interest rate
-
వడ్డీ రేట్లను సవరించిన ప్రముఖ బ్యాంక్
న్యూఢిల్లీ: రెపో ఆధారిత రుణాల రేట్లను 0.10 శాతం మేర పెంచుతున్నట్టు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. రెపో రేటును ఆర్బీఐ ఇటీవలే పావు శాతం తగ్గించినప్పటికీ ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్), ట్రెజరీ బిల్లుల ఆధారిత రుణ రేటు (టీబీఎల్ఆర్), బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్), రెపో లింక్డ్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (ఆర్బీఎల్ఆర్)పై బ్యాంక్ అస్సెట్ లయబులిటీ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలను ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది.ఇదీ చదవండి: పీపీఎఫ్ నామినీ మార్పునకు ఛార్జీలు లేవు: నిర్మలా సీతారామన్రెపో లింక్డ్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (రెపో ఆధారితం/ఆర్బీఎల్ఆర్)ను 0.10 శాతం పెంచడంతో 8.95 శాతం నుంచి 9.05 శాతానికి చేరింది. 6 నెలల నుంచి మూడేళ్లలో కాలం తీరిపోయే రుణాలకు అమలు చేసే టీబీఎల్ఆర్ రేటును 0.05 శాతం తగ్గించడంతో 6.5 శాతానికి దిగొచ్చింది. బేస్ రేటును సైతం 0.05 శాతం తగ్గించగా, 9.80 శాతానికి చేరింది. సవరించిన రేట్లు ఏప్రిల్ 3 నుంచి అమల్లోకి వస్తాయని ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది. -
ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం
తాజా పాలసీ సమీక్షలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే నిర్ణయించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు మరోసారి 4.25–4.5 శాతంవద్దే కొనసాగనున్నాయి. ఛైర్మన్ జెరోమ్ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) గత సమీక్షలోనూ యథాతథ పాలసీ అమలుకే ఓటు వేసిన సంగతి తెలిసిందే.వివిధ దేశాలపై ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌ల విధింపు, వీటి కారణంగా యూఎస్‌లో స్టాగ్ఫ్లేషన్ పరిస్థితులు తలెత్తనున్నట్లు ఆర్థికవేత్తల అంచనాల నడుమ ఎఫ్‌వోఎంసీ ఆచితూచి అడుగేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఫెడ్ నిర్ణయాల తదుపరి చైర్మన్ పావెల్ ప్రసంగంపై ప్రపంచ కేంద్ర బ్యాంకులు దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. అయితే ఆర్థికవేత్తలు ఊహిస్తున్నట్లు 2025లో వడ్డీ రేట్ల కోతలపై ఫెడ్ నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడకపోవచ్చని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: అక్కడ సంపాదించి ఇక్కడకు పంపిస్తున్నారు!భారతదేశంలో ఆర్బీఐ గత మానిటరీ పాలసీ సమావేశంలో ఐదేళ్లలో మొదటిసారి రేటు తగ్గింపును అమలు చేసింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి చేర్చింది. ద్రవ్యోల్బణాన్ని ఆర్థిక వృద్ధితో సమతుల్యం చేయడమే ఈ చర్య లక్ష్యంగా తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య విధానాలు తరచూ భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై ఒత్తిడి పెంచుతున్నా స్థానికంగా ఆర్బీఐ నిర్ణయాలు కీలకంగా మారుతున్నాయి. ఫెడ్ తాజా నిర్ణయాల నేపథ్యంలో ఏప్రిల్ 7-9 వరకు జరిగే ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో ఏమేరకు వడ్డీరేట్లపై చర్యలు తీసుకొంటారో మార్కెట్ వర్గాలు పరిశీలించే అవకాశం ఉంది. -
ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు: ఈసారీ అంతే..
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై.. వడ్డీ రేటును ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్దారించింది. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీరేటు యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత.. ఈ వడ్డీ రేటు ఏడు కోట్లకు పైగా చందాదారులకు జమ అవుతుంది.2022-23లో ఈ వడ్డీ 8.15 శాతంగా ఉండేది. అయితే దీనిని 2023-24లో 8.25 శాతానికి పెంచారు. 2018-19లో ఈ రేటు 8.65గా ఉండేది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో వడ్డీ రేటు ఏకంగా 8.1 శాతానికి పడిపోయింది. ఇప్పుడు గత ఏడాది మాదిరిగానే 8.25 శాతం వద్దనే కొనసాగుతుందని ప్రకటించారు.ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా?ఉమాంగ్ యాప్: ఉమాంగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని.. మీ ఫోన్ నంబర్‌తో నమోదు చేసుకోండి. ఆ తరువాత EPF పాస్‌బుక్, క్లెయిమ్‌లు, బ్యాలెన్స్ చెక్ వంటి సేవలను యాక్సెస్ చేసుకోవచ్చు.ఈపీఎఫ్ఓ పోర్టల్: EPFO అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి, "మెంబర్ పాస్‌బుక్" విభాగానికి వెళ్లి, మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.మిస్డ్ కాల్: మీ UAN-రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇవ్వండం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: పతనమవుతున్న పసిడి ధరలు: కొనడానికి ఇదే మంచి ఛాన్స్! -
ఫిబ్రవరిలో సవరించిన ఎఫ్డీ వడ్డీ రేట్లు.. ఏ బ్యాంకులో ఎంతంటే..
ఫిబ్రవరి 2025లో కొన్ని బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) వడ్డీ రేట్లను సవరించాయి. పెట్టుబడిదారులకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఆకర్షణీయమైన రాబడిని అందించాలని నిర్ణయించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల రెపో రేటును తగ్గించినప్పటికీ, కొన్ని బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచలేదు. కొన్ని ఆర్థిక సంస్థలు సీనియర్ సిటిజన్లకు ఏటా 9.10% వరకు వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఇటీవల ఎఫ్డీ వడ్డీరేట్లను అప్డేట్ చేసిన బ్యాంకుల వివరాలు కింద తెలుసుకుందాం.సిటీ యూనియన్ బ్యాంక్జనరల్ పబ్లిక్: 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 5% నుంచి 7.50% వరకు వడ్డీ.సీనియర్ సిటిజన్లు: అదే కాలపరిమితికి సంవత్సరానికి 5% నుంచి 8% వరకు.అత్యధిక వడ్డీ రేటు: సాధారణ ప్రజలకు 333 రోజుల కాలపరిమితికి సంవత్సరానికి 7.50%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 8%.అమలు తేదీ: ఫిబ్రవరి 10, 2025.డీసీబీ బ్యాంక్జనరల్ పబ్లిక్: 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 3.75% నుంచి 8.05% వరకు వడ్డీ లభిస్తుంది.సీనియర్ సిటిజన్లు: అదే కాలపరిమితికి సంవత్సరానికి 4.25% నుంచి 8.55% వరకు వడ్డీ.అత్యధిక వడ్డీ రేటు: 19 నుంచి 20 నెలల కాలపరిమితికి వార్షికంగా 8.05%, సీనియర్ సిటిజన్లకు 8.55%.అమలు తేదీ: ఫిబ్రవరి 14, 2025.కర్ణాటక బ్యాంక్జనరల్ పబ్లిక్: 7 రోజులు-10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 3.50% నుంచి 7.50% వరకు వడ్డీ లభిస్తుంది.సీనియర్ సిటిజన్లు: ఇదే కాలపరిమితికి సంవత్సరానికి 3.75% నుంచి 8% వరకు వడ్డీ.గరిష్ట వడ్డీ రేటు: సాధారణ ప్రజలకు 401 రోజుల కాలపరిమితికి సంవత్సరానికి 7.50%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 8%.అమలు తేదీ: ఫిబ్రవరి 18, 2025.శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్జనరల్ పబ్లిక్: 7 రోజులు-10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 3.50% నుంచి 8.55% వరకు.సీనియర్ సిటిజన్లు: ఇదే కాలపరిమితికి సంవత్సరానికి 4% నుండి 9.05% వరకు వడ్డీ లభిస్తుంది.అత్యధిక వడ్డీ రేటు: సాధారణ ప్రజలకు 1 రోజు నుంచి 18 నెలల కంటే తక్కువ కాలపరిమితికి, 12 నెలల కాలపరిమితికి ఏటా 8.55%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 9.05% వడ్డీ.అమలు తేదీ: ఫిబ్రవరి 18, 2025.ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్జనరల్ పబ్లిక్: 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 3.75% నుంచి 8.25% వరకు వడ్డీ లభిస్తుంది.సీనియర్ సిటిజన్లు: ఇదే కాలపరిమితికి సంవత్సరానికి 4.25% నుంచి 8.75% వరకు వడ్డీ లభిస్తుంది.అత్యధిక వడ్డీ రేటు: 12 నెలల నుంచి 24 నెలల కాలపరిమితికి సాధారణ పౌరులకు సంవత్సరానికి 8.25%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 8.75% వడ్డీ.అమలు తేదీ: ఫిబ్రవరి 20, 2025.ఇదీ చదవండి: ఈవీ బ్యాటరీ తయారీలోకి కైనెటిక్ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్జనరల్ పబ్లిక్: 7 రోజులు-10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 4% నుంచి 8.50% వరకు.సీనియర్ సిటిజన్లు: అదే కాలపరిమితికి సంవత్సరానికి 4.50% నుండి 9.10% వరకు వడ్డీ లభిస్తుంది.అత్యధిక వడ్డీ రేటు: 12 నెలల నుంచి 24 నెలల కాలపరిమితికి సాధారణ పౌరులకు సంవత్సరానికి 8.50%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 9.10% వడ్డీ.అమలు తేదీ: ఫిబ్రవరి 22, 2025. -
గరిష్ట వడ్డీరేట్లను బహిర్గతం చేయాలని ఆదేశాలు
రుణాలపై విధించే వడ్డీరేట్లలో పారదర్శకతను పెంపొందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు తీసుకుంటోంది. విభిన్న రుణాలపై వసూలు చేసే గరిష్ట వడ్డీ రేట్లను బహిర్గతం చేయాలని బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలను (NBFC) ఆదేశించింది. ఇందులో భాగంగా వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, బీమా, ఇతర ఛార్జీలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.ఆర్బీఐ ఆదేశాల్లోని కీలక అంశాలుతనఖా, వాహనం, ఆస్తి, బంగారం, విద్యా రుణాలు వంటి వివిధ రుణ కేటగిరీలకు కాంపోజిట్ సీలింగ్ రేట్ల(గరిష్ట వడ్డీరేట్లు)ను ఎన్బీఎప్సీలు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ గరిష్ట రేట్లను సంబంధిత డైరెక్టర్ల బోర్డులు ఆమోదించాలి. ఆర్థిక సంస్థల కార్యకలాపాలు ఆర్బీఐ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్‌కు అనుగుణంగా ఉండాలి. ఇది వివిధ కేటగిరీల రుణగ్రహీతలకు వేర్వేరు రేట్లను వసూలు చేసే విధానాలపై స్పష్టతను ఇస్తుంది. రుణ రేట్లపై ఆర్బీఐ పరిమితులు విధించనప్పటికీ, బోర్డు ఆమోదం లేకుండా ఎన్బీఎఫ్సీలు వెల్లడించిన గరిష్ట రేట్లను మించరాదు.ఇదీ చదవండి: కోటక్ బ్యాంకు అలెర్ట్.. ‘డెబిట్ కార్డులు పని చేయవు’పెరుగుతున్న గృహ రుణభారం, రుణగ్రహీతలకు వారి రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది. దీనిపై కొంత ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో దానికి ప్రతిస్పందనగా ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. ఆర్బీఐ నేరుగా రుణ రేట్లను నియంత్రించనప్పటికీ ఎన్బీఎఫ్సీలు తమ రుణ ధరల్లో పారదర్శకతను కొనసాగించడానికి ఈ ఆదేశాలు ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది సంస్థలపై కొంత ఆర్థిక ఒత్తిడిని కలిగించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ఈఎంఐ ఇక మారదు! ఆర్బీఐ కీలక ఆదేశాలు
నెలవారీ సమాన వాయిదాలపై (EMI) మంజూరు చేసే అన్ని వ్యక్తిగత రుణాల్లో బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు తప్పనిసరిగా స్థిర వడ్డీ రేటు ఉత్పత్తిని అందించాల్సిందేనని ఆర్బీఐ (RBI) ప్రకటించింది. వడ్డీ రేటు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ విధానంతో లేక ఇంటర్నల్ బెంచ్‌మార్క్ విధానంతో అనుసంధానమైనదా? అన్న దానితో సంబంధం లేకుండా అన్ని ఈఎంఐ ఆధారిత వ్యక్తిగత రుణాలకు ఇది అమలవుతుందని స్పష్టం చేసింది.రుణాన్ని మంజూరు చేసే సమయంలోనే వర్తించే వార్షిక వడ్డీ రేటు (ఏపీఆర్)ను కీలక సమాచార నివేదిక (కేఎఫ్ఎస్), రుణ ఒప్పంద పత్రాల్లో బ్యాంక్‌లు, ఇతర నియంత్రిత సంస్థలు (ఎన్బీఎఫ్సీలు)వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది. రుణ కాల వ్యవధిలో ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేటు కారణంగా ఈఎంఐ/లేదా కాల వ్యవధిని పెంచేట్టు అయితే ఆ విషయాన్ని తప్పకుండా రుణగ్రహీతకు తెలియజేయాలని తెలిపింది.ప్రతి త్రైమాసికానికి ఒకసారి లోన్ అకౌంట్ స్టేట్మెంట్ను జారీ చేయాలని, అందులో అప్పటి వరకు చెల్లించిన వడ్డీ, అసలు ఎంత?, ఇంకా ఎన్ని ఈఎంఐలు మిగిలి ఉన్నాయనే సమాచారం ఉండాలని పేర్కొంది. ఈఎంఐ ద్వారా రుణాన్ని చెల్లించే వారికి స్థిర వడ్డీ రేటును లేదా కాల వ్యవధిని పెంచుకునే అవకాశం కల్పించానలి 2023 ఆగస్ట్‌లోనే బ్యాంక్‌లను ఆర్బీఐ ఆదేశించడం గమనార్హం. దీనికి సంబంధించి సందేహాలపై తాజా స్పష్టతనిచ్చింది. ఫిబ్రవరిలో ఆర్బీఐ ఎంపీసీ సమావేశంరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పరపతి విధాన కమిటీ సమావేశం ఫిబ్రవరి 5-7 తేదీల్లో జరగనుంది. ఈ సమావేశంలో ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కీలక వడ్డీరేట్లలో కోత విధిస్తారని పరిశ్రమల సంఘం సీఐఐ అంచనా వేసింది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్(US Fed) యూఎస్‌లో వడ్డీరేట్లను తగ్గించింది. ఈ తరుణంలో భారత్‌లోనూ వడ్డీరేట్లను తగ్గించాలనే డిమాండ్ ఉంది.ఇదీ చదవండి: ఈ క్రెడిట్ కార్డులు కనిపించవు! కానీ ఖర్చు చేయొచ్చు..ఆర్బీఐ వచ్చే ఎంపీసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత మానిటరీ ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. ఆర్బీఐ దేశంలో పెట్టుబడులు పెంచేలా నిర్ణయం తీసుకోవాలి. అందులో భాగంగా వడ్డీరేట్లను తగ్గించాల్సి ఉంది. -
ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే!
చేతిలో డబ్బు ఉంటే.. కొందరు గోల్డ్ కొనుగోలు చేస్తారు. మరి కొందరు రియల్ ఎస్టేట్ మీద పెడతారు. ఇంకొందరు మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టి లాభాలను ఆర్జిస్తారు. ఇలా ఎన్నెన్ని పెట్టుబడి సాధనాలు ఉన్నా.. చాలా మంది చూపు మాత్రం 'ఫిక్స్డ్ డిపాజిట్' (FD) వైపు వెళ్తుంది.రిస్క్ లేకుండా వడ్డీ పొందాలంటే.. ఫిక్స్డ్ డిపాజిట్ ఉత్తమమైన మార్గం. వడ్డీ అనేది బ్యాంకులు రెండు విధాలుగా అందిస్తాయి. ఇందులో ఒకటి రెగ్యులర్, మరొకటి సీనియర్ సిటిజన్. రెగ్యులర్ కింద అందరికీ ఒకేరకమైన వడ్డీ లభిస్తుంది. కానీ సీనియర్ సిటిజన్లకు కొంత ఎక్కువ వడ్డీ లభిస్తుంది.ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకునే వ్యక్తి ముందుగానే ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. చాలా బ్యాంకులు కొంతవరకు దాదాపు ఒకే విధమైన వడ్డీ రేట్లను అందిస్తున్నప్పటికీ.. 40 - 50 బేసిస్ పాయింట్ల స్వల్ప వ్యత్యాసం కూడా మీ డబ్బును పెంచడంలో సహాయపడుతుంది. మీ డబ్బును పెంచుకోవడానికి లేదా ఎక్కువ వడ్డీ పొందటానికి ఎన్ని సంవత్సలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేశామన్నది సహాయపడుతుంది.ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వివిధ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు వడ్డీ రేట్లు అందించే వడ్డీ రేట్లు➤హెచ్డీఎఫ్సీ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం➤ఐసీఐసీఐ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం➤యాక్సిస్ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం➤యెస్ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 8 శాతం➤స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం➤పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం (ఈ వడ్డీ రేట్లు జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి).➤బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB): సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 6.8 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.4 శాతం (ఈ వడ్డీ రేట్లు అక్టోబర్ 14, 2024 నుంచి అమల్లో ఉన్నాయి).ఇదీ చదవండి: పేదోళ్లను లక్షాధికారి చేసే స్కీమ్: ఇదిగో డీటెయిల్స్బ్యాంకులలో ఫిక్స్డ్ చేయాలనుకునే ఎవరైనా.. ముందుగా మీరు ఏ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో, అక్కడ (బ్యాంకులో) వడ్డీ ఎంత ఇస్తున్నారనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఆ బ్యాంక్ ఇచ్చే వడ్డీని.. ఇతర బ్యాంకులతో కంపార్ చేసుకోవాలి. ఆ తరువాత మీకు నచ్చిన బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసివచ్చు. -
అధిక వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఇవే..
ఇన్వెస్ట్మెంట్ ద్వారా మరింత డబ్బు సంపాదించాలని చాలామంది కోరుకుంటారు. అందుకు రియల్ఎస్టేట్, బ్యాంకు సేవింగ్స్, ఎఫ్డీ, స్టాక్‌మార్కెట్.. వంటి విభిన్న మార్గాలను ఎంచుకుంటారు. అయితే ఆయా పథకాల్లో డబ్బు పెట్టుబడి పెడితే భద్రత పరమైన సమస్యలు రావొచ్చు. ఇన్వెస్ట్ చేసే నగదుపై మంచి రాబడిని ఇచ్చేలా, ప్రైవేట్ సంస్థల కంటే మెరుగైన భద్రత కల్పించేలా ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో ఆర్థిక లక్ష్యాలు చేరుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న కొన్ని ఇస్వెస్ట్మెంట్ పథకాల గురించి తెలియజేశాం.సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్వడ్డీ: 8.2 శాతంపెట్టుబడి పరిమితులు: రూ.1000-రూ.30 లక్షలుకాలపరిమితి: ఐదేళ్లు, అదనంగా మరో మూడేళ్లు పెంచుకోవచ్చు. నిర్దేశించిన పరిమితికి ముందే డబ్బు విత్‌డ్రా చేయాలనుకుంటే మాత్రం 1 శాతం పెనాల్టీ విధించాల్సి ఉంటుంది.అర్హత: 60 ఏళ్లు కంటే ఎక్కువ వయసు ఉండాలి. భారతీయులై ఉండాలి.సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్వై) వడ్డీ: 8 శాతంపెట్టుబడి పరిమితులు: రూ.250(నెలవారీ)-రూ.1.5 లక్షలు(ఏటా)కాలపరిమితి: అమ్మాయికి 21 ఏళ్లు వచ్చేవరకు.అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత తాత్కాలికంగా 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు.అర్హత: 10 ఏళ్లు కంటే తక్కువ వయసు ఉన్న ఆడ పిల్లలు.ప్రతి ఇంటిలో ఒకరు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు.సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.కిసాన్ వికాస్ పాత్ర(కేవీపీ)వడ్డీ: 7.5 శాతంపెట్టుబడి పరిమితులు: రూ.1000-గరిష్ట పరిమితి లేదుకాలపరిమితి: 115 నెలలు(తొమ్మిదేళ్ల 5 నెలలు)అత్యవసరంగా డబ్బు కావాల్సివస్తే 2.5 ఏళ్లు తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు. అందుకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)వడ్డీ: 7.1 శాతంపెట్టుబడి పరిమితులు: రూ.500(నెలవారీ)-రూ.1.5 లక్షలు(ఏటా)కాలపరిమితి: 15 ఏళ్లుఅర్హత: మైనర్లు, భారతీయ పౌరులు ఇందుకు అర్హులు.సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్ఎస్సీ)వడ్డీ: 7.7 శాతంపెట్టుబడి పరిమితులు: రూ.1000-గరిష్ట పరిమితి లేదు.కాలపరిమితి: 5 ఏళ్లుఅర్హత: మైనర్లు, భారతీయ పౌరులు ఇందుకు అర్హులు.సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.ఇదీ చదవండి: విభిన్న ఖాతాలు.. మరెన్నో పరిమితులు!పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్(పీఓఎంఐఎస్)వడ్డీ: 7.4 శాతంపెట్టుబడి పరిమితులు: రూ.1000-రూ.9 లక్షలు/జాయింట్ అకౌంట్ హోల్డర్లు గరిష్టంగా రూ.15 లక్షలు వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.కాలపరిమితి: 5 ఏళ్లు -
సామాన్యులపై ఈఎంఐల మోత: వడ్డీ రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారా? అయితే ఈఎమ్ఐ చెల్లిస్తున్న వారు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన.. హెచ్డీఎఫ్సీ తాజాగా కొన్ని పీరియడ్ లోన్లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) ఐదు బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఇది హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఆటో లోన్లతో సహా అన్ని రకాల ఫ్లోటింగ్ లోన్ల ఈఎంఐను ప్రభావితం చేస్తుంది.మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు పెరగడం వల్ల వడ్డీ రేట్లు ఇప్పుడు 9.15 శాతం నుంచి 9.50 శాతం మధ్య ఉన్నాయి. కొత్త వడ్డీ రేట్లు ఈ రోజు నుంచే (నవంబర్ 7) అమలులోకి వస్తాయి. ఎంసీఎల్ఆర్ పెరిగినప్పుడు, లోన్ వడ్డీ పెరుగుతుంది. దీంతో లోన్ కడుతున్న కస్టమర్ల ఈఎంఐ కూడా పెరుగుతుంది.కొత్త ఎంసీఎల్ఆర్లు ఇవే..ఓవర్ నైట్: 9.15 శాతంఒక నెల: 9.20 శాతంమూడు నెలలు: 9.30 శాతంఆరు నెలలు: 9.45 శాతంఒక సంవత్సరం: 9.45 శాతంరెండు సంవత్సరాలు: 9.45 శాతంమూడు సంవత్సరాలు: 9.50 శాతంఎంసీఎల్ఆర్ అంటే?మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది. -
వీపీఎఫ్..పన్ను రహిత వడ్డీ పరిమితి పెంపు?
స్వచ్ఛంద భవిష్య నిధి(వీపీఎఫ్)పై సమకూరే పన్ను రహిత వడ్డీ పరిమితిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు వీపీఎఫ్‌పై సమకూరే వడ్డీపై పన్ను మినహాయింపు ఉంది. ఈ పరిమితిని పెంచితే మరింత మందికి మేలు జరుగుతుందని, కాబట్టి ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఈ విషయం తెలిసిన వ్యక్తులు తెలిపారు.ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఆధ్వర్యంలోని స్వచ్ఛంద భవిష్య నిధి(వీపీఎఫ్) ద్వారా ఉద్యోగులు తమ డబ్బుపై అదనంగా వడ్డీ సమకూర్చుకోవచ్చు. ఈపీఎఫ్, వీపీఎఫ్‌కు ఒకే వడ్డీరేటు ఉంటుంది. దాంతో దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చు. వీపీఎఫ్‌లో జమ చేసే నగదుకు సంబంధించి ఎలాంటి పరిమితులు లేవు.వీపీఎఫ్ గురించి కొన్ని విషయాలుఈ పథకం కోసం ఉద్యోగి ప్రత్యేకంగా కంపెనీ యాజమాన్యానికి లేఖ అందించాల్సి ఉంటుంది. కచ్చితంగా అందరు ఉద్యోగులు ఈ పథకంలో చేరాల్సిన నిబంధనేమీ లేదు. బ్యాంకు సేవింగ్స్ ఖాతా, కొన్ని బ్యాంకులు అందించే ఎఫ్డీ వడ్డీ కంటే మెరుగైన వడ్డీ ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుకోవచ్చు. భవిషత్తు అవసరాల కోసం మెరుగైన వడ్డీ కావాలని భావించే ఉద్యోగులు ఇందులో చేరవచ్చు.ఈ పథకంలో చేరిన వారు తమ ప్రాథమిక జీతంలో కట్ అవుతున్న 12 శాతం ఈపీఎప్ కంటే అధికంగా జమ చేసుకునే వీలుంది.ఇదీ చదవండి: ఆహార శుభ్రతకు ‘స్విగ్గీ సీల్’ఏటా జమ చేసే మొత్తం రూ.1.5 లక్షల వరకు ఉంటే సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది.ప్రస్తుతం ఈపీఎఫ్ వడ్డీ 8.15 శాతంగా ఉంది. ఇదే వడ్డీ వీపీఎఫ్‌కు వర్తిస్తుంది.ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత, లేదా పదవీ విరమణ చేసిన తర్వాత ఈ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. వైద్య అత్యవసరాలు, విద్య, వివాహాలు..వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కూడా నిబంధనల ప్రకారం విత్‌డ్రా చేసుకోవచ్చు. -
గరిష్టాలను చేరిన అమెరికా ఆర్థిక లోటు!
అమెరికా దేశ బడ్జెట్ లోటు గరిష్ఠాలను చేరుకుంది. సెప్టెంబర్ 30 నాటికి ఇది రూ.1,538 లక్షల కోట్లను చేరింది. కొవిడ్ మహమ్మారి కాలంతో పోల్చినా ఈ లోటు అధికంగా నమోదవ్వడం ఆందోళనలు కలిగిస్తుంది. రుణ వడ్డీ, విద్యార్థుల సంక్షేమానికి ఖర్చు..వంటివి ఇందుకు కారణమని యూఎస్ ట్రెజరీ విభాగం తెలిపింది. అయితే ఫెడ్ ఇటీవల వడ్డీరేట్లను తగ్గించిన నేపథ్యంతో రానున్న రోజుల్లో ఈ లోటు తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.యూఎస్ అధికారిక ట్రెజరీ డేటా ప్రకారం..సెప్టెంబరు 30 నాటికి యూఎస్ ఆర్థిక లోటు 1.83 ట్రిలియన్ డాలర్ల(రూ.1,538 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఇది అంతకుముందు 2020-21 కాలంలో గరిష్ఠంగా 1.7 ట్రిలియన్ డాలర్లు(రూ.14.2 లక్షల కోట్లు)గా ఉండేది. 2023 మధ్యలో బైడెన్ ప్రభుత్వ ప్రతిపాదనలతో యూఎస్ అత్యున్నత న్యాయస్థానం విద్యార్థుల రుణాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఆర్థిక లోటు మరింత పెరిగినట్లయింది. యూఎస్ ఆర్థిక లోటు స్థూల దేశీయోత్పత్తిలో 6 శాతానికి మించిపోయింది. ఆర్థిక మాంద్యం, అంతర్జాతీయ యుద్ధ భయాల కారణంగా 2023లో 6.2 శాతం, 2024 సెప్టెంబర్ 30 నాటికి 6.4 శాతానికి చేరింది. వడ్డీ చెల్లింపులు కూడా భారీగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి వడ్డీ ఖర్చులు 254 బిలియన్ డాలర్లు(రూ.21 లక్షల కోట్లు) పెరిగి 1.1 ట్రిలియన్ డాలర్లకు(రూ.92 లక్షల కోట్లు) చేరాయి. ఇది గతంలో కంటే 29 శాతం అధికం. జీడీపీలో ఈ వడ్డీ చెల్లింపులు 3.93 శాతంగా ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు 11 శాతం పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఇటీవల కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో రానున్న రోజుల్లో కొంత వడ్డీ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.ఇదీ చదవండి: స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్..కంపెనీలకు నష్టం!దేశీయంగా పెరుగుతున్న అప్పు ఆందోళనకరమే. అయితే ఆ అప్పు మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చిస్తే దాని ప్రతిఫలాలు సమీప భవిష్యత్తులో ఉంటాయి. కాబట్టి దాంతో కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి వడ్డీతో సహా భవిష్యత్తులో అప్పు తీర్చే ప్రణాళికలు ఉంటాయి. కానీ సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వాలు ఒకవేళ అవినీతికి పాల్పడితే దానికోసం ఇతర సంస్థల నుంచి తీసుకొచ్చిన అప్పు భారంగా మారుతుంది. దానివల్ల భవిష్యత్తులో ఎలాంటి రాబడి సృష్టించకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పలితంగా దేశం ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
‘డిపాజిట్’ వార్!
బ్యాంకింగ్ వ్యవస్థలో ఇప్పుడు డిపాజిట్ల పోరు మొదలైంది. రుణాలు ఇస్తున్నంత జోరుగా డిపాజిట్ల సమీకరణ జరగడం లేదంటూ ఆర్బీఐ పదేపదే హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ల మోత మోగుతోంది. అధిక వడ్డీ రేట్ల రేసులో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ముందుండటం గమనార్హం!డిపాజిట్ల సమీకరణలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీలు) దూసుకెళ్తున్నాయి. దాదాపు అరడజను ఎస్ఎఫ్బీలు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై 8% శాతం పైగా వడ్డీరేటును ఆఫర్ చేస్తూ డిపాజిటర్లను ఆకర్షిస్తున్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి బడా బ్యాంకులు, ఇతర వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే ఏకంగా 1 శాతం పైగానే అధికంగా వడ్డీరేటును ఆఫర్ చేస్తుండటం గమనార్హం. గత కొన్నేళ్లుగా డిపాజిట్ రేట్లు నేలచూపులు చూడటంతో పాటు షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు ఇతరత్రా ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశాలు ఆకర్షించడంతో ఇన్వెస్టర్లు తమ పొదుపు నిధులను చాలా వరకు అటువైపు మళ్లిస్తున్నారు. దీంతో కొంతకాలంగా బ్యాంకుల్లో డిపాజిట్లు వెలవెలబోతున్న పరిస్థితి నెలకొంది. దీనిపై ఆర్బీఐ తీవ్రంగా దృష్టి పెట్టడంతో బ్యాంకులు మళ్లీ రేట్ల పెంపు, ప్రత్యేక స్కీమ్‌ల ద్వారా డిపాజిట్ల సమీకరణ వేట మొదలు పెట్టాయి.ఇదీ చదవండి: ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోం’జులై నుంచి జోరు...ఈ ఏడాది జూన్‌లో డిపాజిట్లు, రుణ వృద్ధి మధ్య అంతరం ఆల్‌టైమ్ గరిష్టానికి ఎగబాకడంతో రేట్ల పెంపు మొదలైంది. బ్యాంకులన్నీ వరుస కట్టడంతో జులై నుంచి ఇది వేగం పుంజుకుంది. ఈ రేసులో ఎస్ఎఫ్బీలు బ్యాంకులతో పోటాపోటీగా వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఉత్కర్ష్, సూర్యోదయ ఎస్ఎఫ్బీలు 2–3 ఏళ్ల వ్యవధి ఫిక్సిడ్ డిపాజిట్లపై 8.5% వడ్డీని ఇస్తున్నాయి. ఈక్విటాస్ కూడా రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు ఎఫ్డీలపై 8.5% వడ్డీరేటును అందిస్తోంది. యూనిటీ ఎస్ఎఫ్బీ అయితే 1,001 రోజుల ఎఫ్డీపై ఏకంగా 9% వడ్డీ ఇస్తుండటం విశేషం. ఈ విషయంలో వాణిజ్య బ్యాంకులు వెనుకబడుతున్నాయి. ఎస్బీఐ 444 రోజుల ప్రత్యేక డిపాజిట్ స్కీమ్‌పై అత్యధికంగా 7.25% వడ్డీ ఆఫర్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గరిష్ట డిపాజిట్ రేటు 7.4%. అయితే, ఈ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అదనంగా అర శాతం వడ్డీ ఇస్తున్నాయి. కాగా, బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) కూడా 8% పైగా వడ్డీ ఆఫర్ చేస్తూ బ్యాంకులతో పోటీ పడుతున్నాయి. మణిపాల్ హౌసింగ్ ఫైనాన్స్ 1–3 ఏళ్ల ఎఫ్డీలపై 8.25% వడ్డీ ఇస్తుండగా.. బజాజ్ ఫైనాన్స్ 42 నెలల డిపాజిట్‌కు 8.65% వడ్డీ రేటు అందిస్తోంది. -
పెరిగిన హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లు
భారతదేశంలో దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ (HDFC) వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచినట్లు అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది.అధికారిక వెబ్సైట్ ప్రకారం.. హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీంతో మూడు నెలల ఎంసీఎల్ఆర్ 9.30 శాతంగా ఉంది. ఒక సంవత్సరానికి ఎంసీఎల్ఆర్ 9.45 శాతంగా ఉంది. ఎంసీఎల్ఆర్ పెరిగితే లోన్ ఈఎంఐ పెరుగుతుంది. ఇందులో ఆటో లోన్స్, పర్సనల్ లోన్స్ రెండూ ఉంటాయి. ఇది కస్టమర్ల మీద ప్రభావం చూపిస్తుంది.ఓవర్ నైట్: 9.10 శాతంఒక నెల: 9.15 శాతంమూడు నెలలు: 9.30 శాతంఆరు నెలలు: 9.40 శాతంఒక సంవత్సరం: 9.45 శాతంరెండు సంవత్సరాలు: 9.45 శాతంమూడు సంవత్సరాలు: 9.45 శాతంఎంసీఎల్ఆర్ అంటే..ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. బ్యాంకులు ఈ ఎంసీఎల్ఆర్ రేటును ప్రామాణికంగా తీసుకుని రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. దీన్నే రుణాలపై విధించే కనీస వడ్డీ రేటుగా వ్యవహరిస్తారు. అందువల్ల ఎంసీఎల్ఆర్ రేటు పెరిగితే.. రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. -
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే!
ఆర్థిక పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. నెలకు లక్షల రూపాయలు సంపాదించేవారు కూడా క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు, కావలసినప్పుడు లోన్స్ కూడా తీసుకుంటున్నారు. అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత లోన్స్ తీసుకోవచ్చు. కానీ పర్సనల్ లోన్ తీసుకునే ముందు తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. లేకుంటే తీసుకున్న అసలు కంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.సిబిల్ స్కోర్బ్యాంకు లోన్ ఇవ్వాలంటే సిబిల్ స్కోర్ చూస్తుంది. మంచి సిబిల్ స్కోర్ ఉంటే ఎక్కువ బ్యాంక్స్ మీకు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి. లేకుంటే లోన్ లభించడం కొంత కష్టమనే చెప్పాలి. ఒకవేళా మీకు లోన్ లభించినా వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.వడ్డీ రేటులోన్ తీసుకునే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన మరో విషయం వడ్డీ రేటు. ఎందుకంటే ఒక్కో బ్యాంక్ ఒక్కో వడ్డీ రేటుతో లోన్ అందిస్తుంది. కాబట్టి తక్కువ వడ్డీతో లోన్ ఇచ్చే బ్యాంకుల వద్ద నుంచి లోన్ తీసుకోవడం ఉత్తమం. ఇది మీరు తిరిగీ చెల్లించాల్సిన ఈఎమ్ఐలను సులభతరం చేస్తుంది. ఏ బ్యాంక్ ఎంత వడ్డీకి లోన్ ఇస్తుందనే విషయాలను అధికారిక వెబ్సైట్లలో లేదా బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవచ్చు.లోన్ వ్యవధిలోన్ తీసుకునే వ్యక్తి.. తిరిగి ఎన్ని నెలల్లో చెల్లచగలుగుతాడో, సంపాదన ఎంత వంటి వాటిని బేరీజు వేసుకుని వ్యవధిని ఎంచుకోవచ్చు. పర్సనల్ లోన్ వ్యవధి 12 నెలల నుంచి 60 నెలల మధ్య ఉంటుంది. అయితే 36 నెలలు లేదా మూడు సంవత్సరాలకు మించి ఎక్కువ టైమ్ తీసుకోకపోవడం మీకే మంచిది. అయితే ఇది ఖచ్చితంగా అందరూ పాటించాల్సిన అవసరం లేదు.లోన్ ఎక్కడ నుంచి తీసుకోవాలి (బ్యాంకు/ఎన్బీఎఫ్సీ)పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వ్యక్తి.. బ్యాంకు నుంచి తీసుకోవాలా? లేదా ఎన్బీఎఫ్సీ నుంచి తీసుకోవాలా? అని సొంతంగా నిర్దారించుకోవాలి. బ్యాంకు నుంచి తీసుకోవడం చాలా ఉత్తమం అని నిపుణులు చెబుతారు. లోన్ తీసుకోవడానికి కొంత ఆలస్యమైనా బ్యాంకు నుంచే తీసుకోవడం మంచిది. ఇందులో ఎలాంటి అవకతవకలకు తావుండదు.ఎన్బీఎఫ్సీ (నాన్ బ్యాంక్ ఫైనాన్సియల్ కంపెనీలు) నుంచి కూడా లోన్ తీసుకోవచ్చు. కానీ ఇందులో కొన్నిసార్లు మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో డాక్యుమెంట్స్ ఎక్కువ అవసరం లేదు. ఎన్బీఎఫ్సీలో లోన్ తీసుకోవాలనుకునే వారు ముందుగా ఆ సంస్థ గురించి తెలుసుకోవాలి. -
ధరల భయం.. వడ్డీరేట్లు యథాతథం!
ముంబై: ద్రవ్య, పరపతి విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం స్పష్టం చేసింది. దీనితో వరుసగా తొమ్మిదవసారి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే బెంచ్‌మార్క్ వడ్డీరేటు– రెపో యథాతథంగా 6.5 శాతంగా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రుణ రేట్లు దాదాపు యథాపూర్వం మున్ముందూ కొనసాగనున్నాయి. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ మూడురోజుల సమావేశ నిర్ణయాలు గురువారం వెలువడ్డాయి. 0.25 శాతం రేటు తగ్గింపునకు ఇద్దరు మొగ్గు గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీలో నలుగురు యథాతథ 6.5 శాతం రేటు కొనసాగించడానికి మొగ్గుచూపగా, పావు శాతం రేటు తగ్గింపునకు ఇద్దరు ఓటువేశారు. వీరిలో ఎక్స్టర్నల్ సభ్యులు జయంత్ వర్మతోపాటు అషిమా గోయల్ ఉన్నారు. ‘ఆహార ద్రవ్యోల్బణం తీవ్రత తాత్కాలికమే కావచ్చు. అయితే అధిక ద్రవ్యోల్బణం కొనసాగుతున్న ప్రస్తుత వాతావరణంలో ద్రవ్య విధాన కమిటీ దీనిని సహించబోదు’ అని పాలసీ ప్రకటనలో గవర్నర్ ఉద్ఘాటించారు. మారని వృద్ధి, ద్రవ్యోల్బణం అంచనాలు... ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి, ద్రవ్యోల్బణం అంచనాలను ఆర్బీఐ పాలసీ సమీక్ష వరుసగా 7.2 శాతం, 4.5 శాతాలుగా యథాతథంగా కొనసాగించింది. ఒకపక్క ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేస్తూ మరోవైపు వృద్దికి ఊతం ఇచ్చే చర్యలను ఆర్బీఐ కొనసాగిస్తుందని గవర్నర్ స్పష్టం చేశారు. దీనికి దేశంలో తగిన వర్షపాతం దోహదపడుతుందని అన్నారు. 2024–25లో 4 త్రైమాసికాల్లో వృద్ది రేట్లు వరుసగా 7.1%, 7.2%, 7.3%, 7.2%గా కొనసాగుతాయన్నది పాలసీ సమీక్ష అంచనా. 2025–26 తొలి త్రైమాసికంలో (2026 ఏప్రిల్–జూన్) వృద్ధి 7.2%గా ఉంటుందని కూడా ఆర్బీఐ అంచనావేసింది. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 4.9%, 4.4%, 4.7%, 4.3%గా ఉంటాయని విశ్లేషించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ స్పీడ్ 4.4%గా ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. 2% అటు ఇటుగా 4% వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం ఉండేలా చూడాలని ఆర్బీఐకి కేంద్రం సూచిస్తోంది. పాలసీ ముఖ్యాంశాలు... → మందగమనంలో ఉన్నప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను తట్టుకునే స్థాయిలోనే కొనసాగుతోంది. → దేశీయ ఆర్థిక, ఫైనాన్షియల్ వ్యవస్థలు పటిష్ట ధోరణిలోనే కొనసాగుతున్నాయి. → దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచీ్చ–వెళ్లే విదేశీ నిధులకు సంబంధించిన కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) నిర్వహణ బాగుంది. → విదేశీ మారకద్రవ్య నిల్వలు 675 బిలియన్ డాలర్ల చరిత్రాత్మక గరిష్ట స్థాయిలో ఉన్నాయి. → 2024–25లో ఇప్పటి వరకూ రూపాయి తీవ్ర ఒడిదుడుకులతో కాకుండా ఒక నిర్దిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. → గృహ రుణాలతో సహా నిర్దేశించిన అవసరాలకు టాప్–అప్ను వినియోగించకపోవడం ఆందోళనకరమే. అయితే ద్వైపాక్షిక ప్రాతిపదికన సమస్యను పరిష్కరించడానికి చర్యలు కొనసాగుతాయి. → చెక్ క్లియరెన్స్‌ని వేగవంతం చేయడానికి చర్యలు ఉంటాయ్. → అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్ష చేపట్టనున్నారు.అనధికార డిజిటల్ లెండింగ్పై ఉక్కుపాదం అనధికార సంస్థల ఆట కట్టించడానికి డిజిటల్ లెండింగ్ యాప్‌ల పబ్లిక్ రిపాజిటరీ ఏర్పాటు కానుంది. నియంత్రణలోని సంస్థలు (ఆర్ఈ) ఈ రిపోజిటరీలో తమ డిజిటల్ లెండింగ్ యాప్‌ల గురించిన సమాచారాన్ని నివేదించాలి. అలాగే ఎప్పటికప్పుడు సంబంధిత లావాదేవీల వివరాలను అప్డేట్ చేయాలి. అనధికార రుణ యాప్‌లను గుర్తించడంలోవినియోగదారులకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. యూపీఐ ద్వారా రూ.5 లక్షల వరకు పన్ను చెల్లింపులు యూపీఐ ద్వారా పన్ను చెల్లింపుల పరిమితిని ఒక్కో లావాదేవీకి రూ. లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచాలని పాలసీ నిర్ణయించింది. ఇది యూపీఐ ద్వారా పన్ను చెల్లింపులను మరింత సులభతరం చేయనుంది. ఇక యూపీఐ లావాదేవీలు చేయడానికి ఒక వ్యక్తి మరో వ్యక్తిని అను మతించడానికి సంబంధించి తాజాగా ‘డెలిగేటెడ్ పేమెంట్’ సదుపాయం ఏర్పాటు చేస్తుండడం మరో కీలకాంశం. బ్యాంక్ డిపాజిట్లు పెరగాలి ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాల వైపు గృహ పొదుపులు మారడంపై శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు తమ విస్తారమైన బ్రాంచ్ నెట్వర్క్ ను ఉపయోగించుకోవడం, అలాగే వినూత్న ఉత్పత్తులు, సేవల ద్వారా డిపాజిట్లను సమీకరించాలని కోరారు.ఫుడ్ వెయిటేజ్‌పై సమీక్ష బెంచ్‌మార్క్ వడ్డీ రేటును నిర్ణయించేటప్పుడు ఆహార ద్రవ్యోల్బణాన్ని మినహాయించాలన్న తాజా ఆర్థికసర్వే సూచనలను గవర్నర్ దాస్ పరోక్షంగా తోసిపుచ్చారు. ద్రవ్య విధానాన్ని రూపొందించేటప్పుడు ఆర్బీఐ ఆహార ద్రవ్యోల్బణాన్ని విస్మరించబోదని స్పష్టం చేశారు. అయితే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంలో ఆహార వెయిటేజ్ 2011–12 నుంచి 46 శాతంగా కొనసాగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, దీనిని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం తీరిది... అయితే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం పూర్తి లక్ష్యాన్ని సాధించడంలో ఆహార ధరలు ఒడిదుడుకులు తీవ్ర అడ్డంకిగా మారుతున్నాయి. ఇదే అంశంపై ఆందోళన వ్యక్తంచేస్తూ ఆర్బీఐ 2023 ఫిబ్రవరి నుంచి యథాతథ వడ్డీరేట్ల వ్యవస్థను కొనసాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లను నిర్ణయించడంలో ఆర్బీఐ ఆహార ద్రవ్యోల్బణాన్ని చూడటం మానేయాలని ఇటీవలి ఆర్థిక సర్వే సూచించింది. అధిక ఆహార ధరలను ఎదుర్కోవటానికి పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీని ప్రభుత్వం అన్వేíÙంచాలని సర్వే పేర్కొంది. అధిక ఆహార ధరలు చాలా సందర్భాల్లో సరఫరాలకు సంబంధించిన సమస్యే తప్ప, డిమాండ్ ప్రేరితం కాదని కూడా సర్వే స్పష్టం చేసింది. అయితే ఈ సూచనను తాజాగా ఆర్బీఐ పక్కనబెట్టడం గమనార్హం. ఆహార ధరల కట్టడే ధ్యేయంఆహార ద్రవ్యోల్బణం ‘మొండిగా’ అధిక స్థాయిలోనే ఉంది. ధరల స్థిరత్వం లేకుండా, అధిక వృద్ధిని కొనసాగించలేము. ద్రవ్యోల్బణం కట్టడికి తగిన ద్రవ్య విధానాన్ని సెంట్రల్ బ్యాంక్ కొనసాగించాల్సిందే. నిరంతర ఆహార ద్రవ్యోల్బణం నుండి ఉత్పన్నమయ్యే సవాళ్లు, లేదా రెండవ దశ ప్రభావాలను నివారించడానికి అలాగే ఇప్పటివరకు సాధించిన ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి ఎంపీసీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్నియంత్రణా మార్పులు హర్షణీయం ఆహార ద్రవ్యోల్బణాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఇక పాలసీలో ప్రతిపాదించిన కొన్ని నియంత్రణా పరమైన సంస్కరణలు హర్షణీయం. ముఖ్యంగా డిజిటల్ లెండింగ్ మార్కెట్ క్రమబద్ధీకరణ పాలసీ నిర్ణయాల్లో కీలకాంశం. యూపీఐ సేవల విస్తరణ, పారదర్శకతకు చర్యలను స్వాగతిస్తున్నాం. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ -
దివాలా దిశగా అగ్రరాజ్యం!
ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా అమెరికాకు గుర్తింపు ఉంది. అది అలా వృద్ధి చెందడానికి అప్పులు కూడా ఒక కారణం. ఏంటీ..ఆశ్చర్య పోతున్నారా? అవును..అమెరికా అప్పులతోనూ ఎదిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఏటా ఆ దేశం కట్టే వడ్డీలే అందుకు నిదర్శనం. జూన్ 2024 లెక్కల ప్రకారం..దేశీయంగా వసూలైన వ్యక్తిగత ఆదాయపు పన్నులో 76 శాతం అంటే జాతీయ రుణాన్ని చెల్లించేందుకే వెచ్చిస్తోంది. ఈమేరకు ఎక్స్‌లో పోస్ట్‌లు వెలిశాయి. వాటిని ధ్రువపరిచేలా ప్రముఖ వ్యాపారవేత్త ఇలొన్‌మస్క్ ‘అమెరికా దివాలా దిశగా ప్రయాణిస్తోంది’ అంటూ స్పందించారు. దాంతో ఈ ట్వీట్ మరింత వైరల్‌గా మారింది.పెరుగుతున్న జాతీయ రుణం అమెరికాలో చాలా కాలంగా ప్రధాన సమస్యగా ఉంది. టెస్లా సీఈఓ ఇలొన్ మస్క్ ఈ విషయాన్ని గతంలోనూ చాలాసార్లు తెలిపారు. తాజాగా ‘అమెరికా దివాళా దిశగా వెళ్తోంది’ అంటూ పీటర్ స్టాంజ్ అనే వ్యక్తి అప్లోడ్ చేసిన పోస్ట్‌లోని వివరాలను ధ్రువపరుస్తూ స్పందించారు. అమెరికా వ్యక్తిగత ఆదాయపన్ను వసూళ్లలో దాదాపు 76 శాతం జాతీయ రుణ చెల్లింపులకే ఖర్చు చేస్తున్నట్లు పీటర్ చెప్పారు. అమెరికా అప్పుల్లో కూరుకుపోయేందుకు కారణం మాజీ అమెరికా అధ్యక్షులు ఫ్రాంక్లిన్ డీ రూజువెల్ట్, రిచర్డ్ నిక్సన్ అని అన్నారు.1970 కాలంలో అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్న రిచర్డ్ నిక్సన్ దేశీయ విధానాల కంటే విదేశీ వ్యవహారాలపై ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ఓటర్లు తమ సొంత ఆర్థిక స్థితిపైనే దృష్టి సారిస్తారని నమ్మాడు. అప్పటికే దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం తిరిగి తన ఎన్నికకు ముప్పుగా మారుతుందని గ్రహించాడు. దాంతో ‘న్యూ ఫెడరలిజం’ విధానాలు అమలు చేశాడు. అందులో భాగంగా రాష్ట్రాలకు ప్రత్యేకంగా గ్రాంట్లను ప్రతిపాదించాడు. ఫలితంగా అమెరికా అప్పులు మూటగట్టుకుంది. రూజ్వెల్ట్ అధ్యక్ష పదవిలో ఉన్నపుడు సంపన్నులపై పన్ను రేట్లను 79%కు పెంచారు. ధనవంతులు ఈ రేటును తగ్గించుకోవడానికి ఇతర మార్గాలను ఎంచుకున్నారు. దాంతోపాటు అమెరికాలో ప్రైవేట్ పెట్టుబడులు తగ్గాయి. ఫలితంగా ఉద్యోగ కల్పన కుంటుపడింది. నిరుద్యోగం పెరిగింది.America is headed for bankruptcy fyi https://t.co/O6FH5BK4aQ— Elon Musk (@elonmusk) July 26, 2024ఇదీ చదవండి: ట్రేడింగ్ చేస్తున్నారా.. జాగ్రత్త!పీటర్ స్టాంజ్ ఎక్స్‌లో అప్లోడ్ చేసిన వీడియోపై పీటర్ షిఫ్ అనే క్రిప్టో విమర్శకుడు స్పందించాడు. ‘అమెరికా అప్పులు అక్కడితో ఆగవు. త్వరలో ఫెడరల్ పన్ను ఆదాయంలో 100% రుణవడ్డీని చెల్లించడానికే వెచ్చిస్తారు. అన్ని ప్రభుత్వ ఖర్చుల కోసం అప్పు చేయాల్సిందే. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణం, అప్పులను పరిశీలిస్తోంది’ అన్నారు. జూన్ 2024లో యూఎస్ ప్రభుత్వం ట్రెజరీ సెక్యూరిటీలపై 140.238 బిలియన్ డాలర్లు (రూ.11 లక్షల కోట్లు) వడ్డీ చెల్లించింది. ప్రభుత్వం అదే నెలలో వ్యక్తిగత ఆదాయ పన్నుల రూపంలో 184.9 బిలియన్ డాలర్లు(రూ.15.4 లక్షల కోట్లు) వసూలు చేసింది. -
ఆహార ధరలు ఇంకా తీవ్రమే..
న్యూఢిల్లీ: తక్షణం వడ్డీరేటు సరళతరం అయ్యే అవకాశం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ తెలిపారు. వినియోగ ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2 ప్లస్‌తో ఆరు శాతానికి కట్టడి చేయాలన్న కేంద్రం నిర్దేశం... ప్రస్తుతం 6 శాతం దిగువనే ఉన్న పరిస్థితి (మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతం)ని ఆయన ప్రస్తావిస్తూ, ‘‘ప్రస్తుత ద్రవ్యోల్బణం–4 శాతం లక్ష్యం మధ్య ఉన్న అంతరాన్ని బట్టి వడ్డీ రేటుపై వైఖరిని మార్చడం చాలా ముందస్తు చర్య అవుతుంది’’ అని ఉద్ఘాటించారు. రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 4 శాతమేనని పలు సందర్భాల్లో ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పొంచి ఉన్నాయని కూడా ఆయన పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. జూన్ 2023 నుండి వరుసగా 11వ నెలలో ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గింది. సేవల ద్రవ్యోల్బణం చారిత్రక కనిష్ట స్థాయిలకు దిగివచి్చంది. వస్తు ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు.. → మనం స్థిరమైన ప్రాతిపదికన 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం వైపునకు వెళ్లినప్పుడు వడ్డీరేటు వైఖరిలో మార్పు గురించి ఆలోచించే విశ్వాసం మనకు లభిస్తుంది. → ద్రవ్యోల్బణం ప్రయాణం అంచనాలకు తగ్గట్టుగానే పురోగమిస్తున్నది. అయితే పూర్తి 4 శాతం దిశగా ప్రయాణం అత్యంత కష్టతరమైన అంశం. ఇందుకు పలు అడ్డంకులు ఉన్నాయి. → మార్చి–మే మధ్య తయారీ, ఫ్యూయల్ అండ్ లైట్ ద్రవ్యోల్బణం తగ్గింది. అయితే ఆహార ద్రవ్యోల్బణం విషయలో ఇంకా ఆందోళనలు ఉన్నాయి. కూరగాయలుసహా పలు నిత్యావసరాల వస్తువుల ద్రవ్యోల్బణం స్పీడ్ రెండంకెలపైనే ఉంది. → స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విషయానికి వస్తే పలు అంశాలు వృద్ధికి దోహదపడే విధంగా తమ పాత్రను పోషిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వృద్ధి వేగం చాలా బలంగా ఉంది. ఇది మొదటి త్రైమాసికంలో బలంగా కొనసాగుతుందని భావిస్తున్నాం. జూన్ పాలసీ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ క్రితం 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచడం ఇక్కడ గమనార్హం. ఇదే జరిగితే దేశం వరుసగా నాలుగు సంవత్సరాల్లో 7 శాతం ఎగువన వృద్ధి సాధించినట్లు అవుతుంది. పాలసీ విధానం పునరుద్ఘాటన ఇంటర్వ్యూలో గవర్నర్ పాలసీ విధాన సమీక్ష అంశాలను పునరుద్ఘాటించడం గమనార్హం. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి జూన్ 5 నుంచి 7వ తేదీ మధ్య మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో మెజారిటీ 4 శాతం దిగువకు రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే తన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటూ వరుసగా ఎనిమిదవసారి కీలక రేటు– రెపోను (6.5 శాతం) యథాతథంగా ఉంచింది. అయితే వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. వీరిలో ఎంపీసీ ఎక్స్టర్నల్ సభ్యులు జయంత్ వర్మతో ఆషిమా గోయల్ కూడా ఉన్నారు. అయితే ఆర్బీఐ ఎంపీసీ మెజారిటీ సభ్యులు –ఎటువంటి అనిశ్చితి లేకుండా ద్రవ్యోల్బణం దిగువబాటనే కొనసాగుతుందన్న భరోసా వచ్చే వరకూ– వేచిచూసే ధోరణి పాటించాలని అభిప్రాయపడ్డారు. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ దీన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. కాగా, వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆహార ధరలపరంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఎగిసే రిసు్కలను ఎంపీసీ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాలసీ సమీక్ష సందర్భంగా చెప్పారు. ధరలు నిలకడగా ఉండే విధంగా స్థిరత్వాన్ని సాధించగలిగితేనే అధిక వృద్ధి సాధనకు పటిష్టమైన పునాదులు వేయడానికి సాధ్యపడగలదని ఆయన పేర్కొ న్నారు. ద్రవ్యోల్బణం భయాలు ఇంకా పొంచే ఉన్నాయని ఎంపీసీలోని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2024–25లో 4.5 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ పాలసీ అంచనా. క్యూ1 (ఏప్రిల్–జూన్) 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3 లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం రిటైల్ ద్రవ్యో ల్బణం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. ఆహార ధరల తీవ్రతవల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు రావడం లేదని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష పేర్కొంది. మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, ఆర్బీఐ గవర్నర్ పేర్కొంటున్న లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. -
ఇకపై మరింత రాబడి.. ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్!
SBI FD Interest Rates Hike: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తన కోట్లాది మంది ఖాతాదారులకు శుభవార్త అందించింది. 180 రోజుల నుంచి 210 రోజులు, 211 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని పెంచింది. ఎస్బీఐ ఈ ఎఫ్డీలపై వడ్డీని 0.25 శాతం పెంచింది.ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు బ్యాంకులు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పరిమితిని పెంచుకోవచ్చు. ఎస్బీఐ ప్రకటించిన ఈ కొత్త రేట్లు రూ .3 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లకు ఉన్నాయి. ఈ కొత్త రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి.ఎస్బీఐ ఎఫ్డీ వడ్డీ రేట్లు ఇవే.. » 7 రోజుల నుంచి 45 రోజులు: సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం.» 46 రోజుల నుంచి 179 రోజులు: సాధారణ ప్రజలకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6 శాతం» 180 రోజుల నుంచి 210 రోజులు: సాధారణ ప్రజలకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం» 211 రోజుల నుంచి ఏడాది లోపు: సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం» ఏడాది నుంచి 2 సంవత్సరాల లోపు: సాధారణ ప్రజలకు 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం» 2 సంవత్సరాల నుంచి మూడేళ్ల లోపు: సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం» మూడేళ్ల నుంచి 5 సంవత్సరాల లోపు: సాధారణ ప్రజలకు 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం» ఐదేళ్ల నుంచి 10 సంవత్సరాలు: సాధారణ ప్రజలకు 6.50, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం. -
త్వరలో ఈపీఎఫ్ వడ్డీ.. మీ ఖాతాలో ఎంతుంది.. ఎంతొస్తుంది?
EPFO Interest Rate: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అనేది ఉద్యోగుల రిటైర్మెంట్ స్కీమ్. చాలా మంది ఉద్యోగులు తమ జీతంలో కొంత మొత్తాన్ని ఇందులో దాచుకుంటారు. కంపెనీల యాజమాన్యాలు కూడా ఉద్యోగుల తరఫున కొంత మొత్తాన్ని జమ చేస్తాయి.ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు డిపాజిట్లకు పన్ను మినహాయింపు ఉంటుంది. దీనిపై ఈపీఎఫ్‌వో ఏటా వడ్డీని చెల్లిస్తుంది.వడ్డీ ఎంతొస్తుందో తెలుసుకోండి..ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) ప్రకారం.. ఈ ఏడాది జూలై-ఆగస్టు నాటికి అన్ని ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు వడ్డీ జమ అవుతుంది. ఈ నేపథ్యంలో మీ ఈపీఎఫ్ ఖాతాలో వడ్డీ రేటును ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి.. మీ ఈపీఎఫ్ ఖాతాలో రూ.1 లక్ష, రూ.3 లక్షలు, రూ.5 లక్షల డిపాజిట్లు ఉంటే ఎంత రాబడి వస్తుందో ఇక్కడ తెలియజేస్తున్నాం..వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయిస్తుంది. ఈ సంవత్సరానికి ఇది 8.25 శాతంగా ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. అంటే ప్రస్తుత సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు వారి ఖాతాలపై ఎక్కువ వడ్డీ లభిస్తుంది.మీ ఈపీఎఫ్ ఖాతాలో రూ.1 లక్ష ఉంటే దానిపై 8.25 శాతం వడ్డీ పొందితే ఏడాదికి మీ వడ్డీ రూ.8,250 అవుతుంది.అదే రూ.3 లక్షలు ఉన్నట్లయితే రూ.24,500 వడ్డీ వస్తుంది. ఒక వేళ రూ.5 లక్షలు ఉంటే మీకు వచ్చే వడ్డీ రూ.41,250 అవుతుంది.పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..⇒ ఉమాంగ్ యాప్ లేదా ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.⇒ ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి⇒ ఈ-పాస్‌బుక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.⇒ ఇది మిమ్మల్ని మరొక స్క్రీన్కు తీసుకువెళుతుంది. ఇక్కడ మీ యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ నమోదు చేయాలి.⇒ విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత, పాస్‌బుక్ కోసం మెంబర్ ఐడీ ఆప్షన్‌ను ఎంచుకోండి.⇒ పాస్‌బుక్ పీడీఎఫ్ ఫార్మాట్లో లభిస్తుంది. నిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
డబ్బులు ఈ బ్యాంకుల్లో వేసుకుంటే మంచి వడ్డీ!
FD Interest Rate: దేశవ్యాప్తంగా చాలా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను ఇటీవల సవరించాయి. కస్టమర్లకు ఆకర్షణీయమైన వడ్డీ అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు తమ ప్రత్యేక ఎఫ్డీ పథకాలకు గడువు తేదీని కూడా పొడిగించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకులు తమ ఎఫ్డీ వడ్డీ రేట్లను సవరించాయి. ప్రస్తుతం ఆయా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎంత శాతం వడ్డీ ఇస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): పంజాబ్ నేషనల్ బ్యాంక్ జనవరిలో ఎఫ్డీపై వడ్డీ రేటును రెండుసార్లు సవరించింది. ఒకే టెన్యూర్ ఎఫ్డీపై వడ్డీ రేటును 80 బేసిస్ పాయింట్లు పెంచింది. 300 రోజుల ఎఫ్డీపై వడ్డీ రేటును సాధారణ కస్టమర్లకు 6.25 శాతం నుంచి 7.05 శాతానికి పెంచింది. అలాగే సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం వడ్డీ అందిస్తోంది. రేట్లు సవరించిన తర్వాత ఎఫ్డీలపై సాధారణ కస్టమర్లకు 3.50 శాతం నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.75 శాతం మధ్య వడ్డీని అందిస్తోంది. ఐడీబీఐ బ్యాంక్ (IDBI): ఐడీబీఐ బ్యాంక్ కూడా ఇటీవల ఎఫ్డీ వడ్డీ రేటును సవరించింది. మార్పు తర్వాత 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.50 శాతం మధ్య వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB): బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త మెచ్యూరిటీ వ్యవధితో ప్రత్యేక స్వల్పకాలిక ఎఫ్డీని ప్రారంభించింది. ఇందులో కస్టమర్లకు అధిక వడ్డీ లభిస్తుంది. కొత్త రేట్లు రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు వర్తిస్తాయి. బ్యాంక్ 360D (bob360) పేరుతో కొత్త మెచ్యూరిటీ ఎఫ్డీని తీసుకొచ్చింది. ఇది సాధారణ పౌరులకు 7.10 శాతం వడ్డీని ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కొత్తరేట్ల ప్రకారం.. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఎఫ్డీలపై సాధారణ కస్టమర్లకు 4.25 శాతం నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం నుంచి 7.65 శాతం వడ్డీ అందిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ : ఫెడరల్ బ్యాంక్ ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు 500 రోజుల వ్యవధిలో గరిష్టంగా 8 శాతం రాబడిని అందిస్తోంది. సవరించిన రేట్ల ప్రకారం.. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.50 శాతం, సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 3.50 శాతం నుంచి 8.00 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. గమనిక: ఈ సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. డబ్బులు డిపాజిట్ చేసే ముందు వివరాలు క్షణ్ణుంగా తెలుసుకోవడం అవసరం. -
రేటు తగ్గించే పరిస్థితి లేదు
ముంబై: బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపోను తగ్గించే పరిస్థితి ప్రస్తుతం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఉద్ఘాటించింది. అదే జరిగితే.. ధరలు తగ్గుదలకు ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు ప్రయోజనం లేకుండా పోతాయని అభిప్రాయపడింది. ధరల కట్టడే ఆర్బీఐ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేసింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆర్బీఐ పాలసీ సమీక్షా సమావేశం మినిట్స్ ఈ అంశాలను వెల్లడించాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోకి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల ప్రారంభ సమీక్ష సహా గడచిన ఐదు ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం... రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ప్లస్, 2 శాతం మైనస్‌తో 4 శాతంగా ఉండాలని కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తున్నప్పటికీ తమ లక్ష్యం 4 శాతమేనని గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గుతుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో 5 శాతం ద్రవ్యోల్బణం నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. తగిన స్థాయిలో వర్షపాతం నమోదయితే.. 2024–25 క్యూ1,క్యూ2, క్యూ3, క్యూ4లలో వరుసగా 5 శాతం, 4 శాతం, 4.6 శాతం, 4.7 శాతం చొప్పున ద్రవ్యోల్బణం నమోదవుతని పాలసీ సమీక్ష అంచనా వేసింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరా వ్యవస్థను ప్రభావితం చేస్తోందని, వస్తువుల ధరలపై ఇది తీవ్ర ఒత్తిడి తెస్తోందని, ఆహార ధరల్లో అనిశ్చితి ప్రధాన ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతోందని కమిటీ అభిప్రాయపడింది. -
ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై త్వరలో నిర్ణయం - ఇదే జరిగితే పదేళ్లలో..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అకౌంట్లో ఉన్న డబ్బుపై ఇచ్చే వడ్డీ రేటుపైన కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సుమారు 8% వడ్డీ రేటును ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం. 2022-23లో ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.15 శాతం, 2022-21 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు 8.10 శాతం ఉండేది. ప్రస్తుతం ఇది 8 శాతానికి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం మీద ప్రస్తతానికి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పెట్టుబడులపై రాబడిని మెరుగుపరిచేందుకు స్టాక్స్‌లో పెట్టుబడిని ప్రస్తుత 10% నుంచి 15%కి పెంచడానికి EPFO బోర్డు నుంచి ఆమోదం పొందాలని కూడా యోచిస్తోంది. ప్రభుత్వం ఎన్నికల సంవత్సరం కావడంతో, ప్రావిడెంట్ ఫండ్ (PF) డిపాజిట్లపై స్థిరమైన రాబడి రేటును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఎటువంటి ఎదురుదెబ్బలు రాకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న రేట్లకు అనుగుణంగా చూసే అవకాశం ఉందని EPFO బోర్డు సభ్యుడు వెల్లడించారు. 2013-14 నుంచి 2022-23 వరకు ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు 8 శాతానికి రాలేదు. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం వడ్డీ రేటు 8 శాతంగా నిర్ణయిస్తే.. గత పది సంవత్సరాలకంటే తక్కువ వడ్డీ రేటు ఇదే అవుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇదీ చదవండి: సెల్ఫ్ డ్రైవింగ్ కారు తయారు చేసిన రైతు బిడ్డ, ముచ్చటపడ్డారు కానీ రిజెక్ట్! -
పర్సనల్ లోన్స్ అతి తక్కువ వడ్డీ రేటు ఇచ్చే టాప్ 5 బ్యాంక్స్ ఇవే..
-
ఫిక్స్డ్ డిపాజిటర్లకు శుభవార్త - భారీగా పెరిగిన వడ్డీ రేట్లు
2024లోనే చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు 'ఫిక్స్డ్ డిపాజిట్' వడ్డీ రేట్లను పెంచనున్నట్లు పెంచుతున్నట్లు ప్రకటించి శుభవార్త చెప్పింది. ఈ కథనంలో ఏ బ్యాంకు ఎంత మేర వడ్డీ పెంచింది, దాని వివరాలు ఏంటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశంలో అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంక్ ఎస్బీఐ కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు రూ.2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు వరిస్తాయని ఎస్బీఐ వెల్లడించింది. ఈ వడ్డీ రేట్లు గతంలో ఉన్న వడ్డీ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో సీనియర్ సిటిజన్లంటూ 0.50 శాతం అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే 7 రోజుల నుంచి 45 రోజులకు సాధారణ వడ్డీ 3.50 శాతం అనుకుంటే సీనియర్ సిటిజన్లను 4 శాతం వడ్డీ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI) భారతదేశంలో రెండవ అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ కూడా వడ్డీ రేట్లను 6.7 సంత నుంచి 7.25 శాతానికి పెంచింది. 61 రోజుల నుంచి 90 రోజులకు 6 శాతం, 91 రోజుల నుండి 184 రోజులకు 6.5 శాతం, 185 రోజుల నుంచి 270 రోజులకు 6.75 శాతం, 390 రోజుల నుంచి 15 నెలల వరకు 7.25 శాతం వడ్డీ అందించనుంది. జనవరి 3 నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC) 2023 అక్టోబరు నుంచి HDFC బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. ఒక సంవత్సరం నుంచి 15 నెలల కాలనీ వడ్డీ 6.6 శాతం, 15 నెలల నుంచి 18 నెలల వరకు వడ్డీ 7.10 శాతం, 18 నెలల నుంచి 21 నెలలకు వడ్డీ 7 శాతం, 21 నెలల నుంచి 2 సంవత్సరాల కాలనీ 7 శాతం వడ్డీ అందిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) 2023 డిసెంబర్ 29 నుంచి అమల్లోకి వచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త వడ్డీ రేట్ల ప్రకారం, ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు 6.85 శాతం వడ్డీ, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వ్యవధికి 7.25 శాతం వడ్డీ, 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలానికి వడ్డీ 6.5 శాతం అందిస్తోంది. వీటితో పాటు బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్ స్కీమ్ అని పిలువబడే 399 రోజుల డిపాజిట్లపై 7.15 శాతం వడ్డీ పొందవచ్చు. ఇదీ చదవండి: గిఫ్ట్స్ ఇవ్వడంలో ఎవరైనా వీరి తర్వాతే.. కోడలికి రూ.451 కోట్ల నెక్లెస్ యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) 2023 డిసెంబర్ 26 నుంచి అమలులోకి వచ్చిన కొత్త వడ్డీ రేట్ల ప్రకారం, యాక్సిస్ బ్యాంక్ ఒక సంవత్సరం నుంచి 15 నెలల ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.7 శాతం ఆఫర్ చేస్తోంది . 15 నెలల నుంచి ఐదేళ్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేటు 7.10 శాతం అందిస్తుంది. డీసీబీ బ్యాంక్ (DCB Bank) 2023 డిసెంబర్ 13 నుంచి అమలులోకి వచ్చిన కొత్త వడ్డీ రేట్ల ప్రకారం వినియోగదారుని ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎక్కువ వడ్డీని పొందవచ్చు. సంవత్సరానికి చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు 7.15 శాతం వడ్డీని, 25 నెలల లేదా 26 నెలల మధ్య కాల వ్యవధి డిపాజిట్లకు అత్యధిక వడ్డీ రేటు 8 శాతం అందించడం జరుగుతుంది. -
భారీగా క్షీణించిన ఎఫ్‌డీఐలు.. కేమన్ ఐల్యాండ్స్, సైప్రస్ వెనకడుగు
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి ఆరు నెలల(ఏప్రిల్–సెప్టెంబర్)లో కేమన్ ఐలాండ్స్, సైప్రస్ నుంచి భారత్‌కు వచ్చిన ఎఫ్‌డీఐలు భారీగా క్షీణించాయి. వెరసి దేశీయంగా నమోదైన ఎఫ్‌డీఐలు 24 శాతం బలహీనపడ్డాయి. కేమన్ ఐల్యాండ్స్ నుంచి 75 శాతం తగ్గి 14.5 కోట్ల డాలర్లకు పరిమితంకాగా.. గతేడాది(2022–23) ఇదే కాలంలో 58.2 కోట్ల డాలర్లు లభించాయి. ఇక సైప్రస్ నుంచి మరింత అధికంగా 95 శాతం పడిపోయి 3.5 కోట్ల డాలర్లకు చేరాయి. గతంలో 76.4 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఇందుకు ఈ రెండు దేశాల దరఖాస్తులను నిశితంగా పరిశీలించడం ప్రభావం చూపింది. ఈ బాటలో సింగపూర్, యూఏఈల నుంచి సైతం పెట్టుబడులు వెనకడుగు వేశాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా యూఎస్, ఇతర పశ్చిమ దేశాలలో వడ్డీ రేట్లు పెరగడం, తూర్పు యూరప్, పశ్చిమాసియాలలో భౌగోళిక, రాజకీయ పరిస్థితులు తదితర అంశాలు భారత్‌కు వచ్చే ఎఫ్‌డీఐలను దెబ్బతీసినట్లు రెగ్యులేటరీ, నాంగియా ఆండర్సన్ ఇండియా పార్ట్నర్ అంజలీ మల్హోత్రా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సైప్రస్ పెట్టుబడులు వార్షికంగా 62 శాతం తగ్గినట్లు డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సంజయ్ కుమార్ తెలియజేశారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ నుంచి కేమన్ ఐల్యాండ్స్‌ను ఎఫ్ఏటీఎఫ్ రిస్కుల జాబితా(గ్రే లిస్ట్) నుంచి తప్పించడంతో రానున్న కాలంలో భారత్‌కు పెట్టుబడులు పెరిగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. -
పెరిగిన వడ్డీరేట్లు - కెనరా బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిందే!
న్యూఢిల్లీ: నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ – ఐదు బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. ఇటీవలే ప్రైవే టు రంగ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇదే స్థాయిలో కొన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ను పెంచిన సంగతి తెలిసిందే. అయితే కెనరా బ్యాంక్ మాత్రం అన్ని కాలపరిమితులపై రుణ రేటును పెంచింది. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన అన్ని రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. పెంచిన రేట్లు ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. కెనరా బ్యాంక్ తాజా రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం– సాధారణంగా ఆటో, వ్యక్తిగత, గృహ రుణాలకు ప్రాతిపదికన అయిన ఏడాది ఎంసీఎల్ఆర్ 8.70 శాతం నుంచి 8.75%కి చేరింది. ఓవర్‌నైట్, నెల, మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు కూడా 5 బేసిస్ పాయింట్ల చొప్పున పెరిగాయి. -
Fed Meeting: వడ్డీరేట్ల పెంపు తప్పదు: ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్
ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సి ఉందని పావెల్ సంకేతాలిచ్చారు. ఇందుకు రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెంచక తప్పదని ప్రకటించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా ఇంకా ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం రెండు శాతానికి పడిపోయేంత వరకు వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందన్నారు. ఫెడరల్ రిజర్వ్ గతంలోలాగా వడ్డీరేట్లను పెంచకపోవచ్చనే అభిప్రాయాలు ఉండేవి. కానీ పావెల్ తెలిపిన వివరాలతో గ్లోబల్ మార్కెట్లు, ఇండియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. పెడరల్ రిజర్వ్ బెంచ్‌మార్క్ రుణ రేటు 22 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టకుండా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే ఇప్పుడున్న లక్ష్యంగా తెలుస్తుంది. గత సంవత్సరం జూన్‌లో గరిష్ట స్థాయికి చేరిన ప్రధాన ద్రవ్యోల్బణం.. ప్రస్తుతం సగానికి పైగా తగ్గినప్పటికీ, వడ్డీరేట్లు పెంపు ప్రక్రియ దీర్ఘకాలికంగా కొనసాగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గురువారం అమెరికాలో టెక్ షేర్లలో వచ్చిన అమ్మకాల వెల్లువ అక్కడి మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. యూఎస్‌లో బాండ్ల రాబడులు మరింత పెరగడం కూడా ప్రతికూలంగా మారింది. -
RBI Monetary Policy: ధరల కట్టడే ధ్యేయం..
ముంబై: ధరల కట్టడికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) స్పష్టం చేసింది. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా 6.5 శాతంగా కొనసాగించాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ తరహా ‘యథాతథ రెపో రేటు కొనసాగింపు’ నిర్ణయం తీసుకోవడం వరుసగా ఇది నాల్గవసారి. రిటైల్ ద్రవ్యోల్బణం 4%గా కొనసాగించడమే ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించిన ఎంపీసీ, ఈ దిశలో వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) వెనక్కు తీసుకునే విధానాన్ని కొనసాగిస్తామని పేర్కొంది. ఇందులో భాగంగా బాండ్ విక్రయాల ను చేపడుతున్నట్లు తెలిపింది. ‘సరళతర ద్రవ్య విధానాన్ని వెనక్కుతీసుకునే’ ధోరణికే కట్టుబడి ఉన్నట్లు పాలసీ కమిటీ స్పష్టం చేసింది. మూడు రోజులపాటు జరిగిన కమిటీ సమావేశాల నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాకు తెలిపారు. ‘ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం 4%. 2 నుంచి 6% కాదు’ అని ఉద్ఘాటించారు. ప్లస్ 2, మైనస్ 2తో 4% వద్ద ద్రవ్యోల్బణం ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. పాలసీ ముఖ్యాంశాలు... ► 2023–24లో జీడీపీ 6.5 శాతం. ► రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం. ► అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద పసిడి రుణాల పరి మితి రూ. 2 లక్షల నుంచి రూ. 4లక్షలకు పెంపు. రూ. 2,000 నోట్లు ఇప్పటికీ మార్చుకోవచ్చు.. రూ.2,000 నోట్లను అక్టోబర్ 8 నుంచి కూడా మార్చుకునే అవకాశాలన్నీ ఆర్బీఐ కలి్పంచింది. గవర్నర్ ఈ విషయంపై మాట్లాడుతూ రూ. 3.43 లక్షల కోట్ల రూ. 2,000 డినామినేషన్ నోట్లు ఇప్పటి వరకూ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయ న్నారు. ఇంకా రూ.12,000 కోట్లకుపైగా విలువైన నోట్లు చెలామణీలో ఉన్నాయన్నారు. అక్టోబర్ 8 నుండి 19 ఆర్బీఐ కార్యాలయాల్లో వీటిని మార్చుకోవచ్చన్నారు. నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి మొదట సెపె్టంబర్ 30 వరకు గడువిచి్చన ఆర్బీఐ, ఈ తేదీని అక్టోబర్ 7 వరకూ పొడిగించింది. రాష్ట్ర రాజధానుల్లో ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నందున, ఎక్కడివారైనా, 2,000 నోట్లను మార్చు కోవడానికి పోస్టల్ శాఖ సేవలను పొందవచ్చని దాస్ సూచించారు. కఠిన ద్రవ్య విధానం కొనసాగింపు.. ఆర్బీఐ 2022 మే నుంచి 250 బేసిస్ పాయింట్లు రెపో రేటును పెంచింది. అయితే ఇటు డిపాజిట్ల విషయంలో అటు రుణాల విషయంలో బ్యాంకులు కస్టమర్లకు ఈ రేట్లను పూర్తిగా బదలాయించలేదు. ఈ పరిస్థితుల్లో ‘సరళతర ద్రవ్య విధానాన్ని వెనక్కుతీసుకునే’ ధోరణినే కొనసాగించాలని ఆర్బీఐ భావిస్తోంది. అంటే ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాలు వ్యవస్థలో ఇంకా ప్రతిఫలించాల్సి ఉంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతిలోనూ దేశ ఆర్థికాభివృద్ధి పటిష్టతే లక్ష్యంగా ఉంది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చీఫ్ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. సమీపకాలంలో ధరలు తగ్గవచ్చు. – సుభ్రకాంత్ పాండా, ఫిక్కీ ప్రెసిడెంట్ వృద్ధికి మద్దతునిస్తూ, ద్రవ్యోల్బణం కట్టడే ఆర్బీఐ ధ్యేయంగా కనబడుతోంది – ప్రసేన్‌జిత్ బసు, చీఫ్ ఎకనమిస్ట్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ -
వేతన జీవులకు షాక్.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)లో డబ్బులు దాచుకునే ఉద్యోగులకు చేదువార్త. రానున్న రోజుల్లో పీఎఫ్‌పై వడ్డీ తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగుల భవిష్యనిధిపై ఇస్తున్న వడ్డీ రేట్లను పునఃపరిశీలించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించిందని ఆర్టీఐ సమాచారం ఆధారంగా ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ మిగులును అంచనా వేసిన తర్వాత కూడా నష్టాన్ని చవిచూసింది. రూ. 449.34 కోట్ల మిగులు ఉంటుందని అనుకున్నప్పటికీ రూ. 197.72 కోట్ల లోటును ఎదుర్కొంది. దీంతో పీఎఫ్‌పై ఇస్తున్న వడ్డీ రేట్లను పునఃపరిశీలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.15 శాతంగా నిర్ణయించింది. అయితే నష్టాలను దృష్టిలో ఉంచుకుని, వడ్డీ రేటును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. పీఎఫ్‌పై అధిక వడ్డీ రేట్లను తగ్గించి మార్కెట్ రేట్లతో సమానంగా తీసుకురావాల్సిన అవసరం ఉందంది. ప్రస్తుతం పీఎఫ్‌పై వచ్చే వడ్డీని మార్కెట్‌తో పోల్చితే కాస్త ఎక్కువే. చాలా పొదుపు పథకాల్లో వడ్డీ పీఎఫ్‌పై చెల్లించే వడ్డీ కంటే తక్కువగానే ఉంది.ఈ కారణంగానే పీఎఫ్ వడ్డీని 8 శాతం దిగువకు తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ చాలా కాలంగా వాదిస్తోంది. దీంతో పీఎఫ్‌పై వడ్డీని ఎప్పకప్పుడు తగ్గిస్తూ వస్తున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌పై వడ్డీ రేటును 8.80 శాతం నుంచి 8.70 శాతానికి తగ్గించారు. కార్మిక సంఘాల నిరసనతో మళ్లీ 8.80 శాతానికి పెంచారు. ఆ తర్వాత పీఎఫ్‌పై వడ్డీ రేట్లు తగ్గుతూ 2021-22లో 8.10 శాతానికి తగ్గాయి. 2022-23లో ఇది 8.15 శాతానికి స్వల్పంగా పెరిగింది. కోట్లాది మంది ఉద్యోగుల సామాజిక భద్రతకు పీఎఫ్ అతిపెద్ద ఆధారం. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ చందాదారుల సంఖ్య 6 కోట్లకు పైగా ఉంది. -
వడ్డీ రేట్లు పెరిగితే ఇళ్ల కొనుగోలుపై ప్రభావం
న్యూఢిల్లీ: వడ్డీ రేట్లు ప్రస్తుత స్థాయి నుంచి మరింత పెరిగి 9.5 శాతం దాటితే తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం పడుతుందని, మెజారిటీ ఔత్సాహిక కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ఇండియా నిర్వహించిన ‘కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే’తో పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి. ఈ వివరాలను అనరాక్ ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది. మెజారిటీ ప్రజలు మధ్యస్థ, ప్రీమియం ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ మంది మూడు పడకల ఇళ్లకు తమ ప్రాధాన్యం అని చెప్పారు. అధిక ద్రవ్యోల్బణంతో 66 శాతం మంది (సర్వేలో పాల్గొన్న) ఖర్చు చేసే ఆదాయంపై ప్రభావం పడినట్టు తెలిపారు. వడ్డీ రేటు 9.5 శాతం దాటితే అది తమ కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావిం చేస్తుందని సర్వేలో పాల్గొన్న వారిలో 98 శాతం మంది చెప్పారు. ప్రస్తుతం సగటు గృహ రేటు 9.15 శాతంగా ఉంది. 59 శాతం మంది రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య బడ్జెట్ పరిధిలోని ఫ్లాట్ల కోసం చూస్తున్నట్టు చెప్పారు. రూ.45 - 90 లక్షల మధ్య ఇళ్ల కొనుగోలుకు 35 శాతం మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఇంటి కోసం 24 శాతం మంది చూస్తున్నారు. 48 శాతం మంది 3బీహెచ్‌కే ఇళ్లకు, 39 శాతం మంది 2బీహెచ్‌కే ఇళ్ల పట్ల ఆసక్తిగా ఉన్నారు. 2022 మొదటి ఆరు నెలలతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలంలో 3బీహెచ్‌కే ఇళ్లకు అనుకూలంగా ఉన్న వారు 41 శాతం నుంచి 48 శాతానికి పెరిగారు. రూ.40 లక్షల్లోపు ఇళ్లకు డిమాండ్ తగ్గుతోంది. 2020 మొదటి ఆరు నెలల్లో ఈ తరహా కొనుగోలు దారులు 40 శాతంగా ఉంటే, 2021 అర్ధ భాగంలో 28 శాతానికి, 2023 మొదటి ఆరు నెలల్లో 25 శాతానికి తగ్గారు. -
ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన - ఆ రెండు బ్యాంకులు..
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును మూడవ సారి కూడా 6.5 శాతం వద్దనే ఎటువంటి సవరణ చేయకుండా ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన తరువాత యాక్సిస్ బ్యాంక్ & కెనరా బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకు వడ్డీ రేట్లను సవరించాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యాక్సిస్ బ్యాంక్.. యాక్సిస్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, సవరణల తరువాత సాధారణ ప్రజలకు ఏడు రోజుల నుంచి పదేళ్లలోపు చేసుకునే డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 7.3 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తుంది. అయితే సీనియర్ సిటిజన్లకు మాత్రం ఈ డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 8.05 శాతం వరకు వడ్డీ అందించనుంది. అంతే కాకుండా నగదును ముందస్తుగా ఉపసంహరించుకునే వెసలుబాటు కూడా ఇందులో లభిస్తుంది. 7 రోజుల నుంచి 14 రోజులు, 15 రోజుల నుంచి 29 రోజులు, 30 రోజుల నుంచి 45 రోజులు 3.50% 46 రోజుల నుంచి 60 రోజుల వరకు 4.00% 61 రోజులు నుంచి 3 నెలలు 4.50% 3 నెలలు నుంచి 4 నెలలు, 4 నెలలు నుంచి 5 నెలలు, 5 నెలలు నుంచి 6 నెలలు 4.75% 6 నెలలు నుంచి 7 నెలలు, 7 నెలలు నుంచి 8 నెలలు, 8 నెలలు నుంచి 9 నెలలు 5.75% 9 నెలలు నుంచి 10 నెలలు, 10 నెలలు నుంచి 11 నెలలు, 11 నెలల నుంచి 11 నెలల 24 రోజులు 6.00% 11 నెలల 25 రోజులు నుంచి 1 సంవత్సరం 6.00% 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 4 రోజులు 6.75% 1 సంవత్సరం 5 రోజుల నుంచి 1 సంవత్సరం 10 రోజులు & 1 సంవత్సరం 11 రోజుల నుంచి 1 సంవత్సరం 24 రోజులు 6.80% 1 సంవత్సరం 25 రోజులు నుంచి 13 నెలలు 6.80% 13 నెలలు నుంచి 14 నెలలు, 14 నెలలు నుంచి 15 నెలలు, 15 నెలలు నుంచి 16 నెలలు వరకు 7.10% 16 నెలలు నుంచి 17 నెలలు 7.30% 17 నెలలు నుంచి 18 నెలలు & 18 నెలలు నుంచి 2 సంవత్సరాలు 7.10% 2 సంవత్సరాలు నుంచి 30 నెలలు 7.20% 30 నెలలు నుంచి 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నుంచి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు 7.00% కెనరా బ్యాంక్.. ఇక కెనరా బ్యాంక్ విషయానికి వస్తే.. అధికారిక వెబ్సైట్ ప్రకారం.. కొత్త సవరణ తర్వాత, సాధారణ ప్రజలకు ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు చేసుకునే డిపాజిట్లపై బ్యాంక్ 4 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందజేస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై 4 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు ఇప్పటికే అమలులో ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇదో చెత్త కారు.. రూ. 4 కోట్ల మసెరటిపై గౌతమ్ సింఘానియా ట్వీట్ 7 రోజుల నుంచి 45 రోజుల వరకు 4.00% 46 రోజుల నుంచి 90 రోజుల వరకు 5.25% 91 రోజుల నుంచి 179 రోజులు 5.50% 180 రోజుల నుంచి 269 రోజుల వరకు 6.25% 270 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ 6.50% 1 సంవత్సరం మాత్రమే 6.90% 444 రోజులు 7.25% 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ 6.90% 2 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ 6.85% 3 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ - 5 సంవత్సరాల కంటే తక్కువ 6.80% 5 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ - 10 సంవత్సరాల వరకు 6.70% -
రష్యా కేంద్ర బ్యాంకు సంచలనం: ఆర్థిక వేత్తల ఆందోళన
రష్యా సెంట్రల్ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ కరెన్సీ రూబుల్ కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో కీలక వడ్డీరేట్లను భారీగా పెంచేసింది. 12 శాతం లేదా 350 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు పెంపును మంగళవారం ప్రకటించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి దేశం కరెన్సీ విలువ దిగజారిపోవడం, ద్రవ్యోల్బణంపై పోరులో భాగంగా అత్యవసర చర్యకు ఉపక్రమించింది. తద్వారా రూబుల్‌ను బలోపేతం చేయాలని భావిస్తోంది. యుద్ధం , ఆంక్షలు పరిష్కారం కానంతవరకు గతంలో 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను ఏకంగా 12 శాతానికి పెంచుతున్నట్లు రష్యా సెంట్రల్ బ్యాంక్ మంగళవారం వెల్లడించింది.రష్యన్ కరెన్సీ సోమవారం డాలర్‌తో పోలిస్తే రూబుల్ 102 మార్కు వద్ద 16 నెలల కనిష్టానికి చేరడంతో ఈ కఠిన చర్యలకుది గింది. సంవత్సరం ప్రారంభం నుండి దాని విలువలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ కోల్పోయింది .దాదాపు 17 నెలల్లో కనిష్ట స్థాయిని తాకింది. గత మూడు నెలల్లో ద్రవ్యోల్బణం 7.6 శాతానికి చేరుకుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుందని, ఇది రూబుల్ పతనం ప్రమాదాన్ని పెంచుతుందని అంచనా వేస్తూ, గత నెలలో 1 శాతం మేర వడ్డీరేటును పెంచింది. వడ్డీ రేట్లపై దాని తదుపరి సమావేశం సెప్టెంబర్ 15న జరగనుంది.ఒక్కసారిగా కీలక వడ్డీ రేట్లను 350 బేసిస్ పాయింట్లు పెంచటంపై ప్రపంచ ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది గ్లోబల్ మార్కెట్లను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. లండన్‌లోని బ్లూబే అసెట్ మేనేజ్మెంట్లో సీనియర్ ఎమర్జింగ్ మార్కెట్ల సావరిన్ స్ట్రాటజీ తిమోతీ యాష్ స్పందన: యుద్ధం కొనసాగుతున్నంత కాలం రష్యా, రష్యా ఆర్థిక వ్యవస్థ, రూబుల్‌కు మరింత దిగజారుతుంది. హైకింగ్ పాలసీ రేట్లు దేనినీ పరిష్కరించని వ్యాఖ్యానించారు. రూబుల్ తరుగుదల వేగాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చు కానీ ప్రధాన సమస్య అయిన యుద్ధం , ఆంక్షలు పరిష్కరించుకోవాలన్నారు. లండన్‌లోని ఈక్విటీ క్యాపిటల్‌లో చీఫ మాక్రో ఎకనామిస్ట్ స్టువర్ట్ కోల్ ఏమన్నారంటే..రూబుల్ విలువ పతనానికి ఇది అత్యవసర ప్రతిస్పందన.కరెన్సీ పతనం ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదం ఉంది.ఇది ఉక్రెయిన్ దాడి ఖర్చుల గురించి రష్యన్ ప్రజలకు పంపే సంకేతమన్నారు. యుద్ధం కారణంగా సైనిక వ్యయం పెరిగిపోవడం, రష్యా వాణిజ్య సమతుల్యతపై పాశ్చాత్య ఆంక్షల ప్రభావం, ద్రవ్యోల్బణం లాంటి కారణాలతో రష్యా కేంద్ర బ్యాంకు రేటు పెంపు నిర్ణయం తాత్కాలిక పరిష్కారమే. రూబుల్ పతనం, ఇంధన ధరలు, ఎగుమతి ఆదాయాలు క్షీణించడంతో పాటు వస్తువుల దిగుమతులు వేగంగా పుంజుకోవడం వల్ల కరెంట్ ఖాతా మిగులు బాగా తగ్గిపోయిందని ఆర్థిక వేత్తలంటున్నారు. అంతేకాదు తాజా రేట్ల పెంపు ఇండియా చెల్లింపులను కూడా ప్రభావితం చేయవచ్చని అంచనా. ఈ ప్రభావం ఆసియా స్టాక్‌మార్కెట్లతోపాటు, భారత స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపి నష్టాలకు దారితీయెుచ్చనే ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత, రూబుల్ డాలర్‌తో పోలిస్తే 130కి పడిపోయింది, అయితే సెంట్రల్ బ్యాంక్ దాని కీలక వడ్డీ రేటును 20శాతం వరకు పెంచి మూలధన నియంత్రణలను అమలులోకి తెచ్చింది. ఆ తర్వాత నెలరోజుల్లో రేట్లను తగ్గించి కరెన్సీ విలువను స్థిరీకరించే ప్రయత్నాలు చేసింది. -
ఈఎంఐలు కట్టేవారికి అలర్ట్! షాకిచ్చిన టాప్ ప్రైవేట్ బ్యాంక్
HDFC Bank hikes loans interest rates: విలీనం తర్వాత అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా అవతరించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాకిచ్చింది. బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడనుంది. బ్యాంక్ రుణ రేట్ల పెంపు ఆగస్ట్ 7 నుంచి అమలులోకి వచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంపిక చేసిన టెన్యూర్లపై ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) ను 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచేసింది. టెన్యూర్ ఆధారంగా ఎంసీఎల్ఆర్ రేటు పెంపు ఇలా ఉంది.. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.25 శాతం నుంచి 8.35 శాతానికి చేరింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు ఎగిసి 8.3 శాతం నుంచి 8.45 శాతానికి చేరింది. మూడు నెలలకుగానూ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.6 శాతం నుంచి 8.7 శాతాన్ని తాకింది. ఇక ఆరు నెలలకయితే 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.9 శాతం నుంచి 8.95 శాతానికి ఎగసింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 9.05 శాతం నుంచి 9.1 శాతానికి పెరిగింది. ఇక రెండేళ్ల టెన్యూర్ రేట్‌ను 9.15 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటును 9.2 శాతానికి పెంచింది. ఎంసీఎల్ఆర్ అంటే.. ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. బ్యాంకులు ఈ ఎంసీఎల్ఆర్ రేటును ప్రామాణికంగా తీసుకుని రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. దీన్నే రుణాలపై విధించే కనీస వడ్డీ రేటుగా వ్యవహరిస్తారు. అందువల్ల ఎంసీఎల్ఆర్ రేటు పెరిగితే.. రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. -
వేతన జీవులకు గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ వడ్డీని పెంచిన కేంద్రం
వేతన జీవులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 2023 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.15 శాతంగా కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. ఈ మేరకు 8.15 శాతం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లుగా ఈపీఎఫ్ఓ ఓ సర్క్యలర్ విడుదల చేసింది. ఈపీఎఫ్ పథకం- 1952లోని 60 (1) పేరా కింద ప్రతి సభ్యుని ఖాతాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ వడ్డీని జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదాన్ని తెలియజేసిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ తెలియజేసినట్లు ఈపీఎఫ్ఓ సర్క్యులర్‌లో పేర్కొంది. దీని ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో చందాదారుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేసిన పీఎఫ్ మొత్తానికి 8.15 శాతం వడ్డీని ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇంతకు ముందు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8.10 శాతం చొప్పున వడ్డీని ఈపీఎఫ్ఓ జమ చేసింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 23 ఆర్థిక సంవత్సరానికికి గానూ 8.15 శాతం వడ్డీ రేటును గత మార్చి 28న సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును అనుసరించి, వడ్డీ రేటును ఆర్థిక శాఖ ఆమోదించి నోటిఫై చేయాలి. అప్పుడే సభ్యుల ఖాతాల్లో జమ అవుతుంది. సాధారణంగా, వడ్డీ రేటును ఆర్థిక శాఖ ద్వారా ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తెలియజేస్తుంది. 2023 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ కోసం చందాదారులు ఇప్పటి వరకు వేచి చూశారు. ఎంప్లాయీస్ ప్రావెడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది దేశంలోనే అతిపెద్ద రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్. ఇందులో 70.2 మిలియన్ల మంది ఉద్యోగులు, 0.75 మిలియన్ల కంపెనీలు సొమ్ము జమ చేస్తున్నారు. సబ్స్క్రైబర్ల పాస్‌బుక్‌ని పన్ను పరిధిలోకి వచ్చే, పన్నేతర విరాళాలుగా విభజించాల్సి రావడంతో తలెత్తిన సాఫ్ట్వేర్ సమస్యల కారణంగా 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ జమ ఆలస్యమైంది. 2021-22లో రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్లపై వచ్చే పొదుపు ఆదాయంపై ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను దీనికి కారణం. -
ఆర్థిక వ్యవస్థ శుభ సంకేతాలు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో తాజా గణాంకాలు ఉత్సాహాన్ని నింపాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 4.25 శాతంగా నమోదయ్యింది. అంటే 2022 మేతో పోల్చితే 2023 మేలో రిటైల్ ధరల బాస్కెట్ 4.25 శాతమే పెరిగిందన్నమాట. గడచిన రెండేళ్ల కాలంలో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడ్డం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం 2 ప్లస్ లేదా 2 మైనస్‌తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే 6 శాతం పైబడకూడదు. అయితే 2022 నవంబర్, డిసెంబర్, 2023 మార్చి, ఏప్రిల్, మే మినహా మిగిలిన అన్ని నెలలూ 6 శాతం ఎగువనే రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగింది. తాజా సమీక్షా నెల్లో 2021 ఏప్రిల్ కనిష్టాన్ని (4.23 శాతం) చూసింది. గడచిన నాలుగు నెలల నుంచీ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తుండగా, వరుసగా మూడవనెల నిర్దేశిత 6 శాతం దిగువన నమోదయ్యింది. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో గత మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటును ఆర్బీఐ 6.5 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం అదుపు నేపథ్యంలో గడచిన రెండు త్రైమాసికాల్లో యథాతథంగా కొనసాగించింది. తాజా గణాంకాల ధోరణి కొనసాగితే, ఆర్బీఐ 2023లో రెపో రేటును పెంచే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4.7 శాతం కాగా, గత ఏడాది మే నెల్లో 7.04 శాతంగా ఉంది. కీలకాంశాలు ఇవీ... ఒక్క ఆహార విభాగాన్ని పరిశీలిస్తే, మే నెల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.91 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో ఇది 3.84 శాతం. మొత్తం సూచీలో దీని వెయిటేజ్ దాదాపు 50 శాతం. ఆయిల్, ఫ్యాట్స్ ధరల స్పీడ్ తాజా సమీక్షా నెల్లో 16 శాతం తగ్గింది. కూరగాయల ధరలు 8.18 శాతం దిగివచ్చాయి. అయితే తృణధాన్యాలు, పప్పుదినుసుల ధరలు వరుసగా 12.65 శాతం, 6.56 శాతంగా ఉన్నాయి. ► ఫ్యూయెల్ లైట్ విభాగంలో ధరల స్పీడ్ ఏప్రిల్ లో 5.52% ఉంటే, మేలో 4.64 శాతం. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా. జూన్ త్రైమాసికంలో 4.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఏప్రిల్‌లో తయారీ, మైనింగ్ చక్కని పనితీరు ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి నెల ఏప్రిల్‌లో పారిశ్రామిక రంగం మంచి ఫలితాన్ని నమోదుచేసింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (సీపీఐ) వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదయ్యింది. తయారీ, మైనింగ్ రంగాలు మంచి వృద్ధిరేటును నమోదుచేసుకున్నట్లు అధికా రిక గణాంకాలు తెలిపాయి. 2023 మార్చితో పోల్చితే (1.7 శాతం వృద్ధి) గణాంకాల తీరు బాగున్నప్పటికీ, 2022 ఏప్రిల్‌తో పోల్చితే (6.7 శాతం) వృద్ధి రేటు తక్కువగా ఉండడం గమనార్హం. అయితే అప్పటి గణాంకాల్లో బేస్ తక్కువగా ఉండడం మరోఅంశం. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన తాజా అంకెలను పరిశీలిస్తే... -
నిబంధనలు పాటించని కెనరా బ్యాంకు: ఆర్బీఐ భారీ పెనాల్టీ
సాక్షి, ముంబై: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకు కెనరా బ్యాంకునకు భారీ షాక్ ఇచ్చింది. రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించిందని ఆగ్రహించిన ఆర్బీఐ భారీ పెనాల్టీ విధించింది. ప్రధానంగా రిటైల్ రుణాలపై ఫ్లోటింగ్ రేట్ వడ్డీని, ఎంఎస్ఎంఈ రుణాలను బాహ్య బెంచ్‌మార్క్‌తో లింక్ చేయడంలో బ్యాంక్ విఫలమైందని పేర్కొంది. (మైనర్ల పేరుతో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు: నిబంధనలు మారాయి) వడ్డీ రేట్లను బాహ్య బెంచ్‌మార్క్‌తో అనుసంధానం చేయడం, అనర్హులకు పొదుపు ఖాతాలు తెరవడం వంటి పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు కెనరా బ్యాంక్‌పై రూ.2.92 కోట్ల జరిమానా విధించింది. ఆర్బీఐ చేపట్టిన తనిఖీల్లో విషయాలు వెలుగులోకి రావటంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. బ్యాంక్ ఫ్లోటింగ్ రేట్ రిటైల్ రుణాలపై వడ్డీని, ఎంఎస్ఎంఈలకి ఇచ్చే రుణాలను బాహ్య బెంచ్‌మార్క్‌తో లింక్ చేయడంలో విఫలమైందని గుర్తించినట్టు కేంద్ర బ్యాంకు ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన,ఫ్లోటింగ్ రేటు రూపాయి రుణాలపై వడ్డీని దాని మార్జినల్ కాస్ట్‌తో లింక్ చేయడంలో విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. ఇదీ చదవండి: 18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్మెంట్ అలాగే పలు క్రెడిట్ కార్డ్ ఖాతాలలో నకిలీ మొబైల్ నంబర్లను నమోదు చేయటం, 24 నెలలలోపు ముందుగానే ఉపసంహరించుకోవడం, కస్టమర్ల నుండి ఎస్ఎంఎస్ అలర్ట్ చార్జీలను వసూలు చేసిందనితెలిపింది. కస్టమర్ ప్రొఫైల్‌కు విరుద్ధంగా లావాదేవీలు జరిగినప్పుడు అలర్ట్‌లను రూపొందించడానికి కొనసాగుతున్న కస్టమర్ డ్యూ డిలిజెన్స్‌ను చేపట్టడంలో విఫలమైందని పేర్కొంది. రోజువారీ డిపాజిట్ పథకం కింద ఆమోదించిన డిపాజిట్లపై వడ్డీని చెల్లించడంలో కూడా విఫలమైందని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. -
మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం: 7.5 శాతం వడ్డీరేటు, ఎలా అప్లై చేయాలి?
సాక్షి, ముంబై: 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్', మహిళా సాధికారత,భాగంగా ప్రకటించిన 2023-24 కేంద్ర బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిళా పెట్టుబడిదారుల కోసం కొత్త చిన్న పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఆ పథకమే మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం.కేవలం ఆడపిల్లలు, మహిళలు మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టేలా పోస్టాఫీసుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2025 ఏప్రిల్ వరకూ స్థిర వడ్డీరేటును అందిస్తుంది. (షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) మహిళల పెట్టుబడిలో భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిన్న పొదుపు పథకం కింద కేంద్రం మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌ను అందిస్తోంది. ఇందులో మహిళలకు తక్కువ సమయంలో ఎక్కువ రాబడి రానుంది. మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2 సంవత్సరాలలో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్‌పై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ ప్రయోజనాలు: మహిళలకు, బాలికలకు మాత్రమే ఖాతా తెరిచే అవకాశం. ఒక్క ఖాతా మాత్రమే తెరవవచ్చు. మహిళలు లేదా బాలికల రూ.1000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ రెండేళ్ల కాలపరిమితి పథకం ఆకర్షణీయమైనయు స్థిరమైన వడ్డీని 7.5 శాతం వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన ఖాతాకు వడ్డీ బదిలీ ఉదా: రెండేళ్ల కాలానికి రెండు లక్షలు డిపాజిట్ చేస్తే.. 7.5 శాతం వడ్డీ ప్రకారం రెండు లక్షలకు రెండేళ్లకు రూ.30వేలు వడ్డీ రూపంలో అందుతుందన్నమాట. ఎలా నమోదు చేయాలి స్థానిక బ్యాంక్ లేదా పోస్టాఫీసు నుండి మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన ఫారమ్ తీసుకోవాలి దరఖాస్తులో ఆధార్ కార్డ్ ,పాన్ కార్డ్ , నామినీ లాంటి వివరాలను నమోదు చేయాలి అవసరమైన డాక్యుమెంటేషన్‌తో దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి నగదు లేదా చెక్ రూపంలో సంబంధిత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి ఈ ప్రక్రియ పూర్తైన తరువాత పప్రూఫ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్ మీ చేతికి వస్తుంది డిపాజిట్ చేసిన తేదీ నుండి రెండేళ్లు పూర్తయిన తర్వాత డిపాజిట్ మెచ్యూర్ అవుతుంది ఒక సంవత్సరం గడువు ముగిసిన తర్వాత కానీ మెచ్యూరిటీకి ముందు, బ్యాలెన్స్‌లో గరిష్టంగా 40 శాతం వరకు ఒకసారి విత్‌డ్రా చేసుకోవవచ్చు. చిన్న పొదుపు వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా పోస్టాఫీసుల ద్వారా, గ్రామీణ ప్రాంతాలలోని బాలికలు, మహిళా రైతులు, కళాకారులు, సీనియర్ సిటిజన్లు, ఫ్యాక్టరీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు చిన్న మెత్తంలో పెట్టుబడితో మంచి రాబడిని పొందుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. (ఇదీ చదవండి: స్టార్ బ్యాటర్ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్‌గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్) -
ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త! వడ్డీ రేటు పెంపు
సాక్షి,ముంబై: ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్) ఖాతాదారులకు శుభవార్త. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతంగా వడ్డీ రేటునే నిర్ణయించింది. 0.05 శాతం పెంచి 8.10 శాతం నుండి 8.15 శాతానికి పెంచింది. 2019 తర్వాత పెంపు ఇదే తొలిసారి సీబీటీ నిర్ణయాన్ని 2022-23కి సంబంధించిన ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు అనుమతికి ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిస్తుంది. మార్చి 27, 28 తేదీల్లో సమావేశమైన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. -
Personal Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలా? ఇది మీకోసమే!
ఈ రోజు మనిషి ఎంత సంపాదించినా ఏదో తక్కువైనట్లు, ఏమీ మిగలటం లేదని భావిస్తూనే ఉంటాడు, దీనికి ప్రధాన కారణం పెరిగిన నిత్యావసరాల ధరలు కావచ్చు లేదా అధికమైన కుటుంబ ఖర్చులు కావచ్చు. దీనికోసం చాలీ చాలని సంపాదనతో ముందుకు వెళ్లలేక కొన్ని సందర్భాల్లో బ్యాంకుల నుంచి ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి లోన్ తీసుకుంటాడు. ఒక వ్యక్తి పర్సనల్ లోన్ తీసుకున్న తరువాత ప్రతి నెలా ఈఎమ్ఐ రూపంలో డబ్బు చెల్లిస్తూ ఉంటాడు. లోన్ అనేది ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది, అదే సమయంలో క్రెడిట్ స్కోర్ పెంచుకోవడనికి కూడా సహాయపడుతుంది. కానీ మీరు తీసుకునే లోన్ ఒకే రకమైన వడ్డీ రేటుతో లభించే అవకాశం ఉండదు. వడ్డీ బ్యాంక్, ఇతర ఫైనాన్స్ కంపెనీల మీద ఆధారపడి ఉంటుంది. లోన్ తీసుకునే వారు తప్పకుండా బ్యాంకు పర్సనల్ లోన్ వడ్డీ రేట్లను తెలుసుకోవాలి. పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు సిబిల్ స్కోర్, రీపేమెంట్ హిస్టరీ, ప్రిన్సిపల్ అమౌంట్, టెన్యూర్ వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా వడ్డీ అనేది పర్సనల్ లోన్ మొత్తంపై లెక్కించబడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 16 శాతం వడ్డీ రేటుపైన ఐదు లక్షలు, 60 నెలలు/5 సంవత్సరాల సమయానికి (తిరిగి చెల్లించే కాల వ్యవధి) తీసుకున్నప్పుడు అతడు మొత్తం రూ. 7.29 లక్షలు చెల్లించాలి. అంటే ఆ వ్యక్తి అదనంగా రూ. 2.29 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా వివిధ బ్యాంకులు విధించే వడ్డీ రేటుపైన ఆధారపడి ఉంటుంది. వినియోగదారుడు తప్పకుండా గమనించాలి. వివిధ బ్యాంకులలో వివిధ రకాల వడ్డీ రేట్లు: పర్సనల్ లోన్ వడ్డీ రేటు విషయంలో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. ఇందులో రూ. 20 లక్షల వరకు లోన్ తీసుకుంటే తిరిగి చెల్లించే కాల వ్యవధి 7 సంవత్సరాలు/84 నెలలు ఉంటె వడ్డీ రేటు 9.10 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. కరూర్ వైశ్యా బ్యాంక్‌లో రూ.10 లక్షల వరకు లోన్ తీసుకుంటే 12 నుంచి 60 నెలల కాలవ్యవధికి గానూ 10.20% నుంచి 13.20% వడ్డీ రేటు లభిస్తుంది. ఇండియన్ బ్యాంక్‌లో రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వ్యక్తిగత రుణానికి 12 నుంచి 36 నెలల కాలవ్యవధికి 10.65% నుంచి 12.15% వడ్డీ రేటు లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో రూ.50 వేల నుంచి రూ. 50 లక్షల లోపు పర్సనల్ లోన్ కోసం 12 నుంచి 72 నెలల కాలవ్యవధికి 10.75% నుంచి 19% వరకు వడ్డీ రేటు లభిస్తుంది. పర్సనల్ లోన్ తీసుకునే వ్యక్తి క్రెడిట్ స్కోరు బాగున్నప్పుడు ఎక్కువ లోన్, కొంత తక్కువ వడ్డీకే తీసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ 750 కంటే తక్కువగా ఉన్నప్పుడు పర్సనల్ లోన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒక వేళా లోన్ లభించినా తక్కువ మొత్తంలో, ఎక్కువ వడ్డీ రేటుకి లభిస్తుంది. వడ్డీ రేట్లను గురించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్స్ గానీ, సమీపంలోని బ్యాంకు ద్వారా తెలుసుకోవచ్చు. -
ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి గుడ్ న్యూస్!
ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం... ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మొత్తంపై సాధారణ ప్రజలకు 3.5 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీ చెల్లిస్తుంది. ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్ ఇవే.. ఒకటిన్నర సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల మూడు నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్‌పై అత్యధిక వడ్డీ సాధారణ ప్రజలకు 7.75 శాతం, అదే సీనియర్ సిటిజన్లకైతే 8.25 శాతం ఉంటుంది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. పెరిగిన వడ్డీరేట్లు మార్చి 18 నుంచి అమలులోకి వస్తాయి. వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇలా.. 7 నుంచి 30 రోజుల వ్యవధి డిపాజిట్లపై 3.5 శాతం, 31 నుంచి 45 రోజుల వ్యవధి డిపాజిట్లపై 4 శాతం, 46 నుంచి 60 రోజుల వ్యవధి డిపాజిట్లకు 4.5 శాతం, 61 నుంచి 90 రోజుల వ్యవధి డిపాజిట్లకు 4.60 శాతం వడ్డీ ఉంటుంది. ఇదీ చదవండి: Byju’s: మాస్టారు మామూలోడు కాదు.. సీక్రెట్ బయటపెట్టిన బైజూస్ రవీంద్రన్! 91 నుంచి 120 రోజుల వ్యవధి కలిగిన డిపాజిట్లపై 4.75 శాతం, 121 నుంచి 180 రోజుల వ్యవధి డిపాజిట్లపై 5 శాతం, 181 నుంచి 210 రోజులలో మెచ్యూర్ అయ్యే దేశీయ టర్మ్ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తుంది. అలాగే 211 నుంచి 269 రోజుల వ్యవధి డిపాజిట్లపై 5.80 శాతం, 270 నుంచి 354 రోజుల వ్యవధి డిపాజిట్లపై 6 శాతం, 355 నుంచి 364 రోజుల వ్యవధితో చేసిన డిపాజిట్లపై 6.25 శాతం అందిస్తుంది. ఇదీ చదవండి: ఆ విషయంలో షావోమీ రికార్డ్‌ను బ్రేక్ చేయనున్న ఐఫోన్! -
ఐసీఐసీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై: దేశీయ దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ)లపై వడ్డీ రేట్లను భారీగా పెంచింది. బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 7.15 శాతం వడ్డీ రేటును చెల్లించ నున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. డిపాజిట్ల రకాలు, వ్యవధి ఆధారంగా వడ్డీ రేట్లులో మార్పులుంటాయి. రూ.2 కోట్లకుపైన రూ.5 కోట్ల లోపు ఉండే ఎఫ్డీలపై వడ్డీ రేట్లను బ్యాంక్ పెంచింది. (ఇదీ చదవండి: సుమారు 5 వేలమంది సీనియర్లకు షాకిచ్చిన ఈ కామర్స్ దిగ్గజం) ప్రస్తుతం 4.75 శాతం నుంచి 7.15 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది ఐసీసీఐ. ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 23 నుంచి వర్తిస్తాయని బ్యాంక్ వెల్లడించింది. సవరించిన వడ్డీ రేట్లు నేటి (ఫిబ్రవరి 23 )నుంచే అమలులోకి వస్తాయని ఐసీఐసీఐ వెల్లడించింది. రెండు నుంచి మూడేళ్ల బల్క్ డిపాజిట్లపై 7.00 శాతాన్ని అలాగే 290రోజుల నుంచి రెండేళ్ల వ్యవధిలోని డిపాజిట్లపై అత్యధికంగా 7.15 శాతం వడ్డీని అందిస్తుంది. (నెలకు రూ.4 లక్షలు: రెండేళ...కష్టపడితే, కోటి...కానీ..!) సవరించిన బల్క్ ఎఫ్డీ వడ్డీ రేట్లు ♦ 7 - 29 రోజుల వ్యవధి డిపాజిట్లపై 4.75 శాతం ♦ 30 - 45 రోజులకు 5.50 శాతం ♦ 46 - 60 రోజులకు 5.75 శాతం ♦ 61 -90 రోజులకు 6.00 శాతం ♦ 91 -184 రోజులకు 6.50 శాతం ♦ 185 - 270 రోజులు 6.65 శాతం ♦ 3 నుంచి అయిదేళ్ల డిపాజిట్లపై 6.75 శాతం ♦ 5 -10 సంవత్సరాల డిపాజిట్లపై 6.75 శాతం కాగా ఇటీవల మానిటరీ పాలసీ రివ్యూలో ఆర్బీఐ రెపో రేటును పెంచిన సంగతివ తెలిసిందే. దీంతో అన్ని బ్యాంకులు వడ్డీరేట్లను సవరిస్తున్నాయి. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచింది. సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 7.60 శాతం వరకు వడ్డీ రేటును ప్రకటించింది. ఈ సవరించిన రేట్లు ఫిబ్రవరి 21 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
వడ్డీ రేట్ల డెరివేటివ్స్ వేళల పొడిగింపు
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల డెరివేటివ్స్ ట్రేడింగ్ వేళలను కాంట్రాక్టు ఎక్స్పైరీ తేదీల్లో సాయంత్రం 5 గం.ల వరకూ పొడిగించాలని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) నిర్ణయించింది. దీన్ని గురువారం నుంచి అమలు చేయనుంది. ప్రస్తుతం కాంట్రాక్టుల ట్రేడింగ్ సమయం ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 3.30 గం. వరకు ఉంటోంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన వడ్డీ రేట్ల డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్ వేళలు ఫిబ్రవరి 23న (ఎక్స్పైరీ తేదీ) సాయంత్రం 5 గం. వరకు ఉంటాయని ఎన్ఎస్ఈ తెలిపింది. ఆ రోజున మిగతా వడ్డీ రేట్ల డెరివేటివ్ కాంట్రాక్టుల వేళల్లో మాత్రం మార్పులేమీ ఉండవని తెలిపింది. ఆయా కాంట్రాక్టుల ఎక్స్పైరీ తేదీల్లో మాత్రం సాయంత్రం 5 గం. వరకు ట్రేడింగ్ అందుబాటులో ఉంటుందని వివరించింది. ఈక్విటీ సెగ్మెంట్లో ట్రేడింగ్ వేళలను పొడిగించాలని ఎన్ఎస్ఈ యోచిస్తోందన్న వార్తల నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దేశీ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ వేళలు ఉదయం 9.15 గం. నుంచి సాయంత్రం 3.30 గం. వరకు, కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ వేళలు ఉదయం 10 గం. నుంచి రాత్రి 11.55 గం. వరకు ఉంటున్నాయి. రిస్కుల హెడ్జింగ్‌కు ఉపయోగపడుతుంది.. దేశీ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ వేళలను పొడిగిస్తే .. క్రితం రోజు అంతర్జాతీయంగా చోటు చేసుకునే పరిణామాల వల్ల తలెత్తే రిస్కులను హెడ్జింగ్ చేసుకునేందుకు ఉపయోగపడగలదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘అంతర్జాతీయంగా మార్కెట్లు ఒకదానికి మరొకటి మరింతగా అనుసంధానమవుతున్నాయి. అమెరికా, యూరప్ వంటి పెద్ద మార్కెట్లలో పరిణామాలకు మన స్టాక్ మార్కెట్లు స్పందిస్తున్నాయి. కాబట్టి ఆయా రిస్కులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ట్రేడింగ్ వేళల పెంపు ఉపయోగపడగలదు‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈడీ ఎ. బాలకృష్ణన్ తెలిపారు. ఈక్విటీ సెగ్మెంట్లో వేళల పెంపుతో మార్కెట్ వర్గాలు, రిటైల్ ఇన్వెస్టర్లకూ ప్రయోజనం చేకూరగలదని వివరించారు. అంతర్జాతీయ అనిశ్చితుల రిస్కులను ఎదుర్కొనేందుకు ఈక్విటీ ఎఫ్‌అండ్‌వో, కరెన్సీ సెగ్మెంట్స్ ట్రేడింగ్ వేళలను పెంచడం చాలా అవసరమని ఫైయర్స్ సీఈవో తేజస్ ఖోడే చెప్పారు. దీన్ని వ్యతిరేకిస్తే మన క్యాపిటల్ మార్కెట్ల వృద్ధికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ట్రేడింగ్ వేళల పెంపుతో అంతర్జాతీయ ట్రేడర్లకు దీటుగా దేశీ ట్రేడర్లకు కూడా సమాన అవకాశాలు లభించగలవని జిరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ట్వీట్ చేశారు. -
RBI Monetary Policy: రెపో పెంపుతో ఎన్‌బీఎఫ్‌సీలకు ఇబ్బందిలేదు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను పెంచడం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (ఎన్బీఎఫ్సీ) ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోదని ఇక్రా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. రెపో రేటును ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ బుధవారం పావుశాతం పెంచిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. వరుసగా ఆరవసారి పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. ఎన్బీఎఫ్సీపై రేటు పెంపు ప్రభావం విషయంలో ఇక్రా రేటింగ్స్ తాజా నివేదికలో ముఖ్యాంశాలు.. ► రెపో రేటు పెరుగుదల ఎన్బీఎఫ్సీ వసూళ్ల సామర్థ్యాలను ప్రభావితం చేయదు. రుణగ్రహీతలు ఇచ్చిన పూచీకత్తులు, వారు తిరిగి చెల్లింపులకు ఇచ్చే ప్రాధాన్యతను ఇక్కడ ప్రాతిపతికగా తీసుకోవడం జరిగింది. ► ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పలు రంగాలపై ఈ ప్రభావాన్ని ప్రస్తుతం నిర్ధారించడం కష్టంగా ఉన్నప్పటికీ, మెజారిటీ రంగాల అవుట్‌లుక్ పటిష్టంగానే ఉంది. ఇది ఎన్‌బీఎఫ్‌సీల రుణ వసూళ్ల సామర్థ్యానికి సానుకూల అంశం. ► అందుతున్న గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలలకు (2022–23, ఏప్రిల్–డిసెంబర్) నాన్–బ్యాంకు ఫైనాన్స్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వసూళ్ల సామర్థ్యం 97–105 శాతం శ్రేణిలో ఉంది. ► అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, పెరుగుతున్న వడ్డీరేట్ల నేపథ్యంలోనూ వస్తున్న ఈ సానుకూల గణాంకాలు ఆర్థిక పటిష్టతను సూచిస్తున్నాయి. ► పటిష్ట రుణ వసూళ్ల సామర్థ్యం కొనసాగడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు మెరుగ్గా ఉంటుంది. సానుకూల బ్యాంకింగ్ నిర్వహణా పరిస్థితులకు ఇది దారితీస్తుంది. ► మహమ్మారి కారణంగా అంతరాయం కలిగిన రెండు సంవత్సరాల తర్వాత నాన్–బ్యాంకింగ్ కార్యకలాపాలు తిరిగి ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకున్నాయి. ► కోవిడ్ సమయంలో తీవ్ర ఒత్తిడులను ఎదుర్కొన్న వ్యక్తులు, వ్యాపారాలకు ప్రస్తుతం తిరిగి లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సజావుగా అందుతోంది. పటిష్ట దేశీయ వృద్ధి ధోరణి దీనికి నేపథ్యం. -
ఆ పుష్ఫం ముందు క్రిప్టో కరెన్సీ దిగదుడుపే
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి సమీక్షా విధాన కీలక నిర్ణయాలు దాదాపు మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వెలువడ్డాయి. 2020 ఆగస్టు నుంచి చూస్తే, వరుసగా పదవ ద్వైమాసిక సమావేశంలోనూ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటును యథాతథంగా కనిష్ట స్థాయిల్లో 4 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో యథాతథంగా కొనసాగించాలన్న నిర్ణయానికి ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఓటు చేశారు. ఇక వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) నిర్వహణకు కీలకమైన రివర్స్ రెపో (బ్యాంకులు తమ వద్ద ఉండే అదనపు నిల్వలను ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసి పొందే వడ్డీరేటు– ప్రస్తుతం 3.35 శాతం)ను కూడా యథాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ కమిటీ విధాన నిర్ణయం తీసుకుంది. 2020 ఆగస్టు నుంచి యథాతథమే..: కరోనా సవాళ్లు ఎదుర్కొనడం, వృద్ధి లక్ష్యంగా 2020 మార్చి తర్వాత రెపో రేటును ఆర్బీఐ 115 బేసిస్ పాయింట్లు (1.15 శాతం) తగ్గించింది. 2020 ఆగస్టు నాటికి ఈ రేటు 4 శాతానికి దిగివచ్చింది. ఇక అప్పటి నుంచి (2020 ఆగస్టు ద్వైమాసిక సమావేశం) రెపో రేటును యథాతథంగా కొనసాగించడానికే ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. 2019 ప్రారంభంతో పోల్చితే ఇప్పుడు రెపో రేటు 2.5 శాతం తక్కువగా ఉంది. వడ్డీ రేట్ల పెంపులో సుదీర్ఘ విరామం, నిరంతర సరళతర విధాన వైఖరిని మీడియా సమావేశంలో గవర్నర్ శక్తికాంతదాస్ సమర్థించుకుంటూ, ప్రస్తుత కాలంలో ‘ద్రవ్య– ఆర్థిక విధానాలు ఒకదానికొకటి లేదా ఒకదానితో ఒకటి కలిసి వెళ్లాలి’’ అని వ్యాఖ్యానించారు. రెండు విధానాల్లో ‘అదా–ఇదా’ అనే ప్రశ్నే ప్రస్తుతం తలెత్తబోదని గవర్నర్ అన్నారు. సరళతరానికి ఐదుగురు ఓటు కాగా, పాలసీకి సంబంధించి అనుసరిస్తూ వస్తున్న ‘సరళతర’ వైఖరిని ‘తటస్థం’కు మార్చాలన్న ప్రతిపాదనను ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు వ్యతిరేకించగా, ఒక్కరు మాత్రమే అనుకూలంగా ఓటు చేశారు. పాలసీ నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా అంచనా వేయగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ అంచనావేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్ష్యంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఐదుగురు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వేగవంతమైన వృద్ధి ఇక భారత్ ఎకానమీ వృద్ధి తీరు ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే విభిన్నంగా ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎకానమీ కొనసాగుతుందన్న భరోసాను వ్యక్తం చేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. మహమ్మారి పరిస్థితిపై అస్పష్టత, క్రూడ్‌సహా అంతర్జాతీయ కమోడిటీ ధరల పెరుగుదల వంటి అంశాలు 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 7.8 శాతానికి తగ్గించడానికి కారణం. 2021–22లో ఎకానమీ వృద్ధి 8 నుంచి 8.5 శాతం శ్రేణిలో ఉంటుందని ఎకనమిక్ సర్వే అంచనా. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు సంబంధించి ఈ అంచనా 9 శాతంగా ఉంది. ఈ అంచనాలకన్నా కొంత అధికంగానే ఆర్బీఐ అంచనాలు 9.2 శాతం వద్ద కొనసాగుతుండడం గమనార్హం. మరికొన్ని కీలక నిర్ణయాలు... ► కోవిడ్–19 సంక్షోభం నేపథ్యంలో అత్యవసర ఆరోగ్య సేవల రంగానికి గత ఏడాది మేలో ప్రకటించిన రూ.50,000 కోట్ల ఆన్–ట్యాప్ లిక్విడిటీ రుణ సౌలభ్యతను మరో 3 నెలలు అంటే 2022 జూన్ 30 వరకు పొడిగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ► ప్రస్తుత అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొనడానికి బ్యాంకులు, బ్యాంకింగ్ యేతర ఫైనాన్షియల్ కంపెనీలు మూలధన పెంపు ప్రక్రియపై నిరంతరం దృష్టి సారించాలని సూచించింది. ► దేశానికి వచ్చీ–పోయే విదేశీ మారకపు ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని తెలియజేసే కరెంట్ అకౌంట్– ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2 శాతం (జీడీపీ విలువలో) లోటును నమోదుచేస్తుంది. ► వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో తొలి ద్వైమాసిక పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏప్రిల్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతుంది. రూ. లక్ష వరకు ఈ–రూపీ పరిమితి ఈ–రూపీ (ప్రీ–పెయిడ్ డిజిటల్ ఓచర్) గరిష్ట పరిమితిని రూ. 10,000 నుండి రూ. 1 లక్షకు పెంచుతూ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు లబ్దిదారుడు బ్యాంక్ అకౌంట్, ఇంటర్నెట్ లేకుండా కేవలం ఫీచర్ ఫోన్ ద్వారా కూడా రూ. 1 లక్ష వరకు ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చు. వివిధ ప్రభుత్వ పథకాలను మరింత సమర్ధవంతంగా అందించడానికి వీలుగా మొత్తం పూర్తిగా రీడీమ్ అయ్యే వరకు ఈ–రూపీ వోచర్‌ను లబ్దిదారులకు ఒకటి కంటే ఎక్కువసార్లు ఉపయోగించవచడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాల సమర్థ పంపిణీకి ప్రస్తుతం ఈ–రూపీ కీలకంగా ఉంది. కేవైసీ, కార్డ్, డిజిటల్ చెల్లింపుల యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ వంటి వాటితో సంబంధం లేకుండా వోచర్‌ను రిడీమ్ చేయడంలో లబ్దిదారులకు సహాయపడే వన్–టైమ్ (ఇప్పటివరకూ... ఇకపై పూర్తిగా రీడీమ్ అయ్యే వరకూ) కాంటాక్ట్‌లెస్, నగదు రహిత వోచర్ ఆధారిత చెల్లింపు విధానమే– ఈ–రూపీ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) రూపొందించిన ఈ–రూపీ నగదు రహిత డిజిటల్ ఓచర్‌ను ‘వ్యక్తిగత వినియోగం, సింగిల్ టైమ్ రెడెమ్షన్ సౌలభ్యంతో’ 2021 జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. డిజిటల్ లెండింగ్పై మార్గదర్శకాలు డిజిటల్ రుణ విధానాలపై త్వరలో ఆర్బీఐ మార్గదర్శకాలను జారీచేయనుంది. గత ఏడాది నవంబర్‌లో ఈ విధానంపై ఏర్పాటు చేసిన కమిటీ తన సిఫారసులను ఇప్పటికే సమర్పించినట్లు డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు తెలిపారు. ఇప్పటికే దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించడం జరిగిందని, దీని అధారంగా మార్గదర్శకాలు రూపొందుతున్నాయని తెలిపారు. రిటైల్ పేమెంట్ వ్యవస్థకు కొత్త నేతృత్వ సంస్థ ఖరారుకు ఇంకా సమయం పడుతుందని సూచించారు. క్రిప్టో... తులిప్ కన్నా దిగదుడుపే బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల విషయంలో ఆర్బీఐ కమిటీ తన కఠిన వైఖరిని పునరుద్ఘాటించింది. ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వాలకు ఈ కరెన్సీ ముప్పని స్పష్టం చేసింది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను గవర్నర్ హెచ్చరించారు. అటువంటి అసెట్స్‌కు ఎటువంటి అంతర్లీన విలువా ఉండదని గవర్నర్ అన్నారు. క్రిప్టో కరెన్సీ... తులిప్ పువ్వుకన్నా దిగదుడుపని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన 17వ శతాబ్దంలో వచ్చిన ‘తులిప్ మ్యానియా’ను గుర్తుచేశారు. డిజిటల్ కరెన్సీపై తొందరలేదు.. ఆర్బీఐ 2022–23లో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతుందని ప్రభుత్వం చేసిన ప్రకటనపై గవర్నర్ శక్తికాంతదాస్ ఆచితూచి స్పందించారు. హడావిడిగా దీనిపై ముందుకు వెళ్లాలని సెంట్రల్ బ్యాంక్ కోరుకోవడం లేదని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టే ముందు అన్ని అంశాలనూ ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తుందని తెలిపారు. సీబీడీసీ ఆవిష్కరణకు ఎటువంటి కాలపరమితిని ఆయన ప్రస్తావించలేదు. లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయాలు... ఆచితూచి, లక్ష్యసాధనకు ఉద్దేశించి పరపతి విధాన నిర్ణయాలను ఆర్బీఐ విధాన పరపతి కమిటీ తీసుకుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తగిన స్థాయిలో ఉంటుందన్న అంచనాల ప్రాతిపదికన, వృద్ధే లక్ష్యంగా సరళతర విధానం కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (2022 జనవరి–మార్చి) ద్రవ్యోల్బణం ఆమోదనీయ బ్యాండ్‌లోనే పైకి వెళ్లొచ్చు. అయితే 2022–23 ద్వితీయ ఆరు నెలల కాలంలో 4.5% శ్రేణికి దిగొస్తుందని కమిటీ విశ్వసిస్తోంది. దీనికితోడు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అనిశ్చితి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి సవాళ్లు వంటి అంశాల నేపథ్యంలో విస్తృత ప్రాతిపదికన రికవరీ జరగడానికి ఎకానమీకి పాలసీ మద్దతు అవసరమని కమిటీ భావించింది. సరళతర విధానాన్ని కొనసాగించాలన్న నిర్ణయం వల్ల రివర్స్ రెపోను కూడా యథాతథంగా కొనసాగించాలని కమిటీ అభిప్రాయపడింది. వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయన్న విశ్వాసం ఉంది. ప్రభుత్వ మూలధన వ్యయ ప్రణాళికలు, ఎగుమతులు ఉత్పాదక సామర్థ్యం పెరుగుదల, డిమాండ్ పటిష్టతకు దారితీస్తాయని, ఈ వాతావరణం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయని విశ్వసిస్తున్నాం. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ ఎకానమీకి భరోసా ఇప్పుడిప్పుడే రికవరీ బాట పడుతున్న ఎకానమీ వృద్ధికి పాలసీ నిర్ణయాలు భరోసాను ఇస్తాయి. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ బలోపేతానికి పాలసీ తగిన మద్దతునిచ్చింది. ప్రభుత్వ బాండ్లలో తగిన సమతౌల్యతను కొనసాగించడానికి సంకేతాలను ఇచ్చింది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ అంచనాలకు అనుగుణంగా... పాలసీ నిర్ణయాలు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. వృద్ధిని మరింత పటిష్టం చేయడానికి సెంట్రల్ బ్యాంక్ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఎకానమీలోని పలు రంగాల బలహీనత నేపథ్యంలో ‘సరళతర’ విధానాన్నే కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించడం హర్షణీయం. – అతుల్ కుమార్ గోయెల్, ఐబీఏ చైర్మన్ డిమాండ్‌కు దోహదం సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించాలన్న నిర్ణయం వ్యవస్థలో డిమాండ్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృద్ధి అన్ని రంగాల్లో విస్తృత ప్రాతిపదికన జరగాలని పరిశ్రమ కోరుతోంది. ఈ దిశలోనే ఆర్బీఐ నిర్ణయాలు ఉన్నాయి. ప్రభుత్వంతో సన్నిహిత సహకారంతో వృద్ధి పురోగతికి మరిన్ని చర్యలు ఉంటాయని విశ్వసిస్తున్నాం. – సంజీవ్ మెహతా, ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షణీయం సరళ విధానం కొనసాగించాన్న నిర్ణయం హర్షణీయం. పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించడం రియల్టీకి సానుకూలాంశం. బ్యాంకింగ్‌లో అందుబాటులో ఉన్న అదనపు లిక్విడిటీ అన్ని రంగాలకూ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఇది ఉపాధి కల్పన, ఎకానమీ పురోగతికి దారితీస్తుంది. – హర్షవర్థన్ పటోడియా, క్రెడాయ్ ప్రెసిడెంట్ -
తక్కువ వడ్డీ రేటుతో హోంలోను
న్యూఢిల్లీ: గృహ రుణ రేటును చరిత్రాత్మక కనిష్టం 6.4%కి తగ్గించినట్లు ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 27 నుంచి తగ్గించిన వడ్డీరేటు అమల్లోకి వస్తుంది. కొత్త రుణాల కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు లేదా బ్యాలెన్స్ బదిలీలతో సహా ప్రస్తుత రుణాలను బదిలీ చేయాలనుకునే వారికి కొత్త రేట్లు వర్తిస్తాయని బ్యాంక్ పేర్కొంది. ‘పండుగ సీజన్లో గృహాలను కొనుగోలు చేయడానికి పెరుగుతున్న డిమాండ్‌ను మేము గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఈ ఆఫర్ నుండి ప్రయోజనం పొందుతారు. ఈ తగ్గిన వడ్డీ రేటుతో యూబీఐ గృహ రుణ రేటు పరిశ్రమలో అత్యంత పోటీగా మారింది‘ అని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: బ్యాంకుల్లో బంపర్ ఆఫర్లు, లోన్ల కోసం అప్లయ్ చేస్తున్నారా? -
ఆర్బీఐ వడ్డీరేట్ల ఊరట..!
ముంబై: దేశంలో కరోనా ప్రభావం కనిష్ట స్థాయికి చేరే వరకూ తగిన సరళతర ద్రవ్య, పరపతి విధానాలనే అనుసరిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) భరోసా ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ భారత్ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితిలోకి నెట్టిందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021ఏప్రిల్–2022 మార్చి) వృద్ధి రేటు 9.5 శాతంగానే ఉంటుందని అంచనావేసింది. ఈ విషయంలో గత అంచనా 10.5 శాతానికి ఒకశాతం మేర కోత పెట్టింది. ఈ పరిస్థితుల్లో ఎకానమీ వృద్ధికి సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగించక తప్పదని స్పష్టం చేసింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా ఆరవ ద్వైమాసిక సమావేశంలోనూ యథాతథంగా 4 శాతంగా కొనసాగించాలని గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీనితోపాటు అవసరమైతే మరింత తగ్గించే అవకాశం ఉందనీ సంకేతాలు ఇచ్చింది. మార్చి 2020 తర్వాత 115 బేసిస్ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్బీఐ, కరోనా కష్ట కాలం దేశానికి ప్రారంభమైన తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తూ వస్తోంది. ఇక బ్యాంకులు తమ అదనపు నిధుల డిపాజిట్‌పై ఇచ్చే వడ్డీ–రివర్స్ రెపో రేటును కూడా యథాతథంగా 3.35గా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ జరిగిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం గవర్నర్ శక్తికాంత్‌దాస్ మీడియాతో మాట్లాడారు. సంబంధిత వివరాలు, నిర్ణయాలను క్లుప్లంగా పరిశీలిస్తే.. కట్టడిలో ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడం సరళతర ద్రవ్య విధానం కొనసాగింపునకు దోహదపడుతుందని ఆర్బీఐ విశ్లేషించింది. కేంద్రం నిర్దేశాలకు (2 నుంచి 6 శాతం మధ్య) అనుగుణంగా 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా కొనసాగుతుందని అంచనావేసింది. అయితే ఇది గత అంచనాలకన్నా 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) ఎక్కువ కావడం గమనార్హం. బ్యాంకింగ్‌కు నిధుల భరోసా 2021–22 ఆర్థిక సంవత్సరంలో తీవ్రంగా నష్టపోయిన రంగాలకు రుణ సహాయాన్ని అందించడానికి భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (ఎస్ఐడీబీఐ– సిడ్బీ)సహా ఫైనాన్షియల్ సంస్థలకు తాజా మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా 2022 మార్చి 31 వరకూ రూ.15,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ విండో (ద్రవ్య లభ్యత సౌలభ్యం)ను ప్రకటించింది. ఈ విండో కింద బ్యాంకులు మూడేళ్ల కాలానికి రెపో రేటుకు రుణాలను తీసుకోవచ్చు. తద్వారా హోటల్స్, రెస్టారెంట్లు, పర్యాటకం వంటి కోవిడ్ బాధిత రంగాల పునరుద్ధరణకు బ్యాంకులు రుణ సహాయం అందించవచ్చు. దీనికితోడు లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) చేయూతను ఇవ్వడానికి సిడ్బీకి రూ.16,000 కోట్ల అదనపు నిధిని కేటాయించింది. కరోనా కష్టాల్లో ఉన్న రంగాలకు రుణ సహాయ పరిమితిని రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచింది. రుణ రేట్ల కట్టడికి... బాండ్ల కొనుగోలు సరళ విధానంలో రుణ రేట్లను కట్టడిలో ఉంచడానికి రెండవ త్రైమాసికంలో గవర్నమెంట్ సెక్యూరిటీస్ అక్విజేషన్ కార్యక్రమం (జీ–ఎస్ఏపీ–2.0) కింద అదనంగా రూ.1.2 లక్షల కోట్ల బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఏప్రిల్–మే మధ్య జీ–ఎస్ఏపీ–1.0 కింద రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేస్తామని ఆర్బీఐ ఏప్రిల్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 1 నుంచీ నిరంతరం... ఎన్ఏసీహెచ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్వహిస్తున్న నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) వ్యవస్థ 2021 ఆగస్టు 1వ తేదీ నుంచి నిరంతరం అన్ని రోజులూ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకింగ్ పనిదినాల్లో మాత్రం ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటోంది. చెల్లింపులకు సంబంధించి మధ్యవర్తిత్వ సంస్థగా ఎన్ఏసీహెచ్ నుంచి అత్యాధునిక సేవలు అందుబాటులో ఉంటాయి. డివిడెండ్, వడ్డీ, వేతనం, పెన్షన్ వంటి బదలాయింపులకు అలాగే విద్యుత్, గ్యాస్ టెలిఫోన్, వాటర్ నెలవారీ రుణ వాయిదాలు, మ్యూచువల్ ఫండ్స్, బీమా ప్రీమియం చెల్లింపులకు ఎన్ఏసీహెచ్ వ్యవస్థ కీలక సేవలు అందిస్తోంది. క్రిప్టో కరెన్సీపై ఆందోళనలు ఉన్నాయ్... బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ వైఖరిలో మార్పు లేదు. తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ఇలాంటి ఇన్స్ట్రమెంట్లపై ‘‘తీవ్ర ఆందోళనలు’’ ఉన్నాయి. ఇప్పటికే దీనిపై విడుదల చేసిన ఆర్బీఐ సర్క్యులర్ ఆయా అంశాలకు సంబంధించి పూర్తి స్పష్టతను ఇచ్చింది. 2018లో తొలుత ఇందుకు సంబంధించి జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సవరిత నోటిఫికేషన్‌ను తాజాగా ఆర్థిక సంస్థలకు జారీ చేయడం జరిగింది. అందువల్ల క్రిప్టోకరెన్సీ అంశాల విషయంలో 2018 నాటి సర్క్యులేషన్‌ను ఉదహరించవద్దని తాజా నోటిఫికేషన్లో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, పేమెంట్ వ్యవస్థలకు ఆర్బీఐ సూచిస్తోంది. -
ఆర్బీఐ కీలక సమావేశాలు ప్రారంభం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల కీలక సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఈ సమావేశం విధాన నిర్ణయాలు వెల్లడవుతాయి. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనికిరాని పరిస్థితుల్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) మరింత తగ్గించే అవకాశాలు లేనట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. ‡ ఇక 2020–21 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ రేటు అంచనాలను ఎంపీసీ తగ్గించే అవకాశం ఉంది. అలాగే వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మరింత మెరుగుపడ్డానికి తగిన చర్యలనూ ప్రకటించవచ్చని అంచనా. -
రెండు దఫాలుగా ఈపీఎఫ్ వడ్డీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీని రెండు దఫాలుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనుంది ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ పై ప్రస్తుతానికి కొంత భాగాన్ని..8.5 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాలని నిర్ణయించింది. మిగిలిన దాన్ని డిసెంబరులో చెల్లించనుంది. దీనిపై ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ), డిసెంబరులో మరోసారి సమావేశం కానుంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈపీఎఫ్ ఖాతాల్లోని ఫండ్‌పై 8.15 శాతం వడ్డీని ప్రస్తుతం జమ చేస్తారు. మిగిలిన 0.35 శాతం వడ్డీని ఈ ఏడాది డిసెంబరులో జమ చేయనుంది. ఈక్విటీ పెట్టుబడుల డైల్యూషన్ ద్వారా 0.35 శాతం బకాయి వడ్డీని డిసెంబర్లో చెల్లించేలా బుధవారం జరిగిన ఈపీఎఫ్ఓ ట్రస్టీల సమావేశం నిర్ణయించింది. కోవిడ్-19 అసాధారణమైన పరిస్థితుల దృష్ట్యా, వడ్డీ రేటుకు సంబంధించిన ఎజెండాను కేంద్ర బోర్డు సమీక్షించింది. అలాగే కరోనావైరస్ మహమ్మారి కాలంలో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఇడిఎల్ఐ) పథకం కింద ఉన్న గరిష్ట హామీ ప్రయోజనాన్ని ప్రస్తుతమున్న రూ .6 లక్షల నుండి రూ .7 లక్షలకు పెంచింది. దీంతో ఆరు కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. కాగా లక్ష కోట్ల రూపాయల విలువైన ఈటీఎఫ్ పెట్టుబడులపై నష్టాలు రావడం చందాదారుల చెల్లింపును దెబ్బతీసినట్టు సమాచారం. వార్షిక డిపాజిట్లలో, ఇపిఎఫ్ఓ 85 శాతం రుణ సాధనాలలో, 15 శాతం ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెడుతుంది. మరోవైపు కరోనా సంక్షోభ కాలంలో క్లెయిమ్‌ల సంఖ్యం మొత్తం 13 శాతం పెరిగింది. ఏప్రిల్-ఆగస్టు కాలంలో మొత్తం 35,445 కోట్ల విలువైన 94.41 లక్షల క్లెయిమ్‌లను చెల్లించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 32 శాతం ఎక్కువ. -
ఈపీఎఫ్ వడ్డీపై కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)పై 8.65 శాతం వడ్డీ అందించాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2018–19 కాలానికి 6 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ వడ్డీరేటు 2017–18 కాలానికి 8.55గా ఉండేది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌వో సంస్థ ఇకపై చందాదారుల క్లెయిమ్‌లను 8.65 శాతం వడ్డీతో సెటిల్ చేయనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈపీఎఫ్ రేటును 8.65 శాతానికి పెంచుతూ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ నిర్ణయానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. (చదవండి: పండగ సీజన్‌కు ముందే చెల్లింపు) -
ఈపీఎఫ్ వడ్డీరేటు 8.65 శాతం
న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) చందాదారులందరికీ శుభవార్త. 2018– 19 ఆర్థిక సంవత్సరానికిగాను ఈపీఎఫ్ చందాదారులకు చెల్లించాల్సిన వడ్డీని 8.65 శాతం చొప్పున ఈ పండగ సీజన్‌కు ముందే చెల్లించనున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జాతీయ భద్రతా అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాల్లోని మొత్తాలపై 8.55 శాతం వడ్డీ చెల్లించారు. 2018–19 సంవత్సరానికి ఈ వడ్డీరేటును 8.65 శాతానికి పెంచాలని ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కాగా ఈపీఎఫ్ చందాదారులకు చెల్లించే వడ్డీని 8.65 శాతానికి పెంచనున్నామని గంగ్వార్ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఫెడ్ నిర్ణయం, క్యూ4పై మార్కెట్ దృష్టి
ముంబై: లోక్‌సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఈ క్రమంలో సోమవారం నాలుగో దశ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే మూడు దశలు పూర్తవగా.. నేడు జరిగే పోలింగ్...ఎన్నికల చివరి అంకానికి దగ్గర చేస్తుందనే అంశం మార్కెట్లో కీలకంగా ఉందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. ‘ఫలితాల వెల్లడి తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నాయనే ఉత్కంఠ మార్కెట్లో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మే 23 వరకు ఒడిదుడుకులు కూడా మరింత పెరుగుతాయి’ అని అన్నారయన. కొనసాగుతున్న పోలింగ్, కార్పొరేట్ కంపెనీల తొలిత్రైమాసిక ఫలితాలు ఈవారంలో మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఇకపై వెల్లడికానున్న కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా ఉండి.. ఇదే సమయంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తే మాత్రం సమీపకాలంలోనే మన మార్కెట్లు అవుట్పెర్ఫార్మ్ చేస్తాయి’ అని వ్యాఖ్యానించారు. ఎఫ్ఎంసీజీ దిగ్గజ ఫలితాల వెల్లడి అంబుజా సిమెంట్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, కెన్ ఫిన్ హోమ్స్, టీవీఎస్ మోటార్ కంపెనీలు గత ఆర్థిక సంవత్సర(2018–19) చివరి త్రైమాసిక ఫలితాలను మంగళవారం (30న) ప్రకటించనున్నాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజాలైన బ్రిటానియా (బుధవారం), డాబర్ (గురు), హిందూస్తాన్ యూనిలివర్ (శుక్ర) ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక ఇదేవారంలో రిజల్స్ ప్రకటించనున్న ఇతర ప్రధాన కంపెనీల్లో.. టాటా కెమికల్స్, టాటా పవర్, ఫెడరల్ బ్యాంక్, గోద్రేజ్ ప్రాపర్టీస్, అజంతా ఫార్మా, ఎల్ఐసి హౌసింగ్ ఫైనా¯Œ్స, రేమండ్, బంధన్ బ్యాంక్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. ఈ ఫలితాలు మార్కెట్ ట్రెండ్‌కు అత్యంత కీలకంకానున్నాయని ఎడెల్వీజ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ అన్నారు. ఫెడ్ సమావేశంపై మార్కెట్ ఫోకస్ వడ్డీ రేట్లను సమీక్షించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈవారంలోనే సమావేశంకానుంది. మంగళ, బుధవారాల్లో ఫెడరల్ ఓపె¯Œ మార్కెట్ కమిటీ ఈ అంశంపై చర్చించనుండగా.. ఈ సమావేశానికి సంబంధించిన తుది నిర్ణయాన్ని ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం ప్రకటించనున్నారు. భారీ ఒడిదుడుకుల మధ్య క్రూడాయిల్ గతవారంలో 75 డాలర్లకు సమీపించి మార్కెట్‌కు ప్రతికూలంగా మారిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్.. వారాంతాన దిగొచ్చింది. శుక్రవారం 71.63 డాలర్ల వద్ద ముగిసింది. ఈ అంశం ఆధారంగా డాలరుతో రూపాయి మారకం విలువ 69.50–70.30 శ్రేణిలో ఉండేందుకు అవకాశం ఉందని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ ఫారెక్స్ హెడ్ సజల్ గుప్తా విశ్లేషించారు. ఈ వారంలో ట్రేడింగ్ 3 రోజులే.. ముంబైలో సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ ఉన్న కారణంగా సోమవారం(29న) స్టాక్ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. ఆ తరువాత రోజైన మంగళవారం యథావిధిగా మార్కెట్ కొనసాగనుంది. అయితే, మళ్లీ బుధవారం(1న) మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఈ, ఎ¯Œ ఎస్ఈలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా ఈ వారంలో మార్కెట్లో ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ భారత్ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారీగా పెట్టుబడులు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్ 1–26 కాలంలోనూ రూ.17,219 కోట్లను పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. -
రేటు పావుశాతం పెరగొచ్చు: కేర్ రేటింగ్స్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 6 శాతం) 2018లో పావుశాతం పెంచే అవకాశం ఉందని కేర్ రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణం అధిక శ్రేణికి పెరిగే అవకాశం ఉండటమే దీనికి కారణమని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన నికర వ్యత్యాసమైన ద్రవ్యలోటు పెరుగుతోందని, చమురు ధరల తీవ్రత, వ్యవసాయ వృద్ధి తగ్గడం వంటివి ధరల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2 శాతం ప్లస్, 2 శాతం మైనస్‌తో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం ఉండాలన్నది ఆర్బీఐ లక్ష్యం. అయితే ఈ శ్రేణికి మించి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని కేర్ తన నివేదికలో వెల్లడించింది. -
వడ్డీరేటు తగ్గించిన ఈపీఎఫ్ఓ
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వడ్డీరేటును తగ్గించింది. ఈ ఏడాదికి 8.55 శాతం మాత్రమే వడ్డీరేటును ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. అంటే గతేడాది కంటే ఈ రేటు 10 బేసిస్ పాయింట్లు తక్కువ. గతేడాది ఈ వడ్డీరేటు 8.65 శాతంగా ఉండేది. 2015-16లో ఈ రేటు 8.8 శాతంగా ఉంది. వరుసగా మూడు సార్లు నుంచి ఈపీఎఫ్ఓ ఇలా వడ్డీరేటుకు కోత పెడుతూ వస్తోంది. బుధవారం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ట్రస్టీలతో సమావేశమైన అనంతరం ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ఓలో దాదాపు 5 కోట్ల మంది సబ్స్క్రైబర్లున్నారు. ఈపీఎఫ్ఓ ఈ వడ్డీరేటును నిర్ణయించిన అనంతరం, ఆర్థికమంత్రిత్వ శాఖ దీన్ని ఆమోదిస్తోంది. ఆర్థిక సంవత్సరం చివరిలో సబ్స్క్రైబర్ల అకౌంట్లలో ఏడాది వడ్డీ క్రెడిట్ అవుతుంది. ఆన్లైన్ లేదా యాప్స్ ద్వారా సబ్స్క్రైబర్లు తమ బ్యాలెన్స్‌ను చెక్‌చేసుకోవాల్సి ఉంటుంది. 2015 ఆగస్టు నుంచి ఈటీఎఫ్ఎస్ ద్వారా ఈపీఎఫ్ఓ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. -
బ్యాంక్ డిపాజిట్ కన్నా మెరుగైన రాబడి
సంప్రదాయ ఇన్వెస్టర్ అయితే.. పెట్టుబడుల పరంగా రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకపోతే.. అటువంటి వారు హెచ్డీఎఫ్సీ మీడియం టర్మ్ ఆపర్చునిటీస్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. ఇది ప్రధానంగా 60 నెలల కాల వ్యవధికి మించని డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో, ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఈ పథకం 2010లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఇచ్చిన రాబడులను పరిశీలిస్తే బ్యాంకు డిపాజిట్ల కంటే కాస్త మెరుగైన రాబడులనే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 2017లో ఆర్బీఐ ఒకే ఒక్కసారి వడ్డీ రేట్లను తగ్గించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న దృష్ట్యా అప్పటి నుంచి వేచి చూసే ధోరణిని అనుసరిస్తోంది. మధ్య కాలానికి 4 శాతం పరిధిలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలనుకుంటున్న దృష్ట్యా ఇప్పటికైతే వడ్డీ రేట్లను మరోసారి తగ్గించే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు కేంద్రం ద్రవ్యలోటు విషయంలో లక్ష్యాన్ని చేరుకోవడంపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ ఆటుపోట్లకు పరిమితం చేసే హెచ్డీఎఫ్సీ మీడియం టర్మ్ ఆపర్చునిటీస్ ఫండ్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. మంచి ట్రాక్ రికార్డు రాబడుల పరంగా ఈ ఫండ్‌కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. అన్ని రకాల వడ్డీ రేట్ల సమయాల్లోనూ మంచి పనితీరే ప్రదర్శించింది. బాండ్లకు అత్యంత అనుకూలంగా ఉన్న 2016లో ఏకంగా 10.6 శాతం రిటర్నులు పంచింది. గిల్ట్ ఫండ్లకు ప్రతికూలంగా ఉన్న 2015లోనూ రాబడులు 8.6 శాతానికి తగ్గలేదు. ఇక గిల్ట్ ఫండ్లకు ప్రతికూలంగా ఉన్న గతేడాది (2017లో) చాలా వరకు గిల్ట్ ఫండ్స్ రాబడులు 5–6 శాతానికి పరిమితం కాగా, హెచ్డీఎఫ్సీ మీడియం టర్మ్ ఆపర్చునిటీస్ 6.5 శాతం రాబడులిచ్చింది. ఇప్పటి వరకు రాబడుల పరంగా చూస్తే ఏటా సగటున 8.9 శాతం రాబడినిచ్చింది. మూడేళ్ల కాలంలో చూసుకుంటే 8.3 శాతం, ఐదేళ్ల కాలంలో సగటున 8.7 శాతం వార్షిక ప్రతిఫలాన్నిచ్చింది. ఈ ఫండ్ పెట్టుబడులకు సంబంధించిన వడ్డీ రేట్ల రిస్క్ చాలా పరిమితం. ఎందుకంటే ఏడాదిన్నర నుంచి మూడున్నరేళ్ల కాల వ్యవధి కలిగిన బాండ్లే దీని పోర్ట్ ఫోలియోలో ఎక్కువగా ఉంటాయి. అధిక రేటు కలిగిన (ఏఏఏ) బాండ్లలో, ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీంతో క్రెడిట్ రిస్క్ తగ్గుతుంది. ఈ ఫండ్ మొత్తం నిధుల్లో 76 శాతం ఏఏఏ రేటింగ్ ఉన్న బాండ్లలోనే ఉన్నాయి. 19 శాతం ప్రభుత్వ బాండ్లకు కేటాయించింది. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ కార్పొరేట్ బాండ్లలో ఎక్కువ వాటా కలిగి ఉంది. ఈ ఫండ్ నిర్వహణలో ఉన్న పెట్టుబడుల విలువ సుమారు రూ.13,000 కోట్లు. -
వడ్డీ కాసులవాడే
-
అమెరికా ఫెడ్ వడ్డీరేటు యథాతథం
న్యూయార్క్: అమెరికా సెంట్రల్ బ్యాంక్... ఫెడరల్ రిజర్వ్.. ఫండ్ రేటు యథాతథంగా కొనసాగనుంది. ప్రస్తుతం ఈ రేటు 1–1.25 శాతం శ్రేణిలో ఉంది. మంగళ, బుధవారాల్లో కీలక విధాన సమావేశం నిర్వహించిన ఫెడ్ తాజా నిర్ణయం తీసుకుంది. అమెరికాలో వెలువడుతున్న ఆర్థిక గణాంకాల హెచ్చుతగ్గులు...కీలక వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించడానికి ఒక కారణంగా భావిస్తున్నారు. కఠిన విధానమే... భారత్ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.30కి వెలువడిన ఫెడ్ ప్రకటన ప్రకారం... అక్టోబర్ నుంచి సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ తగ్గింపు ప్రక్రియను మొదలు పెడుతుంది. వ్యవస్థ నుంచి లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) ఉపసంహరణ దీని ఉద్దేశం. ఈ ఏడాది డిసెంబర్లో మరో విడత రేటు పెంపు ఉంటుందని, వచ్చే ఏడాది ఈ పెంపు మూడు దఫాలుగా జరగవచ్చన్న సంకేతాల్ని ఫెడ్ కమిటీలో అధికశాతం సభ్యులు వెలిబుచ్చారు. ఆయా అంశాల నేపథ్యంలో అమెరికాలో ద్రవ్యోల్బణం సమీపకాలంలో 2శాతం లోపే ఉండవచ్చని ఫెడ్ అంచనావేసింది. 2017లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 2.4 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఇంతక్రితం ఈ రేటు అంచనా 2.2 శాతం. వచ్చే ఏడాది 2.1 శాతంగా అంచనావేసింది. అమెరికా ఆర్థిక వృద్ధి లక్ష్యంగా 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో 0–0.25 శాతం శ్రేణికి తగ్గినడ్డీరేటును ఏడాది నుంచీ ఫెడ్ క్రమంగా పెంచుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. -
ఆ వడ్డీరేట్లకు ఐసీఐసీఐ బ్యాంకు కోత
ముంబై : ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు కూడా వడ్డీరేట్లకు కోత పెట్టింది. సేవింగ్ అకౌంట్ డిపాజిట్లపై అందించే వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు వరకు తగ్గించింది. దీంతో రూ.50 లక్షలు కన్నా తక్కువున్న డిపాజిట్లపై వడ్డీరేట్లు 3.5 శాతానికి దిగొచ్చాయి. రూ.50 లక్షలు , ఆపై ఉన్న డిపాజిట్లకు వడ్డీరేట్లను యథాతథంగా 4 శాతంగానే ఉంచినట్టు బ్యాంకు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సమీక్షించిన ఈ వడ్డీరేట్లు నేటి నుంచి అంటే ఆగస్టు 19 నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. తొలుత జూలై 31న ప్రభుత్వం రంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై అందిస్తున్న వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించి, 3.5 శాతానికి తీసుకొచ్చింది. ఇక అప్పటి నుంచి వరుస బెట్టి బ్యాంకులన్నీ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీలను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకు ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంకు, యస్ బ్యాంకు, కర్నాటక బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించాయి. గత రెండు రోజుల కిందట హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా వడ్డీరేట్లకు కోత పెట్టింది. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు కూడా వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. -
పొదుపు వడ్డీ రేటు తగ్గించిన యస్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ‘యస్ బ్యాంక్’ తాజాగా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ (పొదుపు ఖాతాలు) పై వడ్డీ రేటును 1 శాతం వరకు తగ్గించింది. దీంతో రూ.లక్ష లోపు డిపాజిట్లపై వడ్డీ రేటు 5 శాతానికి దిగివచ్చింది. ఇక బ్యాంక్ రూ.లక్షకు పైన, రూ.కోటి లోపు ఉన్న డిపాజిట్లకు ఎప్పటిలాగే 6 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. రూ.కోటి పైన ఉన్న డిపాజిట్ల విషయానికి వస్తే వడ్డీ రేటును 6.5% నుంచి 6.25%కి తగ్గించింది. సవరించిన కొత్త వడ్డీ రేట్లు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది. కాగా ఇప్పటికే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్ తదితర బ్యాంకులు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గించడం తెలిసిందే. -
సేవింగ్స్‌పై వడ్డీ అరశాతం కోత: యాక్సిస్
ముంబై: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తాజాగా పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును అరశాతం తగ్గించింది. సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్లు రూ. 50 లక్షల కన్నా తక్కువుంటే ఇకపై 3.5 శాతం వడ్డీ రేటు మాత్రమే చెల్లించనుంది. రూ. 50 లక్షలు పైబడిన మొత్తం ఉంటే మాత్రం యథాప్రకారం 4 శాతంగానే కొనసాగించనున్నట్లు బ్యాంకు వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. రూ. 1 కోటి కన్నా తక్కువగా డిపాజిట్లున్న పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును తగ్గించిన తర్వాత, బ్యాంక్ ఆఫ్ బరోడా, కర్ణాటక బ్యాంకులు కూడా సేవింగ్స్ అకౌంట్లపై రేటును తగ్గించాయి. -
పొదుపులకు చేటుకాలం
దేశంలోని అతి పెద్ద బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హఠాత్తుగా సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటులో 50 బేసిస్ పాయింట్ల కోత వేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కోటి రూపాయలకంటే తక్కువ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేటును 4 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించింది. 42 కోట్ల ఖాతాదార్ల పునాదిగల అతి పెద్ద బ్యాంకైన ఎస్బీఐని ఇతర వాణిజ్య బ్యాంకులు దిక్సూచిగా పరిగణించడం పరిపాటి. కాబట్టి పలు ఇతర వాణిజ్య బ్యాంకులు కూడా ఇదే బాట పట్టవచ్చని భావిస్తున్నారు. ఎస్బీఐ ఖాతాదార్లలో కోటికి పైగా ఉన్న సేవింగ్స్ డిపాజిటర్లు ఎక్కువగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, దినసరి కూలీలు వంటి చిన్న పొదుపరులే. వారందరికీ ఇది మింగుడు పడని చేదు వార్తే. ఈ ఖాతాల్లోని రూ. 9 లక్షల కోట్ల డిపాజిట్ల వల్ల ఎస్బీఐ నికర వడ్డీ లబ్ధి (ఎన్ఐఎమ్) గణనీయంగా పెరుగుతుంది. పెద్ద నోట్ల రద్దు వల్ల భారీ ఎత్తున డిపాజిట్లు పెరిగాయి కాబట్టి, ద్రవ్యోల్బణం తగ్గి, నిజ వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసు కున్నామని ఎస్బీఐ తన చర్యను సమర్థించుకుంది. 2011లో సేవింగ్స్ ఖాతాల వడ్డీ రేటుపై నియంత్రణను ఎత్తివేసినప్పటి నుంచి సూత్ర రీత్యా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు ఆ స్వేచ్ఛ లభించిన మాట నిజమే. కానీ, వాణిజ్య బ్యాంకుల మధ్య పోటీ వల్ల చిన్న పొదుపుదార్లకు ఎక్కువ వడ్డీ రేట్లు లభించే అవకాశాన్ని కల్పిం చాలనే ఆ స్వేచ్ఛను కల్పించించారు. ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల నిజ వడ్డీ రేట్లు పెరి గితే అది చిన్న పొదుపరులకు మేలు చేయాలనే లక్ష్యానికి తోడ్పడేదే తప్ప, అవాం ఛనీయమైనది కాదు. కానీ ఎస్బీఐ నిర్ణయం, నియంత్రణ ఎత్తివేత అసలు లక్ష్యానికే విరుద్ధమైనది, చిన్న పొదుపరుల ప్రయోజనాలను దెబ్బతీసేది. అది దీర్ఘ కాలంలో మొత్తం పొదుపును తగ్గించి ఆర్థిక వ్యవస్థపైన, పొదుపులను బ్యాంకింగ్ రంగానికి దూరంగా మరల్చి బ్యాంకులపైన ప్రతికూల ప్రభావాన్ని నెరపుతుంది. సేవింగ్స్ వడ్డీ రేటు తగ్గింపు వల్ల ఆ ఖాతాల్లో నిరుపయోగంగా ఉన్న నిధులను ఖాతాదార్లు మ్యూచ్యువల్ ఫండ్స్వంటి లాభదాయక ద్రవ్య సాధనాల రూపంలోకి మళ్లిస్తారని, అది వారికి, ఆర్థిక వృద్ధికి మేలు చేస్తుందని మరో సమర్థన కూడా వినవస్తోంది. విద్యావంతులలో సైతం ద్రవ్య మార్కెట్ అక్షరాస్యత అంతంత మాత్రంగా ఉన్న మన దేశంలో, ఈ చిన్న పొదుçపుల క్యాపిటలైజేషన్ పగటి కలే. నష్టభయంలేని జాతీయ పొదుపు పత్రాలు, కిసాన్ వికాస్ పత్ర, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఫిక్సెడ్ డిపాజిట్ల వంటి ప్రత్యామ్నాయాలపై వడ్డీ రేట్లను ఇప్పటికే తగ్గించారు. కాబట్టి చిన్న మదుపరులు ఈ కోతకు తలూపడం తప్ప గత్యంతరం ఉండకపోవచ్చు. పైగా ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఊహించిన దానికన్నా తక్కువగా ఉన్నా, 2018 నాటికి 4 శాతం పైకి చేరుతుందని ఆర్బీఐ స్వయంగా చెబుతోంది. కాగా, ద్రవోల్బణం తిరిగి రెక్కలు చాచక తప్పదని కొందరు ఆర్థిక నిపుణులు చేస్తున్న హెచ్చరికనూ తోసి పారేయలేం. అదే జరిగితే 3.5 శాతం వడ్డీ సైతం మటు మాయమై పోతుంది. అల్ప వడ్డీ రేట్లు ఆర్థిక వృద్ధికి సోపానాలనేదే యూపీఏ నుంచి నేటి ఎన్డీఏ వరకు ఆర్థిక మంత్రులందరి మాట. ఆగస్టు 2న ఆర్బీఐ, రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. మరింత వడ్డీ కోతను ఆశిస్తూ ఆర్థిక మంత్రి జైట్లీ తాజాగా ‘ద్రవ్యోల్బణం చాలా కాలంగా అదుపులో ఉంది. ఇప్పట్లో చమురు ధరలు తిరిగి ఆకాశాన్ని చేరే అవకాశం లేదు. కాబట్టి ఏ ఆర్థిక మంత్రి అయినా వడ్డీ రేట్లు కోతను ఆశిస్తాడు’ అన్నారు. వడ్డీ రేట్లను నియంత్రించే ద్రవ్య విధాన కమిటీ (ఎమ్ఎన్సీ) సోమవారం సమావేశంలో ఆ కోత తప్పిపోయిందిగానీ, అక్టోబర్‌లో తప్పదని వినవస్తోంది. అందువల్లనే వడ్డీ రేట్లు మరింత తగ్గే అకాశం ఉన్నదనే సహేతుకమైన ఆందోళన చిన్న మదుపర్లను బెంబేలెత్తిస్తోంది. తక్కువ వడ్డీరేట్లు పొదుపరులు, పెన్షనర్లపై అదనపు పన్ను విధింపులా పనిచేసి, వారి అదాయాలకు కత్తెర వేస్తాయి. మరోలా చెప్పాలంటే పెద్ద వయస్కుల ఆదాయాలను తగ్గించడం ద్వారా సాపేక్షికంగా యువ పౌరులకు తక్కువ వడ్డీలకు రుణాలను అందజేస్తాయి. అయినా, వస్తు వినియోగం, డిమాండు పెరిగి ఉత్పత్తికి, వృద్ధికి ప్రోత్సాహం లభి స్తుందని మన విధానకర్తల సిద్ధాంతం. రెండు చేదు వాస్తవాలు దీన్ని ఆచరణకు కొరగానిదని తేల్చాయి. నేటి ప్రపంచ మాంద్య పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావం ఉత్పాదక మదుపులను గణనీయంగా పెంచడానికి బదులు నిల్వ ఉన్న సరుకుల గుట్టలను వదిలించుకోడానికే చాలా వరకు పరిమితం అవుతోంది. రెండవది, కొత్త మదుపులు ఉద్యోగాలు లేని వృద్ధికి మాత్రమే దోహ దం చేస్తున్నది. అయినా తక్కువ వడ్డీ రేట్ల సిద్ధాంతాన్నే నమ్ముకుని ఆర్బీఐ 2015 నుంచి ఇంతవరకు మొత్తం 175 శాతం బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును తగ్గిం చింది. ఈ తగ్గింపు గణనీయమైనదే. కానీ పారిశ్రామిక వృద్ధి చెప్పుకోదగినంతగా పుంజుకోకపోగా, జీడీపీలో వస్తుతయారీ రంగం వాటా 16 శాతం వద్ద ఈడిగిలపడి ఉంది. కార్పొరేట్ బ్యాంకు రుణాల్లో పెరుగుదల ఆశించినంతగా లేదంటే.. అందుకు కారణం వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం కాదు, వస్తు డిమాండు తక్కువగా ఉండటమే. ఉపాధి కల్పన, కొనుగోలు శక్తి పెంపుదల వంటి దీర్ఘకాలిక పరిష్కా రాలు తప్ప, వడ్డీ రేట్ల చిట్కా పనిచేయదని... 2008 ఆర్థిక మాంద్యం తదుపరి కాలపు అమెరికా తదితర అభివృద్ధిచెందిన దేశాల అనుభవం రుజువు చేసింది. అల్ప వడ్డీ రేట్లతో చిన్న పొదుపరులను, పెన్షనర్లను ఆర్థిక వృద్ధి కోసం త్యాగాలు చేయమనడం సమంజసమే అనుకున్నా, ఈ సిద్ధాంతం ఆచరణలో బెడిసి కొట్టక తప్పదు. అల్ప వడ్డీ రేట్లు పెట్టుబడి మదుపులపై చూపే ప్రభావం సంగతి ఎలా ఉన్నా, తక్కువ వడ్డీకి రుణాలిచ్చి, రుణ ఆధారిత వినియోగంతో స్తోమతకు మించిన జీవనశైలిని అనుభవించేలా చేస్తాయి. దీంతో నేటి యువత రుణ భారంతో కుంగడానికి ఎంతో కాలం పట్టదు. ఎలాగో నెట్టుకు వచ్చినా, వయోభారంతో పాటూ రుణ భారాన్ని మోస్తూ వృద్ధాప్యంలోకి ప్రవేశించాల్సి వస్తుంది. ఎలాంటి సామాజిక సంక్షేమ రక్షణ లేని మన దేశంలో ఇది ఎలాంటి దుస్థితో చెప్పనవసరం లేదు. అయినా వడ్డీ రేట్ల తగ్గింపు మంత్రం పఠిస్తూనే ఉందామా? -
ఎఫ్డీ...ఎక్కడ చేద్దాం!
♦ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అధిక రేటు ♦ ఒకటి నుంచి రెండు శాతం వరకు ఎక్కువ ♦ దీర్ఘకాలంలో రాబడుల్లో తేడా బాగానే ఉంటుంది సంప్రదాయ ఇన్వెస్టర్లకు రిస్క్ అంటే ఏ మాత్రం సహించదు. ఎంతసేపటికీ భద్రతకే వారి పెద్దపీట. అదే సమయంలో భద్రతతో కూడిన మెరుగైన రాబడుల కోసం చూస్తుంటారు. ఈ తరహా ఇన్వెస్టర్లు సాధారణ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయటానికి బదులు... స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల పేరుతో ఇటీవల కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బ్యాంకుల్ని పరిశీలించొచ్చు. ఇవి కొంచెం ఎక్కువ వడ్డీ రేటునే ఆఫర్ చేస్తున్నాయి.ప్రస్తుతం ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)లపై వడ్డీ రేటు ఏడాది మించితే 7 శాతాన్ని దాటడం లేదు. మూడేళ్లు దాటిన కాల వ్యవధిగల డిపాజిట్లపై 7 శాతం కూడా ఆఫర్ చేయడం లేదు. కానీ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేటు కాస్త ఎక్కువే ఉంది. ఇవి 9 శాతం వరకు వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నాయి. కొత్తగా వచ్చిన బ్యాంకులు కావడంతో ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు కొంచెం అదనంగా వడ్డీని అందిస్తున్నాయి. అయినప్పటికీ ఇవి రిజర్వ్ బ్యాంకు అడుగుజాడల్లోనే నడవాల్సి ఉంటుంది. కాబట్టి భద్రత విషయంలో అంత భయమేమీ అక్కర్లేదు. రిస్క్ తీసుకోకుండా... బ్యాంకుల్లోనే ఉంచుకోవాలని ఆశించే వారికి ఇవి తగినవే. ఉదాహరణకు రూ.లక్షను పదేళ్ల కాలానికి డిపాజిట్ చేద్దామనుకుంటే... 9 శాతం వడ్డీ రేటుపై ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత అది రూ.2.45 లక్షలు అవుతుంది. అంటే రూ.1.45 లక్షల మేర వృద్ధి చెందుతుంది. అదే రూ.లక్షను తీసుకెళ్లి 6.9 శాతం వడ్డీ రేటుకు ఏ ప్రభుత్వ బ్యాంకో లేదా ప్రైవేటు బ్యాంకులోనో ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పుడు పదేళ్ల తర్వాత ఆ మొత్తం రూ.2 లక్షలు అవుతుంది. వడ్డీ రేటు అధికంగా ఉండటం వల్ల స్మాల్ బ్యాంకులో ఎఫ్డీ ద్వారా రూ.45 వేలను అధికంగా పొందే అవకాశం ఇక్కడ ఉంది. గమనించాల్సిన అంశాలివీ... ఎఫ్డీ చేసే ముందు ఎంత కాలానికి చేస్తున్నారు? ఏ కాలానికి, ఎంత వడ్డీ రేటు అమల్లో ఉంది? అనే విషయాలను వివరంగా అడిగి తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా సెక్షన్ 80సీ కింద ఆదాయ పన్ను ప్రయోజనం పొందేందుకు ఇన్వెస్ట్ చేస్తుంటే ఐదేళ్లకు తక్కువ కాకుండా ఉండాలి. ఐదేళ్ల లోపు డిపాజిట్లకు ఈ పన్ను మినహాయింపు లేదు. ఇక ఎఫ్డీలపై వడ్డీ ఆదాయం ఒక ఏడాదిలో రూ.10వేలు మించితే టీడీఎస్ విధిస్తారన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఉపసంహరణ సమయంలో వచ్చే ఆదాయం మీ మొత్తం ఆదాయంలో కలుస్తుంది. పన్ను పరిధిలో ఉంటే ఆ రేటు ప్రకారం టీడీఎస్ విధిస్తారు. పన్ను పడే ఆదాయం లేకుంటే 60 ఏళ్లలోపు వారు ఫామ్ 15జీ, ఆపైన వయసున్న వారు ఫామ్ 15హెచ్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో చేసే చిన్న డిపాజిట్లకు హామీ ఉంటుంది. అంటే రూ.లక్ష వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద బ్యాంకులు చెల్లించడంలో చేతులు ఎత్తేసినా ఆ మేరకు ఖాతాదారులకు డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. ఒకవేళ బ్యాంకుల్లో కాకుండా కంపెనీల ఎఫ్డీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే ఆయా కంపెనీల గత కాలపు పనితీరు, గుర్తింపును పరిశీలించాల్సి ఉంటుంది. -
దక్షిణ కొరియా కేంద్ర బ్యాంకు సంచలన నిర్ణయం
సియోల్: దక్షిణ కొరియా సెంట్రల్ బ్యాంక్ తన బెంచ్‌మార్క్ వడ్డీరేట్లను రికార్డ్ స్థాయిల వద్ద నిలిపింది. మార్కెట్ అంచనాలకు అనుగుణంగా బ్యాంక్ ఆఫ్ కొరియా తన వడ్డీ రేట్లను భారీగా స్తంభింపచేసింది. వరుసగా 13 నెలలో కూడా పాత వడ్డీ రేట్లనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుత వడ్డీరేట్లు రికార్డు కనిష్టాన్ని నమోదు చేశాయి. బీవోకే గవర్నర్ లీ జు-యూయోల్, మిగిలిన ఆరు ద్రవ్య విధాన బోర్డు సభ్యులు 1.25 శాతంగా (ఏడురోజులు రీపర్చేజ్) నిర్ణయించారు. గత ఏడాది జూన్ నాటి స్థాయికి ప్రస్తుత వడ్డీ రేట్లను బ్యాంక్ తగ్గించిందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. కొరియా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అసోసియేషన్, 200మంది స్థిర-ఆదాయ నిపుణుల సర్వే ప్రకారం రేటు ఫ్రీజ్ ఉంటుందని 98 శాతం మంది అంచనా వేశారు. అటు బీవోకే రేటు పెంపు ఆవశకత్యపై ఇటీవల సంకేతాలిచ్చింది. అయితే అమెరికా గత నెలలో ఫెడరల్ రిజర్వ్ బెంచ్ మార్క్ రేటును 1.00-1.25 శాతం పెంచడంతో బీవోకేపై ఒత్తిడి పెరిగినట్టు అంచనా. ఫెడ్ దాని పాలసీ రేట్లను మరింత పెంచితే దక్షిణ కొరియా ఆర్థిక మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు బహుశా బయటికి వెళ్లిపోతాయని, దీంతో ప్రపంచ వాణిజ్యంపై ఎక్కువగా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ అని ఎనలిస్టులు భావిస్తున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఊహాత్మక పెట్టుబడులను నియంత్రించే లక్ష్యంతో తనఖా రుణాలపై ప్రెసిడెంట్ మూన్ జాయె ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. -
పొదుపు మొత్తాలపై తగ్గిన వడ్డీ
జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి 0.1 శాతం కోత న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్రాలు, సుకన్య సమృద్ధి తదితర చిన్న మొత్తాల పొదుపు పథకాలపై జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి గాను వడ్డీ రేట్లను కేంద్రం 0.1 శాతం మేర తగ్గించింది. అయితే, సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటును యథాతథంగా వార్షికంగా 4 శాతం స్థాయిలోనే ఉంచింది. తాజా పరిణామంతో బ్యాంకులు సైతం డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం మూడు నెలలకోసారి సవరిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం... ఇకపై పీపీఎఫ్ పథకంలో ఇన్వెస్ట్ చేసే మొత్తాలపై వార్షిక ప్రాతిపదికన 7.8 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ♦ కిసాన్ వికాస్ పత్రాలపై 7.5 శాతం వడ్డీ రేటు, మెచ్యూరిటీ గడువు 115 నెలలుగా ఉంటుంది. ♦ బాలికల భవిష్యత్‌కు ఉపయోగపడే సుకన్య సమృద్ధి అకౌంట్ స్కీముపై ఇప్పటిదాకా 8.4 శాతం వడ్డీ రేటు లభిస్తుండగా ఇకపై 8.3 శాతం మాత్రమే లభించనుంది. ♦ 5 ఏళ్ల సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీముపైనా 8.3 శాతం మాత్రమే దక్కుతుంది. -
రుణాలపై వడ్డీ భారం తగ్గించుకున్న ఆర్ఐఎల్
♦ 2016–17లో రూ.1,14,742 కోట్ల పెట్టుబడులు ♦ కార్పొరేట్ చరిత్రలోనే ఇది రికార్డు ♦ వాటాదారులకు వివరించిన ముకేశ్ న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 2.3 బిలియన్ డాలర్ల (రూ.15,000 కోట్లు) రుణాలను తక్కువ వడ్డీ రేటుకు రీఫైనాన్స్ చేసుకుంది. దీనివల్ల వడ్డీ రూపేణా గణనీయంగా ఆదా అవుతుందని వాటాదారులకు కంపెనీ తెలిపింది. కంపెనీ స్థూల రుణ భారం మార్చి నాటికి రూ.1,96,601 కోట్లు కాగా, ఇందులో అధిక భాగం జియో కార్యకలాపాల కోసం తీసుకున్నది కావడం గమనార్హం. ‘‘1.75 బిలియన్ డాలర్ల దీర్ఘకాలిక సిండికేటెడ్ రుణం, 550 మిలియన్ డాలర్ల మేర క్లబ్లోన్ రెండూ కలిపి 2.3 బిలయన్ డాలర్ల మేర రుణాలను రీఫైనాన్స్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల మిగిలి ఉన్న కాలంలో వడ్డీ రూపేణా గణనీయంగా ఆదా అవుతుంది’’ అని 2016 – 17 వార్షిక నివేదికలో వాటాదారులకు కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ వివరించారు. అయితే, వడ్డీ రూపంలో ఎంత ఆదా అవుతుందన్న అంచనాలను వెల్లడించలేదు. ఇక గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.1,14,742 కోట్లను పెట్టుబడులుగా పెట్టామని, దేశ చరిత్రలో ఓ కార్పొరేట్ కంపెనీ ఒకే ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ఇదేనని పేర్కొన్నారు. మూలధన విస్తరణ అన్నది పెట్టుబడుల రేటింగ్‌ను కొనసాగించేందుకేనని వివరించింది. భారత సార్వభౌమ రేటింగ్ కంటే రెండు స్థాయిలు ఎక్కువలోనే కంపెనీ రేటింగ్ ఉందని, ఎస్అండ్పీ సంస్థ ఆర్ఐఎల్కు అంతర్జాతీయ రుణ రేటింగ్ బీబీబీప్లస్ ఇచ్చినట్టు తెలిపింది. మూలధన పెట్టుబడుల వల్ల కంపెనీకి నగదు ప్రవాహాలు మెరుగవుతాయని, రానున్న సంవత్సరాల్లో ఆదాయాల్లో అస్థిరతలు తగ్గుతాయని తెలిపింది. హైడ్రోకార్బన్ వ్యాపారంపై మూలధన వ్యయాలు పూర్తయినందున నగదు ప్రవాహాలు మెరుగుపడతాయని పేర్కొంది. పెట్రోల్ బంక్‌ల విస్తరణ ఇంధన రిటైల్ విస్తరణపై దృష్టి పెట్టినట్టు ఆర్ఐఎల్ తన వాటాదారులకు వివరించింది. కంపెనీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,221 పెట్రోల్ పంపులు ఉండగా, 2017–18 సంవత్సరంలో వీటిని విస్తరించనున్నట్టు తెలిపింది. -
75 లక్షల గృహ రుణంపై వడ్డీ తగ్గింపు
ఎస్బీఐ నిర్ణయం 15 నుంచీ అమలు ముంబై: భారీ గృహ రుణాలపై వడ్డీరేటును బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్వల్పంగా 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో మహిళలకు సంబంధించి ఈ రుణ రేటు 8.55 శాతంగా ఉంటుంది. ఇతరులకు 8.60 శాతంగా అమలవుతుంది. బుధవారంనాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాండెర్ట్ లిక్విడిటీ రేషియో (తమ డిపాజిట్లలో బ్యాంకులు ప్రభుత్వ బాండ్లలో ఉంచాల్సిన మొత్తం)ను అరశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 20 శాతానికి చేరింది. ఇది బ్యాంకుల వద్ద మరిన్ని నిధులు సమకూరే అంశం కాగా, గృహ రుణాలపై ప్రొవిజినింగ్ను సైతం తగ్గించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ శుక్రవారం తాజా నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం జూన్ 15వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో ఎస్బీఐ తెలిపింది. రిస్క్ వెయిటేజ్‌ని ఆర్బీఐ తగ్గించడం తమ నిర్ణయానికి కారణమని ప్రకటనలో ఎండీ (నేషనల్ బ్యాంకింగ్) రజ్నీష్ కుమార్ తెలిపారు. రూ.75 లక్షల పైబడిన గృహ రుణంపై రిస్క్ వెయిటేజ్‌పై ఆర్బీఐ 75 శాతం నుంచి 50 శాతానికి తగ్గించింది. ఇప్పటికి తాజా మూలధనం అక్కర్లేదు ♦ ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య... ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం నుంచి తాను ఏమాత్రం తాజా మూలధనం కోరుకోవడం లేదని శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ మార్గంలో ఇటీవలే ఎస్బీఐ రూ. 15,000 కోట్లు సమీకరించింది. ‘‘మా ప్రణాళికల ప్రకారం ఈ ఏడాది ప్రభుత్వ నిధులు అక్కర్లేదు. అవసరమైతే వచ్చే ఏడాది ప్రభుత్వ నిధులను కోరతాం. బాసెల్ 3 (మూలధన అవసరాలకు సంబంధించి అంతర్జాతీయ నిబంధనలు) నిబంధనలకు అనుగుణంగా సైతం ప్రస్తు తం బ్యాంక్ మూలధనాన్ని కలిగిఉంది’’ అని ఆమె అన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ విభాగాన్ని లిస్టింగ్ చేసే అంశంపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దృష్టి పెడుతున్నామని తెలిపారు. ఎంసీఎల్ఆర్ తగ్గించిన ఓబీసీ 20 బేసిస్ పాయింట్లు తగ్గింపు ∙12 వతేదీ నుంచీ అమలు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.20 శాతం తగ్గించింది. బ్యాంక్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం ♦ ఈ రేటు జూన్ 12వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుంది. ♦ ఓవర్‌నైట్ రేటు 15 బేసిస్ పాయింట్లు తగ్గి 8.10%కి చేరింది. ♦ నెల రేటు 10 బేసిస్ పాయింట్లు తగ్గి 8.20 శాతానికి దిగింది. ♦ మూడు, ఆరు నెలల రేటు 20 బేసిస్ పాయింట్లు తగ్గి వరుసగా 8.25 శాతం, 8.35 శాతానికి దిగివచ్చింది. ♦ ఇక ఏడాది కాలానికి రేటు 10 బేసిస్ పాయింట్లు తగ్గి 8.50కి చేరింది. ♦ తనకు తాజాగా లభ్యమవుతున్న నిధుల వ్యయాల ప్రాతిపదికన, దాదాపు నెలకొకసారి ఎంసీఎల్ఆర్పై సమీక్ష ఉంటుంది. గత బేస్‌రేటు స్థానంలో ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. రెపో రేటు ప్రయోజనాన్ని తక్షణం కస్టమర్లకు అందించాలన్నది ఇక్కడ ప్రధాన లక్ష్యం. ఐఓబీ కూడా... మరో ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తన బేస్ రేటును ప్రస్తుత 9.50 శాతం నుంచి 9.45 శాతానికి తగ్గించింది. జూలై 1 నుంచీ తాజా రేటు అమలవుతుందని తెలిపింది. -
గతవారం బిజినెస్
గృహ రుణాలపై వడ్డీ రేట్లు కట్ అందుబాటు ధరల్లోని గృహాలను ప్రోత్సహించే దిశగా.. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు.. రూ. 30 లక్షల దాకా హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటును 0.3 శాతం దాకా తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. మహిళలకు వడ్డీ రేటు 8.35 శాతంగా (ఇప్పటిదాకా ఇది 8.50%) ఉంటుందని, ఇతరులకు 8.40 శాతంగా ఉంటుందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. ఇక ఉద్యోగినులకు వడ్డీ రేటు 8.35 శాతంగాను, ఇతరులకు 8.40 శాతంగాను ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. ఎస్బీఐ ఇటీవలే అందుబాటు ధరల్లోని గృహ రుణాలపై వడ్డీ రేటను 25 బేసిస్ పాయింట్ల దాకా తగ్గించింది. కొత్తగా రుణం తీసుకునే మహిళలకు 8.35 శాతం వడ్డీ రేటే వర్తింపచేస్తోంది. యాక్సిస్ బ్యాంక్ కూడా గృహ రుణ రేటును 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఎగుమతుల జోరు.. లోటు బేజారు భారత్ ఎగుమతులు ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో శుభారంభం చేశాయి. 2016 ఏప్రిల్‌తో పోలిస్తే, 2017 ఏప్రిల్‌లో 20 శాతం వృద్ధిని నమోదుచేసుకున్నాయి. ఎగుమతుల విలువ 24.63 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు విలువ కూడా భారీగా 50 శాతం పెరిగి విలువ రూపంలో 37.88 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో వాణిజ్యలోటు 13.24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. పేటీఎంకు రూ.9,079 కోట్ల నిధులు ప్రముఖ డిజిటల్ చెల్లింపులు, ఈ–కామర్స్ సంస్థ ‘పేటీఎం’.. పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాల ఆరంభంతో దేశీయ మార్కెట్లో తన దూకుడును మరింత పెంచనుంది. ఈ సంస్థ జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకు నుంచి తాజాగా 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.9,079 కోట్లు) సమీకరించింది. ఫేస్‌బుక్‌తో బీఎస్ఎన్ఎల్ జట్టు ప్రభుత్వ రంగ సంస్థ ‘బీఎస్ఎన్ఎల్’ తాజాగా ఫేస్బుక్, మొబిక్విక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫేస్‌బుక్‌తో కుదుర్చుకున్న ఎంవోయూలో భాగంగా బీఎస్ఎన్ఎల్.. ఫేస్బుక్ ఎక్స్‌ప్రెస్ వైఫై ప్రోగ్రామ్‌కు కనెక్టివిటీ సాయం అందించనుంది. మొబిక్విక్ ఒప్పందంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ మొబైల్ వాలెట్ ఏర్పాటుకు సంబంధించి డిజిటల్ పేమెంట్స్ సంస్థ మొబిక్విక్‌తో కలిసి పనిచేయనుంది. అలాగే బీఎస్ఎన్ఎల్.. డిస్నీ ల్యాండ్ ఇండియాతో మూడో ఒప్పందాన్ని కుదర్చుకుంది. ‘గ్లోబల్ గేమ్ చేంజర్’.. అంబానీ ఫోర్బ్స్ తాజా ‘గ్లోబల్ గేమ్ చేంజర్స్’ జాబితాలో ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ స్థానం దక్కించుకున్నారు. ఫోర్బ్స్.. 25 మంది వ్యాపార దిగ్గజాలతో ఈ జాబితాను రూపొందించింది. ఇందులో స్థానం పొందిన వారందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది జీవితాల్లో మార్పుకు కారణంగా నిలిచారని ఫోర్బ్స్ పేర్కొంది. భారతీయులకు ఇంటర్నెట్ను తక్కువ ధరల్లో అందుబాటులోకి తీసుకురావడానికి అంబానీ తీసుకున్న నిర్ణయాలు, ఎదుర్కొన్న సవాళ్లు వంటి వాటిని పరిగణనలోకి తీసుకోని ఆయనకు జాబితాలో స్థానం కల్పించామని వివరించింది. కాగా ఫోర్బ్స్ 100 మంది అత్యుత్తమ వెంచర్ క్యాపిటలిస్టుల్లో భారతీయ అమెరికన్లు 11 మంది చోటు సంపాదించుకున్నారు. డెరివేటివ్స్ ట్రేడింగ్‌లోకి నాల్కో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఈక్విటీ డెరివేటివ్స్ ప్లాట్‌ఫామ్‌పై ఐదు కంపెనీలకు సంబంధించి ఫ్యూచర్, ఆప్షన్లను ప్రవేశపెట్టనున్నట్టు Ððల్లడించాయి. వీటిలో ఆర్బీఎల్ బ్యాంకు, నాల్కో, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, కజారియా సిరామిక్స్, రామ్‌కో సిమెంట్స్ ఉన్నాయి. ఈ నెల 26 నుంచి ఈ కంపెనీల్లో ఫ్యూచర్, ఆప్షన్ కాంట్రాక్టులు అందుబాటులో ఉంటాయి. ఈ ఐదు కంపెనీల్లో ఫ్యూచర్, ఆప్షన్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్టు ఎన్ఎస్ఈ ప్రకటించిన మరుసటి రోజే బీఎస్ఈ కూడా అదే నిర్ణయం తీసుకుంది. దేశీ మొబైల్ కంపెనీలకు విదేశీ షాక్ చైనా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీలు దేశీ బ్రాండ్స్‌కు గట్టి పోటీనివ్వడమే కాదు.. ఏకంగా వాటిని కనుమరుగు చేసేలా కనిపిస్తున్నాయి. చైనా బ్రాండ్స్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో (2017, జనవరి–మార్చి) ఇండియన్ మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్లో 49 శాతం వాటాను దక్కించుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే వీటి ఆదాయంలో 180 శాతం వృద్ధి నమోదయ్యింది. విక్రయాల పరంగా శాంసంగ్, ఐటెల్, షావోమి కంపెనీల మార్కెట్ వాటా వరుసగా 27 శాతం, 9 శాతం, 6 శాతంగా ఉంది. ఇక స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో చైనా కంపెనీలు ఇప్పటికే దేశీ బ్రాండ్స్‌కు టాప్–5లో చోటులేకుండా చేశాయి. రూ.20 లక్షల కోట్లకు ఫండ్స్ ఆస్తులు మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) ఆస్తులు రోజురోజుకూ కొత్త శిఖరాలను చేరుతున్నాయి. జూన్ నాటికి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.20 లక్షల కోట్లను దాటనుంది. త్వరలో మేకిన్ ఇండియా ఐఫోన్లు .. భారత్‌లోనే తయారయ్యే ఐఫోన్లు మనకు త్వరలోనే అందుబాటులోకి రానున్నవి. అమెరికా టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ’యాపిల్’ తాజాగా బెంగళూరులో ’ఐఫోన్ ఎస్ఈ’ హ్యాండ్సెట్ల తయారీని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ నెలలోనే ఈ ఫోన్లను దేశీ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ పేర్కొంది. సిల్క్ రోడ్డుపై చైనా భారీ పెట్టుబడులు చైనాను ఆసియా, యూరోప్, ఆఫ్రికా దేశాలతో అనుసంధానం చేసే సిల్క్‌రోడ్డు ప్రాజెక్టుపై 124 బిలియన్ డాలర్ల (రూ. 8 లక్షల కోట్లు) పెట్టుబడులు పెడతామని ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు. సిల్క్ రోడ్డు, బెల్ట్‌ను శతాబ్దపు ప్రాజెక్టుగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మేలు చేకూర్చేదిగా ఆయన అభివర్ణించారు. సహకారం కోసం ఓ ఉమ్మడి వేదికను నిర్మిస్తామని, స్వేచ్ఛాయుత అభివృద్ది చెందే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఆర్థిక సహకారాన్ని విస్తృతం చేసేందుకు గాను 40 బిలియన్ అమెరికన్ డాలర్ల సిల్క్ రోడ్డు ఫండ్‌కు చైనా అదనంగా 100 బిలియన్ యువాన్లను సమకూరుస్తుందని జిన్‌పింగ్ చెప్పారు. ఎయిర్టెల్–టికోనాలపై జియో విమర్శ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ ప్రతిపాదిత టికోనా కొనుగోలు డీల్‌తో ప్రభుత్వ ఖజానాకు రూ. 217 కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లుతుందని రిలయన్స్ జియో పేర్కొంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అయిన టికోనాకి చెందిన స్పెక్ట్రమ్‌ను ఎయిర్టెల్ వాయిస్ కాల్స్‌కి ఉపయోగించుకుంటే ఖజానాకు నష్టం తప్పదని, దీన్ని నివారించాలని టెలికం విభాగం (డాట్)కు రాసిన మూడు పేజీల లేఖలో ఆరోపించింది. -
రిస్క్ వద్దా..? పీపీఎఫ్ బెటర్!
