బొలెరోను ఢీకొన్న బస్సు: ఒకరి మృతి
Published Tue, Jan 12 2016 11:20 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM
కురబలకోట: చిత్తూరు జిల్లా కురబలకోట మండలం బాదంవారిపల్లి వద్ద టమాటా లోడుతో వెళుతున్న బొలెరోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ అశోక్ (22) అక్కడికక్కడే మృతి చెందాడు. బొలెరో వాహనంలో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని మదనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అశోక్ తంబళ్లపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Advertisement
Advertisement