![13న తలనీలాల వేలం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11kdp56-170065_mr-1739334048-0.jpg.webp?itok=mQGHXF8Q)
13న తలనీలాల వేలం
గోపవరం : మండలంలోని మల్లెంకొండేశ్వరస్వామి ఆలయంలో తలనీలాల సేకరణ కోసం ఈ నెల 13వ తేదీన వేలంపాట నిర్వహించనున్నట్లు దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారి ఎస్.రామలింగారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వ తేదీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తలనీలాల సేకరణకు ఈ వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 13వ తేదీ ఉదయం 10 గంటలకు మల్లెంకొండేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలోని బద్వేలు దేవదాయ శాఖ కార్యాలయంలో అధికారుల సమక్షంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. మల్లెంకొండేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ఈ నెల 26, 27వ తేదీల్లో రెండు రోజుల పాటు తలనీలాలు సేకరించుకునేందుకు వేలంపాటలో పాల్గొనే వారు రూ.50 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉందన్నారు. డిపాజిట్ నగదు రూపంలో చెల్లించాలని, హెచ్చు పాటదారుడు వేలంపాట ముగిసిన వెంటనే డిపాజిట్‌తో కలిపి మొత్తం నగదు చెల్లించి రసీదు పొందాలన్నారు. అలా చెల్లించని యెడల పాటదారుని డిపాజిట్‌ను అపరాధ రుసుం కింద దేవస్థానం ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ వేలంపాట నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం దేవదాయశాఖ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.
చైన్ స్నాచర్ అరెస్ట్
కడప అర్బన్ : జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఏ. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో చిన్నచౌక్ సీఐ ఓబులేసు, సీసీఎస్ సీఐ సి.భాస్కర్‌రెడ్డి ఎస్‌ఐలు రాజరాజేశ్వర్‌రెడ్డి, రవికుమార్‌లు తమ సిబ్బందితో కలిసి చైన్‌స్నాచర్స్‌పై దృష్టి పెట్టారు. దేవునికడప రథోత్సవం సందర్భంగా ఈ నెల 4వ తేదీన మహారాష్ట్ర పునేటౌన్‌కు చెందిన ఆకాష్‌భాస్కర్.. మాడవీధుల్లో స్వామివారు ఊరేగింపు జరుగుతుండగా తన హస్తలాఘవంతో ఏకంగా మూడు బంగారుచైన్‌లను లాక్కెళ్లారు. ఈ సంఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కడప చిన్నచౌక్, సీసీఎస్ బృందాలతో కలిసి చైన్‌స్నాచర్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలను చేపట్టారు. దేవునికడప ఆర్చి వద్ద నిందితుడైన ఆకాష్‌భాస్కర్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 34 గ్రాముల బరువున్న మూడు బంగారు చైన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన చిన్నచౌక్ హెడ్‌కానిస్టేబుళ్లు సి.శివకుమార్, ఎన్.వేణుగోపాల్, ఎన్.ఈశ్వరయ్య, పి.రామచంద్రారెడ్డి, కానిస్టేబుళ్లు పి.వి శ్రీనివాసులు, పి.ఖాదర్‌హుసేన్, ఎస్.ఎంబాషా, వై.ఓబులేసు, సిహెచ్ కేశవరావు, ప్రదీప్‌కుమార్, కె.నాగేంద్రారెడ్డి, సి.సుధాకర్‌యాదవ్, కె. నాగరాజు, కె.మాధవరెడ్డి, ఎస్.పి రంతుబాషా, సీసీఎస్ సిబ్బంది ఏఎస్‌ఐ శివాజీ, హెడ్‌కానిస్టేబుల్ ఎం.వి సాగర్, కానిస్టేబుల్ బాషలను జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్‌కుమార్ ప్రశంసించి రివార్డుల కోసం సిఫారసు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment