కలెక్టరేట్,న్యూస్‌లైన్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, ఆధార్ కార్డుకు లింకు పెట్టొద్దని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు శు క్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థులు కలెక్టరేట్‌లోనికి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దొరికిన విద్యార్థులను దొరికనట్టుగా లాఠీలతో బాదారు. కలెక్టరేట్ చౌరస్తా నుంచి పాత ఎల్‌ఐసీ చౌరస్తా వరకు పరుగులు పెట్టించారు.
కొంత మందిని అరెస్టు చేసి వ్యానులో తరలిస్తుండగా పొట్టి శ్రీరాములు చౌరస్తా వద్ద విద్యార్థులు భారీగా తరలివచ్చి అడ్డుకున్నారు.దీంతో పోలీసులు వారిని నాల్గోటౌన్‌కు తరలించారు.అంతకు ముందు విద్యార్థులు నగరంలోని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు అంజాగౌడ్ మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి వేల కోట్లు బకాయిలున్నా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు స్పందిం చడంలేదని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అసెం బ్లీని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఆందోళనలో ఏబీవీపీ నాయకులు లక్ష్మణ్, సందీప్,శ్రీనివాస్‌తో పాటు సుమారు 500 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులపై విరిగిన ‘లాఠీ’
Published Sat, Jan 4 2014 6:26 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
Advertisement