KGF 2
-
విజయ్ దేవరకొండ సినిమాపై నాగవంశీ కామెంట్స్
-
అలనాటి స్టార్ హీరోయిన్ కూతురి పెళ్లి.. చిరంజీవి సినిమాలో కూడా!
కన్నడ సినీ ఇండస్ట్రీలో జయమాల అప్పట్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు కన్నడతో పాటు తెలుగు, తుళు, తమిళ భాషల్లో కూడా హీరోయిన్గా అభిమానులను మెప్పించింది. దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించిన జయమాల పెరిగింది మాత్రం చిక్మంగళూరు జిల్లాలోనే. ఆమె కాస్ దాయె కండన అనే తుళు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత నటిగా ఫేమ్ తెచ్చుకున్న ఆమె కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, లోకేష్, శంకర్ నాగ్, అనంతనాగ్, శివరాజకుమార్, రాఘవేంద్ర రాజకుమార్, టైగర్ ప్రభాకర్(తెలుగు నాట కన్నడ ప్రభాకర్‌గా పాపులర్) వంటి సుప్రసిద్ధ కన్నడ స్టార్ హీరోల సరసన నటించింది.తాజాగా ఆమె కూతురు సౌందర్య వివాహం ఘనంగా జరిగింది. బెంగళూరులో జరిగిన ఈ పెళ్లికి పలువురు కన్నడ అగ్ర సినీతారలంతా హాజరయ్యారు. కిచ్చా సుదీప్, కేజీఎఫ్ హీరో యశ్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.చిరంజీవితో జయమాల..కాగా.. తెలుగులో జయమాల అర్జున గర్వభంగం (1979), భామా రుక్మిణి (1983), రాక్షసుడు (1986)(చిరంజీవి) చిత్రాల్లో నటించింది. రాక్షసుడు చిత్రంతో ఈమె తెలుగులో కూడా బాగా పాపులర్ అయింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలసి "నీ మీద నాకు ఇదయ్యో...అందం నే దాచలేను పదయ్యో.." అనే పాటతో మెప్పించింది. ఈ సాంగ్ సూపర్ హిట్ కావడంతో చిరంజీవితో పాటు తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రానికి నిర్మాత కె.ఎస్ రామారావు నిర్మించగా.. దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించారు.కాగా.. జయమాల మొదట కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్‌ను వివాహం చేసుకుంది. అనేక తెలుగు చిత్రాల్లో విలన్‌గా బాగా పాపులరిటీ తెచ్చుకున్నారు. రాక్షసుడు చిత్రంలో కూడా ప్రధాన విలన్‌గా నటించడం విశేషం. అయితే కొన్ని కారణాల రీత్యా జయమాల అతడికి విడాకులు ఇచ్చి కన్నడ సినిమా రంగానికి చెందిన కెమెరామెన్ హెచ్.ఎం.రామచంద్రను పెళ్లాడింది. వీరిద్దరికి సౌందర్య అనే కుమార్తె ఉంది. తాజాగా తన కూతురి పెళ్లిని గ్రాండ్‌గా నిర్వహించింది జయమాల. -
తీసిన సీన్స్ మళ్ళీ చేస్తున్న యశ్
-
పుష్ప -2 క్రేజ్.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 అల్‌టైమ్ రికార్డ్స్ బ్రేక్!
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. ఈనెల 5న థియేటర్లలోకి పుష్ప-2 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన పుష్ప-2 తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన 11 రోజుల్లోనే రూ.1400 కోట్ల మార్క్‌ను అధిగమించింది.సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ సినిమా నార్త్‌లోనూ తగ్గేదేలే అంటోంది. రిలీజైన మొదటి రోజు నుంచే రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటివరకు హిందీలో ఎప్పుడు లేని విధంగా రూ.561 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి డబ్బింగ్ మూవీగా నిలిచింది. అంతే కాకుండా రెండోవారం వీకెండ్లో రూ.100 కోట్ల సాధించిన తొలి హిందీ చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. (ఇది చదవండి: పుష్ప2 'పీలింగ్స్' సాంగ్ వీడియో విడుదల)కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్..ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్-2 సాధించిన రికార్డ్‌ను పుష్ప-2 దాటేసింది. కేజీఎఫ్-2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కేవలం పదిరోజుల్లోనే అధిగమించింది. అంతేకాకుండా రాజమౌళి బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ (రూ.1309) కోట్ల రికార్డ్‌ను సైతం తుడిచిపెట్టేసింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మూవీ వసూళ్లు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. The BIGGEST INDIAN FILM is on a rampage at the box office ❤🔥#Pushpa2TheRule grosses 1409 CRORES GROSS WORLDWIDE in 11 days 💥💥💥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/bWbwb50sj4— Pushpa (@PushpaMovie) December 16, 2024 -
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన శివలింగం దగ్గర 'కేజీఎఫ్' హీరోయిన్ (ఫొటోలు)
-
బాక్సాఫీస్ వద్ద అదే జోరు.. కేజీఎఫ్-2 రికార్డ్ బద్దలయ్యే ఛాన్స్!
శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రల్లో వచ్చిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా రిలీజై 12 రోజులైనప్పటికీ కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.589 కోట్ల గ్రాస్ వసూళ్ల సాధించింది. కేవలం ఇండియాలోనే రూ.498 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. రూ.422 కోట్ల నెట్ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏకంగా రూ.20.2 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.విడుదలైన రెండోవారం మొదలైన స్త్రీ-2 చిత్రానికి థియేటర్లలో ఆదరణ దక్కించుకుంటోంది. హిందీ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్-2 సాధించిన వసూళ్ల కంటే కేవలం 12 కోట్లు మాత్రమే వెనుకబడి ఉంది. ఇదే జోరు కొనసాగితే కొద్ది రోజుల్లోనే ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టనుంది. ఈ చిత్రం త్వరలోనే అత్యధిక వసూళ్లు చేసిన ఆరో భారతీయ చిత్రంగా నిలవనుంది. మూడో వారాంతం నాటికి రూ.500 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబడుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో అపర్శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. ఈ వారంలోనూ బాలీవుడ్లో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో స్త్రీ-2 ప్రభంజనం కొనసాగించే అవకాశముంది. ఆగస్ట్ 30న శుక్రవారం బీటౌన్‌లో బిగ్ స్టార్స్ చిత్రాలు ఏవీ రావడం లేదు. ఇది కూడా ఈ చిత్రానికి వసూళ్లుపరంగా కలిసి రానుంది. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన భావోద్వేగానికి పట్టం
70వ జాతీయ అవార్డులకు గాను దేశవ్యాప్తంగా 28 భాషలకు చెందిన 300 చిత్రాల వరకూ పోటీ పడ్డాయి. 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెన్సార్ అయిన చిత్రాలకు పోటీలో అవకాశం ఉంటుంది. అవార్డుల కోసం వివిధ విభాగాలకు సంబంధించిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి విజేతలను వెల్లడించింది. ఈసారి భావోద్వేగానికి పట్టం కట్టినట్లుగా తెలుస్తోంది. ప్రధాన అవార్డులను పరిశీలిస్తే... ఎమోషనల్‌గా సాగే కథాంశాలకు, భావోద్వేగమైన నటనకు అవార్డులు దక్కినట్లుగా అనిపిస్తోంది. ఆ వివరాలు...ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడి కడియం కలియుగంలో అంతు చిక్కని సమ్యలకు ఎలా పరిష్కారం చూపించింది? అనే అంశంతో రూపొందిన డివోషనల్, ఎమోషనల్ తెలుగు మూవీ ‘కార్తికేయ 2’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. ఈ చిత్రంలో కనబర్చిన పవర్ఫుల్, ఎమోషనల్ నటనకుగాను రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించగా, సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగానూ అవార్డు దక్కించుకుంది. ప్రేమ, ప్రేమలో విఫలం, కుటుంబ బంధాల నేపథ్యంలో మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘తిరుచిత్రాంబళమ్’లో కనబరిచిన గాఢమైన భావోద్వేగ నటనకు గాను నిత్యామీనన్‌ను జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది.భర్త అక్రమ సంబంధం సాగిస్తున్నాడని తెలుసుకున్నాక ఓ భార్య ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందిన గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్‌ప్రెస్’లో భార్య పాత్రలో కనబర్చిన భావోద్వేగానికి గాను ఉత్తమ నటిగా మానసీ పరేఖ్ అవార్డు అందుకోనున్నారు. ఓ నాటక రంగానికి సంబంధించిన ట్రూప్ నేపథ్యంలో ఆనంద్ ఇకర్షి దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘ఆట్టమ్’కి ఉత్తమ చిత్రం, స్క్రీన్‌ప్లే విభాగాల్లో రెండు అవార్డులు దక్కాయి. చనిపోయిన ఓ స్నేహితుడి చివరి కోరికను నెరవేర్చడానికి ముగ్గురు వృద్ధ స్నేహితులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి ట్రెక్కి వెళ్లే కథాంశంతో తెరకెక్కిన హిందీ చిత్రం ‘ఊంచాయి’. ఈ ఎమోషనల్ రైడ్‌ని అద్భుతంగా ఆవిష్కరించిన సూరజ్ బర్జాత్యా జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డు సాధించారు. ఉత్తమ సంగీత దర్శకత్వం (పాటలు) అవార్డును హిందీ ‘బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ’కి సంగీత దర్శకుడు ప్రీతమ్, ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును తమిళ ‘΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్–1’కు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దక్కించు కున్నారు.ఇక గత ఏడాది పది అవార్డులు దక్కించుకున్న తెలుగు పరిశ్రమ ఈసారి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో సరిపెట్టుకుంది. ఇంకా పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు.జాతీయ అవార్డులోని కొన్ని విభాగాలు.... ⇒ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార – కన్నడ) ⇒నటీమణులు: నిత్యా మీనన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ – గుజరాతీ) ⇒చిత్రం: ఆట్టమ్ (మలయాళం)⇒దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఊంచాయి – హిందీ) ⇒దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్ కుమార్ (ఫౌజా –హరియాన్వీ) సంగీత దర్శకత్వం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర: శివ– హిందీ)⇒సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం): ఏఆర్ రెహమాన్ (΄పొన్నియిన్ సెల్వన్ – 1, తమిళ్) నేపథ్య గాయకుడు: అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర– పార్ట్ 1: శివ – హిందీ) ⇒నేపథ్య గాయని: బాంబే జయశ్రీ (సౌదీ వెల్లక్క సీసీ 225/2009 – మలయాళం) ⇒సహాయ నటి: నీనా గు΄్తా (ఊంచాయి– హిందీ) ⇒సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా – హరియాన్వి) ⇒బాల నటుడు: శ్రీపత్ (మాలికాపురమ్ – మలయాళం) ⇒సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్ – 1) ⇒కొరియోగ్రఫీ: జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్) ⇒యాక్షన్ డైరెక్షన్: అన్బు–అరివు (కేజీఎఫ్ 2 – కన్నడ) ⇒విజువల్ ఎఫెక్ట్స్: బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ (హిందీ) ⇒మాటల రచయిత : అర్పితా ముఖర్జీ, రాహుల్ వి. చిట్టెల (గుల్మోహర్ – హిందీ) ⇒సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి – ΄పొన్నియిన్ సెల్వన్ – 1 (తమిళం) ⇒స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): ఆనంద్ ఏకార్షి (ఆట్టమ్ – మలయాళం) ⇒జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను ్రపోత్సహించే చిత్రం: కచ్ ఎక్స్‌ప్రెస్ (గుజరాతీ) ⇒సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: కాంతార (కన్నడ).ప్రాంతీయ ఉత్తమ చిత్రాలు⇒తెలుగు: కార్తికేయ–2 ⇒కన్నడ: కేజీఎఫ్ చాప్టర్–2 ⇒తమిళ్: ΄పొన్నియిన్ సెల్వన్ – 1 ⇒మలయాళం: సౌది వెళ్లక్క సీసీ 225/2009 ⇒హిందీ: గుల్మోహర్అవార్డు బాధ్యత పెంచింది – చందు మొండేటి‘‘మా సినిమాకి జాతీయ అవార్డు రావడం మా బాధ్యతని మరింత పెంచింది. ‘కార్తికేయ 2’ తర్వాత ‘కార్తికేయ 3’పై అంచనాలు ఎంతలా పెరిగాయో తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘కార్తికేయ 3’ ఉంటుంది’’ అని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా చందు మొండేటి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘కార్తికేయ 2’. ప్రాంతీయ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును సాధించిన సందర్భంగా చిత్రబృందం సమావేశం నిర్వహించింది. టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ నేషనల్ అవార్డు మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఓ మైల్స్టోన్ మూమెంట్. మా బ్యానర్‌కి తొలి జాతీయ అవార్డు ఇది’’ అన్నారు. ‘‘కృష్ణుడు నిజం అని ఈరోజు మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ అవార్డు కృష్ణుడే తీసుకొచ్చారని భావిస్తున్నాను’’ అని అభిషేక్ అగర్వాల్ చె΄్పారు.నిఖిల్ మాట్లాడుతూ – ‘‘కార్తికేయ 2’ విజయం సాధించడానికి, అవార్డు రావడానికి కారణం మా టీమ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ చూసిన సినిమా ఇది. దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజై, అద్భుతమైన విజయం సాధించింది. మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు, అవార్డు ప్రకటించిన జ్యూరీకి థ్యాంక్స్’’ అన్నారు.కార్తికేయ కథేమిటంటే... ద్వాపర యుగంలో తనువు చాలించే ముందు శ్రీకృష్ణుడు తన కాలి కడియాన్ని ఉద్ధవునికి ఇచ్చి, ‘కలియుగంలో వచ్చే ఎన్నో అంతు చిక్కని సమస్యలకు ఈ కడియం పరిష్కారం చూపుతుంది’ అని చెబుతాడు. కలియుగంలో నాస్తికుడైన డాక్టర్ కార్తికేయ (నిఖిల్) తన తల్లి ఒత్తిడి మేరకు ఓ మొక్కు తీర్చుకోవడానికి ద్వారక నగరానికి వెళతాడు. అప్పటికే కడియానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించినప్రోఫెసర్ రంగనాథ రావ్‌ను హతమార్చడానికి ట్రై చేస్తుంటాడు సైంటిస్ట్ శాంతను. అతని మనుషుల చేతిలో హతమవ్వడానికి ముందు రంగనాథ రావ్ అనుకోకుండా కార్తికేయను చివరిసారి కలుస్తాడు. దాంతో శాంతను మనుషులతో పాటు శ్రీకృష్ణ భక్తులైన అధీరుల తెగకు చెందిన వ్యక్తులకు సైతం కార్తికేయ టార్గెట్ అవుతాడు. అయితే రంగనాథ రావ్ మనవరాలు ముగ్ధ (అనుపమ) సాయంతో వారందరి నుంచి డాక్టర్ కార్తికేయ ఎలా తప్పించుకున్నాడు? చంద్రశిల శిఖరంలోని శ్రీకృష్ణుడి కడియాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? అన్నదే కథ.ఆనంద్ ఇకర్షి దర్శకత్వం వహించిన ‘ఆట్టమ్’ కథేంటంటే.. ఓ నాటక బృందంలో 12 మంది నటులు, ఒక నటీమణి ఉంటారు. నటులుగా వినయ్ పాత్రలో వినయ్ ఫోర్ట్, అంజలిగా జరీన్ షిబాబ్, కళాభవన్ షాజాన్ హరి కీలక పాత్రలు పోషించారు. వీళ్ల నాటక ప్రదర్శన ఓ విదేశీ జంటకి నచ్చడంతో తమ రిసార్ట్‌లో వాళ్లకి ఆతిథ్యమిస్తారు. పార్టీ అనంతరం ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి నిద్రపోతారు. అయితే తన గదిలో కిటికీ పక్కన నిద్రపోతున్న అంజలితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి నాటక బృందంలోని 12 మందిలో ఒకరా? లేకుంటే బయటి వ్యక్తా? అనే విషయాన్ని అంజలి ఎలా బయటపెట్టింది? అన్నది ‘ఆట్టమ్’ కథ. హాలీవుడ్ మూవీ ‘12 యాంగ్రీమెన్’ (1954) ఆధారంగా ‘ఆట్టమ్’ రూపొందింది.కెరాడి టు పాన్ ఇండియాకర్ణాటకలోని కెరాడి అనే గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు రిషబ్ శెట్టి. చిత్ర పరిశ్రమలోకి రాకముందు పలు ఉద్యోగాలు చేశారు రిషబ్. డిగ్రీ చదివేటప్పుడు సినిమాలు చూసేందుకు డబ్బుల కోసం కూలి పనులు చేశారు. 2004 నుంచి 2014 వరకు (తొలి సారి డైరెక్షన్ చేసేవరకు) వాటర్ క్యా¯Œ లు అమ్మారు. రియల్ ఎస్టేట్ సంస్థలో, హోటల్స్‌లో పని చేశారు. క్లాప్ బాయ్‌గా ఇండస్ట్రీలో జర్నీ ్రపారంభించిన రిషబ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశారు.‘తుగ్లక్’ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రికీ’ (2016). ఆ తర్వాతి సినిమా ‘కిరిక్ పార్టీ’తో దర్శకుడిగా రిషబ్ పేరు కన్నడనాట మార్మోగింది. హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’తో రిషబ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. -
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను వెళ్లడించింది. ఈసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కన్నడ హీరో రిషబ్ శెట్టి (కాంతార) అందుకోనున్నాడు. అయితే, ఉత్తమ నటిగా నిత్యా మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ - గుజరాతి) ఇద్దరికి సంయుక్తంగా దక్కింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ఆట్టమ్ (మలయాళం) నిలిచింది. ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2' నిలిచింది. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్-2 అవార్డు దక్కించుకుంది. ఉత్తమ హిందీ చిత్రంగా గుల్మొహర్ నిలిచింది.జాతీయ అవార్డ్ విజేతలు వీరేఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం) ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార) ఉత్తమ నటి: నిత్యా మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ - గుజరాతి) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా: బ్రహ్మాస్త్ర - పార్ట్ 1ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఉంచాయి - హిందీ)బెస్ట్ కొరియోగ్రాఫర్: జానీ మాస్టర్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), సతీశ్ కృష్ణన్ ఉత్తమ సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి)ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : అర్జిత్ సింగ్ (కేసరియా) - బ్రహ్మాస్త్ర ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : బొంబాయి జయశ్రీ (సౌది వెళ్లక్క సీసీ 225/2009- మలయాళం)ఉత్తమ సంగీతం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మస్త్ర -హిందీ)ఉత్తమ సంగీతం (నేపథ్యం): ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ - 1 తమిళం)ఉత్తమసినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ పార్ట్ - 1 తమిళం) ఉత్తమ సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి (పొన్నియిన్ సెల్వన్ - 1) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: శ్రీపాథ్ (మాలికాపురం - మలయాళం)ఉత్తమ స్క్రీన్‌ప్లే: ఆనంద్ ఏకార్షి (ఆట్టం- మలయాళం)ఉత్తమ ఎడిటింగ్: మహేష్ భువనేండ్ (ఆట్టం) ఉత్తమ యాక్షన్ డైరక్షన్: అన్బరివు (కేజీఎఫ్- 2)ఉత్తమ మేకప్: సోమనాథ్ కుందు (అపరాజితో- బెంగాళీ)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నిక్కి జోషి (కచ్ ఎక్స్‌ప్రెస్- గుజరాతీ) ఉత్తమ మాటల రచయిత: అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల (గుల్మోహర్) ఉత్తమ ప్రాంతీయ సినిమాలుఉత్తమ ప్రాంతీయ చిత్రం: కార్తికేయ -2 (తెలుగు)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కేజీఎఫ్ 2 (కన్నడ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : గుల్మొహర్ (హిందీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : సౌది వెళ్లక్క సీసీ 225/2009 (మలయాళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కబేరి అంతర్దాన్ (బెంగాళీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : వాల్వీ (మరాఠీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : దమన్ (ఒడియా)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : బాగీ డి దీ (పంజాబీ)జాతీయ ఉత్తమ నాన్ ఫీచర్ సినిమాలు ఉత్తమ షార్ట్ ఫిల్మ్: ఉన్యుత (వాయిడ్) - అస్సామీఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్: అయేనా (అద్దం)- హిందీ/ ఉర్దూఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ (మరాఠీ)ఉత్తమ యానిమేషన్ సినిమా: ఏ కోకోనట్ ట్రీ (సైలెంట్)ఉత్తమ దర్శకులు: మిరియం చాండీ మినాచెరీ (ఫ్రమ్ ది షాడో- బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : బస్తి దినేశ్ షెనోయ్ (ఇంటర్మిషన్ - కన్నడ)ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: విశాల్ భరద్వాజ్ (ఫుర్సత్- లీజర్/ హిందీ)ఉత్తమ క్రిటిక్: దీపక్ దుహా (హిందీ) ఉత్తమ బుక్ ఆన్ సినిమా: రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్ ధార్ కిషోర్ కుమార్ (ది అల్టిమేట్ బయోగ్రఫీ - ఇంగ్లిష్)ఉత్తమ సినిమాటోగ్రీఫీ: సిద్ధార్థ్ దివాన్ -మోనో నో అవేర్ (హిందీ - ఇంగ్లీష్) -
నాలుగేళ్లకే లాభాల్లోకి చేరిన హైదరాబాద్ కంపెనీ
కేజీఎఫ్, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు తాజాగా విడుదలకు సిద్ధమైన కల్కి చిత్రానికి డిజిటల్‌మార్కెట్ చేస్తున్న సిల్లీమాంక్స్ నాలుగేళ్లకే లాభాల్లోకి చేరింది. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ జనవరి-మార్చి త్రైమాసికానికిగాను రూ.26.83లక్షలు లాభాన్ని పోస్ట్ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.5.5 కోట్లమేర నష్టపోయిన సంస్థ తాజా ఫలితాల్లో లాభాలు పోస్ట్ చేయడంతో పెట్టుబడిదారులకు కొంత ఊరట లభించింది.కంపెనీ లాభాలపై సంస్థ సహవ్యవస్థాపకులు, ఎండీ సంజయ్‌రెడ్డి మాట్లాడుతూ..‘ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కీలకంగా ఉన్న సంస్థ నాలుగేళ్ల తర్వాత లాభదాయకంగా మారడం గొప్ప విజయంగా భావిస్తున్నాం. సంస్థ చేపట్టిన కొన్ని వ్యూహాత్మక కార్యక్రమాలతో ఈ విజయం సొంతమైంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాం. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాన్ని అనుసరించాం. ప్రతిభావంతులైన బృంద సభ్యులతో మరిన్ని విజయాలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. సంస్థ ప్రాజెక్ట్‌లు ఇవే..ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఈ సంస్థ సినిమాలకు డిజిటల్ మార్కెటింగ్ సేవలందిస్తోంది. గతంలో విడుదలైన కేజీఎఫ్, కేజీఎఫ్-2, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు త్వరలో విడుదలయ్యే ప్రబాస్ నటించిన కల్కి 2898-ఏడీ చిత్రం యూనిట్లతో కలిసి పనిచేసింది. డిజిటల్ మార్కెటింగ్తోపాటు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరిస్తోంది.ఉద్యోగులకు షేర్క్యాపిటల్లో 5 శాతం వాటాకంపెనీ త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన సందర్భంగా తమ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ‘ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్’(ఈసాప్)ను ప్రకటించింది. ఈప్లాన్‌లో భాగంగా కంపెనీ మొత్తం షేర్క్యాపిటల్లో 5శాతం వాటాను తమ ఉద్యోగులకు కేటాయించింది. రానున్న ఐదేళ్లలో ఈవాటాలో 70 శాతం మూలధనాన్ని ఉద్యోగులకు పంచనున్నారు. ఈ ప్రక్రియ జూన్ 2024 నుంచి ప్రారంభంకానుందని కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండికరోనా కారణంగా సినిమా పరిశ్రమ 2020 ప్రారంభం నుంచి తీవ్ర అనిశ్చితులు ఎదుర్కొంది. క్రమంగా కొవిడ్ భయాలు తొలగి గతేడాది నుంచి ఆ రంగం పుంజుకుంటోంది. ఫలితంగా ఆ పరిశ్రమపై ఆధారపడిన కంపెనీలు లాభాల్లోకి చేరుతున్నట్లు మార్కెట్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాంతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరుగుతోంది. అందులో ప్రమోషన్లు, ప్రకటనలు, డిజిటల్ మార్కెటింగ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. -
కరీనా కపూర్ ఖాన్ KGF స్టార్ యష్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది
-
కేజీఎఫ్ ప్రజల ప్రేమ అమోఘం: స్టార్ డైరెక్టర్
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పా.రంజిత్. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో విక్రమ్ కథానాయకుడుగా తంగలాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ప్రతిభావంతులైన కొత్త సంగీత కళాకారులను ప్రోత్సహించే విధంగా గత కొన్నేళ్లుగా నీలం కల్చరల్ సెంటర్ పేరుతో మార్గశిర మాసంలో పలు గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జనం సంగీత కార్యక్రమాన్ని హోసూరు, చైన్నె, కేజీఎఫ్ ప్రాంతాల్లో నిర్వహించ తలపెట్టారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేజీఎఫ్‌లోని నగర పరిపాలన మైదానంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఈనెల 28 నుంచి 30 వరకు చెన్నైలో మూడు రోజులపాటు ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకల్లో పాల్గొన్న దర్శకుడు రంజిత్ మాట్లాడుతూ.. బుద్ధుని ఆశీస్సులతో ఈ జన సంగీత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కేజీఎఫ్ ప్రజల ప్రేమాభిమానాలు తనను ఆశ్చర్య పరిచాయన్నారు. ఇకపై కూడా ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటున్నానన్నారు. సంగీత కళాకారులతో కలిసి బాబా సాహెబ్ అంబేడ్కర్ మార్గంలో మనమంతా పెద్ద విప్లవాన్ని సృష్టిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నటుడు దినేష్, కలైయరసన్, రచయిత తమిళ్ ప్రభ, దర్శకుడు దినకర్, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై పలువురు కళాకారులు జన సంగీత కళలను ప్రదర్శించి ఆహుతులను ఆలరించారు. We are all set at kgf, come join us today and celeberate a music festival straight from the roots✨🎊🥁 Welcome you All! Entry Free! Today at 3pm. Location: Municipality Ground, Robertsonpet. Kolar Gold Fields,Karnataka.@beemji @Neelam_Culture @NeelamSocial @KoogaiThirai pic.twitter.com/qfwusQKKdB — Margazhiyil Makkalisai (@makkalisai) December 23, 2023 రు. -
సలార్ డైరెక్టర్ కొత్త ప్రాజెక్ట్.. టీజర్ రిలీజ్..!
కేజీయఫ్, కాంతార, సలార్ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కుతోన్న మరో చిత్రం బఘీరా. ఈ చిత్రంలో శ్రీమురళీ, రుక్మిణీ వసంత్ జంటగా నటించారు. ఈ మూవీకి సూరి దర్శకత్వం వహించగా.. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రోజు హీరో శ్రీమురళి బర్త్ డే సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ బఘీరా టీజర్ చేసింది. విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రఘు, అచ్యుత్ కుమార్. గరుడ రాముడు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 𝐖𝐡𝐞𝐧 𝐬𝐨𝐜𝐢𝐞𝐭𝐲 𝐛𝐞𝐜𝐨𝐦𝐞𝐬 𝐚 𝐣𝐮𝐧𝐠𝐥𝐞... 𝐚𝐧𝐝 𝐨𝐧𝐥𝐲 𝐨𝐧𝐞 𝐩𝐫𝐞𝐝𝐚𝐭𝐨𝐫 𝐫𝐨𝐚𝐫𝐬 𝐟𝐨𝐫 𝐣𝐮𝐬𝐭𝐢𝐜𝐞...💥 Presenting #BagheeraTeaser to you all ▶️ https://t.co/VRviuMij3o Wishing our 'Roaring Star' @SRIMURALIII a very Happy Birthday.#Bagheera… pic.twitter.com/UxMAaJp1Qr — Hombale Films (@hombalefilms) December 17, 2023 -
తారక్, యష్ చిత్రాలపై అంచనాలు పెంచేసిన ప్రశాంత్ నీల్
కేజీఎఫ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈ ఫ్రాంచైజీతో వచ్చిన రెండు సినిమాలు చరిత్రను సృష్టించాయి. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు టాప్ హీరోలు క్యూ కడుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆయన చేతిలో పాన్ ఇండియా హీరో జూ ఎన్టీఆర్ చిత్రం ఉంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రం కథపై ఎలాంటి ప్రకటన చేయలేదు ప్రశాంత్. తాజాగా ఓ ఇంటరర్వ్యూలో తారక్ సినిమా గురించి మాట్లాడి అంచనాలను పెంచేశాడు. ఇప్పటి వరకు తాను తీసిన చిత్రాలకు విభిన్నంగా తారక్ మూవీ ఉంటుందని ఆయన తెలిపాడు. కానీ.. ఆ చిత్రానికి సంబంధించిన కథ ఏ నేపథ్యంలో సాగుతుందో అనేది ఆయన రివీల్ చేయలేదు. అభిమానులు మాత్రం భారీ యాక్షన్ చిత్రమని భావిస్తున్నారని ఆయన చెప్పాడు. తారక్‌తో తీస్తున్న జానర్ ఏదైనా అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. 2024 ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపాడు. మరోవైపు యష్ జోడి 'కేజీఎఫ్' ఫ్రాంచైజీలో భాగంగా పార్ట్-3 ఉంటుందని ఆయన తెలిపాడు. KGF విడుదలైన 3 సంవత్సరాల తర్వాత, KGF 2 విడుదలైంది. దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కరోనాతో షాక్‌కు గురైన సినిమాలకు ఇది కొత్త ఆశను తెచ్చిపెట్టింది. త్వరలో కేజీఎఫ్- 3 రాబోతుంది. యష్ లేని కేజీఎఫ్ లేదు. త్వరలో ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు తెలుపుతారు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి అయింది. సీక్వెల్ చేయాలనే ఆలోచనతోనే 'కేజీయఫ్ 2' ఎండింగ్లో హింట్ ఇచ్చామని ఆయన పేర్కొన్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ తెరకెక్కిస్తున్న చిత్రం 'సలార్'. ఇందులో శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీరావు ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన సలార్ ట్రైలర్ భారీగా రికార్డ్లను క్రియేట్ చేసింది. డిసెంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నెల 15 నుంచి టికెట్లు అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
యష్ కొత్త చిత్రం ప్రకటన.. సాయి పల్లవికే ఛాన్స్.. డైరెక్టర్ ఎవరంటే
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు యష్.. KGF చాప్టర్ 2 విడుదలై ఇప్పటికి ఏడాదిన్నర అవుతుంది. కానీ ఆయన నుంచి ఏ సినిమా గురించి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు, కాబట్టి అభిమానులు యష్ 19 గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కన్నడ పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్టార్ అయిన ఈ నటుడి సినిమా కోసం దేశం మొత్తం సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంతలో, నటుడు యష్19 గురించి ఒక అప్డేట్ వచ్చేసింది. డిసెంబర్ 8వ తేదీ శుక్రవారం ఉదయం 09:55 గంటలకు యష్ 19 టైటిల్‌ను ప్రకటించనున్నట్లు రాకింగ్ స్టార్ తెలియజేశాడు. దీని తరువాత, ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, దర్శకుడు, సాంకేతిక నిపుణుల గురించి చర్చ జరుగుతోంది. దీంతో చాలా మంది నటీనటుల పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో యష్ హీరోయిన్గా నటి సాయి పల్లవి పేరు ముందు వరుసలో ఉంది. సౌత్ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా గుర్తింపు పొందిన నటి సాయి పల్లవిలో మంత్రముగ్ధులను చేసే డ్యాన్స్‌తో పాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: రేవంత్ రెడ్డి ఫోటో షేర్ చేస్తే ఇంతలా వేధిస్తారా..నన్ను వదిలేయండి: సుప్రిత) ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన ఆమె వెనుదిరిగి చూడలేదు. మలయాళం, తెలుగు, తమిళ చిత్రాల తర్వాత ఇప్పుడు యష్‌తో ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం సాయి పల్లవి ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం యష్ 19కి సంతకం చేసిందని టాక్. ఆమె ఇప్పటికే తెలుగులో నాగ చైతన్య రాబోయే చిత్రం తండేల్‌లో నటిస్తోంది. అలాగే, నితీష్ తివారీ తెరకెక్కించే రామాయణంలో సాయి పల్లవి, యష్ నటిస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి. ఇందులో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనున్నారని సమాచారం. ఈ వార్తను సాయి పల్లవి నిర్ధారించింది కానీ యష్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. యష్ 19వ చిత్రం టైటిల్‌ను ఈ డిసెంబర్ 8, శుక్రవారం ఉదయం 09:55 గంటలకు విడుదల చేయనున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ తెరకెక్కించనున్నట్లు దాదాపు ఖాయమైపోయింది. ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందించే అవకాశం ఉంది. గీతు మోహన్ దాస్ హిందీలో అబద్ధాల పాచికలు అనే చిత్రాన్ని 2014లో తెరకెక్కించారు. ఆ చిత్రానికి గాను రెండు జాతీయ అవార్డులు ఆమెకు దక్కాయి. సుమారుగా 50కి పైగా చిత్రాల్లో నటించి మంచి నటిగా కూడా గుర్తింపు పొందారు. It’s time… 8th December, 9:55 AM. Stay tuned to @KvnProductions #Yash19 pic.twitter.com/stZYBspuxY — Yash (@TheNameIsYash) December 4, 2023 -
KGF ఫ్యాన్స్ బీ రెడీ.. ఛాప్టర్-3 ఎప్పుడంటే
ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో కేజీఎఫ్ మొదటి భాగం పాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది. ఈ సినిమాతో హీరో యష్‌తో పాటు ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి క్రియేట్ చేసింది. దీంతో 2022లో రెండవ భాగాన్ని విడుదల చేశారు మేకర్స్. 'కేజీఎఫ్' సిరీస్ గ్రాండ్ సక్సెస్ తర్వాత, మేకర్స్ ఈ చిత్రానికి మూడవ భాగాన్ని ప్రకటించారు. ప్రకటన వెలువడినప్పటి నుంచి.. KGF, యష్ అభిమానులు 'KGF- 3' గురించి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. (ఇదీ చదవండి :నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన పోస్ట్) తాజాగా హోంబలే ఫిల్మ్స్‌కు చెందిన అధికార ప్రతినిధి 'కేజీఎఫ్' మూడవ భాగం గురించి కొత్త అప్డేట్ చెప్పారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్- 3 మూవీ 2025లో విడుదల కానుందని ఆయన తెలిపారు. ఈ సినిమా నిర్మాణ పనులు 2023లోనే ప్రారంభమవుతాయని, ఇదే విషయాన్ని డిసెంబర్ 21న హోమ్‌బలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. ఇక ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు 2024లో ప్రారంభించి.. 2025 కల్లా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుందని సమాచారం. కేజీఎఫ్- ఛాప్టర్ 2 ఎండింగ్లో పార్ట్- 3 ఉంటుందని దర్శకుడు ప్రకటించారు. అందుకే సినిమా కూడా కన్‌క్లూజన్ లేకుండా వదిలిపెట్టడం వల్ల అభిమానులు కూడా ఈ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ వస్తుందని అనుకున్నారు. కానీ అటు ప్రోడక్షన్ హౌస్ గానీ ఇటు హీరో గానీ ఎటువంటి అప్డేట్ను షేర్ చేయలేదు. ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్‌తో 'సలార్' సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీ అయిపోయారు. యష్ ఇప్పటి వరకు తన నుంచి మరో సినిమా ప్రకటన కూడా చేయలేదు. దీంతో ఈ మూవీ అప్డేట్ గురించి ఎక్కడా ప్రచారంలోకి రాలేదు. ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారంతో కేజీఎఫ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. (ఇదీ చదవండి: విశాల్ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్) -
అనుకోకుండా కిస్.. వాంతి చేసుకున్న 'కేజీఎఫ్' బ్యూటీ
ఇప్పుడు ఏ భాషలో సినిమా తీసుకున్నా ముద్దు అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రేక్షకులకు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే స్క్రీన్‌పై అది చూడటానికి బాగానే ఉన్నా.. దాని వెనక కష్టాలు పెద్దగా ఎవరికీ తెలియవు. అయితే గతంలో తనకు ముద్దు వల్ల జరిగిన చేదు అనుభవాన్ని 'కేజీఎఫ్' ఫేమ్ రవీనా టాండన్ బయటపెట్టింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు) ఏం జరిగింది? 1991 నుంచి ఇండస్ట్రీలో ఉన్న రవీనా టాండన్.. హిందీతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ హీరోయిన్గా చేసింది. టాలీవుడ్ వరకు వస్తే బంగారు బుల్లోడు, ఆకాశవీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాల్లో నటించింది. 'కేజీఎఫ్ 2'లో రమికా సేన్ పాత్ర చేసి చాలా క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే 'నో కిస్సింగ్ రూల్' పాటించే ఈమెకు కెరీర్ ప్రారంభంలో అనుకోకుండా సహనటుడి పెదాల్ని తన పెదాలతో. దీంతో ఈమెకు వాంతి అయిందట. రవీనా కామెంట్స్ 'ఎప్పుడూ ముద్దు సీన్స్‌లో నటించలేదు. ఎందుకో వాటిలో యాక్ట్ చేస్తే నాకు అసౌకర్యంగా ఉంటుంది. అందుకే నటించను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో జరిగిన సంఘటన ఇప్పటికీ గుర్తుంది. ఓ సీన్ చేస్తున్నప్పుడు సహనటుడి పెదాలు పొరపాటున నా పెదాలకు తగిలాయి. అది అతడు కావాలని చేయలేదు. కానీ చిరాగ్గా అనిపించింది. వెంటనే గదిలోకి వెళ్లిపోయా. ఎంతో వికారంగా అనిపించింది. వాంతి చేసుకున్నా. నోటిని వందసార్లు కడుక్కుంటే బాగుండనిపించింది' అని రవీనా టాండన్ చెప్పుకొచ్చింది. అయితే అది ఏ సినిమా, నటుడెవరు తదితర విషయాలు మాత్రం బయటపెట్టలేదు. (ఇదీ చదవండి: Skanda Movie Review: ‘స్కంద’ మూవీ రివ్యూ) -
సైమా అవార్డ్స్: కాంతారా, కేజీఎఫ్ మధ్య పోటీ.. విజేతల జాబితా ఇదే
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) సెప్టెంబర్ 15న అట్టహాసంగా ప్రారంభమైంది. దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 11వ ఎడిషన్ సౌత్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక జరుగుతోంది. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే తెలుగు,కన్నడ సినీ రంగంలోని ప్రముఖులు అవార్డులు కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును నేడు తమిళ్,మలయాళం చిత్రాలకు అందించనున్నారు. (ఇదీ చదవండి: సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!) కన్నడలో కాంతారా, చార్లీ 777, కేజీఎఫ్ చాప్టర్ 2 వంటి చిత్రాలకు భారీగా అవార్డులు వచ్చాయి. ‘కెజిఎఫ్ చాప్టర్ 2’లో అద్భుత నటనకుగానూ యష్ 'ఉత్తమ నటుడు' అవార్డును, శ్రీనిధి శెట్టి 'ఉత్తమ నటి' అవార్డును గెలుచుకున్నారు. కాంతారా చిత్రంలో అద్భుతమైన నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అవార్డును గెలుచుకున్నాడు. రక్షిత్ శెట్టి నటించిన 777 చార్లీ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. అత్యధికంగా కాంతారా సినిమాకు 10 అవార్డులు వచ్చాయి. కన్నడ చిత్రసీమలో అవార్డు దక్కించుకున్న వారి జాబితా ఇదే. కన్నడ చిత్ర సీమలో సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం (కన్నడ): ( 777 చార్లీ) * ఉత్తమ నటుడు (కన్నడ): యష్ (KGF చాప్టర్ 2) * ఉత్తమ నటి (కన్నడ): శ్రీనిధి శెట్టి (KGF చాప్టర్ 2) * ఉత్తమ దర్శకుడు: రిషబ్ శెట్టి -(కాంతారా) * ఉత్తమ సంగీత దర్శకుడు: బి. అజనీష్ లోక్‌నాథ్ (కాంతారా) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : రిషబ్ శెట్టి (కాంతారా) * ఉత్తమ నటి ( క్రిటిక్స్) : సప్తమి గౌడ (కాంతారా) * ఉత్తమ విలన్ : అచ్యుత్ కుమార్ (కాంతారా) * ఉత్తమ సహాయ నటుడు : దిగంత్ మంచలే (గాలిపాట 2) * ఉత్తమ సహాయ నటి : శుభ రక్ష (హోమ్ మినిస్టర్) * ఉత్తమ నటుడు: ప్రకాష్ తుమినాడ్ (కాంతారా) * ఉత్తమ గేయ రచయిత (కన్నడ) : ప్రమోద్ మరవంతే 'సౌందర్య రాశివే' పాట కోసం (కాంతర) * ఉత్తమ నేపథ్య గాయకుడు (కన్నడ) : విజయ్ ప్రకాష్, 'సౌందర్య రాశివే' పాట కోసం (కాంతర) * ఉత్తమ నేపథ్య గాయని (కన్నడ): సునిధి చౌహాన్, 'విక్రాంత్ రోనా'లోని 'రా రా రక్కమ్మ' పాట కోసం * ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : భువన్ గౌడ (KGF చాప్టర్ 2) * ఉత్తమ నూతన దర్శకుడు: సాగర్ పురాణిక్ (డొల్లు) * ఉత్తమ నూతన నిర్మాత : అపేక్ష పురోహిత్,పవన్ కుమార్ వాడెయార్ (డొల్లు) * ఉత్తమ నూతన నటుడు: పృథ్వీ షామనూర్ (పదవి పూర్వ) * ఉత్తమ నూతన నటి: నీతా అశోక్ (విక్రాంత్ రోనా) * స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ : రిషబ్ శెట్టి (కాంతారా) * స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ : ముఖేష్ లక్ష్మణ్ (కాంతారా) * ప్రత్యేక ప్రశంస అవార్డు ఉత్తమ నటుడు (కన్నడ): రక్షిత్ శెట్టి (చార్లీ 777) -
కేజీయఫ్-2 క్లైమాక్స్‌తో ‘సలార్’కు లింకు.. టీజర్ టైమ్‌తో క్లారిటీ?
మరో రెండు రోజుల్లో (జూలై 6) ‘సలార్’ టీజర్ రాబోతుంది. ‘ఆదిపురుష్ రిజల్ట్‌తో డీలా పడ్డ ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఇది పెద్ద ఉమశమనం. అందుకే టీజర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. జులై 6 తర్వాత తమ హీరో పేరు మరోసారి పాన్ ఇండియా స్థాయిలో మారు మ్రోగి పోవడం ఖాయమనే ధీమాతో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే సలార్ టీజర్‌ని అంత పొద్దున( ఉదయం 5.12 గంటలకు) రీలీజ్ చేయడం వెనుక కారణం ఏంటనే చర్చ నెట్టింట మొదలైంది. (చదవండి: బాలీవుడ్ కింగ్ షారుఖ్‌ను ఢీ కొడుతున్న ప్రభాస్..) ప్రభాస్‌కి ఉదయమే టీజర్‌ని విడుదల చేసే సెంటిమెంట్ ఉందని, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల మాదిరి సలార్ అప్డేట్ కూడా ఉదయమే ఇవ్వాలని ప్రభాస్ సూచించడంతోనే సలార్ టీజర్‌ని అంత పొద్దున రిలీజ్ చేస్తున్నారనే టాక్ నిన్నటిదాకా వినిపించింది. ఇక తాజాగా మరో క్రేజీ రూమర్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. సలార్ మూవీకి కేజీయఫ్ చిత్రంతో లింక్ ఉందంట.. అందుకే టీజర్‌ని ఉదయం 5.12 గంటలకు విడుదల చేస్తున్నారనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతుంది. సరిగ్గా 5.12 గంటలకే ఎందుకు? ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీయఫ్ సిరీస్‌లు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికి తెలిసిందే. గతేడాది విడుదలైన ‘కేజీయఫ్ 2’ చిత్రం పార్ట్ 1ని మించిన విజయాన్ని సొంతం చేసుకుంది. రాఖీ భాయ్ చనిపోవడంతో ఆ చిత్రం ముగుస్తుంది. ఆ క్లైమాక్స్ సీన్‌కి సలార్ టీజర్ విడుదలకి సంబంధం ఉందట. రాఖీ భాయ్ చనిపోయినట్లు చూపించే సన్నివేశంలో నాలుగు గడియారాలు ఉంటాయి. ఒక్కోక్కటి ఒక్కో సమయాన్ని సూచిస్తుంది. అందులో ఒకటి సరిగ్గా 5.12 నిమిషాలను చూపిస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి ఇప్పుడు తెగ ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. కేజీయఫ్ సిరీస్‌తో సలార్‌కు లింక్ ఉందని.. అందుకే టీజర్‌ని ఉదయం 5.12 గంటలకు విడుదల చేస్తున్నారనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతుంది. కొంతమంది ఇది నిజమే అంటుంటే.. మరికొంత మంది ‘ఇదేం కనెక్షన్స్రా బాబోయ్...’ అని కామెంట్ చేస్తున్నారు. ఒక వేళ ఇదే నిజమైతే మాత్రం ఈ సారి బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం. #Salaar #KGF #Prabhas 5:12 AM is the time Rocky Bhai gets attacked in KGF-2 climax and it’s the teaser time of Salaar 🔥🔥 . Mother of all collisions Salaar is coming up 🔥🔥🔥. Salaar 🚢 Kgf #Prabhas #Yash @hombalefilms#salaarbhaicoming pic.twitter.com/KduNGXoGAB — NANI CAMERON ™ (@Nani____3) July 3, 2023 -
లేడీ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన 'కేజీఎఫ్' యశ్!
పాన్ ఇండియా హీరోల్లో డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడూ టాప్ లో ఉంటాడు. ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తదితరులు ఉంటారు. తెలుగు కాకుండా దక్షిణాది నుంచి ఈ గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో 'కేజీఎఫ్' యశ్ ఒకడు. గతేడాది ఏప్రిల్ లో 'కేజీఎఫ్ 2'తో వచ్చి వేల కోట్ల కలెక్షన్స్ సాధించాడు. దీంతో యశ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఫ్యాన్స్ అయితే ఈ హీరో నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ అప్డేట్ వచ్చేసినట్లు కనిపిస్తుంది. (ఇదీ చదవండి: 'సలార్' కొత్త పోస్టర్లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా?) 'కేజీఎఫ్' రెండు సినిమాల కోసం దాదాపు ఏడేళ్లు వెచ్చించిన హీరో యశ్.. అందుకు తగ్గ ఫలితం అందుకున్నాడు. ఇదే ఇప్పుడు కొత్త సమస్యల్ని తీసుకొచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ బడ్జెట్ తో సినిమాలు చేస్తే అభిమానులకు నచ్చకపోవచ్చు. అందుకే ఆచితూచి అడుగు వేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో కలిసి ఓ మూవీ చేయడానికి సిద్ధమయ్యాడట. అధికారికంగా బయటకు రానప్పటికీ.. ఈ కాంబో ఖరారైనట్లు తెలుస్తోంది. మలయాళంలో 1989-2009 మధ్య నటిగా ఓ 20కి పైగా సినిమాలు చేసిన గీతూ మోహన్ దాస్.. 2009లో ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది. 2014లో 'లైయర్స్ డైస్' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. 2019లో 'మూతున్' మూవీ తీసింది. లాక్ డౌన్ టైంలో ఓ యాక్షన్ స్టోరీ రెడీ చేసిన ఈమె.. దాన్ని యశ్ కి చెప్పగా అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. అదే టైంలో ఓ రొమాంటిక్ స్టోరీ కూడా యశ్ కోసం సిద్ధం చేసిందట. ఈ రెండింట్లో ఏది చేయాలనే కన్ఫ్యూజన్ కాస్త నడుస్తోందని, ఇది క్లియర్ అయిన వెంటనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. (ఇదీ చదవండి: ఆ బిజినెస్‌లో 'కేజీఎఫ్' విలన్ రూ.1000 కోట్ల పెట్టుబడి?) -
ఆ బిజినెస్‌లో 'కేజీఎఫ్' విలన్ రూ.1000 కోట్ల పెట్టుబడి?
మనల్ని ఎంటర్టైన్ చేసే సినిమా స్టార్స్.. నటించడంతో పాటు పలు వ్యాపారాలు చేస్తుంటారు. మొన్నటివరకు ఫుడ్, రెస్టారెంట్స్ లో వీళ్లు ఎక్కువగా కనిపించారు. రీసంట్ టైంలో మహేశ్, బన్నీ, విజయ్ దేవరకొండ లాంటివాళ్లు మల్టీప్లెక్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఇవన్నీ చాలా సాధారణ విషయాలన్నట్లు బాలీవుడ్ స్టార్ హీరో, 'కేజీఎఫ్ 2' విలన్ ఎవరూ ఊహించని వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. కళ్లు చెదిరే మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది. సంజయ్ దత్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. డ్రగ్స్ కి బానిసవడం, అక్రమాయుధాల కేసులో జైలుకి వెళ్లడం లాంటి చాలా ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. అదంతా పక్కనబెట్టి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఓవైపు లీడ్ రోల్స్ చేస్తూనే మరోవైపు విలన్, సహాయక పాత్రలు చేస్తూ బిజీ అయిపోయాడు. గతేడాది 'కేజీఎఫ్ 2'లో అధీరాగా భయపెట్టిన సంజూ.. ప్రస్తుతం విజయ్ 'లియో', ప్రభాస్-మారుతి దర్శకత్వంలో వస్తున్న మూవీలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఇలా కెరీర్ పరంగా బాగా సంపాదిస్తున్న సంజయ్ దత్.. ఇప్పుడు లిక్కర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. రిటైల్ బిజినెస్ చేయడమే టార్గెట్ గా కార్టెల్ & బ్రోస్ అనే ఆల్కోబెవ్ (ఆల్కహాలిక్ బేవరేజ్) స్టార్టప్ లో పెట్టుబడి పెట్టాడు. ఈ కంపెనీ ఎక్కువగా స్కాచ్-విస్కీ తయారు చేస్తుంది. మన దేశంలో పోర్ట్ ఫోలియోని విస్తరించడమే లక్ష్యంగా.. ఈ కంపెనీలో సంజయ్ దత్ దాదాపు రూ.1000 కోట్ల మొత్తం పెట్టుబడిగా ఉంచినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమేంటనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్ ముందే పసిగట్టిన ప్రభాస్.. ఆ వీడియో వైరల్!) -
'సలార్' కొత్త పోస్టర్లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా?
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్.. 'ఆదిపురుష్' మేనియా నుంచి మెల్లగా బయటకొచ్చేస్తున్నారు. ఈ సినిమా నచ్చడం, నచ్చకపోవడం గురించి ఇక్కడ ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ 'సలార్' రచ్చ మొదలైపోయింది. ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వన్ అండ్ ఓన్లీ మూవీ ఇది. తాజాగా కొత్త పోస్టర్ ని విడుదల చేసి హైప్ ని పెంచేశారు. (ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!) పోస్టర్ అదిరింది! 'సలార్'.. ఈ ఏడాది సెప్టెంబరు 28న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ తో చిత్రబృందం బిజీబిజీగా ఉంది. ఈ మూవీ థియేటర్లలోకి రావడానికి ఇంకా 100 రోజులే ఉందని చెబుతూ తాజాగా అప్డేట్ ఇచ్చారు. 'ప్రపంచానికి సీపీఆర్ పెట్టాల్సిన టైమ్ వచ్చింది' అని వేరే లెవల్లో క్యాప్షన్ పెట్టి ఎలివేషన్ ఇచ్చారు. అభిమానులకు మంచి కిక్ ఇచ్చే మాట చెప్పారు. పోస్టర్ లో కేజీఎఫ్ కనెక్షన్? 'సలార్' సినిమాకు కేజీఎఫ్ స్టోరీతో సంబంధం ఉందని చాన్నాళ్ల నుంచి వినిపిస్తున్న మాట. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈ రెండు సినిమాల్ని లింక్ చేశాడని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు రిలీజ్ చేసిన 'సలార్' పోస్టర్ చాలా డార్క్ గా ఉంది. దీన్ని బ్రైటెనెస్ పెంచి చూస్తే.. అందులో కొన్ని బాక్సులు కనిపించాయి. అయితే అవి 'కేజీఎఫ్ 2'లో రాకీ భాయ్ సముద్రంలో పడేసిన బంగారం బాక్సులు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నిజమేంటనేది.. 'సలార్' రిలీజ్ అయితేనే తెలియదు. (ఇదీ చదవండి: పాన్ ఇండియా హీరోలకు బోలెడు కష్టాలు.. ప్రభాస్ సహా వాళ్లందరూ!) -
కేజీఎఫ్ రాఖీ భాయ్ ఫ్యామిలీ ఫొటోలు చూశారా..
-
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ ఏదో తెలిస్తే షాకవుతారు
ఆది నుంచీ భారతీయ చిత్ర పరిశ్రమ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. అలనాటి మొఘల్-ఎ-ఆజం, షోలే నుంచి లగాన్, దిల్వాలే దుల్హనియా లేజాయింగే, పీకే , పఠాన్, బజరంగీ భాయిజాన్ లాంటి బాలీవుడ్ సినిమాలతో పాటు దేశంలో రెండవ అతిపెద్ద నిర్మాణ కేంద్రంగా ఉన్న టాలీవుడ్లో 1977లో ఎన్టీ రామారావు నటించిన అడవి రాముడు సినిమా కోటి వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచింది. 1992లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి మూవీ ఘరానా మొగుడు , బాక్సాఫీస్ వద్ద రూ 10 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి తెలుగు చిత్రం. బాహుబలి, పుష్ప సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ లిస్ట్‌లో నిలిచాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ రూ.1258 కోట్లను రాబట్టడమే కాదు ఆస్కార్ అవార్డులను సైతం కైవసం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే కన్నడ మూవీల జాబితాలో వసూళ్లకు సంబంధించిన టాప్ వసూళ్లతో దూసుకుపోతున్న మూవీ కేజీ ఎఫ్-2. 100కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన టాప్ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ వసూళ్లలో కన్నడ సినీ పరిశ్రమను మరో ఎత్తుకు తీసుకెళ్లింది. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చివరిగా విడుదలైన పఠాన్ జనవరి 25 న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పఠాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,050.3 కోట్లు వసూలు చేసింది, 2023లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. (తనను తాను పెళ్లాడిన యువతి ఫస్ట్ యానివర్సరీ, అదిరిపోయే వీడియో వైరల్) అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఇండియన్ మూవీస్ దంగల్ అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.2,000 కోట్లు వసూలు చేసింది. దంగల్‌లో అమీర్ ఖాన్ రెజ్లర్ మహావీర్ ఫోగట్ పాత్రను పోషించాడు. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) బాహుబలి-2 ద కంక్లూజన్ రెండు భాగాలుగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి. ప్రభాస్, అనుష్క శెట్టి, సత్యరాజ్, రమ్య కృష్ణన్ , సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషించిన సీక్వెల్ బాహుబలి-2 రూ.1810 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. ఆర్ఆర్ఆర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1,258 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట బ్లాక్ బస్టర్ హిట్.. ఈ సినిమాలో తొలిసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించింది కేజీఎఫ్-2 ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ. 1,250 కోట్లు వసూలు చేసింది. 2018 సూపర్ హిట్ అయిన కేజీఎఫ్‌కి సీక్వెల్‌గా కేజీఎఫ్2 తెరకెక్కింది.ఈ మూవీలో 2 లో యష్, సంజయ్ దత్ , రవీనా టాండన్ నటించారు.(వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్: బేబీ బంప్‌తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా?) బజరంగీ భాయీజాన్ సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.969 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ముఖ్యమైన పాత్రలో నటించారు. పీకే రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన పీకే ప్రపంచవ్యాప్తంగా రూ.769 కోట్లు రాబట్టింది. అమీర్ ఖాన్, అనుష్క శర్మ, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తదితరులు నటించారు. సీక్రెట్ సూపర్ స్టార్ చిన్న బడ్జెట్ చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద రూ.966 కోట్లు వసూలు చేసింది.అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమీర్ ఖాన్ చిన్న పాత్రలో నటించారు. ---- పోడూరి నాగ ఆంజనేయులు -
బాలీవుడ్ ని బ్రేక్ చేసిన 2018 మూవీ
-
KGF-3: 'వాగ్దానం ఇంకా మిగిలే ఉంది'.. కేజీఎఫ్-3పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీయఫ్-2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. భాషతో సంబంధం లేకుండా పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. ఓ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. అభిమానులు సైతం సినిమాను గుర్తుచేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రశాంత్‌నీల్ పవర్ఫుల్ డైరెక్షన్‌తో కమర్షియల్ సినిమాలకు ట్రెండ్ సెట్ చేశారు. హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేస్తూ..'మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ చేసిన పవర్ఫుల్ ప్రామిస్. కేజీఎఫ్-2 చిత్రంలో మరపురాని పాత్రలు, యాక్షన్‌తో మనల్ని ఒక పురాతన ప్రయాణంలోకి తీసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టింది. కోట్లమంది అభిమానుల హృదయాలను గెలిచింది.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో చివర్లో వాగ్దానం ఇంకా మిగిలే ఉందంటూ కేజీఎఫ్-3 పై హింట్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే కేజీయఫ్-3 మొదలు కానుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్-2 భారీ హిట్ కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ వచ్చే వస్తాయని అభిమానులు భావిస్తున్నారు. కాగా..కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్‌తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్‌తో కలిసి పని చేయనున్నారు. ఆ తర్వాత కేజీయఫ్-3 ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. The most powerful promise kept by the most powerful man 💥 KGF 2 took us on an epic journey with unforgettable characters and action. A global celebration of cinema, breaking records, and winning hearts. Here's to another year of great storytelling! #KGFChapter2#Yash… pic.twitter.com/iykI7cLOZZ — Hombale Films (@hombalefilms) April 14, 2023 -
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కేజీఎఫ్ నటి.. ఫోటో వైరల్
కన్నడ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి మాళవిక అవినాష్. శాండల్‌వుడ్‌లో సినిమాలతో పాటు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఈమె కేజీఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమాలో సీనియర్ ఉమెన్ జర్నలిస్ట్ పాత్రలో నటించి పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందింది. ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తూ బిజీబిజీగా గడిపేస్తుంది. అయితే తాజాగా మాళవిక అవినాష్ అనారోగ్యం బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే తేలికగా తీసుకోవద్దు. లేదంటూ నాలాగే ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. పనాడోల్, నెప్రోసిమ్ వంటి సాంప్రదాయ ఔషధం తీసుకోవడంతో పాటు నిర్లక్ష్యం చేయకుండా త్వరగా డాక్టర్ని సంప్రదించండి అంటూ నెటిజన్లను కోరింది. ఈ సందర్భంగా హాస్పిటల్ బెడ్‌పై ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. -
1000 కోట్లు లోడింగ్..బాక్సాఫీస్‌కు కలెక్షన్ల సునామీ
-
‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడానికి అదే కారణం..: రామ్‌చరణ్
లాస్ ఏంజిల్స్‌లో ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో సంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డు వేడుక కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లిన దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి, కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి, తనయుడు కార్తికేయ, సంగీతదర్శకుడు కీరవాణి, గాయకుడు కాలభైరవ, నటుడు శ్రీ సింహా తదితరులు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. కాగా ఆస్కార్ అవార్డు సాధించడం గురించి రాజమౌళిని స్పందించమని విలేకర్లు అడగ్గా.. ఆయన ‘జైహింద్’ అన్నారు. ఇక ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లాస్ ఏంజిల్స్ నుంచి శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు రామ్‌చరణ్. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం గురించి స్పందిస్తూ– ‘‘భారతీయ అభిమానులందరూ ‘ఆర్ఆర్ఆర్’ను ఆదరించారు. ‘నాటు నాటు’ పాటను సూపర్ హిట్ చేశారు. ‘నాటు నాటు’ పాట మాది కాదు.. ప్రజల పాట. ప్రేక్షకుల అభిమానమే ఆస్కార్‌కి దారి వేసింది, అవార్డు వరించేలా చేసింది. వారితో పాటు కీరవాణి, చంద్రబోస్, రాజమౌళిగార్లకి కూడా థ్యాంక్స్ చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు రామ్‌చరణ్. తప్పుగా అర్థం చేసుకున్నారు: కాలభైరవ ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటను పాడినందుకు ఆనందంగా ఉందంటూ ఓ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు కాలభైరవ. ‘‘ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటను ప్రదర్శించినందుకు గర్వపడుతున్నాను. నాకు ఈ విలువైన క్షణాలు దక్కడానికి రాజమౌళి బాబా, నాన్న (కీరవాణి), కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్ మాస్టర్, కార్తికేయ అన్న, అమ్మ, పెద్దమ్మ... ఇలా మరికొందరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమయ్యారు. యూఎస్ టీమ్ కూడా హెల్ప్ చేసింది. వీరి సహకారం, ప్రోత్సాహం లేకపోతే ఆస్కార్ వేదికపై నా ప్రదర్శన వీలయ్యేది కాదు’’ అని ఆ నోట్లో చెప్పు కొచ్చారు కాలభైరవ. కాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల పేర్లను కాలభైరవ ప్రస్తావించకపోవడంతో ఈ ఇద్దరి హీరోల అభిమానులు, కొందరు నెటిజన్లు తప్పుబడుతూ కామెంట్స్ చేశారు. దీంతో ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా కాలభైరవ స్పందించారు. ‘‘ఆర్ఆర్ఆర్’ సినిమా, ఇందులోని ‘నాటు నాటు’ పాట సక్సెస్‌కు తారక్ అన్న, చరణ్ అన్న ముఖ్యులు. అందులో సందేహం లేదు. అయితే నేను ఆస్కార్ వేదికపై నా ప్రదర్శనకు సంబంధించిన విషయం గురించి మాత్రమే ఆ నోట్లో ప్రస్తావించాను. అది తప్పుగా అర్థమైనట్లుంది. అయినప్పటికీ నా మాటలను క్షమించమని అడుగుతున్నాను’’ అని కాలభైరవ పేర్కొన్నారు. ఆస్కార్ వేదికపై షాక్ అయ్యా: గునీత్ మోంగా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ నిర్మాత గునీత్ మోంగా శుక్రవారం ముంబై చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మామూలుగా ఆస్కార్ అవార్డు అందుకున్నవారు తమ యాక్సెప్టెన్సీ స్పీచ్‌ను 45 సెకన్లలో పూర్తి చేయాలి. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ దర్శకురాలు కార్తీకి అన్ని సెకన్లలోనే పూర్తి చేశారు. కానీ నిర్మాత గునీత్ మోంగా కాస్త ఎక్కువ టైమ్ తీసుకుని మాట్లాడుతుండగా స్పీచ్ ఆపాలన్నట్లుగా వెనకనుంచి మ్యూజిక్ ప్లే చేశారు ఆస్కార్ నిర్వాహకులు. అలాగని నిర్వాహకులు ఈ 45 సెకన్ల నియమంలో కఠినంగా ఏమీ లేరు. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెల్చుకున్న చార్లీ మాక్సే, మ్యాథ్యూ ఫ్రౌండ్లు 45 సెకన్ల కన్నా ఎక్కువగా మాట్లాడినా, నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఈ విషయంపై గునీత్ మోంగా స్పందించారు. ‘‘ఇండియాకు తొలి ఆస్కార్ అవార్డును సాధించామనే గొప్ప విషయం గురించి చాలా మాట్లాడాలనుకున్నాను. కానీ నా స్పీచ్‌ను కట్ చేశారు. షాక్ అయ్యాను. ఇండియా తరఫున నేను మాట్లాడే అవకాశాన్ని నా నుంచి ఎవరో లాగేసుకున్నట్లుగా అనిపించింది. నేను మళ్లీ ఆస్కార్‌కు వెళతాను. అప్పుడు తప్పకుండా నా గొంతు మళ్లీ వినిపిస్తాను’’ అని పేర్కొన్నారు గునీత్. అత్యధిక కలెక్షన్ల జాబితాలో ఆర్ఆర్ఆర్ మూడో స్థానం.. భారతీయ చిత్రాల్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ మూడోస్థానంలో నిలిచింది. ఇదివరకు ఈ స్థానంలో ‘కేజీఎఫ్: చాఫ్టర్ 2’ ఉండేది. తొలుత అత్యధిక గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో వరుసగా ‘దంగల్’ (దాదాపు రూ. 1900 కోట్లు), ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’(రూ. 1800 కోట్లు), ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ (రూ. 1230 కోట్లు), ‘ఆర్ఆర్ఆర్’ (దాదాపు రూ. 1150 కోట్లు), ‘పఠాన్’ (రూ. 1050 కోట్లు.. ఇంకా ప్రదర్శిత మవుతోంది) ఉన్నాయి. అయితే గత ఏడాది అక్టోబరులో జపాన్‌లో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికీ ప్రదర్శితమవుతోంది. జపాన్ బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటివరకు రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అలాగే ‘ఆస్కార్’ ప్రచారంలో భాగంగా అమెరికాలో ఈ నెల 3న, తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 10న ‘ఆర్ఆర్ఆర్’ను రీ రిలీజ్ చేశారు. దీంతో మరికొన్ని కలెక్షన్స్ వచ్చాయి. ఈ వసూళ్లు మొత్తాన్ని కలిపితే ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ గ్రాస్ కలెక్షన్స్‌ను ‘ఆర్ఆర్ఆర్’ దాటిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. -
అలా మాట్లాడటం సరైంది కాదు.. మహా కామెంట్స్‌పై నాని
ఇటీవల దర్శకుడు వెంకటేశ్ మహా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ చిత్రంపై విమర్శలు చేశారు. ఆయన తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కూడా చెప్పారు. అయితే తాజాగా ఈ విషయంపై నాచురల్ స్టార్ నాని స్పందించారు. ఇలా జరగడం దురదృష్ణకరమని.. అతను అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు. తాజాగా దసరా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాని మహా కామెంట్స్‌పై స్పందించారు. నాని మాట్లాడుతూ.. 'ఇటీవల దర్శకులు పాల్గొన్న చర్చా కార్యక్రమాన్ని చూశా. వెంకటేశ్ మహా మాట్లాడిన విధానం సరిగా లేదు. థియేటర్లో ఒక సినిమా చూసిన తర్వాత బయటకొచ్చి మన ఫ్రెండ్స్‌తో ఒక విధంగా చెబుతాం. కానీ అదే ఇంటర్వ్యూల్లోకి వచ్చేసరికి అదే మరోలా చెబుతాం. అక్కడ చర్చలోనూ అదే జరిగింది. అందుకే అతను విమర్శలు ఎదుర్కొన్నాడు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సింది. ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నలుగురు దర్శకులు నాకు తెలిసిన వాళ్లే. వాళ్లకు మాస్, కమర్షియల్ సినిమా అంటే ఎంతో ఇష్టం. చిన్న వీడియో క్లిప్ చూసి వాళ్లపై ఒక అభిప్రాయానికి రాను. ఏది ఏమైనా ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం'. అని అన్నారు. కాగా.. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, నందినిరెడ్డి, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, వెంకటేశ్ మహా ఓ డిబేట్లో పాల్గొన్నారు. కేజీఎఫ్‌ను ఉద్దేశించి వెంకటేశ్ మహా మాట్లాడుతూ..'తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారాన్ని సంపాదించి.. చివరికి ఆ మొత్తాన్ని సముద్రంలో పడేశాడు. అలాంటి వ్యక్తి గురించి సినిమాలు చేస్తే మనం చప్పట్లు కొడుతున్నాం' అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. -
భారీ సినిమాల లైనప్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న KGF హీరో యష్
-
కేజీయఫ్ ఓ చెత్త సినిమా: ‘కాంతార’ నటుడు సంచలన కామెంట్స్
కేజీయఫ్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీయఫ్ చాప్టర్ 1 ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. దీనికి సీక్వెల్‌గా గతేడాది విడుదలైన కేజీయఫ్ చాప్టర్ 2 కలెక్షన్ల సునామీ సృష్టించింది. చెప్పాలంటే కన్నడ చిత్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఇది. వరల్డ్ వైడ్ దాదాపు రూ. 12 50 కోట్లు పైగా వసూళు చేసింది. ఈ చిత్రంతో హోంబాలే ఫిలింస్ నిర్మాణ సంస్థ మంచి గుర్తింపు వచ్చింది. చదవండి: రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ధమాకా.. రవితేజ కెరీర్లోనే తొలి రికార్డు! ఇక ఇదే బ్యానర్లో వచ్చి మరో సంచలనం సృష్టించిన సినిమా కాంతార. ఓ ప్రాంతీయ చిత్రంగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిచుకుంది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 400 కోట్లు సాధించింది. తాజాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు కిశోర్ కుమార్ కేజీయఫ్ మూవీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేజీయఫ్ ఓ చెత్త సినిమా అని పేర్కొన్నాడు. రీసెంట్గా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో అతడు మాట్లాడుతూ.. కేజీయఫ్ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: అందుకే నా ట్విటర్ అకౌంట్‌ను నిలిపివేశారు: నటుడు కాంతారతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు కేజీయఫ్ మూవీపై ప్రశ్న ఎందురైంది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘కేజీయఫ్ మూవీ నేను ఇంతవరకు చూడలేదు. ఇది సరైన పోలికో కాదో తెలియదు. అది నా టైప్ సినిమా కాదు. ఇది నా వ్యక్తిగత విషయం. ఇలాంటి ఓ చెత్త సినిమా కంటే పెద్దగా సక్సెస్ కానీ సీరియస్ అంశాన్ని డీల్ చేసే ఓ చిన్న సినిమా చూస్తాను ’ అంటూ తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు. కాగా తెలుగులో ‘హ్యాపీ’, నాని ‘భీమిలి కబడ్డీ జట్టు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ కుమార్ రీసెంట్గా పొన్నియన్ సెల్వన్, కాంతార, షీ వెబ్ సిరీస్ సీజన్ 2లో నటించాడు. ప్రస్తుతం ‘రెడ్ కాలర్’ అనే హిందీ సినిమా చేస్తున్నాడు. -
కేజీఎఫ్ హీరోతో పాండ్యా బ్రదర్స్.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్..!
కేజీఎఫ్ మూవీ సృష్టించిన సంచలన అంతా ఇంతా కాదు. రెండు భాగాలు రిలీజై బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు యశ్. బాలీవుడ్‌తో సహా దక్షిణాదిలో యశ్ అంటే తెలియని వారు ఉండరు. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎందుకంటే క్రికెట్లో బిజీగా ఉండే పాండ్యా బ్రదర్స్ యశ్‌తో దిగిన ఫోటో అభిమానులను కట్టి పడేస్తోంది. ఈ ఫోటోను హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ ఫోటోలను షేర్ చేస్తూ..' కేజీఎఫ్-3' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఆ ఫోటోల్లో కృనాల్ పాండ్యా కూడా ఉన్నారు. పాన్-ఇండియా స్టార్‌తో దిగిన ఫోటోలు సినీ ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. మరికొందరైతే కన్నడ పరిశ్రమకు దక్కినన గొప్ప గౌరవం అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. కేజీఎఫ్ మూడో భాగం ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కథ ఇంకా సిద్ధం కాలేదని తెలిపారు. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
కేజీఎఫ్-3 మూవీపై క్రేజీ అప్ డేట్.. ఆ సినిమా పూర్తయ్యాకే..!
కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభంజన సృష్టించిన సంగతి తెలిసిందే. యశ్ అభిమానులు కేజీఎఫ్ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు హోంబలే ఫిల్స్మ్ అధినేత విజయ్ కిరంగదూర్. ప్రశాంత్ నీల్ తెరక్కిస్తున్న ప్రభాస్ మూవీ 'సలార్' తర్వాత పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. హోంబలే ఫిల్మ్స్ నుంచి కేజీఎఫ్, కాంతార లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేజీయఫ్-3పై అప్డేట్ ఇచ్చారు. 2018లో కన్నడ చిత్రంగా వచ్చి భారీ విజయం అందకున్న చిత్రం కేజీయఫ్. దీనికి కొనసాగింపుగా ఈ ఏడాదే కేజీయఫ్ చాప్టర్-2 వచ్చి సందడి చేసింది. ఈ మువీ కూడా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేజీఎఫ్-3 స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టనున్నారని తెలిపారు. నీల్ వద్ద ఇప్పటికే స్టోరీ లైన్ రెడీగా ఉందని.. వచ్చే ఏడాది లేదా సలార్ పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామని వెల్లడించారు. -
బ్రహ్మాస్త్ర 2 లో యశ్.. కరణ్ జోహార్ క్లారిటీ
-
‘పాన్ ఇండియా’ జాతర.. అంచనాలతో 1000 కోట్లు.. అనుకోకుండా 400 కోట్లు
బాహుబలి లాంటి ఒక్క చిత్రం పాన్ ఇండియా విజయం సాధిస్తే.. అదే ఫీట్ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుందా అంటే..తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు సమాధానం చెప్పాయి. వందల కోట్ల వసూళ్లు సాధించి సంచలన విజయం సాధించాయి. సౌత్ ,నార్త్ ను ఒక్కటి చేసేలా పాన్ ఇండియా హిట్ కొట్టాయి. 2022లో కూడా ఆ సీన్ రిపీట్ అయింది. ఈ ఏడాదంతా బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా జాతర కొనసాగింది. అంచానాలతో వచ్చి వెయ్యి కోట్ల కొల్లగొట్టిన చిత్రాలు..ఏ మాత్రం ఊహించకుండా నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు ఉన్నాయి. మరి ఈ ఇయర్ సౌత్ నార్త్ అనే ఎళ్లలు చేరిపేసిన ఆ చిత్రాలపై ఓ లుక్కేయండి. ‘బహుబలి’ సిరీస్ సినిమాలతో టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి తెలియజేశాడు రాజమౌళి. ఆయన ఈ ఏడాది మరో పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’తో ప్రేక్షకులను పలకరించాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ మూవీ మార్చి 25న విడుదలై, అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద వందల కోట్లను రాబట్టింది. రూ. 550 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం.. దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఏడాది రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన మరో చిత్రం ‘కేజీయఫ్ 2’. కన్నడ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ‘కేజీయఫ్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే కేజీయఫ్ 2. ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలైన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అంచనాలకు మించి రూ.1200 కోట్లను కొల్లగొట్టి ఔరా అనిపించింది. బహుబలి సాధించిన విజయం స్పూర్తితో..మణి రత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని రూపొందించాడు. మల్టీస్టారర్ గా వచ్చిన ఈ మూవీ..ఇటు సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది.నాలుగు వందల యాభై కోట్లు కొల్లగొట్టింది. అలాగే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూడా ఈ ఏడాది ‘విక్రమ్’తో బాక్సాఫీస్‌పై తన విశ్వరూపాన్ని చూపించాడు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్ 3 విడుదలై పాన్ ఇండియా ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.450కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి కమల్ హాసన్ సత్తాని మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. ఈ ఇయర్ లో సౌత్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి..నార్త్ లో కనికట్టుచేసిన మూవీ..కాంతార. ఇది ఎవరు ఉహించని విజయం..సర్పైజింగ్ సక్సెస్. నాలుగు వందల కోట్ల కు పైగా కలెక్షన్లు రాబట్టింది. మరోవైపు బాలీవుడ్ చిత్రం..బ్రహ్మస్త్ర కూడా..పాన్ ఇండియా హిట్ కొట్టింది. హిందీ ఆడియన్స్ ను ఆకట్టుకొని..దక్షణాది ప్రేక్షకుల ప్రేమను కూడా గెలుచుకుంది. తెలుగు లాంగ్వెజ్ లో ఇరువై కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది .అన్ని భాషల్లో కలుపుకొని..నాలుగు వందల కోట్లకు పైగా కొల్లగొట్టింది.ఇలా ఈ చిత్రాలన్ని..ఎళ్లలు దాటి విజయం సాధించాయి..వందల కోట్ల చిత్రాల జాబితాలోకి చేరాయి. -
త్వరలో తెరుచుకోనున్న రియల్ KGF గేట్లు
-
IMDb: ఈ ఏడాది టాప్ 10 మూవీస్ ఇవే.. అగ్రస్థానంలో 'ఆర్ఆర్ఆర్'
ఈ ఏడాది ఇండియాలో టాప్ టెన్ మూవీస్‌లో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబి ఈ జాబితాను విడుదల చేసింది. టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ ఆఫ్ 2022’ పేరుతో విడుదల చేసిన జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అత్యంత భారీ బడ్జెడ్ ఆర్ఆర్ఆర్తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మొదటిస్థానంలో ఆర్ఆర్ఆర్, రెండోస్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, మూడోస్థానంలో కేజీఎఫ్-2, నాలుగో స్థానంలో విక్రమ్, ఐదో ప్లేస్‌లో కాంతార నిలిచింది. ఆ తర్వాత వరుసగా రాకెట్రీ, మేజర్, సీతారామం, పొన్నియిన్ సెల్వన్, చార్లీ 777 చిత్రాలు టాప్ టెన్‌లో స్థానం దక్కించుకున్నాయి. ఈ ఏడాది భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు.. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన కన్నడ హీరో రిషబ్ శెట్టి చిత్రం కాంతార మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే బ్రహ్మరథం పట్టారు. టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్- 2022 ఆర్ఆర్ఆర్ ది కశ్మీర్ ఫైల్స్ కేజీయఫ్-2 విక్రమ్ కాంతార రాకెట్రీ మేజర్ సీతారామం పొన్నియిన్ సెల్వన్ 777 చార్లీ Presenting the IMDb Top 10 Most Popular Indian Movies of the year 2022 🥁💛 How many of your favourites made it to the list?#IMDbBestof2022 pic.twitter.com/0GggT44fG8 — IMDb India (@IMDb_in) December 14, 2022 -
కె.జి.యఫ్ హోటల్.. మీరూ ఓ లుక్కేయండి (ఫొటోలు)
-
‘కాంతార’ లాంటి చిత్రాలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి: స్టార్ డైరెక్టర్
ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు అనే సంబంధం లేకుండ కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. బాషతో సంబంధం లేకుండ సౌత్ సినిమాలకు నార్త్‌లో సైతం విశేష ఆదరణ లభిస్తోంది. ఇందుకు ఇటీవల విడుదలైన కాంతార చిత్రమే ఉదాహరణ. ఈ ప్రాంతీయ సినిమా వచ్చిన ఈ కన్నడ మూవీ దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. దీంతో పాన్ ఇండియా అనే అంశం ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. చదవండి: వాల్తేరు వీరయ్య: కేక పుట్టిస్తున్న రవితేజ ఫస్ట్‌లుక్ టీజర్ ఈ నేపథ్యంలో కాంతార మూవీపై స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్చప్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్ నిలిచాయి. సైరత్ మూవీ విజయం మరాఠి ఇండస్ట్రీని నాశనం చేసిందని గతంలో ఆ మూవీ డైరెక్టర్ నాగరాజు మంజులే చేసిన వ్యాఖ్యలను అనురాగ్ గుర్తు చేశాడు. ప్రాంతీయ సినిమాలు, సొంత కథల సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ.. వాటి సక్సెస్ కారణంగా ఇండస్ట్రీ నాశనమైపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా కల్చర్ హవా కొనసాగుతుందని, దానివల్ల బాలీవుడ్ ఇండస్ట్రీ నాశనమైపోతుందన్నాడు. చదవండి: అంజలి పెళ్లి చేసుకుందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. దీంతో ఈ ట్రెండ్‌పైనే బాలీవుడ్ దర్శక-నిర్మాతలు దృష్టిపెడుతున్నారు. ఇప్పుడు ఇదే బాలీవుడ్‌ను నాశనం చేస్తోంది. పుష్ప, కేజీయఫ్ 2, కాంతార వంటి చిత్రాలు దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యిండోచ్చు. కానీ అలాంటి సినిమాలు బాలీవుడ్లో వర్కౌట్ కావు. వాటినే కాపీ కొట్టి పాన్ ఇండియా సినిమాలుగా తీయాలని చూస్తే మాత్రం బాలీవుడ్‌కు భారీ నష్టం తప్పుదు. ప్రస్తుతం బాలీవుడ్‌కు కావాల్సింది పాన్ ఇండియా సినిమాలు కాదు. ఇండస్ట్రీకి ధైర్యం చెప్పే సినిమాలు కావాలి. కథల్లో ఎప్పుడూ కొత్తదనం ఉండాలి.. అప్పుడే సినిమాలు హిట్ అవుతాయి’’ అని అనురాగ్ పేర్కొన్నాడు. -
కేజీఎఫ్ హీరో యశ్ భార్య ఎమోషనల్ పోస్ట్.. లవ్ యూ అంటూ..!
కేజీఎఫ్ హీరో యశ్ టాలీవుడ్‌లోనూ పరిచయం అక్కర్లేని పేరు. అంతలా పేరు తీసుకొచ్చింది ఆ సినిమా. రాఖీభాయ్‌గా విపరీతమైన క్రేజ్ వచ్చింది. శాండల్‌వుడ్‌లో అత్యంత అభిమానించే హీరోల్లో యశ్ ముందువరుసలో ఉంటారు. తాజాగా ఆయన వివాహ వార్షికోత్సవం సందర్భంగా యశ్ భార్య రాధిక పండిట్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్నారు. దీంతో ఆయన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇది చదవండి: బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్ హీరో.. కరణ్ జోహార్ క్లారిటీ..!) రాధిక ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇది మనమే.. మనం చాలా ఉల్లాసభరితంగా, గంభీరంగా ఉండొచ్చు. కానీ ఇది నిజం.. ఈ ఆరేళ్ల వైవాహిక జీవితాన్ని అద్భుతంగా మార్చినందుకు ధన్యవాదాలు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. లవ్ యూ.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. వారిద్దరు ఎలా కలిశారంటే.. యశ్, రాధిక పండిట్ ఓ సినిమా షూటింగ్ సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు స్నేహం మొదలైంది. కొన్నేళ్లకు వారి స్నేహం ప్రేమగా మారి.. డిసెంబర్ 9, 2016న పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక పాప, బాబు జన్మించారు. వారి పిల్లలకు ఐరా, యతర్వ్ అని పేర్లు పెట్టారు. కాగా.. కేజీఎఫ్ 2 భారీ హిట్ తర్వాత సినిమాలకు కొంత విరామం ప్రకటించారు యశ్. సినీ ప్రియులు కేజీఎఫ్ చాప్టర్- 3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యశ్ తన తదుపరి చిత్రం కోసం దర్శకుడు నర్తన్‌తో కలిసి పని చేయనుండగా.. ఆ చిత్రానికి యశ్ -19 అని పేరు పెట్టారు. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
గూగుల్ సెర్చ్‌లో ఆ సినిమానే టాప్.. ఆర్ఆర్ఆర్ ఎక్కడంటే?
బాలీవుడ్ జంట అలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మస్త్ర-పార్ట్ 1'. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. విజువల్ వండర్‌గా ఈ సినిమా పలు రికార్డులు సాధించింది. అయితే ఈ ఏడాది అత్యధికంగా గూగుల్‌లో వెతికిన చిత్రంగా నిలిచింది. కేజీఎఫ్- 2, ది కాశ్మీర్ ఫైల్స్, కాంతారను వెనక్కినెట్టి 2022లో అత్యధికంగా గూగుల్ సెర్చ్ చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సాధించింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ 'ఇయర్ ఇన్ సెర్చ్ 2022'ని ఆవిష్కరించింది. ఈ ఏడాది 11 నెలల్లో ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్న జాబితాను ప్రకటించింది. అధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ జాబితాలో రెండోస్థానంలో కేజీఎఫ్-2, మూడో స్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, నాలుగో స్థానంలో ఆర్ఆర్ఆర్, ఐదో స్థానంలో కాంతార నిలిచాయి. ఆ తరువాత వరుసగా పుష్ప-ది రైజ్, విక్రమ్, లాల్ సింగ్ చద్ధా, దృశ్యం-2, థోర్-లవ్ అండ్ థండర్ సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్ హిట్ మూవీ పుష్ప: ది రైజ్ గతేడాది విడుదలైనప్పటికీ 2022లోనూ ఆధిపత్యం చెలాయించింది. మొదటి పది స్థానాల్లో దక్షిణాదికి చెందిన ఐదు చిత్రాలు ఉండగా.. కేవలం నాలుగు హిందీ చిత్రాలు మాత్రమే చోటు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. -
కాంతార ప్రభంజనం.. కేజీఎఫ్-2 రికార్డ్ బ్రేక్
బాక్సాఫీస్ సంచలనం సృష్టించిన మూవీ 'కాంతార'. భాషతో సంబంధం లేకుండా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విడుదలై 50 రోజులు అయినా థియేటర్లలో క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా వసూళ్ల పరంగా మరో రికార్డ్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల (గ్రాస్) వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో కేజీయఫ్-2 రికార్డును అధిగమించి రూ.168.50 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. (చదవండి: ఓటీటీకి 'కాంతార'.. ఆ వివాదం వల్లే ఆలస్యమవుతోందా ?) తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.60 కోట్లు, తమిళనాడులో రూ.12.70 కోట్లు, కేరళలో 19.20 కోట్లు, ఓవర్సీస్లో రూ.44.50 కోట్లు వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్లో అయితే ఇప్పటివరకూ రూ.96 కోట్లు వచ్చినట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సినీ ప్రేక్షకులు అందరూ ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో డబ్ అయి, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల జాబితాలో నిలిచింది. మొదటి స్థానంలో ‘కేజీయఫ్2’ రూ.185 కోట్ల టాప్‌లో ఉండగా, ఆ తర్వాత 2.ఓ (రూ.100కోట్లు), రోబో (రూ.72కోట్లు), కాంతార (రూ.60) ఐ (రూ.57కోట్లు) ఉన్నాయి. ‘KANTARA’ CROSSES ₹ 400 CR WORLDWIDE… #Kantara territory-wise breakup… Note: GROSS BOC… ⭐️ #Karnataka: ₹ 168.50 cr ⭐️ #Andhra / #Telangana: ₹ 60 cr ⭐️ #TamilNadu: ₹ 12.70 cr ⭐️ #Kerala: ₹ 19.20 cr ⭐️ #Overseas: ₹ 44.50 cr ⭐️ #NorthIndia: ₹ 96 cr ⭐️ Total: ₹ 400.90 cr pic.twitter.com/CmBQbLrZvf — taran adarsh (@taran_adarsh) November 22, 2022 -
జపాన్‌లోనూ 'ఆర్ఆర్ఆర్' జోరు.. త్రీ ఇడియట్స్ రికార్డు బ్రేక్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా రికార్డ్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం జపాన్‌లోనూ దూసుకెళ్తోంది. అక్కడి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా అమిర్ ఖాన్ బాలీవుడ్ చిత్రం త్రీ ఇడియట్స్ రికార్డును అధిగమించింది. జపాన్‌లో విడుదలైన 17 రోజుల్లోనే 185 మిలియన్ల జపాన్ యెన్ల వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది. దీంతో జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా 'ఆర్ఆర్ఆర్' నిలిచింది. గతంలో రజినీకాంత్ నటించిన ముత్తు చిత్రం జపాన్‌లో 400 మిలియన్ల జపాన్ యెన్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత బాహుబలి- 2 300 మిలియన్లతో రెండో స్థానంలో ఉండగా.. తాజాగా 185 మిలియన్లతో ఆర్ఆర్ఆర్ మూడో స్థానానికి చేరింది. ఈ జాబితాలో రెండు సినిమాలు రాజమౌళి తెరకెక్కించినవే. (చదవండి: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..!) అయితే ఆర్ఆర్ఆర్ మూవీ త్వరలోనే కేజీఎఫ్-2 అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలవనుందా? అనే నెట్టింట్లో పెద్ద చర్చ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.1150 కోట్లు వసూళ్లు రాబట్టింది ఆర్ఆర్ఆర్. యష్ నటించిన కేజీఎఫ్-2 రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లతో ఆ రికార్డును బద్దలు కొట్టింది. ప్రస్తుతం జపాన్‌లో అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం మూడు వారాల్లోనే జపాన్ కరెన్సీలో 185 మిలియన్ల(రూ.10 కోట్లు) వసూళ్ల రాబట్టిందని ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా తెలిపారు. ఇకముందు ఇదే జోరు కొనసాగిస్తే 2022లో కేజీఎఫ్ కలెక్షన్లను దాటి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా అవతరించే అవకాశముంది. #RRRMovie is having a remarkable run at Japan Box Office, collecting 185M ¥ by 3rd weekend (17 days) with 122K+ footfalls Fastest Indian Film to achieve this & becoming the 3rd highest grossing film after Muthu & Baahubali2@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @onlynikil pic.twitter.com/X8noPqROfb — Ramesh Bala (@rameshlaus) November 7, 2022 -
కేజీఎఫ్2 ఎఫెక్ట్.. కాంగ్రెస్ ట్విటర్ అకౌంట్ బ్లాక్!
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది బెంగళూరు కోర్టు. హస్తం పార్టీ ట్విటర్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్-2 సాంగ్స్ ప్లే చేశారంటూ మ్యూజిక్ సంస్థ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన క్రమంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీ ఇటీవల కర్ణాటకలో భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించి కన్నడ చిత్రం కేజీఎఫ్-2లోని పాటలను ఉపయోగించారని ఎంఆర్టీ మ్యూజిక్ మేనేజర్ ఎం నవీన్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ సహా ముగ్గురు సీనియర్ నాయకులపై ఆరోపణలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన బెంగళూరు కోర్టు.. కాంగ్రెస్ ట్విటర్ ఖాతాతో పాటు.. భారత్ జోడో యాత్ర ప్రచార ట్విటర్ హ్యాండిల్‌ను సైతం తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. అప్రూవర్‌గా దినేష్ అరోరా.. సీబీఐ చేతికి కీలక ఆధారాలు! -
రక్తంతో లేఖలు, అశ్లీల చిత్రాలు పంపేవాడు: రవీనా టాండన్
కేజీఎఫ్ మూవీలో నటించిన బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్. 1990ల్లో అభిమానుల్లో సుస్థిర స్థానం సంపాదించకుంది భామ. అయితే ఆమెకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని ఇటీవలే బయట పెట్టారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు ఎదురైన భయానక పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. ఓ అభిమాని రవీనాకు రక్తంతో రాసిన లేఖలు, బ్లడ్ వయల్స్, అశ్లీల చిత్రాలు కొరియర్ ద్వారా పంపేవాడని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తన భర్త అనిల్ తడానీ, పిల్లలతో కలిసి వెళ్తుండగా అభిమాని కారుపై పెద్ద రాయి విసిరిన సంఘటనను గుర్తు చేసుకుంది. ఆ ఘటనతో భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశామని రవీనా టాండన్ చెప్పుకొచ్చింది. ఇంటి వద్ద రెక్కీ: అంతే కాకుండా రవీనాపై ప్రేమను నిరూపించుకోవడానికి ఒక అభిమాని ఏకంగా ఒకసారి ఆమె నివాసం గేటు బయట కూడా క్యాంప్ నిర్వహించాడని భయానకమైన పరిస్థితిని నటి వివరించింది. కేజీఎఫ్‌లో నటించిన రవీనా.. ప్రస్తుతం అర్బాజ్ ఖాన్ నిర్మాతగా వస్తున్న చిత్రం 'పట్నా శుక్లా'లో కనిపించనుంది. ఈ సినిమాలో సతీష్ కౌశిక్, మానవ్ విజ్, చందన్ రాయ్ సన్యాల్, జతిన్ గోస్వామి, అనుష్క కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫోటోగ్రఫీపై మక్కువ : మక్కువతో ఫొటోగ్రఫీని తన ప్రవృత్తిగా ఎంచుకుంది బాలీవుడ్ నటి రవీనా టాండన్. అయితే తాను తీసిన ఫొటోలు సోషల్ మీడియాతో పాటు ఎగ్జిబిషన్లు, ఆర్ట్ గ్యాలరీల్లోనూ ప్రదర్శితం కావడం విశేషం. వన్యప్రాణుల్ని, అక్కడి వాతావరణాన్ని క్యాప్చర్ చేయడానికి ఎక్కువ ఇష్టమని వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని బంధావ్‌ఘర్ నేషనల్ పార్క్‌లో తన భర్త, కూతురితో కలిసి పర్యటించిన రవీనా.. అక్కడి వన్యప్రాణుల్ని తన కెమెరాలో బంధించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆమె తీసిన కొన్ని ఫొటోలు ముంబయిలోని ‘జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ’లోనూ ప్రదర్శించారు. -
సౌత్ సినిమాలు చూసి నవ్వుకునేవారు.. యశ్ సంచలన కామెంట్స్
కేజీఎఫ్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా స్టార్ గుర్తింపు తీసుకొచ్చింది ఆ చిత్రం. ఆ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. తాజాగా ముంబైలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో సౌత్ సినిమాలను చూసి ఉత్తరాది ప్రజలు ఎగతాళి చేసేవారని అన్నారు. (చదవండి: బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్ హీరో.. కరణ్ జోహార్ క్లారిటీ..!) కానీ ప్రస్తుతం సౌత్ సినిమాలు బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాయని తెలిపారు. అయితే ఇండియాను ప్రముఖంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమగా మాత్రమే పరిగణించేవారని వెల్లడించారు. దక్షిణాది సినిమాలు హిందీ చిత్రాలతో పోటీపడాలంటే కష్టతరంగా భావించేవారు. కానీ రాజమౌళి మూవీ బాహుబలి తర్వాత ఇది పూర్తిగా మారిపోయిందని యశ్ అన్నారు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ తర్వాతే ఉత్తరాది వాళ్లు దక్షిణాది చిత్రాలపై మక్కువ పెంచుకున్నారని తెలిపారు. సౌత్ సినిమాకు ఇంతలా ప్రాచుర్యం సొంతం చేసుకుందంటే ప్రధాన కారణం జక్కన్నే అని యశ్ అన్నారు. ‘కేజీయఫ్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో దక్షిణాది చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యశ్ మాట్లాడుతూ.. '10 సంవత్సరాల క్రితమే డబ్బింగ్ చిత్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ మొదట్లో అందరూ భిన్నమైన అభిప్రాయాలతో చూడటం ప్రారంభించారు. సౌత్ సినిమాలంటే జనాలు ఎగతాళి చేసేవారు. 'ఇదేం యాక్షన్ .. అందరూ అలా ఎగిరిపోతున్నారు' అని నవ్వుకునేవారు. కానీ చివరికి వారు కళారూపాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. అంతే కాకుండా దక్షిణాది సినిమాలు తక్కువ ధరకు అమ్ముడయ్యేవి. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’తో మా చిత్రాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు సౌత్ సినిమాలను అందరూ గుర్తిస్తున్నారు.' అని అన్నారు. కేజీయఫ్-3’ గురించి మాట్లాడుతూ.. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడే ఉండదని, అది పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుందని, ప్రస్తుతానికి వేరే ప్రాజెక్ట్‌లపై తన దృష్టి ఉందని, త్వరలోనే కొత్త సినిమా వివరాలు ప్రకటిస్తానని అన్నారు. (చదవండి: పారితోషికం రెట్టింపు చేసిన కేజీఎఫ్ బ్యూటీ!) -
రాహుల్ పాదయాత్రలో ట్విస్ట్.. కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు!
దేశంలో మళ్లీ అధికారంలోని రావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను తలపెట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రాహుల్ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. రాహుల్ పాదయాత్రలో టీకాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు. ఇక, కర్నాటకలో రాహుల్ భారత్ జోడో యాత్ర ముగిసిన విషయం తెలిసిందే. కాగా, రాహుల్ గాంధీపై కాపీరైట్ యాక్ట్ కింద బెంగళూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అయితే, భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోకు కేజీఎఫ్-2 పాటను కాంగ్రెస్ నేతలు వాడుకున్నారు. దీంతో, తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్-2 హిందీ వర్షెన్ పాటను వాడుకున్నారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రాహుల్ గాంధీ సహా ఇద్దరు కాంగ్రెస్ నేతలపై కేసు పెట్టింది. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. అయితే, కర్నాటకలో రాహుల్ జోడోయాత్ర సందర్భంగా పాదయాత్ర ఫొటోలకు బ్యాక్ గ్రౌండ్‌గా కేజీఎఫ్-2 హిందీ సినిమా పాటలు, సంగీతాన్ని వాడుకున్నారు. దీనిపై ఆ సినిమా మ్యూజిక్ హక్కులను సొంతం చేసుకున్న బెంగళూరుకు చెందిన ఎమ్ఆర్టీ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండానే పాటలను వాడుకుందని సదరు సంస్థ ఆరోపించింది. ఈ క్రమంలో కాపీ రైట్ ఉల్లంఘన కింద రాహుల్ గాంధీ, సుప్రియా శ్రీనాథ్, జైరామ్ రమేశ్‌పై కేసు పెట్టింది. आओ, तुम्हें 'सपनों के भारत' की ओर लेकर चलें...#BharatJodoYatra pic.twitter.com/4sZinLl8sS — Congress (@INCIndia) October 11, 2022 -
Kantara Movie: KGF, కాంతార మధ్య పోలిక...
-
KGF రికార్డ్స్ పై కన్నేసిన " కాంతారా "
-
ఈ ఏడాది దుమ్మురేపిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
IMDB Top 10 Most Popular Indian Movies And Web Series 2022: ఓటీటీలు వచ్చాక సినీ ప్రియుల నుంచి ప్రేక్షకుల దాకా అభిరుచి మారింది. రొటీన్, రొడ్డకొట్టుడు సినిమాలకు స్వస్తి పలుకుతూ కొత్త తరహా కథాంశాలతో వచ్చిన చిత్రాలకు సై కొడుతున్నారు. సినిమాలో ఎంత పెద్ద తారాగణం ఉన్నప్పటికీ కథలో దమ్ము, కథనంలో బలం లేకుంటా చూసేదే లే అంటున్నారు. ఇక ప్రస్తుతం విభిన్నమైన స్టోరీస్‌తో వచ్చే సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లను కూడా మూవీ లవర్స్ హిట్టు బాట పట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే 2022లో అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కాగా ప్రేక్షకులు కొన్నింటిని ఆదరిస్తే.. మరికొన్నింటిని తిరస్కరించారు. ప్రేక్షకుల ఆదరణను బట్టి తాజాగా ఐఎమ్‌డీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) టాప్ 10 మోస్ట్ పాపులర్ మూవీస్, వెబ్ సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది. ఇండియాలోని ఐఎమ్‌డీబీ (IMDB)ఆడియెన్స్ పేజీ వీక్షణ ఆధారంగా ఈ రేటింగ్లను కేటాయిస్తారనే విషయం తెలిసిందే. 2022 జనవరి 1 నుంచి జులై 5 వరకు ఇటు థియేటర్స్, అటు ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ఈ రేటింగ్స్‌ను ఇచ్చింది. మరి ఆ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఆ రేటింగ్స్ ఏంటో ఓ లుక్కేయండి. మోస్ట్ పాపులర్ ఇండియన్ చిత్రాలు.. 1. విక్రమ్- 8.8 2. కేజీఎఫ్ 2- 8.5 3. ది కశ్మీర్ ఫైల్స్- 8.3 4. హృదయం- 8.1 5. ఆర్ఆర్ఆర్- 8.0 6. ఏ థర్స్ డే- 7.8 7. ఝుండ్- 7.4 8. రన్‌వే-34- 7.2 9. సామ్రాట్ పృథ్వీరాజ్- 7.2 10. గంగూబాయి కతియావాడి- 7.0 View this post on Instagram A post shared by IMDb (@imdb) మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్‌లు.. 1. క్యాంపస్ డైరీస్ (ఎమ్ఎక్స్ ప్లేయర్)- 9.0 2. రాకెట్ బాయ్స్ (సోనీ లివ్)- 8.9 3. పంచాయత్ 2 (అమెజాన్ ప్రైమ్ వీడియో)- 8.9 4. అపహరణ్ (వూట్/ఆల్ట్ బాలాజీ)- 8.4 5. హ్యూమన్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)- 8.0 6. ఎస్కేప్ లైవ్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)- 7.7 7. ది గ్రేట్ ఇండియన్ మర్డర్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)- 7.3 8. మాయి (నెట్‌ఫ్లిక్స్)- 7.2 9. యే కాళీ కాళీ ఆంఖే (నెట్‌ఫ్లిక్స్)- 7.0 10. ది ఫేమ్ గేమ్ (నెట్‌ఫ్లిక్స్)- 7.0 View this post on Instagram A post shared by IMDb (@imdb) -
మహేష్‌బాబు సినిమానే చివరగా చూశా: కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి
శ్రీనిధి శెట్టి.. కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది ఈ కన్నడ బ్యూటీ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 1కు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు అనేక ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవల కేఎఫ్‌సీ పాప్‌కార్న్ నాచోస్కు సైతం బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన శ్రీనిధి శెట్టితో సాక్షి డిజిటల్ ప్రతినిధి రేష్మి స్పెషల్ ఇంటర్వ్యూ... ఇంజినీరింగ్ కాలేజీ నుంచి అందాల పోటీల వరకు ఇదంతా ఎలా జరిగింది? అందాల పోటీల్లో పాల్గొనాలని, ఆ తర్వాత సినిమాల్లోకి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అయితే, ప్రతిదానికీ సమయం ఉందని పెద్దలు చెప్పంది నిజమని నేను భావిస్తాను. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు తొలి ప్రాధాన్యత కుటుంబమే. అందుకే వారు చెప్పినట్లే మొదట నా చదువును పూర్తి చేశాకే అందాల పోటీలు, తర్వాత సినిమాల కోసం ప్రయత్నించాలని అనుకున్నాను. సినిమా రంగంలోకి ఎలా అడుగుపెట్టారు? నేను సినిమాల్లో నటించాలని అనుకున్నాను. కానీ, కేజీఎఫ్‌లో నటించాలని ప్లాన్ చేసింది కాదు. నేను మిస్ దివా ఇండియా పోటీల్లో కిరీటం గెలుచుకున్నాను. దానికి సంబంధించిన ఫొటోలు అనేక పత్రికల్లో వచ్చాయి. ఈ ఫొటోలను చూసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నన్ను ఆడిషన్‌కు పిలిచారు. నిజం చెప్పాలంటే, ఆ ఆడిషన్ తర్వాత నాకు ఈ పాత్ర వస్తుందని అస్సలు అనుకోలేదు. కానీ ఆడిషన్లో నా పర్ఫామెన్స్ ఆయనకు నచ్చి.. నేనే ఆ పాత్రకు సూట్ అవుతానని అనుకున్నారు. ఇక తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. నాకు కేజీఎఫ్‌లో అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. నా మొదటి సినిమాలోని నా నటనకు లభించిన ప్రేమ, మద్దతుకు ఎంతో సంతోషిస్తున్నా. మీరు కేజీఎఫ్ సినిమా ఒప్పుకున్నప్పుడు ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారా ? అస్సలు అనుకోలేదు. సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ మేము ఒక మంచి సినిమా తీయాలనుకున్నాం. దానికోసం అందరం చాలా కష్టపడ్డాం. కేజీఎఫ్ విడుదలైన తర్వాతే అర్థమైంది మేము ఎంత పెద్ద హిట్ కొట్టామో. ప్రేక్షకుల ప్రేమకు, దేవుని ఆశీస్సులకు ధన్యవాదాలు. అన్ని బాక్సాఫీస్ రికార్డులను కేజీఎఫ్ బద్దలు కొట్టిందని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నా మొదటి సినిమా కన్నడ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇక కేజీఎఫ్ 2 రూ. 1000 కోట్లు దాటింది. మేము ఇలాంటి విజయం సాధించినందుకు, టీమ్‌లో భాగస్వామ్యం అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి భారీ సినిమా కోసం ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాను ఒప్పుకుంటే ఇతర అవకాశాలు కోల్పోతామనే భయం కలిగిందా ? అలాంటి రిస్క్ తీసుకోడానికి నేను సిద్ధంగానే ఉన్నా. కేజీఎఫ్ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ఎన్ని ఏళ్లు పడుతుందనే విషయాన్ని ఆలోచించలేదు. ఎందుకంటే ఏ కళాకారుడికైనా ఎన్ని రోజులు చేశామనేది కాకుండాల ఎంత బాగా చేశామన్నదే ముఖ్యం అని నేను భావిస్తాను. మీరు స్టార్‌గా మారడం చూసిన మీ స్నేహితులు ఎలా స్పందించారు? నేను నటిని మాత్రమే. నన్ను నేను స్టార్‌గా పరిగణించను. నా స్నేహితులు కూడా అలా చూడనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నన్ను ఎప్పుడూ ఒకేలా ట్రీట్ చేస్తారు. వారే నాకు పెద్ద అభిమానులు, నా పెద్ద విమర్శకులు కూడా. యష్‌తో పనిచేయడం ఎలా అనిపించింది? యష్‌తో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా ఉంది. అతను చాలా అంకితభావం, ఏకాగ్రత ఉన్న వ్యక్తి. అతను తన పని చేసుకుంటూనే మనం మరింత మెరుగ్గా నటించేందుకు ప్రేరేపిస్తాడు. అతనితో నేను కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి చెప్పండి. ప్రశాంత్ నీల్‌తో పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఆయన చాలా సౌమ్యుడు, దయగలవారు. అలాగే ఆయనకు తన నటీనటుల నుంచి ఏం కావలన్నదానిపై పూర్తి స్పష్టత ఉంది. దాని వల్ల నటీనటుల నుంచి ఉత్తమ నటనను బయటకు తీసుకురాగలరు. సినిమా అనేది ఎల్లలు దాటేసింది. మరి మీరు ఇతర పరిశ్రమల వైపు మొగ్గు చూపుతున్నారా? నేను భారతీయ సినిమాను ఒక పరిశ్రమగా పరిగణిస్తాను. వివిధ భాషల్లో సినిమాలు చేసేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నాను. మీరు ఇటీవల కేఎఫ్‌సీ కోసం ఒక ప్రకటన చేశారు. దాని గురించి చెప్పండి. ప్రకటనలకు, చలనచిత్రాల షూటింగ్‌కు ఏ మేరకు తేడా ఉంటుంది? కేఎఫ్‌సీతో పని చేసే అవకాశం వచ్చినప్పుడు నేను థ్రిల్ అయ్యాను. ఎందుకంటే నేను కేఎఫ్‌సీ చికెన్ అంటే చాలా ఇష్టం. ఇక నా వరకు అయితే ప్రకటనలు, చలనచిత్రాల మధ్య ఎలాంటి తేడా లేదు. నిజానికి, 1-2 రోజులలో షూట్ చేసే యాడ్ ఫిల్మ్‌లతో పోలిస్తే సినిమాలకు చాలా ఎక్కువ సమయం, నిబద్ధత, నెలలు అవసరం. సమయం చాలా భిన్నంగా ఉంటుంది. కానీ ఒక కళాకారుడిగా, ఉత్తమ ఫలితాన్ని పొందడానికి చేసే కృషి మాత్రం ఒకే విధంగా ఉంటుంది. మీరు టాలీవుడ్ సినిమాలు చూస్తారా ? మీరు ఇటీవల ఏ తెలుగు సినిమా చూశారు? అవును, నేను టాలీవుడ్ సినిమాలు చూస్తాను. నిజానికి, నేను సినిమా పిచ్చిదాన్ని. అన్ని భాషల్లో సినిమాలు చూస్తాను. నేను చూసిన చివరి తెలుగు సినిమా మహేష్ బాబు 'సర్కారు వారి పాట'. కేజీఎఫ్ చాప్టర్ 3 నిజంగా ఉంటుందా ? నాకు తెలియదు. అది మీరు దర్శకనిర్మాతలను అడగాలి. కానీ కేజీఎఫ్ ఫ్రాంచైజీ కొనసాగుతుందని, దాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ తదుపరి చిత్రాలు, పాత్రల గురించి చెప్పండి. చాలా ప్రాజెక్ట్‌లు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. ఇప్పటివరకు దేనికి ఇంకా ఓకే చేయలేదు. ప్రాంతీయ భాషల్లోని సినిమాలు భారతదేశంలో పాన్ ఇండియా చిత్రాలుగా మారి చాలా ప్రశంసలు పొందాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? నిజానికి ఇది చాలా కాలం క్రితమే జరగాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈరోజు ప్రేక్షకులు చాలా ఎక్కువ ఎక్స్‌పోజర్‌ని కలిగి ఉన్నారు. అలాగే వారు అన్ని రకాల చిత్రాలను వీక్షిస్తున్నారు, అభినందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలతో అతిపెద్ద ప్రయోజనం ఏంటని మీరు అనుకుంటున్నారు? ప్రేక్షకులు! ఎప్పుడు కూడా చివరి ఫలితం ప్రేక్షకులే. పాన్ ఇండియా చిత్రాల ద్వారా మీరు అనేక మంది ప్రేక్షకులకు చేరువవుతారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల గురించి మీరు ఏమనుకుంటున్నారు? నా అభిప్రాయం ప్రకారం ఓటీటీ ఒక అద్భుతమైన వేదిక. వివిధ రకాల పాత్రలు, జానర్లతో ప్రయోగాలు చేయడానికి కళాకారులకు, అన్ని రకాల బడ్జెట్లతో పని చేసే దర్శకులకు ఇది అవకాశాలను కల్పిస్తోంది. వెబ్ సిరీస్‌ల్లో మీరు నటించే అవకాశం ఉందా ? పని ఎక్కడ నుంచి వస్తుందని నేను ఆలోచించను. నేను ఇష్టపడే స్క్రిప్ట్‌పై పని చేయడం, నేను ఉన్నతంగా నటిస్తున్నానా లేదా అని చూడటం, అందుకు సహాయపడే బృందంతో పని చేస్తున్నానా లేదా అని చూడటమే నాకు ముఖ్యం. -
ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని వెనక్కి నెట్టిన కన్నడ చిత్రాలు
కరోనా అనంతరం ఈ ఏడాది వరల్డ్ బాక్సాపీస్‌ను షేక్ చేసిన భారతీయ చిత్రాల్లో ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీదే అగ్రస్థానం అనడంలో అతిశయోక్తి లేదు. ఈ మూవీ తర్వాత కేజీయఫ్ 2 ఉంటుంది. అయితే తాజాగా ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డాటాబేస్) టాప్ 250 భారతీయ చిత్రాల జాబితాలో ఆర్ఆర్ఆర్ను రెండు కన్నడ చిత్రాలు వెనక్కి నెట్టడం గమనార్హం. ఐఎండీబీ(imdb) ఇటీవల రిలీజ్ చేసిన ఈ ప్రతిష్టాత్మక జాబితాలో టాలీవుడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ 169వ స్థానంలో నిలిచింది. చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే కన్నడ బ్లాక్‌బస్టర్ చిత్రమైన ‘కేజీయఫ్ 2’, తాజాగా విడుదలైన మరో కన్నడ మూవీ ‘777 చార్లీ ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ అధిగమించాయి. కేజీయఫ్ 2, 101వ స్థానంలో నిలువగా.. ఇదే నెలలోనే విడుదలై 777 చార్లీకి 116వ స్థానం దక్కడం విశేషం. 777 చార్లీ ఐఎండీబీ రేటింగ్‌లో 9000 ఓట్లతో 9.2/10 సంపాదించింది. ఈ కన్నడ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్స్ అయిన బజరంగీ భాయ్ జాన్, దిల్ వాలే దుల్హానియా లే జాయెంగే, బాహుబలి, కేజీఎఫ్ 1, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రాలను కూడా అధిగమించాయి. చదవండి: మాధవన్‌ను చూసి ఒక్కసారిగా షాకైన సూర్య, వీడియో వైరల్ కాగా కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో కే కిరణ్ రాజ్ దర్శకత్వంలో ‘777 చార్లీ’ చిత్రం రూపొందింది. ధర్మ అనే వ్యక్తి నిజ జీవితం ఆధారంగా మూవీని తెరకెక్కింది. ధర్మ అనే వ్యక్తి జీవితంలోకి చార్లీ అనే పెంపుడు కుక్క (పెట్) ప్రవేశించి.. అతని జీవితాన్నిఎలా మార్చేసిందనేది ఈ కథ. జూన్ 10న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో ఇప్పటికీ థియేటర్లో దూసుకుపోతుంది. ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు హీరో రక్షిత్ శెట్టి. -
Srinidhi Shetty: కేజీయఫ్ హీరోయిన్ పరిస్థితి ఇలా అయిందేంటి?
హీరోకి ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ ఒక భాషకి చెందిన సినిమాలనే చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అదే హీరోయిన్స్ అయితే ఓ అరడజను భాషల్లో ప్రాజెక్టులను చుట్టబెట్టేస్తూ ఉంటారు. కేజీయఫ్ బ్రాండ్ తో శ్రీనిథి శెట్టి కూడా అలానే చేయాలి అనుకుంది. అసలే కన్నడ ఇండస్ట్రీ హీరోయిన్ల ఫ్యాక్టరీలా మారిపోయింది. ఇలానే తను కూడా టాలీవుడ్ కి వచ్చి వెలుగు వెలగాలనిచూసింది. (చదవండి: టార్గెట్ సంక్రాంతి... బాక్సాఫీస్ బరిలో చిరు, పవన్, ప్రభాస్) ఇప్పటికే కన్నడ నుంచి అరడజనుకు పైగా కొత్త తారలు టాలీవుడ్ లో ఊపేస్తున్నారు. సౌందర్య, అనుష్క, ప్రేమ లాంటి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ లిస్ట్ లో చేరాలని ప్రయత్నం చేసిందిశ్రీనిథి శెట్టి. కాని ఆమె అనుకున్న ఆశలకు ఆమె నిర్ణయమే గండి కొట్టినట్టు తెలుస్తోంది. కేజీయఫ్ సినిమా తరువాత పారితోషికాన్ని భారీగా పెంచింది శ్రీనిధి. కేజీఎఫ్ 2 కూడా సంచలన విజయాన్ని సాధించడంతో పారితోషికాన్ని మరింత పెంచిందట. ఇంత వరకూ ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. కేజీయఫ్ లో ఆమె పాత్ర కూడా చాలా తక్కువే. అయినా ఆమె తన పారితోషికాన్ని ఒక రేంజ్ లో పెంచడంతో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట. కొత్త ప్రాజెక్టులలో ఆమె కనిపించకపోవడానికి కారణం ఇదేనని శాండల్‌వుడ్ లో టాక్ వినిపిస్తోంది. శ్రీనిధి శెట్టి మంచి పొడగరి .. ఆకర్షణీయమైన రూపం తో ఉంటుంది. ఒక రకంగా ఆమె ప్రయత్నంచేస్తే.. అనుష్కలా టాలీవుడ్ ను ఏలేయోచ్చు.. అయితే ఆమె పెర్పామెన్స్ చూపించేలా సినిమా ఒక్కటి కూడా పడలేదు. కేజీయఫ్ బ్రాండ్ పెట్టుకుని రేటుపెంచేసరికి నిర్మాతలు ఆమెను సినిమాలు అడగటమే మానేశారట. అసలు ఆమె హైట్, బ్యూటీకి.. ప్రభాస్ .. మహేశ్ వంటి హీరోల సరసన ఆమెను చూడాలని అభిమానులు ఆశపడుతుంటే, ఆమె మాత్రం పారితోషికం విషయంలో దిగిరావడం లేదనే టాక్ వినిపిస్తోంది. -
OTT: అమెజాన్‌లో కేజీయఫ్ 2 స్ట్రీమింగ్, ఇకపై ఉచితం
కన్నడ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టిన తొలి చిత్రంగా కేజీయఫ్ నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండ 2018లో విడుదలైన ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. దీనికి సీక్వెల్‌గా కేజీయఫ్ 2 తెరకెక్కి ఎప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి రూ.400 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. నార్త్‌లో ‘బాహుబలి’ తర్వాత రూ.400 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన సినిమాగా కేజీయఫ్ 2 రికార్డు సృష్టించింది. చదవండి: సింగర్ సిద్ధూ హత్య.. సల్మాన్‌కు లారెన్స్ వార్నింగ్.. అప్రమత్తమైన పోలీసులు ఇటీవలే ఈ చిత్రం రూ. 1200కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘కేజీయఫ్ 2’ ఓటీటీలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైం వీడియోస్ సొంతం చేసుకుంది. మార్చి 16 నుంచి ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో సబ్స్క్రైబర్లు అదనంగా రూ.199 పెట్టి సినిమా చూసే విధానంతో అందుబాటులోకి తెచ్చారు కేజీయఫ్ 2ను. అయితే త్వరలోనే కేజీయఫ్ చిత్రానికి ‘పే పర్ వ్యూ’ పద్దతిని తొలిగించనున్నారు. చదవండి: నిర్మాత, హీరో మధ్య మనస్పర్థలు?, అందుకే పదేపదే వాయిదా! జూన్ 3 నుంచి సబ్స్క్రైబర్లు ఈ చిత్రాన్ని ఉచితంగా చూసే వెసులు బాటును అమెజాన్ సంస్థ కల్పించనుంది. తాజాగా దీనిపై అమెజాన్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, నటి రవీణ టాండన్ రావూరమేష్, ప్రకాశ్‌రాజ్‌లు కీలకపాత్రల్లో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించాడు. View this post on Instagram A post shared by amazon prime video IN (@primevideoin) -
కేజీయఫ్ 3లో హృతిక్ రోషన్!
ప్రశాంత్ నీల్ సలార్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నా,యశ్ మరో ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నా....వారిద్దరిని మాత్రం కేజీయఫ్ 3 వదలడంలేదు.ఇప్పటికిప్పుడు ఈ సీక్వెల్ లేదని తెల్సినా సరే కేజీయఫ్ 3పై రూమర్స్ ఆగడం లేదు.కేజీయఫ్ 2 క్లైమాక్స్ లో ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 3 కి లీడ్ ఇవ్వడం ఆలస్యం.. చాప్టర్ 3 కి కౌంట్ డౌన్ మొదలుపెట్టారు రాకీభాయ్ ఫ్యాన్స్.దాంతో కేజీయఫ్ 3 సోషల్ మీడియాలో కంటిన్యూ గా ట్రెండ్ అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న రూమర్స్ కేజీయఫ్3 పై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అడుగు పెడుతున్నాడట. కేజీయఫ్ 2 బాలీవుడ్ స్టార్స్ డామినేషన్ కనిపించింది.రమికా సేన్ పాత్రలో రవీనాటాండన్, అలాగే అధీరా రోల్ ను సంజయ్ దత్ పోషించాడు.వీరిద్దరి కాంబినేషన్, కేజీయఫ్ లో రాకీభాయ్ ఎలివేషన్ ఈ సీక్వెల్ కు నార్త్ లోనే 430 కోట్లను అందించింది.బాహుబలి 2 తర్వాత హిందీ మార్కెట్ లో ఈ స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టిన రెండవ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది కేజీయఫ్2. కేజీయఫ్ సిరీస్ పై బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను వాడుకునేందుకు,ప్రశాంత్ నీల్ పార్ట్ 3లో డైరెక్ట్ గా అక్కడి స్టార్ హీరో హృతిక్ ను రంగంలోకి దింపుతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రొడ్యుసర్ విజయ్ కిరంగదూర్ మాత్రం ఈ ఏడాదిలో కేజీయఫ్-3 ఉండదని, ఈ చిత్రంలో హృతిక్ నటిస్తాడో లేడో ఇప్పుడే చెప్పలేమని అన్నారు.'సలార్' సినిమా మేకింగ్‌లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారని.. అటు యష్ కూడా కొత్త ప్రాజెక్ట్‌కు ప్రకటిస్తారని చెప్పారు. అందరికీ టైమ్ కుదిరినప్పుడు కేజీఎఫ్ 3 గురించి ఆలోచిస్తామన్నారు ఈ సంగతి ఇలా ఉంటే,ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సలార్ బడ్జెట్ ను మరో 20 శాతం పెంచారని శాండల్ వుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కేజీయఫ్ 2 రిలీజ్ కు ముందు ఈ సినిమా బడ్జెట్ ను 200 కోట్లు అనుకున్నారట. ఇప్పుడు కేజీయఫ్ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ కు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ,సలార్ లో అంతకు మించి యాక్షన్ ఉండాలని దాదాపు 40 కోట్లు బడ్జెట్ హైక్ చేసాడట డైరెక్టర్. మొత్తంగా 250 కోట్ల బడ్జెట్ తో సలార్ తెరకెక్కుతోంది. -
తగ్గేదేలే అంటున్న ‘కేజీయఫ్’ బ్యూటీ, భారీగా రెమ్యునరేషన్ డిమాండ్?
కేజీయఫ్ సీరిస్తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. మోడల్‌గా రాణిస్తున్న ఆమెకు కేజీయఫ్ చిత్రం ఆఫర్ వచ్చింది. దీంతో తొలి చిత్రమే పాన్ ఇండియా కావడం, అది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడంతో శ్రీనిధి రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది. దీంతో కేజీయఫ్ 2 తర్వాతా ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. సినిమాలను ఎంచుకోవడంలో ఈ బ్యూటీ ఆచీతూచి అడుగులేస్తుందని వినికిడి. ఈ నేపథ్యంలో ఈ భామ రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందని ఫిలిం దూనియాలో చర్చించుకుంటున్నారు. చదవండి: బెంగాలీ మోడల్స్ వరుస ఆత్మహత్యలు, తాజాగా 18ఏళ్ల మోడల్ సూసైడ్ కలకలం సౌత్‌లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల తీసుకునే రెమ్యునరేషన్‌కు సమానంగా శ్రీనిధి రెండు సినిమాలకే డిమాండ్ చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కేజీయఫ్ 2 సక్సెస్ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమెను హోస్ట్ మీకు పేరు కావాలా? డబ్బు కావాలా? అని ప్రశ్నించింది. దీనికి శ్రీనిధి నిర్మోహమాటంగా డబ్బే కావాలి అని టక్కున సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా కేజీయఫ్ 2 అనంతరం శ్రీనిధి రెండు సినిమాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. -
కేజీఎఫ్–2 చూసి.. రాఖీభాయ్‌లా సిగరెట్లు కాల్చి..
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్2 కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కేజీఎఫ్ చిత్రంతో యశ్ గ్రాఫ్ అంతకముందు.. ఆ తరువాత అనేలా మారిపోయింది. ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. దేశ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కేజీఎఫ్ చిత్రానికి యశ్ హీరోయిజమే మెయిన్ అట్రాక్షన్.. సినిమాలో హీరో మాటలు, ఆటిట్యూడ్, అలవాట్లు ప్రేక్షలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమాను పదే పదే చాడటానికి యువతి ఇష్టపడుతున్నారు. యష్ నటించిన కేజీఎఫ్–2 సినిమాలోని ‘రాఖీభాయ్’ పాత్రను చూసి తానూ అలాగే స్టైల్‌గా ఉండాలనుకున్న 15 ఏళ్ల బాలుడు సిగరెట్లు కాల్చి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఆ బాలుడికి తాము విజయవంతంగా చికిత్స చేసినట్లు బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని సెంచరీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సిగరెట్ కాల్చడం వల్ల వచ్చే దుష్ప్రభావాల నుంచి ఊరట కలిగించడంతో పాటు ఆ బాలుడుకి గట్టిగా కౌన్సింగ్ కూడా చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలుడు రెండు రోజుల వ్యవధిలో కేజీఎఫ్–2 సినిమాను మూడుసార్లు చూశాడు. తర్వాత ఒకేసారి ఏకంగా ఒక ప్యాకెట్ సిగరెట్లు కాల్చి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దీంతో ఆ బాలుడు తల్లిదండ్రులు సెంచరీ ఆస్పత్రికి తరలించారు. థియేటర్లలో విడుదలైన రెండోవారం ఆ సినిమా చూసిన బాలుడు అందులో ప్రధాన పాత్ర అయిన రాఖీభాయ్ స్టైల్ చూసి ప్రేరణ పొందానని.. తాను అలాగే ఉండాలని కోరుకున్నానని అందుకే సిగరెట్లు కూడా కాల్చానని వెల్లడించాడు. కాగా ఈ కేసుపై పల్మోనాలజిస్ట్ డాక్టర్ రోహిత్ రెడ్డి మాట్లాడారు. ప్రేక్షకులు ముఖ్యంగా టీనేజర్లు ‘రాకీ భాయ్’ వంటి పాత్రలతో తొందరగా ప్రభావితమవుతరాని అన్నారు. ఈక్రమంలోనే మైనర్ ధుమపానానికి అలవాటు పడి ఒకే రోజు సిగరెట్ ప్యాకెట్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని తెలిపారు. మనుషులపై సినిమాలు చాలా ప్రభావితం చేసే అంశం అని, సిగరెట్లు తాగడం. పొగాకు నమలడం, మద్యం సేవించడం వంటి చర్యలను గ్లామరైజ్ చేయకుండా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత సినీ నిర్మాతలు, నటీనటులపై ఉంటుందన్నారు. చదవండి: భయ్యా.. ఇదేమయ్యా! నిన్న బీజేపీ, నేడు కాంగ్రెస్‌లో అలాగే పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలాంటి వ్యవసనాలకు అలవాటు పడుతున్నారో తల్లిదండ్రులు గమనించుకుంటూ ఉండాలన్నారు. పిల్లలు చెడు వ్యవసనాలకు బానిసలవ్వడకుండా అవగాహన కల్పించడంలో తల్లిదండ్రల పాత్ర ముఖ్యమంన్నారు. -
పాన్ ఇండియా స్టార్డమ్ కోసం సేఫ్‌సైడ్ గేమ్!
పాన్ ఇండియా లెవల్లో స్టార్ డమ్ అందుకోవడం ఒక ఎత్తు. ఆ తర్వాత ఆ స్టార్ డమ్ ను నిలబెట్టుకోవడం మరో ఎత్తు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ లో వరుస ఫ్లాప్స్ ఇచ్చాడు. ఇప్పుడు తప్పులు సరిదిద్దే పనుల్లో పడ్డాడు. అందుకే మిగితా పాన్ ఇండియా హీరోలు అలెర్ట్ అయ్యారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్, యశ్ సేఫ్ సైడ్ చూసుకుంటున్నారు. పాన్ ఇండియా హీరోలుగా వెలిగిపోయేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు. కేజీయఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ నటుడు యశ్.రాఖీభాయ్ క్యారెక్టర్ లో యశ్ కనిపించిన తీరు, అతని నటన, పాన్ ఇండియా ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది. కేజీయఫ్ 2 తో కలిసొచ్చిన ఇండియా వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కాపాడుకునేందుకు మరోసారి రాఖీభాయ్ క్యారెక్టర్ ను రిపీట్ చేస్తున్నాడు. త్వరలోనే కేజీయఫ్ 3తో తిరిగొస్తానంటున్నాడు. ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నప్పుడే ఆ సినిమా రేంజ్ ను ఎక్స్ పెక్ట్ చేసి,అందుకు తగ్గట్లే పాన్ ఇండియా మూవీస్ ను లైనప్ లో పెట్టాడు రామ్ చరణ్.ఇప్పటికే మాస్టర్ డైరెక్టర్ శంకర్ మేకింగ్ లో భారీ యాక్షన్ చిత్రం చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరితో మూవీ లైనప్ లో ఉంది.ఇప్పుడు వీటితో పాటు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో మూవీ చేయాలనుకుంటున్నాడు చరణ్. ఖైదీ,మాస్టర్, విక్రమ్ లాంటి యాక్షన్ మూవీస్ తో నయా ట్రెండ్ సెట్ చేసాడు లోకేష్.గన్స్ అండ్ బిర్యానీ కాన్సెప్ట్ ను మిక్స్ చేస్తూ వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు.ఇప్పుడు ఇదే ట్రెండ్ ను రామ్ చరణ్ కంటిన్యూ చేస్తూ లోకేష్ మేకింగ్ లో తాను కూడా యాక్షన్ హీరోగా కనిపించాలనకుంటున్నాడు ఆర్ ఆర్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ చేయాల్సిన సినిమా ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. కొరటాలశివతో తారక్ పాన్ ఇండియా మూవీ లాక్ అయింది.ఈ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. -
యశ్ తర్వాతి చిత్రం ఏంటీ? రాకీభాయ్ ఏం చేయబోతున్నాడు?
కేజీయఫ్-1 తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకొని కేజీయఫ్ 2తో తిరిగొచ్చాడు యశ్. ఫస్ట్ పార్ట్ రూ.250 కోట్లు వసూలు చేస్తే.. సెకండ్ పార్ట్ ఉవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.1200 కోట్లు దాటింది. దీంతో రాకీభాయ్ మళ్లీ కేజీయఫ్3తోనే తిరిగొస్తాడని శాండల్‌వుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కానీ ప్రశాంత్ నీల్ ఏమో సలార్, ఎన్టీఆర్ చిత్రాలకు డేట్స్ లాక్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు రాకీభాయ్ ఏం చేయబోతున్నాడు అనేది హాట్ టాపిక్‌గా మారింది. (చదవండి: : ప్రశాంత్ నీల్-తారక్ మూవీ అప్డేట్ వచ్చేసింది) యశ్ తర్వాతి చిత్రం ఏంటనేదానిపై ఇప్పటి వరకు ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కేజీయఫ్ 2 ప్రమోషన్లో అడిగితే కూడా సైలెంట్‌గానే ఉన్నాడు. అయితే కన్నడ సినిమా మాత్రమే చేస్తానని ఓ చోట లీక్ ఇచ్చాడు. ఆ కన్నడ సినిమా కేజీయఫ్-3నే అని టాక్ కూడా ఉంది. అదే నిజమైతే రాకీభాయ్ని మళ్లీ తెరపై చూడాలంటే మరో మూడేళ్లు వెయిట్ చూడాల్సిందే. ఎందుకంటే.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రభాస్ సలార్ విడుదల అవుతుంది. ఆ తర్వాత ఏడాదికి ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ రెండు చిత్రాల తర్వాతే ప్రశాంత్ నీల్ కేజీయఫ్-3ని పట్టాలెక్కించే అవకాశం ఉంది. అంటే 2025లో రాకీభాయ్ రీఎంట్రీ ఉంటుందన్నమాట. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘కేజీయఫ్’ను పాన్ ఇండియా అంటుంటే ఫన్నీగా ఉంది: సిద్ధార్థ్
Siddharth Shocking Comments On KGF 2, Pan India: కేజీయఫ్ 2 మూవీని పాన్ ఇండియా అని పిలుస్తుంటే ఫన్నీగా అనిపిస్తుందంటూ హీరో సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సిద్ధార్థ్ తాజాగా నటించిన వెబ్ సిరీస్ ‘ఎస్కేప్ లైవ్’ త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తన వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఓ జాతీయ మీడియాతో ముచ్చటించిన సిద్ధార్థ్ ఈ సందర్భంగా కేజీయఫ్2 సక్సెస్, ‘పాన్ ఇండియా’ కాన్సెప్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: ఆ సీన్స్‌తో మళ్లీ రిలీజవుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ! ఈ మేరకు సిద్ధార్థ్ మాట్టాడుతూ.. ‘పాన్ ఇండియా.. ఈ పదం వినడానికి చాలా ఫన్నీగా ఉంది. 15 ఏళ్ల నుంచి వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్నాను. ఏ భాషల్లో చేస్తే ఆ భాషకు డబ్బింగ్ నేనే చెప్పుకునే వాడిని. తమిళ సినిమాల్లో చేస్తే తమిళియన్‌గా, టాలీవుడ్లో చేస్తే అచ్చమైన తెలుగు అబ్బాయిలా.. అలాగే ఇప్పుడు హిందీలో భగత్ సింగ్‌కు కూడా. అయితే, నా వరకు వాటిని ఇండియన్ సినిమాలు అని పిలవడమే నాకు ఇష్టం. ఎందుకంటే పాన్ ఇండియా అంటుంటే నాకు అగౌరవంగా అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తాను ఈ వ్యాఖ్యలు ఎవరిని ఇబ్బంది పెట్టడాలని అనడం లేదన్నాడు. ‘పరిశ్రమలో అధిక ప్రాధాన్యత ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి విడుదలైన ఓ హిందీ సినిమా అత్యధిక ప్రేక్షాకదరణ పొందితే దానిని హిందీ సినిమా అనే అంటారు. కానీ, ప్రాంతీయ సినిమాలకు విషయానికి వస్తే అలా ఎందుకు ఉండదు. ప్రాంతీయ చిత్రాలకు విశేషమైన ఆదరణ లభించి, భారీ విజయం సాధిస్తే వాటిని ఎందుకు పాన్ ఇండియా అని పిలవడం? భారతీయ చిత్రం అనొచ్చు కదా. లేదా కేజీయఫ్ జర్నిని గౌరవించి కన్నడ సినిమా అని చెప్పొచ్చు. చదవండి: తెలుగు ఫిలిం చాంబర్‌పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు లేదా ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ సినిమా అని పిలవచ్చు. కాబట్టి పాన్ ఇండియా సినిమా అని కాకుండా ఇండియన్ ఫిలిం అని చెప్పండి. పాన్ అంటే ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆ పదం చాలా ఫన్నీగా ఉంది’ అంటూ సిద్ధార్థ్ అభిప్రాయపడ్డాడు. అయితే గతంలో కూడా సిద్ధార్థ్ పాన్ ఇండియా పదంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ చేసేవి అన్ని భారతీయ చిత్రాలే అయినప్పుడు పాన్ ఇండియా అని ఎందుకంటున్నారని, అలా అయితే 15 ఏళ్ల క్రితమే రోజా అనే పాన్ ఇండియా సినిమా రాలేదా? మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూశారని వ్యాఖ్యానించాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'తుఫాన్' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. చూశారా !
KGF 2: Yash Starrer Toofan Full Song Released: కన్నడ స్టార్ హీరో యశ్, శాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చి బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించిన చిత్రం 'కేజీఎఫ్ 2'. ఓ పక్క అత్యధిక వసూళ్లు రాబట్టగా మరోపక్క విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. బాలీవుడ్లో రూ. 400 కోట్లకుపైగా వసూళ్లను కొల్లగొట్టింది. అంతేకాకుండా ఇటీవలే వెయ్యి కోట్ల క్లబ్లో కూడా చేరింది ఈ మూవీ. ఇండియాలోని అన్ని భాషల్లో కలుపుకుని రూ. 900 కోట్లు దాటగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమాలోని డైలాగ్‌లు, యాక్షన్ సీన్లు, యశ్ యాక్టింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలు అన్ని సినిమాకు హైలెట్ అయ్యాయి. 'కేజీఎఫ్ 2'లోని ప్రతి పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవల అమ్మ పాట, మెహబూబా సాంగ్‌లను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా తుఫాన్ పాటను రిలీజ్ చేసింది. ప్రస్తుతం తుఫాన్ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, శ్రీనిధి శెట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చదవండి: 'కేజీఎఫ్ 3' ఉందా ? లేదా ?.. మరో నిర్మాత ఏమన్నాడంటే ? -
అమెజాన్‌లో ఈ సమ్మర్‌ను కూల్ చేసే వరల్డ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను చూసేయండిలా!
ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ చిత్రాలై పాన్ ఇండియా చిత్రాలను చూసేందుకు మూవీ లవర్స్ కోసం అమెజాన్ ప్రైం వీడియోస్ ఎర్లీ యాక్సెస్ ద్వారా ‘మూవీ రెంటల్స్’ పేరుతో కొత్త యాక్సెస్‌ను లాంచ్ చేసింది. ఈ ఎర్లీ రెంటల్ యాక్సస్ ద్వారా డిజిటల్ సబ్స్క్రిప్షన్ కంటే ముందే బ్లాక్‌బస్టర్ చిత్రాలను ఇంట్లోనే చూడోచ్చు. ఈ యాక్సెస్‌ను మే 16 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు అమెజాన్ ప్రైం వీడియోస్ వారు. దేశవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్స్‌కు ఈ సమ్మర్లో ఇంట్లోనే మరింత వినోదం అందించేందుకే అమెజాన్ ఈ కొత్త పోర్టల్‌ను లాంచ్ చేసింది. ఈ ఎర్లీ యాక్సెస్ ద్వారా పాన్ ఇండియా చిత్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన సినిమాలు, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చిత్రాలు, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రిచ్ క్యాట్‌లాగ్ సినిమాలను హాయిగా ఇంట్లోనే చూసేయొచ్చు. ఇప్పటికే సబ్‌స్రైబ్ చేసుకున్న వారితో పాటు కొత్తగా సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి అమెజాన్ ప్రైం యాప్‌లోనే ఈ ‘మూవీ రెంటల్స్ ’ యాక్సెస్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ మూవీ రెంటల్స్‌లో ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన పాన్ ఇండియా చిత్రం కేజీయఫ్ 2 సినిమాను ముందుగానే స్ట్రీమింగ్ చేస్తోంది అమెజాన్. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కేజీయఫ్ 2ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఎర్లీ యాక్సెస్ ‘మూవీ రెంటల్స్’లో సినిమాలు చూడాలంటే అదనంగా రూ. 199 చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా సబ్‌స్క్రైబ్ చేసుకునే వారితో పాటు ఇప్పటికే సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారు కూడా రూ. 199 చెల్లించాల్సిందే. ప్రైమ్‌వీడియోస్.కామ్ స్టోర్ ట్యాబ్ ద్వారా మీ ఆన్‌డ్రాయిడ్ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, ఎస్‌టీబీఎస్, ఫైర్ టీవీ స్టిక్ ద్వారా యాక్సెస్‌ను పొందండి. అయితే ఒకసారి ఈ విండోలో సినిమా చూస్తే తిరిగి 48 గంటల తర్వాతే ఈ మూవీ మళ్లీ ప్లేబ్యాక్ అవుతుంది. అంటే ఈ సినిమాను 48 గంట్లో ఒకసారి మాత్రమే చూడోచ్చు. అలా ఈ రెంటల్ యాక్సెస్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న తేదీ నుంచి 30 రోజుల పాటు దీని వాలిడిటి ఉంటుంది. ఈ గడువులోపే కస్టమర్స్ ప్రపంచవ్యాప్తంగా రిలీజైన బ్లాక్‌బస్టర్ చిత్రాలను వీక్షించే అవకాశం ఉంది. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ ఎర్లీ రెంటల్ యాక్సెస్ పొంది ఇంట్లోనే బ్లాక్‌బస్టర్ సినిమాలు చూస్తూ ఈ సమ్మర్‌ను కూల్‌గా ఎంజాయ్ చేయండి. (అడ్వర్టోరియల్) -
'కేజీఎఫ్ 3' ఉందా ? లేదా ?.. మరో నిర్మాత ఏమన్నాడంటే ?
Hombale Films Producer Karthik Gowda About KGF 3: యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చి బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించిన చిత్రం 'కేజీఎఫ్ 2'. ఓ పక్క కలెక్షన్లు మరోపక్క ప్రేక్షకుల మౌత్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక బాలీవుడ్లో అయితే రూ. 400 కోట్లకుపైగా వసూళ్లను కొల్లగొట్టింది. అంతేకాకుండా ఇటీవలే వెయ్యి కోట్ల క్లబ్లో కూడా చేరింది ఈ మూవీ. ఇండియాలోని అన్ని భాషల్లో కలుపుకుని రూ. 900 కోట్లు దాటగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీకి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ 3' రానుందని శనివారం ఉదయం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ 3 మూవీని మార్వెల్ తరహాలో తెరకెక్కించనున్నట్లు, అక్టోబర్ తర్వాత షూటింగ్ ప్రారంభం కానున్నట్లు హోంబలే సంస్థ నిర్మాత విజయ్ కిరంగదూర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై హోంబలో సంస్థకు చెందిన మరో నిర్మాత కార్తిక్ గౌడ స్పందించారు. 'సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం మా వద్ద చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిపైనే మా దృష్టి ఉంది. కాబట్టి ఇప్పట్లో హోంబలే సంస్థ 'కేజీఎఫ్ 3'ని తెరకెక్కించలేదు. ఒకవేళ షూటింగ్ ప్రారంభిస్తే తప్పకుండా అధికారిక ప్రకటన ఇస్తాం.' అని కార్తిక్ గౌడ ట్వీట్ చేశారు. చదవండి: 'కేజీఎఫ్ 3'పై క్లారిటీ.. మార్వెల్ ఫ్రాంచైజీ తరహాలో సినిమా The news doing the rounds are all speculation. With a lot of exciting projects ahead of us , we @hombalefilms will not be starting #KGF3 anytime soon. We will let you know with a bang when we start the work towards it. — Karthik Gowda (@Karthik1423) May 14, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'కేజీఎఫ్ 3'పై క్లారిటీ.. మార్వెల్ ఫ్రాంచైజీ తరహాలో సినిమా
KGF Producer Vijay Kiragandur About KGF 3: కేజీఎఫ్ 2.. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించింది. కలెక్షన్ల పరంగానే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక బాలీవుడ్లో అయితే రూ. 400 కోట్లకుపైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేకాకుండా వెయ్యి కోట్ల క్లబ్లో కూడా చేరింది ఈ మూవీ. ఇండియాలోని అన్ని భాషల్లో కలుపుకుని రూ. 900 కోట్లు దాటగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి మరో సీక్వెల్ కూడా వస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆశ పడుతున్నారు. ఈ క్రమంలోనే గుడ్ న్యూస్ తెలిపారు చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్. ఒక ఇంటర్వ్యూలో కేజీఎఫ్ 3 సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విజయ్ కిరంగదూర్. 'కేజీఎఫ్ 3 మూవీ తెరకెక్కించాలనే అనుకుంటున్నాం. ఈ ఫ్రాంచైజీని మార్వెల్ తరహాలో రూపొందించాలని భావిస్తున్నాం. అక్టోబర్ తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుంది. 2024లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ మూవీతో బిజీగా ఉన్నారు. దాదాపు 30-35% షూటింగ్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ వచ్చే వారం స్టార్ట్ అవుతుంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నాటికి పూర్తి చేయాలనుకుంటున్నాం. కాబట్టి అక్టోబర్ తర్వాత కేజీఎఫ్ 3 షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాం.' అని హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరంగదూర్ పేర్కొన్నారు. చదవండి: కేజీఎఫ్ మేకర్స్ భారీ సర్ప్రైజ్.. యువరాజ్ కుమార్ తెరంగేట్రం! సంజయ్ దత్, రవీనా టండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్ రాజ్ తదితరులు కేజీఎఫ్ 2లో నటించారు. ఈ కేజీఎఫ్ 3లో నటీనటుల గురించల విజయ్ను అడగ్గా 'మేము ఒక మార్వెల్ మల్టీవర్స్ తరహాలో తెరకెక్కించాలనుకుంటున్నాం. విభిన్న చిత్రాల నుంచి విభిన్న పాత్రలను తీసుకురావాలనుకుంటున్నాం. అలాగే డాక్టర్ స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్ సినిమా తరహాలో రూపొందించాలని అనుకుంటున్నాం. దీని ద్వారా ఎక్కువ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు.' అని తెలిపారు. చదవండి: హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్‌పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కేజీఎఫ్ 2: 'మెహబూబా' లవ్ సాంగ్ పూర్తి వీడియో చూశారా !
KGF 2 Movie Mehabooba Mehabooba Full Song Released: కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన 'కేజీఎఫ్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్ల తుఫాన్‌తో రాఖీ భాయ్ ఊచకోత కోస్తున్నాడు. హిందీ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా పేరొందిన విషయం తెలిసిందే. ఇప్పటికే రూ. 1000 కోట్ల క్లబ్లో కూడాల చేరిపోయింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని సాంగ్స్ పూర్తి వీడియోలను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. మదర్స్ డే రోజు 'అమ్మ పాట' పూర్తి వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సాంగ్‌ను రిలీజ్ చేశారు. లవ్ ట్రాక్‌లో సాగిన 'మెహబూబా' పాటను చిత్రబృందం విడుదల చేసింది. ట్విటర్ వేదికగా ఈ వీడియో సాంగ్ లింక్‌ను షేర్ చేసింది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా అలరించింది. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
కేజీఎఫ్ 2: 'అమ్మ పాట' ఫుల్ వీడియో చూశారా ?
KGF 2: Voice Of Every Mother Full Song Released: రాఖీ భాయ్ కలెక్షన్ల తుఫాన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 మూవీ రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవలే బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ 2 భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోన యాక్షన్ సీన్స్, పాటలు ఆడియెన్‌ను ఒక రేంజ్లో ఉర్రూతలూగించాయి. యాక్షన్, ఎలివేషన్స్, సాంగ్స్, బీజీఎంకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇందులో కొడుకు గురించి తల్లి పాడే ఎదగరా ఎదగరా అనే పాట ప్రతి ఒక్కరికీ గుర్తు ఉంటుంది. ఈ పాటను 'వాయిస్ ఆఫ్ ఎవ్రీ మదర్ (అమ్మ పాట)' అని ఇదివరకు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆదివారం (మే 8) మదర్స్ డే సందర్భంగా పూర్తి పాటను రిలీజ్ చేశారు మేకర్స్. 'వాయిస్ ఆఫ్ ఎవ్రీ మదర్' అని ట్వీట్ చేస్తూ షేర్ చేశారు లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి. చదవండి: విషాదం.. కేజీయఫ్ నటుడు మృతి ప్రశాంత్ నీల్ మీకు అన్‌హ్యాపీ డైరెక్టర్స్ డే: వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు Voice of every MOTHER!#GaganaNee/#FalakTuGarajTu/#YadagaraYadagara/#AgilamNee/#GaganamNee : https://t.co/lsnsFyAupu#KGFChapter2 @Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @RaviBasrur @LahariMusic @Mrtmusicoff pic.twitter.com/b2RbaKR8U0 — RamajogaiahSastry (@ramjowrites) May 8, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
విషాదం.. కేజీయఫ్ నటుడు మృతి
శాండల్‌వుడ్ నటుడు మోహన్ జునేజా మృతి చెందారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జన్మించిన జునేజా తన కెరీర్లో సుదీర్ఘ కెరీర్లో హాస్యనటుడిగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు. చెల్లాట సినిమా ఆయన కెరీర్‌కు మాంచి బ్రేక్ ఇచ్చింది. సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచిన కేజీయఫ్, కేజీయఫ్-2 చిత్రాల్లో కూడా ఆయన నటించారు. మోహన్ జునేజా మృతి పట్ల శాండల్‌వుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
హిందీలో అత్యధిక వసూళ్లు చేసిన 2వ సినిమా కేజీయఫ్ 2, తొలి సినిమా ఏదో తెలుసా?
KGF 2 Becomes All Time Second Highest Hindi Grosser: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేజీయఫ్ 2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలై మూడు వారాలకు పైగా గడుస్తున్న ఇప్పటికీ థియేటర్లో ఈ మూవీ హావా కొనసాగుతూనే ఉంది. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే విడుదలైన అన్ని భాషల్లో (కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ) భారీ వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ బాలీవుడ్లో అరుదైన ఘనతను సాధించింది. చదవండి: విరాట పర్యం రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజే బిగ్స్క్రీన్పై సందడి విడుదలైన 22 రోజుల్లోనే ఈ మూవీ దంగల్ లైఫ్‌టైం కలెక్షన్స్‌ను దాటేసి అప్పటికి వరకు ఉన్న ఆ మూవీ రికార్డును చెరిపేసింది. ‘దంగల్’ చిత్రం లైఫ్‌టైం రన్లో రూ. 387.40 కోట్లు వసూలు చేయగా... కేవలం 22 రోజుల్లోనే ఆ రికార్డును 'కేజీఎఫ్2' అధిగమించింది. ఇక నిన్నటి(మే 5) వరకు కేజీయఫ్ 2 బి-టౌన్ బాక్సాఫీసు వద్ద రూ. 391.65 కోట్లు వసూలు చేసింది. ఈ రోజు(మే 6) కలెక్షన్స్‌తో రూ. 400 కోట్ల పైగా వసూలు చేసే అవకాశం ఉందని గురువారం ప్రముఖ ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ వెల్లడించగా.. రమేశ్ బాలా అనే మరో ట్రెడ్ అనలిస్ట్ నేటితో కేజీయఫ్ 2 రూ. 400 కోట్ల క్లబ్‌లోకి చేరిందని తెలిపాడు. చదవండి: ఉపాసన.. నా మైండ్లోనూ అదే ఉంది, కానీ మనం కొద్ది రోజులు ఆగాల్సిందే! దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సౌత్ సినిమాగా కేజీయఫ్ 2 నిలిచింది. ఇప్పటి వరకు హిందీలో అత్యధిక వసూళు చేసిన దక్షిణాది సినిమాల్లో బాహుబలి 2 మొదటి స్థానంలో ఉంది. బాహుబలి 2 హిందీ వెర్షన్ అక్కడ రూ. 511.30 కోట్లు వసూలు చేసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే హిందీలో ఇప్పటి వరకు కేవలం రెండు చిత్రాలు మాత్రమే రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఆ రెండూ దక్షిణాది చిత్రాలే (బాహుబలి2, కేజీఎఫ్2) కావడం విశేషం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రశాంత్ నీల్ మీకు అన్‌హ్యాపీ డైరెక్టర్స్ డే: వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
రామ్ గోపాల్ వర్మ.. అందరి కంటే భిన్నంగా ఆలోచిస్తూ.. తన రూటే సపరేట్ అంటాడు. నిత్యం సెలబ్రెటీలను సటైరికల్ కామెంట్స్‌తో కవ్విస్తుంటాడు. ఏ అంశాన్ని అయినా భిన్నమైన కోణంలో చూసి.. దానిని నిస్సందేహం వ్యక్తం చేస్తూ విమర్శలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తాడు. అలాంటి ఆర్జీవీ డైరెక్టర్స్ డే సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేజీయఫ్ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రశాంత్ నీల్. ఈ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా దర్శకుడిగా మారాడు. దీంతో ప్రశాంత్ నీల్‌పై వర్మ వరుస ట్వీట్స్ చేస్తు ప్రశంసలు కురిపించాడు. చదవండి: జానీ తరచూ కొట్టేవాడంటూ కోర్టులోనే బోరున విలపించిన నటి I wish a very UNHAPPY Directors day to @prashanth_neel for so royally FUCKKKKING every directors mind everywhere whether it’s in BOLLYWOOD, TOLLYWOOD,KOLLYWOOD and even in SANDALWOOD ..Sir Prashant Neel, U are the VEERAPPAN of indian cinema🙏🙏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) May 4, 2022 ‘ప్రశాంత్ నీల్.. మీకు అన్ హ్యాపీ డైరెక్టర్స్ డే. కేజీయఫ్ మూవీతో మీరు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు శాండల్‌వుడ్ దర్శకులకు కనువిప్పు కలిగించారు. ఇండియన్ సినిమాకు మీరు వీరప్పన్ లాంటి వారు’ అంటూ వర్మ కొనియాడాడు. సంప్రదాయ పరమైన సినీ పరిశ్రమలకు చెందిన 95 శాతం ప్రజలకు మీ కేజీయఫ్ సినిమా నచ్చి ఉండదు. ఈ మూవీతో మీరు సినీ పరిశ్రమలోని పాత పద్దతిని దూరం చేసి కొత్త పద్దతిని పరిచయం చేశారు’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాగాక ఎంతో మంది రీ షూటింగులు, రీ డ్రాఫ్టులు, పునరాలోచనలతో టన్నుల కొద్దీ డబ్బును వృథా చేస్తున్నారు కానీ, వాళ్లు వేస్ట్ చేస్తున్నంత డబ్బుతోనే మీరు క్వింటాల్ డబ్బు సంపాదించారంటూ ప్రశాంత్ నీల్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు వర్మ. చదవండి: త్వరలో హీరోతో బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి, హింట్ ఇచ్చేసిందిగా! Sir @prashanth_neel u made a quintal of money but that at the cost of indian film industry losing 100’s of tonnes of money becos they will all spend on reshoots, redrafts,rethinks in reinventing themselves,but not knowing why the fucking fuck KGF 2 worked 😳#UnhappyDirectorsDay — Ram Gopal Varma (@RGVzoomin) May 4, 2022 95% of the tradition oriented conventional film industry people have hated KGF 2 and that itself is the proof that @prashanth_neel has kicked out the old industry and brought in a new industry ,which is the #Kgf2 industry — Ram Gopal Varma (@RGVzoomin) May 4, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటీటీలో పాన్ ఇండియా సినిమాల సందడి, మేలో బిగ్ ఫెస్టివల్!
List Of Upcoming OTT Movies In May 2022: మొన్నటి వరకు థియేటర్స్‌లో సందడి చేసిన పాన్ ఇండియా చిత్రాలు.. ఇప్పుడు ఓటీటీలో హల్చల్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ నుంచి కేజీయఫ్ 2 వరకు అన్ని సినిమాలు మేలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుండటంతో నెటిజన్స్‌లో నయా జోష్ మొదలైంది. ముందుగా మే 11న బీస్ట్ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. విజయ్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 13న థియేటర్స్‌లో విడుదలైంది. ఓ షాపింగ్ మాల్‌లోకి కొంతమంది ఉగ్రవాదులు చొరబడి ప్రజలను బందీలుగా మారుస్తారు. ఉగ్రవాదుల చెర నుంచి ప్రజలను హీరో ఏ విధంగా రక్షించాడు అనేదే బీస్ట్ కథ. ఈ చిత్రానికి తొలిరోజు నుంచే మిశ్రమ స్పందన రావడం, తరువాతి రోజు(ఏప్రిల్ 14) కేజీయఫ్2 విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద బీస్ట్ బోల్తాపడింది. దీంతో అనుకున్నదానికి కంటే ముందే ఓటీటీలో విడుదల చేస్తున్నారు మేకర్స్. మే 11న సన్ నెక్స్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో బీస్ట్ ప్రసారం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక మే 13న 2022 బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ ది కశ్మీర్ ఫైల్స్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన ఈ చిత్రం ఓటీటీలో ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి ఇక మే20న మరో పాన్ఇండియా బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ ఓటీటీలో విడుదల కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 25న థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టింది. జూన్ 3న ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని మొదట వార్తలు వచ్చాయి. కానీ, ఈ తాజా బజ్ ప్రకారం మే 20 నుంచే జీ అండ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందట. తొలుత ఈ చిత్రాన్ని పే ఫర్ వ్యూ పద్దతిలో విడుదల చేసేందుకు ఈ రెండు ఓటీటీ సంస్థలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జూన్ 3నుంచి మాత్రం సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉందనుంది. ఆర్ఆర్ఆర్తో పాటు మరో పాన్ ఇండియా చిత్రం కూడా మే నెలలోనే ఓటీటీలోకి రానుంది. మే 27న అమెజాన్ ప్రైమ్ లో కేజీయఫ్ 2 విడుదల కానుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ విషయం పై క్లారిటీ రానుంది.యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. ఇప్పటికీ ఈ చిత్రానికి థియేటర్స్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఒకవేళ నిజంగానే మే 27న ఓటీటీలోకి కేజీయఫ్ 2 వస్తే.. రాకీభాయ్ ఫ్యాన్స్‌కు పండగే. (చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన ఆహా, మేలో ఏకంగా 40+ మూవీస్!) మరో వైపు ఆచార్య ఓటీటీ రిలీజ్ పై కూడా రూమర్స్ మొదలయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర ఆచార్యకు ఆశించినంత ఆదరణలేకపోవడంతో కాస్త ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఎర్లీ ప్రీమియర్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ ఆచార్య ప్రొడ్యూసర్స్ తో 18 కోట్లకు డీల్ కుదుర్చుకుందని సమాచారం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘సలాం రాఖీ భాయ్’ అంటూ యశ్ కూతురు ఎంత క్యూట్‌గా పాడిందో చూశారా?
Yash Daughter Ayra Says Salam Rocky Bhai: కన్నడ రాక్‌స్టార్ యశ్ ప్రస్తుతం కేజీయఫ్ 2 సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నాడు. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీయఫ్ 2 బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 1000కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఒక్క బాలీవుడ్లోనే ఈ మూవీ రూ. 350 కోట్లు వసూళ్లు చేసిన తొలి దక్షిణాది సినిమా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇక మూవీ యశ్ కెరీర్లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. చదవండి: సమంతకు ప్రేమపై నమ్మకం పోయిందా? ఆమె ట్వీట్ అర్థం ఏంటి? ఇక కేజీయఫ్ 2 షూటింగ్‌తో ఇంతకాలం ఫుల్ బిజీగా ఉన్న యశ్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విరామ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. యశ్ ఫ్యామిలీ మ్యాన్ అనే విషయం తెలిసిందే. ఖాళీ దొరికితే కుటుంబంతో కలిసి టూర్లకు, వెకేషన్స్‌కు వెళతాడు. ఈ క్రమంలో కూతురు ఐరాతో యశ్ తన డేను స్టార్ట్ చేశాడు. ఉదయం లేవగానే ఐరాతో ఆడుకుంటున్న వీడియోను షేర్ చేశాడు యశ్. ఈ సందర్భంగా సలాం రాఖీ భాయ్ అంటూ ఐరా పాట పాడింది. చదవండి: హిందీ భాష వివాదంపై కంగనా షాకింగ్ కామెంట్స్ ‘సలాం రాకీ భాయ్.. రారా రాఖీ..’ అంటూ ఐరా క్యూట్‌గా పాడిన ఈ వీడియోను యశ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోకు యశ్ ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సో క్యూట్ అంటూ ఐరాపై ముద్దులొలికిస్తున్నారు నెటిజన్లు. కాగా యశ్ 2016లో తన మొదటి సినిమా హీరోయిన్ రాధిక పండిట్‌ను పెళ్లిచేసుకోగా, వీరికి ఇద్దరు సంతానం. కూతురు ఐరా 2018 డిసెంబర్లో జన్మించగా.. 2019 అక్టోబర్‌లో ఈ జంటకు యథర్వ్ జన్మించాడు. View this post on Instagram A post shared by Yash (@thenameisyash) -
రాకీ భాయ్ ఊచకోత.. నాలుగో చిత్రంగా కేజీయఫ్ 2
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేజీయఫ్ 2 హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి, అంతే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. బాలీవుడ్లో అయితే ఏ సినిమాకు సాధ్యం కాని వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటికే హిందీలో రూ.350 కోట్లకు పైగా రాబట్టి.. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డును అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. దంగల్, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ తర్వాత రూ. వెయ్యికోట్ల క్లబ్లో చేరిన నాలుగో చిత్రంగా ‘కేజీయఫ్ 2’ నిలిచింది. ఇక టాలీవుడ్‌లోనూ కేజీయఫ్ 2 ఇంకా తగ్గలేదు. 15 రోజుల్లో ఈ చిత్రం 77.31 కోట్ల షేర్ని రాబట్టింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు రజనీకాంత్ ‘రోబో’ పేరిట ఉండేది.పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్, హీరోయిన్గా శ్రీనిధి నటించారు. రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. #KGFChapter2 has crossed ₹ 1,000 Crs Gross Mark at the WW Box Office.. Only the 4th Indian Movie to do so after #Dangal , #Baahubali2 and #RRRMovie — Ramesh Bala (@rameshlaus) April 30, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇంతవరకు నేను సౌత్ సినిమాలే చూడలేదు: బాలీవుడ్ నటుడు
Actor Nawazuddin Siddiqui About South India Movies: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌ల మధ్య నెలకొన్న ట్విటర్ వార్ గురించి తెలిసిందే. ఈ వార్ మధ్యలోకి ఆర్జీవీ దూరి బాలీవుడ్‌కు చురకలు అట్టించారు. దీంతో ఈ వివాదం మరింత ముదురింది. ఈ నేపథ్యంలో దీనిపై వరుసగా బాలీవుడ్, సౌత్ స్టార్స్ స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోనూసూద్, మనోజ్ బాజ్‌పాయి వంటి అగ్ర నటులు ఈ వివాదంపై స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి స్పందించారు. చదవండి: షాకింగ్: కెమెరామెన్‌పై తైమూర్ ఎలా అరిచాడో చూడండి తాజాగా ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో దక్షిణాది సినిమాలు ‘పుష్మ: ది రైజ్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీయఫ్ 2’లు బాలీవుడ్లో భారీ విజయం సాధించడంపై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. ‘నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నేను ఏ దక్షిణాది సినిమాలు చూడలేదు. సౌత్ సినిమాలనే కాదు, కమర్షియల్ సినిమాలంటే నాకు పెద్దగా ఆసక్తి ఉండదు. అందుకే అలాంటి సినిమాలు చూడను. అంతేగాక ప్రస్తుతం నాకు అంత సమయం కూడా లేదు. కాబట్టి నేను వీటి సక్సెస్‌పై ఎలాంటి కామెంట్ చేయలేను’ అని బదులిచ్చారు. అనంతరం తాజాగా పరిశ్రమలో నెలకొన్న హిందీ భాష వివాదం, బాలీవుడ్‌పై వస్తున్న విమర్శలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. లాక్డౌన్ నుంచి సినిమాలపై ప్రేక్షకుడి అభిరుచి మారిందని ఆయన అన్నారు. ‘ఒక సినిమా హిట్ అయితే అంతా కలిసి దాన్ని ఆకాశానికెత్తడం. అంతగా కలెక్షన్స్ రాకుంటే వెంటనే విమర్శలు గుప్పించడం సాధారణమైంది. ఇప్పుడిదో ఫ్యాషన్ అయిపోంది. ఈ ట్రెండ్ కూడా పరిస్థితులను బట్టి మారుతోంది. బాలీవుడ్‌కు ఒక్క బ్లాక్‌బస్టర్ పడితే అంతా సర్దుకుంటుంది’ అన్నారు. చదవండి: Vishwak Sen: అంతా ఓకే అనుకునేసరికి ఆమె నన్ను వదిలేసిన విషయం తెలిసింది అలాగే లాక్డౌన్లో అంతర్జాతీయ సినిమాలు చూసిన ప్రేక్షకుడి అభిరుచిలో మార్పు వస్తుందని తాను ముందుగానే ఊహించానన్నారు. కానీ ఈ మార్పు అంత మంచిది కాదన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రేక్షకులు మసాలా కంటెంట్‌తో వస్తున్న సినిమాలనే ఎక్కువగా ఆదిరిస్తున్నారన్నారని ఆయన అభిప్రాయ పడ్డారు. ఇక తాము కూడా హీరో పంటి-2 వంటి కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, అవి కలెక్షన్ల పరంగా తమ సినిమాలు భారీ వసూళ్లు సాధించాలని కోరుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1711356039.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న కేజీయఫ్ బ్యూటీ శ్రీనిధి
కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన కేజీయప్ చాప్టర్ 1కు సీక్వెల్‌గా వచ్చిన కేజీయఫ్ చాప్టర్ 2 ఇటీవలె రిలీజ్ అయి మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధికి వరస అవకాశాలు క్యూ కడుతున్నాయి. త్వరలోనే కోబ్రా అనే సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్ అనంతరం తెలుగు సినిమాలపై దృష్టి పెడతానంటోంది ఈ బ్యూటీ. ఇప్పటికే తెలుగు భాషపై పట్టు సాధించానని, త్వరలోనే టాలీవుడ్ తప్పకుండా సినిమా చేస్తానని ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పింది. మోడల్‌గా కేరీర్‌ను ప్రారంభించిన శ్రీనిధి కేజీయఫ్ తొలి సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కేజీయఫ్ చాప్టర్ 1 పాన్ ఇండియా సినిమాగా సత్తా చాటింది. దీంతో కేజీయఫ్ చాప్టర్ 2పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 14న వచ్చిన కేజీయఫ్ 2 అంచనాలను మించి సూపర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన 12 రోజుల్లోనే ఈ మూవీ రూ. 900 కోట్లకు పైగా వసూళు చేసి 1000 కోట్ట క్లబ్‌లోకి చేరువలో ఉంది. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ వరసగా ఫొటోషూట్లకు ఫోజులు ఇస్తోంది. దీంతో ఆమె బ్యూటీఫుల్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
భార్యతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న యశ్.. ఫోటోలు వైరల్
కన్నడ స్టార్ యశ్ ప్రస్తుతం కేజీఎఫ్-2 గ్రాండ్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యశ్ కెరీర్‌నే మలుపుతిప్పిన సినిమా ఇది. ఈ సినిమా సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్-2 కూడా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. అయితే మొన్నటివరకు షూటింగ్లో ఫుల్ బిజీగా గడిపిన యశ్ తన భార్యతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను యశ్ భార్య రాధిక పండిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: పబ్ ఇన్సిడెంట్ తర్వాత తొలిసారి భర్తతో కనిపించిన నిహారిక View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
త్వరలోనే తెలుగు సినిమా చేస్తా : కేజీఎఫ్ హీరోయిన్
కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా సీక్వెల్ ఇటీవలె రిలీజ్ అయి మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. అతి తక్కువ కాలంలోనే హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీనిధికి ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే కోబ్రా అనే సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా రిలీజ్ అనంతరం తెలుగు సినిమాలపై దృష్టి పెడతానని పేర్కొంది. త్వరలోనే తప్పకుండా తెలుగు సినిమాలు చేస్తానని పేర్కొంది. చదవండి: సూర్యపేటలో అనుపమ సందడి, షాకిచ్చిన ఫ్యాన్స్ -
హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్‌పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్..
Abhishek Bachchan On Pan India Movies Does not Believe In The Term: బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఇటీవల 'దస్వీ' చిత్రంతో నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చదువుకు ఉన్న ప్రాధాన్యత తెలుపుతూ తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా చిత్రాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు అభిషేక్. పాన్ ఇండియా పదంపై తనకు నమ్మకం లేదన్నాడు. బాలీవుడ్ సినిమాల్లో కంటెంట్ లేదన్న వాదనను తిరస్కరించాడు. ప్రతి నటుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భాగమని అభిషేక్ బచ్చన్ అభిప్రాయపడ్డాడు. 'పాన్ ఇండియా అనే పదంపై నాకు నమ్మకం లేదు. మరేదైనా ఇండస్ట్రీకి ఈ పదాన్ని వాడుతున్నామా ? లేదు కదా. కేజీఎఫ్ 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ చిత్రాలు హిందీలో మంచి వసూళ్లు సాధించాయి. మంచి సినిమా హిట్ అవుతుంది. లేకుంటే ప్లాప్ ఎక్కడైనా ప్లాప్ అవుతుంది. బాలీవుడ్లో మంచి కంటెంట్ సినిమాలు రావట్లేదనడం సరికాదు. గంగుబాయి కతియావాడి, సూర్యవంశీ మంచి హిట్ సాధించాయి. రీమేక్ అనేది ఎప్పుడూ జరిగేదే. అది ఒక చాయిస్ మాత్రమే. మన దగ్గర సినీ ప్రియులు ఎక్కవ. సినిమాకు భాషతో పనిలేదు. ఏ భాషలో వచ్చిన అంతిమంగా అది సినిమానే. వివిధ భాషల్లో పనిచేసినా, మనమందరం భారత చిత్ర పరిశ్రమలో భాగమే. ఏదిఏమైనా మనమందరం ఓ పెద్ద కుటుంబానికి చెందినవాళ్లమే.' అని అభిషేక్ బచ్చన్ తెలిపాడు. కాగా అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం 'బ్రీత్' వెబ్ సిరీస్ మూడో సీజన్లో నటిస్తున్నాడని సమాచారం. చదవండి: అభిషేక్ బచ్చన్ అలరించిన ఓటీటీ చిత్రాలు ఇవే.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
KGF ప్రశాంత్ నీల్.. మన బంగారమే
కేజీఎఫ్.. కేజీఎఫ్.. కొద్దిరోజులుగా ఎవరినోట విన్నా ఇదే మాట. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కి మన బాక్సాఫీస్ రేంజ్‌ను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఇది. అసలు అప్పటివరకూ ప్రాచుర్యంలోనే లేని శాండిల్‌వుడ్ (కన్నడ సినీ పరిశ్రమ)నే కాకుండా యావత్తు దేశ సినీ ఖ్యాతిని దర్శకుడు ప్రశాంత్ నీల్ హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాడు. ఇంతటి ఖ్యాతి గడించిన ఈ ప్రశాంత్ నీల్ ఎవరంటే...అచ్చంగా మనోడే. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం వాసి. తన మూడో సినిమాతోనే ప్రపంచస్థాయి గుర్తింపు సొంతం చేసుకున్న ప్రశాంత్‌నీల్ వెండితెర ప్రయాణం, జీవన గమన విశేషాలపై ప్రత్యేక కథనం. మడకశిర(అనంతపురం): ప్రశాంత్ నీల్‌ది మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం స్వగ్రామం. మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్, భారతి దంపతుల కుమారుడు. అయితే వీరి కుటుంబం బెంగళూరులోనే స్థిరపడింది. కొన్నేళ్ల క్రితం మృతి చెందిన తన తండ్రి సుభాష్ మృతదేహాన్ని నీలకంఠాపురంలోనే ఖననం చేయడంతో ప్రశాంత్‌నీల్ అప్పుడప్పుడూ కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చి వెళుతుంటారు. తాజాగా ఈనెల 14న కేజీఎఫ్–2 రిలీజ్ రోజున స్వగ్రామం వచ్చి తండ్రి సమాధిని సందర్శించి వెళ్లారు. వెండితెర ప్రయాణమిలా.. ప్రశాంత్ విద్యాభ్యాసం బెంగళూరులో సాగింది. వారి కుటుంబానికి బెంగళూరులో హాయ్‌ల్యాండ్ ఉండేది. అక్కడ ఎక్కువగా సినీ షూటింగ్‌లు జరిగేవి. దీంతో ప్రశాంత్ తరచూ అక్కడికి వెళ్లి సినీ చిత్రీకరణ చూసేవారు. ఈ క్రమంలోనే సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. డిగ్రీ తర్వాత ఎంబీఏ కోర్సులో జాయిన్ అయిన ప్రశాంత్ నీల్ సినిమాలపై మక్కువతో ఫిల్మ్ స్కూల్లో చేరి అన్ని విభాగాలపై అవగాహన పెంచుకున్నాడు. ఉగ్రమ్‌తో విశ్వరూపం 2014లో ‘ఉగ్రమ్’ సినిమాతో ప్రశాంత్ నీల్ చిత్ర దర్శకుడిగా తన సత్తా చాటారు. ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ‘ఉగ్రమ్’ సినీ చిత్రీకరణకు కోలార్ గోల్డ్ ఫీల్డ్‌కు వెళ్లిన ప్రశాంత్ నీల్.. అక్కడి పరిస్థితులు చూసి ఓ లైన్ రాసుకుని కోలార్ బంగారు గనుల ఇతివృత్తం ఆధారంగా 2018లో కేజీఎఫ్–1 సినిమా తీశారు. 2022లో కేజీఎఫ్–2 సినిమా తెరకెక్కించారు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మళయాలం భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కేజీఎఫ్–2 అందరి అంచనాలను అధిగమించి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఒక్కసారిగా చిత్ర దర్శకుడు ప్రశాంత్‌నీల్ ఎవరు? ఎక్కడి వాడు? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఆరా తీయడం మొదలైంది. నీల్ అంటే నీలకంఠాపురం.. రెండు రోజుల క్రితం వరకూ ప్రశాంత నీల్ మడకశిరవాసి అనే విషయం కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ కుమారుడు ప్రశాంత్‌నీల్ అని తెలుసుకున్న తర్వాత నియోజకవర్గ ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. స్వగ్రామంపై ఉన్న గౌరవంతో నీలకంఠాపురం స్ఫురించేలా ప్రశాంత్ తన ఇంటిపేరును నీల్ అని పెట్టుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. త్వరలోనే ప్రభాస్ హీరోగా మరో భారీ బడ్జెట్ చిత్రం ‘సలార్’ను ఆయన తెరకెక్కించనున్నారు. నీలకంఠాపురంలోని ప్రశాంత్‌నీల్ తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంది మా కుమారుడు సినీ రంగ ప్రవేశం చేసిన అనతి కాలంలోనే గొప్ప ఖ్యాతి గడించడం ఎంతో ఆనందంగా ఉంది. కష్టానికి ఫలితం దక్కింది. ప్రపంచస్థాయిలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నాడు. తల్లిగా ఎంతో అనుభూతి పొందా. – భారతి, ప్రశాంత్‌నీల్ తల్లి నీలకంఠాపురానికి గుర్తింపు సినిమా డైరెక్టర్‌గా ప్రశాంత్‌నీల్ సాధించిన విజయం నీలకంఠాపురానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఏడాదికోసారి నీలకంఠాపురానికి వచ్చి అందరినీ పలకరించి వెళ్తాడు. ఈ గ్రామమంటే అతనికి ఎంతో ఇష్టం. ఈ నెల 14న వచ్చి తన తండ్రి సమాధికి నివాళులర్పించి వెళ్లాడు. భవిష్యత్‌లో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలన్నదే నీలకంఠాపురం ప్రజల ఆకాంక్ష. – చిన్న రంగేగౌడ్, ప్రశాంత్‌నీల్ పినతండ్రి, నీలకంఠాపురం, మడకశిర మండలం చదవండి: ఓటీటీలోకి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే? -
'పుష్ప-2'పై 'కేజీయఫ్-2' ఎఫెక్ట్ పడనుందా..?
గత కొంతకాలంగా దక్షిణాది చిత్రాలు భారతీయ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. అక్కడి జనాలు మన చిత్రాల మేకింగ్, టేకింగ్, యాక్టింగ్‌లకు బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడ ప్రస్తుతం దక్షిణాది చిత్రాలదే హవా. తాజాగా రాకింగ్ స్టార్ యశ్ 'కేజీయఫ్-2'తో హిందీలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. దాంతో ఈ చిత్ర ప్రభావం రాబోయే సినిమాలపై పడనుందా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. 'కేజీయఫ్: చాప్టర్1'కు కొనసాగింపుగా 'కేజీయఫ్-2' వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ చిత్రం తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో కథతో పాటు హీరో ఎలివేషన్స్ ఓ రేంజ్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం సీక్వెల్స్ చేస్తున్న దర్శకులకు 'కేజీయఫ్-2' భారీ హీట్ కావడంతో ఇతర చిత్రాల మేకర్స్‌కు అది ఒకింత తలనొప్పిగా మారిందంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే తొలి భాగంతో పోలిస్తే రెండో భాగం ఏమాత్రం తగ్గినా దాన్ని ప్రేక్షకుడు జీర్ణించుకోలేకపోవచ్చు. మొదటి పార్ట్, రెండో పార్ట్‌ను పోల్చి చూడటంతో దానిపై రకరకాల చర్చలు జరిగే అవకాశం ఉంది. అది చిత్ర ఫలితంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కూడా ఉందంటున్నారు. అయితే సీక్వెల్స్ విషయంలో 'కేజీయఫ్' చిత్రంలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' రెండో భాగం కూడా పాన్ ఇండియా లెవల్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి రాఖీభాయ్ పాత్రలా పవర్ఫుల్ ఎలివేషన్స్‌తో 'పుష్ప' పాత్ర ఉంటుందా? అసలు పుష్ప ఎర్రచందనం సిండికేట్‌ను ఎలా నడిపించాడు? భన్వర్ సింగ్ షెకావత్‌తో పాటు మంగళం శ్రీనులను ఎలా ఎదుర్కొని నిలిచాడు? లాంటి పలు ప్రశ్నలు ప్రస్తుతం ప్రేక్షకులను తొలిచేస్తున్నాయి. దీంతో చిత్ర బృందం సైతం అభిమానుల అంచనాలను అందుకునేలా పలు సన్నివేశాలను రాసుకుంటోందని సమాచారం. అయితే దర్శకుడు సుకుమార్ మాత్రం తగ్గేదేలే అనేలా పుష్పరాజ్ పాత్రను మరింత ఎలివేట్ చేసేలా పుష్ప-2 కథ, కథనాలను మలుస్తున్నాడని తెలుస్తోంది. -
కేజీఎఫ్ 2 ఎఫెక్ట్: హిందీ భాషపై కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు..
Kiccha Sudeep Says Hindi Is No More A National Language: దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన 'ఈగ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. 'ఈగ' సినిమాలో విలన్‌గా మెప్పించి ఎంతో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా పాత్రలో కొత్తదనం ఉంటే చాలు వెంటనే సినిమా చేసేస్తాడు. హీరోగానే కాదు.. కథలో తన ప్రాముఖ్యాన్ని బట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేస్తుంటారు. ‘బాహుబలి’, ‘సైరా: నరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి తనదైన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం సుదీప్ హీరోగా విక్రాంత్ రోణ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూలై 28న విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా కేజీఎఫ్ 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేశాడు కిచ్చా సుదీప్. ఓ ప్రెస్ మీట్లో సుదీప్ మాట్లాడుతూ 'ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఒక చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నా. హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరీ సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందిస్తారో చూడాలి. చదవండి: కిచ్చా సుదీప్ 3డీ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే ? Kannada Actor @KicchaSudeep said ,"correct it,Hindi is no more the National Language, its no more a National language"! In a film launch & a huge applause from the crowd & the media. Hope the efforts of Kannada activists are reaching the intended places.👏👏#stophindilmposition pic.twitter.com/qpj06HJseG — ರವಿ-Ravi ಆಲದಮರ (@AaladaMara) April 23, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1531341776.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చాన్స్ లేదు.. వచ్చినా బోల్తా పడ్డాయి.. చిన్న సినిమాలకు విచిత్ర పరిస్థితి!
గత రెండేళ్లు కరోనా కారణంగా థియేటర్స్ సరిగ్గా తెరుచుకోలేదు.దాంతో చిన్న సినిమాలకు విడుదలకు పెద్దగా దారి దొరకలేదు. థర్డ్ వేవ్ తర్వాత ఇండియాలో థియేటర్స్ పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనూ రెండేళ్ల క్రితం పరిస్థితులు మల్లీ కనిపించాయి. అందుకు తగ్గట్లే పెండింగ్ లో ఉన్న బిగ్ మూవీస్, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రిలీజ్ కు లైన్ క్లియర్ చేసుకున్నాయి. ఇప్పటికే చాలా వరకు సినిమా థియేటర్లకు వచ్చాయి. కొన్ని బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరికొన్ని డిజప్పాయింట్ చేశాయి. త్వరలో ఆచార్య , సర్కారు వారి పాట, ఎఫ్ 3 రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అయితే పూర్తిగా తెరుచుకున్న థియేటర్స్,కేవలం బిగ్ మూవీస్, పాన్ ఇండియా సినిమాలకు ఉపయోగపతున్నాయే తప్ప..చిన్న సినిమాలకు మాత్రం దారి దొరకడం లేదు.మొన్నటి వరకు టాలీవుడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో తెలుగులో చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకలేదు.దాంతో కేజీయఫ్ 2 రిలీజైన తర్వాతి వారం థియేటర్స్ రావాలని గంపెడు ఆశలు పెట్టుకున్నాయ్ చాలా చిన్న చిత్రాలు. వీటిల్లో జయమ్మ పంచాయితీ, అశోకవనంలో అర్జున కళ్యాణం, కృష్ణవృందా విహారి సినిమాలు ఉన్నాయి. (చదవండి: నేషనల్ క్రష్‌కి క్రేజీ ప్రాజెక్ట్.. మరో పాన్ ఇండియా చిత్రంలో రష్మిక!) కాని కేజీయఫ్ 2 కలెక్షన్ల జాతర భీకరంగా కంటిన్యూ అవుతోంది.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 750 కోట్లు దాటిపోయింది.టాలీవుడ్ లోనూ ఆ ఇంపాక్ట్ నెక్ట్స్ లెవల్లో ఉంది.అందుకే చిన్న చిత్రాలు రాకీభాయ్ కు ఎదురెల్లే సాహసం చేయలేక వాయిదా వేసుకుంటున్నాయి. కొన్ని చిత్రాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పేలలేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బిగ్ హీరోస్ మాత్రమే బాక్సాఫీస్ ను రూల్ చేస్తూ వస్తున్నారు. ఒక్క డీజే టిల్లు మాత్రమే స్మాల్ మూవీతో బిగ్ కలెక్షన్స్ రాబట్టాడు. సూపర్ మచ్చి, హీరో, గుడ్ లఖ్ సఖి, సెబాస్ఠియన్, ఆడవాళ్లకు మీకు జోహార్లు, స్టాండప్ రాహుల్, మిషన్ ఇంపాజిబుల్, గని లాంటి చిత్రాలు మినిమం వసూళ్లు లేక డీలా పడ్డాయి. పాన్ ఇండియా సినిమాల మధ్య విడుదలై, ప్రేక్షకులను మెప్పించలేక డీలా పడ్డాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కేజీఎఫ్ 2 సినిమా అద్భుతమంటూ బన్నీ ప్రశంసలు
ఒక్క బాలీవుడ్లోనే కాదు దేశమంతటా ఇప్పుడు సౌత్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. బాహుబలి (1, 2), కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు కేజీఎఫ్ 2 ఇవన్నీ ప్రపంచ రికార్డులు బద్ధలు కొట్టుకుంటూ విశేషాదరణ పొందినవే. మరీ ముఖ్యంగా ఏప్రిల్ 14న రిలీజైన కేజీఎఫ్ 2 వసూళ్ల ఊచకోత ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఎక్కడైనా సరే రికార్డులను తొక్కుకుంటూ పోవాలే అన్న పంథాలో బాక్సాఫీస్ దగ్గర పరుగులు పెడుతోందీ చిత్రం. తాజాగా కేజీఎఫ్ 2 సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించాడు. భారీ విజయాన్ని అందుకున్న కేజీఎఫ్ 2 యూనిట్‌కు కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. 'కేజీఎఫ్ 2 చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు. యశ్ గారు మీ నటన అద్భుతం, అమోఘం. సంజయ్ దత్, రవీనా టండన్, శ్రీనిధి శెట్టి తదితర నటీనటులందరూ బాగా నటించారు. రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో లెవల్లో ఉంది. భువనగౌడ ఎక్సలెంట్ విజువల్స్ అందించారు. సాంకేతిక నిపుణుల అపార కృషికి నా గౌరవాభినందనలు' అని ట్వీట్లో పేర్కొన్నాడు. మరో ట్వీట్లో 'ప్రశాంత్ నీల్ అద్భుతమైన సినిమా అందించారు. మీరు ఏదైతే కలగన్నారో దాన్ని నిజం చేసి చూపించారు. ఇంత మంచి అనుభవాన్నిచ్చినందుకు, భారతీయ సినిమా ఖ్యాతిని పెంపొందించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని రాసుకొచ్చాడు బన్నీ. A spectacular show by @prashanth_neel garu. My respect to his vision and conviction. Thank you all for a cinematic experience & keeping the Indian cinema flag flying high. #KGF2 — Allu Arjun (@alluarjun) April 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1711356039.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: యశ్ నుంచి ప్రశాంత్ నీల్ దాకా.. కేజీఎఫ్ 2 నటీనటుల పారితోషికం ఎంతంటే? ఇకపై తాను సింగిల్ కాదు కమిటెడ్ అంటోన్న బుల్లితెర నటి -
‘పుష్పరాజ్’ పై బాలీవుడ్ నటి ప్రశంసలు..విషయం ఏమిటంటే
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అల్లు అర్జున్‌పై తన అభిమానాన్ని చాటుకుంది. ఇటీవల పలు భాషల్లో విడుదలైన కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న కేజీఎఫ్-2 మూవీపై బన్నీ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన రవీనా ‘‘ థ్యాంక్యూ. అల్లు అర్జున్.. నేను మీకు పెద్ద ఫ్యాన్‌ను..పుష్ప సినిమాలో నచ్చారు. మరిన్ని బ్లాక్ బస్టర్స్ రావాలి’’ అంటూ విష్ చేశారు. దీంతో ఇప్పటికే పుష్ప మూవీ ప్రభంజనాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్న బన్నీ ఫ్యాన్స్ మరింత మురిసిపోతున్నారు. కేజీఎఫ్-2 ఘన విజయంపై స్పందించిన బన్నీ కేజీఎఫ్-2 టీమ్ మొత్తానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్యంగా ఈ మూవీ హీరో యశ్, బాలీవుడ్ నటుడు, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి తదితర నటీనటులను ప్రసంశించారు. అంతేకాదు అద్భుతం అంటూ మ్యూజిక్ డైరెక్టర్ రవితోపాటు, ఇతర టెక్నీషియన్స్ అందర్నీ అభినందిస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అలాగే అద్భుతమైన సినిమాను అందించారు అంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపారు బన్నీ. కాగా ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేజీఎఫ్ చాప్టర్-2 రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్న తొలి కన్నడ చిత్రంగా ఘనతను చాటుకుటున్న సంగతి తెలిసిందే. Thank you @alluarjun 😊😊🙏🏻🙏🏻💛 am a huge fan ! Loved you in #pushpa and many more to come! https://t.co/1zqpc4puVD — Raveena Tandon (@TandonRaveena) April 22, 2022 -
కేజీఎఫ్ 2కు కోట్లల్లో కలెక్షన్లు, రెమ్యునరేషన్ కూడా కోట్లల్లోనే!
'వయలెన్స్.. వయలెన్స్.. వయలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్.. బట్ వయలెన్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్..' కేజీఎఫ్ 2లోని పాపులార్ డైలాగ్ ఇది. రీల్ లైఫ్‌లోని డైలాగ్ రియల్ లైఫ్‌లోకి వచ్చేసరికి ఇదిగో ఇలా మారిపోయింది.. 'రికార్డ్స్, రికార్డ్స్, రికార్డ్స్.. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్. బట్ రికార్డ్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్' అనేలా తయారైంది పరిస్థితి. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటించిన కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఒక్క హిందీలోనే ఇప్పటివరకు రూ.268 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.720 కోట్లకు పైగా రాబట్టింది. ఈ క్రమంలో కేజీఎఫ్ 2లో నటించిన తారలకు ఎంతమేర పారితోషికం ముట్టజెప్పారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ప్రకారం రాఖీభాయ్ యశ్ ఈ సినిమాకు రూ.25 - 30 కోట్ల మేర పారితోషికం తీసుకున్నాడట. అధీరాగా నటించిన సంజయ్ దత్ రూ.10 కోట్లు, రవీనా టండన్ రూ.2 కోట్లు, శ్రీనిధి శెట్టి రూ.3-4 కోట్లు, ప్రకాశ్ రాజ్ రూ.80-85 లక్షల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కళాఖండాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ రూ.15-20 కోట్ల దాకా అందుకున్నాడట! చదవండి: అది చూసి అవకాశం..నమ్మలేకపోయా: కేజీఎఫ్-2 ఎడిటర్ హీరోతో డేటింగ్, కామెంట్ డిలీట్ చేసిన బిగ్‌బీ మనవరాలు -
అది చూసి అవకాశం..నమ్మలేకపోయా: కేజీఎఫ్-2 ఎడిటర్
‘పేరుకు తగ్గట్టే అతను చురుకైనవాడు.. పేరుకు తగ్గట్టే అతని భవిష్యత్తు ఉంటుంది’... ‘కేజీఎఫ్ 2’ చూశాక ‘ఉజ్వల్’ గురించి చాలామంది అన్న మాటలివి. ‘కేజీఎఫ్ 2’ విడుదల తర్వాత ఉజ్వల్ ఓ హాట్ టాపిక్. మరి.. పాన్ ఇండియా సినిమాకి 19ఏళ్ల కుర్రాడు ఎడిటర్ అంటే విశేషమే కదా. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్ 2’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా చూసినవాళ్లు ఉజ్వల్‌కి ‘ఉజ్వల భవిష్యత్తు’ ఉంటుందని ప్రశంసిస్తున్నారు. ఇక ఎడిటర్‌గా ఉజ్వల్‌కి ‘కేజీఎఫ్ 2’ అవకాశం ఎలా వచ్చింది? తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే విషయాలను ‘సాక్షి’కి ఉజ్వల్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుసుకుందాం.. ముందుగా మీ కుటుంబం గురించి? ఉజ్వల్: నార్త్ కర్నాటకలోని గుల్బర్గాలో పుట్టి, పెరిగాను. మా నాన్న గోవింద్రాజ్ కులకర్ణి ఎల్ఐసీ ఆఫీసర్. అమ్మ రమ హౌస్‌వైఫ్. అక్క అనుశ్రీ ఎల్జీలో వర్క్ చేస్తోంది. మరి.. చదువు సంగతి? పీయూసీ ఫస్ట్ ఇయర్లో డ్రాప్ అయ్యాను. ఎడిటర్ కావడానికేనా? యాక్చువల్‌గా క్రికెటర్ కావాలనేది నా కల. మరి.. ఎడిటింగ్ వైపు రావడానికి కారణం? నా కజిన్ వినయ్ యాక్టర్. తన కోసం షూటింగ్, ఎడిటింగ్ చేసేవాణ్ణి. అలా ఎడిటింగ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టాను. నా ఆసక్తి తెలుసుకుని నా ఫ్రెండ్ శశాంక్ ఎడిటింగ్ సైడ్ ప్రోత్సహించాడు. తనే నన్ను బెంగళూరు రమ్మన్నాడు. నాకు బాగా హెల్ప్ చేశాడు. బెంగళూరు వెళ్లాక కొందరు టెక్నీషియన్స్‌ని కలిశాను. కన్నడ సినిమా ‘మఫ్తీ’ ఎడిటర్ హరీష్ కొమ్మె దగ్గర రెండు నెలలు పనిచేశాను. సో.. ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ లేదన్నమాట? లేదు.. మరి... ‘కేజీఎఫ్ 2’కి అవకాశం ఎలా వచ్చింది? యశ్ సార్, ప్రశాంత్ సార్‌కి నేను పెద్ద అభిమానిని. అలాగే ‘కేజీఎఫ్’కి కూడా. దాంతో ‘కేజీఎఫ్’ సినిమా విజువల్స్‌ని ఎడిట్ చేశాను. లక్కీగా ప్రశాంత్ సార్ ఆ విజువల్స్ చూశారు. ఆయనకు నచ్చాయి. ఆ తర్వాత నన్ను ఇంటర్వ్యూకి రమ్మన్నారు.. వెళ్లాను. ‘కేజీఎఫ్ 2’కి ఎడిటర్‌గా అవకాశం ఇచ్చారు. పాన్ ఇండియా సినిమా.. పెద్ద బడ్జెట్ కాబట్టి ఈ సినిమాకి పని చేస్తున్నప్పుడు టెన్షన్ పడిన రోజులేమైనా? అలాంటి రోజలు లేవు. నిజానికి అవన్నీ గోల్డెన్ డేస్ అనాలి. ఎందుకంటే నా లైఫ్‌లో నాకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చిన రోజులవి. ఇంత పెద్ద సినిమాకి అవకాశం వచ్చినప్పుడు మీ అమ్మానాన్న ఏమన్నారు? ఈ అవకాశం రాక ముందు మా అమ్మానాన్న బాగా టెన్షన్ పడేవారు. ఎందుకంటే నేనేమీ చేసేవాణ్ణి కాదు. అందుకే ‘కేజీఎఫ్’ ఆఫర్ గురించి చెప్పగానే వాళ్లు చాలా ఆనందపడ్డారు. ఇవాళ నేను ఏం సాధించినా అది నా పేరెంట్స్‌కే దక్కుతుంది. నేను ఇంత దూరం రావడానికి కారణం వాళ్లే. నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. ‘కేజీఎఫ్ 2’లో యంగెస్ట్ టెక్నీయన్గా యశ్, ప్రశాంత్‌ల నుంచి ఎలాంటి సపోర్ట్ లభించింది? ఆ ఇద్దరితో కలిసి పని చేస్తున్నానని నమ్మలేకపోయాను. వాళ్లిద్దరూ నా ముందు కూర్చుంటే నేను వాళ్ల కోసం పని చేయడం అనే ఆ ఫీల్‌ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ‘ఇంత చిన్న వయసులో ఎడిటింగ్ నేర్చుకున్నావా?’ అని యశ్ సార్ అడిగి, చాలా ఎంకరేజ్ చేశారు. ప్రశాంత్ సార్ ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేస్తారు. ఆయన కథ చెప్పే విధానాన్ని, ఆయన ఆలోచనలను అర్థం చేసుకుంటే నా పని సులువు అవుతుంది. అలాగే చేశాను. ఒకవైపు షూట్ చేయడం.. మరోవైపు ఎడిట్ చేయడం రెండూ జరిగేవి. ఈ సినిమాకి దాదాపు రెండున్నరేళ్లు పట్టింది. ‘కేజీఎఫ్ 2’కి ఎడిటింగ్ పరంగా కష్టం అనిపించిన సన్నివేశాల గురించి... ‘ఇంటర్ కట్స్’ విషయంలో కాస్త కష్టం అనిపించింది. అంతకుముందు వాటి గురించి నాకు అవగాహన లేదు. ప్రస్తుతం ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి ఎడిటర్‌గా చేయమని అడిగారా? ‘సలార్’కి వర్క్ చేయమని ప్రశాంత్ సార్ అన్నారు. అయితే నేను ఈ సినిమాకి సోలో ఎడిటర్‌గా చేస్తానా? అనే విషయం గురించి ఇప్పుడు నాకు తెలియదు. టెక్నికల్‌గా అప్డేట్ కావడా నికి ఇక్కడి సినిమాలు, వెబ్ సిరీ స్లతో పాటు విదేశీ చిత్రాలు కూడా చూస్తుంటారా? చూస్తాను. నాకు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ అంటే చాలా ఇష్టం. ఆయనకు పెద్ద అభిమానిని. ఇక టీవీ సిరీస్‌లో ‘నార్కోస్’, ‘పీకీ బ్లైండర్స్’ బాగా నచ్చాయి. ముఖ్యంగా ‘పీకీ బ్లైండర్స్’ చాలా చాలా ఇష్టం. ఎడిటర్‌గా కంటిన్యూ కావడానికి చదువుకి ఫుల్స్టాప్ పెట్టేశారా? భవిష్యత్ ప్రణాళికలు? ప్రస్తుతానికి అయితే నేను చదువు మీద దృష్టి పెట్టడంలేదు. కెరీర్ ఎలా వెళితే అలా ఫాలో అయిపోతాను. సినిమాల్లోనే ఉండాలనుకుంటున్నాను. మీరు కెమెరా వ్యూ చూస్తున్న ఫొటో ఉంది... ఫొటోగ్రఫీ నేర్చుకుంటున్నారా? లేదు. కానీ సినిమాకి సంబంధించిన ప్రతిదీ నేర్చుకోవాలనుకుంటున్నాను. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'కేజీయఫ్-2' విజయంపై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hero Yash Thanks To Fans: 'కేజీయఫ్-2' విజయంపై రాకింగ్ స్టార్ యశ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తమ చిత్రం పై ప్రేక్షకులు, అభిమానులు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పంచుకున్నాడు. ఇక యష్ మాట్లాడుతూ.. ''ఓ గ్రామానికి ఒకానొక సమయంలో తీవ్ర కరవు వచ్చింది. అప్పుడు ఆ గ్రామస్థులంతా దేవుడిని ప్రార్థించేందుకు ఓ చోటకు చేరారు. అయితే అందులో ఓ అబ్బాయి మాత్రం అక్కడికి ఓ గొడుగుతో వెళ్లాడు. దాంతో అక్కడున్న వారంతా ఆ అబ్బాయి చేసిన పనికి నవ్వుకున్నారు. అందులో కొందరు అతడిది మూర్ఖత్వమని, మరికొందరు అతివిశ్వాసమని అనుకున్నారు. కానీ అది ఆ అబ్బాయి నమ్మకం, విశ్వాసం మాత్రమే. అలా అప్పుడు ఆ అబ్బాయి ఏ నమ్మకంతో అయితే ఉన్నాడో 'కేజీయఫ్' చిత్రం విషయంలో నేనూ అలానే ఉన్నాను. మొత్తానికి నా నమ్మకాన్ని నిలబెట్టిన మీకు నా తరఫున, చిత్ర బృందం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. మాపై మీరు చూపిన ఆదరాభిమానాలకు 'థ్యాంక్స్' అనే పదం సరిపోదు. ఓ గొప్ప సినిమాను మీ అందరికీ ఇవ్వాలనుకున్నాం. అనుకున్నట్టుగానే మేము 'కేజీయఫ్'ను మీకు అందించాం. దానికి తగ్గట్టుగానే మీరు ఎంజాయ్ చేశారు. ఇంకా చేస్తారని ఆశిస్తున్నాను'' అంటూ యశ్ పేర్కొన్నాడు. ఇక చివరిలో చిత్రంలోని 'యువర్ హార్ట్ ఈజ్ మై టెరిటరీ' అనే డైలాగ్ చెప్పి వీడియోను ముగించాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీయఫ్-2' చిత్రం ఏప్రిల్ 14న విడుదలై వసూళ్ల రికార్డులు సృష్టిస్తోంది. ఇక విదేశాల్లోనూ 'కేజీయఫ్' హవా కొనసాగుతోంది. యశ్ స్టైలిష్ నటన, ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు పలువురు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. రవి బస్రూర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. -
లేడీ డైరెక్టర్‌తో మూవీ అనౌన్స్ చేసిన 'కేజీఎఫ్' నిర్మాతలు
ఇండస్ట్రీలో అతికొద్ది మందే లేడీ డైరెక్టర్స్ ఉన్నారు. వారిలో వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుధా కొంగర కూడా ఒకరు. స్టార్ హీరో సూర్యతో తమిళంలో ఆమె చేసిన 'సురారైపోట్రు' తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సూర్యతో పాటు సుధా కొంగరకి కూడా మంచి పేరొచ్చింది. ఇప్పుడీ లేడీ డైరెక్టర్‌కు క్రేజీ ఆఫర్ దక్కింది. కేజీఎఫ్, కేజీఎఫ్-2 లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ తమ కొత్త సినిమాని సుధా కొంగరతో చేస్తున్నట్టుగా అఫీషియల్‌గా ప్రకటించారు. ఈసారి కూడా వాస్తవ సంఘటనల ఆధారంగానే ఆమె కథను సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో హీరో ఎవరన్నది మాత్రం చెప్పలేదు. కానీ సూర్యనే ఈ ప్రాజెక్టులో నటించనున్నట్లు కోలీవుడ్ టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 𝐒𝐨𝐦𝐞 𝐭𝐫𝐮𝐞 𝐬𝐭𝐨𝐫𝐢𝐞𝐬 𝐝𝐞𝐬𝐞𝐫𝐯𝐞 𝐭𝐨 𝐛𝐞 𝐭𝐨𝐥𝐝, 𝐚𝐧𝐝 𝐭𝐨𝐥𝐝 𝐫𝐢𝐠𝐡𝐭. To a new beginning with a riveting story @Sudha_Kongara, based on true events.@VKiragandur @hombalefilms @HombaleGroup pic.twitter.com/mFwiGOEZ0K — Hombale Films (@hombalefilms) April 21, 2022 -
ఆ హీరోయిన్‌తో నటించాలనుంది : యశ్
కేజీయఫ్ 2తో రాకీ భాయ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్నాడు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు ఏ చిత్ర పరిశ్రమలో అయినా 'కేజీఎఫ్ 2' గురించే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేజీఎఫ్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యశ్‌తో సినిమాలు చేసేందుకు డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం కేజీఎఫ్-2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న యశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన ఫేవరెట్ హీరోయిన్ దీపికా పదుకొణె అని, ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. అంతేకాకుండా దీపిక నటన ఎంతో బావుంటుందని, ఆమె సినిమాలను చూస్తూ ఉంటానని యశ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కేజీఎఫ్ 2లో రాఖీభాయ్ తల్లిగా నటించిన అర్చనకు ఘన సన్మానం
సాక్షి, కోలారు (కర్ణాటక): కేజీఎఫ్ సినిమాలో నటించిన కోలారుకు చెందిన నటి అర్చనా జోయిస్ను బుధవారం నగరంలోని సపలమ్మ దేవాలయ సమితి ఘనంగా సన్మానించింది. నగరసభ సభ్యుడు మురళీగౌడ మాట్లాడుతూ అర్చనా జోయిస్ తన నటన ద్వారా జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో కార్తీక్, సత్యనారాయణ, నవీన్‌బాబు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న రిలీజైన కేజీఎఫ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తోంది. 6 రోజుల్లో రూ. 645 కోట్లను వసూళ్లు చేసి కలెక్షన్ల సునామీ సృష్టించింది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రాఖీభాయ్ యశ్ కథానాయకుడిగా సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. చదవండి: 'కేజీఎఫ్ 2' మేనియా.. పెళ్లి శుభలేఖపై 'వయలెన్స్' డైలాగ్ రాకీభాయ్ ఊచకోత.. ‘కేజీయఫ్ 2’ కలెక్షన్స్ ఎంతంటే.. -
కేజీఎఫ్–2 చూస్తూ రచ్చ రచ్చ... థియేటర్లో కాల్పులు
యశ్వంతపుర (కర్ణాటక): తెరపై కేజీఎఫ్2 నడుస్తోంది. హీరో, విలన్ల మధ్య భారీ కాల్పులు, పోరాట దృశ్యాలు చూస్తూ ప్రేక్షకులు మైమరచిపోయారు. కానీ అవే కాల్పులు ఉన్నట్టుండి థియేటర్లోనే తమ కళ్ల ముందే జరగడంతో అంతా భయంతో పరుగులు తీశారు. కర్ణాటకలో హావేరి జిల్లా శిగ్గావి పట్టణంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. సెకండ్ షో చూస్తుండగా వసంతకుమార అనే ప్రేక్షకుని కాలు ముందు కుర్చీలో కూర్చున్న వ్యక్తికి తగిలింది. దాంతో గొడవ పడ్డారు. అతను బయటకు వెళ్లి పిస్టల్‌తో తిరిగొచ్చి ఏకంగా మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. రెండు తూటాలు వసంత కాలు, కడుపులోకి దూసుకెళ్లాయి. దుండగుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కేజీఎఫ్ 2 ఎఫెక్ట్: వెడ్డింగ్ కార్డుపై 'వయలెన్స్' డైలాగ్.. వైరల్
Yash KGF 2 Movie Popular Violence Dialogue On Wedding Card: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో 'కేజీఎఫ్ 2' మేనియా కనిపిస్తోంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు ఏ చిత్ర పరిశ్రమలో అయినా 'కేజీఎఫ్ 2' గురించే టాక్. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు, యశ్ యాక్టింగ్, యాక్షన్‌కు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో యశ్ చెప్పిన డైలాగ్‌లో పత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ విడుదలైనప్పటినుంచే యశ్ డైలాగ్‌లకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇందులోని 'వయలెన్స్.. వయలెన్స్.. వయలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్' ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ డైలాగ్‌తో అనేక మీమ్స్, రీల్స్ వచ్చి ఎంతో అలరించాయి. అయితే తాజాగా ఈ డైలాగ్ తరహాలో తన మ్యారేజ్ గురించి వెడ్డింగ్ కార్డ్‌పై డైలాగ్ ప్రింట్ చేయించడం వైరల్ అవుతోంది. కర్ణాటకలోని బెళగావికి చెందిన చంద్రశేఖర్ తన పెళ్లి శుభలేఖపై 'మ్యారేజ్.. మ్యారేజ్.. మ్యారేజ్.. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ అవైడ్. బట్, మై రిలేటివ్స్ లైక్ మ్యారేజ్. ఐ కాంట్ అవైడ్.' అని ముద్రించాడు. దీంతో ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది రాకీ భాయ్ క్రేజ్ అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అలాగే మరోపక్క బాక్సాఫీస్ వద్ద 'కేజీఎఫ్ 2' వైలెన్స్ బీభత్సంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 6 రోజుల్లో రూ. 645 కోట్లను వసూలు చేసి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చదవండి: కేజీఎఫ్ 2 ఎఫెక్ట్: బాలీవుడ్‌పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. చదవండి: రాకీభాయ్ ఊచకోత.. ‘కేజీయఫ్ 2’ కలెక్షన్స్ ఎంతంటే.. -
రాకీభాయ్ ఊచకోత.. 6 రోజుల్లో ‘కేజీయఫ్ 2’ కలెక్షన్స్ ఎంతంటే
కేజీయఫ్ 2తో రాకీ భాయ్ ఇండియన్ బాక్సాఫీస్ ను ఊచకోత కోస్తున్నాడు. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి, అంతే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 6 రోజుల్లో రూ. 645 కోట్లను వసూళ్లు చేసి రికార్డును సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్లో సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. అక్కడ ఈ మూవీ ఆరు రోజుల్లో రూ. 238.70 కోట్లను రాబట్టింది. మంగళవారం ఒక్క రోజే 19.14 కోట్లను వసూలు చేయడం విశేషం. టాలీవుడ్లో తొలిరోజు రూ.19.5 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం.. 6 రోజుల్లో రూ.62.71 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు రజనీకాంత్ ‘రోబో’ పేరిట ఉండేది. తెలుగు రాష్ట్రాల్లో 'కేజీయఫ్ 2' చిత్రానికి రూ. 74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 75 కోట్ల వరకు షేర్‌ను రాబట్టాల్సి ఉంది. కేజీయఫ్ 2 కలెక్షన్ల జాతర ఇలాగే కొనసాగితే మాత్రం .. మరో రెండు, మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. ఓవర్సీస్లోనూ రాకీభాయ్ హవా కొనసాగుతుంది. యూఎస్‌లో కేజీయఫ్ చాప్టర్ 2 సినిమాకు భారీ స్పందన లభిస్తోంది. అక్కడ ఈ చిత్రం ఏకంగా ఐదు రోజుల్లో 5 మిలియన్ డాలర్లను రాబట్టింది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్, హీరోయిన్గా శ్రీనిధి నటించారు. రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. #KGF2 is SUPER-STRONG on Day 6... Will cross ₹ 250 cr mark today [Wed, Day 7]... AGAIN, THE FASTEST TO HIT ₹ 250 CR... Thu 53.95 cr, Fri 46.79 cr, Sat 42.90 cr, Sun 50.35 cr, Mon 25.57 cr, Tue 19.14 cr. Total: ₹ 238.70 cr. #India biz. #Hindi Version. pic.twitter.com/zSXLjNcsnU — taran adarsh (@taran_adarsh) April 20, 2022 -
అందుకే దక్షిణాది సినిమాలు హిట్ అవుతున్నాయి: బాలీవుడ్ నటి
Raveena Tandon Compares Bollywood And South India Movies: బాలీవుడ్ ఇండస్ట్రీపై నటి రవీనా టండన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2లో ఆమె కీ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటనకు, పాత్రకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఇక మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో రవీనా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకున్నారు. అయితే ప్రస్తుతం దక్షిణాది సినిమాలు ఉత్తరాదిలోనూ అత్యంత ఆదరణ పొందుతున్నాయి. అక్కడ మన సౌత్ సినిమాల రేంజ్ వంద కోట్ల బడ్జెట్‌కు చేరింది. చదవండి: OTT: దక్షిణాది భాషల్లోకి ‘ది కశ్మీర్ ఫైల్స్’, స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే అంతేకాదు మన సినిమాలను సైతం బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్, బాలీవుడ్ ఇండస్ట్రీల మధ్య తేడా గురించి తాజాగా రవీనా ప్రస్తావించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. దక్షిణాది చిత్రాలు ఇండియన్ కల్చర్‌కు దగ్గరగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే.. బాలీవుడ్ సినిమాలు మాత్రం హాలీవుడ్‌ను ఫాలో అవుతూ మాస్ ఆడియన్స్‌కు దూరమవుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ‘90లలో పాశ్చాత్య దేశాల సంస్కృతికి దగ్గరగా ఉండేలా మెలోడియస్, మ్యూజికల్ చిత్రాలు వచ్చాయి. అవి హాలీవుడ్ సినిమాలకు దగ్గరగా ఉండేవి. దీంతో బాలీవుడ్ సినిమాల్లో ఇండియన్ కల్చర్ తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో నేను కొన్ని దక్షిణాది చిత్రాల్లో నటించాను. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్! అక్కడ వాళ్లు మన సంస్కృతి, సంప్రదాయాలకు దగ్గరగా ఉండే సినిమాలు తీశారు. దీంతో ప్రేక్షకులు వాటిలో తమను తాము చూసుకుంటూ మన సంస్కృతికి దగ్గరయ్యారు. అలా ఆ సినిమాలని ప్రేక్షకులు సూపర్‌హిట్ చేశారు. ఈ క్రమంలో బాలీవుడ్లో అలాంటి చిత్రాలు తగ్గడంతో మాస్ ఆడియన్స్ హిందీ సినిమాలకు దూరమయ్యారు’ అని రవీనా టండన్ చెప్పుకొచ్చారు. కాగా ఏప్రీల్ 14న విడుదలైన ‘కేజీఎఫ్: చాప్టర్-2’ దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో సునామీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ మూవీ 625 కోట్ల రూపాయలను వసూలు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఒక్క 5వ రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.73.29 కోట్లను వసూళ్లు చేయడం గమనార్హం. -
కేజీయఫ్ 2 కలెక్షన్ల సునామీ.. ఐదు రోజుల్లో ఎంతంటే..
రాకీ భాయ్ తీసుకొచ్చిన కేజీయఫ్ 2 తుపాన్‌కు ఇండియన్ బాక్సాఫీస్ పీస్ పీస్ అవుతోంది. భారతీయ చరిత్రలోనే ఏ సినిమా కొల్లగొట్టని వసూళ్లను రాకీ భాయ్ కొట్లగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఐదు రోజుల్లో 625 కోట్ల రూపాయలను వసూలు.. సరికొత్త రికార్డును సృష్టించింది. ఒక్క ఐదో రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.73.29 కోట్లను వసూళ్లు చేయడం గమనార్హం. #KGFChapter2 WW Box Office ENTERS ₹600 club in just 5 days. Day 1 - ₹ 165.37 cr Day 2 - ₹ 139.25 cr Day 3 - ₹ 115.08 cr Day 4 - ₹ 132.13 cr Day 5 - ₹ 73.29 cr Total - ₹ 625.12 cr Becomes the 9th HIGHEST grossing movie of all time. [Indian Films] #Yash #KGF2 — Manobala Vijayabalan (@ManobalaV) April 19, 2022 పేరుకు కన్నడ సినిమానే అయినా.. హిందీ ఇండస్ట్రీలోనూ రికార్డులన్నింటిని బద్దలు కొడుతోంది కేజీయఫ్2. అక్కడ అత్యంత వేగంగా 100 కోట్లు, అంతకంటే వేగంగా ఐదు రోజుల్లోనే రూ.219.6 కోట్లను రాబట్టి సౌత్ సినిమాల సత్తా ఏంటో నిరూపించింది. కేజీయఫ్ 2 స్పీడ్ ఇదే విధంగా కొనసాగితే మాత్రం.. బాహుబలి2 రికార్డు(రూ.500 కోట్ల వసూళ్లు)ను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్లో తొలిరోజు రూ.19.5 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లో రూ.58.6 కోట్లను రాబట్టింది. ఐదు రోజుల్లోనే ఓ డబ్బింగ్ మూవీ టాలీవుడ్లో రూ.58 కోట్ల షేర్ రాబట్టడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు రజనీకాంత్ ‘రోబో’పేరిట ఉండేది. టాలీవుడ్లో ఈ మూవీకి రూ. 74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 75 కోట్ల వరకు షేర్‌ను రాబట్టాల్సి ఉంది. కేజీయఫ్ 2 కలెక్షన్ల జాతర ఇలాగే కొనసాగితే మాత్రం కేజీయఫ్ 2 ఆర్ ఆర్ ఆర్ వెయ్యి కోట్ల రికార్డ్ ను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. #KGF2 is UNSTOPPABLE... SUPERB HOLD on a working day [Mon]... Eyes ₹ 270 cr [+/-] in *extended Week 1*... Should cross #Dangal *lifetime biz*, if it maintains the pace... Thu 53.95 cr, Fri 46.79 cr, Sat 42.90 cr, Sun 50.35 cr, Mon 25.57 cr. Total: ₹ 219.56 cr. #India biz. pic.twitter.com/MFUVWTXTJB — taran adarsh (@taran_adarsh) April 19, 2022 -
రూ. మూడు వందలతో బెంగళూరు వచ్చా: యష్
కన్నడ స్టార్ హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన 'కేజీఎఫ్ 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. యష్ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కన్నడ ఇండస్ట్రీలో ఈ స్థాయికి ఎదగడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు. ప్రస్తుతం తాను ఇంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ, ఒకప్పుడు సాధారణ జీవితం గడిపాడు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. తన కెరీర్ మొదటిలో పడ్డ ఇబ్బందుల గురించి యశ్ ఇటీవల పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. సినీ అవకాశాల కోసం తాను కేవలం మూడు వందల రూపాయలతో బెంగళూరులో అడుగుపెట్టాననే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో పుట్టిన యశ్ ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. తండ్రి బస్ డ్రైవర్, తల్లి గృహిణి. కాగా యశ్ సినిమాల్లోకి వెల్లేందుకు వారి కుటుంబం అంగీకరించలేదు. కానీ వారు యష్ కోసం సినిమాల్లో ప్రయత్నించేందుకు తనకు కొంత సమయం మాత్రం ఇచ్చారు. ఆ సమయంలోపు అవకాశాలు దక్కించుకుంటే సరి. లేదంటే తాము చెప్పిన పనిలో చేరాలని సూచించారు. దీనికి అంగీకరించిన యశ్ తన తండ్రి నుంచి తీసుకున్న మూడు వందల రూపాయలతో బెంగళూరు చేరుకున్నాడు. ఈ విషయం గురించి యశ్ మాట్లాడుతూ.. మూడు వందల రూపాయలతో బెంగళూరు చేరుకున్న నేను మొదట సీరియల్స్‌లో అవకాశం దక్కించుకున్నాను. తర్వాత మెల్లిగా సినిమాల్లోకి అడుగుపెట్టా అని చెప్పుకొచ్చాడు. అలా యశ్ సీరియల్స్‌లో నటిస్తున్నప్పుడే తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత కన్నడ చిత్రాలలో చిన్న చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేశాడు. చివరకు 2008లో 'రాకీ' చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత వచ్చిన వరుస హిట్లతో యశ్ కన్నడనాట స్టార్ హీరోగా ఎదిగాడు. 'కేజీఎఫ్'తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఇక ఇటీవలే విడుదలైన 'కేజీఎఫ్-2'తో బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా పాన్ ఇండియా స్టార్‌గా యష్ అవతరించాడు. -
‘కేజీఎఫ్ 2’ మూవీపై స్పందించిన సూపర్ స్టార్ రజనీకాంత్
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన 'కేజీఎఫ్ 2' మేనియా కనిపిస్తోంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు ఏ చిత్ర పరిశ్రమలో అయినా 'కేజీఎఫ్ 2' గురించే టాక్. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు, యశ్ యాక్టింగ్, యాక్షన్‌కు ఫిదా అవుతున్నారు. అన్ని భాషల్లో ఈ చిత్రం కోట్ల రూపాయలు కొల్లగొడుతోందీ. చదవండి: ఆ సీన్ చూసి కృష్ణ ఫ్యాన్స్ నన్ను కొట్టడానికి వచ్చారు: మురళీ మోహన్ ఇక కేజీఎఫ్ 2 చూసిన బాలీవుడ్, టాలీవుడ్ సినీ సెలబ్రెటీలు, ప్రముఖులు ప్రశాంత్ నీల్, యశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేజీఎఫ్ 2తో భారత చలన చిత్ర పరిశ్రమకు మరో అఖండ విజయం లభించిందంటూ కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ చూసిన కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్పందనను తెలిపారట. ఈ మూవీతో భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిచారంటూ కేజీఎఫ్ టీంను స్పెషల్‌గా ఆయన అభినందించారని విశ్లేషకుడు మనోబాల ట్వీట్ చేశాడు. రజనీ స్యయంగా కేజీఎఫ్ నిర్మాతకు ఫోన్ చేసి మూవీ బాగుందని ప్రశంసించినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. చదవండి: బిడ్డను వదిలేసి వచ్చిందని ట్రోల్స్, స్పందించిన కమెడియన్ కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ మూవీ వీకెండ్లో భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా నిలిచింది. కామ్‌స్కోర్ నివేదిక ప్రకారం గ్లోబల్ బాక్సాఫీస్‌లో ఏప్రిల్ 15 నుంచి 17 మధ్య అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ప్రపంచంలోనే కేజీఎఫ్ రెండవ స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే మూడు రోజుల్లోనే రూ.400 కోట్ల మార్క్‌ను దాటేసిన ఈ మూవీ తాజాగా రూ.500 కోట్ల క్లబ్బులో చేరింది. ఇప్పటివరకు ఈ సినిమాకు రూ.552 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. మరి రానున్న రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి! Superstar #Rajinikanth watched #KGFChapter2 and praised the team for delivering a blockbuster movie. — Manobala Vijayabalan (@ManobalaV) April 16, 2022 -
తుఫాన్ సాంగ్ పాడాక రెండు రోజులు రెస్ట్: కేజీఎఫ్ 2 సింగర్
కేజీఎఫ్ చాప్టర్ 1 బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే! కానీ ఈసారి అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది కేజీఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యశ్ తన నటనతో రఫ్ఫాడించాడు. ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ సినిమా రికార్డులను తొక్కుకుంటూ పోతోంది. ఈ మూవీకి సంగీతం ప్రధాన బలం. మరీ ముఖ్యంగా తుఫాన్ సాంగ్‌కు అయితే ప్రేక్షకుడికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ సాంగ్‌ను హిందీలో బ్రిజేష్ శాండిల్య ఆలపించాడు. తాజాగా అతడు ‘సాక్షి’ ప్రతినిధి రేష్మి ఏఆర్‌తో ముచ్చటించాడు. ఆ విశేషాలేంటో చదివేయండి.. కేజీఎఫ్ 2లో మీరు పాడిన తుఫాన్ సాంగ్ సంచలనం సృష్టిస్తోంది, ఎలా ఫీలవుతున్నారు. ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్ చూసి నాతో పాటు కేజీఎఫ్ టీమ్ కూడా చాలా సంతోషంగా ఉంది. వెండితెర మీద ఈ సాంగ్ వస్తున్నప్పుడు ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తారో నేను ఊహించగలను. ఇది ఇంతకుముందు మీరు పాడిన పాటలకు భిన్నంగా ఉంది కదూ! తుఫాన్ ఫుల్ ఎనర్జీతో సాగే పాట. దీన్ని పాడటం అంత ఈజీయేం కాదు. నిజానికి శక్తిమంతంగా ఉండే పాటలను పాడటం అంటే నాకిష్టం. కానీ తుఫాన్ ఊహించినదానికంటే ఎక్కువ ఎనర్జీతో సాగుతుంది. ఈ పాట పాడటం పూర్తి చేశాక రెండు రోజులవరకు నేను నా గొంతుకు విశ్రాంతినిచ్చాను. పాట పాడటానికి ముందు ఎలా ప్రిపేర్ అవుతారు? అది పాడే పాట మీద ఆధారపడి ఉంటుంది. హై పిచ్‌లో పాడే పాటకు ముందునుంచి కొంత ప్రాక్టీస్ చేయాల్సిందే, తప్పదు! కేజీఎఫ్ 2లో పాడే అవకాశం ఎలా వచ్చింది? తుఫాన్ పాట రాసిన షబ్బీర్ అహ్మద్ నాకు మంచి స్నేహితుడు. అతడు నా పేరు సూచించడంతో సాంగ్ కంపోజ్ చేసిన రవి బర్సూర్ ఓసారి నా గొంతును టెస్ట్ చేశాడు. నచ్చడంతో ఫైనల్ చేశాడు. ఇందుకు షబ్బీర్‌కు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను అనుకున్నదానికంటే ఎక్కువ హిట్ అయ్యిందా సాంగ్. రవి బర్సూర్తో కలిసి పని చేసినందుకు ఎలా ఫీలవుతున్నారు? ఆయన చాలా సింపుల్‌గా ఉంటూనే బాధ్యతగా వ్యవహరిస్తాడు. ఇలాంటి వ్యక్తిని నేనింతకు ముందు ఎన్నడూ చూడలేదు. ఊర్లో స్టూడియో పెట్టుకుని అక్కడే పని చేస్తున్నాడు. అతడి గ్రామమైన బర్సూర్‌కు వెళ్లడం మాకు ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. అందరి నోళ్లలో కేజీఎఫ్ నానుతుందంటే దానికి అతడు కూడా ఓ కారకుడే. ప్యాషన్, పట్టుదల ఉంటే ఎక్కడినుంచైనా ఏదైనా చేయవచ్చని ఆయన నిరూపించాడు. అతడికి నా సెల్యూట్. కరోనా వైపరీత్యం కంటే ముందు లైవ్ కన్సర్ట్స్ జరిగేవి. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో లైవ్‌లో పాడుతున్నారు. కన్సర్ట్ పెడితే మునుపటిలా జనాలు వస్తారంటారా? జనాల మధ్యలో మైక్ పట్టుకుని పాడితే ఆ మజానే వేరు. లైటింగ్, బ్యాండ్, స్టేజీ మీద మైక్ పట్టుకుని వారి ఎదురుగా పాడితే ఆ పాట నేరుగా ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. అదే ఆన్లైన్లో పాడితే కంప్యూటర్స్, సెల్‌ఫోన్స్‌లో చూస్తారు. పెద్దగా థ్రిల్ ఉండదు. జనాలు కూడా లైవ్ కన్సర్ట్ల కోసం ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల వల్ల సంగీత కళాకారులకు ఏదైనా లాభం ఉందా? ఒక భాషలోని పాటలు మరో భాషలోని వారికి కొన్నిసార్లు నచ్చుతాయి, మరికొన్నిసార్లు నచ్చవు. ఉదాహరణకు బుట్టబొమ్మ పాటకు అర్థం తెలియకపోయినా ఆ బీట్‌ను చాలామంది ఎంజాయ్ చేస్తారు. అలా పాన్ ఇండియా సినిమాల వల్ల సంగీతకారులకు పని దొరుకుతుంది. సింగర్ల రెమ్యునరేషన్ సంగతేంటి? వారి పనికి తగ్గ పారితోషికం ఇవ్వడం లేదని నా అభిప్రాయం. మీ ఆల్బమ్స్ గురించి చెప్తారా? ఇప్పటివరకు నేను హిందీలో 70 పాటలు పాడాను. అందులో చాలావరకు హిట్టయ్యాయి. త్వరలో నా ఆల్బమ్ నుంచి మరో కొత్త పాట రిలీజ్ కాబోతోంది. తెలుగులో ఏదైనా సాంగ్ పాడుతున్నారా? ఈమధ్యే తెలుగులో ఓ పాట పాడాను. దానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్. గతంలో అతడితో సరైనోడు సినిమాకు కూడా వర్క్ చేశాను. గోల్మాల్ టైటిల్ ట్రాక్ కూడా పాడాను. తెలుగు పాటలంటే ఇష్టమా? ఏ భాషలో అయినా సరే పాడటం అంటే మహా ఇష్టం. తెలుగు పాటను ఒక అరగంటలో పాడేస్తాను. భాష తెలియపోయినా సరే తెలుగు, తమిళ్ సాంగ్స్‌ను అప్పుడప్పుడూ అలా పాడుతూ ఉండేవాడిని. అలాంటిది నేను తెలుగులో ఓ పాట పాడతానని ఎప్పుడూ అనుకోలేదు. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? తనీష్ బగ్చి. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం బాగా నచ్చుతుంది. సౌత్‌లో బెస్ట్ సింగర్? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, యేసుదాస్. సింగర్ కావాలన్నది మీ డ్రీమా? గాయకుడిని కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. రైతు కుటుంబంలో పుట్టిన నేను వ్యవసాయమే చేస్తాననుకున్నాను. ఇప్పటికీ మేము పొలం పండిస్తాము. ఇదంతా పక్కనపెడితే నేను మంచి సింగర్‌ను అవుతానని నా ఫ్రెండ్ చెప్పాడు. అప్పుడే దీనిమీద ఫోకస్ చేశా. అలహాబాద్‌లోని ప్రయాగ్ సంగీత్ సమితిలో సంగీతం నేర్చుకున్నా. అలా మొదలైన నా ప్రయాణం ఇక్కడిదాకా వచ్చింది. చదవండి: వీకెండ్లో మోత మోగించిన కేజీఎఫ్ 2, కలెక్షన్లే కలెక్షన్లు! -
రికార్డులు తొక్కుకుంటూ పోతున్న కేజీఎఫ్ 2, తాజాగా వరల్డ్ రికార్డ్!
సౌత్ నుంచి నార్త్ దాకా అంతా తన అడ్డా అంటున్నాడు రాఖీభాయ్. ఎక్కడైనా తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్‌పై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. కన్నడ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. కేజీఎఫ్ చాప్టర్‌కు 1కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. ఏప్రిల్ 14న రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కోట్ల రూపాయలు కొల్లగొడుతోందీ చిత్రం. వీకెండ్లో భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా నిలిచింది కేజీఎఫ్ చాప్టర్ 2. కామ్‌స్కోర్ నివేదిక ప్రకారం గ్లోబల్ బాక్సాఫీస్‌లో ఏప్రిల్ 15 నుంచి 17 మధ్య అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ప్రపంచంలోనే కేజీఎఫ్ రెండవ స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే మూడు రోజుల్లోనే రూ.400 కోట్ల మార్క్‌ను దాటేసిన ఈ మూవీ తాజాగా రూ.500 కోట్ల క్లబ్బులో చేరింది. ఇప్పటివరకు ఈ సినిమాకు రూ.552 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. మరి రానున్న రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి! #KGFChapter2 Debuts at #2 globally for the opening weekend. First movie from Sandalwood to get into Global Top 10 opening weekend. Only Indian movie to get into Global top 10 for the weekend April 15-17.#KGF2 — Manobala Vijayabalan (@ManobalaV) April 18, 2022 #KGFChapter2 WW Box Office CROSSES ₹500 cr milestone mark in just 4 days. Day 1 - ₹ 165.37 cr Day 2 - ₹ 139.25 cr Day 3 - ₹ 115.08 cr Day 4 - ₹ 132.13 cr Total - ₹ 551.83 cr #2 at the global box office after fantastic beasts. #Yash #KGF2 — Manobala Vijayabalan (@ManobalaV) April 18, 2022 According to @Comscore , #KGFChapter2 debuts at No.2 in the Global Box office for the Apr 15th to 17th weekend.. It's 1st weekend gross is a Whopping $72.38 Million [₹ 552 Crs] 🔥 pic.twitter.com/GeuMG70ANC — Ramesh Bala (@rameshlaus) April 18, 2022 R#KGF2 CREATES HISTORY AGAIN... FASTEST TO ENTER ₹ 200 CR CLUB... ⭐ #KGFChapter2: Will cross ₹ 200 cr today [Mon, Day 5] ⭐ #Baahubali2: Day 6#KGF2 is REWRITING RECORD BOOKS... Thu 53.95 cr, Fri 46.79 cr, Sat 42.90 cr, Sun 50.35 cr. Total: ₹ 193.99 cr. #India biz. #Hindi. pic.twitter.com/ysKnW2zIuV — taran adarsh (@taran_adarsh) April 18, 2022 చదవండి: రామ్ సినిమాలో బుల్లెట్ సాంగ్ పాడిన శింబు ఈ నెల 14న ఇంటి నుంచి బయటకు.. రెండు రోజుల తర్వాత నిర్జీవంగా అసిస్టెంట్ డైరెక్టర్ -
సలాం కేజీఎఫ్ 2, మూడో రోజు కలెక్షన్స్ ఎంతంటే?
'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను..' టాలీవుడ్ ఎంతో ఫేమస్ అయిన ఈ డైలాగ్ కేజీఎఫ్ 2కు కరెక్ట్‌గా సూటవుతుంది. బాక్సాఫీస్ మీద దండయాత్ర మొదలుపెట్టిన కేజీఎఫ్ చాప్టర్ 2 కలెక్షన్ల సునామీని ఇప్పట్లో ఆపేదేలే అన్నట్లుగా దూసుకుపోతోంది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాకు సౌత్ నుంచి నార్త్ దాకా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్ 14న రిలీజైన ఈ చిత్రం అటు ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు మంచి వసూళ్లను కూడా రాబడుతోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.250 కోట్ల మేర రాబట్టిన ఈ మూవీ కేవలం మూడో రోజే మరో రూ.150 కోట్లు అలవోకగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. చదవండి: పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి గని, స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? టాలీవుడ్లో తొలిరోజు రూ.19 కోట్లకు పైగా షేర్ సాధించిన ఈ మూవీ వరుసగా రెండు, మూడు రోజుల్లో రూ.13 కోట్లు, రూ.10 కోట్లు రాబట్టింది. అటు బాలీవుడ్‌లోనూ రాఖీభాయ్ హవా కొనసాగుతోంది. హిందీలో రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిన ఈ చిత్రానికి మూడో రోజు రూ.43 కోట్ల మేర కలెక్షన్లు వచ్చాయి. వీకెండ్లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. #KGFChapter2 [#Hindi] India Nett: A new 1st weekend record is on the way.. 🔥 Thu 53.95 cr Fri 46.79 cr Sat 42.90 cr. Total: ₹ 143.64 cr. — Ramesh Bala (@rameshlaus) April 17, 2022 #KGFChapter2 WW Box Office ENTERS the ELITE ₹400 cr club. Day 1 - ₹ 165.37 cr Day 2 - ₹ 139.25 cr Day 3 - ₹ 115.08 cr Total - ₹ 419.70 cr Record breaking HAT-TRICK ₹100 cr+ days. #Yash #KGF2 — Manobala Vijayabalan (@ManobalaV) April 17, 2022 చదవండి: చిరంజీవి-చరణ్ వీడియోపై వర్మ సంచలన కామెంట్స్ -
అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికే డ్రగ్స్ తీసుకున్నా : స్టార్ హీరో
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చేసినా కేజీఎఫ్-2 పైనే చర్చ నడుస్తుంది. భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ సినిమాలో క్రూరమైన విలన్ అధీరాగా కన్పించి మెస్మరైజ్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్. ప్రస్తుతం కేజీఎఫ్-2 గ్రాండ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా సహా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు డ్రగ్స్ ఎలా అలవాటు అయ్యింది అనే విషయాన్ని సైతం షేర్ చేసుకున్నారు. 'అప్పట్లో అమ్మాయిలతో మాట్లాడాలంటే తెగ సిగ్గుపడేవాడిని. కానీ ఎలాగైనా వాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించేవాడిని. అందులో భాగంగానే డ్రగ్స్ వాడితే అమ్మాయిలకు కూల్‌గా కనిపిస్తానని, వాళ్లతో మాట్లాడే అవకాశం ఈజీగా లభిస్తుందని భావించాను. అలా డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించాను. కానీ ఈ ప్రాసెస్‌లో డ్రగ్స్‌కి బానిసైన నాకు ఆ సంకెళ్లు తెంచుకోవడానిక ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. అందరికీ దూరంగా ఒంటరి ప్రపంచాన్ని గడిపేవాడిని. నా జీవితంలో ఆ పదేళ్లు రూమ్‌లో లేదా బాత్రూమ్లో గడిపేవాడిని. షూటింగ్‌లపై ఆసక్తి ఉండేది కాదు. అయితే డ్రగ్స్ ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి రిహబిలిటేషన్ సెంటర్‌కి వెళ్లి కొంతకాలం అక్కడే గడిపాను. తిరిగి వచ్చాక అందరూ నన్ను డ్రగ్గీ అని పిలిచేవారు. ఆ మచ్చని పోగొట్టుకోవడానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే కష్టపడి బాడీని బిల్డ్ చేసుకున్నా. దీంతో అప్పటి నుంచి అందరూ ‘క్యా బాడీ హై’అంటూ ప్రశంసించారు' అంటూ చెప్పుకొచ్చారు సంజూ భాయ్. -
కేజీయఫ్2 సెకండ్ డే కలెక్షన్స్: రికార్డ్స్..రికార్డ్స్..రికార్డ్స్
ఇండియన్ బాక్సాఫీస్‌పై కేజీయఫ్-2 హవా కొనసాగుతోంది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం గురువారం(ఏప్రిల్ 14)విడుదలై, తొలిరోజు నుంచే హిట్ టాక్ని సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లను రాబడుతోంది. ఫస్ట్‌డే ఓవరాల్‌గా 134.5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదేస్థాయిలో వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజులకు గాను ఈ చిత్రం దాదాపు 240 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించింది. టాలీవుడ్లో తొలిరోజు రూ.19.5 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు రూ.12.95 కోట్లను రాబట్టింది. రెండో రోజుల్లోనే ఓ డబ్బింగ్ మూవీ టాలీవుడ్లో రూ.33 కోట్ల షేర్ రాబట్టడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు రజనీకాంత్ ‘రోబో’పేరిట ఉండేది. టాలీవుడ్లో ఈ మూవీకి రూ. 74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 75 కోట్ల వరకు షేర్‌ను రాబట్టాల్సి ఉంది. Thu kya main kya Hatja Hatja 🔥 𝐓𝐨𝐨𝐟𝐚𝐧 𝐓𝐨𝐨𝐟𝐚𝐧 ⚡#KGFChapter2 @Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @excelmovies @AAFilmsIndia @VaaraahiCC @DreamWarriorpic @PrithvirajProd #KGF2BoxOfficeMonster pic.twitter.com/aiiuD8qttp — #KGFChapter2 - Box Office Monster 🔥 (@KGFTheFilm) April 16, 2022 ఇక బాలీవుడ్‌లోనూ కేజీయఫ్ హవా మాములుగా లేదు. అక్కడ తొలి రోజే రూ.50 కోట్లు వసూళ్లు చేసింది. రెండో రోజు దాదాపు 45 కోట్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. కేవలం రెండు రోజుల్లోనే హిందీలో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరడం విశేషం. ఇక వీకెండ్ కావడంతో శని,ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సీనీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఈ మూవీ ఎన్ని వందల కోట్లను కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్, హీరోయిన్గా శ్రీనిధి నటించారు. రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. -
‘కేజీయఫ్ 2’ ఎఫెక్ట్..తెరపైకి బాహుబలి 3, రూ. 2000 కోట్లే టార్గెట్!
పాన్ ఇండియా సినిమాలు వేరు,పాన్ ఇండియా సీక్వెల్స్ వేరు. పాన్ ఇండియా సినిమా హిట్టైతే, ఆ సినిమా నుంచి వచ్చే సీక్వెల్ కు కనివిని ఎరుగని రీతిలో క్రేజ్ కనిపిస్తోంది. ముందు బాహుబలి 2, ఇప్పుడు కేజీయఫ్ 2 .. ఈ ట్రెండ్ చూస్టుంటే నెక్ట్స్ పుష్పరాజ్ కూడా బాక్సాఫీస్ ను రూల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేజీయఫ్ 2కు వచ్చిన క్రేజ్, ఈ సినిమా బద్దలు కొడుతున్న కలెక్షన్స్ గురించి విన్న తర్వాత పుష్ప టీమ్ లో మరింత జోష్ పెరగడం ఖాయం.పాన్ ఇండియా సినిమాలకు ఒక క్రేజ్ కనిపిస్తే, పాన్ ఇండియా సీక్వెల్స్ కు నెక్ట్స్ లెవల్లో క్రేజ్ కనిపిస్తోంది. అది బాహుబలి 2తో ఒకసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు రాఖీభాయ్ రూలింగ్ తో మరోసారి పాన్ ఇండియా సీక్వెల్స్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్ధమైంది. బాహుబలి 2, కేజీయఫ్ 2 రిలీజ్ హంగామాను రిపీట్ చేసే అవకాశాలు ఒక్క పుష్ప 2కు మాత్రమే ఉన్నాయి. అంతగా ఈ పుష్ప పార్ట్ 1 ఆడియెన్స్ లోకి వెళ్లింది.అందుకు తగ్గట్లే పుష్ప పార్ట్ 2ను కూడా సుకుమార్ తెరకెక్కించగలిగితే మాత్రం టాలీవుడ్ మరో ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయం. మరోవైపు రూ.1000 కోట్లు కొల్లగొట్టిన ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ పై రాజమౌళి మౌనంగా ఉన్నాడు.కాని ఫ్యూచర్ లో బాహుబలి 3ని తీసుకొస్తాను అంటున్నాడు. బాహుబలి 3 థియేటర్స్ కు వచ్చిన రోజున మాత్రం ఇండియన్ సినిమా మరో ఎత్తు ఎదగడం ఖాయం.ఈసారి రాజమౌళి సినిమా మినిమం రెండు వేల కోట్ల వసూళ్లను కొల్లగొట్టడం కన్ ఫామ్.ఎందుకంటే నాలుగేళ్ల క్రితం విడుదలైన బాహుబలి 2 అప్పుడే 1600 కోట్లుకుపైగా కొల్లగొట్టింది. ఫ్యూచర్ లో ఈ సినిమా సీక్వెల్ కు మరింత క్రేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే మినిమం 2 వేల కోట్ల మార్క్ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. -
కేజీఎఫ్ 2 ఎఫెక్ట్: బాలీవుడ్‌పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..
Ram Gopal Varma On KGF 2 Says Its A Horror Movie To Bollywood: సినీ ఇండస్ట్రీలో మొన్నటివరకు 'ఆర్ఆర్ఆర్' మేనియా నడిచింది. ఇప్పుడు 'కేజీఎఫ్ 2' హవా నడుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు ఏ చిత్ర పరిశ్రమలో అయినా 'కేజీఎఫ్ 2' గురించే టాక్. భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు, యశ్ యాక్టింగ్, యాక్షన్‌కు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్‌లోనూ ఈ విశేష స్పందన లభిస్తోంది. విడుదలైన తొలిరోజే సుమారు రూ. 135 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇందులో ఒక్క బాలీవుడ్లోనే దాదాపుగా రూ. 50 కోట్లను రాబట్టడం విశేషం. దీంతీ ఈ చిత్రంపై సినీ ప్రముఖులు తమదైన శైలీలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే సంచలనాల డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ 'కేజీఎఫ్ 2' మూవీని మెచ్చుకుంటూ వరుస ట్వీట్లు పెట్టారు. 'ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కేజీఎఫ్ 2 చిత్రం గ్యాంగ్‌స్టర్ సినిమా కాదు. బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇది ఒక హారర్ మూవీ.కేజీఎఫ్ విజయం నుంచి బాలీవుడ్ తేరుకోవాలంటే కొన్నేళ్లు పడుతుంది. రాఖీ భాయ్ ముంబైకి వచ్చి గ్యాంగ్‌స్టర్స్‌పై మెషిన్ గన్‌తో దాడి చేసినట్లు యశ్ బాలీవుడ్ స్టార్స్ ఓపెనింగ్ కలెక్షన్లపై మెషిన్ గన్‌తో దండెత్తాడు. ఇక చివరి కలెక్షన్లతో శాండల్‌వుడ్ నుంచి బాలీవుడ్పైకి అణుబాంబుతో దాడి చేస్తాడు. కేజీఎఫ్ విడుదలయ్యే వరకు బీటౌన్ మాత్రమే కాదు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు కూడా కన్నడ సినీ ఇండస్ట్రీని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ప్రశాంత్ నీల్ ఆ ఇండస్ట్రీని ప్రపంచ మ్యాప్‌లో నిలబెట్టాడు.' అంటూ వరుసగా ప్రశంసలు కురిపించాడు రామ్ గోపాల్ వర్మ. కేజీఎఫ్ 2లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ నటించిన విషయం తెలిసిందే. చదవండి: సాక్షి ఆడియన్స్ పోల్.. 'కేజీఎఫ్-2'పై ప్రేక్షకుల రివ్వ్యూ . @prashanth_neel ‘s #KGF2 is not just a gangster film but It’s also a HORROR film for the Bollywood industry and they will have nightmares about it’s success for years to come — Ram Gopal Varma (@RGVzoomin) April 15, 2022 Like very much how Rocky Bhai comes to Mumbai to machine gun the villains, @TheNameIsYash is literally machine gunning all the Bollywood stars opening collections and it’s final collections will be a nuclear bomb thrown on Bollywood from Sandalwood — Ram Gopal Varma (@RGVzoomin) April 15, 2022 Forget Hindi film industry, not even telugu and Tamil film industries ever took Kannada film industry seriously till KGF and now @prashanth_neel put it on the world map — Ram Gopal Varma (@RGVzoomin) April 15, 2022 చదవండి: కేజీయఫ్-2 ఎఫెక్ట్.. స్టార్ హీరోల రెమ్యునరేషన్‌పై వర్మ షాకింగ్ ట్వీట్ -
కేజీయఫ్-2 ఎఫెక్ట్.. స్టార్ హీరోల రెమ్యునరేషన్‌పై వర్మ షాకింగ్ ట్వీట్
రామ్ గోపాల్ వర్మ.. చిత్ర పరిశ్రమలో ఈ పేరే ఓ సంచలనం. ఆయన ఎప్పుడు, ఎవరిపై, ఏరకమైన కామెంట్స్ చేస్తారో తెలీదు. ట్రెండింగ్ అంశాలను మాట్లాడడం, దాన్ని వివాదాస్పదం చేయడం వర్మను చూసే నేర్చుకోవాలి. ఒక అంశాన్ని మరో అంశంతో ముడిపెడుతూ.. కామెంట్స్ చేస్తుంటాడు. తాజాగా ఆర్జీవీ మరోసారి తనదైన మార్క్ చూపించాడు. అంతా కేజీయఫ్-2 సక్సెస్ గురించి మాట్లాడుకుంటుంటే.. ఆయన మాత్రం స్టార్ హీరోల రెమ్యునరేషన్ విషయాన్ని బయటకు తెచ్చాడు. (చదవండి: అప్పుడే ఓటీటీకి ‘కేజీయఫ్ 2’, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే..!) కేజీయఫ్-2 పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆర్జీవీ వరస ట్వీట్లతో చిత్రయూనిట్‌పై, ముఖ్యంగా ప్రశాంత్ నీల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా కేజీయఫ్ సక్సెస్‌ని స్టార్ హీరోల రెమ్యునరేషన్‌తో ముడిపెడుతూ ట్వీట్ చేసి, ఇండస్ట్రీలో మరో వివాదానికి తెరలేపారు. ‘సినిమా మేకింగ్‌పై ఎంత ఎక్కువ డబ్బులు పెడితే..అంత మంచి చిత్రాలు బయటకు వస్తాయని చెప్పడానికి కేజీయఫ్-2 మూవీయే ఉదాహరణ. మేకింగ్‌లో ఎంత క్వాలిటీ ఉంటే..అంత భారీ సక్సెస్ వస్తుంది. అంతేకానీ స్టార్ హీరోలకు భారీ రెమ్యునరేషన్ ఇవ్వడం అనేది వృధా’అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. బాలీవుడ్, టాలీవుడ్లో స్టార్ హీరోల రెమ్యునరేషన్ భారీగానే ఉంటుంది. కోలీవుడ్‌లో కూడా అదే పరిస్థితి. అయితే వీటితో పోల్చుకుంటే కన్నడ చిత్రపరిశ్రమలో హీరోల రెమ్యునరేషన్ చాలా తక్కువనే చెప్పాలి. కేజీయఫ్ లాంటి సినిమాలు మినహాయిస్తే.. అక్కడ చాలా సినిమాలు తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతాయి. వర్మ ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. The MONSTER success of KGF 2 is a clear proof that if money is spent on MAKING and not wasted on STAR RENUMERATIONS bigger QUALITY and BIGGEST HITS will come — Ram Gopal Varma (@RGVzoomin) April 15, 2022 -
అప్పుడే ఓటీటీకి ‘కేజీయఫ్ 2’, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే..!
టాలీవుడ్,బాలీవుడ్ అని కాదు.. ప్రస్తుతం ఏ చిత్రపరిశ్రమలో అయినా ‘కేజీయఫ్ 2’ సినిమా గురించే చర్చ జరుగుతుంది. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘కేజీయఫ్ 2’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. యశ్ యాక్షన్‌కి, ప్రశాంత్ నీల్ టేకింగ్కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఈ చిత్రానికి ఊహించని స్పందన లభిస్తోంది. తొలిరోజే దాదాపు 135 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డుని సృష్టించింది. అందులో ఒక్క బాలీవుడ్లోనే దాదాపు రూ.50 కోట్లను రాబట్టడం మరో విశేషం. ఇలాగే కొనసాగితే...ఈ వీకెండ్లోపే 500 కోట్ల క్లబ్బులో చేరడం ఖాయం. (చదవండి: బాక్సాఫీస్‌పై రాకీ భాయ్ దాడి.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..) తమ అభిమాన హీరో చిత్రానికి ఇంతటి ఘన విజయం లభించడం పట్ల యశ్ అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఇదే సమయంలో ‘కేజీయఫ్’ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే వార్త ఒక్కటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారట. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మే 13న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిసింది.అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. హోంబలే ఫిలింస్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. విలన్ అధీరా పాత్రను ప్రముఖ బాలీవుడ్ హీరో సంజయ్ దత్ పోషించాడు. (చదవండి: కేజీయఫ్ 2 రివ్యూ) -
KGF2: బాక్సాఫీస్‌పై రాకీ భాయ్ దాడి.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిచ చిత్రం ‘కేజీయఫ్ చాప్టర్ 2’. భారీ అంచనాల మధ్య గురువారం(ఏప్రిల్ 14) విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కథలో పెద్దగా ట్విస్టులు లేకపోయినా.. ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు, విజన్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో విడుదలైన కేజీయఫ్‌కి తొలుత మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్ల పరంగా కాస్త వెనకపడింది. తర్వాత పబ్లిక్ మౌత్‌తో జనాల్లోకి వెళ్లి భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. అయితే కేజీయఫ్‌కి ఆ గండం లేకుండా పోయింది. పార్ట్ 1 సూపర్,డూపర్ హిట్ కావడంతో...పార్ట్ 2 అంతకు మించేలా ఉంటుందని అంతా భావించారు. అందుకే విడుదల ముందే ప్రీ బుకింగ్స్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. విడుదల తర్వాత సూపర్ హిట్ టాక్ రావడంతో తొలి రోజు భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఫస్ట్‌డే ఓవరాల్‌గా 134.5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి..మరోసారి సౌత్ సినిమాల సత్తా ఏంటో యావత్ భారత్‌కు తెలియజేసింది. బాలీవుడ్లోనే దాదాపు రూ.50 కోట్లను వసూళ్లు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలిరోజు రూ.19.5 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఓ డబ్బింగ్ మూవీ టాలీవుడ్లో ఇంత కలెక్ట్ చేయడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు రజనీకాంత్ ‘రోబో 2.O’(రూ.12.45 కోట్లు) ఉండేది. కర్ణాటక, తమిళనాడు, కేరళలో కలిసి మరో రూ.50 కోట్లు వసూలు చేసిందట. మొత్తంగా తొలిరోజు రాకీభాయ్ విధ్వంసమే సృష్టించాడు. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్, హీరోయిన్గా శ్రీనిధి నటించారు. రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. (చదవండి: ‘కేజీయఫ్ 2’ మూవీ రివ్యూ) -
కేజీఎఫ్-2 ఎడిటర్ 19ఏళ్ల టీనేజర్ అని మీకు తెలుసా?
కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ గురువారం(ఏప్రిల్14)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. స్టార్ మీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా విడుదలైన ఈసినిమాకు అన్ని భాషల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది. చదవండి: సాక్షి ఆడియన్స్ పోల్.. 'కేజీఎఫ్-2'పై ప్రేక్షకుల రివ్వ్యూ కేజీఎఫ్ 2 లాంటి భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించడంలో మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటారో మనం ఊహించుకోవచ్చు. ఇంత పెద్ద భారీ ప్రాజెక్టుకు స్టార్ ఎడిటర్ పనిచేసి ఉంటాడని అంతా అనుకుంటున్నారేమో. కానీ అలాంటిదేమి లేదు. ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేసింది కేవలం 19 ఏళ్ల కుర్రాడు. అవును.. మీరు చదివింది నిజమే. ఉజ్వల్ కుల్కర్ణి అనే ఈ కుర్రాడు గతంలో షార్ట్ ఫిలింస్, ఫ్యాన్ ఎడిట్స్ వంటివి చేస్తూ ఉండేవాడు. అయితే కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్‌కి అతను చేసిన కొన్ని ఫ్యాన్ ఎడిట్స్ ప్రశాంత్ నీల్‌కు బాగా నచ్చాయి. దీంతో కేజీఎఫ్ ఛాప్టర్-2కి ఎడిటింగ్ బాధ్యతలను అప్పగించాడు. అందుకు తగ్గట్లే ఉజ్వల్ కూడా హాలీవుడ్ రేంజ్లో తన పనితనాన్ని చూపించాడు. సినిమా సక్సెస్‌లో ఉజ్వల్ పాత్ర చాలా కీలకంగా మారింది. ఇంత తక్కువ వయస్సులోనే పాన్ ఇండియా సినిమాకు ఎడిటర్‌గా పనిచేయడం నిజంగా ఉజ్వల్‌కు పెద్ద అఛీవ్ మెంట్ అని అంటున్నారు నెటిజన్లు. చదవండి: ‘కేజీయఫ్ 2’ మూవీ రివ్యూ -
'కేజీఎఫ్' అభిమానులకు గుడ్ న్యూస్.. పార్ట్-3 కూడా?
యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'కేజీఎఫ్ 2' ఎట్టకేలకు గురువారం (ఏప్రిల్ 14) విడుదలైంది. కన్నడ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. అయితే 'కేజీఎఫ్2'కి చివరిలో కొనసాగింపుగా 'కేజీఎఫ్3' కూడా ఉండబోతుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ పరోక్షంగా ఓ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలానే అందులో ఈ సారి స్టోరీ ఎక్కడ జరగబోతుందో కూడా చెప్పేశారనే చెప్పాలి. ఇంతవరకూ ఇండియాలోనే జరిగిన 'కేజీఎఫ్' కథ ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండబోతుందని సమాచారం. అందుకే 'కేజీఎఫ్ 2' చిత్రం చివరిలో రాకీభాయ్ వస్తుంటే.. అతడి షిప్‌ను అమెరికా, ఇండోనేషియా దేశాలకు చెందిన అధికారులు వెంటాడుతున్నట్టు చూపించారు. రాకీభాయ్ సామ్రాజ్యం విదేశాలలో కూడా విస్తరించినట్లు చూపించారు. దాంతో పాటు రాకీ మీద భారత ప్రధానికి అమెరికా ఫిర్యాదు చేసినట్లు ఉంటుంది. వీటిని చూసిన సిని ప్రేక్షకులు 'కేజీఎఫ్'కి పార్ట్ 3 కూడా రాబోతోందని నెట్టింట రచ్చ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డార్లింగ్ ప్రభాస్‌తో చేస్తున్న 'సలార్' రెండు భాగాలుగా రానున్నట్టు తెలుస్తోంది. ఆ చిత్రం ఓ కొలిక్కి వచ్చిన తరవాత 'కేజీఎఫ్' పార్ట్ 3 పై మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కాగా దీనిపై అధికారికి ప్రకటన రావాల్సి ఉంది. -
KGF 2: కేజీయఫ్ 2 మీద నెగెటివ్ రివ్యూలు!
భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన కె.జి.యఫ్ ఛాప్టర్ 2.. ప్రేక్షకులకు ఎలివేషన్ ఫీస్ట్‌ను అందించింది. కథ విషయంలో పెద్దగా మలుపులు లేకపోయినా.. మిగతా ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో మెప్పించగలిగాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. యశ్ స్క్రీన్ ప్రజెన్స్ రెండో భాగానికీ మేజర్ హైలెట్ అయ్యింది. ఓవరాల్‌గా.. సినిమా చాలా మందికే నచ్చేసింది. అయితే బాలీవుడ్ మీడియా మాత్రం నెగెటివ్ రివ్యూలతో విరుచుకుపడింది. కె.జి.యఫ్ ఛాప్టర్ 2కు మాతృక కన్నడతో సహా దాదాపు అన్ని భాషల్లోనూ బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. మొదటి ఆట నుంచే యునానిమస్‌గా బ్లాక్‌బస్టర్ టాక్ దక్కించుకుంది ఈ చిత్రం. తమిళనాడులో అయితే విజయ్ బీస్ట్ చిత్రం థియేటర్ల దగ్గర ఆడియొన్స్ బాగా తగ్గిపోగా.. రాఖీబాయ్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపించడం విశేషం. ఇక తెలుగు ఆడియొన్స్ ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా దాదాపుగా సౌత్‌లోని అన్ని భాషల్లోనూ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు దక్కాయి. అయితే.. రిలీజ్‌కు ముందు సైతం పెద్దగా హడావిడి చేయని హిందీ మీడియా.. రిలీజ్ తర్వాత కూడా కేజీయఫ్ ఛాప్టర్ 2కి దాదాపుగా నెగెటివ్ రివ్యూలే ఇచ్చాయి. పైగా సినిమాలోని మైనస్‌లనే హైలైట్ చేస్తూ రివ్యూలు ఇచ్చాయి. హిందీ మీడియాలో సినిమాను పొగుడుతూ రివ్యూలు ఇచ్చిన వెబ్సైట్లు ఒకటో రెండో ఉండగా, ఒకరిద్దరు విశ్లేషకులు మాత్రమే పాజిటివ్‌గా రాశారు. కేజీయఫ్ ఛాప్టర్ 2 విషయంలోనే కాదు.. మొన్న పుష్ప, ఆర్ఆర్ఆర్ విషయంలోనూ కొన్ని మెయిన్ మీడియా హౌజ్‌లు దాదాపుగా ఇదే రీతిలో వ్యవహరించాయి. ఏది ఏమైనా ఈ తీరుతో బాలీవుడ్ మీడియా మరోసారి సౌత్ సినిమాల మీద అక్కసు వెల్లగక్కినట్లయ్యింది. కానీ.. సినిమాను ఆదరించేది అంతిమంగా ఆడియొన్స్. కాబట్టి, ఇలాంటి చేష్టల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక కే.జి.యఫ్ 2కు నార్త్ ఆడియెన్స్ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ దక్కుతోంది. ఒక్క హిందీ బెల్ట్‌లోనే తొలిరోజు రూ. 50 కోట్లు వసూలు చేయొచ్చని అంచనా. చదవండి: కేజీయఫ్ 2 రివ్యూ -
ఎన్టీఎఫ్లలో కేజీఎఫ్ 2 హవా
కేజీఎఫ్ సినిమాతో హీరో యాష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు అందులో పాత్రలకు ప్రత్యేకంగా ప్రాంతాలకు అతీతంగా ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో కేజీఎఫ్ 2 సినిమా విడుదల సందర్భంగా ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా నాన్ ఫంజిబుల్ టోకెన్లు, కేజీఎఫ్వెర్స్ను నిర్మాతలు అందుబాటులోకి తెచ్చారు. కేజీఎఫ్ సినిమాలో కీలకమైన ఎల్డోరాడో క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని పది వేలకు పైగా నాన్ ఫంజిబుల్ టోకెన్లను (ఎన్ఎఫ్టీ) మార్కెట్లో రిలీజ్ చేయగా కేవలం గంట వ్యవధిలోనే ఐదు వందల ఎన్ఎఫ్టీ టోకెన్లు అమ్ముడయ్యాయి.ఇప్పటి వరకు రెండు వేలకు పైగా టోకెన్లు అమ్ముడైపోయాయి. వివిధ రకాలైన కళలకు డిజిటల్ రూపమే నాన్ ఫంజిబుల్ టోకెన్లు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా ఈ ఎన్ఎఫ్టీ లావాదేవీలు జరుగుతుంటాయి. మిగిలిన టెక్నికల్ రూపాలకంటే కూడా ఎన్ఎఫ్టీలలో భద్రత అధికం. ఈ ఎన్ఎఫ్టీ టోకెన్లను భవిష్యత్తుల అమ్ముకోవచ్చు కూడా. కేజీఎఫ్ ఎన్ఎఫ్టీ టోకెన్లు సొంతం చేసుకున్న వారు వాటి సాయంతో కేజీఎఫ్వర్స్లోకి (మెటావర్స్)లోకి వెళ్లి వర్చువల్ 3డీ వరల్డ్‌లో కేజీఎఫ్‌లోని అద్భుతాలను చూసే అవకాశం ఉంది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ విస్త్రృతమైన తర్వాత సినిమాల ప్రమోషన్లలో ఎన్ఎఫ్టీలు కూడా ఓ భాగమయ్యాయి. అమితాబ్ బచ్చన్, రామ్‌గోపాల్ వర్మ వంటి వారు ఇప్పటికే ఈ రంగంలో అడుగు పెట్టారు. రాధేశ్యామ్ ట్రైలర్‌ని మెటావర్స్‌లో రిలీజ్ చేశారు. ఈ పరంపరలో కేజీఎఫ్ నిర్మాతలు సైతం ఎన్ఎఫ్టీల రూపంలో ఈ కొత్త ప్రచారానికి ముందుకు రాగా మంచి స్పందన వచ్చింది. చదవండి: సింగర్ కార్తీక్ తొలి అడుగు.. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ మెటావర్స్ కాన్సెర్ట్ -
సాక్షి ఆడియన్స్ పోల్.. 'కేజీఎఫ్-2'పై ప్రేక్షకుల రివ్వ్యూ
కేజీఎఫ్.. ఎలాంటి అంచనాలు లేకుండా కన్నడ నుంచి వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినిమాను షేక్ చేసింది. ఈ ఒక్క సినిమాతో యష్ తిరుగులేని స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. బాహుబలి తర్వాత ఆ రేంజ్లో సీక్వెల్ కోసం ఎదురుచూసిన సినిమా ఏదైనా ఉందా అంటే అది 'కేజీయఫ్ 2' అనే చెప్పవచ్చు. ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చేసింది.. కేజీఎఫ్ సీక్వెల్‌గా రూపొందిన `కేజీఎఫ్ ఛాప్టర్2`గురువారం(ఏప్రిల్14)న ప్రేక్షకుల మందుకు వచ్చింది. స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మించారు. మరి ఈ చిత్రం 'కేజీఎఫ్' రేంజ్లో సక్సెస్ సాధించిందా? లేక అంతకుమించి ఆకట్టుకుందా? `కేజీఎఫ్ ఛాప్టర్2`పై ఆడియెన్స్ ఓపీనియన్ ఏంటి అన్నది 'సాక్షి ఆడియన్స్ పోల్'లో ప్రేక్షకుల రివ్యూలో తెలుసుకుందాం. -
‘కేజీయఫ్ 2’ మూవీ రివ్యూ
టైటిల్ : కేజీయఫ్ చాప్టర్ 2 నటీనటులు : యశ్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, అర్చన, ఈశ్వరీరావు, రావు రమేశ్ తదితరులు నిర్మాణ సంస్థ: హోంబలే ఫిలింస్ నిర్మాత:విజయ్ కిరగందూర్ దర్శకుడు: ప్రశాంత్ నీల్ సంగీతం: రవి బస్రూర్ సినిమాటోగ్రఫి: భువన్ గౌడ విడుదల తేది: ఏప్రిల్ 14, 2022 సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో కేజీయఫ్ 2 ఒకటి. 2018లో వచ్చిన ‘కేజీయఫ్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఎలాంటి అంచానాలు లేకుండా విడుదలైన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తుందంటే..భారీ అంచనాలు ఉండడం సహజం. అందుకు తగ్గట్టే.. కేజీయఫ్ 2 తీర్చిదిద్టినట్లుగా టీజర్, ట్రైలర్‌ని చూపించారు మేకర్స్ . దీంతో ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు కల్లల్లో ఒత్తులు వేసుకొని వేచి చూశారు. బహుబలి సీక్వెల్ తర్వాత ఓ మూవీ సీక్వెల్ కోసం ప్రేక్షకులు.. అంతా వేచి చూస్తోన్న సినిమా ఏదైనా ఉందంటే అది కేజీయఫ్ 2 అనే చెప్పవచ్చు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు గురువారం(ఏప్రిల్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పార్ట్ 1 సూపర్ హిట్ కావడం, పార్ట్2 టీజర్, ట్రైలర్ అదిరిపోవడంతో ‘కేజీయఫ్ 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన కేజీయఫ్ 2ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు. కేజీయఫ్ 1 స్థాయిని కేజీయఫ్2 అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కేజీయఫ్ మూవీ ఎక్కడ ముగిసిందో.. అక్కడ నుంచి కేజీయఫ్ 2 కథ మొదలవుతుంది. మొదటి పార్ట్‌లో రాకీ భాయ్ స్టోరీని ప్రముఖ రచయిత ఆనంద్ వాసిరాజు(అనంత్ నాగ్) చెబితే.. పార్ట్ 2లో ఆయన కుమారుడు విజయేంద్రవాసిరాజు(ప్రకాశ్ రాజ్) కథ చెబుతాడు. గరుడను చంపిన తర్వాత నరాచి లైమ్ స్టోన్ కార్పొరేషన్‌ను రాకీ భాయ్ (యశ్) తన ఆధీనంలోకి తీసుకుంటాడు. గరుడ పెట్టే చిత్రహింసల నుంచి బయట పడడంతో అక్కడి కార్మికులు యశ్ని రాజుగా భావిస్తారు. తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఇక కేజీయఫ్ సామ్రాజ్యంలో తనకు ఎదురులేదని అనుకుంటున్న సమయంలో ‘నరాచి లైమ్ స్టోన్ కార్పొరేషన్’ సృష్టికర్త సూర్యవర్ధన్ సోదరుడు అధీరా(సంజయ్ దత్) తెరపైకి వస్తాడు. అదే సమయంలో రాజకీయంగా కూడా రాకీబాయ్ సవాళ్లను కూడా ఎదుర్కొవాల్సివస్తుంది. అతని సామ్రాజ్యం గురించి తెలుసుకున్న భారత ప్రధానమంత్రి రమికా సేన్(రవీనా టాండన్)..అతనిపై ఓ రకమైన యుద్దాన్ని ప్రకటిస్తుంది. ఒకవైపు అధీరా నుంచి, మరోవైపు రమికా సేన్ ప్రభుత్వం నుంచి ముప్పు ఏర్పడిన సమయంలో రాకీభాయ్ ఏం చేశాడు? తన సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు?. శత్రువులు వేసిన ఎత్తులను ఎలా చిత్తు చేశాడు? తనను దేవుడిగా భావించిన కార్మికుల కోసం ఏదైనా చేశాడా? అమ్మకు ఇచ్చిన మాట కోసం చివరికి ఏం చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉదంటంటే.. 2018లో చిన్న సినిమాగా విడుదలై అతి భారీ విజయం సాధించిన చిత్రం ‘కేజీయఫ్’. తల్లి చెప్పిన మాటలు, ఆ మాటల ప్రభావంతో పెరిగిన కొడుకు, చివరకు ఓ సామ్రాజ్యానికే అధినేతగా ఎదగడం.. ఇలా కేజీయఫ్ చిత్రం సాగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కేజీయఫ్ చాప్టర్ 2లో చూపించారు. కేజీయఫ్ మాదిరే పార్ట్2లో హీరో ఎలివేషన్, యాక్షన్ సీన్స్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. పార్ట్ 2లో యాక్షన్ డోస్ మరింత ఎక్కువైందనే చెప్పొచ్చు. ఫస్టాఫ్‌లో రాకీభాయ్ ఎదిగే తీరుని చాలా ఆసక్తికరంగా చూపించాడు. కేజీయఫ్ పార్ట్‌నర్స్‌తో జరిపిన మీటింగ్, ఇయత్ ఖలీల్‌తో జరిపిన డీల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే హీరో ఎలివేషన్స్ ఓ రేంజ్లో చూపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్‌లో పార్లమెంట్‌లోకి వెళ్లి మాజీ ప్రధానిని చంపడం సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ‘కేజీయఫ్’అభిమానులకు మాత్రం ఆ సీన్‌తో సహా ప్రతి సన్నీవేశం నచ్చుతుంది. బహుశా దర్శకుడు కూడా వారిని మెప్పించడానికే హీరో ఎలివేషన్స్‌లో మరింత స్వేచ్ఛ తీసుకున్నాడేమో. అయితే కథని మాత్రం ఆ స్థాయిలో మలచుకోలేకపోయాడు. కేజీయఫ్ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఆ సినిమాలోని విలన్లు, వారు ఎలాంటి ఎత్తులు వేస్తారు.. చివరకు ఎం జరుగుతుంది అనేది అంచనా వేస్తారు. వారి అంచనా తగ్గట్టే పార్ట్2 సాగుతుంది. కథలో ట్విస్టులు లేకపోవడం మైనస్. ఇక అధీర పాత్ర తీర్చిదిద్దిన విధానం బాగున్నప్పటికీ.. రాకీభాయ్, అధిరాకు మధ్య వచ్చే ఫైట్ సీన్స్ మాత్రం అంతగా ఆసక్తికరంగా సాగవు. అధిర పాత్రను మరింత బలంగా చూపిస్తే బాగుండేదేమో. అలాగే అతని నేపథ్యం కూడా సినిమాలో చూపించలేదు. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే.. ఇందులో మదర్ సెంటిమెంట్ కాస్త తక్కువే అని చెప్పాలి. మధ్య మధ్యలో తల్లి మాటలను గుర్తు చేస్తూ కథను ముందుకు నడిపారు.ఇక హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ కథకి అడ్డంకిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే చివర్లో మాత్రం తల్లి కాబోతున్న విషయాన్ని హీరోకి తెలియజేసే సీన్ హృదయాలను హత్తుకుంటుంది. సముద్రం ఎందుకంత వెలిగిపోతుందని కొడుకు అడిగిన ప్రశ్నకి తల్లి చెప్పిన సమాధానాన్ని, క్లైమాక్స్‌తో ముడిపెట్టడం ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. సినిమా స్టార్టింగ్‌లో విలన్లకు సంబంధించిన వ్యక్తి, యశ్ గురించి చెబుతూ.. ‘ఇంట్లో ఉన్న ఎలుకలను బయటకు తోలడానికి పాముని పంపారు.. ఇప్పుడు అది నల్ల తాచు అయింది’ అని అంటాడు. అంటే హీరో మరింత బలపడ్డాడు అనే అర్థంతో ఆ డైలాగ్ చెబుతాడు. కేజీయఫ్2లో యశ్ నటన కూడా అంతే. మొదటి భాగంతో పోలిస్తే.. ఇందులో మరింత స్టైలీష్‌గా, తనదైన మేనరిజంలో డైలాగ్స్ చెబుతూ..అదరగొట్టేశాడు. రాకీ భాయ్ పాత్రకు యశ్ తప్పితే మరొకరు సెట్ కాలేరు అన్న విధంగా అతని నటన ఉంది. యాక్షన్ సీన్స్‌లో విశ్వరూపం చూపించాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా మంచి నటనను కనబరిచాడు. అధీరగా సంజయ్ దత్ ఫెర్పార్మెన్స్ బాగుంది. ఆయన పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. ఈ సినిమా షూటింగ్‌కి ముందే సంజయ్ దత్‌కి కేన్సర్ అని తేలింది. అయినా కూడా ఆయన అధీర పాత్రలో నటించడం అభినందించాల్సిందే. ప్రధానమంత్రి రమికా సేన్ పాత్రకి రవీనా టాండన్ న్యాయం చేసింది. రావు రమేశ్, ఈశ్వరి భాయ్, ప్రకాశ్ రాజ్‌తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ప్రతి ఒక్కరి పాత్రకి తగిన ప్రాధాన్యత ఉండడం ఈ సినిమా గొప్పదనం. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం రవి బస్రూర్ సంగీతం. అద్భుతమైన నేపథ్య సంగీతంతో సినిమాను మరో మెట్టు ఎక్కించాడు. భువన్ గౌడ సినిమాటోగ్రఫి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కేజీయఫ్ సామ్రాజ్యాన్ని అందంగా చిత్రీకరించాడు. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించాడు. ఉజ్వల్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
జూ. ఎన్టీఆర్ తల్లి శాలినిపై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Yash Interesting Comments On Jr NTR Mother Shalini: కన్నడ స్టార్ హీరో యశ్ తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ 2 గురువారం(ఏప్రిల్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజు విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ మూవీ విడుదల నేపథ్యంలో చిత్రం గత కొద్ది రోజులుగా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీసెంట్గా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యశ్ యాంకర్ సుమతో ముచ్చటించారు. చదవండి: కాబోయే భార్యకు రణ్‌బీర్ కాస్ట్లీ గిఫ్ట్! అదేంటో తెలుసా? ఈ సందర్భంగా సుమ వారిని ఆర్ఆర్ఆర్ మూవీ గురించి చెప్పమని అడగ్గా.. సినిమా చాలా అద్భుతంగా ఉందంటూ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై ప్రశంసలు కురిపించాడు ప్రశాంత్ నీల్. ఇక యశ్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని, పెద్ద స్క్రీన్‌పై సినిమా చూసి థ్రిల్ అయ్యానన్నాడు. అలాగే చరణ్, ఎన్టీఆర్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరూ గొప్ప నటులని, చరణ్, తారక్‌లతో తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉందని చెప్పాడు. ‘హైదరాబాద్‌లో నేను ఎక్కడ షూటింగ్ చేసినా చరణ్ ఇంటి నుంచి భోజనం పంపిస్తాడు. అంతేకాదు మా మధ్య అంతకుమించి స్పెషల్ బాండింగ్ ఉంది’ అని యశ్ అన్నాడు. చదవండి: సోనూ సూద్‌కు ఫన్నీ రిక్వెస్ట్, స్పందించిన రియల్ హీరో అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘తారక్ కూడా నన్ను వ్యక్తిగతంగా డిన్నర్‌కు ఆహ్వానించాడు. ఆయన కుటుంబం చాలా బాగా రీసివ్ చేసుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ తల్లి శాలిని గారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆమెతో మంచి బాండింగ్ కుదిరింది. ఆమె కర్ణాటకకు చెందిన వారు కావడంతో మా మధ్య ప్రాంతీయ అనుబంధం ఏర్పడింది. అందుకే శాలినిగారు నన్ను చాలా ప్రత్యేకంగా చూసుకున్నారు.కుటంబంలోని వ్యక్తిగా ట్రీట్ చేశారు. ఆయన కుటుంబం ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎప్పటికి మర్చిపోలేను’ అంటూ యశ్ చెప్పుకొచ్చాడు. కాగా హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీణా టాండన్‌లు కీ రోల్ పోషించారు. -
‘కేజీయఫ్ 2’ ట్విటర్ రివ్యూ
‘కేజీఎఫ్ చాపర్ట్ 2’ కోసం యావత్ భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఈ మూవీ మొదటి పార్ట్ ‘కేజీఎఫ్’ భారీ విజయం సాధించడమే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ చిత్రం.. భారతీయ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తుందంటే.. ప్రేక్షకులను అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అందుకు తగ్గట్టే కేజీఎఫ్ 2 తెరకెక్కించానని దర్శకుడు ప్రశాంత్ నీల్ నమ్మకంగా చెబుతున్నాడు. దీంతో కేజీఎఫ్ 2పై మరింత హైప్ క్రియేట్ అయింది. అనేక వాయిదాల అనంతరం ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో పాటు మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్స్‌లో ఈ చిత్రం రిలీజైంది. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #KGFChapter2 The best Don movie in recent times. Masssss... Action packed. A pinch of sentiment and love. @TheNameIsYash stylish look and acting wowww. Worth watching. — Abhi (@abhi_tommi) April 14, 2022 #KGFChapter2 Overall a Superb Action Entertainer that delivers! Neel is the best at giving goosebumps and he delivers once again. The BGM is one of the best in recent years. Apart from a off track 20 minutes in the 2nd half, it delivers as hoped. Rating: 3.5/5#KGF2 — Venky Reviews (@venkyreviews) April 13, 2022 హీరో ఇంట్రడక్షన్ .. ఇంటర్వెల్ సీన్స్ అయితే గూజ్ బమ్స్ వచ్చేలా ఉన్నాయని చెబుతున్నారు.అలాగే రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం అదరిపోయిందని ట్వీట్ చేస్తున్నారు. #KGF2 is ABSOLUTE FIRE UNTIL INTERVAL! #Yash aka. #RockyBhai is MEANER, LEANER & STRONGER!!! #KGFChapter2 If this pace continues in 2nd half, this will be an UNSTOPPABLE Monster at the Box Office. Solid set up for the premise until the interval block. — Himesh (@HimeshMankad) April 13, 2022 #KGFChapter2 Interval: Fine first half. The intro, Toofan song and the pre-interval sequence provide the much needed goosebumps, with #Yash in terrific form. The BGM by Ravi Basrur is simply superb! — Siddarth Srinivas (@sidhuwrites) April 14, 2022 బయట ప్రచారం చేసినంతగా కేజీయఫ్ 2 లేదని, రెగ్యులర్ మాస్ మూవీలాగే ఉంది. కేజీయఫ్ 2 మ్యాజిక్‌ని రీక్రియేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ విఫలమయ్యాడని చెబుతున్నారు. #KGFChpater2Review RATING - 2/5 ⭐#KGFChpater2 DOESN'T LIVE Up To The HYPE . REGULAR MASALA STYLE OUTDATED, PREDICTABLE PLOT & Just The INTENSITY is the Only GOOD Thing. #PrashanthNeel FAILS To RECREATE The MAGIC of #KGF Part 1. #KGF2#KGF2InCinemas pic.twitter.com/qaSHCRoiHE — Himesh Mankadman. (@HimeshMamkad) April 13, 2022 కేజీఎఫ్ మూవీ ఫస్టాఫ్ అదిరిపోయిందని, యశ్ ఎంట్రీ, ఇంటర్వెల్ సీన్స్ రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. #KGF2 1 HALF அய்யய்யோ Ovvoru Scene Goosebumps 🔥🔥 சும்மா பக்கு பக்குன்னு இருக்கு படம் பயங்கரம் 🔥🔥 @TheNameIsYash@prashanth_neel #KGFChapter2 #KGF2onApr14 #KGFChpater2 pic.twitter.com/THa5BUP3bp — VîMãŁ Remo🔥 (@VimalRemoN2) April 14, 2022 #kgf2 1st Half Rocky Rocks BGM🔥 Interval Block 🔥 Not too much Mass loaded for 1st half Some Lag in mid of 1st half#SanjayDutt intro on Fire bridge 👎 Overall decent as expected 1st half 3.25/5#KGF2review #KGFChpater2 #KGFChapter2review #YashBOSS𓃵 #yash #KGFreview #kgf pic.twitter.com/pH7H11MFwz — Shani Sree (@FilmFocus_Live) April 13, 2022 -
కె.జి.యఫ్కు ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా?
తీసింది రెండే రెండు సినిమాలు. స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరడంతోనే ప్రశాంత్ నీల్ ఆగిపోలేదు. కె.జి.యఫ్ లాంటి క్రేజీ ప్రాజెక్టుతో పాన్ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. కేవలం డబ్బు సంపాదన కోసమే సినిమాలు తీయాలనే ఆలోచనతో ఫిల్మ్‌మేకింగ్ కోర్సులో చేరాడు ప్రశాంత్. అయితే.. సినిమా అనే సముద్రం యొక్క లోతు అతని ఆలోచనని మార్చేసింది. ఎలాగైనా కన్నడ సినిమాను ఏలేయాలన్న కసితో అడుగులు వేయించింది. మొదట్లో రెండు, మూడు చిన్న సినిమాలకు స్క్రీన్‌ప్లే రైటర్‌గా పని చేశాడు. ఆ టైంలోనే సొంతంగా ఓ కథ రాసుకుని సినిమా తీయాలనుకున్నాడు. కొత్తవాడు.. పైగా ‘రొటీన్’ కథ. అందుకే హీరోలెవరూ కాల్షీట్లు ఇవ్వలేదు. దీంతో తన బావ, హీరో శ్రీమురళిని పెట్టి సినిమా తీశాడు ప్రశాంత్. రిజల్ట్.. ‘ఉగ్రం’(2014) హిట్ టాక్‌తో కన్నడనాట ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ మూవీతోనే ఊరమాస్ డైరెక్టర్‌గా ప్రశాంత్‌కి పేరొచ్చింది. షోలే ఇన్స్పిరేషన్తో.. ‘ఉగ్రం’ తరువాత ప్రశాంత్‌తో సినిమా చేస్తామని అడిగినోళ్లంతా కన్నడ స్టార్ హీరోలే. కానీ, ఈ సైలెంట్ డైరెక్టర్ మాత్రం హీరోల బాడీలాంగ్వేజ్‌కి తగ్గట్లే కథ రాసుకుంటాడు. అందుకే అప్పటికే యశ్ కోసం కె.జి.యఫ్ స్టోరీ రెడీ చేసుకున్నాడు. ఈ కథకి ప్రశాంత్‌కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది బాలీవుడ్ కల్ట్‌క్లాసిక్ ‘షోలే’. 70వ దశకంలో హిందీ సినిమాలు తనలో ఎంతో మార్పులు తీసుకొచ్చాయని, సినిమాను చూసే విధానంలో తనలో మార్పులు తీసుకొచ్చాయని, కె.జి.యఫ్ కథ తయారు చేసుకోవడంలో స్ఫూర్తి ఇచ్చిందని నీల్ అంటున్నాడు. ప్రత్యేకించి ఆ టైంలో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరున్న అమితాబ్ బచ్చన్ స్ఫూర్తితోనే యశ్ రాకీ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దానని నీల్ తెలిపాడు. భారీ బడ్జెట్.. అయినా వెనకడుగు వేయలేదు నిజానికి మొదట ఒక ఫ్యామిలీ స్టోరీతో ప్రొడ్యూసర్ విజయ్ కిరగండూర్(హోంబల్ ఫిల్మ్స్)ని అప్రోచ్ అయ్యాడు ప్రశాంత్. ఫైనల్‌గా భారీ బడ్జెట్ కథ కె.జి.యఫ్తో కన్విన్స్ అయ్యారు. కన్నడలో కోలార్ బంగారు గనుల మీద ఇంతదాకా ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ‘కాంట్రవర్సీల’ భయాన్ని లెక్కచేయకుండా డేర్‌గా ప్రశాంత్–విజయ్–యశ్‌లు ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఐదు భాషల్లోనూ భారీ సక్సెస్‌తో కన్నడ సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. అంతేకాదు అప్పటిదాకా హయ్యెస్ట్ కలెక్షన్ల కరువుతో ఉన్న శాండల్‌వుడ్ దాహాన్ని కె..జి.యఫ్ ఛాప్టర్–1తో తీర్చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. #KGF first look @NimmaYash #HombaleFilms #PrashanthNeel #Massssss pic.twitter.com/xWjXR0Apfg — Karthik Gowda (@Karthik1423) May 3, 2017 సగం బలం అతనే! అమ్మ సెంటిమెంట్, పవర్ఫుల్ డైలాగులు, హీరో ఎలివేషన్, సినిమాకు తగ్గట్లు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, నటన, టేకింగ్.. ఇవన్నీ ఒక వైపు ఉంటే.. సంగీతం ఈ సినిమాకు మిగతా సగం బలం. ప్రశాంత్ నీల్ తీసిన మూడు సినిమాలకు(కె.జి.యఫ్ ఛాప్టర్–2తో కలిపి).. ప్రభాస్‌తో తీయబోయే ‘సలార్’కి మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కరే. అతని పేరు రవి బస్రూర్. రవికి తన రెండో మూవీ ‘ఉగ్రం’తోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరొచ్చింది. అయితే వీళ్లిద్దరి కాంబో మూవీస్ సక్సెస్‌లో మ్యూజిక్ మామూలు రోల్ పోషించదు. ప్రత్యేకించి సీన్ ఎలివేషన్ కోసం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ప్రాణం పెడతాడు రవి. ఆ అవుట్ఫుల్ జనాలను సీటు అంచుకి తీసుకొస్తుంది కూడా. కె.జి.యఫ్ ఛాప్టర్ 2 రిలీజ్ సందర్భంగా.. సాక్షి వెబ్ ప్రత్యేకం -
KGF Chapter 2 మూవీ టీం తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
మందు తాగుతూనే కథలు రాస్తాను: కేజీఎఫ్ డైరెక్టర్
చాలావరకు సెలబ్రిటీలు వారి వ్యక్తిగత విషయాలను మీడియా ముందు ప్రస్తావించడానికి వెనకడుగు వేస్తుంటారు. అతికొద్ది మంది మాత్రమే తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెరిచిన పుస్తకంలా బయటపెడుతుంటారు. తాజాగా కేజీఎఫ్ 2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తనకు మద్యం తాగే అలవాటుందన్న విషయాన్ని బయటపెట్టాడు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 'ఓ షరతుతో ఈ విషయాన్ని బయటకు చెప్తున్నాను. నా ఇంటర్వ్యూలో ఈ భాగాన్ని కట్ చేసి పక్కన పడేయమని నాకు మాటివ్వండి. నేను మద్యం సేవిస్తాను. మందు తాగుతూనే కథలు రాస్తుంటాను. నేను మత్తులో ఉన్నప్పుడు కూడా సినిమాలో ఈ సన్నివేశాం అవసరమా? లేదా? అనేది నిర్ధారిస్తుంటాను. ఇక్కడ కథ గురించి కాదు, దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నామనేది అత్యంత ముఖ్యమైన టాస్క్' అని చెప్పుకొచ్చాడీ డైరెక్టర్. కాగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ మూవీ చేస్తుండగా, అనంతరం జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నాడు. చదవండి: కత్రీనా కైఫ్ ప్రెగ్నెంట్ ? నెట్టింట వీడియో వైరల్ రణ్‌బీర్, ఆలియా.. త్వరగా పిల్లలను కనేయండి!: సంజయ్ దత్ -
యాక్షన్ బాట పట్టిన టాలీవుడ్ హీరోలు!
కేజీఎఫ్ 2కు పాన్ ఇండియా వైడ్‌గా వస్తోన్న రెస్పాన్స్, ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాఖీభాయ్ స్పీడ్ చూస్తుంటే ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నాడు. అందుకే తెలుగు హీరోలు కూడా ఇప్పుడు యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత మహేశ్ బాబుతో రాజమౌళి మూవీ ఏడాది చివర్లో పట్టాలెక్కనుంది. సూపర్ స్టార్ ను పూర్తిగా యాక్షన్ మోడ్ లో చూపించేందుకు రెడీ అవుతున్నాడు జక్కన్న. ఇప్పటికే వీరిద్దరు ఒక స్టోరీని కూడా లాక్ చేసినట్లు సమాచారం. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ పాన్ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పూర్తి స్థాయి యాక్షన్ మూవీగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మూవీని కూడా యాక్షన్ స్టైల్లో చూపించబోతున్నాడట. ఇప్పటికే కథను రెడీ చేసి తారక్‌కి వినిపించాడట. ఆ స్టోరీకి ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కూడా యాక్షన్ రూట్లోకి వెళ్లిపోయాడు. ఆచార్యలో కళ్ల చెదిరే యాక్షన్స్ సీన్స్‌తో సర్ప్రైజ్ చేయనున్నాడు. ఇక శంకర్ మేకింగ్ లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా భారీ యాక్షన్ సీన్స్ సర్ ప్రైజ్ చేయనున్నాయట. శంకర్ రేంజ్ తెల్సిందే గా... ఒక యాక్షన్ ఎపిసోడ్ కు 10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాడట. మొత్తం టాలీవుడ్ పాన్ ఇండియా హీరోలు ఇఫ్పుడు యాక్షన్ బాట పట్టారు. -
'కేజీఎఫ్2' మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
కన్నడ సినిమాకు ఇంత బడ్జెట్ పెడుతున్నారు.. పిచ్చా అనుకున్నా: దిల్ రాజు
‘‘కేజీఎఫ్’ తొలి భాగం రిలీజ్ అయ్యేవరకు నాలాంటి వాళ్లకు కూడా ఆ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. రిలీజ్ అయ్యాక మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ కన్నడ పరిశ్రమవైపు చూసేలా చేసినందుకు ఆ టీమ్‌కి హ్యాట్సాఫ్. ఇప్పుడు ‘కేజీఎఫ్ 2’తో చరిత్ర సృష్టించబోతున్నారు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. యశ్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్ 2’. హోంబలే ఫిలింస్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలనచిత్రంపై సాయి కొర్రపాటి రిలీజ్ చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడారు. ‘‘కన్నడ ఇండస్ట్రీ గురించి చెబితే చిన్న సినిమాలు తీస్తారు, ఐదు కోట్ల బడ్జెట్‌తోనే తీస్తారనుకునేవాళ్లం. యశ్‌తో ప్రశాంత్ ‘కేజీఎఫ్’ సినిమా మొదలు పెట్టినప్పుడు బడ్జెట్ చూసి కొందరు ఆశ్చర్యపోయారు.. మరికొందరు కర్నాటకలోని రెవెన్యూకి మించి ఖర్చు పెడుతున్నాడు.. పిచ్చా వీడికి అనుకున్నారు. ఈ మధ్య వచ్చిన ‘పుష్ప, ఆర్ఆర్ఆర్’ సినిమాలు వసూళ్లలో రికార్డులు క్రియేట్ చేసినట్లు ‘కేజీఎఫ్ 2’ కూడా చరిత్ర క్రియేట్ చేస్తుంది. ఇండియన్ ఫిల్మ్ గర్వపడే రేంజ్‌కి ఎదిగినందుకు ప్రశాంత్‌కి, యశ్‌కి, విజయ్‌కి అభినందనలు’’ అన్నారు. యశ్ మాట్లాడుతూ– ‘‘నా జీవితంలో ‘కేజీఎఫ్’ చాలా పెద్ద ప్రయాణం. ప్రతి సినిమాను ఆదరించే తెలుగు ఆడియన్స్ అంటే నాకు చాలా గౌరవం. ప్రశాంత్ నీల్ ప్రపంచం, ఆలోచనలు, కలల ప్రతిరూపమే ‘కేజీఎఫ్’ సినిమాలు. విజయ్‌గారు విజనరీ ఉన్న ప్రొడ్యూసర్. ‘కేజీఎఫ్’ రిలీజ్ చేసేందుకు సాయి కొర్రపాటిగారు చాలా ఎఫర్ట్ పెట్టారు. ‘బాహుబలి’ లాంటి సినిమాతో అన్ని ఇండస్ట్రీల వారికి నమ్మకాన్ని ఇచ్చిన రాజమౌళి, శోభు యార్లగడ్డ, ప్రభాస్గార్లకు థ్యాంక్స్. తెలుగు డైలాగులు, డబ్బింగ్, పాటల విషయంలో కన్నడ కంటే పదిరెట్లు ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాం. రామారావుగారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు.. ఆయన పనే మాట్లాడుతుంది. ‘కేజీఎఫ్ 2’ తల్లీ–కొడుకు. కుటుంబంతో కలిసి చూసి, ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమా తీసినందుకు కర్నాటక చాలా గర్వపడుతుంది. కానీ ఇది ఇండియన్ సినిమా. తెలుగువారు ఎక్కడున్నా మా సినిమాని బాగా ఆదరిస్తారని ఓవర్సీస్లో వస్తున్న బుకింగ్స్ చూస్తుంటే అర్థమవుతోంది. మా సినిమా మీ నమ్మకాన్ని, అంచనాలను అందుకుంటుంది’’ అన్నారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తనయుడు, హోంబలే ఫిలింస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామారావు మాట్లాడుతూ–‘‘కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాలని చెప్పే విజయ్ కిరగందూర్ ఏకంగా పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లారు’’ అన్నారు. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ– ‘‘కైకాల సత్యనారాయణగారి సమర్పణలో ‘కేజీఎఫ్ 2’ చేశాం. ఆ లెజెండరీ పేరుకు తగ్గట్టు సినిమా తీశామనే నమ్మకం ఉంది. సాయిగారిలాంటి వాళ్లు అరుదుగా ఉంటారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమా గురించి చెప్పాల్సి వస్తే మొదట రాజమౌళి సార్ గురించి మాట్లాడాలి. యశ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు’’ అన్నారు. ఈ సమావేశంలో కెమెరామేన్ భువన్, డైలాగ్ రైటర్ హనుమాన్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. -
కేజీఎఫ్ హీరోకు చేదు అనుభవం, సారీ చెప్పిన యశ్
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఈ నెల 14న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. అయితే అనుకున్న సమయాని కంటే ఆలస్యంగా ప్రెస్‌మీట్ మొదలుపెట్టడంతో రిపోర్టర్లు యశ్‌ను నిలదీశారు. మమ్మల్ని 11 గంటలకల్లా ఇక్కడ ఉండాలన్నారు. మేము వచ్చి గంటన్నరపైనే అవుతోంది. కానీ మీరిప్పుడు ఇంత లేటుగా వచ్చారు అంటూ ఓ రిపోర్టర్ అసహనం వ్యక్తం చేశాడు. దీనికి యశ్ స్పందిస్తూ.. 'నాకు ఐడియానే లేదు సర్, నన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తున్నాను. ప్రైవేట్ జెట్స్ టేకాఫ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాని కారణంగా ఆలస్యమైనందుకు క్షమించండి. ఇండస్ట్రీని మీరు చాలాకాలంగా చూస్తున్నారు. మేము కావాలనైతే చేయలేదు. నాకు సమయం విలువ బాగా తెలుసు' అంటూ మీడియాకు సారీ చెప్పాడు. కాగా గతంలో పుష్ప ప్రమోషన్స్‌లోనూ అల్లు అర్జున్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మాకు చెప్పిన టైం ఒకటైతే మీరు వచ్చిన టైం ఇంకోటి అంటూ కన్నడ పాత్రికేయులు బన్నీని నిలదీశారు. దానికతడు చార్టెడ్ ఫ్లైట్ టేకాఫ్ ప్రాబ్లమ్ అవడంతోనే లేట్ అయిందని కారణం చెప్తూనే అందరికీ సారీ చెప్పాడు. సారీ చెప్పడం వల్ల మనిషి ఎదుగుతాడు కానీ తగ్గడు అని పేర్కొన్నాడు. అయితే అప్పట్లో బన్నీని అలా క్వశ్చన్ చేసినందుకు ప్రతీకారంగా తెలుగు మీడియా యశ్‌ను నిలదీసిందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. Looks like revenge😂 pic.twitter.com/ZgrzlrK1lZ — AK. (@flawsomedamsel) April 11, 2022 చదవండి: శ్రీవారిని దర్శించుకున్న కన్నడ హీరో యశ్ ఐటం సాంగ్ కోసం భారీగా డిమాండ్ చేస్తున్న బుట్టబొమ్మ -
ఈ వారం థియేటర్, ఓటీటీలో రచ్చ చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్
Upcoming Movies Web Series Theatres And OTT April 3rd Week: 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్', గని తర్వాత మరో రెండు భారీ సినిమాలు ప్రేక్షకులను, మూవీ లవర్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఒకటి కన్నడకు, మరొకటి కోలీవుడ్‌కు చెందిన సినిమాలైన తెలుగులోనూ వాటికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఆ సినిమాల్లోని హీరోలే. అవును. వారే 'కేజీఎఫ్'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరో యశ్ ఒకరైతే, తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ మరొకరు. వీరిద్దరు నటించిన చిత్రాలు ఈ వారంలో థియేటర్లలో హల్చల్ చేయనున్నాయి. మరీ ఆ చిత్రాలేంటీ.. విడుదల ఎప్పుడు అనే విషయాలతోపాటు ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటో చూద్దాం. 1. బీస్ట్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా విభిన్న కథలతో అలరిస్తున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'బీస్ట్'. ఈ సినిమా నుంచి విడుదలైన 'అరబిక్ కుత్తు' సాంగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఆడియెన్స్‌లో అంచనాలను పెంచేసింది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఏప్రిల్ 13న ఈ మూవీ విడుదల కానుంది. 2. కేజీఎఫ్: చాప్టర్ 2 'కేజీఎఫ్ 1'లో గరుడను రాకీ భాయ్ చంపే విధానం ప్రేక్షకులను ఎంతో ఆశ్చర్యపరిచింది. అయితే గరుడ మరణాంతరం ఏం జరిగింది ? గరుడ తర్వాత కేజీఎఫ్‌ను దక్కించుకునేందుకు అధీర ఏం చేశాడు ? అనే ప్రశ్నలతో 'కేజీఎఫ్: చాప్టర్ 2' ప్రేక్షుకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచింది. ఈ ఉత్కఠకు తెరదింపుతూ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ 'కేజీఎఫ్ 1' దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఇదే రోజున బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన 'జెర్సీ' విడుదల కావాల్సింది. కానీ 'కేజీఎఫ్ 2', 'బీస్ట్' చిత్రాలను దృష్టిలో పెట్టుకుని తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఓటీటీలో అలరించే సినిమాలు, వెబ్ సిరీస్‌లు 1. ఆడవాళ్లు మీకు జోహార్లు: ఏప్రిల్ 14 (సోనిలివ్) 2. గాలివాన (వెబ్ సిరీస్): ఏప్రిల్ 14 (జీ5) 3. దహనం: ఏప్రిల్ 14 (ఎంఎక్స్ ప్లేయర్) 4. బ్లడ్ మేరీ: ఏప్రిల్ 15 (ఆహా) చదవండి: సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే.. -
యశ్, విజయ్ ఎఫెక్ట్, వెనక్కి తగ్గిన షాహిద్ కపూర్
Shahid Kapoor Jersey Postponed New Release Date Here: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను 'కబీర్ సింగ్'గా రీమెక్ చేసిన తర్వాత షాహిద్ చేస్తున్న మరో రీమెక్ చిత్రం ఇది. నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే విడుదలకు ఇంకా 3 రోజులు ఉందనగా మరోసారి జెర్సీని పోస్ట్‌పోన్ చేస్తూ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. చదవండి: స్టార్ హీరో అయ్యుండి ఇలా చేస్తారనుకోలేదు: విజయ్‌పై పూజా కామెంట్స్ ఇదే వారం పాన్ ఇండియా చిత్రాలు కేజీఎఫ్ 2, బీస్ట్‌లు విడుదల అవుతోన్న నేపథ్యంలో జెర్సీ టీం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జెర్సీ పోస్ట్‌పోన్ అయిందని, ఏప్రిల్ 22కు ఈ మూవీని వాయిదా వేసినట్లు తాజాగా సినీ విశ్లేషకుడు తరణ్ అదర్శ్ ట్వీట్ చేశాడు. ‘ఎక్స్‌క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్.. జెర్సీ మరో వారానికి వాయిదా పడింది. నిన్న(ఆదివారం) రాత్రి మేకర్స్ ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 22 ఏప్రిల్ 22న జెర్సీ థియేటర్లోకి రానుంది’ అంటూ తరణ్ ఆదర్శ్ రాసుకొచ్చాడు. కాగా క్రికెటర్‌గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి ఏం చేశాడు? 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ బ్యాట్ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆటలో గెలిచాడా? జీవితంలో గెలిచాడా? అనే ఎమోషనల్ అంశాలతో తెరకెక్కించిన సినిమా జెర్సీ. #Xclusiv... BREAKING NEWS... #Jersey POSTPONED by one week... Will arrive in *cinemas* on 22 April 2022... The stakeholders arrived at the decision late last night. pic.twitter.com/7ZY5JU4zQV — taran adarsh (@taran_adarsh) April 11, 2022 చదవండి: RK Roja: కామెడీ షో జబర్దస్త్‌కు ఆర్కే రోజా గుడ్‌బై -
శ్రీవారిని దర్శించుకున్న హీరో యశ్ అండ్ కేజీఎఫ్ 2 టీం
కన్నడ హీరో, రాక్‌స్టార్ యశ్, కేజీఎఫ్ 2 చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ టీం తీర్థ యాత్రలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం వీఐపీ దర్శనంలో కేజీఎఫ్ 2 హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్, మూవీ టీం స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించగా.. అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే నిన్న(ఆదివారం) ధర్మస్థల మంజునాథ్‌స్వామి, కుక్కే సుబ్రమణ్య స్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట కేజీఎఫ్– 2 బృందం ఉన్నారు. యశ్‌ను చూసిన భక్తులు ఆయనతో ఫోటో దిగడానికి ఎగపడ్డారు. ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడ ఎదురు చూస్తున్న మీడియాతో మాట్లాడకుండా కుక్కెకి వెళ్లిపోయారు. ఈ నెల 14న కేజీఎఫ్–2 దేశవ్యాప్తంగా విడుదలవుతున్న తరుణంలో చిత్రబృందం పుణ్యక్షేత్రాలను దర్శిస్తోంది. -
గత 20 ఏళ్లుగా ఎన్టీఆర్ అభిమానిని: కేజీఎఫ్ డైరెక్టర్
Prashanth Neel Says He Is Jr Ntr For 20 Years: మామూలు సినిమాగా వచ్చి రికార్డులెన్నో బద్దలు కొట్టిన చిత్రం 'కేజీఎఫ్'. ఆ సినిమా చూసిన ఆడియన్స్ దానికి సీక్వెల్ ఎప్పుడెప్పుడూ వస్తుందా? అని వేయి కళ్లతో ఎదురుచూశారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడనుంది. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా 'కేజీఎఫ్: చాప్టర్ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఇంతలా క్రేజ్ సంపాదించుకోవడానికి యశ్ యాక్టింగ్ ఒక కారణమైతే.. ఆ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరో ప్రధాన కారణం. ఈ ఒక్క సినిమాతో అటు యశ్, ఇటు ప్రశాంత్ నీల్ సూపర్ పాపులర్ అయ్యారు. దీంతో ప్రశాంత్ నీల్‌కు వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో 'సలార్' తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: కేజీఎఫ్‌తో పాటు ‘సలార్’, ఆడియన్స్‌కి ప్రశాంత్ నీల్ డబుల్ ట్రీట్ ఆ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో సినిమా గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ 'నేను గత 15, 20 ఏళ్లుగా ఎన్టీఆర్ అభిమానిని. మేము స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించాక 10 - 15 సార్లు కలిశాం. ఆయనకు స్క్రిప్ట్ నచ్చడంతో దానిపై పూర్తిగా వర్క్ చేస్తున్నాను. మేము గత రెండేళ్లుగా సన్నిహితులం. ఈ సినిమా గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను. దయచేసి అది ఏ జోనర్ అని నన్ను అడగొద్దు' అని తెలిపాడు. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. The only soil that is worth remembering is the one soaked in blood!! Cant wait to make this one with the one and only force @tarak9999#NTR31 it is!! Wishing you a safe birthday brother 💫 Wishing for a successful collaboration @MythriOfficial @NTRArtsOfficial.#HappyBirthdayNTR pic.twitter.com/jtfYbZ1LCE — Prashanth Neel (@prashanth_neel) May 20, 2021 చదవండి: ప్రభాస్ హైఓల్టేజ్ యాక్షన్ సీన్స్.. అన్ని కోట్ల ఖర్చు -
కేజీఎఫ్2 ఫస్ట్ రివ్యూ: వరల్డ్ క్లాస్ మూవీ.. క్లైమాక్స్ చూసి షాకవుతారు!
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఎన్నో రికార్డులను సృష్టించింది. దాదాపు 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సినీ చరిత్రలో సరికొత్త రికార్డుని నెలకొల్పింది. ఇక ఇప్పుడు అందరి చూపు కేజీఎఫ్ చాప్టర్ 2 పైన పడింది. మరో నాలుగు రోజుల్లో..అంటే ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘కేజీఎఫ్’ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ ఒక్క చిత్రంతోనే యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 భారీ అంచనాలు పెంచుకోవడం సహజం. అందుకు తగ్గట్టుగానే సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించామని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. దీంతో కేజీఎఫ్ 2 విడుదల కోసం సీనీ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఎలాంటి సంచనాలు సృష్టిస్తుంది? ఆర్ఆర్ఆర్ రికార్డుని బద్దలు కొడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఈ సినిమా ఫస్ట్ రివ్యూ అంటూ ఐదు స్టార్లు ఇచ్చాడు ఓ సినీ క్రిటిక్. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిని అని తనకు తాను డప్పు కొట్టుకునే ఉమైర్ సంధు సినిమా రిలీజ్‌కు ముందే కేజీఎఫ్2 చూశానంటూ సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చేశాడు. కేజీఎఫ్ కేవలం కన్నడ బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదని.. ఇదొక వరల్డ్ క్లాస్ మూవీ అని ప్రశంసల జల్లు కురిపించాడు. ‘కేజీఎఫ్ 2 కన్నడ ఇండస్ట్రీకి కిరీటం లాంటింది. సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు.. ప్రతి సీన్ అదిరిపోయింది. యాక్షన్ సీన్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. డైలాగ్స్ చాలా షార్ప్‌గా, ఎఫెక్టివ్‌గా ఉన్నాయి. సంగీతం బాగుంది. బీజీఎం అయితే అదిరిపోయింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమాలో ప్రతి ఒక్కరి నటన చాలా టెరిఫిక్‌గా ఉంది. కేజీఎఫ్ 2 కేవలం శాండల్‌వుడ్ బాక్ల్‌బస్టర్ మాత్రమే కాదు.. ఇదొక వరల్డ్ క్లాస్ మూవీ. యశ్, సంజయ్ దత్‌లు తమదైన నటనతో ఆకట్టుకున్నారు. క్లైమాక్స్ అయితే అందరికి షాకిస్తుంది’అని ఉమైర్ సంధు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో శ్రీనిధి హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
చెన్నైలో సందడి చేసిన కేజీఎఫ్–2 టీం
తమిళ సినీ పరిశ్రమలోని వారంతా శ్రమజీవులని కన్నడ రాకింగ్ స్టార్ యష్ అన్నారు. కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ఈయన తాజాగా కేజీఎఫ్‌కు సీక్వెల్లో నటించారు. శ్రీనిధి శెట్టి, బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, నటి రవీనా టాండన్, ప్రకాష్‌రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ నెల 14న పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. దీనిని తమిళనాట డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ అధినేత ఎస్.ఆర్.ప్రభు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించింది. యష్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం తన మిత్రుడు విశాల్ ద్వారా కేజీఎఫ్ మొదటి భాగాన్ని విడుదల చేశామన్నారు. ఆ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన వారందరూ చాలా శ్రమజీవులని పేర్కొన్నారు. కేజీఎఫ్–2ను చాలా మంది అనువాద చిత్రంగా భావిస్తున్నారని, అయితే దీనిని ప్రతి వెర్షన్లోనూ భాషను గౌరవించి రూపొందించినట్లు తెలిపారు. -
కేజీఎఫ్‌తో పాటు ‘సలార్’ గ్లింప్స్, ఆడియన్స్‌కి ప్రశాంత్ నీల్ డబుల్ ట్రీట్
Salaar Movie Glimpse With Yash KGF 2: డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆడియన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట. ఆయన తెరకెక్కించిన కేజీఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ 14 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ విడుదల రోజే ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. కేజీఎఫ్ ప్రదర్శిస్తోన్న అన్ని థియేటర్లలో సలార్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ ఇచ్చేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ తాజా బజ్ ప్రకారం ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2తో పాటు ప్రభాస్ సలార్ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. చదవండి: బన్నీకి మెగాస్టార్ క్రేజీ విషెస్, కొద్ది క్షణాల్లోనే వేలల్లో లైక్స్ ఈ రెండు చిత్రాల డైరెక్టర్ ఒక్కడే కావడంతో ఈ వార్తలు జోరందుకున్నాయి. ఇది తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కాగా కేజీఎఫ్ మూవీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీఎఫ్ 1 ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో దీనికి స్వీక్వెల్‌గా వస్తున్న కేజీఎఫ్ 2 మాస్ ప్రభంజనం సృష్టించడం ఖాయమంటున్నారు సినీ ప్రియులు. దీంతో వారం రోజుల్లో రిలీజ్ కాబోతోన్న ఈమూవీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొనగా, విడుదలకు ముందే ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న సలార్ అప్డేట్ ఇదే తెరపై రావడం ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులు నిజంగా డబుల్ ట్రీటే అవుతుంది. కేజీఎఫ్ 2లో యశ్‌కు జోడిగా శ్రీనిధి శెట్టి నటించగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టండన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: అంబులెన్స్‌లో బాలీవుడ్ కింగ్ ఖాన్, ఫొటో వైరల్ -
'కెజిఎఫ్' హీరో యష్‌కు అవమానం!
