Market
-
ర్యాలీతో రికార్డుల మోత
ముంబై: ప్రధానంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ దిగ్గజాలలో కొనుగోళ్ల మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో మరోసారి మార్కెట్లు లాభపడ్డాయి. నిఫ్టీ 75 పాయింట్లు ఎగసి 22,197 వద్ద ముగిసింది. దీంతోపాటు ఇంట్రాడేలో 22,216కు చేరడం ద్వారా మళ్లీ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. మరోపక్క సెన్సెక్స్ 349 పాయింట్లు జంప్‌చేసి 73,057 వద్ద నిలిచింది. తద్వారా 73,000 పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించడంతోపాటు.. చరిత్రాత్మక గరిష్టం 73,328ను అధిగమించే బాటలో సాగుతోంది. సోమవారం సైతం నిఫ్టీ 22,122 వద్ద రికార్డ్ సృష్టించిన విషయం విదితమే. అయితే మార్కెట్లు తొలుత వెనకడుగుతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 22,046 దిగువన, సెన్సెక్స్ 72,510 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. తిరిగి మిడ్ సెషన్ నుంచీ జోరందుకున్నాయి. దీంతో ఆరు రోజుల్లో నిఫ్టీ 580 పాయింట్లు, సెన్సెక్స్ 1,984 పాయింట్లు జమ చేసుకున్నాయి. ప్రయివేట్ స్పీడ్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్(1%) జోరు చూపాయి. నిఫ్టీ దిగ్గజాలలో పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఎన్టీపీసీ, కొటక్, ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్, ఇండస్ఇండ్, అపోలో హాస్పిటల్, గ్రాసిమ్, నెస్లే, హెచ్‌యూఎల్ 4.4–1 శాతం మధ్య ఎగశాయి. అయితే హీరోమోటో, బజాజ్ ఆటో, ఐషర్, కోల్ ఇండియా, టీసీఎస్, సిప్లా, బజాజ్ ఫిన్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ 4–1% మధ్య క్షీణించాయి. చిన్న షేర్లు వీక్ అధిక విలువల కారణంగా ఇన్వెస్టర్లు చిన్న షేర్లలో అమ్మకాలు చేపట్టారు. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2 శాతం డీలా పడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,967 నీరసించగా.. 1,876 బలపడ్డాయి. ఇక నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ. 1,336 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్ రూ. 1,491 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. స్టాక్ హైలైట్స్.. ► ఇష్యూ ధర రూ. 151తో పోలిస్తే వి¿ోర్ స్టీల్ ట్యూబ్స్ 179% లాభంతో రూ. 421 వద్ద లిస్టయ్యింది. 193% (రూ.291) బలపడి రూ. 442 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 838 కోట్లను దాటింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో 23.3 లక్షలకుపైగా షేర్లు ట్రేడయ్యాయి. ఈ ఐపీవో భారీ స్థాయిలో 300 రెట్లు సబ్‌్రస్కయిబ్ అయ్యింది. ► ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుల్లో రూ. 656 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించడంతో పవర్‌గ్రిడ్ షేరు 4.2% ఎగసి రూ. 288 వద్ద క్లోజైంది. వరుసగా ఆరో రోజూ ర్యాలీతో దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ మరోసారి సరికొత్త రికార్డును సాధించగా.. సెన్సెక్స్ 73,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. త ద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకునే బాట లో సాగుతోంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 391.5 లక్షల కోట్ల(4.72 ట్రిలియన్ డాలర్లు)ను తాకింది. వర్ల్‌పూల్ వాటా విక్రయం.. రూ. 4,090 కోట్ల సమీకరణ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రమోటర్ సంస్థ వర్ల్‌పూల్ మారిషస్ బ్లాక్‌డీల్స్ ద్వారా దేశీ అనుబంధ కంపెనీ వర్ల్‌పూల్ ఇండియాలో 24 శాతం వాటాను విక్రయించింది. యూఎస్ హోమ్ అప్లయెన్సెస్ దిగ్గజం వర్ల్‌పూల్ కార్పొరేషన్ మారిషస్ సంస్థ ద్వారా 75 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. బ్లాక్‌డీల్స్ ద్వారా రూ. 4,090 కోట్ల విలువైన 3.13 కోట్ల షేర్లు విక్రయించినట్లు బీఎస్ఈకి వర్ల్‌పూల్ ఇండియా వెల్లడించింది. రుణ చెల్లింపుల కోసం వర్ల్‌పూల్ ఇండియాలో 24 శాతం వాటాను విక్రయించనున్నట్లు గతేడాది వర్ల్‌పూల్ కార్ప్ వెల్లడించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వర్ల్‌పూల్ ఇండియా షేరు 3.25 శాతం క్షీణించి రూ. 