Electricity Charges
-
బాబూ.. విద్యుత్ బాదుడు ఆపండి
సాక్షి, అమలాపురం: ‘ఆక్వాకు విద్యుత్ రాయితీ ఇస్తున్నామని పేరుకే చెబుతున్నారు. ఏదో ఒక రూపంలో భారీగా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. బాబూ... విద్యుత్ బాదుడు ఆపండి... ఆక్వా రైతులను ఆదుకోండి’ అంటూ కోనసీమకు చెందిన ఆక్వా రైతులు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కోనసీమ ఆక్వా రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆక్వా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ ‘కూటమి ప్రభుత్వ విద్యుత్ విధానాల వల్ల రైతులపై పెనుభారం పడుతోంది. ఆక్వాకు విద్యుత్ సరఫరాలో తరచూ లో ఓల్టేజ్ సమస్య ఏర్పడుతోంది. దీనివల్ల విద్యుత్ వినియోగం అధికమవుతోంది. దానిని సాకుగా చూపించి కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలని, ఇందుకోసం రూ.లక్షలు చెల్లించాలని రైతులకు నోటీసులు పంపుతున్నారు. ఎస్పీఎల్ చార్జీలని, అదనపు లోడని, షార్ట్ ఫాల్ చార్జీలని ఆక్వా రైతుల నడ్డి విరుస్తున్నారు. చెరువుల్లో రొయ్యలు, చేపలు ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. అదేవిధంగా రొయ్యల కొనుగోలుదారులు సిండికేటుగా మారి రైతులను ముంచేస్తున్నారు. చెరువుల్లో రొయ్యలు లేని సమయంలో కౌంట్ ధరలు పెంచుతున్నారు.పట్టుబడుల సమయంలో రేటు తగ్గించేస్తున్నారు. మేత, ఆయిల్‌పై కస్టమ్స్ డ్యూటీ ఎత్తేశామని బడ్జెట్లో ప్రకటించినా ధరలు యథాతథంగా ఉన్నాయి.’ అని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనలో టీడీపీ, జనసేనకు చెందిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం గమనార్హం. రైతు సంఘాల ప్రతినిధులు యాళ్ల వెంకటానందం, రుద్రరాజు వెంకట రాజు (నానీరాజు), మోటూరి నాని, యేడిద శంకరం, బొలుసు రాంబాబు, టీడీపీ అల్లవరం మండల అధ్యక్షుడు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్తిబాబు రాజు, జనసేన నేత త్సవటపల్లి నాగభూషణం పాల్గొన్నారు. -
విద్యుత్ వెలుగులు లేవు!
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగానికి ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించకుండా చంద్రబాబు ప్రభుత్వం మరోసారి చేతులెత్తేసింది. ఓటాన్ బడ్జెట్లోనే ఇంధన శాఖకు అరకొరగా కేటాయింపులు చేసి చేతులు దులుపుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. వార్షిక బడ్జెట్లోనూ మొండి చేయి చూపించింది. రాష్ట్ర ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ చార్జీల భారం వేసి బిల్లులు వసూలు చేస్తున్న ప్రభుత్వం.. ఇంధన రంగానికి, రాయితీలు, సబ్సిడీల కోసం బడ్జెట్లో కేవలం రూ.13,600 కోట్లే కేటాయించింది. కనీసం చార్జీల రూపంలో ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నంత కూడా ఇవ్వలేకపోయింది. విద్యుత్ రంగం రూ.1.29 లక్షల కోట్లకు పైగా నష్టాల్లో ఉందన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ఆ అప్పులను తీర్చేందుకు ఒక్క రూపాయి కూడా సాయంగా ప్రకటించలేదు. పైగా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిoదని.. అందుకే ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. నిజానికి గత టీడీపీ హయాంలో జరిగిన అనవసర అధిక ధరల విద్యుత్ కొనుగోళ్ల వల్లే.. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయనే వాస్తవాన్ని మంత్రి ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు. నూతన సమగ్ర ఆంధ్రప్రదేశ్ సమీకృత క్లీన్ ఎనర్జీ విధానం–2024 ద్వారా పునరుత్పాదక ఇంధన తయారీ జోన్లను ఏర్పాటు చేసి, పెట్టుబడులను ఆకర్షించి 7.5 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. అయితే ఇప్పటివరకూ ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారో, ఈ రంగంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో మంత్రి చెప్పలేకపోయారు. కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు ఇంధన రంగానికి సంబంధించి ఇచ్చిన హామీలకు బడ్జెట్లో అస్సలు స్థానమే లభించలేదు. రైతులకు సబ్సిడీపై పంపుసెట్లు మంజూరు చేస్తామనే హామీ అమలు గురించి ఎక్కడా కనిపించలేదు. భవిష్యత్‌లో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ను అందుకోవడం కోసం ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ప్రకటించలేదు. ఇక ఇంధన పొదుపు, సంరక్షణ కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కేవలం కేంద్ర పథకాలైన పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలకు వచ్చే సబ్సిడీలతోనే సోలార్ రూఫ్ టాప్, సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని చెబుతోంది. -
చిరు వ్యాపారులకు షాక్
సాక్షి, అమరావతి/తిరుపతి రూరల్: వ్యాపారాలు, చిన్న పరిశ్రమలతో స్వయం ఉపాధి కల్పించుకొని, మరికొందరికి ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు, చిన్న పరిశ్రమలపై చంద్రబాబు ప్రభుత్వం దొంగ దెబ్బ కొట్టింది. ఓ పక్క విద్యుత్ చార్జీలు పెంచడంలేదని చెబుతూనే.. వీరిపై టైమ్ ఆఫ్ డే టారిఫ్ (టీఓడీ) పేరుతో పీక్ అవర్స్‌లో అదనపు విద్యుత్ చార్జీల భారం మోపుతోంది. అంటే విద్యుత్ ఎక్కువగా వాడే ఉదయం, సాయంత్రం సమయాల్లో అదనపు చార్జీలు పడతాయి. చిన్న షాపుల్లో సాయంత్రం వేళ వ్యాపారం జరిగినా, జరగకపోయినా కరెంటు చార్జీలు మాత్రం భారీగా పడతాయి. ఈ సమయాల్లో లోడ్‌నుబట్టి యూనిట్‌కు 50 పైసల నుంచి 1 రూపాయి వరకు అదనపు భారం పడనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి. ఇక బాదుడు మామూలుగా ఉండదు అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ అప్, ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజల నుంచి అత్యధికంగా విద్యుత్ చార్జీలు వసూలు చేస్తూ రూ.15,485 కోట్ల విద్యుత్ చార్జీల భారం వేసిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు సమయాన్ని బట్టి బాదుడు మొదలెట్టింది. ఇన్నాళ్లూ హై టెన్షన్ (హెచ్‌టీ) కనెక్షన్ ఉన్న పెద్ద పరిశ్రమలకు మాత్రమే అమలులో ఉన్న టైమ్ ఆఫ్ డే టారిఫ్ చార్జీలను ఇకపై లో టెన్షన్ (ఎల్టీ) పరిశ్రమలు, వాణిజ్య సర్వీసులకూ అమలు చేయనుంది. ఈ మేరకు 2025–26 ఆర్థిక సంవత్సరం రిటైల్ సరఫరా ధరలు (టారిఫ్ ఆర్డర్)ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) గురువారం తిరుపతిలో విడుదల చేసింది. విద్యుత్ వినియోగించే సమయాన్ని బట్టి వినియోగదారులపై భారం మోపేందుకు ఏపీఈఆర్సీ అనుమతినిచ్చిoది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ‘పీక్ అవర్’ వినియోగంలో ఒక విధంగా, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ‘ఆఫ్ పీక్ అవర్’లో మరో విధంగా చార్జీలు వసూలు చేస్తారు. మిగతా సమయంలో ఇప్పుడున్న చార్జీలే వర్తిస్తాయి. ఈమేరకు చార్జీల వసూలుకు డిస్కంలు చేసిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఎఆర్ఆర్) ప్రతిపాదనలకు ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. గ్రిడ్ డిమాండ్ ఎక్కువగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చార్జీలు మరింతగా పెంచి విద్యుత్ బిల్లుల్లో వేయనున్నారు. పైగా ఇదీ కిలోవాట్ల లెక్కన లోడ్‌నుబట్టి మారిపోతుంది. అంటే 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ, 220 కేవీ లోడ్ ప్రకారం చార్జీ పడుతుంది. ఏమాత్రం లోడ్ పెరిగినా బిల్లు భారీగా పెరుగుతుంది. డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయాలి ఈ వేసవిలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 260 మిలియన్ యూనిట్లకు పెరిగే అవకాశం ఉన్నందున ఎలాంటి కోతలు లేకుండా సరఫరా చేయాలని డిస్కంలను ఏపీఈఆర్సీ ఇన్చార్జి చైర్మన్ ఠాకూర్ రామ్‌సింగ్ ఆదేశించారు. తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గృహావసరాలకు అవసరమైన అదనపు లోడ్లను డిస్కంల పరిధిలో క్రమబద్ధీకరించి కోతలు లేకుండా చూడనున్నట్లు చెప్పారు. ఇప్పుడు వాడుతున్న విద్యుత్‌కు అదనంగా విద్యుత్ అవసరమని అంచనా వేశామన్నారు. స్మార్ట్ మీటర్లు ఎక్కడా ఏర్పాటు చేయడంలేదని, వాటిని ఇంకా ఆమోదించలేదని, ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టును మాత్రమే ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం విద్యుత్ వాడకం పెరుగుతుండడంతో అందుకు తగినట్లుగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. ఏపీఆర్సీ సభ్యుడు వెంకట్రామరెడ్డి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టారిఫ్ ఆర్డర్‌లోని మరికొన్ని నిర్ణయాలు» ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సమర్పించిన ఏఆర్ఆర్ ప్రకారం.. ఆదాయ అవసరం రూ.57,544.17 కోట్లను ఏపీఈఆర్సీ ఆమోదించింది. ఇది డిస్కంలు అడిగిన దానికంటే రూ.1,324.35 కోట్లు మాత్రమే తక్కువ. మొత్తం ఆదాయం రూ.44,323.30 కోట్లుగా నిర్ణయించింది. » రూ.12,632.40 కోట్ల ఆదాయ అంతరాన్ని ఆమోదించింది. ఇది డిస్కంలు దాఖలు చేసినదానికంటే రూ.2,050.86 కోట్లు తక్కువ. » రాష్ట్ర ప్రభుత్వం రూ.12,632.40 కోట్ల ఆదాయ అంతరాన్ని సబ్సిడీగా భరించేందుకు అంగీకరించింది. » ఎంపిక చేసిన వర్గాలకు ఉచిత విద్యుత్, రాయితీలు కొనసాగుతాయి. » రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని జెన్కోలు దిగుమతి చేసుకున్న బొగ్గు రవాణాకు రైలు, సముద్ర మార్గాలను వినియోగించుకోవచ్చు. » స్వల్ప కాలిక విద్యుత్ అవసరాల కోసం తొలిసారిగా అవర్లీ డిస్పాచ్‌ను తీసుకువర్వీచ్చింది. » ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇళ్లను నిర్మించుకునే లేదా పునర్నిర్మిoచే వ్యక్తులు వాణిజ్య టారిఫ్‌కు బదులుగా డొమెస్టిక్ టారిఫ్ బిల్ చెల్లించుకోవచ్చు. » స్థిరమైన టారిఫ్‌లు గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సె‹స్ వినియోగదారులకే కాకుండా ఓపెన్ యాక్సెస్ వినియోగదారులకూ వర్తిస్తాయి. » 150 కేడబ్ల్యూ వరకు కనెక్ట్ చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు ఎల్టీ వోల్టేజ్ స్థాయిలో విద్యుత్ సరఫరా చేయడానికి ఆమోదం. డిమాండ్ చార్జీలు లేకుండా ఈవీల టారిఫ్ యూనిట్‌కు రూ.6.70 వసూలు చేస్తారు.కొత్తగా అదనపు లోడ్ క్రమబద్దీకరణ పథకం డెవలప్మెంట్ చార్జీల్లో 50 శాతం చెల్లించడం ద్వారా గృహ వినియోగదారులు అదనపు లోడ్‌ను క్రమబద్దీకరించే పథకాన్ని ఏపీఈఆర్సీ ఆమోదించింది. ఈ పథకం 2025 మార్చి 1 నుంచి 2025 జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. ఆన్లైన్ విండో ద్వారా వినియోగదారులు స్వచ్ఛందంగా అదనపు లోడ్లను ప్రకటించవచ్చు. డిస్కంలు అదనపు లోడ్లను క్రమబద్దీకరిస్తాయి. డెవలప్మెంట్ ఛార్జీల్లో 50 శాతం వసూలు చేస్తాయి. అదనపు లోడ్ కోసం సెక్యూరిటీ డిపాజిట్లు కూడా సేకరిస్తాయి. ఈ అవకాశం ఒకసారి మాత్రమే ఉంటుంది. -
కరెంటు చార్జీలు పెరగవు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2025–26లో సైతం విద్యుత్ చార్జీలు పెరగవు. ప్రస్తుత చార్జీలనే యథాతథంగా కొనసాగించాలని కోరుతూ దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్/టీజీఎన్పీడీసీఎల్)లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని కోరాయి. ఈ మేరకు తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్), టారిఫ్ ప్రతిపాదనలు 2025–26ను మంగళవారం ఈఆర్సీకి సమర్పించాయి. డిస్కంల అంచనాల ప్రకారం 2025–26లో రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని రకాల ఖర్చులు కలిపి మొత్తం రూ.65,849 కోట్ల వ్యయం కానుంది. అందులో విద్యుత్ కొనుగోళ్లకే రూ.50,572 కోట్ల వ్యయం కానుండగా, నిర్వహణ, పర్యవేక్షణ ఖర్చులు, ఉద్యోగుల జీతాలు కలిపి మిగిలిన వ్యయం కానుంది. అయితే, ప్రస్తుత చార్జీలతో రూ.45,698 కోట్ల ఆదాయం మాత్రమే రానుంది. దీంతో విద్యుత్ చార్జీలు పెంచకపోతే రూ.20,151 కోట్ల నష్టాలను మూటగట్టుకోనున్నాయి. అయితే, డిస్కంలు సమర్పించిన అంచనా ప్రతిపాదనలపై ఈఆర్సీ రాతపూర్వకంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన తర్వాత హైదరాబాద్, వరంగల్‌లో బహిరంగ విచారణ సైతం జరపనుంది. అనంతరం వాస్తవికతకు దగ్గరగా ఉండేలా డిస్కంల అంచనాలను సవరిస్తూ ఆమోదించనుంది. ఒకవేళడిస్కంల ఆదాయ లోటు రూ.20,151 కోట్లు వాస్తవమేనని ఈఆర్సీ ఆమోదిస్తే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలను పెంచాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వంపై సబ్సిడీల భారం పడకుండా గతంలో ఈఆర్సీ.. డిస్కంల ఆదాయ లోటును తగ్గించి చూపించినట్టు విమర్శలున్నాయి. ఏటేటా నష్టాలు ప్రభుత్వం ఏ మేరకు సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరిస్తే ఆ మేరకు మాత్రమే ఆదాయ లోటు ఉందని ఈఆర్సీ నిర్ధారించడంతో డిస్కంల నష్టాలు ఏటేటా పెరుగుతున్నాయి. 2023–24లో రూ.6,299.29 కోట్ల కొత్త నష్టాలను మూటగట్టుకోగా, మొత్తం నష్టాలు రూ.57,448 కోట్లకు ఎగబాకాయి. ఒక్క టీజీఎస్పీడీసీఎల్ నష్టాలే రూ.39,692 కోట్లకు చేరగా, టీజీఎన్పీడీసీఎల్ రూ.17,756 కోట్ల నష్టాల్లో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం డిస్కంలకు రూ.11,499 కోట్ల సబ్సిడీలను చెల్లించేందుకు అంగీకరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపు భారం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడానికి సబ్సిడీలను మరింతగా పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, విద్యుత్ టారిఫ్‌ను యథాతథంగా కొనసాగించినా, హెచ్‌టీ కేటగిరీ వినియోగదారులకు గ్రిడ్ సపోర్ట్ చార్జీలతోపాటు స్టాండ్ బై చార్జీలు, క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీలను మాత్రం సవరించాలని డిస్కంలు ఈఆర్సీని కోరినట్టు తెలిసింది. -
కరెంటు చార్జీల పెంపు లేదు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. చార్జీలు పెంచాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) లు చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. ప్రస్తుత విద్యుత్ చార్జీలనే వచ్చే ఆర్థిక సంవత్సరం 2025–26లో యథా తథంగా కొనసాగించాలని స్పష్టం చేసింది. విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించకుండానే 2025–26కి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్), టారిఫ్ ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించేందుకు డిస్కంలకు అనుమతి నిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యుత్ చార్జీలనే 2025–26లోనూ కొనసాగించాలని ప్రతిపాదిస్తూ వారం రోజుల్లో ఈఆర్సీకి ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలను సమర్పిస్తామని డిస్కంల అధికారవర్గాలు వెల్లడించాయి.నష్టాల ఊబిలో డిస్కంలు..ఉత్తర/దక్షిణ డిస్కంలు గత ఆర్థిక సంవత్సరం 2023–24లో రూ.6,299.29 కోట్ల కొత్త నష్టాలను మూటగట్టుకోగా, మొత్తం నష్టాలు రూ.57,448 కోట్లకు ఎగబాకాయి. ఒక్క టీజీఎస్పీడీసీఎల్ నష్టాలే రూ.39,692 కోట్లకు చేరగా, టీజీఎన్పీడీసీఎల్ రూ.17,756 కోట్ల నష్టాల్లో ఉంది. కాగా విద్యుత్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి గత శనివారం ఆ శాఖపై నిర్వహించిన సమీక్షలో.. డిస్కంల నష్టాలను అధికారులు ప్రస్తావించారు.విద్యుత్ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని వివరించారు. గృహాలు మినహాయించి కేవలం పారిశ్రామిక, ఇతర వాణిజ్య కేటగిరీల విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతించాలని కోరినట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ చార్జీల పెంపు జోలికి వెళ్లవద్దని సీఎం, డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుత చార్జీలనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొనసాగిస్తామని ప్రతిపాదిస్తూ ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాలని సీఎం ఆదేశించారని అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే శనివారం ఈఆర్సీకి ఈ మేరకు ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించే అవకాశముందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.విద్యుత్ సబ్సిడీ పెంచక తప్పదుప్రస్తుత విద్యుత్ చార్జీలతోనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సర ఫరా చేస్తే డిస్కంలకు కొత్తగా వచ్చే నష్టాలను డిస్కంలు అంచనా వేసి ఈఆర్సీకి సమర్పించే ప్రతిపాదనల్లో ఆర్థిక లోటుగా చూపించనున్నాయి. ఈఆర్సీ పరిశీలించి ఆమోదించిన నష్టాల మొత్తాన్ని డిస్కంలకు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తేనే విద్యుత్ చార్జీల పెంపు భారం నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది. గతేడాది నవంబర్ నుంచి ప్రస్తుత ఏడాది మార్చి 31 వరకు రాష్ట్రంలో రూ.1,200 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతి కోరుతూ డిస్కంలు గతేడాది చివర్లో ప్రతిపాదనలు సమర్పించగా, ఈఆర్సీ అనుమతించకపోవడంతో చార్జీల పెంపు భారం నుంచి ఉపశమనం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలను రూ.11,499 కోట్లకు పెంచేందుకు అంగీకరించడంతో ఇది సాధ్యమైంది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సబ్సిడీలను ప్రభుత్వం మరింతగా పెంచితేనే ప్రజలపై చార్జీల పెంపు భారం ఉండదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
భోగి మంటల్లో విద్యుత్ బిల్లుల దహనం
సాక్షి, అమరావతి /కృష్ణలంక(విజయవాడతూర్పు)/ఒంగోలు టౌన్/చిత్తూరు కార్పొరేషన్/ ఆమదాలవలస: చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సోమవారం భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను దహనం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ చార్జీలు పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చిన వెంటనే సర్దుబాటు చార్జీల పేరుతో రెండు విడతల్లో రూ.16వేల కోట్ల భారం మోపారని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు మంగళంపాడారని మండిపడ్డారు. తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. -
విద్యుత్ ఛార్జీల పెంపుపై APERC ప్రజాభిప్రాయ సేకరణ
-
ఎవరినడిగి విద్యుత్ చార్జీలు పెంచారు?
సాక్షి, అమరావతి: ‘రూ.15,485 కోట్ల విద్యుత్ చార్జీలను ఎవరినడిగి పెంచారు? కనీసం ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదు’ అని ప్రతిపక్ష పార్టీల నేతలు, వివిధ వర్గాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమర్పించిన వార్షిక ఆదాయ, అవసరాల నివేదికలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మంగళవారం బహిరంగ విచారణ చేపట్టింది. మండలి ఇన్చార్జ్ చైర్మన్ ఠాగూర్ రామ్‌సింగ్, సభ్యుడు పీవీఆర్ రెడ్డి విజయవాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అభిప్రాయాలు సేకరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రజలపై మోపుతున్న అదనపు విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా, ట్రూ అప్, సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లను పెట్టవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. బహిరంగ విచారణ జరుగుతున్న వేదిక వద్ద వివిధ రాజకీయ పార్టీలతోపాటు వినియోగదారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే రూ.15 వేల కోట్లకుపైగా భారం మోపిందన్నారు.గత ప్రభుత్వం చేసిన మంచిని కొనసాగించాలివిద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం మాటతప్పి నమ్మక ద్రోహం చేసిందని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు అన్నారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు, వృత్తిదారులకు ఉచిత, సబ్సిడీ విద్యుత్ ఇవ్వడం మంచిపని అని..దానిని కూటమి ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. ‘షార్ట్ టెర్మ్’ పేరుతో రూ.వేల కోట్ల అవినీతి జరుగుతోందని, దీనిపై విచారణ చేయాలన్నారు.సౌర విద్యుత్‌పై జీఓ ఏదీ..?గత ప్రభుత్వ తప్పులు వెతకడం అనసరమని ఫార్మర్స్ ఫెడరేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ వేణుగోపాలరావు అన్నారు. సౌర విద్యుత్‌ను ఒడిసిపట్టుకుంటామనిప్రకటనలు చేయడం తప్ప ఇంతవరకూ కూటమి ప్రభుత్వం జీఓ జారీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా శీర్షాసనం చేసి ఆయన నిరసన తెలిపారు.ప్రజల పక్షాన వైఎస్సార్సీపీమాకు ఓటేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచమని, తగ్గిస్తామని ఎన్నికల ముందు హామీఇచ్చి ప్రజలను చంద్రబాబు మభ్యపెట్టారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.15,485 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపైమోపుతున్నారన్నారు. పెంచిన చార్జీలు రద్దు చేసి, ప్రజల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే ఉపసంహరించాలని ఏపీఈఆర్సీని కోరినట్లు ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ తెలిపారు. -
20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ!
సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఎనర్జీ(Green energy) ఉత్పాదకతను ప్రోత్సహించి భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి త్వరలో ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ(Green Energy Policy) ప్రకటించబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తెలిపారు. కాలుష్య కారక థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థానంలో ప్రపంచవ్యాప్తంగా కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ(Green energy) ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్రం కూడా ఆ దిశలో అడుగులు వేస్తోందని చెప్పారు. రాష్ట్రం 11,399 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ(Green energy) ఉత్పత్తితో దేశంలో ముందంజలో ఉండగా, 2030 నాటికి ఈ సామర్థ్యాన్ని 20,000 మెగావాట్లకు పెంచడమే పాలసీ లక్ష్యమన్నారు. శుక్రవారం హెచ్ఐసీసీలో పారిశ్రామిక, వ్యాపార, ఇతర రంగాల భాగస్వాములతో నిర్వహించిన సదస్సులో భట్టి మాట్లాడారు. అనంతరం వివరాలను వెల్లడించారు. భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్ ‘సాంకేతిక, ఫార్మా, ఉత్పత్తి, వ్యవసాయ రంగాల అభివృద్ధికి రాష్ట్రం కేంద్రంగా ఆవిర్భవించింది. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫార్మాసిటీ, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, పారిశ్రామిక కారిడార్లు అధిక విద్యుత్ డిమాండ్(Electricity Demand) కు దోహదపడతాయి. 2024–25లో రాష్ట్రంలో 15,623 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏర్పడగా, 2029–30 నాటికి 24,215 మెగావాట్లకు, 2034–35 నాటికి 31,809 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా’అని భట్టి చెప్పారు. భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు ‘పునరుత్పాదక విద్యుత్ రంగం(electricity sector) లో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం 7,889 మెగావాట్ల సౌర విద్యుత్, 2,518 మెగావాట్ల జల విద్యుత్, 771 మెగావాట్ల డి్రస్టిబ్యూటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ, 128 మెగావాట్ల పవన విద్యుత్ సహా 221 మెగావాట్ల ఇతర పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. పాలసీలో భాగంగా సౌర విద్యుత్‌తో పాటు ఫ్లోటింగ్ సోలార్, గ్రీన్ హైడ్రోజన్, హైబ్రిడ్ ప్రాజెక్టులు తీసుకొస్తాం. ఈ నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులతో పాటు సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తాం..’అని భట్టి తెలిపారు.రాష్ట్రంలో ఈ ఏడాది కూడా విద్యుత్ చార్జీల(electricity charge) ను పెంచబోమని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, డిస్కంల సీఎండీలు ముషారఫ్ అలీ, కె.వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు ఇందనంగా గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని భవిష్యత్తు ఇంధనంగా భావిస్తున్నామని భట్టి చెప్పారు. ఆ్రస్టేలియా– ఇండియా క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఐఐటీలో రెండురోజుల వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పరిశోధన, సంబంధిత సైన్స్ ఆధారిత కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వైఎస్సార్ నాయకత్వంలోనే హైదరాబాద్ ఐఐటీకి పునాదులు పడ్డాయని, ఐఐటీలు దేశ నిర్మాణానికి వేదికలని చెప్పారు. ఈ సందర్భంగా సింగరేణిలో పరిశోధనకు సంబంధించిన ప్రాజెక్టుపై హైదరాబాద్ ఐఐటీ ఆ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. సింగరేణి డైరెక్టర్ బలరామ్ నాయక్, ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి ఎంఓయూపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఆ్రస్టేలియా కాన్సులేట్ జనరల్ (బెంగళూరు) హిల్లరీ మెక్గేచి, భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే, కేంద్ర గనుల శాఖ జాయింట్ సెక్రటరీ దినేష్ మహోర్ తదితరులు పాల్గొన్నారు. -
సీన్ మారిందని ఎల్లోమీడియాకూ స్పష్టమైనట్లుంది!
అంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజల తిరుగుబాటు వేడి బాగానే తగులుతున్నట్లుంది. టీడీపీ జాకీమీడియా ‘ఆంధ్రజ్యోతి’ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పెడుతున్న శోకండాలే దీనికి నిదర్శనం. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలు, ర్యాలీలు విజయవంతం కావడంతో టీడీపీ, దాని తోకమీడియాలిప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు నానా తంటాలూ పడుతున్నాయి. ప్రభుత్వంపై ఆరునెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న అంచనాలను వైఎస్సార్సీపీ పిలుపునకు ప్రజలు స్పందించిన తీరు దాన్ని ధ్రువీకరించింది. తమ కోడి కూయనిదే తెల్లవారదనుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతులు ఈ వార్తలను కప్పిపుచ్చేందుకు, గత ప్రభుత్వం పాలనే ఛార్జీల పెంపునకు కారణమంటూ బుకాయించే యత్నం చేసింది. కాకపోతే ప్రజలు తమకు కలిగిన నొప్పిని కూడా మరచిపోతారని అనుకుందీ ఎల్లో మీడియా! చంద్రబాబు మాకిచ్చిన హామీ ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? అన్న ఆలోచన, విచక్షణ లేకుండా ప్రజలుంటారా? ప్రజల చెవుల్లో పూలు పెట్టి అధికారమైతే కొట్టేశామని టీడీపీ, జనసేన, బీజేపీలు సంతోషించవచ్చు. తమ వంచన చాతుర్యానికి ఈనాడు, ఆంధ్రజ్యోతులు మురిసి పోతూండవచ్చు. అయితే ఇది ఎంతో కాలం నిలవదన్న విషయం ఈపాటికి వీరికి అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా స్వర్గంగా మారిందన్న భ్రమ కల్పించడానికి కూటమి, ఎల్లో మీడియా తంటాలు పడుతున్నాయి. తమ ఈ తాజా పాచిక పారడం లేదన్న విషయమూ వారికి స్పష్టమవుతోంది. మనసులోని ఆందోళనను మరింత పెంచుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపై ఏకంగా రూ. 15 వేల కోట్ల భారం పెట్టింది ప్రభుత్వం. దీంతో సహజంగానే ప్రజల్లో ఆగ్రహం నెలకొంది. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు తప్పంతా జగన్‌దే అని జాకీ పత్రిక నీచమైన కథనం ఇచ్చింది. ‘‘నాడు షాకులు ..నేడు శోకాలు’’ అంటూ హెడింగ్ పెట్టి, విద్యుత్ చార్జీల బాదుడు జగన్ దే అని నిస్సిగ్గుగా రాసింది. ఇది నిజమే అయితే చంద్రబాబుకు తాను విద్యుత్ చార్జీలు పెంచవలసిన అవసరం ఏమి వస్తుంది. కూటమి ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెంచలేదని, వచ్చే ఏడాది సర్దుపోటు ఉందని ఎల్లో మీడియా చెబుతోంది. దానిని ఎవరైనా నమ్ముతారా? ఇది ఏ రకంగా జరుగుతుందో ఎక్కడైనా చెప్పారా? అంటే ఇప్పటికైతే నోరుమూసుకుని ఈ రూ.15 వేల కోట్లు చెల్లించాలని చెప్పడమే కదా? చంద్రబాబు టైమ్ లో పెండింగ్ లో పెట్టిన సుమారు రూ.47 వేల కోట్ల బిల్లులను జగన్ పాలనలో చెల్లించారా?లేదా? అప్పుడు జగన్ ఏమైనా చంద్రబాబు నిర్వాకం గురించి ఏనాడైనా శోకించారా? మరి ఇప్పుడు ఎందుకు ఈ జాకీ మీడియా గుక్కపెట్టి రోదిస్తోంది?విద్యుత్తు సంస్కరణలకు తానే ఆద్యుడినని చెప్పుకునే చంద్రబాబు కాలం నుంచే సర్దుబాటు ఛార్జీల విధానం ఉందన్న విషయాన్ని మరచిపోయింది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. అధికారంలో ఉంటే మరోలా వ్యవహరిస్తారన్నది అందరికీ తెలుసు. ఇందుకు తగ్గట్టుగానే.. అధికారంలోకి వస్తే ఐదేళ్లపాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోనని, 30 శాతం మేర తగ్గిస్తానని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన ఆయన ఆ తరువాత యాభై నుంచి వంద శాతం పెంచేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా ఈ పెంపునూ సమర్థించేందుకు జగన్‌పై నిందలేసే పనిలో పడ్డాయి. ఇచ్చిన హామీ ఎందుకు తప్పుతున్నారని మాత్రం ప్రశ్నించవీ పత్రికలు! ఆర్థిక, రాజకీయ సంబంధాల కారణంగానే ఎల్లో మీడియాకు ప్రజావసరాల కంటే సొంత ప్రయోజనాలే ఇలాంటి కథనాలు రాస్తున్నారని అనుకోవాలి. చంద్రబాబు టైమ్‌లో అధిక రేట్లకు చేసుకున్న సోలార్ విద్యుత్తు ఒప్పందాలను సమీక్షించేందుకు జగన్ ముఖ్యమంత్రిగా ప్రయత్నిస్తే... చంద్రబాబు, ఆయన జాకీ మీడియా కాని తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయని యాగీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ద్వారా చౌకగా అంటే యూనిట్‌కు రూ.2.49లకే కొనుగోలు చేసినా దాన్ని ఈ మంద మెచ్చుకోలేదు సరికదా అభాండాలేసింది. అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరుందంటూ తప్పుడు కథనాలు రాసింది. కేంద్రం సూచనల మేరకు రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు జగన్ చేసిన ప్రయత్నాన్ని ఉరితాళ్లుగా అభివర్ణించిన ఎల్లోమీడియా అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని కొనసాగిస్తూండటం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. మీడియా ఇంత దుర్మార్గంగా మారితే ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో ఆలోచించాలి.విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపునకు స్పందన ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉండింది. కొంతమంది వైఎస్సార్సీపీ నేతలు ఆరు నెలలకే రోడ్లపైకి రావడమేంటని ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు కూడా. టీడీపీ కూటమి కేసులు పెడుతుందన్న భయం దీనికి ఒక కారణమైంది. కానీ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలు మాత్రం ఈ సమస్యపై ప్రజల గొంతుకయ్యారు. పార్టీకి కట్టుబడి ఉన్న నేతలు ధైర్యంగా బయటకు రావడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగినట్లయింది.ఆరు నెలలుగా వైఎస్సార్సీపీని అణచి వేసేందుకు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీకి ఇది అశనిపాతమే. ఎల్లోమీడియా మాత్రం తనదైన శైలిలో వాస్తవాలను వక్రీకరించేందుకు తన వంతు ప్రయత్నం మానలేదు. ఈ నేపధ్యంలోనే జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా వెళ్లి స్వాగతం పలుకుతున్నారు.ఎవరు నిజాయితీగా పాలన చేసింది ప్రజలు అర్దం చేసుకుంటున్నారనిపిస్తుంది. ధర్మవరం మీదుగా బెంగుళూరు వెళుతున్నప్పుడు ఆయా గ్రామాల వద్ద పార్టీ కార్యకర్తలు, ప్రజలు అభివాదం పలికి ఆయనతో సెల్పీలు దిగడానికి పోటీపడిన వైనం, జయ జయ ధ్వానాలు చేసిన తీరు ఆయన క్రేజ్ ను తెలియచేస్తున్నాయి. పార్టీ కార్యకర్తల్లో పెరిగిన విశ్వాసానికి ఇవన్ని దర్పణం పడుతున్నాయని చెప్పవచ్చు. ‘‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’’ అన్న చంద్రబాబు నినాదం అసలు అర్థం కాస్తా.. ‘బాబు ష్యూరిటీబాదుడు గ్యారంటీ’గా మారిపోయిందన్నమాట.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఇప్పటికైనా నిద్ర లేవండి.. బాబు & కో ని ఏకిపారేసిన విడదల రజిని
-
కరెంట్ చార్జీల బాదుడుపై జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట
-
విభాత సంధ్యల ప్రభాత గీతం!
‘తారీఖులు, దస్తావేజులు... ఇవి కావోయ్ చరిత్రకర్థం’ అన్నారు శ్రీశ్రీ. కావచ్చు. కానీ, వాటికి ఉండే ప్రాధాన్యత వాటికున్నది. కొన్ని ముఖ్యమైన తేదీల శతాబ్దులూ, అర్ధ శతాబ్దుల సందర్భాలూ చాలా ప్రత్యేకమైనవి. అవి ఇప్పటి పరిస్థితులనూ, పరిణామాలనూ అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. నేర్చుకోవాలనుకుంటే పాఠాలు కూడా చెబుతాయి. ఇప్పుడు బలంగా ఊడలు దిగి కనిపిస్తున్న భావజాలాలపై అవగాహన కుదరాలంటే నాడు వాటికి నారుపోసి నీరు పెట్టిన తొలి కాపుల లక్ష్యాలేమిటో, స్వప్నాలేమిటో తెలుసుకోవాలి. ఈ సందర్భాలు అందుకు పనికొస్తాయి.కొన్నిసార్లు ఇటువంటి చారిత్రక సందర్భాలు ఒకదాని వెంట ఒకటి వరుసకట్టి వచ్చిపడతాయి. ఈ డిసెంబర్ ఆఖరి వారం కూడా అటువంటి ఓ అరుదైన క్రమాన్ని ఆవిష్కరించింది. జాతిపిత మహాత్మాగాంధీ ఒకే ఒక్కసారి 1924 డిసెంబర్ 24వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. మేధావుల సమ్మేళనంలా ఉండే కాంగ్రెస్ పార్టీని ఆయన జనసామాన్యుల పార్టీగా, ఉద్యమ పార్టీగా పరుగులు పెట్టించారు. ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని అదే బెళగావి (కర్ణా టక)లో నేటి శిథిల కాంగ్రెస్ పార్టీ కూడా దాని వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నది. మీడియా ద్వారా వెల్లడైన సమాచారాన్ని గమనిస్తే ఇది మొక్కుబడి సమావేశంగానే అనిపించింది. దూరమైన ప్రజాశ్రేణుల దరిజేరే ఉపా యాన్ని గాంధీ స్ఫూర్తి నుంచి గ్రహించినట్టు కనిపించలేదు.స్వాతంత్య్రం సిద్ధించిన తొలి దశాబ్దాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ కూడా డిసెంబర్ 26న వందో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అప్పటికే వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఏర్పడిన కమ్యూనిస్టులను ఐక్యం చేసి ఆ రోజున కాన్పూర్‌లో జాతీయ పార్టీగా ప్రకటించారు. అయితే ఈ తేదీపై ఒక డజన్‌కు పైగా ఉన్న కమ్యూనిస్టు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. 1920లోనే నాటి సోవియట్ యూనియన్‌లోని తాష్కెంట్ (నేటి ఉజ్బెకిస్తాన్)లో ఎమ్.ఎన్.రాయ్ తదితరులు పార్టీని ప్రకటించారు గనుక ఆ తేదీనే ఆవిర్భావ దినంగా భావించాలని కొందరి అభిప్రాయం. ముఖ్యంగా బిగ్ బ్రదర్ సీపీఎం తాష్కెంట్ తేదీకే కట్టుబడి ఉన్నది. పుట్టిన తేదీ వంటి ఒక సాధారణ సాంకేతిక అంశంపైనే రాజీ పడటానికి సిద్ధంగా లేని కమ్యూనిస్టులు క్లిష్టమైన సైద్ధాంతిక విషయాల్లో ఐక్యత సాధించగలరని ఆశించే వారి సహనాన్ని అభినందించ వలసినదే!ఈ డిసెంబర్ 25నే ఆరెస్సెస్ కూడా తన వందో ఏడాదిలోకి అడుగుపెట్టింది. హిందూ రాష్ట్ర స్థాపన, హిందూ జాతీయ తావాదం లక్ష్యాలుగా కేశవ బలిరామ్ హెడ్గేవార్ ఈ సంస్థను స్థాపించారు. సంస్థను స్థాపించిన తొలి రోజుల నుంచి సాంస్కృతిక రంగంపైనే ప్రధానంగా గురిపెట్టి ఈ సంస్థ పనిచేయడం ప్రారంభించింది. స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా జరుగు తున్న రోజుల్లో పుట్టినప్పటికీ రాజకీయ రంగంలో అది పరిమిత పాత్రనే పోషించింది. కానీ, ఈరోజున భారత రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకొని ప్రభావితం చేయగలిగే స్థాయికి ఎదిగింది. ఆ సంస్థ స్థాపించిన పలు అనుబంధ సంఘాలు శాఖోపశాఖలుగా విస్తరించి వివిధ రంగాల్లో పనిచేస్తున్నాయి. దాని రాజకీయ వేదికైన భారతీయ జనతా పార్టీ దాదాపు పదికోట్ల మంది సభ్యులతో దేశంలో అతి బలీయమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. అధికార పార్టీగా ఆ పార్టీ అనుస రిస్తున్న, అనుసరించబోయే విధానాలను ఆరెస్సెస్ వ్యవస్థాప కుల సిద్ధాంతాలు, ఆశయాలు ప్రభావితం చేయడం పెద్దగా ఆశ్చర్యపోయే విషయమైతే కాదు.ఈ సంవత్సరమే అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి పూర్తి కావడం యాదృచ్ఛికమైనప్పటికీ ఆసక్తికరం కూడా! ఆరెస్సెస్ కంటే సరిగ్గా ఒక సంవత్సరం ముందు డిసెంబర్ 25వ తేదీనే అటల్ జీ జన్మించారు. ఆరెస్సెస్ తొలి రాజకీయ వేదిక జనసంఘ్‌లో కూడా ఆయన ప్రముఖ నాయకుడుగా ఉన్నారు. కొంతకాలం అధ్యక్షునిగా పనిచేశారు. జనసంఘ్ పార్టీ భార తీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత పాతికేళ్ల పాటు దాని ముఖపత్ర చిత్రంగా వాజ్‌పేయి ఉన్నారు. మతతత్వ పార్టీగా ముద్రపడి ఉన్న బీజేపీని మధ్యేవాదులకు కూడా ఆమోదయోగ్యం చేయడంలో వాజ్‌పేయి బొమ్మ పనికొచ్చింది. ఆయనకున్న ఉదారవాద టైటిల్ సాయంతో తొలిసారి ఢిల్లీ సర్కార్‌ను ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ఏర్పాటు చేయగలిగింది. ఆ కాలానికి వాజ్‌పేయి ఉపయోగపడ్డారు. ఈ కాలానికి కాదు! ఇప్పుడు మోదీయే అవసరమని సంఘ్ అభిప్రాయపడింది. కాలానుగుణంగా కవర్ పేజీ చిత్రాలను ఎంపిక చేయడంలోనే ఆరెస్సెస్ విజయ రహస్యం ఇమిడి ఉన్నది. అంతే తప్ప వాజ్‌పేయి వేరు, మోదీ వేరూ కాదు! ఈ రెండు రూపాల్లోని సారం ఒక్కటే!!డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మనుస్మృతిని దహనం చేసిన చారిత్రక ఘటనకు కూడా వందేళ్లు కావస్తున్నది. 1927లో సరిగ్గా డిసెంబర్ 25వ తేదీనే అంబేడ్కర్ ఈ పని చేశారు. వర్ణ వ్యవస్థ లేదా నేటి కులవ్యవస్థను మనుస్మృతి బలంగా సమర్థించింది. కుల వ్యవస్థ ముసుగులో జరిగిన దారుణమైన సామాజిక అణచితవేతకు గురైన బలహీన వర్గాల్లోని చైతన్యవంతులైన ప్రజల మనోభావాలకు అంబేడ్కర్ చర్య సాంత్వన కలిగించింది. అప్పటికంటే ఇప్పుడు అంబేడ్కరిజానికి మద్దతు మరింత పెరుగుతున్నది.స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం అనేవి ఆధునికమైన ప్రజాస్వామిక భావనలుగా ప్రపంచవ్యాప్తంగా పరిగణన పొందాయి. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ రచనలో ఈ భావనలకే పెద్దపీట వేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉన్న నాటి రాజ్యాంగ సభ ఈ ముసాయిదాకు ఆమోదముద్ర వేసింది. ఈ దేశంలోని కమ్యూ నిస్టులకు కూడా సిద్ధాంతపరంగా ఈ ఆధునిక భావనలతో పేచీ లేదు. మరి దేశంలోనే పెద్ద పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ మాటేమిటి?భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను పరిశీలిస్తే కాలాను గుణమైన ఎత్తుగడలను అమలుచేస్తూ ఆరెస్సెస్ మూల సిద్ధాంతాలను హిడెన్ ఎజెండాగా పెట్టుకొని అవసరాన్ని బట్టి ఒక్కొక్కదాన్ని వెలికి తీస్తున్న పద్ధతి కనిపిస్తున్నది. భారత రాజ్యాంగం పట్ల ఆరెస్సెస్ వ్యతిరేకత రహస్యమేమీ కాదు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తొలిరోజే దాని అధికార పత్రిక వ్యతిరేక వ్యాసం రాసిన సంగతి అందరికీ తెలిసినదే. సంఘ్ సిద్ధాంతకర్త గురు గోల్వాల్కర్ రాజ్యాంగాన్ని ‘పలు దేశాల నుంచి అరువు తెచ్చుకున్న అతుకుల బొంత’గా వ్యాఖ్యానించడం కూడా రహస్యం కాదు. రాజ్యాంగ సభలో చర్చలు జరుగుతున్న రోజుల్లోనే పలువురు సంఘ్ ప్రముఖులు, హిందూ మహాసభ నాయకులు మనుస్మృతిని మన దేశ రాజ్యాంగంగా మలుచుకోవాలని కోరిన విషయాన్ని గుర్తు చేసుకోవడం అవసరం. రాజ్యాంగంలో మార్పులు చేయాలనే ఆలోచన బీజేపీకి ఉన్నట్టు పలు వార్తలు వచ్చాయి. పీఠికలో ఉన్న ‘లౌకిక’, ‘సామ్యవాద’ పదాలను తొలగించాలని ఆ పార్టీ యోచిస్తున్నట్టు ప్రచారం జరిగింది. తన హిడెన్ ఎజెండాలోని అంశాలనుముందుగా ప్రచారంలోకి వచ్చేలా చూడటం, పెద్దగా వ్యతిరేకత కనిపించకపోతే ఆచరణలో పెట్టడం బీజేపీకి కొత్త వ్యూహమేమీ కాదు. ఆధునిక భావనలైన స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వాలకు మనుస్మృతికి సాపత్యం కుదురుతుందంటే నమ్మడం కుదరదు. బీజేపీ ఎటువైపున నిలబడుతుందో చూడాలి. బీజేపీ తన గమ్యాన్ని చేరే యాత్రలో అడ్వాణీ రథయాత్ర ఒక మజిలీ, వాజ్‌పేయి అధికారం ఒక మజిలీ, నరేంద్ర మోదీ మరో రెండు మూడు మజిలీలు దాటి ఉంటారు. రేపటి జమిలి ఎన్నికలు మరో మజిలీ అని పలువురి భావన. ఈ యాత్ర నిర్నిరోధంగా ఇలాగే సాగుతుందా? దీన్ని నిలువరించే శక్తులున్నాయా? అనేదే నేటి ప్రధాన రాజకీయ చర్చ.సిద్ధాంత పరంగా చూస్తే బీజేపీ హిందూయాత్ర(?)ను ఎదిరించే బలం అంబేడ్కరిజానికి ఉన్నదని కొందరి అభి ప్రాయం. కానీ దానికి ఒక సంస్థాగత రూపం లేదు. అందుకే ‘లాల్–నీల్’æఅనే కొత్త నినాదం ముందుకొచ్చింది. అంబే డ్కరిస్టులు, కమ్యూనిస్టులు కలిసి పనిచేయాలని దీని భావం. కానీ, చిన్నచిన్న పట్టింపులతోనే చీలికలు పీలికలైన లాల్వాలాల్లో ఇంకా ఆ సామర్థ్యం మిగిలి ఉందని నమ్మేవారి సంఖ్య స్వల్పం. ఇక వ్యూహ రాహిత్యం, నాయకత్వ వైఫల్యంతో కాంగ్రెస్ పార్టీ కునారిల్లిపోయిన స్థితి. ‘ఇండియా’ కూటమి పక్షాల దన్నుతో 99 లోక్‌సభ సీట్ల దాకా నెట్టుకొచ్చిన ఆ పార్టీని ఇప్పుడు కూటమి పక్షాలే గెటౌట్ అనే పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి వందేళ్ల నాటి భావాలూ, సంస్థలూ ఇంకా మన రాజకీయ యవనికపై కదలాడుతుండటం ఒక విశేషం. ఈ ప్రయాణంలో బలమైన శక్తులు బలహీనంగా మారడం, బలహీన శక్తులు బలంగా మారడం మరో విశేషం.చారిత్రక ఘటనలు పునరావృతం అవుతున్నట్టు కనిపించడం కూడా మరో ఆసక్తికర పరిణామం. వెన్నుపోటు ఉదంతంతో తొలిసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ తర్వాత వాజ్‌పేయి అండతో ‘కార్గిల్ గాలి’లో మరోసారి అధికారంలోకి వచ్చారు. ఇది జరిగి పాతిక సంవత్సరాలు. అప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాది కూడా గడవకముందే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఆయన కొనితెచ్చుకున్నారు. అడ్డగోలుగా బాదిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా మొదలైన ఆందోళనలు ఆయన పదవీకాలమంతా జరుగుతూనే ఉన్నాయి. చివరికి తిరుపతిలో మందుపాతర ప్రమాదం నుంచి బయటపడ్డ సానుభూతి కూడా ఆయన్ను గట్టెక్కించలేకపోయింది.ఇప్పుడూ అదే పరిస్థితి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ను అటకెక్కించడంతోనే తాము మోసపోయామన్న అభిప్రాయం జనంలో వచ్చేసింది. దానికితోడు పరిపాలనా వైఫల్యాలు, కక్షసాధింపు రాజకీయాలు, ప్రజావైద్యం పడకేయడం, నాణ్యమైన ప్రభుత్వ విద్యకు పాతరేయడం, వాడవాడనా పారుతున్న మద్యం కంపు, అంతకుమించి కంపు కొడుతున్న రాజకీయ నాయకుల అవినీతి బాగోతాలు, వెరసి ఆరు మాసాల్లోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా శుక్రవారం నాడు వైసీపీ పిలుపు మేరకు జరిగిన ప్రదర్శనల్లో పది లక్షలమందికి పైగా పాల్గొనడం ప్రజాగ్రహానికి ఒక శాంపిల్ మాత్రమే! పులివెందుల నియో జకవర్గంలో వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి జరిపిన పర్యటన జనసముద్రాన్ని చీల్చుకొని వెళ్తున్నట్టుగా కనిపించింది. అభిమాన సందోహం నడుమ పాతిక కిలోమీటర్ల ప్రయాణానికి ఏడు గంటల సమయం! పులివెందుల నుంచి బెంగళూరు వరకు ఆయన చేసిన రోడ్డు ప్రయాణం కూడా అంతే! దారి పొడవునా ఊళ్లు కాదు, జన జాతరలే దర్శనమిచ్చాయి. ఈ పరిస్థితి చూస్తుంటే కూడా గతమే గుర్తుకొస్తున్నది. మందుపాతర సాను భూతితో మళ్లీ గెలుస్తామని భావించిన బాబు నాలుగు మాసాలు ముందుగానే ఎన్నికలకు పోవాలని నిర్ణయించుకున్నారు. ఆయనతోపాటు కేంద్రంలోని ఎన్టీయే సర్కార్‌ను కూడా తీసుకెళ్లి వాజ్‌పేయి పుట్టి ముంచారు. ఇప్పుడు కూడా ముందుగానే జమిలి వార్తలు వస్తున్నాయి. ఈ జమిలిలో మోదీ పుట్టిని కూడా ముంచుతాడేమో!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ప్రజా సెగ బాగా తగిలిన బాబు
-
ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు బిల్లుల బాదుడు, నయవంచక పాలనపై ఎగసిపడ్డ ప్రజాగ్రహం... వైఎస్సార్సీపీ పోరుబాట విజయవంతం
-
బాబు బాదుడుపై పోరుబాట.. కాకినాడలో YSRCP భారీ ర్యాలీ
-
ప్రజల నెత్తిన చంద్రబాబు రూ.15 వేల కోట్లు భారం.. YSRCP యుద్ధభేరి
-
బాబు మాయమాటలు నమ్మి మోసపోయాం
-
ఏపీ ప్రజలకు హై ఓల్టాజ్ షాక్.. బాదుడుపై సమరం
-
జై జగన్ నినాదాలతో హోరెత్తిన రాష్ట్రం
-
విద్యుత్ చార్జీల పెంపుపై వైఎస్ఆర్ సీపీ పోరుబాట
-
ఏపీ ప్రజలపై విద్యుత్ చార్జీల బాదుడు
-
బిల్లులు భగభగ! ఇదేం బాదుడు బాబూ!
ఎవరిదీ అపరాధం?శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎన్టీఆర్ కాలనీలో నివసించే గృహిణి విజయ ఇంటికి ఈసారి రూ.4,950 కరెంట్ బిల్లు రావడంతో ఆమె కళ్లు బైర్లు కమ్మాయి. జనరల్ కేటగిరీకి చెందిన ఆమె ఇంటికి గతంలో బిల్లు ఎప్పుడూ రూ.150 నుంచి రూ.250 దాటలేదు. 3 నెలలుగా బిల్లు ఇవ్వకుండా డిసెంబర్లో షాక్ కొట్టేలా బిల్లు ఇచ్చారు. దీనిపై ఆమె పలుమార్లు విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లినా ఫలితం శూన్యం. దీంతో గత్యంతరం లేక అపరాధ రుసుముతో సహా రూ.5 వేలు బిల్లు చెల్లించినట్లు బాధితురాలు తెలిపారు.ఇంతలో ఎంత భారం!పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముగూడెంలో నివసించే వెలిశెట్టి అచ్చుత గణేష్ వ్యవసాయదారుడు. ఆయన ఇంటికి సెపె్టంబర్లో 139 యూనిట్లు విద్యుత్ వినియోగించగా రూ.684.53 బిల్లు వచ్చింది. ఇప్పుడు శీతాకాలం కావడంతో వాడకం తగ్గింది. నవంబర్‌లో కేవలం 115 యూనిట్లు మాత్రమే వాడినా బిల్లు మాత్రం రూ.756.97 వచ్చింది. 24 యూనిట్లు తక్కువ వాడినప్పటికీ బిల్లు రూ.72.44 పెరిగింది. పైగా ఇందులో గణేష్ వినియోగించిన విద్యుత్‌కు చెల్లించాల్సిన చార్జీ రూ.464.97 మాత్రమే. అంటే కూటమి ప్రభుత్వం ఆయనపై అదనంగా రూ.292 భారం వేసింది. వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందక.. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులతో సతమతవుతున్న తమపై ఇలా అదనపు భారం మోపడం అన్యాయమని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బోణం గణేష్, ‘సాక్షి’ ప్రతినిధి: రాష్ట్రంలో చలితోపాటు కరెంట్ బిల్లులు పొగలు కక్కుతున్నాయి! ప్రతి నెలా పెరిగిపోతున్న విద్యుత్తు చార్జీల బాదుడుకు వినియోగదారులు వణికిపోతున్నారు. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో బిల్లులు భారీగా పెరిగాయి. శీతకాలంలో వాడకం తగ్గినా బిల్లులు మాత్రం పైపైకి వెళుతూనే ఉన్నాయి. గతంలో నెలకు రూ.రెండు మూడొందలు దాటని వారికి సైతం రూ.వేలల్లో బిల్లులు రావడంతో తీవ్ర షాక్‌కు గురవుతున్నారు. రైతన్నలు, మహిళలు ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదని విద్యుత్తు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు. విద్యుత్తు శాఖ సిబ్బంది అపరాధ రుసుముతో సహా బిల్లులు వసూలు చేస్తున్నారు. రూ.6,000 కోట్ల విద్యుత్తు చార్జీల బాదుడుకే బిల్లులు ఇంత భారీగా పెరిగితే ఇక జనవరి నుంచి అదనంగా మరో రూ.9 వేల కోట్లకుపైగా భారం పడనుండటంతో ఏ స్థాయిలో బిల్లులు జారీ అవుతాయోననే ఆందోళన ప్రజల్లో నెలకొంది. మొత్తంగా రూ.15,485.36 కోట్ల విద్యుత్ చార్జీల పిడుగును టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై వేస్తోంది. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని, అవసరమైతే ఇంకా తగ్గిస్తామని నమ్మబలికిన సీఎం చంద్రబాబు కనీవినీ ఎరుగని రీతిలో హై ఓల్టేజీ షాకులిస్తున్నారు. సంపద సృష్టిస్తానంటూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారు. సబ్సిడీలు లేవ్.. చార్జీల బాదుడేగతంలో టీడీపీ అధికారంలో ఉండగా దాదాపు రూ.20 వేల కోట్ల సర్దుబాటు చార్జీలను వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటగట్టి దిగిపోయింది. అయినా సరే ఆ భారాన్నంతా ప్రజలపై మోపకుండా గత ప్రభుత్వం డిస్కంలకు సకాలంలో రాయితీలు అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీల కింద చెల్లించగా వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా రూ.47,800.92 కోట్లను అందించింది. చంద్రబాబు రైతులకు ఎగ్గొట్టిన రూ.8,845 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలను సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. తాజాగా కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించకుండా వినియోగదారులపైనే చార్జీల భారాన్ని మోపుతోంది.ఇదేం బాదుడు బాబూ! విద్యుత్ చార్జీలు పెంచి మధ్య తరగతి ప్రజలపై ఈ ప్రభుత్వం పెను భారం మోపుతోంది. అకో్టబర్ నెలలో 140 యూనిట్లు వాడితే రూ.694 బిల్లు వచ్చింది. నవంబర్‌లో 114 యూనిట్లే వాడినా రూ.741 బిల్లు వచ్చింది. ఇదేం బాదుడు బాబూ! తక్కువ వినియోగించినా అదనంగా మాపై భారం మోపడం సరికాదు. – సుబ్బ రత్తమ్మ, మార్కాపురం, ప్రకాశం జిల్లా ⇒ విశాఖలోని ఆరిలోవలో ఓ ఇంటికి నవంబర్‌లో 150 యూనిట్లకు రూ.705.69 బిల్లు వచ్చింది. డిసెంబర్ 10న తీసిన రీడింగ్‌లో 131 యూనిట్లకు రూ.816.79 బిల్లు జారీ అయింది. ⇒ కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన మహమ్మద్ రఫీ వెల్డింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన దుకాణానికి 55 యూనిట్లు విద్యుత్ వినియోగించినందుకు నవంబర్‌లో రూ.599 బిల్లు వచ్చింది. ఈ నెల 58 యూనిట్లు వాడగా రూ.794 బిల్లు జారీ చేశారు. కేవలం మూడు యూనిట్లు అదనంగా వాడినందుకు రూ.195 ఎక్కువగా బిల్లు వచ్చింది.ఇలా బాదేస్తున్నారు..విద్యుత్ చార్జీలు భారీగా పెరిగాయి. గత నెల కంటే ఈ నెల వినియోగం తక్కువగా ఉన్నా బిల్లు తగ్గలేదు. అదనపు చార్జీలంటూ వేశారు. వ్యవసాయం చేసుకుని బతికేవాళ్లం. ఇంతంత బిల్లులు మేమెలా కట్టగలం? కరెంటు చార్జీలు పెంచబోమని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడేమో ఇలా బాదేస్తున్నారు. – చిగురుపాటి మహేష్, కొమ్ముగూడెం.మా డబ్బులతో సంపద సృష్టి! శీతాకాలం కావడంతో ఇంట్లో ఫ్యాను కూడా సరిగ్గా వాడటం లేదు. పగలంతా పొలాల్లోనే పనులు చేసుకుంటూ ఉంటాం. సాయంత్రానికి ఇంటికొస్తాం. విద్యుత్ వాడకం బాగా తక్కువ. బిల్లులు మాత్రం బాగా పెరిగిపోయాయి. సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెబితే నిజమనుకున్నాం. కానీ ఇలా మాపై భారం వేసి మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి పెంచుతారనుకోలేదు. – సూర్పని గోపీకృష్ణ, రైతు, కొమ్ముగూడెం.ఫెర్రో అల్లాయిస్పై పెను భారం ఫెర్రో అల్లాయిస్ కంపెనీల్లో విద్యుత్ చాలా కీలక అంశం. ఇప్పటికే పరిశ్రమ తీవ్ర కష్టాల్లో ఉంది. ఇప్పుడు విద్యుత్ చార్జీల పెంపు మరింత కుంగదీస్తోంది. దీంతో చాలా ఫెర్రో అల్లాయిస్ కంపెనీలు క్యాపిటివ్ పవర్ వైపు మళ్లుతున్నాయి. మేం రాష్ట్రం నుంచి ఒక్క యూనిట్ కూడా కొనుగోలు చేయడం లేదు. పూర్తిగా సొంత విద్యుత్ యూనిట్ నుంచే సమకూర్చుకుంటున్నాం. కానీ గ్రిడ్ సపోర్ట్ చార్జీలు చాలా అధికంగా ఉన్నాయి. వీటిని తగ్గించాలని సుప్రీం కోర్టు దాకా వెళ్లి పోరాడుతున్నాం. – నీరజ్ శర్దా, డీఎండీ, శర్దా మెటల్స్ అండ్ అల్లాయిస్ మన రాష్ట్రంలో అధికం.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు అధికంగా ఉండటం పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రతికూలంగా ఉంది. విద్యుత్ చార్జీలను రేషనలైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – పొట్లూరి భాస్కరరావు, ప్రెసిడెంట్, ఏపీ చాంబర్స్⇒ కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన సత్యనారాయణ శెట్టి ఇంటికి నవంబర్‌లో 98 యూనిట్లకు రూ.482 బిల్లు వచ్చింది. డిసెంబర్లో 92 యూనిట్లకు రూ.574 బిల్లు జారీ అయింది.⇒ కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబళం ప్రాంతానికి చెందిన బల్లెకల్ నరసయ్య ఇంటికి నవంబర్‌లో రూ.189 బిల్లు రాగా ఈ నెల కరెంట్ బిల్లు రూ.335 వచ్చింది. వీరు కేవలం రాత్రి పూట మాత్రమే విద్యుత్ వాడతారు. అయినా సరే రూ.146 అదనపు భారం పడింది.తగ్గించమని కోరాం విద్యుత్ చార్జీల పెంపు ఎంఎస్ఎంఈలకు భారంగా మారింది. పెంచిన చార్జీలను తగ్గించాలని ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను కోరాం. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. – వి.మురళీకృష్ణ, ప్రెసిడెంట్, ఫ్యాప్సియా భారంగా కొత్త కనెక్షన్లు ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ నెలకొల్పి కొత్త విద్యుత్ కనెక్షన్ తీసుకోవడం చాలా భారంగా ఉంది. కనెక్షన్ తీసుకోవాలంటే కనీసం రూ.ఐదారు లక్షలకు పైనే ఖర్చు అవుతోంది. ఈ భారాన్ని సబ్సిడీ రూపంలో భరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఎంఎస్ఎంఈ రంగానికి చార్జీల పెంపు మరింత భారంగా మారింది. – మామిడి సుదర్శన్, అధ్యక్షుడు, దళిత్ ఇండ్రస్టియల్ అసోసియేషన్. -
చంద్రబాబు పాలన కాదు..చంద్రబాదుడు పాలన
-
బాబు పాలనలో కరెంట్ కోత..చార్జీల మోత
-
కరెంటు కోత..చార్జీల మోత.! . ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో భారీగా పెరిగిన విద్యుత్ చార్జీలు
-
కరెంట్ కోత.. చార్జీల మోత
మా ఇంటికి రూ.10 వేలు విద్యుత్ బిల్లు వచ్చింది. మాకేమీ ఏసీలు లేవు. లైన్‌మెన్‌ని అడిగితే ఫ్రిజ్ ఉన్నందున ఎక్కువ వాడి ఉంటారంటున్నారు. చివరకు అప్పు చేసి బిల్లు కట్టేశాం.– చిన్నం వెంకటేష్, ఎం.ఎం.పురం, ఏలూరు జిల్లాబోణం గణేష్, ఏలూరు జిల్లా మల్కీమహ్మద్పురం నుంచి సాక్షి ప్రతినిధికరెంట్ బిల్లులు శీత కాలంలోనూ ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి! ఒకపక్క ప్రతి నెలా రూ.వందలు... వేలల్లో బిల్లులు రావడం.. మరోపక్క చలి కాలంలోనూ కోతలు విధించడంతో దోమల బాధతో నిద్రలేని కాళరాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే రూ.6,072.86 కోట్ల మేర విద్యుత్తు చార్జీల భారాన్ని మోపి హై వోల్టేజీ షాకులిచ్చిన కూటమి సర్కారు జనవరి నుంచి మరో రూ.9,412.50 కోట్ల చార్జీల భారాన్ని అదనంగా వేయనుండటం వినియోగదారులను గజగజ వణికిస్తోంది. ఆర్నెలల్లోనే రూ.9,412.50 కోట్ల విద్యుత్తు చార్జీల భారాన్ని మోపడం.. మరోపక్క సంక్షేమ పథకాలు నిలిచిపోవడం.. నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశన్నంటడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచం.. పైగా తగ్గిస్తాం.. నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం మాట తప్పి రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్ షాక్‌లు ఇస్తోంది. వాడకం తక్కువగా ఉండే శీతకాలంలోనే బిల్లులు ఇలా పేలిపోతుంటే వేసవిలో ఏ స్థాయిలో షాక్‌లు ఉంటాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్‌ను దూరం చేసి బిల్లులతో బాదేస్తున్న కూటమి ప్రభుత్వం ఇతర వర్గాలపైనా పెనుభారం మోపింది. వినియోగం తక్కువే.. అయినా కోతలురాష్ట్రంలో ప్రస్తుతం 194.098 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. డిమాండ్ అనుగుణంగా సరఫరా చేయలేక రాష్ట్రవ్యాప్తంగా సగటున 2 నుంచి 3 గంటల పాటు కోతలు విధిస్తున్నారు. వాడకం ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు అనధికారికంగా కోతలు అమలు చేస్తున్నారు. అధికారిక నివేదికల్లో విద్యుత్ లోటు, కోతలు లేవంటూ బుకాయిస్తున్నారు. నిజానికి గతేడాది కంటే 1.17 శాతం తక్కువగా విద్యుత్ డిమాండ్ ఉన్నా కూడా అందించేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. గత సర్కారు మండు వేసవిలోనూ, తీవ్ర బొగ్గు సంక్షోభంలోనూ విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేసింది. కరెంట్ కష్టాలు చెప్పుకోలేక..ఏలూరు జిల్లా మల్కీమహ్మద్పురం (ఎం.ఎం.పురం) గ్రామంలో నెలకొన్న పరిస్థితులు రాష్ట్రంలో ప్రజల కరెంట్ కష్టాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పల్లపూరుగా పిలుచుకునే ఏలూరు జిల్లా ఎం.ఎం పురంలో ప్రజలంతా పేద, మధ్యతరగతి వారే. తెల్లవారుజామునే నిద్రలేచి, కూలి పనులకు వెళుతుంటారు. చుట్టు పక్కల వ్యవసాయ పనులు దొరక్కపోవడంతో దాదాపు 40 కి.మీ. దూరంలో ఉన్న హనుమాన్ జంక్షన్ వరకూ వెళ్లి రాత్రికి ఇంటికి చేరుతుంటారు. ఇంటికి వచ్చాక సేదదీరుదామంటే విద్యుత్ లేక ఫ్యాన్లు పనిచేయడం లేదు. దోమలతో తెల్లవార్లూ జాగారం చేయాల్సిన పరిస్థితి! అది చాలదన్నట్టు కరెంటు బిల్లులు షాక్ ఇస్తున్నాయి. వారి కష్టాల గురించి చెబితే పింఛన్లు తీసేస్తారని, రేషన్ కార్డు పోతుందని అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారు. నిబంధనల ప్రకారమే..రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ సరఫరా నిలిచిందంటే అది స్థానిక పరిస్థితుల కారణంగా జరిగి ఉంటుంది. అధికారికంగా ఎలాంటి విద్యుత్ కోతలు అమలు చేయడం లేదు. విద్యుత్ బిల్లులు కూడా నిబంధనల ప్రకారమే వేస్తున్నాం. ఎవరికైనా ఎక్కువ వేశారనిపిస్తే అధికారుల దృష్టికి తేవచ్చు. –కె.విజయానంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ‘ఈ చిత్రంలో కనిపిస్తున్న అవ్వ పేరు సింగారపు పాపమ్మ. ఏలూరు జిల్లా మల్కీ మహ్మద్‌పురం (ఎంఎం పురం)లో నివసిస్తోంది. భర్త చుక్కయ్య, ఇద్దరు కుమారులు చనిపోవడంతో పిడికెడు మెతుకుల కోసం ఏడు పదుల వయసులోనూ పని మనిషిగా చేస్తూ ఒంటరిగా బతుకుతోంది. పగలంతా పనిచేసి రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుతుంది. ఒక ఫ్యాను, సెకండ్ హ్యాండ్లో కొన్న చిన్న టీవీ, ఓ లైటు మినహా ఆమె ఇంట్లో మరో విద్యుత్ ఉపకరణం లేదు. అలాంటప్పుడు ఆమె ఇంటికి విద్యుత్ బిల్లు ఎంత రావాలి? మహా అయితే వందో.. రెండొందలో కదా! కానీ నవంబర్‌లో వినియోగానికి సంబంధించి ఈ నెల పాపమ్మకు వచ్చిన బిల్లు ఎంతో తెలుసా? ఏకంగా రూ.1,345.39. అది తెలిసి గుండె ఆగినంత పనైందని ఆ వృద్ధురాలు ‘సాక్షి’తో తన గోడు చెప్పుకుంది. ఇంత బిల్లు వేస్తున్నా కరెంట్ సవ్యంగా సరఫరా కావడం లేదు. చీకట్లో చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది. ఇంకా దారుణమేమిటంటే ఎస్సీ సామాజికవర్గానికి చెందిన పాపమ్మకు గత ప్రభుత్వంలో ఉచితంగా విద్యుత్ అందగా ఇప్పుడు రూ.వేలల్లో బిల్లులు రావడం!!శుక్రవారం, మంగళవారం అసలు కరెంటు ఉండదు మా ఊరిలో శుక్రవారం, మంగళవారం కరెంటు ఉండదు. మిగతా రోజుల్లోనూ గంటల తరబడి తీసేస్తున్నారు. చార్జీలు మాత్రం భారీగా పెంచేశారు. పాచి పని చేసుకునేవాళ్లకు కూడా రూ.వేలల్లో బిల్లులు వేస్తున్నారు. ఇదేం ప్రభుత్వమో ఏంటో?. – ఓగిరాల లక్ష్మీ, ఎంఎం పురం, ఏలూరు జిల్లా రోజూ కరెంటు పోతోంది రాత్రిళ్లు 11 గంటలకు తీసేసి తెల్లవారుజాము రెండుకో, మూడుకో ఇస్తున్నారు. దోమలు కుట్టి రోగాల బారిన పడుతున్నాం. రోజూ కరెంటు పోతోంది. చిన్న పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కాలంలో కరెంటు కోతలు మేమెప్పుడూ చూడలేదు. – అంజమ్మ, ఎంఎం పురం, ఏలూరు జిల్లా జగనన్న అధికారంలో ఉండగా మేం బిల్లు కట్టాల్సి రాలేదుజగనన్న అధికారంలో ఉండగా మేం కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు బిల్లులు కట్టమని ఇంటికి వస్తున్నారు. కరెంటు మాత్రం రాత్రి, పగలూ అనే తేడా లేకుండా తీసేస్తున్నారు. – సరోజిని, ఎంఎం పురం, ఏలూరు జిల్లా -
రూ.లక్ష కోట్ల అప్పు!
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తానంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు తిలోదకాలిచ్చిన సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని రుణ భారంతో ముంచెత్తుతున్నారు. బడ్జెట్లోనూ, బడ్జెటేతర అప్పుల్లోనూ దూసుకుపోతున్నారు. ఆర్నెల్లలోనే రూ.లక్ష కోట్లకుపైగా అప్పుల దిశగా రాష్ట్రం పరుగులు తీస్తోంది. మరోవైపు గత ఏడాదితో పోల్చితే అమ్మకాల పన్ను ఆదాయంతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయింది. ఈ ఆర్థిక ఏడాదిలో నవంబర్ వరకు రాబడులు, వ్యయాలకు సంబంధించి కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. రాజధానికి రూ.52 వేల కోట్లు! టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడ్జెట్, బడ్జెటేతర అప్పులు ఏకంగా రూ.74,590 కోట్లకు చేరాయి. బడ్జెట్ అప్పులే నవంబర్ వరకు రూ.65,590 కోట్లకు చేరినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోపక్క ప్రభుత్వ గ్యారెంటీతో బడ్జెటేతర అప్పులు మరో రూ.9,000 కోట్లకు ఎగబాకాయి. ఇక రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పు చేసేందుకు కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఈ మేరకు సీఆర్డీఏకు అనుమతిస్తూ మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది.అంటే సీఎం చంద్రబాబు ఆర్నెల్ల పాలనలో ఇప్పటికే చేసిన అప్పులు, చేయనున్న అప్పులు కలిపి మొత్తం రూ.1.05 లక్షల కోట్లకు చేరుకోనున్నాయి. అంతేకాకుండా ప్రాథమిక అంచనా మేరకు రాజధానికి రూ.52 వేల కోట్ల మేర నిధులు అవసరమని, ఇప్పటికే రూ.31 వేల కోట్లు సమీకరించినందున మిగతా నిధులు రూ.21 వేల కోట్లు కూడా సమీకరించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏకి ప్రభుత్వం నిర్దేశించింది. సంపద సృష్టి అంటే అప్పులు చేయడమే అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోందనేందుకు ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పథకాలు లేవు.. పన్నుల మోతలే సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకపోగా అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపారు. ఏ ఒక్క పథకం అమలు కాకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అమ్మకం పన్ను ఆదాయం భారీగా తగ్గిపోవడమే దీనికి నిదర్శనం. కాగ్ గణాంకాల మేరకు గతేడాది నవంబర్‌తో పోల్చితే ఈ ఏడాది నవంబర్ నాటికి అమ్మకం పన్ను ఆదాయం రూ.1,043 కోట్లు తగ్గిపోయింది. స్టాంపులు, రిజి్రస్టేషన్ల ఆదాయం రూ.868 కోట్లు క్షీణించింది. మరోపక్క కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు రూ.12,510 కోట్లు తగ్గిపోయాయి. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు సంబంధించి సామాజిక వ్యయం కూడా గత నవంబర్‌తో పోల్చితే తగ్గిపోయిందని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు రెవెన్యూ లోటు రూ.9,742 కోట్లు అదనంగా పెరిగింది. -
వైయస్ఆర్ సీపీ ప్రభంజనం ఇక్కడి నుండే మొదలు
-
కరెంటు చార్జీలు పెరగవ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఏడాది కూడా విద్యుత్ చార్జీలు పెంచవద్దని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త విద్యుత్ టారిఫ్ అమల్లోకి రావాల్సి ఉండగా, ప్రస్తుత చార్జీలనే కొనసాగించేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)కి ప్రతిపాదనలు పంపాలని డిస్కంలు నిర్ణయించినట్టు తెలిసింది. వారం రోజుల్లో ఈఆర్సీకి 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)ను సమర్పించేందుకు కసరత్తు చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఏటా నవంబర్ 30లోగా ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి పంపాలి. కానీ, ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో ఈ సారి ఆలస్యమైంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించనున్నట్టు తెలిసింది. ఈ అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం త్వరలో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ప్రభుత్వ సబ్సిడీ నిధులు పెంచితేనే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024–25లోని చివరి 5 నెలల్లో రూ.1,200 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు గతంలో డిస్కంలు అనుమతి కోరగా, రూ.30 కోట్ల చార్జీల పెంపునకు మాత్రమే ఈఆర్సీ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. డిస్కంల ఆర్థికలోటును భర్తీ చేయడానికి విద్యుత్ సబ్సిడీ నిధులను రూ.11,499 కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో చార్జీల పెంపు నుంచి ఉపశమనం లభించింది. డిస్కంలు కోరినట్టు 5 నెలల కాలానికి రూ.1,200 కోట్ల చార్జీల పెంపునకు ఈఆర్సీ అనుమతిచ్చి ఉంటే.. వచ్చే ఏడాది (2025–26)లో ప్రజలపై రూ.4 వేల కోట్లకుపైగా అదనపు భారం పడి ఉండేది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదీ చార్జీల పెంపు భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలి్పంచాలంటే ప్రభుత్వం భారీగా సబ్సిడీలను పెంచక తప్పదని అధికారవర్గాలు తెలిపాయి. -
చంద్రబాబును ఇమిటేట్ చేసిన వైఎస్ జగన్
-
విద్యుత్ చార్జీల మోత మోగిస్తూ ప్రజలకు హైఓల్టేజ్ షాకిస్తున్న కూటమి
-
Andhra Pradesh: చంద్రబాబు ప్రభుత్వం హై ఓల్టేజ్ షాక్
సాక్షి, అమరావతి: ‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచం.. పైగా తగ్గిస్తాం.. నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఐదు నెలలకే మాట తప్పి రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్ షాక్‌లు ఇస్తోంది. సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కినట్లుగానే విద్యుత్ చార్జీలపై చేసిన వాగ్దానాన్ని మరచి ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. విద్యుత్తు చార్జీల మోత మోగిస్తూ హై వోల్టేజీ షాకులిస్తున్నారు. రూ.15,485.36 కోట్ల చార్జీల బాదుడుకు తెర తీశారు. విద్యుత్తు వాడకం తక్కువగా ఉండే శీతకాలంలోనే బిల్లులు ఇలా పేలిపోతుంటే ఇక తరువాత నెలల్లో ఏ స్థాయిలో షాక్‌లు ఉంటాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఓవైపు ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్‌ను దూరం చేసి బిల్లులతో బాదేస్తున్న కూటమి ప్రభుత్వం ఇతర వర్గాలపై పెనుభారం మోపింది.నివ్వెరపోతున్న వినియోగదారులు..ఈ నెల 2వ తేదీ నుంచి మీటర్ రీడింగ్ తీసి విద్యుత్తు సిబ్బంది ప్రజలకు అందిస్తున్నారు. వాడిన దానికి మించి విద్యుత్ బిల్లులతో షాక్‌లకు గురి చేస్తున్నారు. అదనంగా వసూలు చేస్తున్నారని గ్రహించి గగ్గోలు పెడుతున్నారు. ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో రూ.6,072.86 కోట్ల భారాన్ని గత నెల విద్యుత్ వినియోగం నుంచి వినియోగదారులపై ప్రభుత్వం వేస్తోంది. సర్దుబాటు చార్జీ ప్రతి యూనిట్‌కు సగటున రూ.1.27గా నిర్ణయించిన ఏపీఈఆర్సీ దీనిని 15 నెలల్లో వసూలు చేయాలని సూచించడంతో ప్రతి నెలా వినియోగదారులపై ఈ సర్దుబాటు భారం యూనిట్‌కు సగటున రూ.0.63 చొప్పున పడుతోంది.వచ్చే నెల నుంచి మరింత మోత..ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.6,072.86 కోట్లకే ప్రజలపై ఇంత భారీగా చార్జీల భారం పడుతుంటే వచ్చే నెల నుంచి కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల మీద మరో పిడుగు వేయనుంది. రూ.9,412.50 కోట్ల చార్జీల వసూలుకు డిస్కమ్‌లు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ నెల వినియోగం నుంచి అంటే జనవరి మొదటి వారం నుంచి వచ్చే విద్యుత్ బిల్లుల్లో ఈ చార్జీలను ప్రభుత్వం వసూలు చేయనుంది. అసలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశన్నంటుతుంటే దానికి తోడు విద్యుత్ చార్జీల బాదుడుతో సామాన్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మనుబోలులో నివసించే గడ్డం రమణారెడ్డికి నవంబరులో రూ.1,620 విద్యుత్ బిల్లు రాగా ఈ నెల ఏకంగా రూ.2,541 బిల్లు వచ్చింది. గత నెలతో పోలిస్తే 56 శాతం అదనంగా పెరిగి రూ.921 అధికంగా బిల్లు రావడంతో ఆయన లబోదిబోమంటున్నారు. నవంబర్,డిసెంబరు నెలల బిల్లులు చిత్తూరులోని కొంగారెడ్డిపల్లెలో అద్దె ఇంట్లో నివసించే రమేష్‌కు ప్రతి నెలా రూ.300 – రూ.400 మధ్య కరెంట్ బిల్లు వస్తుంది. అక్టోబర్‌లో రూ.363 వచ్చింది. నవంబర్లోనూ రూ.385కి మించలేదు. అలాంటిది ఈ నెల ఏకంగా రూ.679 రావడంతో షాక్ తిన్నాడు. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లలోని ప్రకాశ్‌నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివసించే కత్తి రామక్క నలుగురు సంతానం అనారోగ్యంతో బాధపడుతున్నారు. చిరు వ్యాపారంతో ఆమె కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఎస్సీలకు ఉచిత విద్యుత్తు పథకాన్ని వర్తింపచేయడంతో ఐదేళ్లుగా ఆమెకు కరెంటు బిల్లు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం రాలేదు. కూటమి ప్రభుత్వం రాగానే కరెంటు బిల్లు కట్టాలంటూ విద్యుత్ శాఖ అధికారులు ఇంటి వద్దకు వచ్చారు. రూ.3,464 బిల్లు కట్టాలని, 2018 నుంచి బకాయిలు చెల్లించాలని హెచ్చరిస్తూ కరెంట్ కట్ చేయడంతో అంధకారంలో మగ్గిపోతోంది. విద్యుత్ ఛార్జీలు పెంచనన్నారుగా బాబు 16/08/2023: టీడీపీ విజన్ డాక్యుమెంట్– 2047 విడుదల సందర్భంగా విద్యుత్ చార్జీలు పెంచం.. వీలైతే తగ్గిస్తామని ప్రకటించిన చంద్రబాబు ⇒ మా ఇంటికి వైఎస్సార్ సీపీ హయాంలో ఉచిత విద్యుత్తు అందించారు. 200 యూనిట్ల లోపే వినియోగిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నుంచి బిల్లు కట్టమని విద్యుత్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ⇒ కన్నేపల్లి కుమారి (ఎస్సీ సామాజిక వర్గం), సిటిజన్ కాలనీ, గాంధీ గ్రామం, చోడవరం మండలం, అనకాపల్లి జిల్లా (02 వీఎస్సీ 803)కర్నూలులోని బుధవారపేటలో అద్దె ఇంట్లో నివసించే ప్రైవేట్ ఉద్యోగి అజయ్‌కి (సర్వీస్ నెంబర్ 8311102106824) గత నెలలో విద్యుత్ బిల్లు రూ.688 రాగా ఈ నెలలో ఏకంగా రూ.1,048 రావడంతో గుండె గుభిల్లుమంది. ఆ కుటుంబంపై ఒక్క నెలలోనే రూ.360 అదనపు ఆర్థిక భారం పడింది. ఈ నెల నుంచి పెరిగిన విద్యుత్ బిల్లుల బాదుడు స్పష్టంగా కనిపిస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో 88 యూనిట్లకు రూ.348.97 బిల్లు రాగా ప్రస్తుతం 91 యూనిట్లకు రూ.463.91 బిల్లు వచ్చినట్లు కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన కె.సూర్యకాంత్ తెలిపారు. అదనంగా వాడిన మూడు యూనిట్లకు రూ.114.94 బిల్లు ఎక్కువగా రావడంతో ఆయన షాక్ తిన్నాడు. ఉచిత విద్యుత్తు ఇచ్చిన వైఎస్ జగన్వైఎస్సార్ సీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా అందించిన విద్యుత్‌ను కూడా పాత బకాయిలుగా చూపిస్తూ కూటమి సర్కారు బలవంతపు వసూళ్లకు దిగుతోంది. రూ.లక్షలు.. వేలల్లో బకాయిలు చెల్లించాలంటూ ఆదేశిస్తోంది. అంత డబ్బు కట్టలేని పేదల కరెంట్ కనెక్షన్లను విద్యుత్ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తూ మీటర్లను తొలగిస్తున్నారు. పాత బకాయిల పేరుతో విద్యుత్తు సిబ్బంది కరెంట్ మీటర్లు తొలగించి తీసుకుపోతున్నారు. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని తేల్చి చెబుతుండటంతో పేదలు తీవ్ర షాక్‌కు గురవుతున్నారు. తాటాకు ఇళ్లు, రేకుల షెడ్లు, ప్రభుత్వ కాలనీల్లో నివసించే వారంతా చీకట్లోనే కాలం గడుపుతున్నారు. దాదాపు 250 కుటుంబాలు నివసించే అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం హరిజనవాడలో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్‌శాఖ సిబ్బంది బిల్లులు జారీ చేయడంతో స్థానికులు ఇటీవల నిరసనగా దిగారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది జనవరి వరకు 15,29,017 ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్తుతో రూ.2,361.95 కోట్ల మేర లబ్ధి చేకూరగా 4,57,586 ఎస్టీ కుటుంబాలకు రూ.483.95 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. మొత్తం 19,86,603 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.2,845.90 కోట్ల మేర ఉచిత విద్యుత్తు ద్వారా మేలు చేశారు.‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న బి.శివాజీ. విజయవాడలోని కానూరులో ఉంటారు. ఆయన ప్రతి నెలా దాదాపు రూ.600 విద్యుత్ బిల్లు చెల్లిస్తుండగా ఈ నెల రూ.813 బిల్లు వచ్చింది. దాదాపు 35 శాతం అదనంగా చార్జీలు పడటంతో శివాజీ గగ్గోలు పెడుతున్నాడు. ఇంత భారం మోపితే కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా ఉంటుందని ఆందోళన చెందుతున్నాడు. పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అడిగేవారే లేరా? అని నిస్సహాయంగా ప్రశ్నిస్తున్నాడు.విజయవాడలోని ప్రసాదంపాడుకు చెందిన ఏ.సహిల్‌కు ఈ నెల (నవంబర్ వినియోగం)రూ.1,321 బిల్లు వచ్చింది. గత నెల ఇదే సర్వీసుకు ఆయన చెల్లించిన బిల్లు రూ.861 మాత్రమే. అంటే ఈ నెల బిల్లులో ఏకంగా 53 శాతం అదనంగా భారం పడింది. -
AP: డిస్కంల లోటు రూ.14,683.24 కోట్లు
సాక్షి, అమరావతి: వచ్చే (2025–26) ఆర్థిక సంవత్సరానికి ఆదాయం, రాబడికి మధ్య వ్యత్యాసం రూ.14,683.24 కోట్లుగా డిస్కంలు అంచనా వేశాయి. ఈ మేరకు ఆదాయ, అవసరాలు (ఏఆర్ఆర్), ప్రతిపాదిత టారిఫ్ (ఎఫ్‌పీటీ) నివేదికలను అంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు గత నెల 30న ఏపీఈఆర్సీకి సమర్పించాయి. ఆ ప్రతిపాదనలను ఏపీఈఆర్సీ తన వెబ్సైట్లో శుక్రవారం ప్రజలకు అందుబాటులో ఉంచింది. డిస్కంలు పేర్కొన్న లెక్కల ప్రకారం.. వచ్చే ఏడాది మొత్తం రూ.58,868.52 కోట్ల వ్యయం అయితే, టారిఫ్ యేతర ఆదాయ మొత్తాలను కలుపుకుని విద్యుత్ విక్రయం ద్వారా రూ.44,185.28 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశాయి. ఫలితంగా రూ.14,683.24 కోట్ల లోటు ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. అదేవిధంగా 75,926.22 మిలియన్ యూనిట్ల విద్యుత్ విక్రయం జరుగుతుందని, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024–25 (73,053.78 మిలియన్ యూనిట్లు) కంటే 3.93 శాతం ఎక్కువని డిస్కంలు నివేదికలో చెప్పాయి. ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11,299.49 మిలియన్ యూనిట్ల కంటే 14.4 శాతం ఎక్కువగా 12,927 మిలియన్ యూనిట్ల వరకు ఉంటుందని అంచనా వేశాయి. ప్రస్తుత టారిఫ్ ప్రకారం డిస్కంల ఆదాయ అంతరాన్ని తీర్చడానికి వచ్చే ఏడాది మొత్తం రూ.14,683.24 కోట్ల సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆమోదించబడిన సబ్సిడీ (రూ.13,769.85 కోట్లు) కంటే ఇది 6.6 శాతం పెరిగింది. విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్‌కు రూ.4.80 అవుతుందని నివేదికలో పొందుపరిచాయి. ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు 10.03 శాతంగా ప్రతిపాదించాయి. విద్యుత్ సరఫరా సగటు వ్యయం యూనిట్ కు రూ.7.75 పేర్కొనగా.. రాబడి మాత్రం యూనిట్‌కు రూ.5.82 ఉంటుందని డిస్కంలు భావిస్తున్నాయి. డిస్కంలు ఇచ్చిన ఈ ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి టారిఫ్ ప్రకటిస్తుంది. కొత్త టారిఫ్ ప్రకారం విద్యుత్ చార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. -
బాధ్యత మరచి ఎదురుదాడా!
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు గడుస్తున్నా తన వైఫల్యాలను, తప్పిదాలను ఒప్పుకోకుండా వైఎస్సార్ సీపీపై బురద చల్లేందుకు ఆపసోపాలు పడటం సిగ్గుచేటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలపై రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్తు చార్జీల భారాన్ని మోపడం.. మరోవైపు నిత్యం జగన్ జపం చేస్తూ ఎల్లో మీడియాలో బురద కథనాలకే పరిమితమైందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇసుక నుంచి మద్యం వరకు.. కాకినాడలో పీడీఎస్ బియ్యం నుంచి ధాన్యం రైతులను తుపాన్‌కు వదిలేయడం దాకా అడుగడుగునా కూటమి సర్కారు వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.ఇసుకలో లూటీ చేసేదీ వారే..! బెల్టు షాపులకు అనుమతి ఇచ్చేదీ వారే..! బియ్యాన్ని ఎగుమతి చేసేది వారే.. మళ్లీ స్మగ్లింగ్ జరుగుతోందంటూ హడావుడి చేసేదీ వారేనని పేర్కొంటున్నారు. అసలు కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం ఎందుకు వస్తోంది? పీడీఎస్ బియ్యం వస్తుంటే గత ఆర్నెల్లుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఎవరు పంపుతున్నట్లు? కూటమి పార్టీల ప్రజాప్రతినిధులే దోపిడీ చేసి అమ్ముకుంటున్నారు కదా? తన పార్టీకి చెందిన మంత్రి పౌరసరఫరాల శాఖను పర్యవేక్షిస్తుంటే డిప్యూటీ సీఎం వచ్చి హడావుడి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎంపీ కూడా అదే పార్టీకి చెందిన వారని ప్రస్తావిస్తున్నారు. సీఎంఆర్ బియ్యం బకాయిల విడుదలలో కమీషన్ల పర్వం వెలుగులోకి రావడంతో దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, గత సర్కారుపై బురద చల్లడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోందంటున్నారు. ఊరూరా బెల్ట్ షాపులు తెరిచి.. బెల్ట్ తీస్తామంటారా?మద్యం దుకాణాలను లాటరీ పేరుతో కూటమి శ్రేణులకు కట్టబెట్టిన ప్రభుత్వ పెద్దలు.. టీడీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చడం కోసం ఊరూరా బెల్ట్ షాపులను తెరిపించారు. సీఐ, ఎస్ఐలను పంపి ఇతరులకు మద్యం దుకాణాలు దక్కకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. ఊరూరా ఒక్కో బెల్ట్ షాపును వేలం వేసి వచ్చిన డబ్బులను టీడీపీ కార్యకర్తలకు పంచిపెట్టారు. రూ.2 లక్షల నుంచి మూడు లక్షల దాకా వసూలు చేస్తూ నీకింత.. నాకింత! అని వాటాల దందా నడిపిస్తున్నారు. బెల్ట్ షాపులతో వాడవాడలా మద్యం ఏరులై పారుతోంది. ఈ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానంటూ సీఎం చంద్రబాబు బీరాలు పలుకుతుండటంపై ఎక్సైజ్‌శాఖ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. స్వయంగా హోంమంత్రి అనిత ఇలాకాలో కూడా బెల్టు షాపుల దందా తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.కాకినాడ కేంద్రంగా బియ్యం డ్రామా!ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీ కోసం సేకరించిన వరి ధాన్యాన్ని మర ఆడించేందుకు పౌరసరఫరాల శాఖ మిల్లర్లకు అప్పగిస్తుంది. మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్ కింద బియ్యాన్ని తిరిగి అప్పగిస్తారు. దీనికి సంబంధించి సుమారు రూ.1,600 కోట్ల వరకు మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ బిల్లుల చెల్లింపులో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాకినాడ కేంద్రంగా సరి కొత్త డ్రామాకు తెర తీశారు.స్మగ్లింగ్‌కు కాకినాడ పోర్టు అడ్డాగా మారిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించడం విస్మయానికి గురి చేస్తోంది. కాకినాడ యాంకరేజ్ పోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. బియ్యం ఎగుమతి.. ఎరువుల దిగుమతి అంతా యాంకరేజ్ పోర్టు మీదుగానే సాగుతుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టుకు.. కాకినాడ పోర్టుకు ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న యాంకరేజ్ పోర్టు ద్వారా బియ్యం అక్రమ రవాణా ఎలా సాధ్యమవుతుందని అధికార వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. పారదర్శక వ్యవస్థను తొలగించి ఇంటికే పౌరసేవలా?ప్రభుత్వ సేవలు, పథకాలను పారదర్శకంగా ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు అందించే లక్ష్యంతో వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా దేశంలోనే ఎక్కడా లేనివిధంగా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక 2.60 లక్షల మంది వలంటీర్లను తొలగించి దారుణంగా వంచించారు. వలంటీర్ వ్యవస్థను రద్దు చేసిన సీఎం చంద్రబాబు తాజాగా ఇంటి గుమ్మం వద్దకే పౌర సేవలు అందిస్తానని చెప్పడంపై విస్తుపోతున్నారు. వలంటీర్లు లేకపోవడంతో టీడీపీ నేతలు లబ్ధిదారులను పెన్షన్ల కోసం ఇళ్ల వద్దకు రప్పించి చుట్టూ తిప్పుకుంటున్నారు. సచివాలయాల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్న ఫోటోలు మీడియాలోనూ వచ్చాయి. మరోవైపు కూటమి సర్కారు దాదాపు లక్షన్నర పెన్షన్లను కుదించింది. ఇక పౌరసేవలు, పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.విద్యుత్ చార్జీలు తగ్గిస్తామంటూ బాదుడే బాదుడు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ చారీలను ఏమాత్రం పెంచబోమని.. వాటిని తగ్గిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు ఊరూవాడా ప్రచారం చేశారు. అయితే హామీని నిలబెట్టుకోకుండా అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రూ.15,485.36 కోట్ల భారాన్ని విద్యుత్ చార్జీల రూపంలో ప్రజలపై మోపారు. విద్యుత్ చార్జీల మంటతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దాంతో ఆ నెపాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెడుతూ సీఎం చంద్రబాబు బురద చల్లుతున్నారు.ధాన్యం రైతుకు దగా..ధాన్యం రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవడంలో కూటమి సర్కారు దారుణంగా విఫలమైంది. ఎమ్మెస్పీ దక్కకపోవడంతో అన్నదాతకు బస్తాకు రూ.300 – రూ.400 వరకు నష్టం వాటిల్లింది. దళారులకు అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు తుపాన్ కారణంగా అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగు రోజులు ముందే తుపాన్ హెచ్చరికలున్నా సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించి ముందస్తు జాగ్రత్తలు చేపట్టలేదు. ప్రభుత్వం పంటను కొనుగోలు చేయకుండా చోద్యం చూసింది. గోనె సంచులు సమకూర్చలేదు. పంట చేతికందే సమయంలో వర్షాలకు ధాన్యం తడిచిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.అప్పులపై అవే అబద్ధాలు..వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని.. రూ.పది లక్షల కోట్లు.. రూ.12 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అప్పు చేసిందని ఎన్నికలకు ముందు చంద్రబాబు, కూటమి నేతలు, ఎల్లో మీడియా ప్రచారం చేసింది. ఎన్నికల్లో సూపర్ సిక్స్‌తోపాటు వందల హామీలను ప్రజలకు చంద్రబాబు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్తోసహా ఎన్నికల హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అప్పులతోపాటు రోజుకో డ్రామాకు తెర తీస్తున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్ సాక్షిగా రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లేనని కూటమి ప్రభుత్వమే అంగీకరించింది. అయినా సరే రాష్ట్రం అప్పు రూ.పది లక్షల కోట్లు కంటే ఎక్కువ ఉందంటూ సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలను వల్లె వేస్తూ.. ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉండటం వల్లే హామీలను అమలు చేయలేకపోతున్నానని సమర్థించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.పోలవరానికి ద్రోహం..వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే తగ్గిస్తున్నారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ఫ్రచారం చేశారు. అయితే ఇప్పటికే స్పిల్ వేను 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా నిర్మించామని.. పోలవరం ప్రధాన డ్యామ్‌ను కూడా అదే రీతిలో నిర్మిస్తామని.. కావాలంటే టేపు తీసుకుని వచ్చి కొలుచుకోవాలని నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ సవాల్ విసరడంతో తోక ముడిచారు. పోలవరంలో నీటిని నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి ఒక్క అంగుళం కూడా తగ్గించబోమని అప్పటి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సైతం పార్లమెంట్ ఉభయ సభల్లో అనేక మార్లు స్పష్టం చేశారు.కానీ.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది ఆగస్టు 28న పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేయడం గమనార్హం. దీనిపై ఆ సమావేశంలో పాల్గొన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు నోరు మెదపలేదు. పోలవరానికి కూటమి ప్రభుత్వం తలపెట్టిన ద్రోహానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన దుష్ఫ్రచారాన్నే సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల ఇప్పుడూ చేస్తుండటం గమనార్హం.ఇసుకపై ఇష్టారాజ్యంగా.. ఇసుక ఉచితంగా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీలిచ్చారు. వర్షాకాలంలో అవసరాల కోసం గత సర్కారు స్టాక్ పాయింట్లలో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకలో 40 లక్షల టన్నులను అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే టీడీపీ నేతలు తెగనమ్మి సొమ్ము చేసుకున్నారు. అందరూ దసరా పండుగ సందడిలో ఉన్న సమయంలో కేవలం రెండు రోజులే గడువు ఇచ్చి ఇసుక రీచ్‌లకు టెండర్లు నిర్వహించారు. ఇసుక రీచ్‌లన్నీ టీడీపీ నేతలకే కట్టబెట్టారు. ఇసుక ధరలను పచ్చ ముఠాలు ఇష్టారాజ్యంగా వసూలు చేయడంపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారు. -
ప్రజలపై పెనుభారం మోపుతారా!
అనంతపురం (కార్పొరేషన్): విద్యుత్ చార్జీలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలపై సీఎం చంద్రబాబు ఐదున్నర నెలల్లో రూ.15,485 కోట్ల పెనుభారం మోపారని.. తిరిగి మరోసారి విద్యుత్ చార్జీలు పెంచేందుకు నిర్ణయించడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఆదివారం పార్టీ స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు ఐదున్నర నెలల్లోనే మాట తప్పారని ధ్వజమెత్తారు.ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఇప్పుడు విద్యుత్ చార్జీల పెంపుతో మరింత ఇబ్బంది పడే దుస్థితి నెలకొందన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు హామీ ఇచి్చన చంద్రబాబు మాట తప్పారన్నారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించకపోతే ప్రజల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. బెల్టు తీసినంత సులభం కాదు.. బెల్టు షాపుల మాఫియాను అరికట్టడం బెల్టు తీసినంత సులభం కాదని చంద్రబాబుకు అనంత చురకలంటించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు పెట్టడానికి కారణం చంద్రబాబే అన్నారు. వేలం పాట వేసి మరీ బెల్టు షాపులను తన కార్యకర్తలకు కట్టబెడుతున్నారన్నారు. ఇప్పుడేమో బెల్టు తీస్తా అని తనకేమీ తెలియనట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బూడిద కోసం రెండు జిల్లాల పోలీసులను సరిహద్దుల్లో బందోబస్తు పెట్టడం, ఈ విషయంపై సీఎం చంద్రబాబు పంచాయితీ పెట్టడం చూస్తుంటే ఇంతకన్నా సిగ్గు చేటు మరొకటి లేదని మండిపడ్డారు. -
నిన్న సర్దుబాటు చార్జీలు.. రేపు అసలు బాదుడు
సాక్షి, అమరావతి: కనీవినీ ఎరుగని రీతిలో.. మునుపెన్నడూ ఏ ప్రభుత్వంలో, ఏ సీఎం హయాంలోనూ లేని విధంగా ఆరు నెలల్లోనే ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ సర్దుబాటు చార్జీల భారం మోపిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అసలు చార్జీల వడ్డింపునకు సిద్ధమవుతోంది. ప్రత్యక్షంగానో, కుదరకపోతే దొంగ దారిలో శ్లాబుల విధానంలోనే కరెంటు చార్జీలు పెంచడం ద్వారా ప్రజలపై మరికొన్ని వేల కోట్ల రూపాయల భారం వేసేలా విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల)తో కసరత్తు పూర్తి చేయించింది.ఈ మేరకు 2025–26 సంవత్సరానికి ఆదాయ అవసరాల నివేదిక (అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్)ను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి శనివారం అందజేశాయి. ఈ నివేదికలపై ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ చేపడుతుంది. అనంతరం టారిఫ్ (ధర) ప్రకటిస్తుంది. దాని ప్రకారం వచ్చే ఏడాది (2025) ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమలులోకి వస్తాయి.ప్రజలపై చార్జీల భారం వేయని వైఎస్ జగన్విద్యుత్ చార్జీల భారంతో ప్రజల నడ్డివిరిచే ప్రభుత్వాలను గతంలో చూశాం. కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో సామాన్యులకు ఎలాంటి విద్యుత్ చార్జీలు పెంచని ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఇదే కాకుండా, రైతులకు 9 గంటల పాటు వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్‌ను అందించింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే. వివిధ వర్గాల పేదలకు సైతం ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను ఇచ్చింది వైఎస్ జగన్ హయాంలోనే. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తూ.. రాష్ట్రంలోని దాదాపు 2 కోట్ల కుటుంబాలపై ఎలాంటి విద్యుత్ చార్జీల భారం లేకుండా టారిఫ్ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదించేలా నాటి పాలకులు చేశారు. 2024–25 సంవత్సరానికి మూడు డిస్కంలకు ప్రభుత్వం నుండి అవసరమైన సబ్సిడీ రూ.13,589.18 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. తద్వారా విద్యుత్ చార్జీలను పెంచాల్సిన అవసరం లేకుండా చేసింది. అంతా గోప్యంఏపీఈఆర్సీకి సమర్పించిన ఏఆర్‌ఆర్‌లో ఏముందో డిస్కంలు బయటకు చెప్పడంలేదు. శనివారంతో గడువు ముగుస్తున్నందున సాంకేతికంగా నివేదిక సమర్పించామని, పూర్తి నివేదిక సోమవారం ఇస్తామంటూ తప్పించుకుంటున్నాయి. ఏఆర్‌ఆర్‌లు సమర్పించారని, వాటిని పరిశీలించి, ప్రజల ముందుంచడానికి కొద్ది రోజులు పడుతుందని ఏపీఈఆర్సీ చెబుతోంది. ఇప్పటికే సర్దుబాటు చార్జీలు భారీగా వేయడంతో కూటమి సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. టారిఫ్ కూడా పెంచితే మరింత ప్రజాగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం డిస్కంలతో వినియోగదారులను ఏమార్చేలా ప్రతిపాదనలు ఇప్పించినట్లు సమాచారం. చార్జీల పెంపు ప్రత్యక్షంగా పెంచడం కుదరకపోతే గతంలో చంద్రబాబు హయాంలో చేసినట్లుగానే ఇప్పుడూ స్లాబులు మార్చి, వినియోగదారులను ఏమార్చి బిల్లులు పెరిగేలా డిస్కంలు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. -
ఎల్లో మీడియాకు ఇవి కనిపించడం లేదా?: కాకాణి
సాక్షి, నెల్లూరు: విద్యుత్ ఛార్జీలు పెంచి.. తమపై నిందలు మోపడం దారుణమంటూ కూటమి సర్కార్ తీరుపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి.. రెండోసారి కూడా పెంచుతున్నారంటూ దుయ్యబట్టారు. 9,400 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజలపై మోపుతున్నారు. విద్యుత్ రంగం సంక్షోభంలో కురుకుపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణం. 2014-19 మధ్య సోలార్, విండ్ పవర్‌ను సగటున 5.10 పైసలు పైనే చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. వైఎస్ జగన్ నిర్ణయం వల్ల రాష్టానికి లక్షా పది వేల కోట్లు ఆదాయం వస్తే.. చంద్రబాబు హయాంలో 90 వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం పడింది. చంద్రబాబు దిగిపోయే సరికి రూ.86,215 కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి డిస్కమ్‌లు వెళ్లిపోయాయి’’ అని కాకాణి వివరించారు.సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టినా.. కరెంట్ ఛార్జీలు పెంచినా.. ఎల్లో మీడియాకు కనిపించడం లేదు. నిత్యావసర వస్తువులు నుంచి.. మద్యం దాకా అన్నీ రేట్లు పెరిగాయి. సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు.. ప్రజల సంపదను ఆవిరి చేస్తున్నారు. సంక్షేమ పథకాలు రాకపోవడంతో.. కుటుంబ ఆదాయం పడిపోయింది.. అప్పులు పెరగడంతో కాల్ మనీ గ్యాంగ్‌లు హాల్ చల్ చేస్తున్నాయి. ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలని చూస్తున్నారు.. అందుకే రెండోసారి కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు.’’ అని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.దీన్ని వైస్సార్సీపీ ఖండిస్తుంది..మంత్రి నారాయణ వర్సెస్ కోటంరెడ్డి వ్యవహారంపై కాకాణి స్పందిస్తూ.. ప్రతి జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అవినీతిలో విభేదాలు వస్తున్నాయి. రాయలసీమలో అది నారాయణ రెడ్డి, జేసీ మధ్య రాజకీయ వివాదం రచ్చకెక్కింది. నేతల మధ్య సమన్వయం ఉండటం లేదు.. పాలన సరిగా లేదనడానికి నిదర్శనం.. కూటమి నేతల మధ్య బయటపడుతున్న విభేదాలే స్పష్టం చేస్తున్నాయి’’ అని కాకాణి గోవర్థన్‌రెడ్డి చెప్పారు. -
బాబూ.. బాదుడే.. బాదుడు..
-
శాసనమండలి నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
-
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల భారంపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు... దద్దరిల్లిన శాసన మండలి
-
ప్రజలకు షాక్‌లు.. సర్కారు సోకులు 'వాతలపై వాకౌట్'
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు విద్యుత్తు షాకులపై శాసన మండలి దద్ధరిల్లింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని... అవసరమైతే చార్జీలను ఇంకా తగ్గిస్తామన్న హామీని కూటమి నేతలు గాలికొదిలేయడంతోపాటు ఐదు నెలల్లోనే ప్రజలపై ఏకంగా రూ.17 వేల కోట్లకుపైగా కరెంట్ చార్జీల భారాన్ని మోపడాన్ని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మండలి సాక్షిగా నిగ్గదీసింది. గత సర్కారుపై బురద చల్లే యత్నాలను ఎండగట్టింది. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా డిస్కమ్‌లకు (విద్యుత్తు పంపిణీ సంస్థలు) సకాలంలో రాయితీలను అందించి ఆదుకుందని, ఐదేళ్లలో ఏకంగా రూ.45 వేల కోట్లకు పైగా అందచేసిందని గుర్తు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించేందుకు నిరాకరిస్తూ వినియోగదారులపై నిర్దాక్షిణ్యంగా రూ.17 వేల కోట్లకుపైగా చార్జీల భారాన్ని మోపుతోందని మండిపడింది. విద్యుత్తు చార్జీల వాతలు, సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు లేకపోవడం, రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలకు నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సోమవారం మండలి నుంచి వాకౌట్ చేసింది. శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ అంశాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం నిర్వాకాలపై నిప్పులు చెరిగారు. సామాన్య ప్రజలపై విద్యుత్తు చార్జీల భారాన్ని ఎందుకు మోపుతున్నారని నిలదీశారు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన తరువాత ఆ కార్యక్రమాల వ్యయాన్ని ఆయా ప్రభుత్వాలే భరించాలని హితవు పలికారు. ‘ఎన్నికల సమయంలో మీరే వాగ్దానం చేశారు కదా? హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? సబ్సిడీ కింద ప్రభుత్వం నిధులు కేటాయించి వినియోగదారులకు ఊరట కల్పించవచ్చు కదా? ఇప్పటికే రూ.ఆరు వేల కోట్లకుపై భారాన్ని ప్రజలపై మోపారు. ఇంకో రూ.11 వేల కోట్లకుపైగా భారాన్ని కూడా వేసి ఏం చేద్దామనుకుంటున్నారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు జరపకపోవడం మోసపూరితమని మండిపడ్డారు. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తూ సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ‘రాష్ట్ర విభజన తరువాత విద్యుత్ బకాయిలు, అప్పులు రూ.ఏడు వేల కోట్ల దాకా ఉంటాయి. 2014–19 మధ్య టీడీపీ సర్కారు వాటిని రూ.29 వేల కోట్ల వరకు తీసుకెళ్లింది. వైఎస్సార్ సీపీ హయాంలో రూ.395 కోట్లకు మించి ఐదేళ్లలో డిస్కంలపై భారం పడలేదు. అదే నాడు టీడీపీ హయాంలో రూ.22 వేల కోట్ల మేర భారం వేశారు. ఇక టీడీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లలో డిస్కంలకు రూ.15 వేల కోట్లు మాత్రమే సబ్సిడీ కింద ఇవ్వగా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.45 వేల కోట్లకుపైగా విద్యుత్ రంగానికి అందచేసి ఆదుకుంది’ అని గణాంకాలతో కూటమి సర్కారు షాకులను ఎండగట్టారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి నిరసనగా పార్టీ సభ్యులందరితో కలసి వాకౌట్ చేశారు. అప్పులపై తప్పుడు ప్రచారం.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు మూడు నెలల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం ఆనవాయితీ. ఇంత ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు ఎటువంటి కేటాయింపులు లేకపోగా ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న విషయంపై కూడా స్పష్టత లేదంటే ఇది మోసపూరిత బడ్జెట్ కాక ఇంకేమంటారు? మాజీ ఆర్ధికమంత్రి రూ.14 లక్షల కోట్ల అప్పలు అంటారు! ముఖ్యమంత్రి రూ.పది లక్షల కోట్లు అంటారు! ఆర్థిక మంత్రి రూ.6.46 లక్షల కోట్లు అని బడ్జెట్లో అంటారు! మరి ఇందులో ఏది నిజం? ఎవరు తప్పుడు లెక్కలు చెబుతున్నారో సభకు స్పష్టత ఇవ్వాలి. గత ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిర్దేశించిన పరిమితికి లోబడి అందులో 86 శాతం మాత్రమే అప్పులు తీసుకుంది. సూపర్ సిక్స్ ఎక్కడ? సూపర్‌సిక్స్ పథకాలకు కేటాయింపులు ఎక్కడ? స్కూలుకు వెళ్లే పిల్లలకు తల్లికి వందనం ఎక్కడ? నీకు 15 వేలు.. నీకు 15 వేలు అనేది ఇప్పుడు తెగ ప్రచారమవుతోంది. పాఠశాల విద్యార్థులు 80 లక్షల మందికిపైగా ఉంటే బడ్జెట్లో కేటాయించిన రూ.5,000 కోట్లు ఎలా సరిపోతాయి? ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు? 50 ఏళ్లు దాటిన వారికి ఫించను హామీని ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆలస్యం ఎందుకు? 20 లక్షల ఉద్యోగాలు సృష్టించలేనప్పుడు కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలి కదా? దిగజారిన శాంతి భద్రతలు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఉప ముఖ్యమంత్రే చెప్పారని బొత్స పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, హత్యాచారాలపై మండలిలో చర్చ సందర్భంగా అధికార – ప్రతిపక్ష సభ్యుల వాగ్యుద్ధం చోటు చేసుకుంది. హోంమంత్రి అనిత జవాబిచ్చిన తీరును బొత్స ఖండించారు. సభ్యుల ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పకుండా మంత్రి రాజకీయ ఉపన్యాసాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గత ఐదు నెలల కాలంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, వేధింపులు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కల్పలత ఆందోళన వ్యక్తం చేశారు. యథేచ్ఛగా మద్యం బెల్ట్ షాపులు ఏర్పాటవుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు జరిగిన నేరాల్లో 24–48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశామని హోంమంత్రి అనిత చెప్పారు. కాగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ ఈ సందర్భంగా మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు. కాగా శాంతి భద్రతలు విఫలమయ్యాయని డిప్యూటీ సీఎం అనలేదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఔను.. ఒక్క సిలిండరే ఉచిత గ్యాస్ సిలెండర్ హామీపై బొత్స గట్టిగా నిలదీయండంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చి అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క సిలెండర్ మాత్రమే ఉచితంగా ఇస్తామని, ఏడాదికి మూడు ఉచిత సిలెండర్ల హామీని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభలో స్పష్టం చేశారు. ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనం పెంపు ప్రతిపాదన లేదు.. ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనాల పెంపు ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రి ఫరూక్ తెలిపారు. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి మాత్రమే ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందని చెప్పారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వైఎస్సార్ ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, మహ్మమద్ రుహల్లాలు ఈ అంశాలను ప్రస్తావించారు. మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదు: మంత్రి గొట్టిపాటి రవి రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ఉపప్రశ్నకు మంత్రి గొట్టిపాటి ఈ మేరకు బదులిచ్చారు. బిల్లును వ్యతిరేకిస్తున్నాం: లక్ష్మణ్‌రావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిలును మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికే తొలిదశలో రూ.6 వేల కోట్ల భారాన్ని విద్యుత్తు వినియోగదారులపై మోపింది. ఇప్పుడు మరో రూ.11 వేల కోట్ల బాదుడుకు సిద్ధమైంది. మొత్తం సుమారు రూ.17 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేస్తోంది. వినియోగదారులకు ఇది మోయరాని భారం. ఇలాంటి బిల్లు ఇప్పుడు అవసరమా? దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. మూజువాణితో ఆమోదం... మండలిలో విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చకు విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానిచ్చారు. గత ప్రభుత్వం ఎంతో మేలు చేసినట్లు బొత్స సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని విమర్శించారు. ఇది సవరణ మాత్రమేనని, గత ప్రభుత్వమే ప్రజలపై భారం వేసిందని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో లోపాలను సరిదిద్దడానికే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామన్నారు. అనంతరం బిల్లుపై సభలో తీర్మానం ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. -
మరో విద్యుత్ ఉద్యమానికి సిద్ధం
సాక్షి, అమరావతి: సర్దుబాటు పేరుతో ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపటం దుర్మార్గమని, ఆ చార్జీలను రద్దు చేసే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వామపక్షాల నేతలు ప్రకటించారు. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. అనంతరం సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు విలేకరుతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే సర్దుబాటు చార్జీల భారం రూ.6,072 కోట్లు మోపగా, ఇప్పుడు మరో రూ.11 వేల కోట్ల భారం మోపాలనుకోవడం దుర్మార్గం.మరో విద్యుత్ ఉద్యమానికి శ్రీకారం చుడతాం. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని చంద్రబాబు చెప్పారు. దానికి కట్టుబడి తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలను రద్దుచేయాలి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 19వ తేదిన విజయవాడలో వామపక్షాల నిరసన తెలియజేస్తాం. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానంటూ ఆర్ఎస్ఎస్, బీజేపీ అజెండాను పవన్‌కళ్యాణ్ మోయడం తగదు’ అని చెప్పారు. వివిధ వామపక్ష పార్టీల నేతలు జల్లి విల్సన్, సీహెచ్ బాబూరావు, పి.ప్రసాద్, ఎస్కే.ఖాదర్‌బాషా, కె.పొలారి పాల్గొన్నారు. 18న ఇళ్ల పట్టాల సమస్యలపై వినతిపత్రాలుఇళ్ల పట్టాలకు సంబంధించిన సమస్యలపై ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం ముప్పాళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన వర్చువల్‌గా జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వరంలో ఈ నెల, వచ్చే నెలలో చేపట్టనున్న ఆందోళనలకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. -
విద్యుత్ వెలుగులకు ‘చంద్ర’ గ్రహణం
సాక్షి, అమరావతి: 2014– 2019 పాలనలో చంద్రబాబు చేసిన పాపాలు రాష్ట్ర ప్రజలకు, విద్యుత్ సంస్థలకు శాపాలుగా మారి నేటికీ వెంటాడుతున్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ రంగానికి చేసిన అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కారణంగా విద్యుత్ సంస్థలు నేటికీ తేరుకోలేకపోతున్నాయి. విద్యుత్ కొనుగోలు ఖర్చులతో పాటు, పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. ఆ భారం అంతిమంగా విద్యుత్ వినియోగదారులపైనే పడుతోంది.ఈ విషయాన్ని గుర్తించిన (2019–2024) నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యుత్ సంస్థలను బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టింది. విద్యుత్ సంస్థలకు ఆర్థికంగా చేయూతనిచ్చింది. ప్రజలపై చార్జీల భారం పడకూడదని భావించి, ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతోపాటు, వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందుబాటులో ఉంచడంపై ప్రధానంగా దృష్టి సారించింది. అనుకున్నట్లుగానే ఐదేళ్లలో గత ప్రభుత్వం విద్యుత్ రంగంలో విప్లవాత్మక వృద్ధిని సాధించింది.పెట్టుబడుల సాధనతో పాటు, డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను అందించి, దేశంలోనే ఆదర్శంగా నిలిచి రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డులను సైతం అందుకుంది. కానీ 2024లో మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీల పిడుగు ప్రజల నెత్తిన పడింది. పాలన చేపట్టిన వంద రోజులకే సర్ధుబాటు పేరుతో దాదాపు రూ.17 వేల కోట్లకు పైగానే ప్రజలపై భారం వేసింది.జగన్‌కు.. చంద్రబాబుకు చాలా తేడా2018–19తో పోల్చితే 2023–24 నాటికి విద్యుత్ రంగంలో వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం చంద్రబాబు దిగిపోయే నాటికి 7,213 మెగావాట్ల ఉంటే అది జగన్ హయాంలో 8,789 మెగావాట్లకు పెరిగింది. ఇందులో కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)లోని 800 మెగావాట్ల యూనిట్, నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లోని 800 మెగావాట్ల యూనిట్ ఉన్నాయి.చంద్రబాబు హయాంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి 2018–19లో 27,197 మిలియన్ యూనిట్లు ఉంటే జగన్ హయాంలో 2023– 24లో 34,181 మిలియన్ యూనిట్లుగా ఉంది. అంటే 6,984 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. అలాగే ఏపీ జెన్కో లాభాలు 2018–19లో రూ.2,044 కోట్లు ఉంటే, 2023–24లో రూ.2,469 కోట్లుగా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీపీడీసీఎల్)వి అయితే చంద్రబాబు సమయంలో కేవలం రూ.1,565 కోట్లు ఉంటే, జగన్ హయాంలో రూ.6,240 కోట్లకు చేరాయి.నిలువునా ముంచేసిందే చంద్రబాబు..రాష్ట్రంలో 2015–19 మధ్య 30,742 మిలియన్ యూనిట్లు మిగులు విద్యుత్ రాష్ట్రంలో ఉండేది. ఈ మొత్తం మిగులు విద్యుత్‌ను చంద్రబాబు బ్యాక్‌డౌన్ (వృథా) చేయించారు. అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను అధిక ధరలకు కుదుర్చుకున్నారు. నిజానికి రెన్యూవబుల్ పవర్ పర్చేస్ ఆబ్లిగేషన్ (ఆర్పీపీఓ) నిబంధనల ప్రకారం.. మొత్తం విద్యుత్‌లో పునరుత్పాదక విద్యుత్‌ను 5 నుంచి 11 శాతం తీసుకోవాలి.కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 23 శాతం పునరుత్పాదక విద్యుత్‌ను అత్యధిక ధరలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకుంది. యూనిట్ రూ 2.40కు లభిస్తున్న బొగ్గు ఆధారిత విద్యుత్‌ను వృథాచేసి, రూ.5కు బయట కొనుగోలు చేసింది. అదే సమయంలో పవన విద్యుత్‌ను యూనిట్‌కు ఏకంగా రూ.4.84కు తీసుకుంది. అప్పట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54కు బదులు రూ.8.90 వెచ్చించారు. వీటికి ఫిక్స్డ్ చార్జీలు అదనం.ఇలా దాదాపు 8 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలపై 25 ఏళ్లపాటు ఏటా అదనంగా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. ఈ భారాలను పూడ్చుకోవడానికి డిస్కంలు ప్రజలపై విద్యుత్ చార్జీలు వేస్తున్నాయి. చంద్రబాబు గత హయాంలో ఏపీఈఆర్సీకి సమర్పించకుండా దాదాపు రూ.20 వేల కోట్ల ట్రూ అప్ భారాన్ని మిగిల్చారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే మళ్లీ ఇంధన సర్దుబాటు చార్జీలు వేసి ప్రజలకిచ్చిన మాట తప్పుతున్నారు.బాబు పాలనలో చీకట్లు.. జగన్ హయాంలో వెలుగులు..చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 61,347 మిలియన్ యూనిట్లు ఇవ్వడానికే ఆపసోపాలు పడి పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్ హాలిడేలు విధించేవారు. విద్యుత్ కోతల వల్ల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితులు కల్పించారు. వ్యవసాయానికి రోజులో నాలుగైదు గంటలే ఇచ్చేవారు. అది కూడా రాత్రి సమయంలో ఇవ్వడం వల్ల రైతులు ప్రాణాలు పోగొట్టుకునేవారు.విద్యుత్ కోసం పొలాల్లో పడిగాపులు కాస్తూ రైతులు ప్రాణాలు పోగొట్టుకున్న ఈ చీకటి రోజుల నుంచి విముక్తి కలిగించాలని.. రానున్న 30 ఏళ్లలో అన్నదాతలకు విద్యుత్ కష్టాలు లేకుండా చేయాలని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి 7 వేల మెగావాట్లు తీసుకుని వ్యవసాయ రంగానికి అందించాలని నాటి సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్‌కు రూ.5.10 ఉంటే, సెకీ నుంచి యూనిట్ రూ.2.49కే వచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దీంతో దాదాపు రూ.3,750 కోట్లు రాష్ట్రానికి ఆదా అవుతుంది.దే విధంగా జగన్ హయాంలో 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే అర్హులైన ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు గత ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను అందజేసింది. అలాగే వెనుకబడిన వర్గాల కుటుంబాలు, ధోబీఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లు, చేనేత కార్మికులు, లాండ్రీలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వృత్తిపరమైన స్వర్ణకార దుకాణాలకు ఉచిత, సబ్సిడీతో విద్యుత్‌ను సరఫరా చేసింది. చంద్రబాబు రాకతో వీటన్నింటికీ మంగళం పాడడంతో మళ్లీ ఏపీలో ఆనాటి చీకటి రోజులు మొదలవుతున్నాయి. -
ఏపీ ప్రజలకు షాక్‌ల మీద షాక్!
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్ చార్జీల పిడుగు. ఏకంగా 11వేల కోట్ల రూపాయల ట్రూ అప్ చార్జీల భారం మోపే చాన్స్
-
AP: షాక్‌ల మీద షాక్!
‘‘రాష్ట్రంలో విద్యుత్ చార్జీల భారం ఎక్కువగా ఉంది.. కూటమి ప్రభుత్వం వస్తే చార్జీల భారం తగ్గిస్తాం.. ఐదేళ్ల పాటు ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచం’’ అని ఎన్నికలకు ముందు ప్రతి సభలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే మాట మార్చేశారు. ‘‘అబ్బే.. చెప్పినవన్నీ చేయాలంటే ఎలా కుదురుతుంది? చార్జీలు పెంచకపోతే డిస్కంలకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? డబ్బులు ఊరకే రావు. ‘సర్దుబాటు’ పేరుతో ఎంత కావాలో అంత ప్రజల నుంచే పిండుకోండి. ఇదేంటని ఎవరైనా అడిగితే గత ప్రభుత్వం వల్లే చార్జీలు పెరిగాయని అబద్ధమైనా సరే గట్టిగా దబాయించి చెప్పండి. ఒకటికి పదిసార్లు మన మీడియాలో కథనాలు రాయండి. అప్పటికీ సర్దుకోకపోతే నేనే ఎలాగోలా టాపిక్ డైవర్ట్ చేస్తాను’’ అని అంతర్గతంగా దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ప్రజలు కోలుకోలేని విధంగా షాక్‌ల మీద షాక్.సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కారు వరుసగా విద్యుత్ షాక్‌లు ఇస్తోంది. ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ఇప్పటికే రూ.6,072.86 కోట్ల భారాన్ని ఈ నెల బిల్లు నుంచే వేస్తున్న ప్రభుత్వం, వచ్చే నెల నుంచి ప్రజల మీద మరో రూ.11,826.15 కోట్ల భారం మోపనుంది. ఈ మేరకు 2023–24 సంవత్సరానికి ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు చార్జీల (ఎఫ్‌పీపీసీఏ)కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి సోమవారం ప్రతిపాదనలు సమర్పించాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఎవరికైనా అభ్యంతరాలున్నా, ఏవైనా సూచనలు చేయాలనుకున్నా తమకు నేరుగా గానీ, ఈ మెయిల్ ద్వారా గానీ ఈ నెల 19వ తేదీలోగా తెలియజేయాలని మండలి కోరింది. అనంతరం ఓ వారం రోజుల్లోనే ట్రూ అప్ చార్జీలపై ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకోనుంది. ఆ వెంటనే డిసెంబర్ నెల నుంచే విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చార్జీలను వేసే అవకాశం ఉంది.గరిష్టంగా యూనిట్‌కు రూ.3 భారం ఈ ఏడాది జూన్ నాటికే 2023–24 సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు చార్జీలు యూనిట్‌కు రూ.0.40 చొప్పున ఇప్పటి వరకు దాదాపు రూ.3,752.55 వేల కోట్లు వసూలు చేశామని డిస్కంలు వెల్లడించాయి. మిగిలిన రూ.8,073.60 కోట్ల చార్జీలను బిల్లుల్లో అదనంగా కలిపేందుకు ఏపీఈఆర్సీ ఆమోదం కోసం డిస్కంలు పంపించాయని తెలిపాయి. అయితే ఈసారి వాస్తవ విద్యుత్ కొనుగోలు ఖర్చు, అనుమతించిన ఖర్చుకు మధ్య వ్యత్యాసాన్ని డిస్కంలు భారీగా చూపించాయి. అది మూడు డిస్కంలలోనూ కనిష్టంగా రూ.1.02 నుంచి గరిష్టంగా రూ.2.50 వరకు ఉంది. దీన్ని బట్టి యూనిట్‌కు ఎంత వసూలు చేసుకోవడానికి ఏపీఈఆర్సీ అనుమతిస్తుందనేది ఈ నెలాఖరులోగా తేలుతుంది. ఈ నెల నుంచి యూనిట్‌పై సగటున పడుతున్న రూ.1.27కి వచ్చే నెల నుంచి పడే చార్జీలను కలుపుకుంటే మొత్తంగా యూనిట్‌కు రూ.3 చొప్పున అదనంగా వినియోగదారులపై భారం పడనుంది. ఈ లెక్కన విద్యుత్ చార్జీలు డబుల్ కానున్నాయని, ఎక్కువ విద్యుత్ వాడే వాళ్లకు అంతకంటే ఎక్కువ భారం కానున్నాయని స్పష్టమవుతోంది. (నవంబర్ నెలలో వాడిన కరెంట్‌కు డిసెంబర్ మొదటి వారంలో బిల్లు వస్తుంది. అప్పుడు రూ.6,072.86 కోట్ల భారం పడుతుంది. డిసెంబర్లో వాడిన కరెంట్‌కు జనవరి మొదటి వారంలో బిల్లు వస్తుంది. అప్పుడు రూ.11,826.15 కోట్ల భారం అదనంగా కలుస్తుంది.) -
ఏపీలో విద్యుత్ వాత.. కూటమి మోత..!
-
ఈఆర్సీ తిరస్కరించడం బీఆర్ఎస్ విజయమే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తిరస్కరించడం బీఆర్ఎస్ సాధించిన విజయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలపై రూ.18,500 కోట్ల భారం పడకుండా ఆపగలిగి నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ మంగళవారం ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ఈఆర్సీ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో సంబరాలు జరపాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.పది సంవత్సరాల్లో ఏనాడూ విద్యుత్ చార్జీలు పెంచని బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా, కేవలం 10 నెలల్లోనే రూ.18,500 కోట్ల విద్యు త్ చార్జీల పెంపు ప్రతి పాదనలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిందని విమర్శించారు. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని పబ్లిక్ హియరింగ్‌లో పాల్గొని ఈఆర్సీని ఒప్పించగలిగినట్టు తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు స్వయంగా తనతోపాటు విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి , ఇతర సీనియర్ నాయకులు రాష్ట్ర ఈఆర్సీని కలిసి విద్యుత్ చార్జీల పెంపును ఆపాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొని ప్రజల తరఫున వాదనలు వినిపించారన్నారు. కాంగ్రెస్ నేతలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారుముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యా లను, అవినీతిని ఎత్తి చూపినందుకు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పైన ఫ్రస్ట్రేషన్, డెస్పరేషన్లో ఉన్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ తమపై చేస్తున్న రాజకీయ వేధింపుల ప్రహసనంలో గత రెండు రోజుల్లో జరిగిన పరిణామాలన్నీ ప్రారంభం మాత్రమేనని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో మరిన్ని వేధింపులు ఉంటా యని, కాంగ్రెస్ పార్టీ చేసే వ్యక్తిగత దాడులు, కుట్రలు, ప్రాపగండా, అబద్ధాలను ఎదుర్కొ నేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
ఏపీ ప్రజలకు చంద్రబాబు కరెంటు షాక్
-
కరెంట్ చార్జీల పెంపు దీపావళి కానుకా?
-
కరెంట్ చార్జీల పెంచడమే దీపావళి కానుకా?.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
ఏపీ ప్రజలకు దీపావళి గిఫ్ట్.. నారా వారి పాలనలో ఇంతే
-
విద్యుత్ చార్జీలు పెంచి జగనే కారణమంటారా?: పెద్దిరెడ్డి
కడప వైఎస్ఆర్ సర్కిల్: చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై రూ.6 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపి, అందుకు వైఎస్ జగనే కారణమని చెప్పడం కూటమి దిగజారుడుతనానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఆయన శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పచ్చ పత్రికలు విద్యుత్ చార్జీల పెంపు సమాచారాన్ని ప్రజలకు తెలియజేయకుండా, తిరిగి వైఎస్ జగన్‌పైనే ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. వరదలు సహా అనేక ఇతర అంశాల్లో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా విఫలమై, అన్నింటికీ వైఎస్ జగనే కారణమన్నట్లుగా చెబుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్‌్టనే షర్మిల చదువుతున్నారని అన్నారు. కేసులు పరిష్కారం అయ్యే వరకు షేర్ల బదిలీ జరగదని, అయినా ఆమె ఉద్దేశపూర్వకంగానే జగన్‌ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయం దండగ అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు పంటల బీమా, ఇతర సౌకర్యాలు తొలగించి రాష్ట్ర రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. రైతులు రుగ్మతతో అత్మహత్య చేసుకుంటున్నారని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. అన్నదాతకు ఏ మేలూ చేయరని స్పష్టంచేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందించామని, ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూ్యరెన్స్ వంటి పథకాలతో ఆదుకున్నామని చెప్పారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీని మరింతగా బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ ఇన్చార్జిల సూచనలను తీసుకుని జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సమర్థులైన వారికే పదవులు లభిస్తాయని తెలిపారు. -
బాబూ... ఇదేం బాదుడు?
ఒక్కో ఇంటిపై 44 శాతం భారం మేం అధికారంలోకి వస్తే ఐదేళ్లు విద్యుత్ చార్జీలు పెంచబోమని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నాలుగు మాసాలకే సర్దుబాటు చార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై రూ.6,072 కోట్ల భారాన్ని మోపారు. దీనివల్ల ప్రస్తుతం వస్తున్న బిల్లులపై ఒక్కో ఇంటికి అదనంగా 44 శాతం భారం పడుతుంది. అది కూడా ఏకంగా 15 నెలలు వసూలు చేస్తారు. ప్రభుత్వం వెంటనే విద్యుత్ చార్జీలపై భారాన్ని ఉపసంహరించుకోవాలి. – దుంపల ప్రభాకరరావు,విశ్రాంత పోస్టల్ ఉద్యోగి, తాటితూరు, భీమిలి మండలం గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెరిగితే ఊరూరు తిరిగి ‘బాదుడే... బాదుడు...’ అంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు... తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రకటించారు. ‘కేంద్ర ప్రభుత్వ సోలార్ ఆధారిత విద్యుత్ పథకంతో అనుసంధానం చేసుకుని ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తాం. బిల్లుల భారం తగ్గిస్తాం. అదనపు విద్యుత్‌ను ప్రజల నుంచి కొనుగోలు చేస్తాం...’ అని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే సర్దుబాబు చార్జీల పేరుతో ప్రజలపై రూ.6,072 కోట్ల బాదుడుకు సిద్ధమయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా విజయవాడ అలంకార్ సెంటర్లోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట సీపీఎం ఆధ్వర్యాన శనివారం ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని సర్దుబాటు చార్జీలకు అనుమతిస్తూ ఏపీఈఆర్సీ జారీచేసిన ఉత్తర్వులను దహనం చేశారు. – సాక్షి నెట్వర్క్బాదేస్తున్నారు బాబూ..!ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు ప్రజలపై నాటి ప్రభుత్వం విపరీతమైన భారాలు మోపుతోందని బాదుడే.. బాదుడు.. అంటూ ఊరూరా తిరిగారు. ఇప్పుడు అధికారం వచ్చిన వెంటనే ఆయన కూడా ప్రజలను బాదుతున్నారు. గత ప్రభుత్వం తప్పు చేసిందని పలు ఒప్పందాలను రద్దు చేస్తున్న చంద్రబాబునాయుడు.. ఇప్పుడు ప్రజలపై అదనపు ఇంధన చార్జీల రూపంలో భారం పడుతుంటే ఎందుకు రద్దు చేయడం లేదు. – డి.రామశేషయ్య, రిటైర్డ్ టీచర్, కర్నూలునాడు ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడు యూనిట్‌కు అత్యధికంగా 1.58 పైసలు పెంచడం దారుణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండగా 1999లో తెచ్చిన విద్యుత్ సంస్కరణలపై వామపక్షాల ఉద్యమం సందర్భంగా బషీర్‌బాగ్‌లో ఆందోళనకారులపై అన్యాయంగా కాల్పులు జరిపించి ముగ్గురి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడు. ఆ ఘటనలో పోలీసుల లాఠీ దెబ్బలకు నేను తీవ్రంగా గాయపడ్డాను. చందబ్రాబు గతాన్ని మళ్లీ గుర్తుచేస్తున్నారు. – కె.నాంచార్లు, రైతు కూలీ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడుమద్యం తప్ప అన్నీ ప్రియమే.. రాష్ట్రంలో నేడు మద్యం తప్ప అన్ని వస్తువుల ధరలు ప్రియమే. ఎన్నికల సమయంలో ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజల బాగోగులను విస్మరించింది. విద్యుత్ చార్జీలు పెంచుతున్న సీఎం చంద్రబాబు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. – ఎస్కే రెహనుమా, నెల్లూరుమాట మార్చేశారువిద్యుత్ చార్జీల ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామన్నారు. ఇప్పుడు మాట మార్చేచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ధరలపై నియంత్రణ లేదు. సూపర్ సిక్స్ హామీలు గాలికి వదిలేశారు. సామాన్యుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని పాలన సాగించాలి. – అంబటి సుజాత, మాజీ సర్పంచ్, అరిణాం అక్కివలసప్రభుత్వమే భరించాలిసర్దుబాటు చార్జీల పేరిట ప్రజలపై భారం వేయకుండా ప్రభుత్వమే భరించాలి. ఇప్పటికే నిత్యావసర ధరలతో సామాన్యుడి జీవనం కష్టంగా మారింది. సరిగా పంటలు పండక, పనులు లేక ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయలేదు. కానీ విద్యుత్ చార్జీలు పెంచేశారు. – రాజేశ్వరి, గృహిణి, చిత్తూరు -
నమ్మించి మోసం చేసిన కూటమి కరెంటు బిల్లులు బాదుడే బాదుడు..
-
బాబు మార్కు ‘షాక్’!
సాక్షి, అమరావతి: జనం భయపడినట్లుగానే జరిగింది. కూటమి ప్రభుత్వం అనుకున్నట్లుగానే చేసింది. ప్రజలపై విద్యుత్ చార్జీల భారం వేయం.. వేయం.. అని చెబుతూనే భారీగా వడ్డిస్తోంది. చార్జీలు పెంచేది లేదని ఎన్నికల ముందు అధికారం కోసం ఇచ్చిన హామీ మేరకు ఈ చార్జీలను ప్రభుత్వమే భరించాలని వినియోగదారులు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇచ్చిన మాట తప్పి ఏకంగా రూ.6,072.86 కోట్ల సర్దు బాటు చార్జీల షాక్ ఇచ్చింది. ప్రతి యూనిట్‌పై గరిష్టంగా రూ.1.58.. 15 నెలల పాటు ప్రజల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ఇంత భారీ స్థాయిలో విద్యుత్ చార్జీలు పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలోనే ఇలా ఉంటే ఇక రానున్న నాలుగున్నరేళ్లు ఎలా ఉంటుందోనని జనం భయపడిపోతున్నారు. చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, ప్రజలపై భారం లేకుండా ప్రభుత్వమే భరించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం దిగి రాకపోతే ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. స్పందించని ప్రభుత్వం ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) చార్జీలు రూ.8,113.60 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి డిస్కంలు ప్రతిపాదించాయి. గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.2,194 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సర్విసుల నుంచి రూ.1,901 కోట్లు, పారిశ్రామిక సర్విసుల నుంచి రూ.2,748 కోట్లు, వాణిజ్య సర్విసుల నుంచి రూ.669 కోట్లు, సంస్థల (ఇన్స్టిట్యూషన్స్) నుంచి రూ.547 కోట్లు చొప్పున విద్యుత్ బిల్లుల్లో అదనంగా వసూలు చేసుకుంటామని అడిగాయి. ప్రతి నెల ఒక్కో బిల్లుపైనా యూనిట్‌కు రూ.1.27 చొప్పున వసూలు చేస్తామని తెలిపాయి. ఈ చార్జీల వసూలుకు ఏపీఈఆర్సీ అనుమతి ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే 75 శాతం భారం భరించాల్సి ఉంటుందని డిస్కంలు స్పష్టం చేశాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ ఈ నెల 18న బహిరంగ విచారణ చేపట్టింది. ప్రభుత్వమే ఈ చార్జీలను భరించాలని, ప్రజలపై వేయడానికి వీల్లేదని ఆ విచారణలో పాల్గొన్న వివిధ వర్గాల ప్రజలు కోరారు. వారం రోజుల పాటు ప్రభుత్వ స్పందన కోసం ఏపీఈఆర్సీ ఎదురు చూసింది. చార్జీలు భరించేందుకు కూటమి సర్కారు నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో రూ.6,072.86 కోట్ల సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతిస్తూ ఏపీఈఆర్సీ శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. ఇందులో రైతులు, వివిధ వర్గాల వారికి ఉచితంగా, సబ్సిడీగా ఇచ్చిన విద్యుత్‌పై దాదాపు రూ.1,400 కోట్లు భారం పడనుంది. దానిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేసుకోవాల్సిందిగా డిస్కంలకు ఏపీఈఆర్సీ సూచించింది. ప్రభుత్వం నుంచి ఆ మేరకు వస్తే మిగిలిన రూ.4,672.86 కోట్లు ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంమీద డిస్కంలు అడిగిన దానిలో రూ.2,042 కోట్లు తక్కువకు అనుమతించామని మండలి తెలిపింది. గతం అంతా షాక్‌ల చరిత్రే » చంద్రబాబు చెప్పేదొకటి.. చేసేది మరొకటి అనేది మరోసారి రుజువైంది. అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కారణంగా డిస్కంలను అప్పుల పాలు చేసిన చంద్రబాబు పాపాల వల్లే ప్రజలపై చార్జీల భారం పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచమని ప్రకటించారు. కానీ ఆ మాట తప్పడానికి ఐదు నెలలు కూడా పట్టలేదు. » చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా విద్యుత్ చార్జీల విషయంలో, విద్యుత్ రంగం విషయంలో ఇలాంటి కుట్రలే చేస్తుంటారు. గతంలో ఏపీఈఆర్సీని తప్పుదోవ పట్టించారు. డిస్కంలు ఇంధన సర్దుబాటు చార్జీలు సమర్పించకుండా అడ్డుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2015–16లో 76 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే రూ.140.10 బిల్లు వచ్చేది. 2018–19కి వచ్చే సరికి ఇదే వినియోగానికి వచ్చిన బిల్లు రూ.197.60. అంటే 41.04 శాతం పెరిగింది. అదే విధంగా 78 యూనిట్లకు 39.57 శాతం, 80 యూనిట్లకు 38.21 శాతం పెంచేశారు. »గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.50 చొప్పున కనీస చార్జీలు వసూలు చేసే విధానం గత టీడీపీ హయాంలో ఉండేది. నెలంతా విద్యుత్ వినియోగించకపోయినా కనీస చార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చేది. సగటు యూనిట్ సేవా వ్యయం కూడా రూ.7.17 వసూలు చేసేది. విద్యుత్ వినియోగాన్ని బట్టి శ్లాబులను మార్చి, అధిక భారం వేసే విధానాన్ని టీడీపీ సర్కారే గతంలో అమలు చేసింది. » అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను అధిక ధరలకు చంద్రబాబు కుదుర్చుకున్నారు. దాదాపు 8 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలపై 25 ఏళ్ల పాటు ఏటా అదనంగా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. అంతిమంగా అదంతా విద్యుత్ వినియోగదారులపైనే పాతికేళ్లు వేయాల్సి వస్తోంది. -
‘విద్యుత్’కమిషన్ దూకుడు!
సాక్షి, హైదరాబాద్: ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపేలా రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన 9 వేర్వేరు పిటిషన్లపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సోమవారం నుంచి వరుసగా ఐదు రోజుల పాటు బహిరంగ విచారణలు నిర్వహించనుంది. మండలి చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణయ్యల ఐదేళ్ల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుండగా, ఈలోపే ఆయా పిటిషన్లపై ఈఆర్సీ కీలక నిర్ణయాలను తీసుకోనుంది. నిర్దేశిత గడువుకి చాలా ఆలస్యంగా విద్యుత్ సంస్థలు పిటిషన్లు చేయడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. నిబంధనల ప్రకారం గతేడాది నవంబర్‌లోపే విద్యుత్ సంస్థలు పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉండగా, గత నెలలో దాఖలు చేశాయి.ఒకేసారి పెద్ద సంఖ్యలో దాఖలైన పిటిషన్లను చదివి రాతపూర్వకంగా అభ్యంతరాలను సమర్పించడానికి సమయం సరిపోదని, గడువు పొడిగించాలని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ)తో పాటు విద్యుత్ రంగ నిపుణులు ఎం.వేణుగోపాల్ రావు తదితరులు చేసిన విజ్ఞప్తులను ఈఆర్సీ తోసిపుచ్చింది. సోమవారం నుంచి ఈ నెల 25 వరకు వరుసగా ఐదు రోజుల పాటు హైదరాబాద్, నిజామాబాద్, సిరిసిల్లలో బహిరంగ విచారణలు నిర్వహించనుంది. ఆ తర్వాత 4 రోజుల పదవీకాలం మిగిలి ఉండగా కీలక ఉత్తర్వులు జారీ చేయనుంది. అయితే గడువులోగానే విద్యుత్ రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, రైతు సంఘాలు, సాధారణ వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున రాతపూర్వక అభ్యంతరాలు ఈఆర్సీకి అందాయి. కాగా ఈఆర్సీ తీసుకోనున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి.. జెన్కో ట్రూఅప్ చార్జీల భారం రూ.963 కోట్లు తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.963.18 కోట్ల ట్రూఅప్ చార్జీల పిటిషన్‌తో పాటు 2024–29 మధ్యకాలానికి సంబంధించిన మల్టీ ఇయర్ టారిఫ్ (ఎంవైటీ) పిటిషన్‌ను గత నెల 21న దాఖలు చేసింది. వీటిపై సోమవారం ఈఆర్సీ బహిరంగ విచారణ జరపనుంది. జీటీఎస్ కాలనీలోని విద్యుత్ నియంత్రణ్ భవన్లో ఉదయం 10.30 గంటలకు ఇది ప్రారంభం కానుంది. ఈఆర్సీ ఆమోదించిన విద్యుత్ ధరలు/చార్జీలతో పోల్చితే వాస్తవ ఆదాయంలో వ్యత్యాసాన్ని ట్రూఅప్ చార్జీల రూపంలో విద్యుత్ సంస్థలు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.ఒక వేళ ఆదాయ లోటు ఉంటే భర్తీ చేసుకోవడానికి ఎంత మేరకు ట్రూఅప్ చార్జీలను వసూలు చేయాలో ఈఆర్సీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. జెన్కో విద్యుత్ కేంద్రాల నుంచి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ కొనుగోలు చేసి తమ వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెన్కో ప్రతిపాదించిన రూ.963.18 కోట్ల ట్రూఅప్ చార్జీలను డిస్కంల నుంచి వసూలు చేసుకోవడానికి జెన్కో అనుమతి కోరింది. విద్యుత్ చార్జీలను పెంచడం ద్వారా ఈ ట్రూప్ చార్జీల భారాన్ని డిస్కంలు విద్యుత్ వినియోగదారులపై మోపుతాయి. ఐదేళ్లలో రూ.16,346 కోట్ల ఆదాయ అవసరాలు తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) దాఖలు చేసిన 2024–29 మధ్యకాలానికి సంబంధించిన రెండు ఎంవైటీ పిటిషన్లపై మంగళవారం ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.16,346.1 కోట్ల ఆదాయ అవసరాలున్నట్టు ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఇక సిరిసిల్ల జిల్లాకు విద్యుత్ సరఫరా చేసే కోఆపరేటివ్ ఎలక్రి్టక్ సప్లై లిమిటెడ్ (సెస్) పరిధిలో రూ.5 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు ప్రతిపాదిస్తూ దాఖలు చేసిన ఏఆర్ఆర్ 2024–25, 2024–29 ఎంవైటీ పటిషన్‌పై ఈ నెల 25న సిరిసిల్లలో విచారణ జరగనుంది. నవంబర్ 1 నుంచి పెరగనున్న చార్జీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రాష్ట్రంలో రూ.1,200 కోట్ల మేర విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతి కోరుతూ దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (టీజీఎస్పీడీసీఎల్/టీజీఎనీ్పడీసీఎల్) దాఖలు చేసిన రెండు వేర్వేరు ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్) పిటిషన్లతో పాటు 2024–29 మధ్యకాలానికి సంబంధించిన మరో రెండు ఎంవైటీ పిటిషన్లపై బుధవారం హైదరాబాద్‌లో, గురువారం నిజామాబాద్‌లో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. రాష్ట్రంలో హైటెన్షన్ (హెచ్‌టీ) కేటగిరీ విద్యుత్ చార్జీల పెంపు, లోటెన్షన్ (ఎల్టీ) కేటగిరీలో కూడా నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగించే వారికి ఫిక్స్డ్ చార్జీ (డిమాండ్ చార్జీ)ల పెంపును డిస్కంలు ప్రతిపాదించాయి. హెచ్‌టీ కేటగిరీకి చార్జీల పెంపుతో రూ.700 కోట్లు, ఫిక్స్డ్ చార్జీల పెంపుతో రూ.100 కోట్లు కలిపి రూ.800 కోట్లు భారం పడనుంది. మరో రూ.400 కోట్లను ఎల్టీ వినియోగదారుల నుంచి ఫిక్స్డ్ చార్జీల పెంపు ద్వారా రాబట్టుకుంటామని డిస్కంలు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. నవంబర్ 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. -
నమ్మి ఓటేస్తే కరెంట్ షాకులా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల భారం మోపేందుకు రంగం సిద్ధం చేయడంపై ప్రజలు, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు ) ప్రతిపాదించిన రూ.8,113.60 కోట్ల ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) చార్జీల భారంపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. కర్నూలులో మండలి ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన బహిరంగ విచారణలో పాల్గొని అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు 12 మంది సాధారణ ప్రజలు, రాజకీయ పార్టీలు, సంస్థల ప్రతినిధులు వివరాలు నమోదు చేసుకున్నారు. తమకు ఓటేసి అధికారంలోకి తెస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి నేతలు గాలికి వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూ అప్ చార్జీలు వద్దంటూ సీపీఎం నేతలు విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టి ధర్నా నిర్వహించారు. అభ్యంతరాలపై డిస్కమ్‌ల నుంచి ఏపీఈఆర్సీ వివరణ కోరనుంది. సమాధానాలు రాగానే వారం రోజుల్లోగా చార్జీలపై మండలి నిర్ణయం తీసుకుంటుంది.బాబు పాలనంటేనే ’షాక్’లు..టీడీపీ హయాంలో 2015–16లో 76 యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ.140.10 బిల్లు రాగా 2018–19లో రూ.197.60కి పెరిగింది. అంటే 41.04 శాతం పెరిగింది. 78 యూనిట్లకు 39.57 శాతం, 80 యూనిట్లకు 38.21 శాతం పెంచేశారు. గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.50 చొప్పున కనీస చార్జీలు వసూలు చేసే విధానం టీడీపీ హయాంలో అమలైంది. నెలంతా విద్యుత్ వినియోగించకపోయినా కనీస చార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చేది. సగటు యూనిట్ సేవా వ్యయం కూడా రూ.7.17 వసూలు చేశారు. విద్యుత్ వినియోగాన్ని బట్టి శ్లాబులు మార్చి అధిక భారం మోపే విధానాన్ని గతంలో టీడీపీ సర్కారు అమలు చేసింది. అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను నాడు చంద్రబాబు అధిక ధరలకు కుదుర్చుకున్నారు. ఫలితంగా దాదాపు 8 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో విద్యుత్ సంస్థలపై 25 ఏళ్ల పాటు ఏటా అదనంగా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. అంతిమంగా అదంతా విద్యుత్ వినియోగదారులపైనే వేస్తున్నారు. అనుమతిస్తే భారం ఇలా..డిస్కమ్‌ల ప్రతిపాదనలకు ఏపీఈఆర్సీ నుంచి ఆమోదం లభిస్తే గృహ విద్యుత్ వినియోగదారులపై రూ.2,194 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సర్వీసులపై రూ.1,901 కోట్లు, పారిశ్రామిక సర్వీసులపై రూ.2,748 కోట్లు, వాణిజ్య సర్వీసులపై రూ.669 కోట్లు, ఇన్స్టిట్యూషన్స్పై రూ.547 కోట్లకుపైగా విద్యుత్ బిల్లుల భారం పడనుంది. ప్రతి నెల ఒక్కో బిల్లుపై యూనిట్‌కు రూ.1.27 చొప్పున అదనంగా చార్జీలు వేస్తారు. ఒక వేళ ప్రజలపై భారం మోపేందుకు ఏపీఈఆర్సీ అనుమతించకుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.8,113.60 కోట్లలో 75 శాతం భరించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదని, ప్రజలపైనే ఆ భారాన్ని మోపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ట్రూ అప్ చార్జీల వడ్డనపై ఏపీఈఆర్సీలో విచారణ సర్దుబాటు పేరుతో రూ.8,114 కోట్ల బాదుడుపై నివేదిక సిద్ధం చేసిన డిస్కమ్‌లు కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు పేరుతో విద్యుత్ చార్జీల వడ్డనపై ఏపీ డిస్కంలు సిద్ధం చేసిన నివేదికపై వచి్చన అభ్యంతరాలపై ఏపీఈఆర్సీ (ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగులేటరీ కమిషన్)లో విచారణ జరిగింది. శుక్రవారం కర్నూలులోని ఏపీఈఆర్సీ కార్యాలయంలో మొదటిసారి ఇంధన సర్దుబాటు చార్జీలపై చైర్మన్ నాగార్జునరెడ్డి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ అభ్యంతరాలు/సలహాలు స్వీకరించారు. ఇటీవల డిస్కమ్‌లు రూ.8,114 కోట్ల ఇంధన సర్దుబాటు చేయాలని ఏపీఈఆర్సీకి నివేదించాయి. ఈ క్రమంలో వచి్చన అభ్యంతరాలు, సలహాలపై విచారణ జరిగింది. దాదాపు 14 సంస్థలు / మంది అభ్యంతరాలు, సలహాలు ఇచ్చారు. త్వరలోనే ఇంధన సర్దుబాటు చార్జీలపై ఈఆర్సీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. -
అమెరికాలోనూ ఉచిత తాయిలాలు..!
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఉచితాలు అమెరికా వరకూ వెళ్లాయి’అంటూ ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే విద్యుత్తు చార్జీలను సగానికి తగ్గిస్తానంటూ అక్కడి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీని శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో ప్రస్తావించారు. ట్రంప్ ట్వీట్‌ను ఆయన రీ ట్వీట్ చేస్తూ.. ‘విద్యుత్తు బిల్లులు సగానికి తగ్గిస్తానంటూ ట్రంప్ ప్రకటించారు. ఉచిత తాయిలాలు అమెరికా వరకూ వెళ్లాయి’అంటూ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. విద్యుత్, వైద్యం, విద్య ఉచితమంటూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ పక్షాలు కేజ్రీవాల్‌పై మండిపడుతుండటం తెలిసిందే. కాగా, అధ్యక్షుడిగా ఎన్నికైతే 12 నెలల్లో కరెంట్ బిల్లులతో పాటు ఇంధన బిల్లులను 50 శాతానికి తగ్గిస్తానని, దీనివల్ల అమెరికాలో వ్యాపారావకాశాలు పెరుగుతాయని ట్రంప్ ట్వీట్ చేశారు. విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు పర్యావరణ అనుమతులను వేగవంతం చేస్తానని కూడా ట్రంప్ ప్రకటించారు. -
ఏపీ ప్రజలకు విద్యుత్ షాక్.. సర్దుబాటు చార్జీల పేరుతో దోపిడీ
-
హైటెన్షన్ కరెంట్ పిరం!
సాక్షి, హైదరాబాద్: త్వరలో రాష్ట్రంలో హైటెన్షన్ (హెచ్‌టీ) కేటగిరీ విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. హెచ్‌టీ కేటగిరీలో 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ/ఆపై సామర్థ్యం .అనే మూడు ఉప కేటగిరీల విద్యుత్ కనెక్షన్లుండగా, మూడింటికి వేర్వేరు చార్జీలు విధిస్తున్నారు. ఇకపై 33 కేవీ, 132కేవీ/ఆపై సామర్థ్యం కనెక్షన్ల చార్జీలను 11 కేవీ కనెక్షన్ల చార్జీలకు సమానంగా పెంచేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతిపాదించగా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్టు సమాచారం.కొన్ని హెచ్‌టీ కేటగిరీల్లోని 33 కేవీ కనెక్షన్లకు యూనిట్ విద్యుత్‌పై అర్ధరూపాయి వరకు, 132 కేవీ/ఆపై సామర్థ్యం కలిగిన కనెక్షన్లకు రూపాయి వరకు విద్యుత్ చార్జీలు పెరగనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్/టీజీఎనీ్పడీసీఎల్) సంస్థలు వారంలోగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)ను.. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)కి సమర్పించే అవకాశముంది. నవంబర్లోనే సమర్పించాల్సి ఉండగా... విద్యుత్ టారిఫ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి ఏటా నవంబర్ 30లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ టారిఫ్, ఏఆర్ఆర్ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను డిస్కంలు సిద్ధం చేయగా, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అప్పట్లో గడువు పొడిగింపు పొందాయి. ఉత్తర/దక్షిణ డిస్కంలు గత ఆర్థిక సంవత్సరం 2023–24లో రూ.6299.29 కోట్ల కొత్త నష్టాలను మూటగట్టుకోగా, వాటి మొత్తం నష్టాలు రూ.57,448 కోట్లకు ఎగబాకాయి. ఒక్క టీజీఎస్పీడీసీఎల్ నష్టాలే రూ.39,692 కోట్లకు చేరగా, మరో రూ.17,756 కోట్ల నష్టాల్లో టీజీఎన్పిడీసీఎల్ సంస్థ ఉంది. దీంతో చార్జీల పెంపు అనివార్యంగా మారిందని అధికారులు అంటున్నారు. గృహాలు, వాణిజ్య కేటగిరీలకు పెంపు లేదు లోటెన్షన్ కేటగిరీ పరిధిలోకి వచ్చే గృహాలు, గృహేతర/వాణిజ్య, పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా పథకాలు, సాధారణ వినియోగదారుల విద్యుత్ చార్జీలు పెరగవు. హెచ్‌టీలో చార్జీల మోత.. హెచ్‌టీ కేటగిరీలోని సాధారణ పరిశ్రమలు, లైట్స్ అండ్ ఫ్యాన్స్, కోళ్ల ఫారాలు, సీజనల్ పరిశ్రమలు, ఫెర్రో అల్లయ్ యూనిట్లు, ఇతరులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, తాత్కాలిక సరఫరా వంటి వినియోగదారులు వస్తారు. ఈ కేటగిరీల వినియోగదారులు తమ అవసరాల మేరకు 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ/ఆపై సామర్థ్యంతో విద్యుత్ కనెక్షన్లను కలిగి ఉన్నారు. 11 కేవీ కనెక్షన్‌తో సమానంగా సంబంధిత 33 కేవీ, 132 కేవీ/ఆపై కనెక్షన్ల చార్జీలను పెంచే అవకాశముంది.11 కేవీ కనెక్షన్ల చార్జీలు ఇప్పటికే అధికంగా ఉండడంతో యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు. హెచ్‌టీ కేటగిరీలోని పారిశ్రామికవాడలు, ఆధ్యాతి్మక స్థలాలు, సాగునీటి పథకాలు, తాగునీటి పథకాలు, రైల్వే ట్రాక్షన్, మెట్రో రైలు, టౌన్ షిప్పులు/రెసిడెన్షియల్ కాలనీలు, చార్జింగ్ స్టేషన్లకు సంబంధించిన 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ/ఆపై సామర్థ్యమున్న కనెక్షన్లకు ఒకే తరహా చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో వీటికి చార్జీల పెంపు వర్తించకపోవచ్చు. -
బిల్లుపై బాదుడు
సాక్షి, అమరావతి: ప్రతి నెలా మనం వాడుకున్న విద్యుత్‌కు తగ్గట్టు బిల్లు రావడం సహజం. కానీ ఇప్పుడు బిల్లు పైనే చార్జీలు పడటం వినియోగదారులను షాక్‌కు గురి చేస్తోంది. బిల్లుపై మళ్లీ బిల్లు ఏమిటని ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ విద్యుత్తు వినియోగదారులపై ప్రతి నెలా దాదాపు రూ.30 కోట్ల వరకూ ఆర్ధిక భారం పడింది! అది కూడా విద్యుత్ చార్జీ లపై వేసే చార్జీ కావడం విశేషం. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబో మని ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.ఇదీ సంగతి...!ఇప్పుడు నెలవారీ విద్యుత్ బిల్లు చెల్లించేందుకు వివిధ రకాల యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. చివరి రోజైనా సరే ఇంటి నుంచే క్షణాల్లో కట్టవచ్చు. ప్రతి నెలా బిల్లు చెల్లించాల్సిన తేదీతో సహా మెసేజ్ రూపంలో యాప్‌లు గుర్తు చేస్తుంటాయి. పని ఒత్తిడిలో మర్చిపోకుండా ఆటో పే ఆప్షన్ కూడా ఉంది. అయితే ఇకపై థర్డ్ పార్టీ యాప్‌లతో విద్యుత్ బిల్లులు చెల్లించడం సాధ్యం కాదు. డిస్కమ్‌ల వెబ్సైట్, వాటి మొబైల్ యాప్‌లోనే విద్యుత్తు బిల్లుల చెల్లింపులు చేయాలి. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జూలై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) వెల్లడించాయి.చెల్లింపులపై చార్జీలు ఎలా అంటే..నూతన విధానాల ప్రకారం వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సంబంధిత డిస్కమ్‌ల యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని విద్యుత్తు బిల్లులు చెల్లించవచ్చు. ఏపీసీపీడీసీఎల్ వినియోగదారులు www.apcpdcl.in ద్వారా, ఈపీడీసీఎల్ వినియోగదారులు www. apeasternpower. com ద్వారా, ఎస్పీడీసీఎల్ వినియోగదారులు www.apspdcl.in వెబ్సైట్ ద్వారా కూడా బిల్లులు కట్టవచ్చు. అయితే ఇక్కడే ఓ మెలిక ఉంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా కరెంట్ బిల్లు చెల్లిస్తే ప్రతి లావాదేవీకి రూ.2.50 చొప్పున చార్జీ పడుతుంది. భారత్ క్యూఆర్ ద్వారా కడితే బిల్లు మొత్తంపై 0.85 పైసలు చార్జీ పడుతుంది. డెబిట్ కార్డులు ద్వారా కడితే బిల్లు మొత్తం అమౌంట్లో 0.90 శాతం అదనంగా చెల్లించాలి. క్రెడిట్ కార్డులు, ఇతర పేమెంట్ పద్ధతుల ద్వారా బిల్లు చెల్లించాలంటే 1 శాతం అదనంగా పడుతుంది. ఉదాహరణకు రూ.5 వేలు విద్యుత్తు బిల్లు కట్టాలంటే రూ.50 అదనంగా సమర్పించుకోవాలి. ఇలా రాష్ట్రంలోని దాదాపు 1.92 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ప్రతి నెలా చెల్లించే దాదాపు రూ.3 వేల కోట్ల విద్యుత్ బిల్లులపై 1 శాతం అదనంగా వేసుకుంటే రూ.30 కోట్లు భారం పడుతుంది. కాగా ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్‌ల ద్వారా ఇన్నాళ్లూ ఫ్లాట్ ఫామ్ చార్జీ కింద బిల్లుకు కేవలం రూ.1 మాత్రమే వసూలు చేయడం గమనార్హం.నిర్లక్ష్యంగా డిస్కమ్‌లు...తాజాగా విద్యుత్తు బిల్లుల చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారానే జరగాలని ఆర్బీఐ నిర్దేశించింది. అయితే ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు ఈ బిల్ పేమెంట్ సిస్టమ్‌ను ఎనేబుల్ చేసుకోలేదు. దీంతో డిస్కమ్‌లు తమ వెబ్సైట్, యాప్‌లో చెల్లించమని సూచించడం మినహా అదనపు భారం నుంచి ఊరట కల్పించే నిర్ణయాలు తీసుకోలేదు. కనీసం ప్రజల్లో అవగాహన కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బిల్లుల చెల్లింపులపై గందరగోళం నెలకొంది. బిల్లు కట్టడం ఆలస్యమైతే విద్యుత్ సర్వీసులను నిలిపివేయడం, లేట్ పేమెంట్ చార్జీలు విధించటం లాంటి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో విస్తృతంగా ప్రచారం చేపట్టాల్సిన విద్యుత్తు సంస్థలు ఉదాశీనంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టీడీపీ అంటే షాకులే..76 యూనిట్లు విద్యుత్ వినియోగానికి 2015–16లో టీడీపీ హయాంలో రూ.140.10 బిల్లు రాగా 2018–19లో రూ.197.60 వచ్చింది. అంటే బిల్లు 41.04 శాతం పెరిగింది. నాడు 78 యూనిట్లకు 39.57 శాతం, 80 యూనిట్లకు 38.21 శాతం పెంచేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగంపై చార్జీలు ఏపీలోనే తక్కువగా ఉండేవి. ఇతర చోట్ల యూనిట్ రూ.8.26 వరకూ ఉంటే ఏపీలో రూ.3.11 చార్జీ పడేది. 75 యూనిట్ల వరకు వినియోగానికి టారిఫ్ సగటు సరఫరా వ్యయంలో 50 శాతం కంటే తక్కువే విధించారు. వ్యవసాయానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) ద్వారా 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను సగటు కొనుగోలు ధర యూనిట్ రూ.5.10 చొప్పున ఉన్నప్పటికీ గత ప్రభుత్వం రూ.2.49కే సేకరించేలా చర్యలు తీసుకుంది. దీంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా కానుంది. 2021లో విద్యుత్ కొనుగోళ్లలో రూ.4,925 కోట్లు ఆదా కాగా ఇందులో రూ.3,373 కోట్లను వినియోగదారులకే తిరిగి ఇచ్చేశారు. -
ధగ ధగ.. దగా!
సీహెచ్. వెంకటేశ్: రాత్రి వేళ వీధి దీపాల వెలుగులో మెరిసి పోవాల్సిన హైదరాబాద్ మహానగరంలో చాలాచోట్ల చీకటే రాజ్యమేలుతోంది. ఎక్కువ కాంతిని వెదజల్లడమే కాకుండా, విద్యుత్ చార్జీలు కూడా తగ్గుతాయనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధిదీపాలు అనేక ప్రాంతాల్లో వెలగడం లేదు. రాత్రిళ్లు అన్ని లైట్లూ వెలుగుతాయని ఈఈఎస్ఎల్ (ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్), జీహెచ్ఎంసీ చెబుతున్నా ఆ మేరకు వెలగడం లేదని జీహెచ్ఎంసీ స్ట్రీట్‌లైట్ డాష్బోర్డే స్పష్టం చేస్తోంది. అన్ని స్ట్రీట్ లైట్లూ సీసీఎంఎస్ (సెంట్రలైజ్డ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) బాక్స్‌లకు అనుసంధానమైనందున సర్వర్ నుంచి అందే అలర్ట్స్తో సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయని, చీకటి పడ్డప్పుడు మాత్రమే లైట్లు వెలుగుతూ, తెల్లారగానే ఆరిపోయేలా ఆటోమేటిక్ వ్యవస్థ పనిచేస్తుందన్నది కూడా మాటలకే పరిమితమైంది.ఎల్ఈడీల ఏర్పాటుకు ముందు ఏటా దాదాపు రూ.150 కోట్ల విద్యుత్ చార్జీలు ఉండగా, వీటిని ఏర్పాటు చేశాక ఆ వ్యయం రూ.100 కోట్ల లోపే ఉంటోందని జీహెచ్ఎంసీ పేర్కొంటోంది. పొదుపు సంగతేమో కానీ.. కోటిమందికి పైగా ప్రజలు నివసిస్తున్న భాగ్యనగరంలోని రోడ్లపై అంధకారం నెల కొంటుండటంతో ప్రమాదాలు జరుగుతున్నా యని, దొంగలు, సంఘ వ్యతిరేక శక్తులకు కూడా ఈ పరిస్థితి అనుకూలంగా మారుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో?⇒ గత 4 రోజులుగా మా ఏరియాలో స్ట్రీట్‌లైట్లు వెలగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వర్షం కురిసినప్పుడు డ్రైనేజీ మ్యాన్‌హోళ్లతో ఎప్పు డు, ఎక్కడ, ఏ ప్రమా దం జరుగుతుందోనని భయపడాల్సి వస్తోంది. అధికారులకు పలు పర్యాయాలు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. – కె.రాజశేఖరరెడ్డి, ఓల్డ్ మలక్పేటరాత్రివేళ రక్షణ కావాలి⇒ అడ్డగుట్ట వీధుల్లో దీపాలు వెలగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో లైట్ల చుట్టూ పెరిగిన చెట్ల కొమ్మల కారణంగా వెలు తురు రోడ్లపై పడటం లేదు. చెట్ల కొమ్మలు తొలగించాలని, వెలగని విద్యుత్ దీపాల కు మరమ్మతులు చేయాలని అధికారు లను కోరుతున్నా స్పందించడంలేదు. కొన్ని బస్తీ ల్లో పగటి వేళ కూడా లైట్లు వెలుగు తున్నాయి. ఇప్పటికైనా చెట్ల కొమ్మల్ని తొలగించి, మరమ్మ తులు చేసి రాత్రి వేళల్లో మాకు రక్షణ కల్పించాలి. – సంతోషమ్మ , అడ్డగుట్టగురువారం ఇదీ పరిస్థితి⇒ గురువారం (27వ తేదీ) అర్ధరాత్రి 1.20 గంటలు. ఆ సమయంలో జీహెచ్ఎంసీ స్ట్రీట్‌లైట్ డాష్‌బోర్డు మేరకే నగరంలో 43.79 శాతం వీధిదీపాలు మాత్రమే వెలుగుతున్నాయి. అయితే అది కూడా తప్పే. సీసీఎంఎస్ బాక్సులకు కనెక్టయిన లైట్లలో 43.79 శాతం వెలుగుతున్నాయన్న మాట. వాస్తవానికి ఈ వివరాలు నమోదయ్యే డాష్ బోర్డు లింక్‌ను ఎవరికీ తెలియనివ్వరు. మొత్తం లైట్లలో 98 శాతం లైట్లు వెలిగితేనే వీటిని నిర్వహిస్తున్న ఈఈఎస్ఎల్కు చార్జీలు చెల్లించాలి. కానీ ఎవరికే లింకులున్నాయో కానీ చెల్లింపులు మాత్రం నిరాటంకంగా జరిగిపోతున్నాయి.ఇదీ లెక్క..మొత్తం స్ట్రీట్ లైట్స్ 5,10,413కనెక్టెడ్ 3,05,018లైట్స్ ఆఫ్ 1,71,455లైట్స్ ఆన్ 1,33,563గ్లో రేట్ 43.79 %ఎక్కువ ఫిర్యాదులు దీనిపైనే..నగరంలో భారీ వర్షం కురిసి రోడ్లు జలమయమైనప్పుడు.. రాత్రివేళ స్ట్రీట్‌లైట్లు వెల గక, కనిపించని గుంతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ విధులు నిర్వహించేవారు ముఖ్యంగా మహిళలు పని ప్రదేశాల నుంచి ఇళ్లకు వెళ్లాలంటే భయప డాల్సిన పరిస్థితులు నెలకొంటుండగా, వృద్ధులు, పిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నారు. జీహెచ్ఎంసీకి ఎక్కువ ఫిర్యాదులందే అంశాల్లో వీధిదీపాలు వెలగకపోవడం ఒకటి. ఈఈఎస్ఎల్ పనితీరుపై పలు సందర్భాల్లో మేయర్, కమిషనర్ హెచ్చ రించినా ఎలాంటి ఫలితం లేదు.ప్రధాన రహదారుల్లోనూ..కాలనీలు, మారుమూల ప్రాంతాలే కాదు ప్రధాన రహదారుల్లోనూ లైట్లు వెలగడం లేదు. సికింద్రాబాద్ జోన్‌లోని బైబిల్ హౌస్, ముషీరాబాద్, బోయిగూడ, నామాల గుండు, ఆనంద్‌బాగ్, మోండా మార్కెట్, మల్కాజిగిరి రామాలయం, ఎల్బీనగర్ జోన్‌లోని నాగోల్ ఎన్క్లేవ్, లక్ష్మీ రాఘవేంద్ర కేజిల్, చింతల్‌కుంట, స్నేహపురి కాలనీ, ఎస్బీహెచ్ కాలనీ, చార్మినార్ జోన్‌లోని మైలార్ దేవ్‌పల్లి, అత్తాపూర్, ఖైరతాబాద్ జోన్‌లోని బేగంబజార్, అఫ్జల్‌గంజ్, కూకట్పల్లి జోన్‌లోని కూకట్పల్లి, బోయిన్పల్లి సహా వందలాది ప్రాంతాల్లో లైట్లు వెలగక అంధకారం రాజ్యమేలుతోంది.వీఐపీలకే వెలుగులా!? ⇒ డాష్‌బోర్డులో జీహెచ్ఎంసీలోని అన్ని జోన్లు, సర్కిళ్ల వారీగా డేటా నమోదు కావాల్సి ఉండగా చార్మినార్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ జోన్లకు సంబంధించిన డేటా అందుబాటులో లేదు. సంపన్నులు, రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, తదితర వీఐపీలు ఎక్కువగా ఉండే ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లకు సంబంధించిన వెలుగుల వివరాలే డాష్ బోర్డులో ఉన్నాయి. ఖైరతా బాద్, శేరిలింగంపల్లి జోన్లలో మాత్రమే 98 శాతా నికి పైగా (కనీసం 98% లైట్లు వెలగాలనే నిబంధనకు అను గుణంగా) వెలుగులుండటం గమనార్హం. కాగా మిగతా జోన్లలో చాలా తక్కువ శాతం మాత్రమే వెలుగు తున్నాయి.పనులు చేయని థర్డ్‌పార్టీ..⇒ ఈఈఎస్ఎల్ తాను నిర్వహించాల్సిన పనుల్ని సబ్ కాంట్రాక్టుకు అప్పగించింది. వారికి చెల్లింపులు చేయకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. బల్బు పోయిందని ఫిర్యాదులొస్తే బల్బు తీస్తున్నారు కానీ కొత్తది వేయడం లేదు. అలాగే ఇతరత్రా పనులూ చేయడం లేదు. అధిక చెల్లింపులు?⇒ విద్యుత్ ఖర్చుల పొదుపు పేరిట జీహెచ్ఎంసీ నగరమంతా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు, ఏడేళ్ల నిర్వహణకు ఈఈఎస్ఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం వ్యయం రూ.563.58 కోట్లు. ఎల్ఈడీలతో వెలుగులు బాగుంటాయని, సాధారణ స్ట్రీట్‌లైట్స్ వ్యయంతో పోలిస్తే ఏడేళ్లలో జీహెచ్ఎంసీకి రూ.672 కోట్లు మిగులుతాయని జీహెచ్ఎంసీ ప్రాజెక్టు ఒప్పంద సమయంలో పేర్కొంది. అలా పొదుపయ్యే నిధులనే ఈఈఎస్ఎల్కు చెల్లిస్తామని తెలిపింది. ఇలా ఇప్పటివరకు రూ.400 కోట్లు చెల్లించినట్లు సమా చారం. కాగా వీధిదీపాలు వెలగాల్సిన మేర వెలగ కున్నా చెల్లింపులు జరిగాయనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఒప్పందం మేరకు 5,40,494 వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 5,10,413 మాత్రమే ఉండటం గమనార్హం. అయితే ఒప్పందం మేరకు వెలగాల్సిన లైట్లు వెలగనప్పుడు ఈఈఎస్ఎల్కు చెల్లింపులు చేయడం లేదని, కొన్ని సందర్భాల్లో పెనాల్టీలు కూడా విధించామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. -
విద్యుత్ సరఫరాలో అంతరాయం.. పరిష్కారం దిశగా ప్రభుత్వం
సంప్రదాయేతర విధానాలతో కరెంటు ఉత్పత్తి చేసేలా కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేసవిసమయంలో కరెంట్ వినియోగం పెరుగుతోంది. డిమాండ్‌కు సరిపడా సప్లై లేకపోవడంతో గ్రిడ్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫలితంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం చూస్తున్నారు. ఇదే అదనుగా ప్రభుత్వం ఛార్జీల చెల్లింపులో గతంలోనే ఓ విధానాన్ని ప్రవేశపెట్టింది. రోజులో వినియోగ సమయాన్ని బట్టి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ విధానాన్ని భారీ పరిశ్రమలకు అమలు చేస్తోంది. 2025 ఏప్రిల్ నుంచి గృహవినియోగదారులకు దీన్ని అమలు చేయాలని చూస్తుంది. దీనివల్ల వీరికి పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు.భారత్‌లో అత్యధిక భాగం థర్మల్ విద్యుత్కేంద్రాల నుంచి కరెంట్ తయారవుతోంది. థర్మల్ కేంద్రాల్లో బొగ్గును మండిచడంతో వాయుకాలుష్యం పెరుగుతోంది. దాంతో సంప్రదాయేతర విధానాల్లో కరెంట్‌ను తయారీని పెంచుతూ క్రమంగా థర్మల్ కేంద్రాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే జల, అణు, గ్యాస్, సౌర, పవన తదితర వనరుల నుంచీ కరెంటు అందుతోంది. కానీ అందులో థర్మల్ విద్యుత్ కేంద్రాలను భర్తీ చేసేంత కరెంట్ ఉత్పత్తి కావడం లేదు. అందుకు తగ్గట్టు ఆయా కేంద్రాల సామర్థ్యాన్ని పెంచాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. కాలాలకు అనుగుణంగా, గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ తదితర అవసరాలను బట్టి విద్యుత్తు వినియోగం నిత్యం మారుతుంటోంది. కానీ ఉత్పత్తి ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉన్నపుడు కరెంట్‌ను పెద్దమొత్తంలో స్టోర్చేసే మార్గాలులేవు. దాంతో విద్యుత్ ఉత్పత్తి, వినియోగం ఏకకాలంలో జరగాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో వ్యత్యాసం వచ్చినపుడు మొత్తం సరఫరా వ్యవస్థ (గ్రిడ్) విఫలమయ్యే ప్రమాదం ఉంది.అధిక ఖర్చులు..సంప్రదాయేతర కరెంట్ తయారీలో సౌరవిద్యుత్ ప్రధానమైంది. ఇది పగటిపూట ఎక్కువగా అందుతుంది. పవన విద్యుత్తు వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుంది. అవి గ్రిడ్‌కు అనుసంధానం అయినప్పటికీ వాటిద్వారా వెంటనే విద్యుత్ తయారీ సాధ్యం అవ్వకపోవచ్చు. దాంతో కాలుష్యం ఏర్పడుతోందని తెలుస్తున్నా థర్మల్ విద్యుత్వైపే మొగ్గు చూపుతున్నారు. ఇందులోనూ విద్యుత్ తయారీ పెంచడానికి కొంత సమయం పడుతుంది. జల విద్యుత్తు ఉత్పత్తిని పెంచుతూ కరెంట్‌ను బ్యాటరీల్లో నిల్వ ఉంచితే అప్పటికప్పుడు వాడుకునే అవకాశం ఉంటుంది. కానీ వాటిపై పూర్తిగా ఆధారపడలేం. పైగా బ్యాటరీల వినియోగం చాలా ఖర్చుతో కూడుకొంది. ఈ క్రమంలో గ్రిడ్ వైఫల్యం చెందకుండా చూసుకోవడం సవాలుగా మారుతోంది.జల విద్యుత్తు కేంద్రాల్లో నీటిని వెనక్కి తోడి మళ్ళీ కరెంటు ఉత్పత్తికి ఉపయోగిస్తారు. దాంతో రెండుసార్లు యంత్రాలు పనిచేయడం వల్ల విద్యుత్ ఎక్కువ వృథా అవుతోంది. పగటిపూట లభ్యమయ్యే సౌర తదితర మిగులు విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాత్రిళ్లు కరెంట్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి ఆ మేరకు సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో సంప్రదాయేతర విద్యుదుత్పత్తి కేంద్రాల పెంపు, గ్రిడ్ స్థిరత్వం లక్ష్యంగా కేంద్రం విద్యుత్తు వినియోగదారుల హక్కుల నియమావళి-2020ని గతంలో సవరించింది. ఇందులో వ్యవసాయానికి మినహాయింపు ఇచ్చింది. రోజులో విద్యుత్తును వాడే సమయాన్ని బట్టి ఛార్జీలు విధించాలని నిర్ణయించింది.ఈ సవరణల్లో భాగంగా పగలు సౌర విద్యుత్తు అందుబాటులో ఉండే ఎనిమిది గంటల పాటు విద్యుత్తు ఛార్జీల్లో ఇరవై శాతం రాయితీ అందిస్తారు. సాధారణంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆరు నుంచి పది గంటల దాకా విద్యుత్తు వినియోగం గరిష్ఠంగా ఉంటుంది. ఈ సమయంలో గృహాలకు 10శాతం, ఇతర వర్గాలకు 20శాతం అధిక ధర వసూలు చేయాలని కేంద్రం సూచించింది. ఈ విధానాన్ని 2025 ఏప్రిల్ నుంచి గృహ వినియోగదారులకూ వర్తింపజేయనుంది. ఈ విధానం అత్యధికంగా విద్యుత్తు వినియోగించే భారీ పరిశ్రమలు, పెద్ద వ్యాపార సముదాయాలకు ఎప్పటి నుంచో అమలులో ఉంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న మీటర్లను మార్చి గంటల వారీగా విద్యుత్తును నమోదు చేసే డిజిటల్ మీటర్లను బిగించాల్సి ఉంటుంది. -
వాణిజ్య వడ్డన..! ఆదాయం పెంచుకునే మార్గాలపై విద్యుత్ సంస్థల దృష్టి
సాక్షి, హైదరాబాద్: నష్టాలు, అప్పుల భారంతో సంక్షోభంలో ఉన్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆదాయం పెంచుకునే మార్గాలపై ఫోకస్ చేశాయి. గృహ వినియోగం మినహా.. వాణిజ్య, పారిశ్రామిక, ఇతర కేటగిరీల విద్యుత్ చార్జీలను పెంచాలని ప్రాథమికంగా ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి త్వరలో ప్రతిపాదనలను సమర్పించనున్నాయి. జూన్ 6వ తేదీతో రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియనుంది. ఆ తర్వాత 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. నిజానికి గత నెల (ఏప్రిల్) ఒకటో తేదీ నుంచే రాష్ట్రంలో కొత్త విద్యుత్ టారిఫ్ అమల్లోకి రావాలి. ఎన్నికలు, ఇతర కారణాలతో డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించక పోవడంతో ఉన్న చార్జీలనే కొంతకాలం కొనసాగించేందుకు ఈఆర్సీ అనుమతినిచ్చింది. జనవరి 31 వరకే గడువు ఇచ్చిన ఈఆర్సీ.. విద్యుత్ టారిఫ్ నిబంధనల ప్రకారం.. డిస్కంలు ఏటా నవంబర్ 30వ తేదీలోగా తర్వాతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్, కొత్త టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాలి. తర్వాతి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని వినియోగదారులకు ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది? దానికి ఎంత ఆదాయం అవసరం? ప్రస్తుత విద్యుత్ చార్జీలతో వచ్చే ఆదాయం ఎంత? వ్యత్య్సాం (ఆదాయ లోటు) ఎంత? రాష్ట్ర ప్రభుత్వమిచ్చే విద్యుత్ సబ్సిడీలు పోగా మిగిలే లోటును భర్తీ చేసేందుకు.. ఎంత మేర విద్యుత్ చార్జీలు పెంచాలి? వంటి అంశాలు ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనల్లో ఉంటాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2024–25 ఆర్థిక సంవత్సర ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలను సిద్ధం చేసినా.. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో వాయిదా వేశారు. అప్పట్లో డిస్కంల విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది జనవరి 31 వరకు ఈఆర్సీ గడువు పొడిగించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడు నెలలు గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేసినా.. ఈఆర్సీ తిరస్కరించింది. వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించింది. ప్రస్తుతం ప్రతినెలా రూ1,386 కోట్లలోటు.. డిస్కంల ఆర్థిక నష్టాలు రూ.50,275 కోట్లకు, అప్పులు రూ.59,132 కోట్లకు పెరిగిపోయినట్టు గతంలో విద్యుత్‌పై విడుదల చేసిన శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. డిస్కంలు సగటున ప్రతి నెలా రూ.1,386 కోట్ల లోటు ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది. కోడ్ ముగిస్తే వారికీ ఉచిత విద్యుత్.. కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద రాష్ట్రంలో గృహ వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరాను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించలేదు. ఆ జిల్లాలోని 8 లక్షల గృహ కనెక్షన్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పొందిన విద్యుత్ కనెక్షన్లకు ఎన్నికల కోడ్ ముగిశాక ఈ పథకాన్ని వర్తింపజేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గృహజ్యోతి పథకంతో నెలకు రూ.120 కోట్ల భారం పడుతోందని.. అది రూ.150 కోట్లకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గృహజ్యోతి అమలుకు అనుమతిస్తూ ఈఆర్సీ జారీ చేసిన ఆదేశాల మేరకు... రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ముందస్తుగానే డిస్కంలకు ఈ సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తోంది. ఓ వైపు 200 యూనిట్లలోపు వినియోగించే వారికి ఉచితంగా విద్యుత్ అందిస్తూ.. అంతకు మించి విద్యుత్ వినియోగించే వారి బిల్లులను పెంచడం సమంజసం కాదనే భావన అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే గృహేతర కేటగిరీల విద్యుత్ చార్జీలను మాత్రమే పెంచేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది. పెంచకపోతే సర్కారే భరించాలి! లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియనుండటంతో ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించేందుకు డిస్కంలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాక గృహేతర కేటగిరీల విద్యుత్ చార్జీలను ఏ మేర పెంచాలనే నిర్ణయం తీసుకోనున్నాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ అభ్యంతరాలను స్వీకరించడంతోపాటు హైదరాబాద్, వరంగల్‌లలో బహిరంగ విచారణ నిర్వహిస్తుంది. తర్వాత కొత్త టారిఫ్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. వినియోగదారుల కేటగిరీల వారీగా పెరిగిన/తగ్గిన విద్యుత్ చార్జీల వివరాలు అందులో ఉంటాయి. ఒకవేళ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే.. డిస్కంల ఆదాయ లోటును ప్రభుత్వమే విద్యుత్ సబ్సిడీల రూపంలో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఎలాంటి చార్జీల పెంపు లేకుండానే కొత్త టారిఫ్ ఆర్డర్‌ను ఈఆర్సీ ప్రకటిస్తుంది. -
బాబు దండగ అంటే.. జగన్ పండగ చేశారు..
ఇక వ్యవసాయం దండగ.. దాని పని అయిపోయింది.. రైతులు వేరే పనులు చూసుకోండి.. వ్యవసాయానికి ఉచిత కరెంట్ అట! సాధ్యమయ్యే పనేనా? కరంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికి పనికొస్తాయి’. ఈ మాటలు అన్నది ఎవరని తెలుగు ప్రజలు ఎవరిని అడిగినా ‘చంద్రబాబునాయుడు’ అని టక్కున సమాధానమిస్తారు. రైతులంటే ఆయనకు చులకన. వ్యవసాయం అంటే దరిద్రం అని భావన. విద్యుత్ చార్జీలు తగ్గించమని అడిగినందుకు రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర ఆయనది. ‘ఈ దేశంలో, రాష్ట్రంలో అత్యధిక శాతం మంది ప్రజలు ఆధారపడిన వృత్తి వ్యవసాయం. ఆరుగాలం శ్రమిస్తూ మనందరికీ అన్నం పెడుతున్న అన్నదాతలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రైతుల కష్టాలు కళ్లారా చూశాను కాబట్టే వారి కోసం ఎందాకైనా.. అంటూ ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపట్టాం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. రైతులకు ప్రభుత్వాల పరంగా ఎంత చేసినా తక్కువే’ అని సీఎం వైఎస్ జగన్ తరచూ చెబుతుంటారు. వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు మధ్య ఎంత తేడా ఉందో పై రెండు ఉదాహరణలే నిదర్శనం. ఇలాంటి చంద్రబాబుకు ఈనాడు రామోజీ నిత్యం బాకా ఊదుతున్నారు. వ్యవసాయ రంగ పితామహుడు చంద్రబాబే అన్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. దింపుడు కల్లం ఆశలతో ఉన్న టీడీపీని ఎలాగైనా సరే బతికించాలని బరితెగింపు రాతలు రాస్తున్నారు. నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లె వేస్తున్నారు. ప్రపంచ స్థాయి ఆవిష్కరణ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ఆలోచన వినూత్నం.ప్రపంచ స్థాయి ఆవిష్కరణ. వ్యవసాయాధారిత దేశాలన్నీ అనుసరించదగ్గ గొప్ప విధానం. వీటికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తాం. వీటి గురించి ఇప్పటికే ఐక్యరాజ్యసమితికి కూడా నివేదించాం.– తోమియో షిచిరీ, కంట్రీ మాజీ డైరెక్టర్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (యూఎన్వో) జాతీయ స్థాయిలో అధ్యయనం జరగాలి ఆర్బీకేల ద్వారా సంక్షేమ పథకాల అమలుతో పాటు సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్తున్న తీరు బాగుంది. వాటిని జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు చర్చ, అధ్యయనం జరగాలి. ఆర్బీకేలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే బాగుంటుంది. ఈ విషయమై కేంద్రానికి నివేదిక ఇస్తున్నాం. -అమితాబ్‌కాంత్,సీఈవో, నీతి ఆయోగ్ రామోజీ.. కళ్లకు పచ్చగంతలు తీసి చూడు...మొత్తంగా వ్యవ‘సాయం’ రూ. 1,86,548 కోట్లుచంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి రైతులు నిండా మునిగారు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికింది. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తూ వ్యవసాయాన్ని పండగ చేసింది. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రాయితీ, ధరల స్థిరీకరణ నిధి వంటి సంక్షేమ పథకాల ద్వారా స్థిరమైన వాతావరణాన్ని కలి్పంచింది. ఫలితంగా వ్యవసాయ రంగంలో గణనీయమైన పురోగతి సాధ్యమైంది. రైతుల ఆదాయం, జీవన ప్రమాణ స్థాయి పెరిగింది. – పంపాన వరప్రసాదరావు ధాన్యపు సిరులు..పంట ఉత్పత్తులుఆహార ధాన్యాల ఉత్పత్తిలో రికార్డులు బ్రేకయ్యాయి. బాబు హయాంలో గరిష్టంగా 2017–18లో 167.22 లక్షల టన్నుల దిగుబడులు నమోదు కాగా, గడచిన ఐదేళ్లలో 2019–20 సీజన్లో గరిష్టంగా 175.12 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. వ్యవసాయ శాఖ చరిత్రలోనే ఇదే గరిష్ట దిగుబడులు.. 2014–19 మధ్యలో సగటున 153.95 లక్షల టన్నులుగా నమోదైతే, 2019–23 మధ్య 162.04 లక్షల టన్నులుగా నమోదైంది. అంటే బాబు హయాంతో పోల్చుకుంటే 8 లక్షల టన్నులకు పైగా పెరిగింది . మరో పక్క కనీస మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తుల కొనుగోలు ద్వారా రైతులకు అండగా నిలిచేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు.ఇలా ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకొని 6.17 లక్షల మంది రైతుల నుంచి రూ.7746.31 కోట్ల విలువైన 22.59 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 3.74 లక్షల మంది రైతుల నుంచి కేవలం రూ.3322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులను మాత్రమే సేకరించగలిగింది. ధాన్యం కొనుగోలు ద్వారా 37.73 లక్షల మంది రైతులకు రూ.65,258 కోట్లు చెల్లించారు. గ్యాప్ సరి్టíఫికేషన్‌తో రైతులకు ఎమ్మెస్పీకి మించి రికార్డు స్థాయి ధరలు లభించేలా కృషి చేస్తోంది. ఇప్పటికే 3,524 ఎకరాల్లో ఉద్యాన, వ్యవసాయ పంటలకు గ్యాప్ సరి్టఫికేషన్ ద్వారా 1673 మంది రైతులు లబ్ధి పొందారు. ఆర్బీకేలు.. ఆదర్శం ఆర్బీకేలు అన్నదాత పాలిట దేవాలయాలుగా అవతరించాయి. ఇవి ప్రతి రైతును గ్రామస్థాయిలో చేయిపట్టి నడిపిస్తున్నాయి. గ్రామల్లో ఏర్పాటైన 10,778 ఆర్బీకేలను వన్ స్టాప్ సెంటర్స్, నాలెడ్జ్ హబ్‌లుగా తీర్చిదిద్దారు. వీటిలో 16 వేల మందికి పైగా పట్టభద్రులతోపాటు అనుభవజు్ఞలైన ఎంపీఏవోలు, గోపాలమిత్రలు సేవలందిస్తున్నారు. ఇక్కడ స్మార్ట్ టీవీ, డిజిటల్ లైబ్రరీ, సీడ్, సాయిల్ టెస్టింగ్ కిట్స్, కియోస్‌్కలు ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా బుక్ చేసుకున్న 24 గంటల్లోనే సరి్టఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు చేప, రొయ్యల సీడ్, ఫీడ్, పశుగ్రాసం, దాణా పంపిణీ చేస్తున్నారు. మెరుగైన సేవల కోసం ప్రతీ ఆర్బీకేలో ఓ వలంటీర్, బ్యాంకింగ్ సేవల కోసం 9,277 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను అనుసంధానించారు.ఈ క్రాప్ ప్రామాణికంగా ధాన్యంతో సహా పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. రైతు భరోసా, పంటల బీమా, పంట నష్ట పరిహారం, వడ్డీ రాయితీ వంటి సంక్షేమ ఫలాలను అర్హులైన రైతులకు అందిస్తున్నారు. యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుతో పాటు గోదాములు, కోల్డ్ రూమ్స్, కలెక్షన్ సెంటర్స్ వంటి మౌలిక వసతుల కల్పనతో బహుళ ప్రాయోజిత కేంద్రాలు (ఎంపీఎఫ్సీ) లుగా తీర్చిదిద్దారు. ప్రత్యేకంగా ఆర్బీకే చానల్, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ కూడా అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా ఆర్బీకే వ్యవస్థ ప్రపంచ దేశాలకు రోల్‌మోడల్‌గా నిలిచింది.పొరుగు రాష్ట్రాలతో పాటు ఇథియోపియా, వియత్నాం వంటి దేశాలు ఈ తరహా సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు పోటీపడుతున్నాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), నీతి ఆయోగ్, ఐసీఎఆర్, నాబార్డు, ఆర్బీఐ ఇలా జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఆర్బీకేలను సందర్శించి వీటి సేవలను కొనియాడారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ వైఎస్సార్ రైతు భరోసా పథకం రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఎన్నికల్లో ఇచి్చన హామీ కంటే మిన్నగా ఏటా 3 విడతల్లో ఒక్కో విడతకు రూ.13,500 చొప్పున 2019 నుంచి ఇప్పటివరకు 1.65 లక్షల కౌలు రైతులు, 94 వేల అటవీ భూ సాగు రైతులతో సహా 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. ఎన్నికల హామీ ప్రకారం ఈ పథకంలో ప్రతి రైతు కుటుంబానికి 4 విడతల్లో రూ.50 వేలు ఇవ్వాల్సి ఉండగా, 5 విడతల్లో రూ.67,500 సాయం అందించారు. నోటిఫై చేసిన పంటలు సాగు చేసిన రైతులకు యూనివర్శల్ బీమా కవరేజ్ కల్పిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోన్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.గత ప్రభుత్వ హయాంలో కేవలం 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల బీమా పరిహారం అందిస్తే ఈ ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల చొప్పున రెట్టింపు పరిహారం అందింది. 19 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఎలాంటి కోతలు లేకుండా రోజువారీగా 9 గంటల నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఈ ఐదేళ్లలో విద్యుత్ సబ్సిడీ రూపంలో రూ.37,374 కోట్లు, ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు మరో రూ.1700 కోట్లు ఖర్చు చేసింది. సీజన్ ముగిసేలోపే పంట నష్ట పరిహారం ► ఈ ప్రభుత్వంలో ఏ సీజన్లో పంట నష్టానికి ఆ సీజన్లోనే పరిహారం అందజేత. ►ఇందుకోసం రూ.2వేల కోట్ల ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు. ►తిత్లీ తుఫాన్ సమయంలో చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.182.60 కోట్ల పరిహారం అందజేత ►ఈ ఐదేళ్లలో 34.41లక్షల మంది రైతులకు రూ.3261.60 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అందజేత ►39.07లక్షల మంది రైతులకు బాబు ఎగ్గొట్టిన రూ.1180.66 కోట్లు అందజేత ►ఈ ఐదేళ్లలో 84.67 లక్షల మంది రైతులకు రూ.2050.53 కోట్ల సున్నా వడ్డీ రాయితీ అందజేత ►2019 నుంచి ఇప్పటి వరకు 801 మంది భూ యజమానులు, 495 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 474 మందితో కలిపి మొత్తం 1,770 మందికి రూ.114.42 కోట్ల పరిహారం జమ పాడి రైతులకు వెన్నుదన్నుగా.. మూగజీవాల ఆరోగ్య భద్రతకు పెద్ద పీట వేస్తూ రూ.240.69 కోట్లతో నియోజకవర్గానికి 2 చొప్పున 340 వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవారథాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం 1962తో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.ఈ వాహనాలæ ద్వారా 8.81లక్షల మూగజీవాలను ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించగలిగారు. ఆర్బీకేల్లో నియమించిన 6548 పశుసంవర్ధక సహాయకుల ద్వారా పాడి రైతుల ముంగిట నాణ్యమైన పశువైద్య సేవలు అందిస్తున్నారు. జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు లీటర్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా లబ్ధి పొందేలా చేశారు.ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 16.72 కోట్ల లీటర్ల పాలను సేకరించగా, రూ.762.88 కోట్లు చెల్లించారు. 40 నెలల్లో ఏడుసార్లు అమూల్ పాల ధరలను పెంచడంతో, ఆమేరకు ప్రైవేటు డెయిరీలు కూడా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వాటికి పాలు పోసే రైతులు రూ.4911 కోట్ల మేర లబ్ధి పొందగలిగారు. చేయూత, ఆసరా లబ్ధి్దదారులకు జగనన్న పాల వెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల ద్వారా 5.15 లక్షల కుటుంబాలకు రుణాలు సమకూర్చడం ద్వారా 3.81 లక్షల పాడిగేదెలు, ఆవులు, 1.35లక్షల మేకలు, గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. మరో పక్క రూ.385 కోట్ల పెట్టుబడితో మూతపడిన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఆక్వా రైతులకు అడుగడుగునా అండగా.. మత్స్యకారులు, ఆక్వా రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలిచింది. ప్రతీ కౌంట్‌కు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర ప్రతీ రైతుకు దక్కేలా కృషి చేస్తోంది. పెంచిన ఫీడ్ ధరలను మూడుసార్లు ఉపసంహరించుకునేలా చేసింది. ఆక్వా జోన్ పరిధిలోని 10 ఎకరాల్లోపు అర్హత ఉన్న ప్రతీ రైతుకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తోంది. ఫలితంగా ఐదేళ్లలో రొయ్యల ఉత్పత్తితో పాటు ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. బాబు ఐదేళ్ల పాలనలో రొయ్యల ఉత్పత్తి 1.74లక్షల టన్నులు పెరిగితే. ఈ ప్రభుత్వ హయాంలో 6.94లక్షల టన్నులు పెరిగింది.ఎగుమతులు కూడా 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నులు జరిగితే. ప్రస్తుతం రూ.20వేల కోట్ల విలువైన 3.30లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులవుతున్నాయి. స్థానిక వినియోగం పెంచేందుకు జిల్లా స్థాయిలో ఆక్వా హబ్‌లు, 4వేలకుపైగా అవుట్‌లెట్స్‌తో పాటు డెయిలీ, సూపర్, లాంజ్ యూనిట్లు ఏర్పాటు చేసింది. ఈ దశలో దేశంలోనే తొలిసారి ఆక్వా రైతులకు బీమా సదుపాయం కలి్పంచింది. వరుసగా రెండుసార్లు రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు దక్కాయి. మరో పక్క మత్స్యకారులకు వేట నిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచడమే కాదు..ఈ ఐదేళ్లలో ఏటా సగటున 1.16 లక్షల మందికి రూ.538 కోట్ల మత్స్యకార భృతిని అందించారు. డీజిల్ ఆయిల్ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9లకు పెంచడం ద్వారా ఈ ఐదేళ్లలో రూ.148 కోట్ల సబ్సిడీని అందించింది. మౌలిక వసతులతో మెరుగైన సేవలు► టీడీపీ ఐదేళ్లలో 4.99 లక్షల మంది రైతులకు కేవలం రూ.1488.20 కోట్ల విలువైన యంత్ర పరికరాలు అందించింది. ► ఈ ఐదేళ్లలో రూ.1052.42 కోట్లతో 10,444 ఆర్బీకే, 492 క్లస్టర్ స్థాయిలోనూ వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు. ► వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.366.25 కోట్లు సబ్సిడీ అందించింది. ► 6362 ట్రాక్టర్లు, 492 కంబైన్డ్ హార్వెస్టర్స్, 31,356 ఇతర యంత్ర పరికరాలు అందజేత ► ఆర్బీకేలకు అనుబంధంగా రూ.1584.61 కోట్లతో 500 టన్నులు, 1000 టన్నుల సామర్థ్యంతో గోదాములతో కూడిన 2536 బహుళ ప్రయోజన కేంద్రాలు ఏర్పాటు ► అందుబాబులోకి వచ్చిన గోదాములు – 554 ►వీటిలో రూ.166.33 కోట్ల ఖర్చుతో వివి«ధ రకాల మౌలిక సదుపాయాల కల్పన. ► 60 టన్నుల సామర్థ్యంతో ఒక్కొక్కటి రూ.19.95 లక్షల అంచనాతో 97 ఆర్బీకేల వద్ద వే బ్రిడ్జ్‌ల నిర్మాణం ► రూ.210 కోట్లతో 147 నియోజకవర్గ, 10 జిల్లా స్థాయి, 4 రీజనల్ స్థాయి ల్యాబ్స్‌తో పాటు డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో గుంటూరులో రాష్ట్ర స్థాయి ల్యాబ్‌ల ఏర్పాటు ► అందుబాటులోకి వచి్చన జిల్లా స్థాయి ల్యాబ్స్ – 127 ► మరో 154 వెటర్నరీ, 35 ఆక్వా ల్యాబ్స్ అందుబాటులోకి ఉద్యాన పంటల హబ్‌గా ఏపీ ► 2018–19లో సాగవుతున్న ఉద్యాన పంటలు 42.5 లక్షల ఎకరాలు ► ప్రభుత్వ ప్రోత్సాహంతో 2022–23 నాటికి ఏకంగా 45.61 లక్షల ఎకరాలకు పెరుగుదల ► 2018–19 నాటికి 305 లక్షల టన్నులున్న దిగుబడులు ► 2022–23 నాటికి ఏకంగా 368.89 లక్షల టన్నులు ► దీంతో సాగులో 15 శాతం, దిగుబడుల్లో 20.9 శాతం వద్ధి రేటు సాధన ► బాబు హయాంలో జరిగిన అరటి ఎగుమతులు – 24వేల టన్నులు ► కాగా ఈ 5ఏళ్లలో జరిగిన అరటి ఎగుమతులు– ఏకంగా 1.75లక్షల టన్నులు ► అరటి ఎగుమతుల కోసం తాడిపత్రి నుంచి ముంబైకు ప్రత్యేకంగా కిసాన్ రైళ్లు ఏర్పాటు ► గతంలో మిరప ఎగుమతి – 12లక్షల టన్నులు ► ప్రస్తుతం జరిగిన మిరప ఎగుమతి – 16 లక్షల టన్నులు ► గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బిందు, తుంపర పరికరాలకు ఈ ప్రభుత్వం చెల్లించిన నిధులు రూ. 800.16 కోట్లు ► ఈ ఐదేళ్లలో సబ్సిడీ రూపంలో చెల్లించిన నిధులు – రూ.2669.65 కోట్లు ► తద్వారా కొత్తగా సాగులోకి తీసుకొచి్చన ఎకరాలు – 7.33లక్షల ఎకరాలు ► దీనివల్ల లబ్ధి పొందిన రైతులు 2.60లక్షల మందిరామోజీవి దుర్మార్గపు రాతలే..వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రాయితీ, ధరల స్థిరీకరణ, ఆర్బీకేలు, ఇతర విప్లవాత్మక కార్యక్రమాలేవీ రామోజీ కళ్లకు కనిపించడం లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతులను గుర్తిస్తే.. ఎక్కడ పరిహారం ఇవ్వాల్సి వస్తుందోనని బాబు విస్మరించారు. ఆ బకాయిలు సహా.. పరిహారం పెంచి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే. ఇది కూడా తనకు కనిపించనట్లు రామోజీ నటిస్తున్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి వ్యవసాయ రంగ నిపుణులు రాష్ట్రంలో వ్యవసాయ రంగం ప్రగతిని ప్రశంసించడం కూడా విస్మరించి దుర్మార్గపు రాతలు రాస్తుండటం రామోజీకే చెల్లింది.ఆర్బీకేలు అన్నదాత పాలిట దేవాలయాలుగా అవతరించాయి. 10,778 ఆర్బీకేలు, వన్ స్టాప్ సెంటర్స్, నాలెడ్జ్ హబ్‌లు.. ప్రతి రైతును గ్రామ స్థాయిలో చేయిపట్టి నడిపిస్తున్నాయి. 16 వేల మందికి పైగా పట్టభద్రులతోపాటు అనుభవజు్ఞలైన ఎంపీఏవోలు, గోపాలమిత్రలు అన్నదాతలకు సేవలందిస్తున్నారు. స్మార్ట్ టీవీ, డిజిటల్ లైబ్రరీ, సీడ్, సాయిల్ టెస్టింగ్ కిట్స్, కియోస్‌్కల ద్వారా సత్వర సేవలు అందుతున్నాయి. సరి్టఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు.. చేప, రొయ్యల సీడ్, ఫీడ్, పశుగ్రాసం, దాణా పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఆర్బీకేలో ఓ వలంటీర్, 9,277 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను అనుసంధానించారు. ఆర్బీకే ఛానల్, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ కూడా అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా ఆర్బీకే వ్యవస్థ ప్రపంచ దేశాలకు రోల్‌మోడల్‌గా నిలిచింది. ఏపీలో తగ్గిన ఆత్మహత్యలు : కేంద్రమంత్రి ప్రకటన మూడేళ్లుగా ఏపీలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి లోక్‌సభ సాక్షిగా ప్రకటించారు. కానీ చావులతో రాజకీయాలు చేయడం రామోజీ, చంద్రబాబు ద్వయానికి వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడైనా ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య తక్కువగా ఉందంటే ఎవరైనా హర్షిస్తారు. కానీ దుష్టచతుష్టయం మాత్రం లోలోన కుళ్లిపోతుంటారు. ఒక పక్క రైతులను అన్ని విధాలా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదుకుంటోంది. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల కోసం అర క్షణం కూడా ఆలోచించకుండా అండగా నిలుస్తోంది. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులు టీడీపీ సానుభూతిపరులా? కాదా? అనేకోణంలో చూసేవారు. తమ పార్టీ నాయకులు సిఫార్సు చేస్తేనే ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇచ్చేవారు. కానీ ఇందులో రూ.1.50 లక్షలు అప్పులకు జమ చేసి మిగిలిన రూ. 3.50 లక్షలు విత్‌డ్రా చేసేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసేవారు. దానిపై వచ్చే వడ్డీ మాత్రమే వాడుకునే పరిస్థితి కలి్పంచేవారు. చాలా కాలం తర్వాత ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇలా టీడీపీ ఐదేళ్లలో 2014–18 మధ్య 648 మంది భూ యజమానులు, 276 మంది కౌలురైతులు ఆత్మహత్యకు పాల్పడితే కేవలం 450 మంది రైతు కుటుంబాలకు మాత్రమే రూ.5 లక్షల చొప్పున రూ.22.50 కోట్లు అందించారు. రూ.7లక్షల పరిహారం ఇస్తున్నఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆ పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల ఖాతాలకు నేరుగా జమ చేస్తోంది. భూ యజమాని, కౌలు రైతు అయినా వ్యవసాయ కారణాలతో ఆత్మహత్యకు పాల్పడితే ఒక్క ఏపీలోనే రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కౌలు రైతులకు ఎలాంటి బీమా పరిహారం, ఆర్థిక సహాయం అందజేసే పరిస్థితులు లేవు. రాజకీయాలకు అతీతంగా బాబు హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల పేర్లను పునః పరిశీలన చేసి తిరస్కరణకు గురైన మరో 474 మందికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.23.70 కోట్ల ఆర్థికసాయం అందించింది. అలాగే 2019 నుంచి ఇప్పటి వరకు 801 మంది భూ యజమానులు, 495 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 474 మందితో కలిసి మొత్తం 1,770 మందికి రూ.114.42 కోట్ల పరిహారాన్ని జమ చేసింది. దేశం మొత్తం ఏపీని చూస్తోంది.. మాది తమిళనాడు. ఇప్పటి వరకు దేశంలోనే అత్యధిక అగ్రి ల్యాబ్స్(33) మా రాష్ట్రంలోనే ఉన్నాయనుకునే వాడ్ని. కానీ ఏపీలో ఏకంగా 160 ల్యాబ్స్‌ను తక్కువ సమయంలో నాణ్యతతో ఏర్పాటు చేశారు. ఇక్కడి ల్యాబ్స్, సాగు ఉత్పాదకాలను నేరుగా రైతులకందించాలన్న ఆలోచనతో తీసుకొచి్చన ‘రైతు భరోసా కేంద్రాలు’ గొప్ప ప్రయోగం. గ్రామ స్థాయిలో రైతులకు ఇంతలా సేవలందిస్తున్న రాష్ట్రం భారతదేశంలో మరొకటి లేదు. – డాక్టర్ కె.పొన్ను స్వామి, జాయింట్ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ నూనెగింజల అభివృద్ధి సంస్థ ఈ క్రాప్ విప్లవాత్మక మార్పు ఏళ్ల తరబడి రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర పొందగలగడమనే ప్రధాన సమస్యకు ఎలక్ట్రానిక్ క్రాపింగ్ (పంటల నమోదు) ద్వారా శాస్త్రీయ పరిష్కారాన్ని ఏపీ ప్రభుత్వం చూపించింది. రైతులు ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేస్తున్నారో ఈ క్రాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. పంటల వారీ దిగుబడి అంచనాలతో ఏయే పంట ఉత్పత్తులు ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయో ప్రభుత్వం వద్ద సమాచారం ఉంటుంది. ఏ పంట ఉత్పత్తులకు ఎక్కడ డిమాండ్ ఉంటుందో ఆయా మార్కెట్లను అనుసంధానిస్తే ప్రతీ రైతుకు మద్దతు ధర దక్కుతుంది. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం గొప్ప విషయం. – ప్రొఫెసర్ విజయ్ పాల్ శర్మ, చైర్మన్, వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ -
చంద్రబాబుదే షాక్.. సబ్సిడీలకు బ్రేక్
చంద్రబాబు చేసిన తప్పులను, పాపాలను ఏ రోజూ అచ్చేయని రామోజీకి గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వంలో ఒప్పులు సైతం తప్పులుగానే కనిపిస్తున్నాయి. తానేం రాసినా ఈ రాష్ట్ర ప్రజానీకం నమ్మేస్తుందనే వెర్రి భ్రమల్లోంచి ఈ గురివింద బయట పడడం లేదు. వాస్తవాలను అచ్చేయడానికి ఈ పెద్దమనిషికి చేతులు రావడం లేదు. రోజూ అభూతకల్పనలతో పత్రిక స్థాయిని ఎంతగా దిగజార్చుకోవాలో అంతగా దిగజారుస్తూ పాత్రికేయ విలువలకు వలువలూడదీస్తున్నారు. రికార్డు పరంగా ఉన్న నిజాలను సైతం అబద్ధాలుగా వక్రభాష్యాలతో అచ్చేస్తూ పత్రికను టీడీపీ కరపత్రికగా మార్చే బరితెగింపు రామోజీకి మాత్రమే సాధ్యమైంది. విద్యుత్ చార్జీల విషయంలో ఐదేళ్ల వ్యవధిలో ఏ రోజూ ప్రభుత్వ సబ్సిడీలు ఇవ్వని చంద్రబాబు రామోజీ దృష్టిలో గొప్ప పాలకుడు. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్న వైఎస్ జగన్ మాత్రం నచ్చని పాలకుడు. బొక్కబోర్లా పడిన టీడీపీని ఎలాగైనా నిలబెట్టాలని తెగ ఆరాట పడిపోతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ‘ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్’ శీర్షికతో ఈనాడులో అచ్చేసిన కథనంలో నిజానిజాలు ఇలా ఉన్నాయి. – సాక్షి అమరావతి ఆరోపణ: 2021–22లో వినియోగించిన విద్యుత్తుకు ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో రూ.3,082.99 కోట్ల భారం వాస్తవం : 2021–22లో వినియోగించిన విద్యుత్తుకు వాస్తవ, ఆమోదిత విద్యుత్తు కొనుగోలు ఖర్చులోని వ్యత్యాసాన్ని వసూలు చేస్తోంది. ఆ వసూలు భారం లేనిదే. ప్రతి యూనిట్‌కు కేవలం రూ.0.6455 పైసలు మాత్రమే వసూలు చేస్తోంది. ఇందులోనూ ప్రభుత్వ ప్రమేయం లేదు. పైగా ప్రభుత్వం సబ్సిడీ చెల్లించే కేటగిరీల వినియోగదారులకు ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఆరోపణ: జగన్ ప్రభుత్వం నెలకు 500 యూనిట్లు వినియోగించే వినియోగదారులపై యూనిట్‌కు 90 పైసలు పెంచింది వాస్తవం : ఏటా విద్యుత్తు చార్జీల టారిఫ్‌పై ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి పంపిణీ సంస్థలు సమర్పిస్తాయి. ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చేలా కొత్త టారిఫ్ ప్రకటిస్తుంది. అంటే వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నెల రోజుల ముందే టారిఫ్ అమలులోకి వచ్చింది. అలాంటప్పుడు ఆ చార్జీలను కొత్త ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది ? ఎలా పెంచుతుంది? ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా వార్తలెలా రాస్తున్నారు డ్రామోజీ? చంద్రబాబు హయాంలోనే పెంచిన చార్జీలను జగన్ ప్రభుత్వంపై రుద్దడానికి ఇంత కన్నా మార్గం కనిపించలేదా? నాలుగేళ్లుగా ఈ చార్జీలు కొనసాగుతున్నాయంటే 500 యూనిట్ల పైన వినియోగించే వారంటే కచ్చితంగా పేదలు కాదని రామోజీకి తెలియదా? ఆరోపణ: 2023 ఏప్రిల్ నుంచి ప్రతినెలా విద్యుత్తు కొనుగోలుకు అదనంగా చేసిన ఖర్చును ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో వసూలు చేస్తోంది. వాస్తవం : 2023–24కు సంబంధించి విద్యుత్తు కొనుగోలు ట్రూ–అప్ (విద్యుత్తు కొనుగోలు వ్యయం, సర్దుబాటు)కు ఏపీఈఆర్సీ రెగ్యులేషన్–2 ప్రకారం ఏప్రిల్ నెల వినియోగానికి ఎఫ్‌ఏపీసీఏ మొత్తాన్ని జూన్‌లో వసూలు చేయాలి. అదీ యూనిట్‌కు గరిష్టంగా రూ.0.40 పైసలు వరకు మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతించింది. ఇందులో వ్యవసాయ, ఇతర సబ్సిడీ వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఆరోపణ : గృహ, ఎల్టీ వాణిజ్య వినియోగదారులపై స్థిర చార్జీల భారం వాస్తవం : గృహ వినియోగ కేటగిరీలో అంతకు ముందు విధిస్తున్న కనీస వినియోగ చార్జీలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. నిజానికి గృహ కేటగిరీలో స్థిరచార్జీలు ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. కర్ణాటకలో కిలోవాట్‌కు రూ.110 తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో సింగిల్ ఫేజ్‌కు రూ.110, త్రీ ఫేజ్‌కు రూ.385 వసూలు చేస్తున్నారు. కేరళలో సింగిల్ ఫేజ్‌కు రూ.40 నుంచి రూ.260 వరకూ, త్రీఫేజ్‌కు రూ.100 నుంచి రూ.200 వరకూ విధిస్తున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి ముందు ఒక్కో సర్వీసుకు నెలవారీ కనీస చార్జీల మొత్తం రూ.25గా ఉండేది. ఆ తర్వాత 2021 ఏప్రిల్‌లో ఆ కనీస చార్జీని ఒక్కో కిలోవాట్‌కు రూ.10లుగా నిర్ణయిస్తూ రాష్ట్ర విద్యుత్తుæ నియంత్రణా మండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థిర చార్జీలను డిస్కంకు విద్యుత్తుæ ప్రసార, పంపిణీ వ్యవస్థ (íపీజీసీఐల్, ట్రాన్సిమిషన్, డిస్ట్రిబ్యూషన్)కు అయ్యే వ్యయం, విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన స్థిర వ్యయంలో కొంత భాగాన్ని రికవరీ చేసుకోవడం కోసం విధిస్తున్నారు. ఇది గృహేతర కేటగిరీల్లో ముందు నుంచి వసూలు చేస్తున్నదే. వాస్తవానికి సుమారు 67 శాతం సర్వీసులు ఒక కిలోవాట్, అంతకంటే తక్కువ లోడ్ పరిధిలోనే ఉంటాయి. అందువల్ల ఒక్కో సర్వీసుపైన విద్యుత్తుæ సంస్థలు దాదాపు రూ.15 నష్టాన్ని భరిస్తున్నాయి. ఇందులో ప్రజలపై భారం వేసిందేముంది? ప్రభుత్వం తీసుకున్నదేముంది? ఆరోపణ: 2014–19 మధ్య ట్రూ–అప్ కింద ఇప్పటికే రూ.1,455.37 కోట్లు వసూలు వాస్తవం : 2014–15 నుంచి 2018–19 వరకు ఆమోదించిన దానికి వాస్తవ పంపిణీ ఖర్చు (నిర్వహణ వ్యయం, తరుగుదల, మూలధన ప్రతిఫలం తదితరాలు)లో ఏర్పడ్డ వ్యత్యాసం రూపేణా రూ.2,910.74 కోట్లు ట్రూ–అప్ చార్జీలను వసూలు చేసుకునేందుకు ఏపీఈఆర్సీ ఉత్తర్వుల మేరకు డిస్కంలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఒక్కో యూనిట్‌కు రూ.0.07 పైసలు చొప్పున అనుమతించిన దానిలో సగం మాత్రమే డిస్కంలు వసూలు చేశాయి. అదీ ఆమోదిత, వాస్తవ పంపిణీ ఖర్చు (నిర్వహణ వ్యయం, తరుగుదల, మూలధన ప్రతిఫలం తదితరాలు) వ్యత్యాసాన్ని మండలి ఉత్తర్వుల మేరకు వసూలు చేస్తున్నాయి. నిజానికి ఈ చార్జీలు టీడీపీ హయాంలోనే సర్దుబాటు చేయాల్సి ఉంది. 2014–15 నుంచి 2018–19 వరకు ఐదేళ్లకు టీడీపీ ప్రభుత్వ సబ్సిడీ రూ.17,487 కోట్లు మంజూరు చేయగా, అందులో రూ.10,923 కోట్లు మాత్రమే చెల్లించింది. రూ.6,564 కోట్లు చెల్లించలేదు. ఆ పాపమే ట్రూ–అప్‌గా ప్రజలపై పడింది. 2019–20 నుంచి 2023–24 వరకూ నాలుగేళ్లలోనే సబ్సిడీ రూ.2,0375 కోట్లు మంజూరు చేసి, రూ.20,479 కోట్లను ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఆరోపణ: చార్జీల పెంపు.. శ్లాబుల్లో మార్పులు చేసి ఏటా రూ.1,400 కోట్లభారాన్ని 2022 ఏప్రిల్ నుంచి ప్రభుత్వం వేసింది. వాస్తవం : 2022 ఏప్రిల్ నుంచి శ్లాబులు, యూనిట్ రేట్లను పెరుగుతున్న సరఫరా వ్యయానికి అనుగుణంగాపెంచింది. అదీగాక గృహ వినియోగ కేటగిరీ సరఫరా వ్యయం రూ.7.79 కాగా, బిల్లింగ్ రేటు రూ.5.13 మాత్రమే ఉంది. అంటే గృహ వినియోగదారులకు సరఫరావ్యయంతో పోలిస్తే తక్కువ ధరే వసూలు చేస్తోంది. అప్పుడు భారం ఎవరిపై పడినట్లు డ్రామోజీ? మేలు చేయడం మోసమా? ♦ ఏటా విద్యుదుత్పత్తికి సంబంధించిన చార్జీలు పెరుగుతుండటంతో వాటికి అనుగుణంగా విద్యుత్తు కొనుగోలు చార్జీలూ పెరుగుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకునే వినియోగించిన విద్యుత్తుకు అనుగుణంగా చార్జీలపై ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో ప్రభుత్వానికిగానీ, విద్యుత్తు సంస్థలకుగానీ ఎలాంటి ప్రమేయమూ ఉండదు. జాతీయ టారిఫ్ విధానం ప్రకారం గతంలో ఉన్న టారిఫ్ శ్లాబులను స్థిరీకరణ చేయడం ద్వారా శ్లాబ్‌లలో మార్పులు జరిగాయి. కేటగిరీ వారీగా చూస్తే టారిఫ్ ధరలు పెరగడం లేదు. పైగా వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ సామాన్య ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ సూచనలతో విద్యుత్తు సంస్థల పరిధిలో సామాన్యులు మోయలేనంతగా చార్జీలను వసూలు చేయడం లేదు. వినియోగించిన విద్యుత్తుకు అనుగుణంగానే వసూలు చేస్తోంది. ♦ ఏటా విద్యుదుత్పత్తికి సంబంధించిన వ్యయం పెరుగుతుండడంతో వాటికి అనుగుణంగానే కొనుగోలు చార్జీలూ పెరుగుతున్నాయి. అలా పెరిగినా ఆ భారం పేదలపై పడకూడదని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు (గతంలో 100 యూనిట్లుగా ఉండేది), బాగా వెనుకబడిన తరగతుల వినియోగదారులకు 100 యూనిట్ల వరకు, క్షౌరశాలలకు 150యూనిట్ల వరకు, రజక వినియోగదారులకు 150 యూనిట్ల వరకు, చేనేత వృత్తి వినియోగదారులకు 100 యూనిట్ల వరకు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్తును ప్రభుత్వం రాయితీ ద్వారా అందిస్తోంది. ఇది ప్రణాళికతో చేస్తున్న మేలేగానీ మోసం ఎలా అవుతుంది రామోజీ? ♦ డిస్కంలు మరో రూ.7,200 కోట్లు ట్రూ–అప్ చార్జీలను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని కోరితే ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రతిపాదనను ఏపీఈఆర్సీ పక్కన పెట్టిందని ఈనాడు అర్థంలేని ఆరోపణ చేసింది. రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర ప్రతిపత్తిలో న్యాయమూర్తి హోదా కలిగిన అత్యున్నత వ్యక్తి నేతృత్వంలో నడిచే ఏపీఈఆర్సీ ఓ రాజకీయ పార్టీకిగానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వానికిగానీ జవాబుదారీ కాదనే విషయం రామోజీకి తెలియదా. అలాంటి ఏపీఈఆర్సీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుందని ఎలా అంటారు. పైగా రూ.7,200 కోట్ల భారం ప్రజలపై వేయడానికి అంగీకరించకపోవడం మంచి విషయం కాదంటారా? ♦ రాష్ట్రంలోని దాదాపు రెండు కోట్ల మంది వినియోగదారులకు వారి కుటుంబాలకు ఊరట కలిగిస్తూ.. ఎలాంటి చార్జీల భారం లేకుండా 2024–25 టారిఫ్ ఆర్డర్‌ను ఏపీఈఆర్సీ ఆమోదించింది. మూడు డిస్కంలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సబ్సిడీ రూ.13,589.18 కోట్ల భారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. గతేడాది కంటే ఇది రూ.3,453.96 కోట్లు అధికం. 2020–21 నుంచి రైల్వే ట్రాక్షన్కు టారిఫ్‌లో పెంపుదల లేనందున, వాస్తవ సేవా ఖర్చు, ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబించేలా ఇంధన చార్జీలు యూనిట్‌కు రూ.5.50 నుంచి రూ.6.50కి అంటే కేవలం రూ.1 పెంచడానికి కమిషన్ ఆమోదించింది. విద్యుత్తు వాహన చార్జింగ్ స్టేషన్లకు, డిస్కంలు అందించే విద్యుత్తు రేటును సేవా ఖర్చు (కాస్ట్ ఆఫ్ సర్వీస్) స్థాయికి పెంచాలని డిస్కంలు చేసిన ప్రతిపాదనను కమిషన్ ఆమోదించలేదు. విద్యుత్తు వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు వాటి టారిఫ్‌ను యథాతథంగా డిమాండ్ చార్జీలు లేకుండా, ప్రస్తుతం ఉన్న యూనిట్‌కు రూ.6.70గానే నిర్దేశించారు. మరి రాయితీ ఉపసంహరణ ద్వారా రూ.251 కోట్ల భారం త్వరలో అమలవుతుందని పచ్చి అబద్ధాలు ఎలా అచ్చేస్తారు డ్రామోజీ? -
కరెంటు చార్జీలు పెరగవు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో విద్యుత్తు వినియోగదారులకు వరుసగా రెండో ఏడాదీ శుభవార్త! 2024–25లో వినియోగదారులపై ఎలాంటి విద్యుత్తు భారం పడకుండా డిస్కమ్‌లు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. రాబడి, వ్యయాలు సమానంగా ఉన్నందున సాధారణ ప్రజలతో పాటు పారిశ్రామిక వర్గాలపై ఎలాంటి భారం లేకుండా పాత టారిఫ్‌లనే కొనసాగిస్తున్నట్లు మూడు డిస్కమ్‌లు తెలిపాయి. సోమవారం విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు ఠాకూర్ రామ్‌సింగ్, పీవీఆర్ రెడ్డి నేతృత్వంలో బహిరంగ వర్చువల్ విచారణ మొదలైంది. ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీఈఆర్సీ అధికారులతో పాటు ఇంధనశాఖ, ట్రాన్స్‌కో, జెన్కో, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థల ప్రతిపాదనలకు సంబంధించి తొలిరోజు 17 మంది అభిప్రాయాలు తెలియచేశారు. కార్యక్రమంలో ఏపీఈఆర్సీ సెక్రటరీ డి.రమణయ్యశెట్టి, విద్యుత్ పంపిణీ సంస్థల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మన డిస్కమ్‌లకు ‘ఏ’ గ్రేడ్: జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, ఏపీఈఆర్సీ చైర్మన్ వినియోగదారులకు మేలు చేసేలా కమిషన్ పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ప్రతి డిస్కమ్‌లో వినియోగదారుల సేవలకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించాం. దేశవ్యాప్తంగా 2022–23 వినియోగదారుల సేవల్లో ఏడు డిస్కమ్‌లకు ఏ గ్రేడ్ రేటింగ్ రాగా అందులో మూడు ఏపీకి చెందిన డిస్కమ్‌లే కావడం గర్వకారణం. రాష్ట్రంలో దాదాపు 1.8 కోట్ల వినియోగదారులకు సంబంధించి కేవలం 220 ఫిర్యాదులు మాత్రమే పరిశీలనలో ఉన్నాయి. డిస్కమ్‌లకు 50 శాతం పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఉండగా అధిక భాగం సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల ద్వారా సమకూరుతోంది. కోవిడ్ తర్వాత మార్కెట్ ధరలు అసాధారణంగా పెరిగాయి. కొన్నిసార్లు యూనిట్ రూ.10 సీలింగ్ రేట్‌కు కూడా విద్యుత్ లభ్యత లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. గతేడాది యూనిట్ రూ.16 సీలింగ్ రేటుగా విక్రయించిన సందర్భాలున్నాయి. డిస్కమ్‌లకు చెల్లింపులను హేతుబద్ధం చేస్తూ మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణ పాలసీని ఆమోదించాం. ప్రతి అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకుంటూ వినియోగదారులకు పూర్తి పారదర్శంగా సేవలందించేందుకు ఈఆర్సీ నిరంతరం శ్రమిస్తోంది. వినియోగదారులపై భారం లేదు: పృథ్వీతేజ్ ఇమ్మడి, ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఈపీడీసీఎల్ పరిధిలో 2017–18లో 18,351 మిలియన్ యూనిట్లు విద్యుత్ అమ్మకాలు జరగగా ప్రస్తుతం 27,864 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. 2017–18లో పంపిణీ నష్టాలు 6.70 శాతం ఉండగా ప్రస్తుతం 5.31 శాతానికి తగ్గాయి. సమగ్ర ఆదాయ ఆవశ్యకత రూ.21,161.86 కోట్లుగా అంచనా వేశాం. గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయ, ఇతర వినియోగదారులపై భారం మోపకుండా ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఎలక్ట్రిక్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్లకు ప్రస్తుతం ఉన్న స్టేషన్ల నిర్వహణ రాయితీని ఎత్తివేయాలని, రైల్వేకు అందిస్తున్న విద్యుత్ చార్జీలపై యూనిట్‌కు రూ.1 చొప్పున పెంచాలని నిర్ణయించాం. గ్రీన్ పవర్ టారిఫ్ ప్రీమియం అన్ని కేటగిరీల వినియోగదారులకు 75 పైసల నుంచి రూపాయికి పెంచేందుకు అనుమతివ్వాలని ప్రతిపాదించాం. దీని ద్వారా రూ.వంద కోట్ల ఆదాయం సమకూరనుంది. మొత్తంగా 2023–24లో ఆమోదించిన టారిఫ్ ధరలనే వచ్చే ఏడాదీ అమలు చేస్తాం. 2024–25లో ఏపీఈపీడీసీఎల్ ఆదాయ అంతరాల అంచనా ► ప్రస్తుత ధరల నుంచి ఆదాయం రూ.17,854.16 కోట్లు ► ప్రతిపాదిత ధరల నుంచి ఆదాయం రూ.100.44 కోట్లు ► ప్రతిపాదిత ఫుల్ కాస్ట్ రికవరీ నుంచి ఆదాయం– రూ.3207.27 కోట్లు ► మొత్తం ఆదాయం – రూ.21,161.86 కోట్లు ► సమగ్ర అంచనా వ్యయం– రూ.21,161.86 కోట్లు ► ప్రస్తుత ధరల వద్ద లోటు సున్నా. పాత టారిఫ్‌లే: కె.సంతోషరావు, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఎస్పీడీసీఎల్ పరిధిలో పంపిణీ నష్టాలను 26.84 శాతం నుంచి గతేడాది నవంబర్ నాటికి 8.21 శాతం తగ్గించాం. ప్రభుత్వం అందిస్తున్న టారిఫ్ సబ్సిడీ 2004–05లో రూ.334 కోట్లు నుంచి 2023–24లో రూ.5195.98 కోట్లకు పెరిగింది. నవరత్నాల పథకంలో భాగంగా వ్యవసాయ, ఆక్వా రైతులు, బడుగు బలహీనవర్గాలకు చెందిన 19,26,467 మంది వినియోగదారులకు రూ.4,605.31 కోట్లను రాయితీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ప్రస్తుతం ఉన్న రిటైల్ టారిఫ్ షెడ్యూల్‌ని 2024–25లోనూ కొనసాగిస్తాం. రెండు మూడు స్వల్ప మార్పులున్నా అవి గృహ, వాణిజ్య, పారిశ్రామిక, ఇతర వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదు. 2024–25 ఏపీఎస్పీడీసీఎల్ ఆదాయ అంతరాల అంచనా ► ప్రస్తుత ధరల నుంచి ఆదాయం – రూ.15,175.75 కోట్లు ► ప్రతిపాదిత ధరల నుంచి ఆదాయం– రూ.7521.03 కోట్లు ► క్రాస్ సబ్సిడీ సర్‌చార్జ్ నుంచి రాబడి – రూ.142.46 కోట్లు ► ఆర్ఈసీ నుంచి ఆదాయం– రూ.20 కోట్లు ► మొత్తం ఆదాయం – రూ.22,859.24 కోట్లు ► సమగ్ర ఆదాయ ఆవశ్యకత – రూ.22859.24 కోట్లు ► ప్రస్తుత ధరల వద్ద లోటు, మిగులు– సున్నా భారం లేకుండా ప్రతిపాదనలు: కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం డిస్కమ్ పరిధిలో కొత్తగా రూ.172 కోట్లతో 33/11 కేవీ సబ్స్టేషన్లు 54 వరకూ నిర్మాణ పనులు చేపట్టగా 43 సబ్స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. హెచ్‌వీడీఎస్ పథకం ద్వారా డిస్కమ్ పరిధిలోని మూడు జిల్లాల్లో రూ.1696.59 కోట్లతో విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయ, ఇతర వినియోగదారులపై భారం లేకుండా ప్రతిపాదనలు రూపొందించాం. 2024–25 ఏపీసీపీడీసీఎల్ ఆదాయ అంతరాల అంచనా ప్రస్తుత ధరల నుంచి ఆదాయం – రూ.9090.61 కోట్లు టారిఫ్ కాని ఆదాయం – రూన.392.52 కోట్లు క్రాస్ సబ్సిడీ సర్‌చార్జ్ నుంచి రాబడి – రూ.21.53 కోట్లు ప్రతిపాదిత టారిఫ్ ద్వారా ఆదాయం అంచనా– రూ.50.73 కోట్లు ఫుల్‌కాస్ట్ రికవరీ టారిఫ్ నుంచి ఆదాయం– రూ.2996.53 కోట్లు ప్రస్తుత టారిఫ్ వద్ద రెవిన్యూ లోటు– రూ. –3047.26 కోట్లు సమగ్ర ఆదాయ ఆవశ్యకత – రూ.12,551.92 కోట్లు ప్రస్తుత ధరల వద్ద లోటు, మిగులు– సున్నా ► రూ.15,729 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు: కేవీఎన్ చక్రధర్‌బాబు, ఏపీ జెన్కో ఎండీ, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ మూడు డిస్కమ్‌ల పరిధిలో ఏపీ ట్రాన్స్‌కో నాలుగో నియంత్రణ కాలంలో మంచి విజయాలను నమోదు చేసింది. 2018–19లో 3.10 శాతం సరఫరా నష్టాలుండగా 2023–24 నాటికి 2.75 శాతానికి తగ్గింది. వచ్చే ఐదేళ్లలో ట్రాన్స్మిషన్ సిస్టమ్ లభ్యత 99.70 శాతంగా నిర్దేశించుకున్నాం. ఈ ఐదేళ్ల కాలంలో ఉత్తమ ట్రాన్స్మిషన్ యుటిలిటీ అవార్డు, ఫాల్కన్ మీడియా, ఎనర్జియా ఫౌండేషన్ నేషనల్ అవార్డు 2023 ద్వారా టాప్ స్టేట్ యుటిలిటీ అవార్డు సొంతం చేసుకున్నాం. రాబోయే ఐదేళ్లలో మూడు డిస్కమ్‌ల పరిధిలో 400 కేవీ సబ్స్టేషన్లు 7, 220 కేవీ సబ్స్టేషన్లు 23, 132 కేవీ సబ్స్టేషన్లు 41 నిర్మించాలని నిర్ణయించాం. దశలవారీగా ట్రాన్స్మిషన్ నష్టాలను తగ్గించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. రానున్న ఐదేళ్లకు గాను రూ.15,729.4 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు తయారు చేశాం. -
కరెంట్ బిల్లులు పెంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసే మొత్తం వ్యయ్యాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో రాబట్టుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. మొత్తం వ్యయాన్ని రాబట్టుకునే క్రమంలో వినియోగదారుల విద్యుత్ చార్జీలను ఎప్పటికప్పుడు పెంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ నెల 10న విద్యుత్ (సవరణ) నిబంధనలు–2024ను ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తదుపరి ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన ఆదాయానికి సంబంధించిన అంచనాలను సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతి ఏటా నవంబర్‌లోగా డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది. దాన్ని పరిశీలించిన తర్వాత ఆదాయ అవసరాల మొత్తాన్ని ఈఆర్సీ ఆమోదిస్తుంది. ఈ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన విద్యుత్ చార్జీలను సైతం ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే ఈఆర్సీ ప్రకటించాల్సి ఉంటుంది. ఇకపై ఈఆర్సీ ఆమోదించే ఆదాయ అవసరాల మొత్తం, ప్రకటించిన టారిఫ్‌తో వచ్చే ఆదాయ అంచనాల మొత్తం మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండరాదని గజిట్లో కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ వ్యత్యాసం ఉన్నా, 3 శాతానికి మించరాదని ఆదేశించింది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ఈ విషయంలో మినహాయింపు ఉంటుందని తెలిపింది. లేట్ పేమెంట్ సర్‌చార్జీతో.. విద్యుదుత్పత్తి కంపెనీలకు గడువులోగా బిల్లులు చెల్లించనందుకు డిస్కంలపై విధించే లేట్ పేమెంట్ సర్‌చార్జీతో ఈ ఆదాయ వ్యత్యాసాన్ని కలిపి రానున్న మూడేళ్లలో మూడు సమ వాయిదాల్లో వసూలు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ గజిట్ అమల్లోకి రాకముందు నాటి ఆదాయ వ్యత్యాసాలను, లేట్‌పేమెంట్ సర్‌చార్జీలను మాత్రం వచ్చే ఏడేళ్లలో ఏడు సమ వాయిదాల్లో వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని చెప్పింది. సొంత ట్రాన్స్మిషన్ లైన్లకు లైసెన్స్ అక్కర్లేదు ఏదైనా విద్యుదుత్పత్తి కంపెనీ/కాప్టివ్ విద్యుత్ ప్లాంట్/ఎనర్జీ స్టోరేజీ సిస్టం అవసరాల కోసం ప్రత్యేక ట్రాన్స్మిషన్ లైన్లను ఏర్పాటు చేసుకోవడం, నిర్వహించడం, గ్రిడ్‌కు అనుసంధానం చేయడం కోసం ఇకపై ప్రత్యేకంగా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే, వాటి సామర్థ్యం అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ వ్యవస్థ పరిధిలో 25 మెగావాట్లు, రాష్ట్ర అంతర్గత ట్రాన్స్మిషన్ వ్యవస్థ పరిధిలో 15 మెగావాట్లలోబడి ఉండాలి. ఇందుకు సాంకేతిక ప్రమాణాలు, మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. అదనపు సర్‌చార్జీ బాదుడు వద్దు దీర్ఘకాలిక ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జీలతో పోలిస్తే స్వల్ప కాలిక ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జి 110 శాతానికి మించి ఉండరాదు. అన్ని రకాల ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జీలు.. డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్‌కు సంబంధించిన ఫిక్స్డ్ ధరలకు మించకుండా ఉండాలి. -
‘కరెంట్’ వడ్డన ఉంటుందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించడానికి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇచ్చిన గడువు జనవరి 2తో ముగియనుంది. విద్యుత్ టారిఫ్ రెగ్యులేషన్స్ ప్రకారం.. ఏటా నవంబర్ 30లోగా తర్వాతి ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలు, వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) అంచనాలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాలి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గడువు పెంచాలని డిస్కంలు విజ్ఞప్తి చేయగా.. ఈఆర్సీ జనవరి 2 వరకు గడువు ఇచ్చింది. మరోవైపు టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించేందుకు కొత్త ప్రభుత్వం నుంచి డిస్కంలు ఇంకా అనుమతి పొందలేదు. దీంతో జనవరి 30వరకు మరోసారి గడువు పొడిగించాలని ఈఆర్సీని కోరేందుకు డిస్కంల యాజమాన్యాలు సిద్ధమైనట్టు తెలిసింది. టారిఫ్ ప్రతిపాదనల్లో ఏం ఉంటాయంటే..? 2024–25లో రాష్ట్రంలో మొత్తం ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉంటుంది? అందుకు ఎన్ని రూ.వేల కోట్ల ఆదాయం అవసరం? ప్రస్తుత విద్యుత్ చార్జీలనే 2024–25లో కొనసాగిస్తే ఎంత ఆదాయ లోటు ఏర్పడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న సబ్సిడీ నిధులు ఎంత, ఇంకా ఎంత లోటు ఉంటుంది? ఆ లోటును పూడ్చుకోవడానికి 2024–25లో ఏయే కేటగిరీల వినియోగదారుల చార్జీలను ఎంతమేర పెంచాలన్న అంశాలు డిస్కంల ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనల్లో ఉంటాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ రాతపూర్వకంగా అభ్యంతరాలను సేకరించి, బహిరంగ విచారణ నిర్వహించి.. కొత్త టారిఫ్ ఆర్డర్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. రూ.30వేల కోట్లకు చేరిన ఆర్థిక లోటు 2022–23 నాటికి రాష్ట్రంలో డిస్కంల నష్టాలు రూ.62,461 కోట్లకు పెరిగాయి. ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు సగటున ప్రతి నెలా రూ. 1,386 కోట్లు లెక్కన మరో రూ.11,088 కోట్ల నష్టాలు వచ్చినట్టు ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో డిస్కంల నష్టాలు రూ. 73,549 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.11,500 కోట్ల విద్యుత్ సబ్సిడీనే కొనసాగిస్తే.. 2024–25లో డిస్కంలకు కొత్తగా మరో రూ.16,632 కోట్ల నష్టాలు వస్తాయని అంచనా. నష్టాలను అధిగమించాలంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.31,632 కోట్ల సబ్సిడీని డిస్కంలకు ఇవ్వాల్సి ఉండనుంది. లేకుంటే లోటును భర్తీ చేసుకోవడానికి విద్యుత్ చార్జీలు పెంచాల్సి వస్తుంది. కొత్త సర్కారు ముందు సవాళ్లు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యుత్ సంస్థల నిర్వహణ సవాలుగా మారింది. విద్యుత్ సబ్సిడీలను ఏటా రూ.30వేల కోట్లకు పెంచడం లేదా ఏ ఏడాదికా ఏడాది లోటు భర్తీ చేసుకోవడానికి చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాల్సిన పరిస్థితి. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికితోడు ప్రభుత్వం ఏర్పడిన ఏడాదే విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతిస్తే విమర్శలను, వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచన ఉంది. దీంతో టారిఫ్ ప్రతిపాదనల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఉచితంగా 200 యూనిట్లపైప్రతిపాదనలు సిద్ధం కాంగ్రెస్ సర్కారు హామీ మేరకు ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసే అంశాన్ని 2024–25 టారిఫ్ ప్రతిపాదనల్లో చేర్చడంపై డిస్కంలు కసరత్తు పూర్తిచేశాయి. 200యూనిట్లలోపు వినియోగించే వినియోగదారులు ఎందరు? వారికి ఉచిత విద్యుత్ కో సం అయ్యే వ్యయం ఎంత? అన్న గణాంకాలతో ప్రతి పాదనలు సిద్ధం చేశాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే.. ఈ పథకాన్ని 2024 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో అమలు చేసేందుకు ఈఆర్సీ అనుమతిని కోరనున్నాయి. ఈ పథకాన్ని అమలు చేస్తే.. ప్రభుత్వం అదనంగా రూ.3,500 కోట్ల సబ్సిడీని డిస్కంలకు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసినట్టు అధికారులు చెప్తున్నారు. -
ఆంధ్రప్రదేశ్: విద్యుత్ చార్జీలు పెంచం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) భారీ ఊరటనిచ్చాయి. వచ్చే ఏడాది ఏ వర్గం వినియోగదారులపైనా విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రకటించాయి. రూ.13,878.11 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ చార్జీల భారం వేయబోమని స్పష్టం చేశాయి. ఈ మేరకు రాష్ట్రంలోని విద్యుత్ ప్రసార (ఏపీ ట్రాన్స్‌కో), పంపిణీ సంస్థలు (డిస్కంలు) 2024–25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్), 2024–2029 నియంత్రణ కాలానికి సంబంధించి నెట్వర్క్ ఆదాయ అవసరాల నివేదికలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పించాయి. ఈ నివేదికలోని ముఖ్యాంశాలను ఇంధన శాఖ శుక్రవారం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా తక్కువ ధరలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు కట్టుబడి ఉన్నాయని తెలిపింది. దానికి తగ్గట్టుగానే ఏఆర్‌ఆర్‌లలో ఎలాంటి విద్యుత్ చార్జీల పెంపుదలను ప్రతిపాదించలేదని వివరించింది. లోటు ఉన్నప్పటికీ భారం మోపబోం.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 74,522.67 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని డిస్కంలు అంచనా వేశాయి. వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు 12,321.58 మిలియన్ యూనిట్లు అవసరమని నివేదించాయి. మొత్తం మీద 83,118.13 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని లెక్కగట్టాయి. విద్యుత్ ప్రసార నష్టాలు 2.6 శాతం, ఇంటర్ స్టేట్ నష్టాలు 0.9 శాతం, పంపిణీ నష్టాలు 6.84 శాతం, మొత్తం ట్రాన్స్మిషన్ అండ్ డి్రస్టిబ్యూషన్ నష్టాలు 10.34 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేశాయి. ఈ లెక్కన విద్యుత్ కొనుగోలు ఖర్చు రూ.39,017.60 కోట్లు అవుతుందని భావిస్తున్నాయి. అది కాకుండా ట్రాన్స్మిషన్ అండ్ లోడ్ డిస్పాచ్ ఖర్చు రూ.5,722.88 కోట్లు, డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్ ధర రూ.9,514.42 కోట్లు, ఇతర ఖర్చులు రూ.2,321.13 కోట్లుగా పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. దీని ప్రకారం మొత్తంగా రూ.56,576.03 కోట్ల రాబడి అవసరమని నివేదించాయి. అయితే అన్ని రకాల ఆదాయాలు కలిపి రూ.42,697.92 కోట్లు మాత్రమే వస్తున్నాయని.. దీంతో రూ.13,878.11 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని వివరించాయి. అయినప్పటికీ ఈ లోటును భర్తీ చేసుకోవడం కోసం ప్రజలపై చార్జీల భారం మోపాలనుకోవడం లేదని ఏపీఈఆర్సీకి డిస్కంలు నివేదించాయి. యధావిధిగా ఉచిత, రాయితీలు రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరాకు అయ్యే ఖర్చును సబ్సిడీ రూపంలో ప్రభుత్వం డిస్కంలకు తిరిగి చెల్లిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా డిస్కంలు దాదాపు రూ.11,800 కోట్ల రెవెన్యూ లోటుతో వార్షిక ఆదాయ అవసరాల నివేదికలను దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో డిస్కంలను ఆదుకోవడానికి రూ.10,135.22 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. అలాగే ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరా, తక్కువ స్లాబ్ గృహవినియోగదారులకు సబ్సిడీ, ఆక్వాకల్చర్ రైతులు, ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులు, పవర్ లూమ్స్, హ్యాండ్లూమ్స్, సెలూన్లు, గోల్డ్ ప్లేటింగ్, రజక సంఘాలు మొదలైన వాటికి రాయితీలు వచ్చే ఏడాది కూడా కొనసాగనున్నాయి. దీంతో డిస్కంలు వినియోగదారుల టారిఫ్‌లలో ఎలాంటి మార్పును ప్రతిపాదించలేదు. -
ఇంటికి చేరువలోనే విద్యుత్ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువలోకి విద్యుత్ సేవలను తీసుకువచ్చింది. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లోనే విద్యుత్ సంబంధిత సేవలు దాదాపు అన్నింటిని అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లూ విద్యుత్ బిల్లుల చెల్లింపు మినహా మీ–సేవా కేంద్రాల్లో పొందిన సేవలు ఇకపై వినియోగదారుల ఇంటికి చేరువలోనే లభించే ఏర్పాటు చేసింది. ఇక గ్రామాల్లో కరెంటు బిల్లులు కట్టడానికి సచివాలయాలకు వెళితే సరిపోతుంది. తాజాగా అమల్లోకి వచ్చిన ఈ సేవలతో రాష్ట్రంలోని దాదాపు 1.92 కోట్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఎనర్జీ అసిస్టెంట్లకు బాధ్యతలు పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు అంతరాయాలు లేకుండా విద్యుత్ అందించడంలో ఎనర్జీ అసిస్టెంట్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. సచివాలయ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,883 మంది ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్ శాఖ ద్వారా నియమించారు. వీరికి అవసరమైన శిక్షణను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అందించాయి. భవిష్యత్‌లో వీరికి లైన్మెన్, సీనియర్ లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్ సూపర్వైజర్, ఫోర్‌మెన్‌గా పదోన్నతులు పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రతి ఎనర్జీ అసిస్టెంట్‌ను గరిష్టంగా 1,500 విద్యుత్ కనెక్షన్లకు బాధ్యుడిని చేశారు. కనీసం 30 నుంచి 40 ట్రాన్స్ఫార్మర్లను ఇతను నిరంతరం పర్యవేక్షిస్తాడు. 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో లైన్‌పై చెట్లు పడినా, జంపర్లు తెగిపోయినా బాగు చేయడం, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, చెడిపోయినా, మీటర్లు ఆగిపోయినా కొత్తవి బిగించడం వంటి విధులతో పాటు మరే ఇతర విద్యుత్ సమస్యలు తలెత్తినా బాగు చేస్తారు. వారి స్థాయి కానప్పుడు పైఅధికారులకు వెంటనే సమాచారం అందించడం ద్వారా సాంకేతిక నిపుణులు త్వరగా వచ్చేలా చూస్తారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి వలంటీర్ల ద్వారాగానీ ప్రజలు నేరుగాగానీ గ్రామ సచివాలయానికి ఫిర్యాదు చేసేŠత్ క్షణాల్లో సమస్యలను పరిష్కరిస్తారు. ఇకపై వీరు విద్యుత్ రంగానికి సంబంధించిన అన్ని సేవలను సచివాలయాల ద్వారా ప్రజలకు అందేలా చూస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యుత్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన సేవలు 1. గృహ, వాణిజ్య సర్విసు కనెక్షన్ల కోసం దరఖాస్తు 2. వ్యవసాయ సర్విసు కనెక్షన్ల కోసం దరఖాస్తు 3. అదనపు లోడ్ దరఖాస్తు 4. కేటగిరి మార్పు 5. సర్వీసు కనెక్షన్ పేరు మార్పు 6. మీటరు టెస్టింగ్‌కు సంబంధించి 7. మీటరు కాలిపోవటంపై ఫిర్యాదు 8. బిల్లులకు సంబంధించిన సమస్యలు 9.ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన ఫిర్యాదులు 10. వోల్టేజ్ హెచ్చుతగ్గులపై ఫిర్యాదులు 11. లైన్ షిఫ్టింగ్ 12. పోల్ షిఫ్టింగ్ 13. మీటరు ఆగిపోవడం, నెమ్మదిగా తిరగడంపై ఫిర్యాదులు 14. విద్యుత్ బిల్లులు చెల్లింపు ప్రజలకు మరింత సౌకర్యంగా.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విద్యుత్ సేవలు పొందేందుకు ప్రజలకు అవకాశం కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన సూచనలతో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిస్కంలను కొన్ని నెలల క్రితం జరిగిన సమీక్షలో ఆదేశించారు. ఆ మేరకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేసి తాజాగా అన్ని సేవలను సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకువచ్చాం. డిజిటలైజేషన్ నేపథ్యంలో ఆన్లైన్ పేమెంట్ యాప్స్(యూపీఐ)ల ద్వారా, డిస్కంల సొంత యాప్స్ ద్వారా చాలా మంది విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. కొందరు అందుబాటులో ఉన్న నగరాలు, పట్టణాల్లో ఎనీటైమ్ పేమెంట్ (ఏటీపీ)మెషిన్స్, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో బిల్లులు కడుతున్నారు. గ్రామాల్లో నెలకోసారి దండోరా వేయించి సంస్థ ప్రతినిధి వెళ్లి బిల్లులు కట్టించుకుంటున్నారు. ఇకపై సచివాలయాల్లో కూడా కరెంటు బిల్లులు చెల్లించే సౌకర్యాన్ని కల్పించాం. –ఐ.పృధ్వితేజ్, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్. -
ప్రభుత్వం చెల్లించకుంటే.. ప్రజల నుంచి వసూలు చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా విద్యుత్ సబ్సిడీని చెల్లించని పక్షంలో విద్యుత్ చట్టంలోని సెక్షన్ 65 ప్రకారం వినియోగదారుల నుంచి సబ్సిడీ లేని విద్యుత్ చార్జీలు (టారిఫ్) వసూలు చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సబ్సిడీ రహిత టారిఫ్‌ను వర్తింపజేయాల్సిందిగా రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఆదేశాలు జారీ చేయాలని ఆయా రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండళ్లకు (ఈఆర్సీలకు) సూచించింది. విద్యుత్ చార్జీలు పెంచి వసూలు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యుత్ సబ్సిడీల విధానంలో కీలక మార్పులను అమల్లోకి తెస్తూ గత జూలై 26న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా దానిని బహిర్గతం చేసింది. విద్యుత్ నిబంధనలకు రెండో సవరణ–2023 పేరుతో ఈ నిబంధనలు అమల్లోకి వచ్చా యి. ఇకపై కేంద్రం ప్రకటించే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆధారంగా ప్రభు త్వం చెల్లించాల్సిన విద్యుత్ సబ్సిడీలను డిస్కంలు లెక్కించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఎంత సబ్సిడీ చెల్లించకపోతే అంత మోత.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం సబ్సిడీతో పోల్చితే వాస్తవంగా చెల్లిస్తున్న సబ్సిడీ తక్కువగా ఉంటుండటంతో డిస్కంలు భారీ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన సబ్సిడీ మేరకు విద్యుత్ చార్జీలను పెంచి వినియోగ దారుల నుంచి వసూలు చేయాల్సిందేనని కేంద్రం ఆదేశించింది. ఉదాహరణకు గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు యూనిట్‌కు రూ.8 చార్జీ ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇందులో రూ.4 సబ్సిడీ ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం యూనిట్‌కు రూ.2 మాత్రమే సబ్సిడీగా చెల్లిస్తోంది. దీంతో వినియోగదారులు చెల్లించే రూ.4కు లోటు సబ్సిడీ రూ.2 కలిపి మొత్తం రూ.6కు చార్జీ పెంచుకోవాల్సిందిగా కేంద్రం సూచించింది. ఒకవేళ ప్రభుత్వం సబ్సిడీ పూర్తిగా చెల్లించని పక్షంలో రూ.8 వసూలు చేసుకోవాలని ఆదేశించింది. ఇకపై సబ్సిడీల వివరాలతో త్రైమాసిక నివేదికలు కేంద్రం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు పూర్తి స్థాయిలో విద్యుత్ సబ్సిడీలను ఎప్పటికప్పుడు ముందస్తుగా డిస్కంలకు చెల్లించకతప్పని పరిస్థితి నెలకొంది. కాగా కేటగిరీల వారీగా వినియోగదారులు వాడిన విద్యుత్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ సబ్సిడీలను కచ్చితంగా లెక్కించడానికి కొత్త విధానాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. కేటగిరీల వారీగా ఓ త్రైమాసికంలో సబ్సిడీ వినియోగదారులు ఎన్ని యూనిట్ల విద్యుత్ వాడారు? ప్రతి యూనిట్ విద్యుత్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ ఎంత? రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా చెల్లించిన సబ్సిడీ ఎంత? ఇంకా రావాల్సిన సబ్సిడీ బకాయిలు/లోటు ఎంత? తదితర వివరాలతో రాష్ట్రాల ఈఆర్సీలు త్రైమాసిక నివేదికను విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రతి త్రైమాసికం ముగిసిన తర్వాత 30 రోజుల్లోగా ఈఆర్సీకి డిస్కంలు ఈ మేరకు వివరాలతో ఓ నివేదికను సమర్పిస్తాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన సవరణలతో 30 రోజుల్లోగా ఈఆర్సీ తుది త్రైమాసిక నివేదికను ప్రకటిస్తుంది. నిబంధనల మేరకు విద్యుత్ సబ్సిడీ అకౌంటింగ్ జరగలేదని, సబ్సిడీల కోసం ప్రభుత్వానికి బిల్లులు పంపించలేదని తేలితే డిస్కంలోని సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని ఈఆర్సీలను కేంద్రం ఆదేశించింది. -
జగనన్న ఇళ్లల్లో విద్యుత్ పొదుపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగమయ్యేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈసీఎల్) ముందుకొచ్చింది. గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్‌తో ఈఈఎస్ఎల్ సీనియర్ అధికారులు అనిమేష్మిశ్రా, నితిన్ భుట్ ఢిల్లీ నుంచి ఆదివారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. పేదల ఇళ్లలో ఇంధన సామర్థ్య చర్యల అమలుకు ఈఈఎస్ఎల్ సూత్రప్రాయంగా అంగీకరించింది. అజయ్‌జైన్ మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లుల తగ్గింపునకు ఇలాంటి వినూత్న చర్యలు తీసుకున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ మంజూరు చేసిన 21.3 లక్షల ఇళ్లలో 20.45 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, నెలాఖరు నాటికి దాదాపు 5 లక్షల ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. ఈఈఎస్ఎల్ ద్వారా విద్యుత్ ఆదా చేసే ఎలక్ట్రికల్ ఉపకరణాలను తక్కువ ఖర్చుతో అందజేస్తామని చెప్పారు. -
‘బషీర్‌బాగ్’ సూత్రధారి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజలపై కాల్పులు జరిపించింది అప్పట్లో టీడీపీలో కీలకంగా ఉన్న కేసీఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బషీర్‌బాగ్ విద్యుత్ ఉద్యమంలో రైతులపై కాల్పులకు సూత్రధారి కేసీఆర్ అని ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాల్సి ఉంటుందని నాడుచంద్రబాబు అనడానికి కారణం కేసీఆరే అన్నారు. పార్టీలో మానవ వనరుల విభాగం (హెచ్ఆర్డీ) చైర్మన్‌గా ఉండి ఉచిత విద్యుత్ ఇవ్వడం కుదరదని చంద్రబాబుతో చెప్పించారని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్ కట్టుబడి ఉందనే విషయాన్ని వరంగల్ రైతు డిక్లరేషన్‌లోనే స్పష్టం చేశామన్నారు. ఉచిత విద్యుత్ పేరుతో కేసీఆర్ చేస్తున్న అక్రమాలను అమెరికాలో ‘తానా’ సభల్లో వివరించే ప్రయత్నం చేశానని చెప్పారు. తన మాటలను ఎడిట్ చేసి తమకు అనుకూలంగా మలచుకొని మంత్రి కేటీఆర్ ట్రోల్ చేయించారని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్‌దేనని, 2004కు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి, అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ అమలు చేశారని గుర్తుచేశారు. రైతులకు ఉచిత విద్యుత్తోపాటుఇన్పుట్ సబ్సిడీ, రుణ మాఫీ ఇచ్చింది కాంగ్రెస్సేనని అన్నారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. వినియోగం ప్రాతిపదికన విద్యుత్ పంపకాలు రాష్ట్ర విభజన సందర్భంగా జనాభా ప్రాతిపదికన కాకుండా వినియోగం ప్రాతిపదికన విద్యుత్ పంపకాలు జరపాలని సోనియాను జైపాల్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు ఒప్పించారని రేవంత్ చెప్పారు. అలా తెలంగాణకు 53శాతం.. ఏపీకి 47 శాతం విద్యుత్ ఇచ్చారన్నారు. దమ్ముంటే కేటీఆర్ తనతో కలిసి దుక్కి దున్నాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల విద్యుత్ సరఫరా కావడం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన సవాల్‌ను విద్యుత్ శాఖ మంత్రి స్వీకరించలేదన్నారు. ఉచిత విద్యుత్ పేరుతో కేసీఆర్ అక్రమాలు సీఎం కేసీఆర్ 24 గంటల విద్యుత్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని రేవంత్ ఆరోపించారు. అవసరానికి సరిపడా విద్యుత్ కొనడం లేదని విమర్శించారు. కేంద్రం సూచనలను పెడచెవిన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం 4వేల మెగావాట్ల కోసం రూ. 40వేల కోట్ల అప్పు చేసిందన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు, ఉచిత విద్యుత్ పేరిట చేస్తున్న మోసాల మీద చర్చకు సిద్ధమన్నారు. రాష్ట్రంలో సంవత్సరానికి 20వేల మిలియన్ యూనిట్లను ఉచితంగా ఇస్తూ ప్రభుత్వం రూ.16 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు కేసీఆర్ చెబుతున్నారని, అయితే, ఇందులో రూ.8వేల కోట్లు కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. రైతులకు 24 గంటల ఉచిత ఇచ్చే అంశంపై సెప్టెంబర్ 17న తమ మేనిఫెస్టోలో ప్రకటిస్తామన్నారు. 80 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు వ్యవసాయ మోటార్లకు రాష్ట్ర ప్రభుత్వం మీటర్లుబిగించబోతోందని, ఈ మేరకు కేంద్రంతో ఒప్పందం చేసుకుందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 80 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోతారని కేసీఆర్ సర్వేలో తేలిందన్నారు. ఆయన గజ్వేల్‌లో గెలుస్తారన్న గ్యారంటీ కూడా లేదని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్‌పై గతంలో సీబీఐ విచారణ కోరిన కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. -
‘షాక్’ ఇచ్చింది చంద్రబాబే!.. డ్రామోజీ చెప్పని వాస్తవాలివీ
సాక్షి, అమరావతి : ‘రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరగడానికి గత టీడీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకమే కారణం. 2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేళ్లలో ఆ ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలను చెల్లించకుండా విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల ఊబిలోకి నెట్టేసింది. ప్రస్తుత ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలను పక్కాగా చెల్లించడమే కాకుండా అదనంగా విడుదలచేస్తూ ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. 2014–19 మధ్య పెరిగిన విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యయాలను అప్పటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి (ఏపీఈఆర్సీ) సమర్పించలేదు. నిజానికి.. ఏపీఈఆర్సీ అనుమతించిన మేరకే డిస్కంలు విద్యుత్ చార్జీలను వసూలు చేస్తున్నాయి. అంతకుమించి ఒక్కపైసా కూడా వసూలు చేయడంలేదు. కానీ, ప్రజలు ఏమాత్రం భరించలేని విధంగా ప్రభుత్వం రకరకాల పేర్లతో ఇష్టారాజ్యంగా విద్యుత్ చార్జీలు పెంచిందంటూ ‘స్విచ్చేస్తే షాకే’ శీర్షికతో ఈనాడు మరో తప్పుడు కథనాన్ని మంగళవారం అచ్చేసింది..’ అంటూ ఆ పత్రిక రాతలను విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీలు ఐ.పృద్వీతేజ్, జె.పద్మాజనార్ధన్‌రెడ్డి, కె.సంతోష్ రావులు మంగళవారం అంశాల వారీగా వెల్లడించిన వివరాలివీ... ఆరోపణ: సామాన్యులు మోయలేనంత భారీగా గత నాలుగేళ్లలో ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ చార్జీలనుపెంచింది. వాస్తవం: ఈ అభియోగం పూర్తిగా అసత్యం. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువనున్న ఎంబీసీలకు వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించింది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగానే 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి అప్పటివరకు అమలులో వున్న వార్షిక ట్రూఆప్ చార్జీల స్థానంలో త్రైమాసిక సర్దుబాటు చార్జీల విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి త్రైమాసిక సర్దుబాటు చార్జీల స్థానంలో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ సంవత్సరం జూన్ నుంచి నెలవారీ విద్యుత్ కొనుగోలు చార్జీల సవరింపును అమలుచేస్తున్నాయి. అందువల్ల జూన్‌లో ఈ సంవత్సరం ఏప్రిల్ నెల విద్యుత్ కొనుగోలు చార్జీలు వర్తిస్తాయి. నిబంధనల ప్రకారం కనిష్ట గ్రిడ్ డిమాండ్ ఉన్న సీజన్లో ధరలు తక్కువుంటే ఆ తగ్గింపు కూడా వినియోగదారులకు వర్తిస్తాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే విధానం అమలవుతోంది. ఆరోపణ: ఉపాధి కోసం చిన్నచిన్న దుకాణాలు నడుపుకునే చిన్న వ్యాపారులకు కూడా విద్యుత్ చార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇవ్వలేదు. వాస్తవం: చిరు వ్యాపారుల ప్రయోజనాలను పరిరక్షించాలని ప్రభుత్వం ఎంతో అంకితభావంతో ఉంది. అందువల్లే చిరు వ్యాపారులకు 2019 నుంచి ఇప్పటివరకూ విద్యుత్ చార్జీలు పెంచలేదు. చిరు వ్యాపారులకు మేలు చేయాలనే లక్ష్యంతోనే పలు వర్గాలకు సబ్సిడీ రూపంలో ఉచిత విద్యుత్ అమలుచేస్తోంది. సెలూన్ షాపులు నడుపుకునే వారికి నెలకు 150 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. దారిద్య్రరేఖకు దిగువనున్న గోల్డ్ స్మిత్‌లు (బంగారు ఆభరణాలు తయారుచేసే వారికి) వంద యూనిట్లు, ఇస్త్రీ దుకాణాలు నడుపుకునే రజకులకు 150 యూనిట్లు వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. మరికొన్ని వర్గాల చిరు వ్యాపారులకు కూడా కొంతమేర ఉచిత విద్యుత్ అందిస్తూ సబ్సిడీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఆక్వా యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లు నడుపుకునే వారికి కూడా రాయితీతో కూడిన విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించింది. అంతేకాక.. చిరు వ్యాపారులకు జగనన్న తోడు ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. ఆరోపణ: ప్రజల నుంచి ఏటా రూ.11,270కోట్లు అదనంగా వసూలుచేస్తూ ప్రభుత్వం దండుకుంటోంది. వాస్తవం: ఇది పూర్తిగా అసత్యం. ఏటా వ్యవసాయ, గృహ, వాణిజ్య విద్యుత్ కనెక్షన్లు పెరుగుతాయి. వినియోగదారులు పెరిగినట్లే వసూలు మొత్తం పెరుగుతుంది. దీనిని అదనపు వసూళ్ల కింద చూపడం సమంజసం కాదు. పెరిగిన వ్యయాలకు అనుగుణంగా ఏపీఈఆర్సీ సిఫార్సుల ప్రకారమే డిస్కంలు విద్యుత్ చార్జీలు వసూలుచేస్తున్నాయి. ఇందులో కూడా ప్రభుత్వం కొంత భాగం సబ్సిడీగా భరిస్తోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాటి ఆదాయ అవసరాల నివేదికలు ముందు సంవత్సరం సెపె్టంబర్ నెల నాటికి ఉన్న పరిస్థితుల ఆధారంగా రూపొందిస్తాయి. అప్పుడు వంద శాతం ఖచ్చితత్వంతో విద్యుత్ కొనుగోలు వ్యయం అంచనా వేయడం సాధ్యపడదు. ఆర్థిక సంవత్సరం జరుగుతున్నప్పుడు విద్యుత్ కొనుగోలు ఖర్చులో వాస్తవంగా హెచ్చుతగ్గులుంటాయి. అవి విద్యుత్ చట్టంలోను, సంబంధిత నిబంధనలలో నిర్దేశించిన విధంగా ఇంధన చార్జీలలోగానీ, విద్యుత్ కొనుగోలు వ్యయంలోగానీ ఉండే హెచ్చుతగ్గులు సర్దుబాటు చార్జీల ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలకు వసూలుచేసుకునే వెసులుబాటు ఉంటుంది. దాని ప్రకారమే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ సర్దుబాటు చార్జీలు విధిస్తున్నాయి. ఆరోపణ: ట్రూ అప్, ఇంధన సర్దుబాటు, విద్యుత్ సుంకం అంటూ రకరకాల పేర్లతో విద్యుత్ బిల్లులు వసూలుచేస్తూ ప్రభుత్వం ప్రజలకు షాక్ కొడుతోంది. వాస్తవం: విద్యుత్ తయారుచేయాలంటే బొగ్గు, ఆయిల్ లాంటి అనేక ముడిపదార్థాలు అవసరం. వీటి కొనుగోలు ధర, రవాణా వ్యయం పెరిగినప్పుడు ఆ మేరకు విద్యుత్ చార్జీలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఏ ప్రభుత్వానికైనా ఇలా చేయక తప్పదు. గత ప్రభుత్వం ఇలా చార్జీలు వసూలుచేస్తే ఒప్పుగా, ఇప్పుడు వసూలుచేస్తే తప్పుగా ఈనాడుకు కనిపిస్తోంది. ఈ సంవత్సరం విద్యుత్ నియంత్రణ మండలి వారి టారిఫ్ ఉత్తర్వుల ప్రకారం అన్ని వనరుల నుంచి సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.4.31 ఉండగా, 2023 ఏప్రిల్ నెలలో సంభవించిన అధిక ఉష్ణోగ్రతలవల్ల గ్రిడ్ డిమాండ్ అంచనాల కన్నా అధికంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం దాదాపు 617 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్లో స్వల్పకాలిక కొనుగోళ్ల ప్రాతిపదికన రూ.475 కోట్లు ఖర్చుచేయాల్సి వచ్చింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఏపీఈఆర్సీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ప్రతి యూనిట్‌కు రూ.0.20 ట్రూ అప్ చార్జీని డిస్కంలు వసూలుచేస్తున్నాయి. గృహ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సుంకం పెరగలేదు. ఇదివరకు నిర్దేశించిన ప్రకారమే యూనిట్‌కు కేవలం 6 పైసలు వసూలుచేస్తున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలకు సంబంధించి విద్యుత్ కొనుగోలు, సరఫరా వ్యయం ప్రతి యూనిట్‌కు దాదాపు రూ.1.0 పెరిగినప్పటికీ నిబంధనల మేరకు యూనిట్‌కు కేవలం రూ.0.40 సర్దుబాటుగా వసూలుచేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం 2020–21కు గాను కోవిడ్‌వల్ల విద్యుత్ డిమాండ్ కనిష్టంగా ఉన్న కాలంలో మార్కెట్ ధరలు అత్యంత కనిష్టంగా వున్నప్పుడు విద్యుత్ కొనుగోలు చేయడంతో దాదాపు రూ.4,800 కోట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు మిగల్చాయి. ఈ తగ్గింపు వాస్తవ ఖర్చులు ఆడిట్ అయ్యాక విద్యుత్ నియంత్రణ మండలి వారు జారీచేసిన ఆర్థిక సంవత్సరం 2022–23 టారిఫ్ ఉత్తర్వులలో పంపిణీ సంస్థల నికర వార్షిక ఆదాయ అవసరాల నుంచి తగ్గించారు. ఆరోపణ: వ్యవసాయ మీటర్లకు అమర్చే స్మార్ట్ మీటర్ల భారాన్ని ట్రూఅప్ చార్జీల రూపంలో ప్రజలపైనే వేయనుంది. వాస్తవం: వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల బిగింపునకు అయ్యే మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టంగా ప్రకటించింది. అయినా ఈ ఖర్చును ఇతర వినియోగదారులపై మోపుతారని ‘ఈనాడు’ పదే పదే అబద్ధాలు అచ్చేస్తోంది. ఈ స్మార్ట్ మీటర్ల ఖర్చు భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తగిన ఉత్తర్వులిచ్చింది. స్మార్ట్ మీటర్ల సరఫరాదారుని ఎంపిక ప్రక్రియ కూడా అత్యంత పారదర్శకంగా నిబంధనల ప్రకారమే పూర్తయింది. -
బాదుడు.. బుకాయింపే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను భారీగా పెంచేసిందంటూ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా మరోసారి దుష్ప్రచారానికి తెగబడ్డాయి. రకరకాల పేర్లతో అదనపు బాదుడు పెరిగిందంటూ వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. నిజానికి విద్యుత్ బిల్లులో అన్ని వివరాలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతితో, మార్గదర్శకాల ప్రకారమే పొందుపరుస్తున్నట్లు ఇంధన శాఖ తెలిపింది. చట్టప్రకారమే సర్దుబాటు.. విద్యుత్ రిటైల్ సరఫరా వ్యవస్థలో ఏడాదికోసారి ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ముందు ధరలు ప్రకటిస్తారు. విద్యుత్ పంపిణీ రంగంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలకు అనుగుణంగా సర్దుబాటు చార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ, అవసరాల నివేదికను సెప్టెంబర్ నాటికి ఉన్న పరిస్థితుల ఆధారంగా రూపొందిస్తాయి. కాబట్టి అప్పుడు వంద శాతం ఖచ్చితత్వంతో విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని అంచనా వేయడం సాధ్యం కాదు. ఆర్థిక సంవత్సరం కొనసాగుతున్నప్పుడు విద్యుత్ కొనుగోలు ఖర్చులో హెచ్చు తగ్గులుంటాయి. విద్యుత్ చట్టం నిబంధనల్లో నిర్దేశించిన విధంగా ఇంధన చార్జీలు / కొనుగోలు వ్యయంలో హెచ్చుతగ్గులను సర్దుబాటు చార్జీల ద్వారా వసూలు చేసుకునే వెసులుబాటు డిస్కమ్‌లకు ఉంది. ఆ ప్రకారమే సర్దుబాటు చార్జీలను విధిస్తున్నాయి. రైతులపై పైసా భారం లేదు.. 2014–15 నుంచి 2018–19 వరకు పంపిణీ వ్యవస్థకు సంబంధించి నెట్వర్క్ ట్రూఅప్ చార్జీలు దాదాపు రూ.3,977 కోట్లుగా ఏపీఈఆర్సీ నిర్ధారించింది. ఇందులో ఏపీఎస్పీడీసీఎల్ వాటా రూ.2135 కోట్లు కాగా ఏపీసీపీడీసీఎల్ వాటా రూ.1,232 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ ఖర్చు రూ.609 కోట్లుగా మండలి పేర్కొంది. ఉచిత వ్యవసాయ విద్యుత్ నిమిత్తం ట్రూఅప్ భారం రూ.1,066.54 కోట్లు. రైతులకు అందించే విద్యుత్ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరిస్తోంది. కాబట్టి ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగానికి సంబంధించి ఇంధన వ్యయ సర్దుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మిగిలిన మొత్తం ఇతర కేటగిరీ (వ్యవసాయం కాకుండా) వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని డిస్కమ్‌లను కమిషన్ ఆదేశించింది. పెరిగినదానికన్నా తక్కువే.. విద్యుత్ కొనుగోలులో స్థిర చార్జీలు, చర చార్జీలు (బొగ్గు, ఆయిల్, రవాణా, వాటిపై పన్నులు, డ్యూటీలు) ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. దానికి తోడు బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు ప్రస్తుత అధిక డిమాండ్ సీజన్లో (ఫిబ్రవరి – జూన్) గరిష్టంగా యూనిట్ రూ.10 వరకు ఉంటున్నాయి. అంటే టారిఫ్ ఉత్తర్వుల్లో అంచనా విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.4.30 కన్నా వాస్తవ విద్యుత్ కొనుగోలు ధర అధికంగా ఉంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత పరిస్థితుల నడుమ విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. అయినప్పటికీ వినియోగదారులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దానివల్ల విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్‌కు దాదాపు రూ.1.20 పెరిగింది. నిబంధనలకు లోబడి ప్రతి నెల విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు తగ్గింపు లేదా పెంపు యూనిట్‌కు రూ.0.40 వరకూ వసూలు చేసుకునేందుకు డిస్కమ్‌లకు అనుమతి ఉంది. కేంద్రమే చెప్పింది అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం వార్షిక సర్దుబాటు విధానం స్థానంలో 2021–22 నుంచి త్రైమాసిక సర్దుబాటు విధానం అమలులోకి వచ్చింది. ఈ నిబంధనలకు అనుగుణంగానే ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే పంపిణీ సంస్థలు విద్యుత్ కొనుగోలు వ్యయంలో హెచ్చుతగ్గులపై నివేదికలను సమర్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు త్రైమాసిక విద్యుత్ సర్దుబాటు చార్జీల విధానానికి బదులుగా నెలవారీ విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని సర్దుబాటు చేసేలా ఇటీవల ఏపీఈఆర్సీ మార్గదర్శకాలు జారీ చేసింది. 2021–22కి సంబంధించి త్రైమాసికం ప్రాతిపదికన ఇంధన విద్యుత్ కొనుగోలు సవరింపు చార్జీలు వసూలు చేస్తుండగా ఏపీఈఆర్సీ నియమావళి ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నెల అదనపు విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని జూన్ నెల విద్యుత్ బిల్లులతో కలిపి తీసుకుంటున్నారు. -
ఇంటింటికీ గ్యారంటీలను ఇవ్వలేం: మంత్రి సతీష్
సాక్షి, బళ్లారి: ఎన్నికల ప్రచారంలో ఏవైతే కాంగ్రెస్ పార్టీకి బలాన్ని నింపాయో అవే హామీలు ఇప్పుడు వెంటాడడం మొదలైంది. రాహుల్‌గాంధీ,ప్రియాంకగాంధీ, ఖర్గే, సిద్దు, శివకుమార్ తదితరులు రాష్ట్రంలో మూలమూలలా తిరిగి ఐదు హామీలను అమలు చేస్తామని, ప్రజలకు అనేక రకాలుగా లబ్ధి చేకూరుస్తామని మేనిఫెస్టోలో గ్యారంటీ వాగ్దానాలను చేయడం తెలిసిందే. దావణగెరె జిల్లాలో దండోరా గ్యారంటీ హామీల్లో పేర్కొన్న కరెంటు చార్జీలు, బస్సు చార్జీలను ప్రజలు కట్టవద్దంటూ పలు జిల్లాల్లో వీడియాలు వైరల్ అవుతున్నాయి. రెండు రోజులుగా దావణగెరె జిల్లాలోని పలు గ్రామాల్లో... ఎవరూ విద్యుత్ బిల్లు కట్టవద్దని దండోరా వేస్తున్న వీడియా వైరల్ అయింది. అంతే కాకుండా మహిళలు కేఎస్ఆర్టీసీలో బస్సు చార్జీలు చెల్లించవద్దని పలుచోట్ల వాదనలు జరగడం, ఆ వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. కొన్ని గ్రామాల్లో గ్యారంటీల అమలు కోసం దండోరా వేయిస్తున్నట్లు సమాచారం. అమలు కోసం డిమాండ్లు నేటి నుంచి ఎవరు కరెంట్ బిల్లు కట్టవద్దని, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్ ఇద్దరు కరెంట్ బిల్లు కట్టవద్దని చెప్పారని, 200 యూనిట్ల విద్యుత్ ఉచితం అంటూ హామీ ఇచ్చారని మొదటి క్యాబినెట్ భేటీలోనే అమలు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఐదు హామీలు ఇవే ఇంటికి 200 యూనిట్ ఉచిత విద్యుత్, మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం, డిగ్రీ పూర్తి అయిన నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు, డిప్లొమా నిరుద్యోగికి రూ. 1500, గృహిణికి నెలకు రూ.2 వేలు భృతి, రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి 10 కేజీల ఉచిత బియ్యం అనే ఐదు హామీలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం, దానిపై నాయకులు ఇంటింటా ప్రచారం చేయడం తెలిసిందే. ఇప్పుడు అమలు చేయాలని డిమాండ్లు జోరందుకున్నాయి. బనశంకరి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఇంటింటికీ గ్యారంటీలను ఇవ్వడం సాధ్యం కాదని, నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలను గుర్తించి ఈ పథకాల్ని అందిస్తామని ప్రజాపనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహొళి తెలిపారు. ఆదివారం బెళగావి జిల్లా కిత్తూరు తాలూకా బైలూరు గ్రామంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు తమ ప్రభుత్వంపై చాలా ఆశలు పెట్టుకున్నారని, ఎన్నికల్లో మేము ఇచ్చిన హమీలను నెరవేరుస్తామని చెప్పారు. గ్యారంటీ పథకాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయన్నారు. అందరికీ గ్యారంటీ పథకాలను ఇవ్వడానికి సమయం కావాలని, అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. అయితే ఇంటింటికీ ఇవ్వలేమని, పేదలు, అర్హులను గుర్తించి వర్తింపజేస్తామన్నారు. బసవేశ్వరుని ఆదర్శాల ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. -
విద్యుత్ భారం లేనట్లే.. పెరగని గృహ వినియోగ ఛార్జీలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వినియోగదారులపై ఈసారి ఎలాంటి విద్యుత్ భారం పడలేదు. ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఛార్జీలు మినహా ఎలాంటి ఛార్జీలు పెంచలేదని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి వెల్లడించారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏపీఈఆర్సీ నిర్ణయించిన ఆదాయ అంతరం మొత్తంలో రూ.10,135 కోట్లను సబ్సిడీ రూపంలో డిస్కంలకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని.. ఇది చాలా సంతోషకరమన్నారు. నగరంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకుర్ రామ్‌సింగ్, ఎ.రాజగోపాల్‌రెడ్డిలతో కలిసి విద్యుత్ టారిఫ్ చార్జీలను నాగార్జునరెడ్డి శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టారిఫ్ క్రమబద్ధీకరణకు సబ్సిడీ.. ప్రభుత్వం రాయితీ కల్పిస్తున్న రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ కొనసాగింపుతో పాటు ఎస్సీ, ఎస్టీ, నాయీ బ్రాహ్మణులకు, ఆక్వా రైతుల వినియోగదారులతో పాటు గృహ వినియోగదారులకు టారిఫ్‌ను క్రమబద్ధీకరించడానికి ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ గృహ వినియోగదారులకు సబ్సిడీని ఇచ్చిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.52,590.70 కోట్ల మొత్తంతో ఆదాయ అవసరాలను ఏపీఈఆర్‌సీకీ సమర్పించాయని.. అందులో రూ.49,267.36 కోట్లను ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపిందన్నారు. విద్యుత్ అమ్మకాలు, కొనుగోలు అవసరాలు, విద్యుత్ కొనుగోలు ఖర్చులు విద్యుత్ పంపిణీ సంస్థల అంచనాల కంటే తక్కువగా వుండడంతో ఏపీఈఆర్సీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. చేనేత పరిశ్రమ, పిండిమిల్లులకు ఊరట ఇక పవర్లూమ్ వినియోగదారులకు కేవీఏహెచ్ (కిలోవోల్ట్ యాంపియర్ అవర్స్) బిల్లింగ్ మినహాయింపు ఇచ్చినట్లు నాగార్జునరెడ్డి చెప్పారు. చేనేత కార్మిక వర్గాలు, పిండి మిల్లుల విద్యుత్ వినియోగదారుల అభ్యర్థనల మేరకు 10 హెచ్‌పీ వరకు కేవీఏహెచ్ బిల్లింగ్‌ను మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే, గతేడాదిలో ఒక్కసారే వున్న ఆఫ్–సీజన్ ఎంపికను ఈ ఏడాదికి రెండుసార్లుగా మార్చామన్నారు. ఇప్పటివరకు ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్‌లో హెచ్‌టీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ డిమాండ్ చార్జీలను వసూలుచేయడం లేదన్నారు. ఈ ఏడాదిలో రూ.475 చొప్పున చెల్లించాల్సి వుంటుందన్నారు. సోలార్ రైతులకు సమస్యలొస్తే.. ఉచిత విద్యుత్ సోలార్ పంపుసెట్లను వాడుతున్న రైతులకు సోలార్ విద్యుత్ వినియోగంలో సమస్యలు ఎదురైతే ప్రభుత్వ విధానం ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థలు వారికి ఉచిత విద్యుత్‌ను పంపిణీ చేయాలని ఆదేశించినట్లు నాగార్జునరెడ్డి చెప్పారు. అంతేకాక.. సోలార్ రూఫ్‌టాప్ నెట్ మీటరింగ్ మార్గదర్శకాలను డిస్కమ్‌లు ఖచ్చితంగా పాటించాలన్నారు. విద్యుత్ ఆదా అంశానికి సంబంధించి గృహ వినియోగదారులకు ఎల్ఈడీ, ట్యూబ్‌లైట్లు, బీఎల్డీసీ (బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ మోటార్) సీలింగ్ ఫ్యాన్లు, సూపర్ ఎఫీషియెంట్ ఎయిర్ కండిషనర్లు వంటి ఇంధన ఉపకరణాల విక్రయాల పైలట్ ప్రాజెక్టును ఇప్పటికే ఆమోదించినట్లు తెలిపారు. ఉచిత విద్యుత్‌లో అలసత్వం వహిస్తే చర్యలు రైతులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడంలో అలసత్వం వహిస్తే డిస్కమ్ అధికారులపై చర్యలు తప్పవని నాగార్జునరెడ్డి హెచ్చరించారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరాకు సంబంధించి విద్యుత్ సరఫరా నాణ్యత, వినియోగదారుల సంతృప్తిని సమీక్షించేందుకు జిల్లా కమిటీల నివేదికలు, మినిట్స్‌ను విద్యుత్ పంపిణీ సంస్థలు తమ వెబ్సైట్లో పొందుపరచడంతో పాటు వివరాలను ఏపీఈఆరీ్సకి సమర్పించాలని ఆదేశించామన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రభుత్వ పరిధిలోని అంశం కాదని.. అది చట్టపరిధిలోని అంశమని ఆయన స్పష్టంచేశారు. -
ఇక ‘పీక్’లో షాక్!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ టారిఫ్ విధానంలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. విద్యుత్ డిమాండ్ గరిష్టంగా (పీక్) ఉండే వేళల్లో వాడిన విద్యుత్‌కు సమీప భవిష్యత్తులో అధిక చార్జీలు విధించి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అదే సమయంలో డిమాండ్ తక్కువగా ఉండే వేళల్లో వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన విద్యుత్ చార్జీల్లో 20 శాతం వరకు రాయితీ అందించాలనుకుంటోంది. ఈ మేరకు ముసాయిదా విద్యుత్ (వినియోగదారుల హక్కులు) సవరణ నిబంధనలు–2023 పేరిట కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై వచ్చే నెల 14లోగా అభిప్రాయాలు తెలపాలని రాష్ట్రాలను కోరింది. పీక్ టైమ్‌లో మోత మోగనుంది... ఈ నిబంధనలు అమల్లోకి వస్తే డిమాండ్ గరిష్టంగా ఉండే వేళల్లో వాడిన విద్యుత్‌కు సంబంధించి వసూలు చేయాల్సిన చార్జీలు ఆయా కేటగిరీల సాధారణ చార్జీల కంటే అధికంగా ఉండనున్నాయి. వాణిజ్య, పారిశ్రామిక కేటగిరీల వినియోగదారుల నుంచి కనీసం 20 శాతం, వ్యవసాయం మినహా ఇతర అన్ని కేటగిరీల వినియోగదారుల నుంచి కనీసం 10 శాతం అధిక టైమ్ ఆఫ్ డే టారిఫ్‌ను ఈఆర్సీ నిర్ణయించనుంది. ఇక స్మార్ట్‌మీటర్లు తప్పనిసరి... విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్‌మీటర్లు బిగించిన వెంటనే ఈ మేరకు ‘టైమ్ ఆఫ్ డే’టారిఫ్‌ను వర్తింపజేయాలని కేంద్ర విద్యుత్ శాఖ కోరింది. 2024 ఏప్రిల్ 1 నుంచి 10 కిలోవాట్లలోపు గరిష్ట డిమాండ్గల పారిశ్రామిక, వాణిజ్య కేటగిరీల వినియోగదారులకు... 2025 ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయం మినహా మిగిలిన కేటగిరీల వినిమోగదారులకు టైమ్ ఆఫ్ డే టారిఫ్‌ను అమలుచేయాలని గడువు విధించింది. ఈ గడువుల్లోగా ఆయా కేటగిరీల వినియోగదారులందరికీ స్మార్ట్‌మీటర్లను తప్పనిసరిగా బిగించాల్సి ఉంది. ప్రస్తుత విధానంలో మార్పు ఏమిటి? సాధారణంగా పగటివేళల్లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగి రాత్రివేళల్లో గణనీయంగా తగ్గిపోతుంది. డిమాండ్ గరిష్టంగా ఉండే వేళల్లో అవసరమైన అదనపు విద్యుత్‌ను ఎనర్జీ ఎక్ఛ్సేంజీల నుంచి అధిక ధరలకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కొనుగోలు చేస్తున్నాయి. మరోవైపు రాత్రివేళల్లో డిమాండ్ లేక విద్యుత్ మిగిలిపోతోంది. దీనికి పరిష్కారంగా రాత్రివేళల్లో డిమాండ్‌ను పెంచి పగటివేళల్లో తగ్గించడం కోసం టైమ్ ఆఫ్ డే విధానాన్ని డిస్కంలు అమలు చేస్తున్నాయి. డిమాండ్ అధికంగా ఉండే ఉదయం 6–10 గంటలు, సాయంత్రం 6–10 గంటల మధ్య కాలంలో వినియోగించిన ప్రతి యూనిట్ విద్యుత్‌కు ‘టైమ్ ఆఫ్ డే టారిఫ్’పేరుతో అదనంగా రూపాయి చార్జీని విధిస్తున్నాయి. డిమాండ్ తక్కువగా ఉండే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య వాడిన ప్రతి యూనిట్ విద్యుత్‌కు ‘టైమ్ ఆఫ్ డే ప్రోత్సాహాకాలు’పేరుతో ఒక రూపాయి రాయితీ అందిస్తున్నాయి. హెచ్‌టీ కేటగిరీలోని–పరిశ్రమలు, పౌల్ట్రీ ఫారాలు, హెచ్‌టీ–2 (బీ) ఇతరత్రా వినియోగదారులు, ప్రార్థనా స్థలాలు, ఎయిర్‌పోర్టులు, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ఈవీ చార్జింగ్ స్టేషన్లకు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. తాజా ముసాయిదా నిబంధనలు అమల్లోకి వస్తే నిర్దేశిత గడువులోగా వ్యవసాయం మినహా మిగిలిన అన్ని కేటగిరీల వినియోగదారులకు టైమ్ ఆఫ్ డే టారిఫ్, రాయితీ విధానం అమల్లోకి వస్తుంది. పీక్ డిమాండ్ ఎన్ని గంటలు? సూర్యరశ్మి ఉండే వేళల (సోలార్ హవర్స్)కు సంబంధించిన టారిఫ్.. ఆయా కేటగిరీల వినియోగదారుల సాధారణ టారిఫ్‌తో పోలిస్తే 20 శాతం తక్కువగా ఉండాలి. రోజులో విద్యుత్ డిమాండ్ ఎన్ని గంటలపాటు గరిష్టంగా ఉంటుందనే విషయాన్ని ఈఆర్సీ/ఎస్డీఎల్సీలు ప్రకటిస్తాయి. దీని ఆధారంగా టైమ్ ఆఫ్ డే టారిఫ్‌ను ఖరారు చేస్తాయి. అయితే సూర్యుడు ఉండే వ్యవధికన్నా పీక్ డిమాండ్ గంటల నిడివి ఎక్కువ ఉండరాదు. అన్ని కేటగిరీల వినియోగదారులకు సంబంధించిన టారిఫ్‌ను డిస్కంల వెబ్సైట్లో పొందుపరచాలి. ఇంధన సర్దుబాటు సర్‌చార్జీ, ఇతర చార్జీల విధింపుతో టారిఫ్‌లో జరిగే మార్పులను కనీసం నెల రోజుల ముందే వెబ్సైట్లో పొందుపరచడంతోపాటు విద్యుత్ బిల్లు/ఎస్ఎంఎస్/మొబైల్ యాప్ ద్వారా తెలియజేయాలి. స్మార్ట్ మీటర్లతో పెరగనున్న లోడ్ స్మార్ట్ మీటర్లను బిగించాక నమోదైన గరిష్ట లోడ్ ఆధారంగా అంతకుముందు కాలం నాటి విద్యుత్ వినియోగంపై జరిమానాలు విధించడానికి వీలు లేదు. కనెక్షన్ సాంక్షన్డ్ లోడ్ కన్నా అధిక లోడ్‌తో విద్యుత్ వినియోగించినట్టు రికార్డు అయితే, దాని ఆధారంగానే ఆ నెలలో బిల్లులను జారీ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఆ సంవత్సరంలో నమోదైన మూడు గరిష్ట లోడ్ సామర్థ్యాల్లో అతి తక్కువ లోడ్‌ను ప్రామాణికంగా తీసుకుని సాంక్షన్డ్ లోడ్‌ను సవరించాల్సి ఉంటుంది. -
తప్పిన ‘ట్రూ అప్’ షాక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు భారీ ఉపశమనం లభించింది. రూ.12,718.4 కోట్ల ట్రూఅప్ చార్జీల భారం తప్పింది. ఇదే సమయంలో సాధారణ విద్యుత్ చార్జీల పెంపు కూడా ఉండబోదని స్పష్టమైంది. ట్రూఅప్ చార్జీల మొత్తంతోపాటు రూ.9,124.82 కోట్ల సబ్సిడీ సొమ్మును రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనితో వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే 2023–24 ఆర్థిక ఏడాదిలో రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ చార్జీల పెంపు ఉండదని, ప్రస్తుత చార్జీలు (టారిఫ్) యథాతథంగా కొనసాగుతాయని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ ఈఆర్సీ) శుక్రవారం ప్రకటించింది. ఐదేళ్లలో చెల్లిస్తామనడంతో.. 2023–24లో ప్రస్తుత విద్యుత్ రిటైల్ సప్లై టారిఫ్‌ను యథాతథంగా కొనసాగించాలని.. గత కొన్నేళ్లకు సంబంధించి వినియోగదారుల నుంచి ట్రూఅప్ చార్జీలను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ డిస్కంలు ఇంతకుముందే ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. ఇలా వసూలు చేయాల్సిన చార్జీల మొత్తాన్ని రూ.12, 718.4 కోట్లుగా ఈఆర్సీ తే ల్చింది. ఈ మొత్తాన్ని విద్యుత్ వినియోగదారుల నుంచే వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని వచ్చే ఐదేళ్లలో వడ్డీతో కలిపి చెల్లించడానికి ముందుకు వచ్చింది. దీనితో విద్యుత్ చార్జీలను పెంచాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ మేరకు టీఎస్ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణ య్య శుక్రవారం తమ కార్యాలయంలో ఈ వివరాలను వెల్లడించారు. ప్రార్థనా స్థలాలకు చార్జీల తగ్గింపు డిస్కంల విజ్ఞప్తి మేరకు ఈఆర్సీ ప్రార్థన స్థలాలకు విద్యుత్ చార్జీలను యూనిట్‌కు రూ.5కి తగ్గించింది. ప్రస్తుతం ఎల్టీ –7(బీ) కేటగిరీలో 2 కిలోవాట్లలోపు లోడ్ కలిగిన ప్రార్థన స్థలాలకు యూనిట్‌కు రూ.6.4.. ఆపై లోడ్ కలిగిన ప్రార్థన స్థలాలకు యూనిట్‌కు రూ.7 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇకపై అన్ని ప్రార్థన స్థలాలకు యూనిట్ రూ.5కి తగ్గనుంది. హెచ్‌టీ–2 (బీ) కేటగి రీలోని ప్రార్థన స్థలాలకు అదనంగా రూ. 260 ఫిక్స్డ్ చార్జీలను వసూలు చేస్తారు. సంప్రదింపులతో తప్పిన భారం! ఏదైనా నిర్దిష్ట కాలానికి సంబంధించి విద్యుత్ కొనుగోళ్లు, పంపిణీ కోసం ఈఆర్సీ ఆమోదించిన అంచనా వ్యయం కంటే.. జరిగిన వాస్తవ వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు.. ఈ వ్యత్యాసాన్ని ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేస్తారు. 2016–17 నుంచి 2022–23 మధ్య కాలానికి సంబంధించి రూ.12,015 కోట్ల విద్యుత్ కొనుగోలు ట్రూ అప్ వ్యయం, 2006–07 నుంచి 2020–21 మధ్యకాలానికి రూ.4,092 కోట్ల డిస్ట్రిబ్యూ షన్ ట్రూఅప్ వ్యయం కలిపి.. మొత్తం రూ. 16,107 కోట్లను ట్రూఅప్ చార్జీలుగా వసూ లు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు ఇటీవల ఈఆర్సీకి విజ్ఞప్తి చేశాయి. ఈ లెక్కలపై పరిశీలన జరిపిన ఈఆర్సీ రూ.12,718.4 కోట్ల ట్రూఅప్ చార్జీలకు ఆమోదం తెలపగా.. ఈ మేరకు బిల్లుల్లో వసూలుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు కోరాయి. కానీ ఈఆర్సీ ఈ స్థాయిలో భారం వేస్తే వినియోగదారులు ఇబ్బందిపడతారంటూ సీఎం కార్యాలయంతో సంప్రదింపులు జరిపింది. దీంతో ఈ భారాన్ని భరించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించడంతో వినియోగదారులకు ఉపశమనం లభించింది. -
విద్యుత్ డిస్కంలకు షాక్! కరెంట్ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం?
సాక్షి, హైదరాబాద్: ఎండాకాలం మొదలవుతూనే విద్యుత్ డిస్కంలకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పెరుగుతున్న డిమాండ్ ఓవైపు, అవసరానికి తగినంత సరఫరా చేయలేక మరోవైపు కిందామీదా పడుతున్న డిస్కంలపై విద్యుత్ కొనుగోళ్ల భారం మీద పడుతోంది. ‘దిగుమతి చేసిన బొగ్గు, గ్యాస్ ఆధారిత ప్లాంట్ల’ విద్యుత్‌ను గరిష్టంగా యూనిట్‌కు రూ.50 ధరతో అమ్ముకోడానికి ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజీ (ఐఈఎక్స్)కు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) అనుమతి ఇవ్వడమే దీనికి కారణం. ఈ అంశంలో ఐఈఎక్స్ వేసిన పిటిషన్‌పై సీఈఆర్సీ శుక్రవారం తీర్పు ఇచ్చింది. దీని ప్రభావంతో ఈ వేసవిలో విద్యుత్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని.. ఎక్కువగా విద్యుత్ కొనుగోలు చేసే రాష్ట్రాలపై భారం పడుతుందని విద్యుత్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిమితితో నష్టాల పేరిట.. గతేడాది వేసవిలో దేశవ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. సరిపడా అందుబాటులో లేక తీవ్ర కొరత ఏర్పడింది. ఎనర్జీ ఎక్స్చేంజీల్లో విద్యుత్ ధర యూనిట్‌కు రూ.20కు మించిపోయాయి. అత్యధిక ధరతో కొనుగోళ్లతో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన సీఈఆర్సీ.. విద్యుత్ ధర యూనిట్‌కు రూ.12 మించరాదని పరిమితి విధిస్తూ 2022 మే 6న సుమోటోగా ఆదేశాలు జారీ చేసింది. అయితే దిగుమతి చేసుకున్న బొగ్గు, గ్యాస్ ఆధారిత ప్లాంట్ల విద్యుత్ ధరలు సాధారణంగానే ఇంతకన్నా అధికంగా ఉంటాయి. పరిమితి కారణంగా అవి ఎనర్జీ ఎక్స్చేంజీల్లో విద్యుత్ విక్రయించలేక నష్టపోతున్నట్టు కేంద్రం గుర్తించింది. అలాంటి ప్లాంట్లు ఎనర్జీ ఎక్స్చేంజీల్లో అధిక ధరతో విద్యుత్ విక్రయించుకోవడానికి వీలుగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గతేడాది అక్టోబర్ 11న ‘హై ప్రైస్ డే అహెడ్ మార్కెట్ సెగ్మెంట్’ పేరుతో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ‘ఎన్రాన్’ విద్యుత్ ధర ఆధారంగా.. కొత్త విధానానికి అనుగుణంగా.. దిగుమతి చేసిన బొగ్గు, గ్యాస్ ఆధారిత ప్లాంట్ల విద్యుత్‌ను గరిష్టంగా యూనిట్‌కు రూ.50 ధరతో విక్రయించేందుకు అనుమతి కోరుతూ ఇండియన్ ఎనర్జీ ఎక్ఛ్సేంజీ గతేడాది చివరిలో సీఈఆర్సీలో పిటిషన్ వేసింది. తర్వాత ఈ ధరను రూ.99 వరకు పెంచాలని అనుబంధ అఫిడవిట్ దాఖలు చేసింది. మహారాష్ట్రలోని రత్నగిరి గ్యాస్ అండ్ పవర్ ప్రైవేటు లిమిటెడ్ (పూర్వపు ఎన్రాన్ సంస్థ)కు చెందిన విద్యుత్‌ను ఇటీవల యూనిట్‌కు రూ.58.98 భారీ ధరతో విక్రయించినట్టు వివరించింది. ఆ ప్లాంట్ విద్యుత్ వేరియబుల్ కాస్ట్(గ్యాస్/ఇంధన వ్యయం) యూనిట్ రూ.58.48గా ఉందని.. దానికి అనుగుణంగా అధిక ధరను నిర్ణయించాలని కోరింది. దీనిపై సీఈఆర్సీ వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించగా.. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ) అధిక ధరను సమర్థించింది. సీఈఆర్సీ దీనిని పరిగణనలోకి తీసుకుంది. మొత్తం 100 శాతం దిగుమతి చేసిన బొగ్గు, గ్యాస్‌తో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను మాత్రమే ‘హైప్రైస్ డే అహెడ్ మార్కెట్’ సెగ్మెంట్ కింద, అదీ యూనిట్‌కు గరిష్టంగా రూ.50 ధరతో విక్రయించడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానంపై కొంతకాలం పరిశీలన జరిపిన తర్వాత పునః సమీక్షిస్తామని తెలిపింది. అయితే రెండు దశాబ్దాల కింద ఎన్రాన్ విద్యుత్ కుంభకోణం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ప్లాంటు విద్యుత్ ధరను పరిగణనలోకి తీసుకుని గరిష్ట ధరను ఖరారు చేయడం చర్చనీయాంశంగా మారింది. మూడో ఆప్షన్‌గానే.. అధిక ధర విద్యుత్! ఎనర్జీ ఎక్స్చేంజీలో ఈ అధిక ధర (హైప్రైస్ సెగ్మెంట్) విద్యుత్ విక్రయాన్ని మూడో ఆప్షన్‌గా చేర్చారు. ‘డే అహెడ్ మార్కెట్ సెగ్మెంట్’ విధానం కింద ఎనర్జీ ఎక్ఛ్సేంజీల్లో తొలుత సౌర, పవన విద్యుత్ వంటి గ్రీన్ విద్యుత్‌ను అమ్మకానికి పెడతారు. వాటి విక్రయాలు పూర్తయ్యాక థర్మల్ విద్యుత్‌ను విక్రయిస్తారు. ఈ రెండు సందర్భాల్లో బిడ్డింగ్‌లో పాల్గొని విద్యుత్‌ను పొందలేకపోయిన డిస్కంలు.. ‘హైప్రైస్’ విద్యుత్ కోసం బిడ్డింగ్ చేయాల్సి ఉంటుంది. దీనిలో కనీస ధర సున్నా నుంచి గరిష్ట ధర రూ.50కి మధ్య కోట్ చేయవచ్చు. ఎక్కువ ధరను కోట్ చేసిన డిస్కంలకు విద్యుత్‌ను విక్రయిస్తారు. ఎనర్జీ ఎక్ఛ్సేంజీల్లో కొనుగోళ్లు ఎందుకు? రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) సాధారణంగా దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా ప్లాంట్ల నుంచి నేరుగా విద్యుత్ కొనుగోళ్లు చేస్తుంటాయి. వీటి విద్యుత్ ధర ఒప్పందాలను బట్టి యూనిట్‌కు రూ.4.5 నుంచి రూ.6 వరకు ఉంటుంది. ఇలాంటి ఒప్పందాలు కాకుండా వివిధ ప్లాంట్లు, విద్యుత్ సంస్థల నుంచి బహిరంగ మార్కెట్లో ‘ఎనర్జీ ఎక్స్చేంజీ’ల ద్వారా విద్యుత్ విక్రయాలు కూడా జరుగుతుంటాయి. డిస్కంలు విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయినప్పుడు ‘డే ఎహెడ్ మార్కెట్ (డీఏఎం)’ సెగ్మెంట్ కింద ఎనర్జీ ఎక్స్చేంజీల ద్వారా అవసరమైన మేర కరెంటు కొని వినియోగదారులకు సరఫరా చేస్తుంటాయి. ఈ కొనుగోళ్ల కోసం ఆన్లైన్లో బిడ్లు వేయాల్సి ఉంటుంది. ఎక్కువ ధర కోట్ చేసిన డిస్కంలకు విద్యుత్ లభిస్తుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు రాష్ట్రాల డిస్కంలు పోటాపోటీగా బిడ్డింగ్‌లో పాల్గొంటుండటంతో విద్యుత్ ధరలు భారీగా పెరిగిపోతుంటాయి. ‘కొనే’ రాష్ట్రాలకు భారమే గత ఏడాది వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగిఎక్ఛ్సేంజీల్లో విద్యుత్ ధరలు భారీగా పెరిగిపోయాయి. అయినా యాసంగి కోసం రైతులకు, ఇతర వినియోగదారులకు సరఫరా సాగించడానికి తెలంగాణ డిస్కంలు రోజుకు రూ.100 కోట్ల నుంచి రూ.165 కోట్లు ఖర్చుచేసి ఎనర్జీ ఎక్ఛ్సేంజీల నుంచి విద్యుత్ కొనుగోలు చేశాయి. పలు ఇతర రాష్ట్రాలూ అత్యధిక ధరతో విద్యుత్ కొన్నాయి. ఇప్పుడు ‘దిగుమతి’ ప్లాంట్ల విద్యుత్‌ను యూనిట్‌కు రూ.50 వరకు అమ్ముకునే అవకాశం రావడంతో.. ప్రస్తుత వేసవి లో విద్యుత్ కొనుగోళ్ల భారం పెరిగిపోతుందని నిపుణులు చెప్తున్నారు. దేశంలో 17,600 మెగావాట్ల మేర ‘దిగుమతి’ ఆధారిత ప్లాంట్లు ఉన్నాయని.. వాటి విద్యుత్ ధరలు అమాంతం పెరిగిపోనున్నా యని చెప్తున్నారు. విద్యుత్‌ను ఎక్కువగా కొనే రాష్ట్రాలపై భారం పడుతుందని వివరిస్తున్నారు. -
ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ.. మీరేమంటారు?
సాక్షి, అమరావతి: విద్యుత్ చార్జీల (టారిఫ్) సవరణపై ఈనెల 19వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రజాభిప్రాయం సేకరించనుంది. ఈ నెల 19, 20, 21 తేదీల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ విచారణ చేపట్టనుంది. సామాన్యులపై ఎటువంటి విద్యుత్ చార్జీల భారం వేయకుండా విద్యుత్ చార్జీలను సవరించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) 2023–24 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ సప్లై బిజినెస్ (ఆర్ఎస్బీ) అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్)ను గతేడాది నవంబర్ 30న ఏపీఈఆర్సీకి సమర్పించాయి. వీటిపై ఈసారి కూడా గతేడాది లాగానే విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ విచారణ నిర్వహించనున్నారు. మండలి చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, కార్యదర్శి, సభ్యులు, రాష్ట్ర ఇంధనశాఖ, డిస్కంల అధికారులు ఈ విచారణలో పాల్గొననున్నారు. జిల్లాల్లో ప్రత్యక్ష ప్రసారం ఈ నెల 19వ తేదీ నుంచి మూడు రోజులు ఉదయం గం.10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం రెండుగంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలు అన్ని డిస్కంల టారిఫ్ ఫైలింగ్‌కు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను మండలికి తెలపవచ్చు. అన్ని జిల్లాల్లోని విద్యుత్ ఎస్ఈ, ఈఈ కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాట్లు చేయనున్నారు. ప్రజలు తమ సమీపంలోని ఆయా కార్యాలయాలకు వెళ్లి తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. ముందు నమోదు చేసుకున్న వారి నుంచి, తరువాత నమోదు చేసుకోని వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రజలంతా వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డిస్కంలను ఏపీఈఆర్సీ ఆదేశించింది. -
వచ్చే ఏడాది విద్యుత్ చార్జీలు పెరగవు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 2023–24 ఆర్థిక సంవత్సరానికి చేసిన వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ సరఫరా ధరల ప్రతిపాదనల్లో గృహ విద్యుత్ వినియోగదారులకు, వాణిజ్య అవసరాలకు, సాధారణ పరిశ్రమల రంగానికి, స్థానిక సంస్థలకు, ప్రభుత్వ, ప్రైవేటు నీటిపారుదల ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ చార్జీల పెంపుదల లేదని రాష్ట్ర ఇంధన శాఖ స్పష్టంచేసింది. ‘సాక్షి’ ప్రతినిధికి గురువారం ఇంధన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు చేసిన టారిఫ్ ప్రతిపాదనల సమగ్ర వివరాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి గతనెల 30న సమర్పించాయి. వాటి ప్రతులు ఏపీఈఆర్సీ, పంపిణీ సంస్థల వెబ్సైట్లలో ఉన్నాయి. నివేదిక ప్రతులు డిస్కంల ప్రధాన కార్యాలయంలోను, సర్కిల్ కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ సబ్సిడీలు, రాయితీల్లో ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సరఫరా సేవా ఖర్చు నిర్దేశిత యూనిట్ ఖర్చు రూ.6.98 కన్నా రూ.0.70æ పెరుగుతుందని అంచనా వేసినప్పటికీ ఆ భారాన్ని ఏ వర్గంపైనా వేయడంలేదు. జనం నెత్తిన రూ.13,487.54 కోట్లు భారం పడుతోందని పచ్చ పత్రికలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. అది పంపిణీ సంస్థల వార్షిక ఆదాయ ఆవశ్యకతకు, ప్రస్తుతం టారిఫ్, ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయానికి మధ్య వుండే వ్యత్యాసం మాత్రమే. ఇదంతా ధరలను పెంచడం ద్వారా వినియోగదారులపై మోపడం జరగదు. డిస్కంల ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి, ప్రజాభిప్రాయం తీసుకుని, దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో భాగంగా ఇచ్చే విద్యుత్ సబ్సిడీ, ఇతర రాయతీల ద్వారా ఈ ఆదాయ అంతరాన్ని విద్యుత్ సంస్థలు పూడ్చుకుంటాయి. చార్జీల వసూలు ద్వారా నష్టాల భర్తీ జరగదు రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు అంటే.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం, ఆక్వా రంగం.. తదితరులకు అందించే విద్యుత్ రాయితీల మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11,123 కోట్లుగా నిర్ధారించారు. అయితే, ఏపీఈఆర్సీకి సమర్పించిన ప్రతిపాదనల్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేటగిరి వారీగా, శ్లాబుల వారీగా ప్రస్తుతం అమలులో వున్న ధరలనే ప్రతిపాదిస్తూ (ఇప్పటికే రాయితీ పొందుతున్న ఎనర్జి ఇంటెన్సివ్ పరిశ్రమలకు మినహా) నివేదిక ఇచ్చారు. అంతేగానీ, నష్టాలను చార్జీల వసూలుతో భర్తీ చేసుకుంటామని ఎక్కడా ప్రతిపాదించలేదు. వినియోగదారులపై విద్యుత్ చార్జీల పెంపుదల ప్రతిపాదన చాలా గోప్యంగా ఉంచారన్నది కూడా పూర్తిగా అవాస్తవం. డిస్కంల వారీగా సేవా ఖర్చు ఇక డిస్కంల కొనుగోలు వ్యయంపై వేర్వేరు గణాంకాలు సమర్పించాయనడం సరైంది కాదు. పంపిణీ సంస్థ సేవా ఖర్చు (కాస్ట్ అఫ్ సర్వీస్)లో వివిధ భాగాలు అంటే.. విద్యుత్ కొనుగోలు వ్యయం, ప్రసార, పంపిణీ నష్టాలు, నెట్వర్క్ నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు, మరమ్మతు ఖర్చులు మొదలైనవి ఒక్కో డిస్కంలో ఒక్కో విధంగా ఉంటాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు డిస్కంలకు విద్యుత్ కొనుగోలు వ్యయం, మొత్తం సేవా ఖర్చు–కాస్ట్ అఫ్ సర్వీస్ ప్రతీ యూనిట్‌కు ఇలా వున్నాయి.. (రూ.లలో) -
వచ్చే ఏడాది విద్యుత్ చార్జీల పెంపు లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2023–24లో విద్యుత్ చార్జీలు వడ్డించకుండా ప్రస్తుత రిటైల్ టారిఫ్‌ను యధాతథంగా కొనసాగించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల యాజమాన్యాలు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి ఈ నెలాఖరులోగా 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్), విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను సమర్పించేందుకు డిస్కంలు కసరత్తు నిర్వహిస్తున్నాయి. ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది రాష్ట్రంలో విద్యుత్‌చార్జీలు పెంచి వినియోగదారులపై రూ.5,597 కోట్ల వార్షిక భారాన్ని డిస్కంలు వేశాయి. దీనికితోడు వచ్చే ఏడాదిలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో 2023–24లో విద్యుత్ చార్జీలు పెంచొద్దని డిస్కంలు నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభుత్వ సబ్సిడీ పెంపు! విద్యుత్ టారిఫ్ నిబంధనల ప్రకారం.. ప్రతి ఏటా నవంబర్ చివరిలోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలతోపాటు వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)ను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాలి. వచ్చే ఏడాది రాష్ట్రానికి ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం? ఈ మేరకు విద్యుత్ సరఫరాకి కానున్న మొత్తం వ్యయం ఎంత? ప్రస్తుత విద్యుత్ చార్జీలతోనే బిల్లులు వసూలు చేస్తే వచ్చే నష్టం(ఆదాయ లోటు) ఎంత? లోటును భర్తీ చేసుకోవడానికి ఏ కేటగిరీ వినియోగదారులపై ఎంత మేర చార్జీలు పెంచాలి? అనే అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఏఆర్ఆర్ నివేదికలో ఉంటాయి. వచ్చే ఏడాది విద్యుత్ చార్జీలు పెంచే అవకాశాలు లేనందున రాష్ట్ర ప్రభుత్వమే తమకు సబ్సిడీలు పెంచి ఆదాయలోటును భర్తీ చేయాలని డిస్కంలు ప్రతిపాదించనున్నట్టు తెలిసింది. డిస్కంలు తీవ్ర ఆర్థికనష్టాల్లో ఉన్న నేపథ్యంలో సబ్సిడీల పెంపు తప్ప మరో మార్గంలేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
విద్యుత్ చార్జీలపై అచ్చోసిన అబద్ధాలు
సాక్షి, అమరావతి: విద్యుత్ చార్జీలపై అవే అబద్ధాలను పదేపదే రాస్తూ.. ప్రజలను మభ్యపెట్టేందుకు ‘ఈనాడు’ విశ్వప్రయత్నం చేస్తోంది. ఆ క్రమంలోనే ‘గుట్టుగా షాక్’ అంటూ మరో తప్పుడు కథనాన్ని పతాక శీర్షికన మంగళవారం ప్రచురించింది. తాను చెబుతున్న దానిలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిసి కూడా పచ్చి అబద్ధాలను అచ్చోసి వదిలింది. సర్దుబాటు చార్జీల పాపం గత ప్రభుత్వానిదేనని.. ఈ ప్రభుత్వంలో వినియోగదారులపై అదనపు భారం మోపకపోగా.. విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసినా వాటన్నిటినీ పక్కనపెట్టి పచ్చ పత్రిక అవాస్తవాలను పచ్చిగా వండి వార్చేసింది. ‘ఈనాడు’ విషపు రాతలపై తీవ్రంగా మండిపడిన ఇంధన శాఖ అసలు నిజాలను వెల్లడించింది. టెలిస్కోపిక్ విధానం వల్ల వినియోగదారులకు మేలు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో మూడుసార్లు విద్యుత్ చార్జీలను పెంచిందనడం పూర్తిగా అవాస్తవమని ఇంధన శాఖ పేర్కొంది. ఏడాదిన్నర కాలంలో విద్యుత్ చార్జీలను పెంచింది ఒకసారి మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో గృహ విద్యుత్ వినియోగదారుల టారిఫ్‌ను హేతుబద్ధీకరించి ఒక ఉమ్మడి ఏక గ్రూపు టెలిస్కోపిక్ బిల్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు వివరించింది. దీనివల్ల వినియోగదారులకు మొదటి స్లాబ్ రాయితీ ధరల ప్రయోజనం అందుతుందని వెల్లడించింది. గతంలో విద్యుత్ వాడకపోయినా నెలవారీ కనీస చార్జీలు కట్టాల్సి వచ్చేదని, ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి వాటిని రద్దు చేశారని తెలిపింది. దీని ప్రకారం సింగిల్ ఫేజ్ వారికి రూ.65, త్రీ ఫేజ్ వినియోగదారులకు రూ.150 చొప్పున ప్రతినెలా మిగులుతోందని వివరించింది. ఇంధన శాఖ తెలిపిన మరిన్ని వాస్తవాలు ఇలా ఉన్నాయి. గత ఖర్చులను దాచి పెట్టడం వల్లే.. ► ప్రస్తుతం విధిస్తున్న ట్రూ ఆప్ చార్జీలు గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ కోసం చేసిన వాస్తవ ఖర్చులను నిజాయితీగా బయటపెట్టకపోవడం వల్ల వచ్చినవే తప్ప ఇప్పటి ప్రభుత్వం విధించినవి కావు. ► గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో జరిగిన వాస్తవ ఖర్చులను దాచిపెట్టి .. అన్ని నివేదికలలోనూ తక్కువ అంచనాలు చూపించారు. దానికి సంబంధించిన సర్దుబాటు కోసం అదనంగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ► డిస్కంలు నష్టాలను భరించడానికి చేసిన అప్పులపై గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి వడ్డీ కూడా కట్టలేదు. ఆ అప్పులు తీర్చడానికి సంస్థలకు ఏవిధమైన ఆర్ధిక సహాయం చేయలేదు. ► 2014–15 నుంచి 2018–19 వరకూ (మూడవ నియంత్రణ కాలవ్యవధికి) ట్రూ అప్ చార్జీలను రూ.3,977 కోట్లుగా విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్ధారించింది. ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగం ఈ ట్రూ అప్ భారం రూ.1,066.54 కోట్లు కాగా.. దీనిని రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీగా మండలి పేర్కొంది. మిగిలిన మొత్తం ఇతర కేటగిరీ (వ్యవసాయం కాకుండా) వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని ఈఆర్సీ ఆదేశించింది. ► వినియోగదారులపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా.. అందరి నుంచీ అభ్యంతరాలను తీసుకుని, వినియోగదారులు కోరినట్టు, దక్షిణ, మధ్య డిస్కంల పరిధిలో 36 నెలలు, తూర్పు డిస్కంలో 18 నెలలుగా వసూలు వ్యవధిని నిర్ధారించింది. ఇది ఆగస్టు బిల్లుల నుంచి అమలులోకి వచ్చింది. ► ఈ ట్రూ అప్ చార్జీ కూడా ఎక్కువేం కాదు. ఎస్పీడీసీఎల్లో యూనిట్‌కు రూ.0.22 పైసలు, సీపీడీసీఎల్‌లో రూ.0.23 పైసలు, ఈపీడీసీఎల్‌లో రూ.0.7 పైసలు మాత్రమే. ఈ ప్రభుత్వం రూ.47,530 కోట్లు చెల్లించింది ► 2019–20 ప్రారంభం నాటికి గత ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన సబ్సిడీ బకాయిలు, వివిధ విభాగాల విద్యుత్ వినియోగ చార్జీలు కలిపి దాదాపుగా రూ.12,950 కోట్లు ఉన్నాయి. ► రాష్ట్ర విభజన (2 జూన్, 2014) నాటికి రూ.12,500 కోట్లుగా ఉన్న కొనుగోలు బకాయిలు–నిర్వహణ వ్యయ రుణాలు గత ప్రభుత్వ హయాంలో 2019 ఏప్రిల్ 1 నాటికి రూ.31,844.13 కోట్లకు చేరాయి. ► ప్రభుత్వం 2019 మే నుంచి 2022 సెప్టెంబర్ వరకూ సబ్సిడీ రూపంలో దాదాపు రూ.38,600 కోట్లను డిస్కంలకు ఇచ్చింది. వివిధ విభాగాల విద్యుత్ వినియోగ చార్జీల రూపంలో రూ.8,930 కోట్లు చెల్లించింది. ఇలా మూడున్నరేళ్లలో మునుపెన్నడూ లేనివిధంగా మొత్తం రూ.47,530 కోట్లను విద్యుత్ పంపిణీ సంస్థలకు అందించింది. -
నానాటికీ పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు.. బీజేపీకి షాక్ తగులుతుందా?
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి విద్యుత్ షాక్ తగులుతుందా ? నానాటికీ పెరిగిపోతున్న చార్జీలు ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బ తీస్తాయా ? సామాన్య జనమే కాదు. బడా బడా పారిశ్రామికవేత్తలు కూడా విద్యుత్ టారిఫ్‌లపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతోంది ? గుజరాత్లో విద్యుత్ బిల్లుల భారం తడిసిమోపెడు అవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో ప్రభుత్వం నాలుగు సార్లు చార్జీలను పరోక్ష పద్ధతిలో పెంచింది. ఎన్నికల ఏడాది కావడంతో నేరుగా గుజరాత్ ఎలక్ట్రిసిటీ కమిషన్ చార్జీల భారాన్ని మోపకుండా ఫ్యూయెల్ అండ్ పవర్ పర్చేజ్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ (ఎఫ్‌పీపీపీఏ) రూపంలో పెంచింది. ప్రస్తుతం యూనిట్ ధర వివిధ వర్గాల వాడకానికి అనుగుణంగా యూనిట్‌కు రూ.2.50 నుంచి రూ. 7.50 వరకు ఉంది. . ‘‘గుజరాత్లో విద్యుత్ వినియోగదారులు 2021 మే–జూన్‌లో యూనిట్‌కి రూ.1.80 చెల్లిస్తే, ఈ ఏడాది జూన్ నాటికి యూనిట్ ధర రూ.2.50 చెల్లించాల్సి వస్తోంది. అంటే ఏడాదిలో 70 పైసలు పెరిగింది. గత రెండు నెలల్లోనే యూనిట్‌కు 30 పైసలు పెరిగేసరికి రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై నెలకి అదనంగా రూ.270 కోట్ల భారం పడింది’’ అని రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ నిపుణుడు కె.కె.బజాజ్ చెప్పారు. గుజరాత్లో విద్యుత్ వాడకం ఎక్కువ. ఒక వ్యక్తి ఏడాదికి సగటున 2,150 యూనిట్లు వాడితే, ఇతర రాష్ట్రాల్లో 1,150 యూనిట్లే వాడతారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో డిమాండ్‌కి తగ్గట్టుగా సరఫరా కోసం విద్యుత్ కంపెనీలు రూ.20 పెట్టి యూనిట్ కొనుక్కోవాల్సి వస్తోంది. ఫలితంగా విద్యుత్ చార్జీలు వినియోగదారులపై మోయలేని భారాన్ని మోపాయి. పారిశ్రామిక రంగానికి యూనిట్‌కు రూ.7.50 చెల్లించాల్సి రావడంతో వారంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే వ్యాపారాలు చేయలేమంటోంది సదరన్ గుజరాత్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మహారాష్ట్ర, తెలంగాణలో పరిశ్రమలు యూనిట్‌కు రూ.4 చెల్లిస్తే, తాము రూ.7.50 చెల్లించాల్సి వస్తోందన్న ఆందోళనలో వారు ఉన్నారు. ఆప్ వర్సెస్ బీజేపీ గుజరాత్లో మొదటిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్ తరహాలో గృహాలకు నెలకి 300 యూనిట్ల వరకు ఇస్తున్న ఉచిత విద్యుత్ హామీ పట్ల సామాన్యులు ఆకర్షితులవుతున్నారు. 2021 డిసెంబర్ 31కి ముందు జారీ అయిన పెండింగ్ విద్యుత్ బకాయిల్ని మాఫీ చేస్తామని, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించింది. .మరోవైపు కాంగ్రెస్ కూడా ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తామంటోంది. ఇవన్నీ అధికార పార్టీకి సవాల్‌గా మారాయి. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచితాలు ఇచ్చే పార్టీల మాయలో పడొద్దని ఉచిత హామీ పథకాలు దేశాభివృద్ధిని అడ్డుకుంటాయంటూ ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉచిత విద్యుత్ హామీ నెరవేరాలంటే గుజరాత్ ఖజానాపై ఏడాదికి రూ.8,700 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఏ ప్రభుత్వమైనా ఇంత అదనపు భారాన్ని ఎలా మోస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ అందించడంమే తమ పార్టీ లక్ష్యమనం మోదీ అంటున్నారు. విద్యుత్ చౌర్యం జరగకుండా మీటర్లు పెట్టడం తప్పనిసరి చేశారు. మరోవైపు బీజేపీ ప్రచారాన్ని ఆప్ తిప్పి కొడుతోంది. గుజరాత్లో ముఖ్యమంత్రి నెలకి 5 వేల యూనిట్లు, ఇతర మంత్రులకి 4 వేల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నప్పుడు సాధారణ జనం 300 యూనిట్ల వరకు ఎందుకు వాడుకోకూడదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఉచిత విద్యుత్ గుజరాత్ ఓటర్లకు కొత్త కాదు. 2012 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేశూభాయ్ పటేల్ ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు. బీజేపీ నుంచి బయటకు వచ్చి గుజరాత్ పరివర్తన్ పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించిన కేశూభాయ్ పటేల్ రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించారు. ఆ పథకం కింద 47 లక్షల ముంది లబ్ధి పొందుతారు. అయితే మోదీ ఛరిష్మాకు ఆయన ఎదురు నిలువ లేకపోయారు.అప్పట్లో ఉచిత విద్యుత్ హామీలేవీ ఫలించలేదు. ఇప్పుడు కూడా ఆప్, కాంగ్రెస్‌కు అదే జరుగుతుందని బీజేపీ ధీమాగా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సరైన స్పందన కరువు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ, విద్యుత్ సబ్సిడీ తదితర సమస్యలపై వివరణ కోరగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్ నుంచి సరైన స్పందన లేదని ఢిల్లీ లెఫ్టినెంట్(ఎల్జీ) గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అసహనం వ్యక్తంచేశారు. ‘ఆప్ సర్కార్ ప్రకటనలు, ప్రసంగాలతోనే సరిపుచ్చుతోంది. ప్రజా సంక్షేమం దానికి పట్టడం లేదు. పాలన సరిగా లేదు’ అని శుక్రవారం తాజాగా సీఎం కేజ్రీవాల్‌కు రాసిన మరో లేఖలో ఎల్జీ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘ పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను ఎత్తిచూపుతున్నాను. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ, స్వయంగా రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమానికి సీఎం, మంత్రులు గైర్హాజరవడం, విద్యుత్ సబ్సిడీ, ఉపాధ్యాయ నియామకాలు తదితర సమస్యలపై ఆప్ సర్కార్‌ను నిలదీయడం తప్పా?. ప్రశ్నించిన ప్రతిసారీ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ నన్ను మీరు, మీ మంత్రులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన బాధ్యతలు, విధులను ఆప్ ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తించడంలేదు’ అని సీఎంకు రాసిన లేఖలో ఎల్జీ సక్సేనా వ్యాఖ్యానించారు. దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ‘ నాకు ఎల్జీ నుంచి మరో ప్రేమలేఖ అందింది. ఎల్జీ మాటున బీజేపీ దేశ రాజధాని వాసుల జీవనాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తోంది. నేను బతికి ఉన్నంతకాలం అలా జరగనివ్వను’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తన లేఖను ప్రేమలేఖ అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించడంతో ఎల్జీ మరోసారి స్పందించారు. ‘నా లేఖను ఎగతాళి చేశారు. మీరు అన్నట్లు అది ప్రేమ లేఖ కాదు. పరిపాలన లేఖ’ అని అన్నారు. -
ఢిల్లీలో విద్యుత్ సబ్సిడీ పథకం ప్రారంభం
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యుత్ సబ్సిడీ పథకం శనివారం నుంచి ప్రారంభమైంది. రాయితీ కావాలనుకునే వారు 7011311111 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు లేదా వాట్సాప్ మెసేజీ పంపొచ్చునంటూ గత నెలలో సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అక్టోబర్ ఒకటో తేదీ వరకు విద్యుత్ ఫీజు బకాయి లేని గృహ వినియోగదారులే రాయితీకి అర్హులు. అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా సబ్సిడీ వర్తిస్తుందని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం 200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఉచితంగా, 400 యూనిట్ల వరకు వినియోగించుకునే వారికి 50% సబ్సిడీతో ఢిల్లీ ప్రభుత్వం విద్యుత్ అందిస్తోంది. ఇందులో ఢిల్లీలోని మొత్తం 58 లక్షల గృహ విద్యుత్ వినియోగదారుల్లో 47 లక్షల మంది సబ్సిడీ పొందుతున్నారు. -
AP: ఆ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు.. అంతా ఒట్టిదే: విద్యుత్ శాఖ
సాక్షి, అమరావతి : వినాయక చవితి ఉత్సవాల పందిళ్లకు విద్యుత్ ఛార్జీలు పెరిగాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంత పంపిణీ సంస్థల సీఎండీలు కె. సంతోషరావు, జె. పద్మాజనార్థనరెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసే వినాయక మండపాలకు తాత్కాలిక విద్యుత్ టారిఫ్‌ను పెంచలేదని, పైగా గతంలో 250 వాట్స్‌కి కూడా రూ.వెయ్యి తీసుకునేవారని, కానీ ఇప్పుడు రూ.750గా నిర్ణయించామన్నారు. అప్పట్నుంచీ అవే ఛార్జీలు.. రాష్ట్రవ్యాప్తంగా వినాయక మండపాలకు 2014 నుంచి అమలులో ఉన్న టారిఫ్ ప్రకారం 500 వాట్స్‌కి రూ.1000, 1000 వాట్స్‌కి రూ.2,250, 1,500 వాట్స్‌కి రూ.3,000, 2000 వాట్స్‌కి రూ.3,750, 2,500 వాట్స్‌కి రూ.4,550, 3000 వాట్స్‌కి రూ.5,250, 3,500 వాట్స్‌కి రూ.6,000, 4000 వాట్స్‌కి రూ.6,750, 5000 వాట్స్‌కి రూ.8,250, 6,000 వాట్స్‌కి రూ.9,750, 10,000 వాట్స్‌కి రూ.15,750 చొప్పున చెల్లించి తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లను తీసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ నిబంధనల మేరకు ఈ కనెక్షన్ల ద్వారా పది రోజులపాటు విద్యుత్‌ను వినియోగించుకోవచ్చని సీఎండీలు తెలిపారు. అవసరమైతే టోల్‌ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని వారు కోరారు. -
Electricity Charges: నెలనెలా కరెంట్ షాక్! కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్
సాక్షి, హైదరాబాద్: ఇకపై ప్రతి నెలా విద్యుత్ చార్జీల మోత మోగనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల హెచ్చుతగ్గులకు తగ్గట్టు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోయినట్టు.. ముందు ముందు కరెంటు చార్జీలు కూడా పెరిగిపోనున్నాయి. విద్యుత్ కొనుగోలు ధరలు, బొగ్గు, ఇంధన ధరల్లో హెచ్చుతగ్గుల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు ఆటోమేటిగ్గా విద్యుత్ టారిఫ్‌లో సర్దుబాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువస్తోంది. ఏ నెలకు ఆ నెల భారాన్ని వినియోగదారులపై మోపేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్న ‘విద్యుత్ నిబంధనలు–2005’కు సవరణలు చేస్తూ.. శుక్రవారం ‘విద్యుత్ నిబంధనలు (సవరణ)–2022’ముసాయిదాను కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. ముసాయిదా ప్రతులను అన్ని రాష్ట్రాల ఇంధన శాఖలు, ఈఆర్సీలు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలకు పంపింది. ముసాయిదా నిబంధనలపై సెప్టెంబర్ 11లోగా అభ్యంతరాలు, సలహాలను పంపించాలని కోరింది. ఏ రకంగా భారం పడినా.. వినియోగదారుడిపైనే.. విద్యుదుత్పత్తికి ఇంధనంగా వినియోగించే బొగ్గు, గ్యాస్ వంటి వాటి ధరలు పెరిగితే.. అందుకు అనుగుణంగా విద్యుత్ చార్జీలూ పెరుగుతాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) మార్పులు, డిమాండ్‌కు అనుగుణంగా గ్రిడ్ నుంచి అధిక ధరలకు కొనుగోళ్లు వంటి వాటితో పెరిగే భారాన్నీ.. ఏ నెలకు ఆ నెల వినియోగదారుల నుంచి వసూలు చేయాలని కేంద్ర ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి. ‘విద్యుత్ నిబంధనలు (సవరణ)–2022’అమల్లోకి వచ్చాక 90 రోజుల్లోగా రాష్ట్రాల ఈఆర్సీలు ఇంధన ధరలు, విద్యుత్ కొనుగోలు ధరల్లో హెచ్చుతగ్గులను టారిఫ్‌లో సర్దుబాటు చేసేందుకు ఫార్ములాను ప్రకటించాల్సి ఉంటుంది. ఆలోగా ప్రతి నెలా టారిఫ్ సవరణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఓ ఫార్ములాను ప్రతిపాదించింది. మళ్లీ ఏడాదికోసారి ‘ట్రూఅప్’! ఇక ప్రతి నెలా సవరించిన విద్యుత్ చార్జీలన్నింటినీ ఏడాదికోసారి రాష్ట్రాల ఈఆర్సీలు సమీక్షించాల్సి ఉంటుంది. విద్యుత్ కొనుగోళ్లకు చేసిన వాస్తవ వ్యయం, వినియోగదారుల నుంచి వసూలు చేసిన టారిఫ్‌ను సరిపోల్చి.. ఒకవేళ ఎక్కువ వసూలు చేస్తే తిరిగి వినియోగదారులకు చెల్లించాలి. అదే తక్కువ వసూలు చేసి ఉంటే మాత్రం.. ఆ సొమ్మునూ వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేసుకోవచ్చు. విద్యుత్ రంగ పరిభాషలో వీటిని ‘ట్రూఅప్’చార్జీలు అంటారు. విద్యుత్ చట్టసవరణ బిల్లులోని అంశాలు ముసాయిదాలో.. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022’ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. విపక్షాల నిరసనల నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపింది. ఆ బిల్లు ప్రతిపాదించిన ముఖ్యమైన సవరణలు కొన్ని తాజాగా ప్రకటించిన ‘విద్యుత్ నిబంధనలు (సవరణ)–2022’ముసాయిదాలో ఉండటం గమనార్హం. విద్యుత్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించడానికి ముందే.. ఈ మార్గంలో దాని అమలుకు కేంద్రం ప్రయత్నిస్తోందని నిపుణులు చెప్తున్నారు. పక్కాగా విద్యుత్ సబ్సిడీ లెక్కలు వ్యవసాయం, గృహాలు, ఇతర కేటగిరీల వినియోగదారులకు ఉచితంగా/రాయితీపై విద్యుత్ సరఫరా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అంచనాల మేరకు సబ్సిడీ నిధులను ఇస్తోంది. ఇకపై సబ్సిడీ లెక్కలు కచ్చితంగా ఉండనున్నాయి. కేంద్రం ప్రకటించనున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆధారంగా సబ్సిడీ బకాయిలను డిస్కంలు లెక్కించాల్సి ఉంటుంది. గడువులోగా జల విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు ఇకపై జల విద్యుత్ ప్రాజెక్టులను 150 రోజుల్లో, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు 90 రోజుల్లోగా అనుమతులు జారీ చేయాలన్న నిబంధనను కేంద్రం ప్రతిపాదించింది. ఇప్పటివరకు ఇలాంటి నిబంధన లేక అనుమతుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పునరుత్పాదక విద్యుత్‌కు ఒకే ధర సెంట్రల్ పూల్ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే ధరతో డిస్కంలు పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లు జరిపే వీలు కల్పిస్తూ కేంద్రం మరో కీలక ప్రతిపాదన చేసింది. సౌర, పవన, హైడ్రో, హైబ్రిడ్, స్మాల్ హైడ్రో వంటి ప్రతి పునరుత్పాదక విద్యుత్‌కు ఒక ప్రత్యేక సెంట్రల్ పూల్ ఉండనుంది. అయితే ఏవైనా కంపెనీలు(ఇంటర్మీడియేటరీలు) పునరుత్పాదక విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా కరెంటు కొని.. ఎక్కువ రాష్ట్రాల్లోని డిస్కంలకు తిరిగి విక్రయిస్తే ఈ నిబంధన వర్తిస్తుంది. సెంట్రల్ పూల్ నిర్వహణ కోసం కేంద్రం ఏర్పాటు చేసే ప్రత్యేక ఏజెన్సీ (ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ) ప్రతి నెలా పునరుత్పాదక విద్యుత్ ధరను ఖరారు చేస్తుంది. సెంట్రల్ పూల్ ఐదేళ్లపాటు మనుగడలో ఉంటుంది. తర్వాత కొత్త శ్రీ సెంట్రల్ పూల్ ఏర్పాటు చేస్తారు. సెంట్రల్ పూల్ నుంచి రాష్ట్రాలు కచ్చితంగా విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. కొంటే మాత్రం కేంద్రం కనుసన్నల్లో లావాదేవీలు జరుగుతాయి. -
రవాణాశాఖ వింత వ్యవహారం .. కామ్‌గా కట్టించేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: బస్సు చార్జీలు పెంచినప్పుడు ఆర్టీసీ అధికారులు బహిరంగంగానే వెల్లడించారు.. కరెంటు చార్జీలు పెరిగితే అధికారులు ముందే చెప్పారు.. కానీ వాహనాలకు సంబంధించి జీవిత కాల పన్ను, హరిత పన్నులు పెంచిన రవాణా శాఖ ఒక్కమాట కూడా బహిరంగంగా చెప్పలేదు. ఏయే చార్జీలు ఏ మేరకు, ఎప్పటి నుంచి పెరుగుతున్నాయన్నది అధికారులెవరూ చెప్పలేదు. కానీ పన్ను చెల్లించే సమయంలో భారీ చార్జీలు చూసి జనం నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. రూ.12 లక్షల విలువైన వాహ నాన్ని కొంటే.. వారం కిందటి వరకు రూ.1,68,000 (14 శాతం) జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్) చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడది రూ.2,04,000కు (17శాతానికి) పెరిగింది. ఇంత ప్రభావం చూపే మార్పు జరిగితే ఎక్కడా రవాణా శాఖ నుంచి జనానికి తెలియజేసే అధికారిక ప్రకటన వెలువడలేదు. గత ఆర్థిక సంవత్సరం జీవితకాల పన్ను రూపంలో రూ.2,900 కోట్ల ఆదాయాన్ని పొందింది. తాజా ఉత్తర్వులతో అదనంగా మరో రూ.1,400 కోట్లమేర ఆదాయం లభిస్తుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫిట్నెస్ పంచాయితీ.. రవాణా వాహనాలు ఏడాదికోసారి తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్ష చేయించి సర్టిఫికెట్ పొందాలి. ఇలా ఫిట్నెస్ పరీక్షలు చేయించకుండా తిరిగే ట్రాన్స్‌పోర్టు వాహనాలకు రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ విధించాలి. కేంద్రం ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర రవాణా శాఖ మాత్రం ఎన్ని సంవత్సరాల నుంచి ఫిట్నెస్ చేయించటం ఆపేశారో.. అప్పటి నుంచీ లెక్కగట్టి పెనాల్టీలు వసూలు చేస్తోంది. ► హైదరాబాద్‌కు చెందిన అష్రాఫ్ అనే ఆటోడ్రైవర్ ఏడేళ్లుగా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా ఆటో నడుపుతున్నాడు. కొత్త నిర్ణయం రావటంతో పెనాల్టీలు కట్టే బాధ ఉండొద్దని ఫిట్నెస్ పరీక్ష కోసం వెళ్లాడు. ఏడేళ్ల నుంచి రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ కలిపి మొత్తంగా రూ.1.13 లక్షలు కట్టాలని అధికారులు చెప్పారు. దీనితో బెంబేలెత్తిన అష్రాఫ్ ఆటోను తీసుకెళ్లి ఇంట్లో పెట్టేశాడు. ఆటో నడిపితేనే రోజు గడిచే ఆయన.. ఇప్పుడు దానిని బయటికి తీయట్లేదు. ఇలా 75వేల ఆటోలు పాత బకాయిల పేరిట భారీ పెనాల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఉందని.. దీనితో దాదాపు 40వేల మంది డ్రైవర్లు ఆటోలను బయటికి తీయడం మానేశారని యూనియన్ నేతలు చెప్తున్నారు. ఇదే తరహాలో దాదాపు 4 వేల టాటా ఏస్ మినీ ట్రక్లు, మరో 2 వేల వరకు డీసీఎం వాహనాలు, చిన్న లారీలు ఇలాగే మూలకు చేరాయని అంటున్నారు. ఆటో అమ్ముకోలేక, కొత్తది కొనలేక ఇబ్బందిపడుతున్నారు. ఫీజులు పెంచిన తర్వాత నాలుగు రోజుల క్రితం ఓ లారీకి వచ్చిన పన్ను మొత్తం రూ.13,920 కాలుష్యం పేరిట... వాహనాలు పాతబడే కొద్దీ కాలుష్యం పెరుగుతుందన్న ఉద్దేశంతో వాటి వాడకాన్ని తగ్గించడానికి హరితపన్ను (గ్రీన్ ట్యాక్స్) విధిస్తున్నారు. రవాణాశాఖ ఇటీవలే హరితపన్నును పెంచింది. దీనినీ మూడు శ్లాబులు చేసింది. ఈ విషయాన్నీ బయటికి వెల్లడించలేదు. ఏ శ్లాబుకు ఎంత పన్ను చెల్లించాలో వాహన యజమానులకు తెలియదు. రవాణాశాఖ కార్యాలయంలో వివరాలన్నీ నమోదుచేశాక వచ్చే పన్నుమొత్తం చూసి బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది. ► పాత రేట్ల ప్రకారం ఓ లారీకి గ్రీన్‌టాక్స్ రూ.238 మాత్రమే ఉండేది. అదనంగా ప్రభుత్వ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ► గతంలో ద్విచక్ర వాహనానికి గ్రీన్‌ట్యాక్స్ రూ.285, ప్రభుత్వ ఫీజు రూ.735 ఉండగా.. ఫీజులు పెంచాక గ్రీన్‌ట్యాక్స్ రూ.2,035, ప్రభుత్వ ఫీజు రూ.1,400గా మారింది. ► కార్లకు సంబంధించి గ్రీన్‌ట్యాక్స్ రూ.535, ప్రభుత్వ ఫీజు రూ.1,200 ఉండేది. ఇప్పుడు ట్యాక్స్ రూ.5035, ఫీజు రూ.1,500 అయింది. ఆదాయం కోసం దొడ్డిదారిన పన్ను పెంచారు గ్రీన్‌ట్యాక్స్ పెంచినంత మాత్రాన వాతావరణంలో కాలుష్యం తగ్గుతుందా..? ఇదేం విడ్డూరం. కాలుష్యం వెదజల్లుతున్న వాహనాలను సీజ్ చేయండి, లేదా మరమ్మతు చేయించుకునేలా చేయండి. అలాకాకుండా పన్ను చెల్లించి పొగవదిలితే ఉపయోగం ఉంటుందా? కేవలం ఆదాయం పెంచుకునేందుకు ఇలా దొడ్డిదారిన గ్రీన్‌ట్యాక్స్ పెంచారు. – మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు 40వేలకుపైగా రవాణా వాహనాలు నిలిచిపోయాయి ఏళ్లపాటు ఫిట్నెస్ పెనాల్టీ లెక్కగట్టి బెదిరిపోయేలా చేశారు. దాదాపు 40 వేలకుపైగా రవాణా వాహనాలు రోడ్డెక్కకుండా చేసిన ఈ పెనాల్టీ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. ఆరు నెలల గడువిస్తే అన్ని వాహనాలకు ఫిట్నెస్ చేయించేసుకుంటారు. అలాగాకుండా ఆదాయం కోసం దీన్ని ఆయుధంగా వాడటం సరికాదు – ఎ.సత్తిరెడ్డి, తెలంగాణ ఆటో డ్రైవర్ల సమాఖ్య ప్రధాన కార్యదర్శి -
ఆందోళనలు.. అరెస్టులు
సాక్షి, హైదరాబాద్: పెరిగిన విద్యుత్, పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం గురువారం ఉద్రిక్తతలకు దారి తీసింది. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ సౌధ, సివిల్ సప్లయిస్ భవన్ ముట్టడికి టీపీసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. ముట్టడిని భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించడం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,పాటు వీహెచ్, దాసోజు శ్రావణ్, షబ్బీర్ అలీ, మల్రెడ్డి రంగారెడ్డి, హర్కర వేణుగోపాల్, ఎంఆర్జీ వినోద్‌రెడ్డి తదితరుల హౌస్ అరెస్టుతో వాతావరణం వేడెక్కింది. తర్వాత శాంతియుత ఆందోళనలకు అనుమతినివ్వడం, నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా విద్యుత్ సౌధకు బయల్దేరిన నేతలను పోలీసులు అడ్డుకోవడం, వారు బారి కేడ్లు దూకి చొచ్చుకురావడంతో విద్యుత్ సౌధ ముందు కాంగ్రెస్ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. బారికేడ్లు ఎక్కి... తలపాగా చుట్టి.. ఖైరతాబాద్ వైపు వెళ్లే ఫ్లైఓవర్ వద్ద పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తలపాగా చుట్టిన రేవంత్.. యూత్ కాంగ్రెస్ నేత అనిల్‌కుమార్‌తో కలిసి బారికేడ్లపై నిల్చుని కార్యకర్తలందరూ ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. దీంతో నినాదాలు చేస్తూ ఫ్లైఓవర్ మీదుగా విద్యుత్ సౌధ వద్దకు చేరుకున్నారు. విద్యుత్ సౌధ వద్ద బైఠాయింపు విద్యుత్ సౌధ వద్ద కాంగ్రెస్ నేతలను అడ్డుకునేందుకు పోలీసులు మళ్లీ యత్నించారు. దీంతో నేతలందరూ రోడ్డుపై బైఠాయించారు. అప్పుడు కూడా కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో పలువురు మహిళా నాయకురాళ్లు కూడా విద్యుత్ సౌధ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా తోపులాటలో మహిళా నేత విద్యారెడ్డి సొమ్మసిల్లి పడిపోవడంతో చికిత్స కోసం నిమ్స్‌కు తరలించారు. తీవ్ర వాగ్వాదం అనంతరం 10 మంది నేతలను విద్యుత్ సౌధలోకి అనుమతించారు. దీంతో రేవంత్, భట్టి తదితర నేతలు ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును కలిసి విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరారు. కోర్టును ఆశ్రయిస్తాం: రేవంత్ తెలంగాణ విద్యుత్ సంస్థలకు రూ.10 వేల కోట్లకు పైగా బకాయి పడిన రాష్ట్ర ప్రభుత్వం..ఆ బకాయి లు చెల్లించకుండా పేదలపై భారం మోపేందుకు ప్రయత్నిస్తోందని రేవంత్ విమర్శించారు. పెంచిన విద్యుత్ చార్జీలపై కోర్టును ఆశ్రయిస్తామని, న్యాయనిపుణులతో చర్చించి తమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామని మీడియాకు చెప్పారు. కాంగ్రెస్ నేతలు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మధుయాష్కీగౌడ్, మహేశ్వర్‌రెడ్డి, మల్లు రవి, అంజన్‌కుమార్ యాద వ్, అన్వేష్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, బల్మూరి వెంకట్, శివసేనారెడ్డి, ఫిరోజ్‌ఖాన్, మెట్టు సాయికుమార్, మానవతారాయ్ ఆందోళనలో పాల్గొన్నారు. -
విద్యుత్ చార్జీల పెంపుపై కాంగ్రెస్ పోరుబాట
-
‘పగటి పూట లాంతర్లు పట్టుకుని తిరుగుతున్న లోకేష్’
సాక్షి, అమరావతి: వ్యవస్థలను నాశనం చేసింది చంద్రబాబు కాదా అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అనివార్య పరిస్థితుల్లోనే స్వల్పంగా విద్యుత్ ఛార్జీలు పెంచామన్నారు. విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది చంద్రబాబే. అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచింది టీడీపీ ప్రభుత్వమేనంటూ మండిపడ్డారు. టీడీపీ హయాంలోని ఐదేళ్లలో 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. చదవండి: చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్ ‘‘పేదల ఖాతాల్లో ప్రభుత్వం రూ.లక్షా 35 వేల కోట్లు వేసింది. కొత్త జిల్లాలు, సచివాలయాలతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. వీటిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. లోకేష్ పగటి పూట లాంతర్లు పట్టుకుని తిరుగుతున్నారు. పవన్ తన పవర్ చూపించి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. -
తెలంగాణలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు
-
పలక కళకళ
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మార్కాపురం పలకల పరిశ్రమ మళ్లీ జీవం పోసుకుంటోంది. కరోనాతో ఎగుమతి ఆర్డర్లు లేక మూతపడిన ఫ్యాక్టరీలు కరోనా తగ్గడంతో మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే వివిధ దేశాలు ఆంక్షలు ఎత్తివేస్తుండటంతో ప్రస్తుతం దాదాపు 15 ఫ్యాక్టరీల్లో పనులు జరుగుతున్నాయి. సుమారు 3 వేల మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. మార్కాపురం: కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రకాశం జిల్లా మార్కాపురం పలకల పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయని పారిశ్రామికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా కరోనా కారణంగా ఆంక్షలతో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. నాలుగైదు నెలల నుంచి ఆంక్షలు ఎత్తి వేయటంతో యజమానులు ఫ్యాక్టరీలను తెరవటంతో మళ్లీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కళకళలాడుతోంది. ఫ్యాక్టరీలు మూతపడటంతో 6 వేల మందికి పైగా కార్మికులు పనులు లేక భవన నిర్మాణ కార్మికులుగా, ఇతరత్రా కూలీలుగా మారారు. మరికొందరు వలసలు పోయారు. 2010లో ఈ ప్రాంతంలో సుమారు 100 ఫ్యాక్టరీలు ఉండేవి. టీడీపీ హయాంలో అనుసరించిన పారిశ్రామిక విధానాలు, రాయితీల ప్రోత్సాహం లేకపోవటం, విద్యుత్ చార్జీలు పెంచటం, కూలీల చార్జీలు పెరగటం, ఎగుమతుల ఆర్డర్లు లేకపోవటంతో సంక్షోభం ఏర్పడింది. దీంతో 2015 నాటికి ఫ్యాక్టరీల సంఖ్య 30కి చేరింది. మళ్లీ కరోనా రావటంతో అమెరికా, సింగపూర్, మలేషియా, శ్రీలంక వంటి దేశాలకు విమానాలు లేక పూర్తిగా ఎగుమతులు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే వివిధ దేశాలు ఆంక్షలు ఎత్తివేయటంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో దాదాపు 15 ఫ్యాక్టరీలలో పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అమెరికాకు మాత్రమే షిప్‌లలో కొంత మేర ఎగుమతులు పంపుతున్నారు. దేశీయంగా కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, చెన్నై ప్రాంతాలకు లారీల ద్వారా డిజైన్ స్లేట్స్ పంపుతున్నారు. సుమారు 3 వేల మంది కూలీలు గని కార్మికులుగా, ఫ్యాక్టరీ వర్కర్లుగా, అనుబంధంగా ఉండే బలపాల పరిశ్రమలో కూడా పని చేస్తున్నారు. పలకల గనులు మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, దొనకొండ మండలాల్లోని తుమ్మలచెరువు, రాయవరం, కలుజువ్వలపాడు, గానుగపెంట, పోతలపాడు, గజ్జలకొండ, మల్లంపేట, పెద్దయాచవరం, నాయుడుపల్లె తదితర గ్రామాల్లో సుమారు 15 కి.మీ మేర విస్తరించి ఉన్నాయి. కార్మికులు వివిధ రంగాల్లో పని చేస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా వచ్చిన మార్పులు, గత 8 ఏళ్లుగా ప్రభుత్వాలు పలకల పరిశ్రమల అభివృద్ధికి సహకరించకపోవటంతో ఒక్కొక్కటిగా మూతపడుతూ ప్రస్తుతం 30కి చేరాయి. జీఎస్టీ అదనపు భారం కావటం, విద్యుత్ చార్జీలు పెరగటం, ఎగుమతుల ఆర్డర్లు తగ్గటంతో పలకల పరిశ్రమ ప్రాభవం తగ్గింది. ఇదే సమయంలో చైనాలో కూడా మార్కాపురం పలకల పరిశ్రమలో లభించే రాయి దొరకటం, వారు తక్కువ రేటుకు ఇస్తుండటంతో అమెరికా, శ్రీలంక, సింగపూర్ లాంటి దేశాల వారు చైనా నుంచి తెప్పించుకుంటున్నారు. సుమారు 15 ఏళ్ల కిందట పలకల వాడకం ఎక్కువగా ఉండేది. కంప్యూటర్లు రావటం, విద్యా వ్యవస్థలో మార్పుల వలన పలకల వాడకం తగ్గిపోయింది. దీంతో మార్కాపురం పలకల వ్యాపారులు పలకల రాయిని డిజైన్ స్లేట్‌గా మార్పు చేశారు. మొజాయిక్, పింక్, ఆటమ్, మల్టీకలర్ తదితర రంగుల్లో మార్కాపురం పలకల రాయి లభిస్తుంది. దీనిని వివిధ సైజుల్లో కట్ చేసి గృహాలకు అందంగా అలంకరించేందుకు చెన్నై, ముంబయ్, కోల్కత్తా, ఢిల్లీ, బెంగళూరు, పంజాబ్, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇతర దేశాలైన శ్రీలంక, సింగపూర్, అమెరికా, జపాన్ దేశాలకు పంపుతున్నారు. రాయితీలు ఇవ్వాలి మార్కాపురం పలకల పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం సహకరించాలి. చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చినట్లుగా మార్కాపురం పలకలకు మినహాయింపు ఇవ్వాలి. పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. విద్యుత్ చార్జీలు తగ్గించాలి. ఎగుమతులను ప్రోత్సహించాలి. – బట్టగిరి తిరుపతిరెడ్డి, పలకల ఫ్యాక్టరీ యజమాని రాయల్టీ తగ్గించాలి ప్రభుత్వం పలకల గనులపై ఉన్న రాయల్టీని తగ్గించాలి. చిన్న క్వారీలకు నిబంధనల్లో మినహాయింపు ఇవ్వాలి. ఎక్స్పోర్టులో కూడా ఆంక్షలు సడలించాలి. పలకల పరిశ్రమ బాగుంటే ఈప్రాంతంలో వలసలు ఉండవు, కూలీలందరికీ పని ఉంటుంది. – వెన్నా పోలిరెడ్డి, డిజైన్ స్లేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ -
జీడీపీ అంటే.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడమా?: రేవంత్
సాక్షి, హైదరాబాద్: పేదల రక్తాన్ని పీల్చుకుని, వారి సంపాదనను దోచుకోవడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు పోటీ పడి ధరలు పెంచుతున్నాయని, మళ్లీ ఆ పార్టీలవారే ధరలు తగ్గించాలంటూ ధర్నా లుచేయడం విడ్డూరంగా ఉందన్నారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ బీజేపీ దృష్టిలో జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచడమా అని ప్రశ్నించారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలున్న కారణంగా నాలుగు నెలలపాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదని, ఇప్పుడు ఎన్నికలు అయిపోయి ఫలితాలు రాగానే మళ్లీ పెరుగుతున్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక చేత్తో ఉచితంగా ఇస్తున్నామని చెబుతూనే, మరో చేత్తో విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపుతోందని విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా రూ.12 వేల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ ప్రభుత్వం మోపుతోం దని ఆరోపించారు. కరెంటు చార్జీలు తగ్గించాలని 30న ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్‌చైర్మన్ కోదండరెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యేలు ఈరవత్రి అనిల్, వేం నరేందర్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తానంటే ఏర్పాట్లు చేస్తాం యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో సీఎం ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తామంటే తాము ఏర్పాట్లు చేస్తామని, కాంగ్రెస్ కేడర్ ఆయనకు రక్షణంగా ఉంటుందని రేవంత్ చెప్పారు. కేంద్రం వచ్చి ఐకేపీ కేంద్రాలను పెడుతుందా అని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, ఆ తర్వాత ఎవరికి అమ్ముకోవాల నేది దాని ఇష్టమని చెప్పారు. సీఎం కేసీఆర్ ఈ విషయంలో ప్రధానిని ఎందుకు కలవడం లేదని, ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందంలో కేటీఆర్, హరీశ్‌రావు ఎందుకు లేరని ప్రశ్నించారు. రూ.10 వేల కోట్లు తమకు ఇస్తే «ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత తాము తీసుకుంటామని రేవంత్ చెప్పారు. -
గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్, వంట నూనెలు, చికెన్, పచ్చిమిర్చి.. తగ్గేదేలే!
ఇల్లు గుల్లవుతోంది. నానాటికీ పెరుగుతున్న చార్జీల భారం సామాన్యుడి ఇంటి బడ్జెట్‌ను అమాంతం పెంచేసింది. కోవిడ్ ఆంక్షలకు తోడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేడు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేవలం రెండు నెలల్లోనే గ్రేటర్వాసిపై పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్, ఆయిల్ ఛార్జీలు దండెత్తాయి. దీంతో నగరంలోని సామాన్యుల పరిస్థితి ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అన్నట్టుగా తయారైంది. స్థూలంగా లెక్కకడితే నెలకు ఒక్కో మనిషిపై ఈ చార్జీల భారం రూ.500 పెరిగిందని అంచనా వేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ గ్యాస్ బండపై తాజాగా రూ.50 పెరగడంతో మూడు జిల్లాల పరిధిలో మొత్తం 26 లక్షల గ్యాస్ కనెక్షన్లకు గాను గ్రేటర్‌పై నెలకు సగటున రూ.13 కోట్ల అదనపు భారం పడింది. అదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నగరంలో సుమారు 65 లక్షల వాహనాలు ఉండగా, రోజుకు సుమారు 50 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల డీజిల్ వినియోగం ఉంటుంది. తాజాగా ధరతో పెట్రోల్ వాహనదారులపై రోజుకు సగటున రూ.95 లక్షల చొప్పున నెలకు రూ.2850 కోట్లు భారం మోపగా, డీజిల్ వాహనదారులపై రోజుకు సగటున రూ.52 లక్షల చొప్పున నెలకు రూ. 1560 కోట్ల అధనపు భారం పడింది. చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం: ‘అది పేలడం వల్లే మంటలు వ్యాపించాయి’ విద్యుత్ భారం రూ.165 కోట్లు గృహ విద్యుత్‌పై యూనిట్‌కు 50 పైసలు, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌పై యూనిట్‌కు రూ.ఒకటి చొప్పున పెంచారు. గ్రేటర్లో 55 లక్షల విద్యుత్ వినియోగదారులు ఉండగా, నెలకు సగటున 1900 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగమవుతుంది. గృహ వినియోగ దారులపై నెలకు రూ.25 కోట్లు, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై రూ.140 కోట్ల భారం మోపింది. ఏడాదికి రూ.1980 కోట్ల అదనపు భారం తప్పడం లేదు. మధ్య తరగతి, ఉద్యోగ, వ్యాపార, ఇతర వర్గాలకు చెందిన సుమారు 16 లక్షల మందికిపైగా ప్రయాణికులు సిటీబస్సుల్లో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఫలితంగా ప్రతి ప్రయాణికునిపై రోజుకు సగటున రూ.10 అదనపు భారం పడుతోంది. ఛార్జీల రూపంలో గ్రేటర్ వాసులపై నెలకు రూ.6 కోట్లకు పైగా భారం మోపింది. వంట నూనెల భారం నెలకు రూ.54–60 కోట్లు జనవరిలో కిలో వేరుశనగ నూనె రూ.135 ఉండగా, ప్రçస్తుతం రూ.185 చేరింది. అదే విధంగా సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ రూ.155 ఉండగా, ప్రస్తుతం రూ.190 ఎగబాకింది. అదే విధంగా పామాయిల్ కేజీ రూ.125 ఉండగా, ప్రస్తుతం రూ.150 పెరిగింది. ఒక్కో కుటుంబం నెలకు మూడు కేజీల ఆయిల్ వినియోస్తోందని అంచనా. గ్రేటర్లో సుమారు 45 లక్షల గృహాలు ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన ప్రతి ఇంటికి నెలకు రూ.120–150 అదనపు భారం పడనుంది. ఇలా నెలకు సగటున రూ.54–60 కోట్ల భారం గ్రేటర్ వాసులపై పడుతోంది. ముట్టుకుంటే షాక్ కోవిడ్ కారణంగా ఉపాధి లేకుండా పోయింది. కానీ అన్ని ఛార్జీలు మాత్రం ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. ఇప్పటి వరకు నెలవారీ గృహ విద్యుత్ బిల్లు రూ.500లోపే వచ్చేది. ప్రస్తుతం డిస్కం యూనిట్‌కు రూ.50 పైసల చొప్పున పెంచడంతో ఏప్రిల్ బిల్లులో భారీ వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. – నేమాల బెనర్జీ, డిఫెన్స్ కాలనీ వంటింటికి గుదిబండ గత ఆగస్టులో గ్యాస్ సిలిండర్ ధర రూ.890 ఉండగా, అక్టోబర్ ఐదో తేదీ నాటికి రూ.915కి చేరింది. ఆ తర్వాతి రోజే అనూహ్యంగా రూ.930 కి చేరింది. మార్చి రెండో వారంలో రూ.962 ఉండగా, నాలుగు రోజుల క్రితం ఏకంగా రూ.50 పెరిగింది. ప్రస్తుతం రూ.1002కు చేరింది. ఏదైనా వంట చేయలన్నా.. వెనుకా ముందు ఆలోచించాల్సి వస్తోంది. – గుర్రం అన్నపూర్ణ, బడంగ్పేట్ బైక్ ప్రయాణం భారం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో పని చేస్తున్నా. బైక్‌లో గతంలో రూ.500 పెట్రోల్ కొట్టిస్తే..వారం రోజులు వచ్చేది. ప్రస్తుతం నాలుగైదు రోజులే వస్తుంది. జీతం పెరగలేదు కానీ..పెట్రోల్ వాత మాత్రం తప్ప లేదు. – టి.తిరుమలేష్, కర్మన్‌ఘాట్ -
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు! ఏప్రిల్ 1 నుంచే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ఖరారైంది. 14 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు టీఎస్ ఈఆర్సీ Electricity Regulatory Commission గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం అధికారిక స్పష్టత వచ్చింది. పెరిగిన ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమలులోకి రానున్నాయి. పెరిగిన ఛార్జీల ప్రకారం.. డొమెస్టిక్(గృహోపయోగ విద్యుత్తు వాడకం) పై 40-50 పైసలు పెంపు వర్తించనుంది. ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి చొప్పున భారం పెరగనుంది. అయితే గతంలోనే పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు ఇచ్చిన డిస్కంలు.. 19 శాతం పెంపునకు అనుమతి కోరాయి. కానీ, ఈఆర్సీ మాత్రం 14 శాతానికే అనుమతి ఇచ్చింది. డిస్కమ్‌లకు 10వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉన్నట్లు డిసెంబర్ నెలలోనే నివేదికలు సమర్పించకగా.. ఛార్జీలు పెంచకతప్పదనే సంకేతాలు ఆ టైంలోనే అందించాయి. సుమారు ఏడేళ్ల తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వగా.. సూత్రప్రాయంగా విద్యుత్ నియంత్రణ మండలి టీఎస్ ఈఆర్సీ అంగీకరించినట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచే వర్తింపు డిస్కంల ప్రతిపాదనలతో పాటు వినియోగదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి పెంపు నిర్ణయం తీసుకుందని ఈఆర్సీ చైర్మన్ టి. శ్రీరంగారావు మీడియా సమావేశంలో తెలిపారు. 2022-23 ఏడాదికి డిస్కంలు ప్రతిపాదించిన రెవెన్యూ గ్యాప్ 16 వేల కోట్ల రూపాయలు. కానీ, 14, 237 కోట్ల రూపాయల గ్యాప్‌ను మాత్రమే కమిషన్ ఆమోదించింది. పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమలులోకి రానున్నాయి అని చైర్మన్ రంగారావు వెల్లడించారు. గతంలో కంటే 38.38 శాతం అధికంగా ప్రతిపాదన వచ్చిందన్న ఆయన.. వ్యవసాయానికి విద్యుత్ టారిఫ్ పెంచలేదని స్పష్టం చేశారు. ఈవీ ఛార్జింగ్‌కు టారిఫ్ ప్రతిపాదనలు ఆమోదించలేదని, డిస్కంలు నవంబర్ 30లోపు ప్రతిపాదనలు కమిషన్ ముందు ఉంచాలని ఆదేశించినట్లు వెల్లడించారు. -
విద్యుత్ చార్జీలపై ఈఆర్సీ బహిరంగ విచారణ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) శుక్రవారం హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సి) భవనంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ విచారణ నిర్వహించనుంది. 2022–23లో రూ.6831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించడం తెలిసిందే. బహిరంగ విచారణలో వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ఈఆర్సీ పరిశీలించి చార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్ 1 నుంచి పెంపు అమల్లోకి వస్తుంది. -
విద్యుత్ వాత.. అభ్యంతరాల మోత
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం లో రూ.6,831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపు నకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమర్పించిన ప్రతిపాదనలపై బడా పారిశ్రా మికవేత్తలు, అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలు, టాప్ కంపెనీలతోపాటు సామాన్య వినియోగదా రులూ భగ్గుమన్నారు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉన్న ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) కి రికార్డు సంఖ్యలో రాత పూర్వక అభ్యంత రాలు అందాయి. గడువు ముగిసిన జనవరి 28 నాటికి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)కు 191, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీఎల్)కు 92 అభ్యంతరాలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీ రింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈ ఐఎల్), ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్స ల్టెన్సీ సర్వీసెస్ (టీసీ ఎస్), ఎల్అండ్టీ మె ట్రో రైలు, పెన్నా సిమెంట్స్, జువారి సిమెం ట్స్, ఫ్యాప్సీ తెలంగాణ, తెలంగాణ ఫెర్రో అలాయ్స్ ఉత్పత్తిదారుల సంఘం, ఐటీసీ లిమిటెడ్, ఇండియా ఎనర్జీ ఎక్సే్ఛంజీ లిమి టెడ్, మైత్రాహ్ ఎనర్జీ, డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ పవర్ అసోసియేషన్, సౌత్ ఇండియా సిమెంట్స్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ వంటి ప్రముఖ వ్యాపార సంస్థలతోపాటు కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆయోధ్య రెడ్డి, విద్యుత్ రంగ విశ్లేషకులు తిమ్మారెడ్డి, ఎం.వేణు గోపాల్ రావు, ధోంతి నర్సింహా రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర ఏపీసీపీడీసీఎల్ మాజీ డైరె క్టర్ సూర్య ప్రకాశ రావు, అఖిల భారత్ కిసాన్ మహాసభ నుంచి సారంపల్లి మల్లారెడ్డి అ భ్యంతరాలు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. బహిరంగ విచారణలో మళ్లీ.. భారీగా వచ్చిన అభ్యంతరాలన్నింటికీ రాతపూర్వకంగా సమాధానాలు ఇవ్వడం డిస్కంలకు ఇబ్బందికర విషయమే. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం ఈఆర్సీ బహిరంగ విచారణ జరిపి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సి ఉంది. ఈ నెల 18న సిరిసిల్లలో, 21న హన్మకొండలో, 23న వనపర్తిలో, 25న హైదరాబాద్‌లో బహిరంగ విచారణ నిర్వహించనున్నట్టు ఇప్పటికే ఈఆర్సీ ప్రకటించింది. ఆ సమయంలో మళ్లీ పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చే అవకాశముంది. వీటికి డిస్కంల సీఎండీలు అప్పటికప్పుడే మౌఖికంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఊహించని రీతిలో పెద్దసంఖ్యలో స్పందన వస్తుండటంతో చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈఆర్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
అక్కడి నుంచే చెప్పండి
సాక్షి, అమరావతి: విద్యుత్ చార్జీల(టారిఫ్)పై ఈ నెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) ప్రజాభిప్రాయాన్ని బహిరంగ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సేకరించనుంది. ఈ నెల 24, 25, 27 తేదీల్లో విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఈ సదస్సులు నిర్వహించనున్నారు. సదస్సుల్లో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రాంసింగ్, పి.రాజగోపాల్‌తో పాటు రాష్ట్ర ఇంధన శాఖ, మూడు డిస్కంల అధికారులు పాల్గొంటారు. 2022–23 సంవత్సరానికి ‘ఏఆర్ఆర్’ సమర్పణ తక్కువ విద్యుత్ వినియోగించే వారిపై విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించే విధంగా చార్జీలను సవరించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు 2022–23 ఆర్థిక సంవత్సర రిటైల్ సప్లై బిజినెస్ (ఆర్ఎస్బీ), అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్)ను గత ఏడాది డిసెంబర్ 13న ఏపీ ఈఆర్సీకి సమర్పించాయి. ప్రస్తుతం ఉన్న శ్లాబుల్లో మార్పులను చేయాల్సిన అవసరాన్ని ఇందులో వివరించాయి. వివిధ మార్గాల ద్వారా 2022–23 ఆర్థిక సంవత్సరానికి 74,815 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉందని వెల్లడించాయి. మొత్తం ఖర్చులు రూ.45,398.58 కోట్లుగా అంచనా వేశాయి. పరిశ్రమలకు నాన్ పీక్ అవర్స్‌లో టైం ఆఫ్ ది డే (టీఓడీ) పేరుతో యూనిట్‌కు 50 పైసల చొప్పున రాయితీ ఇచ్చేందుకు డిస్కంలు ప్రతిపాదించాయి. అవసరమైతే ఇదే విధానాన్ని గృహ విద్యుత్ వినియోగదారులకు కూడా వర్తింపజేస్తామని తెలిపాయి. కాగా, ఏపీ ఈఆర్సీ నిలిపివేసిన 2014–2019 ట్రూ అప్ చార్జీలను తిరిగి వసూలు చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా డిస్కంలు విజ్ఞప్తి చేశాయి. కరోనా కారణంగా.. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్‌కు సంబంధించిన బహిరంగ విచారణలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖ నుంచే జరుపనున్నారు. ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఎవరైనా తమ అభిప్రాయాలను విద్యుత్ నియంత్రణ మండలికి తెలియజేయవచ్చు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతిరోజు అన్ని డిస్కంల టారిఫ్ ఫైలింగ్‌కు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను నియంత్రణ మండలి స్వీకరిస్తుంది. విశాఖ వెళ్లక్కర్లేదు ఏపీఈఆర్సీకి విద్యుత్ చార్జీలపై అభిప్రాయాలు చెప్పదలుచుకున్న వారు విశాఖ వెళ్లాల్సిన అవసరం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని సమీప విద్యుత్ ఆపరేషన్ సర్కిల్ (ఎస్ఈ ఆఫీస్), డివిజన్ కార్యాలయం (డీఈ ఆఫీస్) ద్వారా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు చెప్పవచ్చు. ప్రతిరోజు ముందుగానే నమోదు చేసుకున్న వారి నుంచి అభ్యంతరాలు విన్న తరువాత, నమోదు చేసుకోని వారు మాట్లాడేందుకు ఏపీ ఈఆర్సీ అనుమతిస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రజలంతా వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు ‘సాక్షి’కి చెప్పారు. -
ఆ దేశంలో యూనిట్ కరెంటు 14 పైసలే.. ఎక్కడో తెలుసా?
రాత్రీపగలు తేడా లేదు.. ఎప్పుడైనా ఐదు నిమిషాలు కరెంటు పోయిందంటే ఇబ్బందే. లైట్లు, ఫ్యాన్ల వంటి అత్యవసరాల నుంచి టీవీలు, ఇతర సాంకేతిక ఉత్పత్తుల దాకా ఏది నడ వాలన్నా విద్యుత్ కావాల్సిందే. ఈ కరెంటు చార్జీలు ఒకచోట భగ్గుమంటుంటే.. మరోచోట చాలా తక్కువగా ఉంటుంటాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో సగటున కరెంటు చార్జీలు ఎంత ఉన్నాయనే దానిపై ‘గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డాట్ కామ్’ ఓ పరిశోధన చేసి జాబితా లను రూపొందించింది. చిత్రమైన విషయం ఏమిటంటే.. కొన్ని పేద దేశాల్లో కరెంటు చార్జీ లు అతితక్కువగా ఉండగా.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువున్నట్టు గుర్తించింది. మన రాష్ట్రం లో కరెంటు చార్జీల పెంపుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వివరాలేమిటో చూద్దామా.. నివేదికలో గృహ విద్యుత్ చార్జీల లెక్క ఇదీ.. ►ప్రపంచవ్యాప్తంగా 146 దేశాల్లో 2021 చివరినాటికి ఉన్న విద్యుత్ చార్జీలను పరిగణనలోకి తీసుకుని జాబితాను రూపొందించారు. ►మొత్తం ప్రపంచవ్యాప్తంగా సగటున గృహ విద్యుత్ చార్జీలు రూ.10.22 పైసలుగా.. వాణిజ్య విద్యుత్ చార్జీలు రూ.9.30గా ఉన్నాయి. ►క్కువ గృహ విద్యుత్ చార్జీల్లో భారతదేశం సగటున యూనిట్‌కు రూ.5.73 ధరతో 41వ స్థానంలో ఉంది. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లలో విద్యుత్ చార్జీలు మన కంటే తక్కువ. ఇక మనదేశంలో వాణిజ్య విద్యుత్ (దుకాణాలు, పరిశ్రమల వంటి వాటికి ఇచ్చే) ధర సగటున రూ.8.30గా ఉంది. ► అమెరికా రూ.11.39 ధరతో 88వ స్థానంలో నిలిచింది. ►మన దేశంలో సగటున యూనిట్‌కు ధర (రూ.లలో)- 5.73 ► తక్కువ గృహ విద్యుత్ చార్జీలు ఉన్న దేశాల్లో మన స్థానం -41 -
ఇకపై ఏటా చార్జీల వడ్డన!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీలు ఇక ఏటా పెరుగుతాయా? ఏటా నిర్దేశిత గడువులోగా వార్షిక విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించని పక్షంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇకపై విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు భారీ జరిమా నాలు విధించనుండటం ఈ ప్రశ్నకు తావి స్తోంది. జరిమానాలకు సంబంధించిన ముసా యిదా మార్గదర్శకాలను ఈఆర్సీ గురువారం ప్రకటించింది. ఏటా వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)తో పాటు విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు, మల్టీ ఇయర్ టారిఫ్ (ఎంవైటీ), వార్షిక పనితీరు సమీక్ష, ట్రూఅప్ చార్జీలు, వనరుల ప్రణాళిక, రాష్ట్ర విద్యుత్ ప్రణాళిక, వ్యాపార ప్రణాళిక ప్రతిపాదనలు , మూలధన పెట్టుబడి ప్రణాళికలను నిర్దేశిత గడువులోగా సమర్పించాలని స్పష్టం చేసింది లేనిపక్షంలో.. తొలి 30 రోజుల జాప్యానికి రోజుకు రూ.5,000 చొప్పున జరిమానాలను విధించనుంది. 30 రోజుల తర్వాత అదనంగా రూ.1.50 లక్షలతో పాటు రోజుకు రూ.10 వేలు చొప్పున జరిమానాను సంబంధిత ప్రతిపాదనలు సమర్పించే వరకు వసూలు చేయనుంది. ఈ ముసాయిదా నిబంధనలపై ఈ నెల 27లోగా సలహాలు, సూచనలు తెలపాలని ఈఆర్సీ కోరింది. పెరుగుతున్న విద్యుత్ సరఫరా వ్యయాన్ని రాబట్టుకోవడానికి ఏటా క్రమం తప్పకుండా విద్యుత్ చార్జీలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలంగా రాష్ట్రాలను కోరుతోంది. చార్జీల పెంపు ద్వారా మొత్తం వ్యయాన్ని రాబట్టుకో వాల్సిందేనని, నష్టాలు మిగల్చడానికి వీల్లేదని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు సంస్కరణలను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల ఈఆర్సీలు ఇప్పటికే ఈ నిబంధనలను అమలు చేస్తున్నాయి. నవంబర్ 30లోగా సమర్పించాల్సిందే నిబంధనల ప్రకారం ఏటా నవంబర్ 30లోగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెంచాల్సిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను ఈఆర్సీకి రాష్ట్రాల డిస్కంలు తప్పనిసరిగా సమర్పించాలి. అయితే విద్యుత్ చార్జీల పెంపుతో వచ్చే వ్యతిరేకత, విమర్శలకు భయపడి డిస్కంలను రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు అనుమతించడం లేదు. కానీ తాజాగా ఈఆర్సీ తీసుకొచ్చిన జరిమానాల నిబంధనలతో నిర్దేశిత గడువులోగా విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏటా చార్జీల వడ్డన తప్పదనే అభిప్రాయాన్ని విద్యుత్ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. -
సర్కారు తప్పిదాలతోనే విద్యుత్ మోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఏకంగా రూ.6,813 కోట్ల మేర విద్యుత్ చార్జీల పెంపునకు ప్రతిపాదించాయని, చరిత్రలో ఎన్నడూ ఇంతగా చార్జీలు పెంచిన దాఖలాలు లేవని విద్యుత్ రంగ నిపుణులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలు, లోపభూయిష్ట ప్రణాళికలు, లోపాయకారీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిం దని ఆరోపించారు. రాష్ట్రంలో ‘విద్యుత్ చార్జీ లు పెంచడమే మార్గమా?’అనే అంశంపై శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన వెబినార్‌లో పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను, సూచనలను వెల్లడించారు. నిర్లక్ష్యం, వైఫల్యాలతోనే.. మార్కెట్లో సౌర విద్యుత్ ధరలు తగ్గినా, పాత అధిక ధరలతోనే కొనుగోలు ఒప్పందాలు కొనసాగించారని.. ప్లాంట్ల నిర్మాణ గడువు పెంచి ప్రజలపై వందల కోట్ల అనవసర భారం వేశారని విద్యుత్‌రంగ విశ్లేషకుడు ఎం.వేణుగోపాల్‌రావు విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ బిడ్ ద్వారా ఓ రాజకీయవేత్తకు చెందిన థర్మల్ ప్లాంట్ రెండో యూనిట్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం చేసుకున్నారని, ఫలితంగా ప్రజలపై రూ.2,784 కోట్ల అదనపు భారం పడిందని చెప్పారు. కాలం చెల్లిన సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో చేపట్టిన భద్రాద్రి ప్లాంటు, వెయ్యి మెగావాట్ల ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం వంటివి రాష్ట్రానికి గుదిబండ మారాయన్నారు. 2018–22 మధ్య రూ.21,609 కోట్ల ఆదాయ లోటు ఉందని డిస్కంలు నివేదించాయని.. ఇంత భారం పేరుకుపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, ఈఆర్సీ, డిస్కంల వైఫల్యాలే కారణ మని విమర్శించారు. ప్రస్తుత ఒప్పందాల ద్వారానే రాష్ట్రానికి 16,603 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉందని.. 2022–23 నాటికి కొత్త ప్రాజెక్టులు పూర్తయితే ఇది 25,760 మెగావాట్లకు పెరుగుతుందని తెలిపారు. ఇలా భవిష్యత్ డిమాండ్‌ను అతిగా అంచనా వేసి ప్రాజెక్టులు కడుతున్నారని.. వాటి ఫిక్స్డ్ చార్జీల భారాన్ని ప్రజల నెత్తిన వేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలపై భారం తగదు పేదలు, మధ్యతరగతిపై విద్యుత్ చార్జీల భారం మోపడం సరికాదని ‘ప్రయాస్ ఎనర్జీ’సంస్థ నిపుణుడు, ఐఐటీయన్ ఎన్.శ్రీకుమార్ అభిప్రాయపడ్డారు. ‘‘రాష్ట్రంలోని 1. 15 కోట్ల గృహ విద్యుత్ కనెక్షన్లలో 62 శాతం పేదలు, మధ్యతరగతి వారివే. చార్జీల పెం పుతో వారి విద్యుత్ బిల్లులు 75–80 శాతం వరకు పెరిగిపోతాయి. 100 యూని ట్లలోపు వినియోగంపై చార్జీల పెంపును 5 శాతానికే పరిమితం చేయాలి. 100–200 యూనిట్లు వాడేవారిపై 10 శాతం, 200 యూనిట్లు దా టి వాడితే 12–15శాతం చార్జీలు పెంచితే న్యా యంగా ఉంటుంది..’’అని సూచించారు. -
విద్యుత్ చార్జీల పెంపుపై వెనక్కి తగ్గాలి: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ యూనిట్‌కు 50 పైసలు పెంచి పేదలపై భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్, పెట్రో భారం పెరిగిందని, దీంతో అన్ని రకాల నిత్యావసరాలపై ప్రభావం పడిందని విమర్శించారు. దీనిపై పార్లమెంట్లో సోనియాగాంధీ నిలదీశారని జగ్గారెడ్డి గుర్తుచేశారు. కాగా, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పార్టీ పరంగా మంచి పనులు చేస్తే ప్రశంసిస్తానని, పొరపా టు చేస్తే ప్రశ్నిస్తానని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. సోనియాగాంధీకి తాను రాసిన లేఖ ఎలా లీక్ అయిందో తెలియదని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. ఇంటర్ బోర్డు ముందు ధర్నా ఎట్లా చేశావు అంటే.. హైదరాబాద్ ఎవరి జాగీరు కాదని, వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎక్కడికైనా వెళ్తానని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌లో అంతర్గత పంచా యితీ కామన్ అని, పంచాయితీ లేకుంటే కాం గ్రెస్ వాళ్లంతా సైలెంట్‌గా ఉంటున్నారని ప్రజ లు అనుకుంటారని జగ్గారెడ్డి చమత్కరించారు -
పేదలపై పెనుభారం చార్జీల పెంపు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణలో పెంచని చార్జీలంటూ ఏవీ లేవని వెఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. మొన్న ఆర్టీసీ చార్జీలు పెంచిన కేసీఆర్.. తాజాగా విద్యుత్ చార్జీలను పెంచారని విమర్శించారు. 50 యూనిట్లలోపు వాడుకొనే 40 లక్షల పేదవాళ్లపై పెనుభారం మోపారంటూ షర్మిల ట్విట్టర్లో ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆ పార్టీ అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న మాట్లాడారు. పెంచిన చార్జీలను పార్టీ తీవ్రం గా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. -
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం
-
తెలంగాణలో ‘విద్యుత్’ షాక్.. ఛార్జీల పెంపు!
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థలు టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించాయి. సుమారు 6వేల కోట్ల రూపాయల మేర పెంపు ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలికి అందించినట్లు తెలుస్తోంది. ప్రతిపాదన ప్రకారం.. గృహ వినియోగదారులపై యూనిట్‌పై 50పై., వాణిజ్య వినియోగదారులకు 1రూ. పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలను ఈఆర్సీElectricity Regulatory Commissionకి సమర్పించాయి డిస్కంలు. ఇక డిస్కమ్‌లకు 10వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉన్నట్లు నివేదిక ద్వారా తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ఛార్జీలు పెంచకతప్పదనే సంకేతాలు అందించింది. సుమారు ఏడేళ్ల తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వగా.. సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. చార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6,831 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉండగా.. ఈ భారమంతా వినియోగదారులైన ప్రజలపై పడనుంది. ఎల్.టీ (డొమెస్టిక్)కనెక్షన్ ల పై యూనిట్ కు రూ.50పైసలు పెంపు ద్వారా...రూ.2,110 కోట్లు ఆదాయం, హెచ్.టి కనెక్షన్ల రూ.1 పెంపు ద్వారా రూ.4,721కోట్లు ఆదాయం రానున్నట్లు డిస్కంలు చెప్తున్నాయి. ఇక ఎస్సీ, ఎస్టీ డొమెస్టిక్ వినియోగదారులకు 101 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్, 25.78 లక్షల పంపుసెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్, సెలూన్లకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్‌తో పాటు పవర్ లూమ్స్, పౌల్ట్రీ రంగానికి యూనిట్ కు రూ. 2 సబ్సిడీ ఉంది. రైల్వే చార్జీలు,బొగ్గు,బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం అయిందని టీఎస్ ఎస్పీడిఎసిఎల్ సీఎండీ రఘుమారెడ్డి చెప్తున్నారు. -
100 యూనిట్ల లోపు విద్యుత్తు చార్జీలు ఏపీలోనే చవక
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు వారి జీవన వ్యయాన్ని కూడా తక్కువ ఉండేలా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పేదలకు తక్కువ చార్జీలతో విద్యుత్తును అందిస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకంటే 100 యూనిట్ల లోపు విద్యుత్తు రాష్ట్రంలోనే చవగ్గా ఉంది. దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా, వాటిలో 23 చోట్ల్ల ఏపీ కంటే ఎక్కువగా విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. నెలకు 100 యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగించే వారిపై విధిస్తున్న చార్జీలు రాష్ట్రంలో చాలా తక్కువగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ దగ్గర్నుంచి కర్ణాటక, ఒడిశా, గుజరాత్, ఛత్తీస్‌ఘడ్ తదితర రాష్ట్రాల్లోకంటే ఏపీలోనే తక్కువ ధరలు ఉన్నాయని సీఈఏ నివేదిక తేటతెల్లం చేసింది. వంద యూనిట్ల లోపు విద్యుత్ వినియోగానికి రాష్ట్రంలో యూనిట్‌కు రూ.2.66 మాత్రమే పంపిణి సంస్థలు వసూలు చేస్తున్నాయి. ఇదే వినియోగానికి దేశ రాజధాని ఢిల్లీలో రూ. 4.73, అత్యధికంగా రాజస్థాన్‌లో రూ. 8.33 వసూలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటకలో రూ.8.26, ఒడిశాలో రూ.4.66, ఛత్తీస్‌గఢ్‌లో రూ.4.49 వసూలు చేస్తున్నారు. నాలుగైదు రాష్ట్రాలు, కొన్ని కేంద్ర పాలితి ప్రాంతాల్లో మాత్రమే మన రాష్ట్రంకంటే స్వల్పంగా తక్కువ చార్జీలు ఉన్నాయి. వంద యూనిట్ల లోపు వినియోగానికి ఒడిశాలో ఒక వినియోగదారుడు నెలకు సగటున రూ. 374 చెల్లిస్తుంటే, ఛత్తీస్‌గఢ్‌లో రూ.449, ఢిల్లీలో రూ.473 చెల్లించాల్సి వస్తోంది. మన రాష్ట్రంలో ఇది కేవలం రూ.266 మాత్రమే. 400 యూనిట్ల వరకు వినియోగించే వినియోగదారుని చార్జీ ఛత్తీస్‌గఢ్‌లో రూ.494.10 ఉంటే ఒడిశాలో రూ.496.60 ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది తక్కువగా రూ.491.63గా ఉంది. నాణ్యతలోనూ ముందే విద్యుత్ సరఫరా, నాణ్యతలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. రాష్ట్రంలో కోతలు లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారు. దేశంలో విద్యుత్ సరఫరాలో నాణ్యతపై 20–30 శాతం కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. దేశంలో 10 శాతం గృహాలకు ఎక్కువ సార్లు విద్యుత్ కోతలు ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. రాష్ట్రంలో ఇటువంటి ఫిర్యాదులు లేవు. ఒడిశాలో దాదాపు 85 శాతం కుటుంబాలు రోజుకు కనీసం ఒక సారి విద్యుత్ కోతను ఎదుర్కొంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఇది దాదాపు 84 శాతం. అదనపు చార్జీలు లేవు ఏపీలో వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారిపై ఎటువంటి ఫిక్స్డ్ చార్జీలు లేవు. ఎలక్ట్రికల్ డ్యూటీ కూడా 6 పైసలు మాత్రమే. మిగతా చాలా రాష్ట్రాల్లో ఈ రెండూ కూడా ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటకలో రూ.2.75 ఫిక్స్డ్ చార్జీ, 68 పైసలు ఎలక్రికల్ డ్యూటీ వేస్తున్నారు. ఒడిశాలో కూడా 60పైసలు, 16 పైసలు చొప్పున ఈ చార్జీలు కలిపే బిల్లులు వేస్తున్నారు. మన రాష్ట్రంలో 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించేది పేద ప్రజలే. అందుకే వారిపై అధిక భారం వేయడంలేదు. – ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ -
విచారణార్హత లేదు.. డిస్కంలకు షాక్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)కు విద్యుత్ నియంత్రణ మండలి షాక్ ఇచ్చింది. గత మూడేళ్లకు సంబంధించి దాఖలు చేసిన వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) నివేదికలు విచారణార్హమైనవి కావంటూ వెనక్కు పంపింది. డిస్కంలు సమర్పించిన ఏఆర్ఆర్ల విచారణార్హతపై సోమవారం విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు ఎం.డి.మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్యలు విచారణ నిర్వహించారు. ఈ విచారణకు ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డితోపాటు డిస్కంల తరఫు న్యాయవాదులు హాజరయ్యారు. ఈ నివేదికల్లో టారిఫ్ (విద్యుత్ చార్జీల పెంపు) ప్రతిపాదనలను సమర్పించనందున ఏఆర్ఆర్లను విచారణ జరపాల్సిన అవసరం లేదని మం డలి సభ్యులు తేల్చారు. ఒకవేళ మూడేళ్ల టారిఫ్ ప్రతిపాదనలు సమర్పిస్తే విచారణ జర పాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. భాగస్వామ్యపక్షాల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు తీసుకున్నాకే నిర్ణ యిస్తామని వెల్లడించారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతోందని, 10 రోజుల గడువు ఇవ్వాలని డిస్కంలు ఈఆర్సీని కోరగా వారంకన్నా ఎక్కువ సమయం ఇవ్వలేమని ఈఆర్సీ తేల్చిచెప్పింది. ఈ నెల 27లోగా ప్రతిపాదనలను కండోల్ పిటిషన్ రూపంలో సమర్పించా లని ఆదేశించింది. టారిఫ్ ప్రతిపాదనలు డిస్కంలు ఇవ్వకపోయినా తామే సుమో టోగా తీసుకొని విచారణ జరిపే అధికారాల గురించి కూడా ఈఆర్సీ అన్వేషిస్తోంది. ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ అలా జరగలేదని, డిస్కంలు ప్రతిపాదించకుండా టారిఫ్ ఉత్తర్వులు ఈఆర్సీ ఇవ్వజాలదని, యూపీలో డిస్క ంలకు జరిమానా మాత్రం విధించారని ఈఆర్సీ చైర్మన్ దృష్టికి నిపుణులు తీసుకువచ్చారు. దీంతో ఏం చేయాలన్న దానిపై ఈ నెల 27 వరకు ఈఆర్సీ వేచిచూసే ధోరణిలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సీఎం ఆమోదిస్తేనే...: వాస్తవానికి చాలాకాలం తర్వాత ఈఆర్సీకి విద్యుత్ పంపిణీ సంస్థలు ఏఆర్ఆర్లను దాఖలు చేశాయి. ఈ ఏడాది నవంబర్ 30న 2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాల ఏఆర్ఆర్లను దాఖలు చేసినా టారిఫ్ ప్రతిపాదనలు చేయలేదు. దీంతో ఈ నెల 10లోగా ప్రతిపాదించాలని ఈఆర్సీ డిస్కంలకు నోటీసులిచ్చింది. టారిఫ్ ప్రతిపాదనలకు సంబంధించి మంత్రుల స్థాయిలో మూడుసార్లు సమావేశం జరగ్గా ముసాయిదా ప్రతిపాదనలకే మోక్షం లభించింది. ఈ ముసాయిదాను కేసీఆర్ ఆమోదించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈఆర్సీ ఈ నెల 27 వరకు గడువిచ్చింది. ఆలోగా సీఎం ఆమోదిస్తేనే ప్రతిపాదనలు సమర్పించగలమని అధికారులు చెబుతున్నారు. -
Electricity Tariff: కేంద్రమే గుదిబండ
సాక్షి, హైదరాబాద్: దక్షిణ/ఉత్తర తెలంగాణ డిస్కంలు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాల్సిన విద్యుత్ టారిఫ్ (చార్జీల పెంపు) ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం రెండోరోజు ఉన్నతాధికారులతో సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఏడేళ్లలో డిస్కంలపై పెరిగిన వ్యయ భారాలపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు. కోతల్లేని నిరంతర విద్యుత్ సరఫరా, వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ సబ్సిడీలు సైతం డిస్కంలపై తీవ్ర భారాన్ని మోపాయని సమీక్షలో మంత్రులకు అధికారులు నివేదించారు. ఈ నేపథ్యంలో డిస్కంల నష్టాలు, ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. చార్జీల పెంపు ప్రతిపాదనలను ఒకట్రెండు రోజుల్లో ఈఆర్సీకి డిస్కంలు సమర్పించనున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, దక్షిణ డిస్కం సీఎండీ జి. రఘుమారెడ్డి పాల్గొన్నారు. డిస్కంల నష్టాలపై ప్రభుత్వానికి అధికారుల నివేదన ఇదీ... ♦గత నాలుగేళ్లలో బొగ్గు రవాణా రైల్వే చార్జీలను కేంద్రం 40 శాతం మేర పెంచింది. పునరుత్పాదక విద్యత్ (ఆర్పీవో)ను కేంద్రం తప్పనిసరి చేయడంతో జెన్కో థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించి ప్రైవేటు నుంచి ఖరీదైన సోలార్, పవన విద్యుత్‌ను కొనాల్సి వస్తోంది. సీలేరు, కృష్ణపట్నం విద్యుత్ కేంద్రాల ఒప్పందాల (పీపీఏ)ను రద్దు చేసుకోవడంతో ప్రత్యామ్నాయంగా బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో డిస్కంలపై రూ. 2,763 కోట్ల అదనపు భారం పడింది. ఏపీ జెన్కో ఇతర విద్యుత్ కేంద్రాల నుంచి రావాల్సిన విద్యుత్‌ను సైతం నిలిపేయడంతో డిస్కంలు మరో రూ. 2,502 కోట్ల అదనపు ఖర్చులు చేశాయి. ♦ సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ కోసం ఏటా ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌కు రూ. 18,167 సబ్సి డీని ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 19.03 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండ గా ఏడేళ్లలో 6.89 లక్షల కొత్త కనెక్షన్లను సర్కారు మంజూరు చేసింది. ఏటా వ్యవసాయ సబ్సిడీగా ప్రభుత్వం రూ. 3,375 కోట్లు ఖర్చు చేస్తోంది. ♦ కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాల విద్యుత్ సరఫరాకు రూ.3,200 కోట్లు ఖర్చు చేస్తోంది. ♦ 200 యూనిట్లలోపు గృహావసరాల విదుŠయ్త్ వినియోగదారులకు ఏటా రూ. 1,253 కోట్ల రాయితీలను అందిస్తోంది. 5,77,100 ఎస్సీ, 2,69,983 ఎస్టీల గృహాలకు ప్రతి నెలా 101 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తోంది. నాయీ బ్రాహ్మణుల నిర్వహణలోని 15,046 హెయిర్ సెలూన్లు, 47,545 లాండ్రీ షాపులు, 50 దోభీ ఘాట్లకు ప్రతి నెలా 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది. 4,920 పవర్ లూమ్‌లు, 5,920 కోళ్ల ఫారాలు, 36 స్పిన్నింగ్ మిల్లులకు ఒక్కో యూనిట్‌పై రూ. 2 చొప్పున సబ్సిడీ అందిస్తోంది. ♦ కోవిడ్ లాక్డౌన్ల ప్రభావంతో రూ. 4,374 కోట్ల విద్యుత్ బిల్లుల వసూళ్లు నిలిచిపోయాయి. ఏటేటా డిస్కంలపై ఈ మేరకు వ్యయ భారాలు పెరిగిపోతుండగా గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను సైతం పెంచలేదు. టన్ను బొగ్గుపై రూ. 50 ఉన్న క్లీన్ ఎనర్జీ సెస్‌ను మోదీ ప్రభుత్వం రూ. 400కు పెంచడంతో ఏడేళ్లలో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లపై రూ. 7,200 కోట్ల అదనపు భారం పడింది. బొగ్గు ధరలను కేంద్రం సాలీనా 6–10% పెంచడంతో డిస్కంలపై ఏటా రూ. 725 కోట్ల అదనపు భారం పడింది. రాష్ట్ర విభజన వేళ రూ. 12,185 కోట్ల భారీ నష్టాల తో ఏర్పడిన డిస్కంలపై మోదీ సర్కార్ విద్యుత్ సంస్కరణలూ గుదిబండగా మారాయి. – సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారన్న అధికార వర్గాలు -
పేదలపై విద్యుత్ చార్జీల భారం వేయం
సాక్షి, అమరావతి: పేద ప్రజలపై ఎటువంటి భారం లేకుండా, విద్యుత్ చార్జీలను స్వల్పంగా పెంచేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)ని కోరాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఎఆర్ఆర్), రిటైల్ సప్లై బిజినెస్ (ఆర్ఎస్బీ)ను సోమవారం ఏపీఈఆర్సీకి సమర్పించాయి. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ సమక్షంలో తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంతాల విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్)ల సీఎండీలు కె.సంతోషరావు, హెచ్. హరనాధరావు, జె.పద్మాజనార్ధనరెడ్డిలు ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు పి.రాజగోపాలరెడ్డి, ఠాకూర్ రామసింగ్లకు సమగ్ర ఆదాయ ఆవశ్యకత (ఏఆర్ఆర్) నివేదికలను అందజేశారు. ప్రస్తుతం ఉన్న శ్లాబుల్లో ఈ సారి మార్పులు చేశారు. ఇకపై గృహ విద్యుత్ 0–30 యూనిట్ల లోపు వినియోగానికి యూనిట్‌కు రూ.1.45 పైసలు వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. 31–75 వరకు రూ.2.80 పైసలు, 0–100 వరకు రూ.4, 101–200 వరకు రూ.5, 201–300 వరకు రూ.7, 300 యూనిట్ల పైన రూ.7.50 పైసలు చొప్పున వసూలుకు అనుమతి కోరారు. ప్రస్తుతం 301–400 యూనిట్లు వినియోగిస్తే రూ.7.95 పైసలు, 401 నుంచి 500 వరకూ రూ.8.50 పైసలు, ఆ పైన రూ.9.95 పైసలు చొప్పున చార్జీలు విధిస్తున్నారు. తాజా ప్రతిపాదనల్లో ఇవి కొంతవరకూ తగ్గించడం ఊరట కలిగిస్తోంది. అదే విధంగా వాణిజ్య విద్యుత్ టారిఫ్‌లను కూడా తగ్గించాలని ప్రతిపాదించారు. 0–50 యూనిట్లు వాడే వారికి యూనిట్ రూ.6.90 పైసల నుంచి రూ.5.40 పైసలకు తగ్గించారు. హైటెన్షన్ విద్యుత్ సర్వీసులకు 11 కెవీ, 33 కేవీ, ఈహెచ్‌టీల టారిఫ్‌లలో మార్పు లేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తామన్నారు. హార్స్ పవర్ పెరిగే కొద్దీ విధించే చార్జీలను పెంచాలని అడగలేదు. పరిశ్రమలకు విధించే టారిఫ్‌లపైనా మార్పు లేదు. ఇలా అన్ని వర్గాల వారిపైనా భారం లేకుండా నామమాత్రంగా చార్జీలను పెంచేందుకు అనుమతించాలని డిస్కంలు విజ్ఞప్తి చేశాయి. సరాసరి విద్యుత్ సరఫరా వ్యయం రూ.6.58 పైసలుగా తేల్చాయి. కొత్త టారిఫ్‌ల ప్రకారం విద్యుత్ చార్జీలను వచ్చే ఏడాది ఆగస్టు 1 నుంచి అమలులోకి తేవాలనుకుంటున్నట్లు డిస్కంలు మండలికి తెలిపాయి. 2022–23 ఆర్ధిక సంవత్సరానికి వివిధ మార్గాల ద్వారా 74,815 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనాల్సి ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో డిస్కంల ఆదాయం రూ.40,962.4 కోట్లు ఉంటే ఖర్చు రూ.41,220.99 కోట్లు ఉంది. రూ.258.59 కోట్ల వ్యత్యాసం ఉంది. 2022–23లో మొత్తం ఖర్చులు రూ.45,398.58 కోట్లుగా అంచనా వేయగా లోటు వచ్చే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తోందని చెబుతూ నికర ఆర్థిక లోటును 0 గా చూపించాయి. అయితే 2014 నుంచి ఈ ఏడాది మార్చి 31 నాటికి డిస్కంలు రూ.28,599 కోట్ల నష్టాల్లో ఉన్నాయని తెలిపాయి. ఇవి కాకుండా రూ.37,465 కోట్ల అప్పులున్నట్లు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2021–22లో ఇప్పటి వరకూ రూ.13,560 కోట్ల రుణాలు తీసుకున్నట్లు వివరించాయి. విద్యుత్ కొనుగోలు, సరఫరా ఖర్చులు గడిచిన ఏడేళ్లలో రూ.25,595 కోట్లకు చేరాయని తెలిపారు. గత ఆగస్టులో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) నివేదిక ప్రకారం 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగంపై దేశంలోనే అత్యంత తక్కువ చార్జీ ఏపీలో ఉందనే విషయాన్ని గుర్తు చేశాయి. మిగిలితే వినియోగదారులకు ఇస్తున్నాం 2014–15 నుంచి 2018–19 వరకూ ఆమోదించిన ట్రూఅప్ చార్జీలను ఏపీఈఆర్సీ నిలిపివేసింది. తిరిగి వాటి వసూలుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి. చార్జీలు వసూలు చేయడమే కాకుండా మిగిలితే తిరిగి వినియోగదారులకు ఇస్తున్నామని, ఈ విధంగా 2022లో ట్రూ డౌన్ రూ.3,373 కోట్లుగా ఇప్పటికే నిర్ధారించామని తెలిపారు. విద్యుత్ కొనుగోలు ఖర్చుల ట్రూ డౌన్ రూ.4,761 కోట్లు, ఆదాయ లోటు రూ.3,685 కోట్లు, అదనపు ఖర్చు రూ.183 కోట్లు, 2021కి అదనపు ఆదాయ లోటు ట్రూ అప్ రూ.2,480 కోట్లు చొప్పున లెక్క గట్టాయి. ఈ అంశాలన్నింటిపైనా ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ హియరింగ్) నిర్వహించి, తగిన నిర్ణయాన్ని వెలువరిస్తుంది. -
ఏపీలో భళా.. దేశంలో డీలా!
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తమ బకాయిలను రాబట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిపోయిన బకాయిలను కఠిన నిబంధనల ద్వారానైనా వసూలయ్యేలా చూడాలని కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి. అయితే రాష్ట్రంలో మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) విద్యుత్ కొనుగోళ్ల కోసం 2019–21 మధ్య విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. దేశవ్యాప్తంగా రూ.95,104.9 కోట్లు దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు డిస్కంల మొత్తం బకాయిలు ఇప్పటివరకు రూ.95,104.9 కోట్లుగా ఉన్నాయి. డిస్కంలు ఆలస్యంగా చెల్లించడం వల్ల ఉత్పత్తి సంస్థలు తాము తీసుకున్న రుణాలను సకాలంలో తీర్చలేకపోతున్నాయి. ముఖ్యంగా ఉత్పత్తి సంస్థలు బొగ్గు కోసం ముందస్తు చెల్లింపులు చేస్తాయి. నిర్వహణ కోసం ఉంచిన నిధులను బొగ్గు కొనుగోలుకు ఉపయోగించేయడం వల్ల క్రెడిట్ రేటింగ్ పడిపోతోంది. తర్వాత అధిక వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోందని విద్యుత్ ఉత్పత్తిదారుల సంఘం (ఏపీపీ) ఆవేదన వ్యక్తం చేస్తోంది. బకాయిలు ఉన్నవారికి ప్లాంట్లు విద్యుత్ సరఫరాను నిలిపివేసినప్పుడు వారు ఇతర వనరుల నుంచి విద్యుత్‌ను సేకరించుకుంటున్నారు. ఇది కష్టతరమయ్యేలా కఠిన నిబంధనలను విధించాలని స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులు (ఐపీపీ) కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో పరిస్థితి వేరు ఏపీ డిస్కంలు 2019–21 మధ్య విద్యుత్ కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం, సబ్సిడీలు సకాలంలో అందడం వల్లే ఇది సాధ్యమైంది. మార్చి 31, 2019 నాటికి విద్యుత్ సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చింది. 2019–21 సంవత్సరానికి విద్యుత్ సబ్సిడీ, ఇతర ఛార్జీల కింద మరో రూ.16,724 కోట్లు అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు చెల్లించాల్సిన విద్యుత్ సబ్సిడీని కూడా ప్రభుత్వం ఇచ్చేసింది. ఇలా ఇప్పటివరకు దాదాపు రూ.33,639.11 కోట్ల ఆర్థిక సాయం అందించి డిస్కంలను ఆదుకుంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం వడ్డీలతో కలిపి సుమారు రూ.15 వేల కోట్లు ఏపీ జెన్కోకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. ఇందులో రూ.6,283.88 కోట్లు తెలంగాణ డిస్కంల నుంచే రావాల్సి ఉందని ఏపీ జెన్కో ఎండీ శ్రీధర్ ‘సాక్షి’కి వెల్లడించారు. -
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు 7 రోజుల్లోగా సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ టారీఫ్ (చార్జీల పెంపు) ప్రతిపాదనలను 7 రోజుల్లోగా సమర్పించాలని దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఆదేశించింది. నవంబర్ 30న డిస్కంలు సమర్పించిన 2022–23 ఆర్థిక సంవత్సరాల వార్షికాదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)ల్లో టారీఫ్ ప్రతిపాదనలు లేవని, వీటిని సమర్పించినట్లు పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు డిస్కంల సీఎండీలకు ఈఆర్సీ గురువారం లేఖ రాసింది. వచ్చే ఆర్థిక సంవత్సరాని(2022–23)కి సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు సమర్పించిన నాటి నుంచి 120 రోజుల తర్వాతే రాష్ట్రంలో చార్జీల పెంపునకు అనుమతిస్తామని ఈఆర్సీ స్పష్టం చేసింది. దీంతో డిస్కంలకు ఎదురు దెబ్బతగిలింది. ప్రతిపాదనలు ఎంత ఆలస్యం చేస్తే చార్జీల పెంపులో అంత ఆలస్యం జరగనుంది. గడువులోగా టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించకపోతే ఏఆర్ఆర్లను ఈఆర్సీ తిరస్కరించే అవకాశాలున్నట్లు తెలిసింది. 120 రోజులు ఎందుకంటే?.. డిస్కంలు ఈఆర్సీకి ఏఆర్‌ఆర్‌తో పాటు టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత నిబంధనల ప్రకారం వాటిని బహిర్గతం చేసి రాతపూర్వకంగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరిం చాలి. డిస్కంలతో పాటు ఈఆర్సీ వెబ్సైట్లో వీటి ని ప్రదర్శిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది. డిస్కంల టారిఫ్ పెంపు ప్రతిపాదనలు, వాటిపై వచ్చిన అభ్యంతరాలు, సూచనలు, డిస్కంల ప్రతిస్పందనలపై ఈఆర్సీ అధ్యయనం జరిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెంచాల్సిన విద్యుత్ చార్జీలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ప్రక టిస్తుంది. సుదీర్ఘ ప్రక్రియ కావడంతో 120 రోజుల సమయాన్ని ఇందుకు కేటాయిస్తూ కేంద్ర ప్రభు త్వం నిబంధనలను రూపొందించింది. అందుకే ఏటా నవంబర్ 30లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సం బంధించిన ఏఆర్‌ఆర్‌లు, విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పి ంచాలని టారిఫ్ నిబంధనలు పేర్కొంటున్నాయి. వ్యూహాత్మకంగానే ఆలస్యం.. విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజావ్యతిరేకత నుంచి ఉపశమనం పొందడానికే డిస్కంలు టారిఫ్ ప్రతి పాదనలను గడువులోగా సమర్పించకుండా వ్యూహాత్మకంగా వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి. చివరిసారిగా 2018–19కిసంబంధించిన ఏఆర్ఆర్లను ఈఆర్సీకి సమర్పించగా, అప్పట్లో చార్జీలు పెంచలేదు. 2019–20, 2020– 21 ఏఆర్ఆర్లను ఇవ్వలేదు. 2021–22 ఏఆర్ఆర్లను గడువు తీరాక సమర్పించాయి. 2022–23 ఏఆర్ఆర్లను సమర్పించినా, టారిఫ్ ప్రతిపాదనలను వాయిదా వేసుకున్నాయి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి చార్జీలు పెంచాలని భావించినా, 120 రోజుల నిబంధన లో ఈఆర్సీ రాజీపడకపోవడంతో డిస్కంలకు ఎదురు దెబ్బతగిలింది. -
TS: విద్యుత్ వినియోగదారులకు చార్జీల షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు చార్జీల షాక్ తగలనుంది. విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగారావు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ సబ్సిడీలు సర్దుబాటు చేశాక 2022–23కు సంబంధించిన రూ.10,928 కోట్ల భారీ ఆర్థిక లోటును పూడ్చడానికి భారీగా విద్యుత్ చార్జీల పెంపు తప్ప మరో మార్గం లేకుం డాపోయింది. అయితే చార్జీల పెంపు ద్వారా ఎంత మేరకు ఆర్థిక లోటును పూడ్చుకోవాలన్న దానిపై త్వరలో ఈఆర్సీ నిర్ణయం తీసుకోనుంది. వినియోగదారులపై ప్రత్యక్షంగా రూ.2వేల కోట్లు, పరోక్షంగా మరో రూ.2వేల కోట్ల వరకు చార్జీల పెంపు భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. పేద, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల వినియోగదారుల విద్యుత్ బిల్లులు భారీగా పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. పెంపుపై స్పష్టత ఇవ్వని డిస్కంలు ఏఆర్ఆర్ నివేదికతో పాటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెంచాల్సిన విద్యుత్ చార్జీల (రిటైల్ టారిఫ్ షెడ్యూల్) ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పిం చాల్సి ఉంది. మంగళవారం ఏఆర్ఆర్ నివేదికలు అందజేసిన పంపిణీ సంస్థలు.. చార్జీల పెంపు ప్రతిపాదనలను మాత్రం వాయిదా వేసుకున్నాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించాలని ఈఆర్సీ చైర్మన్ ఆదేశించారు. డిస్కంలు వీటిని సమర్పిస్తేనే విని యోగదారుల కేటగిరీల వారీగా విద్యుత్ చార్జీల పెంపుపై స్పష్టత రానుంది. డిస్కంల ప్రతిపాదనలు అందిన తర్వాత నిబంధనల మేరకు ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ నిర్వహించి చార్జీల పెంపునకు అనుమతిస్తామని శ్రీరంగారావు పేర్కొన్నారు. 2021–22కి సంబంధించిన ఏఆర్ఆర్లను సైతం డిస్కంలు సమర్పించినా, ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న మరో 4 నెలల్లో ఎలాంటి విద్యుత్ చార్జీల పెంపు ఉండదని చైర్మన్ ప్రకటించారు. 2021–22లో రూ.10,624 కోట్ల ఆర్థిక లోటు ఉండనుందని డిస్కంలు అంచనా వేయగా, ట్రూఅప్ చార్జీల ద్వారా దీనిని భర్తీ చేసేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. పొంచి ఉన్న ఆరేళ్ల భారం ప్రతి ఏటా నవంబర్ 30లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్‌ఆర్‌లు, విద్యుత్ చార్జీల సవరణ ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాలని విద్యుత్ చట్టం పేర్కొంటోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో సరఫరా చేసేందుకు ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కానుంది? ఇందుకు ఎంత వ్యయం కానుంది? ప్రస్తుత చార్జీలతోనే విద్యుత్ సరఫరా చేస్తే వచ్చే ఆదాయం ఎంత? ఏర్పడే ఆదాయం లోటు ఎంత? ఈ లోటును పూడ్చుకోవడానికి ఏ మేరకు విద్యుత్ చార్జీలు పెంచాలి అనే సమగ్ర అంచనాలు ఏఆర్ఆర్ల్లో ఉంటాయి. తెలంగాణ వచ్చాక తొలిసారిగా 2015–16లో, ఆ తర్వాత 2016–17లో రెండో/చివరిసారిగా విద్యుత్ చార్జీలు పెంచారు. చివరిసారిగా డిస్కంలు 2018–19కి సంబంధించిన ఏఆర్ఆర్లను ఈఆర్సీకి సమర్పించగా, అప్పట్లో చార్జీలు పెంచలేదు. దీంతో 2016–17లో పెంచిన విద్యుత్ చార్జీలే గత ఆరేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఆరేళ్ల ఆదాయ లోటును ట్రూఅప్ చార్జీల రూపంలో వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి వీలుగా డిస్కంలు త్వరలో ఈఆర్సీకి పిటిషన్ సమర్పించే అవకాశం ఉంది. దీనికి ఈఆర్సీ అనుమతిస్తే వినియోగదారులపై ఒకేసారి ఆరేళ్ల భారం పడే ప్రమాదముందని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలను పెంచితే ఆ మేరకు భారం వినియోగదారులపై తగ్గే అవకాశం ఉంది. ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించకుంటే, ట్రూ అప్ చార్జీల రూపంలో ఆ తర్వాత వసూలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వబోమని గత ఈఆర్సీ అప్పట్లో తేల్చిచెప్పింది. ఈ ఆదేశాలకు కట్టుబడి ఉంటారా అని ప్రస్తుత చైర్మన్ శ్రీరంగారావును విలేకరులు ప్రశ్నించగా.. డిస్కంల నుంచి ప్రతిపాదనలు వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు. ట్రూ అప్ చార్జీలంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో డిస్కంలకు సంబంధించిన మొత్తం వ్యయ అంచనాలను ఈఆర్సీ ముందస్తుగా ఆమోదించి, దానికి అనుగుణంగా విద్యుత్ టారిఫ్‌ను నిర్ణయిస్తుంది. ఏడాది ముగిశాక ఈఆర్సీ ఆమోదించిన అంచనాలకు మించి ఖర్చు అయితే.. ఆ వ్యత్యాసాన్ని వసూలు చేసుకోవడానికి (ట్రూ అప్ చార్జీల పేరిట) డిస్కంలకు ఈఆర్సీ అనుమతిస్తుంది. -
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తరహాలో...విద్యుత్ బిల్లుల బాదుడు..!
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తరహాలో విద్యుత్ బిల్లులూ ఇకపై ప్రతిసారీ పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంచలనాత్మక ఆదేశాల నేపథ్యంలో వినియోగదారులపై మళ్లీ ఇంధన సర్దుబాటు చార్జీల (ఫ్యూయెల్ సర్‌చార్జీ అడ్జెస్ట్మెంట్/ఎఫ్ఎస్ఏ) మోత మోగనుంది. విద్యుదుత్పత్తికి వినియోగించే బొగ్గు, గ్యాస్ ధరల్లో పెరుగుదల భారాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారులపై మోపి ప్రతి నెలా ఎఫ్ఎస్ఏ రూపంలో వసూలు చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ బుధవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. తక్షణమే ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండళ్లను (ఈఆర్సీలు) ఆదేశించింది. విద్యుత్ సంస్థలపై పెరుగుతున్న వ్యయ భారాలను ఎప్పటికప్పుడు వినియోగదారులపై బదలాయించి వసూలు చేసుకోవడానికి వీలు కల్పిస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గత నెల 22న విద్యుత్ నిబంధనలు–2021ను ప్రకటించింది. పెరిగే వ్యయ భారాలను మదించడానికి ఇందులో ఓ ఫార్ములాను సైతం పొందుపర్చింది. రాష్ట్రాల ఈఆర్సీలు సొంత ఫార్ములాను రూపకల్పన చేసుకునే వరకు..తమ ఫార్ములాను అనుసరించాలని ఆదేశించింది. నాణ్యత దెబ్బ తింటోందంటూ.. బొగ్గు ధరల్లో పెరుగుదల వల్ల అయ్యే వ్యయం సకాలంలో తిరిగి వసూలు కాక విద్యుదుత్పత్తి కంపెనీలు సంక్షోభంలో నెట్టబడుతున్నాయి. బొగ్గు కొనుగోళ్లకు అవసరమైన డబ్బులు లేక విద్యుదుత్పత్తిని సైతం కొనసాగించలేకపోతున్నాయి. వీటి నుంచి విద్యుత్ కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేసే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సైతం సకాలంలో వినియోగదారుల నుంచి ధరల పెరుగుదల భారాన్ని వసూలు చేసుకోలేకపోతున్నాయి. దీంతో విద్యుత్ సరఫరా సేవల నాణ్యత దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలోనే.. పెరిగే బొగ్గు, గ్యాస్ ధరల వ్యయ భారాన్ని విద్యుదుత్పత్తి కంపెనీలు సకాలంలో డిస్కంల నుంచి, డిస్కంలు వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి వీలు కల్పిస్తూ ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చినట్టు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. బొగ్గు ధరల్లో భారీ పెరుగుదలకు, కొరత తోడు కావడంతో ఇటీవల దేశ విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం పేర్కొంది. తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో.. ప్రస్తుతం ఏడాదికోసారి మాత్రమే విద్యుత్ చార్జీలను సవరించే/పెంచే పద్ధతిని అమలు చేస్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికోసారి కూడా విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతించడం లేదు. గత ఆరేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచలేదు. కానీ ఇంధన సర్దుబాటు చార్జీల ఫార్ములా ఆధారంగా టారిఫ్‌ను ఏడాదిలో ఒకసారికి మించి సవరించుకోవడానికి విద్యుత్ చట్టంలోని సెక్షన్ 62(4) అనుమతిస్తోంది. దీని ఆధారంగానే ఇంధన సర్దుబాటు చార్జీల వసూళ్లపై నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. దీంతో ఇకపై ప్రతి నెలా విద్యుత్ బిల్లులు పెరిగేందుకు అవకాశం ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంధన సర్దుబాటు చార్జీలను కొంత కాలం పాటు వసూలు చేయగా, వినియోగదారులు గగ్గోలు పెట్టారు. తర్వాత రాష్ట్ర హైకోర్టు ఈ వసూళ్లు అక్రమమని తేల్చి బ్రేక్ వేసింది. దాదాపు దశాబ్దం గ్యాప్ తర్వాత కేంద్రం ఈ ఎఫ్‌ఎస్‌ఏను తెరపైకి తెచ్చింది. రాష్ట్రాలు సబ్సిడీ ఇచ్చుకోవచ్చు.. ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రతి నెలా వసూలు చేసుకోవాలని ఆదేశించిన కేంద్ర విద్యుత్ శాఖ..విద్యుత్ చట్టంలోని సెక్షన్ 65 ప్రకారం ముందస్తుగా సబ్సిడీ చెల్లించి వినియోగదారులపై వాటి భారం పడకుండా చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని పేర్కొంది. సర్దుబాటు చార్జీలపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. -
పంజాబ్‌లో తగ్గిన విద్యుత్ చార్జీలు
చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లో విద్యుత్ చార్జీలను తగ్గించింది. గృహ వినియోగదారులకు ఇచ్చే కరెంట్‌ను ఒక్కో యూనిట్‌కు రూ.3 తగ్గిస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. చార్జీలు తగ్గించడంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా ఏటా రూ.3,316 కోట్ల ఆర్థికభారం పడనుంది. చార్జీల తగ్గింపుతో రాష్ట్రంలోని 72 లక్షల గృహ వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని సీఎం చరణ్‌జీత్ చన్నీ చెప్పారు. 100 యూనిట్ల వరకు ఉన్న పవర్ టారీఫ్‌లో ఒక యూనిట్‌కు ఇప్పటిదాకా రూ.4.19 చార్జీ ఉండగా అది ఇకపై రూ.1.19గా ఉండనుంది. దీంతో ప్రతీ యూనిట్‌పై గృహ వినియోగదారులకు రూ.3 లబ్ధి చేకూరుతుంది. 101–300 యూనిట్ల టారిఫ్‌లో ఒక్కో యూనిట్‌కు రూ.4.01 వసూలు చేయనున్నారు. 300 యూనిట్లు మించితే ఒక్కో యూనిట్‌కు రూ.5.76 చెల్లించాల్సి ఉంటుంది. పంజాబ్‌లో విద్యుత్ చార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ నేత నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ రాష్ట్రంలో సొంత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే నిరసన జెండా ఎగరేసిన సంగతి తెల్సిందే. తాజా నిర్ణయంపై సిద్ధూ స్పందించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తోందన్నారు. -
విద్యుత్ చార్జీల పెంపుతో మరో పిడుగు
-
లాక్డౌన్ ప్రభావం.. తగ్గిన విద్యుత్ ధర
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోను లాక్డౌన్ ఏదో ఒక రూపంలో కొనసాగుతోంది. దీంతో ఆ రాష్ట్రాల్లో వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ వినియోగం తగ్గింది. ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కూడా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో అన్ని కాలాల్లోనూ జలవిద్యుత్ పుష్కలంగా ఉంటుంది. ఈ పరిస్థితుల వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఉంటోంది. ఏప్రిల్ నెలలో బహిరంగ మార్కెట్లో విద్యుత్ యూనిట్ రూ.4.20 వరకు ఉంది. వేసవి తీవ్రత పెరగడం, వాణిజ్య, పారిశ్రామిక వినియోగం ఎక్కువ కావడంతో మే నెలలోనూ విద్యుత్ ధరల్లో మార్పు ఉండదని భావించారు. కానీ అంచనాలు తారుమారయ్యాయి. కరోనా విజృంభణతో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో పారిశ్రామికరంగం కుదేలైంది. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా వాణిజ్య, పారిశ్రామిక వినియోగం పడిపోయింది. దీంతో మార్కెట్లో యూనిట్ రూ.2.49 కే లభిస్తోంది. చౌకవిద్యుత్ అందిపుచ్చుకుంటున్న రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఇప్పటికీ విద్యుత్ డిమాండ్‌లో పెద్దగా మార్పులేదు. వర్షం వల్ల మంగళ, బుధవారాల్లో డిమాండ్ తాత్కాలికంగా తగ్గినా.. మిగతా రోజుల్లో రోజుకు 230 మిలియన్ యూనిట్ల (ఎంయూల) వరకు ఉంటోంది. పారిశ్రామిక వినియోగం క్రమంగా పుంజుకుంటున్నట్టు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యుత్ ఉన్నతాధికారులు చౌక విద్యుత్‌పై దృష్టిపెట్టారు. ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్ల విద్యుత్ యూనిట్ గరిష్టంగా రూ.3.50 చర వ్యయంతో ఉంటోంది. మార్కెట్లో మాత్రం యూనిట్ రూ.2.49కే వస్తోంది. థర్మల్ ప్లాంట్ల విద్యుత్ ధరతో పోలిస్తే రోజుకు దాదాపు రూ.2 కోట్లమేర ఆదా అవుతుందని లెక్కించిన అధికారులు చౌక విద్యుత్‌నే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల జెన్కో థర్మల్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు కూడా పెరుగుతున్నాయి. ఇదే సరైన విధానం మార్కెట్లో లభించే చౌక విద్యుత్ తీసుకోవడం వల్ల పెద్ద ఎత్తున ఆదా చేసే వీలుంది. కష్టకాలంలో ఇది మంచి ఆలోచన. మార్కెట్ విద్యుత్ కొనుగోలు, పరిశీలనపై ఉన్నతస్థాయిలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశాం. కొన్నాళ్లు చౌక విద్యుత్‌కు ఢోకా లేదనిపిస్తోంది. అందుకే తాత్కాలికంగా జెన్కో ఉత్పత్తిని తగ్గించటం సంస్థకే ప్రయోజనం. -
కరెంటు లోడ్ లెక్కే మేలు
సాక్షి, అమరావతి: ఏపీ విద్యుత్ సంస్థలు ఏప్రిల్ నుంచీ కనీస విద్యుత్ చార్జీలను ఎత్తేశాయి. దీని స్థానంలో కిలోవాట్(కేవీ) లోడ్‌కు కేవలం రూ.10 వసూలు చేస్తున్నాయి. ఈ విధానం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు విద్యుత్ భారం నుంచి తప్పించుకుంటారు. కరోనా కష్టకాలంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుందని విద్యుత్‌రంగ నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ సరికొత్త విధానం రాష్ట్రంలోని 1.50 కోట్ల వినియోగదారుల్లో 98 శాతం మందికి మేలు కలిగిస్తుంది. పాత విధానంలో 500 కన్నా తక్కువ యూనిట్లు వాడే వినియోగదారులు నెలకు రూ.25, అంతకుమించి వాడేవారు నెలకు రూ.50 కనీస చార్జీ చెల్లించాలి. ఈ విధానాన్ని గత టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. వినియోగదారులపై అనవసర భారం పడుతున్న ఈ విధానాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎత్తేసింది. ఇప్పుడు ఒక కిలోవాట్ లోడ్‌కు రూ.10 చెల్లిస్తే సరిపోతుంది. ఫలితంగా 500 యూనిట్లలోపు విద్యుత్ వాడేవాళ్లకు రూ.180 (నెలకు రూ.15 చొప్పున 12 నెలలకు) ఆదా అవుతుంది. 500 యూనిట్లకుపైన వాడేవాళ్లకు రూ.480 (నెలకు రూ.40 చొప్పున 12 నెలలకు) భారం తగ్గుతుంది. కరెంట్ బిల్లులకు సర్కార్ కళ్లెం రాష్ట్రంలో 95 లక్షల మంది పేద, మధ్య తరగతి వర్గాలపై గత ప్రభుత్వం భారీగా విద్యుత్ భారం మోపింది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా రూ.6,549 కోట్ల మేర చార్జీలు పెంచింది. శ్లాబులు మార్చి మరో రూ.19 వేల కోట్లు అదనంగా వడ్డించింది. అయితే.. దీన్ని ట్రూ–అప్‌గా చూపించి కమిషన్ ఆమోదంతో కాలం గడిపింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఎత్తేసింది. ప్రజలపై భారం వేసేందుకు సిద్ధంగా ఉంచిన ట్రూ–అప్ చార్జీలను కూడా ప్రస్తుత విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) యథాతథంగా ఆమోదించలేదు. అన్ని కోణాల్లో పరిశీలించి దాదాపు రూ.16 వేల కోట్ల అదనపు భారాన్ని తిరస్కరించింది. నిర్వహణ వ్యయాన్ని అదుపు చేయడం, అనవసరంగా అత్యధిక రేట్లకు ప్రైవేటు విద్యుత్ కొనుగోలు చేయడాన్ని నివారించడం వల్ల రాష్ట్రంలో గత రెండేళ్లుగా విద్యుత్ చార్జీలు స్వల్పంగా తగ్గాయి. కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే గతేడాది యూనిట్‌కు 90 పైసలు పెంచారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: చిరంజీవి
సాక్షి, అమరావతి: కరోనాతో భారీగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సినిమా థియేటర్లకు సంబంధించి విద్యుత్ చార్జీలు, వడ్డీ రాయితీలను మరికొంత కాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల విద్యుత్ ఫిక్స్డ్ చార్జీలకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సినిమా థియేటర్ల యజమానులకు భారీ ఊరట లభించనుంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున అక్కినేనితో పాటు పలువును సినీ ప్రముఖులు కృతజ్ఞతులు తెలిపారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: చిరు, నాగ్ విద్యుత్ చార్జీలు, వడ్డీ రాయితీలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెగస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినీ కళాకారులను ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఆదుకున్నారని ప్రశంసించారు. సీఎం జగన్ సాయంతో వేలాది కుటుంబాలకు ఊరట లభించింది అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. My hearty thanks to Hon'ble CM Shri. @ysjagan for the much deserved relief measures for the Film Industry during Covid times. Your sympathetic support will help several thousands of families dependent on this industry. — Chiranjeevi Konidela (@KChiruTweets) April 6, 2021 అలాగానే బుధవారం నాగార్జున అక్కినేని కూడా ట్విటర్ వేదికగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ‘మహమ్మారి వంటి విపత్కర సమయంలో సినిమా హాల్ల విద్యుత్ చార్జీలకు రాయితీ ఇచ్చి అవసరమైన సమయంలో అదుకుని భారీ ఊరటనిచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశాడు. Thanking the Hon’ble chief minister of Andhra Pradesh Shri @ysjagan for the much needed relief measures given to the film Industry During these dark times of Covid🙏 — Nagarjuna Akkineni (@iamnagarjuna) April 7, 2021 చదవండి: సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు -
చార్జీల షాకుల్లేవ్
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ చార్జీల భారం సామాన్య ప్రజలపై పడకుండా.. వినియోగదారుల ఆకాంక్షలు, పంపిణీ సంస్థల ఆర్థిక అవసరాల్ని సమన్వయం చేస్తూ 2021–22 రిటైల్ సరఫరా ధరల్ని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) బుధవారం విడుదల చేసింది. ఇకపై కనీస చార్జీల భారం గృహ వినియోగదారులపై పడకుండా, రైతులకు ఉచిత విద్యుత్ రాయితీలను ప్రభుత్వమే భరిస్తూ, కుల వృత్తులకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కొనసాగిస్తూ రూపొందించిన కొత్త టారిఫ్ నేటి నుంచి అమల్లోకి రానుందని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక వరుసగా రెండోసారి ప్రజలపై భారం మోపకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్తు టారిఫ్‌లను విడుదల చేసింది. కోవిడ్–19 కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ సామాన్యులపై భారం మోపకుండా టారిఫ్‌లను ప్రకటించి మరోసారి ప్రజా ప్రభుత్వమని నిరూపించుకుంది. రూ.4,307.38 కోట్లు అదనపు భారం పడకుండా... గృహ వినియోగదారులపై ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 2021–22 కొత్త టారిఫ్ని ప్రకటించింది. విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు ఠాకూర్ రామసింగ్, పి.రాజగోపాల్ కొత్త టారిఫ్ని విడుదల చేశారు. టారిఫ్ వివరాల్ని జస్టిస్ నాగార్జునరెడ్డి మీడియాకు వివరించారు. ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ రూ.11,741.18 కోట్ల లోటులో ఉన్నట్లు ఏపీఈఆర్‌సీకీ నివేదించాయన్నారు. దీన్ని క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం నికరలోటు రూ.7433.80 కోట్లుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీనివల్ల వినియోగదారులు, ప్రభుత్వంపై రూ.4,307.38 కోట్లు అదనపు భారం పడకుండా నివారించినట్లు వివరించారు. 2021–22 ఆదాయ అంతరాన్ని నిర్ధారించే సమయంలో 2014–15, 2016–17, 2018–19 వరకూ నిర్ణయించిన రూ.3,013 కోట్ల ట్రూఅప్, గత ఆర్థిక సంవత్సర ట్రూడౌన్ సర్దుబాటు కింద రూ.3,373 కోట్లని కూడా పరిగణలోకి తీసుకొని నికరలోటుని నిర్ణయించామని తెలిపారు. సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మీ సెల్వరాజన్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాథరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జే.పద్మజనార్థనరెడ్డి, ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్లు కే.రాజబాపయ్య, బి.రమేష్ప్రసాద్తో పాటు మూడు విద్యుత్ పంపిణీ సంస్థల డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. అన్ని వర్గాల భారాన్ని మోస్తున్న ప్రభుత్వం కొత్త టారిఫ్‌లకు సంబంధించి రాయితీలు, ప్రోత్సాహకాలు, గృహ వినియోగదారులతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రైతులు, పౌల్ట్రీ వర్గాల భారాన్ని ప్రభుత్వమే మోసేందుకు అంగీకరించింది. వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు సంబంధించి 2021–22లో రూ.7,297.08 కోట్ల ఆర్థిక భారం ప్రభుత్వం భరించనుంది. కార్పొరేటేతర రైతులు, చెరకు క్రషింగ్, గ్రామీణ మొక్కల పెంపక కేంద్రాలు, దోభీ ఘాట్లు ఉచిత విద్యుత్ పొందేందుకు అర్హమైనవని ఏపీఈఆర్సీ సూచించింది. ఉచిత విద్యుత్ వర్గాలన్నీ సెక్షన్–65లోకి.. ఈసారి తొలిసారిగా ఉచిత విద్యుత్ వర్గాలన్నీ సెక్షన్–65 కింద ప్రత్యక్ష రాయితీ పొందేలా ఒకే గొడుగు కిందకు తెచ్చారు. వివిధ వర్గాలకు రాయితీలు, ఉచిత విద్యుత్ కారణంగా ప్రభుత్వంపై రూ.1657.56 కోట్ల భారం పడుతోంది. దీన్ని భరించేందుకు ముఖ్యమంత్రి జగన్ అంగీకరించారు. హరిజన, గిరిజన నివాస సముదాయాలు, తండాల్లో నివసించే గృహ వినియోగదారులకు నెలకు రూ.200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తారు. రజక సంఘం నడుపుతున్న బీపీఎల్ లాండ్రీలకు నెలకు 150 యూనిట్లు ఉచితం. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అత్యంత వెనుకబడిన వర్గాలకు (ఎంబీసీ), స్వర్ణకారులు, చేనేత కార్మికులకు నెలకు 100 యూనిట్ల వరకు, నాయీ బ్రాహ్మణులకు 150 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నారు. మరోవైపు యూనిఫాం ధరలతో ప్రభుత్వంపై రూ.136.72 కోట్ల భారం పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు పంపిణీ సంస్థల పరిధిలోనూ ఏకరీతి ధరలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనివల్ల ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని గృహ వినియోగదారులకు రాయితీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రాయితీల భారం రూ.136.72 కోట్లు ఉంటుంది. ఈ నేపథ్యంలో వివిధ వర్గాలకు ఉచిత విద్యుత్, రాయితీలు అందించడం ద్వారా ప్రభుత్వంపై ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,091.36 కోట్ల భారం పడనుంది. ఆక్వా సాగుదారుల మోముల్లో వెలుగులు.. చేపల, రొయ్యల చెరువుల వినియోగదారులకు గతంలో క్రాస్‌సబ్సిడీ యూనిట్ రాయితీ ధర రూ.3.85 ఉండగా ఇప్పుడు దాన్ని రూ.2.35కి తగ్గించారు. అంటే యూనిట్‌పై రూ.1.50 వరకూ తగ్గింది. ఆక్వా హేచరీస్, చేపలు, రొయ్యల దాణా కేంద్రాలు, కోడి పిల్లల తయారీ, కోళ్ల దాణా తయారీ కేంద్రాల్ని ఇండస్ట్రీస్ జనరల్ కేటగిరిలో విలీనం చేయాలన్న విద్యుత్ పంపిణీ సంస్థల అభ్యర్థనని ఏపీఈఆర్సీ అంగీకరించింది. ఇప్పటి వరకూ వీరంతా ఇండస్ట్రీస్ కేటగిరీలో బిల్లులు చెల్లించేవారు. ఇకపై వారంతా టీఓడీ పీక్, ఆఫ్–పీక్ ధరలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. స్వతంత్ర ఎల్టీ కనెక్షన్లు కలిగి, జీఎస్టీ నుంచి మినహాయింపు ఉన్న చేపలు, రొయ్యల చెరువులు, కోళ్ల పెంపకం, పాడి క్షేత్రాలు, సొంత దాణా తయారీ కేంద్రాలకు చెందిన వారంతా ఇకపై యూనిట్‌కు రూ.5.25, కిలోవాట్‌కు రూ.75 మాత్రమే చెల్లించేలా కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చింది. ఇండస్ట్రీస్ (జనరల్) కేటగిరీలోని హెచ్‌టీ వినియోగదారులకు లోడ్ కారక ప్రోత్సాహక పథకాన్ని ఉపసంహరించుకోవాలన్న డిస్కమ్‌ల ప్రతిపాదనకు ఏపీఈఆర్సీ అంగీకారం తెలిపింది. గృహ వినియోగదారులపై భారం లేకుండా... వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వరుసగా రెండోసారి గృహ వినియోదారులపై ఎలాంటి విద్యుత్ చార్జీల భారం మోపకుండా టారిఫ్‌లను విడుదల చేసింది. ఇప్పటివరకూ కనీస ఛార్జీలుగా రూ.50 నుంచి రూ.150 వరకు వసూలు చేసేవారు. ఇకపై ఈ భారం ఉండదు. కనీస ధరలకు బదులుగా కిలోవాట్‌కు రూ.10 వసూలు చేయనున్నారు. ఉదాహరణకు ఒక ఎల్టీ వినియోగదారుడు మూడు నెలల పాటు ఇంట్లో లేకపోయినా నెలకు కనీసం రూ.50 చొప్పున రూ.150 బిల్లు కట్టాల్సి వచ్చేది. ఇకపై నెలకు రూ.10 చొప్పున రూ.30 చెల్లిస్తే సరిపోతుంది. సగటు యూనిట్ సేవా వ్యయం రూ.7.17 నుంచి రూ.6.37కి తగ్గించారు. అపార్ట్‌మెంట్లులో ఒకే పాయింట్ వద్ద అధిక వోల్టేజీ (హెచ్‌టీ) కనెక్షన్ల కింద ధరలు వసూలు చేయాలన్న పంపిణీ సంస్థల ప్రతిపాదనల్ని ఏపీఈఆర్సీ తిరస్కరించింది. అపార్ట్మెంట్లలో ఎక్కువగా నివసించే మధ్యతరగతి కుటుంబాలపై భారాన్ని నివారించేందుకు డిస్కమ్‌ల ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఇక ఫంక్షన్ హాళ్లలో గతంలో నెలకు కిలోవాట్‌కు రూ.100 చెల్లించాల్సి ఉండేది. ఇకపై యూనిట్ల కింద చెల్లించుకునే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం ఆఫ్–పీక్ టీవోడీ(టైమ్ ఆఫ్‌డే) సమయం ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ ఉండగా దీన్ని ఉదయం రూ.8 గంటల వరకూ మార్చాలన్న ప్రతిపాదనని తిరస్కరించారు. 2 గంటలు తగ్గిస్తే గృహ వినియోగదారులకు నష్టం వాటిల్లే అవకాశాలున్నందున డిస్కమ్‌ల ప్రతిపాదనని ఏపీఈఆర్సీ తోసిపుచ్చింది. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేలా.. పర్యావరణ పరిరక్షణకు ఏపీఈఆర్సీ పెద్దపీట వేసింది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రాయితీలతో ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల యూనిట్ విద్యుత్ ధరని ఒక్క పైసా కూడా పెంచకుండా ఈ ఏడాదీ రూ.6.70గానే కొనసాగిస్తోంది. వినియోగదారులకు సేవలందించే చార్జింగ్ కేంద్రాల నుంచి 90 శాతం మాత్రమే డిస్కమ్‌లు తీసుకోవాలని, మిగిలిన 10 శాతం చార్జింగ్ కేంద్రాల నిర్వహణకు విడిచిపెట్టాలని సూచించింది. పునరుత్పాదక విద్యుత్‌ని ప్రోత్సహించేలా కూడా రాయితీలు ప్రకటించింది. పవన, సౌర విద్యుత్‌కు పీపీఏ బదులుగా తాత్కాలిక టారిఫ్ వర్తింపజేశారు. ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్య చర్యల్ని ప్రోత్సహించేందుకు ఏపీ రాష్ట్ర విద్యుత్ సమర్థత అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఈఈడీసీవో)కు నిధులు మంజూరు చేశారు. పునరుత్పాదక విద్యుత్ వ్యవస్థ మొత్తం ఎపీఎస్పీడీసీఎల్ పరిధిలోనే ఉండటంతో మిగిలిన సంస్థలపై ఆ లోటు తొలగించేందుకు సరికొత్త నిర్ణయాన్ని అమలు చేస్తోంది. పునరుత్పాదక విద్యుత్ ధ్రువీకరణ పత్రాలు(ఆర్ఈసీ) రూపంలో వినియోగదారులపై భారం పడకుండా మిగులు విద్యుత్‌ని ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ నుంచి యూనిట్ రూ.2.43 / రూ.2.44 చొప్పున కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేసింది. 150 హెచ్‌పీ వరకూ ఎల్టీ రైస్ మిల్లులే... గత సంవత్సరం టారిఫ్‌లో రైస్ మిల్లులు, పల్వరైజర్లకు టారిఫ్‌లలో వెసులుబాటు కల్పించారు. 100 హార్స్ పవర్ వరకు ఎల్టీ వినియోగదారులుగా, అంతకు మించితే హెచ్‌టీ వినియోగదారులుగా పరిగణిస్తారు. అయితే దీన్ని మార్చాలని వినతులు వెల్లువెత్తడంతో 100 హెచ్‌పీ బదులు 150 హెచ్‌పీ వరకూ ఎల్టీ ధరలు, 150 హెచ్‌పీ దాటితే హెచ్‌టీ కింద పరిగణించాలని నిర్ణయించారు. అయితే ఇది పూర్తి ఆప్షనల్ విధానంగా నిర్థరించారు. 2020 జూన్ 30లోపు మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే చాలా మంది మిల్లర్లు కరోనా కారణంగా మార్చుకోలేకపోయామని చెప్పడంతో ఈ గడువుని ఈ ఏడాది జూన్ 30 వరకూ పొడిగించినట్లు ఏపీఈఆర్సీ ప్రకటించింది. ఒకసారి మార్పు చేసుకున్నాక తిరిగి మళ్లీ మార్చుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే మిల్లులు సర్వీస్ శాంక్షన్ చేసే సమయంలోనే ఆప్షన్లు తెలియజేయాలని సూచించింది. కొనుగోలు, అమ్మకానికి స్పెషల్ సెల్... రియల్ టైమ్ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు, అమ్మకానికి సంబంధించి ప్రతి డిస్కమ్‌లో స్పెషల్ సెల్ ఏర్పాటు చేయాలని ఏపీఈఆర్సీ ఆదేశించింది. మార్కెట్ ధరల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ 24 గంటలూ పర్యవేక్షించేలా సెల్ పనిచేయాలని సూచించింది. దీనిద్వారా జాతీయ స్థాయిలో తక్కువ ధరకు విద్యుత్ అమ్మకానికి వచ్చినప్పుడు కొనుగోలు చేసేలా, ఎక్కువ ధరకు విద్యుత్ విక్రయించేలా అవకాశాలు మెరుగుపడి డిస్కమ్‌లు లాభాల బాట పట్టే అవకాశాలున్నాయి. రెస్కోలు.. డిస్కమ్‌ల పరిధిలోకి ఇకపై గ్రామీణ విద్యుత్ సహకార సంఘాల(రెస్కోలు)ను సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థలు ఆధీనంలోకి తీసుకోవాలని విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించింది. విద్యుత్ పంపిణీ లైసెన్సులు, మినహాయింపుల విషయంలో రెస్కోలు విఫలమవ్వడంతో వినియోగదారులు ఇబ్బందుల పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి తెలిపారు. రాయచోటి, కదిరి రెస్కోలని ఆయా డిస్కమ్‌లు విలీనం చేసుకున్నాయని, అనకాపల్లి, కుప్పం రెస్కోలు కూడా తాత్కాలికంగా డిస్కమ్‌లు ఆధీనంలోకి రానున్నాయని వెల్లడించారు. బిల్లుల వెనుక రాయితీ వివరాలు – జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, ఏపీఈఆర్సీ చైర్మన్ ‘సగటు వినియోగదారులపై రూపాయి భారం లేకుండా కొత్త టారిఫ్ తయారు చేశాం. విద్యుత్ పంపిణీ సంస్థలపై భారం పడకుండా, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా విద్యుత్తు టారిఫ్‌లు రూపొందించడం కత్తిమీద సామే అయినా విజయవంతంగా పూర్తి చేశాం. ప్రభుత్వం వేల కోట్ల రూపాయిల రాయితీలు అందిస్తోంది. అన్ని వర్గాల వినియోగదారుల విద్యుత్ బిల్లుల వెనకవైపు ప్రతి యూనిట్ సేవా వ్యయం(కాస్ట్ ఆఫ్ సర్వీస్), క్రాస్ రాయితీ, ప్రభుత్వ రాయితీ మొదలైన వివరాల్ని పొందుపరచాలని డిస్కమ్‌లకు సూచించాం. తొలిసారిగా వర్చువల్ విధానంలో బహిరంగ విచారణ చేపట్టాం. ఆత్మకూరు లాంటి వెనుకబడిన ప్రాంతాల ప్రజలు కూడా ఈ విచారణలో పాల్గొనడం విశేషం. బహిరంగ విచారణ అనంతరం అన్ని అభ్యంతరాల్ని నిశితంగా పరిశీలించి టారిఫ్‌లు తయారు చేశాం’ – ప్రకటనల హోర్డింగ్స్‌కు రూ.12.25, ఫంక్షన్ హాల్స్‌కు రూ.12.25, విద్యుత్ వాహనాలకు రూ.6.70 చొప్పున యూనిట్‌కు ఛార్జ్ పడనుంది. – పరిశ్రమలకు 75 కేవీ వరకు రూ.6.70, సీజనల్ పరిశ్రమలకు(75 కేవీ) రూ.7.45గా నిర్ణయించారు. – వీధి దీపాలు, సుజల స్రవంతి, సీపీడబ్ల్యూస్, పీడబ్ల్యూఎస్‌కు రూ.7 చొప్పున వసూలు చేస్తారు. ఏపీలోనే చీప్ – కోవిడ్ వెంటాడినా సామాన్యులకు తాకని షాక్ సాక్షి, అమరావతి: కరోనా కారణంగా విద్యుత్ సంస్థల ఆర్థిక పురోగతి దెబ్బతిన్నా పేదలపై ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పడనివ్వలేదు. ఏపీఈఆర్సీ ప్రకటించిన విద్యుత్ టారిఫ్‌ను పరిశీలిస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది. 21 రాష్ట్రాలతో పోలిస్తే నెలకు 50 యూనిట్ల వరకూ వాడే పేద వర్గాలకు ఏపీలోనే భారీ సబ్సిడీతో విద్యుత్ (యూనిట్ రూ. 1.45కు) అందుతుండటం గమనార్హం. అదే బిహార్‌లో యూనిట్ రూ. 6.15 వరకు విద్యుత్ టారిఫ్ ఉంది. 200 యూనిట్లు వాడే వినియోగదారులకు కూడా ఏపీలో ఇప్పటికీ యూనిట్ రూ. 3.60కే విద్యుత్ అందుతోంది. ఇదే శ్లాబులో మహారాష్ట్ర యూనిట్ రూ.8.33 చొప్పున వసూలు చేస్తోంది. మరోవైపు ఏపీలో పాత స్టాటిక్ విధానాన్ని ఎత్తివేసి డైనమిక్ విధానం బిల్లింగ్ అమలులోకి తెచ్చారు. దీనివల్ల వినియోగం ఉన్నప్పుడు మాత్రమే శ్లాబులు మారే అవకాశం ఉంటుంది. సంవత్సరం పొడవున ఎక్కువ టారిఫ్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా పేదలకు విద్యుత్ భారం కారాదన్న విధానానికి అనుగుణంగానే ఏపీఈఆర్సీ కసరత్తు చేసి సత్ఫలితాలు సాధించింది. -
‘గృహ వినియోగదారుడికి ఇకపై కనీస చార్జీలుండవు’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) బుధవారం 2021–22కి విద్యుత్ టారిఫ్‌ను ప్రకటించింది. ఈ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్త విద్యుత్ టారిఫ్ ప్రకటన అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. సగటు యూనిట్ ధర రూ.7.17 నుంచి రూ.6.37కు తగ్గనున్నట్లు పేర్కొంది. పవన, సౌరవిద్యుత్ ఉత్పత్తికి పీపీఏ బదులుగా తాత్కాలిక టారిఫ్ వర్తించనుంది. ఈ సందర్భంగా ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. కులవృత్తుల వారికిచ్చే ఉచిత విద్యుత్ కొనసాగుతుందన్నారు. కులవృత్తులకు ఇచ్చే ఉచిత విద్యుత్ వల్ల రూ.1,657 కోట్ల భారం పడుతుందని, రైతుల ఉచిత విద్యుత్‌కు రూ.7,297 కోట్లు భరించేందుకు ప్రభుత్వం సమ్మతి తెలిపిందని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ► గృహ వినియోగదారుడికి ఇకపై కనీస ఛార్జీలు ఉండవు ► ఛార్జీల స్థానంలో కిలోవాట్‌కు రూ.10 చెల్లిస్తే చాలు ► ఫంక్షన్‌హాళ్లకు కూడా ఇకపై నిర్ధిష్ట ఛార్జీలు ఉండవు ► పరిశ్రమల కేటగిరీలో ఆక్వా, పౌల్ట్రీ రంగాలను చేర్చాం ► గిరిజన తండాల్లో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ► రజక సంఘం నడుపుతున్న లాండరీలకు నెలకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్ ► బీపీఎల్ పరిధిలోని స్వర్ణకారులకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ► బీపీఎల్‌లో ఉన్న ఎంబీసీ వర్గాలకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ► నాయీ బ్రాహ్మణ వృత్తిదారులకు నెలకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ► చేనేత కార్మికులకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ► యూనిట్ రూ.2.35 పైసలకే ఆక్వారైతులకు రాయితీపై విద్యుత్ ► సబ్సిడీ విద్యుత్ కోసం ప్రభుత్వంపై రూ.9,091.36 కోట్లు భారం పడనున్నట్లు నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. చదవండి: నేడు విద్యుత్ టారిఫ్ ప్రకటన: కీలక విషయాలు -
Andhra Pradesh: నేడు విద్యుత్ టారిఫ్ ప్రకటన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) బుధవారం 2021–22కి విద్యుత్ టారిఫ్‌ను ప్రకటించనుంది. ఈ మేరకు విశాఖపట్నంలోని తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు టారిఫ్ ఆర్డర్‌ను వెల్లడిస్తామని కమిషన్ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఏడాది పాటు కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లో ఉంటాయి. వాస్తవానికి.. వారం క్రితమే తిరుపతిలో టారిఫ్ ఆర్డర్ ఇవ్వాలని భావించినా తిరుపతి ఉప ఎన్నికల షెడ్యూల్ రావడంతో వాయిదా వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని విశాఖ కేంద్రంగా టారిఫ్ ఆర్డర్ ఇవ్వాలని కమిషన్ వర్గాలు నిర్ణయించాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఇది రెండో టారిఫ్ ఆర్డర్. డిస్కమ్‌లు (విద్యుత్ పంపిణీ సంస్థలు) తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గతేడాది ప్రభుత్వం ప్రజలపై ఎలాంటి భారం వేయలేదు. వ్యవసాయ విద్యుత్‌కు మునుపెన్నడూ లేని విధంగా రూ.9 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చి ఆదుకుంది. చరిత్రలో తొలిసారిగా గృహవిద్యుత్ వినియోగదారులకు రూ.1,700 కోట్ల సబ్సిడీని ప్రకటించింది. ఆర్థిక లోటులో సింహభాగం ప్రభుత్వమే భరించడంతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడలేదు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.44,030.08 కోట్ల రెవెన్యూ అవసరమని ఏపీ డిస్కమ్‌లు గతేడాది నవంబర్‌లో ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు పంపాయి. ప్రస్తుతం టారిఫ్ రూపంలో రూ.30,769.13 కోట్లు రెవెన్యూ వస్తోందని, రూ.13,260.95 కోట్లు ఆర్థిక లోటు ఉండే వీలుందని పేర్కొన్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కరోనాతో డిస్కమ్‌లు తీవ్ర స్థాయిలో నష్టపోయాయి. లాక్డౌన్ వల్ల రూ.11,524.08 కోట్ల మేర ఆర్థిక వనరులు తగ్గాయి. డిస్కమ్‌ల ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ప్రజలు, వివిధ సంఘాల నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి, ప్రభుత్వ సబ్సిడీని పరిగణనలోనికి తీసుకుని 2021–22కి టారిఫ్ ఆర్డర్ ఇవ్వనుంది. ఈసారి కూడా పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఎలాంటి విద్యుత్ షాక్ ఉండబోదని కమిషన్ వర్గాలు తెలిపాయి. -
మంచి మనిషి;16 ఏళ్లుగా రైతులకు సాయం
సాక్షి, అమరావతి బ్యూరో: కరువు సీమలో కరెంటు బిల్లులు చెల్లించడానికే కటకటలాడే రైతు పరిస్థితిని ప్రత్యక్షంగా చూశారు. ‘ఎలాగోలా కడతాం.. కరెంట్ తీసేయకండి బాబూ’ అంటూ ప్రాధేయపడే వారి గోడునూ విన్నారు. అన్నదాత ఆవేదన ఆయనను కదిలించింది. వారికి తన వంతుగా ఏదైనా చేయాలి.. అన్న ఆలోచన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పథకంతో కార్యరూపం దాల్చింది. అప్పట్నుంచి రైతుకు మేలు చేసే ఆ పథకంలో తానూ పాలుపంచుకుంటున్నారు. నెలనెలా తన జీతం నుంచి కొంత మొత్తాన్ని ఆ పథకం కోసం వెచ్చిస్తున్నారు. రైతుల కష్టాలు చూసి.. ప్రకాశం జిల్లా వేటపాలెంకు చెందిన ఊటుకూరి గోపాలకృష్ణమూర్తి.. ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్)లో ఫైనాన్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖలో తొలుత అనంతపురం జిల్లా ధర్మవరంలో జూనియర్ అకౌంట్స్ అధికారి (జేఏవో)గా 1986లో చేరారు. విధి నిర్వహణలో భాగంగా రైతుల వ్యవసాయ విద్యుత్ బిల్లుల వసూళ్లకు వెళ్లేవారు. అప్పట్లో 5హెచ్‌పీ మోటారుకు నెలకు వచ్చే రూ.37 బిల్లును కూడా నాగసముద్రంగేటు, రామగిరి, వంటి వెనకబడ్డ ప్రాంతాల్లో కొంతమంది రైతులు చెల్లించలేక పోయేవారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా నాయుడుపేట ఏఏవోగా బదిలీ అయిన ఆయనకు ఓజిలి, పెళ్లకూరుల్లోనూ దాదాపు అలాంటి పరిస్థితులే కనిపించాయి. ఇలాంటి రైతులకు తనవంతు సహాయం అందించాలనే తపన అప్పట్నుంచీ ప్రారంభమయ్యింది. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా రైతుల కష్టాలు కళ్లారా చూసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, 2004లో అధికారంలోకి రాగానే.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఉచిత విద్యుత్ పథకం ఫైలుపై ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారు. ఆ పథకంతో గోపాలకృష్ణమూర్తికి ఒక మార్గం దొరికింది. నెలనెలా ఇలా.. ఒక రైతుకు సుమారుగా ఏడాదికయ్యే విద్యుత్ బిల్లును ప్రభుత్వం ద్వారా తాను చెల్లించాలని మూర్తి నిర్ణయించుకున్నారు. అలా 2004 మే నుంచి మొదలుకుని నెల నెలా తన జీతం నుంచి తొలుత రూ.500 చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి చెల్లించడం మొదలు పెట్టారు. ఏటా మార్చిలో ఆ మొత్తాన్ని పెంచుతూ వచ్చారు. అలా ఇప్పుడు నెలకు రూ.6,500 చెల్లిస్తున్నారు. ప్రతి నెలా తన జీతం నుంచే ఆ సొమ్ము సీఎంఆర్ఎఫ్కు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఇలా 16 ఏళ్లుగా చెల్లింపులను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. మూర్తి స్ఫూర్తితో మరికొందరు.. గోపాలకృష్ణమూర్తిని సాటి ఉద్యోగులూ ఆదర్శంగా తీసుకున్నారు. అప్పట్లో విద్యుత్‌శాఖ ‘పవర్‌లైన్’ పేరిట నడిపే మ్యాగజైన్లో మూర్తి గురించి ప్రచురించారు. దీంతో స్ఫూర్తి పొందిన మరికొందరు విద్యుత్ శాఖ ఉద్యోగులు తమకు తోచినంత సీఎంఆర్ఎఫ్కు నెలనెలా పంపించడం మొదలుపెట్టారు. తుదిశ్వాస వరకు ఇస్తా.. రైతులకు సాయపడే విషయంలో నా ఆనందం మాటల్లో చెప్పలేను. మరో ఏడాదిన్నరలో పదవీ విరమణ చేస్తున్నాను. అయినా ఇది ఆపను. నాకొచ్చే పెన్షన్ సొమ్ములోనూ కొంత కేటాయిస్తా. ఏటా పెంచకపోయినా, ఇప్పుడు చెల్లిస్తున్న మొత్తాన్ని మాత్రం తగ్గించను. ఇలా నా ప్రాణం ఉన్నంత వరకు కొనసాగిస్తా. నన్ను నా కుటుంబసభ్యులూ ప్రోత్సహిస్తున్నారు. తండ్రి పేరిట రూ.కోటిన్నర విలువైన భూమి ప్రభుత్వానికి అప్పగింత తాళ్లరేవు (ముమ్మిడివరం): పుట్టిన ఊరి కోసం ఆ తండ్రి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడితే.. ఆయన వారసులు ఆ తండ్రి పేరిట భారీ భూదానం చేశారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఇంజరం గ్రామానికి చెందిన దివంగత నృసింహదేవర సత్యనారాయణ మూర్తి (దత్తుడు) పలుమార్లు సర్పంచ్‌గా పనిచేసి గ్రామాభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. నిరుపేదలకు గృహ నిర్మాణాల నుంచి పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఆరోగ్య ఉప కేంద్రాన్ని తీసుకువచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించేందుకు ప్రభుత్వ స్థలం లేని పరిస్థితుల్లో ఆయన తన సొంత భూమిని ఆయా భవనాలకు కేటాయించి అందరి మన్ననలు పొందారు. ప్రస్తుతం దేశానికే తలమానికంగా మారిన గ్రామ సచివాలయ వ్యవస్థలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి ఆయన కుమారులు రూ.కోటిన్నరకు పైగా విలువైన భూమిని దానం చేశారు. దత్తుడు మరణానంతరం కూడా ఆయన సేవా వారసత్వాన్ని కుమారులు కొనసాగిస్తూ ఊరి అవసరాల కోసం ప్రభుత్వానికి భూమిని అందించారు. -
విద్యుత్ చార్జీలు పెంచం
సాక్షి, అమరావతి: ఎన్ని ఇబ్బందులున్నా విద్యుత్ చార్జీలు మాత్రం పెంచబోమని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్ఈసీఎం) కొత్త లోగోను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్న విషయాలను చంద్రశేఖరరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కరోనా సంక్షోభంతో విద్యుత్ సంస్థలు మరింత ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అయినా కూడా ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే విద్యుత్ పంపిణీ సంస్థలు చార్జీల పెంపు ప్రతిపాదన లేకుండా వార్షిక ఆదాయ అవసర నివేదికలను ఏపీఈఆర్సీకి సమర్పించాయని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్కంలను ఆదుకుందని మంత్రి చెప్పారు. 2019–20లో రూ.17,904 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.8,353.58 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్ సరఫరా కోసం రూ.717.39 కోట్లు సబ్సిడీ కేటాయించిందన్నారు. గృహ విద్యుత్ వినియోగదారులకు రూ.1,707 కోట్ల సబ్సిడీ ఇచ్చిందని తెలిపారు. చౌక విద్యుత్ లక్ష్య సాధన కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి నూతన విధానాలను అధ్యయనం చేయాలని విద్యుత్ సంస్థలకు మంత్రి సూచించారు. కాగా.. గ్రామ, మున్సిపల్ వార్డు సచివాలయాల్లో 7,000 మందికి పైగా జూనియర్ లైన్మెన్లను ప్రభుత్వం నియమించటం వల్ల క్షేత్రస్థాయిలో విద్యుత్ సంస్థల పనితీరు మెరుగుపడిందని మంత్రికి ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి వివరించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు ఇంధన పరిరక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
హామీలు నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వం
సాక్షి, ముంబై: మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, ఇది మాట మీద నిలబడని ప్రభుత్వమని బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ మేరకు ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ బిల్లుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. సాతారా, నాగ్‌పూర్, ముంబై తదితర ప్రాంతాల్లో బీజేపీ నాయకులు నిరసనలు చేపట్టారు. సాతారా జిల్లా కరాడ్‌లో నిర్వహించిన ఆందోళనలో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ మాట్లాడుతూ.. 100 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామి ఇచ్చిందని, అది కూడా నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. లాక్డౌన్ సమయంలో ప్రజలందరికీ భారీ ఎత్తున విద్యుత్ బిల్లులు పంపించారని గుర్తుచేశారు. అయితే బిల్లుల్లో రాయితీలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ, ఇప్పుడు మాట మార్చారని దుయ్యబట్టారు. రాయితీ ఇవ్వలేమని విద్యుత్ బిల్లులు మొత్తం చెల్లించాల్సిందేనని విద్యుత్‌శాఖ మంత్రి స్పష్టం చేశారు. కానీ, ఇచ్చిన హామీల గురించి మాత్రం ఏం మాట్లాడటం లేదన్నారు. లాక్డౌన్ కాలంలో ఆర్థికంగా కుంగిపోయిన పేద ప్రజలు పెంచి ఇచ్చిన విద్యుత్ బిల్లులను ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు. బిల్లులను సవరించి ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రాయితీలు ఇవ్వనంత వరకు బీజేపీ ఆందోళన కొనసాగిస్తుందని చంద్రకాంత్ పాటిల్ హెచ్చరించారు. బంద్ ఉండగా బిల్లులా? నాగ్‌పూర్‌లో బీజేపీ చేపట్టిన ఆందోళనలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి చంద్రశేఖర్ బావన్‌కులేతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంపై నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. లాక్డౌన్ సమయంలో దుకాణాలు, కార్యాలయాలు, మూసి ఉన్నాయని, అయినప్పటికీ లక్షల్లో బిల్లులు పంపారని మండిపడ్డారు. వ్యాపారాలు బంద్ ఉండగా లాండ్రీ, క్షౌరశాలలు ఇతరులు విద్యుత్ బిల్లులు ఎలా కడతారంటూ నిలదీశారు. అందుకే పేద ప్రజల విద్యుత్ బిల్లులు కట్ చేసేందుకు ఎవరైనా వస్తే బీజేపీ అడ్డుకుంటుందని చంద్రశేఖర్ హెచ్చరించారు. ముంబైలో నిర్వహించిన ఆందోళనలో బీజేపీ ముంబై ఇన్చార్జీ అయిన కాందివలి మాజీ ఎమ్మెల్యే అతుల్ భాత్కలకర్ పాల్గొన్నారు. ఆయన కూడా ఆఘాడీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల ప్రాంతాల్లో ఆందోళన నిర్వహించినట్టు బీజేపీ నేతలు పేర్కొన్నారు. -
కరెంట్ చార్జీల పెంపుపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు మళ్లీ కసరత్తు ప్రారంభించాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ఈ నెలాఖరులోగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి టారిఫ్ పెంపు ప్రతిపాదనలు సమర్పించనున్నాయి. వరుస ఎన్నికలతో గత రెండేళ్లుగా చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు వాయిదా వేసుకుంటూ వచ్చాయి. కేంద్ర విద్యుత్ చట్టం ప్రకారం ఏటా నవంబర్ 30లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) అంచనాల నివేదికను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాల్సి ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర విద్యుత్ సరఫరా అవసరాలు ఏమిటి? ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కానుంది? ఇంత విద్యుత్ సరఫరా చేయడానికి ఎంత ఖర్చు కానుంది? ప్రస్తుత విద్యుత్ చార్జీలతో ఇంత విద్యుత్ సరఫరా చేస్తే ఎంత ఆదాయ లోటు ఏర్పడనుంది? ఆర్థిక లోటును అధిగమించడానికి ఏ మేరకు విద్యుత్ చార్జీలు పెంచాలి? ఏ కేటగిరీ వినియోగదారులపై ఎంత భారం మోపాలి? వంటి అంశాలకు సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలతో ఏఆర్ఆర్ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. వాటిపై ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి వచ్చే ఏడాదికి సంబంధించిన టారిఫ్ ఉత్తర్వులను జారీ చేస్తుంది. అయితే గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు, ఇతర రాజకీయ కారణాలతో డిస్కంలు 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికలను ఇప్పటివరకు ఈఆర్సీకి సమర్పించలేదు. దీంతో 2018–19 ఆర్థిక సంవత్సరం కోసం జారీ చేసిన టారిఫ్ ఆధారంగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు వసూలు చేసుకోవడానికి డిస్కంలకు ఈఆర్సీ అనుమతిచ్చింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికను ఈఆర్సీకి సమర్పించడానికి ఈ నెలాఖరుతో గడువు ముగియబోతోంది. అందువల్ల 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సంవత్స రాలకు సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే 2019–20, 2020–21కి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికలు డిస్కంల వద్ద సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో ఈఆర్సీకి సమర్పించలేకపోయాయి. గడువు సమీపిస్తుండటంతో 2021–22కి సంబంధించిన ఏఆర్ఆర్ల రూపకల్పనపై దృష్టి సారించాయి. ఆదాయ లోటు రూ. 20 వేల కోట్లు డిస్కంల ఆదాయ లోటు ఏకంగా రూ. 20 వేల కోట్లకు ఎగబాకిందని ఇంధన శాఖ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 2018–19 నాటికి రూ. 12 వేల కోట్లు ఉన్న ఆదాయ లోటు గత రెండేళ్లలో భారీగా పెరిగి రూ. 20 వేల కోట్లకు మించిపోనుందని ఉన్నతాధికారులు పేర్కొంటు న్నారు. ఉచిత వ్యవసాయ విద్యుత్, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ. 10 వేల కోట్ల విద్యుత్ రాయితీలను బడ్జెట్లో కేటాయించింది. ఈ రాయితీలు పోగా ఆదాయ లోటు రూ. 20 వేల కోట్ల వరకు మిగిలి ఉంటాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు రూ. 10 వేల కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కరోనా ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద ఆర్ఈసీ, పీఎఫ్సీ నుంచి రూ. 12 వేల కోట్ల రుణాలను పొందడానికి డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటికే రూ. 6 వేల కోట్ల రుణాలు మంజూరవగా కేంద్రం విధించిన షరతులు పూర్తి చేస్తే మిగిలిన రుణం మంజూరు కానుంది. అయితే భారీ మొత్తంలో విద్యుత్ చార్జీలు పెంచితేనే ప్రస్తుత పరిస్థితుల్లో డిస్కంలు ఆర్థిక సంక్షోభం నుంచి కొంత వరకు గట్టెక్కే అవకాశాలున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాతే.. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరులోగా టారిఫ్ పెంపు ప్రతిపాదనలు సమర్పించడానికి డిస్కంలకు అనుమతి లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయితే ఆ వెంటనే టారీఫ్ పెంపు ప్రతిపాదనలను సమర్పించే అవకాశముంది. -
థియేటర్లు తెరిచేందుకు అనుమతివ్వాలి
సాక్షి, హైదరాబాద్: అన్‌లాక్ 5.0లో భాగంగా క్టోబర్ నుంచి సినిమా థియేటర్లు తెరవడానికి కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్రంలో థియేటర్ల పునః ప్రారంభంపై చర్చించేందుకు సుదర్శన్ థియేటర్లో సమావేశమయ్యింది. దీనికి తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేంద్ర రెడ్డి, సుదర్శన్ థియేటర్ పార్టనర్ బాల గోవింద్ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. ‘అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్ల ఒపెన్‌కి కేంద్రం అనుమతి ఇచ్చింది. తెలంగాణా ప్రభుత్వం కూడా అనుమతి ఇస్తుందని భావిస్తున్నాము. మా ఓనర్స్ అసోసియేషన్ అందరం థియేటర్స్ తెరవాలని నిర్ణయించాం’ అన్నారు. (చదవండి: 75 శాతం సినిమా టికెట్ల అమ్మకానికి ఓకే) అంతేకాక ‘తెలంగాణా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించాలి. ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందని నమ్మతున్నాం. పార్కింగ్ రుసుము వసూలు చేసుకొనే విధంగా ప్రభుత్వం అనుమతించాలి. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ కూడా సినిమా హాళ్లు ఓపెన్ చెయ్యాలి అని చెప్పారు. వారికి మా కృతజ్ఞతలు’ అన్నారు విజయేంద్ర రెడ్డి. అనంతరం బాల గోవింద్ రాజు మాట్లాడుతూ ‘మమ్మల్ని కాపాడగలిగేది స్టేట్ గవర్నమెంట్ మాత్రమే. మాకు కొన్ని రాయితీలు ఇవ్వాలి. పార్కింగ్ విషయంలో, కరెంట్ విషయంలో ప్రభుత్వం మాకు సహకరించాలి’ అని కోరారు. -
విద్యుత్ అధికారులను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు
-
విద్యుత్ సిబ్బందిని స్తంభానికి కట్టేసి..
సాక్షి, మెదక్: అధిక విద్యుత్ బిల్లులపై వినియోగదారులు భగ్గుమన్నారు. ముట్టుకుంటేనే షాక్ కొడుతున్న కరెంట్ బిల్లులు చూసి ఆగ్రహం చెందిన మెదక్ జిల్లా మండల పరిధిలోని ముస్లాపూర్ గ్రామవాసులు విద్యుత్ సిబ్బందిపై తమ ప్రతాపం చూపించారు. విద్యుత్ బిల్లులు వసూలు చేయడానికి వచ్చిన అధికారులను పట్టుకుని గ్రామస్తులు స్తంభానికి కట్టేశారు. ఉన్నతాధికారులు వచ్చేంతవరకు వారిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అధిక విద్యుత్ బిల్లులు, విద్యుత్ సరఫరాలో అంతరాయం వంటి సమస్యలను చూసి చూడనట్టు వదిలేస్తున్న అధికారుల తీరుపై విసుగు చెందిన గ్రామస్తులు ఇలా నిరసనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రోజులకు రోజులు విద్యుత్ సరఫరాలో అంతరాయం, అధిక కరెంటు బిల్లులు వసూళ్ల గురించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడు లేడని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా తమ వెతలకు పరిష్కారం చూపించాలని వేడుకుంటున్నారు. (చదవండి: నాటు వేస్తూ.. కబడ్డీ ఆడుతూ..) -
మేడం... మీ లెక్క తప్పింది
సాక్షి, అమరావతి: కేంద్రం రాష్ట్రానికి ఒక యూనిట్ విద్యుత్‌ను రూ.2.70కే సరఫరా చేస్తుంటే, పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ రూ.9 చొప్పున సరఫరా చేస్తోందన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రి చెప్పిన మాటలు అవాస్తవమన్నారు. ఎన్టీపీసీ కుడ్గి నుంచి యూనిట్‌కు రూ.9.84 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వద్దన్నా.. కేంద్రం అంటగడుతోందని ఆయన ఎత్తిచూపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన, కులం, అవినీతిని రూపుమాపాలనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వాటిపై పోరాటం చేసే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. విద్యుత్ చార్జీల్లో మార్పులు చేయలేదు ► పరిశ్రమలకు యూనిట్‌కు రూ.7.65 చొప్పున వసూలు చేయాలని 2017లో టీడీపీ సర్కార్ నిర్ణయించింది. ఆ చార్జీల్లో మేం ఎలాంటి మార్పులు చేయలేదు. ► దేశంలో పరిశ్రమలకు యూనిట్ విద్యుత్‌ను తెలంగాణ రూ.7.60, మహారాష్ట్ర రూ.7.25, రాజస్తాన్ రూ.7.30, కర్ణాటక రూ.7.20, తమిళనాడు రూ.6.35 చొప్పున సరఫరా చేస్తున్నాయి. ► తమిళనాడులో కేంద్రం అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల యూనిట్‌ను రూ.3 చొప్పున ఇస్తుండటంతో ఆ రాష్ట్రం యూనిట్‌ను రూ.6.35 చొప్పున పరిశ్రమలకు సరఫరా చేస్తోంది. ► గుజరాత్లో రాయితీలు తక్కువగా ఉండటం.. ఎక్కువ విద్యుదుత్పత్తి కేంద్రాలు ఉండటం వల్ల యూనిట్ రూ.5 చొప్పున పరిశ్రమలకు సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో యూనిట్‌పై రూ.1 చొప్పున రాయితీ ఇస్తున్నాం. అంటే.. యూనిట్ విద్యుత్‌కు రూ.6.65 చొప్పున వసూలు చేస్తున్నాం. టీడీపీ సర్కార్ అవినీతి వల్లే చార్జీలు అధికం ► థర్మల్ విద్యుత్ కేంద్రం పనులకు మెగావాట్‌కు రూ.3 కోట్ల నుంచి రూ.3.50 కోట్లకు మించి ఖర్చు కాదు. కానీ.. టీడీపీ సర్కార్ రూ.8.50 కోట్ల చొప్పున కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఈ వ్యవహారంలో టీడీపీ సర్కార్ పెద్దలు భారీగా కమీషన్లు తిన్నారు. ఈ ఒక్క విద్యుత్ కేంద్రం వల్లే విద్యుత్ సంస్థలపై రూ.20 వేల కోట్ల అప్పు భారం పడింది. ► బహిరంగ మార్కెట్లో సౌర, పవన విద్యుత్‌లు యూనిట్ రూ.2.. అంతకంటే తక్కువ ధరకు లభ్యమవుతోంటే.. టీడీపీ సర్కార్ అధిక ధరలకు దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను కుదుర్చుకుంది. ఈ వ్యవహారంలోనూ టీడీపీ సర్కార్ పెద్దలు అవినీతికి పాల్పడ్డారు. ► 2014 నాటికి ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు రూ.24,800 కోట్లు అప్పులు ఉండేవి. కానీ.. టీడీపీ సర్కార్ అవినీతి, అసమర్థత.. నిర్వహణ లోపం వల్ల విద్యుత్ సంస్థల అప్పులను రూ.70 వేల కోట్లకు పెంచేసింది. అప్పుగా తెచ్చిన నిధులను టీడీపీ సర్కార్ పెద్దలు తినేశారు. ► విభజన సమయంలో సింగరేణి కాలరీస్ తెలంగాణకు కేటాయించారు. రాష్ట్రానికి బొగ్గు గనులను కేటాయించలేదు. దీని వల్ల బొగ్గు కొనుగోలు కోసం ఏటా అదనంగా రూ.2,500 కోట్ల మేర భారం పడుతోంది. విద్యుత్ వాడకపోయినా ట్రాన్స్మిషన్ చార్జీలా! ► సెంట్రల్ ట్రాన్స్మిషన్ లైన్ల ద్వారా రాష్ట్రం మీదుగా సరఫరా అవుతున్న విద్యుత్‌ను వినియోగించుకున్నా.. వినియోగించుకోకపోయినా.. పక్క రాష్ట్రాలు వినియోగించుకుంటున్నా మెగావాట్‌కు రూ.5.50 లక్షల చొప్పున కేంద్రానికి రాష్ట్రం చెల్లించాల్సి వస్తోంది. ► ఇతర రాష్ట్రాలు ట్రాన్స్మిషన్ చార్జీలు మెగావాట్‌కు రూ.లక్ష చెల్లిస్తున్నాయి. ఇది అధర్మమని కేంద్రానికి చెప్పాం. వినియోగించుకున్న విద్యుత్‌కు మాత్రమే ట్రాన్స్మిషన్ చార్జీలు వసూలు చేయాలని సూచించాం. ఇందుకు కేంద్రం అంగీకరించింది. కానీ.. ఇప్పటికీ ఆ తప్పును సరిదిద్దలేదు. దీని వల్ల ట్రాన్స్మిషన్ చార్జీల రూపంలోనే ఏడాదికి రూ.1,700 కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి వస్తోంది. ► బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నా.. సోలార్ బండిల్(సేవలతో కలిపి ఉత్పత్తిని విక్రయించే వ్యూహం) విద్యుత్‌ను ఎన్టీపీసీ యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీని వల్ల ఏడాదికి విద్యుత్ సంస్థలపై రూ.3,500 కోట్లకుపైగా భారం పడుతోంది. ► టీడీపీ సర్కార్ చేసిన అప్పుల్లో రూ.53 వేల కోట్లను కేంద్ర సంస్థలైన పీఎఫ్సీ, ఆర్ఈసీల నుంచే చేసింది. అదీ పది శాతం వడ్డీపై. అంటే వడ్డీ రూపంలోనే ఏటా రూ.5,300 కోట్లకుపైగా చెల్లించాల్సి వస్తోంది. దీని వల్లే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు అధికంగా ఉంటున్నాయి. అద్భుతమైన వ్యవస్థను తీసుకొచ్చాం ► ఎన్నడూ ప్రజా జీవితంలో లేకున్నా.. ఎలాంటి అర్హతలు లేకున్నా.. ఎమ్మెల్యే కాకపోయినా.. కేవలం కొడుకు అనే ‘ఏకైక’ కారణంతో ఒకరిని మంత్రిని చేసిన కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాలనే ఆమె అభిప్రాయాలను గౌరవిస్తున్నాం. ► సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా ఇటీవల సచివాలయ ఉద్యోగాల భర్తీలో మెరిట్‌పైనే 80 శాతం పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఇచ్చాం. నామినేటెడ్ పదవుల్లో కూడా ఈ వర్గాలకు 50 శాతం పదవులను ఇచ్చేలా చట్టాన్ని తెచ్చి, అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ► అవినీతిని నిర్మూలించాలనే లక్ష్యంతో.. గ్రామ స్థాయి నుంచి వ్యవస్థలను పటిష్టం చేయాలనే గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. వలంటీర్ల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సేవలు అందిస్తున్నాం. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలోనే మరెక్కడా లేదు. ► ఇంజనీరింగ్ పనుల టెండర్లలో అవినీతిని నిర్మూలించడానికి చట్టాన్ని తెచ్చాం. జ్యుడిషియల్ ప్రివ్యూను ఏర్పాటు చేశాం. జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించిన షెడ్యూళ్లతో రివర్స్ టెండరింగ్‌ను నిర్వహిస్తున్నాం. ► టీడీపీ సర్కార్ హయాంలో అక్రమాలు జరిగిన టెండర్లను రద్దు చేసి.. గత నెల వరకూ నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో రూ.2,072 కోట్ల మేర ఖజానాకు ఆదా చేశాం. టీడీపీ సర్కార్ పట్టణాల్లో ఐదు లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచింది. నిర్మాణం ప్రారంభించని 64 వేల ఇళ్ల పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తేనే రూ.400 కోట్లు ఆదా అయింది. -
‘అధిక ధరకు విద్యుత్ అంటగడుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి అవినీతికి తావులేకుండా గ్రామస్థాయి నుంచి పటిష్టమైన వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేస్తున్నారని సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ ఛార్జీలు, తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. ఉద్యోగ నియామాకాల్లో 80 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైరారిటీలకు ప్రాధాన్యత ఇస్తూ చట్టం తీసుకొచ్చామన్నారు. రివర్స్ టెండంరింగ్ ద్వారా ఇప్పటివరకు రూ.2,072 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు. వద్దన్నా విద్యుత్ అంటగడుతున్నారు ‘విద్యుత్ టారిఫ్‌పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఏపీలో పరిశ్రమలకు యూనిట్ విద్యుత్ ధర రూ.7.65ల టారిఫ్ గత ప్రభుత్వమే నిర్ణయించింది. మా ప్రభుత్వం వచ్చిన తరువాత దీనిలో ఎలాంటి మార్పు చేయలేదు. కేంద్రం రూ.2.70పైసలకే యూనిట్ విద్యుత్ ఇస్తుందని కేంద్రమంత్రి చెప్పడం అవాస్తవం. ఎన్టీపీసీ రూ.9.84పైసలకు యూనిట్ విద్యుత్ ఇస్తోంది. వద్దన్నా ఈ విద్యుత్‌ను ఏపీకి అంటగడుతున్నారు. ఒక మెగావాట్ విద్యుత్ ట్రాన్స్మిట్ చేసినందుకు ఏపీ నుంచి రూ.5 లక్షలు వసూలు చేస్తున్నారు. పక్క రాష్ట్రం వారు విద్యుత్ తీసుకుంటున్నా ట్రాన్స్మిషన్ చార్జీలు మనం చెల్లించాల్సి వస్తోంది. గత ఒప్పందాల వల్లే పెరిగిన విద్యుత్ ధరలు కేంద్రానికి ఏడాదికి ట్రాన్స్మిషన్ చార్జీలే రూ.1700కోట్లు ఏపీ చెల్లిస్తోంది. కేంద్రం చేసిన ఒప్పందాలను ఇప్పటి వరకు ఎక్కడా ఏపీ ఉల్లంఘించలేదు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏపీకి బొగ్గుగనులు కేటాయించలేదు. ప్రత్యేక బొగ్గు గనుల కేటాయింపులు లేకపోవడం వల్ల ఏడాదికి రూ.2,500కోట్లు అదనంగా ఏపీ చెల్లించాల్సి వస్తోంది. గత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చేసిన కొన్ని ఒప్పందాల వల్లే ఏపీలో విద్యుత్ ధరలు పెరిగాయి. 2014లో అన్ని విద్యుత్ సంస్థల అప్పు కలిపి రూ 24,800 కోట్లు.. నేడు అది 70,000 కోట్లకు పెరిగింది. అవినీతి, తప్పుడు ఒప్పందాల వల్లే ఈ అప్పులు ఇంతగా పెరిగాయి. ఈ అప్పులకు వడ్డీలు కట్టడం వల్ల కూడా విద్యుత్ చార్జీలపై ప్రభావం పడుతోంది. గత ప్రభుత్వం వెళుతూ రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టింది’అంటూ అజేయ కల్లం వివరించారు. -
బీజేపీ నిరసన భగ్నం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల భారాన్ని నిరసిస్తూ విద్యుత్సౌధతోపాటు జిల్లాల్లోని విద్యుత్ కార్యాలయాల వద్ద సోమవారం భారతీయ జనతా పార్టీ చేపట్టిన నిరసనలను పోలీసులు భగ్నం చేశారు. పార్టీ ముఖ్యనేతల్లో కొందరిని అరెస్టు చేయగా.. మరికొంతమందిని గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లో విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నాకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ను, పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులను నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద అరెస్టు చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హైదరాబాద్‌లోని వారి ఇళ్లలో నిర్బంధించారు. పార్టీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రామ్చందర్రావును తార్నాకలో హౌస్ అరెస్టు చేశారు. కోర్ కమిటీ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డిని మింట్ కాంపౌండ్ వద్ద అరెస్టు చేసి రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాగోల్‌లోని విద్యుత్తు కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తిని అరెస్టు చేశారు. ఆదిలాబాద్‌లో ఎంపీ సోయం బాపురావు, వరంగల్‌లో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, జగిత్యాలలో పేరాలæ శేఖర్‌రావు, నల్లగొండలో ప్రేమేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో జితేందర్‌రెడ్డి, డీకే అరుణ, వికారాబాద్‌లో రాపోలు ఆనంద భాస్కర్‌ను అరెస్టు చేశారు. బీజేపీ నేత లక్ష్మణ్‌ను ఆయన నివాసం వద్ద గృహనిర్బంధం చేస్తున్న పోలీసులు ప్రజా సమస్యలపై గళమెత్తితే నిర్బంధాలా? పార్టీ నేతల అరెస్టులపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న నేతలను అరెస్టు చేయడంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లుల రూపంలో నెత్తిన పిడుగు వేసిందని విమర్శించారు. మూడు నెలలు వినియోగించిన యూనిట్లను సగటు చేయడం ఎక్కడి విధానమో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. ఖజానా నింపుకొనేందుకే అధిక విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్ని దోచుకోవాలనే దురుద్దేశంతోనే దోపిడీ విధానాలకు రూపకల్పన చేశారని ధ్వజమెత్తారు. ‘‘లాక్డౌన్ నిబంధనల మేరకు భౌతిక దూరం పాటిస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే అరెస్టులకు పాల్పడం దారుణం. ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ పోలీసులను అడ్డుపెట్టుకుని సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భయపడరు. టీఆర్ఎస్ సర్కారు అశాస్త్రీయ, అసంబద్ధ శ్లాబుల విధానాలపై బీజేపీ పోరు కొనసాగిస్తుంది’’అని సంజయ్ స్పష్టంచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ఒకవిధంగా ప్రజల నడ్డివిరిచేలా వ్యవహరిస్తూ రూ.340 కోట్లకు పైగా కొల్లగొట్టాలని కుట్ర చేసిందని ఆరోపించారు. ప్రజలపై పడిన అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, అధిక బిల్లుల రద్దుకు టీఆర్ఎస్ సర్కారు నిర్ణయం తీసుకునే వరకు బీజేపీ విశ్రమించదని ఆయన ఉద్ఘాటించారు. ప్రభుత్వం వెంటనే సమీక్షించి, పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా పరీక్షలు ఇప్పుడు గుర్తొచ్చాయా? కరోనా పరీక్షలపై కేంద్రం సీరియస్‌గా దృష్టి పెట్టడంతో సీఎం కేసీఆర్ హడావుడి చర్యలు చేపట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కరోనా వ్యాధి తీవ్రంగా విజృంభిస్తోందని, టెస్టులు చేసి వ్యాప్తిని అరికట్టాలని ఎంత విజ్ఞప్తి చేసినా రాష్ట్ర సర్కారు పట్టించుకోలేదన్నారు. మూడు నెలల్లో కేవలం 39వేల మందికి మాత్రమే టెస్టులు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు 50వేల మందికి టెస్టులు చేస్తామని చెప్పడం సమ్మశక్యంగా లేదన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు వ్యాధి సోకిన తర్వాతనే ప్రభుత్వానికి తీవ్రత అర్థమైందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా నియోజకవర్గాల వారీగా టెస్టులు చేయడం సరికాదని, జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
‘లాక్డౌన్’లో గృహ విద్యుత్ వాడకం పెరిగింది
సాక్షి, హైదరాబాద్: వరుసగా 3 నెలలు రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉండటం, ప్రజలంతా ఇళ్లలోనే ఉండడంతో గృహ విద్యుత్ వినియోగం పెరిగి బి ల్లుల పెరుగుదలకు కారణమైందని దక్షిణ తెలంగా ణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీ ఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. గత మార్చి, ఏప్రి ల్, మే నెలలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను 40 శాతం మంది గృహ వినియోగదారులు చెల్లించలేదని, దీంతో జూన్‌లో బకాయిలతో కలిపి ఒకేసారి 4 నెలల బిల్లులు రావడంతో ఎక్కువ మొత్తంగా కని పించడం మరో కారణమన్నారు. విద్యుత్ బిల్లులను అడ్డుగోలుగా పెంచారని విమర్శలు రావడంతో శని వారం ఆయన సంస్థ కార్యాలయంలో విలేకరుల స మావేశం ఏర్పాటుచేసి వివరణ ఇచ్చారు. మూడేళ్లు గా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచలేదని, బిల్లులు పెంచారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. లాక్డౌన్ కారణంగా ఏప్రిల్, మే నెలల్లో మీ టర్ రీడింగ్ తీయకుండా తాత్కాలిక విధానంలో బిల్లులు జారీ చేశామన్నారు. ప్రస్తుత జూన్ నుంచి మీటర్ రీడింగ్ తీస్తున్నామని, జూన్‌లో 3నెలల విని యోగానికి సంబంధించి మీటర్ రీడింగ్ తీసి గత రెండు నెలల్లో వినియోగదారులు చెల్లించిన బిల్లుల్లోని హెచ్చుతగ్గులను సర్దుబాటు చేస్తున్నామన్నారు. వాస్తవ వినియోగం కంటే ఎవరై నా అధికంగా బిల్లులు చెల్లించి ఉంటే వారికి జూన్ బిల్లులను ఆ మేరకు తగ్గించి సర్దుబాటు చేస్తామన్నారు. లాక్డౌన్ వల్ల అనివార్య పరిస్థితిలో తాత్కాలిక బిల్లులు వసూలు చేయాల్సి వచ్చిందని, దీంతో 3 నెలల వినియోగానికి సంబంధించిన మీటర్ రీ డింగ్‌ను ఒకేసారి తీసి సగటున ఒక్కో నెలకు ఎంత వినియోగం ఉంటుందో అంచనా వేసి ప్రస్తుత నెల లో బిల్లులు జారీ చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో కొందరి స్లాబులు ఎగబాకి కొంత వరకు బిల్లులు పెరిగిన మాట వాస్తవమేనన్నారు. తాత్కాలిక బిల్లులతో స్థూలంగా విద్యుత్ సంస్థలే నష్టపోయాయని, వినియోగదారులకు ప్రయోజనం కలిగిందన్నారు. వారంలో చార్జీల పెంపు ప్రతిపాదనలు రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలతో పాటు 2019–20, 2020–21 ఆర్థిక సం వత్సరాలకు సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)ను వారంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పిస్తామని రఘుమారెడ్డి తెలి పారు. టారిఫ్ ప్రతిపాదనల తో పాటు ఏఆర్ఆర్ సమర్పించేందుకు గడు వు పొడిగించడానికి ఈఆర్సీ అంగీకరించలేదని, తక్షణమే వాటిని సమర్పించాలని ఆదేశించిందని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. -
‘అందుకే కరెంటు బిల్లులు పెరిగాయి’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ చార్జీలు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు పెంచలేదని, ఉన్న బిల్లుల ప్రకారమే చార్జీలు వసూలు చేస్తున్నామని టీఎస్ఎస్పీడీసీఎల్ ఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నగరంలో మొత్తం 95 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. ఏప్రిల్, మే నెల వరకు లాక్డౌన్ కారణంగా పాత బిల్లు ప్రకారం వసూలు చేశాం. ఈ నెల ఇంటింటికి వెళ్లి రీడింగ్ తీసి బిల్లులు ఇస్తున్నాం. ఈ సమ్మర్లో విద్యుత్ వినియోగం పెరిగిన కారణంగా వినియోగదారులకు స్లాబులు మారాయి. 13 శాతం అదనంగా స్లాబులు పెరిగాయి. గృహ వినియోగం పెరిగింది కాబట్టే బిల్లులు పెరిగాయి. అందుకు అనుగుణంగానే చార్జీలు వచ్చాయి. ఏప్రిల్‌లో 40 శాతం, మే నెలలో 60 శాతం బిల్లులు మాత్రమే వినియోగదారులు చెల్లించారు. ( టెన్త్ పరీక్షలు హైకోర్టు గ్రీన్ సిగ్నల్) అయితే గతంలో రీడింగ్ ఈ నెల రీడింగ్ తీసిన తరువాత మధ్యలో వాడిన కరెంట్ మొత్తానికి మీరు కట్టిన బిల్లులో తీసివేసి మాత్రమే బిల్లు వచ్చింది. రీడింగ్‌లో గానీ, బిల్లులో గానీ ఎక్కడా తప్పిదాలు జరగలేదు. న్యూస్ పేపర్లో.. వాట్సాప్‌లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవి వాస్తవం కాదు. గత ఏడాది కంటే ఈ ఏడాది కరెంట్ వినియోగం 15 శాతం పెరిగింది. ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండేందుకే యావరేజ్‌గా బిల్లులు వసూలు చేశాం. ఎక్కడా తప్పిదాలు జరగలేదు. ఒకవేళ జరిగితే దాన్ని మేము పరిష్కరిస్తాం’’ అని అన్నారు. -
ఈఆర్సీ ససేమిరా..!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించేందుకు జూన్ 30 వరకు మరోసారి గడువు పొడిగించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన విజ్ఞప్తిని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తాజాగా తోసిపుచ్చింది. వాస్తవానికి 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను గతే డాది నవంబర్ 30లోగా సమర్పించాల్సి ఉండగా, డిస్కంలు వివిధ కారణాలు చూపుతూ పలు దఫాలుగా గడువు పొడిగింపు కోరుతూ వచ్చాయి. చివరిగా ఈ ఏడాది మార్చి 31 వరకు ఈఆర్సీ గడువు పొడిగించినా, డిస్కంలు ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించడంలో విఫలమయ్యా యి. మరింత కాలం గడువు పొడిగింపు కోరుతూ అప్పట్లో డిస్కంలు ఈఆర్సీకి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయలేకపోయాయి. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మార్చి 24 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లోకి రావడంతో గడువు పొడిగింపు కోరలేకపోయాయి. గడువు ముగిసిన 2 నెలల తర్వాత మళ్లీ జూన్ 30 వరకు మరోసారి గడువు పొడిగించాలని కోరుతూ ఇటీవల డిస్కంలు విజ్ఞప్తి చేయగా, ఈఆర్సీ ససేమిరా నిరాకరించింది. ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించే సమయంలోనే ఇప్పటివరకు జరిగిన జాప్యానికి మన్నించాలని విజ్ఞప్తి చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ జూన్ 1న డిస్కంలకు ఈఆర్సీ లేఖ రాసింది. చివరిసారిగా పొడిగించిన గడువు మార్చి 31తో ముగిసిపోగా, ఆ గడువులోపే మళ్లీ గడువు పొడిగింపు కోసం విజ్ఞప్తి చేయాల్సి ఉండగా డిస్కంలు విఫలమయ్యాయి. రెండు నెలల ఉల్లంఘన తర్వాత గడువు కోరడం వల్లే ఈఆర్సీ అంగీకరించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలో చార్జీల పెంపు ప్రతిపాదనలు.. గడువు పొడిగింపునకు ఈఆర్సీ నిరాకరించిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలతో పాటు ఏఆర్ఆర్ నివేదికను డిస్కంలు వెంటనే ఈఆర్సీకి సమర్పించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ప్రతిపాదనలు సమర్పించేందుకు డిస్కంలు మళ్లీ కసరత్తు ప్రారంభించాయి. తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న డిస్కంలు విద్యుత్ చార్జీలు పెంచేందుకు గత ఆరు నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నా, వివిధ రకాల ఎన్నికలు, రాజకీయ కారణాలతో వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను సైతం డిస్కంలు ఈఆర్సీకి సమర్పించలేదు. గత మూడేళ్లకు పైగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచలేదు. దీంతో డిస్కంలు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రస్తుత చార్జీలను యథాతథంగా కొనసాగిస్తే 2018–19లో రూ.9,970.98 కోట్ల ఆర్థిక లోటు ఏర్పడనుందని.. గతంలో ఈఆర్సీకి సమర్పించిన ఏఆర్ఆర్ నివేదికలో డిస్కంలు అంచనా వేశాయి. 2019–20 ముగిసే నాటికి రాష్ట్ర ప్రభుత్వం డిస్కంల ఆర్థిక లోటు రూ.12 వేల కోట్లకు చేరిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా సుమారు రూ.2 వేల కోట్ల వరకు అదనపు ఆదాయాన్ని అర్జించాలని డిస్కంలు యోచిస్తున్నాయి. విద్యుత్ సంస్థల సీఎండీలు త్వరలో సీఎం కేసీఆర్‌తో సమావేశమై ఈ పరిస్థితులను వివరించి చార్జీల పెంపునకు అనుమతి కోరే అవకాశముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతిస్తే జూన్ 30లోగా ప్రతిపాదనలు సమర్పించే అవకాశాలున్నాయి. -
కరెంట్ బిల్లు తగ్గించుకోండిలా..
సాక్షి, అమరావతి: మీ బడ్జెట్‌కు తగ్గట్టుగానే కరెంట్ బిల్లూ రావాలని కోరుకుంటున్నారా? ఇది కష్టమేమీ కాదు. కాకపోతే కరెంట్ వాడకంపై కాస్త అవగాహన ఉండాలి. దేనికి ఎన్ని యూనిట్లు వాడుతున్నామో తెలిస్తే అనవసర వాడకంతోపాటు బిల్లూ తగ్గుతుంది. ఉదాహరణకు కాస్త చీకటి పడితే అన్ని గదుల్లోనూ బల్బులు వెలుగుతాయి. రాత్రి పడుకునే వరకూ ఇవి ఆన్‌లోనే ఉంటాయి. వాతావరణాన్ని బట్టి ఫ్యాన్ వాడకం ఉంటుంది. రోజూ వాడే మోటర్, గీజర్, కుక్కర్, మిక్సీ, ఏసీ, ఏవి ఎన్ని గంటలు వాడుతున్నామో తెలిసే ఉంటుంది. ఇలా లెక్కేసుకోండి...! ఇంట్లో వాడే ప్రతీ విద్యుత్ ఉపకరణాన్ని వాట్స్‌లో లెక్కిస్తారు. వెయ్యి వాల్టులు ఒక గంటపాటు వాడితే ఒక్క యూనిట్ విద్యుత్ ఖర్చవుతుంది. అంటే వంద వోల్టుల బల్బులు మన ఇంట్లో 10 ఉన్నాయనుకుంటే గంటకు ఒక యూనిట్ విద్యుత్ వాడినట్టే. ఇవి ఎన్ని గంటలు వెలిగితే అన్ని యూనిట్లు. ఇలా ప్రతి ఉపకరణం సామర్థ్యం, వాటివల్ల గంటకు ఎంత విద్యుత్ ఖర్చవుతుందో కింద పట్టిక ద్వారా తెలుసుకోండి. దీన్నిబట్టి నెలవారీ ఎంత విద్యుత్ అవసరమో లెక్కేసుకుని, అందుకు తగ్గట్టు ప్లాన్ చేసుకుంటే, మీరు కోరుకున్న బిల్లే మీ చేతికొస్తుంది. -
విద్యుత్తు చార్జీలపై విష ప్రచారం
సాక్షి, అమరావతి: విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని, ఎల్లో మీడియా అవాస్తవ కథనాలను ప్రచురిస్తోందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. శ్లాబుల ధరలు పెరగలేదని, లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లల్లోనే ఉండటం వల్ల కరెంట్ వినియోగం పెరిగిందని చెప్పారు. ఆ మేరకు కొంత బిల్లు పెరగవచ్చు కానీ చార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. కరోనా విపత్తు నియంత్రణకు యావత్తు ప్రభుత్వ యంత్రాంగమంతా కష్టపడుతున్న వేళ రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. విజయవాడలోని రహదారులు–భవనాల శాఖ కార్యాలయంలో మంత్రి బుగ్గన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఇవీ.. అప్పుల్లో ముంచిన టీడీపీ సర్కారు.. ► టీడీపీ సర్కారు విద్యుత్ వ్యవస్థను నష్టాల ఊబిలోకి గెంటేసి జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలను కోలుకోలేని రీతిలో అప్పుల్లో ముంచేసింది. పెద్ద ఎత్తున బకాయిలను మిగల్చడమే కాకుండా అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లు చేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆరు నెలల్లోనే బకాయిలు తీర్చేసి విద్యుత్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది. స్టాటిక్.. డైనమిక్.. తేడా మీరే చూస్తారు ► టీడీపీ సర్కారు అధికారంలో ఉండగా స్టాటిక్ పద్ధతి 2016 నుంచి 2019 వరకు అమలులోకి తెచ్చింది. దేశంలో ఎక్కడా ఈ విధానం లేదు. విద్యుత్తు వినియోగం ఆధారంగా శ్లాబులను నిర్ధారిస్తూ స్టాటిక్ పద్ధతితో ప్రజల్ని గందరగోళానికి గురి చేశారు. ► ఏపీఈఆర్సీ ఇప్పుడు డైనమిక్ పద్ధతి అమలులోకి తెచ్చింది. ఈ పద్ధతిలో ఏ నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తే అదే శ్లాబులో ఉంటుంది. దీని ఫలితాలు వచ్చే రెండు నెలల్లో వినియోగదారులకు కనిపిస్తాయి. శీర్షికకు, విషయానికి పొంతనేది ► విద్యుత్తు వినియోగదారులకు మార్చి, ఏప్రిల్ నెలల్లో బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడిస్తున్న బిల్లులు మూడు నెలల సగటు యూనిట్లను లెక్కించి ఇస్తున్నారు. మూడు నెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోంది. ► విద్యుత్తు బిల్లులు పెరిగినట్లు ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. ఎలాంటి పెనాల్టీ, అపరాధ రుసుము లేకుండా జూన్ 30 వరకు బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తే ఈనాడు దినపత్రిక 15 వరకు అంటూ తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తోంది. కొత్త టారీఫ్ చార్జీలపై ఈనాడు పత్రిక తప్పుడు రిపోర్టింగ్‌తో ప్రజల్ని పక్కదారి పట్టిస్తోంది. వార్త శీర్షికకు, అందులోని విషయానికి పొంతన లేకుండా.. బిల్లు చూస్తే కళ్లు తిరుగుతాయి, కరెంటు పిడుగులు, బిల్లు బాంబు.. అంటూ అసత్య ప్రచారానికి పాల్పడుతోంది. కళ్ల ముందే వాస్తవాలు కనిపిస్తున్నా అవాస్తవాలను ప్రచురిస్తూ ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తోంది. ఏప్రిల్ నుంచి కొత్త టారిఫ్ అమలులోకి వచ్చింది. మార్చి, ఏప్రిల్‌లో ప్రజలంతా ఇళ్లలోనే ఉండటంతో విద్యుత్ బిల్లులు పెరిగాయి తప్ప చార్జీలు పెంచడం వల్ల కాదు. విద్యుత్ బిల్లులపై సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొనుగోలు ధరను గణనీయంగా తగ్గించాం.. ► 2014లో యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర రూ.4.33 కాగా 2019 నాటికి టీడీపీ సర్కారు దీన్ని రూ.6.07కి తీసుకెళ్లింది. ఇప్పుడు ప్రభుత్వం ఆరు నెలల్లోనే యూనిట్ విద్యుత్ కొనుగోలు ధరను రూ.5.66కి తగ్గించింది. ► 2018 అక్టోబర్‌లో గత ప్రభుత్వం యూనిట్ విద్యుత్‌ను రూ.6.75కి కొనుగోలు చేస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక 2019 అక్టోబర్‌లో యూనిట్ విద్యుత్‌ను రూ.3.41 చొప్పున కొనుగోలు చేసింది. ► విద్యుత్తు వినియోగదారులు పరిశీలించుకునేందుకు గత రెండేళ్ల బిల్లులను ఆన్లైన్లో ఉంచుతున్నాం. అతి తక్కువకు విద్యుత్తు ఇక్కడే.. ► 500 యూనిట్లు అంటే రెండు లేదా మూడు ఏసీలను వినియోగించే వినియోగదారులకే చార్జీలు పెరిగాయి. 200 యూనిట్లు లోపు వాడేవారికి దేశంలో తక్కువ ధరకు విద్యుత్ అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే. ► రాష్ట్రంలో 0 – 50 యూనిట్ల వినియోగదారులకు అతి తక్కువగా చార్జీ యూనిట్‌కు రూ.1.45 మాత్రమే ఉంది. అదే తమిళనాడులో రూ. 2.50, కర్నాటకలో రూ.3.75, గుజరాత్లో రూ.3 వరకు ఉంది. గత సర్కారు నిర్వాకాలకు ఈ లెక్కలే రుజువు.. ► గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు బకాయిలను రూ.5,000 కోట్ల నుంచి రూ.19,400 కోట్లకు పెంచి దిగిపోయింది. ఇందులో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆరు నెలల్లోనే రూ.5,000 కోట్లను చెల్లించింది. ఇక డిస్కమ్‌లకు సబ్సిడీలను ఇవ్వకుండా గత ప్రభుత్వం రూ.10,899 కోట్ల బకాయిలను మిగిల్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లోనే రూ.7,000 కోట్ల మేర సబ్సిడీలను చెల్లించింది, జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల అప్పులను టీడీపీ సర్కారు రూ.31,650 కోట్ల నుంచి రూ.63,500 కోట్లకు పెంచింది. మరోవైపు విద్యుత్ సంస్థల నష్టాలు 2015లో రూ.7,000 కోట్లు కాగా టీడీపీ హయాంలో 2019 నాటికి రూ.30 వేల కోట్లకు ఎగబాకాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే గత ప్రభుత్వ సమర్ధత ఏపాటిదో అర్థం అవుతుంది. చార్జీలు ఏపీలోనే చౌక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే గృహ విద్యుత్ టారిఫ్ తక్కువగా ఉంది. ముఖ్యంగా 50 యూనిట్ల వరకు వినియోగించే పేద వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సబ్సిడీతో విద్యుత్ అందిస్తోంది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఉన్నంత అతి తక్కువ విద్యుత్ టారిఫ్ మరే రాష్ట్రాల్లోనూ లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జల విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తై, తక్కువ ధరకే విద్యుత్ లభించే ఉత్తరాది రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ తరహాలో తక్కువ ధరలకు విద్యుత్ ఇవ్వడం లేదు. 51 నుంచి 100 యూనిట్ల లోపు వాడకందారులకు బిహార్ గరిష్టంగా యూనిట్ రూ.6.40కి విద్యుత్ ఇస్తోంది. 200 యూనిట్లు లోపు వాడే వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం యూనిట్ రూ.3.60కే విద్యుత్ అందిస్తోంది. ఇదే శ్లాబులో మహారాష్ట్ర యూనిట్ రూ.8.33 చొప్పున వసూలు చేస్తుండటం గమనార్హం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పాత స్టాటిక్ విధానాన్ని ఎత్తివేసి డైనమిక్ విధానం బిల్లింగ్‌ను అమలులోకి తెచ్చింది. దీనివల్ల వినియోగం ఉన్నప్పుడు మాత్రమే శ్లాబులు మారి కొంత ఎక్కువగా అనిపించే వీలుంది. అయితే దేశంలోని పలు రాష్ట్రాలు రెండు నెలలకు మీటర్ రీడింగ్ తీయడం వల్ల వచ్చిన బిల్లులతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. లాక్డౌన్, వేసవి కావడం వల్ల వాడకం పెరగడంతో గృహ విద్యుత్ వినియోగం మార్చి, ఏప్రిల్‌లో పెరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో పాటు అనేక రాష్ట్రాలు తాజా పరిణామాన్ని ప్రజలకు వివరిస్తున్నాయి. అయితే ఇతర రాష్ట్రాల్లో టారిఫ్ మనకన్నా ఎక్కువగా ఉన్నందున అక్కడే బిల్లులు అధికంగా వచ్చే వీలుందని పేర్కొంటున్నారు. -
ఎంత వాడితే అంతే బిల్లు : నాగలక్ష్మి
సాక్షి, విశాఖ: రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెరిగాయనడంలో వాస్తవం లేదని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి అన్నారు. కరెంట్ బిల్లులు పెరిగినట్లు వస్తున్న వార్తలను ఆమె తోసిపుచ్చారు. లాక్డౌన్ కారణంగానే గత నెల రీడింగ్ తీయలేదని నాగలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఈ నెలలో రెండు నెలల రీడింగ్ తీసుకున్నామని, అయినప్పటికీ ఏ నెలకా నెల బిల్లుగానే లెక్కించి వేశామని, ఏ బిల్లు కూడా పెరగలేదని ఆమె స్పష్టం చేశారు. వేసవి కాలంతో విద్యుత్ ఎక్కువగా వినియోగించడంతోనే బిల్లులలో పెరుగుదల వచ్చిందన్నారు. ప్రజలు అపోహలకు గురి కావద్దని సూచించారు. ఒకవేళ కరెంట్ బిల్లులు పెరిగినట్లు ఎవరికైనా సందేహం వస్తే వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని తెలిపారు. కాల్ సెంటర్ 1912కి కాల్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని, కరెంట్ బిల్లులు చెల్లించడానికి జూన్ 30వరకూ అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. టారిఫ్‌లలో కూడా గతంలో పోలిస్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా డైనమిక్ విధానంలోకి తీసుకు వచ్చామన్నారు. వినియోగదారులు ఎంత వాడితే అంతే బిల్లు వచ్చేవిధంగా టారిఫ్ తీసుకువచ్చినట్లు చెప్పారు. గతంలో అయితే ఏడాది మొత్తం ఒకటే టారిఫ్ ఉండటం వల్ల తక్కువ వాడినప్పటికీ ప్రతి నెల ఒకటే టారిఫ్ అమల్లో ఉండేదని నాగలక్ష్మి తెలిపారు. -
విద్యుత్ చార్జీలు పెంచలేదు: బాలినేని
సాక్షి, ప్రకాశం : .ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు. శ్లాబుల ధరలు ఎక్కడ పెంచలేదని, గతంలో ఏదైతే విద్యుత్ చార్జీలు ఉన్నాయే వాటినే ప్రస్తుతం అమలు పరుస్తున్నామని మంత్రి స్పస్టం చేశారు. శుక్రవారం మంత్రి బాలినేని మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లులు ఎక్కవ రావడంతో ప్రస్తుతం ప్రజల్లో అపోహలు నెలకొన్నాయన్నారు. మూడునెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా జరగడం వల్ల బిల్లులు పెరిగాయని, దీనిపై అధికారులు ప్రజల్లో అవగాహన పెంచాలని పేర్కొన్నారు (విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం: బుగ్గన) మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ...మాచవరం మృతుల సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి పరమార్శించేందుకు మంత్రులను పంపించి 5లక్షల ఎక్స్ గ్రేషియాను 10 లక్షలకు పెంచారని తెలిపారు. భాదిత కుటుంబాల్లో బీటెక్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగం కల్పించాలని దళిత సంఘాలు కోరాయని, .దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తిమ్మసముద్రంలో చెరువులో పడ్డ బాలున్ని కాపాడబోయి మృతి చెందిన ముగ్గురు మహిళల కుటుంబాలను కూడా ఆదుకుంటాని మంత్రి పేర్కొన్నారు. (‘విద్యుత్ చార్జీలు పెరిగాయన్నది అవాస్తవం’) -
కరెంట్ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం
సాక్షి, విజయవాడ : విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్లాబుల ధరలు పెరగకపోయినా.. పెరిగినట్లు అనవసర రాద్ధాంతం చేస్తోందని, లాక్ డౌన్‌తో ప్రజలు ఇళ్లల్లోనే ఉండటంవల్ల కరెంట్ వినియోగం పెరిగిందని ఆయన అన్నారు. విద్యుత్ బిల్లులపై రాజకీయం సరికాదని హితవు పలికారు. మంత్రి బుగ్గన శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘మార్చి, ఏప్రిల్ నెలల్లో బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్న బిల్లులను మూడు నెలల సగటు యూనిట్లు లెక్కేసే ఇస్తున్నాం. మూడునెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎల్లో మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. జూన్ 30 వరకు బిల్లులు చెల్లింపులు ప్రభుత్వం అవకాశం ఇస్తే.. ఈనాడు దినపత్రికలో 15 వరకు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొత్త టారీఫ్ చార్జీలుపై ఈనాడు పత్రిక తప్పుడు రిపోర్టింగ్‌తో ప్రజల్ని పక్కదారి పట్టిస్తోంది. ఏప్రిల్ నెల నుంచి కొత్త టారిఫ్ అమలులోకి వచ్చింది. మార్చి, ఏప్రిల్ నెలలో లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండటంతో విద్యుత్ బిల్లులు పెరిగాయి. అలాగే సోషల్ మీడియాలో కరెంట్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీటర్ రీడింగ్ రెండు నెలలు తీయక పోవడంతోనే టారిఫ్ శ్లాబ్ మారడంతో కరెంట్ బిల్లులు పెరిగాయి. టీడీపీ హయాంలో స్టాటిక్ అనే పద్ధతి 2016 నుంచి 2019 వరకు అమలులో గత ప్రభుత్వం తీసుకు వచ్చింది. భారత దేశంలో స్టాటిక్ పద్ధతి వాడటం లేదు. స్టాటిక్ పద్ధతితో ప్రజల్ని గందరగోళం చేస్తున్నారు. ఏపీ ఈఆర్సీ డైనమిక్ పద్ధతి అమలులోకి తీసుకు వచ్చాం.200 యూనిట్లు లోపు వాడితే దేశంలో తక్కువగా విద్యుత్ ఇస్తోంది. పవర్ పర్చేజ్ బకాయిలు 4900 కోట్లు 2014 లో ఉంటే.. 2019 నాటికి 20వేల కోట్లు బకాయిలుకు చేర్చారు. బకాయిలు 5వేల కోట్లు మా ప్రభుత్వం కట్టింది. 7120 పైగా కోట్లు 5వేల కోట్లు డిస్కంలకు చెల్లించాం. 2014లో యూనిట్ 4.33 పైసలకు కొనుగోలు చేస్తే టీడీపీ హయాంలో 2019లో యూనిట్ 6 రూపాయలకు పెంచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికరంలోకి రాగానే 5.16 పైసలుకు యూనిట్ తగ్గించాం. జెన్కోకు టీడీపీ హయాంలో 11వేల కోట్లు బకాయిలు ఉంటే 7 వేల కోట్లు మేము అధికారంలోకి రాగానే చెల్లించాం. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చినవి అన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తోంది. రెండు సంవత్సరాలు బిల్లులను ఆన్ లైన్లో ఉంచుతున్నాం.’ అని తెలిపారు. -
‘విద్యుత్ చార్జీలు పెరిగాయన్నది అవాస్తవం’
సాక్షి, విజయవాడ : విద్యుత్ చార్జీలు పెరిగాయని టీడీపీ నేతలు ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు పెరిగాయన్నది అవాస్తవమని, రెండు నెలలకు కలిసి రీడింగ్ తీసినా, రెండు నెలలకు వేర్వేరుగా బిల్లులు వేసి చార్జీలు వసూళ్లు చేస్తున్నారని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా విద్యుత్ వినియోగం పెరిగిందని, 500 యూనిట్లు కంటే ఎక్కువ వాడిన వారికి మాత్రమే అదనంగా యూనిట్‌కు 90 పైసలు పడిందని అవినాష్ అన్నారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు ఇళ్లలో సినిమాలు చూస్తూ దొంగ దీక్షలు చేస్తున్నారని నిప్పులుచెరిగారు. -
మేలో కూడా ‘కనీస’ వసూలే..
సాక్షి, హైదరాబాద్: గత ఏప్రిల్ తరహాలోనే ప్రస్తుత మే నెలలో కూడా గృహాలు (ఎల్టీ–1), వీధి దీపాలు (ఎల్టీ–6ఏ), తాగునీటి సరఫరా (ఎల్టీ–6బీ) కేటగిరీల విషయంలో మీటర్ రీడింగ్ తీయకుండా ప్రత్యామ్నాయ విధానంలో విద్యుత్ బిల్లులు వసూలు చేయనున్నారు. 2019 మే నెలలో వసూలు చేసిన విద్యుత్ బిల్లులకు సమానమైన బిల్లును ప్రస్తుత మే నెలలో ఈ కేటగిరీల వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. గృహేతర/వాణిజ్య సముదాయా లు (ఎల్టీ–2) , సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు (ఎల్టీ–3), కుటీర పరిశ్రమలు (ఎల్టీ–4), సాధారణ (ఎల్టీ–7), తాత్కాలిక (ఎల్టీ–8) కేటగిరీల వినియోగదారులకు మే నెల విద్యుత్ బిల్లు ల చెల్లింపు విషయంలో కాస్త ఊరట లభించనుంది. మే 7 తర్వాత రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగిస్తే ఈ కేటగిరీల వినియోగదారుల నుంచి కనీస బిల్లులు మాత్రమే వసూలు చేయనున్నారు. లాక్డౌన్ పొడిగించకపోతే మీటర్ రీడింగ్ ఆధారంగా బిల్లులు చెల్లించాల్సి ఉం టుంది. ఈ మేరకు దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు అనుమతిస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ ముగిసే వరకు ఇదే పద్ధతిని కొనసాగించే అవకాశముంది. లాక్డౌన్ ముగిసిన తర్వాత మీటర్ రీడింగ్ తీసి తాత్కాలిక విధానంలో చెల్లించిన బిల్లుల్లోని హెచ్చుతగ్గులను సరిదిద్దనున్నారు. ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, డిస్కంల వెబ్సైట్ల ద్వారా వినియోగదారులందరికీ వారికి సంబంధించిన మే నెల బిల్లుల వివరాల ను తెలియజేయాలని ఈఆర్సీ కోరిం ది. లాక్డౌన్ అమల్లో ఉన్నంత కాలం మీటర్ రీడింగ్ సేకరించకుండా ప్రత్యామ్నాయ పద్ధతి లోనే విద్యుత్ బిల్లులు వసూ లు చేసే అవకాశముంది. భారీ పరిశ్రమలకు వాస్తవ బిల్లింగ్.. హైటెన్షన్ కేటగిరీ (హెచ్‌టీ) పరిధిలోకి వచ్చే భారీ పరిశ్రమల నుంచి మీటర్ రీడింగ్ సేకరించి దాని ఆధారంగానే బిల్లులను జారీ చేస్తున్నారు. ప్రస్తుత మే నెలలో సైతం మీటర్ రీడింగ్ తీసి బిల్లులు చేయనున్నారు. అయితే, లాక్డౌన్ వల్ల పరిశ్రమలు నష్టపోయిన నేపథ్యంలో ఫిక్స్డ్ చార్జీల వసూళ్లను ప్రస్తుతానికి ప్రభుత్వం వాయిదా వేసుకుంది. కేవలం ఎనర్జీ చార్జీలు మాత్రమే చెల్లిస్తే సరిపోనుంది. ఎవరూ నష్టపోకుండా చర్యలు.. లాక్డౌన్ కాలంలో మొత్తం విద్యుత్ వినియోగం ఆధారంగా సగటున నెలకు ఎన్ని యూనిట్లు వినియోగించి ఉంటారని లెక్కించి ప్రత్యామ్నాయ విధానంలో వసూలు చేసిన బిల్లుల్లోని హెచ్చుతగ్గులను సరిచేయనున్నారు. వాస్తవ వినియోగంతో పోల్చితే అధికంగా బిల్లులు చెల్లించిన వారికి తదుపరి బిల్లులను ఈ మేరకు తగ్గించి సర్దుబాటు చేయనున్నారు. వాస్తవ వినియోగంతో పోల్చితే ఎవరైనా తక్కువ బిల్లులు చెల్లిస్తే తదుపరి కాలానికి సంబంధించిన బిల్లులను ఆ మేరకు పెంచి డిస్కంలు నష్టపోకుండా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధానాన్ని డిస్కంలు తయారు చేసి ఈఆర్సీ నుంచి అనుమతి తీసుకోనున్నాయి. -
చిన్న పరిశ్రమలకు ‘పవర్’ ఫుల్ సాయం
సాక్షి, అమరావతి: చిన్న పరిశ్రమలకు లాక్డౌన్ షాక్ తగలకుండా ఏపీ ప్రభుత్వం పెద్ద సాయం చేసింది. విద్యుత్ డిమాండ్ చార్జీల భారం నుంచి వాటికి విముక్తి కల్పించింది. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కొండంత ధైర్యమొచ్చింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో 79 వేల ఎంఎస్ఎంఈలకు రూ.188 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుంది. నెలకు రూ.62.70 కోట్లు లాక్డౌన్ నేపథ్యంలో మార్చి 22 నుంచి పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఎంఎస్ఎంఈల పరిస్థితి దారుణంగా మారింది. పరిశ్రమలు తెరవకున్నా నిబంధనల ప్రకారం కనీస విద్యుత్ (డిమాండ్) చార్జీలు చెల్లించాలి. ఇవి ఆయా పరిశ్రమలు వినియోగించే విద్యుత్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. ఎంఎస్ఎంఈ పరిశ్రమలు పనిచేస్తే నెలకు 330 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది. దీని విలువ రూ.226 కోట్ల వరకూ ఉంటుంది. ప్రస్తుతం పరిశ్రమలు నడవకపోవడం వల్ల నెలకు రూ.62.70 కోట్ల మేర డిమాండ్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ భారం నుంచి విముక్తి కల్పించాలని ఎంఎస్ఎంఈలు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం వీటిని తొలగించింది. ఎంఎస్ఎంఈలకు గరిష్టంగా రూ.10 లక్షల రుణం లాక్డౌన్ వల్ల దారుణంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)ను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన రూ.200 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ విధివిధానాలను ఖరారు చేసింది. ముఖ్యంగా లిక్విడిటీ కొరతతో కరెంటు బిల్లులు, జీఎస్టీ, ఇతర పన్నులు, జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న ఈ సంస్థలకు లిక్విడిటీ పెంచే విధంగా వర్కింగ్ క్యాపిటల్ కింద రుణాలను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లతో ఒక ఫండ్‌ను ఏర్పాటుచేసింది. ఇందులో రూ.25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుండగా మిగిలిన మొత్తాన్ని సిడ్బీ, లేదా ఇతర బ్యాంకుల నుంచి సమీకరిస్తారు. 6–8 శాతం అతి తక్కువ రేటుకు రూ.2లక్షలు మొదలుకుని గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం ఇచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. రుణ చెల్లింపు కాలపరిమితి 3 ఏళ్లు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ పథకం అమలుచేసే బాధ్యతను ఏపీఎస్‌ఎఫ్‌సీకి అప్పగించారు. -
గత నెల ఎంత వస్తే అంతే కట్టండి!
సాక్షి, అమరావతి: మార్చి నెలలో వచ్చిన విద్యుత్ బిల్లులే ఏప్రిల్ నెలకూ వర్తిస్తాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నందున సిబ్బంది ఇంటింటికీ వెళ్లి విద్యుత్ బిల్లులు తీయడం సాధ్యం కాదని రాష్ట్ర డిస్కమ్‌లో కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి మార్చి (ఫిబ్రవరి వినియోగం)లో వచ్చిన కరెంట్ బిల్లే ఏప్రిల్‌కూ వర్తింపజేస్తూ ఆదేశాలిచ్చారు. సమయం మరో 2 గంటలైనా పెంచండి ప్రభుత్వానికి పౌల్ట్రీ రైతుల విన్నపం సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలను సడలించాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు. రైతుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని మరో రెండు గంటల పాటు చికెన్ దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్, ఏపీ రైతు సంఘాలు కోరాయి. (కరోనా: పెనుగొండలో నిషేధాజ్ఞలు) -
ఆస్తి పన్ను, విద్యుత్ చార్జీలు.. పెంచక తప్పదు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థలు మనుగడ సాగించాలం టే పన్నులు పెంచక తప్పదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పెంచి తీరుతామని ప్రకటించారు. పన్నులు పెంచబోమని చందమామ కథలు చెప్పబోమని, పన్ను కట్టే సామర్థ్యం ఉన్న వారిపైనే భారం మోపుతామన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పల్లె ప్రగతి కార్యక్రమంపై స్వల్పకాలిక చర్చను ప్రారంభించిన సీఎం కేసీఆర్ పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వ దృక్పథాన్ని వివరించారు. పంచాయతీరాజ్ చట్టం అమలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్ల విధులు, కలెక్టర్లకు ఉన్న అధికారాల గురించి మాట్లాడారు. ఆస్తి పన్నుతోపాటు విద్యుత్ చార్జీలు కూడా పెంచనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ‘గత పాలకులు రాజకీయం చేసి పంచా యతీరాజ్, సహకార రంగాలను ఉరితీశారు. గ్రామీణులను ఏకీకృతం కాకుండా గ్రూపు లుగా విడగొట్టారు. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. బోరుబావులను పూడ్చే పరిస్థితి లేదు. బోరుబావిలో పిల్లలు పడితే.. టీవీలు గగ్గోలు పెడితే ఇక్కడి నుంచి చూడటం తప్ప ఏం చేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఉండేది. ఇదో పంచాయతీరాజ్ వ్యవస్థనా? పెంటకుప్పలా తయారైంది. కరోనా, గిరోనా ఎందుకు వస్తోంది. ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థను అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థగా మారిస్తే రోగాలు దరికి చేరవు. సర్పంచ్‌ను పొద్దున తీసేస్తే మధ్యాహ్నానికల్లా ఎమ్మెల్యేను పట్టుకొని కలెక్టర్ ఎదురుగా కూర్చొని వెకిలినవ్వు నవ్వే పరిస్థితి ఉంది. వంద శాతం ఆస్తిపన్ను వసూలు కావాల్సిందే. పన్ను వసూలు చేయకపోతే సర్పంచ్, కార్యదర్శులను ఉద్యోగం నుంచి తీసేస్తాం. నిందించినంత మాత్రాన, విమర్శించినంత మాత్రాన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పంచాయతీరాజ్ చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తాం. శషభిషల్లేవ్. విద్యుత్ చార్జీల పెంపు తప్పనిసరి... విద్యుత్ చార్జీలు పెంచుతాం. సంస్థను కాపాడుకునేందుకు ఇది తప్పనిసరి. దళితులు, గిరిజనులకు 101 యూనిట్ల పరిధిలో మాత్రం చార్జీలు పెంచం. కొంత ఆస్తి పన్ను కూడా పెంచబోతున్నాం. మాకు ఆ ధైర్యం ఉంది. పన్నులు పెంచబోమని చందమామ కథలు చెప్పం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పన్నులపైనే నడుస్తుంది. అయితే పన్నులను అడ్డదిడ్డంగా పెంచం. దళితులకు, గిరిజనులకు రూపాయి కూడా పెంచం. పన్నుకట్టే సామర్థ్యం ఉన్న వారిపైనే భారం మోపుతాం. ట్యాక్సులు పెంచకుంటే సంస్థల మనుగడ ఎలా? గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పన్నులు పెంచాల్సిందే. పన్ను నిర్ధారణలోనూ శాస్త్రీయత పాటిస్తాం. సిబ్బందితో కుమ్మక్కై కొలతలు సరిగా చూపని మతలబులు ఇక కుదరవు. ఇకపై ఇంటి యజమానే ఆస్తిపన్ను లెక్కలు ఇవ్వాలి. సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే దానికి తగ్గట్లుగా పన్ను వసూలు చేస్తాం. ఒకవేళ ఈ లెక్కల్లో తేడా ఉన్నట్లు తేలితే 25 రెట్లు జరిమానా విధిస్తాం. రెండేళ్ల జైలుశిక్ష వేస్తాం. దీన్ని చట్టంలోనే పొందుపరిచాం. నిధుల విషయంలో వెనక్కు తగ్గం.. 15వ ఆర్థిక సంఘం నిధుల ఖరారులో కేంద్రం వైఖరి విచిత్రంగా ఉంది. ఐదేళ్లకు తగ్గట్లు ప్రణాళిక చేయకుండా ఈ ఏడాది అది కూడా మధ్యంతర నివేదిక ఆధారంగా రాష్ట్రానికి రూ. 1,847 కోట్లు కేటాయించింది. అందులోనూ 5–10 శాతం నిధులను మండల, జెడ్పీలకు ఇవ్వాలి. కేంద్ర నిధులకు సమానంగా రూ. 1,847 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. దీన్ని బడ్జెట్లో కూడా పెట్టాం. అవసరమైతే ఎమ్మెల్యేల జీతాలు ఆపైనా.. మేం పస్తులుండైనా పంచాయతీలకు నిధులిస్తాం తప్ప వెనక్కిపోం. కొత్త పంచాయతీల్లో త్వరలోనే రేషన్ షాపులను కూడా ప్రారంభించబోతున్నాం. జనాభా ప్రాతిపదికన అన్ని పంచాయతీలకు సమృద్ధిగా నిధులిస్తున్నాం. ట్రాక్టర్లు, ట్రాలీ, ట్యాంకర్ ఒకసారి వ్యయమే. దానిపై కాంగ్రెస్ సభ్యుల రాద్ధాంతం బాగోలేదు. ట్రాక్టర్లు కొనాలని నేనే చెప్పా. 106 జనాభా ఉన్న గ్రామానికి కూడా ట్రాక్టర్ కొనాలని నిర్ణయించాం. మంచైనా.. చెడైనా నేనే బాధ్యత తీసుకుంటా. ఎన్ని అదనపు నిధులైనా ఇస్తాం. సత్తుపల్లి నియోజకవర్గ సర్పంచ్‌లకు అభినందనలు. వర్ధన్నపేట నియోజకవర్గం దేవరన్నపేట పంచాయతీలో కామిడి నర్సింహరెడ్డి రూ. 25 కోట్లను విరాళంగా ఇచ్చారు. హుస్నాబాద్ సెగ్మెంట్ గట్ల నర్సింగాపూర్ గ్రామంలో గుండవరపు భాస్కర్‌రావు రూ. 3 కోట్లను, నల్లగొండలో కంచర్ల కృష్ణారెడ్డి కోటి రూపాయలను గ్రామాల అభివృద్ధికి విరాళంగా అందజేశారు. వారందరికీ చేతులెత్తి దండాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. డబ్బుకంటే వారి స్ఫూర్తి గొప్పది. మొక్కలు ఎండితే బాధ్యత కౌన్సిలర్లదే.. ప్రేమ, భయం లేకపోతే అభివృద్ధి జరగదు. లంచాలకు మరిగిన కొందరు సిబ్బందితో మనమెందుకు బాధలు, నిందలు పడాలి? గత ప్రభుత్వాల దుర్మార్గాలు అంతాఇంత కాదు. హెచ్‌టీ లైన్ల కింద ఇళ్లకు ఎలా అనుమతులిస్తారు? అందుకే లేఅవుట్ల అనుమతుల అధికారాలను కలెక్టర్లకు కట్టబెట్టాం. దీనిపై కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల హక్కులు కాలరాసినట్లు గగ్గోలు పెట్టారు. గిలిగింతలు, చక్కిలిగింతలు పెడితే ఫలితాలు రావు. 24 గంటలు విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం మనది. ఎవరి పరిధిలో వారు సక్రమంగా పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. హరితహారం కింద నాటిన మొక్కల్లో 86 శాతం మొక్కలు బతికాయి. వార్డుల్లో మొక్కల సంరక్షణ బాధ్యత కౌన్సిలర్లది. వార్డుల బాధ్యత వారు చూసుకోకపోతే వేరేవారు ఎందుకు చూసుకుంటారు? విశ్వసనీయత ఉండాలి.. ఓట్ల కోసం భయపడం. ఉన్నది ఉన్నట్లు చెబుతాం. ఎన్నికల్లో ఏది పడితే అది చెబితే ఓట్లు రావు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తానని హామీ ఇచ్చింది. మేం రూ. లక్షలోపు రుణాలను విడతలవారీగా చేస్తామని చెప్పాం. ఓటర్లు మావైపు మొగ్గు చూపారు. ప్రజల్లో విశ్వసనీయత ఉండాలి. అంతేతప్ప ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతాం అనుకోవడం తప్పు. వితండవాదాలు వద్దు. పంచ రంగులు చూపొద్దు. కుల, మతరహిత శ్మశానవాటికలు నిర్మిస్తున్నాం... చనిపోయిన వాళ్లను సంస్కారహితంగా పంపడం మన సమాజం సంస్కారం. ఒడిశాలో ఒకాయన 20 కిలోమీటర్లు సైకిల్‌పై భార్య శవాన్ని మోసుకెళ్లిండు. భూమి లేని వాళ్లు ఎక్కడ అంత్యక్రియలు చేసుకోవాలి? ఆ బాధ మనకే ఎదురైతే ఎంత కుమిలిపోతం? అందుకే అన్ని గ్రామాల్లో దహనవాటికలు, వైకుంఠధామాలు తయారవుతున్నాయి. కుల, మతరహిత సామూహిక శ్మశానవాటికలను చూడబోతున్నాం. ఇందుకోసం రూ. 10 కోట్లు కానీ రూ. 20 కోట్లు కానీ ఎంత అవసరమైతే అంత ఇస్తాం. షెడ్యుల్ ఏరియాలు కావడంతో... మణుగూరు, పాల్వంచ, ఆసిఫాబాద్, భద్రాచలం వంటి ఏజెన్సీ ప్రాంత మున్సిపాలిటీలు షెడ్యూల్డ్ ఏరియాలుగా ఉండటంతో అక్కడ ఎన్నికల నిర్వహణ సాధ్యంకావట్లేదు. ఈ అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. కేంద్రం నుంచి ఆమోదముద్ర లభించిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తాం. ఎర్రబెల్లి టాప్ పర్ఫార్మర్.. టాప్ పెర్ఫార్మింగ్ మినిస్టర్‌గా మా అంతర్గత సర్వేలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అవార్డు వచ్చింది. ఆయన పల్లె ప్రగతి కోసం త్రీవ్రంగా శ్రమించారు.