Market
-
ట్రేడింగ్ సమయం పెంపు.. సెబీ చీఫ్ ఏమన్నారో తెలుసా..
దేశీయ స్టాక్మార్కెట్లో ట్రేడింగ్ సమయాన్ని పెంచాలనే సూచనపై మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కీలక వ్యాఖ్యలు చేసింది. సెబీ ఇప్పటి వరకు దీనిపై ఒక అభిప్రాయానికి రాలేదని సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బుచ్ అన్నారు. అయితే ఏ ఒక్కరి నుంచీ తమకు ట్రేడింగ్ సమయానికి సంబంధించి ప్రతిపాదన రాలేదన్నారు. స్టాక్ బ్రోకర్లు నిర్వహించిన ఒక సదస్సులో ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే బ్రోకింగ్ కంపెనీ యజమాన్యం మాత్రం వారివారి మదుపర్ల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలను సేకరించి ఫిబ్రవరి నెలాఖరులోపు తమ అభిప్రాయం చెబుతామన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ట్రేడింగ్ సమయాన్ని పొడిగించడం వల్ల కొన్ని నష్టాలు ఉంటాయని సెబీ చీఫ్ హెచ్చరించారు. ప్రస్తుతం సెబీ వద్ద ఉన్న మౌలిక సదుపాయాలతో ట్రేడింగ్ సమయాన్ని పెంచడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఒకవేళ ట్రేడింగ్ సమయం పెంచితే ఈక్విటీ మార్కెట్లకు, కమోడిటీస్ మార్కెట్‌కు తేడా లేకుండా పోతుందన్నారు. ప్రస్తుతం ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈక్విటీ మార్కెట్ ట్రేడింగ్ జరుగుతోంది. -
సాక్షి మనీ మంత్ర : లాభాల్లో దేశీయ స్టాక్ సూచీలు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభ సమయానికి బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభ మయ్యాయి. కొద్ది సేపటికే లాభాల్లోకి జారుకున్నాయి. ఇలా ఒడిదుడుకుల మధ్య ఉదయం 9.50 గంటల సమయానికి స్టాక్ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 152 పాయింట్లతో 71292 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 21576 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. ఇక టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎథేర్ మోటార్స్, ఎం అండ్ ఎం, ఓఎన్జీసీ, రిలయన్స్, అదానీ పోర్ట్స్, సిప్లా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. లార్సెన్, టైటాన్ కంపెనీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎయిర్టెల్, అపోలో హాస్పిటల్, ఎల్ టీఐ మైండ్ ట్రీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పడగొట్టిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ
ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో బజాజ్ ద్వయం, ఐటీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫెడరల్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి(బుధవారం)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా స్టాక్ సూచీలు మంగళవారం ఒక శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 802 పాయింట్లు నష్టపోయి 71,140 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 215 పాయింట్లు క్షీణించి 21,522 వద్ద నిలిచింది. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అమ్మకాల ఒత్తిడితో రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 866 పాయింట్లు క్షీణించి 71,076 వద్ద, నిఫ్టీ 236 పాయింట్లు పతనమై 21,502 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, రియల్టీ, మీడియా షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఎఫ్ఎంసీజీ, యుటిలిటీ, పారిశ్రామిక రంగాల షేర్లలో విక్రయాలు నెలకొన్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు 0.53%, 0.18% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,971 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1003 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్ పాలసీ వెల్లడికి ముందు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇతర ముఖ్యాంశాలు... జీవితకాల గరిష్ట స్థాయి (రూ.2,918) వద్ద రిలయన్స్ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.2815 వద్ద స్థిరపడింది. మంగళవారం ట్రేడింగ్‌లో 7% ర్యాలీ చేసింది. మరో అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలోనూ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీంతో ఈ ప్రైవేట్ రంగ దిగ్గజం దాదాపు 1% నష్టపోయి రూ.1444 వద్ద ముగిసింది. ► క్యూ3 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడంతో బజాజ్ ఫైనాన్స్ షేరు 5% నష్టపోయి రూ.6,815 వద్ద నిలిచింది. షేరు 5% క్షీణతతో మార్కెట్ విలువ రూ. 22,984 కోట్లు హరించుకుపోయి రూ.4.21 లక్షల కోట్లకు దిగివచ్చింది. బజాజ్ ఫైనాన్స్ పతనంతో ఇదే గ్రూప్ చెందిన బజాజ్ ఫిన్సర్వ్ షేరూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.1591 వద్ద నిలిచింది. ► ఐటీసీ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడంతో షేరు 3% నష్టపోయి రూ.438 వద్ద నిలిచింది. ►లిస్టింగ్ రోజే ఈప్యాక్ డ్యూరబుల్ షేరు 10% నష్టపోయింది. ఇష్యూ ధర (రూ.230)తో బీఎస్ఈలో 2% డిస్కౌంట్‌తో రూ.225 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 11% పతనమై రూ.206 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 10% నష్టంతో రూ.208 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,990 కోట్లుగా నమోదైంది. ► మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా మోటార్స్–డీవీఆర్‌తో కలుపుకొని టాటా మోటార్స్ కంపెనీ మారుతీ సుజుకీని అధిగమించి అటో రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. బుధవారం టాటా మోటార్స్ షేరు 2% పెరిగి రూ.859 వద్ద, టాటా మోటార్స్–డీవీఆర్ షేరు 1.63% లాభపడి రూ.573 వద్ద ముగిశాయి. ► బీఎల్ఎస్ ఈ–సర్విసెస్ ఐపీఓకు తొలిరోజు 15.63 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.37 కోట్ల షేర్లను జారీ చేయగా 21.41 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. రిటైల్ కోటా 49.