Nidhhi Agerwal
-
నోరు జారిన కుర్రాడు.. నిధి అగర్వాల్ మాత్రం
సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్. అందుకే పలువురు నెటిజన్లు.. హీరోహీరోయిన్లపై అప్పుడప్పుడు నోటికొచ్చిన కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వాటిని సదరు నటీనటులు పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకుంటే మాత్రం కాస్త గట్టిగానే ఇచ్చేస్తుంటారు. హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhhi Agerwal).. ఇప్పుడు ఓ కుర్రాడికి అలానే కౌంటర్ ఇచ్చింది.ఏం జరిగిందంటే?నిధి అగర్వాల్ గురించి ఓ ట్విటర్ పేజీలో పోస్ట్ పెట్టగా.. దీనికి స్పందించిన ఓ నెటిజన్ ఈమెని శ్రీలల(Sreeleela) పోలుస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడు. 2021లో వచ్చిన శ్రీలీల 20కి పైగా సినిమాలు చేసింది. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత నిధి ఏం చేసింది? ఎన్ని మూవీస్ చేసింది? అని అన్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)ఈ ట్వీట్ పై స్వయంగా స్పందించిన నిధి అగర్వాల్.. సదరు నెటిజన్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. 'ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో మూవీ చేసింది. తమిళంలో మూడు మూవీస్ చేసింది. హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu Movie)కి సంతకం చేసింది. మంచి స్క్రిప్ట్ లు అనుకున్న వాటికే సంతకం చేస్తున్నా. అందుకు టైమ్ తీసుకుంటున్నాను. కొన్నిసార్లు నా నిర్ణయం తప్పయి ఉండొచ్చు. కానీ మంచి సినిమాలు చేయాలనేది నా అభిప్రాయం. వరసగా సినిమాలు చేయాలనే తొందరేం లేదు. ఈ ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నా. కాబట్టి బ్రదర్.. నా గురించి నువ్వేం బాధపడకు' అని చెప్పుకొచ్చింది.నిధి అగర్వాల్ బాగానే కౌంటర్ చేసింది. కానీ సదరు నెటిజన్ అన్నదాంట్లోనూ కాస్త నిజముంది. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ తప్పితే నిధి అగర్వాల్ కెరీర్ లో చెప్పుకోదగ్గ మూవీ లేదు. పవన్ తో హరిహర వీరమల్లు, ప్రభాస్ తో రాజాసాబ్(The Raja Saab Movie) చేసింది గానీ వీటిపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అటు శ్రీలీల కూడా సినిమాలైతే చేస్తోంది గానీ దాదాపు ఫ్లాప్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత) -
హరి హర వీరమల్లుతో 'కొల్లగొట్టిన' నిధి అగర్వాల్ (ఫోటోలు)
-
అందంతో మతిపోగొడుతున్న ఇస్మార్ట్ శంకర్ భామ నిధి అగర్వాల్ ఫోటోలు.
-
ప్రభాస్ హీరోయిన్‌కి వేధింపులు.. రంగంలోకి పోలీసులు!
సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది చేసింది హీరోయిన్ నిధి అగర్వాల్( Nidhhi Agerwal). సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. సదరు వ్యక్తి తనతో పాటు తనకు ఇష్టమైన వారిని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపింది. ఆయన బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని, సదరు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ తన ఫిర్యాదులో కోరింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు నిధి అగర్వాల్ కంప్లైంట్ తీసుకుని, విచారణ చేపట్టారు.వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నిధిబాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్లో రాణిస్తున్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది నిధి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత అక్కినేని అఖిల్ తో మజ్ను అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా నిరాశపరిచింది. దాంతో ఈ బ్యూటీకి ఇక అవకాశాలు రావడం కష్టమే అని అనుకున్నారు అంతా.. ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాలో నటనతో పాటు గ్లామర్ పరంగాను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస సినిమా చాన్స్‌లు వచ్చాయి. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌లతో నటిస్తోంది.‘రాజాసాబ్’తో రొమాన్స్మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab). కామెడీ హారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే మిగతా హీరోయిన్లలో పోలిస్తే నిధి పాత్రకు కాస్త ప్రాధాన్యత ఎక్కువే ఉందట. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.‘వీరమల్లు’కి జోడీగాపవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu). క్రిష్ సారథ్యంలో జ్యోతికృష్ణ దర్శకత్వంలో రానుంది. ఈ చిత్రంలో పవన్‌కి జోడీగా నిధి నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ తొలిభాగం ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది. అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 28న ఈ చిత్రం మొదటి భాగం ప్రేక్షకుల ముందుకురానుంది. -
‘రాజా సాబ్’ చూడాలంటే.. నా పక్కన ఒకరు ఉండాల్సిందే: నిధీ అగర్వాల్
‘‘నేను తెలుగు బాగా మాట్లాడగలను. కేవలం ‘అందరికీ నమస్కారం’ అనే బ్యాచ్ కాదు’’ అన్నారు హీరోయిన్ నిధీ అగర్వాల్. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో ‘రాజా సాబ్’, పవన్ కల్యాణ్‌తో ‘హరి హర వీరమల్లు’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ సమయం కుదిరినప్పుడల్లా నెటిజన్లతో ముచ్చటిస్తుంటారు. అయితే కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేని నిధీ అగర్వాల్ చాలా విరామం తర్వాత ‘ఆస్క్ నిధి’ పేరుతో నెటిజన్లతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా కెరీర్, వ్యక్తిగత విషయాలపై నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. మీకు తెలుగు మాట్లాడటం వస్తుందా మేడం? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘‘నాకు తెలుగు మాట్లాడటం బాగా వస్తుంది. కేవలం ‘అందరికీ నమస్కారం’ అంటూ జస్ట్ అలా మాట్లాడే బ్యాచ్ కాదు’’ అంటూ సూటిగా జవాబిచ్చారు. ‘తెలుగులో ఎందుకు తక్కువ సినిమాలు చేస్తున్నారు?’ అనే మరో ప్రశ్నకు.. ‘‘నేను మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. మీకు బోర్ కొట్టకుండా మీ అభిమానం పొందే చిత్రాల్లోనే నటించాలని నిర్ణయించుకున్నా. అయితే 2025లో తెలుగులో నేను నటించిన ఎక్కువ సినిమాలు విడుదలవుతాయి’’ అని చెప్పారు. ‘జీవితంలో ఏది చాలా ముఖ్యం అనుకుంటారు?’ అనే మరో ప్రశ్నకు ‘‘ప్రశాంతత’’ అంటూ సమాధానం ఇచ్చారు. ‘ఓ నటిగా మీకు చాలా కష్టంగా అనిపించేది ఏంటి?’ అని ఓ నెటిజన్ అడగ్గా.. ‘‘పీఆర్ మెయింటేన్ చేయడం నాకు చాలా కష్టమైన పనిగా అనిపిస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘మీకు హారర్ సినిమాలంటే ఇష్టమేనా? ఒంటరిగా కూర్చొని చూస్తారా?’ అనే ప్రశ్నకు ‘‘అస్సలు చూడలేను. నాతో పాటు ఎవరో ఒకరు ఉండాల్సిందే. ‘రాజా సాబ్’ (హారర్ నేపథ్యంలో రూపొందుతోంది) సినిమా చూడ్డానికి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో థియేటర్స్‌కి రండి’’ అని బదులిచ్చారు. అలాగే మరికొందరు నెటిజన్ల ప్రశ్నలకు నిధీ అగర్వాల్ స్పందిస్తూ– ‘‘ప్రభాస్‌గారితో కలిసి నటించిన ‘రాజా సాబ్’ సినిమా సెట్లో ఎంతో సరదాగా పని చేశాం. ఈ మూవీ టీమ్‌లో ఎంతో నిజాయతీ ఉంది. ‘హరి హర వీరమల్లు’ సెట్లో పవన్ కల్యాణ్‌గారితో ఇటీవల ఓ సెల్ఫీ తీసుకున్నాను... త్వరలోనే ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. రాబోయే నూతన సంవత్సరంలో నేను నటించిన ‘ది రాజా సాబ్’, ‘హరి హర వీరమల్లు’ విడుదలవుతాయి.. ఆ సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువవుతాను. ఆ రెండు చిత్రాలతో పాటు మరో సర్ప్రైజింగ్ మూవీ కూడా ఉంది.. త్వరలోనే ఆ మూవీ ప్రకటన కూడా వస్తుంది’’ అంటూ తెలిపారు నిధీ అగర్వాల్. -
మా లైఫ్‌లో ఎప్పుడు సర్‌ప్రైజ్‌లే: టాలీవుడ్ హీరోయిన్
హీరోయిన్ నిధి అగర్వాల్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ రెండు చిత్రాల్లో నటిస్తోంది. ప్రభాస్-మారుతి కాంబోలో వస్తోన్న ది రాజాసాబ్, పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు సినిమాల్లో కనిపించనుంది. షూటింగ్‌లతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.నిధి అగర్వాల్ తన ట్వీట్లో రాస్తూ..'ఆర్టిస్టుల పూర్తిగా సర్ప్రైజ్లతో నిండి ఉంటుందని.. కానీ వాటిలో కొన్ని గొప్ప అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే రోజు రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటించడం ఆనందంగా ఉంది. అంతేకాదు ఒకటి ఆంధ్రలో షూటింగ్ జరిగితే మరొకటి తెలంగాణ. ఒక్కరోజులో రెండు సినిమాలు.. రెండు రాష్ట్రాలు. నా పనిని మీ ముందుక తీసుకొచ్చేందుకు ఎదురుచూస్తున్నా. ఆ తర్వాత గొప్ప వేడుక చేసుకుంటానని' పోస్ట్ చేసింది.కాగా.. మారుతి డైరెక్షన్ వస్తోన్న ది రాజాసాబ్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈనెల 23న ప్రభాస్ బర్త్ డే రోజు అప్డేట్స్ ఉంటాయని నిర్మాత ఎస్కేఎన్ ఇప్పటికే కామెంట్స్ చేశారు. హారర్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో సందడి చేయనుంది. An artists life is full of surprises, but some leave you feeling truly blessed and grateful. I’m delighted to have shot for 2 much waited pan-Indian films on the same day, that too one in Andhra and another in Telangana1 day 2 film shoots 2 states 🤗Eagerly waiting for you all…— Nidhhi Agerwal (@AgerwalNidhhi) October 17, 2024 -
నిధి అగర్వాల్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన ‘రాజాసాబ్’ మూవీ టీమ్ (ఫొటోలు)
-
Nidhhi Agerwal: ప్రభాస్, పవన్ కల్యాణ్ మీదే ఆశలు.. నిధి అగర్వాల్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
Nidhhi Agerwal: కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్న నిధి అగర్వాల్
-
Nidhi Agarwal: కడపలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి (ఫొటోలు)
-
అనసూయ అందాలు.. కాబోయే మెగాకోడలు డిఫరెంట్ డ్రస్!
మెల్టింగ్ పోజులతో టెంప్ట్ చేస్తున్న నిధి తల్లయినా సరే గ్లామర్‌తో కేక పుట్టిస్తున్న ప్రణీత డిఫరెంట్ స్టిల్‌తో కాబోయే మెగా కోడలు లావణ్య గౌనులో మెరిసిపోతున్న హాట్ బ్యూటీ మలైకా బ్రౌన్ కలర్ ఔట్ఫిట్లో మృణాల్ వయ్యారాలు స్పాట్లైట్ వెలుగులో డీజే టిల్లు రాధిక నవ్వుతూ ఫ్యాన్స్ మనసు దోచేస్తున్న మానుషీ చాన్నాళ్ల తర్వాత ఫొటోషూట్‌లో అనసూయ View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Lavanya tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sakshi (@_vaidyasakshi) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) -
ఆ జ్యూస్ తాగుతాను.. అదే నా అందానికి రహస్యం
'ఇస్మార్ట్ శంకర్' బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మున్నా మైఖేల్ అనే హిందీ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్‌తో మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఆ చిత్రం బంపర్ హిట్ అయనా ఎందుకో ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కుర్రకారు మతి పోగొట్టేంత అందం ఉన్నా.. అదృష్టం దక్కని నటీమణుల్లో నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం సంచలన విజయం సాధించినా నిధి అగర్వాల్‌కు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. దీంతో ఈశ్వరన్ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. అక్కడ తమిళ స్టార్ హీరో శింబుతో ప్రేమాయణంతో బోలెడంత పబ్లిసిటీ దొరికింది. శింబుతో నిధి అగర్వాల్ ప్రేమ కలాపాలు అంటూ కోలీవుడ్ కోడూ కూస్తుంది. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉంటే నిధి అగర్వాల్ తన అందం వెనకున్న సీక్రెట్‌ను బయటపెట్టేసింది. ఆమె ఏం చెప్పిందంటే..పొద్దున్నే లెమన్ జ్యూస్ తాగుతాను. నా డైట్లో తాజా పండ్లు తప్పకుండా ఉంటాయి. అలాగే తగినన్ని మంచినీళ్లూ తాగుతుంటాను. ట్యాన్ ఫ్రీ స్కిన్ కోసం.. సమయం చిక్కినప్పుడల్లా టొమాటో గుజ్జును చేతులు, కాళ్ల మీద అప్లయ్ చేస్తాను. ఇక ఫేస్‌ప్యాక్ విషయానికి వస్తే పెరుగులో కొంచెం తేనె, కాసింత నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటాను. దీంతో ముఖం నున్నగా.. కాంతిమంతంగా మారుతుంది అంటూ చెప్పుకొచ్చింది. -
సొగసుల నిధీని బయట పెట్టిన నిధి అగర్వాల్
-
నిధి అగర్వాల్‌కు కొత్త కష్టాలు.. అన్నీ ఉన్నాసరే!
కొందరు హీరోయిన్లని చూడగానే 'అబ్బా.. ఏముందిరా బాబు' అని అనుకుంటాం. నిధి అగర్వాల్ ఆ కేటగిరీలోకే వస్తుంది. ఈమెని చూడగానే సరిగ్గా ఇలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఫిజిక్ సూపర్, గ్లామర్ అంతకంటే సూపర్. డ్యాన్సులు బాగా చేస్తుంది. అయినాసరే ఈమెని ఆ కష్టాలు వదలట్లేదు. 'అన్నీ ఉన్నా అల్లుడి నోటిలో శని' అన్నట్లు ఈమె లైఫ్ తయారైంది. కొన్ని సమస్యలు ఈమెని శనిలా వెంటాడుతున్నాయా అనిపిస్తోంది. అభిమానుల మధ్య ఇప్పుడు ఇదే టాపిక్ చర్చనీయాంశంగా మారిపోయింది. సినిమా కష్టాలు! చాలామంది హీరోయిన్లకు అందం ఉన్నా.. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావు. ఒకవేళ వస్తే మాత్రం హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా క్రేజ్ సొంతం చేసుకుంటారు. 'ఇస్మార్ట్ శంకర్' బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ప్రస్తుతం తెలుగులో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఒకటి 'హరిహర వీరమల్లు', మరొకటి ప్రభాస్-మారుతి కలిసి చేస్తున్న మూవీ. వీటిలో 'హరిహర..' 2020లోనే ప్రారంభమైంది. ఇప్పటికి సగం షూటింగే జరిగింది. మిగిలిన పార్ట్ ఎప్పుడు మొదలవుతుందో, అసలు జరుగుతుందో లేదా అనేది డౌటే! (ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?) ఉంచుతారో.. తీసేస్తారో? ప్రభాస్, మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో చేస్తున్నాడు. హారర్ కామెడీ స్టోరీతో తీస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లు అని అన్నారు. ప్రభాస్ ప్రస్తుతం 'సలార్', 'ప్రాజెక్ట్ K' చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు పూర్తయిన తర్వాతే మారుతి మూవీ కోసం పనిచేస్తాడు. ఇదంతా జరగడానికి వచ్చే ఏడాది పట్టొచ్చు! అంతలో చిత్రబృందం మనసు మారకపోతే ఓకే. ఒకవేళ ఏమైనా జరిగి హీరోయిన్లు మార్చే ఆలోచన వస్తే మాత్రం నిధికి మూడినట్లే! ఎందుకంటే మహేశ్-త్రివిక్రమ్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. లాంచ్ అయినప్పుడు ఇందులో లీడ్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డేని ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు ఆమెని పక్కనబెట్టేశారని, సెకండ్ హీరోయిన్ శ్రీలీలని మెయిన్ లీడ్ గా చేశారని వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇదే ఫార్ములా ప్రభాస్-మారుతి సినిమాకు అప్లై చేస్తే మాత్రం నిధిని పీకేయడం గ్యారంటీ. ఒకవేళ ఇలా జరిగితే టాలీవుడ్ లో నిధి కెరీరే సందిగ్ధంలో పడిపోతుంది! View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) (ఇదీ చదవండి: ఆ రోజు గొడవలో అమ్మాయిదే తప్పు: హీరో నాగశౌర్య) -
హీరోయిన్ ఇంట్లో వేణుస్వామి సీక్రెట్ పూజలు.. బయటికొచ్చిన వీడియో
ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్పి నిత్యం వార్తల్లో నిలిచే వేణుస్వామి నాగచైతన్య-సమంత డివర్స్ న్యూస్‌తో మరింత ఫేమస్ అయ్యాడు. వారిద్దరూ విడిపోతారంటూ పెళ్లికి ముందే చెప్పాడు. కట్‌చేస్తే పెళ్లైన నాలుగేళ్లకే వారు విడాకులు తీసుకోవడంతో వేణుస్వామి పాపులర్ అయ్యాడు. ఇక కొన్నాళ్లుగా సక్సెస్ కోసం టాలీవుడ్ ప్రముఖులు వేణుస్వామి చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా హీరోయిన్ నిధి ఆగర్వాల్ చేత వేణు స్వామి ప్రత్యేక పూజలు చేయించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2018లో సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ తెలుగు, తమిళంలో పలు చిత్రాలు చేసినా ఆమె కెరీర్ ఆశించినంత సక్సెస్‌ఫుల్‌గా లేదు. దీంతో సినిమా అవకాశాల కోసం నిధి రాజ శ్యామల యాగం చేసింది. ఇక గతంలో రష్మిక ఇంట్లో కూడా వేణుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. మరి వేణుస్వామిని నమ్ముకున్న నిధి అగర్వాల్‌కి కూడా లక్ కలిసొస్తుందా? అన్నది చూడాల్సి ఉంది. -
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ బర్త్ డే స్పెషల్.. ఈ ఫొటోస్ చూశారా?
-
హీరోయిన్ని కాకుంటే ఆ పని చేసేదాన్ని : నిధి అగర్వాల్
కుర్రకారు మతి పోగొట్టేంత అందం ఉన్నా.. అదృష్టం దక్కని నటీమణుల్లో నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. ఈమె తెరపై కనిపించిందంటే అందాల మోతే. ఇక సామాజిక మాధ్యమాల్లోనైతే చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రం సంచలన విజయం సాధించినా, నటి నిధి అగర్వాల్‌కు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. అలాగే తమిళంలో నటుడు శింబుతో రొమాన్స్ చేసిన ఈశ్వరన్ ఆమెను నిరాశ పరిచింది. అయితే నిజ జీవితంతో శింబుతో చెట్టాపట్టాల్ అంటూ ప్రచారం మాత్రం హోరెత్తింది. ఆ ప్రచారం ఎంతవరకు సాగిందంటే శింబు, నిధి అగర్వాల్ ప్రేమ, పెళ్లి పీటలెక్కబోతోంది అన్నంతగా. అయితే ఇప్పుడు ఆ విషయం చడీచప్పుడు లేదు. అంతేకాదు కోలీవుడ్‌లో నటి నిధి అగర్వాల్‌కు అవకాశాలు కూడా దక్కడం లేదు. అయినా అవకాశాల ప్రయత్నంలో భాగంగా సామాజిక మాధ్యమాల్లో గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తునే ఉంది. ఈక్రమంలో ఇటీవల తన అభిమానులతో ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా నిధి అగర్వాల్ ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ తాను వర్కౌట్స్ చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానని చెప్పింది. అదేవిధంగా తాను ఇంటర్ స్టేట్ ఛాంపియన్ అని తెలిపింది. నటి కాకుంటే ఏం చేసేవారు అన్న ప్రశ్నకు నిధి అగర్వాల్ బదులిస్తూ నటిగా సక్సెస్ కాకుంటే తనను ఇంటిలో ఊరికే కూర్చోనిచ్చేవారు కాదని సంపాదించడానికి ఏదో ఒకపని చేయమని చెప్పే వారని పేర్కొంది. తాను నటిని కాకుంటే ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించేదాన్నని చెప్పింది. తనకు ఫ్యాషన్ డిజైనింగ్ పరిచయం లేదని అయితే, శిక్షణ పొంది ఆ రంగంలోకి వెళ్లేదాన్నని చెప్పింది. తన కుటుంబానిది వ్యాపార నేపథ్యమని, తాను కచ్చితంగా ఆ నేర్పరితనాన్ని ఉపయోగించేదాన్నని చెప్పింది. -
సైమా అవార్డ్స్ లో మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
గ్లామరస్ ఫొటోలతో దడ పుట్టిస్తున్న నిధి అగర్వాల్
సినిమా రంగుల ప్రపంచం. ఇందులో అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఉంటుంది. బోల్డ్‌గా నటించే వారికి బోలెడు అవకాశాలు అందుతాయి. అందుకే తారలు ఫొటో సెషన్లు నిర్వహించి దర్శక, నిర్మాతలతో పాటు అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సైతం ఫొటో సెషన్స్ నిర్వహించి గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అవికాస్తా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. మున్నా మైఖేల్ అనే హిందీ చిత్రంతో నాయకిగా పరిచయమైన నిధి అగర్వాల్ ఆ తరువాత టాలీవుడ్లో సవ్యసాచి చిత్రంలో అవకాశం దక్కించుకుంది. రామ్ సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్‌తో మరింత వెలుగులోకి వచ్చింది. ఆ చిత్రం బంపర్ హిట్ అయిన ఈమెకు అక్కడ అవకాశాలు అంతంత మాత్రమే. ఈశ్వరన్ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయ్యింది. శింబు ఈ చిత్ర హీరో. ఇంకేముంది నిధి అగర్వాల్‌కు కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ దొరికింది. చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోయినా అందులోని పాటలు ప్రజల్లోకి బాగానే వెళ్లాయి. ముఖ్యంగా శింబుతో నిధి అగర్వాల్ ప్రేమ కలాపాలు అంటూ పెద్ద రచ్చే జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే వీరి పరిచయం ప్రేమగా మారిందని వీరి పెళ్లికి పెద్దలు కూడా సమర్థించినట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేసింది. వీరు సహజీవనం చేస్తున్నారని టాక్ కూడా వినిపించింది. త్వరలో పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై శింబు, నిధి అగర్వాల్ స్పందించకపోవడం విశేషం. ఈ అమ్మడు నటించే చిత్రాల విషయానికి వస్తే మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అదే విధంగా తెలుగులో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. చదవండి: మాజీ ప్రియుడితో నటి చక్కర్లు, వీడియో వైరల్ ప్రియుడితో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తోన్న ప్రియాభవానీ -
'హీరో' సినిమాకు నిధి రెమ్యునరేషన్ ఎంతంటే?
అందాల నిధి అగర్వాల్ తన రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసింది. నటన, గ్లామర్‌తో కట్టిపడేస్తున్న ఈ భామ సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా పెద్దగా హిట్ అవకపోయినప్పటికి నిధి అందచందాలకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత మిస్టర్ మజ్నులో ఛాన్స్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇస్మార్ట్ శంకర్‌తో కుర్రకారు గుండెల్లో రెళ్లు పరిగెత్తించింది. ఈ మూవీలో నటన, గ్లామర్‌తో కట్టిపడేసిన ఈ భామ తెలుగులో తాజాగా నటించిన చిత్రం 'హీరో'. యంగ్ హీరో అశోక్ గల్లాతో జోడీ కట్టిన నిధి ఈ సినిమా కోసం బాగానే డిమాండ్ చేసిందట! ఇప్పటివరకు రూ.50- 80 లక్షల రెమ్యునరేషన్ అందుకున్న ఆమె ఈ సినిమాకు మాత్రం ఏకంగా కోటిన్నర తీసుకున్నట్లు తెలుస్తోంది. తన కెరీర్లోనే తొలిసారిగా ఓ సినిమాకు ఈ రేంజ్లో డబ్బులు తీసుకుందట! ఏదేమైనా నిధి సినిమాల స్పీడు పెంచడంతో పాటు రెమ్యునరేషన్‌ను కూడా బాగానే పెంచేసింది. -
ఆ ముగ్గురు హీరోలతో నటించాలనుంది: నిధి అగర్వాల్
‘‘నేను పుట్టింది హైదరాబాద్‌లోనే. అందుకే తెలుగువారికి బాగా కనెక్ట్ అయ్యాను. హిందీ, తమిళ సినిమాలు చేసినా తెలుగు పరిశ్రమ అంటేనే నాకు చాలా ఇష్టం.. ఇక్కడ పనిచేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది’’ అని హీరోయిన్ నిధీ అగర్వాల్ అన్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘హీరో’. కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పణలో గల్లా పద్మావతి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ పంచుకున్న విశేషాలు... ♦ శ్రీరామ్ ఆదిత్యగారు ‘హీరో’ కథ చెప్పగానే ఆఫ్‌బీట్ సినిమాగా అనిపించింది. కథ విన్నప్పుడు నా పాత్రకి ఎంత న్యాయం చేయగలనని ఆలోచిస్తాను. నటుడిగా అశోక్ కొత్త అనే ఫీల్ కలగలేదు. అనుభవం ఉన్నవాడిలా చేశాడు. ♦ ‘ఇస్మార్ట్ శంకర్’లో డాక్టర్‌గా చేశాను. ఇప్పుడు ‘హీరో’ సినిమాలోనూ సుబ్బు అనే డాక్టర్ పాత్రే చేశాను. కానీ రెండింటికీ తేడా ఉంటుంది. రెండు కుటుంబాల మధ్య జరిగే డ్రామా ‘హీరో’. వినోదంతో పాటు కథలో కొన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి. పాటలు కూడా బాగా వచ్చాయి. ఇది సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ. ♦ నేనెప్పుడూ వైవిధ్యమైన పాత్రలు చేయాలనే చూస్తాను. సినిమా సినిమాకు చాలా నేర్చుకుంటున్నా. షూటింగ్ లేనప్పుడు మా ఫ్యామిలీ బిజినెస్, ఛారిటబుల్ ఫౌండేషన్ కూడా చూస్తుంటాను. నటి కాకముందు నుంచే నాకు సోషల్ మీడియాలో వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కెరీర్ పరంగా సోషల్ మీడియా నాకు చాలా ఉపయోగపడింది. కొందరి విమర్శలు కూడా ఘాటుగానే ఉన్నా పట్టించుకోను. ఫిట్నెస్ కోసం రోజుకు 45 నిమిషాలు కేటాయిస్తా. నేను శాఖాహారిని. నా డైట్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ♦ నిర్మాత పద్మ గల్లాగారితో పనిచేయడం ఆనందంగా ఉంది. నాకిష్టమైన కెమెరామేన్ సమీర్ రెడ్డిగారితో పనిచేయడం హ్యాపీ. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత గ్లామర్ హీరోయిన్ అనే ట్యాగ్‌లైన్ రావడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నాకు యాక్షన్ పాత్రలంటే ఇష్టం. ‘హరిహర వీరమల్లు’లో యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో నటించాలనుంది. ఓటీటీ కంటే సినిమాలకే తొలి ప్రాధాన్యత ఇస్తా. ప్రస్తుతం తెలుగులో కొన్ని కొత్త ప్రాజెక్టులకు చర్చలు జరుగుతున్నాయి. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో ఓ సినిమా చేశాను.. మరో సినిమా లైన్లో ఉంది. ఏప్రిల్‌లో హిందీ సినిమా ప్రారంభం కాబోతోంది. -
స్టార్ హీరోతో లవ్‌లో పడ్డ నిధి, అతడి ఇంట్లోనే మకాం!
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందన్న వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే రెండుమూడుసార్లు ప్రేమలో విఫలమైన శింబుతో ఆమె లవ్‌లో పడిందని, త్వరలో వీళ్లిద్దరూ ఏడడుగులు నడిచేందుకు రెడీ అవుతున్నారంటూ ఓ క్రేజీ గాసిప్ సినీప్రియులను ఆకర్షిస్తోంది. శింబు, నిధి ఇద్దరూ సుచింద్రన్ దర్శకత్వం వహించిన ఈశ్వరన్ సినిమాలో నటించారు. ఇది గతేడాది జనవరిలో రిలీజైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట! కరోనా టైంలో లవ్‌లో పడ్డ నిధి కొంతకాలంగా చెన్నైలోని శింబు ఇంట్లోనే ఉంటోందని, త్వరలోనే ఈ ప్రేమజంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుందని కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే! కాగా 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. గతేడాది 'ఈశ్వరన్'తో కోలీవుడ్‌లో లక్ పరీక్షించుకున్న ఆమె ప్రస్తుతం 'హీరో', 'హరిహర వీరమల్లు' సహా ఒక తమిళ చిత్రం చేస్తోంది. శింబు విషయానికి వస్తే 'మానాడు' సినిమాతో ఈ మధ్యే మంచి సక్సెస్ అందుకున్నాడీ హీరో. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీలో కూడా అదరగొడుతోంది. ప్రస్తుతం శింబు చేతిలో రెండు తమిళ సినిమాలున్నాయి. అప్సరసలా మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఫొటోలు చూసేయండి -
అందుకే వాన పాటల గురించి ఆలోచించడం లేదు: నిధీ అగర్వాల్
చిరుజల్లులను చూడటం నిధీకి ఎంతో ఇష్టం. వానలో తడవడం చాలా చాలా ఇష్టం. వాన పాటలంటే ఇష్టం. మరి.. వాన పాట చేయడం నిధీకి ఇష్టమేనా? ఆ విషయంతో పాటు ‘వర్షం సాక్షి’గా నిధీ అగర్వాల్ చెప్పిన ‘వానాకాలమ్’ కబుర్లు తెలుసుకుందాం. ► చిన్నప్పటి వానాకాలపు జ్ఞాపకాలు... నిధీ అగర్వాల్: చిన్నప్పుడు వర్షం అంటే.. వేడి వేడి టీ తాగుతూ, పకోడీలు తినేదాన్ని. ► మామూలుగా పిల్లలను వర్షంలో తడవనివ్వరు. మరి.. మీ అమ్మగారు తిట్టేవారా? వర్షంలో తడవడం ఏ పిల్లలకు ఇష్టం ఉండదు చెప్పండి. మా అమ్మగారు తడవడానికి అనుమతించేవారు కాదు కానీ, మనం ఆగం కదా (నవ్వుతూ). నేను మాత్రం వర్షంలో బాగా ఆడుకునేదాన్ని. ఇక రెయినీ సీజన్లో స్కూల్‌కి వెళ్లడం అంటే పండగే. ఫుల్లుగా తడిచేదాన్ని. ► కాగితపు పడవలు చేసేవారా? ఈ మధ్య చేయలేదు. 10, 11 ఏళ్లప్పుడు చేశాను. బోట్ చేయడం.. నీళ్లల్లో వదలడం.. భలే సరదాగా అనిపించేది. ► చివరిసారిగా ఫుల్లుగా తడిసిందెప్పుడు? ఈ మధ్యే. ఒక షూటింగ్లో ఉన్నప్పుడు ఒకేసారి భారీగా వర్షం వచ్చింది. షూటింగ్ లొకేషన్ దగ్గర్లోనే ఉన్న నా వ్యాన్‌లోకి వెళ్లేలోపే తడిసిపోయాను. ► ఈ సీజన్లో ఎలాంటి రంగు దుస్తులు వేసుకుంటారు? వర్షాకాలంలో తెలుపు రంగు దుస్తులకు నో. అది కాకుండా ఏదైనా ఓకే. ► నచ్చిన వాన పాట? వాన బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే రొమాంటిక్ సాంగ్ ఏదైనా ఇష్టమే. బాగా నచ్చే పాట అంటే... ఐశ్వర్యా రాయ్ ‘బరసో రే మేఘా.. మేఘా...’ (‘గురు’ సినిమా). నాకు ఐశ్వర్యా రాయ్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ పాటే కాదు.. నటిగా ఆమె ఏం చేసినా ఇష్టమే. ► వాన పాటల్లో నటించడం ఇష్టమేనా? వాన పాటలు చేయడం అంత ఈజీ కాదు. నటిస్తున్నప్పుడు తడవడం, షాట్ గ్యాప్‌లో ఆరడం, మళ్లీ తడవడం.. బాబోయ్... ముఖ్యంగా వాన పడుతుంటే కళ్లు తెరిచి ఉంచి, నటించడం అంటే కష్టమే. అందుకే వాన పాటల గురించి ఆలోచించడంలేదు. ► వానలో ఇరుక్కున్న ఘటన ఏదైనా? ముంబయ్‌లో ఉన్నప్పుడు జరిగింది. జోరు వాన కారణంగా ఫ్లయిట్ టైమింగ్స్ మారడంతో నేను ఒకే ఫ్లయిట్లో కాకుండా కనెక్టింగ్ ఫ్లయిట్స్‌లో జర్నీ చేయాల్సి వచ్చింది. అలా ఫ్లయిట్లు మారడం ఇబ్బందిగా అనిపించింది. ఈ మధ్య వర్షం కారణంగా ఓ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయింది. అలా జరగడంవల్ల ఇంకో రోజు జర్నీ చేసి, మళ్లీ ఆ షూట్లో పాల్గొనాల్సి వచ్చింది. ► వానాకాలంలో తీసుకునే జాగ్రత్తలు? జలుబు చేయకూడదని ఈ సీజన్లో ఎక్కువగా వేడి నీళ్లు తాగుతుంటాను. ►వర్షాలప్పుడు షూటింగ్లో పాల్గొనడం ఇష్టమేనా? సంవత్సరం మొత్తంలో వాన రోజు తప్ప ఏరోజైనా షూటింగ్లో పాల్గొనడం ఇష్టమే. రెయినీ డే మాత్రం ఇంట్లోనే ఉండిపోవాలనిపిస్తుంది. చక్కగా రూమ్‌లో కూర్చుని, కిటికీలోంచి వాన జుల్లులు చూస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అప్పుడు వేడి వేడిగా ఏదైనా తింటూ, టీ తాగితే మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయలేనంత అనుభూతి కలుగుతుంది. -
నిధి అగర్వాల్ మంచి మనసు
సినిమా హీరోలు కరోనా కష్టకాలంలో సాయానికి ముందు రావట్లేదనే విమర్శలు ఎక్కువ వినిపిస్తుంటాయి. అయితే కొందరు సినీ సెలబ్రిటీలు మాత్రం తమ శక్తిమేర సాయంతో అండగా నిలుస్తున్నారు. రీసెంట్గా ఈ లిస్ట్‌లో చేరింది అందాల భామ నిధి అగర్వాల్. ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ పేరుతో ఒక ఆర్గనైజేషన్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. త్వరలో డిస్ట్రిబ్యూట్ లవ్ పేరుతో ఛారిటబుల్ ఆర్గనైజేషన్‌ను మొదలుపెడుతున్నా. ఈ కష్టకాలంలో సాయం కావాలనుకున్న వాళ్లు ఎవరైనా సరే ఈ వెబ్‌సైట్‌కు రిక్వెస్ట్‌లు పెట్టొచ్చు. వాళ్లకు అవసరమైన సాయాన్ని నాకు చేతనైనంత మేర అందిస్తా. నిత్యావసరాలు, మందులు.. ఇలా ఏవైనా సరే సాయానికి నేను సిద్ధం అని చెప్పింది నిధి. ఇక కొవిడ్ కోసమే ప్రత్యేకంగా. ఆమెతో పాటు ఆమె టీం ఈ ఆర్గనైజేషన్ కోసం పని చేస్తాయని తెలిపింది. కాగా, 2017లో మున్నా మైకేల్ బాలీవుడ్ ఫిల్మ్ ద్వారా ఫేమ్ అయిన నిధి అగర్వాల్, తెలుగు, తమిళ సినిమాల్లో వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. కోలీవుడ్ అభిమానులు ఏకంగా ఆమెకు ఓ గుడి కట్టడం విశేషం. కాగా, ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరిహరవీరమల్లు’లో నిధి హీరోయిన్గా నటిస్తోంది. -
Nidhhi Agerwal: పట్టిస్తే లక్ష రూపాయల నజరానా!
ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తూ తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ బ్యూటీ తాజాగా ఓ కుక్కపిల్ల మిస్ అయినట్లు పోస్ట్ పెట్టింది. దాన్ని పట్టించిన వారికి లక్ష రూపాయలు బహుమానంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కోకో అనే పేరున్న ఆ కుక్కపిల్ల కనిపించినట్లైతే ఫొటోలో ఉన్న నంబర్లను సంప్రదించాలని సూచించింది. మొత్తానికి ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఇక నిధి కెరీర్ విషయానికి వస్తే.. 'సవ్యసాచి' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో కాలు మోపింది. 'మిస్టర్ మజ్ను'తో డిజాస్టర్ అందుకుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైన ఈ సినిమా నిధికి మంచి ఆఫర్స్‌ను అందించింది. అలా 'ఇస్మార్ట్ శంకర్'లో హీరోయిన్గా ఛాన్స్ చేజిక్కుంచుకుంది. ఇది సూపర్ హిట్ కావడంతో నిధికి మళ్లీ వెనుదిరిగి చూసుకోనవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తోంది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన 'హరిహర వీరమల్లు'లో హీరోయిన్గా నటిస్తున్న నిధి అశోక్ గల్లా హీరోగా వస్తోన్న చిత్రంలోనూ కథానాయికగా కనువిందు చేయనుంది. చదవండి: మహేశ్‌తో జతకట్టనున్న ‘ఇస్మార్ట్’ బ్యూటీ! -
నాలుగు మంచి మాటలు చెప్పాలి
సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పాజిటివ్ పోస్ట్‌లే చేయాలని అంటున్నారు హీరోయిన్ నిధీ అగర్వాల్. సోషల్ మీడియా గురించి నిధీ మాట్లాడుతూ– ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో బాధితుల సహాయానికి సంబంధించిన పోస్టులను మనం గమనిస్తూనే ఉన్నాం. ఇటువంటి సందర్భాల్లో కూడా కొందరు నెగటివ్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న బెడ్స్ సంఖ్య వంటి వివరాల గురించి కచ్చితమైన సమాచారం తెలిసినప్పుడు సోషల్æమీడియాలో పోస్ట్ చేస్తే అది కొందరికైనా ఉపయోగడపడుతుంది. పరోక్షంగా మనం కూడా సహాయం చేసినవాళ్లం అవుతాం. అంతేకానీ నెగటివ్ పోస్టుల వల్ల ఏ ప్రయోజనం ఉండదు. కరోనా పాజటివ్ నేపథ్యంలో అందరిలో పాజిటివిటీ పెంచే నాలుగు మాటలు చెబితే మంచిది’’ అని పేర్కొన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ఈ కోవిడ్ పరిస్థితుల్లో నా వ్యక్తిగత సిబ్బందికి ఏమైనా ఇబ్బందులు కలిగితే వారికి నేను అండగా ఉంటాను. అది నా బాధ్యత కూడా’’ అన్నారు. -
ట్రెండింగ్‌లో నిధి అగర్వాల్ ఫొటోలు..
-
ఇస్మార్ట్ బ్యూటీకి గుడి కట్టిన అభిమానులు
‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది అందాల తార నిధి అగర్వాల్. రెండో సినిమాతోనే అక్కినేని హీరోతో ఆడిపాడిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇక రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘ఈస్మార్ట్ శంకర్’తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఈ భామ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది. అంతేకాకుండా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. తాజాగా నిధి అగర్వాల్ అభిమానుల నుంచి విలువ కట్టలేని అందమైన బహుమానాన్ని అందుకుంది. తమ అభిమాన నటి నిధికి తెలుగు తమిళ అభిమానులు కలిసి ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున చెన్నైలో విగ్రహం చేయించి గుడి కట్టారు. అంతేగాక విగ్రహానికి పాలాభిషేకం చేసి పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేయించారు. ఈ విషయాన్ని ట్విటర్లో నిధి ఫ్యాన్స్ క్లబ్ షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంత అభిమానం ఉంటే ఇలా విగ్రహం ప్రతిష్టించి పూజలు చేస్తారని నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి ఈ విషయం నిధి దాకా చేరిందో లేదో తెలీదు. ఒకవేళ తెలిస్తే ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. కాగా ఇటీవల బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు తెలంగాణలో విగ్రహం ఏర్పాటు చేసిన విషషయం తెలిసిందే. లాక్డౌన్లో ఆయన చేసిన సేవలను కీర్తిస్తూ సోనూ అభిమానులు సిద్ధిపేట జిల్లాలోని దుబ్బతండాలో ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: పవన్ సినిమాలో నిధి అగర్వాల్ రామ్ అలా ప్రపోజ్ చేశాడు : సింగర్ సునీత -
పవన్ సినిమాలో నిధి అగర్వాల్
ఇస్మార్ట్ బ్యూటీ నిధీ అగర్వాల్ ఓ క్రేజీ ఛాన్స్ కొట్టేశారు. పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ హీరోయిన్గా నిధీ అగర్వాల్ యాక్ట్ చేస్తున్నారు. ఏయం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నిధి యువరాణి పాత్రలో కనిపిస్తారని సమాచారం. పవన్ కల్యాణ్ వజ్రాల దొంగలా కనిపిస్తారట. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత వరుసగా రెండు తమిళ సినిమాల్లో కనిపించారు నిధీ అగర్వాల్. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం అయి, ఫుల్ జోష్‌లో ఉన్నారామె. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. -
నా సూట్‌కేస్ నిండా అవే!
‘‘కొత్త బట్టలు ఎవరికి ఇష్టం ఉండదు? నాకైతే మరీ.. షాపింగ్ అంటే చాలా ఇష్టం. కోవిడ్ వల్ల షాపింగ్ చాలా మిస్సయ్యాను. మళ్లీ చాలా షాపింగ్ చేసేయాలనుంది’’ అంటున్నారు ‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నిధీ అగర్వాల్. గత ఏడాది మొత్తం ఇళ్లకే పరిమితమయ్యాం. ఈ ఏడాదిలో ఏం చేయబోతున్నారు అనే ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారామె. ‘‘గత ఏడాది షూటింగ్ చేయడం మిస్ అయ్యా. అందుకే ఈ ఇయర్ ఎక్కువ పని చేయాలనుంది. ఫ్రెండ్స్‌తో కలసి బయటకు వెళ్లాలి. అలానే నాకు షాపింగ్ చేయడం ఇష్టం. ఆన్లైన్ షాపింగ్ చేసీ చేసీ బోర్ కొట్టేసింది. స్టోర్స్ అన్నీ ఓపెన్ అయితే రెక్కలు కట్టుకుని వాలిపోవాలనిపించింది. ఇప్పుడు హ్యాపీగా షాపింగ్ చేస్తున్నా. కొత్త బట్టలు కొనుక్కుంటే భలే సంతోషంగా అనిపిస్తుంది. స్టోర్‌కి వెళ్లినప్పుడు ఎవరైనా గుర్తుపట్టే చాన్స్ ఉంది. వాళ్ళందరూ నా సినిమాలు చూసి, నచ్చాయి అని చెబుతున్నప్పుడు బావుంటుంది. అలానే ఎక్కడికి వెళ్లినా ఖాళీ సూట్‌కేస్ తీసుకెళ్తాను. బట్టలు, జ్యూవెలరీ కొనుక్కుంటాను. సూట్‌కేస్‌ని వాటితో నింపేస్తాను’’ అన్నారు నిధీ. -
నిధితో నిధి
‘ఇస్మార్ట్ శంకర్’తో పెద్ద మాస్ హిట్ అందుకున్న నిధీ అగర్వాల్ మంచి జోష్‌లో ఉన్నారు. తమిళంలో వరుస సినిమాలు కమిట్ అవుతూ బిజీ బిజీగా ఉన్నారు. ‘జయం’ రవి నటించిన ‘భూమి’తో తొలిసారి తమిళంలో కనిపించబోతున్నారు నిధి. ఈ సినిమా దీపావళికి ఓటీటీలో విడుదల కానుంది. ఆ తర్వాత శింబు చేసిన ‘ఈశ్వరన్’ సినిమాలో హీరోయిన్గా నటించారామె. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా మూడో సినిమా కూడా కమిట్ అయ్యారీ బ్యూటీ. ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యారామె. తమిళంలో వరుస సినిమాల మీద ఫోకస్ పెట్టడమే కాదు తమిళం నేర్చుకోవడం మీద కూడా శ్రద్ధపెట్టారట నిధీ అగర్వాల్. -
కామారెడ్డిలో నిధి అగర్వాల్ సందడి ఫొటోలు
-
బర్త్‌డే లుక్
నటుడు కృష్ణ మనవడు, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా సోమవారం నిధీ అగర్వాల్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘‘ఈ సినిమా కోసం చేసిన కృష్ణగారి ‘యమలీల’ చిత్రంలోని ‘జుంబారే..’ సాంగ్ రీమిక్స్ వీడియోకు మంచి స్పందన వచ్చింది.. ఇప్పటి వరకూ 60 శాతం షూటింగ్ పూర్తయింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నరేష్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపూటి. -
హీరోయిన్ నిధి అగర్వాల్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
‘ఇస్మార్ట్’ విజయం మా ఆకలిని తీర్చింది
‘‘సినిమా విడుదలై ఏడాది అయిన సందర్భంగా మేం ఏ సెలబ్రేషన్స్ చేయటంలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున అందరం ఇంటిపట్టునే ఉంటున్నాం. హీరో రామ్ ఫ్యాన్స్ కూడా కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు చార్మి. రామ్ హీరోగా నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి కనెక్ట్స్‌పై రూపొందిన ఈ చిత్రానికి చార్మి ఓ నిర్మాత. శనివారం (జులై 18)తో ఈ సినిమా విడుదలై ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా చార్మి చెప్పిన విశేషాలు. రామ్, పూరి జగన్నాథ్ ► పూరీగారితో పాటు టీమ్ అందరం సక్సెస్ కోసం ఎంతో ఎదురుచూశాం. సక్సెస్ అనే ఆకలి తీరాలనుకున్నాం. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించి మా ఆకలిని తీర్చారు పూరి. ఈ సినిమా కథను రామ్ కోసమే రాశారు పూరీగారు. ఆయన కథ చెప్పినప్పుడు రామ్ ఏ ఎనర్జీతో ఉన్నారో షూటింగ్ జరుగుతున్నంత సేపు అదే ఎనర్జీ, అదే పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉన్నారు. రామ్ హీరోగా పూరీగారి దర్శకత్వంలో మరో సినిమా ఉంటుంది. అది ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెలా, మరో సినిమానా అనేది ఇప్పుడే చెప్పలేను. ► విజయ్ దేవరకొండతో చేస్తున్న ప్యాన్ ఇండియా చిత్రానికి ‘ఫైటర్’ టైటిల్‌నే ఫిక్స్ చేశాం. మిగతా భాషలన్నింటికీ కలిపి ఒకే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నాం. ఇకనుంచి మా బ్యానర్లో ప్యాన్ ఇండియా సినిమాలు తీయాలనుకుంటున్నాం. ► ఓటీటీకి కంటెంట్ క్రియేట్ చేయడానికి మా పూరి కనెక్ట్స్ సంస్థ కూడా ప్రిపేర్ అవుతోంది. భవిష్యత్‌లో రెగ్యులర్ సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి కూడా సినిమాలు చేసుకుంటూ వెళతాం. దాదాపు అన్ని స్క్రిప్ట్‌లు పూరీగారు రాసినవే ఉంటాయి. ఓటీటీపై రూపొందించే చిత్రాల ద్వారా కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం. ► ఈ లాక్డౌన్ టైమ్‌లో పూరీగారికి రైటింగ్ తప్ప వేరే వ్యాపకమే లేదు. నాలుగు నెలలుగా పూరీగారు రైటింగ్ సైడే దృష్టి పెట్టారు. భవిష్యత్‌లో పూరి కనెక్ట్స్ నుంచి హృదయానికి ఆనందం ఇచ్చే కథలను ప్రేక్షకులు చూడబోతున్నారు. నటిగా ఎన్నో సినిమాలు చేశాను కానీ, ఇప్పుడు నటించాలనే ఇంట్రస్ట్ లేదు. మా పూరి కనెక్ట్స్ ద్వారా మంచి సినిమాలు తీసే ప్లానింగ్‌లో ఉన్నాం. మరో పదేళ్లకు సరిపడా ప్రొడక్షన్‌ను ఎలా ప్లాన్ చేయాలి, ఎలాంటి కథలు చేయాలనే ప్లాన్స్ జరుగుతున్నాయి. -
మన బాధ్యత
వలస కార్మికుల కోసం ఎవరికి వీలైన సహాయం వాళ్లు చేస్తున్నారు. వాళ్లను సొంత ఊళ్లకు పంపుతూ కొందరు, వాళ్లకు కావాల్సిన సరుకులను అందిస్తూ మరికొందరు సహాయం చేస్తున్నారు. నిధీ అగర్వాల్ కూడా తన వంతు సహాయంగా వలస కార్మికులకు కావాల్సిన ఆహారాన్ని (బ్రెడ్ మరియు జామ్) అందిస్తున్నారు. వాటిని ఆవిడే స్వయంగా ప్యాక్ చేస్తున్నారు కూడా. ఇక్కడ ఉన్న ఫొటోను షేర్ చేసి, ‘వలస కూలీలకు ఆహారం. వాళ్లకు సహాయపడటం మన బాధ్యత’’ అన్నారు నిధీ అగర్వాల్. -
కిలాడీ?
ఏ పనినైనా పూర్తి చేయడం కోసం మాయ చేసి, మంత్రం వేసి, మోసం చేసేవాళ్లను కిలాడీ అంటారు. ఇప్పుడు అలాంటి జగత్ కిలాడీగా మారబోతున్నారట రవితేజ. ‘వీర’ తర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. కోనేరు సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. ఇద్దరు కథనాయికలు ఉన్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్ ఓ హీరోయిన్ అని చిత్రబృందం కన్ఫర్మ్ చేసింది. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఓ పాత్ర పోలీస్ ఆఫీసర్ అట. ఇంకోటి కిలాడీ పాత్ర అని సమాచారం. ఈ సినిమాకు ‘కిలాడీ’ అనే పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ప్రీ–ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
మా అమ్మే మా స్టార్!
అమ్మంటే అనురాగం అమ్మంటే ఆనందం అమ్మంటే ఆత్మీయం అమ్మంటే ధైర్యం అమ్మంటే త్యాగం అమ్మంటే రక్షణ అమ్మంటే ఓదార్పు అమ్మంటే... చెప్పడానికి ఇలా ఎన్నో ఉంటాయి. ‘మదర్స్ డే’ సందర్భంగా ‘మా అమ్మే మా స్టార్’ అంటూ కొందరు సినీ స్టార్స్ పంచుకున్న విశేషాలు. మన తప్పులను ప్రేమించే వ్యక్తి అమ్మ: దేవిశ్రీ ప్రసాద్ ► అమ్మ గురించి మాటల్లో చెప్పడం అంత సులభం కాదు. కొన్ని వేల పాటలు చేసినా కూడా అమ్మ గురించిన కంప్లీట్ ఎమోషన్‌ను చెప్పలేం. ఎందుకంటే వారు చూపించే ప్రేమ అటువంటిది. అమ్మ చేసే త్యాగాలు అటువంటివి. మనం ఎన్ని తప్పులు చేసినా ఎప్పుడూ ఒకేలా మనల్ని ప్రేమించగల ఏకైక వ్యక్తి అమ్మ. అటువంటి ప్రేమకు ప్రతిరూపమైన మదర్స్ అందరికీ ‘హ్యాపీ హ్యాపీ మదర్స్ డే’. ► మా కుటుంబంలో మేమందరం సాధించిన ప్రతి విజయానికి కారణం మా అమ్మగారే. మా కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. మా అందరి పని కంటే మా అమ్మగారు మా కోసం చేసే పనే ఎక్కువ. ఏ పనినైనా చాలా అకింతభావంతో, ఏకాగ్రతగా చేస్తారు. ‘మీరు చేసే హార్డ్‌వర్క్, ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్లో మాకు పదిశాతం ఉన్నా మేం జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి వెళతాం’ అని మా అమ్మగారితో నేను అంటుంటాను. ఈ విషయాన్ని మా నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. ‘మా ఆవిడకు నలుగురు పిల్లలండీ నాతో కలిపి’ అని మా నాన్నగారు అంటుండేవారు. మా నాన్నగారిని కూడా మా అమ్మగారు ఓ చిన్నపిల్లాడిలా చూసుకున్నారు. ► నా ఇంటిపైనే నా స్టూడియో ఉంటుంది. దాని పై నా పెంట్‌హౌస్ ఉంటుంది. కింద అమ్మ ఉంటారు. పైన నేను ఉంటాను. మాములుగానే లంచ్ టైమ్, డిన్నర్లను మా అమ్మగారితో చేస్తాను. ఈ క్వారంటైన్ సమయంలో అమ్మతో ఇంకా ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నాను. ఖాళీ సమయంలో నేను ఏదైనా వంటకాన్ని ట్రై చేద్దామన్నా కూడా అమ్మ ఒప్పుకోవడం లేదు. ► ఈ మదర్స్ డే రోజు మా అమ్మగారి గురించి మాట్లాడటం చాలా చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మగారి గురించి చెప్పమంటే నేను చెబుతూనే ఉంటాను. మా అమ్మగారు వంట చేసినప్పుడల్లా నేను ఓ కాంప్లిమెంట్ ఇస్తూనే ఉంటాను. ‘మమ్మీ వంటలో నువ్వు ఇళయరాజాగారిలా అని’. మ్యూజిక్ గురించి ఏదైనా పోల్చాలంటే నా దృష్టిలో ఇళయరాజాగారు నంబర్ వన్. ‘మ్యూజిక్‌లో ఇళయరాజాగారు ఎలానో వంటలో నువ్వు అలా’ అని మా అమ్మకు నేను కాంప్లిమెంట్ ఇస్తుంటాను. ► చిన్నతనం నుంచే మ్యూజిక్ పట్ల చాలా ఆసక్తికరంగా ఉండేవాడిని. చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేవాడిని. స్కూలు, మ్యూజిక్ క్లాసులు, ఇంటికి వచ్చిన తర్వాత మ్యాండలిన్ శ్రీనివాస్‌గారి దగ్గర క్లాసులు, మళ్లీ ప్రాక్టీస్.. ఇలా వేళకు భోజనం చేయడానికి కుదిరేది కాదు. అందుకే ఇప్పటికీ నాకు డిఫరెంట్ టైమ్స్‌లో ఆకలి వేస్తుంది. అప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది. ఆశ్యర్యంగా అప్పుడే మా అమ్మగారు ఫోన్ చేసి ‘ఏరా.. ఆకలేస్తుందా’ అని అడుగుతారు. ఇది జరిగినప్పుడల్లా నాకు ఒళ్లు పులకరిస్తుంది. ‘నాకు ఆకలేస్తున్నట్లు మీకు ఎలా తెలిసింది?’ అంటే ‘ఏమోరా నాకు అనిపించింది’ అని చెబుతారు. ఇంకో విశేషం ఏంటంటే.. నేను ఏదైతే తినాలనుకుంటున్నానో మా అమ్మగారు ఆ డిష్ పేరు చెప్పి తింటావా? అని అడుగుతారు. ఉదాహరణకు నాకు ఎగ్ రైస్ తినాలనిపించిందనుకోండి.. ‘ఏరా ఎగ్‌రైస్ తింటావా?’ అని మా అమ్మగారు అడుగుతారు. అమ్మా నేను అదే అనుకుంటున్నాను అంటాను. చాలా ఆశ్చర్యపోతారు. ఇలాంటివి చాలా జరిగాయి. మనం అందరం అమ్మకు రుణపడి ఉండాలి. వారిని ప్రేమిస్తూ, బాగా చూసుకుంటూ, వారితో ఎక్కువ సమయం గడపడమే మనం చేయగలిగింది. ఎందుకంటే వారి స్థాయికి మనం ఎప్పుడూ చేరుకోలేం. హ్యాపీ మదర్స్ డే. విత్ లవ్ టు మై మదర్ శివమణి సత్యమూర్తిగారు. మళ్లీ మళ్లీ నీకే పుట్టాలనుకుంటున్నా: చిన్నికృష్ణ ► బుడి బుడి అడుగుల నుంచి పరుగుల వరకు.. జీవితంలో అమ్మ (లక్ష్మీ సుశీల) ఎన్నో పాఠాలు నేర్పింది. నా జీవిత ప్రయాణానికి కూడా గురువు అయ్యింది. మా ఇంటో ఓ కష్టం వస్తే.. దేశంలో ఉన్న ఎన్నో దేవాలయాలు తిప్పింది. అమ్మ వేలు పట్టుకుని అన్ని గుళ్లూ తిరిగాను. అప్పుడు ఎన్నో కథలు చెప్పింది. ఆ కథలే ప్రేక్షకులకు చెప్పే రచయితను చేశాయి. ► నేను సంపాదించడం మొదలుపెట్టాక ఏం కావాలని అడిగితే అమ్మ ‘కపిల గోవు’ని అడిగింది. మాకు గోశాల ఉండేది. అమ్మ అడిగిన గోవుని కొనిపెడితే సంబరపడిపోయింది. అమ్మకి తన పిల్లలు ఎప్పుడూ చిన్నవాళ్లే. ఇప్పటికీ నాకు అన్నం తినిపిస్తుంది. ► మానవత్వానికి, మంచితనానికి జంతువుల్లో ఆవుకి ప్రథమ తాంబూలం ఇస్తారు. అలా మానవత్వంలో మా అమ్మకు నేను ప్రథమ తాంబూలం ఇస్తాను. అందర్నీ సమానంగా చూడటం అనేది ఆమె దగ్గరే నేర్చుకున్నాను. వాళ్లూ వీళ్లూ అనే తేడా లేదు. మా అమ్మగారు ఆర్ఎస్ఎస్సా? మదర్ థెరిస్సానా? ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఆవిడకు అందరూ ఒకటే. ‘మానవకులం’ అనుకుంటుంది. చెడ్డవాళ్లల్లోనూ మంచిని చూసే మనిషి. చెడ్డవాళ్లకు దూరంగా ఉండకు. వీలైతే మంచివాళ్లలా మార్చు అని చెప్పింది. అందుకే ‘అమ్మా... మళ్లీ మళ్లీ నీ కడుపునే పుట్టాలనుకుంటున్నాను’. ► అమ్మ నా దగ్గరే ఉంటుంది. మా అన్నయ్య, చెల్లెలు తెనాలిలో ఉంటారు. వాళ్లతో, వాళ్ల పిల్లలతో ఉండాలని తెనాలి వెళ్లింది. జీవితంలో ఎన్నో ఆనందకరమైన విషయాలకు కారణంగా నిలిచిన అమ్మా... నీకు ‘హ్యాపీ మదర్స్ డే’. లక్ష్మీ సుశీల, చిన్నికృష్ణ చిన్నప్పటి రోజులకు వెళ్లిపోయాం: కాజల్ అగర్వాల్ ► నా పదేళ్ల కెరీర్లో ఇన్ని రోజులు ఇంట్లో ఉండటం ఇదే ఫస్ట్ టైమ్. ఇంట్లో వాళ్లతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నాను. అమ్మ, నాన్న, నాన్నమ్మతో ఎక్కువ టైమ్ గడిపే వీలు దొరికింది. అలాగని సమయాన్ని వృథా చేయడం లేదు. నన్ను నేను బిజీగా ఉంచుకుంటున్నాను. అందరం కష్టకాలంలో, భయంలో ఉన్నాం. దీన్ని ఎలా అయినా దాటగలుగుతాం. ► నేను అమ్మకి చాలా క్లోజ్. నేను ఈరోజు మంచి పొజిషిన్‌లో ఉన్నానంటే దానికి కారణం కచ్చితంగా మా అమ్మే. నన్ను సరైన మార్గంలో గైడ్ చేస్తుంటుంది. నాకు వంట నేర్పించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది అమ్మ. ఫైనల్‌గా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. నేను వంట గది బాధ్యతలు తీసుకోవడం అమ్మకు చాలా సంతోషంగా ఉంది (నవ్వుతూ). ► మా చిన్నప్పుడు నేను, చెల్లెలు (నిషా అగర్వాల్) మదర్స్ డే కోసం స్పెషల్‌గా గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి, అమ్మకి ఇచ్చేవాళ్లం. అలాగే ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ మేమే తయారు చేసేవాళ్లం. అమ్మ గదిని బాగా అలంకరించేవాళ్లం. పెద్దయ్యాక లంచ్‌కి బయటికి తీసుకెళుతున్నాం. లాక్డౌన్ ముందు వరకూ మదర్స్ డే అంటే అవుటింగే. కానీ ఇప్పుడు చిన్నప్పటి రోజులకు వెళ్లిపోయాం. బయటికి వెళ్లలేం కాబట్టి, చిన్నప్పుడు చేసినట్లుగా మా అమ్మ రూమ్‌ని అందంగా డెకరేట్ చేశాం. బ్రేక్‌ఫాస్ట్ కూడా మేమే తయారు చేస్తాం. ► అమ్మకు బహుమతులంటే ఇష్టం ఉండదు. తనతో మేం ఉండటమే పెద్ద గిఫ్ట్ అనుకుంటుంది. ఈ లాక్డౌన్ వల్ల ఓ రెండు నెలలుగా అమ్మతోనే ఉంటున్నాను. ఆవిడకు చాలా ఆనందంగా ఉంది. తల్లి సుమన్ అగర్వాల్‌తో కాజల్ అమ్మ ఏం చెప్పినా వింటాను: నిధీ అగర్వాల్ ► సాధారణంగా షూటింగ్స్‌తో బిజీగా ఉండటంవల్ల ఇంటిపట్టున ఉండటానికి కుదరదు. ఇప్పుడు ఇంట్లో ఉండటం చాలా బావుంది. ఇంట్లో ఉండటం ఎవ్వరికైనా ఇష్టమే కదా. అమ్మ చేతి వంట తింటూ జాగ్రత్తగా ఉంటున్నాం. ఇంట్లో ఉంటే చాలా గారాభంగా చూస్తారు. ఇలా ఎక్కువ రోజులు ఇంట్లో ఉండి 2–3 ఏళ్లు అవుతోంది. షూటింగ్స్ వల్ల మహా అయితే 2 రోజులు కూడా ఉండటానికి కుదిరేది కాదు. ► చిన్నప్పుడు మదర్స్ డే అంటే అమ్మకి స్వయంగా గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి ఇచ్చేదాన్ని. ఎలాంటి కార్డ్ తయారు చేయాలనే విషయంలో ముందు రోజంతా ఆలోచించేదాన్ని. అలాగే చిన్న చిన్న గిఫ్ట్స్‌తో సర్ప్రైజ్ చేసేదాన్ని. ► ఈ మదర్స్‌డేకి అమ్మకి ఏదైనా కొందామంటే బయటకు వెళ్లే వీలు లేదు. ఇవాళ అమ్మ ఏం చెప్పినా వింటాను (నవ్వుతూ). షూటింగ్స్ ఉన్నప్పుడు ఇంటికి ఫోన్ చేయడం కుదరదు. కొన్నిసార్లు ఇంటి నుంచి ఫోన్ వచ్చినా ఆన్సర్ చేయడం వీలవదు. కానీ ఈసారి నుంచి అమ్మ ఫోన్‌ని ఎప్పుడూ మిస్ చేయకూడదని నిశ్చయించుకున్నాను. ► అమ్మానాన్న ఇద్దరితోనూ నేను క్లోజ్. అమ్మతో మంచి అటాచ్మెంట్ ఉంది. అమ్మకు చిన్న వయసులోనే నేను పుట్టాను. మా ఇద్దరి మధ్య 20 ఏళ్ల వ్యత్యాసం కూడా ఉండదు. చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను అన్ని క్లాస్‌లకు పంపేది. కేవలం చదువు ఒక్కటే కాదు. మన పర్సనాలిటీ డెవలప్ అవ్వాలంటే అన్నీ నేర్చుకోవాలని డ్యాన్సింగ్ క్లాస్, స్పోర్ట్స్ క్లాస్ చేర్పించారు. ప్రస్తుతం నేను సినిమాలో ఈజీగా డ్యాన్స్ చేసినా, ఈజీగా ఎవ్వరితో అయినా కమ్యూనికేట్ అవుతున్నా అంటే చిన్నప్పుడు అమ్మ తీసుకున్న శ్రద్ధ వల్లే. మన ప్రవర్తన, అలవాట్లు ఇవన్నీ అమ్మ పెంపకం మీద ఆధారపడి ఉంటాయి. ఆ విధంగా చూస్తే ‘మై మమ్మీ ఈజ్ బెస్ట్’. మంచి చెబుతూ పెంచారు. ► లాక్డౌన్లో వంట గదిలో ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నాను. ఇప్పటివరకూ 2 కేకులు బేక్ చేశాను. దోసె, గ్రీన్ చట్నీ, టీ తయారు చేశాను. అన్నింటికీ మా అమ్మ పదికి పది మార్కులు వేశారు. ఏదైనా పని చేస్తే పక్కాగా చేయాలి, లేదంటే పక్కన పెట్టేయాలి అనుకుంటాను నేను. ఆ అలవాటు అమ్మ వల్ల వచ్చింది. అలాగే మా అమ్మ అందర్నీ సమానంగా చూస్తారు. తననుంచి నేను నేర్చుకున్న మరొక విషయం అది. తల్లి ఇందూ అగర్వాల్‌తో నిధి -
మళ్లీ జోడీ?
‘నేల టిక్కెట్టు’ సినిమాలో జంటగా నటించిన రవితేజ–మాళవికా శర్మ మరోసారి కలిసి నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం ‘క్రాక్’ చిత్రంలో నటిస్తున్నారు రవితేజ. ‘డాన్‌శీను, బలుపు’ వంటి హిట్ చిత్రాల తర్వాత రవితేజ–గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారు రవితేజ. హవీశ్ ప్రొడక్షన్స్ పతాకంపై కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారట. దీంతో ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకి అవకాశం ఉంది. ఇప్పటికే ఒక హీరోయిన్గా నిధీ అగర్వాల్‌ను తీసుకున్న చిత్రబృందం మరో హీరోయిన్గా మాళవికా శర్మను తీసుకోనున్నారని టాక్. ఇదే నిజమైతే రవితేజ–మాళవికలను రెండోసారి జోడీగా చూడొచ్చన్న మాట. -
అందాల నిధి అగర్వాల్
-
రవితేజ సరసన ఇస్మార్ట్ బ్యూటీ
మాస్ మహారాజ రవితేజతో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ జతకట్టనుంది. ‘రాక్షసుడు’ ఫేం రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఏ స్టూడియోస్ పతాకంపై హవీష్ ప్రొడక్షన్లో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఇద్దరి హీరోయిన్లకు అవకాశం ఉండటంతో, ఓ కథానాయికగా నిధి అగర్వాల్‌ను చిత్ర బృందం ఎంపిక చేసింది. మరో హీరోయిన్ పేరును ప్రకటించలేదు. అయితే త్వరలోనే మరో కథానాయిక పేరుతో పాటు ఇతర తారాగణం వివరాలు వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. డిస్కోరాజా తర్వాత మాస్ మహారాజ రవితేజ చేస్తున్న తాజా చిత్రం ‘క్రాక్’. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ తుది దశకు చేరుకుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొని మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టనుంది. ఇప్పటికే పోలీస్ ఆఫీసర్ లుక్‌లో రవితేజ రఫ్పాడిస్తుండగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ నెగటీవ్ షేడ్‌లో కొత్తగా కనిపించింది. బి.మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. -
జోడీ సెట్
‘ఇస్మార్ట్ శంకర్’కి ముందు నిధీ అగర్వాల్ చేసిన ‘సవ్యసాచి’, ‘మిస్టర్ మజ్ను’ కమర్షియల్ సినిమాలే అయినా ‘ఇస్మార్ట్..’ అంత మాస్ కాదు. ఈ సినిమా తర్వాత నిధీ అగర్వాల్ మరో ఫుల్ మాస్ సినిమా అంగీకరించారు. మాస్ హీరో రవితేజ నటించనున్న ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలో నిధీ అగర్వాల్ కథానాయికగా నటించనున్నారు. రవితేజ–నిధి జోడీ సెట్ అయిన విషయాన్ని చిత్రనిర్మాత సత్యనారాయణ కోనేరు గురువారం ప్రకటించారు. హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకుడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉంటారు. ఒకరు నిధీ అగర్వాల్ కాగా మరో హీరోయిన్ని త్వరలో ప్రకటిస్తారు. మే నెలాఖరున ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. -
‘సూత్ర’ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్లో నిధి అగర్వాల్
-
అందాల ‘నిధి’
అందాల నటి నిధి అగర్వాల్ నగరంలో సందడి చేసింది. ఫ్యాషన్ దుస్తులు..డిజైనర్ ఆభరణాలు..లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు ఒకేచోట కొలువుదీరాయి. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ ఇందుకు వేదికైంది. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ‘సూత్ర’ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్‌ను సినీనటి నిధి అగర్వాల్ ప్రారంభించారు. ఈ నెల 19 వరకు అందుబాటులో ఉండే ఈ ఎగ్జిబిషన్లో దేశంలోనే అత్యున్నత ఫ్యాషన్ లేబుల్స్, డిజైనర్ బ్రాండ్లను ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. – మాదాపూర్ -
కూకట్‌పల్లిలో సినీ సందడి
-
దిల్‌సుఖ్‌నగర్‌లో నిధి అగర్వాల్ సందడి
-
అలా బోర్ కొట్టింది
సినిమా : అలా బోర్ కొట్టింది. అందుకే ఇలా అని చెప్పుకొచ్చింది నటి నిధి అగర్వాల్. ఇటీవల టాలీవుడ్లో బాగా వార్తల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కోలీవుడ్‌లో ప్రచారంలో ఉంటోంది. మున్నా మైఖెల్ అనే హిందీ చిత్రంతో కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ జాణ ఆ తరువాత టాలీవుడ్‌కు దిగుమతి అయ్యింది. అక్కడ సవ్యసాచి, మిస్టర్ మజ్ఞు చిత్రాల్లో నటించింది. ఆ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేదు. ఆ తరువాత నటించిన ఇస్మార్ట్ శంకర్ నిధి అగర్వాల్ కేరీర్‌ను టర్నింగ్ తిప్పిందనే చెప్పాలి. రామ్ హీరోగా పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం అనూహ్య విజయాన్ని అందుకుంది. అంతే నిధిఅగర్వాల్కు కోలీవుడ్‌లో కాలింగ్ బెల్ మ్రోగింది. ఇప్పుడీ బ్యూటీ లక్కీ హీరో జయంరవితో భూమి అనే చిత్రంలో నటిస్తోంది. కాగా ఇంతకు ముందు గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసి నెటిజన్లకు మంచిపని చెప్పిన నిధి అగర్వాల్ తాజాగా తమిళ సంప్రదాయం ఉట్టి పడేలా చీరను సింగారించుకున్న ఫొటోను పోస్ట్ చేసింది. ఇంతలో ఇంతమార్పు ఏమిటమ్మా అన్న నెటిజన్ల ప్రశ్నకు ఏంలేదు గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేసి బోర్ కొట్టిందనీ, అందుకే ఒక మార్పు కోసం చీర కట్టిన ఫొటోలను విడుదల చేసినట్లు చాలా సింపుల్‌గా బదులిచ్చింది. ప్రస్తుతం కోలీవుడ్‌పై దృష్టి సారించడంతో ఇక్కడ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగమే ఇదని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇకపోతే నటి నిధి అగర్వాల్ గురించి మరో ప్రచారం ఇప్పుడు సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందుకు కారణం తను పోస్ట్ చేసిన ఒక వీడియోనే. ఖరీదైన పోర్చే కారును డ్రైవ్ చేస్తున్న వీడియోనే అది. దాని విలువ కోటి రూపాయలు. ఒకేఒక్క చిత్రం హిట్ అవ్వడంతోనే కోటి రూపాయల ఖరీదైన కారును నిధి అగర్వాల్ కొనుగోలు చేయడంతో ఇతర హీరోయిన్లకు కంటగింపుగా మారింది. లక్కుకంటే ఈ అమ్మడిదేగా అని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు. కాగా ప్రస్తుతం నిధి అగర్వాల్ జయంరవికి జంటగా భూమి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం పక్కా పల్లెటూరి యువతిగా మారిపోయ్యింది. ఇంతకు ముందు రోమియో జూలియట్, బోగన్ వంటి సక్సెస్‌పుల్ చిత్రాలను తెరకెక్కించిన లక్ష్మణ్ దీనికి దర్శకుడు. అంతేకాదు ఇది నటుడు జయంరవికి 25వ చిత్రం. భూమి చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. నటి నిధి అగర్వాల్ కూడా కోలీవుడ్‌లో తన భవిష్యత్ గురించి కాస్త ఎక్కువే కలలు కంటోందని సమాచారం. -
ఒంగోలులో నిధి అగర్వాల్ సందడి
-
రాజమహేంద్రవరంలో నిధి అగర్వాల్ సందడి
-
సర్కారు బడిలో నిధి అగర్వాల్..
బంజారాహిల్స్: టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ టీచర్‌గా మారిపోయారు. విద్యార్థులకు ఇంగ్లిష్ పాఠాలు చెప్పి మెప్పించింది. సర్కారు బడుల్లో విద్యార్థులకు ఆంగ్ల పాఠాలు చెప్పేందుకు, వారిలో ఆంగ్ల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పెగా టీచ్ ఫర్ ఛేంజ్ స్వచ్ఛంద సంస్థ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం బంజారాహిల్స్ రోడ్ నెం:12లోని ఎన్బీటీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిధి ఇక్కడి మూడో తరగతి విద్యార్థులకు గంట సమయం ఇంగ్లిష్ పాఠాలు బోధించారు. వారితో ఇంగ్లిష్‌లో మాట్లాడించారు. అనంతరం విద్యార్థులతో సెల్ఫీలు దిగి వారిని మరింత ఉత్సాహపరిచారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయడం మరిపోలేనని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాతృభాషతో పాటు ఇంగ్లిష్ నేర్పించడం ఎంతో అవసరమని, ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్న సంస్థను ఆమె అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు, వారిలో సృజనను పెంచేందుకు తాము ప్రముఖులతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పెగా సిస్టమ్స్ ఎండీ సుమన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్ఎస్కే ఫౌండర్ చైతన్య కూడా పాల్గొన్నారు. -
అశోక్ తొలి దర్శక–నిర్మాత కృష్ణగారే
‘‘గల్లా జయదేవ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నన్ను సోదరుడిలా భావిస్తారు. ఆయన నిర్మాతగా కొడుకు అశోక్‌తో తొలి సినిమా చేస్తున్నారు. పద్మావతిగారికి, అశోక్‌కి, నిధీ అగర్వాల్‌కి ఆల్ ది బెస్ట్’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. వ్యాపారవేత్త, పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా పరిచయవుతున్న సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి నటుడు రానా కెమెరా స్విచ్చాన్ చేయగా, రామ్‌చరణ్ క్లాప్ ఇచ్చారు. సూపర్‌స్టార్ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మంచి కథ, కథనాలతో అశోక్ హీరోగా పరిచయం కాబోతుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు రానా. గల్లా జయదేవ్ మాట్లాడుతూ–‘‘టెక్సాస్ ఫిల్మ్ అండ్ టెలివిజన్‌లో అశోక్ డిగ్రీ పూర్తి చేశాడు. మా మామ కృష్ణగారి సినిమాల్లో అశోక్ చిన్నప్పుడు నటించాడు. తన తొలి దర్శక–నిర్మాత కృష్ణగారే. మహేశ్‌బాబు ‘నాని’ సినిమాలోనూ అశోక్ నటించాడు. మా బ్యానర్లో కేవలం సినిమాలే కాదు.. టెలివిజన్ రంగంలోనూ కొత్త కంటెంట్‌ను అందించాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘హీరో కావాలని అశోక్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు’’ అన్నారు పద్మావతి. ‘‘ఈ కథకు అశోక్ కరెక్ట్‌గా సరిపోతాడు’’ అని శ్రీరామ్ ఆదిత్య అన్నారు. ‘‘నేటి నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుంది’’అన్నారు గల్లా అశోక్. ఈ కార్యక్రమంలో అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, నటులు వీకే నరేష్, సుధీర్‌బాబు, సుశాంత్, నిధీ అగర్వాల్, పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, రచయిత సత్యానంద్, అమల అక్కినేని, నమ్రత శిరోద్కర్, నన్నపనేని రాజకుమారి, డా.రమాదేవి పాల్గొన్నారు. -
మహేశ్ మేనల్లుడితో ‘ఇస్మార్ట్’బ్యూటీ
ప్రముఖ వ్యాపారవేత్త, పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సినిమా నవంబర్ 10న పలువురు సినీ ప్రముఖు ల సమక్షంలో గ్రాండ్ లాంచ్కానుంది. రీసెంట్గా `ఇస్మార్ట్ శంకర్` వంటి సూపర్‌హిట్ చిత్రంలో నటించిన నిధి అగర్వాల్‌ను హీరోయిన్గా చిత్ర యూనిట్ ఖరారు చేసింది. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య డిఫరెంట్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
ఇస్మార్ట్ స్టెప్స్
ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు నిధీ అగర్వాల్. ఆ జోష్‌తోనే ఇస్మార్ట్ స్టెప్స్ వేయడానికి రెడీ అవుతున్నారు. హిందీ ర్యాపర్ బాద్షాతో కలసి నిధీ అగర్వాల్ ఓ మ్యూజిక్ వీడియో చేశారు. ఈ వీడియో ఇవాళ రిలీజ్ కానుంది. ఈ మ్యూజిక్ వీడియోకు బలీందర్ యస్. మహంత్ దర్శకత్వం వహించగా ఈ పాటను బాద్షాయే రాసి, పాడి, సంగీతం సమకూర్చారు. ఈ వీడియోలో నిధీ గ్లామర్, తన స్టెప్స్, బాద్షా ర్యాప్ కచ్చితంగా మ్యూజిక్ లవర్స్‌కు ట్రీట్‌లా ఉంటుందని అనుకుంటున్నారు బాద్షా, నిధీ ఫ్యాన్స్. నిధీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళంలో ‘జయం’ రవితో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే తెలుగులో తన తదుపరి సినిమా విశేషాలను ప్రకటించనున్నారు. -
ఇన్నర్వ్యూ సండే స్పెషల్
నాకు ఎంగేజ్మెంట్ కాలేదు సోషల్ మీడియాలో అభిమానులు అడిగే ప్రశ్నలను పట్టించుకోరు నిధీ అగర్వాల్. అయితే ఒక అభిమాని అడిగిన ప్రశ్నను మాత్రం ఆమె పట్టించుకోక తప్పలేదు. నిధి ఆన్లైన్ పేజీలోని రిలేషన్షిప్ స్టాటస్‌లో ‘ఎంగేజ్డ్’ అని ఉండడం చూసి అవాక్కయిన ఆ అభిమాని ఆ స్టాటస్‌ను స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేశాడు. ‘‘మీకు ఎంగేజ్మెంట్ అయిందా!’’ అని షాక్ తిన్నట్లుగా అడిగాడు. దానికి సమాధానంగానే నిధి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఎంగేజ్మెంట్ కాలేదు’ అని రెస్పాండ్ అయ్యారు. కాలేదన్న విషయానికి ఆ అభిమాని ఎంతగా సంతోషించాడో కానీ, అభిమానులు తనను ఇంతగా ఫాలో అవుతున్నందుకు మేఘాల్లో తేలిపోయారు నిధి. నిధికి ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షల 10 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. – నిధీ అగర్వాల్, (మోడల్, డాన్సర్, బాలీవుడ్ నటి) పచ్చడుంటే చాలు ‘‘పచ్చడి అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. పచ్చడి లేకుండా ముద్ద గొంతు దిగదు. భోజనంలోకి మాత్రమే కాదు.. ఎందులోకైనా నాకు పచ్చడి ఉండాల్సిందే. శాండ్విచ్లోకి కూడా! చీజ్ శాండ్విచ్లోకైతే మామిడి కాయ పచ్చడి భలేగుంటుంది. మంచి కాంబినేషన్. ఏ దేశం వెళ్లినా నాకు ఈ అలవాటు పోదు. – ప్రియాంక చోప్రా, (‘ఈస్ట్ ఇండియా కామెడీ’ గ్రూపుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో) మూడుసార్లు వెనక్కి ‘‘నా బుగ్గలు బూరెల్లా ఉన్నాయని, ఒళ్లు బొద్దుగా ఉందని మొదట నన్ను ఈ సీరియల్‌కి తీసుకోలేదు. ఇవే కారణాలతో ఆడిషన్లో మూడుసార్లు ఫెయిల్ అయి వెనక్కి వచ్చేశాను. నాలుగోసారి మాత్రమే నన్ను అదృష్టం వరించింది. అప్పటికి కొంచెం సన్నబడినట్లున్నాను. లైఫ్‌లో ఏదీ ఆశించిన వెంటనే దగ్గరకు వచ్చేయదు. ఓర్పు ఉండాలి. నా మొదటి పారితోషికం 300 రూపాయలు. ఒక క్యాటలాగ్ షూట్లో పాల్గొన్నందుకు ఇచ్చారు. ఆ మూడొందలు ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. – రీమ్ షేక్, (జీటీవీలో ఏడాదిగా ప్రసారం అవుతున్న ‘తుఝే హై రాబ్తా’ సీరియల్లో కల్యాణీ మల్హర్ పాత్రధారి) థ్యాంక్యూ ‘‘గాలిలో కాలుష్యం ఎక్కువైంది. ఊహిస్తుంటేనే భయంగా ఉంది. స్వచ్ఛమైన గాలి కోసం ప్రతి ఒక్కరం మన బాధ్యతగా చెట్లు పెంచాలి. థ్యాంక్స్ వరుణ్ తేజ్ గారూ.. ఈ పనికి నన్ను ప్రేరేపించినందుకు’’. – సాయిపల్లవి (వరుణ్‌తేజ్ ఇచ్చిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ని స్వీకరించి మొక్కను నాటాక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కామెంట్) -
సికింద్రాబాద్‌లో కార్తీకేయ, నిధీ అగర్వాల్ సందడి
-
చాక్లెట్ బ్యూటీ...
-
ఘనంగా సైమా వేడుకలు
-
“ఇస్మార్ట్ శంకర్” బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ స్టిల్స్
-
రామ్ ఎనర్జీ సినిమాను నిలబెట్టింది
‘‘ఈ మధ్యకాలంలో నేను చేసిన రెండు మంచి పనులు.. రామ్‌ని కలవడం ఒకటి, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేయడం మరోటి. అందరి ఆదరణతో ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది’’ అని పూరి జగన్నాథ్ అన్నారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నభా నటేశ్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. పూరి, చార్మి నిర్మించిన ఈ చిత్రం జూలై 18న రిలీజైంది. సక్సెస్ఫుల్ టాక్‌తో 75 కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు పూరి మాట్లాడుతూ – ‘‘సినిమా చూసి నా ఫ్రెండ్స్ అందరూ అభినందిస్తున్నారు. రామ్ ఎనర్జీ ఈ సినిమాను నిలబెట్టింది. సినిమాలో రామ్ క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుకోవడం ఆనందం అనిపించింది’’ అన్నారు. ‘‘సినిమా చూశాక ఎలా ఫీల్ అయ్యానో, ఆడియన్స్ రెస్పాన్స్ చూశాక అలాంటి ఫీలింగే కలిగింది. గతంలో నేను చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా, నా పాత్ర ఉన్నాయి. దానికి కారణం పూరీగారు. కొత్త క్యారెక్టరైజేషన్‌తో∙నన్ను కొత్తగా స్క్రీన్ మీద చూపించారు. నా మంచి కోరుకునే వాళ్లందరికీ ఈ సక్సెస్‌ను అంకితం ఇస్తున్నాను. మణిశర్మ సంగీతం, హీరోయిన్స్ గ్లామర్ ఈ సక్సెస్‌కు యాడ్ అయ్యాయి. సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు రామ్. ‘‘మా సినిమాను బ్లాక్‌బస్టర్ చేసిన అందరికీ థ్యాంక్స్. రామ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పూరీగారు రామ్ పాత్రను కొత్తగా రూపొందించారు. అదే సినిమా సక్సెస్‌కు ముఖ్య కారణం. రామ్ సొంత బ్యానర్ స్రవంతి మూవీస్, సెకండ బ్యానర్ పూరి కనెక్ట్స్’’ అన్నారు చార్మి. ‘‘నాకు చాలా ఇంపార్టెంట్ టైమ్‌లో వచ్చిన హిట్ ఇది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన పూరీగారికి, సపోర్ట్ చేసిన చార్మీగారికి థ్యాంక్స్’’ అన్నారు నిధీ. -
త్వరలోనే డబుల్ ఇస్మార్ట్ స్టార్ట్
‘‘హిట్ సాధించి మూడేళ్లయింది. నా లైఫ్‌లో ఎప్పుడూ హిట్ కోసం తపించని నేను హిట్ కొట్టాలని పరితపించడం ఇదే మొదటిసారి. ఫైనల్‌గా ‘ఇస్మార్ట్ శంకర్’తో విజయం వచ్చింది’’ అన్నారు పూరి జగన్నాథ్. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రంలో నభా నటేష్, నిధీ అగర్వాల్ కథానాయికలుగా నటించారు. పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడులైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా విషయంలో నాపై అందరూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా విజయం విషయంలో చాలా టెన్షన్ పడ్డాను. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఇటీవల మా టీమ్ చేసిన ఆంధ్రా టూర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రతి ఒక్కరు ఇస్మార్ట్ –2 ఎప్పుడని అడుగుతున్నారు. వెంటనే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసి త్వరలోనే ‘ఇస్మార్ట్–2’ తీయాలని ఉంది. ఆ సినిమా కోసం ‘డబుల్ ఇస్మార్ట్ 2’ టైటిల్ రిజిస్టర్ చేసి పెట్టాను. ఇలాంటి మాస్ ఫీల్ సినిమాలను భవిష్యత్‌లో మరిన్ని తీయాలనుకుంటున్నా. రేపటి నుంచి తెలంగాణ టూర్ చేపట్టబోతున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రం తొమ్మిది రోజుల్లో 63 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మేము అనుకున్న కలెక్షన్స్ మైలురాయిని చేరుకుంటామనే నమ్మకం ఉంది. రామ్ అద్భుతంగా నటించారు’’ అన్నారు ఛార్మి. ‘‘పూరీసార్ ఓ డ్రగ్లాంటోడు. ఒక్కసారి ఆయనకు అడిక్ట్ అయితే వదిలిపెట్టలేం. సినిమా వంద కోట్లు దాటుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సత్యదేవ్. ‘‘నా కెరీర్లో మైలురాయి వంటి చిత్రమిది’’ అన్నారు నిధీ అగర్వాల్. -
మాస్ పవర్ ఏంటో తెలిసింది
‘‘చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనుకున్నాను. అలానే అయ్యాను. అదే చాలా పెద్ద సక్సెస్. ఇప్పుడు సినిమాలు హిట్ అవ్వడం పెద్ద బోనస్‌లా భావిస్తున్నాను. ‘సవ్యసాచి’ మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది. ‘మిస్టర్ మజ్ను’ రెస్పెక్ట్‌ని తెచ్చిపెట్టింది. ‘ఇస్మార్ట్ శంకర్’ ఫస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందించింది’’ అని హీరోయిన్ నిధీ అగర్వాల్ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్, నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించారు. గత గురువారం ఈ చిత్రం రిలీజ్ అయింది. ‘ఇస్మార్ట్ శంకర్’ నాకు తొలి మాస్ బ్లాక్‌బస్టర్‌ని అందించింది అంటూ పలు విశేషాలను పంచుకున్నారు నిధీ అగర్వాల్. ► సినిమా రిలీజ్ రోజున విజయవాడలో ఉన్నాను. ఉదయం ఎనిమిదిన్నరకు డైరెక్టర్ చందు మొండేటిగారు ‘ఫస్ట్ బ్లాక్‌బస్టర్‌కి కంగ్రాట్స్’ అంటూ మెసేజ్ పంపించారు. సినిమాకు రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సక్సెస్‌ని మనసుకి తీసుకోవడానికి టైమ్ పట్టేలా ఉంది. ఈ సినిమాతో నాకు మాస్ పవర్ ఏంటో తెలిసింది. నేనింకా సినిమా చూడలేదు. చూద్దామంటే నాక్కూడా టికెట్స్ దొరకలేదు (నవ్వుతూ). ► సోషల్ మీడియా నాకు ఫస్ట్ నుంచి చాలా సపోర్టివ్‌గా ఉంటోంది. నాకెంతో ప్రేమను ఇస్తుంటారు. 60–70 పాజిటివ్ కామెంట్స్‌లో ఒకటీ అరా నెగటివ్ కామెంట్స్ వస్తుంటాయి. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. కానీ మొన్న ఒక్కసారి మాత్రమే రియాక్ట్ అయ్యాను. (‘ఇస్మార్ట్ శంకర్’లో ఎక్స్పోజింగేనా? నటనకేమైనా స్కోప్ ఉందా? అంటూ సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు.. నటనతో పాటు చాలా చేశాను అని స్పందించారు నిధి). ► ‘మిస్టర్మజ్ను’ తర్వాత పూరీ సార్‌ని కలిశాను. ఇందులో నీది సైంటిస్ట్ పాత్ర. ఇది సూపర్‌హిట్ ఫిల్మ్ నిధీ. నువ్వు చేయాలి అన్నారు పూరీగారు. ఆయన సినిమాకు నో ఎలా చెబుతాను? పూరీ సార్ గురించి నేను చాలా విన్నాను. ఆయన సినిమాలు చూశాను. ఆయనకి ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ సూపర్. నేను పని చేయాలనుకున్న దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. పెద్ద దర్శకుల సినిమాలతో మ్యాజిక్ జరుగుతుంది. పూరీగారి హీరోయిన్ అవడం లక్కీ అని ఫీలవుతున్నాను. ► సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్ మన చేతుల్లో ఉండవు. స్క్రిప్ట్ బావుంటుంది, ఈ ఐడియా వర్కవుట్ అవుతుందనే నమ్మకంతో సినిమాలు చేస్తాం. ఫ్రైడే టు ఫ్రైడే సక్సెస్‌ని నేను నమ్మను. సినిమా రిజల్ట్‌ను ఎప్పుడూ నేను హార్ట్‌కి తీసుకోను. యాక్టింగ్ ప్రాసెస్‌ను ఎంజాయ్ చేస్తాను. ► రామ్‌తో వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్. తనో స్వీట్హార్ట్. ఛార్మీగారు నిర్మాతగా సూపర్. చేయాలనుకున్న పనిని కచ్చితంగా చేస్తారు. పూరీగారు సెట్లో అందరితో ఒకేలా ఉంటారు. ఆయన చాలా స్వచ్ఛమైన మనిషి. చాలా కైండ్. సెట్స్‌లో చాలా సరదాగా అనిపించేది. ► నా గురించి రామ్‌గోపాల్ వర్మగారు ట్వీట్ (సూర్యుడి కన్నా హాట్ అని నిధీని ఉద్దేశించి ట్వీట్) చేశారు. ఆయన తీసిన ‘రంగీలా’ సినిమాకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆ సినిమాలో పాటలు ఇప్పటికీ వింటూనే ఉంటాను. నాకు కూడా ‘రంగీలా’ లాంటి సినిమా చేయాలనుంది. మంచి స్క్రిప్ట్, డైరెక్టర్ ఉంటే అలాంటి సినిమాలు చేసేయొచ్చు. ‘రంగీలా’ సినిమా గురించి పూరీగారితో ఓ రోజు సరదాగా షేర్ చేసుకున్నాను. తర్వాత వర్మగారు నా గురించి ట్వీట్ చేశారు. సో.. నేనేదంటే అది జరుగుతుంది (నవ్వుతూ). ► గ్లామర్ సీన్స్ ఎవరితో తీస్తున్నారు, ఏ దర్శకుడు తీస్తున్నారు అన్నది ముఖ్యం. స్క్రీన్ మీద ఎలా ఉంటుందన్నది ముఖ్యం. పూరీగారు నన్ను బాగా చూపించారు. నిన్న మా పేరెంట్స్ సినిమా చూసి బావున్నావు అన్నారు. ► ప్రస్తుతం ‘జయం’ రవితో ఓ తమిళ సినిమా చేస్తున్నా. తెలుగులో వేరే చిత్రాలు అంగీకరించలేదు. ఇప్పుడైతే నేను లవ్‌లో లేను. సింగిల్‌గా ఉన్నాను. ► ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో పేజీల పేజీల డైలాగ్స్ చెప్పాను. తెలుగు మీద మంచి అవగాహన వచ్చింది. ప్రస్తుతానికి డబ్బింగ్ చెప్పుకోలేదు. కానీ డబ్బింగ్ చెబితే మాత్రం ఓ లవ్‌స్టోరీ సినిమాకు కచ్చితంగా డబ్బింగ్ చెబుతాను. లవ్ స్టోరీల్లో డైలాగ్స్ చాలా ముఖ్యం కదా.. అందుకే. -
‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ రివ్యూ
టైటిల్ : ఇస్మార్ట్ శంకర్ జానర్ : మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తారాగణం : రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్, షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి సంగీతం : మణిశర్మ దర్శకత్వం : పూరి జగన్నాథ్ నిర్మాత : పూరి జగన్నాథ్, చార్మీ హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్.. ఇద్దరూ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ఇస్మార్ శంకర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా రామ్‌ను పూర్తిగా కొత్త అవతారంలో కొత్త క్యారెక్టర్లో చూపించాడు పూరి. ట్రైలర్లు, సాంగ్స్ సినిమాకు మాస్ ఇమేజ్ తీసుకువచ్చాయి. మరి ఆ అంచనాలను ఇస్మార్ట్ శంకర్ అందుకున్నాడా..? రామ్, పూరీలకు ఆశించిన సక్సెస్ దక్కిందా..? కథ : శంకర్ (రామ్ పోతినేని) ఓల్డ్ సిటీలో సెటిల్మెంట్స్ చేసే కుర్రాడు. ఓ డీల్ విషయంలో పరిచయం అయిన చాందిని (నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. ఆ సమయంలోనే పొలిటీషియన్ కాశీ విశ్వనాథ్‌ని చంపిన కేసులో జైలుకు వెళతాడు. జైలు నుంచి తప్పించుకున్న శంకర్ మెదడులోకి మరో వ్యక్తి జ్ఞాపకాలను ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు సైంటిస్ట్ పింకీ (నిధి అగర్వాల్). అసలు శంకర్ మెదడులో మరో వ్యక్తి జ్ఞాపకాలను ఎందుకు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.? పొలిటీషియన్ కాశీ విశ్వనాథ్‌ని శంకరే చంపాడా? శంకర్‌కి సీబీఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్)కి సంబంధం ఏంటి? నటీనటులు : సరికొత్త మేకోవర్‌లో డిఫరెంట్ యాటిట్యూడ్, డైలాగ్ డెలివరితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అక్కడక్కడా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పేందుకు ఇబ్బంది పడినా ఓవరాల్‌గా శంకర్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మాస్ యాక్షన్ సీన్స్‌లో రామ్ పర్ఫామెన్స్ సూపర్బ్ అనేలా ఉంది. హీరోయిన్లుగా నభా, నిధి అగర్వాల్ గ్లామర్ షోలో పోటి పడ్డారు. కథలోనూ ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు కావటంతో నటనతోనూ ఆకట్టుకున్నారు. మరో కీలక పాత్రలో నటించిన సత్యదేవ్ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా గుర్తుండిపోయే పాత్రలో అలరించాడు. షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి తమకు అలవాటైన పాత్రల్లో ఈజీగా నటించారు. విశ్లేషణ : వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న పూరి ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేశాడు. గత చిత్రాల తరహాలో చూట్టేయకుండా కాస్త మనసుపెట్టి సినిమాను తెరకెక్కించినట్టుగానే అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్న తరుణంలో పక్కా కమర్షియల్ ఫార్ములా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పూరి. ఓ పాట, ఓ ఫైట్ అన్న ఫార్ములాకు తన మార్క్ టేకింగ్‌ను జోడించి సినిమాను తెరకెక్కించాడు. కథ కొత్తగా ఉన్నా కథనం విషయంలో మాత్రం తన రొటీన్ స్టైల్‌నే ఫాలో అయ్యాడు. పూరి తన మూస ఫార్ములా నుంచి ఇంకా బయటపడలేదనే చెప్పాలి. గత చిత్రాలతో పోలిస్తే మాత్రం ఈ సినిమా కాస్త ఎంగేజింగ్గానే తెరకెక్కించాడు. మాస్, యూత్ ఆడియన్స్‌ను అలరించే డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మణిశర్మ మ్యూజిక్ సినిమాకు ప్రధానబలం. తన మ్యూజిక్‌తో ప్రతీ సీన్‌ను మరింతగా ఎలివేట్ చేశాడు మణి. కొన్ని సీన్స్‌లో నేపథ్య సంగీతం సన్నివేశాలను డామినేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. పాటలు బాగున్నా.. కథలో కావాలని ఇరికించినట్టుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్రధాన బలం. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రామ్ పోతినేని పర్ఫామెన్స్ మాస్ ఎలిమెంట్స్ మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మైనస్ పాయింట్స్ : రొటీన్ కమర్షియల్ ఫార్ములా స్క్రీన్ ప్లే -
అదే నా ప్లస్ పాయింట్
‘‘నేను, రామ్ కలిసి ఓ సినిమా చేద్దామని చాలా రోజులుగా అనుకున్నా కుదరలేదు. అయితే మా కాంబినేషన్లో సినిమా అదిగో, ఇదిగో అంటూ మీడియాలో వార్తలొచ్చాయి. అప్పుడు మేమిద్దరం కలిసి ఎలాంటి సినిమా చేద్దాం అని చర్చించుకున్నాం’’ అని పూరి జగన్నాథ్ అన్నారు. రామ్ హీరోగా, నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ పంచుకున్న విశేషాలు... ► ‘టెంపర్’ సినిమా తర్వాత నాకు సరైన హిట్ లేదు. దీంతో కొంచెం టెన్షన్‌గా ఉంది. ఇస్మార్ట్‌గా ఆలోచించి నా రెగ్యులర్ ఫార్మాట్‌కి భిన్నంగా కొత్తగా ఆలోచించి ‘ఇస్మార్ట్ శంకర్’ కథ రాశా. పైగా రామ్ కూడా గుడ్ బాయ్ కథలు చేసి బోర్ కొట్టేసింది.. బ్యాడ్ బాయ్‌గా చూపించమన్నాడు. అందుకే ఇదొక బ్యాడ్ బాయ్ కథ. ► సినిమా హిట్ అయితే వెధవ కూడా జీనియస్‌లా కనిపిస్తాడు.. అదే ఫ్లాప్ అయితే జీనియస్ కూడా వెధవలా కనిపిస్తాడు. ఈ సినిమాలో హీరోకి చిప్ పెట్టే ఐడియా హాలీవుడ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందా. నా కథలన్నింటిలో ఏదో ఒక స్ఫూర్తి కనిపిస్తుంటుంది. ► ఈ కథ స్టార్ట్ చేశాక తెలంగాణ యాస పెట్టాలనిపించింది. పైగా రామ్ ఇప్పటివరకూ తెలంగాణ యాసలో మాట్లాడలేదు. తొలిసారి ఈ సినిమా మొత్తం అదే యాసలో మాట్లాడటాన్ని బాగా ఎంజాయ్ చేశాడు. తెలంగాణ భాష నాకు కొంచెం తెలుసు.. పూర్తిగా రాసేందుకు కో డైరెక్టర్ శ్రీ«దర్ సహాయం చేశాడు. పైగా నా భార్య తెలంగాణలోనే పుట్టింది. మా కొడుకు ఆకాశ్ తెలంగాణ యాస బాగా మాట్లాడతాడు. ► ఇండియాలో ఎక్కడైనా ప్రజల మధ్య షూటింగ్ చేయడం చాలా కష్టం. పైగా చార్మినార్ వంటి రద్దీ ప్రదేశంలో షూటింగ్ జరుగుతుంటే జనాలు మీదపడ్డారు. ఆ విషయం అటుంచితే, షూటింగ్ జరుగుతుంటే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు.. అదే పెద్ద సమస్య. ► ‘ఇస్మార్ట్ శంకర్’ కథ మాకు తెలుసు.. డబ్బులివ్వకుంటే బయటపెట్టేస్తామని కొందరు బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. నిర్మాత అన్నాక ఇలాంటివన్నీ చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మా సినిమా టీజర్, ట్రైలర్స్‌కి మంచి స్పందన వస్తోంది.. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ట్రైలర్స్ చూశాక కొంతమంది మహిళలే ఫోన్ చేసి బాగుందన్నారు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మగారికి థ్యాంక్స్. ► ‘ఇస్మార్ట్ శంకర్’లో తన మేకోవర్ క్రెడిట్ అంతా రామ్‌దే. తన పాత ఫొటో చూసి ఈ హెయిర్ స్టైల్ బాగుంది, దీన్ని కంటిన్యూ చేద్దామని మాత్రమే నేను చెప్పా. ఇందులో నభా నటేశ్ది చాలా హైపర్ పాత్ర. తనది కూడా తెలంగాణే. నిధీ అగర్వాల్ డాక్టర్‌గా చేశారు. రామ్‌లో బోలెడంత ఎనర్జీ ఉంది. తను చిరుతపులి అని సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో తన నటన చూసి కొత్తవారు నేర్చుకోవచ్చు. ► తెలంగాణ యాస ఆంధ్రవారికి అర్థం కాదని మనం అనుకుంటామంతే.. అందరికీ బాగా అర్థమవుతుంది. నా కాలేజీరోజుల్లో ఫ్రెండ్స్‌తో కలిసి తెలంగాణ ఫోక్ పాటలు పాడేవాణ్ణి.. గద్దర్‌గారి పాటలు వినేవాణ్ణి. సెట్లో షూటింగ్ అంతా ప్రశాంతంగా జరిగేలా వాతావరణం సృష్టిస్తా. ప్రత్యేకించి నటీనటులు ఎటువంటి టెన్షన్ పడకుండా ఉండేలా చూస్తా. అందుకే ప్రశాంతంగా వారి పాత్రల్లో లీనమై నటించగలుగుతారు. ► మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కినా కుటుంబ సభ్యులతో కలిసి చూసేలా ఉంటుంది. ఈ మధ్య పూర్తి సినిమా చూసిన రామ్ ఎగై్జట్ అయ్యి.. నన్ను హత్తుకుని మనశ్శాంతిగా విదేశాలకు వెళ్లిపోయాడు. ఈ చిత్రానికి సీక్వెల్ చేద్దామనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాం. ఈ సినిమాపై అంత నమ్మకం ఉంది మాకు. ► చార్మి.. మగాళ్ల కంటే బాగా కష్టపడి పనిచేస్తుంది. మాకు ఏ టెన్షన్ కూడా ఉండదు. నా దర్శకత్వంలో బయటి నిర్మాతలతో చేస్తున్నప్పుడు బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది. నేనే నిర్మాత అయినప్పుడు అస్సలు కంట్రోల్లో ఉండదు. నేనెప్పుడూ నిర్మాతలను ఇబ్బంది పెట్టను.. అదే నా ప్లస్ పాయింట్. షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల ఈ మధ్య సినిమాలు చూసింది తక్కువే. కానీ, ‘జెర్సీ, మజిలీ, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, బ్రోచేవారెవరురా, ఓ బేబీ’ వంటి వైవిధ్యమైన సినిమాలొచ్చాయి. ► మా అబ్బాయి ఆకాశ్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్నా.. 50 శాతం షూటింగ్ పూర్తయింది. బాలకృష్ణగారితో సినిమా చేయడానికి కథ ఇంకా సిద్ధం కాలేదు. కథ రెడీ కాగానే వెళ్లి ఆయన్ని కలుస్తా. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాతి ప్రాజెక్టు గురించి ఇంకా ఏం అనుకోలేదు.. ఈ సినిమా విడుదల తర్వాత చెబుతా. -
అదే కాదు.. చాలా చేశాను : నిధి అగర్వాల్
నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బ్యూటీ నిధి అగర్వాల్. తొలి సినిమాతోనే గ్లామర్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ భామ తరువాత మిస్టర్ మజ్ను సినిమాతో మరోసారి ఆకట్టుకున్నారు. తాజాగా ఇస్మార్ట్ శంకర్‌కు జోడిగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అయితే ట్విటర్ వేదికగా ఓ ఆకతాయి వేసిన ప్రశ్నకు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చారు నిధి అగర్వాల్. ఈ సినిమాలో మీరు ఎక్స్పోజింగ్ కాకుండా ఇంకేమైనా చేశారు అంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు సమాధానంగా ‘చాలా చేశాను. ట్రైలర్ కాదు మూవీ చూడు’ అంటూ హుందాగా బదులిచ్చారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. నభా నటేష్ మరో హీరోయిన్గా నటించిన ఈ సినిమాను పూరితో కలిసి చార్మి నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. Actually chaala chesanu, trailer kaadu movie chudu — Nidhhi Agerwal (@AgerwalNidhhi) 13 July 2019 -
రామ్‌లో ఎనర్జీ అన్లిమిటెడ్
‘‘పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. రామ్‌లోని ఎనర్జీ అన్లిమిటెడ్. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత. నాకు చేతనైనంత వాడాను. ఇంకా బోలెడు ఎనర్జీ ఉంది. తను ఓ గ్రేట్ యాక్టర్. ‘ఇస్మార్ట్ శంకర్’గా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాడు’’ అన్నారు పూరి జగన్నాథ్. రామ్ హీరోగా, నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘మణిశర్మగారు మా సినిమాకు పెద్ద పిల్లర్. అడగ్గానే ఐదు పాటలు నా మొహాన కొట్టారు (నవ్వుతూ). రీసెంట్ టైమ్‌లో మంచి ఆల్బమ్ అని అందరూ అభినందిస్తున్నారు. నేపథ్య సంగీతం కూడా కుమ్మేశారు’’ అన్నారు. రామ్ మాట్లాడుతూ– ‘‘ఇస్మార్ట్ శంకర్’ కోసం పని చేసిన ఈ ఆరు నెలలు నా లైఫ్‌లోనే బెస్ట్ టైమ్. ఈ సినిమాను రెండుగంటల పాటు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. సినిమాలో చాలా చేసినట్లు అనిపించింది కానీ.. సినిమా ఎలా పూర్తి చేశానో తెలియడం లేదు. ఆనీ మాస్టర్ కంపోజ్ చేసిన ‘ఉండిపో ఉండిపో..’ పాట ప్రేక్షకులను సీట్‌కు అలా కట్టేసి ఉంచుతుంది. మణిశర్మగారి పాటలన్నీ ఒక ఎత్తు అయితే.. రీరికార్డింగ్ మరో ఎత్తు. నాకు సినిమా ఎంత నచ్చిందో చెప్పాను. నేను ఫీల్ అయిన దాంట్లో ప్రేక్షకులు ఒక శాతం ఫీల్ అయినా కూడా నాకు అదే వంద శాతం సంతృప్తి ఇచ్చినట్టవుతుంది.. ఇందుకు పూరికి థ్యాంక్స్ ’’ అన్నారు. ‘‘సినిమా ఫస్ట్ కాపీ చూశాం. మా నమ్మకం మరింత పెరిగింది.. చూసేవాళ్లకు ఫుల్ మీల్స్‌లాంటి సినిమా ఇది. రామ్ నటన చూసిన నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. తను లేకుండా ‘ఇస్మార్ట్ శంకర్’ లేదు. పూరితో రామ్ మళ్లీ పనిచేయాలని అందరూ కోరుకునేలా సినిమా ఉంటుంది’’ అన్నారు ఛార్మికౌర్. ‘‘తక్కువ సమయంలోనే పూరిగారితో కలిసి పనిచేయడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను’’ అన్నారు నిధీ అగర్వాల్. ‘‘పూరిగారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు నభా నటేశ్. డ్యాన్స్ మాస్టర్ ఆనీ పాల్గొన్నారు. -
ఇస్మార్ట్ శంకర్ అందరినీ అలరిస్తాడు
-
డబుల్ ఇస్మార్ట్ తీస్తాం
‘‘రామ్‌కి సినిమా తప్ప మరో ధ్యాస ఉండదు. ప్రతి షాట్‌ను వంద శాతం మనసు పెట్టి చేస్తాడు. ‘టెంపర్’ సినిమా తర్వాత నాకు మంచి హిట్ పడలేదు. విపరీతమైన ఆకలితో ఉన్నప్పుడు రామ్ దొరికాడు. తను రామ్ పోతినేని కాదు.. రామ్ చిరుతపులి. ప్రేక్షకుల ఆశీర్వాదంతో మా సినిమా పెద్ద హిట్ అయ్యి.. డబుల్ ఇస్మార్ట్ సినిమా తీయాలి ’’ అని డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్నారు. రామ్ పోతినేని హీరోగా, నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో ‘ఇస్మార్ట్ బోనాలు’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో రామ్ మాట్లాడుతూ– ‘‘ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందో ఆలోచించుకుంటూ విదేశాలకు వెళ్లిపోయాను. డ్యాన్సులు, ఫైట్స్, లుక్స్ సహా అన్నీ ఉండి, సినిమా కొత్తగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారని తెలిసింది. ఆ సమయంలో పూరీగారిని కలిసినప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ ఐడియా వచ్చింది. పూరీగారితో పని చేస్తున్నప్పుడు ఉన్న కిక్కే వేరు’’ అన్నారు. ‘‘ప్రేక్షకుల కోసం చేసిన కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు ఛార్మి. ‘‘రామ్‌తో డ్యాన్స్ చేయడం చాలా కష్టం’’ అన్నారు నిధీ అగర్వాల్. ‘‘ఒక మంచి పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన పూరీగారికి థ్యాంక్స్’’ అని నభా నటేశ్ అన్నారు. -
గుమ్మడికాయ కొట్టారు
ఇస్మార్ట్ శంకర్ తనకు అప్పగించిన పని పూర్తిచేసేశాడు. పనైపోయిందని గుమ్మడికాయ కూడా కొట్టేశాడు. మరి అతనికి అప్పజెప్పిన పనేంటి? అలాగే అతను చేసిన అల్లరేంటో స్క్రీన్ మీద తెలుస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. డబుల్ ధిమాక్ హైదరాబాదీ అన్నది క్యాప్షన్. నభా నటేశ్, నిధీ అగర్వాల్ కథానాయికలు. పూరి జగన్నాథ్, చార్మీ నిర్మించారు. ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం పూర్తయింది. ఈ సందర్భంగా గుమ్మడికాయ కొట్టారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం జూలై 18న రిలీజ్‌కు రెడీ అయింది. -
పోరీ... ఉండిపో
ఇస్మార్ట్ శంకర్ మస్తు మాసు. అట్లని హీరోయిన్లతో అన్నీ మాస్ పాటలే పాడుకుంటాడా ఏందీ? మెలోడీలు కూడా పాడుకుంటాడు. తన ప్రేయసిని ప్రేమగా ఉండిపోమంటాడు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇ స్మార్ట్ శంకర్’. డబుల్ దిమాక్ హైదరాబాద్ అన్నది క్యాప్షన్. నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లు. చార్మీ, పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ కంపోజ్ చేసిన ‘ఉండిపో ఉండిపో..’ అనే మెలోడీ సాంగ్‌ను శనివారం రిలీజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట.. -
ఆరు రోజులు ఆలస్యంగా...
డబుల్ ధిమాక్ ఇస్మార్ట్ శంకర్ ప్లాన్‌లో చాన్న మార్పు జరిగింది. అనుకున్నదానికన్నా ఆరు రోజులు ఆలస్యంగా రాబోతున్నాడు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్టు పూర్తయింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రాన్ని ముందుగా జూలై 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు జూలై 18న రిలీజ్ డేట్‌ను ఫైనలైజ్ చేశారు. ‘‘ఇటీవల విడుదల చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. జూలై 12న క్రికెట్ ప్రపంచకప్‌లో కీలకమైన పోటీలు ఉన్నాయి. 14న ఫైనల్ మ్యాచ్. సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపకూడదని 18కి వాయిదా వేశాం’’ అని చిత్రబృందం పేర్కొంది. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుధాంశు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ çస్వరకర్త. -
పాతిక... పదహారు!
నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి 16ఏళ్లు పూర్తి కావడం ఒకటి, కెరీర్లో 25వ చిత్రం ప్రారంభం కావడం మరొకటి... ఇలా రెండు సెలబ్రేషన్స్‌తో ఖుషీగా ఉన్నారు తమిళ నటుడు ‘జయం’ రవి. లక్ష్మణ్ దర్శకత్వంలో ‘జయం’ రవి హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తారు. చెన్నైలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ చిత్రంలో ‘జయం’ రవి రైతు పాత్రలో నటించనున్నారని తెలిసింది. ఇది ఆయనకు 25వ చిత్రం కావడం విశేషం. అలాగే 2003లో ‘జయం’ (తెలుగు ‘జయం’ చిత్రానికి తమిళ రీమేక్) సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన రవి ఆ సినిమా హిట్‌తో ‘జయం’ రవిగా మారారు. ఆ సినిమా వచ్చి 16 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన 25వ చిత్రం ప్రారంభోత్సవంలో కేక్ కట్ చేసి సందడి చేశారు ‘జయం’ రవి. -
మాల్దీవుల్లో రొమాన్స్
రామ్, ని«ధీ అగర్వాల్, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం మాల్దీవుల్లో రామ్, నిధి అగర్వాల్‌పై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. భాస్కరభట్ల ఈ పాటను రచించారు. మణిశర్మ స్వరకర్త. ‘‘రీసెంట్గా విడుదల చేసిన టీజర్‌కు, దిమాక్ ఖరాబ్ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 12న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు రాజ్ తోట కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. -
టెరిఫిక్ శంకర్
ఇస్మార్ట్ శంకర్ తన టెంపర్, డబుల్ ధిమాక్ తెలివిని చూపియనీకి రెడీ అయుండు. ఈ డబుల్ ధిమాక్ హైదరాబాదీని కలవాలంటే జూలై 12 వరకూ వేచి ఉండండి అంటోంది ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రబృందం. రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ట్యాగ్‌లైన్ డబుల్ ధిమాక్ హైదరాబాదీ. పీసీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లు. ఈ సినిమాను జూలై 12న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. రామ్ టెరిఫిక్‌గా ఉన్నాడని అభినందిస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తయింది. 3 పాటలు మినహా షూటింగ్ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా నడుస్తున్నాయి’’ అని చిత్రబృందం తెలిపింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట. -
చలో చెన్నై
నిధీ అగర్వాల్ నెక్ట్స్ కొన్ని రోజులు చెన్నైని చుట్టొచ్చే ప్లాన్‌లో ఉన్నారు. పర్సనల్ ట్రిప్ కోసం కాదు ప్రొఫెషనల్ ట్రిప్పే. తమిళ ఇండస్ట్రీ ఈ బెంగళూరు బ్యూటీకి స్వాగతం పలికింది. అందుకే నెక్ట్స్ కొన్ని రోజులు చెన్నైలో మకాం వేయబోతున్నారు. బాలీవుడ్లో ‘మున్నా మైఖేల్’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యారు ని«ధి. ఆ తర్వాత ‘సవ్యసాచి, మిస్టర్ మజ్ను’ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు. ప్రస్తుతం రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేస్తున్నారు. లేటెస్ట్గా ‘జయం’ రవి 25వ చిత్రంలో హీరోయిన్గా నిధీ అగర్వాల్ ఎంపిక అయ్యారు. తమిళంలో నిధీకి ఇదే తొలి సినిమా. లక్ష్మణ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
నాతో కిరికిరి అంటే..!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. పూరి మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ డిఫరెంట్ లుక్‌లో అలరించనున్నాడు. ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. బుధవారం రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఇస్మార్ట్ శంకర్ టీజర్ ను రిలీజ్ చేశారు. రామ్‌ను ఫుల్ మాస్ అవతారంలో పరిచయం చేశాడు పూరి. తెలంగాణ యాసలో రామ్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్ సీన్స్, టేకింగ్ చూస్తుంటే పూరి ఈ సారి సక్సెస్ కొట్టేలాగే ఉన్నాడనిపిస్తుంది. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. -
పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న హీరోయిన్
నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన బ్యూటీ నిధి అగర్వాల్. తరువాత మిస్టర్ మజ్నులో మరో అక్కినేని హీరో అఖిల్‌తో జోడి కట్టినా నిధికి ఇంత వరకు సక్సెస్ మాత్రం దక్కలేదు. దీంతో ప్రస్తుతం సెట్స్‌మీద ఉన్న ఇస్మార్ట్ శంకర్ మీదే ఆశలు పెట్టుకున్నారు నిధి అగర్వాల్. ఇటీవల వారణాసి షెడ్యూల్ పూర్తి చేసుకున్నఇస్మార్ట్ శంకర్ చిత్రయూనిట్ త్వరలో పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే నిధి అగర్వాల్ తన పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకోవటంతో ఫారిన్ షెడ్యూల్‌పై అనుమానాలు ఏర్పడ్డాయి. కానీ షెడ్యూల్ తన వల్ల ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో నిధి ఎంతో కష్టపడి అధికారులను సంప్రదించి పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందారు. దీంతో అనుకున్న సమయానికి ఇస్మార్ట్ శంకర్ ఫారిన్ షెడ్యుల్‌ను ప్రారంభించనున్నారట. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్‌లో నిదితో పాటు నభా నటేష్ మరో హీరోయిన్గా నటిస్తున్నారు. పూరితో కలిసి చార్మి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. -
గర్ల్‌ఫ్రెండ్ మోసం చేసిందా?
‘సరదాగా నన్ను ఏమైనా అడగండి’ అంటూ నెటిజన్లకు నిధీ అగర్వాల్ ఆఫర్ ఇచ్చింది. అంతే.. కొంటె ప్రశ్నలు, సీరియస్ క్వొశ్చన్స్తో ఆమె ట్వీటర్ ఫాలోయర్స్ నిధీ నుంచి సమాధానాలు రాబట్టారు. వాటిలో ‘నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను చీట్ (మోసం) చేసింది. వదిలేసింది?’ అని ఒక ఫాలోయర్ అడిగితే – ‘‘చీటర్ లేని జీవితం చాలా బాగుంటుంది మై ఫ్రెండ్’’ అని సమాధానం ఇచ్చింది నిధి. మోసం చేసినవాళ్ల గురించి బాధపడకూడదని చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పింది కదూ. ఇంకో ప్రశ్నకు సమాధానంగా ‘‘చిన్నప్పుడు నేను రబ్బర్లు, జర్నీ టికెట్స్‌ని దాచుకునేదాన్ని. ఇప్పుడు ‘ఇయర్ రింగ్స్’ కలెక్ట్ చేస్తున్నా. చెవి పోగులంటే నాకంత పిచ్చి’’ అని చెప్పింది. ‘‘రాత్రిపూట నీళ్లలోకి వెళ్లడం నాకు భయం’’ అని తనకున్న ఫోబియాని బయటపెట్టింది నిధి. బయాలజీ, ఎకనామిక్స్ సబ్జెక్ట్స్ అంటే ఇష్టం అని, ఇడ్లీ, పెరుగన్నం ఇష్టంగా తింటానని తన అభిరుచులు చెప్పింది. ఇలా అభిమానుల ప్రశ్నలకు సమాధానాలివ్వడం ఆనందంగా అనిపించిందని పేర్కొంది నిధీ అగర్వాల్. -
వారణాసిలో ‘ఇస్మార్ట్ శంకర్’ యాక్షన్
ఎనర్జిటిక్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. డబుల్ దిమాక్ హైదరాబాది అనే ట్యాగ్ లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ డిఫరెంట్ లుక్‌లో అలరించనున్నాడు. ఈ సినిమా భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను బుధవారం నుండి వారణాసిలో చిత్రీకరించనున్నారు. సినిమా కీలక ఘట్టంలో ఈ యాక్షన్ పార్ట్ ఉంటుంది. కాబట్టి డైరెక్టర్ పూరి జగన్నాథ్ భారీ రేంజ్లో ఈ సీక్వెన్స్‌ని తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ నుండి సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు వారణాసి వెళుతున్నారు. పూరి స్టయిల్లో రియల్ సతీష్ ఈ యాక్షన్ పార్ట్‌ను తెరకెక్కించబోతున్నారు. రామ్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, దీపక్ శెట్టి, తులసి తదితరులు ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. -
ఖరాబ్ చేస్తా
జస్ట్ వారం క్రితం మీ దిమాక్లు ఖరాబు చేస్తానన్నారు నిధీ అగర్వాల్. అన్నంత పనీ చేశారు. ఇప్పుడు నభా నటేశ్ కూడా ఇదే మాట అంటున్నారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’లో ఈ ఇద్దరూ కథానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం మణిశర్మ స్వరపరచిన పాటల్లో ‘దిమాక్ ఖరాబ్..’ అంటూ తెలంగాణ యాసలో సాగే పాట ఒకటి. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో రామ్, నిధి, నభా పాల్గొనగా ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. వారం క్రితం ఈ పాటలోని నిధీ అగర్వాల్ లుక్‌ని విడుదల చేశారు. శుక్రవారం నభా నటేశ్ ఫొటో రిలీజ్ చేశారు. ‘‘నిధీ అగర్వాల్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం పేర్కొంది. నభా కూడా మార్కులు కొట్టేస్తారని, కుర్రకారు దిమాక్ ఖరాబ్ చేస్తారని చెప్పొచ్చు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ఖరాబ్ ఖాయం
‘దిమాక్ ఖరాబ్..’ అంటూ నిధీ అగర్వాల్ అట్టహాసంగా డ్యాన్స్ చేస్తే అబ్బాయిల దిమాక్ ఖరాబ్ కావడం ఖాయం. ‘ఇస్మార్ట్ శంకర్’లోని ‘దిమాక్ ఖరాబ్..’ పాటలోనే నిధి ఇలా హాట్‌గా కనిపించబోతున్నారు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. రామ్, నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరో, హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరకర్త. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న ‘దిమాక్ ఖరాబ్..’ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. తెలంగాణ యాసలో సాగే ఈ పాట చిత్రీకరణ సమయంలో దర్శకుడు సుకుమార్ లొకేషన్‌కి వెళ్లారు. సాంగ్ మేకింగ్, రామ్ లుక్‌ని సుక్కు అభినందించారు. మేలో ఈ చిత్రం రిలీజ్. -
‘ఇస్మార్ట్ శంకర్’లో గ్లామరస్ నిధి
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. డబుల్ దిమాక్ ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన భారీ సెట్లో ‘దిమాక్ ఖరాబ్...’ అనే పాటను చిత్రీకరిస్తున్నారు. వందమంది డ్యాన్సర్స్‌తో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. కాసర్లశ్యామ్ రాసిన ఈ పాట తెలంగాణ యాసలో సాగుతుంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఆన్‌లోకేషన్ స్టిల్స్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వైబ్రేంట్ కాస్ట్యూమ్స్ లో ఉన్న నిధి అగర్వాల్ లుక్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. -
హిట్ హిట్ హుర్రే
సాధారణంగా బిజినెస్ ఇయర్ మార్చి టు మార్చి జరుగుతుంది. ఆ ఏడాది జరిగిన లావాదేవీలన్నీ లెక్కలేస్తుంటారు. బిజినెస్ ఇయర్‌ను మేం కొంచెం మార్చాం. ఉగాది టు ఉగాది చేశాం. గత ఏడాది ఉగాది నుంచి ఈ ఉగాది వరకూ ఇండస్ట్రీకు ఎంట్రీ ఇచ్చిన కొత్త టాలెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఉగాది పచ్చడిలానే సినీపరిశ్రమలో ఫలితాలు కూడా షడ్రుచుల్లా ఉంటాయి. చేదు, పులుపు, తీపి, కారంలా హిట్టు, ఫ్లాప్, యావరేజ్, డిజాస్టర్లు ఉంటాయి. తొలి ప్రయత్నంలోనే తీపి రుచి చూసిన హీరో, హీరోయిన్లు, దర్శకులు గురించి చర్చించుకుందాం. వాళ్లపై స్పెషల్ స్టోరీ. లక్కీయారా తొలి పరిచయంలోనే స్టేట్ సీయంను ప్రేమలో పడేసిన హీరోయిన్ కియారా అద్వానీ. అదేనండీ.. ‘భరత్ అనే నేను’లో సీయం భరత్‌ని ప్రేమలో పడేశారు కదా. మహేశ్‌బాబు నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘భరత్ అనే నేను’తో ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు బాలీవుడ్ బ్యూటీ కియారా. ‘భరత్ అనే నేను’ రిలీజ్ కాకముందే ‘వినయ విధేయ రామ’ సినిమాలో రామ్‌చరణ్‌తో జోడీ కట్టే ఛాన్స్ కొట్టేశారు. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇద్దరు టాప్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసి లక్కీయారా అనిపించుకున్నారు. ‘భరత్..’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచినా, ‘వినయ..’ సినిమా అంచనాలను అందుకోలేదు. అయినా నో ప్రాబ్లమ్. కియారాకి అవకాశాలు కొదవ లేదు. అఖిల్ కొత్త చిత్రంలో కియారా నటించే అవకాశముందని తెలిసింది. మజిలీ ఎటువైపు హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘చి.ల.సౌ’తో పరిచయమయ్యారు రుహానీ శర్మ. సినిమా ఆకట్టుకుంది. రుహానీ నటన కూడా బాగుందనే అన్నారు. కానీ కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. రుహానీలా హిట్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినా కూడా నెక్ట్స్ సినిమాను ఇంకా సైన్ చేయని హీరోయిన్లలో శోభితా ధూళిపాళ, ప్రియాంకా జవాల్కర్ ఉన్నారు. ‘గుఢచారి’ ద్వారా శోభిత, ‘టాక్సీవాలా’ ద్వారా ప్రియాంకా ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేశారు. నెక్ట్స్ ఏ సినిమా చేస్తున్నారు? అంటే.. ఇంకా ప్రకటించలేదు ఈ తెలుగమ్మాయిలు. ఇక నాగచైతన్య, సమంత చేసిన ‘మజిలీ’ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయ్యారు దివ్యాన్షాకౌశిక్. ఆమె నటనను మెచ్చుకున్నారు ప్రేక్షకులు. మరి.. ఈ సినిమా తర్వాత దివ్యాన్ష మజిలీ ఎటువైపో చూడాలి. సమ్మోహిని అదితీరావ్ హైదరీకి బాలీవుడ్లో తొమ్మిదేళ్ల కెరీర్ ఉంది. మణిరత్నం ‘చెలియా’ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఫస్ట్ టైమ్ పలకరించారు అదితీ. మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’ ద్వారా తెలుగుకి స్ట్రయిట్ ఎంట్రీ ఇచ్చారు. గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్‌తో సమ్మోహనపరచడమే కాకుండా తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకొని మెప్పించారు. ఆ వెంటనే వరుణ్ తేజ్‌తో కలసి ‘అంతరిక్షం’లో ప్రయాణం చేశారు. ‘అంతరిక్ష’ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. తాజాగా మరోసారి ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలో హీరోయిన్గా కనిపించనున్నారని తెలిసింది. సుధీర్‌బాబు, నానిలతో మోహనకృష్ణ ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అందులో నాని సరసన హీరోయిన్గా కనిపిస్తారట అదితీ. ఒక్క హిట్ నిధీ అగర్వాల్‌ది స్పెషల్ కేస్. వరుస సినిమాలను సంతకం చేస్తున్నారు కానీ ఫస్ట్ హిట్‌ను ఇంకా టేస్ట్ చేయలేదీ ఈ బెంగళూర్ భామ. నాగచైతన్య ‘సవ్యసాచి’తో పరిచయమైన నిధీ, ఆ తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’లో నటించారు. లేటెస్ట్గా రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’లో ఓ హీరోయిన్గా కనిపిస్తున్నారు. మరి.. అవకాశాలు అందుకుంటున్నట్లుగానే హిట్ ఎప్పుడు అందుకుంటారో చూడాలి. అది ‘ఇస్మార్ట్ శంకర్’తోనే దక్కుతుందనే ఊహలున్నాయి. భల్లే భల్లే పాయల్ గత ఏడాది ఇండస్ట్రీకు ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన వారిలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో ఈ పంజాబీ భామ చేసిన బోల్డ్ రోలే అందుకు కారణం. ప్రస్తుతం వరుస సినిమాలు సైన్ చేసే పనిలో పడ్డారు పాయల్. ‘వెంకీ మామా’లో వెంకటేశ్ సరసన, ‘డిస్కో రాజా’లో రవితేజ సరసన, ‘మన్మథుడు 2’లో యాక్ట్ చేస్తున్నారు పాయల్. తమిళంలో ఆమె చేసిన ‘ఏంజెల్’ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇటీవల తెలుగులో ‘ఆర్డీఎక్స్’ అనే ఓ కొత్త చిత్రం కూడా స్టార్ట్ చేశారు. హాట్ ఎంట్రీతో ప్రస్తుతం హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయిపోయారు పాయల్. కొత్త ఐడియాలు క్లిక్ 2018 తెలుగు సినిమా విభిన్న కథలను చూసింది. సరికొత్త ఐడియాలతో కొత్త దర్శకులు ముందుకొచ్చారు. ‘ఆర్ఎక్స్100’ లాంటి బోల్డ్ అటెంప్ట్‌తో అజయ్ భూపతి ఎంట్రీ ఇచ్చారు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు అద్భుతంగా వచ్చాయి. ప్రస్తుతం ‘మహాసముద్రం’ అనే మల్టీస్టారర్ చిత్రం ప్లాన్ చేస్తున్నారు అజయ్. తక్కువ బడ్జెట్లోనూ బాండ్ తరహా చిత్రాలు తెరకెక్కించవచ్చని ‘గూఢచారి’ సినిమా ద్వారా శశికిరణ్ తిక్క నిరూపించారు. మహేశ్‌బాబు నిర్మాణంలో ‘మేజర్’ చిత్రాన్ని తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు శశికిరణ్. ‘చి. ల. సౌ’ సినిమా ద్వారా దర్శకుడిగా మారారు హీరో రాహుల్ రవీంద్రన్. మంచి పేరు వచ్చింది. సెకండ్ సినిమాకే నాగార్జునను డైరెక్ట్ చేసే చాన్స్ లభించింది. నాగ్ సూపర్ హిట్ ‘మన్మథుడు’ సీక్వెల్ ‘మన్మథుడు 2’ షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు రాహుల్. ‘నీదీ నాదీ ఒకే కథ’ అంటూ మిడిల్ క్లాస్ కథను చూపించిన వేణు ఉడుగుల ఈసారి పీరియడ్ ఫిల్మ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. రానా, సాయి పల్లవి జంటగా నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ కథను తయారు చేశారట. ‘కేరాఫ్ కంచెరపాలెం’తో హిట్ సాధించిన దర్శకుడు వెంకటేశ్ మహా, ‘నన్ను దోచుకుందువటే’ ఆర్ఎస్ నాయుడు, ‘టాక్సీవాలా’ రాహుల్ సంక్రిత్యాన్ తమ నెక్ట్స్ ప్రాజెక్ట్ వివరాలింకా చెప్పలేదు. విజయ కార్తికేయం గత ఏడాది ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో కార్తికేయ బాగా మెరిశారు. ‘ఆర్ఎక్స్ 100’ బండిలానే దూసుకెళ్లారు. సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఆ వెంటనే తమిళ బడా చిత్రాల నిర్మాత కలైఫులి యస్ థాను నిర్మాణంలో ‘హిప్పీ’ సినిమా చేస్తున్నారు. నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. హీరోగా ఎంట్రీ ఇచ్చి, సంవత్సరం తిరక్కముందే విలన్ వేషాలకు కూడా రెడీ అయ్యారు. నాని– విక్రమ్ కె కుమార్ ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో కార్తికేయ విలన్‌గా నటిస్తున్నారు. శభాష్ నటేశ్ నిర్మాతగా హీరో సుధీర్‌బాబు తొలి ప్రయత్నం ‘నన్ను దోచుకుందువటే’. ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యారు కన్నడ నటి నభా నటేశ్. సినిమా సక్సెస్‌లో తన పాత్ర ఎంతో ఉందనే ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు నటనకు కూడా శభాష్ అనిపించుకున్నారు. ఆ హిట్‌తో వరుస సినిమాలతో బిజీ అయ్యారు నభా. రవితేజ ‘డిస్కో రాజా’లో ఓ హీరోయిన్గా, పూరి జగన్నాథ్–రామ్ కాంబినేషన్లో వస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’లో ఓ హీరోయిన్గా చేస్తూ బిజీగా ఉన్నారు. – గౌతమ్ మల్లాది -
దిమాక్ ఖరాబ్
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇందులో నిధీ అగర్వాల్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. పూరిజగన్నాథ్, చార్మీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రబృందం తాజాగా హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేసింది. ‘దిమాక్ ఖరాబ్...’ అనే సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం భారీ సెట్ వేశారు. మణిశర్మ స్వరకర్త. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను సాకేత్, కీర్తన పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలంగాణయాసలో ఉండే ఈ సాంగ్‌లో రామ్ వేసే డ్యాన్స్ మూమెంట్స్ మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించేలా విధంగా ఉంటాయట. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను మేలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
దిమాక్ ఖరాబ్
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇందులో నిధీ అగర్వాల్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. పూరిజగన్నాథ్, చార్మీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రబృందం తాజాగా హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేసింది. ‘దిమాక్ ఖరాబ్...’ అనే సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం భారీ సెట్ వేశారు. మణిశర్మ స్వరకర్త. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను సాకేత్, కీర్తన పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలంగాణయాసలో ఉండే ఈ సాంగ్‌లో రామ్ వేసే డ్యాన్స్ మూమెంట్స్ మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించేలా విధంగా ఉంటాయట. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను మేలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘ఇస్మార్ట్ శంకర్’
ఎనర్జిటిక్ స్టార్ రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ హీరో హీరోయిన్స్‌గా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా గోవా షెడ్యూల్ పూర్తయ్యింది. నెల రోజులుగా గోవాలో ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో హీరో రామ్‌ను సరికొత్త కోణంలో చూపించబోతున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మాతలుగా రూపొందిస్తున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
స్క్రీన్ టెస్ట్
కొన్ని పాటలు పదే పదే పాడుకోవాలనేలా ఉంటాయి. ఎప్పటికీ వెంటాడుతుంటాయి. వాటినే ‘ఎవర్ గ్రీన్ సాంగ్స్’ అంటాం. ఆ పాత పాటలు రీమిక్స్ రూపంలో వస్తే.. అప్పటికే ఆ పాటలను ఎంజాయ్ చేసినవారికి ఆనందాన్నివ్వడంతో పాటు కొత్త తరానికి కూడా ఆ ట్యూన్స్ దగ్గరైపోతాయి. అలాంటి ఫేమస్ పాటలను కొన్నింటిని గుర్తుచేస్తూ ‘రీమిక్స్’పై ఈ వారం స్పెషల్ క్విజ్... 1. ‘రాముడు కాదు కృష్ణుడు’.. 1983లో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ జంటగా నటించిన చిత్రం. ఆ చిత్రంలోని ‘ఒక లైలా కోసం, తిరిగాను లోకం’ అనే సూపర్‌హిట్ సాంగ్ రీమిక్స్‌లో నాగచైతన్య నటించారు. ఆ పాటలోని మొదటి లైన్‌ను తన సినిమా పేరుగా పెట్టుకున్నారు చైతన్య. ఇందులో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) రకుల్‌ప్రీత్ సింగ్ బి) పూజా హెగ్డే సి) నిధీ అగర్వాల్ డి) లావణ్యా త్రిపాఠి 2. ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రంలోని ‘వానా వానా వెల్లువాయె, కొండాకోన తుళ్లిపోయె...’ అప్పట్లో పెద్ద హిట్. తండ్రి చిరంజీవి చేసిన ఆ పాట రీమిక్స్‌లో తమన్నాతో కలిసి ‘రచ్చ’ చిత్రంలో స్టెప్పులేశారు రామ్‌చరణ్. అప్పట్లో చిరంజీవి సరసన నటించిన హీరోయిన్ ఎవరో గుర్తున్నారా? ఎ) వాణీ విశ్వనాథ్ బి) విజయశాంతి సి) రాధిక డి) రాధ 3. ఆత్రేయ స్వరపరచిన ‘ఓ బంగరు రంగుల చిలక పలకవే.. ఓ అల్లరి చూపుల రాజా ఏమని..’ పాట చలం హీరోగా నటించిన ‘తోటరాముడు’ చిత్రంలోనిది. కృష్ణ భగవాన్ హీరోగా నటించిన ఓ చిత్రంలో మరోసారి ఆ పాటను వినిపించాడు. ఆ సినిమాలో కృష్ణభగవాన్ సరసన హీరోయిన్గా నటించింది ఎవరో తెలుసా? ఎ) సిమ్రాన్ బి) రమ్యకృష్ణ సి) నగ్మా డి) రవళి 4. ‘ఆర్య–2’ చిత్రంలోని ఐటెమ్ సాంగ్ ‘రింగ రింగ రింగ రింగ రింగ రింగారే’ పాట హిందీలో రీమిక్స్ నటించిన హీరో ఎవరో కనుక్కోండి? ఎ) అజయ్ దేవ్గన్ బి) అక్షయ్ కుమార్ సి) షారుక్ ఖాన్ డి) సల్మాన్ ఖాన్ 5. ‘గల గల పారుతున్న గోదారిలా...’ ఈ పాట మహేశ్‌బాబు నటించిన ‘పోకిరి’ చిత్రంలోనిది. కృష్ణ నటించిన ఓ సినిమాలోని పాట ఇది. అది ఏ సినిమానో తెలుసా? ఎ) గౌరి బి) సాక్షి సి) పండంటి కాపురం డి) అల్లూరి సీతారామరాజు 6. 1977లో యన్టీఆర్ నటించిన ‘యమగోల’ చిత్రంలోని సూపర్‌హిట్ సాంగ్ ‘ఓలమ్మి తిక్క రేగిందా, వొళ్లంతా తిమ్మిరెక్కిందా...’ను రీమిక్స్ చేసిన దర్శకుడెవరో చెప్పుకోండి? ఎ) వీవీ వినాయక్ బి) శ్రీను వైట్ల సి) ఎస్.ఎస్. రాజమౌళి డి) కొరటాల శివ 7. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే..’ అంటూ సిల్వర్‌స్క్రీన్‌పై స్టెప్పులేసిన హీరో పవన్‌కళ్యాణ్. ఆయన సరసన నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) రాశి బి) రేణూదేశాయ్ సి) శ్రియ డి) భూమికా చావ్లా 8. ‘ఆకుచాటు పిందె తడిసే...’ అంటూ ‘వేటగాడు’ చిత్రంలో తన అందాలను ఆరబోశారు అందాల తార శ్రీదేవి. అదే ట్యూన్‌ను గుర్తు చేస్తూ ‘2002 వరకు చూడలేదే ఇంత సరుకు..’ అని జూనియర్ యన్టీఆర్ ‘అల్లరి రాముడు’ చిత్రంలో ఏ హీరోయిన్‌తో చిందేశారో గుర్తుందా? ఎ) ఆర్తీ అగర్వాల్ బి) సదా సి) కీర్తీ చావ్లా డి) అంకిత 9. కృష్ణ హీరోగా నటించిన ‘సింహాసనం’ చిత్రంలోని ‘ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ’ పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఈ పాటను రీమిక్స్ చేసి తన సినిమాలో వాడుకున్న హీరో ఎవరో తెలుసా? ఎ) నితిన్ బి) నిఖిల్ సి) నవదీప్ డి) ‘అల్లరి’ నరేశ్ 10. ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలోని ‘మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల, మాపటేల కలుసుకో...’ అనే పాట చాలా ఫేమస్. ఆ పాటను తన ఆల్బమ్‌కి పేరుగా పెట్టుకున్న ప్రముఖ గాయని పేరేంటో కనుక్కోండి? ఎ) చిత్ర బి) స్మిత సి) గీతామాధురి డి) శ్రావణ భార్గవి 11. ‘దం^è వే మేనత్త కూతురా... వడ్లు దంచవే నా గుండెలదరా... దంచు దంచు బాగా దంచు’ అనే పాట ‘మంగమ్మ గారి మనవడు’ చిత్రంలోనిది. మళ్లీ ఆ పాటను హీరో నాని ‘రైడ్’ చిత్రంలో యూజ్ చేశారు. ‘రైడ్’ చిత్ర సంగీతదర్శకుడెవరో తెలుసా? ఎ) హేమచంద్ర బి) సాయికార్తీక్ సి) భీమ్స్ డి) శేఖర్ చంద్ర 12. నాగార్జున హీరోగా నటించిన ‘అల్లరి బుల్లోడు’ చిత్రంలోని ‘భీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు కావాలా...’ పాటను రీమిక్స్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఎ) నాని బి) సుమంత్ సి) శర్వానంద్ డి) కల్యాణ్‌రామ్ 13. ‘దేవదాసు’ చిత్రంలోని ‘పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో..’ అనే పాట ఏ హీరో కోసం మళ్లీ తయారయ్యిందో లె లుసా? (క్లూ: ‘ఆటాడుకుందాం రా’ అనే చిత్రం కోసం ఈ పాట మళ్లీ తయారయ్యింది) ఎ) రానా బి) నాగచైతన్య సి) అఖిల్ డి) సుశాంత్ 14. ‘విష్ణు’ చిత్రంతో హీరోగా మంచు విష్ణు కెరీర్ మొదలైంది. ఆ చిత్రంలో యన్టీఆర్, సావిత్రి నటించిన ‘రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ..’ పాటను రీమిక్స్ చేశారు విష్ణు. ఆ పాట ఏ సినిమాలోనిదో తెలుసా? ఎ) మిస్సమ్మ బి) మాయాబజారు సి) దేవత డి) గుండమ్మ కథ 15. ‘ము, ము, ము, ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా...’ పాట అక్కినేని హీరోగా నటించిన ‘అదృష్టవంతులు’ చిత్రంలోనిది. ఆ పాటను హీరో నాగార్జున సినిమాలో వాడారు. నాగార్జున సరసన హీరోయిన్గా నటించిన ఆ భామ ఎవరో తెలుసా? ఎ) అనుష్క బి) మీనా సి) ప్రియమణి డి) మమతా మోహన్‌దాస్ 16. ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు, నేను రోమియోగా మారినది లగాయతు..’ పాట 1993లో నాగార్జున, రమ్యకృష్ణ కాంబినేషన్లో వచ్చింది. 2018లో ‘సవ్యసాచి’ సినిమాలో ఆ పాట రీమిక్స్‌కు నాగచైతన్య, నిధీ అగర్వాల్ కాలు కదిపారు. 1993లో సినిమాకు, 2018లో సినిమాకు సంగీత దర్శకుడు ఒక్కరే. ఎవరా మ్యూజిక్ డైరెక్టర్ తెలుసా? ఎ) ఇళయరాజా బి) యం.యం. కీరవాణి సి) మణిశర్మ డి) కోటి 17. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘పచ్చనికాపురం’. ఈ చిత్రంలోని సూపర్‌హిట్ సాంగ్ ‘వెన్నెలైనా చీకటైనా...’ పాటను రీమిక్స్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఎ) అల్లు శిరీష్ బి) సునీల్ సి) సుధీర్‌బాబు డి) తరుణ్ 18. ‘గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట...’ పాట ‘ఖైదీ నెంబర్ 786’ చిత్రంలోనిది. ‘అందం ఇందోళం, అధరం తాంబూలం’ పాట ‘యమకింకరుడు’ చిత్రంలోనిది. ఈ రెండు పాటలు చిరంజీవి హీరోగా నటించిన సినిమాల్లోనివే. ఆ పాటలను రీమిక్స్ చేసిన హీరో ఎవరు? ఎ) వరుణ్ తేజ్ బి) అల్లు అర్జున్ సి) సాయిధరమ్ తేజ్ డి) రామ్‌చరణ్ 19. ‘ఇప్పటికింకా నా వయసు 26లే, ఇప్పటికిప్పుడు నీ కోసం పెళ్లికి తయ్యారే..’ పాట కృష్ణభగవాస్, రఘుబాబు హీరోలుగా నటించిన కామెడీ సినిమాలోనిది. ఆ సినిమాలో వాళ్లిద్దరూ ఏ హీరోయిన్ను ఉద్ధేశించి ఈ పాట పాడుకున్నారో తెలుసా? ఎ) సౌందర్య బి) రజని సి) రంభ డి) సంఘవి 20. ‘ఆర్య’ సినిమాలో ఐటెమ్ సాంగ్ ‘ఆ అంటే అమలాపురం’ పెద్ద హిట్. ఆ పాటను హిందీ చిత్రం ‘మాగ్జిమమ్’ కోసం వాడారు. హిందీలో ఈ ఐటెమ్ సాంగ్‌కు కాలు కదిపిన భామ ఎవరు? ఎ) కత్రినాౖ కెఫ్ బి) కరీనా కపూర్ సి) మలైకా అరోరా డి) హజెల్ కీచ్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) బి 3) ఎ 4) డి 5) ఎ 6) సి 7) డి 8) ఎ 9) డి 10) బి 11) ఎ 12) బి 13) డి 14)ఎ 15) డి 16) బి 17) సి 18) సి 19) సి 20) డి నిర్వహణ: శివ మల్లాల -
కండలు పెంచుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఎనర్జిటిక్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా కోసం రామ్ కండలు పెంచే పనిలో ఉన్నాడు. ఈ విషయాన్ని రామ్ తన సోషల్ మీడియా పేజ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫోటోలను ట్విటర్ పేజ్‌లో పోస్ట్ చేసిన వర్మ రామ్ పోతినేని 2.0 లోడింగ్ అంటూ కామెంట్ చేశాడు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, చార్మీలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నారు. #Rapo2.0 loading... #ismartshankar pic.twitter.com/emTDcIpGU2 — RAm POthineni (@ramsayz) 13 March 2019 -
నేనే నా మజ్ను
ఎవరో గౌరవించాలి..ఎవరో ప్రేమించాలి... లేకపోతే మనకు విలువ లేదు అని అనుకునే ప్రతి ఒక్కరికీ నిధి చెప్పేదొక్కటే.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.. అని! 15 రోజుల క్రితం ప్రేమికుల దినోత్సవం ఎలా జరుపుకున్నారు? మీ బెస్ట్ వేలైంటైన్ ఎవరు? వేలంటైన్స్ డే స్పెషల్ ఏమీ లేదు. ప్రేమను పంచడానికి ఒక్క రోజే ఎందుకు? నా పేరెంట్స్, ఫ్రెండ్స్.. ఇలా అందర్నీ ప్రతిరోజూ ప్రేమిస్తాను. ఇక బెస్ట్ వేలంటైన్ అంటే.. నేనే నా బెస్ట్ వేలంటైన్‌ని.అంటే మీకు మీరే మజ్ను అన్నమాట. మీరు కాకుండా వేరే ఎవరూ లేరా?(నవ్వేస్తూ). అవును. ప్రస్తుతానికి నాకు నేనే మజ్ను. నేనే నా బెస్ట్ ఫ్రెండ్ అని భావిస్తాను. మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది గొప్ప ఆర్ట్. అది ఆ మధ్య నేర్చుకున్నాను. ఓ ఏడాది నుంచి నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టాను. ఇంతకుముందు కన్నా ఇప్పుడు నన్ను నేను ఇంకా బాగా ప్రేమించుకోగలుగుతున్నాను. ఈ స్వీయ ప్రేమను ఎలా నేర్చుకున్నారు? ఏడాది క్రితం నాకు చాలా ‘టఫ్ టైమ్’. ప్రతిదానికీ కంగారుపడేదాన్ని. అప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా ముఖ్యం అని మా అమ్మగారు చెప్పారు. ‘ఒక్క నిమిషం కూర్చుని ఆలోచించు. జీవితంలో ఇంత దూరం ఎలా రాగలిగావు? ‘ఏమీ లేను’ అనే స్థాయి నుంచి ఇక్కడి దాకా ఎలా చేరుకున్నావు? అందుకే కృతజ్ఞతతో ఉండు. హ్యాపీగా ఉండు. నీతో నువ్వు మరీ కఠినంగా ఉండకు’ అని మా అమ్మగారు చెప్పిన మాటలు నన్ను ఆలోచింపజేసేలా చేశాయి. అంతే.. టెన్షన్, కన్ఫ్యూజన్ పోయాయి. ఈ వేలంటైన్స్ డేకి నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. నన్ను నేనింకా ఎక్కువ లవ్ చేయాలని. గతేడాది టఫ్‌గా గడిచిందన్నారు. ఆ క్లిష్టమైన పరిస్థితి గురించి? చాలా రకాలుగా టఫ్‌గా గడిచింది. మా అమ్మానాన్నలు బెంగళూర్‌లో ఉంటారు. సినిమాల మీద ప్రేమతో నేను ముంబైలో ఉంటున్నాను. ఒంటరి జీవితం. ఇంటిని, జాబ్‌ని బ్యాలెన్స్ చేయాలి. బిల్స్ కట్టుకోవాలి. బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. సినిమా షెడ్యూల్స్ ప్లానింగ్ చేయాలి. ఇలా నా లైఫ్ మొత్తం నేనే హ్యాండిల్ చేసుకున్నాను. అది కొన్నిసార్లు చాలా టఫ్‌గా అనిపించింది. యాక్టర్ అయినప్పుడు చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నా కంట్రోల్ లేకుండా చాలా పనులు జరిగిపోయాయి. అప్పుడు కొంచెం డౌన్ అయ్యాను. జీవితం మంచి పాఠం అంటారు. ఆ పాఠం మంచి అనుభవం అవుతుంది. అందుకే ఈ సంవత్సరం కచ్చితంగా అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాను. ‘నా కంట్రోల్ లేకుండా కొన్ని జరిగిపోయాయి’ అన్నారు. అలాంటప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి? అన్నింటికంటే ముఖ్యమైనది ‘ఇది మన కంట్రోల్ దాటిపోయింది’ అని తెలుసుకోగలగడం. మన చేతుల్లో ఏమీ లేనప్పుడు భారం దేవుడి మీద వేయడమే. నాకు దేవుడి మీద నమ్మకం ఎక్కువ. నా పరిధిలో ఉన్నవాటిని నేనే కంట్రోల్ చేసుకుంటాను. నావల్ల కానిది దేవుడికి వదిలేస్తాను. టఫ్ టైమ్స్‌ని ఎదుర్కొనే విషయంలో నేను పాటించేది ఇదే. ఇది కరెక్ట్ అనిపిస్తే ఎవరైనా ఫాలో అవ్వొచ్చు. లేకపోతే ఎవరి మనసు ఎలా చెబితే అలా వెళ్లిపోవడమే. పాతికేళ్ల వయసులో మీలో చాలా పరిణతి కనిపిస్తోంది. ఓకే... మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్న తర్వాత గమనించిన మార్పులేంటి? చాలా హ్యాపీగా, ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. మన బెస్ట్ కంపెనీ మనమే అని తెలుసుకుంటే లైఫ్ బాగుంటుంది. వంద మంది మధ్య పని చేసినా ఇంట్లో మన గదిలోకి వెళ్లాక మనం ఒక్కరమే ఉంటాం. అప్పుడు మనకు ఎవరు కంపెనీ ఉంటారు? మనమే కదా. మన కంపెనీని మనం ఇష్టపడగలగాలి. అప్పుడే మరుసటిరోజు మనం సంతోషంగా నిద్ర లేవగలం, సంతోషంగా ఉండగలం. అది మన పని మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అవునూ.. చిన్నప్పుడు ఐశ్వర్యారాయ్ హోర్డింగ్ (పోస్టర్) చూసి, ఎప్పటికైనా అలా హోర్డింగ్‌లో కనిపించాలనుకున్నారట. నిజమేనా? (నవ్వేస్తూ) అవును. యాక్టర్ అవ్వాలనుకోవడానికి అదో కారణం. మరి మీరు హీరోయిన్ అయ్యాక మీ హోర్డింగ్ చూసి ఏమనుకున్నారు? ఫుల్ హ్యాపీ. మనమేనా? అనే ఫీలింగ్ కలిగింది. ఫొటోలు తీసుకున్నా. మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీ. వాళ్లిద్దరూ ఎప్పుడైనా మాల్స్‌కి వెళ్లినప్పుడు నా హోర్డింగ్స్‌తో ఫొటో దిగి నాకు పంపుతుంటారు. హీరోయిన్ కావాలన్నది నా చైల్డ్‌హుడ్ డ్రీమ్. ఎందుకంటే ఆర్టిస్టులను స్క్రీన్ మీద చూడగానే వాళ్లు మామూలు మనుషులు కాదనుకునేదాన్ని. దీపికా పదుకోన్ సిస్టర్‌ది మా స్కూలే. ఓసారి దీపికను నేరుగా చూసి, ‘హీరోయిన్లు కూడా మామూలు మనుషుల్లానే ఉంటారా?’ అయితే మనం కూడా హీరోయిన్ అవ్వొచ్చన్నమాట అనుకున్నాను. ఒకవేళ మీరనుకున్నట్లు సినిమాలు కుదరకపోయి ఉంటే ఏం చేసేవారు? చాన్సే లేదు. హీరోయిన్ అనే లక్ష్యం తప్ప వేరే ఏదీ లేదు. కచ్చితంగా అవుతాను అనే నమ్మకం ఉండేది. ఏదో ఓ మ్యాజిక్ జరుగుతుంది అని నమ్మాను. నాకున్న డ్రీమ్ ఇదొక్కటే. అయితే బాగా చిన్నప్పుడు అనుకుంటా... ఎవరు ఏ పని చేసినా అది కావాలనుకునేదాన్ని. కంటి ముందు టైలర్ కనిపిస్తే టైలర్ అవ్వాలని, డాక్టర్ ఎదురుపడితే డాక్టర్ అవ్వాలని, ఎవరైనా వంట చేస్తూ కనిపిస్తే వంట మనిషి అయిపోవాలని.. ఇలా అన్నమాట (నవ్వుతూ). హీరోయిన్ అంటే 365 రోజులూ అందం మీద, ఫిజిక్ మీద దృష్టి పెట్టాలి. కష్టమే కదా? కష్టమే. ఫిజిక్ ఒక్కటే కాదు స్కిన్, హైయిర్, స్టామినా అన్నీ చూసుకోవాలి. ఇవన్నీ జాబ్‌లో భాగమే. యాక్టర్ కావాలనుకుంటే మూడు నాలుగు విషయాలు కచ్చితంగా చూసుకోవాలి. యాక్టింగ్, డ్యాన్స్, లుక్స్. ఇవన్నీ నాకిష్టమే. ఎప్పుడూ వీటి మీద ఫోకస్డ్గా ఉంటాను. ఆర్టిస్ట్ అంటే మాటలా? సరిగ్గా మీరు కథానాయికగా ఎంటరైన టైమ్‌లో ‘మీటూ’ ఉద్యమం వెలుగులోకొచ్చింది. సినిమాలెందుకని భయం వేసిందా? సాధారణంగానే ఎవరికైనా పని చేసే వాతావరణం ఎలా ఉంటుందో అని భయం. పని సరిగ్గా చేయగలుగుతామా? లేదా? అని భయం. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే? అనే భయం. ఇలాంటి భయాలు ఉన్నా అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు భయాన్ని వెనక్కి నెట్టి, ధైర్యాన్ని ముందుకు తెచ్చుకోవాలి. నా అదృష్టమో ఏమో నాకు లైంగిక వేధింపులు ఎదురవ్వలేదు. అలాంటివి ఎదుర్కొన్నవాళ్లు లక్కీగా బయటకు చెబుతున్నారు కాబట్టి భయం మొదలైంది. దీనివల్ల దాడులు తగ్గుతాయని నా నమ్మకం. ఒకవేళ అలాంటి సందర్భాలు ఎదురైతే వాటిని ఎదుర్కొనే ధైర్యం మీలో ఉందా? మనందరికీ ధైర్యం ఉంటుంది. కొంతమంది దాన్ని లోపలే దాచేసుకుంటాం. అయితే ఎంతటి ధైర్యవంతులకైనా కొన్ని సందర్భాల్లో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి ఉంటుంది. నాకు కిక్ బాక్సింగ్ వచ్చు, ఏమైనా చేయగలను అనుకోవచ్చు. కానీ ఆ పరిస్థితిలో ఎలా రియాక్ట్ అవుతామో తెలియదు. నేనైతే కచ్చితంగా బ్యాడ్‌గా రియాక్ట్ అవుతాను. కాలేజ్ డేస్‌లో ర్యాగింగ్ అప్పుడు ధైర్యంగా నిలబడ్డ సందర్భాలు? కొంతమంది అమ్మాయిలు నన్ను ర్యాగింగ్ చేశారు. అది కూడా కొన్నాళ్లే. ఆ తర్వాత నన్నెవరూ ర్యాగ్ చేయలేదు. నేను ఎవర్నీ ర్యాగ్ చేయలేదు. ర్యాగింగ్ సరదా అనుకున్నా కొందరు సున్నిత మనస్కులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటారు కూడా. అందుకే నా దృష్టిలో ర్యాగింగ్ తప్పు. ఓకే.. సవ్యసాచి, మిస్టర్ మజ్ను నటిగా మీకెంతవరకూ ఉపయోగపడ్డాయి? ప్రతి సినిమా ఓ జర్నీ. ఆ జర్నీలో మనం ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యం. ఈ సినిమా కంటే నెక్ట్స్ సినిమాలో ఇంకా బాగా ఎలా యాక్ట్ చెయ్యాలా? అని ఆలోచిస్తుంటాను. అంతేగానీ ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది? అని ఆలోచించకూడదు. నటిగా బెటర్ అవ్వడానికి రెండు సినిమాలూ చాలా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ‘మిస్టర్ మజ్ను’లో కష్టమైన సీన్లు నటిగా మెరుగవ్వడానికి హెల్ప్ అయ్యాయి. ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేస్తున్నారు. మీరెంత స్మార్ట్? వెరీ వెరీ స్మార్ట్. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నాది స్మార్ట్ రోల్. నా రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటుంది. కొత్త టీమ్. చాలా సరదాగా ఉంది. ఈ స్మార్ట్కి గర్ల్‌కి నచ్చాలంటే అబ్బాయిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి? ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో డైలాగ్ చెబుతా. అబ్బాయి విషయంలో నాకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటాను. నిజజీవితంలో కూడా నాకు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మన జీవితం అంతా ఒక వ్యక్తితో షేర్ చేసుకోవాలి కదా. అందుకే రైట్ పర్సన్ అయుండాలి. సింపుల్‌గా గుడ్ మ్యాన్ అయితే చాలు. అలాగే మంచి స్మైల్ ఉండాలి. ఎందుకంటే ఇద్దరం కలసి స్మైల్ చేయాలి కదా. ఓకే.. పెళ్లెప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు? హహ్హహ్హ (పెద్దగా నవ్వుతూ) పెళ్లా! నాకు తెలియదు. ఇంకా చాలా సినిమాలు చేయాలి. పెళ్లి సంగతి దేవుడు చూసుకుంటాడు. అయితే పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తాను. అయినా పెళ్లి గురించి మాట్లాడే వయసులో లేను. ఎవరైనా ‘మీ అమ్మాయికి పెళ్లెప్పుడు చేస్తారు?’ అని నా పేరెంట్స్‌ని అడిగితే.. ‘ఇంకా చిన్నపిల్లే. అప్పుడే పెళ్లా?’ అంటారు. అవునండీ.. నాకప్పుడే పెళ్లేంటి? ఖాళీ సమయాల్లో వంటింట్లో గరిటె తిప్పుతారా? వంట అస్సలు రాదని కాదు.. ఓ సంవత్సరం సర్వీస్ అపార్ట్మెంట్లో ఉన్నాను. త్వరగా వండేవన్నీ నేర్చుకున్నాను. నన్ను నేను బతికించుకోవడానికి వండుకోగలను (నవ్వుతూ). మీరు ఫుడ్ లవరా? అంతేం కాదు. ఇంట్లో తిని బయటకు వెళ్లే టైప్ నేను. భోజనంలో కొత్త్త ప్రయోగాలు చేయలేను. ఇడ్లీ, పెరుగన్నం వంటి కంఫర్టబుల్ ఫుడ్‌ని ఇష్టపడతాను. మరి నాన్‌వెజ్? తినను. వెజిటేరియన్‌గా మారాను. ఎప్పుడు మారారు? కారణం ఏదైనా ఉందా? నా పదకొండేళ్ల వయసప్పుడు అనుకుంటా. నేను నాన్‌వెజ్ తినడంవల్ల జంతువులు చచ్చిపోతున్నాయి అనిపించింది. అంతే.. మానేశాను. వెజిటేరియన్ అయిపోయా. వెజిటేరియన్ హెల్తీ డైట్ కూడా. మనల్ని ఎప్పుడూ లైట్‌గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఫైనల్లీ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? డ్రీమ్ రోల్ కన్నా డ్రీమ్ డైరెక్టర్స్ ఉన్నారు. రాజమౌళి, మణిరత్నం, సంజయ్ లీలా భన్సాలీగార్ల సినిమాల్లో చేయాలని ఉంది. డి.జి. భవాని హైదరాబాద్‌లో పుట్టి, బెంగళూరులో పెరిగి ఇప్పుడు తెలుగు సినిమాల ద్వారా మళ్లీ హైదరాబాద్‌కి దగ్గరయ్యారు. తెలుగు ఫ్యాన్స్ గురించి? నా పేరుతో ఓ ఫ్యాన్ ట్యాటూ వేయించుకున్నాడు. లవ్ లైటర్స్ కంటే కూడా అది టచింగ్‌గా అనిపించింది. ఇండస్ట్రీ మ్యాజికే అది. మనకు ఎంతో ప్రేమను ఇస్తుంటారు. సినిమాల్లోకి రాకమందు నేనూ థియేటర్స్‌లో ఓ ప్రేక్షకురాలిలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నన్ను స్క్రీన్ మీద చూసి, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. జీవితం నాకు చాలా ఇచ్చింది. అందుకే ఫ్యాన్స్‌కి నా మనసులో స్పెషల్ ప్లేస్ ఇచ్చేశా. మీ రోజు ఎలా మొదలవుతుంది.? ప్రస్తుతానికైతే షూటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మొన్న నాలుగున్నరకే నిద్రలేచాను. ఆ రోజు ఏడు గంటలకల్లా షూటింగ్ లొకేషన్లో ఉండాలి. షూటింగ్ లేకపోతే 8–8.30కి లేస్తాను. ఈ మధ్య చాలా ప్రయాణం చేస్తున్నాను. ఎన్ని ప్రయాణాలు చేస్తున్నాను అని లెక్కేస్తున్నాను. ఈ ఏడాది ఈ నెలన్నరలో ఈ మధ్య చేసిన ఫ్లైట్ జర్నీ 22వది. చూడాలి.. ఈ ఏడాది ఇంకా ఎన్ని చేస్తానో? -
చలో గోవా
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇందులో నిధీ అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. నెక్ట్స్ షెడ్యూల్ కోసం చిత్రబృందం గోవా వెళ్లనుంది. అక్కడ ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మేలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఇస్మార్ట్2
హీరోయిజాన్ని సరికొత్తగా తెరపై ఆవిష్కరించడంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ప్రత్యేకమైన శైలి ఉంది. అందుకే హీరోలందరూ ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటుంటారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే పూరిజగన్నాథ్, ఛార్మి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్‌ను రిజిష్టర్ చేయించారు. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో టిపికల్ హైదరాబాదీ కుర్రాడిగా రామ్ కనిపించనున్నారు. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. -
మాకు బాగా కలిసొచ్చింది
విశాఖపట్నం :‘మజ్ను పేరు మా కుటుంబానికి బాగా కలిసివచ్చింది. ఆ పేరుతో వచ్చిన నాన్న సినిమా హిట్టయింది . ఇప్పుడు నా సినిమా మిస్టర్ మజ్ను ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది ’ అన్నారు సినీ హీరో అఖిల్. మిస్టర్ మజ్ను విజయోత్సవంలో భాగంగా శుక్రవారం నగరానికి వచ్చిన చిత్రయూనిట్ ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించింది. హీరో అఖిల్ మాట్లాడుతూ వైజాగ్‌లో బీచ్ ఉండటం విశాఖ ప్రజల అదృష్టమన్నారు. హైదరాబాద్‌లో బీచ్ లేకపోవటంతో తనకు కాస్త చాలా జెలసీగా కూడా ఉందన్నారు. వైజాగ్ ప్రజలు, బీచ్, వాతావరణం చాలా బాగుంటాయని, అందుకే తనకు విశాఖ అంటే చాలా ఇష్టమని అన్నారు. తమ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హీరోయిన్ నిధి, దర్శకుడు వెంకీ తదితరులు పాల్గొన్నారు. -
ఇస్మార్ట్‌తో కిర్రాక్ పోరీ
టాలీవుడ్లో హీరోయిన్ నభా నటేష్ మంచి ఫామ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరపై కనిపించిన ఈ కన్నడ బ్యూటీకి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. రవితేజ హీరోగా నటించనున్న ‘డిస్కోరాజా’ సినిమాలో ఒక హీరోయిన్గా నభా నటేష్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. ఇది వార్తల్లో ఉండగానే.. నభా మరో అవకాశం కొట్టేశారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’లో ఓ నాయికగా నభాని తీసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు చార్మీ, పూరి జగన్నాథ్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఆల్రెడీ ఒక హీరోయిన్గా నిధీ అగర్వాల్ ఎంపిక అయ్యారు. ‘‘కిర్రాక్ హైదరాబాద్ పోరీ నభా నటేష్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో హీరోయిన్గా నటించనున్నారు’’ అని చార్మీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫస్ట్ షెడ్యూల్ దాదాపు 40 రోజులు సాగుతుందని సమాచారం. ఈ చిత్రం మేలో విడుదల కానుంది. -
అక్కినేని ఫ్యామిలీకి ‘మజ్ను’ కలిసొచ్చింది
మజ్ను చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్నుని ప్రేక్షకులు ఆదరించిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ చేస్తోంది. బుధవారం గాంధీనగర్‌లోని శైలజ థియేటర్లో హీరో అఖిల్, హీరోయిన్ నిధి అగర్వాల్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, దర్శకుడు అట్లూరి వెంకట్ ప్రేక్షకులను కలుసుకొని సంతోషం పంచుకున్నారు. లబ్బీపేట (విజయవాడతూర్పు): మజ్ను టైటిల్ మా అక్కినేని ఫ్యామిలీకి కలిసొచ్చిందనీ మిస్టర్ మజ్ను కథానాయకుడు, అక్కినేని అఖిల్ అన్నారు. మిష్టర్ మజ్ను చిత్ర యూనిట్ బుధవారం నగరంలో సందడి చేసింది. శ్రీ వేంకటేశ్వర సినీచిత్ర బ్యానర్‌పై అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్నుని ప్రేక్షకులు ఆదరించిన సందర్భంగా చిత్రయూనిట్ సక్సెస్ టూర్ చేస్తోంది. అందులో భాగంగా హీరో అఖిల్, హీరోయిన్ నిధి అగర్వాల్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, దర్శకుడు అట్లూరి వెంకట్, కమెడియన్ ఆదిలు నగరానికి విచ్చేసి గాంధీనగర్‌లోని శైలజ థియేటర్లో ప్రేక్షకులను కలుసుకున్నారు. అనంతరం మహాత్మాగాంధీరోడ్డులోని ఫార్చ్యూన్ మురళీపార్క్‌లో నిర్వహించి విలేకరుల సమావేశంలో అఖిల్ మాట్లాడుతూ తన తండ్రి నాగార్జున నటించిన మజ్ను టైటిల్‌తో నటించడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించాడు. డైరెక్టర్ అట్లూరి వెంకట్ మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చిందని, అన్ని వర్గాల ప్రజలు చూస్తున్నట్లు తెలిపారు. నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ మా బ్యానర్ నుంచి వచ్చిన మంచి రొమాంటిక్ హిట్ మూవీ మిస్టర్ మజ్నుగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో కామాక్షి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, నాగార్జున ష్యాన్స్ అసోసియేషన్ నాయకులు సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో అఖిల్‌కు అభిమానులు సన్మానం చేశారు. దుర్గమ్మ సేవలో ... ఇంద్రకీలాద్రి : మిస్టర్ మజ్నూ చిత్ర బృందం బుధవారం దుర్గమ్మను దర్శించుకుంది. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన బృందానికిఆలయ అధికా రులు సాదరస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు. హీరో, హీరోయిన్లకు ఆలయ పాలక మండలి చైర్మన్ గౌరంగబాబు అమ్మవారి ప్రసాదాలను అందచేశారు. -
స్మోకింగ్ మానేశా : అఖిల్ అక్కినేని
మిస్టర్ మజ్ను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్, సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. థియేటర్లకు వెళ్లి అభిమానులను స్వయంగా కలవటంతో పాటు ఛానల్లకు ఇంటర్య్వూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తనకు స్మోకింగ్ అలవాటు ఉండేదని ఇటీవల దాన్ని వదిలేసినట్టుగా చెప్పాడు అఖిల్. అంతేకాదు అందరూ స్మోకింగ్ మానేయాలని సూచించాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన మిస్టర్ మజ్ను ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు డివైడ్ టాక్ రావటంతో అఖిల్ సినిమా ప్రమోషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతమందించగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. -
విజయవాడలో మిస్టర్ మజ్ను విజయయాత్ర
-
ఇస్మార్ట్ గర్ల్
‘ఇస్మార్ట్ శంకర్’కి జోడీగా నటించే గర్ల్ ఎవరు? అంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకి ఫుల్స్టాప్ పడింది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి హీరో రామ్ సరసన పలువురి కథానాయికల పేర్లు హల్చల్ చేశాయి. ఫైనల్లీ ఇస్మార్ట్ శంకర్‌తో జోడీ కట్టే చాన్స్ అందుకుని ఇస్మార్ట్ గర్ల్ అనిపించుకున్నారు నిధీ అగర్వాల్. అన్న నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన నిధీ అగర్వాల్ తాజాగా తమ్ముడు అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ అవకాశం దక్కించుకున్నారు. హిందీ చిత్రం ‘మున్నా మైఖేల్’తో కథానాయికగా పరిచయమైన నిధి ఆ తర్వాత తెలుగుకి వచ్చారు. ఇప్పుడు హిందీలో ‘ఇక్కా’ అనే చిత్రం అంగీకరించారట. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ విషయానికొస్తే.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మొదలైంది. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: లావణ్య, సంగీతం: మణిశర్మ, కెమెరా: రాజ్ తోట. -
‘ఇస్మార్ట్ శంకర్’లో హీరోయిన్గా నిధి!
ఎనర్జిటిక్ స్టార్ రామ్, పూరి జగన్నాద్ కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలను ప్రారంభించిన యూనిట్.. రెగ్యులర్ షూటింగ్లో బిజీగా ఉంది. ఈ సినిమాలో రామ్‌కు జోడిగా హీరోయిన్ను ఎంపిక చేసినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్‌ను హీరోయిన్గా తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఈ రూమర్స్‌లో నిజం లేదని నేడు తేలిపోయింది. ‘సవ్యసాచి’ ఫేమ్ నిధి అగర్వాల్‌ను ఈ మూవీలో హీరోయిన్గా ఎంపిక చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ఆశిష్ విద్యార్థి, సత్య దేవ్, సుధాన్ష్ పాండేలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీని సమ్మర్లో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. -
ఆ భయం పోయింది
‘‘దర్శకునిగా నా తొలి చిత్రం ‘తొలిప్రేమ’ విజయం సాధించిన తర్వాత నా రెండో చిత్రం ‘మిస్టర్ మజ్ను’ రిజల్ట్ ఎలా ఉంటుందా? అని భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం పోయింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇండస్ట్రీలో ఏ సినిమాకు ఆ సినిమానే. ఒక సినిమా హిట్ సాధించింది కదా అని రిలాక్స్ అయిపోలేం’’ అని దర్శకుడు వెంకీ అట్లూరి అన్నారు. అఖిల్, నిధీ అగర్వాల్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘మిస్టర్ మజ్ను’ ఈ నెల 25న విడుదలైంది. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి చెప్పిన విశేషాలు... ► నా తొలి సినిమా ‘తొలిప్రేమ’ కంప్లీట్ అవ్వడం, అదే టైమ్‌లో అఖిల్ రెండో చిత్రం ‘హలో!’ కూడా రిలీజ్ అవ్వడంతో ‘మిస్టర్ మజ్ను’ సినిమా సైట్స్‌పైకి వచ్చింది. ‘ప్రేమ్‌నగర్’ చిత్రంలోని ఏయన్నార్‌గారి పాత్ర ఈ సినిమాకు ఓ స్ఫూర్తి. ► నేను అనుకున్నదానికన్నా అఖిల్ 50 పర్సెంట్ ఎక్కువగానే చేశాడు. నిధీ అగర్వాల్ బాగా చేశారు. ‘తొలిప్రేమ’కు తమన్ ఎంత కష్టపడ్డాడో ‘మిస్టర్ మజ్ను’ కి కూడా అంతే కష్టపడ్డాడు. నేను రైటర్ కాకముందు నుంచే బాపీనీడు పరిచయం. ఈ సినిమా జర్నీలో ప్రసాద్‌గారితో మంచి స్నేహం ఏర్పడింది. శ్రీమణి మంచి పాటలు రాశారు. ► నిర్మాత ‘దిల్’ రాజుగారు సినిమాల విషయంలో మంచి జడ్జ్. ఆయన సలహాలను పాటిస్తాను. రాజుగారి మనవడు ఆరాన్ష్ ఈ సినిమాలోని కొండబాబు క్యారెక్టర్ చేశాడు. దాదాపు ఏడాదిన్నర వయసు ఉన్న ఆర్షాన్ రెండో టేక్ తీసుకోలేదు (నవ్వుతూ). ► ఈ సినిమాకు నాగార్జునగారు ఫస్ట్ ఆడియన్. కథ విన్నారు. ఆ తర్వాత సినిమా చూసి.. రిలాక్స్ అయిపోండి అన్నారు. రిజల్ట్ పట్ల టీమ్ హ్యాపీగానే ఉంది. ► ‘తను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలాంటి క్యారెక్టర్ విక్కీని స్క్రీన్‌పై చూపించానని’ అఖిల్ అన్నారు.. అంటే ఆయన మాటల్లోనే అర్థం అవుతుంది ఇప్పుడు అలా లేనని. స్క్రీన్‌పై హీరో ఉన్నట్లు రియల్ లైఫ్‌లో ఉండలేం. అంత ధైర్యం నాకు లేదు. ► రివ్యూస్ చదివాను. కొంతమందికి నచ్చింది. కొంతమందికి నచ్చలేదు. ఈ సినిమాకు కామన్ ఆడియన్స్ నుంచి విమర్శలు రాలేదు. మౌత్ టాక్ పాజిటివ్‌గానే ఉంది. సినిమాలోని ఎమోషన్, కామెడీ సీన్స్‌ను బాగా ఏంజాయ్ చేస్తున్నారు. ► ఒక సినిమా కోసం టీమ్ అంతా ఎంతో కష్టపడతారు. తీరా రిలీజై థియేటర్స్‌లో మార్నింగ్ షో పడగానే ఇంటర్నెట్లో ఓ పైరసీ లింక్ ఉంటుంది. ఇది బాధాకరమైన విషయం. అందుకే పైరసీ ఎపిసోడ్‌ని సినిమాలో చూపించాం. సీరియస్‌గా డీల్ చేయకండా ఆడియన్స్‌కు చెప్పాలనుకున్నాం. అలాగే చేశాం. ► దర్శకులు మణిరత్నం, త్రివిక్రమ్ గార్లు నాకు స్ఫూర్తి. నటన నాకు కంఫర్ట్‌గా అనిపించలేదు. మళ్లీ యాక్టర్ అవ్వాలనుకోవడం లేదు. రైటింగ్‌లో నా ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకున్నాను. ఒక రచయిత ఫైనల్ గోల్ దర్శకుడు కావడమే. ప్రస్తుతానికి ‘మిస్టర్ మజ్ను’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాను. నెక్ట్స్ మూవీ ఇంకా ఫిక్స్ కాలేదు. రెండు మూడు కథలు ఉన్నాయి. త్వరలోనే అనౌన్స్ చేస్తాను. -
‘Mr మజ్ను’ మూవీ రివ్యూ
టైటిల్ : Mr మజ్ను జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్, నాగబాబు, సుబ్బరాజు, ప్రియదర్శి సంగీతం : ఎస్ తమన్ దర్శకత్వం : వెంకీ అట్లూరి నిర్మాత : బీవీయస్ఎన్ ప్రసాద్ తొలి సినిమాతోనే అక్కినేని అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన అఖిల్, రెండో సినిమా హలోతో కాస్త పరవాలేదనిపించుకున్నాడు. అయితే తన మీద ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో మూడో సినిమాగా తన వయసుకు తగ్గ రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి, అఖిల్‌ను ప్లేబాయ్‌గా చూపించాడు. మరి ఈ ఎమోషనల్ లవ్‌స్టోరితో అయినా అఖిల్ సక్సెస్ అందుకున్నాడా..? దర్శకుడు వెంకీ అట్లూరి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడా..? కథ : మూడో ప్రయత్నంగా అఖిల్ తెలుగు తెర మీద చాలా సార్లు చూసిన రొటీన్ ప్రేమకథను ఎంచుకున్నాడు. విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కీ (అఖిల్ అక్కినేని) లండన్‌లో ప్లేబాయ్‌లా అమ్మాయిలతో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అమ్మాయిల విషయంలో ఎలా ఉన్నా విక్కీ వ్యక్తిత్వం నచ్చి నిఖిత అలియాస్ నిక్కీ (నిధి అగర్వాల్) అతడిని ఇష్టపడుతుంది. కానీ నిక్కీ ప్రేమను అర్థం చేసుకోలేని విక్కీ ఆమెను దూరం చేసుకుంటాడు. కానీ నిక్కీ దూరమైన తరువాత తాను కూడా నిఖితని ప్రేమిస్తున్న విషయం విక్కీకి అర్థమవుతుంది. దూరమైన ప్రేమ కోసం విక్కీ ఏంచేశాడు..? తిరిగి ఇద్దరు ఎలా కలుసుకున్నారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : అఖిల్ తన వయసుకు తగ్గ పాత్రలో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో ప్లేబాయ్ తరహా పాత్రలో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. లుక్స్ పరంగా మన్మథుడిని గుర్తు చేశాడు. యాక్షన్ సీన్స్, డాన్స్‌లతోనూ ఆకట్టుకున్నాడు. నటన పరంగా ఎమోషనల్ సీన్స్‌లో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది. నిఖిత పాత్రలో నిధి అగర్వాల్ ఒదిగిపోయింది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. తెర మీద చాలా పాత్రలు కనిపించినా ఎవరికి పెద్దగా స్కోప్ లేదు. సితార, పవిత్ర లోకేష్, నాగబాబు, జయప్రకాష్, రావూ రమేష్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆకట్టుకోగా సుబ్బారాజు, ప్రియదర్శి, హైపర్ ఆది కామెడీతో మెప్పించే ప్రయత్నం చేశారు. విశ్లేషణ : తొలిప్రేమ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. అఖిల్ కోసం రొటీన్ లవ్ స్టోరినే తీసుకున్నాడు. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ రెండో ప్రయత్నంలో వెంకీ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ సీన్స్‌తో బాగానే నడిపించినా.. సెకండ్ హాఫ్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథనం కూడా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగుతూ ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. రచయితగా మాత్రం వెంకీ తన మార్క్ చూపించాడు. చాలా డైలాగ్స్ గుర్తుండిపోయేలా ఉన్నాయి. జార్జ్ సీ విలియమ్స్ సినిమాటోగ్రఫి సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. హీరో హీరోయిన్లతో పాటు లండన్ అందాలను కూడా చాలా బాగా చూపించాడు. తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : అఖిల్ సినిమాటోగ్రఫి మైనస్ పాయింట్స్ : రొటీన్ స్టోరి సెకండ్ హాఫ్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘మిస్టర్ మజ్ను’ ప్రెస్‌మీట్
-
హిట్ గ్యారంటీ.. డౌట్ లేదు
‘‘మిస్టర్ మజ్ను’ సినిమా చాలా బాగా వచ్చింది. గ్యారంటీగా మంచి హిట్ అవుతుంది. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. జనరల్‌గా హీరోలు.. హీరోయిన్స్‌ని బాగా చూసుకుంటారు. కానీ, అఖిల్ మాత్రం నన్ను బాగా చూసుకున్నాడు (నవ్వుతూ). సాంకేతిక నిపుణులందరూ చాలా బాగా పని చేశారు. ప్రేక్షకులు మా సినిమా చూసి, ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. అఖిల్, నిధీ అగర్వాల్ జంటగా ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ మజ్ను’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘తొలిప్రేమ’ సినిమా కంటే ముందే ‘మిస్టర్ మజ్ను’ కథ రాసి, నిర్మాత ‘దిల్’ రాజుగారికి వినిపించా. ‘బలమైన ఎమోషన్స్ ఉన్న కథ ఇది.. అనుభవం ఉన్న దర్శకుడైతే చక్కగా తీయగలడు. ఓ ఏడాది నాతో ట్రావెల్ చెయ్. కొంచెం అనుభవం వస్తుంది, ఆ తర్వాత చేద్దాం’ అన్నారు. ఆ ప్రయాణంలో ఉన్నప్పుడే ‘తొలిప్రేమ’ కథ రాసి, రాజుగారికి వినిపించా. బాగుంది.. ‘ఈ సినిమా తర్వాత ‘మిస్టర్ మజ్ను’ తీస్తే మంచి స్పాన్ ఉంటుంది’ అన్నారు. 2011–2012లో ఈ కథ రాశా. టైటిల్ ‘మిస్టర్ మజ్ను’ అని, సినిమా ఏఎన్ఆర్గారి వారసులతోనే చేయాలని ఫిక్స్ అయ్యా. ఈ కథకి అఖిల్ చక్కగా న్యాయం చేయగలడనే నమ్మకం కుదిరింది. తనకు కథ చెప్పగానే ఓకే అన్నాడు. ఇందులో అఖిల్‌ది ప్లేబోయ్ పాత్ర కాదు. 20నిమిషాలు నాటీ పాత్ర ఉంటుంది. ఆ తర్వాత అంతా లవ్‌స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంటుంది. మా సినిమా చూసి నవ్వుతారు, ఏడుస్తారు, ఆలోచిస్తారు. ‘తొలిప్రేమ’ కంటే మంచి పాటలివ్వాలని తమన్ నాకంటే బాగా కష్టపడ్డారు’’ అన్నారు. అఖిల్ మాట్లాడుతూ– ‘‘నేను ఇలాంటి సినిమా చేసినందుకు నాన్నగారు (నాగార్జున) చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా మా ఫ్యామిలీకి తగ్గ జోనర్. మంచి ప్రొడక్ట్ ఇస్తున్నామనే నమ్మకంతో ప్రతిరోజూ షూటింగ్‌కి ఎంతో ఉత్సాహంగా వెళ్లేవాణ్ని’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ప్రసాద్ సార్‌కి, వెంకీకి థ్యాంక్స్. అఖిల్ మంచి సహనటుడు. ఈ చిత్రంలోని పాత్రకు బాగా కనెక్ట్ అయ్యి చేశా’’ అన్నారు నిధీ అగర్వాల్. -
ఇప్పట్లో లవ్‌ని వదలను!
‘‘మన బ్యాగ్రౌండ్ చూసి ఆడియన్స్ థియేటర్స్‌కు రారు. యాక్టర్‌గా కష్టపడి ఆడియన్స్ నమ్మకాన్ని సంపాదించుకోవాలి. అందుకు కాస్త టైమ్ పడుతుంది. మెట్టు మెట్టుగా ఎదగాలి. నా గత రెండు సినిమాల నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నాను. నా పై ఉన్న భారీ అంచనాలు, ఒత్తిడి నాకు ఉన్న శత్రువులుగా భావిస్తున్నాను. నాకు ఉన్న భయాలు కూడా అవే. మార్పు అనేది అనుభవం నుంచి వస్తుంది’’ అని అఖిల్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్, నిధీ అగర్వాల్ జంటగా రూపొందిన చిత్రం ‘మిస్ట ర్ మజ్ను’. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా అఖిల్ చెప్పిన విశేషాలు.. ► నా తొలి సినిమా ‘అఖిల్’కి ముందే వెంకీ అట్లూరి నాకు కథ చెప్పాడు. ఈ సినిమా జర్నీలో మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. కథలో నాకు, వెంకీకి అభిప్రాయభేదాలు వచ్చాయన్న వార్తలు అవాస్తవం. షూటింగ్ ఫన్నీగా గడిచింది. ఈ సినిమా స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. త్రివిక్రమ్ సినిమాలకు వెంకీ ఇన్స్పైర్ అయ్యాడు. కానీ కాపీ కొట్టలేదు. తాతగారి (ఏయన్నార్) ‘ప్రేమ్‌నగర్’ ఇంపాక్ట్ కూడా ఉంటుందీ సినిమాపై. ► మంచి ఎంటర్టైనింగ్ చిత్రం ఇది. లవర్‌గా మారే ప్లేబాయ్ విక్కీ పాత్రలో నటించాను నేను. రిలీజ్ చేసిన ట్రైలర్లో విక్కీని ప్లేబాయ్‌గా చూపించగలిగాం. కానీ సినిమాలో అందుకు టైమ్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్‌లో నా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత లవ్‌స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్‌లో నా పెర్ఫార్మెన్స్తో ఆడియన్స్‌ను ఎలా ఎంగేజ్ చేయాలన్న విషయం నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. ► ‘మజ్ను’ అనే టైటిల్ మా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది. కానీ మజ్ను అంటే ట్రాజిక్ లవ్‌స్టోరీ అనుకుంటారని, ఈ చిత్రం మోడ్రన్ లవ్‌స్టోరీ అని చెప్పడానికి మజ్నుకి మిస్టర్ అని యాడ్ చేశాం. ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు నేను 8 ప్యాక్స్ చేయడం ఇంపార్టెంట్ కాదనే విషయాన్ని ఒప్పుకుంటాను. నేను వద్దనుకున్నాను. కానీ శేఖర్ మాస్టర్ కన్విన్స్ చేశారు. నా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సాంగ్ కోసం తప్పలేదు. ఆ సాంగ్ షూట్ సెట్‌కి చరణ్ వచ్చారు. చరణ్ డ్యాన్స్ బాగా చేస్తారు. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్లో తారక్ (ఎన్టీఆర్)ని చూసి ‘మాస్’ నేర్చుకోమని నాన్నగారు (నాగార్జున) చెప్పారు. మాస్ ఎలా నేర్చుకోవాలో నాన్నని ఓసారి అడగాలి (నవ్వుతూ). ► బీవీఎస్ఎన్ ప్రసాద్‌గారు చాలా మంచి నిర్మాత. తాతగారితో సినిమాలు చేసిన ఆయనతో సినిమా చేయడం నాకు గర్వంగా అనిపించింది. ‘సవ్యసాచి’ సినిమా రషెస్ చూసి నిధీని తీసుకున్నాం. బాగా నటించింది. ఒక లవ్‌స్టోరీకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆరు పాటలు ఆడియన్స్‌కు బాగా నచ్చాయి. ► ఇప్పుడు నాకు పాతికేళ్లు. రొమాంటిక్ సినిమాలు చేసే చాన్స్ బాగా ఉంది. తప్పకుండా డిఫరెంట్ జానర్ సినిమాలను చేస్తాను. కానీ లవ్‌స్టోరీ చిత్రాలను ఇప్పుడే వదలను. ► ప్రస్తుతానికి నేను సింగిల్. టైమ్ కుదిరితే మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తా (నవ్వుతూ). రియల్ లైఫ్‌లో నేను ఒత్తిడిని దూరం చేసుకునేందుకు క్రికెట్ ఆడతా. సీసీఎల్ జరిగితే తప్పకుండా పాల్గొంటాను. భవిష్యత్‌లో క్రీడా నేపథ్యంలో ఓ సినిమా చేయాలనుంది. ► మల్టీస్టారర్ సినిమాలపై ఆసక్తి ఉంది. రెండు, మూడు స్క్రిప్ట్స్ నా దగ్గరికి వచ్చాయి. అప్పట్లో చేయాలని అనిపించలేదు. ఐదారుగురు ఉన్న మల్టీస్టారర్ మూవీ అయితే బాగుంటుంది. మంచి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు సెట్ వాతావారణం కూడా ఫన్నీగా ఉంటుంది. ► ప్రస్తుతం రెండు మూడు కథలు విన్నాను. ఆ సినిమాల గురించి వచ్చే నెలలో చెబుతాను. ఇకపై సినిమాలు చేయడంలో స్పీడ్ పెంచుతా. ఈ దసరాకి ఓ సినిమాను రిలీజ్ చేద్దామనే ఆలోచన ఉంది. నాన్నగారు (నాగార్జున) నా సినిమాల స్క్రిప్ట్ వింటారు. షూట్ ముగిసిన తర్వాత సినిమా చూసి ఇన్పుట్స్ కూడా ఇస్తారు. నేను పుట్టిన తర్వాత అమ్మగారు (అమల) సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం మోడ్రన్ ఫిల్మ్ మేకింగ్‌పై అమ్మకు అంతగా అవగాహన లేదు. ఎమోషనల్‌గా, యాక్ట్రస్‌గా చాలా స్ట్రాంగ్. నాన్నగారు నా ఫిల్మ్ మేకింగ్ విషయాలను గమనిస్తుంటారు. -
‘మిస్టర్ మజ్ను’ మూవీ స్టిల్స్
-
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మజ్ను’
అఖిల్, హలో చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా..మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు అఖిల్ అక్కినేని. మిస్టర్ మజ్ను అంటూ అభిమానులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. తొలిప్రేమ లాంటి కూల్ హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి డైరెక్షన్లో రాబోతోన్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఒక్క కట్ లేకుండా ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ లభించిందని యూనిట్ తెలిపింది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ జనవరి 25న ప్రేక్షకుల ముందుకురానుంది. -
అఖిల్‌లో ఉన్న మంచి గుణం ఆత్మవిమర్శ
‘‘ఈ ఫంక్షన్‌కు అతిథిలా కాకుండా బంధువులా వచ్చాను. ఈ చిత్రానికి పని చేసిన చాలామంది నాకు కావాల్సిన వాళ్లు ఉన్నారు. ఒక నిర్మాత మంచి చిత్రాలు తీయాలంటే వ్యామోహం ఒక్కటే సరిపోదు. వ్యాపారం కూడా తెలియాలి. ప్రసాద్‌గారిలో వ్యాపారం చూడలేదు, కేవలం సినిమా మీద వ్యామోహం మాత్రమే చూశాను. ఈ సంస్థకు ‘మిస్టర్. మజ్ను’ మరో మైలు రాయి అవ్వాలి’’ అని ఎన్టీఆర్ అన్నారు. అఖిల్, నిధీ అగర్వాల్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్టర్. మజ్ను’. బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్టీఆర్ మాట్లాడుతూ – ‘‘ప్రసాద్‌గారితో ‘ఊసరవెల్లి, నాన్నకు ప్రేమతో’ చేశాను. ఆ రెండు సినిమాలు నాకు చాలా ఇష్టమైనవి. సంపాదించిన ప్రతి రూపాయిని సినిమాకే ఖర్చు పెడతారాయన. అలాంటి నిర్మాత బావుంటే ఇంకా మంచి సినిమాలు అందిస్తారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఉన్న ఫ్రెండ్స్‌లో వెంకీ ఒకరు. ‘తొలిప్రేమ’ అనే టైటిల్‌తో ఏం తీస్తాడు అనుకున్నాను. ఆ చిత్రం చూశాక, గర్వంగా ఫీల్ అవుతున్నాను. ‘మిస్టర్ మజ్ను’ కూడా మంచి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. తమన్ సంగీతంపై నాకు బాగా నమ్మకం ఉంది. ఆ మధ్య తన చుట్టూ ఒక నెగటివిటీ ఏర్పడింది. మళ్లీ తన సామర్థ్యాన్ని చూపించే చిత్రం రావాలి అనుకున్నాను. ‘తొలిప్రేమ’ రిలీజ్ అయింది. ఒక నటుడికి అన్నింటికంటే ముఖ్యంగా కావాల్సింది ఆత్మ విమర్శ. అలాంటి గొప్ప గుణం తమ్ముడు అఖిల్‌లో చూశాను. అఖిల్ చేసుకునేంత ఆత్మవిమర్శ ఎవ్వరూ చేసుకోలేరు. ఆత్మవిమర్శ చేసుకోవాలంటే దమ్ముండాలి. తనని తను మార్చుకుంటూ ఈ మజిలీకి చేరాడు. రాసిపెట్టుకోండి.. మనకున్న ఉత్తమ నటుల్లో అఖిల్ కూడా ఉంటాడు. స్టార్డమ్ గురించి మాట్లాడటం లేదు. ఉత్తమ నటుల్లో అఖిల్ మాత్రం కచ్చితంగా ఉంటాడు. ఆరోజు కోసం ఎదురుచూస్తున్నాను. అది కూడా ఎంతో దూరంలో లేదు. ‘మిస్టర్ మజ్ను’ అఖిల్‌కు బెస్ట్ మూవీ అవుతుంది’’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ – ‘‘మా పెద్ద పెద్ద అబ్బాయి తారక్ (ఎన్టీఆర్). నన్ను చాలా ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తాడు. తారక్ దగ్గరి నుంచి అఖిల్ నేర్చుకోవాల్సింది.. యాక్టింగ్ అండ్ మాస్. రేయ్ మాస్ నేర్చుకోరా అక్కడా (అఖిల్‌ని ఉద్దేశిస్తూ). ప్రసాద్‌గారు 25 సినిమాల్లో 2 బ్లాక్‌బస్టర్స్ ఇచ్చారు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తమన్‌గారి తాతగారే నాన్నను (ఏయన్నారు) ఆర్టిస్ట్‌గా గుర్తించారు. ఆ విధంగా ఈ సర్కిల్ పూర్తయింది అనుకుంటున్నాను. వెంకీ అట్లూరి మా సినిమాలు చూసి ఇక్కడికి వచ్చాడని విన్నాను. ‘మజ్ను’ టైటిల్ నాన్నగారిది. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అఖిల్ చేశాడు. ఈ చిత్రం ఆ 2 సినిమాల కంటే పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ – ‘‘మజ్ను... మంచి టైటిల్ పెట్టావు వెంకీ. అఖిల్‌కి సూట్ అవుతుంది (నవ్వుతూ). అఖిల్‌ని ఫుల్ లవ్‌స్టోరీలో చూడాలనుకున్నాను. అఖిల్ ఫైట్స్, డ్యాన్స్ బాగా చేస్తాడని మనందరికి బాగా తెలుసు. తన బాడీ లాంగ్వేజ్‌కు లవ్‌స్టోరీ బావుంటుందని అనుకున్నాను. వెంకీ ‘తొలిప్రేమ’తో తన మార్క్ చూపించాడు. ‘మిస్టర్ మజ్ను’ కూడా అలానే ఉంటుందనుకుంటున్నాను. నిధీకు సక్సెస్ రావాలి. బ్లాక్‌బస్టర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ప్రసాద్‌గారు’’ అన్నారు. అఖిల్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకు గాడ్ ఫాదర్ బీవియస్‌ఎన్ ప్రసాద్‌గారు. తాతగారితో కూడా ఆయన సినిమా తీశారు. సినిమాకు పని చేసిన నిపుణులందరికీ థ్యాంక్స్. ఇంత స్పెషల్ ఆల్బమ్ ఇచ్చిన తమన్‌కు థ్యాంక్స్. వెంకీ నాకు పదేళ్ల నుంచి ఫ్రెండ్. మూడేళ్ల ముందే ఈ కథ చెప్పి, నా కోసం వెయిట్ చేశాడు. ప్రతి సినిమాకు నాన్నగారు చూపించే శ్రద్ధ చాలా గొప్పది. మీ ఇన్‌ఫుట్స్ లేకుంటే ఈ సినిమా ఇలా ఉండేది కాదు నాన్న. అన్నయ్య ఎన్టీఆర్‌ని నేను టైగర్ అని పిలుస్తాను. ఈ ఫంక్షన్ వస్తున్నందుకు థ్యాంక్స్ అంటే.. అది నా బాధ్యత అని చెప్పారు. థ్యాంక్యూ సో మచ్ అన్నయ్య’’ అన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ – ‘‘నేను ఫస్ట్ థియేటర్లో చూసిన సినిమా ‘శివ’. ప్రేమ్ నగర్ సినిమాలో ‘ఎక్స్క్యూజ్ మీ మిస్’ డైలాగ్‌ని తీసుకొని ఇందులో పెట్టాను. ఈ సినిమా టీమ్ ఎఫర్ట్. చాలా కష్టపడ్డాం. ప్రేక్షకులు ఆశ్వీర్వదించాలి’’ అన్నారు. ఈ వేడుకలో నిధీ అగర్వాల్, తమన్, శ్రీమణి, తదితరులు పాల్గొన్నారు. -
‘నాకు అలా లవ్ చేయడం చేతకాదు’
చేసిన రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా.. ముచ్చటగా మూడోసారి తన లక్‌ను పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడు అక్కినేని వారసుడు అఖిల్. తొలిప్రేమతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరితో కలిసి ‘మిస్టర్ మజ్ను’గా పలకరించేందుకు అఖిల్ సిద్దమయ్యాడు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, సాంగ్స్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతిథిగా విచ్చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. తొలిప్రేమను డిఫరెంట్‌గా తెరకెక్కించిన దర్శకుడు ఈ చిత్రాన్ని కూడా కొత్త తరహాలో రూపొందించినట్టు కనిపిస్తోంది. కథ పరంగా కొత్తదనం కనబడకపోయినా.. కథనంలో మాత్రం డైరెక్టర్ మార్క్ కనపడుతోంది. ట్రైలర్లో అఖిల్ చెప్పిన డైలాగ్‌లు బాగున్నాయి. ‘ నా కోసం ఎవరైనా ఏడిస్తే అది నా తప్పు కాదు. కానీ.. నావల్ల ఒక్కరు ఏడ్చినా అది కచ్చితంగా నా తప్పు అవుతుంది’ , ‘ఇప్పుడు లవ్ అంటే.. ముందు కొంచెం లవ్‌చేసుకుని, ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువగా లవ్‌చేసుకుని.. లాస్ట్‌లో పెళ్లి చేసుకుంటారు ఆ టైప్ లవ్వా.. నాకు అలా లవ్ చేయడం చేతకాదు’ అనే డైలాగ్‌లు హైలెట్ అయ్యాయి. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఐ లవ్ నిక్కీ!
నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు హీరోయిన్ నిధీ అగర్వాల్. తెలుగు ఆడియన్స్ గురించి తన అభిప్రాయాన్ని, కొత్త ఏడాది తీసుకున్న నిర్ణయాలు.. ఇంకా కొన్ని విషయాలను నెటిజన్లతో షేర్ చేసుకున్నారామె. ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు నిధీ అగర్వాల్. ఈ నెల 25న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ బ్యూటీ చెప్పిన విషయాలు తెలుసుకుందాం. ► తెలుగు ప్రేక్షకుల గురించి మీ అభిప్రాయం? అద్భుతమైన, నమ్మకమైనవారు. ► కొత్త ఏడాది తీసుకున్న నిర్ణయం? భయం లేకుండా ఉండటం. ► ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి? మై మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్. ఐ లవ్ యు నిక్కీ (సినిమాలో నిధి పాత్ర పేరు నిక్కీ). ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఎగై్జటెడ్‌గా ఎదురు చూస్తున్నా. ప్రేక్షకులు సపోర్ట్ చేయాలి. ► మీకు బిర్యానీ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం. ► మీ ఫేవరెట్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్? ప్రస్తుతం ‘వైల్డ్ వైల్డ్ కంట్రీ’ చూస్తున్నాను. ► మీ రోల్ మోడల్ ఎవరు? ఈ రోజు ఆమె పుట్టినరోజు (శనివారం బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ పుట్టినరోజని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు) ► ‘అర్జున్‌రెడ్డి’ సినిమా చూశారా? ఇప్పటివరకు నాలుగుసార్లు చూశాను. ► అఖిల్ లేదా నాగచైతన్య.. ఎవరిష్టం? ఈ ప్రశ్న చాలామంది అడుగుతున్నారు (నవ్వుతూ) ► ‘మిస్టర్ మజ్ను’ డైరెక్టర్ వెంకీ అట్లూరి గురించి? మై ఫేవరెట్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్. ► సౌత్ ఇండియన్ స్టార్స్‌లో ఎవరిపై అయినా మీకు క్రష్ ఉందా? అవును. ఉంది కానీ ఎవరో చెప్పను. ► ఫైనల్లీ మీ గోల్ ఏంటి? నా పూర్తి బలాన్ని ఉపయోగించి నేను ఆశించిన శిఖరాలకు చేరుకోవాలి. భవిష్యత్ బాగా ఉండటానికి కావాల్సిన కృషి చేసేంత ఎనర్జీ నాలో దాగి ఉందని నా నమ్మకం. -
సిక్స్ ప్యాక్ మజ్ను
కళ్లెదుట లవర్ ఉన్నప్పుడు బోలె డన్ని తీపి కబుర్లు చెప్పుకుంటాం. లేనప్పుడు మాటలు మరచిపోయినంత పనవుతుంది. మజ్నూకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అందుకే ‘ఏమైనదో.. ఏమైనదో.. పలుకు మరచినట్టు పెదవికేమైనదో..’ అని పాట అందుకున్నాడు. మాటలే రాకపోతే పాట పాడటం ఏంటీ అనుకుంటారేమో. తన భావాన్ని పాట రూపంలో చెప్పాడు మజ్ను. ఇటీవల విడుదలైన ఈ పాటను విన్నాం. ఇప్పుడు మజ్ను మరో పాట వినిపించడానికి రెడీ అయ్యాడు. అఖిల్ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’. తమన్ స్వరకర్త. ఇటీవల విడుదల చేసిన ‘ఏమైనదో.. ఏమైనదో..’ పాటకు మంచి స్పందన లభిస్తోందని, తమణ్ బాణి, శ్రీమణి సాహిత్యం బాగా కుదిరాయని చిత్రబృందం పేర్కొంది. క్రిస్మస్ సందర్భంగా టైటిల్ సాంగ్‌ను ఈ రోజు సాయంత్రం విడుదల చేయనున్నారు. అన్నట్లు.. ఇక్కడున్న ఫొటో చూస్తుంటే... ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తారని అర్థమైంది కదూ. అఖిల్ సరసన ని«ధీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాశ్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్. -
‘ఏమైనదో..’ మిస్టర్ మజ్ను తొలి పాట
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మిస్టర్ మజ్ను. తొలి రెండు సినిమాలు నిరాశపరచటంతో అఖిల్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సవ్యసాచి ఫేం నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా తొలి పాటను విడుదల చేశారు. ఏమైనదో అంటూ సాగే ప్రణయ గీతం సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. తమన్ సంగీత సారధ్యంలో అర్మాన్ మాలిక్ ఆలపించిన ఈ గీతానికి శ్రీమణి సాహిత్యమందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. -
స్క్రీన్ టెస్ట్
పదే పదే వినాలనిపించే పాట ఏ సినిమాకైనా ప్లస్ అవుతుంది. ఆడియో రిలీజయ్యాక ఆ పాట విని, సినిమా చూడటం కోసం థియేటర్‌కి వెళ్లే ప్రేక్షకులు ఉంటారు. ఇలాంటి పసందైన పాటలు సంగీత దర్శకులు, పాట రాసినవారు, పాడిన వారు, నటించిన వారు, ఎంతోమంది సాంకేతిక నిపుణుల కృషి ఫలితమే. 2018లో బాగా విసిపించిన ఇలాంటి క్రేజీ సాంగ్స్ గురించి ఈ వారం క్విజ్. పాడుకుంటూ చదవండి. 1 ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...’ పాటలో హీరో విజయ్ దేవరకొండతో నటించిన హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) రష్మికా మండన్నా బి) అనూ ఇమ్మాన్యుయేల్ సి) లావణ్యా త్రిపాఠి డి) నివేథా థామస్ 2 రామ్‌చరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ చిత్రంలోని హై వోల్టేజి సాంగ్ ‘జిల్ జిల్ జిల్ జిల్...జిగేలు రాణి...’లో నటించిన ప్రముఖ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) కియరా అద్వానీ బి) తమన్నా భాటియా సి) పూజా హెగ్డే డి) శ్రుతీహాసన్ 3 ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలోని మెలోడియస్ సాంగ్ ‘పెనివిటి...’ పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) సిరివెన్నెల బి) శ్రీమణి సి) అనంత శ్రీరామ్ డి) రామజోగయ్య శాస్త్రి 4 ‘భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను..’ పాట ‘భరత్ అనే నేను’ చిత్రం లోనిది. ఆ చిత్ర సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) గోపి సుందర్ సి) యం.యం. కీరవాణి డి) తమన్ 5 ‘దారి చూడు దుమ్ము చూడు మామా, దున్నపోతుల మేరే చూడు...’ పాట నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలోనిది. ఆ పాట రచయిత, గాయకుడు ఎవరో తెలుసా? ఎ) పెంచల్ దాస్ బి) రేలా కుమార్ సి) శివనాగులు డి) వరంగల్ శ్రీను 6 ‘వారు వీరు అంతా చూస్తూ ఉన్న...’ పాట నాగార్జున, నాని నటించిన ‘దేవదాస్’ చిత్రంలోనిది. ఆ పాటలోని మేల్ వాయిస్‌ను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మరి లేడీ వాయిస్ ఎవరిదో తెలుసా? ఎ) గీతా మా«ధురి బి) సునీత సి) అంజనా సౌమ్య డి) రమ్య బెహరా 7 ఆర్. నారాయణమూర్తి నటించి, దర్శక నిర్మాతగా చేసిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. ఈ చిత్రంలోని ‘నేలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేన వేల వందనాలమ్మ ...’ పాట గాయకుడు ఎవరు? ఎ) వందేమాతరం శ్రీనివాస్ బి) గద్దర్ సి) వంగపండు డి) గోరేటి వెంకన్న 8 1993లో నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’ చిత్రంలోని ‘నిన్ను రోడ్డు మీద చూసినది...లగ్గాయత్తు..’ సాంగ్ సూపర్ హిట్. ఆ పాటను ‘సవ్యసాచి’ చిత్రం కోసం సంగీత దర్శకుడు యం. యం. కీరవాణి రీమిక్స్ చేశారు. హీరో నాగచైతన్య సరసన ఈ పాటలో నటించిన నూతన నటి ఎవరో తెలుసా? ఎ) పాయల్ రాజ్‌పుత్ బి) నిధీ అగర్వాల్ సి) నభా నటేశ్ డి) ప్రియాంక జవాల్కర్ 9 సుధీర్ బాబు, అదితీరావు హైదరీ జంటగా నటించిన చిత్రం ‘సమ్మోహనం’. ఈ చిత్రంలోని ‘ఓ చెలి తార... నా మనసారా...’ పాట సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) వివేక్ సాగర్ బి) చైతన్య భరద్వాజ్ సి) సాగర్ మహతి డి) ప్రశాంత్ విహారి 10 ‘పిచ్చి పిచ్చిగా నచ్చావురా.. మనోహరా...’ అంటూ ‘నర్తనశాల’ చిత్రంలోని విరహగీతాన్ని ఆలపించిన సింగర్ ఎవరో తెలుసా? ఎ) లిప్సికా బి) మోహన భోగరాజు సి) సమీరా భరద్వాజ్ డి) దామిని బాట్ల 11 ‘తొలిప్రేమ’ చిత్రంలోని ‘అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా, కాళిదాస ప్రేమ కావ్యమా, త్యాగరాజు సంగీతమా... గీతమా’ పాట పాడిన ప్రముఖ గాయని ఎవరో తెలుసా? ఎ) శ్రేయా ఘోషల్ బి) మానసి సి) కల్పన డి) కౌసల్య 12 ‘బయటికొచ్చి చూస్తే టైమేమో... త్రీ ఓ క్లాక్.. ఇంటికెళ్లే 12బి రూటు మొత్తం రోడ్డు బ్లాక్..’ పాట సంగీత దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) సంతోశ్ నారాయణ్ బి) యువన్ శంకర్‌రాజా సి) హిప్ హాప్ తమిళ డి) అనిరు«ద్ రవిచంద్రన్ 13 ‘రంగస్థలం’ చిత్రంలోని పాటలన్నీ సూపర్‌హిట్. ఆ సినిమాకి సింగిల్ కార్డు రైటర్‌గా సాహిత్యాన్ని అందించిన రచయితెవరు? ఎ) రామజోగయ్య శాస్త్రి బి) చంద్రబోస్ సి) భువనచంద్ర డి) అనంత శ్రీరామ్ 14 ‘అయామే లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో...’ అంటూ 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో ఎవరో తెలుసా? ఎ) రామ్ చరణ్ బి) అల్లు అర్జున్ సి) మహేశ్ బాబు డి) విజయ్ దేవరకొండ 15 పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మెహబూబా’. ఆ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘ఓ ప్రియా... నా ప్రియా.. మెహబూబా...’ రచయితెవరో తెలుసా? ఎ) సుద్ధాల అశోక్‌తేజ బి) పూరి జగన్నాథ్ సి) భాస్కరభట్ల రవికుమార్ డి) కందికొండ 16 ‘చూసి చూడంగానే నచ్చేశావే, అడిగి అడగంగానే వచ్చేశావే...’ పాట ‘ఛలో’ చిత్రంలోనిది. ఆ చిత్రంతోనే దర్శకునిగా అరంగేట్రం చేసిన దర్శకుడెవరో తెలుసా? ఎ) అజయ్ భూపతి బి) వెంకీ కుడుముల సి) వెంకీ అట్లూరి డి) వెంకటేశ్ మహా 17 ‘మహానటి’ చిత్రంలోని ‘చివరకు మిగిలేది...’ అనే పాటను ‘సిరివెన్నెల’ రచించారు. ఆ పాటను ఆలపించిన గాయని ఎవరో కనుక్కోండి? ఎ) చిన్మయ్ శ్రీపాద బి) సునీత ఉపద్రష్ట సి) చిత్ర డి) యస్పీ శైలజ 18 2018లో సూపర్‌హిట్ అయిన ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి..’, ‘మాటే వినదుగ, వినదుగ..’, ‘ఉండి పోరాదే గుండెల్లోన’, ‘యంతరలోకపు సుందరివో..’ పాటలను పాడిందెవరు? ఎ) సిథ్ శ్రీరామ్ బి) రేవంత్ సి) కార్తీక్ డి) కైలాశ్ ఖేర్ 19 2018లో విడుదలైన చిత్రాల్లో ఒక్క పాట కూడా లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమేంటో కనుక్కోండి? (థీమ్ సాంగ్ మాత్రం ఉంది). ఎ) గూఢచారి బి) కేరాఫ్ కంచరపాలెం సి) అ! డి) ఈ నగరానికి ఏమైంది 20 ఈ ఏడాది చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయమవుతున్న బాలీవుడ్ సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) శంకర్ ఎహసాన్ లాయ్ బి) అమిత్ త్రివేది సి) హిమేశ్ సేషమ్మియా డి) విశాల్ భరద్వాజ్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ2) సి 3) డి 4) ఎ 5) ఎ 6) సి 7) ఎ 8) బి 9) ఎ 10) ఎ 11) ఎ 12) డి 13) బి 14) బి 15) సి 16) బి 17) బి 18) ఎ 19) సి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
ఏక్ దో తీన్...
ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే సెకండ్ సినిమా చాన్స్ కొట్టేస్తే లక్కీ అంటాం. సెకండ్ సినిమా కూడా పూర్తి కాకముందే మూడో, నాలుగో సినిమాలకూ ఆఫర్స్ దక్కించుకుంటే? సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అంటాం. ప్రస్తుతం అదే ఎక్స్‌ప్రెస్ స్టీరింగ్ దగ్గర కూర్చొని ఎక్సలేటర్ని అమాంతం తొక్కేస్తున్నారు నిధీ అగర్వాల్. ‘సవ్యసాచి’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నిధీ ఆ సినిమా రిలీజ్ కాకముందే అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ లో హీరోయిన్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉన్న నిధి నెక్ట్స్ నాగశౌర్య సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యారని సమాచారం. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్గా నిధీని ఎంపిక చేసింది చిత్రబృందం. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ చిత్రం జనవరిలో మొదలు కానుంది. అలాగే సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందే సినిమాలోనూ నిధీ అగర్వాల్ పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం. -
ఫినిషింగ్ టచ్
ప్రేమ కోసం లండన్ చుట్టాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోనూ ప్రేమ ప్రయాణం చేశాడు. ప్రసుతం ఈ ప్రయాణం ముగింపు దశకు వచ్చేసింది. డిసెంబర్ మొదటివారంలోపు ‘మిస్టర్ మజ్ను’ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయబోతున్నాం అన్నారు అఖిల్. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’. నిధీ అగర్వాల్ కథానాయిక. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘సినిమాకు సంబంధించిన ప్యాచ్‌వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. డిసెంబర్ 3వ తేదీకి టాకీ పార్ట్ పూర్తి చేస్తాం. కేవలం ఒక్క సెట్ సాంగ్ మినహా షూటింగ్ కంప్లీట్ అయింది. జనవరిలో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం. సినిమా అప్డేట్స్ కోసం ఓపికగా ఎదురుచూస్తున్నందుకు అభిమానులకు థ్యాంక్స్. ఇక ప్రమోషన్స్ టైమ్ స్టార్ట్ అయింది’’ అని పేర్కొన్నారు అఖిల్. ఈ సినిమాని జనవరి 25న రిలీజ్ చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా : జార్జి సి. విలియమ్స్. -
‘మిస్టర్ మజ్ను’ అప్డేట్ ఇచ్చాడు..!
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మిస్టర్ మజ్ను. తొలి రెండు సినిమాలు నిరాశపరచటంతో అఖిల్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సవ్యసాచి ఫేం నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ ను అఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ప్రస్తుతం మిస్టర్ మజ్ను సినిమా ప్యాచ్‌వర్క్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్ 3తో ఒక్క పాట మినహా షూటింగ్ అంతా పూర్తవుతుంది. జనవరిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాం. ఇన్నాళ్లు ఓపిగ్గా ఎదురుచూసినందుకు థ్యాంక్స్’ అంటూ ట్వీట్ చేశాడు అఖిల్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. Good morning !!! An update on #MrMajnu ! Patch work going on full swing and we wrap the film by dec 3rd. Then it’s just one set song for us and then gearing up for our release in Janurary. Thank you all for being patient 🙏🏻 the time has come to start rolling content out soon. 🤗 — Akhil Akkineni (@AkhilAkkineni8) 28 November 2018 -
డేట్ ఫిక్స్
అమ్మాయిల చుట్టూ తిరిగే కుర్రాడు రోమియో అవుతాడు. వాళ్లకు నచ్చితే ప్రేమియో అవుతాడు. మరి మజ్ను అయ్యాడంటే కచ్చితంగా ఏదో ఓ కారణం ఉండే ఉంటుంది. అది తెలుసుకోవాలంటే బిగ్ స్క్రీన్‌పైనే చూడాలి. అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’. నిధీ అగర్వాల్ కథానాయిక. బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ షూటింగ్ దాదాపు పూర్తయిందని సమాచారం. ఈ సినిమాను రిపబ్లిక్ డే వారంలో జనవరి 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఇందులో అఖిల్ ప్లే బాయ్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జార్జి సి. విలియమ్స్. -
కొంచెం ఫారిన్... కొంచెం లోకల్!
లవర్‌బాయ్ ఇంట్రడక్షన్ అంటే ఎలా ఉండాలి? అదిరిపోయే లొకేషన్స్‌లో బ్యూటిఫుల్ మోడల్స్ మధ్య ఐ ఫీస్ట్‌లా ఉండాలి. సేమ్ ఇలానే ప్లాన్ చేశారు అఖిల్ అండ్ టీమ్. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఇందులో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్‌ను బట్టి అఖిల్ ప్లేబాయ్ క్యారెక్టర్లో నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్‌లోనే షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్ చూపించనున్నారు అఖిల్. ఆ మధ్య జరిగిన యూకే షెడ్యూల్లో అఖిల్‌తో పాటు 30 నుంచి 40 మంది మోడల్స్ పాల్గొనగా ఈ పాట మేజర్ షూటింగ్ జరిగింది. ఇదే సాంగ్‌లోని కొంత భాగాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన భారీ సెట్లో షూట్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఈ సినిమాలో ఈ సాంగ్ హైలైట్‌గా ఉంటుందని యూనిట్ సన్నిహితవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారట టీమ్. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ మరో వారం రోజుల్లో హైదరాబాద్‌లో స్టార్ట్ కానుందని సమాచారం. ఈ చిత్రానికి తమన్ స్వరకర్త. ఆల్రెడీ అన్ని పాటల కంపోజిషన్‌ను పూర్తి చేశారు. జనవరిలో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
సిక్స్ ప్యాక్ మజ్ను
రెండు రోజులుగా ‘మిస్టర్ మజ్ను’ నైట్ అంతా ఫైట్ చేస్తూనే ఉన్నారట. మరి ఆ గొడవ గాళ్ ఫ్రెండ్ కోసమా? లేక మరేదైనా విషయమా? తెలియాలంటే ‘మిస్టర్ మజ్ను’ సినిమా చూడాల్సిందే. అఖిల్ హీరోగా ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు చిత్రబృందం. 5 రోజుల పాటు ఈ ఫైట్ సీక్వెన్స్ తీస్తారని సమాచారం. ఆల్రెడీ ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఇటీవల తెరకెక్కించిన ఓ సాంగ్‌లో అఖిల్ తన సిక్స్ ప్యాక్ చూపించారట. ఈ పాట అభిమానులను ఖుష్ చేస్తుందనడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జార్జ్ సి. విలియమ్స్. -
కొత్త కొత్తగా..!
జనవరిలో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు ‘మిస్టర్ మజ్ను’. అఖిల్ హీరోగా ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మిస్టర్ మజ్ను’. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో అఖిల్ ప్లే బాయ్ క్యారెక్టర్లో కనిపిస్తారని తెలుస్తోంది. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దీపావళి సందర్భంగా అఖిల్ కొత్త లుక్‌ను విడుదల చేశారు. అలాగే ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అంటే కొత్త ఏడాదిలో అఖిల్ కొత్త కొత్తగా వస్తారన్నమాట. ఇంతకుముందే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్లను రిలీజ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా టాకీ పార్ట్ ఆల్మోస్ట్ పూర్తయిందట. ఫైట్స్, సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని సమాచారం. నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. -
ముచ్చటగా మూడోది?
ఒక సినిమా పూర్తవ్వకముందే మరో సినిమాలో యాక్ట్ చేసే చాన్స్ కొట్టేస్తే లక్కీ అంటారు. ముచ్చటగా మూడో సినిమా అవకాశం కూడా కొట్టేస్తే? నిధి అగర్వాల్ అంటారు. నాగచైతన్య తాజా చిత్రం ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు నిధి అగర్వాల్. ‘సవ్యసాచి’ సెట్స్‌లో ఉండగానే అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యారు. ఇప్పుడు మూడో సినిమాకు సంతకం చేసి నట్టు సమాచారం. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ హీరోగా పరిచయం కానున్న చిత్రానికి కథానాయికగా ని«ధి అగర్వాల్ పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ నిర్మించనున్న ఈ చిత్రానికి సుకుమార్ అసిస్టెంట్ దర్శకుడు బుచ్చిబాబు సన డైరెక్టర్. -
‘సవ్యసాచి’ మూవీ రివ్యూ
టైటిల్ : సవ్యసాచి జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : నాగ చైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమిక, వెన్నెల కిశోర్ సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి దర్శకత్వం : చందూ మొండేటి నిర్మాత : నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సీ.వీ.మోహన్ అక్కినేని వారసుడిగా వెండితెర అరంగేట్రం చేసిన నాగచైతన్య కెరీర్ స్టార్టింగ్ నుంచి యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. లవర్ బాయ్‌గా సూపర్ హిట్లు సాధించిన ఈ స్టార్ వారసుడు యాక్షన్ హీరోగా మాత్రం ప్రతీ సారి ఫెయిల్ అయ్యాడు. అయినా మరోసారి అదే జానర్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు చైతూ. తనకు ప్రేమమ్ లాంటి బిగ్ హిట్ అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేశాడు. మరి ఈ సినిమా అయినా చైతూకు యాక్షన్ హీరోగా సక్సెస్ ఇస్తుందా..? కథ ; కులు వ్యాలీలో ఓ బస్సు ప్రయాణంతో సినిమా ప్రారంభమవుతుంది. ఏ మాత్రం పరిచయం లేని 21 మంది ఆ బస్సులో ప్రయాణిస్తుంటారు. కానీ ఆ బస్సులో ఉన్న అందరికి కామన్ పాయింట్ వారందరికీ అరుణ్ అనే వ్యక్తి తెలుసు. అనుకోకుండా ఆ బస్సు ప్రమాదానికి గురవుతుంది. ప్రమాదంలో ఒక్క విక్రమ్ ఆదిత్య( నాగచైతన్య) తప్ప బస్సులో ఉన్న అందరూ చనిపోతారు. విక్రమ్ ఆదిత్య.. వానిషింగ్ ట్విన్ సిండ్రమ్‌తో ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనకు ఆనందం వచ్చినా కోపం వచ్చినా తన ఎడమ చేయి తన కంట్రోల్ లో ఉండదు. యాడ్ ఫిలిం మేకర్ అయిన విక్రమ్‌కు అక్క (భూమిక) కూతురు మహాలక్ష్మి అంటే ప్రాణం. తన అమ్మే మళ్లీ మహాలక్ష్మీగా పుట్టిందని నమ్ముతుంటాడు విక్రమ్. ఓ యాడ్ ఫిలిం పని మీద విక్రమ్ న్యూయార్క్ వెళ్లి వచ్చే సరికి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి బావ, మహాలక్ష్మి చనిపోతారు. అక్క హాస్పిటల్లో ఉంటుంది. అన్ని సవ్యంగా ఉన్న సమయంలో విక్రమ్ ఆదిత్య జీవితంలో తుఫాన్ మొదలవుతుంది. ప్రమాదంలో అక్క కూతురు మహాలక్ష్మి చనిపోలేదని, తన దగ్గరే ఉందని ఓ అజ్ఞాత వ్యక్తి(మాదవన్) విక్రమ్‌కి ఫోన్ చేసి చెప్తాడు. అసలు పాపను అతను ఎందుకు కిడ్నాప్ చేశాడు..? విక్రమ్‌కి అజ్ఞాత వ్యక్తికి మధ్య వైరం ఏంటి..? బస్సు ప్రమాదానికి ఈ కథకు సంబంధం ఏంటి..? ఈ సమస్యల నుంచి విక్రమ్ ఆదిత్య ఎలా బయటపడ్డాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; సినిమా ప్రధానంగా నాగచైతన్య, మాధవన్‌ల చుట్టూనే తిరుగుతుంది. ఇద్దరు తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. ప్రతీ సినిమాకు నటుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్న చైతూ ఈ సినిమాలోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎడమ చేయి తన మాట వినని పరిస్థితుల్లో ఒక వ్యక్తి పడే ఇబ్బందులను చాలా బాగా చూపించాడు. కామెడీ, రొమాన్స్, ఎమోషనల్ సీన్స్‌తో పాటు యాక్షన్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు చైతూ. తొలిసారిగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసిన మాధవన్ కు ఇది మంచి లాంచ్ అనే చెప్పాలి. తాను ఎలాంటి పాత్రనైనా పండించగలనని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు మాధవన్. సైకో విలన్‌గా మాధవన్ నటన, పలికించిన హావ భావాలు సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే మాధవన్ పాత్రను ఇంకాస్త ఎలివేట్ చేస్తే బాగుండన్న భావన కలుగుతుంది. హీరోయిన్గా పరిచయం అయిన నిధి అగర్వాల్ కేవలం లవ్ స్టోరి, పాటలకే పరిమితమైంది. భూమిక తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకుంది. వెన్నెల కిశోర్, సుదర్శన్, సత్య తమ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే డిఫరెంట్ పాయింట్‌ను ఎంచుకున్న దర్శకుడు చందూ మొండేటి యాక్షన్ ఎమోషనల్ అంశాలతో మంచి కథను రెడీ చేసుకున్నాడు. అయితే ఆ కథను తెర మీద ఆవిష్కరించటంలో కాస్త తడబడినట్టుగా కనిపిస్తుంది. సినిమాను ఇంట్రస్టింగ్ పాయింట్‌తో మొదలు పెట్టినా.. తరువాత ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలతో నడిపించాడు. హీరోకు ఉన్న ఎడమ చేతి ప్రాబ్లమ్‌కు సంబంధించిన సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో లేవు. ప్రీ ఇంట్రర్వెల్ వరకు అసలు కథ మొదలు కాకపోవటం నిరాశకలిగిస్తుంది. ఇంటర్వెల్ తరువాత కథ వేగం అందుకుంటుదనుకున్న సమయంలో మరోసారి కాలేజ్ ఫ్లాష్ బ్యాక్ బ్రేక్ వేస్తుంది. ఈ సీన్లో సుభద్రా పరిణయం నాటకం, నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయత్తు పాటు ఆకట్టుకున్నా కథనం ఎమోషనల్‌గా సాగుతున్న సమయంలో ఈ సీన్స్ ఇబ్బంది పెడతాయి. మాధవన్ లాంటి నటుడు ఉన్న పూర్తిగా ఉపయోగించుకోలేదనే భావన కలిగిస్తుంది. విలన్ క్యారెక్టర్‌ను మరింతగా ఎలివేట్ చేస్తే బాగుండేది. హీరో, విలన్ల మధ్య జరిగే మైండ్ గేమ్ ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా స్పీడందుకుంటుంది. నాగచైతన్య యాక్షన్ సీన్స్, మాధవన్ పర్ఫామెన్స్ సూపర్బ్. కీరవాణి సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. పాటల పరవాలేదనిపించినా.. నేపథ్య సంగీతం యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌కు మరింత హైప్ తీసుకువచ్చింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; నాగచైతన్య, మాధవన్ నటన యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ ; లవ్ ట్రాక్ రొటీన్ టేకింగ్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
పెళ్లయ్యాక మారిపోయా
‘‘పెళ్లి తర్వాత లైఫ్‌లో ఒక బ్యాలెన్స్ వచ్చింది. జీవితంలో ఎదురయ్యే ఎత్తు పల్లాలను తట్టుకోగలననే నమ్మకం ఏర్పడింది. హ్యూమన్ బీయింగ్‌గా ఇంకా బెటర్ అయ్యాననిపిస్తోంది’’ అన్నారు నాగచైతన్య. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించిన ‘సవ్యసాచి’ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు... ‘ప్రేమమ్’ రిలీజ్ తర్వాత కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ‘సవ్యసాచి’ కథ చెప్పాడు చందు. కథ నచ్చింది. ‘ట్విన్ వ్యానిషింగ్ సిండ్రోమ్’ అనే కొత్త పాయింట్‌తో సినిమా కదా అని స్టార్టింగ్‌లో కాస్త భయపడ్డాను. రెండు మూడు షెడ్యూల్స్ తర్వాత ఆ భయం పోయింది. ‘ప్రేమమ్’ సినిమాను రీమేక్ చేద్దామనుకున్నప్పుడు కూడా ఆలోచించుకోమని కొందరు సలహాలు ఇచ్చారు. కానీ వర్కౌట్ చేశాం. నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాంతో చందూపై ఉన్న నమ్మకం పెరిగింది. యాక్టర్‌గా నాలో ఆత్మవిశ్వాసం పెరగడానికి ఆయన ఒక కారణం. చందూ కొత్తగా ఆలోచిస్తాడు. అన్నీ కుదిరితే చందుతో మరో సినిమా చేస్తాను. ►మాధవన్‌గారు సూపర్‌గా చేశారు. ‘సఖి’ సినిమాతో ఆయన ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ‘విక్రమ్ వేదా, రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాలోనూ అదే చేస్తున్నారు. యాక్టర్‌గా ఆయన దగ్గర్నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. భూమికగారు బాగా చేశారు. కీరవాణిగారి సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా మూమెంట్స్‌ను కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్‌కు థ్యాంక్స్. నిధి అగర్వాల్ ఆల్‌రౌండర్. మంచి డ్యాన్సర్. ‘హాలోబ్రదర్’ సినిమాలోని నాన్నగారి(నాగార్జున) క్యారెక్టర్స్‌తో ఈ సినిమాకు సంబంధం లేదు. అక్కడ ట్విన్స్ ఉంటారు. ఇక్కడ ఒకే శరీరంలో ట్విన్స్ ఉంటారు. గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యం అయ్యింది. ►ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణగారికి ఫ్యాన్‌ని నేను. మా సినిమాకు బాగా వర్క్ చేశారు. నా సినిమానే కాదు ‘అంతరిక్షం’ సినిమా సెట్స్‌ను కూడా చూశాను. ఒక తెలుగు టెక్నీషియన్ ఆ రేంజ్లో చేస్తున్నారంటే అది మంచి పరిణామం. ►నిర్మాణ విలువల పరంగా ఇప్పటివరకు నా కెరీర్లో మైత్రీ మూవీ మేకర్స్‌కు ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. ఎందుకంటే వాళ్లు కంటెంట్‌ని నమ్మి సినిమా తీశారు. నిజాయతీగా చెప్పాలంటే నాకు ప్రస్తుతం ఉన్న మార్కెట్‌కు అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ పెట్టారు. మార్కెట్ ఏంటీ? ఎంత లాభం అనే విషయాలను ఆలోచించకుండా కథపై నమ్మకంతో ఖర్చు పెట్టారు. ►అసరమైతే రీషూట్ చేయాలన్న నాన్నగారి ఫార్ములాను నేను నమ్ముతాను. కచ్చితంగా రీషూట్స్ చేయాలనే ఫార్ములా లేదు. డౌట్స్ ఉన్నప్పుడు చేయడంలో తప్పులేదు. సినిమా రిలీజైన తర్వాత ఆ సీన్ రీపేర్ చేసి ఉన్నట్లయితే బాగుండేది. ఇప్పుడు ఆడియన్స్ చెబుతున్న ఆ మార్పు అప్పుడే మనకు అనిపించింది కదా. అప్పుడే చేసి ఉంటే బాగుండు అని అంతా అయిపోయాక ఆలోచించడంకన్నా సెట్స్‌లో ఉన్నప్పుడే రీషూట్స్ చేయడం మంచిదే అని నా అభిప్రాయం. ప్రపంచంలో ఉన్న టాప్ యాక్టర్స్, హీరోలు రీషూట్స్ చేస్తారు. రీషూట్స్ అంటే అది బెటర్మెంట్ అని నా అభిప్రాయం. ►‘శైలజారెడ్డి అల్లుడు’ రిజల్ట్ విషయంలో ఓపెనింగ్ కలెక్షన్స్ పరంగా హ్యాపీగానే ఉన్నాను. ప్రతి సినిమా స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ అవుతాను. కానీ ఒక లైన్ దాటి వెళ్లకూడదు. అది దర్శకుడికి మనం ఇచ్చే గౌరవంగా నేను ఫీలవుతాను. మారుతిగారు కథ చెప్పినప్పుడు కన్విన్స్ అయ్యాను. కానీ రిజల్ట్స్‌ను ఊహించలేం కదా. ఇక ఒకే రోజు రిలీజైన ‘శైలజారెడ్డి అల్లుడు, యు–టర్న్’ సినిమాల పోటీ అనేది ఓ డిఫరెంట్ సిట్యువేషన్. రివ్యూస్ పరంగా ‘యు–టర్న్’ గెలిచింది (నవ్వుతూ). ►శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నేను, సమంత దంపతులుగానే నటిస్తున్నాం. స్క్రిప్ట్ పరంగా కథలో నాకు, సమంతకు గొడవలు ఎక్కువ. నటించడానికి అది కొంచెం కష్టంగా ఉంది. రియల్ౖ లెఫ్‌లో లేవు కదా (నవ్వుతూ). శివ మంచి డైరెక్టర్. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా షూటింగ్ పూర్తవుతుందని అనుకుంటున్నాం. ‘మజిలీ’ అనేది వర్కింగ్ టైటిల్‌గా పెట్టుకున్నాం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది. ‘వెంకీమామ’ సినిమాను డిసెంబర్లో స్టార్ట్ చేస్తా. పౌరాణికం సినిమాలను టచ్ చేయాలని ఉంది. కానీ ముందు ఓ మూడు నాలుగు హిట్స్ సాధించాలి. ప్రస్తుతానికి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఇంకా సైన్ చేయలేదు. ►నా కెరీర్ స్టార్టింగ్‌లో నాన్నగారు కథలు విన్నారు కానీ ఇప్పుడు నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నాన్నగారు ‘సవ్యసాచి’ సినిమా చూశారు. కొన్ని సలహాలు చెప్పారు. నాన్నగారు చూస్తున్నప్పుడే ఎడిట్ రూమ్‌లో సమంత చూసింది. ►నాన్నగారి ‘నిన్ను రోడ్డు మీద చూసినది..’ సాంగ్ రీమిక్స్ చేస్తున్నప్పుడు మొదట్లో కాస్త కంగారు పడ్డాను. కానీ అవుట్‌పుట్ చూసి హ్యాపీ ఫీలయ్యా. కీరవాణిగారు మంచి సంగీతం ఇచ్చారు. సెకండాఫ్‌కు ఈ సాంగ్ ప్లస్ అవుతుందన్న నమ్మకం ఉంది. -
‘బలరాముడంటే రాముడికి చుట్టమా’
అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకుడు. ఇన్నాళ్లు యాక్షన్ సినిమాగానే ప్రమోట్ చేసిన చిత్రయూనిట్ తాజాగా ఓ కామెడీ టీజర్‌ను రిలీజ్ చేశారు. సుబధ్ర పరిణయం నాటాకానికి సంబంధించిన ఈ టీజర్ కడుపుబ్బా నవ్విస్తోంది. నాగ చైతన్య అర్జునుడిగా కనిపించగా వెన్నెల కిశోర్ కృష్ణుడిగా అలరించాడు. హైపర్ ఆది, సుదర్శన్, విధ్యుల్లేఖ రామన్, వైవ హర్ష ఇతర పౌరాణిక పాత్రల్లో తమవంతు కామెడీ పండించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో చైతూకు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుండగా కీరవాణి సంగీతమందించారు. -
‘సవ్యసాచి’లో నాగ్ సూపర్ హిట్ సాంగ్
అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. నవంబర్ 2 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ ట్రైలర్లతో సందడి చేస్తున్న సవ్యసాచి టీం తాజాగా సాంగ్ టీజర్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో నాగార్జున సూపర్ హిట్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసినది’ పాటను రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాట వీడియో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఒరిజినల్ పాట లోని ఫ్లేవర్ ఏ మాత్రం మిస్ కాకుండా ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా ట్యూన్ చేశారు కీరవాణి. చైతూ కూడా సూపర్బ్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నాడు. చైతూ లుక్స్, కాస్ట్యూమ్స్ కూడా పాటకు మరింత ప్లస్ అయ్యాయి. నిధి అగర్వాల్ గ్లామర్ లుక్స్ తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశారు. చైతూ హీరోగా ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకుడు. పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. తన ఎడమ చేతిమీ నియంత్రణ లేని పాత్రలో చైతూ నటన ఆకట్టుకుంటుందంటున్నారు చిత్రయూనిట్. -
హలోబ్రదర్తో సంబంధం లేదు
‘‘దర్శకుడిగా నాకు థ్రిల్‌తో కూడుకున్న డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలే నచ్చుతుంటాయి. అవే ప్రేక్షకులకు చెప్పాలని ప్రయత్నిస్తుంటాను’’ అని చందూ మొండేటి అన్నారు. నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చందూ మొండేటి పలు విశేషాలు పంచుకున్నారు. ► ‘ట్విన్ వానిషింగ్ సిండ్రోమ్’కి సంబంధించిన ఓ ఆర్టికల్‌ని మా ఫ్రెండ్ చూపించాడు. చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఈ పాయింట్‌ని నా కథలో మిళితం చేసి చైతన్య, మైత్రీ నిర్మాతలకు చెప్పాను. అందరూ బాగా ఎగై్జట్ అయ్యారు. కొత్తగా ఉంటుందని అనుకున్నాం. అప్పుడే ‘సవ్యసాచి’ అనే టైటిల్ అయితే బావుంటుందనుకున్నాను. ► హీరోకు తెలియకుండానే తన ఎడమ చేయి పని చేస్తుందనే పాయింట్‌ని ట్రైలర్లో చూసి, ‘హలో బ్రదర్’ సినిమాతో పోలుస్తున్నారేమో. కానీ అలాంటిదేమీ లేదు. వీలున్న చోట మాత్రమే ఈ పాయింట్‌ని చూపించాం. కేవలం ఈ ఒక్క పాయింట్ చుట్టూనే కథ తిరగదు. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్స్, ఫైట్స్, మంచి లవ్ స్టోరీ అన్నీ సమపాళ్లలో ఉంటాయి. ► మాధవన్ ప్యాన్ ఇండియా యాక్టర్. ఆయన ఫస్ట్ సినిమా నుంచి చూస్తే అన్నీ విభిన్న సినిమాలే ఉంటాయి. నేను ఓ 45 నిమిషాలు కథ చెప్పగానే బావుంది చేద్దాం అనడంతో నమ్మకం వచ్చింది. ఆ తర్వాత కీరవాణి గారు తోడయ్యారు. ఆయన మార్క్ సంగీతం అందిచారు. ► లెగసీ ఉన్న హీరో మన సినిమాలో ఉన్నప్పుడు వాళ్ల ఫ్యామిలీ వాళ్ల పాటలు పెడితే అభిమానులకు, ప్రేక్షకులకూ సరదాగా ఉంటుంది. ‘నిన్ను రోడ్డు మీద చూసినది...’ రీమిక్స్ సాంగ్ సెకండ్ హాఫ్‌లో వస్తుంది. చైతూ ఫుల్ జోష్‌తో చేశాడు. సాంగ్ టీజర్లో మీరు చూసింది శ్యాంపిలే. ముందుగా ఈ పాటకు తమన్నాని అనుకున్నాం. కానీ మా స్క్రిప్ట్‌కు తగట్టుగా కుదర్లే దని నిధితో చేశాం. నిధీ కూడా మంచి డ్యాన్సర్. ► మేమేదో కొత్త పాయింట్ తీశాం అని చెప్పడం లేదు. ఆల్రెడీ ఉన్న ఓ విషయాన్ని మళ్లీ చూపిస్తున్నాం. ప్రేక్షకులకు కూడా ఓ కొత్త అనుభూతి ఇస్తుందని నమ్మాం. ‘మున్నా మైఖేల్’ చిత్రం చూసి నిధిని సెలెక్ట్ చేసుకున్నాం. బాగా చేసింది. నిర్మాతలు అడిగింది అడిగినట్టు ఇచ్చారు. ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉంచుతారు. భూమికగారి పాత్ర నిడివి తక్కువైనా చాలా బాగుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ వల్ల చిత్రం ఆలస్యం అయింది. ► ముందు ‘చాణక్య’ అనే కథ కోసం చైతన్య, నేనూ కలిశాం. కానీ అది చేయడం కుదర్లేదు. ‘ప్రేమమ్’ రీమేక్ చేశాం. ‘సవ్యసాచి’ సినిమా కోసం చైతన్య చాలా కష్టపడ్డాడు. ► నెక్ట్స్ ‘కార్తికేయ 2 ’ లైన్ ఉంది. ఆ పాయింట్‌ని డీల్ చేసే సామర్థ్యం నాకింకా రాలేదనుకుంటున్నాను. నాగార్జునగారి కోసం ఓ స్క్రిప్ట్ రెడీగా ఉంది. కానీ నెక్ట్స్ ఏ సినిమా ఉంటుందో చెప్పలేను. -
‘సవ్యసాచి’ సెన్సార్ పూర్తి!
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమాలకు ఇది కలిసొచ్చే కాలమే. కొత్త ప్రయోగాలతో ముందుకు వస్తే.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ తరుణంలో నాగచైతన్య సవ్యసాచితో రాబోతున్నాడు. తన మాట వినని ఎడమచేతితో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు.. అసలు ఆ కథేంటి అన్న ఆసక్తికర అంశాలతో ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. రీసెంట్గా విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్‌తో సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. మాధవన్, భూమిక, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించగా చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా నవంబర్ 2న థియేటర్లలో సందడి చేయనుంది. -
యాక్షన్ డ్రామాగా సవ్యసాచి
అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. చైతూ హీరోగా ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకుడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిథి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ ట్రైలర్లతో ఆకట్టుకున్న సవ్యసాచి టీం తాజాగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. తన ఎడమ చేతిమీ నియంత్రణ లేని పాత్రలో చైతూ నటన ఆకట్టుకుంటుందంటున్నారు చిత్రయూనిట్. -
‘సవ్యసాచి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
ఈ నలుగురు భామలు భలే లక్కీ!
సిల్వర్ స్క్రీన్‌పై తొలిసారి నేమ్కార్డ్ చూసుకోక ముందే రెండో సినిమాకి అవకాశం వస్తే.. ఆ మజానే వేరు. ఒక సినిమా సెట్లో ఉండగానే ఇంకో అవకాశం వచ్చేస్తే గెట్ సెట్ గో అంటూ హుషారుగా పని చేస్తారు. ఇప్పుడు అలా జోరు మీద ఉన్న నలుగురు ముద్దుగుమ్మల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సినిమానే సెకండ్ సినిమా! కథానాయికగా నటించిన తొలి సినిమా ‘కేదార్నాథ్’ రిలీజ్ కాకముందే బంపర్ చాన్స్ కొట్టేశారు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్. ఏకంగా రణ్వీర్ సింగ్ సరసన నటించే చాన్స్ కొట్టేశారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా రూపొందుతున్న ‘సింబా’ సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు హిట్ ‘టెంపర్’కు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే సారా ఫస్ట్ నటించింది ‘కేదార్నాథ్’ చిత్రంలోనే అయినా ‘సింబా’ చిత్రం ముందు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ చిత్రం 80 శాతం కూడా పూర్తయింది. డిసెంబర్లో రిలీజ్ ఉంది. అటువైపు ‘కేదారనాథ్’ పలు వాయిదాల తర్వాత మార్చిలో రిలీజ్ అంటున్నారు. లెక్క ప్రకారం ఏ సినిమా ముందు రిలీజైతే అదే ఆ ఆర్టిస్ట్‌కి ఫస్ట్ సినిమా అంటారు. సో.. ‘సింబా’ని తన తొలి చిత్రంగా సారా చెబుతారేమో. ఏది ఏమైనా ఒక్క సినిమాతో కూడా వెండితెరపైకి రాకముందే రెండో సినిమాకి అవకాశం దక్కించేసుకున్నారు సారా. తారానందం ప్రస్తుతం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో కథానాయికగా బిజీగా ఉన్న తారా సుతారియా‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’లోనూ నటించాల్సి ఉంది. బిజీగా ఉండి, డేట్స్ కుదరకపోవడంతో నటించలేకపోయారంతే. అలా ఒక సినిమా కోసం వేరే సినిమా వదులుకున్న బాధ తారకు ఇక లేదు. ఎందుకంటే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సెట్స్‌లో ఉండగానే రెండో అవకాశం ఆమె డోర్ తట్టింది. ఈ రెండో సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి డైరీలో డేట్స్ ఖాళీగా ఉన్నాయట. అందుకని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. సిద్ధార్ధ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్ హీరోలుగా మిలప్ జవేరి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో తారకు మంచి రోల్ కూడా దక్కిందట. ఇక కరణ్ జోహర్ నిర్మిస్తున్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాలో టైగర్ ప్రాఫ్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో తారాతో పాటు కొత్తమ్మాయి అనన్య పాండే మరో కథానాయిక. ఈ సినిమా వచ్చే ఏడాది మేలో రిలీజ్ కానుంది. అటు సాంబార్.. ఇటు గోంగూర ఏదైనా ఒక లాంగ్వేజ్‌లో సినిమా రిలీజైన తర్వాత అందులో హీరోయిన్ బాగా యాక్ట్ చేసిందని పేరు వస్తే కానీ వేరే ఇండస్ట్రీలో చాన్స్ రాదు. కానీ రాజశేఖర్–జీవితల పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ మాత్రం ఆ రూల్‌ను బ్రేక్ చేశారు. తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ‘2 స్టేట్స్’ రిలీజ్ కాకముందే కోలీవుడ్ పిలుపు అందుకున్నారామె. తమిళ నటుడు విష్ణు విశాల్ సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు శివాని. వెంకటేశ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక తెలుగు ‘2 స్టేట్స్’ విషయానికి వస్తే.. ఇటీవల ‘గూఢచారి’ సినిమాతో మంచి హిట్ సాధించిన అడవి శేష్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. వెంకట్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో హిట్ సాధించిన ‘2 స్టేట్స్’ సినిమాకు ఇది రీమేక్. మేజర్‌గా కోల్‌కతాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. త్వరలో రిలీజ్‌కు సంబంధించిన వివరాలను తెలియజేయడానికి చిత్రబృందం రెడీ అవుతున్నారు. ఇలా ఇటు తెలుగు అటు తమిళ చిత్రం చేస్తూ కొన్ని రోజులు గోంగూర, కొన్ని రోజులు సాంబార్ టేస్ట్ చేస్తున్నారు శివాని. అరుదైన అవకాశం బాలీవుడ్లో ప్రూవ్ చేసుకున్న తర్వాత సౌత్ ఇండస్ట్రీకి వచ్చి... ఇక్కడ ఒక్క సినిమా రిలీజ్ కాకపోయినా సెకండ్ సినిమా చాన్స్‌ను దక్కించుకున్న హీరోయిన్స్ ఉన్నారు. కానీ బాలీవుడ్లో ఒకే సినిమాలో నటించి, అదీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వనప్పుడు సౌత్‌లో తొలి సినిమా రిలీజ్ కాకుండానే రెండో చాన్స్ కొట్టేసిన హీరోయిన్స్ లిస్ట్‌ను తయారుచేస్తే అందులో కథానాయిక నిధి అగర్వాల్ ఉంటారు. సాబిర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రం ‘మున్నా మైఖేల్’లో నటించారు నిధి అగర్వాల్. కానీ సరిగ్గా ఆడలేదు. వెంటనే సౌత్ డోర్ కొట్టారు. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘సవ్యసాచి’ ద్వారా సౌత్‌లో హీరోగా పరిచయం కానున్నారు. ఈ సినిమా నవంబర్ 2న విడుదల కానుంది. ఈ బొమ్మ థియేటర్లో పడకముందే ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో నటిస్తున్నారు నిధి అగర్వాల్. విశేషం ఏంటంటే.. ముందు నాగచైతన్య సరసన నటించిన నిధి రెండో సినిమాలో అతని తమ్ముడు అఖిల్‌తో జతకట్టారు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ని కూడా రిలీజ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘మిస్టర్ మజ్ను ’సినిమా డిసెంబర్లో విడుదల కానుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాల్లో నిధి నటనకు మంచి మార్కులు పడితే ఆమె ఖాతాలో మరిన్ని సినిమాలు వచ్చి పడే అవకాశం లేకపోలేదు. -
అందుకోసమే చైతుకు అమ్మాయిలు ఫోన్ చేసేవారట!
‘తాతగారు మెదలుపెట్టిన ప్రయాణం ఇది. నాన్నగారికి, సుమంత్ అన్నకు, నాకు, అఖిల్‌కు, సమంతకు ఇలా మా అందరికీ మీ ప్రేమాభిమానాలు, సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. తరాలు మారినా తరగని ప్రేమను అందిస్తున్నారు. కొన్నిసార్లు మిమ్మల్ని నిరుత్సాహపరిచాను, కొన్నిసార్లు ఎనర్జీ ఇచ్చాను. కానీ మనం అందరం ఇలా కలసి ఉండటం నాకు ముఖ్యం’’ అన్నారు నాగచైతన్య. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిÔ¶ ంకర్, మోహన్ చెరుకూరి నిర్మించారు. కీరవాణి సంగీత దర్శకుడు. ఈ చిత్రం నవంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘ఈ వేడుకకు వచ్చినందకు కొరటాల శివగారికి, రౌడీ విజయ్‌కు థ్యాంక్స్. ఉదయం లేవగానే ఓ చెడు వార్త వినాల్సి వచ్చింది. మా కుటుంబానికి చాలా సపోర్ట్‌గా ఉన్న శివప్రసాద్‌గారు మనల్ని వదిలేసి వెళ్లిపోయారు. ఆయన కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం అందరి కంటే చందు ఎక్కువగా కష్టపడ్డాడు. యునిక్ పాయింట్‌కి కమర్షియల్ పాయింట్స్ కలిపి మంచి సినిమా తయారు చేశాడు. కీరవాణిగారు తాతగారితో, నాన్నతో చేశారు. ఆయనతో కలసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీతో నాన్న పంచుకున్న జ్ఞాపకాలు ఎప్పుడూ మాతో పంచుకుంటారు. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నన్ని రోజులు అమ్మాయిలు ఫోన్ చేసి, షూటింగ్‌కి రావచ్చా? మాధవన్‌ని చూడొచ్చా అని అడిగేవాళ్ళు. ‘చెలి’ చూసినప్పటి నా ఫ్రెండ్స్ ఇంకా మిమ్మల్ని అభిమానిస్తూనే ఉన్నారు. మీరు ఈ సినిమా అంగీకరించడంతో మా నమ్మకం ఇంకా పెరిగింది. మాధవన్ ఓ సినిమాని ఊరికే అంగీకరించరని మాకు తెలుసు. ఏదో కొత్తదనం లేకపోతే ఆయన ఒప్పుకోరు. ని«ధీ.. నువ్వు ఇక్కడ ఉండటానికి ఎన్ని కలలు కన్నావో అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. భూమికగారు, ఇలా అందరికీ థ్యాంక్స్. మైత్రీ బ్యానర్ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకువెళ్లారు. మిమ్మల్ని (అభిమానులు) ఆనందపరచడం కోసం నిజాయితీగా పని చేస్తాను. నా కెరీర్లో ఇది పెద్ద సినిమా. కాంబినేషన్‌ని నమ్మి కాదు కంటెంట్‌ని నమ్మి సినిమా తీశారు. ఇలాంటి నిర్మాతలు మనకు కావాలి. ఈ సినిమా నిరుత్సాహపరచదు’’ అన్నారు. కీరవాణి మాట్లాడుతూ – ‘‘నాగార్జునగారితో పని చేయడం ఎంత ఎంజాయ్ చేశానో చైతన్యతో పని చేయడం కూడా అంతే ఆనందించాను. రచయితలు అందరూ చక్కటి సాహిత్యం అందించారు. నిర్మాతలు ప్రతీది అడిగి తెలుసుకున్నారు. అడిగింది ఇచ్చారు’’ అన్నారు. ‘‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ ఇలా ప్రతీ సినిమాకు నేర్చుకుంటూ, మెరుగుపరుచుకుంటూ వస్తున్నాం. శివ గారికి, విజయ్ దేవరకొండకి ఈ ఈవెంట్‌కి వచ్చినందుకు థ్యాంక్స్. చైతన్యతో ఇంకో లవ్ స్టోరీ సినిమా చేయాలని ఉంది. మాధవన్గారూ.. తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్. ‘బాహుబలి’ తర్వాత కీరవాణిగారు ఈ సినిమానే చేశారు’’ అని నిర్మాతలు అన్నారు. మాధవన్ మాట్లాడుతూ– ‘‘మైత్రీ మూవీస్ వాళ్ల వల్ల స్ట్రయిట్ తెలుగు సినిమా చేశాను. వాళ్లు సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతున్నారు. ఈ సినిమా కూడా సూపర్‌గా ఉంటుంది. సినిమాకు పని చేసిన వాళ్లందరూ సహృదయులు. ముఖ్యంగా నాగ చైతన్య. నేను మీ ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్‌ని చైతన్యా. నీతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. చందూతో పని చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మైత్రీ బ్యానర్ నా ఫ్యామిలీ లానే. పెద్ద హిట్ సాధిస్తారనుకుంటున్నాను. పవర్ఫుల్ టైటిల్‌తో వస్తున్నారు. టీమ్‌కు ఆల్ ది బెస్ట్. చైతన్య చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ –‘‘మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రెండు సినిమాలు చేస్తున్నాను. వాళ్ల ప్యాషన్ అద్భుతం. మాధవన్‌గారిని తెలుగులో చూడటం ఆనందంగా ఉంది. చందూ మరో మంచి సినిమా తీశాడని అనుకుంటున్నాను. చైతన్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయన హ్యాండ్‌షేక్, నవ్విన తీరుకే నచ్చేశారు. ఇండస్ట్రీలో ఎవరు చైతన్య గురించి మాట్లాడినా మంచి విషయాలే చెబుతారు. వ్యక్తిగా అంత మంచివాడు’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన టీమ్‌కి థ్యాంక్స్. చైతూతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మాధవన్‌గారితో పని చేయడం మర్చిపోలేను’’ అన్నారు నిధి అగర్వాల్. రామకృష్ణ, మోనికా, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, కెమెరామేన్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
అంత డ్రామా వద్దన్నారు
హైదరాబాద్ టు ముంబై వయా బెంగళూరు... నిధి అగర్వాల్‌కి ఈ మూడు రాష్ట్రాలతో అనుబంధం ఉంది. పుట్టింది హైదరాబాద్. చదువకున్నది బెంగళూరు. నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది ముంబైలో. ఇప్పుడు ‘సవ్యసాచి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నాగచైతన్య, నిధి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ చెప్పిన విశేషాలు. ► ‘మున్నా మైఖేల్’ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయికగా హిందీలో పరిచయమయ్యాను. అందులో టైగర్ ష్రాఫ్‌కు జోడీగా నటించాను. ఆ సినిమా చూసి చందూ మొండేటి ‘సవ్యసాచి’కి చాన్స్ ఇచ్చారు. హీరో నాగచైతన్య సరసన అవకాశం కావటంతో ఎగిరి గంతేశాను. చైతన్య మంచి కో–స్టార్. చిన్న చిన్న డిటేల్స్‌ను కూడా దర్శకుణ్ణి అడిగి తెలుసుకుంటాడు. సమంత, చైతూ ఇద్దర్ని చాలాసార్లు కలిశాను. వాళ్లిద్దర్నీ చూస్తున్నప్పుడు చైతూ ఎంత లక్కీయో అనిపించేది. ఇద్దరూ సోల్‌మేట్స్. సమంత గ్రేట్ అండ్ బ్యూటిఫుల్. ► ఈ సినిమా కోసం దాదాపు 40 రోజుల పైనే వర్క్ చేశాను. సినిమాలో గ్రాఫిక్స్ పార్ట్ ఎక్కువ. అందుకే ఎక్కువ టైమ్ పట్టింది. నాగార్జునగారి ఓల్డ్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు..’ పాటకు డాన్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. కీరవాణి గారి మ్యూజిక్కు ఫిదా అయ్యాను. ఇప్పటివరకు రిలీజైన టీజర్‌ను, ట్రైలర్‌ను కొన్ని వందల సార్లు చూసుకున్నాను. అంత నచ్చాయి. ► నా గురించి చెప్పాలంటే.. మా ఇంట్లో నేను చాలా మొండిదాన్ని. నేను ఏదైనా కోరుకున్నానంటే అది జరిగి తీరాల్సిందే. ఆర్టిస్ట్ అవుతానని పేరెంట్స్ దగ్గర అమాయకంగా అడిగితే, ‘అంత డ్రామా క్రియేట్ చేయకు. నువ్వు ఏది కావాలంటే అదే జరుగుద్ది’ అన్నారు. ‘డోంట్ వర్రీ. మేమంతా నీతో ఉంటాం. కెరీర్‌ని సీరియస్‌గా తీసుకో.. అలాగే ఎంజాయ్ చెయ్’ అని ఎంకరేజ్ చేశారు. ► హ్యాపీగా ఉండాలంటే రోజూ శుభ్రంగా పనిచేయాలి. టైమ్‌కు తిని , చక్కగా నిద్రపోవాలి. హైదరాబాద్‌లో ఉన్నన్ని రోజులు పూర్ణ టిఫిన్ సెంటర్లో ఇడ్లీలు తింటూ (ఎన్నో చెప్పను– నవ్వుతూ), ఐమాక్స్‌లో సినిమాలు చూస్తూ గడిపేస్తాను. ఐ లవ్ హైదరాబాద్. ప్రస్తుతం అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’ చేస్తున్నాను. కుదిరితే నాగార్జునగారితో కూడా చేయాలని ఉంది. పర్సనల్‌గా దీపికా పదుకోన్గారికి వీరాభిమానిని. ఆమె నాకు ఆదర్శం. బెంగళూర్‌లో చదువుకుని బాలీవుడ్లో అంత ఎత్తుకు ఎదిగారామె. మనం మాత్రం ఎందుకు ఎదగకూడదు? మనమూ ట్రై చేద్దాం అనుకున్నాను. అందుకే ఇండస్ట్రీకి వచ్చా. -
చైతూ.. ఈసారైనా హిట్ కొట్టేనా..?
అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్యలో ఆదినుంచీ లవర్ బాయ్‌లానే చూస్తున్నారు ప్రేక్షకులు. మాస్ మంత్రం జపించి హిట్కొట్టాలనుకున్న ప్రతిసారీ చైతూకు ఎదురుదెబ్బే తగిలింది. జోష్‌తో ఎంట్రీ ఇస్తే అంతగా వర్కౌట్ కాలేదు. తరువాత లవర్ బాయ్‌గా నటించిన ఏమాయ చేసావే, 100% లవ్ సినిమాలతో నాగచైతన్య సక్సెస్ సాధించాడు. అయితే మళ్లీ దడ, ఆటోనగర్ సూర్య లాంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులను మెప్పించేందుకు ట్రై చేశాడు. కానీ అవి కూడా మిశ్రమ ఫలితాన్నే ఇచ్చాయి. కానీ మాస్ ఆడియన్స్‌కు దగ్గరచేయలేకపోయాయి. బెజవాడ, దోచేయ్, యుద్దం శరణంలాంటి సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు. ఒక లైలాకోసం, రారండోయ్ వేడుక చూద్దాం, శైలజా రెడ్డి అల్లుడు లాంటి ఫ్యామిలి, లవ్ ఎంటర్టైనర్తో ఫర్వాలేదనిపించాడు. ప్రేక్షకులు చైతూలో ఓ లవర్బాయ్ను చూస్తుంటే.. చైతూ మాత్రం మాస్ ప్రేక్షకులను మెప్పించేందుకు ట్రై చేస్తూ.. యాక్షన్ సినిమాలను ఎంచుకుంటున్నాడు. మళ్లీ ‘సవ్యసాచి’తో యాక్షన్ ఓరియెంటెడ్‌ను చేస్తూ.. మాస్‌ను ఆకట్టుకునేందుకు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మనముందుకు వస్తున్నాడు. మరి ఈసారైనా చైతూ మాంచి హిట్ కొడతాడో లేదో చూడాలి. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 2న విడుదల కానుంది. -
అందాల నిధి
హైదరాబాద్‌లో పుట్టి బెంగళూరులో పెరిగిన నిధి అగర్వాల్ బాలీవుడ్లో తొలిచిత్రం ‘మున్నా మైఖేల్’తో మంచి మార్కులు కొట్టేసింది. నెక్ట్స్ జెన్ స్టార్ అనిపించుకుంది. ‘సవ్యసాచి’తో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్న నిధి అగర్వాల్ గురించి కొన్నిముచ్చట్లు... అంత ఈజీ కాదు! నిధి కుటుంబం, చుట్టాలలో అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు నటులు ఎవరూ లేరు. అయినప్పటికీ ‘నటి’ కావాలనేది ఆమె లక్ష్యం. ఇదే విషయాన్ని ఇంట్లోనో, బంధువుల దగ్గరో చెప్పినప్పుడు నవ్వులు వినిపించేవి. ఆ నవ్వుల అర్థం ‘నటి కావాలనుకోవడం అంతా ఈజీ అనుకుంటున్నావా!’ అని కూడా కావచ్చు. బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన నిధికి బ్యాలె, కథక్, బెల్లీ నృత్యాలలో ప్రవేశం ఉంది. అందాల పోటీల్లో విజేతలుగా నిలిచి, ఆ తరువాత సినిమాల్లో రాణించిన ఐశ్వర్యారాయ్, ప్రియాంకాచోప్రా, సుస్మితాసేన్... తనకు స్ఫూర్తి అంటోంది నిధి అగర్వాల్. చలో ముంబై నటి కావాలనే పట్టుదలతో ముంబై విమానం ఎక్కేసింది నిధి. నటి కావడానికి ముందు మోడలింగ్‌లో స్టార్ అనిపించుకుంటే అవకాశాలు వాటికవే నడిచొచ్చి డోర్‌బెల్ నొక్కుతాయని సన్నిహితులు చెప్పిన మాటలు నిజమయ్యాయి. మోడలింగ్‌లో రాణిస్తున్నప్పుడే డైరెక్టర్ షబ్బీర్‌ఖాన్ దృష్టిలో పడింది. అలా ‘మున్నా మైఖేల్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో ‘డాలీ’ పాత్ర చేసింది. డాలీలాగే నిజజీవితంలోనూ తనకు డ్యాన్స్ అంటే ప్రాణం. అభిమాని తలచే... తక్కువ కాలంలో ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్న కథానాయికల్లో నిధి అగర్వాల్ ఒకరు. ఒక అభిమాని అయితే ఒక గోడ మీద గ్రాఫిటీ ఆర్ట్‌లో నిధి చిత్రం వేసి సామాజిక మాధ్యమాల్లో తెగ హడావుడి చేశాడు. ఇలాంటి అభిమానులకు తన ఫ్యాన్ పేజీలో తప్పనిసరిగా ‘థ్యాంక్స్’ చెప్పేస్తుంది నిధి. ఇదే తొలిమెట్టు నాగచైతన్య ‘సవ్యసాచి’తో తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్న నిధి అఖిల్‌తో కూడా ఒక సినిమాలో నటిస్తుంది. ‘కల కనడం ఒక ఎత్తు. ఆ కలను నెరవేర్చుకోవడం ఒక ఎత్తు. నెరవేరిన కలను నిలబెట్టుకోవడం ఒక ఎత్తు. ‘తక్షణ తీర్పు’ ‘తక్షణ విమర్శ’ ఎదురయ్యే ప్రస్తుత కాలంలో ప్రతికూల ఆలోచనను దగ్గరకు రానివ్వక పోవడం విజయానికి తొలిమెట్టు అంటుంది అందాల నిధి అగర్వాల్. -
‘సవ్యసాచి’ వర్కింగ్ స్టిల్స్
-
‘దేన్నైతే మిస్ చేయకూడదో.. దాన్నే మిస్ అన్నారు’
అక్కినేని నటవారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మూడో సినిమా టైటిల్‌ను ప్రకటించారు చిత్రయూనిట్. చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగా మిస్టర్ మజ్ను అనే టైటిల్‌నే ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో అఖిల్ ప్లేబాయ్‌గా కనిపించనున్నాడు. తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. రేపు (గురువారం) అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా అఖిల్ కొత్త సినిమా టైటిల్‌తో పాటు టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నారు. -
ఫసక్ : రియాక్షన్ విత్ లాట్సాఫ్ ఎమోషన్స్
ఓ టీవీ ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు మోహన్‌బాబు ఫసక్ అన్న పదాన్ని వాడిన దగ్గర నుంచి ఆపదం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ విషయంపై మంచు హీరో మనోజ్, నటి నిధి అగర్వాల్‌ల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. నిధి ‘ఈ ఫసక్ ఏంటి..? ఇలాంటి పదాన్ని నేను ఎప్పుడూ వినలేదు. కానీ ఇప్పుడు చాలా చోట్ల ఈ పదాన్ని చూస్తున్నా’అంటూ ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన మంచు వారి చిన్నబ్బాయి మనోజ్ ‘ఫసక్ అంటూ ఎమోషన్స్ తో వచ్చే రియాక్షన్, నా ఇంగ్లీష్ తప్పయితే క్షమించు.. పూర్తిగా అర్ధమే తప్పనుకుంటే మన్నించు. ఫసక్’ అంటూ రిప్లై ఇచ్చారు. మనోజ్‌కు రిప్లై ఇచ్చిన నిధి ‘మనోజ్.. ఇప్పుడు నేను ఫసక్ ఎమోషన్‌తో పూర్తిగా సింక్ అయ్యాను’ అంటూ కామెంట్ చేశారు. ఇప్పటికే మోహన్ బాబు చెప్పిన ఫసక్ డైలాగ్ ఇన్సిపిరేషన్ లో 200లకు పైగా పేరడీ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. #Fasak is a reaction with lots of Emotion 🔥😜 If my English is wrong then pls excuse me, if the whole meaning is wrong then execute me 😜😂 Fasaaaakk 😜 https://t.co/jXuIXDR79D — Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) 15 September 2018 -
మిస్టర్ మజ్ను!
ఆ కుర్రాడి కళ్లలోకి చూస్తే చాలు ఆ మాయలో పడి అల్లాడిపోతారట అమ్మాయిలు. అతను మాట్లాడుతుంటే చాలు ఏదో హాయి స్వరం విన్నట్లు మైమరచిపోతారట అమ్మాయిలు. జనరల్‌గా ఆ లక్షణాలన్నీ లవర్ బాయ్‌కే ఉంటాయి. ఆల్మోస్ట్ ఇలాంటి క్యారెక్టర్లోనే అక్కినేని అఖిల్ కనిపించనున్నారని టాక్. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నిధీ అగర్వాల్ కథానాయిక. బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. 1971లో అక్కినేని నాగేశ్వరరావు ‘ప్రేమ్‌నగర్’లో చేసిన క్యారెక్టర్‌లోని కొన్ని షేడ్స్ అఖిల్ పాత్రలో కనిపిస్తాయని సమాచారం. ఆ సినిమాలోని ఏయన్నార్ పాత్రలో ఉండే లవ్ యాంగిల్‌ని మాత్రమే తీసుకున్నారట. ఈ సినిమా మేజర్ షెడ్యూల్ రీసెంట్గా లండన్‌లో పూర్తయింది. తాజా షెడ్యూల్‌ను హైదారాబాద్‌లో ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి ‘మిస్టర్ మజ్ను’ టైటిల్ అనుకుంటున్నారట. -
డబుల్ ధమాకా
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవి శంకర్ సినీ లవర్స్‌కు ఒకే రోజు డబుల్ ధమాకా ఇచ్చారు. రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, నాగచైతన్య ’సవ్యసాచి’ సినిమాల విడుదల తేదీలను ఒకే రోజున అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. ‘‘ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మా బ్యానర్లో విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం మంచి హిట్ సాధించింది. మా సక్సెస్ఫుల్ జర్నీలో భాగస్వాములైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన ఈ విజయాలు మా బాధ్యతను మరింత పెంచుతున్నాయి. అలాగే మా సంస్థ నుంచి వస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘సవ్యసాచి’ సినిమాల రిలీజ్ డేట్స్‌ను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాను అక్టోబర్ 5న, నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సవ్యసాచి’ సినిమాను నవంబర్ 2న విడుదల చేయబోతున్నాం’’ అని పేర్కొన్నారు మైత్రీమూవీ మేకర్స్ ప్రతినిధులు. -
యువరాణిలా ట్రీట్ చేస్తా : క్రికెటర్
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ముంబైలోని బాంద్రాలో బాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్‌తో కనిపించిన విషయం విదితమే. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందించిన విషయం తెలిసిందే. క్రికెటర్ రాహుల్ కూడా నేడు తమపై వస్తున్న రూమర్స్‌పై స్పందించాడు. మేమిద్దరం మంచి స్నేహితులమని చెప్పాడు. చాలా కాలం నుంచి మాకు పరిచయం ఉందన్నాడు. అంతేకాక నా జీవిత భాగస్వామిని యువరాణిలా ట్రీట్ చేస్తానని రాహుల్ తెలిపాడు. ‘ ఆమె నాకు చాలా కాలం నుంచి తెలుసు. మేమిద్దరం ఒకే సిటీ నుంచి వచ్చాం. ఆమె తన రంగంలో ముందుకు వెళ్లడం చాలా సంతోషం. నేను క్రికెటర్ కాకముందు నుంచి, ఆమె హీరోయిన్ అవ్వకముందు నుంచే ఇద్దరికి పరిచయం ఉంది. మేమిద్దరమే కాదు బెంగళూరుకి చెందిన స్నేహితులతో కలిసి డిన్నర్‌కు వెళ్లాం. నేను మీకు ఏమి జరగలేదని గ్యారంటీ ఇస్తున్నాను. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే అందరికీ తెలిసేలా చేస్తాను. నా జీవిత భాగస్వామిని యువరాణిలా చూసుకుంటాను. అంతేకానీ ఏ విషయాన్ని కూడా దాచను’ అని క్రికెటర్ కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. ఈ విషయాలను కేఎల్ రాహుల్ ఓ జాతీయ మీడియా సమావేశంలో తెలిపాడు. ఐపీఎల్లో తన బ్యాట్ ఝులించి క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించాడు. ఐపీఎల్-11వ సీజన్లో కేఎల్ రాహుల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. -
కలిసి డిన్నర్‌కు వెళ్లాం: హీరోయిన్
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ముంబైలోని బాంద్రాలో బాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్‌తో కనిపించిన విషయం విదితమే. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇరువూరు కొన్ని రోజులుగా డేటింగ్లో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. తమపై వస్తున్న రూమర్స్‌పై నిధి అగర్వాల్ గురువారం స్పందించిది. తనకు రాహుల్ చాలా కాలం నుంచి తెలుసని నటి చెప్పింది. అంతేకాక తామిద్దరం డేటింగ్లో లేమని కూడా ఆమె స్పష్టం చేసింది. ‘ ఓను.. నేను, రాహుల్ కలిసి డిన్నర్‌కు వెళ్లింది నిజమే. నాకు చాలా కాలం నుంచి అతను తెలుసు. రాహుల్ క్రికెటర్ కాకముందు, నేను హీరోయిన్ అవ్వకముందు నుంచే మా ఇద్దరికీ పరిచయం ఉంది. మేము బెంగళూరులో కలిసి చదువుకున్నాం అని అనుకునేరు. అలాంటిదేమీ లేదు.’ అని నిధి అగర్వాల్ పేర్కొంది. అయితే ఈ డిన్నర్ విషయంపై ఇంతవరకూ రాహుల్ స్పందించలేదు. ఐపీఎల్-11 సీజన్ కేఎల్ రాహుల్ కింగ్స్ ఎలెమన్ పంజాబ్ జట్టు తరఫున ఆడిన విషయం తెలిసిందే. తన అద్బుత ప్రదర్శనతో రాహుల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అంతేకాక ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ అఫ్ సెంచరీ బాది కొత్త రికార్డును నెలకొల్పాడు. నిధి ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా కూడా చేస్తున్నారు. నాగ చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘సవ్యసాచి’ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
ప్రేమలో కేఎల్ రాహుల్..?
ముంబై : క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రేమలో పడ్డారా?. బాలీవుడ్ తారతో కలిసి ఉన్న రాహుల్ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరువురూ కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే సదరు వార్తలపై ఇప్పటివరకూ ఎవరూ స్పందించలేదు. బాలీవుడ్ తార నిధి అగర్వాల్, క్రికెటర్ కే లోకేశ్ రాహుల్‌లు ముంబైలోని బాంద్రాలో జంటగా కనిపించారు. దీంతో బాలీవుడ్లో ఇప్పుడు వీరి గురించే హాట్ టాపిక్ అయింది. నిధి ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా కూడా చేస్తున్నారు. నాగ చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘సవ్యసాచి’ చిత్రంలో ఈమే కథానాయిక. కాగా, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తరఫున కేఎల్ రాహుల్ ఈ సీజన్ ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. -
నిజాయితీ ఉండాలి
అబ్బాయిలను ఇష్టపడాలంటే బోలేడు గుడ్ క్వాలిటీస్ వారిలో ఉండాలని అమ్మాయిలు కోరుకుంటారు. తమను ఎప్పుడూ సంతోషంగా ఉంచుతూ నవ్వించే అబ్బాయిలను మరింత ఇష్టపడతారు కొందరు అమ్మాయిలు. అయితే. . కేవలం నవ్విస్తే సరిపోదు. నిజాయితీగా కూడా ఉండాలి అంటున్నారు కథానాయిక నిధి అగర్వాల్. ‘‘నవ్వించే అబ్బాయిలకు ఈజీగా అమ్మాయిలు ఎట్రాక్ట్ అవుతారు. నవ్వు వారి రిలేషన్‌షిప్‌ను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది’’ అన్న ఓ ట్విటర్ కామెంట్‌కు నిధి స్పందిస్తూ...‘‘అబ్బాయిలు ఓన్లీ నవ్విస్తే సరిపోదు. నిజాయితీగా కూడా ఉండాలి. అలాగే స్థిరంగా ఉంటూనే చాలా ప్రేమించాలి’’ అని సరదాగా పేర్కొన్నారు. అన్నట్లు ఈ బ్యూటీ ఈ ఏడాది తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వనున్నారు. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సవ్యసాచి’ సినిమాలో నిధినే కథానాయిక. ఈ సినిమాను జూలై లోపు రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
సవ్యసాచి... ఎటు నీ చూపుల గురి?
‘సవ్యసాచి’... పంచ పాండవుల్లోని అర్జునుడికున్న పేర్లలో ఒకటి! ఈ పేరు ఎందుకు వచ్చిందంటే... ‘రెండు చేతులతోనూ విల్లు ఎక్కుపెట్టగల సమర్ధుడు కాబట్టి’ అనే ఆన్సర్ వస్తుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ‘సవ్యసాచి’ పేరుతో సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిన్మా టైటిల్ లోగోతో పాటు రెండు చేతులను వెనక్కి పెట్టుకుని శూలాలు పట్టుకున్న హీరోని చూస్తే పైన చెప్పిన ఆన్సర్ నిజమే అన్పిస్తుంది. అయితే... అర్జునుణ్ణి ‘సవ్యసాచి’ అనడానికి ఇంకో కారణం ఉంది. అదేంటంటే... పట్టుదల, అంకితభావం, కఠోర శ్రమతో అతి తక్కువ కాంతిలోనూ శబ్దాన్ని బట్టి విల్లు ఎక్కుపెట్టి వస్తువు ని కొట్టగల నైపుణ్యం అర్జునుడి సొంతమట! ఈ మాటలను దృష్టిలో పెట్టుకునే ఈ రోజు నాగచైతన్య బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన లుక్‌ను డిజైన్ చేసినట్టున్నారు. చైతూ చూపుల్లో ఓ పట్టుదల, కసి కనిపిస్తున్నాయ్ కదూ!! ఆ చూపుల గురి ఎటో మరి? ప్రస్తుతం హైదరాబాద్‌లో చైతూ, మాధవన్ తదితరులపై సీన్స్ తీస్తున్నారు. ఇందులో నిధీ అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: యువరాజ్, సీఈఓ: చిరంజీవి (చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పీటీ గిరిధర్, నిర్మాతలు: వై. నవీన్, వై. రవిశంకర్, మోహన్ (సీవీయం). -
షూటింగ్ షురూ!
మీ లెఫ్ట్ హ్యాండ్ మీ హ్యాండోవర్లోనే ఉందా..? ఇదేం తిక్క ప్రశ్న. రైట్ అయినా లెఫ్ట్ అయినా ఎవరి హ్యాండ్ వారి హ్యాండోవర్లోనే ఉంటుంది కదా అనుకోవచ్చు. కానీ హీరో నాగచైతన్య లెఫ్ట్ హ్యాండ్‌కు మాత్రం నో కంట్రోల్. అంతేకాదు.. కుడి చేతికి ఎంత పవర్ ఉందో సేమ్ టు సేమ్ అంతే పవర్ ఎడమ చేతికి ఉంది. కానీ ఇక్కడో ప్రాబ్లమ్ ఉంది. ఏంటంటే... నాగచైతన్య లెఫ్ట్ హ్యాండ్ అతని బ్రెయిన్ చెప్పిన పని చేయదు. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. అన్నట్లు.. చైకి లెఫ్ట్‌హ్యాండ్ మీద కంట్రోల్ లేనిది రీల్ లైఫ్‌లోనే. రియల్ లైఫ్‌లో కాదండోయ్. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ‘సవ్యసాచి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగచైతన్య క్యారెక్టర్ పైన చెప్పిన విధంగా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెల 8న స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కన్నడ బ్యూటీ నిధీ అగర్వాల్‌ను హీరోయిన్గా సెలక్ట్ చేశారని ఇన్సైడ్ టాక్. పెళ్లి తర్వాత చై–సామ్ హనీమూన్ వెళ్లారు. ట్రిప్‌ని ఎంజాయ్ చేసి, హైదరాబాద్ కూడా వచ్చేశారు. ఇక, ఇద్దరూ తమ తమ షూటింగ్స్‌తో బిజీగా ఉంటారు. -
చైతూ జోడిగా బాలీవుడ్ బ్యూటీ
ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల సక్సెస్ తో మంచి ఫాంలో కనిపించిన అక్కినేని హీరో నాగచైతన్య యుద్ధం శరణం సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. అయితే ఆ ప్రభావం తన తదుపరి చిత్రాల మీద పడకుండా జాగ్రత్త పడుతున్నాడు చైతూ. అందుకే త్వరలో ప్రారంభం కానున్న సినిమా కోసం ఇంట్రస్టింగ్ కాంబినేషన్ ను సెట్ చేసే పనిలో ఉన్నాడు. ప్రేమమ్ సినిమాతో తనకు ఘనవిజయం అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు చైతన్య. సవ్యసాఛి పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యింది. కొత్త తరహా కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా బాలీవుడ్ బ్యూటి నిధి అగర్వాల్ ను ఫైనల్ చేశారు. టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన నిధి, తొలి సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయినా.. హాట్ బ్యూటీ ఇమేజ్ ను మాత్రం సొంతం చేసుకుంది. ఇప్పుడు సక్సెస్ కోసం సౌత్ సినిమాల మీద దృష్టి పెట్టింది. మరి నాగచైతన్య అయిన ఈ భామకు సక్సెస్ అందిస్తాడేమో చూడాలి. -
రోడ్డున పడ్డ యంగ్ హీరోయిన్!
ముంబై: బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోయిన్ నిధి అగర్వాల్ రోడ్డున పడ్డారు. మున్నా మైఖేల్ మూవీలో టైగర్ సరసన నటించిన నిధి అగర్వాల్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. సినీ ప్రపంచంలో వెలుగు వెలగాలని కర్ణాటక నుంచి ముంబైకి వచ్చిన నిధి ఆమె రోడ్డున పడటం సంగటి ఏంటంటారా.. గతేడాది నుంచి ముంబైలోని బాంద్రాలో ఓ అపార్ట్మెంట్లో స్నేహితురాలితో కలిసి నివాసం ఉంటున్నారు. ఇటీవల హైసింగ్ సొసైటీ వారు ఆమెకు ఓ షాకిచ్చారట. సాధ్యమైనంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలన్నది వారి డిమాండ్. 'ఆరు నెలలుగా స్నేహితురాలితో కలిసి ఇక్కడ ఉంటున్నాను. అయితే ఒంటరిగా ఉన్న నటిపై, మోడల్‌పై వీరిది చాలా చిన్న చూపు. నేను సింగిల్‌గా ఉన్నందున ఏదైనా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నానేమోనని సొసైటీ భావిస్తోంది. నాకే కాదు ఇలా ఎవరు వచ్చిన మహిళలు మొదట్లో ఇల్లు కోసం తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సినిమా వాళ్లు షూటింగ్స్ వల్ల ఏ సమయానికి ఇంటికి చేరుతామో తెలియదు. దాంతో పొరుగువారికి ఇది నచ్చడం లేక ఫిర్యాదు చేశారు. వారి అనుమానాలను మరికొందరు సమర్థించడంతో నాలాంటి ఒంటరి ఆడపిల్లలకు కష్టాలు మొదలయ్యాయి. ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోవాలన్నారు. నువ్వు సింగిల్ ఆ.. సినిమాలో నటిస్తున్నావా అంటూ నాకు ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు. దీంతో నా పరిస్థితి రోడ్డున పడ్డట్లు తయారైంది' అని బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ వాపోయింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో షబానా అజ్మీ, ఇమ్రాన్ హష్మీ, తదితరులు కూడా ఇలాంటి కష్టాలు పడ్డారు. -
ఆ హీరోతో డేటింగ్ చేయలేదు.. చేయను!
బాలీవుడ్ లో ఏదైనా కొత్త మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందంటే చాలు ఆ సినిమా హీరో, హీరోయిన్లపై పుకార్లు ప్రచారంలోకి వస్తాయి. సరిగ్గా ఇలాంటి విషయమే బాలీవుడ్ కు పరిచయం అవుతున్న హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఎదురైంది. ఈ విషయంపై నిధి చాలా ఘాటుగానే స్పందించింది. సినిమాకు అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు హీరోతో డేటింగ్ చేస్తానని తాను ఎక్కడా చెప్పలేదు అంటోంది. అన్ని క్లాజ్ లు చదివిన తర్వాతే మూవీకి ఓకే చెప్పానని స్పష్టం చేసింది. హీరో టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని, సినిమా పబ్లిసిటీ కోసం రొమాన్స్ అంటూ అలాంటి విషయాలలో తలదూర్చడం తనకు ఇష్టం ఉందని చెప్పింది. షబ్బీర్ ఖాన్ తెరకెక్కించనున్న 'మున్నా మైఖెల్'లో టైగర్ ష్రాఫ్ తో ఈ భామ జోడీకట్టనుంది. మరో రెండు రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. సినిమా అంటే హీరోతో ఎక్కడ పడితే అక్కడ తిరగాలా, పబ్లిసిటీ కోసం డేటింగ్ చేయడం లాంటివి తనకు నచ్చవని.. మూవీ కోసం నటనలో నూటికి నూరుపాళ్లు శ్రమిస్తానని బాలీవుడ్ భామ పేర్కొంది. గతంలో జాకీ ష్రాఫ్ తో నటించిన హీరోయిన్లు అందరితో అతడు డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో నిధి కూడా అదేబాట పట్టనుందా అన్న అనుమానాలను పటాపంచలు చేసింది.