నంద్యాల (కర్నూలు జిల్లా) : నంద్యాల మున్సిపల్ ఆఫీసులోని టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కమాల్ హుస్సేన్ మంగళవారం ఏసీబీ వలకు చిక్కాడు. సంపత్ కుమార్ అనే వ్యక్తి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడానికి హుస్సేన్ లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.