Market
-
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 22,368 వద్దకు చేరింది. సెన్సెక్స్ 89 పాయింట్లు ఎగబాకి 73,738 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, ఐటీసీ, హెచ్‌యూఎల్, టైటాన్, పవర్‌గ్రిండ్, ఇన్ఫోసిస్ కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. సన్‌ఫార్మా, ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి ప్రియులకు శుభవార్త.. ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు
ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. నేడు (ఏప్రిల్ 23) తులం పసిడి ధర గరిష్టంగా రూ. 1530 తగ్గింది. దేశంలో ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66150 (22 క్యారెట్స్), రూ.72160 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 500 నుంచి రూ. 550 వరకు తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ ఏకంగా రూ. 1400 నుంచి రూ. 1500 తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 66300 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 72310 రూపాయలకు చేరింది. నిన్న రూ.510, రూ.550 వరకు తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 1400 నుంచి రూ.1530 వరకు తగ్గింది.దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. చెన్నైలో పసిడి ధరలు మరింత తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 1450 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1570 రూపాయలు తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ. 67000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 73100 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఈ రోజు (ఏప్రిల్ 23) వెండి ధర రూ. 2500 తగ్గి రూ. 83000 (కేజీ) వద్ద నిలిచింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా గరిష్ట స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. -
సాక్షి మనీ మంత్ర: గ్రీన్‌లో ఓపెన్ అయిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ 89 పాయింట్లు లాభపడి 22,421కు చేరింది. సెన్సెక్స్ 310 పాయింట్లు ఎగబాకి 73,947 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 106 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 87.18 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.61 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.87 శాతం లాభపడింది. నాస్డాక్ 1.11 శాతం ఎగబాకింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 1.24% నష్టపోయి రూ.1,512.30 దగ్గర స్థిరపడింది. బ్యాంక్ మార్కెట్ విలువ రూ.14,434.12 కోట్లు తగ్గి రూ.11.48 లక్షల కోట్లుగా నమోదైంది. త్రైమాసిక ఫలితాల ప్రభావంతో విప్రో షేరు 2.01% లాభపడి రూ.461.95 దగ్గర ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,756.93 కోట్లు పెరిగి రూ.2.41 లక్షల కోట్లకు చేరింది. ఈ రోజు బోర్డు సమావేశాలు ఉన్న కంపెనీల్లో ప్రధానంగా టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఎలెక్సీ, ఎంఅండ్ఎం ఫైనాన్షియల్, ఎంసీఎక్స్ ఇండియా, సైయెంట్ డీఎల్ఎం, నెల్కో ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: తీవ్ర ఒడుదొడుకులు.. గ్రీన్‌లో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. కానీ చివరికు లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 153 పాయింట్లు లాభపడి 22,149 వద్దకు చేరింది. సెన్సెక్స్ 599 పాయింట్లు ఎగబాకి 73,088 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, మారుతీ సుజుకీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎస్బీఐ కంపెనీ షేర్లు భారీగా లాభపడిన జాబితాలో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, నెస్లే, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. యుద్ధభయాలు విస్తరించడంతోపాటు ఫెడ్ ఛైర్మన్ కీలక వడ్డీ రేట్ల పెంపుపై వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. దాంతో మార్కెట్ ఈ రోజు సెషన్లో తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. చివరకు మార్కెట్లు గ్రీన్‌లోనే ముగిశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కొత్త మార్క్‌కు బంగారం.. నిన్ననే కొన్నవారు సేఫ్!
Gold Rate today: పసిడి కొనుగోలుదారులకు ఇది చేదువార్త. బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్ 19) మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు రెండు రోజులు బ్రేక్ ఇచ్చి ఈరోజు మళ్లీ పెరిగి కొత్త మార్క్‌ను చేరాయి. హైదరాబాద్ నగరంతోసహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 పెరిగి రూ.74,340 లకు ఎగిసింది. ఇతర నగరాల్లో బంగారం ధరలు ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.68,900 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.600 చొప్పున ఎగిసి రూ.75,160 లను తాకింది. ♦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 ఎగిసి రూ.74,340 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,300 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.540 పెరిగి రూ.74,490 లకు ఎగిసింది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 ఎగిసి రూ.74,340 వద్దకు చేరింది. -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయి 21,835కు చేరింది. సెన్సెక్స్ 529 పాయింట్లు దిగజారి 71,955 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 106.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 87 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.63 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.2 శాతం నష్టాలపాలైంది. నాస్డాక్ 0.5 శాతం దిగజారింది. ఎన్ఎస్ఈ ఏప్రిల్ 24 నుంచి నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్‌కి సంబంధించిన డెరివేటివ్ కాంట్రాక్టులను ప్రారంభించనుంది. ఇందుకు సెబీ నుంచి అనుమతులు వచ్చినట్లు తెలిపింది. 10 లాట్ సైజుతో 3 నెలల ఇండెక్స్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్లు, వీటి కాలవ్యవధి ఎక్స్పైరీ నెలలో చివరి శుక్రవారంతో ముగుస్తుందని పేర్కొంది. 2024 మార్చి నాటికి ఈ ఇండెక్స్‌లో ఆర్థిక సర్వీసుల రంగం స్టాక్స్ వాటా 23.76 శాతంగా, క్యాపిటల్ గూడ్స్ రంగం వాటా 11.91 శాతం, కన్జూమర్ సరీ్వసెస్ వాటా 11.57 శాతంగా ఉంది. 1997 జనవరి 1న ఈ ఇండెక్స్‌ను ప్రవేశపెట్టారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లోంచి నష్టాల్లోకి
ముంబై: బ్యాంకింగ్ షేర్ల భారీ పతనం, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలతో స్టాక్ సూచీలు నాలుగోరోజూ నష్టాలు చవిచూశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీతో ఉదయం లాభాలతోనే మొదలయ్యాయి. అయితే మిడ్‌సెషన్ సమయంలో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తడంతో లాభాల్లోంచి నష్టాల్లోకి మళ్లాయి. ఇంట్రాడేలో 1,107 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 455 పాయింట్లు నష్టపోయి 72,489 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 72,366 వద్ద కనిష్టాన్ని 73,473 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 365 పాయింట్లు శ్రేణిలో కదలాడింది. ఆఖరికి 152 పాయింట్లు కోల్పోయి 21,996 వద్ద నిలిచింది. రోజంతా 21,962 – 22,327 పాయింట్ల మధ్య ట్రేడైంది. మీడియా మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.39%, 0.06 శాతం చొప్పున నష్టపోయాయి. ఎఫ్‌పీఐలు రూ.4,260 ఈక్విటీలను విక్రయించగా, డీఐఐలు రూ.2,286 కోట్ల షేర్లు కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు 0.50%– ఒకశాతం వరకు లాభపడ్డాయి. ► సెన్సెక్స్ నాలుగు రోజుల్లో 2,549 పాయింట్ల(3.39%) పతనంతో బీఎస్ఈలో రూ.9.30 లక్షల కోట్లు మాయమ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.392 లక్షల కోట్లకు దిగివచి్చంది. ఈ నెల 24 నుంచి నిఫ్టీ నెక్ట్స్ 50 డెరివేటివ్స్ ఎన్ఎస్ఈ ఏప్రిల్ 24 నుంచి నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్‌కి సంబంధించిన డెరివేటివ్ కాంట్రాక్టులను ప్రారంభించనుంది. ఇందుకు సెబీ నుంచి అనుమతులు వచి్చనట్లు తెలిపింది. 10 లాట్ సైజుతో 3 నెలల ఇండెక్స్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్లు, వీటి కాలవ్యవధి ఎక్స్పైరీ నెలలో చివరి శుక్రవారంతో ముగుస్తుందని పేర్కొంది. 2024 మార్చి నాటికి ఈ ఇండెక్స్‌లో ఆర్థిక సర్వీసుల రంగం స్టాక్స్ వాటా 23.76 శాతంగా, క్యాపిటల్ గూడ్స్ రంగం వాటా 11.91 శాతం, కన్జూమర్ సరీ్వసెస్ వాటా 11.57 శాతంగా ఉంది. 1997 జనవరి 1న ఈ ఇండెక్స్‌ను ప్రవేశపెట్టారు. -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 103 పాయింట్లు నష్టపోయి 22,044 వద్దకు చేరింది. సెన్సెక్స్ 454 పాయింట్లు దిగజారి 72,488 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్టెల్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, టాటాస్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు మినహా మిగతావి నష్టాల్లోకి చేరుకున్నాయి. నెస్లే, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఐటీసీ, సన్‌ఫార్మా, బజాన్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు భారీగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. యుద్ధభయాలు విస్తరించడం, వడ్డీ రేట్ల దిశపై అనిశ్చితికి తోడు ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో కొంత మంది మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపినట్లు తెలిసింది. మ్యూచువల్ ఫండ్లలో ద్రవ్యలభ్యత అధికంగా ఉండటం వల్ల, సూచీలను కొంతవరకు ఆదుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం నికరంగా రూ.4,468.09 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.2,040.38 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
హమ్మయ్య.. మళ్లీ పెరగక ముందే కొనేయండి!
Gold Rate today: పసిడి ప్రియులకు శుభవార్త ఇది. బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్ 18) తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు క్రితం రోజున పెరుగుదలకు బ్రేక్ ఇచ్చి స్థిరంగా కొనసాగగా ఈరోజు గణనీయంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,650 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.330 చొప్పున తగ్గి రూ.73,800 వద్దకు దిగొచ్చింది. ఇతర నగరాల్లో.. ♦ చెన్నైలో ఈరోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి రూ.68,350 లకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.390 చొప్పున క్షీణించి రూ.74,560 లకు తగ్గింది. ♦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి ప్రస్తుతం రూ.67,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.73,800 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,800 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 తగ్గి రూ.73,950 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.67,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.73,800 వద్దకు చేరింది. -
సాక్షి మనీ మంత్ర: గ్రీన్‌లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 96 పాయింట్లు లాభపడి 22,245కు చేరింది. సెన్సెక్స్ 280 పాయింట్లు దిగజారి 73,219 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 105.93 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 87.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.59 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.58 శాతం నష్టాలపాలైంది. నాస్డాక్ 1.15 శాతం దిగజారింది. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. 2024లో 6.8%, 2025లో 6.5% మేర భారత్ వృద్ధి నమోదు చేస్తుందని ఇటీవల విడుదలైన ఐఎమ్ఎఫ్ నివేదిక అంచనా వేసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘స్పేస్’లో మరిన్ని ఎఫ్‌డీఐలకు సై
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మూడు కేటగిరీల కింద ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ లాంచ్ వాహనాలు తదితర విభాగాల్లోకి వంద శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించేలా నిబంధనలను సవరిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన విభాగాల్లో 74 శాతం వరకు ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. అది దాటితే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్స్, స్పేస్‌క్రాఫ్ట్‌ల ప్రయోగం కోసం స్పేస్పోర్టుల ఏర్పాటు వంటి విభాగాల్లో 49 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. ఉపగ్రహాల విడిభాగాలు, సిస్టమ్స్/సబ్–సిస్టమ్స్ మొదలైన వాటి తయారీలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. ఇప్పటివరకు ఉన్న పాలసీ ప్రకారం ఉపగ్రహాల తయారీ కార్యకలాపాల్లో ఎఫ్‌డీఐలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉంటోంది. కొత్త సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఈ ఏడాది తొలి నాళ్లలోనే ఆమోదముద్ర వేసింది. వీటికి సంబంధించి కేంద్ర అంతరిక్ష విభాగం ఇన్–స్పేస్, ఇస్రో, ఎన్ఎస్ఐఎల్ వంటి పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరిపింది. మస్క్ పర్యటన నేపథ్యంలో.. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్న సందర్భంలో తాజా పరిణామం ప్రాధా న్యం సంతరించుకుంది. వేల కొద్దీ ఉపగ్రహాలతో ప్రపంచంలో ఎక్కడైనా హై–స్పీడ్ ఇంటర్నెట్ను అందించేలా ఎలాన్ మస్క్ తలపెట్టిన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టు స్టార్‌లింక్‌కు ప్రస్తుతం అనుమతులను జారీ చేసే ప్రక్రియ తుది దశలో ఉంది. ఏప్రిల్ 21, 22 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న మస్క్ .. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు భారతీయ స్పేస్ కంపెనీలతో కూడా సమావేశం కానున్నారు. -
సాక్షి మనీ మంత్ర: కొనసాగుతున్న నష్టాలు.. స్టాక్‌మార్కెట్ల పతనం
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 124 పాయింట్లు నష్టపోయి 22,147 వద్దకు చేరింది. సెన్సెక్స్ 455 పాయింట్లు దిగజారి 72,943 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, మారుతీసుజుకీ మినహా మిగతా కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అందులో ప్రధానంగా ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. యుద్ధభయాలు విస్తరించడం, వడ్డీ రేట్ల దిశపై అనిశ్చితికి తోడు ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపినట్లు తెలిసింది. మ్యూచువల్ ఫండ్లలో ద్రవ్యలభ్యత అధికంగా ఉండటం వల్ల, సూచీలను కొంతవరకు ఆదుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా మార్కెట్లు బుధవారం (ఈనెల 17న) పనిచేయవు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 22,183కు చేరింది. సెన్సెక్స్ 343 పాయింట్లు దిగజారి 73,059 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 106.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 90.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.2 శాతం నష్టాలపాలైంది. నాస్డాక్ 1.79 శాతం దిగజారింది. ఫైనాన్సియల్ సర్వీసెస్, సర్వీసెస్, ఐటీ, బ్యాంకింగ్ ఇండెక్సులు మెటల్, ఆటో షేర్లు సోమవారం భారీ నష్టాలు చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,288 కోట్ల షేర్లను అమ్మేశారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,763 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో ఒక్క చైనా(1%) మినహా అన్ని దేశాల సూచీలు దాదాపు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో యూరప్ మార్కెట్లు కోలుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: బేర్ పంజా.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 241 పాయింట్లు నష్టపోయి 22,277 వద్దకు చేరింది. సెన్సెక్స్ 845 పాయింట్లు దిగజారి 73,399 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో మారుతీసుజుకీ, నెస్లే, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ మినహా మిగతా అన్ని స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయినవాటి జాబితాలో ఉన్నాయి. యుద్ధభయాలు విస్తరించడం, వడ్డీ రేట్ల దిశపై అనిశ్చితికి తోడు ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో కొంత మంది మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపినట్లు తెలిసింది. మ్యూచువల్ ఫండ్లలో ద్రవ్యలభ్యత అధికంగా ఉండటం వల్ల, సూచీలను కొంతవరకు ఆదుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా మార్కెట్లు బుధవారం (ఈనెల 17న) పనిచేయవు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దేశమంతా షాక్! అక్కడ బంగారం కొనేవారికి మాత్రం గుడ్‌న్యూస్
Gold Rate today: పసిడి ప్రియులకు బంగారం ధరలు మళ్లీ ఈరోజు (ఏప్రిల్ 15) షాకిచ్చాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు రెండు రోజుల క్రితం కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. నిన్నటి రోజు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు మళ్లీ ఈరోజు పరుగు అందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ నగరంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.67,050 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.600 చొప్పున పెరిగి రూ.73,150 వద్దకు చేరింది. దేశమంతా బంగారం ధరలు దడ పుట్టిస్తుంటే చెన్నైలో మాత్రం ఈరోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.650 తగ్గి రూ.67,900 లకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.710 చొప్పున క్షీణించి రూ.74,070 లకు తగ్గింది. ఇతర ప్రధాన నగరాల్లో.. ♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి ప్రస్తుతం రూ.67,050 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 ఎగిసి రూ.73,150 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 ఎగిసి రూ.67,200 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.600 పెరిగి రూ.73,300 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.550 పెరిగి ప్రస్తుతం రూ.67,050 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 ఎగిసి రూ.73,150 వద్దకు చేరింది. -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:40 సమయానికి నిఫ్టీ 238 పాయింట్లు నష్టపోయి 22,280కు చేరింది. సెన్సెక్స్ 778 పాయింట్లు దిగజారి 73,455 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 106.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 90.06 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.52 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.46 శాతం, నాస్డాక్ 1.62 శాతం నష్టంతో ముగిసింది. నేడు ఆసియా ప్రధాన సూచీలు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) శుక్రవారం నికరంగా రూ.8,027 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) రూ.6,341.53 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ప్రపంచ పరిణామాలు, క్యూ4 ఆర్థిక ఫలితాలు కీలకం
ముంబై: ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు, స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్ క్యూ4 ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. శ్రీరామనవమి(బుధవారం) సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులు జరగుతుంది. అయితే ఈ సెలవు రోజులో ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు సాయంత్రం ట్రేడింగ్‌లో యథావిధిగా పనిచేస్తాయి. ‘‘అంతర్జాతీయ నెలకొన్న అస్థిర పరిస్థితులు, దేశీయంగా సార్వత్రిక ఎన్నికల ప్రారంభం(శుక్రవారం) నేపథ్యంలో వచ్చేవారం స్టాక్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ నష్టాల్లో చలించవచ్చు. ప్రస్తుతానికి నిఫ్టీ 22,520 వద్ద కీలక మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకుంది. ఎగువస్థాయిలో 22,750–22,800 శ్రేణిలో పరిక్షీణించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రీటైల్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమా తెలిపారు. గత వారం ప్రథమార్థంలో రికార్డు స్థాయి ర్యాలీ చేసిన సూచీలు అమెరికా ద్రవ్యోల్బణం, క్రూడాయిల్ ధరలు పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో లాభాలన్నీ ఆవిరయ్యాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ మూడు పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ ఆరు పాయింట్లు లాభపడ్డాయి. క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ మార్కెట్ ముందుగా గతవారం మార్కెట్ ముగింపు తర్వాత వెల్లడైన టీవీఎస్ పూర్తి ఆర్థిక సంవత్సరం, జనవరి క్వార్టర్ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో దాదాపు 63 కంపెనీలు తమ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్, విప్రో, జియో ఫైనాన్సియల్ సరీ్వసెస్, ఏంజెల్ వన్, ఐసీసీఐ లాంబార్డ్, క్రిసెల్, ఏంజెల్ వన్, టాటా కమ్యూనికేషన్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కంపెనీలు ఇందులో ఇన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు జపాన్ మెషిన్ టూల్ ఆర్డర్స్ డేటా, యూరోజోన్ ఫిబ్రవరి వాణిజ్య లోటు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలతో పాటు దేశీయ హోల్‌సేల్ ద్రవ్యోల్బణ డేటా సోమవారం విడుదల కానుంది. చైనా 2024 జనవరి క్వార్టర్ జీడీపీ, పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలతో పాటు బ్రిటన్ ఫిబ్రవరి నిరుద్యోగ రేటు, యూరోజోన్ వాణిజ్య లోటు, అమెరికా నూతన గృహ విక్రయాల డేటా మంగళవారం వెల్లడి కానుంది. యూరోజోన్, బ్రిటన్ మార్చి ద్రవ్యోల్బణ గణాంకాలు బుధవారం విడుదల అవుతాయి. ఇక శుక్రవారం జపాన్ మార్చి ద్రవ్యోల్బణం, బ్రిటన్ డిసెంబర్ రిటైల్ సేల్స్ విడుదల అవుతాయి. ప్రపంచ పరిణామాలు తూర్పు దేశాల్లో మళీ యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, మిస్సైళ్లతో ఇరాన్ దాడులకు పాల్పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రెండు శాతం మేర పెరిగాయి. చమురుని భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపనుంది. యూఎస్ మార్చి ద్రవ్యోల్బణ అంచనాలకు మించి నమోదవడం ‘ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ వాదనలకు బలాన్నివ్వొచ్చు. కావున ప్రపంచ పరిణామాలు ఈక్విటీ మార్కెట్లకు అనుకూలంగా లేవు. -
సాక్షి మనీ మంత్ర: సీపీఐ డేటా ఎఫెక్ట్.. మార్కెట్లపై బేర్ పంజా
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 238 పాయింట్లు నష్టపోయి 22,515 వద్దకు చేరింది. సెన్సెక్స్ 793 పాయింట్లు దిగజారి 74,244 వద్దకు చేరింది. యూఎస్ సీపీఐ ద్రవ్యోల్బణ డేటా అంచనాలకు మించి 3.5 శాతంగా నమోదవడంతో మార్కెట్ కుప్పకూలినట్లు నిపుణులు చెబుతున్నారు. సెన్సెక్స్ 30 సూచీలో టాటామోటార్స్, టీసీఎస్, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ మినహా అన్ని కంపెనీ షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) బుధవారం నికరంగా రూ.2,778.17 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐలు) రూ.163.36 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వామ్మో... ఇలా అయితే బంగారం కొనాలా.. వద్దా?
Gold Rate today: పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ మీద షాకులిస్తున్నాయి. వారం రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు ఈరోజు (ఏప్రిల్ 12) పీక్కు చేరాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు 10 గ్రాములకు ఈరోజు ఏకంగా రూ.1090 మేర పెరిగాయి. ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్ నగరంతోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 పెరిగి రూ.67,200 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.1090 చొప్పున పెరిగి రూ.73,310 వద్దకు ఎగిసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. ♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 పెరిగి ప్రస్తుతం రూ.67,200 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 ఎగిసి రూ.73,310 వద్దకు చేరింది. ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర అత్యధికంగా రూ.800 పెరిగి రూ.68,050 లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.880 చొప్పున పెరిగి రూ.74,240 ఉంది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 ఎగిసి రూ.67,350 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.1090 పెరిగి రూ.73,460 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.1000 పెరిగి ప్రస్తుతం రూ.67,200 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 ఎగిసి రూ.73,310 వద్దకు చేరింది. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 22,718కు చేరింది. సెన్సెక్స్ 103 పాయింట్లు దిగజారి 74,943 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 105.25 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 90 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.7 శాతం లాభాలతో ముగిసింది. నాస్డాక్ 1.68 శాతం లాభపడింది. నేడు(ఏప్రిల్ 12న) ఐటీ సేవల నంబర్‌వన్ కంపెనీ టీసీసీఎస్ క్యూ4 సహా.. 2023–24 ఫలితాలను విడుదల చేయనుంది. ఈ బాటలో సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్ 18న, విప్రో 19న, టెక్ మహీంద్రా 25న, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 26న క్యూ4, గతేడాదికి పనితీరును వెల్లడించనున్నాయి. దేశీ ఐటీ కంపెనీలు క్యూ4లో అంతంతమాత్ర ఫలితాలను సాధించనున్నట్లు బ్రోకింగ్ సంస్థ ఎమ్కే ఇటీవల అంచనా వేసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘వాటిలో పెట్టుబడి పెడితే రూ.కోట్లే..’
డీప్‌ఫేక్.. ఇటీవల చాలామంది నుంచి వినిపిస్తున్న పదం. ఈ టెక్నాలజీ వాస్తవానికి, కల్పనకు మధ్య తేడాను చెరిపేస్తోంది. క్రియేటివిటీ పేరుతో బోగస్ అంశాలను, వక్రీకరించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి దీన్ని వాడుతున్నారు. సినీ స్టార్లు, క్రికెటర్లు, రాజకీయ నాయకులతోపాటు స్టాక్‌మార్కెట్ ప్రముఖులు సైతం ఈ టెక్నాలజీ అరాచకానికి బలవుతున్నారు. ప్రముఖుల ఫేస్, వాయిస్‌తో ‘ఫలానా స్టాక్‌లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభాలు సొంతం చేసుకోండి’ అంటూ డీప్‌ఫేక్ వీడియోలు వెలుస్తున్నాయి. తాజాగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈఓ ఆశిష్‌కుమార్ చౌహాన్ సైతం దీని బారినపడ్డారు. చౌహాన్ స్టాక్స్ సిఫార్సు చేస్తున్నట్లు, ఫలానా కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నట్లు కొన్ని డీప్‌ఫేక్ వీడియోలు, ఆడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయని ఎన్ఎస్ఈ తెలిపింది. ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. ‘కొన్ని మీడియాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోలు, ఆడియోల్లో ఏమాత్రం నిజం లేదు. ప్రతి సమాచారాన్ని, అప్డేట్లను సంబంధిత వెబ్సైట్లో తెలియజేస్తాం. స్టాక్‌లకు సంబంధించి ఎలాంటి సిఫార్సులు సంస్థ చేయదు. ఈమేరకు ఇన్వెస్టర్లు, రిటైలర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలి. నకిలీ వీడియోలు, ఇతర మాధ్యమాల నుంచి వచ్చే పెట్టుబడి సలహాలు అనుసరించొద్దు’ అని ఎన్ఎస్ఈ వివరించింది. ఇదీ చదవండి: మస్క్ భారత పర్యటనకు డేట్ ఫిక్స్.. ఏం జరగబోతుందంటే.. ఎన్నికల సమయంలోనూ.. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల స్వరాన్ని, ముఖాన్ని అనుకరించి డీప్‌ఫేక్స్‌ను వ్యాప్తిచేసే ప్రమాదం ఉందని ఇప్పటికే నిపుణులు పలుమార్లు హెచ్చిరించిన విషయం తెలిసిందే. అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీల మాటలను వక్రీకరించి ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందన్నారు. డీప్‌ఫేక్‌కు సంబంధించిన ప్రమాదాలను నివారించేలా నిబంధనలు రూపొందించాలని నిపుణులు కోరుతున్నారు. -
Stock Market: 75,000 @ రూ. 400 లక్షల కోట్లు
ఒక్క రోజు గ్యాప్‌లో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి దుమ్మురేపాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ తొలిసారి 75,000 పాయింట్లపైన నిలవగా.. నిఫ్టీ 22,754 వద్ద ముగిసింది. వెరసి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ మళ్లీ రూ. 400 లక్షల కోట్లను అధిగమించింది. తాజా ట్రేడింగ్‌లో చిన్న షేర్లకు సైతం కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికాలో ద్రవ్యోల్బణం మరోసారి కట్టుతప్పడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆలోచనకు చెక్పడే వీలుంది. దీంతో యూఎస్ మార్కెట్లు 1.3 శాతం డీలాపడి ట్రేడవుతున్నాయి. ముంబై: ఇన్వెస్టర్లు అన్ని రంగాలలోనూ పెట్టుబడులకు ఆసక్తి చూపడంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో రెండోసారి సరికొత్త రికార్డులను సాధించాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు జంప్‌చేసి మార్కెట్ చరిత్రలో తొలిసారి 75,038 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 111 పాయింట్ల వృద్ధితో కొత్త గరిష్టం 22,754 వద్ద ముగిసింది. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ 75,105 వద్ద, నిఫ్టీ 22,776 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఈ ప్రభావంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 1–0.5 శాతం మధ్య బలపడ్డాయి. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు రూ. 2,27,025 కోట్లు జమయ్యింది. మొత్తం విలువ రూ. 402 లక్షల కోట్ల(4.83 ట్రిలియన్ డాలర్లు) ఎగువకు చేరింది. ఫార్మా మినహా.. ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ప్రభుత్వ బ్యాంక్స్, చమురు, ఎఫ్ఎంసీజీ, మెటల్ 1.5 శాతంస్థాయిలో పుంజుకోగా.. ఫార్మా 0.3 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో కోల్ ఇండియా, బీపీసీఎల్, ఐటీసీ, కొటక్ బ్యాంక్, హిందాల్కో, ఎయిర్టెల్, ఎస్బీఐ, అదానీ ఎంటర్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, ఐషర్, టెక్ఎం, ఆర్ఐఎల్ 3.6–1% మధ్య లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, సిప్లా, మారుతీ, దివీస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2–1% మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మొత్తం ట్రేడైన షేర్లలో 1,904 లాభపడితే.. 1,939 బలహీనపడ్డాయి. నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ. 2,778 కోట్లు, దేశీ ఫండ్స్ సైతం రూ. 163 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. మూడోరోజూ మెరిసిన పసిడి, వెండి పసిడి, వెండి ధరలు న్యూఢిల్లీలో వరుసగా మూడవ రోజు బుధవారం కూడా రికార్డుల ర్యాలీ చేశాయి. పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర ఒక దశలో లైఫ్‌టైమ్ హై రూ.72,000 తాకింది. అటు తర్వాత క్రితం ముగింపుతో పోలి్చతే రూ.200 లాభంతో రికార్డు స్థాయి రూ.71,840 వద్ద ముగిసింది. వెండి కూడా కేజీకి రూ.200 ఎగసి రూ.84,700 వద్ద ముగిసింది. పసిడి ధర గడచిన మూడు రోజుల్లో రూ.690 పెరగ్గా, వెండి ధర ఇదే కాలంలో రూ.1,500 పెరిగింది. కాగా, అంతర్జాతీయ బులిష్ ధోరణులు ఈ రెండు మెటల్స్ తాజా పెరుగుదలకు కారణంకాగా, బుధవారం వెలువడిన అమెరికాలో తీవ్ర ద్రవ్యోల్బణం గణాంకాలు, వడ్డీరేట్లు తగ్గకపోవచ్చని భయాలతో బంగారం, వెండి తక్షణ ర్యాలీకి బ్రేక్ పడవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా, జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లు క్రితం ముగింపుతో పోల్చితే మైనస్‌లో ట్రేడవుతుండడం ఇక్కడ గమనార్హం. నకిలీ వీడియోలతో తస్మాత్ జాగ్రత్త! ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ స్టాక్ రికమండేషన్లు ఇస్తున్నట్లు అవాస్తవ(డీప్‌ఫేక్) వీడియోల సృష్టి జరిగినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం తాజాగా పేర్కొంది. ఆధునిక సాంకేతికతను తప్పుడు మార్గంలో వినియోగించడం ద్వారా ఎన్ఎస్ఈ లోగోసహా.. ఆశిష్‌కుమార్ ముఖం లేదా గొంతుతో షేర్ల సిఫారసులు చేస్తున్న ఫేక్ వీడియోలను నమ్మొద్దని హెచ్చరించింది. -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 22,753 వద్దకు చేరింది. సెన్సెక్స్ 354 పాయింట్లు ఎగబాకి 75,038 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, కోటక్ మహీంద్రాబ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటాన్, టీసీఎస్, నెస్లే, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. మారుతీ సుజుకీ, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల బాటపట్టాయి. ఇదీ చదవండి: 100 నుంచి 75 వేల పాయింట్ల వరకు ప్రస్థానం (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
100 నుంచి 75 వేల పాయింట్ల వరకు ప్రస్థానం
స్టాక్మార్కెట్లో ఒడిదుడుకులు సహజం. స్వల్పకాలంలోనే డబ్బు సంపాదిద్దామని మార్కెట్లోకి వచ్చిన వారికి ఇటీవల ఈక్విటీ మార్కెట్లు కొంత నిరాశ కలిగించే ఉంటాయి. దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందాలనుకునే వారు మాత్రం ఇలాంటి ఎత్తుపల్లాలు పట్టించుకోకుండా క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా అనుకున్న ఆర్థిక లక్ష్యాలు చేరుకుంటారని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఎన్నో అంతర్జాతీయ అనిశ్చితులు రావొచ్చు. దేశాల మధ్య యుద్ధాలు జరగొచ్చు. కమోడిటీ, ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లొచ్చు. అయినా సరే అన్నింటినీ తట్టుకుని పెట్టుబడి విషయంలో క్రమశిక్షణ పాటిస్తే 20-30 ఏళ్లలో పెట్టుబడిదారుల కోరిక నెరవేరుతుందని నిపుణులు అంటున్నారు. మార్కెట్లు గతంలోనూ చాలా అనిశ్చితులను తట్టుకుని ఇన్వెస్టర్లకు మంచి సంపద సృష్టించాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లు జీవితకాల గరిష్టాలను తాకుతున్నాయి. 1979లో 100 పాయింట్లు ఉన్న సెన్సెక్స్ ప్రస్తుతం 75000 మార్కును తాకింది. ఈ మధ్యలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుంది. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. 100 పాయింట్లు: ఏప్రిల్ 3, 1979లో బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్లను చేరింది. 1000 పాయింట్లు: జులై 23, 1990లో ఈ మార్కెను చేరుకుంది. 900 పాయింట్లు పెరగడానికి అప్పట్లో దాదాపు 11 ఏళ్లు పట్టింది. 5000 పాయింట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు చేరుకున్నాక దేశీయంగా చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. జనవరి 17, 1991లో గల్ఫ్‌యుద్ధం మొదలైంది. జులై 24న మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కీలక మార్పులు తీసుకొచ్చారు. ఏప్రిల్ 26, 1992లో హర్షద్‌మెహతా కుంబకోణం సంచలనం సృష్టించింది. జనవరి 01, 1993 నుంచి భారత్‌లోకి ఎఫ్ఐఐల రాకమొదలైంది. అక్టోబర్ 28, 1997లో ఏషియన్ మార్కెట్లు కుప్పకూలాయి. మే 1,1998లో భారత్ న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించింది. అక్టోబర్ 05, 1998లో యూఎస్‌లో ఆర్థిక అనిశ్చితుల కారణంగో భారత్‌లోని సెన్సెక్స్ ఓకేరోజు 7 శాతం కుంగింది. మే26, 1999లో పాకిస్థాన్‌పై భారత్ కార్గిల్ యుద్ధం ప్రకటించింది. డిసెంబర్ 30, 1999లో సెన్సెక్స్ 5000 మార్కును తాకింది. 10000 పాయింట్లు ఏప్రిల్ 13, 2000లో టెక్ కంపెనీలు భారీగా నష్టపోయయి. మార్చి 30, 2001లో కేతన్‌ప్రకాశ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. జులై 2, 2001లో ‘బద్లా ట్రేడింగ్’ను రద్దు చేశారు. ఫిబ్రవరి 7, 2002లో ఎఫ్ఐఐలకు డెరివేటివ్ ట్రేడింగ్‌లోకి అనుమతులు ఇస్తూ ప్రకటనలు జారీ చేశారు. ఫిబ్రవరి 6, 2006లో 10000 మార్కెను చేరింది. 25000 పాయింట్లు ఏప్రిల్ 26, 2007లో ఐపీఓ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 17,2007లో సెబీ ఎఫ్ఐఐల ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో 50 శాతం ఉండేలా పార్టిసిపేటరీ నోట్ పద్ధతిలో మార్పులు తీసుకొచ్చింది. జనవరి 21, 2008 అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. మే 16, 2014లో సెన్సెక్స్ 25000 మార్కును తాకింది. 50000 పాయింట్లు మే 26, 2014లో నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నవంబర్ 9, 2016లో రూ.500, రూ.1000 పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జులై 1, 2017లో జీఎస్టీను అమలులోకి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 14, 2018లో ఎల్ అండ్ ఎఫ్ఎస్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మార్చి 24, 2020లో కొవిడ్ వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. జనవర్ 21, 2021లో సెన్సెక్స్ 50000 మార్కును చేరింది. ఇదీ చదవండి: సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసిన యూనికార్న్‌లు ఇవే.. 75000 పాయింట్లు జనవరి 24, 2023లో అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికతో మార్కెట్లు కొంత రెడ్‌లో ముగిశాయి. నవంబర్ 29, 2023లో భారత్ కంపెనీలు 4 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్కు చేరాయి. ఏప్రిల్ 9, 2024లో సెన్సెక్స్ చివరకు 75000 మార్కును కూడా విజయవంతంగా చేరుకుంది. -
అవకాశాలను సృష్టించుకోవాలి!
మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆరుషి ఢిల్లీ వాసి. కాలేజీ రోజుల నుంచే ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారాఫ్యాషన్ డ్రెస్సులు, జ్యువెలరీ అమ్మకాలు చేపట్టింది. ఏడేళ్ల క్రితం 30 వేల రూపాయతో విష్’ పేరుతో సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసి, విదేశాలకూ తన ఉత్పత్తులను సర ఫరా చేస్తోంది. ;పాతికమందికి పైగా మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించింది. దేశంలో గ్రామీణ మహిళా కళాకారులను గుర్తించి, వారితో నెట్వర్కింగ్ ఏర్పాటుచేసి, ఉపాల్పిస్తోంది. ‘అవకాశాలను వెతకడం కాదు, మనమే సృష్టించుకోవాలి’ అంటున్న ఆరుషి నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ‘‘నేను ఫ్యాషన్ డ్రెస్సులు, కస్టమైజ్డ్ జ్యువెలరీ, డెకరేటివ్ వస్తువులు, పిల్లల బట్టలు, ఇతర ఉపకరణాలను ఎగుమతి చేస్తుంటాను. నాకు మొదటి నుంచి బిజినెస్ అంటే ఇష్టం. కాలేజీ రోజుల్లో అమ్మతో కలిసి అనేక ఈ–కామర్స్ సైట్లలో చీరలు, సూట్లు అమ్మేదానిని. కానీ, చాలా పోటీ అనిపించేది. ఏదైనా సరే భిన్నంగా చేయాలనే కోరిక ఉండేది. కానీ, సరైన మార్గం దొరికేది కాదు. కాలేజీలో చదువుతూనే ఓ కంపెనీలో ఉద్యోగం కూడా చేశాను. కానీ, నాకు నేనుగా నిరూపించుకునే పనిచేయాలనుకునేదాన్ని. దీంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి సమయాన్ని వ్యా΄ారానికి కేటాయించాలనుకున్నాను. ఉద్యోగం ద్వారా సంపాదించిన మొత్తంతో సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నాను. 30 వేల రూ΄ాయలతో ‘లావిష్’ అనే పేరుతో కంపెనీని రిజిస్టర్ చేయించాను. అమెజాన్‌తో కలిసి చీరలు, ఫ్యాషన్ జ్యువెలరీ వంటివి అమ్మడం మొదలుపెట్టాను. రెండేళ్లు ఈ పనులు ఇలాగే కొనసాగాయి. అంతర్జాతీయంగా.. అమ్మే ఉత్పత్తులకు నా సొంత ఆలోచనను జోడించాను. సొంతంగా డిజైన్లు చేయడంతో ΄పాటు కొనుగోలుదార్లు అడిగే డిజైన్లపైనా పనిచేయడం మొదలుపెట్టాను. కస్టమైజ్డ్ డిజైన్లు అవడంతో ఆర్డర్లు విరివిగా రావడం మొదలయ్యాయి. దేశంలోనే కాదు అంతర్జాతీయంగానూ కొనుగోలుదార్లు పెరిగారు. పాతికలక్షలకు పైగా టర్నోవర్ సాధిస్తున్నాను. మహిళలు మాత్రమే నా కంపెనీలో మహిళలు మాత్రమే పనిచేస్తున్నారు. దేశంలోని గ్రామాల నుండి కళాకారుల సమాచారం సేకరిస్తాను. వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తాను. అక్కడ ఉత్పత్తులను తయారు చేయించి, వాటిని విక్రయిస్తాను. మహిళలు మాతో కనెక్ట్ అవడానికి ప్రత్యేక ప్రయోజనం కూడా ఉంది. తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయనవసరం లేదు. అమ్ముకోవడం కోసం బయటికి వెళ్లనక్కరలేదు. ఇంట్లో కూర్చొని ఉపాధి ΄పోందవచ్చు. అంతేకాదు, వారి నైపుణ్యాలను ప్రపంచం గుర్తిస్తుంది. దీనిద్వారా ఎంతోమంది మహిళలకు ఉపాధి లభిస్తుంది. మన హస్తకళలకు ముఖ్యంగా ఆభరణాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. విదేశీ మహిళలకు రాజస్థానీ వస్త్రధారణ, బంజారా నగలు అంటే పిచ్చి. వారు భారతీయ సంస్కృతిని చాలా ఇష్టపడతారు. దీని కారణంగానే వారు భారతీయ డ్రెస్సులు, ఆభరణాలవైపు ఆకర్షితులవుతారు. ఒంటరి తల్లి నా సక్సెస్ వెనక మా అమ్మ మద్దతు చాలా ఉంది. నేను ముందడుగు వేయడంలో అమ్మ ఎప్పుడూ ్రపోత్సహిస్తుంటుంది. మా చెల్లినీ, నన్ను అమ్మ ఒంటరిగా చాలా కష్టపడి పెంచింది. ఆ కష్టంలో... నేను నా మార్గం కనుక్కోవడానికి ధైర్యాన్ని కూడా ఇచ్చింది. అందుకే ఈ రోజు వరకు 12 దేశాలకు ఒంటరిగా వెళ్లి, సందర్శించగలిగాను. ఇంటి పేరుకు నో! నా పేరుకు ఇంటిపేరు జోడించకూడదని నా సొంత నిర్ణయం. అందుకే, నా పేరుకు ముందు సర్నేమ్ ఉండదు. ఒక వ్యక్తి చేసే పనే వారి గుర్తింపు అవుతుంది. అందుకే, ఇంటి పేరును జత చేసుకోవాల్సిన అవసరం లేదని నేను భావించాను. అందుకు మా అమ్మ కూడా మద్దతు తెలిపింది. కానీ, ముఖ్యమైన పేపర్లలో సర్నేమ్ లేకుండా ఇవ్వలేమనే నిబంధనలతో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. స్కూల్లో, కాలేజీలో ప్రతిచోటా ఈ సమస్య ఎదురైంది. కానీ, నా నిర్ణయాన్ని మార్చకోలేనని స్పష్టంగా చె΄్పాను. అందుకు, చట్టపరంగానూ, న్యాయసలహాలు తీసుకున్నాను. దీంతో నా సర్టిఫికెట్లన్నింటిలోనూ నా పేరు మాత్రమే ఉంటుంది. ఒంటరి యాత్రికురాలిని నాకు ప్రయాణాలు అంటే ఇష్టం. ప్రకృతి అందమైన ప్రపంచాన్ని మన ముందుంచింది. దానిని ఆస్వాదించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అనుకుంటాను. స్వదేశంలో లేదా విదేశంలో ఎక్కడ సందర్శనకు వెళ్లినా ప్రతిచోటా వారి సంస్కృతి, కళల గురించి తెలుసుకుంటాను. గ్రామాల్లో దాగి ఉన్న సాంస్కృతిక, కళాత్మక ప్రతిభను తెలుసుకొని, నైపుణ్యాలను మెరుగుపరిచి, ప్రపంచం ముందుకు తీసుకువస్తుంటాను’’ అని తన విజయపథాన్ని వివరించింది ఆరుషి.