Grama Volunteer
-
వాలంటీర్లకు బాబు,పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి: వరుదు కళ్యాణి
సాక్షి,విశాఖపట్నం: ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్, చంద్రబాబు రాష్ట్రంలో 30 వేల మందికిపైగా మహిళలు మాయమయ్యారని ప్రచారం చేశారని వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గుర్తుచేశారు. ఈ మేరకు శనివారం(నవంబర్ 16) వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు.‘వాలంటీర్ల ద్వారా 30 వేలకు పైగా మహిళలు అక్రమ రవాణా అయ్యారంటూ అబద్ధాలు చెప్పారు.ఇప్పుడేమో అసెంబ్లీ వేదికగా 34 మంది మహిళలే మిస్ అయ్యారని చెప్పారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు మాటలు అసత్యమని అసెంబ్లీ వేదికగా తేలిపోయింది. వాలంటిర్లకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. హిందూస్తాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో చంద్రబాబు అబద్ధాలు చెప్పారు.అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు మొదటి నుంచి అలాటు. ఫేక్ అకౌంట్స్ సృష్టించి విజయమ్మ,షర్మిళపై తప్పుడు ప్రచారం చేసింది టీడీపీనే. పవన్ కల్యాణ్ అమ్మపైన టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసింది. తన తల్లిపై లోకేష్ తప్పడు ప్రచారం చేయిస్తున్నారని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలి.కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది’అని వరుదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: పోలీసుల తీరు అమానుషం.. గౌతమ్‌రెడ్డి కుమార్తె లిఖిత -
వాళ్లది విద్వేషం! ఆ ఒక్కమాటతో..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పేదేదో స్పష్టంగా చెప్పేస్తారు. తన మనసులో ఉన్నమాట దాచుకోరు. చల్లకొచ్చి ముంత దాచే వ్యవహారం ఆయనతో కాదు. వలంటీర్ల అభినందన సభలో ఆయన తన మనోగతాన్ని చాలా గట్టిగా మొహమాటం లేకుండా వెల్లడించారు. వచ్చే రెండు నెలలు ప్రజలకు అందించవలసిన సేవలను, చెప్పవలసిన విషయాలను వలంటీర్లకు వివరించి వచ్చే ఎన్నికల యుద్దానికి సన్నద్దం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఒకరకంగా ఇది ధైర్యంతో కూడిన విషయం. విపక్షాలు చేసే విమర్శలతో నిమిత్తం లేకుండా ఆయన.. పేదల తరపున పనిచేసే ప్రభుత్వానికి వలంటీర్లు వారధులుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వలంటీర్లు నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు కారు. కేవలం స్వచ్చంద కార్యకర్తలు. వారు తమ అభిప్రాయాల ప్రకారం రాజకీయంగా నడుచుకోవచ్చు. వలంటీర్ల వ్యవస్థను సృష్టించి ప్రపంచంలోనే ఒక సరికొత్త చరిత్ర సృష్టించిన జగన్ దాని వల్ల కూడా తన ప్రభుత్వం మళ్లీ విజయం సాధించడానికి మార్గం సుగమం అయిందని చెప్పకనే చెప్పేశారు. సుమారు రెండున్నర లక్షల మంది వలంటీర్లకు అభివందనం పేరుతో వారి సేవలను దృష్టిలో ఉంచుకుని అవార్డులను ప్రకటించారు. వచ్చే ఎన్నికలు ఎంత కీలకమైనవో ప్రజలకు తెలియచెప్పవలసిన బాద్యత వలంటీర్లపై ఉందని అన్నారు. ఈ అభినందన సభలో జగన్ మాట్లాడిన ప్రతి మాటకు విశేష స్పందన కనిపించింది. సీఎం., సీఎం. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. సభ జరిగిన తీరు చూస్తే వలంటీర్లు ఎంత కమిటెడ్‌గా ఉన్నది, జగన్ పట్ల ఎంత అభిమానంతో ఉంది అర్ధమవుతుంది. వారిని చూడగానే ప్రభుత్వ స్కీములు పొందిన పేదలంతా ముఖ్యమంత్రి జగన్ ను చూసినట్లు సంతోషపడుతున్నారు. ప్రత్యేకించి వృద్దులైతే వారి సంతోషానికి అవధులు ఉండడం లేదు. గతంలో కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి గంటల తరబడి వేచి చూసి పెన్షన్ పొందడానికి నానా కష్టాలు పడవలసి వచ్చేది. అలాంటిది ఇప్పుడు వలంటర్ ప్రతి నెల మొదటి తేదీన ఇంటికి వచ్చి మూడువేల పెన్షన్ ఇస్తుండడంతో వారికి ఎంతో గౌరవం, సంతృప్తి ఇస్తోంది. ఇదే విషయాన్ని జగన్ తన స్పీచ్ లో కూడా ప్రస్తావిస్తూ, చంద్రబాబుకు ఓటు వేయడం అంటే ప్రస్తుతం అమలు చేస్తున్న స్కీముల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని హెచ్చరించారు. గతంలో వలంటీర్ల వ్యవస్తను ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వలంటీర్లు అంటే మూటలు మూసే ఉద్యోగమని, ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు ఆడవాళ్లను ఇబ్బంది పెడతారని టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వలంటీర్లను మహిళలను కిడ్నాప్ చేసే వ్యక్తులంటూ తీవ్రంగా అవమానించారు. ఎన్నికలు దగ్గరబడుతున్న తరుణంలో వారు తమ వైఖరి మార్చుకుని వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతున్నా, వారిలో ఈ వలంటీర్లపై పేరుకున్న విద్వేషాన్ని మాత్రం దాచుకోలేకపోతున్నారు. ఈనాడు రామోజీరావు ఈ అల్పజీవులపై విషం చిమ్ముతూ టీడీపీ, జనసేన ఎజెండాను మోస్తున్నారు. ఈ నేపధ్యంలో జగన్ వారందరిని తన సొంత కుటుంబ సభ్యుల మాదిరి చూసుకుంటూ వారి సేవలను అభినందిస్తూ మాట్లాడారు. గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కల వంటివైతే, వలంటీర్లుతో కూడిన ప్రస్తుత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తులసి మొక్క వంటివని సీఎం జగన్ కొనియాడారు. పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్దంలో నిరుపేదలకు వలంటీర్లకు అండగా నిలవాలని ఆయన కోరారు. మేనిఫెస్టోల విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి తాము ఎంతో కష్టపడి నవరత్నాల అమలుకు 70 వేల కోట్లు వ్యయం చేస్తున్నామని, అలాంటిది చంద్రబాబు నాయుడు ఏకంగా 1.26 లక్షల కోట్లు ఖర్చు చేస్తానని చెబుతున్నారని, అది ప్రజలను మోసం చేయడమేనని, ఈ విషయం ప్రజలకు వలంటీర్లు తెలియచెప్పాలని జగన్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును నమ్మితే ఇంతే సంగతన్నది ప్రజలకు అర్ధం కావాలని అన్నారు. తాము బటన్ నొక్కుతుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం అంతకు మించి పంచుతామని అంటున్నారని, దీనిన ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మీ బిడ్డ పై చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు, ఒక జాతీయ పార్టీ ప్రత్యక్షంగా,మరో జాతీయ పార్టీ పరోక్షంగా ఏకం అవుతున్నాయని, కాని నాకు మాత్రం రెండున్నరలక్షల మంది సైన్యం ఉన్నారని జగన్ అన్నప్పుడు వలంటీర్లు అంతా హర్షద్వానాలతో హోరెత్తించారు.వలంటీర్ల సేవలకు తాను సాల్యూట్ చేస్తున్నానని అంటూ, పెత్తందార్లకు,పేదలకు మద్య జరుగుతున్న యుద్దంలో పేదలే గెలవాలని జగన్ అన్నారు. ఒకవైపు పోరాట పటిమను ప్రదర్శించడానికి వలంటీర్లలో స్పూర్తి నింపే విధంగా, మరో వైపు ప్రత్యర్ధి రాజకీయ పక్షాల డొల్లతనాన్ని ఎండగడుతూ జగన్ చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుందని చెప్పాలి. రెండు నెలల్లో జరిగే యుద్దానికి అంతా సిద్దం కావాలని , సిద్దం సభ తరహాలో ఆయన నినదించారు.తన ప్రభుత్వం ఎక్కడా అవినీతి లేకుండా రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేర వివిధ స్కీముల కింద నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలలో వేసిందని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు టైమ్ లో అంతా అవినీతిమయంగా ఉండేదని ఆయన అన్నారు. ఏది ఏమైనా టైమ్ చూసి దెబ్బగొట్టడం అంటే ఇదేనేమో!. వలంటీర్లపై టీడీపీ,జనసేన తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అందుకు భిన్నంగా వలంటీర్లను గౌరవించి వారి ఆదరణను చురగొనే యత్నం జగన్ చేశారని అనుకోవచ్చు!!. దీనిపై రాజకీయ విమర్శలు వచ్చినా ఆయన ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నారు. గతంలో జన్మభూమి కమిటీలను రాజకీయ లక్ష్యంతోనే చంద్రబాబు ఏర్పాటు చేశారు.కాకపోతే వారు పూర్తిగా అవినీతి మయం అయి టీడీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేశారు.కాని వలంటీర్లు ఎక్కడా అవినీతి లేకుండా సేవలు అందిస్తున్నారు. ఈ వ్యవస్థ ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారు. దాంతో విపక్షాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నాయి. అంతేకాక.. చంద్రబాబు ఒకసారి తాను వేసిన రోడ్డు మీద నడుస్తూ వేరే వాళ్లకు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు.చివరికి తాను మంజూరు చేసిన మరుగు దొడ్డిని వాడుతూ వేరే వారికి ఓటు వేయరాదని ఆయన వాదించారు. ఈ పరిస్థితిలో జగన్ ఎక్కడా ప్రజలను బెదించడం లేదు. తాను చేసిన సేవలను ప్రజలకుగుర్తు చేయాలని మాత్రమే కోరుతున్నారు. తద్వారా ఆయన తనవాదన రెడీ చేసుకుని వలంటీర్ల అభినందన సభలో ఇంత స్పష్టంగా వారిని ఆకట్టుకునే రీతిలో స్పీచ్ ఇచ్చారని అనుకోవచ్చు. వచ్చే ఎన్నికలలో వలంటీర్ల ప్రభావం ప్రజలపై బాగా ఉండే అవకాశం ఉంటుందని టీడీపీ ,జనసేన భయపడుతున్నాయి. అందుకే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా వారిపై కక్షపూరిత ప్రచారం చేశాయి. తద్వారా జగన్ ప్రభుత్వానికి అండగా నిలబడే విధంగా వారిని రెచ్చగొట్టారని అనుకోవచ్చు. దాని ఫలితమే అభినందన సభలో జగన్ పట్ల వలంటీర్లు అంత అభిమానాన్ని కనబరుచుకున్నారని భావించవచ్చు. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
వలంటీరుగా రాణిస్తున్న ట్రాన్స్‌జెండర్ శ్రేయదాస్
ట్రాన్స్‌జెండర్ అంటే సమాజంలో ఓ రకమైన చిన్నచూపు. ‘మూడో’రకం మనుషులంటూ హేళనభావం. అనుచితంగా ప్రవర్తిస్తారని, బెదిరించి డబ్బు వసూలు చేస్తారనే అపవాదు. కానీ అందరు ట్రాన్స్జెండర్లూ అలా ఉండరు. మానవత్వం మూర్తీభవించి ఆపన్నులకు అండగా నిలిచేవారు, సమాజానికి సేవ చేయాలని తపనపడే వారూ ఉన్నారు. యాచనకు దూరంగా స్వశక్తితో హుందాగా, గౌరవంగా బతుకుతున్న వారూ ఉన్నారు. అలాంటి వారిలో శ్రేయదాస్ ఒకరు. సాక్షి, అనంతపురం డెస్క్: ఉరవకొండ పట్టణానికి చెందిన శ్రేయదాస్ గ్రామ వలంటీరుగా పనిచేస్తున్నారు. తన క్లస్టర్ పరిధిలోని ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రశంసలు చూరగొంటున్నారు. తన పనితీరుతో అధికారుల మన్ననలూ పొందుతున్నారు. ఈమె బహుశా రాష్ట్రంలోనే వలంటీరుగా పనిచేస్తున్న ఏకై క ట్రాన్స్‌జెండర్! గౌరవంగా బతకాలన్న దృఢసంకల్పం, సమాజానికి సేవ చేయాలన్న తపనతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. కన్నీటి పయనం.. శ్రేయదాస్ సొంతూరు ఉరవకొండ పట్టణమే. చిన్నప్పుడు అబ్బాయి లాగా ఉండేవారు. తల్లిదండ్రులూ అలాగే అనుకున్నారు. మిగిలిన అబ్బాయిలతో కలసి స్థానిక ప్రభుత్వ పాఠశాలకు పంపించారు. పదో తరగతి వరకు అక్కడే చదివారు. కానీ తాను అబ్బాయిని కాదన్న విషయం శ్రేయదాస్కు తెలుసు. ఆ విషయం ఇంట్లో చెప్పాలంటే భయం. చివరికి ఎలాగోలా విషయం బయటపడింది. కొంతకాలానికి తల్లి కూడా చనిపోయింది. కుటుంబ సభ్యుల నుంచి ఛీదరింపులు ఎక్కువయ్యాయి. చివరకు తండ్రి కూడా అండగా నిలవలేదు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. తలదాచుకోవడానికి అద్దె ఇల్లు కూడా దొరకని పరిస్థితి. చాలాకాలం పాటు స్థానిక కందారమ్మ ఆలయమే ఆశ్రయమైంది. ‘ఉన్నత’ లక్ష్యం ఇంటి నుంచి బయటకొచ్చేసిన తర్వాత శ్రేయదాస్ పొట్ట నింపుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. మిగిలిన ట్రాన్స్జెండర్ల లాగా యాచించడం తనకు ఇష్టం లేదు. కానీ ఆకలి తీరాలంటే ముందున్న మార్గం అదొక్కటే. అయిష్టంగానే సుమారు మూడేళ్ల పాటు యాచనతో బతుకు నెట్టుకొచ్చారు. ఓ దుకాణం వద్దకు యాచించడానికి వెళ్లిన ఆమె ఇంగ్లిష్ నేమ్‌బోర్డును స్పష్టంగా చదవడాన్ని అక్కడే నిల్చొన్న ఓ వ్యక్తి గమనించారు. ఏమి చదివారంటూ ఆరా తీశారు. టెన్త్ చదివానని, పైచదువులు చదవాలన్న కోరిక ఉందని చెప్పారు. దీంతో గుంతకల్లులోని సత్యసాయి జూనియర్ కళాశాలలో అడ్మిషన్ చేయించారు. ఇంటర్మీడియట్ తర్వాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ (బీఏ) పూర్తి చేశారు. ఇదే యూనివర్సిటీలో పీజీ (ఎంఏ) అడ్మిషన్ పొంది ఫస్టియర్ ఉత్తీర్ణులయ్యారు. ఇతరత్రా కారణాల వల్ల సెకండియర్‌లో డిస్కంటిన్యూ అయ్యారు. తన చదువుకూ ‘జెండర్’ సమస్య అడ్డొచ్చినప్పటికీ పట్టుదలతో అధిగమించి ముందుకు సాగారు. స్వశక్తితో జీవనయానం హేళన చేసిన చోటే ప్రశంసలు శ్రేయదాసుకు వలంటీరుగా గౌరవ వేతనంతో పాటు ట్రాన్స్‌జెండర్‌గా పింఛన్ కూడా వస్తోంది. ఇంట్లోనే టైలరింగ్ చేస్తున్నారు. యూట్యూబ్ ద్వారా మెలకువలు నేర్చుకుని బ్యూటీషియన్గానూ మారారు. ఇళ్ల వద్దకే వెళ్లి బ్యూటీషియన్‌గా సేవలందిస్తున్నారు. డ్వాక్రా సంఘం సభ్యురాలిగా ఉన్నారు. ఈమెకు ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలాన్ని కేటాయించింది. సొంతింటి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇలాంటి’ వలంటీరునా గ్రామ/వార్డు వలంటీర్ల నియామక నోటిఫికేషన్లో ట్రాన్స్జెండర్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో శ్రేయదాస్ దరఖాస్తు చేసుకున్నారు. ఆమె సంకల్పాన్ని గుర్తించిన అధికారులు గ్రామ వలంటీరుగా అవకాశం కల్పించారు. 2019 ఆగస్టు 15న గ్రామ వలంటీరుగా సేవలు ప్రారంభించారు. మొదట్లో తనను చాలామంది హేళన చేశారు. ‘ఇలాంటి’ వలంటీరునా తమకు కేటాయించిందంటూ ప్రజలు కూడా చిన్నచూపు చూశారు. కానీ అందరి అపోహలను ఆమె పటాపంచలు చేశారు. ఉత్తమ సేవలతో హేళన చేసిన చోటే ప్రశంసలు చూరగొంటున్నారు. ఈ క్రమంలో ‘సేవామిత్ర’ అవార్డు కూడా పొందారు. ‘ఆపదమిత్ర’గా జిల్లాస్థాయి శిక్షణ తీసుకున్నారు. అందులోనూ మొదటి బహుమతి కై వసం చేసుకున్నారు. గౌరవంగా బతుకుతున్నా.. వలంటీరుగా చేరినప్పుడు చాలామంది హేళన చేశారు. సొంత కమ్యూనిటీ నుంచి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అయినా కొందరి ప్రోత్సాహం, అధికారుల సహకారంతో ధైర్యంగా ముందుకు సాగాను. ప్రస్తుతం సచివాలయ సిబ్బంది వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. వెల్ఫేర్ అసిస్టెంట్ భారతి మేడం, వీఆర్వో అరుణ మేడం సహకారం మరువలేనిది. మొదట్లో కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ ఇప్పుడు క్లస్టర్ పరిధిలోని ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. ఆత్మీయురాలిగా చూస్తుండడం ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటుతో గౌరవంగా బతుకుతున్నా. ట్రాన్స్జెండర్లు అందరూ చెడ్డవారు కాదు. మాలోనూ మంచోళ్లు ఉన్నారు. కాబట్టి కొందరి ప్రవర్తనను బట్టి అందరినీ చెడ్డవాళ్లుగా ముద్ర వేయొద్దు. సమాజంలో గౌరవం, సమాన అవకాశాలు లభిస్తే నాలాగా స్వశక్తితో బతకడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. – శ్రేయదాస్, గ్రామ వలంటీరు, సచివాలయం–3, ఉరవకొండ -
ఓరీ దత్తపుత్రా.. అందుకేనా వాలంటీర్లపై వాగింది!
వాళ్లు ఎండావానచలిని లెక్క చేయరు. తమ పరిధిలోని యాభై మందికి ఓర్పు.. ఓదార్పులే కాదు, సాయం చేసిన సందర్భాలనేకం. వ్యయప్రయాసలకు ఓర్చుకుని లబ్ధిదారుల కోసం బహుదూరం ప్రయాణించిన సందర్భాలూ.. గ్రామస్తుల కోసం సాహసాలు చేసిన సందర్భాలూ చూశాం. వ్యక్తిగత జీవితం కంటే విధి నిర్వహణకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన వాళ్లను చూసే ఉంటాం!. అన్నికంటే ముఖ్యంగా.. కరోనా లాంటి మహమ్మారి సైతం వాళ్ల సంకల్పం ముందు చిన్నబోయింది. వాలంటీర్ల సైన్యం.. ఏపీ ప్రజానీకపు కుటుంబ సభ్యులు. అలాంటి సంక్షేమ సారథుల పట్ల.. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఎలా పడితే అలా వాగడం సరైందేనా దత్తపుత్రా?.. ప్రభుత్వం సమర్థంగా పని చేస్తుంటే ఫలితాలు ప్రజలకు అందుతుంటాయి. పేదల సంక్షేమానికి పథకాలు పెడితే.. అవి లబ్ధిదారులకు చేరుతాయి. కానీ, మధ్యలో దళారుల చేతివాటం, అవినీతి పరుల అక్రమాలు, నేతల పక్షపాత ధోరణి లాంటి వ్యవహారాలతో చొరబడే అవకాశాలు ఉంటాయి. ఆ లోటుపాట్లను అర్థం చేసుకున్నారు గనుకే.. ప్రభుత్వానికి- ప్రజలకు నడుమ ఒక వారధి ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తలిచారు. సంక్షేమ సంధాన కర్తలుగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. గ్రామ సచివాలయ వ్యవస్థలో భాగమై.. విప్లవాత్మక మార్పుతో ముందుకు పోతున్న ఈ విధానం గురించి బహుశా ఏమీ తెలియనివాళ్లు.. అర్థం చేసుకోని వాళ్లే ఇలా కారుకూతలు కూస్తుంటారేమో.. పిచ్చి రాతలు రాస్తుంటారేమో!. #PawanSaySorryToVolunteers ప్రభుత్వం అందించే గౌరవ వేతనంతో స్వచ్ఛందంగా పని చేస్తూ.. క్రమశిక్షణ కలిగిన సైన్యమిది. ప్రతినెలా 1వ తేదీన అవ్వాతాతల ఇళ్ల తలుపు తట్టడమే కాదు. పొలాల్లోని రైతులు,ఆసుపత్రుల్లోని రోగులు సహా అందరినీ పరామర్శిస్తూ వారికి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల నుంచి ఇతర సంక్షేమ ఫలాలను నేరుగా అందిస్తున్నారు. కాబట్టే... ఇపుడు రాష్ట్రంలో అర్హత ఉండి పథకం అందలేదనే వారెవరూ లేరు. వివక్షతో దూరమైన వారు లేరు. లంచాలివ్వాలని బాధపడేవారు లేరు. అందుకేనేమో!! జనానికి చేరువైన ఈ జగనన్న సైన్యంపై దొంగల ముఠాలో.. ఆ ముఠాలో ఒకడైన పవన్‌కు వణుకు మొదలైనట్లుంది. #PawanSaySorryToVolunteers వాలంటీర్ వ్యవస్థ విధులివే తెలుస్కో.. వాలంటీర్లూ అహర్నిశలూ పనిచేస్తున్నదనేది కాదనలేని వాస్తవం. లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తోంది. కొత్త రైస్ కార్డులివ్వటంతో పాటు రైస్ కార్డులున్న వారందరికీ సేవలందిస్తోందీ. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద కొత్త కార్డులు మంజూరు చేయటం... ఆరోగ్య శ్రీని ఉపయోగించుకోవటంపై అవగాహన కల్పించటం చేస్తోంది. ఇదీ చదవండి: కరోనా టైంలో.. వలంటీర్లు ఉన్నారనే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ కాపు నేస్తం, చేయూత, రైతు భరోసా, మత్స్యకార భరోసా, వైఎస్సార్ జలకళ, వాహనమిత్ర, నేతన్న నేస్తం, ఆసరా, వైఎస్సార్ బీమా, సంపూర్ణ పోషణ, ఉచిత పంటల బీమా, లా నేస్తం, రైతులకు సున్నా వడ్డీ, ఆరోగ్య ఆసరా, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న తోడు, రజకులు.. టైలర్లు... నాయీ బ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు, జీవ క్రాంతి, అమూల్ పాలవెల్లువ, కంటి వెలుగు, అమ్మ ఒడి... అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు ఒకసారి అందించే ఆర్థిక సాయం, పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాల మంజూరు, ఈబీసీ నేస్తం వంటి పదుల కొద్దీ పథకాల ఫలాలను అర్హులకు చేరుస్తున్నారు. #PawanSaySorryToVolunteers ఇవికాక వివిధ ప్రభుత్వ విభాగాలు సైతం వలంటీర్ల సేవలు ఉపయోగించుకుంటున్నాయి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లో అర్హత ప్రమాణాలను విచారించడంలో వీఆర్వోలకు సహకరిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టే వ్యాక్సినేషన్ డ్రైవ్‌లకు, ఫీవర్ సర్వేలు, ఆరోగ్య సర్వేలకు వలంటీర్లే ఆధారం. వాలంటీర్ల సాయం లేకుంటే ఆర్బీకే సిబ్బంది ఈ–క్రాప్ బుకింగ్‌కు రైతులను గుర్తించడం అంత తేలిక కాదు. ప్రత్యేక వాహనాల్లో రేషన్ బియ్యాన్ని ఇళ్ల వద్దకు తీసుకెళ్లి అందజేస్తున్న ఎండీయూ ఆపరేటర్లకు పూర్తి సహకారం వాలంటీర్లదే. ఇక తుపానులు, భారీ ప్రమాదాలు జరిగినపుడు చాలా మంది వలంటీర్లు స్వచ్ఛంద సైనికుల్లా రంగంలోకి దూకి సేవలందిస్తున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన కోనసీమ వరదల్లో వలంటీర్ల సాయాన్ని అక్కడి ఏ వ్యక్తినడిగినా చెప్పకమానడు. ఇదీ చదవండి: 12 కిలోమీటర్ల కొండమార్గంలో ఆ వాలంటీర్.. 64లక్షల మంది లబ్దిదారులకు ప్రభుత్వ పెన్షన్లను అందిస్తున్న గొప్ప సేవకులు, సైనికులు. 2019నుంచి 2.66లక్షల మంది మహా సైన్యం వ్యవస్థ ప్రజలకు సేవలు అందిస్తోంది. మరి ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాలంటీర్లను చులకనగా చూడడం.. టార్గెట్ చేయడం దేని? బహుశా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసే క్రమంలోనే కదా ఇదంతా జరుగుతోంది కాబోలు. ఇంతకన్నా ఘోరమైన కుట్ర ఉంటుందా?.. ఏమన్నావ్ పవన్.. వాలంటీర్లు సంఘవిద్రోహశక్తులా? వాళ్ల పనితనం గురించి ఏనాడైనా చూశావా?.. పోనీ వాళ్ల సేవలకు సంబంధించిన కథనాలు చదివావా?.. #PawanSaySorryToVolunteers ఇదీ చదవండి: బ్రెయిన్ డెడ్ అయిన వలంటీర్ అవయవదానం ఏమన్నావ్.. వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులా?.. వ్యక్తిగత సమాచారం తస్కరిస్తారా? రాష్ట్రంలో వేల మంది మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమా?. వాళ్లేమైనా నీలాగా ప్యాకేజీ స్టార్ అనుకుంటున్నావా?.. లేదంటే పవిత్రమైన వివాహ బంధానికి తూట్లు పొడిచేవాళ్లు అనుకుంటున్నావా? వాళ్లు ప్రజల మనుషులు.. రియల్ పవర్ స్టార్లు.. అందుకే సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేసే ఘనతను ప్రభుత్వ ఖాతాలో కాకుండా ఆ ‘‘సేవా బలగం’’కే కట్టబెట్టి ప్రతీ ఏటా వాళ్లకు తగిన గౌరవం అందించి సీఎం జగన్ సత్కరిస్తూ సముచిత స్థానం కల్పిస్తున్నారు. #PawanSaySorryToVolunteers ఇదీ చదవండి: వేగులం కాదు.. ప్రజా సేవకులం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇదే తరహాలో ఓసారి వాలంటీర్ల గురించి ఇలాగే వాగాడు. కానీ, జగన్ ఆలోచనకి ఉన్న పవర్ గుర్తించాడు గనుకే.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను కొనసాగిస్తానన్నాడు. కానీ, ఇప్పుడాయన దత్తపుత్రుడు మాత్రం ఘోరంగా అనుమానించి.. అవమానించాడు. ఆ వాగిన వాగుడుకు గట్టిగానే కౌంటర్ పడక మానదు. #PawanSaySorryToVolunteers (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Live: వాలంటీర్లకు సీఎం వైఎస్ జగన్ సన్మానం
-
వాలంటీర్లంటే వణుకెందుకు బాబూ ?
-
Fact Check: రామోజీ.. వలంటీర్లంటే వణుకేల?.. వాస్తవాలివిగో..
ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తే... దాని ఫలితాలు జనానికి అందాలి. పేదల సంక్షేమానికి పథకాలు పెడితే... అవి నేరుగా వారిని చేరాలి. ప్రభుత్వం ఓ కార్యక్రమం తలపెడితే... జనమంతా భాగస్వాములవ్వాలి. ఇదిగో... ఈ లక్ష్యాల సాధనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ సేనను తయారు చేసుకున్నారు. క్రమశిక్షణ కలిగిన సైన్యమిది. ప్రతినెలా 1వ తేదీన అవ్వాతాతల ఇళ్ల తలుపు తట్టడమే కాదు. పొలాల్లోని రైతులు,ఆసుపత్రుల్లోని రోగులు సహా అందరినీ పరామర్శిస్తూ వారికి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల నుంచి ఇతర సంక్షేమ ఫలాలను నేరుగా అందిస్తున్నారు. కాబట్టే... ఇపుడు రాష్ట్రంలో అర్హత ఉండి పథకం అందలేదనే వారెవరూ లేరు. వివక్షతో దూరమైన వారు లేరు. లంచాలివ్వాలని బాధపడేవారు లేరు. అందుకేనేమో!! జనానికి చేరువైన ఈ జగనన్న సైన్యంపై చంద్రబాబులో వణుకు మొదలైంది. బాబు భయంతో... దిక్కుతోచని రామోజీరావుకు కలవరం పెరుగుతోంది. దాని ఫలితమే ‘ఈనాడు’ వరస కథనాలు!!. ఇటీవలే వలంటీర్లనుగూఢచారులుగా వర్ణిస్తూ కథనం వండి వార్చిన రామోజీ... బుధవారం ‘వాలంటీర్లతో ఓటు మాట’ అంటూ మరో కథనం అచ్చేశారు. మరి ఇందులో నిజానిజాలేంటి? రామోజీ సహా చంద్రబాబు జట్టు మొత్తం తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం... వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారనేది. గౌరవ పారితోషికం తీసుకుంటూ... పేరుకు తగ్గట్టే సేవాభావంతో పని చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాష్ట్రంలోని కొన్ని కోట్ల కుటుంబాలకు ప్రభుత్వ పథకాల్నిచే ర్చటమనేది... వ్యవస్థలో వచ్చిన గొప్ప మార్పు. సేవా దృక్పథంతో లంచాలు, వివక్షకు తావులేకుండా వీరంతా పనిచేస్తుండటం వల్లే ఇది సాధ్యమైంది. ‘‘వీళ్లు చేసినన్నాళ్లు చేస్తారు. మంచి ఉద్యోగం వచ్చినా, దీనికన్నా మంచి అవకాశం వచ్చినా వెళ్లిపోతారు’’ అని వీరిని నియమిస్తున్నపుడే చెప్పారు సీఎం వైఎస్ జగన్. మరి అలా గౌరవ పారితోషికం తీసుకుంటూ... ప్రభుత్వ పథకాలను జనానికి చేరువ చేస్తున్న వలంటీర్లకు ఏ రాజకీయ పార్టీపైనా అభిమానమో, దురభిమానమో ఉండకూడదా? ఒక పార్టీ పట్ల వారు గనక అభిమానం చూపిస్తుంటే దాన్ని ఎవరైనా ఆపగలరా? తాము అభిమానించే పార్టీ తాలూకు సమావేశాలకు వాళ్లు గనక హాజరైతే దాన్ని తప్పు అనగలమా? ఎందుకీ రాతలు రామోజీరావు గారూ? బాబు ఘోరాలు చేసినా ప్రశ్నించలేదేం? ఇప్పుడు వలంటీర్ల సైన్యం ద్వారా అర్హులైన రాష్ట్ర ప్రజలందరికీ పథకాలు నేరుగా అందుతున్నాయి. లంచాలు, వివక్షకు అవకాశమే లేకుండా పోయింది. కానీ చంద్రబాబు నాయుడి హయాంలో పేదలకు పింఛన్లు, ఇళ్లు, రుణాలు.. ఇలా ఏమివ్వాలన్నా ఆయన ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల సిఫారసు తప్పనిసరి. వారు ఓకే అంటేనే... ఇళ్లయినా, పింఛన్లయినా... ఆఖరికి రుణాలైనా. అందుకే అప్పట్లో పథకాల సొమ్ములన్నీ తెలుగుదేశం కార్యకర్తలకే అందాయి. టీడీపీ నేతలకు లంచాలిచ్చిన వారికే దక్కాయి. జన్మభూమి కమిటీలు ఆమోదించిన వారికే ఇళ్లతో సహా ఇతర పథకాలను ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశిస్తూ నాటి ప్రభుత్వం ఏకంగా జీవో కూడా విడుదల చేసేసింది. స్థానికంగా ఎక్కడైనా వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులుంటే... వారి ప్రమేయం లేకుండా స్వచ్ఛంద కార్యకర్తల పేరిట టీడీపీ వారిని నియమించుకుని మరీ ప్రతి పథకాన్నీ దుర్వినియోగం చేశారు. ఇది ప్రబలిపోవటంతో కొందరు అప్పట్లో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించినా... ఇందులో తప్పేమీ లేదని న్యాయస్థానం పేర్కొనటంతో టీడీపీ మరింతగా రెచ్చిపోయింది. లబ్ధిదారుల వివరాలు సైతం లేకుండా... ‘నచ్చినోళ్లకు నచ్చినంత..’ అనే రీతిలో సాగిన ఈ దుర్నీతిపై అప్పట్లో ‘ఈనాడు’ ఒక్క అక్షరం ముక్క రాస్తే ఒట్టు! రామోజీరావు ఒక్క ప్రశ్న సంధిస్తే ఒట్టు! వాస్తవమేంటంటే అప్పట్లా ఇప్పుడు వలంటీర్లకు పథకాలను మంజూరు చేసే అధికారమేదీ లేదు. వారు కేవలం సంధానకర్తలు. ప్రజల దరఖాస్తులను ప్రభుత్వ యంత్రాంగానికి అందజేయటం వరకే వారి పని. డాక్యుమెంట్ల ఆధారంగా అర్హతలను తేల్చేది పై స్థాయి అధికారులే. ఒకవేళ వలంటీర్లు తమకు పథకం దక్కకుండా చేస్తారనుకుంటే నేరుగా సచివాలయాలకే వెళ్లి దరఖాస్తు చేయొచ్చు. అయినా ఏ కారణం వల్లనైనా రాకపోతే... మళ్లీ దరఖాస్తు చేయొచ్చు. లబ్ధిదారుల సోషల్ ఆడిట్... పారదర్శకంగా పేర్లు సచివాలయాల్లో ప్రదర్శించటం... ఇదంతా వీసమెత్తు కూడా దాపరికం లేని వ్యవహారం. ఇక లబ్ధిదారులు ఎంపికయ్యాక వారికి ఆ పథకం ఫలాల్ని అందజేసే బాధ్యతను మాత్రం వలంటీర్లు తీసుకుంటున్నారు. అంటే వీరు ప్రజలకు– ప్రభుత్వానికి వారధి మాత్రమే. మరి ఈ రాతలెందుకు? వారికి సొంత రాజకీయ అభిప్రాయాలుండటం తప్పెలా అవుతుంది? దుష్ప్రచారానికి దారులు... సీఎం జగన్మోహన్రెడ్డి మొదట ఈ వలంటీర్ల ఆలోచనను బయటపెట్టి నియామకాల ప్రక్రియ మొదలుపెట్టినపుడు బాబు నానా యాగీ చేశారు. ఎల్లో దుమారం ఎక్కువే రేగింది. అసలు వీళ్ల అవసరమేంటి? అంటూ కథనాలు వండేసింది ఎల్లో ముఠా. కానీ వలంటీర్లు తమ సేవా భావంతో ప్రజలకు దగ్గరయ్యారు. కోవిడ్ సమయంలో ప్రపంచమంతా నివ్వెరపోయే పనితీరు కనబరచడంతో పాటు... పెన్షన్లు అందించటంలో కొత్త చరిత్ర లిఖించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరుస్తూ వారే బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. దీంతో ‘వలంటీర్ల గౌరవ వేతనం పెంపు’ పేరుతో వారిని రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసేలా పురిగొల్పింది టీమ్ ఎల్లో. అందులో కూడా సక్సెస్ కాలేక ... ఏకంగా వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలంటూ ఎన్నికల సంఘానికి తెలుగుదేశం నేతలే ఫిర్యాదు చేశారు. తరవాత వాళ్లను గూఢచారులుగా పేర్కొంటూ కొత్త ప్రచారానికి తెరతీశారు. ఇప్పుడేమో వాళ్లు వైఎస్సార్ సీపీ సమావేశాలకు హాజరవుతున్నారంటూ మరో వాదన తెచ్చారు. వలంటీర్లకు ఎన్ని బాధ్యతలో... ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించటంలో వలంటీర్ల వ్యవస్థ ఎండావానలను లెక్క చేయక... చలికి భయపడక అహర్నిశలూ పనిచేస్తున్నదనేది కాదనలేని వాస్తవం. 2019 జూన్ నుంచి ఈ వ్యవస్థ ప్రతి నెలా దాదాపు 62.5 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తోంది. కొత్త రైస్ కార్డులివ్వటంతో పాటు రైస్ కార్డులున్న వారందరికీ సేవలందిస్తోందీ వ్యవస్థ. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద కొత్త కార్డులు మంజూరు చేయటం... ఆరోగ్య శ్రీని ఉపయోగించుకోవటంపై అవగాహన కల్పించటం చేస్తోంది. ఇవే కాదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ కాపు నేస్తం, చేయూత, రైతు భరోసా, మత్స్యకార భరోసా, వైఎస్సార్ జలకళ, వాహనమిత్ర, నేతన్న నేస్తం, ఆసరా, వైఎస్సార్ బీమా, సంపూర్ణ పోషణ, ఉచిత పంటల బీమా, లా నేస్తం, రైతులకు సున్నా వడ్డీ, ఆరోగ్య ఆసరా, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న తోడు, రజకులు.. టైలర్లు... నాయీ బ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు, జీవ క్రాంతి, అమూల్ పాలవెల్లువ, కంటి వెలుగు, అమ్మ ఒడి... అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు ఒకసారి అందించే ఆర్థిక సాయం, పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాల మంజూరు, ఈబీసీ నేస్తం వంటి పదుల కొద్దీ పథకాల ఫలాలను అర్హులకు చేరుస్తున్నారు. ఈ తేడా కనిపించదా రామోజీ? ►బాబు హయాంలో జన్మభూమి కమిటీ సభ్యులంతా నామినేటెడ్ వ్యవహారమే. టీడీపీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఆ పార్టీ ఇన్‌ఛార్జీలే నామినేట్ చేసేశారు. అందులో కులమతాల పాత్రా అధికమే. కానీ జగనన్న సైన్యమైన వలంటీర్లను మాత్రం... దరఖాస్తులు స్వీకరించి, ఇంటర్వ్యూలు నిర్వహించి రిజర్వేషన్లు, రోస్టర్ ప్రకారం స్థానిక ఎంపీడీవోలే ఎంపిక చేశారు. అందుకే ప్రస్తుతం పనిచేస్తున్న 22.65 లక్షల మందిలో 82 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే!!. పైపెచ్చు వీరిలో సగానికి పైగా మహిళలే. వీరి సేవలను యునిసెఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. తమ అభివృద్ధి లక్ష్యాల కోసం వలంటీర్లతో కలిసి పనిచేస్తున్నాయి. ►బాబు హయాంలో జన్మభూమి కమిటీ సభ్యులు పూర్తిగా రాజకీయ నాయకుల్లానే పనిచేశారు. వలంటీర్లు మాత్రం సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో విధిగా హాజరు వేయించుకుంటున్నారు. జవాబుదారీతనంతో పనిచేస్తున్నారు. అందుకే ఈ సైన్యాన్ని చూసి బాబుకు వణుకు పుడుతోంది. ►రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడున్నర ఏళ్లలో దాదాపు రూ.3.5 లక్షల కోట్లను వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్దిదారులకు అందజేస్తే.. ఎక్కడా పైసా అవినీతి జరగకుండా ప్రతి పైసా నేరుగా లబ్ధిదారులకు చేరింది. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పథకాల్లో 15 శాతం కూడా పేదలకు సరిగా చేరని పరిస్థితి ఉండేది. కోవిడ్ సమయంలో ప్రపంచమే జేజేలు కొట్టింది... 2020 తొలినాళ్లలో ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి వణికిస్తున్నపుడు... దేశం యావత్తూ భయాందోళనలు నిండి, ఆసుపత్రులలో బెడ్లు సైతం దొరక్క విలవిలలాడినపుడు అందరికీ ఒక దిక్సూచిలా కనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. పక్క రాష్ట్రాల నుంచి కోవిడ్ రోగులు సైతం నిబంధనలను గాలికొదిలేసి మరీ ఏపీకి వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడకు వస్తే... ఇక భయం లేదని ప్రతి ఒక్కరూ భరోసా ఫీలయ్యారంటే... అది ఈ ప్రభుత్వం సృష్టించిన వలంటీర్ల వ్యవస్థ వల్లే సాధ్యమైందని వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే కోవిడ్ మహమ్మారికి భయపడి జనం ఇళ్లలోంచి బయటకు రావటానికే భయపడుతున్న సమయంలో... బయట తిరిగితే ప్రమాదమని తెలిసి కూడా వీరే సైన్యంగా పని చేశారు. ఇళ్లకు రోజువారీ సరుకులతో పాటు మందులు అందించటంతో పాటు 16 కోట్ల మాస్కుల్ని జనానికి అందజేశారు. పేదలకు ప్రత్యేక సాయంగా రూ.వెయ్యి చొప్పున అందించటంతో పాటు వ్యాక్సిన్లు త్వరగా అందేలా చూశారు. క్వారంటైన్ సెంటర్లలో సేవలందించటంతో పాటు రికార్డు స్థాయిలో 46 సార్లు ఫీవర్ సర్వే చేశారు. అన్నిటికన్నా ప్రధానం... కోవిడ్ మృతుల భౌతికకాయాలను దహనం చేయటంలోనూ సాయపడ్డారు. అలాంటి సేవలకు యావత్తు దేశం జైకొట్టగా... రామోజీరావు మాత్రం రాజకీయాలు అంటగడుతూ చెలరేగిపోతుండటం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదనే చెప్పాలి. ప్రభుత్వ విభాగాలకూ సహాయంగా... ►ఇవికాక వివిధ ప్రభుత్వ విభాగాలు సైతం వలంటీర్ల సేవలు ఉపయోగించుకుంటున్నాయి. సొంతిళ్లున్న వారిని ఆస్తిపన్ను చెల్లించమని అభ్యర్థిస్తున్న వలంటీర్లు... స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే, మనం మన పరిశుభ్రత, ఫ్రైడే–డ్రైడే, చెత్త పన్ను వసూలు... ఇలాంటి అంశాలన్నిటా వినియోగదార్లకు అవగాహన కల్పిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి విభాగానికి, పంచాయతీ రాజ్– గ్రామీణాభివృద్ధి విభాగానికి సహకరిస్తున్నారు. ►కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లో అర్హత ప్రమాణాలను విచారించడంలో వీఆర్వోలకు సహకరిస్తున్నారు. ►వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టే వ్యాక్సినేషన్ డ్రైవ్‌లకు, ఫీవర్ సర్వేలు, ఆరోగ్య సర్వేలకు వలంటీర్లే ఆధారం. ►వలంటీర్ల సాయం లేకుంటే ఆర్బీకే సిబ్బంది ఈ–క్రాప్ బుకింగ్‌కు రైతులను గుర్తించడం అంత తేలిక కాదు. ►ప్రత్యేక వాహనాల్లో రేషన్ బియ్యాన్ని ఇళ్ల వద్దకు తీసుకెళ్లి అందజేస్తున్న ఎండీయూ ఆపరేటర్లకు పూర్తి సహకారం వలంటీర్లదే. ►ఇక తుపానులు, భారీ ప్రమాదాలు జరిగినపుడు చాలా మంది వలంటీర్లు స్వచ్ఛంద సైనికుల్లా రంగంలోకి దూకి సేవలందిస్తున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన కోనసీమ వరదల్లో వలంటీర్ల సాయాన్ని అక్కడి ఏ వ్యక్తినడిగినా చెప్పకమానడు. ►మరి ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్న వలంటీర్లను రామోజీరావు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏదో ఒకలా వాళ్లను తమ విధులకు దూరం చేద్దామనా? ఈ రాష్ట్రంలో అర్హులకు పథకాలు అందకుండా చేసి... ప్రభుత్వానికి ఆ మకిలిని అంటిద్దామనా? ఇంతకన్నా ఘోరమైన కుట్ర ఉంటుందా రామోజీ? -
'రామోజీరావు ఈ వ్యవస్థను చూసి దేశం ఏమంటుందో తెలుసుకోవాలి'
సాక్షి, తాడేపల్లి: వాలంటీర్ వ్యవస్థపై పచ్చపత్రికల్లో అబద్దాలు, అవాస్తవాలు రాస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ప్రభుత్వం, ప్రజలకు మధ్యన వాలంటీర్లు వారధిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. అలాంటి వ్యవస్థపై రామోజీరావు తన పత్రికల్లో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను వివక్ష లేకుండా వాలంటీర్ల ద్వారా అందిస్తున్నాం. కులం, ప్రాంతం, పార్టీ చూడకుండా వాలంటీర్ వ్యవస్థ తెచ్చాము. వాలంటీర్ల రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా పూర్తి చేశాము. ఏ పార్టీ వారైనా అర్హత ఉంటే అవకాశం ఇచ్చాం. ఇందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, మహిళ రిజర్వేషన్లు అమలు చేశాము. రామోజీరావు ఈ వ్యవస్థ కోసం దేశం ఏమంటుందో తెలుసుకోవాలి. లబ్ధిదారులకు ఇంటికెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. టీడీపీ హయాంలో ఏ పథకమైన లంచం లేకుండా ఇచ్చారా?. జన్మభూమి కమిటీలు ఎలా లంచాలు తిన్నారో ప్రజలకు తెలియదా?. వాలంటీర్ వ్యవస్థను మా పార్టీకి వాడుకోవడం లేదు. మా పార్టీకి గ్రామ స్థాయి, బూత్ స్థాయి వరకు బలమైన వ్యవస్థ ఉంది. ప్రభుత్వ యంత్రగాన్ని పార్టీ కోసం వాడుకున్న చరిత్ర చంద్రబాబుదే. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్ల సేవలు ఎవ్వరు మరువలేరు అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. చదవండి: (ఏం ఖర్మో.. లీడర్లని మారుస్తున్నా.. అక్కడ పార్టీ తలరాత మారడంలే!) -
శభాష్ వలంటీర్
విశాఖపట్నం: గ్రామ వలంటీర్లు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. విధి నిర్వహణలో సేవా దృక్పథంతో వ్యవహరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఈక్రమంలోనే దేవరాపల్లి మండలం ఎన్. గజపతినగరం గ్రామానికి చెందిన వృద్ధురాలు పాసల రామయ్యమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నం గురుద్వార్‌లోని తన కుమార్తె దగ్గర ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక గ్రామ వలంటీర్ గండి స్వాతి తన సొంత ఖర్చులతో అక్కడకు చేరుకుని పింఛన్ సొమ్ము అందజేసింది. వలంటీర్ స్వాతిని గ్రామస్తులు అభినందించారు. విశాఖ కేజీహెచ్‌కు వెళ్లి... అదేవిధంగా చీడికాడ మండలం అర్జునగిరికి చెందిన జకిలింకి తాతయ్యలు అనారోగ్యంతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. వలంటీరు ఏ.సూర్యకాంతం అక్కడకు వెళ్లి నగదు అందించారు. చుక్కపల్లికి చెందిన కోటిబోయిన పైడితల్లమ్మ కంటి శస్త్ర చికిత్స చేసుకుని తూర్పుగోదావరి జిల్లా అత్తిలి మండలం పాలి గ్రామంలో బంధువుల ఇంటి వద్ద ఉంటోంది. గ్రామ వలంటీరు రాజు అక్కడకు వెళ్లి ఆమెకు పింఛన్ సొమ్ము అందించారు. సూర్యకాంతం, రాజులను ఆయా గ్రామాల సర్పంచ్‌లు బి.రమాదేవి, మజ్జి లక్ష్మణమ్మతోపాటు వైఎస్సార్సీపీ నేతలు కొవిలపల్లి పైడిబాబు, పరవాడ నాయుడు, మజ్జి దేవానంద్, బాయిశెట్టి వెంకటరమణ, వలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి అభినందించారు. -
సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
-
శభాష్ వలంటీర్!
నరసాపురం రూరల్/ కొయ్యలగూడెం: అనారోగ్యంతోనో, ప్రమాదానికి గురవడం వల్లో వివిధ ప్రాంతాల్లో ఉండిపోయిన లబ్ధిదారులకు వారివద్దకే వెళ్లి పింఛన్ల సొమ్ము అందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు పలువురు వలంటీర్లు. మండలంలోని లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన కట్టా కనకరాజు కల్లుగీత కార్మికుడు. ఇటీవల కల్లుగీతకు చెట్టెక్కి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజుకు స్థానిక వలంటీర్ గెద్దాడ శివకృష్ణ శుక్రవారం ఆస్పత్రికే వెళ్లి గీత కార్మిక పింఛను సొమ్ము అందజేశాడు. కష్టంలో ఉండగా అందించిన సొమ్ము తనకు ఎంతో ఉపయోగపడుతుందని నాగరాజు సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే కొయ్యలగూడెం మండలం పరింపూడి–2 సచివాలయ ఉద్యోగి సిరాజు తాను సైతం అంటూ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వెళ్లి పింఛను అందజేశాడు. పరింపూడికి చెందిన గాలంకి వెంకటేశం అనే వృద్ధుడు దేవరపల్లి వెళ్లి టైఫాయిడ్ జ్వరం వల్ల అక్కడే ఉండిపోయాడు. స్థానిక వలంటీర్ సెలవుపై ఉండటంతో వెంకటేష్ అనారోగ్యం గురించి తెలుసుకున్న సిరాజు శుక్రవారం 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరపల్లికి వెళ్లి ఆయనకు పింఛను అందజేశాడు. ఈ సందర్భంగా సిరాజును ఎంపీడీవో కేఆర్ఎస్ కృష్ణప్రసాద్ అభినందించారు. -
వివాహేతర సంబంధం.. వాకిలి ఊడుస్తుండగా ఇంట్లోకి పిలిచి..
చావలి (వేమూరు)గుంటూరు జిల్లా: ప్రియుడి చేతిలో గ్రామ వలంటీర్ దారుణ హత్యకు గురైన ఘటన గుంటూరు జిల్లా చావలి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చావలిలోని దళితవాడకు చెందిన దొప్పలపూడి శారద (25)కు అదే గ్రామానికి చెందిన మద్దా పద్మారావుతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. శారద ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇంటి వాకిలి ఊడుస్తుండగా పద్మారావు ఆమెను ఇంట్లోకి పిలిచి కత్తితో మెడ కోశాడు. చదవండి: నువ్వే లేకుంటే నేనెందుకని.. అనంతరం అదే కత్తితో గుండె పైనుంచి పొట్ట భాగం వరకు చీరేశాడు. ఆమె పొట్టలోంచి పేగులు బయటకు రాగా.. శారద రెండు చేతులతో వాటిని పట్టుకుని అరుస్తూ రోడ్డుపైకి వచ్చి పడిపోయింది. స్థానికులు 108కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చే సమయానికి శారద మృతి చెందినట్లు ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపారు. హతురాలు చావలి గ్రామ సచివాలయం ఒకటో వార్డు వలంటీర్‌గా పని చేస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త ధర్మారావు ఇంట్లోలేని సమయంలో ఈ ఘటన జరిగిందని ఎస్ఐ తెలిపారు. పద్మారావును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామన్నారు. -
వలంటీర్ల సేవలకు సలాం.. జగనన్న చిరు సత్కారం (ఫొటోలు)
-
సేవా భావానికి సెల్యూట్: సీఎం వైఎస్ జగన్
సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలోని వలంటీర్ వ్యవస్థ వైపు.. ఇప్పుడు దేశం మొత్తం చూడడం గర్వంగా ఉందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన వలంటీర్లకు వందనం కార్యక్రమ సభలో పాల్గొని.. వలంటీర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కొత్తగా ఏర్పాటైన పల్నాడు జిల్లా.. అందునా జిల్లా కేంద్రం నరసరావుపేట నుంచి వలంటీర్ వ్యవస్థ అనే సేవా భావానికి సెల్యూట్ చేస్తున్నామని చెప్పారు సీఎం వైఎస్ జగన్. వివక్ష, లంచం, అవినీతిలకు తావులేకుండా, కులమతరాజకీయాలను పట్టించుకోకుండా ఒక వ్యవస్థ కోసం కల గన్నామని, వలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ కల సాకారమైందని ప్రశంసించారు సీఎం జగన్. వలంటీర్ వ్యవస్థ దేశంలోనే గొప్ప వ్యవస్థగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. లాభాన్ని పట్టించుకోకుండా.. సేవే పరమావధిగా వలంటీర్లు ముందుకు సాగుతున్నారంటూ గుర్తు చేశారు సీఎం జగన్. వలంటీర్ వ్యవస్థ ద్వారా 33 రకాల సేవలను ప్రతీ ఇంటికి అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2 లక్షల 60 వేలమంది వలంటీర్లు.. లక్షల మందికి పైగా లబ్ధిదారులకు సేవలు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు సీఎం జగన్. ఏ పథకమైనా వివక్షకు తావు లేకుండా వలంటీర్లు సేవలు అందిస్తున్నారని, వలంటీర్లు అంటే గొప్ప సైనికులు, గొప్ప సేవకులని ప్రశంసలు గుప్పించారు. ఈ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం తరపున చిరుసత్కారం అందజేస్తున్నామని చెప్పారు సీఎం వైఎస్ జగన్. -
సీఎం వైఎస్ జగన్ నరసరావుపేట పర్యటన
-
సీఎం జగన్ నరసరావుపేట పర్యటన.. అప్డేట్స్
అప్డేట్స్: 1.10PM రాష్ట్రంలో 2,33,333 మందికి రూ. 232 కోట్ల నగదు పురస్కారాలు.. బటన్ నొక్కి నగదు విడుదల చేసిన సీఎం జగన్ 1.00PM నరసరావుపేటకు పాలిటెక్నిక్, ఆటో నగర్, ఫ్లైఓవర్లు మంజూరు చేసిన సీఎం జగన్ 12.20PM వలంటీర్లకు వందనం. వలంటీర్ల మహా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నా. దేశం మొత్తం మనవైపు చూసేలా వలంటీర్ల వ్యవస్థ: సీఎం జగన్.రాష్ట్రంలో 2లక్షల 60వేలకు మందికి పైగా వలంటీర్లు ఉన్నారు. లంచాలకు తావులేని వ్యవస్థ తీసుకురావాలనేది మా సంకల్పం. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా పాలన. ఏ పథకమైనా వివక్షకు తావు లేకుండా వలంటీర్లు సేవలు. వలంటీర్లు చేస్తున్నది ఉద్యోగం కాదు.. గొప్ప సేవ. - సీఎం జగన్ 12.10PM ► రావిపాడు గ్రామ వలంటీర్ రజిత ప్రసంగం. వలంటీర్లు అందరి తరపున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేసిన రజిత. ఏపీలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గొప్పదనం గురించి.. వాటి వల్ల లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాల గురించి వివరించిన వలంటీర్ రజిత. 12.05PM ► సీఎం వైఎస్ జగన్ పాలనలో వలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్దిదారులకు అందుతున్న సేవల గురించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభా ప్రాంగణంలో చదివి వినిపించారు. 12.03PM ► ప్రజాసేవకు రాజకీయ అనుభవం అక్కర్లేదని.. సంకల్పం, ప్రజాసంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే సీఎం జగన్ లాంటి నేత రాష్ట్రానికి ఉంటే సరిపోతుందని ప్రసంగించారు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అహర్నిశలు శ్రమిస్తూ వలంటీర్లు ప్రజలకు సేవల్ని అందిస్తున్నారంటూ ఉదాహరణలతో సహా ప్రశంసలు గుప్పించారు ఆయన. 11.48 AM ► వలంటీర్ వ్యవస్థ గురించి స్పెషల్ ఏవీ(ఆడియో విజువల్) ప్రదర్శన. 11.46 AM ► ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వలంటీర్లే వారధులన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్. 11.42 AM ► పెన్షన్ సహా ప్రతీ సేవల్ని ప్రజల ముంగిట చేరుస్తున్న వలంటీర్ల సేవలను కొనియాడిన అధికారులు. ► లాక్డౌన్ టైంలోనూ సమర్థవంతంగా విధులు నిర్వహించిన వలంటీర్లపై ప్రత్యేక ప్రశంసలు. 11.36 AM ► నరసరావుపేటలో కాసు వెంగళరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ ► నరసరావుపేట, పల్నాడు జిల్లాలో వలంటీర్లకు సత్కార కార్యక్రమం. ► వలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా.. మూడు కేటగిరీల్లో పురస్కారాలను అందించనున్న సీఎం జగన్. ► అన్ని నియోజకవర్గాల్లో పండుగ వాతావరణం నడుమ వలంటీర్లకు అవార్డుల ప్రదానం. 11.26 AM ► సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న సీఎం జగన్.. అధికారులతో ఆత్మీయ పలకరింపు. 10.57 AM ► వలంటీర్ల అవార్డుల ప్రదాన కార్యక్రమం, బహిరంగ సభలో భాగంగా.. నరసరావుపేట చేరుకున్న సీఎం వైఎస్ జగన్. 10.42AM ► నరసరావుపేట బయలుదేరిన సీఎం జగన్. సీఎం వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీరంగనాథరాజు ఉన్నారు. ► గ్రామ, వార్డు వలంటీర్ల సేవలకు సలాం అంటున్న ఏపీ ప్రజానీకం. నరసరావుపేటలో వలంటీర్లకు వందనం కార్యక్రమం. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ఏపీ వ్యాప్తంగా వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆరంభంలో దీనిపై తీవ్ర విమర్శలు చేసిన వారు సైతం.. ఇప్పుడు అభినందించేలా వలంటీర్లు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు. అందుకే వాళ్ల సేవలకు ప్రోత్సాహకంగా ఇవాళ పల్నాడు నర్సరావుపేటలో నిర్వహించబోయే బహిరంగ సభలో సీఎం జగన్ సత్కరించనున్నారు. ► వరుసగా రెండో ఏడాది గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు అవార్డులు ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. ► మొత్తం 2, 33, 333 మంది వలంటీర్లకు.. రూ.239.22 కోట్ల నగదు పురస్కారాలు. ► సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు, పింఛన్ల పంపిణీ, కరోనా థర్డ్ వేవ్‌లో ఫీవర్ సర్వే తీరు అంశాల ఆధారంగా వలంటీర్లకు పాయింట్లు కేటాయించి మూడు విభాగాల్లో అవార్డులు అందించనున్నారు. ► సేవా వజ్ర, సేవా రత్నతో పాటు కనీసం ఒక ఏడాది పాటు బాధ్యతగా పనిచేస్తూ విధి నిర్వహణలో ఎలాంటి ఫిర్యాదు లేనివారికి సేవా మిత్ర అవార్డు అందించనున్నారు. ► స్టేడియం వద్దకు చేరుకుని బహిరంగసభలో పాల్గొని.. వలంటీర్లను సత్కరిస్తారు. ► పీఎన్సీ కళాశాల వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ► తాడేపల్లి నుంచి ముందుగా.. నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంటారు. ► ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ (గురువారం) పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పర్యటించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గ్రామ వలంటీర్లకు ప్రమాద బీమా
రాజానగరం: ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సకాలంలో చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ వలంటీర్లకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కంపూడి రాజా సొంత డబ్బుతో ప్రమాద బీమా కల్పించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్నంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చేవూరి హరికిరణ్ రాజానగరంలో శనివారం ప్రారంభించారు. వలంటీర్లకు బీమా బాండ్లు అందజేశారు. నియోజకవర్గంలోని సీతానగరం మండలం వంగలపూడి గ్రామ వలంటీర్ కోడెల్లి నీలారాణి గత నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అటువంటి దుస్థితి మరో వలంటీర్ కుటుంబానికి ఎదురు కాకూడదనే ఆలోచనతో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ ప్రమాద బీమా పథకానికి అంకురార్పణ చేశారు. ఈ పథకం ద్వారా సీతానగరం, కోరుకొండ, రాజానగరం మండలాల్లో 1,475 మంది గ్రామ వలంటీర్లకు ప్రమాద బీమా కల్పిస్తున్నారు. ఇందుకుగాను బీమా కంపెనీకి చెల్లించాల్సిన ప్రీమియాన్ని జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ చెల్లిస్తుంది. వలంటీర్లకు మనోధైర్యాన్ని అందించడంలో ఈ ప్రమాద బీమా పథకం అత్యుత్తమంగా నిలుస్తుందని కలెక్టర్ కొనియాడారు. పథకం ద్వారా ప్రమాదవశాత్తు్త మరణించినా లేదా అంగవైకల్యం ఏర్పడినా వలంటీర్లకు రూ.లక్ష పరిహారం అందుతుంది. అవయవాన్ని కోల్పోతే రూ.50 వేల పరిహారం ఇస్తారు. -
సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందొద్దు
సాక్షి, అమరావతి: ప్రొబేషన్ ప్రకటనపై గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆందోళన, అపోహలకు గురికావద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మానస పుత్రిక సచివాలయ వ్యవస్థ అని, అందులో పనిచేసే ఉద్యోగులపై ఆయనకు ఎంతో అభిమానం ఉందని చెప్పారు. శనివారం విజయవాడలోని ఎన్జీఓ హోమ్‌లో పలు ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశంలోనే ఆదర్శవంతమైందని చెప్పారు. దీన్ని చూసి పలు రాష్ట్రాలు ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలను వేగంగా ప్రజలకు చేరవేయడంలో సచివాలయ ఉద్యోగులది కీలక పాత్ర అని చెప్పారు. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ప్రక్రియను జూన్‌లోపు పూర్తి చేసి జులై నుంచి పే స్కేల్స్ ఇస్తామని సీఎం ప్రకటించారని తెలిపారు. కొందరు ఉద్యోగులు గత అక్టోబర్ 2 నుంచే పే స్కేల్స్ అమలు చేయాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, వారంతా సంయమనం పాటించాలని కోరారు. అందరికీ ఒకేసారి ప్రొబేషన్ ప్రకటించి, ఆ తర్వాత పే స్కేల్స్ అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. 23 శాతం ఫిట్మెంట్ వల్ల జీతాలు తగ్గుతాయనే ప్రచారం సరికాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయని చెప్పారు. ఇలాంటి తరుణంలో కూడా ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం గొప్ప విషయమని తెలిపారు. ఎవరూ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదు: జానీ బాషా గ్రామ సచివాలయ ఉద్యోగులెవరూ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జానీ బాషా చెప్పారు. ప్రొబేషన్‌పై సీఎం న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. అక్టోబర్ 2 నుంచి పే స్కేల్ ఇవ్వాలని కోరుతున్నామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు. దీని వెనుక కొన్ని శక్తులు ఉన్నట్లు అనుమానం ఉందన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే కాదని అన్నారని, వారిని పీఆర్సీలో చేర్చడం ద్వారా ఇలాంటి అనుమానాలు పోయాయని తెలిపారు. -
కొత్త పే స్కేలు.. ఉద్యోగ భద్రత
సాక్షి, అమరావతి: రెండేళ్ల క్రితం రికార్డు స్థాయిలో ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న లక్ష మందికిపైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మరో కల కూడా నెరవేరబోతుంది. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారికి ఈ ఏడాది జూన్ 30లోగా ప్రొబేషనరీ ప్రకటించి పే స్కేల్ వర్తింపజేస్తామంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తమవుతోంది. ప్రొబేషనరీ పూర్తి చేసుకున్నట్లు ప్రకటన తర్వాత ప్రస్తుతం రూ.15 వేల చొప్పున నెల వారీ జీతం అందుకుంటున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్ణీత పే స్కేలు పరిధిలోకి వస్తారు. దీనికి తోడు వారంతా ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే పూర్తి స్థాయి ఉద్యోగ భద్రతను పొందడంతో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తారని అధికార వర్గాలు వివరించాయి. విధి నిర్వహణలో ఉద్యోగి మరణించిన పక్షంలో ఆ కుటుంబంలో మరొకరికి ఉద్యోగం దక్కే అవకాశం కూడా ఉంటుంది. నాలుగు నెలల్లో 1.34 లక్షల ఉద్యోగాలు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజునే వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల్లో నియామకాలపై ప్రకటన చేశారు. ప్రమాణ స్వీకార సభలో ప్రకటించిన విధంగా అప్పటికప్పుడు 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను స్పష్టించారు. జూలైలో నోటిఫికేషన్.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి రాత పరీక్షలు... 20 రోజుల్లో ఫలితాల ప్రకటన.. ఆ తరువాత మరో వారం రోజుల్లో ఎంపికైన వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం కూడా పూర్తయింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే దాదాపు లక్ష మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి. మొదటి విడతలో మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి 2020 ఆరంభంలో తిరిగి నోటిఫికేషన్ జారీ చేసి ఆ ఏడాది చివరి కల్లా రెండో దశ నియామక ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారు తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటన మేరకు జూన్ నెలాఖరు కల్లా ప్రొబేషనరీని కూడా పూర్తి చేసుకోబోతున్నారు. -
ఏం కష్టం వచ్చిందో పాపం.. బిడ్డలను అనాథలు చేసింది
తూర్పు గోదావరి: సంధిపూడికి చెందిన వలంటీర్ పిల్లా సుశీల(28) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఆలమూరు ఎస్సై ఎస్.శివప్రసాద్ కథనం ప్రకారం... స్థానిక ఎస్సీపేటలో నివాసముంటున్న సుశీల, ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. కొద్దిసేపటికి తరువాత చిన్నారులిద్దరూ ఇంట్లోకి వచ్చి చూసి ఆ విషయాన్ని బయటకు చెప్పడంతో స్థానికులు వచ్చే సరికే సుశీల మృతి చెంది ఉంది. దీనిపై మృతురాలు తండ్రి రాజానగరం మండలం కొండగుంటరుకు చెందిన మెల్లెం తుక్కయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేయగా మండపేట రూరల్ సీఐ పి.శివగణేష్ దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను అన్ని కోణాల్లో విచారించి కేసును త్వరితగతిన చేధిస్తామని పోలీసులు తెలిపారు. మృతురాలు సుశీలకు భర్త వీర్రాజుతో పాటు ఇద్దరు కువ కేసును త్వరితగతిన చేధిస్తామని పోలీసులు తెలిపారు. మృతురాలు సుశీలకు భర్త వీర్రాజుతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కోవిడ్ కట్టడిలో వలంటీర్లు, ఏఎన్ఎంల పాత్ర కీలకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 కట్టడి, వ్యాప్తి నియంత్రణలో గ్రామ, వార్డు వలంటీర్లు, ఏఎన్ఎంలు కీలకపాత్ర పోషించారని నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక ప్రశంసించింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కోవిడ్–19 పట్ల అవగాహన కల్పించడంతో పాటు స్వల్ప లక్షణాలున్న వారిని హోమ్ ఐసొలేషన్‌లో ఉంచడంలో వలంటీర్లు ప్రధాన భూమిక పోషించారని పేర్కొంది. రాష్ట్రంలో సమగ్ర హోమ్ ఐసొలేషన్ వ్యవస్థను బాగా నిర్వహించారని కితాబిచ్చింది. గ్రామాల్లో కోవిడ్ లక్షణాలున్న వారిని గుర్తించడం, వారికి పరీక్షలు చేయించడం, హోమ్ ఐసొలేషన్‌లో ఉంచి పర్యవేక్షించడంలో ఏఎన్ఎంలు, వలంటీర్ల కృషి బాగుందని తెలిపింది. కోవిడ్–19 రెండు వేవ్‌లలో వివిధ రాష్ట్రాలు అనుసరించిన హోం ఐసొలేషన్ ఉత్తమ పద్ధతులను నీతి ఆయోగ్ నివేదిక వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర హోం ఐసొలేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు నివేదిక తెలిపింది. నివేదికలో ఇంకా ఏం పేర్కొన్నారంటే.. ► కోవిడ్–19 లక్షణం లేదా స్వల్పంగా రోగలక్షణాలున్న వారికి ఏఎన్ఎంల సహాయంతో గ్రామ, వార్డు వాలంటీర్లు అవగాహన కల్పించడంతో పాటు వారి పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు. ► ఇంట్లో రోగులకు వారి లక్షణాలను ఎలా స్వయంగా పర్యవేక్షించాలనే దానిపై అవగాహన కల్పించడంతో పాటు గృహ సంరక్షణ వస్తు సామగ్రి (ఔషధాలతో సహా) రోగులకు అందించారు. రాష్ట్రం హోమ్ ఐసొలేషన్ సహాయాన్ని కూడా ఏర్పాటు చేసింది. ► అత్యవసర పరిస్థితుల్లో డెస్క్‌లు, ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. ► తేలికపాటి లక్షణాలున్న రోగులకు కోవిడ్–19కి పరీక్షలు చేయించారు. ► లక్షణం లేనివారు, స్వల్పంగా రోగలక్షణాలు ఉన్నవారు ఇంట్లో ఒంటరిగా ఉండాలని సూచించారు. అనుభూతి చెందుతున్న వ్యక్తులు అనారోగ్యం, జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలను కలిగి ఉండటం లేదా ముక్కు, గొంతు నొప్పి ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, ఒంటరిగా ఉండాలని సూచించారు. ► అటాచ్డ్ బాత్రూమ్తో కూడిన ప్రత్యేక గది ఉండేలా చూసుకోవాలని సూచించారు. ► ఒక దూతగా వ్యవహరించగల కేర్‌టేకర్.. సంరక్షకులుగా వ్యవహరించాలని సూచించారు ► 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు వైద్యుల ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉండటానికి అనుమతించారు. ► హెచ్ఐవీ, అవయవ మార్పిడి, క్యాన్సర్ రోగులు.. చికిత్స చేసే వైద్యుడి సూచన మేరకు మాత్రమే హోమ్ ఐసొలేషన్‌ను అనుసరించాలని సూచించారు. ► రోగుల పరీక్ష ఫలితాలు నోటిఫై చేసిన తరువాత వారిని ఏఎన్ఎంలు, గ్రామ, వార్డు వలంటీర్లు సంప్రదించారు. ► రోగుల ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోవడంతో పాటు హోమ్ ఐసొలేషన్ కిట్లు (జ్వరం, జలుబుకు చెందిన ఔషధాలతో కూడిన కిట్, మాస్కులు) పంపిణీ చేశారు. ► తూర్పు గోదావరి జిల్లాలోని ఆస్పత్రులపై భారం తగ్గించేందుకు జిల్లా అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు. ► గ్రామాల్లో ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► గ్రామాల్లో చాలామందికి తేలికపాటి లక్షణాలున్నా.. స్థలం లేకపోవడంతో ఇళ్లల్లో ఉండలేకపోయే వారిని గుర్తించి ఐసొలేషన్ కేంద్రాల్లో చేర్చి ఇంట్లో వండిన ఆహారాన్ని అందించారు. ► సర్పంచ్‌లు లేదా వలంటీర్ల ద్వారా ఆహారం అందించడంతో పాటు గ్రామ కార్యదర్శులు పర్యవేక్షిస్తూ ప్రథమ చికిత్స అందించారు. అవసరాన్ని బట్టి వైద్య సహాయం ఏర్పాటు చేశారు ► కోవిడ్ కేర్ కేంద్రాల్లో మందులు, ఆక్సిజన్ వంటి అవసరమైన వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. ► కోవిడ్ కేర్ కేంద్రాల్లో రోగులకు ఆహార సదుపాయాలు కల్పించారు. కోవిడ్ కేంద్రాలను డాక్టర్లు రోజుకు మూడుసార్లు సందర్శించారు. ► అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. రోగులను క్రమం తప్పకుండా పర్యవేక్షించారు. ► ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయిలు పరీక్షిస్తూ ఆక్సిజన్ 94 కంటే తక్కువగా ఉన్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా వెంటనే వైద్యులకు సమాచారం అందించడమే కాకుండా వారిని వెంటనే ఆస్పత్రికి పంపించారు. ► మెడికల్ సపోర్ట్, మానిటరింగ్ కింద ఉంచిన వ్యక్తులను గుర్తించడానికి కోవిడ్–19 హెచ్చరిక ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. 8 ఇంట్లో విడిగా ఉంచడం, టెలికమ్యూనికేషన్స్ సాంకేతిక సహాయంతో దీన్ని నిర్వహించారు. ► సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్‌ఫామ్‌లు, మొబైల్ టవర్ సిగ్నల్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ద్వారా పాజిటివ్ కేసులను, వారి పరిచయాలను మ్యాప్ చేశారు. ► అత్యవసర పరిస్థితుల్లో హోమ్ ఐసొలేషన్స్కు హెల్ప్ డెస్క్, ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. -
విషాదం: తెల్లవారితే పెళ్లి అంతలోనే ఆస్పత్రి పాలై..
సాక్షి, పెదకూరపాడు: అతను గ్రామ వలంటీర్.. పెళ్లి నిశ్చయమైంది. కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజిగా ఉన్నారు.. ఒకసారిగా జ్వరం, వాంతులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఇరువైపుల పెద్దలు పెళ్లిని ఈనెల 20వ తేదీకి వాయిదా వేసుకున్నారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగంగుంట్ల గ్రామానికి చెందిన రావెల నాగచైతన్య(26) గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి నరసరావుపేటకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 14న పెళ్లి ముహూర్తం. రెండు రోజులుగా చైతన్య జ్వరంతో బాధపడుతున్నాడు. సాధారణ జ్వరంగా భావించిన అతను పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి ముందు రోజు ఒకసారిగా జ్వరం తీవ్రం కావడంతోపాటు వాంతులు అవుతుండడంతో గుంటూరు ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. డెంగీతోపాటు కామెర్ల లక్షణాలు ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. చదవండి: (16 రోజుల కిందట వివాహం.. నవ వధువు చైతన్య ఆత్మహత్య) పెళ్లి ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు తండ్రి శివయ్య కూడా పదిరోజుల నుంచి డెంగీ లక్షణాలతో బాధపడుతూ గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాల నందు చికిత్స పొంది పెళ్లికి నాలుగు రోజుల ముందుగా డిశ్చార్జీ అయి ఇంటికి వచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. నాగచైతన్య తల్లి వెంకాయమ్మ అంగవైకల్యంతో ఇబ్బందులు పడుతుంది. ఒక కుమారుడు కావడంతో పెళ్లిని ఘనంగా నిర్వహించాలనుకున్నారు. పలు శాఖల ప్రభుత్వ అధికారులు, రాజకీయపార్టీ నేతలు నాగచైతన్యకు నివాళులర్పించారు. -
ఓటమి భయం.. టీడీపీ నేతల బెదిరింపుల పర్వం
సాక్షి, తిరుపతి: ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ ఓటమి భయంతో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ అభ్యర్థులు, కార్యకర్తలు, వలంటీర్ల ఇంటికి వెళ్లి బెదిరింపులకు దిగుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ వలంటీర్లకు ఫోన్లు చేసి హెచ్చరిస్తున్నారు. 24వ వార్డు వలంటీర్ గాయత్రి నివాసానికి వెళ్లి వైఎస్సార్ సీపీ తరఫున డబ్బులు పంచుతున్నావంటూ ఆమెతో గొడవకు దిగారు. తనకేమీ సంబంధం లేదన్నా వినకుండా టీడీపీ శ్రేణులు గుంపుగా నివాసంలోకి చొరబడి తీవ్రస్థాయిలో హెచ్చరించడమే కాకుండా, మరోసారి తమకు ఏదేని సమాచారం వస్తే పరిస్థితి వేరేలా ఉంటుందంటూ తీవ్రస్థాయిలో బెదిరించారు. చదవండి: Kuppam: డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేతలు వలంటీర్ ప్రాధేయపడుతున్నా వారు లెక్కచేయలేదు. అలాగే, క్రియాశీలక వైఎస్సార్ సీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తిరిగే అంతు చూస్తామని, ఎవరికైనా చెబితే ఇబ్బందులు తప్పవంటూ ఫోన్ చేసి దూషిస్తూ వార్నింగ్ ఇస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓట్లు రాకపోతే పరిస్థితి వేరేవిధంగా ఉంటుందంటూ నేరుగానే దౌర్జన్యాలకు దిగుతున్నారు. మరికొందరు కార్యకర్తల కదలికలపై టీడీపీ శ్రేణులు నిఘా పెట్టినట్లు సమాచారం. చదవండి: త్వరలో టీడీపీ కనుమరుగు: అంబటి రాంబాబు -
Road Accident: వలంటీర్‌కు అత్యవసర వైద్యసేవలందించిన ఎమ్మెల్యే
సాక్షి, అనపర్తి: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ప్రభుత్వాసుపత్రికి చేరిన క్షతగాత్రురాలికి అత్యవసర వైద్యాన్ని అందించి వైద్యో నారాయణో హరి అన్న ఆర్యోక్తికి నిదర్శనంగా నిలిచారు ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి. స్థానిక గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ అధినేతగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ రూ.10 వైద్యునిగా ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి పేరొందారు. వైద్యుడిగా తన ధర్మాన్ని పాటిస్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ప్రభుత్వాసుపత్రిలో చేరిన వలంటీర్‌కు అత్యవసర వైద్య సేవలు అందించటం ద్వారా తన వృత్తి ధర్మాన్ని చాటారు. వివరాల్లోకి వెళితే అనపర్తి గ్రామ సచివాలయం–4లో వలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న పి.సంధ్య ఆదివారం రాత్రి మండలంలోని లక్ష్మీనరసాపురం సమీపంలో రోడ్డు ప్రమాదానికై గురైంది. ఈ ప్రమాదంలో ఆమె కుడిచేయి మీద నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో చేతి మణికట్టు భాగం నుజ్జయ్యింది. దీంతో ఆమెను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చదవండి: (చీరమేను: ఆహా అద్భుత రుచి.. తినండి మైమరిచి..) అయితే ఈ సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రురాలి బంధువుల ద్వారా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి హుటాహుటిన సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి సంధ్యకు అత్యవసర వైద్య సేవలు అందించి మెరుగైన వైద్యం నిమిత్తం ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ సైతం అందుబాటులో లేకపోవడం, సిబ్బంది సకాలంలో స్పందిచకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటిండెంట్ జి.వరలక్ష్మికి ఫోన్ చేసిన ఎమ్మెల్యే ఇటువంటివి పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. -
వలంటీర్ ఆదర్శం: ఒడిశా వెళ్లి పింఛన్ అందజేసి..
నందిగాం: సామాజిక పింఛన్ల పంపిణీలో గ్రామ వలంటీర్లు కీలకభూమిక పోషిస్తున్నా రు. సుదూర ప్రాంతాల్లో ఉంటున్న పింఛన్ లబ్ధిదారుల వద్దకే వెళ్లి డబ్బులు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నందిగాం మండ లం సైలాడ పంచాయతీ రౌతుపురం గ్రామానికి చెందిన నొక్కు రామారావు వలస కార్మి కుడుగా ఒడిశాలోని కాశీనగర్‌లో కూలీ పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల అనారోగ్యానికి గురై కాశీనగరన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరాడు. అతను ఆర్థిక ఇబ్బందు లు పడుతున్నట్టు తెలుసుకున్న గ్రామ వలంటీర్ టి.కృష్ణ కాశీనగర్ ఆస్పత్రికి బుధవారం వెళ్లి ప్రభుత్వం సమకూర్చిన వృద్ధాప్య పింఛన్‌ను అందజేశాడు. దీంతో రామారావు వలంటీర్ కృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశాడు. -
48.63 లక్షల మందికి రూ.1,157 కోట్ల పింఛన్
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వలంటీర్లు సెలవు రోజు అయినా.. ఆదివారం తెల్లవారుజాము నుంచే పింఛన్లు పంపిణీ చేశారు. ఠంచన్‌గా ఒకటో తేదీ తెల్లవారకముందే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి డబ్బులు అందజేశారు. రాత్రి 8 గంటల సమయానికి 48,63,732 మందికి రూ.1,157.74 కోట్లు పంపిణీ చేశారు. రాత్రి వేళ కూడా ఇంకా పంపిణీ కొనసాగుతున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలనసంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 60.50 లక్షల మంది పింఛనుదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.1,455 కోట్లు విడుదల చేసింది. సాంకేతిక కారణాల వల్ల కొన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు పాక్షిక మొత్తంలో డబ్బులు చేరినట్టు అధికారులు గుర్తించారు. దాదాపు రూ.90 కోట్లు సకాలంలో క్షేత్రస్థాయికి చేరలేదని గుర్తించినట్టు సెర్ప్ అధికారులు తెలిపారు. ఆయా వార్డుల్లో కూడా ఆదివారం పింఛన్ల పంపిణీ కొనసాగినట్టు చెప్పారు. సెలవు రోజు అయినా, కొన్నిచోట్లకు సకాలంలో పూర్తి డబ్బు చేరకపోయినా ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా 80.4 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ పూర్తయినట్టు తెలిపారు. పింఛన్ల పంపిణీ తీరును సెర్ప్ సీఈవో ఇంతియాజ్ స్వయంగా పరిశీలించారు. గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో ఆయన పర్యటించి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమ, మంగళవారాల్లో ఈ పంపిణీ కొనసాగనుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ వెళ్లి డయాలసిస్ పేషెంట్‌కు.. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న డయాలసిస్ పేషెంట్ వద్దకు వలంటీర్లు వెళ్లి పింఛను సొమ్ము అందించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం ఖాజీగూడేనికి చెందిన డయాలసిస్ పేషెంట్ కుమ్మరి శ్యాంసన్‌రాజు డయాలసిస్ పేషెంట్ కావడంతో ప్రభుత్వం రూ.10 వేల పింఛను మంజూరు చేసింది. కరోనా బారిన పడి చికిత్స పొందిన అతడికి తరువాత బ్లాక్‌ఫంగస్ రావడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. గత రెండునెలలు పింఛను తీసుకోకపోవడంతో ఈసారి తీసుకోకపోతే పింఛను రద్దయ్యే ప్రమాదముందని స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు అక్కినేని రాజశేఖర్ వలంటీర్లను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ వెళ్లి అతడికి పింఛను ఇచ్చి రావాలని సూచించి, ప్రయాణ ఖర్చులకు తన సొంత సొమ్ము ఇచ్చారు. దీంతో వలంటీర్లు హైదరాబాద్ వెళ్లి 3 నెలల పింఛన్ సొమ్ము రూ.30 వేలు శ్యాంసన్‌రాజుకు అందజేశారు. – పెదపాడు (దెందులూరు), పశ్చిమ గోదావరి జిల్లా విజయనగరంలో చికిత్స పొందుతున్న రాబంద గ్రామానికి చెందిన వృద్ధుడికి పింఛన్ ఇస్తున్న వలంటీర్ నిర్మల జిల్లా సరిహద్దులు దాటి.. అనారోగ్యంతో బాధపడుతున్న పింఛను లబ్ధిదారుకు జిల్లా దాటివెళ్లి మరీ పింఛను అందజేశారు వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని వలంటీరు. కడప నగరం నకాష్ వీధికి చెందిన పీరాన్ బీ (85) అనారోగ్యంతో బాధపడుతోంది. నడవలేని ఆమె ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సీతారామపురంలో కుమార్తె ఇంటివద్ద ఉంటోంది. రెండు నెలలుగా పింఛను తీసుకోలేకపోయిన ఆమె పరిస్థితిని తెలుసుకున్న వలంటీరు షేక్ అబ్దుల్ ఖాదర్ ఆదివారం సీతారాంపురం వెళ్లి పింఛను మొత్తాన్ని అందజేశారు. – కడప కార్పొరేషన్ -
శభాష్ వలంటీర్: బెంగళూరు వెళ్లి బీమా..
కురబలకోట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తిస్తున్నారు. కురబలకోట మండలం భద్రయ్యగారిపల్లె గ్రామ వలంటీర్ వేపలపల్లె దయ్యాల కిరణ్ కుమార్‌రెడ్డి తన పరిధిలోని వారు కొందరు బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకున్నారు. గురువారం వారి వద్దకు వెళ్లి.. బీమా ఈకేవైసీ చేశాడు. తమ కోసం గ్రామ వలంటీర్ బెంగళూరు వచ్చి వైఎస్సార్ బీమా నమోదు చేయడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం దాటిన వలంటీర్ల సేవలు ► ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పింఛన్‌దారులకు మూడు నెలల నగదు అందజేత చీరాల టౌన్: అభాగ్యుల పాలిట వలంటీర్ వ్యవస్థ ఆశా దీపంగా మారుతున్నది. వరుసగా మూడో నెలకూడా పింఛన్ తీసుకోకపోతే కార్డు రద్దయ్యే ప్రమాదం ఉండడంతో వార్డు వలంటీర్లు చొరవ చూపిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వలంటీర్లు షేక్.నాగూర్‌బాబు, కె.గోపి మూడు నెలల పింఛన్‌ను ఒకేసారి చెల్లించడంతో సంబంధిత వ్యక్తులు హర్షం వ్యక్తం చేశారు. చీరాల బోస్ నగర్‌కు చెందిన కె.అంజలీకుమారి ఊపిరితిత్తుల వ్యాధితో చెన్నై పెరంబూర్‌లోని గ్లోబల్ హాస్పిటల్లో మూడు నెలల నుంచి చికిత్స పొందుతోంది. పెరంబూర్ వైద్యశాలలో అంజలీకుమారికి పింఛన్ అందిస్తున్న వలంటీర్ కె.గోపి గురువారం రాత్రి గోపి రైలులో పెరంబూర్ వెళ్లి మూడు నెలల వైఎస్సార్ పింఛన్ ఒకేసారి అందజేశాడు. అలానే బోస్‌నగర్‌కు చెందిన గుంటి రామచంద్రరావు క్యాన్సర్ వ్యాధికి తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర మెడికల్ సైన్సెస్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ మూడు నెలలుగా పింఛన్ తీసుకోవడంలేదు. దీంతో వలంటీర్ షేక్.నాగూర్‌బాబు శుక్రవారం ఉదయం తిరుపతికి చేరుకుని మొత్తం నగదు అందజేశాడు. 95.4 శాతం మందికి పింఛన్ల పంపిణీ ► నేడు కూడా వలంటీర్ల ద్వారా కొనసాగనున్న పంపిణీ సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు శుక్రవారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. శుక్రవారం రాత్రి వరకు మొత్తం 58,16,064 (95.4 శాతం) మందికి రూ.1,405.74 కోట్ల పింఛను డబ్బు పంపిణీ చేశారు. శనివారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి డబ్బులు పంపిణీ చేస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు తెలిపారు. -
సారా విక్రయాలు వద్దన్నందుకు గ్రామ వాలంటీర్‌పై దాడి
సాక్షి, కృష్ణా: జిల్లాలోని నూజివీడు మండలం హనుమంతులగూడెం గ్రామంలో సారా విక్రయదారులు రెచ్చిపోయారు. గ్రామంలో సారా విక్రయాలు ఆపేయాలని చెప్పినందుకు ఏకంగా గ్రామ వాలంటీర్పైనే దాడికి దిగారు. వివరాల్లోకి వెళ్తే... సారా విక్రయదారులు హనుమంతులగూడెం గ్రామంలో సారా అమ్మకాలను సాగిస్తున్నారు. సారా అమ్మకాలను గమనించిన గ్రామ వాలంటీర్ ధీరపాల విజయ గ్రామంలో సారా విక్రయాలు నిలిపివేయాలని చెప్పారు. దీంతో సారా విక్రయదారులంతా ఏకమై గ్రామంలో విధులు నిర్వహిస్తున్న వాలంటీర్ విజయపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఆమెకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. తనపై దాడికి పాల్పడిన ఏడుగురు సారా అమ్మకందారులపై వాలంటీర్ విజయ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. చదవండి: గోదావరిలో నలుగురు విద్యార్ధుల గల్లంతు.. 3 మృతదేహాలు లభ్యం -
ఏడుగురి కోసం 700 కి.మీ. ప్రయాణం..
చిల్లకూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా, పదిలంగా అందించటంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు వలంటీర్లు. తమ పరిధిలో ఉండే కుటుంబాల్లో ఒకరిగా కలిసి పోయి సేవలందిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన చేయూత పథకంతో పాటుగా వైఎస్సార్ బీమా యోజన పథకానికి అర్హులైన లబ్ధిదారులతో ఈకేవైసీ చేయించాల్సి ఉంది. దీంతో వలంటీర్లు ఆ పనిలో నిమగ్నమయ్యారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చిల్లకూరు మిక్సెడ్ కాలనీకి చెందిన 70 కుటుంబాలను వలంటీర్ శ్రీరాం అశోక్‌కు కేటాయించారు. అయితే అందులోని ఏడు కుటుంబాలు బుట్టలు అల్లుకుని, వాటిని విక్రయించుకునేందుకు ఇతర రాష్ట్రాలకు వలస పోయాయి. కోవిడ్ కారణంగా వారంతా కర్ణాటక రాష్ట్రంలోని తుమ్ముకూరు ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఈకేవైసీ చేయించుకోవాలని వలంటీర్ వారికి సమాచారం ఇవ్వగా, వారు తాము రాలేక పోతున్నామని తెలియజేశారు. దీంతో లబ్ధిదారులు నష్ట పోకుండా చూడాలని భావించిన వలంటీర్ అశోక్ చిల్లకూరు నుంచి తుమ్ముకూరుకు సుమారు 700 కి.మీ. దూరం ఉన్నప్పటికీ వెరవకుండా బైక్‌పై తన సొంత ఖర్చులతో వెళ్లాడు. ఏడుగురు లబ్ధిదారుల చేత ఈకేవైసీ చేయించి, పథకాలకు సంబంధించి ఆన్లైన్లో వారి వివరాలు నమోదు చేశాడు. వలంటీర్ అశోక్‌ను మండల అధికారులు, స్థానికులు అభినందించారు. -
‘వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు తప్పు పట్టడం సిగ్గుచేటు’
సాక్షి, చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ఆదర్శవంతంగా వాలంటీర్లు నిలుస్తున్నారని కొనియాడారు. ఈ మేరకు ఎస్ఆర్ పురంలో ప్రభుత్వ పథకాలపై వాలంటీర్లతో నారాయణస్వామి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి పథకాన్ని అర్హులకు అందిస్తున్నారని ప్రశంసించారు. అలాంటి వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు తప్పు పట్టడం సిగ్గుచేటన్నారు. మంచి కార్యక్రమాలు ఏవి జరిగిన చంద్రబాబుకు గిట్టవని దుయ్యబట్టారు. చదవండి: ఏపీలో కొత్తగా 8,239 కరోనా కేసులు -
కరోనాతో మహిళా వలంటీర్ మృతి.. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
సాక్షి, తూర్పు గోదావరి: తూర్పు గోదావరి జిల్లాలో వలంటీర్‌గా పని చేస్తున్న ఎరుసు లక్ష్మీ కరోనాతో మృతి చెందింది. ఆమె రమణయ్య పేట-3 గ్రామ సచివాయం వలంటీర్‌గా పని చేస్తుంది. కరోనా రావడంతో జిజిహెచ్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ లక్ష్మీ కన్నుమూసింది. ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్మీ మృతి పట్ల సంతాపం తెలుపుతూ రూ.5 లక్షలను సాయంగా ఆమె కుటుంబానికి అందజేయాలని ఆదేశించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. ( చదవండి: ‘వలంటీర్’ సేవ; ఆత్మ బంధువులే తోడుగా.. ) -
‘గ్రామీణ వికాసం’లో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: గతంలో నిరుపేద అవ్వకు పెన్షన్ కావాలన్నా.. కూలీనాలీ చేసుకుంటే తప్ప పూట గడవని నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు కావాలన్నా.. రైతు తన వ్యవసాయ భూమి వివరాలు పట్టాదార్ పాస్ పుస్తకంలో నమోదు చేయించుకోవాలన్నా.. అధికారులు లేదా రాజకీయ నాయకుల చుట్టూ రోజుల తరబడి తిరిగితే గాని పనులు జరగని పరిస్థితి. ఒక్కొక్కసారి రూ.వేలు, రూ.లక్షలు ఖర్చు పెట్టినా పని పూర్తికాక ఇబ్బందులు పడిన వారున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పథకానికి అర్హులై ఉంటే చాలు.. చిన్న కష్టం కూడా పడకుండా దరఖాస్తు చేసుకుంటే.. రేషన్ కార్డు, పింఛన్లు, మంజూరు పత్రాలను వలంటీర్లు ఇంటికే తెచ్చి ఇస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకంలో లబ్ధిదారులు ఎవరన్నది గ్రామస్తులందరికీ తెలిసేలా గ్రామ సచివాలయం నోటీసు బోర్డులో ప్రదర్శిస్తున్నారు. గ్రామ సభ నిర్వహించి అభ్యంతరాలు స్వీకరించాకే లబ్ధిదారుల తుది జాబితాలను ఖరారు చేస్తున్నారు. అవ్వాతాతలకు ప్రతి నెలా 1నే పింఛను డబ్బులు వలంటీర్లు ఇంటికే తీసుకెళ్లి ఇస్తున్నారు. రేషన్ సరుకులు సైతం ప్రతి ఒక్కరికీ ఇంటివద్దే అందుతున్నాయి. ఈ సేవలు అందించడం వల్లే కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన అవార్డుల్లో ఏకంగా ఏపీ 17 జాతీయ అవార్డులను ఎగరేసుకుపోయింది. కోటిన్నరకు పైగా సమస్యల పరిష్కారం ఒకప్పుడు గ్రామ పంచాయతీకి పూర్తి స్థాయి గ్రామ కార్యదర్శి కూడా ఉండే వారు కాదు. వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయంలో ఇప్పుడు కనీసం 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారికి అనుబంధంగా ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ సేవలందిస్తున్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ వంటివి 70 వేలకు పైబడి భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కొన్ని పూర్తయ్యాయి. ప్రతి గ్రామ సచివాలయంలో రెండు కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. కుగ్రామంలో ఉండే గ్రామ సచివాలయంలోనూ డిజిటల్ లావాదేవీలు కొనసాగుతున్నాయి. సచివాలయాల ఏర్పాటు తర్వాత 2020 జనవరి 26 నుంచి ఇప్పటివరకు 2.18 కోట్లు వినతులందగా.. 2.11 కోట్ల వినతులను అధికారులు పరిష్కరించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 1.62 కోట్ల వినతులకు గానూ, 1.57కోట్ల వినతులను పరిష్కరించారు. ప్రభుత్వ యంత్రాంగంతో ఏ పని ఉన్నా ఆ ఊరిలోనే పరిష్కరించేలా గ్రామ సచివాలయాల్లో 545 రకాల ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు నిధులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే అందుబాటులో ఉన్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2,625 కోట్లను 70–15–15 నిష్పత్తిలో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు ప్రభుత్వం కేటాయించింది. 2021–22లో రూ.1,939 కోట్ల నిధులు అందుబాటులోకి రానున్నాయి. చదవండి: రికవరీలో ఏపీ బెస్ట్ ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ రోగుల చికిత్సకు రూ.309.61 కోట్లు -
రైలు ప్రమాదంలో గ్రామ వలంటీర్ మృతి
హనుమాన్‌జంక్షన్ రూరల్: స్థానిక నూజివీడు రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ప్రమాదంలో గ్రామ వలంటీర్ దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. నూజివీడు మండలం మొఖసా నరసన్నపాలెం గ్రామంలో బోయపాటి రవీంద్రకుమార్ (35) వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రైలు ఢీకొనటంతో తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే మృతి చెందాడు. కొద్దిసేపటికి ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న ఏలూరు రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వద్ద లభించిన వలంటీర్ ఐడీ కార్డు ఆధారంగా మొఖసా నరసన్నపాలెం గ్రామ వలంటీర్ బోయపాటి రవీంద్రకుమార్‌గా గుర్తించారు. ఈ ఘటనపై ఏలూరు రైల్వే ఎస్ఐ వి.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రవీంద్రకుమార్ ప్రమాదవశాత్తూ రైలు క్రింద పడి మరణించడా లేక మరేమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. చదవండి: నిన్న వలంటీర్లు.. నేడు కౌన్సిలర్, కార్పొరేటర్లు -
నిన్న వలంటీర్లు.. నేడు కౌన్సిలర్, కార్పొరేటర్లు
సత్తెనపల్లి/కంచరపాలెం (విశాఖ ఉత్తర): నిన్నమొన్నటివరకు విశేష సేవలందించి అందరి ప్రశంసలు పొందిన ఇద్దరు వలంటీర్లు నేడు కౌన్సిలర్, కార్పొరేటర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మునిసిపాలిటీలో 12వ వార్డు నుంచి వైఎస్సార్సీపీ తరఫున వలంటీర్ లోకా కల్యాణి బరిలోకి దిగారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన సరికొండ జ్యోతిపై 504 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. విశాఖలో.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో ఓ వార్డు వలంటీర్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 47వ వార్డు కంచర్లపాలెం అరుంధతినగర్ కొండవాలు ప్రాంతానికి చెందిన కంటిపాము కామేశ్వరి గతంలో వార్డు వలంటీర్‌గా పనిచేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన ఆమె తన సమీప ప్రత్యర్థిపై 3,898 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. చదవండి: తాడిపత్రి ఎక్స్అఫిషియో ఓట్ల కేటాయింపులో ట్విస్ట్ -
గ్రామ వాలంటీర్‌ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు...
-
గ్రామ వలంటీర్ దారుణ హత్య
కూడేరు: పంటకు కాపలాగా వెళ్లి శ్రీకాంత్ (24) అనే గ్రామ వలంటీర్ దారుణ హత్యకు గురైన ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం శివరామ్‌పేటలో శనివారం వేకువజామున చోటుచేసుకుంది. శివరామ్‌పేటకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వెంకటేష్ తన పొలంలో నూర్పిడి చేసిన వేరుశనగ పంటకు రెండు రోజులుగా రాత్రి వేళ కాపలా కాస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతడు పొలం నుంచి ఇంటికి భోజనానికి రాగా.. అతని కుమారుడు వలంటీర్ శ్రీకాంత్ పంట కాపలా నిమిత్తం పొలానికి వెళ్లాడు. అతనితోపాటు స్నేహితులైన రాజు, మల్లికార్జున కూడా పొలానికి వెళ్లి రాత్రి 12.45 గంటల సమయంలో ఇళ్లకు వెళ్లిపోయారు. శనివారం ఉదయాన్నే శ్రీకాంత్ చిన్నాన్న పొలంలోకి వెళ్లగా శ్రీకాంత్ తీవ్ర గాయాల పాలై అచేతన స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని శ్రీకాంత్‌ను కూడేరు పీహెచ్‌సీకి, అక్కడినుంచి అనంతపురం ప్రభుత్వాస్పతికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే శ్రీకాంత్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ కృష్ణారెడ్డి, ఎస్ఐ యువరాజు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం పరిశీలించాయి. ఒక్కగానొక్క కుమారుడిని అతి దారుణంగా చంపేశారని తల్లిదండ్రులు భోరున విలపించారు. వలంటీర్‌గా ఎంతో నిజాయతీతో సేవలందించాడని.. ఎవరితోనూ గొడవలు లేవని తండ్రి వెంకటేష్ తెలిపారు. అనంతపురం, హిందూపురం ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి వెళ్లి శ్రీకాంత్ మృతదేహాన్ని పరిశీలించారు. సమగ్ర విచారణ జరిపి హంతకులను పట్టుకుని శిక్షించాలని పోలీసులను కోరారు. చదవండి: పిశాచి పిడుగు : షాకింగ్ వీడియో వైరల్ -
అనంతపురం జిల్లాలో గ్రామా వాలంటీర్ శ్రీకాంత్ హత్య
-
ఓటర్ల దీవెన.. సర్పంచ్‌లుగా ముగ్గురు వలంటీర్లు
మునగపాక/బుచ్చెయ్యపేట/కశింకోట (విశాఖ జిల్లా) : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ వారి మనసులు గెలుచుకున్న గ్రామ వలంటీర్లు చివరికి ఆ గ్రామాల పాలనా పగ్గాలే చేపట్టారు. వారు చేస్తున్న కృషికి మెచ్చిన ఆయా గ్రామాల ప్రజలు వారిని ఏకంగా సర్పంచ్ పీఠంపై కూర్చోబెట్టారు. ఈ విధంగా విశాఖ జిల్లాలో ముగ్గురు వలంటీర్లు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. మునగపాక మండలం మెలిపాకలో అయినంపూడి విజయభాస్కరరాజు, బుచ్చెయ్యపేట మండలం మంగళాపురానికి చెందిన పద్మరేఖ, కశింకోట మండలం జమాదులపాలేనికి చెందిన కరక రాజ్యలక్ష్మిలు గ్రామస్తుల కోరిక మేరకు సర్పంచ్ స్థానానికి పోటీచేసి గెలుపొందారు. వలంటీర్లుగా ప్రజాభిమానం పొందడం వల్లే ఈ గెలుపు సాధ్యమైందని వారంటున్నారు. (చదవండి: ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం) 274 పంచాయతీల్లో ఎన్నికల్లేవు! -
గ్రామ వలంటీర్ నుంచి సర్పంచ్‌గా..
కరప: గతనెల వరకు ఆమె గ్రామ వలంటీర్. నేటి నుంచి గ్రామ సర్పంచ్. తమ కళ్ల ముందు తిరుగుతూ కనిపించే అమ్మాయి సర్పంచ్ అయిందంటే ఆ గ్రామ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కరప మండలం గొర్రిపూడి గ్రామానికి చెందిన కానూరు రమాదేవి ఇంటర్ వరకు చదువుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గ్రామవలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రయోజనం పొంది, గ్రామవలంటీర్‌గా విధుల్లోకి చేరింది. ఏడాదిన్నరగా తనకు కేటాయించిన 50 కుటుంబాలను కలసి, ప్రభుత్వ పథకాలను వారికి చేరువ చేస్తోంది. పంచాయతీ ఎన్నికలు రావడంతో గొర్రిపూడి గ్రామం బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. వైఎస్సార్ సీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు చీకాల సుబ్బారావు ప్రోత్సాహంతో రమాదేవి వలంటీర్ పదవికి రాజీనామా చేసి, పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌గా నామినేషన్ వేశారు. ఈ గ్రామంలో జరిగిన త్రిముఖపోటీలో 508 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందారు. ఈ ఎన్నికలో మొత్తం 4,229 ఓట్లు పోలవ్వగా రమాదేవికి 2002, సమీప ప్రత్యర్థికి 1494 ఓట్లు, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థికి 613 ఓట్లు రావడంతో 508 ఓట్ల మెజార్టీతో గ్రామవలంటీర్ రమాదేవి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖల మంత్రి కురసాల కన్నబాబు, గ్రామపెద్దల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని కొత్త ఎన్నికైన సర్పంచ్ రమాదేవి తెలిపారు. (చదవండి: 24ఏళ్లకే సర్పంచ్..) వీరికి లక్కుంది..! -
33 మంది వలంటీర్ల సామూహిక రాజీనామా
సాక్షి, కొడవలూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలో 33 మంది వలంటీర్లు సామూహికంగా రాజీనామా చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి స్థానిక పోరులో వైఎస్సార్సీపీ అభిమానులను గెలిపించుకునేందుకే తామంతా సామూహికంగా రాజీనామా చేసినట్లు వలంటీర్లు స్పష్టం చేశారు. నార్తురాజుపాళెంలోని వీసీఆర్ అతిథి గృహంలో రాజీనామా చేసిన వలంటీర్లు బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వమిచ్చే గౌరవవేతనం కోసం కాకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలనే సేవా దృక్పథంతో తాము పనిచేస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో తమను దూరం పెట్టడంతో.. రాజీనామా చేసి స్థానిక పోరులో వైఎస్సార్సీపీ అభిమానులను గెలిపించాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. -
నిన్న వలంటీర్.. నేడు సర్పంచ్..
కదిరి అర్బన్: నిన్నటి దాకా ఆమె ఓ వలంటీర్. తన పరిధిలోని ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేశారు. అయితే ఇప్పుడు ఆమె వలంటీర్లు, అధికారుల భాగస్వామ్యంతో ఊరు మొత్తానికి సేవ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఊరందరి సహకారంతో సర్పంచిగా ఏకగ్రీవమయ్యారు. అనంతపురం జిల్లా కదిరి మండలం ముత్యాలచెరువు పంచాయతీ సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. (చదవండి: తొలి దెబ్బ అదిరింది) వలంటీర్‌గా నారికే శుభలేఖ తన ఉద్యోగాన్ని వదిలి సర్పంచి బరిలో నిలిచారు. ఆమెతో పాటు మరో ముగ్గురు కూడా నామినేషన్లు వేశారు. అయితే శుభలేఖ ఉత్తమ సేవలు అందించి ఉండటం, గ్రామస్తుల నిర్ణయం మేరకు మిగతా ముగ్గురు గురువారం నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో శుభలేక సర్పంచిగా ఏకగ్రీవమయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పెడబల్లి వెంకటసిద్ధారెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా ఆమె కలవగా, పూలమాలతో సన్మానించారు.(చదవండి: 523 పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం) -
సర్పంచ్ బరిలో ‘వలంటీర్లు’
సాక్షి, విశాఖ జిల్లా/చిత్తూరు జిల్లా: సంక్షేమ పథకాల అర్హుల ఎంపికలో, సేవలందించడంలో ఉత్తమంగా వ్యవహరిస్తోన్న వలంటీర్లను గ్రామస్తులు సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిపారు. విశాఖ జిల్లా కశింకోట మండలం జమాదులపాలెంకు చెందిన కరక రాజ్యలక్ష్మి ఇంటర్ చదివి వలంటీర్‌గా ఎంపికైంది. గ్రామంలో పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఆమె ప్రత్యేక చొరవ చూపింది. దీన్ని గుర్తించిన గ్రామస్తులు రాజ్యలక్ష్మిని సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో పెద్దపల్లె పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆ గ్రామ పరిధిలోని గౌడసానిపల్లె గ్రామ వలంటీర్ పి.శ్రీనివాసులు రెండో విడతలో నామినేషన్ వేయడానికి సన్నాహాల్లో ఉన్నారు. బీటెక్ చదివిన శ్రీనివాసులు ఏడాదిగా వలంటీర్‌గా పనిచేస్తున్నారు. వలంటీర్ ఉద్యోగానికి ఇటీవలే రాజీనామా చేశాడు -
అమ్మా.. నేనున్నాను..
సాక్షి, పాతపోస్టాఫీసు(విశాఖపట్నం): ప్రేమోన్మాది దాడిలో గాయపడి ప్రస్తుతం కోలుకుంటున్న వలంటీర్ ప్రియాంకకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ భరోసా ఇచ్చారు.అమ్మా...నీ శ్రేయస్సుకు ప్రభుత్వంతో పాటు నేను అండగా ఉన్నాం అని ఓదార్చారు. పాతనగరం 25వ వార్డు పరిధి కన్వేయర్ బెల్టు కింద నివాసం ఉంటున్న ప్రియాంక ఇంటికి గురువారం ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రియాంక గొంతు నయమయ్యేలా హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీఇచ్చారు. ప్రియాంక ఎదుటే ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్‌తో మాట్లాడి త్వరితగతిన మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రియాంక కుటుంబ సభ్యులకు రూ.20వేల నగదు వాసుపల్లి అందజేశారు. తమ కుమార్తెకు మెరుగైన వైద్యం అందుతుందంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటూ ఎమ్మెల్యే వాసుపల్లి చొరవే కారణమని ప్రియాంక తల్లి రవణమ్మ చెప్పారు. కార్యక్రమంలో 39వ వార్డు అధ్యక్షుడు సూరాడ తాతారావు, కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం, ముస్లిం మైనార్టీ నాయకుడు మహ్మద్ సాధిక్, బాబ్జి, 38వ వార్డు అధ్యక్షుడు సన్యాసిరావు, మాధురి పాల్గొన్నారు. -
మహిళా సంరక్షణ కార్యదర్శికి పోలీస్ డ్రెస్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులు ఇకపై పోలీసు యూనిఫాంలో విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగులను అధికారికంగా మహిళా పోలీసు అని పిలుస్తారు. ఇందుకు సంబంధించి వారం పది రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువరించేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఫైల్‌ను సిద్ధం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11,162 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాల్లో ఒక్కో దాంట్లో ఒకరు చొప్పున మహిళా సంరక్షణ కార్యదర్శి ఉన్నారు. మొత్తం 14,948 పోస్టులకు గాను 13,677 పోస్టులను ఈ ఏడాది జనవరి నాటికే భర్తీ చేశారు. మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ (రెండో విడత నోటిఫికేషన్లో) ప్రస్తుతం జిల్లాల్లో కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు 1,100 మందికి నియామక పత్రాలు జారీ చేశారు. కాగా, ఇప్పటికే పలు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులు.. ఆయా సచివాలయాల పరిధిలో పాఠశాలలు, కాలేజీల్లో మహిళల రక్షణ, సైబర్ క్రైం, రోడ్డు సేప్టీ తదితర అంశాలపై పని చేస్తున్నారు. వరకట్న, లైంగిక వేధింపుల నియంత్రణతో పాటు మద్యపాన నియంత్రణ చర్యలలో భాగంగా బెల్ట్‌షాపులు, నాటుసారాను అరికట్టడం వంటి చర్యలలో పాలుపంచుకుంటున్నారు. అక్రమార్కుల్లో భయం పెరుగుతుంది.. మూడు రోజుల క్రితం గ్రామ, వార్డు సచివాలయాల శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్ జగన్.. మహిళా సంరక్షణ కార్యదర్శులకు పోలీసు యూనిఫాం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. వారు పోలీసు యూనిఫాం ధరించి విధులు నిర్వర్తించడం ద్వారా స్థానికంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిలో కొంత భయం ఏర్పడుతుందని చెప్పారు. తద్వారా ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించే అవకాశం ఉంటుందని అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటి దాకా మహిళా సంరక్షణ కార్యదర్శి పేరుతో పిలిచే ఈ ఉద్యోగులందరినీ ఇక నుంచి అధికారికంగానే ‘మహిళా పోలీసు’ అని పిలవాలని సీఎం ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖ చర్యలకు ఉపక్రమించింది. మిగిలిన ఉద్యోగులకూ వేర్వేరు యూనిఫాం గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగులు పని చేస్తున్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శికి పోలీసు యూనిఫాం కేటాయించిన మాదిరే మిగిలిన ఉద్యోగులందరికీ వారి వారి విధుల ఆధారంగా వేర్వేరుగా యూనిఫాం కేటాయించే విషయం పరిశీలించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అయితే, మిగిలిన ఉద్యోగులలో ఎవరికి ఏ రకమైన యూనిఫాం కేటాయించాలన్న దానిపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ నవీన్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. -
దివ్యాంగురాలిది ఆత్మహత్యే
ఒంగోలు: నగర పరిధిలోని దశరాజుపల్లి రహదారిలో ఈ నెల 18న సజీవ దహనమైన దివ్యాంగురాలిది ఆత్మహత్యేనని జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తెలిపారు. స్థానిక పోలీస్ కల్యాణ మండపంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. దశరాజుపల్లి రోడ్డులో దివ్యాంగులు తన వాహనంలోనే కాలిపోతుండటాన్ని గమనించిన స్థానికులు డయల్ 100 కు సమాచారం ఇచ్చారు. తాలుకా సీఐ శివరామకృష్ణారెడ్డి సిబ్బంది, ఫైర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. ఘటనాస్థలంలో లభ్యమైన బ్యాగులో లభించిన ఆధారాల ప్రకారం మృతురాలు ఉమ్మనేని భువనేశ్వరిగా గుర్తించారు. మృతురాలు స్థానిక గోపాల్‌నగరం ఏడో డివిజన్లో వార్డు వలంటీర్‌గా పనిచేస్తుంది. మృతురాలి తల్లి జానకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు సాగించారు.ఓఎస్డీ కె.చౌడేశ్వరి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. నాలుగు టీంలుగా విడిపోయి విచారణ సాగించారు. నేరస్థలంలో లభ్యమైన సాక్ష్యాలు, ప్రత్యక్ష సాక్ష్యులను గుర్తించి వారిని విచారించారు. మృతురాలు రెండు సెల్ఫోన్లు వాడుతున్నట్లుగా గుర్తించి వాటి కాల్స్ విశ్లేషించారు. మృతురాలు ప్రయాణించిన మార్గంలో సీసీ టీవీ ఫుటేజీ విశ్లేషణ ఆధారంగా దర్యాప్తు కొనసాగించి మృతురాలు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారణకు వచ్చినట్లు ఎస్పీ వివరించారు. (దారుణం: ట్రై సైకిల్ పైనే భువనేశ్వరి సజీవ దహనం ) ► దివ్యాంగురాలు దశరాజుపల్లి రోడ్డులో తన త్రిచక్రవాహనంలో వెళుతుండడాన్ని దశరాజుపల్లికి చెందిన కిమ్స్ హాస్పిటల్ సెక్యూరిటీ గార్డు గోగిల శ్రీకాంత్ గమనించాడు. మరో సెక్యూరిటీ గార్డు పెనం కొండయ్య యువతి దగ్ధమవుతున్న విషయాన్ని గుర్తించాడు. వీరిద్దరు కిమ్స్ హాస్పిటల్ సెక్యూరిటీ ఇన్‌ఛార్జి నీరంపల్లి చండేశ్వర్‌కు తెలియపరచగా వారు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. మృతురాలు కమ్మపాలెం నుంచి జాతీయ రహదారివైపు ఒంటరిగా వెళుతుండగా పోతురాజు కాలువ బ్రిడ్జి ఎక్కలేకపోతుండడంతో అక్కడ సబ్‌స్టేషన్ సిబ్బంది బాలాజీ, తిరుమలరావులు బ్రిడ్జిపైకి వెళ్లేందుకు సాయం చేశారు. జాతీయ రహదారి కింద గోపాలనగరం 4వ లైనుకు చెందిన గొర్రెల కాపరి గొల్లప్రోలు శ్రీహరి ఆమె ఒంటరిగా వెళుతుండడాన్ని గుర్తించాడు. ► మృతురాలు సామాజిక మాధ్యమంలో గ్రూప్ ద్వారా గుంటూరుకు చెందిన మనోజ్, విశాఖకు చెందిన తనూజ, శ్రీకాకుళంకు చెందిన కృష్ణలతో ప్రతిరోజు గ్రూప్ చాటింగ్ చేస్తుంటుంది. ఈ నెల 18న సాయంత్రం 7.03 గంటల నుంచి మృతురాలు చాటింగ్‌లో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సాక్ష్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. సాయంత్రం 6.45గంటల సమయంలో తన స్నేహితుడైన బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మనోజ్‌కు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నేరస్థలం నుంచి వాట్సప్‌లో ఆడియో రికార్డు చేసి పంపించింది. అ పోస్టుమార్టం నివేదిక పరిశీలిస్తే మృతురాలి శరీరంపై ఎటువంటి గాయాలు లేవు. మృతురాలు తన స్నేహితులైన ఆటో డ్రైవర్లు రాము, నాయబ్‌రసూల్‌ల ద్వారా 18వ తేదీ సాయంత్రం 6.15 గంటల సమయంలో పెట్రోలు క్యానును తెప్పించుకుని తన త్రిచక్ర వాహనంలో పెట్టుకుండటాన్ని మార్గమధ్యంలో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. ► ఘటనకు ముందు భువనేశ్వరి తన వాట్సప్ స్టేటస్‌లో ఇక తన వాట్సప్ పనిచేయదని, కొంత మంది స్నేహితులు, బంధువులకు బాయ్..బాయ్ చెప్పడం వంటివి గుర్తించామని ఎస్పీ తెలిపారు. కేసులో కేవలం 48గంటల్లోనే నిజాలు నిగ్గుతేల్చారంటూ ప్రత్యేక దర్యాప్తు అధికారి కె.చౌడేశ్వరి, ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్, తాలూకా సీఐ ఎ.శివరామకృష్ణారెడ్డి, ఎస్సైలు సోమశేఖర్, పునావవు, నాయబ్‌రసూల్, ఏఎస్సై దయానంద్, రమేష్, హెడ్‌కానిస్టేబుళ్లు రామకృష్ణ, జి.బాబు, ఎస్బీ హెచ్‌సీ నరశింహారావు, కానిస్టేబుల్ రవిలను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రత్యేకంగా అభినందించారు. -
దారుణం: ట్రై సైకిల్ పైనే భువనేశ్వరి సజీవ దహనం
సాక్షి, ఒంగోలు: మహిళా వలంటీర్.. పైగా రెండు కాళ్లూ లేని దివ్యాంగురాలు.. నగరానికి రెండు కిలోమీటర్ల ఆవల నిర్మానుష్య ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో కాలి బూడిదైంది. ఈ సంఘటన దశరాజుపల్లికి వెళ్లే దారిలో అప్పాయకుంట వద్ద శుక్రవారం రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగింది. నిత్యం ఆమె ఏ త్రిచక్ర వాహనం ఉపయోగిస్తుందో ఆ వాహనంలోనే కాలిపోయింది. ఎవరో తగలబడుతున్నారన్న సమాచారం పోలీసులకు రావడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలార్పారు. ఆమె హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. అందులో యువతి ఆధార్‌కార్డు, ఐడీ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు ఉన్నాయి. వాటి ఆధారంగా ఆమె గోపాలనగరం వాసి ఉమ్మనేని భువనేశ్వరి (23)గా గుర్తించారు. ఈమె తల్లి జానకి స్థానికంగా ప్రకాశం భవనం ఎదుట రాఘవ బుక్‌షాప్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంటోంది. భువనేశ్వరికి మరో అనారోగ్యంతో బాధపడుతున్న సోదరి ఉంది. తండ్రి వీరు చిన్నప్పుడే కన్నుమూశాడు. తన బిడ్డను ఎవరో హత్య చేసుంటారంటూ జానకి సంఘటన స్థలానికి వచ్చి భోరున విలపించింది. వలంటీర్ అంతదూరం ఎందుకు వెళ్లింది, ఆమె చివరగా ఫోన్లో ఎవరెవరితో మాట్లాడింది.. తదితరాల వివరాల కోసం పోలీసులు కాల్‌డేటా సేకరించే పనిలో ఉన్నారు. భువనేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిందా.. లేక ఎవరైనా హత్య చేశారా.. అన్నది పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. చదవండి: (చెట్టంత కొడుకులు.. శవాలై తేలితే..) -
వలంటీర్లకు వందనం!
బొండపల్లి (గజపతినగరం): పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని స్వయంగా వలంటీర్లే డోలీలో 7 కి.మీ. మోసుకుంటూ 108 వాహనం వరకు తీసుకువచ్చిన ఘటన ఇది. నిస్వార్థ సేవలకు ప్రతిరూపంగా నిలిచిన వలంటీర్ల పనితనానికి నిదర్శనమిది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. గొల్లుపాలెం పంచాయతీ శివారు గిరిజన గ్రామమైన ఏర్రోడ్ల పాలేనికి చెందిన గిరిజన మహిళ పంగి జానకమ్మకు శుక్రవారం సాయంత్రం పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే ఆమె భర్త కామేశ్ 108కి ఫోన్ చేయగా వాహనం వెళ్లడానికి సరైన రహదారి సౌకర్యం లేకపోయింది. సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి గంధవరపు కృష్ణ వెంటనే స్పందించి తన ద్విచక్ర వాహనాన్ని గ్రామానికి పంపించగా గర్భిణి దానిపై కూర్చోలేకపోయింది. దీంతో గ్రామ వలంటీర్లు శ్రీహర్ష, బాలాజీ డోలీ కట్టి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లుపాలెం గ్రామానికి నడకదారిన మోసుకొచ్చారు. అక్కడి నుంచి 108 వాహనంలో గజపతినగరం ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించేవరకూ ఏఎన్ఎం మమతావల్లి, ఆశ కార్యకర్త గర్భిణికి వెన్నంటే ఉండి సేవలు అందించారు. వారందరి సేవా భావానికి స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఎమ్మెల్యేలు, వలంటీర్లకు చేతులెత్తి మొక్కాల్సిందే!
ఇంట్లో సేద తీరుతుంటే హఠాత్తుగా వరద వచ్చి పడితే ఏం చేయాలి..మోకాలి వరకు వచ్చిన నీళ్లు చూస్తుండగానే భుజాల పైకి వస్తుంటే, అంతకంతకూ ప్రవాహం పెరుగుతుంటే ఇంటిల్లిపాదీ బయటకు రాలేక, ఇంట్లో ఉండలేక బతుకుపై ఆశలు సన్నగిల్లుతుంటే.... రోజులాగానే రోడ్డుపై వెళుతుండగా నీటి ప్రవాహం అడ్డుకుంటే.... పొలం దగ్గరికి వెళ్లి వస్తుండగా వాగు లాక్కెళ్లిపోతే.. అలాంటి పరిస్థితుల్లో మేమున్నామంటూ వచ్చారు ఈ ప్రాణ ప్రదాతలు. మృత్యు ముంగిట ఉన్న వారిని ప్రాణాలొడ్డి ఒడ్డుకు చేర్చారు. నివర్ పంజా విసిరిన వేళ మన అధికారులు, ఎమ్మెల్యేలు, పోలీసులు, వలంటీర్లు స్పందించిన తీరుకు చేతులెత్తి మొక్కాల్సిందే. గోడలు కూల్చి కాపాడాం చిత్తూరు అర్బన్: తుపాను ముందురోజే కమిషనర్ ఉద్యోగులు అందరినీ అప్రమత్తం చేశారు. వార్డు సచివాలయాల్లోని కార్యదర్శులు, వలంటీర్లు అప్రమత్తంగా ఉండాలని పదేపదే చెప్పారు. ఆ రోజు (27వ తేదీ) మధ్యాహ్నం సచివాలయ కార్యదర్శి నుంచి కమిషనర్‌కు మెసేజ్ రావడంతో వెంటనే నన్ను పురమాయించారు. మెసానిక్ మైదానం పక్కన 15 మంది వరకు చెరువునీటిలో చిక్కుకున్నారని తెలిసింది. పది నిమిషాల్లో నేను, మా సిబ్బంది వెళ్లి చూస్తే పూరిళ్లు, షెడ్లు మోకాలు లోతు నీళ్లలో ఉన్నాయి. వెంటనే అడ్డుగా ఉన్న గోడల్ని కూల్చాం, షెడ్లపైన నిల్చుని పిల్లల్ని పైకి తీసుకున్నాం. అయితే పెద్దోళ్లు ముగ్గురు అక్కడే ఉండిపోయారు. సమాచారమందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి వచ్చేశారు. పెద్ద రోప్‌లు వేసి మిగిలినవాళ్లను పైకి లాగాము. చూస్తుండగానే మరో అరగంటలో ఇళ్లు మునిగిపోయాయి. ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం, సిబ్బంది బాధ్యతగా పనిచేయడం వల్లే ప్రాణనష్టం లేకుండా అందరినీ కాపాడగలిగాం. – నాగేంద్ర, పట్టణ ప్రణాళిక అధికారి, చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ అందరం ఏడ్చేశాం ఆరోజు మధ్యాహ్నం వరకు నీటి ప్రవాహం తక్కువే ఉంది. రాత్రి 7 గంటలప్పుడు ఇంటి కింది అంతస్తు మునిగిపోతే నేను నా భార్య, ముగ్గురు పిల్లలు మెట్లపైకి వెళ్లిపోయాం. కరెంటు పోయింది. నీటిలో పురుగులు, పాము లు వచ్చేశాయని పిల్లలు భయపడిపోయారు. మేము వాళ్లతో కలిసి ఏడ్చేశాం. ప్రెస్ వాళ్లకు చెప్పడంతో పోలీసుల్ని పంపారు. వాళ్లు మాకు మరోజన్మనిచ్చారు. – యుగంధర్, చిత్తూరు వరదనీటిలో చిక్కుకుని బయటపడిన చిత్తూరు మెసానిక్ మైదానం కాలనీ వాసులు దారులన్నీ మూసుకుపోయినా .. వాట్సప్ గ్రూపులో మెసేజ్ రావడంతో చిత్తూరులోని బాలభవన్ స్కూలు పక్కనున్న కాలనీ నీటితో ముగినిపోయిందని, సాయం కోసం ఓ కుటుంబం ఎదురుచూస్తోందని తెలుసుకున్నాం. అందరూ బయటపడ్డా.. వర్షపునీళ్లు ఇంట్లోకి వచ్చేయడంతో ఒక్క కుటుంబం మాత్రం అక్కడే ఉండిపోయింది. వెంటనే వాళ్లతో మాట్లాడి స్పాట్‌కు వెళ్లిచూశాం. ఓవర్‌బ్రిడ్జి మీద నుంచి చూస్తే మనిషి లోతు మొత్తం నీళ్లతో నిండిపోయింది. కరెంట్‌లేదు. దారులన్నీ మూసుకుపోయాయి. కొద్దిగా టెన్షన్.. అయినా ఏదో ఒకటి చేసి కాపాడాలన్న తపన ఉంది. నాతోపాటు వచ్చిన ఎస్టీఎఫ్ పార్టీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పిల్లల్ని అలెర్ట్ చేశాం. పెద్ద రోప్‌లు వేసుకుని, ఈదుతూ అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. పిల్లల్ని భుజాలపైకి ఎత్తుకుని ఈదుతూ వచ్చారు. ఇద్దరు పెద్దవాళ్లను రోప్ పట్టుకోమని గట్టుపైకి తీసుకొచ్చాం. – ఎన్.సుధాకర్‌రెడ్డి, డీఎస్పీ, చిత్తూరు చదవండి: (నివర్ తుఫాన్: వైఎస్సార్ సీపీ నేత మృతి) పునర్జన్మనిచ్చిన వలంటీర్ చంద్రగిరి: రాయలపురం పక్కన మొండికాలువ సమీపంలో దోసలంక ఏరు ప్రవహిస్తుండటంతో నేను స్నేహితులతో కలసి వెళ్లాను. ఏరు దాటే క్రమంలో కాలు జారిపడి కొట్టుకుపోయాను. అక్కడే విధులు నిర్వహిస్తున్న నాగాలచెరువు వలంటీర్ వెంకటేష్ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాడు. కాసేపు తర్వాత నాకు స్పృహ వచ్చింది. ఈ రోజు నేను కుటుంబ సభ్యులతో కలసి ఉండానంటే దానికి వెంకటేషే కారణం. – అభినయ్, రాయలపురం మాకిది పునర్జన్మ లాంటిది పీలేరు: పీలేరు శివారు ప్రాంతంలో కామాటంవారిపల్లె నుంచి ఆకులవారిపల్లెకు వెళ్లే మార్గమధ్యంలో ఉన్న చిన్న గుట్టపై సీతారామయ్య ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. అయితే భారీ వర్షాలకు పింఛానది ఉగ్రరూపం దాల్చడంతో గుడిసె ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో సీతారామయ్య కుటుంబం ఒక మిట్టప్రాంతంలోకి వెళ్లి, తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రాత్రంతా గడిపారు. సమాచారమందుకున్న పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎస్పీ సెంథిల్ కుమార్, మదనపల్లె సబ్‌కలెక్టర్ జాహ్నవిని సంప్రదించి, కర్నూల్‌కు చెందిన రెస్క్యూ టీమ్, అగ్నిమాపక సిబ్బందితోపాటు స్థానిక సీఐ సాధిక్ అలీ రంగంలోకి దిగారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యుల కు అల్పాహారం అందించారు. క్రేన్ సహకారంతో రోప్ కట్టి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. చదవండి: (తుపాన్ మృతులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా) ప్రాణాలమీద ఆశ వదిలేశాం నీటి ఉధృతికి మా ఇల్లు కొట్టుకుపోయింది. అనుక్షణం బిక్కుబిక్కుమంటూ గడిపాం. నదీ ప్రవాహాన్ని చూస్తే మేము బతికి వస్తామని అనుకోలేదు. ఎమ్మెల్యే, అధికారులు మమ్మల్ని కాపాడారు. – గీత ఒంటిమీద పాములు పాకాయి రేణిగుంట: ‘‘రాళ్లకాలువ వాగులోకి గురువారం ఉదయం మేము వెళ్లే సమయంలో మోకాళ్లలోతు నీళ్లున్నాయి. నిలుచుని మోటారు స్టార్టర్లు విప్పుకుని గట్టువైపు అడుగులు వేశాం... హఠాత్తుగా వరద ఉధృతి అమాంతం పెరిగిపోయింది. చూస్తుండగానే నీళ్లు భుజాల వరకు వచ్చేశాయి. ఏం చేయాలో దిక్కు తోచలేదు... పక్కనే ఉన్న చిన్న కానుగ చెట్టును పట్టుకున్నా... అక్కడి నుంచి మెల్లగా చీమచింత చెట్టు వద్దకు చేరి కొమ్మను పట్టుకున్నా... నీటి ప్రవాహంలో పాము నా వీపు మీదుగా వెళ్లి, కాసేపు నా చుట్టూ చక్కర్లు కొట్టింది. కొమ్మను వదిలేస్తానేమోనని వణికిపోయా... నాతో వచ్చిన ఓ వ్యక్తి కళ్ల ముందే మునిగిపోతుంటే.. మరికొంత దూరంలో గట్టుమీద అయిన వాళ్ల ఆర్తనాదాలతో నాలో భయం పెరిగిపోయింది. ఆరు గంటలకు పైగా అక్కడే ఉండి బతుకుపై ఆశలు వదులుకున్నా. తరువాత రెస్క్యూ టీం నన్ను బోటులో ఎక్కించుకుని ఒడ్డుకు చేర్చాక కాస్త కుదుటపడ్డాను.’’ – అంటూ రేణిగుంట మండలం కుమ్మరపల్లికి చెందిన సుందరమ్మ, చెంగల్రాయులు కుమారుడు ఎం.వెంకటేష్(21) వివరించాడు. డిగ్రీ పూర్తి చేసిన అతను గ్రామ వలంటీర్‌గా పని చేస్తున్నాడు. ప్రాణాలను కాపాడటానికి కృషి చేసిన అధికార యంత్రాంగానికి, ఎమ్మెల్యేలకు రుణపడి ఉంటానని చెప్పారు. ఇది పునర్జన్మే ‘‘నేను పట్టుకున్న చెట్టు పట్టుజారే పరిస్థితిని గ్రహించి కిందున్న వైర్ల ఆధారంగా వెంకటేష్ ఉంటున్న చెట్టు వద్దకు చేరడానికి నేను చేసిన సాహసం బతుకు తీపిని వదిలేసుకుని చేసిందే... ఆరు గంటల నిరీక్షణ తరువాత బోటు శబ్దం విన్నాక ప్రాణం లేచి వచ్చింది... ప్రాణాలతో ఒడ్డుకు చేరా....’’ అంటూ మరో యువకుడు కుమ్మరపల్లి దళితవాడకు చెందిన లోకేష్(25) కన్నీటి పర్యంతమయ్యాడు. గుండెలు జారిపోయాయి ఏర్పేడు: మండలంలోని శివగిరి కాలనీకి సమీపంలో ఉన్న మామిడి తోటలో కాపలా ఉంటూ వరద ఉధృతిలో చిక్కుకుని రెస్క్యూ టీం సహకారంతో బయట పడిన గిరిజనులు వారి మనోగతాన్ని సాక్షితో పంచుకున్నారు. ‘‘మేము కోన సమీపంలోని మామిడితోటలో కాపలా ఉంటున్నాము. శుక్రవారం మామిడితోట పక్కన ఉన్న కోనకాల్వ వాగు ప్రవాహం పెరిగిపోయి మేముంటున్న చోటుకి వచ్చింది. నీటిలోనే మాప్రాణాలు పోతాయని అనుకున్నాం. భయంతో తోటలో నుంచి కేకలు వేశాం. కాల్వకు అవతల వైపున్న వారిని గట్టిగా కేకలు వేసి మేమంతా ఆపదలో చిక్కుకున్నామని, కాపాడాలని కోరాం. గంట గంటకూ నీటి ప్రవాహం ఎక్కువకావడంతో మాతోపాటు మా ముగ్గురు పిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయోమని భయపడ్డాం. చిన్న బిడ్డలను భుజాలకు ఎత్తుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపాం. గండం నుంచి బయటపడి సురక్షితంగా బయట పడాలని కొలవని దేవుడు లేదు... కొన్ని గంటల సమయానికి ఓ యంత్రం ద్వారా, ఆహారం, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు మావద్దకు పంపించారు. మాలో ఆశలు చిగురించాయి. సాయంత్రం చీకటి పడే సమయానికి మా వద్దకు ముగ్గురు వచ్చారు. మాకు ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి పంపారని వారు మాతో చెప్పారు. వారితో రాత్రంతా చిన్నపిల్లలతో కలిసి బిక్కుబిక్కు మంటూ నిద్రలేకుండా గడిపాం. శనివారం ఉద యం నీటి ప్రవాహం తగ్గిపోయింది. కాల్వ అవతల వైపు నుంచి రోప్‌లు మావద్దకు వచ్చాయి. రోప్‌ల ద్వారా మేం, మా పిల్లలు కాల్వ గట్టుకు సురక్షితంగా చేరుకున్నాం. మా ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాం.’’ -
గ్రామ స్వరాజ్యం ఆవిష్కృతమై సరిగ్గా ఏడాది
-
చప్పట్లతో సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్నవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. తాడేపల్లిలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు చప్పట్లతో గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటర్లకు అభినందనలు తెలిపారు. (గ్రామ స్వరాజ్యం సాకారం చేశాం: సీఎం జగన్) గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆవిష్కృతమై సరిగ్గా ఏడాది. గత ఏడాది అక్టోబర్ 2న సచివాలయ వ్యవస్థకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవం పోశారు. కార్యదర్శుల నియామకం చేపట్టి ఈ వ్యవస్థను జనవరి 26న పూర్తి స్థాయిలో ప్రారంభించారు. సమస్త సేవలనూ ప్రజలకు చేరువ చేశారు. సచివాలయ వ్యవస్థతో సరికొత్త విప్లవం తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచారు సామాన్యుడు సైతం సమస్యలను వేగంగా, సులభంగా పరిష్కరించుకునేందుకు గ్రామ సచివాలయలు ఉపయోగుపడుతున్నాయి. ప్రభుత్వ సేవలన్నీ గ్రామాలు, వార్డుల్లోనే పొందేలా వెసులుబాటు వచ్చింది. ప్రభుత్వ పథకాలు సైతం వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే దరిచేరుతున్నాయి. ♦సచివాలయ వ్యవస్థ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా కరప సచివాలయం వద్ద చప్పట్లు కొట్టి సచివాయం ఉద్యోగులు,వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. ♦గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల సేవలకు సంఘీభావంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి తన నివాసం లో చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. ♦వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల సేవలకు సంఘీభావంగా విద్య శాఖ మంత్రి ఆదిములపు సురేష్ తన నివాసంలో చప్పట్లు కొట్టి అభినందించారు. ♦సంవత్సర కాలంలో కుల, మత, పార్టీలకతీతంగా సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి సంక్షేమ కార్యక్రమం నేరుగా ప్రజల చెంతకే చేరేలా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు అద్భుతంగా పని చేసినందుకుగాను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత రెండు నిమిషాలు చప్పట్లు కొట్టి వారిని అభినందించారు. ♦హోంమంత్రి సుచరిత చప్పట్లతో సంఘీభావం గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ఏర్పాటై గ్రామ స్వరాజ్యం స్థాపించి నేటికి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా వారు చేస్తున్న నిస్వార్థ సేవకు కృతజ్ఞతగా ఈరోజు గుంటూరు లోని వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్ లో చప్పట్లు కొట్టి వారి సేవలను అభినందించడం జరిగింది. #GramaSwarajyamInAP pic.twitter.com/EYI4MzNPBR — Mekathoti Sucharitha (@SucharitaYSRCP) October 2, 2020 ♦నెల్లూరు: గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ♦అనంతపురం: సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సేవలను అభినందిస్తూ పెనుకొండలోని తన నివాసంలో చప్పట్లు కొట్టి ప్రోత్సాహించిన మంత్రి శంకర్ నారాయణ. ♦విజయవాడ: గ్రామ వాలంటీర్ల సేవలకు సంఘీభావం తెలుపుతూ డిప్యూటీ సీఎం కళాత్తూర్ నారాయణ స్వామి తన కుటుంబ సభ్యులుతో సహా కృతజ్ఞతపూర్వకంగా చప్పట్లు కొట్టారు. ♦విశాఖ: గ్రామ,వార్డుసచివాలయ సిబ్బంది, వాలంటరీ వ్యవస్థకు మద్దతుగా చప్పట్లు కొడుతూ వైజాగ్ బీచ్ రోడ్ నుంచి వైస్సార్ విగ్రహం వరకు మహిళలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన పాల్గొన్నారు. ♦గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల సేవలకు సంఘీభావంగా నగరిలో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే రోజా చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. సీఎం జగన్ తీసుకొచ్చిన ఈ వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమ సేవాలందిస్తోందని రోజా పేర్కొన్నారు. గాంధీజీ స్వప్నం మరియు జగన్ అన్న అశయం అయిన గ్రామ స్వరాజ్యం సాధించడానికి సహకరించిన ప్రతి గ్రామ మరియు వార్డ్ వాలుంటీర్ అలాగే సచివాలయం సిబ్బంది కి కృతజ్ఞతలు 🙏@ysjagan @GSWSOfficial #GramaSwarajyamInAP #APVillageWarriors pic.twitter.com/owtqxhwWS6 — Roja Selvamani (@RojaSelvamaniRK) October 2, 2020 ♦విజయవాడ: సత్యనారాయణ పురం శివాజీ కేఫ్ సెంటర్లో వాలంటీర్ల వ్యవస్థ ఏడాది పూర్తి కావడంతో సీఎం ఆదేశాల మేరకు డివిజన్లో స్థానికులు చప్పట్లు కొడుతున్న దృశ్యం. -
తెలుగు తమ్ముళ్ల వీరంగం
-
తెలుగు తమ్ముళ్ల వీరంగం, కెమెరాలో రికార్డు
సాక్షి, అనంతపురం: అమరాపురం మండలం వి.అగ్రహారంలో టీడీపీ మాజీ ఎంపీటీసీ తిప్పేస్వామి వీరంగం సృష్టించాడు. అక్రమంగా ఫించన్ల సొమ్ముని కొట్టేయడంతో పాటు విచారణ సందర్భంగా మహిళా వలంటీర్‌ను తీవ్ర దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా వలంటీర్ వరలక్ష్మిపై చెప్పుతో దాడికి యత్నించాడు. వివరాలు.. డప్పు కళాకారుల పేరుతో కొన్నేళ్లుగా టీడీపీ మాజీ ఎంపీటీసీ తిప్పేస్వామి పింఛన్ సొమ్ముని స్వాహా చేస్తున్నాడు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి 14 అనర్హుల పింఛన్లను తొలగించారు. అయితే, విచారణకు సందర్భంగా తిప్పేస్వామి తన అనుచరులతో కలిసి రెచ్చిపోయాడు. వలంటీర్ వరలక్ష్మిపై చెప్పుతో దాడి చేసేందుకు యత్నించాడు. తీవ్రంగా తిట్టాడు. తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. (చదవండి: ఒక మహిళ.. రెండు పింఛన్లు) -
‘ఆ రోజు వాలంటీర్లకు చప్పట్లతో అభినందనలు’
సాక్షి, విజయవాడ : అక్టోబర్ 2న రాష్ట్రంలోని వాలంటీర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరూ చప్పట్లతో వాలంటీర్లకు అభినందనలు తెలపాలని పిలుపునిచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. ఏడాదిలో వాలంటీర్, సచివాలయ వ్యవస్థతో అనేక మార్పులు తెచ్చామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కీర్తించారు. చంద్రబాబు తమపై ఎన్ని విమర్శలు చేసినా కానీ తాము పనిచేసి చూపించామని స్పష్టం చేశారు. (అందరికీ.. అన్నిటికీ తామై.. ) గ్రామసచివాలయాలు, వాలంటీర్లు కోసం ఐఏఎస్‌ల శిక్షణ సిలబస్‌లో పాఠంగా చెప్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కరోనా సమయంలో వాలంటీర్లు చాలా కీలకంగా పనిచేశారని, మన వాలంటీర్ వ్యవస్థను కేంద్ర కేబినెట్ సెక్రటరీ అభినందించారని తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా 546 సేవలు, వాలంటీర్ల ద్వారా ప్రస్తుతం 35 సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పరిపాలనా వికేంద్రీకరణను గ్రామస్థాయి నుంచి చేసి చూపిస్తున్నామని, సీఎం జగన్ ఈరోజు ఈ వ్యవస్థ వలన దేశానికే ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. (ఏపీకి 15 ప్రతిష్టాత్మక పురస్కారాలు) -
అందరికీ.. అన్నిటికీ తామై..
గత టీడీపీ ప్రభుత్వం పల్స్ సర్వే పేరిట ప్రతి కుటుంబం వ్యక్తిగత వివరాలు సేకరించడానికి రెండేళ్ల సమయం తీసుకుంది. అయితే.. ప్రతి వలంటీర్ తన పరిధిలోని 50 కుటుంబాల సమాచారాన్ని రెండు నెలల్లోనే సేకరించారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థకు ఏడాది కాలం పూర్తయింది. ‘ఆ పనులకు ప్రత్యేకంగా వలంటీర్లు అవసరమా?’ అని విమర్శించిన ప్రతిపక్షాల నోళ్లు మూతపడేలా వలంటీర్ల వ్యవస్థ అద్భుత విజయాన్ని అందుకుంది. అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది. వలంటీర్ వ్యవస్థ ఏర్పాటుతో పథకాల అమలులో మునుపెన్నడూ లేనంత వేగం పెరిగింది. దేనికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనేలేదు.. ప్రభుత్వ పథకం తమకు అందాలంటే చేతులు తడపాల్సిన అవసరమూ లేదు.. ఏ నాయకుడి చుట్టూ ప్రదక్షిణలూ అక్కర్లేదు. అవినీతిరహితంగా, కులమతప్రాంతాలకతీతంగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి సంక్షేమ పథకాలను అందించడం దేశంలోనే ఇదే ప్రథమం. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.61 లక్షల మంది వలంటీర్లు ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకే తీసుకెళ్లారు. 4.5 కోట్ల మంది లబ్ధిదారుల ఎంపికలో.. రైతు భరోసా, అమ్మఒడి, మత్స్యకార భరోసా, కాపు నేస్తం, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, వాహనమిత్ర, జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత ఇలా అనేక పథకాలకు దాదాపు 4.5 కోట్ల మంది లబ్ధిదారుల ఎంపికలో వలంటీర్లదే కీలకపాత్ర. వివిధ పథకాల ద్వారా రూ.59 వేల కోట్ల ప్రభుత్వ సాయాన్ని అందించారు. అర్హత ఉంటే పది రోజుల్లోనే పింఛన్, రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందిస్తున్నారు. వలంటీర్ల సేవలతో 10.52 లక్షల మందికి కొత్తగా పింఛన్లు, రెండు లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరయ్యాయి. అవ్వాతాతల కన్నీళ్లు తుడిచి.. కదల్లేని స్థితిలో ఉన్న అవ్వాతాతలు ప్రతి నెలా పింఛన్ డబ్బుల కోసం ఊళ్లో పంచాయతీ ఆఫీసు దాకా వెళ్లి అక్కడ గంటల తరబడి వేచి చూసే దుస్థితి వలంటీర్ల వ్యవస్థతో తప్పింది. ప్రతి నెలా 1న తెల్లవారుజాముకల్లా అవ్వాతాతల ఇంటి వద్దనే వలంటీర్లు డబ్బులు అందిస్తున్నారు. కరోనాపై పోరులో వలంటీర్లదే కీలకపాత్ర వలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఐదుసార్లు తెలుసుకున్నారు. కరోనా సోకినవారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించడంలో వలంటీర్ల కృషికి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. నిరుపేదలకు ప్రభుత్వం రూ.1,000 సాయం చేసినప్పుడు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పంపిణీ చేశారు. -
గ్రామ వలంటీర్లపై సీఎం జగన్ ప్రశంసలు
సాక్షి, తాడేపల్లి: వలంటీర్ వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ ఆకాంక్షల మేరకు గ్రామ వలంటీర్లు అద్భుతమైన సేవలందిస్తున్నారని కొనియాడారు. వలంటీర్ల మెరుగైన పనితీరును చూసి గర్విస్తున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ వ్యవస్థ ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. ‘ఏడాది క్రితం రాష్ట్రంలో అవినీతి రహిత పాలన, లబ్దిదారుల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలు అందించే ప్రయాణాన్ని ప్రారంభించాం. ఏడాది ప్రయాణంలో మెరుగైన పనితీరు కనబర్చిన మా #APVillageWarriors కృషి పట్ల గర్వంగా ఉంది. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారు చక్కగా పనిచేశారు’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. (చదవండి: అంతులేని విషాదం) 1 year ago, we embarked upon a journey of corruption-free governance & last-mile delivery of services to every household of AP. We've come a long way since then. Proud of our #APVillageWarriors & the tremendous work they've been doing, especially in the face of adversity. pic.twitter.com/qaSudYJeTP -
మానవత్వాన్ని మింగేసిన కరోనా
సత్తెనపల్లి: కరోనా మానవత్వాన్ని మింగేస్తోంది. వైరస్ సోకి మరణిస్తే సొంత బంధువులు సైతం వణికిపోతున్న ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది. 55 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. ఐసోలేషన్‌కు వెళ్లే నిమిత్తం ఇంటివద్ద సిద్ధంగా ఉండాలని గ్రామ వలంటీర్ సూచించాడు. ఈలోగానే ఆస్పత్రిలో చేరాలని సొంత కుటుంబసభ్యులు, బంధువులతో ఆదివారం రోడ్డుపైకి వచ్చిన అతను కుప్పకూలి మరణించాడు. దీంతో భయపడిన బంధువులంతా అక్కడినుంచి పారిపోయారు. మూడు గంటలకు పైగా మృతదేహం రోడ్డుపైనే ఉండిపోయింది. చివరకు స్థానిక వైఎస్సార్సీపీ నేత చల్లంచర్ల సాంబశివరావు స్పందించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో మున్సిపల్ సిబ్బంది మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. -
రాష్ట్రంలో 2.60 లక్షల క్లస్టర్లు
సాక్షి, అమరావతి: నాణ్యమైన బియ్యాన్ని పేదల ఇళ్లకే డెలివరీ చేసేందుకు రాష్ట్రంలో 2.60 లక్షల క్లస్టర్లను ఏర్పాటు చేశారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 1,93,488 క్లస్టర్లున్నాయి. ఒక్కో క్లస్టర్ పరిధిలో 50 నుంచి 75 కుటుంబాలుండేలా చర్యలు తీసుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టవంతం చేసేందుకు, అవినీతికి తావులేకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో క్లస్టర్లో ఒక్కో గ్రామ వలంటీర్ సేవలందిస్తారు. వలంటీర్లు బియ్యం కార్డుల మ్యాపింగ్‌ను దాదాపుగా పూర్తిచేశారు. నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన శ్రీకాకుళం జిల్లాలో లబ్ధిదారులు గడప దాటకుండానే సరుకులు సకాలంలో వారి ఇంటికే చేరుతున్నాయి. ఈ విధానం మరో మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా పౌరసరఫరాల శాఖాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ► క్లస్టర్ పరిధిలో ఉన్న కార్డుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వారి ఎదుటే నాణ్యమైన బియ్యం తూకం వేసి పంపిణీ చేస్తారు. ► ఇందుకోసం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 13,370 మొబైల్ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ► ఇంటింటికీ పంపిణీ చేసేందుకు అయ్యే అదనపు ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ► ఈ విధానం అందుబాటులోకొస్తే 1.49 కోట్ల కార్డుదారులందరికీ రెండు మూడు రోజుల్లోనే సరుకులందుతాయి. ► రవాణాలో బియ్యం కల్తీ చేయకుండా గోడౌన్ల నుంచి వచ్చే ప్రతి గన్నీ బ్యాగుపైనా ప్రత్యేకంగా స్ట్రిప్ సీల్, బార్ కోడ్ ఉంటాయి. ► క్లస్టర్ల వివరాలను గ్రామ సచివాలయాల నుంచి తీసుకుని, వాటి ఆధారంగా బియ్యం కార్డులను కేటాయిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ చెప్పారు. -
శభాష్ వలంటీర్
సాక్షి, ముంచంగిపుట్టు (అరకు): ఆమె నిండు గర్భిణి. పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్దామంటే రోడ్డు సౌకర్యం లేదు.. ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆ సమయంలో భగవంతుడిలా ప్రత్యక్షమయ్యాడు.. ఆ గర్భిణిని డోలీలో ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణభిక్ష పెట్టాడు. ఆస్పత్రికి చేరడం ఆలస్యం కావడంతో మృత శిశువు జన్మించింది. ప్రస్తుతం ఆ మహిళ క్షేమంగా ఉంది. విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం మారుమూల లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ గ్రామానికి చెందిన బుద్రి అనే నిండు గర్భిణికి మంగళవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. రోడ్డు సౌకర్యం లేని ఆ గ్రామం నుంచి ఆమెను ఎలా ఆస్పత్రికి తరలించాలో తెలియక కుటుంబ సభ్యులు సతమతమవుతున్నారు. (వైజాగ్‌ని చాలా మిస్ అవుతున్నా..) విషయం తెలుసుకున్న గ్రామ వలంటీర్ సుబ్బారావు ముందుకొచ్చి డోలీ కట్టించి కుటుంబ సభ్యులతో బయల్దేరాదు. పన్నెండు కిలోమీటర్ల అటవీ కొండ ప్రాంతాన్ని దాటుకొని.. జోరు వానలో గర్భిణి తడిసి పోకుండా కవర్లు కప్పి లక్ష్మీపురం వరకు మోసుకొచ్చారు. అక్కడి నుంచి రోడ్డు సదుపాయం ఉండటంతో అక్కడి నుంచి 108లో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. ఆస్పత్రికి తీసుకురావడం ఆలస్యమై మృత శిశువుకు జన్మనిచ్చింది. కొండ మార్గంలో మైళ్ల దూరం ప్రయాణం చేసి ఆస్పత్రికి సకాలంలో చేరకపోవడం వల్లే బిడ్డను పోగొట్టుకున్నామని బుద్రి కుటుంబ సభ్యులు వాపోయారు. ముందుగానే ఆస్పత్రిలో చేరాలని సూచించినా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వలంటీర్ సుబ్బారావు అన్నాడు. (మిగతా రాష్ట్రాలకంటే మిన్నగా ఉన్నాం ) -
కొత్తగా పింఛన్ అందుకున్న1,15,269 మంది
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బుధవారం కొత్తగా 1,15,269 మంది పింఛన్ డబ్బులు అందుకున్నారు. దీంతో మొత్తంగా 59.03 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్ డబ్బులను అందజేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,442.21 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2.68 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు బుధవారం ఉదయం నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దేకే వెళ్లి పింఛన్ డబ్బులు అందజేశారు. జూలై నెల నుంచి కొత్తగా 5,165 మంది దీర్ఘకాలిక రోగులు, 1,10,104 మంది వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు పింఛన్ డబ్బులు అందుకోబోతున్నారని సెర్ప్ సీఈవో రాజాబాబు మంగళవారం వెల్లడించారు. ► కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో బయోమెట్రిక్ విధానానికి బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌తో లబ్ధిదారుని ఫొటో తీసుకునే విధానంలోనే ఈసారి కూడా డబ్బుల పంపిణీ కొనసాగనుంది. ► లాక్డౌన్ తదితర కారణాలతో గత మూడు నెలలుగా పింఛను డబ్బులు తీసుకోని వారికి కూడా బకాయిలతో కలిపి పంపిణీ చేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు. ► సొంత ఊరికి ఇప్పటికీ దూరంగా ఉన్న 4,010 మంది లబ్ధిదారులు పోర్టబులిటీ(అంటే పంపిణీ సమయానికి లబ్ధిదారుడు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకునే విధానం) ద్వారా డబ్బులు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా... 3,364 మంది తాము వేరే చోట ఉన్నామని, తమ ఊరికి తిరిగొచ్చాక ఇప్పటి పెన్షన్ డబ్బులు తీసుకుంటామని ముందస్తు సమాచారం అందజేశారు. మరోవైపు 26,034 మంది లబ్ధిదారులు తమ పింఛను డబ్బులను తాత్కాలికంగా ఇప్పుడు తాముంటున్న నివాస ప్రాంతానికి బదిలీ చేసి పంపిణీ చేయాలని ఆయా ప్రాంత వలంటీర్ల ద్వారా సమాచారమిచ్చారు. ► కాగా, జూన్ నెలలో రెండు విడతల్లో 2.11 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరవగా.. మొదటి విడతలో మంజూరైన 1.15 లక్షల మందికి జూలై ఒకటిన పింఛన్ డబ్బు పంపిణీ చేస్తున్నామని, మిగతా 96 వేల మందికి ఆగస్టు ఒకటి నుంచి పంపిణీ చేస్తామని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. జూలై ఒకటిన చేపట్టే పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ముందుగానే నిధులు విడుదల చేసింది. దీంతో రెండో విడతలో మంజూరు చేసిన 96 వేల పింఛన్లకు ఆర్థిక శాఖ నుంచి నిధులు మంజూరు చేసే ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ కారణం వల్ల వారందరికీ ఆగస్టు నుంచి డబ్బుల పంపిణీ మొదలవుతుందని ఆయన తెలిపారు. -
అర్హులందరికీ ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’
సాక్షి, అమరావతి: అర్హులైన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు లబ్ధిదారులకు సంబంధించి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం 2020–21 సంవత్సరానికి సర్వే చేయించింది. సర్వే జాబితాలను జిల్లా స్థాయి కమిటీలు పరిశీలించి ఖరారు చేశాయని ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పటికే నిధులు విడుదల చేసినట్లు వివరించింది. ఈ ఆదేశాల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ► గత సంవత్సరం అర్హులైన నేతన్న నేస్తం లబ్ధిదారులు వివిధ కారణాలతో ఆర్థిక సాయం అందుకోని వారు కొందరున్నారని, వారికి ఈ సంవత్సరం అందజేయాలని చేనేత జౌళి శాఖ డైరెక్టర్ చేసిన సూచనను ప్రభుత్వం స్వాగతించింది. ► పవర్‌లూమ్స్ రావడం వల్ల చాలా మంది చేనేతలు ఆర్థికంగా ముందుకు సాగలేక పోయారు. కేవలం మగ్గాలను నమ్ముకుని జీవిస్తున్న వారికి ప్రభుత్వం ఏడాదికి రూ.24,000 ఆర్థిక సాయం అందించి ముడి సరుకు, ఇతర అవసరాలకు ఉపయోగించుకునే విధంగా సాయ పడింది. ► ఆరు నెలల క్రితం గత సంవత్సరానికి వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. వేల మంది చేనేత కార్మికులకు ఈ ఆర్థిక సాయం వరంగా మారింది. అప్పుల బారి నుంచి చాలా మంది బయట పడ్డారు. మాస్టర్ వీవర్స్ వద్ద పని చేయడం మానేశారు. ► గతంలో పెట్టుబడి సాయం లేక మాస్టర్ వీవర్లను చేనేత కార్మికులు ఆశ్రయించే వారు. ఇప్పుడు ఆ పరిస్థితులు పోయాయి. నేరుగా ప్రభుత్వం సాయం అందించడంతో జీవనోపాధిని మెరుగు పరుచుకునేందుకు అవకాశం ఏర్పడింది. ► అసెంబ్లీ సమావేశాల కారణంగా ఈ నెల17న అందించాల్సిన ఆర్థిక సాయం ఈ నెల 20న అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్ ద్వారా నగదు బదిలీ జరిగి నేరుగా నేతన్నల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది. లబ్ధిదారుల ఎంపిక విషయంలో జిల్లా కమిటీలదే తుది నిర్ణయం. -
పాపం గిరిజన దంపతులు
నెల్లూరు, గూడూరు: వలంటీర్, సచివాలయ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు గిరిజన దంపతులకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కలిగింది. శుక్రవారం పోలీసులు, బాధితులు వెల్లడించిన కథనం మేరకు.. గూడూరు మండలం కొత్తతుంగపాళెంలో ఏకోలు రాజా, చందు అనే గిరిజన దంపతులు జీవిస్తున్నారు. చందు తల్లి రమణమ్మ మండలంలోని సంతదాసుపల్లిలో ఓ భూస్వామికి చెందిన తోటలో పనిచేస్తోంది. కొత్తతుంగపాళెంలో పనుల్లేకపోవడంతో రమణమ్మ తన కుమార్తె, అల్లుడిని కూడా ఆ భూస్వామి వద్దకు వచ్చి పనులు చేసుకోవాలని చెప్పింది. మూడేళ్ల క్రితం ఆ దంపతులు భూస్వామి వద్ద పొలం పనులకు కుదిరారు. అతను వారికి రూ.2 వేలు ఇచ్చి నెల రోజుల పాటు గొడ్డుచాకిరీ చేయించుకున్నాడు. అక్కడ పనిచేయలేక దంపతులు బయటపడాలనుకున్నారు. లెక్క చూసి తమకు నగదు ఇస్తే ఊరికి వెళ్లిపోతామని వారు భూస్వామిని కోరారు. దీంతో అతను దురుసుగా మాట్లాడాడని దంపతులు చెబుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో చంటిబిడ్డతో వారు స్వగ్రామానికి చేరుకున్నారు. వారం రోజులు గడిచాక భూస్వామి ఓ మేస్త్రీని తీసుకుని కొత్తతుంగపాళేనికి వెళ్లాడు. పనికి వస్తే రూ.10 వేలు ఇస్తానంటూ ఆశ చూపాడు. గ్రామంలో అప్పులు ఉండడంతో వాటిని తీర్చేందుకు దంపతులు నగదు తీసుకుని మళ్లీ పొలం పనుల్లో చేరారు. రెండేళ్లు పనిచేసినా భూస్వామి విడిచి పెట్టకుండా, రూ.50 వేలు మీరే ఇవ్వాలని చెప్తడంతో ఆయన వద్ద పనిచేయలేమని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో దంపతులు వైఎస్సార్ జిల్లా రాజంపేట సమీపంలోని కొలుపులూరులో బంధువులు ఉండడంతో అక్కడికి వెళ్లిపోయారు. కొడుకు బాధను చూసి.. దంపతుల ఆచూకీ తెలుసుకున్న భూస్వామి మేస్త్రీని తీసుకుని అక్కడికి వెళ్లాడు. దంపతులను తిడుతూ వాహనంలో ఎక్కించుకుని పనికి తీసుకొచ్చాడు. అప్పటినుంచి వారిని హింసిస్తూ వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాడు. దీంతో రాజా తల్లి వెంకటరమణమ్మ తన కొడుకు దయనీయ స్థితిని కొత్తతుంగపాళెం గ్రామ వలంటీర్ తులసీ దృష్టికి తీసుకెళ్లగా ఆమె చెన్నూరు సచివాలయంలోకి మహిళా పోలీస్ సౌజన్యకు చెప్పింది. వారు గూడూరు రూరల్ ఎస్సై పుల్లారావుకు ఫిర్యాదు చేశారు. ఆయన గురువారం సంతదాసుపల్లి గ్రామానికి వెళ్లి ఆ గిరిజన దంపతులను వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించి తీసుకొచ్చారు. ఆ దంపతులు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు శుక్రవారం గూడూరుకు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూస్వామి పొలంలో తాము చేసిన పనికి నగదు ఇప్పించాలని కోరుతున్నారు. -
ఇంటి వద్దే ఈకేవైసీ
కాకినాడ సిటీ: గతంలో రైస్‌కార్డు (రేషన్‌కార్డు) పొందాలన్నా, అందులో తప్పొప్పులను సరి చేసుకోవాలన్నా పెద్ద ప్రహసనంగా ఉండేది. పనులు మానుకుని ప్రభుత్వ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. నెలలు గడిచినా సమస్య పరిష్కారమయ్యేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జిల్లాలో నవశకం సర్వే ఆధారంగా కొత్త బియ్యం కార్డులను పంపిణీ చేశారు. ఆ కార్డుల్లో ప్రింటింగ్ తప్పొప్పులను సరి చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాన్ని కూడా కల్పించింది. ఈ ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా సాగుతోంది. ఇళ్లకు వచ్చే వలంటీర్లకు ప్రజలు సరైన సమాచారాన్ని ఇస్తే ప్రత్యేక యాప్ ద్వారా తప్పొప్పులను సరి చేస్తున్నారు. 41.08 లక్షల మంది వివరాలు నమోదు చేయాలి జిల్లాలో 14,67,777 కుటుంబాలకు రైస్ కార్డులు అందజేశారు. వాటిలో దాదాపు 41,08,299 మందికి ఈకేవైసీ (ఎలాక్ట్రానిక్ నో యువర్ క్లయింట్) వివరాలు నమోదు చేయాలి. ప్రతి ఒక్కరి ఈకేవైసీ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వలంటీర్లు వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఈకేవైసీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 9,51,702 కుటుంబాలకు చెందిన 21,54,158 మంది వివరాలు సేకరించారు. మిగిలిన 5,16,070 కుటుంబాలకు సంబంధించి 19,54,141 మంది ఈకేవైసీని తీసుకోనేందుకు వలంటీర్లు సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం అందజేసిన 14,67,777 కార్డుల్లో చాలా వరకు కుటుంబ పెద్ద (కార్డు హోల్డర్), కార్డులోని ఇతరుల సంబంధాలు తికమకగా ఉన్నాయి. వీటిని సరి చేస్తున్నారు. కొన్ని కార్డుల్లో సంబంధం లేని వారి పేర్లు ఉండడంతో తొలగింపు, చేర్పుల ప్రక్రియ మొదలైంది. తొలగింపు విషయంలో కేవలం మృతుల పేర్లు, కుటుంబానికి సంబంధం లేని వ్యక్తుల వివరాలను తొలగిస్తున్నారు. చేర్పులు విషయంలో కొత్తగా పెళ్లయిన కోడళ్లు, ఏ కార్డులోనూ లేని వారిని వారి కుటుంబానికి ఉండే కార్డులో చేర్చుతారు. కొత్తగా 49,791 రైస్ కార్డులు జిల్లాలో కొత్తగా బియ్యం కార్డు కోసం ‘స్పందన’లో దరఖాస్తు చేసుకున్న వారిలో 49,791 మంది రేషన్‌కార్డుల పొందేందుకు అర్హత పొందారు. వీరు ఇప్పటి వరకు ఎలాంటి రేషన్ కార్డు పొందలేదు. వీరికి కొత్తగా కార్డులు మంజూరు చేసే ప్రక్రియ మొదలైంది. కార్డు మంజూరు ఉత్తర్వులు రావడంతో ఆధార్ కార్డు ఆధారంగా రేషన్ సరుకులను ఇప్పటికే వీరు పొందుతున్నారు. పెండింగ్‌లో ఆధార్ సీడింగ్ రేషన్‌కార్డులోని ప్రతి సభ్యుడి ఆధార్ వివరాలు అందులో ఉన్నాయి. అయితే కొంతమందికి సంబంధించి తప్పుడు ఆధార్ నంబర్లు ప్రింట్ కావడంతో తీవ్ర ఇబ్బంది నెలకొంది. దీంతో వారికి రేషన్ అందడంలేదు. అయితే ఆధార్ సీడింగ్ తప్పొప్పులను సరి చేయడాన్ని ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచారు. త్వరలోనే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తాయని అంటున్నారు. వలంటీర్లే వివరాలు సరి చేస్తారు కొన్ని కార్డుల్లో వివరాలు తప్పుగా నమోదయ్యాయి. ముఖ్యంగా కుటుంబ పెద్దతోపాటు ఇతరుల వివరాలు తికమకగా ఉన్నాయి. కొందరికి ఈకేవైసీ లేదు. చనిపోయిన వారి పేర్లు తీసివేయడం, కొత్తగా పెళ్లి అయిన వారు, కార్డుల్లో లేని వారిని చేర్చడం తదితర వివరాలను వలంటీర్ల ద్వారా ప్రత్యేక యాప్‌తో సర్వే చేయిస్తున్నాం. ఇంటికి వచ్చిన వలంటీర్‌కు సరైన సమాచారం ఇచ్చి తప్పొప్పులను సరి చేసుకోవచ్చు. అర్హత ఉండి కొత్త రేషన్‌కార్డు కావాల్సిన వ్యక్తులు గ్రామ/వార్డు సచివాలయంలోనే దరఖాస్తులు ఇవ్వాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఈకేవైసీ కార్యక్రమం రెండు రోజుల్లో పూర్తి చేయాలని వలంటీర్లకు ఆదేశాలిచ్చాం. ఎంపీడీవోలు/ మున్సిపల్ కమిషనర్లు వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరాం.– పి.ప్రసాదరావు,జిల్లా పౌరసరఫరాల అధికారి -
వాలంటీర్‌కు వందనం
-
గ్రామ వాలంటీర్ గొప్పతనం
సాక్షి, అనంతపురం: వైఎస్ జగన్ ఏడాది పాలనలో సర్వత్రా ప్రశంసలు పొందింది గ్రామవాలంటీర్ వ్యవస్థ. అందుకు అనుగుణంగానే సీఎం ఆశయాలకు తోడ్పాటుగా గ్రామ వాలంటీర్లు పనిచేస్తూ తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో ఓ గ్రామవాలంటీర్ పెళ్లయిన గంటల వ్యవధిలోనే విధుల్లో చేరి తనకున్న బాధ్యతను తెలియజేశాడు. అమడగూరు మండలం గోపాల్‌నాయక్ తాండాలో తెల్లవారుజామున 6 గంటలకు పెళ్లి చేసుకున్న రాజశేఖర్ నాయక్ అనే గ్రామవాలంటీర్ 9 గంటలకు పెళ్లి బట్టల్లోనే గ్రామంలో పింఛన్లు పంపిణీ చేస్తూ తన గొప్పతనాన్ని చాటుకోవడం విశేషం. గ్రామ సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్లను నియమించి ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు తీసుకురాగలిగారు. అంతేకాదు ఈ వాలంటీర్ల సహాయంతో వృద్ధాప్య పెన్షన్లను రికార్డు స్థాయిలో లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు ఒకటవ తేదీనే చేర్చగలుగుతున్నారు. రాష్ట్రంలో మార్పు కోసమే గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చినట్లు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో అనేకసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: తాకట్టులో సాగరిక.. విడిపించిన మాజీ ఎంపీ . -
‘జగనన్న.. మీరే మా రియల్ హీరో’
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పేదలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని గ్రామ వాలంటీర్ హేమంత్‌రెడ్డి అన్నారు. తమ రియల్ హీరో సీఎం జగనేనని, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. కరోనా సంక్షోభంలోనూ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంటూ కొనియాడారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన- మీ సూచన’ పేరుతో మేథోమధన సదస్సు ప్రారంభమైంది.ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు తమ అనుభవాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. అప్పుడు కించపరిచారు.. ఇప్పుడు మా సేవలను గుర్తించారు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు కించపరిచారని, ఇప్పుడు వాలంటీర్ల సేవలను అందరూ గుర్తించారని గ్రామ వాలంటీర్ యెల్లతూరి స్మైలీ అన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలను కొనసాగిస్తూ సేవలందించడం ఆనందంగా ఉందన్నారు. అవినీతి రహితంగా తాము సేవలు అందిస్తున్నామని, జగనన్న వారియర్స్‌గా కొనసాగుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. చదవండి: సీఎం జగన్ అధ్యక్షతన ‘మన పాలన- మీ సూచన’ మీ నుంచి వచ్చిన గొప్ప ఆలోచన: నాగలక్ష్మీ ‘గ్రామ వాలంటీర్ వ్యవస్థ.. మీ నుంచి వచ్చిన గొప్ప ఆలోచన’ అని గ్రామవాలంటీర్ నాగలక్ష్మీ అన్నారు. ‘ఏ సమస్య ఉన్నా గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిష్కరించవచ్చు. గ్రామ వాలంటీర్ వ్యవస్థకు మంచి తోడ్పాటు అందించారు. ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ మేం చాలా సహాయం చేస్తున్నాం. కరోనా విపత్కర కాలంలోనూ మేం భయపడలేదు. ప్రజల కోసం పనిచేస్తున్నామని ధైర్యంగా ఉన్నాం. మీరు మాకు రూ.50 లక్షల ప్రమాద భీమా కల్పించి అండగా ఉన్నారు’ అని తెలిపింది. నేతన్న కష్టాలు తీర్చారు: ఫర్జానా పాదయాత్రలో నేతన్న కష్టాలు గమనించి ఇప్పుడు మీరు అండగా ఉన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 81 వేల మంది నేతన్నలకు రూ. 24 వేల పెట్టుబడి సాయం అందించడం ద్వారా మమ్మల్ని ఆదుకున్నారంటూ ఫర్జానా తెలిపింది. -
అద్భుతంగా గ్రామ సచివాలయ వ్యవస్థ
సాక్షి, అమరావతి : వ్యవస్థలో మార్పు తీసుకువస్తేనే తప్ప, ప్రజలను మనం ఆదుకోలేమనే భావన కలిగిందని, సుపరిపాలన అందించేందుకు ఒక వ్యవస్థను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆ వ్యవస్థే.. గ్రామ సచివాలయ వ్యవస్థ అని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని సీఎం జగన్ ప్రశంసించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల వ్యవస్థ ద్వారా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన- మీ సూచన’ పేరుతో మేథోమధన సదస్సు సోమవారం ప్రారంభమైంది. నేరుగా మీ ఇంటి వద్దకే సేవలు ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘14 నెలలపాటు నా పాదయాత్ర 3,648 కిలోమీటర్లు సాగింది. పాదయాత్రలో ప్రజల కష్టాలు గమనించా. ప్రభుత్వం ఏర్పడ్డాక సుపరిపాలన అందించేందుకు ఒక వ్యవస్థను తీసుకొచ్చాం. ఆ వ్యవస్థే.. గ్రామ సచివాలయ వ్యవస్థ. ప్రతి లబ్దిదారుడికి న్యాయం జరిగేలా చూస్తున్నాం.లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయంలో ఉంచుతున్నాం. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి నేరుగా ఇంటివద్దకే సేవలు అందేలా చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలకు వాలంటీర్ల వ్యవస్థలో 82 శాతం అవకాశం కల్పించాం. ఏడాది కాలంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం. అవినీతి లేని పారదర్శకత ఉన్న వ్యవస్థ.. గ్రామ సచివాలయ వ్యవస్థ. గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోంది. గ్రామ సచివాలయాలతో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అవ్వాతాతలకు నేరుగా ఇంటివద్దకే పెన్షన్ అందిస్తున్నాం. మత్స్యకార భరోసా, వాహనమిత్ర, వైఎస్ఆర్ భీమా పథకాలు తీసుకొచ్చాం. వాలంటీర్లు, ఆశావర్కర్ల వ్యవస్థ ద్వారానే కరోనాను నియంత్రణ చర్యలు చేపట్టాం. మూడుసార్లు కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించాం.’ అని తెలిపారు. 24 గంటలపాటు గ్రామాల్లో వైద్య సేవలు రాష్ట్రంలో 43 వేల బెల్టుషాపులను తొలగించామని, మద్యం అమ్మకాల్లో ప్రైవేట్ వ్యక్తులను కూడా తొలగించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. షాక్ కొట్టే విధంగా మద్యం ధరలు పెంచడంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయన్నారు. నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని, ప్రతి గ్రామంలో ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను ప్రారంభిస్తామన్నారు. 24 గంటలపాటు గ్రామాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నామని, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలో వ్యవసాయ నిపుణుల ద్వారా సలహాలు, సూచనలు అందిస్తామని వెల్లడించారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, త్వరలో గ్రామాల్లో జనతా బజారు తీసుకొస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. 18 దిశ పీఎస్‌లను ఏర్పాటు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 90 శాతం మేనిఫెస్టోను పూర్తి చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. జులై 8, 2019 వైఎస్సార్ పెన్షన్ కానుక ప్రారంభించాం. గత ప్రభుత్వం 44 లక్షల పెన్షన్లు ఇస్తే..ప్రస్తుతం 58 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. గత సర్కార్ రూ.1000 పెన్షన్ ఇస్తే.. ఈ ప్రభుత్వం రూ.2,250 పెన్షన్ ఇస్తోంది. 69 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించాం. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.1,110 కోట్ల సబ్సిడీ అందించాం. అన్ని పథకాలను గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటివద్దకే చేరుస్తున్నాం. మహిళల భద్రత కోసం దిశ చట్టం తీసుకొచ్చాం. 18 దిశ పీఎస్‌లను ఏర్పాటు చేశాం. 81 వేల మంది చేనేతలకు రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. 82 లక్షల మంది పిల్లలకు చేయూతగా 43 లక్షల మంది తల్లుల అకౌంట్లో అమ్మఒడి విద్యాదీవెన కింద రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ అందించాం. అని పేర్కొన్నారు. జులై 8 దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా 28 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తెలిపారు. రేపు అర్చకులు, పాస్టర్లు, మౌజమ్‌లకు రూ.5వేల చొప్పున సాయం చేస్తామన్నారు. ► మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం ►జూన్ 4న వైఎస్ఆర్ వాహన మిత్ర ►జూన్ 10న షాపు ఉన్న నాయిబ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు రూ.10వేలు ►జూన్ 17న మగ్గమున్న చేనేత కుటుంబాలకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం ►జూన్ 24న వైఎస్ఆర్ కాపు నేస్తం: సీఎం జగన్ ►జూన్ 29న చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి .. ►రెండో విడత రూ.450 కోట్లు విడుదల ►జులై 1న 1060 కొత్త 104, 108 అంబులెన్స్‌లు ప్రారంభం ►జులై 8న వైఎస్ఆర్ పుట్టిన రోజు సందర్భంగా 27 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ ►జులై 29న రైతులకు వడ్డీలేని రుణాలు ►ఆగస్టు 3న వైఎస్ఆర్ విద్యా కానుక ►ఆగస్ట్ 9న ఆదివాసీ దినోత్సవం రోజు గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ ►ఆగస్ట్ 12న వైఎస్ఆర్ చేయూత: సీఎం జగన్ ►ఆగస్ట్ 19న వైఎస్ఆర్ వసతి దీవెన: సీఎం జగన్ ►ఆగస్ట్ 26న హౌసింగ్ నిర్మాణం ►15 లక్షల వైఎస్ఆర్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభం ►సెప్టెంబర్ 11న వైఎస్ఆర్ ఆసరా ►సెప్టెంబర్ 25 వైఎస్ఆర్ విద్యా దీవెన ప్రారంభం ►అక్టోబర్‌లో రెండో విడత రైతు భరోసా, ప్రతి రైతు కుటుంబానికి రూ.4 వేలు ►అక్టోబర్‌లో గుర్తింపు కార్డు ఉన్న చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకే రూ.10 వేల రుణం ►నవంబర్‌లో విద్యా దీవెన రెండో దఫా ఫీజులు నేరుగా తల్లుల అకౌంట్‌కు ►డిసెంబర్లో అగ్రిగోల్డ్ బాధితులకు సహాయం ►2021, జనవరిలో రెండో విడత అమ్మ ఒడి ►2021 జనవరిలోనే చివరి విడత రైతు భరోసా, రూ.2వేలు ►2021 ఫిబ్రవరి విద్యా దీవెన మూడో త్రైమాసం, రెండో దఫా వసతి దీవెన ►2021 మార్చిలో పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. -
మన పాలన.. మీ సూచన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఏడాది కాలంగా అమలుచేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై ‘మన పాలన–మీ సూచన’ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి ఈనెల 30 వరకు రోజూ రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మేథోమధన సదస్సులు నిర్వహిస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసి ఈ నెల 30 నాటికి ఏడాది పూర్తవుతుండడంతో సోమవారం ‘పరిపాలన–సంక్షేమం’పై సీఎం అధ్యక్షతన మొదటి సదస్సు జరగనుంది. జిల్లా స్థాయిలో పథకాల లబ్ధిదారులు, ఆయా రంగాల నిపుణులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన వాటిపై వారి నుంచి సలహాలు, సూచనలను తీసుకుంటారు. ఈ సదస్సు ఉ.10.30 గంటలకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రారంభం కానుంది. సదస్సులో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో.. పరిపాలన–సంక్షేమం, ఈ రెండు అంశాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలా అమలయ్యాయి? ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఏడాది పాలనలో ఎలా ఉందో.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఇలా.. ► టీడీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు జన్మభూమి కమిటీల కంబంధ హస్తాల్లో నలిగిపోయారు. ► ఆ కాలంలో వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ► రేషన్ కార్డు, పింఛన్.. ఇలా ఏ సంక్షేమ పథకం కావాలన్నా ఆ కమిటీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వచ్చేది. ► ఈ కమిటీల సిఫార్సులతో పాటు సంబంధిత ఎమ్మెల్యేలు, మంత్రులు ఆఖరికి ముఖ్యమంత్రి ఆమోదిస్తేగానీ అవి మంజూరయ్యేవి కావు. ► సచివాలయానికి వచ్చినా అవి మంజూరు కావడం ఎండమావిగానే ఉండేది. ► టీడీపీ సానుభూతిపరులకే అన్నీ అందేవి. ► మిగిలిన వారి దరఖాస్తులను నిర్దాక్షిణ్యంగా బుట్టదాఖలు చేసేవారు. ఇప్పుడు ఇంటివద్దకే పరిపాలన తెలుగుదేశం హయాం నాటి దుర్భర పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఏడాది కిందట అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్ కొద్దిరోజుల్లోనే పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాటి నుంచి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రమంతా ఆవిష్కరించారు. పాదయాత్రలో ప్రజలకిచ్చిన మాట మేరకు.. ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల ద్వారా పరిపాలన వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి దగ్గరకే ప్రభుత్వ పాలనను తీసుకువెళ్లారు. ఎలాగంటే.. ► రాష్ట్రవ్యాప్తంగా 15,003 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేశారు. ► వీటిలో 1.34 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలను కల్పించారు. ► అలాగే, మరో 2.70 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లను నియమించారు. ► గ్రామాల్లో ప్రతి 50 ఇళ్ల బాధ్యతలు ఒక గ్రామ వలంటీర్‌కు.. పట్టణాల్లో ప్రతీ 100 ఇళ్ల బాధ్యతలు ఓ వార్డు వలంటీర్‌కు అప్పగించారు. ► గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 534 సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ► ఎవరికైనా రేషన్ కార్డు, పింఛను, సర్టిఫికెట్టు, ఆరోగ్యశ్రీ కార్డు ఇలా ఏదైనా సర్వీసు కావాలంటే వలంటీర్‌కు చెప్పి దరఖాస్తు చేస్తే చాలు. ఇక ఎవ్వరి దగ్గరకు ప్రజలు వెళ్లక్కర్లేదు. ► సచివాలయం, మండల కార్యాలయాలు, ప్రజాప్రతిని« దులు చుట్టూ కూడా తిరగాల్సిన పనేలేదు. ► సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల సిఫార్సుల అవసరమే లేదు. ► అర్హులైన వారందరికీ ఇంటి దగ్గరకే ప్రభుత్వ ఫలాలు వచ్చి చేరుతున్నాయి. ► గ్రామ సచివాలయంలో లబ్ధిదారుల అర్హతలను ఈ వలంటీర్లు పరిశీలించి ఆన్లైన్లో సంబంధిత సెంట్రల్ సర్వర్‌కు వారి దరఖాస్తులను పంపుతున్నారు. ► సంబంధిత శాఖ మరోసారి అర్హతపై ఆన్లైన్లోనే తనిఖీలు నిర్వహిస్తోంది. ► అర్హత ఉందా లేదా అనే సిఫార్సుతో 72 గంటల్లో గ్రామ సచివాలయానికి తిరిగి దరఖాస్తు వస్తుంది. ► అంతే.. గ్రామ సచివాలయంలో అర్హత ఉన్న వారికి వెంటనే సంబంధిత కార్డు ప్రింట్ చేసి వలంటీర్ ద్వారా ప్రజల ఇళ్లకు అందజేస్తారు. ► అర్హత లేదని తేలితే మరోసారి మూడో పార్టీ ద్వారా తనిఖీ చేస్తారు. అనంతరం దరఖాస్తుదారునికి తెలియబరుస్తారు. ► ఇందుకనుగుణంగా అధికార యంత్రాంగం ఆన్లైన్ వ్యవస్థను రూపకల్పన చేసింది. ► అంతేకాదు.. అధికార వికేంద్రీకరణను చేపట్టడంతో పాటు పాలనలో జవాబుదారీ, పారదర్శకతను ప్రభుత్వం తీసుకువచ్చింది. ► ఇందులో భాగంగా ఈ పథకాల మంజూరు అధికారాన్ని తహసీల్దారుకు అప్పగించారు. ► తహసీల్దారు 12 గంటల్లోగా మంజూరు చేయడమో లేదా తిరస్కరించడమో చేయాలి. అలా చేయకపోతే ఆటోమేటిక్‌గా మంజూరు అయ్యేలా ఆన్లైన్ వ్యవస్థను రూపకల్పన చేశారు. ► ఇది నిరంతరం జరిగే ప్రక్రియగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. లబ్ధిదారుల గుర్తింపునకు ఇంటింటి సర్వే ఇదిలా ఉంటే.. వైఎస్సార్ నవశకం పేరుతో నవరత్నాల్లోని పథకాలన్నింటికీ సంతృప్త (శాచురేషన్) స్థాయిలో అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించింది. ఆయా పథకాల పరిధిలోకి మరింత ఎక్కువమంది లబ్ధిదారులు వచ్చేందుకు వీలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అర్హత నిబంధనలు సడలిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అర్హులను వలంటీర్ల ద్వారా గుర్తించి.. ఫలాలను వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఇప్పించారు. వార్షిక ఆదాయం ఐదు లక్షలలోపు ఉన్న వారందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేశారు. దీంతో రాష్ట్రంలోని 95 శాతానికి పైగా జనాభాకు ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరుచేసి ఆరోగ్య భరోసా కల్పించారు. చివరిగా.. నవరత్నాల్లోని ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడానికి రాజకీయాలు, పార్టీలు, మతాలు, కులాలు, ప్రాంతాలు చూడబోమని, అర్హత ఉంటే చాలు.. వారికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని, పైసా లంచం ఇవ్వకుండానే ప్రయోజనాలను నేరుగా ఇంటికి పంపిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీ రాష్ట్రంలో అక్షరాలా నిజమవుతోంది. -
నిబద్ధతతో సేవలందించండి
సాక్షి, అమరావతి : నిబద్ధతగల అధికారులుగా ప్రజలకు మంచి సేవలందించి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 ఏపీ కేడర్‌కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్‌లకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులోనూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఐఏఎస్‌లదే కీలకపాత్ర అయినందున చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన వారిని కోరారు. మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఓ మహిళేనని, మహిళల రక్షణ కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా దిశా చట్టాన్ని చేయడంతో పాటు ప్రత్యేక పోలీసు స్టేషన్లు ఏర్పాటుచేశామని యువ ఐఏఎస్ అధికారులకు ఆయన వివరించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను శనివారం ఈ ప్రొబేషనరీ ఐఏఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరిని ముఖ్యమంత్రి అభినందించారు. అనంతరం యువ ఐఏఎస్‌లు మాట్లాడారు. వారేమన్నారంటే.. ► వలంటీర్ల వ్యవస్థ, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రితో చర్చించాం. ► గ్రామ వలంటీర్లు, అధికార వికేంద్రీకరణ వంటి కొత్త వ్యవస్థలో పనిచేయడం ఆనందంగా ఉంది. ► ముస్సోరిలో తమకిచ్చిన శిక్షణలో గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో పాటు అధికార వికేంద్రీకరణపై పలుమార్లు చర్చ జరిగింది. గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయాల ద్వారా సాధ్యమవుతుంది. మహిళాభివృద్ధి మీద ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ► నిన్నటివరకు పరిపాలనకు సంబంధించి అనేక అంశాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్‌గా తెలుసుకోబోతున్నాం. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన యువ ఐఏఎస్‌లలో ఎం. నవీన్, నిధి మీనా, చహత్ బాజ్‌పాయ్, వికాస్ మర్మత్, వి.అభిషేక్, జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్, సి. విష్ణుచరణ్, కట్టా సింహాచలం, అపరాజిత సింగ్ సిన్సివర్, భావన వశిష్ట్ ఉన్నారు. -
వలంటీర్లపై మూకుమ్మడి దాడి
శ్రీకాళహస్తి రూరల్ (చిత్తూరు జిల్లా): మాజీ మంత్రి, టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుల దాడిలో ముగ్గురు గ్రామ వలంటీర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం మన్నవరంలో చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి రూరల్ సీఐ గుడికాటి విజయ్‌కుమార్ కథనం మేరకు.. మన్నవరం పంచాయతీలో కొల్లం వంశీ (21), సి.జయప్రకాష్ (24), సి.శ్రీనివాసులు (24) గ్రామ వలంటీర్లుగా పనిచేస్తున్నారు. విధులు నిర్వహించడానికి వారు గురువారం పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లారు. అప్పటికే స్థానిక టీడీపీ నేత, శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు పంచాయతీ కార్యాలయానికి తాళాలు వేసి తీసుకుపోయాడు. తాళాలు అడిగినా ఇవ్వలేదని చెంచయ్య నాయుడుపై వలంటీర్లు ఎంపీడీవో బాలాజీ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రెచ్చిపోయిన చెంచయ్య నాయుడు, అతడి అనుచరులు వలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన సెల్ఫోన్లు లాక్కుని వెళ్లిపోయారు. ఎంపీడీవో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తుండగా.. మరోమారు టీడీపీ నేతలు చెంచయ్య నాయుడు, రాంబాబు నాయుడు, చెంచుకృష్ణయ్య, వెంకటేశ్వరావు, శ్రీనివాసులు, శివ తదితరులు మూకుమ్మడిగా వలంటీర్లపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వలంటీర్లు రక్షించాలంటూ ఆర్తనాదాలు చేయడంతో వైఎస్సార్సీపీ కార్యకరలు.. చెంచయ్య నాయుడు, కోటి, నరేష్ దాడులకు పాల్పడుతున్న వారిని అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు వారిపై కూడా దాడికి దిగారు. టీడీపీ నేతల దాడిలో గాయపడ్డవారిని స్థానికులు శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు వలంటీర్‌గా పనిచేస్తున్న తనను కులం పేరుతో దూషించి, దాడి చేశారని కొల్లం వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దాడి చేసిన రంగినేని చెంచయ్యనాయుడు, రాంబాబు నాయుడు, తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. వలంటీర్ల విధులకు ఆటంకం కలిగించారంటూ ఎంపీడీవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కాగా, విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తమపై విచక్షణారహితంగా దాడులు చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని వలంటీర్లు తెలిపారు. గ్రామంలోకి వెళ్తే తమను చంపే ప్రమాదం ఉందని విలపించారు. -
వాలంటీర్ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం
సాక్షి, అమరావతి : కరోనా సమయంలో విధులు నిర్వర్తిస్తూ ఆకస్మికంగా మృతి చెందిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ వాలంటీర్ గబ్బాడ అనురాధ (26) గుండెపోటుతో మరణించింది. దినపత్రికల్లో ఈ వార్తను చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం అనురాధ కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. (కష్టకాలంలో కొండంత ధైర్యమిచ్చారు) సీఎంఓ అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విపత్తు సమయంలో పని చేస్తున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. గబ్బాడ అనూరాధ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటిస్తూ, ఈ సహాయం వెంటనే కుటుంబ సభ్యులకు అందేలా చూడాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కాగా పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సాయంగా రూ.10వేలు అందించారు. (రూ. 1,299.14 కోట్ల పింఛను ఒక్కపూటలో పంపిణీ ) -
బూతులు తిడుతూ.. టీడీపీ నేత దాదాగిరి
సాక్షి, చిత్తూరు: విచక్షణ కోల్పోయిన ఓ టీడీపీ నేత.. వార్డు వాలంటీర్‌పై దాదాగిరికి పాల్పడ్డాడు. సహాయక కార్యక్రమానికి అడ్డు తగులుతూ.. ఓవరాక్షన్ చేయడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని వడమాలపేట మండలం లక్ష్మీపురంలో టీడీపీ నేత ధనుంజయులు నాయుడు తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెడ్‌జోన్ పరిధిలో ప్రజలకు ఎమ్మెల్యే రోజా వార్డు వాలంటీర్ల ద్వారా గురువారం కూరగాయలు, నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తన అనుమతి లేకుండా నిత్యావసరాలు పంచుతావా అంటూ వాలంటీర్‌పై టీడీపీ నేత ధనుంజయులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు బండ బూతులు తిడుతూ దురుసుగా ప్రవర్తించాడు. టీడీపీ నేత ప్రవర్తనపై వాలంటీర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధనుంజయులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
మహిళా వలంటీర్‌పై టీడీపీ కార్యకర్తల దాడి
నెల్లూరు, వాకాడు: మండలంలోని శ్రీపురానికి చెందిన వలంటీర్ సీహెచ్ శ్రావణిపై బుధవారం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆమె విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా దాడి చేసి గాయపరిచారు. లాక్డౌన్ నేపథ్యంలో కల్లు విక్రయాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయితే శ్రీపురంలో టీడీపీకి చెందిన కొందరు కల్లు విక్రయాలు జరుపుతుండడంతో ఇతర ప్రాంతాల వారు పెద్ద ఎత్తున కల్లు కోసం వస్తున్నారన్నారు. దీంతో విక్రయదారులను అడ్డుకునే ప్రయత్నంలో తాను పోలీసులకు ఫిర్యాదు చేయగా ‘ మాపైనే ఫిర్యాదు చేస్తావా?’ అంటూ బూతులు తిడుతూ మూకుమ్మడిగా తనపై దాడి చేయడమే కాకుండా అడ్డొచ్చిన తన భర్త, సోదరుడిపై కూడా దాడి చేసి గాయపరిచారన్నారు. ఈ విషయమై ఎంపీడీఓ గోపీనాథ్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. -
వలంటీర్ల భర్తీకి నేడు నోటిఫికేషన్
అనంతపురం: గ్రామ, వార్డు వలంటీర్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం ఎంపీడీఓలు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈనెల 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 25న స్క్రూటినీ నిర్వహిస్తారు. 27 నుంచి 29 వరకు ఎంపిక చేసి అర్హత సాధించిన వారికి లెటర్లు పంపుతారు. ఎంపికైనవారు మే 1 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. జిల్లాలో మొత్తం 15,254 గ్రామ వలంటీర్లు పోస్టులుండగా... ప్రస్తుతం 675 పోస్టులు ఖాళీగా ఉన్నాయని జిల్లా పంచాయతీ అధికారి రామనాథరెడ్డి తెలిపారు. గ్రామ వలంటీర్ల ఖాళీల వివరాలు.. అమడగూరు 3, అమరాపురం 13, అనంతపురం రూరల్ 40, ఆత్మకూరు 18, బత్తలపల్లి 9, బెళుగుప్ప 3, బొమ్మనహాళ్æ 7, బ్రహ్మసముద్రం 11, బుక్కపట్నం 13, బుక్కరాయసముద్రం 15, చిలమత్తూరు 14, చెన్నేకొత్తపల్లి 5, డి.హీరేహాళ్ 12, ధర్మవరం రూరల్ 24, గాండ్లపెంట 2, గార్లదిన్నె 7, గుత్తి 9, గోరంట్ల 18, గుడిబండ 8, గుమ్మఘట్ట 3, గుంతకల్లు 12, హిందూపురం 16, కదిరి 5, కళ్యాణదుర్గం 17, కంబదూరు 12, కనగానపల్లి 17, కణేకల్లుæ 13, కొత్తచెరువు 6, కూడేరు 13, కుందుర్పి 11, లేపాక్షి 5, మడకశిర 7, ముదిగుబ్బ 12, ఎన్పీ కుంట 13, నల్లచెరువు 6, నల్లమాడ 6, నార్పల 12, ఓడీ చెరువు 7, పామిడి 14, పరిగి 12, పెద్దపప్పూరు 12, పెద్దవడుగూరు 15, పెనుకొండ 8, పుట్లూరు 13, పుట్టపర్తి 7, రామగిరి 8, రాప్తాడు 11, రాయదుర్గం 3, రొద్దం 23, రొళ్ల 7, శెట్టూరు 10, శింగనమల 4, సోమందేపల్లి 14, తాడిమర్రి 4, తాడిపత్రి 12, తలుపుల 5, తనకల్లు 9, ఉరవకొండ 15, వజ్రకరూరు 11, విడపనకల్లు 9, యాడికి 18, యల్లనూరు 7. 393 వార్డు వలంటీర్ల పోస్టులు.. అనంతపురం సెంట్రల్: అనంతపురం కార్పొరేషన్, అన్ని మున్సిపాలిటీల్లోనూ 393 వార్డు వలంటీర్ల పోస్టుల భర్తీ కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీల్లో భర్తీ ప్రక్రియ పూర్తికాగా, మరికొన్ని వాటిలో కసరత్తు చేస్తున్నారు. వార్డు వలంటీర్ల పోస్టుల వివరాలు.. అనంతపురం 72, హిందూపురం 120, కళ్యాణదుర్గం 66, తాడిపత్రి 50, ధర్మవరం 54, కదిరి 6, పెనుకొండ 8, రాయదుర్గం 7, పుట్టపర్తి 5, మడకశిర 5. -
కరోనా: ప్రయాణ చరిత్ర పరిశీలన
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో ఇప్పటివరకు పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. అలాగని ప్రభుత్వం, అధికారులు తేలికగా తీసుకోవడం లేదు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా మరింత లోతుగా పరిశీలన చేస్తున్నారు. ప్రయాణాల చరిత్ర ఆ«ధారంగా ట్రాక్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. ప్రతి పది మందికీ ఒక కోవిడ్ ఆఫీసర్‌ను నియమించారు. వారిని పర్యవేక్షించేందుకు మండలానికో స్పెషల్ ఆఫీసర్‌ను ఏర్పా టు చేయగా, జిల్లా స్థాయిలో కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. విదేశాల నుంచి 1445 మంది రాక కరోనా ప్రభావం పెరిగిన నేపథ్యంలో విదేశాల నుంచి జిల్లాకు 1445 మంది వచ్చారు. వారందర్నీ ప్రత్యే క క్వారంటైన్‌లోనూ, హోమ్ క్వారంటైన్లో పెట్టా రు. లక్షణాలు ఉన్న వారికి ఎప్పటికప్పుడు శాంపి ల్స్ తీసి పరీక్షలు చేశారు. ఇంతవరకైతే విదేశాల నుంచి వచ్చిన వారెవరికీ పాజిటివ్ రాలేదు. దా దాపు శాంపిల్స్ అన్నీ నెగిటివ్ ఫలితాలొచ్చా యి. విదేశాల నుంచి వచ్చిన వారిలో అంతా దాదాపు 14 రోజులకు పైగా క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. దీంతో వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం కని్పంచడం లేదు. ప్రయాణ చరిత్ర ఆధారంగా.. విదేశాల నుంచి వచ్చిన వారినే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి విమానాలు, రైళ్ల ద్వారా జిల్లాకు వచ్చిన వారి వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. విమానయాన, రైల్వే శాఖ వచ్చిన వివరాలు ఆధారంగా సంబంధిత వ్యక్తులను గుర్తిస్తున్నారు. కొందర్ని ఫోన్లో ఆరా తీయగా, మరికొందర్ని చిరునామాల ఆ«ధారంగా చేసుకుని గుర్తిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, వలంటీర్లు, మెడికల్ సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి గుర్తింపు కార్యక్రమం చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి నేతృత్వంలో పోలీసు సిబ్బంది కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మొ త్తానికి ఫిబ్రవరి నెల నుంచి ట్రావెల్ హిస్టరీ చూస్తున్నారు. ఏ ఒక్కర్నీ విడిచి పెట్టడం లేదు. లాక్డౌన్ తర్వాత జిల్లాలోకి 5009 మంది లాక్డౌన్ అమలు తర్వాత జిల్లాలోకి 5009 మంది వచ్చినట్టు సమాచారం. వేర్వేరు మార్గాల ద్వారా వారంతా జిల్లాలోకి ప్రవేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాల నుంచి వచ్చిన సమాచారంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వీరిలో ముంబై నుంచి 600 మంది, ఢిల్లీ నుంచి 400 మంది వచ్చిన వారు ఉన్నారు. మిగతా రాష్ట్రాలు, మిగతా జిల్లాల నుంచి కూడా వచ్చారు. వారందర్నీ అధికారులు ఇ ప్పటికే గుర్తించారు. వారికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ కేటాయించారు. ఇలా వచ్చిన 10 మందికి ఒక కోవి డ్ ఆఫీసర్‌ను నియమించి ఎప్పటికప్పుడు వారి కదలికలను గమనిస్తున్నారు. కేటాయించిన 10మంది వద్దకు ప్రతి రోజూ కోవిడ్ ఆఫీసర్ వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. వారి వద్దకు వెళ్లాలంటే తప్పనిసరిగా స్కాన్ చేయాలి. అక్కడ చేసిన స్కాన్ జిల్లా అధికా రుల వద్ద అప్డేట్ అవుతుంది. దీంతో కోవిడ్ ఆఫీ సర్లు వారికి కేటాయించిన 10మంది వద్దకు వెళ్తున్నారో లేదో ఇట్టే తెలిసిపోతుంది. మరోవైపు ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు వేలల్లో ఉండటంతో వారందరి కోసం వలంటీర్లు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసు కుంటున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు గానీ, ఇతర ఆరోగ్య సమస్యలు గానీ కనిపిస్తే వెంటనే నోట్ చేస్తున్నారు. నోట్ చేసినవన్నీ వైద్యాధికారుల లాగిన్లోకి వచ్చేస్తున్నాయి. వాటి ఆధారంగా త దుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శాంపిల్స్ సేకరణలో కూడా జోరు పెంచారు. సో మవారం ఒక్కరోజే 135 శాంపిల్స్ తీశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మంగళవారం కూడా పెద్ద సంఖ్యలో శాంపిల్స్ తీశారు. ఇకపై శాంపిల్స్ ఫలితాలు కూడా వేగంగా రానున్నాయి. ఇంతవరకు కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు పరీక్షల కోసం పంపించారు. తాజాగా విశాఖపట్నంలో కూ డా టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం కావడంతో సుదూర ప్రాంతమైన కాకినాడకు కాకుండా విశాఖపట్నంకు పంపిస్తున్నారు. దీంతో ఫలితాల వెల్లడి కూడా వేగవంతం కానుంది. -
ఏపీలో రూ.1000 ఆర్థిక సహాయం పంపిణీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.1000 పంపిణీ శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. ఇవాళ ఉదయం నుంచే గ్రామ వాలంటీర్లు ఇంటింటీకి వెళ్లి లబ్ధిదారులకు నగదు అందచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ వాలంటీర్లు ఇంటింటికీ ఆర్థిక సాయం పంపిణీ చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రికి పేదలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దీంతో కోటి 30 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందనుంది. (వ్యవ'సాయం' ఆగొద్దు) కాగా కరోనా వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే లాక్డౌన్ వల్ల పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకెళుతోంది. పేదలకు చేయూత అందించాలనే ఉద్దేశంతో వారికి ఉచితంగా బియ్యం, కందిపప్పుతోపాటు ఒక్కో కుటుంబానికి ఏప్రిల్ 4న రూ.1,000 చొప్పున నగదు ఇస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. (కరోనా: ఇంటింటి సర్వేపై సీఎం జగన్ ఆరా) ఇందులో భాగంగానే మొదటి విడతగా గత నెల 29 నుంచి పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ చేస్తున్నారు. నేడు (శనివారం) బియ్యం కార్డులున్న 1.30 కోట్ల కుటుంబాలకు ఇంటి వద్దే వలంటీర్ల ద్వారా రూ.వెయ్యి చొప్పున నగదు సాయం అందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలందరికీ ఈ ప్రత్యేక సాయం అందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యం. (క్షణక్షణం.. అప్రమత్తం) పేదలకు ఆర్థిక సహాయానికి 1300 కోట్లు విడుదల శ్రీకాకుళం జిల్లాలో 7.5 లక్షల మందికి 75.06 కోట్లు పంపిణీ విజయనగరం జిల్లాలో 6.47 లక్షల మందికి 64.79 కోట్లు పంపిణీ విశాఖ జిల్లాలో 11.05 లక్షల మందికి 110.56 కోట్లు పంపిణీ తూ.గో.జిల్లాలో 14.65 లక్షల మందికి 146.54 కోట్లు పంపిణీ ప.గో.జిల్లాలో 11.44 లక్షల మందికి 114.48 కోట్లు పంపిణీ కృష్ణా జిల్లాలో 11.21 లక్షల మందికి 112.10 కోట్లు పంపిణీ గుంటూరు జిల్లాలో 12.87 లక్షల మందికి 128.70 కోట్లు పంపిణీ ప్రకాశం జిల్లాలో 8.76 లక్షల మందికి 87.66 కోట్లు పంపిణీ నెల్లూరు జిల్లాలో 7.76 లక్షల మందికి 77.69 కోట్లు పంపిణీ చిత్తూరు జిల్లాలో 9.92 లక్షల మందికి 99.21 కోట్లు పంపిణీ అనంతపురం జిల్లాలో 10.67 లక్షల మందికి 106.79 కోట్లు పంపిణీ కర్నూలు జిల్లాలో 10.56 లక్షల మందికి 105.67 కోట్లు పంపిణీ వైఎస్ఆర్ జిల్లాలో 7.06 లక్షల మందికి 70.69 కోట్లు పంపిణీ -
ప్రసవ వేదన వరకూ ప్రజా సేవలో..
పశ్చిమగోదావరి జిల్లా, పోడూరు: ప్రజలకు అంకితభావంతో సేవలందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు కట్టుబడి ఆ మహిళా వలంటీర్ ప్రసవ వేదన వరకూ ప్రజాసేవలోనే నిమగ్నమయ్యారు. గ్రామస్తుల మన్ననలు అందుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరుకు చెందిన వలంటీర్ విన్నకోట జ్యోతి గురువారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలోని ఓ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె ప్రసవానికి ముందురోజు వరకూ విధుల్లోనే నిమగ్నమయ్యారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో గ్రామంలో సర్వేలో పాల్గొన్నారు. బుధవారం కూడా పింఛన్ లబ్ధిదారులకు నగదు అందజేసి విధుల పట్ల నిబద్ధత చాటుకున్నారు. దీంతో స్థానిక అధికారులు, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కర్రి గౌరీ సుభాషిణి, వైఎస్సార్సీపీ నాయకుడు కర్రి వేణుబాబు తదితరులు జ్యోతిని అభినందించారు. సంకల్ప బలంతోనే.. సీఎం వైఎస్ జగన్ చదువుకున్న నాలాంటి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారు. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యలో ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ఆయన స్ఫూర్తితోనే ప్రజలకు వలంటీర్లం సేవలందిస్తున్నాం. 1వ తేదీ ఆపన్నులకు పింఛన్ ఆగకూడదని సీఎం సంకల్పించారు. అందుకే ఆ సంకల్ప బలంతోనే.. వలంటీర్‌గా నా వృత్తికి న్యాయం చేయాలని ప్రసవ సమయం దగ్గరకు వచ్చినా నా విధి నిర్వర్తించాను. 4వ తేదీన రేషన్‌కార్డుదారులకు కూడా రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేయాలనుకున్నాను. కానీ ఈలోగా బిడ్డకు జన్మనిచ్చాను. – విన్నకోట జ్యోతి, మార్టేరు, వలంటీర్ -
కరోనా వైరస్: ఎవరినీ వదలొద్దు..
కాకినాడ సిటీ: నగరాలు, పట్టణాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాటిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రతి రోజు ప్రతి కుటుంబాన్ని వార్డు స్థాయిలో వలంటీర్లు పరిశీలన చేయాలన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో టీమ్స్ బాగా పని చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీనికి కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు బాధ్యత ఉందన్నారు. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లకు వివరించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ అభిషిక్త్ కిశోర్‌తో మాట్లాడుతూ యువ అధికారుల నుంచి ప్రభుత్వం మరింత సేవలను ఆశిస్తుందన్నారు. దానికి అనుగుణంగా పని చేయాలన్నారు. (దారుణం: కరోనా అంటూ కొట్టిచంపారు) కోవిడ్–19 కేసుల కోసం జిల్లాలో కిమ్స్ ఆసుపత్రిలో నాన్ ఐసీయూ బెడ్స్ 730 నుంచి 800లకు, ఐసీయూ బెడ్లు 52 నుంచి 70కి పెంచుతున్నట్టు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి బి రాజశేఖర్, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ, జేసీ–2 రాజకుమారి, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం కరోనా నియంత్రణ ప్రత్యేకాధికారి బి రాజశేఖర్ విద్యాశాఖాధికారులతో మాట్లాడారు. పాఠశాలలకు సంబంధించి నాడు–నేడు కార్యక్రమం చేపట్టిన పనులను పూర్తి చేసేలా చూడాలన్నారు. జిల్లాలో పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 24 వరకు కావల్సిన రేషన్ ఉంచి, మిగతా వాటిని జిల్లా యంత్రాంగానికి ఇచ్చేయాలని ఆదేశించారు. రైతు బజారుల్లో వ్యాయామ ఉపాధ్యాయులను కరోనా నియంత్రణలో భాగంగా వారి సేవలను వినియోగించాలన్నారు. కలెక్టరేట్లో టెలీహబ్ ఏర్పాటు కాకినాడ: స్థానిక కలెక్టరేట్లోని అబ్జర్వేషన్ సెంటర్లో టెలీహబ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి సోమవారం తెలిపారు. ఆరుగురు వైద్యులతో ఈ హబ్ 24 గంటలు పని చే స్తుందన్నారు. జలుబు, దగ్గుతో బాధపడే వారు ఏ సమయంలోనైనా ఫోన్ ద్వారా ఈ వైద్యుల సలహాల కోసం 0886 2333466, 0884 2333488 నంబర్లను సంప్రదించాలనిఆయన సూచించారు. (కరోనా విలయానికి కారకులెవరు?) కోవిడ్–19 కాల్ సెంటర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కోవిడ్–19 కాల్ సెంటర్‌కు వ్యక్తిగతంగా ఎవరినీ అనుమతించమని కలెక్టర్ తెలిపారు. వైద్య, రవాణా, పౌర సరఫరాలు, పోలీస్ తదితర అత్యవసర సమస్యలున్న వారు కంట్రోల్ రూమ్‌లోని కాల్ సెంటర్లను 1800 425 3077, 0884 2356196, 93923 24287కు ఫోన్ చేసి సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. -
వలంటీర్‌పై టీడీపీ నాయకుల దాడి
చౌటగోగులపల్లి(పీసీపల్లి): ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించిన వలంటీర్‌పై టీడీపీ నాయకులు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే..మండల పరిధిలోని చాటగోగులపల్లిలో వైద్య సిబ్బంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వెళ్లి వచ్చిన టీడీపీ నాయకుల ఇంటికి వలంటీర్ నరసింహులు వెళ్లి పిలవగా సుగమంచి ఓబుల్ నరేంద్ర, వారి అనుచరులు 15 మంది కలిసి అతనిపై దాడి చేశారు. దీంతో వలంటీర్ టీడీపీ నాయకులపై ఆదివారం ఎస్సై మధుసూదనరావుకు ఫిర్యాదు చేశారు. వలంటీర్‌పై దాడిని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గోపవరపు బొర్రారెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎస్కే నజీర్ బాషాను ఖండించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలన్నారు. పరిటాలవారిపాలెం(సంతమాగులూరు): వలంటీర్‌పై దాడి చేసి కులం పేరుతో దూషించిన సంఘటన పరిటాలవారిపాలెంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన సతీష్ రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు వెళుతుండగా అదే గ్రామానికి చెందిన యర్రం శెట్టి వీరాంజనేయులు వలంటీర్‌ని అడ్డుకొని మా అమ్మ పింఛన్ తీసేస్తావా అంటూ.. కులం పేరుతో దూషించి దాడి చేశాడు. దీంతో వలంటీర్ మిగిలిన వలంటీర్లతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వీరాంజనేయులపై ఫిర్యాదు చేశాడు. వలంటీర్ ఫిర్యాదు మేరకు వీరాంజనేయులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై నసీద్ బాషా తెలిపారు. -
సీఎం జగన్ బాటలో కేరళ, బ్రిటన్
తిరువనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాలంటీర్లు గుదిబండలా తయారవుతారంటూ ప్రతిపక్ష టీడీపీతో సహా ఎంతో మంది విమర్శలు గుప్పించినా.. పట్టువీడని విక్రమార్కుడిలా ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం జగన్ నాలుగు లక్షలకుపైగా నిరుద్యోగులను గ్రామ వాలంటీర్లుగా నియమించారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఏమాత్రం అవినీతికి ఆస్తారం లేకుండా వారే చూసుకుంటున్నారు. అయితే ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌పై పోరులోనూ ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్లు విశేష కృషి చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా లాక్‌డౌన్‌లోనూ.. వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన విధుల మేరకు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ, రేషన్ సరఫరా వంటి కార్యక్రమాల్లో వీరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాగే కరోనా వైరస్ కట్టడికి నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తికనపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అనుసరిస్తున్న వాలంటీర్ల వ్యవస్థను తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిర్ణయించారు. మహమ్మారి కరోనా వైరస్ కేరళపై తీవ్ర ప్రభావం చూపుతోన్న తరుణంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి అధ్యక్షతన భేటీ అయిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ నివారణకు గ్రామ స్థాయిలో సేవకులుగా 2 లక్షల 36 వేల వాలంటీర్లును వెంటనే నియమించాలని నిర్ణయించారు. అలాగే వీరందరినీ కేవలం గ్రామాల్లోనే కాకుండా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా ఉపయోగించుకోవాలని విజయన్ భావిస్తున్నారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా నియామకాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కాగా కరోనా కేరళపై తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. మరోవైపు గ్రామ వాలంటరీ వ్యవస్థపై పలు ప్రపంచ దేశాలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. వీరిలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ముందువరుసలో ఉన్నారు. బ్రిటన్‌లో ఇప్పటికే 2 లక్షల 80 వేల గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేశారు. వీరందరిని కరోనాపై పోరుకు సహాయకులుగా ఉపయోగించుకోనున్నారు. కాగా ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఆగస్టు 15వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. గ్రామ వాలంటీర్లు నియమితులైన వారికి ప్రతి నెలా రూ.5 వేల చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. దీని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధిని పొందారు. -
కరోనా.. దాక్కోలేవు!
మడకశిర మండలానికి చెందిన కొందరు ఉపాధి కోసం నేపాల్‌కు వెళ్లారు. ఉగాది పండుగను పురస్కరించుకుని వారంతా ఈనెల 22న తిరిగి సొంత ఊళ్లకు చేరుకున్నారు. వీరి సమాచారాన్ని గ్రామ వలంటీర్లు అధికారులకు చేరవేశారు. ఎంపీడీఓ, ఎస్ఐ, వైద్యాధికారులు ఆగమేఘాల మీద అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. దేశ సరిహద్దులో వైద్య పరీక్షలు చేశారని, వ్యాధి లక్షణాలు లేవని తెలుసుకుని వారికి అవగాహన కల్పించి వెళ్లారు. .. ఇక్కడే కాదు జిల్లా వ్యాప్తంగా గ్రామవలంటీర్లు ఇదే తరహాలో సమాచారం సేకరించి ఎప్పటికప్పుడు అధికారులకు చేరవేస్తున్నారు. కరోనాపై పోరాటంలో గ్రామ వలంటీర్లు కీలక భూమిక పోషిస్తున్నారు. విదేశాల నుంచి ఎవరైనా వచ్చినా.. గ్రామాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపించినా వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడ, ఏ మారుమూల గ్రామాల్లో చిన్న ఘటన చోటు చేసుకున్నా వలంటీర్లు ఇట్టే స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వానికి కొండంత అండగా నిలుస్తోంది. అనంతపురం: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలకంగా వ్యవహరిస్తున్న వలంటీర్లు ప్రపంచ వ్యాప్తంగా మానవాళికి ముచ్చెమటలు పట్టిస్తున్న ‘కరోనా వైరస్’ కట్టడిలోనూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 50–60 ఇళ్లకు ఒక వలంటీరును నియమించి అటు ప్రజలు, ఇటు ప్రభుత్వానికి వారధిలా పని చేసేందుకు చర్యలుతీసుకుంది. ప్రజలకు నిత్యం అత్యంత దగ్గరగా ఉండే వలంటీర్లు ప్రస్తుతం గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా, అనుమానం కలిగినా వెంటనే అధికారులకు సమాచారం చేరవేస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రభుత్వ పిలుపుతో వలంటీర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. వైద్య సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యులు, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ వివరాలన్నీ ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఎవరికైనా జలుబు, తలనొప్పి, జ్వరం, ఇతరత్రా అనారోగ్యం ఉన్నట్లు గుర్తిస్తే వారిని ఆస్పత్రులకు వెళ్లాలంటూ సూచిస్తున్నారు. అధికారుల దృష్టికి వివరాలు ఉద్యోగ, ఉపాధి రీత్యా ఇతర దేశాలు, రాష్ట్రాలకు వెళ్లి ఇటీవల స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వారి వివరాల సేకరణలో వలంటీర్లు క్రియాశీలకంగా పని చేస్తున్నారు. వలంటీర్ల ద్వారానే పలువురి వివరాలను అధికారులు సేకరించారు. ఒక వలంటీరు తన పరిధిలోని 50–60 ఇళ్లలోని వ్యక్తులు ఎంతమంది ఏమి పని చేస్తున్నారు.. ఎక్కడ చేస్తున్నారనే వివరాలు ఇదివరకే సిద్ధం చేసుకున్నారు. దీనికితోడు రోజూ ఆ ఇళ్ల చుట్టూ తిరుగుతుండడంతో ఆ కుటుంబాల్లోని వ్యక్తులు బయట నుంచి వచ్చినా.. లేదా కొత్తవారెవరైనా వచ్చినా వలంటీరుకు ఇట్టే తెలిసిపోతుంది. ఈ వివరాలను వలంటీర్లు తమ సచివాలయ అధికారులకు చేరవేస్తున్నారు. ప్రతి ఇల్లూ తిరుగుతున్నారు కరోనా వైరస్ నేపథ్యంలో వలంటీర్లు ప్రతి ఇల్లూ తిరుగుతూ సర్వే చేస్తున్నారు. వైద్య సిబ్బందితో కలిసి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులు, వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుని యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతన్నట్లు గుర్తిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.– రామనాథరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి -
సైన్యం కదిలింది
సాక్షి కడప : కరోనాపై సమరం సాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడికక్కడ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు ప్రధాని నరేంద్రీమోదీ స్వీయ నిర్బంధానికి పిలుపునివ్వడంతో అంతటా నిర్బంధం సాగుతోంది. జిల్లాకు సంబంధించి ఉన్న అన్ని వనరులను వినియోగించుకుని పూర్తి స్థాయిలో కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు అధికారులు కంకణం కట్టుకుని కదులుతున్నారు. ఇప్పటికే మొదటివిడతలో ఈనెల రెండోవారంలో ఒకమారు పూర్తి చేసి వివరాలు సేకరించిన వలంటీర్లు అనే సైనికులు మరోమారు కరోనా మహమ్మారిపై పూర్తి స్థాయిలో వివరాలకు ఇళ్ల బాట పడుతున్నారు. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు, స్థానికంగా ఇళ్లలో ఉన్న వారికి సంబంధించి జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరణ ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో తిరిగి జిల్లాకు వచ్చిన వారి వివరాలను వలంటీర్లు సేకరిస్తున్నారు. విదేశాల నుంచి ఎప్పుడు వచ్చారు? ప్రస్తుతం ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా? తదితర వివరాలను నిక్షిప్తం చేస్తున్నారు. జిల్లాకు విదేశాల నుంచి దాదాపుగా 3,936 మందికి పైగా ఇటీవల వచ్చిన నేపథ్యంలో వారందరికీ సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా విదేశాల నుంచి వచ్చిన అందరినీ ఐసోలేషన్ కేంద్రాల్లో పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. ఎక్కడైనా, ఎవరైనా వచ్చి తప్పించుకుని తిరుగుతున్న నేపధ్యంలో సర్వే ద్వారా వివరాలు సేకరించి కామన్ క్వారంటైన్‌కు తరలించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రధానంగా విదేశాలకు సంబంధించినవారి వివరాలను సేకరించి స్క్రీనింగ్ చేసిన వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. జలుబు, జ్వరం, దగ్గు ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ చూసినా...ఏ నోట విన్నా ఒకటే మాట కరోనా వైరస్.. నలుగురు కలిసినా దీని గురించి చర్చోప చర్చలు. ప్రస్తుతం ఇంటిలో ఉన్న సాధారణ మనుషులకు కూడా జలుబు, జ్వరం, దగ్గు ఉన్నా కూడా కరోనా వైరస్ అని భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. స్వీయ నిర్బంధం, ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించడం ద్వారానే దీనిని నివారించవచ్చు. ఎందుకంటే వైరస్‌కు మందు లేదు. ప్రస్తుతం సర్వేలో భాగంగా వలంటీర్లు జలుబు, జ్వరం, దగ్గు ఉన్న వారి వివరాలను కూడా ప్రభుత్వానికి అప్లోడ్ చేసి పంపుతున్నారు. రెండురోజుల్లో సర్వే జిల్లాలో కరోనా వైరస్‌పై వలంటీర్లు సర్వే కొనసాగిస్తున్నారు. ఏఎన్ఎంలు కూడా కొంత సహకారం అందిస్తుండగా..అన్ని వివరాలు రాబడుతున్నారు. బుధ, గురు వారాల్లో సర్వేను పూర్తి చేసి అప్లోడ్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో వేగవంతం చేశారు. ఇంటింటికి తిరుగుతూ.. వివరాలు రాబడుతూ.. జిల్లాలోని 51 మండలాలు, అన్ని మున్సిపాలిటీలను కలుపుకుని దాదాపుగా 889 సచివాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో 14,892 మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. 50 ఇళ్లకు ఒకరు చొప్పున ఉండడంతో వారు ప్రస్తుతం సర్వేను ఇంటింటికి తిరుగుతూ అన్ని వివరాలు తీసుకుని యంత్రాంగానికి పంపుతున్నారు. జిల్లాలో 7,77,553 ఇళ్లు ఉండగా అన్ని ఇళ్లకు ఉదయం నుంచి వెళుతూ సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. వివరాలు సేకరిస్తున్నాం విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు, మరికొంత సమాచారాన్ని సేకరిస్తున్నాం. రెండు రోజుల్లో పూర్తి చేసేందుకు ఈరోజే మొదలు పెట్టి ఇంటింటికి తిరుగుతున్నాం. విదేశాల నుంచి ఎవరెవరు వచ్చారు? ఏ దేశం నుంచి వచ్చారు? ఎప్పుడు వచ్చారు? ప్రస్తుతం ఎలా ఉన్నారు? అనారోగ్య సమస్య ఉందా? ఐసోలేషన్‌కు వెళ్లారా? లేదా? ఇలా అన్ని వివరాలను నమోదు చేస్తున్నాం.– జి.వినోద్, 47/1, అక్కాయపల్లె, వలంటీర్, కడప సర్వే పూర్తి కావచ్చింది మా పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నాం. ప్రస్తుతం దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి సంబంధించి వివరాలు తీసుకొచ్చి అప్లోడ్ చేస్తున్నాం. నబీకోట పరిధిలో దాదాపుగా సర్వే పూర్తి కావచ్చింది. – పఠాన్ బషీర్, నబీకోట, వలంటీర్, కడప -
సేవా 'వరం'టీర్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/తణుకు/నిడదవోలు రూరల్/నరసాపురం రూరల్/మొగల్తూరు: గ్రామ, వార్డు వలంటీర్లు కరోనా మహమ్మారిని నియంత్రించడంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇంటింటా సర్వే చేయడంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలను వివరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సహకారంతో విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంలో జిల్లాలో వలంటీర్ల పాత్ర కీలకంగా మారింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాబారిన జిల్లా ప్రజలు పడకుండా వీరు పోషిస్తున్న పాత్ర అందరి ప్రశంసలు అందుకుంటోంది. వీరికి తోడుగా ఏఎన్ఎం, ఆశావర్కర్లు జిల్లాలో పరిస్థితి అదుపు తప్పకుండా రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడం, వారి వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఇవ్వడంలో ప్రముఖంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం పనికొంత సులభమైంది. విదేశాల నుంచి వచ్చిన వారు రాష్ట్రంలోనే ఎక్కువగా పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్నారు. కరోనా విజృంభణ మొదలైన తర్వాత వివిధ కరోనా పీడితదేశాల నుంచి మూడు వేల మందికి పైగా జిల్లాకు తిరిగి వచ్చారు. జిల్లావ్యాప్తంగా 16,430 మంది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 50 కుటుంబాలకూ ఒక వలంటీర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 16,430 మంది వలంటీర్లు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలల్లో 8,500 మంది సిబ్బంది ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిసిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించమని వలంటీర్లకు ఆదేశించింది. వలంటీర్లు తమకు కేటాయించిన 50 కుటుంబాల వివరాలను సేకరించారు. విదేశాల నుంచి వచ్చిన వారినీ గుర్తించారు. ఆ సమాచారాన్ని వెంటనే మొబైల్ యాప్ ద్వారా ప్రభుత్వానికి పంపించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విదేశాల నుంచి వచ్చిన వారందరనీ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులకు తరలించారు. మరికొందరిని గృహాల్లోనే ఐసొలేషన్ ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహించారు. అయితే ఎవరికీ కరోనా పాజిటివ్ రిపోర్ట్ రాకపోవటంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. విదేశాల నుంచి వచ్చిన వారందరినీ గృహాల్లోనే ఉంచి వలంటీర్లు, వైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్నిరోజులుగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తి వచ్చినా స్థానికులు వెంటనే వలంటీర్లకు సమాచారమిస్తున్నారు. వారి ద్వారా వారి వివరాలు సేకరించి, వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు జిల్లా పంచాయతీ అధికారి నేతృత్వంలో జిల్లాలోని 11 వందల మంది పంచాయతీ కార్యదర్శులు తమ వద్ద ఉన్న 2,500 మంది పారిశుద్ధ్య కార్మికులతో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మేముసైతం.. పోడూరు: పోడూరు మండలం వేడంగిపాలెం ఎస్సీకాలనీలో గ్రామ వలంటీర్లు మంగళవారం పారిశుద్ధ్య సేవలు అందించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో వలంటీర్లు విశేష సేవలందిస్తున్నారు. వేడంగిపాలెంలోని ఎస్సీ కాలనీలో గ్రామ వలంటీర్లు బ్లీచింగ్ స్ప్రే చేశారు. వైఎస్సార్ సీపీ మండల బూత్ కన్వీనర్ బళ్ల రాజశేఖర్ మాట్లాడుతూ కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రామ వలంటీర్లు పారిశుద్ధ్య సేవలు అందించడం ప్రశంసనీయమన్నారు. వలంటీర్లు ఊసల రమేష్, గునుపూడి ప్రకాష్‌తో పాటు స్థానిక యువకుడు నేతల కిషోర్ బ్లీచింగ్ స్ప్రే చేశారు. కవిటంలో పారిశుద్ధ్య చర్యలు కవిటం గ్రామంలో మంగళవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో విస్తృతంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. గ్రామంలో పలుచోట్ల రోడ్లపై ఉన్న చెత్తకుప్పలను డంపింగ్ యార్డుకు తరలించారు. పలుచోట్ల డ్రెయినేజీల్లో, రోడ్లపక్కన పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పంచాయతీ కా ర్యదర్శి జి.సత్యనారాయణరెడ్డి పనులను పర్యవేక్షించారు. అందరూ ఇళ్లలోనే ఉండాలి కూరగాయల ధరలు, కిరణా సరుకులు, హ్యాండ్ వాష్‌లు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ప్ర జల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. కరో నా ప్రభావంతో వార్డులో ప్రజలందరినీ ఇళ్ల ల్లోనే ఉండాలని సూచిస్తున్నాం. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు పదిహేను రోజులు గడిచింది. వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. వార్డులో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం. –దాసరి అక్కమ్మ, వలంటీర్, 19వ వార్డు, కొవ్వూరు -
వండర్ వలంటీర్!
ఒంగోలు టౌన్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ/వార్డు వలంటీర్లు ఇప్పుడు కరోనా కేసుల గుర్తింపులోనూ కీ రోల్ పోస్తున్నారు. వండర్ వలంటీర్లుగా ప్రశంసలు అందుకుంటున్నారు. 50 నుంచి 60 కుటుంబాలకు ఒకరి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్లను నియమించింది. వారి పరిధిలోని కుటుంబాలకు సంబం«ధించిన సంక్షేమ కార్యక్రమాల్లో వలంటీర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. రెండు నెలల నుంచి సామాజిక భద్రత పింఛన్ల నగదును లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వలంటీర్లు స్వయంగా అందజేసి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని గుర్తించడంలోనూ వీరు ప్రముఖ పాత్ర పోషిస్తూ అటు అధికారులు, ఇటు ప్రజల మన్ననలు పొందుతున్నారు. వీరు ఏదో ఒక కార్యక్రమానికే పరిమితం కాకుండా ప్రజారోగ్య విషయంలో కూడా భాగస్వాములు కావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్ ప్రత్యక్షం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. సచివాలయాలకు సంబంధించి ప్రాధాన్యతా అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కార్యదర్శులను నియమించింది. పట్టణ ప్రాంతాల్లో డివిజన్‌కు ఒకటి చొప్పున సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఆ సచివాలయాలకు వలంటీర్లను అనుసంధానం చేసింది. సచివాలయాలు ఏర్పాటు చేసే ముందు వలంటీర్ల ద్వారా ఆ ప్రాంతంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఆ ఇళ్లల్లో ఎంతమంది నివశిస్తున్నారన్న సమగ్ర సమాచారాన్ని ఫోన్ నంబర్లతో సహా వలంటీర్లు సేకరించి తమ వద్ద ఉంచుకున్నారు. ప్రతి వలంటీర్ తన పరిధిలోని ఇళ్లలో నివసించే ప్రతి ఒక్కరి సమగ్ర సమాచారం తన వద్ద భద్రపరచుకున్నారు. ఒక వ్యక్తి పేరు చెబితే వెంటనే ఆ వ్యక్తి, కుటుంబ సభ్యుల వివరాలు టకాటకా చెప్పేయడం వీరి ప్రత్యేకత. కరోనాలో కీలకపాత్ర.. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. జిల్లా కేంద్రం ఒంగోలు రాంనగర్లో తొలుత ఒక అనుమానిత కేసు నమోదైంది. అతడికి నెగెటివ్‌గా నిర్ధారణ కావడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఆ కేసును గుర్తించడంలో వలంటీర్ కీలకపాత్ర పోషించాడు. మూడు రోజుల క్రితం జెడ్పీ కాలనీలో కరోనా కేసు నమోదైంది. ఈ కేసును కూడా అక్కడి వార్డు వలంటీరే ముందుగా సమాచారాన్ని సేకరించి యంత్రాంగానికి అందించారు. దీంతో సకాలంలో ఆ కుటుంబ సభ్యులందరిని రిమ్స్‌లోని ప్రత్యేక వార్డులో ఉంచే అవకాశం కలిగింది. విదేశాల నుంచి ఇక్కడకు వచ్చేవారి ద్వారా ఆ వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో అలాంటి వారిని గుర్తించడంలో వార్డు వలంటీర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. విదేశాల్లో ఉంటూ చదువుకుంటున్నవారు, విదేశాల్లో స్థిరపడినవారు, స్వగ్రామాలకు వస్తున్నవారి వివరాలను సకాలంలో గుర్తించడంలో సక్సెస్ అయ్యారు. -
'కరోనా' కదన రంగంలోకి వలంటీర్లు
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఇకపై గ్రామ, పట్టణ వలంటీర్లు రంగంలోకి దిగనున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను గ్రామ వలంటీర్ల ద్వారా సేకరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ, పట్టణ వలంటీరు ఉంటారు కాబట్టి విదేశాల నుంచి ఆయా గ్రామాలకు వచ్చిన వారిని తేలిగ్గా గుర్తించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 10 తర్వాత విదేశాలకు వెళ్లి వచ్చిన వారుగానీ, లేదా అంతకుముందే వెళ్లి ఫిబ్రవరి 10 తర్వాత ఇక్కడకు వచ్చిన వారి వివరాలుగానీ సేకరించి వైద్య ఆరోగ్యశాఖకు ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల నుంచి ఆరోగ్యశాఖ సిబ్బందికి మినహాయింపు రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. వార్డు, గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎంలకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. కేఎస్ జవహర్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. వీరిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని.. అలా తీసుకుంటే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి చేపడుతున్న చర్యలకు అవరోధం ఏర్పడుతుందని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 43 మంది అనుమానితులకు వైద్య పరీక్షలకు నిర్వహించగా, 36 మందికి లేదని తేలింది. మిగిలిన ఏడుగురి ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా వైరస్ లక్షణాలున్న వారి కోసం 428 ప్రత్యేక పడకలు, 55 వెంటిలేటర్లు ఏర్పాటుచేశారు. నెల్లూరు యువకుడికి కరోనా? నెల్లూరుకు చెందిన ఓ యువకుడికి కరోనా(కోవిడ్–19) వైరస్ సోకినట్టుగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఇటలీలోని మిలాన్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న 22 ఏళ్ల యువకుడు ఈ నెల 6న చెన్నై మీదుగా స్వస్థలం నెల్లూరుకు వచ్చాడు. తీవ్రమైన జ్వరం, దగ్గుతో బాధపడుతుండటంతో వైద్య అధికారులు ఈ నెల 7న నెల్లూరులోని బోధనాసుపత్రిలో రక్త నమూనాలు సేకరించి తిరుపతికి పంపారు. ప్రాథమికంగా పాజిటివ్ (‘ప్రిజమ్‌టీవ్ పాజిటివ్) అని వచ్చింది. దీంతో తదుపరి పరీక్షల కోసం రక్త నమూనాలను పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం ఆ యువకుడు నెల్లూరు బోధనాసుపత్రిలోని ఐసొలేటెడ్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఇటలీ నుంచి వచ్చిన వారు ఇంటి వద్దే 14 రోజులపాటు ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్‌రెడ్డి ఓ ప్రకటనలో సూచించారు. -
మచిలీపట్నంలో టీడీపీ నాయకుల దాష్టీకం
సాక్షి, కృష్ణా : మచిలీపట్నంలో టీడీపీ నాయకులు దాష్టీకానికి తెగబడ్డారు. 9వ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లపై దాడికి దిగారు. సచివాలయం ఇక్కడ ఉండటానికి వీలు లేదని నినాదాలు చేస్తూ ఆడవారిపై దాడి చేశారు. ‘కులం తక్కువ దానివి. నువ్వేంటే మాకు చెప్పేది’ అంటూ భారతి అనే 4 నెలల గర్భిణీపై పాక్షికంగా దాడి చేశారు. అదే విధంగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తుంటే ఓటర్ కార్డులు మీ చేతిలో ఉండటం ఏంటి.. అని వాలంటీర్లతో టీడీపీ నేతలు గొడవకు దిగారు. -
సూపర్ వలంటీర్..!
దేవరాపల్లి(మాడుగుల): లబ్ధిదారుల చెంతకు పథకాలు అందించేందుకు వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి సంకల్పం అక్షరాలా నెరవేరుతోంది. ఒక్క వృద్ధురాలికి పింఛన్ ఇచ్చేందుకు వ్యయప్రయాసలకోర్చి నాటుపడవలో ఏరుదాటి అతికష్టం మీద గ్రామానికి చేరుకుని తన అంకితభావాన్ని చాటుకున్నాడు ఓ వలంటీర్. దేవరాపల్లి మండలం తామరబ్బ పంచాయతీ పరిధిలోని లోవ ముకుందపురం గ్రామంలో ఏటికి అవతలి వైపు వృద్ధురాలు వంతె పోతమ్మకు చెందిన ఒక్క కుటుంబం నివసిస్తోంది. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే గుట్టలు, కొండల్లో ఏడు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేయాలి. లేదంటే నాటుపడవలో ఏరును దాటి.. మూడు కిలోమీటర్లు నడవాలి. పోతమ్మకు వృద్ధాప్య పింఛన్ అందజేయాలన్న లక్ష్యంతో స్థానిక వలంటీర్ టేడ సింహాచలం నాటు పడవలో ప్రయాణించి అతికష్టం మీద గ్రామానికి చేరుకున్నారు. పోతమ్మకు వృద్ధాప్య పింఛన్ సొమ్మును అందజేశారు. పింఛన్ సొమ్మును ఇంటికి తీసుకొచ్చిన వలంటీర్‌ను పోతమ్మ కుటుంబ సభ్యులు అభినందించారు. గతంలో పింఛన్ అందుకోవాలంటే చాలా కష్టాలు పడాల్సివచ్చేదని గుర్తుచేసుకుంది పోతమ్మ. పథకాల్ని ఇంటికి చేర్చాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనతో తమకు బాధలు తప్పాయని ఆనందం వ్యక్తం చేసింది. -
పింఛన్లు పంపిణీలో జాప్యం: వలంటీర్లపై వేటు
సాక్షి, కృష్ణా: పింఛన్లు పంపిణీలో జాప్యం చేసిన గ్రామ వలంటీర్లపై రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వారిని విధుల నుంచి తొలగించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 21వ వార్డు జవ్వారుపేట టేక్యా ప్రాంతంలో మంత్రి పేర్ని నాని పర్యటించారు. ఈ సందర్భంగా 850 మీటర్ల పైపులైను పునరుద్ధరణ, నూతన పైపులైన్ ఏర్పాటు నిమిత్తం రూ.7 లక్షల 47 వేల రూపాయలతో జరిగే అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం మచిలీపట్నం 10వ వార్డులో పింఛన్లు ఇవ్వడంలో గ్రామ వలంటీర్లు రామకృష్ణ, అపర్ణ ఆలస్యం చేశారని మంత్రి దృష్టికి వచ్చింది. (గ్రామ స్వరాజ్యం.. సచివాలయాలతో సాకారం) దీంతో వారిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించడమే కాక అడ్మిన్ నవీన్ అలసత్వంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 21వ వార్డు పార్టీ ఇన్చార్జ్ మాడపాటి వెంకటేశ్వరరావు, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ అచ్చాబా, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సలార్ దాదా, మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొర్రా విటల్, షేక్ సైదా, శేఖర్, వాలిశెట్టి రవిశంకర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివరామకృష్ణ, ఏఈ పిల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇంటి వద్దకే పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. (ఏపీలో తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ) -
ప్రతి వాలంటీర్‌కు 50 ఇళ్ల కేటాయింపుతో మ్యాపింగ్ చేయాలి
-
టీడీపీ గూండాగిరిపై నిరసన గళం
సాక్షి, వజ్రపుకొత్తూరు: టీడీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటూ గ్రామ వలంటీర్లు నినదించారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న తమపై గూండాగిరి ప్రదర్శించి దాడులు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున కదం తొక్కా రు. పూండి– గోవిందపురం గ్రామ వలంటీర్ కిక్క రి సరస్వతిపై ఈ నెల 7న టీడీపీ నేత పుచ్చ ఈశ్వరరావు కుటుంబ సభ్యులు దాడి చేసి కొట్టడాన్ని నిరసిస్తూ తోటి వలంటీర్లు సోమవారం స్థానిక గ్రామ సచివాలయం వద్ద ధర్నా చేపట్టారు. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మంచినీటి పథకం తాళం ఇవ్వాలని కోరడమే వలంటీర్ పాపమా.. అంటూ మండిపడ్డారు. రాజకీయ ముసుగులో దాడులు చేసి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే సహించబోమని ముక్త కంఠంతో నినదించారు. పూండి–గోవిందపురంలోని వైఎస్సార్ కూడలి వద్ద వలంటీర్లు, నాయకుల మనవహారం కేసు విచారణలో ఉంది.. వలంటీర్‌పై దాడులను ఉపేక్షించేది లేదని వజ్రపుకొత్తూరు ఎంపీడీఓ సీహెచ్.ఈశ్వరమ్మ స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసులు కేసుని విచారించారని, నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినందున పోలీసులు అరెస్టు చేస్తారని చెప్పారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐదు నెలలుగా స్థానికులకు తాగునీరు అందించకుండా మంచినీటి పథకానికి తాళాలు వేశారని, దీనిపై ప్రశ్నిస్తే వలంటీర్‌ను జుత్తు పట్టుకుని కొట్టడం దారుణమన్నారు. నిరసన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చింత రవివర్మ, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు సీదిరి త్రినాథ్, మండల పార్టీ అధ్యక్షుడు పుక్కళ్ల గురయ్యనాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు పాలిన ఉమామహేశ్వరరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశవరావు, కొల్లి రమేష్, డీసీఎంఎస్ డైరెక్టర్ నర్తు ప్రేమ్‌కుమార్, మద్దిల హరినారాయణ, కె.గోపాల్, జి.రామారావు, కొల్లి జోగారవు, అంబటి శ్రీను, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఖండించాలి.. వలంటీర్లపై దాడులను ప్రజా సంఘాలతో పాటు ప్రతి ఒక్కరూ ఖండించాలి. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు వారథులుగా పని చేస్తున్న తమపై దాడులు చేయడం దారుణం. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి.– నర్తు అరుణ, గ్రామ వలంటీర్, గడరుడభద్ర పరారీలో ఉన్నారు.. వలంటీర్‌పై దాడి చేసిన ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. గాలిస్తున్నాం. ఇప్పటికే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశాం. వలంటీర్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవు. విచారణ పూర్తయింది. సరస్వతికి న్యాయం చేస్తాం. – ఎం.గోవింద, ఎస్ఐ, వజ్రపుకొత్తూరు -
టీడీపీ గూండాగిరిపై నిరసన గళం
సాక్షి, వజ్రపుకొత్తూరు(శ్రీకాకుళం) : టీడీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటూ గ్రామ వలంటీర్లు నినదించారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న తమపై గూండాగిరి ప్రదర్శించి దాడులు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున కదం తొక్కా రు. పూండి– గోవిందపురం గ్రామ వలంటీర్ కిక్క రి సరస్వతిపై ఈ నెల 7న టీడీపీ నేత పుచ్చ ఈశ్వరరావు కుటుంబ సభ్యులు దాడి చేసి కొట్టడాన్ని నిరసిస్తూ తోటి వలంటీర్లు సోమవారం స్థానిక గ్రామ సచివాలయం వద్ద ధర్నా చేపట్టారు. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మంచినీటి పథకం తాళం ఇవ్వాలని కోరడమే వలంటీర్ పాపమా.. అంటూ మండిపడ్డారు. రాజకీయ ముసుగులో దాడులు చేసి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే సహించబోమని ముక్త కంఠంతో నినదించారు. కేసు విచారణలో ఉంది.. వలంటీర్‌పై దాడులను ఉపేక్షించేది లేదని వజ్రపుకొత్తూరు ఎంపీడీఓ సీహెచ్.ఈశ్వరమ్మ స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసులు కేసుని విచారించారని, నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినందున పోలీసులు అరెస్టు చేస్తారని చెప్పారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐదు నెలలుగా స్థానికులకు తాగునీరు అందించకుండా మంచినీటి పథకానికి తాళాలు వేశారని, దీనిపై ప్రశ్నిస్తే వలంటీర్‌ను జుత్తు పట్టుకుని కొట్టడం దారుణమన్నారు. నిరసన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చింత రవివర్మ, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు సీదిరి త్రినాథ్, మండల పార్టీ అధ్యక్షుడు పుక్కళ్ల గురయ్యనాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు పాలిన ఉమామహేశ్వరరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశవరావు, కొల్లి రమేష్, డీసీఎంఎస్ డైరెక్టర్ నర్తు ప్రేమ్‌కుమార్, మద్దిల హరినారాయణ, కె.గోపాల్, జి.రామారావు, కొల్లి జోగారవు, అంబటి శ్రీను, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఖండించాలి.. వలంటీర్లపై దాడులను ప్రజా సంఘాలతో పాటు ప్రతి ఒక్కరూ ఖండించాలి. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు వారథులుగా పని చేస్తున్న తమపై దాడులు చేయడం దారుణం. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి. – నర్తు అరుణ, గ్రామ వలంటీర్, గడరుడభద్ర పరారీలో ఉన్నారు.. వలంటీర్‌పై దాడి చేసిన ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. గాలిస్తున్నాం. ఇప్పటికే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశాం. వలంటీర్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవు. విచారణ పూర్తయింది. సరస్వతికి న్యాయం చేస్తాం. – ఎం.గోవింద, ఎస్ఐ, వజ్రపుకొత్తూరు -
సంక్షేమ పాలనలో సరికొత్త అధ్యాయం
ఇంటి ముంగిటకే వచ్చి పింఛన్ అందజేస్తున్న సరికొత్త విధానం నవ్యాంధ్రలో నవచరిత్రకు శ్రీకారం.. గత 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో కనీ వినీ ఎరుగని రీతిలో ఒక ప్రభుత్వ పథకాన్ని నేరుగా లబ్ధిదారుడి ఇంటికే చేర్చిన ఘన చరితం.. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం..ప్రజల వద్దకే పాలన ఆవిష్కృతం.. ఒకే ఒక్క రోజులో లక్షలాది మంది లబ్ధిదారుల ఇంటి వద్దే పింఛన్ల పంపిణీతో ముఖ్యమంత్రి కల సాకారం.. ఇచ్చిన మాట మేరకు అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, దీర్ఘ వ్యాధిగ్రస్తులకు ఊరట కలిగించే విప్లవాత్మక నిర్ణయం సాక్షాత్కారం.. గతం ఎంతో బాధాకరం.. పింఛన్ కోసం ఎండనక.. వాననక.. చెట్ల కింద.. గుడి ముందు.. బడి వెనుక.. గుట్టల పైన.. గంటల తరబడి పడిగాపులు.. అడుగు తీసి అడుగెయ్యలేని దైన్య స్థితిలో మరొకరి తోడు.. ఆ రోజు పింఛన్ అందుతుందో లేదో తెలియని ఆందోళన.. మరుసటి రోజు కాళ్లీడ్చుకుంటూ మళ్లీ రావాలనే భయం.. వెరసి పలుచోట్ల పండుటాకులు అక్కడే ప్రాణాలొదిలిన దయనీయ పరిస్థితి.. ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించి, మాటల కోటలతో మైమరపించి.. ఆనక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మొహం చాటేసే నేతలు.. బాధితులకు తీరని వెతలు.. ఇక అలాంటి దుస్థితికి వైఎస్ జగన్ ప్రభుత్వం చరమగీతం.. ఎన్నెన్నో చెబుతారు కానీ, ఏం చేస్తారులే అనుకుంటున్న వేళ.. అసాధ్యమనుకున్నది సుసాధ్యమైన వేళ.. పండుటాకుల మోములో ఆనందం.. దివ్యాంగుల సంభ్రమాశ్చర్యం.. వితంతువుల్లో సంబరం.. అడుగు తీసి అడుగెయ్యలేని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొండంత ఊరట.. వెరసి వడివడి అడుగులతో ప్రజల వద్దకే ప్రజారంజక పాలన. సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు వలంటీరే స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను డబ్బులు ఇచ్చే సరికొత్త పాలనకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ‘గడప వద్దకే పెన్షన్’ కార్యక్రమం 13 జిల్లాల్లో శనివారం ఉదయం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గ్రామ, వార్డు వలంటీర్లు వారి ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. ఒక్క పూటలో 42,81291 మందికి పింఛన్ల పంపిణీ పూర్తయింది. ప్రభుత్వ ఉద్యోగులకు వారి జీతం డబ్బులు 1వ తేదీనే బ్యాంకు ఖాతాలో టంచన్‌గా పడినట్టు పింఛన్ లబ్ధిదారులందరికీ కూడా 1వ తేదీనే వారి ఇంటి వద్దకే వలంటీరు వెళ్లి అందజేసి వచ్చారు. ఇంతకాలం పింఛన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడిన పింఛనుదారులు.. శనివారం తమ పింఛను డబ్బులు ఇవ్వడానికి వలంటీరే ఇంటి వద్దకు రావడం చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు. ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోను, బయోమెట్రిక్ డివైస్‌ను వెంట తీసుకెళ్లిన వలంటీర్లు.. లబ్ధిదారునితో వేలి ముద్రలు తీసుకొని పింఛన్ డబ్బులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 2,16,874 మంది వలంటీర్లు తొలి రోజే 80% పైగా లబ్ధిదారులకు రూ.1,019 కోట్లు పంపిణీ చేశారు. బాధ తప్పింది.. ఇతని పేరు కె.మహమ్మద్. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండల కేంద్రానికి చెందినవారు. రెండు కాళ్లూ లేవు. ప్రస్తుతం రూ. 3 వేల పింఛన్ అందుతోంది. ఇంతకుముందు ప్రతినెలా పింఛన్ కోసం పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లాలంటే మరొకరి సాయం అవసరం వచ్చేది. ఈ నెల నుంచి ఆ బాధ తప్పింది. శనివారం గ్రామ వలంటీర్ ఇంటి వద్దకే వచ్చి పింఛన్ మొత్తాన్ని అందజేశాడు. దీంతో మహమ్మద్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆస్పత్రి వద్దకు వెళ్లి పింఛన్ ప్రకాశం జిల్లా రాచర్ల ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న చిట్టెం పోలయ్య అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ వలంటీర్ ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న పోలయ్య వద్దకు వెళ్లి శనివారం పింఛను సొమ్ము అందజేశారు. తనలాంటి వారికి ఎంతో సహాయం చేస్తున్న సీఎం జగన్ చల్లగా ఉండాలని పోలయ్య ఆశీర్వదించాడు. ‘కొండంత’ కష్టం తగ్గింది పింఛను తీసుకోవాలంటే తాము పడే కొండంత కష్టం తొలగిపోయిందని సంబర పడుతున్నారు అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని గరుగుచింతలపల్లి గ్రామానికి చెందిన పింఛనుదారులు. ఈ గ్రామంలో పింఛను తీసుకోవాలంటే గ్రామానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం ఉన్న గుట్టను ఎక్కి నిరీక్షించాల్సి వచ్చేది. గ్రామంలో పింఛను పంపిణీకి సిగ్నల్స్ సరిగా ఉండవని, అధికారులు గ్రామంలోని పింఛన్‌దారులను గుట్టపైకి రప్పించి పింఛను పంపిణీ చేసేవారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఊతకర్రల సహాయంతో పింఛను పంపిణీ ప్రదేశానికి చేరుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం పింఛను తమ వద్దకే రావడంతో ఆ పింఛనుదారులు ఎంతో సంతోషపడుతున్నారు. తమకు ఎంతో గౌరవం కల్పించిన సీఎం జగన్‌కు పింఛనుదారులు కృతజ్ఞతలు తెలిపారు. తెలతెలవారగానే లక్ష్మీదేవి తలుపు తట్టింది చిత్రంలో పింఛన్ అందుకుంటూ కనిపిస్తున్న వృద్ధురాలి పేరు బత్సల కామమ్మ. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అమలపాడు గ్రామంలో ఉంటున్న ఈమెకు కిడ్నీ వ్యాధి ఓ పక్క కబళిస్తోంది. మంచానికే పరిమితమైన ఈమె గతంలో కుటుంబసభ్యుల సహకారంతో పింఛన్ కోసం కిలో మీటరు దూరంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఆరోజు కుటుంబసభ్యులు పనులకు వెళ్లేందుకు వీలుపడేది కాదు. నెట్వర్క్ పనిచేయకపోవడం, రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల కనీసం రెండు సార్లయినా తిరగాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి నుంచి ఈమెకు శనివారంతో విముక్తి కలిగింది. తెలతెలవారగనే వలంటీర్ ఇంటి తలుపుతట్టి పింఛన్ అందించారు. దీంతో ఆ వృద్ధురాలి ఆనందానికి అవధుల్లేవు. నాయనా నా ఇంటికే లక్ష్మీదేవి తెచ్చారా అంటూ మురిసిపోయింది. ఆ దేవుడు చల్లగా చూడాలి అంటూ ముఖ్యమంత్రికి ఆశీర్వాదాలు అందించింది. పింఛన్ నడిచెళ్లింది.. ఈమె పేరు కరణం అప్పలనరసమ్మ. విజయనగరం జిల్లా కొమరాడ మండలం అర్ధం గ్రామ పంచాయతీ. ఆమె నడవలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా కాళ్లు, చేతులు మీద పాక్కుంటూ వెళ్లాలి. ప్రతి నెలా చాలా దూరం వెళ్లి రెండు గంటలు పడిగాపులు కాసి డబ్బు తెచ్చుకునేది. ఆమెకు శనివారం కాలు కదప అవసరం లేకుండా వలంటీరు ఇంటికే వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. ఎంతో శ్రమ పడి పింఛన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి నుంచి నా మనవడు జగన్ విముక్తి కలిగించారని ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఎదురుచూపులు ఉండవ్.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన పమిడిముక్కల అన్నమ్మ పక్షవాతంతో గత కొంత కాలంగా మంచానికే పరిమితమైంది. అయితే గతంలో ఈమె పింఛన్ తీసుకోవాలంటే పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ రెండు మూడు రోజులు ఎదురు చూపులు చూడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. తెల్లవారు జామునే వలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులతో సహా సిబ్బంది అంతా ఇంటి తలుపు తట్టి నగదు చేతిలో పెట్టి వేలిముద్ర వేయించుకోవడంతో ఆమె ఆనంద బాష్పాలు జారవిడిచింది. శతాధిక వృద్ధురాలి కష్టాలు తీరాయి.. నా వయసు వందేళ్లు. గతంలో పింఛన్ తీసుకునేందుకు చాలా ఇబ్బందులు పడేదాన్ని. శరీరం సహకరించకపోయినా.. ఎలాగోలా పంపిణీ కేంద్రం వద్దకు చేరుకొని డబ్బుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మా కష్టాలు తీరుతున్నాయి. పొద్దున్నే వలంటీర్ నా ఇంటి వద్దకే వచ్చి పింఛన్ అందజేసి వెళ్లారు. – శరగడం అచ్చియ్యమ్మ, శతాధిక వృద్ధురాలు, యలమంచిలి, విశాఖ జిల్లా హమ్మయ్య.. ఇప్పుడు బాగుంది.. ఈ ఫొటోలో ఉన్న వృద్ధురాలి పేరు కె.సువర్చల. కడప నగరంలోని ఏపీహెచ్‌బీ కాలనీలో నివసిస్తోంది. ఈమె కిడ్నీ వ్యాధిగ్రస్తురాలు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈమెకు రూ. 10 వేల పింఛన్ ఇస్తున్నారు. ప్రతినెలా పింఛన్ తీసుకోవాలంటే ఈమె కడప నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఏదైనా సమస్య వచ్చి పింఛన్లు పంచకపోతేనో, సమయానికి పింఛన్ పంచే వ్యక్తి లేకపోతే ఉసూరుమంటూ ఇంటికి రావాల్సి వచ్చేది. ఇంటి నుంచి కార్పొరేషన్ దగ్గరికి పోవాలంటే ఆటో మాట్లాడుకొని వెళ్లాలి. ఇప్పుడు వలంటీర్ ఇంటి వద్దే పింఛన్ ఇవ్వడంతో సమయం, ఆటో ఖర్చులు అన్నీ ఆదా అయ్యాయని ఈమె చెబుతోంది. శ్రమ, ఖర్చు తగ్గింది.. ఇంటి వద్దకే పింఛన్ రావడంతో శ్రమ తగ్గింది. గతంలో ఆయా పింఛన్ కేంద్రాల వద్ద సిబ్బంది వచ్చే వరకు గంటల తరబడి వేచి ఉండవలసి వచ్చేది. నడవలేని స్థితిలో ఉండటంతో రిక్షాలో పింఛన్ ఇచ్చే కేంద్రానికి వెళ్లి రావడానికి రూ. 200 ఖర్చు అయ్యేది. ఇంటికి వచ్చి పింఛన్ ఇవ్వడం ఎంతో మంచి పథకం. – ఆదిరెడ్డి నారాయణమ్మ,5వ వార్డు, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా మాలాంటి వారికి ఎంతో ఉపశమనం నడవలేని ఇద్దరు ఆడ పిల్లలను మూడు చక్రాల బండిపై తోసుకెళ్తున్న ఈమె పేరు కిన్నెర నరసమ్మ. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం గుడిపాడులో నివాసం ఉంటున్నారు. ఈమెకు భర్త లేరు. కుటుంబాన్ని పోషించుకునే శక్తి లేదు. నెలానెలా పింఛన్ కోసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకు దగ్గరికి ఇద్దరు పిల్లలను మూడు చక్రాల బండిపై తీసుకొని వెళ్లాల్సి వచ్చేది. అక్కడ రద్దీ ఎక్కువ ఉంటే మరో రోజు శ్రమ తప్పేది కాదు. ఒక్కోసారి రెండు మూడు సార్లు తిరగాల్సి వచ్చేది. రెండు మూడేళ్లుగా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద పింఛన్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా మూడు సార్లు తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేశారు. ఇది మాలాంటి వారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. శనివారం ఉదయమే ఇంటి దగ్గరికే వచ్చి కేవలం మూడు నిముషాల్లో పింఛన్ ఇచ్చారు. ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం. దేవుడిలా ఆదుకున్నారు.. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రు గ్రామానికి చెందిన పిల్లి దుర్గారావు గతంలో సింగపూర్‌లో భవన నిర్మాణ కార్మికునిగా పనిచేశాడు. అతనికి ఆరేళ్ల కిందట ఒక పాప పుట్టింది. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆ పాపకు కిడ్నీ సమస్యలు మొదలయ్యాయి. వైద్యం కోసం విజయవాడ, హైదరాబాద్, చెన్నై ఇలా తెలిసిన ఆస్పత్రుల చుట్టూ తిప్పాడు. సంపాదించిన డబ్బులన్నీ అయిపోయాయి. గత ప్రభుత్వంలో పెన్షన్ కోసం, తన పాపను ఆదుకోవాలని అధికారుల చుట్టూ తిరిగాడు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ పాపకు 15 రోజులకు ఒకసారి ఏలూరు ఆసుపత్రికి తీసుకువెళ్లి డయాలసిస్ చేయించాలి. లేకపోతే ముక్కు నుంచి రక్తం వస్తుంది. పుట్టెడు కష్టాన్ని తట్టుకుంటూ ఉన్న ఆస్తులను అమ్ముకుంటూ బిడ్డ బాగుంటే చాలని ఎదురు చూస్తున్న ఆ దంపతులను ఈ ప్రభుత్వం ఆదుకుంది. డయాలసిస్ రోగులకు రూ. 10 వేల పింఛన్ అందిస్తున్నారని తెలిసి దరఖాస్తు చేశారు. వెంటనే ఆ పాపకు పింఛన్ మంజూరు అయ్యింది. ప్రతి నెల పంపిణీ కేంద్రం వద్దకు పాపను తీసుకెళ్లి పింఛన్ తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉండేది. జగన్ పుణ్యమా అని ఆ సమస్య తీరింది. జగన్‌కు జన్మంతా రుణపడి ఉంటామని ఆ దంపతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాట ఇచ్చాడు.. నెరవేర్చాడు దివ్యాంగుడైన ఇతని పేరు మందా రమేష్. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం నెల్లబల్లిరెట్టపల్లి. పింఛన్ కోసం ప్రతి నెలా ఇంటి నుంచి కిలోమీటరు దూరంలోని పంచాయతీ కార్యాలయానికి వెళ్లి గంటల తరబడి పడిగాపులు కాసి, ఒక్కో సారి మళ్లీ మళ్లీ వెళ్లి తెచ్చుకున్న సందర్భాలెన్నో. శనివారం తెల్లారేసరికి గ్రామ సచివాలయ వలంటీర్ ఇతని ఇంటికి వెళ్లి దివ్యాంగ పింఛన్ అందజేశాడు. పింఛన్ తీసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. జగనన్న నాకు మాట ఇచ్చాడు.. నెరవేర్చాడని ఆనందం వ్యక్తం చేశాడు. సరిగ్గా రెండేళ్ల కిందట వైఎస్ జగన్ కలిసిన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘ఆ రోజు ప్రజాసంకల్పయాత్ర గూడూరు రూరల్‌లోని కొండాగుంట సమీప ప్రాంతానికి వచ్చేటప్పటికి నెల్లబల్లిరెట్టపల్లి నుంచి 12 కి.మీ. ట్రై సైకిల్‌పై అక్కడికి వెళ్లి జగన్‌ను కలిశా. ఎందుకు బాబు ఇంత కష్ట పడడం అని జగన్ సార్ అన్నారు. ప్రతి నెల పింఛన్ తీసుకునేందుకు కిలోమీటరు దూరం ఇలానే వెళ్తున్నాను.. మిమ్ములను చూసేందుకు ఇక్కడదాక రాలేమా అని చెప్పాను. ఆ సందర్భంగా దివ్యాంగులు పడుతున్న కష్టాన్ని ఆయనకు విన్నవించా. దీంతో జగనన్న ధైర్యం ఇస్తూ నేను ఉన్నాను.. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్ ఇంటి వద్దకే వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు మా గ్రామ వలంటీర్ పొద్దునే ఇంటి వద్దకు వచ్చి పింఛన్ ఇచ్చాడు. ఇది నేను కలలో కూడా అనుకోలేదు’ అని చెప్పాడు. తొంభై ఏళ్లకు పింఛన్.. ఇంటి ముంగిటకే ఈమె పేరు ఎం.నీల (91). చిత్తూరు జిల్లా సత్యవేడు పంచాయతీ దళితవాడకు చెందిన ఈమె భర్త కేశవన్ చనిపోయిన 31 ఏళ్ల తర్వాత శనివారం వితంతు పింఛను అందుకోవడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. పెళ్లిళ్లు అయిన అనంతరం పిల్లలు వేరు కాపురం పెట్టి తల్లిని ఒంటరిగా వదిలేశారు. ఎన్నిసార్లు పింఛన్ కోసం తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆమె రాజీవ్‌నగర్‌లో ఉంటోంది. ఈమె పరిస్థితి గమనించిన వలంటీర్ గ్రామ సచివాలయంలో పేరు నమోదు చేయించాడు. వెంటనే వృద్ధాప్య పింఛన్ మంజూరైంది. ‘30 ఏళ్లు నిరాశ చెందిన నాకు ప్రాణం పోయేలోపు పింఛన్ వస్తుందో రాదో అనుకున్నా. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని నాకూ పింఛన్ వచ్చింది. నా మందుల ఖర్చుకు పింఛన్ డబ్బు తోడవుతుంది’ అని ఆమె ఆనందపడింది. -
వారి సంతోషంతో నా బాధ్యత మరింత పెరిగింది: వైఎస్ జగన్
-
నా బాధ్యత మరింత పెరిగింది: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన 'ఇంటి వద్దకే పెన్షన్' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా ప్రారంభించిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా.. పెన్షన్లను గడపవద్దకే చేర్చాలన్న సంకల్పాన్ని సాకారం చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. అవినీతి, వివక్ష లేకుండా 54.6 లక్షల మందికి ఇంటివద్దే పెన్షన్ ఇస్తుంటే వారి కళ్లలో కనిపించిన సంతోషంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. దేవుడి దయ, ప్రజల దీవెనతోనే ఇది సాధ్యమైందని సీఎం వైఎస్ జగన్ ట్విటర్లో పేర్కొన్నారు. (రాష్ట్రవ్యాప్తంగా 'ఇంటి వద్దకే పెన్షన్' ప్రారంభం) ‘ఎన్నికలకు ముందు వచ్చే పెన్షన్ రూ.1000 కాకుండా ఇప్పుడు 2,250 వచ్చింది. పెన్షన్ వయస్సు కూడా 65 సంవత్సరాల నుంచి 60కి తగ్గించాం. కొత్తగా 6.11 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. వెంటనే వాటిని పరిశీలించి మంజూరుచేస్తార’ని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కాగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న వైఎస్సార్ పెన్షన్ కానుకలో మరో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. వలంటీర్లు స్వయంగా లబ్ధిదారుడు ఇంటికెళ్లి పింఛన్లు పంపిణీ చేసే గొప్ప కార్యక్రమం చేపట్టారు. పింఛన్లు కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న ఫించన్ దారులకు డోర్ డెలివరీ విధానం ఎంతో ఆనందం కలిగిస్తోంది. తాము ఎప్పుడు ఉంటే అప్పుడే ఇంటికొచ్చి మాకు వలంటీర్లు పింఛన్లు ఇస్తుండడం సంతోషంగా ఉందని, దీని వల్ల తమకు ఎంతో మేలు జరుగుతుందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (ఏపీ: పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం రికార్డు) -
గ్రామ స్వరాజ్యం.. సచివాలయాలతో సాకారం
తన భూమికి సంబంధించిన 1బీ ధ్రువపత్రాన్ని చూపుతున్న ఈ రైతు పేరు కురబ మంజునాథ్. ఇతడిది అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం తూర్పు కోడిపల్లి. గ్రామంలో సర్వే నం.90లో 3 ఎకరాల భూమి ఉంది. భూమి 1బీ ధ్రువపత్రం, అడంగల్ కోసం ఆదివారం గ్రామ సచివాలయానికి వచ్చాడు. రైతు అడిగిన ధ్రువపత్రాలను అక్కడి సిబ్బంది వెంటనే అందించారు. దీంతో మంజునాథ్ ఆనందానికి హద్దుల్లేవు. గతంలో కల్యాణదుర్గం వెళ్లి గంటల తరబడి వేచి చూసినా జరగని పనులు ఇప్పుడు తమ గ్రామంలోనే వెంటనే జరగుతుండటంతో సంతోషంగా ఉందని చెప్పాడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని వెంకట్రాజుపురం ప్రజలు ఏ పనులు కావాలన్నా 32 కిలోమీటర్ల దూరంలోని గ్రామ పంచాయతీకి, లేదంటే 42 కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఉదయం 6 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు తిరిగి ఇళ్లకు చేరుకునేవారు. ఇప్పుడు వెంకట్రాజుపురంలో గ్రామ సచివాలయం ఏర్పాటైంది. సొంత గ్రామంలోనే అన్ని ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌కార్డు కోసం ఆదివారం గ్రామ సచివాలయంలో దరఖాస్తులు అందజేశారు. సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా విప్లవాత్మకమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గణతంత్ర దినోత్సవం రోజునే రాష్ట్ర ప్రజలకు వారి సొంత గ్రామాల్లోనే 536 రకాల ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 15,002 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా, ఆదివారం నుంచి 14,487 సచివాలయాల్లో ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి లేకుండా ప్రభుత్వ సేవలు అందుతుండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల, జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థ తప్పిందని చెబుతున్నారు. సమయం, డబ్బు ఆదా అవుతోందని పేర్కొంటున్నారు. ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ ఫలాలు రాష్ట్రంలో కోటిన్నర దాకా కుటుంబాలు ఉండగా, అందులో గ్రామీణ ప్రాంతాల్లోనే కోటి కుటుంబాలు నివసిస్తున్నాయి. 70 ఏళ్లుగా ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందిన దాఖలాలు లేవు. పథకాలను ప్రజల ముంగిటకు చేర్చే అధికార యంత్రాంగం లేకపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా సామాజిక సూచికలు.. పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం తదితర అంశాల్లో ఆశించిన ప్రగతి సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితిని మార్చాలంటే పరిపాలనను ప్రతి గడప వద్దకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిపాలన వికేంద్రీకరణకు పూనుకున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే గ్రామ, వార్డు స్థాయిలో పనిచేసేందుకు 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. వాటి భర్తీ ప్రక్రియను సైతం స్వల్ప వ్యవధిలోనే విజయవంతంగా పూర్తి చేశారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రతి లబ్ధిదారుడికి అందించాలన్న లక్ష్యంతో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మరో 2.80 లక్షల మంది వలంటీర్లను నియమించారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామ సచివాలయంలో దరఖాస్తుదారుడికి సదరం సర్టిఫికెట్ అందజేస్తున్న సిబ్బంది ఫిర్యాదుల పరిష్కారానికి ‘స్పందన’ ఎక్కడి సమస్య అక్కడే పరిష్కారం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. 80 శాతానికి పైగా ప్రజా సమస్యలను గ్రామ పంచాయతీ స్థాయిలోనే పరిష్కరించాలని.. ప్రజలు మండల, జిల్లా కేంద్రాల్లో ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని ఆదేశించారు. ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగానే గ్రామ–వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థతో ప్రజలకు ప్రభుత్వ సేవలు ఇక వారి గ్రామాల్లోనే అందుబాటులోకి వచ్చాయి. అలాగే ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా గ్రామ–వార్డు సచివాలయాల్లో ప్రతిరోజూ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఈ ఫిర్యాదులను అధికారులు ఏ మేరకు పరిష్కరించారన్న దానిపై ప్రభుత్వం ప్రతివారం సమీక్ష నిర్వహించనుంది. మహిళా రక్షణకు పెద్దపీట రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పాలన వికేంద్రీకరణ ప్రక్రియలో భాగంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఒకరు చొప్పున మహిళా పోలీసులను నియమించింది. ప్రతి 2,000–5,000 మంది జనాభాకు ఒక మహిళా పోలీసు నిత్యం అందుబాటులో ఉంటారు. గ్రామ, వార్డు స్థాయిలో స్థానిక మహిళలు ఎదుర్కొనే సమస్యలకు స్థానికంగానే పరిష్కారం చూపుతారు. లంచాల బెడదకు అడ్డుకట్ట పడినట్టే.. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనంపై ప్రజలు విసుగెత్తిపోయారు. గ్రామ, వార్డు సచివాలయాలతో లంచాల బెడదకు దాదాపు అడ్డుకట్ట పడినట్టే. ఎవరైనా ఊళ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి వద్దకు వెళ్లి పని చేసి పెట్టాలని దరఖాస్తు అందజేస్తే కాదనలేని పరిస్థితి ఉంటుంది. ఇక మండల, జిల్లా కేంద్రాల చుట్టూ తిరిగే అవసరం ఉండదు. మండల, జిల్లా కేంద్రాల్లోని అధికారులు వాళ్లు చేయాల్సిన పనిని మరింత సమర్థవంతంగా చేసే వీలుంటుంది. – చంద్రమౌళి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రిటైర్డు కమిషనర్ గ్రామాల రూపురేఖలే మారిపోతాయి గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామాల రూపురేఖలే మారిపోతాయి. గతంలో ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అధికారులే ప్రజల చుట్టూ తిరుగుతున్నారు. ఇళ్ల వద్దకొచ్చి సమాచారం తీసుకుంటున్నారు. కావాల్సిన పనులు చేసి పెడుతున్నారు. అవినీతికి ఆస్కారమే లేదు. అధికార వికేంద్రీకరణ దిశగా ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ గొప్ప ముందడుగు. – చిత్తరవు నాగేశ్వరరావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిల్ మెంబర్ గ్రామ స్వరాజ్యం వచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల వద్దకే నిజమైన పాలన తెచ్చారు. గ్రామ స్వరాజ్యం అందుబాటులోకి వచ్చింది. సచివాలయాలతో ప్రజల కష్టాలు తీరాయి. ఇక్కడ మా సమస్యలకు పరిష్కారం పొందే అవకాశం కల్పించడం సంతోషకరం. – శ్యామసుందర్‌రెడ్డి, యు.రాజుపాలెం, వైఎస్సార్ జిల్లా సమయం, డబ్బు ఆదా మా ఊళ్లో గ్రామ సచివాలయం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. 1బీ అండగల్, 1బీ సవరణ, వెబ్‌ల్యాండ్‌తోపాటు ప్రతి పనికీ మండల కేంద్రమైన కణేకల్లుకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్య లేదు. సమయం వృథా కాదు. బస్సు, ఆటో చార్జీలు, భోజనాల ఖర్చులు తప్పుతాయి. మా గ్రామంలోనే అన్ని పనులు జరిగిపోతున్నాయి. – అనంతమ్మ, బెణికల్లు అనంతపురం జిల్లా దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట ప్రభుత్వ పథకాలు పొందాలంటే దళారులను ఆశ్రయించాల్సి వచ్చేది. ప్రతి పనికీ డబ్బులు వసూలు చేసేవారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయాల వల్ల దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట పడుతుంది. వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ప్రతి పనినీ ఉచితంగా చేయించుకోవచ్చు. – దారంశంకర్, గుంటూరు కష్టాలు తప్పుతాయి ఇంతకుముందు ఏ పని కావాలన్నా పంచాయతీ, తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు మేం ఉండే ప్రాంతానికి దగ్గర్లోనే సచివాలయం ప్రారంభించడం సంతోషంగా ఉంది. రేషన్ కార్డు కావాలన్న, పింఛన్ కావాలన్న మీ సేవ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టాలు తప్పుతాయి. – జొన్నాడ వెంకటరమణ, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా నిజమైన ప్రజా పాలనకు నాంది గ్రామ సచివాలయాలు నిజమైన ప్రజా పాలనకు నాంది పలుకుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం వేలాది ఉద్యోగాలు భర్తీ చేశారు. ఆయన పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. – ఎన్ నాగప్రసాద్, బందరు మండలం, కృష్ణా జిల్లా మంచి విధానమిది ఇంతకుముందు ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దళారులు దోచేసేవారు. సచివాలయాల వల్ల అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఖర్చు లేకుండా ఆన్లైన్ ద్వారా పనులు చేయించుకోవచ్చు. చాలా మంచి విధానమిది. – బర్మా వెంకట లలిత కుమారి, బందరు మండలం, కృష్ణా జిల్లా చారిత్రక నిర్ణయం దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటికి తీసుకురావడం చారిత్రక నిర్ణయమే. ఇక ఏ ఒక్క లబ్ధిదారుడూ కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు శ్రమకోర్చి వెళ్లాల్సిన పని లేదు. సేవలను ప్రజలకు దగ్గరకు చేర్చిన సచివాలయ వ్యవస్థ చరిత్ర సృష్టిస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి మంచి గుర్తింపు వస్తుంది. – డాక్టర్ వడిశెట్టి గాయత్రి, మహిళా సైంటిస్ట్, పిఠాపురం, తూ.గోదావరి కలలో కూడా ఊహించలేదు ఇలాంటి గొప్ప పాలన వస్తుందని కలలో కూడా ఊహించలేదు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా సామాన్యుల బాధలు పట్టించుకునేవారు కాదు. వ్యయప్రయాసలకోర్చి 10 కిలోమీటర్లు దూరంలోని మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధలు తగ్గాయి. – ఈశ్వర్‌రెడ్డి, రైతు, గోపిదిన్నె, చిత్తూరు జిల్లా -
టీడీపీ నాయకుడి కుమారుడి అఘాయిత్యం
సాక్షి, తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లిలో గ్రామ వలంటీర్‌పై టీడీపీ నాయకుడి కుమారుడు పిడిబాకుతో దాడి చేశాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు.. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గ్రామంలోని రాముల దేవాలయం సమీపంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే ఉన్న వలంటీర్ రామానాయుడిపై టీడీపీ నాయకుడు దబ్బల రామాంజిని కుమారుడు సతీష్ ఒక్కసారిగా పిడిబాకుతో దాడి చేసి పరారయ్యాడు. తీవ్రగాయాలై రక్తపుమడుగులో రామానాయుడు కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు 108 వాహనంలో పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు సతీష్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తుగ్గలి ఏఎస్ఐ మాధవస్వామి తెలిపారు. నిందితుడు సతీష్ డోన్‌లోని డిగ్రీ కాలేజీలో ఫైనలియర్ చదువుతున్నాడు. నవశకం కార్యక్రమంలో భాగంగా వలంటీర్ రామానాయుడు కూడా ఇంటింటి సర్వే చేశాడు. ఆ సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో తన పేరు లేకుండా చేశావంటూ సతీష్ 20 రోజుల క్రితం వలంటీర్‌తో గొడవకు దిగాడు. తాను సర్వే మాత్రమే చేశానని, పేరు తీసేసే హక్కు తనకు లేదని చెప్పాడు. ఆ తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో పేరు ఎలాగూ వచ్చింది. అయినా కక్ష పెంచుకున్న సతీష్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. గ్రామంలో ఉద్రిక్తత వలంటీర్‌పై హత్యాయత్నం ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో 400 ఓట్లకు పైగా వైఎస్సార్సీపీకి మెజార్టీ రావడంతో టీడీపీ వర్గీయులు జీర్ణించుకోలేక పోతున్నారు. రానున్న సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవకుండా చేయాలని వారు ప్లాన్‌లో ఉన్నట్లు వైఎస్సార్సీపీ మద్దతుదారులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకుడి కుమారుడు గ్రామ వలంటీర్‌పై హత్యాయత్నానికి పాల్పడడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. -
ఏపీలో గ్రామస్వరాజ్యానికి రంగం సిద్ధం
-
నవశకం.. నేడు శ్రీకారం
సాక్షి, అమరావతి: పల్లెలు, పట్టణాల్లో బుధవారం నుంచి ముందస్తుగా సంక్రాంతి సందడి సంతరించుకోనుంది. వైఎస్సార్ నవశకం పేరుతో అర్హులైన ప్రజలందరికీ సంక్షమ పథకాల ఫలాలు అందించేందుకు నేటి నుంచి ఇంటింటి సర్వే కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభం కానుంది. వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ, పట్టణ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, రిసోర్స్ పర్సన్లతో పాటు మండల స్థాయి అధికారులందరూ కలిపి దాదాపు 4 లక్షల మంది ఇంటింటి సర్వేలో భాగస్వాములు కానున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం నేరుగా ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం ఇదే తొలిసారి. గతప్రభుత్వంలో రేషన్ కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీ కోసం ప్రజలు జన్మభూమి కార్యక్రమాల్లో అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రజలు పడిన ఆ వెతలను పాదయాత్రలో స్వయంగా చూడటమే కాకుండా అదే యాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చడమే లక్ష్యంగా సంతృప్త స్థాయిలో ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను గుర్తించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యచరణను ప్రకటించారు. ప్రక్రియ.. అవినీతి రహితం, పారదర్శకం కుల, మత, ప్రాంతం, పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అవినీతి రహితంగా, పారదర్శకంగా ఈ పక్రియ సాగనుంది. పేదలకు మరింత న్యాయం చేసేందుకు వార్షిక ఆదాయ పరిమితిని భారీగా పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా వార్షిక ఆదాయ పరిమితిని పెంచడం ద్వారా మరింత మందికి సంక్షేమ, ఆరోగ్య ఫలాలు చేరవేయాలనేది సీఎం ఉద్ధేశం అని ఉన్నతాధికారులు తెలిపారు. బియ్యం కార్డు, వైఎస్సార్ పెన్షన్ కానుక కార్డు, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి కార్డులు వేర్వేరుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు వైఎస్సార్ కాపు నేస్తం, మిగతా పథకాలన్నింటికీ అర్హతలు, ఎంపిక మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. వాటికి అనుగుణంగా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం వలంటీర్లకు ప్రత్యేక ప్రొఫార్మాలను అందజేయడమే కాకుండా ఇంటింటి సర్వేలో పాల్గొనే యంత్రాంగానికి మంగళవారం వరకు వివిధ స్థాయిల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. అర్హుల్లో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా జాగ్రత్తలు గ్రామ వలంటీర్లు తమ పరిధిలో రోజుకు ఐదు ఇళ్లలో, పట్టణ ప్రాంతాల్లోని వార్డు వలంటీర్లు రోజుకు పది ఇళ్లలో మాత్రమే సర్వే నిర్వహిస్తారు. సర్వే ప్రక్రియ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది. అనంతరం లబ్ధిదారుల ముసాయిదా జాబితాలను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఆ ముసాయిదా జాబితాలపై స్థానికుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. మార్పులు, చేర్పులను ఆహ్వానిస్తారు. ఇది పూర్తి కాగానే గ్రామ, వార్డు సభలను ఏర్పాటు చేసి సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామ, వార్డు సభల్లో లబ్ధిదారుల తుది జాబితాలకు ఆమోదం పొందుతారు. ఆ తర్వాత వాటిని సచివాలయాల వద్ద బోర్డుల్లో శాశ్వతంగా ప్రదర్శిస్తారు. సర్వేకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయా సచివాలయ అధికారులు, మండల, మున్సిపాలిటీల స్థాయి అధికారులకు, సంబంధిత శాఖలకు చేరవేయడమే కాకుండా వివరాలను కంప్యూటీకరించనున్నారు. అర్హులైన వారిలో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. కాగా, ప్రతి పథకం అర్హతలు, మార్గదర్శకాలను గ్రామ, వార్డు సచివాలయాల్లోని ప్రదర్శన బోర్డుల్లో ఉంచుతారు. అర్హులైన వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే సమాచారాన్నీ ప్రదర్శిస్తారు. ఇవి సచివాలయాల్లో శాశ్వతంగా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
రాడ్లతో జనసేన కార్యకర్తల దాడి
-
గ్రామవలంటీర్లపై జనసేన కార్యకర్తల దాడి
సాక్షి, సఖినేటిపల్లి (రాజోలు): ప్రభుత్వ పథకాల సర్వే పేరుతో తమ ఇళ్లకు రావద్దని హెచ్చరిస్తూ గుడిమూలకు చెందిన గ్రామవలంటీర్లపై అదే గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు శుక్రవారం దాడి చేశారు. గుడిమూల గ్రామానికి చెందిన వలంటీర్లు గుబ్బల రాజేష్, బత్తుల సునీల్‌లపై జనసేన పార్టీ కార్యకర్తలు నాయుడు కృష్ణస్వామి, బొలిశెట్టి దుర్గాప్రసాద్, నామన రంగబాబు, నాయుడు ఆదినారాయణ రాడ్లతో దాడి చేశారు. వలంటీరు రాజేష్‌ను కారులో ఎక్కించుకుని కిడ్నాప్‌కు యత్నించారు. గుడిమూల నుంచి స్థానికులు కారును వెంబడించడంతో గొంది గ్రామంలో కారు నుంచి బయటకు తోసేశారు. 6777 నంబరు కలిగిన తెలుపురంగు షిఫ్ట్‌కారులో ఇనుప రాడ్లతో వచ్చి రాజేష్, సునీల్‌పై దాడి చేసి భయకంపితులను చేశారు. దాడిలో గాయపడ్డ గుడిమూల వలంటీర్లు రాజేష్, సునీల్ ఈ మేరకు సఖినేటిపల్లి పోలీస్‌స్టేషన్‌లో వలంటీర్లు రాజేష్, సునీల్‌ను ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా వలంటీర్లు గ్రామంలో ప్రభుత్వ పథకాల మంజూరు కోసం సర్వే నిర్వహిస్తుండగా దానిని అడ్డుకుని, తమ ఇళ్ల వద్దకు సర్వే కోసం వస్తే సహించేది లేదని జనసేన కార్యకర్త నాయుడు కృష్ణస్వామి తన అనుచరులతో రాజేష్, సునీల్‌లను బెదిరించాడు. అంతేకాదు కొన్ని రోజులుగా వలంటీర్లు రాజేష్, సునీల్‌లు ప్రభుత్వ పథకాలను ఫేస్బుక్లో పోస్టు చేయడంపైనా జనసేన కార్యకర్తలు ఆగ్రహం పెంచుకుని దాడులకు పాల్పడ్డారు. ఈ మేరకు సఖినేటిపల్లి అడిషనల్ ఎస్సై భవానీకి వలంటీర్లు రాజేష్, సునీల్ ఫిర్యాదు చేశారు. వలంటీర్ రాజేష్ కిడ్నాప్‌కు యత్నించింది ఈ కారులోనే వలంటీర్లపై దాడులకు పాల్పడితే సహించం : కో ఆర్డినేటర్ రాజేశ్వరరావు గ్రామ వలంటీర్లపై దాడులకు దిగితే సహించబోమని రాజోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు హెచ్చరించారు. గుడిమూల వలంటీర్లపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సఖినేటిపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద రాజేశ్వరరావు పార్టీ నాయకులు, కార్యకర్తలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు జనసేన తెరతీస్తోందన్నారు. ఇనుపరాడ్లతో గుడిమూల గ్రామంలో హల్చల్ చేస్తున్న జనసేన కార్యకర్తలు ఎస్సీ సెల్ కార్యదర్శి నల్లి డేవిడ్ మాట్లాడుతూ వలంటీర్లపై దాడులు చేసేలా జనసేన అధినేత పవన్‌కల్యాణ్, స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జనసేన పార్టీ కార్యకర్తలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ బీసీసెల్ కార్యదర్శి పాటి శివకుమార్, నాయకులు రావి ఆంజనేయులు, రుద్రరాజు చినరాజా, సానబోయిన ఏసుబాబు, గుండుమేను శ్రీనివాస్‌యాదవ్, ఎంపీటీసీ మాజీ సభ్యులు కోన ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో మరో భారీ ఉద్యోగాల ప్రకటన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల జాతరను కొనసాగిస్తోంది. రాష్ట్రంలో మరో ఉద్యోగాల ప్రకటన వెలువడింది. ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ల నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 19,170 వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన పూర్తి వివరాలను వెల్లడించారు. మొత్తం 19,170 వార్డు వాలంటీర్ల ఖాళీలు భర్తీ నవంబర్ 1 నుండి భర్తీ ప్రక్రియ ప్రారంభం నవంబర్ 10 వరకు అభ్యర్థులు నుండి దరఖాస్తులు స్వీకరణ నవంబర్ 15 వరకు దరఖాస్తులు పరిశీలన నవంబర్ 16 నుండి 20 వరకు ఇంటర్వ్యూ లు నవంబర్ 22న ఎంపికయిన వార్డు వాలంటీర్ల జాబితా ప్రకటన డిసెంబర్ 1నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి -
గ్రామ వలంటీర్‌పై టీడీపీ వర్గీయుల దాడి
-
గ్రామ వలంటీర్‌పై టీడీపీ వర్గీయుల దాడి
సాక్షి, వైఎస్సార్ కడప: టీడీపీ వర్గీయులు మరోసారి బరితెగించారు. పాత కక్షలతో ఓ గ్రామ వలంటీర్‌పై వేట కొడవళ్లతో దాడికి దిగారు. ఈ ఘటన జిల్లాలోని చక్రాయపేట మండలం కుమారకాల్వలో ఆదివారం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలతో టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. కొడవళ్లు, రాళ్లతో వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో గ్రామ వలంటీర్ తాళ్లపల్లె రాకేష్ (23), ఆయన బంధువుపై పాత కక్షల నేపథ్యంలో విరుచుకుపడ్డారు. దీంతో రాకేష్ చేతిపై కత్తిపోటు బలమైన గాయం చేసింది. రాకేష్ పెద్దనాన్న తాళ్లపల్లె జ్ఞానముత్తు (48 )పై వేట కొడవళ్లతో టీడీపీ వర్గీయులు దాడి చేయడంతో ఆయన తలకు బలమైన గాయమైంది. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
సీఎం జగన్ నిర్ణయం ఆ యువకుడి జీవితాన్నే మార్చేసింది
సాక్షి, విజయనగరం: ఒక మంచి పని ఎందరో జీవితాలను నిలబెడుతుందనడానికి సజీవ సాక్ష్యం ఈ సంఘటన .. ముఖ్యమంత్రి అయిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో గ్రామ,వార్డు వలంటీర్ల నియామకం ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉన్న చోటనే ఉద్యోగం ఇచ్చారు. ప్రజలకు ప్రభుత్వ పధకాలను చేరువ చేయడంలో వీరు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇన్నాళ్లూ ఉద్యోగం సజ్జోగం లేదంటూ చులకనగా చూసిన ఈ సమాజం వారిని ఇప్పుడు గౌరవంగా చూస్తోంది.. ఇదంతా ఒకెత్తయితే చూపులేక, చేసేందుకు పని దొరక్క అవస్థలు పడుతున్న వారికి సైతం వలంటీర్ పోస్టులు లభించడంతో వారి జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. వారు ఇప్పుడు నిజమైన దీపావళి జరుపుకుంటున్నారు. వారిలో ఒకరు బొబ్బిలి మండలం గొల్లపల్లికి చెందిన గొల్లపల్లి శ్రీను. అతనికి కంటి చూపులేదని చిన్న చూపు చూడకుండా ప్రభుత్వం ఇచ్చిన ఉపాధి ఆ యువకుడి జీవితాన్నే మార్చేసింది. పట్టుదలతో ఎంతటి కష్టమైన పనినైనా చేస్తున్నప్పటికీ ఇన్నాళ్లూ లభించని గుర్తింపు అతనికి సీఎం జగన్ వల్ల ఇప్పుడు దొరికింది. ఇదో గొప్ప అనుభవం నేను బ్లైండ్‌ని.. ఈ రోజు నా లైఫ్‌లో వెరీ హ్యాపీ డే. ముందుగా వలంటీర్‌గా ఉద్యోగం కల్పించిన వైఎస్ జగన్ గారికి నా హదయ పూర్వక ధన్యవాదాలు. ఈ రోజు రైతు భరోసా అమౌంట్ పడిందని ఒక రైతు ఇంటికి వచ్చి స్వీట్ బాక్సు కూడా అభిమానంతో ఇచ్చాడు. తన సొంత అమౌంట్‌తో కొని మంచిగా ఉంటే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని ఈ రోజు తెలిసింది. ఇందుకు సహకరించిన అగ్రికల్చరల్ ఆఫీసర్, పీఈఓ మేడం, తోటి వలంటీర్స్‌కి స్పెషల్ ధ్యాంక్స్. – గొల్లపల్లి శ్రీను -
పది పాసైతే చాలు
సాక్షి, అమరావతి: గ్రామ వలంటీర్ల పోస్టుల కనీస విద్యార్హతను ఇంటర్ నుంచి పదవ తరగతికి ప్రభుత్వం తగ్గించింది. ఈ ఏడాది ఆగస్టులో మొదటిసారి వలంటీర్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టినప్పుడు కనీస విద్యార్హతగా మైదాన ప్రాంతంలో ఇంటర్, గిరిజన ప్రాంతంలో పదవ తరగతిగా ఉంది. అప్పట్లో మొత్తం 1,92,964 మంది గ్రామ వలంటీర్ల ఎంపికకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 1,83,290 మంది విధులలో చేరారు. మిగిలిన 9,674 పోస్టులను మైదాన, గిరిజన ప్రాంతం రెండింటిలోనూ పదో తరగతి విద్యార్హతతో భర్తీ చేయడానికి అనుమతి తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీల సంఖ్య ఆధారంగా జిల్లాల వారీగా నవంబర్ 1న ఆయా జిల్లా కలెక్టర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తారు. ప్రత్యేక వెబ్‌పోర్టల్ ద్వారా నవంబర్ పదో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 16 నుంచి 20 మధ్య మండలాల వారీగా ఎంపీడీవో నేతృత్వంలోని ముగ్గురు అధికారుల కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు 22వ తేదీ కల్లా సమాచారమిచ్చి, వారికి 29, 30 తేదీల్లో ప్రాథమిక శిక్షణ ఇస్తారు. కొత్తగా ఎంపికైన వారు డిసెంబర్ 1 నుంచి విధుల్లోకి చేరాల్సి ఉంటుంది. -
వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం
సాక్షి, విజయనగరం : సచివాలయాలకు మహర్దశ పట్టనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీటికి పెద్ద పీట వేస్తున్నారు. గ్రామాల్లోని అన్ని సేవలు సచివాలయాల ద్వారా అందనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీటిలో పని చేసేందుకు కావాల్సిన సిబ్బంది నియామకం కూడా పూర్తి కావచ్చింది. అంతకుముందే సచివాలయాలకు అనుసంధానంగా పనిచేసేందుకు వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయమూ విధితమే. దీనికోసమే ఇప్పటికే ఉన్న పంచాయతీ కార్యాలయాలను గ్రామ సచివాలయాలుగా మార్చారు. లేని చోట అదనపు భవనాలను నిర్మించేందుకు రూ.25లక్షల చొప్పున విడుదల చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కారం.. సచివాలయాల్లో అన్ని శాఖల అధికారులు అం దుబాటులో ఉండి, ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు. ఆ లక్ష్యాన్ని అందుకోవడం కోసమే సీఎం జగన్ సచివాలయాలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకడుగు వేయడం లేదు. వాటికి మంచి భవనాలను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం పంచాయతీ భవనాలు ఉన్నవాటికి అదనంగా భవనాలు నిర్మించేందుకు రూ.25 లక్షల నిధులను విడుదల చేస్తున్నారు. శిథిలావస్థలో భవనాలు ఉన్న చోట రూ.40 లక్షలతో భవనాలు నిర్మించేందుకు ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారుల నుంచి భవనాల స్థితిగతులు, జియోట్యాగింగ్ వివరాలను అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. దీంతో మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా అధికారులు వివరాలను జియోట్యాగింగ్ చేయిస్తున్నారు. అయితే జిల్లాలో అదనపు భవనాలు నిర్మించాల్సిన సచివాలయాల సంఖ్య 392 ఉండగా, శిథిలాలవస్థకు చేరి కొత్త భవనాలు నిర్మించాల్సినవి 272గా ఉన్నాయి. -
గ్రామ వాలంటీర్లపై టీడీపీ కార్యకర్తల దాడి
-
వైఎస్సార్ ‘చేనేత’ సాయం రూ.24 వేలు
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : మగ్గం కలిగివున్న ప్రతి నేతన్నకూ ఏటా వైఎస్సార్ చేనేత సాయం రూ.24 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని జిల్లా జౌళి శాఖ ఏడీవో సుబ్బానాయుడు తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ వలంటీర్లతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీడీవో లీలామాధవి అద్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఏడీవో మాట్లాడుతూ నేతన్నల మగ్గం ఆధునీకరణ, నూలు కొనుగోలుకు ప్రభుత్వం చేయూతనిస్తోందని, అర్హులైన నేతన్నల ఎంపికను వలంటీర్లు పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల్లో భాగంగా మగ్గం ఉన్న నేతన్నలకు ‘వైఎస్సార్ చేనేత సాయం’ అందజేయనున్నట్లు తెలిపారు. ఇందుకు వలంటీర్ల ద్వారా చేనేత కుటుంబాలను సర్వే చేసి అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 7611 చేనేత కుటుంబాలు ఉండగా మదనపల్లెలోనే 4900 ఉన్నట్లు 2018 నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించిన సర్వే ఆధారంగా తేలిందన్నారు. ఇంకా చేనేత కుటుంబాలు ఉన్నట్లయితే రేపటి నుంచి చేపట్టబోయే రీ సర్వేలో గుర్తిస్తామని చెప్పారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాల అమలుకు లబ్ధిదారుల ఎంపిక చేపడతామన్నారు. ఇందుకోసం జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీలను నియమించినట్లు గుర్తుచేశారు. ఈ కమిటీల ఆమోదం ద్వారా ఇదివరకే జిల్లాలో 6821 మందిని గుర్తించి నివేదికను పంపించామన్నారు. మగ్గం లేనప్పటికీ కూలి, అద్దె మగ్గాలు నేస్తున్న వారు కూడా అర్హులేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పట్టణ, రూరల్ పరిధిలోని వలంటీర్లు, చేనేత జవిళి సంఘం నాయకులు పాల్గొన్నారు. -
పల్లెసీమకు పండగొచ్చింది
సాక్షి, కాకినాడ: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ జరిగింది. గాంధీ జయంతి రోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప గ్రామంలో గ్రామ సచివాలయాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించడం చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. ఈ సందర్భంగా కరప జెడ్పీ హైస్కూ ల్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించిన తీరు ప్రజల్లో ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెంచేలా చేసింది. సచివాలయ ప్రారంభోత్స కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం తొలుత పైలాన్, సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సభాస్థలికి చేరే మధ్యలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో సీఎం ఉద్యోగులతో ముచ్చటించారు. ‘మా నాన్న.. దివంగ ముఖ్యమంతి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నెలకొల్పిన ట్రిపుల్ ఐటీలో చదువుకున్నారు. నేను ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు పూర్తి పారదర్శకంగా, అంకితభావంతో పనిచేయాలి. ఏదైనా సమస్యతో సచివాలయానికి వస్తే 72 గంటల్లో పరిష్కరించి వారి మోములో చిరునవ్వులు ఉండేలా చూడాలి తల్లీ, తమ్ముడూ.’ అంటూ తలపై చెయ్యి వేసి ఆప్యాయంగా పలకరిస్తుంటే.. ఉద్యోగులు సంబరపడిపోయారు. ‘ఏం ఉద్యోగం చేస్తున్నావు? ఏ ఊరు మీది? బాగున్నావా తమ్ముడూ, తల్లీ? అని తోడబుట్టిన అన్నగా సీఎం హోదాను పక్కనబెట్టి యోగ క్షేమాలు తెలుసుకోవడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ప్రకృతి వ్యవసాయం, దేశీయ ఆవు మూత్రం, ఆవుపేడ, సేంద్రియ ఎరువుల వినియోగం తదితర లాభాలు, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని సచివాలయ ఉద్యోగులకు సూచిస్తూంటే వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపన కనిపిస్తోందని ఉద్యోగులు భావించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు నాణ్యమైన మందులు అందుతున్నాయా? ఆరోగ్య సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయా? గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సేవలు సక్రమంగా అందుతున్నాయా? దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నారా? అనే అంశాలను స్వయంగా సీఎం అడిగి తెలుసుకునే తీరును చూస్తుంటే ప్రజారోగ్యం, పారిశుద్ధ్య నిర్వహణపై ఆయనకు ఉన్న శ్రద్ధ ఆవిష్కృతమవుతోంది. ఇలా ప్రతి శాఖకు సంబంధించిన విషయాలను ఆ శాఖ సిబ్బంది ద్వారా తెలుసుకుని, ప్రజలకు మెరుగైన, అవినీతి రహిత, పారదర్శక, రాజకీయాలకు అతీతంగా సేవలు అందించాలని సూచించిన తీరు ఉద్యోగుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది. ఆత్మీయ స్వాగతం సీఎం వైఎస్ జగన్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎంపీలు వంగా గీత, అనురాధ, భరత్‌రామ్, కరప గ్రామ ప్రజలు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఘన స్వాగతం పలికారు. హెలీప్యాడ్ నుంచి గ్రామ సచివాలయం, సభా స్థలి వద్దకు సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సచివాలయ వ్యవస్థను జిల్లాను నుంచి ప్రారంభించడం జిల్లాకే గర్వకారణమని నేతలు అభివర్ణించారు. అనుకున్న సమయానికే కార్యక్రమం... గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మాదిరి ప్రజలను గంటల తరబడి వేచి ఉండేలా చేయడం, సభకు సీఎం ఆలస్యంగా రావడం లాంటి వాటికి స్వస్తి చెప్పారు. సీఎం టూర్లో నిర్దేశించిన సమయానికి కచ్చితంగా సభా స్థలికి రావడం, జ్యోతి వెలిగించడం, స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ, మంత్రుల ప్రసంగాలు సైతం క్లుప్తంగా చేయడం చకచకా జరిగిపోయింది. గత ప్రభుత్వంపై బురదజల్లేలా కాకుండా..గతంలో జరిగిన తప్పులు ప్రస్తుత ప్రభుత్వంలో జరగవని చెప్పడం..వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలపై విశ్లేషించారు. కేవలం గంట వ్యవధిలోనే సీఎం తన ప్రసంగాన్ని ముగించారు. కరతాళ ధ్వనులు ఉద్యోగులు, ప్రజల కరతాళ ధ్వనులు, అభిమానుల ఈలల మధ్య కార్యక్రమం ఆద్యంత్యం ఉత్సాహంగా సాగింది. జనవరి నుంచి పూర్తి స్థాయిలో గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని, 35 శాఖలకు చెందిన 500 రకాల సేవలు కేవలం 72 గంటల్లోనే మీ ముందు ఉంచుతామని సీఎం ప్రకటించడంతో సభా ప్రాంగణంలో ప్రజలు, అభిమానులు పైకి లేచి ఒక్కసారిగా ఈలలు వేశారు. కరతాళ ధ్వనులతో సీఎంను అభినందించారు. ఉద్యోగులంటే ప్రజలపై పెత్తనం చెలాయించడం కాదు.. సేవకులుగా పనిచేయాలని నూతనంగా ఎన్నికైన సచివాలయ ఉద్యోగులకు సూచించారు. ఏదైనా సమస్యతో ప్రజలు జన్మభూమి కమిటీల వద్దకు వెళ్తే మొట్టమొదటగా ‘నువ్వు ఏ పార్టీకి ఓటు వేశావు’ అని ప్రశ్నించేవారని.. ప్రస్తుతం అలాంటి వాటికి స్వస్తి పలకాలని, పార్టీలకతీతంగా సేవలు అందించి వారి హృదయాలు గెలవాలని ముఖ్యమంత్రి చెబుతుంటే అక్కడున్నవారు ‘అన్న, అక్క, చెల్లెమ్మ, అవ్వ, తాత, నేను మీ బిడ్డను.. నన్ను సేవ చేసే భాగ్యం కల్పించారు. మీకు నేను ఉన్నాను.. అని సంబోధిస్తుంటే తమ సొంత మనిషిగా భావించి చప్పట్లతో అభినందించారు. సీఎంకు ఎడ్లబండి జ్ఞాపికను బహూకరించిన కన్నబాబు జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు. జిల్లాలో 60 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. సచివాలయ ప్రారంభోత్సవం తన నియోజకవర్గంలోని కరప కేంద్రంలో జరగడం, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వ్యవసాయశాఖ మంత్రి కూడా అయిన కురసాల కన్నబాబు ఇందుకు సూచికగా ఎడ్లబండితో కూడిన జ్ఞాపికను సీఎంకు బహూకరించారు. సభావేదికపై సీఎంను శాలువాతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. పర్యటన విజయవంతం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన విజయవంతం కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, అధికార యంత్రాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం తరలి రావడమే కాకుండా సీఎం ప్రసంగం పూర్తయ్యే వరకూ ఎవరూ కదలకుండా ఆద్యంతం ఆసక్తిగా ఆలకించారు. -
1న వలంటీర్లకు గౌరవ వేతనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ వలంటీర్ల బ్యాంకు ఖాతాల్లో అక్టోబర్ ఒకటో తేదీన గౌరవ వేతనం జమ చేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలో మొత్తం 1,92,848 మంది గ్రామ వలంటీర్లకు గాను 1,85,525 మంది నియామక ప్రక్రియ పూర్తయిందని.. అందులో 1,50,661 మందికి గౌరవ వేతన చెల్లింపులకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు అందినట్టు పేర్కొన్నారు. వారికి ఒక్కొక్కరికి ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ మధ్య కాలానికి చెల్లించాల్సిన రూ.7,500 గౌరవ వేతనం అక్టోబర్ 1న వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు పేర్కొన్నారు. వివిధ సాంకేతిక కారణాలు, సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించని వలంటీర్ల గౌరవ వేతనం సప్లిమెంటరీ బిల్ ద్వారా మిగిలిన అందరికీ అక్టోబర్ మొదటి వారంలో జమ చేస్తామని పేర్కొన్నారు. -
వలంటీర్లపై టీడీపీ నాయకుడి దౌర్జన్యం
సాక్షి, కాశీబుగ్గ: ప్రజల ఇంటికే ప్రభుత్వ సేవలతోపాటు సంక్షేమ పథకాలు అందుతుండటంతో టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తమ మనుగడకే ముప్పు తప్పదని భయపడుతున్న వారంతా వలంటీర్లపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఇటీవల రేగిడి మండలం కాగితాపల్లిలో దాడి చేయగా, తాజాగా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి ఉదయంపురంలో ఓ టీడీపీ నాయకుడు తీవ్ర స్థాయిలో దూషించాడు. మహిళలని చూడకుండా దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాధిత వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... పలాస ఉదయపురం వీధిలో మండపం వద్ద 17, 19, 21, 22, 23 వార్డులకు సంబంధించిన రైతుభరోసా కార్యక్రమాన్ని శనివారం ఏవో ప్రభావతి సమక్షంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇదేక్రమంలో 22వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ గాలి కృష్ణారావు తమ వార్డు వలంటీర్ ఎవరని.. తమకెందుకు సమాచారం ఇవ్వలేదంటూ కొవ్వూరు లక్ష్మి చేతిలో నుంచి బలవంతంగా మైకు లాక్కోని ఆమెను ఇష్టానుసారంగా దూషించాడు. ఇంతలో మరో వలంటీర్ సమాధానం ఇవ్వడంతో ‘నువ్వెవరు సమాధానం చెప్పడానికి’ అంటూ కొత్తపల్లి శోభారాణిపై విరుచుకుపడ్డాడు. వలంటర్ లక్ష్మి కల్పించుకుని ముందు రోజు రాత్రి ఏడు గంటలకు ఇంటికి వెళ్లామని తన భార్య, తల్లిని కలిసి ఇళ్ల దరఖాస్తులు అందించామని, అయినా రాలేదని, పర్సనల్ ఫోన్‌కు సమాచారం అందించలేదని అనడం ఏమిటని ప్రశ్నించింది. దీంతో కోపోద్రిక్తుడై ఆమెపై దురుసుగా ప్రవర్తించడంతో ఆవేదన చెందింది. వలంటీర్లపై విరుచుకుపడ్డ తీరును అందరూ ఖండించారు. తీవ్ర మనస్తాపానికి చెందిన మహిళా వలంటీర్లు కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఎస్ఐ మహమ్మద్ ఆలీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వలంటీర్లలో కొవ్వూరు లక్ష్మి, కే శోభారాణి, సీహెచ్ దుర్గారావు, ఆర్ కుమారి, ఎం సుధారాణి, బీ జ్యోతి, ఎస్ వెంకటరమణ, డీ వాసుదేవ్ ఉన్నారు. కొత్త చెలికానివలసలో పోలీసు పికెట్.. రేగిడి: మండలంలోని కొత్త చెలికానివలస గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వలంటీరు దాసు పుండరీకి గ్రామానికి చెందిన తోట నాగభూషణం, తోట రామారావు, తోట జగన్ తదితరులకు చిన్నపాటి ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో మరో వలంటీరు పూసరి జోత్స్న వీడియో తీస్తోంది. వీడియో ఎందుకు తీస్తున్నావని రామారావు తదితరులు ఇద్దరు వలంటీర్లపై దాడికి యత్నించారు. ఈ విషయం శనివారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఏఎస్సై శ్రీనివాసరావుతోపాటు సిబ్బంది గ్రామానికి వెళ్లి ఎటువంటి గొడవలు తలెత్తకుండా పహారా కాస్తున్నారు. ఇరువర్గాలకు నచ్చజెప్పి సమస్య పరిష్కారమయ్యే విధంగా చేస్తామని ఏఎస్సై తెలిపారు. -
కత్తితో టీడీపీ కార్యకర్త వీరంగం
రేపల్లె/గుంటూరు: గ్రామ వలంటీర్‌పై టీడీపీ కార్యకర్త కత్తితో వీరంగం సృష్టించిన ఘటన గుంటూరు జిల్లా నగరం మండలం చల్లమ్మ అగ్రహారంలో ఆదివారం జరిగింది. టీడీపీ కార్యకర్తలు దొంతుబోయిన నాగబాబురెడ్డి, బురకాయలరెడ్డి టీడీపీ పాలనలో సొంత ఖర్చులతో ఇళ్లు నిర్మించుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలో వారికి సాయం అందలేదు. ప్రస్తుతం గ్రామాల్లో వలంటీర్లు పలు పథకాలకు అర్హులైన వారి పేర్లతో జాబితా తయారు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న ఇంటికి బిల్లులు అందించాలని వలంటీర్ కుంచల వెంకటనాంచారెడ్డితో టీడీపీ కార్యకర్త దొంతుబోయిన నాగబాబురెడ్డి గొడవకు దిగి కత్తితో బెదిరించాడు. వీరంగం సృషించాడు. గతంలో నిర్మించిన ఇంటికి ఇప్పుడు బిల్లు ఎలా వస్తుందన్నందుకు కత్తితో వచ్చి బెదిరించాడని వలంటీర్ ఆందోళన వ్యక్తంచేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. -
పరారీలో నిందితులు
శ్రీకాకుళం ,రేగిడి: మండలంలోని కాగితాపల్లికి చెందిన గ్రామ వలంటీర్ కిమిడి గౌరీశ్వరరావు రేషన్ సరుకులు పంపిణీ చేస్తుండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త దూబ అప్పలనాయుడుతోపాటు మరో నలుగురు టీడీపీ కార్యకర్తలు దాడి చేసి గాయపరిచిన విషయం పాఠకులకు విధితమే. ఈ ఘనటలో బాధితుడు గౌరీశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన రేగిడి ఎస్ఐ బి.రేవతితోపాటు పోలీసులు నిందితుల కోసం ఆరా తీశారు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు దూబ అప్పలనాయుడుతోపాటు మిగిలిన వారంతా గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు పరారయ్యారు. గ్రామంలో రేషన్ సరుకులను పార్టీలకు అతీతంగా అందించేందుకు వచ్చిన గౌరీశ్వరరావుపై దాడి చేయడాన్ని గ్రామస్తులు నియోజకవర్గంలోని ప్రజా సంఘాల నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు తప్పుపడుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. గ్రామంలో ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు ఉండడంతో పోలీసులు పహారా కాస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులు కోసం పోలీసులు అన్ని ప్రాంతాల్లో గాలిస్తున్నారు. రేగిడి, రాజాం, పాలకొండ ప్రాంతాల్లోని ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనాలను పరిశీలిస్తున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్ఐ స్పష్టం చేశారు. గౌరీశ్వరరావుపై దాడి విషయాన్ని సీరియస్‌గా ఉన్నతాధికారులు పరిగణలోకి తీసుకున్నారన్నారు. ఈ ఘటనలో గాయపడిన గౌరీశ్వరరావు ఆరోగ్యం ప్రస్తుతం కుదుట పడిందని ఆయన తండ్రి నీలన్నాయుడు సాక్షికి తెలిపారు. శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స అందుతుందన్నారు. తమ కుమారుడిపై దాడిచేసిన వ్యక్తులతో తమకు భవిష్యత్‌లో కూడా ప్రమాదం పొంచి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆ కారణాలతో ఏ పథకాన్ని నిరాకరించరాదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ప్రజల సమస్యలపై స్థానికంగా స్పందించడానికి గ్రామ సెక్రటేరియట్‌కు ప్రత్యేకంగా ఒక నంబర్ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభానికి సన్నాహకాలపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు నెలల వ్యవధిలో 4 లక్షలకు పైగా నియామకాలు చేయగలిగామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అదే విధంగా గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లకు ఉద్దేశించిన కాల్ సెంటర్లలో ఉన్నవారికి శిక్షణ కూడా ఇస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ప్రతీ శాఖ సహకారం అందించిందని గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ సీఎంకు తెలిపారు. ఫిర్యాదులు, సమస్యలను నివేదించడానికి 1902 కాల్ సెంటర్‌ను సిద్ధంచేస్తున్నామని..సెప్టెంబరు చివరి వారంలో పరీక్షా ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ క్రమంలో పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను సీఎం జగన్ అభినందించారు. ఈ సందర్భంగా... గ్రామ సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్టులను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతులను సమకూర్చారా? లేదా? అని ఆరా తీశారు. ‘72 గంటల్లోగా సమస్యను తీర్చడానికి అవసరమైన విధంగా సచివాలయాల్లో ఏర్పాట్లు ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో డేటా సెంటర్ కూడా ఉండాలి. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించాలి. గ్రామ సెక్రటేరియట్‌కు, సెక్రటేరియట్‌కు అనుసంధానం ఉండాలి. గ్రామ సెక్రటేరియట్‌నుంచి సంబంధిత శాఖాధిపతికి అప్రమత్తత చేసేలా వ్యవస్థ ఉండాలి. ఎమ్మార్వో లేదా ఎండీఓ, కలెక్టర్, అలాగే సంబంధిత శాఖ సెక్రటరీ... ఇలా వీరందరితో గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానం ఉండాలి అని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అదే విధంగా... జాబ్‌చార్టు ప్రకారం గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగులకు కేటాయించిన విధులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగి తనకు కేటాయించిన పనుల విషయంలో ప్రజలకు పూర్తి సహాయకారిగా, తోడ్పాడు అందించేలా ఉండాలి. ప్రజలకు పూర్తిగా అండగా ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థలపై మానిటరింగ్ చాలా ముఖ్యం. నాలుగు లక్షలమందితో పనిచేయించుకోవడం చాలా ప్రాధాన్యత ఉన్న అంశం. మానిటరింగ్, సమీక్ష లేకపోతే... ఫలితాలు రావన్న విషయాన్ని గుర్తించుకోవాలి. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థల కోసం మంచి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురండి’ అని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయండి సంక్షేమ పథకాల అమలు ప్రణాళికను సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ పథకాల లబ్దిదారుల ఎంపిక పూర్తయ్యిందా లేదా అన్న అంశం గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో ఇళ్లస్థలాలపై వాలంటీర్ల సర్వే పూర్తయ్యిందని అధికారులు ఆయనకు తెలిపారు. అదే విధంగా రైతు భరోసా ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. దీంతో రైతు భరోసా లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ‘ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల ఎంపికపై గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీలు జరగాలి. లబ్దిదారుల జాబితాను తప్పనిసరిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలి. గ్రామ, వార్డు సచివాలయాల భవనాలు ఒకే నమూనాలో ఉండేలా చూడండి. ప్రతి గ్రామ సచివాలయంలో రైతులకు వర్క్‌షాపు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలి. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఒక షాపు కూడా ఉండాలి. ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయ విధానాలపై సచివాలయాల్లో రైతులకు అవగాహన కల్పించాలి అని సీఎం జగన్ అధికారులకు సూచించారు. పారదర్శక పద్ధతిలో పథకాన్ని లబ్ధిదారులకు అందించడానికే సాంకేతిక పద్ధతులు. వేలిముద్రలు సరిగ్గా పడకపోతే వీడియో స్క్రీనింగ్ ద్వారా వెంటనే పథకాన్ని అందించాలి. అంతేతప్ప సాంకేతిక కారణాలు చూపి ఏ పథకాన్ని కూడా నిరాకరించరాదని సీఎం స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల ద్వారా దాదాపు 237 సర్వీసులు. 72 గంటల్లోగా అందే సర్వీసులు 115 కాగా...మిగిలిన సర్వీసులు కూడా ఎప్పటిలోగా చేస్తామన్న దానిపై వర్గీకరణ చేయాలి. డిసెంబరులో కొత్త పెన్షన్లు ఇవ్వాలి’ అని సీఎం అధికారులను ఆదేశించారు. -
గ్రామ వాలంటీర్లపై టీడీపీ వర్గీయుల దాడి
సాక్షి, రేగిడి (శ్రీకాకుళం): తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. మండల పరిధిలోని కాగితాపల్లి గ్రామానికి చెందిన గ్రామ వలంటీర్ కిమిడి గౌరునాయుడు మంగళవారం రేషన్ సరుకులు తీసుకున్న ప్రతి లబ్ధిదారుని వేలిముద్రను తీసుకొని బియ్యానికి సంబంధించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేపడుతున్నారు. విధుల్లో భాగంగా ఉద యం 7.30 గంటల సమయంలో దూబ నాగమణికి సంబంధించిన ఇంటితోపాటు మరికొన్ని ఇళ్లకు వేలిముద్రలు వేయించేందుకు వెళ్లారు. ఇంతలో డీసీసీబీ ఉపాధ్యక్షుడు, టీడీపీ నాయకుడు దూబ ధర్మారావు సోదరుడు దూబ అప్పలనాయుడుతోపాటు దూబ పాపారావు, కిమిడి నీలకంఠం, కిమిడి రమేష్, దూబ సూరపునాయుడులు వచ్చి దుర్భాషలాడుతూ దాడికిపాల్పడ్డారని గౌరునాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా ఇంటికి వచ్చి వేలిముద్ర వేయించుకోవడానికి నీవేవరవు, నువ్వు మా వలంటీర్ కాదని దూబ అప్పలనాయుడు హుకుం జారీ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులు సూచించిన ఆదేశాలతోనే తాను విధులు నిర్వహిస్తున్నానని, విధుల్లో భాగంగానే మీ ఇంటికి వెళ్లి వేలిముద్రలను తీసుకోవడంలో తన తప్పేమీలేదని గౌరునాయుడు అన్నారు. దీంతో కోపోద్రిక్తుడైన దూబ అప్పలనాయుడుతోపాటు మిగిలిన వారు కూడా తనపై దాడి చేశారన్నారు. విషయం తెలుసుకున్న గౌరునాయుడు కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకొని నిలువరించే ప్రయత్నం చేయగా వారిని కూడా దుర్భాషలాడుతూ అంతుచూస్తామని బెదింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గాయపడిన గౌరునాయుడును కుటుంబ సభ్యులు బైక్‌పై రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ బి.రేవతి, ఏఎస్ఐ వి.శ్రీనివాసరావు, సిబ్బంది ఆస్పత్రికి వెళ్లి గౌరునాయుడు వద్ద నుంచి వివరాలను సేకరించారు. అనంతరం గ్రామంలోకి పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించి గౌరునాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఎస్ఐ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ.. విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, మజ్జి శ్రీనివాసరావు, టంకాల ఉమాపాపినాయుడు తదితరులు రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి గౌరునాయుడును పరామర్శించారు. అధైర్యపడొద్దని, నీ వెంట తామంతా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే ఆరా.. కాగితాపల్లి గ్రామ వలంటీర్ కిమిడి గౌరునాయుడుపై గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు దూబ ధర్మారావు సోదరుడుతోపాటు అనుయాయులు దాడిచేసిన ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే కంబాల జోగులు ఆరా తీశారు. దాడి ఘటన హేయమైన చర్యని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. -
టీడీపీ కార్యకర్తలపై అట్రాసిటీ కేసు
సాక్షి, భామిని(శ్రీకాకుళం) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన బియ్యం పంపిణీలో టీడీపీ నాయకులు ఆటంకాలు సృష్టించి, గ్రామ వలంటీర్‌తో వివాదానికి దిగిన ఘటన ఆదివారం భామిని మండలంలోని తాలాడ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ విషయంలో అట్రాసిటీ కేసు నమోదైంది. సోమవారం పాలకొండ డీఎస్పీ రామ్‌రాజు కొత్తూరు సీఐ ఎల్.సన్యాసినాయుడు, బత్తిలి ఎస్ఐ అజార్ అహ్మద్ ఆధ్వర్యంలో అట్రాసిటీ కేసుపై దర్యాప్తు చేపట్టారు. బియ్యం నాణ్యంగా లేవని వివాదం రేపిన టీడీపీ కార్యకర్తలు వలరౌతు అచ్చుతరావు, వలరౌతు శివలపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బియ్యం పంపిణీ విషయంలో గ్రామ వలంటీర్‌పై దుర్భాషలాడి వివాదానికి దిగారని, అడ్డుకున్న తనను కులం పేరుతో దూషించారని గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సుంకు అప్పలనర్సి ఫిర్యాదు అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాదం రేగిన సంఘటనపై డీఎస్పీ గ్రామ వలంటీర్ నుంచి వివరాలు సేకరించారు. వీఆర్ఓ హరిహరరావు, కార్యదర్శి ప్రమీలారాణి, మాజీ సర్పంచ్ బంటు శ్రీనివాస్ గ్రామస్తులున్నారు. అనంతరం బత్తిలి పోలీస్ స్టేషన్‌కు గ్రామానికి చెందిన ముగ్గురు వలంటీర్లను పిలిపించి పూర్తి వివరాలు నమోదు చేశారు.వలంటీర్‌పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి టెక్కలి: పాతనౌపడ గ్రామ వలంటీర్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టెక్కలి ఆర్డీఓ ఐ.కిషోర్‌కు స్పందన కార్యక్రమంలో సోమవారం ఆ గ్రామానికి చెందిన వ్యక్తలు ఫిర్యాదు చేశారు. వలంటీర్‌పై దాడి చేయడంతోపాటు సమాచార హక్కు చట్టం పేరుతో అధికారులపై బెదిరింపులకు పాల్పడిన మర్ధల సురేష్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన లోకేశ్వర్‌రావు, యోగి, ఉమాశంకర్ తదితరులు ఆర్డీవోను కోరారు. -
వాలంటీర్ల నాణ్యమైన బియ్యం పంపిణీ
-
జగనన్న భరోసా
-
ఏపీ వ్యాప్తంగా ఉద్యోగ పరీక్షలు
-
స్వప్నం నిజమయ్యేలా
సాక్షి, మచిలీపట్నం : అర్హులైన నిరుపేదలకు వచ్చే ఉగాది కల్లా ఇంటి జాగా కేటాయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం సాకారం చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తును వేగవంతం చేసింది. ఇళ్ల స్థలాలకు అనువైన భూముల అన్వేషణ సాగిస్తోంది. మరో వైపు అందిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించేందుకు గ్రామ, వార్డు వలంటీర్లతో సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇంకా దరఖాస్తు చేయకుండా ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే వారితో కూడా దరఖాస్తులు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. భూముల గుర్తింపునకు కసరత్తు ఇళ్ల స్థలాల కోసం ఇప్పటి వరకు అందిన దరఖాస్తుల ఆధారంగా అవసరమైన భూములను గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది. గడిచిన రెండు నెలలుగా నిర్వహిస్తున్న స్పందనతో పాటు ప్రజాసాధిరాక సర్వే, సోషియో ఎకనామిక్ సెన్సెస్, టోల్ ఫ్రీ నంబరు 1100 ద్వారా జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల 850 దరఖాస్తులు అందినట్టుగా లెక్క తేల్చారు. ఆ మేరకు వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలంటే కనీసం 2,550 ఎకరాల భూములు అవసరమవుతాయని అంచనా వేశారు. కాగా ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసేందుకు అనువైన ప్రభుత్వ భూములు జిల్లా వ్యాప్తంగా 1000 ఎకరాలున్నట్టుగా గుర్తించారు. మరో 1550 ఎకరాల ప్రైవేటు భూములు సేకరించాల్సి ఉంటుందని లెక్కతేల్చారు. ఇందుకోసం రూ.1500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. రేపటి నుంచి క్షేత్రస్థాయి సర్వే ఇప్పటి వరకు అందిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించే కార్యక్రమాన్ని సోమవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. ఇటీవల నియమితులైన గ్రామ, వార్డు వలంటీర్లతో క్షేత్ర స్థాయి పరిశీలన చేపడుతున్నారు. 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వలంటీర్లు తమకు కేటాయించిన 50 కుటుంబాల్లో ఈ దరఖాస్తుదారులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారు అర్హులా? కాదా? వారిలో ఎవరికైనా ఇళ్ల స్థలం ఉంటి గృహ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారా? లేక కనీసం ఇంటి స్థలం కూడా లేని పరిస్థితి నెలకొందా? అని గుర్తిస్తారు. తమకు కేటాయించిన 50 కుటుంబాల్లో ఇంకా ఎవరైనా ఇళ్ల స్థలాలు, గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకోని వారెవరైనా ఉన్నారా? గుర్తిస్తారు. తమ వెంట తీసుకెళ్లే ఖాళీ దరఖాస్తులతో వారి వివరాలను నింపి వాటిని తహసీల్దార్ కార్యాలయంలో నవరత్నాల వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. 31వ తేదీ వరకు ఈ సర్వే జరుగనుంది. సర్వేలో అదనంగా అందిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకొని అర్హుల తుది జాబితాలను సిద్ధం చేస్తారు. ఆ మేరకు అవసరమైన భూములపై ఒక అంచనాకొస్తారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను మినహాయించి ఇంకా ఎంత సేకరించాల్సి ఉంటుందో అంచనా వేస్తారు. ఆ మేరకు భూసేకరణకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. తొలి విడతలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇంటి స్థలాలు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తారు. -
ఇళ్ల పట్టాల పంపిణీకి ఇంటింటి సర్వే
అర్హతలు లబ్ధిదారుకు తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరి. 2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాలలోపు మెట్ట భూమి. పట్టణాల్లో రూ. 3 లక్షల్లోపు వార్షిక ఆదాయం సాక్షి, అనంతపురం: జిల్లాలో ఇళ్లులేని పేదలందరికీ పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా వలంటీర్లు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. వలంటీర్లు సేకరించిన జాబితాను ఇప్పటికే రెవెన్యూ, హౌసింగ్ శాఖ అధికారుల వద్దనున్న సమాచారంతో సరిపోల్చుకోవడంతో పాటు సంబంధిత తహసీల్దార్లు, కమిషనర్లు రీ–వెరిఫికేషన్ చేస్తారు. అనంతరం సెప్టెంబర్ 3 నుంచి 10వ తేదీ వరకు సంబంధిత పంచాయతీ, వార్డుల్లో అర్హులైన జాబితాను ప్రకటిస్తారు. అదేవిధంగా దీనిపై అభ్యంతరాలను స్వీకరించడంతో పాటు పరిష్కరించే పనిని తహసీల్దార్లు, కమిషనర్లు చేయాల్సి ఉంటుంది. అంతిమంగా సెప్టెంబర్ 15వ తేదీ నాటికి తుది జాబితాను కలెక్టరుకు అందజేయాలి. ఆ తర్వాత కలెక్టర్ అనుమతితో అర్హులైన పేదలకు ఇంటి పట్టాల పంపిణీకి రంగం సిద్ధమవుతుంది. ఇందుకోసం జిల్లాలోని మొత్తం 20,050 మంది వలంటీర్లు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. ఎంపిక ఇలా...! జిల్లాలోని మొత్తం 1,029 పంచాయతీలు ఉండగా.. 15,006 మంది గ్రామ వలంటీర్లు.. ఒక కార్పొరేషన్, 11 మునిసిపాలిటీల్లో మొత్తం 373 వార్డులు ఉండగా 5,044 మంది వార్డు వలంటీర్లు నియమితులయ్యారు. జిల్లా వ్యాప్తంగా 20,050 మంది వలంటీర్లు ఈ సర్వేలో పాల్పంచుకోనున్నారు. ఒక ఫారంలో సర్వే చేసిన సంబంధిత కుటుంబం గురించి పేర్కొన్న వివరాలన్నీ సరైనవేనంటూ సదరు ఇంటి యజమానితో పాటు వలంటీరు కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలపై మరోసారి తహసీల్దారు ఆధ్వర్యంలో విచారణ చేపడతారు. ఆయా పంచాయతీలు, వార్డుల్లో జాబితాను సెప్టెంబర్ 3 నుంచి 10వ తేదీ వరకు ఉంచుతారు. దీనిపై అభ్యంతరాలను, క్లైయిమ్లను స్వీకరించి పరిష్కరిస్తారు. అనంతరం తుది జాబితాను ఆమోదం కోసం సెప్టెంబర్ 15 నాటికి కలెక్టర్‌కు పంపనున్నారు. ప్రస్తుత లెక్కలు ఇవీ...! జిల్లాలో ఇప్పటివరకు ఇళ్ల పట్టాల కోసం 1,40,682 మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రాథమిక విచారణలో 1,20,712 మందిని అర్హులుగా అధికారులు తేల్చారు. వీరందరికీ ఇళ్ల పట్టాలను కేటాయించేందుకు 4,082.53 ఎకరాల భూమి అవసరం కాగా.. 1077.25 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే అందుబాటులో ఉంది. ఈ భూమిని 29,259 మంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లపట్టాలను పంపిణీ చేసేందుకు సాధ్యమవుతుంది. మిగిలిన 97,453 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలను పంపిణీ చేసేందుకు మరో 3,010.68 ఎకరాల భూమి అవసరం అవుతుందని రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, ఈ భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకోసం మొత్తం రూ.716.49 కోట్లు అవసరం అవుతుందని జిల్లా అధికారులు లెక్కకట్టారు. అయితే, తాజాగా మళ్లీ ఇళ్ల పట్టాల కోసం అర్హులైన వారి కోసం ఇంటింటి సర్వేతో తుది లబ్ధిదారుల సంఖ్య తేలనుంది. అంతేకాకుండా గతంలో గంపగుత్తగా మండలాల వారీగా లెక్కలు తీసుకోగా.. తాజా సర్వేలో పంచాయతీల వారీగా భూమి లభ్యత, అర్హుల జాబితాను రూపొందించనున్నారు. ఈ దృష్ట్యా ఆయా గ్రామాల పరిధిలోనే ఇంటి స్థలం దక్కనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరికి వచ్చే ఏడాది ఉగాది పర్వదినాన పట్టాల పంపిణీ ప్రారంభంకానుంది. మొత్తం మీద జిల్లాలో ఇళ్లపట్టాలు లేని వారికి త్వరలోనే ఇంటిపట్టా చేతికి అందించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్ 15 నాటికి ప్రక్రియ పూర్తి జిల్లాలో అర్హులైన పేదలకు ఇళ్లపట్టాలను పంపిణీ చేసేందుకు అర్హులై జాబితాను రూపొందించేందుకు 26వ తేదీ నుంచి వాలంటీర్లు సర్వే చేయనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం సెప్టెంబర్ 15 నాటికి పూర్తి అవుతుంది. ప్రధానంగా సంబంధిత పంచాయతీలోనే ఇళ్లపట్టాలను ఇచ్చేందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అర్హులైన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే దిశగా పక్కాగా చర్యలు తీసుకుంటాం. – డిల్లీరావు, ఇన్చార్జి కలెక్టర్ -
‘ఓఎంఆర్ షీట్ తీసుకెళ్తే కఠిన చర్యలు’
సాక్షి, విజయవాడ : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణకు సన్నద్ధం కావాలని అధికారులకు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పిలుపునిచ్చారు. పరీక్షల నిర్వహణపై విజయవాడలో నిర్వహించిన వర్క్‌షాపును కలెక్టర్ ఇంతియాజ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజా శంకర్ మాట్లాడుతూ... చరిత్రలో మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. సెప్టెంబర్ ఒకటో తేదీన 4 ,478 సెంటర్లలో జరిగే పరీక్షలకు పదిహేను లక్షల యాభై ఎనిమిది వేల మంది హాజరు కానున్నారని తెలిపారు. ఇక క్రమశిక్షణ నిబద్దతతో పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అధికారులకు సూచించారు. పరీక్షా సమయం పూర్తయ్యే వరకు ఏ అభ్యర్థిని కూడా బయటకు పంపరాదని పేర్కొన్నారు. పరీక్ష రాసే అభ్యర్థి ఓఎంఆర్ షీట్‌ను బయటకు తీసుకెళితే క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు. -
ఇక ఇంటింటి సర్వే
సాక్షి, ఒంగోలు: వలంటీర్లు విధుల్లోకి వచ్చేశారు. గుర్తింపు కార్డుతో ఇంటి ముంగిటకు వస్తున్నారు. కుటుంబ పరిచయాల్లో ఉన్నారు. ఇదంతా 22వ తేదీలోగా పూర్తి కావాలి. ఇక 23వ తేదీ నుంచి కుటుంబ సర్వేకి ఉపక్రమించనున్నారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ కార్యక్రమం వలంటీర్ల ద్వారానే కుటుంబాలకు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అర్హులైన ఏ ఒక్కరు ప్రభుత్వ సాయం అందుకోకుండా కార్యాలయాల చుట్టూ తిరిగే పద్ధతికి చెల్లు చీటీ ఇవ్వడానికే ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. వలంటీర్లు విధి విధానాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 1038 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 14,628 వలంటీర్లు విధుల్లో ఉన్నారు. స్వాతంత్య్రదిన వేడుకల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఒంగోలు నగరపాలక సంస్థ, చీరాల,కందుకూరు, మార్కాపురం మున్సిపాలిటీలు, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి నగర పంచాయతీల పరిధిలోని వార్డులకు వలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రతి యాభై కుటుంబాల సంక్షేమ బాధ్యత, ప్రభుత్వ పథకాల పంపిణీ వీరి సహకారంతోనే ఉంటుంది. వీరి పని తీరును ఎంపీడీవోలు, కమిషనర్లు పర్యవేక్షించేలా వ్యవస్థ ఏర్పాటైంది. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీవోలు వీరి పనితీరును పర్యవేక్షిస్తారు. 23 నుంచి సర్వే.. వలంటీర్ల ద్వారా కుటుంబ వివరాలను సేకరించేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటికే ప్రజాసాధికార సర్వే జరిగింది. ప్రభుత్వం వద్ద ఈ సర్వే ద్వారా కుటుంబ వివరాలు ఉన్నాయి. ప్రభుత్వం నవరత్నాల అమలు ప్రక్రియను వేగవంతం చేయడానికి వలంటీర్ల వ్యవస్థనే కీలకం చేయనుంది. ఇందులో భాగంగానే వారి ద్వారానే కుటుంబ వివరాలను సేకరించేందుకు సర్వే షెడ్యూలును ఖరారు చేసింది. ఈ నెల 22వ తేదీ వరకు వలంటీర్లు వారి పరిధిలోని కుటుంబాలను పరిచయం చేసుకుంటారు. 23 నుంచి కుటుంబ సర్వేలో పాల్గొంటారు. ఈ సర్వే నివేదికను 30వ తేదీ నాటికి జిల్లా కేంద్రానికి అందేలా చర్యలు తీసుకోవాలి. ఈ నెల 26వ తేదీ నుంచి ఇళ్ల స్ధలాలు లేని వారి వివరాలను సేకరించే కార్యక్రమం జరగనుంది. ఇళ్ల స్థలాలు లేని వారి వివరాలను సేకరించి ప్రత్యేకంగా నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలి. ఎలాంటి సమాచారం సేకరిస్తారంటే... వలంటీర్లు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం సూచించిన విధంగా సర్వే చేస్తారు. ఈ సర్వేలో ఏం అడగాలో వివరాలకు సంబంధించి ఫార్మేట్లను అందజేశారు. సర్వే ఫార్మేట్లు వలంటీర్లకు అందజేశారు. ప్రతి యాభై కుటుంబాల వివరాలను సర్వే ఫాంలో నింపి షెడ్యూలు తేదీల ప్రకారం ఎంపీడీవోలకు అందజేయాలి. ఎంపీడీవోల ద్వారా జిల్లా కేంద్రానికి సమగ్రీకరించిన సర్వే నివేదికను నెలాఖరులోగా చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ► యజమాని వివరాలు, ఆ కుటుంబంలోని సభ్యుల వివరాలను సేకరిస్తారు. కుటుంబ సభ్యుల ప్రాథమిక సమాచారాన్ని అందించాలి. ► గృహనిర్మాణం కింద స్వంత ఇల్లు ఉందా. ఉంటే ఎవరి పేరున ఇల్లు ఉంది. ఇంటికి తాగునీటి వసతి. మరుగుదొడ్డి ఉంటే వివరాలు. విద్యుత్ కనెక్షన్ నెలవారీ బిల్లు వివరాలు. వంట విధానంలో కట్టెలపొయ్యితోనా..గ్యాస్‌తోనా వివరాలు సేకరిస్తారు. ► ఇంటి పరిసరాలు పరిశుభ్రత గురించి ఫార్మెట్లో వివరాలను పొందుపరచాలి. పరిశుభ్రత గురించి తగిన సమాచారాన్ని వలంటీర్లు సేకరించాలి. ► వ్యవసాయ కుటుంబం అయితే వివరాలు. భూమి ఎంత. బ్యాంకు రుణం. కౌలు రైతు అయితే వివరాలు. వ్యవసాయ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు. రైతు తీసుకున్న అప్పుల వివరాలను ఇందులో పొందుపరచాలి. ► పశుపోషణ వివరాలను సేకరిస్తారు. ఏ తరహా పశువులు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో నమోదు చేస్తారు. వీటి ద్వారా ఆదాయం పొందుతుంటే వాటి వివరాలు. పశుపోషణలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వివరాలను నమోదు చేస్తారు. ► ఆరోగ్యం అంశంలో పిల్లల ఆరోగ్యం వివరాలను నమోదు చేస్తారు. వారికి అందుతున్న పౌష్టికాహారాన్ని ఏ విధంగా పొందుతున్నారో సేకరిస్తారు. ► విద్యకు సంబంధించి 6–15 ఏళ్ల వయస్సు ఉన్న వారు అభ్యసిస్తున్న విద్య వివరాలు. ఆ పై వయస్సు ఉన్న వారు చదువుతుంటే ఎక్కడ.. ఎలా చదువుతున్నారో వివరాలను నమోదు చేస్తారు. ప్రభుత్వ లబ్ధి పొందుతుంటే వాటి వివరాలను నమోదు చేయాలి. ► స్వయం సహాయ బృందాల మహిళలు కుటుంబంలో ఉంటే వారి వివరాలు, తీసుకున్న రుణం, ఇతర వివరాలను నమోదు చేస్తారు. పొదుపు సంఘాల సభ్యుల పని తీరును ఈ సర్వేలో నమోదు చేస్తారు. ► ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కింద లబ్ధి పొందుతుంటే పింఛన్, రేషన్, ఇతర పథకాల ద్వారా లబ్ధి వివరాలను సర్వేలో నమోదు చేస్తారు. కుటుంబ సంక్షేమంలో ఇతరత్రా ఎలాంటి సమస్య గుర్తించినా వాటిని ప్రత్యేకంగా సర్వేలో నమోదు చేస్తారు. ► ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మంది లబ్ధిదారులకు ఇంటి నివేశన స్థలాలను ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో ఒంగోలు, కందుకూరు, మార్కాపురం డివిజన్ల పరిధిలో మండలాల వారీగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ, దేవదాయ ధర్మాదాయ భూముల వివరాల నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఎకరాకు గ్రామాల్లో అయితే 40 మంది, పట్టణాల్లో 80 నుంచి వంద మందిని ప్రతిపాదిస్తూ వివరాలను పంపారు. ఇంటి నివేశన స్థలాలకు అర్హుల వివరాలను ఈ సర్వేలో సేకరిస్తారు. సర్వేకి అంతా సిద్ధం గ్రామంలోని వలంటీరు స్థాయిలో సర్వే చేయడానికి అంతా సిద్ధం చేశారు. ఫార్మేట్ పత్రాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. అన్ని మండలాలకు ఫార్మెట్ పత్రాలు చేరాయి. అక్కడి నుంచి వలంటీర్లకు ఈ ఫార్మేట్లను చేరుస్తున్నారు. వలంటీర్లే ఇంటింటి తిరిగి ఫార్మెట్‌లోని వివరాల ప్రకారం సమాచారాన్ని సేకరించి నివేదిక తయారు చేస్తారు. -
ఠంచనుగా పింఛన్
గతంలో పింఛన్ల పంపిణీ మూడో వారానికి కూడా అయ్యేది కాదు. లబ్ధిదారులు కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. పింఛన్ డబ్బులు ఎప్పుడు వస్తాయా? అని ఎదురురు చూడాల్సిన పరిస్థితి ఉండేది.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఠంచనుగా పెన్షన్ అందించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో.. పంపిణీ వ్యవస్థను జిల్లా అధికారులు వేగవంతం చేశారు. దాదాపు శతశాతం పంపిణీని జీవీఎంసీ అధికారులు పూర్తి చేశారు. ఇకపై నేరుగా పింఛనుదారుల ఇంటికే వార్డు వలంటీర్ల ద్వారా పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: నెల ప్రారంభమయ్యేసరికి పింఛను డబ్బులు ఎప్పుడు వస్తాయి.. వాటిని అందుకొని ఆస్పత్రికి వెళ్లి మందులు కొనుక్కోవాలని ఎదురుచూసే వాళ్లు కోకొల్లలు. కానీ.. టీడీపీ హయాంలో ఆ పింఛను ఓ ప్రహసనంలా మారిపోయింది. పింఛను కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తే తప్ప చేతికి అందేది కాదు. పైగా రోజుల తరబడి వేచి చూస్తే బయోమెట్రిక్ పడలేదంటూ తిరస్కరించిన దాఖ లాలూ ఉ న్నాయి. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ పేషెంట్లు ఎన్నో ప్రయాసలు పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదటి రెండు వారాల్లోనే అందరి చేతిలోకి పింఛను డబ్బులు ఉండాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. తక్కువ వ్యవధిలోనే పింఛన్లు పంపిణీ పూర్తి చేసేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో వివిధ లబ్ధి దారులకు శతశాతం పంపిణీ చేసేశారు. జీవీఎంసీ పరిధిలో మొత్తం 1,03,595 మంది లబ్ధిదారులుండగా రూ.25,76,83,000 పంపిణీ చేశారు. ఇక నుంచి ఇంటి వద్దకే... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన పింఛనుదారులకు భరోసా ఇస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి, వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందించాలన్న సీఎం ఆలోచన వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురానుంది. అన్నీ పూర్తయితే వచ్చే నెల పింఛను వలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని జీవీఎంసీ అధికారులు భావిస్తున్నారు. ఇకపై వృద్ధులు వ్యయ ప్రయాసలకోర్చి పింఛన్ కోసం తిరగాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. వలంటీర్లకు వారి పరిధిలో ఉన్న పింఛనుదారుల వివరాల్ని ఇప్పటికే అధికారులు అందజేశారు. ఆయా ఇళ్లకు వెళ్లి లబ్ధిదారుల్ని వలంటీర్లు పరిచయం చేసుకోనున్నారు. నిధులు మంజూరైన మరుక్షణమే. పింఛన్లు పంపిణీ మొదలు పెట్టనున్నారు. వలంటీర్ల పరిధి 50 ఇళ్ల వరకు మాత్రమే ఉండటంతో మొదటి వారంలోనే పింఛన్ల పంపిణీ పూర్తికానుంది. అదే విధంగా కదలలేనివారు, మంచానికి పరిమితమైనవారు, వృద్ధులు, డయాలసిస్ పేషెంట్లకు తొలి ప్రాధాన్యమివ్వాలని జీవీఎంసీ అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక పింఛన్ డబ్బులు పెరగడమే కాకుండా... కష్టపడాల్సిన అవసరం కూడా లేకుండానే చేతికి పెన్షను అందనుందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా వృద్ధులకు, వితంతువులకు దశలవారీగా రూ.3 వేలు వరకు పింఛను పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికే వారి పింఛనుని రూ.2 వేల నుంచి రూ.2,250కి పెంచింది. డయాలసిస్ పేషెంట్లకు టీడీపీ హయాంలో రూ.3 వేలు మాత్రమే అందించేది. దాన్ని ఏకంగా మూడున్నర రెట్ల వరకూ పెంచి రూ.10 వేలు అందిస్తోంది. కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు మొదలైన వారికి గతంలో రూ.2 వేలు మాత్రమే అందేది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక వీరికి రూ.3 వేలు పింఛను అందిస్తోంది. -
నేటి నుంచి పరిచయం
అరసవల్లి: అవినీతి, అక్రమాలు లేకుండా పారదర్శక పాలన అందించాలనే ధ్యేయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో గురువారం నుంచి గ్రామ వలంటీర్ల వ్యవస్థ అమల్లోకి వచ్చింది. దీంతో గ్రామీణ పాలనలో వలంటీర్లు కీలక పాత్ర పోషించనున్నారు. నేరుగా లబ్ధిదారు ని ఇంటి ముంగిటకే ప్రభుత్వ పథకాలను చేర్చే విధంగా వలంటీర్లు పనిచేయనున్నా రు. ఈ మేరకు గురువారం నుంచి వలం టీర్లు విధుల్లోకి చేరారు. జిల్లాలో మొత్తం 38 మండలాల్లో 1141 పంచాయతీల్లో 13427 మంది గ్రామవలంటీర్లు నియమితులైతే.. ఓ 15 మందిS మాత్రమే శిక్షణలకు హాజరుకాకపోవడంతో నియామక పత్రాలను అధికారులు ఇవ్వలేదు. దీంతో 13,412 మంది వరకు వలంటీర్లు గురువారం నాటి విధుల్లోకి వచ్చారు. దాదాపుగా అన్ని మండలాల నుంచి ఈమేరకు వలంటీర్లు చేరికపై జెడ్పీ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలను తెప్పించుకున్నారు. జెడ్పీ సీఈఓ బి.చక్రధరరావు, డిప్యూటీ సీఈవో ప్రభావతి తదితరుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుం ది. వలంటీర్లకు ప్రత్యేకంగా విధి విధానాలతో పాటు ప్రతి నెలా చేపట్టాల్సిన ముఖ్య విధులను షెడ్యూల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ఉన్నతాధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. వలంటీర్ల విధుల షెడ్యూల్ ఇదే.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో నిజమైన అర్హులకు నేరుగా డోర్ డెలివరీ చేయడానికి గ్రామ వలంటీర్ల వ్యవస్థను గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు ప్రారంభిం చారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు తావి వ్వకుండా పాలన సాగాలన్న ఏకైక లక్ష్యంతో ప్రారంభమైన గ్రామ వలంటీర్లుకు ప్రత్యేక విధి విధానాలను కూడా రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో విధులను కూడా ప్రతి నెలా క్రమం తప్పకుండా వలంటీర్లు అంతా ఆచరణలో పెట్టాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో ఎక్కడైనా నిర్లక్ష్యం కన్పించినా వారిని తొలిగించి, ఆ స్థానంలో కొత్త వలంటీర్లను నియమించుకునే అధికారం ఎంపిడివో, జెడ్పీ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారులతో కూడిన కమిటీకి ఉంది. -ఆగస్టు 15న విధుల్లో చేరిన వలంటీర్లు, తమకు కేటాయించిన 50 ఇళ్లు, ఇతరత్రా వివరాలను పంచాయతీ కార్యదర్శి నుంచి సేకరించాలి. -ఆగస్టు 16 నుంచి 23 వరకు కేటాయించిన ఇళ్లల్లో కుటుంబాలను పరిచయం చేసుకోవాలి. -ఆగస్టు 26 నుంచి 30వ తేది వరకు పరిధిలోని 50 ఇళ్లల్లో ఇళ్ల స్థలాలు లేని వారి కోసం సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించాలి. -సెప్టెంబర్ 1 నుంచి 10వ తేది వరకు పరిధిలోని ఇళ్లల్లోని అర్హులకు సామాజిక భద్రతా పింఛన్లు, రేషన్ సరుకులు (ప్యాకెట్ల రూపంలో) డోర్ డెలివరీ చేయాలి. -పైలెట్ ప్రాజెక్టుగా మన జిల్లా నుంచే సన్న బియ్యం రేషన్ బియ్యంగా ప్యాకెట్ల రూపంలో వచ్చే నెల 1 నుంచి అందజేయడం ప్రారంభం కానుంది. -సెప్టెంబర్ 11 నుంచి 15వ తేది నుంచి వివిధ రకాల పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రైతు భరోసా లబ్ధిదారులను వలం టీర్లు స్వయంగా గుర్తిస్తారు. -ఎవరికైనా అందకపోతే వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తారు. -మత్స్యకారులు, రజకులు, ఆటోడ్రైవర్లు, దర్జీలు, నాయీ బ్రాహ్మణులకు సంబంధించిన పథకాలను అర్హులకు కూడా వలంటీర్లు గుర్తిస్తారు. -సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు గ్రామవలంటీర్లకు శిక్షణ ఉంటుంది. -సెప్టెంబర్ 29న గ్రామ సచివాలయాల ఉద్యోగులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ. -అక్టోబర్ 2 నాటికి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వలంటీర్లు అంతా సచివాలయాలకు వెళ్లాలి. -తమ పరిధిలోని అర్హులకు సంబంధించిన పనులను, వినతులను గ్రామ సచివాలయాల్లో అధికారులకు చేరవేసే బాధ్యతలు కూడా వలంటీర్ల మీదే ఉంటుంది. -దరఖాస్తు అందిన వెంటనే 72 గంటల్లోనే పరిష్కారమయ్యేందుకు సచివాలయాలు పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కూడా వలంటీర్లు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. షెడ్యూల్‌ను ప్రతి నెలా విధిగా పాటించాలి.. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురువారం నుంచి వలంటీర్లు విధులను నిర్వర్తించాలి. అలాగే ప్రతి నెలా దీన్నే షెడ్యూల్‌గా పాటించాలి. వలంటీర్ల పనితనంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఈ వ్యవస్థను అమలు చేస్తుందో ఆ లక్ష్యం నెరవేరేలా వలంటీర్లంతా పనిచేయాలి. ప్రతి నెలా వలంటీర్ల పనితనంను మండల అధికా రులు పర్యవేక్షిస్తుంటారు. – రవికుమార్, డీపీఓ, శ్రీకాకుళం గ్రామ సచివాలయాలకు అనుసంధాన కర్తలుగా... గ్రామ సచివాలయాలన్నీ ఈ ఏడాది అక్డోబర్ 2 నుంచి రాష్ట్రంలో అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు గ్రామ వలం టీర్లు అంతా ఈ సచి వాలయాలకు ప్రజలకు మధ్య అనుసంధాన కర్తలుగా పనిచేయాల్సి ఉంటుంది, అలాగే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం విధులు నిర్వర్తించాలి. ముఖ్యంగా కేటాయించిన 50 ఇళ్ల డేటాను కచ్చితంగా ప్రతి ఒక్క వలంటీర్ సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం షెడ్యూల్లో కొన్ని రోజులు కేటాయించారు. – బి.చక్రధరరావు, జెడ్పీ సీఈఓ -
కష్టపడి పని చేసేవారికి మంచి రోజులు
సాక్షి, కర్నూలు: కష్టపడి పని చేసేవారికి మంచి రోజులు వస్తాయని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని మర్చిపోయిందని విమర్శించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య గ్రామ వలంటీర్లు వారధిగా ఉండాలన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలన్నింటిని ప్రజలకు అందించాలని తెలిపారు. అమ్మ ఒడి, పెన్షన్ వంటి వాటిని ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలన్నారు బొత్స. వలంటీర్ల నియమాకలపై టీడీపీ నేతలు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. -
'ప్రభుత్వం సరికొత్త పాలన అందించబోతుంది'
సాక్షి, కడప : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరికొత్త గ్రామ సచివాలయ పాలనలో భాగంగా గ్రామ వలంటీర్ల పాలనకు శ్రీకారం చుట్టబోతోంది. స్వాతంత్య్ర వేడుకల అనంతరం గురువారం ఉదయం 11 .00 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీనిని ప్రారంభిస్తారు. తొలిరోజు వారికి గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తారు. అనంతరం వలంటీర్లు వారి పరిధిలోని గృహాలకు వెళ్లి పరిచయ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. తర్వాత గ్రామ సచి వాలయ పాలనలో భాగస్వాములవుతారు. గ్రామ సచివా లయ పాలనను ప్రభుత్వం పారదర్శకంగా, అవినీతి రహితంగా నిర్వహించాలని కృత నిశ్చయంతో ఉంది. ఈ పాలనను ముందుకు నడిపించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లపై పెట్టింది. గురువారం నుంచి గ్రామ వలంటీర్ల వ్యవస్థ ప్రారంభం నేపథ్యంలో వారి విధి విదానాలు, పాలన తీరుతెన్నులను కలెక్టర్ సీహెచ్ హరి కిరణ్ ‘సాక్షి ప్రతినిధి’కి వివరించారు. గ్రామ వలంటీర్ల పాలనను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని కలెక్టర్ సీహెచ్ హరికిరణ్ తెలిపారు.అనంతరం సీఎం సందేశమిస్తారన్నారు. ప్రభుత్వ పాలన ఎంత పారదర్శకంగా, అవినీతి రహితంగా ఉంటుందో ఆయన తెలియజేస్తారన్నారు. వలంటీర్ల పనితీరు, వారి నడత, నడక ఎలా ఉండాలో స్పష్టత ఇస్తారని, ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎలా తీసుకెళ్లాలో ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేస్తారని కలెక్టర్ తెలిపారు. సీఎం సందేశం అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సైతం ఇందులో పాల్గొంటారన్నారు. ఈనెల 16 నుంచి 23వ తేదీ వరకు వలంటీర్ల పరిచయ కార్యక్రమం ఉంటుందన్నారు. వారికి కేటాయించిన 50 లేదా 60 గృహాలకు వెళ్లి వారు పరిచయం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 23 నుంచి 30వ తేది వరకు గ్రామాల్లో అర్హులైçన వారికి నివాస స్థలాల కోసం సర్వే నిర్వహించాల్సి ఉందన్నారు.వారం రోజుల్లో వలంటీర్లు దీనిని పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. తర్వాత శిక్షణా తరగతులు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. వలంటీర్లు బాధ్యతతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. చిన్న పొరపాటు జరిగినా ఉపేక్షించమని చెప్పారు. గాంధీజయంతి నుంచి గ్రామసచివాలయ వ్యవస్థ అక్టోబరులో గాంధీ జయంతి నాటి నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ అమల్లోకి వస్తుందని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను ప్రభుత్వం అక్కడి నుంచే అమలు చేస్తుందన్నారు. ఇక గ్రామ సచివాలయ ఉద్యోగుల ఎంపికకు సంబంధించి సెప్టెంబరు 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కేటగిరి–1 పరిధిలో జిల్లాలో 82 వేల మంది ఆన్లైన్లో, అన్ని కేటగిరీలకు కలిపి లక్షా 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరికి పరీక్షలు నిర్వహించేందుకు జిల్లాలో 400 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న వలంటీర్ పోస్టులను సైతం త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. జిల్లాలో అర్హులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని కలెక్టర్ చెప్పారు. ఇంటి స్థలాల కోసం జమ్మలమడుగు డివిజన్ మినహా మిగిలిన డివిజన్ల పరిధిలో 2021 ఎకరాలు గుర్తించామన్నారు స్పం దన సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. గ్రామ సచివా లయ వ్యవస్థ రాగానే అర్హులందరికీ పెన్షన్లు, రేషన్‌కార్డులు అందజేస్తామని వివరించారు. -
సేవలకు సిద్ధం
సంక్షేమం ఇక పారదర్శకం కానుంది. ప్రతి ఇంటికీ పథకాలు చేరువ కానున్నాయి. ఇందుకోసం దేశంలోనే వినూత్న రీతిలో వలంటీర్ల వ్యవస్థను రాష్ట్రప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే జిల్లాలో ఎంపిక చేసిన 10,853మందికి శిక్షణ నిచ్చి రంగంలోకి దింపుతున్నారు. ఈ నెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీరు విధుల్లో చేరనున్నారు. అప్పటినుంచి తమకు కేటాయించిన 50 కుటుంబాలకు పథకాలు చేరువ చేయడం... పింఛన్, రేషన్ వంటివి ఇంటికే చేరవేయడం... వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. కొత్తగా లబ్ధిదారుల ఎంపికలోనూ వీరు కీలకంగా వ్యవహరించనున్నారు. లక్కవపుకోట(శృంగవరపుకోట): ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పారదర్శకంగా సక్రమంగా లబ్ధిదారులకు చేరువ చేసేందుకు... నిరుద్యోగ నిర్మూలనకు... రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను రూపొందించారు. దీనికోసం జిల్లాలోని 34 మండలాల్లో 10,853 మంది గ్రామ వలంటీర్లను ఎంపిక చేసి వారికి పూర్తి శిక్షణనిచ్చారు. నవరత్నాలు, పంచాయతీ వ్యవస్థ పనితీరు, ప్రజలతో ఎలా మెలగాలి తదితర అంశాలపై మూడు రోజుల పాటు శిక్షణనిచ్చారు. ప్రభుత్వ పాలన, వ్యవస్థల పనితీరు తెలుసుకోవడానికి 128 పేజీలతో కూడిన కరదీపికను ముద్రించి ప్రతీ వలంటీర్‌కు అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వలంటీర్లు ఈ నెల 15వ తేదీ నుంచి అధికారికంగా విధుల్లో చేరనున్నారు. వలంటీర్ల విధులు, బాధ్యతలు.. -కేటాయించిన 50 కుంటుంబాల పూర్తి సమాచారం సేకరించడం. -బేస్‌లైన్ సర్వే ఆధారంగా వ్యక్తిగత, సామాజిక అవసరాలను గుర్తించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడం. -కేటాయించిన 50 కుటుంబాలు పొందుతున్న పథకాలు, ప్రయోజనాలపై సమాచారం నమోదు చేయడం -సచివాలయాల్లో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు నిర్వహించే సమావేశాలకు హాజరు కావడం. -తమకు కేటాయించిన కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూడడం. -మద్యపానం, బాల్యవివాహాల నివారణలో సహాయసహకారాలు అందించడం. -కేంద్ర, రాష్ట్ర పభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం. -కుల, మత, వర్గ, లింగ, రాజకీయాలకు అతీతంగా అర్హత కల్గిన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను చేరవేయడం. -గ్రామాల్లో కొత్తగా ప్రవేశించిన వ్యక్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచాయితీ దృష్టికి తీసుకెళ్లడం వలంటీర్ల సేవలపై నిఘా.. వలంటీర్లకు నెలకు రూ. 5వేలు గౌరవ వేతనం గ్రామపంచాయతీల ద్వారా అందజేస్తారు. నిధులు పంచాయతీలకు ప్రభుత్వమే సమకూరుస్తుంది. గ్రామవలంటీర్ల పనితీరును ఏంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షిస్తారు. నివేదికలను ప్రతీ నెల కిందిస్థాయి అధికారులు ఎంపీడీఓకు అందిస్తారు. ఆ నివేదికలపై కలెక్టర్ సమీక్షిస్తారు. వలంటీర్ పనితీరు సక్రమంగా లేకపోతే తగిన మార్గనిర్దేశం చేసి మెరుగు పడేలా చేస్తారు. బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తే తొలగిస్తారు. అందించాల్సిన సేవలు: -నెలవారీ పింఛన్లు, రేషన్ సరకులు నేరుగా ఇంటికే తీసుకెళ్లి అందజేయడం, ఇమాన్, మ్యూజిన్లు, చర్ఛి పాస్టర్లకు నెలవారీ వేతనాలు అందించడం. -ఏడాదికోసారి విద్యార్థులకు ఫీజు రీయిం బర్స్మెంట్, అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, చేతివృత్తుల వారికి ఆర్థి క సాయం, వేట నిషేధ సమయంలో మత్య్స కారులకు పరిహారం, చిరు, వీధి వ్యాపారులకు వడ్టీలేని ఆర్థిక సహాయం అందించడం. -అవసరమైనప్పుడు ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, అన్నిరకాల ధ్రువపత్రాలు, వివిధ కార్పొరేషన్ల నుంచి ఆర్థిక సహాయం. వైఎస్సార్ బీమా, గొర్రెలు, పశువులకు బీమా, వైఎస్ఆర్ పెళ్లికానుక మంజూరు ఉత్తర్వులివ్వడం, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇళ్ల స్థలాల పంపిణీ, విద్యుత్ కనక్షన్లు, భవన నిర్మాణ అనుమతులు, తాగునీటి కుళాయిల కనెక్షన్లు ఇప్పించడం వంటి సేవలందించాలి. -ప్రభుత్వం అందించే పథకాలు, అర్హతలు, ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు తన పరిధి లోని 50 కుంటుంబాలకు అవగాహన కల్పిం చడం, పారిశుద్ధ్య పనులు చేయించడం, ప ర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా చేయడం. బాధ్యతతో పనిచేయాలి.. వలంటీర్‌గా ఎంపికైనవారు ఇదేదో ఉద్యోగంలా కాకుండా బాధ్యతగా భావించి పనిచేయాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రతీ 50 కుంటుంబాలకు చేరవేయాలి. ఒత్తిడికి తలొగ్గకూడదు, పారదర్శకంగా, నీతివంతంగా పనిచేయాలి. ఈ ఆవకాశాన్ని వలంటీర్లు దుర్విని యోగం చేస్తే తొలగించక తప్పదు. – కడుబండి శ్రీనివాసరావు, శృంగవరపుకోట ఎమ్మెల్యే గ్రామ వలంటీర్ల వ్యవస్థ ప్రయోజన కరమే.. గ్రామ వలంటీర్ వ్యవస్థ ప్రజలకు ప్రయోజన కరంగా వుంటుంది. ఇంత వరకు ప్రభుత్వ పరంగా ఏ పనిచేయాలన్నా పంచాయతీ కార్యదర్శులపైనే పెడుతున్నాం. వారికి పనిఒత్తడి వల్ల అశించిన మేరకు ఫలితాలు సాధించలేక పోతున్నాం. 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించి ప్రజలకు, గ్రామ సచివాలయానికి మధ్య వారధిలా పనిచేసే ఏర్పాటు చేయడం మంచి ప్రయత్నమే. – బి.కల్యాణి, ఎంపీడీఓ, లక్కవరపుకోట ఉపాధి లభించింది.. చదువులు పూర్తిచేసుకుని తల్లిదండ్రులకు భారంగా ఉన్న మాలాంటి వారికి వలంటీర్ ఉద్యోగం ఊరటనిచ్చింది. నేను గ్రామ వలంటీర్ శిక్షణ పూర్తి చేసుకున్నాను. ప్రభుత్వం అప్పగించిన సేవలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాను. – పిల్లల గోపి, తామరాపల్లి, లక్కవరపుకోట మండలం బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తా.. నేను ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వలంటీర్ పోస్టుకు దరఖాస్తు చేయగా ఎంపికయ్యాను. ఇప్పటికే మాకు రెండు రోజులపాటు శిక్షణచ్చారు. నాకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తాను. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తాను. – ఎస్.కె.ఫిరోజ్, లక్కవరపుకోట -
పథకాల అమలుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అమలు చేయనున్న పథకాల యాక్షన్ ప్లాన్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు పథకాల అమలుకు సంబంధించిన షెడ్యూల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వివరించారు. షెడ్యూల్ ప్రకారం.. ఆగస్ట్ 15 న గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ విజయవాడలో ప్రారంభిస్తారు. మిగతా అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో అక్కడి ఎమ్మెల్యేలు, మండల స్థాయి అధికారులు ప్రారంభిస్తారు. ఆగస్తు 16 నుంచి 23 వరకు ప్రతి గ్రామం, వార్డుకు కేటాయించిన ఇళ్లకు సంబంధించి వలంటీర్లకు అవగాహన కల్పిస్తారు. ఆగస్టు 26 నుంచి 30 వరకు గ్రామాల్లో ఇళ్ల పట్టాలు లేని లబ్ధిదారుల కోసం సర్వే చేస్తారు. సెప్టెంబరు 1 నుంచి సెప్టెంబరు 10 వరకూ బియ్యం, పెన్షన్లు డోర్ డెలివరీ చేస్తారు. పైలట్ ప్రాజెక్టుగా నాణ్యమైన, ప్యాకేజ్ చేసిన బియ్యం పంపిణీని శ్రీకాకుళంలో ప్రారంభిస్తారు. తర్వాత మిగతా జిల్లాలకు వర్తింపజేస్తారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని జిల్లాల్లో నాణ్యమైన ప్యాకేజ్డ్ బియ్యం అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబరు 11 నుంచి 15 వరకూ పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఇళ్లస్థలాలు, రైతు భరోసా లబ్ధిదారులను వలంటీర్ల గుర్తిస్తారు. సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు పథకాల అమలు తీరుపై సమీక్ష, శిక్షణ, ఉంటుంది. అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయాలను సీఎం ప్రారంభిస్తారు. శ్రీకాకుళం, విజయనగరంలో రేషన్ డోర్ డెలివరీ ప్రారంభిస్తారు. అక్టోబర్ 2 నుంచి ప్రతి రోజూ ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందన కార్యక్రమం నిర్వహిస్తారు. 60 నుంచి 65 ఏళ్ల వయస్సు ఉన్నవారికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తారు. అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా పంపిణీ చేపడుతారు. అక్టోబర్ నుంచి అన్ని సంక్షేమ పథకాల కొత్త లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. (చదవండి : రైతు భరోసా ప్రారంభానికి ప్రధాని మోదీకి ఆహ్వానం) -
కొత్త పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర్రంలో కొత్త పరిశ్రమలు రానున్నాయని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) అన్నారు. సోమవారం తగరపువలసలో వార్డు వలంటీర్లకు నియామక ప్రతాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా వచ్చే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వనున్నట్లు తెలిపారు. తగరపువలస, పద్మనాభం ప్రాంతంలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గ్రామ వాలంటీర్ల సేవలకు ప్రభుత్వం సముచిత గుర్తింపునిస్తుందన్నారు. చిట్టివలస జ్యూట్ కార్మికుల బకాయి ఆఖరి పైసా కూడా అందేలా చేస్తానని చెప్పారు. సాధికారిత సాధించే విధంగా మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. -
‘గ్రామ వాలంటీర్లందరూ సచివాలయ సైనికులు’
సాక్షి, శ్రీకాకుళం : గ్రామ వాలంటీర్లందరూ సచివాలయ సైనికులని, గ్రామీణ పాలనా వ్యవస్థకు మూలమని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారం వ్యాఖ్యానించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థ గురించి ఆరా తీస్తున్నాయని పేర్కొన్నారు. శ్రీలంక, మలేషియా దేశాల నుంచి కూడా పరిశీలనకు సిద్ధమయ్యారని తెలిపారు. సోమవారం పొందూరు మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో జరిగిన గ్రామ వాలంటీర్ల సమావేశంలో తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4.50 లక్షల వాలంటీర్లు, 1.50 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తీ రాష్ట్ర, దేశ చరిత్రలో గొప్ప విషయమన్నారు. ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇవ్వాలని, ప్రస్తుతం అదే జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటకు కట్టుబడి మనసుతో పాలన చేస్తున్నారని చెప్పారు. సామాజిక న్యాయం కోసం శాసనసభలో చట్టాలను తీసుకువచ్చామని, వచ్చే శాసనసభలో 50 శాతం మహిళలతో నిండిపోతుందని అన్నారు. ప్రతీ గ్రామ సచివాలయాన్ని సందర్శిస్తానని తెలిపారు. ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. ఏపీపీఎస్సీ, ఎక్సైజ్, డీఎస్సీ తదితర ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నారని తెలిపారు. తన విధుల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నానని, ఎప్పుడూ వ్యవస్థలను భ్రష్ఠు పట్టించే దిశగా పనిచేయనని స్పష్టం చేశారు. -
గ్రామ వలంటీర్ల నియామకం పూర్తి
సాక్షి, ఏలూరు : ప్రజలంతా నవ్వుతూ ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరికొత్త విధానం అమల్లోకి తెచ్చారు. పథకాలు ప్రతి ఇంటికీ అందా లనే సదుద్దేశంతో వార్డు, గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. అనుకున్నదే తడవుగా యుద్ధప్రాతిపదికన నియామకాలూ చేపట్టారు. ప్రస్తుతం వలంటీర్లకు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. దీంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంత భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పించడంపై అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లుగా ఎంపికైన అభ్యర్థులు ఉత్సాహంగా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నేరుగా ప్రజల ఇంటికే వెళ్లి పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వ పాలనలో జన్మభూమి కమిటీల పేరుతో కేవలం తెలుగుదేశం కార్యకర్తలకు, ఆ పార్టీ నేతలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందేవి. జన్మభూమి కమిటీల్లోనూ తెలుగుదేశం నేతలే ఉండేవారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రభుత్వం ఓ పక్క నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ.. నేరుగా ప్రజలందరికీ పథకాలు చేరాలనే లక్ష్యంతో వలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపొందించారు. విశేష స్పందన వలంటీర్ల పోస్టులకు జిల్లావ్యాప్తంగా విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా 8,29,130 గృహాలను పంచాయతీ అధికారులు గుర్తించారు. ఈ గృహాలకు పథకాలను డోర్‌డెలీవరీ చేయాలంటే 16,330 మంది వలంటీర్లు అవసరమని ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు జిల్లాలో 16,294 మందిని ఎంపిక చేసి వారికి నియామకపత్రాలు అందించారు. జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 36 మందికి ఇంకా నియామక పత్రాలు అందించాల్సి ఉంది. అర్హులైన ఎస్టీ అభ్యర్థులు లేకపోవడం వల్ల 36 వలంటీర్ల పోస్టులను ఖాళీగా ఉంచారు. ప్రత్యేక శిక్షణ ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు అం దించడంతోపాటుగా సోమవారం నుంచి ప్రత్యే క శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి గ్రామస్థాయిలో ఏమేర సేవలు అందించాలనే అంశంపై ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. జిల్లాలో 48 మండలాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభ్యర్థుల్లో హర్షం నియామకపత్రాలు పొంది శిక్షణకు హాజరవుతున్న నిరుద్యోగ యువత సర్కారు వినూత్న ఆలోచనపై హర్షం వ్యక్తం చేస్తోంది. ఎన్నోఏళ్లుగా విద్యనభ్యసించి ఖాళీగా ఉంటున్నామని, తమలాంటి వారికి ఇలా ఉద్యోగావకాశం కల్పించి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారని, ఇది ఎంతో సంతృప్తినిస్తోందని వలంటీలర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ వలంటీర్లు అందించే సేవలు, విధులివే.. నెలవారీ సేవల్లో పింఛన్లు, రేషన్ పంపిణీ, ఇమామ్, మ్యూజిన్లు, చర్చి పాస్టర్లకు నెలవారీ వేతనాల పంపిణీలో భాగస్వాములు కావాలి. వార్షిక సేవల్లో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు, అమ్మఒడి ప్రయోజనం అందజేత, రైతు భరోసా, చేతివృత్తిదారులకు అందించే ఆర్థిక సహాయం, చేపలవేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వ ఆర్థిక సహాయంతోపాటు ఇతరత్రా సేవలను అందించాలి. వీటితోపాటు అర్హులతో ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేయించడం, అవి వచ్చేలా అధికారులతో సమన్వయం చేసుకోవడం చేయాలి. స్థానికుల సమస్యలు గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కారం చూపిస్తూ ఉండాలి. ఆనందంగా సేవలందిస్తాం ప్రజలకు సేవలందించేందుకు వలంటీరుగా బాధ్యతలు స్వీకరించా. ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి ఉద్యోగంలో స్థానం లభించడం ఎంతో ఆనందగా ఉంది. ప్రభుత్వం సూచించిన మేరకు ఆనందంగా విధులు నిర్వహిస్తాను. సంతోషంగా సేవలు అందిస్తాను. – ఎం.నాగలక్ష్మి, గార్లమడుగు ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొస్తా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగ అవకాశాన్ని కల్పించడం, ఆ అవకాశం నాకు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. బాధ్యతతో ప్రజలకు సేవలందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాను. – సాయిరామలింగేశ్వరరావు, బాపిరాజుగూడెం -
100 శాతం పోస్టులు గిరిజనులకే..
సాక్షి, అమరావతి: షెడ్యూల్డ్ ఏరియాలో నివశిస్తున్న గిరిజనులకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలు నూరు శాతం స్థానికులకే ఇవ్వాలని ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత ప్రాతిపదికన 13 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని, ఈ ఉద్యోగాలు ఏజెన్సీలోని షెడ్యూల్డ్ ఏరియాలో నివశిస్తున్న స్థానికులకే ఇస్తామని తెలిపారు. నవరత్నాల ఆశయాల అమలుకు వీరు ప్రధానంగా పనిచేయాల్సి ఉంటుందని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. -
విశాఖ గ్రామ వాలంటరీ ఫలితాల విడుదల
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జీవీఎంసీ జోన్-4 కార్యాలయం పరిధిలో ఇటీవల నిర్వహించిన గ్రామ వాలంటీర్ల పరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఎంపికయిన అభ్యర్థుల జాబితాను ఉదయం జోనల్ కార్యాలయ ఆవరణలో నోటీస్‌బోర్డులో పెట్టారు. జోన్-4 పరిధిలో గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు మొత్తం 5,330 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని విశాఖపట్నం జీవీఎంసీ జోన్-4 కమిషనర్ సింహాచలం వెల్లడించారు. 3,700 మంది మౌఖిక పరీక్షకు హాజరు కాగా 1,623 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. 2,181 మంది గ్రామ వాలంటీర్లుగా ఎంపికయినట్లు తెలిపారు. ఫలితాల కోసం కార్యాలయానికి పెద్దసంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు. -
చీరాలలో టీడీపీ నేతల హైడ్రామా..
సాక్షి, చీరాల (ప్రకాశం): చీరాల మండల పరిషత్ అబివృద్ధి అధికారి వ్యవహరిస్తున్న తీరుతో వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు అన్నిశాఖల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామ వలంటీర్ల ఎంపిక జాబితా జిల్లా అధికారులకు పంపినది ఒకటి ఉండగా.. టీడీపీ నేతల బెదిరింపులకు, ఆదేశాలకు తలొగ్గి వారి మెప్పు పొందేందుకు మరొక జాబితాను తయారు చేశాడు ఆ అధికారి. దీంతో బుధవారం చీరాల గ్రామ వలంటీర్ల శిక్షణ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు తమకు సంబంధించిన అనుచరులతో కలిసి హై డ్రామా సృష్టించారు. ఆదివారం ప్రకటించిన జాబితా ఫైనల్‌కాగా సోమవారం అర్ధరాత్రి వరకు టీడీపీ నేతలు ఎంపీడీవో కార్యాలయంలో నానా హంగామా సృష్టించి బెదిరింపుకుల పాల్పడటంతో ఎంపీడీవో మరొక జాబితా తయారు చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం చీరాల ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల గేటు ముందు టీడీపీకి చెందిన నాయకులు తమ అనుచరులతో కలిసి నానా హైరానా సృష్టించారు. చీరాల్లో పోలీసులు 30 యాక్టు, 144 సెక్షన్‌ను విధించడంతో తహసీల్దార్ కార్యాలయం గేటు ముందు వన్‌టౌన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అభ్యర్థులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తనిఖీ చేసిన అనంతరమే పోలీసులు వలంటీర్లను శిక్షణ కేంద్రం లోపలికి అనుమతించారు. ఒన్‌టౌన్ సీఐ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సైలు సురేష్, రాజేశ్వరరావు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో మండలంలోని తోటవారిపాలెం, తదితర గ్రామాలకు చెందినవారు వలంటీర్ ఇంటర్వ్యూలో అర్హత సాధించామంటూ మరో జాబితాలతో మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బాషా, కొందరు టీడీపీ నేతలను వెంటబెట్టుకుని శిక్షణ కేంద్రంలోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని వలంటీర్లుగా నియామకం పొందిన జాబితా చూపించాలని కోరారు. దీంతో వారు తమ వద్ద ఉన్న జాబితా చూపించగా మండల పరిషత్ సిబ్బంది వద్ద ఉన్న తుది జాబితాతో సరిపోకపోవడంతో వారిని శిక్షణకు అనుమతించలేదు. ఒక దశలో టీడీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో వారిని పోలీసులు హెచ్చరించి పంపించారు. టీడీపీ నేతలు మాత్రం దురుసుగా వ్యవహరించడంతో కొందరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రెండు జాబితాలు తయారు చేసిన ఎంపీడీవో నమ్మక ద్రోహం చేశారని వారు వాపోయారు. మిగిలిన ఆ 61 పోస్టులు ఎక్కడ? 446 పోస్టులకు గాను 385 మందిని గ్రామ వాలంటీర్లుగా ఎంపిక చేశారు. మిగిలిన 61 మందిని ఎంపిక చేయకండా ఎంపీడీవో అవకతవకలకు పాల్పడుతున్నారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. చీరాల ఇన్చార్జి ఎంపీడీవో వ్యవహరిస్తున్న తీరు పలు అనుమనాలను రేకెత్తించడంతో పాటు, టీడీపీ నాయకులు సూచించిన వారిని నియామకం చేసేందుకు పాల్పడుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. -
రాజకీయ జోక్యం, లాబీయింగులు ఉండవు : మంత్రి
సాక్షి, విజయవాడ : తన రాజకీయ జీవితంలో ఇంత భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చూడలేదని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా 4 లక్షల 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం లో వార్డు వలంటీర్ల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న బొత్స మాట్లాడుతూ... తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వారి కష్టాలను దూరం చేసేందుకు వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతోనే గ్రామ సచివాలయాలు, వలంటీర్లు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయి వరకు తీసుకువెళ్లేందుకు గ్రామ వలంటీర్లు వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని సూచించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలల్లో ఎలాంటి రాజకీయ జోక్యం, లాబీయింగులు ఉండవని స్పష్టం చేశారు. పరీక్ష నిర్వహించి ప్రతిభావంతుల్ని ఆ పోస్టుల్లో భర్తీ చేస్తున్నామన్నారు. పరిపాలనా విధానంలో భాగంగానే ఈ వ్యవస్థను తీసుకొస్తున్నామని తెలిపారు. గ్రామ వలంటీర్లు చిత్త శుద్ధితో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వలంటీర్ల ఎంపికపై టీడీపీ పెత్తనం
సాక్షి, చీరాల: తాము చెప్పిందే జరగాలని టీడీపీ ఎమ్మెల్యే బలరాం, ఆపార్టీ నేతలు ప్రభుత్వ కార్యాలయాల్లో హల్చల్ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార దర్పం చూపించాలని ఉవ్విళ్లు ఊరుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రభత్వ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది గత ప్రభుత్వ హయాంలో నియమించిన వారంతా టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ వలంటీర్ల నియామకం, శిక్షణ తరగతుల్లో టీడీపీ నేతలు, నాయకుల ప్రోద్బలంతో మంగళవారం జరగాల్సిన శిక్షణ బుధవారానికి వాయిదా వేశారు. మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇన్చార్జి అధికారి టీడీపీ నేతల ఒత్తిళ్లు, సిఫార్సులకు దాసోహం అన్నట్లు వ్యవహరించడంతోనే చీరాల మండలంలో గ్రామ వలంటీర్ల వ్యవహారం గందరగోళంగా మారింది. ప్రభుత్వం చీరాల మండలానికి కేటాయించిన 446 వలంటీర్లు పోస్టులకు గాను మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 1789 మంది దరఖాస్తులు అందించారు. మండలంలో వలంటీర్ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గతనెల 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారిని ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హత ఉన్నవారిని ఎంపిక చేసి ఈపాటికే ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి నివేదించారు. వలంటీర్ల ప్రక్రియ పూర్తయి మంగళవారం నుంచి శిక్షణ అందించాల్సి ఉండగా టీడీపీ నాయకులు రాద్ధాంతంతో శిక్షణను మండల పరిషత్ అధికారులు బుధవారానికి వాయిదా వేశారు. శిక్షణను ప్రారంభించకపోవడానికి ముఖ్య కారణం మండల« స్థాయి అధికారే అని అంతా ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి వరకు.. గ్రామ వలంటీర్ల పోస్టుల్లో తమవారిని నియమించాలని మండల అధికారిపై టీడీపీ ఎమ్మెల్యే, అతని అనుచరులు కొందరు మండల కార్యాలయంలో తిష్టవేసుకుని హల్చల్ చేస్తున్నారు. మండలానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఆ అధికారి కూడా టీడీపీ నాయకులతో ములాఖత్ అయి వారు చెప్పిన వారినే వలంటీర్లుగా నియామకం చేయాలని వత్తాసు పలుకుతున్నారంటే ఆ అధికారులు టీడీపీ నేతల సేవలో నిమగ్నమవుతున్నారనే విమర్శలు గుప్పిస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి అనకశరాత్రి వరకు ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లను మె ఆ అధికారి సాయంతో వలంటీర్ల తుదిజాబితాలో మార్పులు చేసి.. టీడీపీ నాయకులు చెప్పిన వారిని చేర్చి ఆ జాబితా ఆమోదం కోసం అధికారి జిల్లా కేంద్రానికి వెళ్లాడనే ప్రచారం జరుగుతోంది. జాబితాలను మార్చాలని మంతనాలు చేయడంతో ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కనీసం వలంటీర్లుగా ఉద్యోగం చేసుకోబోతున్న తరుణంలో టీడీపీ నాయకులు చేస్తున్న రాజకీయంతో తాము ఇబ్బందులు పడుతావేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధులే వలంటీర్లు చీరాల: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వలంటీర్లు వారధులుగా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని 33 వార్డులకు సంబంధించిన వలంటీర్లుకు శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం పేరాలలోని ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డుల్లో పేదలకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు వలంటీర్లు కృషి చేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారికి ఏమి కావాలో తెలుసుకుని వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను అందేలా చూడాలన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకునే విధంగా వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత వలంటీర్లపై ఉందన్నారు. వలంటీర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వలంటీర్ ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు. తొలి నుంచి టీడీపీకి నమ్మినబంటే..? చీరాల మండల పరిషత్ కార్యాలయంలో ఇన్చార్జి అధికారిగా విధులు నిర్వహిస్తున్న అధికారి టీడీపీ నాయకులంటే ఆది నుంచి వల్లమాలిన అభిమానం. మండల స్థాయి టీడీపీ నేతలు వచ్చి ఏ పని అడిగినా తక్షణమే చేసి తన భక్తిని చాటుకుంటుండాడు ఆ అధికారి. గత మండల పరిషత్ పాలకవర్గంలో పనిచేసిన సభ్యుల్లో టీడీపీకి చెందిన వారికే అధికంగా నిధుల కేటాయింపులు, పనులు చేస్తుండేవాడనే పేరుంది. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ నాయకుల సేవలో ఆ అధికారి తలమునకలవ్వడం పట్ల కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది కూడా విస్మయం చెందుతున్నారు. టీడీపీ నాయకులను దగ్గర కూర్చోబెట్టుకుని మరీ గతంలో రుణాలు, పథకాలు అందించిన ఆ అధికారి ప్రస్తుతం వలంటీర్ల జాబితాను కూడా టీడీపీ నాయకులన దగ్గర ఉంచుకుని వారు సూచించిన వారినే వలంటీర్లుగా జాబితాలో నిక్షిప్తం చేశాడంటే ఆయన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ అధికారిని చీరాల నుంచి పంపించి వివక్షత లేకుండా పథకాలు అందించే అధికారిని నియమించాలని గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
వాలంటీర్లు వారధులుగా పనిచేయాలి- హోం మంత్రి
సాక్షి, గుంటూరు: ప్రభుత్వం, ప్రజలకు మధ్య గ్రామ వాలంటీర్లు వారధులుగా ఉండి.. పార్టీలకు అతీతంగా పనిచేయాలని హోంమంత్రి సుచరిత పిలుపునిచ్చారు. సోమవారం గుంటూరులో గ్రామ వాలంటీర్ల శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్,అధికారులు పాల్గొన్నారు. కొల్లూరులో గ్రామ వాలంటీర్ల శిక్షణా తరగతులను వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందేలా వాలంటీర్లు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నరసరావుపేటలో షాదీఖానాలో గ్రామ వాలంటీర్లుకు శిక్షణా తరగతులను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. విశాఖ జిల్లా: నర్సీపట్నంలో గ్రామ వాలంటీర్లలకు శిక్షణ తరగతులను ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌గణేష్ ప్రారంభించారు. రోలుగుంట,చోడవరం మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహించిన గ్రామ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలు అమలు చేసి.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కోవూరులో గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది రోజున అర్హులందరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. వైఎస్సార్ జిల్లా: బద్వేలు మున్సిపాలిటీ మండల కేంద్రాల్లో గ్రామ వాలంటీర్ల శిక్షణా తరగతులను ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ప్రారంభించారు. విజయనగరం జిల్లా: బోగాపురం నియోజకవర్గం భోగాపురం, డెంకాడ మండలాల్లో గ్రామవాలంటీర్ల శిక్షణా కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, మండలపార్టీ నాయకులు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, బంటుపల్లి వాసుదేవరావు, రావాడ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా: కందుకూరు ఎండీవో కార్యాలయంలో గ్రామ వాలంటీర్ల శిక్షణ తరగతుల్లో ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాల పథకాలను ప్రజలందరికి చేరవేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా: జగ్గయ్యపేట లో వార్డు వాలంటీర్ల శిక్షణ తరగతులను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా చేయవలసిన బాధ్యత వాలంటీర్ల పై ఉందన్నారు. -
పోస్టు ఇవ్వకపోతే ప్రాణం దక్కదు.. జాగ్రత్త!
సాక్షి, చీరాల: చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తన సహజ సిద్ధ లక్షణాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా చీరాలలో రెచ్చిపోయారు. ప్రభుత్వం ఇంటర్వ్యూల ద్వారా నియమించిన గ్రామ వలంటీర్లను కాదని, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేసి తనను గెలిపించిన టీడీపీ కార్యకర్తలకు పోస్టులు ఇవ్వాలంటూ అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. పైగా తాను వెంట తెచ్చిన లిస్టులోని పేర్లున్న వారికి పోస్టులు ఇవ్వకుంటే అంతు చూస్తానంటూ ఇన్చార్జి ఎంపీడీఓను బెదిరించినట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎంపీడీఓ కార్యాలయంలోనే బలరాం తిష్ట వేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. అంతా ఎమ్మెల్యే హోదాలో అధికారులతో చర్చించేందుకు మండల పరిషథ్ కార్యాలయానికి వచ్చారని భావించారు. కానీ ఆయన తన మందీ మార్బలం వెంట తెచ్చుకుని నిబంధనలకు విరుద్ధంగా గ్రామ వలంటీర్ల పోస్టులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలని హంగామా సృష్టించారు. ఒకదశలో భయపడిన అధికారులు, సిబ్బంది బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆ అవకాశం ఇవ్వలేదు. ఎంపీడీఓను నిర్బంధించి తాము చెప్పిన వారికి ఇస్తావా.. చస్తావా..అంటూ బెదిరించడంతో పాటు దుర్బాషలాషలాడినట్లు తెలిసింది. చీరాలకు తాను ఎమ్మెల్యేనని, తాను చెప్పింది వినాలంటూ... లేకుంటే ఏ మవుతారో తేలుస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. తనపై ఓడిన వ్యక్తి చెప్పిన వారికి ఎలా పోస్టులు ఇస్తారంటూ, అతని మాట ఎందుకు వింటున్నారంటూ ఆమంచిని ఉద్దేశించి పరుష పదజాలం వాడినట్లు సమాచారం. అభ్యర్థులను ఎంపిక చేసిన వారి పేర్లు చెప్పాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఒక దశలో ఎంపికలో తమ వారి పేర్లు లేకపోతే చీరాలలో ఏం చేస్తామో చూడాల్సి వస్తుందంటూ బెదిరించడంతో అధికారులు దిక్కు తోచక తాము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామన్నారు. మీరు ఇచ్చిన లిస్టు కూడా ఉన్నతాధికారులకు పంపిస్తామని బలరాంతో చెప్పారు. ఆయన వెంట వచ్చిన టీడీపీ నాయకులు..అధికారులు చెప్పింది వినకపోగా అంతు చూస్తామంటూ హెచ్చరించారు. ఇదీ..జరిగింది ప్రభుత్వం చీరాల మండలానికి కేటాయించిన 449 వలంటీర్ పోస్టులకు మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 1789 మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు ఈ నెల 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటర్వ్యూ చేసి అర్హత ఉన్న వారిని ఎంపిక చేసి ఈ పాటికే ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి నివేదించారు. దాదాపు ప్రక్రియ పూర్తయింది. మంగళవారం నుంచి వలంటీర్లుగా ఎంపికైన వారికి శిక్షణ అందించనున్నారు. ఈ దశలో టీడీపీ నాయకులు మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి హల్చల్ చేశారు. కేవలం ఉనికి కోసమే ఈ హంగామా..అని చీరాలలో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులు వలంటీర్లను నియమించగా చివరి నిమిషంలో వచ్చిన ఎమ్మెల్యే బలరాం కనీసం వంద గ్రామ వలంటీర్ల పోస్టులనైనా టీడీపీ కార్యకర్తలకు ఇవ్వాలని పట్టుబట్టారు. తమ చేతుల్లో లేని వ్యవహారం.. అని అధికారులు చెబుతున్నా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బలరాం పక్కన ఉన్న టీడీపీ నాయకులు అధికారులపై ఇష్టానుసారంగా వ్యవహరించారు. వలంటీర్లుగా ఎంపికైన వారు తమ అనుకూలమైన గ్రామాల్లో ఎలా పనిచేస్తారో చూస్తామని హెచ్చరికలు చేసినట్లు సమాచారం. తమ వారు కాకుండా మరొకరు వలంటీర్‌గా వస్తే చూస్తూ ఊరుకోమని బహిరంగంగానే బెదిరింపులు పాల్పడటం గమనార్హం. రాత్రి 8 గంటల ప్రాంతంలో కూడా ఎంపీడీఓ కార్యాలయంలోనే బలరాంతో పాటు టీడీపీ నాయకులు తిష్ట వేసినట్లు సమాచారం. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను సైతం టీడీపీ కార్యకర్తలు లోపలకు అనుమతించకపోవడం గమనార్హం. -
సేవకు సంసిద్ధం
సాక్షి , కడప : వలంటీర్లు సేవకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు అందించడానికి సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామాలలో వలంటీర్ల వ్యవస్థ ద్వారా పథకాల ఫలాలతోపాటు రేషన్ సరకులను ఇంటింటికీ చేరవేయాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈనెల 15నుంచి వీరంతా విధులలోకి రానున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ పనిచేయనున్నారు. ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తి చేసుకున్నారు. నియామక పత్రాలు అందుకున్నారు. మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జిల్లాలో తొమ్మిది లక్షల మేర కుటుంబాలకు సంబంధించి 15,040 మంది వలంటీర్ల నియామకం చేపట్టారు. ప్రజాసాధికారిక సర్వే తరహాలో ముందుగా వలంటీర్ బయో మెట్రిక్ మిషన్ ద్వారా కుటుంబ వివరాలు సేకరించి పెట్టుకుంటారు. తదనంతరం ఇల్లు, రేషన్, పెన్షన్, స్థలం, నీరు, విద్యుత్, ఇతర కార్డు ఏదైనా అంతా వలంటీర్ ద్వారానే జరగాల్సి ఉంది. సచివాలయ వ్యవస్థ అక్టోబరు నుంచి అమలులోకి వస్తే వలంటీర్ ద్వారా ప్రజల సమస్యలకు సంబంధించి 72 గంటల్లోనే సమస్యను పరిష్కారం చూపేలా ప్రభుత్వం సిద్దమైంది. రేషన్ చేర్చడం మొదలుకొని ప్రతి సేవలోనూ వీరు కీలకంగా వ్యవహారించనున్నారు. వలంటీర్ల వ్యవస్థతో గ్రామాల్లో పూర్తి స్థాయిలో అన్ని సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం కానుంది. వలంటీర్‌కు ప్రభుత్వం రూ.5 వేలు గౌరవ వేతనం అందిస్తుంది. సేవాభావంతో పనిచేసేలా వీరికి దిశా నిర్దేశం చేశారు. మరో పది రోజుల్లో ప్రజల్లోకి వలంటీర్ల వ్యవస్థ రానుంది. జిల్లా సమాచారం జిల్లాలో మొత్తం మండలాలు - 50 రెవెన్యూ గ్రామాలు - 4,032 మున్సిపాలిటీలు- 08 కార్పొరేషన్ - 01 మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పనిచేయనున్న వలంటీర్లు- 4483 గ్రామాల్లో సేవలు అందించనున్న వలంటీర్లు- 10,557 -
గ్రామ వాలంటీర్లు నిబద్ధతతో పనిచేయాలి
సాక్షి, కృష్ణా జిల్లాః నవరత్నాల పథకాలు ప్రజలందరికీ చేరాలంటే వాలంటీర్లు నిబద్ధతతో పనిచేయాలని పామర్రు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం వీరంకిలాకులు జడ్పీ హైస్కూల్లో గ్రామ వాలంటీర్ల శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ప్రజలందరికీ చేరువవ్వాలనే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారని తెలిపారు. తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. ప్రతి కుటుంబానికి గ్రామ వాలంటీర్లు చేయూత నివ్వాలని కోరారు. -
గ్రామ వలంటీర్లకు శిక్షణ..
ఇక గ్రామ వలంటీర్లకు శిక్షణప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తున్న గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఆగస్టు 15 నుంచి అమలకు సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లాలో 14, 449 మంది గ్రామ వలంటీర్ల ఎంపికప్రక్రియ పూర్తయింది. కొత్తగా విధుల్లో చేరే గ్రామ వలంటీర్లకు విధి, విధానాలపై శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. సాక్షి, ఒంగోలు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్నా గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఆగస్టు 15వ తేదీ నుంచి అమలుకు సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లాలో 14,449 మంది గ్రామ వలంటీర్ల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మండలస్థాయి ఎంపీడీఓల ద్వారా ఇటీవల నియామక పత్రాలను కూడా అందించారు. కొత్తగా విధుల్లో చేరే గ్రామ వలంటీర్లకు విధి, విధానాలపై శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. ఈ నెల 6వ తేది నుంచి 9వ తేది వరకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. జిల్లాలో ఉన్న 56 మండలాల్లో శిక్షణ పొందిన ఎంపీడీఓల ద్వారా గ్రామ వలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. తొలుత జిల్లా నుంచి 10 మంది ఎంపీడీఓలు, 10 మంది ఈఓపీఆర్డీలను ఎంపిక చేసి ఇటీవల గుంటూరు జిల్లా బాపట్లకు జిల్లా కలెక్టర్ శిక్షణకు పంపించారు. రెండు రోజుల పాటు శిక్షణ పొందిన ట్రైనర్స్ శనివారం, ఆదివారం రెండు రోజులలో జిల్లాలో ఉన్న 56 మంది ఎంపీడీఓలకు శిక్షణనిచ్చారు. తొలిరోజు 28 మంది, రెండో రోజు 28 మందికి శిక్షణలో పాల్గొన్నారు. మొత్తం 56 మంది ఎంపీడీఓలు శిక్షణ పొందారు. వీరంతా ఈ నెల 6 నుంచి మండల స్థాయిలో ఆయా మండలాల్లో గ్రామ వలంటీర్లుగా ఎంపికైన వారికి మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కొక్క బ్యాచ్‌కి 50 మందిని ఎంపిక చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామ వలంటీర్లు విధుల్లో చేరిన దగ్గర నుంచి ఏయే పనులు నిర్వహించాలో ఈ శిక్షణలో అవగాహన కల్పించనున్నారు. శిక్షణలో ఒక్కొక్క గ్రామ వలంటీర్‌కు ప్రభుత్వం ముద్రించిన కరదీపిక, ఒక పెన్ను సరఫరా చేస్తారు. కొన్ని మండలాల్లో ఎక్కువ మంది వలంటీర్లు ఉంటే మరో రెండు రోజులు శిక్షణ పొడిగించుకోవచ్చునని జిల్లా కలెక్టర్ వెసులుబాటు కల్పించినట్లు ఇన్చార్జి డీపీఓ పీవీ నారాయణ తెలిపారు. నేడు మండలస్థాయి అధికారులతో సమావేశం గ్రామ వలంటీర్ల శిక్షణకు సంబంధించి సోమవారం మండల స్థాయి అధికారులతో మండల కేంద్రంలోనే ఎంపీడీఓ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి డీపీఓ పీవీ నారాయణ తెలిపారు. శిక్షణలో ఎవరెవరు, ఏయే సబ్జెక్టుపై శిక్షణ ఇవ్వాలని అనే అంశంపై సమావేశంలో నిర్ణయిస్తారని తెలిపారు. శిక్షణకు నిధులు మంజూరు గ్రామ వలంటీర్లకు శిక్షణా సమయంలో కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయనున్నారు. వీటికి అయ్యే ఖర్చుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తోందని ఇన్చార్జి డీపీఓ తెలిపారు. ఒక్కొక్క మండలానికి రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు నిధులు విడుదల చేస్తారని తెలిపారు. ఆగస్టు 15 నుంచి విధులకు హాజరు శిక్షణ పూర్తి చేసుకున్న గ్రామ వలంటీర్లు తరువాత గ్రామస్థాయిలో ఆగస్టు 15 నుంచి విధులకు హాజరుకానున్నారు. శిక్షణలో పొందిన అంశాల ఆధారంగా గ్రామస్థాయిలో తమకు అప్పగించిన 50 ఇళ్లపై పర్యవేక్షణ చేసే కార్యక్రమం ప్రారంభమవుతోంది. -
రెండు సమస్యలకు పరిష్కారంగా వాలంటీర్ల వ్యవస్థ: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: అటు నిరుద్యోగులకు ఉపాధి, ఇటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిందే వాలంటీర్ల వ్యవస్థ అని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన గ్రామ వాలంటీర్ల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే క్షేత్ర స్థాయిలో పని విభజన జరగాలి. అందుకే 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించి రాజధాని నుంచి సూచించే ప్రభుత్వ పథకాలు మరో గంటలోపు అమలు చేయగలిగే వ్యవస్థ రూపుదిద్దుకొనున్నదని వివరించారు. వాలంటీర్లు తమకొచ్చే రూ.5వేల గురించి కాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గుర్తించాలన్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించారనే భయం, బాధ్యతతో చంద్రగిరిలో నీటి సమస్య తీర్చడం కోసం 250 బోర్లకు ఒకేసారి అనుమతులు మంజూరు చేశానని వెల్లడించారు. నగర కమిసనర్ మాట్లాడుతూ మీ పరిధిలోని 50 గృహాలకు మీరే మండలాధిపతులుగా ఉంటారనీ, నిస్వార్ధంగా సేవలందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాక్షించారు. తుడా సెక్రటరీ రాం సుందర్ రెడ్డి అభిప్రాయంలో సామాన్యులు తమ అవసరాలకు ఎవరిని కలవాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారనీ, మీతో ఆ ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటున్నానన్నారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాలంటీర్లకు నియామక పత్రాలతో పాటు ఉద్యోగ ప్రదాత సీఎం ఫోటోలను స్వయంగా అందించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వలంటీర్ల చేతుల్లోకి నియామక పత్రాలు
సాక్షి, అనంతపురం న్యూసిటీ: నిరుద్యోగుల కల ఫలించింది. ఏ పనీలేక ఇంట్లో వారికి భారమైన వారికి ఆ బాధ దూరమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వార్డు వలంటీర్ల పోస్టులను భర్తీ చేయడంతో నిరుద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. శనివారం జిల్లాలోని నగరపాలక సంస్థ, 11 మునిసిపాలిటీల్లో వార్డు వలంటీర్లుగా ఎన్నికైన వారికి ఆయా కమిషనర్లు నియామక పత్రాలను అందజేయడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటామని వారు ఆనందంలో తేలిపోయారు. కిక్కిరిసిన నగరపాలక సంస్థ, మునిసిపాలిటీలు జిల్లాలోని వివిధ మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థ వార్డు వలంటీర్లు, వారి కుటుంబ సభ్యులతో కిక్కిరిపోయింది. ఉదయం 8 గంటల నుంచే నియామక పత్రాలిస్తారని వార్డు వలంటీర్లు ఎదురుచూశారు. నియామకపత్రాలకు సంబంధించి ఈ నెల 2న ఆయా మునిసిపాలిటీల అధికారులు మెసేజ్‌లు పంపారు. దాని ఆధారంగా ఏఏ ప్యానెల్లో వారు ఇంటర్వ్యూలకు హాజరయ్యారో అక్కడే నియామకపత్రాలు తీసుకున్నారు. మునిసిపల్ ఆర్డీ, ఇన్చార్జ్ కమిషనర్ అలీంబాషా, తదితర అధికారులు ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీ చెన్నుడు, కార్యదర్శి సంగం శ్రీనివాసులు, ఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస రావు, ఏసీపీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 20979 నియామక పత్రాలు అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు మునిసిపాలిటీల్లో మొత్తం 20,979 మందికి నియామక పత్రాలను అందజేసిన ట్లు మునిసిపల్ ఆర్డీ అలీంబాషా పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని ఒక నగరపాలక సంస్థ, 11 మునిసిపాలిటీల్లో 5,465 మందికి నియామకపత్రాలు అందజేశామన్నారు. వీరికి ఈ నెల 6 నుంచి 9 వరకు శిక్షణ ఉంటుందని, శిక్షణ కేంద్రాల వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు. ఇంటి వద్దకే సేవలు : మంత్రి శంకరనారాయణ పెనుకొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని రాష్ట్ర బీసీసంక్షేమ శాఖామాత్యులు మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన మండల పరిషత్ భవనంలో వలంటీర్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదట సారిగా గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన ఏకైక నేత జగనేనన్నారు. ప్రజలు తమ పనులపై ప్రభుత్వకార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగకుండా వారి ఇంటి వద్దే సేవలు అందించేందుకు సీఎం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా 72 గంటల్లో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఒకేసారి 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. పారదర్శకంగా పాలన గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాయని మంత్రి విమర్శించారు. పాలనలో పారదర్శకత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. వలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేలు ఇస్తామని, నిజాయితీగా పని చేయాలని సూచించారు. ఎంపీడీఓ శివశంకరప్ప, కార్యదర్శి అశ్వర్థప్ప, మండల కన్వీనర్లు శ్రీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గుట్టూరు శ్రీరాములు, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కరరెడ్డి, మాజీ ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, మాజీ మార్కెట్‌యార్డ్ చైర్మన్ నాగలూరుబాబు, మాజీ సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, చలపతి, రాజగోపాలరెడ్డి, టౌన్ కన్వీనర్ తయూబ్ తదితరులు పాల్గొన్నారు. కొలువుల జాతర 12,373 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు అనంతపురం టవర్‌క్లాక్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వలంటీర్ల నియామకం పూర్తయ్యింది. జిల్లాలో 896 గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించగా, ఇంకా వాటి సంఖ్య పెంచుతూ 912 సచివాలయాలు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో మొత్తం 14,007 వలంటీర్ల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం 15,218 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రతిపాదన పంపారు. నిరుద్యోగుల నుంచి ఏకంగా 58,382 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 56,707 మంది అర్హత సాధించారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు శనివారం నియామక ఉత్తర్వులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 12,737 మందిని గ్రామ వలంటీర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేసినట్లు జిల్లా పరిషత్ సీఈఓ శోభాస్వరూపరాణి తెలిపారు. సీఎం దేవుడిలా అవకాశం ఇచ్చారు టైలర్ పని చేసుకుంటూ ఇంటిని నెట్టుకొస్తున్నా. ప్రభుత్వ పథకాల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాకు కల్పించారు. ఉద్యోమంటే మాలాంటోళ్లకు సాధ్యపడదని అనుకున్నాం. ప్రజలకు సకాలంలో సేవలు అందిస్తా. – ద్వారకనాథ్, ఓబుళదేవనగర్ అదృష్టంగా భావిస్తున్నా వార్డు వలంటీర్‌గా ఎన్నికైనందుకు సంతోషంగా ఉంది. ఉపాది లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉపాధి కల్పించడం మాలాంటి నిరుద్యోగులకు అదృష్టంగా భావిస్తున్నాం. ఆర్థికంగా ఊరట లభిస్తుంది. – రాశి, నేతాజీ నగర్ హామీ నిలబెట్టుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తరహాలో ఇచ్చిన మాట తప్పలేదు. వార్డు వలంటీర్లు, సెక్రటేరియట్లలో లక్షలాది మందికి ఉపాధి కల్పించడం సీఎం గొప్పతనమే. వార్డు వలంటీర్‌గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. – శ్రీ బాలాజీ, జీసస్‌నగర్ ధన్యవాదాలు వార్డు వలంటీర్లుగా అవకాశం కల్పించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సార్‌కు ధన్యవాదాలు. విద్య, వైద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళలకు ఆయన సముచిత స్థానం కల్పిస్తున్నారు. మహిళా సాధికారతకు ఆయన చేస్తున్న కృషి ఎంతో గొప్పది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉద్యోగాలు దోహదపడతాయి. –స్రవంతి, నీరజ అంబేద్కర్‌నగర్ -
మహిళా ప్రగతి కేంద్రంలో గ్రామ వాలంటీర్ల శిక్షణ
సాక్షి, పెందుర్తి(విశాఖపట్టణం) : రాష్ట్రంలో అవినీతిలేని పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర్ట పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. త్వరలో బాధ్యతలు తీసుకోనున్న గ్రామ వలంటీర్లు పారదర్శకంగా పని చేసి ప్రజల మన్ననలు అందుకోవాలని సూచించారు. టీవోటీలు వలంటీర్లకు ఆ దిశగా చక్కటి దిశానిర్దేశం చేయాలన్నారు. పెందుర్తి లోని డీఆర్డీఎ మహిళా ప్రగతి కేంద్రంలో శుక్రవారం గ్రామ వలంటీర్లకు శిక్షణ అందించనున్న జిల్లాస్థాయి టీవోటీలకు రెండు రోజుల శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వలంటీర్లకు అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. వారికి కేటాయించిన 50 కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల అవగాహన కలిగించి కుల, మత, వర్గ తేడాలు లేకుండా, రాజకీయాలకు అతీతంగా సంక్షేమపథకాలు అందేలా చూడాల్సి ఉంటుందన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గ్రామ సచివాలయానికి చేరవేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు. వలంటీర్లు అవినీతికి పాల్పడితే జిల్లాస్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని అక్కడ న్యాయం జరగకపోతే స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షించే రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని దాన్ని అందరూ సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అందరం పని చేయాలని ఆకాంక్షించారు. పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్‌రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. గ్రామాల అభివృద్ధిలో వలంటీర్ల పాత్ర అంత్యంత కీలకమన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. గ్రామ వలంటీర్ల శిక్షణ కరదీపిక, నవరత్న మాలిక కరదీపికను మంత్రి, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ–2 ఎం.వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈవో రమణమూర్తి, డీపీవో కృష్ణకుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తిరుపతిరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు జయప్రకాష్, డీఈవో లింగేశ్వరరెడ్డి, డీఆర్డీఎ ఇన్చార్జి పీడీ రామ్మోహనరావు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
గ్రామవాలంటీర్ల మాస్టర్ ట్రైనర్స్‌కు శిక్షణ
-
‘గ్రామ వలంటీర్ల నియామకాల్లో అవకతవకల్లేవు’
సాక్షి, విజయవాడ: గ్రామ వలంటీర్ల నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ వలంటీర్ల నియమకాలు పారదర్శకంగా జరిగాయని, జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ‘మండల కేంద్రాలలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. జులై 1న ప్రారంభమైన స్పందన కార్యక్రమంలో ఇప్పటి వరకూ 600 -7000 వరకు అర్జీలు వచ్చాయి. ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం సాధ్యమవుతుంది. దీనికి సంబంధించిన డేటాను సాధికారిక సర్వే, స్పందన, గ్రామ వలంటీర్ల ద్వారా తీసుకుంటామ’ని ఆయన తెలిపారు. ‘సాధారణ ఎన్నికల్లో జిల్లా సిబ్బంది పూర్తి సహకారం అందించారు. స్పందన, నవరత్నాల అమలులో జిల్లా యంత్రాంగం ముందంజలో ఉంది. ‘నేను సైతం కృష్ణమ్మ శుద్ధి’ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ‘మన విజయవాడ’ పేరుతో యాంటీ ప్లాస్టిక్ డ్రైవ్ చేపడుతున్నాము. విజయవాడను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. నేను సైతం ప్రోగ్రాం ద్వారా 23 రైతు బజార్లలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించామ’ని పేర్కొన్నారు. నగరంలోని సమస్యలపై ఇంతియాజ్ స్పందిస్తూ.. ‘బెంజి సర్కిల్ అంశం గురించి కేంద్రానికి లేఖ రాశాను. కేంద్రం నిధులు విడుదల చేయగానే బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ పనులు వేగవంతం చేస్తాం. ఏ.కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి పెన్షన్లు మంజూరు చేయించాం. అదే విధంగా 9 ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని’ తెలిపారు. నూజివీడు మిర్జాపురం రైతుల ధర్నాపై ఇప్పటికే సబ్ కలెక్టర్‌కు సూచనలు చేశామన్నారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని ఇంతియాజ్ హామీ ఇచ్చారు. -
‘గ్రామ వలంటీర్లు రాజకీయాలకు అతీతంగా ఉండాలి’
సాక్షి, కాకినాడ : రాష్ట్రంలోని పాలనా వ్యవస్థల్లో మార్పు తీసుకువచ్చేందుకు.. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో వలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చామని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో గ్రామ వలంటీర్ల మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమనికి శుక్రవారం ఆయన హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ వలంటీర్లు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. ‘మీ పనితీరు ప్రభుత్వానికి అద్దం పట్టేలా ఉండాలి. వలంటీర్లు తప్పు చేస్తే వెంటనే వారిని తొలగించి కొత్త వారిని నియమిస్తాం’ అని స్పష్టం చేశారు. అదే విధంగా గత ప్రభుత్వ జన్మభూమి కమిటీల మాదిరిగా కాకుండా.. గ్రామ వలంటీర్ వ్యవస్థ అందుకు భిన్నంగా ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. కాగా వలంటీర్ వ్యవస్థ నియంత్రణ మొత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దే ఉంటుందని వెల్లడించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నాం అని మంత్రి తెలిపారు. అన్న క్యాంటిన్లు తొలగించలేదని, బడ్జెట్ కేటాయింపులు పరిశీలిస్తున్నామన్నారు. దీంతో పాటు గోదావరి వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. -
పల్లెతల్లి సేవకు తొలి అడుగు
సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : గ్రామాల్లో పారదర్శక పాలనకు మార్గం సుగమమైంది. సంక్షేమ పథకాలు ఇంటికే అందే విధంగా నూతన ప్రభుత్వం వినూ త్న విధానానికి రూపకల్పన చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల్లో భాగంగా అమలు కానున్న గ్రామ వలంటీర్ల వ్యవస్థలో తుది జాబితా విడుదల చేయడంతో పల్లె సేవకు తొలి అడుగు పడినట్టైంది. ప్రతి గ్రామంలోనూ 50 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున విధులు నిర్వర్తించనున్న ఈ నియామకాలకు సంబంధించి గత నెల 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూల ప్రక్రియ జరిగింది. ఈ మేరకు గురువారం అర్హుల తుది జాబితాను అధికారులు ఆయా మండలాల్లోనే విడుదల చేశారు. అర్హులకు వలంటీర్లుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ మేరకు జిల్లాలోని 38 మండలాల్లో 1,141 గ్రామ పంచాయతీల్లో మొత్తం 13,427 మంది గ్రామ వలంటీర్లను నియమించారు. వీరంతా ఈ నెల 5 నుంచి 10 వరకు నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణ తరగతులకు సన్నద్ధమవుతున్నారు. శిక్షణ అనంతరం ఈ నెల 15 నుంచి గ్రామాల్లో కేటాయించిన 50 ఇళ్లకు ఒక్కో వలంటీర్ చొప్పున విధుల్లోకి చేరనున్నారు. నేటి నుంచి మండల అధికారులకు శిక్షణ గ్రామ వలంటీర్ల నియామకాల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో వీరికి శిక్షణ ఇచ్చేందుకు కూడా ప్రత్యేక అధికార బృందం సిద్ధమవుతోంది. ఈ మేరకు జిల్లా నుంచి ఏడుగురు మాస్టర్ ట్రైనీలకు గత నెల 29,30 తేదీల్లో బాపట్లలో ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. అయితే ఇప్పటికే గుర్తించిన 228 మంది మండల స్థాయి అధికారులకు నేటి నుంచి రెండు రోజుల పాటు మాస్టర్ ట్రైనీస్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మండలానికి ఆరుగురు చొప్పున పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికా రులను జిల్లా పరిషత్ సీఈఓ చక్రధరరావు ఆధ్వర్యంలో అధికార బృందం గుర్తించింది. దీంతో శుక్ర, శనివారాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు జిల్లా పరిషత్ కొత్త సమావేశ మందిరం, పాత సమావేశమందిరంతో పాటు డీఆర్డీఏ సమావేశ మందిరాలను సిద్ధం చేశారు. ఒక్కో బ్యాచ్‌కు 57 మంది చొప్పున ఈ శిక్షణను ప్రారంభించనున్నారు. ఈ రెండు రోజుల శిక్షణ తర్వాత ఈ మండల స్థాయి అధికారులంతా కొత్తగా విధుల్లోకి రానున్న 13,427 మంది వలంటీర్లుకు ఆయా మండల కేంద్రాల్లోనే ఈనెల 5 నుంచి 10 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. వలంటీర్ల విధులు, కనీస 50 ఇళ్లకు చేయాల్సిన సేవలు, ప్రభుత్వ పథకాల అందజేత విధానాలపై ఈ శిక్షణలో వివరించనున్నారు. అనంతరం ఈనెల 15 నుంచి వలంటీర్లంతా పూర్తి స్థాయి విధుల్లోకి వస్తారు. పెరిగిన వలంటీర్ల పోస్టులు వాస్తవానికి జిల్లాలో గ్రామ వలంటీర్లను 11,924 మందిని మాత్రమే నియమించేలా తొలుత నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం తొలుత పోస్టుల సంఖ్యను ఖరారు చేయడంతో తాజా పరిస్థితుల్లో జిల్లాలో కుటుంబాల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో వలంటీర్ల సంఖ్య కూడా పెరిగింది. దీంతో మొత్తం 13,427 మంది వలంటీర్లను నియమించేందుకు అధికారులు నిర్ణయించి, గురువారం విడుదల చేసిన తుది జాబితాలో ఉన్నవారికి నియామక పత్రాలు అందజేశారు. ఆయా మండలాల అధికారుల బృందమే సా మాజిక సేవనే ప్రాధాన్యతగా చేసుకుని అర్హులను గుర్తిం చింది. ఈ మేరకు గ్రామ వలంటీర్ల విధులు ఈ నెల 15 నుంచి పూర్తి స్థాయిలో పనిచేయనున్నారు. రెండు రోజుల శిక్షణ ఇలా.. మండలానికి ఆరుగురు చొప్పున మొత్తం 228 మంది మండల స్థాయి అధికారులను జెడ్పీ సీఈఓ గుర్తించారు. ఈ మేరకు ఇటీవలే బాపట్లలో సుశిక్షితులైన మాస్టర్ ట్రైనీస్, శుక్ర, శని వారాల్లో వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం మండలాల వారీగా బ్యాచ్‌లను ఖరారు చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం కేటాయించిన సమావేశ మందిరాల్లో సంబంధిత మండలాల నుంచి ఎంపికైన మండల స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. బ్యాచ్–1: జెడ్పీ కొత్త సమావేశ మందిరంలో– ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం, టెక్కలి, కోటబొమ్మాళి బ్యాచ్–2 : జెడ్పీ కొత్త సమావేశ మందిరంలో – సంతబొమ్మాళి, పోలాకి, వంగర, సారవకోట, పాతపట్నం,మెళియాపుట్టి,కొత్తూరు, లక్ష్మీనర్సుపేట, వీరఘట్టం, భామిని. బ్యాచ్–3: జెడ్పీ పాత సమావేశ మందిరంలో – జలుమూరు, బూర్జ, జి.సిగడాం, హిరమండలం, సరుబుజ్జిలి, రేగిడి ఆమదాలవలస, రాజాం, పాలకొండ, సంతకవిటి, సీతంపేట. బ్యాచ్–4: డీఆర్డీఏ సమావేశ మందిరంలో – శ్రీకాకుళం, ఆమదాలవలస, పొందూరు, ఎచ్చెర్ల, గార, లావేరు, నరసన్నపేట, రణస్థలం. శిక్షణకు సర్వం సిద్ధం గ్రామ వలంటీర్ల నియామకాల్లో భాగంగా ముందుగా మాస్టర్ ట్రైనీలు, మండల స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిక్షణకు అన్ని ఏర్పాట్లు చేశాం. మొత్తం 228 మంది అధికారులను నాలుగు బ్యాచ్‌లుగా జెడ్పీ కొత్త సమావేశ మందిరంలో రెండు బ్యాచ్‌లు, పాత సమావేశ మందిరంలో మరో బ్యాచ్‌ను అలాగే డీఆర్డీఏ మీటింగ్ హాల్లో ఇంకో బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వనున్నాం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశాం. అలాగే వలంటీర్లకు నియామక పత్రాలను కూడా అందజేశాం. – బి.చక్రధరరావు, జెడ్పీ సీఈఓ -
కొలువుల జాతర
-
అందరికీ ఆల్ ద బెస్ట్ : సీఎం జగన్