ప్రస్తుత వడ్డీ రేటు 7.9 శాతం ♦ పన్ను ఉండదు కనక ఇది మంచి రాబడే ♦ మిగతా పథకాల్లో దేని లోటుపాట్లు దానికున్నాయ్ ♦ సుకన్య సమృద్ధి... ఆడపిల్లలున్న వారికి మాత్రమే ♦ బ్యాంకు ఎఫ్డీలలో వడ్డీ రేటు చాలా తక్కువ ♦ డెట్, మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో రాబడికి గ్యారంటీ లేదు ♦ చాలా వాటికి పన్ను కోత కూడా ఉంటుంది ♦ ప్రస్తుత పెట్టుబడి పథకాలపై నిపుణుల సూచనలివీ... ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్) వడ్డీ రేటు క్రమంగా తగ్గిపోతోంది. తాజా త్రైమాసికానికి గాను 7.9 శాతం వడ్డీ రేటును కేంద్రం ఖరారు చేసింది. ఈ పథకంలో గడిచిన 40 ఏళ్ల కాలంలోనే అత్యంత తక్కువ వడ్డీ రేటు ఇది. భవిష్యత్తులో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు మరికొంత తగ్గే అవకాశాలున్నాయన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయ్. ఈ నేపథ్యంలో చాలామంది పీపీఎఫ్ వద్దనుకుని, ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేస్తున్నారు కూడా? కొందరైతే పీపీఎఫ్‌లో పెట్టుబడుల నుంచి వైదొలగాలని భావిస్తున్నారు. కాకపోతే నిపుణులు మాత్రం వడ్డీ రేటు తగ్గినా ఇతర సంప్రదాయ డిపాజిట్ పథకాలతో పోలిస్తే ఇప్పటికీ పీపీఎఫ్ ఆకర్షణీయమేనంటున్నారు. అదెలాగో చూద్దాం. పీపీఎఫ్‌లో ఉన్న ప్రధాన ఆకర్షణీయత దానిపై పెట్టే పెట్టుబడులకు, దానిద్వారా వచ్చే రాబడులకూ ఆదాయపన్ను మినహాయింపు ఉండడం. ఒకవైపు పన్ను మినహాయింపులు, మరోవైపు చెప్పుకోతగ్గ వడ్డీ రేటును అందించే సంపద్రాయ హామీతో కూడిన పథకాలు పీపీఎఫ్ తప్ప మరొకటి లేదు. పైగా ద్రవ్యోల్బణం రేటు 3.65 శాతం మినహాయించి చూసుకున్నా పీపీఎఫ్‌పై వచ్చే రాబడి రేటు 4.25 శాతంగా ఉంది. హామీతో కూడిన రాబడి, పన్ను మినహాయింపులు, ద్రవ్యోల్బణ తరుగుదల అన్నీ పోను ఈ మాత్రం రాబడులు అన్నవి చక్కనివేనన్నది నిపుణుల మాట. బాండ్లను చూసుకుంటే పదేళ్ల బాండ్ల రాబడి బెంచ్ మార్క్ ప్రకారం ప్రస్తుతం 6.8 శాతంగా ఉంది. కానీ, పీపీఎఫ్‌పై రాబడి 7.9 శాతం. కనుక రిస్క్ వద్దనుకునేవారికి దీర్ఘకాలంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది చక్కని సాధనమన్నది నిపుణుల సూచన. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా రిస్కు లేకుండా కచ్చితమైన రాబడులు వస్తాయి. కానీ వడ్డీ రేటు మాత్రం 6.5–7.5 శాతంగానే ఉంది. పైగా ఈ వడ్డీ రా>బడిపై ఆదాయపన్ను పడుతుంది. ఉదాహరణకు 30 శాతం పన్ను చెల్లించే వారికి పన్ను పోను మిగిలే రాబడి 4.55–5.25 శాతంగానే ఉంటుంది. ద్రవ్యోల్బణ ప్రభావంతో ముడిపెట్టి చూస్తే మిగిలేది ఏముంది గనక!!. ఇక ప్రభుత్వ రంగ కంపెనీలు జారీ చేసే పన్ను రహిత బాండ్లు కూడా పీపీఎఫ్తో పోటీ పడలేవు. ఎందుకంటే వీటిపై రాబడులు 6.25 శాతంగానే ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన ఈ పథకంలో వడ్డీ రేటు 2017–18 సంవత్సరానికి 8.4 శాతంగా ఉంది. కుమార్తె కలిగిన వారు వారి పేరిట పెట్టుబడులకు ఉద్దేశించిన పథకం ఇది. కాకపోతే దీన్లో పదేళ్ల వయసులోపు కుమార్తెలు ఉన్నవారు మాత్రమే పెట్టుబడి పెట్టగలరు. అలాంటి వారు తమ పిల్లలకోసం దీర్ఘకాలిక నిధి సమకూర్చుకోవాలనుకుంటే ఇది అనువైనదే. ప్రస్తుత రేటు ప్రకారం పీపీఎఫ్‌కు మించి రాబడులను ఇచ్చే పథకమిది. పైగా పీపీఎఫ్ మాదిరిగానే ఈ పథకంలో కూడా రాబడులకు పన్ను వర్తించదు. కాకపోతే ఇందులో పెట్టుబడులను ప్రారంబిస్తే కుమార్తెకు 18 ఏళ్లు వచ్చే వరకు వాటిని వెనక్కి తీసుకునేందుకు వీలుండదు. పైగా ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పథకం పరిధిలో ఉన్న వేతన జీవులకు అందుబాటులో ఉన్న పథకం ఇది. ఉద్యోగుల మూల వేతనం నుంచి నిర్ణీత శాతం నెలనెలా ఈపీఎఫ్‌కు జమ చేయడం జరుగుతుంది. దీనికి అదనంగా స్వచ్ఛందంగా పెట్టుబడులు పెట్టుకునేందుకు వీపీఎఫ్ వీలు కల్పిస్తుంది. దీనిపైనా ఈపీఎఫ్‌కు అమలవుతున్న 8.65 శాతం వడ్డీ రేటే వర్తిస్తుంది. కనుక పీపీఎఫ్ కంటే ఇదే ప్రయోజనం. వేతన జీవులు నిస్సందేహంగా పీపీఎఫ్ కంటే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పీపీఎఫ్ వడ్డీ రేటు ఇకముందూ తగ్గుతుందని, ఉద్యోగులకిచ్చే ఈపీఎఫ్ రేటు ఆ స్థాయిలో తగ్గే అవకా>శం లేదన్నది నిపుణుల అభిప్రాయం. కాకపోతే ఈపీఎఫ్ లేదా వీపీఎఫ్ నిధుల్లో 10 శాతం మేర స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నందున మార్కెట్లు పతనం చెందితే రాబడులు తగ్గే అవకాశం లేకపోలేదు. షార్ట్‌టర్మ్ డెట్ ఫండ్స్ గత ఏడాదిగా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌లో రాబడులు సగటున 8.8%గా ఉన్నాయి. కాకపోతే రాబడులపై 20% పన్ను రేటు అమలవుతుంది. ఆ ప్రకారం చూసుకుంటే రాబడి పీపీఎఫ్ కంటే తక్కువేనని అర్థమవుతోంది. మూడేళ్ల పాటు పెట్టుబడులు కొనసాగిస్తే రాబడిలో ద్రవ్యోల్బణ ప్రభావం మినహాయించుకునేందుకు అవకాశం ఉంది. అంటే ఆ మేరకు పన్ను పోటు తగ్గుతుంది. వార్షికంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. వీటిలో రాబడులకు పీపీఎఫ్ మాదిరిగా హామీ ఉండదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఈ ఫండ్స్ ఈక్విటీలు, డెరివేటివ్‌లలో పెట్టుబడులు పెడతాయి. గత ఏడాది కాలంలో సగటు రాబడులు 7.7%గా ఉన్నాయి. ఏడాది పాటు పెట్టుబడులను కొనసాగిస్తే రాబడిపై పన్ను ఉండ దు. ఏడాదికి మించి పెట్టుబడులు కొనసాగించే వారికి ఇది అనువైన సాధనంగానే కనిపిస్తోంది. కానీ, రాబడుల్లో హెచ్చు, తగ్గులు ఉండొచ్చు. మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ (ఎంఐపీ) ఫండ్స్ నిర్వహించే ప్లాన్లు ఇవి. కొంచెం రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లకు ఇవి చక్కని రాబడులను ఇస్తాయి. గత మూడేళ్ల సగటు రాబడులు 11%పైనే ఉన్నాయి. ఈ పథకం కింద మొత్తం నిధుల్లో 15 నుంచి 20 % నిధులను ఈక్విటీల్లో, మిగిలిన నిధులను డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈక్విటీల్లో పెట్టుబడులు అంటే ఆటుపోట్లు ఉంటాయి. కనుక ఎంఐపీ వార్షిక రాబడులు గత 15 ఏళ్ల కాలంలో 10% నుంచి 20% మధ్య ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు ఆశించేవారు, స్వల్ప రిస్క్ భరించే వారు వీటిలో పెట్టుబడుల ద్వారా మంచి రాబడులను అందుకోవచ్చన్నది నిపుణుల మాట. కాకపోతే ఈ రాబడులకు ఎటువంటి హామీ ఉండదనేది గుర్తుంచుకోవాలి. -
బ్యాంకులకు వడ్డీరేట్లు తగ్గించే వీలుంది..
ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అభిప్రాయం ముంబై: మరింతగా వడ్డీరేట్లు తగ్గించే అవకాశం బ్యాంకులకు ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. ఏప్రిల్ 6న ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)ని ఉద్దేశించి ఆయన ఈ అంశాన్ని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం)ను యథాతథంగా కొనసాగిస్తూ, నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2015 జనవరి నుంచీ ఆర్బీఐ రెపో రేటును 1.75 శాతం తగ్గిస్తే– బ్యాంకులు మాత్రం కస్టమర్లకు ఈ ప్రయోజనంలో 0.85 నుంచి 90 బేసిస్ పాయింట్లను మాత్రమే బదలాయించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 6 మినిట్స్ సమావేశాలను ఆర్బీఐ గురువారం విడుదల చేసింది. ద్రవ్యోల్బణం పరమైన అడ్డంకులు వ్యవస్థలో ఉన్నాయని పటేల్ ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమస్యపై కొంత జాగరూకత అవసరమన్నారు. దిగువ స్థాయి వడ్డీరేట్ల వ్యవస్థ వృద్ధికి ఊతం ఇచ్చినా– ద్రవ్యోల్బణం సమస్యలను కొనితెచ్చే వీలుందని పటేల్ అన్నారు. అయితే రెండింటిమధ్యా సమతౌల్యత సాధించడంపై ఆర్బీఐ దృష్టి సారిస్తుందని అన్నారు. పీసీఏ పరిధిలోకి సగం ప్రభుత్వ బ్యాంకులు: ఫిచ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా సమీక్షించిన ‘సత్వర దిద్దుబాటు చర్యల’ (పీసీఏ) మార్గదర్శకాల పరిధిలోకి దాదాపు సగానికిపైగా ప్రభుత్వ రంగ బ్యాంకులు వస్తాయని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఫిచ్ గురువారం విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది. మొండిబకాయిల సమస్య తీవ్రంగా ఉన్న బ్యాంకులకు సంబంధించి పీసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్బీఐ కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణల నేపథ్యంలో ఫిచ్ ఈ అంశాలను ప్రస్తావించింది. అయితే ఈ చర్యల ద్వారా సమస్య పరిష్కారం కీలకమనీ, దీని ఆధారంగానే చర్యలు ఉంటాయని ఫిచ్ పేర్కొంది. కఠిన చర్యలకు అవకాశం! గతంలో ఫ్రేమ్‌వర్క్ ప్రకారం– పీసీఏ పరిధిలోకి వచ్చే బ్యాంకుకు కేవలం రుణాలు ఇవ్వవద్దన్న సూచనలను మాత్రమే ఆర్బీఐ చేయగలిగేది. అయితే ఇప్పుడు తాజా నిర్ణయాల ప్రకారం, చర్యల పరిధి మరింత విస్తృతమైంది. ఎటువంటి చర్యలను ఆర్బీఐ తీసుకుంటుదన్నదే ఇప్పుడు కీలకమని ఫిచ్ వ్యాఖ్యానించింది. -
ఈపీఎఫ్‌పై 8.65 వడ్డీకి ఆర్థిక శాఖ ఆమోదం
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)పై 8.65 శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ విషయంలో తదుపరి చర్యలు చేపట్టేందుకు కార్మిక శాఖకు అనుమతినిచ్చింది. 2016-17కు గాను ఈ మేరకు వడ్డీని ఖరారు చేసిందని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారిక చర్చలు ముగిసినట్టు త్వరలోనే ఒక ప్రకటన వెలువడుతుందని చెప్పారు. దాదాపు నాలుగుకోట్లమందికి ప్రయోజనం చేకూరనున్నట్టు మంత్రి తెలిపారు. కాగా 8.65 శాతం చొప్పున వడ్డీ ఇచ్చేందుకు ఈపీఎఫ్ సంస్థ ట్రస్టీలు డిసెంబరులోనే ప్రతిపాదించారు. కేంద్ర ఆర్థిక శాఖ ఆ రేటు ఎక్కువగా ఉందన్న అభిప్రాయంతో ఇప్పటిదాకా నిర్ణయంఅమలును పెండింగ్ లోపెట్టిన సంగతి తెలిసిందే. -
గృహ రుణాన్ని మార్చేద్దాం!
► ఐదేళ్ల కిందట తీసుకున్న రుణాలపై అధిక వడ్డీ రేటు ► ప్రస్తుతం ఎంసీఎల్ఆర్తో దిగొచ్చిన రేట్లు ► 8.5 శాతానికే ఆఫర్ చేస్తున్న పలు బ్యాంకులు ► పాత రుణాలను కొత్త విధానానికి మార్చుకునే అవకాశం ► వడ్డీ ఒకశాతం తగ్గినా మొత్తంగా మిగిలేది ఎక్కువే మీరు ఇంటి కోసం రుణం తీసుకుని ఈఎంఐలు చెల్లిస్తూ వస్తున్నారా? ఎప్పుడో తీసుకున్న రుణం కాబట్టి అప్పటి వడ్డీ రేట్ల ప్రకారం నెలసరి వాయిదాలు తీర్చడం కష్టంగా అనిపిస్తోందా? అయితే, రుణంపై వడ్డీ రేటును మార్చుకుంటే సరిపోతుంది! బ్యాంకులు గతంలో ఉన్న బేస్ రేట్ విధానం నుంచి నూతన మార్జినల్ కాస్ట్ బేస్డ్ రుణ రేటుకు (ఎంసీఎల్ఆర్) మారడంతో రుణాలపై రేట్లు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎల్ఆర్కు మారడం ద్వారా మీరు కూడా తాత్కాలికంగా భారాన్ని దింపుకోవచ్చు. వడ్డీ రేటు ఎంత...? గృహరుణాన్ని తీసుకుని నెలసరి వాయిదాలు తీర్చడంలో ఇబ్బందులు పడుతున్నవారు ముందు చేయాల్సింది ఒకటుంది. బ్యాంకు ఎంత వడ్డీరేటు వసూలు చేస్తోందో ఓ సారి కనుక్కోవాలి. ఎందుకంటే బ్యాంకులు ఇటీవల బేస్ రేటు నుంచి ఎంసీఎల్ఆర్కు మళ్లాయి. మరి ఆ ప్రయోజనం కస్టమర్‌గా మీకు దక్కుతోందో, లేదో ముందు చూసుకోవాలి. కొన్ని బ్యాంకులు ఖాతాదారులందరికీ ఒకటే రేటును అమలు చేయడం లేదు. కొత్త కస్టమర్లకు తక్కువ రేటుకే రుణాలిస్తూ పాత కస్టమర్లను మాత్రం చార్జీల పేరుతో బాదేస్తున్నాయి. అందుకే మీ బంధుమిత్రుల్లో ఎవరైనా గృహ రుణం లేదా ఆటో లోన్, లేదా వ్యక్తిగత రుణాన్ని తీసుకుని ఉంటే వారి నుంచి బ్యాంకు ఎంత వడ్డీ రేటు వసూలు చేస్తోందో కనుక్కోండి. సాధారణంగా బ్యాంకుల మధ్య వడ్డీ రేట్ల విషయంలో స్వల్ప తేడాలుండడం సహజమే. కానీ ఒకే బ్యాంకులో ఖాతాదారుల మధ్య కూడా ఈ వ్యత్యాసాలుంటాయని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఈ తేడా తక్కువ ఉండొచ్చు. ఎక్కువగానూ ఉండొచ్చు. ఇది కస్టమర్ల రుణ చెల్లింపుల చరిత్ర (క్రెడిట్ హిస్టరీ/క్రెడిట్ స్కోరు) వల్ల అనుకుంటే పొరబడినట్టే. కొన్ని బ్యాంకులు కొత్త వారిని ఆకర్షించటానికి వారికి తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. పాతవారిపై భారం మోపుతున్నాయి. బ్యాంకులు పాత ఖాతాదారులు, కొత్త ఖాతాదాల విషయంలో భిన్న రకాల వడ్డీ రేట్లతో వివక్ష చూపిస్తున్నాయని ఫిన్‌టెక్ స్టార్టప్ ‘ఫిస్డమ్’ సహ వ్యవస్థాపకుడు రామ్‌గణేష్ అయ్యంగార్ పేర్కొన్నారు. పీఎల్ఆర్ టు ఎంసీఎల్ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2016 ఏప్రిల్‌లో ఎంసీఎల్ఆర్ను ప్రవేశపెట్టింది. బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల విషయంలో అనుసరించాల్సిన ప్రామాణిక విధానం ఇది. అప్పటి వరకు బేస్ రేట్ విధానం అమల్లో ఉండేది. బేస్ రేటు విధానంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ ఆ ప్రయోజనాన్ని బ్యాంకులు ఖాతాదారులకు బదిలీ చేయకుండా వేచి చూసే ధోరణి అనుసరించటంతో ఆర్బీఐ ఎంసీఎల్ఆర్ను తీసుకొచ్చింది. బ్యాంకులు నిధుల సేకరణకు అయ్యే వ్యయాలను పరిగణనలోకి తీసుకుని రుణ రేటును ఖరారు చేసుకుంటాయి. బేస్ రేటు కంటే ముందు తక్కువ పారదర్శకతతో కూడిన ప్రైమ్ లెండింగ్ రేటు (పీఎల్ఆర్) అమల్లో ఉండేది. రుణ బదిలీకి చార్జీలుంటాయ్ రుణాల్లో ఫిక్స్డ్, ఫ్లోటింగ్ అని రెండు రకాల వడ్డీ రేట్లుంటాయి. ఆర్బీఐ ప్రకటించే రేట్ల ఆధారంగా బ్యాంకుల ఎంసీఎల్ఆర్ మారుతుంది. దానికనుగుణంగా ఎప్పటికప్పుడు వడ్డీ రేటు మారే రుణాలు ఫ్లోటింగ్. కొన్నేళ్ల పాటు అలా మారకుండా స్థిరంగా ఒకే రేటుతో ఉండేవి ఫిక్స్డ్ రేటు రుణాలు. అయితే ప్రస్తుత రుణాలను ఎంసీఎల్ఆర్ కిందకు మార్చుకుందామని నిర్ణయించుకుంటే అందుకు బ్యాంకులు కొంత చార్జీలు వసూలు చేయొచ్చు. డ్రాఫ్ట్ తయారీ, నూతన ఒప్పందం రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ తదితర చార్జీలను బ్యాంకులు భరించాల్సి వస్తుంది. దీంతో అవి ఖాతాదారుల నుంచి వసూలు చేస్తాయి. మిగిలి ఉన్న రుణం మొత్తంపై ఈ చార్జీలు 0.20 శాతానికి మించి ఉండవు. కానీ బ్యాంకులు 0.5 శాతం వసూలు చేస్తుంటాయి. ఈఎంఐ ఎంత తగ్గుతుంది...? 0.50 శాతం చార్జీని బ్యాంకు విధించినా ఎంసీఎల్ఆర్కు మారడం లాభదాయకమేనని నిపుణుల సూచన. ఎందుకంటే స్వల్పంగా చార్జీలు చెల్లించినా అధిక వడ్డీ రేటు దిగి రావడం వల్ల మిగిలే ప్రయోజనం ఎక్కువే ఉంటుందని చెబుతున్నారు. ఉదాహరణకు ప్రైవేటు కంపెనీ ఉద్యోగి అయిన శ్రావ్య (40) బేస్ రేటు కింద గృహ రుణం తీసుకున్నారు. ఆమె ఇంకా రూ.50 లక్షల బకాయి చెల్లించాల్సి ఉంది. వ్యవధి 15 ఏళ్లు. రుణ రేటులో ఒక శాతం తగ్గినా ఆమె నెలసరి వాయిదా (ఈఎంఐ) రూ.52,200 నుంచి రూ.49,250కు దిగొస్తుంది. అంటే రూ.2,950 తగ్గుదల. ఇలా మారడం వల్ల మొత్తం మీద మిగిలేది రూ.5 లక్షలకు పైనే. కానీ, మారేందుకు చెల్లించాల్సిన చార్జీలు 0.50 శాతం కింద రూ.25వేలే. బ్యాంకు సిబ్బందితో మంచి సంబంధాలుంటే ఈ చార్జీలను కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఐదేళ్ల క్రితం తీసుకుంటే భారమే! ఐదేళ్ల క్రితం గృహ రుణం తీసుకుని ఉంటే ఆయా కస్టమర్లు పీఎల్ఆర్ రేటు విధానంలో వడ్డీ చెల్లిస్తున్నట్టే. ఆ తర్వాత బేస్ రేటు విధానం అమల్లోకి వచ్చింది. వీటితో పోలిస్తే ఇప్పుడు బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కింద 8.5% వడ్డీ రేటుకు గృహ రుణాలను ఆఫర్ చేస్తుండడం ఆకర్షణీయం. ఇప్పటికే గృహ రుణాలు తీసుకుని ఉన్న వారు కూడా ఈ ప్రయోజనాన్ని అందుకోవడం ద్వారా వడ్డీ భారాన్ని కొంత మేర తగ్గించుకోవచ్చు. ‘‘ముందు మార్కెట్లో తక్కువ రుణ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయన్నది తెలుసుకోవాలి. దీనివల్ల తాము రుణం తీసుకున్న బ్యాంకును వడ్డీ రేటు విషయమై బేరమాడేందుకు కావాల్సిన అవగాహన వస్తుంది’’ అని ఐసర్వ్ ఫైనాన్షియల్ సీఈవో దీపక్ సమంత వ్యాఖ్యానించారు. మార్కెట్‌కు అనుగుణంగా వడ్డీ రేట్లను తగ్గించుకోవాలనుకుంటే పీఎల్ఆర్ లేదా బేస్ రేటులో ఉన్న వారు ఎంసీఎల్ఆర్కు మారడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్బీఐ వడ్డీ రేట్ల విషయంలో తటస్థ విధానానికి మళ్లిన నేపథ్యంలో ప్రస్తుతానికి వడ్డీ రేట్లు పెరిగే అవకాశం లేదని, కొంత తగ్గే అవకాశం కూడా లేకపోలేదన్నది వారి విశ్లేషణ. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఎంసీఎల్ఆర్ విధానమనేది బ్యాంకులు ఎప్పటికప్పుడు ఆర్బీఐ విధానానికి అనుగుణంగా తమ ప్రామాణిక రేట్లను మార్చుకునేందుకు ఉద్దేశించినది. కనుక ఈ విధానంలో వడ్డీ రేట్లు ఎంత వేగంగా అయితే తగ్గాయో.... ఆర్బీఐ రెపో, సీఆర్ఆర్లను పెంచడం మొదలు పెడితే... అంతే వేగంగా పెరుగుతాయి. -
చిన్న డిపాజిట్లపై అధిక రాబడులు
చిన్న మొత్తాల డిపాజిట్‌దారులను ఆకర్షించే దిశగా.. సుమారు రూ. 25,000 ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా దాదాపు 8 శాతం పైగా వడ్డీ అందించనున్నట్లు బజాజ్ ఫైనాన్స్ తెలిపింది. ఈ స్కీము ప్రకారం 12–13 నెలల వ్యవధికి వార్షికంగా 7.8 శాతం మేర, 24–35 నెలల కాలావధికి 8 శాతం, 36–60 నెలల కాలానికి చేసే డిపాజిట్లపై 8.05 శాతం రాబడులు అందించనున్నట్లు వివరించింది. రూ. 1 కోటి దాకా డిపాజిట్ చేసే సీనియర్ సిటిజన్స్‌కు అదనంగా మరో పావు శాతం వడ్డీ రేటు వర్తింపచేయనున్నట్లు పేర్కొంది. ఇప్పటిదాకా ఈ స్థాయి రాబడులు అందుకోవడానికి ఎన్సీఆర్, గ్రేటర్ ముంబై ప్రాం తంలో కనీస డిపాజిట్ విలువ రూ. 75,000గాను, మిగతా ప్రాంతాల్లో రూ. 50,000గాను ఉంది. దీనితో డిపాజిటర్ల సంఖ్య 60 శాతం పెరగగలదని, ఫిక్స్డ్ డిపాజిట్ల పరిమాణం రెట్టింపై రూ. 8,500 కోట్లకు చేరగలదని సంస్థ భావిస్తోంది. -
చిన్న మొత్తాల పొదుపునకు చిల్లు
⇒ 0.1% మేర వడ్డీ రేటు తగ్గింపు ⇒ పీపీఎఫ్, కిసాన్ వికాస్పత్ర తదితర స్కీమ్‌లపై ప్రభావం ⇒ ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి వర్తింపు న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లలో ప్రభుత్వం కోత పెట్టింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి పథకం మొదలైన స్కీములపై వడ్డీ రేట్లను 0.1 శాతం తగ్గించింది. జనవరి–మార్చి వ్యవధితో పోలిస్తే ఏప్రిల్–జూన్ మధ్య కాలానికి ఈ రేట్లు వర్తిస్తాయని పేర్కొంది. అయితే సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటు మాత్రం వార్షికంగా 4 శాతం మేర యథాతథంగా కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. గతేడాది ఏప్రిల్ నుంచి చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను మూడు నెలలకోసారి సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామంతో బ్యాంకులు కూడా తమ డిపాజిట్ రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. -
పీపీఎఫ్... మార్చుకోవటం ఈజీనే!
ఒక బ్యాంకు శాఖ నుంచి మరో శాఖకు మార్చుకోవచ్చు పోస్టాఫీసు నుంచి కూడా బ్యాంకుకు మార్చుకునే వీలు ఎక్కడి నుంచైనా క్లోజ్ చేసుకునే అవకాశం కొన్ని లాంఛనాలు పూర్తిచేస్తే చాలు ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్) ఎంతో మందికి చక్కని ఇన్వెస్ట్మెంట్ సాధనం. పన్ను పోటు నుంచి తప్పించటమే కాకుండా మెరుగైన రాబడులు కూడా ఇస్తుంది. అందుకే వడ్డీ రేటు గతం కంటే తగ్గినా దీనిపట్ల ఉన్న ఆకర్షణ మాత్రం తగ్గటం లేదు. పీపీఎఫ్ ఖాతా ప్రారంభించడం సులువే. కానీ, ప్రారంభించిన తరవాత కావాల్సినపుడు నగదు వెనక్కి తీసుకునే విషయంలో చాలా మందికి పలు రకాల సందేహాలు వస్తుంటాయి. పైగా పోస్టాఫీసులో ఈ ఖాతాను ఆరంభించి ఉంటే... దాన్ని బ్యాంకుకు బదిలీ చేసుకోవచ్చు కూడా. ఇందుకు సంబంధించి ఏమేం చేయాలనేది వివరించేదే ఈ కథనం... పీపీఎఫ్ ఖాతాను ఏదైనా ప్రభుత్వరంగ బ్యాంకులో ప్రారంభించామనుకోండి. ఆ తరవాత వేరే ప్రాంతానికి మారిపోతే నగదు ఉపసంహరణకు తిరిగి ఖాతా ప్రారంభించిన దగ్గరకే వెళ్లాలా? ఖాతా క్లోజ్ చేయాలంటే ఎలా? ఇలాంటి సందర్భం ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుంది. కానీ, ఉన్న ప్రాంతం నుంచి ఖాతా తెరిచిన ప్రాంతం దూరంలో ఉంటే అక్కడి వరకూ వెళ్లిరావడం ప్రయాసతో కూడుకున్నదే. దీనికి బదులు ఖాతా క్లోజ్ చేసేసి ప్రస్తుతం ఉంటున్న చోట తెరిస్తే పోదూ..! అన్న ఆలోచన కూడా రావచ్చు. కానీ, బ్యాంకులో పీపీఎఫ్ ఖాతా తెరిస్తే నిజానికి ఇటువంటి ఇబ్బందులేవీ పడనక్కర్లేదు. ఖాతా ఎక్కడ ప్రారంభించామన్న దానితో సంబంధం లేకుండా ఏ పట్టణంలో ఉంటున్నా అక్కడి నుంచే ఖాతాను క్లోజ్ చేసుకోవచ్చు. లేదా నగదు ఉపసంహరించుకోవచ్చు. కాకపోతే ఇది కేవలం ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రారంభించిన పీపీఎఫ్ ఖాతాలకే సాధ్యం. పోస్టాఫీసులో ఇలాంటి సదుపాయం లేదు. ఒకవేళ పోస్టాఫీసులో పీపీఎఫ్ ఖాతా ప్రారంభించి ఉంటే దాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుకు బదిలీ చేసుకోవడమే పరిష్కారం. పీపీఎఫ్ ఉపసంహరణకు...? ముందుగా కేవైసీ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. పీపీఎఫ్ ఉపసంహరణకు వీలుగా ఫామ్ సీ, బ్యాంకు ఖాతాను తెలియజేసేందుకు కేన్సిల్డ్ చెక్, గుర్తింపు, నివాస చిరునామా ధ్రువీకరణ పత్రాలు, పీపీఎఫ్ పాస్ బుక్ ఉంటే దాన్ని కూడా జిరాక్స్ తీసి దగ్గర ఉంచుకోవాలి. ఈ పత్రాలపై బ్యాంకు అధికారుల ముందు సంతకం చేయాల్సి ఉంటుంది. మీరు నివాసం ఉంటున్న ప్రాంతంలో సంబంధిత బ్యాంకు శాఖకు వెళ్లాల్సి ఉంటుంది. పీపీఎఫ్ ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నట్టు మేనేజర్‌కు తెలియజేయాలి. పీపీఎఫ్ ఖాతా ప్రారంభించిన శాఖ మరో ప్రాంతంలో ఉందని, కనుక డాక్యుమెంట్లపై అటెస్టేషన్ చేయాలని కోరాలి. అప్పుడు ఆ డాక్యుమెంట్లపై తన సమక్షంలో సంతకం చేయాలని మేనేజర్ కోరతారు. మీరు సంతకం చేసిన తర్వాత మేనేజర్ దాన్ని ధ్రువీకరిస్తారు. ఆర్బీఐ సంబంధిత మేనేజర్‌కు జారీ చేసిన సిగ్నేచర్ కోడ్‌ను సంతకం పక్కన పేర్కొనాల్సి ఉంటుంది. ఒకవేళ మేనేజర్ అది పేర్కొనకపోతే అడిగి మరీ నమోదు చేయించుకోవాలి. దీంతో అటెస్టేషన్ పూర్తయినట్టు. అటెస్టేషన్ చేయించిన పత్రాలన్నింటినీ రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా ఖాతా ప్రారంభించిన శాఖకు పంపాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అటెస్టేషన్ చేయించిన శాఖ సిబ్బంది తామే వాటిని మెయిన్ బ్రాంచ్‌కు పంపుతామని చెబితే... వారి నుంచి దరఖాస్తు, ఇతర కేవైసీ పత్రాలు ముట్టినట్టు రశీదు తీసుకోవాలి. మీరు పంపిన పత్రాలన్నీ అసలు శాఖకు చేరిన తర్వాత వాళ్లు అన్నీ సక్రమంగా ఉంటే చెల్లింపుల ప్రక్రియను చేపడతారు. పీపీఎఫ్ మెచ్యూరిటీ నగదును నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ ద్వారా నేరుగా మీ బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. గతంలో పే ఆర్డర్లు ఇచ్చేవారు. ఇప్పుడు అనెఫ్ట్/ఆర్టీజీఎస్ విధానంలో ఖాతాలకు జమ చేస్తున్నారు. ప్రజా భవిష్యనిధి ఖాతాను ప్రారంభించిన ఏడేళ్ల తర్వాత ఖాతాలో ఉన్న బ్యాలన్స్‌పై కొంత మొత్తాన్ని ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నా పైన చెప్పుకున్న విధానాన్నే పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ పోస్టాఫీసులో పీపీఎఫ్ ఖాతాను తెరిస్తే... ఆ శాఖ నుంచే ఉపసంహరణ, క్లోజింగ్ సేవలు పొందాల్సి ఉంటుంది. లేదంటే ఆ ఖాతాను పోస్టాఫీసు నుంచి ఏదేనీ బ్యాంకుకు బదిలీ చేసుకోవడమే పరిష్కారం. పీపీఎఫ్ ఖాతా అంటే సాధారణంగా ఎక్కువ మంది పోస్టాఫీసులో ప్రారంభించడమే మంచిదన్న భావనలో ఉంటారు. నిజానికి ఈ విధమైన అభిప్రాయం తప్పు. పోస్టాఫీసు అయినా, బ్యాంకు అయినా పీపీఎఫ్ ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి. ఈ పథకాన్ని కేంద్రం నిర్వహిస్తుంది. సేవల పరంగా పోస్టాఫీసు లేక బ్యాంకు ఈ రెండింటిలో ఏది అనుకూలం అన్నది ఖాతాదారులు నిర్ణయించుకోవాలి. నిజానికి పోస్టాఫీసులో ఖాతా తెరిస్తే నెలవారీ చందాను ఆన్లైన్ విధానంలో జమ చేసుకునే వెసులుబాటు లేకపోవడం ప్రధాన అడ్డంకి గా చెప్పుకోవచ్చు. ఒకవేళ పోస్టల్ బ్యాంకు మొదలైన తర్వాత ఈ విధమైన వెసులుబాటు వస్తుందేమో చూడాలి. అలాగే, పోస్టాఫీసులో పీపీఎఫ్ ఖాతాను తెరవడం వల్ల వేరే ప్రాంతానికి మారిపోతే ఉపసంహరణ సమయంలో తిరిగి అదే శాఖను వెతుక్కుంటూ వెళ్లాలి. ఈ విధమైన ఇబ్బందులు ఎందుకూ అనుకుంటే పోస్టాఫీసులో తెరిచిన పీపీఎఫ్ ఖాతాను బ్యాంకుకు బదిలీ చేసుకోవచ్చు. ఇందుకు ఏం చేయాలి..? ► ముందుగా పోస్టాఫీసుకు వెళ్లి పీపీఎఫ్ పాస్‌బుక్‌లో అప్ టు డేట్ అన్ని లావాదేవీల వివరాలను నమోదు చేయించుకోవాలి. ►తర్వాత పీపీఎఫ్ ట్రాన్స్ఫర్ ఫామ్ ఎస్బీ–10(బీ)ని పూర్తి చేయాలి. ► ఓ పేపర్‌పై పీపీఎఫ్ ఖాతాను పోస్టాఫీసు నుంచి బ్యాంకు శాఖకు బదిలీ చేయాలని కోరుతూ దరఖాస్తు రాయాలి. ఎస్బీఐ ఖాతా ఉంటే పాస్‌బుక్ జిరాక్స్‌ను ఇచ్చినట్టయితే ప్రక్రియ వేగంగా నడుస్తుంది. ► పాన్, చిరునామా ధ్రువీకరణలను కూడా జత చేయాలి. ► వీటిని హెడ్ పోస్ట్ మాస్టర్‌కు అందించాలి. ఆయన పత్రాలన్నింటినీ పరిశీలించి దానిపై ఉన్న సంతకాన్ని తమ రికార్డుల్లో ఉన్న సంతకంతో పోల్చుకుంటారు. దాంతో వెరిఫికేషన్ ప్రక్రియ ముగుస్తుంది. ► అన్నీ సవ్యంగా ఉంటే పీపీఎఫ్ ఖాతాలో అప్పటి వరకు ఉన్న బ్యాలన్స్‌ను వెనక్కి ఇచ్చేసి పోస్ట్‌మాస్టర్ ఖాతాను మూసేస్తారు. పీపీఎఫ్ ఖాతాను ఎస్బీఐకి బదిలీ చేస్తున్నట్టు రిమార్క్ రాస్తారు. ► ఆ తర్వాత పీపీఎఫ్ ఖాతా బ్యాలన్స్, పత్రాలతో ఎస్బీఐ శాఖకు వెళ్లి ఆ మొతాన్ని చెక్ లేదా డ్రాఫ్ట్ రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. ► బ్యాంకు సిబ్బంది పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించి జమ చేసిన బ్యాలన్స్‌ను అందులో చూపిస్తారు. ఆ తర్వాత నుంచి పీపీఎఫ్ ఖాతా మనుగడలో ఉన్నట్టే. -
తీపి కబురు: వడ్డీ రేటు తగ్గించిన ఎస్ బీఐ
భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ) రుణాలపై వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. పలు రకాల మెచ్యురిటీలపై 0.9శాతం వడ్డీని తగ్గిస్తున్నట్లు పేర్కొంది. తగ్గింపు వడ్డీ రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని చెప్పింది. దీంతో గతంలో ఖాతాదారులు తీసుకున్న రుణాలపై 0.9 శాతం వడ్డీ రేటు తగ్గింది. కాగా, 2015 నుంచి ఇప్పటివరకు ఎస్ బీఐ రెండు శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించింది. గత వారం ఎస్ బీఐకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ 0.3 శాతం వడ్డీ రేటును తగ్గించగా, ఐడీబీఐ బ్యాంకు 0.6 శాతం వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఎస్ బీఐ నిర్ణయంతో మిగిలిన జాతీయ బ్యాంకులు కూడా ఎస్ బీఐ దారిలో నడిచే అవకాశం ఉంది. -
ఈపీఎఫ్‌పై వడ్డీ శాతంపై కేంద్రం కోత
-
ఈపీఎఫ్‌పై వడ్డీ 8.65 శాతం
0.15 శాతం తగ్గించిన కేంద్రం ► ఇది పీపీఎఫ్, జీపీఎఫ్‌పై వడ్డీ కంటే ఎక్కువే: దత్తాత్రేయ ► 50 లక్షల మంది కొత్త సభ్యుల నమోదు లక్ష్యం బెంగళూరు: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీపై కేంద్రం కోత విధించింది. 2015–16కు వడ్డీ రేటు 8.8 శాతం ఉండగా ప్రస్తుతం దీనిని 8.65 శాతానికి తగ్గించింది. గత నాలుగేళ్లలో ఇదే అతి తక్కువ వడ్డీ రేటు. స్వల్ప మిగులు కారణంగా వడ్డీ రేటు తగ్గించాల్సి వచ్చిందని భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ పేర్కొంది. 2016–17 సంవత్సరా నికి గాను ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.65 శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం నాడిక్కడ చెప్పారు. ఈపీఎఫ్ఓకు సంబంధించిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 215వ సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పీఎఫ్ వాటాదారులతో విస్తృత సంప్రదింపుల నేపథ్యంలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు సీబీటీ చైర్మన్ కూడా అయిన దత్తాత్రేయ చెప్పారు. 8.65 శాతం వడ్డీ రేటు ఇచ్చిన తర్వాత సంస్థ రూ.269 కోట్ల మిగుల్లో ఉంటుందన్నారు. వడ్డీ రేటు తగ్గినప్పటికీ ఇలాంటి మిగతా సంస్థలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్ (8.1%)), జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్ (8%) వంటి వాటితో పోల్చుకుంటే ఈపీఎఫ్ఓ తన ఖాతాదారులకు చెల్లిస్తున్నది ఎక్కువేనన్నారు. ఇలాఉండగా ఈపీఎఫ్ఓ పరిపాలన పరమైన చార్జీలను 0.85 శాతం నుంచి 0.65 శాతానికి తగ్గించాలని నిర్ణయిం చినట్లు తెలిపారు. కొత్త సభ్యుల నమోదు పెంచే కార్యక్రమాన్ని చేపట్టను న్నామని, మొదటి దశలో 50 లక్షల మంది కొత్త సభ్యుల ను చేర్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. గత ఏడాది ఆదాయంతోపాటు అప్పుడు మిగులు రూ.1,600 కోట్లు ఉండగా, ఈ ఏడాది ఈ మొత్తం రూ.410 కోట్లేనని సీపీఎఫ్ కమిషనర్ జాయ్ చెప్పారు. -
పీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చిన ప్రభుత్వం
-
పీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చిన ప్రభుత్వం
ముంబై: పీఎఫ్ ఖాతాదారుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. రిటైర్మెంట్ నిధి సంస్థ, ఎంప్లాయాస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఒ) వడ్డీరేట్లలో భారీగా కోత పెట్టింది. సోమవారం బెంగళూరులో జరిగిన ఈపీఎఫ్ సెంట్రల్ ట్రస్టీ భేటీలో 2016-17ఆర్థిక సంవత్సరానికి డిపాజిట్లపై వడ్డీరేటును 8.65 శాతంగా ప్రకటించింది. గత ఏడాది ఇది 8.8 శాతంగా ఉంది. అలాగే ప్రస్తుత రేటు ఏడేళ్ల కనిష్టం. దీంతో సుమారు 4 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులపై దీని ప్రభావం పడనుంది. ఈపీఎఫ్ వో కేంద్ర ట్రస్టీల బోర్డు సభ్యులు ప్రస్తుత వడ్డీరేట్లను ఆశించనంతగా పెంచలేదు. కనీసం యధాతథ స్థితిని కూడా కొనసాగించక పోవడంతో ఖాతాదారులు షాకయ్యారు. డీమానిటైజేషన్ తర్వాత దేశంలో నెలకొన్న అనిశ్చిత ఆర్థిక వాతావరణంలో సంస్థ నిర్ణయం వారిలో భారీ నిరాశను మిగిల్చింది. కాగా 2015-16 సం.రానికిగాను గత ఏడాది 8.7 శాతంగా ఉన్న వడ్డీరేటును 8.8 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. -
ఈపీఎఫ్‌పై 8.8% వడ్డీ!
న్యూఢిల్లీ: ఈపీఎఫ్ డిపాజిట్లపై 2016–17 ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతం వడ్డీ రేటును కొనసాగించేందుకు కేంద్ర కార్మిక శాఖ కసరత్తు చేస్తోంది. 4 కోట్లకు పైగాగల చందాదారులకు సంబంధించిన ఈ వ్యవహారంపై కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఆర్థిక మంత్రిని కలిశారు. అయితే 2015–16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్‌వో నిర్ణాయక బోర్డు (సీబీటీ) సూచన మేరకు వడ్డీని 8.8 శాతంగాకాక, 8.7 శాతంగా కేంద్రం తొలుత నిర్ణయించింది. దీనిపై కార్మిక సంఘాలు ఆందోళనలకు దిగడంతో వడ్డీని 8.8 శాతంగా నిర్ణయించారు. ఈసారి అలాంటి ఆందోళనకు తావులేకుండా చేయాలని భావించి, ముందస్తుగా ఆర్థిక శాఖ అనుమతి పొందాలని భావిస్తున్నారు. -
బంగారం భారీ పతనం
• అంతర్జాతీయ మార్కెట్లో 36 డాలర్లు క్షీణత • దేశీయంగా రూ.600కు పైగా డౌన్ న్యూయార్క్/ ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ పావుశాతం వడ్డీరేటు పెంపు (0.25–0.50 శాతం శ్రేణి) ప్రభావం పసిడిపై సుస్పష్టమవుతోంది. పసిడి నుంచి పెట్టుబడులు వేగంగా బయటకు వెళుతున్నాయి. గురువారం ఒక్కరోజు కడపటి సమాచారం అందే సరికి అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర 36 డాలర్లు (3%) పడిపోయి రూ.1,127 డాలర్లకు తగ్గింది. ఇక వెండి కూడా ఇక్కడ 1% పైగా పడిపోయి, 16 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా... ఇదే ధోరణి దేశీయ ఫ్యూచర్స్ మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో కూడా కనిపించింది. పసిడి 10 గ్రాముల ధర కడపటి సమాచారం అందే సరికి రూ.653 పడిపోయి (2 శాతం) రూ.26,934 వద్ద ట్రేడవుతోంది. వెండి సైతం భారీగా 6 శాతం పడిపోయింది. కేజీకి రూ.2,378 నష్టంతో రూ.39,350 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే, శుక్రవారం స్పాట్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులుఅంచనా వేస్తున్నారు. గురువారం ముంబై స్పాట్ మార్కెట్లో పసిడి ధర రూ.550 పడిపోయింది. 99.9, 99.5 స్వచ్ఛత ధరలు వరుసగా రూ.27,500, రూ.27,350 వద్ద ముగిశాయి. ఇక వెండి కూడా కేజీకి రూ.1,410పడిపోయి రూ.40,200కు దిగింది. -
వచ్చే ఏడాది అర శాతం రేటు కోత!: కొటక్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వచ్చే ఏడాది రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.25 శాతం) 25 నుంచి 50 బేసిస్ పారుుంట్ల వరకూ (100 బేసిస్ పారుుంట్లు ఒక శాతం) తగ్గించే అవకాశం ఉందని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. జనవరి-మార్చి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం పెరగవచ్చన్న అంచనాల ప్రధాన కారణంగా బుధవారం నాటి ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) ఆధారిత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.4% ఉంటుందని కొటక్ అంచనావేసింది. జనవరి-మార్చిలో ద్రవ్యోల్బణం లక్ష్యం మేరకు 5%గా ఉంటుందని పేర్కొంది. -
రేట్ల కోత ఏకాభిప్రాయమే..
అక్టోబర్ 4 ఆర్బీఐ విధాన సమీక్ష మినిట్స్ విడుదల ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అక్టోబర్ 3, 4 తేదీల్లో జరిగిన తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.25 శాతానికి పడింది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన జరిగిన ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకాభిప్రాయ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ గవర్నర్ సొంత నిర్ణయానికి సంబంధించిన ఈ కీలక రేటు అంశం అందరి ఆమోదం మేరకే తప్పనిసరిగా జరగాల్సిన ఆవశ్యకత నెలకొనడం అక్టోబర్ 4 ప్రత్యేకత. సభ్యులు ఆరుగురు సమంగా చీలిపోతేనే గవర్నర్ ‘కాస్టింగ్ ఓటు’ కీలకం అవుతుంది. ఈ సమావేశంలో విధాన నిర్ణేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను మంగళవారం వెలువడిన ఆర్బీఐ మినిట్స్ వివరించింది. ఈ అభిప్రాయాలను ఒక్కసారి పరిశీలిస్తే... అంతర్జాతీయ భయాలు.. అంతర్జాతీయ బలహీన ఆర్థిక పరిస్థితులు భారత్ వృద్ధి తీరుపై ప్రభావం చూపే పరిస్థితులు పెరిగాయి. ముఖ్యంగా ఇక్కడ వాణిజ్య అంశాను ప్రస్తావించుకోవాలి. అయితే అదే అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ద్రవ్యోల్బణం అదుపులో కొనసాగే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఆర్థిక క్రియాశీలత బాగున్నప్పటికీ, ప్రైవేటు పెట్టుబడుల పరిస్థితి ఒత్తిడిలోనే ఉంది. పెరుగుతున్న వినియోగ డిమాండ్‌కు తగిన విధంగా ప్రైవేటు పెట్టుబడులు స్పందించడంలేదు. రేటు కోత వల్ల ఈ అంశంలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. - ఆర్.గాంధీ, డిప్యూటీ గవర్నర్ ఇబ్బందులున్నాయ్... ఆర్థిక వ్యవస్థలో పలు విభాగాలు ఇబ్బందుల్లోనే ఉన్నాయి. అయితే వ్యవసాయం, స్టీల్ ఉత్పత్తి, రోడ్లు, రైల్వేలు, జల మార్గాలకు సంబంధించిన పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. రేటు కోత వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. - పాత్ర, ఆర్బీఐ ఈడీ సంస్కరణలు ఫలితాలను ఇస్తాయి... భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో క్రమంగా ముందుకు సాగుతోంది. ప్రత్యేకించి పలు ఆర్థిక సంస్కరణలకు సానుకూలంగా స్పందిస్తోంది. డిమాండ్ ఇంకా కొంత బలహీనంగా ఉన్నందున ద్రవ్యోల్బణానికి సంబంధించి పెద్ద ఇబ్బంది ఏదీ ఉండదని భావిస్తున్నా. - ధోలాకియా, ప్రభుత్వ నామినీ వృద్ధికి ఊతం అవసరం... పాలసీ రేటు కోత ద్వారా వృద్ధికి ఊతం ఇవ్వాల్సిన సరైన సమయం ఇది. ఆర్బీఐ నిర్వహించిన కొన్ని సర్వేలు ద్రవ్యోల్బణం మున్ముందు అదుపులోనే ఉంటుందని వివరిస్తున్నాయి. ప్రైవేటు వ్యయాలకు, వినియోగం పెంపునకు రేటు కోత దోహదపడుతుంది. - పామీ దువా, ప్రభుత్వ నామినీ ద్రవ్యోల్బణం స్థిర గణాంకాలే... ఆహార, ఇంధన ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతుండడం కొంత ఆందోళకర అంశమే. అయితే, ఇవి స్థిరపడతాయని, దిగువస్థాయిలోనే కొనసాగుతాయని సర్వేలు పేర్కొంటుండడం వల్ల ఈ దశలో వృద్ధికి ప్రోత్సాహం అందించాలని భావిస్తున్నాను. - చేతన్ ఘాటే, ప్రభుత్వ నామినీ 5% ద్రవ్యోల్బణం లక్ష్యం సాధ్యమే.. కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి ఐదు శాతం ద్రవ్యోల్బణం లక్ష్యం సాధ్యమే. గణాంకాలు, సర్వేలతో పాటు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, అలాగే పప్పు దినుసుల పరిస్థితి చూసినా దీనిని ధ్రువీకరించుకునే పరిస్థితి ఉంది. ఆర్థిక క్రియాశీలత మెరుగుపడుతున్నప్పటికీ, ప్రస్తుతానికి అవుట్‌లుక్ బలహీనంగానే ఉంది. పరిశ్రమల సామర్థ్య వినియోగమూ తక్కువ స్థాయిలోనే ఉంది. దీనివల్ల ప్రైసింగ్ పవర్ బలహీనంగా కొనసాగే అవకాశాలే ఉన్నాయి. - ఉర్జిత్ పటేల్, ఆర్బీఐ గవర్నర్ -
కీలక రెపో రేట్ లో కోత
-
కీలక రెపో రేట్ లో కోత
ముంబై: రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా 2016-17 నాల్గవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లలోకోత పెట్టింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన డెబ్యూ పాలసీ సమీక్షలో లో కీలక రెపో రేటులో కోత పెట్టారు. రెపో (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) 25 బేసిస్ పాయింట్లను తగ్గించారు. ప్రస్తుతం ఉన్న 6.50 శాతంనుంచి 6.25 గా నిర్ణయించారు. ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ కు తన మొట్టమొదటి పాలసీ రివ్యూలో మ్యాజిక్ చేశారు. మంగళవారం ప్రకటించిన ద్రవ్యపరపతి విధానం సమీక్ష తో వడ్డీ రేట్లు ఆరేళ్ల కనిష్ట స్థాయికి దిగి వచ్చాయి. ఈ దఫా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అత్యున్నత స్థాయి కమిటీ- ఎంపీసీ తొలిసారిగా కీలక వడ్డీ రేట్లను నిర్ణయం చేసింది. ఆరుగురు సభ్యులు వడ్డీ రేట్ల కోతకు ఆమోదం తెలిపారు. కాగా ఆర్ బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ కు కూడా ఇది మొదటి పరపతి విధాన సమీక్ష కానుండటం విశేషం. ప్రభుత్వం తరఫున కమిటీలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ చేతన్ ఘాటే, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డెరైక్టర్ పామి దువా, ఐఐఎం- అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ రవీంద్ర హెచ్ ధోలాకియాతో పాటు కమిటీలో ఆర్బీఐ తరఫున ముగ్గురు నామినీలు కలిసి మొత్తం ఆరుగురు వ్యక్తులు కమిటీ సభ్యులుగా ఉన్నసంగతి తెలిసిందే. -
‘రెపో’కు మెజారిటీ నే ప్రాతిపదిక
3-4 తేదీల్లో ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ భేటీ ముంబై: కీలక పాలసీరేటు రెపో (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.5 శాతం) ఈ దఫా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అత్యున్నత స్థాయి కమిటీ- ఎంపీసీ మెజారిటీ ప్రాతిపదికన నిర్ణయం కానుంది. ఈ కమిటీ నియామకాన్ని ప్రభుత్వం గురువారం నోటిఫై చేసింది. దీనితో పాలసీ సమీక్షకు అక్టోబర్ 3, 4 తేదీల్లో ఇక్కడ ఆర్బీఐ ఆరుగురు సభ్యుల సమావేశం 2016-17 నాల్గవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష జరగనుంది. కమిటీ ఇదీ... ప్రభుత్వం తరఫున కమిటీలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ చేతన్ ఘాటే, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డెరైక్టర్ పామి దువా, ఐఐఎం- అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ రవీంద్ర హెచ్ ధోలాకియాలు ఉన్నారు. ఈ ముగ్గురితో పాటు కమిటీలో ఆర్బీఐ తరఫున ముగ్గురు నామినీలు కలిసి మొత్తం ఆరు ఓట్ల మెజారిటీ ప్రాతిపదికన పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటు నిర్ణయం ఉంటుంది. ఒకవేళ రేటు నిర్ణయంలో కమిటీ చెరిసమానంగా చీలిపోతే... ఆర్బీఐ గవర్నర్ గా ఆయన అదనపు ఓటు కీలకం అవుతుంది. ఇక కమిటీలో ఆర్బీఐ గవర్నర్, ఒక డిప్యూటీ గవర్నర్, మరో ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ఇప్పటి వరకూ సలహాకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఉన్నప్పటికీ, దీనిని తోసిపుచ్చి ఆర్బీఐ గవర్నర్ సొంతంగా రెపో రేటు నిర్ణయం తీసుకునే వీలుంది. సమయం మార్పు కాగా పాలసీ సమీక్ష ఉదయం 11 గంటలకు జరుగుతుండగా ఇకమీదట ఈ సమావేశాన్ని మధ్యాహ్నం 2.30కి మార్చడం జరిగిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆంధ్రాబ్యాంకు రుణ మేళా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రాబ్యాంకు రానున్న పండగలను దృష్టిలో పెట్టుకుని గృహ, వాహన రుణాలను పోటీ వడ్డీ రేట్లకు ఇస్తోంది. విజయ్ దిశ పేరుతో గృహ రుణం, తనఖాపై రుణాలను పోటీ వడ్డీ రేట్లకు ఆఫర్ చేస్తోంది. అలాగే మెగా వెహికిల్ లోన్ కార్నివాల్లో భాగంగా వాహన రుణాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. గృహ రుణం తీసుకున్న కస్టమర్ కారు రుణం సైతం తీసుకుంటే వడ్డీలో 0.25 శాతం తగ్గింపు ఇస్తారు. గృహ, వాహన రుణంపై ప్రాసెసింగ్ చార్జీలు రద్దు చేసినట్టు తెలిపింది. అక్టోబరు 31 దాకా ఈ రుణ మేళా కొనసాగుతుంది. -
వడ్డీరేట్లు మరింత దిగిరావాలి: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: బ్యాంకులు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు (ప్రస్తుతం 6.5%) మరో రెండు శాతం తగ్గాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా తెలిపారు. ఇది దేశ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కొండంత అండనిస్తుందని వివరించారు. అయితే 200 బేసిస్ పాయింట్లు ఒకేసారి తగ్గించాలా... లేక విడతల వారీగా తగ్గించాలా అన్న అంశానికి సంబంధించి నిర్దిష్ట కాల పరిమితిని ఏమీ ఆమె పేర్కొనలేదు. అక్టోబర్ 4వ తేదీన ఆర్బీఐ తదుపరి పాలసీ సమీక్ష నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్య చేశారు. తదుపరి పాలసీ కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ సమర్పిస్తారు. లేదా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆరుగురు సభ్యుల కమిటీ మెజారిటీ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకునే వీలుంది. సెప్టెంబర్ 4తో రాజన్ పదవీ కాలం పూర్తికానుంది. ఇప్పటికే ఆర్బీఐ రెపో కోత ప్రయోజనం కస్టమర్‌కు అందేలా చర్యలు ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో బ్యాంకింగ్‌కు తగిన సూచనలు చేసే విషయంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో చర్చిస్తానని కూడా వెల్లడించారు. -
వడ్డీ తక్కువే... మరి చార్జీలో..!
యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోతామంటూ బ్రిటన్ నిర్ణయం తీసుకోవటం స్టాక్ మార్కెట్లకు శరాఘాతమే. కరెన్సీలతో పాటు క్రూడ్ వంటి కమోడిటీలకూ గడ్డుకాలమే. కాకపోతే ఇలాంటి అనిశ్చితిలో అందరూ చక్కని ఇన్వెస్ట్మెంట్ సాధనంగా భావించేది బంగారమే. ఈ నేపథ్యంలోనే దూసుకుపోతున్న పసిడి, ఈ ఏడాది చివరకు మరింతగా పెరగవచ్చనేది అంచనా. ఆభరణాలుగా, పొదుపు సాధనంగా, ద్రవ్యోల్బణాన్ని కాచుకునే రక్షణ కవచంగా, అవసరమైతే రుణం రూపంలో ఆదుకునే మిత్రునిగా ఇలా బంగారానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం మామూలుది కాదు. ప్రపంచంలోని మొత్తం బంగారం నిల్వల్లో 10% భారతీయుల ఇళ్లలోనే ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనా, పిల్లల చదువులు, సాగు కోసం పెట్టుబడి, ఇల్లు కొనుగోలు... అవసరం ఏదైనా వారికి ముందుగా కనిపించేది బంగారమే. కాకపోతే బంగారంపై రుణాల విషయంలో చాలామందికి అంతంతమాత్రం అవగాహనే ఉంది. ఈ విషయంలో తెలుసుకోవాల్సిన వాస్తవాలెన్నో ఉన్నాయి. అవన్నీ వివరించేదే ఈ ప్రాఫిట్ ప్లస్ కథనం.. గోల్డ్‌లోన్ తీసుకునే ముందు అవగాహన అవసరం ⇒ వడ్డీ రేటు తక్కువే కానీ... దానికి సవాలక్ష కండిషన్లు ⇒ ప్రాసెసింగ్ నుంచి ఆలస్యానికి, ప్రీపేమెంట్కూ చార్జీలు ⇒ ఇవన్నీ కలిపితే పర్సనల్‌లోన్ కన్నా ఎక్కువే వడ్డీరేటు ⇒ బంగారం విలువ తగ్గితే మరింత హామీ కావాలంటూ ఒత్తిళ్లు ⇒ ఇవన్నీ భరించేబదులు విక్రయించటమే బెటరంటున్న నిపుణులు మన అవసరం... వారికి వ్యాపారం బంగారం రుణాల్లో ఎక్కువ శాతం రూ.30 వేల నుంచి రూ.50వేల లోపు తీసుకునేవే ఎక్కువ. తక్కువ ఆదాయ వర్గాల వారు సులభంగా లభించే బంగారం రుణాలవైపు ఆకర్షితులవుతుంటారు. వాటిపై వడ్డీ, ఇతర చార్జీల రూపంలో పడే భారం గురించి వారికి తెలిసింది తక్కువే. పైగా, అత్యవసరాల్లో ఎక్కడా అప్పు దొరకని పరిస్థితుల్లోనే మరో మార్గం లేక బంగారాన్ని కుదువపెడుతుంటారు. దీంతో బంగారంపై రుణాలు ఎన్బీఎఫ్సీ కంపెనీలకు మంచి వ్యాపార వనరుగా మారింది. బంగారం రుణాల్లో 75 శాతం అవ్యవస్థీకృత రంగం (వ్యక్తులు సొంతంగా నడిపేది)లోనే ఉన్నాయి. మిగిలిన 25 శాతం మార్కెట్ వాటా ఎన్బీఎఫ్సీ, బ్యాంకుల చేతిలో ఉంది. బంగారంపై రుణం చిటికెలో పని! మిగిలిన రుణాలతో పోలిస్తే బంగారంపై రుణం తేలిగ్గా లభిస్తుంది. వీధిలో ఉన్న వడ్డీ వ్యాపారి అయినా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ అయినా... విలువైన బంగారాన్ని కుదువపెడితే కళ్లకద్దుకుని రుణాలిచ్చేస్తారు. సామాన్యులను ఎక్కువగా ఆకర్షించే విషయమిదే. ఆదాయ వివరాలు, పే స్లిప్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఇతర డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. క్రెడిట్ స్కోర్‌తో పనిలేదు. కుదువపెట్టే నాటికి మార్కెట్లో ఉన్న బంగారం విలువలో 75 శాతం లేదా అంతకంటే తక్కువ రుణాన్ని మంజూరు చేస్తారు. అయితే బంగారం ధర ఉన్నట్టుండి 25 శాతం వరకు పడిపోతేనే సమస్య ఎదురవుతుంది. కానీ, బంగారం ధరలు తక్కువ వ్యవధిలో ఇంత మేర పడిపోయిన సందర్భాలు చరిత్రలో చాలా తక్కువేనని చెప్పాలి. ఒకవేళ ఆ స్థాయిలో పడిపోతుంటే రుణదాత వెంటనే అప్రమత్తమై... వెంటనే రుణాన్ని కొంతమేర తీర్చివేయాలని లేదా మరికొంత మొత్తం బంగారాన్ని హామీగా సమర్పించాలని రుణగ్రహీతను కోరతారు. చెప్పేది వేరు... చేసేది వేరు చాలా వరకు ఎన్బీఎఫ్సీలు బంగారం విలువపై 75 శాతం వరకు రుణాలిస్తామని ఆకర్షణీయమైన ప్రకటనలిస్తుంటాయి. కానీ, రుణం కోసం వెళ్లినప్పుడే అసలు విషయం తెలుస్తుంది. బంగారాన్ని చూశాక గానీ రుణం ఎంతన్నది తేల్చవు. తాకట్టు పెట్టాలనుకునే బంగారం స్వచ్ఛత, విలువ పరీక్షించిన తర్వాతే ఎంత రుణం ఇచ్చేదీ చెబుతాయి. బంగారు ఆభరణాల విలువను లెక్కించడంలో అనుసరించే విధానం కూడా గోప్యమేనని స్వయంగా రిజర్వ్ బ్యాంకు బృందమే గుర్తించింది. రుణ పత్రాలు, రుణాల జారీ విషయంలో పాటించే విధానం కూడా సంస్థను బట్టి మారుతుంటుంది. రుణగ్రహీతకు తాకట్టు పత్రం, రుణ ఒప్పంద పత్రాన్ని ఇస్తున్నాయి. కానీ, వాటిలో ఆభరణాల వివరాలు, ఎన్ని గ్రాములు, మదించిన విలువ వంటివి వేయటం లేదు. వార్షిక వడ్డీ రేటు వివరాలను కూడా పేర్కొనడం లేదు. రుణం కాల వ్యవధి ఎంత? గడువులోపు చెల్లించడంలో విఫలమైతే వేలం విషయంలో అనుసరించే విధానమేంటి? ఇతర చార్జీలేమైనా ఉన్నాయా? ఇలాంటి వివరాలు ఎన్బీఎఫ్సీ సంస్థలు జారీ చేసిన పత్రాల్లో ఉండటం లేదని ఆర్బీఐ బృందం తేల్చింది. అలాగే, రుణగ్రహీత చెల్లింపుల విషయంలో విఫలమైతే హామీగా ఉంచిన బంగారు ఆభరణాలను వేలం వేసే ముందు ఆ విషయాన్ని కచ్చితంగా తెలియజేయాలి. కానీ, కంపెనీలు ఈ నిబంధనను పాటించ డం లేదు. రుణగ్రహీతకు చెప్పకుండా వేలం ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి. వేలం వేసే రోజు మార్కెట్ విలువ ఎక్కువగా ఉండి... ఆ వేలం ద్వారా అధిక మొత్తం సమకూరితే రుణం, దానిపై వడ్డీ పోను మిగిలిన నగదును రుణ గ్రహీతకు తిరిగి చెల్లించడం లేదని కూడా ఆర్బీఐ గుర్తించింది. వడ్డీ నెలనెలా... అసలు చివర్లో నెలనెలా వడ్డీ చెల్లిస్తూ గడువు తీరిన తర్వాత అసలు మొత్తాన్ని చెల్లించేసి తనఖా పెట్టిన బంగారాన్ని వెనక్కి తీసుకోవచ్చు. బంగారంపై రుణాలిచ్చే బ్యాం కులు లేదా ఎన్బీఎఫ్సీలు ఈ విధానాన్నే ఎక్కువగా పాటిస్తుంటాయి. వడ్డీతోపాటు అసలు కలిపి ఒకేసారి చెల్లించే అవకాశమూ ఉంది. రెండో ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం వడ్డీపై వడ్డీ జమకూడి చెల్లించాల్సిన మొత్తం బాగా పెరిగిపోతుంది. - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం వడ్డీ ఎంత...!? ప్రకటనలను చూస్తే బంగారు రుణాలపై వడ్డీ చాలా తక్కువే అనిపిస్తుంది. కానీ, నిజానికి ఈ వడ్డీ ఎక్కువే. ఎందుకంటే వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీ, విలువ మదింపు చార్జీలు వసూలు చేస్తారు. ఇవన్నీ కలిపితే వడ్డీ ఎక్కువే అవుతుంది. పైగా నెలవారీ వాయిదాలు చెల్లించడంలో విఫలమైతే సంస్థలు విధించే జరిమానా భారీగా ఉంటుంది. రుణాన్ని ముందుగా తీర్చేసినా చార్జీలు తప్పవు. మార్కెట్లో ఉన్న రెండు ప్రముఖ రుణ సంస్థల వడ్డీ రేటును పరిశీలిస్తే... 12 నుంచి 24 శాతం వరకూ ఉన్నట్టు వెల్లడయింది. రుణం తీసుకునే కస్టమర్, తాకట్టు పెట్టే ఆభరణాలు, రుణ మొత్తం, వ్యవధిని బట్టి ఈ వడ్డీరేటు మారిపోతుంది. వాస్తవంలో గరిష్ట వడ్డీ ధర 24 శాతాన్ని దాటిపోయి 30% వరకూ ఉన్న సందర్భాలూ లేకపోలేదు. ఎన్బీఎఫ్ఎసీల మొత్తం బంగారం రుణాల్లో కేవలం 2 శాతమే 12% వడ్డీకి ఇస్తున్నవని వెల్లడయింది. మిగిలిన రుణాలపై వడ్డీ రేటు 24-26% మధ్యనే ఉంటోంది. రుణం తీసుకోవాలా? బంగారం విక్రయించాలా? ఒక గోల్డ్‌లోన్ సంస్థ ఇస్తున్న బంగారు రుణాలపై వడ్డీ నెలకు 2 శాతం. బంగారం మార్కెట్ విలువపై రుణం రేషియో (ఎల్టీవీ) కూడా 70 శాతం వరకే ఉంది. రుణం కాల వ్యవధి మూడు నెలలే. ప్రతి త్రైమాసికం చివర్లో వడ్డీ మొత్తం చెల్లిస్తే మరో మూడు నెలలకు రుణం పొడిగిస్తుంటారు. అసలు చెల్లించే వరకు ఇలా రుణం కాల వ్యవధి కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ బంగారం విలువ తగ్గి, ఎల్టీవీ రేషియో కూడా తగ్గితే అదనంగా బంగారాన్ని హామీగా ఉంచాలని సంస్థ నుంచి ఒత్తిళ్లు మొదలవుతాయి. చార్జీలన్నీ చెల్లించి, ఇలాంటి ఇబ్బందులు పడేకంటే కొన్నిసార్లు బంగారాన్ని విక్రయించడమే లాభసాటిగా కనిపిస్తుంది. అయితే, బంగారం ధరలు పెరిగేటపుడు ఈ ఆప్షన్ అంత మంచిదికాదు. సెంటిమెంటుతో చిక్కు.. భారతీయులకు, ముఖ్యంగా స్త్రీలకు ఆభరణాలతో విడదీయలేని అనుబంధం ఉంటుంది. తండ్రి తన పుట్టిన రోజున ప్రేమగా బహూకరించిన హారం, పెళ్లి నిశ్చితార్థం రోజున కాబోయే వరుడు చేతి వేలికి తొడిగిన ఉంగరం, పెళ్లి సందర్భంగా నాన్న చేయించిన బంగారు గాజులు, వేద మంత్రాల సాక్షిగా కట్టిన తాళి ఇలా ప్రతీ దానికీ ఓ చెరగని జ్ఞాపకం ఉంటుంది. అయితే, మంగళసూత్రం వంటి వాటిని మినహాయిస్తే మిగిలిన వాటి విషయంలో సెంటిమెంటును పక్కన పెడితేనే లాభమన్న విషయాన్ని తెలుసుకోవాలి. పైగా అమ్మడం వల్ల తర్వాత కావాలంటే కొత్త ఆభరణాలను సొంతం చేసుకోవచ్చు. విక్రయించే ముందు వాటిని ఫొటో తీసి పెట్టుకుంటే అవే డిజైన్లతో ఆభరణాలను చేయించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. పసిడి... మెరుపు తగ్గదు! న్యూయార్క్/ముంబై: స్వల్ప స్థాయిలో ఒడిదుడుకులు ఉన్నా... అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పసిడి ధర తగ్గే పరిస్థితి లేదని ఈ రంగంలో నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పసిడి పటిష్ట స్థాయిలోనే కొనసాగుతుందని వారి అంచనా. బ్రెగ్జిట్ నేపథ్యంలో మూడేళ్ల గరిష్ట స్థాయికి (జూన్ 23వ తేదీన ఔన్స్‌కు 1,355 డాలర్లు) ఎగసిన ధరలు మున్ముందూ ఇదే ధోరణిని కొనసాగిస్తాయన్నది వారి అంచనా. క్లుప్తంగా పరిశీలిస్తే... * గోల్డ్ రిఫైనరీస్ జాతీయ సంఘం అసోసియేషన్ ఆఫ్ గోల్డ్ రిఫైనరీస్ అండ్ మింట్స్ సెక్రటరీ జేమ్స్ ఈ అంశంపై మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ధర అంతర్జాతీయ ప్యూచర్స్ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రా)కు 1,400 డాలర్లకు చేరడం ఖాయమని పేర్కొన్నారు. * దేశీయంగా రూపాయి బలహీనత, పసిడి ధర భారీ పెరుగుదలకు కారణం అయ్యే అవకాశం ఉందని ట్రెజరీ అండ్ బ్యాంక్‌నోట్స్ సెంట్రల్ డెరైక్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ హరిప్రసాద్ అంచనావేశారు. * కనీసం ఆరు నెలలు, గరిష్టంగా 18 నెలలు పసిడి మెరుపు కొనసాగే అవకాశం ఉందని ఏవీపీ సిస్టమ్యాటిక్స్ షేర్స్ అండ్ స్టాక్స్ హెచ్ బీరేంద్రకుమార్ సింగ్ అభిప్రాయపడ్డారు. పసిడి 1,509 డాలర్లకు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడిన ఆయన, ఇదే జరిగితే కనిష్ట స్థాయి నుంచి 61.8 శాతం బలపడినట్లు (రిట్రేస్‌మెంట్) అవుతుందని, ఈ స్థాయిని దాటితే తిరిగి పసిడి తన చరిత్రాత్మక గరిష్ట స్థాయిలకు చేరే అవకాశం ఉంటుందని అన్నారు. వారంలో వెండి మెరుపులు: అంతర్జాతీయంగా ఔన్స్ 25 డాలర్లు ఎగసి 1,344 డాలర్లకు చేరింది. ముం బైలో శుక్రవారం శుక్రవారంతో ముగిసిన సమీక్ష వారంలో కొంత నెమ్మ దించింది. 99.9 స్వచ్ఛత ధర రూ.10 నష్టపోయి, 30.905 వద్ద ముగిసింది. అయి తే వెండి భారీగా కేజీకి రూ.2,150 ఎగసి రూ.45,080కి చేరింది. -
రూ. 1,000 కోట్ల సమీకరణలో ఆంధ్రా బ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు సుమారు రూ. 1,000 కోట్ల నిధుల సమీకరణ కోసం పదేళ్ల కాల వ్యవధితో అన్సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డెట్ బాండ్లు జారీ చేయనుంది. వీటికి 8.65 శాతం వడ్డీ రేటు ఉంటుంది. జూన్ 22న ప్రారంభమయ్యే ఇష్యూ 27న ముగుస్తుంది. -
జూన్ లోనే "ఫెడ్" వడ్డన...!
ఫెడ్ రిజర్వు ఆసియన్ మార్కెట్లకి షాకినిచ్చింది. జూన్ లో మరోమారు వడ్డీరేట్లను పెంచబోతున్నట్టు సంకేతాలు విడుదల చేసింది. బుధవారం జరిగిన ఫెడ్ సెంట్రల్ బ్యాంకు ఏప్రిల్ పాలసీ సమావేశం అనంతరం అమెరికా ఆర్థికవ్యవస్థ బాగుంటే జూన్ లో వడ్డీరేట్ల పెంపుకు సిద్దంగా ఉన్నామని అధికారులు వ్యక్తంచేసినట్టు మినిట్స్ వెల్లడించింది. రెండో త్రైమాసికంలో అమెరికా ఆర్థికాభివృద్ధి మెరుగుపడిందని, ఉద్యోగావకాశాలు, ద్రవ్యోల్బణం పెరగిందని సంకేతాలు వచ్చాయి. దీంతో జూన్ లో ఫెడ్ వడ్డీరేట్లను పెంచబోతున్నట్టు మినిట్స్ నివేదించింది. అయితే వాల్ స్ట్రీట్ అంచనా వేసిన దానికంటే చాలా త్వరగానే జూన్ లో ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతాదనే తెలుస్తోంది. దాదాపు 34శాతం ఫెడ్ జూన్ లో రేట్ల పెంపుకే అవకాశముందని ట్రేడర్స్ అభిప్రాయం వ్యక్తంచేశారు. మినిస్ట్స్ విడుదల చేసిన ఈ రిపోర్టుతో మార్కెట్లో డాలర్ బలపడింది. ఫెడ్ 2శాతం టార్గెట్ కు ద్రవ్యోల్బణం పెరుగుతుందని పాలసీమేకర్స్ వ్యక్తంచేసినట్టు తాజా డేటాలో వెల్లడైంది. ఈ సంకేతాల ప్రభావం ఆసియన్ స్టాక్ మార్కెట్లపై చూపించింది. ఈ సంకేతాలతో ఆసియన్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. 2008 లో నెలకొన్న ఆర్థికమందగమనంతో ఫెడ్ రిజర్వు రేట్లను 0శాతానికి ఉంచింది. దాదాపు దశాబ్దం అనంతరం అమెరికా ఆర్థికవ్యవస్థ కొంత మెరుగుపడిందని గణాంకాలు చూపడంతో, డిసెంబర్ లో మొదటిసారి ఫెడ్ వడ్డీరేట్లను 0.25 శాతం-0.50 శాతం పెంచింది. -
ఇండియన్ బ్యాంక్ డిపాజిట్ల రేట్లలో మార్పులు
చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఏడాది కాల వ్యవధి టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఇతర టర్మ్ డిపాజిట్లపై కాల వ్యవధిని బట్టి రేటును 25-50 బేసిస్ పాయింట్ల దాకా తగ్గించింది. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. -
ఈపీఎఫ్ వడ్డీరేటు పెంపు
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) వడ్డీ రేటుపై తన నిర్ణయాన్నిమార్చుకున్న ప్రభుత్వం ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చింది. ఇటీవల తగ్గించిన వడ్డీరేటును సవరించుతూ నిర్ణయం తీసుకుంది. కార్మిక శాఖ మంత్రి నేతృత్వంలో ఉన్న సీబీటీ సిఫారసులకు అనుగుణంగా ఈపీఎఫ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును 8.8 శాతంగా నిర్ణయించింది. ఇటీవల ఇపిఎఫ్ఓ ధర్మకర్తల త్రైపాక్షిక సెంట్రల్ బోర్డు (సిబిటి) ఏకగ్రీవ నిర్ణయానికి విరుద్ధంగా ప్రకటించిన 8.7 శాతం వడ్డీ రేటు నిర్ణయానికి వెనక్కి తీసుకుంది. కాగా ఆర్థిక శాఖ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ సహా పది కేంద్ర కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోకపోతే ఏప్రిల్ 29న పెద్ద ఎత్తున నిరసనకు దిగనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పీఎఫ్ వడ్డీరేటు తగ్గింపుపై ధర్నా
హైదరాబాద్: ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీరేటును తగ్గించటాన్ని నిరసిస్తూ వివిధ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. బర్కత్‌పురాలోని ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం ఎదుట సీఐటీయూ, ఐన్టీయూసీ, ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ తదితర సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) సిఫారసును పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించటాన్ని తప్పుపట్టారు. -
పీపీఎఫ్ వడ్డీరేట్లలోనూ కోత!
ఆర్బీఐ ప్రకటించిన పావుశాతం రెపో రేటు కోత, రుణదారులకు ఆశల పల్లకిలా కనిపిస్తుంటే.. పొదుపరులకు మాత్రం నిరాశా నిస్పృహలను మిగులుస్తోంది. రెపో రేటును ఆర్బీఐ తగ్గించడంతో, అప్పు తీసుకున్నవారికి వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఈ క్రమంలోనే చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) లాంటి పథకాల వడ్డీరేట్లు జూలై-సెప్టెంబర్ కాలంలో 20 నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశాలున్నాయని రీసెర్చ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ వెల్లడించింది. దీంతో చిన్నమొత్తాల్లో పొదుపు చేసుకునేవారు చింతించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీపీఎఫ్ వడ్డీరేట్లు 7.85 నుంచి 7.9 శాతం మధ్య ఉండనున్నట్టు రీసెర్చ్ ఏజెన్సీ తెలిపింది. చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునేవారి వడ్డీరేట్లలో ప్రతి మూడు నెలలకోసారి మార్పులు జరుగుతాయి. ప్రభుత్వ సెక్యురిటీలు, బాండ్లకు అనుగుణంగా వీటిని సమీక్షిస్తుంటారు. చిన్న మొత్తాల పొదుపు వడ్డీరేట్లపై ఏప్రిల్ క్వార్టర్ లో ప్రభుత్వం కోత విధించింది. దీని ఫలితంగా జూన్ 30-ఏప్రిల్ 1 మధ్యకాలంలో పీపీఎఫ్ వడ్డీరేట్లు 8.7 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గాయి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పై వడ్డీరేటు 9.3 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గగా.. చిన్న పిల్లల సుకన్య సమృద్ధి అకౌంట్లపై వడ్డీరేట్లు 9.2 నుంచి 8.6 శాతానికి దిగివచ్చాయి. బ్యాంకుల్లో నగదు నిల్వలు పెంచేందుకే ఆర్బీఐ ఈ లిక్విడిటీ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
సెన్సెక్స్ 516 పాయింట్లు డౌన్
వడ్డీ రేటు తగ్గింపు స్వల్పమేనన్న నిరుత్సాహం ♦ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ ♦ 156 పాయింట్లు తగ్గిన నిఫ్టీ ♦ ఫెడ్ భయాలతో ప్రతికూలంగా ప్రపంచ మార్కెట్లు ముంబై: రిజర్వుబ్యాంక్ వడ్డీ రేటును పావుశాతమే తగ్గించిందన్న నిరుత్సాహానికి ప్రతికూల అంతర్జాతీయ ట్రెండ్ తోడవటంతో మంగళవారం ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దాంతో బీఎస్ఈ సెన్సెక్స్ 516 పాయింట్లు పతనమై 25,000 పాయింట్లస్థాయి దిగువకు జారిపోయింది. రేట్ల కోత అంచనాలతో నెలరోజులుగా పెరిగిన బ్యాంకింగ్ షేర్లే ఆర్బీఐ పాలసీ ప్రకటన అనంతరం అధికంగా క్షీణించాయి. ఆర్బీఐ కేవలం రెపో రేటును మాత్రమే తగ్గించి, సీఆర్ఆర్ను యథాతథంగా అట్టిపెట్టడం కూడా ఇన్వెస్టర్లకు రుచించలేదు. బ్యాంకింగ్ షేర్లలో ఎక్కువగా ఐసీఐసీఐ బ్యాంక్ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. ఈ షేరు 5.45 శాతం క్షీణించగా, ఎస్బీఐ 5.38 శాతం పడిపోయింది. యాక్సిస్ బ్యాంక్ 2.89 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.03 శాతం చొప్పున తగ్గాయి. ఫార్మా షేరు లుపిన్ మినహా సెన్సెక్స్-30లో భాగమైన మిగిలిన షేర్లన్నీ తగ్గుదలతో ముగిశాయి. 25,372 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒకదశలో 24,837 పాయింట్ల వద్దకు పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 516 పాయింట్ల భారీనష్టంతో 24,884 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 156 పాయింట్లు నష్టపోయి 7,603 పాయింట్ల వద్ద ముగిసింది. ఫెడ్ ఎఫెక్ట్... మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయం ప్రపంచ మార్కెట్లను వెన్నాడుతూ ఉంది. ఫెడ్ గత సమావేశపు మినిట్స్ బుధవారం వెల్లడికానున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు క్షీణించడం కూడా ఇక్కడి ట్రేడింగ్‌పై ప్రభావం చూపింది. పైగా మార్చి నెలలో పెట్టుబడుల జోరుతో పోలిస్తే గత కొద్దిరోజుల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు నెమ్మదించాయని, నగదు మార్కెట్లో లావాదేవీలు తగ్గాయని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. తాజా లాభాల స్వీకరణకు ఇది కూడా ఒక కారణమని ఆయన విశ్లేషించారు. బ్యాంకింగ్ షేర్లతో పాటు అదాని పోర్ట్స్ 6.23 శాతం, భారతీ ఎయిర్టెల్ 5.03 శాతం, టాటా మోటార్స్ 4.52 శాతం, బీహెచ్ఈఎల్ 3.67 శాతం, మారుతి 3.66 శాతం, ఎల్ అండ్ టీ 3.30 శాతం, కోల్ ఇండియా 3.26 శాతం, ఎన్టీపీసీ 3.09 శాతం చొప్పున తగ్గాయి. రంగాలవారీగా బీఎస్ఈ టెలికం సూచీ అన్నింటికంటే ఎక్కువగా 3.71 శాతం తగ్గగా, బ్యాంకింగ్ సూచి 3.21 శాతం, ఆటో 2.84 శాతం చొప్పున తగ్గాయి. ట్రేడయిన మొత్తం షేర్లలో 1,631 షేర్లు క్షీణించగా, 882 షేర్లు లాభపడ్డాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపుపై అనిశ్చితి కారణంగా ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. జపాన్ నికాయ్ 2.42 శాతం తగ్గగా, హాంకాంగ్, సింగపూర్ సూచీలు 0.8-1.57 శాతం మధ్య క్షీణించాయి. యూరప్‌లోని కీలక ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ సూచీలు 1.5-3 శాతం మధ్య తగ్గాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా సూచీలు తగ్గుదలతో ట్రేడవుతున్నాయి. -
ఇకపై రుణ రేటుకు ప్రాతిపదిక కొత్త డిపాజిట్ రేటే
♦ మూడేళ్ల వరకూ స్థిర రేటు రుణంపై కూడా ఆదే పద్ధతి ♦ బ్యాంకింగ్‌కు ఆర్బీఐ తాజా ఆదేశం ముంబై: ఇక నుంచి కొత్త డిపాజిట్ రేటు ప్రాతిపదికన బ్యాంకు రుణాల వడ్డీ రేటు వుంటుంది. దీంతో ఆర్బీఐ చేసే రేట్ల మార్పు వెనువెంటనే బ్యాంకుల రుణ రేట్లలో కన్పిస్తుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీచేసిన ఆదేశాలు వచ్చే నెల ఆరంభం నుంచీ అమలవుతాయి. ఇప్పటివరకూ బ్యాంకులు వాటి పాత డిపాజిట్ వ్యయాలు, ఇతర నిధుల సేకరణ వ్యయాలన్నింటినీ పరిగణన లోకి తీసుకుని రుణాలపై రేట్లను నిర్ణయిస్తున్నాయి. దాంతో ఆర్బీఐ రెపో రేటును తగ్గించినంత మేర బ్యాంకులు రుణాల రేట్లను తగ్గించడం లేదు. దాంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచీ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్) విధానాన్ని అనుసరించాలంటూ గత డిసెంబర్లో ఆర్బీఐ మార్గదర్శకాలు జారీచేసింది. అయితే ఈ పద్ధతి నుంచి స్థిర రేటు రుణాలకు అప్పట్లో మినహాయింపునిచ్చింది. ఫ్లోటింగ్ రేటు రుణాల రేటు మాత్రమే ఎంసీఎల్ఆర్ విధానం ప్రకారం అమలుకావాల్సివుంది. కానీ తాజాగా మంగళవారం ఆ మార్గదర్శకాల్లో స్వల్పమార్పు చేస్తూ మూడేళ్లవరకూ కాలపరిమితిగల స్థిర రేటు రుణంపై వడ్డీ రేటును కూడా ఎంసీఎల్ఆర్ ఆధారంగానే నిర్ణయించాలని బ్యాంకుల్ని ఆదేశించింది. మూడేళ్ల కాలపరిమితిపైబడిన స్థిర రేటు రుణాలపై వడ్డీ రేటును పాత పద్ధతి ప్రకారమే బ్యాంకులు నిర్ణయించుకోవొచ్చు. ప్రతి నెలా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండింగ్ ప్రాతిపదికన బ్యాంకులు ఒక స్థిర రుణ రేటును నిర్ణయిస్తాయి. కొత్త డిపాజిట్లపై ఆఫర్ చేస్తున్న వడ్డీరేటు ప్రాతిపదికన ఎంసీఎల్ఆర్ నిర్ణయమవుతుంది. పలు బ్యాంకులు ప్రస్తుతం తాజా డిపాజిట్ల ప్రాతిపదికన కాకుండా... స్థూల డిపాజిట్ల ప్రాతిపదికన రుణ రేటును నిర్ణయిస్తున్నాయి. తాజా నిర్ణయం వల్ల రెపో ద్వారా (బ్యాంకులకు తాను ఇచ్చే స్వల్పకాలిక నిధులపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ- ప్రస్తుతం 6.75 శాతం) తనకు అందిన ప్రయోజనాన్ని బ్యాంకింగ్ త్వరితగతిన వినియోగదారుకు బదలాయించినట్లవుతుంది. అలాగే వడ్డీరేటు విధానంలో మరింత పారదర్శకతకు సైతం తాజా విధానం దోహదపడుతుంది. రుణ రేటు మార్కెట్ రేటుకు అనుసంధానమవుతుంది. కాగా మూడేళ్లు దాటిన తరువాత స్థిర రుణ రేటుకు ఎంసీఎల్ఆర్ నుంచి మినహాయింపు లభిస్తోంది. నిజానికి డిసెంబర్లో జారీచేసిన మార్గదర్శకాల్లో ఎంసీఎల్ఆర్ విధానం నుంచి స్థిర రుణ రేటును మినహాయించారు. అయితే ఈ విధానంలో మార్పు చేస్తూ... ఆర్బీఐ బ్యాంకింగ్‌కు తాజా ఆదేశాలు జారీ చేసింది. -
నేటి పత్రాలు.. రేపటి నోట్లు
ఉమన్ ఫైనాన్స్ సామాన్య ప్రజల్లో పొదుపు అలవాటును పెంపొందించి ఆ పొదుపు సొమ్మును దేశ ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే మార్గంలో పెట్టుబడి పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్’ (ఎన్.ఎస్.సి.) స్కీమును ప్రారంభించింది. ఈ స్కీమును పోస్ట్ ఆఫీసు ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది. ఇందులో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వారు ఈ స్కీములో పెట్టిన పెట్టుబడికి సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపును కూడా ఇస్తున్నారు. ఎన్.ఎస్.సి. స్కీములు ప్రస్తుతం ఎన్నారైలు, హెచ్.యు.ఎఫ్. (హిందూ అన్డివెడైడ్ ఫ్యామిలీ) లు పెట్టుబడి పెట్టడానికి వీలుకాదు. ఒకవేళ ఎన్నారై కాకముందు పెట్టుబడి పెట్టి ఉన్నట్లయితే ఆ పెట్టుబడి కొనసాగుతుంది. కాల పరిమితి ముగిసిన తర్వాత వాపసు తీసుకోవాలి. ఎన్.ఎస్.సి. లను మూడు పద్ధతుల్లో కలిగి ఉండొచ్చు. సింగిల్ హోల్డర్ (వ్యక్తిగతంగా లేదా మైనరు తరఫున జాయింట్ హోల్డర్ (ఎ) : జాయింటుగా ఇద్దరి పేరు మీద తీసుకుని, కాల పరిమితి ముగిసిన తరువాత ఈ మొత్తాన్ని ఇద్దరి పేరు మీద జాయింట్‌గా పొందవచ్చు. జాయింట్ హోల్డర్ (బి) : జాయింటుగా ఇద్దరి మీద పొందవచ్చు. అలాగే మెచ్యూరిటీ మొత్తాన్ని జాయింట్ హోల్డర్స్ ఏ ఒక్కరి పేరు మీదనైనా పొందవచ్చు. ఎన్.ఎస్.సి. వివరాలు - నిర్వహణ ఎన్.ఎస్.సి.లలో కనీస మొత్తం 100 రూపాయల నుంచి ఎంత మొత్తం వరకైనా పెట్టుబడి పెట్టవచ్చు. కానీ పన్ను మినహాయింపు మాత్రం ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 సి లో పొందు పరిచిన మొత్తం వరకు మాత్రమే వర్తిస్తుంది.వీటిని 100, 500, 1,000, 10,000 రూపాయల విలువ కలిగిన సర్టిఫికెట్స్ రూపేణా అందజేస్తారు. ఒక వ్యక్తి ఎన్ని సర్టిఫికెట్స్ అయినా పొందవచ్చు. టి.డి.ఎస్. వర్తించదు. నామినీని పొందుపరిచే సదుపాయం కూడా ఉంది. నామినీని ముందే సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు గానీ, ఎన్.ఎస్.సి.ని పొందిన తర్వాత గానీ నమోదు చేయవచ్చు. ఒకవేళ గడువు తీరకముందే ఎన్.ఎస్.సి. తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆ సర్టిఫికెట్ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు.ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్‌ను కొల్లేటరల్గా (తనఖా) పెట్టి బ్యాంకుల నుండి లోన్ పొందే సదుపాయం కూడా ఉంది.ఎన్.ఎస్.సి.ల వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.5 శాతం చొప్పున అందజేస్తున్నారు. ఎన్.ఎస్.సి. తీసుకున్నప్పుడు ఏ వడ్డీ రేటు అయితే ఉంటుందో ఆ కొన్న ఎన్.ఎస్.సి.కి అప్పటి వడ్డీ రేటే అమలు చేయడం జరుగుతుంది. ► ప్రతి సంవత్సరం వచ్చే వడ్డీ రీ ఇన్వెస్ట్ అవుతున్నప్పటికీ ఆ వడ్డీకీ పన్ను వర్తించదు. ► ఎన్.ఎస్.సి కొన్న తర్వాత కాల పరిమితి లోపల ఒకే ఒక్కసారి వేరే వ్యక్తి పేరిట మార్చుకునే అవకాశం ఉంటుంది. ► ఎన్.ఎస్.సి.లను ఒక పోస్టాఫీసు నుండి ఇంకో పోస్టాఫీసుకు మీ సౌలభ్యం ప్రకారం మార్చుకోవచ్చు. ► ఏవైనా కారణాల వల్ల మీరు ఎన్.ఎస్.సి. పోగొట్టుకున్నట్లయితే డూప్లికేట్ సర్టిఫికేట్‌ని పొందవచ్చు. ► రిస్క్ తక్కువగా ఉండి ఒక నిర్ణీత మొత్తాన్ని పొందగోరేవారు ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్‌ని నెల నెల కొంటూ, కాల పరిమితిముగిసిన తర్వాత ఆ మొత్తాన్ని రీ ఇన్వెస్ట్ చేసినట్లయితే తమ రిటైర్మెంట సమయానికి ఒక మంచి మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. రజని భీమవరపుఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
‘పొదుపు’పై పిడుగు..!
సామాన్యుడికి కేంద్రం షాక్.. ♦ పీపీఎఫ్‌పై వడ్డీరేటు 8.7% నుంచి 8.1%కి తగ్గింపు ♦ సుకన్య సమృద్ధి, సీనియర్ సిటిజన్, ♦ కిసాన్ వికాస్ పత్ర యోజనలపై సైతం రేటు కోత ♦ మరికొన్ని చిన్నమొత్తాల పొదుపులపై కూడా... ♦ ఏప్రిల్ 1 నుంచీ కొత్త రేట్లు అమలు న్యూఢిల్లీ: సామాన్యుడి పొదుపుపై మళ్లీ దెబ్బపడింది. బ్యాంకు డిపాజిట్లకంటే కాస్త మెరుగైన రాబడికి, విశ్వసనీయతకు తగిన పొదుపు సాధనాలుగా ప్రజలు ఎంచుకునే చిన్న మొత్తాల పొదుపు వడ్డీ రేట్లపై ప్రభుత్వం బాగా కోత విధించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)సహా చిన్న పొదుపులపై చెల్లించే వడ్డీరేటును శుక్రవారం మరోసారి కేంద్రం తగ్గించింది. మార్కెట్ రేటుకు అనుసంధానం చేస్తూ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించాలని ఫిబ్రవరి 16న తీసుకున్న నిర్ణయంలో భాగంగా... తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత సమీక్ష సందర్భంలో సామాజిక భద్రతా పథకాలుగా పేర్కొన్న సుకన్యా సమృద్ధి యోజన, ఐదేళ్లసీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి ప్రజాదరణ పథకాలపై సైతం ఈ దఫా వడ్డీరేటు కోత వేటు పడ్డం గమనార్హం. ఈ పథకాల వడ్డీ రేట్లను ముట్టుకోబోమంటూ చెప్పిన ప్రభుత్వం వాటి వడ్డీ రేట్లను సైతం దించేయడం సామాన్యుని పొదుపు రేటుపై మరో శరాఘాతమేనన్న విమర్శలు తలెత్తుతున్నాయి. తాజా రేటు ఏప్రిల్ 1-జూన్ 30 వరకూ అమలవుతుంది. వివిధ పథకాలపై తాజా రేట్లు ఇవి... పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై రేటు 8.7 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గింది. ♦ కిసాన్ వికాస్ పత్రపై రేటు 8.7 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గింది. కిసాన్ వికాస పత్రలో మదుపులు ప్రస్తుతం 100 నెలలకు (ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలలు) రెట్టింపు అవుతుండగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ కాలం 110 (తొమ్మిది సంవత్సరాల రెండు నెలలు) నెలలకు పెరిగింది. ♦ తపాలా సేవింగ్స్‌పై రేటు 4 శాతంగా కొనసాగుతుంది. ప్రజాదరణ కలిగిన ఐదేళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్‌పై వడ్డీ 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గింది. ఐదేళ్ల ప్రస్తుత మంత్లీ ఇన్కమ్ అకౌంట్ రేటు సైతం 8.4 శాతం నుంచి 7.8 శాతానికి దిగింది. పోస్టాఫీస్ ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై సైతం రేటు తగ్గింది. ప్రస్తుతం వీటిపై 8.4 శాతం వడ్డీ వస్తుండగా... ఏప్రిల్ 1 నుంచి ఏడాది టర్మ్ డిపాజిట్‌పై 7.1 శాతం, రెండేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.2 శాతం, మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.4 శాతం వడ్డీ అందుతుంది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై రేటు 8.5 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గింది. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై రేటు 8.4 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది. ♦ సామాజిక అభివృద్ధి పథకంగా పేర్కొని, గత సమీక్ష సందర్భంగా మినహాయించిన కీలక సుకన్యా సమృద్ధి యోజనపై సైతం రేటు కోత పడింది. ఈ రేటు 9.2 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గింది. ♦ గత సమీక్ష సందర్భంగా మినహాయింపు పొందిన ఐదేళ్లసీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌దీ ఇదే పరిస్థితి. ఈ రేటు 9.3 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గించింది. ♦ ఒకటి, రెండు, మూడు సంవత్సరాలకు సంబంధించి పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లు, కిసాన్ వికాస పత్రాలు, ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై ఇప్పటి వరకూ... ఇదే కాలాలకు సంబంధించి ప్రభుత్వ బాండ్లకన్నా అదనంగా పావుశాతం రేటు అందుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ ప్రయోజనం ఏప్రిల్ 1 నుంచి మదుపుదారుకు అందదు. ♦ ఫిబ్రవరి 16 ‘త్రైమాసిక సమీక్ష’ నిర్ణయం సందర్భంగా షార్ట్ టర్మ్ పోస్టాఫీస్ డిపాజిట్లపై 0.25 శాతం రేటు తగ్గించినట్లు ప్రకటించిన ప్రభుత్వం, సామాజిక భద్రతా పథకాల పేరుతో దీర్ఘకాల పథకాలు బాలికా, సీనియర్ సిటిజన్, ఎంఐఎల్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ పీపీఎఫ్‌లపై మాత్రం వడ్డీరేటు కోత నిర్ణయాన్ని తీసుకోలేదు. క్వార్టర్‌కు దాదాపు 15 రోజుల ముందు ఈ రేట్ల సమీక్ష జరుగుతుందని ఫిబ్రవరి 16న ప్రభుత్వం ప్రకటించింది. రేట్ల తాజా నిర్ణయానికి క్రితం 3 నెలల ప్రభుత్వ బాండ్ రేట్ల ప్రాతిపదికన (ఉదాహరణకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి) ఈ సమీక్ష జరుగుతుంది. ♦ చిన్న మొత్తాల పొదుపు స్కీమ్‌ల ద్వారా రానున్న ఆర్థిక సంవత్సరం కేంద్రం రూ. 4 లక్షల కోట్లు సేకరించగలుగుతుందని అంచనా. వీటిపై చెల్లించే వడ్డీరేట్ల తాజా తగ్గింపు వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ. 4 వేల కోట్లు ఆదా అవుతుందని అంచనా. -
సామాన్యులకు చేదువార్త
న్యూఢిల్లీ: వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం చేదువార్త అందించింది. చిన్న మొత్తాలపై వడ్డీలు తగ్గించి సామాన్యులకు షాక్ ఇచ్చింది. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్), కిసాన్ వికాస పత్రం(కేవీపీ) వడ్డీ రేట్లలో భారీగా కోత పెట్టింది. పీపీఎఫ్ పై వడ్డీ రేటు 8.7 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది. కేవీపీ వడ్డీ రేటును 8.7 శాతం నుంచి 7.8 శాతానికి కుదించింది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి వడ్డీరేట్లను సవరించాలని ఫిబ్రవరి 16న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా తాజాగా వడ్డీరేట్లను సవరించింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ఈ వడ్డీరేట్లు అమల్లో ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిగతా పొదుపు పథకాలకు భారీగా వడ్డీరేటు కోత విధించింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ పై వడ్డీరేటు 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది. బాలికల కోసం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజనకు వడ్డీరేటును 9.2 శాతం నుంచి 8.6 శాతానికి పరిమితం చేసింది. వృద్ధుల ఐదేళ్ల పొదుపు ఖాతాల వడ్డీకి కోత పెట్టింది. ఇప్పటివరకు సీనియర్ సిటిజన్లకు 9.3 శాతం వడ్డీ వస్తుండగా ఏప్రిల్ 1 నుంచి 8.6 శాతం వడ్డీ మాత్రమే దక్కనుంది. -
మార్కెట్ కు బడ్జెట్ బూస్ట్..
♦ బడ్జెట్ తరువాతి రోజు అతిపెద్ద ర్యాలీ... ఇదే ♦ సెన్సెక్స్ 777 పాయింట్లు జూమ్.. 23,779 వద్ద ముగింపు ♦ ఒకే రోజు ఇంతలా లాభపడటం ఏడేళ్లలో ఇదే తొలిసారి... ♦ 235 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ; 7,222 వద్ద క్లోజ్ ♦ వడ్డీరేట్ల కోతపై పెరిగిన ఆశలు; చైనా పాలసీ ఉద్దీపన ప్రభావం కూడా ♦ ఒక్కరోజే రూ.2.5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు... ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న ఆశలు దేశీ స్టాక్ మార్కెట్లను పరుగులు పెట్టించాయి. ద్రవ్యలోటు కట్టడి లక్ష్యానికి కట్టుబడతామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం దీనికి ప్రధాన కారణం. మరోపక్క... చైనా సెంట్రల్ బ్యాంక్ పాలసీ సడలింపుతో ప్రపంచ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగింది. ఈ పరిణామాల ప్రభావంతో సెన్సెక్స్ 777 పాయింట్లు దూసుకెళ్లింది. భారత్ స్టాక్ మార్కెట్ చరిత్రలో బడ్జెట్ తర్వాత ఇంత భారీ ర్యాలీ ఇదే తొలిసారి. అంతేకాదు, గడిచిన ఏడేళ్లలో ఒక్కరోజులో సెన్సెక్స్ ఇంతలా లాభపడటం కూడా ఇదే మొదటిసారి. మొత్తంమీద మంగళవారం ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.2.5 లక్షల కోట్లు దూసుకెళ్లి... మన మార్కెట్లలో ‘మంగళ’వారం ఆనందాన్ని నింపింది. ముంబై: బడ్జెట్ రోజు తీవ్ర ఊగిసలాటకు గురైన మన మార్కెట్లలో మళ్లీ బుల్ ఉరకలేసింది. మంగళవారం ట్రేడింగ్ ఆరంభం నుంచే లాభాలతో మొదలైన బీఎస్ఈ సెన్సెక్స్... ఆ తర్వాత మరింత జోరందుకుంది. ఎఫ్ఎంసీజీ, వాహన, రియల్టీ షేర్ల దూకుడుతో ఒకానొక దశలో సెన్సెక్స్ క్రితం ముగింపు 23,002 పాయింట్లతో పోలిస్తే 819 పాయింట్లు ఎగిసి 23,821 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 777 పాయింట్లు లాభంతో(3. 38%) 23,779 వద్ద స్థిరపడింది. 2009 మే18న ఒకే రోజు సెన్సెక్స్ 2,111 పాయింట్లు పెరగగా... మళ్లీ ఒక్కరోజులో అతిపెద్ద లాభం ఇదే కావడం విశేషం. నిఫ్టీ కూడా 235 పాయింట్లు దూసుకెళ్లి(3.37%) 7,222 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ పుంజుకోవడం కూడా మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. ఇటీవల తీవ్రంగా పతనమైన కొన్ని షేర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు, షార్ట్ కవరింగ్ కూడా తాజా ర్యాలీకి దన్నుగా నిలిచిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. జోష్ నింపిన ‘ద్రవ్యలోటు’... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును (జీడీపీతో పోలిస్తే) 3.9 శాతానికి పరిమితం చేస్తూనే... వచ్చే ఏడాది 3.5 శాతం లక్ష్యానికి కట్టుబడి ఉంటామన్న ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రకటన మార్కెట్లలో ప్రధానంగా జోష్ నింపింది. బడ్జెట్ చాలా సమతూకంతో ఉందని.. ప్రభుత్వం మార్కెట్ల నుంచి రుణ సమీకరణను తగ్గించుకోనుండటంతో ఆర్బీఐకి వడ్డీరేట్ల తగ్గింపునకు ఆస్కారం లభించనుందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణకు మోదీ సర్కారు పెద్దపీట వేయడం ఇన్వెస్టర్లలో రేట్ల కోతపై ఆశలు పెంచిందని ఆయన పేర్కొన్నారు. మరోపక్క, బడ్జెట్ సానుకూలతతో ప్రస్తుత ఏడాది ఆర్బీఐ అర శాతం పాలసీ వడ్డీరేటు(రెపో రేటు) అర శాతం మేర తగ్గించే అవకాశం ఉందని అంతర్జాతీయ బ్రోకరేజి దిగ్గజం యూబీఎస్ రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. మరోపక్క, ఇన్ఫ్రా రంగానికి అధిక నిధుల ప్రభావంతో స్టీల్ రంగ షేర్లు పుంజుకున్నాయి. ఇతర ముఖ్యాంశాలివీ... ♦ బీఎస్ఈ సెన్సెక్స్ 30 షేర్ల జాబితాలో 27 స్టాక్స్ లాభాలతో ముగిశాయి. ♦ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ అత్యధికంగా 10 శాతం మేర ఎగబాకి రూ. 325 వద్ద ముగిసింది. ఇక అధికంగా లాభపడిన వాటిలో ఐసీఐసీఐ బ్యాంక్(7.75%), మారుతీ సుజుకీ(7.8%), హీరో మోటోకార్ప్(6.7%), అదానీ పోర్ట్స్(5.3%), గెయిల్(5%), టాటా మోటార్స్(5%), యాక్సిస్ బ్యాంక్(4.4%), టీసీఎస్(4.3%), ఎల్అండ్టీ(4.12%), ఇన్ఫోసిస్(3.76%), ఎంఅండ్ఎం(3.22%), టాటా స్టీల్(3.13%), విప్రో(2.9%) వంటివి ఉన్నాయి. ♦ అత్యధికంగా ఎఫ్ఎంసీజీ సూచీ 4.9 శాతం దూసుకెళ్లింది. ఆ తర్వాత కన్సూమర్ డ్యూరబుల్స్ సూచీ 4.37 శాతం, రియల్టీ 4.21 శాతం, ఆటోమొబైల్స్ ఇండెక్స్ 4.19% చొప్పున ఎగబాకాయి. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 3.23 శాతం, మిడ్‌క్యాప్ సూచీ 3.04 శాతం లాభపడ్డాయి. ♦ మంగళవారం ప్రాథమిక గణాంకాల ప్రకారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.2,913 కోట్లను నికరంగా ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐ) రూ.835 కోట్ల నికర విక్రయాలు జరిపారు. ఇన్వెస్టర్ల సంపద రయ్.. స్టాక్ మార్కెట్ జోరుతో ఇన్వెస్టర్ల సంపద కూడా పరుగులు తీసింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) మంగళవారం రూ.2.5 లక్షల కోట్ల మేర ఎగబాకింది. రూ.88.34 లక్షల కోట్లకు చేరింది. చైనా ‘పాలసీ’ జోష్.. మందగమనంలోకి జారిపోతున్న ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చే చర్యల్లో భాగంగా చైనా సెంట్రల్ బ్యాంక్ తాజాగా పాలసీ ఉద్దీపన చర్యలను ప్రకటించింది. రిజర్వ్ రిక్వయిర్మెంట్ రేషియో (ఆర్ఆర్ఆర్ - బ్యాంకులు తమ డిపాజిట్లలో సెంట్రల్ బ్యాంక్ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన నిధుల పరిమాణం)ను మరో అర శాతం తగ్గించి.. 17 శాతానికి చేర్చింది. వ్యవస్థలోకి మరిన్ని నిధులను అందుబాటులోకి తెచ్చింది. ఈ పాలసీ ఉద్దీపనతో షాంఘై ఇండెక్స్ 1.7 శాతం పెరిగింది. ఆసియాలో ఇతర ప్రధాన సూచీలు కూడా లాభాల్లో నిలిచాయి. యూరప్ సూచీలు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. అటు అమెరికా మార్కెట్లు సైతం 1 శాతంపైగా లాభాలతో ట్రేడవుతున్నాయి. 3 వారాల గరిష్టానికి రూపాయి 57 పైసలు అప్, 67.85 వద్ద క్లోజింగ్ ముంబై: దేశీ ఈక్విటీ మార్కెట్లు కోలుకుని బ్యాంకులు, ఎగుమతిదార్లు తాజాగా డాలర్లను విక్రయించడంతో మంగళవారం రూపాయి మారకం విలువ భారీగా పెరిగింది. డాలర్‌తో పోలిస్తే 57 పైసలు బలపడి మూడు వారాల గరిష్టమైన 67.85 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఒక్క రోజులో ఇంత అత్యధికంగా రూపాయి లాభపడటం ఇదే ప్రథమం. విదేశీ మార్కెట్లలో డాలర్ బలహీనంగా ఉండటం కూడా దేశీ కరెన్సీ బలపడటానికి దోహదపడింది. -
పీఎఫ్‌పై వడ్డీరేటు 8.8 శాతానికి పెంపు
త్వరలో 8.9 శాతానికి పెంచే అవకాశం: కేంద్రమంత్రి దత్తాత్రేయ చెన్నై: 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్)పై వడ్డీ రేటును 8.75 శాతం నుంచి 8.80 శాతానికి పెంచినట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. మంగళవారం చెన్నైలో జరిగిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ట్రస్టీల కేంద్ర బోర్డు (సీబీటీ) 211వ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. అనంతరం దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత పెంపు ‘మధ్యంతరమే’నని...దీన్ని మరోసారి సవరించే అవకాశం ఉందన్నారు. వడ్డీ రేటును 8.90 శాతానికి పెంచాలన్న కార్మిక సంఘాల డిమాండ్‌పై చర్చించేందుకు సీబీటీ త్వరలో మరోసారి సమావేశమవుతుందన్నారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకే తాము ప్రాధాన్యత ఇస్తామన్నారు. వడ్డీ రేటును 8.90 శాతినికి పెంచితే ప్రభుత్వం వద్ద ‘మిగులు’ రూ. 285 కోట్లుగా ఉంటుందని...8.8 శాతానికి పెంచినందు వల్ల అది రూ. 673 కోట్లుగా ఉంటుందన్నారు. కాగా, వడ్డీ రేటును 8.95 శాతానికి పెంచాలని...దీనివల్ల ప్రభుత్వం వద్ద రూ. 91 కోట్ల మిగులు ఉంటుందని ఈపీఎఫ్‌వో సలహా సంఘమైన ఆర్థిక, తనిఖీ, పెట్టుబడుల కమిటీ (ఎఫ్ఏఐసీ) సిఫార్సు చేసింది. ఒక పేజీ పెన్షన్ దరఖాస్తు ఫారం విడుదల: సరళీకరించిన పెన్షన్ క్లెయిమ్ ఫారం 10డీ (యూఏఎన్ ఆధారిత)తోపాటు ఒక పేజీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీఓ) నమూనాను దత్తాత్రేయ అంతకుముందు విడుదల చేశారు. ప్రస్తుతమున్న 8 పేజీల పీపీఓ స్థానంలో తాము ప్రవేశపెట్టిన ఒక పేజీ పీపీఓ వల్ల పెన్షన్ జారీ ప్రక్రియ సమయం తగ్గడంతోపాటు ఈపీఎఫ్‌వో సిబ్బందిపై పనిభారం తగ్గుతుందని దత్తాత్రేయ పేర్కొన్నారు. పెన్షన్ క్లెయిమ్ ఫారం 10డీ (యూఏఎన్) ద్వారా కంపెనీల యాజమాన్యాల సంతకం అవసరం లేకుండానే చందాదారులకు ఈపీఎఫ్‌వో నేరుగా పెన్షన్ పొందే సేవను అందించగలడం సాధ్యమవుతుంది. -
చిన్న పొదుపు రేట్ల కోతపై...
ఆచితూచి నిర్ణయం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 7వ వేతన కమిషన్ సిఫారసుల అమలు {దవ్యలోటు లక్ష్యాన్ని నీరుకార్చబోదన్న విశ్వాసం న్యూఢిల్లీ: చిన్న పొదుపు మొత్తాలపై వడ్డీరేటు కోత నిర్ణయాన్ని ఆచితూచి తీసుకుంటామని ఆర్థికమంత్రి శుక్రవారం పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులుసహా పలు వర్గాల ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్న నేపథ్యంలో జైట్లీ తాజా ప్రకటన చేశారు. తన నుంచి రెపో రేటు ప్రయోజనాన్ని యథాతథంగా అమలు చేయాలని ఆర్బీఐ పేర్కొంటుండగా... ఇందుకు చిన్న మొత్తాల పొదుపు డిపాజిట్ రేటు తగ్గాల్సిన పరిస్థితి ఉందని బ్యాంకులు పేర్కొంటున్నాయి. పొదుపురేట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బ్యాంక్ డిపాజిట్ రేట్లు తగ్గించడం సాధ్యపడదని బ్యాంకింగ్ వాదిస్తోంది. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 7.5 శాతం డిపాజిట్ రేటు ఆఫర్ చేస్తుండగా, చిన్న పొదుపుకు సంబంధించిన పలు పొదుపు పథకాలు 8.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొదుపురేట్ల కోతపై కేంద్రం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. హిందుస్తాన్ టైమ్స్ నిర్వహించిన ఒక సదస్సులో జైట్లీ చేసిన ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు... పెట్రోల్, డిజీల్‌పై పెంచిన సెస్ల్ని హైవేల వంటి మౌలిక రంగ ప్రాజెక్టుల ఫండ్‌కు వినియోగిస్తున్నాం. అయితే వేతనాలు, పెన్షన్లపై వెచ్చించే మొత్తం పెరగడం వల్ల సామాజిక రంగంపై అధిక వ్యయపర్చడం సవాలు. ఉదాహరణకు గత ఏడాది ప్రారంభించిన బాలికల సంక్షేమానికి ఉద్దేశించి ప్రారంభించిన (సుకన్యా సమృద్ధి) యోజన విషయంలో 2015-16లో అధికంగా 9.2 శాతం వడ్డీ అమలవుతోంది. ఏడాది తర్వాత ఈ రేటును భారీగా తగ్గించాల్సి రావచ్చు. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎంతో జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ప్రజలు చిన్న తరహా పొదుపు పథకాలపై వచ్చే ఆదాయంపై ఆధారపడుతున్నారు. ఈ రేటుపై నిర్ణయం తీసుకునే సమయంలో ప్రభుత్వం అత్యంత జాగరూకతతో అన్ని అంశాలనూ పరిశీలిస్తుంది. ఏడవ వేతన కమిషన్ సిఫారసుల అమలు వల్ల రానున్న రెండుమూడేళ్లలో వార్షికంగా ఖజానాపై రూ.1.02 లక్షల కోట్ల అదనపు భారం పడుతుంది. జనవరి 1 నుంచీ అమలయ్యే ఈ సిఫారసులవల్ల ద్రవ్యలోటు పెరగదు. తొలి దశలో (జీడీపీలో 2.5 శాతం) సిఫారసుల అమలు కొంత కష్టమే. అయితే ఆర్థికాభివృద్ధి పెరిగే కొలదీ ఈ నిష్పత్తి తగ్గుతుంది. ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5.55 లక్షల కోట్లు (మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో 3.9 శాతం) మించకూడదన్నది బడ్జెట్ లక్ష్యం. 2016-17లో ఈ లక్ష్యాన్ని 3.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది. {పస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి రేటు 7.5 శాతం ఉంటుందని భావిస్తున్నాం. ప్రభుత్వానికి ఆదాయాలు పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రానున్న ఆర్థిక సంవత్సరాల్లో ఈ రేటు మరింత బలపడే అవకాశం ఉంది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) రేటును రాజ్యాంగంలో చేర్చి దీనిపై పరిమితి విధించాలన్న వాదనతో నేను ఏకీభవించను. సిగరెట్లు, మద్యం వంటి హానికర ఉత్పత్తులపై అధిక పన్ను రేటు అవసరం. ఈ పరిస్థితుల్లో ప్రొడక్టులపై ప్రామాణిక జీఎస్టీ రేటును 18 శాతం రేటు పరిమితిని రాజ్యాంగంలో చేర్చాలన్న కాంగ్రెస్ వాదనను ఆమోదించాల్సిన పనిలేదు. -
గృహ రుణం ప్రీపేమెంట్ చేస్తున్నారా?
గృహ రుణం అనేది ఒక్క రోజుతో తీరిపోయేది కాదు. చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు ఈఎంఐలు కట్టడం భారం కావొచ్చు. అలాంటప్పుడు అనుకోకుండా పెద్ద మొత్తం ఎప్పుడైనా చేతికి వస్తే ముందుగా.. గృహ రుణాన్ని ప్రీ-పేమెంట్ చేసి కొంతైనా భారం తగ్గించుకోవాలనుకుంటాం. మరి అలాంటి సందర్భాల్లో ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి? గరిష్టంగా ఎలా ప్రయోజనం పొందవచ్చు? అన్నది తెలియచెప్పేదే ఈ కథనం. అత్యవసర పరిస్థితుల కోసం ప్రణాళిక.. గృహ రుణం అనేది ఒకటి రెండేళ్లలో తీరేది కాదు. దీర్ఘకాలం కొనసాగుతుంది. భవిష్యత్‌లో ఏదైనా ఇతర రుణం తీసుకోవాలన్నా దానిపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఒక భారీ గృహ రుణం ఉన్నందున భవిష్యత్‌లో మరో రుణం తీసుకోవడం కొంత కష్టం కావొచ్చు. గతంలో డిఫాల్ట్ అయిన పక్షంలో ఒకవేళ ఎలాగోలా రుణం దక్కించుకున్నా, వడ్డీ రేటు భారీగా ఉంటుంది. దీనికితోడు రుణం మొత్తం తీరేలోగా ఇతరత్రా ఏవో అత్యవసరాలు వస్తూనే ఉంటాయి. వీటి కారణంగా ఒకోసారి ఈఎంఐల చెల్లింపు కష్టం కూడా కావొచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే.. కనీసం ఆరు నెలల ఈఎంఐ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ గా ఉంచడం గానీ లేదా అవసరమైన వెంటనే నగదుగా మార్చుకోగలిగే వీలు కల్పించే సాధనంలో గానీ ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈ మొత్తం పోగా మిగతా డబ్బును ప్రీపేమెంటు కోసం ఉపయోగించవచ్చు. గృహ రుణాన్ని మరో బ్యాంకుకు బదిలీ చేయడం.. కొన్ని సార్లు మీరు రుణం తీసుకున్న బ్యాంకుకన్నా మరో బ్యాంకు తక్కువ వడ్డీ రేటుపై లోన్లు ఇస్తుంటాయి. అడిగితే ప్రస్తుత బ్యాంకు కూడా వడ్డీ రేటు తగ్గించే అవకాశాలూ ఉన్నాయి. అలా కుదరనప్పుడు మీ లోన్‌ను సదరు బ్యాంకుకు బదలాయించవచ్చు. అయితే ఇలా చేసేటప్పుడు కొత్త బ్యాంకు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు, వర్తించే స్టాంపు డ్యూటీ మొదలైన ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ కొత్త బ్యాంకుకు బదలాయించే ఖర్చులకన్నా తక్కువగా.. కొంత ఫీజుతో ప్రస్తుత బ్యాంకే వడ్డీ రేటు తగ్గించేందుకు ఒప్పుకుంటే, దానితోనే కొనసాగవచ్చు. అనిల్ కొత్తూరి సీఈవో, ఎడెల్వీస్ హౌసింగ్ ఫైనాన్స్ తీర్చే ముందు చూడాల్సిందేమంటే.. * అనుకోకుండా వచ్చిన డబ్బును గృహ రుణానికి ప్రీ-పేమెంట్‌గా చెల్లించే ముందు గమనించాల్సిందేమిటంటే ఒక్కసారి ప్రీ-పే చేసిన తర్వాత ఆ మొత్తాన్ని మళ్లీ వెనక్కి తీసుకోవడం కుదరదు. కాబట్టి ఆ డబ్బు ఇక మన చేతిలో లేనట్లే. ఆ తర్వాతెప్పుడైనా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా, ఇతరత్రా ఏ అవసరాలు వచ్చినా ఆ డబ్బు అందుబాటులో ఉండదు. * కాబట్టి మంచి రాబడినిచ్చే పెట్టుబడి సాధనం ఏదైనా అందుబాటులో ఉంటే.. అందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే రాబడులను .. ప్రీపేమెంటు వల్ల వచ్చే ప్రయోజనాలను బేరీజు వేసుకోవాలి. హోమ్ లోన్ తీర్చేయడం వల్ల వచ్చే ప్రయోజనాల కన్నా ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రాబడి ఎక్కువగా ఉన్న పక్షంలో అటువైపు మొగ్గుచూపడం ఉత్తమం. దీనివల్ల ఆర్థిక ప్రయోజనంతో పాటు ఇతరత్రా అవసరాలేమైనా తలెత్తినప్పుడు ఉపయోగించుకోవడానికి మన డబ్బు కూడా మనకు అందుబాటులో ఉంటుంది. * ఫిక్స్డ్ రేటుపై తీసుకున్న రుణాన్ని ముందస్తుగా చెల్లించేస్తే.. ప్రీపేమెంట్ పెనాల్టీ కట్టాల్సి రావొచ్చు. కనుక, దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. * ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నాక కూడా రుణాన్ని ప్రీపేమెంటు చేయదల్చుకున్న పక్షంలో రీషెడ్యూలింగ్‌కి సంబంధించి మీ ముందు రెండు చాయిస్‌లు ఉంటాయి. మొదటిదేంటంటే.. నెలవారీ ఈఎంఐ మొత్తాన్ని ఇప్పుడు కడుతున్నంతే చెల్లింపులు కొనసాగించడం. దీనివల్ల ముందుగా నిర్దేశించుకున్న గడువుకన్నా ముందే మీ రుణం తీరుతుంది. రెండోది ప్రతి నెలా కట్టే ఈఎంఐ పరిమాణాన్ని కొంత తగ్గించుకోవడం. తద్వారా ముందుగా పెట్టుకున్న గడువు నాటికి రుణం తీరుతుంది. అయితే, కట్టాల్సిన ఈఎంఐ భారం కొంత తగ్గుతుంది. * పెరిగే నెలవారీ ఖర్చుల కోసం మరింత డబ్బు అవసరమవుతున్న పక్షంలో రెండో చాయిస్‌ను ఎంచుకోవచ్చు. అలా కాని పక్షంలో యథాప్రకారంగా అదే ఇన్స్టాల్మెంట్ కొనసాగిస్తూ రుణా న్ని గడువుకు ముందుగానే తీర్చేయవచ్చు. -
ఐడీఎఫ్సీ బ్యాంకు ప్రారంభం
ముంబై: దేశీయంగా 91వ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుగా ఐడీఎఫ్సీ బ్యాంకు గురువారం కార్యకలాపాలు ప్రారంభించింది. మధ్యప్రదేశ్‌లో 15 బ్రాం చీలు సహా మొత్తం 23 శాఖలతో బ్యాంకు సేవలు మొదలయ్యాయి. కార్పొరేట్, హోల్‌సేల్ బ్యాంకిం గ్‌తో పాటు గ్రామీణ బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం బ్యాంకులో 1,200 మంది ఉద్యోగులు ఉన్నారు. హైదరాబాద్‌తో పాటు చెన్నై తదితర ప్రాంతాల్లో హోల్‌సేల్, కార్పొరేట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు అందించే ఏడు శాఖలు ఉన్నట్లు బ్యాంకు వెబ్సైట్లో పేర్కొంది. దీని ప్రకారం రూ. 1 కోటి పైబడిన సేవింగ్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6 శాతంగా, ఏడాది కాలవ్యవధి గల డిపాజిట్లపై రేటు 8 శాతంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు అరశాతం అధికంగా లభిస్తుంది. పర్సనల్ బ్యాంకింగ్‌కు సంబంధించి ఏ ఏటీఎంలలోనైనా లావాదేవీలు, ఫండ్ ట్రాన్స్ఫర్లు, లైఫ్‌టైమ్ డెబిట్ కార్డులు ఉచితంగా అందిస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది. చెక్కుకు బౌన్సులకు తప్ప ఇతరత్రా ఏ లావాదేవీకి చార్జీలు విధించబోవడం లేదని వివరించింది. బంధన్, ఐడీఎఫ్‌సీలు కొత్తగా బ్యాంకింగ్ లెసైన్సులు పొందిన సంగతి తెలిసిందే. బంధన్ ఇప్పటికే బ్యాంకింగ్ కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఐడీఎఫ్సీ 13 శాతం డౌన్: మౌలిక రంగ రుణ సంస్థ ఐడీఎఫ్సీ, ఐడీఎఫ్సీ కంపెనీగా, ఐడీఎఫ్సీ బ్యాంక్‌గా విడిపోయిన తర్వాత దాదాపు 13 శాతం క్షీణించింది. ఈ డీ మెర్జర్‌ను పరిగణనలోకి తీసుకోకుంటే బుధవారం నాటి ముగింపు ధర(రూ.141)తో పోల్చితే ఈ షేర్ 57 శాతం నష్టపోయినట్లయింది. డీ మెర్జర్ ప్రణాళిక ప్రకారం ఐడీఎఫ్సీ బ్యాంక్ ఆ తర్వాత స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అవుతుంది. బీఎస్ఈలో రూ.69 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైన ఐడీఎఫ్సీ షేర్ చివరకు 13 శాతం (ప్రారంభ ధరను పరిగణనలోకి తీసుకుంటే) నష్టంతో రూ.60 వద్ద ముగిసింది. ఒక్కో ఐడీఎఫ్సీ షేర్‌కు, ఒక ఐడీఎఫ్సీ, ఒక ఐడీఎఫ్సీ బ్యాంక్ షేర్లను కేటాయిస్తారు. ఈ డీమెర్జర్ స్కీమ్‌కు ఈ నెల 5ను రికార్డ్ తేదీగా కంపెనీ నిర్ణయించింది. -
ముద్రా రుణ లక్ష్యం రూ.1.22 లక్షల కోట్లు
♦ ఇప్పటి వరకూ రూ.24 వేల కోట్ల రుణ పంపిణీ ♦ మెగా రుణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్థికమంత్రి జైట్లీ న్యూఢిల్లీ : చిన్న మధ్య తరహా వ్యాపారాలకు ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి (మార్చి 2016) రూ.1.22 లక్షల కోట్ల రుణ పంపిణీ లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన నాటి నుంచి ఈ యోజన కింద ఇప్పటికి 37 లక్షల మంది చిన్న వ్యాపారస్తులకు దాదాపు రూ.24,000 కోట్ల రుణ పంపిణీ జరిగింది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ విషయాలను వెల్లడించారు. ఈ రుణ పంపిణీ ద్వారా లక్షలాది ఉపాధి అవకాశాలు సృష్టించాలన్నది కేంద్రం ప్రధాన లక్ష్యమని వివరించారు. దీనదయాళ్ ఉపాధ్యాయ 99వ జయంతిని పురస్కరించుకుని పీఎంఎంవై కింద వారం రోజుల మెగా రుణ కార్యక్రమాన్ని అరుణ్‌జైట్లీ శుక్రవారం ప్రారంభించారు. రుణం సౌలభ్యం అందక ఇబ్బంది పడుతున్న చిన్న పరిశ్రమలకు చేయూతను ఇవ్వడానికి ముద్రా (చిన్న పరిశ్రమల అభివృద్ధి, రీఫైనాన్స్ సంస్థ) యోజన ఆవిష్కరణ జరిగింది. నేటి నుంచీ వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా పలు బ్యాంకులు ఈ రుణ పంపిణీకి సంబంధించి మెగా క్యాంప్‌ను నిర్వహించనున్నాయి. తగిన వడ్డీరేటుకు రుణం అందుకోవడం ద్వారా చిన్న తరహా వ్యాపారస్తులు స్వయం సంపదను ఆర్జించడానికి ఈ పథకం దోహదపడుతుందని జైట్లీ ఈ సందర్భంగా పేర్కొన్నారు ముద్రా పథకం కింద 1.75 కోట్ల చిన్న వ్యాపారులకు రుణం అందజేయాలన్నది కేంద్ర లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి పలువురు వ్యాపారస్తులకు రుణ మంజూరీ లేఖలను అందజేశారు. శిశు (రూ.50,000 వరకూ) కిశోర్ (రూ.50,000-రూ.5 లక్షల వరకూ), తరుణ్ (రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ) పేర్లతో మూడు కేటగిరీల కింద ముద్రా యోజన కింద రుణాలు మంజూరవుతాయి. కాగా, ఇప్పటికి ముద్రా కార్యక్రమం కింద 1.24 లక్షల కొత్త అకౌంట్లు ప్రారంభించి... రూ.938 కోట్ల రుణ పంపిణీ జరిపినట్లు పీఎన్బీ ఎండీ ఉషాసుబ్రమణ్యం తెలిపారు. -
ఫెడ్ రేటు పెరిగితే మన కంపెనీలపై ప్రభావం స్వల్పమే!
ఇండియా రేటింగ్స్ నివేదిక! నేడే రేట్ల పెంపుపై నిర్ణయం న్యూఢిల్లీ : అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడరల్ రిజర్వ్ గురువారం ఫెడ్ ఫండ్స్ రేటు పెంపుపై ఒక నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో.. దీని ప్రభావాలను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు, ఆర్థిక, రేటింగ్ సంస్థలు విశ్లేషించుకుంటున్నాయి. భారత్ విషయానికి వస్తే- కేవలం 2.6 శాతం పెద్ద కంపెనీలకు మాత్రమే లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలు తలెత్తుతాయని ఇండియా రేటింగ్స్ తన తాజా సర్వేలో పేర్కొంది. గురువారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పస్తుతం 0-0.25 శాతం వున్న ఫెడ్ ఫండ్స్ రేటును పెంచే అంశంపై భిన్న వాదనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థకు ఊపును అందించే లక్ష్యంతో 2008 ఆర్థిక సంక్షోభ సమయం నుంచీ అమెరికా జీరోస్థాయి వడ్డీరేటు వ్యవస్థను కొనసాగిస్తోంది. ఇప్పుడు అమెరికా పరిస్థితులు మెరుగుపడ్డంతో ఈ రేటు పెంచవచ్చని ఒకపక్క ఊహాగానాలు ఉన్నాయి. అయితే ప్రపంచ క్లిష్ట ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ రేటు పెంచకపోవచ్చన్న వాదనా ఉంది. -
ఫెడ్ రేటు పెరిగితే భారత్‌కు మంచిదే
ముంబై: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు పెంచితే భారత్‌కు సానుకూలమేనని ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మిరిల్ లించ్ (బీఓఏ-ఎంఎల్) శుక్రవారం విడుదల చేసిన తాజా నివేదికలో తెలిపింది. ఫెడ్ నిర్ణయం ఆలస్యం అయిన కొద్దీ దేశంలోకి పెట్టుబడుల ప్రవాహంలో ప్రతిష్టంభన ఉంటుందని, తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడతాయని కూడా నివేదిక విశ్లేషించింది. సెప్టెంబర్ 17 సమావేశం తరువాత అమెరికా ఫెడ్ వడ్డీరేటు 25 బేసిస్ పాయింట్లు (పావు శాతం) పెంచే అవకాశం ఉందని తెలిపింది. -
అప్పులున్నా గొప్పగానే!
పెరిగిన రాష్ట్ర రుణ పరపతి * వడ్డీ రేటు రాష్ట్రానికే తక్కువ * దేశంలో చేబదులు తీసుకోని రాష్ట్రాలు రెండే.. * అందులో ఒకటి గుజరాత్.. రెండోది తెలంగాణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రుణ పరపతి పెరిగింది. రెండో ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు రూ. 7,000 కోట్లు అప్పు చేసింది. కొత్త రాష్ట్రమైనప్పటికీ... అన్ని రంగాల్లో వడివడిగా అడుగులు వేస్తుండటం.. తొలి ఏడాదితో పోలిస్తే రెండో ఏడాది సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దూసుకుపోవటంతో రుణ పరపతి పెరిగిందని ఆర్థిక శాఖ విశ్లేషిస్తోంది. ఆర్బీఐ నిర్వహించే వేలంలో తెలంగాణకు తక్కువ వడ్డీ రేటుకు అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు పోటీ పడుతున్నాయి. అందుకే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అత్యల్ప వడ్డీ రేటుకు ఈ అప్పులు తెచ్చుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రతి నెలలో రెండు సార్లు తమ దగ్గరున్న సెక్యూరిటీలను వేలం వేసి అప్పులు తీసుకునేందుకు రిజర్వు బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ఆర్బీఐ రాష్ట్రాల సెక్యూరిటీలను వేలం వేసింది. అందులో ఆరు సార్లు రాష్ట్రం తనసెక్యూరిటీలను పెట్టి అప్పు తెచ్చుకుంది. ఏప్రిల్‌లో రూ. 1,000 కోట్లు, మే నెలలో రూ. 1,348 కోట్లు, జూన్‌లో రూ. 1,300 కోట్లు అత్యధికంగా జూలై నెలలో రూ. 2,500 కోట్లు, ఆగస్టులో రూ. 800 కోట్లు అప్పు తెచ్చింది. ఒక్కోసారి ఒక్కో వడ్డీ రేటు నమోదైనప్పటికీ.. గరిష్ఠంగా 8.26 శాతం వడ్డీ రేటుకు రుణం తీసుకున్నట్లుగా ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. దేశీయ మార్కెట్లో తెలంగాణపై పెట్టుబడిదారులకు, రుణ సంస్థలకు ఉన్న నమ్మకానికి ఈ రేటింగ్ అద్దం పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం దేశంలో మిగులు రాష్ట్రాల జాబితాలో గుజరాత్ తర్వాత స్థానంలో ఉండటం కూడా అందుకు దోహదపడింది. చేబదులు చేయని రాష్ట్రం.. ఆదాయం అంచనాలకు తగ్గి.. అంతకు మించి వ్యయం పెరిగినప్పుడు ఆర్థిక నిర్వహణ ఒడిదొడుకులకు గురవటం అన్ని రాష్ట్రాల్లో సర్వ సాధారణం. అటువంటి కటకట నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెలసరి వచ్చే గ్రాంట్లు, పన్నుల వాటా నిధులను ముందస్తుగానే చేబదులుగా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచీ వేస్ అండ్ మీన్స్‌గా పరిగణించే ఈ చేబదులు తీసుకోని రాష్ట్రాలు దేశంలో రెండే ఉన్నాయి. తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉండటం మెరుగైన ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. సీలింగ్‌తో సమస్య... మరోవైపు అప్పులపై సీలింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం 2015-16లో తీసుకునే రుణాల మొత్తం రూ. 15295 కోట్లకు మించకూడదు. కానీ.. ఆర్థిక శాఖ గడచిన అయిదు నెలల్లోనే సెక్యూరిటీల వేలం ద్వారా రూ. 6448 కోట్లు, కేంద్రం నుంచి మరో రూ. 398 కోట్లు అప్పు తీసుకుంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలను సడలించి మరింత అప్పు తెచ్చుకునేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేయటం గమనార్హం. -
గృహ, వాహనాల కొనుగోలుదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో మంగళవారం కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్ పరపతి విధానంపై సమీక్ష అనంతరం ఈ వివరాలను ప్రకటించారు. రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలుచేసే వడ్డీరేటు) ను పావుశాతం తగ్గించింది. నగదు. నిల్వల నిష్పత్తి ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా ఉంటాయని ప్రకటించింది. ఫలితంగా గృహరుణాలపై ఈఎంఐ తగ్గే అవకాశం ఉంది. ఈసందర్భంగా పెట్టుబడులు ఇంకా బాగా పెరగాలని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ సంయుక్తంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.. ఆర్థికరంగం ఇంకా కోలుకునే దశలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు మంగళవారం ఆర్బీఐ ప్రకనటతో స్టాక్‌మార్కెట్లు నెగిటివ్‌గా స్పందించాయి. దాదాపు 400 పాయింట్లకు పైగా నష్టపోయాయి. రెపో రేటును తగ్గించి ఆ ప్రయోజనాన్ని రుణాలపై వడ్డీరేట్లు తగ్గించటం ద్వారా ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించాలని ఆర్బీఐ ఆకాంక్షించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ద్రవ్యోల్బణం కట్టడిచేసేందుకు, రెపో రేటును తగ్గించాలని, అభివృద్ధికి ఊతం ఇవ్వాలని కేంద్రం గతంలో ఆర్బీయైకి సూచించింది. ప్రస్తుతమున్న 7.5 శాతం వడ్డీరేటు తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు కోరాయి. కాగా గత జనవరి, మార్చిలో కూడా రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. ప్రధానంగా ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం దిగిరావడంతో పెట్టుబడులకు ఊతమిచ్చి తద్వారా ఆర్థిక వ్యవస్థను మరింత జోరందుకునేలా చేయడంపై ఆర్బీఐ దృష్టిపెట్టింది. ద్రవ్యోల్భణం జనవరి 2016 నాటికి6శాతంగా ఉండవచ్చని ఆర్బిఐ అంచనా వేస్తోంది. ప్రభుత్వం ద్రవ్యలోటును జీడీపీలో 4 శాతానికి కట్టడి చేయడం కూడా ఆర్బిఐ తన పాలసీ విధానంలో టార్గెట్ పెట్టుకుంది. -
నేడు ఆర్బీఐ పాలసీ సమీక్ష
రేట్ల కోతకు అవకాశం! న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరపనుంది. ఈ సందర్భంగా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలుచేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.5%)ను పావుశాతం తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడి నేపథ్యంలో రెపో రేటును ఆర్బీఐ తగ్గించి వృద్ధికి ఊతం ఇవ్వాలని కేంద్రం కూడా ఆకాంక్షిస్తోంది. ఈ ఏడాది రెండుసార్లు (జనవరి 15, మార్చి 4) పావు శాతం చొప్పున మొత్తం అరశాతం రెపో రేటును ఆర్బీఐ తగ్గించింది. ఆ ప్రయోజనాన్ని ‘రుణాలపై వడ్డీరేట్లు తగ్గించటం ద్వారా’ కస్టమర్లకు బదలాయించాలని బ్యాంకులకు సంకేతాలిచ్చింది. అయినా బ్యాంకులు ఈ మేరకు నిర్ణయం తీసుకోకపోవడం ‘నాన్సెన్స్’ అంటూ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏప్రిల్ 7 పాలసీ సమావేశం సందర్భంగా ఆగ్రహించారు కూడా. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు పావుశాతం మేర రుణ రేట్లను తగ్గింపు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తాజా పరపతి సమీక్ష జరగనుంది. ద్రవ్యోల్బణం కట్టడి, పారిశ్రామిక మందగమనం నేపథ్యంలో ఆర్బీఐ రుణ రేటు మరోదఫా తగ్గిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. -
వడ్డీ రేట్ల కోతకు చాన్స్..!
పెట్టుబడులకు ఊతమిచ్చేలా ఆర్బీఐ పాలసీ నిర్ణయం ఉండొచ్చు.. రేపటి పరపతి విధాన సమీక్షపై బ్యాంకర్ల అంచనా న్యూఢిల్లీ: ఆర్బీఐ రేపు(మంగళవారం) చేపట్టనున్న పరపతి విధాన సమీక్షలో కీలక పాలసీ వడ్డీరేటు(రెపో)ను తగ్గించే అవకాశాలున్నాయని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం దిగిరావడంతో పెట్టుబడులకు ఊతమిచ్చి.. తద్వారా ఆర్థిక వ్యవస్థను మరింత జోరందుకునేలా చేయడంపై ఆర్బీఐ దృష్టిపెట్టొచ్చనేది వారి అభిప్రాయం. గత కొద్ది నెలలుగా మైనస్‌లోనే కొనసాగుతున్న టోకు ధరల ద్రవ్యోల్బణం... ఏప్రిల్‌లో కొత్త కనిష్టాన్ని(మైనస్ 2.65%) తాకిన సంగతి తెలిసిందే. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఏప్రిల్ నెలలో 4.87 శాతానికి తగ్గింది. మరోపక్క, ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో(2014-15) ద్రవ్యలోటును జీడీపీలో 4 శాతానికి కట్టడి చేయడంతో పాలసీ సమీక్షలో ఆర్బీఐ రేట్ల తగ్గింపునకు ఆస్కారం కలిగించే అంశమని బ్యాంకింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రెపో రేటు 7.5 శాతం, రివర్స్ రెపో 6.5 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతంగా ఉన్నాయి. గత సమీక్ష(ఏప్రిల్7న)లో ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగానే కొనసాగించిన విషయం విదితమే. సీఆర్ఆర్ తగ్గిస్తే బెటర్.. ద్రవ్యోల్బణం మైనస్‌లో కొనసాగుతున్న నేపథ్యంలో పాలసీ రేట్లలో మార్పులకు అవకాశాలున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చైర్మన్ టీఎం భాసిన్ పేర్కొన్నారు. యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓ పి. శ్రీనివాస్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘రిటైల్ ద్రవ్యోల్బణం కూడా ఇప్పుడు చాలా తగ్గింది. దీంతో రెపో రేటు పావు శాతం తగ్గించేందుకు వీలుంది. వృద్ధికి చేయూతనివ్వాలంటే ఆర్బీఐ సానుకూల నిర్ణయం అవసరం. ఇప్పుడు గనుక వడ్డీరేట్లను తగ్గించకపోతే.. ఎల్‌నినో ప్రభావంవల్ల వర్షాలు సరిగ్గా కురవని పక్షంలో రానున్న నెలల్లో రేట్లకోత కష్టతరంగా మారొచ్చు’ అని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కాగా, సీఆర్ఆర్ కోత వల్ల కూడా రుణాలపై వడ్డీరేట్లను తగ్గించేందుకు బ్యాంకులు ముందుకొచ్చే అవకాశం ఉందని భాసిన్ చెప్పారు. ‘ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో అవసరానికి మించి ద్రవ్యలభ్యత(లిక్విడిటీ) ఉంది. రుణ వృద్ధి తగినంతగా లేకపోవడమే దీనికి కారణం. బ్యాంకుల నుంచి ఇప్పుడు మేం స్వల్పకాలిక రుణాలను తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రెపో విండో(సదుపాయం) వల్ల బ్యాంకులకు అదనపు ప్రయోజనం ఉండదు. సీఆర్ఆర్ తగ్గింపు ద్వారానే బ్యాంకుల వ్యయం దిగొచ్చేందుకు దోహదం చేస్తుంది. కనీసం సీఆర్ఆర్ను అర శాతం తగ్గించాలనేది మా విజ్ఞప్తి. దీనివల్ల వ్యవస్థలోకి రూ.40 వేల కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది’ అని భాసిన్ పేర్కొన్నారు. రానున్న కాలంలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశాలుండటంతో పావు శాతానికి మించి ఆర్బీఐ రేట్ల కోతకు ఆస్కారం లేదని బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్, ఎండీ వీఆర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. -
ఓబీసీ, కెనరా బ్యాంక్ బేస్ రేట్ తగ్గింపు
న్యూఢిల్లీ: ఇతర బ్యాంకుల బాటలోనే తాజాగా ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, కెనరా బ్యాంక్ కూడా రుణాలపై వడ్డీ రేటును తగ్గించాయి. కెనరా బ్యాంక్ బేస్ రేటు (కనీస వడ్డీ రేటు)ను 0.20 శాతం మేర తగ్గించడంతో ఇది 10 శాతానికి దిగివచ్చింది. కొత్త రేటు మే 11 నుంచి అమల్లోకి వస్తుంది. అలాగే ఓబీసీ బేస్ రేటును పావు శాతం తగ్గించడంతో ఇది 10 శాతానికి తగ్గుతుంది. కొత్త రేటు మే 15 నుంచి అమలవుతుంది. -
హెచ్డీఎఫ్సీ గృహ రుణంపై వడ్డీరేటు తగ్గింపు
న్యూఢిల్లీ: గృహరుణాలపై వడ్డీరేటును హెచ్డీఎఫ్సీ 0.2 శాతం తగ్గించింది. కొత్త వడ్డీరేటు 9.9 శాతమని, ఇది ఈ నెల 13 (సోమవారం)నుంచి అమల్లోకి వస్తుందని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. కొత్త, పాత రుణగ్రహీతలకు ఇది వర్తిస్తుందని వివరించింది. వివిధ మెచ్యూరిటీ డిపాజిట్లపై రేట్లను కూడా హెచ్డీఎఫ్సీ తగ్గించింది. ఇంతకు ముందే ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు వడ్డీరేట్లను తగ్గించాయి. ు -
వడ్డీరేట్లు తగ్గుతాయి: కేంద్రం
న్యూఢిల్లీ: రుణ గ్రహీతలకు బ్యాంకులు వడ్డీ రేటును తప్పనిసరిగా తగ్గిస్తాయని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా గురువారం పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటు తగ్గింపు నేపథ్యంలో సిన్హా ఈ ప్రకటన చేశారు. అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని సైతం అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయానికి దోహదపడే పలు చర్యలను కేంద్రం తీసుకుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ‘బ్యాంకర్ల ప్రకటన మీరు చూసినట్లయితే, వడ్డీరేట్ల తగ్గింపు చోటుచేసుకునే సంకేతాలు కనిపిస్తాయి. అయితే ఇందుకు వాటికి కొంత సమయం కావాలి. ఆర్థిక వ్యవస్థలో రాత్రికిరాత్రి ఏ పరిణామమూ చోటుచేసుకోదు. త్వరలో బ్యాంకుల రేట్ల కోత చోటుచేసుకుంటుంది’ అని జయంత్ అన్నారు. బుధవారంనాడు సిన్హా ఒక ప్రకటన చేస్తూ, ఆర్బీఐ రేట్లకోత నిర్ణయాన్ని స్వాగతించారు. ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్లు గణనీయంగా తగ్గుతాయనీ అన్నారు. ఆర్థికాభివృద్ధికి దోహదపడే నిర్ణయంగా దీనిని పేర్కొన్నారు. -
మరోవిడత రేట్ల కోతకు చాన్స్!
⇒ పావు శాతం తగ్గే అవకాశం... ⇒ ఆర్థికవేత్తలు, బ్యాంకర్ల అంచనా... ⇒ రేపు ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష న్యూఢిల్లీ/ముంబై: రుణ గ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ మరింత ఊరటనివ్వనున్నారా? వడ్డీరేట్లు ఇంకా దిగిరానున్నాయా? అవుననే అంటున్నారు బ్యాంకింగ్ వర్గాలు, ఆర్థికవేత్తలు.రేపు(మంగళవారం) చేపట్టబోయే పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ కీలక పాలసీ వడ్డీరేటును మరో పావు శాతం తగ్గించే అవకాశం ఉందనేది వారి అంచనా. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం.. కోల్ ఇండియాలో వాటా విక్రయం విజయవంతం కావడంతో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వంటి కారణాల నేపథ్యంలో వృద్దికి చేయూతనిచ్చేందుకు ఆర్బీఐ మరోవిడత రేట్ల కోతకు ఓకే చెప్పొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. గత నెలలో అనూహ్యంగా ఆర్బీఐ పాలసీ రేటు(రెపో)ను పావు శాతం తగ్గించి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. దీంతో గడిచిన 20 నెలలుగా కొనసాగుతున్న కఠిన పాలసీకి బ్రేక్ పడినట్లయింది. రెపో రేటు ప్రస్తుతం 7.75%, రివర్స్ రెపో 6.75%, సీఆర్ఆర్ 4% వద్ద ఉన్నాయి. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5%కి తగ్గగా.. టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం సున్నా స్థాయిలోనే(0.1%) ఉంది. కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వానికి రూ.22,557 కోట్లు లభించాయి. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ.43,425 కోట్లలో ఇప్పటికే సగానికిపైగా ఖజానాకు చేరాయి. ఇంకా ఓఎన్జీసీ, ఐఓఎల్, భెల్, ఎన్ఎండీసీ, పీఎఫ్సీ, ఆర్ఈసీ వంటి పీఎస్‌యూలు వాటా విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో మార్చిలోగా ఈ లక్ష్యం సులువుగానే సాకారమయ్యే అవకాశాలు సుస్పష్టం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, అటు పారిశ్రామిక వర్గాలు ఆర్బీఐ మరింత రేట్లు తగ్గించాలని కోరుతున్నాయి. గతనెలలో పావు శాతం తగ్గింపు చాలా తక్కువేనని కార్పొరేట్లు పేర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం కట్టడిలో ఆర్బీఐ విజయం సాధించిందని.. రానున్నరోజుల్లో వడ్డీరేట్లు ఇంకాస్త దిగొచ్చే అవకాశాలున్నాయంటూ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. ఎవరేమన్నారంటే... * రానున్న నెలల్లో వడ్డీరేట్లు ఒక శాతం వరకూ తగ్గే అవకాశాలున్నాయి. మెరుగైన దేశీ స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా రేపు ఆర్బీఐ చేపట్టే సమీక్షలో పావు శాతం రెపో రేటు కోతకు ఆస్కారం ఉంది. - అనిమేష్ చౌహాన్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ చీఫ్ * తాజా ద్రవ్యోల్బణం, ఇతరత్రా గణాంకాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్బీఐ కచ్చితంగా మళ్లీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలు సర్వత్రా నెలకొన్నాయి. - మలయ్ ముఖర్జీ, ఐఎఫ్సీఐ ఎండీ * బడ్జెట్ తర్వాత ఎప్పుడైనా రేట్ల కోత ఉంటుందనే అంచనాలు గతంలోనే వున్నాయి. అయితే, ఈ నెల 3న తగ్గింపునకు అవకాశాలు పెరిగాయి. మొత్తంమీద ఈ ఏడాది(2015)లో ముప్పావు శాతం వడ్డీరేట్లు తగ్గే చాన్స్ ఉంది. - సౌమ్య కాంతి ఘోష్, ఎస్బీఐ చీఫ్ ఎకనమిస్ట్ * ద్రవ్యోల్బణం తగ్గుముఖం, ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణల ప్రభావంతో త్వరలోనే డిపాజిట్, రుణ రేట్లు మరింత దిగొస్తాయి. అయితే, రేపు సమీక్షపై అంచనా వేయలేను. తాము, ప్రభుత్వం చేపడుతున్న విధాన, సంస్కరణ చర్యలను ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తోంది. కొంత వేచిచూసే ధోరణిని అవలంభించవచ్చు. రానున్న రోజుల్లో కచ్చితంగా రేట్లు దిగొస్తాయి. - రాజన్ ధావన్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ * 3న రేట్ల కోతకు ఆస్కారం ఉంది. అయితే, గత నెలలో ఆనూహ్య తగ్గింపు నేపథ్యంలో మళ్లీ మార్చిలోనే ఆర్బీఐ రేట్లు తగ్గిస్తుందనేది మా ప్రాథమిక అంచనా - ప్రాంజుల్ భండారి, హెచ్ఎస్బీసీ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ -
రైతు నెత్తిన మరో పిడుగు
రుణాలపై వడ్డీ రేటు పెంపు ఆప్కాబ్ నిర్వాకం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలో రైతాంగం నూజివీడు : ప్రభుత్వం రుణమాఫీ అమలు చేయకుండా కాలం గడుపుతున్న నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్న రైతుల నెత్తిన రాష్ట్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి గడువు మీరిన రుణాలపై 2శాతం వడ్డీరేటును పెంచుతూ డీసీసీబీతో పాటు జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌లకు ఆప్కాబ్ నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ ఉత్తర్వులను ఎంతో గోప్యంగా పంపడం గమనార్హం. రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులకు మూలిగేనక్కపై తాటికాయ పడిన చందంగా వడ్డీ రేటును పెంచి ప్రభుత్వం తన సవతి ప్రేమను చూపించింది. పీఏసీఎస్‌లో తీసుకున్న రుణాలను ఏడాదిలోగా చెల్లించకపోతే, గడువు తీరిన తరువాత నుంచి 11శాతం వడ్డీరేటును విధిస్తుండగా, తాజా ఉత్తర్వుల ప్రకారం అది కాస్తా 13శాతానికి పెంచారు. దీంతో రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారు కానుంది. నాబార్డు పెంచిందని సాకు... రిజర్వుబ్యాంకు నుంచి నాబార్డుకు, నాబార్డు నుంచి ఆప్కాబ్‌కు, ఆప్కాబ్ నుంచి డీసీసీబీలకు నిధులు సమకూరుతాయి. అయితే నాబార్డు వడ్డీరేటు పెంచిందని చెప్పి ఆప్కాబ్ కూడా డీసీసీబీలకు ఇచ్చే నిధులపై వడ్డీరేటును పెంచింది. దీంతో డీసీసీబీలు కూడా సొసైటీల్లో రుణాలు తీసుకున్న రైతుల నెత్తిన పెరిగిన వడ్డీరేటును మోపింది. వడ్డీరేటు తగ్గించిన వైఎస్... 2004లో దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి పీఏసీఎస్‌లలో తీసుకున్న స్వల్పకాలిక పంటరుణాలపై 12శాతం ఉండే వడ్డీరేటును తొలుత 11శాతానికి, క్రమేణా 7శాతానికి తగ్గించుకుంటూ వచ్చారు. అలాగే దీర్ఘకాలిక రుణాలకు ఉన్న 18శాతం వడ్డీరేటును తగ్గించారు. అంతేగాకుండా కేంద్రప్రభత్వం ఇచ్చే రాయితీని కూడా రైతులకు వర్తింపచేసి కేవలం పావలా వడ్డీకే రుణాలను ఇచ్చిన రైతు బాంధవుడు వైఎస్. 2004లో కేంద్రప్రభుత్వం నియమించిన వైధ్యనాథన్ కమిటీ సహకార సంఘాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పిస్తే, ఆ నివేదికలో ఉన్న సిఫార్సులను అమలు చేసిన ఘనత కూడా వైఎస్‌కే దక్కుతుంది. అంతేగాకుండా నష్టాల్లో ఉన్న పీఏసీఎస్లన్నింటికి ఆర్థికపరిపుష్టి కల్పించారని రైతులే చెబుతున్నారు. రుణాలు మాఫీ చేసినా భారమే... ప్రభుత్వం రుణమాఫీని వర్తింపచేసినప్పటికీ రైతులకు రుణభారం నుంచి విముక్తి లభించే పరిస్థితులు కనిపించడం లేదు. డిసెంబర్ 31వరకు ఉన్న రుణాలు, బకాయిలను మాత్రమే మాఫీ చేస్తామని పేర్కొన్న నేపథ్యంలో జనవరి నుంచి రుణమాఫీ చేసేవరకు అయ్యే వడ్డీని రైతులు బ్యాంకులకు చెల్లించాల్సిందే. దీనికి తోడు గడువు దీరిపోయిన రుణాలకు సంబంధించి సెప్టెంబర్ నుంచి 2శాతం వడ్డీరేటు అదనంగా తోడవ్వనుంది. దీంతో రుణాలను మాఫీ చేసినా రైతులకు రుణమాఫీ భారం తప్పే పరిస్థితులు కనిపించడం లేదు. వడ్డీరేటు 2శాతం పెరిగింది : కేడీసీసీబీ సీఈవో తోట వీరబాబు గడువు దీరిన రుణాలపై వడ్డీరేటును 11శాతం నుంచి 13 శాతానికి పెంచిన ఉత్తర్వులు వచ్చాయి. ఈ పెంపు సెప్టెంబరు ఒకటోతేదీ నుంచే అమలులోకి వచ్చింది. గడువు తీరకముందు వరకు 7శాతం, గడువుతీరిన తరువాత 13శాతం చొప్పున వడ్డీని లెక్కగట్టడం జరుగుతుంది. -
ఎఫ్డీలపై చౌకగా రుణం..
బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నప్పటికీ.. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు, దాన్ని బ్రేక్ చేయడం ఇష్టం లేక రుణాల కోసం ఇతర మార్గాలూ చూస్తాం. పర్సనల్ లోన్ అంటూ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల చుట్టూ తిరుగుతాం. అధిక వడ్డీ రేటుకు తెచ్చుకుంటుంటాం. అయితే, ఎఫ్డీని బ్రేక్ చేయకుండానే అందులో కొంత భాగాన్ని వినియోగించుకునే వీలు ఉంది. ఇందుకోసం ఫిక్సిడ్ డిపాజిట్‌పై సైతం రుణం తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి బ్యాంకులు. ఇతర రుణాలతో పోలిస్తే ఈ లోన్లపై వడ్డీ రేట్లు కాస్త తక్కువగానూ ఉంటాయి. సాధారణంగా ఎఫ్డీలో 70-90% మొత్తాన్ని బ్యాంకులు రుణంగా ఇస్తున్నాయి. కొన్ని మరింత ఎక్కువగా కూడా ఇవ్వొచ్చు. ఇక వడ్డీ రేటు విషయానికొస్తే.. డిపాజిట్ మీద బ్యాంకు చెల్లించే వడ్డీ రేటు కన్నా 2-2.5% ఎక్కువగా ఉంటుంది. బ్యాంకును బట్టి ఇది మారుతుంది. ఈ తరహా రుణాలపై చాలా మటుకు బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు వంటివి వసూలు చేయడం లేదు. ఒకవేళ చేసినా నామమాత్రం స్థాయిలోనే ఉంటోంది. ఇక చెల్లింపు వ్యవధి విషయానికొస్తే.. డిపాజిట్ గడువే దీనికి కూడా వర్తిస్తుంది. ఒకవేళ ముందుగానే రుణమొత్తాన్ని చెల్లించేసినా.. సాధారణంగా పెనాల్టీలు లాంటివేమీ ఉండవు. అయితే, లోన్ తీసుకున్నందున ... అది తీరేదాకా ఎఫ్డీని ముందస్తుగా క్లోజ్ చేయడానికి మాత్రం కుదరదు. ఏదైతేనేం.. అధిక వడ్డీ రేటు ఉన్న వ్యక్తిగత రుణాలతో పోలిస్తే ఎఫ్డీలపై రుణం మెరుగైనదే. లోన్ తీసుకున్నప్పటికీ మీ డిపాజిట్‌పై వడ్డీ వస్తూనే ఉంటుంది. దీనివల్ల మీరు నికరంగా కట్టే వడ్డీ రేటూ తక్కువగానే ఉంటుంది. -
ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలి: జైట్లీ
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అభివృద్ధిని ప్రోత్సహించేందుకు వడ్డీ రేట్ల తగ్గింపు అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తంచేశారు. ‘జూన్‌లోనూ, ఈ నెలలోనూ రిజర్వ్ బ్యాంకు రుణ సమీక్ష ప్రకటనల అనంతరం అభివృద్ధి, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆర్థిక శాఖ వైఖరిని తేటతెల్లం చేస్తూ ప్రకటనలిచ్చాను. వడ్డీ రేట్లను నిర్ణయించాల్సింది రిజర్వ్ బ్యాంకే. వివిధ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తుందని భావిస్తున్నాను..’ అని ఆదివారం ఇక్కడ ఆర్బీఐ సెంట్రల్ బోర్డులో ప్రసంగించిన అనంతరం మీడియాతో జైట్లీ చెప్పారు. కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పడిన తర్వాత నిర్వహించిన రెండు రుణ సమీక్షల్లోనూ వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. అభివృద్ధికి ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేశాయి. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 30 నెలల కనిష్టస్థాయి 7.31 శాతానికి, టోకు ధరల సూచీ నాలుగు నెలల కనిష్టస్థాయి 5.43 శాతానికి తగ్గాయి. ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ, రిటైల్ ద్రవ్యోల్బణ లక్ష్యం వచ్చే జనవరిలో 8 శాతమనీ, 2016 జనవరిలో 6 శాతమనీ చెప్పారు. ఆధునిక ద్రవ్య విధాన వ్యవస్థకు కసరత్తు ప్రతిపాదిత ఆధునిక ద్రవ్య విధాన వ్యవస్థపై ప్రాథమిక చర్చలను రిజర్వ్ బ్యాంక్ ప్రారంభించిందని రాజన్ చెప్పారు. ఆర్థిక శాఖతో కలసి నూతన వ్యవస్థను రూపొందిస్తామని తెలిపారు. నానాటికీ సంక్లిష్టమవుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఆధునిక వ్యవస్థ అవసరమని ఇటీవలి కేంద్ర బడ్జెట్లో మంత్రి జైట్లీ పేర్కొన్నారు. -
ఓబీసీ డిపాజిట్ రేట్లు పెరిగాయ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) డిపాజిట్ రేట్లను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. 3 విభిన్న కాలవ్యవధులున్న డిపాజిట్లపై 3.25 శాతం వరకూ వడ్డీరేట్లను పెంచింది. కొత్త రేట్లు నేటి(మంగళవారం) నుంచి అమల్లోకి రానున్నాయని బ్యాంక్ పేర్కొంది. తాజా చర్యలతో 31-45 రోజుల వ్యవధిగల డిపాజిట్లపై వడ్డీరేటు ఇప్పుడున్న 6% నుంచి 9.25%కి పెరిగింది. 46-90 రోజుల డిపాజిట్లపై 8.5% నుంచి 9.5%కి; 91-179 రోజుల డిపాజిట్లపై 8.75% 9.75%కి రేట్లను పెంచినట్లు వెల్లడించింది. అలహాబాద్ బ్యాంక్ బేస్‌రేటు కూడా..: అలహాబాద్ బ్యాంక్ కనీస రుణ రేటు(బేస్ రేటు) 0.05 శాతం పెరుగుదలతో 10.25 శాతానికి చేరింది. దీంతో గృహ, వాహన రుణాలతో సహా అన్ని కొత్త రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దేనా బ్యాంకు ఎఫ్సీఎన్ఆర్ రేట్ల సవరణ.. ఎఫ్సీఎన్ఆర్(ఫారిన్ కరెన్సీ నాన్-రిపాట్రియబుల్) (బి), ఆర్ఎఫ్సీ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను దేనా బ్యాంక్ సవరించింది. దీని ప్రకారం ఏడాది నుంచి రెండేళ్ల దాకా వ్యవధి ఉండే డిపాజిట్లపై వడ్డీ రేటును 2.57 శాతం నుంచి 2.55 శాతానికి, 4 నుంచి 5 ఏళ్ల దాకా డిపాజిట్లపై 5.24 శాతం నుంచి 4.23 శాతానికి తగ్గించింది. -
ద్రవ్యోల్బణంపైనే సెంట్రల్ బ్యాంకుల దృష్టి సరికాదు: మాంటెక్
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం కట్టడే ప్రధాన లక్ష్యంగా సెంట్రల్ బ్యాంకులు పనిచేయడం సరికాదని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా సోమవారం పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్ బ్యాంకులు పలు అంశాలు లక్ష్యంగా పనిచేయాల్సి ఉంటుందన్నది తన అభిప్రాయమని అన్నారు. రఘురామ్ రాజన్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత, ద్రవ్యోల్బణమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ రెండుసార్లు రెపో రేటు పెంచిన నేపథ్యంలో మాంటెక్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి క్షీణదశలో నడుస్తున్న నేపథ్యంలో- జనవరి 28వ తేదీన ఆర్బీఐ తన మూడవ త్రైమాసిక పరపతి విధాన సమీక్షను నిర్వహించనుంది. ఆర్థిక రంగంలో సంస్కరణల ప్రక్రియ కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రూపాయి ప్రస్తుతం (సోమవారం 61.52 వద్ద స్థిరపడింది) తన వాస్తవ విలువ దగ్గరగా ఉందని మాంటెక్ తెలిపారు. -
బేస్ రేటుకే ఎస్బీహెచ్ గృహ రుణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) గృహ, వాహన రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. ‘అప్నా ఘర్, అప్నా కార్’ పేరుతో పరిమిత కాలానికి ఈ తగ్గింపు రేట్లను అందిస్తున్నట్లు ఎస్బీహెచ్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రూ.75 లక్షల లోపు గృహరుణాలను బేస్ రేటు 10.20 శాతం వడ్డీకే ఇస్తుండగా, ఆ పై మొత్తం రుణాలకు 10.30% వసూలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రోజువారీ తగ్గింపు విధానంలో వడ్డీని లెక్కించడం జరుగుతుందని, లక్ష రూపాయల రుణాన్ని 30 ఏళ్లకు తీసుకుంటే నెలకు రూ. 892 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. గృహ రుణాల ప్రాసెసింగ్ ఫీజుపై 75 శాతం వరకు తగ్గింపును ఇస్తోంది. అలాగే కార్ లోన్స్‌పై వడ్డీరేట్లను 10.60 శాతం నుంచి 10.40 శాతానికి తగ్గించామని, గరిష్టంగా రూ.1,000 వరకు ప్రోసెసింగ్ ఫీజులో మినహాయింపు ఇస్తున్నట్లు ఎస్బీహెచ్ పేర్కొంది. ఈ రేట్లు మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. -
ధరల కట్టడికే ప్రాధాన్యం
న్యూఢిల్లీ: ధరల కట్టడికే రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యమిస్తుందని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సోమవారం పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలూ అక్కర్లేదని అన్నారు. ఇందుకు అవసరమైనప్పుడల్లా ‘వడ్డీరేట్ల’ సాధనాన్ని ప్రధానంగా వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. అయితే ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యమంటే- వృద్ధిని అలక్ష్యం చేయడం కాదని అన్నారు. ఈ రెండూ సమతౌల్యతతో ముందుకు సాగే అంశాలని వివరించారు. ప్రతి సమీక్షా సమావేశంలో నిర్ణయాలకు అనుగుణంగా తనను అంచనా వేయొద్దని ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. జనవరి 28 తదుపరి సమీక్షలో నిర్ణయానికి ముందు ద్రవ్యోల్బణం, పారిశ్రామిక వృద్ధి తదితర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. సెప్టెంబర్ 4న గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా రాజన్ రెండుసార్లు పావు శాతం చొప్పున రెపో రేటు పెంచారు. అయితే డిసెంబర్ 18న తాజా సమీక్ష సందర్భంగా ఈ రేటులో ఎటువంటి మార్పూ చేయలేదు. దీనితో ఇక ఆర్బీఐ దృష్టి ద్రవ్యోల్బణం నుంచి వృద్ధి వైపునకు మళ్లినట్లు కొందరు విశ్లేషణలు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రాజన్ తాజా వ్యాఖ్యలు చేశారు. -
ఎస్బీఐ రుణాలు భారం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణ ప్రాతిపదిక రేట్లను 20 బేసిస్ పాయింట్లు పెంచింది (100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం). దీనితో కనీస వడ్డీరేటు(బేస్) 10 శాతానికి చేరింది. ప్రామాణిక వడ్డీరేటు (బీపీఎల్ఆర్- బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు) 14.75 శాతానికి ఎగసింది. గురువారం నుంచి రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనివల్ల ఈ రేట్లకు అనుసంధానమైన గృహ, వాహన, వాణిజ్య ఇతర వినియోగ వస్తువుల రుణాలకు సంబంధించి నెలవారీ వాయిదాలు (ఈఎంఐ) ప్రియం కానున్నాయి. పండుగల సీజన్‌ను పురస్కరించుకుని కొన్ని రుణాలపై ఎస్బీఐ 2014 జనవరి 31 వరకూ ప్రత్యేక రాయితీలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ గడువులోపుగా తాజా రుణాలు తీసుకునే వినియోగదారులకు ఈ రాయితీ రేట్లే అమలవుతాయని ఎస్బీఐ ప్రకటన తెలిపింది. ఎస్బీఐ నిర్ణయం నేపథ్యంలో- ఇతర బ్యాంకులు సైతం రుణ రేట్లను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రైవేటు రంగంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కనీస రేటును ఇప్పటికే 20 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 10 శాతానికి చేరింది. తప్పలేదు: అరుంధతీ భట్టాచార్య తాజా రేట్ల పెంపుపై ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య మాట్లాడుతూ, నిధుల సమీకరణ భారం పెరిగిన నేపథ్యంలో బ్యాంక్ తాజా నిర్ణయం తీసుకుందన్నారు. గతసారి రుణ రేట్లను పెంచిన తరువాత ఇప్పటివరకూ రెపో రేటు అరశాతం పెరిగిందని చెప్పారు. నేపథ్యం ఇదీ... బ్యాంకులకు రెపో మార్గం ద్వారా తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను రిజర్వ్ బ్యాంక్ అక్టోబర్ 29న పావు శాతం పెంచింది. దీనితో ఈ రెపో రేటు 7.75 శాతానికి ఎగసింది. ఈ రేటు భారం కావడం వల్ల సహజంగా ఈ భారాన్ని వినియోగదారుల మీదకు బ్యాంకులు మళ్లిస్తాయి. ఎస్బీఐ చేసింది ప్రస్తుతం ఇదే. ఇలాంటి పరిస్థితుల్లో రెపో భారం వల్ల ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) అవసరాలు, సర్దుబాట్లలో భాగంగా బ్యాంకులు డిపాజిట్ రేట్లలో మార్పులు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎస్బీఐ, అలహాబాద్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)లు ఈ దిశలో ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్ డిపాజిట్ రేట్లలో మార్పు కాగా ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కోటి రూపాయలకు లోబడి డిపాజిట్లపై వడ్డీరేట్లను మార్చింది. తాజా రేట్లు నవంబర్ 1 నుంచీ అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. 13-15 నెలల మధ్య డిపాజిట్లపై రేటు పావు శాతం పెరిగి 8.75 శాతానికి చేరింది. అదే సమయంలో 61 రోజుల నుంచి ఆరు నెలల శ్రేణిలో రేట్లు పావు శాతం తగ్గి 8.25 శాతానికి దిగాయి. 6-11 నెలల శ్రేణిలో డిపాజిట్ల రేట్లు పావు శాతం తగ్గి 8.5 శాతానికి చేరాయి. 46-60 రోజుల డిపాజిట్ రేటు విషయంలో 8.5% నుంచి అరశాతం తగ్గింది. మా రుణ రేట్లలో మార్పు ఉండదు: బీఓఐ కాగా తమ కనీస రుణ రేటులో మాత్రం మార్పు ఉండబోదని బుధవారం ప్రభుత్వ రంగంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం- బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) పేర్కొంది. చైర్పర్సన్ విజయలక్ష్మీ అయ్యర్ ఈ అంశంపై ముంబైలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. తమ బ్యాంక్ ద్రవ్య లభ్యత పరిస్థితులు తగిన విధంగా ఉన్నాయని, ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో డిపాజిట్ల వృద్ధి కూడా బాగుందని ఆమె వెల్లడించారు. అయితే పరిస్థితులకు అనుగుణంగా రానున్న కాలంలో బేస్రేట్పై చర్చిస్తామని మాత్రం పేర్కొన్నారు. -
ఇంటి రుణం@ 5%
అల్పాదాయ తరగతుల కోసం కేంద్రం పథకం రూ.ఐదు లక్షల రుణం వరకే ఐదుశాతం వడ్డీ పరిమితం స్థలం ఉన్నా, ఫ్లాట్ కొంటున్నా రుణమిస్తారు.. సాక్షి, హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో సామాన్య ప్రజ లు ఎదుర్కొంటున్న సొంతగూడు ఇబ్బందులు దూరం కానున్నాయి. గృహనిర్మాణంకోసం వీరికి అతి తక్కువగా ఐదుశాతం వడ్డీకే రుణాలందజేయాలని కేంద్రప్రభుత్వం సంకల్పించింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్-ఈడబ్ల్యూఎస్), అల్పాదాయవర్గ తరగతుల(లో ఇన్‌కం గ్రూప్-ఎల్ఐజీ) ప్రజల కోసం ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఈ స్కీము ఇప్పటినుంచి 2017 మార్చి వరకు అమలుకానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ వర్గాలవారు గృహ నిర్మాణానికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే.. కేంద్రం తన నోడల్ ఏజెన్సీద్వారా వడ్డీ సబ్సిడీని నేరుగా సదరు బ్యాంకులకు జమ చేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఐదుశాతం వడ్డీ రూ.ఐదు లక్షల వరకే పరిమితం.. ఐదు శాతం వడ్డీ సబ్సిడీ రూ.ఐదు లక్షల రుణం వరకు మాత్రమే వర్తిస్తుంది. ఐదు లక్షలకంటే ఎక్కువ తీసుకున్నపక్షంలో.. మిగిలిన మొత్తానికి సాధారణ వడ్డీ చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్ వర్గాల ప్రజలకు కనీసం 29 చదరపు మీటర్ల స్థలం కార్పెట్ ఏరియా ఉండాలని, అదే ఎల్ఐజీ వర్గాల గృహానికైతే 40 చదరపు మీటర్ల స్థలం కార్పెట్ ఏరియా ఉండాలని నిబంధన విధించింది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వైకల్యమున్నవారికి ఈ రుణాల్లో ప్రాధాన్యమివ్వనున్నట్టు వెల్లడించింది. లబ్ధిదారులకు నేరుగా సబ్సిడీ ఇవ్వకుండా కేంద్రం ఎంపిక చేసిన జాతీయ గృహ బ్యాంకు(నేషనల్ హౌజింగ్ బ్యాంక్), హడ్కోల నుంచి ప్రతి మూడు నెలలకోమారు ఈ సబ్సిడీ వడ్డీని వాణిజ్య బ్యాంకులకు బదిలీచేస్తారు. లబ్ధిదారులు ప్రతినెలా చెల్లించే వాయిదా(ఇన్స్టాల్మెంట్)లో ఈ సొమ్మును మినహాయించి మిగతా మొత్తాన్ని వాణిజ్య బ్యాంకులు వసూలు చేసుకుంటాయి. ఈ పథకాన్ని రాజీవ్ లోన్ స్కీమ్ లేదా రాజీవ్ రిన్ యోజన(ఆర్ఆర్వై) పథకంగా పరిగణిస్తున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ పేర్కొంది. కేంద్రప్రభుత్వం జాతీయ పట్టణ నవీకరణ పథకం, గృహనిర్మాణ పథకాలను దీనికి అనుసంధానం చేయనున్నట్టు తెలిపింది. అర్హులు వీరే... తలసరి ఆదాయం రూ.లక్ష ఉన్న ఈడబ్ల్యూఎస్ వర్గాలు, రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలలోపు ఆదాయమున్న ఎల్ఐజీ వర్గాలవారు అర్హులు. ఆయా పట్టణాలు, నగరాల్లో స్థలం ఉండి.. కుటుంబంలో ఎవరి పేరిటా ఇల్లు లేనివారు మాత్రమే అర్హులు. ఒకవేళ ఇంటిస్థలం లేనిపక్షంలో, కొనడానికి సిద్ధంగా ఫ్లాట్ ఉన్నా.. రుణం మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ వర్గాలకు రుణాలివ్వడానికి వాణిజ్య బ్యాంకులు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ సూచించిం ది. రుణాలు మంజూరు చేసేటప్పుడు ఆ ఆస్తిని తనఖా పెట్టుకోవచ్చని, కానీ థర్డ్‌పార్టీ గ్యారంటీ అడగరాదని, కొల్లాటరల్ సెక్యూరిటీ కోరరాదని బ్యాంకులకు సూచించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్ని 15 ఏళ్లల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. రాష్ట్రప్రభుత్వాలు గృహ రుణాలు కోరేవారికోసం పట్టణాలు, నగరపాలక సంస్థల్లో ప్రత్యేకంగా అధికారులను నియమించి, దరఖాస్తులు స్వీకరించి వాటిని బ్యాంకులకు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరింది. పట్టణాలు, నగరాల్లో గృహవసతి లేక సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి ఈ పథకాన్ని ప్రోత్సహించాలని సూచించింది. -
పీఎఫ్ వడ్డీ 8.5 %!
న్యూఢిల్లీ: 2013-14 సంవత్సరానికి భవిష్యనిధి (పీఎఫ్) డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీని ప్రకటించే అవకాశముంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన 5 కోట్ల చందాదారులకు గత ఏడాది కూడా ఇదే వడ్డీరేటును ఇచ్చింది. ఈ ఏడాది కూడా 8.5 శాతం వడ్డీని ఇవ్వడం వల్ల ఈపీఎఫ్ఓకు ఎలాంటి లోటు ఉండదని, అయితే దీనికన్నా కొంచెం ఎక్కువ వడ్డీని ఇచ్చినా సంస్థకు భారమవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత సంవత్సరంలో 8.75 శాతం వడ్డీనిస్తే సంస్థ బడ్జెట్ లోటులోకి వెళ్తుందని, దీన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరించదని చెప్పాయి. వడ్డీరేటును ఖాయం చేసేందుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి నేతృత్వంలోని నిర్ణాయక విభాగమైన కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) ఈనెల 23న సమావేశం కానుంది.