హోరాహోరీగా క్రీడా పోటీలు
రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరు మండలంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం పరిధిలోని అనంతరాజుపేట కళాశాలలో నిర్వహిస్తున్న 11వ క్రీడా, సాంస్కృతిక పోటీలు గురువారం ఉత్కంఠ భరితంగా సాగాయి. కబడ్డీ, బ్యాడ్మింటన్, త్రోబాల్, టేబుల్ టెన్నిస్, పరుగు, హైజంప్ పోటీలు నిర్వహించారు. అనంతరాజుపేట బాలికల జట్టు కబడ్డీలో ఫైనల్స్‌కు చేరింది బాలుర వాలీబాల్, బాలికల త్రోబాల్‌లో కూడా ఇదే కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. నాలుగు వందల మీటర్ల బాలుర పరుగు పందెంలో వీఆర్ గూడెం విద్యార్థి అనిల్ కుమార్ విజేతగా నిలిచాడు. బాలికల నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో వీఆర్ గూడెంకు చెందిన యమున, అనూష, అనంతరాజుపేటకు చెందిన షమీరా బహుమతులు గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment