వైఎస్ అభిషేక్ రెడ్డి కుటుంబానికి వైవీ సుబ్బారెడ్డి పర
పులివెందుల రూరల్ : వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్ అభిషేక్‌రెడ్డి గతనెల 10వ తేదీన అనారోగ్యంతో మృతి చెందారు. అప్పట్లో కొన్ని అనివార్య కారణాలవల్ల రాలేకపోయిన టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం పట్టణంలోని అంబకపల్లె రోడ్డులో ఉన్న వైఎస్ ప్రకాష్‌రెడ్డి ఇంటికి వెళ్లి వైఎస్ ప్రకాష్‌రెడ్డిని పరామర్శించారు. అలాగే వైఎస్ అభిషేక్‌రెడ్డి తండ్రి వైఎస్ మధురెడ్డి, సోదరుడు వైఎస్ అభినవ్‌రెడ్డిలను పరామర్శించి వారికి ప్రగాడ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్ అభిషేక్‌రెడ్డి వైద్యుడు, ఉత్సాహవంతుడు అని, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ చిన్నప్ప, వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రతాప్‌రెడ్డి, హాలు గంగాధరరెడ్డి, రసూల్, భాస్కర్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, మహేశ్వరరెడ్డి, సురేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులకు ఆశీర్వాదం
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బసిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన బూచుపల్లె గంగాధరరెడ్డి కుమారుడు నవీన్‌కుమార్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సోదరుడు రత్నారెడ్డి, జ్యోతిల కుమార్తె సహజరెడ్డి వివాహం పట్టణంలోని కదిరి రోడ్డులో ఉన్న విజయ్ గార్డెన్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకకు వైవీ సుబ్బారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ఈ వివాహ వేడుకలో మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment