గోశాలలో మరో 12 ఆవులు మృతి
విజయవాడ: కనకదుర్గమ్మ దేవస్థానానికి చెందిన గోశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల చని పోయిన ఆవుల సంఖ్య 17 కు చేరింది. మరో 14 ఆవుల తీవ్ర అస్వస్థకు గురైయ్యాయి. వాటిలో 6 ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. విషపూరితమైన ఆహారం తిని బుధవారం తొమ్మిది ఆవులు మృత్యువాత పడ్డాయి. గురువారం ఉదయం మరో 8 ఆవులు మృతిచెందాయి. అస్వస్థతకు గురైన ఆవులకు పశువైద్యులు సేవలు అందిస్తున్నారు. కాలం చెల్లిన గోధుమ రవ్వను తినడం వల్లనే ఆవులు మృతి చెందాయని పశుసంవర్థక శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయమని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గోధుమ రవ్వ ను గోశాలకు పంపిణీ చేసిన భవానీ ట్రేడర్స్, సాంబశివరావు అనే వ్యక్తి పై పోలీసులు కేసు నమోదు చేశారు.