ఏప్రిల్ 1 నుంచి ఏపీలో 4జీ సేవలు
హైదరాబాద్: ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ లో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 4జీ సేవలు అందించేందుకు రిలయన్స్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం రిలయన్స్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో 502 టవర్లు ఉన్నాయని, వీటిని 4జీగా అప్గ్రేడ్ చేసేందుకు అనుమతివ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని వారు కోరారు.
దీనిపై స్పందించిన సీఎం 4జీ అనుమతులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలని డీజీపీని ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి 4జీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.