రెట్లు, సంస్థాగతేతర విభాగం 29.66 రెట్లు, క్యూబీఐ కోటా 2.19 రెట్లు సబ్‌స్రై్కబ్ అయ్యాయి. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. నిఫ్టీ 211 పాయింట్ల నష్టంతో 21,527కు చేరింది. సెన్సెక్స్ 786 పాయింట్లు తగ్గి 71,183 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, ఎస్బీఐ, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా పవర్‌గ్రిడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, సన్‌ఫార్మా, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర గత 24 గంటల్లో 0.15 శాతం పెరిగి 82.52 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ)’ సోమవారం రూ.110 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐ)’ సైతం రూ.3,221.34 కోట్ల విలువ చేసే షేర్లను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
లాభాలతోనే శుభారంభం పలికిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 150.28 పాయింట్ల లాభంతో 72091.85 వద్ద, నిఫ్టీ 59.95 పాయింట్ల లాభంతో 21797.55 వద్ద ముందుకు సాగుతున్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), రిలయన్స్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, బిర్లాసాఫ్ట్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), ఐటీసీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: బడ్జెట్ ర్యాలీ.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి. రానున్న బడ్జెట్ నేపథ్యంలో మదుపర్లు మార్కెట్లో అధికమొత్తంలో షేర్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 387.45 పాయింట్లు పుంజుకుని 21,740.05కు చేరింది. సెన్సెక్స్ 1,203.29 పాయింట్లు లాభపడి 71,903.96 వద్ద ట్రేడింగ్ ముగించింది. మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024–25 ప్రభావిత అంశాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్య పాలసీ నిర్ణయాలు ఈ వారం మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వాహన విక్రయ డేటా, అదే నెలకు సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్నాయి. దేశీయ కార్పొరేట్ డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(జనవరి 30న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(జనవరి 31)రోజున ప్రకటిస్తారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టినట్లయితే ఈ ఏడాదిలో మూడు దఫాలు వడ్డీరేట్ల కోత ఉంటుందని గతేడాది డిసెంబర్లో పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ సంకేతాలిచ్చింది. ఈ దఫా ఫెడ్ కీలకవడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయి (5.25 – 5.50 వద్ద) యథాతథంగా కొనసాగవచ్చు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. యూఎస్ జీడీపీ అంచనాలకు మించి నమోదైన నేపథ్యంలో మార్కెట్ వర్గాలు ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలను నిశీతంగా పరిశీలించే వీలుంది. ఫెడ్ పాలసీ తర్వాత దలాల్ స్ట్రీట్ వర్గాలు అత్యంత ఆస్తకిగా ఎదురుచూసే మరో కీలక ఘట్టం బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్ 2024–25 ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజాకర్షక బడ్జెట్ ఉండొచ్చనేది అత్యధిక వర్గాల అంచనా. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అమ్మకాలను కట్టడి చేసేందుకే చైనా కఠిన నిర్ణయాలు..
స్టాక్మార్కెట్లో ఒడిదొడుకులు సహజం. ఏదైనా అనిశ్చిత పరిస్థితుల్లో మార్కెట్లు మరింత ఎక్కువగా ఊగిసలాడుతాయి. అయితే మార్కెట్లో నిత్యం భారీగా అమ్మకాలపర్వం కొనసాగితే ఆ దేశ ఆర్థికవ్యవస్థకు నష్టం జరుగుతుంది. దాంతో ఎక్స్ఛేంజ్ రెగ్యులేటరీలు కొత్త నిబంధనలు తీసుకొస్తాయి. ఫలితంగా కొంత నష్టాన్ని అరికట్టేలా చర్యలు తీసుకుంటాయి. తాజాగా చైనా మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు స్టాక్ మార్కెట్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. చైనా వరుస అమ్మకాల ఒత్తిడిని కట్టడి చేసేందుకు ఏర్పాట్లు చేసింది. కొవిడ్ అనంతరం అక్కడి మార్కెట్ వెళ్లిన జీవనకాల గరిష్ఠాల నుంచి క్రమంగా చైనా, హాంకాంగ్ మార్కెట్లలో ఆరు ట్రిలియన్ డాలర్ల సంపదను మదుపర్లు విక్రయించి దేశానికి షాక్ ఇచ్చారు. ఈ తరుణంలో దేశంలోని ఆర్థిక నిపుణులు సలహా మేరకు అక్కడి మార్కెట్ రెగ్యులేటర్లు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నాయి. ఇందులో భాగంగా చైనా కొత్త నిబంధనలు అమలు చేయనుంది. షార్ట్ సెల్లింగ్‌కు సంబంధించి ‘చైనా సెక్యూరిటీస్ రెగ్యులేటరీ కమిషన్ (సీఎస్ఆర్సీ)’ పరిమితులు విధించింది. ఈ నిబంధనలు ఈరోజు నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ‘రెస్ట్రిక్టెడ్ స్టాక్స్’ లిస్ట్‌లో ఉన్న షేర్లను ఇతరులకు అప్పుగా ఇచ్చేలా గతంలో ఉన్న నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు సీఎస్ఆర్సీ తెలిపింది. దీనిపై మరిన్ని షరతులను మార్చి మూడోవారంలో తెలియజేయనున్నట్లు ప్రకటించింది. ఇదీ చదవండి: అమెరికా వార్నింగ్ ఇచ్చినా ఒకేసారి మూడు ఉపగ్రహాలు ప్రయోగించిన దేశం..! చైనా వృద్ధి రేటు చాలా ఏళ్లపాటు నెమ్మదిగా ఉంటుందనే అంచనాలు వస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఆ దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించిన స్థిరాస్తి రంగం ప్రస్తుతం దారుణ పరిస్థితుల్లో ఉన్నట్లు తెలిసింది. అక్కడి స్టాక్ మార్కెట్ మదుపర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థను ఎలాగైనా పటిష్ట పరుచుకోవాలని భావించిన ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకున్నట్లు తెలిసింది. -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన సూచీలు
వారాంతంలో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు (సోమవారం) శుభారంభం పలికాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 281.58 పాయింట్ల లాభంతో 70982.10 వద్ద, నిఫ్టీ 93.55 పాయింట్ల లాభంతో 21446.15 వద్ద కొనసాగుతోంది. నేడు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా లాభాల్లో సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం అమెరికా మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. దీంతో ఎస్ అండ్ పీ ఐదు రోజుల రికార్డు పరుగులకు బ్రేక్ పడింది. డౌజోన్స్ 0.2 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 0.1 శాతం, నాస్డాక్ 0.4 శాతం తగ్గింది. అమెరికా జీడీపీ 3.3 శాతం వార్షిక రేటుతో క్యూ4లో ఊహించిన దాని కంటే వేగంగా వృద్ధి చెందుతుంది. US ద్రవ్యోల్బణం డిసెంబర్లో స్వల్పంగా పెరిగింది. కానీ వార్షిక ద్రవ్యోల్బణం 3 శాతం తక్కువ కావడం గమనార్హం. నేడు ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్ నిక్కీ 0.46 శాతం లాభపడగా, టో పేక్స్ దాదాపు 1 శాతం ర్యాలీ చేసింది. గిఫ్ట్ నిఫ్టీ భారతీయ మార్కెట్లకు సానుకూల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఎర్ర సముద్రంలో క్షిపణి దాడి తర్వాత సరఫరా ఆందోళనల మధ్య ముడి చమురు ధరలు పెరిగాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC), పంజాబ్ నేషనల్ బ్యాంక్, HDFC బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైనవి ఉన్నాయి. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, ఐటీసీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, సింజీన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల్లో సాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రియల్టీలోకి తగ్గిన విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి గతేడాది (2023లో) 2.73 బిలియన్ డాలర్ల మేర విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 30 శాతం తగ్గాయి. 2022లో 3.96 బిలియన్ డాలర్లు వచ్చాయి. మరోవైపు, దేశీ సంస్థల పెట్టుబడులు రెట్టింపై 687 మిలియన్ డాలర్ల నుంచి 1.51 బిలియన్ డాలర్లకు పెరిగాయి. మొత్తం మీద 2023లో రియల్ ఎస్టేట్‌లోకి సంస్థాగత పెట్టుబడులు 12 శాతం క్షీణించి 4.9 బిలియన్ డాలర్ల నుంచి 4.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. విదేశీ ఫండ్స్ ఆచితూచి వ్యవహరించడం వల్ల పెట్టుబడులు మందగించినట్లు వెస్టియన్ సీఈవో శ్రీనివాస రావు తెలిపారు. ‘రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్‌పై అనిశ్చితి నెలకొన్నప్పటికీ 2023లో పెట్టుబడులు భారీగానే వచ్చాయి. భారత వృద్ధి గాథపై దేశీ ఇన్వెస్టర్లలో నెలకొన్న విశ్వాసం, వారి ఆశావహ దృక్పథం మార్కెట్‌ను నిలబెట్టింది‘ అని ఆయన పేర్కొన్నారు. 2023లో పెట్టుబడులు అయిదేళ్ల కనిష్టానికి తగ్గినా.. దేశీ ఎకానమీ మెరుగైన పనితీరు, ఇన్ఫ్రా రంగంలో ప్రతిపాదిత ప్రాజెక్టుల ఊతంతో 2024లో ఇన్వెస్ట్మెంట్లు మరింత పుంజుకోగలవని శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు. కొత్త పెట్టుబడి సాధనాల రాకతో భారతీయ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తోందని, దీంతో నిధుల అవసరం కూడా పెరుగుతోందని చెప్పారు. ఇలా పెట్టుబడులకు డిమాండ్ అధికంగా ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్లపై కూడా అధిక రాబడులు రావొచ్చని, అదే ఆలోచనతో ఇన్వెస్టర్లు రియల్టీలో మరిన్ని పెట్టుబడులు పెట్టొచ్చని శ్రీనివాస రావు వివరించారు. 2019లో దేశీ రియల్ ఎస్టేట్‌లోకి సంస్థాగత పెట్టుబడులు 6.5 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. 2020లో 5.9 బిలియన్ డాలర్లు, 2021లో 4.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. -
ఫెడ్ పాలసీ, బడ్జెట్‌పై ఫోకస్
ముంబై: మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024 – 25 ప్రభావిత అంశాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్య పాలసీ నిర్ణయాలు ఈ వారం మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వాహన విక్రయ డేటా, అదే నెలకు సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్నాయి. దేశీయ కార్పొరేట్ డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. వీటితో పాటు సాధారణ అంశాలైన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి కదిలికలు, కమోడిటీ, క్రూడాయిల్ ధరలూ సూచీల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ట్రేడింగ్ 3 రోజులే జరిగిన గతవారంలో స్టాక్ సూచీలు ఒకశాతం నష్టపోయాయి. కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, ఎఫ్ఐఐల వరుస విక్రయాలు, మధ్యంతర బడ్జెట్, ఫెడ్ పాలసీ ప్రకటనకు అప్రమత్తతతో గతవారంలో నిఫ్టీ 270 పాయింట్లు, సెన్సెక్స్ 982 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ‘‘అమెరికా, బ్రిటన్ కేంద్ర బ్యాంకుల ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు స్థిరీకరణకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో పలు పెద్ద కంపెనీలు తమ క్యూ3 ఫలితాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. అమ్మకాలు కొనసాగితే సాంకేతికంగా నిఫ్టీకి దిగువున 21050 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 20,970 – 20,770 శ్రేణిలో మరో మద్దతు ఉంది. సానుకూల పరిణామాలు నెలకొని కొనుగోళ్లు జరిగితే ఎగువ స్థాయిలో 21,640 పాయింట్ల వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది.’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, టైటాన్, అదానీ పోర్ట్స్‌తో ఈ వారంలో మొత్తం 475 కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. వీటితో పాటు ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, బీపీసీఎల్, అదానీ టోటల్ గ్యాస్, కొచి్చన్ షిప్‌యార్డ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, పిరమిల్ ఫార్మా, స్ట్రైడ్స్ ఫార్మా, వోల్టాస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, డాబర్ మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక డేటాపై దృష్టి కేంద్ర గణాంకాల శాఖ డిసెంబర్ నెలకు సంబంధించి ద్రవ్య లోటు, మౌలిక రంగ ఉత్పత్తి గణాంకాలను బుధవారం వెల్లడించనుంది. మరుసటి రోజు ఫిబ్రవరి ఒకటిన(గురువారం) ఆటో కంపెనీలు తమ జనవరి నెల వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. అదే రోజున తయారీ రంగ పీఎంఐ డేటా వెల్లడవుతుంది. వారాంతాపు రోజున (శుక్రవారం) జనవరి 26తో ముగిసిన ఫారెక్స్ రిజర్వ్ డేటాను ఆర్బీఐ విడుదల చేస్తుంది. వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప చేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపగలవు. రెండు లిస్టింగులు, ఒక ఐపీఓ ఇదే వారంలో ఇటీవల ఇష్యూలను పూర్తి చేసుకున్న ఈప్యాక్ డ్యూరబుల్ జనవరి 30న, మరుసటి రోజు (31న)నోవా ఆగ్రిటెక్ కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. బీఎల్ఎస్ ఈ–సరీ్వసెస్ పబ్లిక్ ఇష్యూ బుధవారం ప్రారంభమై ఫిబ్రవరి ఒకటిన ముగుస్తుంది. అందరి చూపు ఫెడ్ సమావేశం పైనే అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(జనవరి 30న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(జనవరి 31)రోజున ప్రకటిస్తారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టినట్లయితే ఈ ఏడాదిలో మూడు దఫాలు వడ్డీరేట్ల కోత ఉంటుందని గతేడాది డిసెంబర్లో పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ సంకేతాలిచ్చింది. ఈ దఫా ఫెడ్ కీలకవడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయి (5.25 – 5.50 వద్ద) యథాతథంగా కొనసాగవచ్చు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. యూఎస్ జీడీపీ అంచనాలకు మించి నమోదైన నేపథ్యంలో మార్కెట్ వర్గాలు ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలను నిశీతంగా పరిశీలించే వీలుంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతుడంతో భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ జనవరి 25వ తేదీ నాటికి రూ.24,700 కోట్ల షేర్లను విక్రయించారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్లో రూ.17,120 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అమెరికా బాండ్లపై రాబడులు ఆందోళనలను కలించే అంశమే కాకుండా నగదు మార్కెట్లో అమ్మకాలను ప్రేరేపిస్తుందని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వీకే విజయ్ కుమార్ కుమార్ తెలిపారు. ఆటో, ఆటో ఉపకరణాలు, మీడియా ఎంటర్టైన్మెంట్, ఐటీ షేర్లను విక్రయించారు. ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, ఎంపిక చేసుకున్న ఫైనాన్స్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. మధ్యంతర బడ్జెట్‌పై ఆసక్తి ఫెడ్ పాలసీ తర్వాత దలాల్ స్ట్రీట్ వర్గాలు అత్యంత ఆస్తకిగా ఎదురుచూసే మరో కీలక ఘట్టం బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్ 2024–25 ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజాకర్షక బడ్జెట్ ఉండొచ్చనేది అత్యధిక వర్గాల అంచనా. ముఖ్యంగా ద్రవ్య పరమైన కార్యాచరణ, మూలధన ఆధారిత పెట్టుబడుల విస్తరణ, గ్రామీణాభివృద్ధికి ప్రణాళికలకు మధ్యంతర బడ్జెట్ అధిక ప్రాధ్యాన్యత ఇవ్వొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఏదిఏమైనా మార్కెట్‌కు అనుకూలంగా నిర్ణయాలుంటే సూచీలు, షేర్లు ఇప్పటికే భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో లాభాలు పరిమితంగా ఉండొచ్చు. ప్రతికూల నిర్ణయం వెలువడితే మరింత లాభాల స్వీకరణ చోటుచేసుకొని సూచీలు పతనాన్ని చవిచూడొచ్చు. -
పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..!
స్టాక్‌మార్కెట్ అంటేనే లాభాలకోసం ఎంచుకునే ఒక మార్గం. షేర్లు లేదా ఆఫ్షన్స్ కొనుగోలు చేసినా విక్రయించినా.. ఏదైనాసరే లాభాలే ప్రధానం. అయితే లాభం ఉండదనీ, మనం పెట్టిన డబ్బు తిరిగిరాదని తెలిసీ ఎవరైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారా..! కానీ అందరూ ప్రతిసారి స్వలాభం కోసమే ఆలోచించరు. కాసింత సామాజిక స్పృహ ఉన్నవాళ్లు మాత్రం రూపాయి రాకపోయినా సమాజానికి ఖర్చు చేసేవాళ్లున్నారు. అలాంటి వారికోసం స్టాక్మార్కెట్లో కొత్త విభాగాన్ని ప్రారంభించారు. అదే ‘సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్’. అందులో షేర్లు కొనడం ద్వారా ఎవరైనా విరాళాలు ఇవ్వచ్చు. దానిద్వారా ఇటీవల జెరోధా సంస్థ కోటి రూపాయలు పెట్టింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. వ్యాపార సంస్థలు భవిష్యత్తులో కంపెనీ లాభాల కోసం పెట్టుబడులు సమీకరించేందుకు ఐపీఓకి వెళ్తూంటాయి. ఇప్పుడు సేవాసంస్థలు కూడా తమకు కావలసిన నిధుల కోసం స్టాక్ మార్కెట్‌కి వెళ్లొచ్చు. బెంగళూరులోని శ్రీ గురువాయూరప్పన్ భజన్ సమాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఉన్నతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ యువతకు వృత్తి విద్యల్లో శిక్షణ ఇస్తుంటుంది. కొత్తగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పదివేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వాళ్లు ఉద్యోగాల్లో చేరేలా సహకరించేందుకు ఒక ప్రాజెక్టును సిద్ధం చేసింది. దానికి దాదాపు రెండు కోట్ల రూపాయల దాకా నిధులు అవసరం అయ్యాయి. దాంతో ఆ సంస్థ సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో నమోదుచేసుకుంది. ఎవరినీ నోరు తెరిచి అడగాల్సిన అవసరం లేకుండా ఇరవై రోజుల్లోనే దానికి రూ.కోటీ 80 లక్షలు సమకూరింది. జెరోధా సంస్థ కోటి రూపాయలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారు ఆశిష్ కచోలియా రూ.30లక్షలు, మరో ఇద్దరు చెరో రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్రత్యేకంగా ఎందుకంటే.. ప్రత్యక్షంగా దాతలను అభ్యర్థించో, సోషల్ క్రౌడ్ ఫండింగ్ ద్వారానో ప్రభుత్వేతర, లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలు తమ సేవలకు అవసరమైన నిధులను సేకరిస్తుంటాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎందుకనే అనుమానం రావొచ్చు. పైన తెలిపిన కార్యక్రమాలకు చాలా సమయం పట్టొచ్చు, ఆశించిన మొత్తం అందకపోవచ్చు. చాలామంది దాతలకు తాము ఇచ్చే డబ్బు దుర్వినియోగం అవుతుందేమోననే సందేహం ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ సమాధానంగా సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ని ఎంచుకుంటున్నారు. ఇది దాతలకీ స్వచ్ఛంద సంస్థలకీ మధ్య వారధిలా పనిచేస్తుంది. తొలి సంస్థ ‘ఉన్నతి ఫౌండేషన్’.. మన దేశంలో 2019-20 సంవత్సరపు బడ్జెట్లో సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రతిపాదన తెచ్చారు. సామాజిక అభివృద్ధికి పాటుపడే సంస్థలకు పెట్టుబడి మార్కెట్ అందుబాటులో ఉండాలన్నదే దీని ఆశయం. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఎక్స్ఛేంజిల్లో అనుమతులు పొంది ఇటీవలే ఆచరణలోకి వచ్చింది. దీని ద్వారా నిధులు పొందిన తొలి సంస్థ ఉన్నతి ఫౌండేషన్. లాభాపేక్ష లేని సంస్థలూ(ఎన్పీఓ), లాభాపేక్ష ఉన్న సామాజిక సంస్థలూ(ఫర్ ప్రాఫిట్ సోషల్ ఎంటర్ప్రైజెస్) ఇందులో నమోదుచేసుకోవచ్చు. పేదరికం, పోషకాహారలోపం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, పర్యావరణ సమస్యలు... తదితర రంగాల్లో సేవలు అందించే సంస్థలు దీన్ని ఉపయోగించుకోవచ్చు. డబ్బు ఇచ్చిన దాతల ఖాతాల్లో జీరోకూపన్ జీరో ప్రిన్సిపల్ పేరుతో బాండ్లను జమచేస్తారు. అవి రికార్డు కోసమే తప్ప మరే లాభమూ ఉండదు. వ్యాపార సంస్థలు ఐపీఓకి వెళ్లినట్లే సేవాసంస్థలు నిధుల సేకరణకు వెళ్తాయన్న మాట. లాభాలు ఇవే.. ఈ విధానం వల్ల అటు దాతలకీ ఇటు లబ్ధిదారులైన సంస్థలకీ ఎన్నో లాభాలున్నాయి. తెలిసిన దాతలనే మళ్లీ విరాళాల కోసం అడగలేక ఇబ్బంది పడే ఎన్జీఓలకు కొత్త దాతలు లభిస్తారు. బహిరంగంగా జరిగే లావాదేవీలు కాబట్టి ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొందుతారు. డబ్బు వినియోగంలో ఎక్కడికక్కడ లెక్కలు పక్కాగా ఉంటాయి. ఏ ప్రయోజనానికి ఖర్చు పెడుతున్నారో చెప్పాలి, గడువు లోపల ఖర్చు పెట్టాలి, ఏటా ఆడిట్ నివేదికలు సమర్పించాలి... కాబట్టి లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయి. దాతలు తామిచ్చిన ప్రతి రూపాయీ సద్వినియోగమైందని నిర్ధారించుకోవచ్చు. సామాజిక మార్పులో భాగస్వాములమయ్యామన్న తృప్తి ఉంటుంది. స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల పట్ల నమ్మకమూ పెరుగుతుంది. ఆయా స్వచ్ఛంద సంస్థలూ మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తాయి. నిధులకు ఇబ్బంది ఉండదు కాబట్టి సేవల పరిధినీ విస్తరించుకోవచ్చు. ఇదీ చదవండి: 2024 పారిశ్రామిక పద్మాలు.. వీరే! అయితే యాభై లక్షలు, అంతకన్నా ఎక్కువ మొత్తం అవసరమైనప్పుడే ఈ విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దాతలు కనిష్ఠంగా పదివేల నుంచి విరాళం ఇవ్వచ్చు. దాతలకు పన్ను మినహాయింపు వెసులుబాటు ఉంటుంది. -
సాక్షి మనీ మంత్ర: మార్కెట్లో తీవ్ర ఒడిదొడుకులు.. నష్టాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయ. మార్కెట్ ప్రారంభం నుంచి ముగిసే సమయం వరకు నష్టాల్లో ట్రేడయింది. నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 21,378కు చేరింది. సెన్సెక్స్ 359 పాయింట్లు దిగజారి 70.700వద్ద ట్రేడింగ్ ముగించింది. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ఎఫ్ఐఐలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. దాంతో ఎఫ్ఐఐలు ఈక్విటీ మార్కెట్‌నుంచి భారీ మొత్తంలో స్టాక్‌లు విక్రయిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటు చైనా రిజర్వ్ రేషియో రిక్వైర్మెంట్స్(ఆర్ఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు కట్ చేసింది. దాంతో ఎఫ్ఐఐలు భారీగా చైనాకు తరలిపోతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఫలితంగా దేశీయ మార్కెట్లో కొంత అనిశ్చితి నెలకొంటుందని భావిస్తున్నారు. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్‌ఫిన్‌సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, టైటాన్, టాటా మోటార్స్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. టెక్ మహీంద్రా, భారతీఎయిర్‌టెల్, ఐటీసీ, విప్రో, నెస్లే, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
నిన్న లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 218.05 పాయింట్లు లేదా 0.20 శాతం నష్టంతో 70861.88 వద్ద, నిఫ్టీ 49.10 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో.. 21404.85 కొనసాగుతున్నాయి. నిన్న లాభాలతో ముగిసిన నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈ రోజు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, కెనరా బ్యాంక్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, హిందాల్కో, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరాయి. టెక్ మహీంద్రా, టీవీఎస్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, HCL టెక్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, లారస్ ల్యాబ్స్ లిమిటెడ్, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మొదలైన కంపీనీలు నష్టాల బాట పట్టాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: భారీగా పుంజుకున్న మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీగా పుంజుకున్నాయి. మంగళవారం అమ్మకాలకు ఆసక్తి చూపిన మదుపర్లు బుధవారం కొనుగోలు వైపు మళ్లారు. నిఫ్టీ 227 పాయింట్లు లాభపడి 21,465కు చేరింది. సెన్సెక్స్ 689 పాయింట్లు ఎగబాకి 71,060 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిండ్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ షేర్లు భారీ లాభాల్లోకి చేరుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర గత 24 గంటల్లో స్వల్పంగా పెరిగి 79.59 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపరులు (FIIs)’ మంగళవారం రూ.3,115.39 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపరులు (DIIs)’ రూ.214.40 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. -
బీమా రంగంలో మరిన్ని విలీనాలు, కొనుగోళ్లు
న్యూఢిల్లీ: బీమా రంగం నుంచి రానున్న కాలంలో మరికొన్ని కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్లలో లిస్ట్ కావొచ్చని, విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు చోటు చేసుకుంటాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ అంచనా వేసింది. 2022–23లో బీమా రంగంలో రూ.1,930 కోట్ల లావాదేవీలు నమోదైనట్టు తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. భారత్ మెరుగైన వృద్ధి అవకాశాలు బీమా కంపెనీల నిధుల సమీకరణకు మద్దతునిస్తోందని, దీంతో బలహీన అండర్ రైటింగ్ లాభదాయకతను అవి అధిగమించగలుగుతున్నాయని తెలిపింది. 2022–23లో బీమా రంగం చెల్లించిన మూలధనం రూ.75,300 కోట్లకు పెరిగిందని, 2021–22 నాటికి ఇది రూ.73,400 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 2.6 శాతం వృద్ధి చెందింది. ఇదే తరహాలో మరిన్ని విలీనాలు, కొనుగోళ్లు, ఐపీవోలు వస్తాయని అంచనా వేస్తున్నట్టు, దీంతో భారత బీమా రంగం క్యాపిటల్ అడెక్వెసీ, ఆర్థిక సౌలభ్యత మెరుగుపడుతుందని తెలిపింది. విదేశీ బీమా సంస్థలు భారత బీమా మార్కెట్లో తమ పెట్టుబడులను కొనసాగిస్తాయని, ఇప్పటికే భారత కంపెనీలతో ఉన్న జాయింట్ వెంచర్లలో వాటా పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తాయని అంచనా వేసింది. విదేశీ బీమా సంస్థల భాగస్వామ్యంతో క్యాపిటల్ అడెక్వెసీ, ఆర్థిక సౌలభ్యం, పరిపాలనా ప్రమాణాల పరంగా ప్రయోజనాలు లభిస్తాయని వివరించింది. భారత బీమా సంస్థల్లో విదేశీ బీమా కంపెనీలు వాటాలు పెంచుకోవడం మార్కెట్‌కు క్రెడిట్ పాజిటివ్‌గా పేర్కొంది. మొత్తం మీద 2022–23లో బీమా రంగం లాభదాయకత సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. క్లెయిమ్‌లు పెరిగిపోతుండడంతో సాధారణ బీమా రంగం ఫలితాలు ప్రతికూలంగానే ఉన్నట్టు తెలిపింది. స్థిరమైన ధరల పెరుగుదలతో ఈ రంగం అండర్‌రైటింగ్ పనితీరు, లాభదాయకత గణనీయంగా మెరుగుపడుతుందని అంచనా వేసింది. -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం భారీ నష్టాలతో ముగిసిన బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం కూడా నష్టాలతోనే సెషన్‌ను ప్రారంభించాయి. ఉదయం 9:26 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 160.80 పాయింట్లు లేదా 0.23 శాతం క్షీణించి 70,370.55 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 22.60 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో 21,216.20 వద్ద కొనసాగుతున్నాయి. హిందాల్కో, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్బీఐ, కోల్ఇండియా షేర్లు టాప్ గెయినర్స్‌గా, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటర్‌కార్ప్, ఏషియన్ పెయింట్స్, ఐచర్ మోటర్స్, గ్రాసిమ్ షేర్లు టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
8.50 లక్షల కోట్ల సంపద ఆవిరి
సెన్సెక్స్ ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్ఈలో రూ.8.50 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.365 లక్షల కోట్లకు దిగివచ్చింది. ముంబై: దలాల్ స్ట్రీట్‌లో మంగళవారం అమ్మకాల మోత మోగింది. అధిక వెయిటేజీ షేర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు(3%), రిలయన్స్ ఇండస్ట్రీస్(2%), ఎస్బీఐ(4%) షేర్లు పతనంతో పాటు పశ్చిమాసియాలోని యుద్ధ ఉద్రికత్తలు ఇందుకు ప్రధాన కారణమయ్యాయి. ఇటీవల విడుదలైన కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడమూ సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచింది. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. గడిచిన 3 నెలల్లో భారీగా ర్యాలీ చేసిన చిన్న, మధ్య తరహా షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ 3శాతం చొప్పున నష్టపోయాయి. పెరిగి పడిన మార్కెట్... మూడు రోజుల వరుస సెలవుల తర్వాత తెరుచుకున్న మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 444 పాయింట్లు పెరిగి 71,868 వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు బలపడి 21,717 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. కానీ, కాసేపటికే అమ్మకాల ఒత్తిడి మొదలైంది. ఒక దశలో సెన్సెక్స్ 1,189 పాయింట్లు క్షీణించి 70,235 వద్ద, నిఫ్టీ 397 పాయింట్లు దిగివచ్చి 21,193 వద్ద ఇంట్రాడే కనిష్టాలను దిగివచ్చాయి. చివరికి సెన్సెక్స్ 1,053 పాయింట్లు నష్టపోయి 70,371 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 330 పతనమై 21,242 వద్ద స్థిరపడ్డాయి. జనవరి 17 తర్వాత సూచీలకు ఇది భారీ పతనం. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లూ డీలా...! అమ్మకాల సునామీతో ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లు ఎరుపెక్కాయి. రంగాల వారీగా ఎన్ఎస్ఈలో మీడియా 13%, రియల్టీ 5%, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 4%, మెటల్, ఆయిల్‌అండ్‌గ్యాస్ 3%, బ్యాంక్ నిఫ్టీ 2%, ప్రైవేట్ రంగ బ్యాంక్ 2%, ఎఫ్ఎంసీజీ, ఆటో ఇండెక్సులు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. ఫార్మా సూచీ మాత్రమే 1.5% రాణించింది. ►నష్టాల ట్రేడింగ్‌లోనూ మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ లిస్టింగ్ సక్సెస్ అయ్యింది. ఇష్యూ ధర(రూ.418)తో పోలిస్తే బీఎస్ఈలో 11.24% ప్రీమియంతో రూ.465 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో 22% ఎగసి రూ.510 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభపడి దాదాపు లిస్టింగ్ ధర రూ.464 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.3,197 కోట్లుగా నమోదైంది. ►ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత సిప్లా షేరు రాణించింది. డిసెంబర్ క్వార్టర్లో నికర లాభం 32% వృద్ధి చెందినట్లు వెల్లడించడం కలసి వచ్చింది. బీఎస్ఈలో ఈ షేరు 7% పెరిగి రూ.1,409 వద్ద ముగిసింది. ►సోనీ గ్రూప్ 10 బిలియన్ డాలర్ల విలీన ఒప్పందం రద్దుతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేరు కుప్పకూలింది. బీఎస్ఈలో 10% నష్టంతో రూ.209 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో ఏకంగా 34% పతనమై రూ.152 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. చివరికి 33% నష్టంతో రూ.156 వద్ద స్థిరపడింది. ఒక దశలో షేరు ఇరు ఎక్సే్చంజీలో లోయర్ సర్క్యూట్‌ను తాకింది. షేరు భారీ క్షీణతతో కంపెనీకి రూ.7,300 కోట్ల నష్టం వాటిల్లింది. ►హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు పతనం ఆగడం లేదు. బీఎస్ఈలో 3.50% నష్టపోయి రూ.1428 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3.65% పతనమై రూ.1,425 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10.83 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు వరుస అయిదు రోజుల్లో 13% క్షీణించింది. -
సాక్షి మనీ మంత్ర: భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ మార్కెట్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 333 పాయింట్లు నష్టపోయి 21,238 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1,053 పాయింట్లు దిగజారి 70,370 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో సన్‌ఫార్మా, భారతిఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాన్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర గత 24 గంటల్లో 0.17 శాతం తగ్గి 79.92 డాలర్లకు చేరింది. ‘విదేశీ సంస్థాగత మదుపరులు (FIIs)’ శనివారం రూ.545.58 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపరులు (DIIs)’ సైతం రూ.719.31 కోట్ల విలువ చేసే వాటాలను అమ్మేశారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మూడో రోజు ముందుకు కదలని బంగారం - రూ.500 తగ్గిన వెండి
భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో స్వల్ప పెరుగుదలను నమోదు చేసి.. ఆ తరువాత వరుసగా తగ్గిన పసిడి ధరలు, గత మూడు రోజులుగా కదలిక లేకుండా నిశ్చలంగా ఉన్నాయి. ఈ రోజు గోల్డ్ రేటు ఏ రాష్ట్రంలో ఎలా ఉందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ రోజు హైదరాబాద్, విజయవాడలలో తులం బంగారం రేటు రూ. 57800 (22 క్యారెట్స్), రూ. 63050 (24 క్యారెట్స్)గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తుంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాజ్, బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతుంది. చైన్నైలో కూడా ఈ రోజు పసిడి ధరలు ఏ మాత్రం పెరగలేదు, కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ & 24 క్యారెట్స్ బంగారం ధరలు వరుసగా రూ. 58300, రూ. 63600గా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఇదీ చదవండి: భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేదు.. ఐక్యరాజ్య సమితిపై మస్క్ కీలక వ్యాఖ్యలు బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి ధరలు మాత్రం ఢిల్లీ, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో రూ. 500 తగ్గినట్లు తెలుస్తోంది. నిన్న, మొన్న స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈ రోజు తగ్గుముఖం పట్టాయి. -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయంలో సెన్సెక్స్ 520.55 పాయింట్ల లాభంతో 71868.20 వద్ద, నిఫ్టీ 158.90 పాయింట్ల లాభంతో 21716.70 వద్ద కొనసాగుతున్నాయి. నేడు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా లాభాల్లోనూ ముందు వెళుతున్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా.. సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), భారతి ఎయిర్టెల్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా పవర్ వంటి కంపెనీలు చేరాయి. ప్రధాన మంత్రి సోలార్ స్కీమ్ కారణంగా టాటా పవర్ ముందుకు దూసుకెళ్తోంది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, ఒబెరాయ్ రియల్టీ లిమిటెడ్, IDFC ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC), ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, HDFC బ్యాంక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల్లో సాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 22న సెలవు ప్రకటించడంతో ఈరోజు (జనవరి 20) దేశీయ స్టాక్ ఎక్ఛేంజీలను ట్రేడింగ్ కోసం తెరిచారు. దేశీయ స్టాక్ ఎక్ఛేంజీల సూచీలు ఈరోజు ట్రేడింగ్ సెషన్లో రికార్డు మార్క్‌లను తాకాయి. సెన్సెక్స్ 321.32 పాయింట్లు లేదా 0.45 శాతం లాభపడి 71,508.18 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ నిఫ్టీ 123.45 పాయింట్లు లేదా 0.58 శాతం ఎగిసి 21,585.70 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. కోల్ఇండియా, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజస్, కొటాక్ మహీంద్ర, ఐసీఐసీ బ్యాంకు షేర్లు మంచి లాభాలతో టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. హెచ్‌యూఎల్, టీసీఎస్, మహీంద్ర&మహీంద్ర, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ షేర్ల నష్టాలను మూటకట్టకుని టాప్ లూజర్స్‌గా నిలిచాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: శనివారం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. సోమవారం సెలవు
దేశీయ స్టాక్ ఎక్ఛేంజీలు శనివారం ఓపెన్లోనే ఉన్నాయి. ముందుగా ఈరోజు కొద్ది సమయమే మార్కెట్లు పని చేస్తాయని ప్రకటించిన ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు రోజంతా మార్కెట్ ఓపెన్లోనే ఉండనున్నట్లు తెలిపాయి. అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపనకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో జనవరి 22న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడింగ్ జరగదని ఒక అధికారి తెలిపారు. దేశీయ మార్కెట్లు శనివారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 21698కు చేరింది. సెన్సెక్స్ 754 పాయింట్లు పుంజుకుని 71,941 వద్ద ట్రేడవుతోంది. ఎఫ్ఐఐలు శుక్రవారం రూ.3689.68 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. డీఐఐలు రూ.2638.46 కోట్లు షేర్లు కొనుగోలు చేశారు. అమెరికాలోని నాస్డాక్ 1.7 శాతం లాభాల్లో ముగిసింది. పదేళ్ల కాలపరిమితి ఉన్న యూఎస్ బాండ్ఈల్డ్ 2 బేసిస్పాయింట్లు తగ్గి 4.13 శాతానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ 0.29 శాతం తగ్గి 103.24 వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 78.88 యూఎస్ డాలర్ల వద్ద ఉంది. మిచిగాన్ యూనివర్సిటీ చేసిన సర్వేలో ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు వెల్లడైంది. ఇది మార్కెట్లకు కొంత ఊరట కలిగించే అంశంగా ఉంది. మార్కెట్లో ఇప్పటికే ఐటీస్టాక్ల ర్యాలీ కనబతుతోంది. దీనికితోడు బ్యాంకింగ్‌రంగ స్టాక్‌లు తోడ్పాటునందిస్తే మరింత దూసుకుపోయే అవకాశం ఉంది. కానీ ఇటీవల విడుదలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు మదుపర్లకు కొంత నిరాశ కలిగించాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇవాళ రాబోయే ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఫలితాలను అనుసరించి మార్కెట్ ర్యాలీ ఉండనుందని సమాచారం. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
హైదరాబాద్ ఐటీ సంస్థ రామ్ ఇన్ఫో నిధుల సమీకరణ
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐటీ సంస్థ రామ్ ఇన్ఫో లిమిటెడ్ భారీ నిధుల సమీకరణ ప్రణాళిక చేపట్టింది. ప్రాధాన్యతా షేర్ల కేటాయింపు ద్వారా రూ.62 కోట్ల నిధుల సమీకరణ ప్రణాళికకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ తాజాగా ప్రకటించింది. సేకరించిన నిధులను కంపెనీ అభివృద్ధి, నాయకత్వ విస్తరణ, జాతీయ, అంతర్జాతీయ విస్తరణ కోసం ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. టెక్నాలజీ, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న తమ అనుబంధ, జాయింట్ వెంచర్లలో భవిష్యత్తు పెట్టుబడి అవసరాలను తీర్చడం రామ్ ఇన్ఫో లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. "కంపెనీ ఆదాయం, స్థిరమైన వృద్ధిని మెరుగుపరచడానికి, సర్వీస్ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడానికి, భౌగోళిక పరిధిని విస్తరించడానికి ఈ వ్యూహాత్మక చర్య ఉద్దేశించినది" అని రామ్ ఇన్ఫో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. బలమైన ఆర్డర్లను, సర్వీస్ గ్రోత్‌ను పెంపొందించుకునేందుకు, తమ షేర్హోల్డర్లకు విలువను సృష్టించడానికి నిధుల సమీకరణ సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. -
బడ్జెట్ 2024.. ట్యాక్స్ డబ్బులు ఆదా చేసుకోవాలంటే...?
మార్కెట్ ఆల్‌టైమ్‌హైకి వెళ్లి ఊగిసలాడుతోంది. రానున్న యూనియన్ బడ్జెట్లో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది. పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులు ఉండబోతున్నాయి. బడ్జెట్ సెషన్లో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ట్యాక్స్ తగ్గించుకోవాలంటే ఎక్కడ మదుపుచేయాలి. స్టాక్‌మార్కెట్ పయనం ఏ విధంగా ఉంటుంది. బడ్జెట్ ప్రభావం కీలక మార్కెట్ సూచీలపై ఎలా ఉండబోతుంది. మదుపరులు ఎలాంటి స్ట్రాటజీలను అనుసరించాలో తెలుసుకోవడానికి ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, ఫిన్‌సేఫ్ ఇండియా వ్యవస్థాపకులు మ్రిన్ అగర్వాల్‌తో బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు మాట్లాడారు. ఈ వీడియోలో చూడండి. -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్ లాభాల ర్యాలీ కొనసాగింది. గడిచిన మూడు రోజుల నష్టాలకు బ్రేక్ వేస్తూ శుక్రవారం లాభాలతో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు అదే జోరును కొనసాగిస్తూ లాభాలతోనే ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 541.60 పాయింట్లు లేదా 0.76 శాతం లాభంతో 71,728.46 పాయింట్లకు చేరింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 176.40 పాయింట్లు లేదా 0.82 శాతం ఎగిసి 21,638.65 వద్ద ముగిసింది. ఓఎన్జీసీ, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టెక్‌మహీంద్ర, టాటా స్టీల్ షేర్లు మంచి లాభాలతో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్, దివిస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు షేర్లు భారీ నష్టాలతో టాప్ లూజర్స్ జాబితాలో చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)