ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, పరిరక్షణకు కృషి చేయాలని పాఠశాల విద్య ఆర్జేడి శామ్యూల్‌కు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) కడప జిల్లా శాఖ విజ్ఞప్తి చేసింది. పాఠశాల విద్య కడప ఆర్జేడీగా పదోన్నతి పొంది బాధ్యతలు చేపట్టిన శామ్యూల్‌ను బుధవారం కడపలోని ఆర్జేడి కార్యాలయంలో ఆపస్ నాయకులు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. వెంకట్రామిరెడ్డి, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి డి. కొండారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల, ఉపాధ్యాయుల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. నాగరాజు, నారాయణరెడ్డి,శ్రీనివాసులు,రెడ్డయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment