Market
-
సూచీలకు స్వల్ప నష్టాలు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాలు, వాణిజ్యపరమైన ఉద్రిక్తతల ప్రభావంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 80,004 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 24,194 వద్ద నిలిచింది. యుటిలిటీస్, పవర్, ఆటో, ఆయిల్‌అండ్‌గ్యాస్, సర్వీసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.ఐటీ, టెక్, టెలికమ్యూనికేషన్, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రంప్ తన ప్రమాణ స్వీకారం రోజు జనవరి 20న మెక్సికో, కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25%, చైనాల నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై పది శాతం పన్ను విధింపునకు అవసరమైన పత్రాలపై సంతకం చేస్తానంటూ తెలపడంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. సీవేజ్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎన్విరో ఇన్ఫ్రా ఇంజినీర్స్ ఐపీఓ చివరి రోజు నాటికి 89.90 రెట్ల స్పందన వచ్చింది ఇష్యూలో భాగంగా కంపెనీ 3.07 కోట్ల షేర్లు జారీ చేయగా, 277 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. క్యూఐబీ విభాగం 157 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 24 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. -
ఐపీవోలు.. అదే స్పీడ్
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు ఇటీవల ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు జోరు చూపుతూనే ఉన్నాయి. వచ్చే నెల(డిసెంబర్)లో 10 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ ద్వారా ఉమ్మడిగా రూ. 20,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నాయి. ఈ జాబితాలో సూపర్‌మార్ట్ దిగ్గజం విశాల్ మెగా మార్ట్తోపాటు.. బ్లాక్‌స్టోన్ పెట్టుబడులున్న డైమండ్ గ్రేడింగ్ కంపెనీ ఇంటర్నేషనల్ జెమ్మలాజికల్ ఇన్స్టిట్యూట్(ఇండియా), విద్యారుణాలందించే ఎన్బీఎఫ్సీ అవాన్సే ఫైనాన్షియల్ సరీ్వసెస్, టీపీజీ క్యాపిటల్ సంస్థ సాయి లైఫ్ సైన్సెస్, ఆసుపత్రుల చైన్ పారస్ హెల్త్‌కేర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ డీఏఎం క్యాపిటల్ అడ్వయిజర్స్, డయాగ్నోస్టిక్ చైన్ సురక్షా, ప్యాకేజింగ్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ మమతా మెషినరీ, ట్రాన్స్‌రైల్ లైటింగ్ ఉన్నాయి.వివిధ రంగాలు, విభిన్న పరిమాణంలో కంపెనీలు నిధుల సమీకరణ బాటలో సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తాజా ఫలితాలు స్టాక్ మార్కెట్లో సానుకూల సెంటిమెంటుకు తెరతీయనున్నట్లు ఆన్లైన్ బ్రోకరేజీ ట్రేడ్జినీ సీవోవో త్రివేష్.డి. అభిప్రాయపడ్డారు. దీంతో ప్రైమరీ మార్కెట్ మరింత కళకళలాడే వీలున్నట్లు అంచనా వేశారు. ఈ ఏడాది(2024) ఐపీవోలకు అత్యంత ప్రోత్సాహకరంగా సాగినప్పటికీ ఇటీవల కొంతమేర ప్రతికూల ధోరణి నెలకొన్నట్లు తెలియజేశారు. ఇష్యూల వివరాలు విశాల్ మెగా మార్ట్ ఐపీవో ద్వారా రూ. 8,000 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రమోటర్ సమయత్ సరీ్వసెస్ ఎల్ఎల్పీ వాటాను విక్రయించనుంది. ఇక జెమ్మలాజికల్ ఇన్స్టిట్యూట్ రూ. 4,000 కోట్ల సమీకరణపై కన్నేసింది. దీనిలో భాగంగా రూ. 1,250 కోట్లు తాజా ఈక్విటీ జారీసహా.. రూ. 2,750 కోట్ల విలువైన షేర్లను బ్లాక్‌స్టోన్ సంస్థ, ప్రమోటర్ బీసీపీ ఏషియా–2 టాప్కో పీటీఈ ఆఫర్ చేయనుంది. కాగా.. వార్బర్గ్ పింకస్ సంస్థ ఒలివ్ వైన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేసిన అవాన్సే ఫైనాన్షియల్ రూ. 3,500 కోట్లు సమీకరించనుంది. తాజా ఈక్విటీ ద్వారా రూ. 1,000 కోట్లు, ప్రస్తుత వాటాదారుల షేర్ల విక్రయం ద్వారా రూ. 2,500 కోట్లు అందుకోనుంది. ఈక్విటీ నిధులను మూలధన పటిష్టతకు వెచి్చంచనుంది. రికార్డ్ సమీకరణ ఈ ఏడాది ఇప్పటికే 75 కంపెనీలు ఉమ్మడిగా రూ. 1.3 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించాయి. ఇది రికార్డ్ కాగా.. జాబితాలో హ్యుందాయ్ మోటార్ ఇండియా, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్(ఫస్ట్‌క్రై), ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ చేరాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ ద్వారా గతేడాది(2023)లో 57 కంపెనీలు రూ. 49,436 కోట్లు సమకూర్చుకున్నాయి. సుమారు 236 కంపెనీలు 2021–25 మధ్య కాలంలో ఐపీవోలకు వచ్చాయి. సగటున 27 శాతం లిస్టింగ్ లాభాలను అందించడం గమనార్హం.సురక్ష: రూ. 420–441 సమీకృత డయాగ్నోస్టిక్ చైన్ సురక్షా డయాగ్నోస్టిక్ పబ్లిక్ ఇష్యూ శుక్రవారం(29న) ప్రారంభంకానుంది. డిసెంబర్ 3న ముగియనున్న ఇష్యూకి రూ. 420–441 ధరల శ్రేణిని కంపెనీ తాజాగా ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు 1,91,89,330 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 846 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. అయితే ఈక్విటీ జారీ లేనందున ఇష్యూ ద్వారా కంపెనీకి ఎలాంటి నిధులు లభించబోవు. -
మళ్లీ అవకాశం రాదేమో! తగ్గిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రెండు సెషన్ల నుంచి ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరుతున్నాయి. ఇప్పటివరకు కొంత సేఫ్డ్ అసెట్‌గా భావించే బంగారం పెట్టుబడులను ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు మంగళవారం యూటర్న్ తీసుకున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,800 (22 క్యారెట్స్), రూ.77,240 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.1200, రూ.1310 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1310 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,800 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,240 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1200 తగ్గి రూ.70,950కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.1310 దిగజారి రూ.77,390 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధర కూడా ఈ రోజు భారీగానే పడిపోయింది. సోమవారంతో పోలిస్తే కేజీ వెండి రేటు రూ.2,500 తగ్గి రూ.98,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రెండు ఐపీవోలకు సెబీ గ్రీన్ సిగ్నల్
రియల్టీ సంస్థ కల్పతరు లిమిటెడ్‌తోపాటు, హైప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ యూనిమెక్ ఏరోస్పేస్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోలో కల్పతరు పూర్తిగా తాజా ఈక్విటీని జారీ చేయనుంది. యూనిమెక్ ఏరోస్పేస్ తాజాగా ఈక్విటీ జారీసహా ప్రమోటర్లు షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో రెండు కంపెనీలు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి.రూ.1,590 కోట్లపై దృష్టికల్పతరు కంపెనీ ప్రాస్పెక్టస్ ప్రకారం సంస్థ ఐపీవోలో భాగంగా రూ.1,590 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఐపీవో నిధుల్లో దాదాపు రూ.1,193 కోట్లు కల్పతరు గ్రూప్ కంపెనీ రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. కల్పతరు గ్రూప్‌లో కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్, ప్రాపర్టీ సొల్యూషన్స్(ఇండియా), శ్రీ శుభం లాజిస్టిక్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: అంతా ఓకే.. కేవలం వ్యక్తులపైనే ఆరోపణలు..రూ.500 కోట్ల సమీకరణఐపీవోలో భాగంగా యూనిమెక్ ఏరోస్పేస్ రూ.250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో రూ.250 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో కొంతమేర మెషీనరీ, పరికరాల కొనుగోలు ద్వారా విస్తరణకు వినియోగించనుంది. ఈ బాటలో వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, రుణ చెల్లింపులు తదితరాలకు సైతం నిధులను వెచ్చించనుంది. -
ఐపీవోకు తొలి ఎస్ఎం రీట్
దేశీయంగా తొలిసారి రిజిస్టర్డ్ స్మాల్ మీడియం (ఎస్ఎం) రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్) పబ్లిక్ ఇష్యూకి తెరలేవనుంది. డిసెంబర్ 2న ప్రారంభంకానున్న ఇష్యూ 4న ముగియనుంది. తద్వారా రూ.353 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వెల్లడించింది. సంస్థ నుంచి వెలువడుతున్న తొలి ఎస్ఎం రీట్ పథకం ప్రాప్‌షేర్ ప్లాటినాకు రూ.10–10.5 లక్షల ధరల శ్రేణిని ప్రకటించింది.ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు ఎలాంటి యూనిట్లను ఆఫర్ చేయకపోగా.. పూర్తిగా ప్లాటినా యూనిట్లను జారీ చేయనున్నట్లు ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(పీఎస్‌ఐటీ) పేర్కొంది. ఇష్యూ నిధులను ప్లాటినా ఎస్పీవీకిగల ప్రెస్టీజ్ టెక్ ప్లాటినా కొనుగోలుకి వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ప్రాప్‌షేర్ ప్లాటినా తరహా ఎస్ఎం రీట్స్వల్ల ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ ఆస్తుల్లో పెట్టుబడులకు వీలు కలగనున్నట్లు ప్రాపర్టీ షేర్ డైరెక్టర్ కునాల్ మోక్టన్ తెలియజేశారు. నిరవధిక అద్దె రిటర్నులు(ఈల్డ్స్), పెట్టుబడుల వృద్ధి ద్వారా హైబ్రిడ్ రాబడులకు వీలున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: జీపేలో నిమిషానికి రూ.1.. నెలకు రూ.40 వేలు!ప్రాప్‌షేర్ ప్లాటినా 2,46,935 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని కలిగి ఉంది. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్‌వద్ద ప్రెస్టీజ్ టెక్ ప్లాటినాకు చెందిన లీడ్ గోల్డ్ ఆఫీస్ బిల్డింగ్‌లో ఈ ఆస్థిని కలిగి ఉంది. యూఎస్ టెక్ కంపెనీకి పూర్తిస్థాయిలో 9 ఏళ్ల కాలానికి లీజుకి ఇచ్చేందుకు ప్రతిపాదించింది. ఇందుకు 4.6 ఏళ్ల సగటు వెయిటేజీ లాకిన్తోపాటు ప్రతీ మూడేళ్లకు 15 శాతం అద్దె పెంపు ప్రాతిపదికను ఎంపిక చేసుకుంది. వెరసి తాజా పథకం 2026లో ఇన్వెస్టర్లకు 9 శాతం పంపిణీ ఈల్డ్‌ను అంచనా వేస్తోంది. 2027లో 8.7 శాతం, 2028లో 8.6 శాతం చొప్పున రిటర్నులకు వీలుంది. యూనిట్లను బీఎస్ఈలో లిస్ట్ చేయనుంది. -
రెండోరోజూ మహా ర్యాలీ!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రాతినిధ్యం వహించిన మహాయుతి కూటమి ఆఖండ విజయంతో బుల్ రెండోరోజూ రంకెలేసింది. సెన్సెక్స్ 993 పాయింట్లు పెరిగి 80 వేల స్థాయిపైన 80,110 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 315 పాయింట్లు లాభపడి 24 వేల స్థాయిపైన 24,221 వద్ద నిలిచింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,076 పాయింట్లు బలపడి 80,193 వద్ద, నిఫ్టీ 346 పాయింట్లు ఎగసి 24,253 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 1,356 పాయింట్లు ఎగసి 80,473 వద్ద, నిఫ్టీ 445 పాయింట్లు దూసుకెళ్లి 24,352 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 12 పైసలు బలపడి 84.29 స్థాయి వద్ద స్థిరపడింది. అమెరికా ఆర్థికమంత్రిగా అంతర్జాతీయ ఇన్వెస్టర్, మార్కెట్‌కు అనుకూల ‘స్కాట్ బెసెంట్’ను ట్రంప్ నామినేట్ చేయడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్, సింగపూర్ మినహా అన్ని దేశాల సూచీలు 1.50% ర్యాలీ చేశాయి. యూరప్ మార్కెట్లు అరశాతం లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు ఒకశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. → సెన్సెక్స్ సూచీలో 30కి 26 షేర్లూ లాభాలతో ముగిశాయి. అత్యధికంగా ఎల్అండ్టీ, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 4 – 2.50% లాభపడ్డాయి. బీఎస్ఈలో రంగాల వారీగా ఇండ్రస్టియల్, ఆయిల్‌అండ్‌గ్యాస్ 3%, ఇంధన 2.50%, రియల్టీ, బ్యాంకెక్స్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ 2%, ఫార్మా సూచీలు ఒకశాతం లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2% నుంచి ఒకటిన్నర శాతం పెరిగాయి. → అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు మిశ్రమంగా స్పందించాయి. ఈ గ్రూప్‌లో పదింటికిగానూ అయిదు కంపెనీల షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ 2.55%, ఏసీసీ 2.54%, అదానీ ఎంటర్ప్రైజెస్ 1.26%, అదానీ విల్మార్ 2%, అంబుజా సిమెంట్స్ 1% లాభపడ్డాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 8%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 4%, అదానీ పవర్ 3%, ఎన్డీటీవీ 2%, అదానీ టోటల్ గ్యాస్ 1.50% నష్టపోయాయి. → బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో చోటు దక్కించుకోవడంతో జొమాటో కంపెనీ షేరు 3.58% పెరిగి రూ.274 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 7.62% ఎగసి రూ.284 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇదే సూచీలో స్థానం కోల్పోయిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేరు 2.5% నష్టపోయి రూ. 953 వద్ద ముగిసింది. గడిచిన రెండు రోజుల్లో సెన్సెక్స్ 2,954 పాయింట్లు(4%) ర్యాలీ చేయడంతో రూ.14.20 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.439.58 లక్షల కోట్ల (5.22 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. సోమవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.6.11 లక్షల కోట్లు ఆర్జించారు. -
హమ్మయ్య.. పసిడి ప్రియులకు భారీ శుభవార్త
Gold Price Today: బంగారం ధరల తగ్గుదల కోసం వారం రోజులకు పైగా ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు ఎట్టకేలకు భారీ ఉపశమనం లభించింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు సోమవారం (నవంబర్ 25) భారీగా దిగివచ్చాయి. దీంతో కొనుగోలుకు ఇదే మంచి తరుణమని పసిడి ప్రియులు భావిస్తున్నారు.దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు నేడు ఎంత మేర తగ్గాయన్నది పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.72,000 వద్దకు దిగివచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.1090 తగ్గి రూ.78,550 వద్దకు క్షీణించింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు క్షీణించాయి.దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.1000 తగ్గి రూ.72,150 వద్దకు క్షీణించగా, 24 క్యారెట్ల పసిడి రూ.1090 కరిగి రూ.78,700 వద్దకు వచ్చేసింది.ఇదీ చదవండి: నెలవారీ సంపాదనలో పొదుపు.. ఏదైనా ఆర్థిక సూత్రం ఉందా?మరోవైపు వెండి ధరలు (Silver Price Today) కూడా నేడు మోస్తరుగా క్షీణించాయి. హైదరాబాద్‌లో వెండి కేజీకి రూ.500 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.1,00,500 వద్దకు దిగివచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,061.64 పాయింట్లు లేదా 1.34 శాతం లాభంతో 80,178.75 వద్ద, నిఫ్టీ 343.95 పాయింట్లు లేదా 1.44 శాతం లాభంతో 24,251.20 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, లార్సెన్ & టూబ్రో, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైన సంస్థలు చేరగా.. జేఎస్‌డబ్ల్యు స్టీల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ 395 పాయింట్లు లాభపడి 24,302కు చేరింది. సెన్సెక్స్ 1,253 పాయింట్లు ఎగబాకి 80,386 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.53 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75.2 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.35 శాతం పెరిగింది. నాస్డాక్ 0.16 శాతం పుంజుకుంది.ఇటీవల భారీగా పడిన మార్కెట్లు షార్ట్‌కవరింగ్‌తో సోమవారం పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో మార్కెట్లు పరుగు పెడుతున్నట్లు చెబుతున్నారు. అయితే ప్రపంచస్థాయిలో రాజకీయ, భౌగోళిక ఆందోళనలు, దీంతో పెరుగుతున్న ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు వివరించారు. మరోవైపు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతుండటంతో రూపాయి నీరసిస్తోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మహారాష్ట్ర ఫలితాల ఎఫెక్ట్.. మార్కెట్లు పుంజుకునే చాన్స్
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు, ప్రపంచ రాజకీయ, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక గణాంకాలు ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమి శాసించడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు తెలియజేశారు. దీంతో తొలి రోజు మార్కెట్లు సానుకూలంగా ప్రారంభంకావచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అంచనా వేశారు. దీనికితోడు గత వారం చివర్లో మార్కెట్లు హైజంప్ చేయడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషించారు. కొద్ది వారాలుగా కరెక్షన్ బాటలో సాగుతున్న మార్కెట్లలో శుక్రవారం రిలీఫ్ ర్యాలీకి తెరలేచింది. గత ఐదు నెలల్లోలేని విధంగా సెన్సెక్స్ 1,961 పాయింట్లు దూసుకెళ్లగా.. నిఫ్టీ 557 పాయింట్లు ఎగసిన సంగతి తెలిసిందే. అయితే తదుపరి దశలో పలు దేశ, విదేశీ అంశాలు ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా భావిస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో ఇండియా కూటమి విజయం సాధించడం, రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధ భయాలు పెరగడం వంటి అంశాలను ఈ సందర్భంగా ఖేమ్కా, మీనా ప్రస్తావించారు. జీడీపీ.. కీలకం బుధవారం(27న) త్రైమాసిక ప్రాతిపదికన జులై–సెపె్టంబర్(క్యూ3)కు యూఎస్ జీడీపీ గణాంకాల రెండో అంచనా వెలువడనుంది. ముందస్తు అంచనాలో వార్షికంగా క్యూ3లో 2.8 శాతం వృద్ధిని సాధించింది. ఈ బాటలో ఫెడరల్ రిజర్వ్ మినిట్స్ విడుదల కానున్నాయి. ఎఫ్‌వోఎంసీ గత పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.5–4.75 శాతంగా అమలవుతున్నాయి. ఈ నిర్ణయాల వెనుక అంశాలను మినిట్స్ వెల్లడించనున్నాయి. అక్టోబర్ నెలకు కీలక పీసీఈ ధరల గణాంకాలు విడుదలకానుండగా.. 29న నవంబర్ నెలకు యూరో ప్రాంత ద్రవ్యోల్బణ అంచనాలు తెలియనున్నాయి. ఇక దేశీయంగా జులై–సెపె్టంబర్(క్యూ2)లో ఆర్థిక వ్యవస్థ పనితీరు గణాంకాలు వెలువడనున్నాయి. ఏప్రిల్–జూన్(క్యూ1)లో జీడీపీ 6.7 శాతం పుంజుకుంది. ఇదేవిధంగా ప్రభుత్వం అక్టోబర్ నెలకు మౌలిక రంగ పురోగతి గణాంకాలు ప్రకటించనుంది. సెపె్టంబర్లో మౌలిక రంగం 2 శాతం బలపడింది. ఇతర ప్రభావిత అంశాలు ప్రపంచస్థాయిలో రాజకీయ, భౌగోళిక ఆందోళనలు, దీంతో పెరుగుతున్న ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు వివరించారు. మరోవైపు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతుండటంతో రూపాయి నీరసిస్తున్న విషయం విదితమే. వీటికితోడు యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ మెరుగుపడుతుండటంతో కొద్ది రోజులుగా విదేశీ పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నాయి. ఈ అంశాలు దేశీయంగా మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశించే వీలున్నట్లు మీనా, ఖేమ్కా తెలియజేశారు. కాగా.. దేశీయంగా మౌలిక రంగ అభివృద్ధి, రాజకీయ సుస్థిరతకు మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు దోహదపడగలవని మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పల్క అరోరా చోప్రా పేర్కొన్నారు. ఇది స్టాక్ మార్కెట్లకు బలిమిని ఇవ్వగలదని అభిప్రాయపడ్డారు. అయితే వారాంతాన వెలువడను న్న జీడీపీ, ‘మౌలిక’ గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గత వారమిలా దేశీ స్టాక్ మార్కెట్లు భారీ అమ్మకాల నుంచి గత వారం చివర్లో యూటర్న్ తీసుకున్నాయి. దీంతో గత వారం మార్కెట్లు నికరంగా లాభాలతో ముగిశాయి. ఆటుపోట్ల మధ్య సెన్సెక్స్ 1,537 పాయింట్లు(2 శాతం) జమ చేసుకుని 79,117 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 375 పాయింట్లు(1.6 శాతం) బలపడి 23,907 వద్ద స్థిరపడింది. వెరసి సెన్సెక్స్ 79,000ను అధిగమించగా.. నిఫ్టీ 24,000 పాయింట్లకు చేరువైంది. అయితే బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.7% లాభపడగా.. స్మాల్ క్యాప్ 0.5 శాతమే పుంజుకుంది.అమ్మకాలకే ఎఫ్‌పీఐల మొగ్గు నవంబర్‌లో రూ. 26,533 కోట్లు ఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెలలోనూ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. వెరసి నవంబర్‌లో ఇప్పటి(22)వరకూ నికరంగా రూ. 26,533 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇందుకు ప్రధానంగా చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీయడం, దేశీ కార్పొరేట్ క్యూ2 ఫలితాలు నిరాశపరచడం, ప్రపంచ అనిశి్చతులు, డాలరు బలపడటం వంటి అంశాలు కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే అక్టోబర్‌లో నమోదైన విక్రయాలతో పోలిస్తే అమ్మకాల తీవ్రత తగ్గినట్లు తెలియజేశారు. అక్టోబర్‌లో ఎఫ్‌పీఐలు నికరంగా 11.2 బిలియన్ డాలర్ల(రూ. 94,107 కోట్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు సెపె్టంబర్లో అంతక్రితం 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
విదేశీ ‘స్టాక్స్’ షాపింగ్ చేద్దామా!
‘పెట్టుబడుల్లో ఉచితంగా వచ్చేది ఏదైనా ఉందంటే అది వైవిధ్యమే’ అన్నది ఆధునిక ఫైనాన్స్‌కు పితామహుడిగా చెప్పుకునే, నోబెల్ పురస్కార గ్రహీత హ్యారీ మర్కోవిజ్ అభిప్రాయం. వైవిధ్యం అంటే పెట్టుబడులన్నింటినీ తీసుకెళ్లి ఏదో ఒక సాధనంలో ఉంచకపోవడం. మార్కెట్ అస్థిరతలు, ఊహించని నష్టాల నుంచి పెట్టుబడులకు ఈ వైవిధ్యమే రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈక్విటీలు, ఎఫ్డీలు, బాండ్లు, బంగారం, రియల్ ఎస్టేట్ ఇలా భిన్న సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకోవాలి. ఇక ఈక్విటీ పెట్టుబడుల్లోనూ కొంత మేర అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ వైవిధ్యాన్ని మరింత విస్తృతం చేసుకున్నట్టు అవుతుంది.భారత్ శరవేగంగా వృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటప్పుడు ఈక్విటీ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని వేరే దేశానికి ఎందుకు కేటాయించుకోవడం అన్న సందేహం రావచ్చు. కానీ, ఒక మార్కెట్‌కే పరిమితం కావడం వల్ల ఆ దేశానికి సంబంధించి ఆర్థికపరమైన రిస్క్‌ల ప్రభావం పెట్టుబడులపై అధికంగా ఉంటుంది. ఇది రాబడులపైనా ప్రభావం చూపిస్తుంది. గడిచిన నాలుగైదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే.. నిఫ్టీ 50 సూచీ కంటే అమెరికా ఎస్అండ్పీ 500 (ప్రధాన సూచీ) అధిక రాబడులు అందించింది. ఇదే కాలంలో అమెరికా వృద్ధి రేటు కంటే భారత్ వృద్ధి రేటు మూడు రెట్లు అధికం. అయినా కానీ, రాబడుల్లో ఎస్అండ్పీ సూచీయే ముందుంది. దిగ్గజ టెక్నాలజీ కంపెనీలకు చిరునామా అమెరికా స్టాక్ మార్కెట్. అలాంటి గొప్ప కంపెనీల్లో పెట్టుబడులతో వైవిధ్యం మరింత బలపడుతుందన్నది నిపుణుల సూచన. ఈక్విటీ పెట్టుబడుల వైవిధ్యంతో వచ్చే ప్రయోజనాలపై అవగాహన కలి్పంచే కథనమే ఇది. వైవిధ్యం ఎందుకు..? భారత్‌కు వెలుపల ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది ఇన్వెస్టర్ రిస్క్ సామర్థ్యం ఆధారంగానే ఉంటుంది. గడిచిన రెండు మూడు దశాబ్దాల కాలంలో అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లను పరిశీలిస్తే.. గొప్ప పనితీరు చూపించిన రెండు మార్కెట్లు భారత్, అమెరికా. అందుకే ఈ రెండు ఈక్విటీ మార్కెట్ల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. రిస్క్ సమతుల్యతతోపాటు గొప్ప రాబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. అమెరికా, భారత్ ఈక్విటీలు గత 20 ఏళ్ల కాలంలో గొప్ప రాబడులు ఇచి్చనప్పటికీ వీటి మధ్య సహ సంబంధం తక్కువ. అభివృద్ధి చెందిన ఈక్విటీ మార్కెట్లకు, భారత్‌కు మధ్య పనితీరు విషయంలో 60–80 శాతం వరకు పరస్పర సంబంధం ఉంటోంది. అదే అమెరికాకు వచ్చేటప్పటికి (2008 ఆరి్థక మాంద్యం, కరోనా మినహా) ఇది 50 శాతమే. కనుక రిస్క్, రాబడులను బ్యాలన్స్ చేసుకోవడమే కాదు.. రెండు ఆరి్థక వ్యవస్థల్లోని అనుకూలతల నుంచి ప్రయోజనాలు పొందొచ్చు.రూపాయి క్షీణతకు హెడ్జింగ్ ప్రతి కొన్నేళ్లకోసారి యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు బాటలో నడుస్తుంటుంది. ఆ సమయంలో భారత్ సహా వర్ధమాన దేశాల కరెన్సీలతో పోలి్చతే యూఎస్ డాలర్ బలోపేతం కావడం గమనించొచ్చు. 2011లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 45 డాలర్ల వద్ద ఉంది. ఇప్పుడు 84 డాలర్లను దాటేసింది. ట్రంప్ 2.0 నాలుగేళ్ల పాలనలో రూపాయి మరో 6–8 శాతం క్షీణిస్తుందన్న అంచనాలున్నాయి. అమెరికా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి రూపాయి విలువ క్షీణతతో రెండు రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అమెరికా ఈక్విటీల్లో పెట్టుబడుల వృద్ధికితోడు.. పెట్టుబడుల ఉపసంహరణతో మరిన్ని రూపాయిలు (విలువ క్షీణత వల్ల) చేతికి వస్తాయి. రూపాయి విలువ క్షీణత అన్నది యూఎస్ ఈక్విటీ రాబడులను ఇతోధికం చేస్తుంది. సాధారణంగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు క్రమంలో విదేశీ ఇన్వెస్టర్లు వర్ధమాన మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటుంటారు. ఆ సమయంలో మన ఈక్విటీలు ప్రతికూలతలను చూస్తుంటాయి.భవిష్యత్ అవసరాల కోసం.. మన దేశం నుంచి ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు అమెరికాకు వెళుతున్నారు. అంతేకాదు విద్య అనంతరం ఉపాధి కోసం వెళుతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. ఇలాంటి వారికి యూఎస్ పెట్టుబడులు అనుకూలం. అధిక ఆదాయ వర్గాలు విదేశీ పర్యటనలకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందుకోసం డాలర్ల రూపంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. పిల్లలను విదేశాల్లో చదివించుకోవాలంటే యూఎస్ డాలర్ మారకంలోనే చెల్లింపులు చేయాల్సి వస్తుంది. విదేశీ కోర్సుల వ్యయం ఏటా నిరీ్ణత శాతం మేర పెరుగుతుంది. అదే సమయంలో ఏటా రూపాయి విలువ క్షీణతతో ఆ విద్యా వ్యయం ఇంకాస్త అధికమవుతోంది. అందుకే డాలర్ మారకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూపాయి విలువ క్షీణతతో ఏర్పడే భారాన్ని తొలగించుకోవచ్చు. రూపాయి అస్థిరతలను తగ్గించుకోవచ్చు. ఎలా ఇన్వెస్ట్ చేయాలి..? భారత స్టాక్స్ మాదిరే నేరుగా అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా మ్యూచువల్ ఫండ్స్/ఈటీఎఫ్‌ల ద్వారా ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. యూఎస్ స్టాక్ బ్రోకర్లతో మన దేశ స్టాక్ బ్రోకర్లు కొందరికి ఒప్పందాలు ఉన్నాయి. అలాంటి దేశీ బ్రోకర్ ద్వారా అకౌంట్ ప్రారంభించి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మోతీలాల్ ఓస్వాల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తదితర సంస్థలు ఈ సేవలు అందిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ → యాక్సిస్ నాస్డాక్ 100 ఎఫ్‌వోఎఫ్ → ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ నాస్డాక్ 100 ఎఫ్‌వోఎఫ్ → బంధన్ యూఎస్ ఈక్విటీ ఎఫ్‌వోఎఫ్ → ఎడెల్వీజ్ యూఎస్ టెక్నాలజీ ఈక్విటీ ఎఫ్‌వోఎఫ్ → కోటక్ నాస్డాక్ 100 ఎఫ్‌వోఎఫ్, → ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్ ఫ్రాంక్లిన్ యూఎస్ అపార్చునిటీస్ ఫండ్ → మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఎఫ్‌వోఎఫ్ → ఇన్వెస్కో ఇండియా నాస్డాక్ 100 ఈటీఎఫ్ ఎఫ్‌వోఎఫ్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.రెట్టింపు కాంపౌండింగ్ వాటాదారులకు సంపదను సమకూర్చడంలో యూఎస్, భారత ఈక్విటీ మార్కెట్లు గత కొన్ని దశాబ్దలుగా ఎంతో మెరుగైన పనితీరు చూపిస్తున్నాయి. ఈ రెండు మార్కెట్లను భిన్నమైన వృద్ధి చోదకాలు నడిపిస్తుంటాయి. అయినా కొన్ని ఏకరూప అంశాలు కూడా ఉన్నాయి. రెండు దేశాల్లోనూ గణనీయ సంఖ్యలో వినియోగదారులున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు. మార్కెట్ ఆధారిత ఆరి్థక వ్యవస్థలు. అందుకే మిగిలిన మార్కెట్లకు భిన్నంగా అమెరికా, భారత్ దీర్ఘకాలంగా ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులు అందిస్తున్నాయి. ఈ రెండు దేశాల స్టాక్స్‌లోనూ పెట్టుబడులు సంపద సృష్టికి రెండు ఇంజన్ల మాదిరిగా పనిచేస్తాయి. వర్ధమాన మార్కెట్లలో అత్యధిక వృద్ధి అవకాశాలు భారత ఈక్విటీల ద్వారా.. టెక్నాలజీ, హెల్త్‌కేర్, కన్జ్యూమర్ గూడ్స్ పరంగా దిగ్గజ కంపెనీల్లో ఎక్స్పోజర్ అమెరికన్ ఈక్విటీల ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ)ని ప్రారంభించింది. ఇక్కడ ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా ప్రారంభించడం ద్వారా యూఎస్‌కు చెందిన 50 స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ ద్వారా ఖాతా తెరిచి, బ్యాంక్ ఖాతా నుంచి ఫండ్స్ బదిలీ చేసుకుని షేర్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఒక ఆరి్థక సంవత్సరంలో ఒకరు గరిష్టంగా 2,50,000 డాలర్లను విదేశాల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉంది స్థిరత్వం.. రాబడులు ఆరి్థక మందగమన సమయాల్లో అమెరికా, భారత మార్కెట్లు ఒకే మాదిరి పనితీరు చూపించాలని లేదు. గడిచిన 20 ఏళ్లలో యూఎస్, భారత ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టినట్టయితే భారీ మార్కెట్ పతనాల్లో నష్టాలు తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చాలా అరుదుగానే ఈ రెండు ఒకే మాదిరి ప్రవర్తిస్తాయి. అంతర్జాతీయ సంక్షోభాల్లో రూపాయితో డాలర్ బలపడుతుంటుంది. దీంతో ఆ సమయంలో యూఎస్ పెట్టుబడులు అదనపు విలువను సమకూరుస్తాయి. ఇదే నష్టాలను తగ్గించి, పెట్టుబడులకు స్థిరత్వాన్ని ఇస్తుంది. అమెరికా స్టాక్స్, భారత స్టాక్స్‌కు 50:50 రేషియోలో పెట్టుబడులు కేటాయించుకోవడం వల్ల రిస్క్ ఆధారిత మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రిస్‌్కను పరిమితం చేసుకుని, వీలైనంత అధిక రాబడులు సమకూర్చుకోవడమే విజయవంతమైన పెట్టుబడి విధానం రహస్యం. భారత ఇన్వెస్టర్లకు విదేశీ స్టాక్స్ అన్నవి సమతూకాన్నిస్తాయి. ఒకటి అభివృద్ధి చెందిన దేశం అయితే, రెండేది 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో పనిచేస్తున్న దేశం. రెండింటిలోనూ వృద్ధి అవకాశాలను సొంతం చేసుకోవడం ఇన్వెస్టర్ల ముందున్న మెరుగైన మార్గాల్లో ఒకటి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఐపీవోలో సెక్యూరిటీ డిపాజిట్ రద్దు
న్యూఢిల్లీ: ఏదైనా కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వచ్చేముందు స్టాక్ ఎక్స్చేంజీల వద్ద తప్పనిసరిగా డిపాజిట్ చేయవలసిన నిబంధనలను తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రద్దు చేసింది. ఐపీవో చేపట్టే ప్రణాళికలుగల అన్‌లిస్డెడ్ కంపెనీలకు సెక్యూరిటీ డిపాజిట్‌పై వెసులుబాటు కల్పిస్తూ సెబీ తాజా నిర్ణయాన్ని తీసుకుంది.దీంతో ఇకపై ఇష్యూ పరిమాణంలో 1 శాతాన్ని స్టాక్ ఎక్స్చేంజీల వద్ద డిపాజిట్ చేయవలసిన అవసరం ఉండదు. సులభతర బిజినెస్ నిర్వహణకు వీలు కల్పించే బాటలో సెబీ వెనువెంటనే అమల్లోకి వచ్చేవిధంగా సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇప్పటివరకూ పబ్లిక్ ఇష్యూ ముగిశాక సెక్యూరిటీ డిపాజిట్‌ను స్టాక్ ఎక్స్చేంజీలు తిరిగి చెల్లిస్తున్నాయి.ఐపీవో లేదా రైట్స్‌కు ముందు 1 శాతం మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చేసే నిబంధన రద్దుపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సెబీ చర్చాపత్రానికి తెరతీసింది. ప్రస్తుతం ఐపీవో ప్రక్రియలో ఇన్వెస్టర్ల ఖాతా లకు అస్బా అమలుకావడం, యూపీఐ చెల్లింపులు, డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్ల అలాట్మెంట్ అమలు జరుగుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ డిపాజిట్ అవసరానికి కాలం చెల్లినట్లు సెబీ వివరించింది. -
బంగారం డబుల్ హ్యాట్రిక్..
Gold Price Today: దేశంలో బంగారం ధరలు డబుల్ హ్యాట్రిక్ కొట్టాయి. వరుసగా ఆరో రోజూ పసిడి ధరలు భారీగా ఎగిశాయి. నేడు (నవంబర్ 23) పెరిగిన ధరలతో కొత్త మార్కులను తాకాయి. ఆగకుండా పెరుగుతున్న ధరలు పసిడి కొనుగోలుదారులను నిరాశకు గురి చేస్తున్నాయి.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.750 పెరిగి రూ.73,000 లను తాకింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రూ.820 ఎగసి రూ.79,640 వద్దకు చేరింది. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు బెంబేలిత్తించాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే ఇక్కడా పసిడి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.750 పెరిగి రూ.73,150 వద్దకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.820 పెరిగి రూ.79,790 వద్దకు ఎగిసింది.ఇదీ చదవండి: పసిడిపై పైచేయి.. సిల్వర్ ఈటీఎఫ్‌లకు డిమాండ్మరోవైపు వెండి ధరలు (Silver Price Today) మాత్రం నేడు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.1,01,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఎంతకీ ఆగని పసిడి.. నేడు మరింత భారీగా..
Gold Price Today: దేశంలో బంగారం ధరలు ఎంతకీ ఆగకుండా పెరుగుతున్నాయి. వరుసగా ఐదు రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు నేడు (నవంబర్ 22) మరింత భారీగా ఎగిశాయి. దీంతో 10 గ్రాముల మేలిమి బంగారం ధర మళ్లీ రూ.80 వేల దిశగా పయనిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఈరోజు ఎంత పెరిగాయో ఇక్కడ తెలుసుకుందాం..తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.72,250 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.870 ఎగసి రూ.78,820 వద్దకు పెరిగింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి.అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.800 పెరిగి రూ.72,400 వద్దకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.870 పెరిగి రూ.78,970 లకు ఎగిసింది.ఇదీ చదవండి: కొత్త క్రెడిట్ కార్డ్.. లైఫ్ టైమ్ ఫ్రీ!ఇక వెండి ధరల (Silver Price Today) విషయానికి వస్తే.. నేడు ఎలాంటి మార్పు లేకుండా నిలకడ ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.10,01,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 378.88 పాయింట్లు లేదా 0.49 శాతం నష్టంతో 77,199.50 వద్ద, నిఫ్టీ 167.85 పాయింట్లు లేదా 0.71 శాతం నష్టంతో 23,350.65 వద్ద నిలిచాయి.పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రా టెక్ సిమెంట్, హిందాల్కో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దడ పుట్టిస్తున్న పసిడి పెరుగుదల
Gold Price Today: దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనుగోలుదారులకు దడ పుట్టిస్తోంది. నాలుగు రోజులుగా పసిడి ధరలు ఆగకుండా పెరుగుతున్నాయి. తాజాగా గురువారం (నవంబర్ 21) కూడా పసిడి రేట్లు ఎగశాయి.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి రూ.71,450 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.330 ఎగసి రూ.77,950 వద్దకు పెరిగింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి.ఇక ఢిల్లీలోనూ పసిడి ధరల పెరుగుదల కొనసాగింది. నేడు ఇక్కడ 10 గ్రాముల బంగారం ధర రూ.78 వేలు దాటింది. 22 క్యారెట్ల బంగారం రూ.300 పెరిగి రూ.71,600 వద్దకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.330 ఎగిసి రూ.78,100 లను తాకింది.ఇదీ చదవండి: ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానాకాగా వెండి ధరలు (Silver Price Today) నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.10,01,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం హ్యాట్రిక్ మోత!
Gold Price Today: దేశంలో బంగారం ధరల పరుగు కొనసాగుతోంది. బుధవారం (నవంబర్ 20) పసిడి రేట్లు హ్యాట్రిక్ మోత మోగించాయి. వరుసగా మూడో రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి.దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు పుత్తడి ధరలు ఏ స్థాయిలో పెరిగాయో పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.500 పెరిగి రూ.71,150 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.550 ఎగసి రూ.77,620 వద్దకు పెరిగింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే రీతిలో ధరలు పుంజుకొన్నాయి.దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ.500 పెరిగి రూ.71,300 వద్దకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.550 ఎగిసి రూ.77,770 వద్దకు చేరింది.ఇదీ చదవండి: ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానానిలకడగా వెండిSilver Price Today: దేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.10,01,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఈ ఏడాది ఇదే అతిపెద్ద ఐపీవో..!
ముంబై: సూపర్‌మార్కెట్ చైన్ విశాల్ మెగా మార్ట్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్లో ఐపీవో చేపట్టనుంది. తద్వారా రూ. 8,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. పీఈ దిగ్గజం కేదారా క్యాపిటల్ అండ్ పార్ట్నర్స్కు పెట్టుబడులున్న కంపెనీ లిస్టయితే 2024 ఏడాదికి అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది.అంతేకాకుండా దేశీ ప్రైమరీ మార్కెట్లో నాలుగో పెద్ద ఐపీవోగా రికార్డులకు ఎక్కనుంది. మార్చితో ముగిసిన గతేడాది(2023–24) రూ. 8,912 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 462 కోట్ల నికర లాభం ఆర్జించింది.డిసెంబర్ మధ్యలో.. నిజానికి దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల నమోదవుతున్న దిద్దుబాట్ల కారణంగా నవంబర్‌లో చేపట్టదలచిన ఇష్యూని విశాల్ మెగామార్ట్ డిసెంబర్‌కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికే లండన్, సింగపూర్ తదితర ప్రాంతాలలో రోడ్‌షోలపై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. వచ్చే నెల మధ్యలో చేపట్టనున్న ఐపీవోలో తాజా ఈక్విటీ జారీ లేనట్లు తెలుస్తోంది.నిధుల సమీకరణకు వీలుగా హోల్డింగ్ కంపెనీ సంయత్ సర్వీసెస్ ఎల్ఎల్పీ వాటాలు విక్రయించనుంది. ప్రస్తుతం విశాల్ మెగామార్ట్‌లో సంయత్ సర్వీసెస్‌కు 96.55 శాతం వాటా ఉంది. కంపెనీ సీఈవో గుణేందర్ కపూర్ వాటా 2.45 శాతంగా నమోదైంది. సుమారు 626 సూపర్మార్కెట్ల ద్వారా కంపెనీ దుస్తులు, ఎఫ్ఎంసీజీ, సాధారణ వర్తక వస్తువులు తదితర పలు ప్రొడక్టులను విక్రయిస్తోంది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 189.28 పాయింట్లు లేదా 0.24 శాతం లాభంతో 77,528.29 వద్ద, నిఫ్టీ 46.45 పాయింట్లు లేదా 0.20 శాతం లాభంతో 23,500.25 పాయింట్ల వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ట్రెంట్, ఐచర్ మోటార్స్ వంటి కంపెనీలు చేరాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, హిందాల్కో, రిలయన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎస్బీఐలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,650 (22 క్యారెట్స్), రూ.77,070 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.700, రూ.760 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.760, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,650 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,070 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.700 పెరిగి రూ.70,800కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.760 పెరిగి రూ.77,220 వద్దకు చేరింది.ఇదీ చదవండి: మెటాకు రూ.213 కోట్ల జరిమానా.. కంపెనీ రియాక్షన్సిల్వర్ ధరలుబంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా మంగళవారం భారీగానే పెరిగాయి. సోమవారంతో పోలిస్తే ఈరోజు కేజీకి రూ.2,000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ.1,01,000 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బైబ్యాక్, డివిడెండ్ పాలసీలో మార్పులు
కేంద్ర ప్రభుత్వ సంస్థ(సీపీఎస్ఈ)లకు మూలధన పునర్వ్యవస్థీకరణపై సవరించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ జారీ చేసింది. దీపమ్(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్) విడుదల చేసిన విధానాల ప్రకారం ఇకపై సీపీఎస్ఈలు తమ నికర లాభాల్లో కనీసం 30 శాతం లేదా నెట్‌వర్త్‌లో 4 శాతాన్ని(ఏది అధికమైతే దాన్ని) వార్షిక డివిడెండుగా చెల్లించవలసి ఉంటుంది. ఎన్బీఎఫ్సీ తదితర ఫైనాన్షియల్ రంగ సీపీఎస్ఈలు తప్పనిసరిగా నికర లాభాల్లో కనీసం 30 శాతాన్ని డివిడెండుగా చెల్లించాలి. ఇంతకుముందు 2016లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమైతే నికర లాభాల్లో 30 శాతం లేదా నెట్‌వర్త్‌లో 5 శాతాన్ని(ఏది ఎక్కువైతే అది) డివిడెండుగా చెల్లించవలసి ఉంటుంది. అయితే అప్పట్లో ఫైనాన్షియల్ రంగ సీపీఎస్ఈల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. బైబ్యాక్ ఇలా..గత ఆరు నెలల్లో పుస్తక విలువ(బీవీ) కంటే షేరు మార్కెట్ విలువ తక్కువగా ఉన్న సీపీఎస్ఈ.. ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేయవలసి ఉంటుంది. అయితే ఇందుకు కనీసం రూ.3,000 కోట్ల నెట్‌వర్త్, రూ.1,500 కోట్లకంటే అధికంగా నగదు, బ్యాంక్ నిల్వలు కలిగి ఉండాలి. కంపెనీ రిజర్వులు, మిగులు నిధులు చెల్లించిన ఈక్విటీ మూలధనానికి సమానంగా లేదా 20 రెట్లు అధికంగా ఉన్న కంపెనీలు బోనస్ షేర్లను జారీ చేయవలసి ఉంటుంది. గత ఆరు నెలల్లో షేరు ముఖ విలువకంటే మార్కెట్ ధర 150 రెట్లు అధికంగా పలుకుతున్న లిస్టెడ్ సీపీఎస్ఈ.. షేర్ల విభజనను చేపట్టవలసి ఉంటుంది. ఈ బాటలో షేర్ల విభజన మధ్య కనీసం మూడేళ్ల వ్యవధిని పాటించవలసి ఉంటుంది. తాజా మార్గదర్శకాలు సీపీఎస్ఈల అనుబంధ(51 శాతానికిపైగా వాటా కలిగిన) సంస్థలకు సైతం వర్తించనున్నాయి.ఇదీ చదవండి: ఎస్బీఐ రూ.10 వేలకోట్లు సమీకరణ.. ఏం చేస్తారంటే..వీటికి మినహాయింపుదీపమ్ విడుదల చేసిన తాజా మార్గదర్శకాలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా రంగ కంపెనీలకు వర్తించబోవు. అంతేకాకుండా కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం లాభాలను పంచిపెట్టడాన్ని నిషేధించిన సంస్థలకు సైతం మార్గదర్శకాలు అమలుకావని దీపమ్ స్పష్టం చేసింది. సవరించిన తాజా మార్గదర్శకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) నుంచి అమలవుతాయని తెలియజేసింది. సీపీఎస్ఈలు మధ్యంతర డివిడెండ్ల చెల్లింపులను ప్రతీ త్రైమాసికానికీ లేదా ఏడాదిలో రెండుసార్లు చేపట్టేందుకు వీలుంటుంది. అన్ని లిస్టెడ్ సీపీఎస్ఈలు.. వార్షిక అంచనా డివిడెండ్‌లో కనీసం 90 శాతం ఒకే దశలో లేదా దశలవారీగా చెల్లించవచ్చు. అయితే గడిచిన ఏడాదికి తుది డివిడెండ్‌ను ఏటా సెప్టెంబర్‌లో నిర్వహించే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) ముగిసిన వెంటనే చెల్లించవలసి ఉంటుంది. అన్‌లిస్టెడ్ సంస్థలు గతేడాది ఆడిటెడ్ ఆర్థిక ఫలితాల ఆధారంగా ఏడాదిలో ఒకసారి తుది డివిడెండుగా చెల్లించాలి. -
లాజిస్టిక్స్ ఐపీవోకు స్పందన ఎలా ఉందంటే..
ట్రక్ ఆపరేటర్లకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ సేవలందించే జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి అంతంతమాత్రమే స్పందన లభించింది. ఐపీవో దరఖాస్తు చివరి రోజు సోమవారానికల్లా 1.9 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. కంపెనీ 2.25 కోట్ల షేర్లు ఆఫర్ చేయగా.. 4.19 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 2.76 రెట్లు బిడ్స్ నమోదుకాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 1.65 రెట్లు దరఖాస్తులు లభించాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 24 శాతానికే దరఖాస్తులు అందాయి.ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.501 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. వెరసి షేరుకి రూ.259–273 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,115 కోట్లు సమీకరించింది. ఐపీవో ద్వారా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు రూ.565 కోట్ల విలువైన 2.06 కోట్ల షేర్లను విక్రయించగా.. రూ.550 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ కొత్తగా జారీ చేసింది. ఈ నిధుల్లో రూ.200 కోట్లు మార్కెటింగ్‌కు, రూ.140 కోట్లు బ్లాక్‌బక్ ఫిన్సర్వ్ మూలధన పెట్టుబడులకు వినియోగించనుంది.ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్‌లు కళకళఏరిస్ఇన్ఫ్రా ఐపీవోకు రెడీనిర్మాణ రంగ మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్లో టెక్నాలజీ ఆధారిత బీ2బీ సేవలందించే ఏరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవో చేపట్టేందుకు వీలుగా ఈ ఏడాది ఆగస్ట్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన కంపెనీ తాజాగా అనుమతులు పొందింది. కాగా.. ఇష్యూ నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, అనుబంధ సంస్థ బిల్డ్మెక్స్ ఇన్ఫ్రాలో పెట్టుబడులకు, రుణ చెల్లింపులకు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
గోల్డ్ ఈటీఎఫ్‌లు కళకళ
బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) అక్టోబర్‌లోనూ మెరిశాయి. ఏకంగా రూ.1961 కోట్లను ఇన్వెస్టర్లు వీటిలో పెట్టుబడి పెట్టారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితులతో గత రెండేళ్లుగా బంగారం ర్యాలీ అవుతుండడం చూస్తున్నాం. దీంతో బంగారం మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.1,233 కోట్లు వచ్చాయి. దీంతో పోల్చితే అక్టోబర్‌లో 59 శాతం మేర పెట్టుబడులు పెరిగినట్టు తెలుస్తోంది. ఇక 2023 అక్టోబర్ నెలలో వచ్చిన రూ.841 కోట్ల కంటే రెట్టింపునకు పైగా అధికమయ్యాయి.గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని మొత్తం ఆస్తులు సెప్టెంబర్ చివరికి ఉన్న రూ.39,823 కోట్ల నుంచి అక్టోబర్ చివరికి రూ.44,545 కోట్లకు దూసుకుపోయాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) అక్టోబర్‌లో నికరంగా 2 లక్షలు పెరిగాయి. దీంతో మొత్తం ఫోలియోలు 59.13 లక్షలకు చేరాయి. ఈ ఏడాది ఆగస్ట్‌లో రూ.1,611 కోట్లు, జులైలో రూ.1,337 కోట్లు, జూన్‌లో రూ.726 కోట్లు, మే నెలలో రూ.396 కోట్ల చొప్పున పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు జీసీసీ రంగం!కరోనా విపత్తు, అనంతరం ఉక్రెయిన్–రష్యా యుద్ధం, మధ్యప్రాచ్యంలో హమాస్‌తో ఇజ్రాయెల్ పోరు ఇవన్నీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఆర్థిక అనిశ్చితులకు దారితీయడం గమనార్హం. ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా పేరున్న బంగారానికి డిమాండ్ ఏర్పడి ర్యాలీకి దారితీసింది. దీంతో 2020 జనవరి నుంచి చూస్తే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.24,153 కోట్లు నికరంగా వచ్చాయి. ‘యూఎస్ ఫెడ్ ఈ ఏడాది 0.75 శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో డాలర్ విలువ పెరిగింది. ఇది అంతర్జాతీయంగా బంగారం ధరలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారం ధరలు పెరుగుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. దీన్నుంచి ప్రయోజనం పొందాలన్న ఇన్వెస్టర్ల ఆకాంక్ష ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెరగడానికి దారితీసి ఉండొచ్చు’అని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
నిఫ్టీకి ఏడోరోజూ నష్టాలే..
ముంబై: ఐటీ, ఆయిల్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో నిఫ్టీ ఏడోరోజూ నష్టాలు చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు నష్టపోయి 77,339 వద్ద స్థిరపడింది. ఈ సూచీకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు. నిఫ్టీ 79 పాయింట్లు కోల్పోయి 23,454 వద్ద నిలిచింది. ప్రథమార్థంలో సెన్సెక్స్ 615 పాయింట్లు క్షీణించి 76,965 వద్ద, నిఫ్టీ 209 పాయింట్లు కోల్పోయి 23,350 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి.అయితే మిడ్‌సెషన్ నుంచి మెటల్, రియలీ్ట, ఆటో, సరీ్వసెస్, కన్జూమర్ బ్యాంకులు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంతమేర భర్తీ అయ్యాయి. రంగాలవారీగా.., ఐటీ ఇండెక్స్ 2.50%, ఆయిల్‌అండ్‌గ్యాస్ 2%, ఫార్మా, మీడియా సూచీలు 1% చొప్పున పతనమయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నందున తక్షణ వడ్డీరేట్ల తగ్గింపు ఇప్పట్లో అవసరం లేదంటూ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ⇒ డిసెంబర్లో ఫెడ్ రేట్ల కోత ఉండకపోవచ్చనే సంకేతాలతో టీసీఎస్, ఎంఫసీస్, ఎల్టీఐఎం షేర్లు 3% క్షీణించగా.. ఇన్ఫీ 2.50% విప్రో 2% పడ్డాయి. ⇒ డిసెంబర్ నుంచి చైనా కమోడిటీలకు సంబంధించి ఎగుమ తులపై పన్ను రాయి తీలను తగ్గించడం లేదా రద్దు చేయాలనే ప్రతిపాదనలతో మెటల్ షేర్లు మెరిశాయి. నాల్కో 9 శాతం, హిందాల్కో 4%, వేదాంత 3%, టాటా స్టీల్ 2%, ఎన్ఎండీసీ 1.50%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఒకశాతం లాభపడ్డాయి. ⇒ ప్రభుత్వం నేచరల్ గ్యాస్ సరఫరాను నెలలో రెండోసారి తగ్గించడంతో గ్యాస్ పంపిణీ సంస్థల షేర్లు పతనమయ్యాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ 20% క్షీణించి రూ.325 వద్ద, మహానగర్ గ్యాస్ 14% పడి రూ.1,131 వద్ద ముగిశాయి. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 210.39 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 77,369.92 వద్ద, నిఫ్టీ 72.75 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో 23,459.95 వద్ద నిలిచాయి.హిందాల్కో, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ట్రెంట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)