7న జెడ్పీ సర్వసభ్య సమావేశం
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఫిబ్రవరి 7వ తేది ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన జెడ్పీ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, జిల్లా అధికారులు ఆరోజు ఉదయం 10 గంటలకు కడపలోని జెడ్పీసమావేశ మందిరంలో జరిగే సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలని కోరారు.
నేడు జిల్లాస్థాయి
బాస్కెట్‌బాల్ ఎంపికలు
కడప ఎడ్యుకేషన్: జిల్లా మహిళ, పురుషుల అండర్ 23 ఇంటర్ డిస్ట్రిక్ జిల్లాస్థాయి బాస్కెట్‌బాల్ ఎంపికలను 23వ తేదీ గురువారం కడపలోని జయనగర్‌కాలనీ జిల్లా పరిషత్తు బాలికల హైస్కూల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సదశివారెడ్డి తెలిపారు. ఈ పోటీలలో ప్రతిభచాటిన వారు ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విజయవాడలోని మేరిస్ స్టెల్లా కాలేజీలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు. ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు 2002 జనవరి 1వ తేదీకి ముందు పుట్టినవారై ఉండాలని తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్‌కార్డుతో హాజరుకావాలని సూచించారు.
ఆర్టీసీ సంక్రాంతి
ఆదాయం అదుర్స్
కడప కోటిరెడ్డిసర్కిల్: సంక్రాంతి పండక్కు కడప జోన్ నుంచి ప్రత్యేక సర్వీసులు నడపడం ద్వారా ఆర్టీసీకి భారీ ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల రాజధానులైన హైదరాబాదు, చైన్నె, బెంగుళూరు నగరాలకు ఈ ప్రత్యేక బస్సులు నడిచారు. వైఎస్సార్ జిల్లాలోని వివిధ డిపోల నంచి 412 బస్సులు నడపడం ద్వారా రూ. 1,16,63,369 ఆదాయం వచ్చింది. అలాగే అన్నమయ్య జిల్లాకు సంబంధించి 167 బస్సులు తిప్పడం ద్వారా రూ. 37,06,184 రాబడి వచ్చింది. ఈ సందర్భంగా ఆర్టీసీ కడప జోన్ ఈడీ పైడి చంద్రశేఖర్ మాట్లాడుతూ పండుగ సందర్భంగా విస్తృత సేవలు అందించిన సంస్థలోని ఉద్యోగులను అభినందించడంతోపాటు ఆర్టీసీ బస్సులను ఆదరించిన ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
సెమిస్టర్ ఫలితాల విడుదల
కడప ఎడ్యుకేషన్: వై.ఎస్.ఆర్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలోని 7,5,3 సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వీసీ ఆచార్య జి. విశ్వ నాథకుమార్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా తక్కువ సమయంలో ఫలితాల విడుదలకు కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ అదనపు పరీక్షల నియంత్రణాధికారి జి.ఫణీంద్ర రెడ్డి, సహాయ పరీక్షల నియంత్రణాధికారి ఉదయప్రకాష్‌రెడ్డి, నారపరెడ్డి, పీఆర్‌ఓ వి. శివకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక
కడప ఎడ్యుకేషన్: కడప నగరంలోని శివ శివాని స్కూల్‌లో బుధవారం 71వ కడప జిల్లా కబడ్డీ సీనియర్ ఎంపికలను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కడప జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, సెక్రటరీ జనార్దన్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ జనవరి 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగే 71వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో ఈ క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సుకుమార్, జాయింట్ సెక్రెటరీ ప్రసాద్, రవిశంకర్, ట్రెజరర్ జయచంద్ర, బెనర్జీ, సురేంద్ర, రాకేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.
బాలుర జట్టు ..
కబడ్డీ సీనియర్ విభాగంలో దినేష్ చౌదరి, శివాజీ, వంశీధర్ రెడ్డి, అరవింద్, సుదర్శన్, రెడ్డయ్య, మౌళేశ్వర్ రెడ్డి, బాలసుబ్రహ్మణ్య సాయి, శ్రీధర్‌రెడ్డి, విష్ణు, సూరి ఎంపికయ్యారు. స్టాండ్ బై కింద సిద్ధిక్, ప్రవీణ్ కుమార్, అశోక్, వర్ధన్‌లను ఎంపిక చేశారు.
బాలికల జట్టు ..
బాలికల విభాగంలో షాహినా, నాగశృతి, చైతన్య, మానస, పద్మశ్రీ, గౌరీ, నాగవేణి, శివ కవిత, శ్రావణి, మల్లేశ్వరి, పల్లవి, చెన్నమ్మలను ఎంపిక చేశారు. అలాగే స్టాండ్ బై కింద మేఘన, వైష్ణవి ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment