అనురాగ్ ప్రీతమ్‌కు ఇంటర్నేషనల్ క్లాసికల్ చెస్ రేటిం
కడప ఎడ్యుకేషన్: కడపకు చెందిన 13 ఏళ్ల మేకల అనురాగ్ ప్రీతమ్ ఫిడే ఇంటర్నేషనల్ క్లాసికల్ చెస్ రేటింగ్ అందుకున్నాడు. జనవరి 2025లో చైన్నెలోని నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన చైన్నె ఇంటర్నేషనల్ ఫిడే క్లాసికల్ రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో అనురాగ్ ప్రీతమ్ పాల్గొని రేటెడ్ ప్లేయర్స్‌పై 2.5 పాయింట్లు స్కోరు చేసి ప్రతిభ కనబరిచాడు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య(ఫిడే) ఫిబ్రవరి రేటింగ్ లిస్టులో అనురాగ్ ప్రీతం రేటింగ్‌ను ప్రకటించింది. వైఎస్సార్ జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి అనీస్ దర్బారీ అనురాగ్‌ప్రీతమ్‌కు అభినందనలు తెలిపారు.
సత్వర చికిత్సాకేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి
కడప అర్బన్: పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాలలోపు పిల్లలకు పుట్టుకతో వచ్చే ఎదుగుదల లోపాలకు సంబంధించి సత్వర చికిత్సా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్ పేర్కొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ చైర్మన్ జి. శ్రీదేవి సూచనల మేరకు కడపలోని రిమ్స్ ఆవరణలో ‘జిల్లా సత్వర చికిత్స కేంద్రం’ను తమ టీం సభ్యులతో సందర్శించి న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ జిల్లా న్యాయసేవాధికారసంస్థ ఆధ్వర్యంలో ఈనెల 10 తేదీ నుంచి 24వ తేదీ వరకు సత్వర చికిత్స విధానాన్ని నిర్వహిస్తున్నారన్నారు. కడప, ప్రొద్దుటూరు జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అధికారి రమేష్, ప్రోగ్రాం మేనేజర్ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment