ముద్దనూరు : మోటార్‌బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి వృద్ధుడి నుంచి రూ.2 వేలు దోపిడీ చేసిన సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని కొత్త చౌటిపల్లె వద్ద అదే గ్రామానికి చెందిన లింగమయ్య అనే వృద్ధుడు గురువారం ముద్దనూరు వెళ్లడానికి వేచివ ఉన్నాడు. ఇంతలో మోటార్ బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి ముద్దనూరుకు వెళ్తున్నానని, అక్కడి వరకు లిఫ్ట్ ఇస్తానని తెలిపాడు. దీంతో అతను బైక్‌పై ఎక్కాడు. ముద్దనూరు గ్రామంలోకి రాకుండా బైక్‌ను బైపాస్ నుంచి జమ్మలమడుగు రహదారిలోకి మళ్లించాడు. కొంత దూరంలో బైక్ నిలిపి లింగమయ్య వద్దనున్న సుమారు రూ.2 వేల నగదును అతను బెదిరించి తీసుకుని పారిపోయాడు. బాధితుడు ముద్దనూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి సమీపంలో కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment