Market
-
Flipkart: రెండేళ్లలో రూ.41000 కోట్లు తగ్గిన ఫ్లిప్‌కార్ట్ విలువ!
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వేల్యుయేషన్ గత రెండేళ్లలో రూ. 41,000 కోట్ల మేర (సుమారు 5 బిలియన్ డాలర్లు) తగ్గింది. 2022 జనవరిలో ఇది 35 బిలియన్ డాలర్లుగా ఉండగా ఈ ఏడాది జనవరి 31 నాటికి 35 బిలియన్ డాలర్ల స్థాయికి పరిమితమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ ఈక్విటీ స్వరూపంలో వచి్చన మార్పుల పరిశీలనతో ఇది వెల్లడైంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ 8 శాతం వాటాని 3.2 బిలియన్ డాలర్లకు విక్రయించింది. తద్వారా సంస్థ వేల్యుయేషన్ 40 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లయింది. మరోవైపు, 2024 ఆర్థిక సంవత్సరంలో వాల్‌మార్ట్ 3.5 బిలియన్ డాలర్లతో తన వాటాను 10 శాతం పెంచుకోవడంతో వేల్యుయేషన్ 35 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లయింది. అయితే, వేల్యుయేషన్ తగ్గిపోయిందనడానికి లేదని, 2023లో ఫోన్‌పే సంస్థను విడగొట్టడం వల్ల సర్దుబాటు అయినట్లుగా మాత్రమే భావించాల్సి ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ వర్గాలు తెలిపాయి. సంస్థ వేల్యుయేషన్ ప్రస్తుతం 38–40 బిలియన్ డాలర్లుగా ఉంటుందని సంబంధిత వర్గాలు వివరించాయి. -
ఫెడ్ నిర్ణయాలు కీలకం
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య పరపతి నిర్ణయాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్ దిశానిర్దేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీ ప్రకటన తర్వాత ఇన్వెస్టర్లు సార్వత్రిక ఎన్నికల పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలింవచ్చు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ‘‘స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్ల నిర్వహణ సామర్థ్యాలను పరీక్షించేందుకు స్ట్రెస్ టెస్ట్ నిర్వహించాలని సెబీ ఆదేశాలు జారీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్, రక్షణాత్మక షేర్ల పట్ల ఆసక్తి చూపొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ బలహీనంగా ఉంది. నిర్ణయాత్మక తక్షణ మద్దతు 21,850 స్థాయిని కోల్పోతే దిగువ స్థాయిలో 21,450 స్థాయిని పరీక్షించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రిటైల్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ఇంధన, రియలీ్ట, ఫైనాన్స్ రంగాలకు చెందిన చిన్న, మధ్య స్థాయిలకు షేర్లలో భారీ ఎత్తున అమ్మకాలు జరగడంతో సూచీలు గతవారంలో 2% మేర నష్టపోయాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1476 పాయింట్లు, నిఫ్టీ 470 పాయింట్లు పతనమయ్యాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2,641 పాయింట్లు, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1602 పాయింట్లు చొప్పున క్షీణించాయి. ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయ ప్రభావం అగ్ర రాజ్యం అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(మార్చి 19న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(20న)రోజున ప్రకటిస్తారు. ఫిబ్రవరి అమెరికా కన్జూమర్ ఇండెక్స్, ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదుకావడంతో ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్ల(5.25 – 5.5%) యథాతథంగా ఉంచొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరికి ముందు కొందరు ట్రేడర్లు తమ పొజిషన్లను వెనక్కి తీసుకోవచ్చు. ప్రపంచ పరిణామాలు అమెరికా ఫెడ్ రిజర్వ్ తో పాటు బ్యాంక్ ఆఫ్ జపాన్(మార్చి 19), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(మార్చి 21) ద్రవ్య విధానాలు వెల్లడి కానున్నాయి. అలాగే చైనా ఐదేళ్ల రుణ పరపతి రేటు ప్రకటించనుంది. దీంతో ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవచ్చు. బ్రిటన్ ప్రొడక్టర్ ప్రైస్ ఇండెక్స్, తయారీ, సేవారంగ పీఎంఐ గణాంకాలు వెల్లడి కానున్నాయి. యూరోజోన్ ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు, చైనా రిటైల్ సేల్స్, నిరుద్యోగ డేటాలు ఇదే వారంలో వెల్లడి కానున్నాయి. మార్చి ప్రథమార్థంలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు ఈ మార్చి ప్రథమార్థంలో రూ.40,710 కోట్ల భారత ఈక్విటీలు కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం, దేశీయ స్థూల ఆర్థిక వృద్ధి సానుకూల అంచనాలు ఇందుకు ప్రధాన కారణాలని మార్కెట్ నిపుణులు తెలిపారు. అమెరికా బాండ్లపై రాబడులకు అనుగుణంగా విదేశీ ఇన్వెస్టర్లు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. తాజాగా ద్రవ్యోల్బణ పెరగడంతో బాండ్లపై రాబడులు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ నికర విక్రయదారులుగా మారే అవకాశం ఉంది. -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
ఈ రోజు (శుక్రవారం) ఉదయం నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. నష్టాల్లోనే ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 546.01 పాయింట్ల నష్టంతో 72551.27 వద్ద, నిఫ్టీ 145.50 పాయింట్ల నష్టంతో 22001.20 పాయింట్ల వద్ద ముగిసింది. టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా భారతి ఎయిర్టెల్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ & రిటైల్ లిమిటెడ్, అంబుజ సిమెంట్ లిమిటెడ్, ఫెడరల్ బ్యాంక్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ మొదలైన కంపెనీలు చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, బయోకాన్, అపోలో టైర్స్ కంపెనీలు నష్టాలను చవి చూశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు.. ఈరోజే స్ట్రెస్ టెస్ట్ నివేదిక
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 22,089కు చేరింది. సెన్సెక్స్ 188 పాయింట్లు పుంజుకుని 72,916 వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 103.39 పాయింట్లకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 85.15 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఎస్పీఎక్స్ 0.29 శాతం, నాస్డాక్ 0.3 శాతం నష్టపోయాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గి, 0.2 శాతంగా నమోదయ్యింది. డిసెంబర్లో ఈ రేటు 0.27 శాతంగా ఉంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ టోకు ధరల సూచీ మైనస్ (ప్రతి ద్రవ్యోల్బణం)లో ఉంది. నవంబర్‌లో ప్లస్‌లోకి మారి 0.26 శాతంగా నమోదయ్యింది. అయితే ఆహార ధరలు మాత్రం ఫిబ్రవరిలో స్వల్పంగా పెరిగాయి. సెబీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి స్ట్రెస్ టెస్ట్ డేటాను ఈరోజున రానుంది. దాంతో ఫండ్స్‌లోని నిధులు ఏమేరకు వచ్చాయి. ఎలా వచ్చాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు.. వంటి అనేక అంశాలను పరిగణిస్తూ రిపోర్ట్ వెలువడనుంది. అయితే ఇప్పటికే చాలామంది ఇన్వెస్టర్లు వారి పోర్ట్‌ఫోలియోలోని మ్యూచువల్ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్లను అమ్మేసినట్లు తెలిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లు
ముంబై: వాల్యూయేషన్ ఆందోళనలను విస్మరిస్తూ ఇన్వెస్టర్లు కనిష్ట స్థాయిల వద్ద చిన్న, మధ్య స్థాయి షేర్లను కొనేందుకు ఆసక్తి చూపడంతో స్టాక్ సూచీ లు గురువారం లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 335 పాయింట్లు పెరిగి 73 వేల స్థాయి పైన 73,097 వద్ద నిలిచింది. నిఫ్టీ 149 పాయింట్లు బలపడి 22,100 స్థాయిపైన 22,146 వద్ద ముగిసింది. సూచీలు ఉదయం బలహీనంగా మొదలయ్యాయి. హోల్ సేల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 4 నెలల కనిష్టానికి దిగివచి్చనట్లు డేటా వెల్లడి కావడంతో బుధవారం ట్రేడింగ్‌లో పతనమైన షేర్లకు దిగువ స్థాయి లో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సూచీలు క్రమంగా పుంజుకున్నాయి. ఒక దశలో సె న్సెక్స్ 602 పాయింట్లు పెరిగి 73,364 వద్ద, నిఫ్టీ 207 పాయింట్లు బలపడి 22,205 వద్ద గరి ష్టాలను అందుకున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, ఫై నాన్స్ షేర్లు మాత్రమే నష్టపోయాయి. అంతర్జాతీ య ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడవు తున్నాయి. ► కనిష్ట స్థాయిల్లో చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 3.11%, మిడ్ క్యాప్ ఇండెక్సు 2.28% చొప్పున రాణించాయి. రంగాల వారీగా సరీ్వసెస్, టెలికం సూచీలు 4%, యుటిలిటీ, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, పారిశ్రామిక ఇండెక్స్‌లు 3%, కమోడిటీ సూచీ 2.50% చొప్పున లాభపడ్డాయి. ► భారత సైన్యం, తీర రక్షక దళం కోసం 34 తేలికపాటి హెలికాప్ట్టర్లు, అనుబంధ పరికరాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖతో రూ.8,073 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కంపెనీ షేరు 4.2% లాభపడి రూ.3,167 వద్ద స్థిరపడింది. ► సెన్సెక్స్ 335 పాయింట్లు పెరగడంతో బీఎస్ఈలో రూ.7.81 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపద బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 379 లక్షల కోట్లకు చేరింది. ► అదానీ గ్రూప్ షేర్లూ ముందడుగేశాయి. ఆదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ సొల్యూషన్స్ 11%, అదానీ గ్రీన్ ఎనర్జీ 10%, అదానీ ఎంటర్ప్రైజెస్ 6%, అదానీ పోర్ట్స్, ఎన్డీటీవీ 5% చొప్పున లాభపడ్డాయి. అదానీ విల్మార్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌లు 4%, అదానీ పవర్ 2% రాణించాయి. గ్రూప్‌లో కంపెనీల మార్కెట్ క్యాపిటలేషన్ రూ.15.66 లక్షల కోట్లు పెరిగింది. గోపాల్ స్నాక్స్ లిస్టింగ్ మెప్పించలేదు. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.401)తో పోలిస్తే 13% డిస్కౌంట్‌తో రూ.350 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో మరింత అమ్మకాల ఒత్తిడికి లోనైంది. దాదాపు 15% క్షీణించి రూ.342 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 10% నష్టంతో రూ.342 వద్ద ముగిసింది. -
సాక్షి మనీ మంత్ర: పుంజుకున్న స్టాక్‌మార్కెట్లు.. నష్టాలకు బ్రేక్
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 153 పాయింట్లు లాభపడి 22,151కు చేరింది. సెన్సెక్స్ 335 పాయింట్లు పుంజుకుని 73,097 వద్ద ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, విప్రో, భారతి ఎయిర్టెల్, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ, టీసీఎస్, టెక్ మహీంద్రా, నెస్లే, ఏషియన్ పెయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, కోటక్‌మహీంద్రా బ్యాంక్ కంపెనీ షేర్లు భారీగా పుంజుకున్నాయి. యాక్సిస్‌బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘స్టాక్ మార్కెట్లు గాలి బుడగలా లేవు’
స్టాక్ మార్కెట్లు కొన్ని రోజుల క్రితం జీవితకాల గరిష్ఠాలను తాకాయి. దాంతో చాలా మంది ఇన్వెస్టర్లు మార్కెట్లు భారీగా పెరిగాయనే అభిప్రాయానికి వచ్చారు. దాంతో కొన్నికారణాల వల్ల కొద్దికాలంగా మార్కెట్లు దిద్దుబాటుకు గురవుతున్నాయి. తాజాగా మార్కెట్ తీరుతెన్నులపై సెబీ నిర్వహించిన సదస్సులో బ్యాంకింగ్ దిగ్గజం ఉదయ్ కోటక్ మాట్లాడారు. భారత స్టాక్ మార్కెట్లు గాలి బుడగలా లేవని ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లో షేర్ల విలువలపై నియంత్రణ సంస్థలతో పాటు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. షేర్ల విలువలు కొంత అధిక స్థాయుల్లోనే ఉన్నప్పటికీ.. చేయిదాటి పోలేదని కోటక్ అన్నారు. ఇదీ చదవండి: ఏఐ ప్రభావం.. ఉద్యోగాలు పోతాయ్..? ఇప్పుడేం చేయాలంటే.. మార్కెట్లలో గాలి బుడగ ఏర్పడితే, దాన్ని పెరగకుండా చూసుకోవాలని, లేదంటే అది పేలి మదుపర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అది మంచిది కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లలో ఎప్పటికప్పుడు ముప్పులను గుర్తించే వ్యవస్థలు ఉన్నాయని నమ్ముతున్నట్లు తెలిపారు. -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 22,002కు చేరింది. సెన్సెక్స్ 44 పాయింట్లు నష్టపోయి 72,698 వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 102.77 పాయింట్లకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 84.01 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.19 శాతానికి చేరాయి. కాపర్ ధరలు 11 నెలల గరిష్ఠాన్ని తాకాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఎస్పీఎక్స్ 0.19 శాతం, నాస్డాక్ 0.54 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ లాభాల్లోకి చేరుకున్నాయి. టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాన్ ఫిన్సర్వ్, టీసీఎస్, టాటా మోటార్స్ షేర్లు నష్లాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీగా పడుతున్న స్టాక్‌మార్కెట్లు.. కారణాలు ఇవే..
స్టాక్‌మార్కెట్ అంటేనే ఒడిదొడుకులతో నిండి ఉంటుంది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోనివారు అదో గ్యాంబ్లింగ్ అనుకుంటారు. కానీ కాస్త అనుభవం ఉన్నవారు, మార్కెట్‌ను నిత్యం పరిశీలిస్తున్నవారికి అందులోని ఆంతర్యం అర్థం అవుతుంది. ఎలాంటి సందర్భాల్లో ఎలా స్పందిస్తుందో చెప్పేస్తారు. అలాఅని వారు అనుకుంది ప్రతిసారి జరగాలని మాత్రం లేదు. మార్కెట్లో నిత్యం నేర్చుకోవాల్సిందే. ఈరోజు మార్కెట్లో అనుకున్న స్ట్రాటజీ రేపు పనిచేయకపోవచ్చు. కాబట్టి మార్కెట్లో అన్నివేళలా ప్రతిస్ట్రాటజీ పనిచేస్తుందనుకోవద్దు. ఈ మధ్య మార్కెట్లు వరుసగా భారీగా దిద్దుబాటుకు గురవుతున్నాయి. స్టాక్ మార్కెట్లో బుధవారం స్మాల్, మిడ్‌క్యాప్ సూచీల పతనం కొనసాగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఈ సూచీలు గరిష్ఠాలకు చేరాయి. తదుపరి నష్టపోతూ వస్తున్నాయి. ఇప్పటివరకు స్మాల్‌క్యాప్ సూచీ 12%, మిడ్‌క్యాప్ సూచీ 6% పతనమయ్యాయి. గత కొన్ని సెషన్లలో చిన్న, మధ్యస్థాయి కంపెనీల షేర్లు భారీగా పడిపోతున్నాయి. ఇందుకు కారణాలు కింది విధంగా ఉన్నాయి. సెబీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి స్ట్రెస్ టెస్ట్ డేటాను ఈ నెల 15న వెలువరించనుంది. దాంతో ఫండ్స్‌లోని నిధులు ఏమేరకు వచ్చాయి. ఎలా వచ్చాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు.. వంటి అనేక అంశాలను పరిగణిస్తూ రిపోర్ట్ వెలువడనుంది. అయితే ఇప్పటికే చాలామంది ఇన్వెస్టర్లు వారి పోర్ట్‌ఫోలియోలోని మ్యూచువల్ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్లను అమ్మేసినట్లు తెలిసింది. కానీ ఈ ర్యాలీ 15వ తేదీ వరకు కొనసాగనుందని సమాచారం. పొజిషన్లను కొనసాగించేందుకు ఖాతాదారుల నుంచి అదనపు మార్జిన్ సొమ్మును బ్రోకర్లు అడుగుతున్నారు. దీంతో కొంత మంది పొజిషన్లను అమ్మేస్తున్నారు. దుబాయ్‌కు చెందిన హవాలా ఆపరేటర్ హరిశంకర్ టిబ్రేవాలాపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేయడం ప్రతికూల ప్రభావం చూపింది. అక్కడ నుంచి నిధులు దేశీయ స్టాక్‌మార్కెట్లలోకి అక్రమంగా చేరుతున్నాయనే ఆరోపణలున్నాయి. కొన్ని చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల ధరలు బుడగల్లా ఉన్నాయని సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి పేర్కొనడమూ, మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మదుపర్ల ప్రయోజనాలు పరిరక్షించేలా అప్రమత్తంగా వ్యవహరించాలని స్మాల్, మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలకు సెబీ గత నెలలో నియమావళి జారీ చేయడమూ ఆందోళనకు కారణమైంది. సాధారణంగానే ఆర్థిక సంవత్సరం చివరి నెల అయిన మార్చిలో విక్రయాలు జరుపుతుంటారు. గత 23 ఏళ్లలో సగానికి పైగా సార్లు, మార్చిలో ఈ షేర్లు ప్రతికూల ప్రతిఫలాలు ఇచ్చాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండిమా(ఆంఫీ) ఇటీవల పలు ఫండ్స్‌లో వస్తున్న రిటైల్ ఇన్వెస్టర్ల డబ్బులు ఆపేలా చర్యలు తీసుకుంది. దాంతో చాలా ఫండ్స్ మేనేజర్లు లమ్సమ్ నగదును నిలిపేశాయి. ఇదీ చదవండి: ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ టు శ్రీకాకుళం! ప్రస్తుతం నెలకొంటున్న మార్కెట్ ఒడిదొడుకుల్లో స్వల్పకాల పెట్టుబడుల కోసం ఇన్వెస్ట్ చేసేవారు కాస్త ఆచుతూచి వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఇన్వెస్ట్ చేసేవారికి ఇదో మంచి అవకాశం అని సూచిస్తున్నారు. -
చిన్న షేర్ల పెద్ద క్రాష్
సెన్సెక్స్ భారీ పతనంతో బీఎస్ఈలో రూ.13.47 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.372 లక్షల కోట్లకు దిగివచి్చంది. గత 3 రోజుల్లో రూ.20.69 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ముంబై: చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల భారీ పతనంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ బుధవారం కుప్పకూలింది. అమెరికా ద్రవ్యోల్బణం దిగిరాకపోవడంతో ‘ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు’ ఆశలు సన్నగిల్లాయి. ట్రేడింగ్‌లో వినిమయ, ఇంధన, మెటల్ షేర్ల భారీ పతనంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ 73,000, నిఫ్టీ 22,000 స్థాయిలను కోల్పోయాయి. లాభాల నుంచి భారీ నష్టాల్లోకి ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టానికి దిగివచి్చన సానుకూల సంకేతాలతో ఉదయం స్టాక్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 325 పాయింట్లు పెరిగి 73,993 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు బలపడి 22,432 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే చిన్న, మధ్య తరహా షేర్లలో నెలకొన్న అమ్మకాలతో సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ షేర్ల ట్రేడింగ్‌లో అవకతవకలు జరుగుతున్నాయన్న సెబీ చైర్మన్ మాధవీ పురి ఇటీవలి వ్యాఖ్యలు దీనికి నేపథ్యం. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,152 పాయింట్లు క్షీణించి 72,516 వద్ద, నిఫ్టీ 430 పాయింట్లు దిగివచ్చి 21,906 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. చివరికి సెన్సెక్స్ 906 పాయింట్లు నష్టపోయి 72,762 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 338 పాయింట్లు పతనమై 21,997 వద్ద స్థిరపడ్డాయి. ► స్కాటిష్ చమురు కంపెనీ కెయిర్న్‌కు రూ.77.6 కోట్లు చెల్లించాలంటూ సెబీ ఆదేశాలు జారీ చేయడంతో వేదాంత లిమిటెడ్ షేరు 7% నష్టపోయి రూ.252 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ 8% నష్టపోయి రూ.250 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. కంపెనీకి రూ.6,858 కోట్ల నష్టం వాటిల్లింది. ► మార్కెట్ పతనంలో భాగంగా అదానీ గ్రూప్ షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మొత్తం పదింటికి గానూ ఏడు కంపెనీల షేర్లు నష్టపోయాయి ► జీజే కెమికల్స్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.221)తో పోలిస్తే 4.52% డిస్కౌంట్‌తో రూ.211 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 18% క్షీణించి రూ.181 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 16% నష్టపోయి రూ.185 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.724 కోట్లుగా నమోదైంది. ఎఫ్‌అండ్‌వోపై దృష్టి ఆందోళనకరం రిటైల్ ఇన్వెస్టర్లకు సీఈఏ హెచ్చరిక అత్యధిక రిసు్కలతోకూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో)లో లావాదేవీలు చేపట్టేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం ఆందోళనకరమని ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తాజాగా పేర్కొన్నారు. తక్షణ లాభాలపై దృష్టి పెట్టడం పెట్టుబడుల పురోగతికి ప్రతికూలమని సెబీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. -
సాక్షి మనీ మంత్ర: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 353 పాయింట్లు నష్టపోయి 21,981 వద్దకు చేరింది. సెన్సెక్స్ 906 పాయింట్లు దిగజారి 72,761 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌యూఎల్, భారతిఎయిర్టెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లోకి చేరుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం నికరంగా రూ.73.12 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.2,358.18 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 22,389కు చేరింది. సెన్సెక్స్ 224 పాయింట్లు పుంజుకుని 73,884 వద్ద ట్రేడవుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదయ్యింది. గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న వాస్తవిక లక్ష్యానికి (ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతం) ఇంకా అధికంగా ఉన్నప్పటికీ.. నాలుగు నెలల కనిష్టానికి సూచీ దిగిరావడం గమనార్హం. డాలర్ ఇండెక్స్ 103 పాయింట్లకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.09 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.15 శాతానికి చేరాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, నెస్లే, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, భారతిఎయిర్టెల్, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 179 పాయింట్లు పుంజుకుని పెరిగి 73,672 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2 పాయింట్ల నష్టపోయి 22,330 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, మారుతిసుజుకీ, ఇన్ఫోసిస్, భారతిఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఎస్బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, నెస్లే, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, ఎన్టీపీసీ, విప్రో, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎల్ అండ్ టీ, సన్‌ఫార్మా, కోటక్ మహీంద్రాబ్యాంక్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: స్వల్పంగా పెరిగిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 22,360కు చేరింది. సెన్సెక్స్ 76 పాయింట్లు పుంజుకుని 73,578 వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 102.78 పాయింట్లకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.44 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.09 శాతానికి చేరాయి. సోమవారం డీఐఐలు రూ.3,238 కోట్లు, ఎఫ్ఐఐలు రూ.4,212 కోట్లు విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, విప్రో, హిందూస్థాన్ యూనిలీవర్, నెస్టే కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ
ముంబై: జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద బ్యాంకింగ్, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు సోమవారం దాదాపు ఒకశాతం నష్టపోయాయి. అమెరికా, భారత్ ద్రవ్యోల్బణ డేటా వెల్లడి(మంగళవారం) ముందు ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఆసియా, యూరప్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 685 పాయింట్లు పెరిగి 74,187 వద్ద, నిఫ్టీ 195 పాయింట్లు బలపడి 22,527 వద్ద ఆల్‌టైం హై స్థాయిలు అందుకున్నాయి. రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు దిగడంతో సూచీలు క్రమంగా ఆరంభ లాభాలు కోల్పోయాయి. సెన్సెక్స్ 617 పా యింట్లు పతనమైన 73,503 వద్ద నిలిచింది. నిఫ్టీ 161 పాయింట్ల నష్టంతో 22,333 వద్ద స్థిరపడింది. కాగా, బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2% క్షీణించింది. ► ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో జేఎం ఫైనాన్షియల్ షేరు మరో పదిశాతం నష్టపోయి రూ.79 వద్ద ముగిసింది. ► రిటైల్ ఇన్వెస్టర్ల ‘ఆఫర్ ఫర్ సేల్’ ప్రక్రియ ప్రారంభంతో ఎన్ఎల్సీ ఇండియా షేరు 7% నష్టంతో రూ.233 వద్ద స్థిరపడింది. ► రూ.2,100 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకోవడంతో ఆర్వీఎన్ఎల్ షేరు 3% లాభంతో రూ.245 వద్ద నిలిచింది. ► ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఔషధ ఉతి్పత్తిని, సదుపాయాలను మెరుగుపరచుకోడానికి ఆర్థిక సహాయం అందించే– ఫార్మాస్యూటికల్స్ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీమ్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించాయి. ► ఎస్బీఐ షేరు 2% నష్టపోయి రూ.773 వద్ద ముగిసింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి వెల్లడించడంపై గడువును మరింత పొడిగించాలని కోరుతూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం షేరుపై ప్రతికూల ప్రభావం చూపింది. -
చిన్న షేర్లలో అవకతవకలు
ముంబై: చిన్న, మధ్యతరహా స్టాక్స్‌లో అవకతవకలు జరుగుతున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవీ పురి పేర్కొన్నారు. కొంతమంది అసహజ లావాదేవీలకు తెరతీసినట్లు గుర్తించామని తెలియజేశారు. చిన్న, మధ్యతరహా సంస్థల(ఎస్ఎంఈలు) విభాగంలో కృత్రిమంగా ధరల పెంపును చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎస్ఎంఈ విభాగం ఐపీవోలతోపాటు.. సెకండరీ మార్కెట్లోనూ అక్రమ లావాదేవీలు జరుగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. వెరసి రిసు్కలు అధికంగాగల విభాగంలో ఇన్వెస్టర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉన్నట్లు సూచించారు. ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సు సందర్భంగా మహిళా పాత్రికేయులతో ముచ్చటించిన పురి పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధాన విభాగంతో పోలిస్తే ఎస్ఎంఈ విభాగం ప్రత్యేకమైనదని ఇన్వెస్టర్లు అర్ధం చేసుకోవలసి ఉన్నట్లు పురి పేర్కొన్నారు. ప్రధాన విభాగంలోని కంపెనీలు తప్పనిసరిగా సమాచారాన్ని వెల్లడించవలసి ఉంటుందని, అయితే ఎస్ఎంఈ విభాగం రిసు్కలు విభిన్నంగా ఉంటాయని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. 28 నుంచి ఆప్షనల్ పద్ధతిలో టీ+0 సెటిల్మెంట్ సెక్యూరిటీల టీ+0 సెటిల్మెంట్ను మార్చి 28 నుంచి ఆప్షనల్ పద్ధతిలో ప్రవేశపెట్టనున్నట్లు పురి తెలియజేశారు. గత కొద్ది నెలల్లో భారీగా దూసుకెళుతున్న స్మాల్, మిడ్ క్యాప్ విభాగం షేర్ల విలువలపై స్పందిస్తూ కొన్ని కౌంటర్లలో అసహజ లావాదేవీలు నమోదవుతున్న సంకేతాలున్నట్లు వెల్లడించారు. ధరలను మ్యానిప్యులేట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవి బుడగలవంటివని వ్యాఖ్యానించారు. ఇలాంటి బుడగలు తలెత్తేందుకు అనుమతించకూడదని, ఇవి పగలిపోతే ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ఇది మార్కెట్లకు మంచిదికాదని అభిప్రాయపడ్డారు. స్టాక్ బ్రోకర్లకు కఠిన నిబంధనలు కాగా, అర్హతగల స్టాక్ బ్రోకర్(క్యూఎస్బీ)గా గుర్తించే మార్గదర్శకాలను సెబీ తాజాగా విస్తృతం చేసింది. తద్వారా మరింతమంది బ్రోకర్లను నిబంధనల పరిధిలోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సెక్యూరిటీల మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించే దిశగా తాజా చర్యలకు తెరతీసింది. యాజమాన్య సంబంధ లావాదేవీల పరిమాణం, నిబంధనలు, సమస్యల పరిష్కారం తదితర అంశాలను స్టాక్ బ్రోకర్లను క్యూఎస్బీలుగా గుర్తించడంలో పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఒక సర్క్యులర్‌లో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ పేర్కొంది. -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 175 పాయింట్లు నష్టపోయి 22,332 వద్దకు చేరింది. సెన్సెక్స్ 616 పాయింట్లు దిగజారి 73,502 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, విప్రో, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా స్టాక్ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్ అండ్ టీ, టైటాన్, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లోకి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 81.60 డాలర్ల వద్దకు చేరింది. విదేశీ సంస్థాగత మదుపర్లు గురువారం నికరంగా రూ.7,304.11 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.2,601.81 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎన్నికల బాండ్ల ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన షేర్ ధర
ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం భారతీయ స్టేట్ బ్యాంకును ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఆ వివరాలు వెల్లడించేందుకు ఎస్బీఐ అదనపు సమయం కావాలని గతంలోనే సుప్రీం కోర్టును కోరింది. కానీ అందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో సదరు బ్యాంకు షేర్ల విక్రయాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం నుంచి ఎస్బీఐ షేర్ల అమ్మకాలు కోనసాగుతున్నాయి. జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో షేర్ ధర మధ్యాహ్నం 2:32 వరకు 2శాతం క్షీణించింది. సోమవారం ఉదయం రూ.788.5 ధరతో ప్రారంభమైన షేర్.. మధ్యాహ్నానికి రూ.16 కోల్పోయింది. ప్రస్తుతం రూ. 772 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇదీ చదవండి: మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్.. ఐటీ కేంద్రంలో ఊపందుకున్న డిమాండ్! ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడించేందుకు ఎస్బీఐ అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బ్యాంకు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. మార్చి 12లోగా విరాళాల వివరాలు ఎన్నికల సంఘానికి వెల్లడించాల్సిందేనని ఆదేశించింది. అలాగే ఆ సమాచారాన్ని మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోగా వెల్లడించాలని ఈసీని ఆదేశించింది. -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ నోట్లో ఈ వారం సెషన్‌ను ప్రారంభించాయి. దేశీయ బెంచ్‌మార్క్ స్టాక్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సూచనలు ఉన్నప్పటికీ సోమవారం ఫ్లాట్ నోట్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:45 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 118 పాయింట్ల నష్టంతో 74,001 వద్ద ట్రేడ్ అవుతుండగా మరోవైపు నిఫ్టీ 13 పాయింట్ల క్షీణతతో 22,479 వద్ద ట్రేడవుతోంది. అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ ముందు వరుస సూచీలకు మద్దతుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.31 శాతం జోడించగా, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.14 శాతం పెరిగింది. సెక్టార్లలో నిఫ్టీ రియాల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు 1.7 శాతం వరకు పెరిగి టాప్ గెయినర్లలో ఉన్నాయి. అదే సమయంలో నిఫ్టీ మెటల్ నష్టాలకు దారితీసింది. 0.6 శాతం పడిపోయింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 9 పాయింట్లు పెరిగి 74,095 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 10 పాయింట్ల పెరిగి 22,484 వద్ద ముగిసింది. బీఎస్ఈ 30 ఇండెక్స్‌లో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఐటీసీ, టీసీఎస్, నెస్లే, ఎల్ అండ్ టీ, హెచ్‌యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, ఎస్బీఐ, భారతి ఎయిర్టెల్ కంపెనీల షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకి, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, పవర్‌గ్రిడ్ స్టాక్ షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దేశీ జీ–సెక్యూరిటీలకు సై
న్యూఢిల్లీ: వచ్చే ఏడాదిలో దేశీ జీ–సెక్యూరిటీలను వర్ధమాన మార్కెట్(ఈఎం) స్థానిక ప్రభుత్వ ఇండెక్స్, సంబంధిత సూచీలలో చేర్చనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ తాజాగా పేర్కొంది. దీంతో ప్రభుత్వ నిధుల సమీకరణ వ్యయాలు తగ్గేందుకు వీలు చిక్కనుంది. 2025 జనవరి 31 నుంచి ఇండియన్ ఫుల్లీ యాక్సెసబుల్ రూట్(ఎఫ్ఏఆర్) బాండ్లను బ్లూమ్‌బెర్గ్ ఈఎం లోకల్ కరెన్సీ గవర్నమెంట్ ఇండెక్సులలో చోటు కలి్పంచనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తొలి దశలో బాండ్ల పూర్తి మార్కెట్ విలువకు 10 శాతం వెయిటేజీతో వీటిని చేర్చనున్నట్లు తెలియజేసింది. తదుపరి ఎఫ్ఏఆర్ బాండ్ల పూర్తి మార్కెట్ విలువకు 10 శాతం చొప్పున ప్రతీ నెలా వెయిటేజీ పెరగనున్నట్లు వివరించింది. 10 నెలలపాటు వెయిటేజీ పెరగడం ద్వారా 2025 అక్టోబర్‌కల్లా పూర్తి మార్కెట్ విలువకు వెయిటేజీ చేరనున్నట్లు వెల్లడించింది. బ్లూమ్‌బెర్గ్ ఈఎం లోకల్ కరెన్సీ గవర్నమెంట్ ఇండెక్స్, 10 శాతం కంట్రీ క్యాప్డ్ ఇండెక్స్‌తోపాటు సంబంధిత సహచర ఇండెక్సులలోనూ వీటికి చోటు కలి్పంచనున్నట్లు పేర్కొంది. కాగా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020–21 బడ్జెట్ ప్రసంగంలో కొన్ని ప్రత్యేకించిన విభాగాల ప్రభుత్వ సెక్యూరిటీలు నాన్‌రెసిడెంట్ ఇన్వెస్టర్లకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. దేశీ ఇన్వెస్టర్లకు సైతం ఇవి అందుబాటులో ఉంటాయని, ఇండెక్సులలో లిస్ట్‌కానున్న వీటికి లాకిన్ అమలుకాబోదని తెలియజేశారు. బ్లూమ్‌బెర్గ్ ఈఎం మార్కెట్ 10 శాతం కంట్రీ క్యాప్డ్ ఇండెక్స్‌లో చేరాక చైనా, దక్షిణ కొరియా మార్కెట్ల జాబితాలో భారత్ చేరనుంది. -
సాక్షి మనీ మంత్ర: స్వల్పంగా పెరిగిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ 16 పాయింట్లు లాభపడి 22,490కు చేరింది. సెన్సెక్స్ 41 పాయింట్లు పుంజుకుని 74,127 వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 103.5 పాయింట్లకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.11 శాతానికి చేరాయి. సెన్సెక్స్ 30 సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బజాబ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, కోటమ్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: తీవ్ర ఊగిసలాట.. జీవితకాల గరిష్ఠాలను చేరిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం తీవ్ర ఒడిదొడుకుల మధ్య జీవితకాల గరిష్ఠాలను చేరింది. మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 126 పాయింట్లు ఎగబాకి 22,482 వద్దకు చేరింది. సెన్సెక్స్ 408 పాయింట్లు పుంజుకుని 74,085 వద్ద ముగిసింది. మంగళవారం విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) నికరంగా రూ.574.28 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) రూ.1,834.61 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు. సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఎం అండ్ ఎం, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, మారుతి సుజుకి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్ పేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 22,303కు చేరింది. సెన్సెక్స్ 203 పాయింట్లు పుంజుకుని 73,469 వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 103.8 పాయింట్లకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.1 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.16 శాతానికి చేరాయి. యూఎస్ మార్కెట్లో ట్రేడవుతున్న దిగ్గజ టెక్ కంపెనీలు నెట్‌ఫ్లిక్స్ 3 శాతం, మైక్రోసాఫ్ట్ 3 శాతం, టెస్లా 4 శాతం, యాపిల్ 3 శాతం నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్లోని కొన్ని అంశాలు.. టాటా మోటార్స్‌ను రెండు వేర్వేరు నమోదిత సంస్థలుగా విభజించడానికి బోర్డు అనుమతి లభించింది. దాంతో కంపెనీ షేరు ఇంట్రాడేలో 7.94% పెరిగి రూ.1,065.60 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 3.52% లాభంతో రూ.1,021.95 వద్ద ముగిసింది. పసిడి రుణాల మంజూరు, పంపిణీపై ఆర్బీఐ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కంపెనీపై ఆంక్షలు విధించింది. విద్యుత్తు వాహన ఛార్జర్ తయారీ సంస్థ ఎక్సికామ్ టెలీసిస్టమ్స్ షేరు అరంగేట్రంలో దూసుకెళ్లింది. ఇష్యూ ధర రూ.142తో పోలిస్తే బీఎస్ఈలో షేరు 85.91% లాభంతో రూ.264 వద్ద నమోదైంది. ప్లాటినం ఇండస్ట్రీస్ షేరు ఇష్యూ ధర రూ.171తో పోలిస్తే బీఎస్ఈలో 33.33% లాభంతో రూ.228 వద్ద నమోదైంది. రానున్న 2-3 ఏళ్లలో ‘రీజియన్ ఓవర్సీస్’లో మూడో అతిపెద్ద మార్కెట్‌గా భారత్ నిలుస్తుందని మెర్సిడెస్ బెంజ్ అంచనా వేసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: తీవ్ర ఒడిదొడుకులు.. నష్టాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 22,356 వద్దకు చేరింది. సెన్సెక్స్ 195 పాయింట్లు దిగజారి 73,677 వద్ద ముగిసింది. పరిమిత శ్రేణి ట్రేడింగ్‌లో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. స్టాక్ సూచీలు రికార్డుల ర్యాలీ నిలుపుకునేందుకు ప్రయత్నించాయి. కానీ చివరకు ఉదయం ప్రారంభించిన చోటే దాదాపు సూచీలు ముగిశాయి. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ 2024 ఏడాదికి గానూ భారత జీడీపీ వృద్ధి రేటును 6.1% నుంచి 6.8 శాతానికి పెంచింది. సోమవారం విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.564.06 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ)లు రూ.3,542.87 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)