స్త్రీ నిధిపై వడ్డీంపు
- రుణాలపై 14 శాతం వడ్డీ భారం
- జిల్లాలో 32 వేల మంది మహిళలు తీసుకున్న రుణం రూ.42 కోట్లు
పెరవలి : మహిళలూ.. మీరు డ్వాక్రా సంఘా ల్లో సభ్యులా..! స్త్రీ నిధి బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు తీసుకున్నారా.. అరుు తే, ఇకపై ఏడాదికి 14 శాతం వడ్డీ (ప్రతి రూ.వెరుు్యపై నెలకు రూ.11.67 పైసలు) చెల్లించాల్సిందే. జూలై 1నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. మహిళా సాధికారతను పెంపొందించే చర్యల్లో భాగంగా డ్వాక్రా సంఘాల్లో నిరుపేద మహిళలకు విరివిగా రుణాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వమే స్త్రీ నిధి బ్యాంకును ఏర్పాటు చేసిన విషయం విదితమే.
జిల్లాకు చెందిన మల్లవరపు జీవమణి ఆ బ్యాంకు చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ బ్యాం కు ద్వారా జిల్లాకు చెందిన సుమారు 32 వేల మంది డ్వాక్రా మహిళలు రూ.42 కోట్లను వడ్డీ లేని రుణాలుగా తీసుకున్నారు. పాలకోడేరు, భీమవరం, ఆకివీడు, నరసాపురం, మొగల్తూరు, ఆచంట తదితర మం డలాలకు చెందిన నిరుపేద మహిళలకు స్త్రీ నిధి బ్యాంకు ద్వారా రూ.రెండేసి కోట్ల చొప్పున రుణాలు ఇవ్వగా, ఇతర మండలాల్లో రూ.50 లక్షల నుంచి రూ.కోటిన్నర వరకూ రుణాలు అందిం చారు. ప్ర భుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల నేపథ్యంలో వారం తా వచ్చేనెల నుంచి 14 శాతం వడ్డీ భారం మోయూల్సిందే.
జూలై 1నుంచి వడ్డీ కట్టాలి
స్త్రీ నిధి రుణాలు తీసుకున్న లబ్ధిదారులంతా జూలై 1 నుంచి రుణం మొత్తంపై ఏడాదికి 14 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉందని ఇందిరాక్రాంతి పథం ఏపీఎం బి.రామకృష్ణ తెలిపారు. పెరవలి ఐకేపీ కార్యాలయంలో శుక్రవారం గ్రామసమాఖ్యలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఈ రుణాలపై సున్నా శాతం వడ్డీ ఉండేదన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం వచ్చే నెల నుంచి వడ్డీ వసూలు చేయాల్సి ఉందని చెప్పారు. ఆయా సంఘాలు తీసుకున్న రుణాలపై విధిగా వడ్డీ చెల్లించాలని స్పష్టం చేశారు.
సభ్యుల్ని చేర్పించండి
గ్రామాల్లో పేద, నిరుపేద కుటుంబాల వారిని, వికలాంగులను గుర్తించి పొదుపు సంఘాల్లో చేర్పించాలని రామకృష్ణ సూచిం చారు. సంఘాల్లో సభ్యులు ఎక్కువగా ఉంటే కొత్త సంఘాలను ఏర్పాటు చేయాల న్నారు. ఆగస్టు 31లోపు కొత్త సంఘాల ఏర్పాటు పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. ఇందుకోసం గ్రామాల్లో సర్వే నిర్వహించి అర్హులైన వారిని గుర్తించాలన్నారు. గ్రామసంఘాల పనితీరు సక్రమంగా ఉండేలా సీసీలు సంఘ సభ్యులను చైతన్యపరచాలని చెప్పారు.
ప్రతి డ్వాక్రా సంఘం ప్రతినెలా సమావేశం నిర్వహించి పుస్తకాలను నిర్వహించేలా చూడాలని, సంఘ కార్యకలాపాలను ప్రతి సభ్యురాలికి తెలియజేయూలని సూచించారు. పెరవలి మండలంలో 32 గ్రామ సమాఖ్యలు ఉండేవని, డ్వాక్రా సంఘాలు పెరగడం వలన కార్యకలాపాల నిర్వహణ కష్టతరం అవుతుండటంతో ఎక్కువ సంఘాలు ఉన్న గ్రామ సమాఖ్యలను రెండుగా విభజించామని చెప్పారు. దీనివల్ల పెరవలి మండలంలో మరో 21 గ్రామ సంఘాలు కొత్తగా ఏర్పడ్డాయని వివరించారు. సమావేశంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు పంపన జ్యోతి, సుందర మంగతాయారు, సీసీలు కనకదుర్గ, మహాలక్ష్మి, బాషా పాల్గొన్నారు.