నేడు ఏపీ నీట్‌ మెడికల్‌ ర్యాంకుల విడుదల! | AP Neet Medical Rankings Release Today | Sakshi
Sakshi News home page

నేడు ఏపీ నీట్‌ మెడికల్‌ ర్యాంకుల విడుదల!

Published Sun, Jul 2 2017 1:39 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

నేడు ఏపీ నీట్‌ మెడికల్‌ ర్యాంకుల విడుదల! - Sakshi

నేడు ఏపీ నీట్‌ మెడికల్‌ ర్యాంకుల విడుదల!

విజయవాడ (హెల్త్‌ యూనివర్సిటీ): నీట్‌–2017 మెడికల్‌ లోకల్‌ (ఏపీ) ర్యాంకులను డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఆదివారం విడుదల చేయనుంది. ఈ ఫలితాలను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాసరావు చేతుల మీదుగా విడుదల చేయించేందుకు వర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2017 నీట్‌ మెడికల్‌ పరీక్షను సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) నిర్వహించి గతనెల 23వ తేదీన ర్యాంకులు విడుదల చేసిన విషయం విదితమే. అయితే సీబీఎస్‌ఈ రాష్ట్రానికి సంబం«ధించిన ర్యాంకులు ఇవ్వాల్సి ఉంది. శనివారం రాత్రి ఏపీ ర్యాంకులతో కూడిన సీడీ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి అందింది.

వాస్తవానికి శనివారం రాత్రి లోకల్‌ (ఏపీ)ర్యాంకులు విడుదల చేయాల్సి ఉండగా, ఫలితాలకు సంబంధించిన సీడీ ఆలస్యంగా అందడంతో ఆదివారానికి వాయిదా వేశారు.  ఏపీ అభ్యర్థులకు సంబంధించిన ర్యాంకులను సీబీఎస్‌ ఈ ప్రకటించి అందజేసినంత మాత్రాన అదే ఫైనల్‌ కాదని, ర్యాంకులు పొందినవారిలో చాలా మంది  అభ్యర్థులు తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలు స్థానిక హోదా నిరూపించకపోతే కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హులు కారని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. వీటన్నిటిని అధిగమించేందుకు ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం మరో రెండుమూడు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.  దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేసి తుది మెరిట్‌లిస్టును ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ప్రకటిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement