పార్కింగ్ నుంచి బయటకు వస్తున్న ఓ కారు డ్రైవర్‌కు రెప్పపాటులో పెను ప్రమాదం తప్పింది. ఏకంగా ఏడో అంతస్థు నుంచి ఓ కారు మీద పడటం, తృటిలో అతగాడు తప్పించుకున్నాడు. టెక్సాస్ లోని ఆస్టిన్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఎస్‌యూవిని పార్కింగ్ నుంచి బయటకు తీసేందుకు యత్నిస్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి పడిందో తెలీదుగానీ ఓ బీఎండబ్ల్యూ కారు హఠాత్తుగా కింద పడింది. చిన్న పల్టీ కొట్టాక అక్కడే ఉన్న వాహనానికి తగిలింది. అయితే అదృష్టం కొద్దీ వాహనం మాత్రమే దెబ్బతింది. ఓ మహిళ బీఎండబ్ల్యూ వాహనాన్ని నడిపిందని, బ్రేక్ పెడల్ బదులు ఎస్సెలరేటర్ తొక్కటంతో 7వ అంతస్థులో ఉన్న పార్కింగ్ బారికేడ్ ను ఢీకొట్టి మరీ కింద పడిందని తెలుస్తోంది.
హఠాత్తుగా గాల్లోంచి బీఎండబ్ల్యూ పడిందిbmw
Published Sun, Aug 13 2017 5:20 PM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM
Advertisement
Advertisement
Advertisement