ఈనెల 30,31న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఎస్‌ఎఫ్‌ఐ 28వ జిల్లా మహాసభలను ఈ నెల 30, 31 తేదీల్లో కడప నగరంలో నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి వీరపోగు రవి తెలిపారు. బుధవారం ప్రకాశ్ నగర్‌లోని ప్రభుత్వ హాస్టల్‌లో జిల్లా మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు పోరాటానికి ప్రణాళిక రూపొందించేందుకు ఈ మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యను కాషాయీకరణ, ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు జాలా సుమంత్, ఉపాధ్యక్షులు వంశీ, వినోద్, నగర నాయకులు మనోహర్, అభిలాష్ తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment