Market
-
సాక్షి మనీ మంత్ర: బుల్‌జోరు.. గ్రీన్‌లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 22,703కు చేరింది. సెన్సెక్స్ 203 పాయింట్లు పుంజుకుని 74,883 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 89.49 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.35 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.14 శాతం లాభాలతో ముగిసింది. నాస్డాక్ 0.32 శాతం లాభపడింది. రష్యా తదితర అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలకూ ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇక ఇటీవల యూఎస్ డాలరుతో బలహీనంగా కదులుతున్న దేశీ కరెన్సీ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. ఫండ్స్ రేట్లను యథాతథంగా నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. అమెరికాలో వడ్డీ రేట్ల కోతపై సానుకూల అంచనాలు ఉన్నాయి. జరగబోయే ఎన్నికల అనంతరం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడొచ్చన్న ఊహాగానాలతో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు నష్టపోయి 22,645 వద్దకు చేరింది. సెన్సెక్స్ 77 పాయింట్లు దిగజారి 74,665 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, సన్‌ఫార్మా, నెస్లే కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, ఐటీసీ, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఆల్‌టైమ్‌హై.. గ్రీన్‌లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం జీవితకాల గరిష్ఠాలను చేరాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 49 పాయింట్లు లాభపడి 22,718కు చేరింది. సెన్సెక్స్ 168 పాయింట్లు పుంజుకుని 74,908 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104.12 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 90.52 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.04 శాతం నష్టాలతో, నాస్డాక్ 0.03 శాతం లాభాలతో ముగిసింది. మార్కెట్ విలువ రికార్డ్ ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) సోమవారం తొలి సెషన్లో రూ.401 లక్షల కోట్లను అధిగమించింది. మార్కెట్ చరిత్రలో ఇది తొలిసారికాగా.. డాలర్లలో 4.81 ట్రిలియన్లను తాకింది. చివరికి బీఎస్ఈ మార్కెట్ విలువ రూ. 4,00,86,722 వద్ద స్థిరపడింది. గతేడాది జులైలో తొలిసారి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 300 లక్షల కోట్లను తాకిన విషయం విదితమే. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్స్ బుల్ సవారీ
ముంబై: ప్రధానంగా బ్లూచిప్స్‌లో కొనుగోళ్లతో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి హైజంప్ చేశాయి. వెరసి ప్రామాణిక ఇండెక్సులు సరికొత్త గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 494 పాయింట్లు ఎగసి 74,742 వద్ద ముగిసింది. నిఫ్టీ 153 పాయింట్లు జమ చేసుకుని 22,666 వద్ద స్థిరపడింది. ఒక దశలో సెన్సెక్స్ 621 పాయింట్లు పురోగమించి 74,869ను తాకింది. ఇక నిఫ్టీ 183 పాయింట్లు బలపడి 22,697 వద్ద గరిష్టాన్ని అందుకుంది. ప్రపంచ స్టాక్ మార్కెట్ల ర్యాలీ సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వారాంతాన యూఎస్ మార్కెట్లు లాభపడిన సంగతి తెలిసిందే. . మార్కెట్ విలువ రికార్డ్ ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలి సెషన్లో రూ. 401 లక్షల కోట్లను అధిగమించింది. మార్కెట్ చరిత్రలో ఇది తొలిసారికాగా.. డాలర్లలో 4.81 ట్రిలియన్లను తాకింది. చివరికి బీఎస్ఈ మార్కెట్ విలువ రూ. 4,00,86,722 వద్ద స్థిరపడింది. గతేడాది జులైలో తొలిసారి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 300 లక్షల కోట్లను తాకిన విషయం విదితమే. బ్లూచిప్స్ దన్ను ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, ఆయిల్, రియల్టీ, మెటల్ రంగాలు 2.2–1.2 శాతం మధ్య పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా, ఐటీ 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్, ఎంఅండ్ఎం, మారుతీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ, గ్రాసిమ్, టాటా కన్జూమర్, ఎల్అండ్టీ, ఆర్ఐఎల్, యాక్సిస్, హీరోమోటో, ఎయిర్టెల్ 4–1 శాతం మధ్య ఎగశాయి. అయితే అదానీ పోర్ట్స్, నెస్లే, అపోలో హాస్పిటల్, విప్రో, సన్ ఫార్మా 1.6–0.6 శాతం మధ్య నీరసించాయి. ఆధార్ హౌసింగ్ ఐపీవోకు రెడీ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఐపీవో ద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. మే 20న మార్కెట్లకు సెలవు ముంబైలో సాధారణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మే 20న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 11న ఈద్(రంజాన్), 17న శ్రీరామ నవమి, మే 1న మహారాష్ట్ర డే సందర్భంగా సైతం స్టాక్ మార్కెట్లు పనిచేయవు. -
సాక్షి మనీ మంత్ర : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లో సరికొత్త రికార్డ్‌లు నమోదయ్యాయి. సోమవారం స్టాక్‌మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ, సెన్సెక్స్ ఆల్‌టైం హైకి చేరుకుని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ సానుకూల అంశాలు, ఐటీ, ఆటోమొబైల్ షేర్ల కొనుగోలు, రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగే రాజకీయ పరిణామాలకు కొనసాగింపుగా పెట్టుబడి దారులు మళ్లీ ఆశాజనకంగా మారడంతో బ్యాంక్ నిఫ్టీ తాజా గరిష్ట స్థాయికి చేరుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 494 పాయింట్లు లాభంతో 74,742 వద్ద ముగియగా, నిఫ్టీ 152 పాయింట్ల లాభంతో 22,666 వద్ద ముగిసింది. ఎథేర్ మోటార్స్,మారుతి సుజికీ, ఎం అండ్ ఎం,ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగియగా.. అదానీ పోర్ట్స్,నెస్లే, అపోలో హాస్పిటల్,విప్రో, ఎల్టీఐ మైండ్‌ట్రీ, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. -
ఉగాది వేళ బంగారం కొందామనుకుంటే.. ప్చ్!
Gold Rate today: ఉగాది వేళ బంగారం కొందామనుకున్న పసిడి ప్రియులకు బంగారం ధరలు నిరుత్సాహాన్ని కలిగించాయి. ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ ఈరోజు (ఏప్రిల్ 8) పెరిగాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న పసిడి ధరలు 10 గ్రాములకు ఈరోజు రూ.490 మేర పెరిగాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి రూ.65,650 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.330 చొప్పున పెరిగి రూ.71,620 వద్దకు ఎగిసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇలా.. ♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.65,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.71,620 వద్దకు చేరింది. ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర అత్యధికంగా రూ.450 పెరిగి రూ.66,600లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.490 చొప్పున పెరిగి రూ.72,650 ఉంది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 ఎగిసి రూ.65,800 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 పెరిగి రూ.71,770 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.65,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.71,620 వద్దకు చేరింది. cost of silver today: ఇక వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా మళ్లీ పెరిగాయి. క్రితం రోజు స్థిరంగా ఉన్న రజతం ఈరోజు కేజీకి రూ.1000 చొప్పున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.88,000 ఉంది. ఇది క్రితం రోజున రూ. 87,000 లుగా ఉండేది. -
సాక్షి మనీ మంత్ర: గ్రీన్‌లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 67 పాయింట్లు లాభపడి 22,576కు చేరింది. సెన్సెక్స్ 207 పాయింట్లు పుంజుకుని 74,460 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104.42 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 89.62 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.11 శాతం లాభాలతో ముగిసింది. నాస్డాక్ 1.24 శాతం ఎగబాకింది. రష్యా తదితర అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలకూ ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇక ఇటీవల యూఎస్ డాలరుతో బలహీనంగా కదులుతున్న దేశీ కరెన్సీ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. ఫండ్స్ రేట్లను యథాతథంగా నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. ఈ బాటలో దేశీయంగా సైతం ఆర్బీఐ ద్వైమాసిక పరపతి సమీక్షలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును ఏడోసారీ యథాతథంగా 6.5 శాతంవద్దే కొనసాగించేందుకు నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) జీడీపీ వృద్ధి రేటును 7 శాతంగా అంచనా వేసింది. సీపీఐ లక్ష్యాన్ని 4.5 శాతంగా పేర్కొంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫలితాల సీజన్‌తో జోష్!
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కార్పొరేట్ ఫలితాలు జోష్‌నివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ సేవలకు దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తున్న టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసిక ఫలితాలతో సీజన్‌ను ప్రారంభించనుంది. శుక్రవారం(12న) టీసీఎస్ జనవరి–మార్చి(క్యూ4)తోపాటు పూర్తి ఏడాదికి సైతం ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది. ఇదే రోజు ఆర్థిక గణాంకాలు సైతం వెలువడనున్నాయి. ప్రభుత్వం(ఎన్ఎస్వో) మార్చి నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలను విడుదల చేయనుంది. అంతేకాకుండా ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి వివరాలు సైతం వెల్లడికానున్నాయి. ఫిబ్రవరిలో సీపీఐ నామమాత్ర వెనకడుగుతో 5.09 శాతానికి చేరింది. ఇక పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) జనవరిలో 3.4 శాతంగా నమోదైంది. కాగా.. గురువారం(11న) ఈద్(రంజాన్) సందర్భంగా స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. గత వారం రికార్డు గత వారం ఆర్బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. చివరికి శుక్రవారంతో ముగిసిన గత వారం సెన్సెక్స్ 597 పాయింట్లు(0.8 శాతం) లాభపడి 74,248 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ సైతం 187 పాయింట్లు(0.84 శాతం) ఎగసి 22,514 వద్ద స్థిరపడింది. అయితే చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3.84 శాతం జంప్‌చేసి 40,831 వద్ద నిలిచింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ మరింత అధికంగా 6.64 శాతం దూసుకెళ్లి 46,033 వద్ద ముగిసింది. చమురు, రూపాయి ఎఫెక్ట్ ప్రపంచ స్టాక్ మార్కెట్లు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగలవని స్టాక్ నిపుణులు ప్రస్తావించారు. అంతేకాకుండా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు లేదా అమ్మకాలు మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకాగలవని పేర్కొన్నారు. మరోవైపు రష్యా తదితర అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. ఇక ఇటీవల యూఎస్ డాలరుతో బలహీనంగా కదులుతున్న దేశీ కరెన్సీ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. గత వారం డాలరుతో మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి చేరువైన నేపథ్యంలో ఆరు ప్రపంచ కరెన్సీలతో డాలరు మారకపు విలువ కీలకంగా నిలవనున్నట్లు విశ్లేíÙంచారు. విదేశీ అంశాల విషయానికివస్తే గత వారాంతాన మార్చి నెలకు యూఎస్ వ్యవసాయేతర రంగాలలో ఉపాధి, నిరుద్యోగిత గణాంకాలు వెలువడ్డాయి. వీటితోపాటు ఈ నెల 10న(బుధవారం) యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. ఇటీవల చేపట్టిన పాలసీ సమీక్షలో యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. ఫండ్స్ రేట్లను యథాతథంగా నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. ఈ బాటలో దేశీయంగా సైతం ఆర్బీఐ ద్వైమాసిక పరపతి సమీక్షలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును ఏడోసారీ యథాతథంగా 6.5 శాతంవద్దే కొనసాగించేందుకు నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) జీడీపీ వృద్ధి రేటును 7 శాతంగా అంచనా వేసింది. సీపీఐ లక్ష్యాన్ని 4.5 శాతంగా పేర్కొంది. -
ఈయన్ని నమ్మి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?
న్యూఢిల్లీ: ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ (ఫిన్‌ఫ్లూయెన్సర్) రవీంద్ర బాలుకు సెబీ భారీ షాకిచ్చింది. స్టాక్ మార్కెట్ పేరుతో అక్రమంగా సంపాదించిన మొత్తం రూ.12 కోట్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆ ప్రచారాన్ని నమ్మి పలువురు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోతున్నారు. ఇదే అంశంపై మార్కెట్ నియంత్రణ మండలి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో మార్కెట్ రెగ్యులేటర్ నిబంధనల్ని అతిక్రమించిన సంస్థలు, వ్యక్తులపై సెబీ కొరడా ఝుళిపిస్తోంది. ఈ నేపథ్యంలో రవీంద్ర భారతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ (RBEIPL)వ్యవస్థాపకుడు రవీంద్ర బాలుకు సెబీ నోటీసులు అందించింది. రవీంద్రబాలు,తన భార్య శుభాంగి భారతితో కలిసి 2016 నుంచి భారతి షేర్ మార్కెట్ పేరుతో వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. అందులో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, మార్కెట్లో ఎలా పెట్టుబడులు పెట్టాలో తెలిపేలా మదుపర్లకు క్లాసులు ఇస్తున్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాదు ఈ వెబ్సైట్ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి 25 శాతం నుంచి 1000 శాతం వరకు లాభాలు గడించవచ్చనే ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై సమాచారం అందుకున్న సెబీ రవీంద్ర బాలుకు సంబంధించిన అన్నీ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. తదుపరి నోటీసు వచ్చే వరకు పెట్టుబడి సలహా సేవలు, ట్రేడింగ్ కార్యకలాపాలలో పాల్గొనొద్దంటూ సెబీ వారిని నిషేధించింది. దీంతో పాటు నేషనల్ బ్యాంక్‌లో ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో రూ.12 కోట్లను డిపాజిట్ చేయాలని సూచించింది.కాగా, రెగ్యులేటరీ బాడీ నుండి స్పష్టమైన అనుమతి లేకుండా వాటిని విడుదల చేయడం సాధ్యం కాదని నిర్ధారిస్తూ, ఈ ఎస్క్రో ఖాతాలో నిధుల్ని సెబీ సంరక్షణలో ఉంటాయి. -
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న బంగారం ధరలు పసిడి ప్రియులను భయపెట్టేస్తున్నాయి. గత వారం రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ తారాజువ్వలా పైకి లేశాయి. నేడు దేశంలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.65500 (22 క్యారెట్స్), రూ.71440 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు రూ. 1200, రూ. 1310 వరకు పెరిగింది. చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 1200 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1310 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 65500 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 71440 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 65500 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 71440 రూపాయలకు చేరింది. నిన్న కొంత తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈ రోజు ఏకంగా రూ. 1200, రూ. 1310 పెరిగింది. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 6) వెండి ధర ఒక్కసారిగా రూ. 1800 పెరిగి రూ. 83500 (కేజీ) వద్ద నిలిచింది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 22,526 వద్దకు చేరింది. సెన్సెక్స్ 77 పాయింట్లు దిగజారి 74,306 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రాబ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, బజాన్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీ షేర్లు లాభాలతో ముగిశాయి. ఆల్ట్రాటెక్ సిమెంట్, బజాన్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, మారుతీసుజుకీ, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా, టైటాన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, విప్రో, నెస్లే, ఎన్టీపీసీ సంస్థకు చెందిన షేర్లు నష్టాలబాటపట్టాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 22,457కు చేరింది. సెన్సెక్స్ 178 పాయింట్లు పుంజుకుని 74,049 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104.23 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 90.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.31 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.23 శాతం నష్టాలతో, నాస్డాక్ 1.4 శాతం దిగజారాయి. రూపాయికి అనుసంధానమైన ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ కరెన్సీ డెరివేటివ్స్ (ఈటీసీడీ)పై ఆదేశాల అమలును మే 3కు వాయిదా వేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. పలువురు వాటాదార్ల నుంచి వచ్చిన స్పందనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, వాయిదా పడ్డాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 108 పాయింట్లు లాభపడి 22,543 వద్దకు చేరింది. సెన్సెక్స్ 350 పాయింట్లు దిగజారి 74,227 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రాబ్యాంక్, బజాన్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, విప్రో, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీ షేర్లు లాభాలతో ముగిశాయి. ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, పవర్‌గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ కంపెనీ షేర్లు నష్టాలతో ముగిశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఆల్‌టైమ్ హై.. పుంజుకున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్లు ఆల్‌టైమ్‌హైను చేరాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 144 పాయింట్లు లాభపడి 22,577కు చేరింది. సెన్సెక్స్ 498 పాయింట్లు పుంజుకుని 74,369 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.23 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 89.49 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.35 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.11 శాతం లాభంతో, నాస్డాక్ 0.23 గ్రీన్‌లో ముగిశాయి.ఎన్ఎస్ఈ తాజాగా నగదు విభాగంతోపాటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో)లో నాలుగు ఇండెక్సులను కొత్తగా ప్రవేశపెడుతోంది. నిఫ్టీ టాటా గ్రూప్ 25 శాతం క్యాప్, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ 50:30:20, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50:30:20, నిఫ్టీ మిడ్‌స్మాల్ హెల్త్‌కేర్ పేరుతో కొత్త సూచీలను రూపొందించింది. ఇవి ఈ నెల 8 నుంచి అమల్లోకి రానున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఆల్‌టైమ్ హై.. పుంజుకున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్లు ఆల్‌టైమ్‌హైను చేరాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 144 పాయింట్లు లాభపడి 22,577కు చేరింది. సెన్సెక్స్ 498 పాయింట్లు పుంజుకుని 74,369 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104.23 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 89.49 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.35 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.11 శాతం లాభంతో, నాస్డాక్ 0.23 గ్రీన్‌లో ముగిశాయి. ఎన్ఎస్ఈ తాజాగా నగదు విభాగంతోపాటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో)లో నాలుగు ఇండెక్సులను కొత్తగా ప్రవేశపెడుతోంది. నిఫ్టీ టాటా గ్రూప్ 25 శాతం క్యాప్, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ 50:30:20, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50:30:20, నిఫ్టీ మిడ్‌స్మాల్ హెల్త్‌కేర్ పేరుతో కొత్త సూచీలను రూపొందించింది. ఇవి ఈ నెల 8 నుంచి అమల్లోకి రానున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర : ప్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 27.09 పాయింట్లు నష్టపోయి 73,876.82 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు క్షీణించి 22,434.70 వద్ద ముగింపు పలికాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడగా, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నష్టపోయాయి. రియల్టీ ఇండెక్స్ 2.5 శాతం క్షీణించగా, ఆటో ఇండెక్స్ 0.4 శాతం పడిపోయింది. మరోవైపు పవర్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ (0.6 శాతం పెరుగుదల)తో బ్రాడర్ ఇండెక్స్‌లు తాజా రికార్డు గరిష్ట స్థాయిని తాకాయి. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం పెరిగింది. -
సాక్షి మనీ మంత్ర: నష్టాలలో మార్కెట్లు.. టాప్ లూజర్స్‌లో ఎయిర్టెల్ ఇంకా..
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ బెంచ్ మార్క్ స్టాక్ సూచీలు బుధవారం నష్టాలను కాస్త పెంచుకున్నాయి. ట్రేడింగ్ సెషన్ ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 284.38 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 73,619.52 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 90.45 పాయింట్లు లేదా 0.40 శాతం క్షీణతతో 22,362.85 వద్ద కొనసాగుతున్నాయి. కొనసాగుతున్న విస్తరణలో భాగంగా వచ్చే మూడేళ్లలో రూ.32,400 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించిన తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ దాదాపు 2 శాతం లాభపడింది. మరోవైపు భారతీ ఎయిర్టెల్, నెస్లే, సన్ ఫార్మా, కొన్ని సెలెక్టెడ్ బ్యాంకులు అత్యధికంగా నష్టపోయాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మూడు రోజుల ర్యాలీకి బ్రేక్
ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకులు, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల అంశాలు సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 111 పాయింట్లు నష్టపోయి 73,904 వద్ద స్థిరపడింది. నిఫ్టీ తొమ్మిది పాయింట్లు నష్టపోయి 22,453 వద్ద నిలిచింది. దీంతో సూచీల మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 271 పాయింట్లు పతనమై 73,744 వద్ద కనిష్టాన్ని, నిఫ్టీ 74 పాయింట్లు క్షీణించి 22,388 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. ఆఖరి గంటలో కన్జూమర్ డ్యూరబుల్స్, సర్వీసెస్, మెటల్, యుటిలిటీ, కమోడిటీ రంగాలకు చెందిన మధ్య, తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల నష్టాలు కొంత తగ్గాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.28%, 1.14% చొప్పున పెరిగాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి రికవరీ అయ్యాయి. రిటైల్ విభా గాన్ని విభజిస్తుందన్న వార్తలతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ షేరు 12% లాభపడి రూ.236 వద్ద ముగిసింది. -
తాత చేసిన పని.. 30 ఏళ్ల తర్వాత ఎగిరి గంతేసిన మనువడు
మనలో చాలా మంది..నేను ఎప్పటికైనా లక్షాధికారిని కాకపోతానా? కోటీశ్వరుణ్ణి కాకపోతానా? అని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటారు. అయితే అలా ధనవంతులు కావాలంటే లక్షలు కావాల్సిన పనిలేదు. వందల్లో పొదుపు చేసినా అది ధనవంతుల్ని చేస్తుందని నిజం చేశారు ఓ పెద్దాయన. కేవలం రూ.500 పెట్టుబడి కాస్తా ఇప్పుడు రూ.3.75 లక్షలుగా మారడంతో మనవుడు తన తాతకి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అది వైరల్‌గా మారింది. చండీగఢ్‌కు చెందిన తన్మయ్ మోతీవాలా పీడియాట్రిక్ సర్జన్‌గా వైద్య సేవలందిస్తున్నారు. అయితే ఓ రోజు తన ఇంటిని సర్ధుతుండగా తాత వినియోగించిన ఓ ట్రంక్ పెట్ట మోతీవాలా కంటపడింది. అందులో ఏమున్నాయా? అని తెరిచి చూశాడు. అంతే అప్పుడే తాత పెట్టిన పెట్టుబడి చూసి ఎగిరి గంతేసినంత పనిచేశారు. అయితే ఆ ట్రంక్ పెట్టెలో 1994లో తన తాత రూ. 500 విలువైన ఎస్బీఐ షేర్లను కొనుగోలు చేసినట్లు, వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను షేర్ చేశారు. తన తాత షేర్లను కొనుగోలు చేశారు. వాటిని అమ్మలేదని తర్వాత గుర్తించాడు. ఆ రూ.500 పెట్టబడితో వచ్చిన ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఆరా తీశారు. 1994లో ఒక్కో షేర్ రూ.10 చొప్పున రూ.500కి మొత్తం 50 షేర్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ మొత్తం షేర్ల విలువ రూ.3.75లక్షలకు చేరింది. అంటే దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టిన మొత్తం 750 శాతంతో రిటర్న్స్ వచ్చాయని డాక్టర్ మోతీవాలా వెల్లడించారు. The power of holding equity 😊 My Grand parents had purchased SBI shares worth 500 Rs in 1994. They had forgotten about it. Infact they had no idea why they purchased it and if they even hold it. I found some such certificates while consolidating family's holdings in a… pic.twitter.com/GdO7qAJXXL — Dr. Tanmay Motiwala (@Least_ordinary) March 28, 2024 -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 22,453 వద్దకు చేరింది. సెన్సెక్స్ 110 పాయింట్లు దిగజారి 73,903 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎం అండ్ ఎం, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, టాటీ స్టీల్, ఎస్బీఐ, బజాజ్ ఫైన్‌సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, విప్రో, బజాన్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి చేరుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 22,444కు చేరింది. సెన్సెక్స్ 91 పాయింట్లు పుంజుకుని 73,916 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 87.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.32 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.20 శాతం నష్టంతో, నాస్డాక్ 0.11 లాభంతో ముగిశాయి.దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన సమీక్ష (ఏప్రిల్ 3-5) నిర్ణయాలపైనా మదుపర్లు దృష్టి సారించొచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ ప్రసంగ (ఏప్రిల్ 3) అంశాలూ గమనించాలి. నిఫ్టీ-50 తన జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన 22,526.60ను పరీక్షించొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. కార్పొరేట్ సంస్థల ఫలితాల సీజను ప్రారంభం కానున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉండొచ్చని భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 22,444కు చేరింది. సెన్సెక్స్ 91 పాయింట్లు దిగజారి 73,916 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 105 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 87.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.32 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.20 శాతం నష్టంతో, నాస్డాక్ 0.11 లాభంతో ముగిశాయి. దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన సమీక్ష (ఏప్రిల్ 3-5) నిర్ణయాలపైనా మదుపర్లు దృష్టి సారించొచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ ప్రసంగ (ఏప్రిల్ 3) అంశాలూ గమనించాలి. నిఫ్టీ-50 తన జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన 22,526.60ను పరీక్షించొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. కార్పొరేట్ సంస్థల ఫలితాల సీజను ప్రారంభం కానున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉండొచ్చని భావిస్తున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 148 పాయింట్లు లాభపడి 22,475 వద్దకు చేరింది. సెన్సెక్స్ 399 పాయింట్లు దిగజారి 74,051 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హిందుస్థాన్ యూనిలివర్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ కంపెనీ షేర్లు లాభాలతో ముగిశాయి. టైటాన్, నెస్లే, భారతీఎయిర్‌టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, మారుతీసుజుకీ, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: కొత్త ఏడాదిలో లాభాలతో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 1న లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 175 పాయింట్లు లాభపడి 22,502కు చేరింది. సెన్సెక్స్ 510 పాయింట్లు పుంజుకుని 74,162 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104.45 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 86.81 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.20 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.11 శాతం లాభంతో, నాస్డాక్ 0.12 నష్టంతో ముగిశాయి. దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన సమీక్ష (ఏప్రిల్ 3-5) నిర్ణయాలపైనా మదుపర్లు దృష్టి సారించొచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ ప్రసంగ (ఏప్రిల్ 3) అంశాలూ గమనించాలి. నిఫ్టీ-50 తన జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన 22,526.60ను పరీక్షించొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. కార్పొరేట్ సంస్థల ఫలితాల సీజను ప్రారంభం కానున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉండొచ్చని భావిస్తున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సమీప భవిష్యత్తులో రూ.1.48 లక్షలకోట్ల షేర్లపై ప్రభావం..!
రానున్న 4 నెలల్లో రూ.1.48 లక్షల కోట్ల విలువైన 66 కంపెనీల షేర్లకు లాకిన్ గడువు ముగియనుంది. దీంతో ఈ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారీగా కంపెనీలు స్టాక్మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. అయితే సెబీ నిబంధనల ప్రకారం యాంకర్ ఇన్వెస్టర్లు కంపెనీలో పెట్టుబడిపెట్టిన 90 రోజుల వరకు తమ షేర్లను అమ్మేందుకు వీలుండదు. ఆ లాకిన్ గడువు ముగిసిన తర్వాత వాటిని ఈక్విటీ మార్కెట్లో విక్రయించవచ్చు. గడిచిన కొద్దిరోజుల్లో టాటా టెక్నాలజీస్ వంటి ప్రముఖ కంపెనీలు సైతం ఐపీఓగా మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఆ ఒక్క కంపెనీ అనే కాకుండా మార్కెట్లో పేరున్న చాలా కంపెనీలు మంచి లిస్టింగ్గేయిన్స్తో స్టాక్మార్కెట్లో లిస్ట్అయ్యాయి. ఆ లాభాలంతా 90 రోజుల తర్వాత యాంకర్ ఇన్వెస్టర్ల పొందే వీలుంది. ఇదీ చదవండి: తగ్గనున్న పారుబాకీలు.. అధిక ఎన్పీఏలు ఉన్న రంగాలివే.. లాకిన్ గడువు పూర్తికానున్న షేర్లలో టాటా టెక్నాలజీస్, హోనాసా కన్జూమర్, సెల్లో వరల్డ్, జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి. ఏప్రిల్ 1న గ్లోబల్ సర్ఫేసెస్, సాయి సిల్క్స్, జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాటినం ఇండస్ట్రీస్, ఎక్సికామ్ టెక్నాలజీస్ షేర్ల లాకిన్ ముగియనుంది. రానున్న 4 నెలల్లో దాదాపు 66 కంపెనీల లాకిన్ ముగుస్తుంది. దాంతో సుమారు రూ.1.48 లక్షలకోట్ల విలువైన షేర్లపై ప్రభావం పడనుంది.