గత కొంత కాలంగా యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'కెజిఎఫ్ 2'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 14 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న రాకింగ్ స్టార్ యశ్ తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు చాలా అవమానింపబడ్డానని తెలిపాడు. స్కూల్లో తన స్నేహితులంతా భవిష్యత్తులో నువ్వేం అవుతావు అని ప్రశ్నించిన సమయంలో వారంతా డాక్టర్, ఇంజనీర్, లాయర్ అంటూ చెప్పేవారు. కానీ నేను మాత్రం సినిమా యాక్టర్ అవుతానని చెప్పేవాడిని. ఇక దాంతో అందరూ నన్ను చూసి నవ్వేవారు. వారంతా నన్ను అవమానించినట్లుగా మాట్లాడేవారు. అయితే ఆ సమయంలో తనను అలా ఎవరు అవమానించి మాట్లాడినా నేను మాత్రం అనుకున్నట్లుగానే నటుడిని అయ్యేందుకు ప్రయత్నాలు చేశాను. చివరికి మీ ముందు ఇలా నటుడిగా ఉన్నానంటూ హీరో యశ్ చెప్పుకొచ్చాడు. -
రాఖీభాయ్‌తో పోరుకు విజయ్, షాహిద్ సై.. విజయం ఎవరిది?
ఏప్రిల్ 14న తుపాన్ వేగంతో వస్తున్నాడు రాఖీభాయ్. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్ అభిమానులను అదే రోజు పలకరించనున్నాడు. మొదటి భాగాన్ని మించి రెండో భాగం ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పడం.. అందుకు తగ్గట్టే టీజర్, ట్రైలర్ , సాంగ్స్ ఉండడంతో కేజీఎఫ్2పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అయితే రాఖీభాయ్‌ని ఢీ కొట్టేందుకు ఇటు విజయ్, అటు షాహిద్ కపూర్ రెడీ అవుతున్నారు. కేజీఎఫ్ 2 విడుదలకు ఒక్క రోజు ముందే.. అంటే ఏప్రిల్ 13న విజయ్ కొత్త చిత్రం ‘బీస్ట్’ థియేటర్స్‌లోకి రాబోతుంది. పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు విజయ్. ఈ చిత్రంలోని ‘అరబిక్ కత్త’సాంగ్ బ్లాక్ బస్టర్ కావడం, ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా బంపర్ హిట్ కొట్టడంతో రాఖీభాయ్ వసూళ్లకు బీస్ట్ పెద్ద ఎత్తున గండి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు బాలీవుడ్ లో రాఖీభాయ్ స్పీడ్ కు గట్టిగానే బ్రేకులు వేస్తానంటున్నాడు షాహిద్ కపూర్. గతంలో నాని నటించిన సూపర్ హిట్ ఫిల్మ్, అతని కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేసాడు షాహిద్ కపూర్.తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని ఇంకాస్త బెటర్ గా, బాలీవుడ్ ఆడియెన్స్ ను అలరించే విధంగా తెరకెక్కించాడు.రీసెంట్ గా రిలీజైన న్యూ ట్రైలర్ బాగా ఇంప్రెస్ చేస్తోంది. కేజీఎఫ్ 2 రిలీజ్ అవుతున్న రోజే(ఏప్రిల్ 14) జెర్సీ కూడా థియేటర్స్ లోకి వస్తోంది.కబీర్ సింగ్ తర్వాత షాహిద్ కపూర్ కనిపిస్తున్న సినిమా కావడంతో, కేజీఎఫ్ 2 కలెక్షన్స్ కు ఈ చిత్రం కూడా కొంత కోత పెట్టే అవకాశాలు బాగానే ఉన్నాయి. చదవండి: ఆన్సర్ షీట్లో 'పుష్ప' డైలాగ్స్ రాసిన టెన్త్ స్టూడెంట్ విజయ్ బీస్ట్ గా మారినా,షాహిద్ కపూర్ బ్యాట్ తో క్రికెట్ ఆడినా తాను సృష్టించే విధ్వంసం ముందు తక్కువే అంటున్నాడు రాఖీభాయ్.ప్రశాంత్ నీల్ లాంటి మెగా మేకర్ అండతో,కనివిని ఎరుగని వయలెన్స్ తో కేజీఎఫ్ 2 ఆడియెన్స్ ను మైండ్ బ్లాక్ చేస్తోందనే నమ్మకంగా ఉన్నాడు హీరో యశ్. పైగా అధీర పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తుండటం తనకు అదనపు బలంగా చెప్పుకొస్తున్నాడు రాఖీభాయ్. మరి ఈ బాక్సాఫీస్ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. -
KGF Chapter 2: ఆకట్టుకుంటున్న అమ్మ పాట
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై రికార్డులు సృష్టించిన చిత్రం ‘కేజీఎఫ్’. ఈ ఒక్క సినిమా.. కన్నడ హీరో యశ్ని పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి అమ్మ పాట (వాయిస్ ఆఫ్ ఎవ్రీ మదర్)ను విడుదల చేశారు. ‘ఎదగరా.. ఎదగరా’ అంటూ సాగే ఈ పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చిన ఈ పాటకి తెలుగులో రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, సుచేత బస్రూర్ అద్భుతంగా ఆలపించారు. ఈ సినిమాలో శ్రీనిధి హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
'కేజీఎఫ్ 2' Vs 'బీస్ట్'.. సినీ విశ్లేషకులు ఏమన్నారంటే ?
Yash KGF 2 Vijay Beast Trade Experts About Collections: ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన భారీ బడ్జెట్, బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25న విడుదలైన ఈ మూవీ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. తాజాగా ఈ ఏప్రిల్‌లో సినిమా ఆడియెన్స్‌ను మరో రెండు భారీ సినిమాలు కనువిందు చేయనున్నాయి. ఒకటి సెన్సేషనల్ హిట్ సాధించిన 'కేజీఎఫ్' సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం 'కేజీఎఫ్: చాప్టర్ 2'. ఇక మరొ మూవీ తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'బీస్ట్'. సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఉన్న 'కేజీఎఫ్ 2' ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్గా నటించిన 'బీస్ట్' ఒకరోజు ముందుగా ఏప్రిల్ 13న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తొలుత ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావాల్సింది. కానీ విజయ్ తన 'బీస్ట్' సినిమాను ఒక రోజు ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. అయితే ఈ రెండు భారీ సినిమాలు ఒక రోజు తేడాతో విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఎలా ఉండనున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళనాడు థియేటర్, మల్టీఫ్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుపూర్ ఎం సుబ్రమణ్యం మాట్లాడుతూ 'ఏప్రిల్ మధ్యలో రెండు భారీ బడ్జెట్ చిత్రాల విడుదల కారణంగా థియేటర్ యజమానులు రెండు సినిమాలకు స్క్రీన్ల సంఖ్యను తగ్గించవలసి వస్తుంది. కనీసం ఒక వారం గ్యాప్‌తో విడుదల చేసుంటే అటు నిర్మాతలకు, ఇటు థియేటర్ యజమానులకు మరింత లాభదాయకంగా ఉండేది.' అని తెలిపారు. 'ఎప్పుడైనా సరే ఒక పెద్ద సినిమా విడుదలనే అనువైనది. అయితే వివిధ భాషల్లో రిలీజవుతున్న కేజీఎఫ్ 2 మాతృక భాష కన్నడ, బీస్ట్ మాతృక భాష తమిళం కాబట్టి పెద్ద సమస్య ఏం ఉండకపోవచ్చు.' అని ట్రేడ్ నిపుణుడు రమేష్ బాలా పేర్కొన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ 2 పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. అయితే కేజీఎఫ్ 2, బీస్ట్ రిలీజ్ అంచనాలు పూర్తిగా భిన్నమైనవి. బీస్ట్ అనేది ప్రాథమికంగా ఒక తమిళ చిత్రం. ఇది ఇతర భాషల్లోకి డబ్ చేయబడింది. కానీ ఉత్తరాదిన విజయ్‌కు మంచి స్టార్డమ్ ఉంది. 'తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విజయ్‌కు ఉన్న ప్రజాదరణ కారణంగా బీస్ట్దే పైచేయి అవుతుందని భావిస్తున్నారు. అలాగే కన్నడ సినిమా అయినా కేజీఎఫ్ 1కు నార్త్తోలోనూ ఘన విజయం సాధించిన చరిత్ర ఉన్నందున కేజీఎఫ్ 2 కూడా మంచి పోటీ ఇవ్వనుందనే చెప్పవచ్చు.' అని బాలా తెలిపారు. 'గతంలో ఆర్ఆర్ఆర్ విడుదల సమయంలో తన పోటీదారులతో ఎలా పోరాడిందో పక్కనపెడితే కేజీఎఫ్ 2, బీస్ట్ ఒకేసారి విడుదల కానున్నాయి. వారాంతంలో ఈ సినిమాలకు మంచి బిజినెస్ ఉండనుంది. 2022 సంవత్సరంలో ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ వీకెండ్. ఎందుకంటే తమిళ నూతన సంవత్సరం, విషు పండుగతో సహా 5 రోజులు సెలవులు ఉన్నాయి. అలాగే ఇది వేసవి ప్రారంభం. మాకు తెలిసి వేసవిలో 5-10% ప్రేక్షకులు అదనంగా థియేటర్లకు వస్తారు. పండుగ రోజులు ఉండటం వల్ల రెండు చిత్రాలు మంచి కలెక్షన్లు సాధించే అవాకశం ఉంది. ఓపెనింగ్ డే కలెక్షన్ చాలా ముఖ్యమైనదని, ఈ కరోనా పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నందున సినిమా మరింత వాయిదా వేసి ఇతర తేదిల్లో విడుదల చేయడం ఉత్తమం.' అని పరిశ్రమ, ట్రేడ్ నిపుణుడు శ్రీధర్ పిళ్లై తెలిపారు. చదవండి: 'బీస్ట్' నుంచి మరో సాంగ్.. 'జాలీ ఓ జింఖానా' అంటూ విజయ్ సింగింగ్ -
కేజీఎఫ్ 2 ట్రైలర్: ‘వైలెన్స్.. వైలెన్స్..’ ఈ డైలాగ్ రాసింది ఆ స్టార్ హీరోనే
కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్-2. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్14న విడుదల కానున్న నేపథ్యంలో మార్చి 27 ఆదివారం కేజీఎఫ్ 2 ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ విడుదల అయితే ఇప్పుడ ఈ ట్రైలర్ అన్ని భాషల్లో రికార్డుల మోత మోగిస్తుంది. ఇందులో రాఖీ భాయ్ డైలాగ్స్ ప్రేక్షకులు సలాం కొడుతున్నారు. చదవండి: రెండు ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి ఈటీ మూవీ, స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే ట్రైలర్ ప్రారంభంలో యశ్ ‘వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్.. బట్.. వైలెన్స్ లైక్స్ మీ’ అంటూ చెప్పిన ఈ పవర్ ఫుల్ డైలాగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ యశ్ గురించిన ఆసక్తిర విషయం చెప్పాడు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ఈ మూవీకి ఓ స్టార్ హీరో కొన్ని డైలాగ్స్ రాశాడంటూ సీక్రెట్ రివీల్ చేశాడు. ఆయన ఎవరో కాదని కేజీఎఫ్ స్టార్ యశ్ అని చెప్పాడు. ప్రస్తుతం ఎంతో మందిని ఆకట్టుకుంటూ వైరల్‌గా మారిన ‘వైలెన్స్’ డైలాగ్ స్వయంగా యశ్(రాఖీ భాయ్) రాశాడంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇది తెలిసి ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. చదవండి: ఇప్పటికీ తగ్గని పుష్ప మేనియా, ఆ పాటకు అమెరికా అమ్మాయిల స్టెప్పులు ఇది మాత్రమే కాదు.. మూవీ కొసం యశ్ మరిన్ని డైలాగ్స్ కూడా రాసినట్లు ప్రశాంత్ వర్మ తెలిపాడు. కాగా ఈ ట్రైలర్ విడుదలైన 24గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్ వ్యూస్‌ను కొల్లగొట్టింది. ట్రైలర్‌కి కన్నడ భాషలో 18మిలియన్ వ్యూస్ రాగా.. తెలుగులో 20M, హిందీలో 51M, తమిళంలో 12M, మలయాళంలో 8M వ్యూస్ వచ్చాయి. 'రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్.. రాఖీకి ఇది ఇష్టం ఉండదు, అందుకు తప్పించుకుంటాడు. కానీ రికార్డ్స్ రాఖీని ఇష్టపడతాయి. అందుకే వాటి నుంచి తప్పించుకోలేడు' అంటూ మేకర్స్ బుధవారం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఆర్ఆర్ఆర్ రికార్డులు కొల్లగొట్టిన కెజిఎఫ్2
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న కెజిఎఫ్2 ట్రైలర్ రికార్డులు సృష్టిస్తుంది. దేశంలోనే విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ పొందిన ట్రైలర్‌గా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ప్రశాంత్‌నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కెజిఎఫ్ సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రీసెంట్గా విడుదలైన ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఒక్కరోజులోనే ఈ ట్రైలర్ అన్ని భాషల్లో రికార్డుల మోత మోగిస్తుంది.కేవలం 24గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్ వ్యూస్‌ను కొల్లగొట్టింది. ట్రైలర్‌కి కన్నడ భాషలో 18మిలియన్ వ్యూస్, తెలుగులో 20M,హిందీలో 51M, తమిళంలో 12M, మలయాళంలో 8మిలియన్ వ్యూస్ వచ్చాయి. 24గంటల్లోనే అత్యధిక వ్యూస్ పొందిన ట్రైలర్‌గా ఆర్ఆర్ఆర్కు 51.12M,రాధేశ్యామ్‌కు57.5M రాగా ఇప్పుడు ఆ రికార్డులను కెజిఎఫ్ కొల్లగొట్టింది. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందన్నది తెలియాలంటూ ఏప్రిల్ 14వరకు వేచి చూడాల్సిందే. Records.. Records.. Records..💥 Rocky don't like it, He avoids, But Records likes Rocky! He Cannot avoid it. 𝟏𝟎𝟗 + 𝐌𝐢𝐥𝐥𝐢𝐨𝐧 𝐕𝐢𝐞𝐰𝐬 𝐢𝐧 𝟐𝟒 𝐇𝐨𝐮𝐫𝐬 ♥️🙏 Kannada: 18M Telugu: 20M Hindi: 51M Tamil: 12M Malayalam: 8M#KGFChapter2Trailer #KGFChapter2 pic.twitter.com/n6pspljdxj — Hombale Films (@hombalefilms) March 28, 2022 -
‘కెజిఎఫ్-2’ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
ఆఫర్ క్లోజెస్ సూన్.. ఇప్పుడు కె.జి.యఫ్ 2 వంతు
హైదరాబాద్: మిగిలింది మూడు రోజులే.. మీ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ చాలానాలను మార్చ్ 31వ తారీఖులోపు చెల్లించండి. అవకాశాన్ని నిర్లక్ష్యంతో చేజార్చు కోకండి. ప్రభుత్వం ఇచ్చిన రాయితీని సద్వినియోగం చేసుకోండి. ఆలస్యం చేయకు మిత్రమా అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అంటూ కె.జి.యఫ్ ఛాప్టర్ 2 ట్రైలర్‌లోని ఆఫర్ క్లోజెస్ సూన్ డైలాగ్ మీమ్‌ను వాడేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. వాహనదారులు.. సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికీ కూడా వాహనాల చలాన్లను క్లియర్ చేసుకోకుంటే.. వెంటనే ఆన్లైన్లో చెల్లించండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ శాఖ ఇచ్చిన భారీ డిస్కౌంట్ల ఆఫర్ ముగిసిపోనుంది కాబట్టి. ఇప్పటికే తెలంగాణలో 50 శాతం ఛలాన్లు క్లియర్. హయ్యెస్ట్ ఎవరంటే.. ప్రత్యేకించి.. హైదరాబాద్ సిటీలో పెండింగ్ చలాన్లలో టూ వీలర్స్ టాప్‌లో ఉన్నాయి. ఓ స్కూటర్ ఓనర్‌కు.. అత్యధికంగా 178 చలాన్లు ఇంకా ఉన్నాయట. హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు ఆయనకి ఈ చలాన్లు ఎక్కువగా పడ్డాయట. ఇక ఆగస్టు 2019 నుండి ఇప్పటివరకు 178 చలాన్ల మొత్తం 48,595 రూపాయలుగా ఉంది. రాయితీ పోను అతను చెల్లించాల్సి వచ్చేది కేవలం రూ. 12,490 మాత్రమే. మరో బైకర్‌కు రూ.73,690 చలాన్లు ఉన్నాయట. అతను ప్రత్యేక రాయితీని ఉపయోగించుకుని 19,515 చెల్లిస్తే సరిపోతుంది. మరి వాళ్లు ఉపయోగించుకుంటారో లేదో? చూడాలి. -
కెజిఎఫ్ 2: రికార్డుల మోత మోగిస్తున్న ట్రైలర్
కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్-2. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం నిన్న(ఆదివారం) ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒక్కరోజులోనే ఈ ట్రైలర్ అన్ని భాషల్లో రికార్డుల మోత మోగిస్తుంది. కేవలం 24గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్ వ్యూస్‌ను కొల్లగొట్టింది. ట్రైలర్‌కి కన్నడ భాషలో 18మిలియన్ వ్యూస్, తెలుగులో 20M,హిందీలో 51M, తమిళంలో 12M, మలయాళంలో 8మిలియన్ వ్యూస్ వచ్చాయి. 'రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్.. రాఖీకి ఇది ఇష్టం ఉండదు, అందుకు తప్పించుకుంటాడు. కానీ రికార్డ్స్ రాఖీని ఇష్టపడతాయి. అందుకే వాటి నుంచి తప్పించుకోలేడు' అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. Records.. Records.. Records..💥 Rocky don't like it, He avoids, But Records likes Rocky! He Cannot avoid it. 𝟏𝟎𝟗 + 𝐌𝐢𝐥𝐥𝐢𝐨𝐧 𝐕𝐢𝐞𝐰𝐬 𝐢𝐧 𝟐𝟒 𝐇𝐨𝐮𝐫𝐬 ♥️🙏 Kannada: 18M Telugu: 20M Hindi: 51M Tamil: 12M Malayalam: 8M#KGFChapter2Trailer #KGFChapter2 pic.twitter.com/n6pspljdxj — Hombale Films (@hombalefilms) March 28, 2022 -
ఆ క్రెడిట్ నాకు వద్దు.. యష్ షాకింగ్ కామెంట్స్!
గత కొంత కాలంగా యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'కెజిఎఫ్ 2'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 14 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా బెంగుళూరులో జరిగిన 'కెజిఎఫ్ 2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్ర బృందం పాల్గొంది. ఇందులో భాగంగా ఈ వేదికపై హీరో యష్ మాట్లాడుతూ ఈ చిత్రంపై పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వేదికపై మొదట దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్‌కి హీరో యష్ నివాళులు అర్పించాడు. అనంతరం యష్ మాట్లాడుతూ.. ఈ చిత్రం మా ఎనిమిదేళ్ల కష్టం. దీని కోసం లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు అందరూ చాలా కష్టపడ్డారు. వారి చెమట, రక్తాన్ని చిందించి మరీ ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అయితే ప్రతి ఒక్కరూ సినిమా చూసిన తరువాత ఆ క్రెడిట్ నాకు ఇస్తున్నారు. కానీ అది సరికాదు. 'కేజీఎఫ్' మొత్తం కన్నడ సినిమాకే గర్వకారణం. ఈ చిత్రం నాది కాదు ఇది ప్రశాంత్ నీల్ సినిమా. ఆ క్రెడిట్ అంతా కేవలం ప్రశాంత్ నీల్‌కే చెందాలి. కేవలం అతని వల్లనే ఇది సాధ్యమైంది. నేను ఈ చిత్రంలో నటించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని హీరో యష్ తెలిపారు. -
ఆసక్తికర సన్నివేశాలతో ‘కేజీఎఫ్ 2’ ట్రైలర్, ఫ్యాన్స్‌కు పండగే..
కన్నడ హీరో యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కేజీయఫ్'. ఈ మూవీ మొదటి భాగం ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ ఒక్క సినిమాతో యశ్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవల చిత్రం బృందం తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను బర్త్‌డే బాయ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశాడు. ‘కేజీఎఫ్‌లో గరుడను చంపేసిన తర్వాత ఏం జరిగింది..? మీరు చదువుతారా..?’ అనే సంభాషణలతో షురూ అయింది ట్రైలర్. ‘రక్తంతో రాసిన కథ ఇది. సిరాతో ముందుకు తీసుకెళ్లలేం. ముందుకెళ్లాలంటే మళ్లీ రక్తాన్నే అడుగుతుంది..’అని ప్రకాశ్ రాజ్ చెబుతున్న సంభాషణలు సినిమాను రక్తికట్టించేలా సాగుతున్నాయి. ‘కత్తి విసిరి రక్తం చిందించి యుద్దం చేసేది నాశనానికి కాదు.. ఉద్దరించడానికి’ అంటూ అధీరాగా సంజయ్ దత్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. కాగా ఈ ట్రైలర్ కన్నడ వెర్షన్‌ను స్టార్ హీరో శివరాజ్ కుమార్, హిందీ ట్రైలర్‌ను బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్, తమిళ వెర్షన్‌ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మలయాళ ట్రైలర్‌ను పృథ్విరాజ్ సుకుమారన్ విడుదల చేశారు. కాగా హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ తెరకెక్కిస్తున్న కేజీఎఫ్ 2లో బాలీవుడ్ యాక్టర్లు రవీనా టండన్, సంజయ్ దత్‌తోపాటు కన్నడ నటి శ్రీ నిధి శెట్టి, టాలీవుడ్ నటులు రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
'కేజీఎఫ్ 2'కి పోటీగా విజయ్ 'బీస్ట్'..!
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం 'బీస్ట్'. ఇక తాజాగా 'బీస్ట్' విడుదల తేది గురించి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది చిత్ర బృందం. ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం నుంచి విడుదలైన 'అరబిక్ కుతు' లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. త్వరలోనే 200 మిలియన్ వ్యూస్ మైలురాయిని చేరనుంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 14న మరో పాన్ ఇండియా చిత్రం 'కేజీఎఫ్ 2' విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. కాగా 'కెజియఫ్' చిత్రం పాన్ ఇండియా లెవల్లో పెద్ద హిట్ కావడంతో 'కేజీఎఫ్ 2' పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. మార్చి 27న ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేయనున్నట్టు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల ఓ ట్వీట్లో పేర్కొన్నాడు. అయితే ఒకేసారి ఇద్దరు పెద్ద స్టార్ హీరోల సినిమాలు విడుదల కావడం వల్ల కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. There is always a thunder before the storm!#KGFChapter2 Trailer on March 27th at 6:40 pm. Stay Tuned: https://t.co/grk8SQMTJe@Thenameisyash @VKiragandur @hombalefilms @HombaleGroup @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @bhuvangowda84 @RaviBasrur #KGF2TrailerOnMar27 pic.twitter.com/CYcWx9vK1j — Prashanth Neel (@prashanth_neel) March 3, 2022 -
'కేజీయఫ్ 2' 'తూఫాన్' వచ్చేసింది.. అతనికి అడ్డు నిలబడకండి సార్..
Toofan Lyrical Song Released From Yash KGF 2 Movie: కన్నడ హీరో యష్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కేజీయఫ్'. ఈ మూవీ మొదటి భాగం ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ ఒక్క సినిమాతో యష్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న కేజీయఫ్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, పోస్టర్లకు విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ కేజీయఫ్ 2 సినిమా నుంచి 'తూఫాన్.. తూఫాన్' అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాటలో రాకీ ధైర్యం గురించి ఒక పెద్దాయన చెబుతాడు. మీకొక సలహా ఇస్తాను.. మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్... అంటూ సాంగ్ ప్రారంభమవడం ఆకట్టుకుంటోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా అలరించనుంది. ఇతర పాత్రల్లో రావు రమేష్, రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ సందడి చేయనున్నారు. ఈ మూవీని హొంబాలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మించింది. -
యశ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, కేజీయఫ్ 2 ట్రైలర్‌కు డేట్ ఫిక్స్!
KGF Chapter 2 Trailer Release Date: కేజీయఫ్.. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ దాని క్రేజ్ అలాగే ఉంది. కేజీయఫ్ మూవీ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోయేవాళ్లు చాలామందే ఉన్నారు. వందకోట్లకు పైగా కలెక్షన్లు సాధించి కన్నడ ఇండస్ట్రీ పేరు మార్మోగిపోయేలా చేసిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది కేజీయఫ్ 2. కరోనా వల్ల కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదలవుతోంది. ఈ క్రమంలో తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. మార్చి 27న సాయంత్రం 6.40 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రాఖీ భాయ్ యశ్ గుర్రుగా చూస్తున్న ఫొటోతో ఓ పోస్టర్ వదిలింది. కాగా ఇప్పటికే కేజీయఫ్ 2 నుంచి టీజర్ విడుదలవగా దీనికి 240 మిలియన్ల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. టీజర్‌కే యూట్యూబ్‌ను దద్దరిల్లేలా చేసిన ఫ్యాన్స్ ట్రైలర్ రిలీజయ్యాక ఇంకెంత హంగామా చేస్తారో! ఈసారి కేజీయఫ్ 2 ట్రైలర్ ఇంకెన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి! ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి, ప్రకాశ్ రాజ్, రవీనా టండన్, రావు రమేశ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. విజయ్ కిరంగదూర్ నిర్మిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందించారు. There is always a thunder before the storm ⚡#KGFChapter2 Trailer on March 27th at 6:40 pm. Stay Tuned: https://t.co/QxtFZcv8dy@Thenameisyash @prashanth_neel@VKiragandur @hombalefilms @HombaleGroup @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 #KGF2TrailerOnMar27 pic.twitter.com/4TBuGaaUKh — Hombale Films (@hombalefilms) March 3, 2022 -
శ్రీ వినాయక టెంపుల్లో కేజీఎఫ్ మూవీ టీం ప్రత్యేక పూజలు, వీడియో వైరల్
కేజీఎఫ్ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి అంచాలు లేకుండా విడుదలై.. ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించిన సినిమా ఇది. ఈ ఒక్క సినిమాతోనే కన్నడ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అన్ని భాషల ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: మెసేజ్‌లు చేస్తూ డబ్బులు అడుగుతున్న అనుపమ!, హీరోయిన్ క్లారిటీ ఈ నేపథ్యంలో ఏప్రిల్14న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో పాటు తదితరులు కర్ణాటకలోని కొల్లూర్ శ్రీ మూకాంబికా టెంపుల్, ఉడిపిలోని అనెగుడ్డే వినాయక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ మూవీని సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. చదవండి: వైరల్‌గా ప్రభాస్ ‘ఆది పురుష్’ న్యూ లుక్! శ్రీరాముడిగా ‘డార్లింగ్’ను చూశారా? Yash and KGF team in anegudde temple#KGFChapter2 #KGF2 #KGF2onApr14 #Yash @TheNameIsYash pic.twitter.com/HJigcajUpi — K.G.F ANALYST🕵🏼♂️ (@KGFAnalyst) February 1, 2022 -
దటీజ్ యశ్.. ఒకప్పుడు తిండిలేదు.. బస్టాండ్‌లో నిద్ర.. అదే చోట భారీ కటౌట్
యశ్.. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అయిన హీరో. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే స్టార్ హీరోగా ఉన్న ఈయన.. కేజీఎఫ్ సినిమా తర్వాత నేషనల్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్రం సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఒక్క సినిమాతో యశ్‌కు అన్ని భాషల్లో అభిమానులు పెరిగిపోయారు. ఈ రోజు యశ్ 36వ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. కేజీఎఫ్ సినిమాలో ఎలా అయితే రాకీ భాయ్ ఒక్కో మెట్టు ఎక్కి డాన్ అయ్యాడో.. అచ్చం అలానే యశ్ కూడా సామాన్యుడి నుంచి స్టార్ దాకా ఎదిగాడు. యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. అభిమానులు ముద్దుగా రాకింగ్ స్టార్ అని పిలుసుకుంటారు. జనవరి 8, 1986 న కర్ణాటకలోని హసన్ జిల్లాలోని ఒక చిన్న పట్టణంలో జన్మించాడు యశ్.అతని తండ్రి కేఎస్ ఆర్టీసీ రవాణా సేవలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే యశ్‌కి పిచ్చి. మైసూర్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరువాత వెంటనే సినీమాలో అవకాశం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇంట్లో వాళ్లని ఒప్పించి మూడు వందల రూపాయలతో బెంగళూరు వచ్చాడట. బంధువులు ఇంటికి వెళ్లలేక కెంపెగౌడ బస్టాండ్‌లో చాలా రాత్రులు గడిపాడట. ఏదో ఒకరోజు అక్కడ తన కటౌట్ ఉండాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడట. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని సీరియల్స్ అవకాశాలు సంపాదించుకున్నాడు. ఆ తరువాత సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. 2008 లో తన భార్య రాధిక పండిట్ సరసన మోగ్గినా మనసు చిత్రంతో కన్నడ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అంతేక ఆదు యశ్‌కు మొదటి ఫిలింఫేర్ అవార్డును సంపాదించింది. ఇక 2016 లో తన మొదటి సినిమా హీరోయిన్ రాధిక పండిట్‌ను పెళ్లిచేసుకోగా, వీరికి ఇద్దరు సంతానం. ఐరా అనే కూతురు, యథర్వ్ అనే కొడుకు ఉన్నారు. కూతురు ఐరా 2018 డిసెంబర్లో జన్మించగా.. 2019 అక్టోబర్‌లో ఈ జంట యథర్వ్ కు జన్మనిచ్చింది. కేజీఎఫ్ మూవీతో తిరుగులేని హీరోగా అవతరించాడు యశ్. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రూ .200 కోట్ల వసూళ్లు చేసిన మొదటి కన్నడ నటుడుగా నిలిచాడు. కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ తర్వాత యష్ ప్రతి ప్రాజెక్టుకు రూ .15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు..తను ఏ బస్టాండ్‌లో అయితే ఆకలితో నిద్రలేని రాత్రులు గడిపాడో.. అదే బాస్టాండ్(కెంపెగౌడ బస్టాండ్)లో యశ్‌కు 216 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు అభిమానులు. యశ్ 34వ బర్త్‌డే సందర్భంగా ఈ భారీ కటౌట్లో పాటు.. ఏకంగా 5వేల కేజీల భారీ కేకును తీసుకొచ్చారు. అప్పట్లో అది రికార్డుకెక్కింది. ఇండియా వరల్డ్ రికార్ట్స్ యష్ బర్త్ డే కేకును ‘వరల్డ్ బిగ్గెస్ట్ సెలబ్రిటీ బర్త్ డే కేకు’ప్రకటించింది. ఇక గతేడాది విడుదలైన కేజీఎఫ్ 2 టీజర్ రికార్డులు సృష్టిస్తుంది. తక్కువ సమయంలో మిలియన్స్‌కు పైగా వ్యూస్ రాబడుతూ రికార్డులు కొల్లగొడుతుంది.దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ మూవీలో సంజయ్ దత్, రవీనాటాండన్, రావు రమేష్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ కిరాగండూర్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా… రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 14న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా యశ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో యశ్ సీరియస్ గా కన్పిస్తుండగా, ఆయన ముందు “కాజన్, డేంజర్ ఎహెడ్” అనే బోర్డు కన్పిస్తోంది. మా రాఖీభాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మేకర్స్ ఈ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. -
కేజీఎఫ్ 2లో ఆ వింటేజ్ సాంగ్ రీమిక్స్.. హీరోయిన్ ?
KGF 2 Movie Team Remixed A Super Hit Song With Yash: కేజీఎఫ్ సినిమా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరలం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. రికార్డులను తిరగరాసిన సినిమా అది. ఈ ఒక్క సినిమాతో కన్నడ హీరో యశ్.. పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. వాటికి తగినట్లుగా ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ఉన్నాయి. తాజాగా ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ చక్కర్లు కొడుతుంది. సినిమా మొదటి భాగం హిందీ వెర్షన్లో 'త్రిదేవ్' చిత్రంలోని జాకీ ష్రాఫ్, సోనమ్ నర్తించిన 'గలీ గలీ మే' పాటను రీమిక్స్ చేశారు మేకర్స్. ఈ సాంగ్‌లో బుల్లితెర హాట్ బ్యూటీ మౌనీ రాయ్ నర్తించి ఆకట్టకుంది. తెలుగులో మాత్రం 'దోచెయ్' అంటూ తమన్నాతో ఐటమ్ సాంగ్ చేయించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అలాగే ఇప్పుడు కేజీఎఫ్ 2 చిత్రానికి ఒక వింటేజ్ సూపర్ హిట్ సాంగ్‌ను రీమిక్స్ చేశారని సమాచారం. అదేంటంటే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర కలిసి నటించిన షోలే సినిమాలోని 'మెహబూబా.. మెహబూబా' సాంగ్. ఈ సాంగ్ చిత్రీకరణ కూడా హైదరాబాద్‌లో జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లో ఒక ఊపు ఊపిన ఈ పాటను కేజీఎఫ్ 2 సినిమాలో యశ్ చేత రీమిక్స్ చేయించాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే ఈ పాటలో ఆడిపాడిన బ్యూటీ ఎవరూ అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఈ సాంగ్ కేవలం హిందీ వెర్షన్‌కే పరిమితమా.. లేక అన్ని భాషల్లో ఉంటుందా అని చూడాలి. ఇదీ చదవండి: ఈ ఏడాది 'ఊ'పేసిన ఐటమ్ సాంగ్‌లు ఇవే.. -
‘కేజీఎఫ్ 2’టీమ్‌కు ఆమిర్ ఖాన్ క్షమాపణలు.. యశ్‌కు ఫోన్ కాల్!
‘కేజీఎఫ్ 2’ టీమ్‌కు బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పారు. అంతేకాదు ఆ మూవీ హీరో యశ్‌తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరంగదుర్లకు క్షమాపణ లేఖలు రాస్తూ.. ‘కేజీఎఫ్ 2’చిత్రానికి తాను కూడా ప్రచారం చేస్తానని చెప్పారట. అదేంటి ఆమిర్ ఎందుకు సారీ చెప్పారు? ‘కేజీఎఫ్ 2’ఆయన ఎందుకు ప్రచారం చేస్తారు? అనే కదా మీ డౌటానుమానం. వివరాల్లోకి వెలితే.. ఆమిర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. ఈ మూవీలో కరీనా కపూర్, నాగచైతన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ విడుదల తేదిని కూడా ప్రకటించారు మేకర్స్. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 14, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజు(ఏప్రిల్ 14) కేజీఎఫ్ 2 కూడా విడుదల కానుంది. ఈ తేదిని గతంలో కేజీఎఫ్ 2 బృందం ప్రకటించింది. ఈ చిత్రంపై కూడా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఒకే రోజున రెండు పెద్ద సినిమాలు విడుదలైతే బాక్సాఫీస్ వసూళ్లను షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమిర్ ఖాన్ ‘కేజీఎఫ్ 2’టీమ్‌కు క్షమాపణలు చెప్పారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘తప్పనిసరి పరిస్థితిలో ఏప్రిల్ 14న లాల్‌సింగ్ చద్దాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కేజీఎఫ్ 2 నిర్మాత విడుదల తేదీని ప్రకటించారని తెలిసి కావాలనే మేము ఆ రోజును ఎంచుకోలేదు. విడుదల తేదీని ప్రకటించే ముందు ‘కేజీఎఫ్2’ నిర్మాత విజయ్ కిరంగదుర్, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్‌లకు క్షమాపణ చెబుతూ లేఖ రాశా. యశ్‌తో ఫోన్లో కూడా మాట్లాడాను. ‘కేజీఎఫ్, లాల్‌సింగ్ చద్దా’ రెండు వేర్వేరు జోనర్లకు సంబంధించిన చిత్రాలు. ప్రేక్షకులు రెండు సినిమాలను ఆదరిస్తారు. ‘కేజీఎఫ్ 2’కు నేనే స్వయంగా ప్రచారం చేస్తా. ఆ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. ‘కేజీఎఫ్ 2’కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభిమానుల్లో నేను ఒకడిని. ఏప్రిల్ 14న థియేటర్స్‌లో ఆ సినిమా చూస్తా’అని ఆమిర్ తెలిపారు. మరి ఒకే రోజున వస్తున్న ఈ రెండు చిత్రాలలో ప్రేక్షకులు దేనికి బ్రహ్మరథం పడతారో చూడాలి. -
KGF Chapter2: రిలీజ్ డేట్ ఫిక్స్..ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ మొదటి భాగం ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ ఒక్క సినిమాతో యష్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాను 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఇక సీక్వెల్లో యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నారు. రవీనా టాండన్, రావు రమేష్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే..కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ రోజే ప్రభాస్ నటిస్తున్న సలార్ కూడా విడుదల కానుందని గతంలో చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను కూడా డైరెక్టర్‌గా ప్రశాంత్ నీల్ వ్యవహరిస్తున్నారు. దీంతో రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఒకేరోజు విడుదల అవుతాయా? లేదా సలార్ వాయిదా పడనుందా అన్నది తేలాల్సి ఉంది. చదవండి : టైగర్ 3 కోసం పూర్తిగా మారిపోయిన సల్మాన్.. ఫొటోలు లీక్ Chiru154 : పూనకాలు లోడింగ్.. అదిరిపోయిన పోస్టర్ #KGF2onApr14 pic.twitter.com/2DEW33do1q — Prashanth Neel (@prashanth_neel) August 22, 2021 -
KGF Chapter 2: సౌత్ శాటిలైట్ రేట్స్ కొనుగోలు చేసిందెవరంటే..
కేజీఎఫ్ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి అంచాలు లేకుండా విడుదలై.. రికార్డులు సృష్టించిన సినిమా అది. ఆ ఒక్క సినిమాతోనే కన్నడ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా విడుదలకు ముందే భారీ రికార్డ్సు సృష్టిస్తోంది.. ఇప్పటికే ఈ విడుదలైన టీజర్, పోస్టర్స్‌తో సినిమా ఏ రెంజ్లో అర్థమవుతుంది. తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. కేజీఎఫ్ చాప్టర్ 2 సౌత్ ఇండియన్ అన్ని భాషల శాటిలైట్ హక్కులను జీ సంస్థ కొనుగోలు చేసినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల శాటిలైట్ హక్కులను జీ టెలివిజన్ సంస్థ తీసుకున్నట్లుగా స్పష్టం చేశారు. దీని కోసం జీ సంస్థ భారీగానే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీనిధి హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, తది తరులు కీలక పాత్రలు పోషించారు. #KGFChapter2 locks its official worldwide satellite destination for South languages on ZEE 📺@TheNameIsYash @prashanth_neel @VKiragandur @hombalefilms @HombaleGroup @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7#KGF2SouthOnZee@ZeeKannada @ZeeTVTelugu @ZeeTamil @ZeeKeralam pic.twitter.com/DZ2ROyddc7 — Hombale Films (@hombalefilms) August 20, 2021 -
కేజీఎఫ్-2 : పవర్ఫుల్ లుక్‌లో సంజయ్ దత్
HBD Sanjay Dutt: కన్నడ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. కేజీఎఫ్ ఘన విజయంతో ఈ మూవీకి సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2ను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం(జులై29)న సంజయ్ దత్ బర్త్‌డే సందర్భంగా 'కేజీఎఫ్ 2'లో అధీరాగా విలన్ పాత్ర చేస్తున్న సంజయ్ లుక్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. చేతిలో ఖడ్గం పట్టుకొని ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్న సంజయ్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. యష్, సంజయ్ దత్ భారీ యాక్షన్ సన్నివేశం ఉందని, ఇది ప్రేక్షకులను ఎంతో థ్రిల్‌కు గురి చేస్తుందని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. దీంతో కేజీఎఫ్ చాప్టర్ 2పై పాన్ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానున్న ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే వెల్లడి కానుంది. "War is meant for progress, even the vultures will agree with me" - #Adheera, Happy Birthday @duttsanjay sir.#KGFChapter2 @TheNameIsYash @VKiragandur @hombalefilms @TandonRaveena @SrinidhiShetty7 @excelmovies @VaaraahiCC @PrithvirajProd @DreamWarriorpic @LahariMusic pic.twitter.com/VqsuMXe6rT — Prashanth Neel (@prashanth_neel) July 29, 2021 -
టీజర్‌తో 'కేజీఎఫ్ 2' సునామీ, ఈ దూకుడును ఎవరూ ఆపలేరంతే!
KGF 2 Teaser Get 200 Million Views: యశ్ బాస్ ఇంకా బరిలోకి దిగనేలేదు.. అప్పుడే కేజీఎప్ 2 టీజర్ రికార్డుల మోత మోగిస్తున్నాయి. దుమ్మురేపే వ్యూస్‌తో పాన్ ఇండియా సినిమాలకు చెమటలు పట్టిస్తున్నాయి. ఇంతకీ కేజీఎఫ్ 2 కొత్తగా సాధించిన రికార్డు ఏంటనుకుంటున్నారా? అక్షరాలా రెండు వందల మిలియన్ వ్యూస్‌ను సాధించిందీ టీజర్. ఈ విషయాన్ని స్పెషల్ పోస్టర్ ద్వారా సోషల్‌మీడియాలో వెల్లడించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. Thank you everyone for the thundering response!!!https://t.co/4PzV1fc4uk#KGF2Teaser200MViews pic.twitter.com/dsByWfRaX5 — Prashanth Neel (@prashanth_neel) July 16, 2021 జనవరి 7న యూట్యూబ్‌లో రిలీజైన కేజీఎఫ్ 2 సినిమా టీజర్‌కు ఇప్పటిదాకా 200 మిలియన్ల(20 కోట్ల) వ్యూస్ వచ్చాయి. ఈ టీజర్‌ను 8.4 మిలియన్ల మంది లైక్ చేయగా 11 లక్షల మంది కామెంట్లు రాగా, 1 బిలియన్ ఇంప్రెషన్స్ వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో #KGF2Teaser200MViews పేరిట సందడి చేస్తున్నారు అభిమానులు. ఎంతైనా బాస్ సర్.. బాస్ అంతే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి టీజర్ ద్వారా ఓరకంగా సునామీనే సృష్టిస్తున్నాడు రాఖీ భాయ్. మరి ఈ సినిమా థియేటర్లలో రిలీజయ్యాక ఆ ప్రభంజనం ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి!