Market
-
రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు: 2024లో ఇదే హయ్యెస్ట్..
రోజురోజుకి బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మార్చి 21న గరిష్టంగా 109 రూపాయలు పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు (మార్చి 29) ఏకంగా 142 రూపాయలు పెరిగింది. 2024లో ఇదే హయ్యెస్ట్ పెరుగుదల అని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడల, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.63150 (22 క్యారెట్స్), రూ.68880 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 1300, రూ. 1420 పెరిగింది. చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 1300 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1420 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 63150 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 68880 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 63150 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 68880 రూపాయలకు చేరింది. నిన్న రూ. 350 నుంచి రూ. 380 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు ఏకంగా రూ. 1300, రూ. 1420 వరకు పెరిగాయి. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (మార్చి 29) వెండి ధర రూ. 300 పెరిగి రూ. 77800 (కేజీ) వద్ద నిలిచింది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఆర్థిక సంవత్సరానికి లాభాలతో గుడ్ బై...
ముంబై: ఆర్థిక సంవత్సరం చివరి రోజైన గురువారం స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు పెరిగి 73,651 వద్ద ముగిసింది. నిఫ్టీ 203 పాయింట్లు బలపడి 22,327 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి మీడియా మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 1,194 పాయింట్లు పెరిగి 74,190 వద్ద, నిఫ్టీ 392 పాయింట్లు బలపడి 22,516 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. స్టాక్ మార్కెట్ సంబంధించి ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో పాటు ఫారెక్స్ మార్కెట్లో బలహీనతల కారణంగా ఆఖర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో సూచీలు కొంతమేర ఆరంభ లాభాలు కోల్పోయాయి. సెన్సెక్స్ దాదాపు ఒకశాతం లాభపడటంతో బీఎస్ఈలో రూ.3.33 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ► సెన్సెక్స్ 30 షేర్లలో యాక్సిస్ బ్యాంక్ (0.50%), రిలయన్స్ (0.37%), హెచ్‌సీఎల్ (0.26%), టెక్ మహీంద్రా (0.25%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 26 షేర్లూ లాభపడ్డాయి. ► బీఎస్ఈ, నిఫ్టీలు ఎంపిక చేసుకున్న షేర్లలో బీటా వెర్షన్ టి+0 ట్రేడ్ సెటిల్మెంట్ను ప్రారంభించాయి. తొలి రోజున రెండు ఎక్స్ఛేంజిల్లో 60 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. నేడు ఎక్స్ఛేంజిలకు గుడ్‌ఫ్రైడే సెలవు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు రోజులు కావడంతో ట్రేడింగ్ సోమవారం ప్రారంభం అవుతుంది. ర్యాలీ ఎందుకంటే ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్ల(ఏఐఎఫ్)లో రుణదాతల పెట్టుబడులపై గతంలో కఠిన ఆంక్షల విధించిన ఆర్బీఐ తాజాగా నిబంధనలను సులభతరం చేయడంతో అధిక వెయిటేజీ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు ఫైనాన్స్ రంగాల షేర్లు రాణించాయి. మోర్గాన్ స్టాన్లీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ భారత వృద్ధి అవుట్‌లుక్‌ను 6.5 శాతం నుంచి 6.8 శాతానికి అప్‌గ్రేడ్ చేసింది. ఇటీవల ఎఫ్ఐఐలు భారత ఈక్విటీల పట్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. అమెరికా సూచీలు రికార్డు స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు 0.5% పెరిగాయి. 2023– 24లో రూ.128 లక్షల కోట్ల సృష్టి దేశీయ స్టాక్ మార్కెట్ 2023–24లో గణనీయమైన లాభాలు పంచింది. సెన్సెక్స్ 14,660 పాయింట్లు (25%) ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం విలువ ఏడాది వ్యవధిలో 128 లక్షల కోట్ల పెరిగి రూ.387 లక్షల కోట్లు చేరింది. సెన్సెక్స్ మార్చి 7న 74,245 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. మార్చి 2న ఇన్వెస్టర్ల సంపద సైతం రూ.394 లక్షల వద్ద ఆల్‌టైం హైని తాకింది. ఇదే కాలంలో నిఫ్టీ 4,967 పాయింట్లు(29%) పెరిగింది. మార్చి 11న 22,526 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. 2022–23లో 423 పాయింట్లు పెరిగినప్పటికీ ఇన్వెస్టర్లకు రూ. 5.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. కార్వికి సెబీ మరో షాక్ కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్‌కు సెబీ మరో షాక్ ఇచ్చింది. అర్హత ప్రమాణాలను ఉల్లంఘించినందుకు మర్చంట్ బ్యాంకర్ రిజి్రస్టేషన్‌ను రద్దు చేసింది. 2023 మార్చి 15–17 తేదీల్లో కార్వీ ఇన్వెస్టర్ సర్విసెస్‌ను సెబీ బృందం తనిఖీల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. గతంలోనూ సెబీ కార్వీపై పలు చర్యలు తీసుకున్న సంగతి విదితమే. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డీలిస్టింగ్ స్టాక్ ఎక్స్ఛేంజిల నుంచి డీలిస్ట్ చేసేందుకు 72 శాతం వాటాదారులు అనుమతించినట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తాజాగా వెల్లడించింది. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. డీలిస్టింగ్ తదుపరి మాతృ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌లో విలీనంకానున్నట్లు తెలియజేసింది. డీలిస్టింగ్ పథకంలో భాగంగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వాటాదారులు తమ వద్దగల ప్రతీ 100 షేర్లకుగాను 67 ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లను పొందనున్నట్లు వెల్లడించింది. -
సాక్షి మనీ మంత్ర: మంచి లాభాలతో ముగిసిన మార్కెట్లు.. ఈ షేర్లదే హవా!
దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ బెంచ్ మార్క్ స్టాక్ సూచీలు ట్రేడింగ్ సెషన్‌ను సానుకూలంగా ముగించాయి. ఎన్ఎస్సీ నిఫ్టీ 219.85 పాయింట్లు లేదా 0.99% లాభపడి 22,343.50 వద్ద స్థిరపడగా, బీఎస్ఈ సెన్సెక్స్ 655.04 పాయింట్లు లేదా 0.90% జంప్ చేసి 73,651.35 వద్దకు చేరుకుంది. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్‌లు లాభపడటంతో విస్తృత సూచీలు సానుకూలంగా ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 338.65 పాయింట్లు లేదా 0.72 శాతం పెరిగి 47,124.60 వద్ద స్థిరపడింది. మీడియా స్టాక్స్ నష్టాలను చూడగా ప్రభుత్వ బ్యాంకులు, ఆటో స్టాక్స్ ఇతర రంగాల సూచీల కంటే మెరుగైన పనితీరు కనబరిచాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈ రోజు బంగారం ధరలు - ఇలా ఉన్నాయి
2024 ప్రారంభంలో వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. ఫిబ్రవరి, మార్చిలో భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం గ్రామ్ బంగారం ధర రూ. 7000 దగ్గరకు చేరుకునే దిశగా పరుగులు పెడుతోంది. ఈ రోజు (మార్చి 28) దేశంలో బంగారం ధరలు ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా.. గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.61850 (22 క్యారెట్స్), రూ.67460 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 350, రూ. 380 వరకు పెరిగింది. చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధరలు 350 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 380 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 61850 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 67460 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 61850 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 67460 రూపాయలకు చేరింది. నిన్న రూ. 200 నుంచి రూ. 220 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు రూ. 350, రూ. 380 వరకు పెరిగాయి. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. గత రెండు రోజులుగా తగ్గిన ధరలు ఈ రోజు మళ్ళీ పెరిగాయి. దీంతో వెండి ధర ఈ రోజు (మార్చి 28) రూ. 77500 (కేజీ) వద్ద ఉంది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
నిన్న భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు (మార్చి 28) లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 197.60 పాయింట్ల లాభంతో 73193.91 వద్ద, నిఫ్టీ 61.90 పాయింట్ల లాభంతో 22185.60 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, బజాజ్ ఫిన్సర్వ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, బయోకాన్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మొదలైనవి చేరాయి. అపోలో హాస్పిటల్, టైటాన్ కంపెనీ, బ్రిటానియా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) కంపెనీలు నష్టాల జాబితాలో సాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బుల్ బ్యాక్ ర్యాలీ
ముంబై: ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాల నమోదుతో బ్యాంకింగ్, ఆటో, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 526 పాయింట్లు పెరిగి 72,996 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్లు బలపడి 22,100 స్థాయిపైన 22,124 వద్ద నిలిచింది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్(1%), రిలయన్స్ ఇండస్ట్రీస్(4%), మారుతీ సుజుకీ(2%) షేర్లు రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. రోజంతా లాభాలే.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో రోజంతా లాభాల్లో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 668 పాయింట్లు బలపడి 73,139 వద్ద, నిఫ్టీ 188 పాయింట్లు ఎగసి 22,193 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. మళ్లీ రూ.20 లక్షల కోట్లపైకి రిలయన్స్ మార్కెట్ క్యాప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేరు 3.60% లాభపడి రూ.2988 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ గోల్డ్‌మెన్ శాక్స్ రిలయన్స్ కంపెనీ షేరు టార్గెట్ ధరను పెంచడంతో పాటు క్రూడాయిల్ ధరలు దిగిరావడం ఈ షేరుకు డిమాండ్ లభించింది. ట్రేడింగ్‌లో 4% లాభపడి రూ.3000 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.70,039 కోట్లు పెరిగి రూ.20.21 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ ఫిబ్రవరి 13న కంపెనీ రిలయన్స్ క్యాప్ రూ.20 లక్షల కోట్ల స్థాయిని అందుకుంది. దేశంలో టాప్–5 మార్కెట్ క్యాప్ కలిగిన సంస్థల్లో రిలయన్స్ అగ్రస్థానంలో నిలవగా.., టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ► జ్యువెలరీ రిటైల్ కంపెనీ పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ► బజాజ్ ఫైనాన్స్‌కు చెందిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. తద్వారా కంపెనీ 10 బిలియన్ డాలర్ల(రూ. 83,000 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ► మారుతీ సుజుకీ రూ.12,256 జీవిత కాల గరిష్టాన్ని తాకింది. దీనితో ఇంట్రాడేలో మార్కెట్ క్యాప్ రూ.4 లక్షల కోట్లను అందుకుంది. -
సాక్షి మనీ మంత్ర : భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగింపు పలికాయి. నిన్న నష్టాలతో ముగిసినా బుధవారం ఆటోమొబైల్, రియాలి, పవర్ అండ్ కేపిటల్ గూడ్స్ షేర్ల కొనుగోలుతో నేడు భారీ లాభాల బాట పట్టాయి. దీంతో బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 526 పాయింట్ల లాభంతో 72,996 వద్ద నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 22,123 వద్ద ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజికీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ముగియగా, హీరోమోటో కార్పో, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రోలో నష్టాలతో సరిపెట్టుకున్నాయి. -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లోకి స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. క్రితం నష్టాలతో ముగిసిన బెంచ్ మార్క్ సూచీలు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెషన్ ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 182.35 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 72,652.65 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 57.40 పాయింట్లు లేదా 0.26 శాతం లాభంతో 22,062.10 వద్ద కొనసాగుతున్నాయి. బీపీసీల్, రిలయన్స్, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, హెచ్‌యూఎల్ షేర్లు మంచి లాభాలతో టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐషర్ మోటర్స్, భారతీ ఎయిర్టెల్, విప్రో, కోటక్ మహీంద్ర షేర్లు టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: మార్కెట్లపై బేర్ పంజా
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 22,020 వద్దకు చేరింది. సెన్సెక్స్ 357 పాయింట్లు దిగజారి 72,473 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్‌టీ, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రాబ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, హెచ్‌యూఎల్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 22,045కు చేరింది. సెన్సెక్స్ 172 పాయింట్లు దిగజారి 72,658 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 86 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.21 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు ఎస్ అండ్ పీ 0.14 శాతం నష్టాలతో, నాస్డాక్ 0.16 లాభాలతో ముగిశాయి. సోమవారం హోలీ పండగ సందర్భంగా ఈక్విటీ మార్కెట్లు పనిచేయలేదు. గుడ్‌ఫ్రైడే కావడంతో వచ్చే శుక్రవారమూ (ఈనెల 29న) మార్కెట్లకు సెలవే కనుక ఈ వారంలో మూడు రోజులే ట్రేడింగ్ జరగనుంది. నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారమే తీరనుంది. అమెరికా జీడీపీ గణాంకాల ప్రభావమూ కనిపించొచ్చు. నిఫ్టీ 22,200 స్థాయి పైన బలంగా ముగిస్తేనే బులిష్ ధోరణి కనిపించొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
టి+0 సెటిల్మెంట్కు తేదీ ఖరారు చేసిన సెబీ
స్టాక్మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి ఇప్పటి వరకు టి+1 రోజున అంటే ట్రేడ్ చేసిన మరుసటి రోజున సెటిల్మెంట్ జరుగుతోంది. అయితే తాజాగా సెబీ నిబంధనలు మారుస్తున్నట్లు ప్రకటించింది. దాంతో టి+0తో ట్రేడ్ జరిగిన రోజే షేర్ల సెటిల్మెంట్ పూర్తవుతుంది. ప్రస్తుతానికి సెబీ ఈ సెటిల్మెంట్పై నమూనా పరీక్షలను నిర్వహించనుంది. మార్చి 28, 2024 నుంచి బీటా వర్షన్‌ను ఆవిష్కరించనుంది. టి+0 సెటిల్మెంట్ను కేవలం 25 షేర్లు, పరిమిత బ్రోకర్లకు మాత్రమే మొదలుపెట్టనున్నారు. తద్వారా వ్యవస్థ సామర్థ్యాన్ని పరిశీలించనున్నారు. అన్ని షేర్లకు ఒకే రోజు సెటిల్మెంట్ను అమలు చేయడానికి ముందు ఈ 25 షేర్లపై జరిపే పరీక్షా ఫలితాలను బట్టి సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. మూడు, ఆరు నెలల కాలంపాటు ఈ పరీక్షల ప్రగతిని సెబీ పరీక్షించనుంది. అన్ని సజావుగా జరిగితే విస్తృత స్థాయిలో టి+0 అమల్లోకి వస్తుంది. బీటా వర్షన్ వినియోగదార్లతో పాటు అన్ని వర్గాలతో చర్చించిన అనంతరం పూర్తిస్థాయిలో అమలు తేదీపై సెబీ ఒక నిర్ణయానికి రానుంది. ఏమిటి ప్రయోజనం.. టి+0 సెటిల్మెంట్ వల్ల బ్రోకర్ల సొంత నిధులను వాడాల్సిన అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. తద్వారా మొత్తం మీద వ్యాపార వ్యయాలు తగ్గుతాయి. ప్రస్తుతం ఎవరైనా క్లయింటు షేర్లను విక్రయిస్తే తక్షణం అందుకు సంబంధించిన మొత్తం ట్రేడింగ్ ఖాతాలో పడిపోతోంది. ఆ మొత్తంతో షేర్ల కొనుగోళ్లు చేయడానికి వీలవుతుంది. తక్షణ సెటిల్మెంట్ వల్ల మార్కెట్లో ద్రవ్యలభ్యత పెరుగుతుంది. ఇదీ చదవండి: భారత్‌లో భారీ నిక్షేపాలు.. తేలిగ్గా, దృఢంగా మార్చే ధాతువు గతంలో 2002 వరకు టి+5 సెటిల్మెంట్ విధానం అమలులో ఉండేది. దాన్ని ఏప్రిల్ 2002లో టి+3కి సెబీ మర్చింది. ఆ తర్వాతి సంవత్సరమే టి+2కు సవరించింది. 2021లో టి+1ను దశలవారీగా అమలు చేయడం ప్రారంభించింది. తుది దశను జనవరి 2023కు పూర్తి చేసింది. -
