స్థానికత వివాదంపై ప్రధానికి ఏపీ సర్కారు లేఖ!
స్థానికత వివాదంపై ప్రధానికి ఏపీ సర్కారు లేఖ!
Published Mon, Jul 21 2014 4:04 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
హైదరాబాద్: లక్షన్నర లోపు రుణాలు మాఫీచేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నాల్ని చేపట్టింది. సోమవారం లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో స్థానికత వివాదం, నామినేటెడ్ పోస్టుల రద్దుకు ఆర్డినెన్స్, రైతు రుణమాపీలపై ఏపీ కేబినెట్‌లో చర్చ జరిగింది. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి ప్రభుత్వం ఇన్సింటివ్‌లు ఇచ్చే యోచన చేస్తోంది.
ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం కోసం 1956 సంవత్సరాన్ని స్థానికతకు తెలంగాణ ప్రభుత్వం కటాఫ్ ఏడాదిగా పరిగణించడంపై ఏపీ సర్కారు ప్రధాని నరేంద్రమోడీకి లేఖరాయనుందని మీడియాకు తెలిపారు. స్థానికత వివాదంపై చర్చించేందుకు అవసరమైతే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉల్లి ధరలు నియంత్రణకు 2కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Advertisement