Treatment
-
ఎక్కువగా నిలబడి పనిచేస్తున్నారా?వెరికోస్ వెయిన్స్ నొప్పి నుంచి ఇలా ఉపశమనం
పాదాల్లోని సిరల్లో అవరోధాలు ఏర్పడి చెడురక్తం నిలిచిపోయి అవి మెలికలు తిరిగి ఉబ్బుతాయి. దీన్నే వేరికోస్ వెయిన్స్ అంటారు. ఎక్కువగా నిలబడి పని చేసేవారిలో వెరికోస్ వెయిన్ సమస్య ఎక్కువగా వస్తుంది. దీనికి పరిష్కార మార్గాలు, ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. యోగా యోగా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.సిరల నుంచి ఒత్తిడిని తగ్గిస్తుంది. యోగాసనాల ద్వారా వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే వాపు, పుండ్లు పడటం నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాయామం శారీరక శ్రమ లేదా వ్యాయామం అనారోగ్య సిరల అభివృద్ధి అవకాశాలను తగ్గిస్తుంది. రెగ్యులర్ వ్యాయామం మీ కాళ్ళలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంద. అంతేకాకుండా ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడానికి కూడా సహాయపడుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వాకింగ్ సైకిల్ తొక్కడం ఊపిరితిత్తులు లెగ్ లిఫ్ట్‌లు ఇలా చేయడం వల్ల కాళ్ల సిరల్లో ఒత్తిడి తగ్గడంతో పాటు సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ యాపిల్ సైడర్ వెనిగర్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.పేరుకుపోయిన టాక్సిన్స్ నుంచి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. వెరికోస్ వెయిన్స్కి చికిత్స చేయడానికి, పలచని యాపిల్ సైడర్ వెనిగర్‌ను వెరికోస్ వెయిన్లపై చర్మానికి అప్లై చేసి బాగా మసాజ్ చేయండి. ఇలా రోజుకు రెండుసార్లు చేయండి. లేదా గ్లాసు నీటిలో రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలుపుకొని తాగాలి.యాపిల్ సైడర్ వెనిగర్ చర్మంపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. లెగ్ మసాజ్ నొప్పి ఉన్న ప్రాంతాల్లో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల వేరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. అయితే మసాజ్ చేసేటప్పుడు, నేరుగా సిరలపై నొక్కకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది పెళుసుగా ఉండే కణజాలాలను దెబ్బతీస్తుంది. వెరికోస్ వెయిన్ నొప్పి నుంచి ఉపశమనం తగ్గించడానికి కొన్ని ఆయుర్వేద పద్దతులు: అశ్వగంధ అశ్వగంధను సాధారణంగా "ఇండియన్ జిన్సెంగ్" లేదా "ఇండియన్ వింటర్ చెర్రీ" అని పిలుస్తారు. ఇది అనేక అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో ఉపయోగించే సాంప్రదాయ ఔషధం. ఇది కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గోటుకోలా గోటు కోలా అనేది ట్రైటెర్పెనిక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెంటెల్లా ఆసియాటికా (TTFCA) అనే రసాయనాన్ని కలిగి ఉన్న ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద ఔషధం. ఈ రసాయనం ముఖ్యంగా అనారోగ్య సిరలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎలాస్టిన్, కొల్లాజిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. గుగ్గుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన గుగ్గుల్‌ను ఆయుర్వేదంలో ఆర్థరైటిస్,ఊబకాయంతో సహా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.గుగ్గుల్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, మొటిమలు వంటి చర్మ వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. త్రిఫల చూర్ణం త్రిఫల అనేది ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద ఫార్ములా. ఇది రక్తాన్ని నిర్వీషికరణ చేయడంలో సహాయపడుతుంది. త్రిఫల చూర్ణం కండరాలకు బలాన్ని అందిస్తుంది. మంజిష్ఠ మంజిష్ట రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.రక్తప్రవాహంలో అడ్డంకులను కరిగిస్తుంది. అనారోగ్య సిరలు చికిత్సకు ఇది ఉత్తమమైన ఆయుర్వేద నివారణలలో ఒకటి. మంజిష్ఠ యొక్క ఇతర ప్రయోజనాలు మొటిమలు, హైపర్పిగ్మెంటేషన్ను నయం చేయడం. పసుపు పసుపులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా, వెరికోస్ వెయిన్స్ చికిత్సలో బాగా పనిచేస్తుంది. ఇది వాపు,నొప్పిని తగ్గిస్తుంది. రక్తం నుంచి హానీకరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా రక్త ప్రవాహాన్ని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. గమనిక: పైన పేర్కొన్ని ఆయుర్వేద మందులను వైద్యునితో చర్చించిన తర్వాతే తీసుకోవాలి. -నవీన్ నడిమింటి -
రోజూ హెల్మెట్ వాడుతున్నారా? బాక్టీరియా, క్రిములు..
నిత్యం మనకు సంరక్షణగా ఉండే హెల్మెట్ ప్రాణాలనే కాదు దుమ్ము, ధూళి నుంచి కూడా కాపాడుతుంది. మరి దుమ్ము, ధూళితో నిండే ఆ హెల్మెట్‌ని శుభ్రం చేసుకోవడం ఎలా? పరిష్కారం ఇదిగో.. ఈ డ్రైయర్! ఇది క్రిములు, వైరస్లు, దుర్వాసన కలిగించే బాక్టీరియా, వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు వంటివన్నిటినీ చంపేస్తుంది. 99.99 శాతం శుభ్రపరుస్తుంది. ఫుల్ ఫేస్ హెల్మెట్, హాఫ్ ఫేస్ హెల్మెట్, సైకిల్ హెల్మెట్ ఇలా అన్నింటికీ ఉపయోగపడుతుంది. మరోవైపు ఈ డివైస్‌తో.. సాక్స్, గ్లౌవ్స్, షూ వంటివాటినీ ఆరబెట్టుకోవచ్చు. అందుకు వీలుగా చిత్రంలో ఉన్న విధంగా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్స్ అన్నీ డివైస్‌కి కుడివైపే ఉంటాయి. సూపర్‌గా ఉంది కదూ!. ఈహెల్మెట్ డ్రైయర్ ధర కేవలం 53 డాలర్లు(రూ.4356)మాత్రమే. -
ప్రపంచంలో అతి పెద్ద కిడ్నీలో రాయి ఇదే.!
ఈమధ్య కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువైంది. వీటివల్ల వచ్చే నొప్పి ప్రశాంతంగా కూర్చోనీయదు, హాయిగా పడుకోనీయదు. కిడ్నీలో రాళ్ల సమస్యను ప్రారంభదశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడాన్ని ఏ విధంగా గుర్తించవచ్చు? వాటి లక్షణాలేంటి? ఈ సమస్య దరిచేరకుండా ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ విధమైన ఆహారాన్ని తీసుకోవాలి వంటివి ఇప్పుడు చూద్దాం. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి గల కారణాలు కిడ్నీలో రాళ్ళు వంశపారంపర్యంగా కూడా వస్తాయి. వ్యాయామం చేయకపోయినా, మధుమేహంతో బాధ పడుతున్నవారికి రాళ్లు అధికంగా వస్తాయి. ప్రతిరోజూ తగినంత నీరు త్రాగకపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి మరొక ప్రధాన కారణం ఉప్పు, కాల్షియం మరియు అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకోవడం కూడా ఒకటి. ప్రపంచంలోనే పెద్ద కిడ్నీ స్టోన్ ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ స్టోన్‌ను శ్రీలంకలోని ఒక రోగి నుంచి వైద్యులు తొలగించారు. ఈ రాయి 5.26 అంగుళాల పొడవు, 801 గ్రాముల బరువు కలిగి ఉంది . ఈనెల ప్రారంభంలో శ్రీలంక ఆర్మీ వైద్యులు దీన్ని తొలగించారు. ప్రపంచంలోని అతిపెద్ద, బరువైన కిడ్నీని శస్త్రచికిత్స ద్వారా తొలగించామని శ్రీలంక మిలిటరీ హాస్పిటల్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు కూడా శ్రీలంకలోనే ఒక రోగి నుంచి 620 గ్రాముల బరువైన కిడ్నీ స్టోన్‌ను తొలగించారు. what a week at GWR HQ: - Chef Hilda Baci achieves longest cooking marathon at 93 hours - Max Park completes the fastest 3x3x3 cube solve, smashing record by 0.3 seconds - A kidney stone removed from a man in Sri Lanka is heaviest and largest ever seen we're off for a lie down😴 pic.twitter.com/6p4twlFuFK — Guinness World Records (@GWR) June 16, 2023 కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఏం చేయాలి? ముందుగా జీవనశైలిలో అనేక మార్పులు చేసుకోవాలి..అందులో ఎక్కువగా నీళ్లు తాగడం ముఖ్యమైనది. రోజుకు కనీసం 2 నుండి 2.8 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది. ముఖ్యంగా రోజులో ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. బరువు అధికంగా పెరగకుండా ఉండాలి. కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే.. సిట్రిక్ యాసిడ్ ఉన్న నారింజ, నిమ్మ, మోసాంబి లాంటి పండ్లను తినాలి. తినే ఆహారంలో ఉప్పు పరిమాణం తక్కువగా తీసుకోవడం మంచిది. మంచి ఆహారం, తగు వ్యాయామాలు చేయడం ద్వారా శరీర బరువును అదుపులో ఉంచుకోవడమే కాదు. అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. -
బీడీ, సిగరెట్ తాగుతున్నారా? ప్రతి ఐదుగురిలో ఆ ఒక్కరు కాకండి!
మన దేశంలో 26.7 కోట్ల మంది పొగతాగడం లేదా పొగాకు ఉత్పాదనలను వినియోగిస్తున్నారు. ఆ అలవాటు కారణంగా వచ్చే క్యాన్సర్లు, పక్షవాతం, గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలూ వంటి వాటితో మన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 13.50 లక్షల మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తం మీద 172 కోట్ల మంది సిగరెట్లు తాగుతున్నారు. వీళ్లంతా ప్రతిరోజూ 2000 కోట్ల సిగరెట్లను కాలుస్తుంటారు. వీళ్లలో 35 ఏళ్ల వయసు పైబడి, పొగతాగే అలవాటున్న వ్యక్తులు వివిధ రకాల జబ్బుల పాలబడి, తమ ఆరోగ్యం కోసం పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా 1,77,342 కోట్లు! సొంత ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ మరీ మనం చేసే వృథా ఇది!! ఈ నెల 31న ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం’ సందర్భంగా ఆరోగ్యానికి చేటు తెచ్చుకునేలా ఎన్నెన్ని అనర్థాల్ని చేజేతులారా ఆహ్వానిస్తున్నామో తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. పొగాకు అలవాటు రెండు రకాలుగా ఉంటుంది. చుట్ట, బీడీ, సిగరెట్ వంటివి నిప్పుతో కాలుస్తూ పొగవెలువరించే అలవాటుతో పాటు... పొగ ఏదీ లేకుండానే గుట్కా, ఖైనీ. తమలపాకుతో నమిలే జర్దారూపంలో పొగాకు నమలడం, నశ్యం రూపంలో పీల్చడం ద్వారా కూడా పొగాకుకు బానిసలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చనిపోయే ప్రతి ఐదుగురిలో ఒకరు కేవలం పొగాకు వల్లనే ప్రాణాలొదులుతున్నారు. అణువణువునా విషం... అత్యంత హానికరమైన, ఆరోగ్యానికి ప్రమాదకరమైన వాటిల్లో ప్రపంచమంతటా లీగల్‌గా అమ్మే రెండు ఉత్పాదనల్లో మరీ ప్రమాదకరమైనవి సిగరెట్లు, బీడీల వంటివి మాత్రమే. మరొకటి మద్యం. నాలుగు అంగుళాల పొడవుండే సిగరెట్లో 4,800 హానికరమైన రసాయనాలుంటాయి. అందులో మళ్లీ 70 – 72 రసాయనాలు తప్పక క్యాన్సర్‌ను కలగజేసేవే. ఒకసారి పొగతాగడం అంటూ మొదలుపెడితే... వీళ్లలో దాదాపు సగం మంది (50% మంది) దీని వల్ల వచ్చే అనర్థాలు, అనారోగ్యాల కారణంగానే మరణించే అవకాశం ఉందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రతి అవయవానికీ క్యాన్సర్ ముప్పు... వెలుపల మన తల నుంచి కాలి చివరలు మొదలుకొని దేహం లోపలా ఉన్న అన్ని అంతర్గత అవయవాల వరకు దేన్నీ వదలకుండా పొగాకు తన దుష్ప్రభావాలకు గురిచేస్తుంది. దాదాపు 30 శాతం వరకు క్యాన్సర్లకు పొగాకే కారణం. తల నుంచి లెక్క తీసుకుంటే... హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు పొగాకు కారణంగానే ఎక్కువగా వస్తాయి. నోరు మొదలుకొని... దేహంలోపలికి వెళ్లే కొద్దీ... ల్యారింగ్స్, ఈసోఫేగస్, పెద్దపేగు (కొలోన్), మలద్వార (కోలోరెక్టల్) క్యాన్సరు, బ్లడ్‌క్యాన్సర్లు, కాలేయ క్యాన్సర్లు, పాంక్రికాటిక్ క్యాన్సర్లు, బ్లాడర్ క్యాన్సర్లు... వీటన్నింటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొగాకే కారణం. ఇక ప్రోస్టేట్ క్యాన్సర్‌కూ, పొగాకుకూ నేరుగానే సంబంధం ఉంది. పొగాకులోని బెంజీన్ రసాయనం ‘అక్యూట్ మైలాయిడ్ లుకేమియా’ (ఒకరకం బ్లడ్‌క్యాన్సర్)కు కారణమవుతుంది. ఈ క్యాన్సర్లతో పాటు ఇక గుండెజబ్బులు, పక్షవాతం, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు... ఇలా శరీరంలోని ప్రతి కీలక అవయవాన్నీ పొగాకు దెబ్బతీస్తుంది. పొగమానేసిన మరుక్షణమే ప్రయోజనాలు... పొగతాగడం మానేసిన మరుక్షణం మనకు కలగాల్సిన ప్రయోజనాలు మొదలవుతాయి. చివరి సిగరెట్ తర్వాత 20 నిమిషాల్లో గుండె వేగం నార్మల్కు వస్తుంది. 12 గంటల తర్వాత దేహంలో కార్బన్‌మోనాక్సైడ్ మోతాదులు తగ్గడంతో బాటు రక్తంలో ప్రమాదకరమైన విషాల మోతాదులు తగ్గుతాయి. లంగ్స్ మూడు నెలల్లో నార్మల్కు వస్తాయి. ఏడాది తర్వాత హార్ట్ఎటాక్ వచ్చే ముప్పు (రిస్క్) సగానికి తగ్గిపోతుంది. పదిహేనేళ్లు మానేయగలిగితే... సిగరెట్ అలవాటుకు ముందు ఎలాంటి ఆరోగ్యం ఉంటుందో... అదే ఆరోగ్యం మళ్లీ సమకూరుతుంది. ఆరోగ్యాన్నీ వాతావరణాన్నే కాదు... సిగరెట్ వ్యర్థాలతో భూమిని సైతం... సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగే సమయంలో వెలువడే పొగతో ఆరోగ్యానికి, పర్యావరణానికీ ఎలాగూ ముప్పు చేకూరుతుందన్నది కనబడే సత్యం. కాకపోతే మనం విస్మరించే ఇంకో వాస్తవం ఉంది. సిగరెట్ తాగాక మిగిలిపోయే పీకల (బట్స్) బరువు 77 కోట్ల కిలోలు, అంటే 7.70 లక్షల టన్నులు. ఏటా ఇన్నేసి టన్నుల మొత్తంలో సిగరెట్ వ్యర్థాలు మనం నివాసం ఉంటున్న ఈ భూమిని కలుషితం చేస్తున్నాయి. పొగాకు ఉత్పాదనల కోసం ప్రపంచంలోనే అసహ్యకరమైన రంగు పాంటోన్ 448–సి అనేది ప్రపంచంలోనే అత్యంత అసహ్యకరమైన రంగు. దీన్ని చావును సూచించే రంగుగా కూడా చెబుతారు. ఈ రంగుతోనే సిగరెట్ ప్యాక్‌లు తయారవుతున్నప్పటికీ... పొగతాగేవారిని ఆకర్షించడం కోసం దాన్ని మరింత ఆకర్షణీయంగా చేసి వాడుతుంటారు. బానిసగా చేసుకునేది నికోటిన్... పొగాకులోని నికోటిన్... ఆ ఉత్పాదనలకు బానిసయ్యేలా చేస్తుంది. సిగరెట్‌లోని పొగపీల్చిన 10 సెకండ్లలో నికోటిన్ మెదడును చేరుతుంది. ఏదైనా సంతోషం కలిగించే పనిని చేయగానే... మెదడులో డోపమైన్ అనే రసాయనం వెలువడుతుంది. నికోటిన్ మెదడును చేరగానే వెలువడే ఈ డోపమైన్ కారణంగానే హాయిగా, రిలాక్స్డ్గా ఉన్న భావన కలుగుతుంది. ఆ అనుభూతిని తరచూ పొందేందుకు స్మోకింగ్‌ను ఆశ్రయిస్తారు. ఆ తర్వాత్తర్వాత అదే అనుభూతి కలగడం మునపటంత బలంగా లేకపోయినప్పటికీ... ఆ అనుభవం కోసం వెంపర్లాడటంతో నికోటిన్‌కు బానిసవుతారు. నికోటిన్ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే... ప్రఖ్యాత మనస్తత్వ నిపుణుడు సిగ్మండ్ ఫ్రాయిడ్‌కు ‘స్క్వామస్ సెల్ కార్సినోమా ఆఫ్ పాలెట్’ అనే రకం క్యాన్సర్ సోకింది. అంగిలిలో వచ్చిన ఈ నోటిక్యాన్సర్ నుంచి విముక్తి కల్పించడం కోసం డాక్టర్లు ఆయనకు దాదాపు 30కి పైగా సర్జరీలు చేశారు. దవడను, సైనస్నూ తొలగించారు. అయినా ఆయన సిగరెట్ మానేయలేదు. చివరకు అంగిలికీ... కంటిగూడుకూ మధ్య ఉన్న క్యాన్సర్ గడ్డను శస్త్రచికిత్సతో తొలగించడం సాధ్యం కాలేదు. దాదాపు 16 ఏళ్ల పాటు పొగాకు మానేయమని ఎందరు ప్రాధేయపడ్డా ఫ్రాయిడ్ మానలేదు. ఇదీ నికోటిన్ పవర్. -డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్