ప్రొద్దుటూరు రూరల్ : స్థానిక రామేశ్వరంలోని 89వ చౌక దుకాణాన్ని గురువారం రాత్రి విజిలెన్స్ అధికారు లు తనిఖీ చేశారు. చౌకదుకాణంలోని నిల్వలు, పంపి ణీ చేసిన రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ సీఐ శివన్న, హెడ్‌కానిస్టేబుల్ బాషా పాల్గొన్నారు. మండలంలోని సోములవారిపల్లె పంచాయతీ ఈశ్వరరెడ్డినగర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 20 బస్తా ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఇవి 800 కేజీల బరువు ఉన్నాయని, వీటిని స్థానిక పౌ రసరఫరాల గోడౌన్‌కు తరలించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున పేర్కొన్నారు. వెంట ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మహేంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment