Skin
-
ఎండల్లో ఒళ్లు జాగ్రత్త..!
మానవ మనుగడకు ఎండ ఎంత అవసరమో... అందులోని రేడియేషన్‌తో... అందునా ముఖ్యంగా రేడియేషన్ స్పెక్ట్రమ్‌లోని అల్ట్రా వయొలెట్ కిరణాలతో అంత ప్రమాదం. ఎండ ఎప్పుడూ బాహ్య అవయవమైన చర్మంపైనే పడుతుంది కాబట్టి మొదటి ప్రమాదం మేనికే. పైగా ఇప్పుడు వేసవి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గత కొన్నేళ్లతో ΄ోలిస్తే ఫిబ్రవరి మొదటి వారాల్లోనే ఎండ తీవ్రతలు మొదలయ్యాయి. ఈ ఎండల్లో రేడియేషన్ నుంచి ముఖ్యంగా అందులోని అల్ట్రా వయొలెట్ కిరణాల దుష్ప్రభావాలనుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం. సూర్యకాంతిలో అల్ట్రావయొలెట్ రేడియేషన్ భూ వాతావరణంలోకి ప్రవేశించగానే అందులోని అల్ట్రా వయొలెట్–ఏ, అల్ట్రా వయొలెట్–బీ, అల్ట్రా వయొలెట్–సీ (వీటినే సంక్షిప్తంగా యూవీ–ఏ, యూవీ–బీ, యూవీ–సీ అంటారు) అనే మూడు రకాల రేడియేషన్లు వాతావరణంలో ప్రవేశించాక ప్రధానంగా యూవీ–ఏ, యూవీ–బీ కిరణాలు చర్మంపై పడతాయి. అదృష్టవశాత్తూ అల్ట్రా వయొలెట్ రేడియేషన్‌లోని ప్రమాదకరమైన యూవీ–íసీ వాతావరణంలోకి ఇంకి΄ోతాయి. దాంతో యూవీఏ, యూవీబీ రెండూ చర్మంపై పడతాయి. అయితే ఈ రేడియేషన్‌లో దాదాపు 5 శాతం తిరిగి వెనక్కు వెళ్తాయి. మరికొంత పరిమాణం అన్నివైపులకూ చెదిరిపోతుంది. ఎండ తీవ్రంగానూ, నేరుగా పడే భూమధ్యరేఖ, ఉష్ణమండల ప్రాంతాల్లో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువ అని చాలామంది అనుకుంటారు గానీ... నిజానికి మంచు కప్పి ఉన్న ప్రాంతాల్లోనే రేడియేషన్ ప్రభావమెక్కువ. అంటే భూమధ్య రేఖ కంటే ధ్రువాల వైపు ΄ోతున్న కొద్దీ, అలాగే ఎత్తుకు పోయిన కొద్దీ..., అలాగే వేసవి ముదురుతున్న కొద్దీ, వాతావరణంలో మబ్బులు లేకుండా నీలం రంగు ఆకాశం ఉన్నప్పుడూ ఈ రేడియేషన్‌లోని యూవీ కిరణాల తీవ్రత పెరుగుతుంది. రేడియేషన్‌లో ప్రమాదకరమైనది యూవీ–బీ... యూవీ–ఏ, యూవీ–బీలలో రెండోది (యూవీ–బీ) చాలా ప్రమాదకరమైనది. అది చర్మం తాలూకు ‘ఎపిడెర్మిస్’ అనే పొరను తాకాక అక్కడి డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ట్రి΄్టోఫాన్, టైరోజిన్, మెలనిన్లు ఆ కిరణాలను చర్మంలోకి ఇంకి΄ోయేలా చేస్తాయి. ఆ తర్వాత అవి చర్మంలోని మరో పొర ‘డెర్మిస్’నూ తాకుతాయి. అక్కడి ఇంట్రావాస్కులార్ హీమోగ్లోబిన్, డెర్మిస్లోని టిష్యూ బైలింబిన్ అనే కణజాలాలు వాటిని గ్రహించి మళ్లీ వెనకకు పంపుతాయి. అయితే ఈ ప్రక్రియలో అల్ట్రావయెలెట్ కిరణాలు గ్రహించిన ప్రతి డీఎన్ఏలో ఎంతోకొంత మార్పు రావడం జరుగుతుంది. అలాంటి మార్పులు చాలా పెద్ద ఎత్తున లేదా తీవ్రంగా జరిగినప్పుడు చర్మంపై అవి దుష్ప్రభావాల రూపంలో వ్యక్తమవుతాయి. ఇన్‌డోర్స్‌లో ఉన్నా ప్రమాదమే... ఇండ్లలో ఉన్నవాళ్ల మీద అల్ట్రావయొలెట్ రేడియేషన్ దుష్ప్రభావం ఉండదన్నది చాలా మందిలో ఉండే మరో అ΄ోహ. ఆరుబయటితో పోలిస్తే ఇన్‌డోర్స్‌లో కాస్త తక్కువే అయినా... రేడియేషన్ దుష్ప్రభావాలు గదుల్లో ఉన్నా ఎంతోకొంత ఉండనే ఉంటాయి. గదిలో ఉన్నప్పుడు మనకు అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం ఉండదని అనుకుంటాంగానీ... ఇళ్లలో ఉండే ట్యూబ్లైట్స్, ఎలక్ట్రిక్ బల్బుల నుంచి కూడా దాదాపు 5 శాతం వరకు రేడియేషన్ ఉంటుంది. ఆకాశంలో మబ్బులు కమ్మి ఉన్నప్పుడు అల్ట్రా వయొలెట్ కిరణాల తీవ్రత కొద్దిగా తక్కువగా ఉండవచ్చు. కొన్ని వ్యాధుల్లో ఎండ వల్ల పెరిగే తీవ్రత... కొందరిలో ఈ కింద పేర్కొన్న ఆరోగ్య సమస్యల్లో ఏదో ఒకటి ముందుగానే ఉండవచ్చు. అయితే తీక్షణమైన ఎండకు అదేపనిగా ఎక్కువ సేపు ఎక్స్పోజ్ కావడం వల్ల ముందున్న వ్యాధి తీవ్రత పెరగవచ్చు. ఆ ఆరోగ్య సమస్యల్లో ఇవి కొన్ని... యాక్నె (మొటిమలు) అటోపిక్ ఎగ్జిమా (స్కిన్ అలర్జీ) పెలగ్రా లూపస్ అరిథమెటోసిస్, హెర్పిస్ సింప్లెక్స్ బుల్లస్ పెఫిగోయిడ్ లైకెన్ ప్లానస్ సోరియాసిస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మెలాస్మా వంటివి ముఖ్యమైనవి. రేడియేషన్ వల్ల చర్మానికి జరిగే అనర్థాలివి... అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ కావడం వల్ల...సన్ బర్న్స్ సన్ ట్యానింగ్ చర్మం మందంగా మారడం గోళ్లకు నష్టం కావడం అసలు వయసు కంటే పెద్ద వయసు వారిగా కనిపించడం. ఇక ఈ అంశాల గురించి వివరంగా చెప్పాలంటే... సన్‌బర్న్స్: రేడియేషన్‌లోని అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం మొట్టమొదట కణాల్లోని చర్మకణాల్లోని డీఎన్ఏ పై పడుతుంది. అంతకంటే ముందు మొదట చర్మం వేడెక్కుతుంది. తర్వాత ఎర్రబారుతుంది. ఆరుబయటకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం నేరుగా ఎండ పడే చోట... అంటే... ఎండకు ఎక్స్΄ోజ్ అయ్యే ముఖం మీద, చేతుల మీద త్వరగా కనిపిస్తుంది. బాగా ఫెయిర్‌గా ఉండి తెల్లటి చర్మంతో ఉన్నవారిలో సన్‌బర్న్స్ త్వరగా కనిపిస్తాయి. అయితే మన దేశవాసుల్లో సన్‌బర్న్స్ కాస్త తక్కువే. సన్ ట్యానింగ్ : ఎండ తగిలిన కొద్దిసేపట్లోనే చర్మం రంగు మారి అలా అది కొన్ని నిమిషాలు మొదలుకొని కొన్ని గంటల పాటు అలాగే ఉంటుంది. దీన్నే ‘ఇమ్మీడియెట్ ట్యానింగ్’ అంటారు. ఇలా మారిన రంగు (నల్లబారడం) మొదట తాత్కాలికంగానే ఉంటుంది. కానీ ఎప్పుడూ ఎండలోనే ఉండేవారిలో రంగు మారడం చాలాకాలం పాటు కొనసాగి, ఆ మారిన రంగు కాస్తా అలాగే చాలాకాలం పాటు ఉండిపోతుంది. దీన్నే ‘డిలేయ్డ్ ట్యానింగ్’ అంటారు. అటు తర్వాత అలా చాలాకాలం పాటు ఎండకు అదేపనిగా ఎక్స్పోజ్ అవుతూ ఉండేవారిలో చర్మం మందంగా మారుతుంది. ఇలా కావడాన్ని ‘హైపర్ప్లేషియా’ అంటారు. తెల్లగా, ఎర్రగా ఉన్నవారిలో ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.ఎండ ప్రభావం గోళ్ల మీద కూడా...ఎండకు అదేపనిగా ఎక్స్΄ోజ్ అవుతుండే గోళ్లకు కూడా నష్టం జరిగే అవకాశముంది. నిత్యం అల్ట్రావయొలెట్ రేడియేషన్‌కు గురయ్యే గోళ్లలో వేలి నుంచి గోరు విడివడి ఊడి΄ోయే అవకాశముంటుంది. ఇలా జరగడాన్ని వైద్యపరిభాషలో ‘ఒనైకోలైసిస్’ అంటారు. ఎండ తీవ్రతతో వచ్చే చర్మవ్యాధులివి... ఎండలోని అల్ట్రావయొలెట్ రేడియేషన్‌కు అదేపనిగా ఎక్స్పోజ్ అయ్యేవారిలో కొన్ని రకాల చర్మవ్యాధులు వచ్చే అవకాశముంది. అవి... పాలీమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ : ఇవి యుక్తవయస్కుల్లో, పిల్లల్లో ఎక్కువ. చర్మంపై ముఖ్యంగా చెంపలపైన, ముక్కుకు ఇరువైపులా ఎర్రగా ర్యాష్ రావడం, అరచేతి పైనా, మెడ వెనక ఈ ర్యాష్ కనిపిస్తుంది. ఇందులో దురద కూడా ఎక్కువే. ముఖం మీద తెల్లటి మచ్చలు వస్తాయి. ఆక్టినిక్ ప్రూరిగో: ఈ సమస్య ప్రధానంగా అమ్మాయిల్లో ఎక్కువ. చర్మం అలర్జీలు ఉన్నవారిలో ఎక్కువ. మొదట చిన్న చిన్న దురద పొక్కుల్లాగా వచ్చి, అవి పెచ్చులు కట్టి, మచ్చలా మారుతుంటాయి. అలా వచ్చిన మచ్చ ఎన్నటికీ పోదు. హైడ్రోవాక్సినిఫార్మ్ : ఈ సమస్య పిల్లల్లో కనిపించడం ఎక్కువ. ఇవి దురదగా ఉండే రక్తపు నీటి పొక్కుల్లా ఉంటాయి. చాలా ఎర్రగా మారి, ఆ తర్వాత ఎండి, రాలిపోతాయి. అటు తర్వాత అక్కడ చికెన్పాక్స్లో ఉండే మచ్చలాంటిది పడుతుంది. చెంపలు, చెవులు, ముక్కు, చేతుల మీద ఈ పొక్కులు ఎక్కువగా వస్తుంటాయి. సోలార్ అట్రికేరియా: ఎండకు బాగా ఎక్స్పోజ్ అయిన వాళ్లల్లో కొద్ది నిమిషాల్లోనే అకస్మాత్తుగా చర్మం మీద ఎర్రగా, దద్దుర్లు వస్తాయి. ఇవి ఎవరిలోనైనా రావచ్చు. క్రానిక్ యాక్టినిక్ డెర్మటైటిస్: ఇదో రకం స్కిన్ ఇన్ఫెక్షన్. ఇది వచ్చిన చోట చర్మం ఎర్రగా, మెరుస్తున్నట్లుగా, మందంగా మారి, దురద వస్తుంది. అది వచ్చిన చోట చర్మం పొడిగా మారడమే కాకుండా ఉబ్బినట్లుగా అవుతుంది. ఇది ముఖ్యంగా ముఖం మీద ఎక్కువగా కనిపించినప్పటికీ మాడు, వీపు, మెడ, ఛాతి, చేతుల మీదికి కూడా వ్యాపిస్తుంది. పెద్దవయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. స్కిన్ అలర్జీ, పుప్పొడితో కనిపించే అలర్జీలతోపాటు కలిసి వస్తుంది. చర్మ కేన్సర్లు : నిరంతరం నేరుగా, తీక్షణంగా పడే ఎండలో ఎక్కువగా ఉండేవారికి చర్మక్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ. వీటిల్లో మెలనోమా, నాన్మెలనోమా అని రెండు రకాల క్యాన్సర్లు రావచ్చు. అల్ట్రా వయొలెట్ రేడియేషన్‌తో ఉండే కొన్ని ప్రయోజనాలివి... అల్ట్రా వయొలెట్ రేడియేషన్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి. అవి... విటమిన్ డి ఉత్పత్తికి : అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్΄ోజ్ కాక΄ోతే అసలు విటమిన్–డి ఉత్పత్తే జరగదు. ఎముకల బలానికీ, వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండటానికీ, అనేక జీవక్రియలకూ విటమిన్–డి చాలా అవసరమన్న విషయం అందరికీ తెలిసిందే. ఎముకల బలానికి అవసరమైన క్యాల్షియమ్ మెటబాలిజమ్, ఎముకల పెరుగుదల, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం కోసం, ఇన్సులిన్ ఉత్పత్తికి కూడా అల్ట్రా వయొలెట్ రేడియేషన్ కొంతమేరకు అవసరమవుతుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యల చికిత్సల్లో : సోరియాసిస్, విటిలిగో, ఎగ్జిమా వంటి కొన్ని ఆరోగ్య సమస్యల చికిత్సలో అల్ట్రా వయొలెట్ కిరణాలను ఉపయోగిస్తుంటారు. పుట్టుకామెర్ల చికిత్సలో : నవజాత శిశువుల్లో వచ్చే పుట్టుకామెర్లు (జాండీస్)ను తగ్గించడం కోసం అల్ట్రా వయొలెట్ కిరణాలు ఉపయోగపడతాయి. ఎండలో ఉండే వ్యవధి, తీవ్రత... పెరుగుతున్న కొద్దీ దుష్ప్రభావాల పెరుగుదల... ఎండకు ఎంతసేపు అదేపనిగా ఎక్స్పోజ్ అవుతుంటే దుష్ప్రభావాలూ అంతగా పెరుగుతాయి. అలాగే అల్ట్రావయొలెట్ రేడియేషన్ తాలూకు తీవ్రత పెరుగుతున్నకొద్దీ నష్టాల తీవ్రత దానికి అనుగుణంగా పెరుగుతూనే ఉంటుంది. ఇందుకు ‘ఫొటో ఏజింగ్’ ఒక ఉదాహరణ. ఫొటో ఏజింగ్ అంటే ఎండకు ఎక్స్పోజ్ అవుతున్న కొద్దీ అంటే... ఎక్స్పోజ్ అయ్యే వ్యవధి పెరుగుతున్న కొద్దీ ఆ వ్యక్తి తన వాస్తవ వయసుకంటే ఎక్కువ వయసు పైబడినట్లుగా కనిపిస్తుంటాడు. అల్ట్రా వయొలెట్–బి రేడియేషనే ఇందుకు కారణం. ఆ కిరణాల వల్ల ముఖం అలాగే మేని మీద ముడుతలు రావడం, చర్మం మృదుత్వం కోల్పోవడం, నల్లటి మచ్చలు రావడం, వదులుగా మారి΄ోవడం, తన పటుత్వం కోల్పోవడం వల్ల ఇలా ఏజింగ్ కనిపిస్తూ ఉంటుంది. యూవీ రేడియేషన్ అనర్థాల నుంచి కాపాడుకోవడం ఇలా... ప్రధానంగా వేసవితో పాటు మిగతా అన్ని కాలాల్లోనూ ఎండ తీక్షణత ఎక్కువగా ఉండే సమయంలో అంటే... ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు వరకు ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. చర్మంపై సూర్యకాంతి పడకుండా పొడవు చేతి చొక్కాలు (పొడడైన స్లీవ్స్ ఉండే దుస్తులు) తొడగడం మంచిది. ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖం కవర్ అయ్యేలా చేసే బ్రిమ్ హ్యాట్స్తో పాటు వీలైతే సన్‌గ్లాసెస్ కూడా వాడుకోవడం మంచిది. ఎండలోకి వెళ్లడానికి అరగంట ముందుగా సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్పీఎఫ్) ఎక్కువగా ఉన్న మంచి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. అలా ప్రతి మూడు గంటలకు ఓసారి రాసుకుంటూ ఉండాలి. ఈదేటప్పుడు, చెమట పట్టినప్పుడు రాసుకునేందుకు వీలుగా కొన్ని వాటర్ రెసిస్టాంట్ సన్‌స్క్రీన్ క్రీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సన్‌స్క్రీన్స్ ఎంచుకునే ముందర ఒకసారి చర్మవ్యాధి నిపుణలను సంప్రదించి తమకు సరిపడే ఎస్పీఎఫ్ను తెలుసుకుని వాడటం మంచిది. డీ–హైడ్రేషన్ నివారించడానికి నీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తాగుతుండాలి. డా. వై. అరుణ కుమారి, సీనియర్ డెర్మటాలజిస్ట్ (చదవండి: కష్టాలు మనిషిని కనివినీ ఎరుగని రేంజ్‌కి చేరుస్తాయంటే ఇదే..!) -
గాయాన్ని గంటల్లో మాన్పే మాయా చర్మం
అది చర్మం కాని చర్మం. అయితే అలాంటిలాంటి చర్మం కాదు. గాయాలను శరవేగంగా నయం చేసే చర్మం! ఎంతటి గాయాన్నయినా నాలుగే గంటల్లో 90 శాతం దాకా మాన్పుతుంది. 24 గంటల్లో పూర్తిగా నయం చేసేస్తుంది. వినడానికి ఏదో సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా కథలా అన్పిస్తున్నా అక్షరాలా నిజమిది. ఈ మాయా చర్మం అందుబాటులోకి వస్తే వైద్యచికిత్స కొత్తపుంతలు తొక్కడం ఖాయమని చెబుతున్నారు. అచ్చం చర్మాన్ని తలపించే కొత్త రకం హైడ్రోజెల్‌ను రూపొందించడంలో సైంటిస్టులు విజయవంతమయ్యారు. చర్మానికి ఉండే స్వీయచికిత్స సామర్థ్యాన్ని ఇది ఎన్నో రెట్లు పెంచుతుందట. ఫిన్లండ్‌లోని ఆల్టో యూనివర్సిటీ, జర్మనీలోని బైరైట్ వర్సిటీలకు చెందిన పరిశోధకులు దీన్ని రూపొందించారు. నిజానికి ఇటువంటి విప్లవాత్మక ఆవిష్కరణ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతూనే వస్తున్నాయి. కానీ అవేవీ ఇప్పటిదాకా అంతగా విజయవంతం కాలేదు. చర్మం తాలూకు విలక్షణతే అందుకు కారణం. సాగే లక్షణం, దీర్ఘకాలిక మన్నిక, తీవ్ర ప్రతికూల పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం వంటి ఎన్నో ప్రత్యేకతలు చర్మం సొంతం. వీటన్నింటినీ మించి గాయాలను తనకు తాను నయం చేసుకునే సాటిలేని సామర్థ్యం చర్మానికి ఉంది. ఇన్ని లక్షణాలతో కూడిన కృత్రిమ చర్మం రూపకల్పన ఇన్నేళ్లుగా సైంటిస్టులకు సవాలుగానే నిలిచింది. తాజాగా రూపొందించిన హైడ్రోజెల్ మాత్రం పూర్తిగా చర్మం లక్షణాలను కలిగి ఉంటుంది. కాలిన, తెగిన గాయాలపై ఈ జెల్‌ను అమరిస్తే వాటిని చిటికెలో నయం చేస్తుంది. తర్వాత దాన్ని తొలగించవచ్చు. లేదంటే క్రమంగా అదే కరిగిపోతుంది. ఇలా సాధించారు... అతి పలుచనైన నానోషీట్తో రూపొందించిన పాలిమర్ సాయంతో కృత్రిమ చర్మం రూపకల్పన సాధ్యపడింది. మోనోమర్ పొడిని నీటితో కూడిన నానోషీట్లతో చాకచక్యంగా కలపడం ద్వారా అధ్యయన బృందంలోని శాస్త్రవేత్త చెన్ లియాంగ్ దీన్ని సాధించారు. తర్వాత ఈ మిశ్రమాన్ని యూవీ రేడియేషన్‌కు గురిచేయడంతో అందులోని అణువుల మధ్య ఆశించిన స్థాయిలో బంధం సాధ్యపడింది. ఫలితంగా చక్కని సాగే గుణమున్న చర్మంలాంటి హైడ్రోజెల్ రూపొందించింది. ‘‘అత్యంత హెచ్చు సామర్థ్యంతో కూడిన వ్యవస్థీకృత నిర్మాణం దీని సొంతం. హైడ్రోజెల్‌కు ఇది గట్టిదనం ఇవ్వడమే గాక గాయాల వంటివాటిని తనంత తానుగా నయం చేసుకోగల సామర్థ్యాన్ని కూడా కట్టబెట్టింది’’ అని అధ్యయన బృందం పేర్కొంది. ‘‘జీవకణాలు చూసేందుకు గట్టిగా ఉన్నా స్వీయచికిత్స సామర్థ్యంతో కూడి ఉంటాయి. సింథటిక్ హైడ్రోజెల్లో ఈ లక్షణాలను చొప్పించడం ఇప్పటిదాకా సవాలుగానే నిలిచింది. దాన్నిప్పుడు అధిగమించాం’’ అని వివరించింది. కృత్రిమ చర్మ పరిజ్ఞానంలో ఇది మైలురాయిగా నిలుస్తుందని పేర్కొంది. ‘‘కాలిన, దీర్ఘకాలిక గాయాలను సత్వరం నయం చేయడం ఇకపై మరింత సులువు కానుంది. అంతేగాక వైద్య చికిత్సలోనే గాక ప్రోస్తటిక్స్, సాఫ్ట్ రోబోటిక్స్ తదితర రంగాల్లో కూడా ఇది ఉపయుక్తం కానుంది’’ అని వివరించింది. మిల్లీమీటర్ మందంలోని జెల్లో దాదాపు 10 వేల నానోïÙట్లుంటాయి. ఫలితంగా దానికి గట్టిదనంతో పాటు సాగే గుణం కూడా ఉంటుంది. ఈ మిరాకిల్ జెల్ ప్రస్తుతానికి ప్రయోగ దశలోనే ఉంది. వైద్యపరంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరో ఐదేళ్లకు పైగా పట్టవచ్చు. అధ్యయన వివరాలు ప్రతిష్టాత్మక జర్నల్ నేచర్ మెటీరియల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ఏమిటీ హైడ్రోజెల్ సింపుల్‌గా చెప్పాలంటే ఇది జెల్ వంటి మృదువుగా ఉండే పదార్థం. దీన్ని పాలిమర్ తదితర మెటీరియల్స్‌తో తయారు చేస్తారు. వెంట్రుకల చికిత్స మొదలుకుని ఆహారోత్పత్తుల దాకా దాదాపు అన్నింట్లోనూ వీటిని విస్తృతంగా వాడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆముదంతో చర్మం, జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చిలా!
బంకబంకగా జిగురుగా ఉండే ఆముదం చూడగానే ముట్టుకోవడానికి ఇష్టపడం.. కానీ ఇది అందానికి, కురుల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు. దీన్ని సంప్రదాయ వైద్య విధానంలో కూడా ఉపయోగిస్తారు. అన్ని ప్రయోజనాలని అందించే ఈ ఆముదం నూనెని జుట్టు, చర్మం సంరక్షణ కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.టేబుల్ స్పూను ఆముదం, టేబుల్ స్పూను కొబ్బరి నూనెలను కలిపి వేడి చేసి గోరువెచ్చగా అయిన తరవాత మాడుకు పట్టించి పదినిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే.. చుండ్రు తగ్గడంతోపాటు, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.పొడిబారిన చర్మానికి సైతం ఆముదం మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. బాడీ లోషన్స్‌కు బదులు ఆముదాన్ని రాసుకుంటే మరింత మంచిది.గోరువెచ్చని ఆముదాన్ని పలుచగా ఉన్న కనుబొమ్మలకు రాసి రెండు నిమిషాలు మర్దన చేసి ఉదయం కడిగేయాలి. ఇలా కొన్నిరోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా కనిపిస్తాయి.రాత్రి పడుకునే ముందు ఆముదాన్ని పెదవులకు రాసి మూడు నిమిషాలపాటు మర్దన చేయాలి. చిన్న బాక్స్‌లో ఆముదాన్ని ΄ోసుకుని రోజులో అప్పుడప్పుడు లిప్‌బామ్‌లా రాసుకుంటూ ఉంటే పెదవులు మృదువుగా, పింక్ కలర్లోకి మారతాయి. క్లెన్సర్లు, లోషన్లు, సౌందర్య సాధనాలలో విస్తృతంగా ఈ ఆముదాన్ని ఉపయోగిస్తారు.దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు కాలిన గాయాలు, ప్రెజర్ అల్సర్లు, డయాబెటిక్ అల్సర్లు, శస్త్రచికిత్సా గాయాలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. ఇది జుట్టును లూబ్రికేట్ చేయడంలో సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఇందులోని ఒలీక్, లినోలిక్ యాసిడ్ రక్త ప్రసరణను పెంచి మీ జుట్టును బలంగా, మృదువుగా మార్చుతాయి.(చదవండి: బీపీ-హైబీపీకి మధ్య తేడా ఏంటి..? వంశపారపర్యంగా వస్తుందా..?) -
మసాజ్ రోలర్: వయసు పైబడినట్లు కనిపడనివ్వదు..!
వయసు ప్రభావం చర్మంపై కనిపించకుండా ఉండాలంటే, మర్దనను మించినది లేదు. రకరకాల తైలాలతో శరీరాన్ని మర్దన చేసే పద్ధతులు పురాతన కాలం నుంచి ఉన్నాయి. ఏ తైలాలను ఉపయోగించినా, ఇతర ద్రావణాలను ఉపయోగించినా, చర్మం లోలోతుల్లోకి చేరితేనే ఫలితం ఉంటుంది. ఎవరికి వారే స్వయంగా మర్దన చేసుకునేందుకు వీలుగా అందుబాటులోకి వచ్చిన సాధనమే ఈ డెర్మా మసాజ్ రోలర్. మర్దనకు అవసరమైన తైలాలు లేదా సీరమ్‌లు నింపుకోవడానికి ప్రత్యేకమైన మినీకంటైనర్తో రూపొందిన ఈ పరికరం పైభాగంలో రోలర్ హెడ్‌కు అన్నివైపులా టిటానియం నీడిల్స్ ఉంటాయి. దీనిని చర్మానికి ఆనించి, మర్దన చేసుకునేటప్పుడు రోలర్ గుండ్రంగా తిరుగుతుంది. దాంతో దీనికి ఉన్న నీడిల్స్ చర్మాన్ని లోతుగా ఒత్తి, రక్తనాళాలను ఉత్తేజితం చేస్తాయి. ఈ రోలర్‌తో ఎవరికి వారే స్వయంగా మర్దన చేసుకోవచ్చు. ఇది ఎలాంటి నొప్పిని కలిగించదు. నుదురు, బుగ్గలు, ముక్కు, పెదవులు, గడ్డం, చేతులు, పొట్ట వంటి భాగాల్లో ఈ రోలర్‌తో కావలసిన నూనె లేదా సీరమ్ ఉపయోగించి, మర్దన చేసుకోవచ్చు. ఇది కేశసంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. తలపై కూడా దీనితో మర్దన చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని వినియోగించిన తర్వాత రోలర్‌ను, కంటైనర్‌ను వేరుచేసి, శుభ్రం చేసుకున్న తర్వాత మెత్తని వస్త్రంతో తుడిచి, ఆరబెట్టుకోవాలి. ఈ రోలర్‌తో ట్రాన్స్పరెంట్ క్యాప్ లభిస్తుంది. వాడకం పూర్తయ్యాక రోలర్‌కు క్యాప్ పెట్టుకున్నట్లయితే, దీనిపై దుమ్ము, ధూళి చేరకుండా ఉంటాయి. (చదవండి: హెచ్ఐవీ-ఎయిడ్స్: టీకాకు దీటుగా సూదిమందు...) -
LED Light Therapy: అన్ని రోగాలకు దివ్యౌషధం..!
ముడతలు, సోరియాసిన్, మచ్చలు, ఎండతాకిడికి దెబ్బతిన్న చర్మానికి మంచి చికిత్సగా ‘లెడ్‌లైట్ థెరపీ’ ఉత్తమమని చెబుతున్నారు ఆధునిక పరిశోధకులు. కొందరైతే ‘లెడ్‌లైట్ థెరపీ’ అనేది అన్ని రకాల రోగాలకు దివ్యౌషధం అని ప్రచారం చేస్తున్నారు. లెడ్‌లైట్ థెరపీని లో–పవర్డ్ లేజర్ థెరపీ, కోల్డ్ లేజర్ థెరపీ, ఎల్ఈడీ లైట్ థెరపీ అని కూడా పిలుస్తారు.నొప్పి, మంట, కణజాల నష్టాన్ని తగ్గించడంలో, నోటిపూతలు, మచ్చలు, కాలిన గాయాలను నయం చేయడానికి, కొన్ని రకాల అల్సర్లను నయం చేయడానికి లెడ్‌లైట్ థెరపీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.పార్కిన్సన్, అల్జీమర్స్, మల్టిపుల్ స్లిరోసిస్, ఆర్థరైటిస్, ఆటిజం ఉన్న రోగులకు కూడా లెడ్‌లైట్ థెరపీ ఉపయోగపడుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.ఈ చికిత్స సులువైనది. నొప్పి ఉండదు.లెడ్‌లైట్ థెరపీలో కూర్చున్న లేదా పడుకున్న పేషెంట్‌ను పదిహేను నిమిషాల పాటు లెడ్లైట్కు ఎక్స్పోజ్ చేస్తారు.‘సరిగ్గా వినియోగించినప్పుడు లెడ్‌లైట్ చికిత్స చాలా సురక్షితం’ అంటున్నారు నిపుణులు.‘అన్నిరకాల సమస్యలకు లెడ్లైడ్ థెరపీ పనిచేయకపోవచ్చు’ అంటున్నారు వైద్య అవసరాల కోసం లైట్, లేజర్ల ఉపయోగాలకు సంబంధించిన ఎక్స్పర్ట్, వోరల్ బయాలజీ, బయో మెడికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ప్రవీణ్ అరణి.ఆందోళన నుంచి ఉపశమనం, కండరాల పనితీరును మెరుగుపరచడం, ఆటల వల్ల అయిన గాయాల నుంచి కోలుకోవడం, చర్మానికి యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు...మొదలైన వాటికి సంబంధించి లెడ్‌లైట్ థెరపీని ఉపయోగిస్తున్నారు. అయితే దీనివల్ల ఎంత మేలు జరుగుతుందనే విషయంలో లోతైన అధ్యయనాల కొరత కనిపిస్తుంది. (చదవండి: ఆ... భరణం అచ్చం అలాగే!) -
పిగ్మెంటేషన్ సమస్య తగ్గాలంటే..!
రకరకాల కారణాల వల్ల ముఖంపై పిగ్మెంటేషన్ వస్తుంటుంది చాలామందికి. చూడటానికి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానికి క్రీములు, ఇతర మందులు వాడే బదులు ఒక బంగాళదుంపని తురిమి అందులో పావు కప్పు నిమ్మరసం కలపండి. పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్న చోట ఈ మాస్క్‌ని వేసుకుని అరగంట ఆగి చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల తేనెలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి అవసరమున్న చోట ఈ మిశ్రమాన్ని పూతలా వేసుకోవాలి. తర్వాత గోరు వెచ్చని నీటిలో మెత్తటి బట్ట ముంచి పిండేసి ఆ బట్టని ఈ మిశ్రమం అప్లై చేసిన చోట కవర్ చేసినట్లుగా వేయండి. ఇరవై నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒకసారి చేయాలి. ఇలా చేయడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య తగ్గి ముఖం మిలమిలలాడుతుంది. పిగ్మంటేషన్‌ని పోగొట్టే డ్రింక్‌లు ..కీర, దానిమ్మ, కరివేపాకు ఆకులు, నిమ్మరసంతో ఈ ఇంటి డ్రింకు ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ డ్రింకు లాభాలు ఎన్నో. కీరకాయల్లో యాంటాక్సిడెంట్లు, సిలికా అత్యధికంగా ఉంటాయి. ఇవి పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. ఈ డ్రింకులో ఉపయోగించే దానిమ్మ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే యాంటాక్సిడెంట్లతో పాటు చర్మాన్ని మెరిపించే సుగుణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి పిగ్మెంటేషన్ మచ్చలను పోగొట్టడంలో బాగా పనిచేస్తాయి.ఈ డ్రింకులో వేసే కరివేపాకుల్లో కూడా యాంటాక్సిడెంట్లతో పాటు విటమిన్ సి బాగా ఉంది. అలా కరివేపాకులు కూడా పిగ్మెటేషన్ ను తగ్గించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. ఇక నిమ్మరసంలో విటమిన్ సి ఎంత ఎక్కువగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. నిమ్మరసం చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అంతేకాదు స్కిన్ టోన్ కూడా సమంగా ఉండేలా తోడ్పడుతుంది.తయారీ విధానం: చిన్న కీరకాయ ఒకటి, అరకప్పు దానిమ్మ గింజలు, పది పన్నెండు కరివేపాకులు, అరచెక్క నిమ్మరసం రెడీ పెట్టుకోవాలి. వీటన్నింటినీ బ్లెండర్ లో వేసి బాగా కొట్టాలి. ఆ డ్రింకును గ్లాసులో పోసుకుని తాగాలి అంతే. ఈ డ్రింకు వల్ల పిగ్మెంటేషన్ తగ్గడంతో పాటు ఇందులోని యాంటాక్సిడెంట్ల వల్ల శరీరంలోని ఫ్రీరాడికల్స్ న్యూట్రలైజ్ అవుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను ఈ డ్రింకు తగ్గిస్తుంది. అంతేకాదు సెల్యులార్ పునరుద్ధరణ కూడా చేస్తుంది. -
లూపస్ వ్యాధి గురించి తెలుసా? చికిత్స లేకపోతే ఎలా?!
దీర్ఘకాలికమైన, సంక్లిష్టమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి ఒకటి ఉంది దాని పేరే లూపస్. ఇది శరీరంలోని ఏ భాగాన్ని అయినా ప్రభావితం చేస్తుంది. కళ్ళు, చర్మం, మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు,రక్త నాళాలు సాధారణంగా ప్రభావితమయ్యే భాగాలు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. వీటిల్లో అత్యంత సాధారణమైన రకాన్ని సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసస్(SLE) అని పిలుస్తారు. చర్మంపై దద్దుర్లు, కండరాలు బలహీనత, కీళ్ల వాపు ఇలా శరీరంలోని ఏదో ఒక సమస్యకు గురి చేస్తుంది. అసలు లూపస్ లక్షణాలు ఏంటి? ఎవర్ని ఎక్కుగా బాధించే అవకాశం ఉంది? తెలుసుకుందాం.ఎవరికి లూపస్ వచ్చే అవకాశం ఎక్కువ?ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1000 మందిలో ఒకరు ల్యూపస్ వ్యాధితో బాధపడుతన్నట్టు తెలుస్తోంది. మనదేశంలో ప్రతి లక్ష మందిలో 3.2 మంది ల్యూపస్ బారిన పడ్డారని అంచనా. ఎవరికైనా లూపస్ రావచ్చు, కానీ ఈ వ్యాధి ఎక్కువగా మహిళలను ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి, ఈ వ్యాధి ఉన్న 10 మంది పెద్దలలో 9 మంది మహిళలు ఉన్నారు. ఇది శ్వేతజాతి మహిళలకంటే ఆఫ్రికన్ అమెరికన్, హిస్పానిక్, ఆసియన్ , స్థానిక అమెరికన్ సంతతికి చెందిన మహిళల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. చర్మసంబంధమైన లూపస్: చర్మంపై దద్దుర్లు లేదా పుండ్లు వస్తాయి. సాధారణంగా బాగా ఎండధాటికి గురైనపుడు వస్తుంది. అయితే కొన్ని మందులకు రియాక్షన్ వల్ల కూడా ఇది రావచ్చు. సంబంధిత ఔషధం ఆపివేసిన తర్వాత లక్షణాలు తగ్గిపోతాయి.నియోనాటల్ లూపస్ : ఇది శిశువు తన తల్లి నుండి ఆటోఆంటిబాడీలను పొందినప్పుడు సంభవిస్తుంది (ఆటో యాంటిబాడీలు అనేవి రోగనిరోధక ప్రోటీన్లు, ఇవి పొరపాటున ఒక వ్యక్తి సొంత కణజాలాలను లేదా అవయవాలను లక్ష్యంగా చేసుకుని ప్రతిస్పందిస్తాయి). చర్మం, కాలేయం లూపస్ వ్యాధికి సరైన చికిత్స తీసుకుంటే ఆరు నెలల్లోనే నయమయ్యే అవకాశాలున్నాయి. ల్యూపస్ - లక్షణాలు ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో ఒకటి ల్యూపస్. మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడినపుడు ఇది దాడి చేస్తుంది.మన ముందే చెప్పుకున్నట్టు ఇమ్యూనిటీ పవర్ తగ్గిన సందర్బంలో ఏ అవయవాన్నైనా ల్యూపస్ వ్యాధి సోకుతుంది. సాధారణంగా చర్మం, జుట్టు, కీళ్లు, కండరాలు, ఎముకలు దీనివల్ల ప్రభావితమవుతాయి. అందుకే చర్మంపై దద్దుర్లు, జుట్టు రాలిపోవడం, కీళ్లలో వాపులు, ఎముకల నొప్పులు, కండరాల పటుత్వం తగ్గిపోతుంది. ఒక్కోసారి జ్వరం కూడా రావచ్చు. లూపస్ ఉన్నవారిలో దాదాపు 50–90శాతం మందిలో తీవ్రమైన అలసట ఉంటుంది. ముఖంమీద బటర్ ఫ్లై ఆకారంలో ర్యాషెస్, నోట్లో పుండ్లు రావచ్చు. జుట్టు ఊడిపోతుంది. ఛాతీలో చొప్పి, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాచి. నాడీ వ్యవస్థ కూడా ప్రభావితమైతే ఆటో ఇమ్యూన్ కణాలు మెదడు పొరలపై దాడిచేస్తాయి. దీంతో వాపు లేదా ఇన్ ఫ్లమేషన్ లక్షణాలు కనిపిస్తాయి. ల్యూపస్ వ్యాధి సోకిన మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలొస్తాయి. అప్పటికే గర్భవతులుగా ఉంటే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. కిడ్నీలు ప్రభావితమైతే కిడ్నీ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది.నిర్ధారణ ఎలా?క్లినికల్ పరీక్షలు, రక్త పరీక్షలతో సహా పూర్తి వైద్య చరిత్ర ,శారీరక పరీక్షను నిర్వహించాలి.. రోగ నిర్ధారణ చేయడానికి వైద్యుడు చర్మం మరియు మూత్రపిండాల బయాప్సీలు (యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ (ఎఎన్ఎ) అనే పరీక్ష ద్వారా లూపస్ వ్యాధిని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. రోగి లక్షణాలు, ఏ అవయవానికి సోకింది అనేదానిపై ఆధారణపడి బయాప్సీ, కిడ్నీ ఫంక్షనింగ్ టెస్టు, బ్రెయిన్ సిటి స్కాన్ లాంటి పరీక్షల ద్వారా వైద్యులు నిర్దారిస్తారు. చికిత్స ఏంటి?నిజం చెప్పాలంటే ల్యూపస్ వ్యాధికి శాశ్వత చికిత్స అంటూ ఏమీ లేదు. ఉపశమన చికిత్స మాత్రమే. సోకిన అవయవం,లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స ఉంటుంది ఏయే అవయవాలపై వ్యాధి ప్రభావం ఉందనే దాన్ని బట్టి రుమటాలజిస్ట్ , నెఫ్రాలజిస్ట్ (మూత్రపిండ వ్యాధి), హెమటాలజిస్ట్ (రక్త రుగ్మతలు), చర్మవ్యాధి నిపుణుడు (చర్మ వ్యాధులు), న్యూరాలజిస్ట్ (నాడీ వ్యవస్థ), కార్డియాలజిస్ట్ (గుండె, రక్తనాళ సమస్యలు) ఎండోక్రినాలజిస్ట్ (గ్రంధులు మరియు హార్మోన్లు)ను సంప్రదించాల్సి ఉంటుంది. నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు తీసుకోవాలి. ఇమ్యూనిటీని పెంచుకునే ఆహారాన్ని విరివిగా తీసుకోవాలి. దీంతో పాటు, సమతులం ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం,సరియైన నిద్ర చాలా అసవరం. -
ఇంట్లోనే ఇన్స్టంట్ గ్లో..!
మామూలుగా చాలా నిరాడంబరంగా ఉండేవారు సైతం ఏదైనా పార్టీ అనగానే ఇన్స్టంట్ గ్లో రావాలంటే ఏం చేయాలో అప్పటికప్పడు ప్లాన్స్ చేసుకునేవారుంటారు. ఇలాంటప్పుడు కొన్ని సమస్యలూ తలెత్తవచ్చు. ముందుగా కొద్దిపాటి అవగాహనతో చర్మ సంరక్షణ పట్ల జాగ్రత్త తీసుకుంటే ఇంట్లోనే ఇన్స్టంట్ గ్లో పొందవచ్చు. ఐసింగ్ ... మేకప్‌కు ముందు చర్మం బిగుతుగా, తాజాగా కనిపించడానికి ఐస్‌క్యూబ్స్‌తో మసాజ్ చేసుకుంటారు. దీంతో పోర్స్ మూసుకుపోయి, మేకప్ తాజాగా కనిపిస్తుంది. అరగంట ముందు రోజ్ వాటర్, గ్లిజరిన్ కలిపి ముఖానికి అప్లై చేస్తారు. పాలతో కూడా చర్మాన్ని మసాజ్ చేసుకోవచ్చు. పాలలో మైల్డ్ లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి చర్మానికి హాని కలగదు.ప్రొడక్ట్స్‌తో జాగ్రత్త... ఇన్స్టంట్ గ్లో కోసం కొన్ని ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే, సున్నితమైన చర్మం గలవారు, ఎగ్జిమా వంటి సమస్యలు ఉన్నవారు ఆ ప్రొడక్ట్స్ గురించి తెలియక వాడితే మరిన్ని కొత్త సమస్యలు తలెత్తవచ్చు. ఇంట్లో వాడే ప్రొడక్ట్స్ ఏవైనా నిపుణులు సూచనలతో వాడటం మేలు.ఫేసియల్స్... ఇన్స్టంట్ గ్లో కోసం కెమికల్ పీల్, పంప్కిన్ పీల్, హైడ్రా ఫేసియల్స్... వంటివి కొంత తాజాదనాన్ని ఇస్తాయి. అయితే, వీటిని వేడుక ఉన్న రోజే కాకుండా రెండు, మూడు రోజుల ముందు నిపుణుల ఆధ్వర్యంలో ప్రయత్నించాలి. ఫేసియల్స్కి వాడక్ట్స్ మీ చర్మతత్వానికి సరిపడతాయో లేదో ముందస్తుగా చెక్ చేసుకొని వాడటం మంచిది. లేజర్ వంటి ఇతర బ్యూటీ ట్రీట్మెంట్లు అయితే నిపుణుల ఆధ్వర్యంలో వేడుకకు కనీసం 10–15 రోజుల ముందు చేయించుకోవడం వల్ల చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది. డాక్టర్ స్వప్నప్రియ, క్లినికల్ డెర్మటాలజిస్ట్ (చదవండి: సోనమ్ కపూర్ వాచ్ ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!) -
అందాల చందమామ కాజల్! ఆ సీక్రెట్ ఏంటంటే..
'అందం అమ్మాయైతే నీలా ఉంటుందే...' అనేలా ఉంటుంది కాజల్ అగర్వాల్. చందమామలాంటి మోముతో చూడముచ్చటగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లితో హీరోయిన్ల కథ కంచికి అనుకుంటారు. కానీ కాజల్ విషయం అందుకు విరుద్ధం. పెళ్లై ఓ బిడ్డకు తల్లైనా ఇప్పటకీ అంతే గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. పైగా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో కాజల్ ఇంతలా గ్లామర్‌ని మెయింటైన్ చేసేందుకు ఏం చేస్తుందో, అలాగే ఫిట్‌గా ఉండేందుకు ఎలాంటి డైట్ ఫాలో అవుతుందో సవివరంగా తెలుసుకుందామా..!కాజల్ అందం, ఫిట్నెస్ గురించి అభిమానుల్లో ఎల్లప్పడూ చర్చనీయాంశమే. ఆమె ఇప్పటికీ అలానే ఉందంటూ మాట్లాడుకుంటుంటారు. పెళ్లైతే ఎలాంటి హీరోయిన్ల క్రేజ్ అయినా తగ్గిపోతుంది. కానీ కాజల్ విషయంలో నో ఛాన్స్ చెప్పేస్తున్నారు అభిమానులు. అంతలా సహజ సౌందర్యంతో మైమరిపించే కాజల్ ఓ ఇంటర్వ్యూలో తన అందం, ఫిటెనెస్ల సీక్రెట్ గురించి షేర్ చేసుకుంది. అందం కోసం..కాజల్ తప్పనిసరిగా మాయిశ్చరైజింగ్, సన్‌స్క్రీన్, హైడ్రేషన్ నైట్ సిరమ్‌లు తప్పనిసరిగా వాడతానని అంటోంది. అవి తన చర్మాన్ని ప్రకాశంతంగా కనిపించేలా చేస్తాయని తెలిపింది. స్కిన్ గ్లో కోసం ప్రత్యేకమైన కేర్ తీసుకుంటానంటోంది. ఫిట్నెస్ కోసం..ఎంత బిజీ షెడ్యూల్ అయినా వ్యాయామాలు, యోగా, వర్కౌట్లు స్కిప్ చేయనని చెబుతోంది. సినిమా షూటింగ్‌లు, కుటుంబానికి సంబంధించిన కమిట్మెంట్స్ ఉన్నా సరే..రోజువారి దినచర్యలో భాగమైన వ్యాయామాలను చేసే తీరతానని అంటోంది. అలాగే ప్రతిరోజు కనీసం 30-40 నిమిషాలు పైలెట్స్ చేసేలా లక్ష్యం పెట్టుకుంటానని చెబుతోంది. డైట్ కోసం..సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇస్తానంటోంది. తాజా పండ్లు, ఆకుకూరలు, కొబ్బరి నీళ్లు, రోజువారీ డైట్లో తప్పనిసరి అని చెబుతోంది. పైగా పండ్ల సహజ చక్కెరలతో తక్షణ శక్తి, ఆకుకూరల ద్వారా పోషకాలు, నట్స్ ద్వారా అవసరమైన కొవ్వులు అందుతాయని చెబుతోంది. కొబ్బరి నీరు తన దినచర్యలో భాగమని అంటోంది. ఇది తనను హైడ్రేటెడ్‌గా ఉంచడమే గాక రిఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. తాను ఎలాంటి మోడ్రన్ డైట్లు ఫాలోకానని తేల్చి చెప్పింది. ఆరోగ్యకరమై డైట్‌తో ఫిట్‌గా, అందంగా ఉండేలా కేర్ తీసుకుంటానని పేర్కొంది కాజల్.(చదవండి: ఏడు పదుల వయసులోనూ ఎంతో చలాకీగా, ఫిట్‌గా శక్తికపూర్..! హెల్త్ సీక్రెట్ ఇదే..) -
పెదవులు గులాబీ రంగులో మెరవాలంటే ..!
చలికాలంలో పెదాలు పొడిబారినట్లుగా అయిపోయవడమే గాక ముఖం, చర్మం కాంతి విహీనంగా మారుతుంది. ఓపక్క పని ఒత్తిడి వల్ల కళ్లకింద నలుపు, ముఖంంపై ముడతలతో అందవిహీనంగా కనిపిస్తుంది. ఇలాంటి వాటిని ఆరోగ్యం కోసం తినే ఫ్రూట్స్‌తో చెక్‌పెడదాం. అదెలాగో చూద్దామా..కీరదోసకాయని చక్రాల్లా కోసుకుని కళ్ళమీద పెట్టుకుంటే కంటి అలసట తగ్గుతుంది. రెండు స్పూన్ల చల్లని పాలలో కాటన్ బాల్స్‌ని ముంచి కళ్ళ చుట్టూ వలయాకారంగా మర్ధించి 20 నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కంటి కింద నలుపు తగ్గి అందంగా ఉంటాయి. మెడ మురికి పట్టేసినట్లు నల్లగా ఉంటే... నాలుగు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో రెండు స్పూన్ల బియ్యప్పిండి కలిపి మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మానికి పట్టిన నలుపుతోనాటు ముడతలుపోతాయి.టీ స్పూన్ అరటిపండు గుజ్జులో టీస్పూన్ తేనె కలిపిన మిశ్రమాన్ని పెదవులకు రాసి మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే నల్లని పెదవులు గులాబీ రంగులోకి మారతాయి.టీస్పూన్ పాల మీగడ, అయిదారు గులాబి రేకులు తీసుకుని పేస్ట్ చేసిన మిశ్రమాన్ని పెదవులకు రాసుకుంటే పెదవులు పొడిబారకుండా మృదువుగా ఉంటాయి. చలికాలంలో లిప్‌స్టిక్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. లిప్ గార్డ్, మీగడ, వెన్న, నెయ్యి వంటివి రాసుకుంటూ ఉంటే పెదవులు పొడిబారకుండా అందంగా ఉంటాయి. టీ స్పూన్ ఆపిల్ గుజ్జులో టీ స్పూన్ అరటిపండు గుజ్జు, అయిదారు చుక్కల తేనె వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ఏర్పడ్డ ముడతలు, జిడ్డు తగ్గి ముఖం మెరుస్తూ కాంతివంతంగా ఉంటుంది. (చదవండి: ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?) -
చలి పులి వచ్చేస్తోంది నెమ్మదిగా...ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
నెమ్మదిగా చలి ముదురుతోంది. వెచ్చని దుప్పట్టు, చలిమంటలు కాస్త ఊరటనిచ్చినా ఇంకా అనేక సమస్యలు మనల్ని వేధిస్తుంటాయి. ముఖ్యంగా శీతగాలులకు శ్వాసకోశ వ్యాధులు, చర్మ సమస్యలు బాగా కనిపిస్తాయి. మరి ఈ సీజన్లో చర్మం పొడిబారకుండా, పగలకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఇదిగో మీ కోసం ఈ చిట్కాలు.పొడి బారే చర్మానికి మాయిశ్చరైజర్లు పదే పదే రాయాల్సి వస్తుంది. ఆ అవసరం లేకుండా, చర్మం మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.పాల మీగడలో తేనె కలిపి ముఖానికి, చేతులకు పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.చలికాలం రోజూ ఈ విధంగా చేస్తుంటే చర్మకాంతి కూడా పెరుగుతుంది. చర్మానికి సరైన పోషణ లేక లేకపోతే జీవ కళ కోల్పోతుంది. పాలు, బాగా మగ్గిన అరటిపండు గుజ్జు కలిపి మిశ్రమం తయారుచేసుకొని ప్యాక్ వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. జిడ్డుచర్మం గలవారు పాలు–రోజ్‌వాటర్ కలిపి రాసుకోవచ్చు. తర్వాత వెచ్చని నీటితో కడిగేయాలి. చర్మంపై ఎక్కువ మృతకణాలు కనిపిస్తే కలబంద రసంలో పది చుక్కల బాదం నూనె, నువ్వుల నూనె కలిపి ముఖానికి, చేతులకు రాయాలి. వృత్తాకారంలో రాస్తూ మర్దన చేయాలి.రాత్రంతా అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయం వెచ్చని నీటితో కడిగేయాలి.శీతాకాలంలో శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటేనే మెరుస్తూ ఉంటుంది. అలా ఉండాలంటే తగినన్ని నీళ్లు తాగాలి. (నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!)ఫ్యాటీఫుడ్స్కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, సీ విటమిన్ లభించే పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. రోజూ వాకింగ్, యోగా లాంటి వ్యాయామం చేస్తే శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో మన ముఖంలో చర్మకాంతిలో చక్కటి గ్లో వస్తుంది. -
సెన్సేషనల్ స్టార్ బ్యూటీ సీక్రెట్స్ : మేక పెరుగు, నెయ్యి, జ్యూస్‌లు
ఆర్ట్ కలెక్టర్, దాత సోషల్ మీడియా సెన్సేషన్, రియాలిటీ టీవీ స్టార్ షాలిని పాసి 'ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్' సిరీస్‌తో మరింత పాపులర్ అయిపోయింది. ఆమె అదిరిపోయే పంచ్ డైలాగులు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు 49 ఏళ్ల వయసులో ఇంత అందంగానా? శిల్పం లాంటి ఆకృతి, మెరిసే చర్మం కోసం, ఆమె ఏమి తింటుంది అనేది చర్చకు తెరతీసింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో తన ఆహార నియమాలు, సౌందర్య రహస్యాలను బహిర్గతం చేసింది. షాలిని రోజువారీ ఆహారంలో ఎటువంటి ఘనమైన ఆహారం తీసుకోదట. సెలెరీ (ఆకుకూరలు)జ్యూస్, కూరగాయలతో చేసిన జ్యూస్‌లు, నెయ్యి, మేక పెరుగు ఖచ్చితంగా తీసుకుంటానని తాగా వెల్లడించింది. ప్రధానంగాకొంచెం వింతగా అనిపించినా తాను మేక పెరుగును ఎక్కువగా తీసుకుంటానని చెప్పింది. మేక పెరుగుతో ఎముకలు ,దంతాలు బలంగా ఉంటాయని వివరించింది. డైట్ మాత్రమే కాదు, రోజుకు రెండు గంటల వ్యాయామం తప్పకుండా చేస్తుందట.షానిలి డైట్ సీక్రెట్, ఆమె మాటల్లో ఉదయం ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటా.తర్వాత ఉసిరి అల్లం కలిపిన బీట్రూట్ రసం.డైట్లో హెర్బల్ లిక్విడ్లు, కూరగాయలజ్యూస్లు ఎక్కువ భాగం ఉంటాయి. రెండు గిన్నెల మొలకలను నమలడం కష్టం. అదే జ్యూస్ అయితే సులభంగా తాగవచ్చు. సెలెరీ జ్యూస్, రెడ్ జ్యూస్, స్ప్రౌట్ జ్యూస్, మిరియాలతో చేసే క్యాప్సికమ్ జ్యూస్ ఇలా చాలా ఉంటాయి.సాయంత్రం ఆహారంలో ప్రతిదీ సూప్ రూపంలో ఉంటుంది. వడకట్టకుండా, చిక్కగా ఉండే కూరగాయలను జ్యూస్‌లను తాగుతాను. ఇంకా బచ్చలికూర, బ్రోకలీ సూప్, టొమాటో, బెండ, తామర కాండం, బఠానీలు ఇలా ఏదైనా జ్యూస్ రూపంలోనే.సాయంత్రం 6 గంటల వరకు పచ్చి ఆహారం మాత్రమే .. రాత్రి 7 గంటలకు భోజనం. అదీ కూడా 'ఘర్ కా ఖానా (ఇంట్లో వండిన ఆహారం)'ఉండేలా చూసుకుంటా. కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడే సహజమైన వాటిని మాత్రమే తీసుకుంటాను.డిన్నర్లో అవకాడో, రాగి లేదా జొన్న పిండితో చేసిన దోసలు తింటానుఇక గుడికి వెళ్లని రోజుల్లో ప్రోటీన్ కోసం గుడ్డు, చేపలు లేదా చికెన్ తీసుకుంటా.సాయంత్రం 4 నుండి 6 వరకు నా వర్కౌట్ సమయం. కండరాలకు బలం చేకూర్చే పైలేట్స్ , డ్యాన్స్ చేస్తాను. ఆ సమయంలో నన్ను డిస్టర్బ్ చేయకూడదు. (ఫ్యాషన్‌తో దుమ్మురేపుతున్న షాలిని పాసి, ఒక్కో బ్యాగు ధర..!) -
ప్రొటీన్ పవర్‌హౌస్ బెండకాయ జిగురుతో మహిమలెన్నో!
బెండకాయతో బెనిఫిట్స్ జుట్టు, చర్మం, మోకాళ్ల నొప్పులు ఇంకా ఎన్నో బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికి రావు అనే సామెతవిన్నవారికి, దాని ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. బెండకాయతో ఆరోగ్య ప్రయోజనాలు, జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని రక్షించడంలో కాపాడటంలో ఎలా పనిచేస్తుంది. తెలుసుకుందాం ఈ కథనంలో.బెండకాయ, భేండీ, లేడీ ఫింగర్ పేరు ఏదైనా లాభాలు మాత్రం మెండు. బెండకాయ జుట్టు, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు బెండకాయ తినడం వల్ల మెదడు బాగా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుకే పిల్లలకి బెండకాయ ఎక్కువగా పెడుతూ ఉంటారు. బెండకాయలో పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి బెండకాయతో బోలెడన్ని రెసిపీలు చేసుకోవడం మాత్రమే కాదు, అలాగే మోకాళ్ల నొప్పులుతో బాధపడేవారు, వీర్యకణాలు తక్కువగా ఉండేవారు బెండకాయలను తీసుకోవాలని చెబుతారు. కెరటిన్ కూడా ఎక్కువే. అందుకే ఆరోగ్యకరమైన జుట్టుకు చర్మం సంరక్షణలో కూడా బెండకాయ బాగా పనిచేస్తుంది. బెండకాయ బాగా పనిచేస్తుంది. ప్రకృతి సహజంగా లభించే కెరటిన్‌తో జుట్టు సిల్కీగా, హెల్దీగా ఎదుగుతుంది.బెండకాయలో మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ కే2సీ, ఏ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆరోగ్యకరమైన గర్భధారణకు, గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయ పడుతుంది. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంది.పురాతన ఈజిప్టులోని స్త్రీలు బ్యూటీకోసం వాడేవారట. ఉపయోగించారు. బెండకాయలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌తో చర్మం మెరిసిపోతుంది. యాంటీ ఏజింగ్ సొల్యూషన్‌లా పనిచేస్తుంది. వీటిల్లోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , రీ-హైడ్రేటింగ్ లక్షణాల మొఖం మీద మొటిమలను విజయవంతంగా నిర్మూలిస్తుంది. బెండకాయ నీరుబెండకాయను ముక్కలుగా కట్ చేసి రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే, సుగర్వ్యాధి గ్రస్తుల్లో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. సల్యూబుల్ ఫైబర్, శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. వీర్యపుష్టికి పనిచేస్తుంది.బెండకాయలో ఉండే అధిక ఫైబర్ శాతం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తిని నివారించి, మలబద్దకానికి మంచి మందులాగా కూడా పనిచేస్తుంది. బెండకాయలో ఉండే మ్యూసిలేజ్ అనే పదార్ధం గ్యాస్, అజీర్ణం, కడుపు సమస్యలకుచెక్ పెబుతుంది. ఓక్రా పౌడర్‌తో ప్యాక్మెరిసే చర్మం కావాలంటే ఫేస్ ప్యాక్‌ను వాడవచ్చు. దీనికి కావాల్సిందల్లా రసాయన ఎరువులు వాడకుండా, సేంద్రీయంగా పండించిన బెండకాయలు. వీడిని ఎండబెట్ట పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌లో కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని మీ ముఖానికి అప్లై చేసి కనీసం 15 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. దానిని గోరువెచ్చని నీటితో కడిగేయండి. వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.బెండకాయలు ముక్కలుగా చేసి 10 నిమిషాలు నీటిలో ఉడకబెట్టండి. ఇందులో కొద్దిగా యోగర్ట్, ఆలివ్ నూనె కలిపి, మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్ముఖానికి రాసుకొని ,15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ను ఒక వారం పాటు ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు.ప్రొటీన్ల పవర్‌హౌస్ లేడీఫింగర్‌తో చుండ్రుకు చెక్ పెట్టవచ్చు. స్కాల్ప్‌ను తేమగా ఉంచుతుంది. దురదలు, జుట్టు పొడిబారడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఫ్రింజీగా ఉండే గిరిజాల జుట్టును మృదువుగా మారుస్తుంది. ఏం చేయాలంటే! కట్ చేసిన బెండకాయలను కాసేపు నీళ్లలో ఉడికించాలి. దీన్ని చల్లారేదాకా అలాగే ఉంచాలి. తరువాత ఈ వాటర్‌ను ఒక గాజు సీసాలోకి వడ బోసుకోవాలి. తలస్నానం చేసిన తరువాత ఈ నీళ్లను జుట్టంతా పట్టించాలి. 25 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇది మంచి కండీషనర్‌గా పనిచేసి ఎలాంటి జిట్ట జుట్టునైనా మృదువుగా మార్చేస్తుంది. -
ఔషధాల సిరి ఉసిరి : జుట్టు, చర్మ సంరక్షణలో భళా!
ఔషధాల సిరి ఉసిరి. దీని ద్వారా లభించేఆరోగ్య ప్రయోజనాల ఉగరించి ఎంత చెప్పుకునే తక్కువే.చర్మం, జుట్టు ఇలా శరీరంలోని ప్రతి అవయవానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. విటమిన్ సీ పుష్కలంగా లభించే ఉసిరిలో పొటాషియం, కాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్, కెరోటిన్, ఐరన్, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, జీవక్రియను, దీర్ఘాయువును పెంచడానికి ప్రతిరోజూ ఉసిరి తినాలని చెబుతారు. మనస్సు , శరీరం రెండింటి పనితీరుకు సహాయపడే తీపి, పులుపు, చేదు, ఘాటైన ఐదు రుచులతో నిండిన 'దివ్యౌషధం ఇది. వసాధారణంగా అక్టోబర్ ,నవంబర్ మధ్య వచ్చే కార్తీక మాసంలోదీనికి ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాముఖ్యతుంది. శివుడికి ప్రీతిపాత్రమైందిగా భావిస్తారు.ఉసిరితో వాత, కఫ , అసమతుల్యత కారణంగా సంభవించే వివిధ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, సాధారణ జలుబు, ఫ్లూ, ఇతర ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్ కేన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఉసిరికాయతో పచ్చళ్లు, స్వీట్ తయారు చేస్తారు. ఉసిరికాయ గింజలు కూడా మనకు ఎంతో మేలుస్తాయి. అయితే దీనిని పచ్చిగా, రసం, చూర్ణం, మిఠాయి, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చు. జుట్టుకుఆమ్లా ఆయిల్‌తో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగా ఫోలికల్స్ బలపడతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. నల్లగా నిగనిగ లాడే మెరుపు వస్తుంది. జుట్టును బలోపేతం చేయడమే కాదు తొందరగా తెల్లబడకుండా కూడా చేస్తుంది. స్కాల్ప్‌ను కూడా బలపరుస్తుంది. చుండ్రు రాకుండా కాపాడుతుంది. చర్మం కోసంసహజ రక్త శుద్ధిలా పనిచేస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా చేస్తుంది. మొటిమలు, మచ్చలు, ముడతలను నివారణలో సహాయపడుతుంది. జీవనశైలి,కాలుష్యం, సూర్యరశ్మితో వచ్చే స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. అంతేకాదు ఉసిరి కుష్టు వ్యాధి, సోరియాసిస్, చర్మ అలెర్జీలు , తామర వంటి వివిధ చర్మ పరిస్థితుల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుందని చెబుతారు.యాంటీ ఏజింగ్ పవర్హౌస్లా పనిచేస్తుంది. ఆమ్లా పేస్ట్ లేదా పౌడర్‌తో ఫేస్ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల చర్మానికి తేలికపాటి ఎక్స్‌ఫోలియేషన్‌ను అందిస్తుంది, మృత చర్మ కణాలను,మలినాలను సమర్థవంతంగా తొలగిస్తుంది.మచ్చలపై ఉసిరి పేస్ట్‌ను అప్లయ్ చేయవచ్చు. ఉసిరి రసాన్ని వాడవచ్చు. లేదా ఫేస్ ప్యాక్‌గా కూడా అప్లై చేయవచ్చు. -
ఫెస్టివ్ సీజన్లో మెరిసివాలంటే ఇదిగో చిట్కా, చిటికెలో మ్యాజిక్!
గులాబీలంటే అందరికీ ఇష్టమే. ఒకలాంటి మత్తు వాసనతో కూడిన మృదువైన శృంగార భరిత పువ్వులు. రోజెస్ కేవలం అలకరణకు మాత్రమే కాదు సౌందర్య సంరక్షణలో కూడా అమృతంలా పనిచేస్తాయి. గులాబీ పువ్వుల నుంచి తీసిన రోజ్ వాటర్ ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాలుగా చర్మం, జుట్టు రక్షణలో వినియోగిస్తున్నారు. ఇందులో యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. అందుకే అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలోదీన్ని విరివిగా ఉపయోగిస్తారు. స్వచ్ఛమైన రోజ్ వాటర్‌తో అద్భుతమైన ప్రయోజనాలు, ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం పదండి!మార్కెట్లో దొరికే రోజ్ వాటర్‌కు బదులుగా ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సులభం. బయట లభించే రోజ్ వాటర్‌లో హానీకరమైన కెమికల్స్ ఉంటాయి. దీని వల్ల మొటిమలు, మచ్చలు వచ్చే అవకాశం ఉంది. అందుకే సహాజంగా ఇంట్లోనే రోజ్ వాటర్ తయారు చేసుకోవడం ఉత్తమం. తయారీ చాలా సులువు కూడా.రోజ్ వాటర్ ఉపయోగాలు అన్ని రకాల చర్మాలకు చక్కగా పనిచేస్తుంది.చర్మాన్ని చల్లబర్చి ,మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. ఎర్రబడటం, మంటను తగ్గించడంలో రోజ్ వాటర్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరచి, పీహెచ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.చర్మాన్ని తేమగా ఉంచి, ఫ్రెష్‌గా, మెరిసేలా చేస్తుంది. సన్ బర్న్స్ తగ్గిస్తుంది.విటమిన్ ఏ సీ పుష్కలంగా ఉండే రోజ్ వాటర్ కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది.చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, ముడతలు పడకుండా తొలగిస్తుంది. చర్మంపై మచ్చలు కాలిన గాయాలను నయం చేసే అద్భుత సామర్థ్యం రోజ్ వాటర్‌లో ఉంది. కలిగి ఉంటాయి.ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలిచీడ పీడ లేని తాజా గులాబీరేకులను శుభ్రంగా నీటిలో బాగా కడగండి. ఒక గిన్నెల నీళ్లు తీసుకొని బాగా మరిగించడం. ఆ నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గులాబీ రేకులను నీటిలో వేసి, తరువాత స్టవ్ ఆఫ్ చేయండి. దీన్ని కనీసం 4-5 గంటలు అలానే పక్కనపెట్టండి. దీంతో గులాబీ రేకుల్లోని లక్షణాలన్నీ ఆ నీటిలోకి చేరతాయి. బాగా చల్లారిన తరువాత చక్కగా వడబోసుకుని తడిలేని గాజు సీసాలోకి తీసుకోవాలి. మంచి సువాసనతో ఉన్న ఈ రోజ్ వాటర్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. ఎలా వాడాలి?రోజూ ముఖం కడిగిన తర్వాత రోజ్ వాటర్‌తో ముఖం తుడుచుకుంటే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. డార్క్ సర్కిల్స్ ఉన్నవారు రోజ్ వాటర్‌లో ముంచిన కాటన్ బాల్స్‌ను ప్రతిరోజు ఉపయోగిస్తే నల్ల వలయాలు క్రమంగా తగ్గుతాయి. ఇందులోని యాంటీ ఏజింగ్ లక్షణాలు ముఖాన్ని కాంతివంగా మెరిసేలా చేస్తాయి. ముల్తానా మట్టి, ఇతర ఫేస్‌ప్యాక్‌లలో నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలిపితే మరింత ఫ్రెష్‌లుక్ వస్తుంది. -
మీ ముఖాన్ని.. మెరిపించే మంత్రదండం!
ముఖ వర్చస్సును మెరుగుపరచే ఈ పరికరం అందానికి అసలైన సాధనం అంటున్నారు వినియోగదారులు. ఇది కళ్లచుట్టూ ఉండే వాపును, నల్లటి వలయాలను ఇట్టే తగ్గిస్తుంది. వయసుతో వచ్చే చర్మసమస్యలను వేగంగా రూపుమాపుతుంది. ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. సౌందర్యాన్ని కోరుకునే మహిళలకు ఇది మంత్రదండం లాంటిది.అర్గనామిక్ డిజైన్ ను కలిగి ఉన్న ఈ మెషిన్ చేతిలో చక్కగా ఇమిడిపోతుంది. ట్రీట్మెంట్కి అనువుగా ఉంటుంది. సుతిమెత్తని శరీరభాగాల్లో సులభంగా మూవ్ అవుతుంది. కళ్ల పక్కన ఇరుకైన ప్రదేశాల్లో అటు ఇటు కదిలించి మసాజ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇందులోని క్రియోథర్మల్ టెక్నాలజీ వల్ల దీనిలో కూలింగ్‌తో పాటు హీటింగ్ మోడ్ కూడా ఉంటుంది. కోల్డ్ ట్రీట్మెంట్ మోడ్ చర్మాన్ని 50నిఊ వరకు చల్లబరుస్తుంది, ఇది రంధ్రాలను బిగించి, ముఖాన్ని కాంతిమంతం చేస్తుందిఇక హీట్ మోడ్ 108నిఊ వరకు చేరి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనికి ఉన్న క్యాప్‌ను తొలగించి, దీని హెడ్‌ను చర్మానికి ఆనించి, మెషిన్ ఆన్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. రెడ్ కలర్ హీట్ మోడ్‌ను, బ్లూ కలర్ కూల్ మోడ్‌ను సూచిస్తుంది. ముందే చార్జింగ్ పెట్టుకుని వైర్‌లెస్‌గా కూడా వినియోగించుకోవచ్చు. ఇలాంటి పరికరాలను కొనుగోలు చేసేటప్పుడు ఆన్లైన్లో పలు రివ్యూస్ చూసి తీసుకోవడం మంచిది.ఇవి చదవండి: పళ్ల చిగుళ్ల.. సమస్య! ఏ ట్రీట్మెంట్ వాడాలి? -
Snake Fruit: స్నేక్ ఫ్రూట్!
‘స్నేక్ ఫ్రూట్’ లేదా సలక్ ఫ్రూట్. శాస్త్రీయ నామం సలక్క జలక్క. అరెకేసియే కుటుంబం. ఈత, ఖర్జూర వంటి పామ్ జాతికి చెందిన ఒక రకం. ఇండోనేషియాలోని జావా, సుమత్ర ప్రాంతం దీని పుట్టిల్లు. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ వంటి ఈశాన్య ఆసియా దేశాల్లో విస్తారంగా సాగులో ఉన్న పండు. లేత కాఫీ రంగులో ఉండే ఈ పండు పైన పోలుసు పాము చర్మంపై పోలుసులను పోలి ఉంటుంది. అందుకే కాబోలు, దీనికి స్నేక్ ఫ్రూట్ లేదా స్నేక్ స్కిన్ ఫ్రూట్ అంటారు. పండిన అంజూర పండు సైజులో, అదే ఆకారంలో స్నేక్ ఫ్రూట్ ఉంటుంది. పైపోర పెళుసుగా ఉంటుంది. పైపోరను ఒలిస్తే లోపల తెల్లటి రెబ్బలు (వెల్లుల్లి రెబ్బల మాదిరిగా) ఉంటాయి. వాటి లోపల గోధుమ రంగు గింజలు ఉంటాయి. గింజలు తీసేసి ఈ రెబ్బల్ని తినాలి. రుచి గమ్మత్తుగా, విలక్షణంగా ఉంటుంది. ద ఫ్యూచర్ ఆఫ్ ద హెల్త్ అని, సూపర్ హీరోస్ ఆఫ్ ఫంక్షనాలిటీ అని దీన్ని వ్యవహరిస్తుంటారు. సలక్కు ఇంకా చాలా పేర్లున్నాయి. ఇండోనేషియాలో పోందో, థాయ్‌లాండ్‌లో రకం, చైనాలో సలక లేదా షి పై గ్యో జాంగ్, మయన్మార్‌లో ఇంగన్ అని పిలుస్తున్నారు. న్యూ గినియ, ఫిలిప్పీన్స్, క్వీన్స్లాండ్, ఉత్తర ఆస్ట్రేలియా, పోనపె ఐలాండ్ (కారోలిన్ అర్చిపెలాగో), చైనా, సూరినామ్, స్పెయిన్, ఫిజి తదితర దేశాల్లో స్నేక్ ఫ్రూట్‌ను సాగు చేస్తున్నారు. ఇండోనేషియాలోని ఇతరప్రాంతాల్లో దీన్ని ఆహార పంటగా సాగు చేస్తున్నారు.20 అడుగుల ఎత్తుస్నేక్ ఫ్రూట్ చెట్టుకు కాండం చాలా చిన్నది. అయితే, కొమ్మలు పెద్దగా 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ప్రతి కొమ్మకు ముళ్లతో కూడిన 2 మీటర్ల పోడవైన తొడిమె ఉంటుంది. ముల్లు 6 అంగుళాల వరకు పోడవుంటుంది. కొమ్మకు చాలా ఆకులుంటాయి. ఈ చెట్టు కాండానికి కాయలు గెలలుగా కాస్తాయి. ఆకు అడుగున లేత ఆకుపచ్చగా, పైన ముదురు ఆకుపచ్చగా ఉంటుంది. స్నేక్ ఫ్రూట్ మొక్క నాటిన తర్వాత 3–4 ఏళ్లలో కాపుకొస్తుంది. ఇప్పుడు ముళ్లు లేని వంగడాలు కూడా వచ్చాయి. ఆడ చెట్లు, మగ చెట్లు ఉంటాయి. కొన్ని రకాల స్నేక్ ఫ్రూట్ చెట్లలో (ఉదా.. సలక్ బాలి) ఆడ, మగ పూలు రెండూ ఒకే చెట్టుకు పూసి స్వపరాగ సంపర్కం చెందుతాయి. పూలు గుత్తులుగా పూస్తాయి. ఆడ పూలు 20–30 సెం.మీ., మగవి 50–100 సెం.మీ. పోడవు ఉంటాయి. పరాగ సంపర్కం కోసం మగ పూలలో 20%ని మాత్రమే ఉంచి, మిగతావి తొలగించాలి. మనుషులు చేతులతో పరాగ సంపర్కం చేయిస్తే పండ్ల దిగుబడి పెరుగుతుంది.తీపి కాదు, వగరుసలక్క చెట్ల రకాలు 21 జాతులున్నాయి. మలేషియాలో మూడు రకాలను పెంచుతున్నారు. ఎస్.గ్లాబెరెసెన్స్, ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన. ఎస్. గ్లాబెరెసెన్స్ను లోకల్ సలక్గా భావిస్తారు. దీని నుంచి 9 క్లోన్స్‌ను తయారు చేశారు. ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన రకాలు ఇండోనేషియా నుంచి మలేషియాకు వచ్చాయి. ఇక ఇండోనేషియాలో దేశీయ, విదేశీ మార్కెట్ల కోసం వాణిజ్యపరంగా ఎస్. జటక్క, ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన రకాలను సాగు చేస్తున్నారు. మనోంజయ, బొంగ్కాక్, బంజార్నెగర, కొండెట్, పోందో, బాలి, ఎన్రెంకంగ్, సైడెంపుయన్ వంటి అనేక రకాల స్నేక్ ఫ్రూట్ వంగడాలు సాగులో ఉన్నాయి. స్నేక్ ఫ్రూట్ తియ్యని పండు కాదు, కొంచెం వగరు. బోంగ్కాక్ రకం పండు మరీ ఎక్కువ వగరు. మిగతా రకాల కన్నా తక్కువ తీపి కలిగి ఉంటుంది.పుష్కలంగా పోషకాలుస్నేక్ ఫ్రూట్లో ఇతర పండ్లతో పోల్చినప్పుడు అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. సుక్రోజ్ (7.6 గ్రా/100 గ్రా.), ఫ్రక్టోజ్ (3.9 గ్రా/100 గ్రా.), టోటల్ సుగర్ (17.4 గ్రా./100 గ్రా.), జీర్ణమయ్యే పీచు (0.3 గ్రా./100 గ్రా.), జీర్ణం కాని పీచు (1.4 గ్రా./100 గ్రా.), టోటల్ డైటరీ ఫైబర్ (1.7 గ్రా./100 గ్రా.), నీరు (80గ్రా./100 గ్రా.), కేలరీలు (77 కిలోకేలరీలు/ 100 గ్రా.),ప్రోటీన్ (0.7గ్రా./100 గ్రా.), బూడిద (0.6గ్రా./100 గ్రా.), కొవ్వు (0.1 గ్రా./100 గ్రా.). ఉన్నాయి. సహజ పీచు, సుగర్స్‌కు స్నేక్ ఫ్రూట్ చక్కని వనరు. దీని గుజ్జులో మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఫాస్ఫరస్ (1161 ఎంజి/కేజీ), పోటాషియం (11.339 ఎంజి/కేజీ), కాల్షియం (220 ఎంజి/కేజీ), మెగ్నీషియం (607 ఎంజి/కేజీ), సోడియం (231 ఎంజి/కేజీ), ఐరన్ (12.0 ఎంజి/కేజీ), మాంగనీసు (10.4 ఎంజి/కేజీ), రాగి (3.36 ఎంజి/కేజీ), బోరాన్ (5.07 ఎంజి/కేజీ), సల్ఫర్ (5.07 ఎంజి/కేజీ), అస్కార్బిక్ ఆసిడ్ (400 ఎంజి/కేజీ), కెరోటిన్ (5 ఎంజి/కేజీ), థయామిన్ (20 ఎంజి/కేజీ), నియాసిన్ (240 ఎంజి/కేజీ), రిబోఫ్లావిన్ (0.8 ఎంజి/కేజీ), ఫొలేట్ (6 ఎంజి/కేజీ) మేరకు ఉన్నాయి. స్నేక్ ఫ్రూట్లో ఆరోగ్యదాయకమైన పీచు, పిండి పదార్థం నిండుగా ఉన్నాయి. ఇతర విదేశీ పండ్లతో పోల్చితే దీని గుజ్జులో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ పండును నేరుగా తినొచ్చు లేదా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. డ్రైఫ్రూట్స్, పచ్చళ్లు, చిప్స్, ఊరబెట్టి కూడా వాడుకుంటున్నారు. పోందో (ఇండోనేషియన్ సలక్) రకం లేత కాయలను గింజలతో సహా తినొచ్చు. స్నేక్ ఫ్రూట్ ఆకులను, రెమ్మలను కూడా చాపలు, బుట్టల అల్లికకు వాడుతున్నారు.50 ఏళ్ల పాటు దిగుబడిస్నేక్ ఫ్రూట్‌ను విత్తనాలతో మొక్కలు పెంచి నాటుకోవాలి. అయితే, 50% మాత్రమే ఆడ మొక్కలు వస్తాయి. పండు నాణ్యత ఒకే స్థాయిలో ఉంటుంది. తల్లి మొక్క లక్షణాలు పూర్తిగా రావాలంటే మాత్రం పిలకలు నాటుకోవాలి. 6–12 నెలల వయసు మొక్కను పైన ఆకుల నుంచి కింది వేర్ల వరకు నిలువుగా చీల్చి నాటుకోవచ్చు. పిహెచ్ 4.7 – 7.5 వరకు తట్టుకుంటుంది. లేత మొక్క నీడలో బాగా పెరుగుతుంది. వాణిజ్యపరంగా సాగయ్యే తోటల్లో కొబ్బరి, డ్యూరియన్ చెట్ల నీడన ఈ మొక్కల్ని పెంచుతుంటారు. నాటిన 3–4 ఏళ్లకు కాపు ్రపారంభం అవుతుంది. ఈ చెట్టు 50 ఏళ్ల పాటు హెక్టారుకు 5–15 టన్నుల పండ్ల దిగుబడినిస్తుంది. ఏటా నాలుగు సార్లు పూత వచ్చినప్పటికీ ఏప్రిల్ – అక్టోబర్ మధ్యలోనే పండ్లు వస్తాయి. మొక్కలు 60–70 సెం.మీ. ఎత్తు పెరిగిన 5–7 నెలల తర్వాత నాటుకోవాలి. గుంతలు 40“40“40 సెం.మీ. సైజులో తవ్వాలి. 1.5 “ 3 మీటర్ల నుంచి 2 “ 2 మీటర్ల దూరంలో నాటుకోవాలి. కొమ్మకత్తిరింపు, కలుపు తీత ప్రతి రెండు నెలలకోసారి చేస్తే పూత బాగా వస్తుంది. సరిగ్గా లేని లేదా పాడైన పండ్లను ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. గుత్తికి 20–25 పండ్లు ఉంటే దిగుబడి లాభదాయకంగా ఉంటుంది. సాధారణంగా వర్షాధారంగానే పెరుగుతుంది. కొమ్మ కత్తిరించినప్పుడు, పండ్లు ఎదుగుతున్న దశలో, వేడి సీజన్లలో నీరు అందించాలి. పూత దశలో, పండ్ల కోతకు ముందు రోజుల్లో తగుమాత్రంగా నీరివ్వాలి. ఎక్కువ నీరిస్తే కుళ్లిపోతాయి. వాణిజ్యపరంగా సాగు చేసే తోటల్లో అధిక దిగుబడి కోసం కూలీలతో పోలినేషన్ చేయిస్తారు. పువ్వు గట్టిపడితే పోలినేషన్ సక్సెస్ అయ్యిందని గుర్తు. మెత్తగానే ఉండిపోతే ఫెయిలైనట్లు గుర్తించి తొలగిస్తారు. పండు తగిన సైజు, రంగు వచ్చి, పండుపై ఉన్న సన్నని ముళ్లు ఊడిపోయిందంటే పక్వానికి వచ్చినట్లు గుర్తిస్తారు. పండు 70–80% పండినప్పుడు కూలీలతో పండ్లు కోయిస్తారు. తాజా పండ్ల మార్కెట్లో విక్రయించటంతో పాటు స్నేక్ ఫ్రూట్స్‌ను ఊరగాయ పచ్చడి పెడతారు. సుగర్, ఈస్ట్ కలిపి వైన్ తయారీలో కూడా స్నేక్ ఫ్రూట్స్ వాడుతున్నారు. -
Health: ఈ సమస్యలు.. కొనితెచ్చుకుంటున్నారా?
డెర్మోరెక్సియా... ఈ పదంలో డెర్మో ఉంది, కానీ ఇది చర్మ సమస్య కాదు. మానసిక సమస్య. ఒకరకంగా అనెరొక్సియా వంటిదే. సాధారణ బరువుతో ఉన్నప్పటికీ లావుగా ఉన్నామనే భ్రాంతికి లోనవుతూ సన్నబడాలనే ఆకాంక్షతో ఆహారం తినకుండా దేహాన్ని క్షీణింపచేసుకోవడమే అనెరొక్సియా. ఇక డెర్మోరెక్సియా అనేది చర్మం అందంగా, యవ్వనంగా, కాంతులీనుతూ ఉండాలనే కోరికతో విపరీతంగా క్రీములు వాడుతూ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడమే డెర్మోరెక్సియా. ఇటీవల మధ్య వయసు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది.ఆత్మవిశ్వాసానికి అందం కొలమానం కాదు! ‘అందం ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది’ అనే ప్రచారమే పెద్ద మాయ. సౌందర్య సాధనాల మార్కెట్ మహిళల మీద విసిరిన ఈ వల దశాబ్దాలుగా సజీవంగా ఉంది, ్రపాసంగిక అంశంగానే కొనసాగుతోంది. ఈ తరం మధ్య వయసు మహిళ ఈ మాయలో పూర్తిగా మునిగి΄ోయిందనే చె΄్పాలి. వార్ధక్య లక్షణాలను వాయిదా వేయడానికి, ముఖం మీద వార్ధక్య ఛాయలను కనిపించకుండా జాగ్రత్తపడడానికి యాంటీ ఏజింగ్ క్రీములను ఆశ్రయించడం ఎక్కువైంది. ఒక రకం క్రీము వాడుతూండగానే మరోరకం క్రీమ్ గురించి తెలిస్తే వెంటనే ఆ క్రీమ్‌కు మారి΄ోతున్నారు. వీటి కోసం ఆన్లైన్లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. క్రమంగా ఇది కూడా ఒక మానసిక సమస్యగా పరిణమిస్తోందని చెబుతున్నారు లండన్ వైద్యులు.క్రీమ్‌ల వాడకం తగ్గాలి! లుకింగ్ యూత్‌ఫుల్, ఫ్లాలెస్ స్కిన్ కోసం, గ్లాసీ స్కిన్ కోసం అంటూ ప్రచారం చేసుకునే క్రీమ్‌లను విచక్షణ రహితంగా వాడుతూ యాక్నే, ఎగ్జిమా, డర్మటైటిస్, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. గాఢత ఎక్కువగా ఉన్న గ్లైకోలిక్ యాసిడ్, నియాసినామైడ్, రెటినాల్, సాలిసైలిక్ యాసిడ్, అల్ఫా హైడ్రాక్స్ యాసిడ్స్ చర్మానికి హాని కలిగిస్తున్నాయి. అలాగే చర్మం మీద మృతకణాలను తొలగించడానికి చేసే ఎక్స్ఫోలియేషన్ విపరీతంగా చేయడం వల్ల చర్మం మరీ సున్నితమై΄ోతోంది. కళ్లచుట్టూ ఉండే చర్మం మీద ఈ క్రీమ్‌లను దట్టంగా పట్టించడం వల్ల ఆర్బిటల్ ఏరియాలో ఉండే సన్నని సున్నితమైన రక్తనాళాలు పలుచబడి వ్యాప్తి చెందుతాయి. దాంతో కళ్ల కింద చర్మం ఉబ్బెత్తుగా మారుతుంది. డెర్మోరెక్సియాను గుర్తించే ఒక లక్షణం ఇది. డెర్మోరెక్సియాను నిర్ధారించే మరికొన్ని లక్షణాలిలా ఉంటాయి. – చర్మం దురదగా ఉండడం, మంటగా అనిపించడం, ఎండకు వెళ్తే భరించలేక΄ోవడం – తరచూ చర్మ వ్యాధి నిపుణులను కలవాల్సి రావడం, ఎన్ని రకాల చికిత్సలు తీసుకున్నప్పటికీ సంతృప్తి కలగక΄ోవడం. – చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తరచూ అద్దంలో చూసుకుంటూ అసంతృప్తికి లోనవడం. తళతళ మెరిసే గ్లాసీ స్కిన్ కోసం చర్మం మీద ప్రయోగాలు చేయడం – షెల్ఫ్‌లో అవసరానికి మించి రకరకాల బ్యూటీ ్ర΄ోడక్ట్స్ ఉన్నాయంటే డెర్మోరెక్సియాకు దారితీస్తోందని గ్రహించాలి. మధ్య వయసు మహిళలే కాదు టీనేజ్ పిల్లల విషయంలో కూడా ఈ లక్షణం కనిపించవచ్చు. పేరెంట్స్ గమనించి పిల్లలకు జాగ్రత్తలు చె΄్పాలి.ఓసీడీగా మారకూడదు..శరీరం అందంగా కనిపించట్లేదనే అసంతృప్తి వెంటాడుతూనే ఉండడం బాడీ డిస్మార్ఫోఫోబియా అనే మానసిక వ్యాధి లక్షణం. ముఖం క్లియర్‌గా, కాంతిమంతంగా కనిపించాలనే కోరిక మంచిదే. కానీ అది అబ్సెషన్‌గా మారడం ఏ మాత్రం హర్షణీయం కాదు. ఇది ఎంత తీవ్రమవుతుందంటే... అందంగా కనిపించడానికి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకోవడం, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ, ఆ ట్రీట్మెంట్లో ఎంత మంచి ఫలితం వచ్చినప్పటికీ సంతృప్తి చెందక΄ోవడం, తీవ్రమైన అసంతృప్తితో, ఎప్పుడూ అదే ఆలోచనలతో మానసిక ఒత్తిడికి లోనుకావడం వంటి పరిణామాలకు దారి తీస్తుంది. మెదడు ఇదే ఆలోచనలతో నిండి΄ోయినట్లయితే కొంతకాలానికి ఆ సమస్యకు వైద్యం చేయాల్సి వస్తుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఆ గీతను అర్థం చేసుకోవాలి..ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు, ఆ సంభాషణ తాలూకు విషయమే ముఖ్యం. అంతే తప్ప వారి ముఖం ఎలా ఉంది అనేది పట్టించుకునే అంశం ఏ మాత్రం కాదు. అందం– ఆత్మవిశ్వాసం ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయనేది కొంతవరకే. ఆత్మవిశ్వాసానికి అందం గీటురాయి కానేకాదు. ఈ సన్నని గీతను అర్థం చేసుకోవాలి. సాధారణంగా వయసుతోపాటు దేహంలో మార్పు వస్తుంటుంది. ఆ మార్పు ప్రభావం చర్మం మీద కనిపిస్తుంటుంది. ఈ మార్పును స్వీకరించాల్సిందే. చర్మం కాంతిమంతంగా ఉండడం కోసం రసాయన క్రీములను ఆశ్రయించడం కంటే మంచి ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవనశైలి, మంచి నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి. – ప్రొఫెసర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై, హెచ్‌వోడీ, సైకియాట్రీ విభాగం, కాకతీయ మెడికల్ కాలేజ్ఇవి చదవండి: Lathika Sudhan: రేకులు విప్పిన కలువ.. కొలనైంది! -
సాల్మన్ చేపలతో సౌందర్యం..!
మాంసాహారులు ఇష్టంగా తినే సాల్మన్ చేపలు సౌందర్య సంరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మొటిమలు సమస్య నుంచి ముడతల వరకు ప్రతి చర్మ సమస్యలో సమర్థవంతంగా పోరాడటంలో తోడ్పడుతుందని తెలిపారు నిపుణులు. అదెలాగో సవివరంగా చూద్దాం..!.ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం తప్పనిసరిగా సాల్మన్ చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబతున్నారు నిపుణులు. ఇది చర్మానికి కావాల్సిన ఆర్థ్రీకరణ పెంచడంలోనూ, ముడతలతో పోరాడటంలోనూ సహాయపడుతుందట. ఈ సాల్మన్ చేప ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటుంది. అందువల్ల ఇవి చర్మం తోపాటు మొత్తం ఆరోగ్యానికి అద్భుతమైనవి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు తేమ అవరోధాన్ని నిర్వహించడమేగాక చర్మం బొద్దుగా, మృదువుగా ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు కాలుష్యం, యూవీ కిరణాల వల్ల వాటిల్లే నష్టం నుంచి రక్షిస్తాయి. దీనిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని డ్రై కానివ్వవు. తేమను లాక్ చేసి రోజంతా తాజాగా హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తాయి. మొటిమలను నియంత్రిస్తాయి. అలాగే మొటిమలు వల్ల ఎదురయ్యే మంటను కూడా నివారిస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.చర్మాన్ని యవ్వనంగా, దృఢంగా ఉండేలా చేయడంలో కొల్లాజెన్ కీలకం. సాల్మన్లోని అధిక స్థాయి ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు సహజంగా కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. అలాగే ముఖంపై ఏర్పడే గీతలు, ముడతలను తగ్గిస్తాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇందులోని విటమిన్ డీ చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది. పైగా ముఖ వర్చస్సు పెరుగుతుంది కూడా. అంతేగాదు స్కిన్ ఎలాస్టిసిటీని మెరుగుపరుస్తుంది. మచ్చలు వంటి వాటిని నివారించి స్కిన్ హీలింగ్‌కు మద్దుతిస్తుంది.(చదవండి: చట్నీ డే: చట్నీ, పచ్చళ్లు, పొడుల మధ్య వ్యత్యాసం..?) -
చర్మ సంరక్షణకు డార్క్ చాక్లెట్..!
చాక్లెట్ అంటే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా ఆస్వాదిస్తారు. ఓ చిన్న ముక్క నోట్లో వేసుకుని చప్పరిస్తే ఉండే ఆనందమే వేరబ్బా..!. అలాంటి చాక్లెట్ మీ ముఖ సౌందర్యానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలను ఇవ్వగలదని చెబుతున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. ఈ రోజు అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం సందర్భంగా డార్క్ చాక్లెట్ మీ చర్మ సంరక్షణకు ఎలా ఉపయోగపడుతుంది? దీని వల్ల కలిగే ప్రయోజనాలు గురించి నిపుణుల మాటల్లో సవివరంగా చూద్దాం. ఇది చర్మానికి మంచి సూపర్ పుడ్. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ చర్మానికి మెరుపుని అందించడంలో సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు. చర్మ సంరక్షణకు ఎలా ఉపయోగపడుతుందంటే..డార్క్ చాక్లెట్లో ఫ్లేవనాయిడ్స్ అనే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. అలాగే అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. ముఖంపై ఏర్పడే గీతలు, ముడతలను దూరం చేస్తుంది. హైడ్రేషన్ బూస్ట్: డార్క్ చాక్లెట్ తినడం వల్ల పోషకాలు చర్మ కణాలకు వేగంగా చేరుకుంటాయి. ఫలితంగా చర్మ హైడ్రేషన్‌ని పెంచి ముఖం మృదువుగా ఉండేలా చేస్తుంది. సన్ ప్రొటెక్షన్: ఇది సన్‌స్క్రీన్‌కు ప్రత్యామ్నాయం కానప్పటికీ డార్క్ చాక్లెట్ కొంత యూవీ సంరక్షణను అందిస్తుంది. చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్లు సూర్యరశ్మికి చర్మం ప్రతిఘటనను బలపరుస్తుంది. అలాగే కమిలిపోకుండా చేస్తుందిస్ట్రెస్ బూస్టర్: ఒత్తిడి చర్మాన్ని యవ్వన హీనంగా చేస్తుంది. దీనివల్ల పగుళ్లు ఏర్పడి నిస్తేజంగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే ఒత్తిడిని తగ్గించి, తాజా యవ్వన మెరుపును మరింత పెంచుతుంది.డిటాక్స్ డిలైట్: డార్క్ చాక్లెట్లో ఉండే మినరల్స్-జింక్, మెగ్నీషియం-కణ పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని త్వరగా రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.చాక్లెట్ స్మూతీ గ్లో: బచ్చలికూర, బాదం పాలు, అరటిపండుతో పాటు డార్క్ చాక్లెట్ చిన్న ముక్కను స్మూతీలో జోడించండి. ఈ రుచికరమైన మిశ్రమం అద్భుతమైన రుచిని మాత్రమే కాకుండా చర్మానికి లోపలి నుంచి అదనపు మెరుపును కూడా ఇస్తుంది.స్నాక్ స్మార్ట్: రోజువారీ చిరుతిండిలో భాగంగా 70% లేదా అంతకంటే ఎక్కువ డార్క్ చాక్లెట్‌ని చిన్న ముక్కగా తింటే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. చాక్లెట్ బాడీ స్క్రబ్: కరిగించిన డార్క్ చాక్లెట్, పంచదార, కొబ్బరి నూనెతో ఉల్లాసంగా ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్‌ను తయారు చేయండి. ఈ తీపి స్క్రబ్ శరీరాన్ని మృదువుగా చేయడమే గాక మృత కణాలను తొలగిస్తుంది. (చదవండి: స్ట్రిక్ట్ మామ్ కాజోల్: సరిగా చేస్తే హెలికాప్టర్ పేరెంటింగ్ విధానం బెస్ట్!) -
లోపలికి తొంగిచూడొచ్చు
1897లో వచ్చిన హెచ్‌జీ వేల్స్ ప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ నవల ‘ద ఇన్విజిబుల్ మ్యాన్’ గుర్తుందా? ఒంట్లో కణాలన్నింటినీ పారదర్శకంగా మార్చేసే ద్రావకాన్ని హీరో కనిపెడతాడు. దాని సాయంతో ఎవరికీ కని్పంచకుండా ఎంచక్కా మాయమైపోతాడు. దీని స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. తాజాగా సైంటిస్టులు అలాంటి ఆవిష్కరణే చేశారు! అది కూడా సాదాసీదా ఫుడ్ కలరింగ్ ఏజెంట్ సాయంతో!! దాని సాయంతో తయారు చేసిన సరికొత్త ‘ద్రావకం’ చర్మాన్ని పారదర్శకంగా మార్చేస్తోంది. దాంతో ఒంట్లోని అవయవాలన్నింటినీ మామూలు కంటితోనే భేషుగ్గా చూడటం వీలుపడింది. దీన్నిప్పటికే ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించి చూశారు. ఈ ప్రయోగం మనుషులపైనా విజయవంతమైతే బయో జీవ రసాయన, వైద్య పరిశోధన రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలదని భావిస్తున్నారు... ఇలా సాధించారు... టార్ట్రాజైన్ అనే మామూలు పసుపు రంగు ఫుడ్ కలరింగ్ ఏజెంట్‌ను నీళ్లలో కలపడం ద్వారా చర్మాన్ని మాయం చేసే ద్రావకాన్ని సైంటిస్టులు తయారు చేశారు. ఈ మేజిక్‌ను సాధించేందుకు ఆప్టిక్ రంగ పరిజ్ఞానాన్ని వాడుకున్నారు. పసుపు రంగు కలరింగ్ ఏజెంట్‌లోని అణువులు మామూలుగానైతే కాంతిని విపరీతంగా శోషించుకుంటాయి. ముఖ్యంగా నీలి, అతినీల లోహిత కాంతిని తమగుండా వెళ్లనీయవు. కానీ దాన్ని నీటితో కలిపిన మీదట వచ్చే ద్రావకం పూర్తిగా పారదర్శక ధర్మాలను కలిగి ఉంటుంది. దాన్ని చర్మంపై రుద్దితే దాని కణజాలాలకు కాంతి పరావర్తక సామర్థ్యం లోపిస్తుంది. దాంతో ద్రావకం లోపలికి ఇంకుతూనే చర్మం కని్పంచకుండా పోతుంది! మరోలా చెప్పాలంటే ‘మాయమవుతుంది’. ఈ ద్రావకాన్ని తొలుత కోడి మాంసంపై రుద్దారు. ఫలితం సంతృప్తికరంగా అని్పంచాక ప్రయోగాత్మకంగా ఒక ఎలుకపై పరీక్షించి చూశారు. దాని తల, పొట్టపై ఉన్న చర్మం మీద ద్రావకాన్ని పూశారు. దాంతో ఆయా భాగాల్లో చర్మం తాత్కాలికంగా పారదర్శకంగా మారిపోయింది. ఫలితంగా తల, పొట్ట లోపలి అవయవాలు స్పష్టంగా కని్పంచాయి. ద్రావకాన్ని కడిగేసిన మీదట చర్మం ఎప్పట్లాగే కన్పించింది. పైగా ఈ ప్రక్రియలో ఎలుకకు ఎలాంటి హానీ కలగలేదు. రక్తనాళాలన్నీ కన్పించాయి ఎలుకల తలపై ద్రావకం రుద్దిన మీదట మెదడు ఉపరితలం మీది రక్తనాళాలు మామూలు కంటికే స్పష్టంగా కని్పంచాయి. అలాగే పొట్ట భాగంలోని అవయవాలు కూడా. ‘‘మౌలిక భౌతిక శాస్త్ర నియమాలు తెలిసినవారికి ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కలిగించదు. కానీ ఇతరులకు మాత్రం అచ్చం అద్భుతంగానే తోస్తుంది’’ అని అధ్యయన సారథి, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జిహావో యూ అన్నారు. ‘‘పొట్టపై ఈ ద్రావకాన్ని రుద్దితే చాలు. పొద్దుటినుంచీ ఏమేం తిన్నదీ స్పష్టంగా కని్పస్తుంది. చూడటానికి చాలా సింపులే గానీ, ఈ పద్ధతి చాలా ఎఫెక్టివ్’’ అని వివరించారు. అయితే దీన్నింకా మనుషులపై ప్రయోగించాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.లాభాలెన్నో... మనుషులపై గనక ఈ ప్రక్రియ విజయవంతమైతే వైద్యపరంగా ఎనలేని లాభాలుంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. → రక్తం శాంపిళ్ల సేకరణ, రోగి ఒంట్లోకి అవసరమైన ఫ్లూయిడ్స్ ఎక్కించడం వంటివి మరింత సులభతరం అవుతాయి. ముఖ్యంగా రక్తనాళాలు దొరకడం కష్టంగా మారే వృద్ధులకు ఇది వరప్రసాదమే కాగలదు.→ చర్మ క్యాన్సర్ వంటివాటిని తొలి దశలోనే గుర్తించడం సులువవుతుంది. → ఫొటోడైనమిక్, ఫొటోథర్మల్ థెరపీల వంటి కణజాల చికిత్సల్లోనూ ఇది దోహదకారిగా మారుతుంది. → లేజర్ ఆధారిత టాటూల నిర్మూలన మరింత సులువవుతుంది.కొన్నిపద్ధతులున్నాకణజాలాలను పారదర్శకంగా మార్చేందుకు ప్రస్తుతం పలు ద్రావకాలు అందుబాటులో ఉన్నా అవి ఇంత ప్రభావవంతమైనవి కావు. పైగా పలు డీహైడ్రేషన్, వాపులతో పాటు కణజాల నిర్మాణంలోనే మార్పుల వంటి సైడ్ ఎఫెక్టులకు దారి తీస్తాయి. టార్ట్రాజైన్ ద్రావకంతో ఈ సమస్యలేవీ తలెత్తలేదు. అయితే టార్ట్రాజైన్ మనుషులకు హానికరమంటూ తినుబండారాల్లో దీని వాడకాన్ని అమెరికాలో పలువురు కోర్టుల్లో సవాలు చేశారు. దీన్ని చిప్స్, ఐస్‌క్రీముల్లో వాడతారు.కొసమెరుపు: ఇన్విజిబుల్ మ్యాన్ నవల్లో మాదిరిగా మనిíÙని పూర్తిగా మాయం చేయడం ఇప్పుడప్పట్లో సాధ్యపడేలా లేదు. ఎందుకంటే టార్ట్రాజైన్ ద్రావకం ఎముకలను పారదర్శకంగా మార్చలేదట. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బంగారం లాంటి క్యారెట్ : మృదువైన చర్మం, మెరిసే జుట్టు, ఇలా ఎన్నో..!
కూరగాయల్లో శ్రేష్టమైన క్యారెట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. క్యారెట్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. రోగనిరోధక శక్తికినిచ్చే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా అనేక బ్యూటీ సీక్రెట్స్ కూడా ఉన్నాయి. అందుకే దీన్ని కాస్మొటిక్ వెజ్ అని కూడా అంటారు. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయ పడుతుంది. కాలేయం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు చర్మం,జుట్టుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. సెప్టెంబరు 1 నుండి 7వ తేదీ జరుపుకునే నేషనల్ నూట్రిషన్ వీక్ సందర్భంగా ఈ విశేషాలు మీకోసం..ఆఫ్ఘనిస్తాన్‌లో మొట్టమొదట పండించిన దుంప కూర క్యారెట్. మనకు తెలిసిన ఆరెంజ్ రంగులో మాత్రమే కాదు, ఊదా, పసుపు, ఎరుపు, తెలుపు లాంటి ఇతర రంగులలో కూడా లభిస్తాయి. ఆరెంజ్ క్యారెట్లు 15-16వ శతాబ్దంలో మధ్య ఐరోపాలో అభివృద్ధి చేయబడ్డాయి.క్యారెట్లలో శక్తి అందించే విటమిన్లు ఏ, ఈ, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలతో పాటు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. గుండె, మూత్రపిండాలు ,కాలేయ ఆరోగ్యానికి సాయం చేస్తుంది. క్యారెట్ విటమిన్ సి, లుటిన్, జియాక్సంథిన్, విటమిన్ కె, డైటరీ ఫైబర్‌కి మంచి మూలం. క్యారెట్లో పిల్లల ఎదుగుదలకు అవసరమైన బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. కంటి సమస్యలను దూరం చేస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మెరిసే చర్మాన్ని పొందడానికి మీరు క్యారెట్‌ను ఫేస్ ప్యాక్‌ల రూపంలో కూడా ఉపయోగించవచ్చు. మధుమేహ రోజులు కూడా వాడవచ్చు. ఇందులో సహజ చక్కెరలు తక్కువగా ఉంటాయి. డైటరీ ఫైబర్ రక్తంలోకి చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. క్యారెట్లో విటమిన్ సి, కె, మాంగనీస్, కాల్షియం, ఐరన్, పొటాషియం, కాపర్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి కూడా తోడ్పాటునందిస్తాయి. క్యారెట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయడటంతోపాటు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి, బీటా కెరోటిన్ లక్షణాలు చర్మంపై మొటిమలు, దద్దుర్లు మొదలైన చర్మ వ్యాధులకు నయం చేయడంలో పనిచేస్తుంది. చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.క్యారెట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులోని పీచు పదార్థం మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.వి తక్కువ కేలరీలున్న దీనిని పచ్చిగా తినవచ్చు. స్నాక్స్ లేదా డెజర్ట్ లాగా వాడుకోవచ్చు. అన్ని రకాల కూరల్లో, సలాడ్లలో చేర్చుకుంటే అనేక పోషకాలు అందుతాయి. విడిగా గానీ, బీట్ రూట్, పుదీనా లాంటివాటితో కలిపి గానీ జ్యూస్ చేసుకొని తాగవచ్చు. అంతేకాదు అందంగా కట్ చేసుకుని (గార్నిషింగ్) అలంకరించుకోవచ్చు కూడా -
ఇది ఫేస్ డీప్ క్లీనింగ్ డివైస్..! ప్రయాణాల్లో..
స్కిన్ కేర్‌లో డీప్ క్లీనింగ్ అనేది బెస్ట్ ప్రాసెస్ అంటారు నిపుణులు. వేసుకున్న మేకప్ పూర్తిగా చర్మాన్ని వదలకపోయినా, ప్రయాణాల్లో దుమ్మూధూళి నుంచి ముఖాన్ని సంరక్షించుకోవాలన్నా డీప్ క్లీనింగ్ అవసరం. అందుకు ఈ ఫేషియల్ స్టీమర్ సహకరిస్తుంది. 360 డిగ్రీలలో తిరిగే రొటేటబుల్ స్ప్రేయర్ నాజిల్‌తో కూడిన వార్మ్ మిస్ట్ ఫేస్ స్టీమర్ ముఖానికి పట్టిన మురికిని, జిడ్డును ఇట్టే పోగొడుతుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఈ స్టీమర్ నుంచి విడుదలయ్యే ఆవిరి చర్మపు లోలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి, క్లీన్ చేస్తుంది.ముందుగా ముఖాన్ని చల్లటి నీళ్లతో కడిగి, మెత్తటి క్లాత్‌తో తుడిచి, ఆపైన అరోమాథెరపీ కాటన్ ప్యాడ్‌పైన ఆయిల్ చుక్కలు వేసుకుని, ముఖానికి అప్లై చేసుకోవాలి. అనంతరం ఈ స్టీమర్‌తో ఆవిరి పట్టుకుంటే, ఇంట్లోనే స్పా చేయించుకున్న ఫీలింగ్ కలుగుతుంది. దీని వల్ల మృతకణాలు తొలగిపోతాయి. ముడతలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు నెమ్మదిగా ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. ఈ స్టీమర్‌ని క్రమం తప్పకుండా వినియోగిస్తే, యవ్వనకాంతితో కళకళలాడవచ్చు. వారానికి 2–3 సార్లు, ఒక సెషన్‌కు 10 నిమిషాల చొప్పున ఫేషియల్ స్టీమర్‌ని ఉపయోగించడం మంచిది. కాలిన గాయాలను నివారించడానికి కూడా ఫేస్ స్టీమర్‌ని వాడుకోవచ్చు.ఇందులో నీళ్లు నింపుకుని, బటన్ ఆన్ చేసుకుని ఆవిరి విడుదల అయ్యే రాడ్‌ని మనకు అనుకూలంగా అమర్చుకుంటే సరిపోతుంది. అవసరాన్ని బట్టి దాని పొడవు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అనువైన విధంగా సెట్ చేసుకోవచ్చు. దాంతో ఆవిరి పట్టుకునేటప్పుడు, మన వీలుని బట్టి కూర్చుని లేదా పడుకుని కూడా డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. దీని ధర 27 డాలర్లు. అంటే 2,266 రూపాయలు. ఈ స్టీమర్స్ చాలా కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. -
Beauty Tips: ముఖానికి మెరుపు.. చర్మానికి నునుపు!
ఇది చర్మానికి పునరుత్తేజం కలిగించే అధునాతన సౌందర్య పరికరం. ఇది ముఖాన్ని అందంగా మెరిపిస్తుంది. చక్కటి ఆక్సిజన్ ఫేషియల్‌ను అందజేస్తుంది. ఈ సొగసైన పరికరం చర్మం పైపొరపై పేరుకున్న మృతకణాలను తొలగించడంతో పాటు చర్మం లోలోతుల వరకు ఆక్సిజన్ ను అందిస్తుంది. ఈ పరికరం రక్తప్రసరణను మెరుగుపరచి, చర్మకణాలకు ఉత్తేజం కలిగిస్తుంది. వాడిపోయినట్లున్న చర్మానికి నునుపుదనం కలిగించి, కొత్త మెరుపునిస్తుంది.ఇది ముఖంతో పాటు శరీరంపై చర్మమంతటికీ ఆక్సిజన్ ను అందిస్తూ, చర్మానికి పునరుజ్జీవం కలిగించి, ప్రకాశవంతంగా మారుస్తుంది. క్లెన్సింగ్, ఎక్స్‌ఫోలియేటింగ్, స్కిన్ కేర్ అప్లికేషన్ ఇలా ఎన్నో ప్రయోజనాలతో ఇది ఏమాత్రం నొప్పి లేకుండా చికిత్స చేస్తుంది. దీనిని ఉపయోగించుకోవడం చాలా సులభం. తక్కువ సమయంలోనే మన్నికైన ఫలితాలనిస్తుంది. ఈ పరికరాన్ని ఎక్కడికైనా సులువుగా తీసుకుపోవచ్చు. దీనికి చార్జింగ్ కోసం ప్రత్యేకమైన ట్రే విడిగా లభిస్తుంది. దానిలోనే ఈ పరికరానికి చార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు బ్యూటీ క్యాప్సూల్స్, జెల్, క్రీమ్ వంటివి కూడా లభిస్తాయి. అవి అయిపోయినప్పుడు. వాటిని విడిగా కూడా ఆన్లైన్ లో కొనుగోలు చేసుకోవచ్చు.ముందుగా ముఖాన్ని శుభ్రపరచుకుని, అనంతరం ఈ పరికరానికి ముందున్న చిన్న వలయాల్లో క్యాప్సూల్ అమర్చుకోవాలి. తర్వాత ముఖానికి జెల్ పట్టించి, ఈ పరికరాన్ని చర్మానికి ఆనించి 3 నిమిషాల పాటు గుండ్రంగా తిప్పుతూ చికిత్స తీసుకోవాలి. అనంతరం నీళ్లతో ముఖాన్ని కడిగి, క్రీమ్ రాసుకోవాలి. ఈ పరికరాన్ని ఎవరికి వారే వాడుకోవచ్చు. ఈ పరికరానికి ఒకవైపు క్లీనింగ్ బ్రష్ కూడా ఉంటుంది. దాన్ని విడిగా తీసి, శుభ్రం చేసుకోవచ్చు.ఇవి చదవండి: పీసీఓఎస్ కట్టడికి మలేరియా మందు -
ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలా! అయితే ఇలా చేయండి...
కొందరు ఏ వయసులోనైనా సహజత్వాన్నే కోరుకుంటారు. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలని తహతహలాడతారు. అలాంటి వారికి ఈ ఫేషియల్ టోనర్ చక్కగా పని చేస్తుంది. దీన్ని చాలా సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు.చీక్ బోన్స్స కోసం ప్రత్యేకంగా రూపొందిన ఈ ఫేషియల్ టోనర్.. ముఖంలో సహజ సౌందర్యాన్ని, యవ్వన రూపాన్ని మెరుగుపరచడానికి.. ఎంతగానో సహకరిస్తుంది. ఇది.. సహజమైన, సౌకర్యవంతమైన గాడ్జెట్‌గా.. మార్కెట్లో మాంచి డిమాండ్‌ను అందుకుంటోంది. ఇందులో 3 ప్రోగ్రామ్స్‌ను మార్చిమార్చి సెట్ చేసుకోవచ్చు. పది నిమిషాలు, పదిహేను నిమిషాలు, ఇరవై నిమిషాల టైమింగ్‌తో.. వేరియబుల్ ట్రీట్మెంట్ లెవెల్స్‌తో ఉన్న ఈ డివైస్.. హ్యాండ్ హోల్డ్ కంట్రోలర్‌గా పని చేస్తుంది.హెడ్సెట్ బేస్డ్ డెలివరీ సిస్టమ్‌తో తయారైన ఈ డివైస్‌ని.. తల వెనుక నుంచి ముఖానికి అటాచ్ చేసుకోవచ్చు. చార్జ్ చేసుకుని వాడుకునే వీలు ఉండటంతో.. దీన్ని ఎక్కడైనా సులభంగా వినియోగించుకోవచ్చు. ఈ టోనర్ ముఖ కండరాలను దృఢంగా మార్చేస్తుంది. ముఖాన్ని నాజూగ్గా చేసేస్తుంది. వారానికి ఐదుసార్లు దీనితో ట్రీట్మెంట్ తీసుకుంటే.. ఫలితం ఉంటుంది. అయితే ప్రతి ట్రీట్మెంట్ 20 నిమిషాల వరకు ఉండేలా చూసుకోవాలి. సుమారు 12 వారాలు ఈ టోనర్ ట్రీట్మెంట్ తీసుకుంటే.. 40 దాటినవారు కూడా 20లా కనిపిస్తారట.డివైస్‌కి ఉండే రెండు జెల్ ప్యాడ్స్‌ని ముఖ చర్మానికి ఆనించి.. చిత్రంలో ఉన్న విధంగా పెట్టాలి. ప్యాడ్స్ పెట్టుకునే ముందు.. ఆ భాగంలో లోషన్ లేదా క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇక ఈ మెషిన్ ని ముఖానికి పెట్టుకునేప్పుడు ఖాళీగా ఉండాల్సిన పనిలేదు. ల్యాప్ టాప్ వర్క్ కానీ.. వ్యాయామాలు కానీ.. ఇంటి పని కానీ ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఈ మోడల్స్‌లో బ్లాక్, వైట్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. -
కాలు బెణికితే RICE! చేయాల్సిన ప్రథమచికిత్స ఇదే!
కాలు బెణికినప్పుడు పైకి ఎలాంటి గాయం కనిపించకపోయినా లోపల సలుపుతుంటుంది. ఇలాంటప్పుడు చేయాల్సిన ప్రథమచికిత్స కోసం ఇంగ్లిష్‌లో ‘రైస్’ అనే మాటను గుర్తుపెట్టుకోవాలి.– R అంటే రెస్ట్. అంటే కాలికి విశ్రాంతి ఇవ్వాలి. (24 నుంచి 48 గంటలపాటు).– I అంటే ఐస్‌ప్యాక్ పెట్టడం. ఐస్‌క్యూబ్స్‌ను నేరుగా గాయమైన చోట అద్దకూడదు. ఐస్ నీళ్లలో గుడ్డ ముంచి బెణికిన చోట అద్దాలి.– C అంటే కంప్రెషన్. అంటే బెణికిన ప్రాంతాన్ని క్రాప్ బ్యాండేజ్‌తో కాస్తంత బిగుతుగా ఒత్తుకుపోయేలా (కంప్రెస్ అయ్యేలా) కట్టు కట్టవచ్చు. అది అందుబాటులో లేకపోతే మామూలు గుడ్డతోనైనా కట్టు కట్టవచ్చు.– E అంటే ఎలివేషన్. అంటే బెణికిన కాలు... గుండెకంటే కాస్త పైకి ఉండేలా పడుకోవడం. అంటే కాలికింద దిండు పెట్టుకోవడం మేలు.బ్యూటిప్స్..ఫేషియల్ మసాజ్..– ముఖ చర్మం అందంగా కనిపించాలంటే ఫేస్ మసాజ్ చేసుకోవాలి, దీని వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం ముడతలు పడటం తగ్గుతుంది.– ముఖ చర్మం అందంగా కనిపించాలంటే ఫేస్ మసాజ్ చేసుకోవాలి, దీని వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం ముడతలు పడటం తగ్గుతుంది. -
ఈ ఎలక్ట్రిక్ రెడ్ లైట్ థెరపీతో.. చాలా ప్రయోజనాలు పొందవచ్చు!
అందాలను అందించే గాడ్జెట్స్ కోసం సౌందర్యాభిలాషులు నిరంతరం అన్వేషిస్తుంటారు. అలాంటి వారికి ఈ మసాజర్ ఒక మంత్రదండం లాంటిది. ఇది అందించే ఎలక్ట్రిక్ రెడ్ లైట్ థెరపీతో చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఈ హీటెడ్ అండ్ వైబ్రేషన్ ఫేస్ మసాజర్ వయసుని ఇట్టే తగ్గించేసి, ముఖానికి నవయవ్వన కాంతినిస్తుంది. చేతిలో ఇట్టే ఇమిడిపోయే ఈ పరికరం చర్మం మీదనున్న ముడతలు, గీతలను పోగొట్టి, మృదువుగా మారుస్తుంది.ఈ ఫేషియల్ మసాజర్ 3 లెవెల్ హీటింగ్ మోడ్‌తో, వైబ్రేషన్ మోడ్‌తో ప్రత్యేకంగా రూపొందింది. చర్మానికి పైపైనే కాకుండా లోతుగా ట్రీట్మెంట్ అందించి, చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా ముఖం, మెడ, వీపు, పొట్ట, నడుము, కాళ్లు, చేతులు ఇలా ప్రతిభాగాన్నీ అందంగా మలచుకోవచ్చు.ఈ పరికరం శరీరంలోని ఆక్యుపాయింట్లను ఉత్తేజపరుస్తుంది. దీన్ని ఎవరికి వారు స్వయంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇది ఎల్ఈడీ డిస్ప్లే స్క్రీ¯Œ తో ఉంటుంది. ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి కూడా ఇది చాలా బాగుంటుంది.ఈ ఫేస్ లిఫ్టర్ మసాజర్ చూడటానికి చిన్నగా, క్యూట్‌గా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. ఏ సమయంలోనైనా దీనితో సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అలాగే చర్మానికి ఆయిల్ లేదా నచ్చిన లోష¯Œ అప్లై చేసుకుని, అనంతరం దీనితో మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీని ధర 37 డాలర్లు. అంటే 3,097 రూపాయలు. ఇలాంటి మోడల్స్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ వెర్షన్స్ అందుబాటులోకి రావడంతో వీటికి డిమాండ్ బాగా పెరుగుతోంది. -
త్వరగా.. మేకప్ వేసుకోవాలనుకుంటున్నారా? అయితే దీనిని వాడండి..
ఈరోజుల్లో చిన్నచిన్న పార్టీలకైనా.. పెద్దపెద్ద ఫంక్షన్స్కైనా వేసుకున్న డ్రెస్‌కి తగ్గట్టుగా.. మేకప్ చేసుకోవడం కామన్ అయిపోయింది. దాన్ని చక్కగా సరిదిద్దుతుంది ఈ న్యూడెస్టిక్స్ కన్సీలర్ పెన్సిల్.వేగంగా మేకప్ వేసుకునేటప్పుడు.. ఐలైనర్స్, మస్కారా, ఐబ్రో పెన్సిల్ వంటివి పక్కకు అంటుకుని.. అందాన్ని చెడగొడుతుంటాయి. దాన్ని సరిచేయడానికి బోలెడు సమయం పడుతుంది. అలాంటి శ్రమను దూరం చేస్తుందీ పెన్సిల్. మేకప్ చెదిరిన చోట ఈ పెన్సిల్‌తో లైట్‌గా రుద్దుకుంటే చాలు.. మెరిసిపోతుంది ముఖం.అంతేకాదు ముఖం మీది చిన్న చిన్న మచ్చల్ని, గీతల్నీ దీంతో పోగొట్టుకోవచ్చు. అలాగే కంటి కిందున్న నల్లటి వలయాలను కనిపించకుండా చేసుకోవచ్చు. ఇందులో స్కిన్ కలర్ షేడ్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. మన స్కిన్ టోన్‌కి సరిపడా పెన్సిల్ని ఎంచుకుంటే సరిపోతుంది. దీనితో అవసరం అయిన చోట.. ముందుకు వెనుకకు రుద్ది, పొడిగా ఉండేలా.. వేలికొనలతో ఒత్తినట్లుగా రుద్దుకోవాలి. ఈ పెన్సిల్‌కి ఒక షార్పెనర్ కూడా లభిస్తుంది. ఇదే మోడల్లో చాలా రంగుల్లో ఈ పెన్సిల్స్ అందుబాటులో ఉన్నాయి.దీని తయారికీ.. విటమిన్ ఈ, నేచురల్ మాయిశ్చరైజర్, యాంటీ ఆక్సిడెంట్, షియా బటర్ వంటివి చాలానే వాడతారు. దాంతో దీన్ని డైరెక్ట్‌గా ఫేస్‌కి మేకప్‌లా అప్లై చేసుకోవచ్చు. ఇదే పెన్సిల్లో లిప్ స్టిక్స్ కలర్స్ కూడా లభిస్తున్నాయి. దీని ధర 24 డాలర్లు. అంటే 2,006 రూపాయలన్న మాట.ఇవి చదవండి: ఈ బీచ్‌బబుల్ టెంట్లకి.. ప్రత్యేకత ఏంటో తెలుసా!? -
Beauty Tips: ముఖం మొటిమలతో నల్లబారుతుందా? అయితే ఇలా చేయండి..
కాలుష్యంతో మీ ముఖం నల్లబడటంగానీ, మొటిమలతోగానీ ఇబ్బందికి గురవుతుందా..? అయితే ఈ బ్యూటీ టిప్స్ మీకోసమే..! అవేంటో చూద్దాం.ఇలా చేయండి..ఆపిల్ ముక్కతో ముఖమంతా మృదువుగా రబ్ చేసి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ముఖంలోని అదనపు జిడ్డు తొలగిపోవడంతో మొటిమలు తగ్గి చర్మం తాజాగా కనిపిస్తుంది.కీరా రసంలో రోజ్‌వాటర్, నిమ్మరసం కలపాలి. రాత్రి పడుకోబోయే ముందు ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని ముఖానికి రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడమే కాకుండా ముఖం తాజాగా కనిపిస్తుంది.ఇవి చదవండి: నిజమే..! తాను తొమ్మిదేళ్ల సూపర్ రేసర్!! -
చిరు జల్లులు: వేడి వేడి మొక్కజొన్నపొత్తులు, ఈ విషయాలు తెలుసా?
సన్నని చిరు జల్లులు.. వేడి వేడి మొక్కజొన్న పొత్తులు. ఈ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా. కమ్మగా కాల్చిన వేడి వేడి మొక్క జొన్నపై కాస్తంత నిమ్మరసం, ఉప్పుచల్లుకొని తింటే ఆహా.. అనుకోవాల్సిందే. మరి సీజనల్‌గా లభించే మొక్కజొన్న ఆరోగ్య ప్రయోజనాలగురించి ఎపుడైనా ఆలోచించారా?మొక్కజొన్న లేదా కార్న్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన తృణధాన్యాలలో ఒకటి. సెంట్రల్ అమెరికాకు చెందిన గడ్డి కుటుంబంలోనిది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని రకాల్లో పెరుగుతుంది. సాధారణంగా పసుపు రంగులో ఉంటుంది. అలాగే ఎరుపు, నారింజ, ఊదా, నీలం, తెలుపు, నలుపు వంటి అనేక ఇతర రంగులలో కూడా లభిస్తుంది. ఫైబర్, ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియంలాంటి ఖనిజాలు విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల మూలం మొక్కజొన్న. మొక్కజొన్నలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది , ప్రేగుల క్రమబద్ధతను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. మొక్కజొన్నలో ఇనుము ఉంటుంది. ఇది ఇనుము లోపం అనీమియాను నివారిస్తుంది. మొక్కజొన్నలో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరిత శక్తిని అందిస్తాయి. మన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది.మొక్కజొన్నలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులోని లుటిన్ , జియాక్సంతిన్ కంటి సమస్యలు రాకుండా కూడా కాపాడతాయి. మొక్కజొన్నలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి . కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇంకా గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఫోలేట్, పొటాషియం , ప్లాంట్ స్టెరాల్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిల్లోని ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ వంటి గుణాలు ఎముకలను బలోపేతం చేస్తాయి తద్వారా ఆర్థరైటిస్ నొప్పులకు ఉపశమనం లభిస్తుంది.మొక్కజొన్న చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది మొక్కజొన్నలో విటమిన్ ఎ, విటమిన్ సీతోపాటు , ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. దీంతో మన శరీరం , చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్య సంకేతాలను అడ్డుకుంటుంది. స్కిన్ పిగ్మెంటేషన్ గణనీయంగా తగ్గిందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. -
Beauty Tips: అందానికి 'ఓట్లు'..
ఓట్స్ ఆరోగ్యపోషణతోపాటు సౌందర్యపోషణకూ దోహదం చేస్తాయి. ఓట్స్‌తో చర్మసౌందర్యాన్ని సంరక్షించుకోవడం ఎలాగో చూద్దాం.రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్పౌడర్లో మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిక్స్‌ను ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత వేళ్లతో వలయాకారంగా రుద్దుతూ చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగిన పోషణ లభించడంతోపాటు మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతిమంతమవుతుంది.మొటిమలు తగ్గాలంటే టేబుల్ ఓట్స్ పౌడర్‌లో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. పూర్తిగా ఆరిన తర్వాత మెల్లగా రుద్దుతూ చన్నీటితో శుభ్రం చేయాలి. చర్మంలో అధికంగా ఉన్న జిడ్డును ఓట్స్ పీల్చుకోవడం వల్ల మొటిమలు వాడిపోతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే నాలుగు వారాల్లోనే మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి.రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్‌లో టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల పాలు కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ సహజమైన బ్లీచ్. చర్మాన్ని తెల్లబరుస్తుంది. మృదువుగా మారుతుంది కూడా.ఓట్స్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు, బాదం ΄÷డి టేబుల్ స్పూన్, తేనె టేబుల్ స్పూన్, పాలు లేదా పెరుగు రెండు టేబుల్ స్పూన్లు కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు పట్టించి వలయాకారంలో పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. ఈ ప్యాక్ వల్ల మృతకణాలు తొలగిపోవడంతోపాటు చర్మకణాల్లో పట్టేసిన మురికి వదులుతుంది. ఈ ప్యాక్ నెలకు రెండుసార్లు వేస్తుంటే ప్రత్యేకంగా స్క్రబ్ క్రీమ్‌లు, బ్లీచ్‌లు వాడాల్సిన అవసరం ఉండదు.రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్‌లో రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు, టీ స్పూన్ బాదం ఆయిల్ కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ΄÷డి చర్మానికి ఈ ప్యాక్ చాలా మంచి ఫలితాన్నిస్తుంది. చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. మొటిమలు ఉన్నవాళ్లు బాదం ఆయిల్ లేకుండా ప్యాక్ వేసుకోవచ్చు.ఇవి చదవండి: Pet Last Set: డయల్ చేస్తే.. ఇంటికే అంతిమయాత్ర వాహనం! -
Beauty Tips: ముఖం మీద.. పేరుకుపోయే మురికిని.. తొలగించడిలా..!
ముఖం మీది మేకప్‌ను అయినా.. పొల్యుషన్‌తో పేరుకుపోయే మురికినైనా తొలగించడం కాస్త కష్టమే! అందుకే ఈ మసాజర్ అండ్ క్లీనర్ వచ్చింది మార్కెట్లోకి. మేకప్‌తో పాటు కాలుష్యపు జిడ్డునూ డీప్‌గా క్లీన్ చేసి.. మృతకణాలనూ తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తుందీ డివైస్.దీని సిలికాన్ బ్రష్ హెడ్.. సాధారణ బ్రష్ కంటే 35 రెట్లు అధికంగా చర్మాన్ని శుభ్రపరస్తూ స్కిన్ ఫ్రెండ్లీగానూ ఉంటోంది. క్లీనింగ్ అండ్ మసాజింగ్ ఆప్షన్స్‌తో పని చేసే ఈ 2 ఇ¯Œ 1 గాడ్జెట్.. సోనిక్ వైబ్రేషన్స్‌తో, 6ఎక్స్ డీపర్ క్లీన్ అనే హై టెక్నాలజీ హీటెడ్ హెడ్‌తో వేగంగా పనిచేస్తుంది.ఒక్కసారి చార్జింగ్ పెట్టుకుంటే.. దీన్ని 20 నుంచి 30 సార్లు ఉపయోగించుకోవచ్చు. ఇందులో 5 స్కి¯Œ కేర్ మోడ్స్ ఉంటాయి. వాటిలో మూడు వైబ్రేష¯Œ స్పీడ్ మోడ్స్ కాగా.. రెండు హీటెడ్ మసాజ్ మోడ్స్‌లో పనిచేస్తాయి. అవసరాన్ని బట్టి హెడ్స్ మార్చుకుంటే సరిపోతుంది. ఈ డివైస్‌ని స్త్రీ, పురుషులు ఇరువురూ వినియోగించుకోవచ్చు. ఈ పరికరాన్ని నీటితో క్లీ¯Œ చెయ్యకూడదు. చార్జింగ్ పెట్టేప్పుడు కూడా తడి తగలకుండా చూసుకోవాలి. దీని ధర సుమారు 65 డాలర్లు. అంటే 5,446 రూపాయలు.ఇవి చదవండి: నిజమే..! ఇది మంత్రదండంలాంటి 'ఏఐ' ఉంగరమే..!! -
వెదురు సారంతో కొరియన్ గ్లాస్ చర్మం..!
కొరియన్ చర్మానికి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. పైగా అందుకు సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్నాయి కూడా. అయితే అవన్నీ ఆ బ్రాండ్లకు తగ్గ రేంజ్ ధరల్లోనే ఉంటాయనేది తెలిసిందే. అలా కాకుండా మనకున్న అందుబాటులోని వనరులతో కూడా కొరియన్ గ్లాస్ చర్మాన్ని పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!వెదుర రసంతో కొరియన్ల లాంటి గ్లాస్ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. చక్కగా వారిలా ప్రకాశవంతమైన మచ్చలేని చర్మాన్ని సొంతం చేసుకోవచ్చట. వెదురు సారం ముఖాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తుందట. ఇందులో ఉండే సిలికాన్ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఖనిజంలా పనిచేస్తుంది. చర్మాన్ని దృఢంగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్ది వచ్చే సిలికా స్థాయిలు తగ్గుతాయి.ముడతలు వచ్చి చర్మం ఆకృతి మారిపోయి, వృధాప్య సంకేచ్చేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాంటివి రాకూడదంటే చర్మ సంరక్షణలో భాగంగా వెదురు సారాన్ని ముఖానికి అప్లై చేస్తే సిలికా స్థాయిలు పెరగడమే గాక యవ్వనవంతమైన మెరిసే చర్మ మీ సొంతం అవుతుంది. దీనిలో ఉండే హైడ్రేటింగ్, మాయిశ్చరైజింగ్ కారకాలు చర్మాన్ని బొద్దుగా , మృదువుగా చేస్తాయి. ఇందులో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మంలోని తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ముడతలు, గీతలు వంటివి పడకుండా ఉండేలా రిపేర్ చేస్తుంది. పొడి చర్మం వారికి ఈ వెదురుసారం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే చర్మంపై ఉండే మంట, చికాకులను దూరం చేస్తుంది. వెదురుసారం శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను కలిగి ఉంది. అకాల వృద్ధాప్యం, నీరసానికి దారితీసే కాలుష్యం, యూవీ కిరణాలు వంటి పర్యావరణ నష్టం నుంచి చర్మాన్ని రక్షించే యాంటీఆక్సిడిడెంట్లు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇది సహజ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. ఎర్రటి మెటిమలు, చికాకు వంటి సమస్యలను దూరం చేస్తుంది. అంతేగాదు వెదురుసారంలో ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్లు ఉన్నాయి. ఇవి నిస్తేజంగా అయిపోయిన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, కోమలంగా మారుస్తుంది. ఈ వెదురుసారానికి హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, కలబంద వంటి ఇతర హైడ్రేటింగ్ పదార్థాలను జోడిస్తే మరింత తొందరగా కొరియన్ గ్లాస్ చర్మాన్ని పొందగలరని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఈ వెదురు సారం పొడిగా లేదా ద్రవ రూపంలో వినియోగించవచ్చు. దీన్ని మీకు ఇష్టమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులకు జోడించడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: అంతుపట్టని ఆ వ్యాధిని పది సెకన్లలో నిర్థారించిన పనిమనిషి..! షాక్‌లో వైద్యుడు) -
Beauty Tips: మీ ముఖంపై బ్లాక్‌హెడ్స్ తొలగించాలంటే..??
ముఖాన్ని కళావిహీనం చేసే సమస్యల్లో బ్లాక్‌హెడ్స్ మహా మొండివి. గడ్డం, ముక్కు, నుదురు సహా ముఖం మీద పలు భాగాల్లో కనిపించే ఈ బ్లాక్‌హెడ్స్ తొలగించడమంటే .. కాస్త నొప్పితో కూడిన పనే. అయితే చిత్రంలోని ఈ మెషిన్.. హై–డెఫినిషన్ పిక్సెల్ 20గీ మాగ్నిఫికేషన్ టెక్నాలజీతో ఎలాంటి నొప్పి లేకుండా బ్లాక్‌హెడ్స్‌ను తొలగించి ముఖాన్ని నీట్‌గా మారుస్తుంది.ఈ డివైస్‌లో మొత్తం ఐదు లెవెల్స్ ఉంటాయి. దీని పైన.. వాక్యూమ్ హెడ్స్‌ని బిగించే భాగంలో చిన్న కెమెరా ఉంటుంది. ఈ డివైస్‌ని స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకుంటే, చర్మాన్ని స్కాన్ చేసి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యిందో, ఎక్కడెక్కడ బ్లాక్‌హెడ్స్ ఉన్నాయో చూపెడుతుంది. కింది భాగంలో హీటింగ్ మసాజర్ హెడ్ ఉంటుంది. దీన్ని వినియోగించడం చాలా తేలిక. మొదటి లెవెల్ ఆప్షన్‌తో.. చర్మపు తీరుతెన్నులను పరిశీలించుకోవచ్చు.రెండో లెవల్ ఆప్షన్‌తో సెన్సిటివ్ స్కిన్‌కి, మూడో లెవెల్ ఆప్షన్‌తో జిడ్డు చర్మానికి, నాల్గవ లెవెల్ ఆప్షన్‌తో మరింత జిడ్డు చర్మానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఐదవ లెవెల్ ఆప్షన్‌తో మొండి రంధ్రాలకు సైతం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో 3 సెకన్ల కంటే ఎక్కువసేపు ఒకే స్థలంలో క్లీన్ చేయకూడదు. దీని ధర 169 డాలర్లు. అంటే 14,036 రూపాయలు.ఇవి చదవండి: ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా.. -
ప్రముఖ బ్రాండ్‌కు ప్రచార కర్తగా కీర్తి సురేష్
పాండ్స్ స్కిన్ ఇన్స్టిట్యూట్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటి, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్‌ను నియమించుకుంది. దక్షిణాది సినిమా రంగంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన కీర్తి... సంస్థ ప్రకటనల్లో నటించి తమ ఉత్పత్తులను దక్షిణ భారతదేశంలోని కొత్త కస్టమర్లకు మరింత చేరువ చేస్తుందని కంపెనీ ఆశిస్తోంది. పాండ్స్ స్కిన్ ఇన్స్టిట్యూట్ నుంచి చాలా ఉత్పత్తులు ఉన్నాయి. స్కిన్ కేర్ విషయంలో శ్రేష్ఠతకు స్థిరంగా బెంచ్‌మార్క్‌ను పాండ్స్ సెట్ చేసింది.పాండ్స్ స్కిన్ ఇన్స్టిట్యూట్ అంబాసిడర్‌గా తన కొత్త పాత్రపై కీర్తి సురేష్ మాట్లాడుతూ, “నేను చాలా కాలంగా మెచ్చుకుంటున్న పాండ్స్ స్కిన్ ఇన్స్టిట్యూట్తో చేతులు కలపడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో సహా దేశవ్యాప్తంగా అనేకమంది హృదయాల్లో ఈ బ్రాండ్‌కు ప్రత్యేక స్థానం ఉంది.' అని ఆమె తెలిపింది.హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, స్కిన్‌కేర్ హెడ్ ప్రతీక్ వేద్ తమ భాగస్వామ్యం గురించి ఇలా వ్యాఖ్యానించారు. 'పాండ్స్ స్కిన్ ఇన్స్టిట్యూట్లో, టైమ్‌లెస్ బ్యూటీ సొల్యూషన్లను రూపొందించే ఆవిష్కరణ శక్తిని మేము విశ్వసిస్తున్నాము. కీర్తిని మా కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా స్వాగతించడం మా వినియోగదారులతో బలమైన సంబంధాన్ని ఏర్పరిచే మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ. ఆమె చక్కదనానికి ప్రతిభ, అందం మా బ్రాండ్‌కు కూడా కలిసొస్తుంది.' అని ఆయన తెలిపారు. -
Beauty Tips: చర్మ సౌందర్యానికై ఇలా చేస్తే చాలు..
