బి.కోడూరు : మండలంలోని గోవిందాయపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన కబ్జా వ్య వహారంలో వైఎస్సార్‌సీపీ నాయకుల ప్రమేయం లేద ని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం మండల కేంద్రమైన బి.కోడూరులో విలేకరులతో వారు మాట్లాడారు. ఎల్లో మీడియా పత్రికల్లో ప్రతి నిత్యం పాఠశాల స్థలం కబ్జా వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ నాయకులు అని రాయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా భూ కబ్జాలకు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్పడలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బద్వేలు, పోరుమామిళ్ళ, బి.కోడూరు మండలాల్లో కూటమి నాయకుల ఆగడాలు ఎక్కువై పోయాయని, ఎక్కడ చూసినా ఆక్రమణలు, కబ్జాలు, దందాలతోనే పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. పాఠశాలకు సంబంధించిన స్థలం ఆన్‌లైన్ వ్యవహారంలో రైతు అవగాహన లోపం కారణంగా, రెవెన్యూ అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండానే ఆన్‌లైన్ చేయడం వల్ల జరిగిన పొరపాటే తప్ప ఎవరూ కూడా కావాలని చేసినది కాదన్నారు. అలాగే ఈ విషయమై గతంలో రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయడంతోపాటు ఆ రైతు తీసుకున్న బ్యాంకు రుణాలను కూడా తిరిగి బ్యాంకులో చెల్లించడంతోపాటు ఆ భూమికి, రైతుకు ఎలాంటి సంబంధం లేదని రాతపూర్వకంగా రాయించి రెవెన్యూ అధికారులకు ఇచ్చారన్నారు. కానీ కొంత మంది కూటమి నాయకులు వైఎస్సార్‌సీపీపై బురద జల్లేందుకు ఇటీవల జరిగిన డీఆర్‌సీ సమావేశంలో లేవనెత్తి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పత్రికల్లో వేయించి ప్రచారం చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. పాఠశాల స్థలం ఆన్‌లైన్ చేయించుకున్న వెంకటసుబ్బారెడ్డి, వెంకటసుబ్బమ్మలు ఏ పార్టీకి చెందిన కార్యకర్తలు కాదని, వారు కేవలం రైతు కుటుంబానికి చెందిన వారు మాత్రమేనని తెలిపారు. ఇకనైనా ఇలాంటి బురదజల్లే వ్యవహారారాలు మానుకుని, మండల అభివృద్ధికి కృషి చేయాలని వారు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment