అంగన్వాడీలకు యాప్‌సోపాలు | - | Sakshi
Sakshi News home page

అంగన్వాడీలకు యాప్‌సోపాలు

Published Fri, Feb 7 2025 1:36 AM | Last Updated on Fri, Feb 7 2025 1:36 AM

అంగన్

అంగన్వాడీలకు యాప్‌సోపాలు

కడప కోటిరెడ్డిసర్కిల్‌: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సేవలు అందిస్తున్న కార్యకర్తలను కష్టాలు వెంటాడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో అనేక అవస్థలు ఎదుర్కొవాల్సి వస్తోందని అంగన్వాడీ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల వివరాలను ఎప్పటికప్పుడు పోషణ ట్రాకర్‌ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యల కారణంగా మొబైల్‌ ఫోన్లు తరుచూ మొరాయిస్తున్నాయి. జిల్లాలోని అంగన్వాడీలు రోజువారీ కార్యక్రమాలతోపాటు ప్రభుత్వం సరఫరా చేస్తున్న చిక్కీలు, కోడిగుడ్లు, బాలామృతం కేంద్రాల్లో కూరలు, ఆహారం తీసుకోవాలని చెబుతూ.. మరోవైపు మాతా శిశు మరణాలు జరగకుండా ఉండేందుకు, సుఖ ప్రసవాల కోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

సమస్యలతో సతమతం

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న 3–6 సంవత్సరాలలోపు చిన్నారుల వివరాలను ప్రతిరోజు హాజరుపట్టికలో నమోదు చేయాలి. పిల్లల ఫోటో తీసి పోషణ ట్రాకర్‌యాప్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఏరోజుకారోజు చిన్నారుల గ్రూప్‌ ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. కేంద్రానికి వచ్చిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రంలోపు పూర్తిచేయాల్సి ఉంది. రెండు, మూడు రోజుల వ్యవధిలో ఏవైనా మార్పులు, చేర్పులు చేస్తుండడం వల్ల సాంకేతిక సమస్యలతో వర్కర్లు సతమతమవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నాసిరకం ఫోన్లు సక్రమంగా పనిచేయడం లేదని పలువురు వాపోతున్నారు. మొబైళ్లు పనిచేయకపోవడంతో కొంతమంది తమ సొంత మొబైల్స్‌ను వినియోగిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లనే వాడుతున్నారు. వాటిలో స్టోరేజీ, ర్యామ్‌ తక్కువగా ఉండడంతో ఫోన్‌ హ్యాంగ్‌ అవుతోందని, మరమ్మత్తులకు గురైతే కొత్తఫోన్‌ను ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల బెదిరింపులు

సాంకేతిక సమస్యలతో మొబైల్‌ఫోన్లు పనిచేయక అంగన్వాడీ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా..వాటని సరిచేసేందుకు ప్రయత్నించాల్సిన అధికారులు యాప్‌లో పిల్లల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయకపోతే వేతనాల్లో కోత విధిస్తున్నామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. యాప్‌ లోపాల వల్ల వ ర్కర్లు కేంద్రంలో ఉన్నప్పటికీ లోకేషన్‌ స్థాని కంగా చూపకపోవడంతో వివరాలు నమోదు కావడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అప్‌లోడ్‌ చేసినా ప్రయోజనం లేదని తలలు పట్టుకుంటున్నారు. సమస్య గురించి పలుమార్లు అధికారులకు తెలి యజేసినా పట్టించుకోకపోవడం దారుణం.

మొరాయిస్తున్న మొబైల్‌ ఫోన్లు

సాంకేతిక సమస్యలతోసతమతం

పిల్లల వివరాల నమోదుకు ఆటంకం

నాణ్యమైన మొబైల్స్‌ ఇవ్వాలి

ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు నాణ్యమైన మొబైల్స్‌ను అందజేయాలి. 95 శాతం వరకు మొబైల్స్‌ పనిచేయక పర్సనల్‌ మొబైల్స్‌ను వాడుతున్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించాలి. – ఎస్‌.మంజుల,

గౌరవాధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ

వర్కర్స్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌, కడప

No comments yet. Be the first to comment!
Add a comment
అంగన్వాడీలకు యాప్‌సోపాలు1
1/3

అంగన్వాడీలకు యాప్‌సోపాలు

అంగన్వాడీలకు యాప్‌సోపాలు2
2/3

అంగన్వాడీలకు యాప్‌సోపాలు

అంగన్వాడీలకు యాప్‌సోపాలు3
3/3

అంగన్వాడీలకు యాప్‌సోపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement