![‘కూటమి’ రాగానే మాపై తప్పుడు కేసులు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11myd201-170035_mr-1739334049-0.jpg.webp?itok=JbLYj8fm)
‘కూటమి’ రాగానే మాపై తప్పుడు కేసులు
బ్రహ్మంగారిమఠం : కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థల వివాదంలో యాదవ సామాజిక వర్గం వారు తమపై తప్పుడు కేసులు బనాయించేలా చేస్తున్నారని మండల పరిధి సోమిరెడ్డిపల్లె పంచాయతీ గంగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు అంకిరెడ్డిపల్లె రామిరెడ్డి, లక్ష్మీరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆ గ్రామంలో వారు విలేకరులతో మాట్లాడారు. సోమిరెడ్డిపల్లెలోని గ్రామ సర్వే నంబరు 54–5ఏలో 78 సెంట్ల వ్యవసాయ పొలాన్ని 1998, 2012లో రెండు సార్లుగా కొనుగోలు చేశామన్నారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా తమ దగ్గర ఉన్నాయన్నారు. అయితే తాము వైఎస్సార్‌సీపీ నాయకులం కావడంతో.. కొంత మంది టీడీపీ నేతల ప్రోద్బలంతో తమకు స్థలాలు అమ్మిన వారితో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారన్నారు. ఇప్పటికే 4 కేసులు బనాయించారన్నారు. అయినా తమ వైపు న్యాయం ఉన్నందున కోర్టుల ద్వారా బయటికి వస్తున్నామన్నారు. తాము కొన్న స్థలాల రిజిస్ట్రేషన్ ఫోర్జరీ చేశామంటూ తప్పుడు కేసులు బనాయించడం మంచి పద్ధతి కాదన్నారు. కేవలం అధికార పార్టీ నాయకుల సలహాలను పోలీసులు సైతం వింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించకుండానే.. తమపై తప్పుడు కేసులు పెట్టడటం ఏమిటని ప్రశ్నించారు. సోమవారం తమ గ్రామానికి చెందిన వారు కొంత మంది యాదవ సామాజిక వర్గం వారు పశుగ్రాసం తమ స్థలంలో తోలడం, తాము ఏమైనా చేస్తే తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారన్నారు. తామేమి చేయకపోయినా వారే ఆ పశుగ్రాసాన్ని ఏదైనా చేసి తమపై తప్పుడు కేసులు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. అందుకే విలేకర్ల సమావేశం పెట్టడం జరిగిందన్నారు. ఇప్పటికై నా పోలీసు అధికారులు తమ వద్ద ఉన్న ధ్రువీకరణ పత్రాలను తమకు అమ్మిన వారిని పిలిపించి రెవెన్యూ అధికారుల సమక్షంలో పరిశీలించినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తమపై తప్పుడు కేసులు బనాయించకుండా పోలీసులు వ్యవహరించాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే ఇరువర్గాలను పిలిపించి మాట్లాడాలని, అలా కాకుండా కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పిన మాటలు విని తమపై తప్పుడు కేసులు పెడితే తాము ఊరు వదిలి వెళ్లిపోవాలా అని ప్రశ్నించారు.
స్థల వివాదంపై గంగిరెడ్డిపల్లె
వైఎస్సార్‌సీపీ నాయకుల ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment