విద్యాశాఖను అభివృద్ధి పథంలో నడిపిస్తాం
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో అందరి సహకారంతో విద్యాశాఖను అభివృద్ధి పథకంలో నడిపిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమితులైన షంషుద్దీన్ బుధవారం రాత్రి కలెక్టర్ శ్రీధర్‌ను తమ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీఈఓ కార్యాలయానికి చేరుకుని జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలను చేపట్టారు. డీఈఓకు ఏడీ మునీర్‌ఖాన్, సూపరింటెండెంట్లు బాదుల్లా, రఫిక్, మాజీ సైన్సు అధికారి రెహమాన్ తదితరులు అభినందించారు.
నూతన డీఈఓ షేక్ షంషుద్దీన్
Comments
Please login to add a commentAdd a comment