పరిమిత శ్రేణిలో ఒడిదుడుకుల ట్రేడింగ్
ముంబై: ట్రేడింగ్ మూడు రోజులే జరిగే ఈ వారంలో స్టాక్ మార్కెట్ పరిమిత శ్రేణిలో ట్రేడవుతూ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రయోగాత్మకంగా టి+0 సెటిల్మెంట్ అమలు, ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్, ఆర్థి క సంవత్సరం గడువు ముగింపు అంశాలు ట్రేడింగ్ ప్రభావితం చేయచ్చని పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి ముఖ్యంగా అమెరికా జీడీపీ డేటాపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని అంచనా. వీటితో పాటు డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. హోలీ సందర్భంగా నేడు (సోమవారం), గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులు జరగుతుంది. అయితే ఈ రెండు సెలవు రోజుల్లో ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు సాయంత్రం ట్రేడింగ్‌లో యథావిధిగా పనిచేస్తాయి. ‘‘ఈ వారం ఆర్థిక సంవత్సరం (2023–24) ముగింపు కారణంగా ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్లు, దేశీయ సంస్థాగత సంస్థలు లాభాలు లేదా నష్టాలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్ మూడు రోజులే కావడంతో ఎక్సే్చంజీల్లో ట్రేడింగ్ పరిమాణం తక్కువగా ఉండొచ్చు. అయితే టి+0 సెంటిల్మెంట్ ప్రారంభం, ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ గడువు నేపథ్యంలో సూచీల ఊగిసలాట ఉండొచ్చు. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 22,200 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 21,700 తక్షణ మద్దతు కలిగి ఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రీటైల్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమా తెలిపారు. గత వారం ప్రథమార్థంలో అమ్మకాలతో చతికిలపడిన స్టాక్ సూచీలు ఫెడరల్ రిజర్వ్ సరళతర ద్రవ్య విధాన వైఖరి, సంస్థాగత ఇన్వెస్టర్ల బలమైన కొనుగోళ్లతో కారణంగా ద్వితీయార్థంలో బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 189 పాయింట్లు, నిఫ్టీ 74 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లు రాణించిన రికవరీకి తమ వంతు సాయం చేశాయి. ప్రయోగాత్మకంగా టి+0 సెటిల్మెంట్ అమలు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సూచనల మేరకు ట్రేడింగ్ జరిగిన రోజే సెటిల్మెంట్(టి+0) విధానాన్ని ఎక్సే్చంజీలు గురువారం(మార్చి 28) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నాయి. అన్ని షేర్లకు టి+0 విధానం అమలు చేయడానికి ముందుగా 25 షేర్లు, పరిమిత బ్రోకర్లకు మాత్రమే మొదలుపెట్టనున్నారు. ప్రయోగ పనితీరు ఫలితాలను బట్టి టి+0 అమలు తేదీపై సెబీ ఒక నిర్ణయానికి వస్తుంది. తక్షణ సెటిల్మెంట్ వల్ల మార్కెట్లో ద్రవ్యలభ్యత పెరుగుతుంది. అలాగే భారత స్టాక్ మార్కెట్ల సామర్థ్యం, పారదర్శకత మెరుగవుతుంది. గురువారం ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(మార్చి 28న) నిఫ్టీ సూచీకి చెందిన ఫిబ్రవరి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిణామాలు బ్యాంక్ ఆప్ జపాన్ ద్రవ్య పాలసీ సమావేశ వివ రాలు, అమెరికా గృహ అమ్మకాలు సోమవారం విడుదల కానున్నాయి. యూరోజోన్ ఆర్థిక, పారిశ్రామిక, సర్వీసెస్ సెంటిమెట్, వినియోగదారుల వి శ్వాస గణాంకాలు బుధవారం వెల్లడి కాను న్నాయి. బ్రిటన్ క్యూ4 జీడీపీ వృద్ధి, కరెంట్ ఖాతా, అమెరికా నాలుగో త్రైమాసిక జీడీపీ వృద్ధి డేటా గురువారం విడుదల అవుతుంది. చైనా కరెంట్ ఖాతా, జపాన్ నిరుద్యోగ రేటు, అమెరికా పీసీఈ ప్రైజ్ ఇండెక్స్ డేటా వివరాలు శుక్రవారం వెల్లడి అవుతాయి. విదేశీ ఇన్వెస్టర్ల బుల్లిష్ వైఖరి భారతీయ ఈక్విటీ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బుల్లిష్ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వర కు (మార్చి 22 నాటికి) రూ. 38,000 కోట్లకు పైగా నిధులను దేశీయ ఈక్విటీల్లో పెట్టారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సాను కూల పరిణామాలు, భారత ఆర్థిక వృద్ధి బలంగా ఉండటం వంటి అంశాలు ఎఫ్ఐఐలను ఆక ట్టుకుంటున్నాయి. ‘‘భారత జీడీపీ వృద్ధి, ఆర్బీ ఐ అంచనాలు, వచ్చే ఆర్థిక సంవత్సరం చివర్లో కీలక వడ్డీ రేట్లు 20–50 బేసిస్ పాయింట్ల మేర తగ్గవచ్చనే నిపుణుల అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు’’ అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా మేనేజర్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కాగా అంతకుముందు జనవరిలో రూ. 25,743 కోట్ల భారీ పెట్టుబడుల తర్వాత గత నెల ఫిబ్రవరిలో రూ. 1,539 కోట్ల షేర్లను విక్ర యించారు. ఈ ఏడాదిలో ఇప్పటివర కు ఎఫ్‌పీఐలు రూ. 13,893 కోట్లు ఈక్విటీల్లోకి, రూ. 55,480 కోట్లను డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. -
ఏదైనా పడాల్సిందే.. నష్టాలూ మంచివే!
స్టాక్ మార్కెట్ అంటేనే ఒడిదుడుకుల సహజం. పెట్టుబడి పెట్టిన స్టాక్‌లకు సంబంధించి, సెబీ, ఆర్బీఐ, ప్రభుత్వం.. తీసుకునే నిర్ణయాలకు సంబంధించి చిన్న వార్త వచ్చినా దానికి ప్రతికూలంగానో, అనుకూలంగానో మార్కెట్లు స్పందిస్తుంటాయి. ఒక్క రోజులోనే మదుపరుల సంపద కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిరవుతుంది.. మరోరోజు తిరిగి గరిష్ఠ స్థాయికి చేరుతుంది. మార్కెట్లో నిత్యం పెరిగే స్టాక్‌లు ఉండవు. ఎంత మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ షేర్ అయినాసరే ఎప్పుడోఒకప్పుడు పడిపోవాల్సిందే. ఇటీవల మధ్య, చిన్న స్థాయి షేర్ల ధరలు బుడగల్లా పెరుగుతూ వస్తున్నాయని, ఇవి ఏమాత్రం సహేతుకంగా కనిపించడం లేదని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అభిప్రాయం వ్యక్తం చేసింది. చిన్న మదుపరులు పెట్టుబడులు పెట్టే ముందు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో అనుసరించాల్సిన మార్గాలేమిటో నిపుణులు తెలియజేస్తున్నారు. ఆందోళనతో నష్టాలు.. మార్కెట్ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అస్థిర మార్కెట్లో ఎన్నో భయాందోళనలు ఉంటాయి. వదంతులు వస్తుంటాయి. వీటన్నింటి ఆధారంగా పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఆందోళనలకు గురిచేసే విశ్లేషణలు, సలహాలతో చాలామంది తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, నష్టపోవడం చూస్తూనే ఉంటారు. మార్కెట్లు తిరిగి కోలుకున్నప్పుడు రాబడి ఆర్జించే అవకాశాలు కోల్పోతారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లలాంటివి మీ దగ్గరున్న నగదు నిల్వల విలువను తగ్గిస్తాయి. పెట్టుబడుల రూపంలో ఉన్నప్పుడే మంచి ఫలితాలు రాబట్టుకోగలం. పెట్టుబడుల విలువ తగ్గిపోగానే ఆందోళన చెందడం కాదు. మీరు తెలుసుకుంటున్న సమాచారం ఎంత మేరకు సరైనదో చూసుకోండి. మార్కెట్లు పడిపోతున్నప్పుడు పెట్టుబడుల విలువ తగ్గడం సహజమేననే వాస్తవాన్ని అంగీకరించాలి. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవాలి. దీర్ఘకాలంలో అధిక రాబడి దీర్ఘకాల లక్ష్యాలతో మార్కెట్లో పెట్టుబడి పెడితే అధికమొత్తంలో రాబడి అందుతుంది. చాలా మంది మొదట లాంగ్‌టర్మ్ కోసమనే మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇతర కారణాల వల్ల స్వల్పకాలంలోనే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకుంటారు. దాంతో నష్టమే కలుగుతుంది. పెట్టుబడులు ఎప్పుడూ ఏదో ఒక ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా ఉండాలి. వాటిని సాధించే వరకూ మదుపు సాగుతూనే ఉండాలి. మధ్యలోనే వదిలేయొద్దు. నష్టాన్ని పరిమితం చేసేలా.. మార్కెట్లో నష్టం రావడం సాధారణం. అలాఅని తీవ్ర నష్టాల్లోకి వెళ్లే వరకు పెట్టుబడులను కొనసాగించకూడదు. ఫలానా నష్టం వరకు భరించేలా స్టాప్‌లాస్‌ను ఉంచుకోవాలి. నష్టభయాన్ని పరిమితం చేసుకునేందుకు ప్రయత్నించాలి. పెట్టుబడులు ఒకే చోట కాకుండా.. పలు పథకాలకు కేటాయించాలి. నష్టభయం అధికంగా ఉంటూ, ఎక్కువ రాబడినిచ్చే పథకాల్లో కొంత, సురక్షిత పథకాల్లో కొంత మొత్తం మదుపు చేయాలి. ఈక్విటీ ఆధారిత పెట్టుబడులే కాకుండా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల వంటి స్థిరాదాయ పథకాలనూ ఎంచుకోవాలి. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్లు అ‘ధర’హో.. మార్కెట్ పతనం మంచి అవకాశం మంచి యాజమాన్యం, పనితీరు బాగున్న సంస్థల షేర్లు పతనం సమయంలో అందుబాటు ధరలోకి వస్తాయి. ఇలాంటి వాటిని ఎంచుకొని, దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయాలి. మార్కెట్లు మళ్లీ పెరుగుతున్నప్పుడు ఇవి మంచి లాభాలను పంచే అవకాశం లేకపోలేదు. మంచి షేర్లను అవకాశాన్ని బట్టి యావరేజ్ చేసుకోవచ్చు. నష్టభయాన్ని ఎంత మేరకు భరించగలరో చూసుకోవాలి. -
మూడో రోజూ లాభాలు
ముంబై: ఐటీసీ, ఎల్అండ్టీ, మారుతీ సుజుకీ షేర్ల రికార్డుల ర్యాలీతో పాటు ఈ ఏడాదిలో మూడు సార్లు వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే ఫెడ్ రిజర్వ్ సంకేతాలతో స్టాక్ సూచీలు మూడోరోజూ లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 191 పాయింట్లు పెరిగి 72,832 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 83 పాయింట్లు బలపడి 22,097 వద్ద నిలిచింది. ఉదయం భారీ నష్టాలతో మొదలైన సూచీలు జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాల ప్రభావంతో వెంటనే లాభాల్లోకి మళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 474 పాయింట్లు పెరిగి 73,115 వద్ద, నిఫ్టీ 169 పాయింట్లు ఎగసి 22,181 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే యాక్సెంసర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) ఆదాయ వృద్ధి అంచనాల తగ్గింపుతో ఐటీ, టెక్ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి సూచీల లాభాలను పరిమితం చేసింది. బీఎస్ఈ స్మాల్, మిడ్ ఇండెక్సులు వరుసగా 1.06%, 0.38% చొప్పున లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రంగాల వారీగా బీఎస్ఈలో టెలికమ్యూనికేషన్ 2.28%, ఆటో 1.67%, రియల్టీ 1.40% కన్జూమర్ డి్రస్కిషనరీ 1.20%, ఇండస్ట్రీస్, మెటల్స్ 1.17%, ప్రభుత్వరంగ బ్యాంకులు 1% చొప్పున లాభపడ్డాయి. ఐపీఓకు స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్, శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ ... కొద్ది రోజులుగా కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో తాజాగా రెండు కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఇందుకు అనుమతించమంటూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. జాబితాలో మహారాష్ట్ర కంపెనీ స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమి కల్స్, మధ్యప్రదేశ్ కంపెనీ శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ ఉన్నాయి. జీవితకాల కనిష్టానికి రూపాయి రూపాయి విలువ శుక్రవారం జీవితకాల కనిష్ట స్థాయి 83.61 వద్ద ముగిసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలు, డాలర్ బలోపేత ధోరణి, దేశీయ క్యాపిటల్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం రూపాయి కోతకు కారణమయ్యాయని ట్రేడర్లు తెలిపారు. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంతో పోలిస్తే 83.28 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో ఏకంగా 52 పైసలు క్షీణించి 83.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 48 పైసలు కోల్పోయి జీవితకాల కనిష్టం 83.61 వద్ద ముగిసింది. కాగా, ఇప్పటి వరకూ డాలర్ మారకంలో రూపాయి కనిష్ట ముగింపు (2023 డిసెంబర్13) 83.40 గా ఉంది. -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి 22,084 వద్దకు చేరింది. సెన్సెక్స్ 190 పాయింట్లు దిగజారి 72,831 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో మారుతి సుజుకి, సన్ ఫార్మా, టైటాన్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, భారతి ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) గురువారం నికరంగా రూ.1,826.97 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) రూ.3,208.87 కోట్ల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో కదలాడుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 21,954కు చేరింది. సెన్సెక్స్ 222 పాయింట్లు దిగజారి 72,403 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 85.71 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.27 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.32 శాతం, నాస్డాక్ 0.2 శాతం లాభపడ్డాయి. గురువారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 539 పాయింట్లు పెరిగి 72,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 173 పాయింట్లు లాభపడి 22,012 వద్ద నిలిచింది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా బుధవారం రాత్రి ‘ద్రవ్యోల్బణం దీర్ఘకాలిక లక్ష్యానికి మించి ఉన్నప్పటికీ, ఈ ఏడాదిలో మూడు సార్లు వడ్డీరేట్ల కోత ఉంటుంది’ అని పావెల్ సంకేతాలిచ్చారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సూచీలకు ఫెడ్ జోష్
ముంబై: ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీరేట్ల తగ్గింపు ఆశలను సజీవంగా ఉంచడంతో గురువారం స్టాక్ సూచీలు లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 539 పాయింట్లు పెరిగి 72,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 173 పాయింట్లు లాభపడి 22,012 వద్ద నిలిచింది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా బుధవారం రాత్రి ‘ద్రవ్యోల్బణం దీర్ఘకాలిక లక్ష్యానికి మించి ఉన్నప్పటికీ, ఈ ఏడాదిలో మూడు సార్లు వడ్డీరేట్ల కోత ఉంటుంది’ అని పావెల్ సంకేతాలిచ్చారు. దీంతో అమెరికాతో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. సెన్సెక్స్ ఉదయం 405 పాయింట్లు పెరిగి 72,507 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు బలపడి 21,990 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రోజంతా ట్రేడయ్యాయి. ముఖ్యంగా మెటల్, విద్యుత్, ఇంధన షేర్లు సూచీల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. ఒక దశలో సెన్సెక్స్ 781 పాయింట్లు ఎగసి 72,881 వద్ద, నిఫ్టీ 242 పాయింట్లు బలపడి 22,081 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. కొంతకాలంగా అమ్మ కాల ఒత్తిడికి లోనైన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ ఇండెక్సులు వరుసగా 2.36%, 2.01% చొప్పున ర్యాలీ చే శాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే ఆశలతో బుధవారం అమెరికా మార్కెట్లు జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్ఈలో రూ.5.72 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ. 379 లక్షల కోట్లకు చేరింది. క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ లిస్టింగ్ లాభాలు మాయం క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సరీ్వసెస్ లిమిటెడ్ లిస్టింగ్ లాభాలు నిలుపుకోలేకపోయింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.715)తో పోలిస్తే 11% ప్రీమియంతో రూ.795 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో లిస్టింగ్ లాభాలన్నీ మాయమయ్యాయి. చివరికి రూ.0.38% నష్టంతో రూ.712 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.995 కోట్లుగా నమోదైంది. -
సాక్షి మనీ మంత్ర: పుంజుకున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 22,055 వద్దకు చేరింది. సెన్సెక్స్ 104 పాయింట్లు దిగజారి 72,748 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, విప్రో, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్, సన్ ఫార్మా కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి. భారతిఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకీ నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం బుధవారం రాత్రితో ముగిసింది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా మార్కెట్లు పెరిగాయి. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ 2024 ముగిసే వరకు మూడుసార్లు వడ్డీరేట్లు తగ్గిస్తామని ప్రకటించారు. అయితే ఈసారి మాత్రం కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఫెడ్ మీటింగ్ ప్రభావం.. లాభాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 172 పాయింట్లు లాభపడి 22,011కు చేరింది. సెన్సెక్స్ 567 పాయింట్లు పుంజుకుని 72,659 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 103.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 86.2 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.9 శాతం, నాస్డాక్ 1.25 శాతం లాభపడ్డాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం బుధవారం రాత్రితో ముగిసింది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా మార్కెట్లు పెరిగాయి. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ 2024 ముగిసే వరకు మూడుసార్లు వడ్డీరేట్లు తగ్గిస్తామని ప్రకటించారు. అయితే ఈసారి మాత్రం కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచారు. ఇప్పటికే మార్కెట్ చాలా పడిపోయింది కాబట్టి ఈ వ్యవహారాన్ని మార్కెట్ పాజిటివ్‌గానే తీసుకుంటుందని నిపుణులు అంటున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 21,875కు చేరింది. సెన్సెక్స్ 196 పాయింట్లు పుంజుకుని 72,213 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 103.86 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 87.39 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.56 శాతం, నాస్డాక్ 0.39 శాతం లాభపడ్డాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం ఇండియన్ మార్కెట్లు ముగిసిన తర్వాత ప్రకటిస్తారు. ఫిబ్రవరి అమెరికా కన్జూమర్ ఇండెక్స్, ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదుకావడంతో ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మంగళవారం బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక వడ్డీ రేట్లను 17 ఏళ్ల తర్వాత పెంచడంతో ద్రవ్యోల్బణ భయాలు భారత్ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దాంతో నిన్న మార్కెట్లు భారీగా నష్టపోయాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
22,000 దిగువకు నిఫ్టీ
ముంబై: బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక వడ్డీ రేట్లను 17 ఏళ్ల తర్వాత పెంచడంతో ద్రవ్యోల్బణ భయాలు భారత్ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫెడరల్ రిజర్వ్ ద్రవ పాలసీ నిర్ణయాల వెల్లడి(నేడు)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. బ్రెండ్ క్రూడాయిల్ బ్యారెల్ ఫ్యూచర్స్ ధర అయిదు నెలల గరిష్టం 85 డాలర్లపైకి ఎగిసింది. జపాన్ వడ్డీ రేట్ల పెంపుతో డాలర్ ఇండెక్స్ బలపడింది. ఈ పరిణామాలతో మంగళవారం సెన్సెక్స్ 736 పాయింట్లు నష్టపోయి 72,012 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 238 పాయింట్లు పతనమై 22,000 స్థాయిని కోల్పోయి 21,817 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు ఇరు సూచీలకు నెల కనిష్టం. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం బలహీనంగా మొదలైంది. అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనడంతో సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 815 పా యింట్లు క్షీణించి 72,000 స్థాయి దిగువున 71,933 వద్ద, నిఫ్టీ 263 పాయింట్లు నష్టపోయి 21,793 వద్ద ఇంట్రాడే కనిష్టాలను చూశాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో విక్రయాలు కొనసాగాయి. జపాన్ ఎకానమీకి జోష్! ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్ పురోగమన బాటన పడుతున్నట్లు కనిపిస్తోంది. 17 సంవత్సరాల నెగటివ్ రుణ రేటు వ్యవస్థకు 4.2 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ముగింపు పలికింది. బ్యాంకులకు బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇచ్చే ఓవర్‌నైట్ రుణ రేటు మైనస్ 0.1 శాతం నుంచి ప్లస్ 0–0.1 శాతం శ్రేణికి పెరిగింది. రూ. 4.86 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ ఒక శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్ఈలో రూ.4.86 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.373 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఈ సూచీలో 30 షేర్లకు గానూ ఏడు మాత్రమే లాభపడ్డాయి. టీసీఎస్ నిరాశ.. టీసీఎస్ షేరు రెండేళ్లలో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ప్రమోటర్ సంస్థ టాటా సన్స్ బ్లాక్ డీల్ ద్వారా 2.3 కోట్ల ఈక్విటీ షేర్ల విక్రయంతో ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ట్రేడింగ్‌లో నాలుగున్నర శాతం క్షీణించి రూ. 3,967 వద్ద రెండేళ్ల కనిష్టాన్ని తాకింది. చివరికి 4% నష్టంతో రూ.3,978 వద్ద ముగిసింది. పాపులర్ వెహికల్స్ పేలవం పాపులర్ వెహికల్స్ అండ్ సర్విసెస్ లిస్టింగ్ మెప్పించలేకపోయింది. ఇష్యూ ధర(రూ.295)తో పోలిస్తే బీఎస్ఈలో 1% డిస్కౌంట్‌తో రూ.292 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 11% క్షీణించి రూ.263 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 6% నష్టంతో రూ.276 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,967 కోట్లుగా నమోదైంది. -
సాక్షి మనీ మంత్ర: మార్కెట్ సూచీలపై బేర్ పంజా
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 242 పాయింట్లు నష్టపోయి 21,813 వద్దకు చేరింది. సెన్సెక్స్ 736 పాయింట్లు దిగజారి 72,012 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించాయి. టీసీఎస్, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, హిందూస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం బుధవారం రాత్రి వెలువడనుంది. దాంతో గురువారం మార్కెట్లు స్పందించనున్నాయి. ఈ క్రమంలో మదుపరులు ఇప్పటికే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఫెడ్ మీటింగ్.. నష్టాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ 113 పాయింట్లు నష్టపోయి 21,944కు చేరింది. సెన్సెక్స్ 351 పాయింట్లు దిగజారి 72,399 వద్ద ట్రేడవుతోంది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 87.01 అమెరికన్ డాలర్ల వద్దకు చేరింది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.33 శాతానికి చేరాయి. అమెరికా డాలర్ ఇండెక్స్ 103.59 వద్ద ఉంది. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లోకి వెళ్లాయి. ఎస్పీఎక్స్ 0.63 శాతం, నాస్డాక్ 0.82 శాతం పెరిగాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(మార్చి 19న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(20న)రోజున ప్రకటిస్తారు. ఫిబ్రవరి అమెరికా కన్జూమర్ ఇండెక్స్, ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదుకావడంతో ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్ల(5.25 – 5.5%) యథాతథంగా ఉంచొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అమెరికా ఫెడ్ రిజర్వ్ తో పాటు బ్యాంక్ ఆఫ్ జపాన్(మార్చి 19), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(మార్చి 21) ద్రవ్య విధానాలు వెల్లడి కానున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 22,055 వద్దకు చేరింది. సెన్సెక్స్ 104 పాయింట్లు దిగజారి 72,748 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఎం అండ్ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, మారుతి సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, టైటాన్, విప్రో, హెచ్‌యూఎల్, నెస్లే, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీఎస్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 52 పాయింట్లు నష్టపోయి 21,970కు చేరింది. సెన్సెక్స్ 154 పాయింట్లు దిగజారి 72,480 వద్ద ట్రేడవుతోంది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 85.33 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.3 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఎస్ అండ్ పీ 0.65 శాతం, నాస్డాక్ 1 శాతం నష్టపోయాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(మార్చి 19న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(20న)రోజున ప్రకటిస్తారు. ఫిబ్రవరి అమెరికా కన్జూమర్ ఇండెక్స్, ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదుకావడంతో ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్ల(5.25 – 5.5%) యథాతథంగా ఉంచొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అమెరికా ఫెడ్ రిజర్వ్ తో పాటు బ్యాంక్ ఆఫ్ జపాన్(మార్చి 19), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(మార్చి 21) ద్రవ్య విధానాలు వెల్లడి కానున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)