పాలలో బ్రెడ్ ముక్కలు నానవేసి వాటిని మెత్తగా మెదిపి ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం మృదువుగా మిలమిలలాడుతుంది.కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావు గంట తర్వాత కడిగేసుకోవాలి. తర్వాత శెనగపిండితో గానీ, నలుగుపిండితో గానీ రుద్ది ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మీద ముడతలు లేకుండా తాజాగా కనిపిస్తుంది.పులిపిర్లు రాలిపోయిన తర్వాత ఆ మచ్చలు పోవటానికి తేనె, నిమ్మరసం కలిపి ఆ మచ్చల మీద రాస్తూ ఉండాలి.తులసి ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ఆపేస్టును కాని రసాన్ని కాని ముఖానికి రాసి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. క్రమంతప్పకుండా రోజూ చేస్తుంటే మొటిమలు, వాటి మచ్చలు పూర్తిగా పోవడంతో పాటుచర్మం నునుపుదేలుతుంది.తేనెను గోరువెచ్చగా చేసి అందులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరినతర్వాత కడగాలి. తేనెను ఎప్పుడూ నేరుగామంట మీద వేడి చేయకూడదు. తేనె ఉన్నపాత్రను ఎండలో కాని, వేడి నీటి గిన్నెలోకాని పెట్టి వేడి చేయాలి.ఇవి చదవండి: ఆమె మాట, పాట, నటన, నృత్యంలో.. ‘వాహ్వా’! -
మాయిశ్చరైజర్లను ఇంజెక్ట్ చేయడం గురించి విన్నారా..?
చర్మ సంరక్షణ కోసం వివిధ రకాల మాయిశ్చరైజర్లను వాడటం గురించి విన్నాం. ఇప్పుడూ ఏకంగా ముఖానికే నేరుగా ఇంజెక్ట్ చేస్తారట. దీనివల్ల ముఖం హైడ్రేటెడ్‌గా ఉండి మృదువుగా కనిపిస్తుంది. పైగా ఏజ్లెస్గా కనిపిస్తుందట. స్కిన్‌టోన్ కూడా చాలా బాగుంటదట . అసలేంటిది? ఎలా చేస్తారు తదితరాల గురించి తెలుసుకుందాం!.ఇప్పుడూ చర్మ సంరక్షణపై విపరీతమైన అవగాహన, ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. అందుకు తగ్గట్టుగానే మార్కెట్లో బ్యూటీకి సంబంధించిన కొత్తకొత్త చికిత్సా విధానాలు వచ్చాయి. ఈ చర్మ సంరక్షణకు సంబంధించి సర్జరీలు, చికిత్సలు భారత్‌లో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ముఖ్యంగా ఆసియ పసిఫిక్ ప్రాంతాలైన భారత్, చైనా, జపాన్‌లో బ్యూటీ ప్రొడక్ట్‌లు, చికిత్సలు మంచి ఆదాయాలు అందించే మార్కెట్. ఆ క్రమంలోనే కొత్త చర్మ సంరక్షణ ట్రెండ్ ఒకటి వచ్చింది. ఇంతకీ ఏంటీ ఇంజెక్షన్ మాయిశ్చరైజర్స్?ఇంజెక్ట్ చేసే మాయిశ్చరైజర్లను స్కిన్ బూస్టర్లుగా పిలుస్తారు. ఇవి హెలురోనిక్ యాసిడ్‌తో తయారు చేస్తారు. ఇది శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మానికి హైడ్రేషన్, మృదుత్వాన్ని అందిస్తుంది. సాధారణ మాయిశ్చరైజర్ల మాదిరిగా కాకుండా సూదులతో ఇంజెక్ట్ చేయడం వల్ల ఇది చర్మం పొరల్లోకి లోతుగా చొచ్చుకునిపోయి కాంతిగా ఉండేలా చేస్తుంది. అలాగే ముఖాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, ముఖంపై ఉండే గీతలు, ఆకృతి సమస్యలు, వృధాప్య ముడతలను నివారిస్తుంది. చర్మాన్ని రిపేర్ చేసేలా తేమ స్థాయిని నింపుతుంది. ఇది యవ్వనపు ఛాయను అందించి, ముఖం ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. చర్మాన్ని పునరుజ్జీవింపబడేలా చేస్తుంది. మిగతా కాస్మెటిక్ చికిత్స విధానాల కంటే ఇది తక్షణ ఫలితాన్ని ఇస్తుంది. చర్మం ఆకృతిని, రంగును మెరుగ్గా ఉంచుతుంది. ముఖం ఎప్పటికీ యవ్వనంలా కనిపించాలానుకునేవారికి ఈ పద్ధతి మేలు. వృధాప్య ఛాయలను నివారించాలనుకునే వారికి, యూబైలలో ఉన్న మహిళలకు ఈ చికిత్స విధానం బెస్ట్ ఆప్షన్. ఈ ఇంజెక్ట్ మాశ్చరైజర్లు కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తాయి. దీంతో చర్మానికి మంచి బూస్టింగ్ లభించడమే గాక మేను యవ్వనంగా మారేలా పునరుజ్జీవింప చేసి ముడతలను దూరం చేస్తుంది. అయితే ఈ చికిత్సను అర్హులైన నిపుణుల పరివేక్షణలో చేయించుకోవడం ఉత్తమం. (చదవండి: ఈ డివైజ్‌తో కాళ్లు నొప్పులు మాయం!) -
Beauty Tips: ఇలా చేశారో.. మీ చర్మం కాంతివంతమే!
టీ డికాషన్‌ని ఉపయోగించడం వల్ల వేసవి తాపం నుంచి చర్మాన్ని, శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే, ఇందుకు తేయాకులను మాత్రమే ఉపయోగిస్తే సరైన ఫలితం లభిస్తుంది.చల్లారిన అరకప్పు టీ డికాషన్‌లో రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి, అర టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 20 నిమిషాలు ఆరనివ్వాలి. శుభ్రపరుచుకోవడానికి ముందు కొన్ని నీళ్లు ముఖం మీద చల్లి, వేళ్లతో వలయాకారంగా రుద్దాలి.టీ డికాషన్‌లో ఐస్ క్యూబ్ వేసి, ఆ నీటిని ముఖానికి స్ప్రే చేసుకొని, కాసేపు సేదతీరాలి.ఎండ బారిన పడి ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేయడం వల్ల కమిలిన చర్మం తిరిగి పూర్వపు స్థితికి చేరుకుంటుంది.టబ్ బాత్ చేసేటప్పుడు కొన్ని తేయాకులు నీటిలో వేసి, అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఎండవల్ల కలిగిన అలసట నుంచి చర్మం విశ్రాంతి పొందుతుంది.జుట్టు పొడిబారి నిర్జీవంగా మారితే తలస్నానం చేసిన తర్వాత టీ డికాషన్‌తో కడగాలి. కండిషనర్‌లా ఉపయోగపడుతుంది.ఇవి చదవండి: మిస్ కేరళ ఫిజిక్‌గా టైటిల్ తనకు సొంతం! -
ఈ మినీ మెషిన్‌తో.. స్కిన్ సమస్యలకు చెక్!
వయసు పెరిగే కొద్ది కళ్ల చుట్టూ ముడతలు, పెదవుల చుట్టూ గీతలు పడటం సర్వసాధారణం. అయితే దాన్ని.. చిత్రంలోని ఈ మైక్రోకరెంట్ లైన్ స్మూతింగ్ ఇన్స్టంట్ ప్లంపర్ డివైస్‌తో తగ్గించుకోవచ్చు. ఈ మినీ మెషిన్.. ఆ సమస్యను కేవలం వారం రోజుల్లోనే పరిష్కరించేస్తుంది.ఈ మినీ మెషిన్ తో ట్రీట్మెంట్ తీసుకుంటే.. కళ్లు కాంతిమంతమవుతాయి. పెదవులు ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఈ డివైజ్‌కి ఒకవైపు రెండు చిన్న చిన్న బాల్స్ లాంటి మసాజర్ హెడ్స్ ఉంటాయి. వాటిని చర్మానికి ఆనించి మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టూల్‌కి మధ్యలో చిన్న రోలర్ బాటిల్ ఉంటుంది. అందులో సీరమ్ ఉంటుంది.మసాజ్ చేసుకునేముందు ఆయా ప్రదేశాల్లో ఆ సీరమ్‌ని అప్లై చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. సీరమ్ రోలర్ని డివైస్ నుంచి బయటికి తీసుకోవచ్చు.. తిరిగి అక్కడే అటాచ్ చేసుకోవచ్చు. ఈ సీరమ్ .. యాంటీ ఆక్సిడెంట్ కెఫిన్, క్రాన్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్, రోజ్ వాటర్, ఫర్మింగ్ నియాసినామైడ్, విటమిన్ బి5 వంటి 95% సహజ పదార్థాలతో తయారైంది.ఈ మెషిన్ తో సుమారు ఏడు రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే.. కళ్లు, పెదవుల చుట్టూ ఉన్న ముడతలు, గీతలు పోయి సహజమైన అందం సొంతమవుతుంది. ఈ డివైస్‌కి చార్జింగ్ పెట్టుకుని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ మసాజర్‌లో 5 లెవల్స్‌తో కూడిన ఆప్షన్్స ఉంటాయి. దాంతో అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ధర 186 డాలర్లు. అంటే 15,530 రూపాయలన్నమాట.ఇవి చదవండి: ఇవి మార్జాల పుష్పాలనుకుంటున్నారా! -
Black Salt Benefits : బ్లాక్ సాల్ట్‌తో ఇన్ని లాభాలా?
కోవిడ్-19 సంక్షోభం తరువాతఅందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. పోషకాహారంపై దృష్టి పెడుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి బ్లాక్ సాల్ట్ లేదా నల్ల ఉప్పు. నల్ల ఉప్పుతో ఎలాంటి ప్రయోజ నాలున్నాయో తెలుసుకుందాంఉప్పులేని వంటిల్లు లేదు. కానీ మనం రెగ్యులర్‌గా వాడే తెల్ల ఉప్పుతో కంటే కూడా బ్లాక్ సాల్ట్ ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు కలిగిన బ్లాక్‌సాల్ట్ ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. ఇది రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో సహాయపడే ఈ నల్ల ఉప్పు చాలాబాగా పనిచేస్తుంది. అలాగే నల్ల ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికే కాదు చర్మానికి, జుట్టుకు కూడా మంచిది. నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని చాలా మందికి తెలియదు.ఎసిడిటీ, మెరుగైన జీర్ణక్రియ తరచుగా గ్యాస్ ,అసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి నల్ల ఉప్పు నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిదని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. నల్ల ఉప్పును సరైన పరిమాణంలో తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. బ్లాక్ సాల్ట్ చాట్ లేదా సలాడ్ అయినా వాటి రుచిని పెంచుతుంది. ఇది అనేక యాంటీఆక్సిడెంట్లు కలిగిన పోషకాల నిధి.గుండె ఆరోగ్యానికి చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి కూడా దీని వినియోగం చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మితిమీరి ఎలాంటిది తీసుకున్నా హానికరం కాబట్టి, దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.బరువు తగ్గడానికినల్ల ఉప్పులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి ప్రభావవంతంగా ఉంటుంది.సలాడ్, పానీయం వంటి మొదలైన వాటిల్లో నల్ల ఉప్పును వేసుకుంటే మంచిది.నోటి ఆరోగ్యం గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు వేసి నిద్రించే ముందు పుక్కిలిస్తే దంతాలు బలపడతాయి. దీంతో పంటి నొప్పి, కుహరం సమస్యలు కూడా నయం అవుతాయి. చిగుళ్ళు వాపు, నోటి దుర్వాసన సమస్యను కూడా వదిలించుకోవచ్చు.చర్మ సమస్యలు నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. అందుకే నల్ల ఉప్పును జుట్టుకు, చర్మానికి మంచిది. సబ్బులూ, టూత్ పేస్ట్ ల తయారీలోనూ వాడుతుంటారు. నోట్: ఇది కేవలం సమాచారంగా మాత్రమే అని గమనించగలరు. బీపీ రోగులు ఉప్పును ఎంత పరిమితంగా వాడితే అంత మంచిది. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. -
Beauty Tips: చర్మం మృదువుగా.. ముడతలు లేకుండా ఉండాలంటే..?
పెరుగుతున్న కాలుష్యంతో ఆరోగ్యంపై ఎన్నో ప్రభావాలు పడుతున్నాయి. చాలా రకాల వ్యాధులు ఎదురవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు. చర్మం పొడిబారడం, చారలు, నలుపు, మచ్చలుగా మారడం లాంటివి. మరి ఈ సమస్యలనుండి చర్మం మృదువుగా, నిగారింపుగా ఉండాలంటే.. కావాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం. ముఖ చర్మం మృదువుగా ముడతలు లేకుండా ఉండాలంటే చర్మాన్ని తేమగా ఉండేలా చూసుకోవడం అవసరం. ఇందుకు బీట్రూట్ దుంప బాగా ఉపయోగపడుతుంది. బీట్రూట్ను చెక్కు తీసి సన్నగా తురుముకుని రసం తీసుకోవాలి. ఈ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి ΄్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. అలాగే కొన్ని గులాబీ ఆకులను తీసుకుని వాటికి తగినన్ని నీటిని చేర్చి మెత్తగా రుబ్బుకుని ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత కడిగేసుకుంటే ముఖం తేమగా ఉంటుంది. ఇది ముఖానికి గులాబీ రంగుని ఇస్తుంది. ఇవి అందుబాటులో లేక΄ోయినా లేదా తగిన సమయం లేకున్నా, ముఖంపై రోజ్‌వాటర్‌ను చల్లుకున్నా ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ముఖంపై, బుగ్గల పైన తేనె రాసుకుని ఆరాక శుభ్రం చేసుకున్నా ముఖం స్మూత్‌గా.. మెరుస్తూ కనిపిస్తుంది. ఇవి చదవండి: క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ ఇవి.. -
చికెన్ స్కిన్ గురించి విన్నారా? వేసవికాలంలో ఇబ్బంది పెట్టే వ్యాధి..!
చికెన్‌ఫాక్స్ లాంటి ఆటలమ్మ, పొంగు, తట్టు తరహా చర్మ వ్యాధులను చూశాం. గ్రామాల్లో మాత్రం ఈ వ్యాధిని అమ్మవారు చూపింది అంటారు. ఓ వారం రోజుల్లో ఈ సమస్య తగ్గిపోతుంది. ఇప్పటికీ చాలా చోట్ల దీనికి మందులు వాడరు ప్రజలు. వేపాకు, పసుపుతో తగ్గించుకుంటారు. అయితే దీనికి కూడా టీకాలు వంటివి వచ్చేశాయి ఇప్పుడు. కానీ కొత్తగా ఇదేంటీ..? చికెన్ స్కిన్ .. అంటే.. ఇది కూడా ఒక విధమైన చర్మ వ్యాధే. గానీ తీవ్రత ఎక్కువ. వచ్చిందంటే ఓ పట్టాన తగ్గదు. శోభి తర్వాత భయానకమైన చర్మవ్యాధి ఇదే. ముఖ్యంగా వేసవికాలంలో పలువురిని వేధించే సమస్య ఇది. అయితే కొందరికి నయం అయినా, మరికొందరికి మాత్రం జీవితాంతం వేధిస్తుంది. అసలేంటి వ్యాధి? ఎలా వస్తుంది ? వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..! వైద్య పరిభాషలో చికెన్ స్కిన్‌ను కెరటోసిస్ పిలారిస్ అని పిలుస్తుంటారు. ఈ వ్యాధి వచ్చిన రోగి చర్మంపై చిన్న చిన్న కురుపులు ఏర్పడతాయి. రాను రాను గులాబీ లేదా ఎరుపు రంగు మచ్చలుగా మారతాయి. ఇవి ఎక్కువగా చేతులు, ముఖం, తొడలు, చెంపలు, వీపు పైభాగంలో ఎక్కువగా ఏర్పడతాయి. ఆ మచ్చలు చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తాయి. వాటి వల్ల దురద కూడా ఏర్పడుతుంది. నలుగురిలో అదే పనిగా శరీరాన్ని గోకుతూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి కాకపోయినప్పటికీ.. ఎండాకాలంలో ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. పైగా నలుగురిలో తిరగలేక నానాఅవస్థలు పడతారు. దీనికి ప్రధాన కారణం చర్మంపై కెరాటిన్ ఏర్పడటం. ఎందుకంటే..? ఈ కెరాటిన్ చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. చర్మంపై వెంట్రుకల కుదుళ్ళు పెరగకుండా చేస్తుంది. ఫలితంగా చర్మంపై చిన్న పరిమాణంలో ఎర్రటి గడ్డలు ఏర్పడతాయి. ఈ కెరాటోసిస్ అనేది జన్యు మార్పుల వల్ల వస్తుందని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువ. తామర, మధుమేహం కెరాటోసిస్ పిలారిస్ కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులకు కూడా ఇది వచ్చే ప్రమాదం ఉంది. ఉబ్బసం, అలర్జీ, అధిక బరువు ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ చికెన్ స్కిన్ వల్ల ఏర్పడే గడ్డలు కొందరిలో వాటంతట అవే తగ్గిపోతాయి. మరికొందరిలో అయితే జీవితాంతం వేధిస్తూ ఉంటాయి. చికెన్ స్కిన్ నుంచి బయటపడాలంటే .. ముందుగా పొడి చర్మాన్ని నివారించాలి. కెరాటో లిటిక్ ఏ వంటి మాయిశ్చరైజింగ్ లోషన్లను వాడాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. అయితే చికెన్ స్కిన్ బారిన పడ్డవారు చర్మంపై వచ్చిన ఆ గడ్డలను గిచ్చడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. అంతేకాదు కొంతమంది రాపిడితో కూడిన ఎక్స్ ఫోలీయేటర్తో గడ్డల మీద స్క్రబ్ చేస్తుంటారు. దీనివల్ల చర్మం మరింత ప్రమాదంలో పడుతుంది. అంతేగాదు బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ఈ వ్యాధి బారనే పడ్డట్టు ఇన్స్టాగ్రాం వేదికగా తెలిపింది. ఈ వ్యాధి ఏంటో ఎలా బయటపడాలి అనే దాని గురించి కుణ్ణంగా తెలుసుకునే పనిలో ఉన్నాని కన్నీటిపర్యంతమయ్యింది. అందువల్ల సమస్య ఆదిలో ఉన్నప్పుడే వైద్యులను సంప్రదించి సత్వరమే సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. దీని గురించి మరింత క్షుణ్ణంగా వ్యక్తిగత వైద్యులను, నిపుణులను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. (చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!) -
పాపులర్ వీడియో గేమర్‌కి మెలనోమా కేన్సర్! ఎందువల్ల వస్తుందంటే..!
ఇటీవల కాలంటో ప్రముఖ సెలబ్రెటీలు, ఆటగాళ్లు కేన్సర్ బారిన పడుతున్నారు. ఒక్కసారిగా వారిలో చురుకుదనం కోల్పోయి డల్‌గా అయిపోతున్నారు. పాపం అక్కడకి లేని మనో నిబ్బరాన్నంతా కొని తెచ్చుకుని మరీ ఈ భయానక వ్యాధితో పోరాడుతున్నారు. కొందరూ ప్రాణాలతో బయటపడగా.. మరికొందరూ ఆ మహమ్మారికి బలవ్వుతున్నారు. అచ్చం అలానే ఓ ప్రసిద్ధ వీడియో గేమర్ ఈ కేన్సర్ మహమ్మారి బారిన పడ్డాడు. అతని కొచ్చిన కేన్సర్ ఏంటంటే.. ప్రోఫెషనల్ వీడియో గేమ్ ప్లేయర్ ట్విచ్ స్ట్రీమర్ నింజా చర్మ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ విషయం విని ఒక్కసారిగా అతని అభిమానులంత షాక్‌కి గురయ్యారు. అతడి పాదాలపై ఒక పుట్టుమచ్చ ఉంది. అది అసాధారణంగా పెద్దది అవ్వడం ప్రారంభించింది. దీంతో వైద్యులను సంప్రదించాడు స్ట్రీమర్. అన్ని పరీక్షలు చేసి మెలనోమా కేన్సర్ అని నిర్థారించారు వైద్యులు. అయితే వైద్యులు ప్రారంభ దశలోనే ఈ కేన్సర్‌ని గుర్తించారని పేర్కొన్నాడు సోషల్ మీడియా ఎక్స్‌లో. దయచేసి అందరూ చర్మానికి సంబంధించిన చెకప్‌లు చేసుకోండి అని అభిమానులను కోరాడు. ఇంతకీ అతనికి వచ్చిన మెలనోమా కేన్సర్ అంటే..! మెలనోమా అనేది మెలనోసైట్స్ నుంచి ఉద్భవించే ఒక రకమైన చర్మ కేన్సర్. ఇది మెలనిన్ వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. మెలనోమా సాధారణంగా సూర్యరశ్మికి బహిర్గతమయ్యే చర్మంపై ప్రారంభమవుతుంది. చాలా మెలనోమాలు అతినీలలోహిత కాంతికి గురికావడం వల్ల సంభవిస్తాయి. మెలనోమా దశను అనుసరించి చికిత్స విధానం మారుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పేర్కొంది. ఈ మెలనోమా కేన్సర్ చర్మంపై ఎక్కడైనా తలెత్తుతుందని నిపుణుల చెబుతున్నారు. చాలా పుట్టుమచ్చలు, గోధుమ రంగు మచ్చలు వంటి వాటిల్లో చర్మంపై అసాధారరణ పెరుగదల ఉంటే ఇది వస్తుంది. వీటిని ఏబీసీడీఈలు అనే అగ్లీ డక్లింగ్ గుర్తు ద్వారా మెలనోమాని గుర్తించడం జరుగుతుంది. అంతేగాదు ఆ ప్రదేశంలోని అనుమానాస్పద కణజాలాన్ని చర్మవ్యాధి నిపుణుడు బయాప్సీ చేయించి , క్యాన్సర్ కణాలు ఉన్నాయా, లేదా అని నిర్ణయిస్తాడు. అలా ఈ కేన్సర్‌ని గుర్తించడం జరిగాక, సిటీ స్కాన్లు, పీఈటీ స్కాన్లు సాయంతో ఏ దశలో ఉందనేది నిర్థారిస్తారు. చికిత్స.. ఇతర కేన్సర్ల కంటే ఇందులో చర్మం వద్ద కణాజాలం కాబట్టి తీసివేయడం కాస్త సులభం. గాయాన్ని తొలగించేటప్పడే క్యాన్సర్ ప్రమేయం ఎంతవరకు ఉందో నిర్థారించి తొలగించాక, పూర్తిగా తొలగిపోయాయా లేదా అని నిర్ధారించుకోవడానికి పాథాలజీ పరీక్షలకు కూడా పంపడం జరుగుతుంది. మెలనోమా చర్మంలోని పెద్ద ప్రాంతాలో ఉంటే మాత్రం చర్మాన్ని అంటుకట్టుట వంటివి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కేన్సర్ శోషరస కణుపులకు వ్యాపించే ప్రమాదం ఉంటే.. శోషరస కణుపు బయాప్సీని తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో రేడియేషన్ థెరపీ, కీమో థెరపీ వంటివి కూడా అవసరమవ్వచ్చు. ఇక నింజా 2011 నుంచి వృత్తిపరంగా పలు వీడియో గేమ్‌లు ఆడి స్ట్రీమర్‌గా మారాడు. ఇక్కడ ట్విచ్ అనేది ప్రధానంగా వీడియో గేమ్‌లపై దృష్టి సారించే లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్. అయితే ఇది సంగీతం, సృజనాత్మక కళలు, వంట మరిన్నింటిని కవర్ చేసే స్ట్రీమ్‌లను కూడా కలిగి ఉంటుంది. దీనిద్వారా ఎంతో మంది ప్రముఖులతో లైవ్‌స్ట్రీమ్‌లో వీడియో గేమ్‌లు ఆడి పేరు తెచ్చుకున్నాడు. దీని కారణంగానే అతనికి వేలాదిమంది ఫాలోవర్లుఉన్నారు. మైక్రోసాఫ్ట్ స్ట్రీమిగ్ ఫ్లాట్‌ఫాం మిక్సర్ కోసం 2019లో ట్విచ్ని వదిలిపెట్టాడు. ఆ మిక్సర్ షట్‌డౌన్ అయ్యాక మళ్లీ ట్విచ్కి తిరిగి వచ్చాడు. ఈ స్ట్రీమింగ్ ద్వారా అంతర్జాతీయ ప్రశంసల తోపాటు మిలయన్ల డాలర్లును సంపాదించాడు. (చదవండి: తండ్రి మిలియనీర్..కానీ కొడుక్కి 20 ఏళ్ల వరకు ఆ విషయం తెలియదు!) -
డైట్లో ఈ వంటకాన్ని చేరిస్తే..మెరిసే గ్లాస్ స్కిన్ మీ సొంతం!
కొరియన్ గ్లాస్ స్కిన్‌లా చర్మం ఉండాలని చాలామంది కోరుకుంటారు. అందుకోసం అని కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్‌లను ట్రై చేస్తుంటారు. వాటన్నింటి కంటే కూడా ఈ కొరియన్ వంటకాన్ని మీ డైట్లో చేర్చుకుంటే చక్కటి మచ్చలేని మెరిసే చర్మాన్ని పొందొచ్చు. అకాల వృద్ధాప్యా ఛాయలను కూడా దూరం చేస్తుంది. ఏంటా వంటకం అంటే.. కొరియన్ కిమ్చి అనే ప్రసిద్ధ వంటకం మీ చర్మాన్ని ఆరోగ్యంగా కాంతిమంతంగా చేయడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కిమ్చి అనేది సాంప్రదాయ కొరియన్ పులియబెట్టిన ఆహారం. దీన్ని కొరియన్లు ప్రతిరోజు తమ ఆహరంలో భాగం చేసుకుంటారు. ఇది సాధారణంగా చక్కెర, ఉప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, మిరపకాయ మసాల వంటి వాటిని జోడింది పులియబెట్టిన క్యాబేజీతో తయారు చేస్తారు. ఈ కిమ్చిని కావాలంటే ముల్లంగా, సెలెరీ, క్యారెట్, దోసకాయ, బచ్చలి కూర వంటి ఇతర కూరగాయలను ఉపయోగించి కూడా తయారు చేయవచ్చు. ఇది పులియబెట్టడం వల్ల ఉబ్బినట్లుగా ఉండి, పుల్లని రుచిని కలిగి ఉంటుంది. దీన్నీ మన రోజువారీ డైట్లో భాగం చేసుకుంటే కొరియన్లలాంటి గ్లాస్ స్కిన్‌ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మెటిమలు లేని, మృదువైన హైడ్రేటెడ్ చర్మాన్ని పొందొచ్చని చెబుతున్నారు కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ నీతి గౌర్. ఈ వంటకం చర్మాన్ని ఏవిధంగా మేలు చేస్తుందా సవివరంగా చూద్దాం. ప్రోబయోటిక్స్: కిమ్చిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి పేగు ఆరోగ్యానికి తోడ్పడే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా. ఇందులో ఉండే గట్ మైక్రోబయోమ్ చర్మ సంరక్షణ తోపాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది . శరీరంలో ప్రోబయోటిక్స్ సమతుల్య గట్ వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. తద్వారా సంభావ్యంగా చర్మం మంటను తగ్గించి..మొటిమలు, తామర వంటి వాటిని రాకుండా చేస్తుంది యాంటీఆక్సిడెంట్లు: కిమ్చిలో వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. వీటిలో విటమిన్లు ఏ, సీ ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి కీలకమైనవి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్, పర్యావరణ ఒత్తిళ్లు, యూవీ రేడియేషన్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సీడెంట్లు ఒత్తిడిని తగ్గించి..ముఖాన్ని యవ్వనంగా నిగనిగలాడేలా చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్: కిమ్చీని తయారీలో కిణ్వ ప్రక్రియ కారణంగా ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ వంటి బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉత్పత్తి అవుతాయి, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. మొటిమలు, రోసేసియా, అకాల వృద్ధాప్యం వంటివి దూరం చేస్తుంది. అలాగే ఎక్కువగా చర్మ పరిస్థితులలో వచ్చే వాపు వంటివి రానియ్యదు. విటమిన్లు, మినరల్ కంటెంట్: కిమ్చిలో విటమిన్లు ఏ,సీ, కే వంటి పోషకాలకు మంచి మూలం. అలాగే కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. ఈ పోషకాలు చర్మ ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. కొల్లాజెన్ సంశ్లేషణ, గాయం వంటి వాటి నుంచి సంరక్షిస్తుంది. (చదవండి: నాజూగ్గా ఉండే శిల్పాశెట్టి ఇంతలా ఫుడ్‌ని లాగించేస్తుందా..!) -
నిజంగానే..చర్మం ఒలిచి చెప్పులు కుట్టించాడు! ఇంట్రస్టింగ్ స్టోరీ
చేసిన మేలుకు కృతజ్ఞతగా ‘చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తా’ అనే మాటను సాధారణంగా వినే ఉంటాం కదా. కానీ ఎక్కడా చూసి ఉండం. కానీ మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన ఒక వ్యక్తి అక్షరాలా దీన్ని చేసి చూపించాడు. అదీ నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి పట్ల కృతజ్ఞతతో.. శ్రీరాముడి స్ఫూర్తితో. దీనికి సంబంధించిన స్టోరీ ఇపుడు నెట్టింట విశేషంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన రౌనక్ గుర్జార్ ఒకప్పుడు రౌడీ షీటర్. తన చర్మంతో తన తల్లికి చెప్పులు తయారు చేయించి బహుమానంగా ఇచ్చాడు. అదీ రామాయణం స్ఫూర్తితో. రామాయణంలో శ్రీరాముడు తన తల్లి పట్ల చూపిన భక్తికి , ప్రేమకు చలించిపోయాడు రౌనక్. తాను కూడా అమ్మకోసం ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా కుటుంబంలో ఎవరికీ తెలియకుండా ఓ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకుని, తొడ భాగంలోని కొంత చర్మాన్ని తొలగించి, దానితో తల్లికి సరిపోయేలా ఆ చర్మంతో చెప్పులు తయారు చేయించాడు. (ఇదే తొడమీద ఒకప్పుడు పోలీసులు కాల్పులు జరిపారట.) మార్చి 14 - 21 మధ్య తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన భగవత్ కథలో రౌనక్ తన తల్లికి ఆ చెప్పులు సమర్పించి తల్లి పాదాలపై మోకరిల్లాడు. దీంతో రౌనక్ తల్లితో పాటు గురు జితేంద్ర మహారాజ్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఈ సంఘటన కదిలించింది.రౌనక్ క్రమం తప్పకుండా రామాయణం పారాయణం చేస్తాడట. ఈ క్రమంలోనే శ్రీరాముడి పాత్ర తనలో స్ఫూర్తి నింపిందని చెప్పుకొచ్చాడు. తన చర్మంతో తనకు చెప్పులు కుట్టిస్తాడని ఊహించలేదంటూ రౌనక్ తల్లి కన్నీళ్లుపెట్టుకున్నారు. రౌనక్ లాంటి కొడుకును కనడం అదృష్టంగా భావిస్తున్నానంటూ, నిండు నూరేళ్లుగా చల్లగా వర్ధిల్లమని కొడుకుని మనసారా దీవించి గుండెనిండా హత్తుకుందామె -
చర్మం ఒలిచి..చెప్పులు కుట్టించి..
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన రౌనక్ గుర్జర్ అనే మాజీ గ్యాంగ్‌స్టర్ తన తల్లిపై ఉన్న ప్రేమను అచ్చంగా రామాయణంలో శ్రీరాముడు పేర్కొన్నట్లుగా చాటాడు. ఏకంగా తన చర్మాన్ని ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించి కానుకగా ఇచ్చాడు! ఇందుకుగల కారణాన్ని అతను వివరించాడు. గతంలో నేరప్రవృత్తి కారణంగా పోలీసు కాల్పుల బారినపడ్డ గుర్జర్ ఆ తర్వాత నిత్యం రామాయణ పారాయణంతో పూర్తిగా మారిపోయినట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా శ్రీరాముని పాత్ర నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని.. తల్లికి చర్మంతో చెప్పులు కుట్టించినా ఆమె రుణం తీర్చుకొనేందుకు చాలదని శ్రీరాముడు స్వయంగా పేర్కొన్న మాట తనను ఎంతగానో ఆకర్షించిందని గుర్తుచేసుకున్నాడు. అందుకే తాను తల్లికి తన చర్మంతో చెప్పులు కుట్టించాలని నిర్ణయించుకున్నట్లు గుర్జర్ చెప్పుకొచ్చాడు. ఇంట్లో వారికి చెప్పకుండా ఆస్పత్రిలో చేరి తన కాలి తొడ చర్మాన్ని సర్జరీ చేయించి తొలగించుకున్నానని.. ఆ చర్మాన్ని చెప్పులు కుట్టే వ్యక్తికి ఇచ్చి చెప్పులు చేయించానన్నాడు.గత వారం ఇంటి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తన తల్లికి ఈ చెప్పులను బహూకరించగా వాటిని చూసి ఆమె కన్నీటిపర్యంతమైందని గుర్జర్ తెలిపాడు. తల్లిదండ్రుల పాదాల చెంతనే స్వర్గం ఉంటుందనే విషయాన్ని సమాజానికి చాటిచెప్పాలనే ఈ పని చేశానన్నాడు. ‘తండ్రి స్వర్గానికి నిచ్చెనయితే తల్లి ఆ మార్గాన్ని చేరుకొనే వ్యక్తి’ అని గుర్జర్ పేర్కొన్నాడు. -సాక్షి సెంట్రల్ డెస్క్ -
గ్లాసీ స్కిన్ సీక్రెట్ : కొరియన్ బ్యూటీలు కూడా కుళ్లు కోవాల్సిందే!
మెరిసే చర్మం, మచ్చలేని అందమైన ముఖం అనేగానే అందరికీ గుర్తొచ్చేది కొరియన్ బ్యూటీస్. అందులోనూ ఇటీవల కొరియన్ బాండ్ మ్యూజిక్, సినిమాలు, సిరీస్‌లపై యూత్‌లో బాగా క్రేజ్ పెరిగింది. దీంతో కొరియన్ బ్యూటీల్లాగా గ్లాసీ స్కిన్‌తో మెరిసి పోవాలని కోరుకోవడం సహజమే. అందుకే మచ్చలేని మహారాణి, రాజులా మెరిసిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. ఫేషియల్ ఎక్స్‌ర్‌సైజ్ ముందుగా వ్యాయామాలు చాలా ముఖ్యం. శరీర ఆకృతికి వ్యాయామాలు చేసినట్టుగానే ముఖానికి కొన్ని నిర్దేశిత వ్యాయామాలున్నాయి. రోజులో రెండు సార్లు కచ్చితంగా చేస్తే వీ-జాలైన్ మీ సొంతమవుతుంది. సరిపడినన్ని నీళ్లు తాగడం చాలా కీలకం. క్లెన్సింగ్ కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలంటే డీప్ క్లెన్సింగ్ కీలకం. నీరు, గ్లిజరిన్ వంటి మాయిశ్చరైజర్లు , తేలికపాటి సర్ఫ్యాక్టెంట్లనుతో తయారుచేసిన మైకెల్లార్ క్లెన్సింగ్ వాటర్‌తో ముఖాన్ని రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. ఇది ఆల్కహాల్ ఫ్రీ కూడా. చర్మాన్ని టోన్ చేస్తుంది. క్మురికి, మేకప్, ఆయిల్‌ను డీప్‌గా శుభ్రం చేస్తుంది. లేదంటే నిమ్మకాయ కలిపిన ఫేస్‌వాష్‌తో అయినా శుభ్రం చేసుకోవచ్చు. పులిసిన బియ్యం కడిగిన నీళ్లు ఫేస్‌వాష్‌లు, కెమికల్ సబ్బుల జోలికిపోకుండా రైస్ వాటర్‌ను ఫేస్ వాష్‌గా వాడతారట కొరియన్స్. ఇది న్యాచురల్ క్లెన్సర్‌లా పనిచేస్తుంది. చర్మాన్ని ఎక్కువసేపు హైడ్రేట్‌గా ఉంచుతుంది. శుభ్రంగా కడిగిన బియ్యం నానబెట్టిన నీటి, తరువాత వడకట్టుకోవాలి. 24 గంటలు దీన్ని పులియ నివ్వాలి. మేజిక్ వాటర్‌తో ముఖం కడుక్కుంటే ప్రకాశవంతంగా తేమగా ముఖం మెరిసిపోతుంది. చర్మ సంరక్షణలో పెరుగు చాలా ముఖ్యమైన భాగం. పెరుగులో కొద్దిగా కస్తూరి పసుపు కలిపి, ఈ మిశ్రమంతో మృదువుగా మసాజ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఫేస్ మాస్క్ తేనె, నిమ్మరసం మాస్క్, గ్రీన్ టీ మాస్క్, చార్కోల్ సీరమ్ ఫేస్ మాస్క్ లేదా గ్రీన్-టీ సీరమ్ షీట్ మాస్క్‌ని ఉపయోగించి గ్లాసీ స్కిన్‌ను కూడా పొందవచ్చు.గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని డిటాక్సిఫై చేస్తుంది. నిమ్మరసం, తేనె మాస్క్ చర్మంపై పేరుకున్న మలినాలను, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. తేనె చర్మానికి తేమనందిస్తుంది. నిమ్మరసం టాన్ తొలగించి, స్కిన్ టోన్ లైట్ చేస్తుంది. చర్మాన్నిఆరోగ్యంగా, ముడతల్లేకుండా ఉంచేందుకు వాష్‌క్లాత్‌లతో ముఖాన్ని మసాజ్ చేస్తారు. గోరువెచ్చని నీటిలో మెత్తని గుడ్డను ముంచి, సున్నితంగా (ఎగువ దిశలో) తుడవాలి. దీంతో దుమ్ము , ధూళిని తొలగి తేటగా అవుతుంది. ట్యాపింగ్ ఫేషియల్ రిలాక్సేషన్ కోసం ట్యాపింగ్ టెక్నిక్‌ను కొరియన్లు బాగా వాడతారు. ఇది చర్మానికి మంచి రక్షణ అందించడంతోపాటు, రక్త ప్రసరణను పెంచుతుంది. అంతేకాదు తొందరగా వయసు సంబంధిత ముడతలు రాకుండా కాపాడుతుంది. టోనింగ్ అండ్ క్లీనింగ్ కొరియన్ చర్మ సంరక్షణలో మరో ముఖ్యమైంది టోనింగ్. పురాతన కాలంలో, కొరియన్లు తమ చర్మాన్ని టోన్ చేయడానికి దోసకాయ, టమోటా, పుచ్చకాయ వంటి సహజంగా నీరు లభించే వాటిని ఉపయోగించేవారట. కాబట్టి ఏదైనా టోనర్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఈ పదార్థాలను గుర్తు పెట్టుకొంటే మంచిది. వీటితోపాటు, జెన్సింగ్, గ్రీన్‌టీ రోస్ట్ బార్లీ టీకి కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఇక చివరగా రాత్రి పడుకునే ముందు ముఖచర్మ రక్షణ చర్యల్ని అస్సలు మర్చిపోరు. ప్రధానంగా అలెవెరా జెల్‌ను ముఖమంతా అప్లయ్ చేసుకుని, ఉదయం చల్లటి నీటితో కడుక్కుంటారు. -
బీట్రూట్- మిల్క్ ప్యాక్: మచ్చలు మాయం, గ్లోయింగ్ స్కిన్
ఎండాకాలంలో ముఖం, చర్మం సూర్యరశ్మికి గురికావడం వల్ల చాలా సమస్యలొస్తాయి.మొటిమలు ఎక్కువగా వస్తాయి. చర్మం నల్లబడుతుంది. సూర్యరశ్మికి ఎక్కువగా తిరగడం వల్ల చర్మ రంగు మారుతుంది. ఈ సమస్యని దూరం చేయాలంటే బీట్రూట్ క్రీమ్, ప్యాక్ హెల్ప్ చాలా సహాయ పడుతుంది. బీట్ రూట్ క్రీమ్ తొక్కతీసిన అరకప్పు బీట్రూట్ ముక్కలను గిన్నెలో వేసి అరగ్లాసు నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆపేసి బీట్రూట్ ముక్కల్లో టీస్పూను సోంపు వేసి పది నిమిషాలు నానబెట్టాలి. పది నిమిషాల తరువాత బీట్రూట్ ముక్కల్లో ఉన్న నీటిని వడగట్టి తీసుకోవాలి. ఈ నీటిలో టీస్పూను రోజ్ వాటర్, రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవాలి. వారం రోజులపాటు నిల్వ ఉండే ఈ క్రీమ్‌ను రోజూ ఉదయం పూట రాసుకుంటే.. ముఖం మీద మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పట్టి ప్రకాశవంతముగా కనిపిస్తుంది. బీట్రూట్ ఫేస్ ప్యాక్ స్కిన్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేసి చర్మ రంగుని మెరుగ్గా చేస్తుంది. బీట్రూట్ తొక్క తీసేసి ముక్కలుగా కోయాలి. ఈ ముక్కలకు పాలు కలిపి గ్రైండ్ చేయాలి. దీనిని ముఖానికి ప్యాక్‌లా అప్లయ్ చేయాలి. అలా మెడమీద కూడా రాసుకోవాలి. 15 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత క్లీన్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ దూరమవుతాయి. మురికిని దూరం చేసి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. పాలు కలుపుతాం కాబట్టి, చర్మం మృదువుగా, మెరుస్తుంటుంది. చర్మ సమస్యల్ని దూరం చేసి టోన్ చేయడంలో బీట్రూట్ హెల్ప్ చేస్తుంది. బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే బీట్రూట్లో నేచురల్ కలర్ ఉంటుంది. ఇందులోని బీటా లైన్ ఫెయిర్ స్కిన్‌టోన్‌ని అందిస్తుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి చర్మంలోని సమస్యల్ని దూరం చేసి ముడతలు పడకుండా చేస్తుంది. -
హెల్త్: 'మెగా షేప్ మసాజర్' తో.. ఫిట్నెస్ సెంటర్స్‌కి చెక్!
ఏ డ్రెస్ వేసుకున్నా.. అతికినట్టు సరిపోవాలంటే బాడీ సరైన షేప్‌లో ఉండాలి. అందుకే స్లిమ్ అండ్ ఫిట్ షేప్ కోసం నానాతంటాలు పడేది! ఆ కష్టాన్నించి గట్టెక్కించేదే ఈ మసాజర్. ఇది చక్కటి శరీరాకృతిని అందిస్తుంది. దీన్ని సాధారణ సమయాల్లోనే కాదు.. స్నానం చేస్తున్నప్పుడూ వాడుకోవచ్చు. సాధారణంగా మెషిన్స్‌కి వాటర్ తగిలితే పనిచేయవు. కానీ ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందిన మెషిన్ కాబట్టి.. వాటర్‌ప్రూఫ్‌గా పనిచేస్తుంది. దాంతో స్నానం చేస్తూ కూడా దీన్ని చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. మొదట ఏదైనా ఆయిల్ లేదా స్కిన్ టైటెనింగ్ క్రీమ్‌ని అప్లై చేసుకుని.. ఈ మసాజర్‌తో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మొత్తం 8 రోలర్లు, 13 ప్రోట్రూషన్ లతో కూడిన ఈ బ్యూటీ మసాజర్.. ఒత్తిడిని దూరం చేస్తుంది. డివైస్‌కి అమర్చుకునే రోలర్స్.. నాలుగు నాలుగు చొప్పున రెండు పార్ట్స్‌గా అమర్చి ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని మార్చుకోవచ్చు. మసాజ్ సమయంలో స్పీడ్ తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. ఇది కొవ్వును తగ్గిస్తూ యవ్వనంగా మారుస్తుంది. ఈ డివైస్‌తో పాటు.. ఎసిటినో 5డి డిజైనింగ్ క్రీమ్ కూడా లభిస్తుంది. దీన్ని విడిగా కూడా మార్కెట్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఫిట్నెస్ సెంటర్స్‌కి వెళ్లాల్సిన పని లేకుండానే.. ఈ డివైస్ మిమ్మల్ని నాజూగ్గా, స్లిమ్‌గా మారుస్తుంది. దీనికి 3 గంటల పాటు చార్జింగ్ పెడితే.. సుమారు 30 గంటల పాటు పని చేస్తుంది. కాళ్లు, చేతులు, నడుము, మెడ, పొట్ట భాగాల్లో పేరుకున్న కొవ్వును వేగంగా కరిగిస్తుంది. దీన్ని మెత్తటి క్లాత్ లేదా టిష్యూ సాయంతో క్లీన్ చేసుకోవచ్చు. వినియోగించడం.. ఇతర ప్రదేశాలకు తీసుకుని వెళ్లడం అంతా సులభమే. దీని ధర 207 డాలర్లు. అంటే 17,167 రూపాయలు. ఇవి చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే! -
ఇలా చేస్తే చర్మం నిత్య యవ్వనంగా ఉంటుంది!
చర్మం ఎప్పటికి కాంతిమంతంగా ఉండాలంటే మన ఇంట్లో మనం నిత్యం ఉపయోగించవాటితో ఈజీగా పొందొచ్చు. ముఖ్యంగా కాల్షియం కోసం తాగే పాలతో ముఖాన్ని నిత్య యవ్వనంగా ఉండేలా చేసుకోవచ్చు. అంతేగాదు వార్థప్యపు లక్షణాలకు కూడా చెక్‌పెట్టొచ్చు. పాలతో చర్మ సౌందర్యం పెంచుకునే సింపుల్ చిట్కాలేంటంటే.. పాలతో చర్మ సౌందర్యం చర్మం కాంతిమంతంగా మెరవాలంటే క్రీమ్‌లు లోషన్లకు బదులు ఇంట్లో ఉండే పాలతో ప్రయత్నించి చూడండి. పచ్చి పాలలో దూదిని ముంచి మెడ, గొంతు, ముఖాన్ని తుడిస్తే చర్మం మీద పట్టేసిన మురికి (సబ్బుతో శుభ్రం చేసినప్పటికీ వదలని మురికి) వదిలిపోతుంది. రెండు టీ స్పూన్ల పచ్చిపాలలో టీ స్పూన్ శనగపిండి, రెండు చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కొద్దిగా నీటిని చల్లి వలయాకారంగా మసాజ్ చేస్తూ శుభ్రం చేయాలి. ముఖం మీద సన్నని గీతలతో చిన్న వయసులోనే వార్థక్యపు లక్షణాలు కనిపిస్తుంటే రోజూ మిల్క్ ప్యాక్ వేయాలి. ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసిన తర్వాత పచ్చి పాలలో దూదిని ముంచి ముఖం మీద అద్దాలి. పాలు ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేసి పెసరపిండి ప్యాక్ వేయాలి. రెండు టీ స్పూన్ల పెసర పిండిలో రెండుచుక్కల తేనె వేసి తగినంత నీటితో కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే చర్మం నిత్య యవ్వనంతో ఉంటుంది. వార్థక్య లక్షణాలు దూరమవుతాయి. (చదవండి: గ్రీన్ టీ మంచిదని తాగేస్తున్నారా? దానివల్ల ఎదురయ్యే సమస్యలివే..!) -
ఈ రోలర్‌తో నిగనిగలాడే కోమలమైన చర్మం మీ సొంతం!
ఈ ఫేస్ లిఫ్టింగ్ రోలర్. కళ్ల చుట్టూ ఉండే సున్నితమైన చర్మం, మృదువైన పెదవులతో పాటు బుగ్గలు, మెడ చుట్టూ.. నుదుటి పైన.. చేతులు, కాళ్లు, తొడలు, నడుము ఇలా ప్రతి పార్ట్‌లోనూ ఈ రోలర్ని చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ స్కిన్ టోన్ – లిఫ్ట్ జెర్మేనియం కాంటౌరింగ్ మసాజ్ రోలర్‌కి కిందవైపు జెర్మేనియం మసాజ్ హెడ్ అటాచ్ అయ్యి ఉంటుంది. పైభాగంలో అమర్చుకోవడానికి.. 2 చిన్నచిన్న స్టోన్ మసాజర్లు, ఒక చిన్న జెర్మేనియం మసాజ్ హెడ్ అదనంగా లభిస్తాయి. అవసరాన్ని బట్టి ఆ మూడింటిలో ఒకదాన్ని మార్చుకుంటూ, మసాజ్ చేసుకోవచ్చు. ఇది ముఖవర్చస్సును పెంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే వయసుతో వచ్చే వృద్ధాప్య ఛాయలను మాయం చేస్తుంది. ముడతలను ఇట్టే పోగొడుతుంది. ఇందులోని రెండు జెర్మేనియం మసాజ్ రోలర్స్ మీదున్న ఆక్యుప్రెషర్ ప్యాడ్స్.. శరీరకణజాలలను ఉత్తేజపరచేందుకు తేలికపాటి ఒత్తిడిని కలిగిస్తాయి. దాంతో చర్మం బిగుతుగా మారుతుంది. ఆరోగ్యంగా నిగనిగలాడే కోమలమైన చర్మం మీ సొంతమవుతుంది. దీనితో ఒక్కో భాగం వద్ద సుమారు 30 నుంచి 60 సెకన్స్ పాటు.. క్రమం తప్పకుండా మసాజ్ చేసుకోవచ్చు. సాధారణ మసాజ్ ప్రోసెస్‌ని ఫాలో అవుతూ.. కింద నుంచి పైకి మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వినియోగించిన అనంతరం నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకుంటే సరిపోతుంది. ఈ టూల్ చాలా కలర్స్‌లో అందుబాటులో ఉంది. ధర 21 డాలర్లు (1,742 రూపాయలు) ఉంటుంది. (చదవండి: నటి మల్లికా అరోరా ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవే..!) -
Rice Water రైస్ వాటర్ మ్యాజిక్ నిజమేనా? లేక జిమ్మిక్కా?
ఆధునిక కాలంలో అందమైన ముఖం, చక్కటి జుట్టు, గ్లోయింగ్ స్కిన్ కోసం రకరకాల ఉత్పత్తులను వాడటం అలవాటుగా మారిపోయింది. దీనికి తోడు అనేక గృహచిట్కాలు కూడా తరచూ పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా చర్మ సంరక్షణలో రైస్ వాటర్ కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుందని నమ్మకం. ఇంటర్నెట్లో ఇలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్న వీడియోలకు కొదవలేదు. మరి నిపుణులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం..! సోషల్ మీడియా ప్రకారం రైస్ వాటర్ తయారు చేసి ముఖానికి అప్లై చేయాలంటే.. బియ్యాన్ని నీటిలో శుభ్రంగా, మూడుసార్లు కడిగి మూడోసారి నీటిని నిల్వ చేసి ఉంచుకోవాలి. ఇలా ఫెర్మెంటెడ్ వాటర్‌తో ముఖాన్ని మృదువుగా కడుక్కోవాలి. అలాగే బియ్యం వాటర్‌తో కడిగిన తరువాత మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ అప్లై చేయాల్సి ఉంటుంది. లేదంటే ముఖం డ్రైగా మారే అవకాశం ఉంది. ♦ ఈ బియ్యం నీటిని దాదాపు 2 వారాల పాటు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకొని, సాధారణ ఉష్టోగ్రతకు వచ్చిన తరువాత జుట్టుకు కూడా అప్లయ్ చేసుకొని, తరువాత కెమికల్స్‌లేని షాంపూతో తలంటుకోవాలి. దీని తరువాత కండీషన్ అప్లై చేయాలి. ♦ రైస్ వాటర్ చర్మానికి ఒకటి కాదు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాల కారణంగా చర్మం నూతనంగా ఉంటుంది. ముఖంపై మచ్చలను తొలగించడం, వడదెబ్బ నుండి ఉపశమనం కలిగించడం వంటి ఉపయోగాలను అందిస్తుంది. నిపుణులు ఏమంటున్నారు? జపాన్, చైనా కొరియన్ చర్మ సంరక్షణలో బియ్యం ఎక్కువగా ఉపయోగిస్తారని చెబుతారు. ఇందులో రైస్ వాటర్ టోనర్, ఫేస్ వాష్, రైస్ ఫ్లోర్ ఫేస్ మాస్క్, క్రీమ్ ప్రధానంగా ఉన్నాయి. అయితే బియ్యం కడిగిన నీటిని ముఖానికి జుట్టుకు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయంటున్నారు చర్మవ్యాధి నిపుణులు వరిలో పోషకాలు పుష్కలంగాఉన్నప్పటికీ,చర్మం, జుట్టుకు ఉపయోగపడుతుందనడానికి పరిశోధన, ఆధారాలు లేవని ఆడుబాన్ డెర్మటాలజీ బోర్డు-సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ డియర్డ్రే హూపర్ చెప్పారు. అయితే బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి జుట్టుకు ట్రీట్మెంట్గా ఉపయోగించడం కొత్తది కాదు. వేలాది సంవత్సరాలుగా అనేక ఆసియా దేశాలలో నివసిస్తున్న ప్రజలు బియ్యం నీటిని ఉపయోగిస్తున్నారు. వారి పొడవాటి జుట్టుకి కారణం పులియబెట్టిన బియ్యం నీరే అని చెబుతారు. 1000 సంవత్సరంలో జపనీస్ మహిళలు యు-సు-రు లేదా కడిగిన బియ్యం నీళ్లతో జుట్టును వాష్ చేసుకునేవారట. బియ్యంలో మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, థయామిన్ , నియాసిన్ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే బియ్యం నీటిలో ఫినాల్స్ ఉంటాయి. ఇది అలోపేసియా అరేటా చికిత్సలో సహాయపడుతుంది. కానీ కొంతమందిలోమాత్రం పరిస్థితిని మరింత దిగజారుతుందని హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు బియ్యం నిల్వ ఉండేందుకు కొన్ని రకాల పౌడర్లు కలుపుతారు. ఇవి చర్మానికి హాని కరం హానికరం. రైస్ వాటర్‌లోని స్టార్చ్‌తో జుట్టు పెళుసుబారుతుంది వెంట్రుకలను బియ్యం నీటిలో కడుక్కోవడం వల్ల చిక్కు జుట్టు సులభంగా విరిగిపోయే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా మెడికల్ స్కూల్లోని డెర్మటాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ రోండా ఫరా చెప్పారు. రైస్ వాటర్‌లో ఉంటే స్టార్చ్, తేమను పీల్చేసుకుంటుంది. తద్వారా జుట్టు పెళుసుగా మారుతుందట. అలాగే ప్రాసెస్ చేసిన బియ్యంతో తయారు చేసిన బియ్యం నీరు ఏ మేరకు ఉపయోపడుతుందో తేల్చ లేమన్నారు. సిల్కీ జుట్టు కారణాలు పలు అంశాలపై అధారపడి ఉంటాయని అంతేకాదు ఒక్కో మనిషి జుట్టు రకం భిన్నంగా ఉంటాయని, అందరికీ ఒకే వైద్య చిట్కాలు పనిచేయని కూడా నిపుణులు చెబుతున్నారు. నోట్: ఇంటర్నెట్లో దొరికే సమాచారం అంతా నిజమని నమ్మలేం. ఈ నేపథ్యంలో ఎవరైనా తమ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవాలనుకుంటే, ఒత్తైన జుట్టు కావాలనుకుంటే (ఇది వారి జీన్స్ ఆధారితమైంది కూడా అనేది గమనించాలి) జీవన శైలి మార్పులు అవసరం. ఒత్తిడికి దూరంగా ఉంటూ, చుండ్రుకు చికిత్స చేయడం, హెయిర్ డ్రైయ్యర్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. సురక్షితమైన, సహజమైన రైస్ బ్రాన్ మినరల్ ఎక్స్ట్రాక్ట్ ఉత్పత్తులను వాడుకోవచ్చు. -
మొటిమల ముల్లుకు మొటిమలతోనే విరుగుడు!
టీనేజర్లను బాగా వేధించే సమస్య మొటిమలు. ముఖంపై చిన్న బొడిపెల మాదిరిగా వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. ఒక్కొసారి వాటి నుంచి జిడ్డుగా ఉండే ఒక రకమైన ద్రవం కారుతుంది. గిల్లడం వల్ల ముఖంపై ఎర్రటి పొక్కుల్ల అసహ్యంగా కనిపిస్తాయి. ఓ పట్టాన తగ్గవు. ఇంతవరకు మొటిమలు తగ్గేందుకు యాంటీ బయోటిక్ మందులతో చికిత్స అందిస్తున్నాం. అవి కేవలం మొటిమలు రావడానికి కారణమయ్యే సెబమ్ అనే జిడ్డుని ఉత్పత్తి చేసే కణాలతో పోరాడేవి లేదా నాశనం చేసేవి. నిజం చెప్పాలంటే ఆ ఔషధాలు మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకునే చికిత్స చేసేవారు వైద్యులు. అయితే ఆ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియానే మనకు మేలు చేసేలా మారిస్తే..! అనే సరికొత్త అధ్యయానికి నాంది పలికారు స్పెయిన్ శాస్త్రవేత్తలు. ఈ మేరకు పాంప్యూ ఫాబ్రా విశ్వవిద్యాలయం(యూపీఎఫ్) శాస్త్రవేత్తలు మొటిమల మందులలో క్రియాశీల పదార్థాలు ఉత్పత్తి అయ్యేలా చర్మంలో ఉండే బ్యాక్టీరియాను ఎలా ఇంజనీర్ చేయాలనే దిశగా పరిశోధనలు చేస్తున్నారు. మొట్టిమలకు కారణమయ్యే క్యూటిబాక్టిరియాని రిపేర్ చేయడమే లక్ష్యంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ బ్యాక్టీరియా మన చర్మంపై ఉండే వెంట్రుకల కుదుళ్లలో లోతుగా నివశిస్తుంది. ఇది సెబమ్ అనే ఒక విధమైన జిడ్డు అధికంగా ఉత్పత్తి చేసి మొటిమలు వచ్చేందుకు కారణమవుతోంది. అందువల్ల వైద్యులు ఆ జిడ్డుని ఉత్పత్తి చేసే కణాలను చంపేలే ట్రీట్మెంట్ చేసేవారు. ఇప్పుడూ ఆ సెబమ్ అనే జిడ్డు తక్కువగా ఉత్పత్తి చేసేలా చర్మంలోని బ్యాక్టీరియాని మార్చే టెక్నిక్‌ని అభివృద్ధి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అందుకోసం మానవ చర్మ కణాల్లోని బ్యాక్టీరియాను ల్యాబ్‌లో పరీక్షించగా మెటిమలను రాకుండా చేసే ఎన్జీఏఎల్ అనే ప్రోటీన్‌ను కూడా స్రవించగలదని గుర్తించారు. దీంతో ఆ బ్యాక్టీరియాతోనే ముఖంపై ఏర్పడే జిడ్డు ఉత్పత్తికి కారణమ్యే సెబమ్ ఉత్పత్తిని నియంత్రించొచ్చని కనుగొన్నారు. దీన్ని ఎలుకలపై ప్రయోగించగా.. ఆ బ్యాక్టీరియా ఎలుకల్లో జీవించగులుగుతుందని గుర్తించారు. ఆ విధానం పనిచేస్తుంది కానీ మొటిమల ప్రభావాల గురించి ఎలుకలపై ప్రయోగించి తెలుసుకోవడం అనేది కుదరదు. ఎందుకంటే? ఎలుక చర్మం మానవ చర్మాని కంటే విభిన్నంగా ఉంటుంది. కచ్చితంగా మనుషులపైనే ఈ టెక్నిక్ ట్రయల్స్ నిర్వహించక తప్పదు. అయితే ఈ టెక్నిక్‌ని తొలుత త్రీడీ స్కిన్ మోడల్లో ప్రయత్నిస్తే బెటర్ అని భావిస్తున్నారు. ఎందుకంటే? అన్ని రకాల చర్మ పరిస్థితులకు ఈ విధానం అనువుగా ఉంటుంది. అదే సమయంలో మానువులపై ట్రయల్స్ నిర్వహించేందకు మరింత లోతుగా ఈ టెక్నిక్‌పై పరిశోధనుల చేయాల్సి ఉందని కూడా చెప్పారు పరిశోధకులు. అలాగే తాము ఈ బ్యాక్టీరియాను వివిధ రకాల చర్మ వ్యాధులకు కూడా మేలు చేసేలా మార్చేలా ఆ టెక్నిక్‌ని అభివృద్ధిపరచనున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. అంతేగాక మొటిమల నివారణకు మొటిమలనే ఉపయోగించడంపై కూడా దృష్టి సారిస్తున్నట్లు కూడా తెలిపారు. (చదవడం: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
లైఫ్‌లో దీన్ని నిర్లక్ష్యం చేశారో... ముప్పే!
ఉరుకులు, పరుగుల జీవితంలో ఒత్తిడి చాలా కామన్ అని లైట్ తీసుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ఒత్తిడి చాలారకాలుగా మన అందర్నీ వేధిస్తూ ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడిమానసిక సమస్యలే కాదు, శారీరకంగానూ అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. చర్మ సమస్యలు, త్వరగావృద్ధాప్యం శరీరం ఒత్తిడికి గురైనప్పుడు తలనొప్పికి మానసికంగా కుంగుబాటుతోపాటు అనేక చర్మ సమస్యలకు దారి తీస్తుంది. సోరియాసిస్ వంటి చర్మ పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుంది.స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ హార్మోన్ విడుదల ఎక్కువ అవుతుంది. ఇది చర్మ సున్నితత్వం రియాక్టివిటీని పెంచుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇప్పటికే తామర ఉన్నవారిలో అది మరింత ముదరవచ్చు. అలాగే గాయాలను సహజంగా నయం చేసే చర్మ సామర్థ్యానికి ఒత్తిడి ఆటంకం కలిగిస్తుంది. చర్మంలోని కొల్లాజెన్, సాగే ఫైబర్‌ను ప్రభావితం చేస్తోంది చర్మంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది దీంతో చాలా తొందరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఇంకా మొటిమలు, దద్దుర్లు రావడం, జట్టు సన్నబడటం, రాలిపోవడం లాంటి ఇతర చర్మ సమస్యలు కూడా వస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. హార్మోన్లపై ప్రభావం: ఎక్కువగా స్ట్రెస్‌కు గురైనపుడు డొపమైన్, కార్టిసోల్ అనే హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంది. ఇవి మిగిలిన హార్మోన్స్‌పై ప్రభావం చూపుతాయని ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవచ్చు. బీపీ పెరగడం లాంఇ సమస్యలు ఎదుర్కొంటారు. గుండె పోటు ముప్పు : తీవ్రమైన ఒత్తిడితో హృదయ స్పందనల్లో తేడాలొస్తాయి. ఒక్కోసారి గుండెపోటుకు ప్రమాదం ఉంది. బీపీ పెరిగి పక్షవాతంముప్పు పొంచివుంటుంది. ఒత్తిళ్లతో రక్తపోటు అదుపులో లేని వారిలో హెమరైజ్డ్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ క్షీణిస్తుంది. దీని కారణంగా ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. జీర్ణ సమస్యలు: ఒత్తిడి ఎక్కువైతే కడుపునొప్పి, అజీర్ణం, ఆకలి మందగించడం, అతిగా తినడం, వికారం లాంటివి కన్పిస్తాయి. కడుపులో అల్సర్లు ఏర్పడతాయి. జీవక్రియల వేగం మందగిస్తుంది. ఎంజైమ్‌ల ఉత్పత్తి తగ్గుతుంది. సైలెంట్ కిల్లర్... ఏం చేయాలి? సైలెంట్ కిల్లర్ లాంటి ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించి పరిష్కరించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. గుర్తించి చికిత్స తీసుకుంటే మాత్రం చాలా సులువుగా దీన్నుంచి బయటపడవచ్చు. స్ట్రెస్‌మేనేజ్‌మెంట్ తగినంత నిద్రపోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టడం చాలా కీలకం. రిలాక్సేషన్ టెక్నిక్స్ , యోగా, ధ్యానం లాంటి సాధన. రెగ్యులర్ వ్యాయామం ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, చర్మానికి మేలు చేస్తుంది. 7-9 గంటల నాణ్యమైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, పండ్లు, కూరగాయలు , తృణధాన్యాలతో సమతుల్య ఆహారం తీసుకోవాలి. తగినంత నీటిని తీసుకోవాలి. కెఫిన్ , ఆల్కహాల్‌కి దూరంగా ఉండటంతోపాటు, ఒత్తిడి కలిగించే పనులు, ఎక్కువ శ్రమకు దూరంగా ఉండాలి. స్నేహితులు, ఆత్మీయులు,కుటుంబ సభ్యుల మంచి సంబంధాలకు ప్రయత్నించాలి. ఇక ఒత్తిడి భరించలేని స్థాయికి చేరిందని పిస్తే థెరపిస్ట్ లేదా కౌన్సెలర్, లేదా నిపుణుడైన వైద్యుని సలహా తీసుకోవాలి. -
Onion skin: ఉల్లిపాయ పొట్టుతో ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
సాధారణంగా వంటల్లో ఉల్లిపాయలను అందరమూ వాడుతుంటాం. కొంతమంది వాసన పడక, మరికొంతమంది ఉపవాసాల సమయంలోనూ ఉల్లిపాయలను పక్కనపెట్టేస్తారు. అయితే ఉల్లిపాయలు మాత్రమేకాదు ఉల్లిపాయ తొక్కలు లేదా పొట్టు వల్ల ఆశ్చర్యకరమైన ప్రయోజనాలున్నాయి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అన్నట్టు ఉల్లిపాయ తొక్కల్లో కూడా మంచి పోషకాలు ఉన్నాయి. ఉల్లిపాయల్లో యాంటీ బయోటిక్, యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండి వీటిని తినడం ద్వారా ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని కాపాడుతాయి. వీటిలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బీ, సీ సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం చాలా తక్కువగా ఉండి మనకు ఆరోగ్యాన్నిస్తాయి. క్వెర్సెటిన్ లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలను ఉల్లిపాయ తొక్కల్లో ఉన్నాయని అధ్యయనాలు వెల్లడించాయి. అలాగే ఉల్లి తొక్కలతో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇవి చర్మం, జుట్టుకు మేలు చేకూరుస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో సాయపడతాయి. అంతేకాదు ఉల్లి పొట్టు మంచి కంపోస్ట్‌గా ఉపయోపడుతుంది. టీ, హెయిర్ డై, టోనర్‌గా, ఫ్లేవర్ ఏజెంట్‌గా, కంపోస్ట్‌గా.. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అదెలాగో చూద్దాం. ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు టీ ఉల్లిపాయ తొక్కతో చేసిన టీ తాగడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుందట వీటిని నీటిలో 10 నుంచి 20 నిమిషాలు ఉడకబెట్టి వడపోసి తరువాత ఈ టీని తాగొచ్చు. ఊబకాయం, అధిక రక్తపోటు, ఇన్ఫెక్షన్లను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మసాలా ఉల్లిపాయ తొక్కలను పారేయకుండా శుభ్రంగా కడిగి రెండు సార్లు కడగాలి. వీటిని ఎండలో ఆరబెట్టి పొడిచేయాలి. ఆరునెలలపాటు నిల్వ ఉండే ఈ పొడి మసాలాలో కలుపుకుని కూరల్లో వేసుకుంటే..కూర మంచి రుచిగా ఉంటుంది. రుచి, సువాసన స్టాక్, సూప్, గ్రేవీ మరుగుతున్న సమయంలో ఉల్లిపాయ తొక్కలను జోడించడం ద్వారా మంచి రుచితోపాటు శక్తివంతమైన రంగును అందిస్తుంది. గ్రేవీని చిక్కగా మారుస్తుంది. ఉడకబెట్టిన తర్వాత పీల్స్ తొలగించడం మర్చిపోవద్దు. చర్మం రోగాలకు ఉల్లిపాయ తొక్కలు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండి చర్మం, దద్దుర్లు, అథ్లెట్స్ ఫుట్‌పై దురదను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మంపై ఉల్లిపాయ తొక్క నీటిని అప్లై చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు. హెయిర్ డై సల్ఫర్ పుష్కలంగా ఉండే ఉల్లిపాయ తొక్కలను ఉపయోగించి నెరిసిన జుట్టు రంగు మార్చుకోవచ్చు. ఇది హెయిర్ ఫోలికల్స్‌కు పోషణ అందించడం ద్వారా బూడిద జుట్టును బంగారు గోధుమ రంగులోకి మారుస్తుంది. అలాగే, జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయ తొక్కలు నల్లగా కాలింత వరకు మీడియం మంట మీద వేడి చేసి తొక్కలను మెత్తగా నూరాలి. దీనికి కొద్దిగా కలబంద జెల్ లేదా నూనె కలపాలి. ఇలా చేసుకున్న జెల్‌ను నేరుగా హెయిర్ డైలా అప్లై చేసి గ్రే హెయిర్‌ను కవర్ చేసుకోవచ్చు. మంచి నిద్రకు ఉల్లిపాయ తొక్కలలో ఉండే ఎల్-ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం సహజమైన మత్తుమందులా పనిచేస్తుంది. ఉల్లిపాయ తొక్క టీ తాగడం వల్ల నరాలు ప్రశాంతతను పొందుతాయి. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. హెయిర్ టోనర్ పొడి జుట్టు, నిస్తేజమైన జుట్టు కోసం ఉల్లిపాయ తొక్కలను హెయిర్ టోనర్‌గా వాడుకోవచ్చు. ఉల్లిపాయ తొక్కలను నీళ్లలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించడం ద్వారా ఈ టోనర్‌ను తయారు చేసుకోవచ్చు. దీన్ని సీసాలో నిల్వ చేసుకుని అప్పుడప్పుడు జుట్టుకు పట్టించాలి. మంచి కంపోస్ట్‌గా మిద్దె తోటల్లో, బాల్కనీ గార్డెన్ ఉల్లి తొక్కల కంపోస్ట్ బాగా ఉపయోపడుతుంది. మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే అవసరమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. గులాబీ, మల్లి లాంటి ఇతర పూల మొక్కలకు ఈ కంపోస్ట్ మంచి టానిక్‌లా ఉపయోపడుతుంది. ఉల్లిపాయ తొక్కల్లో మొక్కలకు బలాన్నిచ్చే ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది. సహజరంగుగా ఉల్లిపాయ తొక్కలను నీటిలో ఉడకబెట్టి ఆ రంగును సహజ రంగులుగా వాడతారు. ఉల్లి రకాన్ని బట్టి బంగారు-పసుపు , డార్క్ ఆరెంజ్ రంగు వస్తుంది. హస్తకళాకారులు, చేతివృత్తులవారు ఈ సహజ రంగును వివిధ ఫాబ్రిక్ ,పేపర్ కోసం ఉపయోగిస్తారు. జాగ్రత్త: ఉల్లిపాయ తొక్కను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఇది కొంతమంది వ్యక్తులలో అలెర్జీ రావచ్చు. అలాగే కొన్ని రకాల ఉల్లిపాయలపై అప్పుడప్పుడు నల్లటి ఫంగస్ లాంటిది ఉంటుంది. సో శుభ్రమైన హెల్దీగా ఉన్నవాటిని తీసుకొని, నీటిలో బాగా కడిగి వాడుకోవడం ఉత్తమం -
'పచ్చి మిరపకారా'నికి గారం చేయండి.. ఎందుకో తెలుసా?
ప్రతిరోజూ మనం వండే వంటల్లో కారం రుచి కోసం పచ్చిమిరపకాయలు వాడతాం. అయితే ఇవి రుచిని అందించడంతో పాటు ప్రమాదకర వ్యాధుల నుండి కాపాడడమే కాకుండా, చర్మ సమస్యలు రాకుండా రక్షణ కవచంలా ఉంటాయని మీకు తెలుసా? ఇలా ఒక్క చర్మ సమస్యలే కాదు,.. రక్తప్రసరణ, గుండె జబ్బులు, అల్సర్లు, వివిధ అనేక సమస్యల నుంచి కాపాడటంలో దివ్య ఔషధంగా పని చేస్తుంది. మరి వాటి గురించి తెలుసుకుందాం. పచ్చిమిరపలో ఎ,సి బి6 విటమిన్లతో పాటు ఇనుము, రాగి, పొటాషియం తక్కువ మొత్తంలో ప్రోటీన్, కార్పోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. పచ్చిమిరపలోని క్యాప్సైసిన్ అనే పదార్థం శ్లేష్మ పొరలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో అది సులువుగా బయటకు వచ్చేస్తుంది. సైనస్, జలుబుకి పచ్చిమిరప మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది. పచ్చిమిరప రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పచ్చిమిరపలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల కోతలు, గాయాలు వంటి వాటిని త్వరగా నయం చేస్తుంది. గుండె జబ్బులు, అల్సర్లు కూడా పచ్చిమిరప తీసుకోవడం వల్ల నయమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంలో సమర్థంగా పనిచేస్తుంది. డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు పచ్చి మిర్చితో చేసిన ఫుడ్ తీసుకోవడం మేలు చేస్తుంది. పచ్చిమిరపలో ఉండే విటమిన్ సి, ఇ శరీరంలో రక్తప్రసరణ పెంచడంలో సహాయపడతాయి. మొటిమల సమస్యలను కూడా నయం చేస్తుంది. ఇందులో అసలు క్యాలరీలు ఉండవు కాబట్టి బరువు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. చాలామందిలో మూడ్ స్వింగ్స్ సమస్య ఉంటుంది. పచ్చిమిరప మెదడులోని ఎండార్ఫిన్లను బయటకు పంపేందుకు ఉపయోగపడుతుంది. దీని కారణంగా మూడ్ స్వింగ్స్ నుండి బయటపడి సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా చలికాలంలో పచ్చిమిరపకాయలు తినడం వల్ల యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఎముకలు దంతాలు, కళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు నివారించడంలో పచ్చి మిరపకాయలు ఎంతగానో సహాయపడతాయి. కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న పచ్చి మిరపకాయలను మీరు తినే ఆహారంలో ఎక్కువగా చేర్చుకోండి. ఇవి కూడా చదవండి: మడమల నొప్పితో నడవలేకున్నారా.. అయితే ఇలా చేయండి! -
ఈ మాస్క్ వేసుకుంటే..వయసును చూపించే సంకేతాలన్నీ మాయం!
ఎంత మేకప్ వేసినా.. కళ్లు.. పెరుగుతున్న వయసును దాచలేవు. కళ్ల చుట్టు ఏర్పడే ముడతలు, మచ్చలు, డార్క్ సర్కిల్స్ వంటివన్నీ వయసును బయటపెట్టడమే కాదు ముఖాన్నీ కళావిహీనంగానూ మారుస్తాయి. చిత్రంలోని ఈ మాస్క్‌ను రోజుకు పది నిమిషాలు ఉపయోగిస్తే చాలు.. వయసును చూపిస్తున్న లక్షణాలన్నీ మాయమై ముఖం మిలమిలా మెరుస్తుంది. ఈ ‘మెడి లిఫ్ట్ ఐ ఈఎమ్ఎస్ మాస్క్’ వృద్ధాప్య సంకేతాలతో పోరాడేందుకు కళ్ల కోసం రూపొందింది. దీన్ని రోజుకు పది నిమిషాలు ధరిస్తే చాలు మంచి ఫలితం వస్తుంది. ఎలక్ట్రికల్ మజిల్స్ స్టిమ్యులేషన్ మాస్క్(EMS) నుంచి మంచి ప్రయోజనాలను అందుకోవచ్చు. దీనికి రెండున్నర గంటలు చార్జింగ్ పెడితే సుమారు 3 గంటల పాటు నిర్విరామంగా ఉపయోగించుకోవచ్చు. ఈ మాస్క్ ధర దాదాపుగా 226 డాలర్లు ఉంది. అంటే 18,855 రూపాయలు. దీన్ని వినియోగించడం చాలా ఈజీ. టీవీ చూస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు, వాకింగ్‌కి వెళ్లినప్పుడు, ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా వినియోగించుకోవచ్చు. (చదవండి: నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!) -
శీతాకాలం ముఖానికి కొబ్బరి నూనె రాస్తున్నారా?
శీతకాలంలో ముఖం డ్రైగా మారి గరుకుగా ఉంటుంది. స్కిన్ కూడా తెల్లతెల్లగా పాలిపోయినట్లు అయిపోతుంది. మన ముఖాన్ని టచ్ చేస్తేనే మనకే ఇరిటేషన్‌గా ఉంటుంది. దీంతో ఇంట్లో ఉండే కొబ్బరి నూనెనే గబుక్కున రాసేస్తుంటాం. అందరికీ అందుబాటులోనూ చవకగా ఉంటుంది కూడా. చిన్నప్పటి నుంచి చర్మంపై దురద వచ్చినా, కందినా కూడా కొబ్బరి నూనెనే రాసేవాళ్లం. అయితే ఇలా రాయడం మంచిదేనా? రాస్తే ఏమవుతుంది తదితరాల గురించే ఈ కథనం!. ఏం జరుగుతుందంటే.. ముఖానికి కొబ్బరి నూనె రాయడం చాలా మంచిదే గానీ దాన్ని సరైన విధంగా ముఖానికి అప్లై చేస్తేనే ఫలితం ఉంటుందని సౌందర్య నిపుణలు అంటున్నారు. రాత్రిపూట ముఖానికి కొబ్బరి నూనెతో సున్నితంగా మసాజ్ చేస్తే రాత్రంత ముఖం తేమగా, కోమలంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ మసాజ్ వల్ల ముఖం అంతా రక్తప్రసరణ జరిగి తాజాగా ఉండటమే గాక ముఖ చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది పొడి చర్మం ఉన్నవారికి ఈ కొబ్బరి నూనె మంచి మాయిశ్చరైజషన్గా ఉంటుంది. ఇందులో ఎలాంటి కృత్రిమ రసాయనాలు ఉండవు కాబట్టి దుష్ప్రభావాలు ఉండవని చెబుతున్నారు దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమల వల్ల వచ్చే వాపులను తగ్గిస్తుంది. అలాగే కళ్ల కింద వాపులను కూడా నయం చేస్తుంది. మొటిమలు, వాటి తాలుకా మచ్చలను తగ్గిచడంలో కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. బ్లాక్‌హెడ్స్, వైట్ హెడ్స్ వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. అతినీలలోహిత కిరణాలను నిరోధించే శక్తి ఈ కొబ్బరి నూనెకు ఉంది. అందువల్ల ఇది మంచి యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీన్ని సహజ మేకప్ రిమూవర్‌గా కూడా ఉపయోగించొచ్చు. చెప్పాలంటే.. మేకప్‌ని తొలగించి చర్మాన్ని శుభ్రపరిచే క్లెన్సర్‌గా పనిచేస్తుంది. (చదవండి: బరువు తగ్గడంలో పనీర్ హెల్ప్ అవుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..?) -
ఐస్‌వాటర్ ముఖ సౌందర్యాన్ని ఎలా రక్షిస్తుందో తెలుసా!
ఇంతవరకు ఎన్నో క్రీమ్‌లు, సౌందర్య లేపనాలు ట్రై చేసి ఉంటారు. కానీ అవన్నీ కూడా ఈ ఐస్ వాటర్ ట్రిక్ ముందు బలాదూర్ అంటున్నారు సౌందర్య నిపుణులు. సెలబ్రెటీలు నుంచి ప్రముఖులు వరకు ఈ ఐస్‌వాటర్ ట్రిక్ని ఫాలో అవుతుంటారట. అందువల్ల వాళ్లంతా నలభైలలో కూడా టీనేజ్‌లో ఉన్నట్లే కనిపించేందకు రీజన్ ఇదేనట. అసలు ఐస్‌వాటర్ చర్మ సౌందర్యాన్ని కాపాడటం ఏంటీ? కామెడీగా అని కొట్టిపారేయకండి. ఇది ఎంత మేలు చేస్తుందంటే.. ఉదయం లేచిన వెంటనే మీ ముఖాన్ని కొద్దిసేపు ఐస్‌వాటర్‌లో డిప్ చేసి ఉంచితే ఒక్కసారిగా నిద్రమత్తుతో ఉన్న ముఖం క్షణాల్లో ఫ్రెష్‌గా కనిపిస్తుంది. అది ముఖంపై ఉండే రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చిన్న రంధ్రాలతో అసహ్యంగా కనిపిస్తున్న చర్మానికి ఇది చక్కటి రెమిడీ అని చెప్పొచ్చు. అయితే ఈ చల్లటి వాటర్‌తో ముఖాన్ని రుద్దకపోవడమే మంచిది. ఎందుకంటే పొడిగా అయ్యి ర్యాష్ వచ్చే ప్రమాదం ఉంది. ఓ రెండు నుంచి మూడు నిమిషాలు ముఖాన్ని చల్లటి నీటిలో ఉంచితే ముఖం గ్లాస్ స్కిన్‌లా మెరుస్తూ తాజాగా కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) అదీగాక అప్పటి దాక సాధారణ టెంపరేచర్లో ఉన్న ముఖం ఒక్కసారిగి ఇలా చల్లటి నీటిలో ఉంచితే..ముఖానికంతటికీ రక్తప్రసరణ జరిగి ఒక్కసారిగా తెలియని ఉత్సాహం వస్తుంది. మనం ఉపయోగించే స్క్రబ్‌లు, మాయిశ్చరైజర్ల కంటే ఈ ఐస్ వాటర్ ట్రిక్ అత్యుత్తమమైనది అని అంటున్నారు. ఇలా రోజులో కనీసం రెండు నుంచి మూడు సార్లు క్రమం తప్పకుండా చేస్తే మెరిసే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతమవుతుదంని చెబుతున్నారు. అంతేగాదు ముఖంపై వచ్చే వాపులను కూడా తగ్గిస్తుందట. వాపుగా ఉన్న ప్రాంతంలో... రక్త సరఫరా ఎక్కువ అవ్వడంతో కుచించుకుపోయిన నాళాలకు రక్తసరఫరా తగ్గి యథావిధికి రావడమే గాక నొప్పి కూడా తగ్గుతుందని చెబతున్నారు సౌందర్య నిపుణులు. అంతేగాదు ఇలా ఐస్‌వాటర్‌లో ముఖాన్ని డిప్ చేసి ఉంచే ట్రిక్‌తో తమ అందాన్ని ఎలా కాపాడుకోగలుగుతున్నామో వివరిస్తూ వీడియోలు షేర్ చేసిన కొందరూ సెలబ్రెటీల వీడియోలు నెట్టింట వైరల్ తెగ వైరల్ అవుతున్నాయి. చూసేయండి.. వెంటనే మీరు కూడా ట్రై చేయండి. View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) (చదవండి: ఈ చైర్లో కూర్చొంటే..దెబ్బకు బెల్లీ ఫ్యాట్ మాయం!) -
మద్యపాన వ్యసనం ఇంత ఘోరంగా ఉంటుందా? ఏకంగా యాసిడ్‌లా మూత్రం..
మద్యపానం వ్యసనం అనేది ఓ రుగ్మత అని పలువురు ఆరోగ్య నిపుణులు గట్టిగా నొక్కి చెబుతున్న సంగతి తెలిసిందే. మనకు తెలిసినవాళ్లు లేదా సన్నిహితులు ఇలా ఉంటే గమనించి కౌన్సిలింగ్ ఇప్పించి మార్చాలని లేదంటే మానవ సంబంధాల తోపాటు ప్రాణాలు కూడా హరించిపోతాయని హెచ్చరిస్తుంటారు. కానీ ఇప్పుడూ ఈ ఘటన చూస్తే.. అదంతా నిజమే అని అనకుండా ఉండలేరు. ఈ వ్యసనం కారణంగా ఓ ప్రముఖ మోడల్ ఆరోగ్యం ఎంతలా క్షీణించిందో వింటే..వామ్మో! అని నోరెళ్లబెట్టడతారు!. వివరాల్లోకెళ్తే..కాలిఫోర్నియాకు చెందిన 37 ఏళ్ల మోడల్, నటి జెస్సికా లాండన్ వోడ్కాకు బానిసైపోయింది. ఎంతలా అంటే 24 గంటలు అది తాగకపోతే లేను అనేంతగా మద్యం అంటే పడి చచ్చిపోయింది. ఆ అలవాటు చాలా చిన్న వయసులోనే ఆరోగ్యం మొత్తం కోల్పోయేలా క్షీణించేసింది. చివరికి ఆ వ్యసనం తనకు తెలియకుండానే తాగుతూ నేలపై పడిపోయి తెలియకుండానే అక్కడే మల మూత్ర విసర్జనలు చేసేంతలా ఆరోగ్యాన్ని దిగజార్చేసింది. వృధాప్యంలో వచ్చే వణుకు, భయం అన్ని ఈ వయసులోనే ఫేస్ చేసింది. మాటిమాటికి స్ప్రుహ కోల్పోవడం అన్ని మరిచిపోతున్నట్ల మెదడు మొద్దుబారిపోవడం వంటి లక్షణాలన్ని ఒక్కసారిగా ఆవరించాయి ఆ మోడల్‌కి. దీని కారణంగా బయటకు వచ్చేందుకు కాదు కదా కనీసం తోడు లేకుండా బాత్రూంకి కూడా వెళ్లలేని స్థితికి చేరుకుంది. ఆఖరికి ఆమె మూత్రమే యాసిడ్‌లా మారి ఆమె చర్మాన్ని తినేసేంత స్థితికి వచ్చేసింది. సరిగ్గా అదే సమయంలో ఆమె మెట్లపై స్ప్రుహ కోల్పోయి పడిపోయింది. పుండు మీద కారం చల్లినట్లుగా ఈ టైంలోనే తలకు కూడా బలమైన గాయం అయ్యింది. దీని కారణంగా మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి కణితిలా వచ్చింది. దీంతో ముఖంలో ఒకవైపు అంతా పక్షవాతానికి గురై మాట కూడా రాని స్థితికి చేరుకుంది. ఇది సీరియస్ కాకమునుపే ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో జెస్సికా ఆల్కహాల్‌కి పూర్తి స్థాయిలో దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా ఆల్కహాల్ మానడం అంత ఈజీ కాదు. దీని కారణంగా మూర్చ, పక్షవాతం, వణుకు లాంటి దారుణమైన సమస్యలను ఎదుర్కొంది. ఒకరకంగా మెదడు శస్త్ర చికిత్స కోసం తాగకుండా ఉండటమే ఆమెను ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటపడేందుకు ఉపకరించిందనాలి. ఆ తర్వాత ఆపరేషన్ అనంతరం ఆమె నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. అసలు మద్య పానం వ్యసనం అంటే.. ఆల్కహాల్‌పై నియంత్రణ లేకుండా అదేపనిగా తాగడం. అందుకోసం ఎలాంటి పని చేసేందుకైనా దిగజారడం. ప్రియమైన వారితో సంబంధాలను తెంచుకునేలా ప్రవర్తించడం తగని సమయాల్లో కూడా తాగడం మద్యాన్ని దాచడం లేదా తాగేటప్పుడూ దాచడం తదితర విపరీతమైన లక్షణాలు ఉండే వారిని వైద్యుల వద్దకు తీసుకొచ్చి చికిత్స ఇప్పించాలి లేదంటే ప్రాణాంతక వ్యాధుల బారినపడి చనిపోతారు. (చదవండి: మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?) -
చలికాలం చర్మం పెళుసుబారకుండా ఉండాలంటే..!
వేకువ జాముకు చలి తొంగిచూస్తోంది. కిటికీలో నుంచి దొంగలా గదిలో దూరుతోంది. చల్లగా ఒంటికి హాయినిస్తుంది. కానీ చర్మాన్ని పెళుసుబారుస్తుంది కూడా. అందుకే ఆలస్యంగా చర్మసంరక్షణ మొదలవ్వాలి. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్ రాయాలి. గోరువెచ్చటి నీటిని దోసిట్లోకి తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఇది హాట్‌థెరపీ. రోజుకొకసారి ఉదయం స్నానం చేయడానికి ముందు కానీ రాత్రి పడుకునే ముందుకానీ చేయవచ్చు. ఒక కోడిగుడ్డు సొనలో, టీ స్పూన్ కమలారసం, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది పొడిచర్మానికి వేయాల్సిన ప్యాక్. బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చిదిమి ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇది పొడిచర్మానికి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది, మెడ నలుపు కూడా వదులుతుంది. పొడిచర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్సీడ్ ఆయిల్ బాగా పని చేస్తుంది. ఆయిల్‌ను ఒంటికి రాసి మర్దన చేయాలి. ఫేస్‌ప్యాక్‌లకు బదులుగా స్వచ్ఛమైన ఆముదం ఒంటికి రాసి మర్దన చేసుకోవాలి. ఆముదం వల్ల చర్మం మృదువుగా మారడంతోపాటు అనేక చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. (చదవండి: అలసిన కళ్లకు రిలీఫే ఈ ఐ మసాజర్!) -
షుగర్ పేషెంట్లకు భారీ ఊరట: మూడు రెట్ల సమర్ధతతో కొత్త మాగ్నటిక్ జెల్
Magnetic gel చర్మంపై ఏర్పడే తీవ్రమైన పుండ్ల చికిత్సలో కీలక అధ్యయనం ఒకటి భారీ ఊరటనిస్తోంది. కాలిన గాయాలు, చర్మంపై మానని గాయాలు, ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మధుమేహంతో బాధపడుతున్న వారిలో అల్సర్లు నెమ్మదిగా నయం అవుతాయి. ఒక్కోసారి శరీర భాగాలను తొలగించే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి వాటికి పరిష్కారంగా నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ మాగ్నటిక్ జెల్‌ను రూపొందించింది. ఇది మృత చర్మకణాల చికిత్సలో మూడు రెట్లు సమర్ధ వంతంగా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. కాలిన గాయాలు,డయాబెటిక్, నాన్-డయాబెటిక్, తదితర దీర్ఘకాలిక అల్సర్ల చికిత్సలో మూడు రెట్లుగా మెరుగ్గా పనిచేస్తుందని అధ్యయన వేత్తలు తేల్చారు. ఎలుకలపై నిర్వహించిన పరీక్షల్లో జెల్ చికిత్స స్కిన్ ఫైబ్రోబ్లాస్ట్‌ల వృద్ధి రేటును సుమారు 240 శాతం పెంచింది అలాగే కొల్లాజెన్ ఉత్పత్తి రేటును రెట్టింపు చేసింది. ఈ జెల్ కెరాటినోసైట్లు , ఇతర కణాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచిందని, తద్వారా గాయపడిన ప్రదేశంలో కొత్త రక్తనాళాల పెరుగుదలకు తోడ్పడిందని వెల్లడించింది. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ, సన్ యాట్-సేన్ యూనివర్శిటీ, వుహాన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ, ఏజెన్సీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. (గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్: ప్రపంచంలోనే తొలిసారి!) "వైర్లెస్ మాగ్నెటిక్ -రెస్పాన్సివ్ హైడ్రోజెల్ చర్మపై గాయాల్ని నయం చేయడంలో ప్రాథమిక సవాళ్లను అధిగమించిదని పరిశోధన వేత్త డాక్టర్ షౌ యుఫెంగ్ తెలిపారు. ఈ మాగ్నటిక్ జెల్‌ను గాయానికి నేరుగా బ్యాండేజ్‌లో అమరుస్తారు. ఇందులో ఎఫ్‌డీఏ ఆమోదిత అతి చిన్న అయస్కాంత సెల్స్ కెరాటినోసైట్లు (చర్మాన్ని బాగు పర్చడంలో), ఫైబ్రోబ్లాస్ట్లు (చర్మంపై కణాల మధ్య సమన్వయం) కీలక పాత్ర పోషిస్తాయి. గాయంపై ఉంచిన మాగ్నటిక్ డివైస్ ద్వారా వెలువడిన అయస్కాంత కణాలు నెమ్మదిగా కదులుతూ, రోగి చర్మ కణాలతో మిళితమై కొత్త కణాల వృద్ధికి తోడ్పడతాయి. ఈ అయస్కాంత స్టిమ్యులేషన్ పరికరంపై సంబంధిత అవయవాన్ని రెండు నుండి మూడు గంటల పాటు ఉంచితే సరిపోతుందని అధ్యయన వేత్తలు తెలిపారు. (‘‘ఇక్కడ క్లిక్ చేయండి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) -
యాంటీ యాక్నె డ్రింక్ తాగారా?
అర కప్పు ధనియాలు, పదిహేను కరివేప ఆకులు, అరకప్పు గులాబీ రేకులను రెండు గ్లాసుల నీటిలో వేసి బాగా మరిగించాలి. నీళ్లు రంగు మారాక స్టవ్ ఆపేసి వడగట్టాలి. వడగట్టిన నీటిని తాగాలి. వారానికి మూడు గ్లాసులు ఈ నీటిని తాగాలి. దీనిలో ఉండే విటమిన్ ఎ, కొల్లాజన్లు హార్మోన్ల అసమతుల్యం వల్ల వచ్చే మొటిమలను తగ్గిస్తాయి. గ్రీన్ టీ ఇతర అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, ఈ అధునాతన పానీయం ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్తో సహా యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంది. మొటిమల రూపానికి ముందు ఏర్పడే సెబమ్ ఆక్సీకరణను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. పసుపు టీ పసుపులో ఉండే కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ లక్షణాలకు విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. వేడినీటిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని తాగండి ఈజీగా మొటిమలు మాయం అవుతాయ. వీటి తోపాటు పులియబెట్టిన మజ్జిగ వంటివి తీసుకోవడం వల్ల ఈ కూడా ఈ సమస్య నుంచి ఇంకా సులభంగా బయటపడొచ్చు. చివరిగా వంటింటి చిట్కా! అలాగే జీడిపప్పును పాలలో నానబెట్టి, తరువాత నెయ్యిలో ఎర్రగా వేయించాలి. ఇవి చల్లారాక పేస్టు చేయాలి. ఈ పేస్టుని కూరలో వేసి పదినిమిషాలు మగ్గనిస్తే గ్రేవీ చిక్కగా వస్తుంది. (చదవండి: బౌల్ మసాజ్‌తో మెరిసిపోండి! ఆరోగ్యం, అందం మీ సొంతం!) -
పుట్టాడు ఏలియన్ లాంటి పిల్లోడు.. చేస్తున్నాడు వింతవింత శబ్ధాలు!
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఏలియన్ లాంటి పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లాడిని చూడగానే తల్లితో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు హడలెత్తిపోయారు. పిల్లాడి చర్మం తెలుపురంగులో ఉంది. చర్మంపై పలు చోట్లు పగుళ్లు కనిపిస్తున్నాయి. కళ్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఈ వింత శిశు జననం స్థానికంగా సంచలనం కలిగించింది. కాగా ఇటువంటి శిశువును హాలోక్విన్ ఇథియోసిస్ బేబీ అని అంటారని వైద్యులు తెలిపారు. కాగా ఈ పిల్లాడు పుట్టినప్పటి నుంచి వింతవింత శబ్ధాలు చేస్తున్నాడు. సాధారణంగా ఇటువంటి శిశువులు జన్మించిన వెంటనే చనిపోతారని వైద్యులు తెలిపారు. అయితే ఈ శిశువు ఇంకా ఊపిరి తీసుకుంటున్నాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బేహడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మహిళ కొన్ని రోజుల క్రితం పురిటి నొప్పులతో ఒక ఆసుపత్రిలో చేరింది. ఆగస్టు 30న ఆమెకు నార్మల్ డెలివరీ జరిగింది. అప్పుడే జన్మించిన శిశువును చూడగానే తల్లి హడలెత్తిపోయింది. పిల్లాడు ఏలియన్ మాదిరిగా ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. కాగా డాక్టర్ వినోద్ పాగ్రానీ మాట్లాడుతూ ఇలా జన్మించే శిశువును హాలోక్విన్ ఇథియోసిస్ బేబీ అని అంటారని, ఈ స్థితిలో జన్మించే శిశువుల చర్మంలో తైలగ్రంథులు ఉండవని, ఫలితంగా చర్మం పగిలిపోతుందన్నారు. మూడు లక్షల శిశు జననాలలో ఒకటి ఈ విధంగా ఉండవచ్చన్నారు. ఇటువంటి శిశువు ఎక్కువకాలం జీవించదని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి శిశువులు ఐదారురోజుల వరకూ జీవిస్తారని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పిండిమర.. నలుగురు దుర్మరణం! -
చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే..!
కొందరి చర్మం చూడగానే ఆరోగ్యవంతంగా కనిపించదు. చూడటానికి కూడా బాగుండదు. మరికొందరికి చర్మం పెళుసుగా ముడతలు పడినట్లు ఉంటుంది. దీంతో చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. ఎన్నో రకాల క్రీంలు ఉపయోగించినా ఫలితం అంతగా ఉండదు. అలాంటప్పుడూ ఇలా చేయండి. చర్మం ఆరోగ్యంగా కనిపించాలంటే... చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉండాలంటే కొబ్బరిపాలు మేలైన ఎంపిక. కొబ్బరి పాలను రాత్రిపూట పడుకునేముందు తలకు పట్టించి, షవర్ క్యాప్ వేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి. కొబ్బరి పాలు వెంట్రుకల కుదుళ్లకు చేరి, శిరోజాల మృదుత్వం దెబ్బతినదు. పచ్చి కొబ్బరిని తురిమి, మిక్సీలో గ్రైండ్ చేసి, పాలు తీయాలి. ఈ పాలను చర్మానికంతటా పట్టించి, అరగంట ఆగి, చల్లని నీటితో స్నానం చేయాలి. చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా పని చేసి, ముడతలు తగ్గి, మృదువుగా మారిపోతుంది. ఎండలో నుంచి ఇంటికి వెళ్లినప్పుడు ఫ్రిజ్‌లో ఉంచిన కొబ్బరి పాలను, దూదితో ఒళ్లంతా రాసుకొని, పది నిమిషాలు సేదదీరాలి. తర్వాత స్నానం చేస్తే ఎండవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది. మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది. (చదవండి: క్లెన్సింగ్ నుంచి ఫేషియల్ వరకు.. ఇదొక్క బ్యూటీ ప్రొడక్ట్ ఉంటే చాలు) -
ఆ విటమిన్ లోపిస్తే తినాలనే ఆసక్తి కోల్పోతాం!
శరీరానికి అన్ని విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా ఉండగలం. ఏ విటమిన్ లోపించిన దాని దుష్ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందులోనూ మన శరీరానికి ప్రకృతి సిద్ధంగా లభించే విటమిన్ల విషయంలో అజాగ్రత్త వహిస్తే ఆ పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. విటమిన్లలో సహజసిద్ధంగా లభించే విటమిన్ డీ. ఇది మనకు సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. ఆ విటమిన్ లోపం కారణంగా తినబుద్ది కాదని, పూర్తిగా నీరసించి దారుణమైన స్థితికి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు న్యూట్రిషియన్లు. ఐతే విటమిన్ డీ లోపించిదని ఇచ్చే సంకేతాలు, లక్షణాలు ఏంటో చూద్దామా! డీ విటమిన్ లోపం గురించి ఇచ్చే పది సంకేతాలు ఏంటంటే.. అలసిపోవడం మాటిమాటికి అలసట వస్తున్నా లేదా ఎక్కువ సేపు ఏ పనిచేయక మునుపే తొందరగా అలసటతో కూర్చుండిపోతే డి విటమిన్ లోపించిందని అర్థం. ఇది డీ విటమిన్ లోపానికి సంబంధించిన బలమైన సంకేతంలో ప్రధానమైంది నిద్ర పట్టకపోవడం టైంకి పడుకున్నా కూడా నిద్ర పట్టకపోతే అది డీ విటమిన లోపమే కారణం. మెలటోనిన్ అనే హార్మోన్ మానవ సిర్కాడియన్ లయలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా నిద్ర పట్టకపోవడం అనే సమస్య ఎదురవుతుంది. ఈ డీ విటమిన్ శరీరంలో నిద్ర వచ్చే హార్మోన్‌ని ఉత్పత్తి అయ్యేలా చేసి కంటి నిండా నిద్రపోయేలా చేస్తుంది. కీళ్లపై ప్రభావం దీర్ఘకాలిక కండరాల అసౌకర్యం, బలహీనతకు మూలం విటమిన్ డీ. కాల్షియం శోషణలో సహయపడుతుంది. ఇది లేకపోవడం వల్ల కీళ్లపై ప్రభావం చూపుతుంది. డిప్రెషన్ లేదా విచారం డిప్రెషన్‌కి డీ విటమిన్‌తో ఎలాంటి సంబంధం లేనప్పటికి..పరిశోధనల్లో అలటస కారణంగా మానసికంగా బలం కీణించి అనేక రుగ్మతలకు లోనై డిప్రెషన్‌కి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడం డీ విటమిన్ లోపిస్తే జుట్టు రాలడం, జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపడం వంటివి జరగుతాయి. కొన్ని సందర్భాల్లో ఆ లోపం ఎక్కువగా ఉంటే అలోపేసియాకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. దీంతో తలపై జుట్టు తోపాటు, శరీరంపై ఉండే వెంట్రుకలన్నింటిని పూర్తిగా కోల్పోయేలా ప్రమాదం ఉంది. కండరాల బలహీనత విటమిన డీ ఆరోగ్యకరమైన కండరాల పెరుగుదల, అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే కండరాల సంకోచాన్ని నియంత్రించడానికి కీలకం కూడా. శరీరంలో తక్కువ డీ విటమిన్ స్థాయిలు వివిధ రకాల కండరాల కణాల పనితీరుని ప్రభావితం చేసినట్లు పలు పరిశోధనల్లో తేలింది. డార్క్ సర్కిల్స్ కళ్లు బూడిద రంగులోకి మారడం, కళ్ల కింద ఉన్న చర్మం ఉబ్బడం లేదా మృదువుగా లేనట్లు ఉన్నట్లయితే ఎక్కువసేపు ఎండలో గడపాలని అర్థం. ఆకలి లేకపోవడం ఆహారం పట్ల ఆకస్మికంగా విరక్తి ఏర్పడటం, ఆకలి అనే అనూభూతి లేకపోవడం వంటివి జరుగుతాయి. తరుచుగా అనారోగ్యం రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండి, తరుచుగా అనారోగ్యానికి గురవ్వడం జరుగుతుంది. చర్మం పాలిపోవడం ఆరోగ్యకరమైన చర్మ కణాల ఉత్పత్తికి విటమిన్ డీ అవసరం. కాబట్టి చర్మం పాలిపోయినట్లుగా ఉంటే విటమిన్ డీ లోపం ఉన్నట్లు క్లియర్‌గా అర్థమవుతుంది. కావున ఆయా వ్యక్తులు సూర్యరశ్మీలో గడపడం అత్యంత ముఖ్యం. అంతేగాదు అధిక రక్తపోటు, మధుమేహం, ఫైబ్రోమైయాల్జియా,మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి నాడీ సంబంధిత పరిస్థితులు విటమిన్ డీ లోపంతో సంబంధం కలిగి ఉంటాయి. ఏం చేయాలంటే.. విటమిన్ డీ కి చక్కని సోర్స్ సూర్య రశ్మే. ఆ తరువాత స్థానంలో చేపలు, కాడ్‌లివర్ ఆయిల్, గుడ్డు పచ్చ సొన, ష్రింప్, ఫోర్టిఫైడ్ మిల్క్, ఫోర్టిఫైడ్ బ్రేక్ ఫాస్ట్ సెరియల్, ఫోర్టిఫైడ్ యోగర్ట్, ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్ ఉంటాయి. (చదవండి: 1990లలో అపహరించిన జీప్ అనూహ్యంగా ఎలా బయటపడిందంటే) -
స్కిన్ స్పెషలిస్ట్! ఒక్క ఫొటో చాలు.. మరింత స్మార్ట్‌గా గూగుల్ లెన్స్
గూగుల్ లెన్స్ మరింత స్మార్ట్‌గా మారింది. ఇప్పుడు మీ చర్మం కండీషన్‌ను పరిగట్టేస్తుంది. ఒక్క ఫొటో తీసి పెడితే చాలు స్కిన్ కండీషన్ ఏంటో చెప్పేస్తుంది. మన చర్మానికి ఏదైనా సమస్య ఉండి దాన్ని ఏమని పిలుస్తారో తెలియని సందర్భంలో దానికి సంబంధించిన ఫొటోను గూగుల్ లెన్స్‌తో స్కాన్ చేస్తే ఆ రుగ్మత పేరు, ఇతర వివరాలు ఇట్టే తెలియజేస్తుంది. అయితే ఇది యూజర్ల సమాచారం కోసం మాత్రమే. దీన్ని వ్యాధి నిర్ధారణగా పరిగణించకూడదు. ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. సమస్య ఏంటో చెప్పేస్తుంది.. శరీర భాగాల్లో చర్మంపై ఎక్కడైనా ఏదైనా సమస్యగా అనిపిస్తే దాన్ని ఫొటో తీసి గూగుల్ లెన్స్‌తో స్కాన్ చేస్తే దానికి సంబంధించిన అలాంటి విజువల్ సమాచారం వస్తుంది. ఉదాహరణకు చర్మంపై దద్దుర్లు, వాపు, వెంట్రుకలు రాలిపోవడం వంటి వాటి గురించి గూగుల్ లెన్స్ సాయంతో తెలుసుకోవచ్చు. మరింత స్మార్ట్‌గా.. ఇటీవల చర్చనీయాంశంగా మారిన ఏఆర్ (అగ్మెంటెడ్ రియాలిటీ) సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా గూగుల్ లెన్స్ స్మార్ట్‌గా మారుతోంది. ముందుగా గూగుల్ లెన్స్ యూజర్లకు పేరు తెలియని ఏవైనా సాధారణ వస్తువులను విశ్లేషించడంలో సహాయపడుతుంది. అలాగే వాక్యాలను కూడా అనువదించే సామర్థ్యాన్ని ఇందులో జోడించారు. మనకు తెలియని వాక్యాలను గూగుల్ లెన్స్ కెమెరా ద్వారా ఫొటో తీసి మనకు కావాల్సిన భాషలోకి వాటిని అనువదించుకోవచ్చు. వీటితోపాటు గూగుల్ మ్యాప్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఏఆర్ శక్తిని జోడిస్తోంది గూగుల్. దీని సాయంతో మన చుట్టూ ఉన్న కొత్త స్థలాలను కనుగొనడానికి, యూజర్లు తమకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్లు, కేఫ్‌లు వంటివి శోధించవచ్చని గూగుల్ పేర్కొంది. -
సహజ సిద్ధమైన యూత్ప్యాక్స్
పార్టీలు, వేడుకలకు వెళ్లాలనుకొన్నప్పడు ముఖానికి తక్షణ నిగారింపు రావడం కోసం రకరకాల ఫేస్‌ప్యాక్‌లు ఉపయోగిస్తుంటారు. అయితే ఒక్కోసారి అవి అందుబాటులో ఉండవు. ఉన్నా, చర్మానికి పడవు. అలాంటప్పుడు... సహజసిద్ధమైన ఈ ఫేస్‌ప్యాక్స్ ప్రయత్నించండి. ఇవి మీ చర్మానికి తగిన పోషణను ఇవ్వడంతో పాటు యవ్వన కాంతినిస్తాయి. చందనం, రోజ్ వాటర్ చందనం ముఖం పై ఉన్న మృతకణాలను తొలగించి చర్మం మెరిసిపోయేలా చేస్తుంది. రోజ్‌వాటర్ చర్మానికి మెరుపునందిస్తుంది. వేసవిలో ఈప్యాక్ వేసుకోవడం ద్వారా సూర్యరశ్మి ప్రభావానికి గురైన చర్మానికి ఉపశమనం దొరుకుతుంది. ఇందుకోసం... ♦ గంధపు చెక్కను రోజ్ వాటర్‌తో అరగదీసి.. ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. మీ దగ్గర గంధపు చెక్క లేకపోతే.. దానికి బదులుగా గంధపు పొడిని ఉపయోగించవచ్చు. గంధం పొడిలో సరిపడినంత రోజ్ వాటర్ కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకొంటే సరిపోతుంది. ఓట్ మీల్‌తో... ఓట్మీల్ సహజసిద్ధమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఇతర పోషకాలు చర్మానికి మెరుపునిస్తాయి. ఓట్ మీల్ సహజసిద్ధమైన క్లెన్సర్‌గా పనిచేసి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. రెండు టేబుల్స్పూన్ల ఓట్ మీల్లో టీస్పూన్ చందనం పొడి వేసి సరిపడినంత రోజ్ వాటర్ కలిపి పేస్టులా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు చల్లుకుంటూ మసాజ్ చేసుకొంటున్నట్టుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. -
ఎప్పుడూ ‘యూత్‌ఫుల్’గానే ఉండాలంటే!
అప్పట్లో ఓ కోలా యాడ్‌లో ఓ ఇంగ్లిష్ జింగిల్ వస్తుండేది. ‘‘ఎనీ వేర్ ఇన్ ద వరల్డ్... ఇట్స్ గ్రేటు బి యంగ్’’ అని. పూర్తి శరీరాన్నంతటినీ, ఆమాటకొస్తే లోపలి అవయవాలనూ, వాటి కండరాలను కూడా కప్పి ఉంచే చర్మాన్ని యూత్‌ఫుల్‌గా ఉంచేది ‘కొలాజెన్’ అనే ప్రోటీన్. అదెలా పొందవచ్చో, తద్వారా చాలాకాలం టుమధ్యవయసు లుక్‌నూ,వృద్ధాప్య లక్షణాలనూ దూరంగా ఉంచడం ఎలాగో, వయసు పెరుగుతున్నా (ఏజింగ్ జరుగుతున్నా) యూత్‌ఫుల్‌గా నిత్యయౌవనులుగా కనిపించడం ఎలాగో తెలిపే కథనం ఇది. వయసు పెరుగుతుంటే కొందరిలో చుబుకం కింద, కొందరిలో కళ్ల కిందున్న చర్మం కాస్త కాస్తగా జారుతుంటుంది. స్కిన్ జారిపోవడానికి కారణంగా ‘కొలాజెన్’ అనే ప్రోటీన్ లోపించడమే. కొలాజెన్ స్వాభావికంగానే వృద్ధి చెందడానికి ఏయే ఆహారాలు తీసుకోవాలో, అప్పటికీ ప్రయోజనం లేకపోతే ఎలాంటి ప్రక్రియలు అవలంబించవచ్చో తెలుసుకుందాం. కొలాజెన్ అంటే... నిజానికి ఇదో ప్రోటీన్. చర్మంలో ఎక్కువగా ఉంటుంది. కేవలం చర్మంలోనే కాకుండా దేహంలోని అనేక అవయవాల్లో... అంటే కండరాల్లో, ఎముకల్లో, టెండన్స్, కణజాలాల్లో, రక్తనాళాల్లో, జీర్ణవ్యవస్థలోని అన్ని భాగాల్లో... ఆ మాటకొస్తే మనకు ఎక్కడైనా గాయం తగిలినప్పుడు, గాయం మానే సమయాల్లో ఇలా అన్ని ప్రదేశాల్లోనూ ఉంటుంది. ఆహారంతోనే కొలాజెన్ పొందడమెలా? మాంసాహారాల్లో... చికెన్ ♦ చేపలు (అందునా ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ట్యూనా, మాకరెల్స్తో టు షెల్ఫిష్ వంటివి) ♦ గుడ్డులోని తెల్లసొన భాగం శాకాహారాల్లో... ♦ అన్ని రకాల నిమ్మజాతి పండ్లు (అంటే నిమ్మ, నారింజ, బత్తాయి, కమలాల వంటివి) ♦ బెర్రీ పండ్లు (అంటే... రాస్ప్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ వంటివి) ♦ ట్రాపికల్ ఫ్రూట్స్‌లో (అంటే... మామిడి, జామ, పైనాపిల్, ద్రాక్ష, కివీ... వీటిల్లో ఉండే జింక్ కూడా యాంటీ ఏజింగ్‌కు అదనంగా ఉపయోగపడే పోషకం) వంటలో వాడే పదార్థాల్లో : ♦ వెల్లుల్లి (ఇందులో కొలాజెన్‌ను సమకూర్చే పోషకాలు చాలా ఎక్కువ) ♦ ముదురు ఆకుపచ్చరంగులో ఉండే లకూర లాంటి అన్ని ఆకుకూరల్లో చిక్కుళ్లు ♦ టొమాటో ♦ బెల్పెప్పర్లతో టు ♦ జీడిపప్పు, బాదంపప్పు లాంటి నట్స్‌లో. ♦ ఇవేగాకప్రో టీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే అన్ని ఆహారాలూ కొలాజెన్ ఉత్పత్తికి బాగా తోడ్పడతాయి). కొలాజెన్‌కు ప్రతికూలంగా పనిచేసే ఆహారాలు ఇవీ: చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు, బాగా రిఫైన్స్ చేసిన కార్బోహైడ్రేట్లు కొలాజెన్‌కు కొంత ప్రతికూలంగా పని చేస్తాయి. కొలాజెన్ ఉత్పత్తికి తోడ్పడే కొన్ని బ్యూటీ ప్రక్రియలు: అలోవేరా జెల్ : అలోవేరా జెల్‌ను చర్మంపై పూయడం, నోటి ద్వారా ‘ఆలో స్టెరాల్స్’ తీసుకోవడం. ఈ ప్రక్రియలు కనీసం ఎనిమిది వారాలు కొనసాగాలి. జిన్సెంగ్ : హెర్బల్ ఉత్పాదన అయిన జిన్సెంగ్ను తీసుకోవడం. దీన్ని టీ, టింక్చర్స్ లేదా సప్లిమెంట్స్‌గా తీసుకోవచ్చు. రెటినాల్స్ అండ్ కెరొటినాయిడ్ సప్లిమెంట్స్: బీటా కెరోటిన్ ఎక్కువగా దొరికే... మాంసాహారాల్లో కాలేయం, శాకాహారాల్లో చిలగడదుంప, గుమ్మడి, క్యారెట్స్ తీసుకోవడం. వైద్యచికిత్సా ప్రక్రియల సహాయంతో... థ్రెడ్స్ ట్రీట్మెంట్: వీటిల్లో ఫ్లోటింగ్, ఫ్రీ, కాగ్ థ్రెడ్స్ అని రకరకాల చికిత్సలు ఉంటాయి. పేషెంట్ అవసరాన్ని బట్టి డాక్టర్ వీటిల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేస్తారు. ప్రభావం నెల తర్వాత తెలుస్తుంది. ఈ చికిత్స ప్రభావం ఏడాది వరకే ఉంటుంది. కాబట్టి మళ్లీ మళ్లీ చేస్తుండాలి. పీఆర్పీ థెరపీ ఫర్ ఫేస్: ఈ చికిత్సలో పేషెంట్స్ నుంచి రక్తాన్ని సేకరించి, అందులోని ప్లేట్లెట్ సేకరించి ముఖానికి ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఇందులోనే పీఆర్ఎఫ్ (ఫైబ్రిన్), గ్రోత్ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ పీఆర్పీ అనే కొత్త కొత్త చికిత్సలూ అందుబాటులోకి వచ్చాయి. దీన్ని నెలకొకసారి చొప్పున కనీసం 4 – 5 సార్లు చేయాలి. మైక్రో నీడ్లింగ్ ఆర్ఎఫ్ : రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను ఉపయోగించి ముఖంపై ముడుతలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఫ్రాక్షనల్ సీఓటూ లేజర్ : లేజర్‌ను ఉపయోగించి, ముఖాన్ని తేటగా చేయడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు. హైఫూ : హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ అనే మాటకు హైఫూ సంక్షిప్త రూపం. దీన్ని వివిధ తీవ్రతలతో వాడుతూ, సాగిన చర్మాన్ని బిగుతుగా చేయడానికి, డబుల్‌చిన్ తొలగించడానికి ఉపయోగిస్తుంటారు. హైలూరానిక్ యాసిడ్ ట్రీట్మెంట్ : శరీరంపైన పూసే క్రీములు, ఆయింట్మెంట్ల రూపంలోనూ, ఇంజెక్షన్ల రూపంలోనూ, అలాగే స్కిన్ బూస్టర్ ఇంజెక్షన్స్ ఇస్తారు. దీని వల్ల చర్మానికి మంచి హైడ్రేషన్ సమకూరి, ఏజింగ్ ఆలస్యం అవుతుంది. రెడ్ లైట్ థెరపీ : చర్మాన్ని ఇన్ఫ్రా రెడ్ కిరణాలతో కూడిన ఎరుపురంగులో ఉండే కాంతి కిరణాలకు ఎక్స్పోజ్ చేయడం వల్ల చర్మంలో, దేహంలో కొలాజెన్ కొంత ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే ఇదే ప్రధాన థెరపీలాగా కాకుండా... మిగతా చికిత్సలతో టు దీని ఓ అదనపు చికిత్సగానే పరిగణించాలి. ఓరల్ కొలాజెన్ పౌడర్స్ ఎన్రిచ్డ్ విత్ వైటమిన్ సి అండ్ యాంటీఆక్సిడెంట్స్ : ఇవి నోటి ద్వారా తీసుకునే పౌడర్లు. ఇవే గాక ఇలాంటి ఇంజెక్షన్లూ లభ్యమవుతాయి. చేయకూడనివి... లేత ఎండకు ఎక్స్పోజ్ కావడం పరవాలేదు. అది చర్మానికి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ తీవ్రమైన ఎర్రటి ఎండ, దేహం కమిలిపోతున్నంత ఎండ వేడిమికి ఎక్స్పోజ్ కాకుండా కాడుకోవాలి. గమనిక : ఎప్పుడైనా, ఎక్కడైనా స్వాభావికాలే మేలు. వైద్య ప్రక్రియలను ఆచరించాలను కుంటే స్వాభావికమైన ఆహారాలనే తీసు కుంటూ, ఈ ప్రక్రియల్నీ తీసుకుంటేనే ఉపయోగం ఉంటుంది. అంతేతప్ప పూర్తిగా వైద్యపరమైన చికిత్సలే కొలాజెన్ పెరుగుదలకు ప్రామాణికాలు కావు. ఒకవేళ కొలాజెన్ వృద్ధి కోసం వైద్యపరమైన ప్రక్రియలను తీసుకోవాల్సి వస్తే పూర్తిగా క్వాలిఫైడ్ డర్మటాలజిస్టుల నేతృత్వంలోనే తీసుకోవాలి. - డాక్టర్ స్వప్నప్రియ సీనియర్ డర్మటాలజిస్ట్ -
చర్మం ఒలిచినా దక్కని ఫలితం
వడోదర: రైల్వే ఉద్యోగం సాధించేందుకు ఓ యువకుడు చేసిన తెగింపు యత్నం బెడిసికొట్టింది. తన బొటన వేలి చర్మాన్ని ఒలిచి స్నేహితుడి వేలికి అతికించి, బయోమెట్రిక్ వెరిఫికేషన్‌లో బయటపడ్డాక తనకు బదులుగా పరీక్ష రాయించాలని పథకం వేశాడు. అయితే, బండారం బయటపడి ఇద్దరూ కటకటాల పాలయ్యారు. బిహార్‌లోని ముంగేర్ జిల్లాకు చెందిన మనీష్ కుమార్, రాజ్యగురు గుప్తా స్నేహితులు. 12వ తరగతి వరకు చదువుకున్నారు. రైల్వే శాఖలోని గ్రూప్ డి ఉద్యోగాలకు మనీష్ దరఖాస్తు చేసుకున్నాడు. ఎంపిక పరీక్ష వడోదరలో ఆదివారం జరిగింది. మనీష్ బదులు చదువులో ఎప్పుడూ ముందుండే గుప్తా పరీక్షకు వచ్చాడు. అభ్యర్థులకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఈ గండం గట్టెక్కేందుకు మనీష్ తన బొటనవేలి చర్మాన్ని ఒలిచి గుప్తా చేతి వేలికి అతికించాడు. గుప్తా ఆ చేతిని ప్యాంట్ జేబులోనే ఉంచుకుని, మరో చేతి వేలితో చేసిన బయోమెట్రిక్ వెరిఫికేషన్ యత్నం పలుమార్లు విఫలమైంది. అనుమానించిన అధికారులు అతడి మరో చేతిని బయటకు తీయించి, శానిటైజర్ స్ప్రే చేశారు. బొటనవేలికి అతికించిన చర్మ ఊడి కింద పడింది. అధికారుల విచారణలో అసలు నిజం బయటకు వచ్చింది. దీంతో ఇద్దరు మిత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షకు ముందు బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను ఊహించిన కుమార్..పరీక్షకు ముందు రోజే ఎడమ బొటనవేలిని స్టౌపైన కాల్చుకుని, బ్లేడుతో ఆ చర్మాన్ని ఒలిచి గుప్తా బొటనవేలికి అంటించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఒకవేళ, అతికించిన చర్మం ఊడి రాకున్నా వారి పన్నాగం పారేది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. -
వింత సమస్య.. ప్లాస్టిక్‌లా మారిపోయిన యువతి చర్మం!
లండన్: విహారయాత్రకు వెళ్లి ఎండలో నిద్రలోకి జారుకున్న ఓ యువతికి వింత అనుభవం ఎదురైంది. ఆమె నుదుటిపై చర్మం ప్లాస్టిక్‌లా మారిపోయింది. బ్రిటన్‌కు చెందిన బ్యూటీషియన్ సిరిన్ మురాద్ (25) అనే యువతి కొద్ది రోజుల క్రితం బల్గేరియాకు విహారయాత్రకు వెళ్లింది. ఓ పూల్ వద్ద కూర్చొని అక్కడే కాసేపు కునుకుతీసింది. 30నిమిషాలకు మేల్కొన్న తర్వాత నుదురు, చెంపలు కాస్త మండినట్లు అనిపించినప్పటికీ.. పట్టించుకోలేదు. ఎండకు పొడిబారినట్లుందని మళ్లీ నిద్రపోయింది. అయితే మరుసటి రోజు నుదుటిపై చర్మం ప్లాస్టిక్‌లా తయారైంది. ఎండలో నిద్రపోవడమే దీనికి కారణమని భావించింది.. పైగా సన్‌స్క్రీన్ లోషన్ కూడా అప్లై చేసుకోలేదని పేర్కొంది. తాను నిద్రపోయిన ఆ సమయంలో అక్కడ ఉష్ణోగ్రతలు 21డిగ్రీలు ఉన్నట్లు తెలిపింది. నుదుటిపై చర్మం ప్లాస్టిక్‌లా కనిపిస్తున్నా.. ఏం జరగదులే అని భావించి ఆసుపత్రికి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు సిరిన్ మురాద్. రోజులకు ఆమె ముఖం మొత్తం పగుళ్లు తేలినట్లు మారింది. అయితే.. ప్రస్తుతం కోలుకున్నానని, కొన్ని జాగ్రత్తలు పాటించడంతో తిరిగి ఒకప్పటిలా మారిపోయాయని ఫేస్బుక్లో నాటి, నేటి ఫొటోలను పంచుకుంది సిరిన్. మునుపటి కంటే ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తున్నట్లు పేర్కొంది. కాగా, తాను ఎదుర్కొన్న వింత, భయానక అనుభవాన్ని వివరిస్తూ.. ఆ యువతి ప్రస్తుతం సన్‌స్క్రీన్ లోషన్ల ఉపయోగాలపై అవగాహన కల్పిస్తోంది. వైద్య నిపుణులు మాత్రం ఆమె చర్మం అలా కావడానికి వేరే కారణం కూడా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఎండలో వెళితే అందరికి అలా జరగదని, క్యాన్సర్ ఉన్నవారు ఆ తరహా సమస్యలు ఎదుర్కొంటారని పేర్కొంటున్నారు. ఇదీ చదవండి: భార్యలు రాజేసిన చిచ్చు.. పక్కనున్న పలకరింపుల్లేవ్!! ఆ అన్నదమ్ములు మళ్లీ ఒక్కటయ్యేనా? -
ఈ గాడ్జెట్ ఇంట్లో ఉంటే.. మన వెంట సెలూన్ ఉన్నట్లే
ఆకట్టుకునే ప్రతీది అందమే. అందులో కాళ్లూ.. చేతులూ భాగమే. కాలి గోళ్లు, చేతి వేళ్లు.. నాజూగ్గా మారడానికి క్రమం తప్పకుండా బ్యూటీ పార్లర్లకు వెళ్లి.. పెడిక్యూర్, మానిక్యూర్ చేయించుకుంటూంటారు. అయితే ఆ శ్రమను తప్పిస్తుంది ఈ రీచార్జబుల్ ట్రిమ్మర్. పెద్దలకే కాదు అప్పుడే పుట్టిన పిల్లలక్కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఇది. నొప్పి తెలియకుండా.. శ్రమ లేకుండా ఈజీగా కాలి, చేతి గోళ్లను చక్కగా శుభ్రపరచుకోవచ్చు. అందుకు కావల్సిన మినీ కిట్ ఈ డివైజ్‌తో పాటు లభిస్తుంది. ఈ మెషిన్‌కి చార్జింగ్ పెట్టుకోవచ్చు. పైగా ఇందులో లిథియం బ్యాటరీ ఉండటంతో.. ప్రయాణాల్లో కూడా దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. 3 స్పీడ్ సెట్టింగ్ ఉండటంతో.. పిల్లలు, పెద్దలు సురక్షితంగా వాడొచ్చు. గోళ్లు షేప్ చేసుకోవడంతో పాటు.. డెడ్ స్కిన్ తొలగించడం, మృదువుగా మార్చడం.. వంటివన్నీ ఈజీగా చేసుకోవచ్చు. మెటల్ గ్రౌండింగ్ హెడ్, ఎడ్జ్ ఎక్స్ఫోలియేషన్ హెడ్, నెయిల్ సర్ఫేస్ ఫ్రాస్టింగ్ పాలిషింగ్ హెడ్, పాయింటెడ్ ఫ్రాస్టెడ్ గ్రౌండింగ్ హెడ్, డిస్క్ ఫ్రాస్టింగ్ పాలిషింగ్ హెడ్.. ఇలా 5 ప్రత్యేకమైన హెడ్స్‌తో పాటు 3 ప్రత్యేకమైన రోలర్స్ లభిస్తాయి. ఈ డివైజ్‌కి ఎడమవైపు చార్జింగ్ పాయింట్ ఉంటుంది. మరోవైపు.. హెడ్స్ అమర్చుకునే స్క్రూ ఉంటుంది. అలాగే డివైజ్ ముందువైపు.. రోలర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతో మడమల పగుళ్లు, మృతకణాలు వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ మెషిన్ ఇంట్లో ఉంటే.. మన వెంట సెలూన్ ఉన్నట్లే. ధర సుమారు వెయ్యి రూపాయలు. అయితే రివ్యూలను గమనించి కొనుగోలు చేయడం మంచిది. -
ఆఫ్రికన్ గాడిదలను ఎత్తుకెళ్లి మరీ.. చైనా దుర్మార్గం
కరోనా టైంలో చైనా ఆహారపు అలవాట్ల గురించి ప్రధానంగా చర్చ నడిచింది. ఒకానొక టైంలో ఆ అలవాట్ల వల్లే కరోనా విజృంభించిందన్న వాదన సైతం చక్కర్లు కొట్టింది. అయితే.. చైనీస్ సంప్రదాయ మందుల తయారీ కోసం మూగజీవాలను పొట్టనబెట్టుకుంటుందని ఆ దేశం మీద ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా.. ఆఫ్రికాలో సైతం గాడిదలను ఎత్తుకెళ్లి దేశాలు దాటించి మరీ చంపి.. సంప్రదాయ మందులు తయారు చేస్తున్న చైనా దుర్మార్గపు చేష్టలు వెలుగులోకి వచ్చాయి. ఇంప్రెసెస్ ఇన్ ది ప్యాలెస్ అనే చైనీస్ టీవీ షో కారణంగానే.. ఈ విషయం వెలుగు చూడడం గమనార్హం. పదులు, వందలు కాదు.. లక్షల్లో గాడిదలను సంప్రదాయ మందుల పేరిట బలిగొంటోంది చైనా. మూగజీవాలను ఎత్తుకెళ్లి మరీ సుత్తెలతో కొట్టి చంపి మరీ అమానుషంగా వ్యవహరిస్తోంది. గాడిదల చర్మం నుంచి తయారు చేసే ఎజియావో అనే సంప్రదాయ మందు కోసం ఆరాచకాలకు పాల్పడుతోందని యూకేకు చెందిన డాంకీ శాంక్చురీలో పని చేసే సైమన్ పోప్ ఆరోపిస్తున్నారు. ఎజియావో అనేది ‘డాంకీ గ్లూ’గా పిలుస్తారు చైనాలో. గాడిదల చర్మం నుంచి దీనిని తయారు చేస్తారు. ఈ టానిక్ వల్ల ఆరోగ్యంతో పాటు అందంగా ఉంటారని చైనీయుల నమ్మకం. అందుకే.. గాడిదలను దుర్మార్గంగా చంపేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. చైనాలో ఈ టానిక్ తయారీకి సరిపడా గాడిదలు లేవు. అందుకే.. విదేశాలపై దృష్టి సారించింది. ప్రధానంగా ఆఫ్రికాలో గాడిదల సంఖ్యపై ఆధారపడింది. ఈ మేరకు మాలి, జింబాంబ్వే, టాంజానియాలో అక్రమ దందాలకు చైనా తెర తీసిందని వాయిస్ ఆఫ్ అమెరికా కథనం ప్రచురించింది. అక్కడి ప్రజలకు గాడిదలు ప్రధాన జీవనాధారం. వాటిని అమ్ముకునేందుకు ఇష్టపడడం లేదు. ఈ తరుణంలో.. వాటిని ఎత్తుకెళ్లే చేష్టలకు దిగింది చైనా మాఫియా. మొత్తం ఐదు మిలియన్ల గాడిదలకుగానూ.. సొంతగడ్డపై రెండు మిలియన్లు, విదేశాల నుంచి మరో మూడు మిలియన్ల గాడిదలను రప్పించుకుంటోంది. అయితే.. వాయిస్ ఆఫ్ అమెరికా కథనం ప్రకారం ఆ మూడు మిలియన్లలో 25 నుంచి 35 శాతం గాడిదలు ఎత్తుకొచ్చినవే అని తెలిపింది. తమ తమ దేశాల్లో గాడిదల సంఖ్య తగ్గిపోతుండడంపై ఆయా దేశాలు దృష్టిసారించాయి ఇప్పుడు. తమ దేశంలో గాడిదలు అంతరించిపోయే దశకు చేరుకోవడంతో.. టాంజానియా గత నెలలో గాడిదల వధ, చర్మం వర్తకాలపై నిషేధం విధించింది. నైజీరియా కూడా ఇదే బాటలో పయనిస్తూ నిషేధం ప్రకటించింది. తమ గాడిదలు తమ దేశాల సంపదని.. వాటిని అమ్మడం, చంపడం కుదరంటూ కొన్ని దేశాలు ఇప్పటికే డ్రాగన్ కంట్రీకి గట్టి సంకేతాలు పంపాయి. -
ఆర్డర్ చేసిన ఫుడ్‌లో పాము చర్మం...షాక్‌లో కస్టమర్
Snake skin found in food: ఇటీవల కోవిడ్ -19 తర్వాత ప్రజలు నేరుగా రెస్టారెంట్‌కి వెళ్లి తినడాని కంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని తినడానికే ఇష్టపడుతున్నారు. అదీగాక జోమాటో, స్వీగ్గీ వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ యూప్‌లు ప్రజలకు వెసులుబాటు కలిగించేలా మంచి డిస్కోంట్లు ఇచ్చి మరీ సేవలందింస్తుంది. వీకెండ్ సమయాల్లో మరింత ఆకర్షీణీయమైన పుడ్ ఆఫర్లతో భోజనప్రియులకు మరింత చేరువవుతోంది. దీంతో ప్రజలు కూడా ఆన్లైన్లో ఫుడ్‌ని ఆర్డర్ చేసుకుని తినడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే వారికి ఊహించని భయంకరమైన చేదు అనుభవం ఎదురైంది. అంతేకాదు ఆ ఘటన మళ్లీ ఇంకెప్పుడు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసి తినడానికి జంకేలా చేసింది. వివరాల్లోకెళ్తే...కేరళలోని తిరువనంతపురంలో ప్రియా అనే ఒక మహిళ నెడుమంగడు ప్రాంతంలోని ఒక రెస్టారెంట్ నుంచి రెండు పరోటాలను ఆర్డర్ చేసింది. పైగా ఆర్డర్ కూడా సకాలంలోనే డెలివరీ అయింది. ఐతే ఆమె మొదటగా తమ కుమార్తెకు పరోటా పెట్టింది. కానీ ఆ తర్వాత ఆ పరోటా పార్మిల్ని ఫ్యాకింగ్ చేసిన కవర్ మీద సుమారు అరవేలు పొడవు అంతా పాము చర్శం చూసి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. దీంతో ఆమె ఆగ్రహం చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే సదరు రెస్టారెంట్ ఆహారాన్ని ప్యాకింగ్ చేసిన పేపర్ పై పాము చర్మం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఫుడ్ సేఫ్టీ అధికారి అర్షిత బషీర్ తెలిపారు. అంతేకాదు వంటగదిలో తగినంత వెలుతురు కూడా లేదని సరైన పరిశుభ్రత పాటించకుండా ఆహారం తయారు చేసున్నారని అన్నారు. సదరు రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేయడం తోపాటు ఆ రెస్టారెంట్ యజమానికి షాకాజ్ నోటీసులు కూడా పంపించినట్లు వెల్లడించారు. (చదవండి: నిమ్మకాయలతో మామూలుగా ఉండదు.. జైలు అధికారి సస్పెండ్!) -
పిల్లల్లో జలుబు, గొంతునొప్పి, తీవ్రజ్వరం.. లైట్ తీసుకోకండి!
చిన్నపిల్లలకు జలుబు చేశాక వచ్చే గొంతునొప్పితో పాటు చాలా ఎక్కువ తీవ్రతతో వచ్చే జ్వరం (హైఫీవర్) తో బాధపడుతున్నారనుకోండి.. ‘ఆ... జలుబే కదా... చిన్న గొంతునొప్పే కదా..’ అని నిర్లక్ష్యం చేయకూడదు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తోందా? కానీ వాస్తవం. పిల్లలకు జలుబు చేసి గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు దాన్ని కేవలం ఒక చిన్న సమస్యగా చూడకూడదు. ఇందుకు ఓ కారణం ఉంది. జలుబు, గొంతునొప్పి లాంటి లక్షణాలు కనిపించినప్పుడు తొలుత అది టాన్సిల్స్‌కు ఇన్ఫెక్షన్ వచ్చే టాన్సిలైటిస్‌కు దారితీయవచ్చు. ఇది కొందరిలో గ్రూప్–ఏ స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చినట్లయితే దీనికి సరైన యాంటీబయాటిక్స్‌తో పూర్తి కోర్సు వాడుతూ చికిత్స అందించాలి. అలా జరగకపోతే... ఈ సమస్య వచ్చిన ఒకటి నుంచి ఐదు వారాలలోపు రుమాటిక్ ఫీవర్ అనే సమస్యకు దారితీసే ప్రమాదం ఉంది. లక్షణాలు తొలుత జలుబు, గొంతునొప్పి, తీవ్రమైన జ్వరం వచ్చి తగ్గాక ఒకటి నుంచి ఐదు వారాల లోపు మళ్లీ జ్వరం వస్తుంది. ఆ జ్వరంతో పాటు కీళ్లనొప్పులు, కీళ్లవాపులు, ఒంటిమీద ర్యాష్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని రుమాటిక్ ఫీవర్‌గా అనుమానించాలి. అలాగే ఈ పిల్లల్లో శ్వాసతీసుకోవడం వంటి ఇబ్బంది కూడా కనిపిస్తుంది. తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ వంటివీ కనిపిస్తాయి. ఇంకా మరికొన్ని లక్షణాలూ కనిపిస్తాయి గానీ... ఇక్కడ పేర్కొన్నవి మాత్రం రుమాటిక్ ఫీవర్‌ను గుర్తించేందుకు తోడ్పడే ప్రధాన లక్షణాలు. అయితే చిన్న పిల్లల్లో ముందుగా వచ్చే ఈ జలుబు, గొంతునొప్పి, జ్వరాలను చాలామంది సాధారణ సమస్యగానే చూస్తారు. అది రుమాటిక్ ఫీవర్‌కు దారి తీసే ప్రమాదమూ ఉందని కూడా వారికి తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి జ్వరం వచ్చి తగ్గి, మళ్లీ ఒకటి నుంచి ఐదు వారాలలోపు జ్వరం వస్తే గనక... అప్పుడు తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండాలి. చదవండి: పన్ను నొప్పి: ఆ చీము క్రమంగా దవడకూ, తలకూ పాకవచ్చు.. జాగ్రత్త! నిజానికి రుమాటిక్ ఫీవర్ అనేది సాధారణంగా 5 – 15 ఏళ్ల చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది దాదాపు పదేళ్లు కొనసాగితే మాత్రం... గుండె కవాటాల (వాల్వ్స్)ను తీవ్రంగా ప్రభావితం చేసి గుండెకు ముప్పు తెచ్చిపెడుతుంది. చికిత్స / నివారణ వాస్తవానికి తొలిదశలోనే పూర్తిగా తగ్గిపోయేలా చికిత్స చేస్తే... కేవలం చాలా చిన్న కోర్సు యాంటీబయాటిక్స్తోనే సమస్య పూర్తిగా ముగిసిపోతుంది. కానీ ఆ చిన్న చికిత్సే అందించకపోతే అది గుండె ఫెయిల్యూర్‌కూ దారితీయవచ్చు. చికిత్స అందించాక కూడా కొంతమంది పిల్లల్లో అది వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అవసరం పడేవరకూ వెళ్లే అవకాశం ఉంది (చాలా కొద్దిమంది పిల్లల్లోనే). మరికొందరిలో బ్లడ్‌థిన్నర్స్ (రక్తం పలుచబార్చే మందులు) కూడా జీవితాంతం వాడాల్సి రావచ్చు. ఇలాంటి చిన్నారుల్లో ఆడ పిల్లలు ఉండి, వారు పెద్దయ్యాక గర్భం దాల్చినప్పుడు సైతం అదీ ఓ సమస్యగా పరిణమించవచ్చు. అందుకే పిల్లల్లో జలుబు, గొంతునొప్పితో కూడిన తీవ్రమైన జ్వరం వస్తే దాన్ని చిన్న సమస్యగా పరిగణించకూడదు. పీడియాట్రీషియన్‌ను ఓసారి తప్పనిసరిగా సంప్రదించడమే మేలు. ఇంత పెద్ద సమస్య కేవలం ఒక పూర్తి (కంప్లీట్) కోర్సు యాంటీబయాటిక్తోనూ... అంతేగాక... శారీరక/వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్)తోనూ నివారించవచ్చని గుర్తుంచుకోవాలి. -
చిన్నారుల అరచేతుల్లో చర్మం ఊడుతోందా?
కొందరు చిన్నారుల అరచేతులు, అరికాళ్లలో పొట్టు ఒలిచిన విధంగా చర్మం ఊడి వస్తుంటుంది. అంతేకాదు విపరీతమైన దురదతోనూ బాధపడుతుంటారు. ఇందుకు ప్రధాన కారణం ఎగ్జిమా. ఇలా చర్మం ఊడిపోతూ, దురదల వంటి లక్షణాలు ఎగ్జిమాతో పాటు హైపర్కెరటోటిక్ పాల్మార్ ఎగ్జిమా, కెరటోలైసిస్ ఎక్స్ఫోలియేటా, ఎస్.ఎస్.ఎస్. సిండ్రోమ్, కన్స్టిట్యూషనల్ డిసీజెస్, తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కనిపిస్తుంటాయి. తగినంత పోషకాహారం దొరకని పిల్లల్లో విటమిన్ లోపాల వల్ల కూడా అరచేతుల్లో, అరికాళ్లలో దురదలు రావడంతో పాటు చర్మం పగలడం, ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక పెద్దల్లో సైతం సోరియాసిస్, స్కార్లెట్ ఫీవర్ వంటి కారణంగా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చి తగ్గిన తర్వాత కొందరు పిల్లల్లో ఈ లక్షణాలే కనిపిస్తుంటాయి. కాకపోతే మొదట్లో చాలా తీవ్రంగా కనిపించినా క్రమక్రమంగా తగ్గిపోతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక ఇలా అరచేతులు, అరికాళ్లలో సెకండరీ ఇన్ఫెక్షన్లా వచ్చి... ఇవే లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ‘పోస్ట్ వైరల్ ఎగ్జింథిమా’ అంటారు. ఇది రెండు నుంచి మూడు వారాల్లో పూర్తిగా తగ్గిపోతుంది. చికిత్స: పిల్లల అరచేతులు, అరికాళ్ల అంచుల్లో చర్మం ఊడుతూ... దురదలు వస్తూ తీవ్రంగా అనిపించే ఈ సమస్య... దానంతట అదే పూర్తిగా తగ్గిపోతుంది. చాలావరకు ప్రమాదకరం కూడా కాదు. ఉపశమనం కోసం, చేతులు తేమగా ఉంచుకోవడం కోసం మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ రాయవచ్చు. జింక్ బేస్డ్ క్రీమ్స్ రాయడం వల్ల కూడా చాలావరకు ప్రయోజనం ఉంటుంది. లక్షణాలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం పిల్లల డాక్టర్ / డర్మటాలజిస్ట్ సలహా మేరకు తక్కువ మోతాదు స్టెరాయిడ్స్ (మైల్డ్ స్టెరాయిడ్స్) క్రీమ్ రావడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ పైన పేర్కొన్న సూచనలు పాటించాక కూడా సమస్య తగ్గకపోయినా, చేతులు, కాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చినా, లక్షణాలు మరీ ఎక్కువవుతున్నా డెర్మటాలజిస్ట్‌ను కలిసి తగు సలహా, చికిత్స తీసుకోవాలి. -
సమ్మర్ కేర్.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే..
శివరాత్రికి శివ.. శివా... అంటూ చలి అలా వెళ్లిందో లేదో ఎండలు, ఉక్కపోత ఇలా వచ్చేసాయి. రానున్న కాలంలో ఎండలు మరింత ముదిరి మండించడం ఖాయం. మరి ఈ టైమ్‌లో అందాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది టీనేజర్లకు బెంగ. ముఖ్యంగా ముఖం, జుట్టు, అందమైన చర్మం కోసం వేసవిలో కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి. ఎండాకాలంలోనూ మన స్కిన్ కోమలంగా మెరిసిపోవాలంటే పాటించాల్సిన సింపుల్ బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకుందాం. పూర్తిగా ఎండాకాలం రాకముందే ఎండలు భయపెడుతున్నాయి.సాధారణంగా చర్మ రక్షణ కోసం మనం ఏడాది పొడవునా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ సమ్మర్లో మాత్రం ఎక్స్ ట్రా కేర్ తీసుకోవాల్సిందే. లేదంటే వేడికి స్కిన్ ట్యాన్ అయిపోయి, కాంతి విహీనంగా మారిపోతుంది. సమ్మర్ కేర్‌లో అన్నింటికంటే ముఖ్యమైంది సన్‌స్క్రీన్ క్రీమ్ లేదా లోషన్. అందుకే సూర్యుని నుంచి వెలువడే హానికరమైన యూవి కిరణాల నుండి చర్మాన్ని కాపాడు కోవడం చాలా ముఖ్యం. అందుకే బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, రెగ్యులర్‌గా ఆఫీసులకు వెళ్ళే వారు, సన్‌స్క్రీన్ ప్రతి రోజూ ఉదయం రాయాలి. దీంతోపాటు యాంటీ టానింగ్ క్రీమ్స్ వాడాలి. . తద్వారా చర్మం టాన్ అవ్వకుండా మెరుస్తూ ఉంటుంది. యూవిఎ/యూవిబి లేబుల్, ఎస్ఎఫ్ ఫి + ఉన్న లోషన్ లేదా క్రీమ్ సెలక్ట్ చేసుకోవడం చాలా మంచిది. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయేలా ఇంట్లో తయారు చేసుకున్న నలుగు పిండితో స్నానం చేయడం, లేదా ఆర్గానిక్ స్క్రబ్‌ని ఉపయోగించడం అవసరం. వేసవిలో హాలీడే ట్రిప్స్, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు చాలాకామన్. ఈ నేపథ్యంలో మరింత జాగ్రత్త పడాలి. వేసవిలో చర్మంతో పాటు జుట్టు కూడా పాడయ్యే అవకాశం ఉంది. వేసవిలో చికాకు పెట్టే చెమటలు కురులను కూడా వేధిస్తాయి. మండేఎండలు, చెమటకు జుట్టు కాంతి విహీనంగామారడంతోపాటు దుమ్ము,ధూళితో చుండ్రు సమస్య పీడిస్తుంది.సో..ఎండలో వెళ్లేటపుడు జుట్టును కవర్ చేసుకునేలా స్కార్ఫ్ లాంటివి రక్షణగా వినియోగించుకోవాలి. ప్రతీరోజూ కాకపోయినా, ఎండకు, డస్ట్‌కు ఎక్స్పోజ్ అయ్యాం అనిపించినపుడు మంచి షాంపూతో తలస్నానం చేయడం ఉత్తమం. అలాగే తలస్నానానికి ముందుకు ఇంట్లో తయారు చేసుకున్న హెర్బల్ ఆయిల్‌తో మసాజ్ చేసుకోవడం ఇంకా మంచిది. నెలలో రెండుసార్లు తలలోని చర్మం కూల్‌గా ఉండేలా ఏదైనా హెయిర్ మాస్క్ వేసుకోవాలి. తద్వారా జుట్టు పొడిగా, నిర్జీవంగా మారకుండా నిగనిగలాడుతుంది. వేసవికాలంలో పెదాలు సహజ కోమలత్వాన్ని కోల్పోవడం, పగలిపోవడం మరో సమస్య. సెన్సిటివ్ స్కిన్‌తో ఉండే లిప్స్ ఎండ వేడికిమికి త్వరగా పొడిబారతాయి. సో.. ఎండలోకి వెళ్లేముందు లిప్‌బామ్ అప్ల్ చేయాలి. అది ఇంట్లో తయారుచేసుకున్నదైతే మరీ మంచింది. అలాగే రాత్రి పడుకునే ముందు పెదాలకు నెయ్యిని రాసుకుని మృదువుగా మాసాజ్ చేసుకుంటే పెదాలు మృదుత్వాన్ని కోల్పోకుండా ఉంటాయి. ఇక భరించలేని ఎండలకు ప్రభావితమయ్యేవి కళ్లు. కళ్లను రక్షించుకునేందుకు కూలింగ్ గ్లాసులు వాడటం అలవాటు చేసుకోవాలి..వీటన్నింటికంటే కీలకమైంది శరీరానికి ఏంతో మేలు చేసే మంచినీళ్లు తాగడం చాలా చాలా ముఖ్యం. వీటితోపాటు, పల్చటి మజ్జిగ, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, బార్లీ గంజి, సబ్జా గింజల నీళ్లు లాంటి ద్రవపదార్థాలు విరివిగా తీసుకోవాలి. అలాగే ఎండలోనుంచి వచ్చిన వెంటనే కాకుండా.. ముఖాన్ని, కళ్లను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. -
సాక్స్ అలా ఉంటే చాలా ప్రమాదకరం.. ఏం జరుగుతుందో తెలుసా..?
పాదరక్షలు ఫుల్ షూస్, హాఫ్ షూ, బెల్ట్ షూ, పీప్ టోస్, వెడ్జెస్, శాండల్స్... ఏ రకమైనా సరే సాక్స్ ధరించడం కామన్. సాక్స్ చాలా మందికి డైలీ రొటీన్లో భాగమైపోయాయి కూడా. అయితే సాక్స్ ఎంపికలో మనకు తెలియకుండానే జరిగిపోయే పొరపాట్లు అనేకం. సాక్స్ అంటే సెకండ్ స్కిన్ అని చెప్పాలి. ఎక్కువసేపు పాదాలను అంటిపెట్టుకునే ఉంటాయి. అందుకే అవి స్కిన్ ఫ్రెండ్లీగా ఉండాలి. సాక్స్ వదులుగా జారిపోతూ ఉంటే వెంటనే స్పందిస్తాం. సాక్స్ బిగుతుగా ఉంటే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలంలో కానీ బయటపడవు. ఆ క్షణంలో తెలియదు కాబట్టి మనం ఏ మాత్రం పట్టించుకోం. చదవండి: సంక్రాంతికి వీటిని తినే ఉంటారు.. అయితే వాటి లాభాలు కూడా తెలుసుకోండి! పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటాం. సాక్స్ మరీ టైట్‌గా ఉంటే పాదం, వేళ్ల కదలికలు తగ్గిపోతాయి. అది రక్తప్రసరణ మీద ప్రభావం చూపిస్తుంది. కండరాల కదలికలు, రక్తప్రసరణ వేగం తగ్గిపోతూ ఉంటే చర్మం కూడా జీవం కోల్పోతుంటుంది. అందుకే సాక్స్ కాలివేళ్ల కదలికలను నియంత్రించకూడదు. సాక్స్ ధరించిన తర్వాత వేళ్లను సులువుగా కదిలించగలిగేటట్లు ఉండాలి. రకరకాల ప్రయత్నాల తర్వాత ఏదైనా ఒక కంపెనీ సాక్స్ సౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తే ఇక ఆ బ్రాండ్‌నే కొనసాగించడం మంచిది. ఇక పిల్లల విషయానికి వస్తే... పిల్లలకు ఉదయం స్కూలుకు వెళ్లేటప్పుడు వేసిన సాక్స్ సాయంత్రం ఇంటికి వచ్చేవరకు అలాగే ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్స్ బిగుతుగా ఉండకూడదు. అలాగే సాక్స్ పాతవైపోయి వదులై జారిపోతున్నప్పుడు ‘ఆదివారం సెలవు రోజు వెళ్లి కొత్తవి కొందాం’ అనుకుని ఆపద్ధర్మంగా ఒక రబ్బర్ బ్యాండ్ వేయడం జరుగుతుంటుంది. అలా రబ్బర్ బ్యాండ్‌తోనే రోజులు గడిపేస్తుంటారు. అది చాలా ప్రమాదం. తాత్కాలికంగా ఒకటి –రెండు రోజులు వేసే రబ్బర్ బ్యాండ్ కూడా పిల్లల కాళ్ల మీద ఒత్తిడి పడి చర్మం ఎర్రబడేటట్లు ఉండకూడదు. రక్తప్రసరణకు ఆటంకం కలిగించని విధంగా ఉండాలి. ఇంతకంటే తక్షణం కొత్త సాక్స్ కొనడమే ఉత్తమం. -
పెరిగే వయసుకు కళ్లెం.. నిత్య యవ్వనం ఇక సులువే..
వయసును జయించాలన్నది మనిషి చిరకాల కోరిక! వృద్ధాప్య ప్రక్రియను వెనక్కు మళ్లించేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నా నేటికీ నిత్య యవ్వనం అందని ద్రాక్షలానే ఉంది. తాజాగా ఈ యుగపు టెక్నాలజీగా చెప్పుకుంటున్న కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ప్రయోగానికి ఓ సంస్థ సిద్ధమైంది! మరి మనిషి నిరీక్షణ ఇప్పటికైనా ఫలిస్తుందా? క్రిప్టో కరెన్సీ ‘కాయిన్‌బేస్’ సృష్టికర్త, బిలియనీర్ బ్రియన్ ఆర్మ్‌స్ట్రాంగ్ (38) ఇటీవల ‘న్యూలి మిట్’ పేరిట కొత్త కంపెనీ పెట్టాడు. పేరులో ఉన్నట్లే ఈ కంపెనీ మనిషి మేధకు కొత్త పరిధిని నిర్ణయించే ప్రయత్నం చేస్తోంది! పెరిగే వయసుకు కళ్లెం వేసి జీవితకాలాన్ని పొడిగించేందుకు అవసరమైన పరిశోధనలు చేపట్టడం న్యూలి మిట్ నిర్దేశించుకున్న లక్ష్యం! మనిషి జన్యువులు తీరుతెన్నులను కృత్రిమ మేధ (ఏఐ)లో భాగమైన మెషీన్ లెర్నింగ్ సాయంతో విశ్లేషించడం ద్వారా వృద్ధాప్యాన్ని నిలువరించడంతో పాటు తిరిగి యవ్వనాన్ని తెచ్చే కొత్త, వినూత్న చికిత్సలను అందు బాటులోకి తెస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ప్రయత్నంలో ఆర్మ్‌స్ట్రాంగ్‌కు స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ బయోఇంజనీరింగ్ శాస్త్రవేత్త బ్లేక్ బయర్స్ మద్దతిస్తున్నారు. కణాలకు మళ్లీ శక్తితో... మానవ కణాలకు కొత్త పనులు అప్పగించడం ద్వారా నిత్య యవ్వనాన్ని సులువుగానే సాధించవచ్చని న్యూలిమిట్ అంటోంది! చిన్నప్పుడు మన కణాలు చాలా చురుకుగా ఉంటాయని, వయసు పెరిగేకొద్దీ వాటిల్లో మార్పులొచ్చి తమ పూర్వపు శక్తిని కోల్పోతాయని న్యూలి మిట్ చెబుతోంది. కణాలకు ఆ శక్తిని మళ్లీ అందిస్తే నిత్య యవ్వనం సాధ్యమని పేర్కొం టోంది. జీవశాస్త్రం అభివృద్ధితో డీఎన్ఏ క్రమాన్ని మాత్రమే కాకుండా.. అంతకంటే తక్కువ సైజుండే ఆర్ఎన్ఏ జన్యుక్రమాలనూ సులు వుగా తెలుసుకోగలుగుతున్నామని... ఇవన్నీ తమ పరిశోధనలకు ఉపయోగ పడతాయని న్యూలిమిట్ చెబుతోంది. చదవండి: ఊహించనంత వేగంగా కరిగిపోతున్న గ్లేసియర్లు.. లీడ్స్ యూనివర్సిటీ హెచ్చరిక ఎపిజెనిటిక్స్ మార్గం... వయసును వెనక్కు మళ్లించేందుకు న్యూలిమిట్ ఎపిజెనిటిక్స్ మార్గాన్ని ఎంచుకుంది. డీఎన్ఏ నిర్మాణంలో వచ్చే మార్పులను ఎపిజెనిటిక్స్ అంటారన్నది తెలిసిందే. మన శరీర కణాల్లో కొన్నింటిని మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చని శాస్త్రవేత్తలు సుమారు 15 ఏళ్ల క్రితం గుర్తించారు. చర్మ కణాలను తీసుకొని వాటిని మెదడు కణాలుగా మార్చవచ్చన్నమాట. కేవలం నాలుగు రకాల ప్రొటీన్లను ఉపయోగించడం ద్వారా ఈ అద్భుతం సాధ్యమవుతుంది. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని కణాలకు కొత్త రకమైన పనులు అంటే మృత కణాలను వేగంగా తొలగించడం, కొత్త కణాలను తయారు చేయడం వంటివి అప్పగిస్తే వయసును తగ్గించవచ్చని న్యూలిమిట్ భావిస్తోంది. చదవండి: ఫిలిప్పీన్స్ తుపాను.. 375కు చేరిన మరణాలు అందరికీ అందుబాటులో.. నిత్య యవ్వనం కోసం తాము అభివృద్ధి చేసే ఏ చికిత్స అయినా అందరికీ అందుబాటులో ఉంచుతామని న్యూలిమిట్ హామీ ఇస్తోంది. సెల్ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, కంప్యూటర్ల వంటి సైన్స్ అద్భుతాలన్నీ ప్రాథమిక శాస్త్ర పరిశోధనల ఫలితాలుగా పుట్టుకొచ్చినవేనని, మొదట్లో వాటి ఖరీదు ఎక్కువగానే ఉన్నా వాడకం పెరిగినకొద్దీ ధర కూడా తగ్గుతూ వచ్చిందని న్యూలిమిట్ గుర్తుచేసింది. -
ఎలక్ట్రోథెరపీ డివైజ్.. కాంతివంతమైన చర్మం కోసం
కలువ కన్నుల కోసం, మెరిసే పెదవుల కోసం ఐలైనర్లు, ఐలాష్‌లు, లిప్ స్టిక్స్, లిప్ కేర్స్ ఉండనే ఉన్నాయి. కానీ చర్మంలో మృదుత్వం, కాంతి లేకపోతే.. ఎంత మేకప్ వేసినా ఆ అందం అసహజంగానే కనిపిస్తుంది. చర్మం ముడతలు పడినా, మచ్చలు, మొటిమలు, కళ్ల కింద నల్లటి వలయాలతో అందహీనంగా మారినా.. అన్నింటినీ మాయం చేసేందుకు ఈ హై ఫ్రీక్వెన్సీ మెషిన్ ఓ మ్యాజిక్ స్టిక్‌లా పనిచేస్తుంది. పైగా ఈ డివైజ్.. జుట్టుకోసం ప్రత్యేకమైన దువ్వెనను కూడా అందిస్తోంది. ఈ అల్టిమేట్ హై ఫ్రీక్వెన్సీ బ్యూటీ ఎక్విప్మెంట్ అందించే థెరపీ.. సౌందర్య ప్రియులకు అద్భుతమైన వరమనే చెప్పాలి. మొటిమలు, మచ్చలు, నల్లటి వలయాలను పూర్తిగా తొలగించే ఈ ఎలక్ట్రోథెరపీ డివైజ్.. చర్మంపై పడిన ముడతలనూ శాశ్వతంగా పోగొడుతుంది. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. మష్రూమ్ ట్యూబ్, బెంట్ ట్యూబ్, టంగ్ ట్యూబ్, కూంబ్ ట్యూబ్.. అనే నాలుగు ప్రత్యేకమైన ట్యూబ్స్ ఈ మెషిన్‌తో పాటు లభిస్తాయి. మష్రూమ్ ట్యూబ్‌ను గాడ్జెట్‌కి అటాచ్ చేసి, స్విచ్ ఆన్ చేస్తే.. ముడతలు, గీతలు, మృతకణాలను తొలగిపోతాయి. బెంట్ ట్యూబ్.. మొటిమలను పోగొడుతుంది. టంగ్ ట్యూబ్.. కళ్ల కింద ఉండే నల్లటి వలయాలను రూపుమాపుతుంది. దీన్ని కళ్లు, పెదవులు, ముక్కు వంటి సున్నితమైన ప్రదేశాల్లోనూ ఉపయోగించాలి. ఇక కూంబ్ ట్యూబ్.. తలలోని రక్తప్రసరణ బాగా జరిపి, కొత్త జుట్టు వచ్చేలా చేస్తుంది. ట్యూబ్స్ అన్నింటినీ భద్రంగా పెట్టుకోవడానికి ప్రత్యేకమైన బాక్స్ ఉంటుంది. దీనికి చార్జింగ్ పెట్టుకోవడం, తలకి లేదా ముఖానికి థెరపీ అందించడం చాలా తేలిక. చదవండి: క్రైమ్ స్టోరీ: ది స్పై కెమెరా -
నా బట్టల గురించి మిగతావాళ్ళకెందుకు...బరి తెగించానా?
-
శరీరంలో అలర్జీలు.. నివారణల కోసం అవగాహన అవసరం
ప్రాణమున్న ప్రతిజీవికి ఏదో ఒక అంశం అలర్జీ కలిగించక మానదు. మనిషిలో తీసుకునే ఆహారం వల్ల కావచ్చు, పీల్చే గాలి వల్ల కావచ్చు లేదా మనం వాడే మందుల వల్ల అయినా కావచ్చు... మన రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించి అలర్జీకి దారి తీస్తుంది. అలర్జీపై అలసత్వం కూడదని, కొన్ని అలర్జీలు ప్రాణాంతకం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం కామన్‌గా ఎదుర్కొనే రకరకాల అలర్జీలు, కారణాలు, నివారణలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఫుడ్ అలర్జీ: మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు ఫుడ్ అలర్జీలకు దారితీస్తాయి. సాధారణంగా ఫుడ్ అలర్జీలు గుడ్లు, పాలు, వేరుశెనగ, చేపలు, రొయ్యలు, పీతలు, సోయా, కొన్ని రకాల నట్స్(ఆక్రోట్స్, బాదం, బ్రెజిల్ నట్స్), గోధుమ వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వస్తాయి. శరీరానికి ఈ పదార్థాలు సరిపడకపోతే దురద, చర్మంపై దద్దుర్లు, వాంతులు లేదా కడుపు తిమ్మిర్లు, శ్వాస తీసుకోలేకపోవటం, గురక, దగ్గు, గొంతునొప్పి, పల్స్ పడిపోవడం, చర్మం నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఫుడ్ అలర్జీల నిర్ధారణకు చర్మ పరీక్షతో పాటు రక్త పరీక్షలు(ఐజీఈ యాంటీబాడీస్) కూడా చేయాల్సి ఉంటుంది. డస్ట్ అలర్జీ: సాధారణంగా డస్ట్ అలర్జీ అనేది దుమ్ము, ధూళి వల్ల, వాటిలోని సూక్ష్మజీవుల వల్ల సంభవిస్తుంది. వీటిని డస్ట్ మైట్స్ అంటారు. ఈ డస్ట్ మైట్స్ మనుషుల నుంచి రాలిన చర్మ మృతకణాలను తింటూ ఇంట్లో దుమ్ము, ధూళికి కారణమవుతాయి. ఇవి శ్వాస తీసుకునే క్రమంలో శరీరంలోకి ప్రవేశించి శ్వాసనాళాల వాపుకు కారణమవుతాయి. దీనివల్ల తుమ్ములు, ముక్కు కారడం, కంటిలో దురద, కళ్ళలో నుంచి జిగట నీరు, ఒళ్లంతా దురద, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. మన ఇళ్లలో ఉండే తేమ పరిస్థితులు ఈ డస్ట్ మైట్స్‌కు ఆవాసాలు. కాబట్టి ఇళ్లలో ఉండే దుప్పట్లు, దిండు కవర్లు, టవల్లు, తివాచీలు, ఇతర సామాన్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. డస్ట్ అలర్జీ కారకాలను గుర్తించడానికి చర్మ గాటు పరీక్ష(స్కిన్ ప్రిక్ టెస్ట్)ను నిర్వహించాల్సి ఉంటుంది. డస్ట్ అలర్జీతో బాధపడేవారు 80 శాతం మంది ఆస్తమా రోగులుగా మారుతున్నారు. అరుదైన సందర్భా లలో డస్ట్ అలర్జీలు అనాఫిలాక్సిస్ షాక్‌కు దారి తీస్తాయి. కంటి అలర్జీ: సాధారణంగా కంటి అలర్జీలు పుప్పొడి, డస్ట్‌మైట్స్, పెంపుడు జంతువుల చర్మ కణాలు వంటి వాటి వల్ల సంభవిస్తాయి. వీటివల్ల కళ్లలో దురద, వాపు, మంట, జిగట నీరు కారడం, ఎరుపెక్కడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రకమైన అలర్జీలు అంటువ్యాధులు కావు. కంటి అలర్జీలకు ప్రత్యేకమైన నిర్ధారణ పరీక్షలు ఏవీ ఉండవు. పైన పేర్కొన్న కారకాల్లో ఏవి అలర్జీకి కారణం అవుతున్నాయో పరిశీలించి వాటికి దూరంగా ఉండటమే నివారణ. ఈ నాలుగే కాక కొంతమందిలో తేనేటీగలు, కందిరీగలు (ఇన్సెక్ట్ అలర్జీ), రబ్బరుతో తయారయ్యే వస్తువులు (బెలూన్, చేతి తొడుగులు, కాండమ్స్), కొన్ని రకాల మందులు(డ్రగ్ అలర్జీ), ఫంగస్(మోల్డ్ అలర్జీ) లాంటివి కూడా కనిపిస్తుంటాయి. ఏం చేయాలి? శరీరంలో అలర్జీ లక్షణాలు కనిపించిన వెంటనే అలర్జీ స్పెషలిస్ట్ డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. డాక్టర్‌తో మీ ఫ్యామిలీ హిస్టరీ, జీవనశైలి, ఇతర జబ్బులకు వాడుతున్న మందులు తదితర వివరాలను తెలియజేస్తే, దానికి తగిన నిర్ధారణ పరీక్షలను సూచిస్తారు. ముందుగా ఊపిరితిత్తుల సామర్ధ్య పరీక్ష, ఎక్స్‌రే వంటి పరీక్షలు నిర్వహించి ఆతరువాత మీ అలర్జీ కారకాలను గుర్తించడానికి చర్మ పరీక్షలు, ప్యాచ్ లేదా రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల నివేదికల ఆధారంగా మీరు ఏరకమైన అలర్జీలతో బాధపడుతున్నారో నిర్ధారించుకొని తగిన చికిత్సను సిఫార్సు చేస్తారు. అలర్జీలకు సరైన చికిత్సను నిర్ధారణ పరీక్షల ఆధారంగానే కాకుండా బాధితుడి మెడికల్ హిస్టరీ, లక్షణాల తీవ్రతను పరిగణనలోకి తీసుకొని అందిస్తారు. ఈ రుగ్మతకు శాశ్వత పరిష్కారం లేదు. దీన్ని ఏదో ఒక చికిత్సా విధానం ద్వారా అదుపులో మాత్రమే ఉంచుకోవచ్చు. స్కిన్ అలర్జీ: ఈ రకమైన అలర్జీ సంభవించటానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. రోగనిరోధక వ్యవస్థలో లోపాలు, మందులు, అంటువ్యాధులు వంటి పలు కారణాల చేత ఇవి సంభవిస్తాయి. పెంపుడు జంతువులు, రసాయనాలు, సబ్బులు, నూతన వస్త్రాలు, చర్మ పరిరక్షక క్రీమ్‌లు వంటివి చర్మ అలర్జీలకు ప్రధాన కారకాలు. స్కిన్ అలర్జీ అంటే కేవలం చర్మ సంబంధిత అలర్జీ అనే అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే ఈ రకమైన అలర్జీకి ముఖ్య కారణం రోగనిరోధక వ్యవస్థలోని లోపాలే అన్న విషయం వారికి తెలీదు. స్కిన్ అలర్జీతో బాధపడే వారిలో విపరీతమైన దురద, చర్మంపై దద్దుర్లు, పొడి చర్మం, మంట, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామందిలో ఈ అలర్జీల కారకాలను పరీక్షల ద్వారా నిర్ధారించడం సాధ్యం కాదు. అయితే సాధారణ రక్త పరీక్ష (తెల్ల రక్త కణాల పరీక్ష) ద్వారా బాధితుడి లక్షణాలను కొద్దిమేరకు గుర్తించే ప్రయత్నం చేయవచ్చు. మన చర్మం దేనికి ప్రతిస్పందిస్తుందో జాగ్రత్తగా పరిశీలించి వాటికి దూరంగా ఉండటమే దీనికి నివారణ. చదవండి: కరోనా కాలంలో... కంటి సమస్యలు -
వైరల్: అతడి చర్మాన్ని లాగితే మామూలుగా ఉండదు
లండన్ : మన చర్మాన్ని గట్టిగా లాగితే ఏమౌతుంది? రెండు, మూడు సెంటీమీటర్లు సాగుతుంది. మరీ గట్టిగా లాగితే మరో రెండు సెంటీమీటర్లు సాగుతుంది! బాగా నొప్పి కూడా తీస్తుంది. కానీ, ఇంగ్లాండ్‌లోని లింకన్షేర్కు చెందిన 50 ఏళ్ల గ్యారీ టర్నర్ చర్మం మాత్రం ఎవరూ ఊహించనంత ముందుకు సాగుతుంది. అది ఎంతంటే ఏకంగా 10 సెంటీమీటర్ల మేర. ఇక అతడి పొట్ట మీది చర్మం అయితే 15.8 సెంటీమీటర్లు సాగుతుంది. గ్యారీ చర్మం ఇంతలా సాగటానికి కారణం అతడికున్న ‘‘ఎహ్లర్స్ డాన్లోస్ సిండ్రోమ్’’ అనే అరుదైన శారీరక లోపమే. తన లోపాన్ని తలుచుకుని అతడెప్పుడూ అధైర్యపడలేదు. దాన్నే తన ఉపాధిగా మలుచుకున్నాడు. తన చర్మాన్ని రకరకాలుగా సాగిదీస్తూ షోలు చేయటం మొదలుపెట్టాడు. చివరకు గిన్నిస్ వరల్డ్స్ రికార్డ్సులోనూ చోటు సాధించాడు. గ్యారీ మాట్లాడుతూ.. ‘‘ నా చర్మం ప్రత్యేకమైనదని నాకు తెలుసు. నేను చిన్నపిల్లాడిగా ఉన్నపుడు మా అంకుల్స్ వారి స్నేహితులకు నన్ను చూపించి నవ్వుకునేవారు. నా చర్మాన్ని గట్టిగా సాగదీయటం వల్ల నొప్పేమీ ఉండదు. కానీ, ఈ లోపం వల్ల కలిగే ఇతర ఇబ్బందులు బాధిస్తుంటాయి’’ అని 2012లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చదవండి : పిచ్చి పీక్స్ అంటే ఇదే.. స్వీటు కోసం 200కి.మీ.. -
ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది..
చర్మ సౌందర్యానికి అతివలు అత్యధిక ప్రాధాన్యమిస్తుంటారు. చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి, ముడతలు రాకుండా ఉండటానికి ఫేస్‌మాస్కులు వేసుకోవడం, క్రీములు, లోషన్లు పూసుకోవడం వంటి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వయసు పెరిగేకొద్దీ ఈ సమస్య తగ్గకపోగా, మరింత పెరుగుతుంది. చర్మాన్ని మృదువుగా, ముడతలు రాకుండా చూసుకోవడానికి ఇప్పుడు అంత కసరత్తు అవసరం లేదు. ప్రత్యామ్నాయ పరిష్కారంగా సరికొత్త గాడ్జెట్ మార్కెట్లోకి వచ్చింది. అదే ఈ ‘క్లినికల్ మైక్రోడెర్మాబ్రేషన్ మెషిన్’. క్లినికల్ పరీక్షల్లో ఈ గాడ్జెట్ పనితీరు సమర్థంగా నిరూపితమైంది. ఇది చర్మాన్ని శుభ్రం చేయడమే కాకుండా, టోనింగ్ చేస్తుంది. ముడతలను తగ్గించి, చర్మాన్ని మృదువుగా మార్చేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల ముఖ చర్మం ‘స్పా’ చేసినట్లుగా తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది. ఇందులోని మైక్రోడెర్మ్ గ్లో సిస్టమ్ ముఖ చర్మానికి అధునాతన హోమ్ ఫేషియల్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అత్యంత సులభంగా మీ ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసి, వయసు ప్రభావాన్ని వెనక్కు నెట్టేస్తుంది. త్రీడీ టెక్నాలజీతో రూపొందిన ఈ గాడ్జెట్ అన్ని రకాల చర్మాలకూ సురక్షితమైనదే. ఇది పూర్తిగా వైర్లెస్,రీఛార్జబుల్. ముందుగానే చార్జింగ్ పెట్టుకుని, అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకోవచ్చు. వారానికి ఒకసారి నాలుగు నిమిషాలసేపు ముఖానికి దీంతో ట్రీట్మెంట్ ఇస్తే, మంచి ఫలితం ఉంటుంది. ఈ గాడ్జెట్ ముందు భాగంలోని డిస్ప్లేలో స్పీడ్, మోడ్ తదితర ఆప్షన్లు కనిపిస్తాయి. డిస్ప్లే కింద పవర్ బటన్, స్పీడ్ పెంచుకునే బటన్, స్పీడ్ తగ్గించుకునే బటన్ వరుసగా ఉంటాయి. దీనిని ముఖంతో పాటు మెడ, చేతులు, కాళ్లు వంటి ఇతర భాగాలలోనూ ఉపయోగించుకోవచ్చు. దీని ధర 200 డాలర్లు (సుమారు రూ.15,000). -
కరోనా... చర్మంపై ప్రభావం!
మనం ఏ పూలచెట్టు దగ్గరికో పోతాం. అక్కడ పుప్పొడి లేదా చెట్టుతీగలు గానీ చర్మానికి తగిలినప్పుడు మేను కందిపోయినట్లు అవుతుంది. ఎర్రటి దద్దుర్లో, ర్యాషో వస్తుంది. అచ్చం అలాంటి ర్యాష్‌లు, దద్దుర్లు, చిన్న పగుళ్లలాంటి గాయాలు, గుల్లలు, మచ్చలు, చర్మం ఎర్రబారడాలు వంటివన్నీ కోవిడ్–19 తాలూకు అసలు లక్షణాలు బయటపడటానికి కాస్త ముందుగా కనిపిస్తాయని పరిశోధకుల అధ్యయనాల్లో, వైద్యనిపుణుల పరిశీలనల్లో తేలింది. అయితే పైన పేర్కొన్న చర్మ సంబంధిత లక్షణాలు కేవలం 20% మంది కోవిడ్–19 రోగుల్లో కనిపిస్తాయి కాబట్టి ప్రతి చర్మపు మచ్చలనూ, గుల్లలనూ, ర్యాష్నూ, పొడలనూ అనుమానిస్తూ, దిగులుపడకుండా అవగాహన కోసం ఈ కథనం. మార్బిల్లిఫామ్ ర్యాష్: ఇది చర్మం ఎర్రబారినట్లుగా కనిపించే పొడ. దీన్ని వైద్యపరిభాషలో ఎరిథమెటోస్ / మార్బిల్లిఫామ్ ర్యాష్ లేదా ఎరప్షన్గా చెబుతారు. ఇటలీ వాసుల్లో దాదాపు 70 శాతం మందికి ఇలా కనిపిస్తుంది. ఇటలీ దేశస్థుల్లోనే కాకుండా... చాలామంది స్పానిష్ రోగుల్లోనూ ఇది కనిపించడం విశేషం. చిన్నచిన్న స్పాట్స్‌గా, గుంపులు గుంపులుగా వచ్చే దగ్గరి దగ్గరి మచ్చల (పర్పురా) రూపంలో ఉన్న ఈ మచ్చలన్నీ కలిసిపోయి... ఎర్రటి పొడలా కనిపిస్తుంటాయి. అర్టికేరియా: సాధారణంగా మనకు సరిపడని పౌడర్లు, పుప్పొడి వంటివి చర్మంపై పడ్డప్పుడు చిన్న చిన్న దద్దుర్లు వచ్చి... వాటంతట అవే తగ్గిపోతుండటాన్ని చూస్తుంటాం. ఇలాంటి దద్దుర్లనే వైద్యపరిభాషలో అర్టికేరియా అంటారు. ఇవి కూడా ఎర్రటి ర్యాష్‌లా కనిపిస్తుంటాయి. ఇటలీలోని రోగుల్లో జరిగిన అధ్యయనం ప్రకారం ప్రతి 18 మంది రోగుల్లో ముగ్గురికి ఈ లక్షణాలు కనిపించాయి. స్పెయిన్ డాక్టర్ల పరిశీలన ప్రకారం అక్కడి 32 ఏళ్ల మహిళకూ, అలాగే ఫ్రాన్స్‌కు చెందిన 27 ఏళ్ల మహిళకూ ఇవే లక్షణాలు కనిపించినప్పుడు... కోవిడ్–19 తాలూకు మిగతా లక్షణాలకు ఇచ్చే సింప్టమాటిక్ చికిత్సలాగే... ఈ అర్టికేరియాకు కూడా యాంటీహిస్టమైన్స్ ఇచ్చి చికిత్స చేశారు. కాబట్టి వీటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇలాంటివేవైనా కనిపించిన తర్వాత... కోవిడ్–19 లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు లాంటివేవైనా కనిపిస్తాయేమో కనిపెట్టుకుని ఉండాలి. ఇలాంటి ర్యాష్ ఫ్రాన్స్, ఫిన్‌ల్యాండ్, కెనడా, యూఎస్‌కు చెందిన అనేక రోగుల్లో కనిపించడం రిపోర్ట్ అయ్యింది. వెసిక్యులార్ ఎరప్షన్స్: ఈ గుల్లలు అచ్చం చికెన్పాక్స్లో కనిపించే గుల్లల్లాగే ఉంటాయి. వారిసెల్లా ఇన్ఫెక్షన్లో కనిపించేలాంటి ఈ గుల్లలు ఇటలీలోని కొందరు కోవిడ్–19 రోగుల్లో కనిపించడం వైద్యనిపుణులు గమనించారు. ఇలాంటి గుల్లలు కనిపించిన మూడు రోజుల తర్వాత కోవిడ్–19 తాలూకు అసలు లక్షణాలైన జ్వరం, దగ్గు వంటివి కనిపించడాన్ని వైద్యనిపుణులు గమనించారు. అయితే చర్మంపై కనిపించిన వాటి తీవ్రతకూ, కోవిడ్–19 తాలూకు వ్యాధి తీవ్రతకూ ఎలాంటి సంబంధం లేకపోవడంతో బయాప్సీ వంటి పరీక్షలు నిర్వహించి వీటిని మరింత జాగ్రత్తగా పరిశీలించి చూశారు. చాలా సందర్భాల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన రోగుల్లో ఇలాంటి గుల్లలే వస్తుంటాయనీ, అలాగే ఈ వైరల్ ఇన్ఫెక్షన్లోనూ కనిపించినట్లు పరిశీలనలో వెల్లడయ్యింది. కోవిడ్ టోస్: కొందరు కోవిడ్–19 రోగుల్లో కాళ్ల వేలి చివర్లు ఎర్రగా కనిపించడాన్ని నిపుణులు గమనించారు. ముఖ్యంగా స్పానిష్ రోగుల పరిశీలనలో మహిళల మడమల మీద అవి రావడాన్ని చూశారు. ఇలా కోవిడ్–19 రోగుల కాలివేళ్ల చివర కనిపిస్తాయి కాబట్టి వీటిని ‘కోవిడ్ టోస్’ అని కూడా నిపుణులు పిలుస్తున్నారు. కువైట్‌కు చెందిన కొంతమంది రోగుల్లోనూ ఇవి కనిపించడం విశేషం. లివిడాయిడ్ ఎరప్షన్స్ / లివిడో రెటిక్యులారిస్:ఇవి యూఎస్‌కు చెందిన చాలామంది రోగుల చర్మం పైన కనిపించాయి. కొందరిలో చర్మం కింద రక్తనాళాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. సాధారణంగా చర్మం పారదర్శకంగా ఉండే వారిలో ఇలా రక్తనాళాలు స్పష్టంగా కనిపించడం చూస్తుంటాం. కోవిడ్–19 వచ్చిన కొందరు రోగుల్లో ఈ రక్తనాళాలు ఎర్రగా... ఒకదాని తో మరొకటి అల్లుకుపోయిన వల మాదిరిగా కనిపించడం వల్లే వాటిని ‘లివిడో రెటిక్యులారిస్’ అంటారు. పెటీకియల్ మచ్చలు:డెంగీ రోగుల్లో అంతర్గత రక్తస్రావం కావడం ఒక లక్షణం. ఇలాంటి లక్షణాలతో వ్యక్తమయ్యే డెంగీ వ్యాధిని ‘డెంగీ హేమరేజిక్ ఫీవర్’ అని కూడా అంటారు. ఇలాంటి లక్షణాలతో డెంగీ ఫీవర్ కనిపించనప్పుడు సాధారణంగా చర్మం కింద పూస పూసలుగా రక్తపు మచ్చలు పక్కపక్కనే కనిపిస్తుండటం చూస్తుంటాం. ఇలా మనం బయటి నుంచి చూసినప్పుడు చర్మం కింద కనిపించే ఈ రక్తపు పూసలను వైద్యపరిభాషలో ‘పెటికీ’ అని అంటుంటారు. డెంగీలాగే... కోవిడ్–19 కూడా ఓ వైరల్ జ్వరమే కావడం వల్ల అచ్చం ఇలాంటి లక్షణాలే కోవిడ్–19 వచ్చిన కొందరు రోగుల్లో కనిపించడాన్ని నిపుణులు గమనించారు. ముఖ్యంగా ఈ తరహా మచ్చలు యూఎస్‌లోని కరోనా రోగుల్లో గమనించారు. ఇతరత్రా సమస్యలు: నిర్దిష్టంగా పైన పేర్కొన్న మచ్చలే గాకుండా కొందరిలో పొడిచర్మంపైన కాలిమడమలపై పగుళ్లు (ఎరప్షన్స్) వచ్చిన రీతిలోనే కొందరు రోగుల్లో కనిపించడం కూడా వైద్యనిపుణులు గమనించారు. అయితే కోవిడ్–19 రోగులందరినీ తీసుకుంటే గరిష్టంగా 20% రోగుల్లో మాత్రమే చర్మానికి సంబంధించిన పైన పేర్కొన్న లక్షణాలు రావడాన్ని పరిశోధకులు, అధ్యయనవేత్తలు చూశారు. కాకపోతే... ప్రధాన లక్షణాలు కనిపించడానికి కాస్తంత ముందుగా చర్మానికి సంబంధించిన లక్షణాలు కనిపించడం ఓ విశేషం. అందుకే చర్మంపై ఎలాంటి మచ్చలు వచ్చినా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్లోకి వెళ్లండి. ఐదురోజుల తర్వాత జ్వరమూ, దగ్గు, జలుబు వంటి లక్షణాలు లేకపోతే మీరు నిశ్చింతగా ఉండవచ్చు. మీ పరిశీలన కోసం రెండు ముఖ్య లక్షణాలను గమనంలో పెట్టుకోండి. అవి... కరోనా రోగుల్లో చాలామందిలో కనిపించే నిర్దిష్ట లక్షణం జ్వరం, దగ్గుతో పాటు వాసనలు , రుచులు తెలియకపోవడం. అందుకే పై లక్షణాలన్నింటితో పాటు వాసనలూ, రుచులూ తెలియనప్పుడు వెంటనే వైద్యపరీక్షల కోసం వెళ్లండి.అయితే నిశ్చింతగా, ఆహ్లాదంగా ఉంటూ పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటూ, తగినంత వ్యాయామం చేస్తూ ఉండటం వల్ల కోవిడ్–19 నుంచి రక్షణ పొందడంతో పాటు చర్మానికి సంబంధించి ఏ సమస్యలూ రాకుండా చూసుకోవచ్చు.-డాక్టర్ స్వప్నప్రియ సీనియర్డర్మటాలజిస్ట్ -
చెమట పట్టడం శరీరానికి మంచిదేనా?
న్యూఢిల్లీ: సాధారణంగా మనిషికి అధికంగా చెమట పట్టిందంటే ఆరోగ్యంగా ఉన్నారని అంటారు. కానీ ప్రస్తుత సమాజంలో అధికంగా చెమట వచ్చినప్పటికి అనారోగ్యానికి కారణమని కొందరు అపోహలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకీ మనిషికి చెమట పట్టడం మంచిదా? కాదా?. మరి ఇందుకు సంబంధించిన వాస్తవాలను విశ్లేషిద్దాం.. మనిషి ఆరోగ్యానికి చెమట ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో విపరీతమైన వేడితో చెమట సాధారణం కంటే అధికంగా వస్తుంది. వేసవిలో శ్వేధం అధికంగా స్రవించడం వల్ల శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ద్రవాలను కోల్పోతాం. ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు విపరీతమైన వేడి, తేమ (గాలిలో ఆవిరి) వల్ల జుట్టు పొడిబారుతోంది. ఒత్తయిన జట్టును సొంతం చేసుకోవాలంటే నిత్యం నీటితో శుభ్రం చేసుకోవాలి. కానీ కొన్ని కాస్మోటిక్ కంపెనీలు చమట పట్టడాన్ని పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నారు. అయితే కంపెనీల ప్రకటనలను చర్మ వ్యాధి నిపుణులు కొట్టిపారేశారు. ఆరోగ్యానికి చెమట ఎంతో మేలు చేకూరుతుందని వైద్యులు తెలిపారు. మనిషికి చెమట రాకపోతే శరీరంలో ఉన్న మలినాలు చర్మం నుంచి బయటకు వెళ్లవని వైద్యులు పేర్కొంటారు. మనిషి చాలినంత చెమటను బయటకు స్రవించడం ద్వారా మొఖం మీద మొటిమలు రాకుండా చెమట గ్రంథులు నిరోధిస్తాయని అంటున్నారు. చర్మ సంరక్షణకు నిరంతర వ్యాయామంతో పాటు సమతుల ఆహారం (balanced diet) ఎంతో ముఖ్యం. జిమ్‌లో నిరంతరం వర్క్‌వుట్ చేసే వారి చర్మం చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో చెమట కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి కావాలసిన చెమట స్రవించడం వల్ల మనిషికి దాహం వేస్తుంది. దీంతో దాహం తీరడానికి ఎక్కువగా నీళ్లను తీసుకుంటారు. శరీరానికి కావాల్సిన నీరు తీసుకోవడం వల్ల చర్మ సంరక్షణకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మం నుంచి చెమట స్రవించడం వల్ల శరీరానికి ఉపయోగపడే ఖనిజాలు విడుదలవుతాయని.. ఇవి పొడిబారిన చర్మాన్ని, యూరియా, యూరిక్ యాసిడ్, చెడు బ్యాక్టీరియా,అలర్జీ సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడతాయి. వ్యాయాయం పూర్తయిన తర్వాత కచ్చితంగా స్నానం చేయాలని.. ముఖ్యంగా మెడ ప్రాంతంపై చెమట ఎక్కువ వస్తుంది కాబట్టి నిత్యం శుభ్రం చేసుకోవాలని, శరీరాన్ని నిత్యం సున్నితంగా శుభ్రం చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. -
ఇంటి మాయిశ్చరైజర్లు
పాల మీగడ–తేనె ఈ కాలం చర్మం పొడిబారుతుంటుంది. మాయిశ్చరైజర్లు పదే పదే రాయాల్సి వస్తుంది. ఆ అవసరం లేకుండా చర్మం మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే.. పాల మీగడ తీసుకోవాలి. మీగడలో ఉంటే నూనె చర్మాన్ని పొడిబారనీయదు. తేనెలో చర్మసంరక్షణకు సహాయపడే ఔషధాలు ఉన్నాయి. చర్మంపై ఏర్పడే మొటిమలు, యాక్నె వంటి సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. అందుకని మీగడ–తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. మాయిశ్చరైజర్ అవసరం లేదని మీకే తెలిసిపోతుంది. ఈ చలికాలం రోజూ పాల మీగడ–తేనె కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. చర్మకాంతి కూడా పెరుగతుంది. పాలు – అరటిపండు చర్మానికి సరైన పోషణ లేకపోతే జీవ కళ కోల్పోతుంది. పాలు, అరటిపండు కలిపి మిశ్రమం తయారుచేసుకొని ప్యాక్వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. జిడ్డుచర్మం గలవారు పాలు–రోజ్‌వాటర్ కలిపి రాసుకోవచ్చు. అరటిపండు మృతకణాలను తీసేయడంలో అమోఘంగా పనిచేస్తుంది. బాగా మగ్గిన అరటిపండును గుజ్జు చేసి, దాంట్లో టేబుల్ స్పూన్ పాలు కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. తర్వాత వెచ్చని నీటితో కడిగేయాలి. కలబంద– బాదంనూనె – నువ్వుల నూనె చర్మంపై ఎక్కువ మృతకణాలు కనిపిస్తే కలబంద రసంలో పది చుక్కల చొప్పున బాదం నూనె, నువ్వుల నూనె కలిపి ముఖానికి, చేతులకు రాయాలి. వృత్తాకారంలో రాస్తూ మర్దన చేయాలి. రాత్రంతా అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయం వెచ్చని నీటితో కడిగేయాలి. బొప్పాయి – పచ్చిపాలు విటమిన్–ఇ అందితే చర్మం త్వరగా మృదుత్వాన్ని కోల్పోదు. బాగా పండిన బొప్పాయి ముక్కను గుజ్జు చేసి, దాంట్లో పచ్చి పాలు కలపాలి. ముఖానికి, మెడకు, చేతులకు రాసి ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి. -
ఆపిల్ ప్యాక్
►ఆపిల్ పై తొక్క తీసి, ముక్కలు కోసి, మిక్సర్‌లో వేసి గుజ్జు చేయాలి. దీంట్లో రెండు టీ స్పూన్ల తేనె, విటమిన్–ఇ క్యాప్సుల్ మిశ్రమం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముఖ చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. ►సగం ఆపిల్ ముక్కను ఉడికించి గుజ్జు చేయాలి, అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పదినిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి, తీసి, ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్ ముడతలను నివారిస్తుంది. ►సగం ముక్క ఆపిల్‌ను తరగాలి. రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్, టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు కలిపి మెత్తగా నూరి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి మృదువుగా వేళ్లతో రాయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. కొబ్బరిపాలు లేదంటే మజ్జిగ కలుపుకోవచ్చు. ఈ ప్యాక్ పొడిబారిన చర్మాన్ని మృదువుగా చేస్తుంది. -
కోల్డ్ క్రీమ్ రాస్తున్నప్పటికీ...
నా వయసు 19 ఏళ్లు. నాది పొడి చర్మం (డ్రై స్కిన్). ఇది చలి కాలం కాబట్టి ముఖానికి కోల్డ్ క్రీమ్ రాస్తున్నాను. ఇలా రాసినప్పుడు మాత్రం చర్మం బాగానే ఉంటుంది. కానీ ముఖం కడుక్కున్న వెంటనే అది బాగా డ్రైగా మారిపోతోంది. కోల్డ్ క్రీమ్ రాస్తున్నప్పటి నుంచి చర్మం కాంతి కోల్పోయి, ముఖం నిగారింపు తగ్గినట్లుగా కనిపిస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. పొడి చర్మం ఉన్నవారు చలికాలంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. వీరిలో రక్షణ కవచంలా ఉండాల్సిన స్కిన్ బ్యారియర్ డిస్టర్బ్ అయ్యి సమస్యలకు దారితీస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే... కోల్డ్ క్రీమ్స్ అనేవి అందరికీ సరిపడవు. ముఖానికి, శరీరానికి కూడా వేరువేరుగా క్రీమ్స్ ఫార్ములాలు అందుబాటులో ఉంటాయి. పొడి చర్మం ఉన్నవారు సిండెట్ బేస్ సబ్బు వాడితే మంచిది. డాక్టర్ల సూచించిన మాయిశ్చరైజర్స్ వాడటం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇవి స్కిన్ బ్యారియర్‌ను రిపేరు చేస్తాయి కాబట్టి మీకు సరిపడే మాయిశ్చరైజన్ను డాక్టర్ సలహా మీద వాడండి. మళ్లీ మొటిమలు వస్తున్నాయి... నా వయసు 34 ఏళ్లు. ఇటీవల తరచూ మొటిమలు వస్తున్నాయి. ముఖం కూడా డల్‌గా మారింది. అప్పట్లో నేను టీన్స్‌లో ఉన్నప్పుడు నాకు మొటిమలు విపరీతంగా వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ మొటిమలు వస్తుండటం చాలా ఎంబరాసింగ్‌గా ఉంది. నా సమస్యకు పరిష్కారాన్ని సూచించండి. మొటిమలు మళ్లీ మళ్లీ రావడానికి కొన్ని కారణాలుంటాయి. ఉదాహరణకు మహిళల్లో హార్మోన్ల ప్రభావం, ప్రీ–మెన్స్ట్రువల్ సిండ్రోమ్ వంటి కారణాల వల్ల మొటిమలు వస్తుంటాయి. అంతేగాక... మన ఆహారపు అలవాట్లు కూడా ఈ సమస్యకు ఒక ప్రధాన కారణం కావచ్చు. అంటే మనం తీసుకునే ఆహారంలో నూనెలు, కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉండటం కూడా మొటిమలకు వచ్చేందుకు దోహదపడుతుంది. మీ విషయంలో మీకు ఏ కారణంగా మొటిమలు వచ్చాయన్న అంశంతో పాటు మరికొన్ని వ్యక్తిగత అంశాలను పరిగణనలోకి తీసుకొని, దానికి అనుగుణంగా చికిత్స సూచించాల్సి/చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి మీకు దగ్గర్లో ఉన్న కాస్మటాలజిస్ట్ను సంప్రదించండి. చుండ్రు తీవ్రత ఎక్కువైంది... నా వయసు 24 ఏళ్లు. నాది సాధారణ చర్మం. నేను గత ఆర్నెల్ల నుంచి చుండ్రు (డాండ్రఫ్)తో బాధపడుతున్నాను. ఈమధ్య ఈ సమస్య తీవ్రత మరింత పెరిగింది. బాగా దురదగా కూడా ఉంటోంది. జుట్టు రాలిపోవడం (హెయిర్‌ఫాల్) కూడా ఎక్కువైంది. ఎన్ని యాంటీ డాండ్రఫ్ షాంపూలు మార్చినా ఫలితం లేదు. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం సూచించండి. చుండ్రు (డాండ్రఫ్) అనేక కారణాల వల్ల వస్తుంటుంది. చలికాలంలో దీని తీవ్రత పెరిగి మరింత ఇబ్బంది పెడుతుంది. షాంపూలు వాడినంతమాత్రాన మీ సమస్య తొలగిపోదు. దీనికి ప్రత్యేకించి యాంటీడాండ్రఫ్ లోషన్స్‌తో పాటు మెడికేటెడ్ షాంపూలు వాడాల్సి ఉంటుంది. అలాగే జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. మీ జుట్టు రాలడం సమస్యకు తగిన కారణాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని ఆరోగ్య పరీక్షలు కూడా చేయించాల్సి రావచ్చు. మీరు ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిది. డాక్టర్ సుభాషిణి జయం, చీఫ్ మెడికల్ కాస్మటాలజిస్ట్, ఎన్ఛాంట్ మెడికల్ కాస్మటాలజీ క్లినిక్, శ్రీనగర్‌కాలనీ, హైదరాబాద్ -
గుప్పెడు వేపాకులు
►గుప్పెడు వేపాకులు శుభ్రంగా కడిగి, రెండు లీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి వడకట్టి ఒక బాటిల్లో పోసి ఉంచాలి. స్నానం చేసే బకెట్ నీటిలో కప్పు వేపాకుల నీళ్లు కలపాలి. ఈ నీటితో రోజూ స్నానం చేయాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే చర్మసంబంధమైన ఇన్ఫెక్షన్లు, యాక్నె వంటివి మెల్ల మెల్లగా తగ్గిపోతుంటాయి. ►గుప్పెడు వేపాకులను మెత్తగా నూరి రెండు కప్పుల నీటిలో కలిపి మరిగించాలి. ఒక కప్పు అయ్యేవరకు మరగనిచ్చి, చల్లారనివ్వాలి. ఈ నీళ్లలో కొద్దిగా తేనె, పెరుగు, సోయా పాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీన్ని వారానికి మూడుసార్లు ముఖానికి పట్టించి, చల్లటి నీళ్లతో కడిగేయాలి. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, యాక్నె నుంచి విముక్తి లభిస్తుంది. పోర్స్‌లో మలినాలు శుభ్రపడతాయి. జిడ్డు చర్మం గలవారికి ఇది మేలైన ప్యాక్. -
అందానికి ఐదు చిట్కాలు..
చలికాలం మొదలైందంటే చాలు.. చర్మం పొడిబారిపోయి గరుకుగా తయారవుతుంది. చర్మం బిరుసెక్కి అందవిహీనంగా మారుతుంది. శరీరంపై ఏ చిన్న గీతపడినా తెల్లటి చారలు ఏర్పడతాయి. ముఖం, పెదాలు కూడా కళావిహీనంగా మారుతాయి. అయితే మనం తీసుకునే చిన్నపాటి జాగ్రత్తలతో శీతాకాలంలోనూ మెరిసిపోవచ్చు. కాస్త సమయం కేటాయిస్తే పొడిబారిన చర్మం నుంచి తప్పించుకోవచ్చు. గాఢత ఎక్కువగా ఉండే కెమికల్ ప్రోడక్ట్‌ల జోలికి పోకుండా సహజ సిద్ధమైన ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే కోమలమైన చర్మం మీ సొంతమవుతుంది. ► శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉండటం కోసం ఎప్పుడూ నీళ్లు తాగుతూ ఉండాలి. ఇది చర్మం తేమను కోల్పోకుండా ఉండటానికి సహాయపడుతుంది. వీలైతే నిమ్మ, దోసకాయ, పుచ్చకాయ వంటి పండ్లరసాలను తాగితే మరింత మంచిది. ► చర్మం పొడిబారకుండా తేమతో కూడిన ఆయిల్స్‌ను అప్లై చేయాలి. స్నానానికి వెళ్లే ముందు ఆయుర్వేద ఆయిల్‌ను ఒంటికి పట్టించుకుని ఆ తర్వాత స్నానానికి వెళ్లాలి. ► బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. తాజా కొబ్బరి, బాదంపప్పు, అవకాడో, ఆలివ్ ఆయిల్, నెయ్యి, చేపలు వంటి సంతృప్తికర కొవ్వును అందించే ఆహారాన్ని రోజువారీ డైట్లో చేర్చుకోవాలి. ఇవి మీ చర్మాన్ని యవ్వనంగా, అందంగా కనిపించేందుకు దోహదం చేస్తాయి. ► బద్ధకం వదిలి కాసేపు శరీరానికి శ్రమ కల్పించాలి. యోగా, ఎక్సర్సైజ్ ఏదైనా సరే కాసేపు వ్యాయామాన్ని చేయండి. బయట చలిగా ఉంది.. చేయలేమని చేతులెత్తేయకుండా కనీసం ధ్యానమైనా చేయాలి. ఇది మీ ఆందోళనల నుంచి బయటకు తెచ్చి ప్రశాంతతను చేకూరుస్తుంది. ► గ్లిజరిన్‌లో నిమ్మరసం కలిపి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని ప్రతిరోజు ఓ మాయిశ్చరైజర్‌లా అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ముఖానికి అప్లై చేసిన గంట తర్వాత కడిగేసుకుంటే చర్మం సున్నితంగా, కాంతివంతంగా నిగనిగలాడుతుంది. -
మృతుడి చర్మం సేకరించి... కాలిన రోగికి అంటించి
సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో మొదటిసారి ఒక చనిపోయిన వ్యక్తి నుంచి చర్మం సేకరించి కాలిన గాయాలతో బాధ పడుతున్న రోగికి అమర్చిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని గుంటూరుకు చెందిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ జీఎస్ సతీష్‌కుమార్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 18 రోజుల క్రితం తొడ, ఇతర భాగాల వద్ద చర్మం కాలి తమ వద్దకు చికిత్స కోసం వచ్చారన్నారు. సాధారణంగా చర్మం కాలిన వారికి వారి శరీరంలోని తొడ, కాలు, చేయి, పొట్ట ఇతర శరీర భాగాల నుంచి చర్మం సేకరించి కాలినచోట అతికించి ఆపరేషన్ చేస్తామన్నారు. తమ వద్దకు వచ్చిన వ్యక్తికి 30 శాతం కాలిన గాయాలు ఉండటంతో పాటుగా చర్మాన్ని సేకరించేందుకు వీలు కుదరకపోవటంతో చనిపోయిన వారి నుంచి చర్మాన్ని( కెడావర్) సేకరించి అమర్చేందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ముంబై లోని నేషనల్ సెంటర్ నుంచి నిల్వ ఉంచిన చర్మాన్ని సేకరించి ఐదు రోజుల క్రితం కెడావర్ గ్రాఫ్ట్ ద్వారా ఆపరేషన్ చేసి చర్మం అతికించామన్నారు. చర్మాన్ని సేకరించి స్కిన్ బ్యాంక్‌లో ఐదేళ్ల వరకు నిల్వ ఉంచుకోవచ్చని తెలిపారు. స్కిన్ బ్యాంక్ ఉంటే కాలిన గాయాల వారు చాలా త్వరగా కోలుకుంటారని, చనిపోయిన వారి నుంచి కళ్లు, కిడ్నీలు, గుండె సేకరించినట్టుగానే చర్మాన్ని కూడా సేకరించి కాలిన గాయాలవారి ప్రాణాలు కాపాడవచ్చని డాక్టర్ సతీష్‌కుమార్ తెలిపారు. -
అవాంఛిత రోమాల లేజర్ చికిత్సతో చర్మంపై దుష్ప్రభావం ఉంటుందా?
నా వయసు 20 ఏళ్లు. నాకు ముఖంపైన కొన్నిచోట్ల రోమాలు ఉండి అసహ్యంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి అవాంఛిత రోమాలకు లేజర్ చికిత్స గురించి విన్నాను. నేను ఒకవేళ లేజర్ చికిత్స తీసుకుంటే అది నా చర్మంపై ఏదైనా ప్రతికూల ప్రభావం చూపుతుందా? లేజర్ చికిత్స వల్ల ఇతరత్రా ఏమైనా సైడ్ఎఫెక్ట్స్ అంటే శాశ్వతమైన దుష్ప్రభావాలు ఏవైనా ఉంటాయా? నాకు కాస్తంత వివరించండి. అవాంఛిత రోమాలను తొలగించడానికి వాడే లేజర్ చికిత్సలో అందుకు నిర్దేశించిన ఒక నిర్దిష్టమైన వేవ్‌లెంగ్త్‌లో వాటిని వాడటం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల కేవలం రోమాల్లోని కణాలు, చర్మంలోని కొన్ని నిర్దిష్టమైన కణాలు మాత్రమే ప్రభావితమవుతాయి. మరే ఇతర భాగాలూ దీనివల్ల ప్రభావితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకు అవసరం లేని రోమాలకు మాత్రమే లేజర్ ప్రభావం పరిమితమవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు లేజర్ చికిత్స తీసుకోదలిస్తే దీని గురించి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా తీసుకోవచ్చు. -
మెడ మీద నల్లబడుతోంది..?
నా వయసు 38 ఏళ్లు. వృత్తిరీత్యా నాకు బయట ఎక్కువగా తిరగాల్సిన పని ఉంటుంది. ఇటీవల నా మెడమీద, నుదురు,నడుము మీద విపరీతంగా నల్లబడుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి వివరించండి. మీరు ఎదుర్కొంటున్న కండిషన్‌ను ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటారు. ఈ కండిషన్ ఉన్నవారిలో మెడ, నుదురు వంటి చోట్ల నల్లబడటంతో పాటు అక్కడ చర్మం ఒకింత దళసరిగా కూడా మారుతుంది. సాధారణంగా ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. తక్కువ వ్యవధిలో ఎక్కువగా బరువు పెరగడం, కొన్ని హార్మోన్ల అస్తవ్యస్తతో ఇలా జరుగుతుంది. కొందరిలో కొన్ని రకాల మందులు వాడినా కూడా ఈ సమస్య రావచ్చు. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, ఏ కారణాల వల్ల ఇలా జరుగుతుందో తెలుసుకుని, అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోండి. టీవీ యాడ్స్‌లోని కాస్మటిక్స్ వాడమంటారా? నా వయసు 20 సంవత్సరాలు. నా ముఖం విషయంలో నాకు ఎలాంటి సమస్యా లేదు. ఎలాంటి ఫిర్యాదులూ లేవు. నేను ఎలాంటి క్రీమ్స్ రాయను. అయితే టీవీ యాడ్స్ చూసినప్పుడు నేను కూడా ఏవైనా క్రీమ్స్ రాస్తే మంచిదా అన్న భావం కలుగుతోంది. వాటివల్ల ఏమైనా సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయా అన్న ఆందోళన కూడా ఒక్కోసారి కలుగుతోంది. నాకు తగిన సలహా చెప్పండి. మీ ముఖం, చర్మం విషయంలో ఎలాంటి సమస్యా లేదంటున్నారు కాబట్టి మీరు టీవీ యాడ్స్ వలలో పడకుండా... మీ చర్మాన్ని కాపాడుకోడానికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. సూర్యకిరణాల దుష్ప్రభావం నుంచి కాపాడుకోడానికి మీరు డాక్టర్ సూచించిన సన్‌స్క్రీన్ వాడితే చాలు. అలాగే ముఖాన్ని శుభ్రపరచుకోడానికి సోప్ ఫ్రీ క్లెన్సర్ వాడండి. ఇక చర్మం పొడిబారకుండా ఉండేందుకు మాయిష్చరైజర్ ఉపయోగించండి. స్విమ్మింగ్ తర్వాత మాడుపై దురద! నా వయసు 20 ఏళ్లు. నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం. ఈ మధ్య స్విమ్మింగ్ చేసిన తర్వాత మాడు బాగా దురదగా ఉంటోంది. చర్మం కూడా పొడిబారినట్లు నల్లగా మారుతోంది. ఎందుకిలా జరుగుతోంది? స్విమ్మింగ్‌పూల్‌లో శానిటైజింగ్ కోసం కొన్ని రసాయనాలు (ఉదాహరణకు క్లోరిన్ వంటివి) వాడుతుంటారు. ఆ రసాయనాలు కొంతమందికి సరిపడవు. దాంతో అలర్జీలా వస్తుంటుంది. మరికొంతమందిలో చర్మం పొడిబారడం, మాడుపైన దురదలు రావడం మామూలే. మీరు స్విమ్మింగ్‌కు వెళ్లేముందు డాక్టర్ సూచించిన మెడికేటెడ్ మాయిష్చరైజర్ వాడితే, ఈ రసాయనాల ప్రభావం చర్మంపై పడకుండా చూసుకోవచ్చు. ఔట్‌డోర్ స్విమ్మింగ్‌పూల్స్‌లో ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు స్విమ్మింగ్ చేసినట్లయితే వాటర్ రెసిస్టెంట్ సన్‌స్క్రీన్ ఎస్పీఎఫ్ 50 ఉన్నది వాడటం సముచితం. ఇలా చేయడం వల్ల చర్మాన్ని సూర్యకిరణాల నుంచి సంరక్షించుకోవచ్చు. మాడు భాగం అంటే స్కాల్ప్‌కు స్విమ్మింగ్‌పూల్‌లోని నీళ్లు తగలకుండా ఉండేందుకు క్యాప్ వాడండి. అంతేగాక మైల్డ్ మెడికేటెడ్ షాంపూ అండ్ కండిషనర్ వాడటం ద్వారా జుట్టు పొడిబారకుండా కాపాడుకోవచ్చు. డాక్టర్ సుభాషిణి జయం, చీఫ్ మెడికల్ కాస్మటాలజిస్ట్, ఎన్ఛాంట్ మెడికల్ కాస్మటాలజీ క్లినిక్, శ్రీనగర్‌కాలనీ, హైదరాబాద్ -
హస్తి స్తుతి
నేతి బీరను ఆయుర్వేదంలో హస్తి పర్ణ అంటారు. మెత్తగా జిగురు కలిగి ఉంటుంది కాబట్టి ఇది నేతి బీర అయ్యింది. ‘నేతి బీరలో నెయ్యి చందం’ అని సామెత. నేతి బీరలో నెయ్యి లేకపోవచ్చు కాని చాలా ఆరోగ్య హేతువులున్నాయి. ఇది రక్తాన్ని శుభ్ర పరుస్తుంది. చర్మాన్ని మెరిపిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. కనుక నేతి బీర తినండి. చేసే మేలును స్తుతించండి. నేతి బీరకాయ గుత్తి కూర కావలసినవి: నేతి బీరకాయలు – అర కేజీ; ఉల్లి పేస్ట్ – పావు కప్పు; టొమాటో పేస్ట్ – పావు కప్పు; వేయించిన పల్లీల పొడి – 2 టేబుల్ స్పూన్లు; వేయించిన నువ్వుల పొడి – 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము – పావు కప్పు; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 6; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టేబుల్ స్పూను; నూనె – తగినంత. తయారీ: ►నేతి బీరకాయలను శుభ్రంగా కడిగి తొక్కు తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా, మధ్యలో గుత్తిగా వచ్చేలా తర గాలి ►ఒక పాత్రలో ఉల్లి పేస్ట్, టొమాటో పేస్ట్, పల్లీ పొడి, నువ్వుల పొడి, కొబ్బరి తురుము, మిరప కారం, ఉప్పు వేసి ముద్దలా కలపాలి ►స్టౌ మీద పాన్‌లో నూనె వేసి కాచాలి ►ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, మినప్పప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి దోరగా వేయించాక, పసుపు జత చేసి దింపేయాలి ►గుత్తులుగా తరిగిన బీరకాయలోకి మసాలా మిశ్రమం స్టఫ్ చేసి, కాగుతున్న నూనెలో వేయాలి ►బాగా ఉడికిన తరవాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. నేతి బీరకాయ కొత్తిమీర పచ్చడి కావలసినవి: నేతి బీరకాయ – 1; కొత్తిమీర – అర కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 3; పచ్చి మిర్చి – 4; జీలకర్ర – ఒక టీ స్పూను; చింతపండు గుజ్జు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత. పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; పసుపు – చిటికెడు; ఎండు మిర్చి – 8; కరివేపాకు – రెండురెమ్మలు. తయారీ: ►నేతి బీరకాయను శుభ్రంగా కడిగి, పల్చగా తొక్క తీసేయాలి (లేతగా ఉంటే తొక్క తీయక్కర్లేదు) ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పచ్చి మిర్చి తరుగు, నేతి బీరకాయ ముక్కలు, వెల్లులి రేకలు వేసి సుమారు ఐదు నిమిషాలు పాటు ఉడికించాలి ►కొత్తిమీర, చింతపండు గుజ్జు జత చేసి, మిశ్రమం బాగా మెత్తగా అయ్యేవరకు కలుపుతూ ఉడికించాలి ►జీలకర్ర జత చేసి వేయించి దింపి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, సెనగ పప్పు, పసుపు, కరివేపాకు వేసి దోరగా వేయించి దింపి, సిద్ధంగా ఉన్న పచ్చడికి జత చేయాలి ►వేడివేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. నేతి బీరకాయ బజ్జీ బజ్జీకావలసినవి: నేతి బీర కాయ – 1; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; చాట్ మసాలా – 3 టీ స్పూన్లు పిండి కోసం: సెనగ పిండి – ఒక కప్పు; బియ్యప్పిండి – 4 టీ స్పూన్లు; అల్లంవెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – అర టీ స్పూను; నీళ్లు – తగినన్ని; తినే సోడా – పావు టీ స్పూను. తయారీ: ►బీరకాయలను శుభ్రంగా కడిగి, సన్నగా చక్రాలుగా తరిగి పక్కన ఉంచాలి ►ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉప్పు, మిరప కారం, తినే సోడా, నీళ్లు పోసి బజ్జీల పిండి మాదిరిగా కలపాలి ►స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక, తరిగి ఉంచుకున్న నేతి బీరకాయ చక్రాలను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►చాట్ మసాలా చల్లి వేడివేడిగా అందించాలి. నేతి బీరకాయ వడల కూర కావలసినవి: నేతిబీర కాయలు – అర కేజీ; మసాలా వడలు – 5; నూనె – అర కప్పు; తాలింపు గింజలు – రెండు టీ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు – 6; కరివేపాకు – రెండు రెమ్మలు; తరిగిన పచ్చి మిర్చి – 5; ఉల్లి తరుగు – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను. తయారీ: ►నేతిబీరకాయలను శుభ్రంగా కడిగి, తొక్కు తీసి, ముక్కలుగా కట్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక తాలింపు గింజలు వేసి బాగా వేయించాలి ►వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు జత చేసి మరోమారు కలపాలి ►పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలియబెట్టాలి ►నేతి బీరకాయ ముక్కలు జత చేసి బాగా కలిపి మూత ఉంచి, మెత్తబడేవరకు ఉడికించాలి ►కొన్ని వడలను చిన్న చిన్న ముక్కలుగా చేసి, ఉడుతుకుతున్న కూరకు జత చేయాలి ►మరి కొన్ని వడలను మెత్తగా చేసి ఆ పొడిని కూర కు జత చేయాలి మిరప కారం వేసి బాగా కలిపి మూత ఉంచి ఉడికించి దింపేయాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. నేతి బీరకాయ టొమాటో కర్రీ కావలసినవి: నేతి బీర కాయ ముక్కలు – రెండు కప్పులు; టొమాటో తరుగు – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చిమిర్చి – 4; కరివేపాకు – రెండు రెమ్మలు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4; ఇంగువ – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; నూనె – తగినంత. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, పసుపు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ►ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►టొమాటో తరుగు వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి ►నేతి బీర కాయ ముక్కలు జత చేసి బాగా కలిపి మూత ఉంచాలి ►ఉప్పు వేసి మరోమారు కలిపి, తడి అంతా ఇంకిపోయే వరకు ఉడికించి దింపేయాలి ►అన్నంలోకి, రోటీలలోకి రుచిగా ఉంటుంది. నేతి బీరకాయ నువ్వుల మసాలా కూర కావలసినవి: నేతి బీర కాయలు – పావు కేజీ; ఉల్లి తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 2 నూనె – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నువ్వుల మసాలా కోసం: వేయించిన నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు; బియ్యం – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 2; పాలు – ఒక టేబుల్ స్పూను తయారీ: ►నేతి బీరకాయలను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి ►మిక్సీలో నువ్వులు, బియ్యం, ఎండు మిర్చి వేసి, పాలు జత చేసి మెత్తగా ముద్దలా చేసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ►ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►నేతి బీర కాయ ముక్కలు వేసి బాగా కలిపి, తగినంత ఉప్పు జత చేసి మూత పెట్టి ఉడికించాలి ►బాగా మెత్త పడిన తరవాత నువ్వుల మసాలా మిశ్రమం వేసి మరోమారు కలియబెట్టి, రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి. -
చలికి పాలు
చలికాలంలో చర్మం పొడిబారడం సహజం. దీనిని నివారించడానికి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో భాగంగా పొడి చర్మంతో బాధపడేవారు అందుబాటులో లభించే సాధనాలతో, ఈ కింది మాస్క్ తయారుచేసుకుని ఉపయోగిస్తే చాలు... మెరిసే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. మిల్క్ మాస్క్: పాలపొడి – టీ స్పూన్; బాదం పేస్ట్ – టేబుల్ స్పూన్; అలోవెరా జెల్ –టేబుల్ స్పూన్; తేనె – టేబుల్ స్పూన్; ఎసెన్షియల్ ఆయిల్ – రెండు చుక్కలు. పై పదార్థాలన్నీ కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగెయ్యాలి. -
పెళ్లికి మేకప్!
పెళ్లి కూతురు మేకప్, అలంకరణ మిగతావారికన్నా భిన్నంగా ఉంటుంది. నిద్రలేమి, ఒత్తిడి కారణంగా కళ్ల కింద చర్మం ఉబ్బు ఉంటే తగ్గడానికి గోరువెచ్చని టీ బ్యాగ్‌తో కొద్దిసేపు కాపడం పెట్టాలి. మేకప్ చేసుకునేముందు ఫేస్ వాష్‌తో ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. ►ఏ తరహా స్కిన్ షేడ్ నప్పుతుందో మేనిచాయను బట్టి ఎంపిక చేసుకోవాలి. అలాగే సరైన ఫౌండేషన్, ప్రైమర్, కన్సీలర్ను ఎంచుకోవాలి. ►ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ►బేస్‌గా ప్రైమర్‌ని ముఖమంతా రాయాలి. దీంతో మొటిమల వల్ల అయిన మచ్చలు, ఫైన్ లైన్స్, ముడతలు కనిపించవు. ఎక్కువ సమయమైనా మేకప్ పాడవకుండా ఉంటుంది. అలాగే ఫౌండేషన్ ప్యాచులుగా చర్మానికి పట్టే సమస్య కూడా ఉత్పన్నం అవదు. ►ప్రైమర్ రాసిన తర్వాత ఫౌండేషన్‌ని అప్లై చేయాలి. అలాగే కంటికి ఐ షాడోస్ ఉపయోగించాలి. ►చామన చాయ గలవారు బుగ్గలకు బ్రోంజర్ని అప్లై చేయాలి. ►ఈ కాలం త్వరగా పెదాలు పొడిబారే అవకాశం ఉంటుంది కాబట్టి పెదాలకు లిప్‌స్టిక్ వాడిన తర్వాత లిప్‌గ్లాస్‌ను ఉపయోగించాలి. పెదాలు సన్నగా ఒంపుతిరిగి కనిపించాలంటే లిప్ పెన్సిల్‌తో ఔట్లైనర్ గీసి ఆ తర్వాత లిప్‌స్టిక్ వేయాలి. ►డార్క్ ఐ లైనర్‌తో కళ్లను తీర్చిదిద్దాలి. అలాగే కనుబొమలను కూడా! ►మెరుపుల కోసం ఏ ఇతర గ్లిటర్స్ని ఉపయోగించకపోవడమే మంచిది. ►ముఖంలో కనిపించేవి ముందు పెదాలు, కళ్లు మాత్రమే. అందుకే లిప్‌స్టిక్, ఐ షాడో, మస్కారాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ►షేడ్స్, గ్లిటర్స్ అంటూ అతిగా మేకప్ అయితే మిగతా అలంకరణ కూడా అంతగా నప్పదు. -
పాప ఒంటి మీద పులిపిర్లు
మా అమ్మాయికి పదకొండేళ్లు. ఆమెకు ముఖం మీద, దేహం మీద అక్కడక్కడా చిన్న చిన్న పులిపిరి కాయల్లాంటివి వస్తున్నాయి అవి రోజురోజుకూ పెరుగుతుండటంతో మాకు చాలా ఆందోళనగా ఉంది. మా పాపకు ఇవి ఎందుకొస్తున్నాయి? పాప విషయంలో మాకు సరైన సలహా ఇవ్వండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే... మీ పాపకు ఉన్న కండిషన్ ములస్కమ్ కంటాజియోజమ్ కావచ్చని అనిపిస్తోంది. ఇది వైరస్ వల్ల వచ్చే ఒక రకం చర్మవ్యాధి. ఇది ముఖ్యంగా రెండు నుంచి 12 ఏళ్ల పిల్లల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. చర్మానికి చర్మం రాసుకోవడంతో పాటు... అప్పటికీ ఈ వ్యాధి కలిగి ఉన్నవారి తువ్వాళ్లను మరొకరు ఉపయోగించడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాళ్ల దేహం నుంచి మళ్లీ వాళ్ల చర్మం మీద మరోచోటికి వ్యాపించడం కూడా చాలా సాధారణం. దీన్నే సెల్ఫ్ ఇనాక్యులేషన్ అంటారు. అలర్జిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ లీజన్స్ (పులిపిరుల్లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే... బాహుమూలాలు, పొత్తికడు పు కింద (గ్రోయిన్), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుండవచ్చు. చికిత్స : ఇవి తగ్గడానికి కొంతకాలం వేచిచూడండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు క్రయోథెరపీ, క్యూరటాజ్ వంటి ప్రక్రియలతో వీటికి చికిత్స చేయవచ్చు. ఇక దీనితో పాటు కొన్ని ఇమ్యునలాజికల్ మెడిసిన్స్.... అంటే ఉదాహరణకు ఇ మిక్యుమాడ్ అనే క్రీమ్‌ను లీజన్స్ ఉన్న ప్రాం తంలో కొన్ని నెలల పాటు పూయడం వల్ల చా లా ఉపయోగం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పైన పేర్కొన్న ఇతర ప్రక్రియల (ఉదా: క్రయోథెరపీ వంటివి)తో పాటు ఇమిక్యుమాడ్ కలిపి ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం ఉం టుంది. మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి, చికిత్సను కొనసాగించండి. బాబుకు మాటిమాటికీ జలుబు మా బాబుకు పన్నెండేళ్లు. తరచూ జలుబు చేస్తుంటుంది. చల్లటి పదార్థాలు, కూల్‌డ్రింక్స్ వద్దన్నా మానడు. పైగా ఇప్పుడు చలి బాగా పెరగడంతో... తనకు ఊపిరి సరిగ్గా ఆడటం లేదని తరచూ కంప్లైంట్ చేస్తున్నాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు రాసి ఇచ్చారుగానీ ప్రయోజనం కనిపించడం లేదు. బాబుకు ఇలా తరచూ జలుబు రావడం తగ్గడానికి మార్గం చెప్పండి. మీ బాబుకు ఉన్న కండిషన్‌ను అలర్జిక్ రైనైటిస్ అంటారు. అందులోనూ మీ బాబుకు ఉన్నది సీజనల్ అలర్జిక్ రైనైటిస్‌గా చెప్పవచ్చు. పిల్లల్లో సీజనల్ అలర్జిక్ రైనైటిస్ లక్షణాలు ఆరేళ్ల వయసు తర్వాత ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న పిల్లల్లో జలుబు, ముక్కు దురద, కళ్ల నుంచి నీరు కారడం, ముక్కు దిబ్బడ, ఊపిరి తీసుకోవడంలో కష్టం వంటి లక్షణాలు చూస్తుంటాం. ఈ సమస్య చాలా సాధారణం. దీనికి నిర్దిష్టమైన కా రణం చెప్పలేకపోయినప్పటికీ వంశపారపర్య ం గా కనిపించడంతో పాటు వాతావరణ, పర్యావర ణ మార్పులు కూడా ఇందుకు దోహదం చేస్తాయి. పూలమొక్కలు, దుమ్ము, ధూళి, పుప్పొడి, రంగులు, డిటర్జెంట్స్ వంటివి శరీరానికి సరిపడకపోవడంతో వంటివి ఈ సమస్యకు ముఖ్య కారణాలు. మీ బాబుకు యాంటీహిస్టమైన్స్, ఇమ్యునోమాడ్యులేటర్స్, ఇంట్రానేసల్ స్టెరాయిడ్ స్ప్రేస్ వాడటం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. మీ అబ్బాయి విషయంలో ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. చల్లటి పదార్థాలు తగ్గించడం, సరిపడనివాటికి దూరంగా ఉంచడం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
మొటిమలు పోవడం లేదా?
►ముఖం జిడ్డుగా ఉంటే మొటిమల సమస్య పెరుగుతుంది. ఆపిల్ స్లైస్‌తో ముఖమంతా మృదువుగా రబ్ చేసి, పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపైన జిడ్డు తగ్గి, చర్మం తాజాగా కనిపిస్తుంది. ►మొటిమల సమస్య బాధిస్తుంటే వేరుశనగ నూనె, నిమ్మరసం సమపాళ్లలో తీసుకొని ముఖానికి అప్లై చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజూ చేస్తే బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గుతాయి. ►వెనిగర్‌లో ఉప్పు కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని మొటిమల మీద రాసి, మృదువుగా రబ్ చేయాలి. ఇరవై నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ►తేనెలో దాల్చినచెక్క పొడి కలపాలి. పడుకునేముందు ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాయాలి. మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా రెండువారాల పాటు చేస్తే మొటిమలు తగ్గుతాయి. -
దాహంగా లేదా? అయినా తాగాలి
వర్షాకాలం చర్మ సమస్యలు తరచూ బాధిస్తుంటాయి. అయితే వంటగదిలో వాడే కొన్ని దినుసులు, పదార్థాలతో చర్మం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అవి ఏమిటో చూద్దాం. ►వర్షంలో తడిసి ఇంటికి రాగానే మంచి నీటితో ముఖాన్ని తప్పక శుభ్రపరుచుకోవాలి. రాత్రి పడుకునేముందు రోజ్‌వాటర్‌ని దూదితో అద్దుకొని ముఖమంతా తుడిచి, నీటితో కడిగేయాలి. ఈ జాగ్రత్తల వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడి చర్మ కాంతి పెరుగుతుంది. ►ఈ కాలం ఫౌండేషన్, పౌడర్లను ఎంత తక్కువ వాడితే చర్మానికి అంత మంచిది. నూనె శాతం ఎక్కువ ఉండే మాయిశ్చరైజర్లను కూడా తగ్గించాలి. తరచూ నీళ్లలో తడవడం వల్ల చర్మంపై పోర్స్ (రంధ్రాలు) తెరుచుకుంటాయి. ఇలాంటప్పుడు ఫౌండేషన్, పౌడర్ పోర్స్‌లోకి వెళ్లిపోయి ముఖం జిడ్డుగా మారే అవకాశం ఉంది. దీని వల్ల మొటిమలు, యాక్నె సమస్యలు తలెత్తుతాయి. ►టొమాటో రసం ముఖానికి, చేతులకు రాసుకుని ఆరిన తర్వాత శుభ్రపరుచుకుంటే చర్మంపై జిడ్డు తగ్గుతుంది. పైనాపిల్, యాపిల్, బొప్పాయి, పుచ్చకాయ గుజ్జు లేదా జ్యూస్‌లను కూడా ఈ విధంగా వాడుకోవచ్చు. ►ఓట్స్‌లో తేనె, పెరుగు, ఆరెంజ్ జ్యూస్ కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేసి ముఖానికి చేతులకు, పాదాలకు ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మకాంతి పెరుగుతుంది. ►తేనె, ఆలివ్ ఆయిల్, పెరుగు సమపాళ్లలో కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసుకొని పదినిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మం పొడిబారదు. పొడి చర్మానికి ఇది మేలైన ప్యాక్. పొడి చర్మం గలవారు బాదంపప్పు పొడి, తేనె కలిపి కూడా వాడుకోవచ్చు. జిడ్డు చర్మం గలవారైతే ఆరెంజ్ ఆయిల్, రోజ్ వాటర్ సమపాళ్లలో కలిపి ప్యాక్ వేసుకోవాలి. ►ఈ కాలం రకరకాల అలర్జీలు తలెత్తుతుంటాయి. ఇవి చర్మం సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. కూరగాయలు, పండ్లు గల సమతుల ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. ►ఈ కాలం దాహంగా అనిపించదు. కానీ, రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తప్పక తీసుకోవాలి. తగినన్ని నీళ్లు తాగడం వల్ల చర్మం పొడిబారడం, ముడతలు పడడం సమస్య దరిచేరదు. చర్మం పొడిబారి జీవం లేకుండా ఉంటే పైపైన మాయిశ్చరైజర్ వాడాలి. జిడ్డు చర్మం అయితే రోజుకు రెండు సార్లు తప్పక శుభ్రపరుచుకోవాలి. -
పెదవి పై నలుపు రంగు వస్తుంటే?!
కొందరికి హార్మోన్లలో మార్పుల వల్ల పై పెదవి మీద వెంట్రుకలు వస్తుంటాయి. లేదంటే పెదవి పై చర్మం నలుపుగా అవుతుంటుంది. ఈ సమస్యకు విరుగుడు ఉంది. ►థ్రెడింగ్, వ్యాక్సింగ్ వంటివి మేలైన పద్ధతులు. వీటితోపాటు.. చర్మం నలుపు తగ్గి, సాధారణ రంగులోకి రావాలంటే.. టొమాటో గుజ్జు రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. టొమాటో సహజసిద్ధమైన బ్లీచ్లాగ పనిచేసి అవాంఛిత రోమాలను, నలుపును తగ్గిస్తుంది. ►టీ స్పూన్ తేనెలో అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి రాయాలి. పదిహేను నిమిషాలు ఉంచి, వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ►పసుపు, పాలు కలిపి చిక్కటి మిశ్రమం తయారు చేసుకోవాలి. దీనిని పెదవిపై నలుపుగా ఉన్న ప్రాంతంలో రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. ►కార్న్ ఫ్లోర్, గుడ్డులోని తెల్లసొన, పంచదార కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని రాసి, ఆరిన తర్వాత కడిగేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పై పెదమి మీద వచ్చే నలుపు, అవాంఛిత రోమాల సమస్య తగ్గుతుంది. ఇంటిప్స్ ►కూరగాయలు తరిగే కటింగ్ బోర్డ్ సరిగ్గా శుభ్రపడకపోతే వాసన వస్తుంటుంది. నిమ్మముక్కతో కటింగ్ బోర్డ్‌ను బాగా రుద్ది, అరగంటపాటు ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి. ►వంటగదిని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన వస్తూనే ఉందంటే సింకు దగ్గర పెట్టే చెత్తబుట్టను పట్టించుకోవడం లేదని అర్ధం. తగినన్ని నీళ్లలో బేకింగ్ సొడా కలిపి, ఆ మిశ్రమాన్ని చెత్తబుట్ట అడుగున పోయాలి. బ్రష్‌తో చెత్తబుట్ట లోపలి భాగాన్ని రుద్ది, గంటపాటు వదిలేయాలి. తర్వాత కడగాలి. మూడు టీ స్పూన్ల వెనీలా ఎసెన్స్ లీటర్ వేడి నీళ్లలో కలిపి చెత్తబుట్ట లోపలి భాగాన్ని శుభ్రపరచాలి. వారానికి ఒకసారైనా ఈ విధంగా చేస్తూ ఉంటే దుర్వాసన దూరం అవుతుంది. ►ఎంత శుభ్రపరిచినా సమస్యగా అనిపించేది రిఫ్రిజరేటర్. ఫ్రిజ్ షెల్ఫ్‌ల్లో పదార్థాలు పడిపోయి ఫంగస్ చేరుతుంటుంది. వారానికి ఒకసారైనా వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీళ్లతో ఫ్రిజ్ లోపలి భాగాన్ని తుడవాలి. ఒక డబ్బాలో కొద్దిగా బేకింగ్ సోడా, బొగ్గు లేదా కాఫీ గింజలు వేసి ఫ్రిజ్ లోపల ఒక మూలన ఉంచాలి. -
బ్యూటిప్స్
మృదువైన చర్మం కోసం... ►పెదవులు పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అలొవెరా జెల్ చర్మం పగుళ్లను నివారిస్తుంది. పొడిబారిన పెదవులకు అలొవెరా జెల్‌ని లిప్‌బామ్‌లా రాసుకోవాలి. లేదా రోజ్‌వాటర్‌లో గ్లిజరిన్ కలిపి, పడుకునేముందు పెదవులకు రాసుకోవాలి. పెదవుల చర్మం మృదువుగా మారుతుంది. ►పూలలోని పుప్పొడి, నల్ల నువ్వులు, పసుపుకొమ్ము, బార్లీ గింజలు సమపాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని, తగినన్ని నీళ్లు కలిపి, ముఖానికి, శరీరానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతం అవుతుంది. ►స్నానానికి ముందు టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, మసాజ్ చేయాలి. ఇలా చేస్తే పొడిబారే చర్మం మృదువుగా తయారవుతుంది. ►చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. ఇందుకోసం.. కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దనా చేయాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. -
పగుళ్లకు కాంప్లిమెంట్స్
కవులకేం పన్లేదు. ఊరికే కూర్చొని కవితలు అల్లేస్తుంటారు. పాదాల్ని పద్మాలు అంటారు. తమలపాకులు అంటారు. అయినా పనీపాట ఉన్న స్త్రీల పాదాలు ‘పద్మాలంత సున్నితంగా, తమలపాకులంత కోమలంగా’ ఎలా ఉంటాయి చెప్పండి! కానీ కవుల భావుకతను మరీ అంత తీసిపడేయనక్కర్లేదు. ఒక ఆలోచనైతే కలిగించారు కదా.. పాదాలు మృదువుగా ఉంటే అందంగా ఉంటాయని! అలా అందంగా, శుభ్రంగా పాదాలను ఉంచుకోడానికి ప్రయత్నిస్తే పాపం కవుల కల్పనను గౌరవించినవాళ్లమూ అవుతాం, మనకూ కొన్ని కాంప్లిమెంట్స్ వస్తాయి. ఇప్పుడైతే పగుళ్ల పాదాలను చిన్న టిప్‌తో అందంగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. ఏం చేయాలి? బాగా పండిన అరటిపండ్లు రెండు తీసుకోండి. చక్కగా గుజ్జులా చెయ్యండి. కాస్త పచ్చిగా, పచ్చగా ఉన్న పండ్లయినా ఓకే అనుకోకండి. పూర్తిగా పండని అరటిపండ్లలో ఆసిడ్స్ ఉంటాయి. అవి చర్మంతో దురుసుగా ప్రవర్తిస్తాయి. ఇప్పుడు ఆ పండిన అరటిపండ్ల గుజ్జును మెల్లిగా పాదమంతా రుద్దండి. కాలి వేళ్లు, వేళ్ల సందులకు కూడా గుజ్జును చేర్చి, చిన్న మసాజ్‌లాంటిది ఇవ్వండి. అలా రెండు పాదాలకూ రాసి, 20 నిముషాల పాటు అలాగే ఉంచేయండి. 20 నిముషాల తర్వాత శుభ్రమైన నీటితో (చల్లనివి గానీ, గోరు వెచ్చనివి గానీ) కడిగేయండి. ఎన్నిసార్లు ? పడుకోబోయే ముందు ప్రతి రోజూ చెయ్యాలి. అలా కనీసం రెండు వారాలు లేదా ఫలితాలతో మీరు సంతృప్తి చెందేవరకు చెయ్యాలి. చేస్తే ఏమౌతుంది? అరటిపండు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. అంటే చర్మాన్ని తేమగా ఉంచే స్వభావం గలది. అరటిపండులో ఉండే విటమిన్ ఎ, బి6, సి లలో చర్మాన్ని మెత్తబరిచి, పొడిబారకుండా ఉంచే గుణాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి పాదాలను మృదువుగా మార్చేస్తాయి. మడమల పగుళ్లకు ఇది తిరుగులేని మంత్రం. -
చర్మం కాంతివంతం ఇలా...
తేనె, చక్కెర సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి కళ్ల చుట్టూ మినహాయించి, ముఖానికి, మెడకు పట్టించి, వలయాకారంగా మర్దన చేయాలి. ఇది చర్మానికి నునుపుదనం తీసుకురావడంతోపాటు మృతకణాలను తొలగిస్తుంది. మొటిమలతో గుంతలు పడిన చర్మానికి తరచుగా ఈ ట్రీట్మెంట్ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ♦ రెండు టేబుల్స్పూన్ల టొమాటో జ్యూస్, 50 గ్రా.ల ఓట్స్, 25 గ్రా.ల పెరుగులో కప్పుడు నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గి చర్మం మృదువుగా కాంతివంతంగా కనిపిస్తుంది. ♦ రెండు టీ స్పూన్ల క్యారెట్ తురుము, టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమానికి రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ చేర్చి దీనితో ముఖాన్ని మృదువుగా రబ్ చేసి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి జీవకాంతి లభిస్తుంది. ♦ రెండు టీ స్పూన్ల తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి అప్లై చేసి వేళ్లతో 20 నిమిషాలపాటు మృదువుగా మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా చేస్తుంటే ముఖంపైన జిడ్డు, మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది. ♦ మూడు టీ స్పూన్ల దోసరసం, రెండు టీ స్పూన్ల అలొవెరా జెల్, టీ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకు పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండవల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి ఈ ప్యాక్ సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది. ♦ బంగాళదుంపని మెత్తగా ఉడకబెట్టి పొట్టు తీయకుండా మెదుపుకోవాలి. దీంట్లో పాలు, కొబ్బరి నూనె జత చేసి పేస్ట్‌లా కలపాలి. మెడపై ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మెడ మీద నలుపు తగ్గి చర్మం కాంతివంతం అవుతుంది. -
పాలు కారే ముఖ సౌందర్యం కోసం సహజ చిట్కాలు
సరైన పద్ధతులలో సరైన సౌందర్య చిట్కాలను వాడటం వలన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. సులువుగా ఇంట్లో లభించే పదార్థాల ద్వారా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు, వీటి వలన చర్మ రక్షణ సుల ం కావడంతోపాటు ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ♦ మీది జిడ్డు చర్మం అయితే అరకప్పు కాచి చల్లార్చిన పాలలో ఒక ఐసుముక్కను వేసి, అది ఆ పాలలో పూర్తిగా కరిగాక పాలలో చిన్న చిన్న దూది ఉండలు వేసి, వాటితో పాలను ముఖానికి పట్టించి, ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఫలితంగా చర్మం పైన ఉండే నూనెలు తొలగి, ముఖచర్మం మృదువుగా... తాజాగా మెరుస్తుంటుంది. ♦ కప్పు పాలలో శుభ్రమైన పలుచటి కాటన్ కర్చీఫ్ లేదా ఏదైనా వస్త్రాన్ని నానబెట్టండి. కాసేపయ్యాక దానిని తీసుకుని కళ్ళు మూసుకొని, ముఖం పైన కప్పుకోండి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగివేయండి. ♦ రెండు మూడు బాగా పండిన టమాటాలను ఉడకబెట్టి, చల్లారాక గుజ్జులా చేయండి. ఆ గుజ్జును కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరచండి, దీనిని ముఖానికి పట్టించి, ఆరాక శుభ్రంగా కడగటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ♦ చర్మాన్ని ఆరోగ్యంగా త్వరగా ప్రకాశవంతంగా మార్చడానికి ఇంట్లో చాలా రకాల సౌందర్య చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. తేనె అందులో మొదటిది. అప్పుడప్పుడు ముఖ చర్మానికి తేనె, పసుపు, చందనం కలిపిన మిశ్రమాన్ని రాస్తుండాలి. వాటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా చర్మం పైన ఉండే మచ్చలకు, మొటిమలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, తేనె చర్మాన్ని మృదువుగా, సున్నితంగా పట్టులా మార్చేస్తుంది. ముఖంపై ఉండే మచ్చల కోసం... ♦ ముఖం మీద నల్లటి మచ్చలు ఉన్నాయా? అయితే ఫ్రిజ్ నుంచి తీసిన తాజా దోసకాయ రసంలో కాటన్ బాల్ లేదా చిన్న నూలు బట్ట ముక్కను ముంచి నల్లటి వలయాల పైన 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచండి. ఇలా కొన్ని రోజులు చేయటం వలన కొంత కాలం తరువాత మీ చర్మం పైన ఉండే మచ్చలు మాయమైపోతాయి. -
ముఖంలోనే జబ్బుల లక్షణాలు
సాక్షి, న్యూఢిల్లీ : ముఖారవిందానికి అధిక ప్రాధాన్యతనిచ్చే మహిళలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోవడమే కాకుండా ముఖానికి వికారంగా మొటిమలు పెరిగిపోతున్నాయంటూ స్కిన్ స్పెషలిస్టుల దగ్గరికి పరిగెత్తుతున్న మహిళల సంఖ్య కూడా పెరిగిపోవడంతో ఇటీవల డెర్మటాలజిస్టుల సంఖ్య కూడా ఏకంగా 200 శాతానికి పెరిగింది. ముఖాన మొటిమలుగానీ, గాయం లాంటి మడతలుగానీ ఊరికే రావట. శరీరంలోని అంతరావయాల్లో కలిగే మార్పులు లేదా లోపాలను ఎత్తిచూపడం కోసం అవి వస్తాయట. ఈ విషయాన్ని చైనా ఆయుర్వేద వైద్యులు ‘ఫేస్ మ్యాపింగ్’ ద్వారా ఎప్పుడో తేల్చి చెప్పారు. కళ్లు పసుపు పచ్చగా మారడాన్ని చూసి ‘జాండిస్’ జబ్బు ఉన్నట్లు వైద్యులు నిర్ధారిస్తున్న విషయం కూడా మనకు తెల్సిందే. అలాగే కుడి బుగ్గ వద్ద చీలినట్లయితే ఊపిరి తిత్తులకు సంబంధించి ఏదో సమస్య ఉన్నట్లు లెక్కట. అలాగే గుండె గురించి ముక్కు, హార్మోన్ల గురించి గడ్డం చెబుతుందట. చైనా ఆయుర్వేద వైద్యుల ఈ నమ్మకాలు నిజమేనని న్యూయార్క్‌కు చెందిన డ్యాన్ హుసు కూడా నిర్ధారిస్తున్నారు. మన ముఖంలోని ప్రతిభాగం మన శరీరంలోని ఒక్కో అవయవానికి ప్రాతినిథ్యం వహిస్తాయని ఆయన చెప్పారు. 1. కనుబొమ్మలుపైన: మొటిమలు వస్తే గాల్ బ్లాడర్, కాలేయానికి సంబంధించిన సమస్య ఉన్నట్లు లెక్క. కొవ్వు పదార్థాలు, శుద్ధి చేసిన ఆహారం తగ్గిస్తే సమస్య పరిష్కారం అవుతుందని డాక్టర్ డ్యాన్ సూచించారు. 2. రెండు కనుబొమ్మల మధ్య: మొటిమలు వస్తే ఎక్కువగా మద్యం, ధూమపానం సేవిస్తున్నట్లు సూచనట. 3. ముక్కుమీద మొటిమలు వస్తే: హృదయం, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య. అంటే ఉప్పు, మసాలా ఆహార పదార్థాలకు దూరంగా ఉండమే కాకుండా బీ విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకోవాలని డాక్టర్ సూచిస్తున్నారు. 4. ఇక ఎడమ బుగ్గ నేరుగా కాలేయానికి ప్రాతినిధ్యం వహిస్తుందట. అక్కడ మొటిమలు వస్తే చల్లటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలట. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలట. 5. ఇక నోరు మనలోని జీర్ణ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తుందట. నోటి దగ్గర మొటిమలు లేదా కురుపులు కనిపిస్తే ఫైబర్, కూర గాయలు ఎక్కువగా తీసుకోవాలట. 6. ముఖం మీది చర్మం శీరరంలోని హార్మోన్లను సూచిస్తుందట. ఒమెగా 3 తీసుకుంటే సమతౌల్యం అవుతాయట. చైనా ఆయుర్వేద వైద్యులు ముఖంలోని మార్పులనుబట్టి శరీరంలోని లోపాలను లేదా జబ్బులను చెప్పి ఉండవచ్చు. న్యూయార్క్‌లోని ఈ డాక్టర్ మాత్రం శరీరంలోని లోపాల వల్ల మొటిమలు వస్తాయని, వాటిని ఎలా నివారించవచ్చో సూచిస్తున్నారు. -
ప్రకృతిసిద్ధంగా శరీర సౌందర్యం
ఆర్గానిక్, నేచురల్, వీగన్, గోగ్రీన్ లాంటి హ్యాష్‌ట్యాగ్స్ ఈమధ్యకాలంలో సోషల్‌మీడియాలో తరచూ కనిపిస్తున్నాయి. ఈ డిజిటల్ ప్రపంచంలో ఇవి ప్రముఖమైన పదాలుగా మారాయి. కారణం అవి పాకశాస్త్రంలోనే కాదు. శరీరసౌందర్యాన్ని పెంపొందించుకోవడంలోనూ ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతకాలంలో ఆరోగ్యవంతంగా జీవించడం, స్థిరమైన జీవన విధానం అనేవి ప్రధానంగా అందర్నీ ప్రభావితం చేస్తున్నాయి. ఇవే శరీర సౌందర్యం విషయంలో కూడా కీలకంగా మారాయి. అందుకే ఎన్ని పరిణామాలు చోటుచేసుకున్నా వినియోగదారులు ఇందుకు ఉపయోగపడే వస్తువుల్ని వినియోగిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ అందరి మదిలో ఉత్పన్నమయ్యే ప్రశ్న ఒక్కటే – మనకు లభిస్తున్న సబ్బులు, సౌందర్య సాధనాలన్నీ స్వచ్ఛమైనవేనా? మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. చర్మం ద్వారా ఎన్నో పోషకాలు మన శరీరం లోపలికి వస్తాయి. అయితే ఎన్నో మంచి పోషకాలతోపాటు, చర్మానికి చెడుచేసే ఎన్నో హానికారక రసాయనాలు కూడా చర్మం ద్వారా లోపలికి వచ్చేస్తుంటాయి. అందుకే అవి వాడేముందు మనం ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో ఏ పదార్ధాలు కలిపారు, ఎలాంటివి ఉపయోగించారో తెలుసుకోవాలని చర్మ సంరక్షణ నిపుణులు సూచిస్తున్నారు. గతంలో మన ఇళ్లలో పసుపు, చందనం, పాలతో స్నానం చేయించేవారు. వాటిని మనం పాతపద్ధతులంటున్నాం. కానీ అవి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌గా మారాయి. సంపూర్ణ చర్మ సంరక్షణ కావాలంటే మనం ఉపయోగించే ఉత్పత్తుల్లో కొన్ని తప్పక ఉండాలి. అవి ఏంటంటే... చందనం: క్రమం తప్పకుండా చందనం ఉపయోగించడం వల్ల చర్మానికి చాలా ఉపయోగాలు. ముఖ్యంగా చందనం బ్యాక్టీరియాను రాకుండా చేస్తుంది. చర్మాన్ని ప్రకాశించేలా చేస్తుంది. ట్యాన్‌ని అరికడుతుంది. అన్నిటికీ మించి మీ చర్మం పొడిబారకుండా చేస్తుంది. దీనివల్ల మీ చర్మంపై ఎలాంటి ముడతలు కన్పించవు. పసుపు: చర్మంపై ఉండే మచ్చలను తొలగించి ముఖం ప్రకాశవంతంగా కన్పించేలా చేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా చేస్తుంది. అన్నిటికీ మించి మొటిమల నివారణకు పసుపుని మించిన ఔషధం లేదు. పసుపు క్రమం తప్పకుండా వాడితే మొటిమలు రావు. కుంకుమ పువ్వు: కుంకుమ పువ్వులో అద్వితీయమైన విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. దీనివల్ల చర్మం పొడిబారకుండా స్వచ్ఛంగా, స్మూత్‌గా తయారవుతుంది. కలబంద: కలబందను అలోవెరా అని కూడా అంటారు. ఇది చర్మంపై ఒక పొరలాగా ఉపయోగపడుతుంది. ఈ లేయర్వల్ల చర్మంపై ఎప్పుడూ తేమ ఉంటుంది. అంతేకాదు ఇందులో ఉన్న యాంటి ఆక్సిడెంట్స్, ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. బాదం పాలు: ఎండ వేడి వల్ల చర్మం పాడవకుండా కాపాడుతుంది. ఈ సహజసిద్ధమైన పదార్ధాలతో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడంతోపాటు చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచుకోవచ్చు. -
చర్మకాంతి పెరగడానికి...
చర్మం పొడిబారుతోంది అంటే సరైన నిద్రకు దూరంగా ఉన్నారని అర్ధం చేసుకోవాలి. రోజూ ఎనిమిది గంటల నిద్ర లేకపోతే కళ్ల కింద వలయాలు ఏర్పడతాయి. ఉదయం, రాత్రి పడుకునే ముందు వేలి కొసలతో తేనె అద్దుకొని కళ్ల కింద ఉబ్బుగా ఉన్న చోట రాయాలి. అలాగే ముఖమంతా తేనె రాసి, మృదువుగా రుద్దాలి. తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే చర్మకాంతి పెరుగుతుంది. ∙రోజూ రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్లో ముంచిన దూదితో ముఖమంతా రాయాలి. అదే ఉండతో కాస్త ఒత్తిడి చేస్తూ మసాజ్‌లా చేయాలి. దీంతో ముఖంపైన దాగున్న దుమ్ము కణాలు, శుభ్రపరిచినా మిగిలిన మేకప్ డస్ట్ సులువుగా వదిలిపోతుంది. తర్వాత ముఖాన్ని ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. -
కామెర్లు ఎందుకొస్తాయి...?
నేను వృత్తిరీత్యా కాంట్రాక్ట్ పనులు చేస్తుండటం వల్ల ఎక్కువగా ఊళ్లు తిరుగుతూ ఉంటాను. ఈమధ్య ఆకలి మందగించింది. నీరసంగా ఉండి ఎక్కువ సమయం నిద్రపోవాలనిపిస్తోంది. జ్వరంగా, అలసటగా ఉంటోంది. అప్పుడప్పుడూ కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. తరచూ ఒళ్లంతా దురదలు కూడా వస్తున్నాయి. ఆసుపత్రికి వెళ్లి చూపించుకుంటే కామెర్లని చెప్పారు. వెంటనే చికిత్స ప్రారంభించాలని కూడా అన్నారు. అసలు కామెర్ల వ్యాధి ఎందుకు వస్తుంది? ఒకసారి వ్యాధికి గురైతే పూర్తిగా తగ్గడం సాధ్యమేనా? నా లివర్‌కు ఏమైనా ప్రమాదం ఉంటుందా? దయచేసి కామెర్ల వ్యాధి గురించి వివరంగా చెప్పండి. చర్మం, కళ్లలోని తెల్లటి భాగం పసుపుపచ్చ రంగుకు మారడమే కామెర్ల (జాండీస్)కు కొండగుర్తు. రక్తంలో బైలిరుబిన్ అనే పదార్థం అధికంగా చేరడం అన్నది ఈ కండిషన్‌కు దారితీస్తుంది. బైలిరుబిన్ అనేది పసుపురంగులో ఉండే ఒక వ్యర్థ పదార్థం. ఎర్రరక్తకణాలలోని హిమోగ్లోబిన్ తొలగిపోయాక మిగిలిపోయే భాగం ఇది. బైలిరుబిన్ పరిమాణం ఎక్కువైనప్పుడు అది చుట్టుపక్కల కణజాలాలోకి చేరి వాటికి పసుపురంగును కలిగిస్తుంది. సాధారణంగా రక్తంలోని బైలిరుబిన్‌ను కాలేయం తొలగిస్తుంటుంది. అది కాలేయానికి చేరగానే అక్కడ దానిపై కొన్ని రసాయనాలు పనిచేస్తాయి. ఆ రసాయన చర్యలతో అది అన్‌కాంజుగేటెడ్ బైలిరుబిన్ అనే పదార్థంగా తయారవుతుంది. కాలేయం దీన్ని పైత్యరసంలోకి పంపిస్తుంది. ఈ జీర్ణరసం ద్వారా ఆహారంలోకి చేరిన బైలిరుబిన్ జీర్ణప్రక్రియ చివరివరకూ కొనసాగి చివరకు మలంతో విసర్జితమవుతుంది. మలానికి రంగు దీనివల్లనే ఏర్పడుతుంది. అనేక కారణాలు, అలవాట్లు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడి కామెర్ల వ్యాధి వస్తుంది. గుర్తించడం ఎలా? సాధారణంగా బయటకు కనిపించేది, అత్యధికులకు తెలిసింది చర్మం, కళ్లు పచ్చగా మారడం. ఇది మొదట తల భాగంతో ప్రారంభించి క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ పచ్చదనం కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా ఈ వ్యాధిలో కనిపిస్తుంటాయి. అవి... దురదలు : చర్మంలో బైల్ సాల్ట్స్ అధికంగా చేరడం వల్ల శరీరమంతటా దురదలు వస్తాయి. అలసట : స్పష్టమైన ఏ కారణం లేకుండానే విపరీతమైన అలసట కనిపిస్తుంది. బరువు తగ్గిపోతుంది. జ్వరం : హఠాత్తుగా జ్వరం వస్తుంది. వాంతులవుతాయి. నొప్పి : పొట్టలో తీవ్రమైన నొప్పి వస్తుంది. మలమూత్రాల రంగు మారడం : సాధారణంగా కొద్దిపాటి లేత పసుపురంగుతో తేటగా ఉండే మూత్రం చిక్కగా గోధుమరంగులో వస్తుంది. అలాగే మలం పసుపు, ఆకుపచ్చ రంగులో ఉండటం కూడా కామెర్ల వ్యాధి లక్షణాలలో ముఖ్యమైనది. కారణాలు ప్రధానంగా రెండు కారణాల వల్ల జాండిస్ సోకుతుంది. వీటిలో మొదటిది శరీరంలోని బైలిరుబిన్ అత్యధికంగా ఉత్పత్తి అవుతుండటం. రెండో సహజంగా ఉత్పత్తి అవుతున్న బైలురుబిన్‌ను కాలేయం తొలగించలేకపోవడం. ఈ రెండు సందర్భాల్లోనూ బైలిరుబిన్ శరీర కణజాలంలో చేరి స్థిరపడుతుంది. కామెర్లవ్యాధి సోకిన వ్యక్తి శరీర అంతర్భాగంలో కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. కాలేయం వాపు : ఇలా వాపు రావడం వల్ల బైలిరుబిన్‌ను గుర్తించి, దాన్ని తొలగించే సామర్థ్యం మందగించి, రక్తంలో ఆ వ్యర్థపదార్థం పరిమాణం పెరుగుతూపోతుంది. బైల్‌డక్ట్ వాపు : పైత్యరసం నాళం వాపు కారణంగా ఆ జీర్ణరసం స్రవించడానికీ, తద్వారా బైలిరుబిన్ తొలగించడానికి ఆటంకంగా తయారవుతుంది. దాంతో కామెర్ల వ్యాధి కనపడుతుంది. పైత్యరస నాళంలో అడ్డంకులు : ఇది బైలిరుబిన్‌ను తొలగించే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. హీమోలైటిక్ అనీమియా : భారీసంఖ్యలో ఎర్రరక్తకణాలు విచ్ఛిన్నమైనప్పుడు శరీరంలో పెద్దమొత్తంలో బైలిరుబిన్ తయారవుతుంది. మలేరియా, థలసేమియా వ్యాధుల వల్లగానీ లేదా కొన్ని రకాల ఔషధాల వల్ల ఎర్రరక్తకణాలు భారీగా విచ్ఛిన్నమవుతాయి. గిల్బర్ట్ సిండ్రోమ్ : వంశపారంపర్యంగా ఏర్పడే ఈ పరిస్థితి వల్ల పైత్యరసాన్ని విడుదల చేయగల ఎంజైముల సామర్థ్యం దెబ్బతింటుంది. కొలెస్టాటిస్ : ఈ కండిషన్లో కాలేయం నుంచి పైత్యరసం విడుదలకు అడ్డంకులు ఏర్పడతాయి. దాంతో కాంజెగేటెడ్ బైలిరుబిన్ విసర్జితం కావడానికి బదులు కాలేయంలోనే ఉండిపోతుంది. వయోజనుల్లో మరికొన్ని తీవ్రమైన కారణాల వల్ల కామెర్ల వ్యాధి వస్తుంది. వీటిలో కొన్ని ప్రాణాంతకమైన పరిస్థితులకూ దారితీయవచ్చు. మితిమీరిన మద్యపానం (నాలుగేళ్లకు పైబడి), హెపటైటిస్ బి, సి వైరస్ల ఇన్ఫెక్షన్ల వల్ల ఎక్కువమంది కామెర్ల వ్యాధికి గురవుతుంటారు. హెపటైటిస్ ఏ, ఈ వైరస్ల వల్ల కూడా కామెర్లు వస్తాయి. ఇవి ప్రమాదకరం. కలుషితమైన నీళ్లు, తిండి వల్ల ఈ తీవ్రమైన హెపటైటిస్ ఏ, ఈ వైరస్లు శరీరంలోకి చేరుతుంటాయి. వ్యాధి నిర్ధారణ చాలా సందర్భాల్లో పేషెంట్ ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం, భౌతికంగా పరీక్షించడం, పొట్టదగ్గర పరిశీలించడం ద్వారా డాక్టర్లు కామెర్ల వ్యాధిని గుర్తిస్తారు. పొట్టలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, కాలేయం గట్టిపడిందా అని పరిశీలించి చూస్తారు. కాలేయం గట్టిగా మారడం సిర్రోసిస్ వ్యాధిని సూచిస్తుంది. అది అలా గట్టిగా మారడం క్యాన్సర్ లక్షణం. కామెర్ల తీవ్రతను తెలుసుకోడానికి చాలా రోగనిర్ధారణ పరీక్షలు ఉన్నాయి. వీటిలో మొదటిది లివర్ ఫంక్షన్ పరీక్ష. కాలేయం సరిగా పనిచేస్తున్నదీ లేనిదీ దీనితో వెల్లడవుతుంది. రోగిలో వ్యక్తమవుతున్న లక్షణాలకు కారణాలు బయటపడని పక్షంలో బైలిరుబిన్ పరిమాణం, రక్తపు తాజా పరిస్థితిని అర్థం చేసుకోడానికి బైలురుబిన్ టెస్ట్, ఫుల్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ బ్లడ్ కౌంట్, హెపటైటిస్ వైరస్ల పరీక్షల వంటి వివిధ రకాల పరీక్షలను డాక్టర్లు సూచిస్తారు. నాళాలకు అడ్డంకులు ఏర్పడిన కారణంగా కామెర్లు వచ్చినట్లు అనుమానిస్తే ఎమ్మారై స్కాన్, అబ్డామినల్ అల్ట్రాసోనోగ్రఫీ, కాట్స్కాన్ వంటి పరీక్షలు చేయిస్తారు. సిర్రోసిస్, క్యాన్సర్, ఫాటీలివర్ ఏర్పడినట్లు అనుమానం కలిగితే బయాప్సీ చేయించాల్సిందిగా సూచిస్తారు. చికిత్స చాలామంది అవగాహన లేక జాండిస్‌కు నాటుమందులు వాడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ప్రాణాంతకం కూడా. కామెర్లకు ఇప్పుడు మంచి చికిత్స అందుబాటులో ఉంది. కామెర్లకు సరైన చికిత్స తీసుకోకపోతే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. కామెర్లకు చికిత్స చేసే ముందర ఆ వ్యాధికి దారితీసిన కారణాలను గుర్తించేందుకు పరీక్షలు జరుపుతారు. వాటిని అదుపుచేయడం, నివారించడానికి చికిత్స చేస్తారు. రక్తహీనత కారణంగా ఏర్పడిన కామెర్లను రక్తంలో ఎర్రరక్తకణాలను అభివృద్ధిపరచడం ద్వారా అదుపుచేస్తారు. ఇందుకు ఐరన్ సప్లిమెంట్లు, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం సిఫార్సు చేస్తారు. హెపటైటిస్ కారణంగా వచ్చే కామెర్లను తగ్గించడానికి యాంటీవైరల్ మందులు, స్టెరాయిడ్స్ ఇస్తారు. నాళాలలో అడ్డంకుల కారణంగా కామెర్లు వస్తే, శస్త్రచికిత్స ద్వారా ఆ ఆటంకాలను తొలగిస్తారు.ఏమైనా మందులు వాటం వల్ల వాటిలోని రసాయనాల వల్ల కామెర్లు వస్తే మొదట వాటి వాడకాన్ని నిలిపేస్తారు. ప్రత్యామ్నాయ ఔషధాలను సిఫార్సు చేయడంతో పాటు వాటి దుష్ఫలితాలను తగ్గించేందుకు అవసరమైన చికిత్స అందిస్తారు. హెపటైటిస్ ఏ, ఈ వైరస్ల వల్ల వచ్చే కామెర్లు చాలా ప్రమాదకరం. దీనిలో హఠాత్తుగా కామెర్ల వ్యాధి సోకి ప్రాణాపాయ ప్రమాదం ముంచుకువచ్చే అవకాశం ఉంది. కాలేయమార్పిడి మాత్రమే దీనికి నమ్మకమైన చికిత్స. సజీవులై వారి నుంచి లేదా బ్రెయిన్‌డెడ్ అయిన దాత నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన కాలేయంతో అవయవమార్పిడి ఆపరేషన్ చేస్తారు. డా. బి. రవిశంకర్, సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, యశోద హాస్పిటల్స్. సికింద్రాబాద్ -
మీ గడ్డం బిరుసుగా ఉందా?
కొంతమందికి గడ్డం చాలా బిరుసుగా ఉంటుంది. అలాంటి పురుషులకు షేవ్ చేసుకోవడం ఒక సమస్యగా ఉంటుంది. మరికొందరికి గడ్డంలోనే కొన్ని చోట్ల వెంట్రుకలన్నీ ఒకే పాటర్న్‌లో ఉండవు. అక్కడక్కడా సుడి తిరిగినట్లుగా ఉంటాయి. ఇలాంటప్పుడు షేవింగ్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సురక్షితమైన షేవింగ్ కోసం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే షేవింగ్ ప్రక్రియ మెత్తగా, హాయిగా, సాఫీగా జరుగుతుంది. అంతేకాదు... చర్మం ఎర్రబారడం, మంట పుట్టడం వంటివి లేకుండా కూడా చూసుకోవచ్చు. షేవింగ్ ప్రక్రియ మృదువుగా జరిగిపోడానికి పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు/సూచనలివి... ►బాగా బిరుసుగా ఉన్న వెంట్రుకలు ఉండేవారు ఒక షేవింగ్‌కు ముందుగా న్యాప్కిన్ను లేదా టవల్‌ను వేడినీటిలో ముంచి గడ్డం తడిసి మెత్తబడేలా గడ్డం చుట్టూ దాన్ని కాసేపు చుట్టుకుని ఉండాలి. అలా చేశాక షేవింగ్ చేసుకుంటే... అప్పటికే వెంట్రుకలు బాగా తడిసి మెత్తబడి ఉండటం వల్ల అవి తేలిగ్గా కట్ అవుతాయి. ►గడ్డంలోని వెంట్రుకలు మెలి తిరిగి ఉన్నచోట అవి సరిగా కట్ కాలేదనుకోండి. అప్పుడు ఆ ఒక్కచోటే మాటిమాటికీ షేవ్ చేయకండి. ఒకటి లేదా రెండుసార్లు చేసి అలా వదిలేయండి. మీరలా మాటిమాటికీ షేవ్ చేయడం వల్ల చర్మం ఒరుసుకుపోయి మంట పుడుతుంది. ఆ గాయం మిమ్మల్ని రోజంతా బాధపెడుతూనే ఉంటుంది. ►గడ్డంలో సుడులు మెలితిరిగిన ప్రదేశాలు మీ షర్ట్ కాలర్ ఉండే ప్రాంతంలోనే ఉన్నట్లయితే, గడ్డం గీసే సమయంలో మీరక్కడ బాగా ఒరుసుకుపోయేలా షేవ్ చేసుకున్నట్లయితే... ఆ రోజున మాత్రం గట్టిగా, బాగా బిరుసుగా ఉండే కాలర్ ఉన్న షర్ట్స్ వేసుకోకండి. వీలైతే కాలర్ లేనివో లేదా మెత్తటి కాలర్ ఉండే డ్రస్ లాంటివో వేసుకోండి. ►మీకు బయటకు వెళ్లాల్సిన పనులేవీ లేకుండా ఉంటే మీ సెలవు రోజున వీలైతే గడ్డం గీయకుండా ఒక రోజు బ్రేక్ ఇవ్వండి. ►ఎలక్ట్రిక్ రేజర్ కంటే మామూలు బ్లేడ్‌తో షేవ్ చేసుకోవడమే మంచిదని గుర్తించండి. ఎందుకంటే ఎలక్ట్రిక్ రేజర్‌తో షేవ్ చేసుకునే సమయంలో వెంట్రుక అన్ని దిశల నుంచీ కట్ అవుతుంది. ఒక్కోసారి దీని వల్ల వెంట్రుక మళ్లీ వెనక్కు వెంట్రుక మూలం (ఫాలికిల్)లోకి పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాతి షేవ్స్లో ఇది మరింత బాధాకరంగా పరిణమించే అవకాశాలుంటాయి. కాబట్టి మీకు వీలైనంత వరకు మామూలు బ్లేడ్‌తో షేవ్ చేసుకోవడమే మంచిది. -
మాడుతోందా?
ఎండాకాలంలో సూర్యుడికి దగ్గరగా ఉండేది మాడు. ఒక వయసు దాకా పర్వాలేదు గానీ ఎండల ప్రభావం మాడు మీద, జుట్టు మీద ఎక్కువగానే ఉంటుంది. వేడి పెరిగే కొద్దీ అపోహలు కూడా పేలుతూ ఉంటాయి. తికమకపడకుండా ఈ వాస్తవాలను తలకెక్కించుకోండి. మాడుకు అంటించుకోండి. ‘నడినెత్తికి మాడు అనే పేరెందుకొచ్చిందో?!’... అంటూ అడిగామనుకోండి. ‘ఎండలు మండిపోతూ ఉన్నప్పుడు మిట్టమధ్యాన్నం పూట బయటకు రాగానే తొలుత చుర్రుమనేది నడినెత్తి. అలా ఎండకు మొదటగా మాడిపోయేది అదే కాబట్టి దానికి మాడు అని పేరు పెట్టారేమో?!’ కాస్త సరదా, చిలిపిదనం ఉన్న పిల్లాడిలాంటి వారి నుంచి వచ్చే సమాధానం ఇలాగే ఉంటుంది. ‘నెత్తి మీద జొన్నల తవ్వ పెడితే అవి పేలాలై పేలిపోతున్నాయి. తల మీద గొడుగో లేదా తువ్వాలైనా వేసుకో... అంటూ పెద్దవాళ్లు సలహా ఇస్తుంటారు. ఎండకు మాడే మాడును వేసవి నుంచి రక్షించుకోవడం ఎలాగో... ఈ సీజన్లో దానికి వచ్చే సమస్యలేమిటో తెలుసుకోవడం కోసమే ఈ పది ప్రశ్నలూ... వాటికి సమాధానాలతో కూడిన ఈ కథనం. 1 స్కాల్ప్ అంటే ఏమిటి...? మనం తెలుగులో మాడు అని పిలిచే శరీర భాగాన్నే ఇంగ్లిష్‌లో స్కాల్ప్ అంటాం. నిజానికి స్కాల్ప్ అనేది ఒక పదం కాదు. స్కాల్ప్ అంటే మిగతా అవయవాల్లాగా మాడుకు అది ఇంగ్లిష్ పేరు కాదు. మాడు మీది చర్మంలోని ఐదు భాగాల పేర్ల తాలూకు ముందు అక్షరాలను తీసుకొని ‘స్కాల్ప్’ అనే పదాన్ని రూపొందించారు. మన మాడుపైన మొదట చర్మం ఉంటుంది. అదే ఇంగ్లిష్‌లో స్కిన్. ఇలా స్కిన్‌లోని స్పెల్లింగ్ మొదటి అక్షరం అయిన ‘ఎస్’ను ముందుగా తీసుకున్నారు. అలాగే వరసగా ఆ తర్వాత చర్మంలోని పొరలైన పేర్లలోని మొదటి అక్షరాలను ఒకదాని తర్వాత మరొకటి అమర్చారు. అంటే... సీ అంటే కనెక్టివ్ టిష్యూ అనీ, ఏ అంటే ఎపోన్యూరోటికా అనీ, ఎల్ అంటే లూజ్ ఏరియోలా అనీ, పీ అంటే పెరియాస్టియమ్ అనీ... ఆయా మాటలను ఆయా అక్షరాలు సూచిస్తాయన్నమాట. ఇలా స్కిన్ మొదలుకొని... పి అంటే పెరియాస్టియమ్ వరకు వరసగా ఉంటే పొరలకు ఉన్న పేర్ల తొలి అక్షరాలతో ‘స్కాల్ప్’ అనే మాట రూపొందింది. 2 ఎండవల్ల మాడుకు అనర్థాలు కలుగుతాయా? మన మిగతా చర్మంతో పోలిస్తే మన మాడు మీద నూనె స్రవించే గ్రంథుల సంఖ్య దాదాపు పది రెట్లు ఎక్కువ. నూనెను స్రవించే గ్రంథులను సెబేషియస్ గ్లాండ్స్ అనీ... ఆ నూనెను సీబమ్ అని అంటారు. ఈ సీజన్లో ఎండ ప్రభావం నుంచి మాడును రక్షించడానికి వాస్తవానికి స్రవించాల్సిన దానికంటే మరింత ఎక్కువ మోతాదులో సీబమ్ స్రవిస్తుంటుంది. పైగా మిగతా చర్మం కంటే మాడులో ఈ గ్రంథులు పది రెట్లు ఎక్కువ కావడం వల్ల కూడా స్రావాల పరిమాణం కూడా ఆ మేరకు పెరిగిపోతుంది. దాంతో వేసవిలో జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. పైగా జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్) ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. అందుకే మిగతా సమయాలకంటే ఈ సీజన్లో తల జిడ్డుగా మారడం మరింత ఎక్కువ. ఇక ‘మలసేజియా’ అనే ఒక రకం ఫంగస్‌కు మన తలపైన ఉన్న చర్మమే ఆవాసం. దానికి ఈ ‘సీబమే’ ఆహారం. ఎండల్లో తిరిగేవారిలో సీబమ్ మోతాదు విపరీతంగా పెరగడం వల్ల ఈ ఫంగస్ మరింత ఎక్కువగా వృద్ధి చెంది అది చుండ్రుకు కారణమవుతుంది. దానికి తోడు తలమీద ఫంగస్ మరింతగా పెరిగిపోతే అది ‘సెబోరిక్ డర్మటైటిస్’ అనే చర్మవ్యాధికి కారణమవుతుంది. 3 ఎండా, చెమటా కలిస్తే మాడు మీద డబుల్ ఇంపాక్ట్ ఉంటుందా? ఎండలో మాడుపై సీబమ్ ఎలాగూ స్రవిస్తుంటుందన్న విషయం తెలిసిందే కదా. దానికి తోడు కొందరిలో వారి శరీర తత్వానికి అనుగుణంగా చాలా ఎక్కువగా చెమట పడుతూ ఉంటుంది. దాంతో జుట్టు దట్టంగా ఉండేవారిలో ఈ చెమట కారణంగా తలలో చెమ్మ ఏర్పడి... అక్కడ బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది. వాటి కారణంగా కొందరిలో రోమాంకురాలకు (హెయిర్ ఫాలికిల్స్‌కు) ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ సమస్యనే ఇంగ్లిష్‌లో ‘ఫ్యాలిక్యులైటిస్’ అంటారు. ఈ సమస్య వచ్చిన వారిలో మాడు మీద చీము పొక్కులు (పస్ నిండినట్లుగా కనిపించే కురుపులు, గుల్లలు) వస్తుంటాయి. వాటి వల్ల తీవ్రమైన నొప్పి, విపరీతమైన దురద రావచ్చు. ఈ పరిస్థితి మనల్ని నలుగురిలో తిరగడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేలా చేస్తుంది. 4 ఎండ వల్ల కూడా జుట్టు రాలుతుందా? మాడుపై నేరుగా పడే ఎండ కారణంగా కొందరిలో జుట్టు రాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే నేరుగా వెంట్రుకలపై పడే ఎండ కారణంగా కొందరిలో ‘రోమాంకురాలు’ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్యనే ‘ఎక్టినిక్ టెలోజెన్ ఎఫ్లూవియమ్’ అని కూడా అంటారు. వీటితో పాటు కొందరిలో నుదుటి మీద చిన్న చిన్న పొక్కులు లేదా మొటిమల వంటివి వస్తుంటాయి. 5 ఎండలో హెల్మెట్ పెట్టుకుంటే మరింతగా జుట్టు రాలుతుందా? ఎండవేళల్లో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు మరింతగా రాలుతుందనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ నిజానికి హెల్మెట్... ఇటు జుట్టును, అటు మాడును ఎండ నుంచి రక్షిస్తుంటుంది. అంతేకాదు... బయటి వాతావరణంలోని కాలుష్యం నుంచి కూడా కాపాడుతుంది. దాంతో ఎండ వేళల్లో హెల్మెట్ పెట్టుకోని ద్విచక్రవాహనదారులతో పోలిస్తే హెల్మెట్ వాడే వారిలో జుట్టు రాలిపోకుండా ఉంటుందన్నమాట. అయితే హెల్మెట్ తొడుక్కునేప్పుడు ఒక జాగ్రత్త పాటిస్తే మంచిది. ఒక పరిశుభ్రమైన గుడ్డను కాస్తంత లూజ్‌గా ఉండేలా తల మీద కప్పుకొని, ఆ పైనుంచి హెల్మెట్ పెట్టుకుంటే... మన హెల్మెట్లోపలి భాగం చెమటతో తడిసిపోకుండా ఉంటుంది. దాంతో మాటిమాటికీ తడిసిన హెల్మెట్నే పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనం తలపైన పెట్టుకునే గుడ్డను తరచు ఉతుక్కోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉతికిన గుడ్డను వాడుకోవచ్చు. కానీ హెల్మెట్‌ను శుభ్రపరచుకోలేం కదా. అందుకే ఈ జాగ్రత్త. 6 ఎండ వల్ల వెంట్రుకలు మెరుస్తూ అందంగా కనిపిస్తాయా? ఇది కూడా చాలామందిలో ఉండే అపోహే. మంచి షాంపూ వాడి తలస్నానం చేశాక... కాసేపు ఎండలో ఉంటే వెంట్రుకలు మెరుస్తూ కనిపిస్తాయని చాలా మంది అపోహ పడుతుంటారు. కానీ నేరుగా వెంట్రుకలపై పడే ఎండ వాటిని డల్‌గా మార్చేస్తుంది. కురుల ఆరోగ్యాన్ని కోరుకునే వారు... నేరుగా ఎండపడే సమయంలో వెంట్రుకలకు రక్షణగా క్యాప్ ధరించడం మేలు. అది కాస్తంత వదులుగా ఉండే కాటన్ క్యాప్ అయితే మరింత మంచిది. అంచులు వెడల్పుగా ఉండే బ్రిమ్ క్యాప్ అయితే వెంట్రుకలకు మరింత ఎక్కువ రక్షణ కలుగుతుంది. 7 ఎండవేళల్లో మాడు మాడకుండా ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలా? అవును కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే.... ఎండలో మాడును రక్షించుకోవడంతో పాటు దాన్ని ఆరోగ్యంగానూ ఉంచుకోవచ్చు. అవి... ►మాడుపై సీబమ్ ఎక్కువగా స్రవిస్తున్నప్పుడు జుట్టు జిడ్డుగా మారుతుంది. దాంతో ఆ జిడ్డు కారణంగా అది మరింత డల్‌గా కనిపిస్తుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఈ సీజన్లో రోజు విడిచి రోజు తలస్నానం చేయడం మంచిది. ►మన స్కాల్ప్ పైనున్న భాగం పీహెచ్ విలువ 5.5 ఉంటుంది. సరిగ్గా ఇదే పీహెచ్ ఉన్న షాంపూలను వాడితే మాడుకు మంచిది. ►చుండ్రు లేదా ఫాలిక్యులైటిస్ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా డర్మటాలజిస్టులను సంప్రదించి... వారు సూచించే మందులను తీసుకోవాలి. వారు సూచించే జాగ్రత్తలను తప్పక పాటించాలి. చుండ్రు ఉన్నవారు కీటకెనజోల్ వంటి యాంటీఫంగల్ షాంపూను అవసరానికి అనుగుణంగా మెయింటెనెన్స్ ట్రీట్మెంట్లాగా వాడుకోవచ్చు. వారానికి ఒకసారి వాడుతూ ఉంటే ఎంతకాలం వాడినా దాంతో పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. ►అప్పటికే జిడ్డు చర్మం, జిడ్డుగా ఉండే మాడు ఉన్నవారు తలకు నూనె పెట్టడం అంత మంచిది కాదు. ►ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు, ద్రవాహారాలు కూడా ఎక్కువగా తీసుకోవడం అందరికే మేలు. 8 మాడు రక్షణ కోసం ఆహారపరమైన జాగ్రత్తలేమైనా ఉంటాయా? అవును... అన్ని పోషకాలు అందేలా సమతుల ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అందులో తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దాంతో మంచి వ్యాధి నిరోధకత సమకూరుతుంది. దాంతో మాడుకు వచ్చే అనేక సమస్యల నుంచి మనకు నివారణ లభిస్తుంది. ఐరన్, జింక్ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారంతో జుట్టు మరింత అరోగ్యంగా ఉంటుంది. ►రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసులకు తగ్గకుండా నీరు తాగడం వల్ల మాడు మీద చర్మంపైన మృత కణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి. దాంతో మాడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. ►జుట్టు సంబంధిత సమస్యలు ఉన్నవారు మాంసం, పంచదార, మైదా, స్ట్రాంగ్ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. తీసుకోవాల్సి వస్తే చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి? 9 జుట్టును ఎలా దువ్వుకోవాలి? ►దువ్వుకొనే విధానంలో మార్పులతోనూ జుట్టును రక్షించుకోవచ్చా? అవుననే అంటున్నారు నిపుణులు. మీకు జుట్టు రాలకుండా ఉండాలంటే... మాడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించండి. ►తల మీద ఉన్న జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరగాలంటే మంచి దువ్వెనతో దువ్వుకోవడం మంచిది. ►వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో జుట్టును పాయలుగా విడదీస్తూ, కుదుళ్ల మొదలు దగ్గర నుంచి చివర్ల వరకు దువ్వాలి. ఇలా చేయడం వల్ల తలలో దుమ్ము, చుండ్రు ఉంటే రాలిపోతుంది. అది మాడుకు మేలు చేస్తుంది. 10 మాడు విషయంలో డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి? ఈ కింద పేర్కొన్న లక్షణాలతో మాడుకు ఏదైనా సమస్య వచ్చినట్లు గ్రహిస్తే... వెంటనే డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. ►మాడు మీద విపరీతంగా దురద పెడుతున్నప్పుడు ►ఎండలోకి వెళ్లగానే దురద మరింతగా పెరిగినప్పుడు ►చీముతో కూడిన కురుపులు కనిపించినప్పుడు ►మాడు మీద తెలుపు లేదా గ్రే కలర్లో పెచ్చులు వస్తున్నప్పుడు ►ఎండలో తిరిగినప్పుడల్లా ఎక్కువగా జుట్టు రాలిపోతున్నప్పుడు. -
చక్కటి చుక్కలా
ముఖ సౌందర్యానికి ఫేస్ క్రీమ్స్, లోషన్స్.. ఇలా చాలానే కొంటుంటారు మగువలు. కానీ మృదువైన మోము కోసం వాటికంటే ముఖ్యంగా.. సహజసిద్ధమైన చిట్కాలను పాటించడమే మంచిదంటున్నారు నిపుణులు. మచ్చలు, మొటిమలు శాశ్వతంగా తొలగిపోవాలంటే ఇంటిపట్టున సిద్ధం చేసుకున్న సౌందర్యలేపనాలను వాడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి: క్లీనప్ : బాదం పాలు – 1 టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్ స్క్రబ్ : బియ్యప్పిండి – 2 టీ స్పూన్లు, టమాటా గుజ్జు – 2 టీ స్పూన్లు మాస్క్: తులసి గుజ్జు – 2 టీ స్పూన్లు, చిక్కటి పాలు – 1 టీ స్పూన్, గంధం – 1 టీ స్పూన్ తయారీ: ముందుగా బాదం పాలు, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, టమాటా గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు తులసి ఆకుల గుజ్జు, చిక్కటి పాలు, గంధం బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
ఎండాకాలం... కురులు కులాసాగా...
ఈ కాలం శిరోజాలూ చమట, జిడ్డు కారణాలతో త్వరగా మురికి అవుతాయి. పొడిబారి చిట్లుతుంటాయి. ఈ సమస్యకు విరుగుడుగా ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకొని, కురుల నిగనిగలను కాపాడుకోవచ్చు. ∙రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, అర టీæ స్పూన్ బియ్యం, టీ స్పూన్ మిరియాలు. ఈ మూడింటిని కలిపి బియ్యం ముదురు గోధుమరంగులోకి వచ్చేవరకు మరిగించి, దించి, చల్లారనివ్వాలి. వారానికి రెండు సార్లు ఈ నూనెను వేడి చేసి, తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు మృదువుగా అవడమే కాకుండా, రాలడం సమస్య తగ్గుతుంది. ∙వారానికి రెండుసార్లు గోరువెచ్చని కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేసుకోవడం, నెలకు ఒకసారి హెన్నా ప్యాక్ వాడితే కురుల అందం పాడవదు. ∙వేడిమి వల్ల రోజూ తలస్నానం చేస్తుంటారు. దీంతో మాడు పై చర్మం పొడిబారి వెంట్రుకలు చిట్లడం, రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రాత్రి సమయాల్లో ఉసిరి, తులసి, వేప ఆకులను మరిగించిన కొబ్బరినూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే కుదుళ్లు బలంగా ఉంటాయి. -
లూపస్ అంటే?
లూపస్ అనే ఈ వ్యాధిని సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసస్ (ఎస్‌ఎల్‌ఈ) అని కూడా అంటారు. ఇది ప్రతి వెయ్యిమందిలో ఒకరికి వస్తుంది. ఇది ఆఫ్రికన్–అమెరికన్స్‌తో పాటు ఆసియా వాసుల్లో ఎక్కువ. ఈ వ్యాధి మహిళల్లోనే ఎక్కువగా వస్తుంది. అంటే వ్యాధిగ్రస్తుల్లో మహిళలు–పురుషుల నిష్పత్తి 9:1గా ఉంటుంది. ఇది 15 నుంచి 45 ఏళ్ల మధ్యవయసు వారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నపిల్లలు, వృద్ధులకు కూడా వ్యాధి వస్తుంది. లూపస్ వ్యాధిగ్రస్తుల్లో వ్యాధినిర్ధారణకూ, చికిత్సకూ సుమారు మూడేళ్లపాటు వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. మన దేశంలో ప్రజలతోపాటు చాలామంది వైద్యుల్లోనూ ఈ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం, రుమటాలజిస్టుల కొరత వల్ల వ్యాధి ముదిరాక మాత్రమే చాలామంది వైద్యులను ఆశ్రయిస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. లూపస్ అంటే గ్రీకు భాషలో తోడేలు (వూల్ఫ్) అని అర్థం. ఒకప్పుడు వైద్యం అందుబాటులో లేని సమయంలో వ్యాధిగ్రస్తుల ముఖం తోడేలును తలపించేది. కాబట్టి ఈ వ్యాధికి ఆ పేరు వచ్చింది. లక్షణాలు: ►జుట్టు ఎక్కువగా రాలడం ►ముఖం మీద సీతాకోకచిలుక ఆకృతితో ముక్కుకు ఇరువైపులా ఎర్రటి మచ్చలు రావడం ►నోట్లో పుండ్లు పడటం ∙కీళ్లనొప్పులు ►కీళ్లవాపులు ∙విపరీతమైన అలసట ►జ్వరం వస్తూ, తగ్గుతూ ఉండటం వంటి లక్షణాలు వ్యాధిగ్రస్తుల్లో ప్రాథమికంగా కనిపిస్తుంటాయి. వ్యాధి నిర్ధారణ కాకుండా చికిత్స అలస్యం అయితే... క్రమేణా ఈ వ్యాధి శరీరంలోని ఇతర ►అవయవాలకు వ్యాపించే అవకాశం ఉంది. లూపస్ వ్యాధి వల్ల మన రక్తకణాలు బాగా తగ్గిపోవచ్చు. (ప్లేట్లెట్లు, తెల్లరక్తకణాలు, హీమోగ్లోబిన్ కౌంట్ తగ్గవచ్చు). ఇతర కీలక అవయవాలపై వ్యాధి దుష్ప్రభావాలు ఇలా... మూత్రపిండాలు ప్రభావితమైతే లూపస్ నెఫ్రైటిస్ అనే సమస్య, మెదడు ప్రభావితమైతే ఫిట్ ఊపిరితిత్తులు ప్రభావితమైతే ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం (ప్లూరల్ ఎఫ్యూజన్), ఊపిరితిత్తుల్లో కొబ్బరిపీచు వంటి పదార్థం వృద్ధి కావడం (లంగ్ ఫైబ్రోసిస్/ఐఎల్‌డీ), గుండె ప్రభావితమైతే దానిచుట్టూ నీరు చేరడం (పెరికార్డియల్ ఎఫ్యూజన్), గుండె వేగంగా కొట్టుకోవడం (మయోకారై్డటిస్), హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. లూపస్‌లో రకాలు 1. సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్: ఇది సాధారణంగా మనం ఎక్కువగా చూసే లూపస్. శరీరంలోని ఏ భాగమైనా దీనివల్ల ప్రభావితం కావచ్చు. 2. డిస్కాయిడ్ లూపస్: ఇది ముఖం మీద, తలపైన, మెడమీది చర్మాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. చర్మంపై మందమైన పొరల్లాంటి మచ్చలు ఏర్పడతాయి. 3. సబ్ ఎక్యూట్ క్యుటేనియస్ లూపస్: చర్మంపై సూర్మరశ్మి సోకిన ప్రాంతంలో తీవ్రమైన ఎర్రని మచ్చలు వస్తాయి. 4. నవజాత శిశువుల లూపస్ (నియోనేటల్ లూపస్): లూపస్ ఉన్న తల్లులకు పుట్టిన నవజాత శిశువులకు వచ్చే అరుదైన లూపస్ ఇది. ఈ శిశువుల్లో చర్మంపై ఎర్రటి మచ్చలు వచ్చి, కొద్దివారాల్లోనే పూర్తిగా నయమవుతాయి. చాలా కొద్దిమందిలో హార్ట్ బ్లాక్ రావచ్చు. 5. మందులతో వచ్చే లూపస్ (డ్రగ్ ఇండ్యూస్డ్ లూపస్): చాలా అరుదుగా కొన్నిరకాలపై మందుల వల్ల లూపస్ లక్షణాలు రావచ్చు. కానీ ఆ మందులు ఆపేసిన తర్వాత లక్షణాలూ పూర్తిగా తగ్గిపోతాయి. హైడ్రాలజైన్, ప్రొకైనమైడ్, ఐసోనియాజిడ్ వంటి మందుల వల్ల అరుదుగా ఇలా జరగవచ్చు. వ్యాధినిర్ధారణ పరీక్షలు ►సీబీపీ ►క్రియాటినిన్ ►లివర్ ఎంజైమ్‌ల పరీక్షలు ►ఈఎస్ఆర్ ►సీఆర్పీ ►మూత్రపరీక్ష ►ఏఎన్ఏ టెస్ట్ ►డీఎస్–డీఎన్ఏ టెస్ట్ ►ఏఎన్ఏ ప్రొఫైల్ ►ఛాతీ ఎక్స్‌రే ►స్కానింగ్ వంటి పరీక్షలు చేసి డాక్టర్లు లూపస్ వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఇంకొన్ని ముఖ్యమైన పరీక్షలు ►యాంటీస్మిత్ యాంటీబాడీస్ ►యాంటీఫా ►స్ఫోలిపిడ్ యాంటీబాడీస్ ►యాంటీ రో–యాంటీబాడీ ►యాంటీ లా–యాంటీబాడీ ►సీరమ్ కాంప్లిమెంట్స్ ∙24 గంటల మూత్రపరీక్ష లూపస్ ఎందుకు వస్తుంది? మన శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్)లో సమతౌల్యం లోపించినప్పుడు మనల్ని రక్షించాల్సిన వ్యాధి నిరోధకత మన శరీరంపైనే దాడి చేయడం వల్ల లూపస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు వస్తాయి. జన్యువులు, పరిసరాలు, హార్మోన్ల వంటి అంశాలు ఈ వ్యాధికి కారణం అవుతుంటాయి. ఒక్కోసారి సూర్మరశ్మి అధికంగా సోకడం వల్ల, వైరస్–బ్యాక్టీరియాల వల్ల కూడా లూపస్ వ్యాధి తీవ్రతరం కావచ్చు. చికిత్స ఆధునిక చికిత్సతో లూపస్ వ్యాధిగ్రస్తులు సరైన సమయంలో మందులు మొదలుపెడితే, వారు పూర్తిగా కోలుకొని, సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంది. ఇక మందులు వాడేవారు ఒక్కసారిగా లూపస్ మందులు ఆపితే చాలా ప్రమాదం. రుమటాలజిస్టుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడాలి. వ్యాధి తగ్గుముఖం పట్టిన తర్వాత మందుల మోతాదు తగ్గించే అవకాశం ఉంటుంది. అది కూడా రుమటాలజిస్టులు మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవాలి. లూపస్ వ్యాధిలో వాడే సాధారణ మందులు ►హైడ్రాక్సి క్లోరోక్విన్ ►ఎజథయోప్రిన్ ►మిథోట్రెక్సేట్ ►కార్టికోస్టెరాయిడ్స్ ►సైక్లోఫాస్ఫమైడ్స్ ►మైకోఫినొలేట్ ►టాక్రోలిమస్లతో పాటు సన్‌స్క్రీన్ ఆయింట్మెంట్లు వాడాల్సి ఉంటుంది. అడ్వాన్స్డ్ చికిత్సలు: ►ఐఆర్ఐజీ థెరపీ ►పాస్మాఫెరిసిస్ ►రిటాక్సిమాబ్ ►ఎక్మోథెరపీ లూపస్ వ్యాధి... కొన్ని ముఖ్యమైన విషయాలు : ►లూపస్ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు, సోకదు ►లూపస్ వ్యాధిని త్వరగా గుర్తిస్తే మందులతో పూర్తిగా నయం చేయవచ్చు ►లూపస్ వ్యాధిగ్రస్తులు మందులు వాడుతూ పూర్తిస్థాయి సాధారణ జీవితం గడపవచ్చు ►క్రమంతప్పకుండా రుమటాలజిస్టులను సంప్రదించి మందులు వాడాలి ►ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఏమీ ఉండదు. అయితే సమతుల ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా వంటివి చేస్తే మంచిది. శరీరం, ►మనసుపైన ఒత్తిడి తగ్గించి, మనసును ఉల్లాసంగా ఉంచే పనులు చేయాలి. లూపస్ వ్యాధిని ఎదిరించి పోరాడిన కొందరు ప్రముఖులు ►సెలీనా గోమేజ్ ►లేడీ గాగా (సింగర్, నటి) ►టోనీ బ్రాక్స్టన్ (గ్రామీ అవార్డు విన్నింగ్ సింగర్) ►నిక్ కేనన్ (రేపర్, నటుడు) ►సీల్ (బ్రిటిష్ సింగర్, సాంగ్ రైటర్) ►క్రిస్టెన్ జాన్స్టన్ (మోడల్) డాక్టర్ వి. శరత్ చంద్రమౌళి క్లినికల్ డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ రుమటాలజీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ లూపస్ రోగుల్లో గర్భధారణ అసాధ్యంకాదు లూపస్ వ్యాధిగ్రస్తుల్లో గర్భధారణ జరగడం, ఆ గర్భాన్ని కాపాడటం అటు రోగికీ ఇటు రుమటాలజిస్ట్కీ ఒక పెద్ద సవాలు. ఈ వ్యాధి ప్రభావం తల్లి మీదనే కాకుండా శిశువుపైన కూడా ఉంటుంది. చాలా మంది అపోహ పడే విధంగా ఈ రోగులు గర్భం దాల్చకూడదనేది కేవలం ఒక అపోహ మాత్రమే. అయితే గర్భం దాల్చడానికి ముందు జబ్బు తీవ్రత, మూత్రపిండాల మీద, గుండెపైన, మెదడుమీద దాని ప్రభావాన్ని అంచనా వేయాలి. జబ్బు తీవ్రత ఎక్కువగా ఉండి, దాని దుష్ప్రభావాలు మూత్రపిండాలు, గుండె, మెదడు వంటి కీలకమై అవయవాల మీద ఉన్నట్లయితే... తాత్కాలికంగా గర్భధారణను (ప్రెగ్నెన్సీని) ప్లాన్ చేసుకోకూడదు. అయితే ఇది కేవలం ‘‘తాత్కాలికంగా మాత్రమే’’ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీనికి కారణం ఉంది. జబ్బు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు గర్భం నిలబడకపోవచ్చు. అంతేగాక వారిలో ఉండే యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అనే ప్రతికూల కణాల కారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వాటివల్ల మాయలో రక్తం గడ్డకట్టి శిశువుకి ప్రాణవాయువు సరఫరాకు అంతరాయం కలుగుతుంది. గర్భధారణ సమయంలో జబ్బు తీవ్రత పెరగడం, అధిక రక్తపోటు, తరచూ గర్భస్రావాలు, ప్రీ–ఎక్లాంప్షియా (గర్భవతిగా ఉన్న సమయంలో రక్తపోటు పెరగడం, మూత్రంలో ప్రోటీన్లు వృథాగా పోవడం), మూర్చ (ఫిట్స్), నెలలు నిండకుండానే ప్రసవం కావడం (ప్రీమెచ్యుర్ డెలివరీ) లాంటి ప్రసూతి సమస్యలు సంభవించే అవకాశాలు ఎక్కువ. అలాగే బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, గర్భాశయంలోనే మరణించడం, నియోనేటల్ లూపస్ వంటి సమస్యతో పుట్టుకతోనే బిడ్డ వ్యాధిని కలిగి ఉండటం వంటి సమస్యలూ ఏర్పడే అవకాశాలు ఎక్కువ. ఈ రోగుల్లోని 20 నుంచి 40 శాతం గర్భిణుల్లో ప్రెగ్నెన్సీ సమయంలోనూ, కాన్పు తర్వాతా జబ్బు తీవ్రత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందుకు చాలావరకు అవకాశాలు తక్కువ అనే చెనప్పాలి. కొన్నిసార్లు జబ్బు లక్షణాలు సాధారణ గర్భిణుల్లో కనిపించే లక్షణాలనూ అనుకరిస్తాయి. ఈ రెండింటి మధ్య తేడాను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ద్వారా రుమటాలజిస్టులు మందుల మోతాదులను అవసరం మేరకు మారుస్తారు. దీనివల్ల పిండం మీద ప్రతికూల ప్రభావాలు సాధ్యమైనంతవరకు పడకుండా రుమటాలజిస్టులు జాగ్రత్తపడతారు. అలాగే ప్రసవం తర్వాత బిడ్డకు తల్లిపాలు ఇచ్చినంతకాలం కూడా మందుల విషయంలో రుమటాలజిస్టులు చాలా జాగ్రత్తగా ఉంటారు . పుట్టిన శిశువుపైన కూడా లూపస్ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇలా పుట్టిన బిడ్డకు వచ్చే సమస్యను ‘నియోనేటల్ లూపస్ అంటారు. తల్లి ద్వారా పిండంలోకి వెళ్లే యాంటీబాడీస్ వల్ల తాత్కాలికంగా ఈ సమస్య ఎదురవుతుంది. చర్మం మీద ఎర్రని మచ్చలు రావడం అన్నది అతి సాధారణంగా కనిపించే లక్షణం. కామెర్లు, రక్తహీనత, రక్తకణాలు తగ్గడం లాంటివి కూడా సంభవించే అవకాశాలుంటాయి. గుండె, కాలేయం మీద కూడా దుష్ప్రభావాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ ఇవి చాలా అరుదుగా కలిగే సమస్యలు. రుమటాలజిస్టులు, ప్రసూతి వైద్యనిపుణల మేరకు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల విజయవంతమైన ఫలితాలు లభిస్తాయి. ఎస్‌ఎల్‌ఈ జబ్బు నిర్ధారణ అయ్యాక, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోదలచుకుంటే రుమటాలజిస్టులతో తప్పక చర్చించాలి. ఈ విషయంలో సరైన ప్లానింగ్ అన్నది అత్యంత ముఖ్యమైన మొదటి అడుగు. జబ్బుతీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేదా కీలకమైన అవయవాల మీద జబ్బు దుష్ప్రభావాలు ఉన్నప్పుడు గర్భందాల్చే ప్రయత్నాలు చేయకూడదు. జబ్బు తీవ్రతను పూర్తిగా నియంత్రించిన ఆర్నెల్ల తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల చాలా సమస్యలను నివారించవచ్చు. తరచూ రక్తపరీక్ష, మూత్రపరీక్ష, రక్తపోటు తనిఖీ చేసుకోవడం వంటి పరీక్షలను నిర్వహించుకుంటూ ఉండాలి. అలాగే శిశువు గుండె మీద ప్రభావం ఉందా, లేదా అన్న విషయాలను ఇప్పుడు కొన్ని ఆధునిక పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. ఆధునిక వైద్య చికిత్సా విధానాలు అందుబాటులో ఉండే ఆసుపత్రుల్లో కాన్పు చేయించుకోవడం తప్పనిసరి. దీనివల్ల శిశువు ఏ రకమైన ఇబ్బందితో పుట్టినా సులభంగా వైద్యం అందించడం తేలికవుతుంది, సాధ్యమవుతుంది. లూపస్ రోగులకు గర్భధారణ అన్నది ఒక సవాల్ మాత్రమే. అంతేతప్ప అది అసాధ్యం కానేకాదు. రుమటాలజిస్టుల సలహా మేరకు, సరైన ప్లానింగ్ చేసుకొని, వ్యాధి మీద అవగాహన పెంచుకోవడంతో పాటు ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికత సహాయంతో అందివచ్చిన మెరుగైన ఆధునిక వైద్యం తీసుకుంటే మంచి ఫలితాలు లభించే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్. -
మృదువైన మెరుపు
మార్కెట్లో కొన్న క్రీమ్స్ కంటే.. సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్సే చర్మం మృదుత్వాన్ని కోల్పోకుండా కాపాడతాయి. మచ్చలు, మొటిమలు, ముడతలు... ఇలా ఒక్కటేమిటి వయసుతో వచ్చిన సమస్యలను, కాలుష్యం తెచ్చిపెట్టిన ఇబ్బందులను సహజసిద్ధమైన చిట్కాలు పరిష్కరిస్తాయి. అందుకే చాలా మంది ఈ చిట్కాలను తు.చ. తప్పకుండా పాటిస్తారు. నిపుణుల సలహాలు కూడా ఇవే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి: క్లీనప్ : కమలా రసం – 2 టీ స్పూన్లు, తేనె – అర టీ స్పూన్ స్క్రబ్ : బియ్యప్పిండి – అర టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు – 1 టేబుల్ స్పూన్ మాస్క్: కీరదోస గుజ్జు – 3 టీ స్పూన్లు, ముల్తానీ మట్టి – 2 టీ స్పూన్లు తయారీ: ముందుగా కమలా రసం, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, కొబ్బరి పాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు కీరదోసగుజ్జు, ముల్తానీ మట్టి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
ఎండ నుంచి మేనికి రక్షణ
ఎండ వేడిమి దాడి చేస్తోంది. దీనికి విరుగుడుగా ఈ కాలం మేని సంరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ►ఎండ నుంచి వచ్చిన తర్వాత బొప్పాయి గుజ్జు చర్మానికంతా పట్టించి, మూడు నిమిషాలుంచి కడిగేయాలి. మృతకణాలు తొలగిపోవడమే కాకుండా ఎండవేడిమికి కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. ►చర్మం తాజాగా ఉండాలంటే ఎండలో బయటికి వెళ్లి వచ్చిన తర్వాత బొప్పాయి గుజ్జులో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొని, 5 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ►చలికాలానికి మాయిశ్చరైజర్లు మాదిరి ఈ కాలం సన్‌ప్రొటెక్షన్ లోషన్లు వాడుతుంటారు. అయితే, వీటిని బయటకు వెళ్లడానికి 10 నిమిషాల ముందు రాసుకుంటే చాలు ఎండబారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. ►ఎండవేడికి చర్మం కమిలి, మంట పుడుతుంటే ఉపశమనానికి అలొవెరా జెల్ రాసి, పది నిమిషాలు ఆగి చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ►ఈ కాలం శిరోజాలు పొడిబారడం సమస్య ఎక్కువ. అందుకని వారానికి ఒకసారి అరటిపండు గుజ్జును తలకు అంతా పట్టించి, పది నిమిషాలు ఉంచి, కడిగేయాలి. దీనివల్ల వెంట్రుకల మృదుత్వం దెబ్బతినదు. ►చర్మం నిస్తేజంగా మారకుండా రోజూ 8–10 గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి. -
కాలాన్ని కవర్ చేద్దాం
ఎండవేడిమి చర్మం, శిరోజాల మీద అధిక ప్రభావం చూపుతుంది. విరుగుడుగా మనమే కొన్ని జాగ్రత్తలను పాటించి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఎండకాలం తీవ్రతను కవర్ చేసేయొచ్చు. కమిలిన చర్మానికి కలబంద ఎండకు కమిలిన చర్మానికి కలబంద మంచి ఉపశమనం ఇస్తుంది. కలబంద రసాన్ని ఐస్‌ట్రేలో పోసి ప్రీజర్‌లో సిద్ధంగా ఉంచాలి. కలబంద క్యూబ్‌తో కమిలిన చర్మం మీద మృదువుగా రబ్ చేయాలి. ఇది వెంటనే రిలీఫ్ ఇవ్వడంతో పాటు ట్యాన్ తగ్గిస్తుంది. తాజాదనానికి రోజ్‌వాటర్ ఇంట్లో రోజ్‌వాటర్‌ని ఫ్రిజ్‌లో సిద్ధంగా ఉంచుకోండి. బయటకు వెళ్లి వచ్చినప్పుడు దూది ఉండను చల్లని రోజ్‌వాటర్‌లో ముంచి, దాంతో ముఖమంతా తుడవండి. కళ్ల చుట్టూ మరోమారు తుడవాలి. దీంతో మీకు అలసట తీరిపోయి ఫ్రెష్‌గా కనిపిస్తారు. పొడి జుట్టుకు తేనె తేనె, కొబ్బరినూనె సమపాళ్లలో తీసుకోవాలి. జుట్టుకు, మాడుకు పట్టించాలి. షవర్క్యాప్తో జుట్టునంతా కవర్ చేయాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే పొడిజుట్టుకు మంచి కండిషనింగ్ లభిస్తుంది. కాలిమడమలకు సముద్రపు ఉప్పు బంగాళదుంపను సగానికి కట్ చేసి, దానిని ఉప్పుతో రుద్ది కాలి మడమల భాగంలో రబ్ చేయాలి. తర్వాత వాజెలిన్ రాసి, సాక్స్‌లు వేసుకోవాలి. రాత్రి పడుకునేముందు ఈ విధంగా చేయాలి. కొన్నిరోజుల్లోనే మీ పాదాల పగుళ్లు తగ్గి, చర్మం మృదువుగా అవుతుంది. చిట్లిన వెంట్రుకలకు ఆలివ్ ఆయిల్ వేసవిలో స్విమ్మింగ్ చేసేవారికి తలవెంట్రుకులు బాగా పొడిబారడం, చిట్లడం వంటì సమస్యలు ఎదురవుతుంటాయి. దీనికి విరుగుడుగా.. స్విమ్మింగ్ చేయడానికి ముందు ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల వెంట్రుకల కండిషన్ దెబ్బతినదు. జుట్టు దురద పెడుతుంటే చల్లటి పెరుగును జుట్టుకు పట్టించి 10 నిమిషాలు సేదదీరండి. తర్వాత శుభ్రపరుచుకోండి. దురద తగ్గడమే కాకుండా జుట్టుకు పెరుగు మంచి కండిషనర్‌లా పనిచేస్తుంది. -
మా బాబు ముఖం ఉబ్బుతోంది...తగ్గేదెలా?
మా బాబు వయసు తొమ్మిదేళ్లు. ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ముఖం, కాళ్లు వాపు వచ్చాయి. యూరిన్‌లో ప్రోటీన్స్ పోయాయనీ, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పి చికిత్స చేశారు. నెలరోజులు మందులు వాడిన తర్వాత యూరిన్‌లో ప్రోటీన్ పోవడం తగ్గింది. మందులు ఆపేశాము. మళ్లీ 15 రోజుల తర్వాత యూరిన్‌లో మళ్లీ ప్రోటీన్లు పోవడం ప్రారంభమైంది. మళ్లీ మందులు వాడితే ప్రోటీన్లు పోవడం తగ్గింది. మందులు వాడినప్పుడల్లా తగ్గి, ఆపేయగానీ యూరిన్‌లో మళ్లీ ప్రోటీన్లు పోతున్నాయి. అయితే ఎక్కువకాలం మందులు వాడితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందా అని ఆందోళనగా ఉంది. వాటివల్ల ఏవైనా సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలూ ఉన్నాయా? నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్నప్పుడు మొదటిసారి పూర్తిగా మూడు నెలల పాటు డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. కొంతమంది పిల్లల్లో మందులు మానేయగానే మళ్లీ ప్రోటీన్ పోవడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పిల్లల్లో తక్కువ మోతాదులో మందులను ఆర్నెల్ల నుంచి తొమ్మిది నెలల పాటు వాడాల్సి ఉంటుంది. కొంతమందిలో సైడ్ఎఫెక్ట్స్ కనిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు వేరే మందులు వాడాల్సి ఉంటుంది. చాలామంది పిల్లల్లో ఈ వ్యాధి 12–14 సంవత్సరాల వయసప్పుడు పూర్తిగా నయమవుతుంది. కిడ్నీలు దెబ్బతినే అవకాశం చాలా తక్కువ. మీరు ఆందోళన పడకుండా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడండి. తరతూ మూత్రంలో మంట... ఎలా తగ్గుతుంది? నా వయసు 36 ఏళ్లు. తరచూ జ్వరం వస్తోంది. మూత్రవిసర్జన సమయంలో మంటతో బాధపడుతున్నాను. మందులు వాడినప్పుడు తగ్గుతోంది. నెలలోపు మళ్లీ జ్వరం వస్తోంది. ఇలా పదే పదే జ్వరం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు తరచూ జ్వరం, మూత్రంలో ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే, అది మళ్లీ మళ్లీ రావడానికి గల కారణాలు ఏమిటో ముందుగా నిర్ధారణ చేసుకోవాలి. షుగర్ ఉంటే కూడా ఇలా కొన్ని సందర్భాల్లో కావచ్చు. ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోండి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లు ఉన్నాయేమో చూడాలి. యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సు వాడకపోతే కూడా ఇన్ఫెక్షన్స్ ఇలా తిరగబెడతాయి. ఒకవేళ యాంటీబయాటిక్స్ పూర్తికోర్సు వాడకపోతే డాక్టర్ చెప్పిన మోతాదులో మూడు నెలల పాటు అవి వాడాలి. ఇన్ఫెక్షన్స్ తరచూ తిరగబెట్టకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు (రోజూ రెండు నుంచి మూడు లీటర్లు) తాగుతుండాలి. మూత్రవిసర్జనను ఆపుకోకూడదు. ఒకసారి మీరు డాక్టర్‌కు చూపించుకోండి. మూత్రం ఎర్రగా వస్తోంది? భవిష్యత్తులో సమస్యా? నాకు 34 ఏళ్లు. అప్పుడప్పుడూ మూత్రం ఎర్రగా వస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఇలా జరుగుతోంది. రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? మీరు చెప్పినట్లుగా మూత్రంలో రక్తం చాలాసార్లు పోతుంటే... ఎందువల్ల ఇలా జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవాలి. ఇలా మాటిమాటికీ మూత్రంలో రక్తస్రావం అవుతుండటానికి కిడ్నీలో రాళ్లు ఉండటం, ఇన్ఫెక్షన్ ఉండటం, కిడ్నీ సమస్య లేదా మరేదైనా కిడ్నీ సమస్య (గ్లోమెరూలో నెఫ్రైటిస్ వంటిది) ఉండవచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోండి. మూత్రపరీ„ కూడా చేయించుకోవాలి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్ గానీ లేకుండా ఇలా రక్తం వస్తుంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమోనని కూడా చూడాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఒకవేళ రక్తంతో పాటు ప్రోటీన్ కూడా పోతుంటే కిడ్నీ బయాప్సీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినకుండా ఉండేందుకు మందులు వాడాల్సి ఉంటుంది. డయాలసిస్ తర్వాత చర్మంపై దురద... ఏం చేయాలి? నా వయసు 42 ఏళ్లు. ఒక ఏడాదిగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నాను. నాకు ఈమధ్య విపరీతంగా చర్మం దురద పెడుతోంది. ఎందుకిలా జరుగుతోంది? దురద రాకుండా ఉండటానికి ఏం చేయాలి? డయాలసిస్ చేయించుకునే పేషెంట్స్‌లో చర్మం పొడిగా అవుతుంది. అంతేకాకుండా వాళ్ల రక్తంలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటంవల్ల కూడా దురద ఎక్కువగా వస్తుంటుంది. చర్మం పొడిగా ఉన్నవాళ్లు స్నానం తర్వాత చర్మంపై వాజిలేన్ లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. రక్తంలో ఫాస్పరస్ తగ్గించే మందులు తీసుకోవడంతో పాటు ఆహారంలో పాల ఉత్పాదనలు, మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. రక్తహీనత ఉన్నవాళ్తు రక్తం పెరగడానికి మందులు వాడాలి. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
చర్మ సౌందర్యానికి పుచ్చకాయ
టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసంలో 1 టేబుల్ స్పూన్ తేనెని కలిపి ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాలు పాటు ఆరనిచ్చి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇది మీ చర్మానికి కావాల్సిన తేమను సమకూర్చి మీ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసంలో 1 టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ముఖంపై పట్టించాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, కోమలంగా మార్చేస్తుంది. టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసంలో గుజ్జుగా చేసిన అవకాడో పండుని కలిపి ఈ మిశ్రమాన్ని మీ ముఖం మెడ మీద పట్టించాలి. 20 నిమిషాలు తర్వాత మీ ముఖాన్ని చల్లని నీటితో కడగాలి. -
ఎండ బాధలకు చర్మగీతం
వేసవి తీవ్రత పెరుగుతూ పోతోంది. మనం ఎండలోకి వెళ్లగానే చర్మం మండుతున్నట్లు అనిపిస్తుంది. దాని తీవ్రతను మొదట తెలియజెప్పే జ్ఞానేంద్రియమూ చర్మమే. కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్తే మొదట ప్రభావితమయ్యేది చర్మమే. చర్మానికి ఈ సీజన్లో వచ్చే సాధారణ సమస్యలు, వాటినుంచి కాపాడుకోవడం ఎలా అన్న అంశాలపై అవగాహన కలిగించడం కోసమే ఈ ప్రత్యేక కథనం. అసలు ఎండ అంటే ఏమిటో చూద్దాం... తీక్షణమైన కాంతితో మనకు హాని ఎందుకు కలుగుతుందో తెలుసుకునే ముందు అసలు కాంతి అంటే ఏమిటో చూద్దాం. మన భూమికి చేరే రేడియేషన్‌లో మనం చూడగలిగేదీ చూడటానికి ఉపయోగపడేది చాలా చాలా తక్కువ. సూర్యుడి నుంచి వచ్చే కాంతి అంతా రేడియేషన్ అంతా తరంగాల రూపంలో మనకు చేరుతుంది. ఇందులో రేడియో తరంగాలూ, ఎక్స్–కిరణాలూ, మైక్రోవేవ్ తరంగాలూ ఇలా ఎన్నెన్నో ఉంటాయి. దీన్నింతా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ అంటారు. అయితే ఇందులో వేర్వేరు కిరణాలకు వేర్వేరు వేవ్‌లెంగ్త్ ఉంటుంది. అంటే కాంతి కిరణంలోని పక్కపక్కనే ఉండే అలలోని... ఒక పీక్‌కూ, మరో పీక్‌కూ మధ్యనున్న దూరాన్ని వేవ్లెంగ్త్గా చెప్పుకుంటే మన కళ్లకు కనిపించే కాంతి చాలా పరిమితమైన వేవ్లెంగ్త్తోనే ఉంటుంది. మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే 400 – 700 నానో మీటర్ల రేంజ్లో ఉండే దాన్ని మాత్రమే మనం కాంతిగా పేర్కొంటాం. అంతకంటే తక్కువ వేవ్‌లెంగ్త్‌తో ఉండే కిరణాలను అల్ట్రా వయొలెట్ కిరణాలుగానూ, అంతకంటే ఎక్కువ వేవ్‌లెంగ్త్‌తో ఉండేవాటిని ఇన్ఫ్రా రెడ్ కిరణాలుగానూ చెబుతుంటారు. ఈ అన్ని వేవ్‌లెంగ్త్‌లతో కూడిన రేడియేషన్ కాంతి తీక్షణంగా, ప్రకాశవంతంగా కాయడమే ఎండ. మధ్యాన్నం 2 నుంచి 3 గంటల సమయంలో వెలువడే కిరణాలు చాలా హానికరం. సూర్యుడి నుంచి మన కంటి వరకు చేరే రేడియేషన్‌లోని చాలా హానికారక కిరణాలను ఓజోన్‌పొర వడపోస్తుంది. కేవలం 3 శాతం అల్ట్రా వయొలెట్ కిరణాలు మాత్రమే భూమి ఉపరితలం వరకు చేరతాయి. మానవులపై అల్ట్రావయొలెట్ కిరణాల ప్రభావం ఇలా... మామూలు కాంతిని మినహాయిస్తే... మనల్ని చేరే అల్ట్రా వయొలెట్ కిరణాల వల్ల చర్మంపై దుష్ప్రభావాలు ఉంటాయి. ఇక యూవీ–సి వల్ల కలిగే అనర్థాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. అత్యంత ప్రమాదకరమైన యూవీ–సీ అల్ట్రా వయొలెట్ కిరణాలు చాలా చాలా ప్రమాదకరమైనవి. అవి కొన్నిసార్లు ప్రాణాలకు సైతం ముప్పు కలిగించవచ్చు. చర్మంపై ప్రసరించినప్పుడు స్కిన్–క్యాన్సర్‌గానూ పరిణమించవచ్చు. అదృష్టవశాత్తు యూవీ–సీ రకానికి చెందిన కిరణాలను ఓజోన్ పొర అడ్డుకొని సకల జీవరాశినీ కాపాడుతుంటుంది. మనం ముందుగా చెప్పుకున్నట్లు 400 – 700 న్యానోమీటర్ల మేరకు ఉన్నదే కాంతి. అంతకు మించిన వేవ్లెంత్తోగానీ, అంతకు తగ్గిన వేవ్‌లెంత్‌తో గాని అంటే అల్ట్రావయొలెట్, ఇన్ఫ్రారెడ్ కిరణాలతో మన చర్మానికి ఎంతో ప్రమాదం అని తెలుసుకోవాలి. మన చర్మం తీవ్రమైన ఎండలోని తీక్షణ కాంతి కిరణాలను కొంతవరకు తట్టుకోలేదు. మనం సాధారణంగా తట్టుకోగల కాంతికిరణాలను మించిపోయి ఆ వేవ్లెంత్ ఫ్రీక్వెన్సీ 308 నానోమీటర్లు ఉన్నప్పుడు మన చర్మం ప్రభావితమవుతుంది. అయితే ఇక్కడ తట్టుకునే ప్రభావం కూడా వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు నల్లటిచర్మం (డార్క్ స్కిన్) ఉన్నవారు ఎండ తీవ్రత ఒకింత తీక్షణంగా ఉన్నా తట్టుకోగలరు. కానీ చర్మం రంగు తగ్గుతున్నకొద్దీ అంటే చర్మం ఫెయిర్‌గా అవుతున్న కొద్దీ ఎండ తీవ్రతను తట్టుకునే శక్తి తగ్గుతుంది. అందుకే తెల్లటి చర్మం (ఫెయిర్ స్కిన్) ఉన్నవారు ఎండ తీవ్రతకు చాలా త్వరగా ప్రభావితమవుతారు. ఎండ తీవ్రత ప్రభావం రెండు రకాలుగా ఉంటుంది. మొదట తీవ్రమైన ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు మన చర్మం నల్లబారుతుంది. తొలుత ఇది తాత్కాలికం. ఎండకు వెళ్లడం తగ్గిస్తే ఇలా నల్లబారడమూ తగ్గుతుంది. ఇలా చర్మం నల్లబారడాన్ని పిగ్మెంటేషన్ అంటారు. తొలి దుష్ప్రభావం సన్‌బర్న్స్ రూపంలో... వైద్యపరిభాషలో ఎరిథిమా అని పిలిచే ఈ సమస్యను సాధారణ పరిభాషలో సన్బర్న్స్గా చెబుతారు. సాధారణంగా సూర్యుడి తీక్షణత ప్రభావం వల్ల ఎండలోకి వెళ్లగానే మొదట చర్మం ఎర్రగా మారుతుంది. ఆ తర్వాత మాడినట్లుగా నల్లబడుతుంది. కొన్ని సందర్భాల్లో చర్మంపైన ఎర్రగా పొక్కుల (బ్లిస్టర్స్) రూపంలోనూ ఇది వ్యక్తం కావచ్చు. చర్మం రంగును బట్టి కూడా దీని తీవ్రత తగ్గడం, పెరగడం ఉంటుంది. ఫెయిర్ చర్మం వారిలో సన్‌బర్న్ తీవ్రత ఎక్కువగానూ, నల్లటి చర్మం వారిలో తక్కువగానూ ఉంటుంది. బ్లిస్టర్స్ ఏర్పడితే దీని తీవ్రత ఎక్కువగా ఉందనడానికి సూచన. కొందరిలో భౌతిక లక్షణాలైన జ్వరం, వికారం, వాంతులు, నిస్సత్తువ కూడా కనిపించవచ్చు. కొందరిలో రక్తపోటు తగ్గడం, స్పృహతప్పడం కూడా జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రోగిని హాస్పిటల్‌కు తరలించాలి. చికిత్స: సన్‌బర్న్‌కు గురై చర్మం ఎర్రబారిన వారిని తక్షణం నీడకు తీసుకెళ్లాలి. కేవలం 12 – 24 గంటలు చల్లటిప్రాంతంలో ఉన్నా లేదా ఎయిర్‌కండిషన్ గదిలో ఉన్నా వారి లక్షణాలు వాటంతట అవే మాయమవుతాయి. చర్మంపై చల్లటి నీటిలో తడిపిన టవల్‌తో తుడవటం లాంటివీ చేయవచ్చు. అయితే సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డర్మటాలజిస్టుల సూచన మేరకు నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీస్), చర్మపు మంట తగ్గడానికి హైడ్రోకార్టికోసోన్ క్రీములు వాడాల్సిరావచ్చు. పొక్కులను పగలగొట్టకూడదు. మాయిశ్చరైజింగ్ క్రీములతో ఈ సమస్య తగ్గుతుంది. పిగ్మెంటేషన్ ఎండలో చర్మం రంగు నల్లబారడాన్ని పిగ్మెంటేషనగా చెప్పవచ్చు. యూవీ–ఏ, యూవీ... ఈ రెండింటి వల్ల చర్మంలోని మెలనిన్ కణాల్లో ఫొటోపిగ్మెంటేషన్ చర్య జరగడంవల్ల చర్మం రంగు నల్లగా మారుతుంది. అయితే దీని తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు అంటే... ఇమ్మిడియట్ పిగ్మెంటేషన్ డార్క్నెస్ (ఐపీడీ)లో నీడపట్టుకు వచ్చినప్పుడు కేవలం రెండు గంటల్లో దీని ప్రభావం తగ్గుతుంది. కానీ అదేపనిగా ఎండకు తిరిగే వారిలో తాత్కాలిక ఐపీడీ స్థానంలో పెరిసిస్టెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ (పీపీడీ) అనే కండిషన్ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడ్డప్పుడు దీని ప్రభావం కొద్ది రోజులు మొదలుకొని, కొన్ని వారాల వరకు ఉండవచ్చు. నీడపట్టున ఉండటమే దీనికి నివారణ. పెరిసిస్టెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ (పీపీడీ) ఏర్పడినప్పుడు, ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా ఆ తర్వాత కూడా ఇంకా అదేపనిగా ఎండలో తిరగడం మంచిది కాదు. చెమటకాయలు (మిలీరియా) వైద్యపరిభాషలో మిలీరియా అని పిలిచే ఈ పరిణామంలో చర్మంపై ఉండే స్వేదగ్రంథుల్లో అడ్డంకి ఏర్పడి అవి ఉబ్బినట్లుగా అవుతాయి. బాగా చెమట పట్టినప్పుడు అది ఆవిరైపోయే పరిస్థితి లేనప్పుడు స్వేదగ్రంధుల చివర్లో చెక్కరతో కూడిన పదార్థం (పాలీశాకరైడ్ సబ్‌స్టాన్స్) రూపొంది అది చర్మగ్రంధి చివర అడ్డుగా నిలుస్తుంది. దాంతో లోపల ఉన్న స్వేదం బయటికి రాకుండా ఉండిపోయి, స్వేదగ్రంథిలో ఒత్తిడి పెంచుతుంది. ఫలితంగా స్వేదం పక్క కణజాలాల్లోకి స్రవించి చెమటకాయలు అదేపనిగా విస్తరించినట్లుగా అవుతాయి. అయితే పడకకే పరిమితమైన (బెడ్ రిడెన్) రోగుల్లో చెమట విపరీతంగా పట్టడం, వారు ఒళ్లు కదిలించలేకపోవడంతో ఇవి ఎక్కువగా వస్తుంటాయి. దీనిలోనూ మిలీరియా క్రిస్టలైన్ (సుడామినా), మిలీరియా రుబ్రా (ప్రిక్లి హీట్) ఉంటాయి. మిలీరియా క్రిస్టలైన్లో వీటి తీవ్రత అంతగా లేనప్పుడు చర్మంపై మంట ఉండదు. కానీ మిలీరియా రుబ్రాలో చెమటకాయలు ఎర్రగా చేతికి తగులుతూ ముళ్లతో గుచ్చిన ఫీలింగ్‌తో మంటనూ, తిమ్మిర్ల వంటి భావనను కలిగిస్తాయి. అవి మెడ, ఛాతీ, వీపు భాగంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక మిలీరియా పుస్టులోజా అనే కండిషన్ మరింత తీవ్రమైనది. ఇందులో స్వేదగ్రంధిలోని స్వేదనాళానికి అడ్డంకి ఏర్పడటంతో పాటు అది దెబ్బతినడం కూడా జరగవచ్చు. ఇవి చర్మంలోని ఛాతీ, వీపు ప్రాంతాలలో పాటు ప్రైవేట్ పార్ట్స్‌లో కూడా విస్తరించవచ్చు. ఇది కొన్ని వారాల పాటు ఉంటుంది. చికిత్స: చల్లటి ప్రదేశాల్లో ఉండటం, క్రమం తప్పకుండా స్నానం చేయడం, ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి చర్యలతో దీన్ని నివారించవచ్చు. పిల్లలకు లేదా పెద్దలకు వాడే డస్టింగ్ పౌడర్, ప్రిక్లీ హీట్ పౌడర్లతోనూ ఉపశమనం ఉంటుంది. ఎండ నుంచి చర్మానికి రక్షణ ఇలా... ►ఈ సీజన్లో ప్రతి రోజు రెండుపూటలా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం మంచిది. ►ఎండలో బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా గొడుగు తీసుకెళ్లాలి. ఈ సీజన్లో మనం వేసుకునే దుస్తులు లైట్ కలర్లో ఉండాలి. గాలి ఆడే కాటన్ దుస్తులు, ఎండ తగలనివ్వని లాంగ్‌స్లీవ్స్ దుస్తులు వాడటం మేలు. ►యాంటీ ట్యానింగ్ సన్‌స్క్రీన్స్, ఇన్ఫ్రారెడ్ యూవీ – ఏ అండ్ బీ రేడియేషన్ నుంచి రక్షణ ఇచ్చే సన్‌స్క్రీన్స్ వాడుకోవచ్చు. ఈ వేసవిలో ఎస్పీఎఫ్ ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ లోషన్లను డాక్టర్ చెప్పిన రీతిలో పద్ధతిగా వాడాలి. తమ చర్మానికి అనుగుణంగా వాడుకోవాల్సిన సన్‌స్క్రీన్‌ను డాక్టర్లు సూచిస్తారు. ఈ క్రీములను బయటకు వెళ్లడానికి అరగంట ముందు రాసుకోవడం వల్ల ఎండలోని హానికరమైన కిరణాలనుంచి అవి చర్మాన్ని ప్రభావపూర్వకంగా రక్షించగలుగుతాయి. అయితే ప్రతి మూడు గంటలకు ఒకసారి ఈ క్రీములు వాడాలి. ►ఇక రాత్రి వేళల్లో డాక్టర్ సలహా మేరకు డీ–పిగ్మెంటేషన్ క్రీమ్స్ వాడటం వల్ల చర్మం నల్లబడకుండా ఉంటుంది. ఇక ఈత వంటి ఆటల్లో పాల్గొనే వారు వాటర్ప్రూట్ సన్‌స్క్రీన్స్ వాడాల్సి ఉంటుంది. ►కళ్ల సంరక్షణ కోసం నాణ్యమైన అద్దాలు వాడటం మేలు. అలాగే తలకు టోపీని వాడవచ్చు. సూర్యకిరణాలు నేరుగా ముఖానికి తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లజోళ్లలో అమర్చుకునే స్వెట్ ప్యాడ్స్ క్రమం తప్పకుండా మార్చుకునేలా జాగ్రత్త తీసుకోవాలి. ►చర్మం తన సాగేగుణాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు, ద్రవాహారాలు తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 12 గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగాలి. ఈ సీజన్లో నీళ్లతో పాటు మజ్జిగ (బటర్‌మిల్క్), కొబ్బరినీళ్లు, పండ్ల రసాల వంటి ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. కోలా డ్రింక్స్ వంటివి చర్మానికి హాని చేస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. ►తలకు రంగు వేసుకునే వారు సీజన్ మొదలు కావడానికి ముందే వేసుకోవడం మంచిది. లేదా చల్లటి వేళల్లో వేసుకోవాలి. ►స్విమ్మింగ్ చేసేవారు వాటర్ రెసిస్టెంట్ సన్‌స్క్రీన్ వాడాలి. ►వింటర్లో కోల్డ్ క్రీమ్స్ రాసుకున్నట్లే.... సమ్మర్లో మాయిశ్చరైజింగ్ క్రీమ్‌లు అవసరమవుతాయి. అవి చర్మంపై ఉండే తేమను కాపాడతాయి. వింటర్లో అయితే ఆయిల్ ఇన్ వాటర్ టైపు క్రీములు వాడతారు. సమ్మర్లో వాటర్ ఇన్ ఆయిల్ టైప్ ఆఫ్ క్రీములు వాడాలి. ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండే క్రీములు వాడాలి. క్రీమ్ కంటే లోషన్ రూపంలో ఉండేవి వాడితే మంచిది. ►ఇక డియోడరెంట్స్ వాడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా డియోడరెంట్స్‌లో బర్గ్యాప్టెన్ అనే సోరోలెన్స్ పదార్థం ఉంటుంది. దాంతోపాటు దీనికి మంచి సువాసన (ఫ్రాగ్రెన్స్) రావడానికి కొన్ని రసాయనాలు వాడతారు. ఎండాకాలంలో చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల ఇవన్నీ చర్మంపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. కాబట్టి నేరుగా డియోడరెంట్స్ చర్మంపై రాసుకోవడం కంటే ఫ్రాగ్రెన్స్‌ను కోరుకునేవారు వాటిని బట్టలపై (స్ప్రే చేసుకునేలా) వేసుకుంటే మంచిది. అందునా బట్టలు ధరించకముందే వాటిపై స్ప్రే చేసి... ఒక అరగంట తర్వాత వాటిని ధరించాలి. అలా ఉపయోగిస్తే చర్మానికి కలిగే హానిని తగ్గించినట్లు అవుతుంది. ►ఈ సీజన్లో వెంట్రుకలు, జుట్టు పొడిబారిపోతాయి. కాబట్టి తలకు నూనె రాయడం మేలు చేస్తుంది. అయితే కొంతమంది తల చల్లబడటానికి మెంథాల్ కలిసిన ఆయిల్‌ను వాడతారు. ఇది వారి వ్యక్తిగత ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ►సాధారణంగా ఈ సీజన్లో బిగుతుగా ఉన్న వస్తువులు ధరించడం వల్ల చెమట పట్టడంతో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా మెటల్స్ వల్ల కలిగే అలర్జిక్ రియాక్షన్స్ వల్ల దురద వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరికొందరిలో ఉంగరం ఉన్న చోట సబ్బు నురగ ఇరుక్కుపోయి... అక్కడ డిటర్జెంట్ వల్ల అలర్జీ రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో తమకు సరిపడని... అంటే అలర్జీ కలిగించే వాటిని గుర్తించి, అలాంటి వాటిని ధరించకుండా దూరంగా ఉంచాలి. అలాగే మన ఆభరణాలు మరీ బిగుతుగా లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. యూవీతో దీర్ఘకాలిక పరిణామాలు ఫొటో ఏజింగ్: అదేపనిగా ఎండలో తిరగడం వల్ల కొన్ని అవాంఛనీయ దీర్ఘకాలిక పరిణామాలు ఏర్పడతాయి. అందులో ముఖ్యమైనది ఫొటోఏజింగ్. ఫొటోఏజింగ్ వల్ల చర్మంపై అవాంఛితమైన ముడతలు, వెడల్పుగా ప్యాచ్ వచ్చిన రీతిలో ఏర్పడే మచ్చలు (సోలార్ లెంటిజిన్స్), చర్మం తన సాగే గుణాన్ని కోల్పోవడం, చర్మంపైన రక్తనాళాలు దారపు పోచల్లా కనిపించడం (టెలాంజిక్టాసియాస్ – అవే తర్వాత సాలెగూళ్లలా అల్లుకుని కనిపిస్తాయి. వాటినే స్పైడర్ వెయిన్స్ అంటారు), చర్మం ఎండిపోయినట్టుగా అనిపించడం వంటి పరిణామాలు ఏర్పడతాయి. ఆ తర్వాత చర్మం చాలా ముదురుగా రఫ్‌గా కనిపిస్తుంది. అందుకే ఈ దశలోనైనా అదేపనిగా ఎండకు వెళ్లకుండా చర్మాన్ని కాపాడుకోవాలి. తద్వారా ఫొటో ఏజింగ్‌ను నివారించవచ్చు. యూవీకి ఎక్స్పోజ్ కావడం దీర్ఘకాలం కొనసాగితే మరిన్ని అనర్థాలు కూడా ఏర్పడే అకాశాలు ఉన్నాయి. హాని కలిగేది అల్ట్రా వయొలెట్, ఇన్ఫ్రా రెడ్ కిరణాలతోనే... మనకు చేరే కాంతితో పాటు మన వాతావరణంలో ప్రసరిస్తూ, ప్రవహిస్తూ ఉండే అల్ట్రా వయొలెట్, ఇన్ఫ్రా రెడ్ కిరణాలతో మన చర్మానికీ, కంటికి కూడా హాని కలిగే ప్రమాదం ఉంది. పైగా వేసవిలో ఈ కిరణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం వల్ల అమితమైన శక్తితో ఉండే ఈ కిరణాలు కంటికి హాని చేసే అవకాశాలు ఎక్కువ. అల్ట్రా వయొలెట్లో మూడు రకాలు కంటికి హాని చేయగల అల్ట్రా వయొలెట్ కిరణాల (యూవీ రేస్)ను మూడగా విభజించవచ్చు. అవి... యూవీ – ఏ (వీటి ఫ్రీక్వెన్సీ 320 – 400 న్యానో మీటర్లు)... తక్కువ శక్తిమంతమైనవి. యూవీ – బీ (వీటి ఫ్రీక్వెన్సీ 280 – 320 న్యానో మీటర్లు)... ప్రమాదకరమైనవి. యూవీ – సీ (వీటి ఫ్రీక్వెన్సీ 200 – 280 న్యానో మీటర్లు)... అత్యంత ప్రమాదకరం. మళ్లీ యూవీ–ఏ లో రెండు ఉప–రకాలు ఉంటాయి. అవి.. 340 – 400 న్యానో మీటర్ల వేవ్‌లెంత్‌తో ఉన్నవి యూవీ–ఏ1 అంటారు. 320 – 340 యూవీ–ఏ2 అంటారు. ఇన్ఫ్రా రెడ్ కిరాణాలూ మూడు రకాలు ఇన్ఫ్రారెడ్ – ఏ (వీటి ఫ్రీక్వెన్సీ 700 – 1400 న్యానో మీటర్లు) ఇన్ఫ్రారెడ్ – బీ (వీటి ఫ్రీక్వెన్సీ 1400 – 3000 న్యానో మీటర్లు) ఇన్ఫ్రారెడ్ – సీ (వీటి ఫ్రీక్వెన్సీ 3000 న్యానో మీ. – 1 మిల్లీమీటర్లు) ఇక అన్ని రకాల ఇన్ఫ్రారెడ్ కిరణాలూ చర్మానికి చాలా హానికరమైనవి. చర్మంపై అల్ట్రావయొలెట్ కిరణాల ప్రభావం ఇలా... యూవీ కిరణాలతో తాత్కాలిక ప్రభావాలు ►ఎరిథిమా (సన్‌బర్న్స్) ►పిగ్మెంటేషన్ (తక్షణం కనిపించేది ఇమ్మీడియట్ డార్క్పిగ్మెంటేషన్ (ఐపీడీ) / అదేపనిగా చాలాకాలంఎక్స్పోజ్ అయినప్పుడు కనిపించేది పెరిసిస్టెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ (పీపీడీ) యూవీలతో దీర్ఘకాలిక ప్రభావాలు ►ఫొటో ఏజింగ్ ►ఇమ్యూనోసప్రెషన్ ►ఎగ్సాసెర్బేషన్ ఆఫ్ఫోటోడెర్మటోసిస్ డాక్టర్ స్వప్నప్రియ డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
బ్యూటిప్
ఎంత చక్కని ముఖ కవళికలు ఉన్నా... చర్మం మీద మొటిమల మచ్చలు, గీతలు ఉంటే అందం మరుగున పడిపోతుంది. అందుకే ఇంట్లోనే కొద్దిపాటి శ్రద్ధ తీసుకుంటే మీ ముఖారవిందం మీకే కనువిందు చేస్తుంది. ∙ఒక టేబుల్ స్పూన్ తేనెలో టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే మూడు వారాలకు ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖం మీదున్న నల్ల గీతలు, మచ్చలు తొలగిపోయి చంద్రబింబంలా మారుతుంది. ∙ఒక టేబుల్ స్పూన్ బంగాళదుంప తురుములో ఐదారు చుక్కల నిమ్మరసం, అంతే మోతాదులో తేనె కలిపి ముఖానికి పట్టించాలి. కొంచెం మంటగా ఉంటుంది. కాబట్టి ముఖమంతా పట్టించవద్దనుకుంటే మచ్చల మీద మాత్రమే రాయవచ్చు. ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. అయితే పిగ్మెంటేషన్, సన్‌బర్న్ వంటి సమస్యలకు పై ప్యాక్‌ను ముఖమంతా వేస్తే మంచి ఫలితం ఉంటుంది. ∙వేపాకులను పచ్చిగా కాని ఉడికించి కాని పేస్టు చేసి ముఖానికి రాస్తే మచ్చలు, గుల్లలు విస్తరించకుండా తగ్గిపోతాయి. -
రెట్టింపు అందం
ముఖంపైన మృతకణాలను తొలగించి, ఆకర్షణీయంగా మార్చడంలో సహజమైన చిట్కాలదే ప్రథమస్థానం అంటున్నారు నిపుణులు. రోజూ ఖరీదైన ఫేస్ క్రీమ్స్, లోషన్స్ అప్లై చేసుకుని, వారానికోసారి బ్యూటీ పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా... చక్కగా ఓ 30 నిమిషాలు ఫేస్ ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది. మరింకెందుకు ఆలస్యం..? ఇలా ప్రయత్నించండి! కావాల్సినవి : క్లీనప్ : కీరదోస జ్యూస్ – 2 టేబుల్ స్పూన్లు, తేనె – అర టీ స్పూన్ స్క్రబ్ : ఓట్స్ – 2 టీ స్పూన్లు, కొబ్బరి పాలు – 2 టీ స్పూన్ మాస్క్: కమలా తొక్కల పొడి – 1 టీ స్పూన్, గడ్డ పెరుగు – 1 టీ స్పూన్, అరటిపండు గుజ్జు – 1 టీ స్పూన్ తయారీ : ముందుగా కీరదోస జ్యూస్, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్, కొబ్బరిపాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు కమలా తొక్కల పొడి, గడ్డపెరుగు, అరటిపండు గుజ్జు బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
మేకప్‌తో మెరుగులు
వస్త్రధారణకు తగ్గట్టు మేకప్ ఉంటేనే అందంగా కనిపిస్తారు. అయితే, మేకప్ ఎలా ఉండాలంటే... ►సమకాలీన పరిస్థితులను అనుసరిస్తూ ఫ్యాషన్‌లోనూ, మేకప్‌లోనూ ట్రెండ్స్‌ను పరిశీలిస్తూ మేనికి నప్పే సౌందర్య ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోవాలి. ►మేకప్‌లో ఫౌండేషన్‌ను ఎక్కువ ఉపయోగిస్తుంటారు. దీని వల్ల జిడ్డు చర్మానికి ఫౌండేషన్ మరింతగా అతుక్కుపోయి, సహజకాంతిని దూరం చేస్తుంది. ►పెదవులకు ముదురు రంగు లిప్‌స్టిక్‌లను వాడితే వయసు పైబడినట్టుగా చూపిస్తాయి. అసహజంగానూ కనిపిస్తాయి. తప్పనిసరై ముదురు రంగు లిప్‌స్టిక్ వాడితే, పైన లిప్‌గ్లాస్ సహజసిద్ధమైనది ఎంచుకోవాలి. ►మేకప్ అంటే పెదవులకు గాఢమైన ముదురు రంగు, కనురెప్పలకు మెరుపులద్దే షిమ్మర్‌ని ఉపయోగించాలనుకోకూడదు. ముఖంలో పెదవులు, కళ్లు, బుగ్గలు.. ఇలా ప్రతి భాగాన్ని అత్యంత జాగ్రత్తగా చిత్రకారుడు బొమ్మను గీసినంత అందంగా తీర్చిదిద్దాలి. ►ఎప్పుడైనా ముఖం సహజమైన మెరుపుతో కనిపించాలి. ఇందుకోసం అత్యంత తక్కువ మేకప్‌ను ఎంచుకోవాలి. -
అవాంఛిత రోమాలు తొలగాలంటే...
పసుపును సంప్రదాయకంగా ముఖానికి రాసుకుంటారు. ఇది మన చర్మం పై ఉండే అవాంచిత రోమాలను తొలగించడంలో ఎంతో సహాయ పడుతుంది. శెనగపిండిని కొద్దిగా పసుపు, పెరుగుతో కలిపి ముఖానికి రాసుకుంటే ఎంతో ప్రభావవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. సహజ నివారణలు వాడటం వలన ఎలాంటి దుష్పభ్రావాలు ఉండవు. చక్కెర మిశ్రమంతో... ఇది కొంచం తక్కువ ఖర్చుతో ఇళ్లలో వ్యాక్సింగ్ చేసుకునే ఒక పద్దతి. కొద్దిగా చక్కెర లో కొంచెం తేనె మరియు నిమ్మ రసం కలిపి ఈ మిశ్రమం ముఖంపై రాసుకోవాలి. దీన్ని ఒక క్లాత్ తో తొలగించాలి. ఈ చిట్కా చాలా బాగా పని చేస్తుంది. ఎగ్ మాస్క్ గుడ్డులోని తెల్లసొనను ఒక గిన్నెలో వేసి అందులో చెంచాడు పంచదార, అర చెంచాడు మొక్కజొన్న పిండి కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని ముఖం పై రాసుకుని కొద్దిసేపు ఆరనివ్వాలి. తర్వాత ఒక మాస్క్ లా మారిన దీన్ని మెల్లగా తీసివేస్తే దానితోపాటు ఈ అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి. ఈ పద్ధతి మంచి ఫలితాలనిస్తుంది కానీ కొద్దిగా నొప్పి ఉండచ్చు. -
ఇంత చిన్న పాపకు డయాబెటిసా?
మా పాపకు ఆరేళ్లు. ఎప్పుడూ దాహం అంటూ ఉంటే తరచూ నీళ్లు తాగించేవాళ్లం. చర్మంపై ర్యాష్ వచ్చింది. మా డాక్టర్ గారికి ఎందుకో అనుమానం వచ్చి షుగర్ టెస్ట్ చేయించారు. పాపకు డయాబెటిస్ అని చెప్పారు. ఇంత చిన్నపిల్లల్లోనూ డయాబెటిస్ వస్తుందా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. – డి. పావని, కాకినాడ మీ పాప కండిషన్‌ను జ్యూవెనైల్ డయాబెటీస్ అంటారు. దీన్నే టైప్ ఒన్ డయాబెటిస్ అని కూడా అంటారు. ఇది నెలల పిల్లలకూ రావచ్చు. డయాబెటిస్ రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో జన్యుపరంగా సంక్రమించడం ఒక కారణం. ఒకసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది. అంతవూత్రాన ఆందోళనపడాల్సిందేమీ లేదు. వీళ్లలో చక్కెర నియంత్రణ చేస్తూ ఉంటే మిగతా అందరు సాధారణమైన పిల్లల్లాగానే వీళ్లూ పెరిగి తవు ప్రతిభాపాటవాలు చూపుతారు. ఇలాంటి పిల్లల్లో మందుల ద్వారా, ఆహారం ద్వారా డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. పిల్లల్లోనే ఇలా డయాబెటిస్ రావడానికి జన్యుపరమైన కారణాలతో పాటు... కొన్ని రసాయనాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు కారణం అవతాయి. ఇలాంటి పిల్లలకి ఇన్సులిన్ వాడటం తప్పనిసరి. ఈ పిల్లల చేత క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్లు చేయించడం, ఆహారంలో నియమాలు పాటించేలా చేయడం కూడా అవసరం. డయాబెటిస్ ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలు నేర్చుకొని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వీళ్లలో బ్లడ్ షుగర్ లెవల్స్ చెక్ చేయడం వంటివి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. డయాబెటిక్స్ ఉన్న పిల్లలయితే వాళ్లలో సాధారణంగా బరువ# పెరగకపోవడం, విపరీతంగా దాహం వేస్తుండటం, తరచూ వాంతులు కావడం, డీ–హైడ్రేషన్, చర్మంపై ర్యాషెస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పిల్లల్లో చక్కెర నియంత్రణ లేకపోతే పోనుపోనూ రక్తపోటు పెరగడం, వుూత్రపిండాల సమస్యలు. కంటికి సంబంధించిన రుగ్మతలు, కరోనరీ గుండె సవుస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవేవీ రాకుండా జాగ్రత్తపడాలి. భవిష్యత్తులో ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ ద్వారా కాకుండా నోటి ద్వారా లేదా ఇన్హెలేషన్ (పీల్చడం) ద్వారా ఇచ్చే ప్రక్రియలు అందుబాటులోకి రాబోతున్నాయి. పాంక్రియాటిక్ సెల్స్ (ఇన్సులిన్ తయారు చేసే కణాల) మార్పిడి శస్త్రచికిత్స కూడా పరిశోధన దశలో ఉంది. అలాంటి చికిత్స వూర్గాలు అందుబాటులోకి వస్తే ఈ పిల్లలకు చికిత్స ప్రక్రియలు వురింత సులువవతాయి. మీరు పీడియాట్రీషియన్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం తప్పనిసరి. పాపకు నత్తి వస్తోంది... తగ్గుతుందా? మా పాప వయసు ఎనిమిదేళ్లు. బాగా చదువుతుంది. అయితే ఇప్పటికీ నాలుక తిరగదు. కొంచెం నత్తిగా మాట్లాడుతుంది. డాక్టర్‌ను కలిస్తే అంతా మామూలు అయిపోతుంది. మాటలు బాగా వస్తాయి, కాకపోతే కాస్త ఆలస్యంగా వస్తాయి అన్నారు. అయితే మా పాప కంటే చిన్నవాళ్లు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మా పాప మామూలుగా మాట్లాడగలుగుతుందా? మాకు తగిన సలహా ఇవ్వండి. – ఆర్. అంజలి, కొత్తగూడెం ఉచ్చారణ విషయంలో మీ పాపకు ఉన్న సమస్యను స్టామరింగ్ లేదా స్టట్టరింగ్ అంటారు. ఈ కండిషన్ ఉన్న పిల్లలు ఒక పదాన్ని ఉచ్చరించే ముందు అదేమాటను పదే పదే పలుకుతూ ఉండటం, లేదా గబుక్కున అనలేక దాన్ని పొడిగించడం, ఒక్కోసారి మాట ఆగిపోవడం కూడా జరగవచ్చు. మన జనాభాలో దాదాపు ఒక శాతం మందికి ఈ సమస్య ఉంటుంది. ఇది అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువ. ఈ సమస్యకు నిర్దిష్టంగా ఇదే కారణం అని చెప్పలేకపోయినా... జన్యుపరమైన, న్యూరోఫిజియలాజికల్ మార్పుల వల్ల ఒక్కోసారి ఈ సమస్య రావచ్చు. ఇలాంటి పిల్లల్లో కొందరికి వినికిడి సమస్య కూడా ఉండవచ్చు. కాబట్టి పై సమస్యలు ఉన్నాయా లేదా అని పరీక్షించడం చాలా ముఖ్యం. పిల్లల మానసిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకోకుండా వారిని ఇతరులతో పోల్చిచూడటం, బాగా రాణించాలని కోరుతూ ఒత్తిడి పెంచడం వంటి కారణాలతో స్టామరింగ్ ఇంకా ఎక్కువ కావచ్చు. మాటలు నేర్చుకునే వయసు పిల్లల్లో స్టామరింగ్ అన్నది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే వాళ్లలో వయసు పెరుగుతున్నకొద్దీ సమస్య తగ్గుతూ ఉంటుంది. పిల్లల్లో ఒకవేళ స్టామరింగ్ ఉంటే... ఐదేళ్లు వచ్చేనాటికి 65 శాతం మంది పిల్లల్లో, యుక్తవయసు వచ్చేదానికి ముందర (అర్లీ టీన్స్‌లో) 75 శాతం మందిలో ఈ సమస్య తగ్గిపోతుంది. ఇలాంటి పిల్లల్లో వాళ్లు చెప్పేది పూర్తిగా వినడం మన బాధ్యత. వాళ్లను తొందరపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. వాళ్లు చెప్పదలచుకున్నది పూర్తిగా చెప్పేలా ప్రోత్సహించడం అవసరం. ఇలాంటి పిల్లలకు నిర్దిష్టంగా ఒకే ప్రక్రియతో సమస్య మటుమాయం అయ్యేలా చేయడం జరగదు. కొన్ని మందులు వాడుకలో ఉన్నా వాటి వల్ల అంతగా ప్రయోజనం లేదు. స్పీచ్ ఫ్లుయెన్సీ, స్టామరింగ్ మాడిఫికేషన్ వంటి స్పీచ్‌థెరపీ ప్రక్రియల ద్వారా మీ పాపకు చాలామటుకు నయమవుతుంది. మీరు మొదట స్పీచ్ థెరపిస్ట్‌ని కలిసి తగు చికిత్స తీసుకోండి. పాపకు ఒంటి మీద మచ్చలు... తగ్గేదెలా? మా పాపకు 13 ఏళ్లు. ఏడాది కిందటినుంచి ఒంటిమీద, ముఖం మీద చాలా మచ్చలు వస్తున్నాయి. ఈ మచ్చలు పోవడానికి ఏం చేయాలి?– ఆర్. మీనాక్షి, విజయవాడ మీ పాపకు ఉన్న కండిషన్ నీవస్ అంటారు. దీన్ని వైద్యపరిభాషలో మల్టిపుల్ నీవస్ అనీ, సాధారణ పరిభాషలో చర్మంపై రంగుమచ్చలు (కలర్డ్ స్పాట్స్ ఆన్ ద స్కిన్) అంటారు. ఇవి రెండు రకాలు. మొదటిది అపాయకరం కానివీ, చాలా సాధారణంగా కనిపించే మచ్చలు. రెండోది హానికరంగా మారే మెలిగ్నెంట్ మచ్చ. ఒంటిపై మచ్చలు పుట్టుకతోనే రావచ్చు. మధ్యలో వచ్చే మచ్చలు 10 నుంచి 30 ఏళ్ల మధ్య రావచ్చు. నీవస్ చర్మానికి రంగునిచ్చే కణాల వల్ల వస్తుంది. ఇది శరీరంలో ఎక్కడైనా (అరచేతుల్లో, అరికాళ్లలో, ఆఖరుకు గోళ్లమీద కూడా) రావచ్చు. సూర్యకాంతికి ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం, కుటుంబ చరిత్రలో ఇలాంటి మచ్చలున్న సందర్భాల్లో ఇది వచ్చేందుకు అవకాశం ఎక్కువ. కొన్ని సందర్భాల్లో నీవాయిడ్ బేసల్ సెల్ కార్సినోమా అనే కండిషన్ కూడా రావచ్చు. ఇది పుట్టుకనుంచి ఉండటంతో పాటు, యుక్తవయస్సు వారిలోనూ కనిపిస్తుంది. వారికి ఈ మచ్చలతో పాటు జన్యుపరమైన అబ్నార్మాలిటీస్ చూస్తుంటాం. అలాంటి వాళ్లకు ముఖ ఆకృతి, పళ్లు, చేతులు, మెదడుకు సంబంధించిన లోపాలు కనిపిస్తాయి. మీ పాపకు ఉన్న కండిషన్‌తో పైన చెప్పినవాటికి సంబంధం లేదు. మీ పాపది హానికరం కాని సాధారణ నీవస్ కావచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. క్యాన్సర్‌గా మారే అవకాశం కూడా చాలా తక్కువ. అయితే... కొన్ని నీవస్‌లు క్రమంగా క్యాన్సర్ లక్షణాలను సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒంటిపై మీ పాపలా మచ్చలు ఉన్నవారు రెగ్యులర్‌గా డెర్మటాలజిస్ట్‌లతో ఫాలో అప్‌లో ఉండటం మంచిది. అది ఎలాంటి మచ్చ అయినా... ఏ, బీ, సీ, డీ అన్న నాలుగు అంశాలు గమనిస్తూ ఉండటం మంచిది. ఏ– అంటే ఎసిమెట్రీ... అంటే పుట్టుమచ్చ సౌష్టవంలో ఏదైనా మార్పు ఉందా?, బీ– అంటే బార్డర్... అంటే పుట్టుమచ్చ అంచుల్లో ఏదైనా మార్పు ఉందా లేక అది ఉబ్బెత్తుగా మారుతోందా?, సీ– అంటే కలర్... అంటే పుట్టుమచ్చ రంగులో ఏదైనా మార్పు కనిపిస్తోందా?, డీ– అంటే డయామీటర్... అంటే మచ్చ వ్యాసం (పరిమాణం) పెరుగుతోందా? ఈ నాలుగు మార్పుల్లో ఏదైనా కనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. అప్పుడు బయాప్సీ తీసి పరీక్ష చేసి అది హానికరమా కాదా అన్నది వారు నిర్ణయిస్తారు. ఇక ఇలాంటివి రాకుండా ఉండాలంటే... ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం పూర్తిగా తగ్గించాలి. హానికారక అల్ట్రావయయొలెట్ కిరణాలు తాకకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేప్పుడు ఎక్కువ ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. మీ పాపకు ఉన్న మచ్చల్ని అప్పుడప్పుడూ డెర్మటాలజిస్ట్‌తో పరీక్ష చేయిస్తూ ఉండటం మంచిది. ఇలాంటి నీవస్‌లు ముఖం మీద ఉండి కాస్మటిక్‌గా ఇబ్బంది కలిగిస్తుంటే... దీన్ని ఎక్సెషన్ థెరపీతో వాటిని తొలగించవచ్చు. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
మృదువైన జుట్టు కోసం...
అరటిపండుని మెత్తగా చేసి అందులో ఒక గుడ్డు, 3 టీ స్పూన్ల మజ్జిగ, 3 టీ స్పూన్ల ఆలివ్ నూనె, 2 టీ స్పూన్ల తేనె కలిపి, జుట్టుకి, మాడుకీ బాగా అంటేలా రాయాలి. అరగంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో కడిగేసుకోవాలి. నెలకి రెండుసార్లు ఈ ప్యాక్‌ను వేసుకుంటే మంచిది. ఒక టీ స్పూన్ తాజా నిమ్మరసం, టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ కలబంద రసం కలిపి తలకి రాసుకోవాలి. అరగంటయ్యాక చన్నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలలో రెండుసార్లు చేస్తే సరి! -
మేనికి బొప్పాయి
ఎండ వేడిమి దాడి చేస్తోంది. దీనికి విరుగుడుగా ఈ కాలం మేని సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ►ఎండవేడికి చర్మం కమిలి, మంట పుడుతుంటే ఉపశమనానికి అలొవెరా జెల్ రాసి, పది నిమిషాలు ఆగి చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ►ఇక ఈ కాలం సన్‌ప్రొటెక్షన్ లోషన్లు, మాయిశ్చరైజర్‌ని ఎంపిక చేసుకొని వాడాలి. వీటిని బయటకు వెళ్లడానికి ముందు 10 నిమిషాల ముందు రాసుకుంటే ఎండబారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. ►ఎండ నుంచి వచ్చిన తర్వాత బొప్పాయి గుజ్జు చర్మానికంతా పట్టించి, మూడు నిమిషాలుంచి కడిగేయాలి. మృతకణాలు తొలగిపోవడమే కాకుండా ఎండవేడిమికి కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. ►శిరోజాలకు వారానికి ఒకసారి కండిషనర్ను తప్పక ఉపయోగించాలి. అరటిపండు గుజ్జును తలకు పట్టించి, పది నిమిషాలు ఉంచి, కడిగేయాలి. దీనివల్ల వెంట్రుకల మృదుత్వం దెబ్బతినదు. ►చర్మం నిస్తేజంగా మారకుండా రోజూ 8–10 గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి. -
చర్మంపై ముడతలు పోవాలంటే..
►చర్మం వదులైతే ముడతలు పడు తుంది. చిన్న చిన్న చిట్కాలతో చర్మం బిగుతుగా ఉండేలా చూసుకోవచ్చు. ►ఆరు స్పూన్లు ఆలివ్ ఆయిల్ తీసుకుని కొద్దిగా వేడి చేసి అందులో చిటికెడు ఉప్పు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కంటి చుట్టూ భాగం వదిలేసి ముఖానికి అప్లై చేయాలి. 10–15 నిమిషాలపాటు చేతి వేళ్ళతో మృదువుగా మర్దన చేసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. -
ట్యాన్ తగ్గాలంటే..
ఎండలు పెరుగుతున్నాయి. ఎండ వల్ల చర్మం కమిలినా, ట్యాన్ ఏర్పడినా, పొడిబారినా.. ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు పాటించి మేనికాంతి నిగారింపు కోల్పోకుండా చూసుకోవచ్చు. మూడు టీ స్పూన్ల దోసరసం, రెండు టీ స్పూన్ల అలొవెరా జెల్, టీ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకు పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండవల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి ఈ ప్యాక్ సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది. అరటిపండు గుజ్జు, 3 టేబుల్ స్పూన్ల పంచదార, పావు టీ స్పూన్ వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ కలిపి మేనికి రాసి, సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత వేడినీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మం మృదువుగా తయారవుతుంది. టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖానికి రాయాలి. వేళ్లతో కొద్దిగా మసాజ్ చేసి, ఐదు నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మలినాలు తొలగి, చర్మం కాంతిమంతం అవుతుంది. -
మలినాలు తొలగించాలంటే..
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏ కాలమైనా చర్మం నల్లబడటం సహజంగా జరుగుతూ ఉంటుంది. చర్మంపై మలినాలు పేరుకోవడం వల్లే ఈ సమస్య. మలినాలు సులువుగా తొలగిపోయి చర్మానికి కాంతి రావాలంటే... రెండు కప్పుల నీళ్లలో మూడు టీ స్పూన్ల కాఫీ గింజలు, టీ స్పూన్ ఉప్పు వేసి పదినిమిషాలు మరిగించాలి. కప్పు కాఫీ అయిన తర్వాత దించి, చల్లారనివ్వాలి. ఈ కాఫీతో శరీరమంతా స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మలినాలు తొలగిపోవడమే కాకుండా, మాయిశ్చరైజర్ లభించి పొడిబారడం సమస్య తగుతుంది. అరకప్పు అరటిపండు గుజ్జు, టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ అలొవెరా జెల్, టీ స్పూన్ పెరుగు, గుడ్డులోని తెల్లసొన.. బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, భుజాలకు రాసుకోవాలి. పది నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత తడి బట్టతో పూర్తిగా తుడిచేసి, శుభ్రపరుచుకోవాలి. పొడి చర్మం మృదువుగా అవుతుంది. మూడు టేబుల్ స్పూన్ల నారింజ రసం, టేబుల్ స్పూన్ పెరుగు, టీ స్పూన్ బాదం నూనె, టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ మలినాలను తొలగిస్తుంది. చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. -
ముఖ కాంతికి...
►కొద్దిగా తులసి ఆకులు, మూడు బచ్చలి ఆకులను కలిపి గ్రైండ్ చేయాలి. దీంట్లో సరిపడా నీటిని జత చేసి పేస్ట్ చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే చర్మం మీ కాంతిమంతం అవుతుంది. ►అర టీ స్పూన్ ఆవాల నూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమన్ని వేళ్లతో కొద్దికొద్దిగా తీసుకుని వలయాకారంలో 10 నిమిషాల పాటు మసాజ్ చేసి, గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే చర్మం నిగారిస్తుంది. ►తెల్ల ఉల్లిపాయని గ్రైండ్ చేసి రసం తీయాలి. దీంట్లో పావు టీ స్పూన్ తేనె, చిటికెడు రాళ్ల ఉప్పు వేయాలి. అది కరిగిన తరవాత ఈ మిశ్రమాన్ని మొటిమల మీద అప్లై చేసి 20 నిమిషాల వరకు ఉంచి చన్నీటితో కడిగేయాలి. మొటిమలు తగ్గుతాయి. ►దాల్చిన చెక్కను పొడి చేయాలి. దీంట్లో కొద్దిగా నీటిని చేర్చి పేస్ట్‌లా కలపాలి. మొటిమలు, మచ్చలు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఆరిన తరవాత కడిగేయాలి. వారానికి ఒక్కసారి ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గి చర్మకాంతి పెరుగుతుంది. ►టేబుల్ స్పూన్ శనగపిండిలో గుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్ గంధం పొడి కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌లు అన్ని రకాల చర్మాల వారికి అనువుగా ఉంటాయి. వారంలో ఒక్కసారి ఈ ప్యాక్‌లను వాడడం వలన చర్మకాంతిలో వచ్చే మార్పు ఇట్టే తెలిసిపోతుంది. ►సగం క్యారట్, ఒక ముక్క నారింజ, అర టేబుల్ స్పూన్ పాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ ప్యాక్ వారంలో ఒకసారి చేయడం వల్ల చర్మకాంతి మెరుగుపడుతుంది. -
ఫ్రూటీ బ్యూటీ
ఆయిలీ స్కిన్... ►నిమ్మరసం సహజమైన క్లెన్సర్. చర్మాన్ని శుభ్రం చేస్తుంది. చర్మంలో అదనపు జిడ్డను తొలగిస్తుంది. ద్రాక్షరసం మృదుత్వాన్నిస్తుంది, కోడిగుడ్డు తెల్లసొన చర్మాన్ని వదులు కానివ్వదు. పదిద్రాక్షపండ్లు, ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డులోని తెల్లసొనను బాగా కలిపి ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది ఆయిలీ స్కిన్‌కు చక్కటి ఫేస్ ప్యాక్. ►రకరకాల పండ్లను, సౌందర్యసాధనాలను కలిపి ప్యాక్ తయారు చేసుకునే సమయం లేనప్పుడు నిమ్మకాయను సగానికి కోసి ఒక చెక్కతో ముఖాన్నంతటినీ రుద్ది పదిహేను నిమిషాల సేపు అలాగే ఉంచి తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. డ్రైస్కిన్ అయితే... ►టీ స్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ వెజిటబుల్ ఆయిల్ కలిపి ముఖానికి, మెడకు రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. కొబ్బరి, వేరుశనగ, నువ్వులు, సన్‌ఫ్లవర్... ఆయిల్ వాడవచ్చు. ►ఒక టీ స్పూన్ తేనెలో టీ స్పూన్ పాలు కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల సేపటికి కడగాలి. రెండు రోజులకొకసారి ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది. నార్మల్ స్కిన్‌కి... ►ఒక కప్పు గుమ్మడికాయ గుజ్జు ఒక కçప్పులో కోడిగుడ్డు వేసి(పచ్చసొనతో సహా) బ్లెండ్ చేసి సగం మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి. మసాజ్ తర్వాత మిగిలిన సగం మిశ్రమాన్ని ప్యాక్ వేసి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఫలితం వెంటనే çకనిపిస్తుంది. దీనిని నార్మల్ స్కిన్‌తోపాటు అన్నిరకాల చర్మానికీ వేయవచ్చు. ►ముఖం మీద నల్లటి మచ్చలుంటే ప్రతిరోజూ క్యారట్ రసం రాస్తుండాలి. వారం రోజులకే మంచి ఫలితం ఉంటుంది. మచ్చలు మాసిపోవడంతోపాటు చర్మం కాంతిమంతమవుతుంది. -
వర్రీ వద్దు వంటిల్లు ఉందిగా...
జడివానలో తడిసినప్పుడు జలుబు దగ్గు చేసినా, ఎండ ధాటికి తలనొప్పి వచ్చినా, చలి తాకిడికి చర్మం పొడిబారినా, బరువులు మోయడం వల్ల చేతులు గుంజినా, తడి నేల మీద పొరపాటున జారడం వల్ల కాలు బెణికినా.. ఇలాంటి చిన్నా చితకా సమస్యలు ఏవి తలెత్తినా ఇటీవలి తరానికి చెందిన జనాలు వైద్యుల కోసం వెంపర్లాడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ పరుగులు తీస్తున్నారు. చిన్న చిన్న జబ్బులకు కూడా పెద్ద పెద్ద ల్యాబుల్లో నానా పరీక్షలూ చేయించుకుంటున్నారు. వ్యాధులు నయం కావడం సరే, జేబులకు భారీ చిల్లులు పడుతున్నందుకు కుమిలిపోతున్నారు. ఇదివరకటి కాలంలోనూ ఎండా వానా చలీ ఉండేవి. రుతువులు మారినప్పుడల్లా కాలానుగుణమైన జబ్బులు మనుషులను ఇబ్బందిపెట్టేవి. అలాగని నాటి తరం వాళ్లెరూ చిన్నా చితకా సమస్యలకు ఆస్పత్రుల చుట్టూ పరుగులు తీసేవారు కాదు. ఎందుకంటే, అప్పట్లో దాదాపు ప్రతి ఇంటిలోనూ అనుభవంతో తలలు పండిన బామ్మలు ఉండేవాళ్లు. పోపుల డబ్బానే మెడికల్ కిట్లా, వంటింటినే క్లినిక్‌లా ఉపయోగించేవాళ్లు. చిన్నా చితకా సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం కలిగించేవాళ్లు. నిన్న మొన్నటి తరం వరకు ఇళ్లల్లో బామ్మలే డాక్టర్లు. వాళ్ల చిట్కాలను మీరూ పాటిస్తే ప్రతి చిన్న సమస్యకూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. రోజువారీ జీవితంలో తలెత్తే చిన్నా చితకా ఆరోగ్య సమస్యలకు డాక్టర్ బామ్మల చిట్కాలు కొన్ని మీ కోసం... తలనొప్పి చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవరికైనా తరచుగా ఎదురయ్యే సమస్య తలనొప్పి. రకరకాల కారణాల వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. చాలామంది మెడికల్ షాపుల్లో దొరికే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడేస్తూ ఉంటారు. సింపుల్‌గా శొంఠికొమ్ముతో సరిపోయే దానికి మెడికల్ షాపుల వరకు వెళ్లడం సరికాదు. శొంఠికొమ్మును నీటితో తడిపి సానరాయి మీద బాగా అరగదీసి, ఆ గంధాన్ని తలనొప్పి ఉన్న ప్రదేశంలో బాగా పట్టిస్తే చాలు. ఆ గంధం గాలికి ఆరిపోయే లోగానే తలనొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. తలనొప్పి నివారణ కోసం శొంఠికొమ్ము కషాయాన్ని కూడా తీసుకోవచ్చు. రెండు కప్పుల నీటిలో రెండు గ్రాముల శొంఠికొమ్మును బాగా నలగ్గొట్టి వేసి, ఆ నీరు సగం అయ్యేంత వరకు మరిగించాలి. అలా తయారు చేసిన కషాయాన్ని వడగట్టి, అందులో పటికబెల్లం కలుపుకొని తాగితే తలనొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. కొందరు పార్శ్వపు తలనొప్పితో బాధపడుతుంటారు. ‘మైగ్రేన్’ అనే ఈ పార్శ్వపు తలనొప్పి ఒక పట్టాన వదలదు. దీర్ఘకాలం వేధించే మైగ్రేన్‌కూ శొంఠికొమ్ములతోనే చక్కని విరుగుడు ఉంది. వంద గ్రాముల శొంఠికొమ్ములను తీసుకుని, నేతిలో దోరగా వేయించుకోవాలి. వేగిన శొంఠికొమ్ములను బాగా దంచి, వస్త్రఘాళితం పట్టాలి. మెత్తగా తయారైన ఈ శొంఠిపొడిలో రెండువందల గ్రాముల పాతబెల్లం కలిపి బాగా దంచాలి. దీనిని ఒక గాజు లేదా పింగాణీ జాడీలో నిల్వ చేసుకుని, ప్రతిరోజూ రెండు పూటలా భోజనానికి ముందు ఐదు గ్రాముల చొప్పున తీసుకుని, కాసేపు చప్పరిస్తే చాలు. ఎలాంటి దోషం వల్ల తలెత్తిన తలనొప్పి అయినా మటుమాయం కావాల్సిందే. అంతేకాదు, శొంఠి–బెల్లం కలిపి ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని తినడం వల్ల అరుచి పోయి, బాగా ఆకలి కూడా కలుగుతుంది. తలనొప్పికి విరుగుడుగా ‘చల్ల చల్లని... కూల్ కూల్...’ తలనూనెల కోసం దుకాణాలపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చక్కని తలనొప్పి నివారణ తైలాన్ని తయారు చేసుకోవచ్చు. పావుకిలో నువ్వులనూనెను మూకుడులో వేసి, పొయ్యిమీద సన్నని మంటపై వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరిగిన శొంఠి ముక్కలు, వస వేరు ముక్కలు, అతిమధురం వేరు ముక్కలు... ఒక్కొక్కటి పాతిక గ్రాముల చొప్పున వేసి, గరిటెతో కలియదిప్పుతూ వేయించుకోవాలి. ఇవి నల్లగా మారగానే, పాత్రను దించేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ నూనెను వడగట్టి గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రోజూ తలకు రాసుకుంటూ ఉంటే ఎలాంటి తలనొప్పులైనా నయమవుతాయి. జలుబు – దగ్గు ప్రతి ఒక్కరికీ తప్పని సమస్య జలుబు. సాధారణంగా రుతువులు మారే సమయంలో జలుబు, ముక్కదిబ్బడ పట్టి పీడిస్తాయి. జలుబు చేసిన వెంటనే మెడికల్ షాపుల్లో దొరికే మాత్రలు వేసుకుంటారు చాలామంది. ఇవి జలుబును తక్షణమే తగ్గించలేవు. జలుబు పూర్తిగా తగ్గడానికి కొన్ని రోజులు పడుతుంది. మందు మాకులు వాడినా, వాడకపోయినా సర్వసాధారణంగా ఒక వారం రోజుల్లో జలుబు దానంతట అదే నయమవుతుంది. అలాంటి దానికి మెడికల్ షాపుల వరకు వెళ్లకుండా, వంటింటి సామగ్రితో ఉపశమనం పొందడమే మేలు. పసుపు కొమ్మును కాల్చి, ఆ పొగను పీలిస్తే జలుబు వల్ల కలిగే ముక్కుదిబ్బడ కొంత వరకు నయమవుతుంది. ఉల్లిరసం, అల్లంరసం, తేనె సమపాళ్లలో కలిపి మూడుపూటలా రెండేసి చెంచాల చొప్పున సేవిస్తే జలుబు, రొంప నుంచి ఉపశమనం దొరుకుతుంది. దనియాల చూర్ణం, మెత్తగా దంచిపెట్టుకున్న పటిక బెల్లం సమపాళ్లలో కలిపి తీసుకుంటే జలుబు, గొంతునొప్పి, ముక్కదిబ్బడ లక్షణాలు కొంత త్వరగా నయమవుతాయి.జలుబు ఎక్కువై, గొంతులో కఫం చేరినట్లయితే చెంచాడు తేనెలో అరచెంచా కరక్కాయ పొడి కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. శొంఠి, మిరియాలు, పసుపు కొమ్ములు సమపాళ్లలో తీసుకుని, వీటిని మెత్తని పొడిగా చేసుకోవాలి. అరకప్పు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని ఒక చెంచాడు కలుపుకుని మూడుపూటలా తీసుకుంటే జలుబు, ముక్కుదిబ్బడ, దగ్గు, తలనొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. జలుబుతో పాటు దగ్గు, గొంతునొప్పి కూడా బాధిస్తున్నట్లయితే తులసిపాకంతో ఉపశమనం పొందవచ్చు. తాజా తులసి ఆకులను బాగా నూరి, ఆ ముద్దను శుభ్రమైన వస్త్రంలో మూటలా ఉంచి రసం పిండుకోవాలి. వంద గ్రాముల తులసి రసంలో వంద గ్రాముల పటిక బెల్లం, పాతిక గ్రాముల అల్లం రసం, పది గ్రాముల మిరియాల పొడి చేర్చి, ఒక పాత్రలో వేసుకుని సన్ననిమంట మీద నీరంతా ఇగిరిపోయేంత వరకు మరిగించుకోవాలి. పూర్తిగా నీరింకిన తర్వాత పాత్రను దించేసి, చల్లారిన తర్వాత పాకాన్ని గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ పాకాన్ని చెంచా నుంచి రెండు చెంచాల వరకు కప్పు గోరువెచ్చని నీటిలో వేసి కలిపి తాగుతున్నట్లయితే త్వరగా జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం దొరుకుతుంది. తులసిపాకం సేవిస్తున్నట్లయితే అలర్జీ వల్ల కలిగే దద్దుర్లు, ఆకలి మందగించడం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. చర్మ జుట్టు సమస్యలు కాలుష్యం పెరుగుతున్నందు ఇటీవలి కాలంలో చర్మ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, చర్మం పొడిబారడం లేదా అతిగా జిడ్డుగా మారడం, ముఖంపై మచ్చలు ఏర్పడటం, జుట్టు రాలడం వంటి సమస్యలు యువతను మానసికంగా కూడా కుంగదీస్తున్నాయి. బజారులో దొరికే క్రీములు, లోషన్లు ఎన్ని వాడినా ఈ సమస్యలు పూర్తిగా సమసిపోవు. మంచి ముఖవర్చస్సు కోరుకునేవారు ఇంట్లోనే చక్కని ఔషధ లేపనాన్ని తయారు చేసుకోవచ్చు.తెల్ల ఆవాలు, కలువపూల రేకులు, తామరపూల రేకులు, అతిమధురం, లొద్దుగ చెక్క, కస్తూరి పసుపు, మంచిపసుపు ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున తీసుకోవాలి. వీటిని కొద్ది పరిమాణం నీటితో మెత్తని గుజ్జుగా రుబ్బుకోవాలి. ఈ గుజ్జులో నాలుగువందల గ్రాముల ఆవునెయ్యి కలిపి, ఈ మిశ్రమాన్ని ఒక మందపాటి పాత్రలో వేసుకుని సన్నని మంటపై నెయ్యి మాత్రమే మిగిలేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీనికి రెండువందల గ్రాముల తేనెమైనాన్ని కలిపి ఆరబెట్టాలి. పూర్తిగా చల్లారిన లేపనాన్ని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రోజూ రాత్రిపూట నిద్రపోయే ముందు ఈ లేపనాన్ని ముఖానికి పట్టించి, బాగా చర్మంలోకి ఇంకేలా మర్దన చేయాలి. ఇలా చేస్తే ముఖం మీద మచ్చలు మాయమవుతాయి. శరీరం మీద ఎక్కడ మచ్చలు ఉన్నా ఈ లేపనాన్ని ఉపయోగించుకోవచ్చు. జీలకర్ర, పటికబెల్లం సమభాగాలుగా తీసుకోవాలి. జీలకర్రను సన్నని మంటపై దోరగా వేయించుకోవాలి. ఇప్పడు జీలకర్రను, పటికబెల్లాన్ని కలిపి మెత్తని పొడిగా చేసుకోవాలి. ప్రతిరోజూ రెండుపూటలా బోజనానికి ముందు ఈ చూర్ణాన్ని ఒక చెంచాడు చొప్పున నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉన్నట్లయితే జుట్టురాలడం తగ్గుతుంది. కాంతిహీనంగా మారిన జుట్టుకు తిరిగి జీవకళ వస్తుంది.ఎండిన పొగాకును సన్నని ముక్కలుగా చేసి, మూకుడులో వేసి, పెద్దమంట మీద పెట్టాలి. మంట వేడికి పొగాకు మాడిపోయి బూడిదలా తయారవుతుంది. ఈ బూడిదను వస్త్రఘాళితం చేసుకుని, అందులో తగినంత కొబ్బరినూనె వేసి లేపనంలా తయారు చేసుకోవాలి. తామర తదితర ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఉన్నచోట ఈ లేపనాన్ని పూస్తున్నట్లయితే ఫంగస్ ఇన్ఫెక్షన్లు నయమవుతాయి. బూరుగు పూలు, గులాబి రెక్కలు, కస్తూరి పసుపు సమపాళ్లలో తీసుకుని, వాటిని విడివిడిగా ఆరబెట్టుకుని, పొడి చేసుకోవాలి. ఈ మూడింటి పొడిని వస్త్రఘాళితం చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పాలమీగడలో కలిపి రాత్రివేళ ముఖానికి పట్టించి, ఉదయం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తుంటే ముఖం మీద మొటిమలు, నల్లమచ్చలు వంటివి తొలగిపోతాయి.అరలీటరు కొబ్బరినూనెలో, ఐదు నిమ్మకాయల రసం వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సన్నని మంటపై నిమ్మరసం ఇగిరిపోయి కొబ్బరినూనె మాత్రమే మిగిలేంత వరకు మరిగించుకోవాలి. చల్లారిన తర్వాత ఈ నూనెను గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రోజూ దీనిని తలకు రాసుకుంటున్నట్లయితే చండ్రు, జుట్టురాలడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఒంటి, కీళ్ల నొప్పులు దెబ్బలు తగలడం మాత్రమే కాకుండా నానా కారణాల వల్ల కీళ్లనొప్పులు, ఒంటినొప్పులు, వస్తుంటాయి. ఇలాంటి నొప్పులకు పెయిన్ కిల్లర్స్‌పై ఆధారపడకుండా ఇంట్లోనే తగిన ఔషధాలను తయారు చేసుకోవచ్చు. ఆముదపు గింజలను తెచ్చి వాటిని చితక్కొట్టి పైపెంకును తీసేసి, లోపలి పప్పును వంద గ్రాములు తీసుకోవాలి. దీనికి వంద గ్రాముల శొంఠి, వంద గ్రాముల పటికబెల్లం చేర్చి మెత్తగా దంచుకోవాలి. రెండుపూటలా కప్పు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని చెంచాడు కలిపి తీసుకుంటే కీళ్లనొప్పులు క్రమంగా నయమవుతాయి.దోరగా వేయించిన శొంఠిపొడి, అశ్వగంధ పొడి, నల్లనువ్వుల పొడి, పటికబెల్లం పొడి సమపాళ్లలో తీసుకుని, నాలుగింటినీ కలిపి వస్త్రఘాళితం చేసుకోవాలి. మూడు పూటలా భోజనం చేసేటప్పుడు ఈ పొడిని రెండు చెంచాల ఆవునేతితో కలిపి తీసుకుంటే నడుము నొప్పి, ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోగనిరోధక శక్తి పెరిగి ఒంటికి బలం వస్తుంది.శొంఠి పది గ్రాములు, వాయు విడంగాలు (మిరియాల్లాగే ఉంటాయి) పది గ్రాములు పొడిలా దంచుకుని, ఈ పొడిని ఒక పాత్రలో వేసి, రెండు కప్పుల నీటిలో సన్నని మంటపై మరిగించుకోవాలి. నీరు సగానికి సగం ఇగిరిపోయి కషాయం తయారయ్యాక అందులో ముప్పయి గ్రాముల పాతబెల్లం కలిపి రోజుకు ఒకసారి చొప్పున తీసుకుంటే, మహిళలకు వచ్చే నడుమునొప్పి తగ్గిపోతుంది.నిమ్మరసం పావులీటరు, నువ్వులనూనె పావులీటరు, వెల్లుల్లి గుజ్జు పావుకిలో తీసుకుని, ఈ మూడింటినీ కలిపి సన్నని మంటపై నూనె మాత్రమే మిగిలేంత వరకు మరిగించుకోవాలి. చల్లారిన తర్వాత నూనెను వడగట్టి, అందులో యాభై గ్రాముల ముద్ద కర్పూరం కలిపి గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. నొప్పులు ఉన్న చోట ఈ నూనెతో మర్దన చేస్తున్నట్లయితే త్వరలోనే ఉపశమనం దొరుకుతుంది. దంత సమస్యలు ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది దంత సమస్యలతో బాధపడుతుంటారు. అతిగా శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లకు అలవాటు పడటం, దంతాలకు అంటుకుపోయే పిజ్జా, బర్గర్ వంటి జంక్‌ఫుడ్ పదార్థాలు తరచుగా తీసుకోవడం వంటి కారణాల వల్ల చిగుళ్ల వాపు, దంతాలు వదులవడం, పిప్పిపళ్లు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి తగిన ఔషధాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.తుమ్మకట్టెలను కాల్చి తయారు చేసిన బొగ్గులు వంద గ్రాములు, సన్నని మంటపై పొంగించిన పటిక వంద గ్రాములు, సైంధవ లవణం వంద గ్రాములు.. ఈ మూడింటినీ మెత్తని పొడిగా తయారు చేసుకుని నిల్వ చేసుకోవాలి. దీనినే పళ్లపొడిగా వాడుతున్నట్లయితే దంతాలకు దృఢత్వం కలుగుతుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోటి దుర్వాసన వంటి సమస్యలు దూరమవుతాయి. వంద గ్రాముల సుద్దపొడిలో నలభై గ్రాముల ఏలక గింజల పొడి, అరవై గ్రాముల సైంధవ లవణం పొడి కలిపి వస్త్రఘాళితం చేసుకుని, నిల్వ ఉంచుకోవాలి. రోజూ ఈ పొడితో పళ్లు తోముకుంటే దంతాలు దృఢంగా, తెల్లగా తయారవుతాయి. నోటి దుర్వాసన వంటి సమస్యలు మటుమాయమవుతాయి.పటికను పొంగించి పొడిగా చేసుకోవాలి. సైంధవ లవణాన్ని దోరగా వేయించి పొడిగా చేసుకోవాలి. తుమ్మబొగ్గులను పొడిగా చేసుకోవాలి. మూడింటినీ సమపాళ్లలో తీసుకుని వస్త్రఘాళితం చేసుకోవాలి. ఈ పొడితో పళ్లు తోముకుంటే దంత సమస్యలు, నోటి దుర్వాసన రాకుండా ఉంటాయి. కంటి సమస్యలు టీవీలు, స్మార్ట్ఫోన్లు వచ్చాక చిన్నారులు సైతం కళ్లద్దాలు వాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కంటి చూపు మందగించకుండా ఉండటానికి, చిన్నా చితకా కంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఇంట్లోనే చక్కని ఔషధాలను తయారు చేసుకోవచ్చు. పిప్పళ్లు, వాయు విడంగాలు, అతి మధురం, శొంఠి, సైంధవలవణం.. ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున తీసుకోవాలి. వీటిని కచ్చాపచ్చాగా దంచుకుని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మర్నాటి ఉదయం వీటిని గుజ్జులా నూరుకోవాలి. ఒక మూకుడులో అరలీటరు నువ్వులనూనె, అరలీటరు మేకపాలు వేసి, అందులో ఈ గుజ్జును వేసి సన్నని మంటపై వేడి చేయాలి. బాగా ఉడికిన తర్వాత మూకుడును దించేసి, చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వడగట్టాలి. వడగట్టిన తైలాన్ని గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ తైలాన్ని ముక్కులో నాలుగు చుక్కల చొప్పున వేసుకుని నశ్యంలా పీలుస్తుంటే కంటికైన గాయాలు, కంటిలో ఏర్పడి పుండ్లు తగ్గుతాయి. కంటిచూపు క్షీణించకుండా ఉండటానికి త్రిఫలాఘృతం అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కరక్కాయల బెరడు, గింజలు తీసేసిన ఉసిరికాయ ముక్కలు, తానికాయ ముక్కలు.. ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పన తీసుకుని, వీటిని కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఒక పాత్రలో మూడు లీటర్ల నీరు తీసుకుని, నూరుకున్న త్రిఫలాల పొడిని నీట్లో వేసి, లీటరు కషాయం మిగిలేంత వరకు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఈ కషాయాన్ని వడగట్టుకొని, అందులో అరలీటరు ఆవుపాలు, పావులీటరు ఆవునెయ్యి వేసి నెయ్యి మాత్రమే మిగిలేంత వరకు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఇలా తయారైన త్రిఫలా ఘృతాన్ని గాజుసీసాలో నిల్వ చేసుకుని, ప్రతిరోజూ పది గ్రాముల చొప్పున భోజనానికి ముందు సేవిస్తున్నట్లయితే కంటిచూపు మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి పెరిగాక అజీర్తి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కడుపులో ఏకాస్త ఇబ్బంది తలెత్తినా ఎడాపెడా యాంటాసిడ్ సిరప్లు, పౌడర్లు వాడేస్తూ ఉంటారు చాలామంది. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు వంటింటి సామగ్రిని సజావుగా ఉపయోగించుకున్నట్లయితే, యాంటాసిడ్లతో పనే ఉండదు.శొంఠికొమ్ములను, మిరియాలను, శుభ్రం చేసుకుని ఆరబెట్టుకున్న వేపచెట్టు బెరడును సమపాళ్లలో దోరగా వేయించుకుని మెత్తని పొడిగా చేసి పెట్టుకోవాలి. అరకప్పు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని ఒక చెంచాడు కలుపుకొని పరగడుపున తీసుకుంటున్నట్లయితే ఎసిడిటీ, పులితేన్పులు వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. కరక్కాయ, పిప్పళ్లు, శొంఠి, వాము, సైంధవ లవణం.. వీటిని ఒక్కొక్కటి యాభై గ్రాముల పరిమాణం చొప్పున తీసుకోవాలి. వీటిలో వాము, శొంఠి, పిప్పళ్లను దోరగా వేయించుకోవాలి. వీటికి సైంధవ లవణాన్ని, కరక్కాయలను చేర్చి మెత్తని పొడిగా చేసుకోవాలి. భోజనానికి అరగంట ముందు ఈ పొడిని అరచెంచా చొప్పున గోరువెచ్చని నీటితో తీసుకుంటున్నట్లయితే మందగించిన ఆకలి మళ్లీ మామూలు స్థితికి వస్తుంది. జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. నిమ్మరసంలో సైంధవ లవణం కలిపి, ఆ మిశ్రమంలో సన్నగా తరిగిన తాజా అల్లం ముక్కలను వారం రోజులను నానబెట్టాలి. ఇలా నానబెట్టిన అల్లం ముక్కలను ఎండబెట్టాలి. ఈ అల్లాన్నే ‘భావన అల్లం’ అంటారు. ‘భావన అల్లం’ ముక్కలను ఒక అరచెంచాడు నోట్లో వేసుకుని నమిలితే అరుచి తగ్గి, ఆకలి పుడుతుంది. ‘భావన అల్లం’ తయారు చేసుకున్నట్లే నిమ్మరసం సైంధవ లవణాలతో జీలకర్రను కలిపి, వారం రోజులు నానబెట్టి, ఆ తర్వాత ఎండబెట్టిన జీలకర్రను ‘భావనజీర’గా తయారు చేసుకోవచ్చు. ‘భావన జీర’ కూడా జీర్ణకోశ సమస్యలకు మంచి విరుగుడుగా పనిచేస్తుంది.రెండు చిటికెల ఇంగువ, పావుచెంచా వాము దోరగా వేయించి, పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం దొరుకుతుంది. తాజా కరివేపాకును మెత్తగా రుబ్బుకొని, ఆ ముద్దను వస్త్రంలో వేసుకుని రసం తీసుకోవాలి. ఇలా తీసుకున్న కరివేపాకు రసం రోజూ రెండు చెంచాల చొప్పున తీసుకున్నట్లయితే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. ఆకలి పుడుతుంది. రక్తహీనత తగ్గుతుంది. చిన్న కరక్కాయలు యాభై గ్రాములు, సోంపు గింజలు పది గ్రాములు, జీలకర్ర పది గ్రాములు, సైంధవ లవణం పది గ్రాములు ఒక వెడల్పాటి పళ్లెంలోకి తీసుకోవాలి. వీటికి ఒక చెంచాడు నిమ్మరసం, ఒక చెంచాడు అల్లంరసం కలిపి, ఎండబెట్టాలి. ఇవన్నీ బాగా ఎండిన తర్వాత మెత్తని పొడిగా చేసుకుని గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. చెంచాడు తేనెలో ఈ చూర్ణాన్ని అరచెంచాడు కలిపి రెండుపూటలా తీసుకుంటన్నట్లయితే అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపునొప్పి మాత్రమే కాకుండా నోటి దుర్వాసన, నిద్రలేమి వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.దానిమ్మగింజలను ఎండబెట్టి, వంద గ్రాముల పొడి తయారు చేసుకోవాలి. అలాగే పుదీనా ఆకులను ఎండబెట్టి యాభై గ్రాముల పొడిని తయారు చేసుకోవాలి. వీటికి పాతిక గ్రాముల సైంధవ లవణం పొడిని జత చేసి మూడింటినీ వస్త్రఘాళితం చేయాలి. ఈ పొడిని గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. మూడుపూటలా భోజనం తర్వాత ఈ పొడిని అరచెంచాడు చొప్పున కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక అజీర్ణ సమస్యల నుంచి కడుపునొప్పి నుంచి విముక్తి లభిస్తుంది. -
చర్మకాంతి కోసం...
ఎలాంటి చర్మ తత్వం వాళ్లయినా రాత్రి పడుకునేముందు తప్పని సరిగా ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇందుకోసం సబ్బును ఉపయోగించకూడదు. సబ్బులో ఉండే గాఢ రసాయనాలు చర్మానికి హాని చేస్తాయి. పదిచుక్కల సన్‌ఫ్లవర్ ఆయిల్ లేదా నువ్వుల నూనెలో రెండు టేబుల్స్పూన్ల పాలను కలిపి ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం పొడిచర్మం గల వారికి బాగా పనిచేస్తుంది. మూడు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్లో బాగా మగ్గిన అరటిపండు గుజ్జు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా పట్టించి అరగంట తరువాత కడుక్కోవాలి.పుదీనా పేస్ట్‌లో బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమంలో తగినంత వేడినీటిలో కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత కడుక్కోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తుంటే చర్మకాంతి పెరుగుతుంది. రెండు టీస్పూన్ల పెరుగులో కొద్దిగా బియ్యపు పిండిని కలిపి బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట ప్యాక్‌లా వేసుకోవాలి. తర్వాత ఆ ప్రదేశంలో వేళ్లతో వలయాలుగా చుడుతూ సున్నితంగా మసాజ్ చేయాలి. ఎక్కువ మసాజ్చేస్తే చర్మం ఎర్రగా అయ్యే అవకాశం ఉంది. వారంలో 3 సార్లు ఈ విధంగా చేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గిపోతాయి. -
నునుపైన పాదాల కోసం
చలికాలం పాదాల పగుళ్ల సమస్య ఎక్కువ. చర్మం త్వరగా పొడిబారడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య అధికం. పగుళ్ల వల్ల మడమల్లో నొప్పి కూడా వస్తుంటుంది. నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే సమస్య తీవ్రతను తగ్గించవచ్చు. టేబుల్ స్పూన్ ఉప్పు, రెండు టీ స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్, గోరువెచ్చని నీళ్లు, ప్యుమిక్ స్టోన్.. తీసుకోవాలి. ఒక వెడల్పాటి టబ్బు లేదా బేసిన్ లాంటిది తీసుకొని దానిని గోరువెచ్చని నీళ్లతో నింపాలి. దాంట్లో ఉప్పు, 4టీ స్పూన్ నిమ్మరసం, టేబుల్ స్పూన్ గ్లిజరిన్, టీ స్పూన్ రోజ్‌వాటర్ వేసి కలపాలి. ఈ నీళ్లలో పాదాలను 15 నిమిషాల సేపు ఉంచాలి. ప్యుమిక్‌స్టోన్ తీసుకొని పాదాల అడుగున, మడమలను రుద్దాలి.మరొకపాత్రలో టేబుల్ స్పూన్ గ్లిజరిన్, టీ స్పూన్ రోజ్‌వాటర్, టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. పడుకునేముందు పాదాలను తడి లేకుండా తుడిచి, తయారుచేసుకున్న మిశ్రమాన్ని రాయాలి. పాదాలకు సాక్స్ తొడగాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రంగా పాదాలను కడగాలి. వారంలో కనీసం మూడు రోజులైనా ఈ విధంగా చేస్తూ ఉంటే పాదాల పగుళ్ల సమస్య తగ్గిపోతుంది. -
మేని మెరుపునకు మేలైన ఆహారాలు
చర్మానికి మేలు చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మేని సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. దీర్ఘకాలం పాటు యౌవనంగా కనిపించడానికి ఈ ఆహారం దోహదపడుతుంది. ఆ ఆహార వివరాలు... ఆహారం: తాజా చేపలు, అవిశెలు, బాదం... వీటిల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ప్రయోజనం: ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మాన్ని మెరుస్తూ ఉండేలా చేస్తాయి. చర్మాన్ని నునుపుగా చేస్తాయి. ఆహారం: ముడిబియ్యం, పొట్టు తీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్స్... వీటిల్లో పీచు పదార్థాలు ఎక్కువ. ప్రయోజనం: శరీరంలోని విషాలను తొలగించి బయటకు పంపుతాయి. ఇందులోని పీచుపదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి. ఆహారం: విటమిన్–బి6 ఎక్కువుండే ఆహారమైన క్యాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్నట్, అవకాడో. ప్రయోజనం: హార్మోన్లలోని అసమతౌల్యం వల్ల వచ్చే మొటిమలను విటమిన్–బి6 నివారిస్తుంది. హార్మోన్ల సమతౌల్యత సక్రమంగా ఉండేలా చూస్తుంది. తాజా పండ్లు: అన్ని రకాల తాజాపండ్లలో విటమిన్లతోపాటు యాంటీ–ఆక్సిడెంట్స్ ఉంటాయి. ప్రయోజనం: చర్మాన్ని ముడతలు పడేలా చేసే ఫ్రీ–రాడికల్స్‌ను తొలగించడానికి ఉపయోగపడతాయి. యౌవనంగా ఉండాలంటే తాజా పండ్లు తినాలి. చర్మం గ్లో తగ్గించే పదార్థాలు:ఈ తరహా ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే చర్మానికి అంతగా మేలు జరగదు. మితిమీరి తీసుకుంటే కీడు జరిగే అవకాశాలు కూడా ఎక్కువే. అందుకే ఇవి తీసుకునే సమయంలో విచక్షణతో ఉండాలి. ఈ ఆహారం వివరాలివి... ఆహారం: కాఫీ, టీ, శీతలపానీయాలు, కోలా డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్. చేటు: వీటిల్లో కెఫిన్పాళ్లు ఎక్కువ. ఇది చర్మంలో నుంచి తేమను సంగ్రహించి చర్మం పొడిబారేలా చేస్తుంది. ఆహారం: చాక్లెట్లు, సోడా డ్రింక్స్, భోజనం తర్వాత తినే తీపి పదార్థాలు, తీపి పానీయాలు. చేటు: తీపి ఎక్కువగా ఉండే ఆహారాల వల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. మొటిమలు వస్తాయి. ఆహారం: బేకరీ ఫుడ్స్, బర్గర్స్, నిల్వ ఉంచి తీసుకునే క్యాన్డ్ ఫుడ్. చేటు: ఇందులోని అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు చర్మసౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. చర్మం త్వరగా ముడతలు పడేందుకు దోహదం చేస్తాయి. ఆహారం: నూనె పదార్థాలు, వేపుళ్లు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఉపయోగించే మార్జరిన్ నూనె ఉపయోగించిన పదార్థాలు. చేటు: ఇందులో ట్రాన్స్–ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి రక్తంలో కొవ్వు పదార్థాలను పెంచి చర్మంపై మొటిమలు పెరిగేందుకు దోహదం చేస్తాయి. -
బంగారుకాంతికి...
పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగులో ఉండే గుణాలు నలుపుగా మారిన చర్మాన్ని సాధారణ రంగులోకి తీసుకువస్తాయి. కొబ్బరి నూనె చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తుంది. ∙టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్‌లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది.∙టేబుల్ స్పూన్ పెసర్లు, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. మెడకు, గొంతుకు కూడా రాయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా అవుతుంది. చర్మం పొడిబారడం సమస్యే దరిచేరదు. పెరుగులో పెసరపిండి కలిపి రెండు రోజులు బయటే ఉంచాలి. తర్వాత రోజు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు తగ్గుతుంది. వెంట్రుకలకు మంచి కండిషనింగ్ లభించి మృదువు అవుతాయి. టీ స్పూన్ పెసరపిండిలో తగినంత పెరుగు కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిబారిన చర్మం మృదువవుతుంది. -
చలిబారకుండా
ఎండ, వానల కన్నా చలికాలం చర్మం త్వరగా ముడతలు పడటం, నల్లబడటం చూస్తుంటాం. దీనికి కారణం చర్మం పొడిబారడమే. ఈ సమస్యకు విరుగుడుగా... స్నానానికి ముందు టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, పాదాలకు మసాజ్ చేయాలి. అలాగే స్నానం చేసేముందు అర టీ స్పూన్ బాదం నూనె బకెట్ నీటిలో కలిపాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. అరటిపండు గుజ్జు, కప్పు పెరుగు, టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ ఓట్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడి చర్మానికి మంచి ప్యాక్ అవుతుంది. ముఖానికి, మేనికి పట్టించి పదిహేను నిమిషాలతర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీంతో చర్మానికి జీవకళ వస్తుంది. చలికాలం నూనె శాతం ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. అలాగని చర్మాన్ని మరీ రబ్ చేయకూడదు. కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దన చేయాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. టీ స్పూన్ శనగపిండిలో అర టీ స్పూన్ తేనె, పచ్చిపాలు, చిటికెడు గంధం పొడి కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటేæపొడిబారిన ముఖ చర్మం ముడతలు తగ్గుతాయి. -
మేలైన కాంతి
చలికాలంలో చర్మం పొడిబారి, కళ తప్పి కనిపిస్తుంది. మృతకణాలు పెరుగుతాయి కాబట్టి వీటిని సరిగా శుభ్రం చేయకపోతే రంగు కాస్త తగ్గినట్టు కనిపిస్తారు. ఈ సమస్యకు పరిష్కారంగా..ఉదయం స్నానం చేయడానికి ముందు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె మేనికి రాసుకోవాలి. మృదువుగా మర్దనా చేసి అరగంటసేపు ఆగాలి. తర్వాత మరీ వేడిగా అలాగని చల్లగా కాకుండా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. స్నానానికి సబ్బు ఉపయోగించేవారు క్రీమీగా ఉండేవాటిని చలికాలానికి ప్రత్యేకం అనేవాటిని ఎంచుకోవాలి. లేదంటే సొంతంగా తయారుచేసుకున్న సున్నిపిండిని వాడాలి.బాదంపప్పుల నూనె, అవిసెగింజల నూనె వంటివి మేనిపైకే కాదు లోపల కూడా కావాలి. అందుకని శరీరానికి మేలు చేసే బాదంపప్పులు, అవిసెగింజలు.. రోజూ కొన్ని తినాలి.ఈ కాలం ఉసిరికాయలు లభిస్తాయి. వీటిలో విటమిన్–సి సమృద్ధిగా లభిస్తుంది. ఏదో విధంగా రోజూ ఒక ఉసిరికాయ అయినా తినాలి. పొడిరూపంలోనూ ఉసిరిని తయారుచేసి, నిల్వచేసుకొని, కషాయం చేసుకొని సేవించవచ్చు. దీనివల్ల చర్మంలోపలి మలినాలు కూడా శుద్ధమవుతాయి.పెదవులపై చర్మం పొడిబారడం, పగుళ్లు బారి నలుపుగా అవడం వంటివి ఈ కాలంలో సహజంగా జరుగుతుంటాయి. రాత్రి పడుకునేముందు నెయ్యిని పెదవులపై రాసి, మృదువుగా మర్దన చేయాలి. పగలు కూడా రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పొడిబారం సమస్య రాదు.చలికి చాలా మంది మంచినీళ్లు తాగడం బాగా తగ్గిస్తారు. దీని వల్ల కూడా చర్మం పొడిబారడం, ముడతలు పడటం జరుగుతుంటుంది. రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగేలా శ్రద్ధ పెట్టాలి. ఈ జాగ్రత్తలు చర్మకాంతినే కాదు ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తాయి. -
బ్యూటిప్స్
యాంటీ ఏజింగ్ ఫేషియల్ మాస్క్ పెరిగే వయసును అద్దంలా ప్రతిబింబింపజేసేది చర్మం. అందులోనూ చలికాలంలో మరీ ఎక్కువ ముడతలు పడుతుంది. అందుకే ఈ కాలంలో వార్ధక్య లక్షణాలకు చెక్‌పెట్టే హోమ్మేడ్ ఫేషియల్ మాస్క్ఒక నిమ్మకాయను తీసుకుని, గింజలు వేరుచేసి, అందులో ఒక స్పూను మీగడ వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పలుచటి పొరలా ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత తీసేసి ముఖానికి ఫేషియల్ క్రీమ్ రాసి మర్దన చేయాలి. ముడతలు పడిన చర్మానికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. -
ఇలా చేస్తే... అందం మీ సొంతం
∙క్యారెట్, ఓట్స్ పౌడర్, పంచదార, పసుపు కలిపి మెత్తని పేస్ట్ చేసుకుని మొటిమలపై అప్లై చేసుకుంటే మొటిమలు తగ్గుతాయి. ∙ క్యారెట్, నారింజ రసం, పంచదార తీసుకుని మూడింటినీ కలిపి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. జిడ్డు చర్మం ఉన్న వారు ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసుకుంటే ఫలితం ఉంటుంది. ∙ముఖానికి మేకప్ వేసుకునే ముందు క్యారెట్, నారింజ రసం రెండింటినీ కలిపి ముఖంపై వలయాకారంలో మసాజ్ చేయాలి. తర్వాత ముఖాన్ని చన్నీటితో కడిగేసి 20 నిమిషాల తర్వాత మేకప్ వేసుకోవాలి. ఇలా చేస్తే మేకప్ మరింత అందంగా కనబడుతుంది. ∙మెడ చుట్టూ చర్మం నల్లగా ఉన్నవారు... క్యారెట్ పేస్ట్‌లో నిమ్మరసం, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా మెడ చుట్టూ నల్లగా ఉన్న చర్మంపై నూనె రాసి తయారుచేసుకున్న మిశ్రమాన్ని అప్లై చేసి మసాజ్ చేయాలి. -
పొడిబారిన చర్మం కోసం ప్యాక్స్..
టీ స్పూన్ తేనెలో అర టీ స్పూన్ క్యారట్ జ్యూస్ గాని నారింజ జ్యూస్ గాని కలపాలి. ఈ మూడింటినీ బాగా కలిపిన తరవాత పేస్ట్ చేసుకోవడానికి సరిపడా శనగ పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చర్మం మృదువవుతుంది. పొడి చర్మం వారు వారానికి ఒక్కసారి ఈ ప్యాక్‌ని వాడడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. కోడిగుడ్డులోని పచ్చ సొనలో కొన్ని చుక్కల బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరవాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మం నిగారిస్తుంది. -
పొడిబారిన చర్మానికి...
చలికాలం చర్మం పొడిబారుతుంది. సరైన పోషణ లేకపోతే చర్మంపైన తెల్లని పొట్టులా ఏర్పడుతుంటుంది. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే... ∙అరకప్పు గులాబీ రేకలను పేస్ట్ చేసి అందులో టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు కలపాలి. ఈ పేస్ట్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేయాలి. గులాబీల సుగంధం ఒత్తిడి నుంచి త్వరగా ఉపశమనం పొందేలా చేస్తుంది. కొబ్బరిపాలు చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌ని ఇస్తాయి. చలికాలం ఉన్నన్ని రోజులు రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మ మృదువుగా, కాంతిమంతంగా ఉంటుంది. ∙రెండు టీ స్పూన్ల కోకా బటర్‌ను కరిగించి అందులో టీ స్పూన్ విటమిన్–ఇ ఆయిల్, టీ స్పూన్ నువ్వుల నూనె కలిపి వేడి చేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని శరీరానికి మసాజ్ చేసుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. ∙టేబుల్ స్పూన్ తేనెలో, టీ స్పూన్ మీగడ కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి, మెడకు, భుజాలకు రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడి చర్మం గలవారికి ఇది మేలైన ప్యాక్. ముఖ్యంగా చలికాలంలో. ∙మూడు బాదంపప్పులను రాత్రిపూట నీళ్లలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పై పొట్టు తీసి, మెత్తగా రుబ్బి, అందులో టేబుల్ స్పూన్ పచ్చి పాలు, ఆలివ్ ఆయిల్ కొద్దిగా కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతో పాటు చేతులు, పాదాలకు కూడా రాసుకొని పదిహేను నిమిషాలు వదిలేయాలి. తర్వాత సున్నిపిండితో శుభ్రపరుచుకోవాలి. పొడిబారి నిస్తేజంగా ఉన్న చర్మం మృదువుగా, కాంతివంతం అవుతుంది. ∙ఉడికించిన ఒట్స్, తేనె బాగా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ప్యాక్ వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది పొడి చర్మం గలవారికి మేలైన ప్యాక్. -
ముఖానికి సౌందర్యాహారం
బాదంపప్పును నానబెట్టి, పొట్టుతో సహా పేస్ట్ చేయాలి. టీ స్పూన్ బాదంపప్పు పేస్టులో ఆరు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ప్రతి మూడు రోజులకోసారి ఇలా రెండువారాల పాటు చేస్తే చర్మం కాంతివంతంగా, మృదువుగా అవుతుంది. అరటిపండు గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. నాలుగు టేబుల్ స్పూన్ల కాఫీ గింజలను పొడి చేసి, అందులో ఎనిమిది టేబుల్ స్పూన్ల బాదం పాలు కలిపి పేస్ట్ చేయాలి. దీంట్లో టీ స్పూన్ తే¯ð కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మం కాంతిమంతం అవుతుంది.కప్పు బార్లీ గింజలను పొడి చేసి, నీళ్లు కలిపి ఉడికించాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారంలో మూడు రోజులు ఇలా చేస్తూ ఉంటే మచ్చలు తగ్గిపోయి, ముఖ చర్మం నునుపుగా తయారవుతంది. బాగా పండిన బొప్పాయి గుజ్జును ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇది చర్మంలోని మలినాలు, మృతకణాలను శుభ్రపరుస్తుంది. ఫలితంగా ముఖం యవ్వన కాంతితో మెరుస్తుంది. విటమిన్ –ఇ క్యాప్సుల్‌ని కట్ చేసి, అందులో అర టీ స్పూన్ గ్లిజరిన్ కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిముషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మానికి సరైన పోషణ లభిస్తుంది. చర్మం మృదువుగా అవుతుంది. -
పొడిబారిన చర్మానికి...
చలికాలం చర్మం త్వరగా పొడిబారుతుంది. చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారాలంటే వంటింట్లో ఉండే దినుసులతోనే బ్యూటీ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు. ∙బియ్యాన్ని నానబెట్టి, బాగా కడిగి.. ఆ నీటిని వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి, మెడకు రాస్తూ మృదువుగా మసాజ్ చేయాలి. పొడిబారి నిస్తేజంగా మారిన చర్మం తాజాగా మారుతుంది. రోజుకు రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చర్మం ముడతలు పడటం కూడా తగ్గుతుంది. ∙మూడు 3 టేబుల్ స్పూన్ల పిండిలో పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కొబ్బరి నూనె, 6 చుక్కల నిమ్మరసం, కొద్దిగా పాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అర గంట లేదంటే పూర్తిగా ఆరేదాకా ఉంచి శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు రోజూ కూడా ఈ ప్యాక్‌ను వేసుకోవచ్చు. ∙మొటిమలు, యాక్నె సమస్య ఉన్నవారు దాల్చిన చెక్కను పొడి చేసి, దాంట్లో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, మృదువుగా రుద్దాలి. యాక్నె సమస్య తగ్గుతుంది. చర్మం కాంతిమంతం అవుతుంది. -
ఓట్మీల్ ప్యాక్...
ఓట్‌మీల్స్ వండుకుని దానిలో యాపిల్ గుజ్జు కలుపుకోవాలి. ఈ రెండింటినీ బాగా పేస్ట్ చేసుకుని దానిలో రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి. ముఖాన్ని నీటితో కడిగి తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్యాక్ వేసుకుని పది నిముషాల తర్వాత నీటితో కడిగేయాలి. దీని వల్ల జిడ్డు చర్మం మృదువుగా తయారవుతుంది. ఓట్: మీల్ పౌడర్‌లో రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖంపై, ముక్కు చుట్టూ వేళ్ళ సాయంతో కొంచెం గట్టిగా స్క్రబ్ చేసుకోవాలి. దీనివల్ల బ్లాక్ హెడ్స్ పోతాయి. ఓట్: మీల్ పౌడర్‌ను చేతిలోకి తీసుకుని కొద్దిగా నీటిని కలపి పేస్ట్ చేసుకుని ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి. ఐదు నిముషాలపాటు ఆరనిచ్చి కడిగేయాలి. పొడి చర్మం వారు ఈ ప్యాక్‌లో నీటికి బదులు పాలు వాడాలి. ముఖం కడిగిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఓట్ : మీల్ పౌడర్‌కు తాజా నిమ్మరసం కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి ఐదు నిముషాల తర్వాత కడిగేయాలి. చర్మం కొంచెం చమ్మగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీనివల్ల చర్మం మీద ఉన్న మచ్చలు పోతాయి. నిమ్మరసంలో ఉండే సిట్రికి ఆసిడ్, విటమిన్–సి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. సున్నిత చర్మంగల వాళ్ళు నిమ్మరసంలో కొద్దిగా నీటిని కలుపుకోవాలి. -
మృదువైన చేతుల కోసం...
ఈ కాలం గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం పొడిబారి గరుకుగా తయారవుతుంది. రకరకాల పనుల వల్ల చేతులు నీళ్లలో ఎక్కువసేపు ఉండటం వల్ల చేతులపై చర్మం మరింత పొడిబారి, గరుకుగా అవుతుంది. ఈ సమస్యకు విరుగుడుగా.. టేబుల్ స్పూన్ టమాటా రసంలో అర టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు చేతులకూ రాసి, అయిదు నిమిషాల పాటు మృదువుగా మర్దనా చేయాలి. టేబుల్ స్పూన్ శనగపిండిలో అర టేబుల్ స్పూన్ రోజ్‌వాటర్, చిటికెడు పసుపు కలిపి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు రాసి, ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.టేబుల్ స్పూన్ శనగపిండిలో గుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్ గంధం పొడి కలపాలి. ఈ పేస్ట్‌ని చేతులపై పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ కాలం ట్యాన్ సమస్య కూడా ఉంటుంది కాబట్టి మురికి తొలగించడానికి ఈప్యక్స్ బాగా పనిచేస్తాయి. వారంలో మూడు రోజులైనా ఈ ప్యాక్స్ వేసుకుంటే మేలు. అలాగే రాత్రి పడుకునేముందు చేతులకు గ్లిజరిన్ బేస్డ్ కోల్డ్ క్రీము తప్పనిసరిగా రాసుకోవాలి. గోళ్లను కూడా మర్దనా చేయాలి. దీని వల్ల చేతులపై చర్మం మృదువుగా అవుతుంది. -
గోళ్లు పలచబడి విరిగిపోతుంటే...
గోళ్లు పొడవుగా పెంచుకొని, మంచి షేప్ చేయించుకోవాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు.కానీ కొందరిలో గోళ్ల పెరుగుదల అంతగా ఉండదు. పైగా కొద్దిగా పెరిగినా త్వరగా విరిగిపోతుంటాయి. దీనికి ప్రధాన కారణం... కాల్షియం, ఐరన్ లోపం. దీంతో పాటే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం. రోజూ రాత్రి పడుకునే ముందు నిమ్మరసం, గ్లిజరిన్ సమపాళ్లలో కలిపి గోళ్ల మీద రాసి, మసాజ్ చేయాలి. లేదా బాదం నూనెను వేలితో అద్దుకొని, గోరు చుట్టూ రాసి మృదువుగా మర్దనా చేయాలి. కొబ్బరినూనెను కూడా ఇందుకు ఉపయోగించవచ్చు. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే గోళ్ల పెరుగుదల బాగుంటుంది. త్వరగా విరిగిపోవు. నెల రోజులకోసారి ఇంట్లోనే గోరుచుట్టూ ఉన్న మురికిని తొలగించాలి. దీనికి ఉప్పు, షాంపూ కలిపిన గోరువెచ్చని నీటిలో పది నుంచి పదిహేను నిమిషాలు వేళ్లు మునిగేలా ఉంచి, తర్వాత మెనిక్యూర్ టూల్‌తో గోరుచుట్టూ ఉన్న మురికిని తొలగించాలి. గోళ్లను ఒక షేప్‌లో కత్తిరించి, పెట్రోలియమ్ జెల్లీ లేదా బాదం నూనెతో మర్దనా చేయాలి.వీటితో పాటు.. ∙ఆహారంలో కాల్షియం, ఐరన్ పాళ్లు ఎక్కువ ఉన్న పదార్థాలను చేర్చాలి. పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం మోతాదు అధికంగా ఉంటుంది. తాజా ఆకుకూరలు, నువ్వులు, పల్లీలు, బెల్లం.. మొదలైన వాటిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. -
ఎవర్గ్రీన్ చిట్కాలు
మచ్చలు, మొటిమలు లేని మోముకోసం చాలా ప్రయత్నిస్తుంటారు మగువలు. రకరకాల ఫేస్ క్రీమ్స్, లోషన్స్ వాడేందుకు సిద్ధమవుతుంటారు. అయితే వాటి వల్ల శాశ్వత పరిష్కారం లభించడం కష్టమే. అలాంటి వారి కోసమే ఈ సహజసిద్ధమైన చిట్కాలు. అయితే ఫేస్‌ప్యాక్ వేసుకునే ముందు క్లీనప్ చేసుకుని, స్క్రబ్ చేసుకుని, ఆవిరి పట్టించుకోవడం తప్పనిసరి. కాస్త సమయం పట్టినా ఇవన్నీ చేస్తేనే ఈ కాలుష్యబారినపడిన మీ చర్మం తిరిగి కాంతివంతంగా మెరుస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : పెరుగు మీగడ – పావు టీ స్పూన్, నిమ్మరసం – పావు టీ స్పూన్, యాపిల్ జ్యూస్ – 1 టీ స్పూన్ స్క్రబ్ : చిక్కటిపాలు – 2 టీ స్పూన్లు, క్యారెట్ గుజ్జు – 2 టీ స్పూన్లు, ఓట్స్ – 2 టీ స్పూన్లు మాస్క్ : కలబంద గుజ్జు –అర టీ స్పూన్, యాపిల్ గుజ్జు – 2 టీ స్పూన్లు, కొబ్బరి పాలు– అర టీ స్పూన్ తయారీ : ముందుగా పెరుగు మీగడ, నిమ్మరసం, యాపిల్ జ్యూస్ ఒక బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చిక్కటిపాలు, క్యారెట్ గుజు ్జ, ఓట్స్ ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు, కలబంద గుజ్జు, యాపిల్ గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
చర్మం పొడిబారుతోందా!
చలికాలం రావడానికి ముస్తాబు అవుతోంది. పగటి వేళ ఎండగానూ, రాత్రి వేళ కాస్త చలిగా ఉండడం సహజంగా జరుగుతుంటుంది. ఈ పరిస్థితుల్లో చర్మ సంరక్షణ పట్ల ముఖ్యంగా పొడి చర్మం గలవారు తప్పనిసరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి నీళ్లతోనూ, చల్లని నీళ్లతోనూ కాకుండా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. ముఖానికి పదే పదే సబ్బు వాడకుండా వెచ్చని నీటితో రోజులో రెండు – మూడు సార్లు కడగాలి. స్నానం చేసిన తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ కాలం గాలిలో తేమ తక్కువ. దీని వల్ల ఒంటిమీద ఉండే స్వేదం కూడా త్వరగా ఆరిపోతుంటుంది. దీంతో చర్మం పొడిబారినట్టు అవుతుంది. ఈ సమస్య రాకుండా 2 నుంచి 4 లీటర్ల నీళ్లు రోజులో తప్పనిసరిగా తాగాలి. రాబోయే కాలంలో మృతకణాల సంఖ్య కూడా పెరుగుతుంటుంది. వీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని ఎక్కువసేపు స్క్రబ్ చేయకూడదు. మీ చర్మతత్త్వం ఏదో తెలుసుకొని తగిన సౌందర్య ఉత్పాదనలను ఎంపిక చేసుకొని వాడాలి. పనుల వల్ల పాదాలు, చే తులు ఎక్కువగా నీటిలో నానుతూ ఉంటాయి. దీంతో వీటి పై చర్మం త్వరగా తేమ కోల్పోతుంది. అలాగే వదిలేస్తే పగుళ్లు బారే అవకాశం ఉంది. అందుకని, రాత్రివేళ తడి లేకుండా చేతులను తుడిచి మాయిశ్చరైజర్ రాసి, గ్లౌజ్‌లను వేసుకోవాలి. గ్లిజరిన్ ఉండే క్రీమ్స్, పెట్రోలియమ్ జెల్లీ మాయిశర్చరైజర్లు పాదాల చర్మాన్ని పొడిబారనివ్వవు. వారానికోసారి పాదాలను స్క్రబ్బర్‌తోరుద్ది, కడిగాలి. పడుకునే ముందు పెట్రోలియమ్ జెల్లీ రాసి, సాక్స్‌లు వేసుకోవాలి. చర్మం దురద పెడుతుంటే పొడిబారి ఉంటుందిలే అనుకుని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే, ఒక్కోసారి అవి రకరకాల చర్మ సమస్యలకు కారణమై ఉండచ్చు.