● వైభవం...శ్రీ సీతారాముల కల్యాణం
కడప కల్చరల్: కడప నగరంలోని మున్సిపల్ మైదానంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవ అయో ధ్య ఐక్యవేదిక ప్రతినిధి దేసు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. టీటీడీ వేదిక్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేష్ భట్టర్ ఆద్వర్యంలో విజయ్‌భట్టర్ బృందం కల్యాణ క్రతువును భక్తి శ్రద్దలతో నిర్వహించారు. వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవర్లను కల్యాణ మూర్తులుగా అలంకరించి పెళ్లి పీటలపై కొలువుదీర్చారు. మంగళ వాయిద్యాలు మధురంగా వినిపిస్తుండగా వేద పండితుల మంత్రోచ్ఛాటనలు ప్రతిధ్వనిస్తుండగా కల్యాణ క్రతువు కమనీయంగా సాగింది. అతిథులుగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, నగర మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే మాధవీరెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, పలువురు హాజరై కల్యాణాన్ని వీక్షించారు. అనంతరం అక్షతారోపణ, పూల మాలల మార్పిడి నిర్వహించారు.
నయనానందకరం...
కల్యాణం ఆద్యంతం నయనానందకరంగా సాగింది. మహిళలు కోలాటాలు చేశారు. స్థానిక గాయక బృందం సీతారాములపై గీతాలాపనలు చేశారు. అనంతరం ప్రత్యేకమైన కౌంటర్ల ద్వారా భక్తులకు కల్యాణ తలంబ్రాలను అందజేశారు. ఆ పక్కనే అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment