wages
-
International Women's Day 2025: హోమ్ మేకర్‌కు వేతనమేదీ?
ప్రతీ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International women's day) జరుపుకుంటాం. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అలాగ ప్రపంచంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతను, సవాళ్లపై విస్తృతంగా చర్చించడం వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై సమాలోచన చేయడం. మహిళా సాధికారత, హక్కులు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రాజకీయ సహకారాలపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. ప్రతి ఏడాదీ లాగానే ఈ ఏడాది యాక్సలరేట్ యాక్షన్(Accelerate Action) అనేథీమ్తో మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మహిళా సాధికారతకు, అభివృద్ధికి తోడ్పడూ వ్యూహాలు, వనరులు, చొరవలను గుర్తించి వేగంగా అమలు చేయాలనేది దీని ఉద్దేశం. ఈ సందర్బంగా ఎమ్.డి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్ ప్రత్యేక వ్యాసం.ప్రపంచంలో కోట్లాది మంది గృహిణులకు వేతనం ఎందుకు ఉండ కూడదు అనే విషయం ప్రస్తుతం చర్చానీయాంశం అయింది. చైనాలోని బీజింగ్‌లో ఒక విడాకుల కేసులో కోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పు ఈ చర్చకు దారితీసింది. అయితే ఇంటిపనులు, పిల్లల పెంపకం – సంరక్షణ లాంటివి చూసే గృహిణులకు జీతాలు ఎవరు ఇవ్వాలి అనేదే సమస్య! పురుషుల కన్నా 3 నుంచి 4 గంటలు ఎక్కువ పనిచేస్తారు గృహిణులు. వంట చేయడం, ఇంటిని, వంట సామగ్రిని శుభ్రం చేయడం, పిల్లలు, భర్త, ఇతర కుటుంబ సభ్యుల బట్టలు ఉతకడం వంటి పనులే కాక... తల్లి, భార్య, సోదరి పాత్రల్లో ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తుంది. అందుకే ఆమెకు జీతం ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.తమిళనాడులో గృహిణికి వేతనం అంశం సినీనటుడు కమల హాసన్ తన పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. ఇది కూడా గత ఏడాది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. బీజింగ్ కోర్టు తన తీర్పులో 5 సంవత్సరాలు భర్తతో ఉండి ఇంటి పనులు చూసుకున్నది కాబట్టి, తన కెరీర్‌ను కోల్పోయింది కాబట్టి, రూ. 5 లక్షల పైచిలుకు పరిహారం జీతం కింద ఇవ్వాలని పేర్కొంది. ఈ తీర్పును ప్రపంచం మొత్తంలో 60 కోట్లకు పైగా జనం సోషల్ మీడియాలో చూశారు. గ్రామీణ మహిళ ప్రతి రోజు 14 గంటలు పనిలో ఉంటుంది. గ్రామీణ పురుషులతో పోలిస్తే 2.5 గంటలు ఇది ఎక్కువ అని పరిశోధకులు అంటున్నారు. ఉద్యోగం చేసే పురుషుల కన్నా మహిళల పని నాలుగింతలు ఎక్కువ. ఇంత చేస్తున్నా గుర్తింపు, ఆదాయం లేకపోగా వేధింపులు, అత్యాచారాలు, హత్యా చారాలు. క్రిమినల్ జస్టిస్ వైఫల్యం వల్ల దేశంలో ఆడబిడ్డలపై గృహహింస పెరుగుతోంది. హోమ్ మేకర్లకు జీతం వస్తే... పురుషుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. గృహిణికి కుటుంబంపై ఆధారపడకుండా ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. రక్షణకు... ఒక గ్యారంటీ, నమ్మకం ఏర్పడుతుంది. కుటుంబంలో గౌరవం దక్కుతుంది. -
కేంద్రం కంట్రోల్లో ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలును ఇకపై పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద పనులు జరిగినా వాటికి సంబంధించిన అన్ని రకాల చెల్లింపులను నేరుగా కేంద్రమే ఆయా వ్యక్తులకు, సంస్థలకు చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. తొలుత ఏడు రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. నూతన విధానం అమలులోకి వస్తే ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులో ఇక రాష్ట్రాల పాత్ర నామమాత్రం కానుంది.రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పనుల మంజూరు, పర్యవేక్షణకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఉపాధి హామీ చట్టం నిబంధనల ప్రకారం పథకం అమలుకు రాష్ట్రాలు చేసే ఖర్చులో కనీసం 60 శాతం (ఏడాదిలో రూ.వంద కోట్లు ఖర్చు చేస్తే అందులో కనీసం రూ.60 కోట్లు) కూలీలకు వేతనాల రూపంలో చెల్లించేందుకు వ్యయం చేయాల్సి ఉంటుంది. ఉపాధి హామీ కింద రాష్ట్రం వాటాగా చెల్లించాల్సిన నిధులను ఎప్పుటికప్పుడు ఉమ్మడి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. కూలీల వేతనాలు, మెటీరియల్ నిధులను రెండు వేర్వేరు కేటగిరీలుగా వర్గీకరించి 2006లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మెటీరియల్ కేటగిరీ నిధులు కూడా..ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లించడంతోపాటు పలుచోట్ల అవినీతి చోటు చేసుకుంటోందన్న ఆరోపణల నేపథ్యంలో ఏడేళ్ల కిందట 2017–18లో కూలీలకు చెల్లించాల్సిన వేతనాలను వారి బ్యాంకు ఖాతాలకు కేంద్రమే నేరుగా చెల్లించే విధానాన్ని అమలులోకి తెచ్చింది. రాష్ట్రాల వారీగా కూలీల ద్వారా జరిగిన పనులకు అయ్యే మొత్తంలో గరిష్టంగా 40 శాతం మెటీరియల్ నిధులను కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేస్తూ వస్తోంది. ఆయా నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నాయి. ఇక మీదట మెటీరియల్ కేటగిరీ నిధులను కూడా రాష్ట్రాలకు ఇవ్వకుండా కేంద్రమే నేరుగా చెల్లించే విధానాన్ని తీసుకురానుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ ఆర్థిక సంవత్సరం నుంచే తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్, చత్తీస్గడ్, జార్ఖండ్, అసోం రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా మెటీరియల్ కేటగిరీ నిధులను సైతం కేంద్రమే నేరుగా ఆయా వ్యక్తులు, సంస్థలకు చెల్లించే విధానాన్ని అమలు చేయనుంది. తొలుత మన రాష్ట్రంలో కూడా పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ భావించినా అనంతరం తొలగించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నూతన విధానానికి సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పది రోజుల క్రితమే రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. రాష్ట్రం వాటా కూడాఉమ్మడి ఖాతాలో జమ! మెటీరియల్ కేటగిరీ నిధులను కూడా నేరుగా కేంద్రమే ఆయా వ్యక్తులు, సంస్థలకు చెల్లించే ప్రక్రియ మొదలైతే రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా ఇవ్వాల్సిన 25 శాతం నిధులను ఉమ్మడి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా దాదాపు రూ.90 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల దాకా ఉపాధి హామీ పథకం కింద పనులు జరుగుతుండగా, మన రాష్ట్రంలో ఏటా రూ.9 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల విలువైన పనులు నమోదవుతున్నాయి. ఇందులో దేశవ్యాప్తంగా మెటీరియల్ కేటగిరీ నిధుల వాటా ఏటా రూ.30 వేల కోట్ల దాకా ఉండగా, మన రాష్ట్రంలో దాదాపు రూ.ఐదు వేల కోట్ల దాకా మెటీరియల్ కేటగిరీ నిధులు ఉంటాయి. కేంద్రం కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తే మన రాష్ట్రం ఏటా సుమారు రూ.1,250 కోట్ల వరకు ఎప్పటికప్పుడు ఉపాధి హామీ పథకం ఉమ్మడి ఖాతాకు నిధులు జమ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
తగ్గుతున్న వేతనాలు.. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి!
భారత వృద్ధికి వెన్నెముకగా ఉంటున్న మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం, గృహ ఖర్చులు, రవాణా ఖర్చలు పెరగడం.. వంటి విభిన్న అంశాలు ఇందుకు కారణమని ఎలరా సెక్యూరిటీస్ తెలిపింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం వల్ల లిస్టెడ్ నాన్ ఫైనాన్షియల్ కంపెనీల్లో వేతనాలు 0.5% తగ్గినట్లు ఎలారా పేర్కొంది.ఎలరా సెక్యూరిటీస్ వివరాల ప్రకారం.. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రజల ఆదాయాలు గణనీయంగా ప్రభావితం చెందుతున్నాయి. మధ్యతరగతి, పేద ప్రజలు రోజువారీ నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేట్ ఆదాయాల్లో మందగమనం కనిపిస్తోంది. హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా వంటి కంపెనీలకు చెందిన వస్తువుల పట్టణ డిమాండ్ క్షీణిస్తోంది. ఆయా కంపెనీ త్రైమాసిక వృద్ధికి సంబంధించి ముందుగా అంచనావేసిన దానికంటే బలహీనమైన వృద్ధి నమోదు అవుతోంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో గ్రామీణ విక్రయాలు 8% వృద్ధి చెందగా, పట్టణ విక్రయాలు 2% తగ్గాయి.ఇదీ చదవండి: మస్క్ కొత్తగా గేమింగ్ స్టూడియో!ప్రభుత్వం వస్తువుల డిమాండ్‌ను పెంచేందుకు వడ్డీరేట్ల కోతలు ప్రారంభించాలని యోచిస్తోంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రాధాన్యతనిస్తూ వివిధ మార్గాలు అనుసరిస్తోంది. దాంతో వడ్డీరేట్ల కోత నిర్ణయం వాయిదా పడుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిని 7 శాతం నుంచి 6.5 శాతానికి కట్ చేశారు. అంచనాల కంటే భిన్నంగా జీడీపీ వృద్ధి నమోదవుతుండడం ఆందోళన కలిగించే అంశం. మెట్రో నగరాల్లో ఇంటి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ ధరలు దేశవ్యాప్తంగా 23% పెరిగాయి. ఇంటి అద్దెలు పట్టణ ప్రజల ఆదాయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. -
సారూ.. జీతాలెప్పుడు?
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు రెండు మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న సమగ్ర శిక్ష, 108, 104.. ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు జీతాలు అందక సతమతమవుతున్నారు. విద్యా శాఖలో కీలకమైన రాష్ట్ర సమగ్ర శిక్షలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వీరికి కూడా ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేలా సమగ్ర శిక్ష ఎస్పీడీ చర్యలు తీసుకుని, సంబంధిత ఫైలును ప్రభుత్వానికి పంపించారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా.. సర్కారు నుంచి సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం. సమగ్ర శిక్ష ద్వారా నిర్వహిస్తున్న విద్యా సంబంధ కార్యకలాపాల కోసం ఓటాన్ అకౌంట్ నుంచి రూ.413 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం గత నెలలో జీవో విడుదల చేసింది. కానీ ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆగస్టు, సెపె్టంబర్ నెలలకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది. సీఆర్ఎంటీలు, కేజీబీవీ టీచర్లతో పాటు పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్లు, ఎంఈవో కార్యాలయాల్లో పని చేస్తున్న ఎంఐఎస్ ఇన్స్ట్రక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు, అకౌంటెంట్లు, పీఈటీలు, ఉపాధ్యాయ శిక్షణ సిబ్బంది, మధ్యాహ్న భోజనం వంట వారు, నైట్ వాచ్మన్లు, వాచ్ ఉమెన్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచర్లు, పీజీటీలు, క్లస్టర్ రిసోర్సు మొబైల్ టీచర్లు తదితర 25 వేల మంది జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి నెలవారి వేతనాలు రూ.6,500 నుంచి రూ.25 వేల వరకు ఉన్నాయి. లబోదిబోమంటున్న 108, 104 సిబ్బంది ఆగస్టు, సెపె్టంబర్ నెలల వేతనాలు అందక 108, 104 సిబ్బంది కూడా నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్స్‌లు 768.. 104 మొబైల్ మెడికల్ యూనిట్లు 936 ఉన్నాయి. అంబులెన్స్‌కు పైలట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీíÙయన్(ఈఎంటీ), ఎంఎంయూలో డ్రైవర్‌తో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్(డీఈవో) పని చేస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 104, 108లలో 6,500 మంది డ్రైవర్లు, ఈఎంటీ, డీఈవోలు సేవలు అందిస్తున్నారు. 108 పైలట్, ఈఎంటీలకు నెలకు రూ.18 వేల నుంచి రూ.30 వేల వరకు, 104 ఎంఎంయూ డ్రైవర్, డీఈవోలకు రూ.15 వేల నుంచి రూ.27 వేల వరకు వేతనాలున్నాయి. వీరికి 104, 108 నిర్వహణ సంస్థ అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్విసెస్ వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల వేతనాలు ఇంకా వీరికి అందలేదు. తమకు ప్రభుత్వం నుంచి ఆరు నెలలకుసంబంధించి రూ.140 కోట్ల బిల్లులు రావాల్సి ఉందని నిర్వహణ సంస్థ చెబుతోంది. అవి వస్తే గానీ పెండింగ్ వేతనాలను చెల్లించలేమంటున్నారని సిబ్బంది వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకు సీఎఫ్ఎంఎస్లో బిల్లులు అప్లోడ్ చేయలేదని చెబుతున్నారు. కాగా, ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్‌లో పనిచేసే చిరుద్యోగులు జీతాల బకాయిల కోసం మరో విడత ఆదివారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. గత నెల 13న కూడా వీరు ఆందోళన చేపట్టారు. ఓ వైపు జూలై నుంచి జీతాలు రావడం లేదని, మరోవైపు రాజకీయ ఒత్తిళ్లతో ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని యూనియన్ అధ్యక్షుడు డి.మూర్తిరెడ్డి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రతినెలా జీతం వస్తేనే తమ కుటుంబాలు గడుస్తాయని, ఇంటి అద్దె, కుటుంబ అవసరాలకు డబ్బుల్లేక అగచాట్లు పడుతున్నామని చెప్పారు. -
గురుకుల ఉద్యోగుల వేతన వెతలు
‘‘రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నాం’’ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు కూడా పలు సందర్భాల్లో చెబుతున్న మాటలివి.కానీ గురుకుల విద్యా సంస్థల్లో మాత్రం ఒకటో తేదీన వేతన చెల్లింపులు ఇప్పటివరకు జరగలేదు. ప్రధానంగా ఎస్సీ, మైనార్టీ గురుకులాల్లో ఒకటో తారీఖు దాటి రెండు వారాలైనా ఉద్యోగులు జీతం డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది.సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల పరిధిలో దాదాపు నలభై వేల మంది ఉద్యోగులున్నారు. ఇందులో రెగ్యులర్ ఉద్యోగులు మూడింట రెండొంతులు ఉండగా.. మిగిలిన ఉద్యోగులు పార్ట్‌టైమ్, గెస్ట్ ఫ్యాకల్టీ, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతమున్న ఉద్యోగుల్లో అత్యధికులు ఎస్సీ, మైనార్టీ గురుకుల సొసైటీల పరిధిలోని వారే. పెద్ద సంఖ్యలో ఉన్న ఈ రెండు సొసైటీల్లోని ఉద్యోగులకు నెలవారీ వేతన చెల్లింపులు గాడి తప్పాయి. ఇతర శాఖల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనో, ఆ మరుసటి రోజో వేతనాలు అందుతున్నప్పటికీ.. ఎస్సీ, మైనార్టీ గురుకులాల్లోని ఉద్యోగులకు మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రతి నెలా పది, పదిహేను రోజులు దాటే వరకు జీతాలు అందకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. క్రమం తప్పుతున్న నెలవారీ చెల్లింపులు సాధారణంగా నెలవారీ వేతనాలు పొందే ఉద్యోగులు కుటుంబ ఖర్చులు, పొదుపు అంశాల్లో అత్యంత ప్రణాళికతో ఉంటారు. వేతన డబ్బులు అందిన వెంటనే నెలవారీగా ఉండే చెల్లింపులు చేస్తూ మిగిలిన మొత్తాన్ని భవిష్యత్ అవసరాల కోసం దాచిపెట్టుకుంటారు. కానీ ఎస్సీ, మైనార్టీ గురుకులాల్లోని ఉద్యోగులకు వేతన చెల్లింపులపై స్పష్టత లేకపోవడం, ప్రతి నెలా నిర్దిష్ట సమయంలో కాకుండా ఇష్టానుసారంగా జీతాలు విడుదల చేస్తుండడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో వేతనాలు అందకపోవడంతో గృహ రుణాలు, వాహన రుణాలు, ఇతర వ్యక్తిగత రుణాలకు సంబంధించి నెలవారీ చెల్లింపులు గాడి తప్పుతున్నాయి. రుణ చెల్లింపుల్లో క్రమం తప్పడంతో తమ సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం పడుతోందంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతనాల కోసం ఉద్యోగులు ప్రతి నెలా సొసైటీ కార్యదర్శి కార్యాలయంలో వినతులు ఇవ్వడం పరిపాటిగా మారింది. ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల మాదిరి గురుకుల ఉద్యోగులకు కూడా నెలవారీగా ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
సెబీ చైర్మన్‌ను పిలుస్తాం
న్యూఢిల్లీ: మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్మన్‌గా ఉంటూనే మాధబి పురి బుచ్ ఐసీఐసీఐ నుంచి వేతనం తీసుకుని పరస్పర విరుద్ద ప్రయోజనాలు పొందడంసహా ఆమెపై, సెబీపై పలు ఆరోపణలు వెల్లువెత్తడంతో సెబీ పనితీరును సమీక్షించాలని ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) నిర్ణయించింది. ఈ విషయంలో మాధబిని పిలిపించి ప్రశ్నించేందుకు ఆమెకు సమన్లు జారీచేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధబి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని అమెరికన్ షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలు గుప్పించిన విషయం తెల్సిందే. -
పల్లెకు వెళ్లేడాక్టర్లకు రెట్టింపు వేతనం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాలకే పరిమితమవుతున్న డాక్టర్లను పల్లెలకు పంపించే దిశగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో పనిచేసేందుకు ముందుకు వచ్చే డాక్టర్లకు రెట్టింపు వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనివల్ల వైద్యులు గ్రామాల వైపు ఆకర్షితులవుతారని, తద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) మొదలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి పనిచేస్తే వేతనానికి రెట్టింపు (100 శాతం) ప్రోత్సాహకం, గిరిజన ప్రాంతాల్లోకి వెళ్లి పనిచేస్తే 125 శాతం ప్రోత్సాహకం ఇవ్వాలని అధికారులకు మంత్రి చెప్పినట్లు తెలిసింది. మెడికల్‌కాలేజీలు, జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీ, పీహెచ్సీలలో వైద్య సేవలు అందించే డాక్టర్లు అందరికీ ఈ ప్రోత్సాహకాన్ని వర్తింపజేస్తారు. వీటికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఒడిశా మోడల్ పల్లెల్లో పనిచేసే డాక్టర్ల కంటే హైదరాబాద్‌లో పనిచేసే వారికి హెచ్ఆర్ఏ (ఇంటి అద్దె అలవెన్సు) ఎక్కువ వస్తుంది. అంతేకాదు నగరంలో ఉంటూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసేవారూ ఉన్నారు. కొందరు సొంత ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలా అదనంగా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. పిల్లల చదువుల కోసం మరికొంత మంది నగరానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా అనేక కారణాలతో గ్రామాలకు, గిరిజన ప్రాంతాలకు వెళ్లడానికి డాక్టర్లు ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రి పలుమార్లు వైద్యాధికారులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రోత్సాహక పథకంపై వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ), వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ తదితరులతో అధ్యయనం చేయించారు. ఒడిశాలో రాష్ట్ర రాజధాని నుంచి ప్రతి 50 కిలోమీటర్ల దూరానికి ఒక స్లాబ్ నిర్ణయించి, బేసిక్ పేపై 25 నుంచి 150 శాతం వరకూ ప్రోత్సాహకం ఇస్తున్నారు. దీంతో డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనిపై అధికారులు మంత్రికి నివేదిక ఇచ్చారు. దీంతో ఇదే పద్ధతిని రాష్ట్రంలోనూ అమలు చేయాలని మంత్రి నిర్ణయించారు. జిల్లాలకు వెళితే క్వార్టర్లు కూడా..జిల్లాలకు వెళ్లే డాక్టర్లకు ఆయా ఆసుపత్రుల్లో క్వార్టర్లు నిర్మించాలని కూడా నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లాల్లోని మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రుల్లోని డాక్టర్లకే క్వార్టర్లు ఉన్నాయి. అయితే కొత్తగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లకు కూడా క్వార్టర్లు నిర్మించాలని మంత్రి అధికారులకు సూచించారు. పీహెచ్‌సీల్లోని డాక్టర్లు గ్రామాల్లో కాకుండా సమీపంలో ఉన్న మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు వెళ్లి రావొచ్చు కాబట్టి వారికి క్వార్టర్లు అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చారు. అయితే క్వార్టర్లు నిర్మించి ఇవ్వడం వల్ల డాక్టర్లు నిరంతరం అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. డాక్టర్ అందుబాటులో లేడనే అభిప్రాయం కూడా ఉండదని మంత్రి భావిస్తున్నారు. ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీల్లో పనిచేసేది స్పెషాలిటీ డాక్టర్లు కాబట్టి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి.వీరికి ప్రోత్సాహకాలు ఇచ్చి పల్లెలకు పంపడం వల్ల అక్కడే స్పెషాలిటీ సేవలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో జిల్లాల్లో డాక్టర్లను పూర్తి స్థాయిలో నియమించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని భావిస్తున్నారు. దీనివల్ల 75% వైద్య సేవలు జిల్లాలకే పరిమితం అవుతాయని, హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. -
వలంటీర్లపై ముందడుగా, వెనకడుగా?
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కిత్రం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించే అలోచనలో ఉందా లేదా అన్న అంశంపై మంగళవారం శాసన సభ సమావేశాల ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో చర్చ జరగనుంది. మంగళవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ముందుగా నిర్ణయించిన పది ప్రశ్నల్లో ఈ అంశం మూడోది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, బి. విరూపాక్షి లేవనెత్తిన ఈ ప్రశ్నకు సాంఘిక సంక్షేమ శాఖ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖల మంత్రి డోలా బాల వీరాంజనేయులు సమాధానం చెప్పనున్నారు. ఈ సందర్బంగా సభలో జరిగే చర్చలో వలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వ ఆలోచనలు, సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రకారం వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా.. వారి గౌరవ వేతనం పెంపు హామీని నిలబెట్టుకుంటారా అన్న విషయాలపై చాలా వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.త్రిశంకుస్వర్గంలో వలంటీర్ల వ్యవస్థప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి, వారికి అన్ని విధాలా సహకరించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 ఆగస్టులో వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా విరుచుకుపడేవారు. దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి మాట మార్చేశారు. వలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రూ. 10 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఊసే ఎత్తడంలేదు. పైగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జులై ఒకటి నుంచి చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లను తప్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేశారు. వలంటీర్లు ప్రతి నెలా కీలకంగా నిర్వహించే విధుల్లో పింఛన్ల పంపిణీ ప్రధానమైనది. అటువంటి కార్యక్రమానికే దూరంగా పెట్టడంతో వలంటీర్ల వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు ఏమిటన్న విషయంపై అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుందా లేదంటే ఇంకేమైనా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవే అనుమానాలతో రాష్ట్రంలో పలుచోట్ల వలంటీర్లు ఆందోళనలు చేస్తున్నారు. సోమవారం విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద ప్రస్తుతం అధికారికంగా విధుల్లో కొనసాగుతున్న పలువురు వలంటీర్లు నిరసన తెలియజేశారు. వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం గౌరవ వేతనం రూ. 10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. -
అంగన్వాడీల్లో వేతన యాతన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లకు వేతన కష్టాలు తీరడం లేదు. ప్రస్తుతం రెండు నెలల నుంచి వారికి వేతనాల్లేవు. మరోవైపు సమ్మె కాలానికి సంబంధించిన బకాయిలు సైతం ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదు. దీంతో అంగన్వాడీ టీచ ర్లు, హెల్పర్లు క్షేత్రస్థాయిలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా పదో తేదీలోపు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు అందేవి. కానీ ఏడాది కాలంగా ఈ చెల్లింపుల ప్రక్రియ గాడితప్పింది. రెండు, మూడు నెలలకోసారి వేతనాలు విడుదల కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 59వేల మంది అంగన్వాడీ సిబ్బంది రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచర్, ఒక హెల్పర్ చొప్పున పోస్టులు మంజూరైనప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా 59వేల మంది టీచర్లు, హెల్పర్లు ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్నారు. అంగన్వాడీ టీచర్‌కు నెలకు రూ.13650 చొప్పున గౌరవ వేతనం ఇస్తుండగా... హెల్పర్‌కు రూ.7800 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం గౌరవవేతనం మంజూరు చేస్తోంది. ప్రతి నెలా జాప్యమే.. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన చెల్లింపుల్లో ప్రతి నెలా జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. సాంకేతిక సమస్యలో లేక ఇతరత్రా కారణాలతో వేతన చెల్లింపుల్లో కాస్త ఆలస్యం కావడం సహజమే అయినప్పటికీ.. ప్రతి నెలా ఇదే పరిస్థితి తలెత్తుతుండడం పట్ల వారు తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ వేతనంపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించే పరిస్థితుల్లో వేతన చెల్లింపుల జాప్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలకు ప్రతి నెలా రూ.70 కోట్లు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల గౌరవవేతనానికి సంబంధించి ప్రతి నెలా సగటున రూ.70కోట్ల బడ్జెట్ అవసరం. ఈ లెక్కన ఏటా రూ.840 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది. గత కొంత కాలంగా కేంద్రం నుంచి వచ్చే నిధుల రాక ఆలస్యం కావడంతో ఈ జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. బడ్జెట్ సమస్యతో వేతన చెల్లింపులు ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కమిషనరేట్‌కు ఫిర్యాదులు వేతన చెల్లింపుల్లో జాప్యంపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నుంచి రాష్ట్రస్థాయి ఉ న్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, హె ల్పర్ల సంఘం ఇటీవల రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌కు వే ర్వేరుగా వినతి పత్రాలు సమరి్పంచింది. వేత న చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరి ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని కోరింది. -
ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం భారీగా పెరుగుదల
సాక్షి, అమరావతి : ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం గత నాలుగేళ్లలో భారీగా పెరిగిందని కాగ్ అకౌంట్స్ నివేదిక స్పష్టం చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరం కాగ్ అకౌంట్స్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీకి సమర్పించింది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం పెరుగుతుండటంతో తప్పనిసరి రెవెన్యూ వ్యయం ఏటేటాపెరుగుతోందని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి. ఉద్యోగుల వేతనాల వ్యయం అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చి చూస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో 19.18 శాతం మేర పెరిగినట్టు కాగ్ అకౌంట్స్ పేర్కొన్నాయి. 2019–20 ఉద్యోగుల పెన్షన్ల వ్యయం రూ.17,385 కోట్లు ఉండగా, 2022–23 నాటికి పెన్షన్ల వ్యయం రూ.22,584 కోట్లకు పెరిగినట్లు కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి.. అంటే నాలుగేళ్లలో పెన్షన్ల వ్యయం రూ.4,942 కోట్ల మేర పెరిగింది. అలాగే ఉద్యోగుల వేతనాల వ్యయం 2019–20లో రూ.36,179 కోట్లు ఉండగా, 2022–23 నాటికి వేతనాల వ్యయం రూ.49,421 కోట్లు పెరిగినట్లు కాగ్ అకౌంట్స్ పేర్కొన్నాయి. అంటే నాలుగేళ్లలో వేతనాల వ్యయం రూ.13,242 కోట్ల మేర పెరిగింది. -
అంగన్వాడీలకు అడిగినవన్నీ..
సాక్షి, అమరావతి : బడుగు బలహీనవర్గాలకు మేలుచేసే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, వాటిలో సేవలందిస్తున్న వర్కర్లు, ఆయాలపట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలి నుంచీ సానుకూల వైఖరితోనే వ్యవహరిస్తోంది. ఆ కేంద్రాలను ఆధునీకరించడంతోపాటు అంగన్వాడీలకు మెరుగైన జీతాలిచ్చింది కూడా సీఎం జగన్ ప్రభుత్వమే. చంద్రబాబు జమానాకంటే సీఎం జగన్ పాలనలోనే వీరి వేతనాలు పెరిగాయి. ఎలాగంటే.. 2014 నుంచి 2016 వరకు ఈ వర్కర్లకు కేవలం రూ.4,200 మాత్రమే గౌరవ వేతనం ఇచ్చిన చంద్రబాబు 2016లో కంటితుడుపు చర్యగా రూ.ఏడు వేలకు పెంచారు. అప్పటి నుంచి రెండేళ్ల మూడు నెలలపాటు అదే అరకొర జీతంతో సరిపెట్టారు. 2018లో తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీలకు గౌరవ వేతనం పెంచుతానని ప్రతిపక్ష హోదాలో వైఎస్ జగన్ ప్రకటించడంతో అప్పుడుగానీ చంద్రబాబుకు వారి జీతాలు గురించి గుర్తురాలేదు. దీంతో ఎన్నికలకు ఆర్నెల్ల ముందు హడావుడిగా వేతనాలు పెంచినట్లు మోసపూర్తింగా జీవో ఇచ్చారు కానీ, అమలు చేయలేదు. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ తెలంగాణా కంటే అధికంగా ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7వేలు చొప్పున పెంచి అందిస్తున్నారు. టీడీపీ హయాంలో అరకొర జీతాలతో అవస్థలుపడిన అంగన్వాడీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇలా వేతనాలు పెంచి నాలుగున్నరేళ్లుగా ఆ మొత్తాన్ని అందిస్తోంది. నీతిఆయోగ్ ప్రశంసలు.. గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వంలోనే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సగటు వేతనం భారీగా పెరిగింది. అంతేకాదు.. అంగన్వాడీల నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్ అని నీతిఆయోగ్ ప్రశంసించింది. అంగన్వాడీ వర్కర్లకు అత్యధిక వేతనాలిస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ ఆరవ స్థానంలోను, హెల్పర్ల వేతనాల్లో నాల్గవ స్థానంలో ఉండటం విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే.. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోనే అంగన్వాడీలకు అసలైన మేలు జరిగింది. అత్యాధునికంగా అంగన్వాడీ కేంద్రాలు.. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ♦ నాడు–నేడు ద్వారా అత్యాధునికంగా తీర్చిదిద్దుతోంది. వీటికి అవసరమైన వస్తువులు, స్టేషనరీకి 48,770 మెయిన్ కేంద్రాలకు రూ.500 చొప్పున.., 6,837 మినీ కేంద్రాలకు రూ.250 చొప్పున మొత్తం 55,607 కేంద్రాలకు రూ.7.81కోట్లు మంజూరు చేసింది. ♦ సొంత భవనాల నిర్వహణ, చిన్నపాటి మరమ్మతులకు 21,206 కేంద్రాలకు (ఒక్కొక్క దానికి రూ.3వేలు చొప్పున) మొత్తం రూ.6.36 కోట్లు విడుదల చేసింది. ♦ అద్దె భవనాల్లో ఉన్న గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని 16,575, పట్టణాల్లోని 6,705 అంగన్వాడీ కేంద్రాలకు రూ.66.54 కోట్ల అద్దె బకాయిలు చెల్లించింది. ♦ అవకాశం ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మారుస్తోంది. అంగన్వాడీల మేలు కోరిన ప్రభుత్వం.. వేతనాల పెంపే కాదు.. అంగన్వాడీలు అడిగిన డిమాండ్లను సైతం సీఎం వైఎస్ జగన్ పెద్ద మనస్సుతో ఆమోదించి అమలుచేస్తున్నారు. అంగన్వాడీల మేలు కోరి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా (ఈ నెల 20న) మరికొన్ని ఉత్తర్వులు జారీచేసింది. అవేమిటంటే.. ♦అంగన్వాడీ సహాయకులను కార్యకర్తలుగా నియమించేందుకు వయో పరిమితిని 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు పెంచుతూ జీఓఎంఎస్–44 జారీచేసింది. ♦ సెక్టార్, యూనిట్ సమావేశాలకు హాజరయ్యేందుకు టీఏ, డీఏలు ఇవ్వాలన్న అంగన్వాడీల కోరికపై సానుకూలంగా స్పందించి మెమో నెంబర్.2303564/2023 జారీచేసింది. ♦ అంగన్వాడీ వర్కర్లకు నెలకు ఒకసారి, హెల్పర్లకు రెండు నెలలకు ఒకసారి టీఏ, డీఏలు చెల్లించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ♦ వీటితోపాటు అంగన్వాడీ వర్కర్లు, సహాయకుల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. ♦ అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్ల సర్వీసు విరమణ తర్వాత వన్‌టైం బెనిఫిట్ రూ.50 వేలను రూ.1 లక్షకు పెంచింది. ♦ సహాయకుల సర్విసు విరమణ తర్వాత వన్‌టైం బెనిఫిట్ రూ.20వేల నుంచి రూ.40 వేలకు పెంచింది. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్రతి ఒక్కరికీ యూనిఫారం (ఆరు చీరలు చొప్పున) అందించేందుకు రూ.16 కోట్లను ఖర్చుచేసింది. వారి విధులు సజావుగా నిర్వహించడానికి, మంచి సేవలు అందించడానికి ఈ ప్రభుత్వం రూ.85.47 కోట్లతో 56,984 స్మార్ట్ఫోన్లు కొని, అందించింది. డేటా ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తూ అదనంగా ఏడాదికి రూ.12కోట్లు చెల్లిస్తోంది. ♦ ఈ ఏడాది నుంచి వర్కర్లు, హెల్పర్లకు జీవిత బీమా వర్తింపజేస్తోంది. ప్రమాద బీమాగా రూ.2 లక్షల వరకూ చెల్లిస్తోంది. ♦ అంగన్వాడీల ద్వారా నాణ్యమైన సరుకుల పంపిణీని పర్యవేక్షించేందుకు దాదాపు 500 మంది సూపర్వైజర్లను కూడా నియమించింది. ♦ గర్భవతులు, బాలింతలు, పిల్లలకు గతంలోలా వండి ఇచ్చే ఇబ్బంది లేకుండా టేక్‌హోం రేషన్ పద్ధతిని అమల్లోకి తెచ్చింది. దీనివల్ల వారికి పనిభారం తగ్గింది. 2023 నుంచి డ్రై రేషన్ అందిస్తోంది. ♦ మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 ఇస్తోంది. ఇలా ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా చెల్లిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి పదోన్నతులు.. ఇక అంగన్వాడీలకు 2013 నుంచి పదోన్నతులు ఇవ్వలేదు. టీడీపీ ప్రభుత్వంలో దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చింది. మరోవైపు.. 560 గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులను భర్తీచేసింది. ఇదే సందర్భంలో ఈ సూపర్వైజర్ పోస్టులకు పరీక్షలు రాసే వారి వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. తొమ్మిదేళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వయో పరిమితి పెంపు చాలా ఉపయోగపడింది. ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి రూ.1,313 కోట్లు అందించింది. ఇక నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలుచేసిన జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతుభరోసా, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వారికి కూడా వర్తింపజేయడం గమనార్హం. -
ఐడీ లేక.. వేతనం రాక..
సాక్షి, కామారెడ్డి: గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ) వ్యవస్థను రద్దు చేసిన గత ప్రభుత్వం వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసి నాలుగు నెలలు గడుస్తున్నా ఎంప్లాయ్ ఐడీ ఇవ్వకపోవడంతో వేతనాలు అందడం లేదు. జీతాల కోసం రాష్ట్రంలో 14,954 మంది వీఆర్ఏలు ఎదురు చూస్తున్న దుస్థితి నెల కొంది. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని భా వించిన గత సర్కారు.. మొదట వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి, ఉద్యోగులను వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. తర్వాత వీఆర్ఏలను కూడా వారి విద్యార్హతలను బట్టి వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా, రికార్డు అసిస్టెంట్లుగా, ఆఫీసు సబార్డినేట్లు గా సర్దుబాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మంది గ్రామ సేవకులు (వీఆర్ఏ) ఉండగా వారిలో తొలి విడతలో 14,954 మందిని వివిధ శాఖల్లో స ర్దుబాటు చేశారు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా 2,451 మంది, మున్సిపాలిటీల్లో జూనియర్ అసిస్టెంట్లు, వార్డ్ ఆఫీసర్లుగా 1,266 మంది, రెవెన్యూ శాఖలో రికార్డు అసిస్టెంట్లుగా 2,113 మంది, ఆఫీసు సబార్డినేట్లుగా 680 మంది, నీటి పా రుదల శాఖలో 5వేల మంది, మిషన్ భగీరథలో 3, 372 మందిని సర్దుబాటు చేశారు. మరికొన్ని శాఖ ల్లో మరో 72 మందిని సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక వృద్ధాప్యంతో ఉన్న వారు, వారసులు లేకపోవడం వంటి కారణాలతో కొందరి ఉద్యోగా లు సర్దుబాటు కాలేదు. ఈ ఏడాది ఆగస్టు 10న వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ పోస్టింగ్‌లు కూడా ఇచ్చారు. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారో అక్కడే జాయిన్ కావాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో దూరమైనా సరే వెళ్లి ఉద్యోగాల్లో జాయిన్ అయి పని చేస్తున్నారు. ఇంకా ఎంప్లాయ్ ఐడీ జనరేట్ కాలేదు ఎంప్లాయ్ ఐడీ నమోదైన తర్వాతనే వారిని ప్రభు త్వ ఉద్యోగుల కింద లెక్కగట్టి వేతనాల ప్రక్రియను మెదలుపెడతారు. వీఆర్ఏలను ఆయా ఉద్యోగాల్లో సర్దుబాటు ప్రక్రియను చేపట్టిన గత ప్రభుత్వం వారికి ఐడీ ఇంకా ఇవ్వలేదు. ఇంతలో ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో ఆ విషయం పక్కకు వెళ్లింది. ఫలితంగా నాలుగు నెలలుగా వేతనాలు అందక వీఆర్ఏలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బదీలీలతో ఊరు కాని ఊరు వెళ్లిన తాము అప్పులు చేసి జీవనం సాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం పరిష్కరించాలి వీఆర్ఏలుగా పనిచేస్తున్న మమ్మల్ని వివిధ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగాల్లో సర్దుబాటు చేయడంతో ఎంతో సంతోషించాం. అయితే మాకు వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం మా సమస్యను వెంటనే పరిష్కరించాలి. – ముదాం చిరంజీవి, వీఆర్ఏల సంఘం ప్రతినిధి, కామారెడ్డి -
వేతనాలు చెల్లించాలని ముగ్గురు కార్మికుల ఆత్మహత్యాయత్నం
ఎంజీఎం: వేతనాలు చెల్లించాలని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం ముగ్గురు ఔట్సోర్సింగ్ కార్మికులు పురుగు మందు తాగారు. ఎంజీఎం ఆస్పత్రికి 20 నెలల కిందట 300 ఓసీఎస్ పద్దు కింద 35 పోస్టులు మంజూర య్యాయి. వీరిని ఔట్సోర్సింగ్ కింద తీసుకున్నారు. అయితే 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో 16 మంది కార్మికులు ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయం చు ట్టూ రెండు, మూడు రోజులుగా ప్రదక్షిణలు చేస్తున్నారు. శుక్రవారం సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌తో కార్మికులు చర్చలు జరిపి వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ క్రమంలో 300 ఓసీఎస్ పద్దులో కాకుండా ఎంజీఎం ఆస్పత్రిలో కృష్ణ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ ద్వారా వేతనాలు చెల్లిస్తామని చెప్ప డంతో ఆవేదనకు గురై న కార్మికుల్లో ముగ్గురు ఆయన చాంబర్ ఎదుట పురుగు మందు తాగారు. వెంటనే సిబ్బంది వారిని చికి త్స నిమిత్తం ఆస్పత్రి అత్యవసర విభాగానికి తరలించారు. కాగా, ఈ ఘటనపై సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వీరి వేతనాల సమస్య సచివాలయంలో పెండింగ్ ఉందని తెలిపారు. బెదిరించే ధోరణిలో వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. -
జీతాల పెంపు: దిగ్గజ ఐటీ కంపెనీల ఉద్యోగులకు షాక్!
దేశీయ ఐటీ దిగ్గజాలు ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆదాయం, ఖర్చులు లాంటి పలు సవాళ్లను ఎదుర్కొంటున్న పలు ప్రముఖ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నాయి. దీంతో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురు కానుంది. ఈమేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని వెలువరించింది. దీని ప్రకారం ఇన్ఫోసిస్, HCLTech ఈసారి పెంపును నిలిపివేసినట్టు సమాచారం. సాధారణంగా ఇన్ఫోసిస్ జీతాల పెంపును జూన్/జూలైలో ప్రకటించడం,అవి ఏప్రిల్ నుండి అమలు కావడం జరుగుతూ ఉంటుంది. అయితే హెచ్‌సిఎల్‌టెక్ మధ్య నుండి సీనియర్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను దాటవేసిందట.అలాగే జూనియర్ స్థాయి ఉద్యోగుల జీతాల పెంపును వాయిదా వేసింది. ఇన్ఫోసిస్ 023-24 ఆర్థిక సంవత్సరానికి గాను తన వృద్ధి అంచనాను 4- 7శాతంనుంచి 1-3.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. (ప్రౌడ్ ఫాదర్ జస్ప్రీత్ బుమ్రా నెట్‌వర్త్, లగ్జరీ కార్లు, ఈ వివరాలు తెలుసా?) భిన్నంగా టీసీఎస్, విప్రో: ఉద్యోగులకు ఊరట అయితే మరో టెక్ దిగ్గజం విప్రో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. మునుపటి సంవత్సరం సెప్టెంబర్‌తో పోల్చితే మూడవ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా. టెక్ మహీంద్రా జూనియర్ , మిడ్-లెవల్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను ఇచ్చింది. అయితే సీనియర్‌ల్లో పావు వంతు వాయిదా వేసింది. అటు మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ కూడా గత ఏడాది మాదిరిగానే తన ఉద్యోగులకు ఊరటనిచ్చింది. వారికి 6-8శాతం వరకు సగటు పెంపును, అత్యుత్తమంగా పనిచేసిన వారికి రెండంకెల పెంపు ప్రకటించింది. టీసీఎస్‌తో పాటు మధ్యతరహా ఐటి సంస్థలైన కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఎల్‌టిఐ మైండ్‌ట్రీ తమ ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. -
జీతాల్లేవ్... రెన్యువల్ లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోసం అల్లాడుతున్నారు. మూడు నెలలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వేతనాలు మాత్రం అందడం లేదు. అందుకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో దాదాపు 3,650 మంది పనిచేస్తున్నారు. డాక్టరు స్థాయి మొదలు స్టాఫ్ నర్సులు, రేడియోగ్రాఫర్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డార్క్ రూమ్ అసిస్టెంట్, ఎల్రక్టీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్స్ తదితర కేడర్ల లో కాంట్రాక్టు ప్రాతిపదికన, ఔట్ సోర్సింగ్ పద్దతుల్లో విధు లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సర్విసును ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తారు. ఏప్రిల్ నెల నుంచి మార్చి వరకు సర్విసు కాల పరిమితి ఉంటుంది. ఆ తర్వాత తిరిగి రెన్యువల్ చేస్తేనే నిధులు విడుదల చేస్తారు. పెండింగ్.. పెండింగ్... ఈ ఏడాది ఏప్రిల్‌లో వైద్య విధాన పరిషత్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్విసు రెన్యువల్ ప్రతిపాదనలను ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. సాధారణంగా ఈ ప్రక్రియ వారం నుంచి పది రోజుల్లోగా పూర్తి కావాలి. కానీ ఏప్రిల్ నెలలో సమర్పించిన ప్రతిపాదనలకు ఇప్పటికీ ఆమోదం రాలేదు. ఆ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ ఫైలు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,650 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్విసు రెన్యువల్ కోసం ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఏటా ఇదే తంతు... వైద్య విధాన పరిషత్‌లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపుల్లో ప్రతి సంవత్సరం తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో వేతనాలు అందడంలో ఆలస్యం అవుతోంది. ఇందుకు ప్రధాన కారణం సర్విసు పునరుద్ధరణే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చొరవ తీసుకోవాలని ఉద్యోగులు మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రాలు సమర్పించారు. -
జలమండలి ఉద్యోగులకు 30% పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు (జలమండలి)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం వేతన సవరణ అమలు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా దాదాపు నాలుగు వేల మంది వాటర్ బోర్డు ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. మెట్రో వాటర్‌వర్క్స్ యూనియన్ అధ్యక్షుడు జి.రాంబాబుయాదవ్, ఇతర నేతలు సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. -
సింగరేణి కార్మికులకు 11వ వేజ్‌బోర్డ్ వేతనాలు నేడు
సింగరేణి (కొత్తగూడెం)/గోదావరిఖని: సింగ రేణి కార్మికులకు 11వ వేజ్‌బోర్డ్ ప్రకారం కొత్త వేతనాలను సంస్థ సోమవారం చెల్లించనుంది. కోల్ ఇండియా పరిధిలోని సింగరేణితో పాటు మరో 8 బొగ్గు పరిశ్రమలకు చెందిన సుమారు 3.50 లక్షల మంది కార్మికులకు జూలై నుంచి కొత్త వేతనాలు అందించేందుకు సర్క్యులర్ విడుదల చేసింది. 10వ వేజ్‌బోర్డ్‌లో 1వ కేట గిరీ నుంచి ఏ1 గ్రేడ్ కార్మికులు, సూపర్వైజర్లు కలిపి సుమారు 42వేల మంది పనిచేస్తున్నా రు. వీరికి జూన్ వరకు నెలకు రూ.320 కోట్లు వేతనాల రూపంలో చెల్లించగా, 11వ వేతన సవరణలో అదనంగా రూ.70 కోట్ల మేర పెరి గాయి. గతంలో కేటగిరీ–1 కార్మికులకు రోజు కు రూ.1011.27 చెల్లించగా, ఇప్పుడు రూ.1502.66 చెల్లిస్తారు. ఏ1 గ్రేడ్, సూపర్ వైజర్లకు వేతనం గతంలో రూ.47,802.52 ఉండగా, 11వ వేజ్‌బోర్డు అమలుతో రూ.71, 030.56కు పెరిగింది. ఇంకా వీటికి అలవెన్స్‌లు అదనంగా లభిస్తాయి. బకాయి వేతనాలు విడుదల.. 10వ వేజ్‌బోర్డ్ కాల పరిమితి 2021 జూన్ 30 తో ముగిసింది. అంటే 2021 జూలై 1 నుంచి 11వ వేజ్‌బోర్డు అమలు కానుంది. ఈ నేపథ్యంలో 23 నెలల బకాయిలు కూడా కార్మికుల ఖా తాల్లో జమ కానున్నాయి. 11వ వేజ్‌బోర్డ్‌లో 19 శాతం మినిమమ్ గ్యారెంటీ బెనిఫిట్ (ఎంజీ బీ) జీతం పెరుగుదలతోపాటు 25 శాతం అల వెన్స్‌లు కలిపి ఒకొక్క కార్మికుడికి వారి వేతన స్థాయిని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు బకాయిలు అందే అవకాశం ఉంది. -
AP: ఏడాదిలోనే జీతాల వ్యయం.. రూ.8,068కోట్లు పెరుగుదల
సాక్షి, అమరావతి: దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం భారీగా పెరిగింది. అదే సమయంలో పెన్షన్ల వ్యయం కూడా భారీగానే అయింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2022–23 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ప్రాథమిక గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఏడాది వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం భారీగా పెరిగింది. మరోపక్క.. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల కన్నా ఏపీలోనే ఉద్యోగుల వేతనాల వ్యయం అధికంగా ఉందని కాగ్ తెలిపింది. నివేదిక ముఖ్యాంశాలు ఏమిటంటే.. ♦ 2021–22తో పోలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం 2022–23లో రూ.8,068.39 కోట్లు పెరిగింది. ♦ ప్రభుత్వోద్యోగుల పెన్షన్ల వ్యయం 2021–22తో పోలిస్తే 2022–23లో రూ.2,257.29 కోట్లు పెరిగింది. ♦ 2021–22 ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం ఏపీలో రూ.40,895.83 కోట్లు ఉండగా 2022–23లో అది ఏకంగా రూ.48,964.22 కోట్లకు పెరిగింది. ♦ అలాగే, 2021–22లో ప్రభుత్వోద్యోగుల పెన్షన్ల వ్యయం రూ.20,326.67 కోట్లు కాగా, 2022–23లో అది రూ.22,583.96 కోట్లకు పెరిగింది. ..ఇలా రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం ఏటేటా పెరుగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీని అమలుచేయడంతో పాటు ఉద్యోగులకు డీఏలు ఇవ్వడంతో వేతనాల వ్యయం భారీగా పెరుగుతోంది. మరోవైపు.. వైద్య ఆరోగ్య శాఖలో ఏ ఒక్క పోస్టు ఖాళీలేకుండా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తోంది. -
ప్రభుత్వ ఉద్యోగాలున్నయ్.. కానీ జీతాల్లేవ్!
కోరుట్ల: పేరుకి ప్రభుత్వోద్యోగమే అయినా ఆర్నెల్లుగా నయాపైసా జీతం లేక అల్లాడిపోతున్నారు కొత్త మండలాల్లోని రెవిన్యూ ఉద్యోగులు. గతేడాది సెప్టెంబర్ 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ జీవో నంబరు 97 జారీచేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత తహసీల్దార్ కార్యాలయాలకు రూపునిచ్చారు. ఆయా జిల్లాల్లోని వివిధ మండలాల్లో పనిచేసే సిబ్బందికి వాటిలో పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉందికానీ.. కొత్త మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల మంజూరు కోసం సీసీఎల్ఏ నుంచి ’క్యాడర్ స్ట్రెంత్’సర్కులర్ జారీచేయాల్సి ఉంటుంది. ఈ జీవో జారీ ఆరు నెలలుగా జాప్యమవుతోంది. దీంతో సిబ్బందికి వేతనాలు అందడంలేదు. ♦ 13 మండలాలు.. 240 మంది సిబ్బంది.. ♦ కొత్త మండలాల జీవో జారీ కాగానే తహసీల్దార్ కార్యాయాలు ఏర్పాటు చేశారు. ♦ నిబంధనల ప్రకారం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు గిర్దావర్లు(ఆర్ఐలు), ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, సర్వేయర్, అటెండర్, చైన్‌మన్‌తోపాటు గ్రామాల సంఖ్యను బట్టి 15–25 మంది వీఆర్ఏలను నియమించారు. ♦ జీవో 97 ప్రకారం ఇతర మండలాల్లోని సిబ్బందిని కొత్త మండలాల్లో నియమిస్తూ జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారు. ♦ ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన 13 మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో సుమారు 240 మంది ఉద్యోగులు వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నారు. ఆర్నెల్లుగా అరిగోస.. విధులు నిర్వర్తిస్తున్నా.. తమకు జీతాలు రాకపోవడంపై సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్ స్ట్రెంత్ జీవో జారీకోసం కొందరు జిల్లా కలెక్టర్లు సీసీఎల్ఏకు మొరపెడుతూ లేఖలు రాసినా పట్టించుకునే వారులేరు. జీవో జారీ కాకపోవడంతో ఉద్యోగుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, వేతనాల విడుదల వంటి అంశాల వివరాలు జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో నమోదు కాలేదు. ఫలితంగా ఆరు నెలలుగా జీతాలు లేక కొత్త మండలాల్లో పనిచేస్తున్న సుమారు 240 మంది రెవెన్యూ ఉద్యోగులు నానాతిప్పలు పడుతున్నారు. ఏమిటీ క్యాడర్ స్ట్రెంత్? కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ కార్యాలయాల్లో హోదాల ప్రకారం ఉండాల్సిన సిబ్బంది, వేతన వివరాలు, ఆర్థికపరమైన అనుమతులను రెవెన్యూ పరిభాషలో క్యాడర్ స్ట్రెంత్ అంటారు. ఈ క్యాడర్ స్ట్రెంత్ జీవో విడుదల అయితేనే కొత్త మండలాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, వేతనాలు నేరుగా సంబంధిత జిల్లా ట్రెజరీ కార్యాలయాకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ జీవోను సీసీఎల్ఏ జారీ చేయాల్సి ఉంటుంది. -
ప్రకృతి వనం.. కొరవడిన పచ్చదనం.. జీతాలు ఇయ్యకపాయే! ఎట్లా?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : పలు జిల్లాల్లో గ్రామపంచాయతీల సిబ్బందికి రెండు నుంచి నాలుగు నెలల వేతనాలు రాకపోవడంతో మొక్కల సంరక్షణపై దృష్టి సారించడం లేదు. ఇంకొన్ని ప్రాంతాల్లో నీటి వసతిలేదు. కొన్నిచోట్ల అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. వీటికి వేసవి తోడు కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయి. 12,769 గ్రామపంచాయతీల్లో ఏర్పాటు ఏటా నిర్వహించే హరితహారంలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. పల్లెవాసులకు పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచేందుకు పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను నాటారు. అక్కడ సేద తీరేందుకు వీలుగా బెంచీలు కూడా ఏర్పాటుచేశారు. ఉపాధి హామీ పథకం కింద గత రెండేళ్లు వీటి నిర్వహణ బాగానే సాగింది. నర్సరీల పెంపకం, పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటడం, నీటి వసతి, వన సేవకులకు వేతనం అంతా ఈ పథకం ద్వారా చెల్లించడంతో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. అయితే గత ఏడాది ఏప్రిల్ నుంచి పల్లె ప్రకృతి వనాల నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీ (జీపీ)లకు అప్పగించడంతో పరిస్థితి మారింది. పలు జిల్లాల్లో పూర్తిగా ఎండిపోయి.. ప్రకృతి వనాల్లో మొక్కల సంరక్షణ చూసుకునే బాధ్యత గ్రామపంచాయతీ వర్కర్లకు అప్పగించారు. అయితే వీరికి రెండు నుంచి నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో వీరు బాధ్యతలపై దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. కొన్నిచోట్ల వనాల్లో బోర్లు లేక కూడా మొక్కలు ఎండిపోయాయి. ఆయా ప్రాంతాల్లో పంచాయతీల ట్యాంకర్లతో నీళ్లు పట్టినా.. ట్యాంకర్ల నిర్వహణ జీపీలకు పెనుభారమైన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లోని గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతివనాలు ఇప్పటికే పూర్తిగా ఎండిపోయాయి. మోడువారిన లక్ష్మీపురం వనం ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని రాఘబోయినగూడెం జీపీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామ పల్లె ప్రకృతి వనం. 2020–21లో గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కింద ఎకరం విస్తీర్ణంలో 913 మొక్కలు నాటారు. రెండేళ్లపాటు నిర్వహణ ఈజీఎస్ చూడటంతో వర్కర్లకు వేతనం అందింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి గ్రామ పంచాయతీకి బాధ్యతలు అప్పగించిన తర్వాత క్రమంగా మొక్కలన్నీ ఎండిపోయాయి. ఇక్కడ నీరందించేందుకు బోరు వేసినా మోటారు బిగించలేదు. అసలే ఎదగలేదు.. ఆపై నీరందక.. ఇది వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని నెక్కొండ తండాలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనం. ప్రస్తుతం విపరీతమైన ఎండలతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఇక్కడ సారవంతమైన భూమికి బదులుగా చౌడు భూమిలో మొక్కలు నాటారు. దీంతో మొక్కలు మామూలుగానే సరిగా ఎదగలేదు. ప్రస్తుతం వేసవి తాపానికి తోడు తగిన నీరందకపోవడంతో ఎండిపోతున్నాయి. మూడు నెలల డబ్బులు రావాలి.. ప్రకృతి వనంలో మొక్కలను కాపాడేందుకు ఎండనక, వాననక కష్టపడ్డా. నెలకు రూ.3 వేల చొప్పున మూడు నెలల వేతనం రాలేదు. అధికారులను అడిగితే వస్తుందనే సమాధానం తప్ప బ్యాంకులో జమ అయిందే లేదు. –పార్నంది గౌరమ్మ, శివునిపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ జిల్లా నెల నెలా ఎదురుచూపులే.. వన సేవకుడిగా పనిచేస్తున్నా. గత ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదు. ఎప్పటికప్పుడు ఈనెల వస్తాయంటూ ఎదురుచూస్తున్నా. చేసిన పనికి ప్రతినెలా డబ్బులిస్తే మాకు ఇబ్బందులు ఉండవు. – బోసి ధర్మయ్య, బజార్ కొత్తూర్, నందిపేట్ మండలం, నిజామాబాద్ జిల్లా జీతాలు లేక.. పనికి రాక నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని అమ్రాద్ తండాలో నాలుగైదు నెలలుగా జీతాలు లేక పంచాయతీ కార్మికులు పనికి రావడం మానేశారు. ఇక నీళ్ల ట్యాంకర్‌కు అవసరమైన డీజిల్ డబ్బు కూడా లేకపోవడంతో వనంలో మొక్కలకు నీరందక ఎండిపోతున్నాయి. అన్నిచోట్లా వేతనాల సమస్యే.. ♦ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 42 మండలాల్లో 1,070 జీపీలు ఉండగా, 3,851 మంది మల్టీ పర్పస్ వర్కర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి సంబంధించి రూ.2 కోట్ల వరకు వేతనాలు అందాల్సి ఉంది. ఈ జిల్లాలో 2,088 వనాలు ఏర్పాటు చేయగా, చాలా చోట్ల బోర్లు వేయకపోవడం, ట్యాంకర్లపైనే ఆధారపడి నీళ్లు పోయాల్సి రావడంతో వేసవిలో మొక్కలు ఎండిపోతున్నాయి. ♦ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1,509 జీపీలకు గాను 3,406 వనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పనిచేస్తున్న 4,924 మంది వర్కర్లకు 2 నుంచి 4 నెలల వరకు వేతనాలు రూ.10.11 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే రూ.6 కోట్ల వేతనాలు అందాలి. ఈ క్రమంలో వేసవిలో నీరు అందకపోవడంతో అధికారుల దృష్టికి వచ్చిన చోట ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేసినా మిగతా చోట్ల వనాలు ఎండిపోయాయి. ♦ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1,056 జీపీలకు గాను 1,338 వనాలు ఉన్నాయి. నిధులు లేక వారానికోసారి నీరు పడుతున్నారు. కొన్నిచోట్ల పూర్తిగా వదిలేశారు. ఐదారు నెలలుగా డబ్బు అందక పోవడంతో వన సేవలు పని మానేశారు. ♦ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 963 గ్రామ పంచాయతీలు ఉండగా 965 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. నీరు లేక ఇప్పటికే 92 వనాలు ఎండిపోయే స్థితికి చేరాయి. మొత్తం 3,998 మంది మల్టీ పర్పస్ వర్కర్లకు రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ♦ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌లో రెండు నెలల నుంచి, వనపర్తి, గద్వాల, నారాయణ్‌పేట జిల్లాల్లో 4 నెలల నుంచి వేతనాలు రావడం లేదు. మొత్తంగా 5,786 మంది మల్టీ పర్పస్ వర్కర్లకు సంబంధించి సుమారు రూ.13 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 నెలలుగా 5,666 మంది వర్కర్లకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో వారు ప్రకృతి వనాల నిర్వహణపై దృష్టి సారించడం లేదు. -
ఏపీలోనే ఆశా వర్కర్లకు ఎక్కువ వేతనాలు.. కేంద్ర వెల్లడి
సాక్షి,అమరావతి: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఆశా వర్కర్లకు అత్యధిక ఆర్థిక ప్రోత్సాహకాలు అందుతున్నాయి. ఏపీ ఇస్తున్నట్లుగా ఇతర ఏ రాష్ట్రాల్లోనూ ఆశా వర్కర్లకు నెలకు రూ. పది వేల ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వడం లేదని ఇటీవల పార్లమెంట్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వివిధ రాష్ట్రాల్లో ఆశా వర్కర్లకు అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహక మొత్తాలను ఆ మంత్రిత్వ శాఖ వివరించింది. ఆంధ్రప్రదేశ్ తరువాత తెలంగాణలో నెలకు రూ. 7,500లు ప్రోత్సాహకం అందుతోందని, ఆ తరువాత కేరళ, సిక్కిం రాష్ట్రాల్లో రూ.6 వేలు చొప్పున ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నారని కేంద్రం పేర్కొంది. కమ్యూనిటీ హెల్త్ వలంటీర్లుగా భావించే ఆశా వర్కర్లకు నెలకు రూ. 2 వేలు చొప్పున కేంద్రం ప్రోత్సాహకంగా ఇస్తోందని, అలాగే జాతీయ స్థాయి ఆరోగ్య కార్యకలాపాలు పనితీరు ఆధారంగా కూడా కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తుందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల ప్రణాళికలు అమలు ఆధారంగా ద్రవ్య ప్రోత్సాహకాలు అందించే సౌలభ్యం కల్పించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం ఇచ్చే రూ. 2 వేలకు అదనంగా మరో రూ. 2 వేలు కలిపి నెలకు రూ. 4 వేలు ఇచ్చేది. అది కూడా ఆరు నెలలైనా ఇవ్వని పరిస్థితులు ఉండేవి. వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన సందర్భంలో ఆశా వర్కర్ల వినతులను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 2019, ఆగస్టు 17న ఆశా వర్కర్ల వేతనాలను నెలకు రూ. 10,000లకు పెంచుతూ జీవో ఎంఎస్ నం.87 జారీ చేయించారు. దీంతో రాష్ట్రంలోని 43,767 మంది ఆశా వర్కర్లు లబ్ధి పొందుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఆశా వర్కర్లకు నెలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు ఇలా.. -
వేతనం రాక.. వెతలు తీరక
బీబీపేట: నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిన ఓ పంచాయతీ పారిశుధ్య కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరో పదిరోజుల్లో ఆయన భార్య బిడ్డకు జన్మనివ్వనుండగా... ఈలోపే తన భర్త ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. కామారెడ్డి జిల్లా బీబీపేట పంచాయతీలో ఆదివా రం జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. బీబీపేట గ్రామ పంచాయ తీలో వాటర్‌మన్‌గా పని చేస్తోన్న కొంగరి బాబు(32)కు 4 నెలలుగా వేతనం రావ డం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. భార్యకు ప్రసవ సమయం సమీపిస్తుండటం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో మనోవేద నకు గురై న బాబు.. ఆదివారం పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తోటి కార్మికులు, కుటుంబ సభ్యు లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బాబు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. పోలీసులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా ఆందోళన విరమించలేదు. సర్పంచ్‌తో పాటు పాలకవర్గం సభ్యులు, ప్రజాప్రతి నిధులు అక్కడకు చేరుకుని బాధితుడి కుటుంబానికి న్యాయం చేస్తామని, కుటుంబంలో ఒకరికి అదే ఉద్యోగాన్ని ఇస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి భార్య దేవలక్ష్మి, కుమారుడు భరత్, కూతురు మేఘన ఉన్నారు. దేవలక్ష్మి పురిటి కోసం ముంబయిలో ఉన్న పుట్టింటికి వెళ్లింది. పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం నాలుగు నెలలుగా వేతనాలు విడుదల కావడం లేదని, వారి పరిస్థితిని అర్థం చేసుకుని పంచాయతీ నిధులలోంచి రెండు నెలల వేతనాన్ని ఇచ్చామని సర్పంచ్ లక్ష్మి తెలిపారు. -
వేతనజీవులు.. ఆంధ్రాలో అధికం
సాక్షి, అమరావతి: దేశసగటు కన్నా రాష్ట్రంలోనే వేతన పురుషులు, మహిళల శాతం ఎక్కువగా ఉంది. ఈ విషయం కేంద్ర కార్యక్రమాల అమలు, గణాంకాలశాఖ నిర్వహించిన 2021–22 లేబర్ ఫోర్స్ సర్వేలో వెల్లడైంది. వేతన మహిళలు దేశంలో సగటున 16.5 శాతం ఉండగా, రాష్ట్రంలో 17.2 శాతం ఉన్నారు. వేతన పురుషులు దేశంలో సగటున 23.6 శాతం ఉండగా, రాష్ట్రంలో 27.6 శాతం ఉన్నారు. రాష్ట్రంలో పట్టణాల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా వేతనాలపై జీవిస్తున్నారు. పట్టణాల్లో 48.8శాతం వేతన పురుషులుండగా, 47.8శాతం వేతన మహిళలున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రంలో 15.7 శాతం వేతన పురుషులు ఉండగా, 9.7శాతం వేతన మహిళలున్నారు. కోవిడ్ ప్రభావం నేపథ్యంలో లేబర్ ఫోర్స్ సర్వేలో జాప్యం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేతన పురుషులు, మహిళలు, స్వయం ఉపాధిపై ఆధారపడినవారు, సాధారణ కూలీల శాతంపై సర్వే నిర్వహించారు. రాష్ట్రంలో 44 శాతం పురుషులు, 42.4 శాతం మహిళలు స్వయం ఉపాధిపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో సాధారణ కూలీలుగా 40.4 శాతం మహిళలు, 28.4 శాతం పురుషులు ఉపాధి పొందుతున్నారు. ఢిల్లీ, చండీగఢ్, కేరళల్లో వేతన మహిళలు అత్యధికం ఢిల్లీ, చండీగఢ్, కేరళల్లో వేతన పురుషుల కన్నా వేతన మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఢిల్లీలో వేతన మహిళలు 83 శాతం కాగా వేతన పురుషులు 63.3 శాతమే. చండీగఢ్‌లో వేతన మహిళలు 67.7 శాతం కాగా వేతన పురుషులు 61.5 శాతం, కేరళలో వేతన మహిళలు 37.3 శాతం, వేతన పురుషులు 27.5 శాతం ఉన్నారు. బిహార్‌లో అత్యల్పంగా వేతన పురుషులు 9.9 శాతం ఉండగా వేతన మహిళలు 10.7 శాతం ఉన్నారు. వేతన మహిళల్లో జార్ఖండ్‌లో అత్యల్పంగా 6.3 శాతం, ఆ తరువాత మధ్యప్రదేశ్‌లో 7.7 శాతం, రాజస్థాన్‌లో 7.6 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 6.7 శాతం ఉన్నారు. -
పాక్‌లో వేతనాలు, బిల్లుల చెల్లింపులు బంద్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఆర్థిక కష్టాలతో షహబాజ్ షరీఫ్ సర్కారు అతలాకుతలమవుతోంది. ప్రభుత్వోద్యోగులు, సిబ్బంది వేతనాలు సహా అన్ని బిల్లుల చెల్లింపుల్ని నిలిపేసింది. తదుపరి ఉత్తర్వుల దాకా శాఖలు, డివిజన్లు అనుబంధ విభాగాల బిల్లులను క్లియర్ చేయొద్దని ఆదేశించింది. మరోవైపు అత్యవసరమైన మందులు కూడా దొరక్క రోగులు నరకం చూస్తున్నారు. అత్యవసర ఆపరేషన్లు కూడా ఆగిపోతున్నాయి! -
దారుణం..ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
పుణేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు భీమా నదిలో శవమై కనిపించారు. మృతులు మోహన్ పవార్(45), అతని భార్య సంగీతా మోహన్(40), అతని కుమార్తె రాణి ఫుల్‌వేర్(24), అల్లుడు శ్యామ్ ఫుల్‌వేర్(28) వారి ముగ్గురు పిల్లలు(సుమారు 3 నుంచి 7 ఏళ్ల మధ్య)గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటన జనవరి 18 నుంచి 24 మధ్య పూణేలో దువాండ్ తహసిల్‌లోని పర్గావ్ వంతెన వద్ద జరిగిందని చెబుతున్నారు. దీంతో పోలీసులు మృతుడు మోహాన వార్ బంధువులైన అశోక్ కళ్యాణ్ పవార్, శ్యామ్ కల్యాణ్ పవార్, శంకర్ కల్యాణ్ పవార్, ప్రకాశ్ కల్యాణ్ పవార్, కాంతాబాయి సర్జేరావ్ జాదవ్ అనే ఐదుగురిని నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో మృతులంతా హత్యకు గురైనట్లు తేలిందిని చెప్పారు పోలీసులు. ఐతే సదరు నిందితుడు అశోక్ పవార్ కుమారుడు ధనుంజయ్ పవార్ కొన్న నెలలు క్రితం ప్రమాదంలో చనిపోయినట్లు పేర్కొన్నారు. దానికి సంబంధించిన కేసు పుణె నగరంలో నమోదైనట్లు చెప్పారు. ఐతే ధనుంజయ్ మరణానికి మోహన్ కారణమని దర్యాప్తులో తేలుస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశ్యంతో వారందర్నీ కడతేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. పోస్ట్‌మార్టంలో మృతులంతా నీట మునిగి చనిపోయినట్లు నివేదిక పేర్కొందని చెప్పారు. మృతులంతా ఉస్మానాబాద్ జిల్లాలోని మరఠ్వాడాలోని బీడ్ ప్రాంతానికి చెందిన వారని, వారంతా కూలీ పనులు చేసుకునేవారని తెలిపారు. ఈ మేరకు పోలీసుల కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయడమే గాక కోర్టు ముందు హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. (చదవండి: లక్నో భవనం కూలిన ఘటన: సమాజ్‌వాద్ పార్టీ నేత భార్య, తల్లి దుర్మరణం) -
పారిశుద్ధ్య కార్మికుల వేతనాల్లో కోత
సికింద్రాబాద్ జోన్‌లోని అయిదు సర్కిళ్లలో 3,228 మంది కార్మికులున్నారు. వీరిలో 1,683 మంది వేతనాల్లో కోత విధించారు. అంటే దాదాపు సగం మందికి జీతాల్లో కోత పడింది. కొన్ని సర్కిళ్లలో దాదాపు 70 శాతం మందికి వేతనాల్లో కోత విధించారు. కార్మికులకు రూ. 14వేల పైచిలుకు వేతనానికి రూ.1500 నుంచి రూ.8000 వరకు వేతనాల్లో కోత పడింది. నగరాన్ని పరిశుభ్రం చేసే 20వేల మందికి పైగా బల్దియా పారిశుద్ధ్య కార్మికుల కన్నీటి వెతలకు ఇది ఓ ఉదాహరణ. బయోమెట్రిక్ మెషిన్లలో సాంకేతిక లోపాలున్నా, సరిచేయాల్సిన కాంట్రాక్టు ఏజెన్సీ పనిచేయకున్నా దానిపై చర్యలు తీసుకోవడం మానిన అధికార యంత్రాంగం కార్మికుల కడుపు కొట్టింది. జీహెచ్ఎంసీలో దాదాపు నాలుగైదేళ్లుగా బయోమెట్రిక్ హాజరు నిర్వహిస్తున్నారు. మెషిన్లు పనిచేయని సందర్బాల్లో మాన్యువల్ హాజరు నమోదు చేసి వేతనాలిచ్చేవారు. మార్చి– ఏప్రిల్ నెలల్లో బయోమెట్రిక్ హాజరున్న రోజులకు మాత్రమే వేతనాలిచ్చారు. సమయంలో తేడా వచ్చినా కోత విధించారు. పారిశుద్ధ్య కార్మికుల సాధారణ పనివేళలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. వేసవి సందర్భంగా మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుందని దీన్ని ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు అమలుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విషయం కార్మికులకు ముందస్తుగా తెలియజేయలేదు. ఉదయం 5 నుంచి 6 గంటల లోపున హాజరైన వారికి హాజరు నమోదుచేయాల్సి ఉండగా, 5.30 గంటలు దాటితే వేయడం లేదని కొందరు కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్, యాకుత్‌పురా, గచ్చిబౌలి, వెంగళ్రావునగర్, అంబర్‌పేట సాంకేతిక సమస్యలు పరిష్కరించేదెవరు? బయోమెట్రిక్ హాజరు నమోదుకు వేల రూపాయల వ్యయమయ్యే మెషిన్లను కొనుగోలు చేయకుండా జీహెచ్ఎంసీ ప్రైవేటు ఏజెన్సీకి కాంట్రాక్టుకిచ్చి దానికి లక్షల రూపాయలు చెల్లిస్తోంది. సాంకేతిక లోపాలు తలెత్తినా, మెషిన్లు సక్రమంగా పనిచేయకున్నా ఏజెన్సీ బాధ్యత వహించాల్సి ఉండగా ఆ పనిచేయడం లేదు. కార్మికుల హాజరు నమోదు చేసే గ్రూప్‌లోని లీడర్(ఎస్ఎఫ్ఏ) సొంత జేబులోంచి ఖర్చు చేసుకోవాల్సి వస్తోందని కార్మికులు చెబుతున్నారు.బయోమెట్రిక్ మెషిన్లను సరిగ్గా వినియోగించడం రానందున కూడా ఆబ్సెంట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. వినియోగంపై తగిన అవగాహన కల్పించాల్సిన అధికారులు కాంట్రాక్టు ఏజెన్సీకిచ్చి చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిలాపాపం .. తలా పిడికెడు ► ఎస్ఎఫ్ఏలకు పైస్థాయిలోని వైద్యాధికారులు, ఇతరత్రా అధికారులకు నడుమ ఉండే అవినాభావ సంబంధాలు సైతం అక్రమాలకు దారి చూపుతున్నాయి. ఫంక్షన్లు చేసినప్పుడు టీలు, బిస్కెట్లు, పూలదండలు, శాలువాల నుంచి ఇతరత్రా వన్నీ తెమ్మని అధికారులు ఎస్ఎఫ్ఏలను పురమాయిస్తారు. వారి ఈ వైఖరి తెలిసిన ఎస్ఎఫ్ఏలు సైతం సమయానికి కార్మికులు రాకున్నా, అసలు రాకున్నా బయోమెట్రిక్ పనిచేయడం లేదని హాజరు నమోదు చేస్తారు. ఆ మేరకు కార్మికుల వేతనాల్లో వాటాలు పొందుతారు. ► దీన్ని ఆసరా చేసుకొని చాలామంది విధులకు రాకుండానే వేతనాలు పొందుతున్నారని తెలుస్తోంది. అలాంటి వారిలో ఎస్ఎఫ్ఏల కుటుంబసభ్యులు సైతం ఉంటారు. దీన్ని సక్రమంగా అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం అందరినీ ఒకేగాటన కట్టి ఇష్టానుసారం వేతనాల్లో కోత విధించడంపై కార్మికులు మండిపడుతున్నారు. వేతనాల్లో కోతలపై వివరణ కోసం సంబంధిత అడిషనల్ కమిషనర్‌కు ఫోన్ చేసినా స్పందన లేదు. పనిచేసిన వారికి వేతనాలివ్వాలని సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. సంబంధిత అడిషనల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. (క్లిక్: 111 జీవో ఎత్తివేతతో జరిగేది ఇదే?) బయోమెట్రిక్ ఓ చీటింగ్ బయోమెట్రిక్‌లో లోపాలున్నాయని అధికారులు అబద్ధాలు చెబుతున్నారు. ఇది నమ్మశక్యంగా లేదు. అంతా చీటింగ్ నడుస్తుందని అనుమానంగా ఉంది. మూడు రోజులో, నాలుగు రోజులో మెషిన్ పని చేయకుంటే.. ఆలస్యమైతే అన్ని రోజులకు మాత్రమే వేతనాల్లో కోత విధించాలి. కానీ, వేలకు వేలు ఎలా? పూర్తిస్థాయిలో విచారణ జరిపి మా జీతం మొత్తం తిరిగి ఇచ్చేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. – చెన్నమ్మ, పారిశుద్ధ్య కార్మికురాలు చర్యలు తీసుకుంటాం.. బయోమెట్రిక్ మెషిన్లలో లోపాల కారణంగా జీతాల్లో కోత పడింది. విధులకు హాజరైనప్పటికీ వేతనాలందని వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటాం. – కె.వి. శివప్రసాద్ మలక్‌పేట్ సర్కిల్ ఏఎంహెచ్ఓ -
RBI Report: శ్రమజీవికి సంతోషం.. ఏపీలో కూలీల వేతనాలు పెరుగుదల..
సాక్షి, అమరావతి: గత రెండేళ్లలో రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర, నిర్మాణ రంగ కూలీల వేతనాలు పెరిగాయి. ఉద్యాన కూలీల వేతనాల్లోనూ ఈ పెంపు నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన తాజా నివేదికలో వెల్లడించింది. అయితే, దేశంలో గ్రామీణ వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగ కూలీల వేతనాలు కేరళలో అత్యధికంగా ఉంటే అత్యల్పంగా గుజరాత్లో ఉండటం గమనార్హం. చదవండి: ఎగసిన ఎగుమతులు.. ఏపీ నుంచి భారీగా ఆహార, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు ఇక రాష్ట్రంలో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవసాయ కూలీల రోజువారీ వేతనం రూ.300లోపే ఉంటే 2019–20 నుంచి ఇది రూ.300 దాటింది. అలాగే, వ్యవసాయేతర కూలీల రోజు వారీ వేతనం కూడా చంద్రబాబు హయాంలో రూ.300లోపే ఉంటే 2020–21లో ఆ మొత్తం దాటింది. జాతీయ స్థాయి కూలీల సగటు వేతనం కన్నా రాష్ట్రంలోని కూలీల వేతనం ఎక్కువగా ఉంది. అలాగే, జాతీయ స్థాయి విషయానికొస్తే 2019–20లో వ్యవసాయ కూలీల రోజువారీ వేతనం రూ.287.1లు ఉంటే రాష్ట్రంలో అది రూ.302.6గా ఉంది. అలాగే, 2020–21లో జాతీయ స్థాయిలో కూలీల రోజువారీ సగటు వేతనం రూ.309.9 ఉంటే.. రాష్ట్రంలో రూ.318.6లు గా ఉంది. -
నెలకు లక్షల్లో జీతాలు.. నెలాఖరుకు జేబులు ఖాళీ!
ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి రచించిన రిచ్ డాడ్-పూర్ డాడ్ పుస్తకంలో చెప్పినట్లే ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి ఉంది. దేశంలో సుమారు 80 శాతం మంది వైట్‌కాలర్ ఉద్యోగుల జీతాలు నెల తిరక్కుండానే అయిపోతున్నాయని ఓ సర్వేలో తేలింది. వీరిలో దాదాపు మూడోవంతు మంది జీతాలు నెలలో సగం రోజులు గడవకుండానే ఖర్చవుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. కన్సల్టింగ్ సంస్థ ఈవై, స్టార్టప్ రిఫైన్లు కలిసి సంయుక్తంగా ఎర్న్డ్వేజ్ యాక్సెస్ మోడల్(ఒక రకంగా రోజువారీ జీతం విధానం) (EWA)పై సర్వే నిర్వహించారు. ‘ఎర్న్డ్ వేజ్ యాక్సెస్ ఇన్ ఇండియా: ద ఫైనల్ ఫ్రంటియర్ ఆఫ్ ఎంప్లాయి వెల్బీయింగ్’ పేరిట ఈ నివేదికను తయారు చేశారు. ఈ నివేదిక ప్రకారం.. ఉద్యోగుల జీవన వ్యయం నిరంతరం పెరగడం, జీవనశైలి భయాలు, పేలవమైన ఆర్థిక ప్రణాళిక, ఈఎమ్ఐ ఖర్చులు వంటి కారణాలతో ఉద్యోగులు జీతాలు నెల తిరక్కుండానే అయిపోతున్నాయి. జూలై-ఆగస్టు 2021లో 20 నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్న భారతదేశంలోని 3,010 వేతన ఉద్యోగులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నివేదికను తయారు చేశారు. నెల ప్రారంభంలోనే 14 శాతం మంది, నెల మధ్యలో 20 శాతం, నెలాఖరునాటికి 47 శాతం వారి పూర్తిగా ఖర్చు చేస్తున్నట్లు తేలింది. ఈ ఈడబ్ల్యూఏ సర్వే ప్రకారం కేవలం 38 శాతం మంది మాత్రమే సంతోషంగా ఉన్నారని, వారి ఆర్థికస్థితి అదుపులో ఉన్నట్లు ఈ అధ్యయనం హైలైట్ చేసింది. (చదవండి: విమానం ప్రమాదం, తండ్రి - కూతురు ప్రాణాలు కాపాడిన ఐపాడ్..!) ఐటీ ఉద్యోగుల చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు ఈ ఆర్థిక ఒత్తిడి కేవలం తక్కువ ఆదాయం గల వారికి మాత్రమే పరిమితం కాలేదు. ఎందుకంటే, నెలకు రూ.1,00,000 కంటే ఎక్కువ సంపాదించే వారిలో 59 శాతం మంది తమ జీతాలు నెలాఖరులోగా ఖర్చు అయిపోతున్నాయి.59 శాతం మందికి జీతాలు వచ్చే సమయానికి చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. వీరికి ఆర్ధిక క్రమశిక్షణ కొరవడినట్లు తేలింది. వీరు ఒక మార్కెట్ చక్రంలో ఇరుకున్నారు. వాస్తవానికి భారత్‌లో అత్యధిక వేతనాలు పొందే ఐటీ సెక్టార్‌లోని ఉద్యోగుల జీతాలను విచ్చల విడిగా ఖర్చు చేస్తున్నారు. దీంతో నెలాఖరులో చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. ఇక ఈడబ్ల్యూఏ విధానంలో జీతాలు తీసుకోవడానికి చాలా తక్కువ మంది ఉద్యోగులు ఆసక్తి చూపగా.. మిగిలిన వారు మరింత తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఈ సరికొత్త మోడల్లో మీరు సంపాదిస్తున్న సమయంలో ఎప్పుడైనా జీతాలను డ్రా చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా పశ్చిమ దేశాల్లో దీనిని అనుసరిస్తున్నారు. 14 రోజులకు ఒకసారి యుకెజి ఇండియా, రెఫిన్ వంటి సంస్థలు పాశ్చాత్య దేశాలు స్వీకరించిన నమూనాను భారతదేశంలో పరీక్షిస్తున్నాయి. ఇంకా అనేక ఇతర సంస్థలు ప్రతి 14 రోజులకు ఒకసారి జీతాలను ఉద్యోగులకు చెల్లించేందుకు సిద్దం ఆవుతున్నాయి. ఎఫ్ఎంసిజి, తయారీ, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, రియల్ ఎస్టేట్, రిటైల్, రెస్టారెంట్లు, లాజిస్టిక్స్, పర్యాటకం, రవాణా వంటి రంగాలలో ఈడబ్ల్యుఏ విధానాన్ని అనుసరిస్తున్నాయని తేలింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, ఐటీ, టెలికమ్యూనికేషన్లు కంపెనీలు ఈడబ్ల్యుఏ విధానాన్ని దేశంలో అమలచేసేందుకు ప్రయోగాలు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలపై క్రేజ్ మరి ఇంతగా ఉందా...!) -
'బయోమెట్రిక్' ఆధారంగానే వేతనాలు
సాక్షి, అమరావతి: ‘ఏ ప్రభుత్వ, లేదా ప్రైవేట్ సంస్థ ఉద్యోగైనా సెలవు పెట్టకుండా, విధులకు హాజరుకాకుండా జీతం ఇవ్వమంటే ఎవ్వరూ ఇవ్వరు. జీతం రావాలంటే సెలవు అయినా పెట్టాలి లేదా కార్యాలయానికైనా రావాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇదే అమలుచేస్తున్నారు. వారికి గతంలోనే బయోమెట్రిక్ హాజరుతో వేతనాలను అనుసంధానం చేశారు. అయితే, కోవిడ్ విపత్తు నేపథ్యంలో ఆ విధానానికి సడలింపు ఇచ్చారు. ఇప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బయోమెట్రిక్ హాజరును పునరుద్ధరించారు. అదే తరహాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్ నుంచి పునరుద్ధరించారు. బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే అక్టోబర్ నెల వేతనాలిస్తాం’.. అని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ స్పష్టంచేశారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులతో పాటు శాఖాధిపతులు, కార్యదర్శులకు ఇదే విధానంలో హాజరును అమలుచేస్తున్నారని.. ప్రభుత్వోద్యోగుల తరహాలోనే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు దీనిని అమలుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరైతేనే వేతనాల్లో కోత పెడతారని.. ఇందులో తప్పేమీ లేదన్నారు. వారికి సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తాం కానీ.. విధులకు హాజరుకాకుండా సెలవు పెట్టకుండా వేతనాలివ్వాలంటే సాధ్యంకాదని జైన్ స్పష్టంచేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 మధ్య కాలంలో మొత్తం పనిదినాలు.. విధులకు హాజరైన రోజులు, ప్రభుత్వ సెలవులు పరిగణనలోకి తీసుకున్న తరువాత సిబ్బంది విధులకు గైర్హాజరైతేనే ఆ రోజులకు వేతనాల్లో కోత విధించాలని ఆయన ఆదేశించారు. మరోవైపు.. బయోమెట్రిక్ హాజరు ఆధారంగా అక్టోబర్ వేతనాలను నవంబర్ 1న చెల్లించాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పష్టంచేసింది. హాజరు క్రమబద్ధీకరణకు వెసులుబాటు ఇక గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులందరికీ హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్, లాగిన్‌ను అందుబాటులోకి తెచ్చారు. శిక్షణలో ఉన్నా, బయోమెట్రిక్ పనిచేయకపోయినా, విధుల్లో భాగంగా సమావేశాలకు వెళ్లినా, డిప్యుటేషన్‌పై ఇతర శాఖలకు వెళ్లినా హాజరు క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించారు. అలాగే, సిబ్బంది రోజువారీ హాజరును తనిఖీ చేసుకునేందుకు వీలుగా గ్రామ, వార్డు సచివాలయ వెబ్సైట్లో హాజరు డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తెచ్చారు. దీని ఆధారంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బందితో పాటు పాత పంచాయతీ కార్యదర్శులు, పాత వీఆర్వోలు, పాత మునిసిపల్ ఉద్యోగులకు వేతనాలను చెల్లించాల్సిందిగా డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారులను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆదేశించింది. డ్యాష్‌బోర్డు హాజరులో సెలవులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ప్రస్తుతం హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్లో సీఎల్, ఐచ్ఛిక సెలవులే ఉన్నందున ఇతర సెలవులను కూడా పరిగణనలోకి తీసుకుని వేతనాలు చెల్లించాలని తెలిపింది. ఈ మార్గదర్శకాల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వేతనాల బిల్లులను డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆధికారులు అప్లోడ్ చేసి ట్రెజరీలకు సమర్పించాల్సిందిగా అజయ్‌జైన్ ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో సజావుగా అమలయ్యేలా గ్రామ, వార్డు సచివాలయాల జేసీలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. -
ఎస్సీ, ఎస్టీ ఉపాధి కూలీలకు వేరుగా వేతనాలు
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ కూలీలకు వేతనాల చెల్లింపులో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. వీరిని ఎస్సీ, ఎస్టీ, ఇతర తరగతుల వారీగా విభజించి, వారు చేసిన పనికి ఎప్పటికప్పుడు వేతనాలను వేర్వేరుగా విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఒకేరోజు.. ఓ గ్రూపులో ఉంటూ, ఒకే పనిచేసిన కూలీలందరికీ ఒకేసారి కాకుండా ఎస్సీ కూలీలకు ఒకసారి, ఎస్టీ సామాజికవర్గం వారికి మరోసారి, ఇతరులకు ఇంకో విడతలో కూలీ డబ్బులు విడుదలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్రాల్లో పనిచేసిన కూలీలను ఎస్సీ, ఎస్టీ, ఇతరుల వారీగా పే ఆర్డర్లను తయారుచేసి కేంద్రానికి పంపుతున్నాయి. ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఈ ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ ఉత్తర్వులు పేదల మధ్య చిచ్చుపెట్టి వారి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు, అధ్యక్షులు దడాల సుబ్బారావులు ఓ ప్రకటనలో తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుని పాత పద్ధతిలోనే అందరికీ ఒకేసారి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ సంఘం ప్రతినిధులు శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి వినతిపత్రం అందజేశారు. చదవండి: వంద శాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస ‘గారాల పట్టి.. మేము ఎలా బతికేది తల్లీ’ -
దేశీ ఫార్మా పరుగు షురూ!
న్యూఢిల్లీ: దేశీయ ఫార్మా రంగం ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇన్వెస్టర్లను ఊరిస్తోంది. ఈ రంగంలో మెరుగుపడుతున్న పరిస్థితులను కంపెనీలు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. కరోనా నియంత్రణకు దేశంలో లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి ఫార్మా రంగం షేర్లు 40 శాతానికి పైనే రాబడులను ఇచ్చాయి. కొన్ని స్టాక్స్ అయితే మల్టీబ్యాగర్లుగానూ (రెట్టింపునకు పైగా పెరగడం) మారాయి. 2015లో ఫార్మా షేర్ల ర్యాలీ తర్వాత అవి క్రమంగా ఇన్వెస్టర్ల నిరాదరణకు గురయ్యాయి. దాంతో ఏవో కొన్నింటిని మినహాయిస్తే మెజారిటీ ఫార్మా స్టాక్స్ వాటి గరిష్ట స్థాయిల నుంచి గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. కానీ, కరోనా రాకతో మార్కెట్ పరిస్థితులు ఫార్మాకు మళ్లీ అనుకూలంగా మారాయి. కంపెనీల మూలాలు కూడా బలపడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో ధరల పరమైన ఒత్తిళ్లు తగ్గడం, యూఎస్ఎఫ్డీఏ నుంచి ఔషధ అనుమతులు పెరగడం దేశీయ కంపెనీలకు కలిసొచ్చాయి. ఫార్మా రంగం ఇక ముందూ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల పరంగా ఆకర్షణీయంగానే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూఎస్ఎఫ్డీఏ అనుమతులు... ఫార్మా కంపెనీలు ఉత్తమ తయారీ విధానాలను పాటించడం, దిద్దుబాటు చర్యల ద్వారా అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) నిబంధనల అమలు విషయంలో మెరుగుపడ్డాయి. మరోవైపు కరోనా మహమ్మారి కూడా యూఎస్ఎఫ్డీఏ వైఖరిలో మార్పునకు దారితీసింది. ఏప్రిల్‌లో కేవలం పది రోజుల వ్యవధిలోనే భారత ఫార్మా కంపెనీలకు చెందిన నాలుగు తయారీ కేంద్రాలకు యూఎస్ఎఫ్డీఏ వేగంగా అనుమతులు జారీ చేయడం ఈ కోణంలోనే చూడాలి. అమెరికా మార్కెట్లో దేశీయ కంపెనీలకు బలమైన వాటాయే ఉంది. కాకపోతే యూఎస్ఎఫ్డీఏ అభ్యంతరాలు ఇబ్బంది పెడుతుంటాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇక ముందూ యూఎస్ఎఫ్డీఏ భారత ఫార్మా కంపెనీల యూనిట్లకు అనుమతుల జారీ పట్ల సానుకూలంగానే వ్యవహరిస్తుందన్న అంచనాలు ఈ కంపెనీలకు అనుకూలమే. రుణ భారం తగ్గింపు... అనేక కారణాలతో ఫార్మా కంపెనీలకు రుణ భారం సమస్యగా మారిపోయింది. లాభసాటి కాని జపాన్, దక్షిణ అమెరికా మార్కెట్లలోకి విస్తరించడం ద్వారా కొన్ని ఫార్మా కంపెనీలు చేతులు కాల్చుకున్నాయి. వీటికితోడు అమెరికా మార్కెట్లో జనరిక్ ఔషధాల ధరల ఒత్తిళ్లు, నిబంధనల అమలు విషయంలో యూఎస్ఎఫ్డీఏ మరీ కఠిన వైఖరి అనుసరించడంతో కంపెనీలకు రుణ భారం దించుకునే అవకాశం లభించలేదు. కానీ, గత కొంత కాలంగా కంపెనీలు తమ బ్యాలన్స్ షీట్ల బలోపేతంపై దృష్టి పెట్టాయి. అరబిందో ఫార్మా బిలియన్ డాలర్లతో అమెరికాలోని శాండోజ్ వ్యాపారాన్ని కొనుగోలు చేయాలన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ఇందులో భాగమే. 2022 నాటికి రుణ రహిత కంపెనీగా మారాలన్నది అరబిందో ప్రణాళిక. వ్యయ నియంత్రణలు: అమెరికా వంటి కీలక మార్కెట్లలో ధరలకు సంబంధించి ఒత్తిళ్లు పెరగడంతో కంపెనీలకు మరో మార్గం లేక తమ వ్యయాలను తగ్గించుకోవడంపై దృష్టి సారించాయి. క్షేత్రస్థాయి సిబ్బందిలో కోత, పరిశోధన, అభివృద్ధి బడ్జెట్ తగ్గించుకోవడం తదితర చర్యల ద్వారా ఔషధ తయారీ వ్యయాలను తక్కువ స్థాయిలో ఉండే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. వ్యూహాత్మక విధానాలు భారత ఫార్మా కంపెనీలు తమ విధానాలను సమీక్షించుకుంటున్నాయి. లుపిన్ జపాన్ మార్కెట్ నుంచి తప్పుకోగా, డాక్టర్ రెడ్డీస్ తన యూఎస్ స్పెషాలిటీ ఔషధాల వ్యాపారాన్ని తగ్గించుకుంది. యూనికెమ్ ల్యాబ్, వోకార్డ్ తమ ఔషధ పోర్ట్‌ఫోలియోను విక్రయించాయి. డాక్టర్ రెడ్డీస్, లుపిన్, బయోకాన్, గ్లెన్‌మార్క్ ముఖ్యమైన విభాగాల్లో విదేశీ నిపుణులను నియమించుకున్నాయి. వేల్యూషన్లు తక్కువగానే.. నిబంధనల అమలు, పరిపాలనా, న్యాయ పరమైన వివాదాల సమస్యలు ఫార్మా కంపెనీలను ఇంకా వీడలేదు. అయితే, ఫార్మా స్టాక్స్ ప్రస్తుత ధరలు ఈ అంశాలన్నింటినీ సర్దుబాటు చేసుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సన్‌ఫార్మా, లుపిన్, గ్లెన్‌మార్క్ స్టాక్స్ వాటి 2015 గరిష్ట ధరల నుంచి చూస్తే ఇప్పటికీ 50% పైనే తక్కువలో ట్రేడవుతున్నాయనేది నిపుణుల మాట. డాక్టర్ రెడ్డీస్, సిప్లా, అరబిందో ఫార్మా, టోరెంట్ ఫార్మా, క్యాడిలా 2015 గరిష్ట స్థాయిలకు చేరువలో 10–15% తక్కువకు ట్రేడవుతున్నాయి. -
ఉద్యోగం ఒక చోట.. జీతం మరోచోట
ఆదోని: విద్యుత్ సంస్థ డివిజన్ కార్యాలయంలో జరిగిన ఓ డిప్యుటేషన్ అంశం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పని ఒత్తిడి లేని చోట నుంచి పని ఒత్తిడి ఉన్న ప్రాంతానికి ఉన్నత స్థాయి అధికారులు.. సిబ్బందిని సర్దుబాటు(సర్దుబాటు) చేస్తుంటారు. అయితే ఆదోని విదుŠయ్త్ సంస్థలో మాత్రం విచిత్రం చోటుచేసుకుంది. డి–2 సె„ýక్షన్లో పని చేస్తున్న లైన్‌ఇన్‌స్పెక్టర్‌ను ఎమ్మిగనూరుకు డిప్యుటేషన్‌పై పంపిన అధికారులు ఆయన స్థానంలో పత్తికొండ లైన్ ఇన్స్పెక్టర్ను డిప్యుటేషన్ వేశారు. దీంతో పత్తికొండ మండలం లైన్ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీ అయింది. ఎమ్మిగనూరులో పని భారం ఉందనుకుంటే పత్తికొండ లైన్ఇన్సెక్టర్ను నేరుగా అక్కడికి పంపొచ్చు. కానీ ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు.. పత్తికొండ నుంచి ఆదోనికి.. ఎవరి కోసం ఇలా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు లైన్ ఇన్స్పెక్టర్లు 2018 నుంచి జీతాలు ఒక చోట తీసుకోని మరోచోట సేవలు అందిస్తున్నా రు. నిబంధనల మేరకు ఆరు నెలల దాటితే డిప్యుటేషన్‌ను ఉన్నతాధికారుల అనుమతితో పొడిగించాలి. ఈ ఇద్దరు ఉద్యోగులు నాలుగేళ్లుగా ఎలా కొనసాగుతున్నారోనని, వా రికి సహకరిస్తున్నదెవరోననే విమర్శలు వ్యక్తమవుతున్నా యి. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన డిప్యుటేషన్ల వెనుక ఏం జరిగిందో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీఎన్టీయూసీ డివిజన్ కార్యదర్శి జయన్న డిమాండ్ చేశారు. ఈ విషయమై డిప్యూటీ ఈఈ పురుషోత్తంను వివరణ కోరగా.. తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని, గతంలో ఏమి జరిగిందో తెలియదని చెప్పారు. విచారించి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. -
వేతనాల్లో కోత : ఆర్థిక శాఖ వివరణ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు కోత విధిస్తారనే వార్తలను ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం తోసిపుచ్చింది. ఈ ప్రచారం నిరాధారమని, అవాస్తవమని స్పష్టం చేసింది. ఏ క్యాటగిరీకి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత వేతనాల్లో కోత విధించే ఎలాంటి ప్రతిపాదననూ పరిశీలించడం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ దిశగా ఓ వర్గం మీడియాలో వచ్చిన కథనాలు నిరాధారమని పేర్కొంది. కాగా పెన్షన్ల జారీలోనూ ఎలాంటి కోత విధించడం లేదని, అత్యవసర సమయాల్లో వేతనాలు, పెన్షన్లను తగ్గించే ప్రసక్తి లేదని గతంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పెన్షన్లలో 20 శాతం కోత విధిస్తారనే ప్రచారం సాగిందని ఇది పూర్తి అవాస్తవమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇలాంటి వదంతులను నమ్మరాదని సూచించింది. చదవండి : కోతల్లేవ్..ఫుల్ జీతం -
హెచ్1బీ ఉద్యోగుల వేతనాలపై షాకింగ్ రిపోర్టు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త వీసా సంస్కరణలు, తాజాగా కరోనా వైరస్ సంక్షోభంతో ఐటీ నిపుణులు ఇబ్బందుల్లో పడిన సమయంలో హెచ్ 1 బీ వీసాదారుల వేతనాలకు సంబంధించి షాకింగ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. ప్రధాన దిగ్గజ కంపెలన్నీ తక్కువ (స్థానిక మధ్యస్థ) వేతనాలను చెల్లించాయని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రధాన అమెరికన్ టెక్నాలజీ సంస్థలైన ఫేస్బుక్, గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ సహా ఇతర దిగ్గజ కంపెనీలు హెచ్ 1 బీ నిపుణులకు మార్కెట్ వేతనాల కంటే తక్కువ చెల్లించాయని తాజా నివేదిక పేర్కొంది. హెచ్ 1 బీ వీసాదారులను కలిగిన టాప్ 30 అమెరికా కంపెనీల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, వాల్‌మార్ట్, గూగుల్, ఆపిల్, ఫేస్ బుక్ సహా ప్రధాన సంస్థలు ఇందులో ఉన్నాయి. వీరందరూ హెచ్ 1బీ ఉద్యోగుల్లో చాలామందికి స్థానిక సగటు కంటే తక్కువ జీతాలను చెల్లించాయట. స్థానిక వేతనాల కంటే తక్కువ జీతాల చెల్లింపుపై చట్టబద్ధంగా ఉన్న ప్రోగ్రామ్ నిబంధనలను ఉపయోగించుకుని ఇలా చేశాయని ఎకనామిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. (హెచ్1బీ వీసాదారులకు ఊరట) "హెచ్ 1 బీ వీసాలు , ప్రస్తుత వేతన స్థాయిలు" అనే పేరుతో డేనియల్ కోస్టా , రాన్ హీరా వెల్లడించిన ఈ నివేదిక ప్రకారం, యుఎస్ కార్మిక శాఖ (డీఓఎల్) ధృవీకరించిన 60 శాతం హెచ్1బీ వీసాదారులకు స్థానిక మధ్యస్థ వేతనాని కంటే చాలా తక్కువ వేతన స్థాయిలను అందించాయి. అంతేకాదు ఈ నిబంధనలను మార్చే అధికారం డీఓఎల్ కు ఉన్నప్పటికీ అలా చేయలేదని పేర్కొన్నారు. 2019 లో 53వేలకు పైగా కంపెనీలు హెచ్ 1బీ ప్రోగ్రామ్‌ను ఉపయోగించగా, 2019 లో యుఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆమోదించిన 389,000 హెచ్ 1బీ ఉద్యోగుల టాప్ 30 కంపెనీలు నాలుగింటిలో ఒకటి ఉంది. టాప్ 30 కంపెనీల్లో సగానికి పైగా అత్యధిక ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ ద్వారానే నియమించుకుంటున్నాయన్నారు. అయితే టెక్ కంపెనీలు నేరుగా నియమించుకుంటున్నా వేతనాలు మాత్రం లెవల్ 1, లేదా లెవల్ 2 స్థాయిలోనే ఉన్నాయని నివేదించారు. -
ఇవేం కోతలు ?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రకృతి విరుద్ధ వాతావరణంలో పనిచేస్తూ.. చీకటి సూర్యులుగా పేరుగాంచిన సింగరేణి కార్మికులు లాక్డౌన్ సమయంలోనూ అత్యవసర విభాగం కింద విధులు నిర్వహిస్తున్నారు. అయితే వైద్య, పోలీసు, రెవెన్యూ శాఖల్లాగే తమకూ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న తమను ప్రోత్సహించాల్సింది పోయి గత నెల వేతనంలో 50 శాతం కోత విధించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల పరిస్థితి ఇలా ఉంటే.. తాజాగా అధికారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం కలుగుతున్నట్లు తెలుస్తోంది. తమకు గత నెల వేతనం పూర్తిగా చెల్లించలేదంటూ సీఎంఓఏఐ (కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) మాజీ అధ్యక్షుడు గడిపల్లి కృష్ణప్రసాద్ కొత్తగూడెం సింగరేణి కేంద్ర కార్యాలయం ఎదుట గురువారం గుండు గీయించుకుని నిరసన తెలిపారు. సింగరేణిలో 44 వేల మంది కార్మికులు... విపరీతమైన వేడి ఉండే ప్రదేశంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నామని, తమ శ్రమ వల్లే సంస్థకు లాభాలు వస్తున్నాయని, ప్రభుత్వానికి సైతం పన్నుల రూపంలో కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని కార్మికులు అంటున్నారు. ఇంత చేస్తున్నా తమ వేతనాల్లో కోత పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తగ్గించిన వేతనం తిరిగి చెల్లించకుంటే విధులకు వచ్చేది లేదంటున్నారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల పరిధిలో 44,000 మంది కార్మికులు, 2,400 మంది అధికారులు పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.220 కోట్ల వేతనాలు చెల్లిస్తున్నారు. అయితే లాక్డౌన్ సమయంలోనూ చెమటోడుస్తున్న తమ జీతాల్లో కోత విధించడం ఏంటని మండిపడుతున్నారు. అత్యవసర విభాగం కింద పనిచేస్తున్న తమకు పూర్తి వేతనం చెల్లించాలంటూ పలు ఏరియాల్లో ఆందోళనలు చేస్తున్నారు. కరోనా రక్షణ చర్యలూ అంతంతే.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ తమకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. శానిటైజర్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఎందుకూ పనికిరాని మాస్క్‌లు ఇచ్చారని అంటున్నారు. మెరుగైన శానిటరీ కిట్స్‌తో పాటు ఎన్–95 మాస్క్‌లు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యవసర సేవలు అందిస్తున్న డాక్టర్లు, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు తమకు కూడా 10 శాతం ఇన్సెంటివ్, రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. పూర్తి వేతనం ఇవ్వాలి ఏప్రిల్‌లో ఇచ్చే వేతనాల్లో 50 శాతం కోత విధించారు. ఈనెల అయినా పూర్తి వేతనం చెల్లించాలి. గత నెలలో నిలిపివేసిన 50 శాతం జీతం కూడా ఈనెలలో కలిపి ఇవ్వాలి.– ఎండీ హఫీనొద్దీన్, ఈపీ ఆపరేటర్ 10 శాతం ఇన్సెంటివ్ చెల్లించాలి కరోనా సమయంలో అత్యవసర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న పోలీసు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రభుత్వం 10 శాతం ఇన్సెంటివ్ ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో పనిచేస్తున్న మాకు కూడా 10 శాతం ఇన్సెంటివ్ చెల్లించాలి.– మెంగెన్ రవి, ఈపీ ఆపరేటర్ రూ.50 లక్షల బీమా వర్తింపజేయాలి అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా చెల్లించనున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. మాకు కూడా ఈ సౌకర్యం కల్పించి ఆదుకోవాలి.– సలిగంటి వెంకటేశ్వరరావు, జనరల్ మజ్దూర్ మెరుగైన సౌకర్యాలు కల్పించాలి అత్యవసర విభాగంలో పనిచేస్తున్న సింగరేణి కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ఎన్–95 మాస్క్‌లు అందించాలి. డాక్టర్లకు ఇస్తున్నట్టుగా ప్రత్యేక కిట్లు ఇవ్వాలి.– కూరేటి ఐలయ్య, ఈపీ ఎలక్ట్రీషియన్ -
కరోనా.. ఇచ్చే సగం శాలరీల్లో కోత
సాక్షి, సిటీబ్యూరో: సగటు వేతన జీవి చూపులన్నీ నెలాఖరుపైనే ఉంటాయి. ముప్పయ్యో తేదీ వచ్చిందంటే అకౌంట్లోకి జీతం వచ్చిపడుతుందనే భరోసా గొప్ప ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. అప్పటికే వివిధ రకాల అవసరాలు ఎదురుచూస్తుంటాయి. ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు, నిత్యావసర వస్తువులు, రవాణాఖర్చులు, విద్య, వైద్యం, తదితర అన్ని అవసరాలన్నీ ‘శాలరీ’తోనే ముడిపడి ఉంటాయి. ఐటీ సంస్థల్లో పని చేసే సాఫ్ట్వేర్ నిపుణులు మొదలుకొని ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లో పని చేసే టీచర్లు, డాక్టర్లు, వివిధ రకాల సిబ్బంది వరకు, సంఘటిత రంగాల్లో, పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల నుంచి అసంఘటిత రంగాల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బంది వరకు అందరికీ ‘శాలరీ’ ఒక్కటే ఆధారం.(అక్కడుండలేక.. ఇక్కడికి రాలేక..) కానీ మహమ్మారి కరోనా పెను విపత్తును సృష్టించింది. అన్ని రంగాల్లోనూ లాక్డౌన్ ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. కంపెనీలన్నీ మూతపడ్డాయి. కొన్ని విద్యాసంస్థలు మాత్రమే ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. అలాంటి ఆన్లైన్ తరగతులు నిర్వహించిన టీచర్లకు మాత్రమే జీతం ఇచ్చి మిగతా వారికి కోత విధించేందుకు పలు విద్యాసంస్థలు చూస్తుండగా ఆసుపత్రుల్లో ఎంతమంది రోగులను పరీక్షించి వైద్యచికిత్సలు, సేవలు అందజేశారనే లెక్కల ప్రకారం డాక్టర్లకు జీతాలు చెల్లించేందుకు ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు పూర్తిస్థాయి జీతాలను అందజేస్తుండగా, చిన్న కంపెనీలు మాత్రం పెద్ద కోత పెట్టేశాయి. మార్చి నెల జీతాన్ని ఎలాగో చెల్లించిన సంస్థలు ఏప్రిల్ నెల జీతానికి మాత్రం ‘కరోనా కటింగ్స్’ విధించాయి. నేడు ఏప్రిల్ 30వ తేదీ శాలరీ డే. ప్రతి ఒక్కరూ ఆ సాలరీ కోసమే ఎదురు చూస్తున్నారు. పూర్తిజీతాలు అందుకుంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు సంతోషంగానే ఉన్నా...అరకొర జీతాలు అందుకుంటున్న వాళ్లు మాత్రం నిరుత్సాహంతో ఎదురు చూస్తున్నారు. (బాస్ భౌతిక దూరం ఏదీ..?) సాఫ్ట్వేర్ భళా.... ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలకు కొంగుబంగారంగా ఉన్న రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో లాక్డౌన్ నెలరోజులు దాటిన నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలకు, ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా లేదని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. మహానగరం పరిధిలో సుమారు 200 వరకు బహుళ జాతి ఐటీ కంపెనీలు...మరో 800 వరకు మధ్యతరహా, చిన్న ఐటీ, బీపీఓ సంస్థలున్నట్లు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. బడా సాఫ్ట్వేర్, బీపీఓ, కెపిఓ కంపెనీల్లో పనిచేస్తున్న వేతనజీవుల జీతాల్లో ఎలాంటి కోతలు విధించలేదని, చిన్న కంపెనీల్లో..అదీ 10 శాతం కంపెనీల్లో మాత్రమే ఉద్యోగుల ప్రయాణ భత్యం(ట్రావెలింగ్ అలవెన్స్) తదితరాల్లో స్వల్ప కోతలు విధించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు హైసియా వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. లాక్డౌన్ సందర్భంగా తమ ప్రాజెక్టులు తగ్గి ఉద్యోగులను తీసివేసే యోచన చేసిన సంస్థల యాజమాన్యాలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు రాష్ట్ర కార్మికశాఖ, హైసియా సంస్థలు రంగంలోకి దిగినట్లు ఆ సంస్థ అధ్యక్షులు మురళి బొల్లు ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగి పనిసామర్థ్యం,ప్రతిభ ఆధారంగా సర్వసాధారణంగా ఆయా సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు,కొత్త ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం వంటి ప్రక్రియలు యధావిధిగా కొన సాగుతాయని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుతం నగరంలో రెండు శాతం మేర సంస్థలే ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని...మిగతా సంస్థలు ఉద్యోగులను కాపాడుకొని వారి నుంచి గరిష్ఠ పనిసామర్థ్యం పొందే దిశగా పనిచేస్తున్నాయన్నారు. ఆసుపత్రుల్లో ఇలా... కరోనా కారణంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఎమర్జెన్సీ వైద్య సేవల కోసం వచ్చే రోగులు మినహా సాధారణ వైద్యసేవల కోసం వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 450 పడకలు ఉన్న ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం 90 మంది మాత్రమే ఇన్పెషెంట్లుగా చికిత్సలు పొందుతున్నారు. మరోవైపు ఇతరత్రా వైద్యం కోసం వెళ్లేవారిని కూడా కరోనా పరీక్షలు చేసుకొని రావలసిందిగా సూచించడంతో గుండెజబ్బులు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఆసుపత్రులకు వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో పేషెంట్లకు అవసరమైన వైద్యచికిత్సల కోసం సంబంధిత డాక్టర్లను మాత్రమే పిలిపించి ఆ రోజు వారు అందజేసిన సేవలకు అనుగుణంగా జీతాలు చెల్లిస్తున్నట్లు వైద్యవర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. మరోవైపు టెలీమెడిసిన్ ద్వారా వైద్యసేవలు అందజేస్తున్న డాక్టర్లకు వారు పరీక్షించిన రోగుల సంఖ్యను బట్టి కమీషన్లు ఇస్తున్నారు. మొత్తంగా డాక్టర్లు,నర్సులు,సిబ్బంది పని చేసిన రోజులకు మాత్రమే వేతనాలు అందుతున్నట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి. ఆన్లైన్ బోధన ఆధారంగా జీతాలు సాధారణంగా వేసవి సెలవుల్లోనూ టీచర్లకు జీతాలను ఇచ్చే కార్పొరేట్ విద్యాసంస్థలు, స్కూళ్లు ఈ సారి కోత విధించినట్లు టీచర్లు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో పిల్లలకు ఎన్ని పాఠాలను బోధించారు అనే సంఖ్య ఆధారంగా కొన్ని స్కూళ్లలో జీతాలు ఇస్తున్నారు. మరోవైపు స్కూళ్ల సామర్ధ్యం మేరకు 10 నుంచి 20 శాతం వరకు లాక్డౌన్ కోతలకు పాల్పడ్డాయి.‘‘ ప్రతి నెలా వచ్చే జీతంపైన ఆధారపడి ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఒక నెల జీతంలో వెయ్యి రూపాయలు తగ్గినా అప్పు చేయవలసిందే.ఇంటి అద్దెలు వాయిదా పడ్డాయి.కానీ అసలే చెల్లించకుండా సాధ్యం కాదు కదా. లాక్డౌన్ కారణంగా ఏ ఖర్చు తగ్గిందని ఈ కోతలు విధిస్తున్నారో తెలియడం లేదు.’’ అని ప్రముఖ కార్పొరేట్ స్కూల్లో పని చేసే ఒక టీచర్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు విలవిల సాధారణ రోజుల్లోనే పని చేసిన కాలానికి మాత్రమే జీతాలు తీసుకొనే సంఘటిత, అసంఘటిత కార్మికులపైన లాక్డౌన్ పిడుగుపాటుగా మారింది. లాక్డౌన్ కారణంగా ఉత్పత్తి నిలిచిపోవడంతో చాలా కంపెనీలు ఏప్రిల్ నెల జీతాలు చెల్లించేందుకు నిరాకరించాయి. కొన్ని కంపెనీలు మాత్రం నామమాత్రంగా చెల్లిస్తున్నాయి. ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు జీతాలు పొందే కార్మికులకు ఈ నెల రూ.5000 నుంచి రూ.6000 మాత్రమే అందుతున్నట్లు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘‘ ఎక్కడా అప్పులు కూడా లభించడం లేదు. పని లేకపోతే పస్తులుండాల్సిందేనా..’’ అని ఉప్పల్ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కార్మికుడు ఒకరు ఆందోళన చెందారు. లాక్డౌన్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కార్మికశాఖ, ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ చర్యలను చేపడుతాయో వేచి చూడాల్సిందే. నష్టం అంచనా ఇప్పట్లో కష్టమే ఐటీ క్యాపిటల్‌గా మారిన గ్రేటర్ సిటీలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఐటీ,బీపీఓ,కెపిఓ సంస్థలకు లాక్డౌన్ నేపథ్యంలో కలిగిన నష్టాలను అంచనా వేయడం ఇప్పుడే సాధ్యం కాదు.ఇందుకు మరికొంత సమయం పడుతుంది. సమీప భవిష్యత్‌లో అమెరికా, కెనడా,ఆస్ట్రేలియా తదితర దేశాలకు సంబంధించి ఔట్సోర్సింగ్ ప్రాజెక్టులను సింహభాగం నగరంలోని ఎంఎన్సీ, మధ్యతరహా, చిన్న ఐటీ, బీపీఓ సంస్థలు దక్కించుకునే అవకాశం ఉంది. ఉద్యోగులను తొలగించడం,కంపెనీలను మూసివేయడం,వేతనాల్లో భారీ కోతలుంటాయన్న ఆందోళన ఇప్పుడు అవసరం లేదు.–మురళిబొల్లు, హైసియా అధ్యక్షులు -
కోతల్లేవ్..ఫుల్ జీతం
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా నివారణ చర్యల్లో పాల్పంచుకుంటూ పోరాడుతున్న పలు విభాగాల్లోని అధికారులు, ఉద్యోగులకు కూడా కోతల్లేకుండా పూర్తి జీతాలు ఇవ్వనున్నారు. ప్రభుత్వం పోలీసు, వైద్య ఆరోగ్యశాఖలతో పాటు జీహెచ్ఎంసీలో క్షేత్రస్థాయిలో పనిచేసే పారిశుధ్య కార్మికులు, తదితర విభాగాల్లోని సిబ్బందికి సైతం ఎలాంటి కోతల్లేకుండా పూర్తి జీతాలతో పాటు వారి శ్రమను గుర్తించి ప్రోత్సాహకం ప్రకటించడం తెలిసిందే.. వారితోపాటు జీహెచ్ఎంసీలోని ఇంకా ఎందరో కరోనా నివారణలో పడుతున్న శ్రమను గుర్తించి వారికి కూడా పూర్తి వేతనాలు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. వీరిలో ఆరోగ్యం, పారిశుధ్యం విభాగంలో పనిచేస్తున్న ఏఎంఓహెచ్‌లు, మెడికల్ ఆఫీసర్లు, చీఫ్‌మెడికల్ ఆఫీసర్, చీఫ్ ఎంటమాలజిస్ట్, సీనియర్ ఎంటమాలజిస్టులు, ఈవీడీఎం విభాగంలోని క్షేత్రస్థాయి అధికారులు, రవాణా విభాగం వారు, పారిశుధ్యంతో సంబంధం ఉన్న ఇతరత్రా అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఈ విభాగాల్లోని రెగ్యులర్, ఔట్సోర్సింగ్ సిబ్బంది అందరికీ కోతల్లేని పూర్తివేతనం ఇవ్వనున్నారు. (‘వారి ధైర్యానికి ధన్యవాదాలు’) మేము సైతం.. జీహెచ్ఎంసీలో పారిశుధ్యం, ఎంటమాలజీ, ఈవీడీఎం విభాగంలో క్షేత్రస్థాయిలో పనిచేసే దిగువస్థాయి సిబ్బందితోపాటు ఎందరో ఉద్యోగులు, అధికారులు సైతం కరోనా నివారణకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ వారితో కలిసి నగరంలో కరోనా నివారణకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా కంటైన్మెంట్ ప్రాంతాల్లో కట్టడి అమలుకు, ఇంటింటికీ అవసరమైన మందులు, నిత్యావసరాల పంపిణీ, ఇతరత్రా చర్యలకు ఎంతో కృషి చేస్తున్నారు. వీటితోపాటు వలస కార్మికులు, అనాథలను గుర్తించి వసతి, ఆకలితో అల్లాడుతున్న వారికి భోజనం తదితర సదుపాయాలు కల్పిస్తున్నారు. జీహెచ్ఎంసీలోని అధికారుల జీతాల పూర్తి చెల్లింపు వల్ల ప్రభుత్వానికి ఎలాంటి భారం ఉండదు. జీహెచ్ఎంసీ ఖజానా నుంచే వీరికి జీతాలు చెల్లిస్తారు. ఖజానా భర్తీకి ఆస్తిపన్ను వసూళ్లు తదితర ఫీజులు రాబట్టేదీ జీహెచ్ఎంసీయే కాబట్టి ప్రభుత్వం ఒక ఆదేశం లేదా ఉత్తర్వు జారీ చేస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తారని, ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
లాక్డౌన్ తప్పదు
-
సఫాయి అన్నా నీకు సలామ్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పారిశుధ్య సిబ్బందికి కోత విధించిన వేతనాలను తిరిగి చెల్లిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వారికి అదనంగా నగదు ప్రోత్సాహకం కూడా అందజేస్తామన్నారు. అలాగే కరోనా నియంత్రణ పోరులో కీలకంగా పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వారి మూలవేతనంలో 10 శాతాన్ని సీఎం ప్రోత్సాహకంగా ఇస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ఒకట్రెండు రోజుల్లో ఇస్తాం.. ‘వైద్యులు, పోలీసు సిబ్బందితో పాటు కొంతమంది కరోనా నియంత్రణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. పారిశుధ్య కార్మికులు భుజాన రసాయనాలు తగిలించుకుని స్ప్రే చేస్తూ నగరాలు, పట్టణాలను అద్దంలా పెడుతున్నారు. వీరు రాష్ట్రవ్యాప్తంగా 95,392 మంది ఉన్నారని గుర్తించాం. అందులో 43,661 మంది గ్రామపంచాయతీ కార్మికులు, 21,531 మంది మున్సిపాలిటీల సిబ్బంది, 2,510 మంది హెచ్ఎండబ్ల్యూఎస్ సిబ్బంది, 27,690 మంది జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు. వీరికి ఈ నెల వేతనం ఇచ్చే విషయంలో కొంత పొరపాటు జరిగింది. 10శాతం వేతనం కట్ అయింది. ఆ వేతనాన్ని ఒకట్రెండు రోజుల్లో జమ చేస్తం. దీంతోపాటు ముఖ్యమంత్రి ప్రోత్సాహకం కింద జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ సిబ్బందికి రూ.7,500 అదనంగా ఇస్తాం. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుధ్య సిబ్బంది రూ.5,000 ఇస్తాం. నేను గతంలో కూడా చెప్పాను. సఫాయి అన్నా నీకు సలామ్ అన్నా అని.. ఇప్పుడు కూడా చెబుతున్నా సఫాయి అన్నా నీకు సలామ్ అన్నా. తల్లిదండ్రుల తర్వాత మీరే గొప్ప వారు. కనిపించే దేవుళ్లు. మా సైనికులు మీరు. మేమిచ్చే డబ్బు తక్కువే. మిమ్మల్ని ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. భారతదేశ ధాన్యాగారంగా రాష్ట్రం బెంగాల్ నుంచి గన్నీ బ్యాగుల దిగుమతి కోసం ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో మాట్లాడిన. అక్కడి కేబినెట్ కార్యదర్శి మన సీఎస్‌తో మాట్లాడినరు. మనం సేకరించిన ధాన్యంలో 50–60 శాతాన్ని గన్నీ బ్యాగుల్లోనే ఇవ్వాలని ఎఫ్‌సీఐ నిబంధన ఉంది. వీటిని బెంగాల్లో తయారు చేయించి పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. మనకు ఏడు కోట్ల గన్నీ సంచులు కావాలని అడిగిన. సాధ్యం కాకుంటే ఎఫ్‌సీఐ వాళ్లు 100 శాతం ప్లాస్టిక్ బ్యాగులు తీసుకోవాల్సి ఉంటుంది. 40లక్షల ఎకరాల వరి పంట తెలంగాణలో తొలిసారిగా వస్తోంది. ఈ కరోనా లేకుంటే నేను డ్యాన్స్ చేసి సంబరపడేవాడిని. డబ్బులు లేకున్నా ధాన్యం, మక్కల కొనుగోళ్లకు రూ.30వేల కోట్లు సమీకరించినం. 7వేల సెంటర్లు పెట్టినం. తెలంగాణ ఇప్పుడు భారతదేశ ధాన్యాగారం అయిపోయింది. ఇంకా రెండడుగులు ముందుకుపోతే దేవాదుల, సీతారామ, పాలమూరు, కాళేశ్వరం పూర్తి అయితే ఒక కోటీ 30లక్షల ఎకరాల దాకా వరి సాగుకు తెలంగాణ చేరుకుంటది. ఈ గన్నీ బ్యాగుల పంచాయతీ ఎందుకని మన దగ్గరే రెండు మూడు కంపెనీలు పెట్టించండని మంత్రికి చెప్పిన. వారికి రాయితీలు, భూములు ఇచ్చి ఒకటి రెండు జ్యూట్ మిల్స్ పెట్టించమన్న. రాజకీయాలకు నాలుగేళ్ల టైం ఉంది ఈ సమయంలో చిల్లరగాళ్లు చేసే ప్రచారాలను పట్టించుకోకుండా సమాజం జాగ్రత్తగా ముందుకెళ్లాలి. కొన్ని పత్రికలు కూడా పిచ్చి రాతలు రాస్తున్నయ్. వైద్యులకు రక్షణేదీ.. అని రాస్తున్నయ్. పీపీఈ కిట్లు లేవా? 40వేలున్నయ్ మీకు తెలుసా? అవసరమనుకుంటే కేసులు కూడా పెడతం. ఎంతో చిత్తశుద్ధితో, ధైర్యంగా పనిచేస్తున్న వైద్యుల మనోధైర్యం కోల్పోయేలా వెకిలి వార్తలు రాస్తరా? ఈ సమయంలో ప్రభుత్వానికి, సమాజానికి ఉపయోగపడే వార్తలు రాయాలి. వారికి శిక్ష తప్పదు. మీరు రాసేదాంట్లో వాస్తవం లేదు. మీకే ఉందా బాధ్యత.. మాకు లేదా? ఈ సమయంలో కూడా 5లక్షల కిట్లు, లక్షలాది మాస్కులకు ఆర్డర్ ఇచ్చినం. మా హెల్త్ మినిష్టర్ కానీ మేం కానీ పడుకుంటున్నామా? నిద్ర లేని రాత్రులు గడుపుతున్నం. వైద్యం ఒక్కటే కాదు కదా? రాష్ట్రంలో అన్నీ చూసుకోవాలి. ఈ సమయంలో భుజానికి భుజం తోడయి ముందుకెళ్లాలి. ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా. వక్రబుద్ధి ఉన్నవాళ్లు సక్రమంగా మారాలి. తర్వాత మీ ఇష్టం. అది మీ ఖర్మ. మీకు కరోనా తగలాలని శాపం పెడుతున్నా. రాజకీయాలకు ఇంకా నాలుగేళ్లు టైం ఉంది. హైరానా ఎందుకు? ఇప్పటికైనా క్లీన్‌మైండ్ ఉండాలి. వీరికి సరైన సమయంలో సరైన శిక్ష ఉంటుంది. ఆ శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే వీళ్లు ప్రజాద్రోహులు, దేశద్రోహులు. మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా ఆగాలి. కేసీఆర్ చెబితే ఖతర్నాక్ ఉంటది. మామూలుగా చెప్పడు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఇప్పుడు నేను చెపుతున్నవన్నీ కుత్సిత, చిల్లర బుద్ధితో అసత్యాలు ప్రచారం చేస్తున్న వారికి మాత్రమే. దీన్ని మీడియా కూడా సహించవద్దు. దేశ ఐక్యత కోసం పనిచేసే వాళ్లు ఈ సమయంలో గొప్పవాళ్లు కానీ వెకిలి మకిలి ప్రయత్నాలు చేసేవారు కాదు. ఆ త్యాగధనుల కాళ్లు కడిగి నెత్తిన పోసుకోవాలి. మీడియాలో కూడా మంచి వార్తలు రాసేవాళ్లున్నరు. వాళ్లకు దండం పెడతం, రెండు కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటం. పెద్దలు, బుద్ధిజీవులు, కవులు మంచి సాహిత్యం వెలువరించాలి. ప్రస్తుతం మానవ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే వైతాళికులు కావాలి. చిల్లర రాజకీయం, చిల్లర ప్రచారం, చిల్లర పేపర్లు కాదు. అల్పులు, గొప్పవాళ్లు ఇలాంటి సందర్భంలోనే బయట పడతారు. బీడీలు చుట్టే ఓ మహిళ, రేషన్ బియ్యాన్ని పంచిన మరో మహిళ.. ఇలాంటి వాళ్లకు పాద పూజ చేసి, రాష్ట్ర అవతరణ సమయంలో అవార్డులు కూడా ఇవ్వాలి. జిల్లాల్లో కష్టపడి పనిచేస్తున్న వారికి ప్రోత్సాహకంగా కొంత నగదు ఇస్తాం. 24 గంటలు కష్టపడే వాళ్లకు కొంత నగదు ఇచ్చేందుకు కలెక్టర్లకు నిధులిస్తాం. -
వేతనాల్లో శాతాల వారీ కోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలలో కోత విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంపై ఆర్థిక శాఖ మంగళవారం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల పూర్తి వేతనాన్ని శాతాల వారీగా వాయిదా వేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నం. 27లో పేర్కొన్న విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు మార్చికి సంబంధించి ఏప్రిల్‌లో రావాల్సిన పూర్తి వేతనంలో కోత విధించనున్నారు. ఈ కోత వాయిదా మాత్రమేనని, ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వేతన వ్యత్యాసాన్ని వాయిదా రూపంలో అమలు చేయాలని స్పష్టం చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లులు ఈ పాటికే ఈ కుబేర్‌లో సమర్పించి ఉంటే ఈ వ్యత్యాసాన్ని ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా వర్తింపజేయాలని, ఇప్పటివరకు సమర్పించని బిల్లులను జీవోలో పేర్కొన్న వ్యత్యాసాన్ని వర్తింపజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనంలో 10% వేతనాన్ని వాయిదా వేయాలని, హోంగార్డులు, అంగన్వాడీ కార్యకర్తలు/హెల్పర్లు, వీఆర్ఏలు, విద్యావాలంటీర్లు తదితరులకిచ్చే గౌరవ వేతనానికీ ఈ వాయిదా వర్తిస్తుందన్నారు. నాలుగో తరగతి పెన్షనర్లకు 10%, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్లో 50%, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల పింఛన్లో 60% వాయిదా వేయాలన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ఇప్పటికే జారీ చేసిన బిల్లులు, చెక్కులను వెనక్కు తీసుకోవాలని, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వ్యత్యాసాన్ని వర్తింపజేసి వేతనాన్ని వాయిదా వేయాలని, ఆ మేరకు మళ్లీ బిల్లులు, చెక్కులు మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
బకాయిలు ఇవ్వండి మహాప్రభో!
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న హోంగార్డుల్లో అనేక మంది సకాలంలో జీతాలు అందక సతమతం అవుతున్నారు. ఈ నెల్లో శుక్రవారం వరకు అనేక మంది ‘హోం’గడవని గార్డులుగా మారారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి వేతనాలు అందరికీ సకాలంలో అందకపోవడం, గతంలో కోత పెట్టిన జీతం ఇవ్వకపోవడం, బందోబస్తులకు సంబంధించిన ఫీడింగ్ చార్జీల అంశాన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పోలీసు విభాగంలో మిగతా సిబ్బందితో సమానంగా డ్యూటీలు చేస్తున్నా హోంగార్డులకునెలకు దక్కేది రూ.22 వేలే. కాగా ఈ నెలలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారికి ఒక్కసారిగా వేతనాలు అందలేదు. హోంగార్డుల హాజరు నమోదు చేయడానికి బయోమెట్రిక్ విధానం అమలులో లేదు. ఈ నేపథ్యంలో ప్రతి నెల వారు పని చేసిన రోజులకు సంబంధించి పోలీసుస్టేషన్లు, ప్రత్యేక యూనిట్ల నుంచి అటెండెన్స్ హోంగార్డ్స్ కార్యాలయానికి చేరాల్సి ఉంటుంది. అక్కడ వీరి వేతనాల బిల్లులు రూపొంది కమిషనర్ ఆఫీసుకు చేరతాయి. ఇక్కడ ఆమోద ముద్రపడిన అనంతరం జీతం డబ్బు ఆయా హోంగార్డులకు ఖాతాల్లోకి చేరుతుంది. అప్పట్లో గడిచిన పోయిన నెలకు సంబంధించి ఒకటో తేదీ నుంచి 30 లేదా 31 వరకు నెలగా లెక్కించే వారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా వీరికి తర్వాతి నెల్లో 20వ తారీఖున జీతాలు అందేవి. ఈ విధానాన్ని మారుస్తున్నామని, ఇకపై ఒకటో తేదీకల్లా జీతం బ్యాంకు ఖాతాలో పడేలా చర్యలు తీసుకుంటున్నామంటూ గత ఏడాది మేలో అధికారులు ప్రకటించారు. అయితే ఈ ప్రక్రియ ప్రారంభించడానికి ఆ నెల్లో 20 వరకు హాజరు తీసుకుంటామని, కోల్పోతున్న పది రోజుల మొత్తాన్ని రెండు మూడు నెలల్లో ఖాతాల్లోకి జమ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. తాత్కాలిక ఇబ్బంది అయినప్పటికీ ప్రతి నెలా ఒకటో తేదీ నాటికి జీతం అందుకోవచ్చనే ఉద్దేశంతో హోంగార్డులు అందుకు అంగీకరించారు. దీంతో గత ఏడాది మే నెలలో వీరికి 20 రోజుల జీతమే అందింది. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా మొదటి వారంలోనే జీతం వస్తోంది. అయితే ఇప్పటికి పది నెలలు కావస్తున్నా... ఆ పది రోజుల వేతన బకాయి విషయం మాత్రం అధికారులు మర్చిపోయారు. దీనికి తోడు ఫిబ్రవరి నెలకు సంబంధించి అందరు హోంగార్డులకు ఒకేసారి వేతనాలు అందలేదు. సిటీలో ట్రాఫిక్ విభాగంతో పాటు మరో మూడు యూనిట్లలో కలిపి 6700 మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ట్రాఫిక్‌లో పని చేస్తున్న వారికి ముందుగా జీతాలు అందాయి. శుక్రవారం యూనిట్–1, 2, 3లకు చెందిన వారి బ్యాంకు ఖాతాల్లో జీతం జమయ్యాయి. ఆలస్యమైనా ఈసారి పది రోజుల బకాయితో సహా జీతం వస్తుందని భావించిన సిబ్బందికి నిరాశే మిగిలింది. తమకు బత్తా కింద రూ.12 వేల వరకు రావాల్సి ఉందని, కనీసం రూ.6 వేలైనా ఇవ్వాల్సిందిగా మెరపెట్టుకుంటున్నా వీరి బాధ అరణ్యరోదనగా మారింది. సిటీ పోలీసు విభాగానికి చెందిన ఓ హోంగార్డు ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘జీతం కూడా ప్రతి నెలా సరైన సమయానికి రాకపోతే ఇక మా గతి ఏంటి? గతంలో కట్ చేసిన పది రోజుల జీతం విషయం ఇప్పుడు ఎవరూ పట్టించుకోవట్లేదు. బత్తా ఇమ్మన్నా ఆదుకునే నాథుడే లేకుండా పోయాడు’ అని వాపోయారు. -
బడికి వచ్చిపో 'రాధా'?
సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. వారిని పర్యవేక్షించాల్సిన మండల విద్యాశాఖాధికారులు వారికి సహకరిస్తుండడంతో ఆ శాఖకే చెడ్డపేరు వస్తోంది. 25 నెలలుగా పాఠశాలకు హాజరుకాని ఉపాధ్యాయినికి ప్రతినెలా జీతం అందుతున్న వైనం జిల్లా అధికారులను విస్మయానికి గురిచేసింది. చిత్తూరు కలెక్టరేట్: దీర్ఘకాలిక సెలవులో వెళ్లిన ఉపాధ్యాయిని ఖాతాలో 25 నెలలుగా జీతం జమ అవుతూనే ఉంది. దీన్ని రెండు సంవత్సరాల తర్వాత విద్యాశాఖ ఉన్నతాధికారులు కనిపెట్టారు. సోమల మండలం బోడమంద ప్రాథమిక పాఠశాలలో కిరణ్‌కుమారి అలియాస్ రాధ అనే ఉపాధ్యాయిని ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె పలు కారణాలతో 2018 జనవరి 1వ తేదీ నుంచి దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. అప్పటి నుంచి 2020 మార్చి 1వ తేదీ వరకు సెలవులోనే ఉన్నారు. ఈ విషయాన్ని బయోమెట్రిక్ హాజరు ద్వారా తెలుసుకున్న రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈవో కార్యాలయం ఏడీ–1 పురుషోత్తంను విచారణాధికారిగానియమించారు. ఆయన ఈ నెల 4న బోడమంద ప్రాథమిక పాఠశాలలో, సోమల మండలం ఎంఈఓ కార్యాలయంలో విచారణ జరిపారు. రికార్డుల ను పరిశీలించారు. సిబ్బందిని విచారించారు. ప్రాథమిక విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు పంపారు. బడికి రాని ఉపాధ్యాయిని ఖాతాలోకి ప్రతి నెలా జీతం జమ అవుతున్నట్లు తేలింది. అలసత్వం వహించిన సోమల ఎంఈఓ బాలాజీనాయక్, ఎస్జీటీ కిరణ్‌కుమారిని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. రూ.10 లక్షలు స్వాహా బడికి హాజరుకాని ఉపాధ్యాయిని ఖాతాలోకి ప్రతి నెలా జీతం మంజూరు అవుతున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. ఎస్జీటీ ఉపాధ్యాయిని కిరణ్‌కుమారి 25 నెలల జీతం రూ.10లక్షలు నిబంధనలకు విరుద్ధంగా జమ కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. జీతాల బిల్లులను ఎంఈవో క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. అలా చేయకపోవడం వల్ల గైర్హాజరైన ఉపాధ్యాయినితో ఒప్పందం కుదుర్చుకుని జీతాన్ని సగం సగం తీసుకోవడానికి ప్రయత్నించారా అనే విషయంపై విద్యాశాఖ అధికారుల క్షేత్రస్థాయి విచారణలో తెలియాల్సి ఉంది. రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులు ఆ ఉపాధ్యాయిని బయోమెట్రిక్ నమోదు కాకపోవడంతో సందేహం వచ్చి కిరణ్కుమారికి ఫోన్ చేసినట్లు తెలిసింది. ఆమె ఫోన్లో స్పందించకపోగా స్విచాఫ్ చేశారని అధికారులు తెలిపారు. అనంతరం ఎంఈవో బాలాజీనాయక్‌ను సంప్రదించగా తడబడుతూ సమాధానమివ్వడంతో ఉన్నతాధికారులకు సందేహం వచ్చి విచారణ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పర్యవేక్షణ లోపమే క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారా.. లేదా అన్న విషయంపై ఎంఈవో, డీవైఈవో, డీఈవో, సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. రెండేళ్లకు పైగా ఆ పాఠశాలకు ఏ అధికారీ తనిఖీకి వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది. బోడమంద పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. అక్కడ పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడు 25 నెలలకు ముందు మాత్రమే కిరణ్‌కుమారిని చూసినట్లు చెబుతుండడం గమనార్హం. ఇలాంటి ఘటనలు జిల్లావ్యాప్తంగా ఇంకెన్ని ఉన్నాయో అని విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా కలెక్టర్, రాష్ట్రస్థాయి విద్యాశాఖాధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. -
‘టెక్విప్’ పేరుతో దోపిడీ..
సమాజానికే ఆదర్శంగా ఉండాల్సిన అధ్యాపకులు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికార దుర్వినియోగంతో అందినకాడికి దోచుకునేందుకు సిద్ధమయ్యారు. ‘టెక్విప్’ కింద జేఎన్టీయూ(ఏ)లో మిగిలినపోయిన నిధులను ‘శిక్షణ’ పేరుతో కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో గత టీడీపీ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఓ వెలుగు వెలిగిన వ్యక్తి కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆయనకు వర్సిటీ ఉన్నతాధికారులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం మూడు వారాల కోర్సు శిక్షణకు ఇప్పటికే రూ.33 లక్షల నిధులు కేటాయించారు. మరో మూడు బ్యాచ్‌ల విద్యార్థులకు ఇలా శిక్షణ ఇచ్చేందుకు రూ.1.20 కోట్ల నిధులు ఖర్చుపెట్టి.. ఇందులో సగం పైగా నొక్కేందుకు సిద్ధమైనట్లు సమాచారం. జేఎన్టీయూ: విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్స్ స్కిల్స్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లు, సెమినార్లు, అధ్యాపకులకు డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు నిర్వహించేందుకు ‘టెక్విప్’–3(టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్) పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేఎన్టీయూ(ఏ)కు రూ.7 కోట్లు మంజూరు చేశాయి. 2017 ఏప్రిల్‌లో ఈ నిధులు విడుదల కాగా, 2020 మార్చి 31 లోపు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిధుల వినియోగం ఆశించినంత స్థాయిలో జరగలేదు. దీంతో ఎలాగైనా గడువులోగా మొత్తం రూ.7 కోట్ల నిధులను ఖర్చు చేయాలనే ఉద్దేశంతో వర్సిటీ ఉన్నతాధికారులు హడావుడిగా విద్యార్థులకు ‘పైథాన్’ పేరుతో మూడు వారాల శిక్షణ కార్యక్రమం ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం బీటెక్ ఫైనలియర్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆ తర్వాత మూడు, రెండు, మొదటి సంవత్సరాల విద్యార్థులకు మార్చి నెలాఖరులోగా శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందుకోసం రూ.1.20 కోట్ల నిధులు ఖర్చు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వాస్తవానికి సివిల్, కెమికల్ విభాగం విద్యార్థులకు అవసరం లేకపోయినా ‘పైథాన్’ శిక్షణ ఇస్తున్నారు. అధికార దుర్వినియోగం వాస్తవానికి ‘టెక్విప్’ నిధులను వినియోగించేందుకు గవర్నింగ్ బాడీ అనుమతి తీసుకోవాలి. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సలహాలు ప్రధానం. అయితే జేఎన్టీయూ(ఏ) ఇంజినీరింగ్‌కళాశాలలో నిర్వహిస్తున్న పైథాన్ శిక్షణకు సంబంధించి స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనుమతి తీసుకోలేదు. గత ప్రభుత్వం హయాంలో పెత్తనం చెలాయించిన వ్యక్తి అజమాయిషీలో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు. ఆయన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులే ఫ్యాకల్టీలుగా నియమించుకుని నిధులను దండుకుంటున్నారు. ♦ ఒక్కో ఫ్యాకల్టీ గంటన్నర తరగతిలో బోధిస్తే రూ. 3 వేలు ఇస్తున్నారు. ♦ రోజంతా నాలుగు సెషన్లు నిర్వహించాలి. అంటే ఒక్కో రోజుకు ఒక్కో ఫ్యాకల్టీకి రూ. 12 వేలు వేతనం చెల్లిస్తామని నిర్దేశించారు. ♦ ఒక్కో డిపార్ట్మెంట్లో ఒక ఫ్యాకల్టీకి రోజుకు రూ. 12 వేలు చొప్పున .. ఆరు విభాగాల్లో రోజూ రూ. 72 వేల చొప్పున వారంలో ఆరు రోజులకు కలిపి ఫ్యాక్టలీలకే మొత్తం రూ. 4.32 లక్షలు చెల్లించేలా ప్లాన్ సిద్ధం చేశారు. ♦ జనవరి 20న ప్రారంభమైన ‘పైథాన్’ తరగతులు మార్చి 9వతేదీ వరకు తరగతులు కొనసాగనున్నాయి. అప్పటి దాకా మొత్తం 8 వారాల శిక్షణకు కలిపి రూ. 33.12 లక్షల నిధులను ఖర్చు చేయనున్నారు. దొంగ చేతికి తాళాలు గతంలో జేఎన్టీయూ కలికిరి ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాక్టికల్స్ తరగతుల కోసం ప్రతి ఏటా రెండు దఫాలుగా అనంతపురం కళాశాలకు వచ్చేవారు. వీరందరి నుంచి మెస్‌బిల్లులు చలాన్ల రూపంలో కాకుండా నేరుగా నగదు కట్టించుకున్నారు. ఈ మొత్తాన్ని హాస్టల్ ఖాతాకు జమ చేయకుండా అప్పటి హాస్టల్ మేనేజర్ రూ.50 లక్షల మేర స్వాహా చేశారు. ఈ వ్యవహారం బట్టబయలైనా చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అయినా తాజాగా ఆయన్నే రూ.కోట్లు ఖర్చు చేసే ‘టెక్విప్’ కార్యక్రమానికి కోఆర్డినేటర్‌గా నియమించారు. దీంతో ఆయన తన ఇష్టం వచ్చినట్లు నిధులను ఖర్చు చేయడానికి పథకాలు రూపొందిస్తున్నారు. పాలక మండలి అనుమతుల్లేకుండానే.. జేఎన్టీయూ(ఏ) ఇంజినీరింగ్ కళాశాల కీలకమైన ఉన్నతాధికారి సైతం ఓ ప్రింటర్స్ నుంచి రూ.లక్షలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో టేపులు బహిర్గతమయ్యాయి. ఇలాంటి వ్యక్తులకు ‘టెక్విప్’ బాధ్యతలు అప్పగించడంతో.. వారంతా శిక్షణ పేరుతో ఈ నిధులను భోంచేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వాస్తవానికి రూ.5 లక్షల నగదు దాటే ప్రతి పనికీ పాలకమండలి అనుమతి తప్పనిసరి. అయితే ఏకంగా రూ.33.12 లక్షలు ఖర్చు చేయనున్న పైథాన్ శిక్షణ తరగతులకు పాలకమండలి అనుమతి తీసుకోలేదు. కనీసం కళాశాల గవర్నింగ్ బాడీ అనుమతి లేకుండా నిధుల వినియోగానికి నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ‘టెక్విప్’ కోఆర్డినేటర్‌గా ఉన్న ఉన్నతాధికారిపై గతంలో అవినీతి ఆరోపణలు ఉండడం, గత టీడీపీ ప్రభుత్వం హయాంలో స్కిల్‌డెవలప్‌మెంట్ స్పెషల్ సెక్రెటరీగా పనిచేసిన వారి ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు నిర్వహించడంపై విద్యార్థులూ పెదవి విరుస్తున్నారు. పరిశీలిస్తాం ‘పైథాన్’ శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన పలు అంశాలపై ఆరా తీస్తున్నాం. అన్ని వివరాలను పరిశీలించి అధికార దుర్వినియోగం చేశారా... లేదా అనే కోణంలో విచారణ చేపడతాం. ఆ తర్వాత తగు చర్యలు తీసుకుంటాం.– ఎం.విజయకుమార్,రిజిస్ట్రార్, జేఎన్టీయూ(ఏ) -
కడుపులో బిడ్డకూ కూలి
పాలకులు వస్తుంటారు.. పోతుంటారు. వారి పాలనాకాలంలో ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన మంచి కార్యక్రమాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. అవుకును పాలించిన తిమ్మరాజు.. కూలి పనులకు వచ్చే గర్భిణులకు ఒకటిన్నర కూలి ఇవ్వాలని శాసనం చేశారు. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. సాక్షి, కొలిమిగుండ్ల: అవుకు రాజ్యంలో నంద్యాల, తాడిపత్రి, గండికోట, గుత్తి వరకు సరిహద్దులు ఉండేవి. ఈ రాజ్యంలో 15వ శతాబ్దకాలంలో కరువు కాటకాలు ఏర్పడి పంటలు పండక, పశువులకు సైతం మేత దొరక్క కొండల నుంచి ఆకులు కోసుకొచ్చేవాళ్లు. అరకొర పంటలతో జనం జీవనం సాగించేవాళ్లు. తన రాజ్యం పరిధిలోని ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలనే కోరుకున్నాడు నంద్యాల తిమ్మరాజు. అవుకు సమీపంలో క్రీ.శ 1538లో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో చెరువును తవి్వంచాడు. వందలాది మంది కూలీలతో ఆరోజుల్లోనే ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని మించేలా సీసంతో పోతపోసి పునాదులు బలంగా ఉండేలా నిర్మించారు. ప్రస్తుతం ఈ చెరువు రిజర్వాయర్‌గా అభివృద్ధి చెంది వేలాది ఎకరాలకు సాగు నీరు అందుతోంది. తిమ్మరాజు ధర్మ శాసనం రైతు సంక్షేమం కోసం నిర్మించిన చెరువు ద్వారా పారే నీటితో పంటలు పండించే రైతులు వరి కోతల కాలంలో పనులకు వచ్చే గర్భిణులకు ఒకటిన్నర కూలి ఇవ్వాలని నియమం పెట్టారు. ఈ నియమం పాటించే వారి పాదాలు ఎల్లప్పుడూ తన శిరస్సుపై ఉంటాయని తిమ్మరాజు ధర్మశాసనం చేశాడు. ఇప్పటికీ అవుకు ప్రజలు రాజు శాసనాన్ని తూ.చ. తప్పక పాటిస్తున్నారు. గర్భిణులు వరి కోతల పనులు చేయడమంటే అంత సులువుగా కాదు..ఆమెతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ సైతం పరోక్షంగా పనిలో పాల్గొన్నట్లేనని రాజు భావించాడు. అప్పట్లో వరి కోతలకు మహిళలే అధికంగా వెళ్లేవాళ్లు. పని ముగిశాక నగదు రూపంలో కూలి కాకుండా ఒక్కొక్కరికి నాలుగు పల్లు వడ్లు ఇచ్చేవాళ్లు. నంద్యాల తిమ్మరాజు విగ్రహం గర్భిణులకు అయితే నాలుగు పల్లతో పాటు అదనంగా ఒకటిన్నర పడి వడ్లు అదనంగా ఇచ్చేవాళ్లు. రైతు తమ కోసం అదనంగా ఇచ్చాడనే ఉద్దేశంతో మళ్లీ మూడు పిడికెళ్ల వడ్లను తిరిగి ఇచ్చేవాళ్లు. తెల్లవారు జామున 3గంటలకు పనిలోకి వెళ్లి.. కోత కోసి.. పంట నూర్పిళ్లు చేసి.. వరి గడ్డిని కట్టలు కట్టి మోసుకొచ్చేవాళ్లు. చాలా మంది గర్భిణులు.. రెండు మూడు రోజులు కాన్పు అయ్యే సమయం వరకు కోత పనులకు వెళ్లేవాళ్లు. కొంత మంది పనులు చేసి ఇంటికి వచ్చిన కొద్ది సేపట్లోనే కాన్పు అయిన సంఘటనలు ఉన్నాయని గతంలో పనులకు వెళ్లిన వృద్ధులు చెప్పారు. పనులకు గుంపుగా వెళ్లిన మహిళలు.. గర్భిణులకు దగ్గరుండి అరకూలీ అదనంగా ఇప్పించేవారు. పొరుగు గ్రామాల నుంచి సైతం అవుకులో పని చేసేందుకు అప్పట్లో వచ్చేవాళ్లు. కొనసాగుతున్న ఆచారం ఎన్నో ఏళ్ల క్రితం తిమ్మరాజు చేసిన శాసనం ఇప్పటికీ అవుకులో కొనసాగుతోంది. కాలక్రమేణ మార్పులు చోటు చేసుకొని సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చాక వరికోతలకు దాదాపు పదేళ్ల నుంచి యంత్రాలు ఉపయోగించి కోత కొస్తున్నారు. తగ్గు ప్రాంతాల్లో యంత్రాలు దిగని వరిమళ్లలో కూలీల సాయంతోనే కోత కొస్తుంటారు. ప్రస్తుతం కూడా గర్భిణులు పనులకు వెళితే ఆనాటి ఆచారం ప్రకారం అర కూలి అదనంగా ఇస్తున్నారు. అర కూలి ఎక్కువగా ఇచ్చేవాళ్లు తిమ్మరాజు చెప్పిన ప్రకారం గర్భిణులు వరి కోతలకు వెళితే మామూలుగా ఇచ్చే నాలుగు పళ్ల ఒడ్లతో పాటు అదనంగా అర కూలి చొప్పున ఇచ్చేవాళ్లు. కడుపులో పెరిగే బిడ్డ కష్టపడుతుందనే ఉద్దేశంతో కూలి ఎక్కువ ఇచ్చేవాళ్లు. గర్భం దాలి్చనప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు నేను పనులకు వెళ్లాను. –లక్ష్మమ్మ సంప్రదాయం కొనసాగుతోంది రాజు కాలంలో ఆచారం ఇప్పటికీ ఊర్లో కొనసాగుతోంది. గర్భవతిగా ఉన్నా కూడా వరి కోతకు వెళ్లేదాన్ని. పగలు పనికి వెళ్లి రాత్రి ఇంటికొచ్చాక కాన్పు అయిన మహిళలు ఉన్నారు. ఇప్పుడు మిషన్లు రావడంతో కూలీల సంఖ్య తగ్గిపోయింది. – లక్ష్మీనరసమ్మ బరువు పని చేసే వాళ్లం గర్భవతులు ఉన్నా వరి మళ్లలో బరువైన పనులు చేసేవాళ్లం. గడ్డిమోపులను మోసుకెళ్లే వాళ్లం. కాన్పు అయ్యే వరకు కోత పనులకు పోయేదాన్ని. అదనంగా అరకూలి ఇచ్చేవాళ్లు. మెట్టుపల్లెతో పాటు చుట్టు పక్కల ఊర్ల నుంచి మహిళలు పనులకు వచ్చేవాళ్లు. –వెంకట లక్ష్మమ్మ తరతరాల నుంచి పాటిస్తున్నారు మా వంశంలోని పూరీ్వకుడు తిమ్మరాజు పరిపాలన కాలంలో అమలు చేసిన పద్ధతిని తరతరాల నుంచి రైతులు పాటిస్తూ వచ్చారు. గర్భంతో ఉన్న తల్లితో పాటు లోపల ఉన్న బిడ్డకు కూలి ఇవ్వాలన్న ఉద్దేశంతో అర కూలి ఏర్పాటు చేశారు. రైతులు సంతోషంగా ఇస్తూ వచ్చారు. ఈ పద్ధతి బహుశా ఎక్కడా ఉండక పోవచ్చు. –రామకృష్ణరాజు, తిమ్మరాజు వారసుడు -
జీతాలతో పనేముంది?
సాధారణంగా ఏ ఉద్యోగి అయినా నెల గడిచిందంటే జీతం డబ్బుల కోసం ఎదురుచూస్తారు. కానీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలోని కొందరు ఇంజినీర్లు మాత్రం ఇందుకు భిన్నం. వారికి జీతం డబ్బులతో పనిలేదు. అందుకే ఏడేళ్లుగా జీతమే డ్రా చేయడం లేదు. డిస్కం ఆపరేషన్ విభాగంలోని దాదాపు వంద మంది ఇంజినీర్లు గత ఏడేళ్లుగా వేతనాలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. కమీషన్ల రూపంలో పెద్ద మొత్తంలో అందుతుండడంతో వీరు వేతనాల జోలికి వెళ్లడం లేదని, రిటైర్మెంట్ సమయంలో ఒకేసారి ఈ వేతనాలు డ్రా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సాక్షి, సిటీబ్యూరో: కుటుంబం సాఫీగా గడవాలంటే...ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా నెల జీతం తప్పని సరి. అయితే ఏళ్ల తరబడి వేతనం డ్రా చేయకుండా విధులు నిర్వహిస్తున్న ఘనత ఒక్క దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజినీర్లకు మాత్రమే దక్కింది. ఒకటి కాదు రెండు కాదు..ఒక్కొక్కరు ఏడెనిమిదేళ్లుగా వేతనాలు తీసుకోకుండా విధుల్లో కొనసాగుతుండటాన్ని పరిశీలిస్తే డిస్కంలో ఇంజినీర్ల అవినీతి సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ విభాగంలో పని చేస్తున్న కొందరు ఇంజినీర్లకు నెలసరి వేతనంతో పోలిస్తే కొత్తలైన్లకు సంబంధించిన వర్క్ ఎస్టిమేషన్, వివిధ విద్యుత్ పనులకు అనుమతులు జారీ చేసినందుకు ప్రతిఫలంగా కాంట్రాక్టర్ల నుంచి లభించే కమీషన్లే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కమీషన్లకు జీతం తోడైతే..భారీగా ఆస్తులు జమై...అక్రమాస్తుల సంపాదన కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉండటంతో పలువురు ఇంజినీర్లు జీతం తీసుకోకుండా కేవలం కమీషన్లతోనే కుటుంబ అవసరాలు తీర్చడంతో పాటు భారీగా స్థిరాస్తులను సమకూర్చుకున్నట్లు సమాచారం. ఉద్యోగ విరమణకు ముందు పెండింగ్‌లో ఉన్న వర్క్ ఆర్డర్ ఫైళ్లన్నీ క్లోజ్ చేస్తే..ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న వేతనం సహా అప్పటి వరకు సంస్థ నుంచి రావాల్సిన ఇతర బెనిఫిట్లన్నీ ఒకేసారి దక్కే అవకాశం ఉండటంతో కొందరు ఇంజినీర్లు దీనిని అవకాశంగా తీసుకుంటున్నారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకుని, ఏసీబీ దాడుల నుంచి కాపాడుకునేందుకు ఈ కొత్త తరహా ఎత్తుగడలు వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సంస్థలో అక్రమార్జనపై ఆధారపడి, జీతం తీసుకోకుండా పనిచేస్తున్న ఇంజినీర్ల సంఖ్య వందకుపైగా ఉన్నట్లు అంచనా. అయితే వీరిలో ఇటీవల 15 మందిని గుర్తించిన యాజమాన్యం వారిని ఆయా విధుల నుంచి రిలీవ్ చేసినట్లు తెలిసింది. వీరిలో ఎక్కువ శాతం గ్రేటర్ శివారు ప్రాంతాల్లో పని చేస్తున్న ఇంజినీర్లే కావడం గమనార్హం. ఎల్పీసీ లేకుండా బదిలీలు..ఆపై పదోన్నతులు: కొత్తలైన్ల ఏర్పాటు, కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు, లైన్‌షిఫ్టింగ్ వర్కులు, భూగర్భకేబుల్ వర్కులకు ఆయా సెక్షన్ పరిధిలోని ఏఈ, ఏడీఈ, డీఈలు అంచనాలు రూపొందిస్తారు. ఆ తర్వాత ఆసక్తిగల కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించి, అర్హులైన వారికి పనులు అప్పగిస్తుంటారు. ఆయా పనులు పూర్తయిన తర్వాత ఆ పని చేసిన కాంట్రాక్టర్‌కు చెల్లించిన బిల్లులు, స్టోర్స్ నుంచి తీసుకొచ్చిన డీటీఆర్లు, కండక్టర్, పోల్స్, కాసారాలు, మీటర్లు సహా ఇతర మెటిరీయల్‌కు సంబంధించిన పూర్తి బిల్లులను ఆడిట్ విభాగానికి అందజేయాల్సి ఉంది. ఒక వేళ పని పెండింగ్‌లో ఉన్నట్లైతే..అప్పటి వరకు చేసిన పనులకు సంబంధించిన పూర్తి బిల్లులను ఆడిట్ విభాగానికి అందజేయాలి. ఒక డివిజన్ నుంచి మరో డివిజన్‌కు, ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్‌కు ఉద్యోగి బదిలీపై వెళ్లినప్పుడు విధిగా లాస్ట్ పేమెంట్ సర్టిఫికెట్(ఎల్పీసీ) సమర్పించాల్సి ఉంది. ఒక వేళ వర్క్‌ను కంప్లీట్ చేయకుండా పెండింగ్ పెడితే.. సంబంధిత సెక్షన్ ఉన్నతాధికారులు సదరు ఇంజినీర్లకు ఎల్పీసీ జారీ చేయకపోవడమేగాక నెల జీతం కూడా నిలిపివేస్తారు. వాస్తవానికి ఎల్పీసీ సమర్పించని ఇంజినీర్లకు బదిలీలు, పదోన్నతుల్లో అవకాశం కల్పించరాదు. కానీ డిస్కంలో లాస్ట్ పేమెంట్ సర్టిఫికెట్ సమర్పించకుండా ఏళ్ల తరబడి జీతం కూడా తీసుకోకుండా పని చేస్తున్న ఇంజినీర్లకు పదోన్నతులు కట్టబెడుతుండటం వివాదాస్పదంగా మారుతోంది. సంస్థ పరిధిలోని ప్రతి ఉద్యోగి తాలుకూ సమాచారం సంబంధిత మానవ వనరుల విభాగం(హెచ్ఆర్)లో ఉంటుంది. ఏ ఉద్యోగి ఎం త కాలం నుంచి జీతం తీసుకోవడం లేదో ఇట్టే తెలిసిపోతుంది. అయితే డిస్కంలోని హెచ్ఆర్ విభాగం మాత్రం దీనిని చాలా చిన్న అంశంగా చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఎల్పీసీలు సమర్పిం చని ఇంజినీర్లను నాన్పోకల్ పోస్టుల్లోకి బదిలీ చేయాలి. అయితే అక్రమార్జన కేసుల్లో ఇప్పటికే అరెస్టైన పలువురు ఇంజినీర్లను ఆపరేషన్ విభాగంలోని కీలకమైన ఫోకల్ పోస్టుల్లో కూర్చోబెట్టడం చర్చనీయాంశంగా మారింది. బదిలీ ఆర్డర్స్ ఇచ్చినా అక్కడే: విద్యుత్ సంస్థల్లో ప్రతి మూడేళ్లకోసారి ఉద్యోగుల బదిలీలు చేపడతారు. నిబంధనల ప్రకారం ఒక సెక్షన్లో వరుసగా మూడేళ్ల పాటు పని చేసిన ఏఈ, ఏడీఈ, డీఈ, ఎస్ఈ, సీజీఎంలను ఇతర సెక్షన్లకు బదిలీ చేస్తుంటారు. నిజానికి ఫోకల్ పోస్టుల్లో పని చేసిన వారిని, నాన్‌ఫోకల్ పోస్టుల్లోకి, ఆపరేషన్ విభాగంలో పని చేసిన వారిని ప్రాజెక్ట్ విభాగంలోకి బదిలీ చేయాల్సి ఉంది. అయితే డిస్కంలో ఇందుకు విరుద్ధంగా బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే అక్రమార్జనకు అలవాటుపడి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజినీర్లకు పోస్టుల కేటాయింపులో పెద్దపీఠ వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్లో మూడేళ్ల కంటే ఎక్కువగా పని చేస్తున్న కొందరు ఏఈలు, ఏడీఈలను గత ఏడాది యాజమాన్యం బదిలీ చేసింది. అయితే వారు ఇప్పటి వరకు అక్కడి నుంచి రిలీవ్ కాకపోవడాన్ని పరిశీలిస్తే డిస్కంలో బదిలీల పక్రియ ఎంత అధ్వానంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదే సర్కిల్లోని ఓ ఏఈ, మరో ఏడీఈ బినామీ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నా యాజమాన్యం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటం కొసమెరుపు. -
ఆర్టీసీ ఉద్యోగులకు సెప్టెంబర్ జీతం విడుదల
సాక్షి, హైదరాబాద్: సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులకు సెప్టెంబర్ జీతం సోమవారం విడుదలైంది. సమ్మె నేపథ్యంలో 49,700 మం దికి డబ్బులు లేవనే కారణంతో జీతాన్ని జమ చేయలేదు. అలాగే సమ్మె సమయంలో అందు లో పాల్గొనని వారికి కూడా ఆ జీతాన్ని ఇవ్వలేదు. కొద్ది రోజుల కిందట సమ్మెలో లేనివారి కి మాత్రం చెల్లించారు. ఆదివారం ఉద్యోగుల తో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వెం టనే అందరికీ జీతాలు చెల్లిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే రూ.100 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మొత్తానికి మరికొంత కలిపి సోమవారం ఉద్యోగుల ఖాతాల్లోకి జీతం జమైంది. -
ఉద్యోగంలో సంతృప్తి.. కానీ, వేతనంపైనే..
ముంబై: వేతన జీవులు తాము చేస్తున్న ఉద్యోగం పట్ల సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, తాము పొందుతున్న వేతనం విషయంలో మాత్రం అంత సంతోషంగా లేరని ‘మాన్స్టర్ వేతన సూచీ’ నివేదిక పేర్కొంది. తాము చేస్తున్న ఉద్యోగం పట్ల 75 శాతం మంది సంతృప్తికరంగా ఉన్నారు. కానీ, చెల్లింపుల పట్ల సంతోషం కనిష్ట స్థాయికి చేరిందని, 21.6 శాతం తగ్గిందని ఈ నివేదిక తెలిపింది. 2016 జనవరి నుంచి 2018 డిసెంబర్ వరకు మూడేళ్ల కాలంలో వేతన చెల్లింపుల డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఉద్యోగం పట్ల అంత సంతోషంగా ఉండడానికి, సహచర ఉద్యోగులు, ఉన్నతోద్యోగులతో వారికున్న మంచి సంబంధాలే కారణమట. నిర్మాణ రంగం, టెక్నికల్ కన్సల్టెన్సీ, హెల్త్‌కేర్ సర్వీసెస్, సామాజిక సేవ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సర్వీసెస్, న్యాయ, మార్కెట్ కన్సల్టెన్సీ రంగాల్లోని వారు తమ ఉద్యోగాల పట్ల ఎక్కువ సంతృప్తితో ఉన్నారు. -
వేతనానందం
పోలీస్‌శాఖలోని హోంగార్డుల జీవితాల్లో దీపావళి వెలుగు ముందే వచ్చేసింది. ప్రభుత్వం వారి వేతనాలను పెంచడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో హోంగార్డుల కష్టాలను ప్రత్య క్షంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి..సీఎం అయ్యాక తొలి మంత్రివర్గ సమావేశంలోనే వారి వేతనాలను పెంచుతూ నిర్ణయంతీసుకున్నారు. ఆ మేరకు నెలకు రూ.18000నుంచి 21,300 పెంచుతూ ప్రభుత్వంశనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కడప అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డుల దినసరి వేతనాన్ని రోజుకు రూ.600 నుంచి 710కు పెంచింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, ఇంత త్వరగా అమలులోకి తీసుకొచ్చారని, తమ కుటుంబాల్లో మరింత వెలుగు నింపారని హోంగార్డులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హోంగార్డులకు నెలసరి వేతనాన్ని రూ.3 వేల నుంచి 6 వేలకు పెంచారని, ఆయన తనయుడు మళ్లీ ఇప్పుడు పెంచారని వారు పేర్కొంటున్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హోంగార్డుల వేతనాన్ని పెంచుతామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అమలు చేశారని అన్నారు. నెలసరి జీతం రూ.18000 నుంచి 21,300 వచ్చేలా చేశారని హర్షం వ్యక్తం చేశారు. 715 కుటుంబాలకు ప్రయోజనం జిల్లా పోలీసు శాఖలో సుమారు 715 మంది హోంగార్డులు పని చేస్తున్నారు. హోంగార్డుల జీతాలు పెంచుతూ శనివారం సాయంత్రం జీఓ విడుదలైంది. జిల్లాలో 715 మందికి ప్రయోజనం కలగనుంది. అందులో 58 మంది మహిళలు ఉన్నారు. జీతాలు పెంచినందుకు జిల్లాలోని హోంగార్డులు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మాట నిలబెట్టుకున్న సీఎం హోంగార్డుల జీతం పెంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. మా జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. – కె.శ్రీనివాసులు, హెచ్‌జీ 959, కడప వన్‌టౌన్ దీపావళి ముందే వచ్చింది మాకు జీతాలు పెంచడం హర్షణీయం. దీపావళికి ముందే మా జీవితాల్లో వెలుగు నింపారు. మా కుటుంబ సభ్యులందరం సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. – సి.జలజాక్షి, డబ్లూహెచ్జీ 201, కడప హర్షణీయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు నెలల్లోనే అన్ని వర్గాల సంక్షేమంతో పాటు మాపై కూడా దృష్టి పెట్టి వేతనాల పెంపు చేపట్టడం హర్షణీయం. – పి.కిషోర్‌బాబు, హెచ్‌జి 838, కడప ఒన్‌టౌన్ పీఎస్ డ్రైవర్ ఆత్మస్థైర్యం పెంచారు హోంగార్డుల వ్యవస్థలో పని చేస్తున్న మహిళలలో కూడా ఈ వేతనాల పెంపు మరింత ఆత్మస్థైర్యం పెంపొందిస్తోంది. కారుణ్య నియామకాల కింద పోలీసు కుటుంబాల సభ్యులకు కొందరికి హోంగార్డులుగా.. గతంలో పని చేసిన పోలీసు అధికారులు నియామకాలు చేపట్టారు. అలాంటి వారి జీవితాల్లో మరింత వెలుగు నింపారు. – శ్యామల, మహిళా హోంగార్డు, జిల్లా పోలీసు కార్యాలయం, కడప -
పండగ వేళ జీతాల్లేవ్!
సాక్షి,సిటీబ్యూరో: నాలుగు రోజుల్లో దసరా పండగ.. విద్యార్థులకు సెలవులు కూడా. పండగకు ఊరెళ్లేముందే నగరంలో దుస్తులు, ఇతర వస్తువులు కొనుక్కొని వెళ్లవచ్చుననుకున్న జీహెచ్ఎంసీ రెగ్యులర్ ఉద్యోగులకు ఊహించని శరాఘాతం తగిలింది. ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు తీసుకునే వీరికి అక్టోబర్ 3వ తేదీ నాటి కూడా అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ విజయ దశమి ఆనందం వారి కుటుంబాల్లో కనిపించే పరిస్థితి లేదు. జీహెచ్ఎంసీ ఆదాయం ఏ మాత్రం తగ్గలేదు. ప్రజల నుంచి వసూలవుతున్న పన్నులు గతంలో కంటే ఎక్కువే ఉన్నాయి. అయితే, ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ఖర్చుతో ఏరోజుకారోజు అన్న చందంగా బల్దియా నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఒకటో తేదీన జీతాలందించేందుకు ఖజానాలో తగిన నిధులు లేకపోవడంతో విడుదల చేయలేదు. రెండో తారీఖు సెలవు. కనీసం మూడో తేదీనైనా అందుతాయనుకున్న రెగ్యులర్ ఉద్యోగులకు ఆ ఆశ తీరలేదు. జీహెచ్ఎంసీ ఏర్పాటయ్యాక ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురవలేదు. జీహెచ్ఎంసీలో జీతాల చెల్లింపులకు ప్రతినెలా దాదాపు రూ.110 కోట్లు కావాలి. సోమవారం వరకు ఖజానాలో దాదాపు రూ.60 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకటోతేదీ జీతాలు విడుదల కాలేదు. కనీసం గురువారమైనా అందుతాయేమోనని ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. రాత్రి 8 గంటల వరకు జీతాలు ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో పడలేదు. గొప్పకు పోయి ఇక్కట్లు ఒకప్పుడు మిగులు నిధులతో, బ్యాంక్ డిపాజిట్లతో కళకళలాడిన జీహెచ్ఎంసీ.. ఎస్సార్డీపీలో భాగంగా చేపట్టిన రూ.వేల కోట్ల పనులకు బాండ్ల ద్వారా అప్పులు తీసుకుంటోంది. దీంతో వాటి వడ్డీతో సహా అసలు చెల్లించాల్సి రావడం, ఇతరత్రా పనుల ఖర్చులు పెరిగిపోవడం.. ఔట్‌సోర్సింగ్‌పై వందల సంఖ్యలో నియామకాలు వంటి కారణాలతో ఖర్చులు పెరిగాయి. ఆదాయం కూడా పెరిగినా ఖర్చులు దానికంటే అధికంగా పెరిగాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీలో రూ.312 కోట్ల బ్యాంక్ డిపాజిట్లున్నాయి. ఆర్టిసీకి నష్టాలు రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ నుంచి రెండు విడతల్లో రూ.330 కోట్లు చెల్లించారు. రూ.495 కోట్లు బాండ్ల ద్వారా సేకరించారు. వాటికి నెలనెలా వడ్డీ, ఆర్నెళ్లకోమారు అసలు వాయిదాల చెల్లింపులు, ఔట్‌సోర్సింగ్‌పై తీసుకున్న దాదాపు 400 మంది ఇంజినీర్ల వేతనాలు.. స్వచ్ఛ ఆటోల కొనుగోళ్లకు నెలనెలా బ్యాంకు రుణాల చెల్లింపు.. ఇలాంటి కారణాలతో జీహెచ్ఎంసీపై ఆర్థిక భారం పెరిగింది. మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్లు అందడం లేదు. ఈ పరిస్థితుల్లో కొంతకాలంగా ఏనెలకానెల అన్నట్లుగా నెట్టుకొస్తున్నారు. వసూళ్లను మించిన ఖర్చులు వాస్తవానికి గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లు పెరిగాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌లో రూ.26 కోట్ల ఆస్తి పన్ను వసూలు కాగా, ఈసారి రూ.68 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.1402 కోట్లు వసూలవగా, ఈసారి ఆరు నెలల్లోనే రూ.876 కోట్లు వసూలయ్యాయి. అయినా ఖర్చులు పెరిగిపోవడం వల్లే ఒకటోతేదీన జీతాలందని పరిస్థితి ఎదురైంది. వివిధ పనుల బిల్లుల చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతోంది. జోన్లలో జరిగిన పనులకు ఆగస్టులో చెల్లించాల్సిన బిల్లులు దాదాపు రూ.55 కోట్లు సెప్టెంబర్ నెలాఖరులో చెల్లించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు రాకపోవడంతో దాదాపు రూ.500 కోట్ల బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. మరో రూ.300 కోట్ల బిల్లులు రెడీగా ఉన్నాయి. -
ఒమాన్‌లో ఏడాదిగా జీతాలు ఇవ్వని కంపెనీ
ఒమాన్‌లోని మస్కట్‌లో హాసన్ జుమా బాకర్ అనే భవన నిర్మాణ కంపెనీలో తెలంగాణకు చెందిన కార్మికులకు ఏడాదికాలంగా వేతనాలు ఇవ్వనందున ఎడారిలో అష్టకష్టాలు పడుతున్నారు. వీరు ఆర్థిక ఇబ్బందులతోనే మస్కట్ నుండి హైదరాబాద్‌కు బయలు దేరుతున్న విషయం తెలుసుకున్న 'ఓమాన్ తెలంగాణ ఫ్రెండ్స్' అనే సామాజిక సేవా సంస్థ కన్వీనర్ నరేంద్ర పన్నీరు వీరిని లేబర్ క్యాంపులో కలుసుకొని జేబు ఖర్చులకు ఒక్కొక్కరికి రూ. 500 నగదు సహాయం అందజేశారు. వీరిలో 11 మంది తెలంగాణ వారు కాగా, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక లకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు. వీరంతా ఎయిరిండియా విమానంలో హైదరాబాద్ విమానాశ్రయానికి గురువారం చేరుకున్నారు. ఈ సందర్బంగా నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ... వేతన బకాయిల కోసం న్యాయపోరాటానికి ఇండియన్ ఎంబసీ కృషి చేస్తుందని, కార్మికులు అధైర్య పడవద్దని అన్నారు. గల్ఫ్ దేశాల నుండి తిరిగి వచ్చిన కార్మికులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నరేంద్రతో పాటు సంస్థ సభ్యులు మంచికట్ల కుమార్, వడ్ల గంగాధర్, బొక్కెన దేవేందర్ లు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన గనిశెట్టి శ్రీనివాస్ ఈ సందర్బంగా మాట్లాడుతూ ఒక్కొక్క కార్మికునికి రూ.1 లక్షా 50 వేల నుండి రూ. 2 లక్షల 50 వేల వరకు జీతం బకాయిలు రావాల్సి ఉన్నాయని, తెలంగాణకు చెందిన 45 మంది కార్మికులకు కంపెనీ యాజమాన్యం రూ. ఒక కోటి వరకు బాకీ పడిందని అన్నారు. ఎడారిలో ఒక్కొక్క చెమటచుక్క ఒక్క రూపాయితో సమానమని, తమ కష్టార్జితాన్ని మన భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
పారిశుద్ధ్య కార్మికులకు @18 వేలు
మహా విశాఖ నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు పండగొచ్చింది. ఎండనక, వాననక నిత్యం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికుల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టి సారించారు. వారి ఆరోగ్య భద్రత కోసం హెల్త్ అలవెన్సు కింద నెలకు రూ.6 వేల చొప్పున వేతనంతో కలిపి ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జీవీఎంసీ పరిధిలో 5,130 మంది కార్మికులకు కనీస వేతనం రూ.18 వేలుగా మారడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: పారిశుద్ధ్య కార్మికులు.. నిరంతరం మురుగులో పనిచేస్తుంటారు. చెత్త కంపు కొడుతున్నా.. దాన్ని సేకరించడం.. డంపర్ బిన్లలో వేయడం... మినీ వ్యానుల్లో తరలించడం.. కాల్వలు శుభ్రం చేయడం.. ఇలా నిత్యం చెత్తతోనే సావాసం చేస్తుంటారు. కుళ్లిపోయిన వ్యర్థాల నుంచి విష వాయువులు వెలువడుతున్నా.. వాటిని తొలగించాల్సిందే. ఫలితంగా వారి ఆరోగ్యాలు అంపశయ్యపై ఉన్నాయి. అయినా పనికి రాకపోతే పూటగడవని పరిస్థితి. తమ ఆరోగ్యాల్ని పట్టించుకోండి మహా ప్రభో అంటూ వందల సార్లు గత ప్రభుత్వాలకు విన్నవించినా పట్టించుకున్న పాపానపోలేదు. కనీస వేతనం అందక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విధులకు హాజరైన పరిస్థితులెన్నో ఉన్నాయి. చాలీచాలని వేతనం జిల్లా, జీవీఎంసీ పరిధుల్లో పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా వారికి అలవెన్సు ప్రకటించాలని గత టీడీపీ ప్రభుత్వానికి మున్సిపల్ యూనియన్లు ఎన్నో దఫాలుగా విజ్ఞప్తులు చేశారు. వినతిపత్రాలు అందించారు. కానీ.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరించారు. దీంతో విసుగెత్తిన కార్మిక సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ధర్నాలు, సమ్మెలు చేసినా ఫలితం లేదు. భారమే.. అయినా... ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు అలవెన్స్ మంజూరు చేయడం వల్ల ప్రభుత్వానికి, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లపై నెల నెలా కోట్ల రూపాయిల భారం పడనుంది. అయినా.. కార్మికుల సంక్షేమమే ముఖ్యమని తలచి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలవెన్సుని అందించడం వల్ల జీవీఎంసీపై నెలకు రూ.3.09 కోట్ల అదనపు భారం పడనుంది. ఏడాదికి రూ.37.08 కోట్లు అదనంగా ఖర్చవనుంది. ప్రభుత్వ నిర్ణయంతో జీవీఎంసీ పరిధిలోని 5,130 మంది, నర్సీపట్నం మున్సిపాలిటీలోని 92 మంది, యలమంచిలి మున్సిపాలిటీలోని 90 మంది ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూరనుంది. మాటిచ్చారు..నిలబెట్టుకున్నారు.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామంటూ ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆ హామీని నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్న వారందరికీ హెల్త్ అలవెన్సు కింద రూ. 6వేలు వారి వేతనంతో పాటు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఈ అలవెన్సుతో పారిశుద్ధ్య కార్మికుని వేతనం రూ. 18 వేలకు చేరుకుంది. ఈ అలవెన్సుని ప్రతి నెలా 5న చెల్లించాలని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి ఈ అలవెన్సుని మంజూరయ్యేలా లెక్కించాలని సూచించింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూశాం... రోజూ నగరం శుభ్రం చేయాలని ఎంతో కష్టపడుతున్నాం. కానీ.. మమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వమే లేదు. రోజూ చెత్తలోనే జీవనం సాగిస్తుండటం వల్ల రోగాలు చుట్టుముడుతున్నాయి. అయినా ఏ ప్రభుత్వమూ దాని గురించి పట్టించుకోలేదు. సీఎం జగన్ మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ రోజు కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూశాం.– కింతాడ శ్రీనివాసరావు,పారిశుద్ధ్య కార్మికుడు -
పల్లెకు 30 రోజుల ప్లాన్ !
సాక్షి, హైదరాబాద్ : సెప్టెంబర్ 6 నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యాచరణపై మార్గనిర్దేశం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. వచ్చే నెల 3న మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గ్రామాల్లో పచ్చదనం, పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి, ఊరి సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై సీఎం వరుసగా రెండో రోజూ (శుక్రవారం) ప్రగతిభవన్‌లో 7గంటల పాటు సుదీర్ఘ కసరత్తు నిర్వహించారు. మంత్రులు, కలెక్టర్లు, డీపీవోలు, ఉన్నతాధికారులతో విస్తృతం గా చర్చించిన తర్వాత 30 రోజుల్లో గ్రామాల్లో నిర్వహించాల్సిన పనులను ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 36వేల మంది సఫాయి కర్మచారుల వేతనాన్ని రూ.8, 500కు పెంచాలని కూడా సీఎం నిర్ణయించారు. ఇకపై సఫాయి కర్మచారులు పూర్తి సమయం గ్రామ పంచాయతీ విధులకే కేటాయించాల్సి ఉంటుందన్నారు. ‘స్వాతంత్య్రమొచ్చి 72ఏళ్లయినా గ్రామాల్లో పరిస్థితి ఇంకా దుర్భరంగానే ఉంది. మన ఊరును మనమే బాగు చేసుకోవాలనే స్పృహ రావాలి. చేయగలిగే సత్తా ఉన్నా చేయకపోతే అది నేరమే అవుతుంది. ఏ ఊరి ప్రజలు ఆ ఊరి కథానాయకులు కావాలి. ఊరి పరిస్థితిని మార్చుకోవాలి’అని సీఎం అన్నారు. పంచాయతీరాజ్ శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, కేంద్ర ఆర్థికసంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు జతచేసి, నెలకు రూ.339 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు గ్రామానికో మండలస్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. మండల, జిల్లా పరిషత్‌లను క్రియాశీలకంగా మార్చేందుకు అవసరమైన సిఫారసులను కలెక్టర్ల నుంచి స్వీకరించి, నిబంధనలు రూపొందించాలని కూడా సీఎం సూచించారు. పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలు వెల్లివిరియాలని, ప్రణాళికా పద్థతిలో గ్రామాల అభివృద్ధి జరగాలని, నియంత్రిత పద్ధతిలో నిధులు వినియోగం జరగాలని, మొత్తంగా విస్తృత ప్రజా భాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పని చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మొదట 60రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ.. అధికారుల నుంచి వచ్చిన సూచన మేరకు మొదటి దశలో 30రోజుల కార్యాచరణ.. ఆ తర్వాత మరో దశ కొనసాగించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 4న అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో అధికారులకు కలెక్టర్లు తగు సూచనలు చేస్తారు. పల్లె కార్యాచరణ ప్రణాళిక ఇదే ! మొదటి రోజు గ్రామసభ నిర్వహణ. 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ఎందుకు నిర్వహిస్తున్నారనే విషయాన్ని ప్రజలకు విడమరిచి చెప్పడం. రెండోరోజు కో–ఆప్షన్ సభ్యుల ఎంపిక, గ్రామ పంచాయతీ స్టాండింగ్ కమిటీల ఎంపిక. సర్పంచ్ కుటుంబ సభ్యులు ఈ కమిటీల సభ్యులుగా ఉండకూడదు. గ్రామానికున్న అవసరాలు, వనరులను బేరీజు వేసుకుని ప్రణాళికల రూపకల్పన. ఆ తర్వాత వార్షిక ప్రణాళికను, అలాగే పంచవర్ష ప్రణాళిక రూపకల్పన. దానికి గ్రామసభ ఆమోదం. ఆ మేరకే నిధుల ఖర్చు. పారిశుద్ధ్య నిర్వహణ కూలిపోయిన ఇళ్ళు మరియు భవనాల శిథిలాల తొలగింపు. పనికిరాని, ఉపయోగించని బావులు మరియు లోతట్టు ప్రాంతాలను పూడ్చడం. పాఠశాలలు, అంగన్వాడీలవంటి అన్ని ప్రభుత్వ సంస్థలను శుభ్రపరచాలి. సర్కారు తుమ్మ, జిల్లేడు లాంటి పిచ్చిమొక్కలను తొలగింపు. అన్ని రహదారులు, డ్రైనేజీలను శుభ్రం చేయాలి. మోరీల రిపేరు. మురికి కాలువల్లోని ఇరుక్కుపోయిన చెత్తచెదారం తొలగింపు. గ్రామస్తులందరూ నెలలో రెండుసార్లు శ్రమదానంలో పాల్గొనేలా ప్రోత్సహించడం. సంతలు, మార్కెట్ ప్రదేశాలను శుభ్రపరచాలి. గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లను సమకూర్చుకోవాలి. మొక్కలకు నీరు పోయడానికి, చెత్త సేకరణకు ట్రాక్టర్ తప్పనిసరి. గ్రామాల్లో డంప్‌యార్డ్ ఏర్పాటుకు భూమి గుర్తింపు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేనట్లయితే పంచాయతీ నిధులతో స్థలం కొనుగోలు. స్మశాన వాటిక నిర్మాణానికి అనుగుణమైన స్థలం గుర్తింపు. 100% మరుగుదొడ్లు నిర్మించడానికి ప్రణాళిక రూపొందించాలి. హరిత హారం గ్రామంలో నర్సరీల ఏర్పాటు బాధ్యత పంచాయతీలదే. ఇందుకోసం శాశ్వత ప్రాతిపదికన అనువైన స్థలం ఎంపిక. నర్సరీలను పెంచడానికి ఫారెస్ట్ రేంజ్ అధికారి గ్రామ పంచాయతీలకు సాంకేతిక సహకారం అందించాలి. అటవీశాఖ 12,751 గ్రామ పంచాయతీ హరితహారం నర్సరీలతోపాటు.. కొన్ని ప్రత్యేకమైన జాతులతో (మొక్కలతో) తమ సొంత నర్సరీలను పెంచుకోవచ్చు. గ్రామ పంచాయతీ రైతులను, వారికి అవసరమైన మొక్కలను వ్యవసాయ విస్తరణాధికారుల సహకారంతో గుర్తించాలి. ఇంటిదగ్గర నాటడానికి అవసరమైన పళ్లు, పూల మొక్కల ఇండెంట్‌ను సేకరించాలి. గ్రామపంచాయతీ లోపల నాటడానికి అందుబాటులో ఉన్న భూములను, పంచాయతీ సరిహద్దుల్లో ఉన్న భూములు మరియు రహదారులను కూడా గ్రామపంచాయతీ గుర్తించాలి. ఈ వివరాల ఆధారంగా, గ్రామపంచాయతీ గ్రీన్ ప్లాన్‌ను సిద్ధం చేసి గ్రామసభ ఆమోదించాలి. గ్రామ పంచాయతీలు మొక్కలు పెట్టడంతో పాటు, రక్షణ బాధ్యత తీసుకోవాలి. పవర్ వీక్ వారం రోజుల పాటు పవర్ వీక్ నిర్వహించాలి. వేలాడుతున్న, వదులుగా ఉండే కరెంటు వైర్లు మరియు విద్యుత్ స్తంభాలను సరిచేయాలి. వీధిదీపాల సమర్థ నిర్వహణకు థర్డ్ వైర్, సెపరేట్ మీటర్, స్విచ్‌లు బిగించాలి. పగలు వీధి లైట్లు వెలగకుండా చూడడం. నిధుల వినియోగం కేంద్ర ఆర్థికసంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడ జమచేసి, ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల. ప్రతీ నెల రూ.339 కోట్ల చొప్పున గ్రామపంచాయతీలకు నిధులు. వీటితోపాటు గ్రామ పంచాయతీ స్వీయ ఆదాయం, ఉపాధి హామీ నిధులు కూడా గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉంటాయి. గ్రామపంచాయతీ బడ్జెట్లో 10% నిధులను పచ్చదనం కార్యక్రమాలకు కేటాయింపు. అప్పులు, జీతాలు చెల్లించడంతోపాటు విద్యుత్ బిల్లులు చెల్లింపును కూడా తప్పనిసరి చేయాల్సిన చెల్లింపుల జాబితాలో చేర్చడం. వార్షిక ప్రణాళిక, పంచవర్ష ప్రణాళికకు అనుగుణంగానే నిధులు ఖర్చు చేయాలి. -
పేరుకు గెస్ట్.. బతుకు వేస్ట్!
రాష్ట్రంలోని 132 డిగ్రీ కళాశాలల్లో 30 శాతానికి పైగా కాలేజీలు గెస్ట్ ఫ్యాకల్టీ పైనే ఆధారపడి నడుస్తున్నాయి. నగరంలోని బేగంపేట డిగ్రీ కళాశాలలో 70 మంది లెక్చరర్స్ పనిచేస్తుండగా అందులో 32 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. అందులోనూ 10 మంది కాంట్రాక్టు లెక్చరర్స్ ఉన్నారు. మిగితా రెగ్యులర్ లెక్చరర్స్‌కు అడ్మినిస్ట్రేషన్ పనులు, యూజీసీ, ఎగ్జామ్స్, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్లుగా ఉంటే గెస్ట్ ఫ్యాకల్టీ బోధన చేస్తారు. కొంచెం అటూఇటూగా అన్నికళాశాలల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ముషీరాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల్లో గెస్ట్ లెక్చరర్స్‌తో తరగతులను నిర్వహించిన ప్రభుత్వం.. వారికి వేతనాలు ఇవ్వడం మరిచిపోయింది. 2018–19 విద్యా సంవత్సరం ముగిసి 2019–20 విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా గతేడాది పనిచేసిన 10 నెలల వేతన బకాయిలు చెల్లించలేదు. దీంతో రాష్ట్రం లోని 863 మంది గెస్ట్ లెక్చరర్స్ కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులను నియమిస్తే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్స్ పోస్టులను సృష్టించింది. వీరికి పని గంటలను పరిగణనలోకి తీసుకుని వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో లెక్చరర్ నెలకు కనీసం 72 గంటలు బోధించేలా గంటకు రూ.300 వేతనాన్నినిర్ణయించింది. దాని ప్రకారం ఒకొక్కరికి నెలకు రూ.21,600 చెల్లించాలి. వీరికి సెలవు దినాల్లో ఎలాంటి వేతనం ఉండదు. రాష్ట్రంలోని 132 డిగ్రీ కళాశాలల్లో 863 మంది గెస్ట్ లెక్చరర్స్ పనిచేస్తుండగా హైదరాబాద్ జిల్లాల్లో 11 డిగ్రీ కళాశాలల్లో 123 మంది సేవలందిస్తున్నారు. విధులకు హాజరైతేనే రెన్యూవల్ జూన్ 13న కళాశాలలు ప్రారంభమయ్యాయి. గత 50 రోజులుగా విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నా గెస్ట్ లెక్చరర్స్‌కు జీతం ఇవ్వకపోవడంతో పాటు ఈ విద్యా సంవత్సరానికి రెన్యూవల్ చేయాలనే డిమాండ్‌తో విధులకు రావడంలేదు. దీంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరిన పేద, మధ్య తరగతి విద్యార్థులకు తరగతులు జరగక నష్టపోతున్నారు. అయితే, విధులకు వస్తేనే పాత బకాయిలు చెల్లిస్తామని, రెన్యూవల్ కూడా చేస్తా మని ప్రిన్సిపల్స్ బెదిరిస్తున్నట్లు సమాచారం. కా నీ, ఉన్నత విద్యాశాఖ కమిషన్ మాత్రం గెస్ట్ లెక్చరర్స్‌కు మళ్లీ ఇంటర్వ్యూలు, డెమో ఇచ్చి చేరాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు ఇచ్చినా.. స్కూళ్లలో విద్యా వలంటీర్లు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో గత ఏడాది పనిచేసిన గెస్ట్ లెక్చరర్స్‌నే ఈ ఏడాది కొనసాగించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. కానీ కళాశాల విద్యాశాఖ మాత్రం ఇప్పటికీ గెస్ట్ లెక్చరర్స్‌ను రెన్యూవల్ చేయలేదు. పైగా కొత్తవారిని తీసుకోవడానికి బుధవారం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దీంతో 10 నెలల వేతనాల కోసం ఆందోళన చేస్తున్న గెస్ట్ లెక్చరర్స్‌కు వేతనాలు రాకపోగా ఉన్న ఉద్యోగం కూడా పోయే పరిస్థితి వచ్చింది. నిధులు విడుదలైనా.. అనేక విజ్ఞప్తుల తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీకి రావాల్సిన 10 నెలల వేతనం సీఎం కేసీఆర్ సంతకం చేసి జూన్ 18న ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించినట్లు తెలిసింది. దానికి జీఓ కూడా జారీ చేశారు. కమిషనర్ మాత్రం ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో మా బతుకులు దినదిన గండంగా మారింది. – కిషోర్ కుమార్, టీ–డిగ్రీ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు -
పస్తులుండి.. పిల్లలకు బువ్వ!
మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు తాము పస్తులుండి పాఠశాలల్లో విద్యార్థులకు అన్నం పెడుతున్నారు. బిల్లులు సకాలంలో ఇచ్చినా ఇవ్వకపోయినా అప్పు చేసి మరీ భోజనం వడ్డిస్తున్నారు. ప్రభుత్వం 3 నెలలుగా భోజనానికి సంబంధించిన బిల్లులు నిలిపేసింది. భోజనం వడ్డించే ఆయాలు, హెల్పర్లకు 6 నెలలుగా గౌరవ వేతనాన్ని ఇవ్వలేదు. జిల్లాలో ఈ బిల్లులు, వేతనాలకు సంబంధించి సుమారు రూ.14.75 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. నెల్లూరు (టౌన్): మధ్యాహ్న భోజన కార్మికుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతోంది. వీరికి చెల్లించాల్సిన బిల్లులు, గౌరవ వేతనాలను నిలిపి వేసింది. ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులన్నింటిని పసుపు– కుంకుమ, రైతు రుణమాఫీకి మళ్లించినట్లు చెబుతున్నారు. పైగా వేసవి సెలవుల్లో జిల్లాలోని 26 కరువు మండలాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. పెండింగ్ బిల్లులు ఇవ్వకుంటే భోజనం వడ్డించడం మా వల్ల కాదని నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో మొత్తం 3,404 ప్రభుత్వ పాఠశాలల్లో 2,16,320 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. ఇస్కాన్ సంస్థ ద్వారా నెల్లూరు అర్బన్ పరిధిలోని 111 పాఠశాలలు, అక్షయపాత్ర ద్వారా గూడూరు, మనుబోలు, వెంకటాచలం, ముత్తుకూరు మండలాల్లోని 291 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,002 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 3,002 ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందజేస్తున్నారు. జిల్లాలో మధ్యాహ్న భోజనానికిసంబంధించి రూ.2.85 కోట్లు ఖర్చు అవుతుంది. భోజనం వడ్డిస్తున్న ఆయాలు, హెల్పర్లకు ఒక్కొక్కొరికి నెలకు రూ.1000 గౌరవ వేతనం అందజేస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు గౌరవ వేతనాన్ని రూ.3 వేలకు పెంచి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇస్తామని ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 3 వేల మంది ఆయాలు, మరో 3 వేల మంది హెల్పర్లు పనిచేస్తున్నారు. ఇందుకు సంబంధించి రూ.1000 లెక్కన గౌరవ వేతనం రూ.62.19 లక్షలు రావాల్సి ఉంటుంది. పెంచిన గౌరవ వేతనం నెలకు రూ. 1.86 కోట్లు ఇవ్వాల్సి ఉంది. రూ. 14.63 కోట్లకు పైగా పెండింగ్ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు 3 నెలలుగా నిలిచిపోయాయి. నెలకు రూ.2.85 లక్షల లెక్కన మూడు నెలలకు కలిపి రూ.8.55 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయాలు, హెల్పర్లు గౌరవ వేతనం గతేడాది అక్టోబర్ నుంచి ఇవ్వడం లేదని చెబుతున్నారు. గౌరవ వేతనం రూ.1000 లెక్కన నెలకు రూ.62.19 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పెంచిన రూ.3 వేల ప్రకారం నెలకు రూ. 1.86 కోట్లు రావాల్సి ఉంది. గౌరవ వేతనం రూ.1000 లెక్కన అక్టోబర్ నుంచి జనవరి వరకు 4 నెలలకు కలిపి రూ.2.48 కోట్లు, రూ.3 వేల లెక్కన ఫిబ్రవరి, మార్చి రెండు నెలలకు కలిపి రూ.3.72 కోట్లు కలిపి మొత్తం రూ. 6.20 కోట్లు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి బిల్లులు రూ. 8.55 కోట్లు, గౌరవ వేతనానికి సంబంధించి రూ.6.20 కోట్లు కలిపి 14.75 కోట్లు రావాల్సి ఉంది. గతేడాది అక్టోబర్ వరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ నుంచే బిల్లులు ఇస్తున్నారు. ఆ తర్వాత ఆ బాధ్యతను జిల్లాలకు అప్పగించారు. అయితే ఎక్కువ మొత్తంలో బిల్లులు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి రావాల్సి ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం 4 నెలల నుంచి బిల్లులు రావాలి చెబుతున్నారు. 26 మండలాల్లో భోజన పథకం అమలు బిల్లులు ఇవ్వకపోయినా మూడు నెలలుగా అప్పులు చేసి మరీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించామని ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. వేసవి సెలవుల్లో జిల్లాలోని 26 కరువు మండలాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కరువు మండలాల్లో మధ్యాహ్న భోజనం పెట్టలేమని ఏజెన్సీ నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. కనీసం అక్కడ పనిచేసే ఆయాలు, హెల్పర్లకు కూడా గత 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే బతికేదెట్టా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలకో నాలుగు నెలలకో ఒకసారి పూర్తిస్థాయిలో ఇవ్వకుండా సగం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పెండింగ్ బిల్లులతో పాటు గౌరవ వేతనాన్ని పూర్తిస్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రమ, కష్టాన్ని దోచుకుంటున్నారు మధ్యాహ్న భోజన పథకానికి సకాలంలో బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఏజెన్సీలు అప్పులు చేసి ఎక్కడ నుంచి తెచ్చి పెడతారు. ఏజెన్సీ నిర్వాహకులు, ఆయా, హెల్పర్లు శ్రమ, కష్టాన్ని దోచుకుంటున్నారు. బిల్లులు పెండింగ్‌లో లేకుండా సకాలంలో చెల్లించాలి. ప్రస్తుతం సగం బిల్లులైనా విడుదల చేయాలి.– రెహనాబేగం, మధ్యాహ్న భోజన కార్మికుల అసోసియేషన్జిల్లా గౌరవాధ్యక్షురాలు -
ఆశలపై నీళ్లు
పాలకొల్లు అర్బన్: తెలుగుదేశం ప్రభుత్వం ఆశావర్కల ఆశలపై నీళ్లు పోసింది. గౌరవ వేతనం ఇవ్వాలని ఆశావర్కర్లు ఎన్నో ఏళ్ల నుంచి చేసిన పోరాటానికి ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవ వేతనం రూ.5,600 నిర్ణయిస్తూ గతేడాది అక్టోబర్‌లో జీఓ 113 జారీ చేశారు. అదే ఏడాది ఆగస్టు నుంచి అమలులోకి వచ్చేలా ఆదేశాలు ఇచ్చారు. జీఓ ఇచ్చిన వెంటనే ఆశ వర్కర్లందరినీ విజయవాడకు పిలిపించి వారితో గ్రూప్ ఫొటోలు దిగి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞులై ఉండాలని వారితో ప్రమాణాలు కూడా చేయించుకున్నాయి. అయితే ఇప్పటివరకూ జీఓ అమలుకు నోచుకోలేదు. వీరికి రూ.3 వేలు వేతనం, మరో రూ.3 వేలు పనికి తగ్గ పారితోషికాన్ని గతేడాది డిసెంబర్ వరకు మాత్రమే చెల్లించారు. ప్రస్తుతం జనవరి, ఫిబ్రవరి నెలలకు వేతన బకాయిలు ఉన్నాయి. జీఓ వెంటనే అమలు చేయడంతో పాటు పెండింగ్ వేతనాలు చెల్లించాలని జిల్లావ్యాప్తంగా రెండు రోజుల క్రితం పీహెచ్‌సీల వద్ద ఆశా వర్కర్లు ఆందోళన చేసినా స్పందన లేదు. 2006లో విధుల్లో చేరిన ఆశా వర్కర్లు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక ఆశావర్కర్‌ని 2006లో ప్రభుత్వం నియమించింది. వీరికి గౌరవ వేతనం నిర్ణయించలేదు. పనికి తగ్గ వేతనం కింద రూ.1,000 చెల్లించేవారు. ఆశావర్కర్లు పోరాటాల ఫలితంగా రూ.3 వేలు గౌరవ వేతనం, పనికి తగ్గ పారితోషికం కింద రూ.5,600 చెల్లించేలా గతేడాది ప్రభుత్వం జీఓ ఇచ్చింది. అయితే ఇది అమలుకు నోచుకోలేదు. జిల్లాలో విలీన మండలాలతో కలుపుకుని 3,490 మంది ఆశావర్కర్లు పనిచేస్తున్నారు. ఆశావర్కర్ల విధులు గ్రామాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎం, అదనపు ఏఎన్ఎంలకు సహాయకులుగా ఉంటూ ఆశా వర్కర్ తన పరిధిలోని వెయ్యి మంది ఆరోగ్య పరిరక్షణ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి. గర్భిణుల నమోదు, వారికి వ్యాధి నిరోధక టీకాలు వేయించడం, ప్రసవ సమయంలో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించడం, ప్రమాదకర పరిస్థితిలో ఉన్న గర్భిణిని ఏరియా ఆసుపత్రికి తరలించడం, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు ఎక్కువగా జరిగేలా ప్రోత్సహించడం, చంటి పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించడం, జాతీయ ఆరోగ్య మిషన్‌పై అవగాహన కల్పించడం, వ్యాధులపై, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం తదితర పనులను చేయాల్సి ఉంటుంది. ఆశా వర్కర్లలో ఏఎన్ఎం శిక్షణ పొందిన వారు సైతం ప్రభుత్వం ఏఎన్ఎం, అదనపు ఏఎన్ఎం పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పిస్తారనే ఆశతో చాలీచాలని వేతనంతో చాలా మంది పనిచేస్తున్నారు. వీరి డిమాండ్లు దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే తమకు ఉద్యోగ భద్రత లభించేదని ఆశా వర్కర్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం గౌరవ వేతనం, పనికి తగ్గ వేతనం ఏ నెలకు ఆ నెల ఆశ వర్కర్ల బ్యాంక్ ఖాతాల్లో జమచేయాలి. అర్హతలున్న ఆశ వర్కర్లకు ఏఎన్ఎం, అదనపు ఏఎన్ఎం పోస్టుల భర్తీలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించి ప్రాధాన్యత కల్పించాలి. రూ.5 లక్షలు బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలి. గతేడాది ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉన్న టీఏ, డీఏలు చెల్లించాలి. 2015 నుంచి 104 వాహనంపై పనిచేసినందుకు పారితోషికం బకాయిలు, యవ్యాధి కేసులకు వైద్యం చేసినందుకు పారితోషికం ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. -
ఆకలి కేకలు
విజయనగరం ఫోర్ట్: కేంద్రాస్పత్రిని శుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులు జీతాలందక అవస్థలు పడతున్నారు. ఇచ్చే జీతం తక్కువే అయినా అది కూడా సకాలంలో అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడంతో కుటుంబాలను ఎలా నెట్టుకురావాలని ప్రశ్నిస్తున్నారు. జీతాలు మంజూరు చేయాలని గతంలో అధికారులకు పలుమార్లు కోరినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. కేంద్రాస్పత్రిలో 52 మంది పారిశుద్ధ్య కార్మికులకుగా పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది వార్డుల్లో పనిచేస్తుండగా... మరికొంతమంది గార్డెన్ పనులు చేస్తుంటారు. ఆస్పత్రిలో గైనిక్, కంటి, జనరల్ సర్జరీ, ఎముకలు, ఎన్సీడీ, ఈఎన్టీ, దంత, పిల్లలు, మానసిక, మెడికల్, ఏఆర్టీ, ఫిజియోథెరిపీ ఓపీ విభాగాలున్నాయి. అదేవిధంగా మహిళల మెడికల్, శస్త్రచికిత్సల వార్డులు, పురుషల మెడికల్, శస్త్రచికిత్సల వార్డులు , బర్నింగ్ , ఎన్ఆర్సీ, పిల్లల వార్డు, ఆరోగ్యశ్రీ, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, ఐసీయూ, సిటీస్కాన్, ఎక్సరే, సూపరింటెండెంట్ కార్యాయలం, డీసీహెచ్ఎస్ కార్యాలయం, ఆపరేషన్ థియేటర్, ఈసిజీ గదులు ఉన్నాయి. వీటిన్నంటినీ ప్రతీరోజూ పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేయలి. కొన్నింటిని ఒకటి, రెండు సార్లు శుభ్ర పరచాలి. మరికొన్నింటిని నాలుగు, ఐదుసార్లు శుభ్రపరచాల్సి ఉంటుంది. నెలల తరబడి.. పారిశుద్ధ్య కార్మికులకు 2018 ఆక్టోబర్ నెల నుంచి జీతాలు రావడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కార్మికులకు నెలకు రూ.6200 జీతం ఇస్తున్నారు. ఇచ్చే జీతం తక్కువే అయినప్పటికి సకాలంలో రాకపోవడం కుటుంబాలను నెట్టుకురాలేకపోతున్నారు. అధికారులు కూడా వీరికి జీతాలు ఇప్పించడంలో చొరవ చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీతాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ సీతారామారాజును పలుమార్లు కోరామని.. అయినా ఫలితం లేకపోయిందని సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు వేతనాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాస్తవమే.. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు మంజూరుకాని మాట వాస్తవమే. నాలుగైదు రోజుల్లో వేతనాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటాం.– కె. సీతారామరాజు,సూపరింటెండెంట్, కేంద్రాస్పత్రి -
ఇంత అణిచివేతనా!
పశ్చిమగోదావరి, చింతలపూడి: ప్రభుత్వం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను నిలువునా దగా చేస్తోంది. జీఓ 12ను జారీ చేయడం ద్వారా వారి హక్కులను హరించాలని చూస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కరువైంది. ఒకపక్క పనిభారం, మరో పక్క చాలీచాలని వేతనాలతో ఉద్యోగులుఆందోళన చెందుతున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. సంవత్సరాల తరబడి ఉద్యోగ భద్రత కల్పించకుండా తాత్సారం చేస్తోంది. ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేసిన ప్రతి సారీ వారి కళ్లనీళ్లు తుడవడానికి అన్నట్లు ఒక జీఓ విడుదల చేసి ఉద్యోగులను అయోమయానికి గురిచేస్తున్నట్టు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో పతనం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబుపై భ్రమలు తొలగిపోయాయి 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అటు ఉద్యోగులకు, ఇటు నిరుద్యోగులకు అనేక హామీలను ఇచ్చి ఆశలపల్లకిలో ఊరేగేలా చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు దాటిపోతున్నా.. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. దీంతో ఉద్యోగులు ప్రభుత్వంపై పెట్టుకున్న భ్రమలు తొలగి పోయాయి. రాష్ట వ్యాప్తంగా 3 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి 60 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 2.40 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిపి సుమారు 3 లక్షల మంది పని చేస్తున్నారు. ఇక జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు 23 వేల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే సుమారు 3వేల మందికి పైగా ఉన్నారు. వీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ రాత పరీక్ష ద్వారా 2003లో ఎంపికయ్యారు. వీరంతా తమ ఉద్యోగాల రెగ్యులైజేషన్ కోసం 15ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఆర్సీ 2015 మినిమం టైంస్కేలును ఏప్రిల్ 1 నుంచి వర్తింపచేస్తూ విడుదల చేసిన జీఓ నంబర్ 12 సవరించాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 9వ పీఆర్సీ ప్రకారం కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్‌ను వర్తింపచేస్తూ గత ప్రభుత్వం జీఓ నంబర్ 3ను జారీ చేసింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం జీఓ 12 ద్వారా ఆర్థిక శాఖ ఆమోదంతో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే ఈ సౌకర్యం వర్తింపజేయడం దుర్మార్గమైన చర్య అని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఈ జీఓ వల్ల ఉద్యోగులకు ఉన్న హక్కును హరించడంతోపాటు 10,12 వేల మందికి మాత్రమే టైమ్ స్కేలు వర్తింప చేస్తామనడం రాష్ట్రంలోని 3 లక్షల మంది ఉద్యోగులను వంచించడమే అవుతుందని అంటున్నారు. 2005 నుంచి 2015 వరకు అమలవుతున్న టైంస్కేల్‌ను తెలుగుదేశం ప్రభుత్వమే రద్దు చేసిందని ఉద్యోగులు బాహాటంగా విమర్శిస్తున్నారు. -
పాపం.. పోలీసు!
అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీపీఓ నుంచి లావాదేవీలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో చిన్నస్థాయి పోలీసు ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. వివరాల్లోకి వెళితే... ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు... పోలీసుల ఉద్యోగుల విధులకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏ సమయంలో ఎక్కడికి బందోబస్తు పోవాలో కూడా తెలియని పరిస్థితి. ఒక్కోసారి 10 నుంచి 15 రోజులపాటు బందోబస్తు వెళ్లే ఏఆర్ పోలీసులు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి కూడా వేతనాలు రాకపోవడంతో ఆ కుటుంబాలు ఇబ్బందులు వర్ణనాతీతం. 3700 మందికి ఇబ్బందులు.. జిల్లా వ్యాప్తంగా కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సీఐలకు జనవరి నెల వేతనాలు రాలేదు. దాదాపు 3700 మంది ఉద్యోగులు జీతాలు, టీఏలు, డీఏలు, అడిషనల్ సరండర్‌పే బిల్లు్లలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక కారణాలు సాకుగా చూపి జిల్లా పోలీసు అధికారులు తప్పించుకుంటున్నారు. అసలు కారణాలు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకురాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్ఐ, సీఐ స్థాయి ఉద్యోగులు ఎలాగోలా నెట్టుకొస్తున్నా చిన్న స్థాయి ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. ఇంటి అద్దెలు, ఖర్చులు చెల్లించలేక అవస్థలు పడుతున్నామని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీలోగా వచ్చే జీతాలు ఈ సారి ఆగిపోవడంతో దిక్కుతోచడం లేదు. దీంతో పాటు పోలీసు ఉద్యోగులకు 15 రోజులకు సంబంధించి సరండర్‌పే వేతనాలు జనవరిలోనే మంజూరు కావాల్సి ఉంది. అయితే ఇంత వరకూ చెల్లించలేదు. దీంతో పాటు ఇతర ప్రాంతాలకు చేతి నుంచి డబ్బు పెట్టుకొని బందోబస్తు ముగించుకు వచ్చిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసు కార్యాలయంలో కొంతమంది సిబ్బంది సమస్యల విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు నిధులు దారి మళ్లించారా.? ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్తకొత్తగా హామీలు గుప్పించారు. ఈక్రమంలో పింఛన్ల పెంపు, డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు ఇస్తానని ప్రకటించడంతోపాటు కొంత సొమ్ము కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో ఖజానా విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. ఉద్యోగుల జీతభత్యాలు, ఇతరత్రా బిల్లులన్నీ నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఖజానాలో రూ.వందల కోట్లు బిల్లులు ఆగిపోయినట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో ప్రజలు, డ్వాక్రా మహిళలకు ఎరవేసేందుకు ప్రభుత్వం ఉద్యోగుల డబ్బును దారి మళ్లించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే పోలీసులతో సహా పలు శాఖల ఉద్యోగుల జీతభత్యాలు, బిల్లులు మంజూరుకావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలో వేతనాలుఖాతాల్లో జమ సిబ్బందికి వేతనాలు రాని విషయం వాస్తవమే. ఇందుకు సంబంధించిన సమస్య పరిష్కారమైంది. త్వరలో సిబ్బంది ఖాతాల్లో వేతనాలు జమవుతాయి.– జీవీజీ అశోక్‌కుమార్,జిల్లా ఎస్పీ -
104 కష్టాలు
సాక్షి కడప/కడప రూరల్ : చంద్రన్న 104 సంచార చికిత్సకు సంబంధించిన ఉద్యోగులకు కష్టమొచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాం నుంచి పనిచేస్తున్నా వారిని ఇంతవరకు ప్రభుత్వం గుర్తించ లేదు. 104 వాహనాలను అనేక రకాల సమస్యలు వెంటాడుతున్నా.. ప్రజలకు మాత్రం ఇబ్బందులు రాకుండా చూసుకున్న సిబ్బందికి ఇబ్బంది వచ్చింది. కడుపు కాలిన వారు సమ్మెబాట పట్టడంతో వైద్య విధానం గాడితప్పింది. సమ్మెను నిర్వీ ర్యం చేసేందుకు ఏకంగా పోలీసుల సహకారంతో.. అద్దె డ్రైవర్లను నియమించి వాహనాలను నడపేందుకు యత్నించడంపై పలువురు సంచార వైద్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 22 సంచార చికిత్స వాహనాలు ఉండగా.. అందులో పనిచేస్తున్న దాదాపు 134 మంది ఉద్యోగులకు ‘ఉద్యోగ భద్రత’ కొరవడింది. దీంతో వారు ఆందోళన బాట పట్టారు. వెరసి గ్రామీణ వైద్యానికి గ్రహణం పట్టుకుంది. 2008 నుంచి పనిచేస్తున్నా..ఆదుకోని ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న సంకల్పంతో 2008 ఆగస్టులో దివంగత సీఎం వైఎస్సార్ 104 పేరుతో సంచార వాహనాలను ప్రారంభించారు. నెలలో ఒక రోజు పల్లెలకు వెళుతూ.. వైద్య సేవలను అందిస్తూ ప్రజా మన్ననలు అందుకున్నారు. అయితే వైఎస్ మరణానంతర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో 104 సిబ్బంది వేదన వర్ణణాతీతంగా మారింది. జిల్లాలో 22 సంచార వాహనాలు ఉన్నాయి. ఒక వాహనానికి ఒకరి చొప్పున వైద్యుడు, నర్స్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్ మొత్తం ఐదుగురు సిబ్బంది ఉంటారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సూచనల (రోడ్ మ్యాప్) ప్రకారం ఈ వాహనాలు నిర్దేశించిన గ్రామాలకు వెళతాయి. ఆ మేరకు వైద్యం కోసం ఒక వాహనం వద్దకు ఒక రోజుకు 100–150 మంది రోగులు (ఔట్ పేషెంట్స్) వస్తారు. ఇక్కడికి వచ్చే గ్రామీణులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్సీ)లో ఎలాంటి వైద్య సేవలు లభిస్తాయో..దాదాపు అన్ని వైద్య సదుపాయాలు ఈ సంచార వాహనం ద్వారా లభించాలి. దీంతో గ్రామీణులు పట్టణాలకు రాకుండానే తమ ఇంటి ముంగిటనే వైద్యం పొందుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టాక 104 నిర్వహణ బాధ్యతలను 2016లో పెరమిల్ స్వాశ్య మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (పీఎస్‌ఎంఆర్‌ఐ) కు అప్పగించడంతో పాటు చంద్రన్న 104 సంచార చికిత్సగా నామకరణం చేశారు. సమ్మెలోకి సంచార వైద్య సిబ్బంది జిల్లాలో పనిచేస్తున్న సంచార వైద్య సిబ్బంది మంగళవారం నుంచి వాహనాలు నిలిపివేసి ఆందోళనబాట పట్టారు. మైదుకూరులో చంద్రన్న సంచార 104 వైద్య సేవ కో ఆర్డినేటర్ రామచంద్రయ్యను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. డిమాండ్లు నెరవేర్చకపోవడంతో సమ్మెలోకి వెళ్లామని.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పోలీసుల ద్వారా.. అద్దె డ్రైవర్లతో... సంచార వైద్య సేవ సిబ్బంది సమ్మెకు దిగడంతో ఈ సమ్మెను ఎలాగైనా నిర్వీర్యం చేయాలన్న ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ఇందులో భాగంగా పోలీసుల ద్వారా 104 సంచార వైద్య వాహనాలకు అద్దె డ్రైవర్లను నియమించి కొన్నిచోట్లకు పంపినట్లు తెలియవచ్చింది. ఈ వ్యవహారంపై సమ్మె చేస్తున్న సిబ్బందితోపాటు నాయకులు మండిపడుతున్నారు. చంద్రన్న సంచార 104 సిబ్బంది డిమాండ్స్ ♦ చంద్రన్న సంచార 104 వాహనాలను ప్రభుత్వమే నడపాలి. ♦ 2016 మే 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా జీఓ 151 ప్రకారం వేతనాలను చెల్లించాలి. ♦ ప్రస్తుతం పెరిగిన నిత్యావసరాలకు అనుగుణంగా డైలీ ఫుడ్ అలవెన్స్‌ను రూ. 150కు పెంచాలి. ♦ ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులు సౌకర్యాలను కల్పించాలి ♦ 104లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను రెగ్యులర్ చేయాలి. యాక్ట్ 2–94 ను తొలగించాలి. ♦ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ♦ హెచ్ఎంవీ నిబంధనల ప్రకారం ని యామకాలు చేపట్టిన డ్రైవర్లకు ఆ నిబం« దనల ప్రకారమే వేతనాలు చెల్లించాలి. ♦ 11వ పీఆర్సీని ప్రారంభ తేదీ నుంచి వర్తింప చేయాలి. ♦ వాహనాలలో మెరుగైన సేవల కోసం డేటాఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాలి. ♦ ఔషధి, వీహెచ్‌ఎస్‌డీ డేటా చేస్తున్న ఫార్మసిస్ట్, నర్స్‌లకు పీహెచ్సీలలో మాదిరిగా అదనపు పారితోషికం చెల్లించాలి. ♦ వాహనాలకు ఆర్సీ, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, ఫిట్నెస్ కల్పించాలి. మరమ్మతులను పూర్తి స్థాయిలో చేయించాలి. ♦ ప్రజలకు మరింతగా మెరుగైన సేవలను అందించడానికి చర్యలు చేపట్టాలి. -
‘గిరిజన’ శాఖలో.. సమస్యలు కొలిక్కి వచ్చేనా.?
ఒంగోలు టూటౌన్: జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో గాడితప్పిన సంక్షేమం కొలిక్కి వచ్చేనా..? అన్న సంశయం గిరిజన సంఘాలను వెంటాడుతోంది. గతంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డీటీఓగా పనిచేసి రిటైర్డ్ అయిన ప్రేమనందం అనంతరం ఆయన స్థానంలో జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారిగా రెవెన్యూ శాఖకు చెందిన కె. రాజ్యలక్ష్మి డిప్యూటేషన్‌పై 2017 అక్టోబర్ నెలలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అవుట్ సోర్సింగ్ గిరిజన ఉద్యోగులకు కష్టాలు మొదలయ్యాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాల్లేవ్.. జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ ద్వారా 14 గురుకుల పాఠశాలలు, 17 ఆశ్రమ పాఠశాలలు పనిచేస్తున్నాయి. వీటితో పాటు మూడు పోస్టు మెట్రిక్, మూడు ఫ్రీ మెట్రిక్ వసతి గృçహాలు మొత్తం 37 వసతి గృహాలు నడుస్తున్నాయి. సుమారుగా 4 వేల మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటిలో ప్రభుత్వం ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిపి మొత్తం 140 వరకు పనిచేస్తుండగా అందులో 56 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెల వేతనం రూ.12 వేల వరకు ఉండగా కటింగ్‌లు పోను రూ.10,300 వరకు చేతికొస్తోంది. ఆ చాలీచాలనీ వేతనంతోనే తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో డిప్యూటేషన్‌పై బాధ్యతలు చేపట్టిన కె. రాజ్యలక్ష్మి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ సడెన్‌గా నిలుపుదల చేశారు. 2018 విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత జూన్‌లో రెన్యువల్ ఆర్డర్లు అడగటానికి జిల్లా గిరిజన సంక్షేమశాఖకు వెళ్లిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు చేదు అనుభవం ఎదురైంది. డీటీడబ్ల్యూఓ మిమ్మలను తొలగిస్తున్నట్లు తెలపడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో 56 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. తరువాత పనిచేసిన కాలంలో రావాల్సిన పది నెలల వేతనాలు మంజూరు కాక ఆర్థిక కష్టాల పాలయ్యారు. నిత్యం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయని రోజులేదు. దీంతో గత్యంతరం లేక గిరిజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో బాధితులు స్థానిక ప్రకాశం భవనం వద్ద ధర్నాలకు దిగారు. ఆందోళనలు నిర్వహించారు. చివరకు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఆమెను మాతృశాఖకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్‌తో పాటు గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా బాధితుల ఆవేదన, ఆక్రందన ఆవేదనగానే మిగిలిపోయింది. ఎవరూ సమస్యను పరిష్కరించలేకపోయారు. చివరకు పాలకుల దృష్టికి గిరిజన సంఘం నాయకులు తీసుకెళ్లారు. దీంతో డీటీడబ్ల్యూఓని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఆమె స్థానంలో నెల్లూరు జిల్లా పౌరసరఫరాల శాఖలో విజిలెన్స్ విభాగంలో పనిచేసే ఎం. వెంకటసుధాకర్ను ఇటీవల గిరిజన సంక్షేమశాఖ అధికారిగా నియమించింది. ఆయన వెంటనే బాధ్యతలు చేపట్టారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు గిరిజన సంఘం రావూరి శ్రీనివాసరావు, సంఘం నాయకులు కలిసి తమ సమస్యలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను విన్నవించారు. వీటితో పాటు భూమి కొనుగోలు పథకం అమలు, సీఆర్టీలకు వేతనాలు, ఎన్ఎస్ఎఫ్టీసీ ఇలా పలు గిరిజన సంక్షేమ పథకాలు పడకేశాయని గిరిజన సంఘం నాయకులు లక్ష్మయ్య, శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీటీడబ్ల్యూఓకి విజ్ఞప్తి చేశారు. ఈయన ఏ మేరకు సమస్యలు పరిష్కరిస్తారో వేచిచూడాలి మరి. -
పండగ పూటా పస్తులే!
విశాఖపట్నం, పెదబయలు(అరకులోయ): పండుగ పూట కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాల్సిన తమను పస్తులుంచడం సరికాదని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పెదబయలులో సోమవారం భోగిపండుగ చేసుకోవాల్సిన ఉపాధ్యాయులు రోడ్డుపై ధర్నా చేశారు. గిరిజన గిరిజన ఉద్యోగ సంఘాల ఆద్వర్యంలో పెదబయలు అంబేడ్కర్ కూడలిలో రాస్తారోకో నిర్వహించి ఖాళీ కంచాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారపు సంతలో అన్ని దుకాణాల్లో తిరిగి హెచ్ఎంలు, ఉపాధ్యాయులు భిక్షాటన చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని, హెచ్ఎంల అధికారాలను ఏటీడబ్లు్యవోలకు బదలాయిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 132ను రద్దు చేయాలని, మూడు నెలల నుంచి జీతాలు లేక పండగ పూట పస్తులుండాల్సి వస్తోందని అన్నారు. గిరిజన సంక్షేమ మంత్రి వారం రోజుల్లో జీవో రద్దు చేయించి సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి, ఇచ్చిన మాట మరిచారని విమర్శించారు. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులను చులకనగా చూస్తోన్న ప్రభుత్వానికి సిగ్గురావాలనే తాము భిక్షాటన చేపట్టామని అన్నారు. ఆందోళనలో ఆశ్రమ పాఠశాల హెచ్ఎంలు సైమాన్, మర్రిచెట్టు అప్పారావు, విశ్వనాథం, గిరిజన ఉపాధ్యాయులు, సాగేని లక్ష్మీనారాయణ, నిక్కుల అనంతరావు, గల్లేలు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముంచంగిపుట్టులో.. ముంచంగిపుట్టు(పెదబయలు): ముంచంగిపుట్టులో సోమవారం ఉపాధ్యాయులు రాస్తారోకో నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఖాళీ కంచాలకు ఆకులు వేసుకుని తింటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అందరూ ఆనందంగా పండగ జరుపుకొనే వేళ ప్రభుత్వం తమను అవస్థలు పెడుతోందని మండిపడ్డారు. 132 జీవోను రద్దు చేసి పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీఎఫ్ నాయకులు మద్దతు తెలిపారు. గిరిజన సంక్షేమ సంఘం మండల ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షకార్యదర్శులు భగత్రాం, నాగేశ్వరరావు, రామకృష్ణ, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
చిరుద్యోగులపై చిన్నచూపు
పశ్చిమగోదావరి, దెందులూరు : వైద్య, ఆరోగ్య శాఖలో సేవలందించే ఆరోగ్య మిత్రలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. 15 ఏళ్లుగా పనిచేస్తున్నా అరకొర జీతాలే చెల్లిస్తుండడం, ఉద్యోగ భద్రత కరువవడంతో వారు అవస్థలు పడుతున్నారు. ఆరోగ్య మిత్రల పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్నవారితోనే పని చేయిస్తుండడంతో వారు తీవ్ర పనిభారంతో అల్లాడుతున్నారు. జిల్లాలో 70 పోస్టులు ఖాళీ జిల్లాలో 60 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ వైద్యశాలలు ఉన్నాయి. వీటిలో 170 పోస్టులు ఉండగా 100 మంది ఆరోగ్యమిత్రలు మాత్రమే ఉన్నారు. 70 పోస్టులు నియామకానికి నోచుకోలేదు. ఆరోగ్యమిత్రకు నెలకు రూ.6 వేలు జీతం ఇస్తున్నారు. మొదటి వారంలో మంజూరు కావాల్సిన ఆ జీతం కాస్తా నెల చివరిలో చేతికొచ్చే వరకూ సందేహమే. 15 ఏళ్లుగా ఆరోగ్యమిత్రలకు రూ.6 వేలు మాత్రమే వేతనంగా ప్రభుత్వం చెల్లిస్తోంది. జీతంలో పెరుగుదల లేకపోవడంతో పాటు ఉద్యోగ భద్రత కరువవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏదో ఒక రోజు ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని, జీతం పెరుగుతుందనే ఆశతో పనిచేస్తున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేవలు భేష్ పేషెంట్ వైద్యశాలలో చేరినప్పటి నుంచి ఓపీ షీటు నమోదు దగ్గర నుంచి శస్త్రచికిత్స జరిగి వైద్య సేవలు పొంది ఇంటికి వెళ్లేందుకు డిశ్చార్జి అయ్యేంత వరకు ఆరోగ్యమిత్రలు సేవలందిస్తారు. పేషెంట్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చవకుండా చూసుకునే పూర్తి బాధ్యత వైద్యశాలల్లో ఆరోగ్య మిత్రలదే. ఒక్కో ఆరోగ్యమిత్ర 8 గంటలు చొప్పున విధులు నిర్వహిస్తారు. దినసరి కూలీలు కూడా నేడు నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు సంపాదిస్తున్నారు. కానీ ఆరోగ్యమిత్రలపై మాత్రం ప్రభుత్వం కరుణ చూపడం లేదు. ఆరేళ్లుగా యూనిఫామ్ కరువు 2012లో ఆరోగ్య మిత్రలకు ఒక ఎఫ్రాన్ (యూనిఫామ్) ఇచ్చారు. అప్పటి నుంచి ఆరేళ్లుగా ఆరోగ్యమిత్రలకు యూనిఫామ్‌లు ఇవ్వటం లేదు. సెలవులు సైతం లేవు. ఒకవైపు ప్రభుత్వం నెట్వర్క్ వైద్యశాలలకు చెల్లించాల్సిన బిల్లులు కోట్ల రూపాయలు పెండింగ్ ఉండటం, మరో వైపు పేషెంట్ చేరినప్పటి నుంచి డిశ్చార్జి అయ్యేంత వరకూ సేవలందించే ఆరోగ్యమిత్రలకు ఉద్యోగ భద్రత, జీతంపెంపు, యూనిఫాం ఇవ్వకపోవడం వంటి ప్రధాన సమస్యల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో జిల్లాలోని వంద మంది ఆరోగ్య మిత్రలు దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అనేకసార్లు ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులకు వినతిపత్రాలు అందజేసినా ప్రభుత్వం తమ సమస్యలను 15 ఏళ్లుగా పెడచెవిన పెట్టిందని ఆరోగ్యమిత్రలు కన్నీటి పర్యంతమవుతున్నారు. 15 ఏళ్లుగా సేవలు 15 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 8 గంటల పాటు పూర్తిస్థాయి వైద్య సేవలు అందిస్తున్నాం. ఆరోగ్య మిత్రలకు కనీస వేతనం, యూనిఫాం, నిబంధనల ప్రకారం సెలవులు, నెల మొదటి వారంలో జీతం జమ చేయాలి. ఆరోగ్యమిత్రల సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు అధ్యాయన కమిటీని ఏర్పాటు చేయాలి. – పీవీ ప్రసాద్, ఆరోగ్య మిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు -
ఆకలి కేకలు
విజయనగరం :నింగిని తాకే ధరలతో నిత్యం బతుకు పోరాటం చేయాల్సిన రోజులివి. జీతం ఒకటి.. రెండ్రోజులు ఆలస్యమైతే విలవిల్లాడిపోతారు. మరి ఆరు నెలలుగా జీతాలకు నోచకపోతే ఏం తినాలి.. ఎలా బతకాలి.. ఐసీడీఎస్ శాఖ నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమంలో పనిచేస్తున్న బ్లాక్ ప్రాజెక్టు అసిస్టెంట్ల దీనావస్థ ఇది. ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమంలో బ్లాక్ ప్రాజెక్టు అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. జిల్లాలో 17 ప్రాజెక్టుల్లో 16 మంది పని చేస్తున్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది. ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో ఒక బ్లాక్ ప్రాజెక్టు అసిస్టెంట్ పనిచేస్తున్నారు. వీరిలో 9 మందికి గత ఏడాది జూలై నెల నుంచి జీతాలు అందలేదు. జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు గంట్యాడ, వియ్యంపేట, ఎస్.కోట, నెల్లిమర్ల, భద్రగిరి, కురుపాం, పార్వతీపురం, సాలురు రూరల్, సాలురు అర్బన్, బొబ్బిలి రూరల్, బొబ్బిలి అర్బన్, బాడంగి, భోగాపురం, విజయనగరం అర్బన్, చీపురుపల్లి, పాచిపెంట, గజపతినగరం ప్రాజెక్టులున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ఉంది. వీటిలో భద్రగిరి, కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి రూరల్, పాచిపెంట, బాడంగి, భోగాపురం, నెల్లిమర్ల, విజయనగరం పీడీ కార్యాలయం బ్లాక్ ప్రాజెక్టు అసిస్టెంట్లు జూలై నెల నుంచి జీతాలు అందలేదు. పండగ రోజూ పస్తులు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న బ్లాక్ ప్రాజెక్టు అసిస్టెంట్లకు నెలకు ఒక్కొక్కరికి జీతం రూ.15 వేలు, పీడీ కార్యాలయంలో పనిచేస్తున్న బ్లాక్ ప్రాజెక్టు అసిస్టెంట్‌కు నెలకు రూ.18 వేలు ఇస్తున్నారు. ఆరు నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ కూడా ఇబ్బందిగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల స్కూలు ఫీజులు కట్టడానికి అప్పులు చేస్తున్నామని వాపోతున్నారు. బ్లాక్ ప్రాజెక్టు అసిస్టెంట్ పనిచేసే పోషణ అభియాన్ కార్యక్రమంలో ఇటీవల జాతీయ స్థాయి అవార్డు కూడా వచ్చింది. అయినప్పటికీ వీరికి మాత్రం జీతాలు అందలేదు. బ్లాక్ అసిస్టెంట్ల విధులు ప్రాజెక్టు కార్యాలయాల్లో రిపోర్టులు రాయడం, ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడం, సీమంతాలు, అన్న ప్రాశన తదితర కార్యక్రమాల్లో పాల్గొనాలి. గర్భిణులు తీసుకోవలసిన ఆహారం, జాగ్రత్తలను వివరించాలి. కలెక్టర్‌కు నివేదన కొనసాగింపు ఉత్తర్వులు రాకపోవడం వల్ల వారికి జీతాలు రాలేదు. మిగిలిన చోట్ల ఖజానా శాఖ అభ్యంతరాలు తెలపకపోవడం వల్ల జీతాలు చెల్లించారు. జీతాలు రాని వారికి కొనసాగింపు ఉత్తర్వుల కోసం కలెక్టర్‌కు ఫైల్ పెట్టాం.– శాంతకుమారి,ఏపీడీ, ఐసీడీఎస్ -
జీతం ఇక్కడ.. ఉద్యోగం ఎక్కడో..
పశ్చిమగోదావరి, ఆకివీడు: జీతం ఒక చోట.. విధులు మరొకచోట.. పాలకులు పగబడితే ఎంతటి ఉద్యోగికైనా ఇటువంటి తిప్పలు తప్పవనటానికి ఆకివీడు ఎంపీడీఓగా పనిచేసిన సీతామహాలక్ష్మి నిదర్శనం. రెండు కళ్ల సిద్ధాంతంతో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తున్నారనడానికి ఈ ఎంపీడీఓకు జరిగిన అన్యాయం ఓ నిదర్శనం. ఎమ్మెల్యేలకు అనుకూలంగా లేని అధికారులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల విభజనలో సీతామహాలక్ష్మిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. కొన్నాళ్లు అక్కడ పనిచేసిన ఆమె తరువాత తన సొంత రాష్ట్రమైన ఆంధ్రా చేరుకున్నారు. సొంత గడ్డకు వచ్చానన్న ఆనంద భాష్పాలు ఆమె కళ్లల్లో కనిపించిన కొన్నాళ్లకే అవి కన్నీరుగా మారిపోయాయి. ఆకివీడు ఎంపీడీఓగా పనిచేస్తున్న తెలంగాణవాసి నాయిని శ్రీనాథ్‌ను రాజధాని అమరావతికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో గతేడాది ఎంపీడీఓగా సీతామహాలక్ష్మి ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన 24 గంటలకే ఆమెను ఆకివీడు నుంచి ఉండి మండల పరిషత్‌కు డెప్యూటేషన్‌పై బదిలీ చేయించారు. అయితే అక్కడ కూడా పనిచేసేందుకు ఆమెకు అవకాశం దక్కనివ్వలేదు. అక్కడ ఐదారు నెలలు మాత్రమే ఆమె పనిచేశారు. అక్కడ నుంచి ఏలూరు డీఆర్సీకి బదిలీ చేశారు. ఏలూరులో పనిచేస్తున్న సీతామహాలక్ష్మి ఆకివీడు మండల పరిషత్‌లోనే జీతం తీసుకుంటున్నారు. మండలస్థాయి అధికారికే స్థానం లేకుండా చేస్తే చిరుద్యోగుల పరిస్థితి ఏమిటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎఫ్ఏసీతోనే పాలన ఏడాదిన్నర నుంచి ఆకివీడు ఎంపీడీఓ పోస్టును పూర్తి అదనపు బాధ్యతల(ఎఫ్ఏసీ)తో సూపరింటెండెంట్‌కు అంటగట్టారు.మునిసిపాలిటీ స్థాయికి ఎదిగిన ఆకివీడులో పరిపాలన సాగించడానికి సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగి సరిపోతాడా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక్కరోజు ఎంపీడీఓ ఒక్క రోజు ఎంపీడీఓగా పనిచేసిన అధికారిని ఆకివీడు మండల ప్రజలు చూశారు. మండల స్థాయి అధికారి ఒక్కరోజు పనిచేసి వెళ్లిపోవడంతో ఆమెను ప్రజలు కూడా మరిచిపోయారు. మహిళా ఉద్యోగికి ఇన్ని తిప్పలా? మండలాభివృద్ధి అధికారిగా బదిలీపై వచ్చిన మహిళా ఉద్యోగిని ఇన్ని తిప్పలు పెట్టడం సమంజసం కాదు. జీతం ఒక చోట, విధులు మరొక చోట.. సేవలందించడానికి వచ్చిన ఉద్యోగిని ఇబ్బందుల పాల్జేయడం సరికాదు. టీడీపీ పాలనలో ఆడపడుచులకు ఇచ్చే గౌరవం ఇదేనా. ఆ ఎంపీడీఓకు ఆకివీడులోనే పోస్టింగ్ ఇవ్వాలి.–మోరా జ్యోతిరెడ్డి,ఎంపీటీసీ సభ్యురాలు, ఆకివీడు ఇది సరైన పద్ధతి కాదు సొంత గడ్డపై సేవలందించేందుకు వచ్చిన ఉద్యోగినిని రాజకీయ కారణాలతో తిప్పలు పెట్టడం సరికాదు. మండల స్థాయి అధికారిలో ఈ విధంగా ఎక్కడెక్కడో పనులు చేయించుకోవడం దారుణం. జీతం ఒక చోట, పనులు మరొకచోట. పాలకులు ఇలా ఆడుకోవడం సరైన పద్ధతి కాదు.–డి.కల్యాణి, డెల్టా జిల్లా కార్యదర్శి, ఐద్వా -
వేతన వేదన!
కర్నూలు, కోవెలకుంట్ల: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యబోధిస్తున్న కార్యకర్తలు, ఆయాలను వేతన కష్టాలు వెంటాడుతున్నాయి. రెండు నెలలుగా వీరికి జీతాలు అందడం లేదు. ఐదు నెలల నుంచి టీఏ, డీఏ బిల్లులు విడుదల కావడం లేదు. మంగళవారం క్రిస్మస్ పండుగ ఉండటంతో ఆ కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 3,486 అంగన్వాడీ, 62 మినీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 3,548 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 3,486 మంది ఆయాలు పనిచేస్తున్నారు. వీరిలో 25 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. ఆయా కేంద్రాల ద్వారా 3.35 లక్షల మంది ఆరు సంవత్సరాల్లోపు చిన్నారులు, 42వేల మంది గర్భిణిలు, 41,319 మంది బాలింతలు లబ్ధి పొందుతున్నారు. వేతనాలు, బిల్లులు అందకపోవడంతో పండగ నిర్వహణ భారంగా మారటంతో క్రైస్తవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలకోసం ఎదురుచూపు.. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు ప్రభుత్వం నెలకు రూ. 10,500, ఆయాలకు రూ. 6వేలు వేతనం అందజేస్తోంది. డిసెంబర్ నెల ముగుస్తున్నా అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించిన జీతాలు విడుదల కాలేదు. ఇదిలా ఉండగా..అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు రూ. 1500, ఆయాలకు రూ. 750 వేతనం పెంచుతూ కేంద్రప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన వేతనాల ప్రకారం కార్యకర్తలకు నెలకు రూ. 12వేలు, ఆయాలకు రూ. 6,750 వేతనం అందాల్సి ఉంది. సెప్టెంబర్ నుంచి అంగన్వాడీలకు కొత్త వేతనాలు వర్తింజేయాలి. రెండునెలల వేతనాలు మంజూరు కాకపోవడం, పెంచిన వేతనాలు అమలు కాకపోవడంతో కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్నారు. ప్రతి నెలా సెక్టార్ సమావేశాలకు వచ్చే అంగన్వాడీలకు రూ. 125 డీఏ, రూ. 100 టీఏ అలవెన్సు ఇవ్వాల్సి ఉంది. ఐదు నెలలకు సంబంధించిన అలవెన్సు అందకపోవడంతో దిగాలు చెందుతున్నారు. పండుగ చేసేదెట్టా? క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ అత్యంత ప్రాముఖ్యమైంది. పేద కుటుంబాల వారు సైతం ఈ పండుగను తమకున్నంతలో అత్యంత వై«భవంగా జరుపుకుంటారు. ఇంటి అలంకరణ, ఇంటిల్లిపాది నూత వస్త్రాల కొనుగోలు, స్వీట్లు, తదితర వాటికి రూ. 5వేలవరకు ఖర్చు చేస్తారు. ఈ ఏడాది క్రైస్తవ అంగన్వాడీ కుటుంబాల్లో పండుగ బోసిపోయినట్లైంది. రెండు నెలల నుంచి వేతనాలు, ఐదు నెలల నుంచి బిల్లులు రాకపోవడంతో పండుగ నిర్వహణ భారంగా మారింది. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని పెండింగ్‌లో ఉన్న రెండు నెలల వేతనాలు, కొత్తవేతనాలు, అలవెన్స్ విడుదల చేసి ఆదుకోవాలని అంగన్వాడీలు కోరుతున్నారు. పెద్దపండుగ సాదాగా జరుపుకుంటున్నాం క్రైస్తవులకు క్రిస్మస్ పెద్ద పండుగ. రెండు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో పండుగను సాదాగా జరుపుకుంటున్నాం. ఈ నెల 20వ తేదీ నాటికి వేతనాలు అంగన్వాడీల ఖాతాల్లో జమ కావాల్సి ఉండగా ఇప్పటి వరకు అందలేదు. పండుగనాటికైనా అందుతాయని ఆశపడితే నిరాశే మిగిలింది. అధికారులు చర్యలు తీసుకుని రెండు నెలల వేతనాలు మంజూరు చేయాలి. – వెంకటలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త, కోవెలకుంట్ల వేతనాల మంజూరులో తీవ్ర జాప్యం అంగన్వాడీకార్యకర్తలు, ఆయాలకు వేతనాలు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ఎవరూ పట్టించుకోలేదు. రెండు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. – సుధాకర్, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి, కోవెలకుంట్ల -
విద్యుత్‌శాఖలో ఆకలి కేకలు
విజయనగరం మున్సిపాలిటీ: విద్యుత్ శాఖలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. చేసిన పనికి జీతాలు అందక అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. 6,49,405 సర్వీసులకు సేవలందించడంలో తమ వంతు పాత్రపోషిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు మూడు నెలలుగా జీతాలు అందడంలేదు. ప్రశ్నిస్తే విధుల నుంచి తొలగిస్తారన్న భయంతో ఎవ్వరికీ చెప్పుకోలేక ఆత్మక్షోభ అనుభవిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కాలంగడుపుతున్నారు. మరో నాలుగు రోజుల వ్యవధిలో ప్రారంభం కానున్న వరుస పండుగల నేపథ్యంలో ఈ నెలైనా జీతాలు అందుతాయో లేదో అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇదీ పరిస్థితి... ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషషన్ సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లలో 32 మంది కంప్యూటర్ ఆపరేటర్లు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వి«ధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ సంస్థపరిధిలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఏజేన్సీ నుంచి ప్రతి నెలా జీతాలు చెల్లిస్తుంటారు. అయితే, అక్టోబర్ నుంచి జీతాలు రాకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. సకాలంలో జీతాలు రాకున్నా ఉన్న ఉద్యోగాన్ని వదులకోలేక విధుల్లో కొనసాగుతున్నారు. ప్రభుత్వం తాజా నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు సంస్థ పరిధిలో ఒకే ఏజెన్సీ కింద పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్లను జిల్లాల వారీగా ఏజెన్సీలకు అప్పగించారు. అంతేకాకుండా నవంబర్ నుంచి అన్ని డిస్కం, ట్రాన్స్‌కో సంస్థల పరిధిలో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు వీరికి జీతాలు పెంచారు. ఈ లెక్కన అక్టోబర్ నెలకు రూ.11,200తో పాటు నవంబర్ నుంచి పెంచిన వేతనం రూ.18,300 రావాల్సి ఉంది. మరో పది రోజుల వ్యవధిలో డిసెంబర్ నెల ముగియనుండటంతో మూడు నెలలు పూర్తి కావస్తోంది. దీంతో 32 మంది కంప్యూటర్ ఆపరేటర్లు జీతలు లేక, కుటుంబ షోషణ కోసం ఇబ్బందులు పడే పరిస్థితి దాపురించింది. సమస్య ఎక్కడంటే.. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రతీనెలా ఏపీఈపీడీసీఎల్ సంస్థ పరిధిలో ఉన్న ఓ ఏజెన్సీ ద్వారా అందించేవారు. అయితే, పాలనాపరమైన సౌలభ్యం మేరకు ఈ విధానాన్ని మార్పు చేస్తూ సర్కిల్ పరిధిలో ఏజెన్సీలకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ విషయంలో సర్కిల్లోని ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సదరు ఏజెన్సీ ద్వారా కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాలు చెల్లింపులు జరిగేలా చూడాల్సి ఉంది. అయితే, గడిచిన మూడు నెలల కాలంలో సంభవించిన తిత్లీ, పెథాయ్ తుపానులు కారణాలుగా చెబుతూ ఈ ప్రక్రియను నిర్వహించడం లేదు. దీంతో అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లు జీతాలకు నోచుకోవడం లేదు. ఇదే సమస్యను పలుమార్లు విశాఖలో ఉన్న ఏపీఈపీడీసీఎల్ సంస్థ కార్యాలయం అధికారుల దృష్టికి తీసుకెళ్లి పట్టించుకోవటం లేదని , కార్పొరేట్ కార్యాలయానికి వెళ్తే సర్కిల్ కార్యాలయానికి వెళ్లి అడగాలంటూ కుంటి సాకులు చెప్పుకుంటూ వస్తున్నారని వాపోతున్నారు. ఇదే విషయాన్ని ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ వై.విష్ణు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. సెక్షన్ కార్యాలయాల్లో విధులు నిర్వహించే కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాలు అందకపోవడంతో టెండర్లలో జాప్యం జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు ఏ ఒక్కరు తన దృష్టికి ఈ సమస్యను తీసుకురాలేదని, టెండర్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో బకాయి జీతాలు కలిపి చెల్లించేస్తామన్నారు. -
మోడల్ స్కూల్స్‌లో జీతాల కేకలు
ఒంగోలు టౌన్: జిల్లాలోని ఏపీ మోడల్ స్కూల్స్‌లో జీతాల కేకలు వినిపిస్తున్నాయి. వాటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది జీతాల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. నాలుగు నెలల నుంచి ఉపాధ్యాయులకు, ఆరు నెలల నుంచి ఉపాధ్యాయేతర సిబ్బందికి జీతాలు రాకపోవడంతో కుటుంబాలను ఎలా నెట్టుకురావాలని వారు ప్రశ్నిస్తున్నారు. మోడల్ స్కూల్స్‌ను సీఎఫ్ఎంఎస్ పరిధిలోకి తీసుకొచ్చినా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నిర్లక్ష్యం కారణంగా అందులో పనిచేసే ఉపాధ్యాయులు సకాలంలో జీతాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. మోడల్ స్కూల్స్‌లో ఔట్ సోర్సింగ్ ద్వారా ఉపాధ్యాయేతర సిబ్బందిని నియమించారు. వారికి సంబంధిత ఏజెన్సీ ఆరు నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అసలే తక్కువ జీతం, ఆపై నెలల తరబడి రాకపోవడంతో అప్పులు పుట్టే పరిస్థితులు కూడా లేవని వారు వాపోతున్నారు. జీతాలు ఎప్పుడు వస్తాయా అని ఒకవైపు ఉపాధ్యాయులు, ఇంకోవైపు ఉపాధ్యాయేతర సిబ్బంది వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 11స్కూల్స్.. 222 మంది:జిల్లాలో 11ఏపీ మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ముండ్లమూరు, కనిగిరి, దర్శి, దోర్నాల, మార్కాపురం, రాచర్ల, వలేటివారిపాలెం మండలంలోని చుండి, లింగసముద్రం మండలంలోని తిమ్మారెడ్డిపాలెం, కందుకూరు మండలంలోని జడ్ మేకపాడు, ఉలవపాడు మండలంలోని వీరేపల్లిలో 2013 జూన్‌లో మోడల్ స్కూల్స్‌ను ప్రారంభించారు. ఈ ఏడాది జూన్‌లో చీరాలలో మరో మోడల్ స్కూల్‌ను ప్రారంభించారు. పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వ ని«ధులతో వీటిని నిర్వహిస్తూ వచ్చారు. ఆ సమయంలో ఇందులో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రతినెలా జీతాలు వచ్చేవి. అయితే 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూల్స్ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. అప్పటి నుండి అందులో పనిచేసే ఉపాధ్యాయులకు జీతాల కష్టాలు వచ్చి పడ్డాయి. ప్రతి మోడల్ స్కూల్లో ఆరుగురు ప్రిన్సిపాళ్లు, 129 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరంతా డీఎస్సీ ద్వారా నియమితులైనవారే. వీరు కాకుండా ఔట్ సోర్సింగ్ ద్వారా 88 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో మోడల్ స్కూల్లో ఎనిమిది మంది చొప్పున ఉపాధ్యాయేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ఆఫీసు ఫీల్డ్ కింద ఒక ఎల్డీసీ, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉండగా, టీచింగ్ ఫీల్డ్ కింద ఒక పీఈటీ, ఒక లైబ్రేరియన్ విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితోపాటు ఇద్దరు చొప్పున అటెండర్లు, వాచ్మెన్లు పనిచేస్తున్నారు. సీఎఫ్ఎంఎస్ పరిధిలోకి వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ ఒకేసారి వేతనాలు ఇచ్చేందుకుగాను ఇటీవల సెంట్రల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం(సీఎఫ్ఎంఎస్)ను ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా ప్రతినెలా ఒకటి రెండు తేదీలో అందరికీ జీతాలు ఇస్తున్నారు. తమను కూడా సీఎఫ్ఎంఎస్ పరిధిలోకి తీసుకురావడంతో మోడల్ స్కూల్స్‌లో పనిచేసే ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే వారు సీఎఫ్ఎంఎస్ పరి«ధిలోకి వచ్చినప్పటికీ జిల్లా విద్యాశాఖ కార్యాలయ రూపంలో జీతాలకు బ్రేక్‌లు పడుతున్నాయి. సీఎఫ్ఎంఎస్ పరిధిలోకి రాకముందు మోడల్ స్కూల్స్‌కు సంబంధించిన ఉపాధ్యాయుల జీతాల బిల్లులు జిల్లా విద్యాశాఖ కార్యాలయం తయారుచేసి ట్రెజరీ ద్వారా రాష్ట్ర విద్యాశాఖకు పంపించేవారు. అక్కడి ఏఓ బిల్లుల ప్రక్రియను పరిశీలించిన అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు పంపించేవారు. నిత్యం బిజీగా ఉండే కమిషనర్ మోడల్ స్కూల్స్‌కు చెందిన ఉపాధ్యాయుల బిల్లులను చూసి సంతకం చేస్తేనే ఉపాధ్యాయులకు జీతాలు వచ్చేవికావు. ఇంత ప్రాసెస్ నడిచేసరికి నెలలు గడిచిపోవడం సర్వసాధారణమైంది. తమతోపాటు ఇతర పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఠంఛనుగా ప్రతినెలా జీతాలు తీసుకుంటుంటే, మోడల్ స్కూల్స్‌లో పనిచేసే ఉపాధ్యాయులు మాత్రం నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చేతులు తడపాల్సిందే.. సీఎఫ్ఎంఎస్ ద్వారా మోడల్ స్కూల్స్‌కు చెందిన ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ జిల్లా విద్యాశాఖ కార్యాలయం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సీఎఫ్ఎంఎస్ ద్వారా నేరుగా ట్రెజరీకి బిల్లులు పెడితే సంబంధిత ఉపాధ్యాయుల బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమవుతాయి. అయితే జిల్లా విద్యాశాఖ కార్యాలయం నిర్లక్ష్యం అందులో పనిచేసే ఉపాధ్యాయులకు శాపంగా మారింది. సీఎఫ్ఎంఎస్ కింద జీతాల బిల్లలు ట్రెజరీకి పంపించేందుకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో చేతులు తడపాల్సిన పరిస్థితి నెలకొంది. ముండ్లమూరు, కనిగిరి, చుండి, తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్స్‌లో పనిచేసే ఉపాధ్యాయులకు ఆగస్టు నెల జీతాలు పడటం, మిగిలిన వాటిలో పనిచేసే ఉపాధ్యాయులకు పడకపపోవడంపై అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖాధికారి జోక్యం చేసుకొని తమకు పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే విడుదలయ్యేలా చూడాలని మోడల్ స్కూల్స్‌లో పనిచేసే ఉపాధ్యాయులు కోరుతున్నారు. అదే సమయంలో మోడల్ స్కూల్స్‌లో ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయేతర సిబ్బంది కూడా తమకు ఆరు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇప్పించాలని వేడుకుంటున్నారు. -
అధిక వేతనాలు బెంగళూరులోనే!
హైదరాబాద్: దేశంలో అన్ని నగరాల్లో కంటే బెంగళూరులోనే వేతనాలు ఎక్కువ అని లింక్డ్ఇన్ తాజా శాలరీ సర్వే వెల్లడించింది. అందరూ అనుకున్నట్లు అధిక వేతనాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు దక్కడం లేదని పేర్కొంది. అధిక వేతనాలను హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ ఉద్యోగులు ఎగరేసుకు పోతున్నారని వెల్లడించింది. లింక్డ్ఇన్కు భారత్‌లో 5 కోట్ల మంది యూజర్లున్నారు. అమెరికా తర్వాత లింక్డ్ఇన్కు అధిక యూజర్లు ఉన్నది మన దేశంలోనే. తన ప్లాట్‌ఫామ్‌పై ఉన్న డేటా ఆధారంగా లింక్డ్ఇన్ సంస్థ రూపొందించిన ఈ సాలరీ సర్వేలో కొన్ని ముఖ్యాంశాలివీ... ♦ భారత్‌లో అధిక వేతనాలు బెంగళూరులోనే ఉన్నాయి. సగటు వేతనం ఏడాదికి రూ.12 లక్షలుగా ఉంది. రూ.9 లక్షల సగటు వేతనంతో ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్లు రెండో స్థానంలో ఉన్నాయి. రూ.8.5 లక్షల సగటు వేతనంతో హైదరాబాద్ మూడో స్థానంలో, రూ.6.3 లక్షల వేతనంలో చెన్నై నాలుగో స్థానంలో నిలిచాయి. ♦ హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ ఉద్యోగులు ఏడాదికి రూ.15 లక్షల వరకూ వేతనం పొందుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు రూ.12 లక్షల వరకూ, వినియోగ రంగంలోని ఉద్యోగులు రూ.9 లక్షల వరకూ వేతనం పొందుతున్నారు. ♦ హార్డ్‌వేర్ జాబ్స్ అంటే సంప్రదాయ హార్డ్‌వేర్ ఉద్యోగాలు కాదు. చిప్ డిజైన్, కొత్త తరం నెట్వర్కింగ్ ఉద్యోగాలు. వందలాది, వేలాది ట్రాన్సిస్టర్ల, డివైజ్‌ల సమ్మేళనంతో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను(ఐసీ) తయారు చేసే ఈ రంగంలోని ఉద్యోగుల వేతనాలు రెండేళ్ల క్రితం వారి అనుభవానికి 3 రెట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వారి అనుభవానికి 4–5 రెట్ల వేతనాలు లభిస్తున్నాయి. ♦ భారీ స్థాయిలో డేటా వస్తుండటంతో వినియోగదారులకు భద్రత, తదితర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి నెట్వర్కింగ్ రంగంలో నవకల్పనలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా నెట్వర్కింగ్ రంగంలో ఉద్యోగాలు, నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోంది. ♦ సాఫ్ట్‌వేర్‌లో డిజిటల్ టెక్నాలజీల కారణంగా వేతనాలు పెరుగుతున్నాయి. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్‌లలో వేతనాలు ఎగబాకుతున్నాయి. ప్రోగ్రామింగ్ బాగా వచ్చి, ఇతర (బిజినెస్, ఫైనాన్స్, మెడికల్) రంగాల్లో విస్తృత పరిజ్ఞానం ఉన్నవారికీ మంచి వేతనాలు లభిస్తున్నాయి. ♦ ఇంజినీరింగ్ డైరెక్టర్లు అధిక వేతనం పొందుతుండగా, ఆ తర్వాతి స్థానాల్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్(సేల్స్), సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్లు ఉన్నారు. -
జెట్ ఉద్యోగులకు జీతాల్లేవ్..!
న్యూఢిల్లీ: జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.1,300 కోట్ల నష్టాలను ప్రకటించి, వరుసగా రెండో త్రైమాసికంలోనూ నష్టాలను నమోదుచేసిన ఈ సంస్థ.. కనీసం ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి దిగజారింది. రూ.75వేలకు మించి జీతాలు ఉన్నటువంటి ఏ1–ఏ5, ఓ2, ఓ3 గ్రేడ్ ఉద్యోగులకు అక్టోబరు ఒకటిన జీతాలు అందగా.. ఎం1, ఎం2, ఈ1, ఇతర గ్రేడ్ల వారికి ఇంకా వేతనాలు అందలేదని వెల్లడైంది. ఈ అంశంపై సంస్థ ఉద్యోగి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘సాధారణంగా ప్రతినెలా 1వ తేదీన జీతాలు వస్తాయి. గతనెలలో మాత్రం సీనియర్ మేనేజ్మెంట్, పైలెట్లు, ఇంజనీర్లను మినహాయించి.. మిగిలిన ఉద్యోగులందరికీ వేతనాన్ని సరియైన సమయానికే చెల్లించారు. అయితే, ఈసారి సెప్టెంబర్ వేతనాన్ని మాకు ఇప్పటికీ చెల్లించలేదు.’ అని వ్యాఖ్యానించారు. -
వేతన వెతలు.. !
వేతనాలు సక్రమంగా అందకపోవడంతో సచివాలయ సిబ్బంది అల్లాడుతున్నారు. రెండు, మూడు నెలలకు ఒకసారి జీతాలుఇస్తుండడంతో ఇళ్లు గడవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే అరకొర జీతాల్లో కూడా కొర్రీలుపెడుతున్నారని.. రెండు రోజులకు మించి సెలవు తీసుకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకుపాల్పడుతున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీలలో హౌస్ కీపింగ్ సిబ్బంది సుమారు 170 మంది పని చేస్తున్నారు. ఇందులో 150 మంది మహిళా సిబ్బంది. మిగిలిన వారు సూపర్వైజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయంలోని ఆరు బ్లాకులు, అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం వీరి విధి. కాంట్రాక్ట్ దక్కించుకున్న ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగంలో చేరిన మూడు నెలలకు జీతాన్ని రూ.8 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతామని చెప్పి రూ.6,400 ఇస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. నెలకు కనీస సెలవులు కూడా ఇవ్వడం లేదని.. సెలవులు తీసుకుంటే జీతాన్ని కట్ చేసి ఇస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. బ్యాంకు ఖాతాలోజమ చేయని అధికారులు.. బ్యాంకు ఖాతాల్లో జీతం జమ చేయకుండా చేతికి ఇస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. బ్యాంకులో జమ చేస్తే సిబ్బందికి ఇచ్చే జీతం ఎంత.? ఈఎస్ఐకి ఎంత కట్ చేస్తున్నారు ? పీఎఫ్ ఎంత కట్ అవుతోంది ? అనే వివరాలు కచ్చితంగా ఉంటాయి. చేతికి ఇవ్వడం వల్ల జీతంలో బేసిక్ ఎంత, హెచ్ఆర్ ఎంత అనే వివరాలు కూడా తమకు తెలియడం లేదని వాపోతున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ పేరుతో ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, ఈఎస్ఐ కార్డులను ఆస్పత్రికి తీసుకెళితే చెల్లడం లేదని చెబుతున్నారు. ప్రతి నెలా జీతాలు ఇవ్వమని అడిగితే దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో తమ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని సిబ్బంది కోరుతున్నారు. సచివాలయం, అసెంబ్లీలో విధులు నిర్వర్తించే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహించే కార్మికుల సమస్యలను మాత్రమే కాదు.. ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది వెతలు తీర్చేందుకు కూడా చొరవ చూపాలని, ఉద్యోగ భద్రత చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సచివాలయంలో పని చేసే రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా తమకు రాయితీలు కల్పించాలని కోరుతున్నారు. -
జీతాలపెంపునకు రైట్ రైట్
తిరుమల : టీటీడీ రవాణా శాఖ విభాగంలో 65 మంది డ్రైవర్లు, 15 మంది íఫిట్టర్ల జీతం పెంచాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. మండలి సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. పుట్టా సుధాకర్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి. ♦ టీటీడీ రవాణా విభాగంలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న 65 మంది డ్రైవర్లు, 15 మంది ఫిట్టర్లకు వేతనం రూ.15వేల నుంచి రూ.24,500 లకు, 28 మంది క్లీనర్లకు వేత నం రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంపు. ♦ తుళ్లూరు మండలం వెంకటపాళెం వద్ద రూ.150 కోట్లతో శ్రీ వేంకటేశ్వర దివ్యక్షేత్రం నిర్మాణానికి ఆమోదం. ♦ తిరుమలలోని గోవర్దన సత్రం సమీపంలో నూతన యాత్రికుల వసతి సముదాయం నిర్మాణానికి రూ.79 కోట్లు మంజూరు. ♦ రాష్ట్రంలోని 142 గ్రంథాలయాలకు 2,200 ఆధ్యాత్మిక ప్రచురణలు ఉచితంగా సరఫరా. ♦ ఫాస్ట్‌ఫుడ్, టీæ, టిఫిన్ సెంటర్లలో ఆహారపదార్థాల ధరలను సమీక్షించేందుకు ఐదుగురు అధికారులతో కమిటీ. కమిటీ నివేదికను బోర్డుకు సమర్పిస్తుంది. ♦ శ్రీవారి సేవాసదన్–1, 2 భవనాలు,వకుళాదేవి విశ్రాంతిగృహం, పీఏసీ–3 కలిపి 3 సంవత్సరాలకు ఎఫ్ఎంఎస్ నిర్వహణ కోసం రూ.19.50 కోట్లతో టెండర్లు ఖరారు. ♦ ఒంటిమిట్టలోని యాత్రికుల వసతి సముదాయం భవనం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు అప్పగింత. ♦ కల్యాణమండపాల్లో అభివృద్ధి పనులకు రూ.37.05 కోట్లు మంజూరు. సీఎం సిఫారసుకు చెక్ టీటీడీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారుతోందని ఇటీవల ఉద్యోగులు అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. వినతిపత్రంపై సంతకం చేసిన వారిలో టీటీడీ చైర్మన్ సహాయకుడు కూడా ఉన్నారు. ఇప్పుడు చర్చిస్తే ఆయనపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చైర్మన్ ఈ అంశాన్ని ప్రస్తావించకుండా ముగించినట్లు తెలిసింది. పాలకమండలి సభ్యులు చర్చ జరగాలని పట్టుపట్టినా చైర్మన్ వినతిపత్రం ఇచ్చిన అందరిపై చర్యలు తీసుకోవాలని చాకచక్యంగా సమావేశాన్ని ముగించారు. ఈ అంశం వల్ల సీఎం సిఫారసులకు చెక్‌పడింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రితో సహా నేతలంతా తాము చెప్పిన చోట కల్యాణమండపాలు నిర్మించాలని టీటీడీకీ సిఫారసు చేశారు. ఉద్యోగస్తులు రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీ మారుతుందనే ఉద్యోగుల వాదన నేపథ్యంలో ఈ సిఫార్సుకు బ్రేక్ పడింది. దీనిపై మండలి వెనకడుగేసింది. ఆరునెలల వరకు నిర్మాణాలు చేపట్టమని టీటీడీ ఈఓ స్పష్టం చేశారు. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సమయంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు ఆహ్వానం అందలేదని సంప్రోక్షణ సమయంలో ఆలయం ఎదుట చైర్మన్‌తో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై చర్చ జరగలేదు. ఇది మరోమారు ఎమ్మెల్యేను టీటీడీ అవమానపరచినట్లేనని ఆమె వర్గీ యులు మండిపడుతున్నట్లు తెలిసింది. -
ఈ–కుబేర్ కాదు.. ఈ–కుదేల్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఓ భరోసా. ఎలాంటి పరిస్థితులలో అయినా ప్రతినెలా మొదటి రోజు వేతనాలు వస్తాయనే నమ్మకం. అయితే, ఉద్యోగుల వేతనాల చెల్లింపుల ప్రక్రియను మరింత వేగవంతం, సరళతరం చేసేందుకు అమలులోకి తెచ్చిన ఈ–కుబేర్ వ్యవస్థలోని సాంకేతిక సమస్యలు కొందరు ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారాయి. ఆగస్టు నెల ముగింపునకు వచ్చినా ఇంకా వేతనాలు అందలేదు. దీంతో వేతనాలు అందని వారంతా ట్రెజరీ విభాగాల చుట్టూ తిరుగుతున్నారు. ట్రెజరీ అధికారులు ఒక్కో ఉద్యోగికి సంబంధించిన వివరాలను సరి చూస్తూ పరిష్కరిస్తున్నారు. సాంకేతిక సమస్యలను ముగించే ప్రక్రియ ఆలస్యమవు తుండటంతో నెల ముగిసే సమయానికి కూడా అందరికీ వేతనాలు అందే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈలోపు ఆగస్టు నెల వేతనాలను చెల్లించే ప్రక్రియ మొదలైంది. సాంకేతిక సమస్యలతో ఆగస్టులో వేతనాలు అందని వారికి, సెప్టెంబర్‌లోనూ ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. ఈ–కుబేర్ కొత్త విధానంలో సాఫ్ట్‌వేర్‌తో ఉత్పన్నమయ్యే సమస్యలు పరిష్కరించేందుకు సరిపడా సాంకేతిక సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ఆగస్టు నుంచే... ఉద్యోగుల వేతన చెల్లింపు ప్రక్రియలో ఆగస్టు 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ‘డిజిటల్ ఇండియా’కార్యక్రమంలో భాగంగా ఆర్బీఐ కొత్తగా అమలులోకి తెచ్చిన ఈ–కుబేర్ విధానాన్ని దీనికి వర్తింపజేశారు. కొత్త విధానం ప్రకారం ఉద్యోగుల వేతనాల బిల్లులను ట్రెజరీ అధికారులు ‘ఈ–కుబేర్’సాఫ్ట్‌వేర్‌తో ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ వివరాలు ఆర్బీఐకి చేరుతాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) పద్ధతిలో ఆర్బీఐ నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోకి వేతనాలను జమ చేస్తుంది. ఒకటో తేదీ ఆదివారం అయినా ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ అవుతాయి. సాంకేతిక సమస్యలు మొదట 2.56 లక్షల మంది పెన్షనర్లకు అమలుచేసిన ఈ–కుబేర్ విధానాన్ని ఆగస్టు ఆరంభం నుంచి ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తున్నారు. మొదట అందరు ఉద్యోగుల ఖాతాల్లో ఒక్కో రూపాయి చొప్పున డిపాజిట్ చేసి పరిశీలించారు. కొంతమంది ఉద్యోగుల బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ నంబర్లు తప్పుగా ఉండడంతో వారికి ఈ మొత్తం జమ కాలేదు. ఇలాంటి వాటిని సరిచేసి ఆగస్టు 1న వేతనాలు జమ చేశారు. అయితే ఒక రూపాయి జమ చేసిన సందర్భంలో వచ్చిన సమస్యలను పరిష్కరించినా, పూర్తి వేతనాలు ఇచ్చినప్పుడూ ఇదే జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పది శాతం మంది ఉద్యోగులకు వేతనాలు జమ కాలేదు. ఉద్యోగుల వేతన బిల్లులను డ్రాయింగ్, డిస్బర్సింగ్ ఆఫీసర్ (డీడీవో) దశలవారీగా ఆన్లైన్ ద్వారా ఈ–కుబేర్‌కు పంపారు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అవి తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా ఉద్యోగులకు ఈ నెలలో వేతనాలు జమ కాలేదని అధికారులు చెబుతున్నారు. ఇలా రిజెక్టయిన వారు ఒక్కొక్కరుగా వెళ్లి ట్రెజరీ అధికారులకు విజ్ఞప్తులు చేయడంతో సాంకేతిక సమస్యలను పరిష్కరించి వేతనాలు ఖాతాకు జమచేస్తున్నారు. ఎక్కువ మంది ఉద్యోగులకు ఇదే సమస్య రావడంతో పరిష్కారంకోసం ఎక్కువ రోజులు పడుతోంది. - ఈ–కుబేర్ విధానంలో ఒకవ్యక్తికి సంబం ధించిన డబ్బులు ఒకే ఖాతాలో జమ అవుతా యి. ఒక ఉద్యోగికి ఒకటికంటే ఎక్కువ బ్యాం కు ఖాతాలు ఉంటే సమస్యలు వస్తాయి. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొంది న వ్యక్తికి వేతనం ఒక బ్యాంకు ఖాతాలో, పెన్షన్ మరో ఖాతాలో జమవుతుంది. - పోలీసు శాఖలో విధి నిర్వహణలో చనిపోయిన సిబ్బందికి వారి రిటైర్మెంట్ వయస్సు వరకు పూర్తి వేతనం అదే ఖాతాలో జమ అవుతుంది. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుడు ఉద్యోగం పొందితే ఆ వేతనం వేరే ఖాతాలో జమ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ–కుబేర్ సాఫ్ట్‌వేర్‌లో ఇబ్బందులు వస్తున్నాయి. -
అర్హులైన అర్చకులకు త్వరలో వేతనాలు
సాక్షి, హైదరాబాద్: అర్హులైన అర్చకులు, ఆలయ ఉద్యోగులందరికి త్వరలోనే వేతనాలు చెల్లిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాలపై మంగళవారం సచివాలయంలో దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ, కొన్ని సాంకేతిక కారణాలవల్లే 131 ఆలయాలకు సంబంధించిన 6బీ, 6సీ, 6డీ కేటగిరి కింద ఉన్న అర్చకులు, ఆలయ ఉద్యోగుల డాటా ఇంకా ఆన్లైన్ చేయలేదన్నారు. ఈ 131 ఆలయాల్లో పనిచేస్తున్న వారితోపాటు, అర్హతలు ఉన్నా, లిస్ట్‌లో తమ పేరు లేదని కొంతమంది నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వారి సమస్యల పరిశీలనకు ఓ కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. 1,903 మందికి రివైజ్డ్ వేతనాలు వారి ఖాతాల్లో వేయడం జరుగుతుందన్నారు. 1,500 మందికి ఈ నెలాఖరులోగా జమ చేయడం జరుగుతుందన్నారు. ఆందోళన తాత్కాలిక వాయిదా గత 15రోజులుగా అర్చక, ఉద్యోగులు చేస్తున్న ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. దేవాలయాల్లో ఆర్జిత సేవలను బుధవారం నుంచి ప్రారంభిస్తామని అర్చక, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గంగు భానుమూర్తి వెల్లడించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇచ్చిన హామీతో జేఏసీకి సంతృప్తి కలగడంతో ఈ ఆందోళన విరమిస్తున్నామన్నారు. -
అధ్యాపకులకు వేతనాల పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో అధ్యాపకుల వేతనాలు త్వరలోనే పెరగనున్నాయి. పెంపు కనీసం 20 శాతం ఉంటుందని ఉన్నత విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్ర ఏడో వేతన సవరణ కమిషన్ సిఫారసులను అమలు చేసేందుకు ఇటీవల ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆ కమిటీ మంగళవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి నేతృత్వంలో సమావేశమై చర్చించింది. కమిటీ ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలో దాదాపు 5వేల మందికి పీఆర్సీ ప్రయోజనాలు కల్పించాల్సి ఉంటుందన్న నిర్ణయానికి వచ్చింది. అందులో 240 మంది ఎయిడెడ్ డిగ్రీ అధ్యాపకులు, 1,350 మంది ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సిబ్బంది, 1,000 మంది వరకు యూనివర్సిటీల్లో బోధన సిబ్బంది ఉన్నట్లు అంచనా వేసింది. ఉస్మానియా, కాకతీయ వంటి యూనివర్సిటీల్లో పాత పెన్షన్ వర్తించే దాదాపు 2,500 మంది రిటైర్డ్ అధ్యాపకులకు ఈ పీఆర్సీ ప్రయోజనాలను వర్తింపచేయాల్సి ఉంటుందన్న ఆలోచనకు వచ్చింది. ఇందుకు రూ.100 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని భావిస్తోంది. అయితే అందులో 50 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుండగా, మరో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. 2019 మార్చి 31లోగా కేంద్ర ఏడో పీఆర్సీని వర్తింపజేయకపోతే అందుకోసం ఇవ్వాల్సిన నిధులను తాము ఇవ్వబోమని, ఈలోగా వర్తింపజేస్తేనే తమ వాటా కింద ఇవ్వాల్సిన నిధులను ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో వేతనాల పెంపునకు కసరత్తు ప్రారంభమైంది. ఈనెల 21న అధ్యాపకులు, అధికారులతో మరోసారి సమావేశం కావాలని, తర్వాత ఉన్నత స్థాయి కమిటీ సమావేశమై నివేదిక ఖరారు చేయాలని నిర్ణయించింది. కమిటీ ఇచ్చే సిఫారసులను ప్రభుత్వం పరిశీలించి, వేతనాల పెంపును ప్రకటించనుంది. దీనికి ఒకటి రెండు నెలల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
కష్టాల కడలిలో కాంట్రాక్టు ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: సర్కారు ఖజానాకు ఆదాయం సమకూర్చే ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఆర్టీసీ తదితర శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు మూడు నెలలుగా వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో మొత్తంగా 40 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలోనే ఈ ఉద్యోగుల కాంట్రాక్టు గడువు ముగిసిపోయింది. నిబంధనల ప్రకారం ముగింపు గడువుకు ముందుగానే కాంట్రాక్టును తిరిగి పునరుద్ధరించాలి. కానీ మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కాంట్రాక్టు గడువును పొడిగించకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది కొలువు ఉంటుందో ఊడుతుందో తెలియని అయోమయం నెలకొని ఉంది. కాంట్రాక్టును వెంటనే పునరుద్ధరించి, పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలని ప్రతి ఉద్యోగికి కనీసం రూ.12,000 వేతనం చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక్కో చోట ఒక్కో విధానం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమల్లోకి తెచ్చిన ఈ విధానం నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. తెలంగాణ రాక పూర్వం 6,500 కనీస వేతనం ఇచ్చి, ఉద్యోగులతో ప్రభుత్వం అధికారికంగా వెట్టిచాకిరీ చేయించుకునేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2016లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు నెలకు కనిష్టంగా రూ.12,000, గరిష్టంగా రూ.17,500 చొప్పున వేతనం ఇవ్వాల్సి ఉండగా.. ఒక్కోచోట ఒక్కొక్క విధానాన్ని అమలు చేస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ, ఆర్టీసీ, ఫారెస్టు శాఖల్లో ఇప్పటికీ రూ.7,500 వేతనాలే చెల్లిస్తున్నారని ఫిర్యాదులున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంగా కాంట్రాక్టు ఒప్పందం కింద టైగర్ ట్రాకర్లుగా పనిచేస్తున్న చెంచుల వేతనాలను అక్కడి ఫారెస్టు అధికారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో అచ్చంపేట సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేసిన ఓ అధికారి కొంతమంది టైగర్ ట్రాకర్లకు వేతనాలు ఇవ్వకుండా మొత్తం తానే తీసుకున్నాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఫారెస్టు ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం. -
పేరుకే పంతుళ్లు.. పనికి కూలీలు
రోజుకు రెండు గంటలు పనిచేసే ఉపాధి కూలీ నెలకు రూ. 6 వేలు వరకూ సంపాదిస్తున్నాడు. రోజుకు 12 గంటలు పనిచేసే ప్రయివేటు ఉపాధ్యాయుడు నెలకు 8 వేలు కూడా పొందలేకపోతున్నాడు. పేరుకు పంతుళ్లే అయినా వెట్టిచాకిరీ కూలీల్లా పనిచేస్తున్నారు. ఇదీ జిల్లాలో ప్రయివేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల దుస్థితి. కష్టపడి చదివినా ప్రభుత్వ కొలువులు లేవు. బీఈడీ, డిగ్రీలు పూర్తి చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగాలు లేక కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. కనీస వేతనం వీరికి కలగానే మిగిలిపోతుంది. నిరుద్యోగుల పేదరికం, ఉద్యోగ అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు చాలీచాలని జీతాలిస్తూ వారి శ్రమను నిలువునా దోచుకుంటున్నాయి. యద్దనపూడి: జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకూ బోధించే గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు 684 ఉన్నాయి. ఒక్కొక్క స్కూలుకు టీచింగ్ స్టాఫ్ 15 నుంచి 20 మంది వరకూ ఉంటారు. ఇతర సిబ్బంది మరో 10 నుంచి 15 మంది వరకూ ఉంటుంటారు. జిల్లాలో దాదాపు 12 వేల మందిపైగా ఆయా పాఠశాలల్లో బీఈడీ, డీఈడీ, డిగ్రీలు పూర్తిచేసిన వారు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఒక్క పర్చూరు డివిజన్ పరిధిలో ప్రైవేటు పాఠశాలలు 76 ఉన్నాయి. ప్రతి పాఠశాలలో 10 మంది నుంచి 40 మంది వరకు ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది పని చేస్తున్నారు. ఇలా దాదాపు 987 మంది దాకా ఆయా పాఠశాలలో నిరుద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. బీఈడీ, డీఈడీ పూర్తి చేసి అన్ని అర్హతలున్నా వారికి తగిన వేతనం ఇవ్వడం లేదు. ఇక సాదారణ డిగ్రీ చేసిన వారికైతే మరీ తక్కువగా ఉంటుంది. వీరిలో మహిళలైతే మరీ తక్కువగా ప్రాథమికంగా రూ. 3 వేల నుంచి 6 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. ఫీజులు ఘనం – వేతనాలు నామ మాత్రం: యాజమాన్యాలు రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా సిబ్బందికి మాత్రం రూ. వేలల్లో చెలిస్తున్నారు. జీఓ నెం 91 ప్రకారం విద్యా సంస్థలు వసూలు చేస్తున్న ఫీజుల్లో 50 శాతం మేర సిబ్బందికి జీత భత్యాలు చెల్లించాలి. కానీ అవేవీ మచ్చుకైనా కనిపించడం లేదు. దీనికి తోడు సంవత్సరంలో 10 నెలలు మాత్రమే జీతాలు ఇస్తున్నారు. వేసవిలో మాత్రం ప్రతి టీచరు కనీసం 10 మందిని తగ్గకుండా పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాల్సి ఉంటుంది. లేకుంటే వేరొకరిని నియమించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. యాజమాన్యాల ఒత్తిడిని తట్టుకోలేక కొందరు ఉపాధ్యాయులైతే ఉద్యోగం పోతుందన్న భయంతో సొంతంగా వారే తెలిసిన పిల్లల పేరుతో ప్రవేశ రుసుం చెల్లించి టార్గెట్లు పూర్తిచేశారు. ఉద్యోగ భద్రత కోసం మండుటెండల్లో ఇంటింటికి తిరిగి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఉపాధి కూలీలే నయం: యాజమాన్యాలు ఉపాధ్యాయులకు ఎక్కువగా బోధనాల కంటే విద్యార్థుల స్టడీ అవర్ల పేరుతో అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిలువు కాళ్లపై నిలబడి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు అయ్యవార్లు వాపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఉపాధి హామీ కూలీలే నయమని, వారు ఉదయం 8 గంటల నుంచి 10 గంటలు పని చేసినా 2 గంటలకే 200 రూపాయలకు తగ్గకుండా కూలీ వస్తుందని, తాము మాత్రం 12 గంటలు కష్టపడినా రోజుకు 150 రూపాయలు కూడా రావడంలేదని కొందరు వాపోతున్నారు. ముఖ్యంగా మహిళా టీచర్లపై యాజమాన్యాల ఒత్తిళ్ళు చాలా దారుణంగా ఉంటున్నాయని, గత్యంతరం లేకే పని చేస్తున్నామని ఎవరికి చెప్పుకోలేక లోలోనే మదన పడుతున్నామని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసి ప్రయివేట్ పాఠశాలల్లో అధిక ఫీజులను నియత్రించి కనీస వేతనం 15 వేలకు తగ్గకుండా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండు చేస్తున్నారు. -
గౌరవ వేతనం అం(తే)దేనా..?
సర్పంచ్ల పరిస్థితి అడకత్తెరలో పోకచక్కెలా తయారైంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీలను వేసి సర్పంచ్‌లకు పూర్తిగా అధికారాలు లేకుండా చేసింది. పైగా గౌరవ వేతనం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. మదనపల్లె రూరల్: జిల్లాలోని సర్పంచ్‌లకు 30 నెలలుగా గౌరవ వేతనం అందడం లేదు. మరో 20 రోజుల్లో వారి పదవీ కాలం ముగియనుంది. దీంతో పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలు ఇస్తారా.. లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని 66 మండలాల్లో 1,393 మంది సర్పంచ్‌లు ఉన్నారు. వీరికి నెలకు రూ.3 వేల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం 2015లో ప్రకటించింది. తర్వాత 9 నెలలు చెల్లించింది. 2016 నుంచి ఇప్పటి వరకు వేతనాలు చెల్లించలేదు. నెలకు రూ.41.79 లక్షల చొప్పున 30 నెలలకు రూ.12 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంది. తమ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుందని, గౌరవ వేతనాల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు ట్రెజరీలో పెండింగ్‌లో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని చెబు తున్నారు. ప్రస్తుతం ఒక్కో సర్పంచ్‌కు రూ.90 వేలు రావాల్సి ఉంది. పెండింగ్‌లో బిల్లులు.. జిల్లాలో పలు గ్రామ పంచాయతీల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కోట్లాది రూపాయలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అప్పులు చేసి పనులు చేయించామని, బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ట్రెజరీల్లో సీఎఫ్ఎంఎస్ విధానంలో బిల్లుల మంజూరు విధానం ప్రవేశ పెట్టడంతో 14వ ఆర్థిక సంఘం నిధులు సైతం మంజూరుకావడం లేదని వాపోతున్నారు. తమ పదవీ కాలం ముగిసేలోగా పెండింగ్ బిల్లులతో పాటు గౌరవ వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకో వాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. వెంటనే మంజూరు చేయాలి సర్పంచ్‌లకు గౌరవ వేతనం పెంపు అనంతరం 9 నెలలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన 30 నెలలకు గౌరవ వేతనాలు ఇవ్వలేదు. పదవీ కాలం ముగుస్తోంది. వేతనాలు వెంటనే ఇవ్వాలి. పంచా యతీల్లో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో అవస్థలు పడుతున్నాం. – నాగరత్నమ్మ, సర్పంచ్, కొండామారిపల్లె -
వేతన వెతలు!
మడకశిర: అంగన్ వాడీ కార్యకర్తలకు వేతన వెతలు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1,500 మంది అంగన్వాడీ కార్యకర్తలు,హెల్పర్లకు ఐదు నెలలుగా జీతాలు అందలేదు. చిన్నపాటి సాంకేతిక లోపాన్ని ఎత్తి చూపుతూ నెలల తరబడి జీతాల చెల్లింపులో జాప్యం చేస్తూ వస్తున్నారు. లోపాన్ని సరిచేయడంలో సంబంధిత ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 17 ప్రాజెక్ట్‌లు..5,126 అంగన్వాడీ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 17 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 5,126 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 5,126 మంది కార్యకర్తలు పని చేస్తున్నారు. ఇదే స్థాయిలో హెల్పర్లు కూడా ఉన్నారు. మడకశిర, హిందూపురం, కదిరిలో రెండు, కళ్యాణదుర్గం, కణేకల్లు, కంబదూరు, రాయదుర్గం, పెనుకొండ, ఉరవకొండ, గుత్తి, తాడిపత్రి, ధర్మవరం తదితర కేంద్రాల 50 నుంచి 100 మంది అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు ఐదు నెలలుగా జీతం అందలేదు. ఐఎఫ్ఎస్సీ నమోదులో తప్పిదం వివిధ బ్యాంకులకు సంబంధించిన ఐఎఫ్ఎస్ కోడ్ల నమోదులో తేడా రావడమే జీతాల చెల్లింపులో జాప్యంగా సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు స్థానికంగానే ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించేవారు. ప్రస్తుతం నేరుగా అమరావతిలోని ఐసీడీఎస్ కమిషనరేట్ నుంచి జీతాలను వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ బ్యాంకుల్లో తమకున్న ఖాతా నంబర్లను అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు అందజేశారు. అయితే ఆయా బ్యాంకుల ఐఎఫ్ఎస్ కోడ్లను సరిగా నమోదు చేయకపోవడంతో కొన్ని మండలాల అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు ఐదు నెలలుగా జీతాలు వారి ఖాతాల్లో జమ కాలేదు. ఈ చిన్న సాంకేతిక లోపాన్ని సరిచేయకుండా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లలో ఆవేదన వ్యక్తమవుతోంది. అగళిలో సమస్య జటిలం జిల్లాలోని అగళి మండలంలో 57 మంది అంగన్వాడీ కార్యకర్తలు, మరో 57 మంది హెల్పర్లు ఉన్నారు. వీరికి ఐదు నెలలుగా జీతాలు అంద లేదు. ఐఎఫ్ఎస్ కోడ్ నమోదులో వచ్చిన తేడా వలన ఈ పరిస్థితి ఏర్పడింది. మడకశిర నియోజకవర్గంలో 438 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 378 మంది హెల్పర్లు ఉన్నారు. వీరిలో అగళి మండలం వారికి మినహా మిగిలిన మండలాల వారందరికీ జీతాలు అందుతున్నాయి. దీంతో తామేమీపాపం చేసామంటూ అగళి మండలానికి చెందిన కార్యకర్తలు, సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లోపాన్ని సరి చేయాలంటూ అమరావతి కార్యాలయానికి పలుమార్లు స్థానిక ఐసీడీఎస్ అధికారులు వెళ్లి విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రజా ప్రతినిధులు సైతం ఈ సమస్య తమది కాదు అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండంతో అంగన్వాడీల ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. జీతాలు అందక ఇబ్బంది ఐదు నెలలుగా జీతాలు అందలేదు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. సాంకేతిక లోపం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అయితే లోపాన్ని సరిచేయకుండా మా జీవితాలతో ఆడుకుంటున్నారు. అధికారులకు చెప్పినా ఫలితం లేకుండా పోతోంది. వెంటనే జీతాలు చెల్లించి ఆదుకోవాలి.– సర్వమంగళ, అంగన్వాడీ కార్యకర్త, అగళి -
ప్రధానికి లేఖ రాసిన కింగ్‌ఫిషర్ స్టాఫ్
న్యూఢిల్లీ : గత ఆరు ఏళ్ల క్రితం అంటే 2012లో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తన దుకాణం మూసివేసింది. ఈ కంపెనీ ఉద్యోగులు ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నారు. కానీ తాజాగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తమకు చెల్లించాల్సి ఉన్న బకాయిలను ఇప్పించండి అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాల్యాకు వ్యతిరేకంగా తాజాగా ఛార్జ్‌షీటు నమోదు చేసిన వెంటనే కంపెనీ మాజీ ఉద్యోగులు తమ బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2012లో మూత పడింది. బ్యాంకులకు భారీగా రుణాలు ఎగవేసి, విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా, తమ వేతనం కానీ, గ్రాట్యుటీ, పరిహారాలు కానీ ఏమీ చెల్లించలేదని ప్రధానికి రాసిన లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు. లండన్, ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులకు మాత్రం మాల్యా అన్ని రకాల పేమెంట్లు జరిపారని తెలిపారు. లిక్విడేషన్ ప్రాసెస్‌తో తమ పీఎఫ్ మొత్తాన్ని కూడా విత్‌డ్రా చేసుకోవడానికి కుదరడం లేదన్నారు. మాల్యా చేతుల్లో తాము రక్తం చిమ్మించి చేసిన పని ఉందని, అతన్ని వెనక్కి తీసుకొచ్చి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో మాల్యాకు వ్యతిరేకంగా ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఒక్క రోజు అనంతరమే కింగ్‌ఫిషర్ మాజీ ఉద్యోగులు ప్రధానికి లేఖ రాశారు. -
దేశవ్యాప్తంగా నిలిచిన రూ.20 వేల కోట్ల లావాదేవీలు
-
బ్యాంకింగ్ సేవలకు సమ్మె సెగ..
న్యూఢిల్లీ: వేతనాలు స్వల్పంగా పెంచుతామని బ్యాంకులు చేసిన ప్రతిపాదనను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మెతో తొలి రోజు బుధవారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగింది. ముఖ్యంగా కేరళ, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఇటు నెలాఖరు, అటు వేతనాల సమయం కూడా కావడంతో విత్‌డ్రాయల్ లావాదేవీలపై ప్రతికూల ప్రభావం పడింది. పలు చోట్ల ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ప్రతిపాదించిన 2 శాతం వేతనాల పెంపును నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల సమ్మెకు దిగటం తెలిసిందే. గురువారం కూడా ఇది కొనసాగనుంది. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 13 పాత తరం ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఆరు విదేశీ బ్యాంకులు, 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది పైచిలుకు ఉద్యోగులు ఇందులో పాల్గొంటున్నారని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ఒక ప్రకటనలో తెలిపింది. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు దేశవ్యాప్తంగా 85,000 పైచిలుకు శాఖలు ఉన్నాయి. బ్యాంకింగ్ లావాదేవీల పరిమాణంలో 70 శాతం వాటా వీటిదే ఉంటోంది. స్వల్ప పెంపు అవమానించడమే.. 2012 నాటి వేతన సవరణలో 15% మేర పెంచగా.. తాజాగా రెండు శాతమే ఇస్తామనడం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులను అవమానించడమేనని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) జాయింట్ జనరల్ సెక్రటరీ రవీందర్ గుప్తా వ్యాఖ్యానించారు. దీంతో రెండు రోజుల వేతనాన్ని వదులుకుని మరీ సమ్మెకు దిగడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందన్నారు. నోట్ల రద్దు మొదలుకుని ముద్ర, జనధన యోజన మొదలైన ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయడంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని, కానీ దానికి ప్రతిఫలంగా రెండు శాతమే వేతనాల పెంపు అనేది కష్టించి పనిచేసిన వారికి తీవ్ర అన్యాయం చేయడమేనని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. ప్రైవేట్ బ్యాంకింగ్ యథాతథం.. సమ్మెతో డిపాజిట్లు, ఫిక్సిడ్ డిపాజిట్స్ రెన్యువల్స్, ప్రభుత్వ ట్రెజరీ కార్యకలాపాలు, మనీ మార్కెట్ లావాదేవీలు దెబ్బతిన్నాయి. ఆర్టీజీఎస్ మొదలైన సాధనాల రూపంలో కొంత మేర డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. మొత్తం బ్యాంకింగ్ కార్యకలాపాల్లో డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీల వాటా 5 శాతం ఉంటాయని పేర్కొన్నాయి. అటు, కొత్త తరం ప్రైవేట్ బ్యాంకులు ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు మొదలైనవి యథాప్రకారం పనిచేశాయి. చెక్కుల క్లియరెన్స్ వంటి కొన్ని లావాదేవీలపై మాత్రం ప్రభావం పడింది. రూ. 20వేల కోట్ల లావాదేవీలకు విఘాతం.. బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో దాదాపు రూ.20,000 కోట్ల విలువైన లావాదేవీలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు పరిశ్రమల సమాఖ్య అసోచామ్ అంచనా వేసింది. సమ్మెను విరమించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ)ని కోరింది. మరోవైపు, మొండిబాకీలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరును మెరుగుపర్చేందుకు తగు ప్రణాళికను రూపొందించాలని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ కోరారు. -
ముడుపులిస్తే రైట్..రైట్
విధులకు రాకపోయినా జీతాలు తీసుకోవచ్చు. అదేంటి విధులకు వెళ్తేనే కదా జీతం తీసుకోగలం అనుకుంటున్నారా? అయితే ఆర్టీసీ శాఖలో అధికారులను ప్రసన్నం చేసుకుంటే చాలు విధులకు రాకపోయినా సరేనెల జీతం బ్యాంకుల్లో జమ అవుతోంది. ఓడీ (ఔట్ ఆఫ్ డిజిగ్నేషన్) పేరుతో విధులకు డుమ్మా కొట్టే కండక్టర్లు ఇందుకోసం ఉన్నతాధికారులకు కొంత ముట్టచెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి జిల్లాలోని తూర్పు మండలాల్లోని ఆర్టీసీ డిపోల్లో ఈ జాడ్యం విస్తరించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓడీ విధానం ఆర్టీసీలోవివాదాస్పదమవుతోంది. పుత్తూరు:ఆర్టీసీలో ఓడీ విధానం ఉన్నతాధికారులకు కాసులు కురిపిస్తోంది. సంస్థకు ఉన్న అవసరాల దృష్ట్యా సిబ్బందికి రెగ్యులర్ విధులతో పాటు ఇతర బాధ్యతలు అప్పగించే వెసులుబాటు ఉంది. ఇందుకుగాను ఓడీ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. సరిగ్గా ఈ విధానమే ఆర్టీసీలోని కొంతమంది ఉన్నతాధికారులకు అవకాశంగా మారింది. దీంతో వారు దీని పేరిట అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం. ప్రత్యేకించి కొందరు కండక్టర్లకు ఓడీ పేరుతో ఇతర పనులు అప్పగిస్తూ వారి వద్ద నుంచి ముడుపులు పోగేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓడీ వేసుకున్న సిబ్బంది సొంత వ్యాపకాల్లో మునిగి తేలుతూ సంస్థకు గుదిబండగా మారుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతునా యి. నెల పూర్తయ్యే సరికి జీతాలను జేబుల్లో వేసుకుంటూ సంస్థకు నష్టం కలిగిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. నవ్విపోదురుగాక.. ఆర్టీసీ క్యాట్ కార్డులు, బస్‌పాసులు అమ్మేం దుకు కొందరు కండక్టర్లకు ఆన్‌డ్యూటీ వేస్తారు. వీరు ఆయా డిపోల పరిధిలోని మండలాలు, గ్రామాలకు వెళ్లి క్యాట్ కార్డులను అమ్మాలి. ఈ సాకుతో వారు సొంత పనులను చేసుకుంటున్నట్లు సమచారం. వీరి పనితీరును పర్యవేక్షించాల్సిన ఉన్నతా ధికారులు ముడుపులకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలు స్తోంది. తిరుపతిలో మరీ దారుణంగా బస్టాండ్‌లో కాసేపు కట్టి చేతపట్టుకుని కలియతిరిగి ఇంటికి చెక్కేస్తున్నారు. మరుగుదొడ్ల శుభ్రతపై తనిఖీ డ్యూటీలు వేస్తున్నారు. పుత్తూరు డిపో పరిధిలో అయితే తమిళనాడు, ప్రైవేట్ బస్సులు ఎన్ని వెళ్తున్నాయో తెలుసుకునేందుకు కండక్టర్లకు రూట్ సర్వే పేరుతో డ్యూటీ వేస్తున్నారు. అసలే నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి వీరు ఐరావతంలా మారారనే మాటలు వినిపిస్తున్నాయి. పాలసీ కట్టు..ఓడీ వేస్తా.. ఆర్టీసీలో కొందరు ఉన్నతాధికారులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు. ఇలాంటి వారికి ఓడీ విధానం వరంలా మారింది. జిల్లాలో 14 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. అయితే తూర్పు మండలాల్లో మాత్రం ఓడీ విధానం వివాదాస్పదమవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మూడు నియోజకవర్గాలకు కేంద్రమైన ఒక డిపోలోని ఉన్నతాధికారి ఏకంగా ఇన్సూరెన్స్ ఏజెంట్ అవతారమెత్తేశారు. ఔట్ ఆఫ్ డిజిగ్నేషన్ డ్యూటీ వేస్తే తన కుటుంబసభ్యుల దగ్గర ఎల్ఐసీ పాలసీని కొనుగోలు చేయాలనే అనధికారిక నిబంధనను విధించేశారు. దీంతో ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. తమిళనాడు సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఆ డిపోలో అయితే ఆర్టీసీ ఉన్నతాధికారి బరితెగించిట్లు సమాచారం. ఆయన్ను అన్ని రకాలుగా ‘సంత్పప్తి’పరిచిన వారికే ఓడీలు వేస్తున్నట్లు తెలు స్తోంది. తిరుపతిలో అయితే ఓడీ విధానం వివాదాస్పదమవుతోంది. ఇక్కడ కూడా ఉన్నతాధికారులకు ‘సంతర్పణ’ చేసిన వారికే ఇలాంటి డ్యూటీలు అప్పగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చర్యలు తీసుకుంటాం.. మన జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో ఔటాఫ్ డిజిగ్నేషన్ విధానం అనధికారికంగా ఎక్కడా లేదు. అయితే దీనిపై కార్మికుల నుంచి ఆరోపణలు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – చెంగల్‌రెడ్డి,రీజనల్ మేనేజర్, ఆర్టీసీ, తిరుపతి -
ఉపాధిలో లోపాలెన్నో..
కడప సిటీ : ఉపాధి హామీ పథకం జిల్లాలో సక్రమంగా అమలుకు నోచుకోలేదన్న విమర్శలున్నాయి. సమస్యలను పరిష్కరించడంలో అధికారులు తీవ్ర వైఫల్యం చెందారన్న ఆరోపణలున్నాయి. మజ్జిగ పంపిణీ, కూలీలకు సౌకర్యాలు, బిల్లుల చెల్లింపు, పెండింగ్ ఖాతాల పరిష్కారాలు, సిబ్బంది సమస్యలు తదితర అంశాలు తిష్టవేసి పరిష్కారానికి నోచుకోక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. పంపిణీ కాని మజ్జిగ :జిల్లాలో రోజుకు ఉపాధి పనులకు 1.80 లక్షల మంది కూలీలు హాజరవుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వేసవిలో కూలీలకు వడదెబ్బ సోకకుండా ఒక్కొక్కరికి 250ఎం.ఎల్ మజ్జిగను అందించాల్సి ఉంటుంది. ఇందుకుగానూ మేట్లకు మజ్జిగకు రూ.4లు, పంపిణీ చేసినందుకు ఒక్క రూపాయి ఇస్తారు. అయితే జిల్లాలో చాలా చోట్ల మేట్లు కూలీలకు మజ్జిగ పంపిణీ చేయకుండానే పంపిణీ చేస్తున్నట్లు నమోదు చేసుకుంటున్నారు. తమ ఖాతాలలో ఆ మొత్తాన్ని జమ చేసుకుంటున్నారు. అధికారులకు తెలిసినప్పటికీ ఈ విషయం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పరిష్కారంకానీ సస్పెన్షన్ ఖాతాలు :గతకొన్నేళ్లుగా ఉపాధి కూలీలకు సంబంధించి సస్పెన్షన్ ఖాతాల జాబితాలో ఉన్న వారికి ఇప్పటికీ కూలీ ల సొమ్ము అందలేదు. జిల్లా వ్యాప్తంగా ఈ ఖాతాల పరిధిలో 13,832మంది కూలీలు ఉన్నారు. దాదాపు రూ.2.26కోట్లు ఈ కూలీలకు డబ్బులు రావాల్సి ఉంది. ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాకు లింకేజీ కాకపోవడంవల్ల కూలీలకు డబ్బులు జమ కాలేదు. ఈ సమస్యను అధికారులు పరిష్కరించలేదు. ♦ కంప్యూటర్ ఆపరేటర్లు జాబ్ కార్డులు ఇచ్చేటప్పుడు వారి బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు నంబర్లు సరిగా వేస్తేనే ఖాతా నమోదవుతుంది. ఆపరేటర్ల నిర్లక్ష్యం ఉన్నా అధికారులు దగ్గరుండి చేయించకపోవడంవల్లే ఈ పరిస్థితి నెలకొంది. వాటర్ షెడ్ గ్రామాలలో అందని మజ్జిగ.. జిల్లాలో 795పంచాయతీలున్నాయి. ఇందులో 200గ్రామాలు వాటర్ షెడ్ కింద ఎంపికయ్యాయి. అయితే ఈ పథకం కింద ఎంపికైన గ్రామాలలో ఉపాధి కూలీలు మజ్జిగ పంపిణీకి నోచుకోలేదు. ఈ పథకానికి సంబంధించి ప్రత్యేక వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దాదాపు 40వేల మంది కూలీలకు మజ్జిగ అందడంలేదు. సరిగా అందని బిల్లులు :జిల్లాలో గతంలో లేని విధంగా కూలీలకు బిల్లుల సమస్య వెంటాడుతోంది. 2016–17 సంవత్సరంలో మార్చి నాటికే దాదాపు రూ.60లక్షల మేర బిల్లులు రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో బిల్లులు రాలేదు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధి పనులకు సంబంధించి కూలీలకు సకాలంలో కూలీ డబ్బులు అందడంలేదు. దీంతో కూలీలు పనులకు రావాలంటే మొగ్గు చూపడంలేదు. సోషల్ ఆడిట్‌పై విమర్శలు : ఉపాధి పనులను సక్రమంగా చేశారా.. లేక అక్రమాలకు పాల్పడ్డారా అనే విషయంపై సామాజిక తనిఖీ(సోషల్ ఆడిట్) చేయడం ఉపాధి పథకంలో ఒక నియమంగా ఉంటుంది. కానీ జిల్లాలో సోషల్ ఆడిట్‌పై పలు విమర్శలు వస్తున్నాయి. ♦ ముద్దనూరులో సోషల్ ఆడిట్ సక్రమంగా జరగలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అలాగే సొ మ్ము రికవరీ చేయడానికి అలసత్వం ప్రదర్శిస్తున్న ట్లు తెలుస్తోంది. కొంతమందినుంచి రికవరీ చేయకుండానే లోపాయికారి ఒప్పందం చేసుకుని అధికా రులు మళ్లీ విధులలో చేర్చుకున్నట్లు సమాచారం. ♦ ఉపాధిలో తిష్ట వేసిన సమస్యలను పరిష్కరించాలని డైరెక్టర్ రంజిత్ బాషాను ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తిష్ట వేసిన సమస్యలను పరిష్కరించే దిశగా నేడు జరిగే సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఖరారు
సాక్షి, చెన్నై: బ్యాంకు ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నారు. రెండు రోజుల పాటు(48 గంటల) సమ్మె చేపట్టనున్నామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) నాయకులు చెప్పారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మె చేపట్టనున్నారు. మే 30వ తేదీ ఉదయం 6గంటల నుంచి జూన్ 1వ తేదీ ఉదయం 6గంటల వరకు సమ్మె నిర్వహించేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. వేతనాల సమీక్ష విషయంలో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్లు(యూఎఫ్‌బీయూ)కి, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)కి మధ్య మే 5 న ముంబైలో జరిగిన చర్చలు మరోసారి విఫలమవడంతో సమ్మెకు దిగుతున్నట్టు వెల్లడించారు. బ్యాంక్ మేనేజ్మెంట్ అండ్ చీఫ్ లేబర్ కమీషనర్ (సెంట్రల్), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కు సమ్మె నోటీసులిచ్చామని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం స్పష్టం చేశారు. . 2017, నవంబరు నుంచి వేతన సవరణ పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. 2012 నవంబర్ 1న 10వ బిపర్‌టైట్ వేతన ఒప్పందంలో భాగంగా మొత్తం వేతన బిల్లులో 15 శాతానికి పైగా పెంపునకు బదులుగా 2శాతం ఐబీఏ ఆఫర్ చేయడాన్ని యూనియన్లు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. -
జీతాల్లేవ్ !
మడకశిర మండలం కల్లుమరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 14 మంది టీచర్లు, నాన్ టీచింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరికి రెన్నెళ్లుగా మార్చి, ఏప్రిల్ జీతాలు నేటికీ అందలేదు. సీఎఫ్ఎంఎస్ విధానంలో ఈ స్కూల్ హెచ్ఎం ఆదినారాయణరెడ్డి డీడీఓగా ఉన్నారు. ఈయనేమో ఏకంగా మూడుసార్లు స్టాఫ్ అందరి హెచ్ఆర్ వివరాలు ఆన్లైన్లో పొందు పరిచారు. కానీ ఇప్పటిదాకా వారికి జీతాలు మాత్రం అందలేదు. ట్రెజరీ కార్యాలయంలో విచారిస్తే సర్వర్ స్లోగా ఉందంటూ సమాధానం చెబుతున్నారు. జీతాల విషయమై స్టాఫ్ హెచ్ఎంతో గొడవ పడుతున్నారు. జీతాలు రాకపోయే సరికి నెలానెలా కట్టాల్సిన వ్యక్తిగత రుణాలు, ఇతరత్రా అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు. అనంతపురం ఎడ్యుకేషన్: ఖజానా శాఖలో నూతన విధానం ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో గుబులు పుట్టిస్తోంది. మొన్నటి దాకా ప్రతినెలా ఒకటో తేదీ టంచనుగా జీతాలు అందుతుండగా రెన్నెళ్లుగా ఆలస్యమవుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు 34,900 మంది ఉండగా, టీచర్లు 16,300 మంది దాకా ఉన్నారు. జీతాల చెల్లింపులో సాంకేతికను ప్రవేశపెట్టి పారదర్శకతను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ‘సమగ్ర ఆర్థిక చెల్లింపుల వ్యవస్థ’ సీఎఫ్ఎంఎస్ను తీసుకొచ్చింది. దీనిపై డ్రాయింగ్ అధికారులకు (డీడీఓ) సరైన అవగాహన లేదు. ఫలితంగా క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తుతున్నాయి. స్థానికంగా ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వేదికగా రాజధానిలో కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. అయినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. వేలాదిమంది ఉద్యోగ, ఉపాధ్యాయుల వివరాలు సీఎఫ్ఎంఎస్లోకి మార్చాల్సి ఉంది. ఈ మార్పులు చేసేందుకు కొత్త సర్వర్ సరిగా పని చేయడం లేదు. వివరాలు మార్పుచేసి బిల్లులు పెట్టాలంటే సమయం చాలా పడుతుందని డీడీఓలు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో జీతాలపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ ఒక్కటే కాదు దాదాపు అన్ని శాఖల ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. అయితే ఎక్కువమంది ఉద్యోగులున్న విద్యాశాఖలో ఈ గందరగోళం మరింత ఎక్కువగా ఉంది. మరోవైపు కొత్త విధానంపై అవగాహన లేకపోవడం ఓ సమస్య అయితే సమస్యల పరిష్కారానికి రాజధానిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినా ప్రయోజనం లేదని డీడీఓలు వాపోతున్నారు. సర్వర్ పని చేయకపోవడం, వివరాలు అప్లోడ్ చేసేందుకు ఎదరువుతున్న సాంకేతిక పరమైన ఇబ్బందులపై కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే వారి నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా కొత్త విధానాన్ని అమలు చేసే ముందు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఉన్నఫళంగా అమలు చేయడంతోనే సమస్య తలెత్తుతోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మార్చి నెల జీతాలందలేదు సీఎఫ్ఎంఎస్ విధానం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీడీఓలకు అవగాహన కల్పించకపోవడం సమస్యగా మారింది. జిల్లాలో దాదాపు 100 పాఠశాలల ఉపాధ్యాయులకు మార్చి నెల జీతాలు ఇప్పటికీ అందలేదు. ఉన్నతాధికారులు స్పందించి సీఎఫ్ఎంఎస్ విధానంపై స్పష్టమైన అవగాహన కల్పించాలి. – పి.అశోక్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
నీరుగారుతున్న వయోజన విద్య
ముప్పాళ్ల: వయోజనులకు విద్య అందించాలనే లక్ష్యంతో సాక్షరభారత్ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన వయోజనులకు, చదువు రాని వారికి ఉదయం, సాయంత్రం సమయాల్లో చదువు చెప్పే దిశగా 2010లో సాక్షరభారత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆలోచనైతే బాగానే ఉంది కానీ ఆచరణలో మాత్రం అది అమలు కావటం లేదు. ఎప్పుడు కార్యక్రమం ఉంటుందో ఎప్పుడు తీసేస్తారో కోఆర్డినేటర్లకే అర్థం కాకుండా పోతోంది. ఈ కేంద్రాల్లో పనిచేసే మండల, గ్రామస్థాయి కో ఆర్డినేటర్లకు జీతాలు అందకపోవడంతో కేంద్రాల నిర్వహణ భారంగా మారింది. జీతం లేని కొలువు ఎన్నాళ్లు చేస్తామని పలువురు కోఆర్డినేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి విధులతో పాటుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమల్లోనూ అదనపు విధులు నిర్వహిస్తుండటంతో మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కార్యక్రమాన్ని కూడా ఎత్తివేసే ఆలోచనలో ప్రభుత్వాలు ఉండటం వయోజన విద్య మిథ్యగా మారిపోయింది. ఐదు నెలలుగా జీతాల కరువు.. జిల్లాలో మొత్తం 57 మండలాలకు గాను, 57 మంది మండల కోర్డినేటర్ లు, 1022 పంచాయతీలకు గాను ఒక్కో గ్రామానికి ఇద్దరు చొప్పున సాక్షరభారత్ కోఆర్డినేటర్లను నియమించారు. వీరిలో రాజకీయ కోణంలో కొన్ని చోట్ల ఖాళీలు అయినప్పటికీ వాటిని భర్తీ చేసిన దాఖలాలు లేవు. గ్రామ కోఆర్డినేటర్లు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు విద్యాభోదన చేస్తారు. ఒక్కోసారి ప్రత్యేకంగా రెండు గంటల సమయం అదనంగా బోధనకు వెచ్చిస్తారు. మండల కోఆర్డినేటర్ జీతం నెలకు రూ.6 వేలు ఉండగా, గ్రామ కోఆర్డినేటరుకు రూ. 2 వేలు ప్రభుత్వం అందిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వీరికి గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వేతనాలు అందడం లేదు. కొంతమంది కేవలం దీనిని నమ్ముకొనే ఉండటం వలన వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మరికొందరు చేసేదేమీ లేక అప్పులు తెచ్చుకొని ఇల్లు గడుపుకొంటున్న సందర్భాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా మారే ఇలాంటి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయక పోవటం, జీతాలు సక్రమంగా చెల్లించక పోవటంతో కార్యక్రమంతో పాటు కోఆర్డినేటర్లు పరిస్థితి దయనీయంగా మారింది. ఉద్యోగ భద్రత కరువు ఐదు నెలలుగా వేతనాలు అందాల్సి ఉంది.అక్షరాస్యతతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల నిర్వహణలో భాగంగా నిలుస్తున్నాం. అయినా మాకు ఉద్యోగ భద్రత లేదు. జీతాలు సకాలంలో రావడం లేదు. అధికారులు, పాలకులు స్పందించి జీతాలు విడుదల చేయాలి.–ఎం.బ్రహ్మానందం,సాక్షర్‌భారత్ మండల కో ఆర్డినేటర్ -
వేతనాల్లేవు..!
ప్రభుత్వ నిర్ణయాలు ఉద్యోగుల జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన సీఎఫ్ఎంఎస్ విధానం అమలులో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో జీతాలు నిలిచిపోయాయి. మార్చి నెల నుంచి వేతనాలు అందక ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్థిక గణాంకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకురావడంలో భాగంగా ప్రభుత్వం నూతనంగా సీఎఫ్ఎంఎస్(కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌సిస్టం) విధానాన్ని ప్రవేశపెట్టింది. ట్రెజరీ ద్వారా మంజూరయ్యే బిల్లులన్నింటినీ ఈ విధానం ద్వారానే దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 37,790 మంది ఉద్యోగులు, 39 వేల మంది పింఛనర్లతోపాటు, ఇతర బిల్లులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పంపాలని, కాగిత రహిత విధానం అమలు చేయాలని స్పష్టంగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా ‘శాప్’ అనే ప్రైవేటు సంస్థ ద్వారా అన్ని శాఖల్లోని ఉద్యోగులు, అధికారులకు శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కొన్ని శాఖలకు సాంకేతికంగా అవసరమైన స్కానర్లు, కంప్యూటర్లు, ఇతర పరికరాలు అందజేశారు. వీటి వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో బిల్లులు దాఖలు చేయడంలో బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా ఇంటర్నెట్ సదుపాయం కూడా వేగంగా లేకపోవడంతో ఒక బిల్లు అప్లోడ్ చేయడానికి రెండు నుంచి మూడు గంటలు పడుతోందని పలు శాఖల అధికారులు చెబుతున్నారు. కంప్యూటర్లు పూర్తి సామర్థ్యంతో పని చేయక పోవడంతో సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతీ నెల 18 నుంచి 25వ తేదీ మధ్య బిల్లులు ఖజానాశాఖకు సమర్పించాలని చెప్పారు. అయితే ప్రస్తుతం కొన్ని శాఖలకు సంబంధించి ఇప్పటి వరకు బిల్లులు పొందుపర్చకపోవడంతో ఉద్యోగుల జీతాలపైన ప్రభావం చూపుతోంది. కొన్నిశాఖల అధికారులు బిల్లులు ఆలస్యంగా సమర్పించడం, ప్రభుత్వం నుంచి కొన్ని బిల్లులకు డబ్బులు చెల్లించాలా లేదా అనే విషయంలో అనుమతులు రాకపోవడంతో పెండింగ్‌లో ఉంచారు. ప్రధానంగా తలెత్తుతున్న సమస్యలివే.. కొన్ని శాఖలలో ప్రధానంగా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి సిస్టంలు, స్కానర్లు, ప్రింటర్లు, నెట్ స్పీడ్ లేకపోవడంతో జీతాల బిల్లులు ఆన్లైన్లో సమర్పించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. డిపార్టుమెంట్ సంబంధించి అధికారులకు సాంకేతిక పరిజ్ఞానంపైన శిక్షణ ఇవ్వలేదు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించలేదు. దీనికి సంబంధించి ప్రధానంగా కొన్ని శాఖల అధికారులు ఇంతవరకు శిక్షణ తీసుకోలేదు. దీంతోనే సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలకు సంబంధించిన జీతాలు సైతం మార్కెటింగ్ శాఖతోపాటు, పలుశాఖల ఉద్యోగులకు రాలేదు. ఎయిడెడ్ ఉద్యోగులకు సంబంధించి సీఎఫ్ఎంఎస్ విధానం గుదిబండగా మారింది. దీంతో ఉద్యోగుల జీతాలు ఆలస్యమవుతున్నాయి. ప్రధానంగా ఇంజినీరింగ్శాఖకు సంబంధించి పీఏవో ద్వారా జీతాలు తీసుకునేవారు. వారిలో హెచ్ఆర్ఎంఎస్ సిబ్బందికి చెక్కు ద్వారా జీతాలు చెల్లించేవారు. వీరికి సంబంధించి బ్యాంకుల్లో ఐడీలు లేకపోవడంతో ప్రభుత్వం ముందస్తుగా ఒక్కోక్కరికి రూ.75వేలు అడ్వాన్సును చెల్లించింది. మొత్తంగా ఏప్రిల్ నెల జీతాలు పూర్తి స్థాయిలో ఉద్యోగులకు అందేలా చేసేందుకు ఆయా డిపార్టుమెంటల్ అధికారులు, ఖజానా సిబ్బంది పూర్తి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఖజానా కార్యాలయానికి సీఎఫ్ఎంఎస్ విధానంలో 2,250 బిల్లులు రాగా 950 బిల్లులు పాస్ అయినట్లు సమాచారం. 600 బిల్లులు డీడీవోల స్థాయిలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. వీలైనంత త్వరగా బిల్లులు పాస్‌చేసేందుకు ఖజానా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు ఖజానా అధికారులు పేర్కొన్నారు. అందరికి జీతాలు అందేలా చేస్తాం జిల్లాలోని ఉద్యోగులు , పింఛనర్లు అందరికి జీతాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. నిర్ధేశిత సమయం మించినప్పటికీ ఆన్లైన్ ద్వారా వస్తున్న వేతన బిల్లులను ఖచ్చితంగా పాస్ చేసేలా ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. నూతనంగా ప్రవేశపెట్టిన సాంకేతిక విధానం వల్ల చిన్న చిన్న సాంకేతిక సమస్యల తలెత్తుతున్న మాట వాస్తవం. కాని ఇందులోని బాలారిష్టాలను అధిగమించి బిల్లులతోపాటు, వేతనాలు ఖచ్చితంగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం.– ఎన్.సదాశివరావు, ఉప సంచాలకుడు, జిల్లా ఖజానాశాఖ -
‘పుర’ కార్మికులకు వేతనాల పెంపు
సాక్షి, హైదరాబాద్ : పురపాలికల కౌన్సిల్ అనుమతితో వెంటనే ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపును అమలు చేసి వారితో సమ్మె విరమింపజేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. వేతనాల పెంపునకు సంబంధించి ఏ పురపాలిక కౌన్సిల్ అయినా తీర్మానం చేయకుంటే వెంటనే చర్యలు తీసుకోవాల న్నారు. శనివారం సచివాలయంలో మున్సి పల్ కమిషనర్లు, జిల్లా పౌర సంబంధాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరె న్స్లో ఆయన మాట్లాడుతూ.. వేతనాల పెంపునకు మునిసిపాలిటీల నిధులు వినియోగించుకోవాలన్నారు. మునిసిపల్ కమిషనర్లు కలెక్టర్లకు అందుబాటులో ఉండి పారిశుధ్య సమస్య లేకుండా చూడాలన్నారు. సమ్మె కొనసాగు తున్న చోట ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మునిసిపల్‌శాఖ మంత్రి ఆదేశించా రని ఆయన చెప్పారు. అనుకూల వార్తలకు చర్యలు మునిసిపల్ కమిషనర్లు, జిల్లా పౌర సంబం ధాల అధికారులు సమన్వయం చేసుకుని మీడియాలో అనుకూల వార్తలు వచ్చేలా చూడాలని అరవింద్ కుమార్ ఆదేశించారు. ఆస్తి పన్నుకు సంబంధించి ఖమ్మం కార్పొ రేషన్ 99% వసూలు చేసినందుకు ప్రత్యేకంగా అభినందించారు. -
ఖాళీ కడుపులతో విధులు
నక్కపల్లి(పాయకరావుపేట): పంచాయతీ సిబ్బంది ఆకలితో అలమటిస్తున్నారు. నాలుగు నెలలుగా జీతాలకు నోచుకోక పస్తులతోనే విధులకు హాజరయ్యే దుస్థితి. పంచాయతీల్లో నిధులున్నప్పటికీ వాటి వినియోగంపై ప్రభుత్వం ఆంక్షలతో ఈ పరిస్థితి నెలకొంది. గతంలో సంక్రాంతి, ఉగాది పండుగలప్పుడూ వీరికి జీతాలు చెల్లించకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 37 మేజర్పంచాయతీలు, 888 మైనర్ పంచాయతీలు ఉన్నాయి. వీటిని 558 పంచాయతీ క్లస్టర్లుగా విభజించారు. వీటిలో కార్యనిర్వాహణాధికారులు, బిల్కలెక్టర్లు, అటెండర్లు, గుమస్తాలు, పారిశుద్ధ్యకార్మికులు, పార్ట్‌టైం అసిస్టెంట్లు మొత్తంగా సుమారు 4వేలమందికి పనిచేస్తున్నారు. వీరికి జీతాలు పంచాయతీ సాధారణ నిధుల నుంచి చెల్లిస్తుంటారు. చాలా పంచాయతీల్లో పారిశుద్ధ్య సిబ్బందిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. రక్షిత మంచినీటి పథకాల నిర్వాహణను స్విచ్‌బోర్డు ఆపరేటర్లతో చేయిస్తుంటారు. ఏడాదికి కొంత బడ్జెట్ కేటాయించి, దాని పరిధికి లోబడి పారిశుద్ధ్య సిబ్బంది, పార్ట్‌టైం అసిస్టెంట్లకు వేతనం చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులర్ ఉద్యోగులైన కార్యనిర్వాహణాధికారులు, బిల్కలెక్టర్లు, అటెండర్లు, గుమస్తాలకు కూడా పంచాయతీ నిధుల నుంచే జీతాలు చెల్లిస్తుంటారు. ఇంటి పన్నులు వసూళ్లు, సెస్సులు, డైలీమార్కెట్లు, షాపింగ్‌కాంప్లెక్స్‌లు పంచాయతీకి వచ్చే ఆదాయ వనరులు. ప్రత్యేక గ్రాంట్లు ద్వారా సమకూరే ఆదాయం నుంచి ఏటా 15నుంచి 35 శాతం సిబ్బంది జీతాలకు ఖర్చు చేస్తుంటారు. పంచాయతీలకు ఈ ఆదాయం యథావిధిగానే సమకూరుతుంది. ఇంటి పన్నుల వసూళ్లు కూడా సక్రమంగానే జరుగుతున్నాయి. సెస్సుల రూపంలో వచ్చే ఆదాయం బాగానే వస్తోంది. ఐనప్పటికీ సిబ్బందికి జీతాలు చెల్లించే విషయంలో స్థానిక సంస్థలపై ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోంది. వీరి జీతాలను సబ్‌ట్రెజరీల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా పంచాయతీ పాలకవర్గాలు జమాఖర్చులను ఆమోదించి సిబ్బందికి చెల్లించాల్సిన జీతాలను బిల్లు పెట్టి ట్రెజరీకి పంపిస్తుంటారు.అక్కడ కొర్రి వేయడం వల్ల జీతాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. రాష్ట్రప్రభుత్వం దుబారాఖర్చులు చేపడుతూ నిధుల వినియోగం పై ఆప్రకటిత ఆంక్షలు (ఫ్రీజింగ్) విధించడం వల్ల పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు చెల్లించని దుస్థితి. ఒక్క సిబ్బంది జీతాలే కాకుండా పంచాయతీలో వీధి దీపాలు, రక్షితమంచినీటి పథకాల నిర్వాహణ, చిన్నచిన్న మరమ్మతు పనుల కోసం కూడా నిధులు డ్రాచేసే అవకాశం లేదని సిబ్బంది పేర్కొంటున్నారు. ఉదాహరణకు పాయకరావుపేట మేజర్ పంచాయతీలో 64 మంది పనిచేస్తున్నారు. వీరికి నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించలేదు. సుమారు రూ.7.84 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఏళ్ల తరబడి పంచాయతీల్లో పనిచేస్తున్నాం కాబట్టి సకాలంలో జీతాలు చెల్లించక పోయినా వేరే గత్యంతరం లేక పస్తులుంటూనే విధులు నిర్వర్తించాల్సి వస్తున్నదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు నెలలయితే ఫర్వాలేదు.ఏకంగా నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించకపోతే ఎలా బతకాలంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు. ఈవిషయాన్ని డీపీవో కృష్ణకుమారి వద్ద ప్రస్తావించేందుకు ప్రయత్నించగా ఆమె అమరావతిలో కమిషనర్ సమావేశానికి హాజరు కావడంతో అందుబాటులో లేరు. పాయకరావుపేట పంచాయతీ ఈవో లవరాజు వద్ద జీతాల బకాయిలు విషయం ప్రస్తావించగా పంచాయతీలో సుమారు 64 మంది సిబ్బంది పనిచేస్తున్నారని నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించలేదని తెలిపారు. దాదాపు 7.80 లక్షలు బకాయి ఉందన్నారు. ట్రెజరీ ఆంక్షలు కారణంగా చెల్లించలేదన్నారు. -
ఇప్పుడు జీతాల కోసం
సాక్షి, అమరావతి: కరువు భత్యం(డీఏ), పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) బకాయిల కోసం ఇప్పటికే చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లపై మరో బండ పడింది. డీఏ, పీఆర్సీ బకాయిల సంగతేమో గానీ నెలవారీగా అందాల్సిన వేతనాలు, పింఛన్లు సైతం రాక ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా అమల్లోకి తీసుకొచ్చిన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్ఎంఎస్) దారుణంగా విఫలమైంది. ఏప్రిల్ వచ్చి 25 రోజులు గడిచినా మార్చి నెల వేతనాలు, పింఛన్లు ఇప్పటికీ రాలేదని లక్షలాది మంచి ఉద్యోగులు, పెన్షనర్లు గగ్గోలు పెడుతున్నారు. గడచిన నెల వేతనాలను మరుసటి నెల ఒకటో తేదీకల్లా చెల్లించాల్సి ఉంది. దశాబ్దాలుగా ఇదే విధానం అమలవుతోంది. కానీ, మార్చి నెల వేతనాలు, పింఛన్లు ఏప్రిల్ నెల 10వ తేదీ నాటికి 50 శాతం మందికి కూడా అందలేదు. ఏప్రిల్ 15 తేదీ నాటికి 40 శాతం మందికి రాలేదు. ఇప్పటికీ 20 శాతం మందికి వేతనాలు, పింఛన్లు రాకపోవడంతో అగచాట్లు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ తలెత్తలేని ఉద్యోగులు, పెన్షనర్లు మండిపడుతున్నారు. డీఏ, పీఆర్సీ బకాయిల సంగతేంటి? రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే రెండు డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 2017 జూలై ఒకటో తేదీ నుంచి ఒక డీఏ, 2018 జనవరి నుంచి మరో డీఏను బకాయిలతో సహా ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. పెన్షనర్లకు కూడా రెండు డీఏలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన పదో పీఆర్సీ బకాయిలు రూ.4,500 కోట్లు ఇవ్వడానికి నాలుగేళ్లు గడిచినా ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఆగిపోయిన బిల్లులు సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ సక్రమంగా పని చేయకపోవడంతో వేతనాలు, పింఛన్లతోపాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల బిల్లుల చెల్లింపులు సైతం ఆగిపోయాయి. అప్పు చేసి వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన సొమ్ముకు సంబంధించిన చెక్కులు చెల్లుబాటు కావడం లేదు. మార్చి నెలలో జారీ చేసిన పది వేలపైగా చెక్కులను బ్యాంకులు తిరస్కరించాయి. నెల రోజుల నుంచి సీఎంఆర్ఎఫ్ చెక్కుల జారీ ప్రక్రియను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన బిల్లుల సమర్పణ, చెల్లింపులు కూడా ఆగిపోయాయి. వేతనాలు అందని విభాగాలు ఎయిడెడ్ విద్యాసంస్థల ఉద్యోగులతోపాటు ఇరిగేషన్, రహదారులు–భవనాలు, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లోని పలువురు ఉద్యోగులకు మార్చి నెల వేతనం ఇంకా రాలేదు. మార్చి, ఏప్రిల్ నెలలకు కలిపి ఒక్కో ఉద్యోగికి రూ.75 వేల చొప్పున అడ్వాన్స్‌గా ఇచ్చారు. ఈ అడ్వాన్స్ సరిపోదని, నెలకు ఒక్కో ఉద్యోగికి రూ.50 వేల వేతనం ఉన్నందున, మిగతా మొత్తాన్ని కూడా ఇప్పించాలని వర్క్ చార్జెడ్ ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు ఆర్థిక శాఖను కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. చిరుద్యోగులు ఎలా బతకాలి? 25వ తేదీ వచ్చినా ప్రభుత్వం వేతనం ఇవ్వకపోతే తాము ఎలా బతకాలని చిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ‘‘మొదటి వారం దాటితే ఇంటి యజమానులు అద్దె ఇవ్వాలని అడుగుతారు. పాల బిల్లు, కరెంటు బిల్లు, పిల్లలకు స్కూలు ఫీజులు ఠంచనుగా చెల్లించాల్సిందే. కిరాణా సరుకులు కొనుక్కోవాలంటే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? పైపెచ్చు ఆర్థిక సంవత్సరం చివరి నెలలు కావడంతో వేతనంలో కోత పడకుండా ఆదాయపు పన్ను మినహాయింపుల కోసం ఇన్సూరెన్స్ ప్రీమియం లాంటివి కట్టాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతి ఉద్యోగికి ఏప్రిల్ చాలా కీలకం. ఈ నెలలోనే వేతనం ఇవ్వకపోవడం దారుణం’’ అని ఉద్యోగ సంఘం నాయకుడొకరు విమర్శించారు. అక్కరకు రాని సీఎఫ్ఎంఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎఫ్ఎంఎస్ ఏర్పాటుకు 2013లో ఎన్ఐఐటీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా ఆ సంస్థకు రెండు దశల్లో రూ.100 కోట్లకుపైగా చెల్లించారు. ఎన్ఐఐటీ కోసం తొలుత రూ.60 కోట్లతో సూపర్ కంప్యూటర్లను కొనుగోలు చేశారు. ఆ సంస్థ ప్రతినిధులు మూడేళ్ల పాటు సాఫ్ట్వేర్, డేటా డెవలప్మెంట్ పేరిట కాలయాపన చేశారు. సాఫ్ట్వేర్ రూపకల్పనలో విఫలమైన ఎన్ఐఐటీని ప్రభుత్వం పక్కకు తప్పించింది. అనంతరం ఆ సంస్థకు ఆంధ్రప్రదేశ్ వాటా కింద గతేడాది ఫిబ్రవరి 23న రూ.41.99 కోట్లు చెల్లించారు. విఫలమైన సంస్థకు నిధులు చెల్లించడానికి కారణం.. ఆ సంస్థ ప్రతినిధి ‘ముఖ్య’నేతకు సన్నిహితుడు కావడమే. తరువాత ఎస్ఏపీ ప్లాట్‌ఫాంపై సాఫ్ట్వేర్, డేటా డెవలప్మెంట్కు రూ.46.23 కోట్లు ఖర్చుచేశారు. అనంతరం సేవల కోసం అంటూ వివిధ దశల్లో 12 జీవోల ద్వారా రూ.38.19 కోట్లు చెల్లించారు. అంతా సిద్ధమైందని, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సీఎఫ్ఎంఎస్ ద్వారానే ఆర్థిక కార్యకలాపాలు, బిల్లుల సమర్పణ, చెల్లింపులు జరుగుతాయని ప్రభుత్వం పేర్కొంది. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థను ముఖ్యమంత్రి ఇటీవలే అట్టహాసంగా ప్రారంభించారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 24 రోజులు దాటినప్పటికీ కొత్త వ్యవస్థ ద్వారా బిల్లుల సమర్పణ, చెల్లింపులు సక్రమంగా జరగడం లేదు. ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పింఛన్లు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. దీనికి కారణం సాఫ్ట్‌వేర్‌లో లోపాలు తలెత్తడంతోపాటు ట్రెజరీల్లోని సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వకపోవడమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
25 నుంచి మునిసిపల్ సమ్మె!
