ఈ రోజు ఉదయం (గురువారం) లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిసాయి. సెన్సెక్స్ 227.56 పాయింట్ల లాభంతో 72050.38 వద్ద, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 21910.80 వద్ద నిలిచాయి. నేడు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా లాభాల్లోనే ముగిసాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), నేషనల్ పవర్ థర్మల్ కార్పొరేషన్ (NTPC), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) మొదలైన కంపెనీలు చేరాయి.
నష్టాలను చవి చూసిన కంపెనీల జాబితాలో ప్రధానంగా.. యాక్సిస్ బ్యాంక్, అపోలో హాస్పిటల్, హిందుస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ మొదలైనవి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment