Market
-
బడ్జెట్ 2024.. ట్యాక్స్ డబ్బులు ఆదా చేసుకోవాలంటే...?
మార్కెట్ ఆల్‌టైమ్‌హైకి వెళ్లి ఊగిసలాడుతోంది. రానున్న యూనియన్ బడ్జెట్లో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది. పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులు ఉండబోతున్నాయి. బడ్జెట్ సెషన్లో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ట్యాక్స్ తగ్గించుకోవాలంటే ఎక్కడ మదుపుచేయాలి. స్టాక్‌మార్కెట్ పయనం ఏ విధంగా ఉంటుంది. బడ్జెట్ ప్రభావం కీలక మార్కెట్ సూచీలపై ఎలా ఉండబోతుంది. మదుపరులు ఎలాంటి స్ట్రాటజీలను అనుసరించాలో తెలుసుకోవడానికి ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, ఫిన్‌సేఫ్ ఇండియా వ్యవస్థాపకులు మ్రిన్ అగర్వాల్‌తో బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు మాట్లాడారు. ఈ వీడియోలో చూడండి. -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్ లాభాల ర్యాలీ కొనసాగింది. గడిచిన మూడు రోజుల నష్టాలకు బ్రేక్ వేస్తూ శుక్రవారం లాభాలతో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు అదే జోరును కొనసాగిస్తూ లాభాలతోనే ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 541.60 పాయింట్లు లేదా 0.76 శాతం లాభంతో 71,728.46 పాయింట్లకు చేరింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 176.40 పాయింట్లు లేదా 0.82 శాతం ఎగిసి 21,638.65 వద్ద ముగిసింది. ఓఎన్జీసీ, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టెక్‌మహీంద్ర, టాటా స్టీల్ షేర్లు మంచి లాభాలతో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్, దివిస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు షేర్లు భారీ నష్టాలతో టాప్ లూజర్స్ జాబితాలో చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫలితాలు ఎలా ఉన్నా ఇవి మాత్రం..
దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు ఒక్కొక్కటిగా తమ మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. స్టాక్ ఫలితాలకు తగ్గట్టుగా మన పెట్టుబడి వ్యూహాన్ని మారుస్తుంటాం. అయితే కొన్ని రోజులుగా మార్కెట్‌ను అనుసరిస్తున్నవారు, కొత్తగా మార్కెట్లోకి వచ్చినవారు ఈ సమయంలో ఎలా స్పందించాలో నిపుణులు కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నారు. మన పోర్ట్‌ఫోలియోలోని కంపెనీలు వాటి ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తుందో ట్రాక్ చేయాలి. ఇది సాధారణంగా ముందుగానే షెడ్యూల్ చేస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇన్వెస్టర్ రిలేషన్స్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఫలితాల్లో కంపెనీలు తమ ఆదాయాలు, బ్యాలెన్స్ షీట్, క్యాష్‌ఫ్లో సహా దాని ఆర్థిక నివేదికలను ప్రకటిస్తాయి. స్టాక్‌కు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేముందు వాటిని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. ఈ నివేదికల వల్ల కంపెనీ పనితీరును సమీక్షించడానికి వీలువతుంది. కంపెనీలు ఫలితాలు విడుదల చేయడానికి ముందే ఆర్థిక నిపుణలు, విశ్లేషకులు తరచు సంస్థ పనితీరును గమనిస్తూ రిజల్ట్స్‌ను అంచనా వేస్తారు. ఈ అంచనాలతో వాస్తవ ఫలితాలను సరిపోల్చాలి. ఒకవేళ ఫలితాలు అంచనాలను మించి ఉంటే అది సానుకూలంగా పరిగణించవచ్చు. గతంలో కంపెనీ పనితీరు ఎలా ఉంది.. ఫలితాలు ప్రభావితం చేసే ఏవైనా ఆర్థిక అంశాలు ఉన్నాయో అర్థం చేసుకోవాలి. చాలా కంపెనీలు వాటి భవిష్యత్ పనితీరుపై మార్గదర్శకత్వం లేదా ఔట్‌లుక్‌ను విడుదల చేస్తాయి. సానుకూలంగా నివేదికలు అందించే కంపెనీల్లో స్టాక్ పెరుగుదల చూడవచ్చు. ఫలితాల వల్ల మార్కెట్ ఎలా స్పందిస్తుందో గమనించాలి. ఒక్కోసారి స్టాక్ ధర వేగంగా పడిపోవచ్చు..పెరగొచ్చు. స్టాక్ సంబంధించిన అన్ని అంశాలను గమనించాలి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులైతే స్టాక్ ధరలో హెచ్చుతగ్గులు అంతగా పట్టించుకోవద్దు. స్వల్పకాలిక మార్కెట్ కదలికల ఆధారంగా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఇదీ చదవండి: ఈసారైనా సెక్షన్ 80సీకు మోక్షం లభిస్తుందా..? ఒకే కంపెనీలో కాకుండా పోర్ట్‌ఫోలియో డైవర్సిఫై చేయడం ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏదైనా కంపెనీ అనుకున్న ఫలితాలు విడుదల చేయకపోయినా పోర్ట్‌ఫోలియో పెద్దగా నష్టాల్లోకి వెళ్లకుండా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు, లాభాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఫలితాల ఆధారంగా స్టాక్ అమ్మాలో, కొనాలో అనే నిర్ణయం తీసుకోవడానికి ముందు కంపెనీ భవిష్యత్తు పనితీరును పరిగణలోకి తీసుకోవాలి. -
సాక్షి మనీ మంత్ర: వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గడిచిన మూడు రోజుల నష్టాలకు బ్రేక్ వేస్తూ శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 21,614కు చేరింది. సెన్సెక్స్ 580 పాయింట్లు పుంజుకుని 71,766 వద్ద ట్రేడవుతోంది. ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐలు గడిచిన రెండురోజుల్లో భారీగా షేర్లను విక్రయించారు. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి రూ.9,901.56 కోట్లు విలువైన షేర్లు విక్రయించారు. డీఐఐలు రూ.5,977.12 కోట్లు విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. డాలర్ ఇండెక్స్ 103.38కు చేరింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 79.01 డాలర్లుగా ఉంది. అమెరికా మార్కెట్లోని నాస్డాక్ గురువారం 1.35 శాతం పెరిగింది. 10 కాలవ్యవధి ఉన్న యూఎస్ బాండ్ ఈల్డ్‌లు 3 బేసిస్ పాయింట్లు పెరిగి 4.14 శాతానికి చేరాయి. అమెరికాలోని జాబ్స్ డేటా ఆశించిన దానికంటే తక్కువగా నమోదైంది. పాకిస్థాన్ ఇరాన్ వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడుతోందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎర్ర సముద్రంలో చేలరేగుతున్న అల్లర్లతో అంతర్జాతీయంగా వాణిజ్యంపరంగా కొంత అనిశ్చితులు నెలకొన్నాయి. దానికితోడు పాకిస్థాన్ అంశం తోడైతే మార్కెట్లు మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇరుదేశాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు కొన్ని కథనాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య సంబంధాలపై కొమ్‌జాంగ్‌ఉన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల సంబంధాలపై కిమ్ భిన్న వైఖరి అవలంబించబోతున్నట్లు చెప్పారు. మిస్సైల్‌ల్ల పరీక్ష, లైఫ్ ఫైర్ ఎక్సర్‌సైజ్‌లను చేయబోతున్నట్లు తెలిపారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock market: మూడో రోజూ వెనకడుగు
ముంబై: స్టాక్ మార్కెట్ మూడోరోజూ నష్టాలు చవిచూసింది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనవడం, ఐటీ షేర్ల బలహీన ట్రేడింగ్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు సందేహాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 314 పాయింట్లు నష్టపోయి 71,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 110 పాయింట్లు పతనమై 21,462 వద్ద స్థిరపడింది. ఉదయం ఆసియాలో జపాన్, సింగపూర్, థాయిలాండ్ సూచీలు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 1% లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో 3% నష్టపోయి రూ.1,487 వద్ద స్థిరపడింది. బుధ, గురవారాల్లో 11% నష్టపోవడంతో బ్యాంకు మార్కెట్ విలువ రూ.1.45 లక్షల కోట్లు కోల్పోయి రూ.11.28 లక్షల కోట్లకు దిగివచి్చంది. ► ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ లైఫ్ ఇన్సూరెన్స్ షేరు 6% నష్టపోయి రూ.486 వద్ద ముగసింది. మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇందుకు కారణం. ► క్యూ3 ఫలితాలు అంచనాలకు అందుకోలేకపోవడంతో ఎల్‌టీఐమైండ్‌ట్రీ షేరు 11% నష్టపోయి రూ.5,602 వద్ద స్థిరపడింది. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన సూచీలు
ఈ రోజు (గురువారం) నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నష్టాల్లోనే ముగిసాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 313.90 పాయింట్ల నష్టంతో 71186.86 వద్ద, నిఫ్టీ 109.70 పాయింట్ల నష్టంతో 21462.30 వద్ద ముగిసింది. ఈ రోజు కూడా సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ భారీ నష్టాల్లోనే ముగిసాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా.. సన్ ఫార్మా, సిప్లా, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, అపోలో టైర్స్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, ఆర్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ మొదలైన కంపెనీలు చేరాయి. నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్, HDFC బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇండియామార్ట్ ఇంటర్మేష్ లిమిటెడ్ సంస్థలు నష్టాలను చవి చూశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మాత్రమే కాకుండా చెన్నై, ఢిల్లీలలో కూడా ఈ రోజు తులం మీద రూ.300 నుంచి రూ.330 వరకు తగ్గింది. నేడు పసిడి ధరలు ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ రోజు హైదరాబాద్, విజయవాడలలో తులం బంగారం మీద రూ. 300 నుంచి రూ. 330 తగ్గింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ. 57400 (22 క్యారెట్స్), రూ. 62620 (24 క్యారెట్స్) వద్ద నిలిచింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరులలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి. చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22, 24 క్యారెట్స్ బంగారం ధరలు వరుసగా రూ. 57800, రూ. 63050గా ఉన్నాయి. నిన్నట్లి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 తగ్గినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఈ రోజు 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 57550 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62770గా ఉంది. ఈ ధరలు నిన్నటి ధరల కంటే వరుసగా రూ.300, రూ.330 తగ్గింది. ఇదీ చదవండి: సమీపిస్తున్న గడువు.. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ ఇలా అప్డేట్ చేసుకోండి వెండి ధరలు హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలలో బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా రూ. 400 తగ్గింది. కేవలం మూడు రోజుల్లో కేజీ వెండి మీద రూ. 1300 వరకు తగ్గింది. -
సాక్షి మనీ మంత్ర: కొనసాగుతున్న బేర్ పంజా.. భారీ నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోయి 21,453కు చేరింది. సెన్సెక్స్ 352 పాయింట్లు దిగజారి 71,147 వద్ద ట్రేడవుతోంది. ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐలు ఎప్పుడూ లేనంతగా రూ.10,578.13 కోట్లు విలువైన షేర్లు విక్రయించారు. డీఐఐలు రూ.4006.44 కోట్లు విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. ఇలా మార్కెట్లో షేర్లు విక్రయించడం కేవలం ఇండియా మార్కెట్లోనే కాదు, ఆసియా మార్కెట్లోని తైవాన్, కొరియా, హాంగ్‌కాంగ్‌లో మొత్తం దాదాపు బుధవారం ఒకేరోజు రూ.45వేల కోట్లు ఎఫ్ఐఐలు విక్రయించారు. డాలర్ ఇండెక్స్ 103.37కు చేరింది. యూఎస్ రిటైల్ సేల్స్ డిసెంబర్ నెలలో పెరిగినట్లు కథనాలు వస్తున్నాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 78.03 డాలర్లుగా ఉంది. అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు స్టాక్ (8.46%) బుధవారం నష్టపోవడంతో సూచీలు భారీగా దిగజారాయి. నిఫ్టీ కోల్పోయిన మొత్తం 460 పాయింట్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు వాటాయే 235 పాయింట్లు కావడం గమనార్హం. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై ప్రభావం చూపించే అమెరికా డిసెంబర్ ద్రవ్యోల్బణ డేటా, ఉపాధి కల్పన గణాంకాలు అంచనాలకు మించి నమోదడవడంతో ‘వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ అంచనాలు తెరపైకి వచ్చాయి. దీంతో అమెరికాలో పదేళ్ల కాల పరిమితి కలిగిన బాండ్లపై రాబడులు(4.04%) ఒక్కసారిగా పెరిగాయి. విదేశీ పెట్టుబడులు ఈక్విటీల నుంచి బాండ్లలోకి తరలిపోతాయనే ఆందోళనలు అధికమయ్యాయి. అలాగే క్రూడాయిల్‌తో పాటు ఇతర కమోడిటీల ధరల పెంపునకు కారణమయ్యే డాలర్ ఇండెక్స్ సైతం నెలరోజుల గరిష్టానికి చేరడమూ ప్రతికూల ప్రభావాన్ని చూపింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Bear attack: క్రాష్ మార్కెట్..!
ముంబై: స్టాక్ మార్కెట్‌పై బేర్ ప్రతాపం చూపింది. ఫలితంగా కొత్త ఏడాదిలో జీవితకాల గరిష్టాల వద్ద ట్రేడవుతున్న సెన్సెక్స్ గత, 18 నెలల్లో భారీ పతనాన్ని బుధవారం చవిచూసింది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు(8.46%)పతనం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆందోళనలు, అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం గతేడాది (2023) చైనా ఆర్థిక వృద్ధి నిరాశపరచడం తదితర పరిణామాలు ఇందుకు కారణమయ్యాయి. సెన్సెక్స్ ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్ఈలో రూ.4.69 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.370 లక్షల కోట్లకు దిగివచి్చంది. కాగా గడిచిన 2 రోజుల్లో రూ.5.73 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ రంగ షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రోజంతా నష్టాల్లోనే ట్రేడింగ్ ఉదయం సెన్సెక్స్ 1,130 పాయింట్ల పతనంతో 71,999 వద్ద, నిఫ్టీ 385 పాయింట్ల నష్టంతో 21,647 వద్ద మొదలయ్యాయి. తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,699 పాయింట్లు క్షీణించి 71,429 వద్ద, నిఫ్టీ 482 పాయింట్లు దిగివచ్చి 21,550 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు పడ్డాయి. చివరికి సెన్సెక్స్ 1,628 పాయింట్లు నష్టపోయి 71,501 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 460 పాయింట్లు పతనమై 21,572 వద్ద స్థిరపడ్డాయి. 2022 జూన్ 13 తర్వాత సూచీలకిదే అత్యంత భారీ పతనం కావడం గమనార్హం. ► చైనా ఆర్థిక వృద్ధి రేటు 2023లో (5.2%) అంచనాలు అందుకోలేకపోవడం, డాలర్ ఇండెక్స్ నెల గరిష్టానికి చేరుకోవడంతో మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెయిల్ 5%, టాటా స్టీల్, నాల్కో, జిందాల్ స్టీల్ షేర్లు 4% పతనమయ్యాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఎన్ఎండీసీ, వేదాంత, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 3%, హిందుస్థాన్ కాపర్, హిందాల్కో జింక్ షేర్లు 2.5% నుంచి ఒకశాతం చొప్పున నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీకి.. రూ.1.07 లక్షల కోట్ల నష్టం హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు నిరాశపరిచాయి. రుణ వృద్ధి, లిక్విడిటీ కవరేజ్ రేషియో(ఎల్‌సీఆర్)లపై ఆందోళన వ్యక్తం చేస్తూ బ్రోకరేజ్ సంస్థలైన సీఎల్ఎస్ఏ, మోర్గాన్ స్టాన్లీలు షేరు రేటింగ్ తగ్గించాయి. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు 8.46% నష్టపోయి రూ.1,537 వద్ద ముగిసింది. బ్యాంకు మార్కెట్ విలువ ఒక్క రోజులోనే రూ.1.07 లక్షల కోట్లు ఆవిరై రూ.11.66 లక్షల కోట్లకు దిగివచి్చంది. అత్యంత విలువైన పీఎస్‌యూగా ఎల్ఐసీ ఎల్ఐసీ కంపెనీ అరుదైన రికార్డు సృష్టించింది. ప్రభుత్వ రంగ లిస్టెడ్ కంపెనీల్లో అత్యంత విలువైనదిగా అవతరించింది. ఈ షేరు ఇంట్రాడేలో 3% లాభపడి రూ.919 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. లాభాల స్వీకరణతో 1% నష్టంతో రూ.887 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.5.60 లక్షల కోట్లకు చేరింది. ఎస్బీఐ షేరు 1.67% తగ్గింది. మార్కెట్ క్యాప్ రూ.5.58 లక్షల కోట్లుగా నమోదై రెండో స్థానానికి దిగివచ్చింది. కుప్పకూలింది ఇందుకే... హెచ్డీఎఫ్సీ బ్యాంకు పతన ప్రభావం అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు (8.46%) నష్టం పతనం సూచీల భారీ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. నిఫ్టీ కోల్పోయిన మొత్తం 460 పాయింట్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు వాటాయే 235 పాయింట్లు కావడం గమనార్హం. ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా ఆందోళన యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై ప్రభావం చూపించే అమెరికా డిసెంబర్ ద్రవ్యోల్బణ డేటా, ఉపాధి కల్పన గణాంకాలు అంచనాలకు మించి నమోదడవడంతో ‘వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ అంచనాలు తెరపైకి వచ్చాయి. దీంతో అమెరికాలో పదేళ్ల కాల పరిమితి కలిగిన బాండ్లపై రాబడులు(4.04%) ఒక్కసారిగా పెరిగాయి. విదేశీ పెట్టుబడులు ఈక్విటీల నుంచి బాండ్లలోకి తరలిపోతాయనే ఆందోళనలు అధికమయ్యాయి. అలాగే క్రూడాయిల్‌తో పాటు ఇతర కమోడిటీల ధరల పెంపునకు కారణమయ్యే డాలర్ ఇండెక్స్ సైతం నెలరోజుల గరిష్టానికి చేరడమూ ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల డీలా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీరేట్ల తగ్గింపు వాయిదా అంచనాలు, చైనా ఆర్థిక వ్యవస్థ బలహీన సంకేతాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఆసియా మార్కెట్లు 2% క్షీణించి నెల రోజుల కనిష్టానికి దిగివచ్చాయి. యూరప్ మార్కెట్లు 2 శాతం మేర క్షీణించాయి. అమెరికా ఒక శాతానికి పైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పతన ప్రభావం దలాల్ స్ట్రీట్పైనా పడింది. -
సాక్షి మనీ మంత్ర: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Stock Market Closing Update: ఈ రోజు (బుధవారం) నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిసాయి. సెన్సెక్స్ 1613.64 పాయింట్ల భారీ నష్టంతో 71515.13 వద్ద, నిఫ్టీ 461.45 పాయింట్ల నష్టంతో 27570.45 వద్ద ముగిసింది. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా నేడు నష్టాల్లోనే ముగిసినట్లు స్పష్టమైంది. టాప్ గెయినర్స్ జాబితాలో HCL టెక్నాలజీస్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టి టెక్నాలజీ, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, బిర్లాసాఫ్ట్ లిమిటెడ్, పాలిక్యాబ్ ఇండియా లిమిటెడ్ మొదలైన కంపెనీలు ఉన్నాయ. HDFC బ్యాంక్, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వోడాఫోన్ ఐడియా మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: మార్కెట్‌పై బేర్ పంజా.. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 211 పాయింట్లు దిగజారి 21,820కు చేరింది. సెన్సెక్స్ 755 పాయింట్లు నష్టపోయి 72,373 వద్ద ట్రేడవుతోంది. అమెరికా బాండ్ ఈల్డ్‌లు మంగళవారం 13 బేసిస్ పాయింట్లు పెరిగి 4.07 శాతానికి చేరాయి. యూరప్ సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధులు ఫెడ్ కీలక వడ్డీరేట్లకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు వస్తున్న సంకేతాలు ఎన్నిరోజులు కొనసాగుతాయో తెలియదని చెప్పారు. కేవలం కొంతకాలాన్నే పరిగణించి ఫెడ్ వడ్డీరేట్లను తగ్గిస్తే ద్రవ్యోల్బణం పుంజుకోదని సూచించారు. దాంతో రానున్న రోజుల్లో వడ్డీరేట్లు తగ్గుతాయో లేదోనని మార్కెట్లు కొంత సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. దానికితోడు పుట్‌కాల్ రేషియో(పీసీఆర్)లో కూడా ఎక్కువ అంతరాలు ఉండడంతో మార్కెట్లు కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. డాలర్ ఇండెక్స్ 0.89 శాతం పెరిగి 103.31 కు చేరింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 77.87 డాలర్లుగా ఉంది. ఎఫ్ఐఐలు మంగళవారం ఈక్విటీ మార్కెట్లో రూ.656.57 కోట్ల విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.369.29 కోట్లు విలువైన షేర్లు విక్రయించారు. సోమవారం ట్రేడింగ్‌లో నిఫ్టీ చరిత్రలో తొలిసారిగా 22,000 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్ కూడా 73,000 పాయింట్ల ఎగువన ముగిసింది. తాజాగా అయిదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1972.72 పాయింట్లు, నిఫ్టీ 584.45 పాయింట్లు చొప్పున పరుగులు తీశాయి. ఫలితంగా బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ.9.68 లక్షల కోట్లు వృద్ధి చెంది జీవనకాల తాజా గరిష్ఠమైన రూ.376.09 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాది నవంబరులో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) సామాజిక భద్రతా పథకంలో 15.92 లక్షల మంది కొత్త సభ్యులు చేరారు. దాదాపు 20,830 కొత్త సంస్థలు ఇందులో నమోదైనట్లు కార్మిక శాఖ వెల్లడించింది. 15.92 లక్షల మందిలో 7.47 లక్షల మంది 25 ఏళ్ల వయసులోపు వారే ఉన్నారు. మహిళా సభ్యులు నికరంగా 3.17 లక్షల మంది చేరారు. ఇది భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థకు కొంత సానుకూల అంశంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు. 2023 డిసెంబరులో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 9 నెలల గరిష్ఠమైన 0.73 శాతంగా నమోదైంది. ఆహార ధరలు పెరగడం ప్రభావం చూపింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు ప్రతికూలంగా ఉన్న ద్రవ్యోల్బణం.. నవంబరులో 0.26 శాతానికి చేరింది. 2022 డిసెంబరులో టోకు ద్రవ్యోల్బణం 5.02 శాతంగా ఉంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాలు స్వీకరణ.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమై నష్టాల్లోనే ట్రేడింగ్ ముగించాయి. నిఫ్టీ 65.95 పాయింట్లు నష్టపోయి 22,031 వద్ద, సెన్సెక్స్ 193 పాయింట్లు దిగజారి 73,134 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, టైటాన్, ఐటీసీ, మారుతిసుజుకీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, టీసీఎస్, ఎం అండ్ ఎం షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన ఐటీ, రిలయన్స్ వంటి స్టాక్ల్లో మదుపరులు మంగళవారం లాభాలు స్వీకరించినట్లు నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లు దాదాపు గత 11 ఏళ్ల నుంచి నెలవారీగా గమనిస్తే ప్రతి జనవరి నెలలో నష్టాల్లోకే జారుకున్నాయి. కానీ ఈసారి అది పునరావృతం కాదని అంటున్నారు. ఈక్విటీలో మదుపుచేస్తున్న ఇన్వెస్టర్లు భారత మార్కెట్లపై ఎంతో ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలంగా స్టాక్మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు తాజాగా విడుదల చేస్తున్న త్రైమాసిక ఫలితాలను గమనించాలి. దాంతోపాటు కంపెనీ యాజమాన్యం తమ భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో తెలుసుకుని ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నాలుగు రోజుల తరువాత మళ్ళీ తగ్గిన బంగారం, వెండి - నేటి కొత్త ధరలు
జనవరి 3 నుంచి వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు 12వ తేదీ నుంచి పెరుగుదల వైపు అడుగులు వేసాయి. అయితే ఈ రోజు మళ్ళీ తులం గోల్డ్ మీద రూ. 100 నుంచి రూ. 110 వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా పసిడి ధరలు తగ్గాయి. నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 58050 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ. 63330గా ఉన్నాయి. చెన్నై ఈ రోజు పసిడి ధరలు వరుసగా రూ. 200 నుంచి 220 తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 63820కు చేరింది. ఢిల్లీలో ఈ రోజు ధరలు రూ. 100 నుంచి రూ. 110 తగ్గి తులం బంగారం ధరలు వరుసగా రూ. 58200 (22 క్యారెట్స్), రూ. 63480 (24 క్యారెట్స్)కు చేరింది. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా తగ్గాయి. నేడు హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీలలో కేజీ మీద రూ. 300 తగ్గింది. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు
సోమవారం లాభాల్లో ప్రారంభమై.. లాభాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు తగ్గుదలను నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు (మంగళవారం) ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 182.99 పాయింట్ల నష్టంతో 73146.95 వద్ద, నిఫ్టీ 50.40 పాయింట్ల నష్టంతో 22044.95 వద్ద ముందుకు సాగుతున్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), టాటా మోటార్స్, హిందాల్కో, JSW స్టీల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL), నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) మొదలైన కంపెనీలు చేరాయి. ఐషర్ మోటార్స్, విప్రో, HCL టెక్నాలజీ, టెక్ మహీంద్రా, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల్లో సాగుతున్నాయి. యూఎస్ మార్కెట్లో సోమవారం కొంత రేంజ్‌లోనే కదలాడాయి, దేశంలోని ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1085 కోట్లు విలువ గల షేర్లు కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.820.69 కోట్లు విలువైన షేర్లను విక్రయించారు. అమెరికా మార్కెట్లోని నాస్డాక్ 0.02 శాతం పెరిగింది. యూరప్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిసాయి. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితుల నేపథ్యంలో మదుపర్లు కొంత జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం రోజు హౌతీ రెబల్స్, అమెరికాకు సంబంధించిన రాడార్లను నాశనం చేసినట్లు సమాచారం. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 72.38 డాలర్లుగా ఉంది. ఇటీవల ఐటీ స్టాక్స్ నిఫ్టీ అల్ టైమ్ హైలోకి వెళ్ళింది, దీనికి రిలయన్స్ కూడా సహకరించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఐటీ స్టాక్స్ తాజాగా విడుదల చేస్తున్న త్రైమాసిక ఫలితాల్లో TCS, HCL కంపెనీలు తప్పా.. మిగిలిన స్టాక్స్ ఆశించిన మేర పోస్ట్ చేయకపోవడంతో.. మదుపర్లు ఆ సంస్థలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఫెడ్ నిర్ణయాలకు అనుగుణంగా కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే భావనతో మదుపర్లు ఐటీ స్టాక్స్‌లను మరింత కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల మార్కెట్లో ఐటీ రంగలోని స్టాక్స్, రిలియన్స్‌కు తోడు ఫార్మా స్టాక్స్ సైతం సానుకూలంగా స్పందించడంతో.. దేశీయ మార్కెట్లు జీవిత కాల గరిష్టాలను తాకుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్ రంగ స్టాకులో ఇంకా ర్యాలీ మొదలు కాలేదు, ఒక వేళా ఈ త్రైమాసిక ఫలితాల్లో వృద్ధిని సాధిస్తే బ్యాంకు నిఫ్టీ దేశీయ సూచీలు మరింత పెరిగేందుకు సహకారం అందించే వీలుందని చెబుతున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
ఈ రోజు లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 801.16 పాయింట్ల భారీ లాభంతో 73369.62 వద్ద, నిఫ్టీ 202.90 పాయింట్ల లాభంతో 22097.45 వద్ద నిలిచింది. ఈ రోజు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా మంచి లాభాల్లో దూసుకెళ్లాయి. టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, భారతి ఎయిర్టెల్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ వంటి కంపెనీలు చేరగా.. HDFC లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, సన్ టీవీ నెట్వర్క్, టీవీఎస్ మోటార్ మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Gold Price: ఇంకా పెరిగిన బంగారం.. తులం ఎంతంటే..
పండగ వేళ బంగారం ధరలు ఇంకా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఈరోజు (జనవరి 15) పసిడి ధరలు మరింత ఎగిశాయి. క్రితం రోజు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు మోస్తరుగా పెరిగాయి. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర తులం (10 గ్రాములు) రూ.170 చొప్పున పెరిగింది. అదే విధంగా 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.150 చొప్పున పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.63,440, 22 క్యారెట్ల పసిడి తులం ధర రూ. 58,150 ఉంది. క్లిక్ చేయండి: దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు Silver Rate: దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. హైదరాబాద్ సహా ఇరు తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర కేజీకి రూ.300 పెరిగింది. దీంతో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.78,300 లకు చేరింది. -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ప్రారంభం.. కొనసాగుతున్న స్టాక్ ర్యాలీ
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈవారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీల గత సెషన్ ర్యాలీ సోమవారం కొనసాగింది. రెండో రోజు తాజా గరిష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 550 పాయింట్లు ఎగసి 73,127 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 133 పాయింట్లు ఎగబాకి 22,000 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్‌లో విప్రో, హెచ్‌సీఎల్‌టెక్ వరుసగా 10 శాతం, 4 శాతం ఎగబాకాయి. తర్వాతి విజేతలుగా టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎస్బీఐ నిలిచాయి. మరోవైపు, ఏషియన్ పెయింట్స్, నెస్లే, హెచ్‌యుఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కొన్ని ఫ్రంట్‌లైన్ డ్రాగ్‌లలో ఉన్నాయి. ప్రీ ఓపెనింగ్ పరిస్థితులను ఓ సారి పరిశీలిస్తే.. డోజోన్స్ 118 పాయింట్లు కోల్పోగా, S&P 500, నాస్డాక్ ఫ్లాట్‌గా ముగిశాయి. చాలా ఆసియా-పసిఫిక్ మార్కెట్లు క్షీణించాయి. ఓటర్లు అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి వరుసగా మూడోసారి అధ్యక్ష పదవిని అప్పగించడంతో తైవాన్ ప్రధాన స్టాక్ ఇండెక్స్ పెరిగింది. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఫ్లాట్ లైన్లో ట్రేడైంది. యెమెన్‌లోని హౌతీ-నియంత్రిత ప్రాంతాల్లోని లక్ష్యాలపై యూఎస్, యూకే సైనిక దాడులు నిర్వహించడంతో చమురు ధరలు పెరిగాయి. WTI, బ్రెంట్ ఫ్యూచర్స్ శుక్రవారం ఉదయం 4శాతానికిపైగా పెరిగి డిసెంబర్ 27 తర్వాత అత్యధిక స్థాయిలను తాకాయి. యూఎస్ ముడి చమురు బ్యారెల్ 75.25 డాలర్లకు పెరిగింది. అదే సమయంలో గ్లోబల్ బెంచ్‌మార్క్ 80.75 డాలర్లను తాకింది. మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతన్న ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు శుక్రవారం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వార్తల్లోని స్టాక్స్ హెచ్‌సీఎల్ టెక్: 2024 ఆర్థిక సంవత్సరం క్యూ3లో లాభం అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే 13.5 శాతం పెరిగి రూ. 4,350 కోట్లకు చేరింది. ఆదాయం 6.7 శాతం పెరిగి రూ.28,446 కోట్లకు చేరుకుంది విప్రో: ఐటీ సేవల ఆదాయం కిందటి త్రైమాసికం కంటే 1.1 శాతం తగ్గి రూ. 22,150.8 కోట్ల చేరింది. ఆదాయం 2.1 శాతం క్షీణించి 2,656.1 మిలియన్ డాలర్లకు పడిపోయింది అవెన్యూ సూపర్‌మార్ట్స్: రూ. 690 కోట్ల వద్ద ఏకీకృత లాభంలో 17% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఆపరేషన్స్ ఆదాయం సంవత్సరానికి 17.3% పెరిగి రూ. 13,572 కోట్లకు చేరుకుంది. మార్జిన్ 8.3 శాతం వద్ద స్థిరంగా ఉంది ఈరోజు కీలక ఫలితాలు జియో ఫైనాన్షియల్, ఏంజెల్ వన్, ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్, కేసోరామ్ ఇండ్, మెటాలిస్ట్ ఫోర్జింగ్స్, నెల్కో.. ఈరోజు ఉన్న కీలక ఫలితాలు టాటా కన్స్యూమర్: క్యాపిటల్ ఫుడ్స్‌లో 100% వాటాను రూ. 5,100 కోట్లకు, ఆర్గానిక్ ఇండియాను రూ. 1,900 కోట్లకు కొనుగోలు చేస్తోంది. అదానీ ఎంటర్ప్రైజెస్: అదానీ న్యూ ఇండస్ట్రీస్ భారత్‌లో సంవత్సరానికి 198.5 MW సామర్థ్యం గల ఎలక్ట్రోలైజర్లను ఏర్పాటు చేయడానికి సోలార్ ఎనర్జీ కార్ప్ నుంచి ఎల్ఓఏ అందుకుంది. బీహెచ్ఈఎల్: ఒడిషాలోని 3x800 MW NLC తలబిరా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోసం ఎన్ఎల్సీ ఇండియా నుంచి ఎల్ఓఏ అందుకుంది. ఈ ప్రాజెక్టు విలువ రూ.15,000 కోట్లు. లుపిన్: ప్రొప్రానోలోల్ హైడ్రోక్లోరైడ్ ఎక్స్టెండెడ్ రిలీజ్ క్యాప్సూల్స్ కోసం లుపిన్ సంక్షిప్త కొత్త డ్రగ్ అప్లికేషన్‌కు యూఎస్ఎఫ్డీఏ ఆమోదం. ఇండెరల్ ఎల్ఏ హైడ్రోక్లోరైడ్ ఎక్స్టెండెడ్ రిలీజ్ తరహా జనరిక్ క్యాప్సూల్స్ మార్కెటింగ్‌కు యూఎస్‌లోని ఏఎన్ఐ ఫార్మాస్యూటికల్స్ నుంచి అనుమతి. జిల్లెట్ ఇండియా: రూ. 222.9 కోట్లతో 3.3 లక్షల షేర్లను కొనుగోలు చేసిన నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్. రూ. 405.5 కోట్ల విలువైన 6 లక్షల షేర్లను (పెయిడ్-అప్ ఈక్విటీలో 1.8%) విక్రయించిన అడ్వెంట్జ్ ఫైనాన్స్. సికల్ లాజిస్టిక్స్: షేరుకు రూ. 270.6 చొప్పున 6 లక్షల షేర్లను (పెయిడ్-అప్ ఈక్విటీలో 0.9%) విక్రయించిన ప్రమోటర్ ప్రిస్టైన్ మాల్వా లాజిస్టిక్స్ పార్క్. ఈ బ్లాక్ డీల్‌లో నెగెన్ క్యాపిటల్ సర్వీసెస్ కొనుగోలుదారు. మనీ మంత్రా ఇన్వెస్టర్లు సాధారణ ఎఫ్డీలతో పాటు పన్ను మినహాయింపు, అధిక వడ్డీ కోసం పన్ను ఆదా చేసే ఎఫ్డీలను కూడా అన్వేషిస్తారు. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఎఫ్డీలో డిపాజిట్ చేసిన మొత్తంపై మాత్రమే వర్తిస్తుంది. కానీ దానిపై వచ్చే వడ్డీకి పన్ను ఉంటుంది. ఒకవేళ మీరు జాయింట్ డిపాజిట్‌ని ఎంచుకుంటే, సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనం డిపాజిట్ మొదటి హోల్డర్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.100, గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు బ్యాంక్ వార్షిక వడ్డీ రేటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 7% ఐసీఐసీఐ బ్యాంక్ 7% కోటక్ మహీంద్రా 6.2% ఎస్బీఐ 6.5% పంజాబ్ నేషనల్ బ్యాక్ 6.5% (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
పాతికేళ్ల ట్రాక్ రికార్డ్.. మంచి రాబడులు ఇస్తున్న ఈ ఫండ్ గురించి తెలుసా?
స్మాల్‌క్యాప్ ఫండ్స్, మిడ్‌క్యాప్ ఫండ్స్, లార్జ్‌క్యాప్ ఫండ్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ, ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు పెద్దగా పరిచయం లేని, పట్టించుకోని విభాగం ఒకటి ఉంది. అదే లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగం. దీర్ఘకాలంలో ఈ విభాగం మంచి సంపద సృష్టిస్తుందని చెప్పడానికి ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు ఆధారంగా నిలుస్తాయి. లార్జ్‌క్యాప్ స్థిరత్వానికి, రిస్క్ తక్కువకు వీలు కల్పిస్తుంది. మిడ్‌క్యాప్ మోస్తరు రిస్క్‌తో, అధిక రాబడులకు మార్గం కల్పిస్తుంది. ఈ రెండు రకాల విభాగాల్లో పెట్టుబడులకు వీలు కల్పించేదే లార్జ్ అండ్ మిడ్‌క్యాప్. ఈ విభాగంలో సుదీర్ఘకాల చరిత్ర (25 ఏళ్లకు పైగా) ఉండి, మంచి రాబడులను అందిస్తున్న పథకంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్‌కు ట్రాక్ రికార్డు ఉంది. పెట్టుబడుల విధానం.. సెబీ నిబంధనల ప్రకారం ఈ పథకం లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌లో 35 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ, కొన్ని సందర్భాల్లో విభాగాల వారీ కేటాయింపుల్లో పరిమిత కాలం స్వేచ్ఛ ఉంటుంది. ఈ పథకం మేనేజర్ టాప్డౌన్, బోటమ్ అప్ విధానాలను స్టాక్ ఎంపికకు వినియోగించుకోవడాన్ని గమనించొచ్చు. ఈ విధానాల ద్వారా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ విభాగాల నుంచి స్టాక్స్ ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆకర్షణీయమైన అవకాశాలు ఎక్కడ కనిపించినా, ఫండ్ మేనేజర్ గుర్తించి అందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్మాల్‌క్యాప్‌లో ఆకర్షణీయమైన అవకాశాలు కనిపించినా సొంతం చేసుకునే విధంగా ఈ పథకం పనిచేస్తుంటుంది. ఇన్వెస్టర్లకు అదనపు ఆల్ఫా అందించడమే దీని ఉద్దేశ్యం. ఈక్విటీల్లో తీవ్ర అస్థిరతలు ఉన్న సందర్భాల్లో 30 శాతం వరకు డెట్ సాధనాలకు సైతం కేటాయించగలదు. పోర్ట్‌ఫోలియో డిసెంబర్ 31 నాటికి చూసుకుంటే ఈ పథకం నిర్వహణలో రూ.10,268 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 93.74 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించగా, డెట్ సాధనాల్లో 0.87 శాతం, నగదు, నగదు సమానాల్లో 5.4 శాతం మేర కలిగి ఉంది. ప్రస్తుతం ఈక్విటీ కేటాయింపులను పరిశీలించగా, 70.42 శాతం లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 26 శాతం మేర ఇన్వెస్ట్ చేయగా, స్మాల్‌క్యాప్ కంపెనీలకు కేవలం 2 శాతాన్నే కేటాయించింది. ప్రస్తుతం స్మాల్‌క్యాప్ కంపెనీల వ్యాల్యూషన్లు చారిత్రక గరిష్ట స్థాయిలో ఉన్నందున అప్రమత్త ధోరణితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ రికవరీతో లాభపడే రంగాలు, స్టాక్స్‌కు ఎక్కువ కేటాయింపులు చేసినట్టు ప్రస్తుత పోర్ట్‌ఫోలియోను గమనిస్తే తెలుస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థ మెరుగైన వృద్ధికి అనుగుణంగా ఆయా స్టాక్స్ ర్యాలీకి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావించొచ్చు. రాబడులు ఈ పథకం 1998 నవంబర్ 30న ప్రారంభమైనంది. నాటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు వార్షిక రాబడి 18.60 శాతంగా ఉంది. ఈ పథకం ఎక్స్పెన్స్ రేషియో 1.80 శాతంగా ఉంది. అంటే ఇన్వెస్టర్ తన పెట్టుబడుల విలువపై ఏటా ఈ మేరకు చార్జీల రూపంలో కోల్పోవాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ప్రస్తుతం ఇహబ్ దల్వాయ్ నిర్వహిస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 33 శాతం రాబడిని అందించింది. మూడేళ్లలో 25.63 శాతం, ఐదేళ్లలో 20 శాతం, ఏడేళ్లలో 16.44 శాతం, పదేళ్లలో 16.62 శాతం చొప్పున రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. ఈ పథకం ప్రారంభమైన నాడు ఏకమొత్తంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, అది ఇప్పుడు రూ.72.15 లక్షలు అయి ఉండేది. ఈ కాలంలో బెంచ్‌మార్క్ నిఫ్టీ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ 250 టీఆర్ఐ కంటే మెరుగైన పనితీరు చూపించింది. పథకం ఆరంభం నుంచి ప్రతి నెలా రూ.10వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వస్తే రూ.4.03 కోట్లు సమకూరి ఉండేది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఐసీఐసీఐ బ్యాంక్ 6.84 మారుతి సుజుకీ 4.50 ఎన్టీపీసీ 3.79 భారతీ ఎయిర్టెల్ 3.22 ఇన్ఫోసిస్ 3.14 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.89 ఎస్బీఐ కార్డ్స్ 2.83 రిలయన్స్ 2.53 ఎన్‌హెచ్‌పీసీ 2.36 ముత్తూట్ ఫైనాన్స్ 2.35 -
సానుకూలతలు కొనసాగొచ్చు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఈ వారమూ సానుకూలతలు కొనసాగొచ్చని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ కార్పొరేట్ డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. అలాగే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, క్రూడాయిల్ ధరల కదలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించొచ్చంటున్నారు నిపుణులు. ఇదే వారంలో మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ సరీ్వసెస్ ఐపీఓ జనవరి 15న(నేడు) ప్రారంభం కానుంది. ఇటీవల పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ షేర్లు మంగళవారం(జనవరి 16న) ఎక్చేంజీలో లిస్ట్ కానున్నాయి. గత వారం మొత్తంగా సెన్సెక్స్ 542 పాయింట్లు, నిఫ్టీ 184 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. దేశీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీవీఎస్‌ల క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో శుక్రవారం సూచీలు తాజా జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. ‘‘దేశీయ మార్కెట్‌ను సానుకూల వాతావారణ నెలకొనప్పట్టికీ.., సూచీలను స్థిరంగా లాభాల వైపు నడిపే అంశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు మూమెంటమ్‌ను నిర్దేశిస్తాయి. సాంకేతికంగా నిఫ్టీ బలమైన అవరోధం 21,500 – 21,850 శ్రేణిని చేధించింది. కావున ఎగువ స్థాయిలో 22,000 స్థాయిని పరీక్షించవచ్చు. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే దిగువ స్థాయిలో 21,750 వద్ద తక్షణ మద్దతు లభిస్తుంది. ఈ స్థాయిని కోల్పోతే 21,650 – 21,575 పరిధిలో మరో బలమైన మద్దతు ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ అమోల్ అథవాలే తెలిపారు. క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ మార్కెట్ ముందుగా గతవారం మార్కెట్ ముగింపు తర్వాత వెల్లడైన హెచ్‌సీఎల్ టెక్, విప్రో, అవెన్యూ సూపర్‌మార్ట్స్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో దాదాపు 200కు కంపెనీలు తమ క్యూ3 ఫలితాలు ప్రకటించనున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పేయింట్స్, ఎల్టీఐఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, అ్రల్టాటెక్ సిమెంట్, జియో కంపెనీలు ఇందులో ఇన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. ప్రపంచ పరిణామాలు యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై ప్రభావం చూపించే అమెరికా డిసెంబర్ ద్రవ్యోల్బణ డేటా, ఉపాధి కల్పన గణాంకాలు అంచనాలకు మించి నమోదడవంతో ‘వడ్డీరేట్ల తగ్గింపు వాయిదా’ అంచనాలు తెరపైకి వచ్చాయి. అలాగే ఎర్ర సముద్రం చుట్టూ నెలకొన్న రాజకీయ అనిశి్చతి, తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకి డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) విజయం పరిణామాలను ఈక్విటీ మార్కెట్ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు జపాన్ మెషిన్ టూల్ ఆర్డర్స్ డేటా, యూరోజోన్ నవంబర్ వాణిజ్య లోటు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలతో పాటు దేశీయ హోల్‌సేల్ ద్రవ్యోల్బణ డేటా సోమవారం విడుదల కానుంది. చైనా 2023 డిసెంబర్ క్వార్టర్ జీడీపీ, పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలతో పాటు బ్రిటన్ డిసెంబర్ ద్రవ్యోల్బణం, పీపీఐ ఇన్పుట్–అవుట్‌పుట్ డేటా బుధవారం వెల్లడి కానుంది. గురువారం యూరోజోన్ నవంబర్ కరెంట్ అకౌంట్, జపాన్ మెషనరీ ఆర్డర్స్, పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడి అవుతుంది. ఇక శుక్రవారం జపాన్ డిసెంబర్ ద్రవ్యోల్బణం, బ్రిటన్ డిసెంబర్ రిటైల్ సేల్స్ విడుదల అవుతాయి. తొలి 2 వారాల్లో రూ.3,900 కోట్లు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది తొలి రెండు వారాల్లో రూ.3900 కోట్లు పెట్టుబడి పెట్టారు. గతేడాది డిసెంబర్లో రూ.66,134 కోట్లతో పోలిస్తే పెట్టుబడులు నెమ్మదించాయి. భారత ఈక్విటీ మార్కెట్ జీవితకాల గరిష్టాలకు చేరుకోవడంతో పాటు ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై నెలకొన్న అస్థిరతల నేపథ్యంలో ఎఫ్ఐఐలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈక్విటీ పట్ల అప్రమత్తత వహిస్తున్న ఎఫ్ఐఐలు డెట్ మార్కెట్లో మాత్రం ఉదారంగా ఇన్వెస్టర్లు చేస్తున్నారు. ఈ జనవరి 12 నాటికి డెట్ మార్కెట్లో రూ.7,91 కోట్ల పెట్టుబడులు జొప్పించారు. ఇక 2023లో భారత్ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ.1.71 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. -
అంతర్జాతీయ బ్యాంకులకు షాకిచ్చిన దక్షిణ కొరియా
రెండు ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులకు దక్షిణ కొరియా ఆర్థిక నియంత్రణ సంస్థ షాకిచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న విచారణలో భాగంగా ఆ రెండు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులపై భారీ జరిమానా విధించే ప్రణాళికను ఆదివారం ప్రకటించింది. ఈ రెండు బ్యాంకులు అక్రమమైన నేక్డ్ షార్ట్ సెల్లింగ్ (సరైన రుణాలు తీసుకోకుండానే షేర్లను విక్రయించడం) లావాదేవీలకు పాల్పడ్డాయని దక్షిణ కొరియా ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ (FSC) పేర్కొంది. అయితే ఈ బ్యాంకులు ఏవి అనేది ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ వెల్లడించలేదు. తమ దేశ స్టాక్ మార్కెట్ నుంచి అక్రమ షార్ట్ సెల్లింగ్ కార్యకలాపాలను నిర్మూలించడానికి ప్రపంచ పెట్టుబడి సంస్థల పరిశీలనను ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ విస్తృతం చేస్తోంది. అక్రమ షార్ట్ సెల్లింగ్ పపద్ధతులను అరికట్టడానికి దక్షిణ కొరియా గతేడాది నవంబర్ నుంచి 2024 జూన్ చివరి వరకు షార్ట్-సెల్లింగ్‌పై పూర్తి నిషేధాన్ని విధించింది. ఇందులో భాగంగా అక్రమ షార్ట్ సెల్లింగ్ లావాదేవీలకు పాల్పడిన రెండు అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకులు, ఒక స్థానిక బ్రోకరేజ్ సంస్థకు 26.5 బిలియన్ వోన్లు ( సుమారు రూ. 167 కోట్లు) జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. -
పండగ పూట బంగారం కొనేవారికి షాక్!
పండగ పూట బంగారం కొనేవారికి పెరిగిన ధరలు షాకిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈరోజు (జనవరి 13) పసిడి ధరలు మరింతగా పెరిగాయి. నిన్నటి రోజున స్పల్పంగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు ఇంకాస్త ఎగిశాయి. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర తులానికి (10 గ్రాములు) రూ.320 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.300 ఎగిసింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,270లకు, 22 క్యారెట్ల పుత్తడి తులం ధర రూ. 58,000లకు చేరింది. క్రితం రోజు ఈ ధరలు వరుసగా రూ. 62,950, రూ.57,700 ఉండేవి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలు ప్రభావితం చేసే ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. వెండి కూడా.. Silver Rate: దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా పెరిగాయి. మూడు రోజుల నుంచి శాంతించిన వెండి ధరల్లో మళ్లీ పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌తోపాటు ఇరు రాష్ట్రాల్లో వెండి ధర కేజీకి రూ.500 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.78,000 లకు చేరింది. నిన్నటి రోజున కేజీ వెండి ధర రూ.77,500 ఉండేది. -
ఐటీ షేర్ల అండ.. కొత్త శిఖరాలు
న్యూఢిల్లీ: ఐటీ షేర్లలో నెలకొన్న కొనుగోళ్ల అండతో స్టాక్ సూచీలు శుక్రవారం ఇంట్రాడే, ముగింపుల్లోనూ సరికొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బలపడటమూ కలిసొచ్చింది. ఐటీతో పాటు అధిక వెయిటేజీ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇంధన షేర్లు, అలాగే సర్వీసెస్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, వినిమయ షేర్లు రాణించి సూచీల రికార్డుల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 847 పాయింట్లు పెరిగి 72,568 వద్ద, నిఫ్టీ 247 పాయింట్లు బలపడి 21,895 వద్ద స్థిరపడ్డాయి. ఈ ముగింపు ఇరు సూచీలకు సరికొత్త రికార్డు స్థాయిలు కావడం విశేషం. విస్తృత స్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ సూచీలు 0.41%, 0.36% లాభపడ్డాయి. రికార్డుల ర్యాలీలోనూ ఫార్మా, ఆటో, మీడియా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణ, ఉపాధి కల్పన అంచనాలకు మించిన నమోదు కారణంగా ‘ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.\ ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్ ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలను విస్మరిస్తూ ఉదయం సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 427 పాయింట్ల లాభంతో 72,148 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 21,774 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉత్సాహంగా మొదలైన సూచీలు రోజంతా అదే రోజు కనబరిచాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1000 పాయింట్లు ఎగసి 72,721 వద్ద, నిఫ్టీ 282 పాయింట్లు బలపడి 21,928 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలకు చేరాయి. ♦ సెన్సెక్స్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 4 సెషన్లలో రూ.6.88 లక్షల కోట్లు పెరిగి ఆల్ టైం హై రూ.373.29 లక్షల కోట్లకు చేరింది. ♦ఐటీ రంగ షేర్లు 8% ర్యాలీ చేసి సూచీలను సరికొత్త శిఖరాల వైపు నడిపించాయి. ♦దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్‌ల క్యూ3 ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో ఈ రంగ షేర్లకు డిమాండ్ పెంచింది. ♦కోఫోర్జ్ 6%, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌టెక్, ఎల్టీఐఎం షేర్లు 5%, విప్రో, ఎంఫసీస్‌లు 4%, పెర్సిస్టెంట్ 3.50%, ఎల్టీటీఎస్ 2% లాభపడ్డాయి. ♦ అంచనాలకు తగ్గట్టు డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు ప్రకటిచడంతో ఇన్ఫోసిస్ షేరు 8% ఎగసి రూ.1612 వద్ద ముగిసింది. ♦ ఇదే క్యూ3లో మెరుగైన పనితీరుతో పటిష్టమైన ఆర్థిక ఫలితాలు సాధించిన టీసీఎస్ షేరు 4% లాభపడి రూ.3,882 వద్ద స్థిరపడింది. ♦ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6%, యూనియన్ బ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్‌లు 5%, పీఎస్బీ, యూకో బ్యాంక్, పీఎస్బీ, సెంట్రల్ బ్యాంక్‌లు 3% పెరిగాయి. ఎస్బీఐ, ఐఓబీ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ షేర్లు 2–1% మధ్య లాభపడ్డాయి. -
విప్రో లాభం డౌన్...
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం దాదాపు 12 శాతం క్షీణించి రూ. 2,694 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 3,053 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 4 శాతం వెనకడుగుతో రూ. 22,205 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 23,229 కోట్ల టర్నోవర్ సాధించింది. ఐటీ సర్విసుల విభాగం 4.5 శాతం తక్కువగా రూ. 22,151 కోట్ల ఆదాయం అందుకుంది. గైడెన్స్ ఇలా ఈ ఏడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో ఐటీ సర్విసుల బిజినెస్ 261.5–266.9 కోట్ల డాలర్ల(రూ. 21,845–22,296 కోట్లు) మధ్య టర్నోవర్‌ను సాధించే వీలున్నట్లు విప్రో తాజాగా అంచనా వేసింది. వాటాదారులకు ప్రతీ షేరుకీ రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఇతర విశేషాలు ♦ ఐటీ సర్వీసుల నిర్వహణ లాభం(ఇబిట్) త్రైమాసికవారీగా 2 శాతం తగ్గి రూ. 3,540 కోట్లుగా నమోదైంది. ♦బీఎఫ్ఎస్ఐ సర్విసుల విభాగం ఆదాయం 12.1% క్షీణించగా.. కన్జూమర్ 6.9%, తయారీ 9.1% చొప్పున నీరసించాయి. కమ్యూనికేషన్స్ నుంచి మాత్రం 18.8 శాతం జంప్‌చేసింది. ♦ ఆర్డర్ బుక్ 0.2 శాతం బలపడి 3.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వీటిలో భారీ డీల్స్ విలువ 0.9 బిలియన్ డాలర్లు. ♦ ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు గత 6 క్వార్టర్లకల్లా కనిష్టంగా 14.2 శాతంగా నమోదైంది. ♦ డిసెంబర్‌కల్లా 4,473 మంది ఉద్యోగులు తగ్గారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,40,234గా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 465 వద్ద ముగిసింది. -
ఇన్వెస్టర్స్ అలర్ట్: బడ్జెట్ 2024.. స్టాక్ మార్కెట్ స్ట్రాటజీ..!
మార్కెట్ ఆల్‌టైమ్‌హైలో ఉంది. రానున్న రోజుల్లో మార్కెట్ పయనం ఏ విధంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపర్లు ఎలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి? రానున్న బడ్జెట్ సెషన్లో ఎలాంటి కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. దాని ప్రభావం స్టాక్‌మార్కెట్‌పై ఎలా ఉండబోతుంది. మదుపరులు ఎలాంటి స్ట్రాటజీలను అనుసరించాలో తెలుసుకోవడానికి ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ శ్రీధర్ సత్తిరాజుతో బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు ముఖాముఖి ఈ వీడియోలో చూడండి. -
సాక్షి మనీ మంత్ర: స్టాక్‌మార్కెట్ల లాభాల పరుగు.. రికార్డ్ హై!
దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో కొత్త శిఖాలకు చేరాయి. బెంచ్‌మార్క్ సూచీలు లాభాలతో రికార్డ్ గరిష్టాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్, పేర్లతో పాటుగా ఐటీ స్టాక్‌లలో దూసుకుపోతున్న ర్యాలీ శుక్రవారం ఈక్విటీ సూచీలను రికార్డు స్థాయికి తీసుకువెళ్లింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 847 పాయింట్లు లేదా 1.18 శాతం లాభంతో 72,568 స్థాయి వద్ద ముగిసింది. ట్రేడ్ ముగించే ముందు సెన్సెక్స్ 72,721 వద్ద కొత్త జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. మరోవైపు నిఫ్టీ కూడా 247 పాయింట్లు లేదా 1.14 శాతం పెరిగి 21,895 వద్ద ముగిసే ముందు 21,928 వద్ద కొత్త శిఖరాగ్రాన్ని చేరింది. ఈరోజు ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, టెక్‌మహీంద్ర, ఎల్టీఐ మైండ్‌ట్రీ, టీసీఎస్‌ల షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక సిప్లా, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాబ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)