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలను తక్షణమే పెంచాలని, లేని పక్షంలో ఈనెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగిలిన 72 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పని చేస్తున్న 16 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారని స్పష్టం చేసింది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉండిపోయిన వేతనాల పెంపు డిమాండ్‌పై బుధవారం రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టరేట్ ముందు కార్మికులతో ధర్నా నిర్వహించింది. అనంతరం ఆ శాఖ ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ మేరకు సమ్మె హెచ్చరికలు జారీ చేసింది. జేఏసీ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ నేతృత్వంలోని కార్మిక సంఘాల నేతలు పురపాలక శాఖ అధికారులకు ఈ మేరకు సమ్మె నోటీసులు అందించారు. పురపాలికల్లో కీలకమైన పారిశుధ్య సేవలు, పార్కులు, నీటి సరఫరా, వీధి దీపాలు, మలేరియా నివారణ, బిల్ కలెక్టర్లు, సూపర్వైజర్లు, ఆఫీసు సిబ్బందితోపాటు వివిధ కేటగిరిల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమ విధులను బహిష్కరించి సమ్మెలోకి దిగనున్నారని వెల్లడించారు. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి రాష్ట్రంలోని పురపాలికల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలను జీవో నం.14 ప్రకారం కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల వారీగా వరుసగా రూ.17.5 వేలు, రూ.15 వేలు, రూ.12 వేలకు పెంచాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం కార్మికులకు చెల్లిస్తున్న రూ.8,300 వేతనం ఏ మాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ‘వేతనాలు పెంచినా చెల్లించాల్సింది పురపాలికలే కాబట్టి అవే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. అయితే పురపాలికల ఆదాయం అంతంత మాత్రమే ఉందని, వేతనాలు పెంచితే చెల్లించే స్తోమత పురపాలికలకు లేదని ఇప్పటికే మేయర్లు, మునిసిపల్ చైర్పర్సన్లు తేల్చి చెప్పారు. ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలనే 3 నెలలకోసారి చెల్లిస్తున్నామని వారు ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కార్మికు ల వేతనాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి’అని జేఏసీ డిమాండ్ చేసింది. రెండోసారి సమ్మెకు సై! రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వేతనాల పెంపు డిమాండ్‌తో 2015 జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు సమ్మె నిర్వహించారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వ్యర్థాలు, చెత్త పేరుకుపోయి సామాన్య ప్రజలు అవస్తలకు గురయ్యారు. సమ్మె విరమిస్తే వేతనాల పెంపును పరిశీలిస్తామని అప్పట్లో సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో కార్మికులు తిరిగి విధుల్లో చేరారు. అయితే జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాలు పెంచిన ప్రభుత్వం మిగిలిన పురపాలికల్లో పని చేస్తున్న కార్మికుల విషయంలో ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. -
మా వేతనాలు వదులుకోబోం: శివసేన
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ మలివిడత సమావేశాలు కొనసాగని కారణంగా.. 23 రోజుల వేతనాన్ని వదులుకుంటున్నామన్న బీజేపీ నిర్ణయంపై ఎన్డీయే పక్షాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ వేతనాలు వదులుకోబోవటం లేదని శివసేన స్పష్టం చేసింది. వేతనాల విషయంలో తమను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని మండిపడింది. పార్లమెంటు నిరసనలతో వాయిదా పడేందుకు ప్రభుత్వం తీరే కారణమని శివసేన విమర్శించింది. అటు ఆర్ఎల్ఎస్పీ చీఫ్, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ కూడా వేతనాల విషయం తమకు తెలియదన్నారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా బీజేపీ నాయకత్వం నిర్ణయంపై విభేదించారు. కాగా, మొత్తం 400 మంది ఎన్డీయే ఎంపీ (ఉభయసభలు)ల 23 రోజుల వేతనం రూ.3.66 కోట్లను వదులుకోనున్నట్లు గురువారం కేంద్ర మంత్రి అనంత్ కుమార్ వెల్లడించారు. -
కుయ్‌కుయ్..నయ్నయ్
పార్వతీపురం: ప్రజలకు 108 వాహనాల సేవలు రోజురోజుకూ దూరమవుతున్నాయి. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అనారోగ్యంతో బాధపడేవారిని సకాలంలో ఆస్పత్రులకు చేర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ వాహనాలు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కునారిళ్లుతున్నాయి. ఒకప్పుడు ఒక్క ఫోన్‌తో వచ్చే వాహనాలు, ఇప్పుడు రాకపోవడంతో ఆటోల్లో రోగులను తరలించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 108 వాహనాల ఏర్పాటు లక్ష్యం కుంటుపడుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటి నిర్వహణ సంస్థలను మారుస్తుండడం కూడా వీటి దారుణ స్థితికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగులకు అందని వేతనాలు.. వాహనాల పరిస్థితి ఎలా ఉందో, వాటిలో పని చేసే ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉంది. గతంలో జీవీకే సంస్థ నిర్వహణ చూసేది. 2017 డిసెంబర్లో బీవీజీ (భారతీయ వికాస్ గ్రూప్)కు బాధ్యతలు మారాయి. అప్పటికి జీవీకే వారు మూడు నెలల జీతాన్ని సిబ్బందికి ఇవ్వాల్సి ఉంది. ఒక్కో ఉద్యోగికి రూ.12,500 చొప్పున మూడు నెలలకు గానూ రూ.37,500 ఇవ్వాల్సి ఉంది. మొత్తం 153 మంది ఉద్యోగులకు రూ.57,37,500 బకాయి ఉంది. ఆ మొత్తాన్ని జీవీకే చెల్లించలేదు. కొత్త సంస్థకు అప్పగించ లేదు. దీంతో నాలుగు నెలలుగా 108 సిబ్బంది వేతనాలు రాక అవస్థలు పడుతున్నారు. ఉద్యోగుల రిలీవింగ్ బిల్లులు, గ్రాట్యూటీ అంశాలు కొత్త సంస్థ చేతికి ఇవ్వలేదు. దీంతో 108 ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం కొన్ని రోజులుగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతూ నిరసన తెలుపుతున్నారు. సరఫరా కాని మందులు.. వైఎస్సార్ హయాంలో 108 వాహనాలకు 108 రకాల మందులు సరఫరా చేసేవారు. రోగులను ఆస్పత్రికి చేర్చేలోపు ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు దానిలో ఉండేవి. జీవీకే వారు కూడా 100 రకాల మందులు అందించేవారు. కానీ బీవీజీ సంస్థ వారు 108 నిర్వహణ బాధ్యతలను తీసుకున్న తర్వాత 57 రకాల మందులను మాత్రమే ఇస్తున్నారు. ఈఎంటీ, ఫైలెట్లకు అవసరమైన గ్లౌజులు, మాస్కులు నేటికి ఇవ్వలేదు. రోగుల కోసం మందులు, సూదులు, ఎట్రోసిన్, ఎడ్రినాలిన్ వంటి మందులు, గుండెనొప్పితో బాధపడే వారికి ఇచ్చే సార్బిట్ రేట్ ట్యాబ్లెట్లను, డెలివరీ కిట్స్‌ను సరఫరా చేయలేదు. ఆక్సిజన్ సిలెండర్లను కూడా సరఫరా చేయడం లేదు. ఇలాంటి స్థితిలో ఆటోలో వెళ్లినా, అంబులెన్స్‌లో వెళ్లినా ఒకటేనని రోగులు అంటున్నారు. మరమ్మతులకు నిధులు లేవు.. 108 వాహనాలు చాలా పాతవి. ఐటీడీఏ ప్రాంతంలో ఎక్కువగా గిరిజన గ్రామాల వాసులకు సేవలు అందిస్తుంటాయి. చాలా వరకు మట్టి, రాళ్ల రోడ్లలో ప్రయాణిం చాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మరమ్మతుల బారిన పడుతుంటాయి. వాటిని బాగు చేసేందుకు నిధులు మంజూరు చేయాల్సి ఉం టుంది. కానీ ఆ పని జరగలేదు. దీంతో వాహనాలు రోడ్డు పక్కనే ఆగిపోతున్నాయి. నాలుగు నెలల జీతం రావాలి.. నాలుగు నెలలుగా వేతనాలు రాలేదు. పాడైన వాహనాన్ని బాగు చేయలేదు. ఆది పని చేస్తే కాని వేతనాలు ఇవ్వరంటా, దీంతో కుటుంబం అవస్థలు పడుతోంది.– ఉరిటి వేణు, కురుపాం, ఈఎంటీ. వాహనం నడిస్తే ఒకలా, నడవకుంటే ఒకలా జీతం ఇస్తున్నారు. ఇంతకు ముందు వచ్చే రూ.12,500 జీతం ఇప్పుడు రావడం లేదు.దీనసరి కూలీల్లాగే చూస్తున్నారు. ప్రభుత్వం కల్పించుకుని ఉద్యోగ భద్రత కల్పించాలి. వాహనాల మరమ్మతులకు నిధులు కేటాయించాలని. మోనటరింగ్ చేసేందుకు ఒక సూపర్వైజర్ను నియమించాలి. – మజ్జి రాజారావు, పైలెట్, గుమ్మలక్ష్మీపురం. -
పనివ్వకుండా జీతమిస్తున్నారు
సాక్షి,సిటీబ్యూరో: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ తీరు మారడం లేదు. పరిపాలనా పరమైన వ్యవహారాల్లో సైతం నిర్లక్ష్యం వీడటం లేదు. ఒక వైపు ఖాళీలు వెక్కిరిస్తున్నా... కీలక పోస్టులు కూడా భర్తీకి నోచుకోవడం లేదు. కింది స్థాయిలో కనీసం పదోన్నతులు ప్రక్రియ ఉసే లేకుండా పోగా, గెజిటెడ్ స్థాయిలో మాత్రం నామమాత్రంగా పదోన్నతులు కల్పిస్తున్నా.. పోస్టింగ్‌లు మాత్రం కేటాయించడం లేదు. ఫలితంగా వారిని నెలల తరబడి ఖాళీగానే కూర్చో బెట్టి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖకు పూర్తి స్థాయి పరిపాలనాదీశుడు లేక ఇంచార్జీలతో కొనసాగడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలో ఇద్దరు జిల్లా రిజిస్ట్రార్లకు డీఐజీలు గా, ఐదుగురు గ్రేడ్–1 సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతులు కల్పిస్తూ గతేడాది 31న ఆదేశాలు జారీ అయ్యాయి. అందులో హైదరాబాద్ సౌత్ జిల్లా రిజిస్ట్రార్, మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్లు డీఐజీలు గా పదోన్నతులు లభించడంతో వెంటనే రిలీవ్ అయి ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. అదేవిధంగా జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతుల పొందిన ఐదుగురు గ్రేడ్–1 సబ్ రిజిస్ట్రార్లు సైతం రిలీవ్ అయి సంబంధిత శాఖలో రిపోర్టు చేశారు. వారికి ఇప్పటి వరకు పోస్టింగ్ కేటాయించక పోవడం విస్మయానికి గురిచేస్తోంది. వెక్కిరిస్తున్న ఖాళీలు రిజిస్ట్రేషన్ శాఖలో రెండు డీఐజీ పోస్టులతోపాటు 12 రిజిస్ట్రార్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ డీఐజీ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. జిల్లా రిజిస్ట్రార్ నుంచి డీఐజీగా పదోన్నతుల పొందిన ఇద్దరికి ఆయా పోస్టుల్లో భర్తీ చేయవచ్చు. కానీ ఇప్పటి వరకు కేటాయించలేదు. మరోవైపు ఇతర డీఐజీలకు అదనపు బాధ్యతలు అప్పగించి కొనసాగిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ సౌత్, మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్లతో మరో పది డీఆర్ పోస్టులు ఖాళీగా ఇంచార్జిలతో కొనసాగుతున్నాయి. గ్రేడ్–1 సబ్ రిజిస్ట్రార్ల నుంచి జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతులు పొందిన ఐదుగురితో ఖాళీగా గల డీఆర్ పోస్టింగ్‌లు భర్తీ చేయవచ్చు.. కానీ, ఇప్పటి వరకు ఆ దిశ చర్యలకు ఉపక్ర మించడంలేదు. ఎలాంటి సేవలు తీసుకోకుండానే జీతాలు ఇవ్వడం నిర్లక్ష్యానికి దర్పణం పడుతోంది. ఇటీవల కమిషనరేట్‌లో జరిగిన సమావేశంలో ఇంచార్జి కమిషనర్ దృష్టికి పదోన్నతులు పొందిన వారు తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. నాలుగేళ్ల నుంచి రిజిస్ట్రేషన్ శాఖలో నాలుగేళ్ల నుంచి సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు లేకుండా పోయా యి. సుమారు 50 వరకు గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్ పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నా ...వాటిని భర్తీ చేయడం లేదు. పదోన్నతుల జాబితాలో పెద్ద ఎత్తున సీనియర్ అసిస్టెంట్లు ఉన్నా ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. మొత్తంమీద రిజిస్ట్రేషన్ శాఖలో క్యాడర్ సంఖ్య 3,930 ఉండగా అందులో 590 పోస్టులు మినహా అన్ని పోస్టులు ఖాళీగా నే వెక్కిరిస్తున్నాయి. -
వేతనాల్లేవ్..ఇక ఏడుపే
పాల్వంచ: జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు గత ఏడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చే అరకొర జీతం కూడా ప్రతి నెలా అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు 86 ఉండగా వాటిలో 450 మంది కార్మికులు (స్వీపర్లు, కుక్‌లు, వాచ్మెన్లు, హెల్పర్లు, స్కావెంజర్లు) పనిచేస్తున్నారు. వీరికి రావాల్సిన వేతనాలు రూ.60 లక్షల మేర పేరుకు పోయాయి. అంతేగాక 2016లో వేసవి శిబిరాల సమయంలో పనిచేసిన వేతనాలు కూడా ఇప్పటివరకు రాకపోవడం గమనార్హం. ఆ సమయంలో పనిచేసిన సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఈఎల్స్(సంపాదిత సెలవులు) ఇచ్చారు. సీఆర్టీలకు కూడా వేతనాలు అందించారు. వారితో పాటు పనిచేసిన కార్మికులకు మాత్రం ఇంత వరకూ అతీగతీ లేదు. వేతనాలు అందించాలని ప్రపోజల్స్ పంపి నెలలు గడుస్తున్నా ఉన్నతాధికారులు కనికరించడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఎప్పుడు వస్తాయో కూడా తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు. వెట్టి కష్టాలు ఇంకెన్నాళ్లో.. ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ, మున్సిపాలిటీల పరిధిలో గల ఆశ్రమ పాఠశాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులందరిదీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. రెండు, మూడు దశాబ్దాలకు పైగా ఐటీడీఏ పరిధిలోనే పనిచేసున్న వారు అనేక మంది ఉన్నారు. వీరిని పర్మనెంట్ చేయాలని కోరుతున్నా పట్టించుకునే వారు లేరు. మరోవైపు జీతాలు కూడా సకాలంలో అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. పెరిగిన పనిభారం.. హాస్టళ్లు, పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులకు పనిభారం పెరిగింది. గతంలో ఉన్న మెనూకు, ప్రస్తుత మెనూకు చాలా తేడా ఉంది. విద్యార్థులకు ఉదయం రకరకాల టిఫిన్లు, భోజనం, వెజ్, నాన్ వెజ్ వంటలు పెడుతున్నారు. పాఠశాలల్లో తరగతి, వసతి గదులు కూడా పెరిగాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో పాటు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా విధులు నిర్వహించాలి. ఇలా పనిభారం నానాటికీ పెరుగుతున్నా వేతనాలు మాత్రం పెరగడం లేదు. సెలవులు వస్తే జీతాల్లో కోత విధిస్తున్నారని, ఆరోగ్యం సరిగా లేక సెలవులు తీసుకున్నా వేతనాలు తగ్గించి ఇస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఐటీడీఏ డీడీ సీహెచ్.రామ్మూర్తిని వివరణ కోరేందుకు పలుమార్లు ప్రయత్నించినా అందుబాటులో లేరు. జీతాలు సకాలంలో రావడం లేదు. జీతాలు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నాం. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు మావి. ప్రతి నెలా జీతాలు ఇస్తే బాగుంటుంది. కానీ ఐదారు నెలలకు కూడా ఇవ్వక పోతే కుటుంబాల పోషణ ఇబ్బందిగా ఉంది. – కాంతమ్మ, హెల్పర్ పనిభారం పెరిగింది గతం కంటే ఆశ్రమ హాస్టళ్లలో పనిభారం పెరిగింది. ఇప్పుడు మెనూ కూడా పెంచారు. అయినా కష్టపడి విద్యార్థులకు సమయానికి వండి పెడుతున్నాం. పనిభారం ఎక్కువైనా వేతనాలైతే పెరగలేదు. ఇన్ని నెలల పాటు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నాం. – రాంబాయి, హెల్పర్ పర్మనెంట్ కాక ఇబ్బందులు రెండు, మూడు దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న వారికి కూడా పనిభద్రత కరువైంది. ఐటీడీఏను నమ్ముకుని పనిచేస్తున్న మాకు పర్మనెంట్ చేసి వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించాలి. కష్టానికి తగిన ఫలితం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. – సరోజిని, హెల్పర్ -
డ్యూటీ వేయాలా.. రూ. వెయ్యి కొట్టు
ఏడాది క్రితం సీఎం చంద్రబాబుబందోబస్తుకు వెళ్ళిన హోంగార్డుకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి.ఆ హోంగార్డుకు ఆసుపత్రి ఖర్చు ఏకంగా రూ.2 లక్షల వరకు అయ్యింది.అటు ప్రభుత్వం గానీ.. ఇటు సంక్షేమసంఘం కానీ రూపాయి ఇవ్వలేదు.. అరకొరజీతాలతో బాధలు పడే ఆ కుటుంబంఅష్టకష్టాలు పడింది.విధులు నిర్వర్తిస్తూ ఒక హోంగార్డుమరణించాడు. అంత్యక్రియల ఖర్చులకు రూ.వెయ్యి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మూడు నెలలకు అన్ని విచారణలు చేసి రూ.15 వేలు ప్రభుత్వం నుంచి అందించారు. కుటుంబ యజమాని మరణంతో ఆ కుటుంబం ఆర్థికంగా నష్టపోయింది.. పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : రోజంతా రోడ్డుపై నిలబడి విధులు నిర్వర్తించాలి. పోలీస్ శాఖలోని సిబ్బందితో సమానంగా విధులు నిర్వహిస్తున్నా హోంగార్డుల కుటుంబాలకు వెతల బతుకులే. శాంతిభద్రతల పరిరక్షణలోనూ, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ కార్యక్రమాలు ఇలా ఏది జరి గినా అందరికంటే ముందు విధుల్లో ఉండేది హోంగార్డులే. ఎండావానా.. దుమ్మూధూళిని లెక్కచేయకుండా పోలీస్ సిబ్బందితో సమానంగా ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నా అరకొర జీతాలే. పనిచేస్తేనే రోజువారీ వేతనం చెల్లించే పరిస్థితి ఉంది. రోడ్డు ప్రమాదం జరిగినా.. మరణించినా ప్రభుత్వం నుంచి ఆదుకునే అవకాశం లేదు. ఇక జిల్లా కార్యాలయం అంతా అవినీతిలో కూరుకుపోయింది. ప్రతిపనికీ రేటు నిర్ణయించి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మహిళా సిబ్బంది బాధలు వర్ణణాతీతంగా మారాయని ఆవేదన చెందుతున్నారు. అధికారులతోపాటు కార్యాలయంలోని హోంగార్డులు సైతం మహిళలను అన్ని రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని, ఉన్నతాధికారులకు చెప్పుకున్నా న్యాయం జరిగే పరిస్థితి లేదని వాపోతున్నారు. సొమ్ము చెల్లించుకుంటేనే హోంగార్డులు వివిధ శాఖల్లో డ్యూటీలు వేయాలంటే సొమ్ములు చెల్లించుకోవాల్సిందేనంట. రూ.వెయ్యి కొడితే తప్ప డ్యూటీలు వేయని దుస్థితి నెలకొంది. హోంగార్డులకు సంబంధించిన జిల్లా కార్యాలయంలో ఏ పని చేయాలన్నా సొమ్ము ముట్టనిదే పని ముందుకు వెళ్ళదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 873 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు. వీరంతా ఆర్టీసీ, రవాణాశాఖ, ఎఫ్‌సీఐ, సబ్‌జైలు, పవర్‌ప్లాంట్ ఇలా ఇతర శాఖలు, ప్రైవేటు సంస్థల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్టీఓ కార్యాలయంలో డ్యూటీకి డిమాండ్ ఉంది. ఇక్కడ విధుల్లో వేయాలంటే రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకూ ఇచ్చుకోవాల్సిందే. ఆర్టీసీ, ఎఫ్‌సీఐ, ద్వారకాతిరుమల ఆలయం ఇలా కొన్ని శాఖల్లో రూ.500 నుంచి రూ.1000 సమర్పించుకోవాలి. ఇక రవాణా శాఖలో పనిచేస్తున్న హోంగార్డులకు గత నాలుగు నెలలుగా వేతనాలే ఇవ్వలేదు. ప్రమాదంలో మరణిస్తే హోంగార్డులు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే మట్టి ఖర్చులకు రూ.5 వేలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. కానీ జిల్లాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మరణిస్తే కేవలం రూ.1000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మిగిలిన సొమ్ము లెక్కలు చెప్పే పరిస్థితి లేకపోగా, అడిగే అవకాశం హోంగార్డులకు లేకుండా పోయింది. ఆ శాఖలోని అధికారులే సొమ్ములు మింగేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బీమా సొమ్ముకు సైతం హోంగార్డుల వేతనాల్లోంచే కోతలు వేసి మరీ చెల్లించే దుస్థితి ఉంది. మూడు నెలల అనంతరం విచారణలు చేసి మరో రూ.15 వేలు కుటుంబానికి అందజేస్తారు. టీడీపీ ప్రభుత్వం చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హోంగార్డులను రెగ్యులర్ చేస్తామంటూ ప్రకటించింది. కానీ రెగ్యులర్ కాదు కదా..రోజువారీ వేతనం సైతం పెంచేందుకు చర్యలు తీసుకోలేదని హోంగార్డులు ఆవేదన చెందుతున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో హోంగార్డుల రోజువారీ వేతనాన్ని రూ.400 నుంచి రూ.675 కు పెంచారు. బందోబస్తుకు వెళితే అదనంగా రూ.200 చెల్లిస్తున్నారు. హోంగార్డులకు ఆరోగ్య కార్డులు, మెటర్నరీ లీవులు, ప్యాటర్నిటీ సెలవులు, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఏపీలో మాత్రం హోంగార్డులకు అదనపు విధులకు వారి సొంత ఖర్చులతోనే వెళ్ళాల్సి వస్తోంది. గతంలో ఏఆర్ అధికారులు వాహనాల్లో తీసుకువెళ్ళగా ప్రస్తుతం ప్రయాణ ఖర్చులు వారే భరించాల్సి వస్తోంది. -
కియా పేరుతో దగా
పెనుకొండ రూరల్: కరువు పీడిత ‘అనంత’లో నెలకొల్పుతున్న కియా కార్ల పరిశ్రమ నిరుద్యోగుల్లో ఆశలుæ రేపుతోంది. అందులో ఉద్యోగాలంటే భారీ వేతనాలు ఉంటాయని, జీవితంలో స్థిరపడవచ్చని ఎంతోమంది విద్యావంతులు భావిస్తున్నారు. ఎలాగైనా ఉద్యోగాలు సాధించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పెనుకొండ మండలం అమ్మవారుపల్లి సమీపంలో ఏర్పాటయ్యే కియా పరిశ్రమలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రభుత్వమే చూస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే నిరుద్యోగుల అవసరాలను గుర్తించి, వారిని నిలువు దోపిడీ చేసేందుకు కొన్ని సంస్థలు తెగించాయి. కియా కార్ల పరిశ్రమతోపాటు అనుబంధ సంస్థలైన యూంగ్ చాంగ్, కుక్ బూ తదితర కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ‘కియాన్ మ్యాన్ పవర్ ఏజెన్సీ’ బోర్డు పెట్టింది. ఏ కేటగిరీ ఉద్యోగాలు.. ఎంతమంది అవసరమవుతాయి అనే వివరాలు తెలపకుండానే దరఖాస్తుల స్వీకరణకు తెర తీసింది. ఈ ప్రకటనకు ఆకర్షితులై ఇప్పటి వరకు నాలుగు వేలమందికి పైగా నిరుద్యోగులు తమ దరఖాస్తులను ఆ ఏజెన్సీ వారికి అందజేశారు. అసలు కియా అనుబంధ సంస్థలు ఏర్పాటు కాకముందే, కనీసం వాటి నుంచి టెండర్లు రాకుండానే నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండటం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్పందించి ఇలాంటి సంస్థలపై విచారణ చేసి నిరుద్యోగులు ఇబ్బంది పడకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. బోగస్ సంస్థలను నమ్మొద్దు అమ్మవారిపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన కియాన్ మ్యాన్ పవర్ ఏజెన్సీ బోగస్ సంస్థ. నిరుద్యోగులు అలాంటి సంస్థలను నమ్మి మోసపోవద్దు. కియా పరిశ్రమలోనే కాదు వాటి అనుబంధ పరిశ్రమలకు సంబంధించి ఉద్యోగ ప్రకటనలు వెబ్సైట్ నుంచే వెలువడుతాయి. సదరు సంస్థపై విచారణ చేపడతాం. – రామమూర్తి, ఆర్డీఓ, పెనుకొండ -
వేతనాల్లేవు... వాహనాలు తిరగవు...
విజయనగరం గంటస్తంభం: ఆపద సమయంలో ఆదుకునే 108 వాహనానికి గడ్డుపరిస్థితి దాపురించింది. అందులో పనిచేసే సిబ్బందికి నెలల తరబడి వేతనాలు అందడంలేదనీ... వాహనాలు సరిగ్గా తిప్పలేక సేవలు అందించలేకపోతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో 108 సర్వీసెస్ ఎంప్లాయిస్ యూ నియన్ అధ్యక్షుడు బంగార్రాజు ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి సంయుక్త కలెక్టర్–2 కె.నాగేశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 27 వాహనాలుండగా ఏడు సాంకేతిక కారణాల వల్ల పని చేయ డం లేదని, 15 వాహనాలకు ఇన్సూరెన్స్ లేక తిప్పలేకపోతున్నామని తెలిపారు. ఇక ఉద్యోగులకు జనవరి నెల నుంచి నెలవారీ జీతాలివ్వకుండా... పని చేసిన రోజులకే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవీకే సంస్థ ఏటా 10శాతం వేతనం పెంచేదని, 2016 నుం చి పెరగలేదన్నారు. 52రోజుల జీతం పెండింగ్‌లో ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. వీటిని పరిష్కరించాలని కోరారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు మొత్తం 210 అర్జీ లు వచ్చాయి. జేసీ–2 నాగేశ్వరరావుతోపాటు డీఆర్వో ఆర్.ఎస్.రాజ్‌కుమార్ వినతులు స్వీకరించారు. అందులో కొన్నింటిని పరిశీలిస్తే.... ♦ మూతపడిన జ్యూట్ మిల్లులు తెరిపించా లని ఇఫ్టూ జల్లా కమిటీ నాయకులు కె.సన్యాసిరావు, బోని సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు వినతిపత్రం ఇచ్చారు. ♦ కుమిలిలో నిర్మించిన సామాలమ్మ గుడిని దేవాదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకో వాలని ఆ గ్రామానికి చెందిన జి.నాగిరెడ్డి కో రా రు. ♦ దరం కార్యక్రమం జరగక ఇబ్బందులు పడుతున్నామని, తన కుమారుడు అజయ్ కోసం తొమ్మిది నెలలుగా తిరుగుతున్నా పట్టిం చుకోవడం లేదని బొబ్బిలికి చెందిన పి.జయరా వు తెలిపారు. ♦ ప్రధానమంత్రి పసల్‌బీమా యోజనలో పని చేస్తున్న వ్యవసాయ బీమా కార్యకర్తలకు ఖరీఫ్ కాలంలోనే పని కల్పిస్తున్నారని, ఈ ఏడాది పని కల్పించాలని బీమా కార్యకర్తల ఆసోసియేషన్ అధ్యక్షుడు బి.ప్రశాంత్ తది తరులు వినతిపత్రం సమర్పించారు. ♦ పూసపాటిరేగ మండలం పతివాడ పంచాయతీ త మ్మయ్యపాలెంలో సర్వే నెం: 111/2లో 10 ఎకరాలు 62సెంట్లు, 112లో 17.97ఎకరాలు ప్రభు త్వ భూమిలో మత్స్యకారులు చేపలు ఎండబెట్టుకుంటున్నారని, ఆ భూములు అక్రమణకు గురవుతున్నాయని సర్పంచ్ ఎ.పైడిరాజు, ఎంపీటీసీ సభ్యుడు కూర్మినాయుడు తదితరులు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ♦ అంతకుముందు నిర్వహించిన డయల్‌యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఎనిమిది ఫోన్ కాల్స్ వచ్చాయి. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. -
వేతన వెతలు
సాక్షి, విశాఖపట్నం: ఒక నెల జీతాలు అందకపోతేనే మధ్య తరగతి ఉద్యోగులు అల్లాడిపోతారు. కుటుంబం గడవడం ఎలా? అంటూ సతమతమైపోతారు. కానీ నెలా? రెండు నెలలు కాదు.. నాలుగు నెలలు జీతాల్లేకుండా కుటుంబాలను ఈడ్చడం ఎంత కష్టం? ఇప్పుడు అలాంటి కష్టాలనే 108 సిబ్బంది అనుభవిస్తున్నారు. ఇన్నాళ్లూ జీవీకే సంస్థ ఆధ్వర్యంలో 108 అంబులెన్స్‌ల సిబ్బంది పనిచేసేవారు. గత డిసెంబర్ 13న జీవీకే నుంచి 108ల నిర్వహణ బాధ్యతలను మహారాష్ట్రకు చెందిన బీవీజీ (భారత్ వికాస్ గ్రూప్) సంస్థ తీసుకుంది. అప్పటికే రెండు నెలల నుంచి జీవీకే సంస్థ 108 వాహనాల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు చెల్లించడం మానేసింది. కొత్తగా వచ్చిన బీవీజీ సంస్థ అయినా పాత బకాయిలతో పాటు జీతాలను సక్రమంగా చెల్లిస్తుందని వీరు సంబరపడ్డారు. కానీ బీవీజీ కూడా అదే బాటలో పయనిస్తూ జీతాలివ్వడం లేదు. సంక్రాంతి పండగ సమీపిస్తున్న తరుణంలో ఈ సిబ్బంది ఆందోళన చేపట్టడంతో జనవరిలో రూ.7 వేల చొప్పున అడ్వాన్సు రూపంలో ఇచ్చారు. ఆ తర్వాత ఇక జీతాల జోలికే వెళ్లడం మానేశారు. ఒక్కో అంబులెన్స్‌లో షిఫ్టుల వారీగా సగటున ఐదుగురు విధులు నిర్వహిస్తారు. వీరిలో పైలట్లు (డ్రైవర్లు), ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్లు ఉంటారు. ఇలా విశాఖ జిల్లాలో 108 అంబులెన్స్‌లు 45 ఉన్నాయి. వీటిలో నాలుగింటిని స్పేర్‌గా ఉంచుతారు. 41 అంబులెన్స్‌లను నగరంలోనూ, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నడుపుతున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 185 మంది 108 అంబులెన్స్‌ల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నెలకు రూ.11,000 నుంచి 12,000 వరకు జీతాలు చెల్లిస్తుంటారు. ఆఖరిసారిగా వీరు గత అక్టోబర్‌లో వేతనాలు అందుకున్నారు. నెలలు తరబడి జీతాలివ్వకపోవడం వల్ల పిల్లాపాపలతో ఉన్న వీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. తమ వేతనాల గురించి జీవీకే సంస్థ ప్రతినిధులను అడిగితే ప్రభుత్వం నుంచి తమకు బకాయిలు రావలసి ఉందని చెప్పి తప్పించుకుంటున్నారని... కొత్తగా వచ్చిన బీవీజీ గ్రూప్ యాజమాన్యాన్ని అడుగుతుంటే ఇటీవలే బాధ్యతలు తీసుకున్నామని, అంతా సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నారని 108 సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వీరు వాపోతున్నారు. తమకు జీతాలు చెల్లించేలా చూడాలని 108 సిబ్బంది యూనియన్ నాయకులు ఇటీవల విజయవాడలోని కార్మికశాఖ కమిషనర్ రాజేంద్రప్రసాద్‌ను కలిశారు. దీంతో ఆయన జీవీకే, బీవీజీ సంస్థలతో పాటు 108 సిబ్బంది యూనియన్ ప్రతినిధులతో కలిసి ఈనెల 8న సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఆ సమావేశాన్ని ఈ నెల 22కి వాయిదా వేయడంతో వీరంతా డీలా పడ్డారు. -
‘ఉపాధి’.. జాడేది?
ఆదిలాబాద్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు జిల్లాలో ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు ఇవ్వడం లేదు. వలసలను నివారించి గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు చేతి నిండా పని కల్పించాలనే లక్ష్యం నీరుగారుతోంది. అధికారులు పర్యవేక్షణ లోపంతో కొందరికే చేతి నిండాపని లభిస్తోంది. ఈ పథకం కింద పనికి వచ్చే కూలీలకు కనీసం వంద రోజులు పని చూపించాల్సిన అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహించడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. దీనికి తోడు కూలి చెల్లింపులోనూ జాప్యం కావడం, గిట్టుబాటు కాకపోవడంతో ఆశించిన స్థాయిలో కూలీలు హాజరుకావడం లేదు. వంద రోజుల పని కొందరికే పరిమితమైందనే విమర్శలున్నాయి. ఆర్థిక సంవత్సరానికి 47 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంకా జిల్లాలో ఉపాధి పనులు ప్రారంభం కాలేదు. దీంతో వంద రోజుల పని అందరికి కల్పించడం కలగానే మిగిలిపోనుంది. ఈ పథకం అమలులో భాగంగా చేపట్టిన ఇందిర జలప్రభ, వ్యవసాయ రహదారులు, ఇంకుడుగుంతలు, మట్టికట్టలు, బావుల పూడికతీత, నాడెపు, వర్మీ కంపోస్టు తదితర పనులు చాలా మండలాల్లో వెనుకబడి ఉన్నాయి. కూలి చెల్లింపులో జాప్యం.. గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిరోధించి వారికి గ్రామంలోనే పని కల్పించడం ఈ ఉపాధి పథకం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పథకంలో కూలీల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. మొదట్లో పథకం అమలు తీరు బాగానే ఉండేది. వలస వెళ్లకుండా గ్రామీణులకు భరోసా ఇచ్చింది. సొంత ఊరిలో ఉపాధి దొరకడం, వేతనాలు కూడా ప్రతీ వారం చెల్లించడంతో చాలా మంది ఆసక్తి చూపేవారు. అయితే రెండేళ్లుగా జిల్లాలో ఉపాధి పథకం అంతగా సత్ఫలితాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. కూలి సకాలంలో అందకపోవడం, వచ్చినా అంతంతమాత్రంగానే ఉండడంతో ఈ పథకంపై ప్రజలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో కూలీలు ఎక్కువగా వ్యవసాయ పనులకే మొగ్గు చూపుతున్నారు. అధికారులు విఫలం.. జిల్లాలో జాబ్‌కార్డు కలిగిన 67,434 కుటుంబాలు ఉంటే అందులో కేవలం 5,527 కుటుంబాలకు మాత్రమే వంద రోజులు పని కల్పించారంటే పథకం అమలు తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. ఈ పథకంలో తగినంత మంది ఉద్యోగులు, సిబ్బంది ఉన్నా ఎక్కువ పనులు కల్పించే దిశగా చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, అధికారులు పర్యవేక్షణ లోపంతోనే చేతినిండా పనులు కల్పించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పథకం కింద చేపట్టిన ఆయా నిర్మాణ పనులు నత్తనకడకన సాగుతున్నాయి. బిల్లుల విడుదలలోనూ జాప్యం చేయడంతో పథకంపై ప్రజలు నిరాశగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామస్థాయిలో అధికారులు వెళ్లి ఉపాధి పనులపై ప్రచారం చేసి ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, వంద రోజుల పనిదినాలు ఎక్కువ కుటుంబాలకు కల్పించే ప్రణాళిక రూపొందించినప్పుడే ఈ పథకంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందనే భావనే వ్యక్తమవుతోంది. మూడు వారాల డబ్బులు రావాలె.. ఉపాధి పనికి వెళ్లిన కూలి డబ్బులు ఇంకా ఇవ్వడం లేదు. నాకు మూడు వారాల డబ్బులు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు నేను 45 రోజులు మాత్రమే పనిచేశా. వెళ్లిన పనికి సమయానికి డబ్బులు ఇస్తలేరు. అందుకే ఉపాధి పనికి వెళ్లాలనిపించడం లేదు. – డి. విఠల్, లక్ష్మీపూర్, జైనథ్ డబ్బులు రాకుంటే పనికెట్ల పోయేది? నేను ఇప్పటివరకు చేసిన మూడు వారాలకు సంబంధించిన డబ్బులు రాలేదు. నెలరోజులు కూడా నాకు పనిదినాలు కల్పించలేదు. డబ్బులు సరిగ్గా ఇస్తే కూలికి పోయేందుకు మంచిగుంటది. – సేవంతబాయి -
చిరుద్యోగులకు ఊరటనిస్తారా..
సాక్షి, అమరావతి : బడ్జెట్ అంటేనే చిరుద్యోగులు దడదడలాడుతుంటారు. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో అని కంగారు పడుతుంటారు. చిరుద్యోగి జాతకంలో ఎప్పుడూ ఆదాయం 2గా ఉంటే వ్యయం 12గా ఉంటోంది. ఈ సారైనా కేంద్ర బడ్జెట్లో తమను కనికరిస్తారా అనే ఆశతో వారు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న చాలామంది మధ్యతరగతి, చిరు ఉద్యోగులు జీతాలు సరిపోక, పన్నులు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బడ్జెట్లో ఆదాయపు పన్ను పరిమితిని పెంచి ఆర్థికమంత్రి ఉద్యోగులకు ఊరటనిస్తారని ఆశిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తారస్థాయికి చేరడంతో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ స్థాయిలో జీతాలు మాత్రం పెరగడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. గత రెండేళ్ల నుంచి వ్యాపారాలు లేక ఉద్యోగులకు జీతాలు పెంచడం లేదని, కానీ ధరలు మాత్రం 20 నుంచి 30 శాతం పెరిగిపోవడంతో కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో అర్థంకావడం లేదని చీరాలకు చెందిన ప్రైవేటు ఉద్యోగి కిశోర్ ఆవేదన వ్యక్తం చేశారు. జీతాల పెరుగుదల లేదు ధరలు పెరుగుతున్న స్థాయిలో జీతాలు పెరగడం లేదు. దీనికితోడు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటివాటితో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో చాలా సంస్థలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచలేని పరిస్థితి. ఇప్పుడు చేతికి అందుతున్న జీతం 15వ తేదీ రాకుండానే ఖర్చు అయిపోతోంది. ఈ బడ్జెట్లోనైనా ఆదాయ పన్ను పరిమితి పెంచితే కొంతైనా ఊరట లభిస్తుంది. కె. నారాయణరావు, ప్రైవేట్ ఉద్యోగి, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా విజయవాడలో పెరిగిన ఖర్చులు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలి రావాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ఇంటి అద్దెలు, ఇతర వ్యయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మెట్రో నగరాల్లో పనిచేసే హెచ్ఆర్ఏ నిబంధనలను ఇక్కడ కూడా అమలు చేయాలి. అలాగే పెరిగిన జీవనవ్యయాలను దృష్టిలో పెట్టుకొని స్టాండర్డ్ డిడక్షన్‌ను తిరిగి ప్రవేశపెట్టాలి. జి.గణేష్ కుమార్, ప్రభుత్వ ఉద్యోగి, అమరావతి. -
వేతన వెతలు
గ్రామ పంచాయతీల కార్మికుల పట్ల పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నెలనెల వేతనాలు అందక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. నిత్యం పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచుతున్నా కార్మికుల సమస్యలు పరిష్కారంపై పాలకులు అలివిమాలిన నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏళ్లతరబడి పోరాడి సాధించుకున్న జీవోలు సైతం అమలకు నోచుకోని దుస్థితి జిల్లాలో నెలకొంది. ప్రభుత్వాలు.. లాఠీ దెబ్బలకు వెరవకుండ పోరాడి సాధించుకున్న జీవోలను అధికారులు కాగితాల్లోనే మగ్గబెడుతున్నారు. వాటిని అమలు చేయకుండా సంకెళ్లు వేసి.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఒంగోలు టూటౌన్: పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పట్ల పాలకులు అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని పరిశీలిస్తే.. జిల్లాలో 1028 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో పారిశుద్ధ్య కార్మికులు, టైమ్‌స్కేల్ కార్మికులు, పర్మినెంట్, టెండర్, ఎన్ఎంఆర్ ఇలా ఐదు రకాల కార్మికులు పనిచేస్తున్నారు. పర్మినెంట్, టైమ్ స్కేల్ కార్మికులు కాంట్రాక్ట్, ఎన్ఎంఆర్ (దినసరి కూలీలు) పద్ధతిలో పనిచేసే కార్మికులు దాదాపు 1000 మంది ఉన్నారు. ఎన్‌ఎంఆర్‌లు 100 వరకు ఉన్నారు. వీరందరికీ పంచాయతీలకు వచ్చే ఆదాయంలో 30 శాతం నిధులను జీత, భత్యాలకు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ విధానం ఏ గ్రామ పంచాయతీలో అమలుకు నోచుకోవడం లేదు. అరకొర వేతన కార్మిక వేతన చట్టం ప్రకారం నెలకు రూ.12 వేల వరకు ఇవ్వాల్సి ఉంది. అలా కాకుండా కేవలం రూ.ఆరు వేలు, కొన్ని పంచాయతీల్లో రూ.7 వేలలోపు వేతనాలు చెల్లిస్తూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. ఈ అరకొరగా ఇచ్చే వేతనాలు కూడా నెలనెలా ఇవ్వని దుస్థితి నెలకొంది. జిల్లాలోని పొదిలి, పామూరు, సంతనూతలపాడు, దర్శి ఇలా చాలా గ్రామ పంచాయతీల్లో ఏడాది నుంచి జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది. కొన్ని పంచాయతీల్లో మూడు నెలలు, ఆరు నెలలకు కూడా ఇవ్వడం లేదు. కొత్తపట్నం పంచాయతీలో పది మంది స్వీపర్లు వారికి 6 నెలల వేతనాలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం అనధికారికంగా ఒక్కో కార్మికునికి రూ.3 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సంతనూతలపాడులో ఇటీవల కార్మికులు జీతాల కోసం రోడ్డెక్కి ఆందోళన చేశారు. పది నెలలకుపైగా జీతాలు ఇవ్వాల్సి ఉంటే కేవలం 5 నెలలకు ఇచ్చి ఊరటనిచ్చారు. ఇలా నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. చిల్లర దుకాణాల్లో కూడా అప్పులు పెరిగి తిరిగి అప్పు పుట్టని పరిస్థితి నెలకొంది. అయినా అధికారులకు కార్మికుల పట్ల కనికరం లేకుండా పోతోంది. జీవో అమలులో నిర్లక్ష్యం కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, నెల మొదటి వారంలో జీతాలు చెల్లించాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని 13–07–2011న (మెమో నెం.16306 /ఇ.ఎస్.టి.టి /4 /ఎ2 /2010–4), (పి.ఆర్.ఓ.సి. నెం. సి /953/2014) ప్రకారం రోజుకు రూ.300 ఇవ్వాలని ఆదేశాలు గతంలో జారీ చేశారు. జారీ చేసిన జీవో కాపీలు జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా పంచాయతీ, స్థానిక పంచాయతీలకు అందాయి. దశాబ్దాలు గడిచినా నేటికీ జీవో అమలు చేసిన నాథుడు లేడు. కార్మికులు పోరాడి సాధించుకున్న ఆ జీవో కాగితాల్లోనే మగ్గుతోంది. మళ్లీ తాజాగా ఇటీవల ప్రభుత్వం 151 జీవోని విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం కార్మికులకు నెలకు రూ.12 వేలు వేతనం ఇవ్వాల్సి ఉంది. ఇంతవరకు ఈ జీవో అమలకు నోచుకోలేదు. హైకోర్టు ఆదేశాలు బేఖాతర్ హైకోర్టు ఇటీవల ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. గ్రామ పంచాయతీల్లో కార్మికుల నియామకానికి నిర్వహిస్తున్న టెండర్ల విధానాన్ని రద్దు చేయాలని ఆదేశించింది. దీర్ఘకాలికంగా పనిచేస్తున్న కార్మికులను కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు పంచాయతీరాజ్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. టెండర్ల విధానం రద్దు చేస్తామని చెప్పారు. టెండర్ల రద్దు చిత్తూరు జిల్లాలో అమలకు నోచుకుంది. మన జిల్లాలో ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. కలగానే 010 పద్దు జీతాలు పర్మినెంట్ కార్మికులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని 2011 సెప్టెంబర్‌లో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జాయింట్ కలెక్టర్ అధ్యక్షుడిగా, జిల్లా పంచాయతీ అధికారి, డీఎల్‌పీవోతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. పర్మినెంట్ కార్మికులను గుర్తించి వివరాలు పంపిస్తే ప్రభుత్వం ఖజానా శాఖ ద్వారా జీతాలు చెల్లించే అవకాశం ఉంటుంది. పర్మినెంట్ కార్మికులు ఉన్న పంచాయతీలకు ఆర్థిక భారం తగ్గుతుంది. మిగిలిన పార్ట్‌టైం, ఎన్ఎంఆర్ పారిశుద్ధ్య కార్మికులకు పంచాయతీలు వేతనాలు ఇచ్చేందుకు వెసులుబాటు కలుగుతుంది. జిల్లాలో పర్మినెంట్ కార్మికులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆందోళనకు సిద్ధం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఆందోళన చెపడుతున్నట్లు సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు మజూందర్ తెలిపారు. టెండర్ల విధానం రద్దు చేయాలని, నెలనెలా కార్మికులకు జీతాలు ఇవ్వాలని, 151 జీవో ప్రకారం జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మజుందార్ పేర్కొన్నారు. -
రూ. 50 కోట్ల సంతర్పణ!
సాక్షి, హైదరాబాద్: దేవాదాయశాఖలో అడ్డదారిలో చేరిన సిబ్బంది వల్ల ప్రభుత్వ ఖజానాకు ఇప్పటికే పడుతున్న చిల్లుకు మరింత గండి పడనుంది. దేవాలయ ఉద్యోగులు, అర్చకులకు సర్కారు వేతన సవరణ ప్రారంభించిన నేపథ్యంలో అక్రమ ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం చూసి ఉన్నతాధికారులే కంగు తినాల్సి వచ్చింది. వేతన సవరణ కోసం ఒక్కో ఉద్యోగి వివరాలు సేకరించిన సమయంలో... నియామకాలపై నిషేధం ఉన్నప్పుడు చేరిన వారి సంఖ్య దాదాపు 1,500 వరకు ఉందని తేలింది. ఇప్పుడు వేతన సవరణకు అర్హులుగా గుర్తించిన 5,260 మందిలో అక్రమ సిబ్బంది కూడా ఉండటం, వారి సగటు వేతనం రూ. 30 వేలుగా ఉండటంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా సుమారు రూ. 50 కోట్ల మేర భారం పడుతుందని స్పష్టమవుతోంది. నాటి కమిషనర్ కక్కుర్తి వల్లే... 2006కు ముందు పని చేసిన ఓ కమిషనర్ కక్కుర్తి ఇప్పుడు పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. కొందరు అధికారులతో కలసి ఆలయ భూములను అన్యాక్రాంతం చేయడం ద్వారా రూ. కోట్లు దండుకున్న ఆ అధికారి అది చాలదన్నట్టు దేవాలయాల్లో వందలాది మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించాడు. ఇందుకోసం ఒక్కొక్కరి వద్ద నుంచి భారీగా వసూలు చేశాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో స్పందించిన ప్రభుత్వం...ఆ అధికారిపై వేటు వేసి అక్రమ సిబ్బందిని తొలిగించింది. అలాగే అక్రమంగా సిబ్బందిని నియమించకుండా నిషేధం విధించింది. ఎక్కడైనా అవసరమైతే ప్రత్యేక అనుమతి తీసుకుని నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. అయితే దేవాలయ పాలకమండళ్లు, కొందరు అధికారులు చాలా చోట్ల అనుమతుల అవసరం లేకుండానే వందల మందిని అక్రమంగా నియమించి సొమ్ము చేసుకున్నారు. వేతన సవరణ నేపథ్యంలో ఈ భారీ అక్రమం వెలుగుచూసింది. దీంతో అక్రమ సిబ్బందిని తొలగించాలని కొందరు అధికారులు పేర్కొంటుండగా కొందరు నేతలు మాత్రం వారికి అడ్డుపడుతున్నారు. అక్రమ సిబ్బందిని కొనసాగించేందుకు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. సగం అక్రమ సిబ్బందికే... దేవాదాయశాఖలోని ప్రభుత్వ ఉద్యోగులు మినహా మిగతా వారిని దేవాలయ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వారు ఏ ఆలయంలో పనిచేస్తే ఆ ఆలయం నుంచే వేతనాలు పొందాల్సి ఉంటుంది. ఆయా ఆలయాల ఆదాయంలో 30 శాతం మొత్తాన్ని ఉద్యోగుల వేతనాలకు కేటాయిస్తారు. తాజా వేతన సవరణతో ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. ఉద్యోగులు పొందుతున్న వేతనాలను ఇకపై కూడా ఆయా ఆలయాలే చెల్లించనుండగా వేతన సవరణతో పెరిగే మొత్తాన్ని ప్రభుత్వ గ్రాంటు నుంచి చెల్లిస్తా రు. 5,260 మంది ఉద్యోగులు, అర్చకులకు సంబంధించి ప్రభుత్వం సాలీనా ఇవ్వనున్న రూ. 115 కోట్ల గ్రాంటులో సగం ఈ అక్రమ ఉద్యోగుల జేబుల్లోకి వెళ్లనుంది. -
గార్డులమని.. గడ్డి తినమంటారా?!
నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా తమ కుటుంబాలను ఎండబెడుతున్న ప్రైవేట్ ఏజెన్సీల తీరుకు నిరసనగా శుక్రవారం నగరంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఇలా వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ద్వారకానగర్(విశాఖ దక్షిణ): నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని, వేతనాలు లేక బతుకులు అస్తవ్యస్తమయ్యాయని ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డులు నినదించారు. జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ విశాఖ సెక్యూరిటీ గార్డుల యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం వీరు జీవీఎంసీ రోడ్డులో ధర్నా నిర్వహించారు. బకాయిల సహా జీతాలు వెంటనే చెల్లించేట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గార్డులు గడ్డి పరకలు పట్టుకుని నిరసన తెలిపారు. రోడ్డుపైకి రావడానికి అనుమతి లేదని పోలీసులు గార్డులను హెచ్చరించారు. లేదంటే అరెస్ట్‌లు చేస్తామని చెప్పడంతో గార్డులు తప్పనిసరి పరిస్ధితిలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి జేడీ నాయుడు మాట్లాడుతూ నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో సెక్యూరిటీ గార్డులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. నగరంలో ప్రభుత్వ ఆధీనంలోని కింగ్ జార్జి హాస్పటల్, ప్రభుత్వం విక్టోరియా జనరల్ హాస్పటల్, పభుత్వ మానసిక ఆసుపత్రి, ప్రభుత్వ ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రి, చెవి, ముక్కు, గొంతు, వ్యాధుల ఆస్పత్రి విమ్స్, ప్రాంతీయ కంటి ఆసుపత్రులలో 400 మంది సెక్యూరిటీ గార్డులు జై బాలాజీ సర్వీస్ ప్రైవేటు లిమిటెడ్ తరపున సేవలందిస్తున్నారని తెలిపారు. వీరంత బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారని, జీతాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యాన్ని ఎన్నిసార్లు అభ్యర్థించినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ ఉండడంతో మరో దారిలేక విధులు బహిష్కరించామని తెలిపారు. వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యక్షుడు సీహెచ్ గురుమూర్తితోపాటు ఎ.గోపి, ఇ.సాగర్, ఐ.శివ తదితరులు పాల్గొన్నారు. -
హోమ్ గడవని గార్డులు
హోంగార్డు.. పదానికి అర్థం ఏదైనా పోలీసు శాఖలో వీరిది కీలక పాత్ర. జీతం తక్కువైనా సేవలు మాత్రం పోలీసులతో సమానం. ఇంకా చెప్పాలంటే వారికంటే ఎక్కువే. రోజుకు వారికిచ్చే వేతనం రూ.400. అది కూడా రోజూ హాజరైతేనే. ఎనిమిది గంటలు పనిచేసే కార్మికులకు చట్టప్రకారం రూ.18వేలు ఇవ్వాలని కార్మిక శాఖ చెబుతోంది. చట్టాన్ని రక్షించే రక్షకులుగా పనిచేసే వీరి కష్టాలు వర్ణనాతీతం. పేరుకు హోంగార్డుగా పనిచేస్తున్నా హోమ్ గడవని గార్డులెందరో. హోంగార్డుల విధులు, వేతనాలు, పడే కషాలపై కథనం. ఏళ్లుగా హోంగార్డుల డిమాండ్లు ⇔ ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలి ⇔ బస్సులో వెళ్లేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి ⇔ మహిళా హోంగార్డులకు రెండు నెలల జీతంతో ప్రసూతి సెలవులు కేటాయించాలి ⇔ నెల జీతం రూ.18 వేలకు పెంచాలి ⇔ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి ⇔ విధుల్లో చనిపోయిన హోంగార్డుల వారసులకు ఉద్యోగం ఇవ్వాలి. ⇔ విధుల్లో లేదా అనారోగ్యంతో చనిపోతే రూ.2లక్షల వరకు ఆర్థిక సాయం చేయాలి. జిల్లాలో దాదాపు 1600 మందికి పైగా హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో చాలా మంది ట్రాఫిక్ విధులు, సెక్యూరిటీ, పారిశుద్ధ్య పనులు, స్టేషన్ల డ్యూటీలు, పోలీసు వాహనాలకు డ్రైవర్లుగా, అధికారుల ఇళ్ల వద్ద పని చేస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరికీ పని గంటల్లో పరిమితి ఉండడం లేదు. తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకు పోలీసులతో సమానంగా విధులు చేసి తీరాల్సిందే. పోలీసులైనా నెలలో సెలవు తీసుకునే వెలుసుబాటు ఉంటుంది. కానీ హోం గార్డులకు సెలవు అనే మాటే ఉండదు. ఉన్నతాధికారులు దయతలిస్తే తప్ప సెలవు మంజూరుకాదు. మానసికంగా, శారీరంగా పనిలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న హోంగార్డులు ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే వీరి గురించి ఆలోచించడానికి ప్రభుత్వాలు, పాలకులకు సమయం ఉండడం లేదు. వేతనాలు అంతంతే... పదేళ్ల సర్వీసు ఉన్న ఒక్కో కానిస్టేబుల్‌కు గరిష్ట వేతనం రూ.30 వేల వరకు అందుతోంది. కానీ 20 ఏళ్లకు పైగా సర్వీసు ఉన్న హోంగార్డులకు ఇప్పటికీ రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారు. రోజుకు రూ.400 వేతనానికి పనిచేస్తున్నారు. ఇంటి పనులు చేసే మేస్త్రీ కూలీకి రోజుకు రూ.550 వేతనం ఇచ్చి ఓ పూట భోజనం పెడుతున్న తరుణంలో కనీస వేతన సవరణ చట్టాన్ని హోంగార్డులకు అందడం లేదు. ఇక జిల్లాలో అగ్నిమాపక, పురాతనవస్తు శాఖల్లో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న హోం గార్డులకు ప్రతినెలా వేతనాలు సక్రమంగా అందడంలేదు. గత నాలుగు నెలలుగా వీరికి వేతనాలు రాకున్నా ఎందుకు..? ఏమయ్యింది..?అని అడిగే దిక్కు కూడా లేదు. అమలు కాని కోర్టు ఆదేశాలు.. ⇔ హోంగార్డులకు ప్రతి 26 నెలలకు ఓ సారి వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా అమలుకావడంలేదు. తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో నెలకు రూ.18 వేల వేతనం ఇస్తున్నా.. ఇక్కడ మాత్రం రూ.12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. ⇔ విధి నిర్వహణలో, అనారోగ్యంతో చనిపోయిన హోం గార్డుల అంత్యక్రియలకు తక్షణం కుటుంబానికి రూ. 15 వేలు ఇవ్వాలని పదేళ్లుగా అడుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. సాటి ఉద్యోగులు చందాలు వేసుకుని ఆర్థికసాయం చేయాల్సి వస్తోంది. ⇔ హోంగార్డుల కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వైద్యం చేయించడానికి ఈఎస్ఐ సౌకర్యం లేదు. రీయింబర్సుమెంటు రూ.2 లక్షలు ఇవ్వాలని అడుతున్నా రూ.25 వేలు ఇస్తున్నారు. ⇔ కానిస్టేబుల్ కోటాలో ఉద్యోగాలు పొందాలనుకునే హోంగార్డులకు సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా 35 ఏళ్ల వరకు అవకాశం ఇవ్వాలని పోరాడుతున్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఇంటి అద్దె, రవాణా భత్యం లాంటి వాటికి హోంగార్డులు అర్హులుకారు. ⇔ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో హోంగార్డులను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ పేర్కొన్నా.. 2016లో తిరుపతిలో జరిగిన మహానాడులో హోంగార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదు. పోలీసులతో సమానంగా విధులు పోలీసు శాఖలో చివరిది హోంగార్డు వ్యవస్థ. 1990లో రోజుకు రూ.50తో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాలనుగుణంగా ప్రస్తుతం రోజుకు రూ.400 చెల్లిస్తున్నారు. వీరికిచ్చే జీతం తక్కువైనప్పటికీ సేవలు మాత్రం పోలీసులతో సమానంగా ఉంటాయి. సమాజంలో ఒక కుటుంబం జీవించాలంటే నెలకు రూ. 18వేలు కావాలి. రూ.12వేల జీతంతో హోంగార్డులు జీవితాలను నెట్టుకొస్తున్నారు. హోంగార్డులంటేనే స్వచ్ఛంద సేవలు చేసేవారని, వీరికి వేతనాలకు బదులుగా గౌరవ వేతనం ఇవ్వాలని 30 ఏళ్ల కిందట ఇచ్చిన ఆదేశాలను మార్చాలని కోరుతున్నారు. తాము స్వచ్ఛంద సేవకులం కాదని.. కష్టపడి పనిచేసే ఉద్యోగులమని గొంతులు చించుకుని అరుస్తున్నా ఆ ఆకలి కేకలు ఎవరికీ వినపడడంలేదు. -
వృద్ధ అర్చకుల ‘సవరణ’ వెతలు
కూకట్‌పల్లికి చెందిన రామశాస్త్రి స్థానిక దేవాలయంలో 20 ఏళ్లుగా అర్చకుడిగా పని చేస్తున్నారు.. ఇప్పుడు ఆయన వయసు 68 సంవత్సరాలు. ఇంతకాలం అడ్డురాని వయసు.. ఇప్పుడు ఆయన ఉపాధికే ఎసరు పెట్టింది. పదవీ విరమణ వయసు దాటినందున అర్చకుడిగా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పేదరికంలో మగ్గుతున్న ఆయనకు ఆదుకునే అండ లేకపోవడంతో ఆ కుటుంబం ఆందోళనలో పడింది. – సాక్షి, హైదరాబాద్ ఇలా ఒక్క రామశాస్త్రికే కాదు.. రాష్ట్రంలోని వందల మంది అర్చకులకు ఉన్నట్టుండి ఇబ్బంది వచ్చిపడింది. దేవాలయ అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతన సవరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో కసరత్తు మొదలెట్టిన అధికారులు అర్చకుల పదవీ విరమణ వయసుపై దృష్టి సారించారు. విరమణ వయసు దాటి అర్చకులుగా కొనసాగుతున్నవారి విషయంలో నిర్ణయం తీసుకునే దిశగా యోచిస్తున్నారు. వారి తొలగింపు విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే అర్చకులను విధుల నుంచి తొలగించాలని నిర్ణయిస్తే వందల మంది పేద అర్చకుల కుటుంబాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. పెద్ద ఆలయాల్లోనే.. అర్చకుల పదవీ విరమణ వయసు ప్రస్తుతం 60 సంవత్సరాలు. దేవాదాయ శాఖ పర్య వేక్షణలోని పెద్ద దేవాలయాల్లోనే ఈ ని బంధన అమలవుతోంది. చిన్న దేవాలయాల్లో నిబంధనను పట్టించుకోకపోవడంతో చాలా దేవాలయాల్లో వయసుతో నిమిత్తం లేకుండా అర్చకులు పని చేస్తున్నారు. పాలక మండళ్లు నియమించినవారు కావటంతో వారి వయసు నూ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో పేదరికంలో మగ్గుతున్న వృద్ధులు అర్చకత్వాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచే వేతనాలు.. అర్చకులకు ప్రభుత్వం నుంచే నేరుగా వేతనాలు అందేలా వేతన సవరణకు ప్రభుత్వం ఇటీవల అంగీకరించింది. దేవాలయాల నుంచి వేతనాలకు కేటాయించే 30 శాతం నిధులు, లోటు ఏర్పడితే ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఇచ్చే నిధులనుంచి వేతనాలు చెల్లించనున్నారు. ఈ క్రమంలో ఒక్కో అర్చకుడి వివరాలు సేకరిస్తున్న అధికారులకు వయసు నిబంధన ఎదురైంది. ఇంతకాలం పట్టించుకో కుండా సాగినా, వేతన సవరణ జరుపుతున్నందున నిబంధన అమలు చేయకుంటే ఎలా అన్న సందేహం తలెత్తింది. అయితే 60 ఏళ్లు దాటిన అర్చకులు వందల సంఖ్యలో ఉండ టంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. 60 ఏళ్లు దాటిన అర్చకుల్లో ఎక్కువ మంది పేదలే కావటం, వారిలో చాలామందికి మరో అండ లేకపోవటంతో.. ఆయా కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పాపం.. పాలక మండళ్లదే దేవాదాయ శాఖ ఆలయ నియామకాల్లో పాలక మండళ్లదే ప్రధాన పాత్ర. ఖాళీలు, అర్హతలతో సంబంధం లేకుండా డబ్బు వసూలు చేసి నియామకాలు జరిపిన దాఖలాలు కోకొల్లలు. కానీ దీన్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. నియామకాలపై నిషేధం ఉన్నా, పాత తేదీలతో పోస్టింగులు ఇవ్వడం.. పాలక మండళ్ల గడువు తీరినా, పాత తేదీలతో పైరవీ చేసి పోస్టింగులు ఇప్పించడం పరిపాటిగా మారింది. మరోవైపు చిన్న దేవాలయాల్లో వయో నిబంధన అటకెక్కింది. ఇంతకాలం నామమాత్రంగా కూడా పట్టించుకోని దేవాదాయ శాఖ.. ఇప్పుడు వారిని ఉన్నట్టుండి తొలగించే దిశగా యోచిస్తుండటం వివాదాస్పదమవుతోంది. -
గోపాల మిత్రల గోడు పట్టదా..?
♦ పట్టించుకోని ప్రభుత్వం ♦ రూ.2 వేల జీతంతో ఆర్థిక ఇబ్బందులు ♦ ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేస్తున్న గోపాలమిత్రలు నిడదవోలు: గోపాలమిత్రల బతుకులు దుర్భరంగా మారాయి. ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్నా అందేది అంతంత మాత్రం వేతనమే.. ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్నా వేతనాలు పెంచడం లేదని గోపాలమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశు వైద్యాధికారికి, రైతుకు అనుసంధానకర్తగా పశుగణాభివృద్ధి సంస్థలో జిల్లా వ్యాప్తంగా 180 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ గ్రామగ్రామాన తిరుగుతూ పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అరకొర వేతనాలు రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి పశువులకు వైద్యం అందించడం వీరి ప్రధాన బాధ్యత. అయితే వీరు ఇంత చాకిరీ చేస్తున్నా అరకొర వేతనాలే అందుతున్నాయి. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ భారమవుతోందని గోపాలమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశుసంపద పెంచడానికి కృషి చేసేందుకు ‘రైతుల ముంగిటకే వైద్యం’ అనే నినాదంతో 2000 సంవత్సరంలో గోపాలమిత్రలను ప్రభుత్వం నియమించింది. వీరికి నెలకు రూ.2000 వేతనం ఇస్తున్నారు. ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తే అదనంగా మరో రూ.1500 చెల్లిస్తారు. లేదంటే గౌరవ వేతనం మాత్రమే అందుతుంది. విధులు ⇔ రైతులకు పశుగ్రాసం, మేతపై అవగాహన కల్పించడం ⇔ పశువైద్యాధికారి సహకారంతో గ్రామాల్లో గర్భకోçశ వ్యాధులపై చికిత్స శిబిరాలు, పశు విజ్ఞాన సదస్సులు నిర్వహించడం ⇔ రైతుల ఇళ్లకు వెళ్లి పశువులకు కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు చేయడం ⇔ కృత్రిమ గర్భధారణ పద్ధతులను ప్రోత్సహించి మేలు జాతి పశుసంతతిని అభివృద్ధి పర్చడం ⇔ పశువులకు బీమా చేయించడం ఇవీ డిమాండ్లు.. ⇔ పశుసంవర్ధకశాఖలో గోపాలమిత్రలను వీఏలుగా నియమిస్తామనే ప్రభుత్వ హామీని నెరవేర్చడం ⇔ పశువైద్యశాలలో గోపాలమిత్రలకు 50 శాతం కోటా కల్పించి, కార్యాలయ సబార్డినేట్లుగా నియమించడం ⇔ కనీస వేతనం రూ.13,500 కల్పించడం ⇔ ప్రమాదంలో మరణించిన వారికి రూ. 5 లక్షల ప్రమాద బీమా చెల్లింపు ⇔ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ∙రవాణా చార్జీల చెల్లింపు -
‘మార్కెట్ కమిటీ’ వేతనాలు పదింతలు
గ్రేడ్–1 మార్కెట్ చైర్మన్ల వేతనం వెయ్యి నుంచి 10 వేలకు పెంపు - రూ.2 వేలున్న వారి వేతనం రూ.20 వేలకు పెంపు - పెంపునకు మంత్రి హరీశ్‌రావు ఆమోదం..10 రోజుల్లో ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల వేతనాలను భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత వేతనాలను ఏకంగా పదింతలు చేయనుంది. సెలక్షన్ గ్రేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్లకు ప్రస్తుతం రూ.2 వేల వేతనం ఇస్తుండగా దాన్ని రూ.20 వేలకు పెంచనున్నారు. స్పెషల్ గ్రేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ల వేతనాన్ని రూ.1,500 నుంచి రూ.15 వేలకు, గ్రేడ్–1 మార్కెట్ కమిటీ చైర్మన్ల వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.10 వేలకు, ఇతర గ్రేడ్ మార్కెట్ల చైర్మన్ల వేతనాన్ని రూ.500 నుంచి రూ.10 వేలకు పెంచనున్నారు. వేతనాల పెంపుపై మార్కెటింగ్‌శాఖ కసరత్తు చేసి మంత్రి హరీశ్‌రావుకు ఫైలు పంపగా.. ఆయన ఆమోదం తెలిపినట్లు సమాచా రం. ఇందుకు సంబంధించి వారం, పది రోజుల్లోగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. సరైన వేతనాలు లేక ఇబ్బందులు... రాష్ట్రంలోని 180 మార్కెట్ కమిటీల్లో 16 సెలక్షన్ గ్రేడ్ మార్కెట్లు, 29 స్పెషల్ గ్రేడ్ మార్కెట్లు, 26 గ్రేడ్–1 మార్కెట్లు, 109 ఇతర మార్కెట్లు ఉన్నా యి. కొందరు మార్కెట్ కమిటీల చైర్మన్ల వేతనాలు అణగారిన వర్గాలకు ఇస్తున్న పింఛన్లకన్నా తక్కువగా ఉన్నాయని మార్కెటింగ్‌శాఖ భావించింది. బడుగు, బలహీనవర్గాలకు చెందిన అనేక మంది మార్కెట్ కమిటీ చైర్మన్ల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండటం, తక్కువ వేతనాల కారణంగా వారు వివిధ ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వారి వేతనాలను భారీగా పెంచాలని నిర్ణయించినట్లు మార్కెటింగ్‌శాఖ వర్గాలు తెలిపాయి. వేతనాల పెంపు నిర్ణయం వాస్తవమేనని, త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. కాల పరిమితి పొడిగింపు అనేక మార్కెట్ కమిటీ చైర్మన్ల కాలపరిమితి ముగుస్తుండటంతో ప్రభుత్వం వాటిని 6 నెలలకు పొడిగిస్తోంది. 70 మార్కె ట్ కమిటీ పాలక వర్గాలకు 6 నెలలు పొడిగింపు ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్ కమిటీలకు ఏడాది కాలపరిమితి ఉండగా దాన్ని రెండుసార్లు వరకు 6 నెలల చొప్పున పొడిగించే వీలుంది. మార్కెట్ కమిటీలను బలో పేతం చేయాలనుకుంటున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. వచ్చే సీజన్లో మిర్చి, కంది సహా ఇతర ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు సూచించామన్నారు. -
ఎన్నాళ్లీ వెట్టిచాకిరి..?
► ముప్పై ఏళ్లుగా ఎదురుచూపులే.. ► స్వరాష్ట్రంలోనూ దుర్భర జీవితం ► ఇదీ పీటీఎఫ్‌ల దుస్థితి ► ఉమ్మడి జిల్లాలో 142 మంది ఉద్యోగులు ► 8 నెలలుగా అందని వేతనం బీర్కూర్(బాన్సువాడ): ‘ఈరోజు కాకున్నా రేపైనా ప్రభుత్వం తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయకపోతుందా, మా వేతనాలు పెరగక పోతాయా’.. అంటూ ముప్పై ఏళ్లుగా పీటీఎఫ్‌లు(పార్ట్ టైం ప్యూన్) వెట్టిచాకిరీ చేస్తూనే ఉన్నారు. వీరితోపాటు ఇతర ఉద్యోగాల్లో చేరినవారు పదోన్నతులు పొంది రూ.వేలల్లో వేతనాలు పొందుతూ రిటైర్మెంట్కు దగ్గరపడినా, పీటీఎఫ్‌ల జీవితాల్లో మాత్రం వెలుగు రాలేదు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలోనే వీరు విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 142 మంది.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జీవో నంబర్ 212 ప్రకారం 102 మంది, జీవో 112 ప్రకారం 32 మంది పీటీఎఫ్‌లు ఆయా పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 1987లో విధుల్లో చేరిన పీటీఎఫ్‌ల సర్వీసు మొత్తం పుణ్యకాలానికే సరిపోయింది. అయినా ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూస్తూనే ఉన్నారు. వారికి పర్మినెంట్ లేదు సరికదా వేతనం సైతం ఆశించిన స్థాయిలో పెరగలేదు. 1987లో రూ.75తో ప్రారంభమైన వేతనం ప్రస్తుతం రూ.4వేలు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశన్నంటిన ప్రస్తుత తరుణంలో వీరి వేతనం గతేడాది అక్టోబర్ వరకు నెలకు రూ. 1623గానే ఉంది. ధరల పెరుగుదలకు అనుగుణంగా జీతాలు పెరగలేదు. గతేడాది అక్టోబర్‌లో రూ.4వేలకు వేతనం పెంచుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం 8నెలలైనా ఇంకా నయాపైస మంజూరు చేయలేదు. అయినా 30 ఏళ్లుగా ఏ క్షణాన పాలకులు, అధికారులు కనికరిస్తారో అంటూ ఆశావాహ దృక్పథంతో జీవనం సాగిస్తున్నారు పీటీఎఫ్‌లు. ఆశవర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు, ఐకేపీ బుక్కీపర్లకు, వీఆర్ఏలు, వీవీలకు విరివిగా వేతనాలు పెంచిన ప్రభుత్వం పీటీఎఫ్‌ల వేతనాలను పెంచాలని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. 8నెళ్లుగా వేతనాలు ఇస్తలేరు.. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. మంత్రులు, ముఖ్యమంత్రులు మారారు. కాని మా సమస్యలు పరిష్కారానికి నోచుకోలే. తమ సేవలను ప్రభుత్వం గుర్తించి సర్వీస్ రెగ్యులర్ చేసి న్యాయం చేయాలి. 8నెలలుగా వేతనాలు ఇస్తలేరు. రంజాన్ పండుగకైనా వస్తాయని ఆశతో ఎదురు చూసినా రాలేదు –హఫీజ్, పీటీఎఫ్, బోర్లంక్యాంపు శ్రమ దోపిడీకి గురవుతున్నాం.. 30 ఏళ్లుగా ఉద్యోగం పర్మినెంట్ అవుతుందేమోననే ఆశతో తక్కువ వేతనం వచ్చినా పని చేస్తూ వస్తున్నాం. ఉదయం 7 గంటలకు పని మొదలు పెడితే సాయంత్రం 5 గంటల వరకు చేస్తున్నం. శ్రమకు తగిన వేతనం లభించక శ్రమ దోపిడీకి గురవుతున్నాం. తమకన్నా ఉపాధి కూలీలు నయం. –వీరేశం, పీటీఎఫ్, జెడ్పీ హైస్కల్, కోనాపూర్ -
వేతనాలివ్వండి మహాప్రభో!
► రాష్ట్రంలో ఎంపీటీసీలకు ఆరు నెలలుగా అందని గౌరవ వేతనాలు ► సర్కారు ఉత్తర్వులిచ్చి నెలరోజులైనా విడుదల కాని నిధులు సాక్షి, హైదరాబాద్: నేతి బీరలో నెయ్యి చందమంటే ఇదేనేమో! పేరుకు ప్రజాప్రతినిధి. కానీ వారి వద్ద నిధి ఉండదు. నెలనెలా గౌరవ వేతనం ఇవ్వాలి. కానీ వేతనం సక్రమంగా అందదు. ఇదీ మండల పరిషత్ ప్రాదేశిక కమిటీ(ఎంపీటీసీ)సభ్యుల దుస్థితి. అభివృద్ధి నిధులు, రాజ్యాంగం కల్పించిన అధికారాల కోసం ఎంపీటీసీలు ఎంత కొట్లాడినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,441మంది ఎంపీటీసీలున్నారు. వీరికి నెలనెలా రూ.5 వేల చొప్పున, 438 మంది మండల పరిషత్ అధ్యక్షుల(ఎంపీపీ)కు రూ.10వేల చొప్పున ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం రావాల్సి ఉంది. అయితే, గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎంపీటీసీల్లో చాలామంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారే. కూలీకి వెళితే తప్ప రోజులు గడవని పరిస్థితి వారిది. వేతనం రాక, కూలీకి వెళ్లలేక సతమతమవుతున్నారు. రోజువారీ కుటుంబ ఖర్చుల నిమిత్తం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత నెల 28న ఎంపీటీసీలు, ఎంపీపీల గౌరవ వేతనాల నిమిత్తం రూ.21.95 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సర్కారు ఉత్తర్వులిచ్చి నెలవుతున్నా, నేటికీ గౌరవ వేతన బకాయిలు తమ చేతికి అందలేదని ఎంపీటీసీలు వాపోతున్నారు. మూడేళ్లనాటి బకాయిలకేదీ మోక్షం 2014–15 ఆర్థిక సంవత్సరంలో అందాల్సిన ఆరు నెలల వేతన బకాయిలకూ ఇప్పటిదాకా మోక్షం కలగలేదు. 2015 ఏప్రిల్‌లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వేతనాలను పెంచిన ప్రభుత్వం అంతకు ముందు ఆరునెలల బకాయిలను చెల్లించకుండా వదిలేసింది. వేతన పెంపు కంటే ముందు ఎంపీటీసీలకు నెలకు రూ.750, ఎంపీపీలకు నెలకు రూ.1500 చొప్పున చెల్లించాల్సి ఉంది. గౌరవ వేతనంతోపాటు మండల పరిషత్ సమావేశాలకు హాజరైతే టీఏ, డీఏలను కూడా చెల్లించాల్సి ఉంది. 2014 అక్టోబరు నుంచి 2015 మార్చి నెలవరకు రూ.4.54 కోట్లు ప్రభుత్వం నుంచి ఎంపీటీసీలకు, ఎంపీపీలకు అందాల్సి ఉంది. మొత్తంగా రూ.26.49 కోట్లను ఎంపీటీసీలకు, ఎంపీపీలకు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గౌరవ వేతనాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని తెలంగాణ ఎంపీటీసీల ఫోరం హెచ్చరిస్తోంది. ఎంపీటీసీలపై సర్కారు చిన్నచూపు ఎమ్మెల్యేలు, ఎంపీల మాదిరిగానే ప్రజలతో నేరుగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుండడం దురదృష్టకరం. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజాప్రతినిధులకు అధికారాలు, అభివృద్ధి పనులకు నిధులివ్వకుండా మండల, జిల్లా పరిషత్ వ్యవస్థలను బలహీనపరుస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంపీటీసీలు నెరవేర్చలేని దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇకనైనా ఎంపీటీసీలకు గౌరవ వేతనాలను ప్రతినెలా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. ఎమ్మెల్యేలకు మాదిరిగా ఎంపీటీసీలకు కూడా అభివృద్ధి నిధులను ఇవ్వాలి. – యు. మనోహర్‌రెడ్డి, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి -
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
కూడేరు (ఉరవకొండ) : కూడేరు మండలం కరుట్లపల్లికి చెందిన ఉపాధి కూలీ బండి లక్ష్మీదేవి (45) వడదెబ్బతో సోమవారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు అందించిన వివరాల మేరకు... లక్ష్మీదేవి శనివారం ఉపాధి పనికి వెళ్లింది. ఎండలోనే పని చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత నీరసంగా ఉండడంతో స్థానికంగా ఉన్న వైద్యునితో చూపించుకుంది. ఆదివారం ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి వెళ్లింది. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందింది. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మీదేవి ప్రభుత్వాన్ని కోరారు. -
108 ఉద్యోగులకు ఉగాది కానుక
-
108 ఉద్యోగులకు ఉగాది కానుక
రూ.4 వేల చొప్పున జీతాల పెంపు: లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 ఉద్యోగులందరికీ రూ.4 వేల చొప్పున వేతనాలు పెంచారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పెంపు 2016 ఏప్రిల్ నుంచి వర్తిం పచేస్తున్నట్లు చెప్పారు. పెంపు మొత్తాన్ని విడుదల చేశామన్నా రు. దీంతో 1,578 మందికి లబ్ధి చేకూరుతుందని, వివిధ కేడర్లకు చెందిన వారి వేతనాలు రూ. 19 వేలు కానున్నాయని మంత్రి వివరించారు. -
ఉపాధి కూలీ.. ఉగాది ఖాళీ
కోవెలకుంట్ల: మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు ఈ ఏడాది ఉగాది పండుగకు దూరం కానున్నారు. 55 రోజులు నుంచి వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో తెలుగు సంవత్సరాది పండుగ పూట పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని 53 మండలాల్లో 1.08 లక్షల మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయని కారణంగా గత నెల 2వ తేదీ నుంచి కూలీల వేతనాలు నిలిచిపోయాయి. ఒక్కో కుటుంబానికి సంబంధించి రూ. 10వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనాలు అందాల్సి ఉంది. జిల్లాలో పని చేస్తున్న ఉపాధి కూలీలకు రూ. 15 కోట్ల మేర వేతనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇంటిల్లిపాది పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభం నుంచే ఉపాధి పనులను ప్రారంభించింది. పనులకు వెళితే నాలుగుడబ్బులొస్తాయన్న ఆశతో కూలీలు వేసవికాలం ప్రారంభం కావడంతో ఎండను సైతం లెక్కచేయకుండా పనులు చేస్తున్నారు. వేతనాల కోసం రెండు నెలలుగా నిరీక్షణ దాదాపు రెండు నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోవడంతో కూలలు వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. డబ్బులు రాకపోవడంతో ఇప్పటికే ఎక్కువ శాతం మంది ఉపాధి కూలీలు పనులు మానేసి వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. కొందరు మిరప కోతలు, గడ్డివాముల పనులకు వెళ్తుండగా గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని కూలీలు తప్పని పరిస్థితుల్లో ఉపాధి పనులు చేస్తున్నారు. కూలీల సంఖ్యను పెంచాలంటూ జిల్లా కలెక్టర్ ఇటీవల సిబ్బందిపై కొరడా ఝుళిపించి 26 మండలాల సిబ్బందికి వారం రోజుల పాటు వేతనాల్లో కోత విధించారు. అయితే మరో రెండు రోజుల్లో ఉగాది పండుగ ఉండగా కూలీలకు డబ్బులు చెల్లించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కూలీలు ఆవేదన చెందుతున్నారు. ఉగాది ముఖ్యమైన పండుగ కావడంతో వేతనాలు లేక పండుగ ఎలా చేయాలని కూలీలు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుని వేతనాలు చెల్లించాలని కూలీలు కోరుతున్నారు. పండగెట్టా చేయాలి: నారాయణమ్మ, ఉపాధి కూలీ నాలుగు వారాల నుంచి కోవెలకుంట్ల సమీపంలో జుర్రేరు వాగులో ఫాంపాండ్ల నిర్మాణ పనులు చేస్తున్నాను. 14 రోజుల కొకసారి వేతనాలు అందజేయాల్సి ఉంది. ఈ ఏడాది నెల రోజులు పనిచేసినా డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు లేకుండా ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి. బొబ్బలేక్కేలా చేసినా పైసా ఇవ్వలేదు: ఉసేన్‌బీ, ఉపాధి కూలీ భూమి గట్టిగా ఉండటంతో ఫాంపాండ్లు తవ్వేందుకు ఇబ్బందులు పడుతున్నాం. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనిచేస్తే తప్ప రూ. 194 కూలి పడటం కష్టంగా ఉంది. నెలన్నర రోజుల నుంచి అర చేతులు బొబ్బలెక్కేలా పనిచే స్తున్నా ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఉగాది పండుగకు డబ్బులు వస్తాయనుకుంటే ఇంత వరకు ఇవ్వలేదు వేతనాలు అందజేసేందుకు చర్యలు: సాంబశివరావు, ఉపాధి పథక ఏపీడీ కూలీలకు వేతనాలు చల్లించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. బ్యాంకర్లతో మాట్లాడి ఒకటి, రెండు రోజుల్లో కూలీలకు వేతనాలు అందించేందుకు కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. -
ఉగాదికి ఉపాధి వేతనాలు విడుదల
- గ్రామీణా«భివృద్ధి కమిషనర్ రామాంజినేయులు - జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కర్నూలు(అర్బన్): ఉపాధి కూలీలకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బకాయి ఉన్న రూ. 10 కోట్ల వేతనాలను ఉగాది పండుగలోగా విడుదల చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం ఆయన రాజధాని నుంచి జిల్లా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి కూలీలకు రెండు నెలలుగా వేతనాలు అందకపోవడాన్ని డ్వామా పీడీ డాక్టర్ సి.హెచ్.పుల్లారెడ్డి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వేతన బకాయిలున్నాయని, వీలైనంత త్వరగా వాటిని విడుదల చేసేందుకు చర్యలు చేపడుతున్నామని కమిషనర్ చెప్పారు. ఈనెల 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఉపాధి పనులను వేగవంతం చేయాలన్నారు. వర్మికంపోస్టు యూనిట్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను కూడా గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా పీడీ పుల్లారెడ్డి మాట్లాడుతూ ఈ ఐదు రోజుల్లో ఐదు లక్షల పనిదినాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, దాదాపు రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తామన్నారు. వెయ్యి ప్రకారం ఫాంపాండ్స్, వ్యక్తిగత మరుగుదొడ్లు, వర్మికంపోస్టు యూనిట్లను పూర్తి చేస్తామన్నారు. ఉపాధి వేతనాలకు సంబంధించి కూలీలు ఎలాంటి హైరానా చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుత బకాయిలన్నింటినీ విడుదల చేసిన అనంతరం కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేతనాలను కూలీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని కమిషనర్ చెప్పారు. కార్యక్రమంలో అదనపు పీడీలు మురళీధర్, రసూల్, ఎంఅండ్‌ఈ సులోచన పాల్గొన్నారు. -
వేతనాల్లేవ్!
మార్చి గడుస్తున్నా చేతికందని ఫిబ్రవరి జీతం రెండు వేల మంది ఉద్యోగుల ఎదురుచూపు హన్మకొండ అర్బన్: మరో వారం రోజుల్లో మార్చి నెల ముగుస్తుంది. ఇప్పటి వరకు జిల్లాలోని రెండు వేల మందికి పైగా ఉద్యోగులకు ఫిబ్రవరి నెల వేతనాలు చేతికందలేదు. ఆదాయ పన్నుకు సంబంధించి వివరాలు అందజేయని కారణంగా కొందరి వేతనాలు ఆగితే.. మరికొందరివి ప్రభుత్వ కార్యాలయాల్లో బిల్లులు చేయక ఆగినట్లు సమాచారం. ఉద్యోగుల వేతనాల బిల్లులు చేసే క్రమంలో ఇన్‌కంటాక్స్ బిల్లుల పేరుతో కార్యాలయాల్లో ఒక్కో ఉద్యోగి నుంచి రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేశారు. ఇలాంటి చోట్ల కూడా ఇప్పటివరకు వేతనాలు ఉద్యోగుల ఖాతాల్లో పడకపోవడంతో వారు మండిపడుతున్నారు. నెలాఖరు వచ్చినా వేతనాలు రాక పోవడం వల్ల బ్యాంకుల్లో గతంలో తీసుకున్న రుణాలకు సంబందించి చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఉద్యోగులు అంటున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని ఎస్సీ సంక్షేమ శాఖలో ఉద్యోగులకు వేతనాల బిల్లులు చేసే ఉద్యోగి ఇటీవల ఖమ్మం జిల్లాకు పదోన్నతిపై వెళ్లారు. బదిలీ కంటే ముందే శాఖలో పనిచేసే ఉద్యోగులందరి నుంచి ఇన్‌కంటాక్స్ బిల్లులు, డీటీఓ అధికారుల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.500 తీసుకున్నారు. అనంతరం విధుల నుంచి రిలీవ్ అయి ఖమ్మంలో జాయిన్ అయ్యారు. బిల్స్ చేయలేదు సరికదా.. కొత్తగా చార్జ్ ఇచ్చిన వారికి కనీసం సిస్టం పాస్వర్డ్ కూడా చెప్పకుండా వెళ్లాడని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో రెండు రోజుల క్రితం కార్యాలయంలో కొందరు ఉద్యోగులు ఉన్నతాధికారికి విషయం చెప్పి గొడవకు దిగినట్లు సమాచారం. అయినా ఇప్పటి వరకు ఎలాంటి మార్పూ లేదు. ఫిబ్రవరి నెలకు సంబందించి వేతనాలు అందుకోనివారు సుమారు 2వేల మంది వరకు ఉంటారని జిల్లా ఖజానా అధికారి జి.రాజు తెలిపారు. బిల్లుల అందజేయక పోవడం, టైంలోపు ఆదాయపన్ను వివరాలు అందజేయక పోవడం వల్ల వేతనాలు పొందలేక పోయారని తెలిపారు. -
భద్రత గాలికి..
వేతనాలు లేక మక్కా, రాయల్ మసీదు సిబ్బంది అవస్థలు సగం మంది హోంగార్డులు మాతృ విభాగానికి ప్రశ్నార్థకంగా మారిన మక్కా మసీదు భద్రత సిటీబ్యూరో: చారిత్రక మక్కా, పబ్టిక్ గార్డెన్స్‌లోని రాయల్ మసీదు సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. నగరంలో ప్రముఖమైన ఈ రెండు మసీదులు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏటా బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయిస్తున్నా మక్కా, రాయల్ మసీదుల సిబ్బందికీ గత రెండేళ్లుగా సకాలంలో వేతనాలు అందడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని అన్ని విభాగాల సిబ్బందికి ప్రతి నెల వేతనాలు చెల్లిస్తున్న అధికారులు తమపై చిన్న చూపు చూడటం దారుమని వారు పేర్కొన్నారు. ప్రతి నెల వేతనాలు వస్తాయో.. రావోనని ఆందోళన చెందుతున్నామని, కుటుంబ పోషణ కష్టంగా మారిందని, పిల్లలను చదివించుకునేందుకు అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. మాతృ విభాగానికి హోంగార్డులు ఇదిలా ఉండగా మక్కా, రాయల్ మసీదుల్లో 24 మంది హోం గార్డులు బందోబస్తు విధులు నిర్వహిస్తుంటారు. గతంలో మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుళ్లను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం మక్కా మసీదులో 24 గంటల పాటు బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇందుకుగాను ప్రత్యేకంగా హోంగార్డులను నియమించారు మక్కా, రామల్ మసీదులో మొత్తం 24 మంది సెక్యూరిటీ గార్డులు పని చేస్తున్నారు.అయితే గత నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారిలో 11 మంది మాతృ విభాగానికి వెళ్లి పోయినట్లు మక్కా, రాయల్ మసీదు పర్యవేక్షకుడు ఖాద్రీ తెలిపారు. దీంతో మిగిలిన 13 మందితో మక్కా మసీదులో 6–7 మంది చొప్పున బందోబస్తును కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సెక్యూరిటీ ప్రశ్నార్థకం మక్కా మసీదును సందర్శించడానికి రోజు వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. శుక్రవారం, అదివారం, సెలవు దినాల్లో వీరి సంఖ్య భారీగా ఉంటోంది. గతంలో 24 మంది హోంగార్డులు బందోబస్తులో పాల్గొంటుండగా, ప్రస్తుతం కేవలం 13 మందితోనే నెట్టుకురావాల్సి వస్తోంది. గతంలో సెక్యూరిటీ వైఫల్యం కారణంగానే బాంబు పేలుడు ఘటనలు చోటు చేసుకున్న విషయం విదితమే.ఈ నేపథ్యంలో వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మక్కా, రాయల్ మసీదు సిబ్బందికి, హోంగార్డులకు వేతనాలు చెల్లించాలని, బందోబస్తును కట్టుదిట్టం చేయాలని పలువురు ధార్మిక, మైనార్టీ స్వచ్చంధ సంస్థలు ప్రతినిధులు కోరుతున్నారు. -
వీవోఏల జీతం రూ. 5 వేలు
⇒ వారి వేతనాల పెంపునకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ⇒ ప్రభుత్వం తరఫున రూ.3 వేలు, గ్రామైక్య సంఘాల నుంచి రూ.2 వేలు ⇒18,405 మందికి ప్రయోజనం ⇒ డ్వాక్రా మహిళలు కుటీర పరిశ్రమలు నడపాలన్న సీఎం ⇒ అవసరమైన శిక్షణ, చేయూత అందిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: జనహిత వేదికగా వివిధ వర్గాలతో సమావేశమవుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరో వరం ప్రకటించారు. గ్రామాల్లో అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వివో ఏల) వేతనాలను రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అందులో రూ.3 వేల ను ప్రభుత్వం తరఫున, మరో రూ.2 వేలు గ్రామైక్య సంఘాల తరఫున అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 18,405 మంది వీవోఏలు ఉన్నారు. సీఎం తాజా నిర్ణయంతో వారందరికీ లబ్ధి కలగనుంది. ఒక్కొక్కరికి కనీసం రూ.3,500 వేతనం పెరగనుంది. ఇప్పుడిస్తున్నది రూ. 1,500 లోపే! ప్రస్తుతం గ్రామంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్య, వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వీవోఏలకు వేతనాలు చెల్లిస్తున్నారు. ఇలా వీవోఏలకు నెలకు రూ.500 నుంచి రూ.1,500 వరకు మాత్రమే వేతనంగా అందుతున్నాయి. దీంతో తాము చేసే పనికి వస్తున్న జీతం సరిపోవడం లేదంటూ వారు కొన్నేళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామైక్య సంఘాలిచ్చే డబ్బుతో పాటు ప్రభుత్వం కూడా కొంత వేతనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యం లో బుధవారం ప్రగతి భవన్లో వీవోఏలతో సీఎం కేసీఆర్ సమావేశమై.. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారికి నెలకు రూ.5 వేల వేతనం చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. గ్రామైక్య సంఘాలు రూ.2 వేలు చెల్లించాలని, మిగతా రూ.3 వేలు ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ వాటాను సెర్ప్ ద్వారా చెల్లిస్తామని, గ్రామైక్య సంఘాల వాటాను చెల్లించే బాధ్యతను సూపర్ వైజర్లు తీసుకోవాలని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి చర్యలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఈ సంద ర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామాల్లో డ్వాక్రా మహిళల ఆర్థిక స్థితి మెరుగు పడాలని చెప్పారు. ‘రాష్ట్రంలో మహిళా సంఘాలకు మంచి పేరు వచ్చింది. కేవలం పొదుపుతోనే సరిపెట్టుకోకుండా కుటీర పరిశ్రమలు నడ పాలి. గ్రామాల్లో దొరికే వస్తువులను మార్కెట్ అవసరాలు తీర్చేలా ప్రాసెసింగ్ చేయాలి. కారంపొడి, పసుపు పొడి, పాపడాలు, కారా, బూందీ లాంటి వస్తువులను తయారు చేయా లి. అప్పుడు మహిళలకు ఉపాధి లభిస్తుంది, ప్రజలకు కల్తీలేని సరుకులు దొరుకుతాయి’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం మహిళలకు అవసరమైన శిక్షణను అందిస్తుందన్నారు. వివిధ రాష్ట్రాలు, బంగ్లా దేశ్ లాంటి దేశాల్లో మహిళా సంఘాలు ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేస్తామని... పూర్తిస్థాయి కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సెర్ప్ సీఈవో నీతూ ప్రసాద్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు పాల్గొన్నారు. -
నేడే ఆఖరు
► సమగ్ర వివరాలు సమర్పించిన ఉద్యోగులు 50 శాతమే ► వేతనాలు నిలిపివేస్తామన్నా.. కొరవడిన స్పందన ► ఈరోజు భారీ సంఖ్యలో అందే అవకాశం సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సమగ్ర సమాచారం అందించడానికి గడువు నేటితో ముగియనుంది. ఇంతవరకు 50 శాతం ఉద్యోగుల వివరాలు మాత్రమే జిల్లా ట్రెజరీ శాఖకు చేరినట్లు తెలుస్తోంది. నిర్ణీత ఫార్మెట్లో వివరాలు అందజేయాలని, లేకుంటే ఫిబ్రవరి నెలకు సంబంధించిన వేతనాలు నిలిపివేస్తామని గత నెలలో ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. పరిపాలనా సౌలభ్యం, బడ్జెట్ అంచనాలు, ఖాళీగా ఉన్న పోస్టులు తదితర లెక్కలపై స్పష్టమైన సమాచారం రాబట్టడానికి వీలుగా ఈ చర్యలకు ఉపక్రమించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దీనికి అనుగుణంగా ఈనెల 20వ తేదీలోగా శాఖల వారీగా ఉద్యోగుల వివరాలను అందజేయాలని డిస్బర్సింగ్ అండ్ డ్రాయింగ్ ఆఫీసర్ల (డీడీఓ)కు జిల్లా ట్రెజరీ శాఖ సూచిం చింది. ఆలస్యం చేయకుండా వివరాలు పంపేందుకు వీలుగా ప్రతిశాఖకు నమూనా ఫారాలను కూడా చేరవేసింది. బిల్లులతోనే వివరాలు వాస్తవంగా అన్ని శాఖల నుంచి ఉద్యోగుల పే బిల్లులు ప్రతినెలా 25వ తేదీలోగా ట్రెజరీకి అందుతాయి. వీటి ఆధారంగానే వేతనాలు విడుదల చేస్తారు. ఈ నిర్ణీత తేదీకి ఐదు రోజుల ముందుగానే అంటే 20వ తేదీలోగా వివరాలు తమకు అంద జేయాలని ట్రెజరీ శాఖ అధికారులు చెప్పినప్పటికీ.. పెద్దగా స్పందన రాలేదు. పే బిల్లుల అందజేతకు గడువు నేటితో ముగియనుంది. వివరాల అందజేతకూ ఇదే వర్తిస్తుంది. జిల్లాలో 18 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లు ఉన్నారు. ఇందులో ఇంకా 50 శాతం మంది వివరాలు ట్రెజరీకి అందాల్సి ఉందని సమాచారం. ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి చాలా మంది ఉద్యోగులు వివరాలు చేరలేదని తెలుస్తోంది. ఈ శాఖ పరిధిలో జిల్లాలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కానిస్టేబుల్ నుంచి ఐఏఎస్ ర్యాంకు వరకు దాదాపు ఐదు వేల మంది ఉంటా రని అంచనా. వీరిలో దాదాపు రెండు వేల మందే సమర్పించారని సమాచారం. తమ పరిధిలో ఉన్న ఉద్యోగుల వివరాల పత్రాలను డీడీఓలు సేకరిస్తున్నారు. ఇలా తీసుకున్న ప్రతి ఉద్యోగి సమాచారాన్ని సర్వీస్ పుస్తకంలో ఉన్న అంశాలతో సరిచూ డాల్సి ఉంటుంది. ఇవన్నీ సహేతుకంగా ఉంటేనే ఒకే చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి అధిక సమయం పడు తోం దని అధికారులు వివరిస్తున్నారు. ఈ కారణంగా అందజేతలో కాస్త జాప్యం చోటుచేసుకుంటుందని చెబుతున్నారు. అయితే డీడీఓల నుంచి చివరి రోజు పెద్ద ఎత్తున అందవచ్చని ట్రెజరీ శాఖ భావిస్తోంది. మరోవైపు సాయంతంల్రోగా తమకు చేరిన పత్రాలకు సంబంధించిన ఉద్యోగులకే వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మిగిలిన వారు అందుకు నోచుకోక పోవచ్చని పేర్కొంటున్నారు. -
‘ఉపాధి హామీ’వేతనాలు పెంపు!
న్యూఢిల్లీ: పెరుగుతున్న ధరల నుంచి పేదలను కాపాడేందుకు కేంద్రం గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీ ఏ) వేతనాలను పెంచే అవకాశం ఉంది. వేతనాలు నిర్ణయించే ప్రాతిపదిక(బేస్‌లైన్)ను మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉపాధి హామీ పథకం వేతనాల వార్షిక సమీక్ష బేస్‌లైన్‌ను వినియోగదారుల ధరల సూచీ–వ్యవసాయ కూలీ(సీపీఐ–ఏఎల్) నుంచి వినియోగదారుల ధరల సూచీ –గ్రామీణం(సీపీఐ– రూరల్)కు మార్చనున్నట్లు గ్రామీణ శాఖ కార్యదర్శి అమర్జీత్ సిన్హా తెలిపారు. ఇందుకోసం ఎస్ మహేంద్ర దేవ్ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటామని, తుది నిర్ణయం మాత్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాక ఉంటుందని వెల్లడించారు. -
చెక్కుల, ఖాతాల ద్వారానే వేతనాల చెల్లింపు
న్యూఢిల్లీ: పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు చెల్లించాల్సిన వేతనాల్ని చెక్కులు లేదా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని పేర్కొంటూ ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది. పేమెంట్ ఆఫ్ వేజెస్(సవరణ) బిల్లు 2017ను, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ బిల్లును సభ ముందుంచారు. పేమెంట్ ఆఫ్ వేజెస్(సవరణ) బిల్లు 2016, స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఇంతకుముందు ఈ అంశంపై జారీ చేసిన ఆర్డినెన్స్ ను కూడా రద్దు చేయాలని సూచించారు. -
మా వేతనాలు పెంచండి
ఈజీఎంఎం జాబ్ రిసోర్స్ పర్సన్ల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయి మెంట్ గ్యారంటీ అండ్ మార్కె టింగ్ మిషన్ (ఈజీఎంఎం)లో పనిచేసే ఉద్యోగులకు దాదాపు పదేళ్లుగా వేతనాలు పెంచడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నామని ఈజీఎంఎం జాబ్ రిసోర్స్ పర్సన్లు వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో పనిచేస్తున్న జేఆర్పీలు సోమవారం హైదరాబాద్‌లోని ఈజీఎంఎం కార్యాలయాన్ని ముట్టడించారు. చిరుద్యోగుల పట్ల ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఈజీఎంఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధుకర్బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై ఈడీ మధుకర్బాబును ‘సాక్షి’వివరణ కోరగా... జీతాల పెంపు ఆర్థికపరమైన అంశం కనుక పాలకమండలి ఆమోదం తప్పనిసరని చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంలో పాలకమండలి సమావేశం జరిగే అవకాశం ఉందని, పాలకమండలి సూచనల మేరకు జేఆర్పీల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. -
కార్మికుల పిల్లలకు ప్రోత్సాహకాలు
ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు సాక్షి, హైదరాబాద్: కార్మిక కుటుంబాల్లో పదోతరగతి, ఆపైన చదువుతున్న పిల్లలకు ఉపకారవేతనాలు ఇవ్వాలని తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి నిర్ణయించింది. ప్రతిభ ఆధారంగా వీటిని మంజూరు చేయనుంది. ఇందులోభాగంగా 2015–16 విద్యాసంవత్సరంలో పదోతరగతి, ఆపై చదువులు పూర్తి చేసిన వారికి ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. 2015–16 విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు రూ.వెయ్యి, పాలిటెక్నిక్ కోర్సు చేసిన వారికి రూ.1,500, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారికి రూ.2వేల చొప్పున ఉపకారవేతనం ఇవ్వనుంది. ఈమేరకు దరఖాస్తు ఫారాలు సహాయ కార్మిక కమిషనర్ (ఏసీఎల్) కార్యాలయాల్లో అందుబాటులో ఉంచింది. పూర్తిచేసిన దరఖాస్తులను వచ్చేనెల 28లోగా కార్మిక కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలని సూచించింది. ప్రతిభ ఆధారం గా అర్హులను గుర్తించి, మేడే నాటికి బ్యాంకు ఖాతాలో ఉపకారవేతన నిధులు జమచేయనున్నట్లు తెలంగాణ సంక్షేమ మండలి కార్యాలయం తెలిపింది. -
ఇక పట్టణీకరణ!
మున్సిపాలిటీల పరిధి పెంపు కొత్త నగర పంచాయతీల ఏర్పాటు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు మెట్పల్లి(కోరుట్ల) : కొత్త జిల్లాల్లో పట్టణ ప్రాంతాల పెంపుపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. జిల్లాల విభజన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం వాటిలో పట్టణాల రూపకల్పనపై దృష్టి సారించింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీల పరిధిని పెంచడంతోపాటు కొత్తగా నగర పంచాయతీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిపై విధివిధానాలను రూపొందించి వాటి ప్రకారం ప్రతిపాదనలను తయారు చేసి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. జగిత్యాల జిల్లాలో 327 గ్రామ పంచాయతీలతో పాటు మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. 9 మేజర్ గ్రామ పంచాయతీలున్నాయి. జిల్లాలో ప్రస్తుతమున్న మున్సిపాలిటీల పరిధి పెంచడంతో పాటు మేజర్ గ్రామాల్లోని రెండు లేదా మూడింటిని నగర పంచాయతీలుగా మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీల పరిధి పెంచడానికి వాటికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల విలీనం, 20 నుంచి 40వేల జనాభా ఉన్న మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చడానికి అవకాశాలను పరిశీలించాలని ఉత్తర్వులో పేర్కొంది. ఇందుకు ఆదాయం, మౌళిక సదుపాయాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. మున్సిపాలిటీల్లో విలీనమయ్యే గ్రామాలు... ప్రభుత్వం సూచన మేరకు మున్సిపాలిటీలో విలీనానికి అవకాశమున్న గ్రామాలను అధికారులు ఎంపిక చేస్తున్నారు. మెట్‌పల్లికి సంబంధించి పట్టణానికి సమీపంలో ఉన్న వెంకట్రావుపేట, ఆరపేట, వెల్లుల్ల, వేంపేట గ్రామాలను విలీనానికి ప్రతిపాదిస్తూ ఇటీవలనే కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. కోరుట్ల మున్సిపాలిటీలో కిషన్రావుపేట, సంగెం, యెఖిన్పూర్, జిల్లా కేంద్రంగా ఉన్న జగిత్యాల మున్సిపాలిటీలో చల్గల్, ధరూర్, మోతె, తిమ్మాపూర్, తిప్పన్నపేట గ్రామాలను ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. మేజర్ పంచాయితీల్లో అవకాశం ఎన్నిటికో..? జిల్లాలో ఇబ్రహీంపట్నం, బండలింగాపూర్, వెల్లుల్ల, ఐలాపూర్, మల్లాపూర్, రాయికల్, మల్యాల, కొడిమ్యాల, ధర్మపురి మేజర్ పంచాయతీలుగా ఉన్నాయి. ఇవన్నీ 20వేల లోపు జనాభాను కలిగి ఉన్నాయి. నగర పంచాయతీల ఏర్పాటు కోసం జనాభా తక్కువగా ఉండి...పట్టణీకరణకు అవకాశమున్న వాటిలో అవసరమైతే సమీపంలోని చిన్న గ్రామాలను కలపాలని ప్రభుత్వం సూచించింది. దీని ప్రకారం అధికారులు జిల్లాలో కొత్త నగర పంచాయతీల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. విలీనాన్ని వ్యతిరేకిస్తున్న సర్పంచ్‌లు మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనాన్ని సర్పంచ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పంచాయతీలను మున్సిపాలిటీల్లో కలపడం ద్వారా ప్రజలపై పన్నులభారం పెరగడంతోపాటు గ్రామీణ కూలీల కడుపు నింపుతున్న ఉపాధి హామీ పథకాన్ని కోల్పోవాల్సి ఉంటుందని సర్పంచ్‌లు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. మెట్పల్లి మున్సిపాలిటీలో ఆరపేట, వెంకట్రావ్పేట, వెల్లుల్ల, వేంపేట గ్రామాల విలీనానికి అనుకూలంగా మున్సిపల్ పాలకవర్గ సభ్యులు తీర్మానం చేశారు. దీనిని తాము అంగీకరించబోమంటూ ఆయా గ్రామాల సర్పంచ్‌లు సబ్‌కలెక్టర్ ముషారఫ్అలీని కలిసి విన్నవించారు. గ్రామాల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని.. లేనిపక్షంలో ప్రజలతో కలిసి అందోళనలు చేపడుతామని వారు పేర్కొనడం గమనార్హం. -
‘ఆర్మీ’ వేతనాలు ఇవ్వాలి
సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సందేశం న్యూఢిల్లీ: ఆర్మీతో సమానంగా తమకు వేతనాలు, ఇతర అలవెన్సులు ఇవ్వాలంటూ ఫేస్బుక్లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వీడియో పోస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. సాయుధ బలగాలతో పోలిస్తే పారామిలిటరీ సిబ్బందికి చెల్లించే వేతనాలు, ఇతర ప్రయోజనాల విషయంలో వివక్ష చూపుతున్నారని ఆరోపించాడు. వీడియో పోస్ట్ చేసిన జవాన్‌ను జీత్ సింగ్‌గా గుర్తించారు. ఇది పాత వీడియో అని, ఆ జవానుకు సర్వీసుకు సంబంధించి ఫిర్యాదులు ఉన్నాయని, వేతనాలు, ఇతర ప్రయోజనాల విషయంలో వివక్షను తొలగించాలని కోరాడని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కె.దుర్గాప్రసాద్ చెప్పారు. మరోపక్క లాన్స్ నాయక్ యజ్ఞ ప్రతాప్ సింగ్ అనే జవాను తన పైస్థాయి అధికారులు తనను వేధిస్తున్నారంటూ మరో వీడియో పోస్ట్ చేశాడు. -
పస్తులేనా!
అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు అందని వేతనాలు సాక్షర భారత్ కో–ఆర్డినేటర్లకు పత్తాలేని జీతాలు అభయహస్తం పింఛన్ లబ్ధిదారుల పరిస్థితి అంతే.. పంచాయతీ కార్మికులకు జీతాలివ్వని జీపీలు సంక్రాంతికి చేతిలో చిల్లిగవ్వ లేక అవస్థలు ఇందూరు : సంక్రాంతి పండుగ పలువురు చిరుద్యోగులను సంకట స్థితిలో పడేసింది. అందరూ ఉద్యోగులు ఈ నెల వేతనాలు తీసుకుని సంక్రాంతి పండుగను నిర్వహించుకోవడానికి సిద్ధమవుతుంటే అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు.. సాక్షర భారత్ మండల, గ్రామ కో–ఆర్డినేటర్లు.. అభయ హస్తం పింఛన్ లబ్ధిదారులు, పంచాయతీ కార్మికులు మాత్రం వేతనాలు రాక, చేతిలో డబ్బులు లేక పండుగెట్లా చేసుకోవాలని బాధ పడుతున్నారు. ‘అక్షరం’ సాక్షిగా పద్నాలుగు నెలలుగా వేతనాల్లేవు.. నిరక్ష్యరాసులను అక్షరాస్యులగా మార్చేందుకు గ్రామాల్లో అక్షరాలు నేర్పించే సాక్షర భారత్ గ్రామ కో–ఆర్డినేటర్లు, మండల కో–ఆర్డినేటర్లకు ప్రభుత్వం పద్నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. జిల్లాలో మొత్తం గ్రామ కో–ఆర్డినేటర్లు 650 వరకు ఉండగా.. మండల కో–ఆర్డినేటర్లు 19 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి నెలనెల వేతనాలు రావాల్సి ఉన్నా.. ఎప్పుడు నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. గతేడాది నుంచి వచ్చిన దసరా, దీపావళి పండుగలతోపాటు సంక్రాంతిని కూడా వేతనాలు లేక కుటుంబంలో పండుగలు సక్రమంగా జరుపుకున్న సందర్భాలే లేవు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాల పోషణ వీరికి కష్టంగా మారింది. అయితే తమకు అన్ని పండగలకు ప్రభుత్వ ఈ రకంగా బాధించడం సరికాదని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. ఆవేదనలో అంగన్వాడీ ఉద్యోగులు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు కూడా సంక్రాంతి పండుగ పూట ప్రభుత్వ వేతనాలను మంజూరు చేయలేదు. కొన్ని ప్రాజెక్టుల్లో డిసెంబర్ వరకు వేతనాలు చెల్లించగా, మరి కొన్ని ప్రాజెక్టుల్లో మూడు నుంచి నాలుగు నెలల వేతనాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లాలో ఐదు ప్రాజెక్టులకు 1,500 అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు 2,250 మంది, ఆయాలు 2,200 మంది పని చేస్తున్నారు. కార్యకర్తలకు రూ. 7 వేలు, ఆయాలకు రూ.4,500 నెలసరి వేతనం ప్రభుత్వం ఇస్తుంది. దాదాపు అందరికి డిసెంబర్ నెలకు సంబంధించి వేతనాలు రాలేదు. బోధన్ ప్రాజెక్టులో నాలుగు నెలలు, ఆర్మూర్‌లో 150 మందికి, నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టులో 25 మంది కార్యకర్తలు, 50 మంది ఆయాలకు వేతనాలు లేవు. దీంతోవీరి కుటుంబంలో కూడా సంక్రాంతిపండుగ ఎట్లా చేసేది అక్కా అన్న చందగా మారింది. డబ్బులు వచ్చినా.. ‘అభయం’ లేదు.. ఏడాది తరువాత ప్రభుత్వం జిల్లాకు అభయహస్తం పింఛన్ డబ్బులు మంజూరు చేసినా లబ్ధిదారుల చేతికి అందని విధంగా మారింది. జిల్లాలో మొత్తం అభయహస్తం పెన్షన్ లబ్ధిదారులు 5,340 మంది ఉన్నారు. ఒక్కో లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి నెలకు రూ.500 పెన్షన్‌ను ఇవ్వాలి. కానీ.. ప్రభుత్వం ఏడాది కాలంగా వీరికి పెన్షన్ డబ్బులు మంజూరు చేయడం లేదు. అయితే పక్షం రోజుల క్రితం ఈ డబ్బులకు మోక్షం కలిగిస్తూ ప్రభుత్వం జిల్లాకు రూ.3 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. వీటిని డీఆర్డీఏ అధికారులు సంబంధిత మండలాల ఎంపీడీఓల ఖాతాల్లో జమ చేశారు. డబ్బులు చేతికివ్వమని, బ్యాంకు ఖాతాలు ఇస్తే అందులో జమ చేస్తామని చెప్పడంతో సంక్రాంతి పండగ ముంగిట చేతిదాక వచ్చిన డబ్బులు చేతికి అండకుండానే పోయాయి. అందరు బ్యాంకు ఖాతాలు ఇచ్చినప్పుడే డబ్బులు చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సంక్రాంతి పండక్కు డబ్బులు ఆసరాగా ఉంటాయనుకున్న లబ్ధిదారుల ఆశలు ఆవిరయ్యాయి. సఫాయి కార్మికుల పరిస్థితి దారుణం జిల్లాలో 393 పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీల్లో పారిశుధ్యం పనులు చేసే కార్మికులు దాదాపు 420 మంది వరకు ఉంటారు. వీరికి ఐదారు నెలలుగా పంచాయతీల నుంచి వేతనాలు రావడం లేదు. అలాగే మున్సిపాలిటీలో పని చేసే సఫాయి కార్మికులకు కూడా రెండు, మూడు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. వీరికి వచ్చేది కొద్ది పాటి వేతనాలే అయినా వేతనాలు ఇవ్వడంతో మున్సిపాల్టీలు, పంచాయతీ పాలకవర్గాలు తీవ్ర జాప్యం చేస్తున్నాయి. డబ్బులు లేవని అందుకే వేతనాలు ఇవ్వడం లేదని స్పష్టం చేస్తున్నారు. సఫాలు కార్మికులు వారి వేతనాలు తప్పామరే మార్గం లేక దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇటు పంచాయతీ కారోబార్లు కూడా ఇదే విధంగా వేతనాలు లేక సంక్రాంతి పండక్కు ఇంట్లో సంబరం లేకుండా పోయింది. -
ఎనిమిది నెలలుగా అందని వేతనాలు
ప్రభుత్వాస్పత్రి ఎదుట పారిశుధ్య సిబ్బంది ఆందోళన పెద్దపల్లిరూరల్ : పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో పారిశుధ్య పనులు నిర్వహించే కాంట్రాక్టర్ తమకు ఎనిమిది నెలలు గా వేతనాలు ఇవ్వడంలేదని కార్మికులు శుక్రవారం ఆస్ప త్రి ఎదుట ఆందోళన చేశారు. పాత కాంట్రాక్టర్ మూడు మాసాలు, కొత్తగా పనులు తీసుకున్న కాంట్రాక్టర్ నుంచి ఐదు నెలల వేతనాలు అందాల్సి ఉందని కార్మికులు దాసరి లక్ష్మి, గుజ్జుల విజయ పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లేందుకు ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన చేశారు. ఒక్కొక్కరికీ రూ.4 వేల చొప్పున వేతనం ఇస్తున్న కాంట్రాక్టర్లు ఇపుడు తమకు అనుకూలమైన ఎనిమిది మందికే పనికల్పిస్తామంటున్నారని కార్మికురాలు లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది. తమకు నెలానెల వేతనాలివ్వకపోవడంతో పస్తులుంటున్నామని విజయ, లక్ష్మి, పద్మ, కనకమ్మ, ఈశ్వరి, ఈర్ల పోశమ్మ, బీబీ, భాగ్యమ్మ, రవి ఆవేదన వ్యక్తం చేశారు. 14 మంది పనిచేస్తున్నా ఎనిమిది మంది ఖాతాలకే వేతనాలు వేస్తామంటున్నారని తెలిపారు. తమకు బకాయి వేతనాలను వెంటనే చెల్లించడంతోపాటు పనిభద్రతను కల్పించేలా ఉన్నతాధికారులు చొరవచూపాలని కోరారు. ఈ విషయమై పారిశుధ్య పనులు పొందిన సావనీర్ కంపనీ ప్రతినిధిని ఫోన్ లో సంప్రదించగా అవసరానికి మించి సిబ్బంది ఉండడం ఇబ్బందిగా మారిందన్నారు. ఎనిమిది మందికే వేతనాలందించే అవకాశముందన్నారు. అయితే చాల కాలంగా పనిచేస్తున్నందున తాము ఇచ్చే వేతనాలను అందరూ పంచుకోవాలని సూచించామని పేర్కొన్నారు. -
వేతనాలు చెల్లించని కువైట్ కంపెనీ
విలవిల్లాడిపోతున్న తెలుగు కార్మికులు ఇంటికి వెళ్తామన్నా అనుమతివ్వని యాజమాన్యం మోర్తాడ్: కువైట్‌లోని ప్రముఖ నిర్మాణ కంపెనీల్లో ఒకటైన ఖరాఫీ నేషనల్ కంపెనీ కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వ కుండా వేధింపులకు గురిచేస్తోంది. ఈ కంపె నీలోని వివిధ క్యాంపుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు దాదాపు రెండు వేల మం ది పనిచేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా రెండు, మూడు నెలలకు ఒకసారి వేతనాలు తీసుకుంటూ సర్దుబాటు చేసుకున్న కార్మికు లకు తాజాగా కంపెనీ మొండి చెయ్యి చూపింది. ఐదు నెలల నుంచి కార్మికులకు వేతనాలు చెల్లించడంలేదని కంపెనీలో సైట్ ఇన్చార్జిగా పనిచేస్తున్న నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం ఏర్గట్ల వాసి మచ్చ శ్రీని వాస్ ’సాక్షి’కి ఫోన్లో వివరించారు. ఐదు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోయినా పని విషయంలో కఠినంగానే వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ ఇళ్లకు వెళ్లిపోతామంటే అను మతి ఇవ్వడం లేదు. నెలల తరబడి వేతనం చెల్లించకపోవడంతో ఇంటి వద్ద చేసిన అప్పు లు తీర్చడం ఎలా అని కార్మికులు ప్రశ్నిస్తు న్నారు. ఒక్కో కార్మికునికి రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు కంపెనీ యాజమాన్యం వేత నం చెల్లించాల్సి ఉంది. విదేశాంగ శాఖ స్పందించి ఖరాఫీ నేషనల్ కంపెనీ యాజమా న్యంతో చర్చించి కార్మికుల సమస్యను పరి ష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
వేతన జీవుల అవస్థలు
ఎస్ఎస్ఏ నుంచి బయటకు వెళ్లిన ఉద్యోగులకు 'ఎల్పీసీ' అడ్డంకి ఐదు నెలలుగా జీతాలకు బ్రేక్ అనంతపురం ఎడ్యుకేషన్ : నెల రోజులు పనిచేసి ఒకటో తేదీన జీతం కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తారు. కానీ డిప్యూటేషన్‌పై సర్వశిక్ష అభియాన్‌లో పనిచేసి తిరిగి మాతృశాఖ, ఇతర శాఖలకు వెళ్లిన ఉద్యోగులు మాత్రం ఐదు నెలలుగా జీతాలందక అవస్థలు పడుతున్నారు. జీతాలు ఎందుకు ఆపారో తెలియక, 'ఎల్పీసీ' (లాస్ట్ పే సర్టిఫికెట్) ఇవ్వకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఇలా.. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా డిప్యూటేషన్‌లో పని చేస్తూ మరోశాఖకు బదిలీ అయితే అతనికి సంబంధించి 15 రోజుల్లో ఎల్పీసీ ఇవ్వాలి. నెల జీతం బ్రేక్ పడకుండా చూడాలి. పని చేస్తున్న చోటు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు పెండింగ్ ఉన్నా...ఎల్‌పీసీకి కొర్రీ వేయరాదు. బదిలీపై వెళ్లిన శాఖ ద్వారా నోటీసులు ఇచ్చి వాటిని రాబట్టుకోవాలి. తప్ప పెండింగ్ పెట్టరాదు. ఎస్ఎస్ఏలో జరిగిందిలా... డీఈగా పని చేసిన బాలాజీనాయక్ జూలై మొదటివారంలో, ఇన్చార్జ్ ఈఈగా పని చేసిన వెంకటస్వామి అదేనెల చివరివారంలో బదిలీపై వెళ్లారు. సీనియర్ అసిస్టెంట్‌గా పని చేసిన సూర్యనారాయణరెడ్డి మేలో, ఇక్బాల్ జూన్‌లో, ఎఫ్ఏఓ పార్వతి, అలెస్కోగా పని చేసిన వెంకటరమణనాయక్ అక్టోబర్‌లో ఇక్కడి ఎస్ఎస్ఏ నుంచి ఇతర శాఖలకు వెళ్లారు. అప్పటి నుంచి వీరు ఎల్పీసీల కోసం తిరుగుతున్నా..పట్టించుకునే నాథుడే లేరు. డబ్బు లేక అల్లాడుతున్నానంటూ ఓ ఉద్యోగి వాపోయాడు. కాగా వీరిలో ఎఫ్ఏఓ పార్వతి, సీనియర్ అసిస్టెంట్ ఇక్బాల్, అలెస్కో వెంకటరమణనాయక్‌కు ఇటీవల ఎల్పీసీ ఇచ్చారు. మిగిలిన వారికి ఇంకా ఇవ్వలేదు. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్లే... – దశరథరామయ్య, ఎస్ఎస్ఏ పీఓ ఆర్థికపరమైన వ్యవహారాల వల్ల ఎల్పీసీలు ఇవ్వడం కొద్దిగా ఆలస్యమవుతోంది. కోట్లాది రూపాయలు చేసిన పనులు, అడ్వాన్స్‌లకు లెక్కలు చెప్పకుండా, వివరాలు ఇవ్వకుండా వెళ్తే రేప్పొద్దున ఆడిట్ ఇబ్బందులు వస్తాయి. వాటిని క్లియర్ చేయాలని అందరికీ సూచించాం. కొందరు ఉద్యోగులు ఖాళీ చెక్కులు ఇష్యూ చేశారు, ఓ ఉద్యోగి కీలకమైన ఫైళ్లు గల్లంతు చేశారు. వీటన్నంటినీ క్లియర్ చేయాలని చెప్పాం. క్లియర్ చేసిన కొందరికి ఎల్పీసీలు ఇచ్చేశాం. తక్కిన వారికి కూడా సిద్ధం చేస్తున్నాం. -
'వంద'ల పాట్లు
80% ఏటీఎంల్లో నో క్యాష్.. వంద నోట్ల జాడలేదు - ఏటీఎంలే కాదు బ్యాంకుల్లోనూ ‘నో క్యాష్’ బోర్డులు - రాజధాని ప్రాంతం విజయవాడ బ్యాంకుల్లోనే స్వైపింగ్ మిషన్లు లేవు - వెలగపూడి సచివాలయం ఎస్బీఐలో నో క్యాష్ బోర్డు - 1వ తేదీ రావడంతో ఉద్యోగులు, సామాన్య ప్రజల్లో టెన్షన్.. టెన్షన్ - సచివాలయ ఉద్యోగులు వేతనాలు తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు - ఒకేసారి 24 వేల రూపాయలు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ చర్యలు సాక్షి, అమరావతి: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 22 రోజులైనా నోట్ల సంక్షోభం వీడలేదు. ఒకటవ తేదీ వచ్చినా ఏటీఎంలోను, బ్యాంకుల్లోను నగదు దొరక్కపోవడంతో ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజానీకంలో టెన్షన్ పెరిగిపోతోంది. గురువారం బ్యాంకు ఖాతాల్లో వేతనం పడుతుందని, దాన్ని తీసుకోవడం ఎలా అనే విషయంపైనే ఉద్యోగులు బుధవారం నుంచి హైరానా పడుతున్నారు. ఏటీఎంల్లో రోజుకు రూ.2500 మాత్రమే తీసుకోవడానికి అనుమతి ఉంది. కానీ ఏదైనా ఏటీఎంలో నగదు వస్తోందంటే అదీ ఒక్క రెండు వేల నోటు మాత్రమే. బ్యాంకుల్లో వారానికి 24 వేల రూపాయలు తీసుకోవడానికి అనుమతి ఉన్నప్పటికీ... నగదు కొరత నేపథ్యంలో ఒకేసారి 24 వేల రూపాయలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నారుు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, పేదలు, సామాన్య ప్రజానీకం... అందరిలోనూ ఆందోళనే. ఒకటవ తేదీన ఇంటి అద్దె చెల్లించడానికి, పిల్లల ఫీజులు కట్టడానికి, పాలు పోసే వారికి ఇవ్వడానికి నగదు ఎలాగంటూ సతమతమవుతున్నారు. ఇంటి అద్దె చెక్‌ల రూపంలో చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత సలహా ఇచ్చిందని, అరుుతే ఇంటి యజమానులెవ్వరూ చెక్‌లు తీసుకోరని, నగదు ఇవ్వాలని పట్టుపడతారని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నారుు. బ్యాంకు రుణాలు చెల్లించడానికై తే చెక్‌లు ఇస్తామని, మిగతా వాటికి నగదు ఎలాగంటూ ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల్లో స్వైపింగ్ మిషన్ల ద్వారా అకౌంట్ నుంచి నగదు తీసుకోవచ్చునని చెబుతున్నప్పటికీ ఆచరణలో సాధ్యం కావడం లేదు. విజయవాడలోనే చాలా బ్యాంకుల్లో స్వైపింగ్ మిషన్లు లేకపోవడం గమనార్హం. నగరంలోని సూర్యారావు పేటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో స్వైపింగ్ మిషన్ లేకపోవడం ఇందుకు ఉదాహరణ మాత్రమే. బుధవారం విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు పట్టణాల్లో 80 శాతం ఏటీఎంల్లో నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చారుు. మిగతా 20 శాతం ఏటీంఎల్లో రెండు వేల నోట్లు తప్ప వంద నోట్లు జాడే కనిపించలేదు. సాక్షాత్తు పరిపాలన కేంద్రమైన వెలగపూడి సచివాలయంలోని స్టేట్ బ్యాంకు ఇండియా బ్రాంచిలో నో క్యాష్ బోర్డు పెట్టారు. ఏమిటని అడిగితే నగదు అరుుపోందని సిబ్బంది పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులకు ఒకేసారి రూ.24 వేలు ఇప్పించేందుకు ఏర్పాట్లు ఇలా ఉండగా సచివాలయ ఉద్యోగులు ఒకేసారి 24 వేల రూపాయలు బ్యాంకులు ఇప్పించాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లంను బుధవారం కోరారు. సచివాలయ ఉద్యోగులందరికీ స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్, ఆంధ్రా బ్యాంకుల్లోనే వేతన ఖాతాలున్నాయని, ఆ బ్యాంకుల ద్వారా ఒకేసారి 24 వేల రూపాయలు ఇప్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కల్లం బ్యాంకు అధికారులతో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. వెలగపూడి సచివాలయంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ బ్రాంచి లేనందున గురువారం, శుక్రవారం రెండు రోజులపాటు ఆ బ్యాంచి అధికారులను వెలగపూడి రప్పించి అక్కడే విత్ డ్రా ఫారాలను ఉద్యోగుల నుంచి తీసుకుని తగిన నగదు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. అలాగే ఉండవల్లి, తుళ్లూరు, మంగళగిరి స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ బ్రాంచీల్లో సచివాలయ ఉద్యోగులు వెళ్లి 24 వేల రూపాయల చొప్పున నగదు తీసుకునేందుకు ఏర్పాటు చేశారు. సచివాలయంలోని ఆంధ్రా బ్యాంకు బ్రాంచితో పాటు ఆయా బ్యాంకుల్లో సరిపడా నగదును అందుబాటులో ఉంచనున్నారు. ఇక రాష్ట్ర ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు కూడా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లంను కలిసి ప్రధానంగా గ్రామాల్లో, మండలాల్లో, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు నగదు రూపంలో వేతనాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం నాటికి కరెన్సీ చెస్ట్‌ల్లో రూ.1480 కోట్లు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కరెన్సీ చెస్ట్‌ల్లో కేవలం రూ.1480 కోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేశారుు. ఇందులో 90 శాతం మేర నగదు రెండు వేల నోట్ల రూపంలోనే ఉందని బ్యాకింగ్ అధికారులు తెలిపారు. చిన్న నోట్ల సమస్య ఇప్పట్లో తీరదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నారుు. ఆర్బీఐ నిబంధనల మేరకు సగం చిన్న నోట్లను, సగం పెద్ద నోట్లను పాటిచాల్సి ఉందని, అరుుతే 2005 సంవత్సరం నుంచి ఆర్బీఐ నగదు ముద్రణ వ్యయాన్ని తగ్గించడంలో భాగంగా చిన్న నోట్ల ముద్రణను తగ్గించేసి పెద్ద నోట్ల ముద్రణను చేపట్టిందని ఉన్నతస్థారుు అధికారి తెలిపారు. దీంతో పెద్ద నోట్లు శాతం 86 ఉండగా చిన్న నోట్ల శాతం 14 శాతానికి పడిపోరుుందని, దీంతో చిన్న నోట్ల సమస్య తలెత్తిందని, ఇప్పటికిప్పుడు చిన్న నోట్ల సరిపడా అందుబాటులోకి రావడం సాధ్యం కాదని అధికార వర్గాలు పేర్కొన్నారుు. -
నోట్ల రద్దు... ప్రకంపనలు క్యాష్తో ముందే వేతనాలివ్వాలి!
• ప్రభుత్వానికి పారిశ్రామిక, వాణిజ్య సంఘాల సూచనలు • నోట్ల రద్దుతో నష్టం జరగకుండా చూడాలని వినతి న్యూఢిల్లీ: నోట్ల రద్దుతో తక్షణం పడే ప్రభావంపై ఆందోళనతో ఉన్న వాణిజ్య, పారిశ్రామిక సంఘాలు ఈ విషయంలో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారుు. కొత్త కరెన్సీ నోట్ల రూపంలో ముందస్తుగా వేతనాలు చెల్లించాలని, నగదు కొరతను నివారించేందుకు పదవీ విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగుల సేవలను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించారుు. ఈ మేరకు పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఓ వినతిపత్రం సమర్పించారుు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు పాక్షికంగా లేదా పూర్తిగా వేతనాలను మందుగానే రూ.500 నోట్ల రూపంలో చెల్లించాలని కోరారుు. దీనివల్ల బ్యాంకుల వద్ద క్యూలు తగ్గుతాయని, నగదు మార్చుకునే క్రమంలో ఉద్యోగుల గైర్హాజరు కారణంగా ఉత్పాదకత తగ్గకుండా చూడవచ్చని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. మరోవైపు అసోచామ్ సైతం ఈ విషయంలో ప్రధాని మోదీకి నేరుగా ఓ సూచన చేసింది. వేగంగా నగదు మార్పిడి, నగదు ఉపసంహరణ సాఫీగా జరిగేలా చూసేందుకు బ్యాంకులు రిటైర్డ్ ఉద్యోగులను భారీగా నియమించుకోవాలని అసోచామ్ సూచించింది. సాధారణ ఎన్నికల విధుల కోసం వివిధ శాఖల ఉద్యోగులను నియమించినట్టే ఇప్పుడు బ్యాంకుల్లోనూ వివిధ రకాల ఉద్యోగులను నియమించాలని కోరింది. 25 శాతం పడిపోరుున వ్యాపారం నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా వ్యాపారం 25 శాతం మేర తగ్గినట్టు ట్రేడర్ల సంఘం సీఏఐటీ పేర్కొంది. ఒకవైపు నగదు సరఫరా సాఫీగా కొనసాగేలా చూడడంతోపాటు ఎలక్ట్రానిక్ చెల్లింపులను పెంచే చర్యలను వేగవంతం చేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరింది. -
సెర్ప్‌లో ‘వేతన వేదన’పైసర్కారు సీరియస్
పంచాయతీరాజ్ శాఖను వివరణ కోరిన సీఎస్ సాక్షి, హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో పని చేస్తున్న సుమారు 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా అందకపోతుండటంపై సర్కారు సీరియస్ అయింది. ‘సెర్ప్ ఉద్యోగులకు వేతన వేదన’ శీర్షికన ఈనెల 9న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై సీఎస్ రాజీవ్‌శర్మ స్పందించారు. వేలాది మంది ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందకపోతుండటం, ఆగస్టు 1 నుంచి వేతన పెంపు అమలు కాకపోవడం తదితర అంశాలపై వివరణ ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఈనెల 20న నోటీసు జారీ చేశారు. అయితే పంచాయతీరాజ్ శాఖ నుంచి సమాచారం అందకపోవడంపై సీఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ అదేశాల మేరకు జాయింట్ సెక్రటరీ శ్రీధర్ ..సెర్ప్ అధికారులకు 21న మెమో జారీ చేశారు. అయినప్పటికీ శుక్రవారం వరకు సెర్ప్ అధికారుల నుంచి తనకు సమాచారం అందలేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సెర్ప్ ఇంచార్జి సీఈవో అనితా రాంచంద్రన్, సీఎస్ నోటీసుకు వివరణ పంపించామని ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగులకు వేతన పెంపు విషయమై కొన్ని ఇబ్బందులు తలెత్తాయని, పరిష్కరించి సాధ్యమైనంత త్వరగా వేతనాలు అందజేస్తామని పేర్కొన్నారు. -
విద్యావలంటీర్ల వేతనాలు విడుదల
విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్ల వేతనాల నిధులు మంజూరయ్యాయి. జిల్లాలో 467 మంది విద్యావలంటీర్ల వేతనాలకు సంబంధించి రూ.89లక్షలు విడుదలయ్యాయని డీఈఓ పి.రాజీవ్ తెలిపారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో విద్యావలంటీర్లకు వేతనాలు ఇవ్వకుండా ల్యాప్స్ చేసిన ఎంఈఓలు ఆయా నెలలతో పాటు జూన్ నెల వేతనాలు అందజేయాలని, అప్పట్లో ఇచ్చిన వారికి కేవలం జూన్ వేతనం చెల్లించాలని ఆయన సూచించారు. ఒక్కో విద్యావలంటీర్‌కు రూ.8వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని డీఈఓ తెలిపారు. -
అర్చకులకే శఠగోపం..!
160 ఆలయాల్లో అర్చకులు, సిబ్బందికి సరిగా అందని వేతనాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆలయాల ఆదాయం భారీగా పెరుగుతోంది. కొన్నిచోట్ల బడ్జెట్ కోట్ల రూపాయలు దాటుతోంది. అయినా అర్చకులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించని దుస్థితి. కొన్ని నెలలుగా వేతనాలు సరిగా చెల్లించకపోతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదా పు 160 దేవాలయాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. పాలకమండళ్లతోపాటు కొందరు అధికారుల అవినీతి కారణంగానే ఈ దుస్థితి. ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడడంతో అక్రమాలు పెచ్చరిల్లి.. దేవాలయాలకు వస్తున్న ఆదాయం పక్కదారి పడుతోంది. ఓ ఆలయానికి ఎంత ఆదాయం వస్తోంది, అందులో దేవాదాయశాఖకు చెల్లించాల్సిందెంత, ఆలయ ఖర్చులకు, సిబ్బంది జీతభత్యాలకు చేస్తున్న వ్యయం ఎంతనే లెక్కల్లో స్పష్టత ఉండడం లేదు. చాలా దేవాలయాల్లో అర్చకులు, సిబ్బందికి రెండు మూడు నెలలకోసారి వేతనాలు చెల్లిస్తున్నారు. అదేమంటే ఆదాయం సరిపోవడం లేదనే సమాధానం వస్తోంది. కొన్ని నెలలుగా అందని జీతాలు దేవాదాయ శాఖ పరిధిలో సుమారు 635 ఆల యాలున్నాయి. వాటిలో కొన్నింటికే పాలక మండళ్లు ఉన్నాయి. పాలక మండళ్లు లేని చోట కార్యనిర్వహణాధికారు(ఈవో)ల పాలన. వీటికితోడు పలు ఆలయాలను వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మొత్తంగా దేవాదాయశాఖ పరిధిలోని ఈ ఆలయాల్లో 5,600 మంది అర్చకులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరేగాకుండా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిన పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్నారు. అయితే వేములవాడ, యాదగిరిగుట్ట వంటి పలు ప్రధాన దేవాలయాలు కాకుండా.. చాలా ఆలయాల్లో అర్చకులు, సిబ్బందికి సరిగా వేతనాలు అందడం లేదు. కామారెడ్డి సమీపంలోని భిక్కనూరు సిద్ధరామేశ్వరస్వామి ఆలయంలో కొన్ని నెలలుగా సిబ్బందికి, అర్చకులకు జీతాలు చెల్లించడం లేదు. హైదరాబాద్ శివార్లలో ఉండి, రూ.కోట్లలో వార్షికాదాయం ఉన్న కీసర రామలింగేశ్వరస్వామి ఆలయంలోనూ సకాలంలో వేతనాలు అందడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయం, మెదక్ జిల్లాలోని నాచారం లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి... ఇలా చిన్నాపెద్దా తేడా లేకుండా చాలా దేవాలయాల్లో ఇదే దుస్థితి. అయితే ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించడానికి అర్చకులు, సిబ్బంది జంకుతున్నా రు. తమ ఉద్యోగాలకు ఎక్కడ ఇబ్బంది వస్తుం దోనని భయపడుతున్నారు. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న పాలకమండళ్లు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆదాయం ఏమవుతోంది? ఆలయానికి సమకూరే మొత్తం ఆదాయంలో 12 శాతాన్ని దేవాదాయశాఖ అధికారుల వేతనాల కోసం ఆ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. సర్వశ్రేయోనిధికి మరో 3శాతం సమర్పించాలి. మరో 30శాతానికి మించకుండా నిధులను జీతాలకు కేటాయించాలి. మిగిలే నిధులను ఆయా ఆలయాల నిర్వహణ, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలి. దేవాదాయశాఖకు అందాల్సిన మొత్తాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వసూలు చేస్తున్నారు. ఆల య ఖర్చులు, సిబ్బంది జీతభత్యాల విషయంలో గందరగోళం నెలకొంటోంది. ఇటీవల సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ దేవాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసిన ప్పుడు.. సరుకుల కొనుగోలులో భారీ అవినీతి జరిగినట్టు తేలింది. దీనిపై అధికారులు దేవాదాయశాఖ కమిషనర్‌కు నివేదిక సమర్పించగా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇలా చాలాచోట్ల అధికారులు తప్పుడు బిల్లులు సమర్పిస్తూ దేవుడి నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. ఇది మరీ విచ్చలవిడిగా కొనసాగుతుండడంతో దేవాలయాల్లో నిధులకు కటకట ఎదురవుతోంది. చివరికి అర్చకులు, సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేనందున తమకేమీ పట్టనట్లు ఉండిపోతున్నారు. తమకు జీతాలు సరిగా రావడం లేదని.. ఈ సమస్యను పరిష్కరించాలంటూ అర్చకులు, సిబ్బంది చేస్తున్న విజ్ఞప్తులు అరణ్యరోదనే అవుతున్నాయి. ‘ప్రత్యేక నిధి’ ఏర్పాటు పట్టదా..? అర్చకులు, ఆలయ సిబ్బంది తమ వేతనాల సమస్యపై ఆందోళనలు చేయడంతో కొన్నేళ్ల కింద ‘ప్రత్యేక నిధి’ ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం దేవాలయాల ఆదాయంలో 30 శాతం వరకు అర్చకులు, సిబ్బంది వేతనాల కోసం వెచ్చిస్తున్నారు. పలు దేవాలయాల్లో ఆదాయం ఎక్కువగా ఉండడం, మరికొన్ని చోట్ల తక్కువగా ఉండడంతో కనీస వేతనాల్లో వ్యత్యా సం వస్తోంది. అంతేగాకుండా ఆలయాలపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడడంతో ఆదా య, వ్యయాల లెక్కల్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు అన్ని ఆలయాల ఆదాయం నుంచి 30 శాతం చొప్పున వసూలు చేసి ‘ప్రత్యేక నిధి’ని ఏర్పాటు చేయాలని... ఆ నిధి నుంచే అర్చకులు, సిబ్బందికి వేతనాలు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. దీనివల్ల ఆదాయంతో సంబంధం లేకుండా అన్ని ఆలయాల అర్చకులు, సిబ్బందికి వేతనాలు సకాలంలో అందడంతోపాటు, ఆలయాల ఆదాయ, వ్య యాలను ప్రభుత్వం పర్యవేక్షించే అవకాశం ఉంటుందని అధికారులు సూచించారు. ఈ అంశంపై ప్రభుత్వం ఐదురుగు మంత్రులతో ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఈ సబ్ కమిటీ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో వాస్తవాలను అధ్యయనం చేయకపోవడం గమనార్హం. తమ అవకతవకలు బయటపడతాయని కొందరు పాలక మండళ్ల సభ్యులు, అధికారులు... పైస్థాయిలో ఒత్తిడి తెచ్చి సబ్ కమిటీ పరిశీలనను జాప్యం చేసేలా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. -
పుష్కర వేతనాల కోసం కార్మికుల నిరసన
విజయవాడ: బెజవాడలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. పుష్కరాల పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వలేదంటూ మున్సిపల్ కార్యాలయం ముందు గురువారం కార్మికులు నిరసన బాట పట్టారు. కృష్ణా పుష్కరాల్లో రోజుకు 8 గంటలు పని చేయాలని చెప్పి... తర్వాత 16 గంటలు పనిచేయించారని కార్మికులు వాపోయారు. డబ్బులు ఇస్తానని చెప్పిన కాంట్రాక్టర్ కనిపించకుండా పోయాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 గంటలకు రూ.400 ఇస్తామని చెప్పి...16 గంటలు వెట్టిచాకిరీ చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదన్నారు. వెంటనే తమకు డబ్బులు చెల్లించాలని కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా పుష్కరాలు ఎంతో ఆర్భాటంగా నిర్వహించామని చెబుతున్న బాబు సర్కార్.... కార్మికులకు డబ్బులు చెల్లింపులో జాప్యంపై విపక్షాలు తీరు స్థాయిలో మండిపడుతున్నాయి. -
పుష్కరాల పుణ్యం.. అందని భత్యం!
⇒ పుష్కర విధులకు వెళ్లిన అధికారులకు అందని భత్యం ⇒ గోదావరి పుష్కరాలకు ఏడాది ⇒ పంపేశామంటున్న ఉన్నతాధికారులు ⇒ రాలేదంటున్న జిల్లా అధికారులు ⇒ బాధ నేరుగా చెప్పుకోలేక ఆకాశ రామన్న ఉత్తరాలు పన్నెండేళ్లకోమారు పుష్కరాలు వస్తే... ఒక్క మునకతోనే పుణ్యం వస్తుందంటూ వేలాదిమంది పరుగులు పెడతారు. అదే డెప్యుటేషన్‌పై విధి నిర్వహణ నిమిత్తం వెళ్లినవారైతే రోజూ మునకలు చేయొచ్చు. ఇక వారికి లెక్కనేనంత పుణ్యం లభిస్తుందనుకున్నారో ఏమో.. వారికివ్వాల్సిన భత్యం మాత్రం చెల్లించలేదు. గోదావరి పుష్కరాలకు ఏడాది పూర్తయ్యాయి. తాజాగా కృష్ణా పుష్కరాలు ముగిసిపోయాయి. కానీ నాటి భత్యం గురించి మాత్రం నోరు మెదపడంలేదు. డబ్బులిచ్చేశామని ఉన్నతాధికారులు చెపుతుండగా.. రాలేదని ఇక్కడి అధికారులు సెలవిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆకాశరామన్న ఉత్తరం ద్వారా ఉద్యోగులు తమ విలాపం తెలియజేశారు. గత ఏడాది గోదావరి పుష్కరాలు.... ఈ ఏడాది కష్ణాపుష్కరాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. కోట్లాదిరూపాయలు ఖర్చుచేసి విస్తతంగా చేపట్టిన ప్రచార పుణ్యమాని ఎక్కడెక్కడినుంచో జనం వెళ్లి మునకలు పూర్తి చేశారు. వారికి పుణ్యఫలం దక్కిందో లేదోగానీ... అక్కడి సేవలందించే తహసీల్దార్లు... ఉపతహసీల్దార్లకు మాత్రం గత ఏడాది నిర్వహించిన పుష్కరసేవల భత్యం ఇప్పటికీ అందలేదు. అదేంటి? ఎంతో ఖర్చు చేసిన పెద్ద కార్యక్రమ బాధ్యతను తమ భుజస్కంధాలపై మోసిన అధికారులకు ఇంకా భత్యం చెల్లించలేదా అని ఆశ్చర్యపోతున్నారా? విషయమేమంటే ఆ నిధులు పంపించేశామని విజయవాడలోని ఉన్నతాధికారులు చెబుతుంటే అసలు రాలేదని ఇక్కడి అధికారులు చెప్పడం విశేషం. మిగతా జిల్లాలవారికి అందినా.. గతేడాది నిర్వహించిన గోదావరి పుష్కరాల్లో సేవలకు ఇక్కడినుంచి పదిమంది తహసీల్దార్లు, మరో 15మంది ఉప తహసీల్దార్లు రెండు రోజుల ముందే అక్కడకు వెళ్లారు. పుష్కరాలు ముగిశాక ఇక్కడకు వచ్చిన వారంతా తమకు రావాల్సిన టీఏ, డీఏలకోసం బిల్లులు పెట్టుకున్నారు. కానీ ఒక్క అధికారికీ పైసా కూడా ఇవ్వలేదు. మిగతా జిల్లాల అధికారులకు మాత్రం ఈ బిల్లులు అందినా... ఇక్కడివారికి ఎందుకో ఇవ్వలేదు. ఇప్పటికీ వాటికోసం అడుగుతున్న అధికారులకు డబ్బులు రాలేదన్న సమాధానమే వస్తోంది. ఒక్కొక్కరికీ సుమారు రూ. 5వేలకు పైగానే చెల్లించాల్సి ఉంది. పలుమార్లు అడుగుతున్నా లేదన్న సమాధానం రావడంతో కొందరు తహసీల్దార్లు తూర్పు, పశ్చిమగోదావరి కలెక్టరేట్‌ను సంప్రదించగా.. వారు ఆ డబ్బులు ఎప్పుడో డ్రాఫ్ట్ తీసి జిల్లాకు పంపించేసినట్టు చెప్పారని తెలుసుకున్నారు. అయితే ఇక్కడి ఉన్నతాధికారులను అడగలేక ఓ ఆకాశ రామన్న ఉత్తరం రాశారు. పేరు పొందుపరచకుండా వెంటనే డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జిల్లా మంత్రి మణాళిని, ఇన్చార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్ వివేక్ యాదవ్, మీడియా ప్రతినిధుల పేరున ఆ లేఖలు పంపించారు. ఇలా గోదావరి పుష్కరాల్లో సేవలందించిన జిల్లాకు చెందిన వారికి సుమారు రూ. 10లక్షలు ఇంకా చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాత్రీ పగలు నిద్రలు లేనిరాత్రులు కూడా గడిపి సేవలందిస్తే కష్ణా పుష్కరాలు కూడా వచ్చి వెళ్లిపోయినా ఇంకా నిధులు రాలేదని చెప్పడంపై వీరు మండిపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత కలెక్టర్ వివేక్ యాదవ్ ఈ బిల్లులు వచ్చాయా? రాలేదా? అన్న అంశంపై కొద్దిపాటి విచారణ చేస్తే విషయం తెలుస్తుంది. అప్పుడయినా వీరికి బిల్లులు అందే అవకాశం లేకపోలేదని సంబంధిత అధికార వర్గాలు భావిస్తున్నాయి. -
రూ.5కోట్లు స్వాహా!
వీసీవోల వేతనాలందుకుంటున్న కారోబార్లు, ఆశావర్కర్లు, ఆర్ఎంపీలు 300 మందికిపైగా వీసీవోల వేతనాలు ఇతరుల ఖాతాల్లోకి... ఇప్పటికే రూ.3లక్షల మేరకు రికవరీ చేసిన అధికారులు వేతనాల స్వాహాపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశం సహకార ఆడిట్ అధికారి అంబయ్య విచారణ షురూ.. వయోజన విద్యాశాఖ కార్యాలయంలో రికార్డుల పరిశీలన నేర్పని అక్షరానికి నేడు లక్ష మందికి పరీక్ష వయోజన విద్యాశాఖ తీరుపై సర్వత్రా విస్మయం సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లా వయోజన విద్యాశాఖ తీరు విస్మయం కలిగిస్తోంది. ఆ శాఖలో తవ్వినకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. విలేజ్ కో ఆర్డినేటర్(వీసీవో)ల వేతనాలు పెద్ద ఎత్తున పక్కదారిపడుతున్నాయి. గ్రామాల్లోని కారోబార్లు, ఆశావర్కర్లు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్(సీఆర్పీ)లు వీసీవోల అవతారమెత్తి వారి వేతనాలను స్వాహా చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 300 మంది వీసీవోల పేరిట ఏటా రూ.75 లక్షలు తమ జేబుల్లో వేసుకుంటున్నట్లు తెలిసింది. ఇది చాలదన్నట్లుగా వయోజన విద్యాశాఖలో మరికొందరు ఉద్యోగులు వీసీవోల వేతనాలను మింగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆ శాఖ అంతర్గత విచారణలో వీసీవోల వేతనాలు ఇతర సిబ్బంది ఖాతాల్లో పడుతున్న విషయం తెలియడంతో బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తపడుతున్నారు. ఇప్పటివరకు పక్కదారి పట్టిన వేతనాల్లో సుమారు రూ.3 లక్షల వరకు తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమచేసే పనిలో పడ్డారు. వీసీవోల వేతనాల స్వాహా విషయం కలెక్టర్ నీతూప్రసాద్ దృష్టికి వెళ్లడంతో ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా సహకార అధికారి అంబయ్యను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అంబయ్య శనివారం వయోజన విద్యాశాఖ ఉప సంచాలకుడి కార్యాలయానికి వెళ్లి విచారణ చేపట్టారు. అసలేం జరుగుతోందంటే... నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సాక్షరభారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. మన జిల్లాలో 2010, సెప్టెంబర్ 8 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా జిల్లాలోని 1207 గ్రామ పంచాయతీలకు గాను, ఒక్కో గ్రామ పంచాయతీకి ఇద్దరు చొప్పున వీసీవోలను నియమించారు. మండలస్థాయిలో మండల కో ఆర్డినేటర్, జిల్లాస్థాయిలో జిల్లా రిసోర్స్ పర్సన్లను నియమించారు. వీసీవోలకు రూ.2వేల చొప్పున జిల్లాలోని 2414 మందికి ప్రతినెలా రూ.48.28 లక్షలు, 57 మంది మండల కో ఆర్డినేటర్లకు రూ.6,500 చొప్పున రూ.3.70 లక్షలు చెల్లిస్తున్నారు. గ్రామంలోని నిరక్షరాస్యులను గుర్తించడం, వారికి అక్షరాలు నేర్పించడమే వీరి పని. కానీ ఇటీవల ఆ కార్యక్రమం పూర్తిగా మరుగునపడింది. ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి వంటి చోట్ల మినహా ఎక్కడా చురుగ్గా అమలవుతున్న దాఖలాల్లేవు. వీసీవోలు తప్పనిసరిగా 10వ తరగతి పాసై ఉండాలి. మరే ఉద్యోగం చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ గ్రామాల్లోని కారోబార్లు, ఆశావర్కర్లు, సీఆర్పీలు ఒకవైపు గౌరవ వేతనాలు తీసుకుంటూనే వయోజన విద్యాశాఖలోని కొందరు అధికారుల చలువతో వీసీవోల అవతారమెత్తడం విశేషం. హుజూరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 50 మంది వీసీవోల పేరిట ప్రభుత్వ సొమ్మును తమ ఖాతాలో వేసుకుంటున్నట్లు తెలిసింది. కరీంనగర్, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా 150 మంది కారోబార్లు, 75 మంది ఆశావర్కర్లు, 75 మంది సీఆర్పీలతోపాటు మరికొందరు ఆర్ఎంపీలు కూడా వీసీవోలుగా సర్కారు సొమ్మును స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఏటా రూ.75 లక్షల చొప్పున గత ఆరేళ్లుగా సుమారు రూ.5 కోట్లు పక్కదారిపట్టినట్లు సమాచారం. అయినప్పటికీ దీనిపై అధికారులెవరూ దృష్టి పెట్టకపోవడం ఆశ్చర్యకరం. వాస్తవానికి జిల్లా లోక్‌శిక్షా సమితి చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరిస్తారు. కలెక్టర్‌కు తెలియకుండా ఈ తతంగమంతా నడుస్తుంటం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయంపై అంబయ్య ఆధ్వర్యంలో విచారణ ప్రారంభం కావడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. అయితే 2012 నుంచి 2016 వరకు వీసీవోల వేతనాలపై వివరాలు ఇవ్వాలని అంబయ్య వయోజన విద్యాశాఖ అధికారులను కోరినట్లు తెలిసింది. కానీ 2010 నుంచి వివరాలు సేకరిస్తే పెద్ద ఎత్తున కుంభకోణం బయటపడే అవకాశాలున్నాయని వీసీవోలు అభిప్రాయపడుతున్నారు. వేతనాలు సరే... పెన్నులు, పుస్తకాల సంగతేంది? వేతనాల స్వాహాపై విచారణ జరుపుతున్న అధికారులు వయోజన విద్యాశాఖలో జరుగుతున్న పెన్నుల కొనుగోళ్లు, పుస్తకాల ప్రింటింగ్ అక్రమాలపై దృష్టి సారించకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఏటా వీటì పేరిట రూ.25 లక్షల సొమ్ము దుర్వినియోగమవుతోందని ఆరోపణలున్నాయి. వీటిపైనా విచారణ జరిపితే ఉన్నతస్థాయి అధికారుల బాగోతం బయటపడుతుందని ఆ శాఖలోని సిబ్బందే చెబుతున్నారు. నేర్పని అక్షరానికి నేడే పరీక్ష.. మరోవైపు వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నేడు నిరక్షరాస్యులకు అక్షరాస్యత పరీక్ష జరగనుంది. సాక్షరతా భారత్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్(ఎన్ఐఓఎస్) సంయుక్తంగా నిర్వహించే ఈ పరీక్షకు సుమారు లక్ష మంది హాజరవుతున్నారని అంచనా వేసిన వయోజన విద్యాశాఖ వారి కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షకు ఇంతవరకు ఏ ఒక్క నిరక్షరాస్యుడు పేరు నమోదు చేసుకోలేదు. వారికి అక్షరాలు నేర్పిన పాపాన పోలేదు. కానీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) అధికారులు మాత్రం ఈ పరీక్షకు 92 వేల మందిని తీసుకొస్తామని, వారి పేర్లు నమోదు చేశామని, వారికి అక్షరాలు కూడా నేర్పామని చెబుతుండటం విశేషం. వాస్తవానికి గతంలో పరీక్ష రాసిన వారిని, గ్రామాల్లోని అక్షరాస్యులను తీసుకొచ్చే బాధ్యతను వీసీవోలు, ఎంసీవోలు, డీఆర్డీఏ క్షేత్రస్థాయి సిబ్బందిపై మోపినట్లు తెలిసింది. మొత్తమ్మీద ఆదివారం జరగబోయే పరీక్షలు ప్రహాసనమే కాబోతున్నాయి. ఈ విషయంపై పత్రికల్లో వార్తలొచ్చినప్పటికీ... ఏ ఒక్కరికీ ఇంతవరకు అక్షరాలు దిద్దించలేదని తెలిసినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆదివారం పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమవవడం విశేషం. -
ఈ వేతనాలు.. ఎలా సరిపోతాయి? - ఎమ్మెల్యేలు
లక్షల రూపాయల జీతాలు చాలడం లేదట తమ వేతనాలను మరింత పెంచాలంటూ ఎమ్మెల్యేల డిమాండ్ నెలసరి ఆదాయాన్ని రూ.1.75 లక్షలకు పెంచాల్సిందిగా స్పీకర్‌కు మనవి బెంగళూరు: ‘ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి, ఇలాంటి సందర్భంలో ఇంత తక్కువ వేతనాలు ఇస్తే కుటుంబాలు గడిచేదెట్లా? ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మా వేతనాలు తక్కువగా ఉన్నాయి, అందుకే తక్షణమే మా వేతనాలను పెంచండి’ ఇది ఏ చిరుద్యోగో తనపై అధికారికి చేసుకున్న విన్నపం కాదు, ఏకంగా లక్షల్లో వేతనాలు తీసుకుంటున్న శాసనసభ్యులు స్పీకర్‌కు చేసిన మనవి. అవును ఇప్పుడు తమకు అందుతున్న వేతనాలు ఎంతమాత్రం సరిపోవడం లేదని, తమ వేతనాలను వెంటనే పెంచాలని శాసనసభ్యులు స్పీకర్‌కు ఓ విన తి పత్రాన్ని అందజేశారు. కర్ణాటకలోని శాసనసభ్యుల వేతనాలను 2015లో 40 శాతం పెంచారు. దీంతో అప్పటి వరకు రూ.95 వేలుగా ఉన్న ఎమ్మెల్యేల వేతనం (అన్ని అలవెన్సులు కలుపుకొని) అమాంతం రూ.1.40 లక్షలకు చేరుకుంది. వేతనాలను పెంచి ఏడాది అవుతున్న నేపథ్యంలో తమ వేతనాలను 25 శాతం మేర పెంచాలంటూ ఎమ్మెల్యేలు స్పీకర్ కె.బి.కోళివాడకు వినతి పత్రాన్ని అందజేశారు. అంటే ప్రస్తుతం ఉన్న రూ.1.40 లక్షల వేతనాన్ని రూ.1.75 లక్షలకు పెంచాలన్నది ఎమ్మెల్యేల డిమాండ్. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రూ.2.20 లక్షల వేతనాన్ని అందుకుంటుండగా, ఢిల్లీ ఎమ్మెల్యేలు రూ.2.10 లక్షల వేతనాన్ని అందుకుంటున్నారని ఎమ్మెల్యేలు తమ వినతి పత్రంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తమ వేతనాలను కూడా రూ.1.75 లక్షలకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలోని ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈ డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ అంశంపై ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ...‘నియోజకవర్గ పరిధిలోని ప్రజలంతా తమ ఎమ్మెల్యే చాలా ధనవంతుడని భావిస్తుంటారు. వారికి ఏ ఆర్థిక పరమైన సమస్య వచ్చినా ముందుగా ఎమ్మెల్యే ఇంటి తలుపు తడతాడు. ఇక పెళ్లిళ్లు, అంత్యక్రియల పేరిట ప్రతి నెలా ఇచ్చే మొత్తానికి లెక్కలే ఉండవు. ఇలాంటి ఖర్చులను భరించడం ఎమ్మెల్యేలకు చాలా కష్టం, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇది తలకు మించిన భారం, అందువల్ల వేతనాలను పెంచితే ఇలాంటి సమస్యల నుండి కాస్తంత బయటపడేందుకు ఆస్కారం ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు. వేతనాలను పెంచాలని కోరలేదు.... అయితే ఈ అంశంపై అరసికెరె ఎమ్మెల్యే కె.ఎం.శివలింగేగౌడ మాట్లాడుతూ....‘ఇతర రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల జీత భత్యాలు ఎలా ఉన్నాయో తెలియజేయాలంటూ మేం స్పీకర్‌కు లేఖ రాశాము, తద్వారా ఎమ్మెల్యేల జీత, భత్యాల చెల్లింపులో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక ఏ స్థానంలో ఉందో తెలుసుకోవడమే మా ఉద్దేశం అంతేకానీ, జీతాల పెంపును మేము డిమాండ్ చేయలేదు’ అని పేర్కొన్నారు. -
వేతన సవరణ సంఘం ఏర్పాటుకు అంగీకారం
మురళీనగర్: దేశ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో పని చేస్తున్న అధ్యాపకుల వేతనాల సవరణకు కమిటీ నియామకానికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ అంగీకరించినట్లు ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (ఏఐఎఫ్‌పీటీఓ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సవరణ సంఘం సూచనల మేరకు నూతన జీతభత్యాలను అమలు చేస్తున్న నేపథ్యంలో యూజీసీ పరిధిలో పనిచేసే అధ్యాపకుల వేతాల సవరణకు యూజీసీ 7వ వేతన సవరణ సంఘాన్ని నియమించింది. దీంతో పాలిటెక్నిక్ అధ్యాపకుల వేతనాల సవరణకు 7వ వేతన సవరణ సంఘాన్ని నియమించాలని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ ఏఐసీటీఈ చైర్మన్‌కు ఇటీవల ఒక విజ్ఞాపన పత్రాన్ని అందించినట్లు చంద్రశేఖర్ చెప్పారు. దీనికి స్పందించిన ఏఐసీటీఈ చైర్మన్ వేతన సవరణ సంఘం నియామకానికి సానుకూలంగా ఉన్నట్లు లేఖ పంపినట్టు చంద్రశేఖర్ చెప్పారు. వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసి నివేదిక ఇస్తే దేశంలోని 40వేలమంది పాలిటెక్నిక్ కాలేజీ అధ్యాపకులకు లాభం చేకూరుతుందని ఆయన వివరించారు. తమ జీతభత్యాల సవరణకు వేతన సవరణ సంఘం ఏర్పాటుకు అంగీకరించిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ఏఐసీటీఈ చైర్మన్‌కు సంఘం తరపున చంద్రశేఖర్ కతజ్ఞతలు తెలిపారు. -
బకాయి వేతనాలు చెల్లించాలని ధర్నా
ఎంజీఎం : వరంగల్‌లోని ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో విధులు నిర్వస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్ కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని గురువారం కార్మికులు ఆస్పత్రిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ బకాయి వేతనాలు చెల్లించాలని సదరు కాం ట్రాక్టర్‌ను అడగగా తమపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా కార్మికులకు ఈఎస్ఐ, ఈఫీఎఫ్ చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ శ్రమదోపిడి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు యాదగిరి, నాగరాజుతో పాటు కార్మికులు పాల్గొన్నారు. -
రెండేళ్లలో సీఈఓల వేతనం డబుల్
న్యూఢిల్లీ : ప్రైవేటు రంగంలో బ్లూచిప్ కంపెనీల సీఈవోల వేతనాలు రెండేళ్లలోనే దాదాపు రెట్టింపయ్యాయి. సగటున వార్షిక వేతనం రూ.19 కోట్లకు పెరిగింది. రెండేళ్ల క్రితం (2013-14) ఇది రూ.9.9 కోట్లుగానే ఉంది. అయితే, అమెరికాలోని లిస్టెడ్ బ్లూచిప్ కంపెనీల సీఈవోల వేతనాలతో పోల్చి చూస్తే దేశీయ లిస్టెడ్ బ్లూచిప్ కంపెనీల సీఈవోల వేతనం సగటున ఆరింట ఒక వంతు కంటే తక్కువే. అమెరికన్ కంపెనీల్లో సీఈవో వేతనాలు 2015లో 2 కోట్ల డాలర్లు (రూ.130 కోట్లు సుమారు)గా ఉన్నాయి. అదే దేశీయంగా చూస్తే మాత్రం ప్రభుత్వ-ప్రైవేటు రంగాల మధ్య కూడా ఇదే అంతరం కనిపిస్తోంది. ప్రభుత్వ రంగ కంపెనీల సీఈవోల వేతనం సగటున రూ.25-30 లక్షలుగానే ఉంది. సెన్సెక్స్‌లో భాగమైన ప్రైవేటు కంపెనీల సీఈవోలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో సగటున అందుకున్న వేతనాలను పరిశీలిస్తే... సీఈవోలు లేదా ఉన్నత స్థానంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్లు, లేదా ఎండీలు వార్షికంగా అందుకున్న వేతనం 19 కోట్లు. వేతనాలు, కమీషన్లు, పారితోషికాలు, ఎంప్లాయ్ స్టాక్ ఆప్షన్లు, ఇతర భత్యాలు అన్నీ ఇందులో భాగంగానే ఉన్నాయి. 24 కంపెనీలకు గాను 20 కంపెనీలు వెల్లడించిన వివరాల ఆధారంగా వేసిన అంచనాలు ఇవి. మరి అదే సెన్సెక్స్‌లో భాగంగా ఉన్న ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య వేతనం మాత్రం రూ.31.1 లక్షలుగానే ఉంది. అత్యధికంగా ఎల్అండ్టీ చైర్మన్ ఏఎం నాయక్ రూ.66.14 కోట్లు స్వీకరించగా... సగటున తక్కువ అందుకున్నది ప్రైవేటు రంగ బ్యాంకుల అధిపతులు కావడం గమనార్హం. కొన్ని సంస్థల బాస్‌ల వేతనాలు ⇔ ఏఎం నాయక్, ఎల్అండ్టీ రూ.66.14 కోట్లు ⇔ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం, ఎల్అండ్టీ రూ.22 కోట్లు ⇔ విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ రూ.48.73 కోట్లు ⇔ దేశ్‌బంధు గుప్తా, లుపిన్ రూ.44.8 కోట్లు ⇔ శిఖర్ శర్మ, యాక్సిక్ బ్యాంకు రూ.5.5 కోట్లు ⇔ చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంకు రూ.6.6 కోట్లు ⇔ దీపక్ పరేఖ్, చైర్మన్ హెచ్డీఎఫ్సీ రూ.1.89 కోట్లు ⇔ ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ రూ.15 కోట్లు ⇔ గౌతం అదానీ, అదానీ పోర్ట్స్ రూ.2.8 కోట్లు ⇔ రాహుల్ బజాజ్, బజాజ్ ఆటో రూ.11.3 కోట్ల్లు ⇔ సంజీవ్ మెహతా, హెచ్‌యూఎల్ 13.87 కోట్లు -
17వేల మందికి సమ్మె వేతనాలు లేవు
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య శ్రీరాంపూర్ : సింగరేణì వ్యాప్తంగా 17వేల మంది కార్మికులు సకల జనుల సమ్మె వేతనాలు పొందలేకపోయారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య తెలిపారు. శుక్రవారం ఆయన శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో యూనియన్ అధ్యక్షుడు వై.గట్టయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణిలో కార్మికులంతా కలిసి సకలజనుల సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. నాడు ఉద్యమంలో పాల్గొంటూనే గనులు మునిగిపోకుండా, కూలిపోకుండా అత్యవసర సిబ్బంది విధులు నిర్వహించారు. కాలనీల్లో నీటి సరఫరా చేస్తూ, ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తూ అనేక మంది నాడు సమ్మె కాలంలో విధులు నిర్వహించారు. వారు నాడు విధులు నిర్వహించకుంటే పరిస్థితి దారుణంగా ఉండేది. కానీ అలాంటి వారికి నేడు సమ్మె వేతనాలు చెల్లించకపోవడానికి కారణం గుర్తింపు సంఘం వైఫల్యమే అన్నారు. కేవలం కొద్ది మందికే ప్రయోజనం చేకూరేలా ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. దీని కోసం పెట్టిన నిబంధనలు కేవలం కొద్ది మందికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా ఉన్నాయన్నారు. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి కార్మికుల సమస్యలపై సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేయాలని సీతారామయ్య కోరారు. ఈ సమ్మెపై శనివారం శ్రీరాంపూర్ ప్రెస్‌క్ల»Œ లో జాతీయ సంఘాల నేతలంతా కలిసి సమావేశం కానున్నట్లు తెలిపారు. 10వ వేజ్‌బోర్డు కమిటీని వెంటనే వేయాలని, గ్రాట్యూటీపై ఉన్న సీలింగ్ ఎత్తివేయాలని, పింఛన్ 25 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతేడాది కంపెనీ సాధించిన లాభాల నుంచి 25 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, బ్రాంచి సెక్రెటరీలు ల్యాగల శ్రీనివాస్, కొట్టె కిషన్‌రావు, నాయకులు కాంపెల్లి నర్సయ్య పాల్గొన్నారు. -
సకల’ వేతనాలు అందరికీ చెల్లించాలి
సెంటినరీకాలనీ : సింగరేణిలోని అన్ని విభాగాల కార్మికులకు సకలజనుల సమ్మెకాలపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆర్జీ–3 డివిజన్లోని డిస్ట్రిబ్యూషన్ కార్యాలయం వద్ద ఎస్అండ్ పీసీ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ ఎస్అండ్పీసీ రామగుండం రీజియన్ ఇన్చార్జి అంబటి నరేష్ మాట్లాడుతూప్రాణాలనుపణంగా పెట్టి సంస్థ ఆస్తులను కాపాడిన సిబ్బందికి సకలజనుల సమ్మె కాలపు వేతనం చెల్లించకపోవడం బాధాకరమన్నారు. టీబీజీకేఎస్ లోపభూయిష్టం ఒప్పందంతోనే కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు. కార్మికులందరికీ వేతనాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నా.. టీబీజీకేఎస్ అడ్డుకుందని ఆరోపించారు. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ సీఅండ్ఎండీ శ్రీధర్‌తో చర్చలు జరుపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్అండ్పీసీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఒక రోజు ముందు డ్యూటీ నిబంధన ఎత్తివేత
బెల్లంపల్లి : సకలజనుల సమ్మె వేతన బకాయిల చెల్లింపునకు అడ్డంకిగా ఉన్న సమ్మెకు ఒకరోజు ముందు డ్యూటీ చేయాలనే నిబంధనను ఎత్తి వేయడానికి సింగరేణి ౖచైర్మన్ శ్రీధర్ అంగీకారం తెలిపినట్లు టీబీజీకేఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి చైర్మన్‌తో టీబీజీకేఎస్ అధ్యక్ష,కార్యదర్శులు జరిపిన చర్చలతో యాజమాన్యం ఆ నిబంధనను తొలగించడానికి ఒప్పుకుందన్నారు. ఆ నిబంధనవల్ల సుమారు రెండువేల మంది కార్మికులకు వేతన బకాయిలు చెల్లించడానికి వీలు లేని పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. అందులో వెయ్యిమంది వరకు తమ సంఘం కార్యకర్తలే ఉన్నారని తెలిపారు. ఆ కార్మికులకు పది రోజుల్లో వేతన బకాయిలను యాజమాన్యం చెల్లిస్తుందని చెప్పారు. జాతీయ కార్మిక సంఘాలు చేసుకున్న తప్పుడు ఒప్పందం వల్లనే ఆ అడ్డంకి ఏర్పడిందన్నారు. సమ్మె వేతన బకాయిల్లో తొలివిడతగా బుధవారం రూ.137 కోట్లు కార్మికులకు చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. కార్మికుల పక్షాన తమ సంఘం అంకితభావంతో పని చేసస్తుందన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు ఎస్ సత్యనారాయణ , డి.శ్రీనివాస్ , బి.శంకర్ , నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనం పెంపు
ముకరంపుర: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వ నిర్ణయం ఊరటనిచ్చింది. పదేళ్లుగా కీలకంగా పనిచేస్తున్న ఫీల్డ్అసిస్టెంట్లను రెగ్యులరైజ్ చేయాలని, వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలకు సర్కార్ ఎట్టకేలకు దిగివచ్చింది. ప్రస్తుతం నెలవారీగా ఇస్తున్న వేతనం రూ.6240నుంచి రూ.10 వేలకు పెంచింది. జిల్లావ్యాప్తంగా 936 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు దమ్మని లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. -
పోరాటాల ఫలితంగానే కూలి పెంపు
ఖిలావరంగల్ : చేనేత సమస్యలపై అఖి ల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపాముల వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం శివనగర్ తమ్మెర భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. చేనేత కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా చేనేత కార్మిక సహకార సొసైటీ(టెస్కో) 20 నుంచి 27 శాతానికి కూలి రేట్లు పెంచిందన్నారు. మీటరు నేత కు రూ.3 50 పైసలు, టెరికాటన్ షూటింగ్ క్లాత్, షర్టింగ్, లంగా, పాలిస్టర్ బ్లౌజ్, ఓణీ క్లాత్ నేతకు రూ.4. 50 పైసలు పెరిగాయ ని తెలిపారు. జౌళిశాఖ నుంచి చేనేతను విడదీసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే కార్మికులు పో రాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చా రు. సమావేశంలో గోరంట్ల శరత్‌బాబు, చె రుకు వెంకట్రాం నర్సయ్య, గుల్లపెల్లి సాం బమూర్తి, సతీష్‌కుమార్ పాల్గొన్నారు. -
‘సకల’ వేతనం ఇవ్వాలి
గోదావరిఖని : సకలజనుల సమ్మె కాలంలో సింగరేణిలో అత్యవసర విధులు నిర్వహించిన తమకు కూడా సమ్మెకాలపు వేతనాలు ఇప్పించాలని సింగరేణి ఏరియా ఆస్పత్రి సిబ్బంది కోరారు. ఈమేరకు సిబ్బంది, ఉద్యోగులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ సకల జనుల సమ్మె కాలం వేతనాలు అత్యవసర సిబ్బంది అయిన ఏరియా ఆస్పత్రి, సవిల్ విభాగం, ఎస్అండ్పీసీ, అండర్‌గ్రౌండ్, పంప్ ఆపరేటర్, మైనింగ్ సర్దార్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా పాలకుల కుట్రలకు వత్తాసు పలుకుతున్న టీబీజీకేఎస్ సకల జనుల సమ్మె వేతనాలు అత్యవసర సిబ్బందిని విస్మరించడం సరికాదని పేర్కొన్నారు. అత్యవసర సిబ్బందికి సమ్మె వేతనాలు చెల్లించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఎంఏ.ఖయ్యూం, దార సుశీల, శేషారత్నం, రామలక్ష్మి, విజయలక్ష్మి, సింహాచలం, థెరీసా, చలం కుమారి, రామారావు, వెంకటయ్య, తోట ప్రభాకర్, పుట్టపాక రాజయ్య, ఎ.రాజశేఖర్, శ్రీనివాస్, కె.శ్రీనివాస్, బి.సురేశ్, వి.తిరుపతి, డి.వేణు, బి.వేణుగోపాల్, కె.సతీశ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
వేతనానికి కొండెక్కాల్సిందే!
ఉపాధి వేతనదారులకు తప్పని వెతలు పది కిలోమీటర్లు కొండెక్కాలి రెండేళ్లుగా ఉపాధి లేని బిల్లగూడ కాలనీ వాసులు సీతంపేట : ఉపాధి హామీ సిబ్బంది చేసిన తప్పిదానికి రెండేళ్లుగా ఆ గిరిజనులకు ఉపాధి పనుల్లేకుండా పోయాయి. మా జాబ్‌కార్డులు ఒక చోట పనులు మరోచోట కల్పిస్తున్నారు, జాబ్‌కార్డులు మార్చాలంటూ పదేపదే అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదని మండలంలోని కుశిమి పంచాయితీ బిల్లగూడ కాలనీకి చెందిన గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం వీరంతా మండల పరిషత్ కార్యాలయ అధికారులను ఆశ్రయించారు. వివరాలు పరిశీలిస్తే... మండలంలోని కుశిమి పంచాయతీ పరిధిలో బిల్లగూడ కాలనీలో 30 వరకు గిరిజన కుటుంబాలు నివశిస్తున్నాయి. మూడు శ్రమశక్తి గ్రూపులు ఉండగా 21 జాబ్‌కార్డులుండగా 60 మంది ఉపాధి హామీ పనిలో పాల్గొంటున్నారు. వీరందరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శంబాం పంచాయతీ బిల్లగూడలో జాబ్‌కార్డులు ఉండడంతో అక్కడ వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. వేతనాల కోసం వెళ్లాలంటే కొండలు దాటి పది కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని గ్రామానికి చెందినవేతనదారులు బాబురావు, శ్యామలరావు, సిమ్మయ్య తదితరులు తెలిపారు. 2007 నుంచి ఇదే సమస్య ఉందని తెలిపారు. ఈ సమస్యతో రెండేళ్లుగా ఉపాధి పనులకు కూడా వెళ్లడం లేదన్నారు. ఉపాధి అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పరిష్కారం లేదని తెలిపారు. ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయం చేయాలని గిరిజనులు కోరుతున్నారు. -
బడ్జెట్‌తో సంబంధం లేకుండా వేతనాలు
రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ఎయిడెడ్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు బడ్జెట్‌తో సంబంధం లేకుండా మొదటి తేదీన జీతాలు చెల్లించేందుకు ఆర్థికశాఖ మార్గదర్శకాలు రూపొం దిస్తుందని యూటీఎఫ్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో పని చేస్తున్న ఎయిడెడ్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు క్వార్టర్ల వారీగా బడ్జెట్ విడుదల చేయడం, ఇది జిల్లాలకు చేరి డీఈవో కార్యాలయాలు, ఖజాన శాఖల్లో ఆమోదం పొంది సంబంధిత ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ అయ్యేందుకు రెండు, మూడు నెలలు సమయం పట్టేందన్నారు. ఈ సమస్యను ఉపాధ్యాయ సంఘాలు అనేక దఫాలు ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లాయన్నారు. సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడమే తప్ప ఆచరణ జరగలేదన్నారు. దీనిపై సోమవారం యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి, పీడీఏ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ఆర్థిక కార్యదర్శి రవిచంద్ర దష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఇక నుంచి ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించే విధంగా ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి పెన్షన్లు ఈ–పేమెంట్ ద్వారా చెల్లించే ప్రతిపాదనకు మార్గదర్శకాలు విడుదల అవుతాయని ఆయన తెలిపారు. -
నెరవేరనున్న అర్చకుల కల
ఇక ట్రెజరీ ద్వారా వేతనాలు! సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో అమలు? అర్చకుల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం మంత్రి తుమ్మల చొరవతో సమస్య కొలిక్కి 460 మంది అర్చకులకు చేకూరనున్న లబ్ధి ఇక అర్చకులకు మంచి రోజులు రానున్నాయి. ట్రెజరీ ద్వారా వారికి వేతనాలు చెల్లిస్తూ.. సర్కారు ఉద్యోగులుగా గుర్తించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. వేతనాల పెంపును పక్కనపెట్టి.. ప్రస్తుతం ఉన్న వేతనాన్నే 010 పద్దు ద్వారా చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల అర్చకుల ఆందోళనతో ప్రభుత్వం జూన్ 3న మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని.. ఇందులో కీలక సభ్యుడిగా ఉన్న మంత్రి తుమ్మల చొరవతో అర్చకులను గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఖమ్మం కల్చరల్: అర్చకులకు ఇక మంచి రోజులు రానున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కల నెరవేరనుంది. ట్రెజరీ ద్వారా వారికి వేతనాలు చెల్లిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. అర్చకులు, ఉద్యోగులు రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే ట్రెజరీల ద్వారా తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. రాష్ట్రం ఏర్పడిన సమయంలో సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలో భాగంగా అపరిష్కృతంగా ఉన్న అర్చకుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ అది నెరవేరకపోవడంతో ఆగ్రహించిన అర్చక, ఉద్యోగ జేఏసీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా 2015, జూన్‌లో నిరవధిక సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. సమస్య పరిష్కారానికి ప్రభుత్వ ముఖ్య సలహాదారుడిగా ఉన్న రమణాచారి నేతృత్వంలో ఓ కమిటీ వేశారు. కమిటీ విధివిధానాలు రూపొందించి.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించినా దానిని కొందరు తుంగలో తొక్కారనే ఆరోపణలు వచ్చాయి. తర్వాత పలు ప్రాంతాల్లో అర్చక ఉద్యోగ జేఏసీ నేతలు సమావేశాలు ఏర్పాటు చేసి.. ఆమరణ నిరహార దీక్షలు చేస్తామని.. సమస్యల పరిష్కారానికి కేసీఆర్ చొరవ చూపాలని హెచ్చరికలు జారీ చేయడంతో.. సమస్య ఓ కొలిక్కి వచ్చింది. 010 పద్దు ద్వారా వేతనాలు? అర్చకుల సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసినట్లు సమాచారం. వేతనాల పెంపును పక్కనపెట్టి.. ప్రస్తుతం ఉన్న వేతనాన్నే 010 పద్దు ద్వారా చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తర్వాత మిగిలిన సమస్యలను పరిష్కరించవచ్చనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు శాఖ ఉద్యోగి ఒకరు తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని అర్చక, ఉద్యోగుల వివరాలు సేకరించాలని దేవాదాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని ఆయన అన్నారు. జిల్లాలో భద్రాచలం మినహా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 105 ఆలయాలు, ఆ శాఖ గుర్తించిన 448 ఆలయాల్లో పనిచేస్తున్న సుమారు 460 మంది అర్చక, ఉద్యోగుల వివరాలను ఫొటోలతో సహా సేకరించింది. వీటిని ఆన్లైన్ చేసి.. రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయానికి పంపే పనిలో జిల్లా ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి నెల రోజుల సమయం పట్టవచ్చని.. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి అర్చక, ఉద్యోగులు ట్రెజరీ ద్వారా వేతనాలు పొందే అవకాశం ఉందని దేవాదాయ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. మంత్రి తుమ్మల చొరవతో... జిల్లాలోని అర్చక, ఉద్యోగులతోపాటు ఇతర జిల్లాలకు చెందిన అర్చక, ఉద్యోగులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి సమస్యను వివరించారు. స్పందించిన ఆయన సీఎం కేసీఆర్‌కు సమస్య ప్రాధాన్యతను వివరించారు. ఆ వెంటనే సీఎం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో జూన్ 3న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న మంత్రి తుమ్మల చొరవతో నెల రోజుల్లోనే సమస్యను ఓ కొలిక్కి వచ్చినట్లు దేవాదాయశాఖ ఉద్యోగి చెప్పారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రభుత్వం మా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ.. వేతనాల ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తెలిసింది. ఏళ్లుగా అనుభవిస్తున్న మా వెతలను ఇప్పటివరకు ఎవరూ గుర్తించలేదు. ప్రస్తుతం వాటిని గుర్తించి.. మాకు సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి జిల్లా అర్చక, ఉద్యోగ జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. – దాములూరి వీరభద్రశర్మ, జిల్లా అర్చక సంఘం అధ్యక్షుడు