1,288 వద్ద ముగిసింది. -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈ రోజు (మంగళవారం) నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 349.24 పాయింట్ల లాభంతో 73057.40 వద్ద, నిఫ్టీ 74.70 పాయింట్ల లాభంతో 22197.00 పాయింట్ల వద్ద ముగిసాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, గ్లెన్‌మార్క్ ఫార్మా లిమిటెడ్ మొదలైన కంపెనీలు చేరాయి. హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, ఫెడరల్ బ్యాంక్, బయోకాన్ లిమిటెడ్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. నేడు ఆటోమొబైల్ రంగం నష్టాల్లో సాగుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 72592 వద్ద నిఫ్టీ43 పాయింట్ల స్వల్పంగా నష్టపోయి 22079 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, గ్రాసిమ్, ఓఎన్జీసీ, కొటక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్ ట్రీ, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ ,యూపీఎల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడగా...హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, ఎథేర్ మోటార్స్, బజాజ్ఆటో, బీపీసీఎల్, మారుతి సుజికి షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర : లాభాల్లో ముగిసిన దేశీయ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ తాజా ఆల్ టైమ్ హైని తాకడంతో ఫిబ్రవరి 19న సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ముగింపులో సెన్సెక్స్ 281 పాయింట్ల లాభంతో 72,708 వద్ద, నిఫ్టీ 81.60 పాయింట్ల లాభంతో 22,122 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. దాదాపు 2184 షేర్లు లాభాలు గడించగా... 1243 షేర్లు క్షీణించాయి. 123 షేర్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా టాప్ లాభాలు గడించగా, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ అండ్ టీ, విప్రో హెచ్డీఎప్సీ లైఫ్ షేర్లు నష్టపోయాయి. -
బంగారం, వెండి ధరలు - ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
ఫిబ్రవరి ప్రారంభం నుంచి పెరుగుతూ, తగ్గుతూ ఉన్న బంగారం ధరలు గత మూడు రోజుల నుంచి వరుస పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ఈ రోజు కూడా తులం బంగారం ధరలు నిన్నటి కంటే రూ. 270 పెరిగింది. దీంతో పసిడి ధరలు దాదాపు రూ. 63000 (10 గ్రామ్స్)కు దగ్గరగా చేరాయి. హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలు రూ. 57450 (22 క్యారెట్స్), రూ.62670 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.250, రూ.270 పెరిగినట్లు తెలుస్తోంది. చెన్నైలో నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు, ఈ రోజు రూ.200 నుంచి రూ.220 వరకు పెరిగింది. దీంతో ఈ రోజు తులం బంగారం ధరలు వరుసగా రూ. 58000 (22 క్యారెట్స్), రూ. 63270 (24 క్యారెట్స్) వద్ద నిలిచాయి. ఢిల్లీలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ. 250 పెరిగి 57600 రూపాయలకు.. 24 క్యారెట్ల ధర రూ. 270 పెరిగి 62820 రూపాయలకు చేరింది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు దేశంలోని దాదాపు అన్ని నగరాల్లోనే పెరుగుదలవైపు అడుగులు వేసాయి. వెండి ధరలు బంగారం ధరలు పెరిగిన తరుణంలో వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. నేడు ఒక కేజీ వెండి ధర రూ. 76000 వద్ద ఉంది. అంటే నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర రూ. 500 తక్కువ. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, చెన్నై నగరాల్లో కూడా వెండి ధరలు తగ్గాయి. ఇదీ చదవండి: అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారో తెలుసా.. -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
వారాంతంలో లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లో.. ఈ రోజు (సోమవారం) ఉదయం కూడా శుభారంభం పలికాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 105.17 పాయింట్ల లాభంతో 72531.81 వద్ద, నిఫ్టీ 42.50 పాయింట్ల లాభంతో 22083.20 వద్ద కొనసాగుతున్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, బంధన్ బ్యాంక్, బయోకాన్ లిమిటెడ్ వంటి సంస్థలు చేరాయి. నష్టాలను చవి చూసిన కంపెనీల జాబితాలో విప్రో, టీసీఎస్, లార్సెన్ & టుబ్రో, బిర్లాసాఫ్ట్ లిమిటెడ్, ఆర్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ మొదలైనవి ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దీర్ఘకాలంలో నమ్మకమైన లాభాలనిచ్చే ఫండ్.. ఓ లుక్కేయండి..
లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ వేల్యుయేషన్లను అర్థం చేసుకోవడం సాధారణ ఇన్వెస్టర్లకు కష్టమైన విషయమే. భవిష్యత్తులో వీటిల్లో ఏ విభాగం, మిగిలిన విభాగాలతో పోలిస్తే మంచి పనితీరు చూపిస్తుందని ముందుగా గుర్తించడం కూడా కష్టమే. గత 15 ఏళ్ల కాలంలో లార్జ్‌క్యాప్ ఇండెక్స్ నాలుగేళ్ల కాలంలో మంచి పనితీరు చూపించగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా నాలుగు సంవత్సరాలలో మంచి పనితీరు ప్రదర్శించింది. కానీ, స్మాల్‌క్యాప్ మాత్రం ఏడేళ్లలో మంచి పనితీరు చూపించింది. కనుక ప్రతీ విభాగంలోనూ ఇన్వెస్టర్ దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రాబడులు ఆర్జించడానికి మంచి అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇలా లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టి మంచి రాబడులు ఇచ్చేవే ఫ్లెక్సీక్యాప్, మలీ్టక్యాప్ ఫండ్స్. ఈ విభాగంలో ఎంతో కాలంగా పనిచేస్తూ, మంచి పనితీరు చూపుతున్న పథకాల్లో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. రాబడులు ఈ పథకం ఏ కాలంలో చూసినా కానీ, బెంచ్ మార్క్ అయిన బీఎస్ఈ 500 టీఆర్ఐ కంటే మెరుగైన పనితీరు చూపించింది. గడిచిన ఏడాది కాలంలో 37.58 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. మూడేళ్లలో కాలంలో వార్షిక రాబడి 24.27 శాతంగా ఉంది. ఇక ఐదేళ్ల కాలంలో 19.40 శాతం, ఏడేళ్లలో 16.44 శాతం, పదేళ్లలో 17.13 శాతం చొప్పున వార్షిక రాబడి ఈ పథకంలో భాగంగా ఉంది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడితో పోల్చి చూస్తే, ఈ పథకమే 3 శాతం నుంచి 8 శాతం మేర అధిక రాబడిని వివిధ కాలాల్లో అందించినట్టు తెలుస్తోంది. ఇక బీఎస్ఈ 500 టీఆర్ఐతో చూసినా కానీ, ఈ పథకంలోనే 1–6 శాతం మేర వివిధ కాలాల్లో అధిక రాబడి కనిపిస్తుంది. ఈ పథకం 1995 జనవరి 1న ప్రారంభమైంది. గతంలో హెచ్డీఎఫ్సీ ఈక్విటీ ఫండ్ కాగా, అనంతరం ఫ్లెక్సీక్యాప్గా మారింది. ఆరంభం నుంచి వార్షిక రాబడి 19 శాతం మేర ఉండడం గమనించొచ్చు. పెట్టుబడుల విధానం/ఫోర్ట్‌ఫోలియో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌కు దేశ ఈక్విటీ మార్కెట్లో సుదీర్ఘ ట్రాక్ రికార్డు ఉండడం గమనార్హం. తొలుత రూ.52 కోట్లతో ఆరంభమైన ఈ పథకంలో ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ ఏడాది జనవరి చివరికి రూ.47,642 కోట్లుగా ఉన్నాయి. ప్రతి మార్కెట్ సైకిల్లో మంచి పనితీరు చూపించే అవకాశం ఉన్న రంగాలు, కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం ప్రత్యేకత. ప్రస్తుతం ఈ పథకం తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 87.5 శాతమే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. డెట్ సాధనాల్లో 0.42 శాతం పెట్టుబడులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాల్లోనూ 3.79 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. నగదు, నగదు సమానాల రూపంలో 8.29 శాతం పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీల్లో 91 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 7.61 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 1.52 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్‌ఫోలియోలో 41 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 32 శాతం పెట్టుబడులు పెట్టింది. హెల్త్‌కేర్ కంపెనీలకు 12.59 శాతం, టెక్నాల జీ కంపెనీలకు 9.5 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 7.39 శాతం చొప్పున కేటాయించింది. -
వెయ్.. ‘సిప్’ వెయ్
న్యూఢిల్లీ: మెజారిటీ యవత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను ఎంపిక చేసుకుంటున్నారు. డిజిటల్ రూపంలో లావాదేవీలు సులభంగా నిర్వహించుకునే వీలు, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి, ఆర్థిక అక్షరజ్ఞానం పెరుగుతుండడం ఇందుకు వీలు కలి్పస్తున్నట్టు వైట్ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. ఈ సంస్థ నిర్వహణలో 3.33 లక్షల ఇన్వెస్టర్లకు సంబంధించి రూ.8,400 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఏడాది క్రితమే ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్స్ కార్యకలాపాలు మొదలు పెట్టింది. తన కస్టమర్లలో 56 శాతం జెనరేషన్ జెడ్, మిలీనియల్స్ (జెనరేషన్ వై) ఉన్నట్టు తెలిపింది. 1981–1996 మధ్య జన్మించిన వారు జెనరేషన్ వై కిందకు, 1997–2012 మధ్య జని్మంచిన వారు జెనరేషన్ జెడ్ కిందకు వస్తారు. తనకున్న 3.33 లక్షల కస్టమర్లలో 28 శాతం మేర జెనరేషన్ జెడ్, మరో 28 శాతం మేర జెనరేషన్ వై విభాగంలోని వారేనని ఈ సంస్థ తెలిపింది. అంతేకాదు 51 శాతం మంది డిజిటల్ చానల్స్ ద్వారానే ఇన్వెస్ట్ చేస్తున్నట్టు పేర్కొంది. ‘‘జెనరేషన్ వై, జెడ్ డిజిటల్ టెక్నాలజీ తెలిసిన వారు. కనుక వారు టెక్నాలజీ ఆధారితంగా నడిచే ఫైనాన్షియల్ సరీ్వస్ ప్రొవైడర్లకు ప్రాధాన్యత ఇవ్వడం సహజమే’’అని వైట్ఓక్ క్యాపిటల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రతీక్ పంత్ తెలిపారు. సహేతుక రాబడులు, నిపుణుల ఆధ్వర్యంలో పెట్టుబడుల నిర్వహణ, చాలా స్వల్ప మొత్తం నుంచే పెట్టుబడికి అవకాశం, ఎన్నో రకాల పెట్టుబడి పథకాలు, సులభంగా ఉపసంహరించుకునే వెసులుబాటు ఇవన్నీ యువ ఇన్వెస్టర్లు సిప్ వేసేందుకు అనుకూలిస్తున్నట్టు చెప్పారు. టికెట్ సైజు తక్కువే 18–35 ఏళ్ల వయసు వారు సిప్ రూపంలో చేస్తున్న పెట్టుబడి, ఇంతకంటే పెద్ద వయసులోని వారితో పోలిస్తే తక్కువగానే ఉన్నట్టు వైట్ఓక్ తెలిపింది. తమ పాకెట్ మనీ నుంచి లేదంటే పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం ద్వారా వచ్చే మొత్తం నుంచి వీరు ఇన్వెస్ట్ చేస్తుండొచ్చని ప్రతీక్ పంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలో 7.92 కోట్ల సిప్ ఖాతాలు ఉన్నాయి. -
నాలుగో రోజూ లాభాలు
ముంబై: ఐటీ, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు నాలుగో రోజూ లాభాలు ఆర్జించాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు, ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాలు సెంటిమెంట్‌ను మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. సెన్సెక్స్ 376 పాయింట్లు లాభపడి 72,427 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 130 పాయింట్లు పెరిగి 22 వేల స్థాయిపై 22,041 వద్ద ముగిసింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా స్థిరంగా ముందుకు కదిలాయి. భారత వాణిజ్య లోటు 9 నెలల కనిష్టానికి దిగిరావడంతో క్యాపిటల్ గూడ్స్, మెటల్, పారిశ్రామిక రంగాల షేర్లకు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఇటీవల ర్యాలీ చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 72,218 వద్ద కనిష్టాన్ని, 72,545 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 21,969 – 22,069 శ్రేణిలో ట్రేడైంది. బీఎస్ఈలో స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 0.68%, 0.78 % చొప్పున రాణించాయి. ► ఎంటెరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.1,258)తో పోలిస్తే 1% డిస్కౌంట్‌తో రూ.1245 వద్ద లిస్టయ్యింది. 9.22 % నష్టపోయి రూ.1142 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 8.50% క్షీణించి రూ.1149 వద్ద ముగిసింది. ► వరుస పతనాల నుంచి పేటీఎం షేరు కోలు కుంది. దిగువ స్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈలో 5% ఎగసి రూ. 341.50 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. -
సాక్షి మనీ మంత్ర : సూచీల్లో కొనసాగుతున్న లాభాల పరంపర
దేశీయ సూచీల్లో లాభాల పరంపర కొనసాగుతుంది. ఫిబ్రవరి 16న నిఫ్టీ 22,000 ఎగువన భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా నాల్గవ సెషన్లో లాభాలతో ముగిశాయి. విప్రో, ఎం అండ్ ఎం, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టి అత్యధికంగా లాభపడగా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, బ్రిటానియా ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాల్లో ముగిశాయి. చమురు అండ్ గ్యాస్, పవర్ మినహా, ఇతర అన్ని సూచీలు ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఐటీ, రియల్టీ 1-2 శాతం వరకు గ్రీన్‌లో ట్రేడ్ అవ్వగా బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు దాదాపు 1 శాతం పెరిగాయి. -
పీఏసీఎల్ బాధితులకు శుభవార్త.. ప్రారంభమైన రిఫండ్
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ పథకాల ద్వారా నిధులు సమీకరించిన పీఏసీఎల్ ( PACL )లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన బాధితులకు చెల్లింపులు చేపట్టినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. రూ. 19,000 వరకూ క్లెయిముల చెల్లింపుల కోసం దాదాపు రూ. 1,022 కోట్లు వెచ్చించినట్లు తెలియజేసింది. ఇందుకు అర్హమైన 20,84,635 దరఖాస్తుల(ఇన్వెస్టర్లు)కు చెల్లింపులను పూర్తి చేసినట్లు వెల్లడించింది. గతంలో వ్యవసాయం, రియల్టీ బిజినెస్‌ల పేరుతో పీఏసీఎల్ అక్రమ పథకాల ద్వారా రూ. 60,000 కోట్లకుపైగా సమీకరించినట్లు సెబీ తెలియజేసింది. రిటైర్డ్ జస్టిస్ ఆర్ఎం లోధా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ దశలవారీగా రిఫండ్స్‌ను ప్రారంభించినట్లు వివరించింది. పెట్టుబడులు చేపట్టిన ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంలో విఫలంకావడంతో 2015 డిసెంబర్లో పీఏసీఎల్తోపాటు.. 9మంది ప్రమోటర్లు, డైరెక్టర్లకు చెందిన అన్ని ఆస్తులనూ అటాచ్ చేయవలసిందిగా సెబీ ఆదేశించింది. నిజానికి 2014 ఆగస్ట్ 22న ఇన్వెస్టర్లకు సొమ్మును రీఫండ్ చేయవలసిందిగా పీఏసీఎల్సహా సంస్థ ప్రమోటర్లు, డైరెక్టర్లను సెబీ ఆదేశించింది. ఇందుకు మూడు నెలల గడువును సైతం ప్రకటించింది. -
సాక్షి మనీ మంత్ర: పుంజుకున్న మార్కెట్లు.. లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 వరకు నిఫ్టీ 81 పాయింట్లు పుంజుకుని 21.991కు చేరింది. సెన్సెక్స్ 235 పాయింట్లు లాభపడి 72,275 వద్ద ట్రేడవుతోంది. ఎఫ్ఐఐలు గురువారం ఈక్విటీ మార్కెట్లో రూ.3064.15 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ.2276.93 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అమెరికా మార్కెట్లోని నాస్డాక్ బుధవారం ముగింపు సమయానికి 0.3శాతం పెరిగింది. పదేళ్ల కాలపరిమితి ఉన్న యూఎస్ బాండ్‌ఈల్డ్‌లు 4.25శాతానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ 0.45 శాతం నష్టపోయి 104.25 పాయింట్లకు చేరింది. క్రూడాయిల్ ధర 1.6శాతం పెరిగి బ్యారెల్ ధర 82.88 డాలర్లకు చేరింది. గురువారం ప్రథమార్థంలో స్తబ్ధుగా కదలాడిన మార్కెట్ సూచీలు మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో జోరు పెంచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 71,644 వద్ద కనిష్టాన్ని, 72,165 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 21,795 – 21,954 శ్రేణిలో ట్రేడైంది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, ఆటో, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇన్వెస్టర్లకు అలర్ట్.. బీఎస్ఈ హెచ్చరికలు
న్యూఢిల్లీ: తప్పుదారి పట్టిస్తున్న నకిలీ(ఫేక్) సోషల్ మీడియా సంస్థలకు దూరంగా ఉండాలంటూ స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం బీఎస్ఈ ఇన్వెస్టర్లను తాజాగా హెచ్చరించింది. లింక్డ్ఇన్, ట్విటర్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ తదితర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అనధికార, నకిలీ సంస్థలు బీఎస్ఈ అధికారిక గుర్తింపులను వినియోగిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా బీఎస్ఈతో సహచర్యం కలిగి ఉన్నట్లు తప్పుగా పేర్కొంటున్నాయని తెలియజేసింది. వెరసి ఇలాంటి సంస్థలు లేదా వ్యక్తులపట్ల అప్రమత్తతో వ్యవహరించవలసిందిగా ఇన్వెస్టర్లను హెచ్చరించింది. "తప్పుదోవ పట్టించే సోషల్ మీడియా హ్యాండిల్స్/ ఎంటిటీల బారిన పడకుండా ఇన్వెస్టర్లను బీఎస్ఈ అప్రమత్తం చేస్తోంది. బీఎస్ఈకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు క్లెయిమ్ చేసే సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రామాణికతను నిర్ధారించుకోవాల్సిందిగా సూచిస్తోంది" బీఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. బీఎస్ఈ అధికారికంగా ధ్రవీకరించబడిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను విశ్వసించాలని ఇన్వెస్టర్లను కోరింది. -
Stock market: మళ్లీ 72 వేలపైకి సెన్సెక్స్
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, మహీంద్రాఅండ్‌మహీంద్రా షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మూడో రోజూ లాభపడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 228 పాయింట్లు పెరిగి 72వేల స్థాయిపైన 72,050 వద్ద నిలిచింది. నిఫ్టీ 71 పాయింట్లు బలపడి 21,911 వద్ద స్థిరపడింది. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ప్రథమార్థపు ట్రేడింగ్‌లో స్తబ్ధుగా కదలాడిన సూచీలు మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో జోరు పెంచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 71,644 వద్ద కనిష్టాన్ని, 72,165 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 21,795 – 21,954 శ్రేణిలో ట్రేడైంది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, ఆటో, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈలో స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.24%, 0.93 % చొప్పున రాణించాయి. రంగాల వారీగా బీఎస్ఈ ఆయిల్‌అండ్‌గ్యాస్ 2.61%, యుటిలిటీస్ 2.59%, పవర్ 2%, ఆటో 1.41%, టెలికం 1.26% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3,064 కోట్ల షేర్లను విక్రయించగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,277 కోట్ల షేర్లు కొన్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► డిసెంబర్ క్వార్టర్ నికర లాభం 61% వృద్ధి నమోదుతో మహీంద్రాఅండ్‌మహీంద్రా షేరు దూసుకెళ్లింది. బీఎస్ఈలో ఆరున్నరశాతం పెరిగి రూ.1766 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 8% ర్యాలీ చేసి రూ.1784 ఆల్‌టైం హైని నమోదు చేసింది. సెన్సెక్స్, ► ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి తన అనుబంధ సంస్థ పీపీబీఎల్ అధికారులపై ఈడీ విచారణ కొనసాగుతుండంతో పేటీఎం షేరు బీఎస్ఈలో 5% లోయర్ సర్క్యూట్‌తో రూ.325 వద్ద లాకైంది. ► ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ షేరు 5% లాభపడి రూ.246 వద్ద ముగిసింది. క్యూ3లో నికర లాభం జోరుతో ట్రేడింగ్‌లో 7% ఎగసి రూ.253 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ► బ్లాక్‌డీల్ ద్వారా రెండుశాతానికిపైగా వాటాకు సమానమైన రూ.2,600 కోట్ల విలువైన షేర్లు చేతులు మారినట్లు వార్తలు వెలుగులోకి రావడంతో వేదాంత షేరు 4% నష్టపోయి రూ.268 వద్ద ముగిసింది. -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు
ఈ రోజు ఉదయం (గురువారం) లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిసాయి. సెన్సెక్స్ 227.56 పాయింట్ల లాభంతో 72050.38 వద్ద, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 21910.80 వద్ద నిలిచాయి. నేడు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా లాభాల్లోనే ముగిసాయి. టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), నేషనల్ పవర్ థర్మల్ కార్పొరేషన్ (NTPC), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) మొదలైన కంపెనీలు చేరాయి. నష్టాలను చవి చూసిన కంపెనీల జాబితాలో ప్రధానంగా.. యాక్సిస్ బ్యాంక్, అపోలో హాస్పిటల్, హిందుస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ మొదలైనవి చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పాపం పేటీఎం ఇన్వెస్టర్లు.. రూ. 27,000 కోట్లు ఆవిరి!
పేటీఎం ( Paytm )యాజమాన్య ఫిన్‌టెక్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు గురువారం (ఫిబ్రవరి 15) 5 శాతం పడిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో రూ. 325.30 వద్ద సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని ఉపయోగించే సంస్థలు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) ను ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి పేటీఎం బ్యాంక్ ప్రతినిధులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ప్రశ్నించిన ఘటన తర్వాత వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు పడిపోయాయి.ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిషేధం విధించినప్పటి నుంచి 11 రోజులలో పేటీఎం ఇన్వెస్టర్లు సుమారు రూ. 27,000 కోట్లు నష్టపోయారు. ఇది దాని విలువలో 57 శాతం. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలతో వ్యాపారాన్ని నిర్వహించిన కస్టమర్లకు సంబంధించిన సమాచారం, పత్రాలు, వివరాల ఈడీ నుంచి నోటీసులు, అభ్యర్థనలు వస్తున్నట్లు ఇటీవలి ఫైలింగ్‌లో వన్97 కమ్యూనికేషన్స్ అంగీకరించింది. అయితే తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ విదేశీ రెమిటెన్స్‌లలో పాల్గొనదని కంపెనీ స్పష్టం చేసింది. నివేదికల ప్రకారం.. ఈడీ అధికారులు కోరిన సమాచారం, పత్రాలను పేటీఎం ఇప్పటికే అందించినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలోగా మరిన్ని వివరాలు అందజేయాలని ఈడీ ఆదేశించినట్లుగా సమాచారం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి సేకరించిన సమాచారం, డాక్యుమెంట్లు ఈ దశలో ఫెమా ఉల్లంఘనలను సూచించడం లేదని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ద్వారా తెలుస్తోంది. -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 62 పాయింట్లు పుంజుకుని 21,900కు చేరింది. సెన్సెక్స్ 180 పాయింట్లు లాభపడి 71,998 వద్ద ట్రేడవుతోంది. ఎఫ్ఐఐలు బుధవారం ఈక్విటీ మార్కెట్లో రూ.3929.6 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ.2897.98 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అమెరికా మార్కెట్లోని నాస్డాక్ బుధవారం ముగింపు సమయానికి 1.3శాతం పెరిగింది. పదేళ్ల కాలపరిమితి ఉన్న యూఎస్ బాండ్‌ఈల్డ్‌లు 5 పాయింట్లు నష్టపోయి 4.27శాతానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ 0.26 శాతం నష్టపోయి 104.69 పాయింట్లకు చేరింది. క్రూడాయిల్ ధర 1.5శాతం తగ్గి బ్యారెల్ ధర 81.53 డాలర్లకు చేరింది. రష్యా ఇటీవల ఉక్రెయిన్‌పై జిర్కాన్ హైపర్సోనిక్ మిసైల్‌ను ప్రయోగించింది. దాంతో అంతర్జాతీయంగా కొంత అనిశ్చితులు నెలకొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లు ఈ మధ్యకాలంలో భారీగా ఒడిదొడుకులకు లోనవుతోందని తెలుస్తుంది. అయితే ఇలాంటి సమయంలో కొత్తగా మార్కెట్లోకి వచ్చినవారు నష్టభయాన్ని తట్టుకోలేక లాస్‌బుక్ చేస్తుంటారు. కానీ స్టాక్ ఫంటమెంటల్స్పై పూర్తి అవగాహన ఉండి బిజినెస్ మోడల్‌పై పట్టు ఉంటే దీర్ఘకాలికంగా మంచి లాభాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 277 పాయింట్ల లాభంతో 71,833.17 వద్ద, నిఫ్టీ స్వల్పంగా 96 పాయింట్లు పెరిగి 21,840 వద్ద ముగించింది. నిఫ్టీలో బీపీసీఎల్, ఎస్బిఐ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, టెక్ మహీంద్రా, సిప్లా, సన్ ఫార్మా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నష్టపోయాయి. సెక్టోరల్‌లో, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఒక్కొక్కటి 3 శాతం పెరిగాయి, ఆటో, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పవర్, రియల్టీ షేర్లు ఒక్కొక్కటి 1.2 శాతం పెరిగాయి. మరోవైపు ఐటీ, ఫార్మా సూచీలు 1 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున పెరిగాయి. -
‘బంగారం’ లాంటి వార్తే.. తెలిస్తే ఈరోజే కొనేస్తారు!
Gold Rate today : పసిడి ప్రియులకు ఇది నిజంగా బంగారం లాంటి వార్తే. వారం రోజులుగా దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గిపోయాయి. నిన్నటి రోజున స్పల్పంగా తగ్గిన పసిడి ధరలు ఈరోజు భారీగా దిగొచ్చాయి. వారం రోజుల వ్యవధిలో బంగారం ధరలు రూ.1000 పైగా తగ్గాయి. హైదరాబాద్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు (ఫిబ్రవరి 14) బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,000 లకు దిగివచ్చింది. అలాగే 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.660 చొప్పున తగ్గి రూ.62,180 వద్ద ఉంది. పవిత్రమైన మాఘమాసంలో బంగారం ధరలు భారీగా తగ్గడంతో మహిళలు, పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం పసిడి కొనుగోలుచేసేవారికి భారీ ఊరట లభిస్తోంది. దేశంలోని ఇతర నగరాల్లో.. ➦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,150 వద్ద, 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.680 తగ్గి రూ.62,310 వద్ద కొనసాగుతోంది. ➦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,000 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.62,180 వద్ద ఉంది. ➦ చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.600 దిగొచ్చి రూ.57,500లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.650 క్షీణించి రూ.62,730 ఉంది. ➦ ముంబైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.600 తగ్గి రూ.57,000 లకు చేరింది. 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.660 చొప్పున తగ్గి రూ.62,180 వద్ద ఉంది. Silver Price : ఇక దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న వెండి ధర ఈరోజు (ఫిబ్రవరి 14) కేజీకి ఏకంగా రూ. 1500 తగ్గింది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 75,500లుగా ఉంది. -
సాక్షి మనీ మంత్ర: భారీగా తగ్గిన మార్కెట్ సూచీలు.. కారణం ఇదేనా..
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:20 వరకు నిఫ్టీ 179 పాయింట్లు దిగజారి 21,566కు చేరింది. సెన్సెక్స్ 610 పాయింట్లు నష్టపోయి 70,940వద్ద ట్రేడవుతోంది. ఎఫ్ఐఐలు మంగళవారం ఈక్విటీ మార్కెట్లో రూ.376.32 కోట్లు, డీఐఐలు రూ.273.94 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అమెరికా సీపీఐ డేటా మార్కెట్ అనుకున్నదానికంటే ఎక్కువ రావడంతో ఈసారి వచ్చే ఫెడ్ మీటింగ్‌లో కీలక వడ్డీరేట్లను తగ్గించరేమోనని భావించి అక్కడి మార్కెట్లు భారీగా దిగజారాయి. కొన్ని రోజులుగా ద్రవ్యోల్బణంకు సంబంధించి నెలకొంటున్న పరిణామాలతో ఇకపై వడ్డీరేట్లను తగ్గించేయోచనలో లేనట్లు మార్కెట్లు భావిస్తున్నయని తెలుస్తుంది. యూఎస్ బాండ్ ఈల్డ్‌లు 4.32 శాతానికి చేరాయి. మార్కెట్లు ఈ మధ్యకాలంలో భారీగా ఒడిదొడుకులకు లోనవుతోందని తెలుస్తుంది. అయితే ఇలాంటి సమయంలో కొత్తగా మార్కెట్లోకి వచ్చినవారు నష్టభయాన్ని తట్టుకోలేక లాస్‌బుక్ చేస్తుంటారు. కానీ స్టాక్ ఫంటమెంటల్స్పై పూర్తి అవగాహన ఉండి బిజినెస్ మోడల్‌పై పట్టు ఉంటే దీర్ఘకాలికంగా మంచి లాభాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర : భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లకు జాతీయ, అంతర్జాతీయ అంశాలు కలిసొచ్చాయి. ప్రధానంగా అమెరికా ద్రవ్యోల్బణ డేటా విడుదల నేపథ్యంలో మదుపర్లు ఆసియా మార్కెట్లలో మదుపు చేసేందుకు మొగ్గు చూపారు. ఫలితంగా మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికి.. మార్కెట్లు ముగిసే సమయానికి పుంజుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 482 పాయింట్ల లాభంతో 71555 వద్ద, నిఫ్టీ 127 పాయింట్ల లాభంతో 21743 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ఇక, కోల్ ఇండియా, యూపీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ, విప్రో షేర్లు లాభాల్లో ముగియగా.. హిందాల్కో, గ్రాసిమ్, ఆల్ట్రాటెక్ సిమెంట్, దివిస్ ల్యాబ్స్, బీపీసీఎల్, ఎం అండ్ ఎం, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్ షేర్లు నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. -
సాక్షి మనీ మంత్ర: స్వల్పంగా పెరిగిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్పంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 26 పాయింట్లు పుంజుకుని 21,654కు చేరింది. సెన్సెక్స్ 203 పాయింట్లు లాభపడి 71,272వద్ద ట్రేడవుతోంది. ఎఫ్ఐఐలు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.126.6 కోట్లు, డీఐఐలు రూ.1711.75 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన ఆహార ద్రవ్యోల్బణం జనవరిలో 3 నెలల కనిష్ట స్థాయిలో 5.1 శాతానికి తగ్గింది. కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం దీనికి కారణమని అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. మార్కెట్లు ఈ మధ్యకాలంలో భారీగా ఒడిదొడుకులకు లోనవుతోందని తెలుస్తుంది. అయితే ఇలాంటి సమయంలో కొత్తగా మార్కెట్లోకి వచ్చినవారు నష్టభయాన్ని తట్టుకోలేక లాస్‌బుక్ చేస్తుంటారు. కానీ స్టాక్ ఫంటమెంటల్స్పై పూర్తి అవగాహన ఉండి బిజినెస్ మోడల్‌పై పట్టు ఉంటే దీర్ఘకాలికంగా మంచి లాభాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర : భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. తీవ్ర ఒడిదుడుకుల మధ్య మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 523 పాయింట్ల నష్టంతో 71072 వద్ద నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 21616 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, అపోలో హాస్పటిల్స్, దివీస్ ల్యాబ్స్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఎల్టీఐ మైండ్ ట్రీ, ఎం అండ్ ఎం, ఎథేర్ మోటార్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగియగా.. కోల్ ఇండియా, హీరోమోటో కార్ప్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలతో సరిపెట్టుకున్నాయి. ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు పలు అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనికి తోడు మార్కెట్ ర్యాలీ విపరీంగా ఉన్న సమయంలో మదుపర్లలలో కొంత ఆందోళన నెలకొంది. ముఖ్యంగా షేర్లు కొనుగోలు జరిగే సమయంలో ప్రతికూల వార్తలు ఇబ్బందే పెట్టే అవకాశం ఉందని భావించే ఇన్వెస్టర్లు కొనుగోలు, అమ్మకాల సమయాల్లో ఆచితూచి వ్యవహిరస్తుంటారు. ఫలితంగా ఫిబ్రవరి 12న మార్కెట్లు నష్టాలతో ముగిశాయని స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
శుభ ముహూర్తాల వేళ పసిడి ప్రియులకు ఊరట!
Gold Rate today : దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతకు ముందు పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో పవిత్రమైన మాఘమాసం ప్రారంభమైంది. శుభ ముహుర్తాల వేళ బంగారం ధరల్లో పెరుగుదల లేకపోవడం కొనుగోలుదారులకు కలిసొచ్చే అంశం. హైదరాబాద్‌తోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు (ఫిబ్రవరి 12) బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,700 వద్ద ఉండగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.62,950 వద్ద ఉంది. ఇతర నగరాల్లో ఇలా.. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,700 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.62,950 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.58,300లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.63,600 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,850, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.63,100 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.57,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.62,950 వద్ద స్థిరంగా ఉంది. -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 43 పాయింట్లు పుంజుకుని 21,830 వద్దకు చేరింది. సెన్సెక్స్ 125 పాయింట్లు లాభపడి 71,724 వద్ద ట్రేడవుతోంది. నేడు (సోమవారం) జనవరి నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ డేటా, డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) విడుదల కానున్నాయి. మరుసటి మంగళవారం(ఫిబ్రవరి 13న) అమెరికా సీఐపీ ద్రవ్యోల్బణం వెల్లడి కానుంది. ఫిబ్రవరి 14న(బుధవారం) భారత్‌తో పాటు బ్రిటన్ హోల్‌సేల్ ద్రవ్యోల్బణ డేటా, అమెరికా రిటైల్ అమ్మకాల గురువారం విడుదల కానున్నాయి. వీటితో పాటు పలు దేశాలు ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన, పారిశ్రాకోత్పత్తి డేటాను వెల్లడించనున్నాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబింపజేసే ఈ స్థూల ఆర్థిక డేటా వెల్లడి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది. ఎఫ్ఐఐలు శుక్రవారం ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.141.95 విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.421.87 కోట్లు విలువైన షేర్లను విక్రయించారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)