‘అయ్యా.. అన్యాయం చేయమాకండయ్యా.. ఆ భూములమీదే ఆధారపడి బతుకుతున్నాం.. మూడు కార్లు పండే పచ్చటి పొలాలను లాగేసి మా కడుపు కొట్టొద్దు’ అని నవ్యావంధ్ర రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఎంతగా నెత్తీనోరు కొట్టుకున్నా స్పందించని రాష్ట్ర సర్కారు తీరును ప్రపంచ బ్యాంకు తప్పు పట్టింది. బలవంతంగా రైతుల నుంచి భూములు సేకరిస్తూ వారి జీవనోపాధికి భంగం కలిగిస్తున్నారని, తద్వారా పర్యావరణం, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఎత్తి చూపింది. సామాజిక ఆర్థిక సర్వే అంతా లోపభూయిష్టంగా సాగిస్తూ.. కొంత మంది అభిప్రాయాన్ని అందరి అభిప్రాయంగా చెప్పడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈ నెల 12వ తేదీన ప్రపంచ బ్యాంకు తనిఖీ ప్యానల్ చైర్మన్ గోంజలో కాస్ట్రోడెలా మాటా సంతకంతో ఒక డాక్యుమెంట్ విడుదల చేశారు.
Published Thu, Jun 29 2017 6:56 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
Advertisement