-
భార్యభర్తలిద్దరూ నాలుగేళ్లుగా విడిగా...
కావలి: బోగోలు మండలం కొండబిట్రగుంటలో ఒకే ఇంట్లో ముగ్గురిని దారుణంగా హత్య మార్చిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 5న కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో సొంత కోడలితో పాటు ఆమె నాన్న, అమ్మమ్మను అత్త, మామ, మరిది కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన రోజు నుంచి నిందితులు పరారీలో ఉండగా పోలీసులు నిఘా ఉంచి శుక్రవారం అరెస్ట్ చేశారు. కావలి డీఎస్పీ వెంకట రమణ నిందితుల వివరాలను వెల్లడించారు. వివరాలు.. కొండబిట్రగుంటకు చెందిన మందాటి మధుసూదన్‌కు, బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన వాడకుప్ప మౌనికతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సుమారు ఎనిమిదేళ్ల వయస్సున బాబు ఉన్నాడు. రైల్వే ఉద్యోగిగా పనిచేసే మధుసూదన్ తరచూ మద్యం సేవించి భార్యతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో భార్యభర్తలిద్దరూ నాలుగేళ్లుగా విడిగా ఉంటున్నారు. మౌనిక తన కుమారుడిని బుచ్చిలోని అమ్మమ్మ వద్ద ఉంచి తను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గతనెల 28న భర్త గుండెపోటుతో చనిపోవడంతో మౌనిక కొండబిట్రగుంటలోని అత్తగారింటికి వచ్చింది. ఆమెకు తోడుగా ఆమె నాన్న వాడకుప్ప కృష్ణయ్య, అమ్మమ్మ శాంతమ్మ కూడా వచ్చి కొండబిట్రగుంటలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆస్తి గొడవలు తలెత్తడంతో ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి సమయంలో మౌనిక అత్తమామలైన మందాటి మాల్యాద్రి, మందాటి ధనమ్మ, మరిది మౌళిచంద్రలు ఇనుప రాడ్లతో దాడి చేసి ముగ్గురిని హతమార్చారు. మౌనిక తల్లి వాడకుప్ప పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి బుడంగుంట గేటు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కుటుంబ కలహాలు.. బాలుడి పీక నొక్కి చంపిన తాత?
సాక్షి, ప.గో జిల్లా: సొంత తాతయ్య తన మనువడిని హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న ఘటన పెంటపాడు మండలం మీనవల్లూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం మీనవల్లూరుకి చెందిన పోకల వెంకట కళ్యాణ్ (6) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. బుధవారం ఉదయం నుంచి కనిపించడం పోవడంతో బాలుడి తల్లి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం సాయంత్రం యనమదర్రు కాలవలో అదృశ్యమైన ఆరేళ్ల బాలుడు మృతదేహం లభ్యమైంది. తాతనే బాలుడి పీక నొక్కి చంపేసి కాలవలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాలు,ఆస్థి తగాదాలు మధ్య తాతయ్య హత్య చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. బాలుడు తండ్రి, తాత, నానమ్మ కూడా ఈ హత్యలో పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాతయ్య పరార్ లో ఉండగా, బాలుడి తండ్రి నానమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డాక్టర్ రాధా హత్య కేసులో బిగ్ ట్విస్ట్
ఎన్టీఆర్: జిల్లాలో సంచలనం రేపిన డాక్టర్ మాచర్ల రాధ (59) హత్య కేసులో మిస్టరీ వీడింది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడని పోలీసులు తేల్చి చెప్పారు. రాధను హతమార్చటంలో నిందితుడు కారు డ్రైవర్ సహాయం పొందినట్లు నిర్ధారించారు. కుటుంబ కలహాలు, ఆర్ధిక వివాదాలే హత్యకు గల కారణాలుగా నిర్ధరించారు. జిల్లా ఎస్పీ పి.జాషువా శుక్రవారం తన ఛాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మూడు నెలల ముందే పథక రచన.. డాక్టర్ లోక్‌నాథ్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ రాధ భార్యభర్తలు. మచిలీపట్నం జవ్వారుపేటలో శ్రీ వెంకటేశ్వర తల్లిపిల్లల ఆసుపత్రి నడుపుతున్నారు. రాధ కొంత కాలంగా ప్రాక్టీస్ ఆపేసింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరిరువురూ వివాహితులే. కుమారుడికి ఇటీవలే వివాహం కావటంతో గత నెలలో అత్తారింటికి వెళ్లాడు. ఇదిలా ఉండగా లోక్నాధ్, రాధల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. వ్యక్తిగత కలహాలతో పాటు ఆర్ధికపరమైన విషయాల్లోనూ మనస్పర్ధలు ఉన్నాయి. విబేధాలు తారస్థాయికి చేరుకోవటంతో ఉమామహేశ్వరరావు భార్యను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు పథకం రచించి సమయం కోసం వేచి చూస్తున్నాడు. తన వద్ద సుమారు 15 ఏళ్లుగా నమ్మకంగా పని చేస్తున్న కారు డ్రైవర్ స్ఫూర్తి జానార్ధన్ అలియాస్ మధును ఈ పనిలో సహాయం కోరాడు. సహకరిస్తే 30 లక్షల నగదుతో పాటు రాధ సంబంధించిన బంగారం మొత్తం ఇచ్చి జీవితంలో స్థిరపడేందుకు సహాయం చేస్తానని భరోసా ఇచ్చాడు. ఇందుకు మధు ఒప్పుకున్నాడు. ముందుగానే వేసుకున్న పథకాన్ని అమలు చేసేందుకు మూడు నెలల ముందుగానే సీసీ కెమెరాలను ఉపయోగంలో లేకుండా చేశారు. ఆభరణాలు తీసి.. సీలింగ్‌లో దాచి.. అదును కోసం చూస్తున్న ఉమామహేశ్వరరావు కొడుకు అత్తగారింటికి వెళ్లటంతో డ్రైవర్‌తో చర్చలు జరిపాడు. ఆక్సిజన్ సిలిండర్లు బిగించేందుకు ఉపయోగించే రెంచీని ఆయుధంగా ఎంచుకున్నారు. గత నెల 25వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ లోక్‌నాథ్ రెంచీని మధుకు అందజేశాడు. సాయంత్రం రెండో అంతస్తులో అనుమానం కలుగకుండా నక్కి ఉండమని చెప్పాడు. అతడు డాక్టర్ చెప్పిన విధంగా చేశాడు. అదును చూసుకుని ఉమామహేశ్వరావు, మధు ఇద్దరూ రాధపై ఒక్కసారిగా దాడి చేశారు. మధు ఆమెను బలంగా పట్టుకోగా భర్త ఆమె తలపై రెంచీతో బలమైన దెబ్బలు కొట్టాడు. తీవ్ర రక్తస్రావం అయిన రాధ స్పృహ కోల్పోయింది. మృతి చెందిందీ లేనిదీ నిర్ధారించుకునేందుకు మరలా రెంచీతో బలంగా ఆమె తలపై కొట్టారు. మృతి చెందినట్లు నిర్ధారించుకున్న అనంతరం ఉమామహేశ్వరరావు ఇంటి వెనుక వైపు నుంచి కింది ఫ్లోర్‌లోని క్లినిక్‌లో వెళ్లిపోయాడు. మధు ఆమె ఒంటిపై ఆభరణాలు ఒలిచి సీలింగ్‌లో దాచాడు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ఉండేందుకు డాక్టర్ సలహా మేరకు కారం తెచ్చి మృతురాలి ఒంటిపై చల్లాడు. గదిలో అక్కడక్కడా కారం చల్లటంతో పాటు రెంచీని ఇంటి వెనుకభాగంలో దాచి పెట్టాడు. అదే రోజు రాత్రి 10.30 సమయంలో డాక్టర్ ఉమామహేశ్వరావు ఏం ఎరుగనట్టు పోలీసులకు ఫోన్ చేసి తన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారంటూ సమాచారం ఇచ్చాడు. ఆభరణాలు స్వాధీనం.. రాధ హత్య సమాచారం అందుకున్న బందరు డీఎస్పీ మాధవరెడ్డి, సంబంధిత ఏరియా సీఐ ఉమామహేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భర్త నుంచి వివరాలు తీసుకున్నారు. అతని ఫిర్యాదుపై ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో హత్య కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులకు ఎటువంటి ఆధారాలు చిక్కకపోవటంతో ఎస్పీ ఆదేశాల మేరకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రాధను హత్య చేసింది ఆమె భర్తేనని నిర్ధారించారు. అతడికి డ్రైవర్ సహకరించినట్లు నిర్ణయానికి వచ్చారు. ఇరువురిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసింది తామేనని అంగీకరించారు. హత్యకు ఉపయోగించిన రెంచీతో పాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ కేసును చేధించటంలో ప్రతిభ కనబరచిన బందరు డీఎస్పీ మాధవరెడ్డిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. దర్యాప్తును సమర్ధవంతంగా నిర్వర్తించి హంతకులను అదుపులోకి తీసుకున్న సిబ్బందికి రివార్డులు ప్రకటించేందుకు రాష్ట్ర డీజీపీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ హరిబాబు, డీఎస్పీ మాధవరెడ్డి, సీఐలు ఉమామహేశ్వరరావు, రవికుమార్ పాల్గొన్నారు. -
నడిరోడ్డుపై వీఆర్వోను పట్టుకున్న ఏసీబీ అధికారులు
కనిగిరి రూరల్: పాస్ పుస్తకాల మ్యుటేషన్‌కు వీఆర్వో లంచం డిమాండ్ చేయడంతో డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక కనిగిరి మండలం ఏరువారిపల్లి వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డిని అదే సచివాలయ పరిధిలో పనిచేసే వలంటీర్ ఏసీబీ అధికారులకు పట్టించాడు. వివరాల్లోకి వెళితే కనిగిరి మండలం పేరంగుడిపల్లికి చెందిన వీరంరెడ్డి భాస్కర్‌రెడ్డి గోసులవీడు గ్రామవలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి లక్ష్మీరెడ్డి పేరు మీద మండలంలోని అజీస్‌పురంలో 2.73 ఎకరాల భూమి ఉంది. దీన్ని మ్యుటేషన్ చేయించుకునేందుకు గత నెల 24న గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత పాస్బుక్ల మ్యుటేషన్ కోసం వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డిని కలిశాడు. అతను రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. చివరకు ఇద్దరి మధ్య రూ.21 వేలకు బేరం కుదిరింది. లంచం ఇవ్వడం ఇష్టంలేని వీఆర్వో ఏసీబీ అధికారులకు ఈనెల 9న ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ జరిపిన ఏసీబీ అధికారులు 11న శుక్రవారం కేసు రిజస్టర్ చేసుకుని.. ఏసీబీ డీఎస్పీ వీ శ్రీనివాసరావు బృందం దాడులు నిర్వహించింది. వెంటాడి నడిరోడ్డుపై పట్టుకున్న ఏసీబీ అధికారులు.. ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం ఏసీబీ అధికారులు రైతుల వేషధారణలో తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణాల్లో కాపు కాశారు. ఏసీబీ అధికారులు వీరం రెడ్డి భాస్కర్‌రెడ్డి చేతికి రూ.21 నగదును అందజేశారు. సుమారు 12 గంటల సమయంలో భాస్కర్‌రెడ్డి.. వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డికి నగదు ఇస్తానని చెప్పాడు. దీంతో వీఆర్వో , వలంటీర్‌ని బైక్ పై ఎక్కించుకుని పట్టణంలో కందుకూరు రోడ్డు వైపు ఉన్న కపిలా హోటల్ సెంటర్‌కు తీసుకెళ్లి నగదు తీసుకున్నాడు. అప్పటికే వీఆర్వోను వెంటాడుతున్న ఏసీబీ ట్రాప్ పార్టీ అధికారులు ఒక్క సారిగా రోడ్డుపై చుట్టుముట్టారు. దాన్ని గమనించిన వీఆర్వో తీసుకున్న నగదును జేబులో నుంచి కింద పడేశాడు. వెంటనే ఏసీబీ అధికారులు వీఆర్వో రెండు చేతులు గట్టిగా వెనక్కి మడిచి పట్టుకున్నారు. రోడ్డు పైనే స్టూల్ పెట్టి ఏసీబీ అధికారులు వెంట తెచ్చిన రసాయనం కలిపిన నీటిలో వీఆర్వో చేతులను కడిగించగా, నీళ్లు రంగు మారాయి. ఈ ఘటన అంతా నడిరోడ్డుపై దాదాపు 15 నిమిషాలు సాగింది. ట్రాఫిక్‌కు అంతరాయంగా మారడంతో వీఆర్వో వేణును పోలీసుల సహకారంతో తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణానికి తరలించి, తదుపరి విచారణ ప్రక్రియ ప్రారంభించారు. వీఆర్వో వద్ద లెక్కలో లేని నగదు మరో రూ.32,300 ఉంది. ఏసీబీ అధికారుల ట్రాప్‌నకు ముందు ఇద్దరు రైతుల వద్ద ఈ నగదును తీసుకున్నట్లు అధికారులు గుర్తించి, విచారణ జరిపి వారి వద్ద కూడా ఫిర్యాదు తీసుకుంటామని తెలిపారు. మాచవరంలోని ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు: వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి స్వగ్రామమైన మాచవరానికి వెళ్లి అతని ఇంట్లో ఏసీబీ సీఐ అపర్ణ సోదాలు నిర్వహించారు. ఇంట్లో 10 ఈ–పాస్ బుక్‌లు ఐదేళ్ల నాటివి దొరికినట్లు ఏసీబీ డీఎస్పీ వీ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఆ పాస్‌బుక్‌లు తిరిగి ఇవ్వకుండా అతని దగ్గరే ఎందుకు ఉంచుకున్నాడు అనే దానిపై విచారణ చేపడతామని డీఎస్పీ వెల్లడించారు. వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు. ఏసీడీ దాడుల్లో ఏసీబీ సీఐలు అపర్ణ, సీహెచ్ శేషు, టీవీ శ్రీనివాసులు, ఎస్సై జేవీఎన్ ప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ వీ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధితుడు వీరం రెడ్డి భాస్కర్‌రెడ్డి తొలుత ఈనెల 6న 14400 యాప్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే 14400 యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫిర్యాదుదారుల పేర్లను, వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. తర్వాత విచారణ జరిపి నిజమైతే చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు పరార్.. వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకోగానే వివిధ శాఖ అధికారులు పరారయ్యారు. ప్రధానంగా తహసీల్దార్ కార్యాలయంలోని వీఆర్వోలు, వివిధ స్థాయిల్లోని అధికారులు అదృశ్యమయ్యారు. రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో సబ్ రిజిస్టర్ ఆఫీసులోని అధికారులు, సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు పత్తా లేకుండా పోయారు. బిక్కు బిక్కు మంటూ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇతర సిబ్బంది విధులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు కనిగిరి వదిలి పోయేంత వరకు పలు శాఖల ఉన్నతాధికారులు వారి సీట్లల్లో కూర్చోలేదంటే అతిశయోక్తి కాదు. పలువురు వీఆర్వోలు, రెవెన్యూ, ఇతర రెండు శాఖల్లోని ప్రధాన అధికారుల పేర్లు ఏసీబీ జాబితాలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. -
విజయవాడ: టూరిస్ట్ గైడ్ నందా విష్ణువర్ధన్‌పై దాడి
సాక్షి, విజయవాడ: టూరిస్ట్ గైడ్ నందా విష్ణువర్ధన్‌పై దాడి జరిగింది. నలుగురు వ్యక్తులు బందర్‌రోడ్డులోని ఆఫీసులో విష్ణును రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలోనే ఆఫీస్‌లోని ఫర్నీచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఇక, దుండగుల దాడిలో విష్ణు తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్య చికిత్స అందిస్తున్నారు. కాగా, దాడి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని మాచవరం సీఐ గునరామ్ పరిశీలించారు. అయితే, దాడి సందర్భంగా అదంతా సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండగా నిందితులు జాగ్రత్తపడ్డారు. ఇదిలా ఉండగా.. ఆలిండియా హాస్టల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా విష్ణు ఉన్నాడు. ట్రెక్కింగ్ గైడ్, టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తున్నాడు. ఇక, మహిళల వ్యవహారం కారణంగానే విష్ణుపై దాడి జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: రాజకీయాల్లో యాక్టివ్.. బీజేపీ నేత దారుణ హత్య.. -
ఎన్టీపీసీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి
సాక్షి, అనకాపల్లి/ విశాఖపట్నం: అనకాపల్లిలోని పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎన్టీపీసీలో కేబుల్ ట్రాక్ విరిగిపడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాంలో మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో 50 అడుగుల ఎత్తులో కేబుల్ ట్రాక్ నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కేబుల్ ట్రాక్ విరిగిపడటంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: కొత్తగూడెంలో సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్ -
రక్తం కారుతున్నా.. ‘అన్నా.. తను జాగ్రత్త’
అనంతపురం (శ్రీకంఠం సర్కిల్): రెండు కాళ్లూ ఛిద్రమై రక్తమోడుతున్నాయి. అయినా ఆయన భయపడలేదు. తనతో పాటు ప్రమాదానికి గురైన భార్యను కాపాడాలని తాపత్రయపడ్డాడు. పైకి లేచి నిలబడలేని స్థితిలోనూ గుండె నిబ్బరం చేసుకుని నేలపై పాకుతూ వెళ్లి భార్యను గుండెలకు హత్తుకున్నాడు. ‘ఏం కాదులే’ అని ధైర్యం చెప్పాడు. 108 వాహనంలోకి చేర్చే క్రమంలో ఆమెను దీనంగా చూస్తూ అంబులెన్స్ సిబ్బందితో.. ‘అన్నా.. తను జాగ్రత్త’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. భార్యను కాపాడేందుకు ఎంతగానో తపించిన ఆ భర్త చివరకు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అనంతపురం నగర శివారులోని నేషనల్ పార్క్ వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. లారీ ఢీకొన్న ఘటనలో కిరణ్‌కుమార్ (42) మరణించగా.. అతడి భార్య అనిత తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నారు. భర్త ఏఆర్ కానిస్టేబుల్.. భార్య టీచర్ ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన కిరణ్‌కుమార్ 2003 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్. ఇదే ప్రాంతానికి చెందిన అనితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అనితకు టీచర్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ రీత్యా అనంతపురం శివారు కళ్యాణదుర్గం రోడ్డు ఎస్బీఐ కాలనీ రెండో క్రాస్‌లో నివాసం ఉంటున్నారు. కిరణ్‌కుమార్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తిస్తుండగా.. అనిత తరిమెల జెడ్పీ హైసూ్కల్లో టీచర్. వీరికి యశ్వంత్ నారాయణ, మణిదీప్ ఇద్దరు సంతానం. రోజూ ఉదయం భార్యను సోములదొడ్డి క్రాస్‌కు బైక్‌పై తీసుకెళ్లి.. ఆర్టీసీ బస్సులో తరిమెలకు పంపించడం కిరణ్‌కుమార్ దినచర్య. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో కిరణ్‌కుమార్ భార్యతో కలిసి సోములదొడ్డి బస్‌స్టాప్ వద్దకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. 44వ జాతీయ రహదారిపై నుంచి నేషనల్ పార్క్ వద్ద సరీ్వసు రోడ్డులోకి వచ్చే క్రమంలో లారీ ఢీకొంది. బైక్‌పై నుంచి ఎగిరి కిందపడ్డ కిరణ్‌కుమార్ కాళ్లపై లారీ వెనుక టైర్లు వెళ్లాయి. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకోగానే అల్లంత దూరంలో భార్య అనిత పడి ఉండటం చూసి ఆమెను ఎలాగైనా కాపాడాలనుకున్నాడు. తన కాళ్లు ఛిద్రమైపోయినా శక్తినంతటినీ కూడదీసుకుని పాకుతూనే ఆమె వద్దకు చేరాడు. భార్యను చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. ముక్కు, చెవిలో రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకుంటున్న భార్యను చూసి ‘ఏమీ కాదు’ అంటూ ధైర్యం చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు. ఆమెను అంబులెన్స్‌లోకి ఎక్కించిన తరువాత అపస్మారక స్థితిలోకి చేరాడు. దంపతులిద్దరినీ 108 వాహనంలో సర్వజనాస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రథమ చికిత్స చేసి బెంగళూరుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ కిరణ్‌కుమార్ మృతి చెందగా.. భార్య అనిత కోమాలోకి వెళ్లింది. చదవండి: కుమారుడు పరీక్షలో తప్పాడని..తల్లి ఆత్మహత్య -
వివాహితపై లైంగికదాడి : నిందితుడికి రిమాండ్
సబ్బవరం: మండలంలోని నారపాడు గ్రామంలో వివాహితపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్టు పరవాడ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. సబ్బవరం పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామానికి చెందిన రాజాన అప్పారావు(36) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మానసిక వైకల్యంతో ఉన్న మహిళపై అత్యాచారం చేసినట్టు చెప్పారు. వారం రోజుల కిందట బాధితురాలి భర్త గ్రామంలో లేని సమయంలో మధ్యాహ్నం ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడన్నారు. విషయం బహిర్గతం కాకుండా పెద్దలు న్యాయం చేస్తారనడంతో వెంటనే ఫిర్యాదు ఇవ్వలేదని, అయితే నిందితుడి నుంచి సరైన స్పందన రాకపోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈమేరకు ఎస్ఐ ఎల్.సురేష్ కేసు నమోదు చేశారన్నారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని అరెస్ట్ చేసి సీఐ రంగనాథం జుడీషియల్ రిమాండ్‌కు తరలించారని చెప్పారు. సమావేశంలో సీఐ రంగనాఽథం, ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు. -
సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలు
సాక్షి, అమరావతి/ గుంటూరు లీగల్/నగరంపాలెం: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన రేపల్లె రైల్వేస్టేషన్లో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు ముద్దాయిలకు 20 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.2,500 జరిమానా విధిస్తూ నాలుగో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఆర్.శరత్‌బాబు బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం మండలం, వెంకటాద్రిపురానికి చెందిన కొర్రపోలు రమేష్ వ్యవసాయ, తాపీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య ఏసమ్మ, ముగ్గురు పిల్లలు సంతానం కాగా, భార్య మళ్లీ గర్భంతో ఉంది. కృష్ణాజిల్లా నాగాయలంకలో కూలి పనులు చేసుకునేందుకు రమేష్ తన భార్య, పిల్లలతో 2022 ఏప్రిల్ 30న గుంటూరులో రైలు ఎక్కి రేపల్లె వెళ్లాడు. అప్పటికి సమయం 11.45 కావడంతో రైల్వేస్టేషన్లోనే తన భార్య, పిల్లలతో రమేష్ నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పాలుబోయిన విజ యకృష్ణ, పలుచూరి నిఖిల్, మరో మైనర్ బాలు డు మద్యం మత్తులో రైల్వేస్టేషన్‌లోకి వచ్చారు. అక్కడ భార్య,పిల్లలతో నిద్రిస్తున్న రమేష్‌ను నిఖిల్ నిద్రలేపి టైం అడిగాడు. టైం చెప్పకపోవడంతో రమేష్‌ను కొట్టడం ప్రారంభించాడు. దీంతో రమేష్ స్టేషన్ బయటకు పరుగెత్తాడు. అక్కడే ఉన్న రమేష్ భార్యపై విజయకృష్ణ లైంగికదాడికి పాల్పడ్డాడు. రమేష్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి పోలీసులను తీసుకొచ్చేసరికి నిందితులు పారిపోయారు. నిందితులు తన భార్యపై సామూహిక అత్యాచారం చేసినట్లు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేపల్లె డీఎస్పీ టి.మురళీకృష్ణ, దిశ డీఎస్పీ యు.రవిచంద్ర దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పీపీ శారదమణి వాదించారు. ఈ కేసులో మూడో ముద్దాయి మైనర్ కావడంతో తెనాలి పోక్సో కోర్టులో విచారణ జరుగుతుంది. సత్ఫలితాలనిస్తున్న కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ అత్యాచార కేసుల్లో దోషులకు సత్వరం శిక్షలు విధించేలా పోలీసు శాఖ కోర్ట్ ట్రయల్ మానిటరింగ్ విధానాన్ని సమర్థంగా అమలు చేస్తున్నదని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో గతేడాది ఓ మహిళపై అత్యాచారం చేసిన కేసులో పాలుబోయిన విజయకృష్ణ, పాలుచురి నిఖిల్‌ను దోషులుగా గుర్తిస్తూ న్యాయస్థానం 20 ఏళ్లు జైలు శిక్ష విధించడం కేసు దర్యాప్తులో పోలీసుల సమర్థతకు నిదర్శనమన్నారు. కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ ద్వారా గతేడాది కాలంగా గుర్తించిన 122 కేసుల్లో 102 కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయన్నారు. ముగ్గురికి మరణశిక్ష, 37మందికి జీవిత ఖైదు, 62 కేసుల్లో 7 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడిందన్నారు. ఈ తీర్పు ఓ గుణపాఠం.. రేపల్లె రైల్వేస్టేషన్లో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఇచ్చిన తీర్పు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఓ గుణపాఠమని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ తెలిపారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని స్పందన హాల్లో బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాధితురాలికి తక్షణ సాయంగా రూ.10 లక్షలు, ఎస్సి, ఎస్టి కేసు కింద రూ.8.50 లక్షలు, ఎంపీ, ఎమ్మెల్యే నుంచి రూ.1.50 లక్షలు అందజేసినట్లు చెప్పారు. కాగా, ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేసి, నిందితులకు శిక్షలు పడే వరకు ప్రతిభ కనబరిచిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శారదామణి, డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ మధుసూదనరావు, తదితర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు, రివార్డులు అందజేశారు. -
‘అంగళ్లు’ దాడుల కేసులో ఎ1గా చంద్రబాబు
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు సంబంధించి టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ప్రథమ ముద్దాయిగా పోలీసులు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 4న యాత్ర ముసుగులో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతల హత్యకు కుట్ర పన్ని, మారణాయుధాలు, బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడిన ఘటనలపై చంద్రబాబు సహా 20 మందిపై కురబలకోట మండలం ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఈ కేసు నమోదైంది. ఇతర నిందితుల్లో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, తిరుపతి ప్రాంతాలకు చెందిన నేతలు నిందితులుగా ఉన్నారు. దాదంవారిపల్లెకు చెందిన అంగళ్లు మార్కెట్ కమిటీ చైర్మన్ డీఆర్.ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ 120బి, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద ఎస్ఐ షేక్ ముబిన్తాజ్ కేసు నమోదు చేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు వేచి ఉండగా ప్రాజెక్టుల సందర్శన యాత్ర చేపట్టిన చంద్రబాబు ఈనెల 4న అంగళ్లుకు వస్తున్నారని తెలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతిరెడ్డి, ఎంపీపీ దస్తగిరి, జెడ్పీటీసీ జ్యోతి భర్త బైసాని చంద్రశేఖర్‌రెడ్డి, రవిశేఖర్‌రెడ్డి, కులశేఖర్‌రెడ్డి తదితరులు అంగళ్లు కూడలి సమీపంలోని రాయచోట రోడ్డు వద్దకు చేరుకున్నారు. పిచ్చలవాండ్లపల్లె సాగు, తాగ నీటి రిజర్వాయర్ పనులను చంద్రబాబు కోర్టు ద్వారా నిలిపివేయించారని, ఈ చర్యను నిరసిస్తూ నల్ల కండువాలు ధరించి శాంతియుత పద్ధతిలో ఆయనకు వినతిపత్రం ఇవ్వాలని వేచి ఉన్నారు. వారికి రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు మద్దతుగా వచ్చారు. ఊగిపోయి.. దాడులకు ఉసిగొల్పి.. మధ్యాహ్నం చంద్రబాబు యాత్ర కూడలిలోకి చేరుకుంది. అక్కడ నల్ల కండువాలతో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు, రైతులను చూసి చంద్రబాబు ఊగిపోయారు. ‘తమాషాగా ఉందా.. ఆ నా కొడుకులను తరమండిరా.. వేసేయండిరా వాళ్లని’ అని వేలేత్తి చూపించి టీడీపీ శ్రేణులను ఉసిగొల్పారు. వాహనంపై ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రులు దేవినేని ఉమా, ఎన్.అమరనాథ్‌రెడ్డి, మదనపల్లె మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్‌బాషా, దొమ్మలపాటి రమేష్, ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి తదితర నేతలు కూడా వైఎస్సార్సీపీ నేతలవైపు చేతులు చూపుతూ, కేకలు వేస్తూ హెచ్చరికలు చేస్తూనే.. సైగలతో దాడులకు ప్రేరేపించారు. మరికొందరు స్థానిక నేతలు ఈలలు వేస్తూ, తొడ గొడుతూ.. బూతులు తిడితూ కొట్టండి అంటూ దాడికి ప్రోత్సహించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఓ పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలు ఈ దాడులు చేయించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా అప్పటికే సిద్ధం చేసుకున్న మారణాయుధాలు, రాళ్లు, కొడవళ్లు, ఇటుకలు, కట్టెలు, చెప్పులు, రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు, దాడిని అడ్డుకోబోయిన పోలీసులు కూడా గాయపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన బైసాని చంద్రశేఖర్‌రెడ్డి, వసంతరెడ్డి, అర్జున్‌రెడ్డి, మహేష్, ఓ విలేకరి శ్రీనివాసులు, ముదివేడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కేశవులు తీవ్రంగా గాయపడ్డారు. దాడితో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. రోడ్డుపై పగిలిన బాటిళ్లు, ఇటుకలు, కర్రలు పడి ఉన్నాయి. కొందరు స్థానికులు వైఎస్సార్సీపీ నేతలను రక్షించారు. లేనిపక్షంలో కొందరు హత్యకు గురయ్యేవారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆధారాలతో ఫిర్యాదు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతిరెడ్డి ఆధారాలతో సహా చంద్రబాబు తదితరులపై ఫిర్యాదులో చేశారు. అంగళ్లు రోడ్‌షోలో చంద్రబాబు రెచ్చగొట్టే ప్రసంగాలు, ఇతర నాయకుల చర్యలను పెన్‌డ్రైవ్, సీడీలో ముదివేడు పోలీసులకు అందజేశారు. ఈ ఫిర్యాదు, ఆధారాల మేరకు పోలీసులు చంద్రబాబు ఏ1గా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముందస్తు ప్రణాళిక, నేరపూరిత కుట్ర, అల్లర్లలో భాగంగా మారణాయుధాలతో తమపై దాడిì చేసిన చంద్రబాబు అనుచరులు, దాడులకు పురమాయించిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఉమాపతిరెడ్డి కోరారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోనూ ఇవే అంశాలను పేర్కొన్నారు. చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కేసు : అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్‌రావు రాయచోటి టౌన్ : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ముదివేడు పోలీసు స్టేషన్లో హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్ రావు చెప్పారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అంగళ్లులో జరిగిన సంఘటనపై ఉమాపతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామని తెలిపారు. ఈనెల 4 న మారుణాయుధాలు, ఐరన్ రాడ్లు, రాళ్లు, ఇటుకలు, కర్రలతో వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని వివరించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ములకలచెరువు పోలీసు స్టేషన్లో బాబుపై మరో కేసు ములకలచెరువు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అన్నమయ్య జిల్లా ములకలచెరువు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఈ నెల 4న ములకలచెరువులో జరిగిన రోడ్ షోలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసు నమోదైంది. ఈ ఘటనపై ఇన్చార్జి సీఐ శివాంజనేయులు సమగ్ర విచారణ జరిపిన అనంతరం చంద్రబాబును ఏ–7 నిందితుడిగా కేసు నమోదు చేశారు. -
రామోజీ, శైలజకు మరోసారి నోటీసులు
సాక్షి, కృష్ణా: మార్గదర్శి అవకతవకల కేసులో ఆ సంస్థల అధినేత, ఎండీలకు మరోసారి ఏపీ సీఐడీ(Crime Investigation Department) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరుకావాలని చెరుకూరి రామోజీరావుకి నోటీసుల్లో స్పష్టం చేసింది. అలాగే.. ఎండీ శైలజా కిరణ్‌కు ఈ నెల 17వ తేదీన హాజరు కావాలని ఆదేశించింది. విచారణ నిమిత్తం వీరిద్దరినీ సీఐడీ విజయవాడ రీజనల్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో సీఐడీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. గతంలో నోటీసులు ఇచ్చినా వీళ్లు హాజరు కాలేదు. దీంతో మరోసారి విచారణ కోసం 41(ఏ) కింద నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి కుంభకోణం కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా ఆయన కోడలు చెరుకూరి శైలజా కిరణ్‌లను చేర్చింది ఏపీ సీఐడీ. ఇదీ చదవండి: ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది ఈనాడులో నోటికి వచ్చినవన్ని రాస్తారు -
విశాఖ: సంధ్య ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లాలో సంపులో పడి ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్న(మంగళవారం) అర్ధరాత్రి సంధ్య ఫోన్ నుంచి ఆటో డ్రైవర్‌కు ఫోన్ వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, సంధ్య పిల్లల్ని సదరు ఆటో డ్రైవర్ ప్రతీరోజూ స్కూల్‌కు తీసుకువెళ్తాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. మర్రిపాలెం ప్రకాశ్ నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లోని నీటి సంపులో ముగ్గురు మృతదేహాలు బుధవారం లభించాయి. మృతులను తల్లి సంధ్య, పిల్లలు గౌతమ్, అలేఖ్యలుగా గుర్తించారు. కాగా, చనిపోయిన వారు అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌గా కుటుంబంగా స్థానికులు చెబుతున్నారు. కాగా, పది నెలల క్రితమే వీరంతా విశాఖకు వచ్చారు. ఇంతలోనే ఇంత ఘోరం జరగడంతో అక్కడున్నవారంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక, వీరి మృతిపై సమాచారం అందుకున్న విశాఖ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను సంపు నుంచి బయటకు తీశారు. అయితే వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం, వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: కీచక టీచర్ అరెస్ట్ -
విజయవాడలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్‌కార్డులు..
సాక్షి, విజయవాడ: నగరంలో సిమ్‌కార్డుల దందా వెలుగులోకి వచ్చింది. గుణదలలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్‌కార్డులు జారీ కావడం కలకలం రేగుతోంది. డాట్ (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్) ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాలని సూర్యారావుపేట పోలీసులను సీపీ రానా ఆదేశించారు. దర్యాప్తులో భాగంగా ఒకే ఫొటోతో ఓ నెట్వర్క్ సంస్థకు 658 సిమ్‌లను అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. సత్యనారాయణపురానికి చెందిన నవీన్ అనే యువకుడు ఈ సిమ్ కార్డుల్ని రిజిస్టర్ చేసినట్లు గుర్తించారు. అజిత్‌సింగ్‌నగర్, విస్సన్నపేట పోలీస్స్టేషన్ల పరిధిలో మరో 150 వరకు సిమ్ కార్డులు నకిలీ పత్రాలతో జారీ చేసినట్లు గుర్తించారు. సిమ్ కార్డుల మోసాలను అరికట్టేందుకు టెలి కమ్యూనికేషన్ శాఖ ప్రత్యేకంగా ఓ వ్యవస్థను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఓ టూల్ కిట్ ద్వారా సిమ్ కార్డుల దందా బయటపడింది. చదవండి: నా భార్య దొంగతనాలు చేస్తోంది.. \ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫేసియల్ రికగ్నేషన్ వెరిఫికేషన్ సాఫ్ట్వేర్ ద్వారా సిమ్‌కార్డు మోసాలను గుర్తించారు. ఈ సిమ్‌లు ఎక్కడికి వెళ్లాయి.. ఎవరు వినియోగిస్తున్నారన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చేసుకుంది. పెద్దమ్మ వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. అక్రమ సంబంధం వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో సహా సంపులో పడి సంధ్య బలవన్మరణానికి పాల్పడింది. దంపతులు బొబ్బిలి నుంచి విశాఖ రాగా, విశాఖ వచ్చిన పెద్దమ్మ పార్వతీ వేధింపులు ఆగలేదు. సంధ్య భర్తను పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: నా భార్య దొంగతనాలు చేస్తోంది.. -
మల్లెపూలు అమ్మి ఇంటికి వెళ్తుండగా కన్నేసిన ఆటోడ్రైవర్..
పర్చూరు (చినగంజాం): బాపట్ల జిల్లా పర్చూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు పిల్లి నాగేంద్ర బాబు అలియాస్ మోసెస్‌కు మంగళవారం ఒంగోలు అడిషనల్ జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ 13 సంవత్సరాల జైలు, రూ.4 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కేసు వివరాలను పరిశీలిస్తే బాధితురాలు బాపట్ల జిల్లా చీరాల నుంచి పర్చూరు మండలం అడుసుమల్లి గ్రామానికి అరటికాయలు, మల్లెపూలు తీసుకొని వచ్చి అమ్ముకొని సాయంత్రానికి ఇంటికి వెళ్తుండేది. ఈ క్రమంలో 2021 జూలై 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు అడుసుమల్లి నుంచి పర్చూరుకు రావడానికి గుంటూరు వైపు నుంచి వస్తున్న ఆటోలో ఎక్కింది. అందులో బాధితురాలు ఒకటే ఉండటంతో ఆటో డ్రైవర్ తన ఆటోను దేవరపల్లి గ్రామ పొలాల్లోకి వెళ్లి డొంక దారిలోకి తీసుకెళ్లి బాధితురాలిని చంపుతానని బెదిరించి ఆమైపె లైంగికదాడి చేశాడు. బాధితురాలు అతని బారి నుంచి తప్పించుకొని పర్చూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన అప్పటి ఇంకొల్లు సీఐ పీ సుబ్బారావు నిందితుడైన ఆటో డ్రైవర్ పిల్లి నాగేంద్ర బాబు అలియాస్ మోసెస్ నేరం చేసినట్లు నిర్ధారించి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నేరం రుజువు కావడంతో రుజువు చేయడంతో న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ నేరస్తుడికి 13 ఏళ్ల జైలుశిక్ష రూ.4 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ పోలీస్ అధికారులను, పీపీని అభినందించారు. డీజీపీ కే రాజంద్రనాథ్‌రెడ్డి మహిళల సంబంధిత నేరాల్లోని నిందితులకు జైలు శిక్ష పడేలా సంబంధిత కేసుల్లో పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు ట్రయల్ మానిటరింగ్ నిర్వహిస్తున్నారన్నారు. ఈ కోర్టు ట్రయల్ మానిటరింగ్ సత్ఫలితాలను ఇస్తుందన్నారు. పోలీసు అధికారులే స్వయంగా కోర్టు ట్రయల్‌ను పర్యవేక్షించడం వలన గతంలో పోలిస్తే ప్రస్తుతం కోర్టులో విధించే శిక్షల శాతం పెరిగిందని చెప్పారు. -
హనీట్రాప్ కలకలం.. కపిల్‌పై విశాఖ సీపీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో హనీట్రాప్ కేసులో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ త్రివిక్రమ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై మంగళవారం సీపీ త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు చెందిన హనీట్రాప్ కేసులో కపిల్‌పై కేసు నమోదు చేశాం. కపిల్ వద్ద నుంచి మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సైబర్ ఫోరెన్సిక్‌కు పంపించాము. కానిస్టేబుల్ కపిల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం ప్రశ్నిస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన కపిల్ కుమార్ విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీలో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. తొలుత హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో విధులు నిర్వహంచి 2022 ఆగస్టు నెలలో విశాఖకు బదిలీపై వచ్చాడు. ప్రస్తుతం అతడు సీఐఎస్ఎఫ్ ఫైర్ విభాగంలో పనిచేస్తునే పేస్బుక్ ద్వారా పరిచయమైన తమీషాతో మాట్లాడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తమీషా ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ముఖ్య నాయకుడి వద్ద వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేస్తున్నట్లు గుర్తించడంతో కపిల్‌పై నిఘా పెట్టారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోన్లను స్వాధీనం చేసుకుని అందులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై అంతరంగిక భద్రత చట్టం కింద కేసులు పెట్టామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: పుంగనూరు దాడిలో చూపు కోల్పోయిన పోలీస్.. సీఎం జగన్ సాయం -
హానీట్రాప్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. కీలక సమాచారం పాక్ చేతిలోకి?
సాక్షి, విశాఖపట్నం: పాకిస్తాన్ ఎప్పటిలానే తన కపట బుద్దిని ప్రదర్శిస్తోంది. భారత అంతర్గత వ్యవహారాలను తెలుసుకునేందుకు ఉద్యోగులపై హానీ ట్రాప్ వల విసురుతోంది. తాజాగా పాక్ హానీ ట్రాప్‌లో ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చిక్కుకున్నాడు. అనుమానం రావడంతో అతనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ కుమార్ జగదీష్ భాయ్ మురారీ పని చేస్తున్నాడు. అంతకు ముందు రక్షణ రంగంలో కీలకమైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో విధులు నిర్వహించేవాడు. దీంతో అతని నుంచి కీలక సమాచారం తెలుసుకునే క్రమంలో పాకిస్తాన్ అతనిపై హనీట్రాప్ ప్లాన్‌ని ప్రయోగించింది. ఓ ఉగ్రవాద సంస్థకి చెందిన పెద్ద నాయకుడి పీ.ఏకి తమిషా అనే పాకిస్తాన్ యువతితో పరిచయం ఉంది. ఆ యువతితో సోషల్ మీడియా ద్వారా కపిల్‌తో పరిచయం పెంచుకుంది. రెండేళ్ల పాటు ట్రాప్ చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టింది. న్యూడ్ వీడియో కాల్స్‌తో మొదలై.. రహస్యంగా ఓ గదిలో కలిసేంత వరకు వీరి కథ నడిచింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కపిల్ కుమార్ కదలికలపై ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా కపిల్ కుమార్ ఏడాది క్రితం హైదరాబాద్ నుంచి బదిలీ అయ్యి విశాఖలో పని చేస్తున్నాడు. కీలక సమాచారం పాకిస్థాన్ గూఢచార సంస్థకు చేరినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. కపిల్ కుమార్ మొబైల్స్ స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ ఫోరెన్సిక్ విచారణకు పంపింది. తదుపరి విచారణ కోరుతూ స్టీల్ ప్లాంట్ పోలీసు స్టేషన్లో సీఐఎస్ఎఫ్ యూనిట్ ఇన్ఛార్జ్ ఫిర్యాదు చేశారు. అధికారిక రహస్యాల ఉల్లంఘన నేరం కింద కేసు నమోదు చేశారు. ఈ అంశం అంతరంగిక భద్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో వివిధ ఏజెన్సీలు దర్యాప్తులోకి దిగాయి. చదవండి వచ్చినవాడు గద్దర్.. ఆ హెడింగ్ చూసి ఆశ్చర్యపోయాం! -
వెళ్లి పోయావా మిత్రమా!
కోనసీమ: ఊహకు ఊపిరిలా.. ఆశకు శ్వాసలా.. మది నిండా మధుర జ్ఞాపకాలతో సందడి చేశారు. నీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చుకున్నారు.. స్నేహితుల దినోత్సవం వేళ దోస్తులంతా కలసి చేసిన సందడి కొద్ది క్షణాల్లోనే ఆవిరి అయ్యింది. తమ స్నేహితుడు కళ్ల ముందే కాలువలో గల్లంతైన ఘటన చూసిన సహచరులు నిర్ఘాంతపోయారు. ఈ ఘటన ఎస్.యానం కట్టు కాలువ వద్ద జరిగింది. స్నేహితులు, కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడిలో కొత్త కాలనీకి చెందిన చిత్రి ముఖేష్ కుమార్ (19) తన పదకొండు మంది మిత్రులతో కలసి ఎస్.యానం బీచ్‌కు వెళ్లాడు. అక్కడ ఆట పాటలతో సముద్ర స్నానాలు చేసి సాయంత్రం వరకూ సరదాగా గడిపారు. తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఇంటికి వెళుతూ ఒంటిపై ఉన్న ఇసుకను తొలగించుకునేందుకు బీచ్‌ను ఆనుకుని ఉన్న కట్టు కాలువలో స్నానాలకు దిగారు. సముద్ర పోటు సమయం కావడంతో కాలువలో నీరు ఎక్కువగా ఉంది. దీంతో ముఖేష్ కుమార్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. తోటి స్నేహితులు చూస్తుండగానే అతను నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. స్నేహితులు చేతనైన సాయం చేద్దామనుకున్నా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. స్నేహితుల దినోత్సవం రోజునే తమ మిత్రుడు ఇలా కొట్టుకుపోతుంటే తట్టుకోలేక హాహాకారాలు చేశారు. ఈ సంఘటనను తెలుసుకున్న ఎస్సై జి.వెంకటేశ్వరరావు, పోలీసులు, గ్రామస్తులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ముఖే‹Ùకుమార్ ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం రాత్రి వరకూ గాలింపు కొనసాగింది. ముఖేష్ కుమార్ సోదరుడు తరుణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటేశ్వరరావు వివరించారు. -
నమ్మించి.. నట్టేట్లో తోసేసి..
రావులపాలెం/తాడేపల్లి రూరల్: ఓ బిడ్డతో కలిసి ఉంటున్న మహిళను ప్రేమ పేరుతో నమ్మించాడు.. మూడేళ్ల పాటు సహజీవనం చేశాడు. ఓ చిన్నారికి జన్మనిచ్చాడు. అనంతరం వారిని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. మాయమాటలు చెప్పి తల్లీబిడ్డలను గోదావరి బ్రిడ్జి పైకి తీసుకువచ్చి.. నిర్దాక్షిణ్యంగా నదిలోకి తోసేశాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద జరిగిన ఈ ఘటనలో తల్లి, ఏడాది చిన్నారి గల్లంతవ్వగా.. 13 ఏళ్ల బాలికను పోలీసులు రక్షించారు. వివరాలు.. భర్తతో విభేదాల వల్ల పుప్పాల సుహాసిని(36) కృష్ణా జిల్లా గుడివాడ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లికి వచ్చి ఓ హోటల్లో పనిచేస్తూ కుమార్తె లక్ష్మీ సాయి కీర్తనతో కలిసి జీవిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేశ్ కూడా తాడేపల్లిలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. సురేశ్‌కు అప్పటికే వివాహమైంది. అయినా సుహాసినిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. ఎన్టీఆర్ కరకట్ట మీద ఉన్న ఓ ఇంట్లో మూడేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. జెర్సీ(ఏడాది పాప) జన్మించిన తర్వాత గొడవలు మొదలై ఇద్దరూ విడిపోయారు. సుహాసిని తన ఇద్దరు బిడ్డలతో కలిసి క్రిస్టియన్‌పేటలో ఉంటోంది. సురేశ్ తరుచూ వచ్చి సుహాసినితో గొడవ పడేవాడు. దీంతో సుహాసిని తన పెద్ద కుమార్తె కీర్తనకు ఫోన్ ఇచ్చి.. ఇంటికి ఎవరైనా వచ్చి బెదిరిస్తే 100కు ఫోన్ చేయాలని ధైర్యం చెప్పి పనికి వెళ్లేది. ఈ నేపథ్యంలో సురేశ్ దుస్తులు కొందామని నమ్మించి సుహాసిని, లక్ష్మీకీర్తన, జెర్సీలను శనివారం రాత్రి కారులో రాజమహేంద్రవరం తీసుకువచ్చాడు. అక్కడి నుంచి రావులపాలెం తెచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గౌతమీ గోదావరి పాత బ్రిడ్జి పైకి కారును తీసుకువచ్చి ఆపాడు. ఆ తర్వాత కొంతసేపటికి సెల్ఫీ తీసుకుందామంటూ సుహాసినిని బ్రిడ్జి గోడపై కూర్చోమని చెప్పి.. సుహాసినితో పాటు జెర్సీని గోదావరిలోకి తోసేశాడు. అనంతరం కారులో కూర్చుని ఫోన్లో పాటలు వింటున్న కీర్తనను కూడా బయటకు తెచ్చి గోదావరిలోకి తోసేశాడు. ఆ తర్వాత సురేశ్ కారులో పరారయ్యాడు. సకాలంలో స్పందించిన పోలీసులు బ్రిడ్జి పై నుంచి పడిపోతున్న సమయంలో కీర్తన బ్రిడ్జికి ఉన్న కేబుల్ పైపును బలంగా పట్టుకుంది. తన వద్ద ఉన్న ఫోన్‌తో తెల్లవారుజామున 3.50 గంటలకు 100 నంబర్‌కు డయల్ చేసింది. పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఫోన్ లొకేషన్ ఆధారంగా 10 నిమిషాల్లోనే అక్కడికి చేరుకొని ఆమెను రక్షించారు. ప్రథమ చికిత్స అందించి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. సుహాసిని, కీర్తన ఆచూకీ కోసం పోలీసులు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి కోసం మరో బృందం విస్తృతంగా గాలిస్తోంది. కీర్తన ప్రాణాలను కాపాడిన పోలీసులను ఎస్పీ శ్రీధర్ అభినందించారు. -
ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా విషాదం చోటుచేసుకుంది. కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద బ్రిడ్జిపై నుంచి ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఏపీ 39 హెచ్ఆర్0907 నెంబర్ గల బలేనో కారు ఏజెన్సీ మారేడుమిల్లి నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున జరిగింది. వివరాలు.. జిల్లాకు చెందిన 10 మంది స్నేహితులు రెండు కార్లలో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలోని గుడిసె పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. రుగు ప్రయాణంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద ఓ కారు నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. స్థానికంగా ఉండే పాత, కొత్త వంతెనల మధ్యలోని కాల్వలో పడింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. ముగ్గురు మృతిచెందారు. మృతులను ఉదయ్ కిరణ్, హర్ష వర్ధన్, హేమంత్గా గుర్తించారు. గాయపడిన మిగతా ముగ్గురిని రాజమంత్రి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. మరణించిన ముగ్గురు యువకులు ఏలూరు సమీపంలోని రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీలో బీ టెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం. -
మై వైఫ్ .. శివాని గురించి రమేశ్ చివరిమాటలు
సాక్షి, క్రైమ్: విశాఖలో వివాహేతర సంబంధంతో భర్త రమేశ్‌ను ప్రియుడితోపాటు హత్య చేసిన ఉదంతంలో సంచలన వీడియోలు బయటకు వచ్చాయి. భర్తను హత్యకు ముందు శివాని చేసిన పనికి పోలీసులు సైతం షాక్ తిన్నారు. రమేశ్‌కు మద్యం తాగించి.. ఆ సమయంలో తన గురించి పొగిడినదంతా ఆమె వీడియోలు తీయించుకుంది. కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు లో కీలక వీడియోలు సాక్షి టివి చేతికి అందాయి. రమేశ్‌ని చంపే ముందూ.. తన మీద అనుమానం రాకుండా భర్తతో ప్రేమగా ఉన్నట్టు ఆమె వీడియోలు రికార్డు చేసింది. భర్తకి మటన్ వండి పెట్టీ.. మందు తాగించి.. ‘నా భార్య మంచిది’ అని రమేశ్‌తో చెప్పించింది శివాని. ఆపై మద్యం మత్తులో జోగుతున్న భర్తను మంచంపై పడుకోబెట్టినదంతా కూడా రికార్డు అయ్యింది. మా ఆవిడ చాలా తెలివైంది. గైడెన్స్ ఇస్తే ఏదైనా సాధిస్తుంది. నా వైఫ్.. మై లైఫ్. చాలా ధైర్యవంతురాలు. నేను ఉన్నంత వరకు ధైర్యం చూపిస్తుంది. నేను ఎప్పుడు ఉంటానో.. ఎప్పుడు పోతానో తెలియదు. నేను పోయాక కూడా అదే ధైర్యం చూపించాలి. నా వైఫ్ బెస్ట్ అంటూ మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి. భర్త హత్య తర్వాత గుండెపోటుతో చనిపోయాడని నాటకం ఆడే క్రమంలో.. తనపై ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ పని చేసింది శివాని. ఆమె ఫోన్ నుంచి వీడియోలు సేకరించిన పోలీసులు.. నేరస్తురాలి తెలివితేటలు చూసి షాక్ తిన్నారు. 2009 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ బర్రి రమేష్(35). 2012లో శివాని(జ్యోతి)తో వివాహం జరిగింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదర్శనగర్‌లో ఉంటూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య శివాని(శివజ్యోతి) పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్‌తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్‌కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్‌ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ అఘాయిత్యంలో శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మకు కూడా భాగం అయ్యిందనే అనుమానాలు ఉన్నాయి. పైడమ్మ వల్లే తనకు రామారావు పరిచయం అయ్యాడని శివాని పోలీసులకు చెప్పింది. అంతేకాదు.. కాన్ఫరెన్స్ కాల్స్‌లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. అయితే తాను అమాయకురాలినని పైడమ్మ వాపోతోంది. -
వైజాగ్ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: కానిస్టేబుల్ రమేష్ మర్డర్ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తెరపైకి కొత్త వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మ.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పైడమ్మే.. రామారావుతో కలవడానికి కారణమని పోలీసులకు శివాని తెలిపింది. ఫోన్ కాల్ డేటా పరిశీలించిన ఎంవీపీ పోలీసులు.. వందల సార్లు కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. పైడమ్మ, శివాని, రామారావు ముగ్గురం కలిసే బయటకు వెళ్లే వాళ్లమని శివాని చెప్పింది. పైడమ్మాను ఏ4గా చేర్చే అవకాశం ఉంది. తనకు అసలు సంబంధం లేదంటున్నా శివాని అక్క పైడమ్మా.. కావాలనే ఇరికిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. శివాని.. రామారావు ఒక ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి పరిచయం చేసిందని పైడమ్మా తెలిపింది. కాన్ఫరెన్స్ కాల్స్‌లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు. పైడమ్మను విచారిస్తున్నారు. ఆమె ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ పోలీసుల అదుపులోనే A1 భార్య శివాని, A2 ప్రియుడు రామారావు, A3 నీలా ఉన్నారు. వారిని రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. చదవండి: తహసీల్దార్ వేధింపులు... మహిళా ఉద్యోగి ఆత్మహత్య కాగా, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ రమేష్ మృతి విషయంలో తొలి నుంచి అనుమానిస్తున్నదే జరిగింది. శివజ్యోతి అలియాస్ శివానీయే ఆమె ప్రియుడితో కలిసి తన భర్త రమేష్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. 2009 బ్యాచ్‌కు చెందిన బర్రి రమేష్(35) ఆదర్శనగర్‌లో ఉంటూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్‌పై విగతజీవిగా ఉన్న రమేష్ ను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్‌తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్‌కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్‌ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. తొలి నుంచి శివానీది నేర స్వభావమే.. రమేష్ భార్య శివానీది తొలి నుంచి నేర స్వభావమే అని సీపీ తెలిపారు. తల్లిదండ్రులతో సైతం ఆమె పలుమార్లు గొడవ పడినట్లు చెప్పారు. ప్రియుడి విషయంలో భార్యను పలుమార్లు రమేష్ మందలించాడని వెల్లడించారు. ఆమె తీరు కారణంగా విసిగిపోయి ఒక దశలో ఇద్దరు కుమార్తెలను తన వద్ద వదిలేసి ప్రియుడితో వెళ్లిపొమ్మని కూడా ఆమెకు చెప్పాడన్నారు. అయితే పిల్లలు, ప్రియుడు ఇద్దరూ కావాలనే ఉద్దేశంతో శివాని రమేష్ హత్యకు కుట్ర పన్నింది. ఈ హత్యలో సహకారానికి శివానీ, ప్రియుడు రామారావు అతని స్నేహితుడు నీలాకు రూ.లక్ష సుపారి కూడా ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. -
టీడీపీ రాక్షస క్రీడ
సాక్షి, తిరుపతి/చిత్తూరు/ పుంగనూరు/బి కొత్తకోట: రాయలసీమలో రక్తపాతమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పక్కా స్కెచ్‌తో అగ్గి రాజేశారు. టీడీపీ గూండాలను రెచ్చగొట్టి.. పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలు, బీరు బాటిళ్లతో దాడులు చేయించారు. అంతటితో ఆగక పోలీసు వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. శాంతి భద్రతలకు తీవ్రంగా విఘాతం కలిగించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర రక్త గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రాజెక్టుల సందర్శన పేరుతో శుక్రవారం ఆయన అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు. ములకలచెరువు మండలం నాయనపల్లి చెరువు వద్ద ఉన్న హంద్రీ–నీవా, గాలేరు నగరి అనుసంధానం కాలువ పనులను పరిశీలించారు. ఆ తర్వాత బి కొత్తకోట మండలం చీతివారిపల్లి సమీపంలో ఉన్న హంద్రీ–నీవా పుంగనూరు ఉప కాలువ పనులను పరిశీలించాల్సి ఉండింది. అయితే పుంగనూరులో విధ్వంసం సృష్టించాలనే లక్ష్యంతో రూట్ మ్యాప్ మార్చుకున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండల పరిధిలోని ముదివేడు రిజర్వాయర్ పరిశీలనకు వెళ్తున్నారని తెలుసుకున్న స్థానికులు, వైఎస్సార్సీపీ శ్రేణులు బాబు తీరుపై మార్గం మధ్యలోని అంగళ్లు సర్కిల్ వద్ద నిరసన తెలిపి వెనుదిరిగారు. అంతలో అక్కడికి చేరుకున్న చంద్రబాబు బృందం వందలాది మందితో వచ్చీ రాగానే కేకలు వేస్తూ... తొడలు చరుస్తూ కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లు విసురుతూ దాడులకు తెగబడ్డారు. దూరంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, పోలీసులు ఎంతగా వారించినా వినలేదు. స్థానికులు భయాందోళనతో ఇళ్లలోకి పరుగులు తీశారు. టీడీపీ గూండాల రాళ్ల దాడిలో ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కేశవ, అంగళ్లకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త అర్జున్‌రెడ్డి (35) తీవ్రంగా గాయపడ్డారు. ములకలచెరువుకు చెందిన విశ్వనాథరెడ్డి సహా మరో పది మందికి గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా చంద్రబాబు వారించడం అటుంచి, చోద్యం చూశారు. పైగా జీపుపైకి ఎక్కి రెచ్చగొట్టేలా మాట్లాడారు. పోలీసులపై రాళ్లు విసిరి దాడికి పాల్పడుతున్న టీడీపీ శ్రేణులు పుంగనూరు పుడింగితో తేల్చుకుందాం రండి అంగళ్ల వద్ద నుంచి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు బైపాస్, పలమనేరు మీదుగా చంద్రబాబు చిత్తూరుకు చేరుకోవాల్సి ఉంది. చంద్రబాబు రూట్ మ్యాప్‌లో పుంగనూరు ప్రస్తావన లేదు. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు.. పుంగనూరుకు వెళ్దాం.. రండి అంటూ టీడీపీ గూండాలకు మైక్ ద్వారా పిలుపునిచ్చారు. ‘పుంగనూరులో పుడింగి ఉన్నాడు.. రండి తేల్చుకుందాం’ అని గట్టిగా అరుస్తూ ముందుకు కదిలారు. బాబు పిలుపుతో పుంగనూరు వద్ద విధ్వంసం అంగళ్ల వద్ద చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు పుంగనూరు వద్ద టీడీపీ గూండాలు పెద్ద సంఖ్యలో అధినేత రాకముందే గుమిగూడారు. ఒక్కసారిగా బైపాస్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. పుంగనూరు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నా వినిపించుకోకుండా గొడవకు దిగారు. ఒక ఏఎస్పీ, డీఎస్పీ, ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలతోపాటు సుమారు 350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతలో చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. వందల సంఖ్యలో వచ్చిన టీడీపీ గూండాలను వెనకేసుకుని బైపాస్ రోడ్డులోని భీమగానిపల్లె సర్కిల్ నుండి పుంగనూరులోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ‘పుంగనూరులో కాలుమోపుతా.. ఎవరు అడ్డుకుంటారో? చూస్తా?’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఎంతగా వారించినా వినలేదు. పైగా పోలీసులను టార్గెట్‌గా చేసుకుని టీడీపీ శ్రేణులు తొలుత రాళ్ల వర్షం కురిపించాయి. ఆ తర్వాత కర్రలతో పోలీసులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ముందస్తుగా సిద్ధం చేసుకున్న బీరు బాటిళ్లు, మద్యం సీసాలు పోలీసులపైకి విసిరి తీవ్రంగా గాయపరిచారు. పోలీసు గస్తీ కోసం ఏర్పాటు చేసిన వజ్ర వాహనాన్ని, మరో పోలీసు వాహనాన్ని కిందకు పడదోసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఎంతగా సంయమనం పాటించి, సర్దిచెప్పినప్పటికీ వారు వినకపోవడంతో పోలీసులు వారిపైకి బాష్ప వాయువు ప్రయోగించి చెదరగొట్టాల్సి వచ్చింది. ఈ విధ్వంసం గంటన్నరకుపైగా సాగింది. 27 మందికి గాయాలు టీడీపీ శ్రేణుల దాడిలో ఏఎస్పీ, డీఎస్పీతోపాటు ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలతోపాటు మొత్తం 27 మందికి రక్త గాయాలయ్యాయి. సాయంత్రం 4 నుండి 5.30 గంటల మధ్య పుంగనూరు బైపాస్‌రోడ్డు ప్రాంతం రణరంగాన్ని తలపించింది. చిత్తూరు ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు, దిశ స్టేషన్ డీఎస్పీ బాబుప్రసాద్, క్రైమ్ సీఐ భాస్కర్, పాలసముద్రం ఎస్ఐ ప్రసాద్‌లకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ పోలీసుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫొటోలు, వీడియోల్లో పోలీసు అధికారులు, సిబ్బంది రక్త గాయాలతో ఉండటం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని పోలీసులపై టీడీపీ శ్రేణులు ఇలా దాడులు చేసి గాయ పరచడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను పరామర్శించారు. అనంతరం అనంతపురం రేంజి డీఐజీ అమ్మిరెడ్డితో కలిసి పుంగనూరులో ఘటన వివరాలను మీడియాకు వివరించారు. కాగా, గొడవ విçషయం తెలిసి పుంగనూరు బైపాస్ రోడ్డు వద్దకు చేరుకున్న స్థానిక వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో 50 మందికి టీడీపీ నేతల రాళ్ల దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులపైకి రాళ్లు విసురుతూ దూసుకొస్తున్న టీడీపీ శ్రేణులు అంతా వ్యూహాత్మకం చిత్తూరు అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఎస్జీ కమాండోల రక్షణలో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న టీడీపీ నేత చంద్రబాబు ఎక్కడైనా పర్యటించాలంటే 24 గంటల ముందుగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో) నుంచి ఇంటెలిజెన్స్ విభాగానికి రోడ్ మ్యాప్ ఇవ్వాలి. అప్పుడు జిల్లా పోలీసుశాఖ ముందుగా రూట్ మ్యాప్‌లో ఉన్న కల్వర్టులు, శివారు ప్రాంతాలు, అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతుంది. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), ఆర్మ్డ్ రిజర్వు దళాలు చంద్రబాబు కార్యక్రమం జరిగే రూట్ మ్యాప్‌లో భద్రతా చర్యలు, ముందస్తు తనిఖీలు చేపడతారు. కానీ చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి చంద్రబాబు నుంచి పోలీసులకు అందిన రూట్ మ్యాప్ ఒకలా ఉంటే.. దాన్ని కాదని పుంగనూరులోకి పర్యటనను మారుస్తూ మరో దారిని ఎంచుకోవడం రాజకీయంగా లబ్ధి పొందే వ్యూహమేనని స్పష్టమవుతోంది. మదనపల్లె నుంచి పుంగనూరు బైపాస్ మీదుగా చంద్రబాబు నాయుడు చిత్తూరు శివారుల్లోని బాన్స్ హోటల్‌కు వెళతారని బుధవారం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి నుంచి పోలీసులకు సమాచారం అందింది. గురువారం రాత్రి కూడా పర్యటనలో మార్పులు చేస్తూ.. పుంగనూరు బైపాస్ మీదుగానే వెళ్లిపోతారని చెప్పారు. తీరా శుక్రవారం సాయంత్రం పుంగనూరులోకి ప్రవేశించడానికి విఫలయత్నం చేస్తూ విధ్వంసం సృష్టించారు. రాజంపేట టీడీపీ అభ్యర్థి నరహరి కారులో గన్ బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా నరహరి కారు డ్రైవర్ గుర్మిత్ సింగ్(38)పై ముదివేడు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మదనపల్లె రూరల్ సీఐ శివాంజనేయులు కథనం ప్రకారం.. చంద్రబాబు పర్యటన సమయంలో కడప వైపు నుంచి అంగళ్లుకు నరహరి కారు వేగంగా వచ్చింది. కడప రోడ్డులోని పెట్రోలు బంకు వద్ద తంబళ్లపల్లె మండలం కన్నెమడుగుకు చెందిన ఎంపీటీసీ మహే‹Ùపైకి దూసుకొచ్చింది. మహేష్ హెచ్చరికతో కారు ఆగింది. అంత వేగమెందుకని మహేష్ నిలదీయగా.. ఆగ్రహించిన గురుమిత్‌సింగ్ కారులోంచి డబుల్ బ్యారల్ గన్ తీసి కాల్చుతానంటూ బెదిరించారు. దీంతో మహేష్ ముదివేడు పోలీసులకు చెప్పగా వారు కారును తనిఖీ చేశారు.పేకాట పెట్టెలు, వెనుకవైపు కింద డబుల్ బ్యారల్ గన్, సీటు కవర్లో ఎనిమిది తూటాలు కలిగిన ప్యాకెట్ లభించాయి. వీటితోపాటు కారును స్వాదీనం చేసుకుని ముదివేడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితుడు మహేష్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ గుర్‌మిత్‌సింగ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. రెచ్చగొట్టే ప్రసంగాలతోనే విధ్వంసం రెచ్చగొట్టే ప్రసంగాలతో పథకం ప్రకారం విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు జరగడం బాధాకరం. ఇలాంటి మాటలు సమాజానికి మంచిది కాదు. గాయపడిన పోలీసుల పరిస్థితి ఇది.. తెలుగుదేశం వారు ఉపయోగించిన రాళ్లివి (వీడియో చూపుతూ). అనుమతి పొందిన రూట్‌మ్యాప్‌ను కాదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పుంగనూరులోకి వచ్చే ప్రయత్నం చేయడంతోనే విధ్వంసం జరిగింది. పోలీస్ అధికారుల వద్ద పిస్టల్ ఉన్నప్పటికీ, ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని గ్రహించినా సంయమనంతో వ్యవహరించారు. ప్రజలు భయభ్రాంతులకు గురికాకూడదని కాల్పులు జరపలేదు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దాడులు చేసిన వారిని గుర్తిస్తాం. బాధ్యులందరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేస్తాం. విధ్వంసం సృష్టించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. – అమ్మిరెడ్డి, అనంతపురం రేంజ్ డీఐజీ ముందస్తు పథకం ప్రకారమే దాడులు ముందస్తు పథకం ప్రకారం విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందిపై దాడి చేశారు. రాళ్లు, మద్యం బాటిళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. పోలీస్ వాహనాలను సైతం తగులబెట్టడం దారుణం. దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదు. చట్ట ప్రకారం వారందరిపై కేసులు నమోదు చేస్తాం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు 350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. రూట్ మ్యాప్‌లో లేకపోయినా.. టీడీపీ నాయకులు కొంత మంది కావాలనే నిబంధనలకు విరుద్దంగా పుంగనూరులోనికి రావడానికి ప్రయత్నించారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నిలువరించినందుకే దాడి చేశారు. పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరించి, దెబ్బలు తిన్నప్పటికీ కాల్పులు జరపలేదు. గొడవనంతటినీ వీడియో చిత్రీకరించాము. చట్టప్రకారం బాధ్యులందరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తాం. – రిషాంత్‌రెడ్డి, చిత్తూరు ఎస్పీ నేడు చిత్తూరు జిల్లా బంద్ పుంగనూరులో చంద్రబాబు అనుచరగణం సృష్టించిన విధ్వంసాన్ని నిరసిస్తూ, పోలీసులపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఖండిస్తూ వైఎస్సార్సీపీ శనివారం చిత్తూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. కాగా అంగళ్లు కూడలిలో శుక్రవారం వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ దాష్టీకంపై పెద్దఎత్తున నిరసన తెలిపారు. -
పక్కా ప్లాన్‌తోనే టీడీపీ శ్రేణుల దాడి: చిత్తూరు ఎస్పీ
సాక్షి, పుంగనూరు: అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా పచ్చ పార్టీ నేతలు రెచ్చిపోయారు. పుంగనూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పోలీసులను టార్గెట్ చేసి దాడులకు పాల్పడ్డారు. ఇక, ఎల్లో బ్యాచ్ దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, 14 మంది పోలీసులు గాయపడ్డినట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఎస్పీ రిషాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పథకం ప్రకారమే పోలీసులపై దాడి చేశారు. చంద్రబాబు పుంగనూరు హైవే మీదుగా చిత్తూరు వెళ్లాల్సి ఉంది. రూట్ మార్చి పుంగనూరు వచ్చేందుకు ప్రయత్నించారు. పుంగనూరులోకి రాకుండా టీడీపీ శ్రేణులను అడ్డుకున్నాం. అడ్డుకున్న పోలీసులపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగారు. విచక్షణారహితంగా దాడులు చేశారు. బీర్ బాటిళ్లు, కర్రలు, రాళ్లతో టీడీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేశారు. టీడీపీ శ్రేణుల రాళ్ల దాడిలో 50 మందికిపైగా గాయపడ్డారు. రెండు పోలీసు వాహనాలను తగలబెట్టారు. దాడులకు దిగిన టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేస్తాం. దాడుల వెనుక ఎంత పెద్ద వ్యక్తులను అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: పుంగనూరు దాడుల్లో షాకింగ్ వాస్తవాలు.. టీడీపీ నేతల వాహనాల్లో గన్స్.. -
అన్నమయ్య: టీడీపీ నేతల అరాచకం.. కర్రలు, రాళ్లతో దాడి
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి దిగారు. ఈ క్రమంలో పలువురు వైఎస్సార్సీపీ శ్రేణులకు గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటనలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇక, టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడులకు దిగారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించేశారు. ఇక, ఈ సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. దాడికి పాల్పడుతున్న టీడీపీ నేతలకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో కొందరు టీడీపీ కార్యకర్తలు పోలీసులపైకి కూడా రాళ్లు విసిరారు. దీంతో, పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు లాఠీచార్జ్ చేసినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ‘ప్రజలకు ఉపయోగపడే పనిచేస్తే పవన్‌ను పట్టించుకునేవారేమో’