Market
-
ఇన్వెస్టర్లకు యూపీఐ.. సెబీ ఆదేశం
న్యూఢిల్లీ: సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ కోసం క్లయింట్లకు యూపీఐ ఆధారిత బ్లాక్ విధానాన్ని లేదా త్రీ–ఇన్–వన్ ట్రేడింగ్ అకౌంటు సదుపాయాన్ని అందించాలని క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్క్కు (క్యూఎస్బీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది.ప్రస్తుత ట్రేడింగ్ విధానంతో పాటు ఫిబ్రవరి 1 నుంచి ఈ రెండింటిలో ఒక సదుపాయాన్ని తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించింది. త్రీ–ఇన్–వన్ ట్రేడింగ్ అకౌంటులో సేవింగ్స్ అకౌంటు, డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ మూడూ కలిసి ఉంటాయి.ఇదీ చదవండి: సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరటయూపీఐ బ్లాక్ మెకానిజంలో క్లయింట్లు ట్రేడింగ్ సభ్యునికి ముందస్తుగా నిధులను బదిలీ చేయడానికి బదులుగా తమ బ్యాంకు ఖాతాలలో బ్లాక్ చేసిన నిధుల ఆధారంగా సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ చేయవచ్చు. ఈ సదుపాయం ప్రస్తుతం ఇన్వెస్టర్లకు ఐచ్ఛికంగానే ఉంది. -
24,000 దిగువకు నిఫ్టీ
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో స్టాక్ సూచీలు మంగళవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. దేశీయ అక్టోబర్ ద్రవ్యల్బోణ, సెపె్టంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రోజుకో కొత్త కనిష్టానికి దిగిరావడమూ ఒత్తిడి పెంచింది. ఫలితంగా సెన్సెక్స్ 821 పాయింట్లు నష్టపోయి 79 వేల దిగువన 78,675 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 258 పాయింట్లు క్షీణించి 24 వేల దిగువన 23,883 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. రియలీ్ట, ఐటీ మినహా అన్ని రంగాల్లో విక్రయాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బ్యాంకులు, ఆటో, విద్యుత్ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 948 పాయింట్లు క్షీణించి 78,548 వద్ద, నిఫ్టీ 302 పాయింట్లు కోల్పోయి 23,839 వద్ద కనిష్టాలు తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1.25%, 1% నష్టపోయాయి. సెమికండక్టర్ల షేర్లతో పాటు చైనా మార్కెట్ వరుస పతనంతో ఆసియా మార్కెట్లు 3% పడ్డాయి. యూరప్ మార్కెట్లు 1.5% క్షీణించాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ అధిక వెయిటేజీ షేర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3%, ఎస్బీఐ 2.50%, ఏషియన్ పెయింట్స్ 2%, ఐటీసీ, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్ 1% నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి.⇒ అధిక వాల్యుయేషన్ల ఆందోళలనల తో ప్రభుత్వరంగ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీఐ 10% పతనమైంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, గెయిల్ 4.50%, భెల్, ఎన్ఎల్సీ 4%, ఎన్సీఎల్ 3.50% క్షీణించాయి. ⇒ బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ మంగళవారం ఒక్కరోజే రూ.5.29 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.437.24 లక్షల కోట్లకు తగ్గింది. ⇒ సాగిలిటీ ఇండియా లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.30)తో పోలిస్తే 3.50% ప్రీమియంతో రూ.31 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 10% పెరిగి, చివరికి 2% నష్టంతో రూ.29.36 వద్ద ముగిసింది. -
బంగారం భారీగా తగ్గిందోచ్..
Gold Price Today: పిసిడి ప్రియుల ఎదురుచూపులకు ఫలితం దక్కింది. దేశవ్యాప్తంగా నేడు (నవంబర్ 12) బంగారం ధరలు భారీ స్థాయిలో తగ్గాయి. క్రితం రోజుతో పోలిస్తే తులానికి (10 గ్రాములు) సుమారు రూ.1500 మేర దిగివచ్చింది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో పసిడి ధరలు ఎంతెంత తగ్గాయో ఇక్కడ అందిస్తున్నాం.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం ధర భారీగా రూ.1350 తగ్గి రూ.70,850 లకు వచ్చేసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.1470 క్షీణించి రూ. 77,290 వద్దకు దిగివచ్చింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు క్షీణించాయి.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరల్లో నేడు భారీ తగ్గుదల నమోదైంది. 22 క్యారెట్ల బంగారం రూ.1350 తగ్గి రూ.71,000 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.1470 తగ్గి రూ.77,440 వద్దకు దిగొచ్చింది.వెండి కూడా భారీగానే..Silver Price Today: దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు భారీ స్థాయిలో క్షీణించాయి. హైదరాబాద్‌లో కేజీ వెండిపై ఏకంగా రూ.2000 తగ్గింది. దీంతో ఇక్కడ కేజీ వెండి రూ.1,00,000 వద్దకు వచ్చి చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ట్రంప్ రీఎంట్రీ..మార్కెట్ గతేంటి?
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో ట్రంప్ విజయ విహారం చేశారు. అయితే, ఇప్పుడు ‘మేక్ వరల్డ్ అన్–ప్రెడిక్టబుల్ అగైన్’గా మారుతుందనే అందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మార్కెట్లలో జోష్ నెలకొన్నప్పటికీ, మన మార్కెట్లో మళ్లీ అమ్మకాలు పోటెత్తడంతో ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కరెక్షన్ బాటలో ఉన్న దేశీ సూచీల పయనమెటన్నది అర్థం కావడం లేదు. అయితే, ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ పాలసీలతో పాటు సుంకాల పెంపు వంటి చర్యలతో అగ్రరాజ్యంలో వడ్డీరేట్ల తగ్గింపునకు బ్రేకులు పడొచ్చని... డాలరు బలోపేతం, ద్రవ్యోల్బణం పెరుగుదల ఎఫెక్ట్‌తో రూపాయి మరింత బలహీన పడొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల పరంపర కొనసాగడంతో... స్వల్పకాలానికి మన మార్కెట్లో ట్రంప్ సెగలు తప్పవంటున్నారు!అల్‌టైమ్ గరిష్టాల నుంచి కొండ దిగుతున్న దేశీ సూచీలు.. గత నెలన్నర రోజుల్లో 8 శాతానికి పైగానే పడ్డాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనం దీనికి ప్రధాన కారణం. ఎన్నికల తర్వాత సెపె్టంబర్ వరకు పెట్టుబడుల మోత మోగించిన విదేశీ ఇన్వెస్టర్లు... అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో రూ.1.15 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇక నవంబర్లోనూ రివర్స్ గేర్ కొనసాగుతోంది. 6 ట్రేడింగ్ సెషన్లలో రూ.23,000 కోట్లకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నారు. మొత్తంమీద ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.2.9 లక్షల కోట్ల మేర విదేశీ నిధులు తరలిపోయాయి. ఇలాంటి తరుణంలో అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి గ్రాండ్ విక్టరీ కొట్టిన ట్రంప్.. మళ్లీ సుంకాల జూలు విదిల్చే అవకాశం ఉండటంతో పాటు ‘అమెరికా ఫస్ట్’ పాలసీలను ఆచరణలో పెడితే మన ఎకానమీపై ప్రతికూల ప్రభావానికి దారితీసే అవకాశం ఉందనేది ఆర్థిక వేత్తల అభిప్రాయం. మళ్లీ ద్రవ్యోల్బణం గుబులు... ట్రంప్ చెబుతున్నట్లుగా కార్పొరేట్ ట్యాక్స్ కోతకు తోడు సుంకాల పెంపునకు తెరతీస్తే మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎగబాకే అవకాశాలున్నాయి. సుంకాలు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. వస్తు, సేవలపై కనీసం 10 శాతం సుంకాలు పెంచినా, అక్కడ 0.8 శాతం ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాం ఉందని ఎకనమిస్టులు లెక్కలేస్తున్నారు. దీనివల్ల యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల కోత అవకాశాలు సన్నగిల్లి.. డాలరు పుంజుకోవడానికి దారితీస్తుంది. వెరసి, ఇప్పుడిప్పుడే వడ్డీరేట్ల తగ్గింపు బాటలో వెళ్తున్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు దీనికి బ్రేక్ వేసే చాన్స్ ఉంటుంది. మరోపక్క, టారిఫ్ వార్‌కు తెగబడితే ఎగుమతులు దెబ్బతినడం... దిగుమతులు గుదిబండగా మారడం వల్ల మన దేశంలోనూ మళ్లీ ద్రవ్యోల్బణం పురి విప్పుతుంది. ఇప్పటికే జారుడుబల్లపై ఉన్న రూపాయిని (తాజాగా డాలరుతో 84.38 ఆల్‌టైమ్ కనిష్టానికి పడింది) ఇది మరింత దిగజార్చుతుంది. దీంతో ఆర్బీఐ వడ్డీరేట్ల కోతపై ఆశలు ఆవిరైనట్లేననేది ఆర్థిక వేత్తల మాట. ‘ట్రంప్ ట్యాక్స్ కట్ అంటే అమెరికాలో రుణ భారం మరింత పెరుగుతుంది. అధిక వడ్డీరేట్లు, డాలరు బలంతో భారత్ లాంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు కచి్చతంగా ప్రతికూలమే’ అని ఏఎస్కే వెల్త్ అడ్వయిజర్స్‌కు చెందిన సోమ్‌నాథ్ ముఖర్జీ పేర్కొన్నారు. అయితే, చైనాపై భారీగా సుంకాలు విధించి, భారత్‌పై కాస్త కనికరం చూపితే, మన ఎగుమతులు.. కొన్ని రంగాలకు సానుకూలంగా మారుతుందని కూడా కొంత మంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా.. ట్రంప్ పగ్గాలు చేపట్టి (జనవరి 20న), విధానపరమైన స్పష్టత వచ్చే వరకు మన మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు తప్పవనేది పరిశీలకుల అభిప్రాయం.ట్రంప్ తొలి జమానాలో..2017లో ట్రంప్ తొలిసారి గద్దెనెక్కినప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఉంది. ముఖ్యంగా చైనా స్టాక్ మార్కెట్లో అలజడి, క్రూడ్ ధరల క్రాష్, గ్రీస్ దివాలా.. బ్రెగ్జిట్ ప్రభావాలతో స్టాక్ మార్కెట్లు తిరోగమనంలో ఉన్నాయి. అయితే, ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం ఉన్నప్పటికీ.. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా మన మార్కెట్లు మళ్లీ పుంజుకోగలిగాయి. 2017 నుంచి 2020 వరకు ట్రంప్ తొలి విడతలో నిఫ్టీ 50 శాతం మేర పుంజుకోగా... జో బైడన్ జమానాలో ఈ ఏడాది సెపె్టంబర్ వరకు ఏకంగా 120 శాతం పైగా నిఫ్టీ ఎగబాకడం విశేషం. ఇక ట్రంప్ 1.0 హయాంలో డాలర్‌తో రూపాయి విలువ 11% క్షీణిస్తే, 2.0 కాలంలో 8–10% క్షీణించే అవకాశం ఉందని ఎస్బీఐ తాజా నివేదిక తెలిపింది!ట్రంప్ విక్టరీ నేపథ్యంలో చైనా, భారత్ సహా పలు దేశాలపై దిగుమతి సుంకాల మోతకు అవకాశం ఉంది. ఇది అక్కడ ద్య్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీయొచ్చు. దీంతో అమెరికాలో వడ్డీ రేట్ల కోత జాప్యం కావచ్చు. దీనికితోడు ట్రంప్ హామీ మేరకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తే, యూఎస్ బాండ్ మార్కెట్లో ఈల్డ్‌లు ఎగబాకుతాయి. ఈ పరిణామాలు భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనానికి మరింత పురిగొల్పుతాయి. – నితిన్ అగర్వాల్, క్లయింట్ అసోసియేట్స్ డైరెక్టర్ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
గుడ్ న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం
Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి దిగివచ్చాయి. ఇప్పటికే పతాక స్థాయికి చేరుకున్న పసిడి రేట్లు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు నగల దుకాణాల వైపు చూసే సాహసం చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు (నవంబర్ 11) 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.550 తగ్గి రూ.72,200 లకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.600 క్షీణించి రూ. 78,760 లకు తగ్గింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు క్షీణించాయి.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. 22 క్యారెట్ల బంగారం రూ.550 తగ్గి రూ.72,350 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.600 తగ్గి రూ.78,910 వద్దకు దిగొచ్చింది.పసిడి బాటలోనే వెండిSilver Price Today: దేశంలో వెండి ధరలు కూడా నేడు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.1000 తగ్గి రూ.1,02,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
గణాంకాలు, ఫలితాలపై దృష్టి
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ముగింపునకు వస్తోంది. ఈ బాటలో ఈ వారం మరికొన్ని కార్పొరేట్ దిగ్గజాలు జులై–సెప్టెంబర్(క్యూ2) పనితీరును వెల్లడించనున్నాయి. వీటితోపాటు దేశీ స్టాక్ మార్కెట్లను దేశీ ఆర్థిక గణాంకాలు సైతం ఈ వారం ప్రధానంగా ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ వారం ఓఎన్జీసీ, అపోలో టైర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్, బీఈఎంఎల్, బీఏఎస్ఎఫ్, బాష్, అల్ఫాజియో, జూబిలెంట్ ఫుడ్, ఎన్ఎండీసీ, బ్లూడార్ట్, బ్రిటానియా, ఫినొలెక్స్ కేబుల్స్, హ్యుందాయ్, ఈఐహెచ్, బటర్‌ఫ్లై గంధిమతి, బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్(ఫస్ట్‌క్రై మాతృ సంస్థ), గ్రాఫైట్, ఎల్జీ ఎక్విప్మెంట్స్, శ్రీ సిమెంట్, జైడస్ వెల్నెస్ తదితర పలు కంపెనీలు క్యూ2 ఫలితాలు ప్రకటించనున్నాయి. పావెల్ ప్రసంగం అక్టోబర్ నెలకు యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు 13న వెలువడనున్నాయి. సెప్టెంబర్‌లో 2.4 శాతంగా నమోదైంది. ఇక కీలకమైన వినియోగ ధరల సూచీ సెప్టెంబర్‌లో 3.3 శాతాన్ని తాకింది. శుక్రవారం కీలక అంశాలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగించనున్నారు. గత వారం చేపట్టిన పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించిన విషయం విదితమే. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు తాజాగా 4.5–4.75 శాతానికి చేరాయి. ఇక మరోపక్క జులై–సెప్టెంబర్‌కు జపాన్ జీడీపీ గణాంకాలు ఇదే రోజు వెల్లడికానున్నాయి. ఏప్రిల్–జూన్‌లో జపాన్ జీడీపీ 0.7 శాతం పుంజుకుంది. అక్టోబర్‌కు చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం తెలియనున్నాయి. సెప్టెంబర్‌లో 5.4 శాతం పురోగతి నమోదైంది. ఇతర అంశాలు యూఎస్ ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనుండటంతో డాలరు ఇండెక్స్సహా యూఎస్ బాండ్ల ఈల్డ్స్ ఇటీవల బలపడుతూ వస్తున్నాయి. దీంతో డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి సరికొత్త కనిష్టాలను తాకుతోంది. 84.38వరకూ పతనమైంది. మరోవైపు రాజకీయ, భౌగోళిక అనిశ్చతుల కారణంగా ముడిచమురు ధరలు ఆటుపోట్లకు లోనవుతున్నాయి. కాగా.. ఈ వారం దేశ, విదేశీ గణాంకాలు సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటికితోడు దేశీ కార్పొరేట్ల క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పల్కా ఆరోరా చోప్రా తెలియజేశారు. గత వారమిలా విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం డీలా పడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. ఈ నెలలోనూ అమ్మకాలు కొనసాగే వీలున్నట్లు అంచనా వేశారు. అంతంతమాత్ర క్యూ2 ఫలితాలు, ప్రపంచ అనిశి్చతుల కారణంగా ఈ వారం మార్కెట్లు సైడ్‌వేస్‌లో కదలవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. అయితే ఫలితాల ఆధారంగా కొన్ని స్టాక్స్‌లో యాక్టివిటీకి వీలున్నట్లు తెలియజేశారు. గత వారం సెన్సెక్స్ 238 పాయింట్లు క్షీణించి 79,486వద్ద నిలవగా.. నిఫ్టీ 156 పాయింట్లు కోల్పోయి 24,148 వద్ద ముగిసింది.ఎఫ్‌పీఐలు5 రోజుల్లో రూ. 20,000 కోట్లు ఈ నెలలోనూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో విక్రయాలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో తొలి ఐదు ట్రేడింగ్ సెషన్లలో నికరంగా దాదాపు రూ. 20,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీయడం, దేశీయంగా మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరి ఖరీదుగా మారడం తదితర కారణాలతో కొద్ది రోజులుగా ఎఫ్‌పీఐలు నిరవధిక అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా గత నెలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 94,017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. అయితే అంతకుముందు సెప్టెంబర్‌లో గత 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! కాగా.. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఒకే నెలలో అత్యధికంగా రూ. 61,973 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. శుక్రవారం సెలవు గురునానక్ జయంతి సందర్భంగా వారాంతాన(15) ఈక్విటీ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. అక్టోబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మంగళవారం(12న) వెలువడనున్నాయి. సెప్టెంబర్‌లో సీపీఐ 5.49 శాతంగా నమోదైంది. టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు గురువారం(14న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్‌లో డబ్ల్యూపీఐ 1.84 శాతానికి చేరింది. ఈ బాటలో ప్రభుత్వం శుక్రవారం(15న) అక్టోబర్ నెలకు వాణిజ్య గణాంకాలు విడుదల చేయనుంది. -
ఐపీవో లో 'లక్కు' కుదురాలంటే..
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో).. ఎక్స్ లేదా వై లేదా జెడ్.. ఇన్వెస్టర్ల నుంచి పదులు, వందల రెట్ల అధిక స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు దీటుగా రిటైలర్లూ దూకుడుగా ఐపీవోల్లో బిడ్ వేస్తున్నారు. చాలా ఇష్యూలు లిస్టింగ్‌లో లాభాలు కురిపిస్తుండడంతో ప్రైమరీ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారిపోయింది. ఇది ఏ స్థాయిలో అంటే బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లపై లిస్ట్ అయ్యే చిన్న కంపెనీల ఐపీవోలకూ ఎన్నో రెట్ల అధిక బిడ్లు దాఖలవుతున్నాయి. దీంతో ఐపీవో ఆకర్షణీయ మార్కెట్‌గా మారిపోయింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఐపీవో పోస్ట్‌లకు మంచి ఫాలోయింగ్ ఉంటోంది. స్పందన పెరిగిపోవడం వల్ల చివరికి కొద్ది మందినే షేర్లు వరిస్తున్నాయి. కానీ, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా డిమాండ్ ఉన్న ఐపీవోలో అలాట్మెంట్ అవకాశాలను పెంచుకోవచ్చు. ఇందుకు ఏమి చేయాలన్నది చూద్దాం. ఒకటికి మించిన దరఖాస్తులు ఐపీవోలో షేర్ల అలాట్మెంట్ అవకాశాలను పెంచుకోవాలంటే, ఒకటికి మించిన పాన్ల ద్వారా దరఖాస్తు చేసుకోవడం తెలివైన ఆప్షన్. మనలో కొంత మంది తమకున్న వివిధ డీమ్యాట్ ఖాతాల ద్వారా ఒకటికి మించిన బిడ్లు సమరి్పస్తుంటారు. కానీ, ఒకే పాన్ నంబర్‌పై ఒకటికి మించిన బిడ్లు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అన్ని బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఒకటికి మించిన బిడ్లు వేయడం సెబీ నిబంధనలకు విరుద్ధం. దీనికి బదులు తమ తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, జీవిత భాగస్వామి పేరిట దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పాన్ నంబర్లతో దరఖాస్తులు సమరి్పంచడం వల్ల షేర్లు కచ్చితంగా వస్తాయని చెప్పలేం. కానీ కేటాయింపుల అవకాశాలు కచి్చతంగా మెరుగుపడతాయి. కొందరు స్నేహితుల సాయంతోనూ ఒకటికి మించిన దరఖాస్తులు సమరి్పస్తుంటారు. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో కనీసం ఒక లాట్‌కు బిడ్ వేయాలి. ఒకటికి మించిన లాట్లతో బిడ్లు సమర్పించినప్పటికీ స్పందన అధికంగా ఉంటే, చివరికి ఒక్కటే లాట్ (కనీస షేర్లు) వస్తుంది. ఉదాహరణకు ఇటీవలే ముగిసిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవో ఒక లాట్ పరిమాణం 214 షేర్లు. విలువ రూ.14,980. ఒక ఇన్వెస్టర్ రూ.74,900తో ఐదు లాట్లకు బిడ్ వేసినా కానీ, ఒక్కటే లాట్ అలాట్ అయి ఉండేది. ఎందుకంటే ఇష్యూ పరిమాణంతో పోలి్చతే 60 రెట్లు అధిక బిడ్లు దాఖలు కావడం గమనార్హం. తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో ఒకటికి మించిన బిడ్లు సమరి్పంచడం వల్ల కొన్ని సందర్భాల్లో అదృష్టం కొద్దీ ఒకటికి మించిన దరఖాస్తులకు కేటాయింపులు రావచ్చు. జాక్పాట్డిమాండ్ ఉన్న కంపెనీ షేర్లను సొంతం చేసుకునేందుకు పదుల సంఖ్యలో ఖాతాల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకునే వారూ ఉన్నారు. దీన్నొక ఆదాయ మార్గంగా మలుచుకుని కృషి చేస్తున్నవారు కూడా కనిపిస్తుంటారు. చెన్నైకి చెందిన ఆదేష్ (30) ఇటీవలి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో జాక్‌పాట్ కొట్టేశాడు. వేర్వేరు పేర్లతో ఉన్న 18 డీమ్యాట్ ఖాతాల ద్వారా షేర్‌హోల్డర్ కేటగిరీ కింద బిడ్లు సమర్పించాడు. అదృష్టం తలుపుతట్టడంతో 14 డీమ్యాట్ ఖాతాలకూ వాటాదారుల కోట కింద కేటాయింపు లభించింది. అలాగే, హెచ్ఎన్ఐ కోటా కింద కూడా దరఖాస్తు చేశాడు. మొత్తం 39 లాట్లు దక్కాయి. అంటే మొత్తం 8,346 షేర్లు అతడిని వరించాయి. ఇష్యూ ధరతో పోలి్చతే లిస్టింగ్ రోజున బజాజ్ ఫైనాన్స్ ఒక దశలో 136 శాతం వరకు ర్యాలీ చేయడం గమనించొచ్చు. వాటాదారుల కోటా.. ఐపీవోకు వస్తున్న కంపెనీ మాతృసంస్థ (పేరెంట్) అప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటే, వాటాదారుల కోటాను ఉపయోగించుకోవచ్చు. ఇటీవలే ముగిసిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వాటాదారులకు 7.62 శాతం షేర్లను రిజర్వ్ చేశారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అన్నది బజాజ్ ఫైనాన్స్ సబ్సిడరీ. అలాగే, బజాజ్ ఫైనాన్స్ అన్నది బజాజ్ ఫిన్సర్వ్ సబ్సిడరీ. దీంతో రెండు కంపెనీల వాటాదారులకూ షేర్‌హోల్డర్స్ కోటా లభించింది. ఐపీవోకు వస్తున్నది కొత్త కంపెనీ అయితే ఇందుకు అవకాశం ఉండదు. లిస్టెడ్ కంపెనీల సబ్సిడరీలు ఐపీవోలకు వస్తుంటే, ముందుగానే ఆయా లిస్టెడ్ సంస్థలకు సంబంధించి ఒక్క షేరు అయినా డీమ్యాట్ అకౌంట్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఐపీవోకి సెబీ నుంచి అనుమతి రావడానికి ముందే ఈ పనిచేయాలి.బిడ్స్ ఇలా...త్వరలో ఐపీవోకు రానున్న ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీ ఏథర్ ఎనర్జీ సైతం లిస్టెడ్ సంస్థ హీరో మోటోకార్ప్ వాటాదారులకు కోటా రిజర్వ్ చేసింది. ఏథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్‌కు 35 శాతానికి పైగా వాటా ఉండడం ఇందుకు కారణం. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో దరఖాస్తు పెట్టుకున్న వారు.. విడిగా వాటాదారుల కోటాలోనూ గరిష్టంగా రూ.2 లక్షల విలువకు బిడ్ సమరి్పంచొచ్చు. రూ.2 లక్షలకు మించి నాన్ ఇనిస్టిట్యూషనల్ కోటాలోనూ పాల్గొనొచ్చు. ఎల్ఐసీ ఐపీవో సమయంలో పాలసీదారుల కోసం విడిగా షేర్లను రిజర్వ్ చేయడం గుర్తుండే ఉంటుంది. రుణం తీసుకుని మరీ..వ్యాపారం నిర్వహించే హర్ష (25) ఐదు వ్యక్తిగత డీమ్యాట్ ఖాతాలు, ఒక హెచ్‌యూఎఫ్ డీమ్యాట్ ఖాతా ద్వారా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో పాల్గొన్నాడు. అప్పటికే తనకున్న ఈక్విటీ షేర్లను తనఖాపెట్టి ఎన్బీఎఫ్సీ నుంచి రూ.కోటి రుణం తీసుకుని మరీ హెచ్ఎన్ఐ విభాగంలో బిడ్ వేశాడు. మొత్తం మీద 19 లాట్లు దక్కించుకున్నాడు. వాటాదారుల కోటాలో..ఐటీ ఉద్యోగి అయిన ధీరజ్ మెహ్రా (43) ముందుగానే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు కొని పెట్టుకున్నాడు. షేర్ హోల్డర్స్ కోటా కింద బిడ్లు వేశాడు. మొత్తం 11 డీమ్యాట్ ఖాతాలను ఉపయోగించుకున్నాడు. 6 లాట్ల షేర్లు అలాట్ అయ్యాయి. తిరస్కరణకు దూరంగా..కొన్ని తప్పుల కారణంగా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుంటాయి. ఒకటే పాన్ ఆధారంగా వేర్వేరు ఖాతాల నుంచి బిడ్లు వేయడం ఇందులో ఒకటి. బిడ్ వేయడానికి ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలోని పేరు, డీమ్యాట్ ఖాతాలోని పేరు ఒకే విధంగా ఉండాలి. ఏదైనా ఐపీవో ఇష్యూ విజయవంతం కావాలంటే కనీసం 90% మేర సబ్‌్రస్కిప్షన్ రావాల్సి ఉంటుంది. కసరత్తు అవసరం.. లిస్టింగ్ రోజే లాభాలు తీసుకుందామనే ధోరణితో ఐపీవోల్లో పాల్గొనడం అన్ని సందర్భాల్లో ఫలితమివ్వదు. పైగా ఈ విధానంలో రిస్క్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. జారీ ధర కంటే తక్కువకు లిస్ట్ అయ్యేవీ ఉంటాయి. అలాంటి సందర్భంలో నష్టానికి విక్రయించకుండా దీర్ఘకాలం పాటు కొనసాగించగలరా? అని ప్రశి్నంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం లిస్టింగ్ లాభం కోసం దరఖాస్తుచేసుకుంటే.. లిస్టింగ్ నాడు నష్టం వచి్చనా విక్రయించాల్సిందే. దీర్ఘకాల దృష్టితో దర ఖాస్తు చేసుకుంటే, మెరుగైన ఫలితాలు చూడొచ్చు. లిస్టింగ్ ఆశావహంగా లేకపోయినా, కంపెనీ వ్యాపార అవకాశాల దృష్ట్యా పెట్టుబడి కొనసాగించొచ్చు. ఇటీవలి ఐపీవోల్లో చాలా వరకు అధిక వేల్యుయేషన్పైనే నిధులు సమీకరిస్తున్నాయి. అలాంటి కొన్ని లిస్టింగ్ తర్వాత ర్యాలీ చేస్తున్నాయి. ఐపీవో ముగిసి లిస్టింగ్ నాటికి మార్కెట్ దిద్దుబాటులోకి వెళితే.. అధిక వ్యా ల్యూషన్పై వచ్చిన కంపెనీ షేర్లు లిస్టింగ్‌లో నష్టాలను మిగల్చవచ్చు.ఎస్ఎంఈ ఐపీవోలు మెయిన్‌బోర్డ్ ఐపీవోల్లో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ (రూ.15,000)కు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే ఎస్ఎంఈ ఐపీవో అయితే కనీస లాట్ విలువ రూ.లక్ష, అంతకు మించి ఉంటుంది. కనుక చిన్న ఇన్వెస్టర్లు అందరూ వీటిలో పాలు పంచుకోలేరు. బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లపై ఈ కంపెనీలు లిస్ట్ అవుతాయి. ఆరంభ స్థాయిలోని చిన్న, మధ్య స్థాయి కంపెనీలు సులభంగా ప్రజల నుంచి నిధులు సమీకరించి, లిస్ట్ అయ్యేందుకు ఈ వేదికలు వీలు కల్పిస్తుంటాయి. ఇటీవలి కాలంలో ఎస్ఎంఈ ఐపీవోలకు సైతం అనూహ్య స్పందన వస్తోంది. దీనికి కారణం గత రెండేళ్లుగా ఎస్ఎంఈ సూచీ ఏటా 39 శాతం మేర రాబడి ఇస్తోంది. ఇదే కాలంలో నిఫ్టీ 50 రాబడి 15 శాతం (సీఏజీఆర్) కాగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ రాబడి 37 శాతం చొప్పునే ఉంది. లాట్ పరిమాణం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ లిక్విడిటీ (వ్యాల్యూమ్) తక్కువగా ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లు లిస్టింగ్ లాభాల ధోరణితో కాకుండా, దీర్ఘకాల దృక్పథంతో ఎస్ఎంఈ ఐపీవోల్లో పాల్గొనడం మంచిది.జాగ్రత్త అవసరం..ఇక ఎస్ఎంఈ ఐపీవోల్లో మరింత జాగ్రత్తగా మసలుకోవాలి. ఆరంభ స్థాయి, చిన్న కంపెనీలు కావడంతో వ్యాపారంలో అన్నీ రాణిస్తాయని చెప్పలే. పైగా ప్రమోటర్ల సమర్థత గురించి తెలుసుకోవడానికి సరిపడా సమాచారం లభించదు. ఎస్ఎంఈ విభాగంలో నాణ్యమైన, పేరున్న కంపెనీల ఐపీవోలకే పరిమితం కావడం ద్వారా రిస్‌్కను తగ్గించుకోవచ్చు. ఎస్ఎంఈ ఐపీవోల పట్ల తగినంత శ్రద్ధ తీసుకోవాలని సెబీ ఇప్పటికే ఇన్వెస్టర్లకు సూచించింది. ట్రాఫిక్సాల్ ఐటీఎస్ టెక్నాలజీస్ అనే ఎస్ఎంఈ రూ.45 కోట్లతో ఐపీవో ఇష్యూ చేపట్టగా 345 రెట్ల స్పందన వచ్చింది, అయితే ఈ సంస్థ వెల్లడించిన సమాచారంలో లోపాలపై ఓ ఇన్వెస్టర్ చేసిన ఫిర్యాదు మేరకు, సెబీ జోక్యం చేసుకుని లిస్టింగ్‌ను నిలిపివేయించింది. సదరు కంపెనీ ఐపీవో పత్రాలపై సెబీ దర్యాప్తు చేస్తోంది. మెయిన్‌బోర్డ్ ఐపీవోకు సెబీ అనుమతి మంజూరు చేస్తుంది. ఎస్ఎంఈలకు అయితే బీఎస్ఈ లేదా ఎన్ఎస్ఈ ఆమోదం ఉంటే సరిపోతుంది. రుణంతో దరఖాస్తు... పేరున్న, వృద్ధికి పుష్కల అవకాశాలున్న కంపెనీ ఐపీవోకు వచ్చింది. దరఖాస్తుకు సరిపడా నిధుల్లేవు. అప్పుడు ఐపీవో ఫండింగ్ (రుణం రూపంలో నిధులు సమకూర్చుకోవడం) ఉపయోగపడుతుంది. కేవలం ఒక లాట్‌కు పరిమితం కాకుండా, పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకునేందుకు ఐపీవో ఫండింగ్ సాయపడుతుంది. ఒక్కో పాన్‌పై గరిష్టంగా రూ.కోటి వరకు ఫండింగ్ తీసుకోవచ్చు. కొన్ని సంస్థలు కనీసం రూ.25 లక్షల పరిమితిని అమలు చేస్తున్నాయి. సాధారణంగా రూ.10లక్షలకు మించిన కేటగిరీలో పాల్గొనే హెచ్ఎన్ఐలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటుంటారు. రుణ కాలవ్యవధి 6 రోజులుగా ఉంటుంది. 20–30 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఫండింగ్ కోసం రుణం ఇచ్చే సంస్థ వద్ద ఖాతా తెరవాలి. అలాగే ఆ సంస్థతో భాగస్వామ్యం కలిగిన బ్రోకరేజీ వద్ద డీమ్యాట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. తనవంతు మార్జిన్‌ను ఇన్వెస్టర్ సమకూర్చుకోవాలి. అప్పుడు మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్టర్ ఖాతాకు ఎన్బీఎఫ్సీ బదిలీ చేస్తుంది. ఒప్పందం ప్రకారం కేటాయించిన షేర్లపై ఎన్బీఎఫ్సీకి నియంత్రణ ఉంటుంది. లిస్టింగ్ రోజే విక్రయించాల్సి ఉంటుంది. కేటాయించిన ధర కంటే తక్కువకు లిస్ట్ అయితే, మిగిలిన మేర ఇన్వెస్టర్ చెల్లించాలి. లాభం వస్తే, ఎన్బీఎఫ్సీ వడ్డీ, ఇతర చార్జీలు చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్టర్ వెనక్కి తీసుకోవచ్చు.నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం (ఎన్ఐఐ) అధిక నెట్‌వర్త్ కలిగిన ఇన్వెస్టర్లు ఈ విభాగంలోనే బిడ్లు వేస్తుంటారు. ఇందులో రూ.2–10 లక్షల బిడ్లను స్మాల్ హెచ్ఎన్ఐ కేటగిరీగా, రూ.10 లక్షలకు మించి బిగ్ హెచ్ఎన్ఐ విభాగంగా పరిగణిస్తుంటారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌కు రూ.2–10 లక్షల విభాగంలో విలువ ప్రకారం చూస్తే 32 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. రూ.10 లక్షలకు పైన కేటగిరీలో 50 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. బిడ్ల విలువతో సంబంధం లేకుండా ప్రతి దరఖాస్తును సమానంగా పరిగణించి, అధిక సబ్ర్స్కిప్షన్ వచి్చనప్పుడు లాటరీ ఆధారంగా కేటాయింపులు చేస్తారు. ఇనిస్టిట్యూషన్స్ మినహా వ్యక్తులు ఎవరైనా ఈ విభాగంలో బిడ్లు వేసుకోవచ్చు. తద్వారా కేటాయింపుల అవకాశాలను పెంచుకోవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం స్మాల్ హెచ్ఎన్ఐ విభాగంలో 3.6 శాతం, బిగ్ హెచ్ఎన్ఐ విభాగంలో 12 శాతం మేర షేర్లను పొందే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎన్ని రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయనే దానికంటే మొత్తం దరఖాస్తులు ఎన్ననేది చూడడం ద్వారా కేటాయింపు అవకాశాలను తెలుసుకోవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అంత పెరిగి ఇంతే తగ్గింది.. నేటి పసిడి ధరలివే..
Gold Price Today: దేశంలో బంగారం ధరలు కొనుగోలుదారులకు కాస్త ఊరటను కలిగించాయి. క్రితం రోజున భారీగా పెరిగిన పసిడి రేట్లు ఈరోజు (నవంబర్ 9) స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో నేడు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర స్వల్పంగా రూ.100 తగ్గి రూ.72,750 లకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.110 క్షీణించి రూ. 79,360 లకు తగ్గింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు క్షీణించాయి.ఇదీ చదవండి: డిసెంబర్ 14 డెడ్‌లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు!ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే ఇక్కడ కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.72,900 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.110 తగ్గి రూ.79,510 వద్దకు దిగొచ్చింది.నిలకడగా వెండిSilver Price Today: దేశంలో వెండి ధరలు శనివారం నిలకడగా ఉన్నాయి. క్రితం రోజున కేజీకి రూ.1000 పెరిగగా నేడు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి రూ.1,03,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 55.47 పాయింట్లు లేదా 0.070 శాతం నష్టంతో 79,486.32 వద్ద, నిఫ్టీ 51.15 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 24,148.20 వద్ద నిలిచాయి.మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, నెస్లే, అశోక్ లేలాండ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ట్రెంట్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గోల్డ్ మళ్లీ స్వింగ్.. నేడు ఏకంగా..
Gold Price Today: దేశంలో బంగారం ధరలు హెచ్చుతగ్గులతో దోబూచులాడుతున్నాయి. క్రితం రోజున భారీగా దిగివచ్చిన పసిడి రేట్లు నేడు (నవంబర్ 8) అదే స్థాయిలో ఎగిశాయి. మేలిమి బంగారం తులానికి ఏకంగా రూ.900లకు పైగా పుంజుకుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో నేడు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) ధర ఏకంగా రూ.850 ఎగిసి రూ.72,850 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా భారీగా రూ.910 పెరిగి రూ. 79,470 లను తాకింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు భగ్గుమన్నాయి.ఇదీ చదవండి: సగానికి పడిపోయిన పండుగ డిమాండ్మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు ఆందోళనకరంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.850, అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ.910 ఎగిసింది. ప్రస్తుతం వీటి ధరలు వరుసగా రూ.73,000, రూ.79,620 లుగా కొనసాగుతున్నాయి.వెండి కూడా..Silver Price Today: దేశంలో వెండి ధరలు కూడా శుక్రవారం భారీగా పుంజుకున్నాయి. క్రితం రోజుతో పోలిస్తే వెండి ధరలు ఈరోజులు కేజీకి రూ.1000 చొప్పున పెరిగాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి రూ.1,03,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
4 ఐపీవోలకు సెబీ ఓకే.. లిస్ట్‌లో హైదరాబాదీ కంపెనీ
న్యూఢిల్లీ: దాదాపు రూ. 3,000 కోట్ల సమీకరణకు సంబంధించి నాలుగు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాయి లైఫ్ సైన్సెస్, రూబికాన్ రీసెర్చ్, సనాతన్ టెక్స్టైల్స్, మెటల్‌మ్యాన్ ఆటో వీటిలో ఉన్నాయి. ఇవి జూలై–ఆగస్టు మధ్యకాలంలో తమ ముసాయిదా ఐపీవో పత్రాలను సెబీకి సమర్పించాయి. అక్టోబర్ 31న సెబీ ఆమోదం లభించింది.హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్ ప్రతిపాదిత ఐపీవో కింద రూ. 800 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రమోటరు, ఇన్వెస్టర్ షేర్హోల్డర్లు, ఇతరత్రా షేర్హోల్డర్లు 6.15 కోట్ల షేర్లను ఓఎఫ్ఎస్ విధానంలో విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 600 కోట్ల మొత్తాన్ని రుణాల చెల్లింపునకు, మిగతా నిధులను కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. రూబీకాన్ రీసెర్చ్ రూ. 1,085 కోట్లు .. ఔషధాల ఫార్ములేషన్ కంపెనీ రూబీకాన్ రీసెర్చ్ రూ. 1,085 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, రూ. 585 కోట్లు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రమోటర్ విక్రయించనున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం జనరల్ అట్లాంటిక్‌కు రూబీకాన్ రీసెర్చ్‌లో 57 శాతం పైగా వాటాలు ఉన్నాయి. ఐపీవో నిధుల్లో రూ. 310 కోట్ల మొత్తాన్ని, రుణాల చెల్లింపు కోసం, మిగతాది ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం రూబీకాన్ వినియోగించుకోనుంది.మరోవైపు, సనాతన్ టెక్స్టైల్స్ రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రమోటర్ గ్రూప్ సంస్థలు రూ. 300 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నాయి. తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 210 కోట్ల మొత్తాన్ని .. అనుబంధ సంస్థ సనాతన్ పాలీకాట్కి సంబంధించి దీర్ఘకాలిక మూలధన అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయనుంది. అలాగే రూ. 175 కోట్లను రుణాల చెల్లింపు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగించుకోనుంది.అటు మెటల్‌మ్యాన్ ఆటో సంస్థ రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఓఎఫ్ఎస్ విధానంలో ప్రమోటర్లు 1.26 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 25 కోట్ల మొత్తాన్ని మధ్యప్రదేశ్‌లోని పిథంపూర్‌లో 2వ యూనిట్లో యంత్రపరికరాల కొనుగోలు తదితర అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 849.86 పాయింట్లు లేదా 1.06 శాతం తగ్గి 79,528.27 వద్ద, నిఫ్టీ 289.45 పాయింట్లు లేదా 1.18 శాతం తగ్గి 24,194.60 వద్ద నిలిచాయి.అపోలో హాస్పిటల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, టీసీఎస్, లార్సెన్ & టూబ్రో వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హిందాల్కో, ట్రెంట్ లిమిటెడ్, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎన్నిక ముగిసింది.. పరుగు ఆగింది! బంగారం ధర యూటర్న్
అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడడంతో డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడి పీఠం ఎక్కనున్నారు. ఇప్పటివరకు కొంత సేఫ్డ్ అసెట్‌గా భావించే బంగారం పెట్టుబడులను ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నాట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు గురువారం యూటర్న్ తీసుకున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.72,000 (22 క్యారెట్స్), రూ.78,560 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. బుధవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.1650, రూ.1790 తగ్గింది.చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1650, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1790 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.72,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.78,560 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.ఇదీ చదవండి: ‘నవంబర్ 8న సెలవులో ఉంటాను.. బై’!దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1650 తగ్గి రూ.72,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.1790 దిగజారి రూ.78,710 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధర కూడా ఈ రోజు భారీగానే పడిపోయింది. బుధవారంతో పోలిస్తే కేజీ వెండి రేటు రూ.3,000 తగ్గి రూ.1,02,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మార్కెట్.. ‘ట్రంపె’ట్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంతో బుధవారం దలాల్ స్ట్రీట్ ఒకశాతానికిపైగా లాభపడింది. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 901 పాయింట్లు పెరిగి 80,378 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 271 పాయింట్లు బలపడి 24,484 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ సూచీలు ట్రంప్ ఆధిక్యంతో పాటు పెరుగుతూ వచ్చాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,094 పాయింట్లు పెరిగి 80,570 వద్ద, నిఫ్టీ 325 పాయింట్లు పెరిగి 24,538 వద్ద గరిష్టాలు తాకాయి. బీఎస్ఈలో చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 2.28%, రెండుశాతం రాణించాయి. రంగాల వారీగా అత్యధికంగా బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 4% లాభపడింది. టెక్ 3%, రియల్టీ 3%, ఇండ్రస్టియల్ 3%, సరీ్వసెస్ ఇండెక్సులు 2.50% రాణించాయి.అమెరికాలో అధికారం చేజిక్కించుకున్న రిపబ్లికన్ల పార్టీ ‘ట్రంప్ సరిచేస్తారు’ నినాదం అక్కడి మార్కెట్లనూ ప్రతిధ్వనించింది. యూఎస్ డోజోన్స్ 3%, ఎస్అండ్పీ 2%, నాస్డాక్ 2.5% లాభాల్లో ట్రేడవుతున్నాయి. అయితే ట్రంప్ అమెరికా ఫస్ట్ వైఖరి ప్రభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. సుంకాల మోత ఖాయమనే అంచనాలతో ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్, కొరియా సూచీలు 2.5% నుంచి అరశాతం నష్టపోయాయి. అయితే జపాన్, సింగపూర్, తైవాన్ సూచీలు 2% వరకు పెరిగాయి. యూరప్‌లో జర్మనీ డాక్స్, ఫ్రాన్స్ సీఏసీ, బ్రిటన్ ఎఫ్టీఎస్ సూచీలు 1% నష్టపోయాయి. ఇదీ చదవండి: ట్రంప్ మానియా..ఐటీపై ప్రభావం ఎంత?ట్రంప్ గెలుపు ఆధిక్యం కొనసాగుతున్న వేళ డాలర్ల రూపంలో ఆదాయాలు ఆర్జించే దేశీయ ఐటీ కంపెనీల షేర్లకు డిమాండ్ లభించింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 4% లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో అత్యధికంగా పెరిగిన షేర్లు ఇవే. పెర్సిస్టెంట్ 6%, ఎల్టీఐమైండ్టీ 5%, విప్రో షేర్లు 4% చొప్పున పెరిగాయి. సెన్సెక్స్ రెండురోజుల ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద ఎగసింది. బీఎస్ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.10.47 లక్షల కోట్లు పెరిగి రూ.452 లక్షల కోట్లకు చేరింది.రూపాయి ఆల్‌టైమ్ కనిష్టండాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం 22 పైసలు క్షీణించి జీవితకాల కనిష్టం 84.31 స్థాయి వద్ద స్థిరపడింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌కు మార్గం సుగమం కావడంతో పాటు ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో యూఎస్ కరెన్సీ డాలర్ బలపడటం దేశీయ కరెన్సీ కోతకు కారణమైంది. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ కొనసాగుతుండడమూ ప్రతికూలంగా మారింది.జీవితకాల గరిష్టానికి బిట్కాయిన్డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఖాయమనే వార్తలతో క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ 8% ఎగసి జీవితకాల 75,000 డాలర్లకు చేరింది. క్రిప్టో కరెన్సీలకు ట్రంప్ సానుకూలత కలిసొచి్చందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో 77% ర్యాలీ చేసింది. ఎన్నికల సందర్భంగా అమెరికాను క్రిప్టోల రాజధానిగా మార్చడంతో పాటు వ్యూహాత్మక రిజర్వ్‌గా బిట్‌కాయిన్‌ను తీర్చిదిద్దుదామని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
నిన్నటి వరకు ఓ లెక్క.. ఇప్పుడు మరో లెక్క: నేటి బంగారం ధరలు ఇవే..
నవంబర్ నెల ప్రారంభం నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. మళ్ళీ పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో పసిడి రేటు మళ్ళీ పెరిగింది. ఈ కథనంలో నేడు (నవంబర్ 6) దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడా తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో (హైదరాబాద్, విజయవాడ) 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,350 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,650 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు పసిడి ధర వరుసగా రూ. 100, రూ. 110 పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, వైజాగ్, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో కూడా పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.80,350 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.73,650 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ.100, రూ.110 పెరిగినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో.. చెన్నైలో బంగారం ధరలు ఒకే మాదిరిగా ఉన్నాయి.దేశ రాజధానిలో బంగారం ధర రూ. 110 (10 గ్రా 24 క్యారెట్స్) & రూ. 100 (10 గ్రా 22 క్యారెట్స్) పెరిగింది. అయితే ఢిల్లీలో ఈ రోజు గోల్డ్ రేట్లు వరుసగా రూ. రూ. 80,500.. రూ. 73,800 వద్ద ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు కొంత ఎక్కువగా ఉన్న ప్రాంతం ఢిల్లీ అని స్పష్టమవుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 గంటలకు సెన్సెక్స్ 97.18 పాయింట్లు లేదా 0.12 శాతం లాభంతో 79,573.81 వద్ద, నిఫ్టీ 34.85 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 24,279.70 వద్ద ముందుకు సాగుతున్నాయి.టాప్ గెయినర్స్ జాబితాలో అపోలో హాస్పిటల్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, డీఎల్ఎఫ్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరాయి. టైటాన్ కంపెనీ, హిందాల్కో, టాటా స్టీల్, టాటా మోటార్స్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం కంపెనీ, మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు నష్టాల బాట పట్టాయి.యూఎస్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో డోజోన్స్, నాస్డాక్ సూచీలు లాభాల్లో సాగుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ట్రంప్' షేర్స్ ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. జపాన్, సౌత్ కొరియా మార్కెట్లు సైతం లాభాల్లోనే సాగుతున్నాయి. అమెరికా ఎన్నికల ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్న సమయంలో స్టాక్ మార్కెట్ జోరందుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆసియా స్టాక్ మార్కెట్లలో జోష్: ఒక్కసారిగా పెరిగిన ట్రంప్ షేర్స్
అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా దూసుకెళ్తున్నాయి. డోజోన్స్, నాస్డాక్ సూచీలు లాభాల్లో సాగుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ట్రంప్' షేర్స్ ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. జపాన్, సౌత్ కొరియా మార్కెట్లు సైతం లాభాల్లోనే సాగుతున్నాయి.ప్రారంభ ట్రేడ్‌లో జపాన్ నిక్కీ 263.50 పాయింట్లు లేదా 0.68 శాతం పెరిగి 38,843.50 వద్ద ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఎస్&పీ/ఏఎస్ఎక్స్200.. 67.90 పాయింట్లు లేదా 0.83 శాతం పెరిగి 8,200.90 వద్ద ఉంది. దక్షిణ కొరియా కోస్పి 4.05 పాయింట్లు లేదా 0.16 శాతం పురోగమించి 2,581.57 వద్దకు చేరుకుంది.అమెరికా ఎన్నికలు ముగియడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌లు లాభపడ్డాయి. ఓవర్‌నైట్ ట్రేడ్‌లో.. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 427.28 పాయింట్లు లేదా 1.02 శాతం పెరిగి 42,221.88 వద్ద ఉంది. ఎస్&పీ 500 ఇండెక్స్ కూడా 70.07 పాయింట్లు లేదా 1.23 శాతం పెరిగి 5,782.76 వద్దకు చేరుకుంది. గిఫ్ట్ నిఫ్టీ.. ఒక రోజు స్మార్ట్ రికవరీ తర్వాత దేశీయ స్టాక్ సూచీలు ఎలా రాణిస్తాయనే దానిపై అందరి దృష్టి ఉంది.ఎన్నికల ఫలితాలు అమెరికాకు ఎగుమతి చేసే ఐటీ అండ్ ఫార్మా వంటి అనేక దేశీయ రంగాల దృక్పథాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా యూఎస్ ప్రభుత్వ విధానాలు ఆటో, బ్యాంకింగ్, రక్షణ, చమురు & గ్యాస్‌తో సహా అనేక ఇతర రంగాలను ప్రభావితం చేయవచ్చని తెలుస్తోంది. -
వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లపై జాగ్రత్త: సెబీ హెచ్చరిక
న్యూఢిల్లీ: అనధికార వర్చువల్ ట్రేడింగ్ లేదా గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు దూరంగా ఉండాలని సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. కేవలం రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీల (మధ్యవర్తిత్వ సంస్థలు) ద్వారానే లావాదేవీలు నిర్వహించాలని సూచించింది. యాప్‌లు/వెబ్ అప్లికేషన్లు/ప్లాట్‌ఫామ్‌లపై లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరల ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ లేదా ఫాంటసీ గేమ్‌లు ఆఫర్ చేస్తున్నట్టు సెబీ దృష్టికి వచ్చింది.ఈ తరహా కార్యకలాపాలు సెక్యూరిటీస్ చాంట్రాక్ట్ (రెగ్యులేషన్స్) చట్టం, 1956, సెబీ చట్టం 1992కు విరుద్ధమని, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ చట్టాలను తీసుకొచ్చినట్టు సెబీ తెలిపింది. రిజిస్టర్డ్ సంస్థల ద్వారానే పెట్టుబడులు, ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించింది. ‘‘అనధికారిక పథకాల్లో పాల్గొనడం, వ్యక్తిగత కీలక సమాచారాన్ని పంచుకోవడం ఇన్వెస్టర్ల సొంత రిస్క్, పైనే ఆధారపడి ఉంటుంది. దీని వల్ల ఎదురయ్యే పరిణామాలకు ఇన్వెస్టర్లే బాధ్యులు. ఎందుకంటే ఆయా సంస్థలు సెబీ వద్ద నమోదైనవి కావు. కనుక ఆయా సంస్థలతో నిర్వహించే లావాదేవీలకు సంబంధించి ఇన్వెస్టర్లకు పెట్టుబడిదారుల పరిరక్షణ, ఫిర్యాదుల పరిష్కార విభాగం తదితర సెబీ యంత్రాంగాలు అందుబాటులో ఉండవు’’ అని స్పష్టం చేసింది.విదేశీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు..మ్యూచువల్ ఫండ్స్ విదేశీ పెట్టుబడుల విషయంలో సెబీ కొంత ఉపశమనాన్ని కల్పించనుంది. భారత సెక్యూరిటీల్లో విదేశీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టిన మేరకు.. ఆయా విదేశీ పథకాల్లో భారత మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సెబీ తాజాగా ప్రకటించింది. అయితే ఆయా విదేశీ ఫండ్స్ భారత పెట్టుబడులు వాటి నిర్వహణ ఆస్తుల్లో 25 శాతానికి మించకూడదని పేర్కొంది.మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తమ పెట్టుబడులను మరింత వైవిధ్యం చేసుకునేందుకు సెబీ తాజా నిర్ణయం వీలు కల్పించనుంది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని సెబీ తెలిపింది. ఫండ్స్ పెట్టుబడుల విలువ సెబీ పరిమితులను మించితే నిబంధనలకు అనుగుణంగా తగ్గించుకునేందుకు ఆరు నెలల వ్యవధి ఉంటుంది. -
ఆరేళ్లలో ఈ2ఈ షేర్ ప్రభంజనం: రూ. 57 నుంచి రూ.5000కు!
స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ చిన్న కంపెనీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎమర్జ్ ప్లాట్ఫామ్లో లిస్టయిన కంపెనీ ఈ2ఈ నెట్వర్క్స్. తాజాగా డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ పెట్టుబడుల రూపంలో 21 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. అయితే అతిచిన్న కంపెనీగా ప్రారంభమైన ఈ షేరు ప్రస్తుతం మిడ్‌క్యాప్ స్థాయికి చేరుకోవడం విశేషం!ప్రస్థానమిలా..2018 మే 15న ఎన్ఎస్ఈ ఎమర్జ్‌లో షేరుకి రూ. 57 ధరలో ఐపీవోకు వచ్చిన కంపెనీ ఈ2ఈ నెట్వర్క్స్. తాజాగా ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 4,978 వద్ద ముగిసింది. వెరసి వరుసగా ఏడో రోజు అప్పర్ సర్క్యూట్ వద్ద నిలిచింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) రూ. 8,404 కోట్లకు చేరింది. గత 8 ట్రేడింగ్ సెషన్లలో ఈ షేరు 48 శాతం జంప్‌చేసింది. గత నెల రోజుల్లో చూస్తే 70 శాతం ర్యాలీ చేసింది. ఇదే సమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 3 శాతం నీరసించడం గమనార్హం!ఇటీవల ధూమ్‌ధామ్ గత 9 వారాలను పరిగణిస్తే అంటే సెపె్టంబర్ 2నుంచి ఈ2ఈ షేరు రూ. 2,332 నుంచి 113 శాతం ఎగసింది. నిజానికి 2024 జనవరి నుంచి 621 శాతం దూసుకెళ్లింది. ఈ సమయంలో నిఫ్టీ 10 శాతం మాత్రమే బలపడింది. ఇక 2023 ఆగస్ట్ 4న రూ. 285 వద్ద కదిలిన ఈ షేరు గత 15 నెలల్లో 17 రెట్లు లేదా 1,644 శాతం పురోగమించింది. కాగా.. 2024 సెపె్టంబర్30న సుప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా 1.05 శాతం వాటాకు సమానమైన 1,77,043 షేర్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ2ఈ కంపెనీ షేరు మెయిన్‌బోర్డ్‌లో ట్రేడవుతోంది.కంపెనీ ఏం చేస్తుందంటే?ఈ2ఈ నెట్వర్క్స్ సీపీయూ, జీపీయూ ఆధారిత క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను అందించడంలో ప్రత్యేకతను కలిగి ఉంది. తద్వారా కస్టమర్లకు భారీస్థాయి జనరల్ అండ్ ఏఐ వర్క్‌లోడ్స్‌ను నిర్వహించడంలో సహకారమందిస్తుంది. చిప్ దిగ్గజం ఎన్విడియా సాంకేతిక సహకారం ఇందుకు కంపెనీకి తోడ్పాటునిస్తోంది. ఈ బాటలో చిప్ తయారీ దిగ్గజాలు ఎన్విడియా, ఇంటెల్, ఏఎండీసహా హెచ్‌పీఈ, మైక్రోసాఫ్ట్, డెల్‌తో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఓపెన్‌సోర్స్ టెక్నాలజీ ద్వారా ప్రొప్రయిటరీ వర్చువలైజేషన్, క్లౌడ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్(ఐపీ) అభివృద్ధి చేస్తోంది. -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 649.37 పాయింట్ల లాభంతో.. 79,431.61 వద్ద, నిఫ్టీ 202.95 పాయింట్ల లాభంతో 24,198.30 పాయింట్ల వద్ద నిలిచాయి.జేఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, హిందాల్కో, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ మొదలైనవి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ కంపెనీ, జేకే సిమెంట్ వంటివి నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
శుభవార్త.. మరోమారు తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (నవంబర్ 5) పసిడి రేటు గరిష్టంగా రూ.160 తగ్గింది. దీంతో గోల్డ్ ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. కాబట్టి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేటు ఎలా ఉందనే విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.ఆంధ్రప్రదేశ్ (విజయవాడ), తెలంగాణ (హైదరాబాద్) వంటి తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.80,240.. 22 క్యారెట్ల ధర రూ.73,550 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 150, రూ. 160 తగ్గినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు రూ. 150 (10 గ్రా 24 క్యారెట్స్) & రూ. 160 (10 గ్రా 22 క్యారెట్స్) తగ్గింది. ధరలు ఎంత తగ్గినప్పటికీ.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ బంగారం రేటు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దేశ రాజధానిలో బంగారు ధరలు ఈ రోజు రూ. 80,390, రూ. 73,700 వద్ద నిలిచాయి.చెన్నైలో కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.80,240 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.73,550 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ.150, రూ.160 తగ్గింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా రూ.1,000 తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ ధర రూ. 1,05,000 వద్ద నిలిచింది. నవంబర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా బంగారం, వెండి ధరలు ఏ మాత్రం పెరగలేదు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బేర్ ఎటాక్..!
దేశీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతానికి పైగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 942 పాయింట్లు క్షీణించి 78,782 వద్ద స్థిరపడగా... నిఫ్టీ 309 పాయింట్లు నష్టపోయి 24 వేల దిగువన 23,995 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు మూడు నెలల కనిష్టం కావడం గమనార్హం. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలతో నష్టాల బాటపట్టాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో ట్రేడింగ్ గడిచే కొద్ది నష్టాల తీవ్రత మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్ 1,492 పాయింట్లు క్షీణించి 78,233 వద్ద, నిఫ్టీ 488 పాయింట్లు పతనమై 23,816 వద్ద కనిష్టాలు తాకాయి. ట్రేడింగ్ చివర్లో కనిష్ట స్థాయిల వద్ద పలు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కొంతమేర నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. కొన్ని రియల్టీ రంగ షేర్లు 5–6 శాతం వరకూ పతనం కాగా... ప్రైవేటు రంగ బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు 3–6 శాతం నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలేఇంట్రాడేలో అన్ని రంగాల షేర్లలోనూ విక్రయాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా రియల్టీ ఇండెక్స్ 3% క్షీణించింది. ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన సూచీలు 2.50% పడ్డాయి. టెలికమ్యూనికేషన్, విద్యుత్, కమోడిటీ షేర్లు 1.50% నష్టపోయాయి. వాస్తవానికి చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ ఏకంగా 2% పతనమైంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.50% నష్టపోయింది.ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్ సూచీలు మినహా అన్ని దేశాల ఇండెక్సులు నష్టపోయాయి. 1% నుంచి అరశాతం నుంచి పతనమయ్యాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ సూచీలు పావుశాతం నష్టపోయాయి. అమెరికా సూచీలు బలహీనంగా ట్రేడవుతున్నాయి.సెన్సెక్స్ 942 పాయింట్ల పతనంతో ఇన్వెస్టర్ల సంపద గురువారం ఒక్కరోజే రూ. 5.99 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈ మార్కెట్ విలువ రూ.421 లక్షల కోట్లకు దిగివచ్చింది. రిలయన్స్ 3%, అదానీ పోర్ట్స్ 3%, సన్‌ఫార్మా 2.60%, ఎన్టీపీసీ 2.50%, బజాజ్ ఫిన్సర్వ్ 2.45%, యాక్సిస్ బ్యాంకు 2.40 నష్టపోయాయి. అక్టోబర్ వాహన అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండడంతో బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ షేర్లు 3–4% చొప్పున నష్టపోయాయి. ఎదురీదిన ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా షేరు ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా షేరు ఎదురీదింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.463)తో పోలిస్తే 7% డిస్కౌంటుతో రూ.430 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 9% క్షీణించి రూ.420 వద్ద కనిష్టాన్ని తాకింది. అయితే ట్రేడింగ్ చివర్లో రికవరీతో 2.50% లాభపడి రూ.475 వద్ద స్థిరపడింది.ఇదీ చదవండి: స్విగ్గీకి రూ.35,453 జరిమానా!నష్టాలు ఎందుకంటే..?అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ద్రవ్య పరపతి సమావేశాల(6–7 తేదీల్లో) నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. బీజింగ్‌లో జరుగుతున్న నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సందర్భంగా చైనా మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించవచ్చనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. చమురు ఉత్పత్తి పెంచాలనే నిర్ణయాన్ని ఓపెక్ వాయిదా వేసుకోవడంతో క్రూడాయిల్ ధరలు 2% పెరిగాయి. సెపె్టంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరిచేలా ఉండటంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర కొనసాగుతోంది. -
గరిష్ట ధర వద్ద లాభాల స్వీకరణ
న్యూఢిల్లీ: అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా గరిష్ట ధరల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో బంగారం పరుగు కొంత తగ్గింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర సోమవారం రూ.1,300 తగ్గి రికార్డు స్థాయిల నుంచి రూ.81,100కు దిగివచ్చింది. గత ట్రేడింగ్‌లో రూ.82,400 ఆల్‌టైమ్ రికార్డుకు పసిడి దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఇక వెండి కేజీ ధర ఏకంగా రూ.4,600 తగ్గి రూ.94,900కి చేరింది.ఆభరణ వర్తకులు, రిటైలర్ల నుంచి కూడా డిమాండ్ కొంత మందగించినట్లు ట్రేడర్లు పేర్కొన్నారు. కాగా, 99.5 స్వచ్ఛత పసిడి ధర న్యూఢిల్లీలో రూ.1,300 దిగివచి్చన రూ.80,700కు చేరింది. ఇదిలావుండగా అంతర్జాతీయ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ ఫ్యూచర్స్ ఔన్స్ (31.1గ్రా ములు) ధర 2,747 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ పసిడి ధర వారంరోజుల క్రితం 2,802 డాల ర్ల ఆల్‌టైమ్ రికార్డును తాకిన సంగతి తెలిసిందే.