కడప సెవెన్‌రోడ్స్: పారిశుధ్యకార్మికులు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల నగదు బహుమతిని బుధవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తన చాంబర్‌లో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైదుకూరు మున్సిపాలిటికి చెందిన పారిశుధ్య కార్మికులు పి.అమ్ములమ్మ, జి. చెన్నమ్మ, యం.గంగాధర్ అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ సమాజ శ్రేయస్సుకు ఎంతో విలువైన సేవలందిస్తున్నారన్నారు. ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకే విధులకు హాజరై మైదుకూరు రోడ్లు, టౌన్, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంలో వీరి కృషి అభినందనీయమన్నారు. వీరి కృషి, పట్టుదలను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18న మైదుకూరు సభలో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ముగ్గురు మూడు లక్షల నగదు బహుమతిని ప్రకటించారన్నారు. తమ సేవలను గుర్తించినందుకు పారిశుధ్య కార్మికులు ముఖ్యమంత్రికి, కలెక్టరుకు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్‌తోపాటు జేసీ అదితి సింగ్, మైదుకూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment