![సూర్యచంద్రులపై వేంకటరమణుడు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11plvd54-170055_mr-1739334050-0.jpg.webp?itok=0BV_g_-f)
సూర్యచంద్రులపై వేంకటరమణుడు
పులివెందుల టౌన్ : పులివెందుల పట్టణంలో వెలసిన శ్రీవేంకటరమణుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం స్వామి వారు సతీసమతుడై పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటరమణుడిని భక్తులు దర్శించి తరించారు. పట్టణంలోని మెయిన్ బజార్, పూలంగళ్ల సర్కిల్, ముత్యాల వారివీధి, అమ్మవారిశాల వీధి మీదుగా స్వామివారు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. భక్తులు స్వామివారికి కాయ కర్పూరాలు సమర్పించి గోవింద నామస్మరణలతో స్మరించుకున్నారు.
నేడు బ్రహ్మ రథోత్సవం
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమలలో తలపించే విధంగా బుధవారం శ్రీవేంకటరమణుడు బ్రహ్మ రథోత్సవంపై ఊరేగనున్నారు. బ్రహ్మ రథోత్సవాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం 9 గంటల నుంచి పురవీధులలో రథోత్సవం ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు తెలిపారు. కావున భక్తులు రథంలో కొలువుతీరిన శ్రీవేంకటరమణుడిని దర్శించి తరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment