2029 నాటికి 50 శాతం పచ్చదనం | 50 Percent greenery by 2029 | Sakshi
Sakshi News home page

2029 నాటికి 50 శాతం పచ్చదనం

Published Mon, Sep 18 2017 2:27 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

2029 నాటికి 50 శాతం పచ్చదనం - Sakshi

2029 నాటికి 50 శాతం పచ్చదనం

ప్రాంతీయ పర్యావరణ సదస్సులో సీఎం చంద్రబాబు
 
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని మైదాన ప్రాంతంలో 2029 సంవత్సరం నాటికి 50 శాతం పచ్చదనం నింపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం 23 శాతం పచ్చదనం మాత్రమే ఉందన్నారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌ను పర్యావరణ పరిరక్షణలో దేశంలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలుపుతామన్నారు. విశాఖలో జాతీయ హరిత ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాంతీయ పర్యావరణ సదస్సు ముగింపు కార్యక్రమంలో  మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ చర్యలను వివరించారు.

 సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.కె.అగర్వాల్‌ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే అధికారాలు రాష్ట్రాలవేనని, ఆ మేరకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత వాటిపైనే ఉందని స్పష్టం చేశారు.జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌ మాట్లాడుతూ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వాలకు సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement