![ప్రతి ఇంటా ప్రగతే పి–4 పాలసీ లక్ష్యం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06kdp241-170061_mr-1738871324-0.jpg.webp?itok=glkZ-pTH)
ప్రతి ఇంటా ప్రగతే పి–4 పాలసీ లక్ష్యం
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్: ప్రభుత్వ, ప్రయివేట్, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటినీ ప్రగతి పథంలో నడిపించి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పి–4 పాలసీని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా దూరం చేసే దిశగా ప్రభుత్వం ప్రాధాన్యతతో అమలు చేయనున్న పి–4 ప్రణాళికపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగా హాలు నుంచి కలెక్టర్ శ్రీధర్, జేసీ అదితిసింగ్, జెడ్పీ సీఈవో ఓబులమ్మ, సీపీఓ హాజరత్తయ్య, నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్‌రెడి పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జీరో పావర్టీని సాధించే దిశగా ముఖ్యమంత్రి రానున్న ఉగాది నాడు ప్రారంభించ తలపెట్టిన పి–4 (పబ్లిక్ పీపుల్ ప్రయివేట్ పార్ట్నర్ షిప్) పాలసీ అమలు పై గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించనున్నట్లు చెప్పారు. ఎన్జీవోలు, ఎన్‌ఆర్‌ఐలు, వ్యాపారస్తులు, స్థానిక నాయకులు వివిధ రంగాల నిపుణుల భాగస్వామ్యం, వారి నైపుణ్యం, వనరులు, మార్గదర్శకత్వాన్ని పంచుకోవడం ద్వారా పేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment