బ్రహ్మంగారిమఠం : మండలంలోని సోమిరెడ్డిపల్లె పంచాయతీ గంగిరెడ్డిపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు అంకిరెడ్డిపల్లె రామిరెడ్డిపై స్థల వివాదం సాకుతో పోలీసులు వేధింపులు చేస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రామిరెడ్డి కుటుంబ సభ్యులు ఇలా తెలుపుతున్నారు. గంగిరెడ్డిపల్లె సమీపంలోని ఆనంద ఆశ్రమం వెళ్లే దారిలో సోమిరెడ్డిపల్లె గ్రామ పొలం సర్వే నంబర్ 54– 5ఏలో రెండు సార్లుగా 78 సెంట్లు గంగిరెడ్డిపల్లెకు చెందిన మేకల రామయ్య దగ్గర 1998, 2002లలో కొనుగోలు చేశామన్నారు. అప్పటి నుంచి తాము ఇంటి నిర్మాణం చేసుకొని అనుభవంలో ఉన్నామని పేర్కొన్నారు. యాదవ సామాజిక వర్గం దగ్గర కొనడం తాము చేసిన తప్పా అన్నారు. అప్పటి నుంచి ఎలాంటి ఫిర్యాదులు చేయని వారు, వారికి కొంత మంది తప్పుడు సమాచారం ఇచ్చి తాము కొనుగోలు చేసిన స్థలంపై తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తమ కుటుంబ సభ్యులపై వేధింపులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా గురువారం పోలీసులు తమ ఇంటికి వచ్చి రామిరెడ్డిని తీసుకు పోయారన్నారు. అంతలోని 420 కేసు నమోదు చేసి ప్రొద్దుటూరు కోర్టుకు తీసుకువెళ్లారన్నారు. అయినా జడ్జి రిమాండ్‌కు తిరస్కరించడంతో 41 నోటీసులు ఇస్తామని పొలీసులు తెలిపారన్నారు. కేవలం రాజకీయ కక్షలో భాగంగానే రామిరెడ్డిపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ఎస్‌ఐ చంద్రశేఖర్‌ను వివరణ అడగగా.. గంగిరెడ్డిపల్లెకు చెందిన రామిరెడ్డి కుటుంబ సభ్యులు 54–5ఏ కొనుగోలు చేసింది 40 సెంట్లు మాత్రం రిజస్టర్ చేయించుకున్నారని స్థలంకు చెందిన వారు ఆరోపించారు అన్నారు. ఫోర్జరీ వల్ల అదనంగా 38 సెంట్లు చేయించకున్నట్లు ఆరోపించడంతో కేసు నమోదు చేశామని తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష లేదని, కోర్టు ఉత్తర్వుల ప్రకారం 41 నోటీస్ ఇచ్చి పంపినట్లు వివరించారు.
వైఎస్సార్‌సీపీ నాయకుడిపై కేసు
Comments
Please login to add a commentAdd a comment