జిల్లా ఆస్పత్రి తనిఖీ
ప్రొద్దుటూరు క్రైం: వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ రమేష్ కిశోర్, డాక్టర్ స్వప్న సింధులు గురువారం జిల్లా ఆస్పత్రిని పరిశీలించారు. జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్‌బాబుతో కలిసి ఆస్పత్రిలోని వార్డులు, ఓపీ విభాగం, ఫార్మసీ విభాగాన్ని వారు తనిఖీ చేశారు. ఓపీలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అలాగే సిటి, ఎమ్మార్‌ఐ విభాగాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
కడప కేంద్ర కారాగారం
సూపరింటెండెంట్ నియామకం
కడప అర్బన్: కడప కేంద్ర కారాగారం పర్యవేక్షణ అధికారిగా రాజేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన కడప కేంద్ర కారాగారం ఇన్‌చార్జి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పనిచేసిన ప్రకాష్‌ను నెల్లూరుకు బదిలీ చేసి అక్కడ పనిచేస్తున్న రాజేశ్వరరావుకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. అయితే ఆయనను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తైక్వాండో పోటీల్లో ప్రతిభ
ప్రొద్దుటూరు: కాకినాడలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగిన 1వ ఎన్టీఆర్ మెమోరియల్ తైక్వాండో ఛాంపియన్ షిప్–2025 పోటీల్లో కడప జిల్లా ఓవరాల్ రన్నర్ అప్ సాధించింది. ఈ పోటీల్లో కడప జిల్లా మొత్తం 9 స్వర్ణ, 4 రజత, 4 కాంస్య పతకాలు సాధించినట్లు కోచ్‌లు కమల్, రాజేష్ తెలిపారు. స్వర్ణ పతకాలను ఈశ్వరి, మహిత, సత్యభామ, హోిషికా, కీర్తన, దినేష్, తనీష్, విజయ్ సుందర్‌రాజు, జి.హేమ, రజత పతకాలను నిహాల్, తేజస్వి, త్రివేణి, మోక్షిత, కాంస్య పతకాలను భరత్, ఫరియా, శ్యామ్, యోగి సాధించినట్లు వివరించారు. ఈ పోటీల్లో విన్ తైక్వాండో అకాడమీ కీలకపాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. విజేతలను ఏపీఎస్‌పీడీసీఎల్ బీసీ సంఘం ప్రెసిడెంట్ మురళీమోహన్ అభినందించారు.
ఇంటర్ ప్రాక్టికల్స్
పక్కాగా నిర్వహించాలి
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జనరల్ ప్రాక్టికల్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలని ఇంటర్మీడియేట్ ఆర్జేడీ రవి పేర్కొన్నారు. గురువారం కడపలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సంబంధించి సైన్స్ జూనియర్ లెక్చరర్లకు పరీక్షల విధి విధానాలు, మార్కుల గురించి ఇంటర్ ఆర్‌ఐఓ బండి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ జిల్లాలో 14 పరీక్షా కేంద్రాల్లో ఒ కేషనల్ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయన్నారు. ప దోతేదీ నుంచి జనరల్ ప్రాక్టికల్స్ ప్రారంభమవుతాయన్నారు. జనరల్ ప్రాక్టికల్స్‌కు జిల్లాలో 78 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇంటర్ ఆర్‌ఐవో బండి వెంకటసుబ్బ య్య మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో ఎ క్క డా ఆరోపణలకు తావు లేకుండా చూడాలని లె క్చరర్లకు సూచించారు. జిల్లా స్పెషల్ ఆ ఫీసర్ మురళీ,సైన్స్ అధ్య్యాపకులు పాల్గొన్నారు.
8, 9 తేదీల్లో విరసం
రాష్ట్ర సాహిత్య పాఠశాల
ప్రొద్దుటూరు: విప్లవ రచయితల సంఘం(విరసం) 25వ రాష్ట్ర సాహిత్య పాఠశాల ఈనెల 8, 9 తేదీల్లో కర్నూలులోని వెంకటాద్రి నగర్ వెంకటేశ్వర కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పి.వరలక్ష్మి తెలిపారు. గురువారం స్థానిక సృజన సామాజిక వేదిక కార్యాలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ప్రముఖ కథా రచయిత దాదాహయాత్ విడుదల చేశారు. రెండు రోజుల సాహిత్య పాఠశాలను, సభలను విజయవంతం చేయాలని రచయితలు, కవులు, కళాకారులు, ఉద్యమాభిమానులకు, ప్రజాస్వామిక వాదులకు పిలుపునిచ్చారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్, చైతన్య మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పద్మ, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఆస్పత్రి తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment