Market
-
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 22,355కు చేరింది. సెన్సెక్స్ 174 పాయింట్లు పుంజుకుని 73,713 వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 104 పాయింట్లకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 0.9 శాతం తగ్గి 82.81 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4 బేసిస్ పాయింట్లు పెరిగి 4.22 శాతానికి చేరాయి. పబ్లిక్ ఇష్యూకి బ్లాక్‌బక్ లాజిస్టిక్స్ అంకుర సంస్థ బ్లాక్‌బక్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. ఐపీవో ద్వారా కంపెనీ సుమారు 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,500 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ప్రస్తుత ఇన్వెస్టర్లు కొన్ని షేర్లు విక్రయించనుండగా, కొత్తగా మరికొన్ని షేర్లను కూడా సంస్థ జారీ చేయనున్నట్లు వివరించాయి. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను సరీ్వసుల వ్యాపార విభాగాన్ని విస్తరించేందుకు బ్లాక్‌బక్ వినియోగించుకోనుంది. బ్లాక్‌బక్‌ను నిర్వహించే జింకా లాజిస్టిక్ సొల్యూషన్స్‌లో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులు ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు నష్టపోయి 22,401 వద్దకు చేరింది. సెన్సెక్స్ 72 పాయింట్లు ఎకబాకి 73,878 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టైటాన్ స్టాక్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) శనివారం జరిగిన ప్రత్యేక సెషన్లో నికరంగా రూ.82 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) రూ.45 కోట్ల స్టాక్స్‌ను విక్రయించారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 22,401కు చేరింది. సెన్సెక్స్ 70 పాయింట్లు పుంజుకుని 73,889 వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 103.83 పాయింట్లకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర పెరిగి 83.46 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.19శాతానికి చేరాయి. బలమైన స్థూల ఆర్థిక మూలాల కారణంగా మన ఈక్విటీ మార్కెట్లు రాణించొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఉన్న పొజిషన్లను కొనసాగించొచ్చని.. కొత్తగా కొనుగోళ్లకు మాత్రం మార్కెట్ల దిద్దుబాటు కోసం ఎదురు చూడాలని సూచిస్తున్నారు. తాజా గరిష్ఠాలకు చేరిన నిఫ్టీ, సమీప భవిష్యత్తులో 22,500 పాయింట్లకు చేరే అవకాశం లేకపోలేదని సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. చమురు ఉత్పత్తి కోతలను జూన్ ఆఖరు వరకు ఐచ్ఛికంగా పొడిగించాలని ఒపెక్+ దేశాల సమావేశం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు ఆదివారం తెలిపాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: శనివారం ప్రత్యేక సెషన్.. గ్రీన్‌లో ఓపెన్ అయిన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు శనివారం పనిచేస్తున్నాయి. ఈక్విటీ, డెరివేటివ్స్ సెగ్మెంట్లలో మార్చి 2న ఎక్స్ఛేంజీలు ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తున్నాయి. దాంతో ఈరోజు మార్కెట్ పనిచేస్తాయి. ఈ సెషన్ అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే డేటాబేస్, ఇతర పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రేడర్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు స్టాక్ ఎక్స్ఛేంజీలు ఈ ప్రత్యేక చర్యలకు పూనుకున్నాయి. దేశీయ స్టాక్‌మార్కెట్లు శనివారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 సమయానికి సెన్సెక్స్ 165.57 పాయింట్లు లేదా 0.22% పెరిగి 73,910.92కి చేరుకోగా, నిఫ్టీ 47.80 పాయింట్లు లేదా 0.21% లాభంతో 22,386.60 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐదు నెలల్లో కోటి మంది కొత్త మదుపర్లు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) ప్లాట్‌ఫామ్‌పై నమోదైన మదుపర్ల సంఖ్య 9 కోట్లను అధిగమించిందని సంస్థ ప్రకటించింది. గత 5 నెలల్లోనే కోటి మంది కొత్త మదుపర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపింది. గత అయిదేళ్లలో ఎక్స్ఛేంజీ మదుపర్ల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగింది. డిజిటలీకరణ, మదుపర్లలో అవగాహన పెరగడం, స్టాక్‌మార్కెట్లు బలంగా రాణించడం వంటివి ఇందుకు కలిసొచ్చాయని తెలిసింది. ఎక్స్ఛేంజీలో నమోదైన ఖాతాదారు కోడ్ల సంఖ్య 16.9 కోట్లకు చేరింది. 2023 డిసెంబరు చివరికి ఫండ్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.50,77,900.36 కోట్లకు చేరింది. నవంబరులో ఈ విలువ రూ.49,04,992.39 కోట్లుగా ఉంది. ఈక్విటీ, హైబ్రిడ్, సొల్యూషన్ ఓరియెంటెడ్ పథకాల్లోని రిటైల్ పెట్టుబడుల విలువ రూ.28,87,504 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: యాప్‌లు అవసరంలేని మొబైల్ ఫోన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా.. ఓపెన్ ఎండెడ్, క్లోజ్డ్ ఎండెడ్ పథకాలు కలిసి రూ.9,872 కోట్లను సమీకరించాయని తెలిసింది. గతేడాది డిసెంబర్ నాటికి క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) ద్వారా ఫండ్లలోకి రూ.17,610.16 కోట్లు వచ్చాయి. -
సాక్షి మనీ మంత్ర : సూచీల సరికొత్త రికార్డ్.. సెన్సెక్స్ 1,200+, నిఫ్టీ 300+
దేశీయ స్టాక్ సూచీలు సరికొత్త రికార్డ్లను నమోదు చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం యూఎస్ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలతో నిపుణులు అంచనాల కంటే మెరుగ్గా ట్రేడ్ అయ్యాయి. రంగాల వారీగా ఎక్కువ శాతం సూచీలు సానుకూలంగా ట్రేడ్ అయ్యాయి. అందరి చూపు ఫిబ్రవరి ఆటోమొబైల్ సేల్స్ వైపే ఉండడంతో సంబంధిత స్టాక్స్ సైతం పుంజుకున్నాయి. ఇక శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1245 పాయింట్లు లాభంతో 73745 వద్ద, నిఫ్టీ 355 పాయింట్ల లాభంతో 22338 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. టాటా స్టీల్,జేఎస్‌డ్ల్యూ స్టీల్,టైటాన్ కంపెనీ, బీపీసీఎల్, హిందాల్కో, మారుతి సుజికీ, గ్రాసిమ్, టాటా మోటార్స్, ఎస్బీఐ షేర్లు భారీ లాభాల్లో మూటగట్టుకోగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, ఎల్టీఐ మైండ్ ట్రీ, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 133 పాయింట్లు లాభపడి 22,114కు చేరింది. సెన్సెక్స్ 382 పాయింట్లు పుంజుకుని 72,888 వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 0.17శాతం పెరిగి 104 పాయింట్లకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 0.1 శాతం తగ్గి 83.62 అమెరికన్ డాలర్లుగా ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.25శాతానికి చేరాయి. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్స్ విలువలు గణనీయంగా పెరిగిన సమయంలో మదుపరుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సెబీ కీలక సూచనలు చేసింది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారి రక్షణ దృష్ట్యా తగిన కార్యాచరణను/విధానాలను అమల్లో పెట్టాలని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలను (ఏఎంసీలు) ఆదేశించింది. ప్రతి నెలా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.వేలాది కోట్లు వస్తుంటే, వాటిని ఫండ్ మేనేజర్లు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల స్టాక్స్ విలువలు మరింత పెరిగిపోతాయి. ఈ ర్యాలీని చూసి ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. కానీ, దిద్దుబాటు మొదలైందంటే, దీనికి విరుద్ధంగా అమ్మకాల ఒత్తిడికి స్టాక్స్ విలువలు దారుణంగా పడిపోయే రిస్క్ ఉంటుంది. దీన్ని నివారించేందుకు, పెట్టుబడుల రాకను క్రమబద్దీకరించేందుకు సెబీ ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: రోజంతా ఒడుదొడుకులు.. స్వల్ప లాభాలతో ముగింపు..
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నా చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 21,982 వద్దకు చేరింది. సెన్సెక్స్ 195 పాయింట్లు ఎగబాకి 72,500 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పవర్‌గ్రిడ్, మారుతి సుజుకీ, ఎస్బీఐ, టైటాన్, ఏషియన్ పెయింట్స్, నెస్లే కంపెనీ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. హెచ్‌యూఎల్, భారతిఎయిర్టెల్, టాటా మోటార్స్, ఐటీసీ, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ స్టాక్‌లు నష్టాల్లోకి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 83.54 డాలర్ల వద్దకు చేరింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) బుధవారం నికరంగా రూ.1,879.23 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) రూ.1,827.45 కోట్ల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర : స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ఫోకస్లో రిలయన్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. క్రితం రోజు భారీ నష్టాలతో ముగిసిన సూచీలు కోలుకున్నాయి. సెన్సెక్స్ 790 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్ల నష్టంతో క్రాష్ అవ్వగా ఈరోజు స్టీడీ అయినట్లు కనిపిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 14.96 పాయింట్లు లేదా 0.021 శాతం నష్టంతో 72,289.92 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 29.80 పాయింట్లు లేదా 0.14 శాతం నష్టంతో 21,921.35 వద్ద కొనసాగుతున్నాయి. రిలయన్స్, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, ఎస్బీఐ షేర్లు లాభాలతో టాప్ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అపోలో హాస్పిటల్, ఐషర్ మోటర్స్, బజాజ్ ఆటో షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బిట్‌కాయిన్ సరికొత్త రికార్డ్‌లు..రెండేళ్ల తర్వాత తొలిసారి
ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ (Bitcoin) సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. వరుసగా ఐదవ రోజు మళ్లీ పుంజుకొని రెండేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. దీంతో బుధవారం ఒక్కో బిట్ కాయిన్ ధర 60వేల డాలర్ల మార్కుకు చేరుకుంది. ఫలితంగా ఈ ఫిబ్రవరి నెలలో బిట్‌కాయిన్ విలువ 39.7శాతం పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజా ట్రేడింగ్‌తో బిట్‌కాయిన్ 4.4శాతం వృద్దిని సాధించింది. దీంతో డిసెంబర్ 2021లో అత్యధిక స్థాయిలో ఉన్న ఒక్కో బిట్ కాయిన్ విలువ 59,259వేల డాలర్లకు పైకి చేరుకుంది. అదే సమయంలో మరో ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఈథర్ 2.2శాతం పెరిగి 3,320కి చేరుకుంది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయిని తాకింది. ఫిబ్రవరి 26న బిట్‌కాయిన్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంలో గరిష్ట స్థాయికి చేరుకుని 57,000డాలర్లను దాటింది. కాయిన్ డెస్క్ ప్రకారం నవంబర్ 2021 తర్వాత తొలిసారిగా గణనీయంగా 57,000డాలర్ల మార్కును తాకింది. అయితే, మార్కెట్లో నెలకొన్న భయాలతో ఇది ఆ తర్వాత సుమారు 56,500 డాలర్లకు తగ్గింది. తాజాగా మరోసారి తిరిగి పుంజుకుని 60వేల డాలర్ల మార్క్‌ను దాటి రికార్డ్‌లు సృష్టించింది. క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ బిట్సేవ్ సీఈఓ జఖిల్ సురేష్ ప్రకారం.. ఎఫ్‌టీఎక్స్ సంఘటన తర్వాత నవంబర్ 2022లో బిట్‌కాయిన్ దాని కనిష్ట స్థాయిల నుండి 200 శాతానికి పైగా పెరిగినట్లు చెప్పారు. -
సాక్షి మనీ మంత్ర : భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ఇతర ఆసియా మార్కెట్ల మిక్స్డ్ ఫలితాల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు లాభనష్టాలతో ఊగిసలాడాయి. అదే ధోరణి కొనసాగడంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 790 పాయింట్ల నష్టంతో 72304 వద్ద, నిఫ్టీ 247 పాయింట్లు నష్టపోయి 21951 వద్ద ముగిశాయి. హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎయిర్టెల్ షేర్లు లాభాల్ని గడించగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అపోలో హాస్పిటల్,ఎథేర్మోటార్స్, మారుతి సుజికి,బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలతో సరిపెట్టుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా మార్కెట్లు.. దూసుకెళ్తున్న ‘టాటా’ షేర్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. మంగళవారం లాభాలతో ముగిసిన బెంచ్‌మార్క్ సూచీలు ఈరోజు కూడా స్వల్ప లాభాలతో సెషన్‌ను ప్రారంభించాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 16.65 పాయింట్లు లేదా 0.023 శాతం స్వల్ప లాభంతో 73,111.87 వద్ద కొనసాగుతోంది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ స్వల్పంగా 11.00 పాయింట్లు లేదా 0.050 శాతం ఎగిసి 22,209.35 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. భారతీ ఎయిర్టెల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా మోటర్స్, హిందాల్కో షేర్లు మంచి లాభాలతో టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హీరో మోటర్‌కార్ప్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, దివిస్ ల్యాబ్స్ షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆటో, ఐటీ షేర్ల జోరు
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు రెండు రోజుల నష్టాల నుంచి గట్టెక్కాయి. ఐటీ, ఆటో షేర్లు రాణించడంతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో రికవరీ ర్యాలీ కలిసిరావడంతో మంగళవారం అరశాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ 305 పాయింట్లు పెరిగి 73,095 వద్ద నిలిచింది. నిఫ్టీ 76 పాయింట్లు బలపడి 22,200 స్థాయి చేరువులో 22,198 వద్ద స్థిరపడింది. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు ప్రథమార్థంలో నష్టాలతో ట్రేడయ్యాయి. మిడ్ సెషన్ నుంచి ఐటీ, ఆటో, మెటల్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకుల షేర్లు రాణించడంతో నష్టాల్లోంచి లాభాల్లోకి మళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 371 పాయింట్లు దూసుకెళ్లి 73,161 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు పెరిగి 22,218 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. కమోడిటీ, ఫైనాన్షియల్ సర్విసెస్, టెలీ కమ్యూనికేషన్, యుటిలిటీ, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.25 %, 0.10 % నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,509 కోట్ల షేర్లు అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,861 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరప్ మార్కెట్లు అరశాతం లాభపడ్డాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు అరశాతం లాభంతో ట్రేడవుతున్నాయి. కాగా పేటీఎం షేరు ఆరంభ లాభాలు నిలుపుకోలేకపోయింది. ఇంట్రాడేలో 5% ఎగసి రూ.449 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. అయితే ఆరంభ లాభాలు నిలుపుకోవడంలో విఫలమైంది. చివరికి 0.11% నష్టపోయి రూ. 427.50 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో రూ.449 వద్ద గరిష్టాన్ని, రూ.413.55 వద్ద కనిష్టాన్ని తాకింది. టీసీఎస్ షేరు 2.50% ర్యాలీ చేసి రూ.4103 వద్ద ముగిసింది. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ ఈ షేరు రేటింగ్‌ను ‘న్యూట్రల్’ నుంచి ‘బై’కు అప్‌గ్రేడ్ చేయడంతో పాటు టార్గెట్ ధరను రూ.4,000 నుంచి రూ.4,700కు పెంచింది. ట్రేడింగ్‌లో 3.25% పెరిగి రూ.4,125 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
జాగ్రత్త.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్!
ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ (ఎఫ్‌పీఐ) విషయంలో అప్రమత్తంగా ఉండాలని క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఎఫ్‌పీఐ మార్గం ద్వారా స్టాక్ మార్కెట్ యాక్సెస్‌ను సులభతరం చేస్తామంటూ మోసగిస్తున్న ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎఫ్‌పీఐలతో తమకు అనుబంధం ఉందని, ఎఫ్‌పీఐ లేదా సంస్థాగత ఖాతాల ద్వారా ట్రేడింగ్ అవకాశాలు కల్పిస్తామని కొన్ని మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఇన్వెస్టర్లను మభ్యపెడుతున్నాయని సెబీకి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ సెబీ ఈ హెచ్చరిక ప్రకటన విడుదల చేసింది. మోసగిస్తున్నారిలా.. స్టాక్ మార్కెట్లో ఆన్లైన్ ట్రేడింగ్ కోర్సులు, సెమినార్లు, మెంటర్షిప్ ప్రోగ్రామ్‌ల ద్వారా మోసగాళ్లు బాధితులను ప్రలోభపెడుతున్నారని, ఇందుకోసం వాట్సాప్ లేదా టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పాటు లైవ్ బ్రాడ్క్యాస్ట్ను ఉపయోగిస్తున్నారని సెబీ పేర్కొంది. సెబీ నమోదిత ఎఫ్‌పీఐలకు చెందిన ఉద్యోగులు లేదా అనుబంధ సంస్థలుగా చెప్పుకొంటూ షేర్ల కొనుగోలు, ఐపీఓలకు సబ్స్క్రయిబ్ కోసం బాధితులతో యాప్‌లను డౌన్లోడ్ చేయిస్తున్నారని సెబీ తెలిపింది. ఇలాంటి మోసాలు చేయడానికి తప్పుడు పేర్లతో నమోదైన మొబైల్ నంబర్లను ఉపయోగిస్తాస్తున్నారని వెల్లడించింది. నిబంధనల ప్రకారం.. దేశంలో నివసిస్తున్న పౌరులకు ఎఫ్‌పీఐ పెట్టుబడి మార్గం అందుబాటులో ఉండదు. అయితే దీనికి కొన్ని పరిమిత మినహాయింపులు ఉంటాయి. -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్ సూచీలోని సెన్సెక్స్ ఉదయం 72,723.53 పాయింట్లతో ప్రారంభమైంది. తరువాత ఇంట్రాడేలో 73,161.30 పాయింట్ల మార్కును తాకి లాభాలకు చేరింది. చివరకు 305.09 పాయింట్లు పెరిగి 73,095 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 76.30 పాయింట్లు పెరిగి 22,198.35 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.90గా ఉంది.సెన్సెక్స్‌లో టాటా మోటార్స్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, ఇండస్ ఇండ్, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మ్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 97 పాయింట్లు నష్టపోయి 22,115 వద్దకు చేరింది. సెన్సెక్స్ 354 పాయింట్లు దిగజారి 72,788 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్ అండ్ టీ, పవర్‌గ్రిడ్, హెచయూఎల్ మినహా అన్ని స్టాక్‌లు నష్టాల్లోకి చేరుకున్నాయి. ఏషియన్ పెయింట్స్, టాటాస్టీల్, టైటాన్, టెక్‌మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్ భారీగా నష్టపోయాయి. అమెరికా మార్కెట్లు గడిచిన మార్కెట్ సెషన్లో రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. టెక్ స్టాక్స్‌లో అమ్మకాలు, యూరోజోన్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో నేడు ఆసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు ప్రతికూలంగా ట్రేడైనట్లు తెలిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 81.22 అమెరికన్ డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎఫ్ఐఐలు శుక్రవారం నికరంగా రూ.1,276.09 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.176.68 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర : నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 మూడో త్రైమాసికం భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి గణాంకాలు గురువారం(ఫ్రిబవరి 29న) విడుదల కానున్నాయి. ప్రాథమిక మార్కెట్లో ఆరు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కానున్నాయి. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా ఈ వారం తొలిరోజే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటల సమయానికి 144 పాయింట్ల నష్టంతో 72998 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 22174 వద్ద కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, యూపీఎల్,అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, ఎస్బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఏసియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్టీఐ మైండ్ ట్రీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. -
ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది?
ముంబై: ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్ధేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ గడువు ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకుల ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 మూడో త్రైమాసికం భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి గణాంకాలు గురువారం(ఫ్రిబవరి 29న) విడుదల కానున్నాయి. ప్రాథమిక మార్కెట్లో ఆరు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కానున్నాయి. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ‘‘చివరి ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయి(22,297)ని నమోదు చేసిన తర్వాత తీవ్ర ఊగిసలాటకు లోనైంది. కొనుగోళ్ల కొనసాగితే 22,300 – 22,500 స్థాయిని పరిక్షీణింవచ్చు. లాభాల స్వీకరణ జరిగితే దిగువ స్థాయిలో 22,000 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఇన్వెస్టర్లు పతనమైన నాణ్యమైన షేర్లను కొనుగోలు చేయడం ఉత్తమం’’ అని రిలిగేర్ బ్రోకింగ్ సాంకేతిక నిపుణుడు అజిత్ మిశ్రా తెలిపారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధరలు స్థిరంగా కొనసాగడంతో గతవారం సూచీలు దాదాపు ఒకశాతం పెరిగాయి. సెన్సెక్స్ 716 పాయింట్లు, నిఫ్టీ 172 పాయింట్లు లాభపడ్డాయి. ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇంధన షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా జనవరి గృహ విక్రయాలు, జపాన్ జనవరి ద్రవ్యోల్బణ డేటా ఫిబ్రవరి 27న, అమెరికా నాలుగో త్రైమాసిక జీడీపీ వృద్ధి గణాంకాలు బుధవారం (28న) విడుదల కానున్నాయి. యూరోజోన్ ఫిబ్రవరి పారిశ్రామిక, సర్వీసెస్, కన్జూమన్ కాన్ఫిడెన్స్ డేటా బుధవారం వెల్లడి అవుతాయి. జపాన్ రిటైల్ అమ్మకాలు, నిర్మాణ ఆర్డర్లు, భారత క్యూ3 జీడీపీ వృద్ధి డేటా, అమెరికా నిరుద్యోగ, పీసీఈ ప్రైస్ ఇండెక్స్ గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం చైనా కాగ్జిన్ మానుఫ్యాక్చరింగ్ పీఎంఐ, జపాన్ నిరుద్యోగ రేటు, యూరోజోన్ హెచ్సీఓబీ కాగ్జిన్ మానుఫ్యాక్చరింగ్ పీఎంఐ, భారత్ ఆటో అమ్మకాలు, పారెక్స్ నిల్వల డేటా వెల్లడి కానున్నాయి. బుధవారం ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ, జీడీపీ వృద్ధి డేటా ఈ గురువారం(ఫిబ్రవరి 29న) నిఫ్టీ సూచీకి చెందిన జనవరి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదేరోజున ప్రస్తుత ఆర్థి క సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి డేటా విడుదల కానుంది. ప్రభుత్వ వ్యయంలో మందగమనం కారణంగా క్యూ2 జీడీపీ వృద్ధి (7.60%)తో తక్కువగా నమోదు కావచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే వార్షిక ప్రాతిపదన గ త ఆర్థిక సంవత్సరం క్యూ3 జీడీపీ వృద్ధి(4.5%)తో పోలిస్తే అధికంగా ఉండొంచ్చంటున్నారు. డెట్ మార్కెట్లోకి రూ.18,500 కోట్లు భారత డెట్(రుణ) మార్కెట్లో ఫిబ్రవరి 2న నాటికి విదేశీ ఇన్వెస్టర్లు రూ.18,500 కోట్లకు పైగా పట్టుబడులు పెట్టారు. త్వరలో భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్ ఇండెక్స్‌లో చేర్చనున్న వార్తలు ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు తెలిపారు. జనవరిలో భారత డెట్ మార్కెట్లోకి రూ.19,836 కోట్ల పెట్టుబడులు రాగా, ఇది ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ నెలవారీ ఇన్‌ఫ్లోగా నిలిచింది. గతంలో 2017 జూన్‌లో ఇన్‌ఫ్లో రూ. 25,685 కోట్లుగా నమోదైంది. సమీక్ష కాలంలో (ఫిబ్రవరి 1– 23 తేదీల మధ్య) విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ.424 కోట్లను వెనక్కి తీసుకున్నారు. జనవరిలో రూ.25,743 కోట్లను ఉపసంహరించుకున్నట్లు ఎన్‌సీడీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. 3 ఐపీఓలు, 2 లిస్టింగులు ప్రాథమిక మార్కెట్ నుంచి ఆరు కంపెనీలు ఈ వారంలో రూ.3,330 కోట్ల సమీకరణకు సిద్ధమయ్యాయి. ప్లాటినం ఇండస్ట్రీస్, ఎక్సికం టెలీ–సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూలు ఫిబ్రవరి 27న మొదలై 29న ముగియనున్నాయి. భారత్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్వెస్ట్మెంట్ ఐపీఓ ఫిబ్రవరి 28– మార్చి 1 తేదీల మధ్య జరగనుంది. గతవారం ప్రారంభమైన జీపీటీ హెల్త్‌కేర్ ఐపీఓ ఫిబ్రవరి 26న(సోమవారం) ప్రారంభం కానుంది. ఇదేవారంలో ఫిబ్రవరి 28న జునియర్ హోటల్స్, మరుసటి రోజున జీపీటీ హెల్త్‌కేర్ షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. -
ఆల్ టైమ్ హైలో మార్కెట్లు.. ఎలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే..
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు ఆల్‌టైమ్‌హైలో ట్రేడవుతున్నాయి. రానున్న రోజుల్లో మార్కెట్ పయనం ఏ విధంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపర్లు ఎలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పటికే ఐటీ స్టాక్స్ బాగార్యాలీ అయ్యాయి. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి. దానికి సంబంధించి ఎలాంటి స్ట్రాటజీలను అనుసరించాలో తెలుసుకోవడానికి స్టాక్ మార్కెట్ లీడ్ అనలిస్ట్ 'కౌశిక్ మోహన్'తో ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ 'కారుణ్యరావు' ముఖాముఖి ఈ వీడియోలో చూడండి. -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్ సూచీలు
స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 15 పాయింట్లు నష్టపోయి 73,142 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 4 పాయింట్ల తగ్గి 22,212 వద్ద ముగిసింది. బీఎస్ఈ 30 ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, ఎంఅండ్ఎం, నెస్లే ఇండియా, రిలయన్స్, హిందుస్థాన్ యూనిలివర్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, ఎల్అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ, బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఎస్బీఐఎన్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, భారతీ ఎయిర్ టెల్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్ టెక్ నష్టాల్లో ముగిశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: వరుస లాభాల్లో స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ లో వరుస లాభాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం స్టాక్ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20గంటల సమయానికి సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 73261 వద్ద నిఫ్టీ 35 పాయింట్ల స్వల్ప లాభంతో 22253 వద్ద కొనసాగుతుంది. హీరోమోటో కార్ప్, టైటాన్ కంపెనీ, గ్రాసిం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ టీఐ మైండ్ ట్రీ, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో,సిప్లా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, బ్రిటానియా,మారుతి సుజికి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్ టీపీసీ, నెస్లే, హిందాల్కో, ఐటీసీ హేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. -
సాక్షి మనీ మంత్ర: భారీ లాభాలు.. సెన్సెక్స్ రికార్డ్ క్లోజింగ్!
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు భారీ లాభాలలో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు తర్వాత పుంజుకుని భారీ లాభాల వైపు పయనించాయి. సెన్సెక్స్ 535 పాయింట్లు ఎగిసి రికార్డ్ క్లోజింగ్‌ను చూసింది. నిఫ్గీ సైతం 22,200 పాయింట్ల బెంచ్‌మార్క్‌ను దాటింది. బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం సెషన్లో 535.15 పాయింట్లు లేదా 0.74 శాతం లాభంతో 73,158.24 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 162.40 పాయింట్లు లేదా 0.74 శాతం పుంజుకుని 22,217.45 వద్ద సెషన్‌ను ముగించింది. బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్, ఐచర్ మోటర్స్, కోల్ ఇండియా, ఐటీసీ షేర్లు లాభాలను అందుకుని టాప్ గెయినర్స్‌గా ఉండగా ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్ర, బీపీసీల్, హీరో మోటర్‌కార్ప్ షర్లే నష్టాలను మూటకట్టుకుని టాప్ లూజర్స్ జాబితాలోకి చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం మునుపటి ముంగింపు దగ్గరే ట్రేడవుతున్నాయి. ఉదయం 9:17 వరకు నిఫ్టీ 8 పాయింట్లు పుంజుకుని 22,064కు చేరింది. సెన్సెక్స్ 4 పాయింట్లు లాభపడి 72.602 వద్ద ట్రేడవుతోంది. అమెరికాలోని నాస్డాక్ 0.3శాతం నష్టాల్లో ముగిసింది. వరుసగా మూడోరోజు ఈ సూచీ నష్టాలభాట పట్టినట్లు తెలిసింది. ఫెడ్ మినట్స్ మీటింగ్‌లో ప్రధానంగా మార్చి 2024లో కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే అందుకు సెంట్రల్ బ్యాంక్‌లు అచితూచి వ్యవహరించనున్నాయని తెలుస్తుంది. యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్‌లు 4.8 పాయింట్లు పెరిగి 4.32 శాతానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ 0.08శాతం నష్టపోయి 103.97కు చేరింది. ఎఫ్ఐఐలు బుధవారం ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.284.66 కోట్ల విలువ చేసే స్టాక్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.411.57 కోట్లు విలువైన స్టాక్లను విక్రయించారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈ రోజు (బుధవారం) ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 434.34 పాయింట్ల నష్టంతో 72623.09 పాయింట్ల వద్ద, నిఫ్టీ 142 పాయింట్ల నష్టంతో 22055.00 పాయింట్ల వద్దకు చేరాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), జిందాల్ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు చేరాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), కోల్ ఇండియా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), హీరోమోటోకార్ప్, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్, GMR ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర : స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటల సమయంలో సెన్సెక్స్ 76 పాయింట్ల స్వల్ప లాభంతో 73134 వద్ద నిఫ్టీ 21 పాయింట్ల స్వల్ప లాభంతో 22218 వద్ద ట్రేడింగ్ ను కొనసాగిస్తుంది. టాటా స్టీల్, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఎథేర్ మోటార్స్,గ్రాసిమ్,ఓఎన్జీసీ,బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హీరో మోటోకార్ప్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, లార్సెన్, బజాజ్ ఆటో, హెచ్ సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)